TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 3rd Lesson కాళోజి Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించాడు.
మంచి ఎక్కడున్నా స్వాగతించాడు.
అన్యాయం, అణచివేతలపై తిరగబడ్డాడు
తన వాదనలతో తెలంగాణేతరుల మనసులను కూడ గెలుచుకున్నాడు.
తెలంగాణ వైతాళికుడని పేరుగన్నాడు.
ఈ నేల సాంస్కృతిక వారసత్వంలోనుండి ఎదిగిన ఆ మహనీయుడే – కాళోజి
TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కాళోజి – బాల్యం – విద్యాభ్యాసంను గూర్చి రాయండి.
జవాబు:
కాళోజి నారాయణరావుగారు మొదటి ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో అనగా 9-9-1914న జన్మించాడు. ఈయన ‘రట్టహళ్ళి’ అనే గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుతం బీజాపూరు జిల్లాలో ఉంది. ఈ ఊరు, కర్ణాటక ప్రాంతంలోని పాత బొంబాయి ప్రెసిడెన్సీ కింద ఉండేది.

కాళోజీ బాల్యంలో వారి కుటుంబం, కొన్ని సంవత్సరాలు మహారాష్ట్రలోని ‘సాయరాం’ అనే గ్రామంలోనూ, మరికొంతకాలం తెలంగాణాలోని ఇల్లెందు తాలూకా ‘కారేపల్లి’ గ్రామంలోనూ నివసించేది. 1917 వరకూ కాళోజీ కుటుంబం ‘హనుమకొండ’ లో ఉండేది. తరువాత ‘మడికొండ’ కు మారింది.

కాళోజీ అన్న రామేశ్వరరావు న్యాయశాస్త్రం చదవడానికి హైదరాబాదు వెళ్ళవలసినప్పుడు కాళోజీ పాతబస్తీలోని చౌయహల్లా కాన్లీబడిలో సెకండ్ ఫారమ్లో చేరారు. ఆ తరువాత సుల్తాను బజారులోని రెసిడెన్సీ మిడిల్ స్కూలులో చేరారు. ఉన్నత విద్య కోసం 1934 ఏప్రిల్ వరంగల్ కాలేజిమేట్ హైస్కూలులో ఇంటర్మీడియట్లో ప్రవేశించారు. 1939లో కాళోజీ ‘లా’ పూర్తి చేశారు. 1940లో గవిచెర్ల గ్రామానికి చెందిన ‘రుక్మిణి’ని వివాహం చేసుకున్నారు.

ప్రశ్న 2.
కాళోజిగారి కథలను గూర్చి రాయండి.
(లేదా)
కథా రచయితగా కాళోజీ ఎలా రాణించారు ?
జవాబు:
కాళోజీ కవిగానేగాక, కథకునిగా కూడ రాణించాడు. ఈయన కథలో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన, స్పష్టంగా కనిపిస్తాయి. కాళోజీ కథలకు ఈనాటికీ ‘ప్రాసంగికత’ ఉంది.

కులమతాలపేరిట, మనుషుల్ని హీనంగా చూడటం అవమానించడం, ఎంత దారుణమో ఈయన చెప్పారు. మనుషుల్లో ఉండే ద్వంద్వ ప్రవృత్తినీ, అన్యాయరీతుల్ని గూర్చి ఈయన తన కథల్లో చెప్పారు.

ఈయన ‘విభూతి లేక ఫేస్ పౌడర్ కథ’ వ్యంగ్య హేళనలతో సాగింది. ఈ కథలో అలంకరణల పట్ల మోజును గూర్చి, నవ్వు తెప్పించే విధంగా చెప్పాడు.

రాజకీయములో పరిపాలనలో ఉన్న అవకతవకలనూ, అక్రమాలనూ మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. తెలంగాణాలో 1940 నాటికి ఉన్న రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరిని మించి ఒకరు కుట్రలు కుతంత్రాలతో లౌక్యంతో రాజ్యపాలన సాగింది. ఈ పరిస్థితుల్ని రామాయణంలోని సుగ్రీవుడు, విభీషణుడి కథలకు ముడిపెట్టి, కాళోజీ రాసిన కథ పేరు “లంకా పునరుద్ధరణ”. రామాయణ కథపై విసరిన వ్యంగ్యాస్త్రమే, ‘లంకా పునరుద్ధరణ’ కథ.

రాతి బొమ్మకు గుడిని కట్టించే విషయంలో ముందుకు వచ్చిన ప్రజలు, ప్రాణం ఉన్న అనాథ శిశువుపై ఆదరణ చూపించలేకపోవడంపై విసరిన మరో వ్యంగ్యాస్త్రం, “భూతదయ” అనే కథ. ఈ విధంగా కాళోజీ కథలన్నీ ఒకరకంగా రాజకీయ కథలు. ఈ కథలో సాహిత్య విలువలను కాపాడడానికి కాళోజీ ప్రయత్నించారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

ప్రశ్న 3.
కాళోజి ‘కవిత్వం – భాష’ అనే వాటిని గూర్చి రాయండి.
జవాబు:
కాళోజి తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకువెళ్ళి ప్రజాకవిగా పేరు పొందాడు. తెలంగాణ పక్షాన నిలిచి, తాడిత, పీడిత ప్రజల గుండెల్లో కొలువైన మహాకవి కాళోజి. కాళోజి మాటలలో, చేతలలో, ఆలోచనలో, ఆవేదనలో, వేషభాషల్లో ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం, సంపూర్ణంగా కనిపిస్తుంది.

ఈయన సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ అనే పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపూటాలుగా వెలువరించారు. కాళోజీ ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కవి. నిరంకుశ రాజ్యాలమీద తన జీవితాంతం కత్తి కట్టి పోరాడాడు. అందుకే రాజకీయాలతో, ప్రజా ఉద్యమాలతో, మమైకమైన కాళోజీ కవిత్వాన్ని తెలుగునాట ప్రజలు ఆదరించాడు.

రజాకార్లపై ఆయన కోపాన్ని పరాకాష్ఠకు చేర్చిన ఆయన కవిత, “కాటేసి తీరాలె” అనేది. ఇందులోని కసి తెలంగాణ ప్రజలది.

“మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండాలధీశులను
మరచి పోకుండ గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండ బుసకొట్టుచుండాలె
కాలంబు రాగానె కాటేసి తీరాలె”

కాళోజీ భాష : కాళోజీ దృష్టిలో భాష రెండు రకాలు. ఒకటి “బడి పలుకుల భాష”. రెండవది జనం నిత్యం వ్యవహారంలో వాడే “పలుకుబడుల భాష”. వీటినే గ్రాంథిక భాష, వ్యావహారిక భాష అంటాము.
ఏ భాషకైనా జీవధాతువు, మాండలికమే. కాళోజీ జీవభాష వైపే మొగ్గు చూపాడు.

ప్రశ్న 4.
కాళోజీ నారాయణరావుగారి ప్రజా జీవితం గురించి రాయండి.
జవాబు:
ఎనిమిది దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కాళోజీ బ్రతుకు ముడిపడింది. ఆయన వివక్ష ఎక్కడ ఉన్నా వ్యతిరేకించాడు. మంచిని స్వాగతించాడు. అన్యాయం, అణచివేతలపై తిరుగుబడ్డాడు. ఆయన వాదనలోని సమర్థనలను, ఆలోచించ గలవారు గుర్తించారు. ఈయన పెక్కు సందర్భాల్లో తెలంగాణేతరుల మనస్సులను కూడా జయించాడు.

కాళోజిని తెలంగాణా వైతాళికుడిగా చెప్పాలి. ఈయన తెలంగాణ వారసత్వంలోంచి ఎదిగాడు. ఈయన మనుషులను అర్థం చేసుకున్న తీరు, విశిష్టమైనది. ఈయనకు భాగవతంలో ప్రహ్లాదుడి పాత్ర నచ్చిందని చాలాసార్లు చెప్పాడు. అన్యాయాన్ని ఎదిరించినవాడే తనకు పూజ్యుడని, కాళోజీ చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉంటుందని ఈయన భావించాడు. ఓటుహక్కు ప్రజాస్వామికమైనదని ప్రకటిస్తూ మెడలో బోర్డు వేసుకొని, ఈయన తిరిగాడు. ఈ స్వేచ్ఛా ప్రవృత్తి కాళోజిలో అడుగడుగునా కనిపిస్తుంది.

వ్యక్తిత్వం, స్వేచ్ఛ, అనే రెండు ప్రధాన విషయాలను మనిషి కోల్పోకూడదని, కాళోజీ చెప్పారు. కాళోజీ జీవితాంతం ప్రజాస్వామ్యవాదిగా ఉన్నారు. “నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించే నీ హక్కులకోసం అవసరమైతే నా ప్రాణాలిచ్చి పోరాడుతా” అనే మాటల్ని కాళోజీ గుర్తు చేసేవారు. ఆ మేరకు ఆయన బతికారు.

తెలంగాణ ఇటీవల వరకు యుద్ధ భూమి అందులో కాళోజీ ప్రజల వైపు నిలబడి, కవిత్వం వినిపించాడు. నిజాంను ఎదిరించాడు. కాళోజీ ఉద్యమ కవి.

ప్రశ్న 5.
కాళోజీ నారాయణరావు వ్యక్తిత్వాన్ని గురించి సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
కాళోజీ 9-9-1914న బీజపూర్ జిల్లా రట్టహళ్ళిలో జన్మించారు. 1939లో లా పూర్తిచేసి, 1940లో రుక్మిణిని పెండ్లాడారు. ఆచరణకు, ఆదర్శానికీ తేడాలేని జీవితం ఆయనది. కాళోజీ నిరంతర ఉద్యమ జీవి. తమ కాలంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. రజాకార్లను ఎదిరించి జైలు జీవితం గడిపారు. నిజాం రాజును ఎదిరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఇతరుల బాగు కోసం పోరాడేతత్త్వం, సామాజిక స్పృహ, కాళోజీలో ఉన్నాయి.

కాళోజీ తాడిత పీడిత ప్రజల గుండెల్లో నిలిచి కవి. ఆయనలో తెలంగాణా స్వరూపం దర్శనమిస్తుంది. దాశరథి అన్నట్లు, కాళోజీ, “తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం”. కాళోజీ, సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ అనే పేరున అనేక కవితలు రాశాడు. కాళోజీ నిజానికి అంతర్జాతీయ కవి. రజాకార్లపై తన కోపాన్ని కాళోజీ ‘కాటేసి తీరాలె’ అన్న కవితలో రాశారు. కాళోజీ తన రచనలలో, జీవ భాష వైపే మొగ్గుచూపారు. ‘వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది’, అని కాళోజీ ఎలుగెత్తి చాటాడు. కాళోజీ కవిగా, ఉద్యమకారునిగా, కథకునిగా కూడా, రాణించారు. కాళోజీ వివక్షను వ్యతిరేకించాడు. మంచిని స్వాగతించాడు. కాళోజీ తెలంగాణ వైతాళికుడు.

ఈయన, ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ ఉంటుందని చెప్పి, మెడలో బోర్డు వేసుకొని తిరిగేవాడు. ఆయన నిర్భయంగా మాట్లాడేవారు. కాళోజీ జీవితాంతం, ప్రజాస్వామ్య వాధిగా ఉన్నాడు. ఖలీల్ జిబ్రాల్ రాసిన “ది ప్రాఫెట్”ను ‘జీవనగీత’గా అనువదించాడు. తన భౌతిక శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ వారికి అందించాడు.
కాళోజీ జీవితమంతా దేశంగా, ప్రజలుగా, ఉద్యమాలుగా బతికిన మహాకవి.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

తెలంగాణ పక్షాన నిలిచి తాడిత, పీడిత ప్రజల గుండెలలో కొలువైన కవి కాళోజి. మాటలలో, చేతలలో, ఆలోచనలలో, ఆవేదనలో, వేషభాషలలో, ప్రవర్తనలో, తెలంగాణ స్వరూపం సంపూర్ణంగా కనిపిస్తుంది. దాశరథి అన్నట్లు “తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం కాళోజి. తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్ళి ప్రజాకవిగా పేరుపొందినవాడు కాళోజీ.

సమాజ గొడవను తన గొడవగా చేసుకొని “నా గొడవ” పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపుటాలుగా వెలువరించాడు. ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజి నిజానికి అంతర్జాతీయ కవి. ‘నిరంకుశ రాజ్యాలమీద జీవితాంతం కత్తిగట్టి పోరాడినవాడు కాళోజి. అందుకే రాజకీయాలతో, ప్రజా ఉద్యమాలతో మమైకమైన కాళోజి కవిత్వాన్ని తెలుగునాట ప్రజలు ఆదరించారు. రజాకార్లపై ఆయన కోపాన్ని పరాకాష్టకు చేర్చిన కవిత “కాటేసి తీరాలె”. ఇందులోని కసి తెలంగాణా ప్రజలందరిది.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కాళోజీ గురించి దాశరథి అన్నమాట ఏది ?
జవాబు:
‘తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం ‘కాళోజి’ అని దాశరథి కాళోజి గురించి చెప్పాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

ప్రశ్న 2.
కాళోజి ఎటువంటి కవి ?
జవాబు:
ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజి, నిజానికి అంతర్జాతీయ కవి.

ప్రశ్న 3.
కాళోజీలో ఏమి కనిపిస్తుంది ?
జవాబు:
కాళోజి మాటలలో, చేతలలో, ఆలోచనలలో, ఆవేదనలో, వేషభాషలలో, ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం, సంపూర్ణంగా కనిపిస్తుంది.

ప్రశ్న 4.
కాళోజి ప్రజాకవి ఎట్లు అయ్యాడు ?
జవాబు:
తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకువెళ్ళాడు కాబట్టి, కాళోజి ప్రజాకవి అయ్యాడు.

ప్రశ్న 5.
‘నా గొడవ’ కవితా సంపుటాల గురించి తెలుపండి.
జవాబు:
కాళోజీ సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపుటాలుగా వెలువరించాడు.

2. ఈ కింది పేరా చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

కవిగా, ఉద్యమకారునిగా పేరొందిన కాళోజి కథకునిగా కూడా రాణించాడు. ఇతని కథల్లో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన స్పష్టంగా కనిపిస్తుంది. కాళోజి కథలకు ఈనాటికీ ప్రాసంగికత ఉన్నది. మతం పేరిట, కులంపేరిట మనుషుల్ని హీనంగా చూడటం, అవమానించటం ఎంత దారుణమో చెప్పాడు. మనుషుల్లోని ద్వంద్వ ప్రవృత్తి, అన్యాయమైన రీతుల్ని తెలియజెప్పాడు. వ్యంగ్యం, హేళనలతో సాగిన కథ విభూతి లేక ఫేస్ పౌడర్. ఇందులో అలంకరణల పట్ల గల మోజును నవ్వు తెప్పించే విధంగా చెప్పాడు. రాజకీయాల్లో, పరిపాలనలో అవకతవకల్ని, అక్రమాల్ని ఇప్పుడు కూడా చూస్తున్నాం. తెలంగాణాలో 1940 నాటికి ఉన్న రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరి మించి ఒకరు కుట్రలు, కుతంత్రాలతో, లౌక్యంతో రాజ్యపాలన సాగింది.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కాళోజి కథల్లో ఏమి కనిపిస్తుంది ?
జవాబు:
కాళోజీ కథలో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన, స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రశ్న 2.
తెలంగాణలో 1940 నాటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది ?
జవాబు:
తెలంగాణలో 1940 నాడు రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరిని మించి ఒకరు కుట్రలు కుతంత్రాలతో లౌక్యంతో రాజ్యపాలన సాగింది.

ప్రశ్న 3.
‘ఫేస్ పౌడర్’ కథలో విశిష్టత ఏది ?
జవాబు:
`ఫేస్ పౌడర్ కథలో అలంకరణ పట్ల మోజును, నవ్వు తెప్పించే విధంగా కాళోజీ చెప్పాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

ప్రశ్న 4.
కాళోజి ఎట్లా రాణించాడు ?
జవాబు:
కాళోజీ కవిగా, ఉద్యమకారునిగా, మరియు కథకునిగా, రాణించాడు.

ప్రశ్న 5.
కాళోజీ కథల్లో చెప్పిన సంగతులేవి ?
జవాబు:
కాళోజీ కథల్లో కులమతాల పేరిట మనుష్యుల్ని హీనంగా చూడటం, అవమానించడం, ఎంత దారుణమో చెప్పాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

తెలంగాణలో కవులే లేరనే నిందా వ్యాఖ్యలకు
“గోలకొండ కవుల సంచిక” ద్వారా సమాధానమిచ్చినవాడు.
తన కృషి సమాజపరంగా సాగించిన ఉద్యమశీలి.
సాహిత్య, సాంస్కృతిక సామాజిక, రాజకీయ రంగాల్లో
బహుముఖ ప్రతిభ చాటిన ప్రజ్ఞాశాలి. తెలంగాణ వైతాళికుడు
సురవరం ప్రతాపరెడ్డి. ఆయన జీవితం ఎట్లా స్ఫూర్తిదాయకమో
తెలుసుకుందాం.
TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
సురవరం ప్రతాపరెడ్డిగార్ని గూర్చి మల్లంపల్లి సోమశేఖర శర్మగారు చేసిన పరిచయం ఎటువంటిది ?
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి పేరు వినగానే, ఒక గొప్ప మూర్తి మన కంటి ఎదుట దర్శనమిస్తుంది. బహుముఖ ప్రతిభకు, ప్రతాపరెడ్డి నిలువెత్తు ఉదాహరణం. సురవరం ప్రతాపరెడ్డి గారు మేధా సంపన్నుడు. సాహిత్య రంగంలో రెడ్డి గారి ప్రతిభకూ, ప్రజ్ఞకూ స్తాటిలేదు.

రెడ్డిగారు విమర్శకులలో గొప్ప విమర్శకుడు. కవులలో కవి. పండితులలో పండితుడు. రాజకీయవేత్తలలో గొప్ప రాజకీయవేత్త. పత్రికా రచయితలలో పత్రికా రచయిత. నాటక కర్తలలో నాటక కర్త. పరిశోధకులలో గొప్ప పరిశోధకుడు. దేశాభిమానులలో పెద్ద దేశాభిమాని, సహృదయులలో రెడ్డిగారు గొప్ప సహృదయులు.

ప్రతాపరెడ్డిగారి వంటి స్నేహితుణ్ణి, పండితుణ్ణి, రసజ్ఞుడిని చాలా అరుదుగా చూస్తాం. రెడ్డిగారు ఇంతటి ప్రజ్ఞా పాండిత్యములు కలవాడని, సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మగారు వ్రాశారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 2.
సురవరం ప్రతాపరెడ్డిగారి ప్రతిభా పాండిత్యాలను వెల్లడించే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో జరిగిన సభా విశేషాలు రాయండి.
జవాబు:
ఒకసారి హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషా నిలయంలో సాహిత్య సభ జరిగింది. ఆ రోజు నాచన సోమన రాసిన ఉత్తర హరివంశముపై విశ్వనాథ సత్యనారాయణగారు ప్రసంగం చేయాలి. ఆ సభకు అధ్యక్షుడిగా శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు కూర్చున్నారు.

సభ ప్రారంభం కాగానే, ప్రతాపరెడ్డిగారు ధీరగంభీరంగా తొలిపలుకులు మాట్లాడారు. క్రమంగా మాటల చినుకులు మహావర్షంగా మారాయి. దాదాపు గంటసేపు రెడ్డిగారు మాట్లాడిన ఆ ఉపన్యాసం, సభ్యులను కట్టిపడేసింది.

సోమన కవిత్వంలోని కొత్తకోణాలు సభ్యులకు పరిచితమవుతున్నాయి.. తరువాత విశ్వనాథ సత్యనారాయణగారు లేచి, అధ్యక్షులు ప్రతాపరెడ్డి గారు మాట్లాడిన తర్వాత, చెప్పడానికి తనకు ఇంకేమీ మిగుల లేదని, హరివంశంలోని కొన్ని పద్యాలు మాత్రం చదివి, వ్యాఖ్యానిస్తానని అన్నారట.

విశ్వనాథ వంటి మహాకవి, పండిత విమర్శకుడినే ఆ విధంగా ప్రతాపరెడ్డిగారి ఉపన్యాసం, ఆనాడు నిశ్చేష్టుడిని చేసింది. ఈ సంఘటన ప్రతాపరెడ్డిగారి ఉపన్యాస శక్తినీ, విమర్శనాశక్తినీ వెల్లడిస్తుంది.

ప్రశ్న 3.
సురవరం ప్రతాపరెడ్డిగారి బాల్యము – విద్యాభ్యాసము గూర్చి రాయండి.
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి గారు 1896లో మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల సంస్థాన రాజధానియైన “బోరవిల్లి” లో జన్మించారు. ఈయన మొదటి పేరు “పాపిరెడ్డి”. పాపిరెడ్డి గురువు, చండశాసనుడు. దానితో పాపిరెడ్డికి చదువుపై విముఖత పెరిగింది. బడిమానేసి, గోలీలాడుకొనేవాడు.

ఈ విషయం ప్రతాపరెడ్డి చిన్నాన్నకు తెలిసి, కచ్చితమైన దినచర్యను అమలు చేశాడు. దానితో ప్రతాపరెడ్డి జీవితం, మలుపు తిరిగింది. ప్రతాపరెడ్డి తొమ్మిదో తరగతి చదివేటప్పుడు, తెలుగులో కవియై కీర్తి సంపాదించాలని నిశ్చయించాడు. తన సంకల్పాన్ని అమలుచేశాడు. స్వయంకృషి, సాధన సంకల్పాన్ని నెరవేరుస్తాయి.

ప్రతాపరెడ్డి, చిలకమర్తి, వీరేశలింగం వంటి వారి రచనలు సంపాదించి చదివాడు. చేమకూర వెంకటకవి విజయ విలాసాన్నీ, ఇతర ప్రబంధాలనూ, తెలుగు నిఘంటువు సాయంతో చదివాడు. కర్నూలు వెల్లాల శంకరశాస్త్రి దగ్గర, సంస్కృత సాహిత్యం చదివాడు. బి.ఏ లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ద్వితీయ భాషగా సంస్కృతం చదవాలనుకున్నాడు. అందుకు వేదం వేంకటరామశాస్త్రి గారితో సిఫారసు కూడా చేయించాడు.

కాని సంస్కృతంలో ప్రతాపరెడ్డికి గల పరిచయాన్ని గూర్చి కాలేజీవారు పరీక్షించారు. ప్రతాపరెడ్డి భారత శ్లోకాన్ని పదవిభాగంతో సహా చెప్పి, కాలేజీ వారిచే మెప్పు పొందాడు.. సంస్కృతం వేదం వారి వద్ద చదవడం కోసం రెడ్డిగారు మాంసాహారాన్ని విడిచిపెట్టాడు. ప్రతాపరెడ్డి గారు పుస్తకాలు కొన్ని, విమర్శనాత్మకంగా చదివేవారు.

ప్రశ్న 4.
ప్రతాపరెడ్డిగార్కి గోల్కొండ పత్రికతో గల సంబంధాన్ని రాయండి.
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి గారికి, మద్రాసులో చదివే రోజులలోనే పత్రిక పెట్టాలని కోరిక కలిగింది. జాతీయోద్యమ ప్రభావంతో పత్రికకు ‘దేశబంధు’ అని పేరు పెట్టాలనుకున్నారు. చివరకు రెడ్డిగారు హైదరాబాదులో ఉన్నప్పుడు పత్రికను ప్రారంభించారు. దేశబంధు పేరుకు నిజాం ప్రభుత్వం అంగీకరించదని, ‘గోల్కొండ’ అనే పేరు పత్రికకు పెట్టారు.

10 మే, 1926న గోల్కొండ పత్రిక ప్రారంభమయ్యింది. గోల్కొండ పత్రిక, తెలుగు పత్రికా రంగంలో సంచలనాలు సృష్టించింది. ప్రతాపరెడ్డి పేరు వినగానే, గోల్కొండ పత్రిక గుర్తుకు వస్తుంది. పత్రిక ప్రారంభమయ్యింది కాని, తగిన ఆర్థిక వనరులు లేనందున, నడపడం కష్టమయ్యింది. అయినా ప్రతాపరెడ్డి గారు అధైర్యపడలేదు.

ప్రతాపరెడ్డి తానే రచయితగా, సంపాదకుడిగా, ప్రూఫ్ రీడర్ గా, గుమాస్తాగా అనేక అవతారాలు ఎత్తాడు. ఆటంకాలను దాటి, లక్ష్యమును చేరుకున్నాడు. గోల్కొండ పత్రిక రెండు లక్ష్యాలతో నడచింది.

1) ఆంధ్రభాషా సేవ

2) జాతి, మత, కులవివక్షత లేకుండా ఆంధ్రులలో అన్ని శాఖలవారి సత్వరాభివృద్ధికీ పాటు పడడం. నాటి నిజాం దుష్కృత్యాల గురించి, సంపాదకీయాలు సాగేవి. ప్రతాపరెడ్డి రచయితలను కవ్వించి, వారి ప్రతిభను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఎందరో రచయితలకు ప్రోత్సాహాన్ని ఇచ్చి, నిష్పక్షపాతంగా పత్రికను నడిపారు.

ఆ రోజుల్లో నిజాంకు వ్యతిరేకంగా వార్త రాసిన షోయబుల్లాఖాన్న, నడివీధిలో నరికి చంపారు. అటువంటి రోజుల్లో ప్రతాపరెడ్డి గారు సాహసంతో నిజాం దుర్మార్గాలను నిరసిస్తూ పత్రికలో సంపాదకీయాలు రాశారు. ఈయన 23 సంవత్సరాలు గోల్కొండ పత్రికలో సంపాదకుడిగా తెలంగాణకు సేవలందించాడు. ప్రతాపరెడ్డి ప్రాతఃస్మరణీయుడు.

ప్రశ్న 5.
ప్రతాపరెడ్డిగార్కి వివిధ సంస్థలతో గల అనుబంధం గురించి తెలపండి.
జవాబు:
ప్రతాపరెడ్డి గారిని గురించి, దాశరథి రాస్తూ “అతడు లేని తెలంగాణ, అలంకరణలేని జాణ” అని రాశాడు. ప్రతాపరెడ్డిగార్కి అనేక సంస్థలతో అనుబంధముంది. తెలంగాణలో ఆంధ్రమహాసభ, పరాయి భాషా దౌర్జన్య ప్రభంజనానికి అల్లాడుతున్న తెలుగు దీపాన్ని ఆరిపోకుండా చూసుకోడానికి ఆవిర్భవించింది. ఆ ఆంధ్రమహాసభ మొదటి సమావేశం, మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. ఆ సభకు ప్రతాపరెడ్డిగారే అధ్యక్షత వహించారు.

విజ్ఞానవర్ధినీ పరిషత్తు, ఆంధ్ర సారస్వత పరిషత్తులకు ప్రతాపరెడ్డి గారు వ్యవస్థాపక సభ్యులు. ఆ తర్వాత, ఆ సంస్థలకు వీరే అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రతాపరెడ్డిగార్కి కులమతాల పట్టింపులు లేవు. అందుకే రెడ్డిగారు, యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, గౌడ సంఘములకు కూడా అధ్యక్షులుగా ఉన్నారు.

ప్రతాపరెడ్డి గారు హైదరాబాదు ఆయుర్వేద సంఘం అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. రెడ్డిగార్కి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, లక్ష్మణరాయ పరిశోధకమండలి, బాలసరస్వతీ గ్రంథాలయం, వేమన గ్రంథాలయం, మొదలయిన సంస్థలతో సన్నిహిత సంబంధం ఉండేది. ఈ విధంగా ఆనాడు తెలంగాణలో ఉన్న పెక్కు సాహిత్య సాంస్కృతిక సంస్థలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీరికి అనుబంధముంది.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 6.
సురవరం ప్రతాపరెడ్డిగారి సాహిత్య కృషిని వివరించండి.
జవాబు:
ప్రతాపరెడ్డిగారు, ఎన్నో సాహిత్య ప్రక్రియలను సమర్థంగా నిర్వహించారు. కవిత్వము, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవితచరిత్ర వంటి ప్రక్రియల్లో వీరు రచనలు చేశారు. ఎన్నో గ్రంథాలను పరిష్కరించారు. సాహిత్యాన్ని సేకరించారు. పరిశోధనాత్మక గ్రంథాలను ప్రకటించారు.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, రామాయణ విశేషములు అన్న వీరి రచనలు, పరిశోధకులుగా ప్రతాపరెడ్డిగార్కి సాటిలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. రాజుల చరిత్రయే చరిత్రగా చెలామణి అయ్యే రోజుల్లో, ప్రజల సాంఘిక చరిత్రయే అసలైన చరిత్రగా రెడ్డిగారు ఆవిష్కరింపజేసారు. చరిత్ర రచనకు రెడ్డిగారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అన్న గ్రంథము ఒజ్జబంతి అయ్యింది. అందుకే ఈ గ్రంథము కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథంగా చరిత్ర సృష్టించింది.

వీరి హిందువుల పండుగలు అన్న గ్రంథము, హిందువుల పండుగల వెనుకనున్న నేపథ్యాలను, ఆచార సంప్రదాయాలను తెలిపే ప్రామాణిక గ్రంథము. వీరు, హిందువుల పండుగల విశేషాలెన్నింటినో పురాణ శాస్త్రప్రమాణంగా తెలిపారు. ప్రతాపరెడ్డి గారి ఈ హిందువుల పండుగలు అన్న గ్రంథానికి విపులంగా పీఠిక వ్రాయడానికి తనకు శక్తి, వ్యవధి కూడా చాలదని రాధాకృష్ణన్ గారు రాశారు. దానిని బట్టి, ఈ గ్రంథ ప్రత్యేకత ఏమిటో మనకు అర్థమౌతుంది.

సాహిత్యము ఆనందాన్నీ, ఉపదేశాన్నీ కూడా ఇవ్వాలి.

ప్రశ్న 7.
సురవరం ప్రతాపరెడ్డిగారి వ్యక్తిత్వాన్ని గూర్చి రాయండి.
జవాబు:
నిరాడంబరత, నిర్భీతి, నిజాయితి, నిస్వార్థత అన్నవి ప్రతాపరెడ్డి జీవ లక్షణాలు. వేషభాషల్లో ఈయన అచ్చమైన తెలుగు వాడిగా జీవించాడు. ఈయన తెలుగు అంకెలనే వాడేవాడు. ఈయన ‘స్వవేష భాషా దురభిమాని’ అని పేరు పొందాడు. ఈయన ఎవరినీ పొగిడేవాడు కాడు. తనను ఎవరైనా పొగిడితే, అంగీకరించేవాడు కాదు..

ప్రతాపరెడ్డి గారిలో ధర్మావేశం పాలు ఎక్కువ. ఆత్మీయతకే తప్ప, అహంకారానికి చోటులేని హృదయం ఈయనది. మంచి ఎక్కడున్నా, ఈయన గ్రహించేవాడు. ఆచార్య బిరుదు రాజు రామరాజు గారిని మొదట పరిశోధనవైపు మళ్ళించింది. సురవరం వారే ఈ విధంగా ఈయన ఎన్నో రచనలకు ప్రేరకుడు, కారకుడు.

ఈయనకు కులమతాల పట్టింపులేదు. జోగిపేటలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో, భాగ్యరెడ్డి వర్మకు సభలో పాల్గొనే అవకాశాన్ని రెడ్డిగారే కల్పించారు. అంబేద్కర్ కన్న ముందే, దళితోద్యమ స్ఫూర్తిని రగిల్చిన వాడు ‘భాగ్యరెడ్డివర్మ’. ప్రతాపరెడ్డిగారి ఆలోచనా సరళి విభిన్నంగా ఉంటుంది. శ్రీకృష్ణునికి మీసాలు ఉండాలని ప్రశ్నించి మీసాల కృష్ణుని చిత్రాన్ని తన గోల్కొండ పత్రికా కార్యాలయంలో వీరు పెట్టుకున్నాడు. వనపర్తి, ఆత్మకూరు, గద్వాల, గోపాలపేట, కొల్లాపూర్ సంస్థానాధీశులతో తనకు గల పరిచయాన్ని వీరు కేవలం సాహిత్య సమారాధనకే వినియోగించారు.

ప్రతాపరెడ్డి గారు ప్రజల మనిషి. 1952లో వనపర్తి శానస సభ్యుడిగా ఈయన ఎన్నికయ్యారు. తెలంగాణ సమాజాన్ని వీరు అన్ని కోణాల్లో ప్రభావితం చేశారు. ఈయన జీవనం పవిత్రం.
ప్రతాపరెడ్డి గారు రైతు, రాజబంధువు, కావ్య వేద నిష్ణాతుడు. స్వతంత్రుడు, శాసనకర్త, పురుషార్థజీవి, సంస్కృతీ పరిరక్షకుడు.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

అ) కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

మద్రాసులో చదివేరోజుల్లోనే పత్రికొకటి పెట్టాలనే ఆలోచన కలిగింది ప్రతాపరెడ్డికి, జాతీయోద్యమంతో ప్రభావితుడై తన పత్రికకకు “దేశబంధు” అనే పేరు పెట్టాలనుకున్నాడు కూడా. మంచి ఆలోచనలెప్పుడూ మట్టిలో కలిసిపోవు. హైద్రాబాదులో ఉన్నప్పుడు ఈ ఆలోచనను ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. “దేశబంధు” పేరుకు నిజాం ప్రభుత్వం అనుమతినిచ్చే పరిస్థితి లేదు. అందుకే “గోల్కొండ” పేరును ఖరారు చేసుకున్నాడు. అనుమతి దొరికింది. కార్యసాధనకు సమయస్ఫూర్తి కావాలి. 10 మే 1926 న గోల్కొండ పత్రిక పురుడు బోసుకుంది. నాటి తెలుగు పత్రికారంగంలో సంచలనాలకు తెరలేపింది. ప్రతాపరెడ్డి పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక. ఇది ప్రతాపరెడ్డి అక్షరాల కోట.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ప్రతాపరెడ్డి తన పత్రికకు ‘దేశబంధు’ అనే పేరు ఎందుకు పెట్టాలనుకున్నాడు .
జవాబు:
ప్రతాపరెడ్డి, జాతీయోద్యమంతో ప్రభావితుడయ్యాడు. అందుకే ఆయన తన పత్రికకు ‘దేశబంధు’ అనే పేరు పెడదామనుకున్నాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 2.
గోల్కొండ పత్రిక ప్రారంభించిన తేదీ ఏది ?
జవాబు:
గోల్కొండ పత్రికను ప్రారంభించిన తేదీ 10 మే, 1926.

ప్రశ్న 3.
ప్రతాపరెడ్డి పేరు వినగానే, గుర్తుకు వచ్చే విషయం ఏది ?
జవాబు:
ప్రతాపరెడ్డి పేరు వినగానే “గోల్కొండ” పత్రిక గుర్తుకు వస్తుంది.

ప్రశ్న 4.
గోల్కొండ పత్రిక ప్రత్యేకత ఏది?
జవాబు:
గోల్కొండ పత్రిక నాటి తెలుగు పత్రికా రంగంలో సంచలనాలకు తెరలేపింది. అది ప్రతాపరెడ్డి అక్షరాలకోట.

ప్రశ్న 5.
కార్యసాధనకు కావలసినదేది ?
జవాబు:
కార్యసాధనకు కావలసినది “సమయస్ఫూర్తి”.

2. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

“ఎన్నో సాహిత్య ప్రక్రియలను సమర్థంగా నిర్వహించాడు ప్రతాపరెడ్డి. కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవిత చరిత్ర వంటి ప్రక్రియల్లో రచనలు చేశాడు. గ్రంథ పరిష్కరణలు, జానపద సాహిత్య సేకరణ చేశాడు. పరిశోధనాత్మక గ్రంథాలు ప్రకటించాడు.

పరిశోధకుడుగా ప్రతాపరెడ్డికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టినవి “ఆంధ్రుల సాంఘిక చరిత్ర”, “హిందువుల పండుగలు”, “రామాయణ విశేషములు”. రాజుల చరిత్రయే, చరిత్రగా చెలామణి అయ్యేకాలంలో ప్రజల సాంఘిక చరిత్రే అసలైన చరిత్రగా ఆవిష్కరింపజేశాడు ప్రతాపరెడ్డి. చరిత్ర రచనకు ఈయన గ్రంథం ఒజ్జబంతి అయ్యింది. అందుకే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథంగా చరిత్ర సృష్టించినదీ గ్రంథం.

హిందువుల పండుగల వెనుకనున్న నేపథ్యాలు, ఆచార సంప్రదాయాలు తెలిపే ప్రామాణిక గ్రంథం ‘హిందువుల పండుగలు’.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పరిశోధకుడిగా సాటిలేని కీర్తిని ప్రతాపరెడ్డిగార్కి తెచ్చిన గ్రంథం ఏది ?
జవాబు:
పరిశోధకుడిగా ప్రతాపరెడ్డి గార్కి సాటిలేని కీర్తిని తెచ్చిన గ్రంథం “ఆంధ్రుల సాంఘిక చరిత్ర”.

ప్రశ్న 2.
చరిత్ర రచనలో ప్రతాపరెడ్డి గారు అనుసరించిన నూతన మార్గం ఏది ?
జవాబు:
రాజుల చరిత్రయే చరిత్రగా, ఆనాడు చెలామణి అయ్యేది. ఆ పరిస్థితులలో ప్రజల సాంఘిక చరిత్రే, అసలైన చరిత్రగా రెడ్డిగారు ఆవిష్కరింపచేశారు.

ప్రశ్న 3.
ప్రతాపరెడ్డి గారు ఆదరించిన సాహిత్య ప్రక్రియలను పేర్కొనండి.
జవాబు:
ప్రతాపరెడ్డి గారు కవిత్వము, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవిత చరిత్ర వంటి సాహిత్య ప్రక్రియలను ఆదరించారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 4.
‘హిందువులు పండుగలు’ అన్న రెడ్డిగారి గ్రంథంలో గల విశేషాలేవి ?
జవాబు:
”హిందువులు పండుగలు’ అనే గ్రంథంలో రెడ్డిగారు, హిందువుల పండుగల వెనుక ఉన్న నేపథ్యాలనూ, ఆచార సంప్రదాయాలనూ వివరించారు.

ప్రశ్న 5.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథం ఏది ?
జవాబు:
ప్రతాపరెడ్డి గారి “ఆంధ్రుల సాంఘిక చరిత్ర” అన్న గ్రంథము, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథము.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 1st Lesson కుంరం భీం Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

‘జల్, జంగల్, జమీన్ (నీరు అడవి భూమి)
మనది…… అనే నినాదంతో గోండులను, కోయలను,
చెంచులను సంఘటితపరచి పోరుబాటలో నడిపించిన
విప్లవ వీరకిశోరం కుంరం భీం. ‘మా గూడెంలో
మా రాజ్యం’ అనే నినాదంతో గిరిజనులందరిని
ఏకంచేసి ప్రభుత్వంపై సమరం సాగించిన
పోరాటయోధుడు కుంరం భీం.
TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
బాల్యంలో కుంరం భీం, మనసుపై చెరగని ముద్రవేసిన సంఘటనను గూర్చి తెలపండి.
జవాబు:
కుంరం భీం ఒకసారి తన మిత్రులు జంగు, కొంతల్, మాదు, పైకులతో అడవికి వెళ్ళాడు. వారితో మేకపిల్లలు ఉన్నాయి. పైకు నారేపచెట్టు ఎక్కి, సన్న సన్న కొమ్మల్ని నరికి మేకలకు వేస్తున్నాడు. ఇంతలో జంగ్లాత్ జవాన్లు, ఒక సుంకరి వచ్చి చెట్టు కొమ్మలు నరుకుతున్న పైకును పట్టుకున్నారు. వారి వెంట అమీనాబ్ వచ్చి, పిల్లలందరినీ బంగ్లా దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు.

భీం తండ్రి, కుంరం చిన్ను, ఆ గూడెం పెద్ద. అమీనాబ్ పిల్లలు చెట్లు నరికినందుకు చిన్నును మందలించాడు. కొమ్మ నరికిన పిల్లవాడి వేళ్ళు నరకడమే తగిన శిక్ష అంటూ, ఎంత మంది బతిమాలినా వినకుండా భీం స్నేహితుడు పైకు వేళ్ళు నరికించాడు. పైకు అరుపులతో అడవి మారు మ్రోగింది. పైకు స్పృహతప్పి పడిపోయాడు.

ఈ సంఘటన భీంను పట్టి కుదిపింది. ఆవేశంలో వదినె దగ్గరకు వెళ్ళి “ఈ గాలి, నీరు, ఆకాశం మనవైనప్పుడు, ఈ భూమి, అడవి మనవి ఎందుకు కావు ? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నను “మీ నాయినను అడుగు” అని వదినె భీంకు చెప్పింది.

పన్నుల రూపంలో తమ కష్టాన్ని అంతా గుంజుకుంటే ఆకలితో చచ్చిపోవాల్సిందేనా ? అని, ఆలోచిస్తూ, భీం ఆ రోజు ఆకలితో పడుకున్నాడు. ఈ సంఘటన భీం మనస్సుపై చెరగని ముద్రవేసింది. గిరిజనుల కష్టాన్ని ఇతరులు అన్యాయంగా తీసుకుపోతున్నారని భీం తెలుసుకున్నాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 2.
కుంఠం భీంపై, విటోబా ప్రభావం ఎటువంటిది ?
జవాబు:
సుర్దాపూర్ గొడవలో కుంరం భీం చేతిలో సిద్ధిక్ చచ్చిపోయాడు. భీం తన మిత్రుడు కొండల్తో కలిసి, ‘భారీలొద్ది’లో ఉన్న పెద్ద ముఖాసీని కలిసి, సర్కారుపై తాను తిరుగబడతాననీ, తనకు మద్దత్తు ఇమ్మనీ అడిగాడు. ముఖాసీ హింసా పద్ధతులు వద్దని సలహా చెప్పాడు.

దానితో భీం రైలెక్కి ఎలాగో చాందా పట్నానికి చేరాడు. రైల్వేస్టేషన్ బయట కూర్చున్న భీంకు, తన సామానులు మోయలేక బాధపడుతున్న ఒక ప్రయాణికుడు కనిపించాడు. ఆయనే విటోబా. భీం విటోబా సరకులను ఇంటికి చేర్చాడు. విటోబా ప్రింటింగ్ ప్రెస్సు యజమాని. నిజాం సర్కారుకూ, తెల్లదొరలకూ వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళతో విటోబాకు దగ్గర సంబంధాలున్నాయి. విటోబా రహస్యంగా ఒక పత్రికను నడిపేవాడు. రహస్య పార్టీ, రహస్య పత్రికల గురించి తెలుసుకున్న భీంకు, విటోబాపై మంచి అభిప్రాయం ఏర్పడింది. భీం, విటోబా దగ్గర ఒక సంవత్సరం ఉన్నాడు. అక్కడే

భీం తెలుగు, ఇంగ్లీషు, హిందీ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. భీంకు విటోబా రాజకీయాల్నీ, సమాజ పరిణామాల్ని తెలియజేశాడు. సంఘంలో మార్పురావాలంటే త్యాగం చేయాలన్నాడు. ఒక రోజు రాత్రి పోలీసులు వచ్చి భీంను కొట్టి, విటోబాను అరెస్టు చేశారు. భీం తిరిగి రైల్వేస్టేషన్కు చేరాడు. అక్కడే భీంకు, మంచిర్యాల నుండి వచ్చిన ఒక తెలుగువాడితో పరిచయం అయ్యింది. వారిద్దరూ కలసి, ‘చాయ్పత్తా’ అని పిలువబడే అస్సాంకు వెళ్ళారు.

ప్రశ్న 3.
కుంరం భీంకు, అస్సాం తేయాకు తోటల్లో కలిగిన అనుభవాలను చెప్పండి.
జవాబు:
కుంరం భీం, అస్సాంలో తేయాకు తోటల్లో అడుగుపెట్టాడు. అక్కడ అనేక అనుభవాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. ఎక్కడైనా కష్టజీవులకు బాధలు తప్పవనీ, కష్టపడే వానికి కడుపు నిండటం లేదనీ, భీం తెలుసుకున్నాడు. రోజు కూలీ పద్ధతిన, భీం తేయాకు తోటల్లో కష్టపడి పనిచేశాడు. అక్కడ చెమట తుడుచుకోడానికి లేచిన కార్మికులను, మేస్త్రీలు కొరడాలతో కొట్టేవారు. వారి సంపాదన వారి మందులకే సరిపోయేది కాదు. తోటల యజమానులకు కొంచెం కూడా దయాగుణం ఉండేది కాదు.

ఇవన్నీ చూస్తున్న భీంకు అసంతృప్తి రాజుకుంది. కుంరం భీం అస్సాంలో నాల్గు సంవత్సరాలున్నాడు. అక్కడే భీంకు మన్యం నుండి వచ్చిన ఒక తెలుగు వ్యక్తితో పరిచయం అయ్యింది. అతడి ద్వారా భీం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును గూర్చి తెలుసుకున్నాడు. మన్య ప్రాంత ప్రజల్ని సీతారామరాజు సమీకరించిన విధానాన్నీ, రామరాజు జరిపిన పోరాట రీతుల్ని, భీం అర్థం చేసుకున్నాడు. యువకులకు యుద్ధరీతులను రామరాజు ఎలా నేర్పాడో తెలుసుకున్నాడు.

అడవిపై తమకు తప్ప ఇతరులు ఎవరికీ అధికారం లేదని గిరిజనులతో చెప్పించిన రామరాజు యొక్క గొప్పతనాన్ని భీం అర్థం చేసుకున్నాడు. యుద్ధ సమయంలో సమాచారాన్ని చేరవేసే పద్ధతిని భీం గ్రహించాడు. యుద్ధ మెళుకువలను భీం గ్రహించాడు. క్రమంగా భీం ఎక్కుపెట్టిన బాణంలా తయారయ్యాడు.

ఈ సమయంలో తేయాకు తోటల్లో అన్యాయంగా ఇద్దరు కార్మికుల్ని కొడుతున్న మేస్త్రీతో, భీం తగవుపెట్టుకున్నాడు. మేస్త్రీలు కొరడా. భీం పైకి ఎత్తారు. భీం వారిని చితక కొట్టాడు. తోటల యజమాని పోలీసులతో చెప్పి భీంను జైల్లో వేయించాడు. ‘భీం’ జైలు నుండి తప్పించుకొని స్వగ్రామం వెళ్ళాడు.

ప్రశ్న 4.
కుంరం భీం, సర్కార్ (నిజాం) సైన్యంతో యుద్ధం చేసి అమరుడైన విధము తెలపండి.
(లేదా)
కుంరం భీం నాయకత్వంలో గోండు రాజ్య స్థాపనానికి గోండులు చేసిన యుద్ధ పరిణామాల్ని తెలుపండి.
జవాబు:
కుంరం భీం పినతండ్రి “కుర్దు” నాయకత్వంలో, బాబేఝరి ప్రాంతంలో గిరిజనులూ, గోండులూ అడవిని కొట్టి, వ్యవసాయం చేశారు. అది తెలిసి జంగ్లాత్ వాళ్ళు దాడిచేసి గిరిజన గూడేలను ధ్వంసం చేశారు. కుంరం భీం, బాబేఝరి వైపు వచ్చి “టొయికన్” గూడెంలో దిగాడు. భీం భార్య పైకూబాయి వకీలును పెట్టుకోమని భీంకి సలహా చెప్పింది. భీం వకీలును కలిశాడు. వకీలు నిజాంకు అసలు విషయం చెప్పమనీ, నిజాం అతడి ఇష్టం వచ్చినట్లు చేస్తాడనీ చెప్పాడు.

‘భీం’ పన్నెండు గూడేల ప్రజలను పట్నాపూర్ రమ్మని పిలిచాడు. గిరిజనులను భూములను దున్నండని, పంటలు పండించండని నిజాం మనుష్యులను తరిమికొడదామనీ చెప్పాడు. గిరిజనులు కూడా తాము ఆకలితో చావడం కన్న, పోరాటం చేసి చద్దాం అన్నారు. గోండులు భీం నాయకత్వాన్ని సమర్థించారు.

గోండులు అడవిని నరికి, పంటలు పండించారు. జంగ్లాత్ వాళ్ళు ‘బాబేఝరి’పై విరుచుకుపడ్డారు. ఒక జాగీర్దార్ తుపాకీపేల్చాడు. భీంకు అది భుజంపై తగిలింది. తాశీల్దార్ గోండులను అరెస్టు చెయ్యమని డి.ఎస్.పి. కి చెప్పాడు. కుంరం భీం, నిజాంను కలవాలని ప్రయత్నించాడు. కాని అతడికి నిజాం దర్శనం కాలేదు.

భీం, జోడెన్ ఘాట్ వెళ్ళి, గిరిజనుల్ని కలిసి, పరిస్థితుల్ని వారికి చెప్పాడు. “భూమి లేక చచ్చే కంటే, పోరాడి చద్దాం”. అన్నారు గిరిజనులు. గోండు రాజ్యస్థాపన లక్ష్యంగా, జోడెన్ ఘాట్ కేంద్రంగా, భీం నాయకత్వంలో నిజాంపై పోరాటానికి, గోండులు సిద్దమయ్యారు.

నిజాం సర్కారు ఆజ్ఞలను గోండులు వినలేదు. భీం నాయకత్వాన్ని ఇష్టపడ్డ ఇతర గ్రామాలవారు కూడా; గోండు రాజ్యస్థాపనకు భీంకు మద్దతిచ్చారు. తుపాకులు తయారయ్యాయి. గోండులు కుంరం భీంకు జై అన్నారు. నైజాం సైన్యాన్ని భీం బలగం, తరిమి కొట్టింది.

నైజాం సర్కారు సబ్కలెక్టర్, భీంను కలిసి, భీం కూ, అతని బంధువులకూ భూమి పట్టాలిస్తామన్నాడు. పోరు ఆపమని కోరాడు. చివరకు పన్నెండు గ్రామాల వారికీ పట్టాలిస్తానన్నా, భీం అంగీకరించలేదు. వేరుగా గోండు రాజ్యం కావాలన్నాడు. యుద్ధం ఏడు నెలలు సాగింది. నిజాం సైన్యం 10 రోజులు యుద్ధం చేసినా, కొండ ఎక్కలేకపోయింది. ఇంతలో కర్దూపటేల్ భీంను మోసం చేశాడు. సర్కారు సేనతో కలిసి, కొండ మీదికి దారి చూపాడు. నైజాం సైన్యం దొంగతనంగా వచ్చి, గోండు వీరుల్ని చంపింది. కుంరం భీంను కాల్చి చంపింది. ఈ విధంగా కుంరం భీం అమరుడయ్యాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 5.
గోండు నాయకుడు కుంరం భీంను గూర్చి రాయండి.
జవాబు:
ఆదిలాబాదు జిల్లా అడవుల్లోని యుద్ధ వీరులు గోండులు. వారిలో కుంరం భీం ప్రసిద్ధుడు. గూడెం పెద్ద చిన్ను కుమారుడు భీం. భీంకు సోము, బొజ్జు అనే అన్నలు ఉన్నారు. భీం చిన్నప్పుడు సంకెనపెల్లి గూడెంలో పెరిగాడు. భీం చిన్ననాటి నుండి సాహసుడు. నాయకలక్షణాలు కలవాడు. ఇతడి ఆలోచనలకు బలాన్ని ఇచ్చింది ఇతని వదినె కుకూబాయి.
ఒకసారి భీం మిత్రులతో అడవికి వెళ్ళాడు. చెట్టు కొమ్మలను నరికి మేకలకు వేశాడని, అమీనాబ్ ఇతని స్నేహితుడు పైకు వేళ్ళను నరికించాడు. ఆ సంఘటన భీం మనసుపై చెరగని ముద్రవేసింది. అక్కడి గాలి, ఆకాశం, నీరు తమదైనపుడు అక్కడ అడవి, భూమి తమవి ఎందుకు కావనీ, భీం వదినెను అడిగాడు.

భీం కుటుంబంతో సుర్దాపూర్ వెళ్ళి, అక్కడ అడవులు కొట్టి వ్యవసాయం చేశాడు. అక్కడ భూమి తనదన్న సిద్ధికు భీం కొట్టి చంపాడు. జంగ్లాతోళ్ళతో పోరు మంచిది కాదని, పెద్ద ముఖాసీ భీంకు సలహా చెప్పాడు. భీంకు చాందాలో విటోబాతో పరిచయం అయ్యింది. అక్కడ భీం తెలుగు, హిందీ, ఇంగ్లీషు చదవడం రాయడం నేర్చుకున్నాడు. విటోబా, నిజాంకు వ్యతిరేకంగా పత్రిక నడిపేవాడు. భీంకు రాజకీయాలను విటోబాయే తెలిపాడు.

భీం, అస్సాం తేయాకు తోటల్లో కూలీగా పనిచేశాడు. అక్కడే అల్లూరి సీతారామరాజు గిరిజనుల పక్షాన చేస్తున్న పోరాటం గురించి, యుద్ధరీతుల గురించి భీం తెలుసుకున్నాడు. తర్వాత “కాకన్ ఘాట్”లో అతడు అన్నలను కలిశాడు. దేవడం పెద్ద లచ్చుపటేల్, భీంకు సోంబాయితో పెళ్ళి చేయించాడు. పైకూబాయి కూడా భీం పట్ల ఆకర్షణతో అతణ్ణి పెళ్ళాడింది.

“బాబేఝరి” వద్ద భీం కుటుంబీకులు అడవిని కొట్టి వ్యవసాయం చేశారు. జంగ్లాత్ వాళ్ళు మన్నెంగూడేలను భస్మం చేశారు. భీం జనగామలో వకీలును కలిశాడు. భీం పన్నెండు గూడేల గిరిజనులను, పట్నాపూర్ పిలిచాడు. అక్కడ గిరిజనులు నైజాంతో పోరాటం చేసి చద్దామని నిశ్చయించారు. బాబేఝురి ప్రాంతంలో గిరిజనులు సర్కారు ఆజ్ఞలను లెక్కచేయలేదు. విషయం నైజాంకు చెప్పడానికి భీం ప్రయత్నించాడు. ఏడు నెలలు గిరిజనులకూ, నైజాం సైన్యానికి పోరాటం జరిగింది. ఒక గ్రామం పెద్ద కుట్రతో, నైజాం సైన్యం దొంగతనంగా వచ్చి గోండు వీరుల్నీ, భీంనూ కాల్చి చంపింది.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

అ) కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

కుంరం భీం బాల్యం నుండి తెలివైనవాడు, సాహసవంతుడు, నాయకత్వ లక్షణాలున్నవాడు. భీం చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి స్పందించేవాడు. ఆలోచించేవాడు. దేన్నీ ఊరికే వదిలిపెట్టేవాడు కాదు. ఈ లక్షణాలే తరువాత అతడిని గిరిజన వీరుడిని చేశాయి. అతని ఆలోచనలకు పురుడు పోసింది, అతని భావాలకు బలాన్ని ఇచ్చింది అతని వదినె కుకూబాయి. భీం చిన్నప్పుడు సంకెనపెల్లి గూడెంలో పెరిగాడు. అక్కడి చెట్టూ, చేమా, బోళ్ళు, బండలు, కొండలు, వాగులు ఒకటేమిటి సమస్త ప్రకృతి అతడిని తీర్చిదిద్దింది. ఆ రోజుల్లోనే ఒక రోజు భీం తన మిత్రులైన జంగు, కొంతల్, మాదు, పైకులతో కలిసి అడవికి వచ్చాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కుంరం భీం భావాలకు బలాన్ని ఇచ్చిన వారెవరు ?
జవాబు:
కుంరం భీం భావాలకు బలాన్ని ఇచ్చింది అతని వదినె ‘కుకూబాయి’.

ప్రశ్న 2.
కుంరం భీంను తీర్చిదిద్దినవారు ఎవరు ?
జవాబు:
కుంరం భీంను సంకెనపెల్లి గూడెంలోని చెట్లూ, చేమా, కొండలూ వంటి సమస్త ప్రకృతి తీర్చిదిద్దాయి.

ప్రశ్న 3.
కుంరం భీం మిత్రుల పేర్లు ఏమిటి ?
జవాబు:
కుంరం భీం మిత్రులు

  1. జంగు,
  2. కొంతల్,
  3. మాదు,
  4. పైకు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 4.
కుంరం భీం వ్యక్తిత్వం ఎటువంటిది ?
జవాబు:
కుంరం భీం, బాల్యం నుండి తెలివిగలవాడు. నాయకత్వ లక్షణాలు గలవాడు. సాహసవంతుడు.

ప్రశ్న 5.
కుంరం భీం ఆలోచనలకు పురుడు పోసిన వదినె పేరు ఏమిటి ?
జవాబు:
కుంరం భీం ఆలోచనలకు పురుడు పోసిన వదినె పేరు “కుకూబాయి”.

ఆ) కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

దేవడం పెద్ద లచ్చుపటేల్. అతని దగ్గర భీం జీతానికి కుదిరాడు: అతని పంట పొలాల్లో మార్పు తెచ్చాడు. పత్తి, మిరప వంటి వ్యాపార పంటలను వేశాడు. మొత్తానికి భీం తెలివిపరుడని, వ్యవహారదక్షుడని అందరితో అనిపించుకున్నాడు. లచ్చుపటేల్ భూముల వ్యవహారాలను ముందు నుంచి చూసే అంబటిరావుకు, “సోంబాయి” అనే కూతురు ఉంది. ఆమెను భీంకిచ్చి పెండ్లి చేస్తే బాగుంటుందని లచ్చుపటేల్ నిశ్చయించాడు.

ఆ విధంగా కుంరం భీం, సోంబాయిల పెండ్లి దేవడంలో లచ్చుపటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజుల్లో కుంరం భీం వార్తల్లో వ్యక్తి అయినాడు. అతని పట్ల ఆకర్షణ పెంచుకున్న పైకూబాయి, అనే యువతి కోరి అతన్ని పెండ్లాడింది. భీం కాకన్ట్లో కాపురం పెట్టాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కుంరం భీం పెండ్లి ఎక్కడ, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ?
జవాబు:
కుంరం భీం పెండ్లి దేవడంలో లచ్చుపటేల్ ఆధ్వర్యంలో జరిగింది.

ప్రశ్న 2.
కుంరం భీం ఎవరి దగ్గర పనిచేశాడు? ఆయన ఎవరు ?
జవాబు:
కుంరం భీం, లచ్చుపటేల్ దగ్గర జీతానికి కుదిరాడు. లచ్చుపటేల్ “దేవడం” గ్రామపెద్ద.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 3.
పెండ్లి అయిన తర్వాత భీం, ఎక్కడ మకాం పెట్టాడు ?
జవాబు:
పెండ్లి అయిన తర్వాత భీం “కాకనాట్”లో కాపురం పెట్టాడు.

ప్రశ్న 4.
భీం తెలివిపరుడని, వ్యవహారదక్షుడని ఎందుకు పేరు తెచ్చుకున్నాడు ?
జవాబు:
భీం, లచ్చుపటేల్ దగ్గర జీతానికి కుదిరి, ఆయన పంట పొలాల్లో పత్తి, మిరపలాంటి వ్యాపార పంటలు వేశాడు. `ఆ విధంగా తెలివిపరుడని భీం పేరు తెచ్చుకున్నాడు.

ప్రశ్న 5.
అంబటి రావు ఎవరు ?
జవాబు:
అంబటి రావు, లచ్చుపటేల్ భూముల వ్యవహారాలను చూసేవాడు. అంబటిరావు కూతురు సోం బాయిని భీం పెండ్లాడాడు.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 6th Lesson దీక్షకు సిద్ధంకండి Textbook Questions and Answers.

TS 9th Class Telugu 6th Lesson Questions and Answers Telangana దీక్షకు సిద్ధంకండి

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 60)

స్వచ్ఛతలో చరిద్దాం !! స్వచ్ఛతకై శ్రమిద్దాం !

స్వచ్ఛ భారత్కు సన్నద్ధం కండి !

ప్రియమైన విద్యార్థులారా ………….

దేశవ్యాప్తంగా ఇటీవల మనం స్వచ్ఛభారత్ పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన విషయం మీకు తెల్సిందే! ప్రజల బాధ్యతారాహిత్యం వల్ల దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న అపరిశుభ్రతను అనతికాలంలోనే తొలగించాలన్నది ఒక దీక్షలాగ చేపట్టాం. నిరంతరం కొనసాగవలసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా భాగస్వాములే ! మీ మీ పరిసరాల్లో పోగుపడ్డ చెత్తాచెదారాన్ని తొలగించుకుంటూ, వ్యక్తిగత శుభ్రతతో సామాజిక పరిశుభ్రతను గురించి పదిమందికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛభారత్ సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం !

రానున్న రోజులలో భారతావని పరిశుభ్ర భారతంగా పరిఢవిల్లాలని కోరుకుందాం.

వైద్య, ఆరోగ్యశాఖ, రాష్ట్రం.
తెలంగాణ రాష్ట్రం

ప్రశ్నలు

ప్రశ్న 1.
ఇటువంటి పత్రాలు ఎక్కడైనా చూశారా ?
జవాబు:
ఇటువంటి పత్రాలను నేను చూశాను. వీటిని “కరపత్రాలు” అంటారు. వీటినే ఇంగ్లీషుభాషలో Pamphlet అంటారు. ఈ రోజుల్లో సమావేశాలకు రమ్మని పిలిచే ఆహ్వానాలకూ, ఆరోగ్యవర్ధకమైన ప్రభుత్వ ప్రచారాలకు, దైవసంబంధ కార్యక్రమాలకు ఈ కరపత్రాలను పంచుతున్నారు.

ప్రశ్న 2.
ఇట్లా పంచిపెట్టే పత్రాలను ఏమంటారు?
జవాబు:
ఇలా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించేందుకు వినియోగించే పత్రాలను కరపత్రాలు అంటారు.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
వీటిని ఎందుకు పంచిపెడుతారు?
జవాబు:
ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని ప్రజలందరికీ తెలియపరచడమే, కరపత్రం పంచడంలో గల ప్రధాన ఉద్దేశం. ఒక వ్యక్తిగాని, సంస్థగాని ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు ఈ కరపత్రాలను వినియోగిస్తారు.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కరపత్రాలను ఎందుకు రూపొందిస్తారు ? మీరు చదివిన కరపత్రం గురించి మాట్లాడండి.
జవాబు:
ఒక వ్యక్తిగాని, సంస్థగాని ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని, వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు కరపత్రాన్ని రూపొందిస్తారు. ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద విషయాన్ని ప్రజలందరికీ తెల్పడమే కరపత్రం యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనాలు ఉన్న విషయాలను, సామాన్య ప్రజానీకానికి చేరవేయడానికి కరపత్రం, ఒక ముఖ్య సాధనంగా ఉంటుంది.

నేను చదివిన కరపత్రం : స్టేట్బ్యాంకు వారు ఇంటి అప్పులు తక్కువ వడ్డీకి, ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా ఇస్తారన్న కరపత్రాన్ని నేను చదివాను.

  1. ఇంటి అప్పుకు దరఖాస్తు చేసే వ్యక్తి పేర ఇంటిస్థలం ఉండాలి.
  2. ఇల్లు నిర్మాణానికి స్థానిక పంచాయితీ / మునిసిపల్ కార్పొరేషన్ వారి అనుమతి పత్రం ఉండాలి.
  3. నిర్మాణ ఖర్చులో 1/4 వంతు పెట్టుబడిగా పెట్టగలిగిన స్థోమత దరఖాస్తుదారుకు ఉండాలి.
  4. హామీదారు అవసరం లేదు.
  5. అప్పు వడ్డీతో సహా 15 సంవత్సరాలలో తీర్చగలగాలి.
  6. జీతం నుండి రికవరీ చేసి, బ్యాంకుకు కడతామన్న పై అధికారి, హామీపత్రం ఉండాలి.
  7. సంవత్సరానికి 8% వడ్డీకే ఋణం మంజూరు.
  8. ఋణం ముందుగా చెల్లిస్తే, వడ్డీలో కన్సెషన్లు ఇవ్వబడతాయి.

ప్రశ్న 2.
ప్రజా ఉద్యమాలను శాంతియుతంగానే నిర్వహించవలసిన అవసరం ఏమిటి? చర్చించండి.
జవాబు:
ప్రజా ఉద్యమాలను శాంతియుతంగానే నిర్వహించాలి. హింసా పద్ధతులతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజల నిత్యావసరాల సరఫరాకు ఆటంకాలు కల్పించడం, వగైరా పనులు చేయరాదు.

ప్రజా ఉద్యమాలను శాంతియుతంగా నిర్వహిస్తే కలిగే లాభాలు :

  1. ఉద్యమకారులకు ప్రాణనష్టం, ధననష్టం జరుగదు.
  2. ఉద్యమకారులు ప్రాణభయంతో ఉద్యమం నుండి తప్పుకోరు.
  3. శాంతియుతంగా ఉద్యమాలు నడిపితే, ఉద్యమాన్ని ఎక్కువకాలం కొనసాగించవచ్చు.
  4. ఎక్కువకాలం శాంతియుతంగా ఉద్యమం నిర్వహిస్తే, ప్రభుత్వానికి కూడా ఉద్యమకారులపై సానుభూతి, దయ కలుగుతుంది.
  5. శాంతియుతంగా ఉద్యమం నడిపిన ఉద్యమకారులపై సామాన్య ప్రజలకు అభిమానం, సానుభూతి కలుగుతాయి.
  6. శాంతియుతంగా చేస్తే, ఉద్యమకారులను ప్రభుత్వం కూడా ఏమీ చేయదు.
  7. శాంతియుత ఉద్యమం తప్పక విజయాన్ని సాధిస్తుంది.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
పాఠం చదువండి. అప్పటి ప్రభుత్వ పాలనను గురించి విమర్శిస్తూ వాడిన కీలక పదాలు వెతికి రాయండి. వాటిని వివరించండి.
TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 1
జవాబు:
TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 2

ప్రశ్న 4.
కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఆంగ్లేయుల రాకకు ముందు మన భారతదేశంలో కరపత్రాలు లేవు. ఆధునిక కాలంలో ప్రతిరోజు మనం కనీసం ఒకకరపత్రమైనా చూస్తున్నాం.

ఒక సమాచారాన్ని లేదా ప్రత్యేక అంశాలను అందరికీ తెల్పడమే కరపత్రం ప్రధాన ఉద్దేశం. కరపత్రంలో సాధారణంగా వాడుకభాష ఉంటుంది. కరపత్రాలు వేసినవాళ్ళు, రాసినవాళ్ళ పేర్లు గాని, ముద్రణాలయం పేరు గాని కరపత్రాల్లో ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనాలున్న అంశాలను సామాన్య ప్రజానీకానికి చేరవేయడానికి కరపత్రం ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుంది. కరపత్రం మనిషి భావస్వేచ్ఛకు సంకేతం.

ప్రశ్నలు:

అ) పై పేరాకు శీర్షిక నిర్ణయించండి.
జవాబు:
‘కరపత్రాల ప్రయోజనం’ అనేది, పై పేరాకు శీర్షికగా సరిపడుతుంది.

ఆ) కరపత్రాలు మనదేశంలో ఎప్పటి నుండి ఉన్నాయి ?
జవాబు:
కరపత్రాలు, మనదేశంలో ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పటి నుండీ ఉన్నాయి.

ఇ) కరపత్రాలు ఎందుకు ?
జవాబు:
ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని అందరికీ తెల్పడానికి, కరపత్రాలు ఉపయోగిస్తారు.

ఈ) కరపత్రాలు ఎట్లా ఉండాలి ?
జవాబు:
కరపత్రాలలో సాధారణంగా వాడుకభాష ఉండాలి. కరపత్రాలు వేసినవాళ్ళు, రాసినవాళ్ళ పేర్లు గాని, ముద్రణాలయం పేరు గాని, కరపత్రాల్లో ఉండాలి.

ఉ) పై గద్యం ప్రకారం ఎక్కువగా వేటికి చెందిన కరపత్రాలు చూస్తున్నాం ?
జవాబు:
ప్రభుత్వ సంక్షేమ పథకాలనూ, సామాజిక ప్రయోజనాలున్న విషయాలనూ, సామాన్య ప్రజలకు చేరవేయడానికి నేడు ఎక్కువగా కరపత్రాలు వాడుతున్నాం.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) 1969 తెలంగాణ ఉద్యమకాలం నాటి పాలన ఎట్లా ఉందని భావిస్తున్నారు ?
జవాబు:
1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని, విద్యార్థులూ, ప్రజలూ, ఉద్యోగస్థులూ, రాజకీయ నాయకులూ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ నాయకుడు పి.వి. నరసింహారావుగారు ఉండేవారు. 1956లో ఆంధ్ర ప్రాంతమూ తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ప్రాంతానికి ముల్కీ హక్కులు ఉండేవి.. దాని ప్రకారము తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం తెలంగాణ వారికే ఇవ్వాలి.

కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత, తెలంగాణ ప్రాంతంలో సహితమూ, ముల్కీ నియమాలను ఉల్లంఘించి, ఆంధ్ర ప్రాంతం వారికి తెలంగాణలో ఉద్యోగాలు ఇచ్చారు. అదీగాక 1956 నుండి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఆంధ్ర ప్రాంతం వారే ఉండేవారు. వారు ఆంధ్ర ప్రాంతానికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకొనేవారు. తెలంగాణ ప్రాంతంలో వచ్చే ప్రభుత్వ రెవెన్యూను సైతం వారు ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు చేసేవారు.

అందువల్ల తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడింది. తెలంగాణ ఉద్యోగులు, ముల్కీ హక్కుల రక్షణకు, నిరవధిక సమ్మెలు ప్రారంభించారు. రాష్ట్ర నాయకులు సమ్మెలను నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. విద్యార్థులు 9 నెలలపాటు సమ్మె చేసినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. విద్యార్థులకు అప్పుడు ఒక విద్యా సంవత్సరం పూర్తిగా వ్యర్ధమయ్యింది.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ఆ) అప్పటి తెలంగాణ పోరాటంలో ప్రజలు కోపోద్రిక్తులు కావడానికి కారణాలు రాయండి.
జవాబు:
ప్రజలు శాంతియుతంగా నెలల తరబడి సమ్మెలు, ధర్నాలు, పికెటింగులు చేసినా, నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్యమ నాయకులను బలవంతంగా కారాగారాల్లో ప్రభుత్వము బంధించింది. ఎందరో యువకులు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోలీసుల తుపాకుల తుటాలకు బలయ్యారు. ఎందరో ఉద్యమ నాయకులు, రక్తతర్పణ చేశారు. ఎందరో యువకులు అంగవికలులు అయ్యారు..

తెలంగాణ ప్రాంతం అంతా, అగ్నిగుండంగా మారింది. అయినా కేంద్రప్రభుత్వము తెలంగాణ ప్రజల కోరికను మన్నించలేదు. కనీసము వారిని శాంతింపచేయడానికి ప్రయత్నాలు కూడా చేయలేదు. ఆ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కోపోద్రిక్తులయ్యారు.

ఇ) గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ సాధించాలనడంలో ఆంతర్యం ఏమిటి ?
జవాబు:
1969వ సంవత్సరము గాంధీ శతజయంతి సంవత్సరము. గాంధీజీ శాంతి, సత్యము, అహింస అనే సిద్ధాంతాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలకులను మనదేశం నుండి వెడలగొట్టగలిగారు. గాంధీజీ కార్యసాధనకు సత్యాగ్రహాలను, నిరాహారదీక్షలను నమ్మినవాడు. అటువంటి గాంధీజీ శత జయంతి సంవత్సరంలో, గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని, తెలంగాణ ప్రజాసమితి భావించింది. అందుకే విద్యార్థి నాయకుడు నిరాహారదీక్షకు సిద్ధపడ్డాడు.

ఉద్యమం శాంతియుతంగా నడవకపోతే, ప్రభుత్వం బలవంతంగా ఆ ఉద్యమాన్ని శాంతిస్థాపన పేరుతో అణచివేస్తుంది. అశాంతిగా ఉద్యమాన్ని నడిపిస్తే, నాయకులను, ప్రభుత్వం బంధిస్తుంది. ఆ పరిస్థితులు రాకుండా, తెలంగాణ ప్రజాసమితి నాయకత్వం ముందు జాగ్రత్తగా, రాష్ట్ర సాధనోద్యమాన్ని, గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా సాగించాలని నిశ్చయించింది.

ఈ) ప్రజా ఉద్యమాలు హింసాత్మకంగా మారకుండా ఉండడానికి ఉద్యమనాయకత్వం ఏం చేయాలి?
జవాబు:
ప్రజా ఉద్యమాలు హింసాత్మకంగా మారకుండా ఉండాలంటే, ఉద్యమనాయకులు ఈ కింది పద్ధతులను ఆచరణలో పెట్టాలి.

  1. ఉద్యమానికి ప్రధాన నాయకునిగా ఆవేశపరుడు, ఉద్రేకం కలవాడు కాని, అనుభవం కల నాయకుడిని ఎన్నుకోవాలి.
  2. ఉద్యమం శాంతియుతంగా, గాంధీజీ నమ్మిన అహింసా మార్గంలోనే నడిపించాలి.
  3. ఉద్యమనాయకులు ప్రభుత్వ ఆస్తులకు ఏవిధమైన నష్టం కల్గించరాదు.
  4. ఉద్యమనాయకులు తమ అనుచరులకు హితాన్ని ఉపదేశించి, శాంతిమార్గంలో నడిచేలా చేయాలి.
  5. ఉద్యమనాయకులు ప్రభుత్వానికి తమ సమస్యలను ఎప్పటికప్పుడు శాంతియుతంగా తెలపాలి.
  6. ఉద్యమాన్ని హింసా పద్ధతిలోనికి ఎన్నడూ మార్చరాదు.
  7. ఉద్యమం హింసాపద్ధతిలోకి మళ్ళినట్లయితే, వెంటనే ఉద్యమాన్ని తాత్కాలికంగా నాయకుడు ఆపుచేయాం.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) 1969 నాటి తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్రం సాధించకపోవడానికి, నేటి ఉద్యమం విజయవంతం కావడానికి కారణాలు విశ్లేషించండి.
జవాబు:
1969 తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ నాయకులు డా॥ మర్రి చెన్నారెడ్డిగారు నాయకత్వం వహించారు. ఆ రోజుల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఈ మధ్య సాగిన ఉద్యమం కంటే తీవ్రస్థాయిలోనే జరిగింది. నాటి తెలంగాణ ప్రజాసమితి నాయకత్వాన్ని ప్రజలు కూడా ఎక్కువగానే సమర్థించారు.

అప్పుడు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి నాయకులను 10 మందిని, ప్రజలు యమ్.పి లుగా నెగ్గించారు. విద్యార్థులు 9 నెలలపాటు పాఠశాలలనూ, కళాశాలలనూ బహిష్కరించారు. వారికి ఒక విద్యాసంవత్సరం మొత్తం నష్టం అయ్యింది. అయినా, ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాలేదు.
దానికి ముఖ్యకారణాలివి.

ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అహింసా పద్ధతులు అమలయ్యాయి. హైదరాబాదు నగరంలో నివసిస్తున్న ఆంధ్రప్రాంత స్త్రీలను ఉద్యమకారులు అవమానించారు. అల్లర్లు చేశారు. ఈ విధంగా ఉద్యమంలో అహింసా పద్ధతులు అమలుచేయడం వల్లే, నాడు ఆ నాయకులు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధింపలేకపోయారు.

నేటి ఉద్యమ విజయానికి కారణాలు :

  1. నేటి ఉద్యమం, పట్టువదలని విక్రమార్కుడైన కె.సి.ఆర్ నాయకత్వంలో అహింసా పద్ధతులలో సాగింది.
  2. నిరాహారదీక్షలు, నిరసనలు, సమ్మెలు, సకలజనుల సమ్మె, ఉద్యోగుల సమ్మె వంటి పద్ధతుల ద్వారా కేంద్రప్రభుత్వాన్ని నేటి ఉద్యమ నాయకులు ఒప్పించగలిగారు.
  3. 1969 ఉద్యమానికి నాటి కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకంగా నిలిచింది. నేటి ఉద్యమనాయకులకు, తెలంగాణలోని అన్ని పార్టీలూ కలిసి వచ్చాయి.
  4. ముఖ్యంగా కాంగ్రెస్పార్టీ వారు ముందుండి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టారు.
    ఈ విధంగా శాంతియుతంగా సాగడమే, నేటి ఉద్యమ విజయానికి ప్రథమ కారణం.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

ఆ) తెలంగాణ ప్రజల జీవనానికి, గ్రామాల అభివృద్ధికి తోడ్పడేవి “చెరువులు”. ఈ చెరువుల ప్రాధాన్యత వివరిస్తూ, వీటిని కాపాడడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చే కరపత్రం తయారు చేయండి. చదివి వినిపించండి.
జవాబు:

‘తెలంగాణ ప్రజల జీవనానికి చెరువుల ప్రాధాన్యము’

మన తెలంగాణ ప్రాంతంలో నేడు నీటి కొరతను ఎదుర్కొంటున్నాం. మనకు కృష్ణా, గోదావరి జీవనదులు ఉన్నా, వర్షపాతం తగినంత లేకపోడం దానికి ముఖ్యకారణం. ప్రధానంగా మన తెలంగాణలో చెరువులు ముఖ్యనీటి వనరులుగా ఉండి, మనకు త్రాగునీటినీ, సాగునీటినీ అందిస్తూ వచ్చాయి. ఈ మధ్యకాలంలో చెరువులను పూడ్చి ఆ స్థలంలో భవనాలు కట్టడం జరుగుతోంది. ఉన్న చెరువులను లోతుగా త్రవ్వించి, దానితో నీటిని నిల్వ చేయడంలో శ్రద్ధ తగ్గిపోయింది. చెరువులు, నీటి తూడు వగైరా పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. కొన్ని చెరువులు ఎండిపోయాయి. అందువల్లనే నేడు భూగర్భజలాలు అడుగంటిపోయాయి. 1500 అడుగులు లోతు బోర్లు వేసినా, చుక్క నీరు లభించడం లేదు. దీనికి ముఖ్యకారణం, మనం చెరువుల విషయంలో చూపిస్తున్న అశ్రద్ధ.

మన తెలంగాణ ప్రాంతంలో శాతవాహనుల కాలం నుండి చెరువుల నిర్మాణంపై శ్రద్ధ ఉంది. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం ఉన్నత దశకు చేరింది. తెలంగాణ పాలకులు, అసఫ్జాహీలు, కుతుబ్షాహీలు, సంస్థానాధీశులు చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు.

ఇప్పటి మన తెలంగాణ ప్రభుత్వము చెరువుల ప్రాధాన్యతను గుర్తించింది. ‘మిషన్ కాకతీయ’ అనే పేరుతో పాత చెరువుల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. మనం కూడా ప్రభుత్వంతో చేయి కలుపుదాం. మనం కూడా ఉద్యమస్ఫూర్తితో ముందుకు కదులుదాం. ప్రతి గ్రామంలో చెరువుల పునర్నిర్మాణంలో పాలు పంచుకుందాం. నీటి కొరతలేని బంగారు తెలంగాణను నిర్మించుకుందాం. కదలిరండి. చెరువులను పునర్నిర్మించండి.

ది. X X X X X

ఇట్లు
తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ.

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు అర్థాలు రాస్తూ, సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

అ) ఆయన అహర్నిశల ఆరాటము తీరని ఆవేదనగానే మిగిలిపోయినది.
జవాబు:
అహర్నిశలు = రాత్రింబగళ్ళు
వాక్యప్రయోగం : మనిషి అహర్నిశలూ విద్యాధనములు సంపాదించాలి.

ఆ) గాంధీ అహింసా మార్గంలో లక్ష్యాన్ని సాధించాడు.
జవాబు:
లక్ష్యం = తలపెట్టిన కార్యం
వాక్యప్రయోగం : ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే పట్టుదల మెండుగా ఉండాలి.

ఇ) తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగిస్తున్నది.
జవాబు:
జనత = జనుల గుంపు
వాక్యప్రయోగం : భారతదేశం జనత కష్టజీవులు. ధర్మవర్తనులు.

2. ఇచ్చిన వివరణలకు సరిపడే జాతీయాలను బ్రాకెట్లో ఇవ్వబడిన వాటి నుండి ఏరి వాటికెదురుగా ఉన్న గళ్లల్లో రాయండి.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 3
(కట్టలు తెంచుకోవడం, ఏ ఎండకాగొడుగు, ఉక్కుపాదం మోపడం, తిలోదకాలు ఇవ్వడం)
జవాబు:
అ) ఆశలు వదులు కొనటం = తిలోదకాలు ఇవ్వడం
ఆ) బలవంతంగా అణచివేయటం = ఉక్కుపాదం మోపడం
ఇ) మితిమీరిపోవటం = కట్టలు తెంచుకోవడం
ఈ) అవకాశవాదం = ఏ ఎండకాగొడుగు

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లో సంధి పదాలను గుర్తించి, ఆ పదాలను విడదీసి సంధి పేర్లు పేర్కొనండి.

అ) కోపోద్రిక్తులైన కార్యకర్తలను హింసకు తెగబడకుండా కట్టడి చేశారు.
__________ + _______ = __________
జవాబు:
కోపాద్రిక్తులు = కోప + ఉద్రిక్తులు = గుణసంధి

ఆ) నమ్మిన సిద్ధాంతం కోసం గొప్పవారు ప్రాణాలర్పించడం చూస్తనే ఉన్నాం.
__________ + _______ = __________
జవాబు:
ప్రాణాలర్పించడం = ప్రాణాలు + అర్పించడం = ఉత్వసంధి

ఇ) సత్యాహింసలు పాటించడం ద్వారా సమాజ శాంతికి బాటలు వేయవచ్చు.
__________ + _______ = __________
జవాబు:
సత్యాహింసలు = సత్య + అహింసలు = సవర్ణదీర్ఘ సంధి

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

2. సమాస పదాలకు చెందిన కింది పట్టికను పూరించండి.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 6

‘సమాస పదం – విగ్రహవాక్యం – సమాస నామం

  1. భక్తి ప్రపత్తులు – భక్తియు, ప్రపత్తియు – ద్వంద్వ సమాసం
  2. ధర్మయుద్ధం – ధర్మము కొఱకు యుద్ధం – చతుర్థీ తత్పురుష సమాసం
  3. రక్తపాతం – రక్తం యొక్క పాతం – షష్ఠీ తత్పురుష సమాసం
  4. శాంతి సందేశం – శాంతి యొక్క సందేశం – షష్ఠీ తత్పురుష సమాసం
  5. నాలుగెకరాలు – నాలుగు సంఖ్య గల ఎకరాలు – ద్విగు సమాసం

3. కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు.
వేలాది యువకులు కారాగారాలకు వెళ్లారు. (సామాన్య వాక్యాలు).
జవాబు:
వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు మరియు కారాగారాలకు వెళ్ళారు. (సంయుక్త వాక్యం)

ఆ) గాంధీ విధానాలను ఆచరించాలి.
గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి. (సామాన్య వాక్యాలు)
జవాబు:
గాంధీ విధానాలను ఆచరించాలి మరియు మంచిని సాధించాలి (సంయుక్త వాక్యం)

ప్రాజెక్టు పని

మీ ప్రాంతంలో వివిధ రకాల కరపత్రాలు సేకరించి వాటి వివరాలు కింది పట్టిక రూపంలో నమోదు చేయండి. నివేదిక రాయండి.
TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 4
జవాబు:
TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి 5

కఠిన పదాలకు అర్థాలు

I

62వ పేజీ

సామూహిక ఉపవాస దీక్ష = అందరూ కలసి గుంపుగా ఉపవాసవ్రతం చేపట్టడం
తెలంగాణ రాష్ట్ర ధ్యేయాన్ని = తెలంగాణ రాష్ట్ర సాధన వాంఛను
చాటి చెప్పడానికి = వెల్లడించడానికి
మహాత్ముని = మహాత్మగాంధీజీ యొక్క
ప్రగాఢ విశ్వాసాన్ని = గట్టి నమ్మకాన్ని
ఆదేశాలను = ఆజ్ఞలను
ప్రజా ఉద్యమము = ప్రజల పోరాటం
కొనసాగుతున్నా = సాగుతున్నప్పటికీ (జరుగుతున్నప్పటికీ)
నిరసనపత్రాలకు = వ్యతిరేకతను తెలిపే కాగితాలకు
బడా మనుషులు = పెద్ద మనుష్యులు
భుక్తి మార్గం = తిండికి మార్గం
మలిన హృదయాలను = మురికిపట్టిన మనస్సులను
మరుగుపరుస్తున్నారు = దాస్తున్నారు
జాతిపిత ప్రబోధాలకు = గాంధీజీ బోధనలకు
తిలోదకాలు
(తిల + ఉదకాలు) = నువ్వుల నీళ్ళు
తిలోదకాలిచ్చు = పూర్తిగా ఆశ వదలుకొను,
అహర్నిశలు = పగలు, రాత్రి
ఆరాటము = సంతాపము
ఆవేదన = బాధ
కన్నీటితో తడియడం = ఏడవడం వల్ల కన్నీరు కారడం
ఆంధ్రపాలకులు = ఆంధ్రదేశపు ముఖ్యమంత్రులు
బానిస బంధాలను = = బానిస బంధములను;
తెలంగాణ జనత = తెలంగాణ ప్రజలు;
ప్రాణాలు కోల్పోయినారు = ప్రాణాలు పోగొట్టుకున్నారు
అంగవిహీనులు = అవయవాలు లేనివారు
సత్యాగ్రహ సమరం = సత్యాగ్రహ యుద్ధం

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

కారాగారం = జైలు
పికెటింగు = అడ్డుకోడం
ధర్నా = నిరసన కార్యక్రమం
ఉత్కృష్ట లక్ష్యాన్ని= గొప్ప లక్ష్యమును
రాబందుల రాచరికం = రాబందుల పెత్తనం
శాంతియుత విప్లవాన్ని = శాంతితో కూడిన విప్లవాన్ని
ప్రశాంత గంభీర జలధి = ప్రశాంతమైన లోతైన సముద్రము
పరిశీలన = శోధన
ప్రజాభిప్రాయము = ప్రజల అభిప్రాయము
మన్నన = గౌరవము
దారుణ హింసాకాండ = భయంకరమైన హింసా కృత్యం
రక్తపాతం = రక్తం కారడం
కోపోద్రిక్తులను = కోపముతో విజృంభించిన వారిని
కట్టలు తెంచుకొంటున్నది = గట్టులు తెంపుకొంటోంది
సడలిపోయే = జారిపోయే
ఏ ఎండకా గొడుగు = సందర్భానుసారంగా ఆచరించి కాలం గడుపుకోడం

63వ పేజీ

శాసన సభ్యులపైన = శాసనసభలోని సభ్యులపై (MLA లపై)
పేరుకుంటున్నది = అతిశయిస్తోంది
అగ్నిజ్వాలలు = అగ్నిమంటలు
కేరింతలాడుతున్న = ఉత్సాహంతో కేకలు వేస్తున్న
స్వార్థపరులు = తమ ప్రయోజనము మాత్రమే చూసుకొనేవారు
ప్రదర్శించడం = చూపడం
ధ్యేయానికి = కోరిన లక్ష్యమునకు
కలచివేస్తున్న = బాధపెడుతున్న
వాస్తవమే = సత్యమే
గాంధీ శతజయంతి
సంవత్సరం = గాంధీగారి నూరవ పుట్టినరోజు అయిన 1969వ సంవత్సరం
సత్యాహింసలు
(సత్య + అహింసలు) = సత్యము, అహింస
వరప్రభుత్వాన్ని = విదేశ ప్రభుత్వాన్ని
పారద్రోలిన = వెళ్ళగొట్టిన
కాసురాకాసి = డబ్బు రాక్షసి
నిరాహారదీక్ష = ఆహారం తిననని పట్టుపట్టడం
సమ్మతిని = అంగీకారాన్ని
శతజయంతి = నూరవ పుట్టినరోజు
జన్మదినానికి = పుట్టినరోజుకు
చేపట్టడం = చేయవలెనని అనుకోడం
పుష్టిని = బలాన్ని
భక్తి ప్రపత్తులు = భక్తి మరియు శరణాగతి
కానుక = బహుమతి
దిగ్విజయం = జయప్రదం
వెలుగులు విరజిమ్మాలి = కాంతులు నింపాలి
సత్యమేవ, జయతే = సత్యమే జయిస్తుంది

పాఠం నేపథ్యం, ఉద్దేశం

తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు. ఎంతోమంది అమరుల త్యాగాలకు చిహ్నంగా సాధించుకున్నదే ఈ తెలంగాణ రాష్ట్రం. ఇది ఉద్యమాల ఫలితంగానే సాకారమైంది. నిన్నటి ఉద్యమానికి ముందే 1969లో ‘తెలంగాణ ప్రజాసమితి’ పేరుతోటి ప్రత్యేకరాష్ట్ర సాధన పోరాటం మొదలైంది. ఆనాటి ఉద్యమ తీరుతెన్నులను తెలుపడం, కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం.

TS 9th Class Telugu Guide 6th Lesson దీక్షకు సిద్ధంకండి

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి గాని, సంస్థ గాని, ప్రజలకు అందించాలనుకొనే సమాచారాన్ని వీలయినంత సంక్షిప్తంగా అచ్చు రూపంలో అందించేందుకు ఉపయోగించే పత్రాన్ని కరపత్రం అంటారు. దీనినే ఆంగ్లభాషలో ‘పాంప్లెట్” (Pamphlet) అంటారు.

“తెలంగాణ హిస్టరీ సొసైటి తరపున 2009లో వెలువడ్డ పుస్తకం, “1969 ఉద్యమం – చారిత్రక పత్రాలు” అనేది. ఈ పుస్తకంలో 1969 నాటి తెలంగాణ ఉద్యమ స్థితి గతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించబడ్డాయి. ఆ పుస్తకంలో నుండి ఒక కరపత్రం తీసుకోబడింది. ఆ కరపత్రమే, ఈ పాఠం.

ప్రవేశిక

దీర్ఘకాలంగా శాంతియుత ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినా అణచివేతకు దిగినా ఉద్యమాలు హింసాయుతంగా మారే అవకాశం ఉన్నది. ముందుగానే అటువంటి పరిణామాన్ని ఊహించిన ఉద్యమనాయకత్వం పాలకులను ఎండగడుతూ గాంధీ సిద్ధాంతాల కనుగుణంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఇందుకనుగుణంగా రూపొందించిన 1969 నాటి కరపత్రంలో వివరాలు ఏమున్నాయో తెలుసుకుందాం.

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

These TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 1st Lesson Important Questions ధర్మార్జునులు

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘ధర్మార్జునులు’ పాఠం ఆధారంగా రాజుకు ఉండవలసిన ఐదు లక్షణాలు తెల్పండి.’
జవాబు:
“యథా రాజా తథా ప్రజాః” – రాజు ఎట్లా ఉంటే, ప్రజలు. అట్లే ఉంటారు. ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ, ప్రజారంజకమైన విధానాలతో ధర్మపరిపాలన అందించాడు. ప్రస్తుత పాఠం ఆధారంగా రాజుకు ఉండవలసిన

లక్షణాలు – అవి :

  1. ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి.
  2. దానగుణం కల్గి, పూర్తిస్థాయిలో చెయ్యాలి.
  3. ముఖప్రీతి మాటలుకాక మనస్ఫూర్తిగా మాట్లాడాలి.
  4. ప్రజల సంపదను చూసి అసూయపడకూడదు.
  5. రాత్రింబగళ్ళు ధర్మకార్యాలు చేయాలి.
  6. కోపం కొంచెం కూడా ఉండకూడదు.
  7. మంచి చెడులను తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
  8. ఆడంబరాలు లేని స్థిరస్వభావం ఉండాలి.

ప్రశ్న 2.
ఒక కుటుంబంలోని అన్నదమ్ములు ఎలా ఉండాలి ?
జవాబు:
అరమరికలు లేని అన్నదమ్ములు ఆణిముత్యాలు. సోదర ప్రేమకు నిలువుటద్దం రామాయణభారతాలు. శ్రీరాముడు సోదరులైన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల పట్ల భ్రాతృప్రేమను చాటాడు. అలాగే రాముని పట్ల మిగిలినవారు అంతటి సోదరభావాన్ని ప్రదర్శించారు. అట్లాగే భారతంలోని పాండవులు స్నేహము, భక్తి, సహనం కలిగి, చిన్నా పెద్దా అనే తేడాలు చూసుకుంటూ, ఒకరిమాట ఒకరు పాటిస్తూ అందరూ ఒకే మనస్సుతో పనులు చేస్తూ, అన్యోన్య ప్రేమతో ప్రవర్తించేవారు.

కుటుంబంలోని అన్నదమ్ములు శ్రీరాముని సోదరులను, పాండవులను ఆదర్శంగా తీసుకోవాలి. ఒద్దిక కలవారై ఒకరి మనసు ఒకరు తెలుసుకుని మెలగాలి.

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 3.
చేమకూర వేంకట కవి కవితా శైలిని గూర్చి రాయండి.
జవాబు:
చేమకూర వేంకట కవి భారత కథలో అవసరమైన చక్కని మార్పులు చేసి, “ప్రతిపద్య చమత్కారం”తో స్వతంత్ర కావ్యంగా “విజయ విలాసము” తీర్చిదిద్దాడు. ఈ ప్రబంధం రఘునాథ నాయకునికి అంకితమివ్వబడింది. ఈ కావ్యంలో శబ్దాలంకారాలు సొగసులతో, తెలుగు నుడికారాలతో, అందమైన శైలి, ప్రసన్న గంభీరమైన పద్యం నడక కనబడుతుంది.

విజయ విలాసంలో, చమత్కారం లేని ఒక్క పద్యం కూడా లేదని పేరుపొందాడు. ‘పిల్ల వసుచరిత్ర’ అనే ప్రశంసను పొందిన ఈ కావ్యం, తెలుగులోని పంచమహాకావ్యాలతో సరితూగగలదని విజ్ఞులు తలుస్తారు.

ప్రశ్న 4.
‘అతని నుతింపశక్యమె’ అని అర్జునుడిని గురించి వేంకటకవి అన్నాడు. అర్జునుడి గొప్పతనాన్ని వివరించండి.
జవాబు:
అర్జునుడు అన్నల విషయంలోనూ, తమ్ముళ్ళ విషయంలోనూ సమానంగా ప్రవర్తించే వాడనే పేరు పొందిన ఘనుడు. రాజులందరిలోనూ ఎక్కడా ఎదురులేనివాడని ప్రసిద్ధినీ, గొప్పతనాన్నీ పొందిన పరాక్రమశాలి. అర్జునుడు సాత్త్వికులు ప్రశంసించే, ధర్మప్రవర్తన కలవాడు.

అర్జునుడు అందంలో ఇంద్రుని కుమారుడు జయంతుని అంతటివాడు. దయా స్వభావంలో కృష్ణుడికి ప్రాణమిత్రుడు. యుద్ధ విజయాలలో శివుడితో పోటీపడే వీరుడు. ఈ భూమండలంలో అర్జునుడికి అర్జునుడే సాటియైనవాడు.

అర్జునుడు తేరిపార చూస్తే, శత్రుసైన్యం పారిపోడానికి సిద్ధం అవుతుంది. అర్జునుడు విల్లుఎత్తి పట్టుకోడానికి వంగితే శత్రువులు వీర స్వర్గం దారిపడతారు. అర్జునుడితో సాటి అని చెప్పదగినవాడు, పోల్చదగిన వీరుడు ఈ లోకంలో శ్రీరాముడు తప్ప మరొకరు లేడు.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ధర్మరాజు పాలనతో, నేటి నాయకుల పాలనను పోల్చి రాయండి.
జవాబు:
ధర్మము తెలిసినవాడు ధర్మరాజు. ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, తాను సహితం ఆచరించేవాడు. శాంతము, దయ, సత్యము అనే సద్గుణాలు కలవాడు. మంచివారిని ఆదరించేవాడు. దానము చేయడంలో ఆసక్తి కలవాడు. ముఖప్రీతి కోసం మాట్లాడేవాడు కాడు. కోపం లేనివాడు. లోకువ చేసేవాడు కాడు.

అసూయ లేనివాడు. మెచ్చుకున్నప్పుడు తృప్తిగా ఇచ్చేవాడు. ఇలా కృతయుగ (సత్యకాలం) లక్షణాలతో విరాజిల్లే ధర్మరాజుతో నేటి నాయకుల పాలనను పోల్చడానికి మనసు రావడం లేదు, పెన్ను కదలడం లేదు.

ఆకలితో అలమటించేవారికి రూపాయి ఖర్చుపెట్టడానికి ఆలోచించే నేటి నాయకులు ఎన్నికలలో డబ్బును ఎన్ని రూపాల్లో పంచవచ్చో అలా పంచేస్తున్నారు. ఓటుకు నోటు ఇచ్చినవాడు తిరిగి మాట మీద నిలబడి మనకు మేలు చేస్తాడని నమ్మడం, ఓటు అమ్ముకోవడం మనం చేస్తున్న దోషాలు. నాణ్యత లేమి ప్రతి పనిలో కనబడుతుంది. ముందుచూపు లేని నాయకుల పాలనలో ప్రజలు ప్రకృతి బీభత్సాలకు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఆవేశం కలిగిన నాయకులు ప్రజలకు అనర్థాలే కలిగిస్తున్నారు.

పెద్దల సభలలో వారి ప్రవర్తన జుగుప్స కల్గిస్తుంది. ముఖప్రీతి మాటలే చెబుతున్నారు. ప్రజలకు ఇచ్చేటప్పుడు పత్రికల ముందు గొప్ప కోసం తప్ప తృప్తిగా ఇచ్చేది లేదు. ప్రభుత్వ పథకాలు అర్హులు అయిన వారికన్నా అనర్హులకే పొడుగు చేతుల పందేరం అవుతోంది. శాంతి, దయ, సత్యం, మత సహనం అనే లక్షణాలు నామమాత్రంగానే ఉన్నాయి.

గాంధీ వంటి మహాత్ముల పేరు చెప్పుకొని బ్రతుకుతున్న నాయకులంతా దేశభక్తిని విడిచి భుక్తి మార్గం వెతుకుతున్నారు. తెల్లరంగు ఛాయలో తమ మలిన హృదయాలను దాచుకుంటున్నారు. త్యాగమూర్తుల ప్రబోధాలకు నీళ్ళొదులుతున్నారు. ఇది కచ్చితంగా కలికాలం. కష్టాల కాలమే.

PART – I : PART – B

భాషాంశాలు – పదజాలం :

1. సొంతవాక్యాలు :

1. సోయగం : చెరువు గట్టున ఉన్న మాయింటి సోయగం చూపులకే కాదు, మనస్సుకు హాయినిస్తుంది.
2. ఏవురు : స్నేహితులు నల్వురు ఏవురు వున్నా, మంచివారై ఉండాలని అమ్మ చెప్పింది.
3. కొంగుపసిడి : మా తాతయ్య మాయింటికే కాదు ఊరికే కొంగుపసిడి అని అంతా అంటారు.
4. సరాగము : మా ఉమ్మడి కుటుంబంలో సరాగము పండుగ రోజుల్లో కనబడుతుంది.
5. ప్రతిజోదు : మా తెలివితేటలకు ప్రతిజోదు మా మావయ్య అడిగే క్విజ్ ప్రశ్నలు.
6. అసూయపడు : ఎదుటివారి సంపదలకు అసూయపడితే నిద్ర రాదు, ఫలితం ఉండదు.
7. సౌజన్యం : ఆపదలు ఎదురైనప్పుడు మనిషిలో సౌజన్యం బయటపడుతుంది.
8. వన్నె, వాసిగాంచు : వన్నె, వాసిగాంచిన మహాపురుషుల గురించి, చిన్నప్పటి నుండి తెలుసుకొంటే మనకు లక్ష్యం ఏర్పడుతుంది.
9. శాంతి : ఎప్పుడూ బాధ లేకుండా ఉండటం ఎల్లప్పుడు మనము శాంతినే కోరుకోవాలి.
10. అసూయపడుట : ఈర్ష్యపడుట – పాండవుల ఐశ్వర్యానికి దుర్యోధనుడు అసూయపడ్డాడు.
11. వెలసిరి : అవతరించటం – విష్ణువు భక్త సంరక్షణార్థమై కలియుగంలో వేంకటేశ్వర స్వామిగా తిరుమలలో వెలసెను.
12. పుణ్యభూమి : గొప్పభూమి – ధర్మ పరిపాలనా తత్పరులు పాలించిన పుణ్యభూమి మనదేశం.

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

II. అర్థాలు:

అ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
శ్రీరాముడు దశరథుని తనూజుడు – గీత గీసిన పదానికి అర్థం
A) తండ్రి
B) కుమారుడు
C) వారసుడు
D) వంశకర్త
జవాబు:
B) కుమారుడు

ప్రశ్న 2.
“క్షితి” అంటే అర్థం
A) చితి
B) ఒక పక్షి
C) భూమి
D) రాజు
జవాబు:

ప్రశ్న 3.
“ఎడాటము” అనే పదానికి సరియైన అర్థం
A) పెంపకము
B) తడబాటు
C) విషయము
D) శ్రద్ధ
జవాబు:
C) విషయము

ప్రశ్న 4.
“ధర్మరాజు” అనే అర్థం వచ్చే పదం
A) అజయుడు
B) ధర్మ తనూజుడు
C) ఉద్ధతుడు
D) కోవిదుడు
జవాబు:
B) ధర్మ తనూజుడు

ప్రశ్న 5.
మనకు కొదవ లేనివి ప్రకృతి వనరులు గీత గీసిన పదానికి అర్థం
A) కొఱత
B) ధనము
C) మర్యాద
D) ఎక్కువ
జవాబు:
A) కొఱత

ప్రశ్న 6.
కలిమి గలనాడె దేవుని పూజింపుము – గీత గీసిన పదానికి అర్థం
A) బలము
B) ధాన్యము
C) భక్తి
D) సంపద
జవాబు:
D) సంపద

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 7.
“జలధి” అనే పదానికి సరియైన అర్థం
A) వారధి
B) వారిధి
C) వారిజాతము
D) పారిజాతము
జవాబు:
B) వారిధి

ప్రశ్న 8.
“భూమి” అనే అర్థం వచ్చే సరియైన పదం
A) మిన్ను
B) చక్రము
C) వసుమతి
D) దానవుడు
జవాబు:
C) వసుమతి

ప్రశ్న 9.
సోదరులు – అనే అర్థం గల పదము
A) అనుజన్ములు
B) కుమార్తెలు
C) తనూజులు
D) తండ్రి, బాబాయి
జవాబు:
A) అనుజన్ములు

ప్రశ్న 10.
సత్త్వగుణం కలవారు – అనే అర్థం వచ్చే సరియైన పదం
A) సరసులు
B) సంపన్నులు
C) ధర్మరాజు
D) సాత్త్వికులు
జవాబు:
D) సాత్త్వికులు

ప్రశ్న 11.
ధర్మరాజు శాంతి, దయలనే ఆభరణాలుగా ధరించాడు – గీత గీసిన పదానికి అర్థం
A) గుణాలు
B) గుడ్డలు
C) నగలు
D) సుగంధాలు
జవాబు:
C) నగలు

ప్రశ్న 12.
పాండురాజు జ్యేష్ఠ కుమారుడు ధర్మరాజు – గీత గీసిన పదానికి అర్థం
A) చివరి
B) మధ్య
C) పెద్ద
D) ఆరంభం
జవాబు:
C) పెద్ద

ప్రశ్న 13.
ధర్మకార్యాలు చేస్తూ పుణ్యం సంపాదించాలనే దృష్టి – గీత గీసిన పదానికి అర్థం
A) చూపు
B) చాప
C) కోరిక
D) దిష్టి
జవాబు:
A) చూపు

ప్రశ్న 14.
మనుష్యులలో వ్యత్యాసం తెలిసినవాడు – గీత గీసిన పదానికి అర్థం
A) ఎక్కువ
B) తేడా
C) తక్కువ
D) సమానం
జవాబు:
B) తేడా

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 15.
యాచకుల దీనత్వం పోగొట్టడానికి ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉంటారు – గీత గీసిన పదానికి అర్థం
A) యాత్రికులు
B) అనాథలు
C) దానం కోరువారు
D) వీధిబాలలు
జవాబు:
C) దానం కోరువారు

ప్రశ్న 16.
లోకంలో అన్నదమ్ముల ఒద్దిక అంటే వారిదే సుమా – గీత
A) అధికారం
B) పెత్తనం
C) అయిష్టం
D) అనుకూలం.
జవాబు:
D) అనుకూలం.

ప్రశ్న 17.
శత్రు సమూహం వీరస్వర్గం దారిపడుతుంది – గీత గీసిన
A) ఇంటిదారి
B) వీరమరణం
C) సుఖం
D) నరకం
జవాబు:
B) వీరమరణం

ప్రశ్న 18.
యథా రాజా తథా ప్రజాః – గీత గీసిన పదానికి అర్థం
A) అట్లు
B) వలన
C) ఎట్లు
D) ఇట్లు
జవాబు:
A) అట్లు

III. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
దేవతలు, దివిజులు, సురలు – అనే పర్యాయపదాలు గల పదము
A) దైత్యుతులు
B) అమరులు
C) భాసురులు
D) శ్రమణకులు
జవాబు:
B) అమరులు

ప్రశ్న 2.
ఎప్పుడూ పసిడి ధర ఎక్కువే – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) వెండి, బంగారం
B) నగలు, ప్లాటినం
C) పుత్తడి, పైడి, స్వర్ణము
D) సొమ్ములు, నగలు, ఆభరణాలు
జవాబు:
C) పుత్తడి, పైడి, స్వర్ణము

ప్రశ్న 3.
తనూజుడు పుట్టినప్పుడు కాక కుమారుడు ప్రయోజకుడైతే, ఆ సుతుని చూచి తండ్రి ఆనందపడతాడు. పై వాక్యంలో పర్యాయపదాలు ఉన్న పదం.
A) జనకుడు
B) ఆనందము
C) ప్రయోజనము
D) పుత్రుడు
జవాబు:
D) పుత్రుడు

ప్రశ్న 4.
పురము – అనే పదానికి పర్యాయపదాలు
A) పురము, పురహరుడు
B) పట్టణము, జనపదం
C) ప్రోలు, పట్టణము, నగరం
D) జనపదం, భాగ్యనగరం
జవాబు:
C) ప్రోలు, పట్టణము, నగరం

ప్రశ్న 5.
క్షితి – అనే పదానికి పర్యాయపదం కానిది.
A) భూమి
B) ధరణి
C) వసుమతి
D) పక్షి
జవాబు:
D) పక్షి

ప్రశ్న 6.
నరుడు, మానవుడు – అనే పర్యాయపదాలుగా గల పదం
A) మానిసి
B) ఉత్తముడు
C) దనుజుడు
D) కృష్ణుడు
జవాబు:
A) మానిసి

ప్రశ్న 7.
రాజు అనే పదానికి పర్యాయపదాలు
A) ఏలిక, ప్రభువు
B) ధనికుడు, రాజు
C) చంద్రుడు, రాజు
D) రాజనాలు, ప్రభువు
జవాబు:
A) ఏలిక, ప్రభువు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 8.
ఇల, మహి, వసుమతి – అనే పర్యాయపదాలు గల పదం
A) క్షితి
B) స్త్రీ
C) ధర్మము
D) అర్జునుడు
జవాబు:
A) క్షితి

ప్రశ్న 9.
మన మాటలో నిజం ఎదుటివాడికి వినబడాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) నిజాయితీ, నైజం
B) ఋతము, సత్య
C) అనృతం, అమృతం
D) సత్తువ, సాపత్తి
జవాబు:
B) ఋతము, సత్య

ప్రశ్న 10.
“శత్రువు” అనే పదానికి పర్యాయపదాలు
A) వైరి, అరి, రిపుడు
B) విరోధం, పగ, విజితులు
C) మిత్రుడు, స్నేహితుడు, దోస్తు
D) వెన్నుజూపు, పాఱజూచు
జవాబు:
A) వైరి, అరి, రిపుడు

ప్రశ్న 11.
నిజం చెప్పడంలోని స్వారస్యాన్ని తెలిసినవాడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) అబద్ధం, అసత్యం
B) సత్యం, ఋతం
C) ఋతం, ఋతం
D) నాసికం, కర్ణం
జవాబు:
B) సత్యం, ఋతం

ప్రశ్న 12.
అతని ముఖము పై చిరునవ్వు ఎప్పుడూ ఉంటుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) చెవులు, కాళ్ళు
B) ముక్కు చేతులు
C) ఆననం, ఆస్యం
D) నాసికం, కర్ణం
జవాబు:
C) ఆననం, ఆస్యం

ప్రశ్న 13.
సముద్రం ఈ భూమండలాన్ని ఆవరించియున్నది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సాగరం, రత్నాకరం
B) ఘోష, రొద
C) నదీనదం, వారిధి
D) సంగ్రామం, సంగరం
జవాబు:
A) సాగరం, రత్నాకరం

ప్రశ్న 14.
అయిదు దేవతా వృక్షాలు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) ఋక్షం, చెట్టు
B) మహీరుహం, భూజం
C) భూగృహం, రంధ్రము, కాలము
D) మొక్క ఆకు
జవాబు:
B) మహీరుహం, భూజం

ప్రశ్న 15.
కృష్ణునికి ప్రాణమిత్రుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) రాముడు, భీముడు
B) విష్ణువు, ధనువు
C) కన్నయ్య, కన్నమ్మ
D) విష్ణువు, కిట్టయ్య
జవాబు:
D) విష్ణువు, కిట్టయ్య

ప్రశ్న 16.
శివునివలె యుద్ధ విజయాలలో పోటీపడే వీరుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) శంకరుడు, విష్ణువు
B) కృష్ణుడు, రుద్రుడు
C) భవుడు, రుద్రుడు
D) బ్రహ్మ, ఈశ్వరుడు
జవాబు:
C) భవుడు, రుద్రుడు

ప్రశ్న 17.
తేరిపార చూస్తే చాలు శత్రు సైన్యం పారిపోతుంది – గీసిన పదానికి పర్యాయపదాలు
A) దండు, సేన
B) దండ, సాన
C) సైనికులు, రైతులు
D) కార్మికులు, జాలరులు
జవాబు:
A) దండు, సేన

IV. నానార్థాలు:

ప్రశ్న 1.
ఆస్యమును ప్రతి ఉదయము, రాత్రి శుభ్రపరచుకోవాలి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) నోరు, నాలుక
B) ముఖము, నోరు
C) చేతులు, ముఖము
D) వాకిలి, ఇల్లు
జవాబు:
B) ముఖము, నోరు

ప్రశ్న 2.
భాషను కాపాడతానని బాస చేస్తున్నాను- గీత గీసిన పదానికి నానార్థాలు
A) భాష, ప్రతిజ్ఞ
B) ఆజ్ఞ, వాణి
C) అధికారి, భాష
D) ఆధారము, అనుమతి
జవాబు:
B) ఆజ్ఞ, వాణి

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 3.
దిశ, ఆశ్రయం (ఆధారం) – అనే నానార్థాలు గల పదం
A) వైపు
B) అరణము
C) దిక్కు
D) పర్ణశాల
జవాబు:
C) దిక్కు

ప్రశ్న 4.
మామిడి పళ్ళు ప్రియము – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ఇష్టము, ప్రేమ
B) ప్రియమైనది, అధిక ధర
C) పులుపు, తీపి
D) పండు, కాయ
జవాబు:
B) ప్రియమైనది, అధిక ధర

ప్రశ్న 5.
ఇతడే మా ఏలిక, ఆకాశానికి చంద్రుడు ఇతడు – ఈ వాక్యంలో నానార్థాలు గల పదం
A) నక్షత్రము
B) శివుడు
C) దాత
D) రాజు
జవాబు:
D) రాజు

ప్రశ్న 6.
మరణం లేనివారు, దేవతలు – అను నానార్థాలు గల పదం
A) అమరులు
B) సురపానం
C) పుణ్యాత్ములు
D) పాండవులు
జవాబు:
A) అమరులు

ప్రశ్న 7.
“చౌక” అను పదానికి నానార్థాలు
A) వెల తక్కువ, చులకన
B) నాలుగు దారులు, చదరము
C) చవుక, ఆకాశము
D) చమత్కారము, చదరము
జవాబు:
A) వెల తక్కువ, చులకన

ప్రశ్న 8.
“ధర్మరాజు” అను పదానికి నానార్థాలు
A) ధర్మరాజు, అర్జునుడు
B) ధర్మరాజు, ధార్మికుడు
C) ధర్మరాజు, యముడు
D) ధర్మడు, అధర్ముడు
జవాబు:
C) ధర్మరాజు, యముడు

ప్రశ్న 9.
“మునుపు” అనే పదానికి సరియైన నానార్థాలు
A) నునుపు, పంపుట
B) మునులు, తపస్వినులు
C) ముందు, పూర్వము
D) ఎదురు, తిట్టు
జవాబు:
C) ముందు, పూర్వము

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 10.
సాధుజనుల పట్ల ఆదరణ కల్గి ఉండాలి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) సాధువులు, సన్యాసులు
B) మంచివారు, సాధువులు
C) నిదానం, నెమ్మది
D) మంచి, ధర్మం
జవాబు:
B) మంచివారు, సాధువులు

ప్రశ్న 11.
ధర్మరాజు ఆజ్ఞా పరిపాలన వ్రతుడు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ఉత్తరువు, ఉత్తరం
B) దండన, బెత్తం
C) ఉత్తరువు, దండన
D) ఉత్తరం, బెత్తం
జవాబు:
C) ఉత్తరువు, దండన

V. ప్రకృతి, వికృతులు :

ప్రశ్న 1.
ఆజ్ఞను కొందరు ఆనతి అంటారు – గీత గీసిన పదానికి వికృతి
A) అధికారం
B) ఆన
C) గుర్తు
D) ప్రతిన
జవాబు:
B) ఆన

ప్రశ్న 2.
“పురము”నకు సరియైన వికృతి పదము
A) వూరు
B) కాపురము
C) ప్రోలు
D) పూరణ
జవాబు:
C) ప్రోలు

ప్రశ్న 3.
మనస్సుకు భాష వస్తే కవిత్వం వస్తుంది గీత గీసిన పదానికి వికృతి పదం
A) భాస
B) బాస
C) బాష
D) బాసులు
జవాబు:
B) బాస

ప్రశ్న 4.
“దిష్టి” అనే పదానికి సరియైన వికృతి పదం
A) దూరము
B) అదృష్టం
C) దుష్టుడు
D) దృష్టి
జవాబు:
D) దృష్టి

ప్రశ్న 5.
ఈ కింది వానిలో ప్రకృతి – వికృతి సరిగా లేనిది
A) రాజు – తేడు
B) కీర్తి – కీరితి
C) వర్ణము – పర్ణము
D) కన్య – కన్నె
జవాబు:
C) వర్ణము – పర్ణము

ప్రశ్న 6.
“ధర్మము (ప్ర) – ధమ్మము (వి)” వీటిలో వికృతి పదం సరిగా లేదు. సరైన వికృతి
A) ధరమము
B) దమ్మము
C) దమము
D) ధరమ
జవాబు:
B) దమ్మము

ప్రశ్న 7.
“యోధుడు” – ప్రకృతి పదమునకు వికృతి
A) జోదు
B) యోద్ధ
C) యెద
D) ఎదిరి
జవాబు:
A) జోదు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 8.
అద్దములో మన రూపము చూడవచ్చు – గీత గీసిన పదానికి వికృతి
A) రూప్యము
B) రూపాయి
C) రూపు
D) రూపాలు
జవాబు:
C) రూపు

ప్రశ్న 9.
“కుమారుడు” అనే పదానికి వికృతి పదము
A) కొడుకు
B) కొమరుడు
C) కన్నయ్య
D) కుమారిత
జవాబు:
B) కొమరుడు

ప్రశ్న 10.
ఈ వస్త్రము వర్ణము బాగుంది – గీత గీసిన పదానికి వికృతి
A) పర్ణము
B) వర్ణి
C) తారు
D) వన్నె
జవాబు:
D) వన్నె

ప్రశ్న 11.
యమధర్మరాజు కుమారుడు ధర్మరాజు – గీత గీసిన పదానికి వికృతి
A) పుత్రుడు.
B) సుతుడు
C) బొట్టె
D) కొమరుడు
జవాబు:
D) కొమరుడు

ప్రశ్న 12.
తన కీర్తి కాంతులను ప్రసరింపచేస్తూ ధర్మరాజు పాలించేవాడు – గీత గీసిన పదానికి వికృతి
A) పేరు
B) ప్రతిష్ఠ
C) కీరితి
D) కొరతి
జవాబు:
C) కీరితి

ప్రశ్న 13.
సత్యమును రూపముగా కలవాడు – గీత గీసిన పదానికి వికృతి
A) బలం
B) సత్తు
C) సత్వం
D) నిజం
జవాబు:
B) సత్తు

ప్రశ్న 14.
ధర్మమును అనుసరించువాడు ధర్మరాజు – గీత గీసిన పదానికి వికృతి
A) దమ్మం
B) దరమం
C) ధరమం
D) దమ్ము
జవాబు:
A) దమ్మం

ప్రశ్న 15.
విష్ణువు ఆయుధాలలో శార్జ్గవము ఒకటి – గీత గీసిన పదానికి వికృతి
A) విల్లు
B) కత్తి
C) సింగిణీ
D) సారగవము
జవాబు:
C) సింగిణీ

VI. వ్యుత్పత్త్యర్ధములు :

ప్రశ్న 1.
తన దేహము నుండి పుట్టినవాడు – వ్యుత్పత్త్యర్ధము గల పదము
A) కొడుకు
B) తనూజుడు
C) దేహి
D) దేవత
జవాబు:
B) తనూజుడు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 2.
ధర్మనందనుడు – అను పదానికి సరియైన వ్యుత్పత్తి
A) ధర్మము మరియు నందనుడు
B) ధర్ముని కొరకు నందనుడు
C) యమధర్మరాజు యొక్క కొడుకు
D) నందనుడైన ధర్ముడు.
జవాబు:
C) యమధర్మరాజు యొక్క కొడుకు

ప్రశ్న 3.
“జలమునకు నిధి” అను వ్యుత్పత్త్యర్ధము గల పదము
A) జలధి
B) జలజము
C) జలజాకరము
D) బావి
జవాబు:
A) జలధి

ప్రశ్న 4.
పాండవులు – అను పదానికి సరియైన వ్యుత్పత్తి
A) ధర్మభీమార్జునులు
B) పాండురాజు యొక్క కుమారులు
C) పాండవులు వేయిమంది
D) కౌరవులు కానివారు.
జవాబు:
B) పాండురాజు యొక్క కుమారులు

ప్రశ్న 5.
“నరులను పాలించువాడు” అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) నరనారాయణుడు’
B) చక్రవర్తి
C) నృపాలుడు
D) రాజు
జవాబు:
C) నృపాలుడు

ప్రశ్న 6.
అమరులు-అను పదానికి సరియైన వ్యుత్పత్త్యర్ధము గల పదము
A) మరులు కొన్నవారు
B) స్వర్గములో ఉండువారు
C) మరణము లేనివారు
D) చెట్లు గల వారు వ్యుత్పత్తి అర్థము గల పదము
జవాబు:
C) మరణము లేనివారు

ప్రశ్న 7.
సంతోష పెట్టువాడు – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) స్నేహితుడు
B) నందనుడు
C) సోదరుడు
D) భగవంతుడు
జవాబు:
B) నందనుడు

ప్రశ్న 8.
సత్యప్రధానమైన యుగము – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) కలియుగం
B) ద్వాపరయుగం
C) కృతయుగం
D) త్రేతాయుగం
జవాబు:
C) కృతయుగం

PAPER – II : PART – A

అపరిచిత పద్యాలు

1. క్రింది పద్యాన్ని చదివి, అర్థం చేసుకుని, ఇచ్చిన ఖాళీలను పూరించండి.

తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్
దల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !

ఖాళీలు

1) పాముకు విషం ………… లో ఉంటుంది.
జవాబు:
తల

2) వృశ్చికమనగా ………….
జవాబు:
తేలు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

3) శరీరమంత విషం ……….. ఉంటుంది.
జవాబు:
ఖలునకు

4) పై పద్య మకుటం ………….
జవాబు:
సుమతీ

5) పై పద్యాన్ని రచించిన కవి ……..
జవాబు:
బద్దెన

2. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులు, దేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
నాగులేరు ఏ సీమలో ప్రవహిస్తున్నది?
జవాబు:
నాగులేరు పల్నాటి సీమలో ప్రవహిస్తున్నది.

ప్రశ్న 2.
పల్నాటిసీమ ప్రజల ఆహారం ఏది?
జవాబు:
పల్నాటి సీమ ప్రజల ఆహారం సజ్జ, జొన్నకూళ్ళు.

ప్రశ్న 3.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి ‘పల్నాటి పల్లెటూళ్ళు’ అని పేరు పెట్టవచ్చు.

ప్రశ్న 4.
ఈ పద్యంలోని శబ్దాలంకారమేమిటో రాయండి.
జవాబు:
ఈ పద్యంలోని శబ్దాలంకారం వృత్త్యనుప్రాసం.

ప్రశ్న 5.
ఈ పద్యం వల్ల ఏమి తెలుస్తోంది ?
జవాబు:
ఈ పద్యం వల్ల పల్నాటి సీమ పల్లెటూళ్ళ గురించి తెలుస్తోంది.

3. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అక్షరంబు వలయు కుక్షి జీవనులకు
నక్షరంబు జిహ్వ కిక్షు రసము
అక్షరంబు తన్ను రక్షించు గావున
నక్షరంబు లోక రక్షితంబు.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
మానవులకు ఏం కావాలి ?
జవాబు:
మానవులకు అక్షరం (విద్య) కావాలి.

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 2.
అక్షరం జిహ్వకు ఎటువంటిది ?
జవాబు:
అక్షరం జిహ్వకు చెరకురసం వంటిది.

ప్రశ్న 3.
అక్షరము దేనిని రక్షిస్తుంది ?
జవాబు:
అక్షరము తనను (చదువుకున్నవానిని) రక్షిస్తుంది.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘అక్షరాలు నేర్చుకో.’

ప్రశ్న 5.
ఈ పద్యంలో దేన్ని గురించి తెలియజేయబడింది?
జవాబు:
ఈ పద్యంలో ‘చదువు’ గురించి తెలియజేయబడింది.

4. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ
మందుడు మృత్పిండమువలె
గ్రిందంబడి యడగియుండుఁ గృపణత్వమునన్.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
సుజనుడు ఎట్లా ఉంటాడు ?
జవాబు:
సుజనుడు కందుకంలా ఉంటాడు.

ప్రశ్న 2.
మందుడు ఎలా ఉంటాడు ?
జవాబు:
మందుడు మృత్పిండంలా ఉంటాడు.

ప్రశ్న 3.
సుజనుని కవి దేనితో పోల్చాడు ?
జవాబు:
సుజనుని కవి బంతితో పోల్చాడు.

ప్రశ్న 4.
ఈ పద్యంలోని అలంకారమేమి ?
జవాబు:
ఈ పద్యంలో ఉపమాలంకారం ఉంది.

ప్రశ్న 5.
ఈ పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘నీతిపద్యం’.

5. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కలహపడునింట నిలువదు.
కలుముల జవరాలు కానఁ గలకాలం బే
కలహములులేక సమ్మతి
మెలఁగంగా నేర్చెనేని మేలు కుమారీ !

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
కలహపడే ఇంట్లో ఏం నిలువదు ?
జవాబు:
కలహపడే ఇంట్లో లక్ష్మి (సంపద) నిలువదు.

ప్రశ్న 2.
కలకాలం ఎలా మెలగాలి ?
జవాబు:
కలకాలం ఏ విధమైన కలహాలు లేకుండా మెలగాలి.

ప్రశ్న 3.
ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పబడింది ?
జవాబు:
ఈ పద్యం కుమారీని సంబోధిస్తూ అంటే ఆడపిల్లలను సంబోధిస్తూ చెప్పబడింది.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘కలహం వద్దు’.

ప్రశ్న 5.
ఈ పద్యం ఏ శతకం లోనిది?
జవాబు:
ఈ పద్యం కుమారీ శతకం లోనిది.

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

1. సంధులు:

ప్రశ్న 1.
భీమార్జునులు – సంధి విడదీస్తే
A) భీముడు + అర్జునుడు
B) భీ + మార్జునులు
C) భీమ + అర్జునుడు
D) భీముని + అర్జునుడు
జవాబు:
C) భీమ + అర్జునుడు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 2.
“జయ + పెట్టు” – గసడదవాదేశ సంధి చేయగా
A) జయము + వెట్టు
B) జయవెట్టు
C) జయము పెట్టు
D) జోతపెట్టు
జవాబు:
B) జయవెట్టు

ప్రశ్న 3.
పాండవాగ్రేసరుడు – సంధి విడదీయగా
A) పాండ + వాగ్రేసరుడు
B) పాండవాగ్ర + ఇసరుడు
C) పాండవాగ్రే + సరుడు
D) పాండవ + అగ్రేసరుడు
జవాబు:
D) పాండవ + అగ్రేసరుడు

ప్రశ్న 4.
“కన్యకాధిపతి”లో వచ్చు సంధి
A) యణాదేశ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) యడాగమ సంధి
D) గుణసంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 5.
“అర్ధికి + ఇచ్చు” – ఏ సంధి
A) ఇత్వ సంధి
B) అత్వ సంధి
C) యడాగమ సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
A) ఇత్వ సంధి

ప్రశ్న 6.
వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు – గీత గీసిన పదానికి సంధి విడదీసి రాయండి.
A) అన్న + దమ్ములు
B) అన్నయు + తమ్ముడు
C) అన్న + తమ్ములు
D) అన్నా + దమ్ములు
జవాబు:
C) అన్న + తమ్ములు

ప్రశ్న 7.
“పంచ + ఆస్యము” అని విడదీయగా పూర్వ పరస్వరములు
A) చ + ఆ
B) అ + ఆ
C) పంచ + ఆస్యము
D) ఆ మరియు అ
జవాబు:
B) అ + ఆ

ప్రశ్న 8.
“సవర్ణదీర్ఘ సంధి”కి సరియైన ఉదాహరణ
A) అతనికి + ఇచ్చు
B) యడాగమ సంధి
C) పంచ + అమరతరులు
D) వాడు + ఉండెను
జవాబు:
C) పంచ + అమరతరులు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 9.
ఇచ్చకము + మెచ్చు – సంధి చేయగా వచ్చు సంధి
A) పుంప్వాదేశ సంధి
B) మేన + అత్త
C) ఉత్వ సంధి
D) లులనల సంధి
జవాబు:
A) పుంప్వాదేశ సంధి

ప్రశ్న 10.
య, వ, ర లు ఆదేశము వచ్చు సంధి పేరు
A) యడాగమ సంధి
B) యణాదేశ సంధి
C) గసడదవాదేశ సంధి
D) గుణసంధి
జవాబు:
B) యణాదేశ సంధి

ప్రశ్న 11.
త్రికములు అనగా
A) ఏ, ఓ, అర్
B) ఇ, ఉ, ఋ
C) ఆ, ఈ, ఏ
D) ఏ, ఐ, ఓ, ఔ
జవాబు:
C) ఆ, ఈ, ఏ

ప్రశ్న 12.
ఏ, ఓ, అర్ లను ఏమంటారు ?
A) త్రికములు
B) గుణములు
C) సరళములు
D) వృద్ధులు
జవాబు:
B) గుణములు

II. సమాసములు :

ప్రశ్న 1.
ధర్మార్జునులు – అను దానికి సరియైన విగ్రహవాక్యము
A) ధర్మము మరియు అర్జునుడు
B) ధర్మరాజు మరియు అర్జునుడు
C) ధర్మరాజు తమ్ముడైన అర్జునుడు
D) ధర్మర్జునులు మొదలైనవారు
జవాబు:
B) ధర్మరాజు మరియు అర్జునుడు

ప్రశ్న 2.
“ద్వంద్వ సమాసము”నకు ఉదాహరణ
A) రేపగలు
B) దయాభరణుడు
C) ధర్మనందనుడు
D) దోఃఖర్జులు
జవాబు:
A) రేపగలు

ప్రశ్న 3.
పంచాయుధములు, పంచాస్యములు – ఏ సమాసమునకు ఉదాహరణ ?
A) ద్వంద్వ సమాసము
B) విశేషణ పూర్వపద కర్మధారయము
C) ద్విగు సమాసము
D) రూపక సమాసము
జవాబు:
C) ద్విగు సమాసము

ప్రశ్న 4.
పాండు కుమారులు – అను పదమునకు విగ్రహవాక్యము రాయగా
A) పాండురాజు వలన కుమారులు
B) కుమారులగు పాండవులు
C) పాండవులును, కుమారులును
D) పాండురాజు యొక్క కుమారులు
జవాబు:
D) పాండురాజు యొక్క కుమారులు

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 5.
కృప అనెడు రసము – అనే విగ్రహవాక్యాన్ని సమాసము చేయగా
A) కృపకు రసము
B) కృపతో రసము
C) కృపాభావము
D) కృపారసము
జవాబు:
D) కృపారసము

ప్రశ్న 6.
ధర్మరాజుకు నలుగురు తమ్ముకుర్రలు కలరు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం
A) కుర్రలైన తమ్ములు
B) తమ్ములైన కుర్రలు
C) తమ్ములును, కుర్రలును
D) తమ్ముల వంటి కుర్రలు
జవాబు:
A) కుర్రలైన తమ్ములు

ప్రశ్న 7.
“విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము”నకు ఉదాహరణ
A) కార్మిక వృద్ధులు
B) పాదపద్మం
C) తొల్లిటిరాజులు
D) పాండునందనులు
జవాబు:
C) తొల్లిటిరాజులు

ప్రశ్న 8.
చతురబ్ధులు – ఇది ఏ సమాసమునకు ఉదాహరణగా గుర్తించవచ్చు.
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) విశేషణ పూర్వపదం
D) బహువ్రీహి
జవాబు:
B) ద్విగు సమాసము

ప్రశ్న 9.
“విశేషణం ఉత్తరపదం”గా ఉన్న సమాసము
A) విశేషణ పూర్వపద కర్మధారయము
B) ఉపమాన పూర్వపద కర్మధారయము
C) విశేషణ ఉత్తరపద కర్మధారయము
D) ఉపమాన ఉత్తరపద కర్మధారయము
జవాబు:
C) విశేషణ ఉత్తరపద కర్మధారయము

ప్రశ్న 10.
కన్యక (పార్వతి)కు అధిపతి – సమాసము పేరు
A) షష్ఠీ తత్పురుష
B) చతుర్థీ తత్పురుష
C) బహువ్రీహి
D) సంభావనా పూర్వపద కర్మధారయము
జవాబు:
A) షష్ఠీ తత్పురుష

III. ఛందస్సు :

ప్రశ్న 1.
అతని కతండె సాటి చతురబ్ధి పరీత మహీతలమ్మునన్ – ఏ పద్యపాదం ?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) కందం
D) సీసం
జవాబు:
B) చంపకమాల

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 2.
మ, స, జ, స, త, త, గ – అను గణములు వరుసగా వచ్చు పద్యం.
A) శార్దూలము
B) మత్తేభము
C) చంపకమాల
D) ఉత్పలమాల
జవాబు:
A) శార్దూలము

ప్రశ్న 3.
“నీవేనా” అను పదమును గణ విభజన చేయగా
A) U IU
B) UUU
C) UUI
D) IUI
జవాబు:
B) UUU

ప్రశ్న 4.
IIU – ఇది ఏ గణం ?
A) భ గణం
B) జ గణం
C) స గణం
D) ర గణం
జవాబు:
C) స గణం

ప్రశ్న 5.
సూర్య గణములు
A) న, హ(గల)
B) భ, ర, త
C) గగ, నల
D) లగ, గల
జవాబు:
A) న, హ(గల)

IV. అలంకారములు :

ప్రశ్న 1.
ఒక వస్తువునకు మరొక వస్తువుతో రమణీయమైన పోలిక చెప్తే
A) రూపకం
B) ఉపమా
C) ఉత్ప్రేక్ష
D) యమకం
జవాబు:
B) ఉపమా

ప్రశ్న 2.
తెలుగువీర లేవరా !
దీక్షబూని సాగరా !
అదరవద్దు బెదరవద్దు !
నింగి నీకు హద్దురా !
పై గీతంలో ఉన్న అలంకారం
A) యమకం
B) వృత్త్యనుప్రాస
C) అంత్యానుప్రాస
D) లాటానుప్రాస
జవాబు:
C) అంత్యానుప్రాస

TS 9th Class Telugu Important Questions 1st Lesson ధర్మార్జునులు

ప్రశ్న 3.
ఒకే అక్షరం పలుమార్లు ఆవృత్తి అయితే,
A) అంత్యానుప్రాస.
B) ఛేకానుప్రాస
C) యమకము
D) వృత్త్యనుప్రాస
జవాబు:
D) వృత్త్యనుప్రాస

ప్రశ్న 4.
“భూమి బంతి వలె గోళంగా ఉన్నది.” – ఈ వాక్యంలో గల అలంకారం
A) ఉత్ప్రేక్ష
B) ఉపమా
C) రూపకము
D) వృత్త్యనుప్రాస
జవాబు:
B) ఉపమా

V. వాక్యాలు:

ప్రశ్న 1.
ఈ కింది వాక్యాలలో కర్తరి వాక్యము
A) ఆమె డాక్టరు.
B) ఈ రోజు ఇంటికి వెళ్ళండి.
C) రాము సైకిల్ను తొక్కుతున్నాడు.
D) రాము బజారుకు వెళుతున్నాడు.
జవాబు:
C) రాము సైకిల్ను తొక్కుతున్నాడు.

ప్రశ్న 2.
“రాము తోటపనిని చేస్తున్నాడు.” – ఈ వాక్యమును కర్మణి వాక్యములోనికి మార్చగా
A) తోటపనిని రాము చేస్తున్నాడు.
B) తోటపని రాము చేత చేయబడుచున్నది.
C) చేస్తున్నాడు, రాము తోటపనిని.
D) రాము చేస్తున్న పని, తోటపని.
జవాబు:
B) తోటపని రాము చేత చేయబడుచున్నది.

ప్రశ్న 3.
“వారిచే సినిమా నిర్మించబడినది.” – ఇది ఏ వాక్యం ?
A) కర్మణి వాక్యం
B) కర్తరి వాక్యం
C) సంయుక్త వాక్యం
D) ప్రారంభ వాక్యం
జవాబు:
A) కర్మణి వాక్యం

ప్రశ్న 4.
“ధర్మరాజు తమ్ములను ఆదరించాడు.” ఇది ఏ వాక్యం ?
A) సంయుక్త వాక్యం
B) కర్తరి వాక్యం
C) సంశ్లేష వాక్యం
D) అప్రధాన వాక్యం
జవాబు:
B) కర్తరి వాక్యం

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

These TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 6th Lesson Important Questions దీక్షకు సిద్ధంకండి

PAPER – 1 : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
తెలంగాణ జనత ఆత్మగౌరవం కాపాడుకొనుటకు ధర్మయుద్ధం సాగిస్తున్నది- దీనిలోని ఆంతర్యం వివరించండి.
జవాబు:
గాంధీ పేరు చెప్పుకొని బ్రతుకుతున్న నాయకులు దేశభక్తి కన్నా తమ భుక్తే లక్ష్యంగా ఉంటూ జాతిపిత ప్రబోధాలకు నీళ్ళు ఒదులుతున్నారు. మతకల్లోలాలతో, హత్యలతో దేశంలోని ప్రతి అంగుళం రక్తంతోనో, కన్నీటితోనో తడుస్తోంది. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ వెనుకబడింది. ఆంధ్ర ప్రభుత్వ ఉక్కుపాదాల కింద తెలంగాణ ప్రజలు నలిగిపోయి, స్వేచ్ఛను కోల్పోతున్నారు. దీని నుండి విముక్తి పొందడానికై తమ బానిస బంధాలను తెంచుకొని ఆత్మగౌరవం కాపాడుకోవడానికి తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగిస్తున్నది.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘దీక్షకు సిద్ధంకండి’ పాఠం ఆధారంగా 2014లో తెలంగాణ సిద్ధించుటకు తోడ్పడిన అంశాలు రాయండి.
జవాబు:
తెలంగాణ ఉద్యమం ఈ మధ్య వచ్చింది కాదు. ఎంతోమంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమంలో తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ అమరజీవుల త్యాగాలకు గుర్తే ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ కొత్త రాష్ట్రం ఉద్యమాల ఫలితంగానే రూపుదిద్దుకొంది. ఈ మధ్య జరిగిన తెలంగాణ ఉద్యమానికి ముందే 1969లో తెలంగాణ ప్రజాసమితి పేరుతో ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం మొదలయ్యింది. .

దీర్ఘకాలంగా శాంతియుతంగా ఉద్యమాలు చేసినప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తాయి. లేదా అణచివేయడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు ఉద్యమాలు హింసాయుతంగా మారే అవకాశం ఉంది. ఉద్యమ నాయకత్వం, ఆ పరిణామాన్ని ముందుగానే ఊహించి, పాలకుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ, గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉద్యమం చేపట్టాలని పిలుపు నిచ్చారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో అహింసా పద్ధతులు అమలయ్యాయి. హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్రా స్త్రీలను ఉద్యమకారులు అవమానించారు. అల్లర్లు చేశారు.

2014లో తెలంగాణ సిద్ధించడానికి ప్రధాన కారణం ఆనాటి ఉద్యమ హింసా వాతావరణం లేకపోవడం. నిరాహారదీక్షలు, నిరసనలు, సకలజనుల సమ్మెవంటి పద్ధతులలో ఉద్యమం నడిచింది. నేటి ఉద్యమ నాయకులకు తెలంగాణలోని అన్ని పార్టీలు కలిసివచ్చాయి. ఈ విధంగా శాంతియుతంగా సాగడమే తెలంగాణ సిద్ధించడానికి తోడ్పడింది.

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 2.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం గురించి వివరించండి.
జవాబు:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మూడు దశలుగా ఉద్యమం జరిగింది. 1952 వరకు, 1969, 1996 లో తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఎందరో మహనీయులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహరహం శ్రమించారు. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ వెనుకబడింది. ఆంధ్ర ప్రభుత్వ ఉక్కుపాదాల కింద తెలంగాణ ప్రజలు నలిగిపోయారు. తమ బానిస బంధాలను తెంచుకొని ఆత్మగౌరవం కాపాడుకోవడానికి తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగించింది. ఈ ప్రజా పోరాటంలో వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది యువకులు అంగవిహీనులయ్యారు. ఖైదు చేయబడ్డారు. గాంధీ కలలుగన్న దేశంలో రాబందుల రాచరికం నడుస్తున్నది.

రాష్ట్రంలో రోజురోజుకు దారుణ హింసాకాండ, రక్తపాతం ప్రజలను కోపోద్రిక్తులను చేస్తున్నది. అహింసా సిద్ధాంతం పట్ల ఆత్మవిశ్వాసం సడలిపోయే ప్రమాదం కనబడుతోంది. నాయకులు ఏ ఎండకాగొడుగు పడుతున్నారు. ముఠా రాజకీయాలు పెరిగిపోతున్నాయి. అప్పటి ఫజల్ అలీ కమిషనన్ను కలిసిన విద్యార్థి నాయకుడు ‘మంచిగ బతకలేకుంటే, బిచ్చమెత్తుకోనైనా అని ఖరాఖండిగా చెప్పి, నిరాహార దీక్షలు ప్రారంభించాడు. సామూహిక ఉపవాసదీక్షలు చేపట్టి, గాంధీ మార్గంలో నడిచి జాతిపితకు అంకితం చేశారు. మన ఆకలి మంటల జ్వాలలో గాంధీ సిద్ధాంతాలు వెలుగులు విరజిమ్మాలని కార్యకర్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం నడిచింది.

PAPER – I : PART – B

భాషాంశాలు – పదజాలం :

I. సొంతవాక్యాలు :

1. అహర్నిశలు : రైతులు తమ పంట ఇంటికి వచ్చేదాక అహర్నిశలు కష్టపడతారు.
2. జనత : జనత కోరుకొన్న సాధారణ కోర్కెలకేకాక అసాధారణ ప్రాజెక్టులకు ప్రణాళికలు వేసి దేశాభివృద్ధికి పాటుపడాలి.
3. తిలోదకములిచ్చు : ప్రజానాయకులు ఓటు కోసం ఓటి మాటలకు తిలోదకాలిచ్చి గట్టి మేలు తలపెట్టాలి.
4. జాతిపిత : గాంధీ మన జాతిపితగానే గాక అహింసా మార్గ పోరాటం నేర్పి విశ్వపిత అయినాడు.
5. ఉపమానం : ఆయుధం లేకుండా శత్రువును ఓడించిన వారికి ఒక ఉపమానం గాంధీ తాత.
6. ఉక్కుపాదం ఆశ్రమ విద్యాభ్యాసం కాలంలో బ్రహ్మచారులు కోర్కెలను ఉక్కుపాదంతో అణిచిపెట్టి కోరిన విద్యలు నేర్చుకొనేవారు.
7. కట్టలు తెంచుకోవడం : తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడగానే ప్రజలలో ఆనందం కట్టలు తెంచుకొని ప్రవహించింది.
8. ఏ ఎండకాగొడుగు : ఏ ఎండకాగొడుగు పట్టే మా బాబాయి అంటే ఊరి వాళ్ళకెందుకో అంత ఇష్టం ?
9. ‘ రాబందులు : తుపానుకు కొంపగోడు పోయి ప్రజలు బాధపడుతుంటే రాబందుల్లా దోపిడి దొంగలు ఎగబడ్డారు.

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

II. అర్థాలు :

ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
అమ్మ అహర్నిశలు మన కోసం శ్రమిస్తుంది – గీత గీసిన పదానికి అర్థం
A) కొంతకాలం
B) ఎల్లవేళలా (పగలురాత్రి)
C) చిన్నతనంలో
D) పెరిగేంతవరకు
జవాబు:
B) ఎల్లవేళలా (పగలురాత్రి)

ప్రశ్న 2.
సమ్మక్క-సారక్క జాతరకు జనత మొత్తం కదలివచ్చింది – గీత గీసిన పదానికి అర్థం
A) ఒక రైలు బండి
B) పాలకులు
C) జన సమూహం
D) భక్త బృందం
జవాబు:
C) జన సమూహం

ప్రశ్న 3.
“ఉక్కుపాదం మోపడం” అంటే అర్థం
A) ఇనుముతో చేసిన పాదం పెట్టు
B) బూట్లు ఇనుముతో చేసినవి
C) బలవంతంగా అణిచివేయడం
D) బరువు మీద పెట్టడం
జవాబు:
C) బలవంతంగా అణిచివేయడం

ప్రశ్న 4.
“తిలోదకాలు ఇవ్వడం” అంటే అర్థం
A) ఆశ వదులుకోవడం
B) అమరులైన వారికి నమస్కరించు
C) అన్నం నీళ్ళు ఇవ్వడం
D) ఒక పాదం ముందు పెట్టడం
జవాబు:
A) ఆశ వదులుకోవడం

ప్రశ్న 5.
“పోరాటం” అనే అర్థంలో వాడుతున్న పదం
A) సమ్మె
B) ఉద్యమం
C) బందులు
D) నిరాహారదీక్ష
జవాబు:
B) ఉద్యమం

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 6.
“పోరాటం” అనే అర్థంలో వాడుతున్న పదం
A) తృణం
B) నమస్సు
C) నిర్బంధం
D) సమ్మతి
జవాబు:
D) సమ్మతి

ప్రశ్న 7.
“బడా మనుషులు” అంటే అర్థం
A) పొడుగు మనుష్యులు
B) ధనం కలవారు
C) పెద్ద మనుషులు
D) చెడ్డ మనసులు
జవాబు:
C) పెద్ద మనుషులు

ప్రశ్న 8.
“శత జయంతి” అనే పదానికి అర్థం
A) పుట్టి నూరు సంవత్సరాలు
B) వంద పరుగులు
C) ఒక పూవు పేరు
D) వందనము
జవాబు:
A) పుట్టి నూరు సంవత్సరాలు

ప్రశ్న 9.
ప్రతి చిన్న విషయం రుజువు చేయనక్కర లేదు – గీత గీసిన పదానికి అర్థం
A) సత్యవాక్యము
B) సాక్ష్యము చూపించు
C) ప్రయోగము చేయు
D) ఒట్టు వేయు
జవాబు:
B) సాక్ష్యము చూపించు

ప్రశ్న 10.
మన్నన చేయు – అనే పదానికి అర్థం
A) అంగీకరించు
B) తుంచి వేయు
C) గౌరవించు
D) ప్రోగుచేయు
జవాబు:
C) గౌరవించు

ప్రశ్న 11.
ఎంతోమంది అమరుల త్యాగాలకు చిహ్నంగా నిలిచింది ఈ తెలంగాణ – గీత గీసిన పదానికి అర్థం
A) కోరిక
B) చిత్తం
C) గుర్తు
D) జ్ఞానం
జవాబు:
C) గుర్తు

ప్రశ్న 12.
లక్షలాది ప్రజలు సత్యాగ్రహ సమరంలో పోరాడారు – గీత గీసిన పదానికి అర్థం
A) స్వర్గం
B) విజయం
C) సంగరం
D) సమయం
జవాబు:
C) సంగరం

ప్రశ్న 13.
ఉపవాస దీక్షల ద్వారా వారు నమ్మిన సిద్ధాంతానికి పుష్టిని చేకూర్చండి – గీత గీసిన పదానికి అర్థం
A) బలం
B) ధైర్యం
C) నమ్మకం
D) గర్వం
జవాబు:
A) బలం

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

III. ప్రకృతి, వికృతులు:

ప్రశ్న 1.
ఛాయ – అనే పదానికి వికృతి
A) చాయి
B) చాయ
C) చూచు
D) చేయను
జవాబు:
B) చాయ

ప్రశ్న 2.
గౌరవం అంటే మనల్ని చూడగానే ఎదుటివారు పలకరించాలి – గీత గీసిన పదానికి వికృతి
A) గారవము
B) పెద్దరికము
C) గార
D) గౌరు
జవాబు:
A) గారవము

ప్రశ్న 3.
హృదయము – అనే పదానికి వికృతి
A) హృది
B) హృత్
C) ఎద
D) ఉదయం
జవాబు:
C) ఎద

ప్రశ్న 4.
“దమ్మము” వికృతిగా గల పదం
A) దయ
B) ధర్మం
C) దమ్ము
D) ధార్మికం
జవాబు:
B) ధర్మం

ప్రశ్న 5.
ఎంతోమంది అమరుల త్యాగఫలితం నేటి మన స్వేచ్ఛ – గీత గీసిన పదానికి వికృతి
A) యాగం
B) చాగం
C) తాగం
D) తయాగం
జవాబు:
B) చాగం

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 6.
దీర్ఘకాలంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నా ఫలితంలేదు – గీత గీసిన పదానికి వికృతి
A) దీగ
B) దీర్గ
C) తీగె
D) వైరు
జవాబు:
C) తీగె

ప్రశ్న 7.
జాతిపిత ప్రబోధాలకు తిలోదకాలిస్తున్నారు – గీత గీసిన పదానికి వికృతి
A) తెలకలు
B) నువ్వులు
C) తిలకం
D) నీళ్ళు
జవాబు:
A) తెలకలు

ప్రశ్న 8.
ఈ ప్రజా పోరాటంలో ఎందరో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు – గీత గీసిన పదానికి వికృతి
A) ఆయువు
B) పానం
C) నమ్మకం
D) గర్వం
జవాబు:
B) పానం

IV. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
నమ్మిక, విశ్వాసం – పర్యాయపదాలుగా గల పదము
A) నమ్మకము
B) విసుమానము
C) నిశ్చయము
D) దృఢము
జవాబు:
A) నమ్మకము

ప్రశ్న 2.
“సముద్రము”నకు పర్యాయపదాలు కానివి.
A) జలధి, పయోధి
B) సముద్రము, సాగరము
C) సరస్సు, సరోవరము
D) సంద్రము, వారిధి
జవాబు:
C) సరస్సు, సరోవరము

ప్రశ్న 3.
“యుద్ధం” అనే పదానికి పర్యాయపదాలు
A) యుద్ధం, మేళనం
B) పోరాటం, రణము, సమరం
C) ప్రయాణం, కారణం
D) దొమ్మి, లాఠీ
జవాబు:
B) పోరాటం, రణము, సమరం

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 4.
జ్వాల – అనే పదానికి పర్యాయపదాలు
A) మంట, శిఖ
B) నిప్పు, దాహం
C) వెలుగు, కాల్చు
D) పొగ, వేడి
జవాబు:
A) మంట, శిఖ

ప్రశ్న 5.
వంట చేయటానికి ఇప్పుడు అగ్ని కావాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) అనలం, నిప్పు
B) అగ్గి, ఆజ్యం
C) దాహం, తృష్ణ
D) కాల్చు, దహించు
జవాబు:
A) అనలం, నిప్పు

ప్రశ్న 6.
దేశంలోని ప్రతి అంగుళం రక్తంతోనో, కన్నీటితోనో తడిసిపోయింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) నల్ల, నెల్ల
B) రగతం, తగరం
C) రుధిరం, నెత్తురు
D) నలుపు, ఎఱుపు
జవాబు:
C) రుధిరం, నెత్తురు

ప్రశ్న 7.
ప్రశాంత గంభీర జలధిలోని ప్రళయాల పరిశీలన జరగడం లేదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సముద్రం, నది
B) సాగరం, రత్నాకరుడు
C) సంద్రం, జలదం
D) పయోధి, పదిలం
జవాబు:
B) సాగరం, రత్నాకరుడు

ప్రశ్న 8.
జాతిపితకు తెలంగాణ ప్రజలు భక్తి ప్రపత్తులతో సమర్పించే కానుక ఉపవాసదీక్ష – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) తండ్రి, నాన్న
B) పిత, మాత
C) అయ్య, అన్న
D) జనకుడు, జనం
జవాబు:
A) తండ్రి, నాన్న

V. నానారాలు :

ప్రశ్న 1.
ప్రజలు, సంతానము – అను నానార్థములు గల పదం
A) సంతు
B) ప్రజ
C) జనులు
D) పుత్రులు
జవాబు:
B) ప్రజ

ప్రశ్న 2.
“ధర్మము” అను పదమునకు సరియగు నానార్థాలు
A) స్వధర్మము, శ్రేయస్సు
B) రసాయన ధర్మము, భిక్షము
C) న్యాయము, స్వభావము
D) పాడి, ధర
జవాబు:
C) న్యాయము, స్వభావము

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
సరుకులు పుష్టిగా తెప్పించాము – గీత గీసిన పదానికి నానార్థాలు
A) అధికం, కొంచెం
B) బలము, సమృద్ధి
C) నిండుగా, నీరసంగా
D) తోడు, వెంట
జవాబు:
B) బలము, సమృద్ధి

ప్రశ్న 4.
అంగము అను పదమునకు నానార్థము
A) శరీరభాగము, అంగదేశము
B) దేశము, విజ్ఞానము
C) సైన్యంలో భాగము, ఒకరోజు
D) శరీర అవయవము, చొక్కా
జవాబు:
A) శరీరభాగము, అంగదేశము

ప్రశ్న 5.
జాతిపిత ప్రభోధాలకు తిలోదకాలిస్తున్నారు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) మాట, పాట
B) ఆట, మాట
C) మేలుకోలు, మిక్కిలి తెలివి
D) అనుబోధం, నమ్మకం
జవాబు:
C) మేలుకోలు, మిక్కిలి తెలివి

ప్రశ్న 6.
గాంధీజీ కన్న కలలు ఫలించి తీరుతాయి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) నిద్ర, నిదుర
B) స్వప్నం, శిల్పం
C) భాగం, పాలు
D) వడ్డీ, అసలు
జవాబు:
B) స్వప్నం, శిల్పం

ప్రశ్న 7.
భక్తిని వదిలేసి భుక్తి మార్గం వెతుకుతున్నారు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) సేవ, స్నేహం
B) భాగం, వంతు
C) మైత్రి, నైయ్యం
D) ఊడిగం, కయ్యం
జవాబు:
A) సేవ, స్నేహం

VI. వ్యుత్పత్యర్థములు :

ప్రశ్న 1.
మరణముతో కూడినది – అను వ్యుత్పత్తి గల పదం
A) సమరం
B) యుద్ధం
C) రణం
D) పోరు
జవాబు:
A) సమరం

ప్రశ్న 2.
అగ్నికి జ్వాల అందం – గీత గీసిన పదానికి సరియైన వ్యుత్పత్తి
A) చాలా మండునది
B) జ్వలించునది (మండునది)
C) జలజల మండునది
D) జారుడు స్వభావం కలది
జవాబు:
B) జ్వలించునది (మండునది)

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
“జలము దీనిచే ధరించబడును” – అను వ్యుత్పత్తి గల పదం
A) జలదము
B) జలజము
C) జలధి
D) జలపుష్పం
జవాబు:
C) జలధి

ప్రశ్న 4.
సాగరం – అనే పదానికి సరియైన వ్యుత్పత్తి
A) గరంగరంగా సాగునది
B) సాగని నీరు కలది
C) సగరులచే త్రవ్వబడినది
D) పెద్ద అలలు కలది
జవాబు:
C) సగరులచే త్రవ్వబడినది

ప్రశ్న 5.
సత్యం – అనే పదానికి వ్యుత్పత్త్యర్థాలు
A) చెడ్డవారి మనసులో ఉండేది’
B) దేవతలకు సంబంధించినది
C) సత్పురుషులందు పుట్టునది
D) రాక్షసులకు చెందినది
జవాబు:
C) సత్పురుషులందు పుట్టునది

ప్రశ్న 6.
జ్వలించునది – అనే పదానికి వ్యుత్పత్త్యర్థాలు
A) చలి
B) జ్వాల
C) రవ్వ
D) శిఖ
జవాబు:
B) జ్వాల

PAPER – II : PART – A

అపరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారుచేయండి.

“తెలుగు సాహిత్యంలోని పంచకావ్యాల్లో మనుచరిత్రను మొట్టమొదట లెక్కపెడతారు. ఆంధ్రప్రబంధ కవులలో ప్రథమపూజ అల్లసాని పెద్దన గారికే చేస్తారు. ఆదికవులు, కవిబ్రహ్మలు, ప్రబంధ పరమేశ్వరులు, కవి సార్వభౌములు మొదలైన ఆజానుబాహులు ఎందరున్నా, మన సాహితీ రంగంలో ఒక జానెడు ఎత్తుగా కనిపించే జాణ ఆంధ్రకవితా పితామహ బిరుదాంకితులు అల్లసాని పెద్దనగారే. దీనికి కారణం కృష్ణరాయలవారు అందరికన్నా పెద్దనగారికి పెద్దపీట వేయడమే కాదు. ఆయన సహజంగా ఉన్నతుడు. దానికి కారణం ఆయనలో పూర్వకవుల శుభలక్షణాలన్నీ కేంద్రీకృతం అయ్యాయి.
జవాబు:
ప్రశ్నలు

  1. తెలుగు పంచకావ్యాల్లో మొదట లెక్కపెట్టదగిన కావ్యం ఏది ?
  2. ఆంధ్ర ప్రబంధ కవులలో ఎవరిని శ్రేష్ఠునిగా గౌరవిస్తారు ?
  3. ‘ఆంధ్రకవితా పితామహుడు’ అనే బిరుదు పొందిన కవి ఎవరు ?
  4. పెద్దన కవి సహజంగా ఉన్నతుడు కావడానికి కారణం ఏమిటి ?
  5. పెద్దన గారిని ఆదరించిన కవి రాజు ఎవరు ?

ప్రశ్న 2.
కింది వచనాన్ని చదివి, దాని దిగువ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“సాహితీ సృజనలో అంతర్జాతీయ కీర్తి నందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా, రచయితగా, తత్త్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. వీరి పేరు వినగానే చప్పున స్ఫురించేవి ‘జనగణమన ‘గీతం’, ‘గీతాంజలి’. జనగణమన గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా వీరి లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయ గీతాలనందించిన కవిగా, అపూర్వ చరిత్రను సృష్టించారు. “శాంతి నికేతన్” పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి, ‘గురుదేవుడు’ గా కీర్తింపబడ్డారు.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
అంతర్జాతీయ కీర్తినందుకొన్న భారతీయ మహాకవి ఎవరు ?
జవాబు:
అంతర్జాతీయ కీర్తినందుకొన్న భారతీయ మహాకవి “రవీంద్రనాథ్ ఠాగూర్”.

ప్రశ్న 2.
ఏ రెండు దేశాలకు ఠాగూర్ జాతీయ గీతాలను అందించాడు ?
జవాబు:
భారత్, బంగ్లాదేశ్లకు ఠాగూర్ జాతీయ గీతాలను అందించాడు.

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన విద్యాసంస్థ ఏది ?
జవాబు:
రవీంద్రనాథ్ ఠాగూర్ ‘శాంతినికేతన్’ అనే విద్యాసంస్థను నెలకొల్పాడు.

ప్రశ్న 4.
రవీంద్రుని ప్రసిద్ధ రచనలు రెండింటిని రాయండి.
జవాబు:
రవీంద్రుడు 1) గీతాంజలి 2) జనగణమన గీతం రచించాడు.

ప్రశ్న 5.
రవీంద్రుని బహుముఖ ప్రజ్ఞను వివరించండి.
జవాబు:
రవీంద్రుడు కవి, రచయిత, తత్త్వవేత్త, సంగీతజ్ఞుడు, చిత్రకారుడు.

ప్రశ్న 3.
కింది వచనాన్ని చదివి, కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

“పద్యనాటక రచయితలలో ప్రత్యేకస్థానాన్ని అందుకున్న వారు తిరుపతి వేంకట కవులు. వీరు

1) దివాకర్ల తిరుపతిశాస్త్రి
2) చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి.
వీరు శతావధానులు. తమ అవధానాలతో వీరు ఆంధ్రదేశం అంతా పర్యటించి, సాహిత్య ప్రపంచంలో నూతనోత్తేజాన్ని కలిగించారు. వీరి అవధానాలతో స్ఫూర్తి పొందిన ఎందరో వ్యక్తులు సాహిత్యరంగంలో అడుగిడి కృషి చేశారు. ఆధునికాంధ్ర సాహిత్యంలో వీరికి ఎందరో లబ్ధ ప్రతిష్ఠులైన శిష్యులున్నారు. విశ్వనాథ, వేటూరి, కాటూరి, పింగళి వారలు వీరి శిష్యులే. వీరు రచించిన పాండవోద్యోగ విజయ నాటకాలకు లభించిన ప్రసిద్ధి ఇంతింతనరానిది. పశులకాపరి నుండి పండితుల వరకు అందరి నాల్కలపై వీరి పద్యాలు నాట్యం చేస్తున్నాయి.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
తిరుపతి వేంకట కవులు ఎవరు ?
జవాబు:
తిరుపతి వేంకట కవులు జంట కవులు. వీరు

  1. దివాకర్ల తిరుపతి శాస్త్రి
  2. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి.

ప్రశ్న 2.
వీరు సాహిత్య రంగంలో నూతనోత్తేజాన్ని దేని ద్వారా కల్పించారు ?
జవాబు:
వీరు అవధానాల ద్వారా సాహిత్యరంగంలో నూతనోత్తేజాన్ని కలిగించారు.

ప్రశ్న 3.
వీరి శిష్యులలో ఇద్దరిని పేర్కొనండి.
జవాబు:
‘పాండవోద్యోగ విజయాలు’ అనే వీరి నాటకాలు ప్రసిద్ధి పొందాయి.

ప్రశ్న 4.
వీరి ప్రసిద్ధికెక్కిన నాటకాలు ఏవి ?
జవాబు:
వీరి శిష్యులలో

  1. విశ్వనాథ సత్యనారాయణ
  2. వేటూరి ప్రభాకరశాస్త్రి ప్రసిద్ధులు.

ప్రశ్న 5.
అందరి నాల్కలపై నాట్యం చేసే వీరి పద్యాలు ఏ నాటకాలలోనివి ?
జవాబు:
వీరి పాండవోద్యోగ విజయాలు అనే నాటకాలలో పద్యాలు ప్రజల నాల్కలపై నాట్యం ఆడుతున్నాయి.

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 4.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

గాంధీ మహాత్ముడు పోరుబందరులో జన్మించాడు. అక్కడ అతని బాల్యంలో చదువు ఏ మాత్రమూ సాగలేదు. అతని తండ్రి పోరుబందరు నుండి రాజకోట వచ్చి కొత్త ఉద్యోగంలో చేరాడు. అక్కడ గాంధీ విద్యార్థి జీవితం ప్రారంభం అయింది. అతడు ముందుగా సబర్బను స్కూలులోను, ఆ తరువాత హైస్కూలులోను చేరి చదువుకున్నాడు. విద్యార్థి దశలో అతను ఎక్కువ బిడియంతో ఉండి ఎవరితోను కలిసిమెలిసి ఉండేవాడు కాదు. ఒకనాడు పరీక్షాధికారి అయిదు మాటలు చెప్పి వాటి వర్ణక్రమాన్ని వ్రాయమన్నాడు. వాటిలో కెటిల్ అనే మాటను గాంధీ తప్పుగా వ్రాశాడు.
జవాబు:

ప్రశ్నలు

  1. గాంధీ ఎక్కడ జన్మించాడు?
  2. అతడు ఏయే స్కూళ్లల్లో చదువుకున్నాడు?
  3. విద్యార్థి. దశలో అతను ఎలా ఉండేవాడు?
  4. అతడు పరీక్షలో దేనిని తప్పుగా వ్రాశాడు?
  5. గాంధీ తండ్రి పోరుబందరు నుండి ఎక్కడకు వచ్చాడు ?

ప్రశ్న 5.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

“కవిత్వం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం – ఈ ఐదింటిని లలిత కళలంటారు. ఈ కళల్లో కృష్ణరాయలకు తగినంత చొరవ ఉండేది. ఆయన ఆస్థానంలో కవులు, గాయకులు, నాట్యకారులు, చిత్రకారులు, శిల్పులు ఉండేవారు. వారు తమ తమ కళలను అద్భుతరీతిలో ప్రదర్శించి రాయల మన్ననలందుకొనేవారు. కళలు మానవుని హృదయాన్ని స్పందింపజేసే స్వభావం కలవి. కళలను ఆనందించలేనివాడు రాయిలాగే జడుడని చెప్పవచ్చు.”
జవాబు:

ప్రశ్నలు

  1. లలితకళ లేవి?
  2. కవులు రాయల మన్ననలందుకొనడానికి గల కారణమేమి?
  3. కళలను ఆనందించలేని వాడు రాయిలాగే జడుడు అంటే అర్థం ఏమిటి?
  4. సంగీతం పాడేవారిని గాయకులంటారు. అలాగే చిత్రాలను వేసే వారిని ఏమంటారు?
  5. కళల స్వభావం ఏమిటి ?

వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
“చెరువులు గ్రామాలకు పట్టుకొమ్మలు” అని తెలుపుతూ నీ మిత్రునికి లేఖ రాయుము.
జవాబు:

లేఖ

ముదిగొండ,
X X X X.

ప్రియ మిత్రుడు ప్రవీణ్కు,

నేను బాగా చదువుతున్నాను. నీవూ బాగా చదువుతున్నావనుకుంటున్నాను. ‘చెరువులు గ్రామాలకు పట్టుకొమ్మలు’ అనే విషయం నీకు చెప్పదలచి ఈ లేఖ రాస్తున్నాను.

మన తెలంగాణ ప్రాంతంలో నేడు నీటి కొరతను మనం ఎదుర్కొంటున్నాం. మనకు కృష్ణా, గోదావరి నదులు ఉన్నా తగినంత వర్షపాతం లేకపోవడం దానికి ముఖ్య కారణం. ఈ మధ్యకాలంలో చెరువులు పూడ్చి, ఆ స్థలంలో భవనాలు కట్టడం జరుగుతోంది. చెరువుల పట్ల శ్రద్ధ తగ్గడం వల్ల నీటితూడు వగైరా పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. కొన్ని చెరువులు ఎండిపోయాయి.

శాతవాహనుల కాలం నుండి మన ప్రాంతంలో చెరువుల నిర్మాణంపై శ్రద్ధ ఉంది. మన ప్రభుత్వం చెరువుల ప్రాధాన్యం గుర్తించి “మిషన్ కాకతీయ” పేరుతో పాత చెరువుల అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తోంది. చెరువులు కళకళలాడుతుంటేనే ప్రజలు, పశువులు, పక్షులు జీవంతో ఉండేది. వ్యవసాయం, తాగునీరు, నిత్యావసర పనులకు చెరువులపై ఆధారపడే గ్రామాలకు చెరువులు పట్టుకొమ్మలు కదా !

మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు.

ఇట్లు,
నీ మిత్రుడు,
కె. జస్వంత్.

చిరునామా :
డి. ప్రవీణ్,
9వ తరగతి,
పాల్వంచ, ఖమ్మం జిల్లా.

ప్రశ్న 2.
స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో నగరాన్ని / గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకుందామని కరపత్రాన్ని తయారుచేయండి. (లేదా) స్వచ్ఛ తెలంగాణ – సామాజిక బాధ్యత ఈ అంశంపై కరపత్రం తయారుచేయండి.
జవాబు:
సూచన : ప్రశ్నలలో భారత్ / తెలంగాణ అడగడం జరిగింది. పేరు మార్చి రెండిటికి విషయం ఒకటే.

స్వచ్ఛ భారత్ / స్వచ్ఛ తెలంగాణ

ప్రియమైన నా సోదర సోదరీమణులారా !

ఎక్కడ చూసినా, ఎటు చూసినా అపరిశుభ్రం, అశుద్ధం. దోమలు, ఈగల నిలయాలా ? ఇవి జనవాసాలా ? ఆలోచించే శక్తి కోల్పోయారా ? ఆలోచించరా ? ఇప్పటికైనా కళ్ళు తెరవండి, చైతన్యవంతులు కండి. పరిసరాలు శుభ్రంగా లేకపోతే రోగాలు చుట్టుముట్టుతాయి. దోమలు, ఈగల వల్ల భయంకర వ్యాధులు సోకుతాయి. మన నివాసాలు, పశువుల కొట్టాలకన్నా అధ్వానంగా ఉన్నాయి. నీ ఒక్క ఇల్లు బాగుంటే చాలనుకోకు. బయటకు రా. నీతోటి వారి క్షేమాన్ని నీవే కోరకపోతే ఎవరొస్తారు. ఒకరికొకరు మనమే సాయం చేసుకోవాలి. ఈ మురికిలోనే పసిపిల్లలు తిరుగుతున్నారు. వారి భవిష్యత్ కోసమైన పాటుపడదాం. మీ కోసం మేము తోడుంటాం. మరి మీ కోసం మీరేమి చేయరా ? చేయి చేయి కలిపి కష్టాన్ని దూరం చేద్దాం. గ్రామాన్ని తద్వారా దేశాన్ని ప్రగతి పథాన నడుపుదాం. ఈ రోజు నుండే పరిసరాలను శుభ్రంగా ఉంచుదాం. స్వచ్ఛ భారత్ / స్వచ్ఛ తెలంగాణలో భాగస్వాములవుదాం.

ఇట్లు,
స్వచ్ఛ భారత్ / స్వచ్ఛ తెలంగాణ నిర్మాణ యువత.

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 3.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఒక పెద్ద రాజకీయ నాయకుడు నీ వద్దకు వస్తే ఆయన్ని ఏమేమి ప్రశ్నలడుగుతావో ప్రశ్నావళిని తయారుచేయండి.
జవాబు:
తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వచ్చిన రాజకీయ నాయకునితో ఈ ప్రశ్నలు అడుగుతాను.

  1. రాష్ట్రానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ?
  2. మీరు చెప్పినవన్నీ నిస్వార్థంగా చేస్తారా ?
  3. ఎన్నిసార్లు మీరు జైలు కెళ్ళారు ?
  4. ఓటుకు నోటు ఇచ్చారా ?
  5. ఉద్యమంలో పాల్గొనటం కాక ఇంకా మీరు ఏమి చేశారు ?
  6. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తారా ?
  7. ఖద్దరు ధరించిన మీరు గాంధీ సిద్ధాంతాలు పూర్తిగా పాటిస్తున్నారా ?
  8. మద్యపాన రహిత రాష్ట్రంగా తెలంగాణను చూడగలమా ?
  9. అంటరానితనం నేరమంటూనే పుట్టింది మొదలు చచ్చేవరకు కులం అనే ‘కాలం’ ఎందుకు సర్టిఫికెట్స్లో పెట్టారు?

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

I. సంధులు:

ప్రశ్న 1.
“ప్రత్యేకం” సంధి విడదీసి రాయగా
A) ప్రత్య + ఏకం
B) ప్రతి + యేకం
C) ప్రతి + ఏకం
D) ప్రతికి + ఏకం
జవాబు:
C) ప్రతి + ఏకం

ప్రశ్న 2.
“సవర్ణదీర్ఘ సంధి”కి ఉదాహరణ
A) ప్రత్యేకం
B) ప్రజాభిప్రాయం
C) ప్రజలంతా
D) నాలుగెకరాలు
జవాబు:
B) ప్రజాభిప్రాయం

ప్రశ్న 3.
చిన్నచిన్న హాస్యాలకు కోపోద్రిక్తులు కాకండి – గీత గీసిన పదం ఏ సంధి ?
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) ఉత్వ సంధి
D) అత్వ సంధి
జవాబు:
B) గుణసంధి

ప్రశ్న 4.
“స్వ + ఇచ్ఛ” సంధి కలిపి రాయగా
A) స్వచ్ఛ
B) స్వచ్ఛ
C) సర్వేఛ్ఛ
D) స్వేచ్ఛ
జవాబు:
D) స్వేచ్ఛ

ప్రశ్న 5.
“సవర్ణదీర్ఘ సంధి”కి ఉదాహరణ కానిది.
A) ప్రజాభిప్రాయం
B) సత్యాగ్రహం
C) సత్యాహింసలు
D) తిలోదకాలు
జవాబు:
D) తిలోదకాలు

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

ప్రశ్న 6.
“ప్రాణాలు + అర్పించు” – సంధికార్యములో వచ్చు సంధి పేరు
A) ఉత్వ సంధి
B) అత్వ సంధి
C) గుణసంధి
D) వృద్ధి సంధి
జవాబు:
A) ఉత్వ సంధి

ప్రశ్న 7.
య, వ, రలు ఆదేశముగా వచ్చు సంధి
A) యడాగమ సంధి
B) గుణసంధి
C) యణాదేశ సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
C) యణాదేశ సంధి

II. సమాసములు :

ప్రశ్న 1.
సత్యమును, అహింసయు, భక్తియు మరియు ప్రపత్తియు – అనే విగ్రహవాక్యాలు ఏ సమాసానికి చెందినవి ?
A) ద్విగు సమాసము
B) ద్వంద్వ సమాసము
C) బహువ్రీహి సమాసము
D) షష్ఠీ తత్పురుష సమాసము
జవాబు:
B) ద్వంద్వ సమాసము

ప్రశ్న 2.
“విద్యార్థి నాయకుడు” – అను సమాస పదంనకు సరియైన విగ్రహవాక్యము
A) విద్యార్థుల యందు నాయకుడు
B) విద్యార్థి నాయకుడుగా కలవాడు
C) విద్యార్థుల వలన నాయకుడు
D) విద్యార్థులకు నాయకుడు
జవాబు:
D) విద్యార్థులకు నాయకుడు

ప్రశ్న 3.
మలినమైన హృదయము – సమాసముగా మార్చగా
A) మలిన హృదయము
B) మలినమగు హృదయము
C) మలినాల హృదయము
D) మలిన హృదయుడు
జవాబు:
A) మలిన హృదయము

ప్రశ్న 4.
“విశేషణ పూర్వపద కర్మధారయము”నకు ఉదాహరణ
A) సత్యాహింసలు
B) సత్యాగ్రహము
C) ఉత్కృష్టమైన లక్ష్యము
D) రాష్ట్ర ధ్యేయము
జవాబు:
C) ఉత్కృష్టమైన లక్ష్యము

ప్రశ్న 5.
“సత్యం కొరకు ఆగ్రహం” – ఈ విగ్రహవాక్యము ఏ సమాసమునకు ఉదాహరణ ?
A) షష్ఠీ తత్పురుష
B) చతుర్థీ తత్పురుష
C) తృతీయా తత్పురుష
D) ద్వంద్వ సమాసము
జవాబు:
B) చతుర్థీ తత్పురుష

ప్రశ్న 6.
“తీవ్ర పరిస్థితుల వలన ధర్మయుద్ధంలో విద్యార్థులు అగ్నిజ్వాలల వలె మండిపడ్డారు.” – ఈ వాక్యములో షష్ఠీ తత్పురుష సమాసమునకు ఉదాహరణ
A) తీవ్ర పరిస్థితులు
B) ధర్మయుద్ధం
C) అగ్నిజ్వాలలు
D) మండిపడు
జవాబు:
C) అగ్నిజ్వాలలు

ప్రశ్న 7.
“ప్రాణాలను అర్పించు” వారు త్యాగవీరులు – ఈ విగ్రహవాక్యంను సమాసంగా మార్చండి.
A) ప్రాణార్పణవీరులు
B) ప్రాణాలర్పించు
C) ప్రాణదాతలు
D) ప్రాణ త్యాగవీరులు
జవాబు:
B) ప్రాణాలర్పించు

TS 9th Class Telugu Important Questions 6th Lesson దీక్షకు సిద్ధంకండి

III. అలంకారములు :

ప్రశ్న 1.
“కిషోర్ లేడిపిల్లలా పరుగులు పెడుతున్నాడు.” – ఈ వాక్యంలో ఉన్న అలంకారం
A) ఉపమాలంకారం
B) ఉత్ప్రేక్షాలంకారం
C) అంత్యానుప్రాస
D) యమకము
జవాబు:
A) ఉపమాలంకారం

ప్రశ్న 2.
……….. గుడిసెకు విసిరి పోతివా
……….. నడుం చుట్టుక పోతివా
………. దిక్కు మొక్కుతు పోతివా – ఈ వాక్యాలలో ఉన్న అలంకారం
A) ఛేకానుప్రాస
B) లాటానుప్రాస
C) వృత్త్యనుప్రాస
D) అంత్యానుప్రాస
జవాబు:
D) అంత్యానుప్రాస

IV. వాక్యాలు

ప్రశ్న 1.
వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద మద్రాసు వెళ్ళాడు. వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద బెంగళూరు వెళ్ళాడు. పై వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చండి.
A) వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద మద్రాసు వెళ్ళి బెంగళూరు వెళ్ళాడు.
B) వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద మద్రాసు మరియు బెంగళూరు వెళ్ళాడు.
C) వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద మద్రాసు నుండి బెంగళూరు వెళ్ళాడు.
D) వెంకట్రామయ్య వెళ్ళాడు బెంగళూరుకి, మద్రాసుకి.
జవాబు:
B) వెంకట్రామయ్య ఆఫీసు పనిమీద మద్రాసు మరియు బెంగళూరు వెళ్ళాడు.

ప్రశ్న 2.
సీత కాఫీ తాగుతుంది. సీత హార్లిక్స్ తాగుతుంది.
పై వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చండి.
A) సీత కాఫీ మరియు హార్లిక్స్ కూడా తాగుతుంది.
B) సీత కాఫీ తాగి హార్లిక్స్ తాగుతుంది.
C) సీత తాగింది హార్లిక్స్ మరియు కాఫీలు.
D) సీతకు కాఫీ మరియు హార్లిక్స్ కూడా ఇష్టమే.
జవాబు:
A) సీత కాఫీ మరియు హార్లిక్స్ కూడా తాగుతుంది.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

These TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 5th Lesson Important Questions శతక మధురిమ

PAPER – 1 : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘ధనికుని కంటే పేద గొప్ప కదా !’ అన్న కవి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా ? ఎందుకు ?
జవాబు:
ఉత్పల సత్యనారాయణాచార్య “ధనము, ధనాభిమానము, శ్రియఃపతీ !” అను పద్యంలో ‘ధనికుని కంటే పేద కడు ధన్యుడు” అన్న వారి అభిప్రాయంతో నేను గొంతు కలుపుతున్నాను. ఎందుకంటే ధనం, ధనంపై అభిమానం, ఎల్లప్పుడు ధనం సంపాదించాలనే కోరిక అనే ఈ మూడు దోషాలు ధనికునికి ఉన్నాయి. కాని పేదవానికి ధనం ఉండదు. ధనంపై ఆశ ఉన్నా మంచివారికి దగ్గరగా ఉండటం వల్ల అది కూడా నశిస్తుంది. కనుక ధనికుని కంటే పేద గొప్ప కదా !

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
“చేతులకు దానమే అందం, కానీ కంకణాలు కావు” ఎందుకు ? సమర్థిస్తూ రాయుము.
జవాబు:
“దానేన పాణిర్నతు కఙ్కణేన” అన్న భర్తృహరి వాక్యానికి ‘మల్ల భూపాలీయం’ నీతిశతక కర్త ఎలకూచి బాలసరస్వతి తెలుగు సేత ‘చేతులకు దానమే అందం కానీ కంకణాలు కావు’ అన్న వాక్యం.

పరోపకారం చేయడం కోసం దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు. అందువల్ల మనశక్తి కొలది ఇతరులకు సాయం చేయాలి. మనచుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తే ఇతరుల కోసమే నదులు ప్రవహిస్తున్నాయి, పండ్లు ఫలిస్తున్నాయి, గోవులు పాలిస్తున్నాయి. వీటన్నిటి ఉపకారాలు పొందుతూ మనిషి మాత్రం స్వార్థంగా జీవిస్తున్నాడు. తాత్కాలికంగా మంచివాడనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడేకాని స్వార్థాన్ని పూర్తిగా విడువలేకపోతున్నాడు.

స్వార్థ చింతన కొంతమాని పొరుగువాడికి సాయం చేయాలనే భావన మాత్రం కలుగడం లేదు. తన వైభవమే “చూసుకోవడం తప్ప తోటివారి బాధలు గమనించడం లేదు. అందుకే కవి “చేతులు మనకు భగవంతుడు ఇచ్చింది పరులకు గొప్పగా సాయం చేయమనే కాని కంకణాలు ధరించటానికి కాదంటాడు”.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 2.
అందరిని ఆదరంగా చూస్తే భూమి మీద కష్టాలు పుట్టవు అని చెప్పిన ‘శతక మధురిమ’ పద్యం అంతరార్థం సోదాహరణంగా వివరించండి.
జవాబు:
“అఖిల జీవుల తనవోలె నాదరింప

ఉద్భవించునే యాపదలుర్వియందు అంటారు నింబగిరి నరసింహ శతక కర్త శ్రీ అందె వేంకట రాజం. సహజంగా ఇళ్ళలో అత్తాకోడళ్ళ విషయంలో కొన్ని బాధలుంటాయి. అత్త కోడలిని కొడుకు భార్యగా కాక పరాయిపిల్ల అనుకోవడం, కోడలు అత్తను రాక్షసిగా భావించడం, కట్నం విషయంలో అత్త కోడల్ని నిందించడం, కోడలి పుట్టింటి వారిని గూర్చి తక్కువ చేసి మాట్లాడటం ఇలా ఎన్నో ఉంటాయి. కోడలిని కూతురి మాదిరిగా చూస్తే ఇంట్లో ఘోరాలు సంభవించవు.

కార్మికులను భాగస్థులను చేస్తే, కర్మాగారాల్లో అల్లర్లు జరుగవు. ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. అన్ని మతాలు చెప్పేది ఒకటే. ఇతర మతస్థులను మన అన్నదమ్ముల వంటి వారిగా ఆదరిస్తే, మతకలహాలు, కొట్లాటలు లేక ప్రపంచం శాంతిధామం అవుతుంది. కనుక ప్రాణులందరినీ తనవలె ఆదరంగా చూస్తే భూమి మీద కష్టాలు పుట్టవు అని ‘శతక మధురిమ’ పద్యం చక్కగా వివరిస్తోంది.

ప్రశ్న 3.
పాఠశాలలో జరిగే భాషోత్సవాన్ని తిలకించడానికి ప్రముఖ శతక కవులు వచ్చారు. వారిని మీరు ఏమని ఇంటర్వ్యూ చేస్తారు ? అవసరమైన ప్రశ్నావళి రాయండి.
జవాబు:
ప్రశ్నావళి :

  1. శతకంలోని ‘మకుట నియమం’ యొక్క ఉద్దేశం ఏమిటి ?
  2. ఇందలి పద్యాలు దేనికవే వేరుగా అర్థాన్నిస్తాయి కదా ? మరి శతక రచన ఉద్దేశం ఏమిటి ?
  3. “చదువ పద్యమరయ చాలదా నొక్కటి” అని వేమన చెప్పాడు కదా ? ఇన్ని శతక పద్యాలు చదువక్కరలేదా ?
  4. పుత్రోత్సాహం అన్నారే కాని పుత్రికోత్సాహం అని ఎందుకు అనలేదు ?
  5. “తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు” అను పద్యంలో లేనివి, రానివి చెప్పబడ్డాయి. దీని ఉద్దేశం ఏమిటి ?
  6. శతకం అంటే నూరు కదా మరి నూట ఎనిమిది పద్యాలు ఉండాలనే నియమాన్ని ఎందుకు పాటించారు ?
  7. శతక పద్యధారణ ఎవరికి అవసరం ?
  8. శతకం కవి ఆత్మీయతకు ప్రతిబింబమా ?

PAPER – 1 : PART – B

భాషాంశాలు – పదజాలం :

1. సొంతవాక్యాలు :

అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. జాతుల్చెప్పుట : టి.వి.లో జాతుల్చెప్పు వారిలో ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఒకరు.
2. పరద్రవ్యము : పరద్రవ్యము పాము కంటే ప్రమాదము కాబట్టి దానిని కోరవద్దు.
3. నిక్కం : అవగాహన చేసుకొని చదివినదే నిక్కమైన చదువు.
4. ఒజ్జ : అన్ని విద్దెలకు ఒజ్జ ఆ బొజ్జగణపయ్య.
5. తృష్ణ : అర్జునుని గెలవాలన్న తృష్ణతో కర్ణుడు పరశురాముని శిష్యుడయ్యాడు.
6. విభూషణము : నెమలి ఈక అదృష్టం ఏమిటంటే శ్రీకృష్ణుని విభూషణం కావడమే.
7. ఆభరణం : నగ – పరోపకారమే శరీరానికి ఆభరణం వంటిది.
8. ఆదరం : ఆదరణ – అన్ని జీవులను తనవలె ఆదరంగా చూస్తే భూమ్మీద కష్టాలుండవు.
9. ఆశీర్వాదం: దీవెన – గురువు ఆశీర్వాదం పొందిన శిష్యుడే శ్రేష్ఠమైన సాధనాన్ని పొందుతాడు.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

II. అర్థాలు:

ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
“కృష్ణ” అంటే అర్థం
A) తృణము
B) దప్పిక
C) ఒక తులసి
D) బిందువు
జవాబు:
B) దప్పిక

ప్రశ్న 2.
సజ్జనులు మంచినే కోరుకుంటారు – గీత గీసిన పదానికి అర్థం
A) బుట్ట
B) ఒక ధాన్యము
C) సత్పురుషులు
D) సంఘజీవులు
జవాబు:
C) సత్పురుషులు

ప్రశ్న 3.
“మహి” అంటే అర్థం
A) మహిమ
B) భూమి
C) పాము
D) ఒక స్త్రీ
జవాబు:
B) భూమి

ప్రశ్న 4.
ఆకసమున శీతభానుడు వెన్నెల కురిపిస్తున్నాడు – గీత గీసిన పదానికి అర్థం
A) చందమామ
B) సూర్యుడు
C) వెన్నెల
D) నక్షత్రములు
జవాబు:
A) చందమామ

ప్రశ్న 5.
అబద్ధములు – అనే అర్థం వచ్చే పదం
A) బద్ధము
B) మృషలు
C) సత్యాలు
D) అశుద్ధి
జవాబు:
B) మృషలు

ప్రశ్న 6.
మంత్రులు – అనే అర్థం వచ్చే పదం
A) ప్రధానులు
B) రాజోద్యోగులు
C) మంత్రగాళ్ళు
D) సేనాపతులు
జవాబు:
A) ప్రధానులు

ప్రశ్న 7.
కొండెములాడు వానితో స్నేహం వద్దు – గీత గీసిన పదానికి అర్థం
A) కొండ ఎక్కువాడు
B) కొంచెం చెప్పువాడు
C) చాడీలు చెప్పేవాడు
D) తొండం
జవాబు:
C) చాడీలు చెప్పేవాడు

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 8.
“పరద్రవ్యం” అంటే అర్థం
A) ఇతరులు
B) ఇతరుల సొమ్ము
C) బరువైన ద్రవం
D) పరమాత్ముడు
జవాబు:
B) ఇతరుల సొమ్ము

ప్రశ్న 9.
ఉర్వి అంటే ధరణి అనే అర్థం. ఇటువంటి అర్థం వచ్చే మరొక పదం
A) ఉర్వీశ
B) భూమి
C) ధరణీశ
D) జగదీశ
జవాబు:
B) భూమి

III. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
కూతురు – అనే పదానికి పర్యాయపదాలు
A) కుమార్తె, పుత్రిక, దుహిత
B) సుత, జనని
C) ఆత్మజ, మహిత
D) బిడ్డ, ఫలము
జవాబు:
A) కుమార్తె, పుత్రిక, దుహిత

ప్రశ్న 2.
శరీరము – అనే పదానికి పర్యాయపదాలు
A) తనువు, మైపూత
B) మేను, ఒడలు, కాయము
C) దేహము, సందేహము
D) గాత్రము, కళత్రము
జవాబు:
B) మేను, ఒడలు, కాయము

ప్రశ్న 3.
“క్ష్మాపతి”కి మరొక పర్యాయపదం
A) దేశము
B) రాణువ
C) భూపతి
D) శ్రీపతి
జవాబు:
C) భూపతి

ప్రశ్న 4.
గరము మింగిన జోదు, ఈశ్వరుడు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) గరళము, వ్యాళము
B) గరళము, విషము, శ్రీ
C) విషము, తీపి
D) చేదు, వేడి
జవాబు:
B) గరళము, విషము, శ్రీ

ప్రశ్న 5.
శ్రీ కాళహస్తీశ్వరా ! – అనే పదంలో గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సాలీడు, లూత, సాలెపురుగు
B) లక్ష్మి, సాలెపురుగు, శివుడు
C) లాభం, లూత
D) లచ్చి, శివుడు
జవాబు:
A) సాలీడు, లూత, సాలెపురుగు

ప్రశ్న 6.
అన్నిటికంటే ఎత్తైన శైలము హిమగిరి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) అద్రి, పర్వతము, అచలం
B) గట్టు, మెట్ట
C) నగము, శిఖరము
D) కొండ, తరువు
జవాబు:
A) అద్రి, పర్వతము, అచలం

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 7.
పిపాస, ఈప్స, కాంక్ష – అను పర్యాయపదాలు గల పదం
A) దప్పిక
B) దాహము
C) తృష్ణ
D) త్రప
జవాబు:
C) తృష్ణ

ప్రశ్న 8.
నరుడు, మానవుడు, మర్త్యుడు – అనే పర్యాయపదాలు గల పదం
A) మనిషి
B) దానవుడు
C) మరుడు
D) అమరుడు
జవాబు:
A) మనిషి

IV. నానార్థాలు:

ప్రశ్న 1.
శ్రీ – అనే పదానికి నానార్థాలు
A) సాలెపురుగు, లక్ష్మి, సంపద
B) ధనము, ప్రకృతి
C) శోభ, భాష
D) కవిత, కావ్యము
జవాబు:
A) సాలెపురుగు, లక్ష్మి, సంపద

ప్రశ్న 2.
మనిషి ఆశతో జీవిస్తాడు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) కోరిక, ప్రేమ
B) పేరాశ, దిక్కు
C) కోరిక, దిక్కు
D) ఆసక్తి, అధికము
జవాబు:
C) కోరిక, దిక్కు

ప్రశ్న 3.
చెవిపోగులు, పాము – అను నానార్థాలు వచ్చే పదము
A) ఆభరణము
B) కుండలి
C) సర్పము
D) నాగము
జవాబు:
B) కుండలి

ప్రశ్న 4.
“దోషము” అను పదమునకు నానార్ధములు – “తప్పు” మరియు ……….
A) రాత్రి, పాపము
B) దోసకాయ, దోషకారి
C) వేషము, రోషము
D) కోపము, పాపము
జవాబు:
A) రాత్రి, పాపము

ప్రశ్న 5.
శ్రియః – అను పదమునకు నానార్ధములలో ఒకటి లక్ష్మీదేవి మరియొకటి
A) ప్రజ్ఞ – ప్రజ
B) ప్రజ్ఞ – ప్రగ్గడ
C) ప్రజ్ఞ – పగ్గె
D) ప్రజ్ఞ – ప్రతిజ్ఞ
జవాబు:
C) ప్రజ్ఞ – పగ్గె

ప్రశ్న 6.
ఇటువంటి గుణము కావాలి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) స్వభావము, వింటినారి
B) లక్షణము, వైద్యుడు
C) హెచ్చవేత, మాత్ర
D) దారము, దూది
జవాబు:
A) స్వభావము, వింటినారి

ప్రశ్న 7.
వైభవంలో ఇంద్రుని మించినవాడా ! – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ప్రభువు, రాజు
B) శేషుడు, నాగరాజు
C) దేవేంద్రుడు, శ్రేష్ఠుడు
D) ఈశ్వరుడు, శివుడు
జవాబు:
C) దేవేంద్రుడు, శ్రేష్ఠుడు

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 8.
ఓ వేంకట పతీ ! పరబ్రహ్మమూర్తి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) చంద్రుడు, వైశ్యుడు
B) నలువ, విష్ణువు
C) శివుడు, క్షత్రియుడు
D) సూర్యుడు, నక్షత్రం
జవాబు:
B) నలువ, విష్ణువు

ప్రశ్న 9.
లక్ష్మీనాథా ! నీవే దిక్కు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) శ్రీదేవి, సిరి
B) తామర, మల్లె
C) కలువ, పారిజాతం
D) పసుపు, కుంకుమ
జవాబు:
A) శ్రీదేవి, సిరి

ప్రశ్న 10.
గురువు ఆశీస్సును పొందినపుడే, శిష్యుడు శాంతాన్ని – సాధించగలుగుతాడు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) హితం, కీడు
B) ఇచ్ఛ, కోరిక
C) పాముకోర, విషం
D) ఆశీర్వాదం, స్తోత్రం చేయుట
జవాబు:
D) ఆశీర్వాదం, స్తోత్రం చేయుట

V. ప్రకృతి, వికృతులు:

ప్రశ్న 1.
ఈ కింది ప్రకృతి – వికృతులలో సరికాని జోడు ఏది ?
A) దోషము – దొసగు
B) సింహం – సింగ౦
C) కార్యము – కారణము
D) కలహము – కయ్యం
జవాబు:
C) కార్యము – కారణము

ప్రశ్న 2.
“అగ్ని”కి సరియైన వికృతి పదం
A) అగిని
B) అగ్గి
C) నిప్పు
D) మంట
జవాబు:
B) అగ్గి

ప్రశ్న 3.
“పాము విషము కన్నా అవినీతి సర్పము యొక్క విసము ప్రమాదము.’ ఈ వాక్యములో ఉన్న సరియైన ప్రకృతి – వికృతులు
A) పాము – సర్పము
B) అవినీతి – అనీతి
C) ప్రమాదము – ప్రమోదము
D) విషము – విసము
జవాబు:
D) విషము – విసము

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 4.
“సూది” అను పదము వికృతిగా గల పదము
A) సూచన
B) సూచి
C) సూచించు
D) దబ్బనము
జవాబు:
B) సూచి

ప్రశ్న 5.
శ్రియః – అను పదమునకు నానార్ధములలో ఒకటి లక్ష్మీదేవి మరియొకటి
A) ప్రజ్ఞ – ప్రజ
B) ప్రజ్ఞ – ప్రగ్గడ
C) ప్రజ్ఞ – పగ్గె
D) ప్రజ్ఞ – ప్రతిజ్ఞ
జవాబు:
C) ప్రజ్ఞ – పగ్గె

ప్రశ్న 6.
“శ్రీ” అను పదమునకు సరియైన వికృతి
A) సిరి
B) స్త్రీ
C) ఇంతి
D) సిరి
జవాబు:
A) సిరి

ప్రశ్న 7.
యోధులు – అను పదమునకు సరియైన వికృతి
A) యోద్ధలు
B) జోదులు
C) జోగి
D) యాది
జవాబు:
B) జోదులు

ప్రశ్న 8.
కలహం పేరు వింటే నారదుడు గుర్తుకు వచ్చాడా ? గీత గీసిన పదానికి వికృతి
A) కార్యం
B) పేచి
C) కయ్యం
D) తగవు
జవాబు:
C) కయ్యం

ప్రశ్న 9.
భగవంతునికి తన భక్తుడు అంటే ప్రేమ – గీత గీసిన పదానికి వికృతి
A) భక్తి.
B) భజన
C) భాగ్యశాలి
D) బత్తుడు
జవాబు:
D) బత్తుడు

ప్రశ్న 10.
`శిష్యుడు అంటే వివేకానందుడే ఆదర్శం – గీత గీసిన పదానికి వికృతి
A) సిసువుడు
B) సచివుడు
C) శశికరుడు
D) సాధన
జవాబు:
A) సిసువుడు

ప్రశ్న 11.
“నిచ్చలు” అను పదానికి ప్రకృతి
A) నిశ్చయం
B) గోరు
C) నింగి
D) నిరూపణ
జవాబు:
B) గోరు

ప్రశ్న 12.
“ఘోరము” అను పదమునకు వికృతి
A) గరువము
B) గోరు
C) గోరము
D) గోస
జవాబు:
C) గోరము

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 13.
రావే ఈశ్వరా, కావవే వరదా.
A) శివుడు
B) ఈసరుడు
C) శంకరుడు
D) రుద్రుడు
జవాబు:
B) ఈసరుడు

VI. వ్యుత్పత్త్యర్ధములు :

ప్రశ్న 1.
“అచ్యుతుడు” – అను పదమునకు సరియైన వ్యుత్పత్తి
A) చ్యుతము నుండి జారినవాడు
B) నాశనము (చ్యుతి) లేనివాడు
C) అచ్యుతానంత అని పాడువాడు
D) చ్యుతునికి సోదరుడు
జవాబు:
B) నాశనము (చ్యుతి) లేనివాడు

ప్రశ్న 2.
“ప్రకాశమును కలిగించువాడు” – అను వ్యుత్పత్తి కలిగిన పదము
A) భానుహుడు
B) భాస్కరుడు
C) భారతీయుడు
D) చంద్రుడు
జవాబు:
B) భాస్కరుడు

ప్రశ్న 3.
“మనువు సంతతికి చెందినవారు” – అను వ్యుత్పత్తి గల పదము
A) మానవులు
B) భారతీయుడు
C) దానవులు
D) మారినవారు
జవాబు:
A) మానవులు

ప్రశ్న 4.
“సహెూదరులు” – అను పదమునకు సరియైన వ్యుత్పత్తి
A) అపూర్వమైనవారు
B) తోడ (ఒకే గర్భము నుండి) పుట్టినవారు
C) దరిదాపులనున్నవారు
D) ఒక అన్నకు తమ్ముడు
జవాబు:
B) తోడ (ఒకే గర్భము నుండి) పుట్టినవారు

ప్రశ్న 5.
“జలజాతము, అబ్జము” – అను పదములకు సరియైన వ్యుత్పత్తి “నీటి (జలము, అప్పు) నుండి పుట్టినది.” – దీనికి సరియైన పదము
A) అగ్ని
B) పద్మము
C) చేప
D) లక్ష్మి
జవాబు:
B) పద్మము

ప్రశ్న 6.
ఈమెచే సర్వము చూడబడును – అను వ్యుత్పత్తి కలిగిన పదము
A) కన్ను
B) లక్ష్మి
C) సూర్యుడు
D) పార్వతి
జవాబు:
B) లక్ష్మి

ప్రశ్న 7.
విష్ణువు నాశ్రయించునది – అను వ్యుత్పత్తి కలిగిన పదము
A) బ్రహ్మ
B) లక్ష్మి
C) భూదేవి
D) నారదుడు
జవాబు:
B) లక్ష్మి

ప్రశ్న 8.
కంకణం – అను వ్యుత్పత్తి కలిగిన పదము
A) కడియం
B) గాజు
C) మ్రోయునది
D) మెరియునది
జవాబు:
C) మ్రోయునది

PAPER – II : PART – A

అపరిచిత పద్యాలు

1. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

తనిసిరే వేల్పు లుదధి రత్నముల చేత ?
వెఱచిరే ఘోర కాకోల విషము చేత ?
విడిచిరే యత్న మమృతంబు వొడుముదనుక ?
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
ఉదధి రత్నముల చేత తృప్తి చెందని వారెవరు ?
జవాబు:
వేల్పులు ఉదధి రత్నములచేత తృప్తి చెందలేరు.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 2.
నిపుణమతులు ఎటువంటివారు ?
జవాబు:
నిపుణమతులు తాము అనుకున్న కార్యం నెరవేరే – వరకు తమ ప్రయత్నాన్ని వదలరు.

ప్రశ్న 3.
వేల్పులు దేన్ని చూసి భయపడలేదు ?
జవాబు:
వేల్పులు ఘోర కాకోల విషాన్ని చూసి భయపడలేదు.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “నిపుణమతుల లక్షణం”.

ప్రశ్న 5.
ఉదధి అంటే ఏమిటి ?
జవాబు:
ఉదధి అంటే సముద్రం.

2. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

విద్యచే భూషితుండయి వెలయుచున్నఁ
దొడరి వర్ణింపనగుఁ జుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్త మస్త
కంబయిన పన్నగము భయంకరము గాదె.

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
చదువుకున్నప్పటికీ విడువదగినవాడు ఎవరు ?
జవాబు:
దుర్జనుడు చదువుకున్నప్పటికీ విడువదగినవాడు.

ప్రశ్న 2.
ఎటువంటి పాము భయంకరమైనది ?
జవాబు:
మణులచేత అలంకరింపబడిన శిరస్సుగల పాము భయంకరమైనది.

ప్రశ్న 3.
ఈ పద్యంలోని దుర్జనుడు దేనితో పోల్చబడ్డాడు ?
జవాబు:
ఈ పద్యంలో దుర్జునుడు పాముతో పోల్చబడ్డాడు.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘దుర్జనుడితో స్నేహం పనికిరాదు.’

ప్రశ్న 5.
మస్తకము అంటే ఏమిటి ?
జవాబు:
మస్తకం అంటే తల.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

3. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు
సుకవి చేతి కలము సుధలు కురియు
ఆత డేల గలుగు యావత్ప్రపంచంబు
నీత డేల గలుగు ఇహము పరము

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
రాజు చేతి కత్తి దేన్ని వర్షిస్తుంది?
జవాబు:
రాజు చేతి కత్తి రక్తాన్ని వర్షిస్తుంది.

ప్రశ్న 2.
సుధలు కురిపించునది ఏది?
జవాబు:
సుకవి చేతి కలము సుధలు కురిపిస్తుంది.

ప్రశ్న 3.
యావత్ప్రపంచాన్ని పరిపాలించగలిగింది ఎవరు?
జవాబు:
రాజు యావత్ప్రపంచాన్ని పరిపాలించగలడు.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘రాజు సుకవి’.

ప్రశ్న 5.
ఇహము పరము ఏలగలిగేది ఎవరు ?
జవాబు:
ఇహము పరము ఏలగలిగేది సుకవి.

4. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
అల్పుడు మాట్లాడే తీరు ఎలాంటిది?
జవాబు:
అల్పుడు మాట్లాడే తీరు ఆడంబరంగా ఉంటుంది.

ప్రశ్న 2.
సజ్జనుడు ఎలా మాట్లాడుతాడు?
జవాబు:
సజ్జనుడు చల్లగా మాట్లాడుతాడు.

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
కంచు మ్రోగునట్లు మ్రోగనిదేది?
జవాబు:
కంచు మ్రోగునట్లు మ్రోగనిది బంగారం.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘అల్పుడు – సజ్జనుడు’.

ప్రశ్న 5.
ఈ పద్యం ఏ శతకం లోనిది ?
జవాబు:
ఈ పద్యం వేమన శతకం లోనిది.

5. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కుసుమ గుచ్ఛంబునకుఁబోలె బొసగు శౌర్య
మానవంతున కివి రెండు మహితగతులు
సకలజన మస్తక ప్రదేశములనైన
వనమునందైన జీర్ణభావంబుఁ గనుట

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
శౌర్య మానవంతుడు ఎవరితో పోల్చబడ్డాడు?
జవాబు:
శౌర్య మానవంతుడు పుష్పగుచ్ఛంతో పోల్చబడ్డాడు.

ప్రశ్న 2.
కుసుమ గుచ్ఛం ఎక్కడ అలంకరింపబడుతుంది.?
జవాబు:
కుసుమ గుచ్ఛం సమస్త ప్రజల శిరస్సులందు అలంకరింపబడుతుంది.

ప్రశ్న 3.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘శౌర్య మానవంతుని లక్షణం’.

ప్రశ్న 4.
ఈ పద్యంలోని అలంకారం రాయండి.
జవాబు:
ఈ పద్యంలో ‘ఉపమాలంకారం’ ఉంది.

ప్రశ్న 5.
శౌర్యమానవంతునకు మహితగతులు ఎన్ని ?
జవాబు:
శౌర్యమానవంతునకు రెండు మహిత గతులు.

వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
శతక మధురిమలోని ఏదైనా ఒక పద్యం ఆధారంగా ఒక నీతికథను తయారుచేయండి.
జవాబు:
భక్తులే కాదు మనుషులన్న వారెవ్వరైనా పద్ధతిని, నీతిని తప్పకూడదని సర్వేశ్వర శతకపద్యం చెబుతోంది. నీతి, నిజాయితీలు మనిషి ఉన్నతికి దోహదపడతాయనేదే ఈ కథ.

నిజాయితీ

రామాపురంలో రాజయ్య అనే పేదవాడు ఉన్నాడు. అతడు ప్రతిరోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకొని, వాటిని అమ్మి జీవించేవాడు. ఒకరోజు రాజయ్య ఆ అడవిలో నది ఒడ్డునున్న పెద్ద చెట్టెక్కి కట్టెలు కొడుతుండగా చేయి జారి గొడ్డలి నదిలో పడిపోయింది. ఆ నది చాలా లోతు. రెండు, మూడు సార్లు నదిలో దిగి ఎంతో ప్రయత్నించాడు. కాని గొడ్డలి దొరకలేదు. ఎంతో బాధతో భగవంతుణ్ణి మనసులో ప్రార్థించాడు. తన గొడ్డలి ఇప్పించమని వేడుకున్నాడు.

అతని ప్రార్ధనను విని గంగాదేవి ప్రత్యక్షమై, “ఎందుకు బాధపడుతున్నావు” అని అడిగింది. “తల్లీ! నన్ను రక్షించు. నా జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అది దొరకలేదు” అని బాధపడ్డాడు. ”సరే ఉండు అంటూ దేవత నీటిలో మునిగి బంగారు గొడ్డలితో ప్రత్యక్షమైంది. “ఇదేనా నీ గొడ్డలి ?” అని బంగారు గొడ్డలిని చూపించింది. “నాది కాదు తల్లీ !” అన్నాడు. మళ్ళీ నీళ్ళలో మునిగి దేవత వెండి గొడ్డలితో ప్రత్యక్షమైంది. “ఇదేనా నీ గొడ్డలి?” అని వెండి గొడ్డలిని చూపించింది. కాదని తల అడ్డంగా ఊపాడు. ఈసారి అతని గొడ్డలితోనే ఎదుట నిలిచి “ఇదేనా ?” అన్నది. రాజయ్య సంతోషంతో “అమ్మా ! ఇదే నా గొడ్డలి” అని ఆనందంతో పరవశించాడు.
రాజయ్య నిజాయితీకి మెచ్చి గంగాదేవి మూడు గొడ్డళ్ళు ఇచ్చి మాయమైపోయింది.
నీతి : నిజాయితీయే రాజయ్యను ధనవంతుణ్ణి చేసింది.

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

I. సంధులు:

ప్రశ్న 1.
“శ్రీకాళహస్తి + ఈశ్వరా”, “పుణ్య + ఆత్ముడు” – అను వాటికి వచ్చు సంధి కార్యము
A) గుణసంధి
B) ఇత్వ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) అత్వ సంధి
జవాబు:
C) సవర్ణదీర్ఘ సంధి

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 2.
రాజరాజేశ్వరా – సంధి విడదీసి రాయగా
A) రాజ + రాజేశ్వరా
B) రాజరా + జేశ్వరా
C) రాజరాజ + ఈశ్వరా
D) రాజరాజ + యీశ్వరా
జవాబు:
C) రాజరాజ + ఈశ్వరా

ప్రశ్న 3.
“నెఱి + మేను” – కలిపి రాయగా
A) నెఱిమేను
B) నెమ్మనము
C) నెమ్మేను
D) నిండుమేను
జవాబు:
C) నెమ్మేను

ప్రశ్న 4.
ఈశ్వరుని పదాబ్జములను కొలుతును – గీత గీసిన పదానికి సంధి కార్యము
A) గసడదవాదేశ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) అత్వ సంధి
D) గుణసంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 5.
“జాతుల్ + చెప్పుట” – సంధి చేసి రాయగా
A) జాతుచెప్పుట
B) జాతికి సెప్పుట
C) జాతులెప్పుట
D) జాతులే సెప్పుట
జవాబు:
D) జాతులే సెప్పుట

ప్రశ్న 6.
“ఏమి + అయినన్” – ఇది ఏ సంధి ?
A) ఇత్వ సంధి
B) అత్వ సంధి
C) గుణసంధి
D) యణాదేశ సంధి
జవాబు:
A) ఇత్వ సంధి

ప్రశ్న 7.
క, చ, ట, త, ప ల స్థానంలో గ, స, డ, ద, వలు వచ్చు సంధి నామము
A) సరళాదేశ సంధి
B) గసడదవాదేశ సంధి
C) ద్రుత సంధి
D) ఆమ్రేడిత సంధి
జవాబు:
B) గసడదవాదేశ సంధి

ప్రశ్న 8.
“వేంకటేశ్వరా” అను పదమును విడదీయగా వచ్చు సంధి
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణసంధి
C) యణాదేశ సంధి
D) యడాగమ సంధి
జవాబు:
B) గుణసంధి

ప్రశ్న 9.
“తలఁదాల్చు” అను పదాన్ని విడదీసి రాయగా
A) తలతోన్ + తాల్చు
B) తల + తాల్చు
C) తలన్ + తాల్చు
D) తలఁ + తాల్చు
జవాబు:
C) తలన్ + తాల్చు

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

II. సమాసములు :

ప్రశ్న 1.
“షష్ఠీ తత్పురుష సమాసాని”కి ఉదాహరణ
A) నీ భక్తుడు
B) చేదమ్మి
C) నెమ్మేన
D) కలహాగ్నులు
జవాబు:
A) నీ భక్తుడు

ప్రశ్న 2.
జలజాతప్రియ శీతభానులు అను దానికి విగ్రహవాక్యం
A) జలజాతము మరియు ప్రియమైన శీతము భానుడును
B) జలజాతప్రియుడును మరియు శీతభానుడును
C) జలజాతప్రియము వంటి శీతభానులు
D) జలజాత ప్రియుని యొక్క శీతభానులు
జవాబు:
B) జలజాతప్రియుడును మరియు శీతభానుడును

ప్రశ్న 3.
“కార్యము నందు దక్షుడు” – అను విగ్రహవాక్యమునకు సమాసరూపం
A) కార్యదక్షుడు
B) కార్యమున దక్షుడు
C) కార్యాధ్యక్షుడు
D) కార్యములందు దక్షుడు
జవాబు:
A) కార్యదక్షుడు

ప్రశ్న 4.
“మూడు దోషాలు” సమాసము పేరు
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) రూపక సమాసము
D) బహువ్రీహి సమాసము
జవాబు:
B) ద్విగు సమాసము

ప్రశ్న 5.
“ఆశాపాశం”లో చిక్కినవాడు, బయటపడలేడు – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం
A) ఆశ యందు పాశము
B) ఆశ యొక్క పాశం
C) ఆశ అనెడు పాశము
D) ఆశలు మరియు పాశాలు
జవాబు:
C) ఆశ అనెడు పాశము

ప్రశ్న 6.
అబ్జముల వంటి పదములు – విగ్రహవాక్యమునకు సమాసము
A) విశేషణ పూర్వపద కర్మధారయము
B) సంభావనా పూర్వపద కర్మధారయము
C) ఉపమాన ఉత్తరపద కర్మధారయము
D) బహువ్రీహి
జవాబు:
C) ఉపమాన ఉత్తరపద కర్మధారయము

ప్రశ్న 7.
“బహువ్రీహి సమాసము”నకు ఉదాహరణ
A) పుణ్యాత్ముడు
B) పరమేశ్వరుడు
C) కలహాగ్నులు
D) పరద్రవ్యము
జవాబు:
A) పుణ్యాత్ముడు

ప్రశ్న 8.
భీష్మద్రోణులు దుర్యోధనుని కొలువులో ఉన్నారు – గీత గీసిన పదం ఏ సమాసం ?
A) ద్వంద్వ సమాసము
B) ద్విగు సమాసము
C) ప్రాది సమాసము
D) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
A) ద్వంద్వ సమాసము

III. ఛందస్సు

ప్రశ్న 1.
“నీయాత్మ” అను పదమును గణవిభజన చేయగా
A) య గణం
B) త గణం
C) జ గణం
D) స గణం
జవాబు:
B) త గణం

TS 9th Class Telugu Important Questions 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 2.
UUI, UIU – ఈ గణములకు సరియైన పదం
A) శ్రీరామ భూపాల
B) సీతామనోహరా
C) రాజరాజాధిపా
D) తారాశశాంకము
జవాబు:
B) సీతామనోహరా

ప్రశ్న 3.
“శార్దూల పద్యం”లో వచ్చు గణములు
A) న, జ, భ, జ, జ, జ, ర
B) స, భ, ర, న, మ, య, వ
C) మ, స, జ, స, త, త, గ
D) భ, ర, న, భ, భ, ర, వ
జవాబు:
C) మ, స, జ, స, త, త, గ

ప్రశ్న 4.
ధనము, ధనాభిమానము, సదా ధనతృష్ణయు మూడు దోషముల్ – ఈ పద్యపాదంలో 11వ స్థానం యతి వచ్చింది. అయితే ఈ పద్యపాదం
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభం
D) శార్దూలం
జవాబు:
B) చంపకమాల

ప్రశ్న 5.
ఇంద్ర గణములు ఏవి ?
A) న, హ
B) నగ, నల, సల, భ, ర, త
C) య, ర, త, భ, జ, స
D) మ, న, లగ
జవాబు:
B) నగ, నల, సల, భ, ర, త

IV. వాక్యాలు :

ప్రశ్న 1.
రామకృష్ణారావు సత్యాగ్రహం చేశారు. రామకృష్ణారావు జైలుకు వెళ్ళారు. పై వాక్యాలు సంక్లిష్ట వాక్యాలుగా మారిస్తే
A) రామకృష్ణారావు సత్యాగ్రహం చేశారు, జైలుకు వెళ్ళారు.
B) రామకృష్ణారావు సత్యాగ్రహం చేశారు కాబట్టి జైలుకు వెళ్ళారు.
C) రామకృష్ణారావు సత్యాగ్రహం చేసి, జైలుకు వెళ్ళారు.
D) రామకృష్ణారావు సత్యాగ్రహం చేసినా జైలుకు వెళ్ళారు.
జవాబు:
C) రామకృష్ణారావు సత్యాగ్రహం చేసి, జైలుకు వెళ్ళారు.

ప్రశ్న 2.
పాండవులు అరణ్యవాసం చేశారు. పాండవులు అజ్ఞాతవాసం చేశారు. పై వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మారిస్తే
A) పాండవులు అరణ్యవాసం చేసి, అజ్ఞాతవాసం చేశారు.
B) పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు.
C) పాండవులు అరణ్యవాసం చేశారు కాని అజ్ఞాతవాసం కూడా చేశారు.
D) పాండవులు అరణ్యవాసం చేసినా అజ్ఞాతవాసం కూడా చేశారు.
జవాబు:
B) పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు.

ప్రశ్న 3.
సామాన్య వాక్యాలు ఏవి ?
A) చైతన్య వాలీబాల్ ఆడతాడు. నిర్మల్ క్రికెట్ ఆడతాడు.
B) చైతన్య వాలీబాల్ ఆడితే, నిర్మల్ క్రికెట్ ఆడతాడు.
C) చైతన్య వాలీబాల్ ఆడతాడు కాబట్టి, నిర్మల్ క్రికెట్ ఆడతాడు.
D) చైతన్య మరియు నిర్మల్లు, వాలీబాల్ మరియు క్రికెట్ ఆడతారు..
జవాబు:
A) చైతన్య వాలీబాల్ ఆడతాడు. నిర్మల్ క్రికెట్ ఆడతాడు.

ప్రశ్న 4.
“నేను ఈ ఇడ్లీలు చేశాను” అంది హైమ – ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మారిస్తే
A) హైమ అన్నది “నేను ఈ ఇడ్లీలు చేశాను,” అని.
B) తాను ఈ ఇడ్లీలు చేశానని హైమ అన్నది.
C) తాను చేసిన ఇడ్లీలు ఏవి అని హైమ అన్నది.
D) హైమ చేసిన ఇడ్లీలు ఇవి అని ఆమె అన్నది.
జవాబు:
B) తాను ఈ ఇడ్లీలు చేశానని హైమ అన్నది.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 5th Lesson శతక మధురిమ Textbook Questions and Answers.

TS 9th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక మధురిమ

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 45)

బలవంతుఁడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతఁజిక్కి చావదె సుమతీ!

ప్రశ్నలు

ప్రశ్న 1.
బలవంతుడననే అహంకారం ఎందుకు ఉండకూడదు ?
జవాబు:
బలవంతుడను అనే అహంకారంతో పదిమందితోనూ తగవు పెంచుకుంటే, ఆ పదిమంది కలసి, ఆ బలవంతుణ్ణి చావగొడతారు. అందువల్ల బలవంతుడననే అహంకారం ఉండరాదు.

ప్రశ్న 2.
చలిచీమల నుంచి మీరేమి తెలుసుకున్నారు ?
జవాబు:
చలిచీమలు సహజంగా బలములేనివి. కాని ఆ చలిచీమలు అన్నీ కలిసి, బలవంతమైన సర్పాన్ని చంపుతాయి. దానిని బట్టి సంఘీభావంతో బలహీనులు కూడా, ఎంతటి ఘనకార్యాన్ని అయినా చేయగలరని చలిచీమల నుండి నేను నేర్చుకున్నాను.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ప్రశ్న 3.
పై పద్యం ద్వారా తెలిసే నీతి ఏమిటి?
జవాబు:

  1. బలవంతుడనే గర్వంతో, పెక్కుమందితో విరోధం కూడదు.
  2. బలహీనులు కూడా కలసిమెలసి ఉంటే, ఎంతటి ఘనకార్యాన్ని అయినా చేయగలరు. అనే నీతులు ఈ పద్యం ద్వారా గ్రహించాలి.

ప్రశ్న 4.
ఇట్లాంటి నీతులు ఉండే పద్యాలు సాధారణంగా ఏ ప్రక్రియలో కనబడుతాయి ?
జవాబు:
ఇట్లాంటి నీతులు ఉండే పద్యాలు సాధారణంగా శతక ప్రక్రియలో కనబడతాయి.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 48)

ప్రశ్న 1.
“భక్తుడు పద్ధతి తప్పడు” అని కవి అన్నాడు కదా! పద్ధతి తప్పడమంటే, మీరేమనుకుంటున్నారు ?
జవాబు:
భక్తుడు పద్ధతి తప్పడు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, భక్తుడు భగవంతుణ్ణి విశ్వసించి భగవంతుణ్ణి త్రికరణశుద్ధిగా ఆరాధిస్తాడనీ, తాను చేసే దైవ పూజా పద్ధతిని విడిచి, మరోదారి త్రొక్కడనీ ఎల్లవేళలా భక్తుడు భగవంతుడినే నమ్మి కొలుస్తాడనీ దీని భావము.

ప్రశ్న 2.
కీర్తి ఎలా కలుగుతుంది?
జవాబు:
కీర్తి అంటే మంచిపేరు. లోకానికి ఉపకారం జరిగే మంచి పనులు చేస్తే, కీర్తి కలుగుతుంది. మిగిలిన వారికంటె తాను కష్టపడి మంచి విజయాలు సాధిస్తే, అతడికి మంచి కీర్తి కలుగుతుంది. రాజులు వంటివారు మంచిగా ప్రజలను పాలిస్తే, వారికి కీర్తి కలుగుతుంది. కవులూ, పండితులూ వంటివారు మంచి గ్రంథ రచనలు చేస్తే వారికి కీర్తి కలుగుతుంది.

ప్రశ్న 3.
మనిషి చేయకూడని పనులేమిటి?
జవాబు:
ఇతరుల సొమ్మును ఆశించి, జోస్యాలు చెప్పరాదు. అబద్ధాలు చెప్పరాదు. అన్యాయంగా కీర్తిని పొందరాదు. కొండెములు చెప్పరాదు. హింస చేయరాదు. లేనిపోని వ్యాఖ్యానాలు చేయరాదు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 49)

ప్రశ్న 1.
“పరోపకారం శరీరానికి ఆభరణం” అని కవి ఏ ఉద్దేశంతో అన్నాడు ?
జవాబు:
పరోపకారం చేయడం కోసమే దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు. అందువల్ల మన శక్తి కొద్దీ, మనం ఇతరులకు సాయపడాలి. మన శరీరానికి అందం కోసం, సుగంధద్రవ్యాలు రాసుకుంటూ ఉంటాము. నిజానికి అవి శరీరానికి అందాన్ని ఇవ్వవనీ, పరులకు గొప్పగా ఉపకారం చేయడమే, మనిషికి నిజమైన అలంకారమనీ కవి తన అభిప్రాయం వెలిబుచ్చాడు.

ప్రశ్న 2.
రాజు ఏ విధంగా ప్రవర్తిస్తే, పనులు నెరవేరుతాయి ?
జవాబు:
రాజు తనకు తానుగా తన బుద్ధితో చక్కగా ఆలోచించి కార్య నిర్ణయం చేయాలి. అతనికి స్వయంగా మంచి బుద్ధి పుట్టాలి. అప్పుడే ఆయన పనులు నెరవేరతాయి.

ప్రశ్న 3.
దుర్యోధనుడు ఎట్లాంటివాడు ?
జవాబు:
దుర్యోధనుడికి తనకు తానుగా బుద్ధిలో ఆలోచన పుట్టదు. అతడు తన మిత్రులు సలహా ప్రకారమే నడచుకొనేవాడు. దుష్ట చతుష్టయము” అని పిలువబడే ఆ మిత్రుల సలహా సంప్రదింపుల ప్రకారమే, దుర్యోధనుడు నడచుకొనేవాడు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 50)

ప్రశ్న 1.
సజ్జనాప్తి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
జవాబు:
సజ్జనాప్తి వల్ల పేదవాడికి ధనతృష్ణ నశిస్తుంది.

ప్రశ్న 2.
ధనమువల్ల కలిగే దోషాలు ఏవి ?
జవాబు:
ధనము ఉంటే ధనం మీద అభిమానము, ఇంకా ధనం సంపాదించాలనే దురాశ పెరుగుతాయి. ధనము వల్ల మదము, అహంకారము పెరుగుతాయి. ధనతృష్ణ పెరిగితే, ధన సంపాదన కోసం తప్పుడు మార్గాలను మానవుడు అనుసరిస్తాడు. అవినీతికి పాల్పడుతాడు. సజ్జనులకు కష్టాలు కల్గిస్తాడు.

ప్రశ్న 3.
మనుషులు విషంతో నిండి ఉన్నారని అనడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు:
మనుషులు కామక్రోధలో భమదమోహమాత్సర్యములతో నిండి యున్నారని చెప్పడానికే, కవి మనుషులు విషంతో నిండియున్నారని చెప్పాడు. మనుషులలో స్వార్థం, అవినీతి, దుర్మార్గం, మోసం పెరిగిపోయాయని చెప్పడానికే, కవి మనుషులు విషంతో నిండియున్నారని చెప్పాడు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 51)

ప్రశ్న 1.
ఇంట్లో బాధలు కలగడానికి గల కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
సహజంగా ఇళ్ళల్లో అత్తాకోడళ్ళ విషయంలో కొన్ని బాధలు వస్తూ ఉంటాయి.

  1. వచ్చిన కోడలిని అత్తగారు తన కుమారుని భార్యగా ఆదరించకుండా, వేరింటి పిల్లగా చూడడం మొదటి కారణం.
  2. వచ్చిన కోడలు అత్తగారిని తన తల్లిగా చూడడం మాని, ఏదో రాక్షసిని చూసినట్లు చూడడం రెండో కారణం.
  3. కోడలు కట్న కానుకలను ఎక్కువగా తేలేదని, ఆమెను నిందించడం.
  4. కోడలి పుట్టింటి వారిని గూర్చి అగౌరవంగా మాట్లాడడం.
  5. ఇచ్చిన కట్నం చాలలేదనడం, మనవడే పుట్టాలనడం వంటి కారణాల వల్ల ఇంట్లో బాధలు కలుగుతాయి.

ప్రశ్న 2.
ఇతర మతస్థులతో కూడా ఎందుకు ప్రేమగా ఉండాలి ?
జవాబు:
ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. అన్ని మతాలూ దైవాన్ని గురించి ఒకే మాట చెపుతున్నాయి. భగవంతుడిని ప్రేమించాలని ఆయనే సర్వానికీ కారణమనీ, అన్ని మతాలూ చెపుతున్నాయి.

అన్ని మతాలు చెప్పేది ఒకటే కనుక, ఇతర మతస్థులతో కూడా మనం ప్రేమగా ఉండాలి. ఇతర మతస్థులను మన అన్నదమ్ముల వంటి వారిగా ఆదరిస్తే, మత కలహాలు, కొట్లాటలు లేక ప్రపంచం శాంతి ధామం అవుతుంది.

ప్రశ్న 3.
‘శాంతి’ అంటే ఏమిటి? ఇది నేడు ఎందుకు కనుమరుగైపోయింది ?
జవాబు:
‘శాంతి’ అంటే కామక్రోధాది షడ్గుణాలు లేకపోవడం. ‘శాంతి’ అంటే ప్రేమ, సహనము, ఆదరము. నేడు కులమత కలహాల వల్ల, ఉన్నదానితో సంతృప్తి లేకపోవడం వల్ల, అవినీతి, లంచగొండితనం, అక్రమ పరిపాలనల వల్ల, అశాంతి పెరిగింది. మనుష్యులలో మానవత్వం నశించి, దానవత్వం ప్రబలింది. అన్ని ప్రాణులనూ తనలాగే చూస్తే, శాంతి వర్ధిల్లుతుంది.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి.

అ) “సమాజానికి మార్గనిర్దేశనం చేసేవాళ్ళు శతకకవులు” చర్చించండి.
జవాబు:
శతకకవులు తమ శతకాలను తమకు గల ఎంతో అనుభవంతో, తమకు కలిగిన పుస్తక జ్ఞానంతో, దృష్టాంతాలతో, నీతులతో రాస్తారు. కాబట్టి శతకాలలో ముఖ్యంగా నీతి శతకాల్లో శతకకవులు చెప్పిన నీతులు సమాజానికి చక్కని మార్గాన్ని నిర్దేశిస్తాయి.

ఉదాహరణకు మనం చదివిన శతక పద్యాలు చూద్దాం.

  1. అందె వేంకటరాజం గారు, నింబగిరి శతకంలో కోడలిని కూతురుగా చూడాలని, కార్మికులను కర్మశాలల్లో భాగస్థులను చేయాలని, దళితులను సోదరులుగా చూడాలని, ఇతర మతాల వారిని తమ వారిగా ప్రేమించాలని చెప్పి, సమాజానికి మంచి మార్గాన్ని చూపించారు.
  2. అలాగే కాళహస్తీశ్వర శతకంలో పరుల సొమ్మును ఆశించి మనుష్యులు చేసే చెడ్డపనులను గూర్చి చెప్పారు. పరద్రవ్యమును ఆశించి, ఆ చెడ్డపనులు చేయరాదని ధూర్జటి ఆ విధంగా సమాజానికి హితాన్ని బోధించాడు.
  3. మల్ల భూపాలీయంలో చెవికి శాస్త్రజ్ఞానము, చేతికి దానము, శరీరానికి పరోపకారము ముఖ్యాలంకారాలని కవి చెప్పాడు.
  4. రాజుకు సరైన ఆలోచన మనస్సులో పుట్టడం ముఖ్యమని భాస్కర శతక కర్త చెప్పాడు. దీనిని బట్టి శతకకవులు సమాజానికి మార్గనిర్దేశకులు అన్న మాట సత్యము.

ప్రశ్న 2.
పాఠంలోని పద్యాలలో కింది భావాలకు తగిన పద్య పాదాలను గుర్తించండి.

అ) “సూర్యచంద్రులు గతిదప్పినా”
జవాబు:
“జలజాతప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్” అనేది, పై భావాన్ని ఇచ్చే పద్యపాదము.

ఆ) ‘మొదటిదైన ధనం పేదకు ఉండదు’
జవాబు:
‘తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు’ – అనేది, పై భావాన్ని ఇచ్చే శతక పద్యపాదము.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ఇ) ‘అన్ని జీవులను తనలాగే ఆదరిస్తే’
జవాబు:
‘’అఖిల జీవుల తనవోలె నాదరింప’ – అనేది, పై భావాన్ని ఇచ్చే శతక పద్యపాదము.

ప్రశ్న 3.
కింది పద్యాలను పాద భంగము లేకుండా పూరించండి. వాటి భావం రాయండి.

అ) కులశైలంబులు ………………. సర్వేశ్వరా!
జవాబు:
“కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునం గూలినన్
జలధుల్ మేరల నాక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్,
జలజాతప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్!
దలకం డుబ్బఁడు చొప్పుదప్పుఁడు భవద్భక్తుండు సర్వేశ్వరా !

భావం : ఓ సర్వేశ్వరా! కుల పర్వతాలు స్థిరత్వాన్ని తప్పి పెల్లగిలి దిగంతముల వద్ద పడిపోయినా, సముద్రాలు హద్దులను అతిక్రమించి పైకి నెట్టబడి ఉప్పొంగినా, సూర్య చంద్రులు తిరుగవలసిన రీతిగా తిరగడం మానినా నీ భక్తుడు చలించడు. పొంగిపోడు. తన పద్దతిని తప్పడు.

ఆ) ధనము, ధనాభిమానము, ………. శ్రియఃపతీ !
జవాబు:
ధనము, ధనాభిమానము, సదాధనతృష్ణయు మూడు దోషముల్
ధనికున కందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్
ధనికుని కంటె పేదకడు ధన్యుడు, యాతని తృష్ణ సజ్జనా
ప్తిని శమియించు వేంకటపతీ! అఖిలాండపతీ! శ్రియఃపతీ !

భావం : ఓ వేంకటపతీ! బ్రహ్మాండాధిపతీ! లక్ష్మీనాథా! ధనమూ, ధనముపై అభిమానమూ, ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే కోరికా అనే మూడు దోషాలూ ధనవంతుడికి ఉంటాయి. కాని పేదవాడికి అందులో ధనము అనే దోషం ఉండదు. పేదవాడికి ధనాశ ఉన్నా మంచివారికి దగ్గర ఉండడం వల్ల అతడిలో ధనాశ పోతుంది. కాబట్టి పేదవాడు ధనికుని కంటె ధన్యుడు.

ప్రశ్న 4.
కింది పద్యాన్ని చదువండి.

సీ|| కోపంబు చే నరుల్ క్రూరాత్ములగుదురు
కోపంబు మనుషుల కొంప ముంచు
కోపంబు వలననె పాపంబులును హెచ్చు
కోపంబుననె నింద గూడ వచ్చు
కోపంబు తన చావు కొంచెంబు నెరుగదు
కోపంబు మిత్రులన్ కొంచెపరుచు

కోపంబు హెచ్చినన్ శాపంబులున్ వచ్చు
కోపంబు జూడగా కొరివి యగును
తే॥ కోపము నరుని సాంతము కూల్చును భువి
లేదు వెదికిన యిటువంటి చేదు ఫలము
వినుడి మాయప్ప శిద్దప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప
– ప్రసిద్ధి రామప్పవరకవి (సిద్దప్ప), కరీంనగర్ జిల్లా.

పై పద్యం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.

అ) కవి చేదు ఫలమని దేనిని అన్నాడు ?
ఎ) వేపపండు
బి) కోపం
సి) పాపం
డి) కాకరపండు
జవాబు:
బి) కోపం

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ఆ) కోపం ఎక్కువైతే వచ్చే ఫలితం ?
ఎ) శాపం
బి) పాపం
సి) నింద
డి) కొరివి
జవాబు:
ఎ) శాపం

ఇ) కోపంచేత మనుషులు ఎట్లా మారుతారు ?
ఎ) పాపాత్ములు
బి) దురాత్ములు
సి) నీచాత్ములు
డి) క్రూరాత్ములు
జవాబు:
డి) క్రూరాత్ములు

ఈ) ‘సొంతం’ అను పదం అర్థమేమిటి?
ఎ) కొంత
బి) మొత్తం
సి) సగం
డి) శూన్యం
జవాబు:
బి) మొత్తం

ఉ) కోపం ఎవరి కొంప ముంచుతుంది ?
ఎ) మనుషుల
బి) మంచివారి
సి) దుర్మార్గుల
డి) నీచుల
జవాబు:
ఎ) మనుషుల

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ధనతృష్ణ ఎప్పుడు నశిస్తుందో వివరించండి.
జవాబు:
ధనతృష్ణ సజ్జనాప్తిచే నశిస్తుంది. సజ్జనాప్తి అంటే సత్పురుష సహవాసం. శంకరాచార్యులవారు భజగోవింద శ్లోకాలలో, సత్సంగత్వం వల్ల నిస్సంగత్వము, నిస్సంగత్వము వల్ల నిర్మోహత్వము ఏర్పడుతాయని చెప్పారు.

ధనముపై దురాశ అంత తేలికగా నశించదు. మంచివారితో కలియడం వల్ల, వారి మంచి మాటల వల్ల క్రమంగా ధనముపై దురాశ పోతుంది. చనిపోయినపుడు మనం సంపాదించిన ద్రవ్యం, మన వెంటరాదని, మనం చేసుకున్న పుణ్యపాపకర్మల ఫలమే, మన వెంట వస్తుందనీ, సజ్జన సహవాసం వల్ల తెలుస్తుంది. దాని వల్ల ధనతృష్ణ క్రమంగా నశిస్తుంది.

ఆ) మనిషికి నిజమైన అందాన్ని ఇచ్చేవి ఏవి ?
జవాబు:
చెవులకు శాస్త్ర పాండిత్యము అందాన్ని ఇస్తుంది. కుండలాలు చెవులకు అందాన్ని ఇవ్వవు. చేతులకు దానము అందాన్ని ఇస్తుంది. చేతులకు కంకణాలు అందాన్ని ఇవ్వవు. శరీరానికి పరోపకారమే అందాన్ని ఇస్తుంది. శరీరానికి సుగంధలేపనాలు, అందాన్ని ఇవ్వవు. శాస్త్ర పాండిత్యము, దానము, పరోపకారము అనేవి మనిషికి నిజమైన అందాన్నిస్తాయి.

ఇ) ఆపదలు రాకుండా ఉండాలంటే ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలి ?
జవాబు:
ఆపదలు రాకుండా ఉండాలంటే, మన ప్రవర్తనలో మార్పులు రావాలి.

  1. కోడలిని కూతురివలె చూడాలి.
  2. కార్మికులను కర్మశాలల్లో భాగస్థులను చేయాలి.
  3. దళితులను తన సోదరుల వలె మన్నించాలి.
  4. పరమతస్థులను తనవారివలె ప్రేమించాలి.
  5. జీవులందరినీ తనవలె చూసుకొని, ప్రేమతో ఆదరించాలి.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ఈ) “ధనవంతునికంటే కూడా పేదవాడు గొప్పవాడు.” దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
ధనవంతుడిలో సామాన్యంగా ఈ కింది మూడు దోషాలు ఉంటాయి.

  1. ధనము,
  2. ధనాభిమానము,
  3. ధనతృష్ణ.

ఇందులో పేదవాడికి ధనము ఉండదు. కాబట్టి పేదవాడికి ‘ధనము’ అనే దోషం అతడిలో ఉండదు – ధనవంతుడిలో ఉండే ధనతృష్ణ అనే దోషము పేదవాడికి సజ్జన సహవాసం చేత పోతుంది. అందువల్ల పేదవాడిలో ధనము, ధనతృష్ణ అనే రెండు దోషాలు ఉండవు. అందుచేతనే ధనికుని కంటే పేదవాడు గొప్పవాడని చెప్పాలి.

ధనము ఉన్న కొద్దీ, ఇంకా సంపాదించాలనే దురాశ పెరుగుతుంది. ఆ ధనాన్ని ఎలా వృద్ధి చేయాలా ? అనే చింత పట్టుకుంటుంది. ఆ ధనాన్ని ఎలా దాచాలా అనే విచారం కలుగుతుంది. ఆ విచారంతో ధనవంతుడు ఎ.సి గదుల్లో కూడా హాయిగా నిద్రపోలేడు.

పేదవాడికి ధనం పోతుందనే విచారం లేదు. అందువల్ల ధనికుని కంటే పేదవాడు గొప్ప అని నా అభిప్రాయం.

ప్రశ్న 2.
కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) ‘శతక పద్యాలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి – విమర్శిస్తాయి’ వివరించండి.
జవాబు:
సామాన్యంగా శతకకవులు తన కాలం నాటి సంఘంలోని మంచి చెడులను గూర్చి తమ పద్యాలలో చెపుతారు. ఆ కవులు నాటి సంఘంలోని దురాచారాల్ని ఎత్తి చూపి విమర్శిస్తారు. నీతి మార్గాన్ని సంఘానికి బోధిస్తారు. మన శతకపద్యాల్లో ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతక పద్యంలో నాటి సంఘంలోని మనుష్యులు, పరద్రవ్యాన్ని ఆశించి ఎలా బ్రతుకుతున్నారో చెప్పాడు.

పరద్రవ్యాన్ని ఆశించి జోస్యాలు చెప్పడం, అబద్ధాలాడడం, వంకర మార్గంలో కీర్తిని సాధించే ప్రయత్నం చేయడం, చాడీలు చెప్పడం, హింసను ప్రేరేపించడం వంటి పనులు చేస్తున్నారని చెప్పాడు. ఇది ధూర్జటి కాలం నాటి సమాజ ప్రతిబింబం అనడంలో వివాదం అక్కరలేదు.

అలాగే అందె వేంకటరాజంగారు ఇంట్లో అత్తాకోడళ్ళ పోరాటాలు, కర్మశాలలో అలజడులు, దళితుల పట్ల అగ్రవర్ణాల అరాచకాలు, మతహింస వంటి, నేటి సమాజంలోని లోపాలను ఎత్తిచూపి, వాటిని పరిహరించే మార్గాలను కూడా ఉపదేశించారు. ఈ పద్యం నేటి సమాజానికి చక్కని ప్రతిబింబం.

ఈశ్వరుడు విషాన్ని మింగడం గొప్పకాదనీ, నేటి మనుష్యులలోని విషాన్ని పోగొట్టమనీ రాజరాజేశ్వర శతక పద్యంలో కవి చెప్పారు. నేటి మనుష్యులలో అవినీతి, లంచగొండితనం, దురాచారాలు వంటి విషం పెరిగి పోయిందని, కవి ఈనాటి సంఘాన్ని గురించి దీనిలో విమర్శించారు. కాబట్టి శతక పద్యాలు, సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయనీ, విమర్శిస్తాయనీ చెప్పడం యథార్థము.

ప్రశ్న 3.
కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) పాఠంలోని మీకు నచ్చిన పద్య భావాల్ని ఆధారంగా చేసుకొని ఒక కథను రాయండి.
జవాబు:

తీరని రుక్కు కోరిక

‘రుక్కు’ గారి భర్త, రైల్వేలో ఏదో పనిచేసేవాడు. రుక్కుగారి పెద్దకొడుకు కంప్యూటర్ ఇంజనీరు. రుక్కుగారు పెద్దకొడుక్కి మూడేళ్ళ కితం పెళ్ళయింది. ప్రస్తుతం రుక్కుగార్కి ఏడాది దాటిన మనవడు ఉన్నాడు. రుక్కుగారి కోడలు కూడా కంప్యూటర్ బి.టెక్ చదివింది. రుక్కుగార్కి మరో కొడుకు ఉన్నాడు. కాని ఎడ్రస్ లేదు. పెద్ద కొడుకు చేత హైదరాబాద్లో బ్యాంకు లోను పెట్టించి, రుక్కు మూడు బెడ్రూమ్ల ఇల్లు కొనిపించింది. రుక్కుగారి భర్త ఈ మధ్యనే రిటైరయ్యాడు. రుక్కుగార్కి హైదరాబాద్ వెళ్ళి కోడలుపై పెత్తనం చేస్తూ కొడుకు డబ్బును అంతా తానే మేనేజ్ చేయ్యాలని పెద్ద ఆశ. రుక్కుకు ఇంకెక్కడా ఇల్లు లేదు. మొగుడికి ఏదో కొద్దిపాటి పెన్షను రావచ్చు. కోడలును తన గుప్పిట్లో పెట్టి నలిపేస్తూ, మనవడిని తన ఇష్టం వచ్చినట్లు పెంచాలని రుక్కుగారి ఉబలాటం. రుక్కుకు కూతురు లేదు. రుక్కుకు తన మాట ఇంట్లో సాగకపోతే, ఏడుపు వస్తుంది.

‘రుక్కు’ తన ఇంటికి వచ్చినప్పుడల్లా పెంట పెడుతుంది. ఇప్పుడు పర్మనెంటుగా మొగుడిని వెంట పెట్టుకొని హైదరాబాద్ వస్తే ఏం అల్లరిచేస్తుందో అని రుక్కు కోడలుకు గుండె గుబగుబలాడుతోంది. రుక్కు మొగుడు పాపం పెంపుడు కుక్క పిల్లలాంటివాడు. నోట్లో నాలుక లేదు. “అద్దె ఇంట్లో మనమిద్దరం హాయిగా ఉందాం. హైదరాబాద్ వద్దు. అన్నాడు రుక్కుతో ఆమె భర్త. రుక్కుకు చాలా కోపం వచ్చింది. ఏడ్చింది. రుక్కుకు జోస్యాల మీద మంచి నమ్మకం. ఒక మఠంలో సన్యాసి రుక్కు హైదరాబాద్ వెళ్ళడం మంచిది కాదని జోస్యం చెప్పాడు. పాపం రుక్కుకు కోడల్ని ఎలా సతాయించాలో అర్థం కాలేదు. కొడుకు కూడా రుక్కును రావద్దన్నాడు. జోస్యం అల్లాగే ఉంది. రుక్కు కోరిక తీరే మార్గం ఇప్పట్లో లేనట్లే.

(లేదా)

ఆ) పాఠంలోని పద్యభావాల ఆధారంగా విద్యార్థులలో నీతి, విలువల పట్ల అవగాహన పెంచటానికై ఒక కరపత్రాన్ని తయారు చేయండి.
జవాబు:
‘విద్యార్థులు – నీతినియమాలు’

విద్యార్థి సోదరులారా! దైవభక్తి కలిగి ఉండండి. ఐశ్వర్యం శాశ్వతం కాదు. ధనం కోసం అబద్ధాలాడకండి. ర్యాంకుల కోసం తప్పుడుదారులు తొక్కకండి. తోడి పిల్లలపై కొండెములు చెప్పి, హింసను ప్రేరేపించకండి. సిరి శాశ్వతం కాదు. వేషభాషలపై వెర్రితనం మంచిది కాదు. విద్య ప్రధానము. అలంకారాలు ముఖ్యం కాదు. పరోపకారమే విద్యార్థులకు నిజమైన అలంకారం అని తెలుసుకోండి.

మీరు కార్యాన్ని సాధించాలంటే బాగా బుద్ధి పెట్టి ఆలోచన చెయ్యండి. ఇతరుల సలహాలపై ముందుకు సాగకండి. ధనముపై దురాశ పెంచుకోకండి. మన చుట్టూ మనుష్యులలో విషం ఉన్న వాళ్ళున్నారు. వారి విషయంలో జాగ్రత్తపడండి.

మీ దళిత మిత్రులను సోదరులుగా చూడండి. పరమతాల వారిని ప్రేమించండి. జీవులందరినీ మీలాగే చూడండి. గురువుల మాటలను తలదాల్చండి. శాంతి, సత్యము, అహింసలకు ప్రధాన స్థానమియ్యండి. ఇది కరపత్రం కాదు. భగవద్గీత అని నమ్మండి.

ఇట్లు,
విద్యార్థి మిత్రులు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

III. భాషాంశాలు

పదజాలం

1. కింది పదాలకు అర్థాలు రాస్తూ, సొంతవాక్యాలు రాయండి.

ఉదా : ఆపద = కష్టం
వాక్యప్రయోగం : ఆపదలు వచ్చినపుడు ఓర్పుతో, ఉపాయంతో వ్యవహరించాలి.

అ) నిక్క = నిజము
వాక్యప్రయోగం : సర్వకాలములయందు భగవంతుని ముందు నిక్కం మాట్లాడాలి.

ఆ) ఒజ్జ = గురువు
వాక్యప్రయోగం : శిష్యులకు ఒజ్జలమాటలు శిరోధార్యములు.

ఇ) తృష్ణ = దప్పి, పేరాస
వాక్యప్రయోగం : ధనతృష్ణ మానవులకు సర్వానర్ధదాయకము.

ఈ) విభూషణం = ఆభరణము
వాక్యప్రయోగం : నేటికాలంలో యువతకు విద్యయే విభూషణం.

2. కింది పదాలకు పర్యాయపదాలు రాసి, వాటితో వాక్యాలు రాయండి.

ఉదా : కూతురు : పుత్రిక, కుమార్తె
వాక్యప్రయోగము : జనకుని పుత్రిక సీతాదేవి, ఈ కుమార్తె వలన జనకుడు పరమానందాన్ని పొందాడు.

అ) తృష్ణ :

  1. దప్పిక
  2. దప్పి
  3. పిపాస

వాక్యప్రయోగము : వేసవి తాపం వల్ల దప్పిక పెరిగింది. పిపాస తీరాలంటే నిమ్మ నీరు త్రాగాలి.

ఆ) సజ్జనుడు :

  1. సత్పురుషుడు
  2. సుజనుడు

వాక్యప్రయోగము : సుజనుడికి లోకమంతా మంచిగానే కన్పిస్తుంది. ఆ సత్పురుషుడు లోకానికి మంచి మార్గాన్ని చూపిస్తాడు.

ఇ) మహి :

  1. భూమి
  2. ధరణి
  3. వసుధ

వాక్యప్రయోగము : భూమిపై పచ్చనిచెట్లు లేవు. ధరణి అంతా నిర్జీవంగా కనిపిస్తోంది.

ఈ) శైలము :

  1. పర్వతము
  2. అద్రి
  3. గిరి

వాక్యప్రయోగము : గిరి పుత్రిక పార్వతి పర్వతమును ఎక్కుతోంది.

3. కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాల్లోని ప్రకృతి – వికృతుల్ని గుర్తించండి. వాటి కింద గీత గీయండి.

అ) ప్రతి మనిషికి తెలియకుండా దోషం చేయడం తప్పుకాదేమో కాని తెలిసి దోసం చేయడం తప్పు.
జవాబు:
ప్రతి మనిషికి తెలియకుండా దోషం చేయడం తప్పుకాదేమో కాని తెలిసి దోసం చేయడం తప్పు.

ఆ) సింహం వేట ద్వారా ఆహారాన్ని పొందుతుంది. కానీ ఆకలి వేసినప్పుడే సింగం వేటాడుతుంది.
జవాబు:
సింహం వేట ద్వారా ఆహారాన్ని పొందుతుంది. కానీ ఆకలి వేసినపుడే సింగం వేటాడుతుంది.

ఇ) ఏ కార్యమైనా శ్రమిస్తేనే పూర్తి చేయగలం. కాని కర్ణం నిర్వహించే తీరు తెలియాలి.
జవాబు:
ఏ కార్యమైనా శ్రమిస్తేనే పూర్తి చేయగలం. కాని కర్ణం నిర్వహించే తీరు తెలియాలి.

ఈ) కలహం ఏర్పడినపుడు శాంతం వహిస్తే, కయ్యం నెయ్యంగా మారుతుంది.
జవాబు:
కలహం ఏర్పడినపుడు శాంతం వహిస్తే, కయ్యం నెయ్యంగా మారుతుంది.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

వ్యాకరణాంశాలు

1. కింది పదాలను విడదీయండి. సంధుల పేర్లు గుర్తించి రాయండి.

అ) కలహాగ్నులు = కలహ + అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి
ఆ) వేంకటేశ్వరా = వేంకట + ఈశ్వరా = గుణసంధి
ఇ) కుండలమొప్పు = కుండలము + ఒప్పు = ఉత్వసంధి
ఈ) యోధులనేకులు = యోధులు + అనేకులు = ఉత్వసంధి

2. కింది సమాసపదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేర్లు రాయండి.

అ) కార్యదక్షుడు – కార్యమునందు దక్షుడు – సప్తమీ తత్పురుష సమాసం
ఆ) మూడుదోషాలు – మూడైన దోషాలు – ద్విగు సమాసం
ఇ) కర్మశాల – కర్మము కొఱకు శాల – చతుర్థీ తత్పురుష సమాసం
ఈ) ఆశాపాశం – ఆశ అనె పాశం – రూపక సమాసం

3. కింది పద్యపాదాలు పరిశీలించి, గణవిభజన చేసి, గణాలు గుర్తించి, ఏ పద్యపాదమో రాయండి.

అ) ధనము, ధనాభిమానము, సదా ధనతృష్ణయు మూడు దోషముల్
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 9
పై పాదంలో న, జ, భ, జ, జ, జ, ర గణాలున్నాయి. కాబట్టి ఇది ‘చంపకమాల’ పద్యపాదం.

ఆ) భూపతికాత్మబుద్ధి మదిఁబుట్టనిచోటఁ బ్రధానులెంత ప్రజ్ఞా…..
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 10
పై పాదంలో భ, ర, న, భ, భ, ర వ గణాలున్నాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ పద్యపాదం.

సరళాదేశ సంధి

కింది పదాలు చదువండి. పదంలోని చివరి అక్షరం కింద గీతలు గీయండి.
ఉదా : 1) పూచెను
2) చూసెను
3) వచ్చెను
4) తినెను
5) చేసెన్
6) నడిచెన్
7) వెళ్ళెన్
జవాబు:
1) పూచెను
2) చూసెను
3) వచ్చెను
4) తినెను
5) చేసెన్
6) నడిచెన్
7) వెళ్ళెన్ ………..

పై పదాలను గమనిస్తే, ఆ పదాల చివర ను, న్ లు కనిపిస్తాయి. అంటే పదాల చివర ‘న’ కారం ఉన్నది. ఈ ‘న’ కారాన్ని ద్రుతం అంటారు. ద్రుతం (న) చివరగల పదాలను ‘ద్రుత ప్రకృతికాలు’ అంటారు. కావున చూచెను, పూచెను, తినెను, చేసెన్, నడిచెన్ మొదలైన పదాలు ద్రుతప్రకృతికాలే.

అభ్యాసము : మీరు కూడా మరికొన్ని ద్రుతప్రకృతిక పదాలు రాయండి.

  1. చేసెను
  2. వ్రాసెను
  3. వచ్చుచున్
  4. నాకొఱకున్
  5. నాయందున్

కింది వాటిని పరిశీలించండి.

అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు
ఈ) పాటిన్ + తప్ప = పాటిన్ + దప్ప
ఉ) వడిన్ + పట్టి = వడిన్ + బట్టి

పై పదాలను పరిశీలిస్తే

‘న్’ కు ‘క’ పరమైతే ‘క’ – ‘గ’ గా మారుతుంది.
”న్’ కు – ‘చూ’ పరమైతే ‘చూ’ – ‘జూ’ గా మారుతుంది.
‘న్’ కు ‘ట’ పరమైతే ‘ట’ – ‘డ’ గా మారుతుంది.
‘న్’ కు ‘త’ పరమైతే, ‘త’ – ‘ద’ గా మారుతుంది.
‘న్’ కు – ‘ప’ పరమైతే, ‘ప’ – ‘బ’ గా మారుతుంది.
అంటే
క → గ
చ → ‘జ’
ట → ‘డ’
త → ‘ద’
ప → ‘ఐ’ లుగా మారాయి
క, చ, ట, త, ప – లకు వ్యాకరణ పరిభాషలో పరుషాలని పేరు.
గ, జ, డ, ద, బ – లకు వ్యాకరణ పరిభాషలో సరళాలని పేరు.

పై ఉదాహరణలలోని భావాన్ని బట్టి సూత్రీకరిస్తే,

సూత్రము : ద్రుత ప్రకృతికాలకు పరుషాలు లు పరమైతే ఆ పరుషాలు సరళాలుగా మారుతాయి.

ఇప్పుడు కింది ఉదాహరణలను పరిశీలించండి.
పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 11
పై ఉదాహరణ ఆధారంగా సంధి జరిగిన విధానాన్ని సూత్రీకరిస్తే

సూత్రము : ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

4. కింది సంధి పదాలను విడదీసి, ద్రుత ప్రకృతిక సంధి లక్షణాలను పరిశీలించండి.

అ) గురువులఁగాంచి = గురువులన్ + కాంచి – గురువులఁగాంచి; గురువులం గాంచి ; గురువులన్గాంచి
ఆ) ఎక్కువగఁజొప్పడ = ఎక్కువగన్ + చొప్పడ – ఎక్కువగఁజొప్పడ ; ఎక్కువగంజొప్పడ ; ఎక్కువగన్జప్పడ
ఇ) తలఁదాల్చి = తలన్ + తాల్చి – తలదాల్చి ; తలం దాల్చి ; తలన్దాల్చి
ఈ) చెవికింగుండలంబు = చెవికిన్ + కుండలంబు – చెవికిఁగుండలంబు ; చెవికి౦గుండలంబు ; చెవికిన్గు౦డలంబు

శార్దూలం

కింది రెండు పద్యపాదాలను గణవిభజన చేసి పరిశీలిద్దాం!

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 12

గమనిక :

  1. పై పద్యపాదంలో వరుసగా మ, స, జ, స, త, త, గ గణాలు వచ్చాయి.
  2. పద్యానికి నాలుగు పాదాలున్నాయి.
  3. ప్రతి పాదంలో రెండవ అక్షరంగా ‘శ’ ఉన్నది. అంటే ప్రాస నియమం కలిగి ఉంది.
  4. 13వ అక్షరంతో యతి మైత్రి (నా 5) ప్రతి పాదంలో 19 అక్షరాలున్నాయి.

పై లక్షణాలు గల పద్యం “శార్దూలం”.

మత్తేభం

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 13

పై పద్యపాదాన్ని పరిశీలిస్తే

  1. దీనిలో వరుసగా స, భ, ర, న, మ, య, వ గణాలు వచ్చాయి.
  2. పద్యానికి నాలుగు పాదాలున్నాయి. ప్రతిపాదంలో ‘వ’ రెండవ అక్షరంగా ఉండి ప్రాసనియమం కలిగి ఉన్నది.
  3. 14వ అక్షరం యతి మైత్రి (చె – చే) చెల్లుతుంది.
  4. ప్రతిపాదంలో 20 అక్షరాలున్నాయి.
  5. ఈ లక్షణాలు గల పద్యం “మత్తేభం”.

ఈ పాఠ్యాంశంలోని ఐదు, ఏడు పద్యాలకు గణవిభజన చేసి అవి ఏ పద్యపాదాలో తెలుపండి.
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 14

గమనిక :

  1. పై పాదంలో న, జ, భ, జ, జ, జ, ర గణాలున్నాయి.
  2. కాబట్టి ఇది చంపకమాల పద్యపాదము.
  3. యతి 11వ అక్షరము (ధ-దా) లకు.

7వ పద్యం :

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 15

గమనిక :
1) పై ఏడవ పద్యపాదంలో వరుసగా 6 ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు క్రమంగా వచ్చాయి. కాబట్టి ఇది ‘సీస
పద్యపాదము’
1, 3 గణాద్యక్షరాలకు యతి కూకో
5, 7 గణాద్యక్షరాలకు యతి మం – మం

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

ప్రాజెక్టు పని

మీ పాఠశాలలోని గ్రంథాలయాన్ని సందర్శించి శతకపద్యాల పుస్తకాలను పరిశీలించి, మీకు నచ్చిన ఏవేని ఐదు పద్యాలు సేకరించి, వాటికి భావాలు రాయండి. నివేదిక రాసి, ప్రదర్శించండి.

ప్రశ్న 1.
సిరిలేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుధుండౌదలన్
గురుపాదానతి కేలనీగి చెవులందు న్విన్కి వక్త్రంబునన్
స్థిరసత్యోక్తి భుజంబులన్విజయమున్జిత్తం బునన్సన్మనో
హర సౌజన్యము గల్గిన న్సురభిమల్లా! నీతివాచస్పతీ!

భావం : నీతిలో బృహస్పతి వంటివాడా! సురభిమల్లా! తలకు, గురుపాదాలకు పెట్టే నమస్కారం, చేతులకు త్యాగం, చెవులకు మంచి వినే గుణం ఉండాలి. నోటికి సత్యవాక్కు ఉండాలి. బాహువులకు విజయం, మనసుకు మంచితనం ఉండాలి. అలాంటి పండితుడు సంపదలేకపోయినా ప్రకాశిస్తాడు.

ప్రశ్న 2.
బీదలకన్న వస్త్రములు పేర్మినొసంగుము తుచ్ఛసౌఖ్యసం
పాదనకై యబద్ధముల బల్కకు, వాదములాడబోకు, మ
ర్యాదనతిక్రమింపకు, పరస్పరమైత్రి మెలంగు, మిట్టివౌ
వేదములంచెరుంగుము, వివేకధనంబిదినమ్ముచిత్తమా!

భావం : ఓ మనసా ! బీదవారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి. నీచమైన సౌఖ్యాల కోసం అబద్ధాలు చెప్పకు. తగవులు పెట్టుకోకు. మర్యాదను మీరకు. ఒకరితో ఒకరు స్నేహంగా ఉండాలి. ఇటువంటివే జీవన వేదాలని తెలుసుకో. వివేకమనే ధనం ఇదే కదా !

ప్రశ్న 3.
పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండిపుడిచ్చినంతలోఁ
దిట్టక దీనదేహులను తేటగ లాలనజేసి, యన్నమున్
పెట్టు వివేకి మానసముఁ బెంపొనరించుచు నూరకుండినన్
గుట్టుగ లక్ష్మిఁబొందుఁ; దరిగొండనృసింహ! దయాపయోనిధీ!

భావం : దయా సముద్రుడా ! తరిగొండ నరసింహస్వామీ ! ఈశ్వరుడు పట్టుదలతో తన పక్షం వహించి ప్రసాదించిన సంపదలో శక్తిమేరకు పేదవారికి పెట్టాలి. అలాగే పేదలను నిందించకుండా అన్నం పెట్టిన వానికి మనస్సుకు ఆనందం కలుగుతుంది. ప్రయత్నించకపోయినా సంపద చేరుతుంది.

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

I

1వ పద్యం: (కంఠస్థ పద్యం)

మ॥ “కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునం గూలినన్
జలధుల్ మేరల నాక్రమించి సముదంచదృంగి నుప్పొంగినన్,
జలజాతప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్
దలకం డుబ్బఁడు చొప్పుదప్పుఁడు భవద్భక్తుండు సర్వేశ్వరా!

ప్రతిపదార్థం :

సర్వేశ్వరా = ఓ సర్వేశ్వర స్వామీ !
కులశైలంబులు = కులపర్వతాలు (సప్తకుల పర్వతాలు)
పాదు = ఆశ్రయము (స్థిరత్వము)
పెల్లగిలి = పెల్లగింపబడి (ఉన్మూలితమై)
దిక్కులంబునన్
(దిక్ + కూలంబునన్ = దిక్కుల ఒడ్డున (దగ్గర)
కూలినన్ = కూలిపోయినప్పటికీ
జలధుల్ = సముద్రములు
మేరలన్ = హద్దులను (చెలియలికట్టలను)
ఆక్రమించి = అతిక్రమించి
సముదంచద్భంగిన్
(సముదంచత్ + భంగిన్)
సముదంచత్ = అధికంగా పైకినెట్టబడిన
భంగిన్ = విధముగా
ఉప్పొంగినన్ = మిక్కిలి పొంగినా
జలజాతప్రియ శీతభానులు ;
జలజాతప్రియ = పద్మములకు ప్రియుడైన సూర్యుడును
శీతభానులు = చల్లని కిరణములు గల చంద్రుడునూ
యథాసంచారముల్ = (వారు) సంచరింపవలసిన తీరుగా సంచరించడం (తిరుగవలసిన రీతిగా తిరగడం)
తప్పినన్ = మరచిపోయినా
భవద్భక్తుండు
(భవత్ + భక్తుండు) = నీ భక్తుడు
తలకండు = చలించడు;
ఉబ్బడు = పొంగిపోడు;
చొప్పు = పద్ధతిని
తప్పడు = దాటడు; (విడిచిపెట్టడు)

భావం : ఓ సర్వేశ్వరా ! కుల పర్వతాలు స్థిరత్వాన్ని తప్పి పెల్లగిలి దిగంతముల వద్ద పడిపోయినా, సముద్రాలు హద్దులను అతిక్రమించి, పైకి నెట్టబడి ఉప్పొంగినా, సూర్యచంద్రులు తిరుగవలసిన రీతిగా తిరగడం మానినా, నీ భక్తుడు చలించడు. పొంగిపోడు. తన పద్ధతిని తప్పడు.

విశేషములు :
1) కులపర్వతాలు ఏడు అవి :

  1. మహేంద్రము
  2. మలయము
  3. సహ్యము
  4. శక్తిమంతము
  5. గంధమాదనము
  6. వింధ్యము
  7. పారియాత్రము

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

2వ పద్యం : (కంఠస్థ పద్యం)

శా॥ జాతుల్ సెప్పుట, సేవ చేయుట మృషల్ సంధించు టన్యాయ వి
ఖ్యాతిం బొందుట కొండెకాఁ డవుట హింసారంభకుం డౌట మి
ధ్యాతాత్పర్యము లాడు టన్నియుఁ బరద్రవ్యంబు నాశించి యీ
శ్రీ తా నెన్ని యుగంబు లుండఁ గలదో శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం :

శ్రీకాళహస్తీశ్వరా = శ్రీకాళహస్తిలో వెలసిన ఈశ్వరా!
జాతుల సెప్పుట
(జాతుల్ + చెప్పుట) = జాతకాలు చెప్పడమూ,
సేవచేయుట = రాజులకు కాని, ఇతరులకు కాని సేవ చేయడము
మృషల్ = అసత్యములు
సంధించుట = కూర్చుటయు; (మాట్లాడడమూ)
అన్యాయవిఖ్యాతిన్;
అన్యాయ = అన్యాయ మార్గములో
విఖ్యాతిన్ = కీర్తిని
పొందుట = పొందడమూ
కొండెకాడు = కొండెములు చెప్పేవాడు (ఒకరిమీద చాడీలు చెప్పేవాడు)
అవుట = అవడమూ, (కావడం)
హింసారంభకుండు
(హింసా + ఆరంభకుండు) = హింసా ప్రయత్నము చేసేవాడు
జౌట = అగుటయూ (కావడమూ)
మిధ్యా తాత్పర్యములు = అసత్యమైన భావములు
ఆడుట = చెప్పడమూ;
అన్నియున్ = ఈ పైన చెప్పిన అన్ని పనులునూ
పరద్రవ్యంబున్ = ఇతరుల ధనాన్ని
ఆశించి = చేజిక్కించుకోవాలనే ఆశ చేతనే కదా!
ఈ శ్రీ = ఇలా సంపాదించిన ధనము
తాను = తాను
ఎన్నియుగంబులు = ఎన్ని యుగాలకాలముపాటు
ఉండగలదో = నిలిచి యుంటుందో! (ఎవ్వరికీ తెలియదు)

భావం : ఓ శ్రీకాళహస్తీశ్వరా! లోకములోని మనుష్యులు, జాతకములు చెప్పడమూ, ఇతరులకు సేవలు చేయడమూ, అసత్యము లాడడమూ, అన్యాయంగా కీర్తిని సంపాదించడమూ, చాడీలు చెప్పడమూ, హింసా ప్రయత్నం చేయడమూ, అనవసర అర్థాలు చెప్పడమూ వంటి పనులు చేస్తూ, తాము ఇతరుల ధనాన్ని ఆశిస్తున్నారు. కాని ఇలా సంపాదించిన ధనం, ‘ఎంతకాలం నిలుస్తుంది ? (ఎంతోకాలం నిలబడదని భావం.)

II

3వ పద్యం : (కంఠస్థ పద్యం)

మ॥ చెవికిం గుండల మొప్పుగాడు శ్రుతమే, చేదమ్మికిన్గంకణం
బు విభూషాఢ్యము గాదు దానమె మహిన్బుణ్యాత్మునెమ్మేనికిన్
బ్రవిలేపంబులు గావు సొమ్ములుపకారప్రౌఢియే నిక్కమౌ
లవితేంద్రాతిగ వైభవా! సురభిమల్లా! నీతివాచస్పతీ!

ప్రతిపదార్థం :

లవితేంద్రాతి వైభవా !
లవిత (లలిత) = సుందరుడైన
ఇంద్ర = ఇంద్రుడి
అతిగ = అతిక్రమించిన (మించిన)
వైభవా = వైభవము గలవాడా!
నీతివాచస్పతీ = నీతి శాస్త్రమునందు దేవతలకు గురువైన బృహస్పతి వంటి వాడా!
సురభి మల్లా = ఓ సురభిమల్ల భూపాలుడా!
చెవికిన్ = చెవులకు
శ్రుతమే (శ్రుతము +ఏ) = శాస్త్రపాండిత్యమే కానీ,
కుండలము = కుండలములు ధరించడం
ఒప్పుగాదు (ఒప్పు + కాదు) = అందము కాదు
చేదమ్మికిన్ = పద్మము వంటి చేతికి;
దానమే
(దానము + ఎ) = దానమే కాని
కంకణంబు = కంకణము
‘విభూషాఢ్యము
(విభూషా + ఆఢ్యము) = గొప్ప అలంకారము
కాదు = కాదు;
మహిన్ = భూమండలములో
పుణ్యాత్ము = పుణ్యాత్ముని యొక్క
నెమ్మేనికిన్
(నెఱి + మేనికిన్) = అందమైన శరీరానికి
ఉపకార ప్రౌఢియే = గొప్ప ఉపకారమే కాని
ప్రవిలేపంబులు = పూత పూసుకొనే సుగంధ ద్రవ్యములు
సొమ్ములు + కావు = ఆభరణములు కావు

భావం : వైభవంలో ఇంద్రుని మించినవాడా! నీతిలో బృహస్పతితో సమానమైన వాడా! ఓ సురభిమల్ల మహారాజా! చెవులకు శాస్త్రపాండిత్యమే అందంకాని, కుండలాలు కాదు. చేతులకు దానమే అందంకాని, కంకణాలు కాదు. శరీరానికి పరోపకారమే ఆభరణం కాని, సుగంధ విలేపనాలు కావు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

4వ పద్యం : (కంఠస్థ పద్యం)

ఉ॥ భూపతికాత్మబుద్ధి మదిఁబుట్టని చోటఁబ్రధానులెంత ప్ర
జ్ఞా పరిపూర్ణులైనఁ గొనసాగదు కార్యము కార్యదక్షులై
యోపిన ద్రోణ భీష్మకృప యోధులనేకులుఁ గూడి కౌరవ
క్ష్మాపతి కార్యమేమయినఁ జాలిరెచేయఁగ వారు భాస్కరా!

ప్రతిపదార్థం:

భాస్కరా = ఓ సూర్య భగవానుడా!
భూపతికిన్ = రాజునకు;
ఆత్మబుద్ధి = తన తెలివి
మదిన్ = మనస్సు నందు
పుట్టనిచోన్ = కలుగకున్న పక్షంలో
ప్రధానులు = (ఆ రాజుగారి) మంత్రులు
ఎంత = ఎంతయో
ప్రజ్ఞాపరిపూర్ణులు = గొప్పబుద్దితో నిండినవారు
ఐనన్ = అయినప్పటికీ
కార్యము = పని
కొనసాగదు = నెరవేరదు;
ఎట్లనన్ = ఎలా అంటే
కార్యదక్షులై = పనులయందు నేర్పరులైన
ద్రోణభీష్మకృప యోధులు ;
ద్రోణ = ద్రోణాచార్యులు
భీష్మ = భీష్ముడు
కృప = కృపాచార్యుడు మొదలయిన
యోధులు = వీరులు;
అనేకులు = అనేకమంది
కూడి = కలసి
కౌరవక్ష్మాపతికార్యము = కౌరవులకు రాజయిన దుర్యోధనుని పనిని; (యుద్ధ విజయాన్ని)
ఏమైనన్ = ఏ మాత్రమైనా
చేయగన్ = చేయడానికి
చాలిరె = సరిపోయినారా? (సరిపోలేదు)

భావం : భాస్కరా! రాజుకు సరైన ఆలోచన పుట్టనపుడు, మంత్రులు ఎంత తెలివి కలవారయినా, కార్యాన్ని నెరవేర్చలేరు. కార్యాలోచనలేని దుర్యోధనుడి పనులను, కార్యదక్షులైన ద్రోణ, భీష్మకృపాచార్యాది మహావీరులు, నెరవేర్పలేక పోయారు కదా!

విశేషము : దుర్యోధనుని పక్షంలో మహావీరులయిన భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు వంటి వారున్నా, దుర్యోధనుడికి యుద్ధ విజయాన్ని వారు తెచ్చిపెట్టలేకపోయారు.

III

5వ పద్యం : (కంఠస్థ పద్యం)

చం॥ ధనము, ధనాభిమానము, సదాధనతృష్ణయు మూడు దోషముల్
ధనికున కందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్
ధనికుని కంటె పేదకడు ధన్యుడు, యాతని తృష్ణ సజ్జనా
ప్తిని శమియించు వేంకటపతీ! అఖిలాండపతీ! శ్రియఃపతీ!

ప్రతిపదార్థం :

వేంకటపతి
అఖిలాండపతీ = ఓ వేంకటేశ్వరా!
(అఖిల + అండ, పతీ) = ఓ బ్రహ్మాండనాథా!
శ్రియఃపతీ = లక్ష్మీపతీ!
ధనమున్ = ధనమునూ
ధనాభిమానమున్
(ధన + అభిమానమున్) = ధనమునందు అభిమానమునూ
సదా = ఎల్లప్పుడునూ
తృష్ణయున్ = పేరాశయునూ (అనే); (ధనం సంపాదించాలనే కోరికయును)
మూడు దోషముల్ = మూడు దోషాలూ
ధనికునకున్ = ధనవంతుడికి (ఉంటాయి)
అందున్ = ఆ మూడు దోషాలయందు
తొల్తటిది = మొదటిది (అనగా ధనము)
పేదకున్ = బీదవానికి
లేదు = లేదు
అతని = ఆ పేదవాడి
తృష్ణ = ధనముపై పేరాశ
సజ్జనాప్తిని (సజ్జన + ఆప్తిని) = మంచివారితో కూడడం (సహవాసం) వల్ల
శమించున్ = శమిస్తుంది (నశిస్తుంది)
కావునన్ = కాబట్టి
ధనికుని కంటెన్ = ధనవంతుడి కన్నా
పేద = బీదవాడు
కడున్ = మిక్కిలి
ధన్యుడు = ధన్యాత్ముడు

భావం : ఓ వేంకటపతీ! బ్రహ్మాండాధిపతీ! లక్ష్మీనాథా! ధనమూ, ధనముపై అభిమానమూ, ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే కోరికా, అనే మూడు దోషాలూ ధనవంతుడికి ఉంటాయి. కాని పేదవాడికి అందులో ధనము అనే దోషం ఉండదు. పేదవాడికి ధనాశ ఉన్నా మంచివారికి దగ్గర ఉండడం వల్ల అతడిలో ఆ ధనాశ పోతుంది. కాబట్టి పేదవాడు ధనికుని కంటె ధన్యుడు.

6న పద్యం: (కంఠస్థ పద్యం)

మ॥ గరమున్ మ్రింగి హరించితిన్ సుజన దుఃఖమ్మంచు నీయాత్మలో
మురియంబోకు మనుష్యదుర్విషమునున్మూలింపుమా ముందు యీ
నరులందుండు విషమ్ము సూది విడనైనన్సంధి లేదో ప్రభూ
హర శ్రీవేములవాడ రాజఫణి హారా! రాజరాజేశ్వరా!

ప్రతిపదార్థం :

ఓ ప్రభూ = ఓ ప్రభువా!
హర = ఈశ్వరా
శ్రీవేములవాడ = సంపత్కరమైన వేములవాడ అనే పుణ్యక్షేత్రంలో వెలసిన
రాజఫణి, హారా = పెద్ద సర్పము కంఠహారంగా కలవాడా?
రాజరాజేశ్వరా = ఓ రాజరాజేశ్వర స్వామీ !
గరమున్ = కాలకూట విషాన్ని
మ్రింగి = మ్రింగి (తిని)
సుజన దుఃఖమ్మున్ = సత్పురుషులైన దేవతల దుఃఖాన్ని
హరించితిన్ = పోగొట్టాను
అంచున్ = అని
నీ యాత్మలోన్ (నీ + ఆత్మలోన్) = నీ మనస్సులో
మురియంబోకు = సంతోషపడవద్దు
ఈ నరులందున్ = ఈ మనుష్యులందు
ఉండు = ఉండే
విషమ్ము = విషము
సూదిన్ = సూదిని
ఇడనైనన్ = గ్రుచ్చడానికైనా
సంధిలేదు = సందులేదు
ముందు = ముందుగా
మనుష్యదుర్విషమున్ = మనుష్యులలో ఉన్న చెడ్డ విషాన్ని
ఉన్మూలింపుమా = నశించునట్లు చెయ్యి

భావం : సర్పరాజు వాసుకిని కంఠమున ధరించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామీ ! విషాన్ని మ్రింగి దేవతల దుఃఖాన్ని పోగొట్టానని నీలో నీవు మురిసిపోవద్దు. సూదిమొనకు కూడా చోటు లేనంతగా నిండిపోయిన ఆ మనుష్యులలోని భయంకరమైన విషాన్ని ముందుగా తొలగించు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

7వ పద్యం : (కంఠస్థ పద్యం)

సీ||
కూతురు చందాన కోడలిన్ జూచిన
మండునే ఘోరముల్ మందిరమున ?
కార్మిక జనుల భాగస్థులుగాఁ గాంచ
క్రమ్మునే అలజడుల్ కర్మశాల ?
దళితుల నిజ సహోదరులుగా మన్నించ
పుట్టునే ఉత్పాతములు జగాన?
పరమతస్థుల తమ వారిగా ప్రేమించ
రేగునే కలహాగ్నులాగడములు?
తేగీ॥
అఖిల జీవుల తనవోలె నాదరింప
ఉద్భవించునే యాపదలుర్వియందు?
వరశుభవిలాస | శ్రీనింబగిరి నివాస!
భవ్యగుణధామ ! నరసింహ! దివ్యనామ!

ప్రతిపదార్థం :

వరశుభవిలాస;
వర = శ్రేష్ఠమైన
శుభ = శుభాలతో
విలాస = అలరారే వాడా!
భవ్యగుణధామ;
భవ్య = శ్రేష్ఠమైన
గుణ = గుణాలకు
ధామ = నిలయమైనవాడా!
‘శ్రీ నింబగిరి నివాస;
శ్రీ = సంపత్కరమైన
నింబగిరి = నింబగిరియందు
నివాస = నివసించేవాడా?
దివ్యనామ = ఇంపయిన పేరుగలవాఁడా?
నరసింహ = ఓ నరసింహస్వామీ
కోడలిన్ = కోడలిని (కొడుకు భార్యను)
కూతురు చందానన్ = తన కూతురునువలె
చూచినన్ = చూచినట్లయితే
మందిరమునన్ = ఇంట్లో
ఘోరముల్ = భయంకరములైన సంఘటనలు (కోడలిని దహనం చేయడం, కొట్టడం, విషాన్ని త్రాగించడం వంటివి)
మండునే = చెలరేగుతాయా ?
కార్మిక జనులన్ = ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులను
భాగస్థులుగాన్ = (ఆ) ఫ్యాక్టరీ లాభనష్టాల్లో భాగము కలవారిగా
కాంచన్ = చూస్తే
కర్మశాలన్ = ఫ్యాక్టరీలో
అలజడుల్ = ఆందోళనలు (సమ్మెలు వగైరా)
క్రమ్మునే = వ్యాపిస్తాయా? (జరుగుతాయా?)
దళితులన్ = హరిజనులను
నిజసహోదరులుగాన్ = తన తోడబుట్టినవారిగా
మన్నించన్ = గౌరవిస్తే (ఆదరిస్తే)
జగానన్ = ప్రపంచంలో
ఉత్పాతములు = ఉపద్రవములు
పుట్టునే = కలుగుతాయా ?
పరమతస్థులన్ = = ఇతర మతాలవారిని
తమ వారిగా = తమకు కావలసిన వారిగా (తమ మతంలోని వారిగా)
ప్రేమించన్ = ప్రేమగా చూస్తే
కలహాగ్నులు
(కలహా + అగ్నులు) = కయ్యాలు అనే అగ్నిహోత్రములు
ఆగడములు = దౌష్ట్యములు (అన్యాయాలు)
రేగునే = విజృంభిస్తాయా? (పెరుగుతాయా?)
అఖిల జీవులన్ = అన్ని ప్రాణులనూ
తనవోలెన్ = తనవలెనే (ఆత్మవత్ సర్వభూతాని అన్న విధంగా)
ఆదరింపన్ = ప్రేమగా చూస్తే
ఉర్వియందున్ = భూమండలంలో
ఆపదలు = ఆపత్తులు
ఉద్భవించునే = సంభవిస్తాయా ? (సంభవింపవు)

భావం : నింబగిరిలో విలసిల్లే దేవా! శ్రేష్ఠమైన శుభాలతో ఒప్పేవాడా! అత్యుత్తమ గుణాలకు నిలయమైనవాడా! ఓ నరసింహదేవా! కోడలిని కూతురి మాదిరిగా చూస్తే, ఇంట్లో ఘోరాలు సంభవించవు. కార్మికులను భాగస్థులను చేస్తే, కర్మాగారంలో అల్లర్లు జరుగవు. దళితులను తన సొంత అన్నదమ్ముల్లాగా భావిస్తే, ప్రపంచంలో ఉపద్రవాలు పుట్టవు. ఇతర మతస్థులను తనవారిగా ప్రేమతో చూస్తే, కొట్లాటలు, ఆగడాలు పెరగవు. ప్రాణులనందరినీ తనవలె ఆదరంగా చూస్తే, భూమిమీద కష్టాలు పుట్టవు గదా!

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

8వ పద్యం : (కంఠస్థ పద్యం)

శా॥ ఆశాపాశ నిబద్ధుడై చెడక నిత్యంబోర్సుతో దేశికా
దేశంబుందలఁదాల్చి యోగ విధులర్డిన్ సల్పుచున్ భవ్యమౌ
నాశీర్వాదము వొజ్జచేఁ బడసితానందంగనౌ నంచితం
బౌశాంతంబును వచ్యుతార్చిత పదాబ్జా! చంద్రమౌళీశ్వరా!

ప్రతిపదార్థం:

అచ్యుతార్చితపదాబ్జా ;
అచ్యుత = శ్రీమహావిష్ణువు చేత
అర్చిత = పూజింపబడిన
పదాబ్జా (పద + అబ్జా) = పద్మములవంటి పాదములు
చంద్రమౌళీశ్వరా = చంద్రుడు శిరస్సున గల ఓ చంద్రమౌళీశ్వర స్వామీ !
ఆశాపాశ నిబద్ధుడై ;
ఆశాపాశ = ఆశలు అనే త్రాళ్ళచే
నిబద్ధుడై = కట్టబడినవాడై
చెడక = చెడిపోక
నిత్యంబు = ఎల్లప్పుడునూ
ఓర్పుతో = సహనముతో
దేశికాదేశంబున్ ;
దేశిక = గురువుగారి యొక్క
ఆదేశంబున్
తలదాల్చి
(తలన్ + తాల్చి) = శిరసావహించి
యోగవిధులు = యోగాభ్యాస విధులు (యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే అష్టాంగయోగ విధులు)
అర్థిన్ = ప్రీతితో
సల్పుచున్ = ఆచరిస్తూ
భవ్యమ్ = అనుకూలమైన
ఆశీర్వాదమున్ = ఆశీస్సును
ఒజ్జచేస్ = గురువుగారిచేత
పడసి = పొంది
(అంచితంబు + ఔ) = ఒప్పియున్న
తాన్ = తాను
అందంగనౌన్ = అందుకోగలడు (సంపాదించగలడు)

భావం : విష్ణువుచే పూజింపబడిన పాదపద్మాలు కలిగిన ఓ చంద్రమౌళీశ్వరా! ఆశ అనే పాశముచే బంధింపబడి, చెడిపోకుండా, ఎల్లప్పుడూ ఓర్పుతో గురువుగారి ఆదేశాలను తలదాల్చి, యోగాభ్యాస విధులను ఆచరిస్తూ, గురువుగారి దివ్యమైన ఆశీస్సును పొందినపుడే, శిష్యుడు శ్రేష్ఠమైన శాంతిని
పొందగలుగుతాడు.

పాఠం ఉద్దేశం

శతక పద్యాలు నైతికవిలువల్ని పెంపొందింపజేస్తాయి. భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాల ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే ఈ పాఠ్యం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం, శతక ప్రక్రియకు చెందినది. సాధారణంగా శతకపద్యాల్లో ప్రతిపద్యం చివర ‘మకుటం’ ఉంటుంది. శతక పద్యాలు ముక్తకాలు. అంటే ఏ పద్యానికదే స్వతంత్రభావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో మల్లభూపాలీయం, సర్వేశ్వర, భాస్కర, శ్రీకాళహస్తీశ్వరశతకం, ఉత్పలమాల, ఏకప్రాసశతపద్యమాలిక, నింబగిరి నరసింహ, చంద్రమౌళీశ్వర శతకాల పద్యాలున్నాయి.

కవుల పరిచయం

1) సర్వేశ్వర శతక కర్త :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 1

  1. యథావాక్కుల అన్నమయ్య.
  2. ఈయన కవితా శైలి ధారాళమైనది.
  3. ఈ సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యములో గొప్ప పేరున్నది. ఈయన కాలము 13వ శతాబ్దం.

2) శ్రీకాళహస్తీశ్వర శతక కర్త :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 2

  1. ధూర్జటి
  2. ఈయన కాలము 16వ శతాబ్దం.
  3. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో “ధూర్జటి” ఒకడు.
  4. రాజుల సేవను ఈయన ధైర్యంగా ధిక్కరించాడు.
  5. ఈయన కవిత్వాన్ని శ్రీకృష్ణదేవరాయలు, “అతులితమాధురీమహిమ” కలదిగా మెచ్చుకున్నాడు.
  6. ఈయన
    1. శ్రీకాళహస్తీశ్వర శతకం,
    2. శ్రీకాళహస్తి మాహాత్మ్యం అనే ప్రబంధాన్ని రాశాడు.

3) “మల్ల భూపాలీయం” నీతిశతక కర్త :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 3

  1. ఎలకూచి బాల సరస్వతి. కాలం 17వ శతాబ్దం.
  2. ఈయన నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలు సంస్థానంలో సురభి మాధవరాయల ఆస్థానకవి.
  3. ఈయన తెలుగులో మొదటి త్ర్యర్థి కావ్యం రాఘవ యాదవ పాండవీయంతో పాటు, 12 గ్రంథాలు రచించాడు.
  4. భర్తృహరి సుభాషిత త్రిశతిని, తెలుగులోనికి అనువదించిన వారిలో ఈయన మొదటివాడు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

4) భాస్కర శతక కర్త :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 4

  1. మారద వెంకయ్య. కాలం 17వ శతాబ్దం.
  2. ఈయన ‘భాస్కరా’ అనే మకుటంతో ఎన్నో నీతులను మనసుకు హత్తుకొనేటట్లు, తన పద్యధారను కొనసాగించాడు.

5) ఉత్పలమాల :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 5

  1. ఉత్పల సత్యనారాయణాచార్య
  2. జననం : 4-7-1928. మరణం : 23-10-2007,
  3. ఈయన ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతీయుడు.
  4. రసధ్వని, “ఈ జంటనగరాలు హేమంతశిశిరాలు,” గజేంద్రమోక్షం, భ్రమరగీతం, శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైనవి రాశాడు.

6) ఏకప్రాస శతపద్యమాలిక కర్త:
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 6

  1. గౌరీభట్ల రఘురామ శాస్త్రి
  2. జననం : 22-04-1929, మరణం : 4-2-2004.
  3. సిద్ధిపేట జిల్లాలో “రిమ్మనగూడ” ఈయన జన్మస్థానం.
  4. వ్యాసతాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణ దాసచరిత్రం, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక, శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర మొదలైనవి రచించారు.

TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ

7) నింబగిరి నరసింహ శతక కర్త:
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 7

  1. డా॥ అందె వేంకటరాజం
  2. జననం : 14-10-1933, మరణం : 11-09-2006. జన్మస్థలం : జగిత్యాల జిల్లా కోరుట్ల,
  3. రచనలు : నవోదయం, మణిమంజూష, కళాతపస్విని అనే పద్యకావ్యాలు, “భారతరాణి” నాటికల సంపుటి మొదలైనవి రాశాడు.
  4. బిరుదులు : కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన మొదలైనవి.

8) చంద్రమౌళీశ్వర శతక కర్త :
TS 9th Class Telugu Guide 5th Lesson శతక మధురిమ 8

  1. ఇమ్మడిజెట్టి చంద్రయ్య. నాగర్ కర్నూల్ జిల్లా “తాళ్లపల్లి” జన్మస్థలం.
  2. జననం : 31-03-1934. మరణం : 11-03-2001
  3. రచనలు :
    1. హనుమద్రామ సంగ్రామం, భక్తసిరియాళ, వీరబ్రహ్మేంద్ర విలాసం అనే హరికథలు, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం మొదలైనవి.

ప్రవేశిక

పద్య ప్రక్రియలో శతకం ఒక విభాగం. నీతినీ, జీవిత అనుభవాలనూ, భక్తినీ, వైరాగ్యాన్నీ శతకపద్యాలలో కవులు రాశారు. ఈ శతక పద్యాలు, నైతిక విలువలను పెంపొందిస్తూ, రసానుభూతిని కలిగిస్తాయి. ఇటువంటి కొన్ని శతక పద్యాలను మనం చదువుదాం.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 3rd Lesson వలసకూలీ Textbook Questions and Answers.

TS 9th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వలసకూలీ

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 25)

ఊరిలో నీకిల్లు లేదు – ఊరి వెలుపల పొలము లేదు
కూలి నిర్ణయ మింతని లేదు – కూలి పని స్థిరమైనది కాదు
ఆలుపిల్లల నేలేదెట్లా – అనే చింత నిన్నిడదోయి వ్యవసాయకూలి.
బతుకు దెరువు లేక నీవు – భార్యపిల్లల నొదిలి పెట్టి
బస్తి చేరి రిక్షలాగి – బలముగ జ్వరమొచ్చి పంటే
కాస్త నీకు గంజినీళ్ళు – కాసి పోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి.
– సుద్దాల హనుమంతు

ప్రశ్న 1.
ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి ? రాసింది ఎవరు ?
జవాబు:
ఈ పంక్తులు వ్యవసాయ కూలీలను గూర్చి తెలుపుతున్నాయి. ఈ గేయాన్ని “సుద్దాల హనుమంతు” రాశాడు.

ప్రశ్న 2.
కూలిపని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థమేమిటి ?
జవాబు:
‘కూలిపని’ అంటే ఏ రోజుకు ఆ రోజు, ఎవరికైనా ఏదో పని చేసిపెట్టి, ఆ చేసిన పనికి కూలి తీసుకోవడం. ఈ పని ఉద్యోగంలా స్థిరమైనది కాదు. ప్రతిరోజూ కూలిపని ఎక్కడ దొరకుతుందో. అని వెతుక్కోవాలి. ఒక్కొక్క రోజు ఏ పనీ దొరకదు. వర్షం వచ్చిన రోజున ఎవరూ కూలిపని చెప్పరు. కూలిపని కోసం నిత్యం వేటాడాలి.

ఒకరోజు పని ఉంటుంది. మరొకరోజు ఏ పనీ ఉండదు. లేదా ఏ రిక్షాయో అద్దెకు తీసుకుని దాన్ని తొక్కుతూ జీవనం సాగించాలి. అందుకే కూలిపని స్థిరమైనది కాదు.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది ?
జవాబు:
కూలిపని దొరికితే, వచ్చిన కొద్ది డబ్బుతో ఏదోరకంగా సంసారం నడుపుకుంటారు. డబ్బు లేనప్పుడు అప్పులు చేస్తారు. ఋణాలు తీసుకుంటారు. ఏమీ దొరకకపోతే, కాసిని మంచినీళ్ళు తాగి, కడుపులో కాళ్ళు పెట్టుకొని ముడుచుకొని పడుకుంటారు. లేదా, ఏ రిక్షాయో తొక్కి దానితో వచ్చిన కొద్దిపాటి డబ్బుల్లో రిక్షా అద్దె కట్టి, మిగిలినది ఉంటే దానితో బతకాలి.

ప్రశ్న 4.
ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితులేవి ?
జవాబు:
తాము ఉంటున్న ఊళ్ళలో సరైన వ్యవసాయపనులు, తమ వృత్తిపనులు లేకపోవడం వల్ల, నగరాల్లో కూలి చేసుకొని బ్రతకవచ్చని గ్రామీణ జనం, తమ ఊర్లు వదలి నగరాలకు పోతారు.

వర్షాలు లేకపోతే వ్యవసాయపనులు గ్రామాల్లో దొరకవు. వ్యవసాయ ఆదాయం లేకపోతే, పెద్ద రైతులు చేతివృత్తులవారికి తగిన పనులు చూపించలేరు. అలాగే కొందరు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడానికి నగరాలకు వలసపోతారు. పిల్లల చదువుల కోసం కోందరు గ్రామాలు వదలి నగరాలకు వెడతారు. గ్రామాల్లో ఉపాధి సౌకర్యాలు బొత్తిగా లేకపోవడం వల్లనే ప్రజలు ఊళ్ళు వదలి పోతున్నారు.

ఆలోచించండి – చెప్పండి. (Textbook Page No. 27)

ప్రశ్న 1.
‘గొడ్ల డొక్కలు గుంజడం’ అంటే మీకు ఏమి అర్థమైంది ?
జవాబు:
గొడ్లు అంటే పశువులు. ‘డొక్కలు గుంజడం’ అంటే వాటి పొట్టలు తిండిలేక లోపలకు నొక్కుకుపోవడం. పశువులకు తిండిలేక వాటి శరీరాలు ఎండిపోయి, వాటి డొక్కలు లోపలకు దిగిపోయాయన్నమాట. ఆ పాలమూరు జిల్లాలో వర్షాలు లేనందున, ప్రజలకు తిండి, పశువులకు గ్రాసం లేకపోయిందని నాకు అర్థమయ్యింది.

ప్రశ్న 2.
కోస్తా ప్రాంతానికి ఎవరు, ఎందుకు వెళ్ళారు ?
జవాబు:
కోస్తా ప్రాంతానికి పాలమూరు జిల్లాలోని కూలీలతో పాటు, ఒక జాలరి వెళ్ళాడు. పాలమూరు ప్రాంతంలో వర్షాలు లేవు. కృష్ణాష్టమి వెళ్ళిపోయింది. పశువులకు ఆహారం లేదు. వాగుల్లో నీళ్ళులేక వానపాములు సైతం ఎండిపోయాయి. చెరువులు, కుంటలు బీటలు తీశాయి. వానపడుతుందన్న ఆశ లేకపోయింది. ఆ పరిస్థితుల్లో, కోస్తా దేశంలో కూలి ఎక్కువగా దొరుకుతుందని, కూలి పని చేసుకొనేవారు, కోస్తా ప్రాంతానికి వెళ్ళిపోయారు.

ప్రశ్న 3.
పల్లెబతుకుల కష్టానికి కారణం ఏమిటి ?
జవాబు:
పల్లెల్లో ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ‘ జీవిస్తారు. పశువుల పాడిపై ఆధారపడతారు. వర్షాలు పడకపోతే, వ్యవసాయం పనులుండవు.. పశువులకు మేత దొరకదు. కూలివారికి కూలిపనులు దొరకవు. మొత్తంపై వర్షాలు లేక, వ్యవసాయం పనులు లేకపోవడం, వ్యవసాయం వల్ల, పాడిపంటల వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉండడం, అనేవే పల్లె బ్రతుకుల కష్టాలకు కారణాలు.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

ఆలోచించండి – చెప్పండి’ (Textbook Page No. 28)

ప్రశ్న 1.
కృష్ణా ఆనకట్టను కట్టకపోవటానికి, పాలమూరు జనం కూలీలుగా మారడానికి గల సంబంధం ఏమై ఉంటుంది ?
జవాబు:
కృష్ణానదిపై ఎగువన ఆనకట్ట కడితే, ఆ నీళ్ళు మహబూబ్ నగర్ జిల్లా పంటపొలాలకు అందుతాయి. ఆ నీళ్ళు లభ్యమైతే, ఆ పాలమూరు జిల్లా ప్రజలు వర్షాధారంగా జీవించవలసిన పనిలేదు. హాయిగా కృష్ణాజలాలతో తమ పొలాల్లో పంటలు పండించు కోవచ్చు. ప్రస్తుతం ఆ ఆనకట్ట నిర్మించనందువల్ల, వర్షాలు లేకపోవడం వల్ల, పాలమూరు జనం కూలీలుగా మారిపోయి యుంటారు.

ప్రశ్న 2.
‘చీకు మబ్బుల ముసురులో కార్తీకపున్నం వెళ్ళి పోయిందని’ కవి ఎందుకు ఆవేదన చెందాడు ?
జవాబు:
సామాన్యంగా వర్షాలు శ్రావణ భాద్రపద మాసాల్లో ఎక్కువగా పడతాయి. కార్తీక పౌర్ణమి వచ్చే నాటికి వర్షాలు పూర్తిగా వెనుకపడతాయి. కార్తీక పౌర్ణమి వెళ్ళిపోయిందంటే, ఇంక ఆ సంవత్సరానికి వర్షాలు లేనట్లే లెక్క

ఇక చీకు మబ్బుల ముసురు సంగతి చూద్దాము. ఆ ప్రాంతంలో మబ్బులు ముసురుకున్నాయి. కాని అవి- చీకుమబ్బులు. అంటే చితికిపోయిన చిన్న చిన్న మబ్బులు అన్నమాట. దట్టమైన నల్లని మబ్బులు కావు. అందువల్ల చిన్న చిన్న జల్లులు తప్ప, పెద్ద వర్షం పడలేదన్నమాట.

అంతవరకూ పెద్ద వర్షం లేదు. కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఆ సంవత్సరం వర్షం పడదు. అందుకే సరియైన వర్షం రాలేదని కవి ఆవేదన పడ్డాడు.

ఇవి చేయండి

I అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
ఒక ప్రాంతంలోని జనం ఇతర ప్రాంతాలకు ఎందుకు వలసలు వెళతారు? దీనిని అరికట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది? చర్చించండి.
జవాబు:
ఒక ప్రాంతంలోని జనం, ఆ ప్రాంతంలో వారు జీవించడానికి అనువయిన పరిస్థితులు లేనపుడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వారి జీవనానికి అనువైన మరో ప్రాంతానికి వలసవెడుతూ ఉంటారు.

  1. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురియక, తినడానికి తిండి, త్రాగడానికి నీరు దొరకదు. త్రాగేనీరు సహితం వారు కొనవలసి వస్తుంది. ఆ పరిస్థితుల్లో జనం వలసలు పోతారు.
  2. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయపనులు లేక, జీవనాధారం లేక, మరో ఉద్యోగం సంపాదించే సావకాశం లేక, ఏదైనా పని చేసుకొని బ్రతుకవచ్చనే ఆశతో, నగరాలకు వలసపోతారు.
  3. తాము నివసించే ప్రాంతాలలో విద్యా వైద్య, ప్రయాణ సౌకర్యాలు లేక, ఆ సదుపాయాల కోసం జనం వలసలు పోతారు. ముఖ్యంగా జనం, జీవనభృతి కోసం, అది సంపాదించగల ప్రాంతాలకు వలసలు పోతుంటారు. వలసలు నిరోధించాలంటే, ప్రజలకు కావలసిన అన్ని సదుపాయాలు గ్రామ ప్రాంతాల్లోనే దొరికేలా ప్రభుత్వాలు చర్యలు తీసికోవాలి. కూలీలకు వ్యవసాయపనులు లేనపుడు, పనికి ఆహారపథకం వంటి పథకాల ద్వారా, ప్రజలకు పనులు చూపించాలి. గ్రామాల్లో సాగునీటి, త్రాగునీటి సదుపాయాలు కల్పించాలి.

ప్రశ్న 2.
పాఠం చదువండి. ‘అంత్యానుప్రాస’ పదాలు రాయండి.
జవాబు:

  1. ఎన్నడొస్తవు లేబరీ
    పాలమూరి జాలరీ !
  2. గొడ్ల డొక్కలు గుంజినా
    వానపాములు ఎండినా
  3. సరళా సాగరం నిండేది కాదని
    కోయిల సాగరం నిండేది కాదని
  4. గుడిసెకు విసిరి పోతివా
    నడుం చుట్టుక పోతివా
  5. మరిగి రాకనె పోతివా
    చారు మరిచే పోతివా
  6. కర్మ మెందుకు
    వేయ నందుకు
  7. మొక్కుతు పోతివా
    కోస్తదేశం పోతివా

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణం శాతవాహనుల కాలం కంటే ముందునుంచే ఉన్నప్పటికీ కాకతీయుల కాలంలో ఉన్నతదశకు చేరుకుంది. ఆ తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానాధీశులు, తెలంగాణలో చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధిపరిచి, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. తర్వాత కాలంలో ఈ చెరువుల వ్యవస్థ సరైన నిర్మాణానికి నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది.

దీనివలన స్వయంపోషక గ్రామాలుగా ఉన్న తెలంగాణ గ్రామాలు కరవు పీడిత గ్రామాలుగా మారాయి. ఈ పరిణామం కూడా వలసలకు కారణమైంది. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పొట్టచేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలసపోయారు. తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధిస్తే, ప్రజలకు ఉపాధి దొరికి, వలసలు ఆగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడానికి ‘మిషన్ కాకతీయ’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.

ప్రశ్నలు :

అ) పై పేరా దేని గురించి చెప్తున్నది ?
జవాబు:
పై పేరా తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం గురించి చెప్తున్నది.

ఆ) ‘మిషన్ కాకతీయ’ అంటే ఏమిటి ?
జవాబు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి ‘మిషన్ కాకతీయ’ అని పేరు పెట్టింది.

ఇ) తెలంగాణ ప్రజలు ఎందుకు వలసలు వెళ్ళుతున్నారు?
జవాబు:
తెలంగాణలో చెరువుల వ్యవస్థ కాలక్రమంలో సరైన నిర్మాణానికి నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది. దానితో తెలంగాణ గ్రామాలు కరవుపీడిత గ్రామాలుగా మారడంతో, తెలంగాణ ప్రజలు వలసలు వెడుతున్నారు.

ఈ) వలసలు ఆగిపోవడానికి చేపట్టవలసిన చర్యలేవి?
జవాబు:
తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా, వ్యవసాయాభివృద్ధి సాధిస్తే ప్రజలకు ఉపాధి దొరికి, వలసలు ఆగిపోతాయి.

ఉ) చెరువుల అభివృద్ధి కోసం కృషిచేసిన వారెవరు?
జవాబు:
చెరువుల అభివృద్ధి కోసం కాకతీయులు, కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానాధీశులు కృషిచేశారు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ముకురాల రామారెడ్డి పాట విన్నారు కదా! దీని ఆధారంగా పాలమూరు కూలీ జీవితం ఎట్లా ఉండేదో ఊహించి రాయండి.
జవాబు:
పాలమూరులో కూలీలకు పని దొరికేదికాదు. కనీసం వారికి తిండి ఉండేది కాదు. త్రాగడానికి నీరు కూడా దొరికేది కాదు. ఆ ప్రాంతంలోని భూస్వాములకు వ్యవసాయం చేసేందుకు సాగునీటి సౌకర్యం లేదు. వర్షాలు లేవు. దానితో కూలీలు తిండిలేక, పస్తులు పడుకోవలసి వచ్చేది. వారి పిల్లలకు చదువు సంధ్యలు లేవు. వారికి జబ్బుచేస్తే మందులు వేసికోడానికి కూడా డబ్బులు వారి వద్ద ఉండేవి కావు. అందుకే వారు కూలీ దొరికే ప్రాంతాలకు వలసలు పోయేవారు.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

ఆ) ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. అలాంటి గ్రామాల నుండి ప్రజలు ఎందుకు వలసలు పోతున్నారు?
జవాబు:
గ్రామాల్లో పూర్వము పెద్ద పెద్ద భూస్వాములు ఉండేవారు. పెద్ద పెద్ద వ్యవసాయ చెరువులు, ఆ చెరువుల నుండి పొలాలకు సాగునీరు లభించేది. దానితో గ్రామాల్లో పని కావలననే రైతు కూలీలందరికీ పని దొరికేది. ఇప్పుడు పెద్ద భూస్వాములు లేరు. పిల్లలకు భూములు పంచడంతో అవి చిన్న చిన్న భూకమతాలుగా మారాయి. ఆ చిన్నరైతులు వ్యవసాయ కూలీలకు 365 రోజులూ ఉపాధిని చూపించలేరు.

చిన్న రైతులకే సంవత్సరం పొడుగునా పని ఉండదు. యంత్రాలు అమల్లోకి వచ్చాయి. దానితో కూలీల అవసరం తగ్గింది. గ్రామాల్లో కూలీల పిల్లలకు, విద్యా వైద్య ఉపాధి సౌకర్యాలు అంతగా లేవు.

గ్రామాల్లో ఉన్న యువకులు తమ జీవనభృతిని సంపాదించుకోగల పరిస్థితులు గ్రామాల్లో నేడు లేవు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమితో వారికి కావలసిన సదుపాయాలు లభించడంలేదు. వ్యవసాయదారులకు ప్రభుత్వ సహాయం ఉండడం లేదు.

అందువల్ల పిల్లలకు ఉద్యోగసంపాదనకు తగిన చదువులు చెప్పించడానికీ, తమ పిల్లలు మంచి ఉద్యోగాలు పొందడానికీ, తాము సుఖంగా జీవితాలు గడపడానికీ, ప్రజలు గ్రామాలు విడిచి, నగరాలకు వలసలు పోతున్నారు.

గ్రామాల్లో 24 గంటలూ విద్యుచ్ఛక్తి సౌకర్యం ఉండడం లేదు. గ్రామాల్లోని వృత్తి పనివారలకు నగరాల్లో చక్కని జీవనభృతి లభిస్తోంది. భవన నిర్మాణ కార్మికులకు నగరాల్లో 365 రోజులూ పని దొరుకుతోంది.

పై కారణాల వల్లనే నేడు గ్రామాల నుండి ప్రజలు నగరాలకు వలసలు పోతున్నారు.

ఇ) “ఎప్పుడొస్తవు లేబరీ, పాలమూరి జాలరీ” అని అనడంలో కవి ఉద్దేశాన్ని రాయండి.
జవాబు:
‘లేబరీ’ అంటే పనిచేసుకొని జీవించే కూలివాడు అని అర్థము. ఈ పాటలో కూలి, జాలరివాడు. అంటే చేపలు పట్టుకొని వాటిని అమ్ముకొని జీవించేవాడు. పాలమూరు ప్రాంతాల్లో వాగులు, వంకలూ ఎండిపోయాయి. దానితో ఈ జాలరికి చేపలు పట్టుకొనే పనిలేకుండా పోయింది.

కోస్తా ప్రాంతంలో సముద్రం ఉంటుంది. అక్కడి జాలర్లు పడవలపై సముద్రంలోకి నైలాన్ వలలతో చేపల వేటకు వెడతారు. అందుకే ఈ పాలమూరి జాలరి ఇక్కడ తనకు పనిలేక, కోస్తా బెస్తల పడవల్లో లేబరీగా మారాడు. అందుకే కవి జాలరిని, ఎప్పుడొస్తవు లేబరీ అని రాశాడు.

ఈ) గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి ఎప్పుడు దొరుకుతుంది ?
జవాబు:
గ్రామాల్లోని పంటచేలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తే గ్రామాల్లోని బీడు భూములన్నీ చక్కని పంటపొలాలుగా మారుతాయి. అప్పుడు గ్రామాల్లో ప్రజలందరికీ చేసుకోడానికి పని దొరుకుతుంది. గ్రామాల్లోని పూర్వం చెరువులన్నింటినీ పునరుద్ధరించాలి. పంటలు బాగా పండితే, ప్రజలు మంచి గృహాలు నిర్మించుకుంటారు. అప్పుడు వృత్తిపనివారలకు అందరికీ మంచి ఉపాధి దొరుకుతుంది. గ్రామాల్లో విద్యా వైద్య రవాణా సౌకర్యాలు కల్పిస్తే, గ్రామాల్లో ఉపాధి సౌకర్యాలు పెరుగుతాయి. అప్పుడు ఎక్కువమందికి ఉపాధి దొరుకుతుంది.

గ్రామాల్లో వ్యవసాయానికి తోడు అనుబంధ పరిశ్రమలు ప్రారంభించాలి. ముఖ్యంగా పాడి పరిశ్రమను గ్రామాల్లో ప్రోత్సహించాలి. కోళ్ళు, మేకలు, గొట్టెలు వంటివాటిని పెంచాలి. సేంద్రియ ఎరువులను తయారుచేసే యూనిట్లు ప్రారంభించాలి. గ్రామాలను స్వయంపోషకంగా తయారుచేయాలి. యువకులకు గ్రామాల్లో లఘు పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి చూపించాలి. గ్రామాల్లో ఉపాధి పుష్కలంగా లభించేటట్లు ప్రభుత్వం కృషిచేయాలి.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “వలసకూలీ” గురించి కవి ఆవేదనను మీ సొంతమాటల్లో రాయండి.
‘వలసకూలీ’ గేయ సారాంశాన్ని రాయండి.
(లేదా)
జవాబు:
ఓ పాలమూరి జాలరీ ! కూలి ఎక్కువ ఇస్తారని, కోస్తా దేశం వెళ్ళావా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?
గోకులాష్టమి వెళ్ళిపోయింది. పశువులు డొక్కలు ఎండిపోయాయి. వాగులలో, వంకలలో వానపాములు సైతం ఎండిపోయాయి. చెరువులు, కుంటలు బీటలు తీశాయి. అయినా చినుకుపడే ఆశలేదని కోస్తా దేశం వెళ్ళావా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?

వానపడదు. సరళా కోయిల సాగరాలు నిండనే నిండవు. చౌట మడుగులు ఎండిపోయాయి. పైరులు వరుగులయ్యాయి. పల్లెల్లో బతకడం ఎలాగా అనీ, కూలి బాగా ఇస్తారనీ, కోస్తాకు వలసపోయావా !
ఓ జాలరీ ! నావ, గాలం గుడిసెలో పడేసి నైలాను వల తీసుకొని, మన్నెంకొండ దేవుడు వేంకటేశ్వరుడికి మొక్కుతూ, కోస్తాకు వెళ్ళావా ! తిరిగి ఎప్పుడొస్తావు ?

మెరిగె, బొచ్చె చేపలకు అలవాటుపడి, చందమామల, పరకపిల్లల చారు మరిచిపోయావా ! కోస్తా బెస్తల పడవల్లో కూలీగా పనిచేసే కర్మ నీకు కృష్ణా ఎగువ ఆనకట్ట కట్టకపోడం వల్లనే కదా !

నీవు తిరిగి ఇంటికి వస్తానన్న గడువు దాటి వారాలయ్యింది. కార్తీక పౌర్ణమి వెళ్ళింది. ఇక్కడ నుండి వెళ్ళిన జనం అంతా చచ్చే కాలం వచ్చిందన్నట్లు, జలపిడుగు భద్రాచలం మెట్లు తాకిందట. ఎక్కడున్నావు ? ఎప్పుడొస్తావు ?

(లేదా)

ఆ) వలసకూలీల బతుకుల్లో వెలుగులు నింపడానికి ఎట్లాంటి చర్యలు అవసరమో వివరించండి.
జవాబు:
వలసకూలీలు సామాన్యంగా గ్రామీణప్రాంతాల నుండి నగరాలకు వస్తూ ఉంటారు.

  1. వలసకూలీలకు గ్రామాల్లో ఉన్న రేషనుకార్డులు, పింఛన్లు వంటి సదుపాయాలన్నీ, వలసకు వారు వచ్చిన నగర ప్రాంతాల్లో కూడా కల్పించాలి.
  2. వలసకూలీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారికి ఇళ్ళు కట్టించి ఉచితంగా ఇవ్వాలి.
  3. వలసకూలీలందరికీ నగరాల్లో పట్టణ ఉపాధి పథకాల ద్వారా పనులు చూపించాలి. రెవెన్యూ అధికారులు వలస కూలీలకు రేషన్కార్డులు ఇచ్చి, వారికి చౌకగా బియ్యం, పంచదార వంటి వస్తువులు ఇప్పించాలి.
  4. వలసకూలీల పిల్లలకు, విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి.
  5. నగరాల్లో వలసకూలీలు ప్రయాణం చేయడానికి సిటీబస్సుల్లో కన్సెషన్ టిక్కెట్లు ఇవ్వాలి.
  6. ప్రభుత్వం చేయించే పనులలో వలసకూలీలకు పనిలో ప్రాధాన్యం ఇవ్వాలి. వలసకూలీల కాలనీల్లో రోడ్లు, మంచినీటి కుళాయిలు వగైరా సదుపాయాలు కల్పించాలి.
  7. వలసకూలీలు తమ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడానికి కనీసం ఏడాదిలో రెండుసార్లు ప్రయాణ సదుపాయాలు ఏర్పాటుచేయాలి.
  8. వలసకూలీల కష్ట సుఖాలను మునిసిపల్ కౌన్సిలర్సు తెలిసికొని, ప్రభుత్వాధికారులకు తెలియజేయాలి. వలస కూలీలు నగరాల్లో స్వేచ్ఛగా జీవించేందుకు కావలసిన ఏర్పాట్లు ప్రభుత్వం కలుగజెయ్యాలి.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) శ్రమజీవులైన కూలీలు పనిదొరకక పొట్టచేత పట్టుకొని వలసపోతున్నారు. వారి జీవనాన్ని ఊహిస్తూ ఒక కవిత/గేయం రాయండి.
జవాబు:
కూలీ గొప్పగ ముట్టుతుందని
నగర మార్గమై సాధనమ్మని
గ్రామం విడిచి పట్నవాసము
దారి పడితివి అయ్యోపాపము !

ఉన్న ఊరిలో పనులు లేవయా
కన్న తల్లిని విడిచి నావయా.
అమ్మా నాన్నలు దూరమయ్యిరీ
బంధు లందరూ నిన్ను విడిచిరీ

తిండి కోసమీ తిప్పలు తప్పవు
నగరములో మరి పనులు దొరకెనా ?
కడుపు నిండుగా తిండి దొరకెనా ?
ఉండడానికి ఇల్లు దొరకెనా ?

రోడ్డు పక్కనే చోటు దొరకెనా
అమ్మా నాన్నలు గుర్తుకొచ్చిరా
భార్యా బిడ్డలు గుర్తుకొచ్చిరా
అయ్యో కంటను కన్నీరొచ్చెనా

ఎవరైనా నీ పనిని మెచ్చెనా
కడుపు కోసమా ఇంత పరీక్ష
అయ్యా ఎందుకు నీకీ శిక్ష
కండబలమూ ఉన్నవాడవు

మొండితనమూ పట్టినాడవు
కలుగును తప్పక నీకు విజయము
దైవము తోడగు నీకిది నిజము.

(లేదా)

ఆ) వలసలను నిరోధించడానికి ప్రజలకు గ్రామాల్లోనే ఉపాధి లభించేటట్లు ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలను గురించి పత్రికలకు లేఖ రాయండి.

నిజామాబాద్,
X X X X X.

ప్రధాన సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.
ఆర్యా,

నమస్కారాలు. నేను ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. మా పరిసర ప్రాంతాల పల్లెల నుండి ఎందరో. గ్రామీణ జనం, మా నగరాలకు వలస వస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వము కింది సాయం చేస్తే వలసలను అరికట్టవచ్చు.

  1. గ్రామాల్లో ప్రజలకు సాగునీరు, త్రాగునీరు, విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి.
  2. గ్రామాల నుండి రవాణా సదుపాయాలు కల్పించాలి.
  3. గ్రామాల్లో ప్రజలకు పనికి ఆహారపథకం ద్వారా 365 రోజులూ పనులు చూపించాలి. ప్రతి మండల కేంద్రాల్లో పిల్లల చదువులకు సక్సెస్ పాఠశాలలు ఏర్పాటుచేయాలి.

ప్రతి గ్రామానికి రోజూ 24 గంటలూ విద్యుచ్ఛక్తి సదుపాయం కల్పించాలి. ప్రతి మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేయాలి. ప్రతి గ్రామాలకూ ఆర్.టి.సి బస్సు సౌకర్యం ఉండాలి.

వ్యవసాయానికి కావలసిన ఆధునిక పనిముట్లను, చౌకగా ప్రజలకు అందించాలి. వ్యవసాయదారులకు బ్యాంకుల ద్వారా అప్పులు తక్కువ వడ్డీకి ఇప్పించాలి. ఈ విషయాలను మీ పత్రిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ముందుగానే మీకు నా కృతజ్ఞతలు. తప్పక ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి మీ పత్రిక ద్వారా తీసుకురండి.

ఇట్లు,
భవద్విశ్వసనీయుడు,
పి. రాజా,
తొమ్మిదవ తరగతి,
ప్రభుత్వ పాఠశాల,
నిజామాబాద్.

చిరునామా :

ప్రధాన సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) పుస్తకాల నిండ మస్తుగ బొమ్మలు ఉన్నవి.
జవాబు:
మస్తుగ = అధికంగా
వాక్యప్రయోగం : ప్రభుత్వం దగ్గర మస్తుగ డబ్బు ఉంది.

ఆ) పరీక్ష రుసుం చెల్లించడానికి నేటితో గడువు ముగిసింది.
జవాబు:
గడువు = కాలవ్యవధి
వాక్యప్రయోగం : ఈ నెల పదవ తారీకు వరకూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనే గడువు ఉంది.

ఇ) పల్లెదారి పంట పైరులతో అందంగా ఉన్నది.
జవాబు:
పైరు = సస్యము
వాక్యప్రయోగం : ఈ సంవత్సరము మా చేలలో పైరులన్నీ పురుగుపట్టి పాడయ్యాయి.

2. కింది పదాలు/వాక్యాలు వివరించి రాయండి.

అ) గొడ్లడొక్కలు గుంజినా…
జవాబు:
వివరణ : ‘గొడ్లు’ అంటే పశువులు. ‘డొక్కలు’ అంటే వాటి పొట్టలు. గుంజడం అంటే ‘లాగడం’. పశువులకు కడుపునిండా తిండి లేకపోతే, వాటి డొక్కలు ఎండి లోపలకు దిగిపోతాయి. మొత్తంపై పశువుల శరీరాలు ఎండి లోపలకు దిగిపోడాన్ని ‘గొడ్లడొక్కలు గుంజడం’ అంటారు.

ఆ) చెర్లుకుంటలు పర్రెవడెనని………..
జవాబు:
వివరణ : చెర్లు అంటే చెరువులు. కుంటలు అంటే నీటి గుంటలు. వర్షాలు లేనందున చెరువులు, గుంటలు ఎండిపోయాయి. చెరువులు, గుంటలలోని నేల ‘పర్రెలు పడింది’ అంటే నెరలు తీసింది అనగా బీటలు పడిందని భావం.

ఇ) పైరులన్నీ వరుగులయ్యె….
జవాబు:
వివరణ : పైరులు పచ్చగా ఉంటాయి. ‘వరుగులు’ అంటే పచ్చి కూరగాయలు ఎండబెట్టిన ముక్కలు. పచ్చి కాయగూరలు ఎండబెడితే, బాగా ఎండి అవి వరుగులు అవుతాయి. పైరులు నీరులేక పచ్చదనం పోయి అవి వరుగులుగా మారిపోయాయని భావము.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

ఈ) జల పిడుగు…….
జవాబు:
వివరణ : పిడుగు ఆకాశం మీది నుండి వర్షం వచ్చేటప్పుడు నేలపై పడుతుంది. పిడుగు పడ్డట్లయితే ఆ పడ్డ వస్తువు లేక మనిషి మాడిపోతాడు. మరణిస్తాడు.

ఇది ‘జలపిడుగు’. పిడుగుపాటులా జలము పొంగి పొర్లిందన్న మాట. వరదలు వస్తే ఆ నీరు ప్రజలపై పిడుగులా వచ్చి పడుతుంది. కాబట్టి ‘జలపిడుగు’ అంటే పిడుగువలె వచ్చిపడిన ‘వరద ఉధృతి’ అని భావం. తుపాను వస్తే సముద్రం పొంగి పిడుగులా సముద్రం నీరు మీద పడుతుంది. కాబట్టి తుపాను, నదుల వరద వంటివి “జల పిడుగులు” అని భావం.

3. కింది వ్యాక్యాలలోని ప్రకృతి, వికృతులను గుర్తించండి.

అ) మానవుడు ఆశాజీవి. అతని ప్రయత్నాన్ని బట్టి ఆసలు నెరవేరుతాయి.
జవాబు:
ఆశ (ప్రకృతి) – ఆస (వికృతి)

ఆ) సింహాలు కొండ గుహల్లో ఉన్నాయి. జడివానకు కుహరాలలోని సింగాల గుండెలు పగిలాయి.
జవాబు:
సింహాలు (ప్రకృతి) – సింగాలు (వికృతి)

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
కింది పదాలను పరిశీలించండి. వాటిని విడదీసి సంధిని గుర్తించి, సూత్రం రాయండి.

అ) ఎట్లని
జవాబు:
ఎట్లని = ఎట్లు + అని = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.

ఆ) కాలమంటూ
జవాబు:
కాలమంటూ = కాలము + అంటూ = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.

ఇ) వరుగులయ్యే = వరుగులు + అయ్యే = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.

శబ్దాలంకారాలు :

అంత్యానుప్రాస

కింది వాక్యాలు పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.
……….. గొడ్లడొక్కలు గుంజినా
………. వానపాములు ఎండినా
………. గుడిసెకు విసిరి పోతివా
………. నడుం చుట్టుక పోతివా
…….. ఎన్నడొస్తవు లేబరీ ;
……… పాలమూరి జాలరీ!

గమనిక : పై పాదాలు చివర అక్షరాలు, పునరుక్తమైనాయని గమనించారు కదా ! అక్షరాలు పునరుక్తమవడాన్ని “అంత్యానుప్రాస” అంటారు.

అంత్యానుప్రాస లక్షణం : పదాల, పాదాల, వాక్యాల చరణాల చివరలో అక్షరాలు పునరుక్తమైతే అది అంత్యానుప్రాసాలంకారం.

ప్రశ్న 2.
అభ్యాసము : పాఠంలోని అంత్యానుప్రాసాలంకార పంక్తులను గుర్తించి రాయండి.
జవాబు:

  1. ఎన్నడొస్తవు లేబరీ
    పాలమూరి జాలరీ !
  2. గొడ్లడొక్కలు గుంజినా
    వానపాములు ఎండినా
  3. సరళాసాగరం నిండేది కాదని
    కోయిలసాగరం నిండేది కాదని
  4. గుడిసెకు విసరి పోతివా
    నడుం చుట్టుక పోతివా
  5. దిక్కు మొక్కుకు పోతివా
    కోస్తదేశం పోతివా
  6. మరిగి రాకనె పోతివా
    చారు మరిచే పోతివా
  7. …….. కర్మ మెందుకు
    ……… వేయ నందుకు

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

ఈ కింది వాక్యాలలో గీత గీసిన సమాస పదాలను పరిశీలించండి.
ఉదా : భద్రాచలం ఒక పుణ్యక్షేత్రం.
గమనిక : పై ‘భద్రాచలం’ అనే సమాస పదంలో భద్ర, అచలం అనే రెండు పదాలున్నాయి కదా! ‘అచలం’ అంటే కొండ అని అర్థం. ‘అచలం’ అనేది నామవాచకం.
‘భద్ర’ అనేది పేరు. అనగా “సంజ్ఞ”.
సంజ్ఞనే సంభావన అని అంటారు.
ఈ విధంగా పూర్వపదం (మొదటి పదం)లో సంభావన ఉన్నట్లయితే, ఆ సమాసపదాన్ని “సంభావన పూర్వపద కర్మధారయ సమాసము” అని అంటారు.

ప్రశ్న 3.
ఈ పాఠంలో ఉన్న సంభావన పూర్వపద కర్మధారయ సమాస పదాలను గుర్తించి, విశ్లేషించండి.
రూపక సమాసం
జవాబు:

  1. సరళా సాగరం – విశ్లేషణ : ‘సరళా’ అనే పేరు గల సాగరం.
  2. కోయిల సాగరం – విశ్లేషణ : ‘కోయిల’ అనే పేరు గల సాగరం
  3. కోస్త దేశం – విశ్లేషణ : ‘కోస్తా’ అనే పేరు గల దేశం
  4. మన్నెం కొండ – విశ్లేషణ : ‘మన్నెం’ అనే పేరు గల కొండ
  5. మెరిగె చాప – విశ్లేషణ : ‘మెరిగె’ అనే పేరు గల చేప
  6. బొచ్చె చాప – విశ్లేషణ : ‘బొచ్చె’ అనే పేరు గల చేప

కింద గీత గీసిన సమాస పదాన్ని పరిశీలించండి.

ధనాలన్నింటిలో శ్రేష్ఠమైనది విద్యాధనం.
పై గీత గీసిన పదములో విద్యకు ధనమునకు భేదం లేనట్లు చెప్పబడింది.
“విద్య అనెడు ధనం” అని ‘విద్యాధనం’ అనే సమాసానికి అర్థం.
‘విద్యాధనం’ అనే సమాసపదంలో, ‘ధనం’ అనేది ఉపమానం.
‘విద్యాధనం’ అనే సమాసపదంలో, ‘విద్య’ అనేది ‘ఉపమేయము’.

అభ్యాసము : కింద గీత గీసిన సమాసపదాలలోని ఉపమాన, ఉపమేయాలను గుర్తించండి.

1. “దయాభరణము”ను ధరించినవాడు భగవంతుడు.
వివరణ : “దయాభరణము” అనే సమాసపదంలో, ‘ఆభరణము’ అనే పదం ఉపమానము. ‘దయ’ అనేది ఉపమేయం.

2. పేదలపై కృపారసము కలిగియుండాలి.
వివరణ : ‘కృపారసము’ అనే సమాసపదంలో, “రసము” అనే పదం, ‘ఉపమానం’, ‘కృప’ అనేది ఉపమేయము.
గమనిక : ఈ విధంగా ఉపమానం యొక్క ధర్మాన్ని, ఉపమేయమందు ఆరోపించడాన్ని, ‘రూపక సమాసం’ అంటారు. లేదా “అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు.

ప్రశ్న 4.
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాలో గుర్తించండి.

సమాస పదం – విగ్రహవాక్యం – సమాస నామం

అ) పాలమూరు జిల్లా – ‘పాలమూరు’ అను పేరు గల జిల్లా – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) సరళాసాగరం – ‘సరళా’ అనే పేరు గల సాగరం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఇ) మన్నెంకొండ – ‘మన్నెం’ అనే పేరు గల కొండ – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) కీర్తికన్యక – కీర్తి అనే కన్య – రూపక సమాసం
ఉ) జ్ఞానజ్యోతి – జ్ఞానము అనే జ్యోతి – రూపక సమాసం

ప్రాజెక్టు పని

మీ గ్రామంలో లేదా వాడలో వలసకూలీల వద్దకు/ వాళ్ల బంధువుల వద్దకు వెళ్లి, వలస ఎందుకు వచ్చారో తెలుసుకుని, వాళ్ళ కష్టసుఖాల గురించి ఇంటర్వ్యూ చేసి నివేదిక రూపొందించండి.
జవాబు:
నేను మా గ్రామంలోని వలస కూలీల వద్దకు, వాళ్ళ బంధువుల వద్దకు వెళ్ళి వారు ఏ ప్రాంతం నుండి వచ్చారో, ఎప్పటి నుండి వచ్చారో, ఏ కారణాలతో వచ్చారో ప్రశ్నావళి ద్వారా వివరాలను తెలుసుకున్నాను. కరవుకాటకాల వల్ల, ఉపాధి అవకాశాలు లేనందువల్ల, కూలీ పనులు లేని కారణంగా వలస వచ్చినట్లుగా గ్రహించాను. వారు ప్రతి రోజు దుర్భర జీవితాన్ని గడుపుతున్నట్లుగా అర్థమయ్యింది. అందువల్ల ఇలాంటి వలసకూలీల సంక్షేమానికి ప్రభుత్వం చేయూతను అందివ్వాలి. సంపన్నులు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలి. వారిని మనలో ఒకరిగా గుర్తించాలి. వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఉన్నతంగా జీవించే అవకాశాలను కల్పించాలి.

(లేదా)

కార్మికుల, కూలీల బతుకు జీవనం గురించి వచ్చిన కథ/కవిత/గేయం/ పాటలను సేకరించి, నివేదిక రాయండి. చదివి వినిపించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

గేయ పంక్తులు – భావం

I

1వ గేయం

కూలి మస్తుగ దొరుకుతాదని!
కోస్తదేశం పోతివా!
ఎన్నడొస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ!

భావార్థం :

కూలిమస్తుగ దొరుకుతాదని = కూలి ఎక్కువగా దొరుకుతుందని (కూలి ఎక్కువగా వస్తుందని)
కోస్తదేశం పోతివా = కోస్తా ప్రాంతానికి వెళ్ళావా ?
(ఆంధ్రదేశంలో శ్రీకాకుళం జిల్లా నుండి, నెల్లూరు జిల్లా వరకూ సముద్రతీర ప్రాంతాన్ని కోస్తా దేశం అంటారు. ).
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?
(లేబరర్ = LABORER = కూలివాడు)
పాలమూరి జాలరీ = పాలమూరు జిల్లాలోని
బెస్తవాడా ! (మహబూబ్ నగర్
జిల్లాలో ఉండే బెస్తవాడా !)
(జాలరి = చేపలు పట్టేవాడు)

భావం:కూలి బాగా ముడుతుందని, కోస్తా దేశం వెళ్ళావా ? ఓ పాలమూరి జిల్లా జాలరీ ! ఎప్పుడు తిరిగి వస్తావు ?

2వ గేయం

గోకులాష్టమి దాటిపోయినా, గొడ్లడొక్కలు గుంజివా,
వాగులల్లో, వంకలల్లో వానపాములు ఎండినా,
చినుకురాలే ఆశలేదని, చెర్లుకుంటలు పర్రెవడెవని
కూలి మస్తుగ దొరుకుతాదని కోస్తదేశం పోతివా!

ఎన్నడొస్తవులేబరీ,
పాలమూరి. జాలరీ!

భావార్థం :

గోకులాష్టమి = కృష్ణాష్టమి (గోకులాష్టమి శ్రావణ బహుళ అష్టమినాడు వస్తుంది) (శ్రావణమాసం వెళ్ళిపోతున్నా వర్షాలు రాలేదన్నమాట)
దాటిపోయినా = వెళ్ళిపోయినా
గొడ్లడొక్కలు గుంజినా = పశువుల శరీరాలు, లోపలకు లాగుకుపోయినా; (తిండిలేక వాటి పొట్టలు ఎండి లోతుకు పోయినా)
వాగుల్లో, వంకలల్లో = సెలయేఱులలో, చిన్న ఏఱుల్లో ఉండే
వానపాములు ఎండినా = వానపాములు ఎండిపోయినా (చాలాకాలంగా ఆ వాగులలో, వంకలలో నీరు లేనందున, ఆ మట్టిలోని వానపాములు సైతం ఎండిపోయాయన్న మాట)
చినుకురాలే ఆశలేదని = వానచినుకు పడుతుందని ఆశ ఇంక లేదని ;
చెర్లుకుంటలు = చెరువులూ, గుంటలూ
పర్రెవడెనని = బీటలు తీశాయని ; (నెఱ్ఱలు పడ్డాయని)
కూలి మస్తుగ దొరుకుతాదని = కూలి ఎక్కువగా ఇస్తారని
కోస్తదేశం పోతివా ! = కోస్తాకు వెళ్ళావా !
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా! ఎప్పుడు తిరిగి వస్తావు ?
పాలమూరి జాలరీ = పాలమూరులో ఉండే ఓ బెస్తవాడా!

భావం: ఓ పాలమూరు జాలరీ ! కృష్ణాష్టమి వెళ్ళిపోయినా, పశువుల డొక్కలు ఎండిపోయినా, వాగులలో, వంకలలో, వానపాములు ఎండిపోయినా, ఇక్కడ వర్షపు చినుకు నేలపై రాలిపడే ఆశ కనబడటల్లేదని, చెరువులూ, గుంటలూ బీటలు తీశాయనీ, అక్కడ కూలీ బాగా దొరుకుతుందనీ, కోస్తా ప్రాంతానికి వెళ్ళిపోయావా ? ఓ కూలివాడా ! ఎప్పుడు తిరిగి వస్తావో చెప్పు.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

3వ గేయం

చాలు వానే పడదు సరళాసాగరం నిండేది కాదని,
చౌట మడుగులె యెండె, కోయిలసాగరం నిండేది కాదని,
పైరు లన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని,
కూలి మస్తుగ దొరుకుతాదని కోస్తదేశం పోతివా
ఎన్నడొస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ!

భావార్థం :

పాలమూరి జాలరీ = ఓ పాలమూరు జిల్లాలో ఉండే జాలరివాడా !
చాలు = ఇంక ఆశలు చాలు
వానే పడదు = ఈ సంవత్సరం ఇంక వాన పడదు
సరళాసాగరం = ‘సరళాసాగరం’ అనే నీటిమడుగు
నిండేది కాదని = ఈ సంవత్సరానికి ఇంక నిండదని;
చౌట మడుగులె = చౌడు నేలల్లో ఉన్న నీటిమడుగులే;
ఎండె = ఎండిపోయాయని;
‘కోయిల సాగరం’
నిండేది కాదని = ‘కోయిల సాగరం’ మడుగు ఇక ఈ సంవత్సరం నిండదని
పైరులన్నీ = పంటచేలన్నీ
పరుగులయ్యే
(వరుగులు + అయ్యే) = వరుగులవలె ఎండిపోతే,
పల్లెలో = గ్రామంలో
బతికేది ఎట్లని = జీవించడం ఎలా అని,
కూలి మస్తుగ దొరుకుతాదని = కూలి బాగా దొరుకుతుందని
కోస్తదేశం పోతివా = కోస్తాకు వెళ్ళావా (సముద్రతీర ప్రాంతం)
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం: ఓ పాలమూరి జాలరీ ! ఇంక వానపడదని, సరళా సాగరం ఇంక నిండదని, చౌడు నేలల్లో నీటిగుంటలు ఎండిపోయాయనీ, కోయిల సాగర్ ఇంక నిండదని, పైరులన్నీ వరుగుల్లా ఎండిపోయాయనీ, ఇంక పల్లెల్లో బ్రతకడం కష్టమనీ, కూలి ఎక్కువగా దొరకుతుందనీ, కోస్తా దేశానికి వెళ్ళిపోయావా ? ఓ కూలివాడా ! తిరిగి ఎప్పుడు వస్తావు ?

II

4వ గేయం

కొడిమెలూ, గాలాల గడెలూ గుడిసెకు విసిరిపోతివా!
నజాకతు నైలాను వలనే నడుం చుట్టుక పోతివా,
తిరిగి మన్నెంకొండ దేవుని దిక్కు మొక్కుతు పోతివా,
కూలి మస్తుగ దొరుకుతాదని కోస్తదేశం పోతివా
ఎన్నడొస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ !

భావార్థం:

పాలమూరి జాలరీ = ఓ పాలమూరు జిల్లా బెస్తవాడా!
కొడిమెల = నావలూ (చేపల బుట్టలు)
గాలాల గడెలు = చేపలను పట్టే గాలముల, కఱ్ఱులూ
(గడె = చేపలు పట్టేసాధనం).
గుడిసెకు విసిరిపోతివా = నీవు ఉండే తాటియాకుల ఇంటిలోకి విసరిపడేసి వెళ్ళిపోయావా ?
నజాకతు, నైలాను వలనే = సున్నితమైన నైలాను దారంతో అల్లిన వలను మాత్రం.
నడుం చుట్టుక పోతివా = నీ నడుముకు చుట్టుకొని వెళ్ళావా ? (కూడా తీసుకువెళ్ళావా అని భావం)
తిరిగి = వెళ్ళిపోతూ వెనుకకు తిరిగి
మన్నెంకొండ దేవుని = మన్నెంకొండలో వేలిసిన వేంకటేశ్వరుడి
దిక్కు మొక్కుతు పోతివా = ధిక్కు చూస్తూ దండం పెడుతూ వెళ్ళావా ?
కూలి మస్తుగ దొరుకుతాదని = కూలి ఎక్కువగా దొరుకుతుందని
కోస్తదేశం పోతివా = కోస్తా దేశానికి వెళ్ళావా ?
ఎన్నడొస్తవు లేబరీ = కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం : ఓ పాలమూరి జాలరీ ! పడవలు, గాలాల కఱ్ఱులు →గుడిసెలోకి విసరిపోయావా ? సున్నితమైన నైలాను వలను నీ నడుముకు చుట్టుకొని వెళ్ళిపోయావా ? వెళ్ళిపోతూ వెనక్కు తిరిగి మన్నెంకొండ వేంకటేశ్వరుడి వైపు చూసి నమస్కారం చేస్తూ వెళ్ళిపోయావా ? కూలి బాగా వస్తుందని, కోస్తా దేశానికి వెళ్ళిపోయావా ? కూలివాడా ! ఎప్పుడు తిరిగివస్తావు ?

5వ గేయం

మెరిగె చాపకు బొచ్చె చాపకు మరిగి రాకనె పోతివా,
చందమానుల, పరక పిల్లల చారు మరిచే పోతినా,
ఎన్నడోస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ !

భావార్థం:

మెరిగే చాపకు = మెరిగె అనే చేపలకూ
బొచ్చె చాపకు = ‘బొచ్చెలు’ అనే చేపలకూ (మెరిగెలు, బొచ్చెలు కోస్తాలో దొరికే చేపలు).
మరిగి = అలవాటుపడి (కోస్తా ప్రాంతంలో దొరికే మెరిగె, బొచ్చెలు అనే చేపలు తినడానికి అలవాటుపడి)
రాకనె పోతివా = తిరిగి పాలమూరు. రాకుండా పోయావా ?
చందమామల, పరక పిల్లల= చందమామలు, పరకలు అనే చేపపిల్లలతో పెట్టే;
చారు మరిచే పోతివా = చారు రుచి మరచిపోయావా!
పాలమూరి జాలరీ = ఓ పాలమూరి జాలరీ !
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం: ఓ పాలమూరి జాలరీ ! కోస్తా ప్రాంతంలో దొరికే మెరిగెలు, బొచ్చెలు అనే చేపలకు అలవాటుపడి, తిరిగి ఇక్కడకు రాకుండా పోయావా ? ఇక్కడ దొరికే చందమామల, పరక పిల్లల చారు రుచిని మరచిపోయావా ? ఓ కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

6వ గేయం

కోస్తబెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు ?
ఎగువ కృష్ణా ఆనకట్టను ఇంత వరకూ వేయవందుకు
ఏడ ఉంటివొ లేబరీ,
ఎన్నడొస్తవు జాలరీ !

భావార్థం:

కోస్తబెస్తల = కోస్తా తీరంలోని చేపలు పట్టే బెవాండ్ర
పడవలల్లో = పడవలలో
కూలివయ్యిన కర్మమెందుకు = కూలిగా పడి ఉండవలసిన కర్మము నీకు ఎందుకు ?
ఎగువ కృష్ణా ఆనకట్టను = కృష్ణా నదిపై ఎగువ భాగాన (పై భాగాన) ఆనకట్టను
ఇంతవరకూ వేయనందుకు = ఇంతవరకూ కట్టనందువల్లనే కదా !
ఏడ ఉంటివొ లేబరీ = ఓ కూలివాడా ! ఎక్కడ ఉన్నావు ?
ఎన్నడొస్తవు జాలరీ = ఓ జాలరీ ! ఎప్పుడు తిరిగి పాలమూరు వస్తావు ?

భావం : కృష్ణా నదిపై ఎగువన ఆనకట్ట కడితే, పాలమూరు జిల్లాకు నీరు వచ్చేది. అప్పుడు ఆ ప్రాంత ప్రజలు వలసలు వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదని గేయకర్త అభిప్రాయం.

7వ గేయం

ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటె,
చీకు మబ్బుల ముసురులో కార్తీకపున్నం వెళ్ళిపాయె,
ఇటే పోయిన జనం – అంతా అటే చచ్చే కాలమంటు,
జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెవంటా
ఎక్కడుంటివి లేబరీ,
ఎన్నడొస్తవు జాలరీ !

భావార్థం :

ఇంటికొస్తానన్న గడువుకు = నీవు ఇంటికి తిరిగి వస్తానన్న కాలవ్యవధికి;
ఇప్పటికి వారాలు దాటే = ఇప్పటికే వారాలు దాటిపోయాయి
చీకు మబ్బుల = చితికిపోయిన చిన్న చిన్న మబ్బుల
ముసురులో = ఎడతెగని చిరు వానలో
కార్తీకపున్నం = కార్తీక పౌర్ణమి
వెళ్ళి పాయె = వెళ్ళిపోయింది
ఇటే పోయిన జనం = ఇక్కడి నుండి కోస్తా వెళ్ళిన జనము
అంతా అటే చచ్చే కాలమంటు = అంతా అక్కడే చచ్చే కాలము వచ్చిందన్నట్లు;
జలపిడుగు పొర్లాడి = ‘నీటి ఉధృతి’ అనగా గోదావరి నది వరద పొంగి
భద్రాచలం మెట్లకు తాకెనంటా = భద్రాచలంలోని శ్రీరామ పాదాలను తాకిందట కదా !
ఎక్కడుంటివి లేబరీ = ఓ కూలివాడా! ఎక్కడ ఉన్నావు?
ఎన్నడొస్తవు జాలరీ = ఓ జాలరివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం : ఓ కూలివాడా ! నీవు ఇంటికి తిరిగివస్తానన్న కాలవ్యవధి, ఇప్పటికే వారాలు దాటిపోయింది. చిన్నమబ్బుల ముసురువానలో కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది. ఇక్కడి నుండి కోస్తా ప్రాంతానికి వెళ్ళిన జనం, అంతా అక్కడే చచ్చే కాలం వచ్చినట్లు, గోదావరి వరద భద్రాచలంలోని రామ పాదాలను తాకిందట. నీవు ఎక్కడ ఉన్నావు ? ఓ జాలరీ! ఎప్పుడు తిరిగి వస్తావు ?

పాఠం నేపథ్యం

తెలంగాణ రాష్ట్రంలో నీటివసతికి నోచుకోక, పంటలు పండక, నిరంతరం కరువురక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు, నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్నగర్ జిల్లా. బతుకుభారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతుకటానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి.

1977లో తూర్పు తీరప్రాంతానికి వలస వెళ్ళిన, కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుపానుకు గురై తిరిగిరాలేదని, వాళ్ళెక్కడున్నరో జాడతెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం గేయ ప్రక్రియకు సంబంధించినది. “లయాత్మకంగా ఉండి, ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం”. ఈ గేయం, పల్లవి, చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతమవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే ‘గేయం’.
ప్రస్తుత పాఠ్యభాగం, డా॥ ముకురాల రామారెడ్డిగారి ‘హృదయశైలి’ అనే గేయ సంకలనంలోనిది.

కవి పరిచయం

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ 1
01.01.1929
24.02.2003

పాఠ్యభాగము : ‘వలసకూలీ !’

కవి : డా॥ ముకురాల రామారెడ్డి

దేని నుండి గ్రహింపబడింది : కవి రాసిన ‘హృదయశైలి’ గేయ సంకలనం నుండి గ్రహింపబడింది.

జననము : వీరు 01.01.1929న జన్మించారు.

జన్మస్థలము : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ‘ముకురాల’ గ్రామంలో వీరు జన్మించారు.

రచనలు :

  1. మేఘదూత (అనువాద కవిత్వం),
  2. దేవరకొండ దుర్గం,
  3. నవ్వేకత్తులు (దీర్ఘకవిత),
  4. హృదయశైలి (గేయ సంపుటి),
  5. రాక్షసజాతర (దీర్ఘకవిత),
  6. ఉపరిశోధన (పరిశోధనా పత్రాల సంకలనం),
  7. తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగునవి రచించారు.

పరిశోధనా గ్రంథం : “ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావపరిణామం” అనే అంశంపై పరిశోధనా గ్రంథం వెలువరించారు.

సన్మానాలు:

  1. వీరి ‘విడిజోడు’ కథకు, కృష్ణాపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇచ్చారు.
  2. ఆకాశవాణి ఢిల్లీ వారు 1967లో ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ కవిగా వీరిని గుర్తించి, సన్మానం చేశారు.

ప్రవేశిక

మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది. ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్ధకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన. ఆశ. కానీ ………….
కాలం కలిసి రాని అభాగ్యజీవులు, తమ జీవితాన్ని నెట్టుకురావడమే ఒక ‘కల’గా భావించవలసి వస్తే …………
అందంగా ఉండవలసిన ‘కల’ కూడా ‘పీడకల’గా పరిణమిస్తే ……………..

బతుకు బండి నడిపేటందుకు తన కలలన్నీ, కల్లలు కాగా పొట్టచేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి ….
మనసును పంచుకొనేటందుకు మనుషులు లేక,
బాధను పంచుకొనేటందుకు బంధువులు లేక,
సమాజం నుండి దూరమౌతున్న వ్యథార్థజీవితాలను గురించి,
ముకురాలవారు రాసిన గేయం చదువుదాం.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 2nd Lesson నేనెరిగిన బూర్గుల Textbook Questions and Answers.

TS 9th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నేనెరిగిన బూర్గుల

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 14)

సహనమ్ము, సత్యమ్ము, శాంతగంభీరమ్ము,
ఆత్మవిశ్వాసమ్ము, నహరహమ్ము
సాధన, దక్షత, సాధుభాషణమును,
సద్వివేచనమును, సద్గమనము,

దానమ్ము, ధైర్యమ్ము, త్యాగమ్ము, సునిశిత
బుద్ధి, మేల్గాంచుట, పుణ్యగుణము,
కరుణ, క్షమ, పరోపకారబుద్దియనెడి
యాలోచనారీతు లమరియుండు

‘మనుజులెప్పుడును మాన్యులు, మంగళస్వ
రూపులు, మహోన్నతులు, విరాడ్రూపశోభి
తులు, సుకీర్తికాంతవరపతులు, సుమతులు,
జగతిగతి విరచితులు, సజ్జనులువారు.

ప్రశ్న 1.
ఈ పద్యం దేన్ని గురించి చెబుతున్నది ?
జవాబు:
ఈ పద్యం మాన్యులూ, మంగళ స్వరూపులూ, మహోన్నతులూ, కీర్తిమంతులూ అయిన సజ్జనులను గురించి చెబుతున్నది.

ప్రశ్న 2.
ఈ పద్యం ద్వారా గుర్తించిన లక్షణాలేవి ?
జవాబు:
ఈ పద్యం ద్వారా గుర్తించిన లక్షణాలు ఇవి.

  1. సహనం,
  2. సత్యం,
  3. శాంతగంభీరం,
  4. ఆత్మవిశ్వాసం,
  5. రాత్రింబగళ్ళు సాధన,
  6. దక్షత,
  7. సాధుభాషణం,
  8. సద్వివేచనం,
  9. సద్గమనం,
  10. దాన ధైర్యాలు,
  11. త్యాగం,
  12. సునిశిత బుద్ధి,
  13. పుణ్యగుణం,
  14. కరుణ,
  15. క్షమ,
  16. పరోపకారబుద్ధి.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
మంచి లక్షణాలు కలిగిన వారినేమంటారు ?
జవాబు:
మంచి లక్షణాలు కలిగిన వారిని

  1. మాన్యులు,
  2. మంగళ స్వరూపులు,
  3. మహోన్నతులు,
  4. విరాడ్రూపశోభితులు,
  5. సుమతులు,
  6. సజ్జనులు అని అంటారు.

ప్రశ్న 4.
అలాంటివారి గురించి ఎందుకు తెలుసుకోవాలి ? వారితో ఎందుకు సాంగత్యం చేయాలి ?
జవాబు:
అలాంటి వారిని గూర్చి చదివితే, మంచి స్ఫూర్తి కలుగుతుంది. అలాంటి మహాత్ముల గుణాలను ఆదర్శంగా తీసుకొని తాము కూడా ఆ విధంగా సన్మార్గంలో నడవడానికి వీలుపడుతుంది. అటువంటి వారితో సాంగత్యం చేయడం వల్ల, వారి మహోన్నత వ్యక్తిత్వం గూర్చి చక్కగా తెలిసికోడానికి వీలవుతుంది.

అటువంటి వారిని గూర్చి తెలిసికొని, వారు నడచిన అడుగుజాడలలో తాము కూడా నడవడానికి వీలవుతుంది.

ఆలోచించండి – చెప్పండి’ (Textbook Page No. 17)

ప్రశ్న 1.
అంతరాత్మ బోధించడం అంటే ఏమిటి ? మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా ? ఎప్పుడు?
జవాబు:
అంతరాత్మ అంటే హృదయం. అంటే మనలో ఉన్న మనస్సు. మనం నోటితో పైకి ఏమి చెపుతున్నా, లోపల మనస్సు మరోరకంగా చెపుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి అందరికీ జరుగుతుంది.

ఒకసారి నేను మధ్యాహ్నం బడి మానివేసి సినీమాకు వెళ్ళాను. ఇంటికి వచ్చాక నాన్నగారు ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడిగారు. ఆటలు ఆడి వచ్చానని అబద్ధం చెప్పాను కాని నేను అబద్ధం చెపుతున్నాననీ, అది తప్పనీ, నా అంతరాత్మ నాకు బోధించింది.

ప్రశ్న 2.
ఇతరులకంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట, ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. ఈ వాక్యం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
ప్రతి వ్యక్తి తాను ఇతరుల కంటే గొప్పవాడినని, పదిమంది చేత అనిపించుకోవాలని గట్టిగా అనుకుంటాడు. అందుకోసం లేని గొప్పలు చెప్పుకోడానికి కూడా అతడు సిద్ధపడతాడని గ్రహించాను.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
సత్యదూరమైన విషయం అంటే ఏమిటి ? దీన్ని ఏ ఏ సందర్భాలలో వాడతారు ?
జవాబు:
సత్యదూరమైన విషయం అంటే, నిజం కాని విషయం. అంటే పూర్తిగా అబద్ధము అన్నమాట. ఇతరులు లేని మాటలను ఉన్నట్లు చెపుతున్నపుడు, వారు చెప్పినది. అబద్ధం అని చెప్పడానికి ‘సత్యదూరం’ అనే మాటను వాడతారు.

ఆలోచించండి – చెప్పండి’ (Textbook Page No. 19)

ప్రశ్న 1.
ఎవరైనా గుర్తింపు పొందడానికి శరీరాకృతి కారణం కాదని తెల్సుకొన్నారు కదా! దీన్ని మీరెలా సమర్థిస్తారు?
జవాబు:
“ఒక వ్యక్తి గుర్తించబడటానికి అతని శరీరం యొక్క ఆకారం కారణం కాదు” అని రచయిత చెప్పిన మాట సత్యం.

మన భారతదేశానికి రెండవ ప్రధానమంత్రి అయిన “లాల్ బహదూర్ శాస్త్రిగారు” పొట్టివాడు. ఆయన ఎంతోకాలం కేంద్రమంత్రిగా పనిచేశారు. రైల్వేమంత్రిగా ఆయన ఉన్నప్పుడు పెద్ద రైల్వే ప్రమాదం జరిగింది. వెంటనే ఆయన రిజైన్ చేశారు.

ఆయన ‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదం ఇచ్చి, రైతులనూ, సైనికులనూ ఉత్తేజపరచాడు. ఆయన మరణించే నాటికి ఆయనకు స్వంత ఇల్లు లేదు. అంతటి నిజాయితీ గల శాస్త్రిగారు పొట్టివాడైనా, ఆయన గట్టివాడనిపించుకున్నాడు కదా!

ప్రశ్న 2.
అనన్యమైన వాదనాపటిమ అంటే ఏమిటి ? ఇది ఎవరికి అవసరం ? ఎందుకు ?
జవాబు:
‘వాదనాపటిమ’ అంటే వాదించడంలో గల సమర్థత అని అర్థం. ‘అనన్యము’ అంటే అటువంటి వాదనాశక్తి, మరొక్కరికి ఎవ్వరికీ లేదని అర్థం. ‘అనన్యమైన వాదనాపటిమ’ అంటే, తాను చెప్పినదే సరయినదని, ఎదుటి వారివద్ద గట్టిగా వాదించి చెప్పగల సామర్థ్యం.

ఇటువంటి వాదనాపటిమ ముఖ్యంగా న్యాయ వాదులకు ఉండాలి. న్యాయవాదులు చేపట్టిన కేసులను నెగ్గించుకోవాలంటే, వాదనాపటిమ వారికి ముఖ్యం.

ప్రశ్న 3.
“కొరుకుడు పడకపోవడం” అంటే ఏమిటి ? దీన్ని ఏ ఏ సందర్భాలలో వాడతారు ?
జవాబు:
వస్తువు గట్టిగా ఉండి, పళ్ళతో కొరికి తినడానికి వీలులేక పోవడాన్ని “కొరుకుడు పడకపోవడం” అంటారు. ఈ పదాన్ని రెండు సందర్భాల్లో వాడతారు.

  1. వస్తువు బాగా గట్టిగా ఉండి, పళ్ళతో కొరికి తినడానికి వీలుకానప్పుడు వాడతారు.
  2. తెలిసికోవలసిన విషయం మన బుద్ధికి అంద నప్పుడు, అది ఎంత చెప్పినా అర్థం కానప్పుడు, ఎంత పరిశీలించినా ఆ విషయం స్పష్టం కానప్పుడు, విషయం “కొరుకుడు పడడం లేదు” అని అంటారు.

ఆలోచించండి – చప్పండి (Textbook Page No. 20)

ప్రశ్న 1.
గొప్పవారు తమ జీవితానుభవాలను గ్రంథస్థం ఎందుకు చేయాలి ?
జవాబు:
గొప్పవారి జీవిత చరిత్రలో ఎన్నో ఆదర్శ సంఘటనలు ఉంటాయి. అవి ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. వాటిని అందరూ తెలిసికోవాలి.

గొప్పవారు తమ జీవితానుభవాలను వారు పుస్తక రూపంగా రాసిపెడితే, ఆ పుస్తకాలు చదివి, ఇతరులు తమ జీవితాల్ని గొప్పవారు నడిచిన మంచి దారిలో నడుపుకోవచ్చును. కనుక గొప్పవారు తమ జీవితాను భవాల్ని పుస్తకంగా రాయాలి.

ప్రశ్న 2.
మీరు వెచ్చించే సమయం దేనికి ఎక్కువగా ఉంటోంది? మీకుపయోగపడేవాటికా ? లేక ఇతరపనులకా ?
జవాబు:
నేను ఎక్కువగా నా సమయాన్ని చదువుకోసం, ఆటపాటల కోసం వినియోగిస్తాను. నేను ఇతర పనులకు నా సమయాన్ని వినియోగించను.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
రామకృష్ణారావుగారిని పి.వి. గారు ప్రాతఃస్మరణీయులు అని పేర్కొన్నారు కదా! నేటి రాజకీయ నాయకులు కూడా రామకృష్ణారావుగారిలా గొప్పపేరు సంపాదించు కోవాలంటే ఎలా ఉండాలి ? ఏమేం చేయాలి ?
జవాబు:
నేటి రాజకీయ నాయకులు కూడా రామకృష్ణారావు గారివలె పేరు సంపాదించుకోవాలంటే ఈ క్రింది విధంగా పనులు చేయాలి.

  1. ప్రజల అభీష్టానికి పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చి మతాతీతంగా విశిష్ట వ్యక్తిత్వం కలిగి ఉండాలి.
  2. ప్రజలకు కష్టసుఖాలలో తాము పాలుపంచుకోవాలి.
  3. శాసనసభ చర్చలలో చక్కగా పాల్గొని, దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి చక్కని సూచనలు ఇవ్వాలి.
  4. సాహిత్యం బాగా చదివి మంచి పాండిత్యం సంపాదించాలి. మంచి వక్తగా పేరు పొందాలి.
  5. అవినీతికి దూరంగా ఉండాలి.
  6. ప్రజలకు సన్నిహితంగా, సోదర శాసనసభ్యులతో స్నేహంగా, ప్రజల తలలో నాలుకవలె మెలగాలి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కింది అంశం గురించి మాట్లాడండి.

ఇతరుల కంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. దీని గురించి మీ అభిప్రాయాలను తెలపండి.
జవాబు:
ఇతరుల కంటే తాను గొప్పవాడని అనిపించుకోవాలనే కోరిక, ఉత్సాహము సహజంగా అందరిలోనూ ఉంటుంది. బడిలో పిల్లలకు కూడా పక్కవాడి కంటే తాను ఎక్కువ మార్కులు తెచ్చుకొని, తాను గురువుల వద్ద మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. అలాగే ఆటలలో తానే బాగా ఆడి, పేరు తెచ్చుకోవాలని, అందరూ తన ప్రతిభను మెచ్చుకోవాలని పిల్లలు అనుకుంటారు.

కవులూ, పండితులూ, ఇతర కవి పండితుల కంటే తాము గొప్పవారమని అందరూ గుర్తించాలని వారు తమను గూర్చి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. సంఘంలో మనుషులు తాము పక్కవారి కంటే డబ్బు కలవారమని, గొప్పవారమని అనిపించుకోవాలని ఉబలాటపడుతూ ఉంటారు.

ప్రశ్న 2.
కింది విషయాలు పాఠంలో ఏయే పేరాలలో ఉన్నాయి ? వాటికి సంబంధించిన అంశాలను పట్టికలో రాయండి.
జవాబు:
TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 2

ప్రశ్న 3.
పాఠం మొత్తాన్ని చదువండి. పాఠంలో ఉన్న జాతీయాలను గుర్తించి రాయండి.
జవాబు:
పాఠంలో జాతీయాలు:

  1. శ్రీరామరక్ష
  2. గీటురాయి
  3. స్వస్తివాచకం
  4. కారాలు మిరియాలు నూరడం
  5. రూపుమాపడం
  6. ముప్పిరిగొను
  7. ఉక్కిరిబిక్కిరైపోవు
  8. వీసం ఎత్తు
  9. ఒడ్డూ పొడుగూ
  10. నిత్య నైమిత్తికం
  11. కంచుగోడలు
  12. కొరుకుడుపడని
  13. జోహారులర్పించు
  14. ప్రాతఃస్మరణీయులు
  15. మార్గదర్శకులు
  16. స్వస్తివాచకం
  17. ఆరునూరుగు
  18. చీల్చిచెండాడు
  19. అతిశయోక్తి
  20. ఒడుదుడుకులు.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 4.
కింది గద్యాన్ని చదువండి.

క్లిష్టపరిస్థితుల్లో రాజ్యాధికారం చేపట్టిన రుద్రమ నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనా, పరిపాలనా నిర్వహణలో మంచి సమర్థురాలుగా పేరొందింది. స్త్రీలు రాజ్యాధికారం చేపట్టడం అరుదైన ఆ కాలంలో రుద్రమాంబ తన తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయక వీరనారిగా చరిత్రలో నిలిచింది.

స్త్రీ అయినప్పటికి పురుషవేషం, పురుషనామం ధరించి సమకాలీన రాజులందరికంటే మిన్నగా రాజ్యాన్ని పరిపాలించి సాహసవంతమైన జీవితాన్ని గడిపింది. గ్రామాలను దానంచేసి ఆదాయంతో విద్యార్థులకు పాఠశాలలు, ఉచిత వసతిగృహాలు నెలకొల్పింది. ఆరోగ్యశాలలు, ప్రసూతి శాలలు ఏర్పాటు చేసింది.

ఒక విద్యాపీఠం స్థాపించి అందులో వేదాలను, సాహిత్యాన్ని, ఆగమవ్యాఖ్యానాలను బోధింపజేసేది. పాఠశాలల్లో ఉపాధ్యాయులను, గ్రామాల్లో కరణాలను నియమించి వారికి వస్తువాహనాలను, ధాన్యాన్ని సమకూర్చేది. మార్కోపోలో అనే విదేశీ యాత్రికుడు ఈమె పరిపాలనా దక్షత, సాహిత్యసేవ, శిల్పకళలు, మహదైశ్వర్యం గురించి ప్రశంసిస్తూ తన’ డైరీలో రాసుకున్నాడు. అదీ రుద్రమదేవి ఘనత.

కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) రుద్రమాంబపై ఆమె తండ్రి ఉంచిన నమ్మకమేమిటి ?
జవాబు:
రుద్రమాంబ స్త్రీ మూర్తి అయినా, ఆమె రాజ్యాధికారం చేపట్టి, చక్కగా పరిపాలించగలదని, రుద్రమాంబపై ఆమె తండ్రి నమ్మకం పెట్టుకున్నాడు.

ఆ) రుద్రమాంబ చేసిన సత్కార్యాలేవి ?
జవాబు:
రుద్రమాంబ గ్రామాలను దానంచేసి, ఆ ఆదాయంతో విద్యార్థులకు పాఠశాలలు, వసతిగృహాలు నెలకొల్పింది. ఆరోగ్యశాలలు, ప్రసూతిశాలలు ఏర్పాటు చేసింది. విద్యాపీఠం నెలకొల్పి, వేదాలను, సాహిత్యాన్ని, ఆగమాలను బోధింపజేసింది. కరణాలనూ, ఉపాధ్యాయులనూ నియమించింది.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ఇ) మార్కోపోలో ఏయే అంశాల్లో రుద్రమదేవిని పొగిడాడు ?
జవాబు:
మార్కోపోలో రుద్రమదేవి యొక్క

  1. పరిపాలనా దక్షత
  2. సాహిత్యసేవ
  3. శిల్పకళలు
  4. మహదైశ్వర్యం అనే విషయాలను గురించి పొగిడాడు.

ఈ) రుద్రమదేవి సమర్థత ఏమిటి ?
జవాబు:
రుద్రమదేవి క్లిష్టపరిస్థితిలో రాజ్యాధికారం చేపట్టి, నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనా, పరిపాలనా నిర్వహణలో మంచి సమర్థత కలిగి ఉండేది.

ఉ) ఈ గద్యం ద్వారా రుద్రమదేవి వ్యక్తిత్వాన్ని ఒక వాక్యంలో రాయండి.
జవాబు:
రుద్రమదేవి పాలనాదక్షత

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) బూర్గుల – పి.వి. గార్ల సంబంధం గురుశిష్య సంబంధం లాంటిది. దీన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
పి.వి. నరసింహారావుగారు, బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గర, అందరికంటే జూనియర్ న్యాయవాదిగా శిక్షణ పొందేవారు. తల్లి, చిన్న పిల్లవానిపై మమకారం ఎక్కువగా చూపించే విధంగానే, బూర్గుల వారు, పి.వి. గారిపై విశేష మమకారం చూపించేవారు. పి.వి. గారు చొరవగా బూర్గుల వారి ఆఫీసుకు వెళ్ళి, జూనియర్లకు లొంగని చిక్కుకేసులను చదివేవారు. అది చూసిన బూర్గులవారి సీనియర్ గుమస్తా, పి.వి. గారిపై కోపపడేవాడు.

అది చూసిన బూర్గులవారు, పి.వి. గార్కి కేసులు చదవడానికి అనుమతి ఇచ్చారు. అంతేగాక, పి.వి. గారితో కేసుల గురించి స్వయంగా తాను చర్చించేవారు. దానితో పి.వి. గారు తన శక్తిసామర్థ్యాలను గుర్తించి, ఆత్మవిశ్వాసాన్ని పొందారు.

ఈ విధంగా పి.వి. గారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన, బూర్గుల వారు, గురువులుగానూ, పి.వి. గారు శిష్యులుగానూ పేరు పడ్డారు. వారిద్దరి మధ్య గల సంబంధం గురుశిష్య సంబంధం వంటిది.

ఆ) ‘సరే – అవన్నీ ఆటల్లో ఉండేవేగా’ అని బూర్గులవారు అనేవారు కదా! ఏ సందర్భంలో ఎందుకనేవారో దానికిగల కారణాలను రాయండి.
జవాబు:
బూర్గుల రామకృష్ణారావుగారి సామాజిక యాత్ర, ఎప్పుడూ సాఫీగా సాగలేదు. ఆయన అనేక రకాల ఒడుదుడుకులను ఎదుర్కోవలసి వచ్చింది. అనేక సందర్భాల్లో ఆపదలు ఆయనను చుట్టుముట్టాయి. అయినా ఆయన చలించేవారు కాడు. మనః స్థైర్యాన్నీ, సమచిత్తతనూ విడిచిపెట్టేవారు కాడు.

ఆయన విజయానికి పొంగిపోలేదు. కష్టం వస్తే క్రుంగిపోలేదు. ఎవరైనా స్నేహితులు ఆయనకు ద్రోహం తలపెట్టినా, ఆయనకు వ్యతిరేకులు ఆయనను దూషించినా “సరే, అవన్నీ ఆటలో ఉండేవేగా” అని సరిపెట్టుకునేవారు.

ఇ) బూర్గుల వారిని ప్రాతఃస్మరణీయులని పి.వి. నరసింహారావుగారు పేర్కొనడాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
‘బూర్గుల రామకృష్ణారావుగారు ప్రాతఃస్మరణీయులు’ అని పి.వి. నరసింహారావుగారు రాశారు. ప్రాతఃస్మరణీయులంటే నిద్ర నుండి లేవగానే స్మరించుకోవలసిన దైవస్వరూపుడు అని అర్థము.

పి.వి. గారు బూర్గులవారి వద్ద జూనియర్ న్యాయవాదిగా ఉండేవారు. పి.వి. గారు, బూర్గులవారి ఆఫీసులోకి వెళ్ళి, జూనియర్లకు లొంగని చిక్కు కేసుల ఫైళ్ళను తీసి, చదువుతూ ఉండేవారు. పి.వి. చూపించే చొరవ, అక్కడ ఉన్న బూర్గుల వారి సీనియర్ గుమాస్తాకు కోపం తెప్పించింది.

ఒకసారి బూర్గులవారు దానిని గమనించి, పి.వి. గారు తన ఫైళ్ళు చూడడానికి అంగీకరించారు. అంతేగాక పి.వి. గారితో కేసుల గురించి స్వయంగా చర్చించేవారు. పి.వి. గారిలో శక్తి సామర్థ్యాలున్నాయని ఈ విధంగా పి.వి. గారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించారు. ఆ ఆత్మవిశ్వాసం, పి.వి. గారికి శ్రీరామరక్ష అయ్యింది. అందుకే పి.వి. గారు, బూర్గుల వారిని ప్రాతఃస్మరణీయులు అని రాశారు.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 2.
కింది ప్రశ్నలకు పడేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) బూర్గుల వ్యక్తిత్వంలోని మహోన్నత లక్షణాల గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
బూర్గుల వ్యక్తిత్వం – మహోన్నత లక్షణాలు: బూర్గులవారు ఎప్పుడూ అన్ని విషయాలూ, ఆఖరుకు తమలోని లోపాలను సహితం ఉన్నవి ఉన్నట్లు చెప్పేవారు. ఆయన పొట్టిగా ఉండేవారు. కాని ఆయనలో బహుముఖమైన ప్రతిభ ఉండేది. అవసరం అయినప్పుడు దానిని మహోన్నతరూపంలో వారు కనబరచేవారు. అవసరం లేనప్పుడు అది ఆయనలో ఇమిడి పోయేది.

న్యాయవాదిగా, బూర్గులవారు విశేషప్రతిభతో, ఎదుటి న్యాయవాదుల వాదనలకు ఎదురొడ్డి నిలిచేవారు. ఆయనలో సునిశిత మేధాసంపత్తి ఉండేది. బూర్గులవారు తమ జూనియర్ న్యాయవాదులను బాగా ప్రోత్సహించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవారు. బూర్గులవారు ప్రాతఃస్మరణీయులు.

బూర్గులవారు కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులు అయ్యారు. బూర్గులవారు, రాజనీతి విశారదులు. బూర్గులవారు ఏ నిర్ణయం తీసుకున్నా, అన్ని విధాలైన జాగ్రత్తలతోనూ, మంచి వ్యవహార దక్షతతోనూ తీసుకొనేవారు. బూర్గులవారు మతాతీత స్థితిని పాటించేవారు. వీరిది విశిష్టమైన వ్యక్తిత్వం. బూర్గులవారు మంచి పార్లమెంటేరియన్. ఈయన బహుభాషావేత్త. ఈయన మంచి ఉపకారశీలి. ఈయన సంతోషానికి పొంగలేదు. కష్టాలకు క్రుంగలేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే, బూర్గులవారు “పూర్ణపురుషులు”, బహుముఖ ప్రజ్ఞగలవారు. ప్రధానంగా వీరు సాహితీ జగత్తుకు చెందినవారు.

(లేదా)

ఆ) ఈ పాఠం ఆధారంగా “గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్పూర్తి గొప్పగా ఉంటుంది” అనే అంశం గురించి, సమర్థిస్తూ రాయండి.
జవాబు:
‘గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి కూడా గొప్పగానే ఉంటుంది’ అన్నమాట నిజం.
బూర్గుల రామకృష్ణారావుగారు మహోన్నత వ్యక్తి. వారిది విశిష్ట వ్యక్తిత్వం. విశాల వ్యక్తిత్వం. ఈయన పూర్ణపురుషుడు. బూర్గులవారి సాంగత్యం, శ్రీ పి.వి. నరసింహారావుగారికి మంచి స్ఫూర్తి నిచ్చింది. బూర్గులవారి వద్ద శ్రీ పి.వి. గారు జూనియర్ లాయర్గా పనిచేసేవారు.

బూర్గులవారు లాయర్ కేసు తీసుకొనేటప్పుడే, ఆ కేసు తాలూకు ఫైలుపై రేఖామాత్రంగా, నోటు వ్రాసి పెట్టుకొనేవారు, ఆ నోటు ఆధారంగానే వారు కోర్టులో ఎదుటి న్యాయవాదుల వాదనలను గట్టిగా అడ్డుకొనేవారు. బూర్గులవారి మేధాసంపత్తినీ, ఆ వాదనాపటిమనూ దగ్గరగా చూసిన పి.వి. గారికి మంచి స్ఫూర్తి కలిగింది.

పి.వి. గారు బూర్గులవారి వద్ద అందరికంటే జూనియర్ లాయరుగా ఉండేవారు. బూర్గులవారు, పి.వి. గారిని ఆదరంగా చూసేవారు. దానితో పి.వి. గారు చొరవగా బూర్గులవారి ఆఫీసులోకి వెళ్ళి, తనకు కావలసిన కేసులను, ముఖ్యంగా జూనియర్లకు కష్టమైన చిక్కు కేసుల ఫైళ్ళను ఏరుకొని చదివేవారు. పి.వి. గారి ఆ చొరవకు అక్కడి సీనియర్ గుమాస్తా కోపపడేవాడు.

కాని బూర్గులవారు పి.వి. గారు తన ఫైళ్ళు చూడ్డానికి అంగీకరించారు. అంతేకాక కేసుల గురించి పి.వి. గారితో బూర్గులవారు సమాన స్థాయిలో చర్చించేవారు. దానితో పి.వి. గారు తనలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, ఆత్మవిశ్వాసాన్ని పొందారు.

పి.వి. గారికి ఆ ఆత్మవిశ్వాసం, శాసనసభల్లోనూ, ఇతర స్థలాల్లోనూ శ్రీరామరక్షగా పనిచేసింది. ఈ విధంగా గొప్పవారైన బూర్గులవారి సాంగత్యం, పి.వి. గారికి మంచి స్ఫూర్తి నిచ్చింది.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) పాఠంలోని పదజాలం, విశిష్ట లక్షణాల ఆధారంగా ఒక కవిత రాయండి.
జవాబు:
“పూర్ణపురుషుడు బూర్గుల రామకృష్ణారావు”
“రామకృష్ణారావు మహాశయా! ఓ పూర్ణపురుషా!
నీవు నా పాలిటి ప్రాతఃస్మరణీయుడవు.
నీ పేరు వింటే, గత స్మృతులతో ఉక్కిరిబిక్కిరౌతాను.
నీ చదువూ, మంత్రి పదవులూ, గవర్నరు గిరీలూ
కమిటీ అధ్యక్షతలూ – నీ వ్యక్తిత్వ ప్రతిబింబాలు కానేకావు.

నీ గురించి నీవు వీసం ఎత్తు ఎక్కువ తక్కువలు చెప్పవు.
నీవు నిజంగా వామనుడైన విరాట్ స్వరూపుడివి,
నీ వ్యక్తిత్వపు మహోన్నత శిఖరం, అనన్య దర్శనీయం
న్యాయవాదిగా నీ ప్రజ్ఞాప్రాభవాలు, శక్తి సామర్థ్యాలూ

సునిశిత మేధా సంపత్తీ – జాజ్వల్యమాన ప్రతిభా
అనన్య వాదనాపటిమా – అద్భుతం, మహాద్భుతం.
నీవు నాలో నింపిన ఆత్మవిశ్వాసం, నా కదే శ్రీరామరక్ష.
నీ విశిష్ట వ్యక్తిత్వానికి ఇవే నా జోహార్లు

నీవు సామ్యవాదవ్యవస్థకు మార్గదర్శకుడవు.
రాజకీయాలలో నీ సమ్యక్ దృష్టి, ప్రశంసనీయం
మత దురభిమాని నిజాం, నీకు బద్ధ శత్రువు, కానీ
కుచ్చుటోపీల మౌల్వీలూ, గడ్డాల ముల్లాలూ నీ వాళ్ళే

మతాతీత స్థితి, నీ విశాల వ్యక్తిత్వం
నీవు బహు భాషావేత్తవు, ఉపకారశీలివి, ఉదారుడవు.
కించిత్తూ చలించవు కష్టసుఖాల రాకలకు
నీ గురించి చెప్పాలంటే అది నా వల్ల ఔతుందా ?
కానేకాదు. నీవు నిజంగా “పూర్ణపురుషుడవు”.

(లేదా)

ఆ) ఈ పాఠం ఓ అభినందన పత్రంగా ఉంది కదూ! దీన్ని ఆధారంగా మీకు నచ్చిన గొప్ప వ్యక్తిని గురించి అభినందన వ్యాసం రాయండి.
జవాబు:
సరస్వతీ మూర్తీ!

మాకు నచ్చిన గొప్ప వ్యక్తి “ఉత్తమోపాధ్యాయుడు” దువ్వూరి సోమయాజులు గార్కి విద్యార్థులు సమర్పించిన సన్మానపత్రం.

ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయునిగా మిమ్ము నిర్ణయించి గౌరవించిన సందర్భంగా మీ శిష్యులమైన మేము మీకూ, ప్రభుత్వానికీ, శతకోటి వందనాలు అర్పిస్తున్నాం. మీరు బహుభాషావేత్తలు. సంస్కృతాంధ్రభాషల్లో మీకు గల శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞాప్రాభవాలు ప్రశంసనీయాలు. మీ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, మాకు ఉపాధ్యాయుడిగా ఉండడం మాకు గర్వకారణం.

సౌజన్యమూర్తీ!
మీరు మా విద్యార్థులను మీ కన్నబిడ్డవలె ప్రేమగా చూస్తారు. మీరు మతాతీత స్థితిని పాటిస్తారు. మీకు కులమతాల పట్టింపులు లేవు. ధనిక బీద తారతమ్యం లేదు. మీ విశాల వ్యక్తిత్వం, విశిష్ట వ్యక్తిత్వం, సౌజన్యం మరెక్కడా కనబడదు. అందుకే మీరు ఉత్తమోపాధ్యాయులు అయ్యారని మా విశ్వాసం.

మార్గదర్శీ!
మీరు మాలో గల శక్తి సామర్థ్యాలను వెలికితీసి, మెరుగుపెట్టి, మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అందుకే మాకు ఎన్నో మంచి మార్కులు, బహుమతులు వస్తున్నాయి. మీ సునిశిత మేధాసంపత్తి, జాజ్వల్యమాన ప్రతిభ ఆధారంగా మమ్మల్ని ఉత్తమ విద్యార్థులుగా మీరు తీర్చిదిద్దుతున్నారు. మీరు మా కందించే ప్రోత్సాహమే, మాకు శ్రీరామరక్ష. మీరు మాకు ప్రాతఃస్మరణీయులు.

మీకు పరమేశ్వరుడు ఆయురారోగ్య భాగ్యాలను ఇచ్చి, మా వంటి ఎందరో విద్యార్థినీ, విద్యార్థులను సాహితీ సంపన్నులుగా తయారుచేసేందుకు మీకు తోడ్పడాలని, మేము దైవాన్ని కోరుతున్నాం.

ఇట్లు,
పదజాలం

X X X X X X
హైదరాబాద్.

III. భాషాంశాలు

పదజాలం

1. కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.

అ) చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు ముప్పిరిగొంటున్నాయి.
జవాబు:
ముప్పిరి = చుట్టుముట్టాయి (అతిశయించాయి.)

ఆ) వీసం ఎత్తు అహంకారం లేకుండా ముందుకెళ్ళాలి.
జవాబు:
వీసం ఎత్తు : 1/16 వ వంతు

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ఇ) దశరథుని కడగొట్టు బిడ్డడు శత్రుఘ్నుడు.
జవాబు:
కడగొట్టు = కట్టకడపటి ; చివరి

ఈ) భారతదేశ ప్రాభవాన్ని మనమంతా పెంచాలి.
జవాబు:
ప్రాభవాన్ని = శ్రేష్ఠత్వాన్ని

ఉ) మనదేశ ప్రజలకు వివేకానందుడు ప్రాతః స్మరణీయుడు.
జవాబు:
ప్రాతఃస్మరణీయుడు = నిద్ర నుండి లేవగానే స్మరించుకోవలసిన దైవస్వరూపులు.

ఊ) హితైషి చెప్పిన మాటలను పెడచెవిన పెట్టవద్దు.
జవాబు:
హితైషి = మేలును కోరేవాడు.

2) కింది జాతీయాలను మీ సొంతవాక్యాలలో ప్రయోగించండి.

అ) శ్రీరామరక్ష = పరిరక్షించగలిగినది, సర్వరక్షకం
జవాబు:
వాక్యప్రయోగం : నెహ్రూజీ మొదటి ప్రధానమంత్రి కావడం, మన భారతదేశానికి శ్రీరామరక్ష అయ్యింది.

ఆ) గీటురాయి = కొలబద్ద, ప్రమాణం
జవాబు:
వాక్యప్రయోగం : మంత్రిగారు మెచ్చుకోడం, నా తమ్ముని ప్రతిభకు గీటురాయి అని చెప్పాలి.

ఇ) రూపుమాపడం = శాశ్వతంగా తొలగించడం
జవాబు:
వాక్యప్రయోగం : వీరేశలింగంగారు నాటి సంఘంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషిచేశారు.

ఈ) కారాలు మిరియాలు నూరడం = మండిపడడం, మిక్కిలి కోపగించడం
జవాబు:
వాక్యప్రయోగం : నా తమ్ముడు తప్పుచేస్తే, మా నాన్నగారు కారాలు మిరియాలు నూరుతారు.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ఉ) స్వస్తివాచకం = ముగింపు, వదలివేయు
జవాబు:
వాక్యప్రయోగం : విద్యార్థులు చదువుకోసం పూర్తిగా ఆటలకు స్వస్తివాచకం చెప్పకూడదు.

3. కింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించండి.

అ) రైతులు ప్రతివర్షం పంటలను పండిస్తూ సాలుకొకసారి వచ్చిన ధనంతో సంవత్సరమంతా నడుపుతారు.
జవాబు:
పర్యాయపదాలు :

  1. వర్షం
  2. సాలు
  3. సంవత్సరం

ఆ) భూమిపై కాలుష్యం పెరుగుట వల్ల, ధరిత్రి మీద ఉండే జనం విలవిలలాడుతూ అవనిపై మేము జీవించలేమని అంటున్నారు.
జవాబు:
పర్యాయపదాలు :

  1. భూమి
  2. ధరిత్రి
  3. అవని.

ఇ) ఒక వ్యక్తి దక్షతతో పనిచేస్తే, ఆ సామర్థ్యం అందరికీ తెలుస్తుంది.
జవాబు:
పర్యాయపదాలు :

  1. దక్షత
  2. సామర్థ్యం

4. కింది ‘వికృతి’ పదాలకు పాఠంలో ఉన్న ‘ప్రకృతి’ పదాలను వెతికి రాయండి.

అ) దవ్వు
జవాబు:
దవ్వు (వికృతి)

  1. దూరము
  2. దవీయము (ప్రకృతి)

ఆ) గారవం
జవాబు:
గారవం (వికృతి) – గౌరవం (ప్రకృతి)

ఇ) పగ్గె / పగ్గియ
జవాబు:
పల్లె / పగ్గియ (వికృతి) – ప్రజ్ఞ (ప్రకృతి)

ఈ) దోసం
జవాబు:
దోసం (వికృతి) – దోషం (ప్రకృతి)

ఉ) రాతిరి
జవాబు:
రాతిరి (వికృతి) – రాత్రి (ప్రకృతి)

ఊ) బాస
జవాబు:
బాస (వికృతి) – భాష (ప్రకృతి)

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

5. ప్రతి వృత్తికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయని పాఠం ద్వారా తెలుసుకున్నారు కదా! మీకు తెలిసిన కొన్ని వృత్తులు, వాటికున్న ప్రత్యేక లక్షణాలకు సంబంధించిన పదాలను పట్టిక రూపంలో రాయండి.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 3
జవాబు:
TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 4

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలను విడదీసి సంధులను గుర్తించండి.

అ) హైదరాబాద్ లోని విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటి.
జవాబు:
విమానాశ్రయం : విమాన + ఆశ్రయం = సవర్ణదీర్ఘ సంధి

ఆ) చిన్నప్పటి విషయాలు జ్ఞాపకముండడం చాలా అరుదు.
జవాబు:
జ్ఞాపకముండడం : జ్ఞాపకము + ఉండడం ఉత్వసంధి

ఇ) ప్రతి జీవికి ఒక్కో శరీరాకృతి ఉంటుంది.
జవాబు:
శరీరాకృతి : శరీర + ఆకృతి = సవర్ణదీర్ఘ సంధి

ఈ) అబ్దుల్ కలాం మహోన్నత వ్యక్తిత్వం కలవాడు.
జవాబు:
మహోన్నత : మహా + ఉన్నత = గుణసంధి

ఉ) నా జీవితాన్నంతా దేశసేవకే వినియోగించాలనుకుంటున్నాను.
జవాబు:
జీవితాన్నంతా : జీవితాన్ని + అంతా

ఊ) మాధవి చెప్పినప్పటికీ రమ వినలేదు.
జవాబు:
చెప్పినప్పటికీ : చెప్పిన + అప్పటికీ = అత్వసంధి

ఋ) ఒక్కొక్కప్పుడు ముఖ్యమైన విషయాలు జ్ఞప్తికి రావు.
జవాబు:
ఒక్కొక్క : ఒక + ఒక = ఆమ్రేడిత సంధి

2. కింది సమాస పదాల్లోని తత్పురుష భేదాలను గుర్తించి, విగ్రహవాక్యాలు రాయండి. సమాస నిర్ణయం చేయండి.

ఉదా : – సత్యదూరము – సమాస పదం – షష్ఠీ తత్పురుష సమాసం

సమాసపదం – విగ్రహకవాక్యం – సమాసం పేరు

అ) అమెరికా రాయబారి – అమెరికా యొక్క రాయబారి – షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) వాదనాపటిమ – వాదనయందు పటిమ – సప్తమీ తత్పురుష సమాసం
ఇ) అసాధ్యం – సాధ్యము కానిది – నఞ తత్పురుష సమాసం
ఈ) నెలతాల్పు – నెలను ధరించినవాడు – ద్వితీయా తత్పురుష సమాసం
ఉ) గురుదక్షిణ – గురువు కొఱకు దక్షిణ – చతుర్థీ తత్పురుష సమాసం
ఊ) వయోవృద్ధుడు – వయస్సు చేత వృద్ధుడు – తృతీయా తత్పురుష సమాసం
ఋ) దొంగభయము – దొంగవలన భయము – పంచమీ తత్పురుష సమాసం
ౠ) రెండు రాష్ట్రాలు – రెండైన రాష్ట్రాలు – ద్విగు సమాసం
ఎ) శక్తిసామర్ధ్యాలు – శక్తియు, సామర్ధ్యమును – ద్వంద్వ సమాసం
ఏ) అమూల్యసమయం – అమూల్యమైన సమయం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఐ) పూర్ణపురుషులు – పూర్ణులైన పురుషులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఒ) ప్రాచీనకావ్యాలు – ప్రాచీనములైన కావ్యాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఓ) పెద్దకుటుంబం – పెద్దదైన కుటుంబం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

3. కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.

అ) పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు.
పర్షియన్ భాషను చదివాడు.
ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు.
జవాబు:
పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరి, పర్షియన్ భాషను చదివి, ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. (సంక్లిష్ట వాక్యం)

ఆ) బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కు నిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారుచేశాడు.
బూర్గుల సామ్యవాద వ్యవస్థకు పునాది వేశాడు.
బూర్గుల అజరామర కీర్తిని పొందాడు.
జవాబు:
బూర్గుల హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు పునాదివేసి, అజరామరకీర్తిని పొందాడు. (సంక్లిష్ట వాక్యం)

ప్రాజెక్టు పని

మహోన్నత వ్యక్తిత్వంతో, పరిపాలనాదక్షతతో సేవచేసిన వారి వివరాలు సేకరించండి. నివేదిక రూపొందించండి. తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 5

పదాలు – అర్థాలు

I

16వ పేజి

స్వర్గీయులు = స్వర్గాన్ని చేరిన వారు (మరణించిన వారు)
వర్ధంతి = “మరణించిన రోజు”, అనే అర్థంలో ఈ పదం వాడబడుతోంది.
మిత్రులు = స్నేహితులు
స్మృతులు = తలంపులు, జ్ఞాపకాలు
ముప్పిరిగొని = చుట్టుకొని, అతిశయించి
భావోద్రేకంతో
(భావ + ఉద్రేకంతో) = ఉద్రేకంతో కూడిన భావాలతో
ఉక్కిరి బిక్కిరైపోవు = ఊపిరి ఆడకపోవు; (విశ్రాంతి లేకపోవు)
రేఖామాత్రంగా = గీత వలె (కొద్దిగా)
పొందుపరుస్తాను = ఉంచుతాను (రాస్తాను)
పర్షియన్ భాష = పర్షియా భాష
ఐచ్ఛిక విషయం = స్వేచ్ఛా విషయం
పట్టభద్రులయ్యారు = డిగ్రీ పట్టా తీసికొన్నారు (బి.ఏ. పాసయ్యారు)
ట్యూటరు (Tutor) = ఉపన్యాసకునికి తోడుగా పనిచేసే గురువు (Private Teacher)
న్యాయవాద పట్టా = లా డిగ్రీ (Law Degree)
నమోదు అయ్యారు = రిజిష్టరు చేసుకున్నారు
కన్ను మూశారు = మరణించారు.
అవగతం కాదు ‘= అర్థం కాదు

17వ పేజి..

ఘనంగా = గొప్పగా
చిత్రించుకొనే = వర్ణించి చెప్పుకొనే
అంతరాత్మ (అంతః + ఆత్మ) = హృదయం
కృత్రిమ ఘనతను = తెచ్చిపెట్టుకొన్న గొప్పతనాన్ని
ప్రదర్శించి = చూపించి (కనబరచి)
ఉబలాటం = తీవ్రమైన కోరిక
పెనుగులాట = గ్రుద్దులాట
తత్ఫలితంగా = దానికి ఫలితంగా
కించపరుచుకొంటూ = తక్కువ చేసికొంటూ
అమూల్య సమయాన్ని = విలువకట్టలేని గొప్ప కాలాన్ని
వ్యర్థపరచుకుంటూ = వ్యర్థం చేసికొంటూ
అరుదుగా = అపురూపంగా (మిక్కిలి తక్కువగా)
మినహాయింపు = విడిచిపెట్టడం (Exemption)

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

వీసం ఎత్తు = వీసం ఎత్తు బరువు (రూపాయిలో 16వ వంతు బరువు)
మరుగుపరుస్తూ ఉండేది = కప్పిపెడుతూ ఉండేవి
సత్యదూరం = అసత్యం (సత్యం కానిది)
భావన = తలంపు
ఒడ్డూ, పొడుగూ = వెడల్పు, పొడుగు (ఒడ్డు = వెడల్పు)
వామనరూపాన్ని = వామనమూర్తివలె పొట్టి రూపాన్ని
స్నేహపూరితమైన = స్నేహంతో నిండిన
పరిహాసాలను = ఎగతాళులను (వేళాకోళాలను)
భావ నిర్లిప్తతతో = భావము యొక్క తగులపాటు లేకుండా (పట్టించుకోకుండా)
లోగడ = పూర్వం
అసాధారణ పొడగరితనం = సాధారణంగా ఉండని పొడుగుదనం
మరుగుపరచలేదు = కప్పిపెట్టలేదు
విమానాశ్రయం
(విమాన + ఆశ్రయం) = విమానాలు ఆగేచోటు
పుష్పమాలాలంకృతునిగా
(పుష్పమాలా + అలంకృతునిగా) = పూలదండతో అలంకరింపబడిన వానిగా
అతిథి = ముందు తెలియజేయకుండా భోజన సమయానికి వచ్చే వాడు
ఆతిథేయులు = అతిథికి సత్కారం చేసే వారు (గృహస్థులు)
ఇర్వురు = ఇద్దరూ
సరస్పర, సౌజన్య, సౌహార్దాలు = ఒకరికొకరియందు; మంచితనమూ, స్నేహమూ
ఫీటు (Feat) = సాహసకృత్యం
వినోదకర దృశ్యం = వేడుకను ఇచ్చే దృశ్యం
కళానైపుణ్యానికి = కళలో నేర్పరిదనానికి
గీటురాయి = ప్రమాణం
చేకూర్చింది = సిద్ధింపచేసింది

II

17వ పేజి

విరాట్రూపం = ఆదిపురుషుని బ్రహ్మాండ స్వరూపం; (పెద్ద ఆకారం)
శరీరాకృతి (శరీర + ఆకృతి) = శరీరం యొక్క ఆకారము
గహనమైనది
(గహనము + ఐనది) = ఎరుగరానిది
వ్యక్తిత్వం = వ్యక్తి స్వభావం
నిత్య నైమిత్తికంగా (Routine) = వాడుకగా (నియమిత చర్యగా)
వామనమూర్తి వలె = వామనుని వలె (వామనావతారంలో విష్ణువువలె పొట్టిగా)
ముల్లోకాలు
(మూడు + లోకాలు) = స్వర్గ, మర్త్య, పాతాళలోకాలు
ఆక్రమించి = ఆక్రమణం చేసి (వ్యాపించి)
ప్రదర్శించేవారు = వెల్లడించే వారు
ఇమిడిపోతూ = లీనమవుతూ (కలిసిపోతూ)
నిరాడంబరంగా = ఆడంబరం లేకుండా
తెరమరుగున = తెరచాటున (వెనుక)
బహుముఖ ప్రతిభాయుత మూర్తిమత్వం = అనేక విధాలైన తెలివి తేటలతో కూడిన రూపాన్ని కల్గి యుండడం
మహోన్నతరూపం
(మహా + ఉన్నతరూపం) = మిక్కిలి గొప్ప రూపం
వ్యక్తిత్వపు, మహోన్నత శిఖరాలు (వ్యక్తిత్వము + మహోన్నత శిఖరాలు) = స్వభావము యొక్క మిక్కిలి గొప్ప, విశిష్టతలు
అగాధపులోతులలోనే
(అగాధము + లోతులలోనే) = తెలియశక్యంకాని లోతులలో
పరిలక్షితమౌతుంది
(పరిలక్షితము + ఔతుంది) = బాగా సూచింపబడుతుంది. (వెల్లడి అవుతుంది)

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

18వ పేజి

న్యాయవాది (Advocate) = ప్లీడరు
ప్రాక్టీస్ (Practice) = అనుభవం
Roaring Practice = ఎక్కువ ప్రాక్టీసు
ప్రజాహిత జీవితం = ప్రజలకు మేలు కలిగించే జీవితం
ఫైలు పెరుగుట = హోదా పెరగడం (File)
ఉపకరిస్తే = సాయపడితే
తారుమారైంది = తిరగబడింది
క్లయింట్లు (Clients) = లాయర్లకు వ్యాజ్యాలు ఇచ్చేవారు
మిశ్రిత భావం = కలగాపులగమైన భావన
ప్రజ్ఞా ప్రాభవాలు = తెలివియు, గొప్పతనమును
సంపూర్ణ విశ్వాసానికి = పరిపూర్తి అయిన నమ్మకానికి
తోడు = సహాయం
రాజకీయ వ్యగ్రత = రాజకీయాలలోని తొందర తనం
ధ్యానము = మనస్సు యొక్క ఏకాగ్రత
క్షుణ్ణంగా చదివి = బాగా చదివి
చేపట్టేటప్పుడే = తీసుకొనేటప్పుడే (స్వీకరించేటప్పుడే)
ఫైలు (File) = దొంతి (కాగితాలు వరుసగా పెట్టుకొనే అట్ట)
అస్పష్టమైన = స్పష్టంకాని
నోట్సులు (Notes) = వివరణలు
రేఖామాత్రంగా = కొద్దిగా
జాజ్వల్యమానమైన = ప్రకాశించే
వాదనాఘాతములకు = వాదనలనే దెబ్బలకు
దుర్భేద్యమైన = భేదింప శక్యం కానిదైన
నిలపడం = నిలబెట్టడం
నిష్ణాతమైన = నేర్పు కలదైన
సునిశిత మేధాసంపత్తి = మిక్కిలి పదునైన బుద్ధిసంపద
ప్రదర్శిస్తున్నారు = చూపిస్తున్నారు
అనన్యమైన = ఇతరులకులేనట్టి
వాదనాపటిమ = వాదించడంలో సామర్థ్యం
ప్రోత్సాహం (ప్ర+ఉత్సాహం) = మిక్కిలి ఉత్సాహం
ప్రత్యేక తరహా = ప్రత్యేక విధం
జూనియర్ (Junior) = చిన్న
కడగొట్టు బిడ్డ = చివరి బిడ్డ
విశేష, మమకారం = అధికమైన, అభిమానం
చొరవతో = సాహసంతో
నిరాఘాటంగా = అడ్డులేకుండా
ఆఫీసును (Office) = కార్యాలయాన్ని
కాఫీ పానశాల(Coffee Hotel) = కాఫీ త్రాగేశాల
పరిగణించి = లెక్కించి (ఎన్నుకొని)
కొరుకుడుపడని = కొరకడానికి వీలుపడని (అర్థంకాని, కష్టమైన)
ఏరుకొని = ఏరి తీసుకొని (తీసుకొని)
కారాలు మిరియాలు నూరుతూ = కోపగిస్తూ
చేష్ట = నడవడి (కార్యం)
ఆమోదముద్ర = అంగీకారముద్ర
ప్రకరణం = ఒక విషయాన్ని బోధించే గ్రంథ భాగం
ముగియడం = ముగింపు
నిష్కాపట్యంతో = కపటం లేకుండా
సమానస్థాయి = సమానమైన స్థితి
చర్చా సంబంధం = చర్చకు సంబంధం
రూపొందించిన = ఏర్పరచిన
జోహారులు = నమస్కారాలు
అర్పిస్తూనే ఉంటాను = సమర్పిస్తూనే ఉంటాను
పూరించిన = నింపిన
ఆత్మవిశ్వాసమే = తన శక్తి యందు నమ్మకం కల్గియుండడమే
శాసనసభలు = చట్టసభలు
శ్రీరామరక్ష = సర్వరక్షకం
ప్రాతఃస్మరణీయులు = తెల్లవారు జాముననే తలంపవలసిన వారు (దేవుని వంటివారు)
విశిష్ట వ్యక్తిత్వము = మిక్కిలి శ్రేష్ఠమైన వ్యక్తిత్వం
అట్టిది = అటువంటిది
సమ్యక్ దృష్టికోణం = సరియైన చూపు
సంకుచితం = ముడుచుకున్నది
సైద్ధాంతిక అరలు = సిద్ధాంతానికి చెందిన భాగములు.
తావు = స్థానం
జాగీర్దార్ = నవాబుల వలన శౌర్యాదులకై మాన్యాలు పొందినవాడు
జాగీర్దారీ వ్యవస్థ = జాగీర్దారుల ఏర్పాటు
రూపుమాపడానికి = నశింపజేయడానికి (తీసివేయడానికి)
స్నేహకోటి = స్నేహితుల సమూహం
భూస్వాములు భూములు ఎక్కువగా గలవారు (భూకామందులు)
కౌలుదారీ చట్టాన్ని = భూమి యజమాని, సేద్యం చేసే రైతులకు ఇచ్చే హక్కుల చట్టాన్ని
సామ్యవాద వ్యవస్థ = ప్రజలందరికీ సమానమైన అధికారాలూ, భోగభాగ్యాలూ కలగాలని కోరే ఏర్పాటు
మార్గదర్శకులు = మార్గాన్ని చూపించేవారు
ఎంపిక చేసిన = ఎన్నుకొన్న
భూకామందులు = భూస్వాములు
రాజకీయసహచరులు = రాజకీయాల్లో వెంట తిరిగే స్నేహితులు

19వ పేజి

సంస్థానవిచ్ఛిత్తి = సంస్థానాల నాశనం
రాజకీయ ప్రాబల్యానికి = మంచి సమర్థత పొందడానికి
స్వస్తివాచకం పలుకు = ముగించు
మేలు చేకూర్చే = ఉపకారాన్ని చేసే
ఆత్మపరిత్యాగానికి = మనస్సును పూర్తిగా విడిచి వేయడానికి (మనఃపూర్వకం కాని దానికి)
సక్రియ రాజకీయాల నుండి = క్రియాశీలమైన రాజకీయాల నుండి
నిష్క్రమణకు = వెడలిపోడానికి (తప్పుకోడానికి)
అంకితం చేసుకొనే = సంపూర్తిగా సమర్పించుకొనే
రాజనీతి విశారదులు = రాజనీతి పండితులు
బహు అరుదు = మిక్కిలి తక్కువ
‘వ్యవహార దక్షత = వ్యవహార సామర్థ్యం
ఆరునూరైనా = ఏది ఏమయినా
సంక్షిప్త రాజకీయ చరిత్ర = కొద్దిగా చెప్పిన రాజకీయాల చరిత్ర

III

19వ పేజి

సౌజన్యానికి = మంచితనానికి
మారుపేరు = మరోపేరు
ముఖ్యాంశ (ముఖ్య + అంశం) = ముఖ్యవిషయం
గతతరంలోని = పూర్వపుతరంలోని (పూర్వకాలంలోని)
సుగుణాల = మంచిగుణాల
మూర్తిమత్వం = స్వరూపం (personality)
శరాఫత్ = సౌజన్యం (మంచితనం)
మత, దురభిమానం = మతమునందు, పిచ్చి ప్రేమ
పెంపొందిస్తూ = అభివృద్ధిపరుస్తూ
రాజ్యమేలుతున్న = రాజ్యాన్ని పాలిస్తున్న
నాటి నిజాంకు = ఆ రోజుల్లో పాలించే నిజాం రాజుకు
బద్ధవ్యతిరేకి = గట్టి విరోధి
పరమ మిత్రులు = మిక్కిలి స్నేహితులు

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ఆప్తులు = స్నేహితులు
అతినిరాడంబరంగా = మిక్కిలి ఆడంబరం లేకుండా
ఆడంబరం = డంబం
మతాతీతస్థితి (మత + అతీత స్థితి) = మతాన్ని అతిక్రమించిన పరిస్థితిని (మతంతో సంబంధం విడిచిపెట్టడం)
పాటించేవారు = ఆచరించేవారు
డ్రాయింగు రూం
(Drawing Room) = చావడి, (అతిథులు కూర్చుండే గది)
సంస్కృతీ ప్రదర్శనశాల = సంస్కృతిని తెలిపే ఇల్లు
మౌల్వీలు = ముసల్మాను పండితులు
ముల్లాలు = ముస్లిమ్ పండితులు
మహామహోపాధ్యాయులు = గొప్ప వేదశాస్త్ర పండితులు
ఆహ్వానించడానికి = పిలవడానికి
మూడు, విభిన్నతరాల, చివరి, వారధి = మూడు, వేరు వేరు తరాలకు చివరి వంతెన (మూడు తరాల వారినీ కలిపి ఉంచగలవాడు)
తీర్చిదిద్దారు = రూపుదిద్దారు
సునిశిత మేధ = చురుకైన తెలివి (గొప్పతెలివి)
శాసనసభా నాయకులు = చట్టసభలో నాయకులు
పరిమార్జిత భాష = శుద్ధిచేయబడిన భాష (సంస్కరింపబడిన భాష)
మేళవించి = కలిపి
ఉన్నత ప్రమాణాలను = గొప్ప ప్రమాణాలను
స్మరించుకుంటూ = తలచుకుంటూ
ప్రత్యర్థులను = ఎదుటి పక్షం వారిని (వ్యతిరేక పక్షం వారిని)
కన్నీరు బొట్టు = కన్నీటి చుక్క
రవ్వంత (రవ్వ + అంత) = కొద్దిమాత్రం
పార్లమెంటేరియన్ = ప్రజాప్రతినిధి
(Parliamentarian)
(MLA, MP)
అద్వితీయ కళాకౌశలం = సాటిలేని కళలో నేర్పు
బహుభాషావేత్త = అనేక భాషలు తెలిసినవాడు
అభిరుచులు = ఆసక్తులు
ప్రయివేటుగా (Private) = రహస్యంగా
ఆఫీసు ఫైళ్ళు = కార్యాలయపు దస్త్రాలు
సంస్కృత ప్రాచీన కావ్యాలు = సంస్కృత భాషలోని పూర్వపు కవులు వ్రాసిన ‘రఘువంశం’ వంటి గ్రంథాలు’
బహుముఖ ప్రతిభావంతులు = అనేక రంగాలలో తెలివి కలవారు
సాహితీ జగత్తు = సాహిత్యలోకం
సాహిత్య వ్యాసంగం = సాహిత్యంలో పరిశ్రమ

20వ పేజి

ముట్టని = అంటని
క్షేత్రం = రంగం
అతిశయోక్తి = ఎక్కువగా చెప్పడం
(అతిశయ + ఉక్తి)
సాహిత్యక్షేత్రం = సాహిత్యరంగం
దశాబ్దాలు = పదుల సంవత్సరాలు
స్మృతులను = జ్ఞాపకాలను
గ్రంథస్థం = గ్రంథంలో రాయడం
హితైషులు = మేలును కోరేవారు
ఔదార్యం = గొప్పతనం (దాతృత్వం)
దోష౦ = తప్పు
పరిణమించేది = మారేది
అసాధ్యం = సాధ్యం కానిది
చీదరింపు = ‘ఛీ’ యనడం (కాదు పొమ్మనడం)
పరిష్కరించి ఉండేవారు = చక్కపెట్టేవారు
మలచబడ్డారు = చెక్కబడ్డారు (తీర్చిదిద్దబడ్డారు)
ఉపకారశీలి = ఉపకారం చేసే స్వభావం కలవాడు
ఆత్మీయులైన = తనవారైన
పేరుబడ్డారు = పేరు కెక్కారు
సహచరులు = స్నేహితులు, అనుచరులు
ఓర్మి = సహనం
వేచిఉంటూ = ఎదురు చూస్తూ ఉంటూ
పరిపాటి = పద్ధతి (అలవాటు)
సామాజిక యాత్ర = సంఘానికి సంబంధించిన యాత్ర
సాఫీగా = తిన్నగా
ఒడుదుడుకులు = ఎత్తుపల్లాలు (కష్టస్థితులు)
విపత్కర పరిస్థితులు = ఆపద కలిగే పరిస్థితులు
సేనావాహిని = సేనానది
చలించేవారు = తొందరపడేవారు
మనః స్థైర్యాన్ని = మనస్సులో దృఢత్వాన్ని
సమచిత్తత = సమానమైన మనస్సు కల్గి యుండడం
క్రుంగిపోనూలేదు = అణగిపోలేదు (దిగాలు పడలేదు)
పూర్ణపురుషుల = సంపూర్ణమైన వ్యక్తులు (అన్ని శక్తులూ కలవారు)

పాఠం ఉద్దేశం

సమాజంలో కొద్దిమందే ప్రభావశక్తి సంపన్నులు ఉంటారు. వీరి సాంగత్యం పొందినా, వీరి గురించి తెలుసుకున్నా, స్ఫూర్తి కలుగుతుంది. మంచిమార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. ఇలా స్ఫూర్తిదాయకులైన వారిలో బూర్గుల రామకృష్ణారావు ఒకరు. ఈయన హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి, రాజనీతిజ్ఞుడిగా బహుభాషావేత్తగా పరిపాలనాదక్షుడిగా పేరెన్నికగన్నాడు. ఈయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా పి.వి. నరసింహారావు వ్యాసం రాశాడు, మహోన్నత వ్యక్తిత్వాల నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. గొప్పవారి జీవితాన్ని, వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన, స్ఫూర్తివంతమైన జీవన కోణాలను విశ్లేషిస్తూ, ప్రశంసిస్తూ రాసిన అభినందన వ్యాసం ఇది.
ఈ పాఠ్యభాగం ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక 1972 సం॥పు డిసంబర్ సంచిక నుండి తీసుకొనబడింది.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

రచయిత పరిచయం

వ్యాస రచయిత : పాములపర్తి వేంకట నరసింహారావు (పి.వి. నరసింహారావు)
పాఠ౦ : “నేనెరిగిన బూర్గుల”

రచయిత జన్మస్థలం : వరంగల్లు రూరల్ జిల్లా ‘నర్సంపేట’ మండలంలోని “లక్నేపల్లి” గ్రామంలో జన్మించారు.

దత్తపుత్రుడు : రచయిత, నరసింహారావుగారు, వరంగల్ దగ్గర ‘భీమదేవరపల్లి’ మండలంలోని ‘వంగర’ గ్రామంలోని రుక్మిణమ్మ, రంగారావులకు దత్తపుత్రుడు.
TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 1
రచయిత గురువులు : “స్వామి రామానంద తీర్థ వీరికి గురువు. బూర్గుల రామకృష్ణారావుగారు, ఈ రచయితకు గురుతుల్యులు.

రాజకీయ జీవితం : పి.వి. నరసింహారావుగారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థిగా హైద్రాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొని, విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గురి అయినారు. 1938 లో హైద్రాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు.

శాసన సభ్యత్వం : కరీంనగర్ జిల్లా “మంథని” నియోజక వర్గం నుండి వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్.ఎల్.ఏ.గా ఎన్నికయ్యారు.

మంత్రి పదవులు : అనేక శాఖలకు రాష్ట్రమంత్రిగా పనిచేసి, 1971 73 లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్రమంత్రిగా చాలాకాలం పనిచేసి, చివరకు 1991 96 కాలంలో భారత ప్రధానిగా పనిచేశారు.

రాజనీతిజ్ఞుడు : ఈయన అపరచాణక్యుడు. తన రాజకీయ చాతుర్యంతో, భారత రాజకీయాల్లో గొప్పగా రాణించిన రాజనీతిజ్ఞుడు.

సాహితీసేవ : ఈయన తెలుగుతో సహా 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన బహుభాషావేత్త. తెలుగులో ‘కాకతీయ’ పత్రికను నడిపించాడు. విశ్వనాథ సత్యనారాయణ గారి ‘వేయిపడగలు’ నవలను, ఈయన “సహస్రఫణ్” అనే పేరుతో హిందీలోకి అనువదించాడు. ఈ నవలకు కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఈయన “ఆత్మకథ” అని పేరు కెక్కిన “ఇన్ సైడర్” అనేక భాషల్లోకి అనువదించబడింది. “పన్లక్షతొకొనతో” అనే మరాఠి నవలను, ఈయన తెలుగులో “అబలా జీవితం” అనే పేర అనువదించారు.

వ్యక్తిత్వం : నిరాడంబరజీవితం, నిజాయితీ, దేశభక్తి కలిగినవారు. జీవిత పర్యంతం, నిండు కుండలా స్థితప్రజ్ఞునిగా వెలిగారు.

ప్రవేశిక

ప్రతి మానవునిలోనూ సాధారణంగా ఉన్నదానికంటే తనను గురించి ఘనంగా చిత్రించుకొనే స్వభావం ఉంటూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా ప్రవర్తించేవారు బహు అరుదుగా ఉంటారు. రకరకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నా విపత్కర పరిస్థితులు సేనావాహినిలా చుట్టుముట్టినా చలించకపోవడం, మనః స్థైర్యాన్ని, సమచిత్తాన్ని విడనాడక పోవడం గొప్పవారికే సాధ్యమౌతుంది.

జయాపజయాలను సమానంగా స్వీకరించడం, మిత్రులు సైతం ద్రోహం తలపెట్టినా ప్రత్యర్థులు దూషించినా “సరే ! ఇవన్నీ ఆటలో భాగమేగా !” అని స్థితప్రజ్ఞతను ప్రదర్శించడం అందరికీ సాధ్యమౌతుందా ? మరి ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఎవరు ? ఈ పాఠం ద్వారా తెలుసుకొండి.

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

These TS 10th Class Telugu Bits with Answers 10th Lesson గోలకొండ పట్టణము will help students to enhance their time management skills.

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

బహుళైచ్ఛిక ప్రశ్నలు (\(\frac{1}{2}\) మార్కులు)

PAPER – I: PART – B

1. సొంతవాక్యాలు (1 మార్కు)

1. రూపు రేఖలు : …………
జవాబు:
వంటపనితో మా అక్క రూపురేఖలు మారిపోయాయి.

2. జనసమ్మర్దము : …………
జవాబు:
పండుగల కాలంలో జనసమ్మర్దము విపరీతంగా ఉంటుంది.

3. సత్యహీనుడు : ………….
జవాబు:
లోకంలో సత్యహీనునికి గౌరవ మర్యాదలు దక్కవు.

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

4. మనసు కరుగు : ………..
జవాబు:
పేదలను చూస్తే నా హృదయం, మనసు కరుగుతుంది.

2. అర్ధాలు

ప్రశ్న 1.
గోలకొండ కైవారము చాలా పెద్దది. (గీత గీసిన పదమునకు అర్థం గుర్తించండి.)
A) చుట్టురా
B) దగ్గర
C) లోపల
D) వెలుపల
జవాబు:
A) చుట్టురా

ప్రశ్న 2.
గోలకొండ కోటలోని ఉద్యానవనాలు సొంపు కల్గి ఉంటాయి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) చుట్టూ
B) అందం
C) మేడ
D) గోడ
జవాబు:
B) అందం

ప్రశ్న 3.
బెంగళూరు నగరములో హర్మ్యములు చూడముచ్చటగా ఉంటాయి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) అల్పాహారం
B) చిన్నమేడ
C) ఎత్తైన మేడ
D) క్రీడా సరస్సులు
జవాబు:
C) ఎత్తైన మేడ

ప్రశ్న 4.
పాదుషాలు కేళాకూళులు నిర్మించారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) నేర్పు
B) కష్టం
C) అప్పు
D) క్రీడా సరస్సులు
జవాబు:
D) క్రీడా సరస్సులు

ప్రశ్న 5.
దర్వాజా తెరిచి ఉంది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) కోట
B) ద్వారము
C) కిటికి
D) ఇంటి ముందు
జవాబు:
B) ద్వారము

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 6.
“స్కంధం” అంటే అర్థం
A) విభాగం
B) తోట
C) చెట్టు బోదె
D) బురుజు
జవాబు:
C) చెట్టు బోదె

ప్రశ్న 7.
గోల్కొండలో కౌశల్యము గల శిల్పులు గలరు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) (June ’18)
A) నేర్పు
B) మార్పు
C) కూర్పు
D) చేర్పు
జవాబు:
A) నేర్పు

ప్రశ్న 8.
మిషన్ కాకతీయ పథకంలో తటాకములకు పూర్వవైభవం వచ్చింది. గీతగీసిన పదానికి అర్థం.
A) నది
B) సముద్రం
C) చెరువు
D) వాగు
జవాబు:
C) చెరువు

ప్రశ్న 9.
“మహమ్మారి” అంటే అర్థం
A) గొప్ప మర్రి
B) మరిడమ్మ
C) మశూచి,అమ్మతల్లి
D) తల్లి అమ్మ
జవాబు:
C) మశూచి,అమ్మతల్లి

ప్రశ్న 10.
“రాజసదనము” అంటే అర్థం
A) గుఱ్ఱాలు
B) రాజుగారి గుఱ్ఱము
C) రాజు తోట
D) రాజు మేడ
జవాబు:
D) రాజు మేడ

ప్రశ్న 11.
హిమగిరి సొగసులు మనసుకు ఆనందాన్నిస్తాయి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) నది
B) మంచు
C) జలం
D) పర్వతం
జవాబు:
D) పర్వతం

ప్రశ్న 12.
భారతదేశంలోని ప్రజలు లేమితో నలిగిపోతున్నారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) మోక్షగామి
B) పేదరికం
C) రాచరికము
D) బలిమి
జవాబు:
B) పేదరికం

ప్రశ్న 13.
రాజహర్మ్యము చాలా విశాలంగా ఉన్నది. (గీత గీసిన పదానికి అర్థము గుర్తించండి.)
A) వైపు
B) గుఱ్ఱము
C) రాజభవనం
D) మేడ
జవాబు:
C) రాజభవనం

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 14.
మహిళలు జాతరలో సూడిగములు కొన్నారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) గజ్జెలు
B) బొమ్మలు
C) గాజులు
D) బట్టలు
జవాబు:
C) గాజులు

3. పర్యాయపదాలు

ప్రశ్న 1.
ఏనుగు దంతములు విలువైనవి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) దన్తి, హస్తి
B) లొట్టె, ఉష్ణము
C) నీతి, రీతి
D) కృష్ణ, స్వాద్వి
జవాబు:
A) దన్తి, హస్తి

ప్రశ్న 2.
మేడలు గొప్పగా నిర్మించారు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) స్వాధ్వీ, కృష్ణ
B) లొట్టె, వాసంతము
C) పురము, సౌధము
D) గజం, ఏనుగు
జవాబు:
C) పురము, సౌధము

ప్రశ్న 3.
ఒంటెలు రాజస్థాన్లో ఎక్కువ ఉంటాయి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) లొట్టె, ఉష్ట్రము
B) నీతి, తురగము
C) గుంపు
D) నీళ్ళు, ఎఱ్ఱ తామర
జవాబు:
A) లొట్టె, ఉష్ట్రము

ప్రశ్న 4.
“కోట, ఖిల్లా” అనే పదాలకు పర్యాయపదం గుర్తించండి.
A) దుర్గము
B) పడి
C) కోశం
D) బురుజు
జవాబు:
A) దుర్గము

ప్రశ్న 5.
“మాతంగము, సామజము, హస్తి” అనే పదాలకు పర్యాయపదం గుర్తించండి.
A) ఒంటె
B) భల్లూకము
C) ఏనుగు
D) వేదం
జవాబు:
C) ఏనుగు

ప్రశ్న 6.
గోల్కొండలో మేడలు అందముగా నున్నవి. (గీతగీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) గోడ, కుడ్యము
B) గుడిసె, ఇల్లు
C) పురము, నగరు
D) వనము, అవని
జవాబు:
C) పురము, నగరు

ప్రశ్న 7.
“వాజి, ఘోటకము, హయము” పర్యాయపదాలుగా గలిగిన పదం
A) తరంగము
B) అశ్విని
C) అశ్వము
D) రథము
జవాబు:
C) అశ్వము

ప్రశ్న 8.
“హర్మ్యము” అనే పదానికి పర్యాయపదం కానిది.
A) చోటు
B) భవనము
C) ప్రాసాదము
D) సౌధము
జవాబు:
B) భవనము

ప్రశ్న 9.
“తొడవు, భూషణము, ఆభరణము”. అనే పదానికి పర్యాయపదం గల పదం.
A) మార్గము
B) నగ
C) నాగము
D) రాణులు
జవాబు:
B) నగ

ప్రశ్న 10.
“జింక” అనే పదానికి పర్యాయపదాలు కాని జత
A) ఏణము, కురంగము
B) కురంగము, హరిణము
C) ఇట్టి, మృగము
D) పుండరీకము, అశ్వము
జవాబు:
B) కురంగము, హరిణము

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 11.
గజకర్ణము అంటే విసనకర్ర అని అర్థం (దీనికి పర్యాయ పదాలు కానివి.)
A) వీవన, సురటి
B) ఏనుగు తొండం, గజము
C) రాజు, మదపుటేనుగు
D) తాళము, తాళవనం
జవాబు:
B) ఏనుగు తొండం, గజము

ప్రశ్న 12.
ఈ కిందివానిలో “జైలు” అనే పదానికి పర్యాయపదాలు కానివి.
A) చెరసాల, కటకటాలు
B) కారాగారము, కారాగృహము
C) బందీ, చోరులు
D) ఖైదు, బంధిఖానా
జవాబు:
B) కారాగారము, కారాగృహము

ప్రశ్న 13.
నేస్తము మంచి పుస్తకము వంటివాడు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) మిత్రుడు, చుట్టము
B) నఖుడు, చెలికాడు
C) ఆప్తుడు, బంధువు
D) ఏదీ కాదు
జవాబు:
B) నఖుడు, చెలికాడు

ప్రశ్న 14.
మిత్రుడు లేనివాడు అరణ్యంలోని గుడ్డి జంతువు లాంటివాడు. గీత గీసిన పదానికి సరియైన పర్యాయ పదాలు ఏవి ?
A) నేస్తము, చెలికాడు
B) మిత్రుము, కళత్రము
C) రవి, చంద్రుడు
D) మైత్రి, సుమిత్ర
జవాబు:
A) నేస్తము, చెలికాడు

ప్రశ్న 15.
గుడి, దేవాలయం అనే పర్యాయపదాల్ను మాట (June ’18)
A) వెన్నెల
B) కోవెల
C) సదనం
D) మహీరుహము
జవాబు:
B) కోవెల

ప్రశ్న 16.
……….వారు కొత్త గృహములోనికి ప్రవేశించారు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) ఇల్లు, మేడ
B) పాక, మందిరం
C) ఇల్లు, మందిరం
D) ఇల్లు, దేవాలయం
జవాబు:
A) ఇల్లు, మేడ

ప్రశ్న 17.
తరువు, మహీరుహం – అనే పర్యాయపదాలు గల మాట. (Mar. ’17)
A) చెట్టు
B) కొండ
C) చెరువు
D) చెలిమి
జవాబు:
A) చెట్టు

4. వ్యుత్పత్త్యర్థాలు

ప్రశ్న 1.
“రాజు నివసించు ప్రధాన పట్టణము”. (దీనికి సరిపడు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)
A) భవనము
B) అంతఃపురము
C) నందనం
D) రాజధాని
జవాబు:
D) రాజధాని

ప్రశ్న 2.
సంతోష పెట్టునది. (దీనికి సరిపడు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)
A) నందనం
B) భవనం
C) రాజధాని
D) తానము
జవాబు:
A) నందనం

ప్రశ్న 3.
మనస్సును హరించునది. (దీనికి సరిపడు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)
A) నందనం
B) భవనం
C) రాజధాని
D) హర్మ్యము
జవాబు:
D) హర్మ్యము

ప్రశ్న 4.
“భాషింపబడునది” దీనికి వ్యుత్పత్తి పదం
A) జలధి
B) సరస్వతి
C) భాష
D) తెలుగు
జవాబు:
C) భాష

ప్రశ్న 5.
“ఆజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు” – దీనికి వ్యుత్పత్తి పదం
A) గురువు
B) బ్రహ్మ
C) శివుడు
D) నారదుడు
జవాబు:
A) గురువు

ప్రశ్న 6.
మనస్సును హరించునది – అను వ్యుత్పత్తి గల పదము
A) కుసుమము
B) హర్మ్యము
C) జట
D) మహిళ
జవాబు:
B) హర్మ్యము

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 7.
ప్రజలను రంజింపచేయువాడు – వ్యుత్పత్తి గల పదము
A) రాజు
B) కళాకారుడు
C) హంతకుడు
D) రంజనం
జవాబు:
A) రాజు

ప్రశ్న 8.
దౌవారికుడు – అనే పదానికి సరియైన వ్యుత్పత్త్యర్థం
A) రెండుసార్లు వారించువాడు
B) సేవలు చేయువాడు
C) ద్వారమును కాపాడువాడు
D) మనుమని మనుమడు
జవాబు:
C) ద్వారమును కాపాడువాడు

ప్రశ్న 9.
వేదములను విభజించినవాడు (వ్యుత్పత్తి పదం)
A) వేదవ్యాసుడు
B) పారాశర్యుడు
C) వేదకర్త
D) వ్యాసుడు
జవాబు:
D) వ్యాసుడు

ప్రశ్న 10.
‘చర్యలను కనిపెట్టి చూచేవాడు’ అనే వ్యుత్పత్యర్థాన్ని కలిగి వున్న పదం ఏది ?
A) ఆచార్యుడు
B) అధ్యక్షుడు
C) కార్యదర్శి
D) క్రియాశీలి
జవాబు:
B) అధ్యక్షుడు

ప్రశ్న 11.
తిధి నియమాలు లేకుండా భోజన సమయానికి వచ్చేవాడు. (వ్యుత్పత్యర్థ పదం)
A) భోజనార్ధి
B) భిక్షార్ధి
C) అతిధి
D) భాగ్యతి
జవాబు:
C) అతిధి

5. నానార్థాలు

ప్రశ్న 1.
గోలకొండ పట్టణం ఎంతో అందమైనది. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) వస్త్రము, రాజధాని
B) గుంపు, రాపిడి
C) నీతి, తురగం
D) దన్తి, హస్తి
జవాబు:
A) వస్త్రము, రాజధాని

ప్రశ్న 2.
హైదరాబాద్ నగరంలో జన సమ్మర్థం ఎక్కువ. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) వగిజుడు, వర్తకుడు
B) రాపిడి, గుంపు
C) నగరు, పాదం
D) లొట్టె, ఉష్ట్రము
జవాబు:
B) రాపిడి, గుంపు

ప్రశ్న 3.
మనిషికి జీవనాధారము జలం. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) గుంపు, రీతి
B) రాజధాని, నగరం
C) నీళ్ళు, ఎఱ్ఱతామర
D) యుద్ధం, రణం
జవాబు:
C) నీళ్ళు, ఎఱ్ఱతామర

ప్రశ్న 4.
శిఖరము (అన్న పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) అగ్రము, మండపము
B) వాయువు, స్తంభము
C) హిమము, ఇగము
D) అండ, బంఢ
జవాబు:
A) అగ్రము, మండపము

ప్రశ్న 5.
గాలివానలో ప్రయాణం సాగదు. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) వాయువు, మండపం
B) వాయువు, పిశాచము
C) బద్దె, విద్దె
D) దక్షిణము, దక్కినము
జవాబు:
B) వాయువు, పిశాచము

ప్రశ్న 6.
వజ్రాలహారాన్ని మైసమ్మకు సమర్పించారు. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) రత్నము, ఆకాశము
B) కోరిక, దిక్కు
C) రత్నములలో ఒకటి, పిడుగు
D) కోరిక, రత్నము
జవాబు:
C) రత్నములలో ఒకటి, పిడుగు

ప్రశ్న 7.
అంబరం (అన్న పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) వస్త్రము, ఆకాశము
B) కోరిక, కీర్తి
C) అధికం, హారము
D) వాన, దేశం
జవాబు:
A) వస్త్రము, ఆకాశము

ప్రశ్న 8.
వాన, సంవత్సరం (అనే నానార్థాలనిచ్చే పదం)
A) నేల
B) వర్షం
C) శరీరం
D) దిక్కు
జవాబు:
B) వర్షం

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 9.
పుణ్యక్షేత్రం పదానికి నానార్థాలు
A) చోటు, పుణ్యస్థానం
B) కోరిక, నేల
C) ఆకాశము, కీర్తి
D) భూమి, దేశము
జవాబు:
A) చోటు, పుణ్యస్థానం

ప్రశ్న 10.
“ఉదాహరణము” – అనే పదానికి నానార్థాలు
A) దృష్టాంతము, ఉపమానము
B) నాటకభేదము, దొంగతనము
C) ప్రమాణము, ప్రణామము
D) వృథా, మికిలి
జవాబు:
A) దృష్టాంతము, ఉపమానము

ప్రశ్న 11.
‘శుక్రుడు, కావ్య రచయిత’ ఈ నానార్థాలు కలిగిన సరియైన పదం ఏది ?
A) గ్రంథకర్త
B) కావ్యకర్త
C) కవి
D) ఒక గ్రహణ
జవాబు:
A) గ్రంథకర్త

ప్రశ్న 12.
‘ప్రీతి’కి నానార్థాలు ఏవి ?
A) అభిమానం, దయ
B) ప్రతీత, పాత్ర
C) కీర్తి, క్రాంతి
D) ప్రఖ్యాతి, కాంతి
జవాబు:
D) ప్రఖ్యాతి, కాంతి

ప్రశ్న 13.
కవిత, విద్దె, కబ్బం, విద్య, కావ్యం, కైత – ఈ పదాల్లోని ప్రకృతి పదాలు (Mar. ’18)
A) కవిత, కావ్యం, కైత
B) విద్దె, కావ్యం, కవిత
C) కవిత, విద్య, కావ్యం
D) కబ్బం, కైత, విద్య
జవాబు:
C) కవిత, విద్య, కావ్యం

6. ప్రకృతి – వికృతులు

ప్రశ్న 1.
మా ప్రాంతము చాలా రద్దీగా ఉంటుంది. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) పొంత
B) దమ్మము
C) తానము
D) చోటు
జవాబు:
A) పొంత

ప్రశ్న 2.
స్నానముల గదులు చూడముచ్చటగానున్నవి. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) దమ్మము
B) తానము
C) పొంత
D) విద్య
జవాబు:
B) తానము

ప్రశ్న 3.
పూలరేఖలా? (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) లేఖ
B) లేక
C) రేక
D) రెమ్మ
జవాబు:
C) రేక

ప్రశ్న 4.
రాజు కొన్నది, రత్నము కాదా ? (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) రాయలు
B) రాడు
C) రోజు
D) తరాజు
జవాబు:
A) రాయలు

ప్రశ్న 5.
గీము, ఇంతి పదానికి వికృతి పదాలు గుర్తించండి.)
A) గీచు, స్త్రీ
B) గృహము, స్త్రీ’
C) గృహము, శ్రీ
D) గ్రహము, స్త్రీ
జవాబు:
B) గృహము, స్త్రీ’

ప్రశ్న 6.
మా వీథిలో దేవుని గుడి ఉంది (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) వీథులందు
B) వీదిలో
C) బాటలో
D) బజారులో
జవాబు:
B) వీదిలో

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 7.
“ఉష్ట్రము” ప్రకృతి అయితే వికృతి పదం
A) ఊపిరి
B) రాష్ట్రము
C) ఒంటె
D) ఒంటెలు
జవాబు:
C) ఒంటె

ప్రశ్న 8.
“అచ్చెరువు” అనే పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) ఆశ్చర్యము
B) అబ్బురము
C) అభ్రము
D) అక్కర
జవాబు:
A) ఆశ్చర్యము

ప్రశ్న 9.
“దేవాలయము” అనే పదానికి వికృతి పదం గుర్తించండి.
A) దేవరయిల్లు
B) దేవళము
C) దేశము
D) గుడి
జవాబు:
B) దేవళము

ప్రశ్న 10.
గురువు ఆజ్ఞ పాటిస్తే మేలు గీతగీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) ఆన
B) ఆగ్న
C) అనుమతి
D) ఆలోచన
జవాబు:
A) ఆన

ప్రశ్న 11.
ఆమెకు ప్రాణభీతి లేదు. గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) భయం
B) బయం
C) బీతు
D) ప్రీతి
జవాబు:
C) బీతు

ప్రశ్న 12.
మృగమును బంధించుము. గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) మృగము
B) మెకము
C) మృగ
D) మేక
జవాబు:
B) మెకము

ప్రశ్న 13.
తల్లి బిడ్డలను ప్రేమించడం సహజం. గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
A) సైతం
B) అసహజం
C) సమాజం
D) సాజం
జవాబు:
D) సాజం

ప్రశ్న 14.
మిషన్ కాకతీయ పథకంలో తటాకములకు పూర్వ వైభవం వచ్చింది. గీతగీసిన పదానికి అర్థం. (June ’18)
A) నది
B) సముద్రం
C) చెరువు
D) వాగు
జవాబు:
B) సముద్రం

భాషాంశాలు (వ్యాకరణం)

PAPER – II : PART – B

1. సంధులు

ప్రశ్న 1.
రమ్యోద్యానములు (సంధి గుర్తించండి.)
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణ సంధి
C) యణాదేశ సంధి
D) త్రిక సంధి
జవాబు:
B) గుణ సంధి

ప్రశ్న 2.
అత్యంత ఏ సంధి ?
A) త్రిక సంధి
B) యణాదేశ సంధి
C) అకార సంధి
D) ఉకార సంధి
జవాబు:
B) యణాదేశ సంధి

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 3.
ఏకైక ఏ సంధి ?
A) అకార సంధి
B) త్రిక సంధి
C) లులనల సంధి
D) వృద్ధి సంధి
జవాబు:
D) వృద్ధి సంధి

ప్రశ్న 4.
“వాజఙ్మయము” విడదీయగా
A) వాక్ + మయము
B) వాగ్ + మయం
C) వాక్ + మయ
D) వాజ్మయ + ము
జవాబు:
A) వాక్ + మయము

ప్రశ్న 5.
‘శస్త్రాదులు’ ఏ సంధి ?
A) త్రిక సంధి
B) ఆమ్రేడిత సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) అకార సంధి
జవాబు:
C) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 6.
క్రమాభివృద్ధి – విడదీయండి.
A) క్రమ + అభివృద్ధి
B) క్రమాః + అభివృద్ధిః
C) క్రమాఅ + భివృద్ధి
D) క్రమాభి + వృద్ధి
జవాబు:
A) క్రమ + అభివృద్ధి

ప్రశ్న 7.
ద్రాక్షాసవము – విడదీయండి.
A) ద్రాక్ష + సవము
B) ద్రాక్ష + ఆసవము
C) ద్రాక్షా + స్తవము
D) ద్రాక్షాస + వము
జవాబు:
B) ద్రాక్ష + ఆసవము

ప్రశ్న 8.
ధనాగారము విడదీయండి.
A) ధనా + ఆగారము
B) ధనుస్సు + ఆగారము
C) ధన + ఆగారము
D) ధనః + ఆగారః
జవాబు:
C) ధన + ఆగారము

ప్రశ్న 9.
రమ్యోధ్యానములు – విడదీయండి.
A) రమ్యః + ధ్యానములు
B) రమ్య + ఉద్యానములు
C) రమ్యః + ఉధ్యానములు
D) రామ్య + ఉదధి + ధానములు
జవాబు:
B) రమ్య + ఉద్యానములు

ప్రశ్న 10.
రాజోద్యోగులు – విడదీయండి.
A) రాజ + సద్యోగులు
B) రాజ్యః + ఉద్యోగులు
C) రాజ + ఉద్యోగులు
D) రాజోద్యో + గులు
జవాబు:
C) రాజ + ఉద్యోగులు

ప్రశ్న 11.
క్రింది వానిలో సవర్ణదీర్ఘ సంధి కాని పదం ఏది ?
A) భిక్షాపాత్ర
B) ధనాపహరణం
C) సర్వాపదలు
D) శోకాగ్ని
జవాబు:
A) భిక్షాపాత్ర

ప్రశ్న 12.
అమ్మకు పిల్లలపై ప్రేమ అత్యంతము. (గీత గీసిన పదాన్ని విడదీయండి.)
A) అ + అంతము
B) అత్య + అంతము
C) అతి + అంతము
D) అత్యంత + అంతము
జవాబు:
C) అతి + అంతము

ప్రశ్న 13.
‘ఎల్లెడల’ పదాన్ని విడదీయండి.
A) ఎల్లె + డల
B) ఎల్లన్ + ఎడల
C) ఎల్ల + ఎడల
D) ఏ + వెడల
జవాబు:
C) ఎల్ల + ఎడల

ప్రశ్న 14.
క్రింది వానిలో ద్వంద్వ సమాసం కానిదేది ?
A) జవసత్త్వాలు
B) సమస్త కార్యాలు
C) పెట్టువోతలు
D) తాతాముత్తాతలు
జవాబు:
B) సమస్త కార్యాలు

2. సమాసాలు

ప్రశ్న 1.
గోలకొండ పట్టణము ఏ సమాసము ?
A) ద్విగువు
B) ద్వంద్వం
C) చతుర్థీ తత్పురుష
D) సంభావనా పూర్వపద కర్మధారయం
జవాబు:
B) ద్వంద్వం

ప్రశ్న 2.
పెంపుసొంపులు – ఏ సమాసము ?
A) ద్వంద్వ
B) విశేషణ పూర్వపద కర్మధారయం
C) ద్విగువు
D) బహువ్రీహి
జవాబు:
A) ద్వంద్వ

ప్రశ్న 3.
ఏడుమైళ్ళు ఏ సమాసము ?
A) బహువ్రీహి
B) ద్విగువు
C) ద్వంద్వం
D) చతుర్థీ తత్పురుష
జవాబు:
B) ద్విగువు

ప్రశ్న 4.
హైదరాబాద్ అను పేరు గల నగరము. (సమాసంగా మార్చండి.)
A) హైదరాబాదు నగరం
B) హైదరాబాద్ యొక్క నగరం
C) హైదర్ నగరం
D) హైదరాబాద్
జవాబు:
A) హైదరాబాదు నగరం

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 5.
‘యుద్ధభీతి’ అను మాటకు విగ్రహవాక్యం (June ’18)
A) యుద్ధము వలన భీతి
B) యుద్ధము అనెడి భీతి
C) యుద్ధమునకు భీతి
D) యుద్ధము వంటి భీతి
జవాబు:
A) యుద్ధము వలన భీతి

ప్రశ్న 6.
“చక్రపాణి” ఏ సమాసం ?
A) ద్వంద్వం
B) బహువ్రీహి
C) తృతీయా తత్పురుష
D) చతుర్థీ తత్పురుష
జవాబు:
B) బహువ్రీహి

ప్రశ్న 7.
అన్యపదార్థ ప్రాధాన్యం కల సమాసం
A) ద్వంద్వం
B) తృతీయా తత్పురుష
C) చతుర్థీ తత్పురుష
D) బహువ్రీహి
జవాబు:
D) బహువ్రీహి

ప్రశ్న 8.
ద్వంద్వ సమాసానికి ఉదాహరణ
A) పెంపుసొంపులు
B) రూపురేఖలు
C) స్నానమందిరములు
D) నలుమూలలు
జవాబు:
C) స్నానమందిరములు

ప్రశ్న 9.
షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణ
A) రాజభవనాలు
B) ప్రజా సముదాయము
C) వెండి పూత
D) పెంపుసొంపులు
జవాబు:
A) రాజభవనాలు

ప్రశ్న 10.
చతుర్థీ తత్పురుష సమాసానికి ఉదాహరణ
A) రెండు బారకాసులు
B) బంజారా దర్వాజ
C) విహార భూమి
D) రెండు లక్షలు
జవాబు:
C) విహార భూమి

ప్రశ్న 11.
ద్విగు సమాసానికి ఉదాహరణ (June ’18)
A) కూరగాయలు
B) నాలుగు రోడ్లు
C) అమ్మఒడి
D) మహావృక్షం
జవాబు:
B) నాలుగు రోడ్లు

ప్రశ్న 12.
“భోగము నందు లాలసత్వం గలవారు.” – విగ్రహ వాక్యానికి సరియైన సమాసము పేరు
A) సప్తమీ తత్పురుష సమాసము
B) బహువ్రీహి సమాసము
C) అవ్యయీభావ సమాసము
D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
జవాబు:
B) బహువ్రీహి సమాసము

ప్రశ్న 13.
నిర్మాణము కొఱకు పథకములు వేసిరి గీత గీసిన ప్రత్యయము ఏ విభక్తికి సంబంధించినది ?
A) తృతీయా విభక్తి
B) సప్తమీ విభక్తి
C) చతుర్ధి విభక్తి
D) షష్ఠీ విభక్తి
జవాబు:
C) చతుర్ధి విభక్తి

ప్రశ్న 14.
కింది వానిలో ద్విగు
A) ముజ్జగములు
B) వేయిస్తంభాలు
C) 300 సంవత్సరాలు
D) ముక్కంటి
జవాబు:
B) వేయిస్తంభాలు

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 15.
వివేకహీనుడు ప్రమాదం తెస్తాడు. విగ్రహవాక్యం ఏది ?
A) వివేకము యొక్క హీనుడు
B) వివేకమునందు హీనుడు
C) వివేకము హీనముగా కలవాడు
D) వివేకము చేత హీనుడు
జవాబు:
D) వివేకము చేత హీనుడు

ప్రశ్న 16.
‘యశస్సు అనెడి వసనము’ – సమాసపదంగా మారిస్తే,
A) యశఃవసనము
B) యశావసనము
C) యశోవసనము
D) యశస్వసనము
జవాబు:
C) యశోవసనము

ప్రశ్న 17.
అస్థిరమైన భావంతో పని చేయకూడదు – సమాస పదం ?
A) స్థిరభావం
B) అస్థిర భావం
C) అస్థిరము భావం
D) ఆస్థిర భావం
జవాబు:
B) అస్థిర భావం

ప్రశ్న 18.
పంచమీ తత్పురుష సమాసానికి ఉదాహరణ (Mar. ’18)
A) గురుదక్షిణ
B) సత్యనిష్ట
C) దొంగభయము
D) నెలతాల్పు
జవాబు:
C) దొంగభయము

3. ఛందస్సు

ప్రశ్న 1.
U I U – ఇది ఏ గణము ?
A) రగణం
B) భగణం
C) జగణం
D) తగణం
జవాబు:
A) రగణం

ప్రశ్న 2.
నగణం – దీనికి గణాలు గుర్తించండి.
A) U I I
B) U U U
C) I I I
D) I U U
జవాబు:
C) I I I

ప్రశ్న 3.
వృద్ధుడు – ఇది ఏ గణం ?
A) భగణం
B) నగణం
C) యగణం
D) సగణం
జవాబు:
A) భగణం

ప్రశ్న 4.
ఇంద్రగణాలు ఎన్ని ?
A) 3
B) 6
C) 4
D) 7
జవాబు:
B) 6

ప్రశ్న 5.
భ-ర-న-భ-భ-ర-వ గణాలు ఏ పద్యపాదానికి చెందినవి
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) శార్దూలం
D) మత్తేభం
జవాబు:
B) ఉత్పలమాల

ప్రశ్న 6.
సూర్యగణాలు ఎన్ని ?
A) 3
B) 4
C) 5
D) 2
జవాబు:
D) 2

ప్రశ్న 7.
‘సారము’ ఇది ఏ గణము ?
A) ‘స’ గణం
B) ‘భ’ గణం
C) ‘య’ గణం
D) ‘త’ గణం
జవాబు:
B) ‘భ’ గణం

4. అలంకారాలు

ప్రశ్న 1.
మావిడాకులు తెచ్చివ్వండి – అలంకారం గుర్తించండి.
A) శ్లేషాలంకారం
B) ఉపమా
C) రూపకం
D) ఉత్ప్రేక్ష
జవాబు:
A) శ్లేషాలంకారం

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 2.
రాజు కువలయానందకరుడు – అలంకారం గుర్తించండి.
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) శ్లేషాలంకారం
జవాబు:
D) శ్లేషాలంకారం

ప్రశ్న 3.
హిమాలయ పర్వతాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అలంకారం గుర్తించండి.
A) శ్లేషాలంకారం
B) ఉపమాలంకారం
C) ఉత్ప్రేక్ష
D) అతిశయోక్తి
జవాబు:
D) అతిశయోక్తి

ప్రశ్న 4.
జింకలు బిత్తరి చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున దూకుతున్నాయి – ఏ అలంకారం ?
A) స్వభావోక్తి
B) ఉపమా
C) రూపకం
D) ఉత్ప్రేక్ష
జవాబు:
A) స్వభావోక్తి

ప్రశ్న 5.
‘కమలాక్షునర్పించు కరములు కరములు’ ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి.
A) లాటానుప్రాస
B) ముక్తపదగ్రస్తము
C) యమకము
D) ఉపమాలంకారము
జవాబు:
A) లాటానుప్రాస

ప్రశ్న 6.
ముఖము చంద్రునివలె మనోహరముగా ఉన్నది ఇందులో సమాన ధర్మపదం ఏది ?
A) వలె
B) చంద్రుడు
C) మనోహరము
D) ముఖము
జవాబు:
C) మనోహరము

5. వాక్య పరిజ్ఞానం

ప్రశ్న 1.
వృద్ధుడు ఆశ్రమంబున నుండె దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) వృద్ధుడు ఆశ్రమంలో ఉన్నాడు
B) ఉండెను ఆశ్రమంబున వృద్ధుడు
C) వృద్ధునిచే ఆశ్రమంబున నుండె
D) ఆశ్రమంబుననుండె వృద్ధుడు
జవాబు:
A) వృద్ధుడు ఆశ్రమంలో ఉన్నాడు

ప్రశ్న 2.
విద్యార్థి వృద్ధునికి నమస్కరించె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) విద్యార్థి వినయంబున నమస్కరించే వృద్ధునికి
B) విద్యార్థి వృద్ధునికి నమస్కరించాడు
C) నమస్కరించె విద్యార్థి వృద్ధునికి
D) వృద్ధునిచే నమస్కరించబడియె విద్యార్థి
జవాబు:
B) విద్యార్థి వృద్ధునికి నమస్కరించాడు

ప్రశ్న 3.
విద్యార్థులు విద్యను ఆర్జించవలె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) విద్యార్థులను విద్యను నార్జించాలి
B) విద్యార్థులు విద్యను ఆర్జించాలి.
C) విద్యార్థులతో విద్య నార్జింపవలె
D) విద్యార్థుల వల్ల విద్య నార్జించాలి.
జవాబు:
B) విద్యార్థులు విద్యను ఆర్జించాలి.

ప్రశ్న 4.
‘నాకు చదువు రావాలి’ అని బాలుడు అన్నాడు. దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) బాలుని వల్ల చదువు రావాలని అన్నాడు.
B) చదువు రావాలని తాను బాలుడు చెప్పుకున్నాడు
C) బాలుడు చదువు రావాలని చెప్పాడు.
D) తనకు చదువు రావాలని బాలుడు అన్నాడు
జవాబు:
D) తనకు చదువు రావాలని బాలుడు అన్నాడు

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 5.
వృద్ధుడు ఆశ్రమమును కట్టించెను. దీనికి ఆధునిక వాక్యాన్ని గుర్తించండి.
A) ఆశ్రమమును వృద్ధునికే నిర్మించాడు.
B) వృద్ధుడు ఆశ్రమాన్ని కట్టించాడు
C) వృద్ధునిచే ఆశ్రమము కట్టించబడెను
D) వృద్ధుడు ఆశ్రమం కట్టించెను
జవాబు:
B) వృద్ధుడు ఆశ్రమాన్ని కట్టించాడు

ప్రశ్న 6.
అడ్డంకి గంగాధర కవిచే తపతీ సంవరణోపాఖ్యానం రచించబడింది. ఈ వాక్యం (June ’18)
A) ప్రత్యక్ష వాక్యం
B) పరోక్ష వాక్యం
C) కర్మణి వాక్యం
D) కర్తరి వాక్యం
జవాబు:
C) కర్మణి వాక్యం

ప్రశ్న 7.
లోభము మోహమును బుట్టించును – ఈ వాక్యానికి ఆధునిక వచనం గుర్తించండి.
A) లోభమునే మోహంబును బుట్టించును
B) లోభాద్మోహముత్పాద్యతి
C) లోభం మోహాన్ని పుట్టిస్తుంది.
D) లోభముతో మోహంబును బుట్టును
జవాబు:
D) లోభముతో మోహంబును బుట్టును

ప్రశ్న 8.
విద్యార్థి భక్తిగ నమస్కరించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) విద్యార్థికి భక్తిగ నమస్కరించాడు.
B) విద్యార్థితో భక్తిగ నమస్కరింపబడియె
C) విద్యార్థి వల్ల భక్తిగ నమస్కరింపబడెను
D) విద్యార్థి కొరకు భక్తిగ నమస్కరించాడు
జవాబు:
B) విద్యార్థితో భక్తిగ నమస్కరింపబడియె

ప్రశ్న 9.
వృద్ధుని చేత బాలుడు రక్షించబడెను – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.
A) విద్యార్థి బాలుడిని రక్షించాడు
B) విద్యార్థి వల్ల బాలుడిచే రక్షింపబడియె
C) విద్యార్థి వలన బాలునికి రక్షించబడెను
D) విద్యార్థికి బాలుడి యందు రక్షించాడు
జవాబు:
A) విద్యార్థి బాలుడిని రక్షించాడు

ప్రశ్న 10.
విద్యార్థి చక్కగా చదివాడు గుర్తించండి. – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) విద్యార్థి వలన చక్కగా చదివించబడియె
B) విద్యార్థికి చక్కగా చదివింపబడెను
C) విద్యార్థికి చక్కగా చదివించెను
D) విద్యార్థి చేత చక్కగా చదువబడెను
జవాబు:
D) విద్యార్థి చేత చక్కగా చదువబడెను

ప్రశ్న 11.
తల పాదాల మీద ఆనించబడింది – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.
A) తల పాదముల యందు ఆనింతును
B) పాదాల మీద తలను ఆనించాడు.
C) పాదాలకు తలను ఆనించాడు.
D) పాదాల యొక్క ఆనించాడు తలపై
జవాబు:
A) తల పాదముల యందు ఆనింతును

ప్రశ్న 12.
ఆయన ఓర్పు వహించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) ఓర్పు ఆయనతో వహించును
B) ఓర్పు ఆయనకు వహించబడును
C) ఓర్పు ఆయనచేత వహించబడినది
D) ఓర్పు ఆయన వల్ల వహించాడు.
జవాబు:
C) ఓర్పు ఆయనచేత వహించబడినది

ప్రశ్న 13.
ముగ్గురు రచయిత్రులచే ‘పీఠిక’ వ్రాయబడింది.దీనికి కర్మణి వాక్యం గుర్తించండి. (A.P (SA – I)2016)
A) ముగ్గురు రచయిత్రులూ పీఠిక రాయలేదు.
B) పీఠిక ముగ్గురు రచయిత్రులచే రాయబడింది
C) పీఠికను ముగ్గురు రచయిత్రులు వ్రాశారు
D) పీఠిక ముగ్గురు రచయిత్రులు రాసేశారు
జవాబు:
C) పీఠికను ముగ్గురు రచయిత్రులు వ్రాశారు

ప్రశ్న 14.
‘నాకు గురుభక్తి ఎక్కువ’ అని రవి అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) వానికి గురుభక్తి ఎక్కువగా రవి చెప్పాడు.
B) తనకు గురుభక్తి ఎక్కువని రవి అన్నాడు
C) వానికి గురుభక్తి అధికంబని రవి చెప్పాడు
D) అతని యందు గురుభక్తి ఎక్కువని చెప్పాడు
జవాబు:
B) తనకు గురుభక్తి ఎక్కువని రవి అన్నాడు

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 15.
‘అందరూ చదవాలి’ అని ప్రభుత్వం చెప్పింది – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) అందరిచే చదువబడెనని ప్రభుత్వం చెప్పింది
B) అందరిని చదవాలని ప్రభుత్వం చెప్పింది
C) అందరు చదవాలని ప్రభుత్వం చెప్పింది
D) ప్రభుత్వం చెప్పడం వల్ల అందరు చదివారని చెప్పారు
జవాబు:
C) అందరు చదవాలని ప్రభుత్వం చెప్పింది

ప్రశ్న 16.
“నాకు ఆనందం కలిగింది అని బాలుడు అన్నాడు. – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) తనకు ఆనందం కలిగిందని బాలుడు అన్నాడు
B) తనకు ఆనందం కలగాలని బాలుడు చెప్పాడు
C) తనకు ఆనందం కలుగవచ్చు బాలుడు అన్నాడు.
D) బాలుడు తనకు ఆనందం కలుగవచ్చునని చెప్పాడు
జవాబు:
A) తనకు ఆనందం కలిగిందని బాలుడు అన్నాడు

ప్రశ్న 17.
“నాకు కన్నీళ్ళు వచ్చాయి” అని విద్యార్థి అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) వానికి కన్నీళ్ళు వచ్చాయని విద్యార్థి అన్నాడు.
B) తనకు కన్నీళ్ళు వచ్చాయని బాలుడు చెప్పుకున్నాడు
C) తనకు కన్నీళ్ళు వచ్చాయని విద్యార్థి అన్నాడు.
D) కన్నీళ్ళు నేను పెట్టుకున్నానని విద్యార్థి అన్నాడు
జవాబు:
C) తనకు కన్నీళ్ళు వచ్చాయని విద్యార్థి అన్నాడు.

ప్రశ్న 18.
నేను నీతో “నేను రాను” అని చెప్పాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) అతనితో తాను రానని చెప్పుకున్నాడు.
B) నేను నీతో రానని చెప్పాడు
C) తనతో నేను రానన్నాడు.
D) వానితో నేను రానన్నాడు.
జవాబు:
B) నేను నీతో రానని చెప్పాడు

ప్రశ్న 19.
అడవులను నరకవద్దు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) ధాత్వర్థక వాక్యం
B) నిశ్చయార్థక వాక్యం
C) నిషేధార్థక వాక్యం
D) హేత్వర్థక వాక్యం
జవాబు:
C) నిషేధార్థక వాక్యం

ప్రశ్న 20.
బాగా చదివి ఉండడం వల్ల మార్కులు వచ్చాయి. ఇది ఏ రకమైన వాక్యం ?
A) సందేహార్థక వాక్యం
B) హేత్వర్థక వాక్యం
C) అప్యర్థక వాక్యం
D) నిశ్చయార్థక వాక్యం
జవాబు:
B) హేత్వర్థక వాక్యం

ప్రశ్న 21.
నాయనా ! చిరకాలం వర్థిల్లు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) హేత్వర్థక వాక్యం
B) అప్యర్థక వాక్యం
C) నిశ్చయార్థక వాక్యం
D) ఆశీర్వచనార్థక వాక్యం
జవాబు:
D) ఆశీర్వచనార్థక వాక్యం

ప్రశ్న 22.
‘ఆయన డాక్టరా ? ప్రొఫెసరా ?’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.
A) సంక్లిష్ట వాక్యం
B) సామాన్య వాక్యం
C) సంయుక్త వాక్యం
D) అప్యర్థక వాక్యం
జవాబు:
C) సంయుక్త వాక్యం

ప్రశ్న 23.
‘నీరు లేక పంటలు పండలేదు’ – ఇది ఏరకమైన వాక్యం ?
A) సందేహార్థక వాక్యం
B) హేత్వర్థక వాక్యం
C) విధ్యర్థక వాక్యం
D) నిషేధార్థక వాక్యం
జవాబు:
B) హేత్వర్థక వాక్యం

ప్రశ్న 24.
రాజేష్ అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడగలడు (ఇది ఏరకమైన వాక్యమో గుర్తించండి.)
A) సంభావనార్థం
B) సామర్ధ్యార్థకం
C) చేదర్థకం
D) భావార్థకం
జవాబు:
B) సామర్ధ్యార్థకం

ప్రశ్న 25.
ఆ ఎత్తు మీద అతను కూర్చున్నాడా ! ఇది ఏరకమైన వాక్యం ?
A) ప్రశ్నార్థక
B) సామర్థ్యార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) విధ్యర్థకం
జవాబు:
C) ఆశ్చర్యార్థకం

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 26.
సన్యాసి చెప్పింది విని ఖిన్నుడనైతి. దీనికి ఆధునిక వాక్యం ఏది ?
A) ఖిన్నుడనైతిని చెప్పింది విని సన్యాసి
B) చెప్పింది విని సన్యాసి
C) సన్యాసి చెప్పింది విని ఖిన్నుడిని అయ్యాను
D) సన్యాసి చెప్పగా విన్నాను, ఖిన్నుడనయ్యాను
జవాబు:
C) సన్యాసి చెప్పింది విని ఖిన్నుడిని అయ్యాను

ప్రశ్న 27.
నదులలోని నీరు ప్రవహించును. ఇది ఏ రకమైన వాక్యం ?
A) నిషేధార్థక వాక్యం
B) తద్ధర్మార్థక వాక్యం
C) ప్రశ్నార్థక వాక్యం
D) విధ్యర్థక వాక్యం
జవాబు:
B) తద్ధర్మార్థక వాక్యం

ప్రశ్న 28.
తనకు చాలా ముఖ్యమైన పని యుందని రాము అన్నాడు దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి.
A) వానికి ముఖ్యమైన పని ఉందని రాము అన్నాడు.
B) ముఖ్యమైన పని నేను చేయాలి అని రాము అన్నాడు.
C) “నాకు చాలా ముఖ్యమైన పని ఉంది” అని రాము అన్నాడు.
D) “నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను” అని రాము అన్నాడు.
జవాబు:
B) ముఖ్యమైన పని నేను చేయాలి అని రాము అన్నాడు.

ప్రశ్న 29.
రామం తప్పక వెళ్తాడు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) హేత్వర్థక వాక్యం
B) నిశ్చయార్థక వాక్యం
C) తుమున్నర్థక వాక్యం
D) ప్రార్థనార్థక వాక్యం
జవాబు:
B) నిశ్చయార్థక వాక్యం

ప్రశ్న 30.
పిల్లలు పల్లెలకు వెళ్ళవచ్చు. – ఇది ఏ రకమైన వాక్యం ?
A) ప్రార్థనార్థక వాక్యం
B) అనుమత్యర్థక వాక్యం
C) అప్యర్థక వాక్యం
D) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
B) అనుమత్యర్థక వాక్యం

ప్రశ్న 31.
సన్యాసి పండుకున్నాడు. సన్యాసి నిద్రపోలేదు – దీనికి సంయుక్త వాక్యం ఏది ?
A) నిద్ర కోసం సన్యాసి పండుకున్నాడు.
B) సన్యాసి నిద్ర కోసం పండుకున్నాడు.
C) సన్యాసి పండుకున్నాడు గాని నిద్రపోలేదు
D) సన్యాసి పండుకున్నాడు నిద్రించాడు
జవాబు:
C) సన్యాసి పండుకున్నాడు గాని నిద్రపోలేదు

ప్రశ్న 32.
రైతులు పంటలు పండించారు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) పండించారు
B) రైతులచే పంటలు పండించబడినాయి
C) రైతులతో పంటలు పండించబడును
D) రైతులు పండించారు పంటలు
జవాబు:
B) రైతులచే పంటలు పండించబడినాయి

ప్రశ్న 33.
వారందరికి ఏమైంది ? ఇది ఏ రకమైన వాక్యం ?
A) ప్రశ్నార్థక వాక్యం
B) అప్యర్థక వాక్యం
C) తద్ధర్మార్థక వాక్యం
D) సందేహార్థక వాక్యం
జవాబు:
A) ప్రశ్నార్థక వాక్యం

ప్రశ్న 34.
‘కోటలో ఉత్తర భాగమునందు జింకల వనము ఒకటి యుండెను” ఈ వాక్యాన్ని వ్యవహార భాషలో రాస్తే (June ’18)
A) కోటయందు నుత్తర భాగమునందు జింకల వనము ఒకటి నుండెను.
B) కోటలో ఉత్తర భాగమునందు ఒక జింకల వనము యున్నది.
C) కోటలో ఉత్తర భాగాన జింకల వనం ఒకటి ఉండేది.
D) కోట ఉత్తర భాగంలో ఒక జింకల వనము ఉండె.
జవాబు:
C) కోటలో ఉత్తర భాగాన జింకల వనం ఒకటి ఉండేది.