TS 10th Class Maths Solutions Telangana | 10th Class Maths Textbook SSC Solutions Telangana

TS SCERT 10th Maths Solutions | TS 10th Class Maths Study Material Guide Pdf Free Download Telangana

TS 10th Class Maths Solutions Telangana Chapter 1 Real Numbers

10th Class Maths Textbook SSC Solutions Telangana Chapter 2 Sets

SSC 10th Class Maths Guide Pdf Telangana Chapter 3 Polynomials

TS SCERT 10th Maths Solutions Chapter 4 Pair of Linear Equations in Two Variables

TS 10th Class Maths Study Material Pdf Telangana Chapter 5 Quadratic Equations

10th Class Maths Textbook Solutions Telangana Chapter 6 Progressions

TS SCERT Class 10 Maths Solutions Chapter 7 Coordinate Geometry

SCERT Maths Textbook Class 10 Solutions Telangana Chapter 8 Similar Triangles

TS 10 Maths Solutions Chapter 9 Tangents and Secants to a Circle

10th Class Maths Question Bank Pdf Telangana State Chapter 10 Mensuration

TS SSC Class 10 Maths Solutions Chapter 11 Trigonometry

TS Maths Solutions Class 10 Chapter 12 Applications of Trigonometry

Telangana SCERT 10th Class Maths Solutions Chapter 13 Probability

Telangana State 10th Class Maths Solutions Chapter 14 Statistics

TS 10th Class Study Material

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

These TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 3rd Lesson Important Questions వలసకూలీ

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పాలమూరు జిల్లా ప్రజలు అధికంగా వలస కూలీలుగా ఎందుకు జీవిస్తున్నారు ?
జవాబు:
పాలమూరులో కూలీలకు పని దొరికేదికాదు. కనీసం వారికి తిండి ఉండేది కాదు. త్రాగడానికి నీరు కూడా దొరికేది కాదు. ఆ ప్రాంతంలోని భూస్వాములకు వ్యవసాయం చేసేందుకు సాగునీటి సౌకర్యం లేదు. వర్షాలు లేవు. దానితో కూలీలు తిండిలేక, పస్తులు పడుకోవలసి వచ్చేది. వారి పిల్లలకు చదువు సంధ్యలు లేవు. వారికి జబ్బుచేస్తే మందులు వేసికోడానికి కూడా డబ్బులు వారి వద్ద ఉండేవి కావు. అందుకే వారు కూలీ దొరికే ప్రాంతాలకు వలసలు పోయి జీవిస్తున్నారు.

ప్రశ్న 2.
వలస జీవితంలో ఉన్న అవస్థలేవి?
జవాబు:
ఒక ప్రాంతంలోని జనం, ఆ ప్రాంతంలో వారు జీవించడానికి అనువైన పరిస్థితులు లేనపుడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వారి జీవనానికి అనువైన మరో ప్రాంతానికి వలసలు పోతారు. అక్కడైనా సరైన సదుపాయాలు ఉంటాయా అంటే ! అనుమానమే. ముఖ్యంగా స్థానికంగా ఉండేవారి వల్ల ఇబ్బందులు.

ఇక తినటానికి, ఉండటానికి తిండి, జాగా దొరకక ‘ నానా ఇబ్బందులు పడాలి. తమ పిల్లల చదువులు గాని, వైద్యపరంగా సదుపాయాలు గాని ఉండవు. రేషన్ కార్డులు, పింఛన్లు వంటివి కూడా ఉండవు. అటు ఉన్న ఊరును కాదనుకొని వచ్చినందుకు ఈ ఊరులోనివారు వీరిని కాదంటారు. మొత్తం మీద వీరి అవస్థ “రెండిటికి చెడ్డ రేవడి పరిస్థితి”.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
పల్లె జీవనం కష్టతరంగా మారింది. కారణాలు ఏమై ఉంటాయని భావిస్తున్నావు ?
జవాబు:
పల్లెలు వ్యవసాయ క్షేత్రాలు. రైతులే ప్రత్యక్ష దేవుళ్ళు. చెమటోడ్చి తన రక్తాన్నే పెట్టుబడిగా పెట్టి పంట పండించి, లోకానికి అన్నం పెడుతున్న రైతు ‘అన్నదాత’. ఆ అన్నదాతకు నేడు కష్టకాలం వచ్చింది. మన విపరీత ధోరణుల వల్ల ప్రకృతి వికృతిగా మారింది. రైతును కుంగదీస్తోంది. ఒకసారి అతివృష్టి, మరొకసారి అనావృష్టితో ప్రకృతి విలయతాండవం చేసి, రైతును అతలాకుతలం చేస్తుంది. రాబడి లేకపోగా అప్పులు, వడ్డీలు పెరిగి బ్రతుకు భారంగా మారి, చివరకు మరణమే మేలు అని భావిస్తున్నాడు రైతు.

ఇలాగే కొద్ది తేడాలతో అన్ని వృత్తులవారి పరిస్థితి ఇలాగే ఉంది. ఒకప్పుడు ఒకరి కష్టంలో మరొకరు పాలుపంచుకునే స్థితి నుండి ప్రస్తుతం ఎవరికి వారే యమునా తీరే అన్న స్థితికి చేరింది. ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి సాయం అందకపోవడం ప్రధాన కారణం. చెట్టుకున్న పళ్ళను గమనిస్తామేగాని.

చెట్టును గమనించనట్లు పల్లెలలోనివారి బ్రతుకులూ ఉన్నాయి. కనుకనే పల్లెజీవనం కష్టతరంగా మారింది. విద్యా, వైద్య సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం, యువకులకు సరైన ఉపాధి మొదలైనవి లేకపోవడం మరో కారణం.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
పల్లెవాసులు వలసపోవడానికి కారణాలేమిటో వివరించండి.
జవాబు:
నీటి వసతికి నోచుకోలేక, పంటలు పండక, నిరంతరం కరవు రక్కసి కోరల్లో చిక్కుకున్నవారు, బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతుకటానికి పల్లెవాసులు వలస పోవడం జరుగుతుంది.

మానవజన్మ ఉదాత్తమైనది. ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్ధకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన, ఆశ. కానీ కాలం కలిసిరాని అభాగ్యజీవులు, తమ జీవితాన్ని నెట్టుకురావడమే ఒక ‘కల’గా భావించవలసి వస్తే అందంగా ఉండాల్సిన ‘కల’ కూడా ‘పీడకల’గా పరిణమిస్తే, బతుకు బండి నడిపేటందుకు తన కలలన్నీ, కల్లలు కాగా పొట్టచేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి మనసును పంచుకొనేందుకు మనుషులు లేక, బాధను పంచుకొనేందుకు బంధువులు లేక, సమాజం నుండి దూరమౌతున్న వ్యథార్థ జీవితాలు గడుపుతున్న పల్లెవాసుల బతుకులు దయనీయంగా ఉన్నాయి.

పల్లెవాసులు వలసపోవడానికి కారణాలు : పని ఎక్కువ దొరుకుతుందని, పైసలు ఎక్కువ వస్తాయని ఆశే వలసలకు ప్రధాన కారణం. వానలు లేక పంటలు ఎండిపోయి, పశువులకు మేతలు కరువవటం పల్లెవాసుల వలసలకు మరొక కారణం. సరైన ఉపాధి లేకపోవడం, ప్రభుత్వం నుండి సరైన ఆదరణలేక కూలీలు, యువకులు వలసల బాట పడుతున్నారు. సరైన విద్య, వైద్య సదుపాయాలు పల్లెలలో లేకపోవడం వలసలకు దారితీస్తున్నది.

ప్రశ్న 2.
‘కోస్తబెస్తల పడవలలో కూలివయ్యిన కర్మమెందుకు ?” అని కవి ఎందుకు అనవలసి వచ్చింది ?
జవాబు:
‘కోస్తబెస్తల పడవలలో కూలివయ్యిన కర్మమెందుకు ?’ ఈ వాక్యం డా॥ ముకురాల రామారెడ్డిగారి ‘హృదయశైలి’ అనే గేయ సంకలనంలోనిది. తెలంగాణ రాష్ట్రంలో నీటివసతిలేక పంటలు పండక, ఎప్పుడూ కరవు రాక్షసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం ‘పాలమూరు’. బ్రతుకు భారాన్ని మోస్తూ, కాలాన్ని వెళ్ళదీసే మార్గం లేక, బ్రతుకు తెరువు కోసం వలస పోవడం పాలమూరు (మహబూబ్నగర్) జిల్లాలోని కూలీలకు పరిపాటి.

ఈ విధంగా 1977లో పాలమూరు నుండి తూర్పుతీర ప్రాంతానికి వలస కూలీలుగా వెళ్ళి, తుపానులో చిక్కుకొని తిరిగిరాలేదు. ఆ సందర్భంలో కవి హృదయంలో కలిగిన ఆవేదనలోంచి వచ్చిన మాటల్లో ఇదొకటి.

కోస్తాబెస్తల పడవల్లో కూలీగా పనిచేసే కర్మ నీకు, కృష్ణా ఎగువ ఆనకట్ట కట్టకపోవడం వల్లనే కదా ! అని కవి విచారిస్తున్నాడు. కృష్ణానదిపై ఎగువ ఆనకట్ట కడితే, ఆ నీళ్ళు మహబూబ్ నగర్ జిల్లా పొలాలకు అందుతాయి.

ఆ నీళ్ళు లభ్యమైతే, అక్కడి ప్రజలు వర్షాధారంగా జీవించాల్సిన పనిలేదు. కృష్ణా జలాలతో తమ పంటలు పండించుకోవచ్చు.. ప్రస్తుతం ఆ ఆనకట్ట కట్టకపోవడం, వర్షాలు లేకపోవడం వల్ల పాలమూరు జనులకు ఈ పరిస్థితి వచ్చిందని కవి ఆవేదన చెందారు.

PAPER – 1 : PART – B

భాషాంశాలు – పదజాలం :

I. సొంతవాక్యాలు :

అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. మస్తుగ : ఒకటి కొంటే ఒకటి ఉచితం అని అమ్ముతున్న దుకాణం ముందు జనం మస్తుగ జమైనారు.
2. గడువు : మీరు గడువు దాటిన మందులు కొనకండి.
3. పైరు : వెన్ను వేసి, నిలిచిన మొక్కజొన్న పైరు కన్నుల పండుగగా ఉంది.
4. వలస : కరవు తాండవించడంలో వ్యవసాయదారులు కూలీలుగా నగరాలకు వలస వెళ్ళిపోతున్నారు.

II. అర్థాలు :

ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
వరుగులు – అంటే అర్థం
A) ఎండిన కాయ గింజలు
B) బక్కచిక్కిన
C) ఒరిగిన
D) తరిగిన
జవాబు:
A) ఎండిన కాయ గింజలు

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 2.
“జలపిడుగు” అనే పదం కవి ఈ అర్థంలో వాడాడు.
A) ఒకరకం చేప
B) వరద
C) ఉరుము
D) నిప్పు
జవాబు:
B) వరద

ప్రశ్న 3.
తిరగడం మరిగితే చదవడం తగ్గుతుంది – గీత గీసిన పదానికి అర్థం
A) కోపం
B) అలవాటుపడు
C) చల్లార్చు
D) మొదలుపెట్టు
జవాబు:
B) అలవాటుపడు

ప్రశ్న 4.
“క్రమ్ముకొను” అనే అర్థం గల పదం
A) కొమ్ములు మొలుచు
B) చుట్టుప్రక్కల అంటే సరియైన అర్థం
C) ముసురుకొను
D) మొక్క మొలుచు
జవాబు:
C) ముసురుకొను

ప్రశ్న 5.
జాలరి – అంటే సరియైన అర్ధం
A) పొడగరి
B) కూలి
C) చేపలు పట్టువాడు
D) కోస్తావాడు
జవాబు:
C) చేపలు పట్టువాడు

ప్రశ్న 6.
ముద్దతు – అంటే అర్థం
A) గడువు సమయం
B) మద్దతు
C) ముదిరిన
D) సౌకర్యం
జవాబు:
A) గడువు సమయం

ప్రశ్న 7.
నిరంతరం కరవు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు – గీత గీసిన పదానికి అర్థం
A) ఆకలి
B) మనిషి
C) రాక్షసి
D) బాధ
జవాబు:
C) రాక్షసి

ప్రశ్న 8.
సమాజం నుండి దూరమౌతున్న వ్యథార్త జీవితాలు ఎన్నో – గీత గీసిన పదానికి అర్థం
A) నిజం
B) బాధ
C) లేమి
D) కలిమి
జవాబు:
B) బాధ

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 9.
జాలరిని గూర్చి భార్యాపిల్లలు యాది జేసుకోవడం ఎంత ఆర్ధ్ర్రంగా ఉంటుందో – గీత గీసిన పదానికి అర్థం
A) తడిసినది
B) తడిపి
C) గుర్తు
D) సంతోషం
జవాబు:
B) తడిపి

III. పర్యాయపదాలు:

ప్రశ్న 1.
బర్లు, గొడ్లు, పసులు – అనే పర్యాయపదాలు గల పదం
A) సొమ్ములు
B) గేదెలు
C) గోర్లు
D) పాడి
జవాబు:
B) గేదెలు

ప్రశ్న 2.
“పల్లె” అనే పదానికి పర్యాయపదాలు
A) పల్లె, ఇల్లు
B) జనపదం, గ్రామం
C) ఊరు, పేట
D) పేట, నగరం
జవాబు:
B) జనపదం, గ్రామం

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
కొలనులోని చేపలు ఎగిరెగిరి పడుతున్నాయి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) మెరిగెలు, చందమామలు
B) మీనములు, మత్స్యములు
C) కొర్రలు, జలపుష్పాలు
D) బాడిస, రొయ్యలు
జవాబు:
B) మీనములు, మత్స్యములు

ప్రశ్న 4.
మబ్బు – అనే పదానికి పర్యాయపదాలు కానిది.
A) మేఘము, మొయిలు
B) జీమూతం, చీకటి
C) అంబుదము, జలదము
D) వారిదము, జీమూతం
జవాబు:
B) జీమూతం, చీకటి

ప్రశ్న 5.
కూలి మస్తుగ దొరుకుతాదని, కోస్త దేశం పోతివా ?
A) వేతనం, పెత్తనం
B) మూల్యం, అమూల్యం
C) భరణం, భారం
D) భృతి, భృత్యం
జవాబు:
D) భృతి, భృత్యం

IV. ప్రకృతి, వికృతులు:

గీత గీసిన పదానికి పర్యాయపదాలు

ప్రశ్న 1.
దేశనాయకులు దేశసేవ చేయాలని “ఆశ” – గీత గీసిన పదానికి వికృతి
A) దిక్కు
B) ఆస
C) ఆశలు
D) అసు
జవాబు:
B) ఆస

ప్రశ్న 2.
పూర్ణిమ, పౌర్ణమి – అనే పదాలకు సరియైన వికృతి
A) పూర్ణము
B) పురాణము
C) పున్నమి
D) పూస
జవాబు:
C) పున్నమి

ప్రశ్న 3.
“సింగం” వికృతిగా గల పదం
A) సింహం
B) సింగిడి
C) సిగ
D) సికరం
జవాబు:
A) సింహం

ప్రశ్న 4.
కవి హృదయంలో ఆవేదన – గీత గీసిన పదానికి వికృతి
A) ఎద
B) గుండె
C) మనసు
D) చిత్తం
జవాబు:
A) ఎద

V. నానార్థాలు

ప్రశ్న 1.
ముకురాల ప్రజల కోసం కలం పట్టిన కవి – గీత గీసిన పదానికి
A) కావ్యకర్త, పండితుడు
B) నీటికాకి, కవిలె
C) శుక్రుడు, కుజుడు
D) గణపతి, పవి
జవాబు:
A) కావ్యకర్త, పండితుడు

ప్రశ్న 2.
వైపు, దిశ, ఆధారము – అనే నానార్థాలు గల పదం
A) నిశి
B) దిక్కు
C) తాళము
D) మూల
జవాబు:
B) దిక్కు

ప్రశ్న 3.
“కాలము” అను పదమునకు నానార్థాలు
A) సమయము, వానాకాలము
B) సమయము, నలుపు
C) నలుపు, ఋతువు
D) పత్రికలో భాగం, వెల
జవాబు:
B) సమయము, నలుపు

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 4.
చాలు వానే పడదు సరళా సాగరం నిండేది కాదని – గీత గీసిన పదానికి నానార్థాలు
A) మదం, మందం
B) సంద్రం, సంఖ్య
C) మృగం, మెకం
D) నేతిసిద్దె, గిన్నె
జవాబు:
B) సంద్రం, సంఖ్య

VI. వ్యుత్పత్యర్థములు

ప్రశ్న1.
జాలరి – అనే పదానికి వ్యుత్పత్తి అర్థం
A) చేపలు పట్టువాడు
B) జాలము (వల) కలిగినవాడు
C) చాలాకాలము నీటిలో ఉండువాడు.
D) జాలమునకు శత్రువు
జవాబు:
B) జాలము (వల) కలిగినవాడు

ప్రశ్న2.
కృత్తికా నక్షత్రం పౌర్ణిమనాడు గల మాసం – దీనికి వ్యుత్పత్తి పదం
A) మార్గశిరం
B) కార్తీకం
C) మాఘం
D) చైత్రం
జవాబు:
B) కార్తీకం

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న3.
అక్షమునకు అభిముఖమైనది – దీనికి వ్యుత్పత్తి పదం
A) పరోక్షం
B) అక్షయ
C) ప్రత్యక్షం
D) అక్షాంశం.
జవాబు:
C) ప్రత్యక్షం

PAPER – II : PART – A

అపరిచిత పద్యాలు

1. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

కోపమునను ఘనత కొంచమై పోవును
కోపమునను గుణము కొరత వడును
కోపమునను బ్రతుకు కొంచమై పోవును
విశ్వదాభిరామ ! వినుర వేమ !

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
దేనివలన గొప్పదనము తగ్గిపోతుంది ?
జవాబు:
కోపము వలన గొప్పదనము తగ్గుతుంది.

ప్రశ్న 2.
గుణము ఏలా కొరతపడుతుంది ?
జవాబు:
కోపము వలన గుణము కొరతపడుతుంది.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
కోపము వలన బ్రతుకు ఏమౌతుంది ?
జవాబు:
కోపము వలన బ్రతుకు కొంచమై పోతుంది.

ప్రశ్న 4.
పై పద్యానికి సరైన శీర్షిక పెట్టండి.
జవాబు:
కోపము

ప్రశ్న 5.
పై పద్యానికి ఒక ప్రశ్న తయారు చేయండి.’
జవాబు:
పై పద్యం ఏ శతకంలోనిది ?

2. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

పరగ రాతి గుండు పగులఁ గొట్టఁగవచ్చు
కొండలన్ని పిండి కొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపఁగా రాదు
విశ్వదాభిరామ ! వినుర వేమ !

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
వేటిని పగుల గొట్టవచ్చును ?
జవాబు:
రాతి గుండులను పగుల గొట్టవచ్చును.

ప్రశ్న 2.
వేటిని పిండి కొట్టవచ్చును ?
జవాబు:
కొండలను పిండి కొట్టవచ్చును.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
ఎవరి మనస్సుని కరిగించలేము ?
జవాబు:
కఠిన చిత్తుని మనస్సుని కరిగించటము కష్టము.

ప్రశ్న 4.
పై పద్యము ఏ శతకములోనిది ?
జవాబు:
పై పద్యము వేమన శతకము లోనిది.

ప్రశ్న 5.
పై పద్యాన్ని ఎవరు రచించారు ?
జవాబు:
పై పద్యాన్ని వేమన రచించారు.

3. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునఁ దా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ !

ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎటువంటి చుట్టమును విడిచిపెట్టాలి ?
జవాబు:
సమయమునకు సహాయము చేయని చుట్టమును విడిచిపెట్టేయాలి.

ప్రశ్న 2.
ఎటువంటి దైవమును విడిచిపెట్టాలి ?
జవాబు:
నమస్కరించిననూ వరమీయని దేవుణ్ణి విడిచి పెట్టవలెను.

ప్రశ్న 3.
యుద్ధములో ఎవరిని విడిచిపెట్టాలి ?
జవాబు:
యుద్ధములో తానెక్కగా పరిగెత్తని గుఱ్ఱమును వెంటనే విడిచిపెట్టాలి.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 4.
పై పద్యములోని నీతి ఏమిటి ?
జవాబు:
అవసరానికి ఉపయోగపడని వాటిని వెంటనే విడిచిపెట్టాలి.

ప్రశ్న 5.
పై పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు:
పై పద్యం సుమతీ శతకంలోనిది.

4. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

అన్ని దానములను నన్నదానమె గొప్ప
కన్నతల్లి కంటె ఘనము లేదు
ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ! వినుర వేమ !

ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న 1.
దానములన్నింటి కన్నా ఏ దానము గొప్పది ?
జవాబు:
దానములన్నింటి కన్నా అన్నదానమే గొప్పది.

ప్రశ్న 2.
ఎవరి కంటే మించినది లేదు ?
జవాబు:
కన్నతల్లి కంటే మించినది లేదు.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
ఎవరికన్న మించిన వ్యక్తి లేడు ?
జవాబు:
గురువు కంటే మించిన వ్యక్తి లేడు.

ప్రశ్న 4.
ఈ పద్యము ఏ శతకములోనిది ?
జవాబు:
ఈ పద్యము వేమన శతకములోనిది.

ప్రశ్న 5.
పై పద్యంలో ఏ దానం గురించి చెప్పారు ?
జవాబు:
పై పద్యంలో అన్నదానము గురించి చెప్పారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
సంభాషణ

బతుకు భారాన్ని నడిపేందుకు కూలీలు వలసలకు వెళుతున్నారు. దీనికి గల కారణాలను తెలుపుతూ ‘సంభాషణను’ రాయండి.
జవాబు:
సోములు : ఓరేయ్ చంద్రయ్యా ! రాములుగాడు, ఆడిపెళ్ళాం పిల్లలు రెండు రోజులు నుండి కనిపించడం లేదు ఏడకు ఎల్లిండ్రు ?

చంద్రయ్య : నీకు ఏంది మావా, తినటానికి తిండిలేక, పస్తులుండలేక టౌనుకు పోయినడు గందా.

సోములు : ఒర్రేయ్ అల్లుడూ ! ఎంత కస్టమొచ్చినాది. నిజంగా నాకు తెల్దు. ఔను గానీ, ఇక్కడే ఏదో పని చేసుకోవాలి గాని ఊరు ఒదిలి యెత్తే కొత్త ఊళ్ళో ఎవరు పని ఇత్తాడ్రా ?

చంద్ర : నిజమే మామ. కాని ఊళ్ళో ఏం పనుందే. వానలు లేక పొలం పన్లు లేవు. పసులకే గడ్డి లేదు. వాడికి పనిచ్చేదెవరు.

సోములు : అవున్రా. వానల్లేక అందరికి ఇబ్బందిగానే కాలం గడస్తొంది. మరి ఓబులేసు, సుబ్బారావు వాళ్ళంతా ఏం చేస్తుండ్రు.

చంద్ర : వాళ్ళా, ఓ పూట గంజినీళ్ళు, ఓ పూట పస్తులు.

సోములు : ఉన్న చెరువును పూడ్చి మిద్దెలు కట్టాలని ఆ కాంట్రాక్టరు సెప్పినాడని ఊ గొట్టినామ్. ఆ పని మన నోళ్ళలో మట్టి కొట్టినాది.

చంద్ర : అవును మామ. డబ్బులు సూసేసరికి రాబోయే కష్టకాలం యాదికి రానేదు. ఇప్పుడదే నోటి కూడు తీసినాది.

సోములు : ప్రభుత్వమైనా సాయం సేయదా ?

చంద్ర : ఎందుకు సేయదు. కాని వెంబడినే జరక్కపోవచ్చు.

సోములు : అక్కడ వాడు ఎలా బతుకుతుండో ఎంటో, బాధగా ఉందిరా.

చంద్ర : మనం చేసుకున్న పనులే మనకు కాని కాలాన్ని తెచ్చాయి మావ, చెట్లు నరుకున్నాం. చెరువు పాడు చేసుకున్నాం.

సోములు : మన పెద్దలు మనకిచ్చింది. మళ్ళీ మనం మన బిడ్డలకు ఈనేక పోతున్నాం. ఏది ఏమైన ఉన్న ఊరుని కాదని పొరుగూరు వెళ్తే ఎట్టా ఉంటదో తెలిసి కూడా ఎట్టా వెళ్ళాలిరా ?

చంద్ర : తప్పదు సోములు మావ. తిండిలేదు, వైద్దిగం కూడా నేదు. పిల్లల సదువులకు పట్నం పోవల్సిందే. ఇక్కడే ఉంటే జరుగుబాటు కావద్దా ?

సోములు : నిజమే లేరా. కలికాలం అంటేనే కాని కాలం. సీకటి పడినాది పోదాం పదా.

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 2.
గేయం

“ఆకలి మంటలు ఆరని మంటలు. బడుగుల బతుకులు, అతుకుల బొంతలు, నలిగిన బతుకులు. తీరని వెతలు – పట్టెడు మెతుకులే పరమాన్నాలు” ఇటువంటి ప్రాస పదాలను వాడుతూ వలస జీవుల బ్రతుకులపై గేయాన్ని రాయండి.
జవాబు:

వలస జీవుల బతుకులు

పొట్ట చేత బట్టి, పెళ్ళాం బిడ్డలను విడిచిపెట్టి
నోరు కట్టి, వలసకు వెళ్ళావా ? వనాల కెళ్ళావా ?
గంపెడు ఆశతో గుండెలవిశేలా కష్టం చేసి
కూలీ కోసం రక్తాన్ని చెమటగా మార్చేసి
గుండెను బండగ చేసావా ఎందయ్యా ?

చాలీ చాలక ఆకలి తీరక
గుండె మంటలు ఆర్పలేక పోతున్నావా ?
ఇంటి ఆడది మాది కొస్తోందా ?
పిల్లల కోసం మనసు లాగేస్తోందా ?
గుండెను బండను చేసాయా ఏందయ్యా ?

నిన్ను నిన్నుగానే చూడాలనుకొనే కళ్ళు
వేయికళ్ళతో వెదుకుతున్న ఆనవాళ్ళు
నీకు తెలియవచ్చే నాటికి గడిచేను ఎన్నో యేళ్ళు
నీ వాళ్ళు గుర్తు రావటం లేదా ఇన్నాళ్ళు
గుండెలవిసేలా రోదిస్తున్నావా ఏందయ్యా ?

ప్రశ్న 3.
వ్యాసం
వలస కూలీల కష్టసుఖాలను వ్యాసరూపంలో రాయండి.
జవాబు:
పూర్వం గ్రామాల్లో భూస్వాములు ఉండేవారు. పెద్ద వ్యవసాయం ఉండేది. దానితో గ్రామాల్లో కూలీలందరికి పని దొరికేది. ఇప్పుడు ఆ భూస్వాములు లేరు. ఉపాధి లేదు. పైగా యంత్రాలు అమల్లోకి వచ్చాయి. దానితో కూలీల అవసరం తగ్గింది. గ్రామాల్లో కూలీల పిల్లలకు విద్యా, వైద్య ఉపాధి సౌకర్యాలు అంతగా లేవు.

గ్రామాల్లో ఉన్న యువకులు తమ జీవనభృతిని సంపాదించుకోగల స్థితులు గ్రామాల్లో నేడు లేవు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమితో వారికి కావలసిన సదుపాయాలు లభించడం లేదు. వ్యవసాయదారులకు ప్రభుత్వ సహాయం ఉండడం లేదు.

గ్రామాల్లో 24 గంటలూ విద్యుచ్ఛక్తి సౌకర్యం ఉండడంలేదు. రవాణా సౌకర్యాలు లేవు. త్రాగునీరు, సాగునీరు సదుపాయాలు లేవు.

తినడానికి తిండి, తాగటానికి నీరు, బతకటానికి కావల్సిన విద్యా, వైద్య సదుపాయాలు లేనప్పుడు ప్రజలు అక్కడే ఎందుకు ఉంటారు ? అందుకే వలసల బాట పట్టారు. జీవనాధారం లేకపోతే గంపెడు సంసారం మోయటం ఎవరికైనా కష్టమే. తోటివారే కాదు, నారు పోసినవాడు (దేవుడు) కూడా కన్నెర్ర చేస్తే పొట్ట చేతపట్టినవాడి పని ఏమిటి ? అందుకే వలస పోతున్నారు.

గ్రామాల్లోని వృత్తిపనివారలకు నగరాల్లో చక్కని జీవనభృతి లభిస్తోంది. భవన నిర్మాణ కార్మికులకు నగరాల్లో 365 రోజులూ పని దొరుకుతోంది. అందుకే గ్రామాల నుండి ప్రజలు నగరాలకు వలస వెళుతున్నారు.

ఈ వలస కూలీలకు వలస ప్రాంతంలో కూడా చెల్లేట్లుగా వారికి రేషన్ కార్డులు, పింఛన్లు వంటి సదుపాయాలు కల్పించాలి. వారి పిల్లలకు, వారికి విద్యా, వైద్య సదుపాయాలు కల్పించాలి. వారికై ఇళ్ళు నిర్మించాలి. వారి కష్టనష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వసతులు ఏర్పాటు చేయాలి.

పనికి ఆహార పథకం ద్వారా వారికి పనులు చూపాలి. ప్రభుత్వం అందించేవి వీరికి అందుతున్నాయా, లేదా పర్యవేక్షించాలి. అప్పుడే వీరు సుఖంగా జీవించడానికి వీలవును.

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

1. సంధులు:

ప్రశ్న 1.
“ఉత్వ సంధి”కి ఉదాహరణ కానిది.
A) ఎట్లు + అని
B) కాలము + అంటూ
C) వరుగులు + అయ్యే
D) సముద్రము + నీరు
జవాబు:
D) సముద్రము + నీరు

ప్రశ్న 2.
“ఎప్పుడు + ఒస్తవు” – ఉత్వ సంధి చేయగా.
A) ఎప్పుడొస్తవు
B) ఎప్పుడునొస్తవు
C) ఎప్పడువచ్చెదవు
D) ఎప్పుడొచ్చినావు
జవాబు:
A) ఎప్పుడొస్తవు

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
గోకులాష్టమినే కృష్ణాష్టమి అంటారు – గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి.
A) గో + కులాష్టమి
B) గోకులా + ష్టమి
C) గోకుల + అష్టమి
D) గోకులము యొక్క అష్టమి
జవాబు:
C) గోకుల + అష్టమి

ప్రశ్న 4.
“ఎక్కడ + ఉంటివి → ఎక్కడుంటివి” – సంధి జరిగిన తీరు
A) ఉత్వ సంధి
B) ఆమ్రేడిత సంధి
C) అత్వ సంధి
D) యడాగమ సంధి
జవాబు:
C) అత్వ సంధి

II. సమాసములు :

ప్రశ్న 1.
“భద్రాచలం” – అను పదం యొక్క సమాసం నామం
A) విశేషణ పూర్వపద కర్మధారయము
B) సంభావనా పూర్వపద కర్మధారయము
C) ఉపమాన పూర్వపద కర్మధారయము
D) విశేషణ ఉత్తరపద కర్మధారయము
జవాబు:
A) విశేషణ పూర్వపద కర్మధారయము

ప్రశ్న 2.
“సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము”నకు ఉదాహరణ కానిది.
A) కోయిల సాగరము
B) సరళా సాగరము
C) కోస్త దేశం
D) ఎగువ కృష్ణా
జవాబు:
D) ఎగువ కృష్ణా

ప్రశ్న 3.
ఈ కింది వానిలో “రూపక సమాసము” కానిది.
A) విద్యా అనెడు ధనము
B) కృప అనెడు రసము
C) దయ అనెడు ఆభరణం
D) భద్రాచలం అనే పట్టణం
జవాబు:
D) భద్రాచలం అనే పట్టణం

ప్రశ్న 4.
జీవితంలో వెలుగుల కోసం జ్ఞానజ్యోతిని వెలిగించాలి – గీత గీసిన పదానికి సరియైన విగ్రహవాక్యం
A) జ్ఞానము కొరకు జ్యోతి
B) జ్ఞానము అనెడి జ్యోతి
C) జ్ఞానము తోడి జ్యోతి
D) జ్ఞానమును, జ్యోతియును
జవాబు:
B) జ్ఞానము అనెడి జ్యోతి

ప్రశ్న 5.
“గొడ్లడొక్కలు” – సమాసము పేరు
A) రూపక సమాసము
B) షష్ఠీ తత్పురుష సమాసము
C) తృతీయా తత్పురుష సమాసము
D) ద్వంద్వ సమాసము
జవాబు:
B) షష్ఠీ తత్పురుష సమాసము

III. ఛందస్సు:

ప్రశ్న 1.
పద్యపాదములో రెండవ అక్షరమును ఇలా అంటారు.
A) యతి.
B) ప్రాస యతి
C) ప్రాస
D) గణము
జవాబు:
C) ప్రాస

ప్రశ్న 2.
య గణం – గురులఘువులలో
A) UUI
B) UII
C) IUU
D) IIU
జవాబు:
C) IUU

ప్రశ్న 3.
“ఉత్పలమాల” పద్యానికి యతి
A) 10
B) 11
C) 13
D) 14
జవాబు:
A) 10

IV. అలంకారములు:

ప్రశ్న 1.
……….. రాకనే పోతివా,
……. మరిచే పోతివా;
పై వాక్యాలలో ఉన్న అలంకారము
A) అంత్యానుప్రాస
B) ఛేకానుప్రాస
C) వృత్త్యనుప్రాస
D) లాటానుప్రాస
జవాబు:
A) అంత్యానుప్రాస

TS 9th Class Telugu Important Questions 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 2.
ఒక వస్తువునకు మరొక వస్తువునకు పోలిక ఉపమాలంకారంలో ఒకటిగా ఉండేది
A) సమాన ధర్మం
B) ఉపమానము
C) ఉపమేయము
D) క్రియ
జవాబు:
A) సమాన ధర్మం

V. వాక్యాలు:

ప్రశ్న 1.
“రామయ్య ఊరికి వెళ్ళి పొలం పనులు చూసుకున్నాడు.” – సామాన్య వాక్యాలుగా మారిస్తే
A) రామయ్య ఊరికి, పొలానికి వెళ్ళాడు.
B) రామయ్య ఊరికి వెళ్ళాడు, రామయ్య పొలం పనులు చూసుకున్నాడు.
C) రామయ్య పొలం పనులు చూడటానికి ఊరు వెళ్ళాడు.
D) ఊరికి వెళ్ళి పొలం పనులు చూసుకున్నాడు.
జవాబు:
B) రామయ్య ఊరికి వెళ్ళాడు, రామయ్య పొలం పనులు చూసుకున్నాడు.

ప్రశ్న 2.
“తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేశారు. తెలంగాణ సాధించారు.” – సంక్లిష్ట వాక్యం గుర్తించండి.
A) తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేశారు మరియు సాధించారు.
B) తెలంగాణ సాధించారు కాని ఎన్నో ఉద్యమాలు చేశారు.
C) తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేసి, సాధించారు.
D) తెలంగాణ సాధించే వరకు ఎందరో ఉద్యమాలు చేశారు.
జవాబు:
C) తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు చేసి, సాధించారు.

ప్రశ్న 3.
“వర్షాలు బాగా పడ్డాయి. పంటలు పండలేదు.” – సరియైన సంయుక్త వాక్యాన్ని గుర్తించండి.
A) వర్షాలు బాగా పడే పంటలు పండలేదు.
B) వర్షాలు బాగా పడ్డాయి కాని పంటలు పండలేదు.
C) పంటలు పండలేదు కాబట్టి వర్షాలు బాగా పడ్డాయి.
D) వర్షాలు బాగా పడలేదు కాబట్టి పంటలు పండలేదు.
జవాబు:
B) వర్షాలు బాగా పడ్డాయి కాని పంటలు పండలేదు.

ప్రశ్న 4.
“అమ్మ వంట చేసి, దేవుని పూజ చేసింది.” – ఈ వాక్యాన్ని సామాన్య వాక్యాలలోకి మార్చండి.
A) అమ్మ వంట చేయాలి. అమ్మ దేవుని పూజ చేయాలి.
B) అమ్మ వంట చేసింది. అమ్మ దేవుని పూజ చేసింది.
C) అమ్మ వంట చేస్తూ అమ్మ దేవుని పూజ చేసింది.
D) అమ్మ వంట చేస్తే దేవుని పూజ చేస్తుంది.
జవాబు:
B) అమ్మ వంట చేసింది. అమ్మ దేవుని పూజ చేసింది.

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

These TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 2nd Lesson Important Questions నేనెరిగిన బూర్గుల

PAPER – I : PART – A

1. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
బూర్గుల వాదనాపటిమ గలవాడని పి.వి. ఎందుకన్నాడు ?
జవాబు:
పి.వి.నరసింహారావుగారు, బూర్గులవారి వద్ద జూనియర్ న్యాయవాదిగా ఉండేవారు. బూర్గులవారు తమ విశిష్ట వ్యక్తిత్వంతో, పి.వి.గారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. బూర్గులవారి వాదనా పటిమను పి.వి. ప్రత్యక్షంగా చూసారు.

బూర్గులవారి వాదనాపటిమ : బూర్గులవారు న్యాయవాదిగా కేసు చేపట్టేటప్పుడే, విషయం శ్రద్ధగా విని, ఆ ఫైలుపైనే అస్పష్టంగా, రేఖామాత్రంగా నోట్సు రాసుకునేవారు. కోర్టులో ఆ నోట్సు ఆధారంగా, తమ విశేష ప్రతిభతో, ఎదుటి న్యాయవాదులను ఎదుర్కొని నిలిచేవారు. న్యాయవాద వృత్తిలో గొప్ప మేధాసంపత్తిని ఆయన ప్రదర్శించి, కోర్టులో కేసులో గెలిచేవారు. అందుకే బూర్గుల వాదనాపటిమ గలవారని పి.వి. పేర్కొన్నారు.

ప్రశ్న 2.
దున్నేవారికే భూమి అంటే మీకేమర్థమయింది ?
జవాబు:
సామాన్యంగా భూస్వాములు తమ పొలాలను రైతులకు సేద్యానికి ఇచ్చి, వారి నుండి సంవత్సరానికి కొంత శిస్తు తీసుకుంటారు. రైతులు, ఆ చేలలో పంట పండినా, పండకపోయినా నిర్ణయించుకున్న శిస్తును కామందులకు చెల్లించాలి. అదీగాక భూకామందులు తమ ఇష్ట ప్రకారం, తమ పొలాన్ని రైతుల నుండి ఎప్పుడైనా తిరిగి తీసుకుంటారు. దీనివల్ల రైతులు నష్టపోతారనే భావనతో రైతులకు కొన్ని రక్షణలు కల్పించడానికి దున్నేవారికే భూమి అనే కౌలుదారి చట్టాన్ని రూపొందించారని గ్రహించాను.

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
బూర్గుల సౌజన్యానికి మారుపేరు అని ఎలా చెప్పగలరు ?
జవాబు:
బూర్గుల రామకృష్ణారావుగారు మతాతీత వ్యక్తి. ఆయన సుగుణాలు మూర్తీభవించిన వ్యక్తి. ఈయన సౌజన్యానికి మారుపేరు. నిజాంకు బూర్గులవారు వ్యతిరేకులయినా, రాష్ట్రంలోని ముసల్మానులు అందరికీ ఈయన స్నేహితులుగా, ఆప్తులుగా ఉండేవారు. బూర్గులవారు నిరాడంబరంగా, మతానికి అతీతంగా ఉండేవారు.

ఆయన డ్రాయింగ్ రూమ్ సంస్కృతీ ప్రదర్శనశాలలా ఉండేది. అక్కడ కుచ్చుటోపీల మౌల్వీలు, గడ్డాల ముల్లాలు, తలపాగాల పండితులు, మహామహోపాధ్యాయులు, గాంధీ టోపీలవారు, ఖద్దరు ధారులు, టెరిలీన్ యువకులూ ఇలా అన్నిరకాల వారూ బూర్గులవారితో స్నేహపూర్వకంగా ఉండేవారు. కనుకనే ఆయన సౌజన్యానికి మారుపేరు అని చెప్పవచ్చు.

ప్రశ్న 4.
“బూర్గులవారు మతాతీతవ్యక్తులు” – అని ఎలా చెప్పగలరు ?
జవాబు:
బూర్గుల రామకృష్ణారావుగారు, మతాతీతవ్యక్తి. ఆయన సుగుణాలు మూర్తీభవించిన వ్యక్తి. ఈయన సౌజన్యానికి మారుపేరు. ఆనాటి నిజాం నవాబు మతదురభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యం ఏలేవాడు. రామకృష్ణారావుగారు నిజాంకు బద్ధ వ్యతిరేకి.

నిజాంకు బూర్గులవారు వ్యతిరేకులయినా, రాష్ట్రంలోని ముసల్మానులు అందరికీ ఈయన స్నేహితులుగా, ఆప్తులుగా ఉండేవారు. బూర్గులవారు నిరాడంబరంగా, మతానికి అతీతంగా ఉండేవారు. బూర్గులవారి డ్రాయింగ్ రూమ్, సంస్కృతీ ప్రదర్శనశాలలా ఉండేది. అక్కడ కుచ్చుటోపీల, మౌల్వీలు, గడ్డాల ముల్లాలు, తలపాగాల పండితులు, మహామహోపాధ్యాయులు, గాంధీ టోపీలవారు, ఖద్దరు ధారులు, టెరిలిన్ యువకులూ, ఇలా అన్ని రకాలవారూ బూర్గులవారిని పిలవడానికి అక్కడకు వచ్చేవారు.

పై విధంగా బూర్గులవారు, విశిష్ట వ్యక్తిత్వంతో, మతాతీత వ్యక్తిగా ఉండేవారు.

ప్రశ్న 5.
బూర్గులవారిని గురించి చరిత్రకారులు ఏయే విషయాలు పొందుపరచి ఉంటారని చెప్పారు.
జవాబు:
చరిత్రకారులు, బూర్గులవారిని గురించి ఈ కింది విషయాలు రాసి ఉండేవారు.

  1. బూర్గుల రామకృష్ణారావుగారు పుట్టిన గ్రామం గురించి రాసేవారు. పూనాలో ఆయన ఫెర్గూసన్ కాలేజీలో పర్షియన్ ‘భాష చదివి, పట్టభద్రులయ్యారని, పర్షియన్ ట్యూటర్గా కొంతకాలం పనిచేశారని రాసి ఉండేవారు.
  2. న్యాయవాద పట్టా తీసుకొని న్యాయవాదిగా పనిచేశారని రాసి ఉండేవారు.
  3. ప్రజా ఉద్యమాల్లో పాల్గొని, జైలుకు వెళ్ళారని రాసి ఉండేవారు. హైదరాబాదు స్టేటు కాంగ్రెస్లో బూర్గులవారు ప్రముఖ నాయకులని, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, రెండు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశారని రాసి ఉండేవారు.

ప్రశ్న 6.
పాఠ్యాంశ రచయిత పి.వి. నరసింహారావుగారి గొప్పతనం గురించి తెలపండి.
జవాబు:
పి.వి. నరసింహారావుగారు భారత ప్రధానిగా, బహుభాషావేత్తగా, భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు పొందారు. స్వామి రామానందతీర్ధకు పి.వి. గారు శిష్యులు. బూర్గుల వారు, పి.వి. గార్కి గురుతుల్యులు. విద్యార్థిగా హైద్రాబాదు విముక్తి పోరాటంలో వీరు పాల్గొన్నారు. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా సేవ చేశారు. ఈయన గొప్ప రాజనీతిజ్ఞుడు.

17 భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. ఈయన ఆత్మకథ “ఇన్ సైడర్” అనేక భాషల్లోకి అనువాదం అయ్యింది. పి.వి. గారు, నిరాడంబర జీవితం, నిజాయితీ, దేశభక్తి కలిగి, స్థిత ప్రజ్ఞుడిగా వెలుగొందారు. విశ్వనాథ వారి ‘వేయి పడగలు’ నవలను ‘సహస్రఫణ్’ అనే పేరుతో వీరు హిందీలో రాశారు.

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 7.
రామకృష్ణారావుగారి విశిష్ట వ్యక్తిత్వం గురించి పి.వి. గారు ఏమని తెలిపారు ?
జవాబు:
పి.వి. నరసింహారావుగారు, బూర్గులవారి వద్ద జూనియర్ న్యాయవాదిగా ఉండేవారు. పి.వి. గారు బూర్గులవారి ఆఫీసుకు వెళ్ళి, జూనియర్లకు అర్థంకాని చిక్కు కేసులను చదివేవారు. దానితో బూర్గులవారి సీనియర్ గుమస్తా, పి.వి. గారిపై కోపపడేవాడు. కాని బూర్గులవారు పి.వి. గార్ని సమర్థించేవారు.

అంతేకాక పి.వి. గారితో కేసులను గురించి స్వయంగా తాను చర్చించేవారు. దానితో పి.వి.లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ ఆత్మవిశ్వాసం, తరువాత కాలంలో పి.వి. గార్కి శ్రీరామరక్ష అయ్యింది. ఈ విధంగా బూర్గులవారు తమ విశిష్ట వ్యక్తిత్వంతో, పి.వి. గారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి,
ఆయనకు మేలు చేశారు.

ఆ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘బాహ్య సౌందర్యం కన్నా అంతర సౌందర్యం అతిముఖ్యం’ ఈ వాక్యం బూర్గుల వారి జీవితానికి ఎలా సరిపోతుంది – వివరించండి.
జవాబు:
ప్రతి మానవునిలోనూ సాధారణంగా ఉన్నదాని కంటే తనను గురించి ఘనంగా చిత్రించుకొనే స్వభావం ఉంటుంది. ఇందుకు భిన్నంగా ప్రవర్తించేవారు చాలా అరుదుగా ఉంటారు. ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన బూర్గులవారిని తలచుకోవడం, వారిని అనుసరించడం మనందరికి శుభదాయకం. లోకంలో వ్యక్తులకు వారసత్వంగా వచ్చే ఆర్థిక, రాజకీయ పరమైన గుర్తింపే కాని, వారి వ్యక్తిత్వాలకు గుర్తింపనేది నేతిబీరకాయ చందంగానే ఉంటుంది.

వ్యక్తిత్వం లేనివారు ఎంత గొప్ప పేరుప్రఖ్యాతులు పొందినప్పటికీ అది వారితో ఉన్న అవసరాలు ఇతరులచేత ఆహా ! ఓహో అనిపిస్తాయి. అదీ ఆ అవసరాలు తీరేదాకే. అదే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు తమ వ్యక్తిత్వానికి మచ్చతెచ్చుకొనే పనులు చేయకుండా ‘పరోపకార్థమ్ ఇదమ్ శరీరం’ అన్నట్లు జీవిస్తారు.

ఈ కోవకు చెందినవారే శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు. వారెల్లప్పుడు అన్ని విషయాల్లో ఆఖరికి తమలోని లోపాలను కూడా ఉన్నవి ఉన్నట్లుగా చెప్పేవారు. బూర్గుల వారి కీర్తి ఎంత పెద్దదో మూర్తి అంత చిన్నది. తన పొట్టితనాన్ని గూర్చి వారే ఇలా అనుకొనేవారు, ‘నన్ను గమనించకుండా ఎవరూ ఉండలేరు.

పొడుగు మనుషుల మధ్య పొట్టివాణ్ణి కదా ! అని అవసరం వచ్చినప్పుడు వారు అలనాటి వామనమూర్తి వలె ఇంతింతై ముల్లోకాలు ఆక్రమించి తమ విరాట్ రూపాన్ని ప్రదర్శించేవారు. అందుచేత బూర్గులవారు కావాలని నిరాడంబరంగా తెరమరుగున ఉండడం జరుగలేదు. శరీరాకృతిలో అందం లేకపోయిన మంచి మనసు కలిగి అందరూ బాగుండాలనే బూర్గులవారి జీవితానికి ‘బాహ్య సౌందర్యం కన్నా అంతఃస్సౌందర్యం అతిముఖ్యం’ అనే వాక్యం చక్కగా సరిపోతుంది.

ప్రశ్న 2.
బూర్గుల రామకృష్ణారావుగారి వ్యక్తిత్వం ద్వారా మనం నేర్చుకోదగిన అంశాలేవి ?
జవాబు:
మనం నివసిస్తున్న ఈ సమాజంలో మంచి ప్రభావశక్తి కలవారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అటువంటి వారితో కలిసినా, వారిని గురించి తెలిసికొన్నా మనకు మంచి స్ఫూర్తి కలుగుతుంది. వారు నడిచిన దారిలో మనం కూడా నడవడానికి అవకాశం కలుగుతుంది.

ఈ విధంగా స్ఫూర్తిని ఇచ్చేవారిలో కీ.శే. బూర్గుల రామకృష్ణారావుగారు ఒకరు. ఈయన హైదరాబాదు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజనీతిజ్ఞుడు, బహుభాషావేత్త, పరిపాలనాదక్షుడు. ప్రతివ్యక్తికి, తన గురించి ఉన్నదాని కంటే ఎక్కువగానే చిత్రించుకొనే స్వభావం ఉంటుంది.

దీనికి భిన్నంగా ఉండేవారు బహుకొద్దిమందే ఉంటారు. వారిలో ముందుగా చెప్పదగినవారు బూర్గుల. అనేక విధాలైన ఒడిదుడుకులు వచ్చినా, విపత్కర పరిస్థితులు చుట్టుముట్టినా, చలించలేపోవడం, మనః స్థైర్యాన్ని, సమచిత్తాన్ని విడిచిపెట్టకపోవడం వంటి లక్షణాలు రామకృష్ణారావుగారి వ్యక్తిత్వం ద్వారా మనం నేర్చుకోవచ్చు.

జయాపజయాలను సమానంగా స్వీకరించడం, మిత్రులు సైతం ద్రోహం చేసినా, శత్రువులు దూషించినా “అవన్నీ ఆటలో భాగమేగా” అని స్థితప్రజ్ఞులుగా నిలవడం, అందరికీ సాధ్యం కాదు. అటువంటి విశిష్ట వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి శ్రీ బూర్గులవారు. ఈయన మతాతీత వ్యక్తి. సుగుణాలు మూర్తీభవించిన మహోన్నత వ్యక్తి. సౌజన్యానికి మారుపేరు. నిరాడంబరంగా జీవించే బూర్గులవారి వ్యక్తిత్వం ఆనాటివారికే కాదు ఏనాటివారికైనా, ప్రాతఃస్మరణీయమైనది.

ప్రశ్న 3.
“రాజకీయాలలో బూర్గులవారి సమ్యక్ దృష్టికోణం, సంకుచిత సైద్ధాంతిక అరలకు తావివ్వలేదు” దీనిని బట్టి మీరేమి గ్రహించారు?
జవాబు:
బూర్గుల రామకృష్ణారావుగారిని గూర్చి పి.వి. నరసింహారావు గారు చెప్పిన సత్యమిది. బూర్గుల వారికి రాజకీయాలపై సంపూర్ణమైన దృష్టికోణం ఉందట. బూర్గులవారు సంకుచిత దృష్టితో వీరు నావారు, వారు పేదవారు అనే భేదాన్ని వారు చూపించేవారు కారట.

హైదరాబాదు సంస్థానంలో జాగీర్దారీ వ్యవస్థ తరతరాల నుండీ వస్తోంది. భూములు అన్నీ కొద్దిమంది చేతులలోనే ఉండేవి. అది గమనించిన బూర్గులవారు, హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కును ఇచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారు చేసి, సామ్యవాద వ్యవస్థకు వారు మార్గదర్శకులు అయ్యారు.

ఈ కౌలుదారీ చట్టాన్ని ముందుగా బూర్గులవారు, కొన్ని జిల్లాల్లో అమలు పరచడానికి ఎంపిక చేశారు. ఆ చట్టం అమలు వల్ల ఎక్కువగా నష్టపోయిన భూకామందులు అందరూ, బూర్గుల వారికి బంధువులూ, రాజకీయ సహచరులు. దీనిని బట్టి బూర్గుల వారికి రాజకీయాల్లో సమ్యక్ దృష్టి కోణం ఉందనీ, వారికి సంకుచిత సిద్ధాంత భేదాలు లేవని తెలుస్తోంది.

PAPER – I : PART – B

భాషాంశాలు – పదజాలం :

I. సొంతవాక్యాలు :

అ) కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. శ్రీరామరక్ష : మంచి గూఢచార వ్యవస్థ దేశానికి, ప్రజలకు శ్రీరామరక్ష.
2. గీటురాయి : క్రీడాకారుల ప్రతిభకు వారు సంపాదించిన బహుమతులే గీటురాళ్ళు.
3. రూపుమాపడం : ఆధునిక వైద్య విజ్ఞానం మశూచి, కలరా వంటి అంటువ్యాధుల్ని రూపుమాపగలిగింది.
4. కారాలు మిరియాలు నూరడం : కారు అద్దం పగిలి సంవత్సరమయినా మా స్నేహితులందరిమీద మా పక్కింటాయన ఇప్పటికి కారాలు మిరియాలు నూరుతునే ఉన్నాడు.
5. స్వస్తివాచకం : పాత పెద్దనోట్లకు ప్రధాని మోదీ స్వస్తివాచకం పలికాడు.
6. ప్రాతఃస్మరణీయులు : భగవంతునితో పాటు, విజ్ఞాన వేత్తలు, సంఘ సంస్కర్తలు అందరూ మనకు ప్రాతః స్మరణీయులే.
7. శక్తిసామర్థ్యాలు : మనం మన శక్తిసామర్థ్యాలు, శారీరక, మానసిక, వైజ్ఞానిక విషయాలలో పెంపొందించుకోవాలి.
8. సౌజన్య సౌహార్దాలు : గాంధీ, బుద్ధుడు, క్రీస్తు మొదలగు వారిని చూసినప్పుడు సౌజన్య సౌహార్దాలు కూడా ప్రపంచాన్ని గెలవడానికి ఉపయోగపడతాయి అని అనిపిస్తుంది.
9. కంచుకోట : అవినీతిపరులు కంచుకోట వంటి ఇంటిని నిర్మించుకొని దొంగసొత్తును దాస్తారు కదా !

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

II. అర్థాలు :

ఆ) కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

ప్రశ్న 1.
నిరాఘాటంగా – అనే పదానికి అర్థం
A) ఆటంకాలుగా
B) అడ్డులేకుండా
C) సాఫీగా
D) పడుతూలేస్తూ
జవాబు:
B) అడ్డులేకుండా

ప్రశ్న 2.
ప్రమాణం – అనే అర్థం వచ్చే పదం
A) ప్రయాణం
B) గీటురాయి
C) తిరుగలి
D) గుండ్రాయి
జవాబు:
B) గీటురాయి

ప్రశ్న 3.
సచిన్ నిష్క్రమణతో భారతజట్టు ధోని వైపు తిరిగింది – గీత గీసిన పదానికి అర్థం
A) రాక
B) క్రమశిక్షణ
C) తప్పుకోవడం
D) బాధలతో
జవాబు:
C) తప్పుకోవడం

ప్రశ్న 4.
ఒక విషయం గురించి అనర్గళంగా మాట్లాడు – గీత గీసిన పదానికి సరియైన అర్థం
A) ఆటంకం లేకుండా
B) గొంతుతో
C) ఎదిరించి
D) ఆలోచించి
జవాబు:
A) ఆటంకం లేకుండా

ప్రశ్న 5.
“కడగొట్టు” అనే పదానికి అర్థం
A) కనిపెట్టు
B) గట్టిగా కొట్టు
C) చిట్టచివరి
D) పడగొట్టు
జవాబు:
C) చిట్టచివరి

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 6.
ప్రాతఃస్మరణీయుడు – అను పదానికి అర్థం
A) ప్రతి ఉదయం జ్ఞప్తికి తెచ్చుకోతగినవాడు.
B) పాతకాలములో గుర్తున్నవాడు.
C) ఉదయమే గుర్తుకు వచ్చిన మనిషి.
D) గుర్తుంచుకోవలసిన విషయము (పాత సంఘటన).
జవాబు:
A) ప్రతి ఉదయం జ్ఞప్తికి తెచ్చుకోతగినవాడు.

ప్రశ్న 7.
“సునిశితమేధ” – అను పదానికి సరియైన అర్థం
A) ఒక రకమైన మేధ
B) చురుకైన బుద్ధి
C) మందబుద్ధి
D) సరియైన మేధావి
జవాబు:
B) చురుకైన బుద్ధి

ప్రశ్న 8.
“కలగలుపు” – అనే అర్థం గల పదం
A) అన్నము
B) కలుపు మొక్క
C) మేళవించు
D) విడివిడిగా
జవాబు:
C) మేళవించు

ప్రశ్న 9.
“సాహితీ జగత్తు” లో కాళిదాసు మొదటివాడు – గీత గీసిన పదానికి అర్థం
A) ప్రాచీన గ్రంథంలో
B) సాహిత్యం అనే ప్రపంచంలో
C) వీణా జగత్తులో
D) కవి పండితులలో
జవాబు:
B) సాహిత్యం అనే ప్రపంచంలో

ప్రశ్న 10.
అతని సౌజన్యం అందరిని ఆకర్షించింది – గీత గీసిన పదానికి అర్థం
A) మంచితనం
B) సౌందర్యం
C) వేషధారణ
D) సంపద
జవాబు:
A) మంచితనం

ప్రశ్న 11.
రామకృష్ణారావుగారి పేరు వినగానే గత స్మృతులెన్నో ముప్పిరిగొన్నాయి – గీత గీసిన పదానికి అర్థం
A) తలుపు
B) బాధ
C) తలపు
D) సంతోషం
జవాబు:
C) తలపు

ప్రశ్న 12.
వీసం ఎత్తు ఎక్కువా లేదు – గీత గీసిన పదానికి అర్థం
A) 1/16
B) 1/8
C) 1/4
D) 1/32
జవాబు:
A) 1/16

ప్రశ్న 13.
రామకృష్ణారావుగారు ప్రధానంగా సాహితీ జగత్తుకు చెందినవారు – గీత గీసిన పదానికి అర్థం
A) ప్రజలు
B) గ్రంథాలు
C) దేశాల
D) లోకం
జవాబు:
D) లోకం

III. ప్రకృతి, వికృతులు :

ప్రశ్న 1.
భూమి తిరముగా ఉండదు – గీత గీసిన పదానికి ప్రకృతి
A) పల్లము
B) స్థిరము
C) తిన్నగా
D) వేడి
జవాబు:
B) స్థిరము

ప్రశ్న 2.
దోసము, దొసగు – అనే వికృతి పదాలకు ప్రకృతి పదం
A) దోసకాయ
B) రోషము
C) దోషము
D) దుష్టుడు
జవాబు:
C) దోషము

ప్రశ్న 3.
“జాతరలో పిల్లలు తప్పిపోతారని యాత్ర మానుకొన్నారు.” – ఈ వాక్యంలో ప్రకృతి ఉన్న పదం
A) జాతర
B) పిల్లలు
C) మాను
D) తప్పిపోవు
జవాబు:
A) జాతర

ప్రశ్న 4.
ఊరేగింపులో దేవుని దవ్వు నుండి చూడగలిగాము – గీత గీసిన పదానికి ప్రకృతి
A) పువ్వు
B) ఎత్తు
C) వెనుక
D) దూరము
జవాబు:
D) దూరము

ప్రశ్న 5.
“పగ్గె, సాల” – అను వికృతి పదాలకు సరియైన ప్రకృతి పదాలు
A) ప్రజ్ఞ, శాల
B) ప్రతిజ్ఞ, విశాల
C) పగ్గము, శాల
D) ప్రజ్ఞ, సాలీడు
జవాబు:
A) ప్రజ్ఞ, శాల

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 6.
శక్తి – అనే పదానికి వికృతి
A) శక్యము
B) సత్తి
C) సత్తెము
D) సకియ
జవాబు:
B) సత్తి

ప్రశ్న 7.
సంతసము – అను పదానికి ప్రకృతి
A) సంతోషము
B) సంతానము
C) ఆనందము
D) సంగతి
జవాబు:
A) సంతోషము

ప్రశ్న 8.
గౌరవము – అనే పదానికి వికృతి
A) గార్దభము
B) గారాబు
C) గౌరు
D) గారవము
జవాబు:
D) గారవము

ప్రశ్న 9.
బూర్గుల వారు పర్షియన్ భాష ఐచ్ఛికంగా తీసుకున్నారు – గీత గీసిన పదానికి వికృతి
A) పుస్తకం
B) గ్రంథం
C) బాస
D) బాష
జవాబు:
C) బాస

ప్రశ్న 10.
రామకృష్ణారావు గారు ప్రాచీన కావ్యాలు చదివేవారు – గీత గీసిన పదానికి వికృతి
A) కవ్వం
B) కబ్బం.
C) కవనం
D) కాననం
జవాబు:
B) కబ్బం.

ప్రశ్న 11.
కష్టాలు సంభవించినపుడు అధైర్యంతో క్రుంగిపోనూ లేదు – గీత గీసిన పదానికి వికృతి
A) కసటు
B) కసాటు
C) కషటు
D) కసటం
జవాబు:
A) కసటు

IV. పర్యాయపదాలు :

ప్రశ్న 1.
లోకము, జగము, ప్రపంచము – అను పర్యాయపదాలు కల పదం
A) లోకనము
B) జగత్తు
C) స్వర్గము
D) పంచాస్యం
జవాబు:
B) జగత్తు

ప్రశ్న 2.
మిత్రుడు- అనే పదానికి పర్యాయపదాలు
A) నేస్తం, దోస్తు
B) స్నేహితుడు, మైత్రి
C) బంధువు, చెలికాడు.
D) చెలువుడు, సంగడి
జవాబు:
A) నేస్తం, దోస్తు

ప్రశ్న 3.
రక్తము – అనే పదానికి పర్యాయపదాలు
A) శోణితము, రుధిరము
B) నెత్తురు, వర్ణము
C) కీలాలం, ద్రవము
D) పలాశము, పలలము
జవాబు:
A) శోణితము, రుధిరము

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 4.
తనువు, కాయము, మేను – పర్యాయపదాలుగా గల పదం
A) శబ్దం
B) ప్రాణం
C) శరీరం
D) దేశం
జవాబు:
C) శరీరం

ప్రశ్న 5.
అబ్దం, సాలు, వర్షం – పర్యాయపదాలుగా గల పదం
A) సంవత్సరము
B) వాన
C) నీటిచాలు
D) సముద్రం
జవాబు:
A) సంవత్సరము

ప్రశ్న 6.
“దక్షత” – అను పదమునకు మరియొక పర్యాయపదము
A) శిక్షణ
B) సామర్ధ్యము
C) ఒక రాజు
D) దక్షిణం
జవాబు:
B) సామర్ధ్యము

ప్రశ్న 7.
“జనకుడు” – అను పదానికి పర్యాయపదం కాని పదం
A) కొడుకు
B) తండ్రి
C) పిత
D) నాన్న
జవాబు:
A) కొడుకు

ప్రశ్న 8.
‘సహస్రఫణ్” కు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) కానుక, కనుక
B) బహుమానం, సన్మానం
C) గౌరవం, మర్యాద
D) బహూకరణ, నమూనా
జవాబు:
B) బహుమానం, సన్మానం

ప్రశ్న 9.
సౌజన్యానికి ఆయన మారుపేరు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సౌజన్య, సుజన
B) సౌశీల్యం, సుశీల
C) సుజనత్వం, మంచితనం
D) దయ, కరుణ
జవాబు:
C) సుజనత్వం, మంచితనం

ప్రశ్న 10.
బూర్గులవారి విశేష నైపుణ్యానికి నేను ఎల్లప్పుడు జోహారులర్పిస్తాను – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) నమస్కారం, అంజలి
B) కైమోడ్పు, మౌనం
C) చేమోడ్పు, చేయిముడు
D) దండం, దండ
జవాబు:
A) నమస్కారం, అంజలి

ప్రశ్న 11.
స్నేహితులు ద్రోహం తలపెట్టినా పట్టించుకోరు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) మేలు, మంచి
B) కీడు, శుభం
C) చెడు, సంతోషం
D) ఆపద, కీడు
జవాబు:
D) ఆపద, కీడు

V. నానార్థాలు:

ప్రశ్న 1.
“వాహిని” – అనే పదానికి నానార్థాలు
A) కాండము, నీరు
B) వాహనం, దేవత
C) నది, సేన
D) ప్రవాహము, కొండ
జవాబు:
A) కాండము, నీరు

ప్రశ్న 2.
సూర్యుడు, స్నేహితుడు – అనే నానార్థాలు గల పదం
A) రాజు
B) మిత్రుడు
C) గ్రహం
D) నక్షత్రం
జవాబు:
B) మిత్రుడు

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
“మరుగు” – అనే పదానికి నానార్థాలు
A) చాటు, అలవాటుపడు
B) వేడెక్కు, దానం
C) దాగు, దాచు
D) తెర, తెరచాప
జవాబు:
A) చాటు, అలవాటుపడు

ప్రశ్న 4.
నాకు క్షేత్రములన్న ప్రీతి – గీత గీసిన పదానికి నానార్థములు
A) వరిమడి, పుణ్యస్థానం
B) దేవాలయము, గుడి
C) శరీరము, దానము
D) భార్య, విశేషము
జవాబు:
A) వరిమడి, పుణ్యస్థానం

ప్రశ్న 5.
అన్ని మతములు శ్రేయస్సును కోరునవి – గీత గీసిన పదానికి నానార్ధములు –
A) కులము, అతుకు
B) ముత్యము, భాష
C) మతాబులు, పూజా విధానము
D) అభిప్రాయము, శాస్త్రం, సమ్మతి
జవాబు:
D) అభిప్రాయము, శాస్త్రం, సమ్మతి

VI. వ్యుత్పత్యర్థములు :

ప్రశ్న 1.
“గురువు”నకు సరియైన వ్యుత్పత్త్యర్థము
A) లావుగా ఉండువాడు.
B) అజ్ఞానమనే అంధకారమును పోగొట్టువాడు.
C) గుండ్రముగా తిరుగువాడు.
D) దేవతలను ఆజ్ఞాపించువాడు.
జవాబు:
B) అజ్ఞానమనే అంధకారమును పోగొట్టువాడు.

ప్రశ్న 2.
మనవు సంతతి వారు – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) మనవి
B) మానవులు
C) మానినులు
D) రాక్షసులు
జవాబు:
B) మానవులు

ప్రశ్న 3.
ద్రవ్యము – అను పదమునకు సరియైన వ్యుత్పత్తి
A) పొందదగినది
B) దున్నుటకు వీలైనది
C) ద్రవించునది
D) అవ్యయము వంటిది
జవాబు:
A) పొందదగినది

ప్రశ్న 4.
అజ్ఞానాన్ని తొలిగించువాడు – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) రక్షకభటుడు
B) గురువు
C) వైద్యుడు
D) దొంగ
జవాబు:
B) గురువు

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 5.
తిథి, వార, నియమం లేనివాడు – అను వ్యుత్పత్తి అర్థము గల పదము
A) జులాయి
B) మిత్రుడు
C) అతిథి.
D) చుట్టం
జవాబు:
C) అతిథి.

PAPER – II : PART – A

అపరిచిత గద్యాలు

ప్రశ్న 1.
కింది గద్యభాగాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారుచేయండి.

“శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దివాడు. సాహిత్యంపై ప్రత్యేక అభిమానం కలవాడు. భువనవిజయమనే సభామండపంలో సాహిత్యగోష్ఠి నిర్వహించేవాడు. అనేక కవి పండితులను పోషించేవాడు. ఆయన ఆస్థానంలోని ఎనిమిది మంది ప్రసిద్ధ కవులను అష్టదిగ్గజాలు అని పిలిచారు. అందులో అల్లసాని పెద్దన అగ్రగణ్యుడు. వారిలో తెనాలి రామకృష్ణుడు వికటకవిగా పేరు పొందాడు. రాయలు రాజు మాత్రమే కాదు, కవి కూడా. దేశభాషలందు తెలుగు లెస్స అని చాటాడు. ఆయన కాలం తెలుగుభాషకు స్వర్ణయుగమై భాసిల్లింది.

జవాబు:

ప్రశ్నలు

  1. శ్రీకృష్ణదేవరాయలు ఏ కాలము వాడు ?
  2. శ్రీకృష్ణదేవరాయల సభాభవనం పేరు ఏమి ?
  3. ‘అష్టదిగ్గజాలు’ అంటే ఎవరు ? వారిలో అగ్రగణ్యుడు ఎవరు ?
  4. తెలుగుభాషకు ఎవరి కాలం స్వర్ణయుగం ?
  5. తెనాలి రామకృష్ణుడు ఏ విధంగా పేరు పొందాడు ?

ప్రశ్న 2.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.

“ఏకశిలా నగరాన్ని రాజధానిగా చేసుకొని, తెలుగునేలను వైభవ స్థితిలో నిలిపిన కాకతీయ రాజులలో చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు. అతడు ఉత్తమ పరిపాలకుడు మాత్రమే కాదు, మానవ ధర్మాన్ని, కళామర్మాన్ని ఎరిగిన సాహితీమూర్తి. సంస్కృతాంధ్రభాషల్లో అనుపమానమైన పాండిత్యాన్ని సొంతం చేసుకున్న సత్కవీంద్రుడు. సంగీత, సాహిత్య, నృత్య, చిత్రలేఖన, శిల్పకళలకు ఇతోధిక ప్రాధాన్యత నిచ్చి, వాటి విస్తృతికి విశేష సహకారమందించిన రసహృదయుడు, సహృదయుడు. ఎంతటి మహోన్నతులకయినా, చంద్రునిలో మచ్చలా ఏవో బలహీనతలుంటాయి. వేట ప్రతాపరుద్రుని బలహీనత. క్రమం తప్పకుండా వేట వినోదాన్ని ఆస్వాదించేవాడు ప్రతాపరుద్రుడు. ఆ వ్యసనం నుండి మహారాజును దూరం చేయాలని ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయినాడు మంత్రి యుగంధరుడు.

జవాబు:

ప్రశ్నలు

  1. కాకతీయుల రాజధాని ఏది ?
  2. రెండవ ప్రతాపరుద్రుడు ఏయే భాషల్లో పండితుడు ?
  3. ప్రతాపరుద్ర చక్రవర్తి యొక్క బలహీనత ఏమిటి ?
  4. యుగంధరుడు ఎవరు ?
  5. ప్రతాపరుద్రుడు లలితకళలను ఎలా పోషించాడు ?

ప్రశ్న 3.
కింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.
“సాహితీ సృజనలో అంతర్జాతీయ కీర్తి నందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా, రచయితగా, తత్త్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. వీరి పేరు వినగానే చప్పున స్ఫురించేవి ‘జనగణమన గీతం’, ‘గీతాంజలి’. జనగణమన గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా వీరి లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయ గీతాలనందించిన కవిగా, అపూర్వ చరిత్రను సృష్టించారు. “శాంతి నికేతన్” పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి, ‘గురుదేవుడు’ గా కీర్తింపబడ్డారు.

జవాబు:

ప్రశ్నలు

  1. అంతర్జాతీయ కీర్తినందుకొన్న భారతీయ మహాకవి ఎవరు ?
  2. ఏ రెండు దేశాలకు ఠాగూర్ జాతీయ గీతాలను అందించాడు ?
  3. రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన విద్యాసంస్థ ఏది ?
  4. రవీంద్రుని ప్రసిద్ధ రచనలు రెండింటిని రాయండి.
  5. రవీంద్రుని బహుముఖ ప్రజ్ఞను వివరించండి.

ప్రశ్న 4.
కింది గద్యభాగాన్ని చదువండి. కింద ఇచ్చిన ఐదు వాక్యాలలోని తప్పొప్పులను గుర్తించి బ్రాకెట్లలో రాయండి. “అంతరించిపోతున్న తెలుగుభాషా సంస్కృతులకు పునరుజ్జీవనం కల్పించుటకై రంగంలోకి దిగిన కందుకూరి పూర్తి సంఘసంస్కరణ దృక్పథంతో పనిచేశారు. ఒకే రంగాన్ని ఎంచుకోకుండా, సంఘంలో అపసవ్యంగా సాగుతున్న పలు అంశాలవైపు దృష్టిని సారించాడాయన. ప్రధానంగా స్త్రీల అభ్యున్నతిని కాంక్షించిన మహామనీషిగా వాళ్ళ చైతన్యం కోసం అనేక రచనలు చేశారు. చంద్రమతి చరిత్ర, సత్యవతి చరిత్ర వంటివి అందులో కొన్ని. వారి బ్రహ్మవివాహం నాటకం, పెద్దయ్య గారి పెళ్ళి పేరుతో, వ్యవహార ధర్మబోధిని, ప్లీడర్ నాటకం పేరుతోనూ, ప్రసిద్ధి పొందాయి.

వాక్యాలు

1. కందుకూరి పూర్తిపేరు వీరేశలింగం పంతులు.
జవాబు:
ఒప్పు

2. చంద్రమతి చరిత్ర కందుకూరి రాసిన గొప్ప నాటకం.
జవాబు:
తప్పు

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

3. సంఘంలోని సవ్యమైన అంశాలపై దృష్టి సారించాడాయన.
జవాబు:
తప్పు

4. కందుకూరి గొప్ప సంఘసంస్కర్త.
జవాబు:
ఒప్పు

5. తెలుగుభాషా సంస్కృతులను పునరుజ్జీవింపచేశారు కందుకూరి.
జవాబు:
ఒప్పు

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
మాతృభాష గొప్పదనాన్ని తెల్పుతూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

బాసర,
X X X X.

ప్రియమైన స్నేహితురాలు శ్రీవల్లికి,

నేను బాగా చదువుతున్నాను. నీవూ బాగా చదువుతున్నావని తలుస్తాను. ముఖ్యంగా ఈ లేఖలో మాతృభాష గొప్పతనాన్ని తెలియజేస్తున్నాను. తల్లి నుండి వచ్చిన భాషను మాతృభాష అంటారు. మన మాతృభాష తెలుగు. ‘తేనె లొలుకు భాష తెలుగు భాష’ అని పండితులు కీర్తించారు. పరభాషా మోజులో పడి మన మాతృభాషను మరిచిపోకూడదు. మాతృభాషలో నేర్చుకోని విద్య మెట్లు లేకుండ ఇంటిపైకి ఎక్కినట్లుంటుంది. ఏ జాతి సంస్కృతి అయినా ఆ జాతివాడే భాష మనుగడపైనే ఆధారపడి ఉంటుంది. మనిషి ఊహాశక్తికి, భావ వ్యక్తీకరణకు, నూతన సృజనకు ఆధారం ఈ మాతృభాషే, ఇంతటి మహత్తర శక్తి ఉంది కాబట్టే ఐక్యరాజ్య సమితి ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని 1999లో నిర్ణయించింది. ఆంగ్లం అవసరమే కాని అనివార్యం మాత్రం కాదు. మాతృభాషను గౌరవించడమంటే తల్లిని గౌరవించడంతో సమానం. నికోలా కాంటే తెలుగుభాష గొప్పదనాన్ని కొనియాడుతూ “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్”గా అభివర్ణించాడు. “దేశభాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు ప్రశంసించాడు. మాతృభాష ఏ జాతి సంస్కృతి కైనా జీవగర్ర ! దీనిని ఎవరూ మరువకూడదు.

నీవు కూడా మాతృభాషను గూర్చిన విషయాలు తెలిసినవి రాస్తావని కోరుకుంటున్నాను.

ఇట్లు,
నీ ప్రియ స్నేహితురాలు,
కె.లలిత.

చిరునామా :

సిహెచ్. శ్రీవల్లి,
9వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్,
భద్రాచలం, ఖమ్మం జిల్లా.

PAPER – II : PART-B

భాషాంశాలు – వ్యాకరణం

కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.

1. సంధులు:

ప్రశ్న 1.
విమానాశ్రయం – విడదీసి రాయగా
A) విమా + నాశ్రయము
B) విమాన + ఆశ్రయం
C) విమానా + శ్రయము
D) విమానముల + ఆశ్రయం
జవాబు:
B) విమాన + ఆశ్రయం

ప్రశ్న 2.
“సవర్ణదీర్ఘ సంధి”కి ఉదాహరణ కానిది.
A) శరీర + ఆకృతి
B) గిరి + ఈశుడు
C) మత + అతీత
D) ఆ + అవసరము
జవాబు:
D) ఆ + అవసరము

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
ఈ కింది వానిలో “గుణసంధి”కి ఉదాహరణ కానిది.
A) భావ + ఉద్రేకం
B) భావ + ఆవేశం
C) ప్ర + ఉత్సాహం
D) దేవ + ఇంద్రుడు
జవాబు:
B) భావ + ఆవేశం

ప్రశ్న 4.
“యణాదేశ సంధి”కి ఉదాహరణ
A) మహెూన్నతము
B) ముఖ్యాంశం
C) ప్రత్యర్థులు
D) సారాంశం
జవాబు:
C) ప్రత్యర్థులు

ప్రశ్న 5.
కర్మధారయములలో మువర్ణకమునకు పు, ౦పు లు వచ్చు సంధి పేరు
A) ముగాగమ సంధి
B) పుంప్వాదేశ సంధి
C) రుగాగమ సంధి
D) లులనల సంధి
జవాబు:
B) పుంప్వాదేశ సంధి

ప్రశ్న 6.
“ఇంత + ఇంత” సంధి కలిపి రాయగా
A) ఇంతయింత
B) ఇత
C) ఇంతింత
D) ఇంతయునింత
జవాబు:
C) ఇంతింత

ప్రశ్న 7.
పుష్పమాలా + అలంకృతులు – అని విడదీయగా వచ్చు సంధి పేరు
A) సవర్ణదీర్ఘ సంధి
B) లులనల సంధి
C) అత్వ సంధి
D) యడాగమ సంధి
జవాబు:
A) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 8.
అతిశయ + ఉక్తి – సంధి పేరు
A) గుణసంధి
B) యడాగమ సంధి
C) యణాదేశ సంధి
D) ఉత్వ సంధి
జవాబు:
A) గుణసంధి

II. సమాసములు :

ప్రశ్న 1.
“మూల్యము కానిది – అమూల్యము.” – ఇది ఏ సమాసము ?
A) విశేషణ పూర్వపదము
B) నఞ తత్పురుష
C) చతుర్థీ తత్పురుష
D) ద్విగు సమాసము
జవాబు:
B) నఞ తత్పురుష

ప్రశ్న 2.
“విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణ
A) అమూల్య సంపద
B) పద్మముఖి
C) జలజాకరము
D) తల్లిప్రేమ
జవాబు:
A) అమూల్య సంపద

ప్రశ్న 3.
“దేశ చరిత్ర” – సరియైన విగ్రహవాక్యమును గుర్తించుము.
A) దేశములు, చరిత్రలు
B) దేశము నుండి చరిత్ర
C) దేశము యొక్క చరిత్ర
D) చరిత్ర గల దేశము
జవాబు:
C) దేశము యొక్క చరిత్ర

ప్రశ్న 4.
“వాదన యందు పటిమ” – సమాసము చేయగా
A) వాదనలో పటిమ
B) వాదనా పటిమ
C) వాదనలు, పటిమలు
D) వాదోపవాదము
జవాబు:
B) వాదనా పటిమ

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 5.
“ద్విగు సమాసము”నకు ఉదాహరణ
A) ప్రాచీన కావ్యాలు
B) శక్తి సామర్థ్యాలు
C) నెలతాల్పు
D) రెండు రాష్ట్రాలు
జవాబు:
D) రెండు రాష్ట్రాలు

ప్రశ్న 6.
“దొంగ వలన భయము” – ఏ సమాసము
A) పంచమీ తత్పురుష
B) షష్ఠీ తత్పురుష
C) బహువ్రీహి
D) సంభావనా పూర్వపద కర్మధారయము
జవాబు:
A) పంచమీ తత్పురుష

ప్రశ్న 7.
“తృతీయా తత్పురుష సమాసమునకు ఉదాహరణ
A) గురువు కొఱకు దక్షిణ
B) నెలను తాల్చినవాడు
C) మూడు కన్నులు కలవాడు
D) వయస్సు చేత వృద్ధుడు
జవాబు:
D) వయస్సు చేత వృద్ధుడు

ప్రశ్న 8.
“విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము”నకు ఉదాహరణ కానిది
A) అమూల్య సమయం
B) పూర్ణ పురుషులు
C) పెద్ద కుటుంబం
D) నెలతాల్పు
జవాబు:
D) నెలతాల్పు

III. ఛందస్సు:

ప్రశ్న 1.
ఈ కింది గణాలలో “భ గణం” గుర్తించండి.
A) UIU
B) UII
C) IIU
D) UUI
జవాబు:
B) UII

ప్రశ్న 2.
“తాయెత్తు” గణ విభజన చేయగా
A) UII
B) UIU
C) UUI
D) UUU
జవాబు:
C) UUI

ప్రశ్న 3.
ఉత్పలమాల పద్యములో వచ్చు గణములు
A) గగ, భ, జ, స, నల
B) భ, ర, న, భ, భ, ర, వ
C) మ, స, జ, స, త, త, గ
D) నల, నగ, భ, ర, త
జవాబు:
B) భ, ర, న, భ, భ, ర, వ

ప్రశ్న 4.
చంపకమాలలో యతి ఎన్నవ అక్షరము ?
A) 10
B) 13
C) 14
D) 11
జవాబు:
D) 11

ప్రశ్న 5.
పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ఇలా అంటారు.
A) ప్రాస
B) యతి
C) ప్రాసయతి
D) గణ
జవాబు:
A) ప్రాస

TS 9th Class Telugu Important Questions 2nd Lesson నేనెరిగిన బూర్గుల

IV. అలంకారములు :

ప్రశ్న 1.
ఒకే అక్షరం పలుమార్లు ఆవృత్తి అయితే ఆ అలంకారం
A) వృత్త్యనుప్రాస
B) అనుప్రాస
C) అంత్యానుప్రాస
D) లాటానుప్రాస
జవాబు:
A) వృత్త్యనుప్రాస

ప్రశ్న 2.
“అమందానందంబున నందనందను డిందు వచ్చె” పై వాక్యంలో గల అలంకారం
A) ఉపమాలంకారం
B) వృత్త్యనుప్రాసాలంకారం
C) ఛేకానుప్రాసాలంకారం
D) లాటానుప్రాసాలంకారం
జవాబు:
B) వృత్త్యనుప్రాసాలంకారం

ప్రశ్న 3.
వృత్త్యనుప్రాసాలంకారానికి ఉదాహరణ
A) అది ఒక గోడ, గోడ పక్కన నీడ, నీడలో ఆవు దూడ
B) కలికి, చిలుకల కొలికి కిలకిల నవ్వె
C) భవనము వనములో ఉన్నది
D) తుమ్మెద ఝుం ఝుమ్మని పాడింది
జవాబు:
A) అది ఒక గోడ, గోడ పక్కన నీడ, నీడలో ఆవు దూడ

V. వాక్యాలు :

ప్రశ్న 1.
కింది వాటిలో ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యం
A) తన తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు.
B) “నా యీ చొరవ సీనియర్ గుమస్తా కోప కారణమైంది” అని పి.వి. అన్నాడు.
C) అతడు నాతో సినిమాకి వస్తానన్నాడు.
D) అందరూ అధికులు కావాలని చూస్తారు.
జవాబు:
B) “నా యీ చొరవ సీనియర్ గుమస్తా కోప కారణమైంది” అని పి.వి. అన్నాడు.

ప్రశ్న 2.
“నేను ఒక్కడినే చదువుకొంటున్నాను” అని అన్నాడు చైతన్య. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా
A) నేను చదువుకొంటున్నాను అని చైతన్య అన్నాడు.
B) తాను ఒక్కడే చదువుకొంటున్నానని చైతన్య అన్నాడు.
C) నేను చదువుకొంటున్నాను ఒక్కడినే అని చైతన్య అన్నాడు.
D) వాడు ఒక్కడే చదువుతున్నాడని చైతన్య అన్నాడు.
జవాబు:
B) తాను ఒక్కడే చదువుకొంటున్నానని చైతన్య అన్నాడు.

ప్రశ్న 3.
“నరేష్ తాను రానని నాతో చెప్పాడు.” ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చగా
A) నరేష్ “నేను రాను” అని నాతో చెప్పాడు.
B) నరేష్ నాతో రానని చెప్పాడు.
C) నాతో రానని నరేష్ చెప్పాడు.
D) తనతో నేను రానని నరేష్ చెప్పాడు.
జవాబు:
A) నరేష్ “నేను రాను” అని నాతో చెప్పాడు.

ప్రశ్న 4.
రాజు “నా పుట్టినరోజుకు తప్పక రావాలి” అని కృష్ణతో అన్నాడు.
A) రాజు పుట్టినరోజుకి తప్పక రావాలని కృష్ణ అన్నాడు.
B) రాజు నేను పుట్టినరోజుకు తప్పక వస్తానని కృష్ణతో అన్నాడు.
C) రాజు, కృష్ణ పుట్టినరోజుకు రావాలన్నాడు.
D) రాజు తన పుట్టినరోజుకు తప్పక రావాలని కృష్ణతో అన్నాడు.
జవాబు:
D) రాజు తన పుట్టినరోజుకు తప్పక రావాలని కృష్ణతో అన్నాడు.

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

These TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి will help the students to improve their time and approach.

TS 9th Class Telugu 4th Lesson Important Questions రంగాచార్యతో ముఖాముఖి

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
దాశరథి రంగాచార్యకు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం ఉందని ఎలా చెప్పగలవు ?
జవాబు:
తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యులుగారికి విశిష్ట స్థానం ఉంది. ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య ఈయన సోదరుడు. రంగాచార్య విశిష్టమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసాడు. నాలుగు వేదాలను, పది ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాసి, ప్రజలకు అందుబాటులో వాటిని తెచ్చారు.

తెలుగు నవలలో ‘పాత్రోచితయాస’ను మొదటగా ప్రవేశపెట్టి, ప్రశంసలందుకొన్నారు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి అనువదించబడ్డాయి అంటే వీరి సాహిత్య విలువలు ఎలా ఉంటాయో గమనించాలి. వీరి “చిల్లర దేవుళ్ళు” నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా రచనలు చేసి, తన విశిష్ట రచనాశైలితో పాఠకుడిని ఆకట్టుకొనే రంగాచార్యకు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా ఏం కావాలి ?

ప్రశ్న 2.
వాడుకభాష వలన ప్రయోజనం ఏమిటి?
జవాబు:
తెలుగుభాష బోధనలో, వ్యాసాలూ, వార్తల రచనల్లో, కథాకథనంలో గ్రాంథికం గాక, వాడుకలో ఉన్న పదాలతో, ఎలా సామాన్యంగా మాట్లాడతామో అలా తెలుగు వాక్యాలను వ్రాయడం ద్వారా విద్య పండితులకే అన్న భావన తొలిగి విద్య అందరిదీ అన్న భావనను మహనీయులైన ఎందరో కవులు తెచ్చారు.

పూర్వం మాట్లాడే భాషకు, రాసే భాషకు అంతరం ఉండేది. దానివల్ల కవుల గ్రంథాలు కేవలం పండితులకే పరిమితం అయ్యాయి. రానురాను కవులు, రచయితల ఆలోచనలలో మార్పువచ్చి పండిత పామర రంజకంగా రాయాలంటే వాడుకభాషే సరైనదని భావించి, రచనలు చేశారు. వాడుకభాష వల్ల సామాన్యుడు సైతం తేలికగా అర్ధం చేసుకోవడానికి వీలుంటుంది. కవి ఆంతర్యం, ఆలోచన లోకానికి తొందరగా చేరుతుంది.

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
“సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది” అంటే మీకు ఏమర్థమయ్యింది ?
జవాబు:
‘సిద్దాంతము’ అనగా అక్షర రూపు దాల్చిన స్థిరమైన విధానము. మనం ఏమి చేయాలనుకున్నామో, ఎట్లా చేయాలనుకున్నామో ఇదంతా ఒక మాటగానో, పుస్తకంగానో ఉండటమే సిద్ధాంతం. ఇక ‘కర్తవ్యం’ అంటే విధి. మనం చేయాల్సిన పనిని తెలిపేది. బాధ్యతను గుర్తుచేసేది అని చెప్పవచ్చు. మాటలకన్నా చేతల్లో చూపించడం అనేది ఎప్పుడూ గొప్పే. కనుక అక్షర (మాటలు) రూపంలోని సిద్ధాంతాలతో కూర్చోవడం కన్నా మనిషిగా మన కర్తవ్యాన్ని గుర్తించి ప్రవర్తించడం గొప్ప విషయం. ఇది పెద్దల మాట. గాంధీగారు “డూ ఆర్ డై” అన్నారు. అది ఆయన సిద్ధాంతం కాదు. కర్తవ్యం అని అర్థం చేసుకున్నాను.

ప్రశ్న 4.
ఇంటర్వ్యూ ఎన్ని రకాలు ? అవి ఏవి ?
జవాబు:
ఇంటర్వ్యూలు రెండు రకాలు. ఉద్యోగాల ఎంపికకు అభ్యర్థుల ప్రతిభను పరీక్షించడానికి చేసే ఇంటర్వ్యూలు మొదటి రకం. ప్రముఖుల జీవిత విశేషాలను తెలుసుకోడానికి చేసే ఇంటర్వ్యూలు రెండో రకం.

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని, పోరాటాలను దాశరథి తన రచనల్లో ప్రతిబింబించిన తీరును సొంతమాటల్లో వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యుల గారికి విశిష్ట స్థానం ఉంది. ఈయన తెలంగాణ పోరాటం పూర్వరంగాన్ని, తన జీవశక్తిగా మార్చుకొని, తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించారు. రంగాచార్య నవలల్లో ప్రధాన విషయం ‘తెలంగాణ సాయుధ పోరాటం’. దాశరథి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఉద్యమశీలి. తెలంగాణలో పోలీసు యాక్షన్ తరువాత రైతుల భూములను దొరలు కాజేశారు.

తరువాత వచ్చిన ఉద్యమాలు, వాటి పేరున జరిగిన మోసాలు, రాజకీయాలు, ఎంత దిగజారాయో మొదలైన విషయాలు ప్రజలకు తెలియాలి అనే భావనతో ‘జనపదం’ నవలలో వివరించారు. “మోదుగుపూలు” నవల ద్వారా ‘సిద్దాంతం కన్నా కర్తవ్యం గొప్పది. విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది’ – అని ప్రకటించారు.

కమ్యూనిస్టు ఉద్యమం దాశరథికి జీవితాన్ని నేర్పింది. సమాజం కోసం ఏదైనా చేయాలి అనే తపన కల్గించింది. “నేను రచనలు ప్రజాజీవితాన్ని చిత్రించడానికి రాశాను. నా ప్రజలకోసం రాశాను” అనడంలో దాశరథికి తెలంగాణ ప్రజలపట్ల ఉన్న అభిమానం వ్యక్తమౌతుంది. “ఆదర్శం, ఆవేశం, అక్షరం” ఇవి ఉన్నప్పుడే వ్యక్తికైనా, సమాజానికైనా కావాల్సినవి సిద్ధిస్తాయని తన రచనల ద్వారా సందేశమిచ్చిన దాశరథి ప్రాతఃస్మరణీయులు.

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 2.
ప్రముఖ సాహితీవేత్త డా॥ దాశరథి రంగాచార్య చేసిన సాహిత్య సేవను వివరించండి. (లేదా) రంగాచార్యతో ముఖాముఖి ఆధారంగా ఆయన రచనల గురించి వివరించండి.
జవాబు:
మహాకవి దాశరథి రంగాచార్యగారు తెలంగాణ సాయుధపోరాటం నేపథ్యంగా చిల్లర దేవుళ్ళు, జనపదం, మోదుగుపూలు, మాయజలతారు వంటి అద్భుతమైన నవలలు రాశారు. చారిత్రాత్మకమైన తెలంగాణ పోరాట చరిత్రను తన రచనల ద్వారా భావితరాలకు వారు అందజేశారు.

ఇంతేకాక, నాలుగు వేదాలనూ, పది ఉపనిషత్తులనూ తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళవచనంలో రాశారు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం, వంటి అంశాలు నేపథ్యంగా ఈయన విశిష్టమైన నవలలు రచించి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు నవలలో పాత్రోచితయాసను మొదటగా ప్రవేశపెట్టారు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి కూడా అనువదింపబడ్డాయి.

ఈయన నవలలు చలన చిత్రాలుగా వచ్చాయి. ఈయన రచనాశైలి, పాఠకుడిని ఆకట్టుకొంటుంది. ఈయన రాసిన “చిల్లర దేవుళ్ళు” నవలకు, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయనను ‘గద్య దాశరథి’ అనేవారు. ఈయన సంస్కృతాంధ్ర భాషల్లో మహాపండితుడు. ఈయన జీవిత చరిత్రను ‘మోదుగుపూలు’ నవలలో చిత్రించారు. రంగాచార్య గొప్ప రచయిత.

PAPER – I : PART – B

భాషాంశాలు – పదజాలం

1. సొంతవాక్యాలు

అ) కింది పదాలను సొంతవాక్యాల్లో ప్రయోగించండి.

1. బుగులు పడడం (కలత చెందడం)
వాక్యప్రయోగం : రాష్ట్రం విపరీతమైన ఎండలతో బుగులు పడింది.

2. బృహత్ కార్యము: (పెద్దపని)
వాక్యప్రయోగం : ముఖ్యమంత్రి రాష్ట్రమును బంగారు తెలంగాణగా రూపొందించడం అనే బృహత్ కార్యక్రమమును చేపట్టారు.

3. గర్వకారణము :
వాక్యప్రయోగం : మా పాఠశాలలో పదవతరగతి పరీక్షల్లో నూటికి నూరుశాతం పాసుకావడం, మాకు గర్వకారణం

4. సాంప్రదాయసిద్ధము :
వాక్యప్రయోగం : మేము సాంప్రదాయ సిద్ధమైన వస్త్రాలనే ధరిస్తాము.

5. వసుధైక కుటుంబం :
వాక్యప్రయోగం : ప్రపంచ ప్రజలు కులమత భేదాలు విడిచి వసుధైక కుటుంబ భావనతో జీవించాలి.

ఆ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించి, వాటి సంకేతాన్ని (A, B, C, D) రాయండి.

ప్రశ్న 1.
నా నవలలు ఆ వ్యధ, బాధ అనే తమస్సులోంచి ఆవిర్భవించాయి.
A) పుట్టడం
B) బాధపడడం
C) తపస్సు చెయ్యడం
D) రాయడం
జవాబు:
A) పుట్టడం

ప్రశ్న 2.
నీ కర్తవ్యం నీవు మరువకు.
A) మాట
B) చేయవలసిన పని
C) ఆలోచన
D) ప్రార్థన
జవాబు:
B) చేయవలసిన పని

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
ప్రణాళికలను బాగా అధ్యయనం చేయాలి.
A) రాయడం
B) పరిశీలించడం
C) చదవడం
D) నేర్చుకోడం
జవాబు:
B) పరిశీలించడం

ఇ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరియైన పర్యాయపదాలు గుర్తించి, వాటి సంకేతాన్ని (A, B, C, D) రాయండి.

ప్రశ్న 1.
ఈ వ్యధ బాధ ఆవేదనలోంచి పుట్టాయి.
A) విచారం, గొప్ప
B) గరువము, కావరము
C) గౌరవం
D) రంధి, కష్టం
జవాబు:
C) గౌరవం

ప్రశ్న 2.
కమ్యూనిస్టు ఉద్యమం నన్ను మనిషిని చేసింది.
A) నరుడు, మానవుడు
B) మనుజుడు, యోగ్యుడు
C) మర్త్యుడు, సరసుడు
D) నరుడు, దేవత
జవాబు:
A) నరుడు, మానవుడు

ప్రశ్న 3.
ప్రజల జీవితం నేపథ్యంగా నవలలు రాశారు.
A) బతుకు, కష్టం
B) బతుకు, సంసారం
C) బతుకు, జీవనం
D) మనికి, నడవడి
జవాబు:
C) బతుకు, జీవనం

ప్రశ్న 4.
రామప్పగుడి సోయగం వర్ణనాతీతం.
A) అందం, చందం
B) అందం, సొగసు
C) సొగసు, గొప్పతనం
D) అందం, రంగు
జవాబు:
B) అందం, సొగసు

ఈ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులను గుర్తించి, వాటి సంకేతాన్ని (A, B, C, D) రాయండి.

ప్రశ్న 1.
రావణుని గర్వమునకు కారణం ఏమిటి ?
A) ఖర్వం
B) గరువము, కారవము
C) గౌరవం
D) గారం
జవాబు:
B) గరువము, కారవము

ప్రశ్న 2.
ఆలస్యం ఎందుకంటే కత చెప్తావేం? గీత గీసిన పదానికి ప్రకృతి
A) కతలు
B) కొత్త
C) కథ
D) కైత
జవాబు:
C) కథ

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
నీ కష్టం నాకు అర్ధం అయ్యింది.
A) కస్తి
B) నష్టం
C) కలహం
D) ఇష్టం
జవాబు:
A) కస్తి

ప్రశ్న 4.
తమిళంలో ఒక్క అక్షరం రాయరాదు.
A) అక్ష
B) అవసరం
C) అక్కరం
D) అక్షయం
జవాబు:
C) అక్కరం

ప్రశ్న 5.
నాకు పద్యము చదవడం ఇష్టం.
A) పద్దెము
B) గద్యం
C) గం
D) పాట
జవాబు:
A) పద్దెము

ఉ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు నానార్థాలను గుర్తించి, వాటి సంకేతాన్ని (A, B, C, D) రాయండి.

ప్రశ్న 1.
తెలంగాణలో రైతుపోరాట ఉద్యమం ఉవ్వెత్తున సాగింది.
A) యత్నం, ప్రయత్నం
B) యత్నం, పోరాటం
C) కలహం, సిద్దమవడం
D) యత్నం, కృషి
జవాబు:
B) యత్నం, పోరాటం

ప్రశ్న 2.
రాష్ట్ర సాధనలో విద్యార్థుల కృషి అమోఘమైనది.
A) ప్రయత్నం, వ్యవసాయం
B) వ్యవసాయం, చేత
C) పని, నడక
D) ప్రయత్నం, సాధక
జవాబు:
A) ప్రయత్నం, వ్యవసాయం

ప్రశ్న 3.
ఈ రోజు పాఠశాలలో సభ జరిగింది.
A) జూదం, మీటింగు
B) పరిషత్తు, కొలువు
C) ఇల్లు, జూదం
D) పరిషత్తు, ఉద్యమం
జవాబు:
C) ఇల్లు, జూదం

ప్రశ్న 4.
ఈ మధ్య సమాజం పూర్తిగా, కొత్తపుంతలు తొక్కుతోంది.
A) సభ, మనుషుల గుంపు
B) మనుషుల గుంపు, సమితి
C) సమితి, జనం
D) జనం, సభ
జవాబు:
A) సభ, మనుషుల గుంపు

PAPER – II : PART – A

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

ప్రశ్న 1.
దాశరథి రంగాచార్యగారిని అభినందిస్తూ కవిత/గేయం రాయండి.
జవాబు:
కవిత
– కంచిభొట్ల ఫణిరామ్

ఎవరయ్యా అతడు ! ఎవరయ్యా !
జనపదం ఆయన పథం
మోదుగు పూలు వారి హృది పథం.
చరిత్రను చెరపలేరంటాడు
రానున్న తరాలకు అందిస్తానంటాడు.
వారి నవలలు కావా ప్రజా జీవితాలూ ?
ఎందరో యువకులకు ప్రబోధ గీతాలు.

ఎవరయ్యా ఇతడు ! ఎవరయ్యా !

సత్యం ఆయన నమ్మిన మార్గం.
కర్తవ్యానికి నిలువెత్తు దుర్గం.
తెలంగాణం అంటే అభిమానం.
తెలంగాణేతరం పట్ల లేదు దురభిమానం.

‘ఆదర్శం, ఆవేశం, అక్షరం’ నా జీవితం
బాధ్యత, విలువలు గల ఈ సమాజానికే అంకితం.
అన్నది ఇంకెవరయ్యా ఆయనే దాశరథి రంగాచార్య.

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 2.
మీ తెలుగు పాఠ్యపుస్తక రచయిత మీ పాఠశాలకు వస్తే ఆయనతో ముఖాముఖికి అవసరమైన ప్రశ్నావళిని తయారుచేయండి.
జవాబు:
మా పాఠశాలకు డా॥ ఇరివెంటి కృష్ణమూర్తిగారు వస్తే, ఈ క్రింది ప్రశ్నలతో ఆయనను ఇంటర్వ్యూ చేస్తాను.

  1. యువభారతి అధ్యక్షా ! ‘కవి సమయములు’ అంటే ఏమిటి ? .
  2. విద్వత్తులేని వక్తృత్వం ఎంతోకాలం అంతటా రాణించదు అన్నారు. ఎందుకు ?
  3. వక్తకు జ్ఞాపకశక్తి ఉండాలా ?
  4. వక్త అంగాంగ విన్యాసం చెయ్యాలనే నియమం ఏదీ లేదన్నారు. ఎలా ?
  5. ఉపన్యాసం వ్యంగ్యార్థాన్ని ఆశ్రయించాలా ?
  6. ఉపన్యాసానికి ఆత్మ ఏది ?
  7. బాగా ఆలోచించేవాడు తక్కువ మాట్లాడతాడా ?
  8. శ్రోతలను శిలామూర్తులనుకోవడం ఎలా ?

ప్రశ్న 3.
మీ పాఠశాలకు వచ్చిన పదవీ విరమణ పొందిన ఒక ఉపాధ్యాయునితో ఆయన ఉద్యోగ జీవితాన్ని గురించి తెలుసుకునేందుకు ప్రశ్నావళి తయారుచేయండి.
జవాబు:
మా పాఠశాలకు ఇటీవల పదవీ విరమణ పొందిన తెలుగు ఉపాధ్యాయుడు వస్తే, కింది ప్రశ్నలతో ఆయన గూర్చి ఇలా అడుగుతా.

  1. నమస్కారమండి గురువుగారు! మీ ఆరోగ్యం ఎలా ఉంది ?
  2. మీ ఊరిలో ఉన్నప్పుడు మేము గుర్తుకొస్తామా ?
  3. మీకు కాలక్షేపం ఎలా అవుతోంది ?
  4. ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు ?
  5. ఏవైనా పుస్తకాలు రాశారా ?
  6. మేమేమైనా ఇబ్బంది పెట్టి ఉన్నామా ?
  7. మేము మీ మనసుకు బాగా కష్టపెట్టిన సందర్భం ఏది ?
  8. మీరు ఎన్నో ఊళ్ళు మారి ఉంటారు. ఎందరినో విద్యార్థులను చూసి ఉంటారు. వారిలో బాగా నచ్చిన దెవరు ? బాధపెట్టిన దెవరు ?
  9. మీకు ఇష్టమైన కవి ఎవరు ?
  10. మీకు బాగా నచ్చిన పుస్తకం ఏది ?

PAPER – II : PART – B

భాషాంశాలు – వ్యాకరణం

1. సంధులు

1) మహోద్యమం = మహా + ఉద్యమం – గుణసంధి
2) మహోజ్జ్వలం = మహా + ఉజ్జ్వలం – గుణసంధి
3) అన్నయ్య = అన్న + అయ్య – అత్వసంధి
4) ప్రభావాత్మకము = ప్రభావ + ఆత్మకము – సవర్ణదీర్ఘ సంధి
5) సంస్కృతాంధ్రభాషలు = సంస్కృత + ఆంధ్రభాషలు – సవర్ణదీర్ఘ సంధి
6) వసుధైక కుటుంబం = వసుధా + ఏకకుటుంబం – వృద్ధిసంధి
7) మరొకటి = మరి + ఒకటి – ఇత్వసంధి
8) విద్యార్థులు = విద్యా + అర్థులు – సవర్ణదీర్ఘ సంధి

2. సమాసాలు

సమాస పదం – విగ్రహవాక్యం – సమాస నామం

1) మహోద్యమము – గొప్పదైన ఉద్యమం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2) విద్యార్థులు – విద్యను అర్థించువారు – ద్వితీయా తత్పురుష సమాసం
3) ప్రజాజీవితాలు – ప్రజల యొక్క జీవితాలు – షష్ఠీ తత్పురుష సమాసం
4) పోరాటగాథ – పోరాటము యొక్క గాథ – షష్ఠీ తత్పురుష సమాసం
5) జీవనచిత్రాలు – జీవనము యొక్క చిత్రాలు – షష్ఠీ తత్పురుష సమాసం
6) భారతదేశము – భారతము అనే పేరుగల దేశము – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
7) కొత్త దృక్పధము – కొత్తదైన దృక్పధము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
8) గర్వకారణం – గర్వమునకు కారణం – షష్ఠీ తత్పురుష సమాసం
9) చదువు రాణి – చదువులకు రాణి – షష్ఠీ తత్పురుష సమాసం
10) భగవదనుగ్రహం – భగవంతుని యొక్క అనుగ్రహం- షష్ఠీ తత్పురుష సమాసం
11) వారసత్వసంపద – వారసత్వం అనెడి సంపద – రూపక సమాసం
12) సాహిత్యకృషి – సాహిత్యమందు కృషి – సప్తమీ తత్పురుష సమాసం
13) జీవనవైభవము – జీవనము యొక్క వైభవము – షష్ఠీ తత్పురుష సమాసం

ప్రశ్న 3.
‘సభ కొఱకు భవనం’ – ఈ విగ్రహవాక్యాన్ని సమాసపదంగా మార్చి, సమాసనామం రాయండి.
జవాబు:
సభా భవనం – చతుర్థీ తత్పురుష సమాసం

ప్రశ్న 4.
‘తల్లియు బిడ్డయూ’ విగ్రహవాక్యాన్ని సమాసపదంగా మార్చి, సమాసనామం రాయండి.
జవాబు:
తల్లీ బిడ్డలు – ద్వంద్వ సమాసం

ప్రశ్న 5.
‘వసుధైక కుటుంబము’ – విడదీసి సంధి పేర్కొనండి.
జవాబు:
వసుధా + ఏక కుటుంబము – వృద్ధిసంధి.

TS 9th Class Telugu Important Questions 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 6.
‘భారతదేశము’ విగ్రహవాక్యం రాసి, సమాసనామాన్ని పేర్కొనండి.
జవాబు:
భారతం అనే పేరుగల దేశం- సంభావన పూర్వపద కర్మధారయం

ప్రశ్న 7.
‘వారసత్వ సంపద’ – సమాసానికి విగ్రహం రాసి, సమాసం పేరు చెప్పండి.
జవాబు:
వారసత్వం అనే సంపద – రూపక సమాసం

ప్రశ్న 8.
‘మహా + ఉద్యమం’ – సంధి కలిపి సంధి జరిగిన విధానాన్ని రాయండి.
జవాబు:
మహోద్యమము – గుణసంధి, ‘మహా’ పదం చివర ‘అ’కు, ‘ఉ’ పరమై గుణసంధి వచ్చింది.

ప్రశ్న 9.
రాముడు రావణుని చంపాడు. (కర్మణి వాక్యంగా మార్చండి.)
జవాబు:
రావణుడు రామునిచే చంపబడ్డాడు. (కర్మణి వాక్యం)

ప్రశ్న 10.
బాలురచే సెలవు తీసికోబడింది. (కర్తరి వాక్యంగా మార్చండి.)
జవాబు:
బాలురు సెలవును తీసుకున్నారు. (కర్తరి వాక్యం)

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద 1
భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుందనీ, గౌరవిస్తుందనీ, అన్ని మతాలు సత్యాలేననీ, అవన్నీ భగవంతుని చేరుకోడానికి మార్గాలనీ స్వామీజీ చెప్పారు. ఎవరూ మతాన్ని మార్చుకోనవసరం లేదనీ, నా మతమే గొప్పది. నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్పవంటివారనీ స్వామీజీ తెలిపారు. మిగతా వక్తలు తమ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే, స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరఫునా మాట్లాడి నిజమైన మతసామరస్యాన్ని చూపించాడు. సదస్యులందరికి స్వామీజీ ప్రసంగమే నచ్చింది.

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
నరేంద్రుని బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి.
జవాబు:
నరేంద్రుడు ఆరవ ఏట విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. మొదట్లో ఇంట్లోనే తల్లిదండ్రులు నియమించిన గురువు వద్ద చదువుకున్నాడు. గురువు ఒకసారి చెప్పగానే నేర్చుకొని, అప్పచెప్పగలిగేవాడు.
ఏడవ ఏట ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్లో చేరాడు. నరేన్ తెలివితో, చురుకుతో తోటి బాలురందరికీ నాయకుడయ్యాడు. నరేన్కు ఆటలంటే ప్రాణం.
– నరేన్కు ఇష్టమైన ఆట “రాజు – దర్బారు”. ఇంటిలోనే సొంతంగా ఒక వ్యాయామశాల ఏర్పాటుచేశాడు. తర్వాత వ్యాయామశాలలో చేరి కర్రసాము, కత్తిసాము, గుర్రపుస్వారీ నేర్చాడు.

నరేన్కు క్రమంగా పుస్తకాలు చదవడంపై ఆసక్తి పెరిగింది. తండ్రిగారు బదిలీకావడంతో, రాయపూర్ వెళ్ళి తిరిగి కలకత్తా వచ్చి మూడేళ్ళ చదువు ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేశాడు. ఆ పరీక్ష మొదటిశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. పాఠశాలలో ఆ శ్రేణిలో పాసైన ఏకైక విద్యార్థి నరేన్ ఒక్కడే.

తరువాత ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, మరుసటి సంవత్సరం నేడు స్కాటిష్చర్స్’ అని పిలువబడే కళాశాలలోనూ చేరాడు. ప్రిన్సిపాలూ, గురువులూ నరేన్ ప్రతిభాపాటవాలకు ఆశ్చర్యపోయేవారు. నరేంద్రుడు ఎన్నో గ్రంథాలు చదివాడు. 1884లో బి.ఏ. పాసయ్యాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద

ప్రశ్న 2.
వివేకానందుని అమెరికా పర్యటన విశేషాలను తెల్పండి.
జవాబు:
స్వామీజీయైన నరేంద్రుడు అమెరికాలో జరుగబోయే సకల మతముల మహాసభకు వెళ్ళి, భారతదేశ ధర్మాన్ని ప్రపంచానికి తెలియపరుద్దామనుకున్నాడు. మద్రాసులో యువకులు అందుకు సహాయం చేశారు. ఖేత్రీ మహారాజు నరేంద్రునికి కెనడా వెళ్ళే ఓడలో టిక్కెట్టుకొని ఇచ్చాడు. నరేంద్రుని, “వివేకానంద” అనే నామాన్ని స్వీకరింపమన్నాడు.

వివేకానందుడు 1893 మే 31న అమెరికాకు బయలుదేరాడు. ఓడ కెనడా దేశంలోని ‘వాంకోవర్ ‘ లో ఆగింది. అక్కడ నుండి రైలులో “షికాగో” నగరానికి వివేకానంద వెళ్ళాడు. రైల్లో’ ‘సాన్ బోర్న్’ అనే మహిళతో పరిచయం అయ్యింది. ఆమె వివేకానందుడు ‘బోస్టన్’ నగరానికి వచ్చినపుడు తన ఇంటికి రమ్మంది.

షికాగో ధనవంతుల నగరం. విశ్వమత మహాసభలకు ఇంకా రెండు నెలల వ్యవధి ఉంది. అదీగాక, ఆ సభలో మాట్లాడేందుకు వివేకానందుని వద్ద ధ్రువపత్రాలు లేవు. దానితో వివేకానందుడు ‘బోస్టన్’లో సాన్ బోర్న్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ హార్వర్డ్ ప్రొఫెసర్ జె.హెచ్.రైట్తో పరిచయమైంది. రైట్, వివేకానందుని విశ్వమత మహాసభలో హైందవ ధర్మం గురించి మాట్లాడమన్నాడు. తనవద్ద ధ్రువపత్రాలు లేవని వివేకానందుడు చెప్పాడు.

ఆ ప్రొఫెసర్ విశ్వమత మహాసభల అధ్యక్షుడికి వివేకానందుని గూర్చి అమెరికాలోని పండితులందరి కంటే వివేకానందుడు గొప్పవాడని రాశాడు. వివేకానందుని ఆ ప్రొఫెసర్ చికాగోకు పంపాడు. కానీ రైట్ ఇచ్చిన కాగితం కనబడలేదు. వివేకానందుడు చికాగోలో భిక్షాటన చేశాడు. చెట్టు కింద పడుకున్నాడు. జార్జ్. డబ్ల్యూ. హేల్ అనే ఆమె వివేకానందుని చూసి, విశ్వమత మహాసభలకు వచ్చిన భారతీయ సన్యాసి అని గౌరవించింది. ఆమె సాయంవల్లనే వివేకానందుడు విశ్వమత మహాసభలో మాట్లాడాడు.

సభలో వివేకానందుడు “నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా ! అంటూ తన ఉపన్యాసం ప్రారంభించాడు. ఆ కమ్మని పిలుపుకు సభ్యులు ఆనందించి మూడు నిమిషాలపాటు లేచి చప్పట్లు కొట్టారు. వివేకానంద ఆ సభలో అన్ని ధర్మాల తరపునా మాట్లాడి, సర్వమత సామరస్యాన్ని చూపాడు. వివేకానందుని ఖ్యాతి దేశదేశాలకూ పాకింది.

ప్రశ్న 3.
వివేకానందుడు జాతికిచ్చిన సందేశమేమి ?
జవాబు:
వివేకానందుని సందేశము: “మన భారతదేశం పుణ్యభూమి. సంపద, అధికారం మన భారతజాతికి ఎప్పుడూ ఆదర్శాలు కాలేదు. భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత తారతమ్యం లేకుండా, పేద, గొప్ప వివాదం లేకుండా, కుల వివక్షతను దగ్గరకు రానీయకుండా, అందరూ నా సహోదరులే అని చాటాలి. భారతదేశానికి అంతటికీ ఏది హితమో, అదే తనకు కూడా హితము అని ప్రకటించాలి.

భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీ జనోద్ధరణ, జన చైతన్యం ప్రధానంగా సంభవించాలి. పేద జనానికి ఆహారం ఇవ్వాలి. విద్యావ్యాప్తి సక్రమంగా జరగాలి. సర్వజనులకూ తగినంత ఆహారం, జీవనోపాధి అవకాశాలు కల్పించాలి. వ్యావహారిక భాషలోనే కళాత్మకంగా, సహజంగా శాస్త్ర పాండిత్యం సాధించాలి. పరిశోధనలను కూడా వాడుక భాషలోనే నిర్వహించాలి. విద్య సమస్త సమస్యలనూ పరిష్కరించే మార్గం కావాలి.

వివేకానంద యువకులకు ఇలా సందేశం ఇచ్చారు – “మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలనూ, అమాయక ప్రజలనూ, అణగద్రొక్కబడిన వారినీ ప్రేమించండి. వారి కొరకు పరితపించండి. పిరికితనాన్ని విడచి, ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. దీనజనులను ఉద్ధరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయని మరువకండి. లేవండి మేల్కొనండి. శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలు అనుసరించండి.”

ప్రశ్న 4.
వివేకానందుని సందేశాల ఆధారంగా ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
ఏకపాత్రాభినయం “వివేకానంద” :

నా భారతీయ సహోదరులారా !
మన భారతదేశం ఒక్కటే అసలైన పుణ్యభూమి, మన భారతజాతి శతాబ్దాలుగా శక్తిమంతమైన జాతి. ఐనా అది ఇతర రాజ్యాలపై దండయాత్ర చేయలేదు. మన భారతీయుడు ఎవరైనా సరే, జాతిమత భేదం, పేద – గొప్ప తేడా, కుల భేదం లేకుండా, అందరూ నా సోదరులే అని చాటాలి. భారతీయ సమాజం నా బాల్యడోలిక, నా యౌవన ఉద్యానం, నా వార్ధక్యంలో వారణాసి. భారతీయ సమాజం నాకు స్వర్గతుల్యం.

మన భారతదేశానికి మంచి జరగాలంటే, స్త్రీ జనోద్ధరణ, జనచైతన్యం ప్రధానంగా సంభవించాలి. నాకు ఈ లోకంలో సరిపడ తిండిని ప్రసాదించలేక, స్వర్గంలో ఆనందాన్నిచ్చే భగవంతుని నేను విశ్వసించలేను. ముందు కడుపునిండా తిండి. తర్వాతనే మతం.

మనం వ్యావహారిక భాషలోనే శాస్త్రపాండిత్యం సాధించాలి. మన పరిశోధనలు వ్యావహారిక భాషలోనే నిర్వహించాలి. సాహసం గల యువకులారా ! మీకు ప్రేమ, నిజాయితీ, సహనం కావాలి. నిరుపేదలను, అమాయకులను, అణగద్రొక్కబడిన వారిని ప్రేమించండి. దీనుల కోసం శ్రమించండి.

“ఉత్తిష్ఠత ! జాగ్రత ! ప్రాప్య వరాన్ నిబోధత !” (లేవండి! మేల్కొనండి ! శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలను అనుసరించండి !)

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

కాశీలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు దుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తూంటే దారిలో ఒక కోతులగుంపు కనిపించింది. అవి ఆయనవైపు తిరిగి పరుగెత్తి రాసాగాయి. అవి కరుస్తాయనే తలంపుతో వివేకానంద స్వామిజీ వెనుదిరిగి చిన్నగా పరుగెత్త నారంభించాడు. అవి ఇంకా వెంబడిస్తూనే ఉన్నాయి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ పరుగెడుతున్న స్వామికి అటుగా వెళ్తున్న ఒక వృద్ధ సన్యాసి కనిపించాడు. అడగకుండానే ఆ సన్యాసి అంతా గమనించి, “ఆగు! వెనుదిరిగి ఆ జంతువుల నెదుర్కో” అని గట్టిగా అరిచాడు. స్వామిజీ ఆగి వెనక్కి తిరగగానే, కోతులు కూడా ఆగి వెనుదిరిగాయి. స్వామిజీ రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంకించుకున్నాయి. తరువాతి కాలంలో స్వామిజీ అమెరికాలో ప్రసంగిస్తూ ఇది తన జీవితంలో తాను నేర్చుకున్న ఒక గొప్ప పాఠం అనీ, ఆ కోతుల్లాగ కష్టాలు మనల్ని వెన్నాడుతున్నాయనీ, ఎప్పుడైతే ఆగి మనం వెనుదిరిగి వాటినెదుర్కొంటామో, అప్పుడు అవే పారిపోతాయని బోధించాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కోతులు ఎప్పుడు పరుగుపెట్టాయి ?
జవాబు:
స్వామీజీ వెనుదిరిగి రెండు మూడడుగులు వేసి భయపెట్టగానే కోతులు పరుగుపెట్టాయి.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద

ప్రశ్న 2.
వివేకానంద స్వామిజీకి కోతులు ఎప్పుడు కనిపించాయి ? ఎక్కడ కనిపించాయి ?
జవాబు:
వివేకానంద స్వామిజీకి దుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తున్నప్పుడు కోతులు కాశీలో దారిలో కనిపించాయి.

ప్రశ్న 3.
‘ఆ జంతువులనెదుర్కో’ అని ఉపదేశించిన వ్యక్తి ఎవరు ?
జవాబు:
‘ఆ జంతువుల నెదుర్కో’ అని ఒక వృద్ధ సన్యాసి స్వామికి అరిచి చెప్పాడు.

ప్రశ్న 4.
వివేకానందస్వామి కోతుల సంఘటన నుండి నేర్చుకున్న పాఠం ఏమిటి ?
జవాబు:
కోతుల్లాగే కష్టాలు మానవులను వెన్నాడుతాయనీ, ఎప్పుడైతే, ఆగి మనం వెనక్కు తిరిగి ఆ కష్టాలను ఎదుర్కుంటామో అప్పుడు అవి పారిపోతాయనీ, స్వామికి కోతుల సంఘటనను బట్టి నేర్చుకున్నాడు.

ప్రశ్న 5.
కోతులు సంఘటనను గూర్చి వివేకానంద ఎక్కడ చెప్పారు ?
జవాబు:
కోతుల సంఘటనను గూర్చి స్వామిజీ అమెరికాలో చెప్పాడు.

2. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

వివేకానంద స్వామి బొంబాయి నుండి 1893 మే 31 వ తారీఖున అమెరికాకు బయలుదేరాడు. ఓడ దారిలో సిలోను, సింగపూరు, హాంగ్కాంగ్, చైనా, జపాన్ లోని రేవులలో ఆగింది. స్వామిజీ ఆయా ప్రాంతాలను ఎంతో ఆసక్తితో గమనించేవాడు. కొన్నాళ్ళకు ఓడ కెనడా దేశంలోని వాంకోవర్లో ఆగింది. స్వామిజీ అక్కడి నుండి షికాగోకి రైలులో వెళ్ళాడు. రైల్లో సాన్బోర్న్ అనే ఒక మహిళ స్వామిజీతో మాట్లాడింది. స్వామిజీ ప్రతిభాపాండిత్యాలనీ, పవిత్రతనీ, గమనించి, ‘స్వామీ మీరెప్పుడైనా బోస్టన్ నగరానికి వస్తే, దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మమ్మానందింపజేయండి’ అని తన చిరునామా ఇచ్చింది. జూలై నెల మధ్యలో స్వామీ షికాగో చేరుకున్నాడు. అదొక చిత్రమైన కొత్త ప్రపంచం. అక్కడి భవంతులు రోడ్లు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలూ, యంత్రాలూ, కర్మాగారపు తయారీలూ, కళలూ మొదలైనవన్నీ చూసి స్వామీజీ విస్తుపోయాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
స్వామీజీ వేటిని చూసి విస్తుపోయారు ?
జవాబు:
స్వామిజీ, షికాగోలో భవంతులు, రోడ్లు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలూ, యంత్రాలూ, కర్మాగారపు తయారీలూ, కళలూ మొదలయినవి చూసి విస్తుపోయారు.

ప్రశ్న 2.
వివేకానంద స్వామి ప్రయాణించిన ఓడ ఎక్కడ ఆగింది ?
జవాబు:
వివేకానందస్వామి ప్రయాణించిన ఓడ కెనడా దేశంలోని వాంకోవర్ లో ఆగింది.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson స్వామి వివేకానంద

ప్రశ్న 3.
స్వామిజీకి రైల్లో కనబడిన మహిళ ఎవరు ? ఆమె ఏ నగరానికి చెందినది ?
జవాబు:
స్వామిజీకి రైల్లో కనబడిన మహిళ పేరు “సాన్బోర్న్”. ఆమె బోస్టన్ నగరానికి చెందినది.

ప్రశ్న 4.
స్వామిజీ బొంబాయిలో ఎప్పుడు బయలుదేరారు ?
జవాబు:
స్వామిజీ బొంబాయిలో 1893 మే 31వ తారీఖున అమెరికాకు బయలుదేరారు.

ప్రశ్న 5.
స్వామిజీ ఎప్పుడు చికాగో చేరుకున్నారు?
జవాబు:
స్వామిజీ జూలై నెల మధ్యలో చికాగో చేరుకున్నారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్ Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 1

తెలంగాణ చెరువు తీరు
మన జయశంకరు సారూ
అలుగు దుంకి పారూ
పదునైన మాట జోరు
పాలు పోసుకున్న పజ్జోన్న కంకులల్ల
పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్ల
మీ ఆశయాల వ్రాలూ
కనిపించే ఆనవాలూ ….
కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు
ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు
ఆలోచనల అవసరాన్ని తెలిపిన నిబద్ధుడు
తెలంగాణ కనుగొన్న అతడు మరో

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
జయశంకర్ బాల్యం, విద్యాభ్యాసం గురించి రాయండి.
జవాబు:
తెలంగాణను శ్వాసించిన మహోపాధ్యాయుడు, జయశంకర్, వరంగల్లు జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మీ దంపతులకు 1934 ఆగస్టు 6న జన్మించాడు. ఆ రోజుల్లో ఉర్దూ మీడియం పాఠశాలలు మాత్రమే ఉండేవి. జయశంకర్ ఆ రోజుల్లో హన్మకొండలోని మర్కజీ పాఠశాలలో ప్రాథమిక విద్య నేర్చాడు. హన్మకొండ న్యూ హైస్కూలులో మాధ్యమిక వరకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్.ఎస్. సీ వరకు చదువుకున్నాడు.

జయశంకర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ. పూర్తి చేశాడు. బెనారస్ విశ్వవిద్యాలయం, ఆలీగఢ్ విశ్వవిద్యాలయాల నుండి పి.జి. పూర్తి చేశాడు. ఆ రోజుల్లో వరంగల్లో డిగ్రీ కళాశాల లేదు. డిగ్రీ చదవాలంటే, హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చేది. లెక్చరర్ గారి ప్రోద్బలంతో కాలేజీ కావాలని విద్యార్థులు ఉద్యమం చేశారు. అందులో జయశంకర్ ముందువరుసలో నిలిచాడు.

ఊరేగింపులో జయశంకర్ నినాదాలిస్తున్నాడు. “వరంగల్కు డిగ్రీ కాలేజి కావాలి” అని నినాదాలు ఇవ్వడానికి బదులు, యూనివర్సిటీ కావాలి అని జయశంకర్ నినాదం ఇచ్చాడు. అందరూ నవ్వుకున్నారు. అప్పుడు జయశంకర్ను బాగా ఇష్టపడే ఒక లెక్చరరు, “ఏయ్ పిచ్చిపిల్లాడా ! ఏమయ్యింది” అని జయశంకరుని మందలించాడు. చిత్రంగా ఈ సంఘటన జరిగిన పదేళ్ళకు డిగ్రీ కాలేజి, 30 ఏళ్ళకు యూనివర్సిటీ వరంగల్లులో ప్రారంభమయ్యాయి. అంతేకాదు. పిచ్చిపిల్లాడనిపించుకున్న ఆ జయశంకర్, వరంగల్లు యూనివర్సిటీ వైసాఛాన్సలరు అయ్యాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

ప్రశ్న 2.
జయశంకర్ ఉద్యోగ జీవితం గురించి తెలపండి.
జవాబు:
జయశంకర్ 1960లో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాడు. దానితో జయశంకర్ ఉద్యోగ జీవితం మొదలయ్యింది. తరువాత హన్మకొండలో ఉపాధ్యాయుడిగా నియమింపబడ్డాడు. అక్కడి నుండి లెక్చరర్గా ఆదిలాబాద్కు వెళ్ళాడు. 1975-79 వరకు సి.కె. యం. కళాశాల ప్రిన్సిపాలుగా, బోర్డు మెంబరుగా జయశంకర్ సేవలందించాడు.

1982 – 91 వరకు, సీఫెల్ రిజిష్ట్రారుగా పనిచేశాడు. ఈయన 1991 94 వరకు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఇవియే కాకుండా, వివిధ ప్రభుత్వ హోదాల్లో, సంఘాల పదవుల్లో పనిచేసి, తనదైన ముద్ర వేశాడు.

జయశంకర్ ఎన్నో పదవుల్లో పనిచేశాడు. తనకు వైస్ ఛాన్సలర్గా చేసిన పనిలో తృప్తి కంటే, సి.కె. ఎం. కళాశాల ప్రిన్సిపాలుగా పనిచేయడం, ఎక్కువ తృప్తినిచ్చిందని జయశంకర్ సార్ చెప్పేవాడు. ఈ విధంగా హన్మకొండలో టీచర్ గా మొదలైన జయశంకర్ ఉద్యోగ జీవితం, అదే ఊళ్ళో వైస్ ఛాన్సలర్గా పదవీ విరమణతో ముగిసింది.

ప్రశ్న 3.
తెలంగాణ ఉద్యమంలోని మూడు దశల్లో జయశంకర్ నిర్వహించిన పాత్రను గురించి రాయండి.
జవాబు:
తెలంగాణ ఉద్యమంలో మూడు ప్రధాన దశలు ఉన్నాయి. మొదటిది భావజాల వ్యాప్తి. రెండవది ఆందోళనా కార్యక్రమం. మూడవది రాజకీయ ప్రక్రియ. ఈ మూడు దశల్లోనూ జయశంకర్ పాత్ర మరచిపోలేనిది. అందుకే, జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త.

ఇందులో మొదటిది తెలంగాణ భావజాల వ్యాప్తి :
తెలంగాణ భావజాలం ఎంతగా ప్రజల్లోకి వెళ్ళిందో జయశంకర్ ఒకరోజు ఇలా చెప్పాడు. “ఎందుకమ్మా తెలంగాణ” అని అడిగితే, తెలంగాణ వస్తే మా పొలాలకు నీళ్ళొస్తాయి. మా పిల్లలకు ఉద్యోగాలొస్తాయి అని చదువు రాని ఆడవాళ్ళు చెప్పారు” – ఈ విధంగా తెలంగాణ భావజాలం వ్యాపించింది.

రెండవది ఆందోళన కార్యక్రమం. తెలంగాణలో జరిగిన ఆందోళనలు, ఉద్యమాన్ని రెండింతలు చేశాయి. ఈ ఉద్యమాల వెనుక జయశంకర్ వంటి మేథావులు, ఉద్యమ కార్యకర్తల సూచనలు, సలహాలు ఉన్నాయి. జయశంకర్ ఆందోళనకారులకు కావలసిన పూర్తి వివరాలు, విశ్లేషణలతో ముందుంచేవాడు.

మూడవ దశ రాజకీయ ప్రక్రియ. జయశంకర్ రాజకీయ ప్రక్రియలో పాల్గొనకపోయినా, తెలంగాణ రాజకీయ నాయకులందరికీ, తన సహకారం అందించాడు. చెన్నారెడ్డి నుండి చంద్రశేఖరరావు వరకు ప్రతి రాజకీయ పార్టీకి జయశంకర్ తన మేథోశ్రమను ధారపోశాడు. జయశంకర్ ఊహించినట్టే, చివరకు రాజకీయ ప్రక్రియతోనే తెలంగాణ వచ్చింది.

ప్రశ్న 4.
జయశంకర్ సమయపాలన, నిబద్ధతల గురించి తెలిపే సంఘటనలను తెలపండి.
జవాబు:
జయశంకర్ నీతి,నిజాయితి, నిరాడంబరత, నిబద్ధత సమయపాలన వంటి లక్షణాలు ఉన్న మహా మనీషి. ఈయన సమయపాలన, నిబద్ధతలను గురించి తెలిపే ఒక సంఘటనను పరిశీలిద్దాం. జయశంకర్ సీఫెల్ రిజిష్ట్రారుగా ఉన్న సమయంలో సాయంత్రం 5.30 నుండి రాత్రి 10.30 వరకు తన పరిశోధక విద్యార్థికి సమయం కేటాయించేవారు. తన భోజన సమయంలో విద్యార్థిని కూర్చోబెట్టుకొని, మెటీరియల్ చూసేవారు. ఒకసారి జయశంకర్ సార్ స్నేహితుడొకడు 5 గంటల వరకూ ఆయనతో గడపి, తృప్తిలేక ఇంకా మాట్లాడడానికి ప్రయత్నించాడు.

జయశంకర్ నిర్మొహమాటంగా తన పి.హెచ్.డి విద్యార్థి వచ్చే సమయమయ్యిందనీ మిత్రునితో మరొకసారి కలుద్దామని చెప్పి, మిత్రుని బయటకు పంపించారు. పై పరిశోధక విద్యార్థే తరువాతి కాలంలో ఖమ్మం కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు. అప్పుడు జయశంకర్ కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. పై ప్రిన్సిపాలు వైస్ ఛాన్స్లర్గా ఉన్న జయశంకర్ సార్తో ఒకసారి సమయం తెలియకుండా మాట్లాడుతున్నాడు. అప్పుడు జయశంకర్ “నీకు రైలు టైం అవుతుంది. స్టేషన్కు వెళ్ళడం ఆలస్యం అవుతుంది నీవు వెళ్ళు” అని చెప్పి పంపించివేశారట. దీనిని బట్టి జయశంకర్ సమయానికి విలువ ఇస్తారని అర్థమవుతోంది.

ప్రశ్న 5.
జయశంకర్ సార్ వ్యక్తిత్వాన్ని గురించి రాయండి.
జవాబు:
జయశంకర్ తెలంగాణకు చిరునామా. తెలంగాణకు మార్గదర్శి. జయశంకర్ జీవితాంతం ఉద్యమాల్లో తిరిగాడు. పెళ్ళి చేసుకోలేదు. ఉద్యోగం ద్వారా వచ్చిన జీతాన్ని ఉద్యమాల కోసం ఖర్చు పెట్టాడు. తన ఉమ్మడి కుటుంబానికి జయశంకర్ చేదోడువాదోడుగా ఉండేవాడు. ఉమ్మడి కుటుంబంలో వారందరూ పెరిగి పెద్దవారు అయ్యారు. జయశంకర్ ఒంటరిగా మిగిలాడు. జయశంకర్ తనకు సాయంగా ఉండడానికి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లవాడిని చేరదీశాడు. అతడిని చదివించి పెళ్ళి చేశాడు. వారికో పిల్ల పుట్టింది. వారితో కలసి జయశంకర్ చివరి దశలో గడిపాడు. తనకు తల్లిదండ్రులిచ్చిన పాత ఇల్లు అమ్మి వరంగల్లులో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు, అదే జయశంకర్ ఆస్తి.

ఉదాత్తమైన వ్యక్తిత్వం, మృదుభాషణం, ఉద్యమస్ఫూర్తి, స్థితప్రజ్ఞత – అనేవి కలిస్తే జయశంకర్. తెలంగాణ వారందరిచే ఈయన జయశంకర్ సార్ అని ప్రేమగా పిలిపించుకున్నాడు. జయశంకర్ ఉద్యమ పితామహులుగా, తెలంగాణ జాతిపితగా పేరు పొందాడు. ఈయనకు కార్యకర్తకు కావాల్సిన కార్యదక్షత ఉన్నది. కె.సి. ఆర్. వంటి నాయకులకు ఆత్మ విశ్వాసాన్ని
ఈయన అందించారు.

జయశంకర్ సార్ శనివారం భోజనం చేసేవారు కాదు. ఈయన జీవితంలో రెండు విషయాల్లో రాజీ పడలేదు.

1) శనివారం పస్తుండటం.

2) తెలంగాణ అంశం మాట్లాడకుండా ఉండలేకపోవడం. తెలంగాణ రాకముందే, జయశంకర్ అస్తమించాడు.
జయశంకర్ జీవితాంతం, ఒకే మార్గంలో నడిచాడు. ఒకే మాటపై నిలబడ్డాడు. అందరినీ తన మార్గంలో నడిపించాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

1996లో నాటి ప్రధాని 15 ఆగస్టు ఎర్రకోట నుండి చేసిన ఉపన్యాసం తెలంగాణా వాదులందరిని తట్టిలేపింది. తెలంగాణ సాధనకు ఎలాంటి వ్యూహాలు రచించాలో జయశంకర్కు తెలుసు. మొత్తం తెలంగాణ ఉద్యమానికి మూడు దశలున్నాయి. మొదటిది భావజాల వ్యాప్తి. అది జరిగింది. రెండోది ఆందోళనా కార్యక్రమం. అది కొనసాగుతున్నది. ఇక మిగిలింది రాజకీయ ప్రక్రియ. అది జరగాల్సి ఉంది. దానిని పూర్తి చేయడమే ఉద్యమ కర్తవ్యం కావాలి. దానికి రాజకీయ చిత్తశుద్ధి అవసరం. ‘ఇప్పుడున్న రాజకీయ నాయకత్వం ఆ పని పూర్తిచేస్తుందని నేను నమ్ముతున్నాను’ అని అన్నాడు. ఈ మూడు దశల్లో కూడా జయశంకర్ పాత్ర మరువలేనిది. అందుకే అతడు తెలంగాణ సిద్ధాంతకర్త. మొదటిది తెలంగాణ భావజాల వ్యాప్తి. అది ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకపోయిందో జయశంకర్ ఒక రోజు ఇట్లా చెప్పిండు. “ఎందుకమ్మా తెలంగాణ అంటే ? ‘ఏం సార్ తెలంగాణ వస్తె మా పొలాలకు నీళ్ళొస్తయ్, మా పోరగానికి కొలువొస్తది” అనే భావన వారికి కలిగిందని” చదువురాని ఆడవాళ్ళు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకొన్నాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
తెలంగాణ ఉద్యమంలో రెండవదశ ఏది ?
జవాబు:
తెలంగాణ ఉద్యమంలో రెండవ దశ “ఆందోళన కార్యక్రమం”.

ప్రశ్న 2.
తెలంగాణ వస్తే ఏమవుతుందని చదువురాని ఆడవాళ్ళు చెప్పారు ?
జవాబు:
తెలంగాణ వస్తే వారి పొలాలకు నీళ్ళు వస్తాయని, వారి పిల్లలకు ఉద్యోగాలొస్తాయని ఆడవాళ్ళన్నారు.

ప్రశ్న 3.
తెలంగాణ వాదులను తట్టిలేపింది ఏది ?
జవాబు:
1996లో ఆగస్టు 15, నాటి ప్రధాని ఎర్రకోట నుండి చేసిన ఉపన్యాసం తెలంగాణ వాదులను తట్టిలేపింది.

ప్రశ్న 4.
జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త ఎలా అయ్యాడు ?
జవాబు:
తెలంగాణ ఉద్యమం మూడు దశల్లోనూ జయశంకర్కు గల పాత్ర మరువలేనిది. అందుకే జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త అయ్యాడు.

ప్రశ్న 5.
తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన మూడు దశలు తెల్పండి.
జవాబు:

  1. భావజాల వ్యాప్తి
  2. ఆందోళన కార్యక్రమం
  3. రాజకీయ ప్రక్రియ అనేవి తెలంగాణ ఉద్యమంలో మూడు దశలు.

2. ఈ కింది పేరా చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

జీవితాంతం పదవుల్లో ఉద్యమాల్లో తిరిగిన జయశంకర్ పెండ్లి చేసుకోలేదు. ఉద్యోగరీత్యా సంపాదించినదంతా ఉద్యమాల కోసం ఖర్చు బెట్టాడు. ఉమ్మడి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. జీవిత కాలం ఎక్కువగా ఇట్లాగే ఖర్చు అయింది. ఉమ్మడి కుటుంబంలోని వాళ్ళందరు పెరిగి, ఎవరి సంసారాలు వాళ్ళకు అయినంక జయశంకర్ ఒంటరిగా మిగిలాడు. జయశంకర్ తనకు సహాయంగా ఉండటానికి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లవాడిని చేరదీశాడు. అతడిని చదివించాడు. అనాథ పిల్లతో పెండ్లి చేశాడు. వారికో పాప పుట్టింది. వాళ్ళతో కలిసి జీవితం చివరిదశలో గడిపాడు. తల్లిదండ్రులు ఇచ్చిన పాత ఇల్లు అమ్మి, వరంగల్లో ఫ్లాట్ తీసుకున్నాడు. అదే అతని ఆస్తి. పెన్షన్తో కాలం
గడిపాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
జయశంకర్ తన సంపాదనను ఎలా ఖర్చు చేశాడు ?
జవాబు:
జయశంకర్ తన సంపాదనను అంతా ఉద్యమాల కోసం ఖర్చు చేశాడు.

ప్రశ్న 2.
జయశంకర్ పెండ్లి ఎందుకు చేసికోలేదు ?
జవాబు:
జయశంకర్ జీవితాంతం పదవుల్లో, ఉద్యమాల్లో తిరిగినందున పెండ్లి చేసుకోలేదు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఆచార్య కొత్తపల్లి జయశంకర్

ప్రశ్న 3.
జయశంకర్ చివరి దశలో ఎవరితో గడిపాడు ?
జవాబు:
జయశంకర్ చివరి దశలో తాను చేరదీసిన అనాథ పిల్లవాడితో, అతని భార్యాపిల్లలతో గడిపాడు.

ప్రశ్న 4.
జయశంకర్ ఆస్తి ఏమిటో చెప్పండి.
జవాబు:
జయశంకర్ తనకు తల్లిదండ్రులు ఇచ్చిన పాత ఇల్లును అమ్మి, వరంగల్లులో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. అదే ఆయన ఆస్థి.

ప్రశ్న 5.
జయశంకర్ ఒంటరివాడు ఎందుకు అయ్యాడు ?
జవాబు:
‘ జయశంకర్ ఉమ్మడి కుటుంబ సభ్యులు అందరూ పెరిగి, ఎవరి సంసారాలు వారు చేసుకుంటున్నారు. అందువల్ల జయశంకర్ ఒంటరివాడయ్యాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

“జ్యోతి ! సావిత్రికెందుకు చదువు నేర్పుతున్నావు ?”
“ఎందుకు నేర్పకూడదు ?”
అసలు మన కులంవాళ్ళమే చదువుకోకూడదు. అయినా నిన్ను చదివించాను. ఇప్పుడు నువ్వు నీ భార్యకు చదువు చెబుతున్నావు – “ఆమె కూడా మనిషే కదా ! కాదంటే చెప్పు”
“నిజమే కావచ్చు కానీ ఆడదానికి చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతది. బుద్ధి లేనిదవుతది”-
“నాన్నా! సావిత్రి చదువుకుని ఆ మాటలన్నీ అబద్ధాలని నిరూపిస్తుంది”
TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
సావిత్రీబాయి కాలంలో స్త్రీల పరిస్థితులు ఎలా ఉండేవి ?
జవాబు:
సావిత్రీబాయి కాలంలో ఆడవాళ్ళు గడప దాటకూడదు. ఆడదంటే వంటింటికీ, వంటింట్లో పొయ్యికీ కట్టుబడి ఉండాలి. ఆడపిల్ల నియమాలను ఎంతమాత్రం దాటరాదు.

ఆ రోజుల్లో పొయ్యిలో కర్రలూ, పొయ్యి ఊదే గొట్టం ఆడపిల్ల చేతిలో ఎప్పుడూ ఉండాల్సిందే. ఆడపిల్ల ఆ గొట్టంతో పొయ్యిని ఊదుతూ ఉండాల్సిందే. ఆడపిల్ల భర్తనూ, అత్తమామల్ని సేవించుకోవాలి. ఇప్పుడు రెండవతరగతి చదివే వయస్సులోనే ఆనాడు ఆడపిల్లలు అత్తవారింట్లో ఉండేవారు. అత్తవారి ఇల్లే ఆడపిల్ల అసలు ఇల్లని ఆ రోజుల్లో ఆడపిల్లలకు తల్లిదండ్రులు నొక్కి చెప్పేవారు.

ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు పనికిరాదు. చదువుకున్న ఆడది చెడిపోతుందని, బుద్ధిలేనిది అవుతుందని అప్పటివారు నమ్మేవారు. ఆనాడు సావిత్రి ఆడపిల్లలకు చదువుచెప్పడానికి బడికి పోతూంటే, జనం కిటికీల వెనుక నిలబడి తిట్టేవారు. శాపనార్థాలు పెట్టేవారు. నీచమైన మాటలు అనేవారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

ప్రశ్న 2.
సేబీ అంటే ఎవరు ? ఆయన వ్యక్తిత్వాన్ని గురించి వివరించండి.
జవాబు:
సేబీ అంటే సావిత్రీబాయి భర్త “జ్యోతీరావ్ ఫూలే”. సేబీ, పూనాలో ఉండే ఫూలే కుటుంబంలో పుట్టాడు. సేబీకి ఎప్పుడూ బడి, పుస్తకాలు, చదువు అంటే ఇష్టం. సావిత్రీబాయి, జ్యోతీరావ్ ఫూలేని సేబీ అనే పిలిచేది.

మనిషి మంచివాడయితే, అతడు మనదేశం వాడయినా, విదేశీయుడయినా సరే, ఆయన జీవితం, వ్యక్తిత్వం విలువలూ అన్నీ తెలుసుకోవాలి అనేవాడు సేబీ. శివాజీ, వాషింగ్టన్ వంటి వారి జీవిత చరిత్రలు అన్నీ ఆయన చదివాడు. థామస్పెన్ రాసిన “మానవహక్కులు” పుస్తకం చదివి మనిషికి ఉన్న హక్కులూ, బాధ్యతలూ చక్కగా తెలిసికొన్నాడు.

మన కులవ్యవస్థ, మన సమాజాన్ని నాశనం చేస్తోందని సేరీ చెప్పేవాడు. ఒకప్పుడు మంచిగా ఉన్న మన మతం మూర్ఖపు ఆచారాల్లో చిక్కుకుందనీ, వాటిని రూపుమాపాలనీ అనేవాడు. సేబీ, కబీర్, తుకారాం వంటి భక్తుల సాహిత్యాన్నీ, మత సంస్కర్తల రచనల్నీ చదివాడు. ఆ కాలంలోని శూద్ర, అతిశూద్రకులాల గొడవలు, విద్య వల్లే పోతాయనీ, విద్యే మన ధ్యేయం కావాలనీ సేబీ చెప్పేవాడు. సేబీ, విద్య అనే తపన వహించిన మహావృక్షం వంటివాడు.

ఆడమనిషి చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని, భార్య సావిత్రికి చదువుచెప్పి, ఆమెను మొదటి పంతులమ్మగా చేశాడు. తక్కువ కులాల ఆడపిల్లల కోసం సొంత ధనంతో బడిపెట్టాడు.

మానవులందరూ పుట్టుకతో సమానులనీ, వాళ్ళు ఒకరినొకరు సమానులుగా చూసుకోవాలనీ సేర్ చెప్పేవాడు. ఆడపిల్లలకు చదువు చెపుతున్నందుకు కోపంతో కొందరు సేరీని చంపబోయారు. బీదవాళ్ళకు సాయం చెయ్యడమే తన జీవితాశయం అనీ, వాళ్ళ చేతుల్లో చావటానికి కూడా తాను సిద్ధం అని చెప్పి, హంతకుల మనస్సును సేబీ మార్చాడు.

శిశు హత్యలకు వ్యతిరేకంగా మొదటి ఆశ్రమం స్థాపించాడు. “దేవుడు ఒక్కడే. మనందరం ఆయన పిల్లలం. మనిషిని ‘ గొప్పవాడిగా చేసేది అతని గుణమే కాని, కులంకాదు. అనే సిద్ధాంతాలతో “సత్యశోధక సమాజాన్ని” స్థాపించాడు. సేర్జే అంటే జ్యోతీరావ్ ఫూలే. ఈయన స్త్రీ విద్యకూ, కులరహిత సమాజానికీ కృషిచేసిన మహనీయుడు.

ప్రశ్న 3.
జ్యోతీరావ్ ఫూలేని చంపడానికి వచ్చిన వాళ్ళు పరివర్తన చెందిన సంఘటనను తెలపండి.
జవాబు:
జ్యోతీరావ్ ఫూలే తక్కువ కులాల ఆడపిల్లల చదువులకై బడిపెట్టాడు. ఇది గిట్టని సంఘంలో కొందరు పెద్దమనుషులు పూలేని చంపమని దోండిరామ్, కుంబార్ అనే హంతకులను నియమించారు.

ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక ఫూలే నిద్రపోడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఫూలే పెరటి గుమ్మం తీసుకొని ఇద్దరు హంతకులు గొడ్డళ్ళతో నీశ్శబ్దంగా లోపలకు వచ్చారు. వాళ్ళ ముఖాలు భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు పూలే భార్య సావిత్రికీ, ఫూలేకీ ముందు నిలబడి, పూలేని చంపడానికి గొడ్డళ్ళు పైకెత్తారు. వెంటనే ఫూలే భార్య “అన్నల్లారా ! ఆగండి. దయచేసి వెళ్ళిపొండి” అని బ్రతిమాలింది. ఎందుకు వచ్చారని పూలే వాళ్ళను అడిగాడు.

ఫూలే బడులు నడపడం ఇష్టంలేని కొందరు పెద్దలు, ఆయనను చంపడానికి తమకు కాంట్రాక్టు ఇచ్చారని, వాళ్ళు ఫూలేకు చెప్పారు. అప్పుడు ఫూలే వాళ్ళతో – “నా చావు మీకు లాభం అయితే, నన్ను చంపండి. బీదవాళ్ళకు సాయం చెయ్యడమే, నా జీవితాశయం – బీదవారి చేతిలో చావడంలో తప్పులేదు. నన్ను చంపండి” అని మెడవంచి శాంతంగా చావుకు సిద్ధమయ్యాడు. వెంటనే దోండిరామ్, కుంబార్లు గొడ్డళ్ళు కిందపడేశారు. ఫూలే కాళ్ళమీద పడ్డారు. “మేము మిమ్మల్ని చంపం. మీరు మా తండ్రి వంటివారు. ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని ఇక్కడకు పంపిన వాళ్ళను చంపుతాం” అన్నారు ఫూలే వాళ్ళను ఆపాడు. వారి ఆలోచన మారేదాకా వారితో మాట్లాడాడు.

వాళ్ళిద్దరూ ఫూలే రాత్రిబడిలో చేరారు. దోండే ఫూలేకు బాడీగార్డుగా తయారయ్యాడు. కుంబార్ “వేదాచార్” అనే పుస్తకం రాసి, పూలే పనికి సాయం చేశాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

ప్రశ్న 4.
సావిత్రిబాయి ఫూలే పాత్రను ఏకపాత్రాభినయం చేయండి.
జవాబు:
“సావిత్రిబాయి ఫూలే” ఏకపాత్రాభినయం :
నేను సావిత్రిని.

ఈ రోజు మీతో మాట్లాడదామని మీ ముందుకు వచ్చా. మీరు, మేం మా కాలంలో ఎక్కడున్నామో అక్కడే నిలిచిపోయారా ? అని నాకు అనిపిస్తోంది. నేను మహారాష్ట్రలో సతారా జిల్లా, ఖండాలా తాలూకాలో నైగావ్ గ్రామంలో పాటిల్ గారి మొదటి సంతానంగా పుట్టా. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని. చెట్లు ఎక్కి సీమ చింతకాయలు కోసుకు తినేదాన్ని.

నాకు ఏడవ సంవత్సరంలో పూనాలోని పూలే కుటుంబీకుడు జ్యోతిరావ్తో పెండ్లి జరిగింది. మా మామగారు మంచివారు. నా భర్తను నేను సేఠ్ జీ అని పిలిచేదాన్ని. సేఠ్ జీకి చదువు అంటే ఇష్టం. నాకు ఆయన అన్నీ చదివి చెప్పేవారు. సే సాగర్ వెళ్ళారు. ఆడది చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుందని అక్కడ ఒక తెల్లజాతి మనిషి సేబీకి చెప్పింది.

సేఠ్ జీ నాకు చదువు చెప్పడం ప్రారంభించారు. మా మామగారు చదువుకుంటే ఆడది చెడిపోతుందని సేబీకి సలహా చెప్పారు. అయినా సేఠ్ జీ ఆ మాట వినలేదు. నా భర్త తక్కువ కులాల ఆడపిల్లల చదువులకు రెండు బడులు పెట్టారు. ఇంతలో ఆ స్కూలు నడిపే బడిపంతులు మానివేశాడు. దానితో ఫూలే బలవంతంపై, నేనే ఆ పిల్లలకు పంతులమ్మనయి, స్త్రీలకు చదువు చెప్పాను. ఆ పని చేయడం ఇష్టం లేని జనం నన్ను తిట్టేవారు. కిటికీలు మూసి నేను వారికి పాఠాలు చెప్పాను.

ఒక రోజున నేనూ, సేఠ్ నిద్రపోవడానికి సిద్ధంగా ఉండగా ఇద్దరు హంతకులు సేబీని చంపడానికి మా ఇంటికి వచ్చారు. సేబీ తన్ను చంపండని తలవంచారు. హంతకుల మనస్సులు మారిపోయాయి. మేం ఓ పిల్లవాణ్ణి పెంచుకున్నాం. మా సొంతబిడ్డలాగే వాడిని చూసుకున్నాం. ‘నేనే మొదటి పంతులమ్మను. శిశు హత్యలకు వ్యతిరేకంగా మేము ఒక ఆశ్రమం స్థాపించాము.

సత్యశోధక సమాజాన్ని స్థాపించాము. మేం సాధించిన విజయాలను, మా తర్వాత వచ్చిన ప్రజలు ముందుకు తీసుకెళ్ళాలి. పక్షవాతంతో సేఠ్ మరణించారు. 1897లో పూనాలో ప్లేగువ్యాధి వచ్చింది. ప్లేగువ్యాధితో బాధపడే పసిపిల్లలను నేను చేరదీశాను. నేను కూడా ప్లేగువ్యాధితోనే కన్నుమూశాను. మా ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళండి. సెలవు.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

నేను …….. సావిత్రిబాయిని

1897లో పునాలో ప్లేగువ్యాధి ప్రబలింది. పట్టణం ఎడారి అయిపోయింది. జనమంతా దగ్గర్లో ఉన్న అడవుల్లోకి పారిపోయారు. ఇట్లాంటి సమయాల్లో తక్కువ కులాల వాళ్ళకు సహాయపడాలని ఎవరనుకుంటారు ? నేను, నా కొడుకు యశ్వంత్, సమాజం సభ్యులు వ్యాధిగ్రస్తులకు సాయంగా వెళ్ళాం. ఒక గుడిసెలో రెండేళ్ళ పసివాడు బాధతో లుంగలు చుట్టుకుపోతూ కనిపించాడు. ఆ పిల్లవాడిని యెత్తుకొని డాక్టర్ దగ్గరకు పరుగెత్తాను. ప్లేగు అంటువ్యాధైనా ప్రాణం కోసం పెనుగులాడుతున్న ఆ పసిగుడ్డును ఎత్తుకోకుండా ఎట్లా ఉండగలను ? నా గుండెలకు అదుముకున్నాను. ఆ పసిబిడ్డ చావవలసి ఉంటే మరొక మనిషి ప్రేమ ఇచ్చే వెచ్చదనంతో చనిపోనివ్వు. ఆ బిడ్డ చనిపోయాడు. నాకు కూడా ప్లేగువ్యాధి సోకింది.. నా ప్రయాణం పరిసమాప్తమయ్యింది. నేను పనిలో ఉండగా మృత్యువు వరించటం నా అదృష్టం.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
‘నా ప్రయాణం పరిసమాప్తమయ్యింది’ అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
నా ప్రయాణం పరిసమాప్తమయ్యింది అంటే, తన జీవితకాలం ముగిసిందని తాను చచ్చిపోతున్నానని అర్థం.

ప్రశ్న 2.
సావిత్రిబాయి కుమారుడు పేరు ఏమిటి ?
జవాబు:
సావిత్రీబాయి కుమారుడి పేరు “యశ్వంత్”.

ప్రశ్న 3.
పూనాలో ప్లేగువ్యాధి ఎప్పుడు వ్యాపించింది? పట్టణం ఎడారి అయ్యింది అంటే ఏమిటి ?
జవాబు:
పూనాలో ప్లేగువ్యాధి 1897 లో వ్యాపించింది. పట్టణం ఎడారి అయ్యిందంటే ఎడారిలోలాగే మనుష్యులు లేకుండా నగరం నిర్జనంగా ఉందన్నమాట.

ప్రశ్న 4.
గుడిసెలో పిల్లవాడిని చూసి సావిత్రీబాయి ఏమి చేసింది ?
జవాబు:
గుడిసెలో పిల్లవాడిని చూసి సావిత్రీబాయి ఆ పిల్లవాడిని ఎత్తుకొని, డాక్టర్ దగ్గరకు పరుగెత్తింది.

ప్రశ్న 5.
ప్లేగువ్యాధిగ్రస్తులకు, ఎవరు సాయంగా వెళ్ళారు ?
జవాబు:
ప్లేగువ్యాధిగ్రస్తులకు సావిత్రీబాయీ, ఆమె కుమారుడు యశ్వంత్, సమాజం సభ్యులూ సాయంగా వెళ్ళారు.

2. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

“నేను… సావిత్రిబాయిని’

ఒక రోజు నేను ఇల్లు సర్దుతున్నా. పుస్తకాల గుట్టమీద వున్న దుమ్ము దులుపుతున్నా. ఇల్లు శుభ్రంగా ఉండాలి గదా. అదుగో అప్పుడే ఆయనొచ్చాడు. “నా పుస్తకాలనేం చేస్తున్నావు!” అన్నాడు. “దుమ్ము దులిపి శుభ్రం చేయొద్దా?” అన్నా. “పేజీలు పోగొడతావ్ జాగ్రత్త?’ అంటే ‘ఎక్కడికి పోవు, అన్నీ ఉంటాయి అన్నా. ఇదేంటో మరి?’ ‘ఏ పేజీ అది పేజీనో ఏమిటో నాకేం తెలుస్తుంది ? ఏమయిందని మీరిప్పుడీ రగడ చేస్తున్నారు?’ అన్నా ! అవన్నీ జీవిత చరిత్రలు. ఇదిగో చూడు. ఇది శివాజీ గురించి రాసింది. ఆయన ఫోటో ఇది. ఇక్కడ వాషింగ్టన్ గురించి రాసింది. ఇది ఆయన ఫోటో. అని సేరీ అన్నాడు.

“ఎవరూ ? శివాజీ నాకూ తెలుసు. మనవాడే కదా! కానీ ఈయనెవరూ? పరాయిదేశం మనిషివలె ఉన్నాడు. మనదేశం అయితేనేం కాకపోతేనేం. మనిషి మంచి పనులు చేస్తే మనం అతని జీవితం, వ్యక్తిత్వం, విలువలు అన్నీ తెలుసుకోవాలి.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పై పేరాలో విషయం మనకు చెపుతున్నది ఎవరు ?
జవాబు:
పై పేరాలో మనకు విషయం చెపుతున్నది ‘సావిత్రీ బాయి’.

ప్రశ్న 2.
మనిషి మంచి పనులు చేస్తే, ఏం చేయాలి ?
జవాబు:
మనిషి మంచి పనులు చేస్తే ఆ మనిషి జీవితం, వ్యక్తిత్వం, విలువలు అన్నీ తెలుసుకోవాలి.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson నేను… సావిత్రిబాయిని

ప్రశ్న 3.
పై పేరాలో పేర్కొన్న జీవిత చరిత్రలు, ఫోటోలు ఎవరికి సంబంధించినవి ?
జవాబు:
పై పేరాలో పేర్కొన్న జీవిత చరిత్రలు, ఫోటోలు

  1. శివాజీకి,
  2. వాషింగ్టన్కి సంబంధించినవి.

ప్రశ్న 4.
సావిత్రీబాయి ఏమి చేస్తోంది ?
జవాబు:
సావిత్రీబాయి, సేఠ్ పుస్తకాలపై పడ్డ దుమ్మును దులిపి శుభ్రం చేస్తోంది.

ప్రశ్న 5.
సేఠ్ ఎందుకు రగడ చేశాడు ?
జవాబు:
సేబీ తన పుస్తకాల్లో పేజీలు పోతాయనే భయంతో భార్య సావిత్రీబాయితో రగడ చేశాడు.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి Textbook Questions and Answers.

TS 9th Class Telugu 4th Lesson Questions and Answers Telangana రంగాచార్యతో ముఖాముఖి

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 34)

తెలంగాణకు చెందిన ప్రముఖ భాషాశాస్త్రవేత్త డా॥ చేకూరి రామారావుతో పత్రికా విలేఖరి ముఖాముఖి.

పత్రికా విలేఖరి : మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి.

చేకూరి రామారావు : మాది ఇల్లిందలపాడు గ్రామం, ఖమ్మం జిల్లా. తల్లి భారతమ్మ, తండ్రి లింగయ్య. భాషాశాస్త్రంలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ప్రారంభించి, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డీన్ గా పదవీ విరమణ చేశాను.

పత్రికా విలేఖరి : మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు, ఏ రచనకు వచ్చింది ?

చేకూరి రామారావు : నేను రాసిన “స్మృతి కిణాంకం” అనే వ్యాస సంకలనానికి 2002 సంవత్సరంలో ఉత్తమమైన విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

పత్రికా విలేఖరి : వాడుకభాష గురించి చెప్పండి.

చేకూరి రామారావు : వ్యావహారిక భాషావాదమంటే మాట్లాడినట్లు రాయడం కాదు. మాట్లాడే భాషకు, రాసే భాషకు పరిమితులు వేరు. ప్రయోజనం వేరు. రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరం.

పత్రికా విలేఖరి : తెలుగు కనుమరుగు అవుతుందేమోనన్న ఆందోళన గురించి మీ అభిప్రాయం.

చేకూరి రామారావు : ఇన్ని కోట్లమంది మాట్లాడే భాష కనుమరుగుకాదు. కాకపోతే మన తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఎక్కువగా కనిపిస్తున్నది.

ప్రశ్నలు

ప్రశ్న 1.
పై పేరాలో ఎవరు ఎవరిని ప్రశ్నలడుగుతున్నారు?
జవాబు:
పై పేరాలో ప్రముఖ భాషాశాస్త్రవేత్త అయిన డా॥ చేకూరి రామారావుగారిని, పత్రికా విలేఖరి ప్రశ్నలు అడుగుతున్నాడు.

ప్రశ్న 2.
పై సమాధానాల ద్వారా మీకు తెలిసిన సాహితీ విశేషాలేమిటి?
జవాబు:
వ్యవహారిక భాషావాదము అంటే, మాట్లాడినట్లు రాయడం కాదనీ, మాట్లాడే భాషకూ, రాసే భాషకూ పరిమితులు వేరనీ, ప్రయోజనం వేరనీ, రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరమనీ తెలిసింది. నేటి తెలుగుభాషను కోట్లాదిమంది మాట్లాడుతున్నారు కాబట్టి తెలుగు ఎప్పటికీ కనుమరుగు కాదనీ, నేటి తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఎక్కువగా ఉందనీ తెలిసింది.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
ఈ విధంగా ప్రశ్నలడిగే విధానాన్ని ఏమంటారు?
జవాబు:
ఈ విధంగా ప్రశ్నలడిగే విధానాన్ని ఇంగ్లీషు భాషలో ‘ఇంటర్వ్యూ’ అంటారు. తెలుగులో “ముఖాముఖి” అని, ‘పరిపృచ్ఛ’ అని పిలుస్తారు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 37)

ప్రశ్న 1.
“తెలంగాణ సాయుధపోరాటం” గురించి విన్నారా ? మీకు తెలిసింది చెప్పండి.
జవాబు:
తెలంగాణ ప్రాంతంలో భూస్వాముల నుండి, దొరల నుండి, నిజాం ప్రభుత్వం నుండి, వెట్టిచాకిరి నుండి, విముక్తి కోసం, రైతులూ, రైతుకూలీలూ, కార్మికులూ స్త్రీలూ, పిల్లలూ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిపిన పోరాటమే, “తెలంగాణ సాయుధపోరాటం”.

ఈ పోరాటం, 1946 నుండి 1951 వరకు కొనసాగింది. వందలాది ఎగరాలు కలిగిన భూస్వాములపై, వారికి అండదండలు అందించిన నిజాం ప్రభుత్వంపై, రైతులు చేసిన పోరాటం ఇది. భూమి కోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం, పేద రైతులు చేసిన ఈ సాయుధ పోరాటం, ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చింది.

ప్రశ్న 2.
“వారసత్వం” అనే మాటను ఏ విధంగా గ్రహించాలి ?
జవాబు:
‘వారసత్వం’ అనే పదానికి, ఒకతరం నుండి మరో తరానికి వచ్చే సంప్రదాయ హక్కు అని అర్థము. తాత ఆస్తి తండ్రికి, తండ్రి ఆస్తి కొడుకుకి వారసత్వంగా సంక్రమిస్తుంది. అలాగే తెలంగాణ సాయుధపోరాట స్ఫూర్తి, ఒక తరం నుండి వారి తరువాత తరానికి సంక్రమించాలి.

తెలంగాణ సాయుధపోరాటంలో ఆనాటి రైతులూ వగైరా ప్రజలు, ఎలా ప్రభుత్వంపై, భూస్వాములపై, తమ హక్కుల కోసం పోరాడారో, అలాగే భావితరాల వారు కూడా, తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేసే పట్టుదల, దీక్ష, వారసత్వంగా వారికి రావాలని ఆ మనం ఈ మాటనుబట్టి గ్రహించాలి.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 38)

ప్రశ్న 1.
“జనపదం” నవల ఇతివృత్తమేమిటి ?
జవాబు:
తెలంగాణలో పోలీసు యాక్షన్ తరువాత రైతుల భూములను దొరలు కాజేశారు. దానితో ‘జనపదం’ కథ మొదలవుతుంది. తరువాత వచ్చిన ఉద్యమాల గురించి, ఉద్యమాల పేరున జరిగిన మోసాల గురించి, ఆనాడు రాజకీయాలు భ్రష్టు పట్టడం గురించి, ఈ “జనపదం” నవలలో వివరంగా చెప్పబడింది. ఇది ఒక్క తెలంగాణ కాక, భారతదేశానికి చెందిన నవల. ఈ నవలలో నిజం చెప్పబడింది.

ప్రశ్న 2.
రంగాచార్య నవలల్లో ప్రధాన విషయం ఏమిటి ?
జవాబు:
రంగాచార్య నవలల్లో ప్రధాన విషయం, “తెలంగాణ సాయుధపోరాటం”. రంగాచార్య నవలలు, తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంగా రాయబడ్డాయి. ‘మోదుగు పూలు’ అనే నవల ఆయన జీవిత చరిత్ర ప్రధానంగా రాయబడింది.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
తన ఆత్మకథగా వర్ణించిన పుస్తకమేది ?
జవాబు:
రంగాచార్య రాసిన ‘మోదుగుపూలు’ అనే నవల సుమారుగా ఆయన ‘ఆత్మకథ’ వంటిది. రంగాచార్య తన జీవన యానాన్ని ఈ నవలా రూపంలో రాశాడు. ఈ నవల పర్ఫెక్షన్ సాగింది. ఈ నవలలో ఒక్క లోపాన్ని కూడా చూపించలేరని రంగాచార్య చెప్పారు. ఈ నవలలో సిద్ధాంతం కన్నా, విశ్వాసం కన్నా, కర్తవ్యం గొప్పది అని రంగాచార్య చెప్పాడు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 39)

ప్రశ్న 1.
‘మాండలికమే ప్రజల భాష !’ నిజమేనా ?
జవాబు:
మాండలిక భాష అంటే ఆ మండలంలో లేక ఆ ప్రాంతంలో సామాన్య ప్రజలు వారి నిత్య వ్యవహారాలలో ఒకరితో ఒకరు మాట్లాడుకొనే భాష, మాండలిక భాష, ప్రజల హృదయాల్లోంచి అప్రయత్నంగా వచ్చిన భాష, అది కావ్య భాషవలె కృత్రిమం కాదు. కాబట్టి మాండలిక భాషను నిజమైన ప్రజల భాష అని చెప్పవచ్చు.

ప్రశ్న 2.
‘వసుధైక కుటుంబం’ అంటే మీరు ఏమనుకుంటున్నారు?
జవాబు:
కుటుంబము అంటే మనకు తెలుసు. మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అప్పాచెల్లెండు, తాతామామ్మలు మన కుటుంబము. మన కుటుంబ సభ్యులపట్ల, మనం ప్రేమాదరాలతో ఉంటాము. మన కుటుంబ సభ్యుల కష్టసుఖాల్లో మనం పాలుపంచుకుంటాము.

వసుధైక కుటుంబం, అంటే ప్రపంచంలోని భూమండలంపై ఉండే ప్రజలందరూ ఒకే కుటుంబం అని అర్థం. అంటే ప్రపంచ ప్రజలంతా కులమత భేదాలు విడిచి, ఒకే తల్లిదండ్రుల పిల్లల్లా కలసిమెలసి, కష్టసుఖాల్లో పాలుపంచుకోడాన్ని ‘వసుధైక కుటుంబం’ అనవచ్చు.

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 39)

ప్రశ్న 1.
కృషి – గుర్తింపు వీటి మధ్య సంబంధాన్ని చెప్పండి.
జవాబు:
కొందరు వ్యక్తులు సంఘం కోసం తమ జీవితాన్ని కూడా త్యాగం చేసి ఎంతో ‘కృషి’ అనగా ప్రయత్నం చేస్తారు. కొందరు సంఘసంస్కర్తలు, సాంఘిక సంస్కరణల కోసం గొప్ప కృషి చేస్తారు. కొందరు శాస్త్రవేత్తలు, శాస్త్రాభివృద్ధికై కృషి చేస్తారు. కొందరు డాక్టర్లు, ఎన్నో పరిశోధనలు చేసి గొప్ప విజయాలు సాధిస్తారు. కొందరు రాజకీయ వేత్తలు దేశం కోసం కృషి చేస్తారు.

అందులో కొందరిని సంఘం గుర్తించి వారిని గౌరవిస్తుంది. వారికి సన్మానాలు చేస్తుంది. అందులో కొందరి కృషికి, గుర్తింపు ఉండదు. ఎవరూ వారి కృషిని మెచ్చుకోరు. కాబట్టి కృషికీ, గుర్తింపుకూ మధ్య సంబంధం ఉండదు.

ప్రశ్న 2.
సందేశమిచ్చే అవకాశం ఎవరికి ఉంటుందని మీరు అనుకుంటున్నారు ?
జవాబు:
కొందరు వ్యక్తులు దేశం కోసం, శాస్త్రాభివృద్ధి కోసం, జనం కోసం, ఎంతో కృషి చేసి తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తారు. వారు ప్రజలకు చెప్పిన మాటలను తాము కూడా ఆచరిస్తారు. అటువంటి మహాత్ములకు, ఆదర్శ జీవనం కలవారికి, ఇతరులకు సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 3.
‘సాంస్కృతిక వైభవం’ అంటే ఏమని అర్థం చేసుకోవచ్చు?
జవాబు:
‘సంస్కృతి’ అంటే నాగరికత. ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కళలు, కొన్ని ఆచార వ్యవహారాలు, కొన్ని పండుగలు, కొన్ని ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ చేసుకుంటారు. గణేశ్ ఉత్సవాలు చేస్తారు. మహంకాళి అమ్మవార్ని ఆరాధిస్తారు. దీనినే సాంస్కృతిక వైభవం అని చెప్పవచ్చు.

ఇవి చేయండి

I. అవగాహన-ప్రతిస్పందన

ప్రశ్న 1.
దాశరథి రంగాచార్యతో ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది ? మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు:
దాశరథి రంగాచార్యగారితో ఇంటర్వ్యూ మంచి ఆనందాన్ని కల్గించింది. తెలంగాణ ముద్దుబిడ్డ అయిన రంగాచార్యగార్కి తెలంగాణ సాయుధపోరాటంతో గల సంబంధం, మాకు మంచి స్ఫూర్తినిచ్చింది. రంగాచార్య రచించిన చిల్లర దేవుళ్ళు, జనపదం, మోదుగుపూలు వంటి నవలలు కొని, తప్పక చదవాలనిపించింది. ఆ నవలలు ప్రతి పాఠశాల, గ్రంథాలయంలోనూ ఉండేలా, ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటే బాగుంటుదనిపించింది.

నాలుగు వేదాలనూ, 10 ఉపనిషత్తులనూ తెనిగించిన ఆ మహాపండితుడిని, ఒక్కసారి కన్నులారా చూడాలనిపించింది. రంగాచార్య వంటి పండితునిపై కమ్యూనిస్టుల ప్రభావం ఉందని తెలిసి, ఆశ్చర్యం అనిపించింది. రంగాచార్యగారు ఉత్తమ మనీషి అని, మంచి మనిషి అని నాకు అనిపించింది. రంగాచార్య ఉద్యమజీవి అనిపించింది. రంగాచార్య తెలంగాణ ముద్దుబిడ్డ అనిపించింది.

ప్రశ్న 2.
ఈ మధ్యకాలంలో టి.వి.లో లేదా ఇంకెక్కడైన మీరు చూసిన ఇంటర్వ్యూ గురించి మాట్లాడండి.
జవాబు:
అఖిల భారత, భారతీయ జనతాపార్టీ అధ్యక్షడు ‘అమిత్’తో, ఈనాడు పత్రిక వారు చేసిన ఇంటర్వ్యూ వివరాలను దిగువ ఇస్తున్నాం.

ఈనాడు ప్రతినిధి : మోదీ ప్రభుత్వం, మొదటి సంవత్సరం పాలనలో సాధించిన అతిపెద్ద విజయం ఏమిటి ?

అమిత్ షా : మేము 2014 మే 26న అధికారానికి వచ్చాం. ఈ ఏడాది పాలనలో మాపై ఒక్క అవినీతి మచ్చ కూడా లేదు. అదే యూ.పీ. ఏ – 10 ఏళ్ళ పాలనలో 12 లక్షల కోట్ల కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇది మేము సాధించిన మొదటి పెద్ద విజయం.

ఈనాడు ప్రతినిధి : ఇవి కాకుండా, ఇంకా ఏమి సాధించారు ?

అమిత్ షా : గాడి తప్పిన ఆర్థిక రంగాన్ని పట్టాలపైకి ఎక్కించాం. ద్రవ్యలోటు దిగి వస్తోంది. కాశ్మీర్ వరదలు, నేపాల్ భూకంపం, వంటి ఉపద్రవాలలో, వేగంగా బాధితులను మేము ఆదుకున్నాం. ఏడాది కాలంలో 14 కోట్ల (జన్ ధన్) బ్యాంకు ఖాతాలు ప్రారంభించాం. మూడు సామాజిక భద్రతా పథకాలు, పేదవారి కోసం తీసుకువచ్చాం.

ఈనాడు ప్రతినిధి : మోదీ సర్కారు కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా!

అమిత్ షా : అదంతా వట్టి అబద్దం. గత ప్రభుత్వం, బొగ్గు, ఖనిజ నిక్షేపాలను, కార్పొరేట్లకు దాదాపు ఉచితంగా ఇచ్చింది. మేము మొత్తం గనుల్లో 10 శాతం వేలం వేస్తే, 2 లక్షల కోట్లు ప్రభుత్వానికి వచ్చింది. అలాగే స్పెక్ట్రమ్ వేలంలో 1.08 లక్షల కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. మీరే గమనించండి. ఎవరు ఎవరికి వత్తాసో !

ఈనాడు ప్రతినిధి : ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ?

అమిత్ షా : ఈ సమస్యను త్వరలో ఆర్థిక మంత్రి పరిష్కరిస్తారు.

ఈనాడు ప్రతినిధి : భూసేకరణ బిల్లును మీరు రాజ్యసభలో పాస్ చేయించుకోలేకపోతున్నారు కదా !

అమిత్ షా : అవును. ప్రతిపక్షాలు అనవసరంగా అడ్డు వస్తున్నాయి. ఆ బిల్లు త్వరలోనే పార్లమెంట్లో పాసవుతుంది.

ఈనాడు ప్రతినిధి : ధన్యవాదాలు, సెలవు.

ప్రశ్న 3.
పాఠం ఆధారంగా దాశరథి రంగాచార్య నవలలు, వాటిలోని ఇతివృత్తాలను తెలుపుతూ ఒక జాబితా రాయండి.
TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి 2
జవాబు:
TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి 3

ప్రశ్న 4.
ఇంటర్వ్యూకు సంబంధించిన కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

పత్రికల్లో, టి.వి.లో రకరకాల ఇంటర్వ్యూలను చూస్తుంటాం. ఇంటర్వ్యూలు రెండు రకాలని తెలుసుకదా ! ఉద్యోగాల ఎంపికకై అభ్యర్థి ప్రతిభను పరీక్షించటానికి చేసేది ఒకరకం. ఉద్యోగాన్ని సంపాదించటానికి అభ్యర్థులు పూర్తి సంసిద్ధతతో ఇంటర్వ్యూకు పోతారు. దీనిలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ముఖ్యపాత్ర పోషిస్తారు. ఇది మొదటిది. ప్రముఖుల జీవిత విశేషాలను తెలుసుకోవటానికి చేసేది మరోరకం. ప్రముఖుల, గొప్పవాళ్ళ నుండి వారి వివరాలను విశేషాలను తెలుసుకోవడానికి చేసేది రెండవది. దీనిలో ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తే కీలకం.

రెండవ రకం ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ముందుగా కొన్ని అంశాలపై ప్రశ్నలు తయారుచేసుకుంటారు. మొదట వారిని పరిచయం చేసుకొని వారి వ్యక్తిగత వివరాల నుండి మొదలై వారి జీవితంలోని ముఖ్య సన్నివేశాలు, ఘట్టాలు, వారందించిన సేవలు, ఆశయాలు, సమాజానికి వారిచ్చే సందేశంతో ముగ్గుస్తుంది.

ఇట్లా చేసే ఇంటర్వ్యూల వివరాలను పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో ప్రజలు చూస్తుంటారు. ఆదర్శవంతులు, సంఘసంస్కర్తలు, కవులు, రచయితలు, ఉద్యమకారులు, శాస్త్రవేత్తలు, రాజకీయనాయకులు మొదలగు వారే కాకుండా మరే ఇతర రంగంలోనైనా ‘ఉత్తమ’ సేవలందించిన వాళ్ళందరిని ఇంటర్వ్యూ చేయడం మనం చూస్తుంటాం. వీళ్ళ జీవితాలు ఎందరికో స్పూర్తిని కలిగిస్తాయి. దారిని చూపుతాయి.

ప్రశ్నలు

అ) ఇంటర్వ్యూ అంటే ఏమిటి ?
జవాబు:
ఉద్యోగాల కొరకై అభ్యర్థుల ప్రతిభను పరీక్షించడానికి చేసే ఒక ప్రక్రియను ఇంటర్వ్యూ అంటారు.

ఆ) ప్రముఖులను ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు ?
జవాబు:
ప్రముఖుల జీవిత విశేషాలు, వారి అనుభవాలు, వారు అందించిన సేవలు, ఎందరికో స్ఫూర్తినిస్తాయి. మరెందరికో దారిని చూపుతాయి. అందుకోసం ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తారు.

ఇ) మొదటిరకం ఇంటర్వ్యూ దేనికి సంబంధించినది ?
జవాబు:
ఉద్యోగాల ఎంపికకై అభ్యర్థుల ప్రతిభను పరీక్షించడానికి చేసే ఇంటర్వ్యూ మొదటి రకం. దీనిలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ప్రముఖపాత్ర వహిస్తారు.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ఈ) ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడానికి ఎట్లా సిద్ధం కావాలి ?
జవాబు:
ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ముందుగా కొన్ని అంశాలపై ప్రశ్నలు తయారుచేసుకుంటారు. మొదట ప్రముఖులను పరిచయం చేసుకొని, వారి వ్యక్తిగత వివరాలను అడిగి, తరువాత వారి జీవితంలోని ముఖ్య సన్నివేశాలు, వారందించిన సేవలు, వారి ఆశయాలు, సమాజానికి వారిచ్చే సందేశంతో ఇంటర్వ్యూ ముగుస్తుంది.

ఉ) ప్రముఖుల నుండి ఇంటర్వ్యూలో సాధారణంగా రాబట్టే విషయాలు ఏవి ?
జవాబు:

  1. వ్యక్తిగత వివరములు,
  2. వారి జీవితంలోని ముఖ్య సన్నివేశాలు, ఘట్టాలు, వారందించిన సేవలు, వారి ఆశయాలు, సమాజానికి వారిచ్చే సందేశం మొదలయిన విషయాలు ప్రముఖుల నుండి రాబడతారు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) దాశరథి రంగాచార్య తాను రచనలు ఎందుకు చేయాలనుకున్నారో సొంతమాటల్లో రాయండి.
జవాబు:
రంగాచార్య ఆంధ్ర మహాసభ ఉద్యమాల ప్రభావంతో మొదట రచన ప్రారంభించారు. నిజాం రాజ్యంలోని పరిస్థితులను గురించి, పత్రికలకు లేఖలూ, వ్యాసాలూ రాశారు.

ప్రభుత్వం, తెలంగాణ సాయుధపోరాట చరిత్రను వక్రీకరించింది. దాన్ని చెరిపివేసి విద్యార్థులకు తెలియకుండా చేసింది. అందువల్ల తెలంగాణ మహోజ్జ్వల వారసత్వం, తరువాతి తరాల వారికి తెలియకుండా పోతుందనే బాధతో, ఆందోళనతో, రంగాచార్య, తెలంగాణ సాయుధపోరాట గాథలో వట్టికోట ఆళ్వారుస్వామి రాయగా మిగిలిన విషయాలను నవలలుగా రచించారు.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ఆ) “తెలంగాణ ఏర్పాటు సంతోషాన్ని”చ్చిందని రచయిత అనటంపై మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు:
తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించింది. అలా రాష్ట్రం ఏర్పాటు కావడం తనకు సంతోషాన్ని కలుగజేసిందని రంగాచార్యగారు చెప్పారు. అదే సందర్భంలో రంగాచార్యగారు తెలంగాణ వచ్చిందనుకుంటే లాభం లేదని, వచ్చిన తెలంగాణను కాపాడుకోవాలని, అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు.

దీనినిబట్టి దాశరథి రంగాచార్యగారికి, తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంతో ప్రేమ ఉందని అర్ధం అవుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయంలో తెలంగాణలో పుట్టినవారందరూ సంతోషిస్తారని నా అభిప్రాయం.

ఇ) “ప్రజల భాష” అంటే మీరేమి అర్థం చేసుకున్నారో రాయండి.
జవాబు:
రంగాచార్య తన నవలలను ప్రజల భాషలో వ్రాశానని చెప్పారు. ప్రజల భాష అంటే ప్రజలు మాట్లాడుకొనే మాండలిక భాష, నవలల్లో పాత్రలకు వారు పాత్రోచితమైన తెలంగాణలోని మాండలిక భాష వాడారు. రంగాచార్య గారికి తెలంగాణ అంటే అభిమానం. తెలంగాణ యాస సొగసులు అంటే ఇష్టం. అందుకే వారు నవలలలోని పాత్రలను బట్టి, పాత్రలు మాట్లాడేటప్పుడు ప్రజల భాషయైన మాండలికాన్ని వాడారు.

ఇక కథను చెప్పేటప్పుడు సాధారణ భాషనే వాడారు. ఆయన ప్రజాజీవితాన్ని చిత్రించడానికి, ప్రజల కోసం రచనలు చేశారు. అందుకే ప్రజల భాషయైన తెలంగాణ యాసతో ప్రజలు మాట్లాడే భాషను, తమ నవలల్లో ఉపయోగించారని గ్రహించాను.

ఈ) రంగాచార్య తన రచనలకు “తెలంగాణ ప్రజల జీవితాన్ని” నేపథ్యంగా ఎందుకు తీసుకున్నాడు ?
జవాబు:
దాశరథి రంగాచార్య తెలంగాణ సాయుధపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆయనను ఆ ఉద్యమం ఎక్కువగా ప్రభావితం చేసింది. ఆయన ఉద్యమ జీవి. ముఖ్యంగా కమ్యూనిష్టు ఉద్యమం, ఆయనకు జీవితాన్ని నేర్పి’ మనిషిని చేసింది.

ప్రభుత్వం తెలంగాణ సాయుధపోరాట చరిత్రను వక్రీకరించింది. దాన్ని చరిత్ర నుండి చెరిపేయడానికి ప్రయత్నించింది. రైతులూ, కూలీలూ, కార్మికులూ, స్త్రీలూ, పిల్లలూ చేసిన చారిత్రాత్మక పోరాటం భావితరాలకు తెలియకుండా పోతుందనే బాధతో, ఆవేదనతో రంగాచార్య తెలంగాణ ప్రజల జీవితాన్ని నేపథ్యంగా తీసుకొని, తన రచనలను సాగించారు. తెలంగాణ ప్రజా జీవితాలు, ప్రజల ఆశలు పోరాటాలు, శాశ్వతంగా భావితరాలకు స్ఫూర్తినియ్యాలని, రంగాచార్య తన రచనలను తెలంగాణ ప్రజల జీవితాలు నేపథ్యంగా రచించారు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) డా॥ దాశరథి రంగాచార్య చేసిన సాహిత్యసేవను వివరించండి.
జవాబు:
మహాకవి దాశరథి రంగాచార్యగారు తెలంగాణ సాయుధపోరాటం నేపథ్యంగా చిల్లర దేవుళ్ళు, జనపదం, మోదుగుపూలు, మాయజలతారు వంటి అద్భుతమైన నవలలు రాశారు. చారిత్రాత్మకమైన తెలంగాణ పోరాట చరిత్రను తన రచనల ద్వారా భావితరాలకు వారు అందజేశారు.

ఇంతేకాక, నాలుగు వేదాలనూ, పది ఉపనిషత్తులనూ తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళవచనంలో రాశారు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం, వంటి అంశాలు నేపథ్యంగా ఈయన విశిష్టమైన నవలలు రచించి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టారు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి కూడా అనువదింపబడ్డాయి.

ఈయన నవలలు చలన చిత్రాలుగా వచ్చాయి. ఈయన రచనాశైలి, పాఠకుడిని ఆకట్టుకొంటుంది. ఈయన రాసిన “చిల్లర దేవుళ్ళు” నవలకు, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయనను ‘గద్య దాశరథి’ అనేవారు. ఈయన సంస్కృతాంధ్ర భాషల్లో మహాపండితుడు. ఈయన జీవిత చరిత్రను ‘మోదుగుపూలు’ నవలలో చిత్రించారు. రంగాచార్య గొప్ప రచయిత.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) మీ పాఠశాలకు ఒక క్రీడాకారుడు, కళాకారుడు లేదా నాయకుడు వచ్చాడనుకోండి. వారిని ఇంటర్వ్యూ చేయడానికి కావలసిన ప్రశ్నావళిని తయారు చేయండి.
జవాబు:
మా పాఠశాలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వస్తే, నేను ఈ కింది ప్రశ్నలతో ఆయనను ఇంటర్వ్యూ చేస్తాను.

  1. భారతరత్న మహాశయా ! మీకు క్రికెట్ ఆట కాకుండా, ఇంకా ఇష్టమైన ఇతర ఆటలేవో చెప్పండి.
  2. మీరు ఎన్నో సంవత్సరంలో క్రికెట్ ఆడుగు పెట్టారు ?
  3. క్రికెట్లో మీరు సాధించిన విజయాలు మీకు పూర్తి సంతృప్తినిచ్చాయా ?
  4. క్రికెట్, పాఠశాలల్లో, కళాశాలల్లో బాగా వ్యాప్తి చెందడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టాలి ?
  5. నేడు భారత క్రికెట్ రంగంలో, రాజకీయాలు ప్రవేశించాయి కదా ! దానిపై మీ అభిప్రాయం ఏమిటి ?
  6. మీరు అభిమానించే క్రికెట్ క్రీడాకారుడు ఎవరు ?
  7. మీకు క్రికెట్ నేర్పిన గురువు ఎవరు ?
  8. భారత్లో క్రికెట్ అభివృద్ధికి మీరిచ్చే సూచనలు ఏమిటి ?
  9. క్రికెట్ నేర్చుకొనే యువతకు మీరిచ్చే సలహాలు ఏమిటి ?
  10. మొత్తంపై క్రీడాకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?

(లేదా)

ఆ) డా॥ దాశరథి రంగాచార్య వ్యక్తిత్వాన్ని లేదా సాహిత్యసేవను ప్రశంసిస్తూ వార్తా పత్రికకు ఒక లేఖ రాయండి.
జవాబు:
నమస్తే తెలంగాణ పత్రిక ప్రధాన సంపాదకులకు లేఖ

నల్గొండ,
X X X X X.

ప్రధాన సంపాదకులు,
నమస్తే తెలంగాణ దినపత్రిక,
హైదరాబాదు.

ఆర్యా,

నమస్కారాలు. నేను నల్గొండ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. మాకు దాశరథి రంగాచార్య గారితో ఇంటర్వ్యూ పాఠం ఉంది. శ్రీ రంగాచార్య మహా మనీషి, వారిని గూర్చి ప్రతి తెలంగాణబిడ్డ తెలుసుకోవాలి. వారిని గూర్చి తెలిసిన విషయాలు రాస్తున్నా. మీ పత్రిక ద్వారా ప్రజలకు అందించకోరుచున్నాను.

“దాశరథి రంగాచార్య తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్న ఉద్యమ శీలి. వీరు తెలంగాణ ప్రజాజీవితం నేపథ్యంగా ఎన్నో నవలలు రాశారు. వీరి నవలల్లో ‘చిల్లర దేవుళ్ళు’ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘జనపదం’ అనే నవలలో మొత్తం సమాజాన్ని మైక్రోస్కోపిక్ గా చూపించారు. ఇది తెలంగాణకి సంబంధించిన నవల కాదు. ఇది భారతదేశానికి చెందిన నవల. ‘మోదుగుపూలు’ నవలలో వీరి జీవిత చరిత్రను రాశారు.

దాశరథి రంగాచార్య గారిపై కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ఉంది. ఆ ఉద్యమం వీరికి జీవితాన్ని నేర్పింది. వీరిని మనిషిని చేసింది. ప్రభుత్వం, తెలంగాణ సాయుధపోరాటాన్ని వక్రీకరించింది. చరిత్ర నుండి చెరిపివేయడానికి ప్రయత్నించింది. ఎందరో రైతులు, కూలీలు, స్త్రీలు, కార్మికులు, పిల్లలు చేసిన ఆ చారిత్రక పోరాటం వివరాలు, భావితరాలకు అందజేయాలని వీరు తెలంగాణ ప్రజల నేపథ్యంలో నవలలు రాశారు.

ఈయనకు తెలంగాణ అంటే గొప్ప ప్రేమ. ఈయన నేపథ్యంలో మహాపండితుడు. నాలుగు వేదాలను, పది ఉపనిషత్తులను, తెలుగులోకి అనువదించారు. భారత, భాగవత, రామాయణములను సరళ వచనంలో రాశారు.

రంగాచార్య చరిత్రను మీ పత్రికలో తప్పక అచ్చువేయండి. నమస్తే కృతజ్ఞతలతో

ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
పి. రామకృష్ణ,
9వ తరగతి, ప్రభుత్వ పాఠశాల,
నల్గొండ.

చిరునామా :

ప్రధాన సంపాదకుడు,
నమస్తే తెలంగాణ,
దినపత్రిక, హైదరాబాదు.

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

ఉదా : విలువలతో కూడిన విద్య మానవ జీవన వికాసానికి దోహదం చేస్తుంది.
జవాబు:
వికాసం = వికసించడం, విప్పారడం

అ) రామప్పగుడి శిల్పకళ సొగసును వర్ణించ శక్యమా ?
జవాబు:
సొగసు = అందము, సౌందర్యము

ఆ) వట్టికోట ఆళ్వారుస్వామి రచనల్లో ప్రజల మనిషి ఉత్కృష్టమైన రచన.
జవాబు:
ఉత్కృష్టం = శ్రేష్ఠము, గొప్పది

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ఇ) భాగవతంలో కృష్ణలీలలు సమగ్రం గా రాశారు.
జవాబు:
సమగ్రం = సంపూర్ణంగా, సమస్తమూ

ఈ) నానాటికి మానవ సంబంధాలు క్షీణించి పోతున్నాయి.
జవాబు:
క్షీణించు = తరుగు, నశించు

2. కింది వాక్యాల్లో గల ప్రకృతి – వికృతులను గుర్తించి రాయండి.

అ) కథలంటే నాకిష్టమని మా నాయినమ్మ నాకు రోజూ కతలు చెప్పింది.
జవాబు:
కథ (ప్రకృతి) – కత (వికృతి)

ఆ) స్వచ్ఛభారతం కోసం ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతిన చేయడమే కాదు పనిచేసి చూపుదాం.
జవాబు:
ప్రతిజ్ఞ (ప్రకృతి) – ప్రతిన (వికృతి)

ఇ) ప్రజలకోసం కవిత్వం రాశాడు. ఆ కైత ప్రజలను చైతన్యపరిచింది.
జవాబు:
కవిత్వం (ప్రకృతి) – కైతం (వికృతి)

ఈ) ఆశ ఉండవచ్చు. మితమీరిన ఆస ఉండరాదు.
జవాబు:
ఆశ (ప్రకృతి) – ఆస (వికృతి)

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
కింది పదాలను విడదీయండి. సంధిపేరు రాయండి.
జవాబు:
సంధి పదం – విడదీసిన రూపం – సంధిపేరు
ఉదా :
పోయినాడంటే – పోయినాడు + అంటే -ఉత్వసంధి
అ) ఏమని – ఏమి + అని – ఇత్వసంధి
ఆ) కాదనుకున్నాడు – కాదు + అనుకున్నాడు – ఉత్వసంధి
ఇ) పిల్లలందరూ – పిల్లలు + అందరూ – ఉత్వసంధి

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 2.
కింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చండి. సమాసం పేరు రాయండి.
ఉదా : మూడు సంఖ్యగల రోజులు మూడురోజులు – ద్విగు సమాసం

అ) రెండు సంఖ్యగల రోజులు = రెండురోజులు – ద్విగు సమాసం
ఆ) వజ్రమూ, వైడూర్యము = వజ్రవైడూర్యములు – ద్వంద్వ సమాసం (లేదా) ఉభయ పద విశేషణ కర్మధారయ సమాసం)
ఇ) తల్లియూ, బిడ్డయూ = తల్లీబిడ్డలు – ద్వంద్వ సమాసం

కర్తరి, కర్మణి వాక్యాలు

కింది వాక్యాలు పరిశీలించండి.

  1. ఆళ్వారుస్వామి “చిన్నప్పుడే” అనే కథ రాశాడు. (కర్తరి)
  2. ‘చిన్నప్పుడే అనే కథ ఆళ్వారుస్వామిచే రచింపబడింది. (కర్మణి)

పై రెండింటిలో మొదటివాక్యం కర్తరి వాక్యం. భావం సూటిగా ఉంది కదా ! అది కర్త ప్రధానంగా కలిగిన వాక్యం. అంటే ‘రాశాడు’ అనే క్రియ, ‘ఆళ్వారుస్వామి’ అనే కర్తను సూచిస్తోంది. ఇటువంటి వాక్యాలను ‘కర్తరి వాక్యాలు’ అంటారు. రెండవ వాక్యం ‘కర్మణి వాక్యం’. ఇది కర్మ ప్రధానంగా కలిగిన వాక్యం. అంటే ‘రాయబడింది’ అనే క్రియ, ‘చిన్నప్పుడే అనే కథ’ అనే కర్మను సూచిస్తోంది.

ఈ వాక్యంలో రెండు మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  1. ‘బడు’ అనే ధాతువు చేరడం
  2. ‘చే’ అనే విభక్తి చేరడం.

కర్తరి వాక్యం : కర్త ప్రధానంగా రూపొందుతుంది.
కర్మణి వాక్యం : కర్మ ప్రధానంగా రూపొందుతుంది. క్రియ మీద ‘బడు’ ధాతువు, కర్తమీద ‘చే / చేత’ విభక్తి చేరుతుంది.

ప్రశ్న 3.
కింది వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి.

అ) లింగయ్య మా నాయకునికి ఉసిరికాయ ఇచ్చాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
లింగయ్య చేత మా నాయకునికి ఉసిరికాయ ఇవ్వబడింది. (కర్మణి వాక్యం)

ఆ) బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
బాలుచే ఇసుకతో ఇల్లు కట్టబడింది. (కర్మణి వాక్యం)

ఇ) అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది. (కర్తరి వాక్యం)
జవాబు:
అక్కచే ఇంటి ముందు ముగ్గు వేయబడింది. (కర్మణి వాక్యం)

ప్రశ్న 4.
కింది వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

అ) గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని పోబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:
గ్రామీణులు నాయకులను ఎదుర్కొని పోయారు. (కర్తరి వాక్యం)

ఆ) కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
కాయలన్నీ అతని ముందర పోశారు. (కర్తరి వాక్యం)

ఇ) బాలురచే సెలవు తీసుకోబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
బాలురు సెలవు తీసుకున్నారు. (కర్తరి వాక్యం)

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రశ్న 5.
మీరు తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నారు కదా ! కింది విగ్రహవాక్యాల్లో గీత గీసిన విభక్తి ప్రత్యాయాల ఆధారంగా ఆయా తత్పురుష సమాసాల పేర్లు రాయండి.

అ) విద్యను అర్థించువారు
జవాబు:
(ద్వితీయా తత్పురుష సమాసం)

ఆ) గుణాలచేత< హీనుడు
జవాబు:
(తృతీయా తత్పురుష సమాసం)

ఇ) సభ కొరకు భవనం
జవాబు:
(చతుర్థీ తత్పురుష సమాసం)

ఈ) దొంగల వల్ల భయం
జవాబు:
(పంచమీ తత్పురుష సమాసం)

ఉ) రాముని యొక్క బాణం
జవాబు:
(షష్ఠీ తత్పురుష సమాసం)

ఊ) గురువు నందు భక్తి
జవాబు:
(సప్తమీ తత్పురుష సమాసం)

ప్రాజెక్టు పని

మీ గ్రామంలోని వేరు వేరు రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రశ్నావళి రూపొందించుకుని ముఖాముఖి నిర్వహించండి. నివేదిక రాయండి.
జవాబు:
విద్యారంగం :

  • మీరు ఎంత కాలంనుండి విద్యాబోధన చేస్తున్నారు ?
  • విద్యా ప్రణాళికలో నైతిక విలువల ప్రాధాన్యత ఎంతవరకు ఉంది ?
  • ప్రాథమిక స్థాయిలో యోగా విద్యకు ప్రాధాన్యతను ఇవ్వాలా ?
  • ప్రస్తుత విద్యా విధానంలో పరీక్షల సంస్కరణలు ఎలా ఉండాలి ?
  • పనిబాట పట్టిన పిల్లలను బడిబాట పట్టడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?
  • పాఠశాల వాతావరణం ఎలా ఉండాలి ? లోపాలను ఎలా సరిదిద్దాలి ?

వ్యాపార రంగం :

  • వ్యాపారంలో నైతికత అవసరం ఎంతవరకు ఉంది ?
  • పెట్టుబడులకు బ్యాంకుల సహకారం ఎంతవరకు ఉండాలి?
  • వినియోగదారుల మన్ననను వ్యాపారులు ఎట్లా పొందాలి ?
  • వ్యాపారుల మధ్య పోటీ ఎలా ఉండాలి ?
  • వ్యాపారస్థులు సమాజం పట్ల బాధ్యతను ఎలా గుర్తించాలి ?

వైద్యరంగం :

  • గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవశ్యకత ఎంతవరకు ఉంది ?
  • గ్రామస్థులకు వైద్యులు ఎలాంటి ఆరోగ్య సూత్రాలను అందించాలి ?
  • వర్షాకాలంలోనూ, ఎండాకాలంలోనూ, ప్రజలకు ఎలాంటి సూచనలను వైద్యులు అందించాలి ?
  • అంటురోగాలు ప్రబలకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

వ్యవసాయరంగం :

  • పంటలో సేంద్రియ ఎరువుల ఆవశ్యకత ఎంతవరకు ఉంది ?
  • రైతులకు గిట్టుబాటు ధరలు కావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి ?
  • ప్రస్తుత తరుణంలో సమష్టి వ్యవసాయం అవసరం ఉందా ? లేదా ?
  • రైతుల ఆత్మహత్యలను ఎలా నివారించాలి ?
  • ఆధునిక వ్యవసాయంలో ఎలాంటి మెలకువలు పాటించాలి ?

కఠిన పదాలకు అర్థాలు

I

36వ పేజి

సాహితీ రంగ ప్రవేశం = సాహిత్య రంగములో ప్రవేశించడం
ఆంధ్రమహాసభ = ఆంధ్రులు పెట్టుకున్న మహాసభ;
మహోద్యమం (మహా + ఉద్యమం) = గొప్ప పోరాటం ;
ప్రభావితుణ్ణయి = ప్రభావం పొందినవాడినయి
పూనుకున్నాను = సిద్ధపడ్డాను
ఉద్యమం = పోరాటం
ప్రజాజీవితం = ప్రజల యొక్క జీవితం
నేపథ్యంగా = పూర్వరంగంగా
వక్రీకరించింది = తప్పుదారి పట్టించింది ;
సాయుధపోరాటం = ఆయుధములతో పోరాటం ;
జడుసుకుంది = భయపడింది
బుగులుపడింది = కలతపడింది (కలత చెందింది)
చారిత్రాత్మక పోరాటం = చరిత్ర ప్రసిద్ధమైన పోరాటం
ప్రతిన = ప్రతిజ్ఞ
రక్తా రుణ సమరాలు
(రక్త + అరుణ, సమరాలు) = రక్తంతో ఎరుపెక్కిన యుద్ధాలు;
మహోజ్జ్వల వారసత్వం
(మహా + ఉజ్జ్వల, వారసత్వం) = గొప్పగా ప్రకాశించే వారసత్వం
వ్యథ = దుఃఖము
ఆవేదన = బాధ
ఆవిర్భవించినవి = పుట్టాయి
ఉత్కృష్టమైన = శ్రేష్ఠమైన
పోరాటగాథ = పోరాటానికి సంబంధించిన కథ;

37వ పేజి

ఆందోళన = ఊగిసలాట (కంగారు)
బృహత్ కార్యము = పెద్దపని
ఉపక్రమించినాను = మొదలుపెట్టినాను

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

II

37వ పేజి

అగ్రజులు = అన్నగారు
తొలుత = మొదట
ప్రక్రియలో = రచనా పద్ధతిలో
ఉభయులు = ఇద్దరూ
ప్రభావాత్మకము = ప్రభావం కల్గించేది
దృక్పథాన్ని = దృష్టి మార్గాన్ని
విస్తృతమయిన = విశాలమైన
సమాజాన్ని = సంఘాన్ని
మైక్రోస్కోపిక్ (Microscopic) = అత్యంత సూక్ష్మంగా ;
పోలీస్ యాక్షన్ (Police Action) = (1948లో నిజాం నుండి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోడాన్ని భారత యూనియన్ వారు, చేపట్టిన పోలీసు చర్య)
కాజేయడం = ఆక్రమించడం;
ఉద్యమాలొచ్చినయి = ఉద్యమాలు (పోరాటాలు) వచ్చాయి
భ్రష్టుపట్టడం = చెడిపోవడం
వ్యాఖ్య చెయ్యడం = వివరంగా వ్యాఖ్యానించి చెప్పడం ;
గర్వకారణం = గర్వపడడానికి కారణం

38వ పేజి

ప్రియమయిన = ఇష్టమైన
ఆత్మకథ = తన జీవిత కథ
జీవనయానం = జీవన ప్రయాణం (ఆత్మ జీవిత కథ)
ఇవాల్టికీ = నేటికీ
పర్ఫెక్షన్ (Perfection) = సంపూర్ణత (లోపం లేకపోడం)
కర్తవ్యం = చేయదగిన పని
డూ ఆర్ డై (Do or die) = చేయడం లేకపోతే చావడం ;
సిద్ధాంతం = స్థిరమైన నిరూపిత సారాంశము

III

38వ పేజి

కృషి = ప్రయత్నం
భగవదనుగ్రహం
(భగవత్ + అనుగ్రహం) = భగవంతుడి దయ
విశ్వాసం = నమ్మకం
అసాధ్యమైన = సాధ్యముకాని
సంప్రదాయ సిద్ధము = గురుపరంపరగా వచ్చినట్టిది
చదువుల రాణి = సరస్వతి
కీర్తించు = పొగడను
శ్లాఘించను = కొనియాడను
మాండలికం = మండలములోని భాష (ప్రాంతీయమైన యాస పలుకుబడి)
తెలంగాణేతర
(తెలంగాణ + ఇతర) = తెలంగాణ కంటే ఇతరమైన
దురభిమానం = చెడ్డ అభిమానం
యాససొగసులు = మాట్లాడే తీరులోని అందాలు
నివేదనకు = వెల్లడించడానికి
సంక్షిప్తంగా = కొద్దిగా
వాల్మీకి = సంస్కృత రామాయణ కర్త
వ్యాసుడు = అష్టాదశపురాణాలు, భారత భాగవతాలు సంస్కృతంలో వ్రాసిన మునీశ్వరుడు
కాళిదాసు = అభిజ్ఞాన శాకుంతలం వంటి సంస్కృత నాటకాలు వ్రాసిన సంస్కృత మహాకవి
గోర్కీ = మాక్సింగోర్కి (రష్యన్ రచయిత ఈయన రాసిన ‘అమ్మ’ నవల ప్రసిద్ధము.)
చెఖోవ్ = రష్యాదేశ ప్రసిద్ధ కథా రచయిత;
డికెన్స్ = ఫ్రాన్సు దేశ రచయిత (A Tale of two cities) రెండు మహా నగరాల కథా రచయిత
ప్రేంచంద్ = హిందీ నవలా రచయిత (గోదాన్ నవలా కర్త)
ఉన్నవ = ఉన్నవ లక్ష్మీనారాయణ గారు (మాలపల్లి నవలా రచయిత)
విశ్వనాథ = వేయిపడగలు నవలా కర్త (విశ్వనాథ సత్యనారాయణగారు)
అల్లం రాజయ్య = నవలా రచయిత, కథా రచయిత
పరిధులు = సరిహద్దులు
వసుధైక కుటుంబం = ప్రపంచం అంతా ఒకే కుటుంబంగా భావించడం

39వ పేజి

ప్రభావితం చేసిన = ప్రభావం కలుగజేసిన
వ్యక్తులుగా = మనుషులుగా
ఉద్యమజీవిని = ఉద్యమమే ఊపిరిగా జీవించినవాడిని
సమాజం = సంఘము

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

IV

39వ పేజి

అధ్యయన దశ = గురుముఖంగా చదివి నేర్చుకోవలసిన, స్థితి
అధ్యయనం = చదవడం
ఆచరణ దశ = పనిచేయవలసిన, స్థితి
సాహిత్య సాంస్కృతిక జీవనవైభవానికి = సాహిత్యము, సంస్కృతికి సంబంధించిన, జీవితంలోని గొప్పదనానికి
జీవగడ్డ = జీవనాధారమైన నేల ;
వారసత్వ సంపద = పూర్వీకుల నుండి వచ్చే సంపద
పునరుజ్జీవనానికి (పునః + ఉజ్జీవనానికి) = తిరిగి, బ్రతికించడానికి
ప్రణాళిక = పథకము
మేనిఫెస్టోలు = ప్రకటన కాగితము
రూపొందించుకోవచ్చు = తయారుచేసికోవచ్చు
నిర్వర్తించాను = నెరవేరతాయి
సందేశం = చెప్పవలసి మాట
సిద్ధిస్తాయి = నెరవేర్చాను

పాఠం ఉద్దేశం

తెలంగాణకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. నాటి నుండి నేటి వరకు ఈ గడ్డపై పోరాడిన వీరులు, కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు. నాటి తెలంగాణ పోరాటాన్ని కళ్ళార చూసిన సాహితీయోధుడు డా॥ దాశరథి రంగాచార్య. తెలంగాణ ప్రజల జీవనాన్ని, అస్తిత్వాన్ని, పోరాటాలను తన రచనల ద్వారా ప్రతిఫలింప చేశాడు. అలాంటి ప్రముఖ రచయిత వ్యక్తిత్వస్ఫూర్తిని, రచనల గొప్పదనాన్ని ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు తెలియజేయటమే పాఠ్యాంశ ముఖ్య ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠ్యభాగం ఇంటర్వ్యూ (పరిపృచ్చ) ప్రక్రియకు చెందినది. ఇంటర్వ్యూ (Interview)నే, పరిపృచ్ఛ, లేక ‘ముఖాముఖి’ అని కూడా అంటారు. ఈ ఇంటర్వ్యూ రెండు రకాలుగా ఉంటుంది.

ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపికచేసే ప్రక్రియలో ఉద్యోగార్థుల ప్రతిభను పరీక్షించడం కోసం చేసే ఇంటర్వ్యూ మొదటిరకం. ఇక నిర్దిష్ట రంగంలో సేవలందించిన మహాత్ముల అనుభవాలను, అంతరంగాన్ని తెలిసికోడానికి చేసే ఇంటర్వ్యూ రెండవది.

డా॥ దాశరథి రంగాచార్య, వేరువేరు సందర్భములలో వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోని ముఖ్యాంశాలే ఈ పాఠ్యభాగం.

డా॥ దాశరథి రంగాచార్య కవి పరిచయం

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి 1

పాఠము పేరు : “రంగాచార్యతో ముఖాముఖి”

ఇంటర్వ్యూలో జవాబులు చెప్పినవారు : దాశరథి రంగాచార్య

రంగాచార్య జననం : 24-08-1928

రంగాచార్య మరణం : 07-06-2015

జన్మస్థలం : మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరులో జన్మించారు.

సోదరుడు : ప్రముఖ కవి డా|| దాశరథి కృష్ణమాచార్య వీరి సోదరుడు.

ఉద్యోగము : ఈయన ఉపాధ్యాయుడిగా, గ్రంథాలయ నిర్వాహకుడిగా, సికింద్రాబాద్ పురపాలకశాఖలో పనిచేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.

నవలా రచన : ఈయన విశిష్టమైన తెలుగు నవలలు రచించి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.

అనువాదము :

  1. నాలుగు వేదములను, పది ఉపనిషత్తులను, సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం చేశారు.
  2. రామాయణ, భారత, భాగవతాలను సరళమైన తెలుగు వచనంలో రాశారు.

రచనలలోని విషయము : తెలంగాణ జనజీవనము, రైతాంగ పోరాటం వంటి విషయాలు పూర్వరంగంగా, (నేపథ్యంగా) ఈయన రచనలు సాగాయి. వీరు తెలుగు నవలలో ‘పాత్రోచితయాస’ను ప్రవేశపెట్టారు. ఈయన రచనలు, ఇతర భాషల్లోకి అనువదింపబడ్డాయి. సినిమాలుగా వచ్చాయి.

పురస్కారం : వీరి “చిల్లర దేవుళ్ళు” నవలకు, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

శైలి : వీరి రచనాశైలి పాఠకులను ఆకట్టుకొంటుంది.

TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

ప్రవేశిక

తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యులుగారికి విశిష్టస్థానము ఉంది. ఈయన తెలంగాణ పోరాటం పూర్వరంగాన్ని, తన జీవశక్తిగా మార్చుకొని, తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించారు. అటువంటి రంగాచార్యగారి అంతరంగాన్ని మరింత దగ్గరగా తెలుసుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం పాఠకులకు సహజంగానే ఉంటుంది. అలా తెలుసుకోడానికి ఈ ముఖాముఖి (Interview) ప్రక్రియ తోడ్పడుతుంది.

రచయితతో పరిచయం వల్ల, ఆయన రచనల్లో తెలియని కొత్త కోణాలు సాహితీలోకానికి పరిచయం అవుతాయి. అందుకోసం డా॥ దాశరథి రంగాచార్యగారితో ముఖాముఖిని చదువుదాం.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 3rd Lesson కాళోజి Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించాడు.
మంచి ఎక్కడున్నా స్వాగతించాడు.
అన్యాయం, అణచివేతలపై తిరగబడ్డాడు
తన వాదనలతో తెలంగాణేతరుల మనసులను కూడ గెలుచుకున్నాడు.
తెలంగాణ వైతాళికుడని పేరుగన్నాడు.
ఈ నేల సాంస్కృతిక వారసత్వంలోనుండి ఎదిగిన ఆ మహనీయుడే – కాళోజి
TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కాళోజి – బాల్యం – విద్యాభ్యాసంను గూర్చి రాయండి.
జవాబు:
కాళోజి నారాయణరావుగారు మొదటి ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లో అనగా 9-9-1914న జన్మించాడు. ఈయన ‘రట్టహళ్ళి’ అనే గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుతం బీజాపూరు జిల్లాలో ఉంది. ఈ ఊరు, కర్ణాటక ప్రాంతంలోని పాత బొంబాయి ప్రెసిడెన్సీ కింద ఉండేది.

కాళోజీ బాల్యంలో వారి కుటుంబం, కొన్ని సంవత్సరాలు మహారాష్ట్రలోని ‘సాయరాం’ అనే గ్రామంలోనూ, మరికొంతకాలం తెలంగాణాలోని ఇల్లెందు తాలూకా ‘కారేపల్లి’ గ్రామంలోనూ నివసించేది. 1917 వరకూ కాళోజీ కుటుంబం ‘హనుమకొండ’ లో ఉండేది. తరువాత ‘మడికొండ’ కు మారింది.

కాళోజీ అన్న రామేశ్వరరావు న్యాయశాస్త్రం చదవడానికి హైదరాబాదు వెళ్ళవలసినప్పుడు కాళోజీ పాతబస్తీలోని చౌయహల్లా కాన్లీబడిలో సెకండ్ ఫారమ్లో చేరారు. ఆ తరువాత సుల్తాను బజారులోని రెసిడెన్సీ మిడిల్ స్కూలులో చేరారు. ఉన్నత విద్య కోసం 1934 ఏప్రిల్ వరంగల్ కాలేజిమేట్ హైస్కూలులో ఇంటర్మీడియట్లో ప్రవేశించారు. 1939లో కాళోజీ ‘లా’ పూర్తి చేశారు. 1940లో గవిచెర్ల గ్రామానికి చెందిన ‘రుక్మిణి’ని వివాహం చేసుకున్నారు.

ప్రశ్న 2.
కాళోజిగారి కథలను గూర్చి రాయండి.
(లేదా)
కథా రచయితగా కాళోజీ ఎలా రాణించారు ?
జవాబు:
కాళోజీ కవిగానేగాక, కథకునిగా కూడ రాణించాడు. ఈయన కథలో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన, స్పష్టంగా కనిపిస్తాయి. కాళోజీ కథలకు ఈనాటికీ ‘ప్రాసంగికత’ ఉంది.

కులమతాలపేరిట, మనుషుల్ని హీనంగా చూడటం అవమానించడం, ఎంత దారుణమో ఈయన చెప్పారు. మనుషుల్లో ఉండే ద్వంద్వ ప్రవృత్తినీ, అన్యాయరీతుల్ని గూర్చి ఈయన తన కథల్లో చెప్పారు.

ఈయన ‘విభూతి లేక ఫేస్ పౌడర్ కథ’ వ్యంగ్య హేళనలతో సాగింది. ఈ కథలో అలంకరణల పట్ల మోజును గూర్చి, నవ్వు తెప్పించే విధంగా చెప్పాడు.

రాజకీయములో పరిపాలనలో ఉన్న అవకతవకలనూ, అక్రమాలనూ మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. తెలంగాణాలో 1940 నాటికి ఉన్న రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరిని మించి ఒకరు కుట్రలు కుతంత్రాలతో లౌక్యంతో రాజ్యపాలన సాగింది. ఈ పరిస్థితుల్ని రామాయణంలోని సుగ్రీవుడు, విభీషణుడి కథలకు ముడిపెట్టి, కాళోజీ రాసిన కథ పేరు “లంకా పునరుద్ధరణ”. రామాయణ కథపై విసరిన వ్యంగ్యాస్త్రమే, ‘లంకా పునరుద్ధరణ’ కథ.

రాతి బొమ్మకు గుడిని కట్టించే విషయంలో ముందుకు వచ్చిన ప్రజలు, ప్రాణం ఉన్న అనాథ శిశువుపై ఆదరణ చూపించలేకపోవడంపై విసరిన మరో వ్యంగ్యాస్త్రం, “భూతదయ” అనే కథ. ఈ విధంగా కాళోజీ కథలన్నీ ఒకరకంగా రాజకీయ కథలు. ఈ కథలో సాహిత్య విలువలను కాపాడడానికి కాళోజీ ప్రయత్నించారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

ప్రశ్న 3.
కాళోజి ‘కవిత్వం – భాష’ అనే వాటిని గూర్చి రాయండి.
జవాబు:
కాళోజి తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకువెళ్ళి ప్రజాకవిగా పేరు పొందాడు. తెలంగాణ పక్షాన నిలిచి, తాడిత, పీడిత ప్రజల గుండెల్లో కొలువైన మహాకవి కాళోజి. కాళోజి మాటలలో, చేతలలో, ఆలోచనలో, ఆవేదనలో, వేషభాషల్లో ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం, సంపూర్ణంగా కనిపిస్తుంది.

ఈయన సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ అనే పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపూటాలుగా వెలువరించారు. కాళోజీ ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కవి. నిరంకుశ రాజ్యాలమీద తన జీవితాంతం కత్తి కట్టి పోరాడాడు. అందుకే రాజకీయాలతో, ప్రజా ఉద్యమాలతో, మమైకమైన కాళోజీ కవిత్వాన్ని తెలుగునాట ప్రజలు ఆదరించాడు.

రజాకార్లపై ఆయన కోపాన్ని పరాకాష్ఠకు చేర్చిన ఆయన కవిత, “కాటేసి తీరాలె” అనేది. ఇందులోని కసి తెలంగాణ ప్రజలది.

“మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండాలధీశులను
మరచి పోకుండ గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండ బుసకొట్టుచుండాలె
కాలంబు రాగానె కాటేసి తీరాలె”

కాళోజీ భాష : కాళోజీ దృష్టిలో భాష రెండు రకాలు. ఒకటి “బడి పలుకుల భాష”. రెండవది జనం నిత్యం వ్యవహారంలో వాడే “పలుకుబడుల భాష”. వీటినే గ్రాంథిక భాష, వ్యావహారిక భాష అంటాము.
ఏ భాషకైనా జీవధాతువు, మాండలికమే. కాళోజీ జీవభాష వైపే మొగ్గు చూపాడు.

ప్రశ్న 4.
కాళోజీ నారాయణరావుగారి ప్రజా జీవితం గురించి రాయండి.
జవాబు:
ఎనిమిది దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కాళోజీ బ్రతుకు ముడిపడింది. ఆయన వివక్ష ఎక్కడ ఉన్నా వ్యతిరేకించాడు. మంచిని స్వాగతించాడు. అన్యాయం, అణచివేతలపై తిరుగుబడ్డాడు. ఆయన వాదనలోని సమర్థనలను, ఆలోచించ గలవారు గుర్తించారు. ఈయన పెక్కు సందర్భాల్లో తెలంగాణేతరుల మనస్సులను కూడా జయించాడు.

కాళోజిని తెలంగాణా వైతాళికుడిగా చెప్పాలి. ఈయన తెలంగాణ వారసత్వంలోంచి ఎదిగాడు. ఈయన మనుషులను అర్థం చేసుకున్న తీరు, విశిష్టమైనది. ఈయనకు భాగవతంలో ప్రహ్లాదుడి పాత్ర నచ్చిందని చాలాసార్లు చెప్పాడు. అన్యాయాన్ని ఎదిరించినవాడే తనకు పూజ్యుడని, కాళోజీ చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువ ఉంటుందని ఈయన భావించాడు. ఓటుహక్కు ప్రజాస్వామికమైనదని ప్రకటిస్తూ మెడలో బోర్డు వేసుకొని, ఈయన తిరిగాడు. ఈ స్వేచ్ఛా ప్రవృత్తి కాళోజిలో అడుగడుగునా కనిపిస్తుంది.

వ్యక్తిత్వం, స్వేచ్ఛ, అనే రెండు ప్రధాన విషయాలను మనిషి కోల్పోకూడదని, కాళోజీ చెప్పారు. కాళోజీ జీవితాంతం ప్రజాస్వామ్యవాదిగా ఉన్నారు. “నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించే నీ హక్కులకోసం అవసరమైతే నా ప్రాణాలిచ్చి పోరాడుతా” అనే మాటల్ని కాళోజీ గుర్తు చేసేవారు. ఆ మేరకు ఆయన బతికారు.

తెలంగాణ ఇటీవల వరకు యుద్ధ భూమి అందులో కాళోజీ ప్రజల వైపు నిలబడి, కవిత్వం వినిపించాడు. నిజాంను ఎదిరించాడు. కాళోజీ ఉద్యమ కవి.

ప్రశ్న 5.
కాళోజీ నారాయణరావు వ్యక్తిత్వాన్ని గురించి సంక్షిప్తంగా రాయండి.
జవాబు:
కాళోజీ 9-9-1914న బీజపూర్ జిల్లా రట్టహళ్ళిలో జన్మించారు. 1939లో లా పూర్తిచేసి, 1940లో రుక్మిణిని పెండ్లాడారు. ఆచరణకు, ఆదర్శానికీ తేడాలేని జీవితం ఆయనది. కాళోజీ నిరంతర ఉద్యమ జీవి. తమ కాలంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. రజాకార్లను ఎదిరించి జైలు జీవితం గడిపారు. నిజాం రాజును ఎదిరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఇతరుల బాగు కోసం పోరాడేతత్త్వం, సామాజిక స్పృహ, కాళోజీలో ఉన్నాయి.

కాళోజీ తాడిత పీడిత ప్రజల గుండెల్లో నిలిచి కవి. ఆయనలో తెలంగాణా స్వరూపం దర్శనమిస్తుంది. దాశరథి అన్నట్లు, కాళోజీ, “తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం”. కాళోజీ, సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ అనే పేరున అనేక కవితలు రాశాడు. కాళోజీ నిజానికి అంతర్జాతీయ కవి. రజాకార్లపై తన కోపాన్ని కాళోజీ ‘కాటేసి తీరాలె’ అన్న కవితలో రాశారు. కాళోజీ తన రచనలలో, జీవ భాష వైపే మొగ్గుచూపారు. ‘వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది’, అని కాళోజీ ఎలుగెత్తి చాటాడు. కాళోజీ కవిగా, ఉద్యమకారునిగా, కథకునిగా కూడా, రాణించారు. కాళోజీ వివక్షను వ్యతిరేకించాడు. మంచిని స్వాగతించాడు. కాళోజీ తెలంగాణ వైతాళికుడు.

ఈయన, ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ ఉంటుందని చెప్పి, మెడలో బోర్డు వేసుకొని తిరిగేవాడు. ఆయన నిర్భయంగా మాట్లాడేవారు. కాళోజీ జీవితాంతం, ప్రజాస్వామ్య వాధిగా ఉన్నాడు. ఖలీల్ జిబ్రాల్ రాసిన “ది ప్రాఫెట్”ను ‘జీవనగీత’గా అనువదించాడు. తన భౌతిక శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ వారికి అందించాడు.
కాళోజీ జీవితమంతా దేశంగా, ప్రజలుగా, ఉద్యమాలుగా బతికిన మహాకవి.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

1. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

తెలంగాణ పక్షాన నిలిచి తాడిత, పీడిత ప్రజల గుండెలలో కొలువైన కవి కాళోజి. మాటలలో, చేతలలో, ఆలోచనలలో, ఆవేదనలో, వేషభాషలలో, ప్రవర్తనలో, తెలంగాణ స్వరూపం సంపూర్ణంగా కనిపిస్తుంది. దాశరథి అన్నట్లు “తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం కాళోజి. తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్ళి ప్రజాకవిగా పేరుపొందినవాడు కాళోజీ.

సమాజ గొడవను తన గొడవగా చేసుకొని “నా గొడవ” పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపుటాలుగా వెలువరించాడు. ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజి నిజానికి అంతర్జాతీయ కవి. ‘నిరంకుశ రాజ్యాలమీద జీవితాంతం కత్తిగట్టి పోరాడినవాడు కాళోజి. అందుకే రాజకీయాలతో, ప్రజా ఉద్యమాలతో మమైకమైన కాళోజి కవిత్వాన్ని తెలుగునాట ప్రజలు ఆదరించారు. రజాకార్లపై ఆయన కోపాన్ని పరాకాష్టకు చేర్చిన కవిత “కాటేసి తీరాలె”. ఇందులోని కసి తెలంగాణా ప్రజలందరిది.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కాళోజీ గురించి దాశరథి అన్నమాట ఏది ?
జవాబు:
‘తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం ‘కాళోజి’ అని దాశరథి కాళోజి గురించి చెప్పాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

ప్రశ్న 2.
కాళోజి ఎటువంటి కవి ?
జవాబు:
ప్రాంతీయ దృక్పథం, దేశీయ దృక్పథం, అంతర్జాతీయ దృక్పథం కలిగిన కాళోజి, నిజానికి అంతర్జాతీయ కవి.

ప్రశ్న 3.
కాళోజీలో ఏమి కనిపిస్తుంది ?
జవాబు:
కాళోజి మాటలలో, చేతలలో, ఆలోచనలలో, ఆవేదనలో, వేషభాషలలో, ప్రవర్తనలో తెలంగాణ స్వరూపం, సంపూర్ణంగా కనిపిస్తుంది.

ప్రశ్న 4.
కాళోజి ప్రజాకవి ఎట్లు అయ్యాడు ?
జవాబు:
తన కవిత్వాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకువెళ్ళాడు కాబట్టి, కాళోజి ప్రజాకవి అయ్యాడు.

ప్రశ్న 5.
‘నా గొడవ’ కవితా సంపుటాల గురించి తెలుపండి.
జవాబు:
కాళోజీ సమాజ గొడవను తన గొడవగా చేసుకొని, ‘నా గొడవ’ పేరుతో అనేక కవితలు రాసి, వాటిని ఎనిమిది సంపుటాలుగా వెలువరించాడు.

2. ఈ కింది పేరా చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

కవిగా, ఉద్యమకారునిగా పేరొందిన కాళోజి కథకునిగా కూడా రాణించాడు. ఇతని కథల్లో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన స్పష్టంగా కనిపిస్తుంది. కాళోజి కథలకు ఈనాటికీ ప్రాసంగికత ఉన్నది. మతం పేరిట, కులంపేరిట మనుషుల్ని హీనంగా చూడటం, అవమానించటం ఎంత దారుణమో చెప్పాడు. మనుషుల్లోని ద్వంద్వ ప్రవృత్తి, అన్యాయమైన రీతుల్ని తెలియజెప్పాడు. వ్యంగ్యం, హేళనలతో సాగిన కథ విభూతి లేక ఫేస్ పౌడర్. ఇందులో అలంకరణల పట్ల గల మోజును నవ్వు తెప్పించే విధంగా చెప్పాడు. రాజకీయాల్లో, పరిపాలనలో అవకతవకల్ని, అక్రమాల్ని ఇప్పుడు కూడా చూస్తున్నాం. తెలంగాణాలో 1940 నాటికి ఉన్న రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరి మించి ఒకరు కుట్రలు, కుతంత్రాలతో, లౌక్యంతో రాజ్యపాలన సాగింది.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కాళోజి కథల్లో ఏమి కనిపిస్తుంది ?
జవాబు:
కాళోజీ కథలో స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన, స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రశ్న 2.
తెలంగాణలో 1940 నాటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది ?
జవాబు:
తెలంగాణలో 1940 నాడు రాజకీయ వ్యవస్థ శైశవ దశలో ఉంది. ఒకరిని మించి ఒకరు కుట్రలు కుతంత్రాలతో లౌక్యంతో రాజ్యపాలన సాగింది.

ప్రశ్న 3.
‘ఫేస్ పౌడర్’ కథలో విశిష్టత ఏది ?
జవాబు:
`ఫేస్ పౌడర్ కథలో అలంకరణ పట్ల మోజును, నవ్వు తెప్పించే విధంగా కాళోజీ చెప్పాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson కాళోజి

ప్రశ్న 4.
కాళోజి ఎట్లా రాణించాడు ?
జవాబు:
కాళోజీ కవిగా, ఉద్యమకారునిగా, మరియు కథకునిగా, రాణించాడు.

ప్రశ్న 5.
కాళోజీ కథల్లో చెప్పిన సంగతులేవి ?
జవాబు:
కాళోజీ కథల్లో కులమతాల పేరిట మనుష్యుల్ని హీనంగా చూడటం, అవమానించడం, ఎంత దారుణమో చెప్పాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

తెలంగాణలో కవులే లేరనే నిందా వ్యాఖ్యలకు
“గోలకొండ కవుల సంచిక” ద్వారా సమాధానమిచ్చినవాడు.
తన కృషి సమాజపరంగా సాగించిన ఉద్యమశీలి.
సాహిత్య, సాంస్కృతిక సామాజిక, రాజకీయ రంగాల్లో
బహుముఖ ప్రతిభ చాటిన ప్రజ్ఞాశాలి. తెలంగాణ వైతాళికుడు
సురవరం ప్రతాపరెడ్డి. ఆయన జీవితం ఎట్లా స్ఫూర్తిదాయకమో
తెలుసుకుందాం.
TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
సురవరం ప్రతాపరెడ్డిగార్ని గూర్చి మల్లంపల్లి సోమశేఖర శర్మగారు చేసిన పరిచయం ఎటువంటిది ?
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి పేరు వినగానే, ఒక గొప్ప మూర్తి మన కంటి ఎదుట దర్శనమిస్తుంది. బహుముఖ ప్రతిభకు, ప్రతాపరెడ్డి నిలువెత్తు ఉదాహరణం. సురవరం ప్రతాపరెడ్డి గారు మేధా సంపన్నుడు. సాహిత్య రంగంలో రెడ్డి గారి ప్రతిభకూ, ప్రజ్ఞకూ స్తాటిలేదు.

రెడ్డిగారు విమర్శకులలో గొప్ప విమర్శకుడు. కవులలో కవి. పండితులలో పండితుడు. రాజకీయవేత్తలలో గొప్ప రాజకీయవేత్త. పత్రికా రచయితలలో పత్రికా రచయిత. నాటక కర్తలలో నాటక కర్త. పరిశోధకులలో గొప్ప పరిశోధకుడు. దేశాభిమానులలో పెద్ద దేశాభిమాని, సహృదయులలో రెడ్డిగారు గొప్ప సహృదయులు.

ప్రతాపరెడ్డిగారి వంటి స్నేహితుణ్ణి, పండితుణ్ణి, రసజ్ఞుడిని చాలా అరుదుగా చూస్తాం. రెడ్డిగారు ఇంతటి ప్రజ్ఞా పాండిత్యములు కలవాడని, సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మగారు వ్రాశారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 2.
సురవరం ప్రతాపరెడ్డిగారి ప్రతిభా పాండిత్యాలను వెల్లడించే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో జరిగిన సభా విశేషాలు రాయండి.
జవాబు:
ఒకసారి హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషా నిలయంలో సాహిత్య సభ జరిగింది. ఆ రోజు నాచన సోమన రాసిన ఉత్తర హరివంశముపై విశ్వనాథ సత్యనారాయణగారు ప్రసంగం చేయాలి. ఆ సభకు అధ్యక్షుడిగా శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు కూర్చున్నారు.

సభ ప్రారంభం కాగానే, ప్రతాపరెడ్డిగారు ధీరగంభీరంగా తొలిపలుకులు మాట్లాడారు. క్రమంగా మాటల చినుకులు మహావర్షంగా మారాయి. దాదాపు గంటసేపు రెడ్డిగారు మాట్లాడిన ఆ ఉపన్యాసం, సభ్యులను కట్టిపడేసింది.

సోమన కవిత్వంలోని కొత్తకోణాలు సభ్యులకు పరిచితమవుతున్నాయి.. తరువాత విశ్వనాథ సత్యనారాయణగారు లేచి, అధ్యక్షులు ప్రతాపరెడ్డి గారు మాట్లాడిన తర్వాత, చెప్పడానికి తనకు ఇంకేమీ మిగుల లేదని, హరివంశంలోని కొన్ని పద్యాలు మాత్రం చదివి, వ్యాఖ్యానిస్తానని అన్నారట.

విశ్వనాథ వంటి మహాకవి, పండిత విమర్శకుడినే ఆ విధంగా ప్రతాపరెడ్డిగారి ఉపన్యాసం, ఆనాడు నిశ్చేష్టుడిని చేసింది. ఈ సంఘటన ప్రతాపరెడ్డిగారి ఉపన్యాస శక్తినీ, విమర్శనాశక్తినీ వెల్లడిస్తుంది.

ప్రశ్న 3.
సురవరం ప్రతాపరెడ్డిగారి బాల్యము – విద్యాభ్యాసము గూర్చి రాయండి.
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి గారు 1896లో మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల సంస్థాన రాజధానియైన “బోరవిల్లి” లో జన్మించారు. ఈయన మొదటి పేరు “పాపిరెడ్డి”. పాపిరెడ్డి గురువు, చండశాసనుడు. దానితో పాపిరెడ్డికి చదువుపై విముఖత పెరిగింది. బడిమానేసి, గోలీలాడుకొనేవాడు.

ఈ విషయం ప్రతాపరెడ్డి చిన్నాన్నకు తెలిసి, కచ్చితమైన దినచర్యను అమలు చేశాడు. దానితో ప్రతాపరెడ్డి జీవితం, మలుపు తిరిగింది. ప్రతాపరెడ్డి తొమ్మిదో తరగతి చదివేటప్పుడు, తెలుగులో కవియై కీర్తి సంపాదించాలని నిశ్చయించాడు. తన సంకల్పాన్ని అమలుచేశాడు. స్వయంకృషి, సాధన సంకల్పాన్ని నెరవేరుస్తాయి.

ప్రతాపరెడ్డి, చిలకమర్తి, వీరేశలింగం వంటి వారి రచనలు సంపాదించి చదివాడు. చేమకూర వెంకటకవి విజయ విలాసాన్నీ, ఇతర ప్రబంధాలనూ, తెలుగు నిఘంటువు సాయంతో చదివాడు. కర్నూలు వెల్లాల శంకరశాస్త్రి దగ్గర, సంస్కృత సాహిత్యం చదివాడు. బి.ఏ లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ద్వితీయ భాషగా సంస్కృతం చదవాలనుకున్నాడు. అందుకు వేదం వేంకటరామశాస్త్రి గారితో సిఫారసు కూడా చేయించాడు.

కాని సంస్కృతంలో ప్రతాపరెడ్డికి గల పరిచయాన్ని గూర్చి కాలేజీవారు పరీక్షించారు. ప్రతాపరెడ్డి భారత శ్లోకాన్ని పదవిభాగంతో సహా చెప్పి, కాలేజీ వారిచే మెప్పు పొందాడు.. సంస్కృతం వేదం వారి వద్ద చదవడం కోసం రెడ్డిగారు మాంసాహారాన్ని విడిచిపెట్టాడు. ప్రతాపరెడ్డి గారు పుస్తకాలు కొన్ని, విమర్శనాత్మకంగా చదివేవారు.

ప్రశ్న 4.
ప్రతాపరెడ్డిగార్కి గోల్కొండ పత్రికతో గల సంబంధాన్ని రాయండి.
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి గారికి, మద్రాసులో చదివే రోజులలోనే పత్రిక పెట్టాలని కోరిక కలిగింది. జాతీయోద్యమ ప్రభావంతో పత్రికకు ‘దేశబంధు’ అని పేరు పెట్టాలనుకున్నారు. చివరకు రెడ్డిగారు హైదరాబాదులో ఉన్నప్పుడు పత్రికను ప్రారంభించారు. దేశబంధు పేరుకు నిజాం ప్రభుత్వం అంగీకరించదని, ‘గోల్కొండ’ అనే పేరు పత్రికకు పెట్టారు.

10 మే, 1926న గోల్కొండ పత్రిక ప్రారంభమయ్యింది. గోల్కొండ పత్రిక, తెలుగు పత్రికా రంగంలో సంచలనాలు సృష్టించింది. ప్రతాపరెడ్డి పేరు వినగానే, గోల్కొండ పత్రిక గుర్తుకు వస్తుంది. పత్రిక ప్రారంభమయ్యింది కాని, తగిన ఆర్థిక వనరులు లేనందున, నడపడం కష్టమయ్యింది. అయినా ప్రతాపరెడ్డి గారు అధైర్యపడలేదు.

ప్రతాపరెడ్డి తానే రచయితగా, సంపాదకుడిగా, ప్రూఫ్ రీడర్ గా, గుమాస్తాగా అనేక అవతారాలు ఎత్తాడు. ఆటంకాలను దాటి, లక్ష్యమును చేరుకున్నాడు. గోల్కొండ పత్రిక రెండు లక్ష్యాలతో నడచింది.

1) ఆంధ్రభాషా సేవ

2) జాతి, మత, కులవివక్షత లేకుండా ఆంధ్రులలో అన్ని శాఖలవారి సత్వరాభివృద్ధికీ పాటు పడడం. నాటి నిజాం దుష్కృత్యాల గురించి, సంపాదకీయాలు సాగేవి. ప్రతాపరెడ్డి రచయితలను కవ్వించి, వారి ప్రతిభను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఎందరో రచయితలకు ప్రోత్సాహాన్ని ఇచ్చి, నిష్పక్షపాతంగా పత్రికను నడిపారు.

ఆ రోజుల్లో నిజాంకు వ్యతిరేకంగా వార్త రాసిన షోయబుల్లాఖాన్న, నడివీధిలో నరికి చంపారు. అటువంటి రోజుల్లో ప్రతాపరెడ్డి గారు సాహసంతో నిజాం దుర్మార్గాలను నిరసిస్తూ పత్రికలో సంపాదకీయాలు రాశారు. ఈయన 23 సంవత్సరాలు గోల్కొండ పత్రికలో సంపాదకుడిగా తెలంగాణకు సేవలందించాడు. ప్రతాపరెడ్డి ప్రాతఃస్మరణీయుడు.

ప్రశ్న 5.
ప్రతాపరెడ్డిగార్కి వివిధ సంస్థలతో గల అనుబంధం గురించి తెలపండి.
జవాబు:
ప్రతాపరెడ్డి గారిని గురించి, దాశరథి రాస్తూ “అతడు లేని తెలంగాణ, అలంకరణలేని జాణ” అని రాశాడు. ప్రతాపరెడ్డిగార్కి అనేక సంస్థలతో అనుబంధముంది. తెలంగాణలో ఆంధ్రమహాసభ, పరాయి భాషా దౌర్జన్య ప్రభంజనానికి అల్లాడుతున్న తెలుగు దీపాన్ని ఆరిపోకుండా చూసుకోడానికి ఆవిర్భవించింది. ఆ ఆంధ్రమహాసభ మొదటి సమావేశం, మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. ఆ సభకు ప్రతాపరెడ్డిగారే అధ్యక్షత వహించారు.

విజ్ఞానవర్ధినీ పరిషత్తు, ఆంధ్ర సారస్వత పరిషత్తులకు ప్రతాపరెడ్డి గారు వ్యవస్థాపక సభ్యులు. ఆ తర్వాత, ఆ సంస్థలకు వీరే అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రతాపరెడ్డిగార్కి కులమతాల పట్టింపులు లేవు. అందుకే రెడ్డిగారు, యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, గౌడ సంఘములకు కూడా అధ్యక్షులుగా ఉన్నారు.

ప్రతాపరెడ్డి గారు హైదరాబాదు ఆయుర్వేద సంఘం అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. రెడ్డిగార్కి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, లక్ష్మణరాయ పరిశోధకమండలి, బాలసరస్వతీ గ్రంథాలయం, వేమన గ్రంథాలయం, మొదలయిన సంస్థలతో సన్నిహిత సంబంధం ఉండేది. ఈ విధంగా ఆనాడు తెలంగాణలో ఉన్న పెక్కు సాహిత్య సాంస్కృతిక సంస్థలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీరికి అనుబంధముంది.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 6.
సురవరం ప్రతాపరెడ్డిగారి సాహిత్య కృషిని వివరించండి.
జవాబు:
ప్రతాపరెడ్డిగారు, ఎన్నో సాహిత్య ప్రక్రియలను సమర్థంగా నిర్వహించారు. కవిత్వము, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవితచరిత్ర వంటి ప్రక్రియల్లో వీరు రచనలు చేశారు. ఎన్నో గ్రంథాలను పరిష్కరించారు. సాహిత్యాన్ని సేకరించారు. పరిశోధనాత్మక గ్రంథాలను ప్రకటించారు.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, రామాయణ విశేషములు అన్న వీరి రచనలు, పరిశోధకులుగా ప్రతాపరెడ్డిగార్కి సాటిలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. రాజుల చరిత్రయే చరిత్రగా చెలామణి అయ్యే రోజుల్లో, ప్రజల సాంఘిక చరిత్రయే అసలైన చరిత్రగా రెడ్డిగారు ఆవిష్కరింపజేసారు. చరిత్ర రచనకు రెడ్డిగారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అన్న గ్రంథము ఒజ్జబంతి అయ్యింది. అందుకే ఈ గ్రంథము కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథంగా చరిత్ర సృష్టించింది.

వీరి హిందువుల పండుగలు అన్న గ్రంథము, హిందువుల పండుగల వెనుకనున్న నేపథ్యాలను, ఆచార సంప్రదాయాలను తెలిపే ప్రామాణిక గ్రంథము. వీరు, హిందువుల పండుగల విశేషాలెన్నింటినో పురాణ శాస్త్రప్రమాణంగా తెలిపారు. ప్రతాపరెడ్డి గారి ఈ హిందువుల పండుగలు అన్న గ్రంథానికి విపులంగా పీఠిక వ్రాయడానికి తనకు శక్తి, వ్యవధి కూడా చాలదని రాధాకృష్ణన్ గారు రాశారు. దానిని బట్టి, ఈ గ్రంథ ప్రత్యేకత ఏమిటో మనకు అర్థమౌతుంది.

సాహిత్యము ఆనందాన్నీ, ఉపదేశాన్నీ కూడా ఇవ్వాలి.

ప్రశ్న 7.
సురవరం ప్రతాపరెడ్డిగారి వ్యక్తిత్వాన్ని గూర్చి రాయండి.
జవాబు:
నిరాడంబరత, నిర్భీతి, నిజాయితి, నిస్వార్థత అన్నవి ప్రతాపరెడ్డి జీవ లక్షణాలు. వేషభాషల్లో ఈయన అచ్చమైన తెలుగు వాడిగా జీవించాడు. ఈయన తెలుగు అంకెలనే వాడేవాడు. ఈయన ‘స్వవేష భాషా దురభిమాని’ అని పేరు పొందాడు. ఈయన ఎవరినీ పొగిడేవాడు కాడు. తనను ఎవరైనా పొగిడితే, అంగీకరించేవాడు కాదు..

ప్రతాపరెడ్డి గారిలో ధర్మావేశం పాలు ఎక్కువ. ఆత్మీయతకే తప్ప, అహంకారానికి చోటులేని హృదయం ఈయనది. మంచి ఎక్కడున్నా, ఈయన గ్రహించేవాడు. ఆచార్య బిరుదు రాజు రామరాజు గారిని మొదట పరిశోధనవైపు మళ్ళించింది. సురవరం వారే ఈ విధంగా ఈయన ఎన్నో రచనలకు ప్రేరకుడు, కారకుడు.

ఈయనకు కులమతాల పట్టింపులేదు. జోగిపేటలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో, భాగ్యరెడ్డి వర్మకు సభలో పాల్గొనే అవకాశాన్ని రెడ్డిగారే కల్పించారు. అంబేద్కర్ కన్న ముందే, దళితోద్యమ స్ఫూర్తిని రగిల్చిన వాడు ‘భాగ్యరెడ్డివర్మ’. ప్రతాపరెడ్డిగారి ఆలోచనా సరళి విభిన్నంగా ఉంటుంది. శ్రీకృష్ణునికి మీసాలు ఉండాలని ప్రశ్నించి మీసాల కృష్ణుని చిత్రాన్ని తన గోల్కొండ పత్రికా కార్యాలయంలో వీరు పెట్టుకున్నాడు. వనపర్తి, ఆత్మకూరు, గద్వాల, గోపాలపేట, కొల్లాపూర్ సంస్థానాధీశులతో తనకు గల పరిచయాన్ని వీరు కేవలం సాహిత్య సమారాధనకే వినియోగించారు.

ప్రతాపరెడ్డి గారు ప్రజల మనిషి. 1952లో వనపర్తి శానస సభ్యుడిగా ఈయన ఎన్నికయ్యారు. తెలంగాణ సమాజాన్ని వీరు అన్ని కోణాల్లో ప్రభావితం చేశారు. ఈయన జీవనం పవిత్రం.
ప్రతాపరెడ్డి గారు రైతు, రాజబంధువు, కావ్య వేద నిష్ణాతుడు. స్వతంత్రుడు, శాసనకర్త, పురుషార్థజీవి, సంస్కృతీ పరిరక్షకుడు.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

అ) కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

మద్రాసులో చదివేరోజుల్లోనే పత్రికొకటి పెట్టాలనే ఆలోచన కలిగింది ప్రతాపరెడ్డికి, జాతీయోద్యమంతో ప్రభావితుడై తన పత్రికకకు “దేశబంధు” అనే పేరు పెట్టాలనుకున్నాడు కూడా. మంచి ఆలోచనలెప్పుడూ మట్టిలో కలిసిపోవు. హైద్రాబాదులో ఉన్నప్పుడు ఈ ఆలోచనను ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. “దేశబంధు” పేరుకు నిజాం ప్రభుత్వం అనుమతినిచ్చే పరిస్థితి లేదు. అందుకే “గోల్కొండ” పేరును ఖరారు చేసుకున్నాడు. అనుమతి దొరికింది. కార్యసాధనకు సమయస్ఫూర్తి కావాలి. 10 మే 1926 న గోల్కొండ పత్రిక పురుడు బోసుకుంది. నాటి తెలుగు పత్రికారంగంలో సంచలనాలకు తెరలేపింది. ప్రతాపరెడ్డి పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక. ఇది ప్రతాపరెడ్డి అక్షరాల కోట.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ప్రతాపరెడ్డి తన పత్రికకు ‘దేశబంధు’ అనే పేరు ఎందుకు పెట్టాలనుకున్నాడు .
జవాబు:
ప్రతాపరెడ్డి, జాతీయోద్యమంతో ప్రభావితుడయ్యాడు. అందుకే ఆయన తన పత్రికకు ‘దేశబంధు’ అనే పేరు పెడదామనుకున్నాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 2.
గోల్కొండ పత్రిక ప్రారంభించిన తేదీ ఏది ?
జవాబు:
గోల్కొండ పత్రికను ప్రారంభించిన తేదీ 10 మే, 1926.

ప్రశ్న 3.
ప్రతాపరెడ్డి పేరు వినగానే, గుర్తుకు వచ్చే విషయం ఏది ?
జవాబు:
ప్రతాపరెడ్డి పేరు వినగానే “గోల్కొండ” పత్రిక గుర్తుకు వస్తుంది.

ప్రశ్న 4.
గోల్కొండ పత్రిక ప్రత్యేకత ఏది?
జవాబు:
గోల్కొండ పత్రిక నాటి తెలుగు పత్రికా రంగంలో సంచలనాలకు తెరలేపింది. అది ప్రతాపరెడ్డి అక్షరాలకోట.

ప్రశ్న 5.
కార్యసాధనకు కావలసినదేది ?
జవాబు:
కార్యసాధనకు కావలసినది “సమయస్ఫూర్తి”.

2. కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

“ఎన్నో సాహిత్య ప్రక్రియలను సమర్థంగా నిర్వహించాడు ప్రతాపరెడ్డి. కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవిత చరిత్ర వంటి ప్రక్రియల్లో రచనలు చేశాడు. గ్రంథ పరిష్కరణలు, జానపద సాహిత్య సేకరణ చేశాడు. పరిశోధనాత్మక గ్రంథాలు ప్రకటించాడు.

పరిశోధకుడుగా ప్రతాపరెడ్డికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టినవి “ఆంధ్రుల సాంఘిక చరిత్ర”, “హిందువుల పండుగలు”, “రామాయణ విశేషములు”. రాజుల చరిత్రయే, చరిత్రగా చెలామణి అయ్యేకాలంలో ప్రజల సాంఘిక చరిత్రే అసలైన చరిత్రగా ఆవిష్కరింపజేశాడు ప్రతాపరెడ్డి. చరిత్ర రచనకు ఈయన గ్రంథం ఒజ్జబంతి అయ్యింది. అందుకే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథంగా చరిత్ర సృష్టించినదీ గ్రంథం.

హిందువుల పండుగల వెనుకనున్న నేపథ్యాలు, ఆచార సంప్రదాయాలు తెలిపే ప్రామాణిక గ్రంథం ‘హిందువుల పండుగలు’.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
పరిశోధకుడిగా సాటిలేని కీర్తిని ప్రతాపరెడ్డిగార్కి తెచ్చిన గ్రంథం ఏది ?
జవాబు:
పరిశోధకుడిగా ప్రతాపరెడ్డి గార్కి సాటిలేని కీర్తిని తెచ్చిన గ్రంథం “ఆంధ్రుల సాంఘిక చరిత్ర”.

ప్రశ్న 2.
చరిత్ర రచనలో ప్రతాపరెడ్డి గారు అనుసరించిన నూతన మార్గం ఏది ?
జవాబు:
రాజుల చరిత్రయే చరిత్రగా, ఆనాడు చెలామణి అయ్యేది. ఆ పరిస్థితులలో ప్రజల సాంఘిక చరిత్రే, అసలైన చరిత్రగా రెడ్డిగారు ఆవిష్కరింపచేశారు.

ప్రశ్న 3.
ప్రతాపరెడ్డి గారు ఆదరించిన సాహిత్య ప్రక్రియలను పేర్కొనండి.
జవాబు:
ప్రతాపరెడ్డి గారు కవిత్వము, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవిత చరిత్ర వంటి సాహిత్య ప్రక్రియలను ఆదరించారు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson సురవరం ప్రతాపరెడ్డి

ప్రశ్న 4.
‘హిందువులు పండుగలు’ అన్న రెడ్డిగారి గ్రంథంలో గల విశేషాలేవి ?
జవాబు:
”హిందువులు పండుగలు’ అనే గ్రంథంలో రెడ్డిగారు, హిందువుల పండుగల వెనుక ఉన్న నేపథ్యాలనూ, ఆచార సంప్రదాయాలనూ వివరించారు.

ప్రశ్న 5.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథం ఏది ?
జవాబు:
ప్రతాపరెడ్డి గారి “ఆంధ్రుల సాంఘిక చరిత్ర” అన్న గ్రంథము, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథము.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

Telangana SCERT 9th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం 1st Lesson కుంరం భీం Questions and Answers.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

‘జల్, జంగల్, జమీన్ (నీరు అడవి భూమి)
మనది…… అనే నినాదంతో గోండులను, కోయలను,
చెంచులను సంఘటితపరచి పోరుబాటలో నడిపించిన
విప్లవ వీరకిశోరం కుంరం భీం. ‘మా గూడెంలో
మా రాజ్యం’ అనే నినాదంతో గిరిజనులందరిని
ఏకంచేసి ప్రభుత్వంపై సమరం సాగించిన
పోరాటయోధుడు కుంరం భీం.
TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం 1

PAPER – I : వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన) (మార్కులు: 6)

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
బాల్యంలో కుంరం భీం, మనసుపై చెరగని ముద్రవేసిన సంఘటనను గూర్చి తెలపండి.
జవాబు:
కుంరం భీం ఒకసారి తన మిత్రులు జంగు, కొంతల్, మాదు, పైకులతో అడవికి వెళ్ళాడు. వారితో మేకపిల్లలు ఉన్నాయి. పైకు నారేపచెట్టు ఎక్కి, సన్న సన్న కొమ్మల్ని నరికి మేకలకు వేస్తున్నాడు. ఇంతలో జంగ్లాత్ జవాన్లు, ఒక సుంకరి వచ్చి చెట్టు కొమ్మలు నరుకుతున్న పైకును పట్టుకున్నారు. వారి వెంట అమీనాబ్ వచ్చి, పిల్లలందరినీ బంగ్లా దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు.

భీం తండ్రి, కుంరం చిన్ను, ఆ గూడెం పెద్ద. అమీనాబ్ పిల్లలు చెట్లు నరికినందుకు చిన్నును మందలించాడు. కొమ్మ నరికిన పిల్లవాడి వేళ్ళు నరకడమే తగిన శిక్ష అంటూ, ఎంత మంది బతిమాలినా వినకుండా భీం స్నేహితుడు పైకు వేళ్ళు నరికించాడు. పైకు అరుపులతో అడవి మారు మ్రోగింది. పైకు స్పృహతప్పి పడిపోయాడు.

ఈ సంఘటన భీంను పట్టి కుదిపింది. ఆవేశంలో వదినె దగ్గరకు వెళ్ళి “ఈ గాలి, నీరు, ఆకాశం మనవైనప్పుడు, ఈ భూమి, అడవి మనవి ఎందుకు కావు ? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నను “మీ నాయినను అడుగు” అని వదినె భీంకు చెప్పింది.

పన్నుల రూపంలో తమ కష్టాన్ని అంతా గుంజుకుంటే ఆకలితో చచ్చిపోవాల్సిందేనా ? అని, ఆలోచిస్తూ, భీం ఆ రోజు ఆకలితో పడుకున్నాడు. ఈ సంఘటన భీం మనస్సుపై చెరగని ముద్రవేసింది. గిరిజనుల కష్టాన్ని ఇతరులు అన్యాయంగా తీసుకుపోతున్నారని భీం తెలుసుకున్నాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 2.
కుంఠం భీంపై, విటోబా ప్రభావం ఎటువంటిది ?
జవాబు:
సుర్దాపూర్ గొడవలో కుంరం భీం చేతిలో సిద్ధిక్ చచ్చిపోయాడు. భీం తన మిత్రుడు కొండల్తో కలిసి, ‘భారీలొద్ది’లో ఉన్న పెద్ద ముఖాసీని కలిసి, సర్కారుపై తాను తిరుగబడతాననీ, తనకు మద్దత్తు ఇమ్మనీ అడిగాడు. ముఖాసీ హింసా పద్ధతులు వద్దని సలహా చెప్పాడు.

దానితో భీం రైలెక్కి ఎలాగో చాందా పట్నానికి చేరాడు. రైల్వేస్టేషన్ బయట కూర్చున్న భీంకు, తన సామానులు మోయలేక బాధపడుతున్న ఒక ప్రయాణికుడు కనిపించాడు. ఆయనే విటోబా. భీం విటోబా సరకులను ఇంటికి చేర్చాడు. విటోబా ప్రింటింగ్ ప్రెస్సు యజమాని. నిజాం సర్కారుకూ, తెల్లదొరలకూ వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళతో విటోబాకు దగ్గర సంబంధాలున్నాయి. విటోబా రహస్యంగా ఒక పత్రికను నడిపేవాడు. రహస్య పార్టీ, రహస్య పత్రికల గురించి తెలుసుకున్న భీంకు, విటోబాపై మంచి అభిప్రాయం ఏర్పడింది. భీం, విటోబా దగ్గర ఒక సంవత్సరం ఉన్నాడు. అక్కడే

భీం తెలుగు, ఇంగ్లీషు, హిందీ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. భీంకు విటోబా రాజకీయాల్నీ, సమాజ పరిణామాల్ని తెలియజేశాడు. సంఘంలో మార్పురావాలంటే త్యాగం చేయాలన్నాడు. ఒక రోజు రాత్రి పోలీసులు వచ్చి భీంను కొట్టి, విటోబాను అరెస్టు చేశారు. భీం తిరిగి రైల్వేస్టేషన్కు చేరాడు. అక్కడే భీంకు, మంచిర్యాల నుండి వచ్చిన ఒక తెలుగువాడితో పరిచయం అయ్యింది. వారిద్దరూ కలసి, ‘చాయ్పత్తా’ అని పిలువబడే అస్సాంకు వెళ్ళారు.

ప్రశ్న 3.
కుంరం భీంకు, అస్సాం తేయాకు తోటల్లో కలిగిన అనుభవాలను చెప్పండి.
జవాబు:
కుంరం భీం, అస్సాంలో తేయాకు తోటల్లో అడుగుపెట్టాడు. అక్కడ అనేక అనుభవాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. ఎక్కడైనా కష్టజీవులకు బాధలు తప్పవనీ, కష్టపడే వానికి కడుపు నిండటం లేదనీ, భీం తెలుసుకున్నాడు. రోజు కూలీ పద్ధతిన, భీం తేయాకు తోటల్లో కష్టపడి పనిచేశాడు. అక్కడ చెమట తుడుచుకోడానికి లేచిన కార్మికులను, మేస్త్రీలు కొరడాలతో కొట్టేవారు. వారి సంపాదన వారి మందులకే సరిపోయేది కాదు. తోటల యజమానులకు కొంచెం కూడా దయాగుణం ఉండేది కాదు.

ఇవన్నీ చూస్తున్న భీంకు అసంతృప్తి రాజుకుంది. కుంరం భీం అస్సాంలో నాల్గు సంవత్సరాలున్నాడు. అక్కడే భీంకు మన్యం నుండి వచ్చిన ఒక తెలుగు వ్యక్తితో పరిచయం అయ్యింది. అతడి ద్వారా భీం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును గూర్చి తెలుసుకున్నాడు. మన్య ప్రాంత ప్రజల్ని సీతారామరాజు సమీకరించిన విధానాన్నీ, రామరాజు జరిపిన పోరాట రీతుల్ని, భీం అర్థం చేసుకున్నాడు. యువకులకు యుద్ధరీతులను రామరాజు ఎలా నేర్పాడో తెలుసుకున్నాడు.

అడవిపై తమకు తప్ప ఇతరులు ఎవరికీ అధికారం లేదని గిరిజనులతో చెప్పించిన రామరాజు యొక్క గొప్పతనాన్ని భీం అర్థం చేసుకున్నాడు. యుద్ధ సమయంలో సమాచారాన్ని చేరవేసే పద్ధతిని భీం గ్రహించాడు. యుద్ధ మెళుకువలను భీం గ్రహించాడు. క్రమంగా భీం ఎక్కుపెట్టిన బాణంలా తయారయ్యాడు.

ఈ సమయంలో తేయాకు తోటల్లో అన్యాయంగా ఇద్దరు కార్మికుల్ని కొడుతున్న మేస్త్రీతో, భీం తగవుపెట్టుకున్నాడు. మేస్త్రీలు కొరడా. భీం పైకి ఎత్తారు. భీం వారిని చితక కొట్టాడు. తోటల యజమాని పోలీసులతో చెప్పి భీంను జైల్లో వేయించాడు. ‘భీం’ జైలు నుండి తప్పించుకొని స్వగ్రామం వెళ్ళాడు.

ప్రశ్న 4.
కుంరం భీం, సర్కార్ (నిజాం) సైన్యంతో యుద్ధం చేసి అమరుడైన విధము తెలపండి.
(లేదా)
కుంరం భీం నాయకత్వంలో గోండు రాజ్య స్థాపనానికి గోండులు చేసిన యుద్ధ పరిణామాల్ని తెలుపండి.
జవాబు:
కుంరం భీం పినతండ్రి “కుర్దు” నాయకత్వంలో, బాబేఝరి ప్రాంతంలో గిరిజనులూ, గోండులూ అడవిని కొట్టి, వ్యవసాయం చేశారు. అది తెలిసి జంగ్లాత్ వాళ్ళు దాడిచేసి గిరిజన గూడేలను ధ్వంసం చేశారు. కుంరం భీం, బాబేఝరి వైపు వచ్చి “టొయికన్” గూడెంలో దిగాడు. భీం భార్య పైకూబాయి వకీలును పెట్టుకోమని భీంకి సలహా చెప్పింది. భీం వకీలును కలిశాడు. వకీలు నిజాంకు అసలు విషయం చెప్పమనీ, నిజాం అతడి ఇష్టం వచ్చినట్లు చేస్తాడనీ చెప్పాడు.

‘భీం’ పన్నెండు గూడేల ప్రజలను పట్నాపూర్ రమ్మని పిలిచాడు. గిరిజనులను భూములను దున్నండని, పంటలు పండించండని నిజాం మనుష్యులను తరిమికొడదామనీ చెప్పాడు. గిరిజనులు కూడా తాము ఆకలితో చావడం కన్న, పోరాటం చేసి చద్దాం అన్నారు. గోండులు భీం నాయకత్వాన్ని సమర్థించారు.

గోండులు అడవిని నరికి, పంటలు పండించారు. జంగ్లాత్ వాళ్ళు ‘బాబేఝరి’పై విరుచుకుపడ్డారు. ఒక జాగీర్దార్ తుపాకీపేల్చాడు. భీంకు అది భుజంపై తగిలింది. తాశీల్దార్ గోండులను అరెస్టు చెయ్యమని డి.ఎస్.పి. కి చెప్పాడు. కుంరం భీం, నిజాంను కలవాలని ప్రయత్నించాడు. కాని అతడికి నిజాం దర్శనం కాలేదు.

భీం, జోడెన్ ఘాట్ వెళ్ళి, గిరిజనుల్ని కలిసి, పరిస్థితుల్ని వారికి చెప్పాడు. “భూమి లేక చచ్చే కంటే, పోరాడి చద్దాం”. అన్నారు గిరిజనులు. గోండు రాజ్యస్థాపన లక్ష్యంగా, జోడెన్ ఘాట్ కేంద్రంగా, భీం నాయకత్వంలో నిజాంపై పోరాటానికి, గోండులు సిద్దమయ్యారు.

నిజాం సర్కారు ఆజ్ఞలను గోండులు వినలేదు. భీం నాయకత్వాన్ని ఇష్టపడ్డ ఇతర గ్రామాలవారు కూడా; గోండు రాజ్యస్థాపనకు భీంకు మద్దతిచ్చారు. తుపాకులు తయారయ్యాయి. గోండులు కుంరం భీంకు జై అన్నారు. నైజాం సైన్యాన్ని భీం బలగం, తరిమి కొట్టింది.

నైజాం సర్కారు సబ్కలెక్టర్, భీంను కలిసి, భీం కూ, అతని బంధువులకూ భూమి పట్టాలిస్తామన్నాడు. పోరు ఆపమని కోరాడు. చివరకు పన్నెండు గ్రామాల వారికీ పట్టాలిస్తానన్నా, భీం అంగీకరించలేదు. వేరుగా గోండు రాజ్యం కావాలన్నాడు. యుద్ధం ఏడు నెలలు సాగింది. నిజాం సైన్యం 10 రోజులు యుద్ధం చేసినా, కొండ ఎక్కలేకపోయింది. ఇంతలో కర్దూపటేల్ భీంను మోసం చేశాడు. సర్కారు సేనతో కలిసి, కొండ మీదికి దారి చూపాడు. నైజాం సైన్యం దొంగతనంగా వచ్చి, గోండు వీరుల్ని చంపింది. కుంరం భీంను కాల్చి చంపింది. ఈ విధంగా కుంరం భీం అమరుడయ్యాడు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 5.
గోండు నాయకుడు కుంరం భీంను గూర్చి రాయండి.
జవాబు:
ఆదిలాబాదు జిల్లా అడవుల్లోని యుద్ధ వీరులు గోండులు. వారిలో కుంరం భీం ప్రసిద్ధుడు. గూడెం పెద్ద చిన్ను కుమారుడు భీం. భీంకు సోము, బొజ్జు అనే అన్నలు ఉన్నారు. భీం చిన్నప్పుడు సంకెనపెల్లి గూడెంలో పెరిగాడు. భీం చిన్ననాటి నుండి సాహసుడు. నాయకలక్షణాలు కలవాడు. ఇతడి ఆలోచనలకు బలాన్ని ఇచ్చింది ఇతని వదినె కుకూబాయి.
ఒకసారి భీం మిత్రులతో అడవికి వెళ్ళాడు. చెట్టు కొమ్మలను నరికి మేకలకు వేశాడని, అమీనాబ్ ఇతని స్నేహితుడు పైకు వేళ్ళను నరికించాడు. ఆ సంఘటన భీం మనసుపై చెరగని ముద్రవేసింది. అక్కడి గాలి, ఆకాశం, నీరు తమదైనపుడు అక్కడ అడవి, భూమి తమవి ఎందుకు కావనీ, భీం వదినెను అడిగాడు.

భీం కుటుంబంతో సుర్దాపూర్ వెళ్ళి, అక్కడ అడవులు కొట్టి వ్యవసాయం చేశాడు. అక్కడ భూమి తనదన్న సిద్ధికు భీం కొట్టి చంపాడు. జంగ్లాతోళ్ళతో పోరు మంచిది కాదని, పెద్ద ముఖాసీ భీంకు సలహా చెప్పాడు. భీంకు చాందాలో విటోబాతో పరిచయం అయ్యింది. అక్కడ భీం తెలుగు, హిందీ, ఇంగ్లీషు చదవడం రాయడం నేర్చుకున్నాడు. విటోబా, నిజాంకు వ్యతిరేకంగా పత్రిక నడిపేవాడు. భీంకు రాజకీయాలను విటోబాయే తెలిపాడు.

భీం, అస్సాం తేయాకు తోటల్లో కూలీగా పనిచేశాడు. అక్కడే అల్లూరి సీతారామరాజు గిరిజనుల పక్షాన చేస్తున్న పోరాటం గురించి, యుద్ధరీతుల గురించి భీం తెలుసుకున్నాడు. తర్వాత “కాకన్ ఘాట్”లో అతడు అన్నలను కలిశాడు. దేవడం పెద్ద లచ్చుపటేల్, భీంకు సోంబాయితో పెళ్ళి చేయించాడు. పైకూబాయి కూడా భీం పట్ల ఆకర్షణతో అతణ్ణి పెళ్ళాడింది.

“బాబేఝరి” వద్ద భీం కుటుంబీకులు అడవిని కొట్టి వ్యవసాయం చేశారు. జంగ్లాత్ వాళ్ళు మన్నెంగూడేలను భస్మం చేశారు. భీం జనగామలో వకీలును కలిశాడు. భీం పన్నెండు గూడేల గిరిజనులను, పట్నాపూర్ పిలిచాడు. అక్కడ గిరిజనులు నైజాంతో పోరాటం చేసి చద్దామని నిశ్చయించారు. బాబేఝురి ప్రాంతంలో గిరిజనులు సర్కారు ఆజ్ఞలను లెక్కచేయలేదు. విషయం నైజాంకు చెప్పడానికి భీం ప్రయత్నించాడు. ఏడు నెలలు గిరిజనులకూ, నైజాం సైన్యానికి పోరాటం జరిగింది. ఒక గ్రామం పెద్ద కుట్రతో, నైజాం సైన్యం దొంగతనంగా వచ్చి గోండు వీరుల్నీ, భీంనూ కాల్చి చంపింది.

PAPER – II : పరిచిత గద్యాలు (మార్కులు : 5)

అ) కింది పేరాను చదువండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

కుంరం భీం బాల్యం నుండి తెలివైనవాడు, సాహసవంతుడు, నాయకత్వ లక్షణాలున్నవాడు. భీం చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి స్పందించేవాడు. ఆలోచించేవాడు. దేన్నీ ఊరికే వదిలిపెట్టేవాడు కాదు. ఈ లక్షణాలే తరువాత అతడిని గిరిజన వీరుడిని చేశాయి. అతని ఆలోచనలకు పురుడు పోసింది, అతని భావాలకు బలాన్ని ఇచ్చింది అతని వదినె కుకూబాయి. భీం చిన్నప్పుడు సంకెనపెల్లి గూడెంలో పెరిగాడు. అక్కడి చెట్టూ, చేమా, బోళ్ళు, బండలు, కొండలు, వాగులు ఒకటేమిటి సమస్త ప్రకృతి అతడిని తీర్చిదిద్దింది. ఆ రోజుల్లోనే ఒక రోజు భీం తన మిత్రులైన జంగు, కొంతల్, మాదు, పైకులతో కలిసి అడవికి వచ్చాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కుంరం భీం భావాలకు బలాన్ని ఇచ్చిన వారెవరు ?
జవాబు:
కుంరం భీం భావాలకు బలాన్ని ఇచ్చింది అతని వదినె ‘కుకూబాయి’.

ప్రశ్న 2.
కుంరం భీంను తీర్చిదిద్దినవారు ఎవరు ?
జవాబు:
కుంరం భీంను సంకెనపెల్లి గూడెంలోని చెట్లూ, చేమా, కొండలూ వంటి సమస్త ప్రకృతి తీర్చిదిద్దాయి.

ప్రశ్న 3.
కుంరం భీం మిత్రుల పేర్లు ఏమిటి ?
జవాబు:
కుంరం భీం మిత్రులు

  1. జంగు,
  2. కొంతల్,
  3. మాదు,
  4. పైకు.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 4.
కుంరం భీం వ్యక్తిత్వం ఎటువంటిది ?
జవాబు:
కుంరం భీం, బాల్యం నుండి తెలివిగలవాడు. నాయకత్వ లక్షణాలు గలవాడు. సాహసవంతుడు.

ప్రశ్న 5.
కుంరం భీం ఆలోచనలకు పురుడు పోసిన వదినె పేరు ఏమిటి ?
జవాబు:
కుంరం భీం ఆలోచనలకు పురుడు పోసిన వదినె పేరు “కుకూబాయి”.

ఆ) కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

దేవడం పెద్ద లచ్చుపటేల్. అతని దగ్గర భీం జీతానికి కుదిరాడు: అతని పంట పొలాల్లో మార్పు తెచ్చాడు. పత్తి, మిరప వంటి వ్యాపార పంటలను వేశాడు. మొత్తానికి భీం తెలివిపరుడని, వ్యవహారదక్షుడని అందరితో అనిపించుకున్నాడు. లచ్చుపటేల్ భూముల వ్యవహారాలను ముందు నుంచి చూసే అంబటిరావుకు, “సోంబాయి” అనే కూతురు ఉంది. ఆమెను భీంకిచ్చి పెండ్లి చేస్తే బాగుంటుందని లచ్చుపటేల్ నిశ్చయించాడు.

ఆ విధంగా కుంరం భీం, సోంబాయిల పెండ్లి దేవడంలో లచ్చుపటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజుల్లో కుంరం భీం వార్తల్లో వ్యక్తి అయినాడు. అతని పట్ల ఆకర్షణ పెంచుకున్న పైకూబాయి, అనే యువతి కోరి అతన్ని పెండ్లాడింది. భీం కాకన్ట్లో కాపురం పెట్టాడు.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
కుంరం భీం పెండ్లి ఎక్కడ, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ?
జవాబు:
కుంరం భీం పెండ్లి దేవడంలో లచ్చుపటేల్ ఆధ్వర్యంలో జరిగింది.

ప్రశ్న 2.
కుంరం భీం ఎవరి దగ్గర పనిచేశాడు? ఆయన ఎవరు ?
జవాబు:
కుంరం భీం, లచ్చుపటేల్ దగ్గర జీతానికి కుదిరాడు. లచ్చుపటేల్ “దేవడం” గ్రామపెద్ద.

TS 9th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson కుంరం భీం

ప్రశ్న 3.
పెండ్లి అయిన తర్వాత భీం, ఎక్కడ మకాం పెట్టాడు ?
జవాబు:
పెండ్లి అయిన తర్వాత భీం “కాకనాట్”లో కాపురం పెట్టాడు.

ప్రశ్న 4.
భీం తెలివిపరుడని, వ్యవహారదక్షుడని ఎందుకు పేరు తెచ్చుకున్నాడు ?
జవాబు:
భీం, లచ్చుపటేల్ దగ్గర జీతానికి కుదిరి, ఆయన పంట పొలాల్లో పత్తి, మిరపలాంటి వ్యాపార పంటలు వేశాడు. `ఆ విధంగా తెలివిపరుడని భీం పేరు తెచ్చుకున్నాడు.

ప్రశ్న 5.
అంబటి రావు ఎవరు ?
జవాబు:
అంబటి రావు, లచ్చుపటేల్ భూముల వ్యవహారాలను చూసేవాడు. అంబటిరావు కూతురు సోం బాయిని భీం పెండ్లాడాడు.