Telangana TSBIE TS Inter 2nd Year Sanskrit Study Material 4th Lesson भिषजो भैषज्यम् Textbook Questions and Answers.
TS Inter 2nd Year Sanskrit Study Material 4th Lesson भिषजो भैषज्यम्
निबन्धप्रश्नौ (Essay Questions) (వ్యాసరూప సమాధాన ప్రశ్నలు)
पश्न 1.
वेंकटरावस्य भैषज्यं विवृणुत
(వెంకటరావు యొక్క వైద్యమును గురించి వివరించుము.)
(Explain the treatment of Venkata Rao.)
पश्न 2.
वेंकटरावः किमर्थं मूर्च्छितः अभवत् विवृणुत ।
(వెంకటరావు ఎందుకు మూర్ఛపోయాడు ?)
(Why did Venkata Rao become unconscious ? Explain.)
(अथवा)
पश्न 3.
‘भिषजो भैषज्यम्’ इति पाठ्यभागस्य सारांशं सक्षेपेण लिखत ।
(“భిషజో భైషజ్యమ్’ అనే పాఠ్యభాగము యొక్క సారాంశాన్ని సంక్షిప్తంగా రాయండి.)
उत्तर:
కవి పరిచయము : “भिषजो भैषज्यं” అను పాఠ్యభాగము “श्रीरामचंद्र लघुसंग्रहः” అను గ్రంథం నుండి గ్రహించబడినది. ఈ పాఠ్యభాగ రచయిత శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు. వేదాంత విశారద, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు, బహుశాస్త్రకోవిదులైన వీరు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని, రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
కథా పరిచయము : ఈ కథలో కుశాగ్రబుద్ధి, సర్వవిధ చికిత్సా విశారదుడైనప్పటికి ‘ఈ ప్రపంచం అంతా ధనమూలం’ అని భావించే స్వార్థపరుడైన వైద్యుని యొక్క స్వభావం చక్కగా చిత్రించబడింది. ఈ కథ ద్వారా కవి ఈ వైద్యునివలె ఎవ్వరూ ధనసంపాదన కోసం తన వృత్తి ధర్మం పట్ల నిరాదరణ ప్రదర్శించరాదని, ఆపదలయందు స్వపరభేదం విడచి అందరికీ యథాశక్తిగా సహాయం చేయాలనే సందేశాన్ని సమాజానికి అందిస్తున్నారు.
కథా సారాంశము : వెంకట్రావు ఒక సమర్థుడైన వైద్యుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఒక రోజు కొందరు పల్లెటూరి జనం ప్రమాదంలో గాయపడిన ఒక బాలుణ్ణి అతడి వద్దకు తీసికొని వచ్చి వైద్యం చేయమని అడిగారు. ఇది వైద్యం చేసే సమయం కాదని పలికి వెంకట్రావు వైద్యం చేయడానికి నిరాకరించాడు. కానీ ఆ గ్రామీణుల్లో ఒకడు, “అయ్యా మాకు మీ కాలనియమం తెలుసు. కాని ఇలాంటి కష్టసమయంలో మాయందు దయ చూపించాలి” అని సానునయంగా ప్రార్థించాడు. ఆ మాటలకు వెంకట్రావు హృదయం ఏమాత్రం చలించలేదు”. “ఓరీ మూర్ఖుల్లారా ! మీకు ఎప్పుడూ మీ సుఖమే ప్రధానం, వైద్యుడు కూడా మానవుడేనని, అతడికి కూడా విశ్రాంతి, సుఖం కావాలని మీలో ఒక్కడు కూడా ఆలోచించడు. వెంటనే వెళ్ళండి” అంటూ కోపంగా అరిచాడు.
अरे मूर्खाः ! सर्वदापि स्वसुखचिन्तैव युष्माकम् |
చేసేది లేక గ్రామీణులు వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. కాని అంతలోనే మరో యువకుడు ముందుకువచ్చి, “అయ్యా ఆకస్మికంగా వాహన ప్రమాదానికి గురై మూర్ఛ పోయిన ఈ బాలుడెవరో మాకు తెలియదు. ఈ బాలుడికి సహాయం చేయడం స్వసుఖం, స్వార్థపరత్వం అని నిందిస్తున్నారు” అన్నాడు. వైద్యుడు రెట్టించిన కోపంతో, “మూర్ఖుడా ! నీ కపటోపాయం ఎవరికి తెలియదు. గుర్తు తెలియని బాలుడని చెప్పి, ఉచితంగా వైద్యం చేయించుకోవాలని చూస్తున్నావు. వెంటనే వెళ్ళకపోతే భటులచే బయటకు గెంటిస్తా”నని కఠినంగా పలికాడు.
“అయ్యా ! మోసగించడం మా ఉద్దేశ్యంకాదు. ఎంతో కొంత సొమ్ము చెల్లించుకుంటాం” అని చెప్పినా వినకుండా పోలీసులకు ఫోను చేయడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో ఒక వృద్ధుడు, “ఈయనతో వృథాకలహమెందుకు ? బాలుడి పరిస్థితి క్షణక్షణం దిగజారిపోతుంది. వేరే వైద్యుని వద్దకు వెళదాము” అంటూ వారిని తీసికొని వెళ్ళిపోయాడు.
“क्षणे क्षणे किल परिक्षीयते बालस्य दशा | आगच्छत; अन्यत्र गमिष्यामः ”
వెంకట్రావు ఒక బీద కుటుంబంలో జన్మించాడు. ఐదేళ్ళ వయసులోనే అతని తల్లి చనిపోయింది. తండ్రి తన ప్రేమనంతా కుమారుని మీదే చూపిస్తూ కొడుకు సుఖమే తన సుఖంగా భావిస్తూ అతడిని పెంచసాగాడు. అతడు బాగా చదువుకుని వైద్యకళాశాలలో సీటు సంపాదించి ఎమ్.బి.బి.యస్. లో ఉత్తీర్ణుడయ్యాడు. కాని కుటుంబపోషణకు ఆధారమైన పొలం కాస్తా అతడి చదువుకోసం ఖర్చు అయిపోయింది. కొడుకు పొలం ఖరీదుకు వెయ్యిరెట్లు సంపాదించి తనను సుఖపెడతాడని తండ్రి సుబ్బయ్యశాస్త్రి ఎదురుచూడసాగాడు. వెంకట్రావు ఒక ధనవంతుడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వెంకట్రావు ఆదాయం ప్రతిదినం పెరుగుతోంది. దానితోబాటే దుర్గుణాలు కూడా వృద్ధి చెందసాగాయి. కొడుకుచేత నిరాదరించబడినప్పటికీ ఉత్తమ వంశమున జన్మించిన కోడలి. ఆదరణము వలన సుబ్బయ్యశాస్త్రి మనుమని యందు ప్రేమతో, అక్కడే కొంతకాలము గడిపాడు. కాని ఒకసారి “ఇతడెవరో బిచ్చగాడు” అని ఒక స్నేహితునితో చెబుతుంటే విని అవమానంతో తన గ్రామంలో ఏదోవిధంగా శేషజీవితం గడపడానికి వెళ్ళిపోయాడు.
“अयं कोऽयं याचकः” इति कस्मैचित् मित्राय कथयतः पुत्रस्य वचः श्रुत्वा स्वग्रामे जीवितावशेषं यापयितुं जगाम ।
వివాహమంటే వ్యాపారమని వెంకట్రావు నమ్మకం. వైద్యకళాశాలలో ధనికులైన సహవిద్యార్థులను చూసి, తానొక పేదవాని కొడుకైనందుకు తండ్రి మీద ద్వేషం, డబ్బుమీద ఆసక్తిని పెంచుకున్నాడు. ధనవంతురాలైన కన్యతో వివాహానికి కూడ డబ్బుమీద ఉండే వ్యామోహమే మూలకారణం. కాని ధనికుని కుమార్తెకు పేదవానియందు సహజమైన ప్రేముండదని అతడి విశ్వాసం. సద్గుణవతియైన సుశీల సహజమైన ప్రేమను నటనగా భావిస్తూ మొదటి నుండీ ఆమె యందు ప్రేమ కలిగియుండేవాడు కాదు. సహజ ప్రేమకు పాత్రుడైన కుమారుడు సురేష్ మాత్రమే వారి దాంపత్య బంధానికి బలమైన ముడిగా ఉన్నాడు. లేకపోతే ఆమె ఎప్పుడో చనిపోయి ఉండేది.
వెంకట్రావు యొక్క ఈ కఠోరమైన ప్రవృత్తి తన కుటుంబ విషయాలకే పరిమితమై ఉండేది. లోకానికి మాత్రం దయామయుడైన వైద్యుడుగానే కనబడేవాడు. క్రమంగా ధనం సంపాదించాలనే కోరిక నెరవేరడంతో అధికార వాంఛ అతడి మనస్సులో ప్రవేశించింది. శ్రమపడకుండానే రెండుసార్లు శాసనసభలో సభ్యుడయ్యాడు. కాని ఎంత ప్రయత్నించినా మంత్రి పదవిని పొందలేకపోయాడు. ”बहुधा प्रयत्यापि स मंत्रित्वादिकम प्राप्तुं नाशकत्” | చివరకు మూడవసారి శాసనసభా సభ్యత్వం కూడా రాకపోయేసరికి అతనిలో కొద్దిగా మిగిలి ఉన్న నటించే మంచితనం కూడా మాయమైంది. తన పరా జయానికి వీళ్ళే కారణమని సామాన్య జనులమీద అతనికి ఏవగింపు కలిగింది. అటువంటి మంచివాడికి ఇటువంటి కాఠిన్యం కలగడం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు.
గ్రామీణులు వచ్చి వైద్యం చేయమని అడిగిన రోజు వైద్యుడు వెంకట్రావు యొక్క మనస్సు కొంచెం వ్యాకులపడినట్లుగా ఉంది. ఒక వారం రోజుల క్రిందటే ప్రభుత్వ వైద్యశాలలో వైద్యురాలిగా నియోగించబడిన తన సహాధ్యాయిని మంజుహాసిని తనను చూడ్డానికి రాకపోవడం అతడికి సహించలేనిదిగా ఉంది. పోనీ తానే వెళదామనుకుంటే గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చి అడుగు ముందుకు పడలేదు.
కళాశాలలో చదివే రోజుల్లో ప్రేమపేరుతో వికృతంగా ప్రవర్తించి, ఆమెచే తిరస్కరించబడి అవమానించ బడ్డాడు. ఇప్పుడు డబ్బు సంపాదించడం వలన స్నేహంతోనో ప్రేమతోనో గౌరవిస్తుందని ఆశతో ఉన్నాడు. ఇలా ఆలోచిస్తున్న సమయంలో తన దగ్గరకు వచ్చిన గ్రామీణులతో ఆ విధంగా క్రూరంగా ప్రవర్తించాడు.
ఇంతలో ఆ వైద్యురాలు ఒక వ్యక్తికి వైద్యం చేసే విషయంలో సహాయం చేయడానికి రమ్మని ఫోను చేసింది. ఊహించని విధంగా వచ్చిన ఈ అవకాశానికి సంతోషించి వైద్యశాలకు బయలుదేరాడు. ఇంతలో కారుడ్రైవరు “అయ్యా పాఠశాల నుండి తమ కుమారుడు సురేష్ను తీసుకొని రావడానికి వెళుతూ మార్గమధ్యంలో కారు బ్రేకు బిగింపజేయవలసి వచ్చి కొద్దిగా ఆలస్యంగా వెళ్ళాను.
అప్పటికే మీ కుమారుడు పాఠశాల నుండి వెళ్ళిపోయాడు” అని చెప్పారు. కాని ఆ విషయం పెద్దగా పట్టించుకోకుండా “అతడు వచ్చేసి ఉండవచ్చును. మనం త్వరగా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళాలి” అంటూ వెంకట్రావు సమాధానం కోసం ఎదురుచూడకుండా దర్పంగా కారులో కూర్చున్నాడు.
भवतु भवतु ; तेनागतेन भवितव्यम् ; अद्यास्माभिः शीघ्रमेव प्रभुत्व – चिकित्सालय प्रति गन्तव्यम् ।
వైద్యశాలలోకి ప్రవేశించగానే అతని కళ్ళు మంజుహాసిని కోసం వెదుకుతూ అర్ధగంట క్రితమే తన దగ్గరకు వచ్చిన పల్లెటూరి జనాన్ని, వాళ్ళ సమీపంలోనే పడుకొని ఉన్న బాలుడి శ్వాసను పరీక్షించి, పెదవి విరుస్తూ నిరాశను వ్యక్తపరుస్తున్న మంజుహాసినిని చూసాడు. ఆ దృశ్యం చూడగానే సిగ్గుతో, దుఃఖంతో నిండిన మనస్సు గలవాడై వెంకట్రావు మూర్ఛపోయాడు.
ఈ కథ ద్వారా కవి స్వార్థంతో వృత్తిపట్ల అంకితభావం లేని వ్యక్తులను ఆలోచింపజేస్తూ, సమాజాన్ని చైతన్యపరచడంలో కృతకృత్యులైనారు.
Introduction: The lesson Bhishajah Bhaishajyam was written by Prof. Pullela Sriramachandra. It was taken from his Kathatrayi. This lesson describes the story of a selfish doctor, and the fruit he reaped for his selfishness.
The Villagers’ Plea : One day some villagers came to Dr. Venkata Rao, and requested him to attend to a boy who was injured in an accident. Venkata Rao chided them for not coming in time, and looking after their comforts only. सर्वदा स्वसुखचिंतैव युष्माकं| He accused them of trying to get treatment done without paying fee. When they left as the boy’s was serious condition. क्षणे क्षणे किले परीक्षयते बालस्य दशा, Venkata Rao thought nothing would happen if, one puppy boy died in India.
The Poor and Intelligent Venkata Rao: Venkata Rao was the son of a poor farmer. He was very intelligent and secured a seat in medical college. A rich man married his daughter to Venkata Rao. Venkata Rao’s practice also picked up. When he spoke of his father as a beggar, his father left him and returned to their village. Marriage was also a business affair for Venkata Rao. “विवाहो नाम वनिगवयवहार एव” For him, money was everything. He never loved his wife. His son Suresh alone became the object of his affection.
Manjuhasini, the Lady Doctor: At that time, Dr. Manjuhasini joined the government hospital there. She was Venkata Rao’s classmate in medical college. Venkata Rao was disturbed, as she did not yet come to meet him. He could not meet her because of his ego.
The Death of His Son: Just then Venkata Rao received a phone call from Manjuhasini requesting his help in an emergency accident case. His driver tried to inform him that he could not pick up his son from school after getting the brake repaired. Venkata Rao cut him short saying that he should go to general hospital urgently. On reaching the hospital he saw the same villagers who came to him earlier in the day, and the body of his dead son. स बालः न कोप्यन्यः, तस्त्र पुत्रः सुरेश एव | Overcome by shame and grief, Venkata Rao swooned.
पश्न 2.
वेङ्कटरावस्य स्वभावं सग्रहेण लिखत ।
(వెంకటరావు యొక్క స్వభావాన్ని సంగ్రహంగా రాయండి.)
उत्तर:
కవి పరిచయము : “भिषजो भैषज्यं” అను పాఠ్యభాగము “श्रीरामचंद्र लघुसंग्रहः” అను గ్రంథం నుండి గ్రహించబడినది. ఈ పాఠ్యభాగ రచయిత శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు. వేదాంత విశారద, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు, బహుశాస్త్రకోవిదులైన వీరు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని, రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
కథా పరిచయము : ఈ కథలో కుశాగ్రబుద్ధి, సర్వవిధ చికిత్సా విశారదుడైనప్పటికి `ఈ ప్రపంచం అంతా ధనమూలం’ అని భావించే స్వార్థపరుడైన వైద్యుని యొక్క స్వభావం చక్కగా చిత్రించబడింది. ఈ కథ ద్వారా కవి ఈ వైద్యునివలె ఎవ్వరూ ధనసంపాదన కోసం తన వృత్తి ధర్మం పట్ల నిరాదరణ ప్రదర్శించరాదని, ఆపదలయందు స్వపరభేదం విడచి అందరికీ యథాశక్తిగా సహాయం చేయాలనే సందేశాన్ని సమాజానికి అందిస్తున్నారు.
వెంకటరావు పుట్టుకతోనే దరిద్రుడు. ఐదారేండ్ల వయసులోనే తన తల్లి చనిపోయింది. అతని పేదరికానికి కారణం తన తండ్రే అని ఎల్లప్పుడు ఆలోచించేవాడు. ఎంతో ఖర్చుపెట్టి తన తండ్రి వైద్యవిద్యను చదివించాడు. అక్కడ ధనికులైన తన తోటి విద్యార్థులను చూచి ఆత్మన్యూనతా భావానికి లోనయ్యేవాడు.
వైద్యవిద్య పూర్తయిన తరువాత ఒక ధనికుని కూతురితో వివాహం అయింది. వివాహం వ్యాపారమే అనేది అతని దృఢమైన నమ్మకం. తన భార్య చాలా సౌందర్యవతి. ఎల్లప్పుడూ తన భర్తయందే అనురాగం కలది. కాని అతడు తన భార్య ప్రేమను నటిస్తుందని ఆలోచించేవాడు. వారిద్దరికీ ఒకే ఒక కుమారుడు. వారి వివాహబంధానికి మూలకారణం. మనుమడిపై ప్రేమతో తండ్రియగు వెంకటరావు ఇంట్లోనే జీవిస్తున్నాడు.
కాని వెంకటరావంటే చిన్నచూపు. కీటకంలా చూస్తాడు. ఇంకా ధన వ్యామోహంతో మాత్రమే రోగుల రోగాలను నయం చేసేవాడు. ఈ విధంగా ధనాన్ని సంపాదించి, అధికారాన్ని కూడా సంపాదించాలనుకున్నారు. శాసన సభలో రెండుసార్లు సభ్యత్వం పొందాడు. కాని మూడవసారి మంత్రి పదవి ఆశపడగా అతని కోరిక తీరలేదు. అప్పుడిక జనాలను కూడా కీటక బుద్ధితో చూడడం ప్రారంభించాడు.
అందువల్లనే దెబ్బలతో మూర్ఛపోయిన పిల్లవాడికి వైద్యం చేయడానికి ఇష్టపడలేదు. గ్రామీణులు ఎంత బ్రతిమిలాడినా డబ్బులివ్వరు అనే బుద్ధితో నిరాకరించి దూషించాడు కూడా. ఒక అర్థగంట తరువాత పూర్వం పరిచయురాలైన వైద్యురాలు ఫోన్ చేసి పిలువగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ బండి ఢీ కొనడంతో మూర్ఛపోయిన బాలుడు తన కొడుకేనని తెలియగానే మూర్ఛపోయాడు. ఇందు ధనాశ మనుష్యులందు కీటబుద్ధి, సోత్రలయందు సత్యమనే భావనను కలుగజేసి మనలను నాశనం చేస్తుంది.
सन्दर्भ वाक्यानि (సందర్భవాక్యాలు) (Annotations)
1. क्षणे क्षणे किल परीक्षीयते बालकस्य दशा ।
परिचय : इदं वाक्यं ‘भिषजो भैषज्यम्’ इति पाठ अस्ति । अस्य पाठस्य रचयित्, श्री पुल्लेल श्रीरामचन्द्रुडु |
सन्दर्भ : एकः वृद्धः युवकं उद्दिश्य एवं अवदत् ।
भाव : क्षणे क्षणे परीशील्यमाने बालकस्य दशा क्षीयेत ।
विवरणम् : वृथा अनेन कलहेन, बालकस्य परिस्थितिः सीयते ।
2. अरे मूर्खाः सर्वदा स्वसुख चिन्तैव युष्माकम् ।
परिचय : इदं वाक्यं ‘भिषजो भैषज्यम्’ इति पाठ अस्ति । अस्य पाठस्य रचयित्, श्री पुल्लेल श्रीरामचन्द्रुडु |
सन्दर्भ : स्वसमीपं आगतान् ग्रामीणाजनान् प्रति वैद्यः एवं अवदत् । भाव हे जनाः यूयं सर्वदा युष्माकं सुखमेव चिन्तयन्ति ।
विवरणम् : रे मूर्खा, इत सर्वे गच्छन्तु सर्वदा युष्माकं सुखमेव चिन्तयन्ति ।
3. स बालः न कोऽप्यन्यः, तस्य पुत्रः सुरेश एव ।
परिचय : इदं वाक्यं ‘भिषजो भैषज्यम्’ इति पाठ अस्ति । अस्य पाठस्य रचयित्, श्री पुल्लेल श्रीरामचन्द्रुडु |
सन्दर्भ : चिकित्सां कर्तुं निराकृतवस्य बालकस्य विषयप्रस्तावं कविः करोति ।
भाव : वैद्येन चिकित्सां कर्तुं यः कालः निराकुतः सः वैद्यस्य पुत्रः एव ।
विवरणम् : स्वैधौः सर्वेषां चिकित्सां करणीया, भिष्जा चिकित्सां कर्तुं यः बालः निरंकृतः सः भिषजः कुमारः एव ।
एकपद समाधान प्रश्नाः (ఏకపద సమాధాన ప్రశ్నలు)(One Word Questions)
पश्न 1.
वेङ्कटरावः कीद्दशे कुटुंबे उदभूत् ?
समादान:
वेङ्कटरावः निर्धनकुटुंबे उदभूत् ।
पश्न 2.
वेङ्कटरावस्य पितुः नाम किम् ?
समादान:
वेङ्कटरावस्य पितुः नाम सुब्बय्यशास्त्री ।
पश्न 3.
भिषगंगना का ?
समादान:
भिषगंगना वेङ्कटरावस्य सहाध्यायिनी ।
कठिन शब्दर्थां (కఠిన పదాలు – అర్ధాలు)
1. भिषक् = वैद्य: – వైద్యుడు
2. करालः = भयङ्करः – భయంకరుడు
3. सारमेयाः = शुनका: – కుక్కలు
4. जाया = पत्नी – భార్య
5. व्रीडा = लज्जा – సిగ్గు
व्याकरणांशाः (వ్యాకరణాంశాలు)
सन्धयः (సంధులు)
1. कः + अयं = कोऽयम् – विसर्गसन्धिः
2. परमेश्वरः + अपि – परमेश्वरोऽपि – विसर्गसन्धिः
3. वैद्यः + अपि = वैद्योऽपि – विसर्गसन्धिः
4. विश्रान्तिः + आवश्यकी = विश्रान्तिरावश्यकी – विसर्गसन्धिः
5. चेत् + भटैः = चेद्भटैः – जश्त्वसन्धिः
6. बहिः + आगत्य = बहिरागत्य – विसर्गसन्धिः
7. अन्तः + विहस्य = अन्तर्विहस्य – विसर्गसन्धिः
8. अन्तः + अगच्छत् = अन्तरगच्छत् – विसर्गसन्धिः
9. वेङ्कटरावः + अपि = वेङ्कटरावोऽपि – विसर्गसन्धिः
10. अन्ततः + च = अन्ततश्च – श्रुत्वसन्धिः
11. वस्तुतः + च = वस्तुतश्च – श्रुत्वसन्धिः
12. ग्रन्थिः + आसीत् = ग्रन्थिरासीत् – विसर्गसन्धिः
13. चिन्तयन् + आसीत् = चिन्तयन्नासीत् – ङमुडागमसन्धिः
समासाः (సమాసాలు)
1. समयस्य नियमः, समयनियमः – षष्ठीतत्पुरुषसमासः
2. स्वस्य सुखं स्वसुखं, स्वसुखस्य चिन्ता, – षष्ठीतत्पुरुषसमासः
3. दीनानि वदनानि येषां ते, दीनवदनाः – बहुव्रीहिसमासः
4. प्रतिगमनाय उन्मुखाः, प्रतिगमनोन्मुखाः – चयुर्थीतत्पुरुषः
5. द्विगुणीभूतः क्रोधः यस्य सः, द्विगुणीभूतक्रोधः – बहुव्रीहिसमासः
6. निर्धनञ्च तत् कुटुम्बञ्च निर्धनकुटुम्बं निर्धनकुटुम्बे – विशेषणपूर्वपद कर्मधारयसमासः
7. कुशस्य अग्रम् कुशाग्रम् इव धीः यस्य सः, कुशाग्रधीः- बहुव्रीहिसमासः
8. पठिता वैद्यविद्या येन सः, पठितवैद्यविद्यः बहुव्रीहिसमासः
9. महांश्च असौ धनिकश्च महाधनिकः – विशेषणपूर्वपदकर्मधारयसमासः
10. स्नेहेन वशः, स्नेहवशः तेन, स्नेहवशेन तृतीयातत्पुरुषसमासः
11. जीवितस्य अवशेषं, जीवितावशेषं – षष्ठीतत्पुरुषसमासः
12. दाम्पत्यस्य रज्जुः, दाम्पत्यरज्जुः तस्याः दाम्पत्यरज्जोः – षष्ठीतत्पुरुषसमासः
13. भिषक् च असौ अङ्गना च, भिषगङ्गना – विशेषणपूर्वपदकर्मधारयसमासः
भिषजो भैषज्यम् Summary in Sanskrit
कविपरिचयः
“भिषजो भैषज्यम्’ इत्ययं पाठ्याशंः पद्मश्री सत्कारेण सम्मानितस्य महामहोपाध्याय पुल्लेल श्रीरामचन्द्रुडु महाभागस्य “कथात्रयी’ इत्यस्मात् ग्रन्थात् उद्धृतः । नैकशास्त्रविशारदोऽयं कविपण्डितः १९२७ तमे वर्षे जनिं लेभे । अस्य पितरौ पुण्यदम्पती सत्यवती – सत्यनारायणशास्त्रिणौ । आबाल्यात् संस्कृते साहित्य-व्याकरण-वेदान्तादिशास्त्राणि अभ्यस्य १९६० तमे वर्षे, उस्मानिया विश्वविद्यालयस्य संस्कृतविभागे प्रवाचकपदम् अध्यगच्छत् अयं विद्वत्तल्लजः । अयं प्रायः अशीत्युत्तरैकशतं (१८०) ग्रन्थान् अरचयत् । एतेषु ग्रन्थेषु काव्यानि, रूपकाणि, व्याख्यानानि, अनुवादानि शास्त्राणि च सन्ति । वेदान्तविशारद, विश्वभारती, कालिदासज्ञानरत्न, वाचस्पति इत्यादिभिः उपाधिभिः सम्मानितः आलङ्कारिकचक्रवर्ती इति स्वगुरुभिः प्रशंसितः अयं विबुधः २०१५ तमे वर्षे दिवं गतः ।
सारांश
आकस्मिकयानप्रहारेण मूर्छितं बालमेकं केचन जनाः वेङ्कटराव नामानं भिषजम्प्रत्यानयन्ति । किन्तु गर्विष्ठः सः वैद्यः चिकित्सां कर्तुं निराकरोति अपि च बालं रक्षितुं तत्रानीतान् जनान्निन्दति भर्त्सयति च । तेन विस्मिताः दुःखिताश्च ते बालं नीत्वा अन्यं चिकित्सालयं गच्छन्ति । निर्धनकुटुम्बे जातोऽपि वेंङ्कटरावः केवलं धनार्जने आसक्तो भूत्वा निर्धनान् न आद्रियते । किन्तु क्षणंकालानन्तरं सर्वकारीयचिकित्सालयात् मञ्जुभाषिणी नाम्न्या भिषगङ्गनया दूरवाण्या झटित्या- गन्तुम् आहूतः सः तत्र गच्छति । तत्र स्वगृहम्प्रत्यागतान् जनान् एवं च तेषां पुरतः स्थितं मृतं स्वपुत्रं दृष्ट्रा खिद्यते ।
भिषजो भैषज्यम् Summary in English
Introduction
Introduction : Bhishajah Bhaishajyam is a short story from Kathatrayi written by Prof. Pullela Sriramachandra. His parents were Satyavathi and Satyanarayana. Prof. Sriramachandra was a poet, scholar, translator, commentator and critic. He authored around 180 books. He wrote poems, stories, commentaries, dramas and translations. He received many awards. He started teaching at Osmania University in 1960.
भिषजो भैषज्यम् Summary in Telugu
కవి పరిచయం
“భిషజః భైషజ్యమ్” అనే పాఠ్యభాగాన్ని పద్మశ్రీ బిరుదాంకితులైన మహా మహాపాధ్యాయులు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు రచించారు. ఈ పాఠ్యభాగం వారు రచించిన “కథాత్రయీ” అనే గ్రంథం నుండి స్వీకరింపబడింది. వీరు అనేక శాస్త్రాలలో గొప్ప విద్వాంసుడు. వీరు 1927వ సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు’, సత్యవతి, సత్యనారాయణ శాస్త్రి పుణ్యదంపతులు బాల్యం నుండి సంస్కృత వ్యాకరణ.. లోను, సాహిత్యంలోను, వేదాంతము మొదలైన విభాగాల్లో నైపుణ్యాన్ని సంపాదించారు.
వీరు దాదాపు 180 గ్రంథాలు రచించారు. వీటిలో కావ్యాలు, రూపకాలు, వ్యాఖ్యానాలు: అనువాదాలు, శాస్త్రాలు ఉన్నాయి. వీరి కాంత విశారద, విశ్వభారతి, కాళిదా జ్ఞానరత్న, వాచస్పతి మొదలైన బిరుదులు ఉన్నాయి ఆలంకారిక చక్రవర్తి అయిన వీడ. తమ గురువుల ప్రశంసలను అందుకున్నాడు వాలు 2015వ సంవత్సరంలో దివంగతు లయ్యారు.
సారాంశము
అనుకోకుండా ఒక వాహనం తగలడం వల్ల ఒక బాలుడు మూర్ఛపోయాడు. కొంతమంది వెంకటరావు అనే వైద్యుని వద్దకు తీసుకొని వచ్చారు. గర్విష్టి అయిన అతడు వైద్యం చేయడానికి నిరాకరించాడు. పైగా బాలుడిని రక్షించడానికి వచ్చిన ప్రజలను నిందించాడు, బెదిరించాడు. దాంతో ఆశ్చర్యాన్ని పొందిన వారంతా దుఃఖితులై బాలుడిని తీసుకొని వేరొక వైద్యుని వద్దకు వెళ్ళారు.
పేద కుటుంబంలో జన్మించిన వెంకటరావు కేవలం ధనార్జనతో శ్రద్ధ చూపాడు. ఒకసారి మంజుహాసిని పిలుపుతో, అత్యవసరంగా వెంకటరావు ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ ప్రజలందరు గుమిగూడారు అక్కడ మృతి చెందిన తన కుమారుడిని చూచి తీవ్రంగా దుఃఖించాడు.
“అరే ! ఏంటి అడ్డగిస్తున్నారు ! సమయం అంటే సమయమే. సాక్షాత్తు పరమేశ్వరుడే రానివ్వు” అని కోపంతో వెళ్ళిపోయాడు వైద్యుడు వెంకట్రావు, “అయ్యా ! మాకు తెలుసండి మీ కాలనియమం. కానీ ఇటువంటి ఆపద సమయాలలో మీరు కాస్త మమ్మల్ని అనుగ్రహించాలి.” అని బ్రతిమిలాడుతూ ఒక గ్రామీణుడు వచ్చి ప్రార్థించాడు. వెంకటరావు మనస్సు మళ్ళీ రాయిలా మారిపోయి బ్రతిమిలాడినా ఏమాత్రం చలించలేదు.
“అరే మూర్ఖుల్లారా ! ఎప్పుడూ మీ సుఖం గురించే మీ ఆలోచనా ? వైద్యుడు కూడా మనిషే. అతనిక్కూడా విశ్రాంతి, సుఖాలు అవసరమని ఆలోచించరే ఒక్కరు కూడా. వెళ్ళండి వెంటనే” అని గట్టిగా అరిచాడు.
ఏం చేయాలో తెలియని ఆ అమాయకులైన గ్రామీణులు అకారణంగా కోప్పడే వైద్యుని ముఖం వైపు దీనంగా చూస్తూ తిరిగి వెళ్ళిపోదలచుకున్నారు. వాళ్ళలో నుంచి ఒక యువకుడు కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చి “అయ్యా ! మా సుఖాల గురించి ప్రాకులాడతారంటున్నారు మీరు ! ఆకస్మికంగా వాహనం గుద్దేయడంతో మూర్ఛపోయి మార్గంలో పడిఉన్న ఈ తెలియని పిల్లవానికి సహాయం చేయడం కూడా మా సుఖమేనా, స్వార్థమంటారా ? అని పలికెను.
ఆ మాటలు విని రెట్టింపు కోపంతో వైద్యుడు “అరే ! మూర్ఖుడా ! నా సహాయం అడుక్కోవడానికి వచ్చి నన్ను ఎదిరిస్తున్నావ్ ? ఎవరికి తెలియదనుకున్నావు మోసబుద్ధి ? ముక్కు ముఖం తెలియని పిల్లవాడని చెప్పి డబ్బు లేకుండా వైద్యం చేయించుకోవాలనుకుంటున్నారా ? ఏ మూర్ఖుడు నమ్ముతాడనుకున్నారు ? ఎలా వచ్చిన వారు అలా తిరిగి వెళ్ళండి. లేకపోతే పోలీసులను పిలుస్తాను” అని కఠినంగా మాట్లాడెను. “అయ్యా మిమ్మల్ని మోసం చేయటం మా కోరిక కాదు. మేమందరం శక్తి కొలది ఎంతో కొంత వైద్యానికి డబ్బు చెల్లిస్తాము. ఒక్కసారి బయటికొచ్చి ఆ పిల్లవాడి ముఖమైనా చూడండి. ` ఆ పసికందు ముఖాన్ని చూసైనా మీ మనసులో జాలిపుడుతుందేమో” అని బయటికి కోపం వస్తున్నా అణచుకొని ఆ యువకుడు వినయంతో వేడుకున్నాడు. వైద్యుడు వికటంగా నవ్వి “ఓహో ! ఎంత సుకుమారం చూపిస్తున్నారు.
దాన్ని గాడిదపిల్ల సుకుమారమంటారు” అని పలికి పోలీసులకి ఫోను చేయబోతున్నాడు. అక్కడే ఉన్న ఒక ముసలివాడు ముందుకొచ్చి అయ్యో ! ఈ జాలిలేనివాడి దగ్గర ఇదేది కుదిరేదికాదు. ఎందుకు మీరంతా గొడవపెట్టుకొని సమయాన్ని వృథా చేస్తున్నారు ? క్షణక్షణానికి పిల్లవాడి స్థితి క్షీణిస్తోంది. రండి వేరేచోటుకు వెళ్లాము” అని పలికి ఆ యువకుడిని అందరిని తీసుకెళ్ళిపోయాడు.
వైద్యుడు కూడా లోపలికి వెళ్ళిపోతూ “వెళ్ళండిరా కుక్కల్లారా. నాకు తెలియకుండా ప్రతిరోజు ఈ భారతదేశ జనాభాలో ఎవరో ఒకడు పోతూనే ఉంటాడు. ఈరోజు ఈ కుక్కపిల్ల చస్తోంది అని తిడుతూ చాలా గట్టిగా శబ్దంవచ్చేలా తలుపులను మూసేసి “లోపలికి వెళ్ళిపోయాడు.
వెంకటరావు పేదకుటుంబంలో పుట్టాడు. అతని ఐదారేండ్లకే తన తల్లి కాలం చేసింది. తన తండ్రి తనకన్నీ ఆ కొడుకే అన్నట్టుగా అతనిమీదే ఆశను పెట్టుకొని బ్రతకడానికి ఉపయోగపడే పొలం సహాయంతో ఏదోలా కాలాన్ని గడిపాడు. కొడుకు సుఖమే తన సుఖమనుకొని తన కొడుకు బాగుకోసమే పాటుపడేవాడు.
బుద్ధికుశలత కలిగిన వెంకటరావు కూడా పాఠశాలలో అన్ని తరగతులలోనూ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడవ్వగా తరువాత ఎలానో వైద్యకళాశాలలో స్థానాన్ని సంపాదించి, ఎమ్.బి.బి.ఎస్. పరీక్షలో సఫలుడైనాడు. కుటుంబానికి ఆధారమైన పొలం మొత్తము అతని చదువుకే ఖర్చు పెట్టేసాడు. ఆ పొలాన్ని అమ్మేసినా అంతకు వెయ్యిరెట్లు విలువచేసేది వస్తుందని తలుస్తూ తండ్రి ఆ సమయం కోసం ఎదురుచూస్తూ తనలో తాను మురిసిపోయేవాడు.
ఎప్పుడు తన కొడుకు చాలా డబ్బును సంపాదిస్తాడు, ఎప్పుడు తనకున్న అన్ని బాధలు దూరమై పోతాయి అని అతను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. వైద్యవిద్యను చదివినవాడై, చక్కని ఆకారం కలవాడై, బుద్ధిమంతుడై ఉన్నాడు అని తలచి వెంకటరావును ఎవరో ఒక మహాధనికుడు తనకు అల్లుడుగా చేసుకోవాలనుకున్నాడు. దానితో అందమైన భార్యతోపాటు వెంకటరావు డబ్బు కూడా చాలానే పొందాడు. చాలా తక్కువ కాలంలోనే తన సంపాదన ప్రతినెలా రెండుమూడువేలు చొప్పున పెరుగుతూ వచ్చింది. అలా తండ్రియైన సుబ్బయ్య శాస్త్రిగారి ఆశ ఒకటి సఫలమైనది కానీ రెండవది మాత్రం ఎప్పటికీ సఫలం కాలేదు. దానితో ఆ తండ్రి ఇక తన ఆశ సఫలం కాదని తలచెను. ప్రతిరోజూ పెరుగుతున్న ధనంతోపాటు వెంకటరావుకి దుర్గుణాలు కూడా వేగంగా పెరిగాయి.
“మనుషులను కీటకాలుగా, తనను తాను దేవునిగా, పొగిడేవాళ్ళ పొగడ్తలను పరమ సత్యాలుగా భావిస్తూ ఉండడం ఇవి ధనానికి ఫలితాలు” అనే న్యాయంతో ఈ మూడురకాల ఆలోచనలు అతనిలో ఒకేసారి పుట్టాయి. మొదటగా తక్కువ భావంతో తన తండ్రి సుబ్బయ్యశాస్త్రిని పురుగులా చూడసాగాడు. కొడుకు పట్టించుకోకపోయినా ఉత్తమ వంశంలో పుట్టిన కోడలు గౌరవంగా చూసుకోవడంతో ఒకే ఒక్క మనవడితో ఉన్న స్నేహంతో ఎలాగోలా అక్కడే కొంత కాలాన్ని గడిపాడు.
తరువాత ఒకసారి తండ్రిని “ఈయన ఎవడో భిక్షగాడు” అని ఎవరికో స్నేహితునికి తన కొడుకు చెప్పగా విని స్వాభిమానం కోల్పోయినవాడై దూరంగా తన గ్రామానికి వెళ్ళి ఏదోలా అక్కడే గడిపేద్దామని వెళ్ళి పోయాడు.
పెళ్ళంటే వ్యాపారమేనని వెంకటరావు యొక్క విశ్వాసము. తన దృష్టిలో ధనమే అన్నింటికి ప్రధానము. ” అంతటికి డబ్బే మూలము ” కదా ! (సవ్యం ఖల్విదం విత్తం) అని తలస్తూ లోకాన్నంతా కనకమయంగా చూడసాగాడు. ఇటువంటి ఆలోచన మనస్సులో ఎప్పుడు పుట్టిందో చెప్పలేము. వైద్యకళాశాలలో ధనికులను, తనతో చదువుకుంటున్నవారిని చూసి తనను పేదవాని కొడుకుగా తలచి అది క్రమంగా తండ్రిపై ద్వేషంగా మారి, మనసులో డబ్బుపై ఆసక్తి పెరగసాగింది.
ఐశ్వర్యవంతురాలైన అమ్మాయితో వివాహానికి కూడా మూలకారణం ధన వ్యామోహమే. ఇంకా అతనీ విధంగా అనుకొనేవాడు – తన భార్య ఎంతో ధనవంతురాలు, సకలగుణ సంపన్నురాలు అయినప్పటికి పేదవాని కొడుకైన తనను పెండ్లి చేసుకొని ప్రేమ నటిస్తుంది అని, ఈ కారణంతో నిజమైన ప్రేమగలదైనా తన భార్య సుశీలను చూసి ప్రేమనటిస్తోందని తలచి మొదటి నుండి ఆమెను తక్కువగానే ప్రేమించేవాడు. నిజానికి ఇద్దరికి కలిగిన ఒకే ఒక కొడుకు అయిన సురేష్ వల్లే ఆ మాత్రం ప్రేమతోనైనా వాళ్ళ దాంపత్యజీవితం గట్టిగా ముడివేయబడినది. లేకుంటే చాలాకాలం క్రితమే ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోయేది.
వెంకటరావు యొక్క ఈ కఠోరమైన తీరు కుటుంబ విషయం వరకే పరిమితంగా ఉంది. లోకం మాత్రం అతను ఎంతో జాతి మనస్సు కలవాడని, ఎన్నో రకాల చికిత్సా విధానాలు తెలిసినవాడని, పరులకు ఉపకారం చేయటంలో దక్షుడని, గొప్పవైద్యుడని భావించేవారు. ఇలా మంచితనమును నటించడం సఫలం కావడంతో అతను గొప్పకీర్తిని, చాలా డబ్బును సంపాదించుకున్నాడు. క్రమంగా అతనికి డబ్బుమీద ఉన్న కోరిక అధికారం మీదకు మనసు పోయేలా చేసింది. క్రమంగా ఆ అధికార వాంఛ బలవత్తరమైన గొప్ప అధికారం లేనివాడికి ఎంత ఐశ్వర్యమున్నా నిష్ఫలము అని ఆలోచిస్తూ ఉండేవాడు వెంకట రావు. ఎంతో డబ్బు సంపాదించినవాడు, జనులకు ఇష్టమైనవాడు ఇటువంటి వాడికి అధికారం సంపాదించడం ఏపాటిది. కష్టం లేకుండానే రెండుసార్లు శాసనసభ సభ్యుడయ్యాడు. కాని అతనికి ఆ సంతోషమే మిగిలింది.
ఎంత ప్రయత్నించినా మంత్రి మాత్రం కాలేక పోయాడు. స్వార్థంగా ఆలోచించడంతో ఇంతవరకూ చేసిన ప్రజల ఆరాధన వ్యర్థమైపోవడం చూసి వెంకటరావు మనస్సు విరిగిపోయింది. ఆశాభంగమైన ఆయన క్రమంగా తన మనస్సులో ఉండిపోయిన సహజ ద్వేషభావము, అహంకారము బయటపెట్టాడు. చివరిగా మూడోసారి శాసనసభలో సభ్యత్వం రాకపోవడంతో ఇంకా మిగిలిన మంచితనమనే నటన ఇక పూర్తిగా పోయింది.
తండ్రిపై చూపించిన పురుగనే తక్కువ భావం ఇప్పుడు అందరిపైనా చూపించసాగాడు. తను ఓడిపోవడానికి ఈ ప్రజలే కారణమని సామాన్య జనులపై చాలా అసహ్య భావన కలిగింది. అటువంటి సౌజన్య శీలునిలో ఇటువంటి కర్కశం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదే ఆయన సహజ స్వభావమని ఇటువంటి వాడని ఎవరికి తెలుసు ?
ఆ రోజున వైద్యుడైన వెంకటరావు మనస్సు కొంచెం బాధగా ఉంది. ఆమె విషయంలో ఏ మాత్రము భరించలేకున్నాడు. ఎందుకనగా వారం రోజుల ముందు ప్రభుత్వ చికిత్సాలయంలో చేరిన తన యొక్క సహాధ్యాయిని వైద్యురాలు ఈ రోజు వరకు తనను చూడడానికి రాలేదని. తనే వెళ్ళాలనుకున్నా గతంలో జరిగిన సంఘటన గుర్తొచ్చి వెళ్ళలేకపోయాడు. పూర్వం ఒకప్పుడు కళాశాలలో శరీరావయవాలను గూర్చి బోధించే తరగతిలో అధ్యాపకుని పాఠాన్ని వినకుండా మాటిమాటికి నన్ను చూస్తున్న మంజుహాసినీ తన అమాయకత్వానికి కొంచెం నవ్వింది.
అది ప్రేమచిహ్నంగా అనుకొని ఇతను కళాశాల బయట కొంచెం వికృత చేష్టలను చేయనారంభించేసరికి చెప్పుతీసికొట్టడం తప్ప మిగతా అన్ని రకాలుగాను తగిన సత్కారం చేసింది. అప్పుడైతే పేదవాడినవ్వడంతో అలా చేసింది, ఈ రోజు చాలా డబ్బు సంపాదించాను, నన్ను సత్కరిస్తుంది. అది ఆమె స్నేహంతోనో లేదా ప్రేమతోనో అని చాలా ఆశగా ఉన్నాడు. ఇలా మనస్సులో గాలిమేడలు కట్టేసుకుంటూ అతను ఉండగా ఆ సమయంలోనే ఆ గ్రామీణులు రావటం అతను క్రూరంగా ప్రవర్తించడం జరిగింది.
తరువాత అక్కడ ఈ గ్రామీణులు వెళ్ళిపోయే అరగంటముందే ఫోను మోగింది. వైద్యుడైన వెంకటరావు ఆమే అయ్యుంటుందని తలచి ఫోను చెవి దగ్గర పెట్టుకొని అక్కడెవరండీ అని అడిగెను. అబ్బా ! నేను చాలాసేపు ఎదురుచూస్తున్న కంఠస్వరము వెంటనే ప్రభుత్వ చికిత్సాలయానికి రమ్మనమనగా విన్నాను.
యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదంలో గాయపడి చాలా క్లిష్టపరిస్థితిలో ఉన్నవానికి చికిత్స చేయడానికి వెంకటరావు సహాయం కావాలి. తనతో ఆమెకు అవసరం ఉందని తెలియగానే అపరిమిత ఆనందం కలిగింది. వెంటనే బట్టలు వేసుకొని బయటికొచ్చి డ్రైవర్ని పిలిచాడు. అప్పుడే ఎక్కడనుండో వచ్చిన డ్రైవర్ మాట్లాడెను “అయ్యా ! పాఠశాల నుండి అబ్బాయి సురేష్న తీసుకురావడానికి వెళ్ళగా దారిలో కారు బ్రేకులు పొడవగా బాగుచేయించడానికి వెళ్ళాను. అక్కడ కొంచెం ఆలస్యమైంది. అక్కడ నుండి పాఠశాలకు వెళ్ళగా మీ అబ్బాయి కనిపించ మీ లేదు.
అతను నడచుకుంటూ వచ్చేసాడేమో” అని చెప్పే లోపులోనే వెంకటరావు “సరే సరే ! త్వరగా ప్రభుత్వ చికిత్సాలయానికి వెళ్ళాలి అక్కడ నా సహాయం అవసరము అని కారు తలుపుతీసి వెంటనే కూర్చున్నాడు. ఇతరుల చికిత్సకు ఇంత శ్రద్ధ చూపడం చూడగానే ఆశ్చర్యపోయిన డ్రైవర్ వెంటనే వేంకటరావును చికిత్సాలయానికి తీసుకెళ్ళాడు. చికిత్సాలయం లోపలికి వెళ్ళగానే వెంకటరావుకి ఒక అరగంట క్రితం తన దగ్గరకు వచ్చిన గ్రామీణులు, ఆ గ్రామీణులు దగ్గర పడుకుని ఉన్న పిల్లవాడి శ్వాసను పరీక్షించి ఇక లాభం లేదని నిరాశను తెలియజేస్తున్న మంజుహాసినిని చూసి సిగ్గుతో భరింపలేని దుఃఖంతో మూర్చపోయాడు.
अनुवादः (అనువాదములు) (Translations)
“अये कोऽयं निर्बन्धः ? समयनियमो नाम समयनियम एव । साक्षात् परमेश्वरोऽपि वा आगच्छतु” इति सक्रोधं जगाद भिषग् वेङ्कटरावः ।
“आर्य ! जानीम एव वयं भवतः कालनियमादिकम्, परन्तु एतादृशे आपत्समये अस्मास्वनुग्रहः कर्तव्यः” इति सानुनयम् आगतेष्वेकः ग्रामीणः प्रार्थयामास । “अरे मूर्खाः सर्वदा स्वसुखचिन्तैव युष्माकम् । वैद्योऽपि मानव एव तस्यापि विश्रान्तिरावश्यकी । शीघ्रम् अपसरत” इति पुनः उच्चैः जगर्ज वेङ्कटरावः ।
ते दीनवदनाः ग्रामीणाः प्रतिगमनोन्मुखाः अभूवन । किन्तु तेष्वेकः युवा किञ्चिद् धैर्यं समालम्ब्य चिकित्सकस्य अग्रतो गत्वा “आर्य स्वसुखचिन्तेति अधिक्षिपति भवान् अस्मान् मार्गे आकस्मिकयानप्रहारेण मूर्च्छितस्य अज्ञातस्य बालस्य साहाय्यकरणमपि यदि स्वसुखम्, स्वार्थपरता इत्युच्यते, अहो करालः किलायं कालः” इत्यवदत् । इदं श्रुत्वा द्विगुणीभूतक्रोधः भिषक् – “अरे को वा न जानाति युष्माकं कपटोपायम्, अज्ञातो बाल इत्युक्त्वा विनैव शुल्कं चिकित्सां कारयितुं प्रयत्यते युष्माभिः गम्यताम्, गम्यतां नोचेद् भटैः निष्कासयिष्यामि” इति अतिपरुषं जगाद | “आर्य ! दास्याम एव यथाशक्ति यत्किञ्चित् चिकित्सा-शुल्कम् ।
बहिरागत्य पश्यतु तावत् भवानेतस्य बालस्य मुखम् । तादृशस्य सुकुमारस्य एतादृशीम् अवस्थां दृष्ट्रापि वा भवतो हृदये करुणा जायेत” । इति उद्गच्छन्तं कोपं नियम्य स युवा सविनयं प्रार्थयामास । अत्रान्तरे कश्चित् वृद्धः पुरः आगत्य” अये किमर्थमनेन सह वृथा कलहेन याप्यते कालः, क्षणे क्षणे किल परिक्षीयते बालस्य दशा | आगच्छत शीघ्रम् अन्यत्र गमिष्यामः” इति वदन् तं युवानम् अन्यांश्च अनयत् ।
वैद्यश्च अन्तर्विहस्य ” गच्छत रे सारमेयाः न जाने किं वा छिन्नं भवति प्रतिदिनोपचीयमानजनगणस्य भारतदेशस्य, यदि कश्चित् शुनकस्य शिशुः म्रियते ” इति यत्किञ्चित् जल्पन् महता शब्देन कवाटं पिधाय अन्तरगच्छत् ।
అనువాదము : “అరె ఏమిటీ నిర్బంధం ? సమయాన్ని పాటించడమంటే సమయాన్ని పాటించడమే. సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చినా సరే ! అన్నాడు వైద్యుడు వెంకట్రావ్. ‘అయ్యా ! మాకు మీ కాలనియమం తెలుసు, కాని ఇలాంటి కష్ట సమయంలో మా యందు దయచూపించాలి” అని సానునయంగా అక్కడికి వచ్చిన గ్రామీణుల్లో ఒకడు ప్రార్థించాడు. వెంకట్రావు హృదయం మాత్రం రాయిలాగా మృదువైన మాటలకు ఏమాత్రం చలించలేదు. “ఓరీ ! మూర్ఖులారా ! మీకు ఎప్పుడు మీ సుఖమే, వైద్యుడు కూడా మానవుడేనని, అతడికి కూడా విశ్రాంతి, సుఖం మొదలైనవి కావాలని మీలో ఒక్కడు కూడా ఆలోచించడు. తొందరగా తప్పుకోండి అని మళ్ళీ గట్టిగా అరిచాడు. ఏంచేయాలో దిక్కుతోచని ఆ గ్రామీణులు అకారణంగా కోపగిస్తున్న ఆ వైద్యుడి ముఖంలోకి దీనంగా చూస్తూ వెళ్ళిపోవడానికి ఉద్యుక్తులయ్యారు. అంతలో ఒక యువకుడు కొంచెం ధైర్యం చేసి ముందుకు వచ్చి, “అయ్యా ! మా సుఖం గురించే ఆలోచిస్తున్నామని నిందిస్తున్నారు.
ఆకస్మికంగా వాహన ప్రమాదంలో దెబ్బతిని మూర్ఛపోయి దారిలో పడిఉన్న అజ్ఞాతబాలునికి సహాయం చేయడం కూడా స్వసుఖం, స్వార్థపరత్వం అని అంటున్నారు, అయ్యో ! ఎంత భయంకరమైన కాలం వచ్చింది” అని అన్నాడు. ఇది విని రెట్టించిన కోపంతో వైద్యుడు “ఓరీ! మూర్ఖుడా ! నా సహాయాన్ని అర్థించడానికి వచ్చి సన్నే నిందిస్తున్నావు ! మీ కపటోపాయము ఎవరికి తెలియదు ? ఎవరో గుర్తుతెలియని బాలుడని చెప్పి, డబ్బు ఇవ్వకుండా ఉచితంగా వైద్యం చేయించుకోవాలని ప్రయత్నిస్తే ఏ మూర్ఖుడు మీ మాటలు నమ్ముతాడు ? మీరు వచ్చినట్లుగానే వెళ్ళండి. లేకపోతే భటులచేత బయటకు గెంటిస్తాను” అని కఠినంగా మాట్లాడాడు. ” అయ్యా ! మిమ్మల్ని సుబ్బయ్యశాస్త్రిని కూడా లెక్కచేసేవాడు కాదు.
కొడుకుతో నిరాదరింపబడినప్పటికీ, ఉత్తమ వంశంలో జన్మించిన కోడలి ఆదరణ వలన ఏకైక మనమని యందు ప్రేమతో ఏదో విధంగా అక్కడ కాలము గడిపెను. అంతలో ఒకసారి ఇతడు ఎవడో బిచ్చగాడు। అని ఒక స్నేహితునితో చెప్పతున్న కుమారుని మాటలు విని అవమానమనే అగ్నిచే దహింపబడుతున్న మనస్సు కలవాడై దూరంగా తన గ్రామంలో ఏదో విధంగా శేషజీవితాన్ని గడపడానికి వెళ్ళిపోయాడు.
Dr. Venkata Rao was angry with the villagers saying that he would stick to his timings only.
When the villagers pleaded with him that it was an urgent case, he retorted saying that doctors were also human and needed rest. He chided them for thinking about themselves only.
Then one of them pointed out that they brought a boy who became unconscious having been hit by a vehicle, and he could not term it as selfishness or thinking about their needs only. Venkata Rao became angrier and commented that under the pretext of helping someone, they wanted to get treatment without paying any fees. He warned them that he would call the police. The villagers said that they would pay fees according to their might, and requested him to check the condition of the delicate boy. Then one of the elder persons among them said that the condition of the boy was deteriorating, and it would be better if they went elsewhere.
Venkata Rao thought that nothing would happen if the population of India was decreased by the death of a puppy dog. He went inside and closed the door.
Venkata Rao was born in a poor family. His mother died when he was five years old. His father kept all his hopes on Venkata Rao only. The intelligent Venkata Rao got seat in MBBS. A rich man made Venkata Rao his son-in-law thinking the handsome Venkata Rao who finished his medical education was a good man. Thus, Venkata Rao became rich and also got a beautiful wife. Within a short time, his income crossed two thousand rupees a month. Venkata Rao, who became very proud, did not care even his father Subbayya Sastri.
His father spent his time there because of the respect shown by his noble daughter-in-law, and his love for his grandchild. But when he overheard his son while the latter spoke about him as a beggar, disheartened, he went back to his village to pass the rest of his life.
विवाहो नाम वणिव्यापार एवेति वेङ्कटरावस्य विश्वासः । तस्य मते धनमेव सर्वप्रधानम् । अत एव ऐश्वर्यवतीं सुशीलां परिणीतवान् । किन्तु अन्वर्थनामधेयवत्याः तस्याः सहजं प्रेम अतथ्याभिनयं मन्यमानः स्वयं तस्याम् आदितः प्रभृति नातीव प्रेमवान् बभूव । वस्तुतश्च तस्य सहजप्रेम्णः, एकैकपात्रं कुमारः सुरेश एव तयोः दाम्पत्यरज्जोः दृढः ग्रन्थिरासीत् येन सा बहोः कालात् पूर्वमेव नाशीर्यत ।
వివాహం అంటే వ్యాపారమని వెంకట్రావు నమ్మకం. అతని దృష్టిలో ధనమే సర్వప్రధానం. “ఇదంతా ధనమే” అని ఆలోచిస్తూ మొత్తం ప్రపంచాన్నంతా ధనమయం గానే చూసాడు. ఇటువంటి ఆలోచన అతని మనస్సులో ఎప్పుడు ప్రవేశించిందో నిశ్చయంగా చెప్పడం సాధ్యంకాదు. బహుశ వైద్యకళాశాలలో చదివేటప్పుడు, ధనికులైన సహవిద్యార్థులను చూసి, తానొక పేదవాని కొడుకునని తెలుసుకొని, ఇతడు తండ్రియందు ద్వేషం, డబ్బుమీద ఆసక్తి పెంచుకున్నాడు. ధనవంతురాలైన కన్యతో వివాహానికి కూడా ధనం మీద ఉండే ఆసక్తే మూలకారణం.
సకలగుణసంపన్నురాలైనప్పటికీ ధనికుని కుమారైకు, పేదవాని కొడుకు యందు సహజమైన ప్రేమ ఉండదని అతడి విశ్వాసం. అందుచేతనే అతడు సార్ధక నామధేయురాలైన సుశీల యొక్క సహజమైన ప్రేమను నటనగా భావించుచున్నవాడై ఆమెయందు మొదటినుండీ ఎక్కువ ప్రేమ కలిగియుండలేదు. వాస్తవానికి అతని యొక్క సహజమైన ప్రేమకు ఏకైక పాత్రుడు కుమారుడైన సురేష్ మాత్రమే. వారి దాంపత్యమనే త్రాటికి బలమైన ముడిగా ఉన్నాడు. లేకపోతే ఆమె ఎప్పుడో చనిపోయి ఉండేది.
For Venkata Rao even marriage was a matter of business. According to him, money alone was the most important thing. That was why he married the rich Suseela. Considering her true love as an act only, from the beginning, he never showed love for her. He loved his son Suresh only. Because of him alone, their marriage did not break up.
तस्मिन् दिवसे भिषजः वेङ्कटरावस्य मानसं किञ्चिद् व्याकुलमासीत् । इदं तस्यातीव दुस्सहं यत् सप्ताहात् पूर्वमेव सर्वकारचिकित्सालये नियोगेनागता तस्य सहाध्यायिनी भिषगङ्गना अद्यावधि तं द्रष्टुं नागतेति । स्वयमेव तां द्रष्टुं जिगमिषतः तस्य मनसि अहङ्कारः उत्पन्नः । लोके अत्यन्तधनिकेषु अन्यतमं मां द्रष्टुं सैव प्रथममागच्छेत् इति चिन्तयन्नासीत् ।
మోసగించడం మా అభిలాషకాదు. మా శక్తి మేరకు ఎంతోకొంత శుల్కం ఇచ్చు కుంటాము. బయటకు వచ్చి ఈ బాలుడి ముఖం చూడండి. అటువంటి సుకుమారుడైన బాలునికి వచ్చిన ఇటువంటి అవస్థను చూస్తేనైనా మీ మనస్సులో జాలి కలుగవచ్చును అని బయటకు వస్తున్న కోపాన్ని నిగ్రహించుకొని ఆ యువకుడు వినయంగా ప్రార్థించాడు. వైద్యుడు వికటంగా నవ్వి “ఆహా ! మీలాంటివాళ్ళ యొక్క సౌకుమార్యం! అంటే గాడిదపిల్ల సౌకుమార్యం వంటిది.” అంటూ పోలీసులకు ఫోన్ చేయడానికి సిద్ధమయ్యాడు. అంతా ఐపోతుంది.
ఒక వృద్ధుడు మందుకు వచ్చి, “ఓయీ ! ఈ జాలిలేని వానివద్దే ఇతనితో గొడవపడుతూ కాలం గడిపేయడం ఎందుకు ? క్షణక్షణానికి బాలుడి పరిస్థితి దిగజారిపోతుంది. రండి, వేరే చోటికి పోదాము” అంటూ ఆ యువకుణ్ణి ఇతరులను కూడా తీసికొనిపోయాడు. వైద్యుడు లోపల నవ్వుకుంటూ – “పొండిరా కుక్కల్లారా ! ఏదైనా ఒక కుక్కపిల్ల చచ్చిపోతే, ప్రతిరోజు పెరిగే భారతదేశపు జనాభాకేమైనా నష్టం కలుగుతుందా ఏమిటి” ? అని ఏదో మాట్లాడుతూ, పెద్ద చప్పుడు, అయ్యేటట్లుగా తలుపు మూసి లోపలకు వెళ్ళిపోయాడు.
That day Venkata Rao was in an agitated mood. His class-mate in college Manjuhasini was appointed as in the Government Hospital in the city. But she did not try to meet him so far. He could not go to meet her because of his ego. He thought that she should come first to meet him as he was one of the richest in the city.
वेङ्कटरावः कस्मिंश्चन निर्धनकुटुम्बे उदभूत् । पञ्चषवर्षदेशीये एव तस्मिन् माता पञ्चत्वमगात् । तस्य पिता पुत्रस्य सुखमेव आत्मनः सुखं मन्यमानः सर्वथा तस्य वर्धन एव तत्परः अभवत् । कुशाग्रधीः बेङ्कटरावोऽपि पाठशालायां सर्वासु कक्ष्यासु प्रथमतया उत्तीर्णतां लभमानः अन्ततः एम्. बि. बि. यस्. परीक्षायां सफलः अभवत् । पठितवैद्यविद्यः, आकाररूपसम्पन्नो बुद्धिमानिति धिया वेङ्कटरावं कश्चिन्महाधनिकः आत्मनो जामातरमकार्षीत् । सुन्दराङ्ग्या जायया साकं सः प्रभूतं वित्तम् अलभत । अनतिदीर्घकाले एव च तस्यार्जनं द्वित्रसहस्र- संख्याम् अतिचक्राम | धनार्जनेन अत्यन्तं गर्विष्ठः सः पितरं सुब्बय्यशास्त्रिणमपि न गणयति स्म । सुतेन अनादृतः सुब्बय्यशास्त्री उत्तमवंशप्रसूतायाः स्रुषायाः आदरवशेन, एकमात्रपौत्रे स्नेहवशेन च यथाकथञ्चित्तत्रैव कालं यापयामास । अन्ततश्चैकदा “अयं कोपि याचकः” इति स्वगृहं प्रत्यागताय मित्राय कथयतः पुत्रस्य वचः श्रुत्वा दुःखितो भूत्वा दूरतः स्वग्रामे जीवितावशेषं यापयितुं जगाम ।
వెంకటరావు ఒకానొక పేద కుటుంబంలో జన్మించాడు. ఐదేళ్ళ వయసులోనే అతని తల్లి మరణించింది. అతని తండ్రి తన ప్రేమనంతా ఆ కుమారుని మీదే చూపిస్తూ, అతడి పెంపకంలోని నిమగ్నుడయ్యాడు. కుశాగ్ర బుద్ధి అయిన వెంకటరావు కూడా పాఠశాలలో అన్ని తరగతుల్లోను మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యేవాడు. చివరిగా M.B.B.S పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. వైద్యవిద్యలో బాగా చదువుకున్నాడని, అందమైనవాడని, బుద్ధిమంతుడని ఆలోచించి ఒక ధనికుడు అతడిని అల్లుడిగా చేసుకున్నాడు.
అందమైన భార్యతో పాటు చాలా ధనం కూడా వచ్చింది. కొద్దిరోజుల్లోనే అతని ఆదాయం రెండువేలు దాటింది. ధన సంపాదనతో గర్వించిన వెంకటరావు తన తండ్రి అయిన ఆ రోజు వైద్యుడు వెంకట్రావు యొక్క మనస్సు కొంచెం వ్యాకులపడినట్లుగా ఉంది క్రిందటే ప్రభుత్వ వైద్యశాలలో లేడీ డాక్టరుగా నియమించబడిన తన సహాధ్యాయి ఈనాటికి తనను చూడటానికి రాకపోవడం అతనికి సహించలేనిదిగా ఉంది. పోనీ తానే స్వయంగా వెళ్ళాలని భావించినా అతని మనసులో అహంకారం కల్గింది. లోకంలో అత్యంత ధనికుడనైన నా `వద్దకే ఆమె ముందుగా రావాలని భావించాడు.
That day Venkata Rao was in an agitated mood. His class-mate in college Manjuhasini was appointed as in the Government Hospital in the city. But she did not try to meet him so far. He could not go to meet her because of his ego. He thought that she should come first to meet him as he was one of the richest in the city.
अत्रान्तरे तस्य दूरभाषिणी नदति स्म । चिन्तामग्नः वेङ्कटरावः श्रावणीं श्रवसि निधाय “कः कोऽत्र भोः ” इत्यपृच्छत् । स एव स्वरः यस्य कृते सः निरीक्षमाणः आसीत् । तस्य सहाध्यायिनी भिषगङ्गना मञ्जुहासिनी वेङ्कटरावं सर्वकारस्य चिकित्सालयम्प्रति झटिति आगन्तुं प्रार्थयति स्म । अतिक्लिष्टः कश्चन यादृच्छिकः प्रहारः चिकित्सितव्यः यत्र वेङ्कटरावस्य साहाय्यम् अपेक्ष्यते इति सा वदति स्म । शीघ्रमेव सः स्वीयकार्यानस्य चोदकम् आह्वयत् । कार्यानस्य अवरोधकारणात् कुमारं सुरेशं पाठशालातः आनेतुं न शक्तवानहम् इति वक्तुं प्रयतमानं तं चोदकं भर्त्सयन् वेङ्कटरावः अतिवेगेन सर्वकारचि- कित्सालयं नयत्विति आदिदेश ।
पुरा कदाप्यदृष्टां परचिकित्साश्रद्धाम् अस्य दृष्ट्वा विस्मितचित्तः चोदकः तं शीघ्रं चिकित्सालयम् अनयत् । तत्र गत्वा सः अर्धघण्टायाः पूर्वं स्वसमीपम् आगतान् ग्रामीणान् तेषां च निकटे शायितं बालं च अपश्यत् । स बालः न कोऽप्यन्यः, तस्य पुत्रः सुरेश एव । बालस्य श्वासं परीक्ष्य अधरविस्फाटितेन नैराश्यं सूचयन्तीं मञ्जुहासिनीं विलोक्य व्रीडादुःख- विहतमनाः भिषक् वेङ्कटरावः मूर्च्छितः अभवत् ।
ఇంతలో వాళ్ళు వెళ్ళిన అరగంటలోనే ఫోను మ్రోగింది. వైద్యుడు వెంకట్రావు ఏమీ తెలియని వాడులాగ రిసీవర్ చెవిదగ్గర పెట్టుకొని, “హలో ! ఎవరక్కడ?” అని అడిగాడు. ఆహా ! తాను చిరకాలంగా నీరిక్షిస్తున్న స్వరం వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు రమ్మని ప్రార్థిస్తూ వినిపించింది. అతిక్లిష్టమైన ఒక యాదృచ్ఛిక ప్రమాదంలో (ఏక్సిడెంట్) కలిగిన గాయానికి చికిత్స చేయడంలో వెంకట్రావు సహాయం అవసరమైంది. ఊహించ కుండా కలిగిన ఈ అవసరాన్ని చూసి వెంకట్రావుకి అపరిమితమైన ఆనందం కలిగింది. వెంటనే బట్టలు ధరించి బయటకు వచ్చి డ్రైవర్ని గట్టిగా పిలిచాడు. అప్పుడే ఎక్కడినుండో వచ్చిన డ్రైవర్ ఇలా అన్నాడు, “అయ్యా ! పాఠశాల నుండి మీ కుమారుడైన సురేష్ను తీసుకొని వచ్చుటకు వెళుతూ మార్గమధ్యంలో కారుబ్రేకు బిగింపజేయడానికి కారు బాగుచేసే చోటికి వెళ్ళాను. అక్కడ కొద్దిగా ఆలస్యమైంది.
తరువాత పాఠశాలకు వెళ్ళిన నాకు మీ కుమారుడు కనబడలేదు. బహుశా అతడు నడుస్తూ ……. ” అని చెబుతూ ఉండగానే అతడి మాటలను ఆపి వెంకట్రావు, “సరే సరే అతడు వచ్చేసి ఉండవచ్చు. ఇప్పుడు మనం త్వరగా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళాలి. కష్టమైన ఒక చికిత్స విషయంలో నా సహాయం అవసరమైంది.” అని అంటూ సమాధానం కోసం ఎదురుచూడకుండా కారులో దర్పంగా కూర్చున్నాడు. ఇతరులకు చికిత్స చేసే విషయంలో గతంలో ఎప్పుడూ చూడని శ్రద్ధ చూసి ఆశ్చర్యపడిన డ్రైవరు త్వరగా వైద్యశాలకు తీసుకొని వెళ్ళాడు.
వైద్యం చేసే గదిలోకి ప్రవేశించగానే కళ్లతో మంజుహాసినిని వెదుకుతూ, అర్థగంట క్రితమే తన దగ్గరకు వచ్చిన పల్లెటూరి జనాన్ని వాళ్ళ సమీపంలోనే పడుకొని ఉన్న బాలుడి శ్వాసను పరీక్షించి, పెదవి విరుస్తూ నిరాశను వ్యక్తపరుస్తున్న మంజుహాసినిని చూసి సిగ్గుతో దుఃఖంతో దెబ్బతిన్న మనస్సుగలవాడై మూర్ఛపోయాడు.
Then the telephone rang. It was the voice he was waiting to hear. Manjuhasini requested his help regarding a critical accident case, and asked him to come to the general hospital immediately. At once, he called for his driver. As the driver tried to tell him that he could not pick his boy from school as he was delayed in getting the brake repaired, Venkata Rao stopped him saying that he needed to go to general hospital quickly.
The driver, surprised at the attention Venkata Rao was paying for someone else’s case, drove him quickly to the hospital. On reaching there, Venkata Rao saw the villagers who came to him half an hour earlier, and a boy lying near them. He was none other than his son Suresh. As Manjuhasini bit her lip showing no hope, overcome by shame and grief, Venkata Rao swooned.