TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 3rd Lesson బండారి బసవన్న Textbook Questions and Answers.

బండారి బసవన్న TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana

చదువండి ఆలోచించి చెప్పండి.

గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానాషా. ఇతని పాలనా కాలంలో భద్రాచలం తహశీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఆయన శ్రీరామభక్తుడు. ప్రజల నుండి వసూలు చేసిన సుమారు ఆరు లక్షల రూపాయల పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. సీతారాములకు విలువైన నగలు చేయించాడు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే నెపంతో గోపన్నను కారాగారంలో బంధించారు. గోపన్న తన కీర్తనలతో శ్రీరాముడిని వేడుకొన్నాడు. శ్రీరాముడే తానాషాకు ఆ సొమ్ము చెల్లించి బంధవిముక్తుడిని చేశాడు.

ప్రశ్నలు

ప్రశ్న 1.
కంచర్ల గోపన్న ఎవరు ?
జవాబు.
కంచర్ల గోపన్న గోలకొండ పాలకుడైన అబుల్ హసన్ తానాషా పాలనాకాలంలో భద్రాచలం తహశీల్దారుగా ఉండేవాడు. గోపన్న గొప్ప శ్రీరామభక్తుడు.

ప్రశ్న 2.
అతనిపై మోపిన అభియోగమేమిటి ?
జవాబు.
ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడని అతనిపై అభియోగం మోపబడింది.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

ప్రశ్న3.
గోపన్న ఎట్లా బంధ విముక్తుడయ్యాడు ?
జవాబు.
గోపన్న తన కీర్తనలతో శ్రీరాముని వేడుకున్నాడు. కరుణించిన శ్రీరాముడు గోపన్న ఇవ్వవలసిన సొమ్ము తానే చెల్లించి బంధవిముక్తుడిని చేశాడు.

ప్రశ్న 4.
గోపన్న వంటి భక్తులను గురించి మీకు తెలుసా ?
జవాబు.
గోపన్న వంటి భక్తులకు మనదేశం పెట్టింది పేరు. అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని మీద భక్తితో సుమారు ముప్పై మూడువేల సంకీర్తనలు రాశాడు. దైవాన్ని తప్ప మానవులను స్తుతించను, వారిపై కీర్తనలు రాయను అన్నందుకు ఘోరశిక్షలను అనుభవించాడు. క్షేత్రయ్య మొవ్వ వేణుగోపాలస్వామి భక్తుడు. మధురభక్తితో పదాలు రచించి ఆ దేవుని కీర్తించాడు. తరిగొండ వెంగమాంబ, అక్క మహాదేవి రచయిత్రులు కూడ భగవంతునిపై కీర్తనలు, వచనాలు రాశారు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.24)

ప్రశ్న 1.
‘సురతరువు, కనకాచలం, సురధేనువు, భక్తి చింతామణి అనే పదాలను వాడడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
సురతరువు పాలసముద్రం నుండి పుట్టి దేవలోకంలో ఉన్న గొప్ప వృక్షము. కనకాచలం దేవలోకంలో ఉన్న బంగారపుకొండ. పార్వతీదేవి నివాసం చాలా ఎత్తైనది. సురధేనువు పాలసముద్రం నుండి పుట్టి బ్రహ్మర్షి వసిష్ఠుని ఆశ్రమంలో పూజలందుకుంటున్న కామధేనువు. చింతామణి పాలసముద్రం నుంచి పుట్టింది. కోరిన కోరికలు తీర్చే రత్నం. ఇలా ఇవన్నీ చాలా గొప్పవి. వాటిని తుచ్ఛమైన వాటితో పోల్చరాదు. అలాగే శివభక్తులు చాలా గొప్పవారు. ఆ భక్తిలో మునిగినవారు అల్పమైన కోరికలకు లొంగరు అని చెప్పటం కవి ఉద్దేశం.

ప్రశ్న 2.
‘బగుతుడాసించునే పరధనమునకు’ దీనిపై మీ అభిప్రాయమేమిటి ?
జవాబు.
పగతుడు అంటే శత్రువు. శత్రువు మనపైన దాడిచేయటానికి కారణం రాజ్యం మీదనో, భూమి మీదనో, ధనం మీదనో ఆశ కలిగి ఉండటం. అటువంటి శత్రువు కూడా శివభక్తి కలిగి ఉన్నప్పుడు ఇతరుల ధనాన్ని కోరడు. అటువంటిది శివభక్తి వ్రతంగా బ్రతికే బసవన్న రాజు ధనాన్ని కోరడు అని కవి బసవని భక్తిని గురించి వర్ణించాడు అని నా అభిప్రాయం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.25)

ప్రశ్న 1.
‘శివ భక్తులను హంస, చిలుక, చకోరం, తుమ్మెదలతో కవి ఎందుకు పోల్చి ఉంటాడు ?
జవాబు.
హంస శ్రేష్ఠమైన పక్షి. మానస సరోవరంలో విహరిస్తుంది. చిలుక పలుకు నేర్చి రామనామం జపించే ఉత్తమమైన పక్షి. అల్పమైన పండ్లను కోరదు. మామిడిపండ్లు మాత్రమే తింటుంది. చకోరం వెన్నెలపక్షి. చంద్ర కిరణాలతో అమృతాన్ని ఆస్వాదిస్తుందే తప్ప మంచుతుంపర్లు పీల్చదు. తుమ్మెద… పూలలో రాణియైన తామర పువ్వులోని సుగంధాన్ని పీలుస్తూ తిరుగుతుంది. ప్రబ్బలి పూల జోలికి పోదు. శివభక్తులు కూడ అల్పులను ఆశ్రయించరు. వారు గొప్పవారు అని చెప్పడానికే కవి అలా పోల్చాడు.

ప్రశ్న 2.
“ఒడయల కిచ్చితి నొడయల ధనము” అనడంలో అర్థం ఏమై ఉంటుంది ?
జవాబు.
ఈ సమస్త ప్రపంచము ఈశ్వరుని ప్రసాదమే. మనం నాది నాది అని భ్రమ పడుతున్నాం. మనది అనేది ఏదైనా శివుడిచ్చినదే. జంగం దేవరలు సాక్షాత్తు శివుని అవతారం. కాబట్టి వారికి మనమిచ్చేది ఏదైనా మనసొంతంకాదు. వారి సొమ్మే వారికిస్తున్నాము అని కవి వివరించాడు.

ఇవి చేయండి

విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

I. “అచంచల భక్తి పారవశ్యం కల్గిన వాళ్ళు ధనాశకు లోనుకారు” దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు.
ఏనుగు కుంభస్థలాన్ని బద్దలుచేసి తినే సింహం గడ్డిమేయదు. పాలసముద్రంలో హాయిగా విహరించే హంస నీటిమడుగులలో నీరు తాగదు. దోరమామిడిపళ్ళ రుచి మరిగిన చిలుక బూరుగు చెట్టుపైన కాసే దూదికాయలను తినదు. స్వచ్ఛమైన పున్నమి వెన్నెలను ఆస్వాదించే చకోర పక్షి చీకట్లను ఆరగించదు. విరిసిన పద్మాలలో సుగంధాన్ని పీల్చి ఆనందించే తుమ్మెద బబ్బిలి పూలవాసన కోరదు. దేవతల ఏనుగు యొక్క సంతానము పందిపాలను తాగటానికి ఇష్టపడదు. అలాగే అచంచల భక్తి పారవశ్యం కల్గినవాళ్ళు ధనాశకు లోనుకారు.

2. ద్విపదను రాగయుక్తంగా పాడండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. పాఠంలో కింది భావాలున్న పాదాలను గుర్తించండి. వీటిని ఎవరు ఎవరితో అన్నారో చెప్పండి.

అ) మా ధనాన్ని అప్పగించి వెళ్ళు.
జవాబు.
“మా యర్థ మొప్పించి పొమ్ము.”
ఈ పాదం రాజు బిజ్జలుడు దండనాయకుడైన బసవన్నతో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

ఆ) తామర పూల వాసనలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలను ఎట్లా ఆస్వాదిస్తుంది ?
జవాబు.
“విరిదమ్మి వాసన విహరించు తేఁటి
పరిగొని సుడియునే బబ్బిలి విరుల”
ఈ పాదములు దండనాయకుడైన బసవన్న రాజైన బిజ్జలునితో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.

ఇ) సింహం ఎక్కడైనా గడ్డిమేస్తుందా ?
ప్రశ్న : ఈ వాక్యం ఏ పాఠంలోనిది ? ఎవరు అన్నారు ? ఎవరితో అన్నారు ?
(లేదా)
“మృగపతి యెద్దెస మేయునే పుల్లు” ఈ వాక్యం ఏ పాఠంలోనిది ? ఎవరు ఎవరితో అన్నారు ?
జవాబు.
ఈ పాదం మంత్రి, దండనాయకుడు ఐన బసవన్న ప్రభువైన బిజ్జలునితో అన్నాడు.
ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకున్న బండారి బసవన్న పాఠంలోనిది.

2. కింది పద్యం చదువండి. ఖాళీలను పూరించండి.

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ !

అ) ఖరము అంటే _________
జవాబు.
గాడిద

ఆ) కూడు అంటే _________
జవాబు.
తిండి

ఇ) గంగిగోవు పాలను _________ తో పోల్చాడు.
జవాబు.
భక్తి

ఈ) ఈ పద్యాన్ని _________ రాశాడు.
జవాబు.
వేమన

ఉ) ఈ పద్యం _________ శతకంలోనిది.
జవాబు.
వేమన

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) బండారి బసవన్న స్వభావాన్ని రాయండి.
జవాబు.
బండారి బసవన్న గురించి పాల్కురికి సోమనాథుడు గొప్పగా రాశాడు. బండారి బసవన్న గొప్ప శివభక్తుడు. జంగమ దేవరలను సాక్షాత్తు పరమశివునిగా భావించి పూజిస్తాడు. ఈ జగమంతా ఈశ్వర వరప్రసాదమని భావించాడు. అందుకే ఈశ్వరుడు మనకిచ్చినదానిని శివభక్తులకు సమర్పించటంలో తప్పులేదంటాడు. పరులధనానికి ఎప్పుడూ ఆశించడు. సత్యధర్మవ్రతుడు కనుక రాజుముందైనా సరే నిర్భయంగా మాట్లాడగలడు. ఎంతటి రాజోద్యోగులైనా అతడిని తప్పు పట్టాలంటే భయపడతారు. బసవన్న తన ఉద్యోగ విధులను, గృహధర్మాలను, శివారాధనను క్రమం తప్పకుండా సమర్థవంతంగా నిర్వహించేవాడు.

ఆ) బండారి బవసన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు కదా ! ఇట్లా ఎప్పుడు నిర్భయంగా మాట్లాడగలుగుతారు?
జవాబు.
బండారి బసవన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు. ఎందుకంటే అతడు తన విధి నిర్వహణలో ఏ లోపమూ రానివ్వలేదు. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించాడు. అన్నింటిని మించి గొప్ప శివభక్తుడు.
అలాగే మనం మనసులో కల్మషం లేకుండా ఉండాలి. సత్యం మాట్లాడాలి. ధర్మాన్ని ఆచరించాలి. ఏ తప్పు చేయకూడదు. ఎవరికీ కీడు చెయ్యాలని ప్రయత్నించకూడదు. అలా మంచి ప్రవర్తన కలవారిలో ఆత్మవిశ్వాసం దృఢంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం నిర్భయంగా మాట్లాడగలం.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

ఇ) భక్తుడు పరధనాన్ని ఆశించడు. ఎందుకు ?
(లేదా)
బండారి బసవన్న పాఠంలో భక్తుడిని వేటితో పోల్చారు ? పరధనాన్ని వేటితో పోల్చారు ?
జవాబు.
భక్తుడు ఎప్పుడూ పరధనాన్ని ఆశించడు. ఎందుకంటే పరుల సొమ్ము పామువంటిది. నీచమైనది. కష్టపడి సంపాదించుకున్నదే మన సొంతం అని భక్తుడు నమ్ముతాడు. శివభక్తుడు మానవులలో ఉత్తమమైనవాడు. ఆ భక్తి అతనికి కల్పతరువు, కామధేనువు, మేరుపర్వతం, చింతామణి వంటిది. ఇవి ఉన్నవాడికి ఏది కోరితే అది లభిస్తుంది. అలాగే శివభక్తి కలవాడు పరధనాన్ని కోరడమంటే సింహం గడ్డి మేసినట్లు. అందుచేత శివభక్తుడు పరధనాన్ని ఆశించడు.

ఈ) “క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావంగ” అని బసవన్న అనడంలో గల ఉద్దేశం ఏమిటి?
(లేదా)
బండారి బసవన్న పాఠంలో శివభక్తుణ్ణి వేటితో పోల్చారు ?
జవాబు.
సింహం గడ్డిమేయడానికి ఇష్టపడదు. మామిడిపళ్ళు తినే చిలుక బూరుగు పళ్ళు తినదు. పున్నమి వెన్నెలను ఆస్వాదించే చకోరపక్షి చీకటిని ఆస్వాదించదు. తామరపూల వాసన పీల్చే తుమ్మెద ఉమ్మెత్త పూల దగ్గరకి పోదు. ఏనుగుపిల్ల పంది దగ్గర పాలు తాగదు. అలాగే పాలసముద్రంలో విహరించే హంస కుంటలలో నీరు తాగదు అని కవి వర్ణించాడు. ఉత్తమమైనవారు ఉత్తమమైన వాటినే కోరుకుంటారు. అల్పమైన వాటికి ఆశపడరు అని కవి ఉద్దేశం.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

బసవని గురించి తెలుసుకున్నారు కదా ! భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో రాయండి.
(లేదా)
బండారి బసవన్న పాఠం ఆధారంగా శివభక్తుల గుణగణాలు రాయండి.
(లేదా)
బసవన్న భక్తితత్పరత గురించి రాయండి.
జవాబు.
పాల్కురికి సోమనాథుడు బండారి బసవన్న ద్వారా భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పాడు.
బసవన్న భక్తి : బసవన్న పరమ శివభక్తుడు. చిత్తశుద్ధితో పూజలతో పాటు తన కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. అందుకే అతనిలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్నది. ఎవ్వరితోనైనా నిర్భయంగా మాట్లాడగలిగేవాడు. అందరూ అతడిని గౌరవించేవారు.

భక్తుని లక్షణాలు : బసవని వ్యక్తిత్వం తెలుసుకున్న తరువాత భక్తుని లక్షణాలు ఎలా ఉండాలో మనకు అర్థమౌతుంది. భక్తునికుండవలసిన ప్రధాన లక్షణం స్వచ్ఛమైన మనసు. నిర్మలమైన మనసుతో భగవంతుని ఆరాధిస్తే తప్పక అనుగ్రహిస్తాడు. భక్తుడైనవాడు దేవుని మాత్రమే గాక ఆయన భక్తులను కూడ దేవునితో సమంగా భావించాలి. వారిని ఆదరించి వారి కోరికలు నెరవేర్చాలి. భక్తులు కోరినదిచ్చేటప్పుడు మనదేదో వారికి దానం చేస్తున్నామన్న అహంకారం ఉండకూడదు. వారి సొమ్ము వారికిస్తున్నామన్న భావనతో దానం చేయాలి. భక్తుడు ఇతరుల సొమ్మును ఆశించకూడదు. సత్యవ్రతం కలిగి ఉండాలి. ఆడినమాట తప్పకూడదు. ఇలా నడుచుకొనేవాడు నిజమైన భక్తుడు.

IV. సృజనాత్మకత/ ప్రశంస

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.

అ) ద్విపద రూపంలోనున్న ఈ పాఠ్యాంశ విషయాన్ని సంభాషణ రూపంలో రాయండి.

బండారి బసవన్న … కోశాగారంలోని సొమ్మును జంగందేవరకు దానం చేశాడని అధికారులు బిజ్జల మహారాజుకు నివేదించారు. రాజు అతనిని దండించాలని సైనికులను పిలుచుకురమ్మని పంపించాడు.

V. పదజాల వినియోగం:

1. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి.

అ) క్షీరాబ్ధిని మథించినప్పుడు అమృతం పుట్టింది.
జవాబు.
పాలసముద్రం

ఆ) కొండ గుహలలో నివసించే మృగపతి అడవికి రాజు.
జవాబు.
సింహం

ఇ) పుడమీశులు ప్రజలను చక్కగా పరిపాలించారు.
జవాబు.
రాజులు

2. కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.

ప్రకృతివికృతి
అ) ఆశ్చర్యంఎ) బత్తి
ఆ) భక్తిబి) దెస
ఇ) దిశసి)  పుడమి
ఈ) పృథ్విడి) అచ్చెరువు

జవాబు.

ప్రకృతివికృతి
అ) ఆశ్చర్యండి) అచ్చెరువు
ఆ) భక్తిఎ) బత్తి
ఇ) దిశబి) దెస
ఈ) పృథ్విసి)  పుడమి

 

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పట్టికను పూరించండి.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న 1
జవాబు.

సంధి పదంవిడదీసి రాయండి.సంధి పేరు
ఉదా : క్షీరాబ్ధిక్షీర + అబ్దిసవర్ణదీర్ఘ సంధి
1. కనకాచలంకనక + అచలంసవర్ణదీర్ఘ సంధి
2. నాకొకనాకు + ఒకఉత్వసంధి
3. కాదేనికాదు + ఏనిఉత్వసంధి
4. అతనికిచ్చెనుఅతనికి + ఇచ్చెనుఇకారసంధి
5. పుట్టినిల్లుపుట్టిన + ಇಲ್ಲುఅత్వసంధి
6. ఏమిటిదిఏమిటి + ఇదిఇత్వ సంధి
7. నాయనమ్మనాయన + అమ్మఅత్వసంధి
8. పుడమీశపుడమి + ఈశఇత్వ సంధి

 

గుణసంధి:

2. కింది పదాలను విడదీయండి.

ఉదా : రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)
అ) గజేంద్రుడు = గజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)

ఉదా : పరమేశ్వరుడు = పరమ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)
ఆ) సర్వేశ్వరుడు = సర్వ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)

ఉదా : వసంతోత్సవం = వసంత + ఉత్సవం (అ + ఉ = ఓ)
ఇ) గంగోదకం = గంగ + ఉదకం (అ + ఉ = ఓ)

ఉదా : దేవర్షి = దేవ + ఋషి
(అ + ఋ = అర్)
ఈ) మహర్షి = మహా + ఋషి
(అ + ఋ = అర్)

పై పదాలను గమనించండి. వాటిని మూడు రకాలుగా విడదీయటం జరిగింది. మూడు సందర్భాల్లోను పూర్వస్వరం ‘అకారం’ ఉన్నది. పరస్వరం స్థానంలో ఇ, ఈ, ఉ, ఋ లు ఉన్నాయి.”

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

‘అ’ కారానికి ‘ఇ/ఈ’ – పరమైనప్పుడు ‘ఏ’ (ే)
అకారము అంటే ‘అ’ లేదా ‘ఆ’.
”అ’ కారానికి ‘ఉ’ – పరమైనప్పుడు ‘ఓ’ (ో)
‘అ’ కారానికి ‘ఋ’ – పరమైనప్పుడు ‘అర్’
ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు.
‘అ’ కారం స్థానంలో ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వచ్చాయి. ఇట్లా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు.
‘అ’ కారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వస్తాయి.

3. కింది పదాలను కలిపి, సంధి ఏర్పడిన విధానాన్ని తెలుపండి.
TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న 2
జవాబు.
ఉదా : మహా + ఇంద్రుడు = మహేంద్రుడు (అ + ఇ = ఏ) (ే)
అ) దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు (అ + ఇ = ఏ) (ే)
ఆ) గణ + ఈశుడు = గణేశుడు (అ + ఈ = ఏ) (ే)
ఇ) నర + ఉత్తముడు = నరోత్తముడు (అ + ఉ = ఓ) (ో)
ఈ) నవ + ఉదయం = నవోదయం (అ + ఉ = ఓ) (ో)
ఉ) బ్రహ్మ + ఋషి = బ్రహ్మర్షి (అ + ఋ = అర్) (ర్షి)

భాషా కార్యకలాపాలు / ప్రాజెక్టు పని

ప్రశ్న 1.
ఈ బసవని వంటి పరమ భక్తులలో ఒకరి కథను సేకరించి, మీ సొంతమాటల్లో రాసి దాన్ని తరగతిలో చెప్పండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు : “మహా శివభక్తుడు – చిఱుతొండ నంబి”
2) సమాచారాన్ని సేకరించిన విధానం : గ్రంథాలయ పుస్తకం ద్వారా
ఆ) నివేదిక :
విషయ వివరణ:
చిఱుతొండ నంబి మహా శివభక్తుడు. అతని భార్య తిరువెంగనాచి కూడా మహా శివభక్తురాలు. వారికి లేక లేక కలిగిన ముద్దుల సంతానమే సిరియాళుడు. ఈ దంపతులిరువురు ప్రతిరోజు స్నానం – పూజ ముగించుకొన్న పిమ్మట, మడితో వంట వండి, ఒకరిద్దరు అతిథులకు భోజనం పెట్టిన పిమ్మట తాము భుజించే సాంప్రదాయం గలవారు. వీరి కుమారుడు సిరియాళుడు కూడా తల్లిదండ్రుల మాట జవదాటని వాడై, మహా శివభక్తి గలవాడై, దిన దిన ప్రవర్ధమానంగా అనేక విద్యలనభ్యసిస్తూ పెరుగుతున్నాడు.

ఈ దంపతులిద్దర్నీ పరీక్షించాలనే ఉద్దేశంతో శివుడు, పార్వతి ఇద్దరూ వృద్ధ దంపతుల రూపంలో చిఱుతొండ నంబి ఇంటికి వచ్చారు. వారి రాకకు ఎంతో ఆనందించిన చిఱుతొండ నంబి దంపతులు ఆ వృద్ధ బ్రాహ్మణులను సాదరంగా ఆహ్వానించి, వారికి శాకాహార భోజనం వండి, తినడానికి పిలిచారు. అప్పుడు ఆ కపట బ్రాహ్మణుడు మాకు నరమాంసం లేనిదే గొంతులోకి ముద్ద దిగదని చెప్పగా విని చిఱుతొండ నంబి దంపతుల గుండెల్లో రాయి పడ్డట్టయ్యింది. మనిషి మాంసం ఎలా తేగలమని బెంగతో వారు చింతాక్రాంతులై ఉండగా తనను చంపి వండమని వారి పుత్రుడు సిరియాళుడు కోరాడు.

ఎంతో దుఃఖభరితమైన మనసుతో వారు తమ పుత్రుణ్ణి చంపి వండడానికి సిద్ధపడ్డారు. అప్పుడు శివుడు, సిరియాళుని వద్దకు వెళ్ళి నీ తల్లిదండ్రులు నిన్ను చంపి వండుతారు, ఇల్లు వదలి పారిపొమ్మనగా సిరియాళుడు తిరస్కరించి, శివపూజకు నా దేహం అర్పించుటకంటే భాగ్యమేమున్నదని పలికాడు. చివరకు అతణ్ణి చంపి వృద్ధ బ్రాహ్మణులకు వండి పెట్టారు. నీ కుమారుడు సిరియాళుడు లేనిదే నేను భుజింపనని శివుడనగా, చిఱుతొండ నంబి దుఃఖించుచుండగా ‘చిఱుతొండా ! ఒక్కసారి సిరియాళా అని పిలువు’ అని శివుడు అనగానే చిఱుతొండడు ‘సిరియాళా’ అని పిలువగానే శివ వర ప్రభావంతో సిరియాళుడు బ్రతికి వచ్చాడు.

ఇ) ముగింపు :
శివుని పూజకోసం, అతిథి దేవుళ్లను సంతృప్తి పరచడం కోసం కన్న కొడుకునే చంపిన తల్లిదండ్రులను చూచి వారి మూఢ భక్తికి ఆశ్చర్యం వేసింది. చివరికి సిరియాళుడు బ్రతికి రావడం మాత్రం నాకు చాలా ఆనందం
కలిగించింది.
TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న 4

TS 8th Class Telugu 3rd Lesson Important Questions బండారి బసవన్న

ప్రశ్న 1.
బండారి బసవన్న పాఠం సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
బండారి బసవన్న గొప్ప శివభక్తుడని నిరూపించండి.
జవాబు.
బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిచి ధనాగారం నుండి తీసిన ధనం మాకు అప్పగించి మీరిక వెళ్ళవచ్చు. ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనం ఆశించనని ప్రతిజ్ఞ చేశారుకదా! అని అన్నాడు. బసవన్న “శివభక్తి అనే కల్పవృక్షం, శంకరునిపై భక్తి అనే బంగారు (మేరు పర్వతం నా అధీనంలో ఉండగా ఇతరుల ధనాన్ని ఆశిస్తానా” అని అన్నాడు.

హంస మడుగు నీటిని త్రాగనట్లే, మామిడి పండ్లు తినే చిలుక బూరుగ చెట్టు పండ్ల వైపు కన్నెత్తి చూడనట్లే, చకోరపక్షి చీకటిని ఆస్వాదించనట్లే, ఏనుగుపిల్ల పందిపాలు త్రాగదని తెలియదా! శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు? స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను. ఇతరుల ధనంతో నాకేంపని? మీ ధనంకోసం నేను చేయిచాపను. నేను న్యాయం తప్పను. మీకు నామీద నమ్మకం లేకపోతే మీ సొమ్ము లెక్కచూసుకోండి అని బసవన్న పలికాడు.

ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి, తాళాలు తీయించి, మూతలు తెరిపించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెలనిండా బంగారు నాణేలు (మాడలు) ఉన్నాయి. తళతళలాడుతున్న ఆ నాణేలను లెక్కించిచూడగా, లెక్కకన్నా ఎక్కువగానే ఉన్నాయి. నిజాయితీపరుడైన బసవన్న ఏ రాజద్రోహం చేయలేదని బిజ్జలుడు గ్రహించాడు. శివుని భక్తివల్ల తీసిన ధనమంతా మరల ధనాగారంలోకే రావటంతో బసవన్న పరమ శివభక్తుడు అని చెప్పవచ్చును.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

ప్రశ్న2.
బండారి బసవన్న రాజద్రోహం చేయలేదని ఎలా చెప్పగలవు ?
(లేదా)
బసవన్న నిజాయితీ ఎటువంటిది ?
జవాబు.
బసవన్న తన విధి నిర్వహణలో ఏ లోపమూ రానివ్వలేదు. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించిన గొప్ప భక్తుడు. మనసులో కల్మషం లేకుండా సత్యం పల్కుతూ, ధర్మాన్ని ఆచరిస్తూ, ఆత్మవిశ్వాసంతో ఎవరికీ కీడు చేయకుండా, ఉ న్న విషయం నిర్భయంగా మాట్లాడేవాడు. ప్రపంచమంతా ఈశ్వర వరప్రసాదమని భావించాడు.

అందుకే ఈశ్వరుడు మనకిచ్చిన దానిని శివభక్తులకు సమర్పించడంలో తప్పులేదంటాడు బసవన్న. తన ఉద్యోగ విధులను, గృహధర్మాన్ని, శివారాధనను క్రమం తప్పకుండా నిజాయితీగా ఆచరించే బసవన్న రాజద్రోహం చేయలేదని చెప్పవచ్చు. ఎందుకంటే బిజ్జలుడు ఆ సొమ్ము ఉన్న పెట్టెలను తెచ్చి తెరిపించగా అందులో మాడలు అందులోనే తళతళలాడుతూ ఉన్నాయి. సొమ్ము అంతా లెక్కకు సరిపోయింది కనుక రాజద్రోహం చేయలేదని చెప్పవచ్చు.

ప్రశ్న3.
మీ పాఠం ఆధారంగా “భక్తి” అంటే మీరేమనుకుంటున్నారో రాయండి.
(లేదా)
బండారు బసవన్న పాఠం ఆధారంగా “భక్తి” భావన గురించి రాయండి.
జవాబు.
బండారి బసవన్న పరమ శివభక్తుడు. చిత్తశుద్ధితో పూజలు చేయటమే కాకుండా కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. ఆత్మవిశ్వాసం, నిర్భయత్వంగల ఇతడిని అందరూ గౌరవించేవారు. భక్తులకుండాల్సిన లక్షణాలన్నీ బసవన్నలో ఉన్నాయి. స్వచ్ఛమైన మనసు, దైవభక్తులను దైవస్వరూపులుగా భావించుట, వారిని ఆదరించి వారి కోర్కెలు తీర్చుట, అహంకారం లేకుండా మనవద్ద ఉన్న వారి సొమ్ము వారికిస్తున్నామనే భావనతో సంతోషంగా దానం చేయటం, పరుల సొమ్ము ఆశించకుండా సత్యవ్రతం కల్గి, ఆడినమాట తప్పకుండా నడుచుకొనేవాడే నిజమైన భక్తుడు అని బసవన్నను చూస్తే తెలుస్తుంది.

సంభాషణ

రాజు : భటులారా ! బసవన్న దండనాయకుని వెంటనే పిలుచుకురండి.
భటులు : చిత్తం మహాప్రభూ ! (భటులు బసవన్నతో కలిసి ప్రవేశం)
రాజు : దండనాయకా ! నీవు ధనాగారంలోని సొమ్ము దానం చేశావని అభియోగం. దీనికి నీ సమాధానమేమి?
బస : ప్రభూ ! మీ సొమ్ము నేను తాకలేదు. ఇది అబద్ధం.
రాజు : మా అధికారులు కళ్ళతో చూసిన నిజం నాకు చెప్పారు. వెంటనే మా సొమ్ము మాకప్పగించు. నువ్వు పదవి నుండి తప్పుకో.
బస : నేను అపరాధం చెయ్యలేదు.
రాజు : నీ మాటలు భయం కలిగిస్తున్నాయి. మా ధనం మా కప్పగించి వెంటనే వెళ్ళిపో. పరధనానికి ఆశించను అని ప్రతిజ్ఞ చేసి ఇలా మా ధనం కాజేయవచ్చునా ?
బస : (చిరునవ్వుతో) కామధేనువు, కల్పవృక్షము, మేరుపర్వతము, చింతామణి వంటి శక్తివంతమైన ఈశ్వరభక్తి నా దగ్గర ఉండగా నా కంటె ధనవంతుడెవరు ? నీ సొమ్ము నేనాశిస్తానా ? సింహం గడ్డిమేస్తుందా ? పాలసముద్రంలో తిరిగే హంస నీటిగుంటలలో తిరుగుతుందా? మామిడిపళ్ళు తినే చిలుక బూరుగు పళ్ళు తింటుందా ? వెన్నెల తాగే చకోర పక్షి చీకటిని కోరుతుందా ? తామరపూల సుగంధాన్ని పీల్చే తుమ్మెద ప్రబ్బలి పూలజోలికి వెళుతుందా ? ఏనుగుపిల్ల పంది పాలు తాగుతుందా ? జంగం దేవరలకు దాసుడను. డబ్బు నాకొకలెక్కా? మీ డబ్బు కోసం నేనెప్పుడూ చెయ్యి జాపను. ఆడిన మాట తప్పేవాడిని కాను. ఈశ్వర ప్రసాదితమైన సొమ్ము ఈశ్వరభక్తునికే ఇచ్చాను. నమ్మకపోతే లెక్కలు చూసుకో.
రాజు : ఖజానాలో ధనం పెట్టెలు తీసుకురండి. (భటులు తెస్తారు) తెరవండి. (తెరిచారు) ఏమి ఆశ్చర్యం ! ఉండవలసిన సొమ్ము కంటె ఎంతో ఎక్కువ సొమ్మున్నది ! మమ్మల్ని మన్నించు బసవన్నా ! నీ భక్తి తెలుసుకున్నాము.

పర్యాయపదాలు:

  • బాస =ఒట్టు, ప్రతిజ్ఞ, వాగ్దానం
  • ధనం = అర్థం, డబ్బు
  • జననాథుడు = ప్రజాపతి, రాజు, పుడమీశుడు
  • హరుడు = శివుడు, పరమేశుడు, సోమార్థ ధరుడు
  • చూతము = రసాలము, ఆమ్రము, మామిడి
  • తమి = తామర, కమలం, పద్మం
  • సురధేనువు = కామధేనువు, సురభి
  • పగతుడు = శత్రువు, విరోధి, అరి
  • కనకము = బంగారము, కాంచనము
  • తేటి = తుమ్మెద, బంభరం

నానార్థాలు:

  • అర్థము = డబ్బు, ప్రయోజనము, పదానిక చెప్పే భావం
  • దెస = దిక్కు, విధము
  • మృగము = జింక, జంతువు

ప్రకృతి – వికృతులు:

  • ప్రకృతి – వికృతి
  • భాష – బాస
  • భక్తి – బత్తి
  • మృగం – మెకము
  • హంస – అంచ

సంధులు:

  • మాయర్థము = మా + అర్థము = యడాగమసంధి
  • బాసయండ్రు = బాస + అండ్రు = యడాగమసంధి
  • మంత్రియని = మంత్రి + అని = యడాగమసంధి
  • చింతామణియుండ = = చింతామణి + ఉండ = యడాగమసంధి
  • సూత్రం : సంధి లేనిచోట స్వరం కంటె పరంగా ఉన్న స్వరానికి యడాగమం ఔతుంది.
  • రాకామల = రాకా + అమల = సవర్ణదీర్ఘ సంధి
  • కామారి = కామ + అరి = సవర్ణదీర్ఘ సంధి
  • సోమార్థధరుడు = సోమ + అర్థధరుడు = సవర్ణదీర్ఘసంధి
  • ప్రహసితాస్యుడు = ప్రహసి + ఆస్యుడు = సవర్ణదీర్ఘ సంధి
  • సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
  • అరమొప్పించి = అర్థము + ఒప్పించి = ఉత్వ సంధి
  • తప్పేమి = తప్పు + ఏమి = ఉత్వసంధి
  • ఎట్లొకో = ఎట్లు + ఒకో = ఉత్వసంధి
  • అరుదగు = అరుదు + అగు ఉత్వసంధి
  • మాడలుప్పొంగుచు = మాడలు + = ఉత్వసంధి
  • సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి ఔతుంది.
  • పాడుచేసితివి = పాడు + చేసితివి = గసడదవాదేశ సంధి
  • ఫలంబులు సుంబించు = ఫలంబులు + చుంబించ = గసడదవాదేశసంధి
  • పండ్లు గగ్గోనునె = పండ్లు + కన్గొనునే = గసడదవాదేశ సంధి
  • ఆకాంక్ష సేయునే = ఆకాంక్ష + చేయునే = గసడదవాదేశసంధి
  • చను సీక = చను + చీక = గసడదవాదేశసంధి
  • లెక్కలు సూడు = లెక్కలు + చూడు గసడదవాదేశ సంధి
  • సూత్రం : ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

సమాసాలు:

  • సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
  • సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
  • పరధనము – పరుల యొక్క ధనం – షష్ఠీ తత్పురుష సమాసం
  • జననాథుడు – జనములకు నాథుడు – షష్ఠీ తత్పురుష సమాసం
  • మృగపతి – మృగములకు పతి – షష్ఠీ తత్పురుష సమాసం
  • కామారి – కాముని యొక్క అరి (శత్రువు) – షష్ఠీ తత్పురుష సమాసం
  • సోమార్థధరుడు – సోమార్థుని ధరించినవాడు – ద్వితీయాతత్పురుష సమాసం
  • ప్రహసితాస్యుడు – ప్రహసితమైన ఆస్యము కలవాడు. – బహువ్రీహి సమాసం
  • బసవన దండనాయకుడు – బసవన అనే పేరుగల దండనాయకుడు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
  • చూత ఫలంబులు – చూతము అనే పేరు గల ఫలములు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
  • హరుభక్తి – హరుని యందు భక్తి – సప్తమీ తత్పురుష సమాసం

పద్యాలు – ప్రతిపదార్థాలు – భావాలు

I. ప్రతిపదార్థాలు – భావాలు:

బండారి బసవన దండనాయకుని
రప్పించి “మాయర్ద మొప్పించి పొమ్ము
దప్పేమి ? సాలుఁ బ్రధాని తనంబు
‘దండింప రా’ దను తలఁపున నిట్లు
బండార మంతయుఁ బాడు సేసితివి
పరధనం బపహరింపని బాస యండ్రు
పరధనం బెట్లొకో బసవ ! కైకొంటి
వేయు మాటలు నేల వెఱతుము నీకు
మాయర్థ మొప్పించి నీయంత నుండు”
మనవుడుఁ గించి త్ప్రహసితాస్యుఁడగుచు
జననాథునకు బసవన మంత్రి యనియె
“బరమేశు భక్తియన్ సురతరువుండ
హరుభక్తియన్ కనకాచలంబుండ
గామారి భక్తి చింతామణి యుండ
సోమార్ధ ధరు భక్తి సురధేనువుండ
బగుతుఁడాసించునే పరధనంబునకు
మృగపతి యెద్దె మేయునే పుల్లు ?

ప్రతిపదార్థం :
బండారి బసవన్న= బండారి బసవన్న అనే పేరుగల సేనాపతిని
దండనాయకుని = సేనాపతిని
రప్పించి = పిలిపించి
మా + యర్థము = మా సొమ్మును
ఒప్పించి = అప్పగించి
పొమ్ము = వెళ్ళు
తప్పు + ఏమి = అలా చేయడంలో తప్పులేదు.
ప్రధానితనంబు = మీ మంత్రిత్వము
చాలున్ = ఇకపై మాకు అక్కరలేదు.
దండింపరాదు = నన్నెవరూ శిక్షించరులే
అనుతలపునన్ = అనే ఆలోచనతో
బండారము + అంతయు = ధనాగారమంతా
పాడు చేసితివి = నాశనం చేశావు
పరధనంబు = ఇతరుల సొమ్మును
అపహరింపని = దొంగిలించనని
బాసయండ్రు = ప్రతిజ్ఞ చేశావు
పరధనంబు = ఇతరుల ధనాన్ని
బెట్లోకొ = ఎట్లు
బసవా = ఓ బసవా !
కైకొంటి = తీసుకున్నావు.
వేయి మాటలు = వేలకొలది మాటలు
ఏల = ఎందుకు ?
మా అర్ధము = మా సంపద
ఒప్పించి = అప్పగించి
నీయంత నుండు = నీవు వెళ్ళు
అనవుడు = అని పలుకగా
కించిత్ = కొద్దిపాటి
ప్రవసిత = నవ్వబడిన
ఆస్యుడు = ముఖము కలవాడు
అగుచు = అయి
జననాథునకు = రాజుకు
బసవనమంత్రి = బసవ మంత్రి
అనియె = ఇట్లు పలికాడు
పరమేశు = శంకరునిపై
భక్తియన్ = భక్తి అనే
సురతరువు + ఉండ = కల్పవృక్షము ఉండగా
హరుభక్తియన్ = పరమేశ్వరుని యందు భక్తి అనే
కనక = బంగారుమయమైన
అచలము + ఉండ = కొండ ఉండగా
కామ + అరి = మన్మథుని వైరి అయిన శివుని యందు
భక్తి = భక్తి అనే
చింతామణి ఉండ = చింతామణి ఉండగా
సోమార్ధధరు = చంద్రుని శిరసున ధరించిన శివుని యందు
భక్తి = భక్తి
సురధేనువు ఉండ = కామధేనువు ఉండగా
పగతుడు = భక్తుడు
పరధనంబు = ఇతరుల ధనాన్ని
ఆశించునే = ఆశిస్తాడా ?
మృగపతి = సింహం
ఎద్దె = ఎప్పుడైనా
పుల్లు = గడ్డిని
మేయునే = మేస్తుందా ?

భావం :
బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిపించాడు. “మా ధనాన్ని అప్పగించి పోవటంలో తప్పేమీ లేదు. ఇక చాలు మీ ప్రధాని పదవి. నన్నెవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా! మరి ఎట్లా దొంగిలించావు ? ఎక్కువ మాటలు ఎందుకు గానీ నిన్ను ఏమయిన అనడానికి నాకు భయం కలుగు తున్నది. మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు” అన్నాడు. అప్పుడు మంత్రి బసవన్న చిరునవ్వుతో ‘పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం (మేరు -పర్వతం) నా అధీనంలో ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా, శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా ? సింహం ఎక్కడైన గడ్డి మేస్తుందా ?

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

II.
క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస
గోరునే పడియల నీరు ద్రావంగం ?
జూత ఫలంబులు సుంబించు చిలుక
బ్రాతి బూరుగు మ్రాని పండ్లు గల్గినునె ?
రాకామల జ్యోత్స్నఁ ద్రావు చకోర
మాకాంక్ష సేయునే చీకటిఁ ద్రావ
విరిదమ్మి వాసన విహరించుతేఁటి
పరిగొని సుడియునే బబ్బిలి విరులు ?
నెఱుఁగునే యల దిగ్గజేంద్రంబు కొదమ
యెఱపంది చను సీక ? నెఱుఁగవు గాక
యరుదగు లింగ సదర్థుల యిండ్ల
వరవుడ నా కొక సరకెయర్థంబు
పుడమీశ ! మీధనంబునకుఁ జేస్వాప
నొడయల కిచ్చితి నొడయలధనము
పాదిగదఱిఁగిన భక్తుండఁగాను
గాదేని ముడుపు లెక్కలు సూడు” మనుచు
దట్టుఁడు బసవన దండనాయఁకుఁడు
పెట్టెలు ముందటఁ బెట్టి తాళములు
పుచ్చుడు మాడ లుప్పొంగుచుఁ జూడ
నచ్చెరువై లెక్క కగ్గలంబున్న

ప్రతిపదార్థం :

క్షీర + అబ్ధిలోపల = పాలసముద్రంలో
క్రీడించు హంస = విహరించే హంస
పడియల = నీటి మడుగులలోని
నీరు + త్రావంగన్ = నీళ్ళు తాగడానికి
కోర్టును + ఏ = ఇష్టపడుతుందా ?
చూతఫలంబులు = మామిడిపళ్ళను
చుంబించు = ముద్దాడే (తినేటువంటి)
చిలుక = రామ చిలుక
బ్రాతి = ఏ విధంగానైనా
బూరుగ మ్రాని = బూరుగ చెట్టు యొక్క
పండ్లు = పళ్ళు
కన్గొనునె = చూస్తుందా ?
రాకా+అమంజ్యోత్స్నన్ = పున్నమినాటి స్వచ్ఛమైన వెన్నెలను
త్రావు = తాగుతుండే
చకోరము = వెన్నెల పక్షి
చీకటి = చీకటిని
త్రావన్ = తాగడానికి
ఆకాంక్ష+చేయును+ఏ = కోరుతుందా ?
విరి+తమ్మి వాసన = విరిసిన కమలం యొక్క సువాసనలో
విహరించు తేటి = తిరుగాడే తుమ్మెద
పరిగొని = పక్కకు తిరిగి
బబ్బిలి విరులన్ = ప్రబ్బలి పూలను
సుడియును + ఏ = చుట్టుకుంటూ తిరుగుతుందా?
అల దిక్+గజ +ఇంద్రంబు = ఆ దిగ్గజము యొక్క
కొదమ = పిల్ల
ఎఱపందిచను+చీక = పంది దగ్గర పాలు తాగడానికి
ఎఱుగును + ఏ = ఇష్టపడుతుందా ?
పుడమి + ఈశ = ఓ రాజా!
ఎఱుగవు + కాక = నీకు తెలియదేమో !
అరుదు + అగు = విశిష్టులైన
లింగ = లింగధారులైన
సదర్థుల + ఇండ్ల = గొప్ప జంగమదేవరల ఇళ్ళలో
వరవుడ = దాసుడను
అర్థము = ధనము
నాకున్+ఒక సరకు+ఎ = లెక్కలోనిదా ?
మీ ధనంబునకు = మీ డబ్బు కోసం
చేయి + చాపన్ = అడగన
ఒడయలకున్+ఇచ్చితిన్ = దేవరలకే ఇచ్చాను
పాదిగ + తఱిగిన = స్థిరత్వం తప్పిన
భక్తుండన్ + కాను = భక్తుణ్ణి కాను
కాదు + ఏని = కాదనుకుంటే (నీవు నమ్మకుంటే)
ముడుపు లెక్కలు = ధనము యొక్క లెక్కలు
చూడు = చూడుము
అనుచు = అంటూ
దండ నాయకుడు = దండ నాయకుడు
పెట్టెలు = పెట్టెల్ని
ముందటన్ = ఎదుట
పెట్టి = ఉంచి
తాళములు = తాళాలను
పుచ్చుచుచూడ = తెరచి చూడగానే
అచ్చెరువు = ఆశ్చర్యం
జూడ = కలుగునట్లుగా
మాడలు = బంగారు నాణేలు
లెక్క తగ్గలంబున్న = లెక్కకు తగినట్లుగా
ఉప్పొంగుచున్ = ఉప్పొంగినాయి

భావం :
పాల సముద్రంలో క్రీడించే హంస మడుగులలో నీరు తాగుతుందా ? మామిడి పండ్లను తినే చిలుక బూరుగు చెట్టు పండ్లను కన్నెత్తి ఐనా చూస్తుందా ? నిండు పున్నమి నాటి వెన్నెలను తాగే చకోరపక్షి చీకటిని ఆస్వాదిస్తుందా ? తామరపూల సుగంధంలో విహరించే తుమ్మెద ప్రబ్బలి పూలకోసం పరుగులు తీస్తుందా ? ఏనుగు పిల్ల పంది పాలు తాగడానికి తహతహలాడుతుందా ? నీకు విచక్షణ లేకపోతే నేనేం చేయాలి ? శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు ?

స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను. ఇతరుల ధనంతో నాకేం పని ? మీ ధనం కోసం నేను చేయి చాపను. నేను న్యాయం తప్పను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్క చూసుకో” అని పలికాడు. ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బిజ్జలుడి ముంగటే వాటి మూతలు తీయించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండ మాడలు (బంగారు నాణేలు) తళతళలాడు తున్నాయి. లెక్కపెట్టి చూడగా ఉండవలసిన వాటికన్న ఎక్కువనే ఉన్నాయి.

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న

పాఠం ఉద్దేశం

ప్రశ్న.
బండారి బసవన్న పాఠం ఉద్దేశం తెల్పండి.
జవాబు.
బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి “నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి. లేకపోతే మీ సపర్యలు స్వీకరించను” అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని పేటికల్లో ఉ న్న మాడలను (బంగారు నాణేలు) జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పారు.
బసవన్న ఔదార్య బుద్ధి, భక్తితత్వం తెలియజేయటం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రశ్న.
ద్విపద ప్రక్రియను పరిచయం చేయండి.
జవాబు.
ఈ పాఠం ద్విపద. ఇది దేశికవితా ప్రక్రియ. ఇది రెండేసి పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని “ద్విపద కావ్యం” అంటారు. ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన ‘బసవపురాణం’ తృతీయాశ్వాసంలోనిది.

కవి పరిచయం

ప్రశ్న.
పాల్కురికి సోమనాథకవి పరిచయం రాయండి.
జవాబు.
దేశి సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవకవి. ఓరుగల్లు సమీపాన గల పాలకుర్తి (పాలకురికి) పాల్కురికి సోమన జన్మస్థలం. బసవ పురాణము, అనుభవసారము, బసవోదాహరణము, వృషాధిపశతకము, చతుర్వేదసారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలయినవి సోమన కృతులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలయిన సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీభాషా పదాలను యధేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో ‘మణి ప్రవాళ శైలి’ని వాడిన తొలికవి.

ప్రవేశిక

ప్రశ్న.
బండారి బసవన్న పాఠ్యభాగం సందర్భం తెల్పండి.
జవాబు.
సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడూ మనిషిని సచ్చీలుడుగనే నిలబెడతాయి. భగవంతుడు కూడా ఇటువంటి పనులను చేసేవారిని మెచ్చుకుంటాడు. దీనికి ఉదాహరణలు పురాణేతిహాసాలలో అనేకం కనిపిస్తాయి. ఆ కోవలోని వాడే బండారి బసవన్న. అతని జీవితంలో జరిగిన ఒక మహత్తర ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కఠిన పదాలకు అర్ధాలు

దండ నాయకుడు = సేనాధిపతి మంత్రిత్వము
ప్రధానితనము = దొంగిలించు, కాజేయు
దండించు = ధనం
అపహరించు =
= కయి = చేయి
గైకొను = తీసుకొను
కించిత్ = కొంచెం
ఆస్యము = ముఖము
ప్రహసితం = నవ్వు
జననాథుడు = రాజు
సురతరువు = దేవతావృక్షం, కల్పవృక్షం
కామారి = కామ + అరి = మన్మథుని శత్రువైన శివుడు
సోముడు = చంద్రుడు
పుల్లు = గడ్డి
మృగపతి = మృగరాజు = సింహం
పడియ = నీటి మడుగు
చూతం = మామిడి
తమ్మి = తామర
తేటి = తుమ్మెద
మ్రాను = చెట్టు
వరవుడు = దాస్యము
ఒడయల ధనము = దేవరల సొమ్ము
పాదిగా తఱిగిన = కుదురు తప్పిన, స్థిరత్వం లేని
దట్టుడు = సమర్థుడు
మాడలు = బంగారు నాణేలు
అగ్గలము = అధికము
కొదమ = పిల్ల
చకోరము = వెన్నెల పక్షి

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana బండారి బసవన్న 5

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 8th Lesson చిన్నప్పుడే Textbook Questions and Answers.

మంజీర TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే 1

1. పై బొమ్మలోని సన్నివేశం ఎక్కడ జరుగుతుండవచ్చు?
జవాబు.
పై చిత్రంలోని సన్నివేశం గ్రామంలో ఒక చెట్టుకింద రచ్చబండ దగ్గర జరుగుతోంది.

2. మీ గ్రామంలో ఇట్లాంటి దృశ్యం ఎప్పుడైనా చూశారా? ఎప్పుడు?
జవాబు.
మా గ్రామానికి మధ్యలో రావిచెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ సిమెంటుతో దిమ్మ కట్టబడి ఉంది. దానిని అందరూ పెద్ద బజారు సెంటరు (కూడలి) అంటారు. సాయంకాలానికి రైతులందరూ అక్కడికి చేరి వ్యవసాయపు పనుల గురించి, గ్రామ సమస్యల గురించి మాట్లాడుకుంటారు. ఆ దృశ్యాన్ని నేను చాలా సార్లు చూశాను.

3. మాట్లాడుతున్న నాయకుడు ఏం చెప్పుతున్నాడని మీరు అనుకుంటున్నారు ?
జవాబు.
మాట్లాడుతున్న నాయకుడు గ్రామ ప్రజలకు జరుగుతున్న మోసాలను, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని చెబుతూ ఉండి ఉంటాడు. గ్రామీయులు పంటల విషయం, పశువుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రభుత్వం వారికి ఏర్పాటు చేస్తున్న ఆర్థిక సౌకర్యాల గురించి చెబుతూ ఉండవచ్చు. తమ చుట్టూ ఉన్న సమాజంలో ఏమి జరుగుతోందో చెప్పి, గ్రామీయులు కూడా సమాజం మార్పునకు ఎలా కృషిచేయాలో చెబుతూ ఉండవచ్చు.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

4. స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఇట్లాంటి దృశ్యాలు ఊరిలో కనిపించేవని మీకు తెలుసా ?
జవాబు.
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలలో చైతన్యం కలిగించడానికి గ్రామాలలో సభలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు లాంటి నాయకులు ఉద్యమాలు నడిపి గ్రామప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ‘స్వాతంత్ర్యం నా జన్మహక్కు” అనే నినాదంతో బాలగంగాధర తిలక్ ప్రజలలో పౌరుషాన్ని నింపాడు. ఇవన్నీ మేము పెద్దవాళ్ళు చెప్పగా విన్నాము. మరికొన్ని విషయాలు పుస్తకాలు చదివి తెలుసుకున్నాము.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 82)

ప్రశ్న 1.
ఈ “వరికోతల రోజులు. అయినా పొలాల్లో ఎవరూ లేరు” ఈ వాక్యాన్నిబట్టి మీకేమి అర్థమయింది ?
జవాబు.
వ్యవసాయం చేసి పంటలు పండించే గ్రామీణులకు నాట్లు వేయడం, కోత కోయడం, కుప్ప నూర్చడం అనే మూడు
పనులూ చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా పంట పండాక దానిని తగిన సమయంలో కోయడానికి ఊళ్ళో జనం అంతా పొలాల్లోనే ఉంటారు. అటువంటి వరికోతల రోజులలో కూడా ప్రజలు పొలాలు విడిచి నాయకుల కోసం వెళ్ళారంటే వారికి ఆ నాయకుల మీద ఉన్న అభిమానం, గౌరవం తెలుస్తున్నాయి.

ప్రశ్న 2.
ఈ ఊళ్ళోకి ఎదుర్కొని తీసుకొని పోవడమంటే ఏమిటి ?
జవాబు.
ఊళ్ళోకి ఎవరైనా గౌరవనీయులు వస్తే వారికి ఎదురువెళ్ళి వాయిద్యాలతోనో, పూలదండలతోనో స్వాగతం పలికి ఊరిలోకి తీసుకురావడం మర్యాద. దీనినే ఊళ్ళోకి ఎదుర్కొని తీసుకొని పోవడం అంటారు.

ప్రశ్న 3.
“పిల్లలు నాయకుణ్ణి అమితోత్సాహంతో చుట్టివేశారు” కదా! వాళ్ళు అట్లా ప్రవర్తించడానికి కారణాలు ఏమై ఉంటాయి ?
జవాబు.
తమ గ్రామంలోని పెత్తందారుడు ప్రతిరోజూ ప్రతివస్తువునూ తమ దగ్గరి నుంచి అన్యాయంగా అపహరిస్తాడు. కానీ నాయకుడు మాత్రం దుర్మార్గుడైన ఆ పెత్తందారును ఎదిరించాడు. గ్రామంలో పెత్తందారులు నిందలు లేకుండా చేశాడు. నేరాలు మోపడం, లంచాలు గుంజడం లేకుండా చేశాడు. నాయకుని కృషివల్లనే గ్రామంలో అందరూ గౌరవంగా, ఆకలి బాధలు లేకుండా బతుకుతున్నారు. పైగా నాయకుడు పిల్లలందరినీ చేరదీసి వారి బాగోగులను తెలుసుకుంటాడు. వారిని ప్రేమతో పలకరిస్తాడు. అందువల్లనే పిల్లలు నాయకుణ్ణి అమితోత్సాహంతో చుట్టివేశారు.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

ప్రశ్న 4.
ఈ పిల్లలు చెప్పిన విషయాలను బట్టి ఆనాటి గ్రామాల పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకున్నారు?
జవాబు.
నాయకులు వచ్చింది తమను బతికించడానికి అని పిల్లలు చెప్పడం ద్వారా ఆ నాటి గ్రామాలలో పెత్తందారీల దుర్మార్గాలు తెలిశాయి. ఏదో సాకుతో బర్రెను బందెల దొడ్లో పెట్టించడం, కోడెదూడ చేలో పడిందని పదిరూపాయలు వసూలు చేయడం, దున్నపోతు బుస్సు మన్నదని, మోతాడు లేదని ముప్పయి రూపాయలు గుంజడం, సర్కారీ రకం కట్టలేదని నాయనకు బండలెత్తడం వంటి దౌర్జన్యాల ద్వారా ఆ నాటి గ్రామ ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారో తెలుస్తుంది. అంతేగాక చేలో కట్టెపుల్లలు ఏరుకుంటే ఆడ కూలీలను కొట్టడం. అడ్డువచ్చిన భర్తల్ని విరగబాదడం మొదలైన విషయాల ద్వారా ఆ నాటి గ్రామప్రజల దయనీయ దుర్భరస్థితి తెలుస్తున్నది.

ప్రశ్న 5.
“మనం మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవి అప్పులు, రోగాలు, కష్టాలేగా” అని నాయకుడు అనడంలోని ఉద్దేశమేమి?
జవాబు.
రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలలో దయనీయ పరిస్థితిని ఉద్దేశించి నాయకుడు ఈ మాట అన్నాడు. ఏరోజు కారోజున వచ్చే కూలీ డబ్బులతో పేదలు పొట్ట పోషించుకుంటారు. పని లేకపోతే పస్తు పడుంటారు. లేకపోతే అప్పులు చేస్తారు. చేసిన అప్పుతీర్చలేక నానా అవస్థలూ పడతారు. రోగాలు వచ్చి పడతాయి. ఈ అప్పులు, రోగాలు, కష్టాలు తరతరాలుగా కొనసాగుతూనే ఉంటాయి. అందువల్లనే నాయకుడు అట్లా అన్నాడు.

ఇవి చేయండి.

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. ‘చిన్నప్పుడే’ కథ చదివారు కదా! దీని ఆధారంగా స్వాతంత్ర్యానికి ముందు గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉండేదో ఊహించండి, మాట్లాడండి.
జవాబు.
స్వాతంత్ర్యం రాకముందు గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండేది కాదు. గౌరవ మర్యాదలు ఉండేవికాదు. పెత్తందార్లు, అగ్రకులాల వాళ్ళు పేదవారిని, బలహీన వర్గాల వారిని దోపిడీ చేసేవారు. స్త్రీలను నీచంగా చూడడం, అనరాని మాటలు అనడం చేసేవారు. పేద ప్రజలు గ్రామాలలో తినడానికి తిండిలేక ఇబ్బందులు పడేవారు.

స్త్రీలు కూలికి పోయి చేలో కట్టెలు ఏరుకుంటే ఎందుకు ఏరుకున్నారని సిగపట్టుకొని కొట్టేవారు. సర్కారుకు పన్నులు కట్టలేదని నెత్తిమీద బండరాళ్ళు ఎత్తి మోయించేవారు. పిల్లలు బడికెళుతుంటే వాళ్ళను బెదిరించేవారు. పశువులు చేలో పడి గడ్డి తిన్నాయని వాటిని బందెల దొడ్లో పెట్టించేవారు. లేకపోతే డబ్బులు వసూలు చేసేవారు. స్వాతంత్ర్యం రాకముందు మన గ్రామాలలో పరిస్థితి పైవిధంగా ఉండేదని ఈ పాఠం చదివిన తరువాత అనిపించింది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. పాఠం ఆధారంగా కింది మాటలు ఎవరు ఎవరితోటి ఏ సందర్భంలో అన్నారో చర్చించండి.

(అ) వీండ్లందరెవరో ఎరికేనా?
జవాబు.
తమ గ్రామానికి వెంకట్రావు, ఇతర నాయకులు వస్తున్నారని తెలిసిన గ్రామంలోని పిల్లలు వారు ఉన్నచోటికి వెళ్ళారు. నాయకులు పిల్లల్ని ప్రేమగా పలకరించారు. పిల్లలు వారికి తాము కోసుకున్న ఉసిరికాయలు పంచారు. అప్పుడు వెంకట్రావు నాయకుల్ని చూపించి. వీండ్లందరెవరో ఎరికేనా ? అని పిల్లల్ని ప్రశ్నించాడు.

(ఆ) నేను సంగిశెట్టి కొడుకును.
జవాబు.
ఒక నాయకుడు ఒక పిల్లవాణ్ణి “మీరెవరబ్బాయి!” అని ప్రశ్నించాడు. అపుడు ఆ అబ్బాయి “నేను సంగిశెట్టి కొడుకును” అని బదులిచ్చాడు.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

(ఇ) మన సంతానమంతా హాయిగా బతుకుతారు.
జవాబు.
మనం ఈరోజు స్వార్ధరహితంగా ధైర్యంగా పట్టుదలతో పనిచేస్తే మన సంతానం అంతా హాయిగా బతుకుతారని ఒక నాయకుడు మరొక నాయకునితో అన్నాడు.

2. కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

నిజాం రాష్ట్రంలో సాంస్కృతికంగా, భాషాపరంగా అణచివేయబడిన తెలంగాణ ప్రజల్లో వారి మాతృభాష, సంస్కృతి పట్ల గాఢాభిమానం కలిగించటంలో ఆనాడు తెలుగు గ్రంథాలయాలు, పఠనాలయాలు, తెలుగు పత్రికలు ఎంతో దోహదం చేశాయి. తెలంగాణలో తెలుగు ప్రజలకు తెలుగు భాషపై, సంస్కృతిపై ఆసక్తి కలిగించటం ద్వారా వారి జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన మహనీయుల్లో మాడపాటి హనుమంతురావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయి, రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి, రావి నారాయణరెడ్డి ముఖ్యులు. జాతిని చైతన్యపరిచే లక్ష్యంతోనే మాడపాటి హనుమంతరావు ఆంధ్రోద్యమాన్ని తెలంగాణలో అంటే అప్పటి నిజాం రాష్ట్రంలో ప్రారంభించాడు.

ప్రశ్నలు :
అ. అణచివేతకు గురైన వారెవరు ?
జవాబు.
నిజాం రాష్ట్రంలో అణచివేతకు గురైన వారు తెలంగాణ ప్రజలు.

ఆ. వాళ్ళు ఏఏ విషయాల్లో అణచివేతకు గురి అయ్యారు ?
జవాబు.
వాళ్ళు సాంస్కృతికంగా, భాషాపరంగా అణచివేతకు గురి అయ్యారు.

ఇ. తెలంగాణాలో ఆంధ్రోద్యమం ఎందుకు విస్తరించింది ?
జవాబు.
తెలంగాణాలో తెలుగు ప్రజలకు తెలుగు భాషపై, సంస్కృతిపై ఆసక్తి కలిగించడానికి ఆంధ్రోద్యమం విస్తరించింది.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

ఈ. తెలంగాణ ప్రజల్లో భాషాసంస్కృతులపట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలేవి ?
జవాబు.
తెలుగు గ్రంథాలయాలు, పఠనాలయాలు, తెలుగు పత్రికలు తెలంగాణ ప్రజల్లో భాషా సంస్కృతుల పట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలు.

ఉ. తెలంగాణలో జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన కొందరు మహనీయులు ఎవరు ?
జవాబు.
మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయి, రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి, రావి నారాయణ రెడ్డి మొదలైన వారు తెలంగాణాలో జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషిచేసిన మహనీయులు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. వెంకట్రావు స్వభావాన్ని తెల్పండి.
జవాబు.
వెంకట్రావు ఆంధ్రమహాసభ కార్యకర్త. తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలను చూడలేక వారిలో చైతన్యం తీసుకొనిరావడానికి కృషిచేసిన మహానుభావుడు. ఆయనకు ప్రజలు హృదయపూర్వకంగా దండం పెట్టేవారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షకునిగా పనిచేశాడు. పెత్తందార్లు చేసే అగడాలను ఎదుర్కొని వారు చిన్న, పెద్దలను గౌరవించే విధంగా మార్పు తెచ్చాడు.

వెంకట్రావు కృషి ఫలితంగా పెత్తందార్లు స్త్రీలను దుర్భాషలాడడం, నీచంగా ప్రవర్తించడం లాంటివి పోయాయి. ప్రజలంతా విరామం లేకుండా కూలి పనిచేసినా కడుపు నిండా తిండిలేకపోవడం చూసి వెంకట్రావు పెత్తందార్లపై తిరగబడి పేదలు కడుపునిండా అన్నం తినేటట్లుగా చేసిన మహనీయుడు. మనిషిని మనిషిగా చూడాలనే తత్త్వం కలవాడు వెంకట్రావు. అందుకే అటువంటి మంచి స్వభావం గల వెంకట్రావును గ్రామపెద్దలు, పిన్నలు కూడా గౌరవిస్తూ దేవుడిలా చూసుకునేవారు.

ఆ. వెంకట్రావు వంటి యువకుల వల్ల కలిగే ప్రయోజనాలేవి?
జవాబు.
వెంకట్రావు వంటి యువకుల వల్ల ప్రజలలో చైతన్యం కలుగుతుంది. ‘దండం – నమస్కరించడం’ అనే పదానికి సరైన అర్థం లభిస్తుంది. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కలుగుతుంది. ప్రజలపై పెత్తందార్లు వేసే నిందలు తగ్గుతాయి. లంచాలు తీసుకొనే వారి సంఖ్య తగ్గిపోతుంది. సమాజంలో ధనం ఆధారంగా ఎక్కువ, తక్కువ అనే భావనపోయి, మనుషుల్ని మనుషుల్లా చూడడం జరుగుతుంది.

పేద ప్రజలకు కడుపునిండా తిండి దొరుకుతుంది. పెత్తందార్లు ప్రజలను హింసించకుండా గౌరవ భావంతో చూస్తారు. నాయకులు పిల్లలు, పెద్దల కష్ట నష్టాలను తెలుసుకొని పరిష్కార మార్గాలు ఆలోచిస్తారు. పేద ప్రజలకు మేలు చేస్తారు. వెంకట్రావు వంటి యువకులవల్ల సమాజానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

ఇ. వెంకట్రావుతో నేటి యువతను పరిశీలించి, పోల్చండి.
జవాబు.
మన దేశ స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న కాలం నాటి వ్యక్తి వెంకట్రావు. వెంకట్రావులో దేశభక్తి, సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురాచారాలను రూపుమాపాలనే కోరిక అధికంగా కనిపిస్తున్నాయి. తనకు దేశం ఏమిచ్చింది అని చూడక, తాను దేశానికి ఏమి చేయాలి అని ఆలోచించిన వ్యక్తి వెంకట్రావు. నేటి యువకుల్లో అలా ఆలోచించే వారు తక్కువ మందే ఉన్నారు.

ఎక్కువ మందికి తాము, తమ కుటుంబం బాగుంటే చాలనే స్వార్ధం పెరిగిపోయింది. సోమరితనం పెరిగిపోయింది. సమాజంలోని అవినీతిని దౌర్జన్యాలను, దురాచారాలను వెంకట్రావులా ఎదిరించాలనే ధోరణి, తన తోటి వారికి సాయపడాలనే సేవాభావం నేటి యువతలో తగ్గాయి. పెడధోరణులు, క్రమశిక్షణ లేకపోవడం నేటి యువతలో కనబడుతున్నాయి.

ఈ. “మనం ఈ రోజు స్వార్థ రహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పనిచేస్తే, మన సంతానం అంతా హాయిగా బతుకుతారు.” అని ఒక నాయకుడు ఎందుకు అని ఉంటాడు ?
జవాబు.
ఆంధ్రమహాసభ కార్యకర్త వెంకట్రావు నాయకులతో కలిసి రంగాపురానికి వెళ్లాడు. అక్కడ కొంతమంది పిల్లలు తమ ఊరి పటేలు, దొర, ఇతర పెత్తందార్లు తమను, తమ తల్లిదండ్రులను ఎంతగా బాధపెడుతోందీ నాయకులకు చెప్పారు. హాయిగా, సంతోషంగా ఎదగాల్సిన బాలలు అంత చిన్న వయసులోనే తమ కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాలు తెలుసుకోవాల్సిన గతి పట్టిందంటే, సమాజ పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా ఉందని నాయకులకు అర్థమైంది.

వారి పసిమనస్సులు కష్టాల కారణంగా గాయపడితే, సమాజానికి ప్రమాదం. అలాంటి కష్టాలేవి తెలియకుండా పిల్లలు ఎదగాలంటే, స్వార్థరహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పెత్తందార్ల ఆగడాలను ఆపే నాయకులు రావాలి. వారు సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. నాయకులు చేసే కృషి వల్లే సమాజంలో జరిగే అన్యాయాలు తగ్గి, పిల్లలు ఎటువంటి బాధలు, కష్టాలు లేకుండా ఎదుగుతారని నాయకుడన్నాడు.

ఉ. గ్రామంలోని పెత్తందార్ల, దొరల దౌష్ట్యాలను వివరించండి.
జవాబు.
గ్రామంలోని పెత్తందార్లకూ, దొరలకూ దయాదాక్షిణ్యాలు లేవు. అన్యాయంగా బర్రెను బందులదొడ్లో పెట్టించారు. కోడెదూడ చేలో పడ్డదని ఊరి పటేలు పదిరూపాయలు వసూలు చేశాడు. దున్నపోతు బుస్సుమన్నదనీ, దానికి మోతాడు లేదనీ మాలిపటేలు ముప్పయి రూపాయలు తీసుకున్నాడు. వెంకట్రామ పంతులు పెట్టిన బడిలోకిపోతే దెబ్బలు కొడతానని దొర గుమస్తా బెదిరించాడు. కూలికి పోయి వస్తూ చేలో కట్టెపుల్లలు ఏరుకున్నందుకు స్త్రీ అని కూడా చూడకుండా ఒక తల్లిని సిగపట్టుకొని కొట్టాడు దొర శేగిదారు. అడ్డువెళ్ళిన ఆమె భర్త చెయ్యి విరగగొట్టాడు కూడా. ఈ విధంగా గ్రామంలోని పెత్తందార్ల, దొరల దౌర్జన్యాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

ఊ. గ్రామస్తుల కష్టాలను పిల్లలు నాయకులకు ఎలా వివరించారు?
జవాబు.
వెంకట్రావు, ఇతర నాయకులూ వచ్చి పిల్లలను కుశల ప్రశ్నలతో ప్రేమగా పలకరించారు. ఒక పిల్లవాడు వాళ్ళమ్మ పొయ్యిలో కట్టెలు లేకపోతే ఆ రాత్రి బువ్వెట్లా వండిందో వివరించాడు. అయ్య అన్నం వండుతుంటే గిర్దావరు బరులకు పోవాలని అతణ్ణి పట్టుకుపోయాడు. పొయ్యిమీది అన్నం చెడిపోయింది. అయినా దాంట్లోనే మీరం, ఉప్పుపోసుకుని నీళ్ళుపోసుకొని తిన్నానన్నాడు ఆ పిల్లవాడు.

ఒకసారి వాళ్ళమ్మ పసుల జంగల్లో నుంచి పేడ తెచ్చిందని పోలీసు పటేలు ఇనుపతట్ట గుంజుకున్నాడనీ, ఆ తట్ట ఇప్పటిదాక ఇవ్వలేదని ఒక పిల్లవాడు చెప్పుకున్నాడు. పాపం! చిన్నప్పుడే కుటుంబ ఇబ్బందులన్నీ ఈ పిల్లలు తెలుసుకోవాల్సిన గతి బట్టిందంటే పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో కదా! అని నాయకులు బాధపడ్డారు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. ‘చిన్నప్పుడే’ కథ ద్వారా ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నారు కదా! నాటి పరిస్థితులు నేటి సమాజంలో కూడా ఉన్నాయా ? కారణాలు ఏమిటి ?
జవాబు.
‘చిన్నప్పుడే’ కథా కాలంలో పటేళ్ళ దొరల దౌర్జన్యాలు ఎక్కువగా ఉండేవి. ఆనాటి పరిస్థితులు ఈనాడు లేవు. 1947 సం||లో మనకు స్వాతంత్ర్యం వచ్చాక, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మన దేశానికి రూపొందించిన రాజ్యాంగం ప్రజలంతా సమానమేనని, కుల, మత, వర్గ విచక్షణ పనికిరాదని తేల్చి చెప్పింది. చట్టం ముందు అంతా సమనామేనని తేల్చింది. కొన్ని వర్గాల వారికి ప్రత్యేక రక్షణలు కల్పించింది. స్త్రీలకు ఆర్తిక స్వాతంత్ర్యం కల్పించింది. దీంతో సమాజంలో చైతన్యం తెచ్చింది.

పటేలు, దొర పెత్తనాలు తగ్గుముఖం పట్టాయి. నేడు ప్రతి గ్రామంలో విద్యాలయం స్థాపించడం వల్ల, విద్యా విధానంలో మార్పులు రావడం వల్ల మారుమూల గ్రామాల్లో ఉన్న పిల్లలు కూడా విద్యావంతులై తమ హక్కులను గుర్తించడం మొదలుపెట్టారు. ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేసి పెత్తందారీతనాన్ని అణచివేశాయి. అయితే ఇంకా మార్పు రావలసి ఉంది. ఢిల్లీ అత్యాచార సంఘటనలు అప్పుడప్పుడు వెలుగుచూస్తున్నా పెత్తందార్ల దౌర్జన్యాలు, దోపిడీల వల్ల సమాజంలో ఇంకా ఆనాటి పరిస్థితులు అక్కడక్కడ ఉన్నాయనిపిస్తున్నా, చాలా వరకు పరిస్థితులు మారాయన్నది నిజం.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. కింది అంశాల గురించి సృజనాత్మకంగా రాయండి.

అ. ఈ పాఠం ఆధారంగా చేసుకొని, మీ అనుభవాలతో ఒక చిన్న కథ రాయండి.
జవాబు.
రామాపురం మారుమూల చిన్న పల్లెటూరు. అన్ని వర్గాల వాళ్ళు కలిసి మొత్తం 350 కుటుంబాలున్నాయి. ఆ ఊళ్ళో జానయ్య అనే ఒక మోతుబరి రైతు ఉన్నాడు. అదే ఊళ్ళో రామయ్య అనే 100 ఎకరాలున్న రైతు ఉన్నాడు. రామయ్య దగ్గర వ్యవసాయం పనులు చేయడానికి, ఇంకా ఇతర పనులు చేయడానికి మొత్తం పదిమంది పనివాళ్ళున్నారు. రామయ్య పనివాళ్లను బాగా చూసుకుంటాడు. జానయ్యకు తల పొగరు ఎక్కువ.

పనిచేసే వాళ్ళను చాలా హీనంగా చూస్తాడు. అందుకే ఆయన ఇంట్లో పనివాళ్ళు ఎక్కువ కాలం పనిచేయరు. గ్రామంలో ఉన్న ప్రజలకు ఏ అవసరమొచ్చినా రామయ్య ముందుంటాడు. అందుకే అంతా రామయ్యను గౌరవిస్తారు. ఆయన గ్రామానికి గత 30 సంవత్సరాల నుండి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడమే దానికి నిదర్శనం. ఈ మధ్యనే రామయ్య తన పొలంలో 40 ఎకరాల పొలాన్ని కొంత రైతులకు, కొంత ఇండ్ల స్థలాలకు ఇచ్చాడు.

ప్రతి గ్రామంలో ఇటువంటి వారుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాభివృద్దే దేశాభివృద్ధి కదా! అదే విధంగా 5 ఎకరాల స్థలంలో పాఠశాల నిర్మాణం చేయించాడు. ఒకప్పుడు ఆ గ్రామ విద్యార్థులు దాదాపు 5 కి.మీ. నడచి వెళ్ళి చదువుకోవలసిన పరిస్థితి ఉండేది. గ్రామంలో మంచినీటి సౌకర్యాన్ని కలిగించాడు. పంచాయితీ భవనాన్ని కట్టించాడు. రోడ్ల నిర్మాణం చేయించాడు. రామయ్యను చూసి ఇప్పుడు జానయ్య కూడా మారాడు.

(లేదా)

ఆ. వెంకట్రావు వలె గ్రామం బాగుకోసం పాటుపడుతున్న వాళ్ళు నేడు కూడా ఉంటారు. అటువంటి వారి సేవలను ప్రశంసిస్తూ ఒక అభినందన పత్రం రాయండి.
జవాబు.

ఆర్మూర్,
తేది : XX.XX.XXXX

పేద కుటుంబంలో, మురికివాడలో జన్మించిన ‘స్వామి’ బాల్యంలో ఎంతో దుర్భరమైన జీవితాన్ని అనుభవించాడు. ఎంతో కష్టపడి చదువుకున్నాడు. చిన్న వయస్సులోనే ఉద్యోగం సంపాదించడం అతని ప్రతిభకు నిదర్శనం. స్వామి మా గ్రామ ప్రజలకు తలలో నాలుకలా ఉంటాడు. మా గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా తనే ముందుంటాడు. యువకులను, విద్యావంతులను కలిసి ‘గాంధీ యువసేన’ అనే సంఘం ఏర్పాటు చేశాడు.

వారంతా ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవం, నవంబరు 14 బాలల దినోత్సవం వంటి వాటిల్లో బాల బాలికలకు వివిధ రకాల పోటీలు ముఖ్యంగా వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన బాల బాలికలకు బహుమతులు అందిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ మా గ్రామ పాఠశాలలో నిర్వహిస్తారు. బాల బాలికలను చైతన్యవంతులను చేయడమే అతని ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇవే కాకుండా పోలియో చుక్కలు వేసేటప్పుడు పసిపిల్లల తల్లులను చైతన్యపరుస్తాడు.

వివిధ రకాలైన సేవా కార్యక్రమాలలో భాగంగా పంచాయతీ వారితో మాట్లాడి గ్రామంలో చెత్త కుండీలను ఏర్పాటు చేయించాడు. మొక్కల అవసరం, వినియోగం గురించి అందరికీ చెప్పి ఇండ్లలో, రహదారులపై, పొలాల గట్లపై విరివిగా మొక్కలను నాటించేటట్లు చేశాడు. మన దేశ సమైక్యత, సమగ్రతలను గురించి, అవినీతి, లంచగొండితనం గురించి వివరిస్తూ ప్రజలలోనూ, విద్యార్థులలోనూ అవగాహన కలిగిస్తాడు. స్వామిలాంటి వారు ప్రతి గ్రామంలో ఉంటే దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని నా
భావన.

స్వామికి నా అభినందనలు

ఇట్ల
రవికుమార్,
ఆర్మూర్.

(ఇ) పాఠం ఆధారంగా వెంకట్రావు, నాయకులు, బాలుర మధ్య జరిగిన సన్నివేశాన్ని సంభాషణల రూపంలో రాయండి.
జవాబు.

సంభాషణ

ఆంధ్రమహాసభ కార్యకర్త వెంకట్రావు నాయకులతో కలసి రంగాపురానికి బయలుదేరాడు.
వెంకట్రావు : (నాయకులతో) మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళకూడదు. మనం అలా వెళితే గ్రామ ప్రజలకు నిరుత్సాహం కలుగుతుంది. వాళ్ళు మంగళవాయిద్యాలతో మనకు స్వాగతం పలికి తీసుకువెళతారు.
గ్రామ యువకుడు : (బాటసారితో) ఆంధ్రనాయకులు వచ్చారని గ్రామంలో తెలియజెయ్యి.
బాలకులు : మన గ్రామానికి నాయకులు వచ్చారట మనందరం ఉసిరికాయలు ఏరుకొని అక్కడకు వెళదాం పదండి.
నాయకులు : రండి ! పిల్లలూ ! రండి.
నాయకుడు 1 : నీ పేరేంటి?
ఒక బాలుడు : లింగయ్య
రెండో బాలుడు : మేము ముందు లింగా అని పిలిచేవాళ్ళం. బడిలో అందరం లింగయ్య ! అని పిలుస్తున్నాం.
నాయకుడు 2 : మీరు ఎవరు ?
లింగయ్య : మేము బట్టలుతుకుతాం.
నాయకుడు 3 : నాకు ఒక ఉసిరికాయ ఇస్తావా ?
లింగయ్య : ఇదిగో. తీసుకోండి.
బాలలందరూ (పిల్లలందరూ) : ఇవిగోండయ్యా ! ఇవన్నీ మీకే !
వెంకట్రావు : వీళ్ళంతా ఎవరో మీకు తెలుసా ?
పిల్లలు (బాలురు) : వీళ్ళంతా మమ్మల్ని బతికించడానికి వచ్చినవాళ్ళు.
నాయకుడు : మీకేం మీరు బాగానే ఉన్నారు కదా !
బాలుడు – 1 : ఏం బాగు బాబూ ! మా బర్రెను బందెలదొడ్లో పెట్టించాడు.
బాలుడు – 2 : మా అన్న కోడెదూడ చేలో పడిందని పటేలు పది రూపాయలు వసూలు చేశాడు.
బాలుడు – 3 : మా దున్నపోతు బుస్సుమన్నదని మాలి పటేలు ముప్పయి రూపాయలు తీసుకున్నాడు.
బాలుడు – 4 : సర్కారు పన్ను కట్టలేదని మా నాయనకు బండలెత్తారు.
బాలుడు – 5 : వెంకట్రావు పంతులు పెట్టిన బడికిపోతే దెబ్బలు కొడతానని మా దొర గుమాస్తా బెదిరించాడు.
బాలుడు – 6 : మా అమ్మ కూలి పనికిపోయి కట్టెపుల్లలు ఏరుకుందని సిగపట్టుకొని కొట్టాడు. మా అయ్య అడ్డంపోతే చేతికర్ర ఇరిగేదాకా కొట్టాడు దొరగారి శేగిదారు.
నాయకుడు : నువ్వు ఎవరబ్బాయివి ?
బాలుడు : నేను సంగిశెట్టి కొడుకును.
నాయకుడు : మీకేమయినా కష్టాలున్నాయా ?
బాలుడు : ఏమో ? నాకేం ఎరుక ? మా నాయనకెరుక. (నాయకులందరూ ఒకరితో ఒకరు)
పాపం ! ఈ చిన్నపిల్లలు ఇప్పటినుంచే కష్టాలు పడాల్సి వచ్చింది. మనందరం స్వార్థం లేకుండా ఉంటే భావితరం పిల్లలు హాయిగా బతుకుతారు.

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు తెలుసుకొని రాయండి.

(అ) వెంకట్రావుకు పెట్టే దండంలో పెత్తందార్లకు పెట్టే దండంలో తేడా కనిపించింది.
దండం = నమస్కారం, వందనం
తిరిగి రాయుట : వెంకట్రావుకు పెట్టే నమస్కారంలో, పెత్తందార్లకు పెట్టే నమస్కారంలో తేడా ఉంది. వెంకట్రావుకు పెట్టే వందనంలో, పెత్తందార్లకు పెట్టే వందనంలో తేడా ఉంది.

(ఆ) ఆ నాయకుడు పిల్లలకు అవ్యాజ బంధువైపోయాడు.
జవాబు.
అవ్యాజ = కపటం లేనిది
తిరిగి రాయుట : పసిపిల్లలు కల్లాకపటంలేని వారు. ఆ నాయకుడు పిల్లలకు కపటం లేని బంధువైపోయాడు.

(ఇ) సర్కారీ రకం కట్టలేదని ఆ పిల్లవాని తండ్రికి బండలెత్తారు.
జవాబు.
రకం = పైకం, ధనం
తిరిగి రాయుట : సర్కారీ పైకం కట్టలేదని పిల్లవాని తండడ్రికి బండలెత్తారు. సర్కారీ ధనం కట్టలేదని పిల్లవాని తండ్రికి బండలెత్రారు.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

(ఈ) ఆ బువ్వలోనే మిరం, ఉప్పుపోసుకొని పిల్లవాడు తిన్నాడు.
జవాబు.
మిరం : పంరపపాడి
తిరిగి రాయుట : ఆ బువ్వలోనే మిరపపొడి, ఉప్పం పోసుకొని పిల్లవాడు తిన్నాడు.

(ఉ) కష్టాల సంగతి నాయనకు ఎరుక.
ఎరుక = జ్ఞానం, తెలుసు
తిరిగి రాయుట = కష్టాల సంగతి నాయనకు తెలుసు.

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను రాయండి.

ఉదా :
ఊళ్ళోని యువకుడు వెంకట్రావుకు దండం పెట్టాడు.
దండం = నమస్కారం, అంజలి

(అ) పిల్లల పట్ల ఆయనకు గల ప్రేమకు విలువ కట్టలేం.
జవాబు.
విలువ = ధర, వెల, మూల్యం

  1. వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.
  2. ఆ పుస్తకం వెల కట్టలేనంత గొప్పది.
  3. ఆ వస్తువు మూల్యం ఎంత ?

(ఆ) పిల్లలు తమ కష్టాలను కుప్పలుగా కురిపించారు.
జవాబు.
కుప్పలు = రాసులు, పోగులు, గుంపులు

  1. రైతులు ధాన్యాన్ని రాసులుగా పోశారు.
  2. మొక్కజొన్న కండెలు పోగులుగా ఉన్నాయి.
  3. నాయకుని ఉపన్యాసం వినడానికి జనం గుంపులుగా చేరారు.

(ఇ) కుటుంబ పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి.
జవాబు.
అధ్వాన్నం = అమార్గం, తప్పుదారి

  1. ఆ గ్రామానికి వెళ్ళే దారి అమార్గంగా ఉంది.
  2. విద్యార్థులు తప్పుదారిలో నడవకూడదు.

(ఈ) పిల్లలందరూ గభాలున అతని వద్దకు చేరుకున్నారు.
జవాబు.
గభాలున = శీఘ్రంగా, తొందరగా, త్వరగా

  1. ప్రమాదం జరిగిన చోటుకు శీఘ్రంగా అందరూ చేరారు.
  2. బడి గంట వినపడి పిల్లలు తొందరగా పరుగెత్తారు.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

(ఉ) నీ చేతులకు వెండి కడియాలున్నాయి.
జవాబు.
వెండి = రజతము, శ్వేతము

  1. మా చెల్లి కాలి పట్టీలు రజతముతో చేసినవి.
  2. శ్వేతము స్వచ్ఛతకు మారు పేరు.

3. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి పదాలు రాయండి.

(అ) నాయకులు ఒకరి మొగం ఒకరు చూసుకున్నారు.
మొగం (వి) – ముఖం (ప్ర)
జవాబు.
ముఖం

(ఆ) అతడు పట్టలేని సంతసంతో పిల్లలను దగ్గరికి తీసుకున్నాడు.
సంతసం (వి) – సంతోషం (ప్ర)
జవాబు.
సంతోషం

(ఇ) మనం ధైర్యంగా కష్టపడి పనిచేస్తే మన పిల్లలు సుకంగా ఉంటారు.
జవాబు.
సుకం (వి) – సుఖం (ప్ర)

(ఈ) గారవం పొందాలంటే మంచి పనులు చేయాలి.
గారవం (వి) – గౌరవం (ప్ర)
జవాబు.
గౌరవం

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పట్టికలోని ఖాళీలను పూరించండి.

సమాసపదంవిగ్రహవాక్యంసమాసం పేరు
రాజ్యకాంక్ష
విజయం వల్ల గర్వం
అష్టదిక్కులు
బలరాముడును, కృష్ణుడును
ప్రజల భాష
క్రమము కానిది

జవాబు.

సమాసపదంవిగ్రహవాక్యంసమాసం పేరు
రాజ్యకాంక్షరాజ్యము నందు కాంక్షసప్తమీ తత్పురుష సమాసం
విజయగర్వంవిజయం వల్ల గర్వంపంచమీ తత్పురుష సమాసం
అష్టదిక్కులుఎనిమిది అయిన దిక్కులుద్విగు సమాసం
బలరామకృష్ణులుబలరాముడును, కృష్ణుడునుద్వంద్వ సమాసం
ప్రజల భాషప్రజల యొక్క భాషషష్ఠీ తత్పురుష సమాసం
అక్రమముక్రమము కానిదినఞ తత్పురుష సమాసం


2. కింది వాటిని చదువండి.

ఔరౌర! ఎంత గొప్పపని చేశావు.
ఆహాహా! ఎంతో ఆనందం కలిగించావు.

పై వాక్యాలలో గీత గీసిన పదాలను విడదీసి రాస్తే
ఔరౌర = ఔర + ఔర
ఆహాహా = ఆహా + ఆహా – అవుతున్నాయి కదా!

ఇక్కడ ఒకే పదం రెండు సార్లు వచ్చింది. అట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు. పై పదాలను గమనిస్తే
ఔర = ఔర్ + అ
ఆహా = ఆహ్ + అ

ఆ పదాల చివర అచ్చులు కనబడుతున్నాయి. వాటికి ఆమ్రేడితం వచ్చి చేరితే ఏమవుతుందో చూద్దాం.
ఔర + ఔర = ఔరౌర
ఔ (ర్ + అ) = ఔర అని ఉండగా అకారం లోపించి ఔర్ + ఔర అని ఉంటుంది. ఆమ్రేడిత పదంలోని ‘ఔ’ వచ్చి చేరి “ఔరౌర” అని అయింది.

అట్లాగే ఆహా + ఆహా = ఆ (హ్ + ఆ) + ఆహా = ఆహాహా
దీనివల్ల అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది. ఇది ‘ఆమ్రేడిత సంధి’
సూత్రం : “అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగానగు.”

కింది పదాలను కలిపి రాయండి.

(అ) అప్పుడు + అప్పుడు = అప్పుడప్పుడు
(ఆ) ఏమి + ఏమి = ఏమేమి
(ఇ) ఊరు + ఊరు = ఊరూరు
(ఈ) ఇంట + ఇంట = ఇంటింట
(ఉ) ఓరి + ఓరి = ఓరోరి

ఈ కింది పదాలను చదవండి.

(అ) పగలు + పగలు = పట్టపగలు
(ఆ) చివర + చివర = చిట్టచివర
పై పదాలు కలిపినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
పగలు + పగలు = పట్టపగలు అవుతోంది. అంటే మొదటి పదంలోని పగలులో ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ పోయి దానికి బదులుగా ‘ట్ట’ వచ్చింది. అప్పుడు పట్టపగలు అయింది. అట్లనే చిట్టచివరి పదం కూడా.

మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.
(అ) నడుమ + నడుమ = నట్టనడుమ
(ఆ) కొన + కొన = కొట్టకొన
(ఇ) కడ + కడ = కట్టకడ

ద్విరుక్తటకారమనగా ‘ట్ట’ (ద్విత్వము)
ఆమ్రేడితం పరంగా ఉంటే నడుమ, కొన, కడ మొదలైన శబ్దాలలో మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలు పోయి వాటి సంస్థానంలో ‘ట్ట’ వస్తుందని చూశాం కదా!
సూత్రం : ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు ద్విరుక్తటకారం వస్తుంది.

3. కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి.

(అ) బయలు + బయలు = బట్టబయలు
బయలు + బయలు – అని ఉన్నప్పుడు మొదటి పదమైన బయలులోని ‘బ’ తప్ప తక్కిన ‘యలు’ లోపించాయి. ఆ లోపించిన ‘యలు’ స్థానంలో ద్విరుక్తటకారం అంటే ‘ట్ట’ వచ్చింది. అపుడు బట్టబయలు అనే రూపం ఏర్పడింది.

(ఆ) అంత + అంత = అంతంత
అంత + అంత – అని ఉన్నప్పుడు అందులో మొదటీపదంలో చివరి ‘అ’ (త్ + అ) ఉన్నది. తరువాతి పదంలో మొదటి ‘అ’ ఉన్నది. అంటే ‘అ + అ’ అని ఉండగా మొదటి పదంలోని చివరి ‘అ’ లోపించి రెండవ పదంలో మొదట่ ఉన్స ‘అ’ మిగిలి ‘అంతంత’ అనే రూపం ఏర్సడింది.

(ఇ) తుద + తుద = తుట్టతుద
తుద + తుద – అని ఉండగా అందులోని మొదటి తుదలో మొదటి అక్షరము మా(్రం మిగిలింది. దాని మీద ఉన్న ‘ద’ లోపించింది. లోపించిన ‘ద’ స్థానంలో ద్విరుక్తటకారం ‘ట్ట’ వచ్చింది. అపుడు తుట్టతుద అనే రూపం ఏర్హడింది.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

(ఈ) ఎన్ని + ఎన్ని = ఎన్నెన్ని
జవాబు.
ఎన్ని + ఎన్ని – అని ఉండగా అందులోని మొదటి పదం చివర ఉన్న ‘ఇ’ (న్.న్ + ఇ), తరువాతి పదం మొదట ఉన్న ‘ఎ’ల స్థానంలో అంటే ‘ఇ + ఎ’లలో ‘ఇ’ లోపించి ‘ఎ’ మాత్రం మిగిలింది. అప్పుడు ‘ఎన్నెన్ని’ అనే రూపం ఏర్పడింది.

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

మీ తాత / అమ్మమ్మ / నాయనమ్మలను అడిగి ఒక కథ చెప్పించుకుని వాళ్లు చెప్పినట్లుగానే రాసి నివేదికను తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు.
(అ) ప్రాథమిక సమాచారం :
(1) ప్రాజెక్టు పని పేరు : పెద్దలు చెప్పిన కథ వాళ్ళు చెప్పిన రీతిలో రాయడం.
(2) సమాచారాన్ని సేకరించిన విధానం : తాత/నానమ్మ/అమ్మమ్మ చెప్పగా విని

(ఆ) నివేదిక : రామయ్య శెట్టి 3 వరాల కథ
మా 8వ పాఠం ‘చిన్నప్పు’’లో తాత/నానమ్మ/అమ్మమ్మలచే కథ చెప్పించుకుని చెప్పిన రీతిలోనే రాయాలని ప్రాజెక్టుపని ఉన్నదని, ఒక కథ చెప్పమని మా నానమ్మను అడగగా తన వంటపని ముగిశాక, భోంచేశాక తను నన్ను దగ్గర కూర్చుండబెట్టుకుని ఈ కథ నాకు చెప్పొంది. పూర్వం రంగాపురంలో రామయ్యశెట్టీ అనే పరమ పిసిరి ఉండేవాడు. అతడు మిక్కిలి దురాశ గలవాడు. ఒకరోజు భగవంతుడు భిక్షకుని రూపంలో ‘అయ్యా భిక్షాందేహి’ అని అతని దుకాణం ముందుకు వచ్చి అడగ్గా…. కసురుకొని పంపివేశాడు.

భిక్షకుని రూపంలో ఆ దేవుడు రామయ్య పక్కింటి వాడైన పేరిశాస్త్రి ఇంటికి వెళ్ళగా, వారు ఆ భిక్షకుణ్ణి సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టారు. భిక్షకుడు వారిని ఆశ్రీదించి బయటకు వెళ్ళగానే పేరయ్య పాత ఇంటి స్థానంలో పెద్ద భవనము, పరిచారకులు, ఇంటినిండా ధన, ధాన్య రాశులు (ప్రత్యక్షమయ్యాయి. ఇది చూసిన రామయ్యశెట్టి ఆ వచ్చినవాడు మామూలు వ్యక్తి కాదని గ్రహించి, పరుగు పరుగున వెళ్ళి అతని

కాళ్ళపైపడి అనుగ్రహించమనగా, ‘నీవు మొదట కోరిన 3 కోరికలు నిజమౌతాయి వెళ్ళు’ అని భగవంతుడు అతన్ని పంపివేశాడు. 3 కోరకకలు ఏం కోరుకోవాలని, ఇంటి వెనుక రాయిఫై కూర్చుని రామయ్యశెట్టి తీక్షణంగా ఆలోచిస్తుండగా నెత్తిపై కాకి రెట్ట వేసింది. ఛీ కాకి చచ్చిపోను అన్నాడు రామయ్యశెట్టి. మొదటి వరం (్రకారం కాకి చచ్చిపోయింది.

మిట్టమధ్యాహ్నం అయ్యింది, భర్త ఇంకా లోనికి రావడం లేదని భార్య ‘మండీ లోపలికి రారా’ అంటే, నేను రాను అన్నాడు రామయ్యశెట్టి. అలా రెండవ వరం న్ష్ప్యయోజనం అయ్యింది. రాయికే అతడు అతుక్కుపోయాడు. ఎండ తీ|్రత పెరుగుతోంది. రాయి వేడెక్క్ కాలడం వల్ల దాసిపై కూర్చోలేక తను రాయి నుండి విడివడాలని 3వ వరం కోరుకుని ఇంట్లోకి వచ్చాడు. ఇలా అతని 3 వరాలు నిష్ఫలమయ్యాయి.

(ఇ) కుగింళ్ర / అభల్రాయుం :
దురాశ దుఃఖానికి చేటు, అత్రాశ పనికిరాదు. జనులు మితిమీరిన సంపాదన మోజులో పడి, చన్న చిన్న ఆనందాలకు, ఆత్మీయుల స్నేహపూర్వక పలకరింపులకు దూరం కారాదు. కేవలం సంపాదనే కాకుండా ఆనందంగా జీవించడం కూడా ఎంతో ముఖ్లం. అత్యాశకు పోయి రామయ్య తన 3 వరాలలో ఏ ఒక్క వరాన్నీ ఉపయోగించు కోలేకపోయాడు.

TS 8th Class Telugu 8th Lesson Important Questions చిన్నప్పుడే

పర్యాయపదాలు

  • రైతు = వ్యవసాయదారుడు, కృషీవలుడు, కర్షకుడు
  • ముఖము = వదనము, ఆననము, మోము
  • తల = శిరస్సు, మస్తకము, మూర్ధము
  • ధనము = డబ్బు, ద్రవ్యము, ఐిత్తము
  • కృషి = యత్నము, పూనిక, ఉద్యోగము
  • స్త్రీ = యువతి, ఉవిద, లలన, మగువ
  • మంతి = ముచ్చట, ప్రసంగం ప్రస్థావన
  • కడుపు = ఉదరము, కుక్షి, పొట్ట
  • చెవి = కర్ణము, శ్రవణము, వీను
  • నేల = భూమి, ఇల, ధరణి, వసుధ

నానార్థాలు

  • వయస్సు – ఈడు, పక్షి, ఆరోగ్యం
  • పొలం – వరిమడి, అడవి, విధం
  • గంట – అరవై నిమిషాల కాలం, చిఱుగంట, గడ్డిదుబ్బు
  • బడి – పాఠశాల, ఐిధం, అనుసరణం
  • దండం – నమస్కారం, కఱ్ఱ, సమూహం

వ్యతిరేకార్థక వాక్యాలు

  • బాలురంతా పరిగెత్తారు × బాలురంతా పరుగెత్తలేదు
  • నాయకులు పిల్లలతో అరగంట గడిపారు × నాయకులు పిల్లలతో అరగంట గడపలేదు
  • బాలుడు జవాబు చెప్పాడు × బాలుడు జవాబు చెప్పలేదు
  • అందరి ముఖాలు వికసించాయి × అందరి ముఖాలు వికసించలేదు.
  • పిల్లలు మెల్లగా నాయకుల ప్రక్కన కూర్చున్నారు × పిల్లలు మెల్లగా నాయకుల ప్రక్కన కూర్చోలేదు

సంధులు

1. సవర్ణదీర్ఘసంధి :
జీవితాంతం = జీవిత + అంతం
గాఢాభిమానం = గాఢ + అభిమాసం
అధ్వాన్నము = అధ్వ + అన్నము
స్వార్రము = స్వ + అర్రము
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

2. గుణసంధి :
అమితోత్సాహం = అమిత + ఉత్సాహం
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే

3. ఉత్వసంధి :
బట్టలుతుకుతాం = బట్టలు + ఉతుకుతాం
మేమెందుకొ = మేము + ఎందుకొ
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.

4. అత్వసంధి :
బువ్వంత = బువ్వ + అంత
లింగయ్య = లింగ + అయ్య
చిన్నప్పుడు = చిన్న + అప్పుడు
సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

5. ఇత్వసంధి :
ఏమైంది = ఏమి + ఐంది
ఇవన్ని = ఇవి + అన్ని
ఎవరబ్బాయి = ఎవరి + అబ్బాయి
ఏమయింది = ఏమి + అయింది
సూత్రం : ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

ఇత్వసంధి : (ఆ)
పట్టిందంటే = పట్టింది + అంటే
అన్నదట = అన్నది + అట
సూత్రం : క్రియాపదాల్లో ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

6. గసడదవాదేశ సంధి:
హాయిగా = హాయి + కా
విలువగట్టు = విలువ + కట్టు
సూత్రం : ప్రథమమీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి.

సమాసములు

  • గాఢాభిమాన = గాఢమైన అభిమానం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
  • దివ్యభవనాలు = దివ్యమైన భవనాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
  • పెద్దకొడుకు = పెద్దయైన కొడుకు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
  • వాద్యాల చప్పుడు = దివ్యభవనాలు పెద్దకొడుకు వాద్యాల చప్పుడు – షష్ఠీ తత్పురుష సమాసం
  • పరహితము = పరులకు హితము – షష్ఠీ తత్పురుష సమాసం
  • మన సంతానము = మన యొక్క సంతానము – షష్ఠీ తత్పురుష సమాసం
  • ఒకరైతు = మన సంతానము ఒకరైతు – ద్విగు సమాసం
  • పండ్రెండు గంటలు = పండ్రెండైండు గంటలు – ద్విగు సమాసం
  • పదినిమిషాలు = పది అయిన నిమిషాలు – ద్విగు సమాసం
  • (పతి వస్తువు = వస్తువు వస్తువు – అవ్యయీభావ సమాసం
  • చేతి కర్ర = చేతి యందలి కర్ర – సప్తమీ తత్పురుష సమాసం
  • విశ్వమానవులు = విశ్వము నందలి మానవులు – సప్తమీ తత్పురుష సమాసం
  • గౌరవమర్యాదలు = గౌరవమును, మర్యాదయు – ద్వంద్వ సమాసం
  • స్కార్రరహీతము = స్వార్ధము చేత రహితము – తృతీయా తత్పురుష సమాసం
  • ఆగమనవార్త = ఆగమనమును గుఱించి వార్త – ద్వితీయా తత్పురుష సమాసం

పాఠం ఉద్దేశం

అప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాషా సంస్కృతులు ఉపేక్షకు గురికావడాన్ని నిరసిస్తూ నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమం విస్తరించింది. ఆ సందర్భంగా సభలద్వారా, పత్రికలద్వారా, రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెల్పడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రశ్న 1.
కథానిక ప్రక్రియను గురించి రాయండి.
జవాబు.
ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది; సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది; ఈ వచన ప్రక్రియనే “కథానిక” అంటారు. కథనం, సంభాషణలు, శిల్పం కథానికలోని ప్రధానాంశాలు. సంక్షిప్తతా లక్షణమే కథానిక ప్రత్యేకత. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆళ్వారుస్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం.

రచయిత పరిచయం

పాఠం పేరు : “చిన్నప్పుడే”
రచయిత : వట్టికోట ఆళ్వారుస్వామి
పాఠ్యభాగం దేని నుండి గ్రహింపబడింది : 1945 లో “మీజాన్” పత్రికలో ప్రచురితమైన కథానిక ఇది
రచయిత జననం : 1915 నవంబరు 1న, నల్గొండ జిల్లాలోని “చెరువుమాదారం”లో జన్మించారు.
ప్రతిభ : ఆళ్వారుస్వామి సుప్రసిద్ధ నవలా రచయిత. గొప్ప సాహితీవేత్త. తొలితరం కథా రచయిత.
జైలుజీవితం : నిజాంపాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలయ్యారు.
ఆంధ్రమహాసభాధ్యక్షులు : ఆంధ్రమహాసభ నల్గొండ జిల్లా శాఖకు ఈయన అధ్యక్షులుగా పనిచేశారు.
గ్రంథమాల స్థాపకులు : దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలు ముద్రించారు. “తెలంగాణ” పత్రికను నడిపించారు.
నవలా రచయిత : ఈయన రచించిన ‘ప్రజలమనిషి’, ‘గంగు’ నవలలు బాగా ప్రజాదరణ పొందాయి. వీరు అనేక కథలూ రాశారు.
నైజాం వ్యతిరేకోద్యమం : ఆళ్వారుస్వామి గారు హైదరాబాదు సంస్థాన ప్రజలలో స్ఫూర్తినీ, సాంస్కృతిక చైతన్యాన్నీ రగిలించారు.
మరణం : వీరు తన 46వ ఏటనే, అనగా 5-2-1961న కన్నుమూశారు.

ప్రవేశిక:

రజాకార్ల అఘాయిత్యాలకు, పెత్తందార్ల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం తిరగబడ్డది. అట్లా తిరగబడటానికి ప్రేరణనిచ్చినవారు ఉద్యమ కార్యకర్తలు, నాయకులు. ఆనాటి మానవ సమాజానికి స్వతంత్రత, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం వంటి ఉత్తమ గుణాలనందించేటందుకు వాళ్ళు ఏవిధమైన ప్రయత్నం చేశారు ? ఆనాటి సాంఘిక పరిస్థితులెట్లా ఉండేవి ? ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించే కథనం కోసం.. ఈ పాఠం చదువుదాం

కఠినపదాలకు అర్థాలు:

  • పెత్తందార్లు = పెత్తనం చేసేవారు, అధికార్లు, నాయకులు
  • దుర్భాషలు = చెడ్డ మాట่లు
  • ఆగమనం = రాక
  • మాటామంతీ = మాటలు, ముచ్చట్లు, ప్రసంగం
  • పరిహాసం = ఎగతాళి
  • మాలిపటేలు = (గామాల్లో ఒక అధికారి
  • శేగిదారు = పెద్ద నౌకరు
  • గిర్దావరు = రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆదాయ అధికారి
  • మిరం = కారం
  • ఎరుక = తెలియుట, జ్ఞానం, తెలివి
  • తట్ట = గంప
  • సౌభ్రాతృత్వం = మంచి సోదర భావం
  • అధ్వాన్నం = హీనము, తప్పదారి, అపమార్గం
  • నేరుగా = సూటిగా, తిన్నగా
  • గ్రామీయులు = గ్రామంలో ఉండేవారు
  • సన్నాహాలు = ఏర్పాట్లు
  • నింద = అపవాదు
  • బర్రె = గేదె
  • బండలు = రాళ్ళు
  • జ్ఞాపకం = గుర్తు
  • నాయన = తండ్రి
  • స్వతంత్ర = స్టేచ్ఛ)
  • భ్రాతృత్వం = సోదర భావం
  • చిరము = చాలాకాలం
  • పరిచితం = తెలసినది
  • మోతాడు = గొడ్ల ముక్కుకు వేసే తాడు
  • పసులు = పశువులు
  • జంగల్లో = అడవుల్లో
  • అవ్యాజం = కహటంలేనది
  • దీక్ష = గట్టి పట్టుదల, నియమ

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చిన్నప్పుడే 2

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 7th Lesson మంజీర Textbook Questions and Answers.

మంజీర TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించి చెప్పండి

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర 3

ప్రశ్న 1.
పై బొమ్మలో ఏమేం కన్పిస్తున్నాయి ? బొమ్మలోని బాలిక ఏం చూస్తున్నది ? ఏం ఆలోచిస్తుండవచ్చు?
జవాబు.
పై బొమ్మలో ప్రవహిస్తున్న నది, నదికి అవతలిగట్టున స్నానాల రేవు, ఆ రేవులో పవిత్ర జలంలో స్నానం చేస్తున్న భక్తులు, నది గట్టున అమ్మవారి ఆలయం కనిపిస్తున్నాయి. బొమ్మలోని బాలిక పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న నది వంక చూస్తున్నది. నది అంత అందంగా ఎలా పరుగెట్ట గలుగుతుందా అని ఆలోచిస్తుండవచ్చు.

ప్రశ్న 2.
ఏదైనా నదిని చూసినప్పుడు మీకు కలిగిన భావాలను చెప్పండి.
జవాబు.
నేను నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు కృష్ణానదిని చూశాను. ఆ నదిని చూసినప్పుడు ఇన్ని నీళ్ళు ఎక్కణ్ణుంచి వచ్చాయి, వేగంగా పరిగెత్తే నీళ్ళు ఎక్కడికి వెడతాయి, నది నీళ్ళు అంత స్వచ్ఛంగా, తియ్యంగా ఎందుకు ఉంటాయి, చలికాలం వెచ్చగానూ, వేసవి కాలంలో చల్లగానూ ఎలా ఉంటాయి. అసలు ఈ నదులు లేకపోతే తాగునీటి కోసం, సాగునీటికోసం మనుషులు ఏం చేసేవారో కదా! మొదలైన భావాలు కలిగాయి.

ప్రశ్న 3.
మీ ప్రాంతంలో ప్రవహించే నదుల పేర్లు చెప్పండి.
జవాబు.
మా ప్రాంతంలో కృష్ణా, గోదావరి, మంజీర, మూసీ, మొదలైన నదులు ప్రవహిస్తాయి.

ప్రశ్న 4.
నదుల వల్ల ఉపయోగాలు ఏమిటి ?
జవాబు.
నదులు ప్రాణులన్నింటికీ తాగు నీటిని ఇస్తాయి. పంటలు పండించడానికి సాగు నీరు ఇస్తాయి. రవాణా సౌకర్యాలకు ఉపయోగపడతాయి. విద్యుత్తు ఉత్పత్తికి తోడ్పడతాయి. భవన నిర్మాణాలకు, కట్టడాలకు కావలసిన ఇసుకను ఇస్తాయి.

ఆలోచించండి – చెప్పండి  (TextBook Page No. 70)

ప్రశ్న 1.
“పైరు పచ్చల కన్నుల పండువుగ విలసిల్లు” అనడంలో మంజీర నదికున్న సంబంధమేమిటి?
జవాబు.
మంజీర నది చల్లని తల్లివంటిది. అది పంట పొలాలకు తీయని నీరు అందిస్తుంది. మంజీరనది ప్రవాహపు సవ్వడి, గాజుల గలగలల వంటి ఆ నది తరంగాల శబ్దం వినగానే రైతు నాగలితో పొలం పనులు మొదలవుతాయి. ఆ నది మంచితనం చూడగానే రెప్పపాటులోనే పచ్చని పైరులు కనుల పండుగగా ప్రకాశిస్తాయి.

ప్రశ్న 2.
మంజీర నదిని కవి “ఎంత తీయని దానవే” అని అనడంలో ఆంతర్యమేమిటి?
జవాబు.
మంజీర నది తన పరిసరాలలో నివసించే ప్రజలకు తాగటానికి తీయని మంచినీరు ఇస్తుంది. ఆ నది నీటి వల్ల పండిన రుచికరమైన పంటలు ప్రజల ఆకలి తీరుస్తున్నాయి. అందువల్ల కవి మంజీర నదిని “ఎంత తీయని దానవే” అని అన్నారు.

ప్రశ్న 3.
ఈ “గిడస బారిన పుడమి ఎడద కరిగించెదవు” అని కవి మంజీర గురించి ఎందుకన్నాడు?
జవాబు.
మంజీర నది నీరు చేరగానే అప్పటి వరకూ ఎండిపోయి బిగుసుకుపోయిన నేల మృదువుగా, పంటలు పండడానికి వీలుగా తయారవుతుంది. అందువల్ల కవి మంజీర గురించి “గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు” అని అన్నాడు.

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

ప్రశ్న 4.
‘మంజీర’ పల్లెటూర్లను తల్లివలె లాలించింది అని కవి ఎందుకన్నాడు?
జవాబు.
ఆహార పంటలు పండించడంలో పల్లెటూళ్ళు ప్రముఖపాత్ర పోషిస్తాయి. అటువంటి పల్లెటూళ్ళలో పంటలు పండటానికి నదుల నీరే ఆధారం. మంజీరా నది పల్లెవాసులకు స్నానాలకూ, తాగడానికీ, సాగు చేయడానికీ నీళ్ళను అందించి కన్నతల్లి లాగా వారిని లాలిస్తుంది. ‘అందువల్ల కవి మంజీర పల్లెటూర్లను తల్లివలె లాలించింది అని అన్నాడు. పిల్లల అన్ని అవసరాలను తల్లి తీర్చినట్లు పల్లె ప్రజల సాగునీటి, తాగునీటి మొదలైన అవసరాలను అన్నింటినీ మంజీర నది తీరుస్తుంది అని తాత్పర్యం.

ప్రశ్న 5.
ఈ పట్టణాలను మంజీరానది తోబుట్టువులవలె ప్రేమిస్తుందని కవి ఎందుకన్నాడు?
జవాబు.
మంజీర నదికి పల్లెలు బిడ్డల వంటివి, పట్టణాలు తోబుట్టువుల వంటివి. బిడ్డలైన పల్లె ప్రజల అన్ని అవసరాలను తన తియ్యని నీటితో తీరుస్తుంది మంజీర తల్లి. తన బిడ్డలు పండించిన ఆహార పంటలను పంపించి తన తోబుట్టువులైన నగరాలను కూడ పోషిస్తుంది. అంటే పల్లెటూళ్ళలో ప్రజలకు అవసరమైన దానికంటే ఎక్కువ పంటలు పండుతాయి అని భావం. అంతేకాక ఆ ధాన్యం రవాణాకు కూడా మంజీర నది నీరు ఉపయోగపడుతుందని తాత్పర్యం.

ప్రశ్న 6.
“పట్టణాలను మంజీరానది పోషిస్తున్నది” ఎట్లాగో మీ మాటల్లో చెప్పండి.
జవాబు.
మంజీరానది ప్రవహించడం వల్లనే పల్లెటూళ్ళలో ఆహారపంటలు అధికంగా పండుతున్నాయి. తమ మిగులు పంటలను పల్లె ప్రజలు పట్టణాలకు పంపిస్తారు. ఈ అధిక దిగుబడికి మంజీర నది అందిస్తున్న తియ్యని నీరే కారణం. అందువల్ల
పట్టణాలను మంజీరానది పోషిస్తున్నది అని చెప్పవచ్చు.

ఇవి చేయండి :

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.

ప్రశ్న 2.
నదుల వల్ల ఏయే ప్రయోజనాలున్నాయో చర్చించండి.
జవాబు.
భూమి మీద నివసించే అన్ని రకాల జీవుల దాహార్తిని తీర్చే నదులు మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రాచీనకాలం నుంచే స్నానానికి, సాగునీటికి ఉపయోగపడుతున్న నదులు నేడు విద్యుత్తు ఉత్పత్తికి, పర్యాటక కేంద్రాలుగా, రవాణా సౌకర్యాలకూ, ఇసుక ఇవ్వడం మొదలైన ఎన్నో విధాలుగా ఉపయోగపడు తున్నాయి.

నేటి కాలంలో ప్రవహించే నది నీటిని ఆపే ఆనకట్టలు, నీటిని నిలవ ఉంచే రిజర్వాయర్ల సౌకర్యాలు పెరిగాయి. అందువల్ల నది నీటిని గొట్టాలద్వారా నేరుగా ఇంటిదగ్గరకే పంపించగలుగుతున్నారు. దీనితో అందరూ నది నీటిని తాగునీరుగా ఉపయోగించుకోగలుగుతున్నారు. నదుల నుంచి నీరు పెద్ద కాలువలోకి, అందులోనుంచి చిన్న కాలవలలోకి, వాటి నుంచి బోదెలలోకి, నీరు చేరడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాక నది నీటి తలానికి ఎత్తులో ఉండే ప్రాంతాలకు కూడా నీళ్ళు తోడిపోసే యంత్రాల ద్వారా నీళ్ళు అందుతున్నాయి. నదులకు ఆనకట్టలు కట్టి నీటిని కాలవల ద్వారా పంపేచోట విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. పంటలకు ఉపయోగపడే నీరే విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల మానవాళికి ఎంతో ఉపయోగం.

నదులలో ముఖ్యంగా ఆనకట్టల ప్రాంతాలలో బోటులు, మరపడవలలో విహారయాత్రలకు వీలు కలుగుతున్నది. ఇది ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతున్నది. తక్కువ ఖర్చుతో ఎంతో బరువున్న వస్తువులను నది నీళ్ళలో రవాణా చేయడం సులువు. దీనివల్ల ఖర్చు, శ్రమ, కలిసివస్తాయి. కొండల్లో నుంచి, గుట్టల్లోనుంచి ప్రవహించే నదులు తమతోపాటు తెచ్చిన ఇసుకను ఒడ్డుల్లో, మధ్యలో, మేటలు వేస్తాయి. ఆ ఇసుక భవన నిర్మాణాలకూ, వంతెన నిర్మాణాలకూ ఎంతో ఉపయోగపడుతున్నది.ఈ విధంగా ఆధునిక కాలంలో నదులు మానవాళికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. నదులు మానవ జీవన విధానంలో విడదీయలేనంత అనుబంధం కలిగి ఉన్నాయి.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

కింది భావాన్నిచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి రాయండి.

(అ) రైతు నాగలి ముందుకు సాగుతుంది.
జవాబు.
కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు

(ఆ) చిన్నబోయిన నేల గుండెను సేదతీరుస్తావు.
జవాబు.
గిడసబారిన పుడమి; ఎడద కరిగించెదవు

(ఇ) హైదరాబాద్ ప్రజలకు తీయని నీళ్ళందిస్తావు.
జవాబు.
భాగ్యనగరములోన వసియించు పౌరులకు పంచదారను బోలు మంచి నీరొసగెదవు.

(ఈ) పల్లెను తల్లి ప్రేమతో లాలిస్తావు.
జవాబు.
పల్లెటూళ్ళను కూర్మి తల్లివలె లాలించి

2. గంగాపురం హనుమచ్చర్మ రాసిన కింది గేయ పంక్తులు చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రవహింతువా దుందుభీ మాసీమ
పాల యేఱుగ దుందుభీ
చిరుగాలి కెరటాల
పొరలెత్తు అలలతో
దరులంటు అమృతశీ
కరములౌ జలముతో
లంటి వాని ని
ర్ఘరులంటి, పైపైని
దరులంటి జాజి క్రొ
వ్విరుల వన్నియలూని ప్రవహింతువా

ప్రశ్నలు :
అ. ఈ గేయం దేన్ని గురించి చెప్పింది ?
జవాబు.
ఈ గేయం దుందుభినది ప్రవాహం గురించి చెప్పింది.

ఆ. దుందుభి నది ప్రవాహాన్ని కవి దేనితో పోల్చాడు ?
జవాబు.
దుందుభి నది ప్రవాహాన్ని కవి పాలయేఱుతో పోల్చాడు.

ఇ. కవి దుందుభి నదిని పాలయేఱు అని ఎందుకన్నాడు?
జవాబు.
తెల్లగా ఉండే కొత్త జాజిపూల రంగుతో ప్రవహించడం వల్ల కవి దుందుభినదిని పాలయేఱు అని అన్నాడు.

ఈ. ‘దరులు’ అనే పదానికి అర్థమేమిటి ?
జవాబు.
దరులు అంటే ఒడ్డులు అని అర్థం.

ఉ. దుందుభి జలం ఎట్లా ఉన్నదని కవి ఉద్దేశం ?
జవాబు.
దుందుభి జలం అమృతపు తుంపరల వలె ఉన్నదని కవి ఉద్దేశం.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. “నది పొలానికి బలం చేకూరుస్తది” అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
తియ్యని నదుల నీటితో పొలాలలో రుచికరమైన పంటలు పండుతాయి. కొండలు, అడవులలో నుంచి ప్రవహిస్తూ వచ్చే నదులలో ఒండ్రుమట్టి, వన మూలికలు, ఆకులు అలములు మొ||వి కొట్టుకు వస్తాయి. ఇవి పొలాలలోకి చేరి పంటమొక్కలకు ఎంతో బలాన్ని అందిస్తాయి. పంటల అధిక దిగుబడికి కారణం అవుతాయి. అందువల్లనే “నది పొలానికి బలం చేకూరుస్తుంది” అని కవి అన్నాడు.

ఆ. భాగ్యనగరానికి, మంజీర నదికి ఉన్న సంబంధం గురించి వివరించండి.
జవాబు.
భాగ్యనగరం అంటే హైదరాబాదు. ఈ నగరాన్ని కులీకుతుబ్షా అనే సుల్తాను నిర్మించాడు. ఈ భాగ్యనగరంలో

ఇ. మనం నదులను ఎట్లా కాపాడుకోవాలి ?
జవాబు.
జీవులన్నింటికీ మంచినీరు ప్రాణాధారం. నదులు మంచినీరు అందించి ప్రాణాలను కాపాడతాయి. కనుక నదులను మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నది నీటిని వ్యర్థాలతో, మలినాలతో కలుషితం చేయకూడదు. ప్రాణాలు నిలబెట్టే నదులలోని మంచినీటిని వృథా చేయకూడదు. భవన నిర్మాణాల కోసమో, నగర నిర్మాణాల కోసమో నదులను దారి మళ్ళించ కూడదు. అట్లా చేయడం వల్ల నదులు కనుమరుగు కావడమే కాక వరదలు, ముంపులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల నదులను కాపాడుకోవాలి.

ఈ. నదులు ‘నాగరికతకు ఆలవాలం’ ఎందుకు ?
జవాబు.
నాగరీకరణం చెందిన మానవ జీవన విధానమే నాగరికత. మానవుడు కొండల్లో, గుహల్లో తలదాచుకున్న దశ నుంచి వ్యవసాయం చేయడం నేర్చుకొని స్థిరనివాసాలు ఏర్పరచుకున్నాడు. అవే గ్రామాలు. గ్రామ దశ నుంచి వర్తక వాణిజ్యాల అభివృద్ధితో నగరాలు ఏర్పడ్డాయి. ఈ నాగరికతలో నదులు ప్రముఖ పాత్ర పోషించాయి. ఆ మాటకొస్తే నదుల వల్లే నాగరికత అభివృద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధ నగరాలు అన్నీ దాదాపు నదుల ఒడ్డున ఏర్పడినవే. ఉదాహరణకు మూసీనది ఒడ్డున హైదరాబాదు, గోదావరి ఒడ్డున రాజమండ్రి, యమునా నది ఒడ్డున ఆగ్రా, గంగానది ఒడ్డున కాశీ, నైలునది ఒడ్డున కైరో, థేమ్సునది ఒడ్డున ఇంగ్లాండు, సీన్ నది ఒడ్డున రోమ్ మొదలైనవి. కనుక నదులు నాగరికతకు నిలయమైనవని చెప్పవచ్చు.

ఉ. మంజీర నది మానవులకు చేసే మేలు ఏమిటి ?
జవాబు.
మంజీర నది జీవులను కన్నతల్లిలా పోషిస్తుంది. తియ్యని మంచినీరు అందిస్తుంది. రుచికరమైన ఆహార పంటలు పండటానికి తోడ్పడుతుంది. ఎండిపోయిన, బీడుబోయిన నేలను తడిపి పంటలు పండటానికి అనువుగా తయారు చేస్తుంది. ఎటువంటి నేలలో అయినా తీయని చెరకు వంటి పంటలు పండటానికి తోడ్పడుతుంది. తన ప్రవాహంతో పాటు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందించి పంటకు బలాన్ని ఇస్తుంది. భాగ్యనగర్ వాసులకు తీయని మంచినీరు అందిస్తుంది. స్నానం, తాగునీరు, సాగునీరు మొదలైన పల్లెవాసుల అవసరాలన్నీ తీరుస్తుంది. పల్లెల్లో పండించిన ధాన్యాన్ని పట్టణాలకు పంపడానికి దోహదపడుతుంది.

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

ఊ. మానవ నాగరికత పరిణామంలో నదుల పాత్ర ఏమిటి ?
జవాబు.
మానవ నాగరికత పరిణామంలో నదులు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలో విలసిల్లిన నాగరికతలు అన్నీ నదుల ఒడ్డున ఏర్పడి అభివృద్ధి చెందినవే. ఉదాహరణకు నైలునది ఒడ్డున కైరో, థేమ్సునది ఒడ్డున ఇంగ్లాండు, యమునానది ఒడ్డున ఆగ్రా, మూసీనది ఒడ్డున హైదరాబాదు, సీన్ నది ఒడ్డున రోమ్ నగరం, గోదావరి నది ఒడ్డున రాజమండ్రి, గంగానది ఒడ్డున కాశీనగరం మొదలైనవి. ప్రాచీనకాలం నుంచి నదులు జీవుల దాహం తీరుస్తున్నాయి. వ్యవసాయానికీ, రవాణా సౌకర్యాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఆధునికకాలంలో విద్యుత్ తయారీకి, పర్యాటకుల్ని ఆకర్షించడానికీ కూడా ఉపయోగపడుతూ మానవులకు ఎంతో మేలు చేస్తున్నాయి.

ఎ. “నీ కంకణ క్వణము నినదించినంతనే” దీన్ని వివరించండి.
జవాబు.
కంకణం అంటే గాజు, క్వణం అంటే ధ్వని. కంకణకణము అంటే గాజులు కదలేటప్పుడు వినిపించే గలగలల శబ్దం. సాధారణంగా నదిని స్త్రీతో పోలుస్తారు. ఇక్కడ కవి మంజీర నదిలోని అలల సవ్వడిని స్త్రీ గాజుల గల గలల లాగా ఉన్నాయని ఊహించాడు. ‘నీ కంకణ క్వణము నినదించినంతనే’ అంటే నీ (మంజీర నది) గాజుల సవ్వడి గలగలలు (అలల సవ్వడి) ధ్వనులు విన్న వెంటనే అని తాత్పర్యం.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయో కారణాలు వివరించండి.
జవాబు.
నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగు కావడానికి వాతావరణ కాలుష్యం, జలకాలుష్యం, నీటివృథా, అజాగ్రత్త, నిర్వహణాలోపం మొదలైనవి ముఖ్యకారణాలు.

  1. వాతావరణ కాలుష్యం : మేఘాలు వర్షించినప్పుడు భూమిపైన ఎత్తుమీద పడిన నీరు పల్లానికి ప్రవహించి చిన్న చిన్న వాగులై అవి మహానదిలా మారి చివరికి సముద్రంలో కలుస్తాయి. భూమి మీద వృక్షసంపద తగ్గిపోతూండడం వల్ల తగినంత వర్షం పడటంలేదు. అందువల్ల నదుల్లో ప్రవహించే నీటి శాతం క్రమంగా తగ్గుతున్నది.
  2. జలకాలుష్యం : ప్రవహించే నీటిలో అనేక పరిశ్రమల వ్యర్థాలు, మలిన పదార్థాలు కలిసిపోవడం వల్ల ఆ నీరు కలుషితమై పోతున్నది. ఆ నీరు తన సహజగుణాన్ని కోల్పోతున్నది.
  3. నీటి వృథా : నీటిని వృథా చేయడం వల్ల కూడా కొంతకాలానికి నదుల్లో నీరు కనుమరుగైపోతుంది.
  4. అజాగ్రత్త : నదుల్లో ప్రవహించే నీటిని జాగ్రత్త చేసుకోలేక పోవడం వల్ల ఎక్కువ శాతం నీరు సముద్రంలో కలిసిపోతున్నది.
  5. నిర్వహణాలోపం : నది నీటికి శాస్త్రీయ పద్ధతులలో నిర్వహణ లేకపోవడం వల్ల కూడా నదినీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
  6. ముగింపు : ఈ విధంగా మన నాగరికతకు మూలాధారాలైన నదులను జాగ్రత్తగా కాపాడకపోతే మానవ జీవనం ప్రశ్నార్థకమౌతుంది.

ఆ. గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు.
డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రచించిన ‘మంజీర’ అనే పాఠ్యభాగంలో మంజీరనది మానవాళికి చేసే మేలును గురించి తేలికైన తేటతెలుగు పదాలలో వివరించారు. మాత్రాఛందస్సులో రచించిన ఈ గేయంలో మంజీరానది సాగునీటిగా తాగు నీరుగా ఉపయోగపడుతూ ప్రజలకు చేసే మేలును వివరించారు.

సాగునీరు : మంజీర నది చల్లని తల్లి వంటిది. గాజుల గలగలలు వంటి ఆమె ప్రవాహపు సవ్వడి వింటేనే రైతన్న నాగలి ముందుకు సాగుతుంది. ఆమె చల్లని చూపు వంటి ప్రవాహంతో పొలాలన్నీ పచ్చని పైర్లతో కనుల పండుగలాగా ప్రకాశిస్తాయి. మంజీర నది ఎండిపోయిన నేలను కూడా తన తీయని నీటితో కరిగించి పంట పండటానికి అనువుగా తయారుచేస్తుంది. ఎటువంటి నేలలో అయినా చెరుకు వంటి తీయని పంటలు పండేటట్లు చేస్తుంది. అంతేకాక తన ప్రవాహంతోపాటు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందిస్తుంది. పంట మొక్కలకు బలాన్ని ఇస్తుంది.

తాగునీరు : మంజీర నది కులీకుతుబ్షా నిర్మించిన భాగ్యనగరం (హైదరాబాదు)లో నివసించే వారికి తీయని మంచి నీరు అందిస్తుంది. తన పరీవాహక పరిసరాలలో నివసించే పల్లె ప్రజలను ప్రేమగా లాలిస్తుంది. వారి సాగునీటి అవసరాలతో పాటు స్నానాల, తాగునీటి అవసరాలను కూడా తీరుస్తుంది.

పట్టణానికి తోబుట్టువులా : మంజీరనది పల్లె ప్రజలను తల్లిలా లాలిస్తుంది. పట్టణ ప్రజలను తోబుట్టువులా ఆదరిస్తుంది. పల్లె ప్రజలకు అవసరమైన దానికంటే అధికంగా దిగుబడిని అందిస్తుంది. పల్లె ప్రజలు తమ మిగులు పంటను పట్టణాలకు పంపించడానికి తోడ్పడుతుంది. ధాన్యాన్ని, ఇతర వస్తువులనూ తరలించడానికి రవాణా కోసం కూడా నది ఉపయోగపడుతుంది.

ముగింపు : ఈ విధంగా మంజీర నది సకల జీవులకూ తాగునీటి అవసరాలను తీరుస్తుంది. మానవులకు సాగునీటి అవసరాలను తీర్చి ఎంతో మేలు చేస్తున్నదని ‘మంజీర’ పాఠ్యభాగంలో కవి వర్ణించాడు.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. మీ ప్రాంతంలోని లేదా మీరు చూసిన వాగు / చెరువు / నదిని వర్ణిస్తూ కవిత / గేయాన్ని రాయండి.

పల్లవి : మా వూరు వచ్చింది మా మంచి ఏరు
మనసార నివ్వింది సిరిమల్లె తీరు
మా దాహమును తీర్చి మా పంట పండించ ॥మా వూరు॥

చరణం 1 : పగటి ఎండల్లోన పరవళ్ళు తొక్కింది
తెల్ల మబ్బుల వంటి నురగల్లు తెచ్చింది.
పండు వెన్నెల్లోన నిండుగా పారింది
ఎండు బీడుల్లోన గుండె ఉప్పొంగంగ ॥మా వూరు॥

చరణం 2 : గలగలా పారుతూ గిలిగింత పెట్టింది.
హలము పొలము దున్న రైతును తట్టింది
తీయని నీటితో తేనెను పోలింది
చక్కని పంటతో సిరులు కురిపించంగ ॥మా వూరు॥

చరణం 3 : జలపాతములతోన జలకాలు ఆడింది
గులకరాళ్ళల్లోన సెల పాటపాడింది
మంచి నీటితోన చెరువు ముంచెత్తింది.
తేటనీటితోన ఏరై పరుగెత్తంగ ॥మా వూరు॥

V. పదజాల వినియోగం

1. కింది పదాలకు సమానార్థక పదాలను పట్టికలో గుర్తించి రాయండి.

(అ) రైతు
(ఆ) చల్లదనం
(ఇ) నేల
(ఈ) స్నేహం
(ఉ) పంపి
(ఊ) ప్రకాశించు

భాషపుడమినాగలి
అంపివిలసిల్లుచలువ
కర్షకుడుకంకణముసోపతి

(అ) రైతు – కర్షకుడు
(ఆ) చల్లదనం – చలువ
(ఇ) నేల – పుడమి
(ఈ) స్నేహం – సోపతి
(ఉ) పంపి – అంపి
(ఊ) ప్రకాశించు – విలసిల్లు

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు ప్రకృతి పదాలను రాయండి.

“రైతు ఎడద విశాలమైనది. ధాన్య రాసులతో దేశాన్ని సుసంపన్నం చేస్తాడు.

వికృతిప్రకృతి
ఎడదహృదయం
రాసులురాశులు

3. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.

(అ) కాకతీయుల కాలం సాహిత్య సంపదతో విల్లసిల్లింది కృష్ణ కుచేలుల కూర్మి గొప్పది. = ప్రకాశించింది
(ఆ) కృష్ణ కుచేలుల కూర్మి గొప్పది. = స్నేహం, సోపతి
(ఇ) పుడమి అనేక సంపదలకు నిలయం = భూమి, ధరణి

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది ఖాళీలను పూరించండి.
ఉదా :

సమాసపదంవిగ్రహవాక్యంసమాసం పేరు
సీతజడసీత యొక్క జడషష్ఠీ తత్పురుషము
చెట్టు యొక్క నీడ
వయోవృద్ధుడు
రాజులలో శ్రేష్ఠుడు

జవాబు.

సమాసపదంవిగ్రహవాక్యంసమాసం పేరు
సీతజడసీత యొక్క జడషష్ఠీ తత్పురుషము
చెట్టునీడచెట్టు యొక్క నీడషష్ఠీ తత్పురుషము
వయోవృద్ధుడువయసు చేత వృద్ధుడుతృతీయా తత్పురుషము
రాజశ్రేష్ఠుడురాజులలో శ్రేష్ఠుడుషష్ఠీ తత్పురుషము
అమంగళంమంగళం కానిదినఞ తత్పురుషము
తిలకధారితిలకమును ధరించినవాడుబహువ్రీహి సమాసం


2. కింది దానిని చదువండి.

ఇల్లు, మనిషి, పెళ్ళి మంటపం, ఫంక్షన్ హాలు, వాహనం ఏదైనాసరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాం. అట్లానే రచనలు ఆకర్షణీయంగా ఉండడానికి అలంకారాలు ఉపయోగిస్తారు.
ఇది మన బడి
అక్షరాల గుడి
సరస్వతీదేవి ఒడి
మనకు నేర్పును నడవడి

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఈ కవిత చదువుతుంటే ఎట్లా అనిపించింది?
జవాబు.
ఈ కవిత చదువుతుంటే చెవికి ఇంపుగా ఉన్నది.

ప్రశ్న 2.
ఎందుకని వినసొంపుగా ఉన్నది?
జవాబు.
ప్రతి పాదం ‘డి’ అనే అక్షరంతో ముగియడం వల్ల వినసొంపుగా ఉన్నది.

ప్రశ్న 3.
దీనిలో ఎక్కువసార్లు వచ్చిన అక్షరం ఏది?
జవాబు.
దీనిలో ‘డి’ అనే అక్షరం ఎక్కువసార్లు వచ్చింది. పై కవితలో ‘డి’ అనే అక్షరం అనేకసార్లు రావడం వల్ల కవిత అందంగా, వినసొంపుగా ఉన్నది కదా! ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం. ఆ అందం శబ్దం వల్ల వచ్చింది కాబట్టి శబ్దాలంకారం. అర్థం వల్ల అందం కలిగితే అర్థాలంకారం అవుతుంది. ఇప్పుడు ఒక శబ్దాలంకారం గురించి తెలుసుకుందాం.

కింది వాక్యాలు పరిశీలించండి.

(అ) గడ గడ వడకుచు తడబడి జారిపడెను.
(ఆ) రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది.
పై రెండు వాక్యాల్లో ఎక్కువసార్లు వచ్చిన హల్లు ఏది ?
పై వాక్యాల్లో వరుసగా ‘డ’, ‘త్త’ అనే అక్షరాలు అనేకసార్లు వచ్చాయి కదా! ఇట్లా ఒకే హల్లు అనేకసార్లు రావడాన్ని ‘వృత్యను ప్రాస’ అలంకారం అంటారు.

3. మరికొన్ని వృత్త్యనుప్రాస అలంకారానికి చెందిన వాక్యాలను పాఠాలలో వెతికి రాయండి.

  1. పైరు పచ్చలు కనుల
    పండువుగ విలసిల్లు
  2. గిడసబారిన పుడమి
    ఎడద కరిగించెదవు

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులు, వాటిపై నిర్మించిన ఆనకట్టలు, ఆ నదుల తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలను తెలియజేసే పట్టికను తయారుచేయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు.
(అ) ప్రాథమిక సమాచారం :
(1) ప్రాజెక్టు పని పేరు : తెలంగాణ రాష్ట్రంలో నదులు – వాటిపై ప్రాజెక్టులు వాటి – తీరాల్లో పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు.
(2) సమాచారాన్ని సేకరించిన విధానం : గ్రంథాలయ పుస్తకాలు, పెద్దల నుండి సమాచార సేకరణ

(ఆ) నివేదిక :

నది పేరుప్రాజెక్టు పేరుపుణ్యక్షేత్రం (నదీతీరపు)దర్శనీయ స్థలాలు
1. గోదావరి

 

(1) నిజాంసాగర్ – ప్రాజెక్టు – అచ్చంపేట(1) సత్యనారాయణ స్వామి దేవాలయం లక్షెట్టిపేట్ (గూడెంగుట్ట) ఆదిలాబాద్ జిల్లా(1) కొయ్యబొమ్మల పరిశ్రమ నిర్మల్, జి॥ ఆదిలాబాద్
(2) సింగూరు ప్రాజెక్టు సింగూరు(2) జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర, ఆదిలాబాద్ జిల్లా(2) చేతి బొమ్మల పరిశ్రమ ఆర్మూర్, జి॥ నిజామాబాద్
(3) శ్రీరాంసాగర్ – ప్రాజెక్టు – పోచంపాడు(3) నరసింహస్వామి దేవాలయం, ధర్మపురి, కరీంనగర్ జిల్లా
(4) దుమ్ముగూడెం – పవర్ ప్రాజెక్టు – పాములపల్లి ఖమ్మంజిల్లా(4) శివాలయం, కాళేశ్వరం జి॥ కరీంనగర్
2. కృష్ణా(1) నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (నల్గొండ) నాగార్జున కొండ(1) శ్రీ జోగులాంబదేవి దేవాలయం, ఆలంపూర్ మహబూబ్నగర్ జిల్లా(1) పిల్లలమర్రి మహబూబ్నగర్ జిల్లా
(2) జూరాల ప్రాజెక్టు రేవులపల్లి – మహబూబ్నగర్(2) శ్రీరంగనాయక స్వామి దేవాలయం, వనపర్తి, మహబూబ్నగర్(2) గద్వాల్ పోర్టు, మహబూబ్నగర్ జిల్లా

(ఇ) ముగింపు :
తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యనదులైన గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ఆ నదులపై నిర్మించిన ప్రాజెక్టుల వివరాలు మరియు ఆ నదుల పరీవాహక ప్రాంతాలలోని ప్రసిద్ధ దర్శనీయ స్థలాల వివరాలను పట్టికలో పొందుపరిచాను. పెద్దల ద్వారా వాటి గూర్చి తెల్సుకొంటున్నప్పుడు ఆ స్థలాలను దర్శిస్తే బాగుండుననిపించింది.
ఉదా : మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రిలో 700 సం||ల క్రితపు మఱివృక్షం ఉందట. అలాంటి వింతలు విశేషాలు గల స్థలాలను సెలవులలో మా కుటుంబంతో కలిసి దర్శించుకోవాలని నిర్ణయించుకొన్నాను.
TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర 1

TS 8th Class Telugu 7th Lesson Important Questions మంజీర

పర్యాయపదాలు

  • క్వణం = శబ్దం, సవ్వడి, చప్పుడు
  • కర్షకుడు = రైతు, వ్యవసాయదారుడు, కృషీవలుడు, హాలికుడు
  • నాగేలు = నాగలి, హలం
  • చేయి = కరం, హస్తం, పాణి
  • కన్ను = నేత్రం, అక్షం, చక్షువు
  • పండుగ = ఉత్సవం, వేడుక
  • పుడమి = నేల, ధరణి, భూమి
  • పొలం = చేను, క్షేత్రం
  • పురం = నగరం, పట్టణం
  • నీరు = జలం, ఉదకం, నీళ్లు, తోయం
  • తల్లి = అమ్మ,, అంబ, జనని, మాత

ప్రకృతి – వికృతిలు

  • హలము – నాగేలు, నాగలి
  • హృదయం – ఎద, ఎడద, డెందం
  • పృథివి, పృథ్వి – పుడమి

సంధులు

  • చల్ల్దాసవే = చల్లనిదానవు + ఏ = ఉత్వ సంధి
  • తీయనిదానవే = తీయనిదానవు + ఏ = ఉత్వ సంధి
  • చేదైన = చేదు + ఐన = ఉత్వ సంధి = ఉత్వ సంధి
  • నీరొసగెదవు = నీరు + ఒసగెదవు = ఉత్వ సంధి
  • సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
  • నినదించినంతనే = నినదించిన + అంతనే = అత్వ సంధి
  • కనినంత = కనిన + అంత = అత్వ సంధి
  • సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
  • పల్లెటూళ్ళను = పల్లె + ఊళ్లను = టుగాగమ సంధి
  • సూత్రం : కర్మధారయాల్లో ఉత్తునకు అచ్చు పరమైనపుడు టుగాగం అవుతుంది.
  • స్నానపానాదులకు = స్నానపాన + ఆదులకు = సవర్ణదీర్ఘ సంధి
  • సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

సమాసాలు

  • కంకణక్వణం – కంకణం యొక్క క్వణం – షష్ఠీ తత్పురుష సమాసం
  • ధాన్యరాసులు – ధాన్యం యొక్క రాసులు – షష్ఠీ తత్పురుష సమాసం
  • పల్లెటూళ్ళు – పల్లె అయిన ఊళ్ళు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
  • జీవకణములు – జీవమైన కణములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

గేయం – అర్థాలు – తాత్పర్యాలు

I. (i) నీ కంకణక్వణము
నినదించి నంతనే
కర్షకుని నాగేలు
కదలి ముందుకు సాగు
నీ చేతి చలువ చిం
దిలిపాటు గనినంత
పైరు పచ్చలు కనుల
పండువుగ విలసిల్లు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయని దానవే!

అర్థాలు :
మంజీర! = తల్లీ మంజీరా!
సవు = నువ్వు
ఎంత చల్లన
దానవే! = = ఎంత చల్లని దానవో కదా!
ఎంత తీయని
దానవే! = ఎంత తీయని దానవో కదా!
నీ = నీ
కంకణక్వణము = చేతి గాజుల గలగలలు – ఇక్కడ ప్రాహమని అర్థం
నినదించిన + అంతనే = సవ్వడి చేయగానే
కర్షకుని = రైతు
నాగేలు = నాగలి
కదలి = కదలిక వచ్చి ముందుకు
సాగు = ముందుకు సాగుతుంది
నీ = నీ
చేతి చలువ = మంచితనపు (స్వచ్ఛమైన నీరు)
చిందిలిపాటు = పరవళ్ళ
కనిన + అంత = చూడగానే
పైరు పచ్చలు = పైరుల పచ్చదనాలు
కనుల పండువగ = కన్నుల పండుగలాగా
విలసిల్లు = పకాశిసాయి

తాత్పర్యం : అమ్మా! మంజీర! ఎంత చల్లని దానవు నువ్వు. ఎంత తీయని దానవు నువ్వు. నీ నీటి ప్రవాహప సవ్వడి, నీ చేతి గాజుల గలగలల శబ్దం వింటే చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది. నీ మంచితనం చూసిన వెంటనే రెప్పపాటులో పచ్చనిపైర్లు కన్నుల పండుగగా (ప్రకాశిస్తాయి.

(ii) గิడసబారిన పుడమి
ఎడద కరిగించెదవు
చేదైన నేలలో
చెరకు పండించెదవు
చేవగలిగిన మట్టి
జీవకణములు తెచ్చి
పొలముకు ఎరువుగా
బలము చేకూర్చెదవు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయనిదాసవే!

అర్థాలు :
మంజీర! = తల్లీ మంజీరా!
నీవు = సీవు
ఎంత చల్లని దానవే! = ఎంత చల్లని దానవో కదా!
ఎంత తీయని దానవే! = ఎంత తీయని దానవో కదా!
గిడసబారిన = ఎండిపోయిన
పుడమి ఎడద = నేలతల్లి హ్లయాన్ని
కరిగించెదవు = కరిగిస్తావు
చేదు + ఐన = చేదైన
నేలలో = నేలలో
చెరుకు = తీయన చెరకు
పండించెదవు = పండిస్తావు
జీవకణములు = జీవ కణాలు కలిగిన
చేవ గలిగిన = సారవంతమైన
మట్టి = మట్టిని
తెచ్చి = తీసుకొన వచ్చి
పొలముకు = పోలాసిక
ఎరువుగా = ఎరువుగా ఇచ్చ
బలము = బలాన్ని
చేకూర్చెదవు = చేకూరుస్తావు

తాత్పర్యం : తల్లీ! మంజీర! చిన్నటోయిన నేలతల్లి హృదయాన్ని కరిగిస్తావు. చేదైన నేలలో తీయని చెరుకును పండిస్తావు. సారవంతవైన మట్టిని తీసుకువచ్చి పౌలాలకు ఎరువుగా అందించి బలాన్నిస్తావు.

II. (i) ఆనాడు కుతుబు సు
ల్తాను నిలిపిన పురము
ఖాగ్యనగరములోన
వసియించు పౌరులకు
పంచదారసు జోలు
మంచి సీరొసగెదవు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయని దానవే!

అర్థాలు :
మంజీర! = తల్లీ మంజీరా!
నీవు = నీవు
ఎంత చల్లని దానవే! = ఎంత చల్లని దానవో కదా!
ఎంత తీయని దానవే! = ఎంత తీయని దానవో కదా!
ఆనాడు = ఎప్పుడో
కుతుబుసుల్తాను = కులీకుతుబ్షా
నిలిపిన = నిర్మించిన
పురము = నగరమైన
లోస = భాగ్ననగరము (హైదరాబాదు)లోన
వసియించు = నివసించే
పౌరులకు = ఝజలకు
పంచదారను + పోలు = పంచదార లాగా తీయనైన
మంచినీరు = మంచనళ్ళ్రు
ఒసగెదవు = అందిస్తావు

తాత్పర్యం :
అమ్మా! మంజీర! కులీకుతుబ్షా నిర్మించిన భాగ్యనగర్ (హైదరాబాద్) వాసులకు చక్కెర వంటి తీయని తాగునీటిని అందిస్తావు.

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

(ii) పల్లెటూళ్ళను కూర్మి
తల్లివలె లాలించి
స్నానపానాదులను
సమకూర్చెదవు నీవు
పట్టణమ్ములసు తో
బుట్టువలె [పేమించి
ధాన్యరాసుల నంపి
తరచు పోషించెదవు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయని దానవే!

అర్థాలు :
మంజీర! = తల్లీ మంజీరా!
నీవు = నీవు
ఎంత చల్లని దాసవో! = ఎంత చల్లని దానవో కదా!
ఎంత తీయని దాసవో! = ఎంత తీయని దానవో కదా!
నీవు = నువ్వు
పల్లె+ఊళ్ళను = పల్లెటూళ్ళను
కూర్మి = (పేమగా
తల్లివలె = తల్లిలాగా
లాలంచి = లాలించి
స్నాన పాన + ఆదులను = స్నానం, మంచినీరు వంటి అవసరాలను
సమకూర్చెదవు = తీరుస్తావు
పట్టణమ్ములను = నగరాలను
తోబుట్టువల = తోడబుట్టిన వాళ్ళుగా
(పేమించి = (పేమించి
ఢాన్యరాసులను = పల్లెల్లో పండిన ధాన్యాలను
అంపి = ఆ నగరాలకు పంపించి
తరచు = ఎల్లప్పుడూ
పోషించెవు =పోషిస్నావు

తాత్పర్యం:
తల్లీ! మంజీర! పల్లెలను అమ్మలాగ, (పేమగా లాలించి స్నానం, తాగునీరు వంటి అవసరాలను తీరుస్తావు. నగరాలను తోడబుట్టిన వాళ్ళుగ [పేమించి పల్లెల్లో పండిన ఢాన్యాన్ని పంపి ఎల్లప్పుడు పోషిస్తావు. అమ్మా! మంజీర ఎంత చల్లని దానవు నువ్వు. ఎంత తీయని దానవు.

పాఠ్యభాగ ఉద్దేశం :

ప్రశ్న 1.
మంజీర పాఠం ఉద్దేశం తెల్పండి.
జవాబు.
పాడి పంటలకు, సిరిసంపదలకు నదులే మూలం. తెలంగాణా రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్, సింగూర్, ఘనపురం ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి.
ప్రజల జీవనానికి, పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతో మేలును చేకూరుస్తున్నాయని తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు :

ప్రశ్న 1.
గేయ ప్రక్రియ గురించి రాయండి.
జవాబు.
మంజీర పాఠం గేయ ప్రక్రియకు చెందినది. పాడుకోవటానికి వీలుగా ఉండే కవిత్వాన్ని గేయం / పాట అంటారు. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డా॥ వేముగంటి నరసింహాచార్యులు రాసిన “మంజీర నాదాలు” అనే గేయకావ్యంలోనిది.

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

కవి పరిచయం

ప్రశ్న 1.
వేముగంటి నరసింహాచార్యుల పరిచయం రాయండి.
జవాబు.
పాఠ్యభాగం పేరు : మంజీర
కవి పేరు : డా॥ వేముగంటి నరసింహాచార్యులు
జననం : 30-06-1930
మరణం : 29-10-2005
జన్మస్థలం : సిద్ధిపేట జిల్లాలోని సిద్ధిపేట
తల్లిదండ్రులు : తండ్రి రంగాచార్యులు, తల్లి రామక్క
రచనలు : తిక్కన, రామదాసు, మంజీర నాదాలు, వివేక విజయం మొదలైన 40కిపైగా రచనలు.
బిరుదులు : కవి కోకిల, కావ్యకళానిధి, విద్వత్కవి.
సత్కారాలు : తెలుగు విశ్వవిద్యాలయం వీరిని డాక్టరేట్తో సత్కరించింది.
విశేషాంశాలు : వీరు ‘సాహితీ వికాస మండలి’ అనే సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘం అనే వాటిని స్థాపించి, సాహిత్య వికాసానికి కృషి చేశారు.
శైలి : వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వీటిలోని తెలంగాణ భాష ఇంపు, సొంపు పాఠకులను పరవశింపజేస్తాయి.

ప్రవేశిక:

జలధారలు ప్రాణికోటి జీవనాధారాలు. అందుకే మానవ జీవనమంతా నదీ పరీవాహాల్లో విస్తరించింది. ముఖ్యపట్టణాలు, తీర్థస్థలాలు అన్నీ నదుల నానుకొని వ్యాపించాయి. చినుకులు కాలువలై, కాలువలు నదులై తాగునీరుగా, సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని, ఆరోగ్యన్ని అందిస్తాయి. అందుకే నది పవిత్రమైనది. పుణ్యరపదమైనది. మన రాష్ట్రంలో (్రవహించే ముఖ్యమైన జీవనదుల్లో ‘మంజీర’ ఒకటి. ఆ నదీమతల్లి ప్రస్థాన్ని హృదయంతో దర్శించిన కవి వేముగంటి నరసింహాచార్యుల రచనను ఆస్వాదిద్దాం. అవగాహన చేసుకుందాం….

కఠినపదాలకు అర్థాలు:

  • క్వణము – శబ్దం
  • చిందిలిపాటు – పరవళ్ళు
  • చేవ – శక్తి, సారము
  • హూర్మి – เపేమ
  • చేతి చలువ – చేతి మంచితనము
  • కనుట – చూచుట
  • กิడసబారిన – ఎండిపోయిన
  • అంపి – పంపించి
  • ఆదులు – మొదలైనవన్నీ
  • తరచు – ఎల్లప్పుడు
  • లాలించు – బజజ్జగంంు
  • వసించు – నివసించుట
  • పోలుట పోలిక – సమానమైన
  • పురము – పట్టణం
  • తోబుట్టువు – తనతో పుట్టినవారు (అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు)

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర 4

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 2nd Lesson సముద్ర ప్రయాణం Textbook Questions and Answers.

సముద్ర ప్రయాణం TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana

చదువండి – ఆలోచించి చెప్పండి

పడవలో ఇంకా ఇద్దరు భారతీయ విద్యార్థులుండిరి. వారు నాతో మాట్లాడుతూ ఉండిరి. సర్కారువారు వారిని స్కాలర్షిప్ ఇచ్చి పంపినది. కొంతమంది తల్లిదండ్రుల పైసాతో వచ్చుచుండిరి. నేను ఎక్కువ సామాను లేకుండా 22 పౌండ్లతోనే ఇంగ్లండుకు బయలుదేరినాను. ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయేటన్ని లేకుండె. ధోతి, పయిజామా, షేర్వాణీతోనే పడవలో తిరిగేవాణ్ణి. దేవునిపైన భారం వేసినాను. బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను. గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడుగున ఉత్తరం వైపు మా ప్రయాణం సాగుచుండెను. గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుచుండెను. దేవుడు నన్ను తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి, కృతజ్ఞతా వందనం చేసితిని.

ప్రశ్న1.
పడవలోని వాళ్ళు ఎక్కడికి ప్రయాణమైపోతున్నారు ?
జవాబు.
పడవలోని వాళ్ళు బొంబాయి నుండి ఇంగ్లండుకు ప్రయాణమైపోతున్నారు.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

ప్రశ్న2.
వాళ్ళు బ్రిటన్ క్కు ఎందుకు వెళ్ళి ఉండవచ్చు ?
జవాబు.
వాళ్ళు చదువుకోవడానికి బ్రిటన్కు వెళ్ళి ఉండవచ్చు.

ప్రశ్న3.
పడవలో ప్రయాణించిన వ్యక్తి దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పటానికి గల కారణాలు ఏమై ఉంటాయి ?
జవాబు.
ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, అనుకున్నచోటుకు క్షేమంగా చేరినందుకు దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పి ఉండవచ్చు. ఎంతో దూరంలో ఉన్న బ్రిటన్కు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చేరినందుకు కృతజ్ఞతలు చెప్పి ఉండవచ్చు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 13)

ప్రశ్న 1.
వాహనాలు కాన్వాయ్గా వెళ్ళడం ఎప్పుడైనా చూశారా ? దేని కొరకు అట్లా వెళ్తాయి ?
జవాబు.
వాహనాలు కాన్వాయ్గా వెళ్ళటం చాలాసార్లు చూశాము. రాజకీయ నాయకులు, మంత్రులు ప్రయాణం చేస్తున్నపుడు వారికి రక్షణగా బందోబస్తు కొరకు కాన్వాయ్లు వెళ్తుంటాయి.

ప్రశ్న 2.
సైరన్ లేదా అలారం ఎందుకు మోగిస్తారు ?
జవాబు.
ఒక సంకేతాన్ని గాని, హెచ్చరికను గాని సూచించటానికి సైరన్ లేదా అలారం మోగిస్తారు.

ప్రశ్న 3.
దూర ప్రయాణాలకు ఎట్లా సిద్ధం కావాలి ?
జవాబు.
దూర ప్రయాణాలకు సిద్ధమయ్యేటప్పుడు మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. కావలసినంత డబ్బు, దుస్తులు, వస్తు సామగ్రిని, మందులను సిద్ధంగా ఉంచుకోవాలి.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 14)

ప్రశ్న 1.
ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ప్రయాణీకులు ఏమేం చేస్తుంటారో చెప్పండి.
జవాబు.
ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ఎఫ్.ఎమ్. రేడియోలు, లాప్టాప్లు, సెల్ఫోన్లు వాడుతున్నారు. వీటితోపాటుగా హౌసీ, చదరంగం వంటి ఆటలు ఆడుతున్నారు. కొంతమంది అంత్యాక్షరి పోటీలు కూడా పెట్టుకుంటారు.

ప్రశ్న 2.
ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో ఎట్లా ఉండాలి ? ఎందుకు ?
జవాబు.
ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో సౌమ్యంగా, మర్యాదగా ప్రవర్తించటానికి ప్రయత్నించాలి. వారితో కలిసిపోయి ఉండటానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే వారి భావాలు మనకు, మన భావాలు వారికి తెలుస్తాయి. నలుగురిలో ఎలా మసలుకోవాలో తెలుస్తుంది.

ప్రశ్న 3.
కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి భాష అర్థం కాకపోతే ఎటువంటి చిక్కులెదురవుతాయి ? అప్పుడు మీరేం చేస్తారు?
జవాబు.
కొత్త ప్రదేశానికి వెళ్ళినపుడు అక్కడి భాష అర్థంకాకపోతే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటప్పుడు వారు మాట్లాడేటప్పుడు వారి హావభావాలను బట్టి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. లేదా ‘దుబాసీ’ని ఏర్పాటు చేసుకుంటాం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 15)

ప్రశ్న 1.
విదేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని సరిచేసుకోవాలి. దీనికి కారణం ఏమిటి ?
జవాబు.
సూర్యుడు తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేస్తాడు. కాబట్టి పశ్చిమ దేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని పెంచుకోవాలి. తూర్పుదేశాలకు వెళ్ళేటప్పుడు సమయాన్ని తగ్గించుకోవాలి. గ్రీన్విచ్ మీన్ అని దీనిని వ్యవహరిస్తారు.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

ప్రశ్న 2.
విదేశాలలో మనకు తెల్సినవారు, బంధువులుంటే ఎట్లాంటి సౌకర్యాలు పొందవచ్చో చెప్పండి.
జవాబు.
విదేశాలలో మనకు తెల్సినవారు బంధువులు ఉంటే ఒక రకమైన ఊరట కలుగుతుంది. ఆ ప్రాంతంలోని చారిత్రాత్మక, విశిష్ట ప్రదేశాలను తెలుసుకునే అవకాశం, చూసే అవకాశం ఉంటుంది. భాష అంతగా రాకపోయినా బాధపడవలసిన అవసరం ఉండదు.

ప్రశ్న 3.
“ఈశ్వరా నీవే దిక్కు” అని రచయిత అనుకోటానికి కారణమేమిటి ? మీకెదురైన అట్లాంటి సందర్భాన్ని చెప్పండి.
జవాబు.
భారతదేశం నుండి ఇంగ్లండుకు చేరిన వారివద్ద తగినంత డబ్బు లేకపోతే అట్లాంటి వారిని డీ పోర్టు చేసి వాపసు పంపుతారని, బ్రిటీషు పోలీసులు చాలా స్ట్రిక్ట్ అని రచయితకు ఆంగ్లో ఇండియన్ ఫాల్సెట్ చెప్పారు. అపుడు రచయిత తనను ఇంగ్లండులో దిగనివ్వకుండా వెనక్కు పంపుతారని భయపడి “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుకున్నాడు. నేను ఒకసారి నా మిత్రునితో కలసి బెంగుళూరు వెళ్ళాను. అపుడు మా టికెట్ను ఎక్కడో పోగొట్టుకున్నాం. టి.సి. టికెట్ చూపించకపోతే జైలుకు పంపిస్తాడేమోనని భయపడి “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుకున్నాం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 16)

ప్రశ్న 1.
రచయితకు సురేశ్ బాబు సహాయం లేకుండానే పర్మిషన్ దొరకడానికి కారణం ఏమై ఉంటుంది ?
జవాబు.
బ్రిటన్ పోలీసులు రచయితను చూసి చదువు కొరకు వచ్చారని అనుకున్నారు. అదే విషయం రచయితను అడిగారు. రచయిత అవునని చెప్పేటప్పటికి ఇంకా ఏమీ అడగకుండానే ‘పర్మిటెడ్’ అని స్టాంపు వేశారు. అందువల్ల రచయితకు సురేశ్బాబు సహాయం అవసరం లేకపోయింది.

ప్రశ్న 2.
ఏఏ సందర్భాల్లో మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటారో తెల్పండి.
జవాబు.
కష్టంలో నుండి బయటపడ్డప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాము. కుటుంబ సభ్యులలో, స్నేహితులలో ఎవరైనా అనారోగ్య స్థితి నుండి బయటపడవేసినందుకు దేవునికి కృతజ్ఞతను చెప్పుకుంటాం.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
(లేదా)
ముద్దు రామకృష్ణయ్య పట్టుదల, ఆత్మవిశ్వాసం గలవాడని ఎలా చెప్పగలవు ?
జవాబు.
ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. ఈ రెండూ లేకపోతే దేనినీ సాధించలేము. ఉదాహరణకు మన పాఠంలోని సముద్ర ప్రయాణం వ్రాసిన ముద్దు రామకృష్ణయ్యనే తీసుకుందాం ! ఆయన ప్రయాణ కాలం రెండవ ప్రపంచ యుద్ధకాలం. అపుడు ప్రయాణం చేయాలంటే మనసును రాయి చేసుకోవాల్సిందే ! ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించిన కృష్ణయ్య దృఢ సంకల్పంతో, పట్టుదలతో తన మనసులోని కోరికను, లక్ష్యాన్ని సాధించటానికి సుదూర ప్రాంతమైన గ్రేట్ బ్రిటన్కు ప్రయాణమయ్యాడు. పైసలు లేవు, తెలిసినవారు లేరు. అయినా మంచి సంకల్ప బలం ఆయనను ఇంగ్లండుకు నడిపించింది. ఆయనలోని కృతనిశ్చయం, దృఢ సంకల్పం ఆయన విజయానికి దారితీశాయి. గ్రేట్ బ్రిటన్ వెళ్ళి అక్కడి లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి యం.ఇడి. పట్టా పొందారు కదా ! కాబట్టి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. కింది వాక్యాలు. పాఠంలోని ఏ పేరాలో ఉన్నవో గుర్తించి, పేరాకు శీర్షికను పెట్టండి.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం 1
జవాబు.

వాక్యంపేరా సంఖ్యశీర్షిక
1. పడవలో రిసెప్షన్ రూం కూడా ఉంటుంది.13వ పేజీలో 4వ పేరాపడవ ప్రయాణంలో సౌకర్యాలు
2. నేను ధోవతి శేర్వానీతో ఉంటిని1 పేజీ 1వ పేరావేషధారణ
3. ఏవేళ ప్రాణం పోతుందో12వ పేజీ 1వ పేరారెండవ ప్రపంచ యుద్ధం
4. మేము పడవ నుండి దిగేవరకు సూర్యాస్తమయం అయింది.16వ పేజీ  చివరి పేరాగ్రేట్ బ్రిటన్

 

2. కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

హైదరాబాద్ నుండి నేను రైలులో బాసర రైల్వేస్టేషన్కు చేరుకున్నాను. అక్కడి నుండి బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవి ఆలయానికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంలో, గోదావరినది తీరాన ఈ సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది.

ఇక్కడి సరస్వతీదేవి సైకతమూర్తిని వ్యాసమహర్షి మలిచాడని ప్రసిద్ధి. ఈ వాగ్దేవతా సమక్షంలో వసంతపంచమిరోజు పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. దసరా పండుగ రోజుల్లో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క అవతార మూర్తిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజుల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది.

అ) బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు ?
జవాబు.
బాసర పుణ్యక్షేత్రంలో వెలసిన దేవత శ్రీ జ్ఞాన సరస్వతీదేవి.

ఆ) సరస్వతీదేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది ?
జవాబు.
సరస్వతీదేవి ఆలయం గోదావరి నదీ తీరాన ఉన్నది.

ఇ) సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవారు ఎవరు ?
జవాబు.
సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవారు వేదవ్యాస మహర్షి.

ఈ) నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి ?
జవాబు.
నవరాత్రి ఉత్సవాలు దసరా పండుగ రోజుల్లో జరుగుతాయి.

ఉ) పై పేరాకు శీర్షిక సూచించండి.
జవాబు.
ఆధ్యాత్మికతకు మారుపేరు – బాసర.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) దూర ప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు.
దూర ప్రయాణాలకు పోయేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బు చేతినిండా ఉంచుకోవాలి. ఆయా ప్రాంతాన్ని బట్టి దుస్తులను సమకూర్చుకోవాలి. అక్కడ ఎవరైనా తెలిసిన వారుంటే వారి చిరునామా, ఫోన్ నంబర్లను తీసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది ఆ ప్రాంతంలో మాట్లాడే భాషను కొంతన్నా మాట్లాడగలగాలి. ముందే ఆ భాషను నేర్చుకొని ఉండాలి. లేదా ప్రపంచ భాషగా ప్రసిద్ధి చెందిన ఏదో ఒక భాషను నేర్చుకొని ఉండాలి. దానితోబాటుగా మన భాషలోను, ఆ ప్రాంతం భాషలోను చక్కగా మాట్లాడగలిగే వారిని ముందుగా కలుసుకోవటం చేయాలి.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

ఆ) రచయిత ఉన్నతవిద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండు వెళ్ళాడు కదా ! దీని ద్వారా మీరేం గ్రహించారు ?
జవాబు.
కృషి, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలమన్న విషయాన్ని రచయిత ఇంగ్లాండుకు వెళ్ళిన సంఘటన ఋజువు చేస్తోంది. జ్ఞానాన్ని సంపాదించటానికి ఎల్లలుండవు. దేన్నైనా సాధించాలనే దృఢ సంకల్పం ఎటువంటి ఆటంకాలనైనా ఎదుర్కొని విజయం సాధించేందుకు తోడ్పడుతుంది. మంచి సంకల్పం ఉంటే విజయాలు వాటంతట అవే వెతుక్కుని వస్తాయట. కనుక మనం దేనిలో విజయం సాధించాలనుకున్నామో దానిని సాధించటానికి పట్టుదలతో కృషిచేయాలని గ్రహించాము.

ఇ) “ఉన్నత లక్ష్యం, పట్టుదలతో, దేనినైనా సాధించవచ్చు” వివరించండి. (లేదా) సముద్ర ప్రయాణం పాఠం ఆధారంగా పట్టుదలతో దేనినైనా సాధించవచ్చును అని వివరించండి.
జవాబు.
ఉన్నత లక్ష్యంతో, పట్టుదలతో దేనినైనా సాధించవచ్చన్నది యథార్థం. స్వామి వివేకానంద భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. దానికోసం ఆయన ప్రపంచదేశాలన్నీ చుట్టి వచ్చాడు. చేతిలో డబ్బుల్లేకపోయినా, ఎన్నో రోజులు పస్తులున్నా ఆయన ముందు తన దేశభక్తిని ప్రపంచానికి చాటాలనే లక్ష్యం ఉండటం చేత ఆ సమస్యలు ఆయనను ఏమి చేయలేక పోయాయి. చికాగోలో ఉపన్యాసానికి ముందు ఆయన ఆహారం లేక సొమ్మసిల్లి పడిపోతే ఆయనను ఎక్కడో చూసిన ఒక స్త్రీ రక్షించి ఆహారాన్నిచ్చి ఆయనను చికాగో నగరానికి పంపించింది. కాబట్టి ఉన్నత లక్ష్యం, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలం అన్నది నిజం.

ఈ) ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలను తెల్సుకోవడానికి మీరేంచేస్తారు ?
జవాబు.
క్రొత్త ప్రదేశాన్ని దర్శించినపుడు అక్కడ తెలియని విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రదేశంలో పరిచయమున్నవారితో స్నేహం చేసి తెలుసుకుంటాం. ఆ ప్రాంతానికి సంబంధించిన అట్లాసు, గైడ్లపై ఆధారపడతాం. తెలిసిన బంధువులు, స్నేహితులు, మన వూరివారు ఆ ప్రాంతంలో ఎవరున్నారనే విషయాన్ని తెలుసుకుంటాం. అక్కడున్న పర్యాటక ఏజెన్సీలలో సంప్రదిస్తాం. అక్కడి వింతలు, విశేషాలు తెలుసుకుని వాటిని చూడటానికి ప్రయత్నిస్తాం: నేటి సాంకేతిక పరిణామాలను అనుసరించి ‘నెట్’ ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటాం. ‘వికిపీడియా’ ప్రపంచాన్నంతటిని మన చేతుల్లోకి తెచ్చింది కదా ! దానిని ఉపయోగించి మరింత సమాచారాన్ని తెలుసుకుంటాం. (అదనపు ప్రశ్న)

ఉ) గ్రేట్ బ్రిటన్ని చేరిన రచయిత మనఃస్థితిని వివరించండి.
జవాబు.
రచయిత ఎన్నో అడ్డంకులను అధిగమించి చదువుకోసం చివరికి గ్రేట్ బ్రిటన్ చేరుకున్నారు. పడవలో నుండి బయటకు అడుగుపెట్టగానే ఆయనకు పట్టరాని సంతోషం కలిగింది. గ్రేట్ బ్రిటన్ని చూస్తూ అలా నిలబడిపోయారు. సాధ్యం కాదనుకున్న దానిని దేవుడు సాధ్యం చేశాడు. “ఎక్కడో తెలంగాణలో మారుమూల గ్రామంలో పుట్టిన నేనెక్కడ, బ్రిటన్ ఎక్కడ ! పైసా లేకుండా రావటం ఎంత ఆశ్చర్యం. ఆ ఈశ్వరుడే నన్ను రక్షించి ఇక్కడకు తీసుకువచ్చాడు.” అని రచయిత అనుకున్నాడు. బ్రిటన్ సుందర దృశ్యాలను చూసే అదృష్టాన్ని ఉన్నత చదువులు చదివే అదృష్టాన్ని తనకు కల్పించినందుకు దేవునికి కృతజ్ఞతలను తెలుపుకున్నాడు.

ఊ) సురేష్ బాబుకు, రచయితకు మధ్య జరిగిన సంభాషణను వివరించండి.
జవాబు.
(అదనపు ప్రశ్న) రచయిత గ్రేట్ బ్రిటన్కు ప్రయాణమయ్యాడు. ఆయనతో పాటు కరీంనగర్కు చెందిన జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గారి అబ్బాయి సురేష్ బాబు ప్రయాణించాడు. ఆయన స్కాలర్షిప్తో పాటు దండిగా డబ్బులు తెచ్చుకుంటున్నాడు. రచయిత తనని తాను పరిచయం చేసుకొని క్లుప్తంగా తన దీన పరిస్థితిని, చదువుకోవాలన్న ఆసక్తిని వినిపించాడు. తన దగ్గర డబ్బు లేదన్న రహస్యాన్ని ఎవరికి చెప్పవద్దని వాగ్దానం తీసుకున్నాడు.

సురేష్ రచయిత “బాబు ! నీకు డబ్బు ప్రశ్న లేదు. నీ దగ్గరున్న 150 పౌండ్ల డ్రాఫ్ట్ ఉంది. అందులో వంద పౌండ్లు నావి అని చెప్పు” అని వేడుకున్నాడు. “నీ డబ్బు అడగను నన్ను పడవ దిగేటట్లు చూడు” అని కోరాడు. సురేష్ బాబు సరేనని ఒప్పుకున్నాడు. అయితే రచయితకు సురేష్ బాబు సహాయం లేకుండానే చివరికి ‘పర్మిటెడ్’ అని స్టాంపు వేశారు బ్రిటన్ పోలీసులు. అయినా తనకు ఒక ధీమాను, ఓదార్పును ఇచ్చిన సురేష్ బాబుకు రచయిత కృతజ్ఞతలను చెప్పుకున్నాడు.

ఋ) రచయిత ఎడెన్లో దిగినప్పటి అనుభవాలను రాయండి. (అదనపు ప్రశ్న)
జవాబు.
గ్రేట్ బ్రిటన్లో మొదటి మజిలీ ఆడెన్ (ఎడెన్). ఎడెన్ పట్టణంలోకి వెళ్ళటానికి రచయిత తోటి ప్రయాణీకులకు అనుమతి లభించింది. రచయిత తోటి ప్రయాణికుడి బంధువులు ఆడెన్లో ఉన్నారు. అందులో ఒకరు కారును తీసుకువచ్చి ఆడెన్ ప్రాంతంలోని చారిత్రాత్మక ప్రాంతాలన్నీ చూపించాడు. వారింటిలోనే శాకాహార భోజనాన్ని వీరికి అందించాడు. కొంత విశ్రాంతి అనంతరం రచయితను ఆయనతో ఉన్న గుజరాతీ పిల్లలను మరల ఓడరేవులో దించేశాడు. ఆడెన్లో ఉండే వారందరూ దాదాపు అరబ్బీ ముస్లింలే. హైదరాబాద్ లోని ముస్లింల మొహల్లా ఉన్నట్లు ఆడెన్ ఉంటుంది. అది ఒక గొప్ప అనుభవంగా రచయిత భావించాడు.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) “అనుకున్నది సాధించటంలో కలిగే తృప్తి అనంతమైనది.” ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం ఆధారంగా వివరించండి. (లేదా) “అనుకున్నది సాధించడంలో ముద్దు రామకృష్ణయ్య ఎంతో సంతృప్తి పొందాడు.” (లేదా) అనుకున్నది సాధించినపుడు పొందే తృప్తి ఎట్లాంటిది?
జవాబు.
ముద్దు రామకృష్ణయ్య జనన విశేషాలు :
ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లాలోని మంథని గ్రామంలో అక్టోబరు 18, 1907 లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. ఈయన ఒక బడి పంతులు. ఉన్నత విద్య కోసం రామకృష్ణయ్య గ్రేట్ బ్రిటన్ వెళ్ళాలనుకున్నాడు. తగినంత ధనం లేకపోయినా అనుకున్నది సాధించాడు.

గ్రేట్ బ్రిటను ప్రయాణం :
అది రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న రోజులు. ప్రయాణం మొదలయింది. బ్రిటన్లో ఎవరిని కలవాలో తెలీదు. ఎలాంటి ప్రతిఘటనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని తెచ్చుకున్నాడు రచయిత. తనకున్న రెండు జతల బట్టలను పైజమా కుర్తాలను సర్దుకుని పాస్పోర్టు 22 పౌండ్ల ధనాన్ని తీసుకుని పడవ ఎక్కాడు. ఆయన కండ్ల ముందు ఒకటే లక్ష్యం. ఆ లక్ష్య సాధనే ఆయన సిద్ధాంతం. తాను అనుకున్న ఉన్నత విద్యను సాధించాలని ప్రయాణం ప్రారంభించాడు.

సహాయకులు :
ఆయనకు పడవలో తొలి పరిచయస్తుడు ఆంగ్లో ఇండియన్ ఫాల్సెట్టు. ఆయన బ్రిటన్ గురించి అక్కడి అలవాట్లను గురించి వివరించాడు. తరువాత కరీంనగర్ నుండి బయలుదేరిన సురేష్ బాబు పరిచయం ఏర్పడి పడవ దిగేవరకు రచయితకు భరోసా ఇచ్చాడు.

బ్రిటన్లో కాలుపెట్టిన రచయిత అనుభూతి :
స్టడీస్ కొరకు వచ్చాడని తెలుసుకున్న పోలీసులు తేలికగానే పర్మిషన్ ఇవ్వటంతో బ్రతుకు జీవుడా అనుకున్నాడు. గ్రేట్ బ్రిటన్ న్ను చూస్తూ అలా నిలబడిపోయాడు అనుకున్న లక్ష్యాన్ని సాధించాననుకున్నాడు. సంకల్పం, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించగలం అన్న నమ్మకాన్ని అందరికి కలిగించాడు ముద్దు రామకృష్ణయ్య. అనిర్వచనీయమైన సంతృప్తి పొందుతాడు.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. కింది వానిలో ఒకదానికి జవాబు రాయండి.

అ) చదువును కష్టంగా భావించవద్దు. ఉన్నత లక్ష్యం పెట్టుకొని, ఇష్టంగా చదువుకుని, అనుకున్నది సాధించాలని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.

జనగాం,
ది. XX. XX. XXXX

ప్రియమైన మిత్రుడు యాదగిరికి,

నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తున్నాను. నీ చదువు ఎలా సాగుతోంది. కష్టపడి పనిచేయాలి ఇష్టంగా చదవాలి అంటారు పెద్దలు. మొక్కుబడిగా చదివే చదువు బుర్రలోకి ఎక్కదు. జ్ఞాపకం ఉండదు. అందువల్ల ఎన్నిగంటలు చదివినా, చదవడం అవగానే మరచిపోతాము. అదే ఇష్టపడి చదివితే, మనసులోకి ఎక్కుతుంది. ఎన్నాళ్ళైనా మరచిపోవడం జరగదు. అందుకే చదువును ఎప్పుడూ కష్టంగా భావించకూడదు. ఉన్నత లక్ష్యాలను సాధించటానికి చదువు మూలం. చదువు మనకు సంస్కారాన్నిస్తుంది. జ్ఞానాన్నిస్తుంది. కాబట్టి చక్కగా చదువుకుని లక్ష్యాన్ని సాధించి మంచి జీవితానికి బాటలు వేసుకోవాలి. లక్ష్యం ఉన్నతంగా ఉంటే, దానిని సాధించడానికి క్రమశిక్షణతో కృషిచేస్తాము. లక్ష్యాన్ని సాధించడానికి బాగా కష్టపడతాము. ఇలా కష్టపడి సాధించిన లక్ష్యం ఎంతో ఆనందాన్నిస్తుంది.

ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని వినాలని కోరిక. తప్పక రాస్తావు కదూ !

ఇట్ల
నీ ప్రియమైన మిత్రుడు,
జమలయ్య.
ఖమ్మం.

చిరునామా :
కె. యాదగిరి
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,

ఆ) మీరు చేసిన ఒక ప్రయాణ అనుభవాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి.

(లేదా)

ప్రయాణం చేసే సమయంలో ఇబ్బందులేమైనా ఉన్నాయా? ఉంటే వ్రాయండి.
జవాబు.
మేము మా కుటుంబంతో కలసి వేసవి సెలవులలో ఎక్కడికన్నా వెళ్లామనుకున్నాం. మా తాతగారు ఒరేయ్ మీకు ప్రకృతి అంటే ఏమిటో చూపిస్తాను వస్తారా ? అన్నారు. అందరం సరేనన్నాం. ఒక గంటలోనే అందరం ప్రయాణానికి సిద్ధం అయ్యాం. పెద్ద టాటా సుమో కారు మా యింటి ముందుకు వచ్చి ఆగింది. ఎక్కడికో ఏమిటో చెప్పనేలేదు. అందరం దాన్లో ఎక్కి కూర్చున్నాం. నేను తాతగారు ముందు, మిగిలిన వారందరూ వెనుక కూర్చున్నాం. అప్పుడన్నారు తాతగారు మనం భద్రాచలం నుండి రాజమండ్రి వెళ్తున్నాం అని. ఇది కూడా ఒక ప్రయాణమేనా అని అందరం ఉసూరుమన్నాం. వాహనం ముందుకు సాగింది. భద్రాచలం అడవుల గుండా ప్రారంభమైన మా ప్రయాణం ఖమ్మం, చింతూరుల మీదుగా సాగింది.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

అది చిన్న ఘాట్ రోడ్. కొండలు, గుట్టలు, లోయలు దారంతటా దర్శనమిస్తున్నాయి. నిజమైన ప్రకృతి సంపద వృక్షసంపద. ఆకాశాన్నంటే ఎత్తైన వృక్షాలు, ఋషుల జడలు లాగా అల్లుకున్న తీగలు, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి లాగా ఉంది ఆ అడవి. పెద్ద పెద్ద సెలయేళ్ళు జలజలా ప్రవహిస్తుంటే ఒళ్ళు జలదరించింది.

పక్షుల కిలకిలా రావాలు, కీచురాళ్ళు పెట్టే ధ్వని మధ్యమధ్యలో అడవిలో తిరుగాడే కోతులు, చిరు జంతువుల అరుపులు, తోడేళ్ళ, నక్కల ఊళలు నిజంగా ప్రకృతి అంటే ఇదేగా అన్నట్లున్నది. ఆ ఘాట్రోడ్డులో జనసంచారమే కాదు వాహన సంచారం కూడా చాలా అరుదు. కొండమలుపుల్లో మాలో కలిగిన ఆందోళన అంత ఇంత కాదు. ఇబ్బందిగా ఉంటుందని అనుకున్నాం. భయపడ్డాం. కానీ, అక్కడ వాతావరణం చూస్తే పళ్ళు, పూలతో అలరిస్తున్న చెట్లు నిజంగా అది ఒక స్వర్గలోకం అనిపించింది. తాతగారు చెప్పిన ప్రకృతి అర్థం ఇదా అని, ఇంతటి సుందర ప్రాంతాన్ని చూపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాం.

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి తగిన అర్థాన్ని గుర్తించండి.

అ) పై చదువుకు సరిపడా ద్రవ్యం నా వద్ద లేకుండె.
అ) శక్తి
ఆ) సామర్థ్యం
ఇ) డబ్బు
ఈ) వస్తువు
జవాబు.
ఇ) డబ్బు

ఆ) నా మిత్రునికి సహాయపడతానని నేను వాగ్దానం చేశాను.
అ) మాటతీసుకొను
ఆ) మాటయిచ్చు
ఇ) మాట మార్చు
ఈ) డబ్బు యిచ్చు
జవాబు.
ఆ) మాటయిచ్చు

2. కింది జాతీయాలను సొంతవాక్యాలలో రాయండి.

ఉదా : అందెవేసిన చేయి
సీస పద్యాలు రాయడంలో శ్రీనాథుడిది అందెవేసిన చేయి.

ఆ) పట్టరాని సంతోషం
జవాబు.
నా కథకు మొదటి బహుమతి రావటం పట్టరాని సంతోషాన్నిచ్చింది.

ఆ) దేవునిపై భారంవేయు :
జవాబు.
కష్టకాలంలో దేవునిపై భారం వేయటం. కష్టం తీరగానే మరచిపోవడం మానవ నైజం.

ఇ) గుండె జల్లుమను
జవాబు.
రోడ్డు ప్రమాదాన్ని చూసి నా గుండె జల్లుమన్నది.

ఈ) చెమటలు పట్టు
జవాబు.
పామును చూడగానే నాకు చెమటలు పట్టాయి.

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించి, వాటి పేర్లు రాయండి.

అ) ఆదిశేషునికి వేయితలలు : ______________________
జవాబు.
వేయి సంఖ్య గల తలలు – ద్విగు సమాసం

ఆ) కృష్ణార్జునులు సిద్ధమైనారు : ______________________
జవాబు.
కృష్ణుడును, అర్జునుడును – ద్వంద్వ సమాసం

ఇ) రవి, రాము అన్నదమ్ములు : ______________________
జవాబు.
అన్నయును, తమ్ముడును – ద్వంద్వ సమాసం

ఈ) వారానికి ఏడురోజులు : ______________________
జవాబు.
ఏడు సంఖ్య గల రోజులు – ద్విగు సమాసం

ఉ) నూరేండ్లు జీవించు : ______________________
జవాబు.
నూరు సంఖ్య గల ఏండ్లు – ద్విగు సమాసం

2. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

అ) విద్యాభ్యాసం = ________ + ________ = _____________
జవాబు.
విద్య మొదలు + అభ్యాసం = సవర్ణదీర్ఘ సంధి

ఆ) మొదలయింది = ________ + ________ = _____________
జవాబు.
మొదలు + అయింది = ఉత్వసంధి

ఇ) విద్యార్థులు = ________ + ________ = _____________
జవాబు.
విద్య + అర్థులు = సవర్ణదీర్ఘ సంధి ఇత్వసంధి

ఈ) ఏదైనా = ________ + ________ = _____________
జవాబు.
ఏది + ఐన = ఇత్వసంధి

ఉ) వారందరు = ________ + ________ = _____________
జవాబు.
వారు + అందరు = ఉత్వసంధి

అత్వ సంధి 

కింది పదాలను పరిశీలించండి.

అ) రామయ్య = రామ + అయ్య
ఆ) మేనత్త/మేనయత్త = + అత్త
ఇ) సెలయేరు = సెల + ఏరు
ఈ) ఒకానొక = ఒక + ఒక

సంధిని విడదీసినప్పుడు ఏర్పడే రెండు పదాలలో మొదటి పదాన్ని “పూర్వపదం” అని, రెండవ పదాన్ని “పరపదం” అని అంటారు.

పూర్వపదం చివర ఉన్న అచ్చు ఏది ?
పరపదం మొదట ఉన్న అచ్చు ఏది ?
పూర్వపదం చివరి అచ్చుకు పరపదం మొదటి అచ్చు కలిస్తే ఏం ఏర్పడింది ?

పై ఉదాహరణలు చూసినప్పుడు మొదటి పదం చివరన ‘అ’ అచ్చు ఉంటుంది. రెండవ పదం మొదట అ, ఏ, ఒ మొదలైన అచ్చులు ఉన్నాయి. సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి అచ్చు ‘అ’ లోపించి రెండో పదం మొదటి అచ్చు. వచ్చి చేరితే కింది విధంగా ఉంటాయి.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

రామయ్య → లాంటి పదాల్లో సంధి ఎప్పుడూ అవుతుంది. (నిత్యం)
మేనత్త, మేనయత్త లాంటి పదాల్లో సంధి జరగవచ్చు, జరుగకపోవచ్చు. (వైకల్పికం)
సెలయేరు → లాంటి పదాలు ‘సెలేరు’ లాగా మారకుండా ‘సెలయేరు’ లాగానే ఉంటాయి. (నిషేధం)
ఒకానొక → లాంటి పదాలు ‘ఒకొక్కలాగా మారకుండా మరోరూపంలోకి అంటే ‘ఒకానొక’లాగా మారుతాయి. (అన్యకార్యం)
(మొదటి పదం చివరి అచ్చు పూర్వస్వరం. రెండోపదం మొదటి అచ్చు పరస్వరం.)
‘అ’ కు అచ్చులు (అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ ఔ) పరమైతే ఏర్పడే సంధి ‘అత్త్వసంధి’.
సూత్రం : (అత్తు అంటే హ్రస్వమైన ‘అ’) నకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగానగు.

3. కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి.

ఉదా : తగిన + అంత = తగినంత.

అ) చాలిన + అంత = ________
జవాబు.
చాలినంత

ఆ) సీత + అమ్మ = ________
జవాబు.
సీతమ్మ

ఇ) అక్కడ + ఇక్కడ = ________
జవాబు.
అక్కడిక్కడ

ఈ) అందక + ఉండెను = ________
జవాబు.
అందకుండెను

ఉ) చెప్పుట + ఎట్లు = ________
జవాబు.
చెప్పుటెట్లు

ఊ) రాక + ఏమి = ________
జవాబు.
రాకేమి

బహుళం :
సంధి నిత్యంగా, వైకల్పికంగా, నిషేధంగా, అన్యకార్యంగా జరుగడాన్ని “బహుళం” అంటారు.

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

వివిధ పత్రికలలో వచ్చే యాత్రారచనలను చదివి, వాటిలో ఒక దానికి నివేదిక రాయండి.

అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు
2) సమాచారాన్ని సేకరించిన విధానం

ఆ) నివేదిక :
విషయ వివరణ :
దర్శనీయ యాత్రాస్థలం – వేములవాడ : పత్రికలు చదివి తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి సుమారు 32 కి.మీ. దూరంలో నెలకొని ఉన్న వేములవాడ ప్రసిద్ధ యాత్రాస్థలం. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంతో పాటు, భీమేశ్వర ఆలయం, బద్ది పోచమ్మ ఆలయం కలవు. సుదూర ప్రాంతాల నుండి ఎంతో మంది భక్తులు వేములవాడకు వచ్చి శ్రీ రాజరాజేశ్వరస్వామిని, అమ్మవారిని దర్శించుకొంటారు. రాత్రి ఒకపూట ఇక్కడ నిద్రచేసి వెళ్తే తమ దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.
TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం 2
భక్తులు బసచేయుటకు ప్రభుత్వ వసతి గృహాలతో పాటు, ప్రైవేటు లాడ్జ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయాన్ని వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు, రాజాదిత్య కట్టించినట్లు చరిత్రకారులు చెబుతారు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు కలదు. దీనిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇతర ఏ దేవాలయంలో లేని విధంగా భక్తులు కోడెలను కట్టివేసి మొక్కు చెల్లించుకొనే సాంప్రదాయం ఈ గుళ్ళో కలదు.

1830 ప్రాంతంలో కాశీయాత్రలో భాగంగా, నాటి నైజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరాస్వామి, తన “కాశీయాత్ర” అనే పుస్తకంలో ఈ పుణ్యక్షేత్రం గురించి ప్రస్తావించారు. శివరాత్రి రోజున 3 లక్షల మంది భక్తులు రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. వంద మంది అర్చకులు మహాలింగార్చన చేస్తారు. రాత్రిపూట శివరాత్రి రోజున విద్యుద్దీపాల కాంతిలో ఈ దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతుంటే అది కళ్ళారా చూసి తరించాల్సిందే తప్ప నోటితో పొగడడం ఎవరి శక్యమూ కాదు.

కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం లను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడకు వేంచేశాడని పురాణ కథనం. మూల విరాట్టు రాజరాజేశ్వరస్వామి ఎడమవైపున శ్రీ రాజరాజేశ్వరిదేవి, కుడివైపున శ్రీ లక్ష్మీ సహిత సిద్ది వినాయక విగ్రహాలున్నాయి. దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్లనాటి మసీదు ఉంది. ఇలా ఈ ఆలయం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది. అతి పురాతనమైన భీమేశ్వర ఆలయంలో భక్తులు శనిగ్రహ దోష నివారణకు శని పూజలు జరుపుకుంటారు. ఈ దేవాలయంలో కోడెను కట్టివేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

ఇ) ముగింపు :
ఇంత ఘన చరిత్ర కలిగిన దేవాలయానికి ఒక్కసారి వెళ్ళి కనులారా ఆ దేవదేవుని దర్శించుకోవాలని కోరిక కలిగింది. మన గత వైభవానికి ప్రతీకలు, సంస్కృతీ సాంప్రదాయాలకు వారధులైన దర్శనీయ స్థలాల గూర్చి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే భావన నాలో కలిగింది.

TS 8th Class Telugu 2nd Lesson Important Questions సముద్ర ప్రయాణం

ప్రశ్న1.
రచయిత గ్రేట్ బ్రిటన్ కు వెళ్ళిన పడవ ప్రయాణంలోని సౌకర్యాలను వివరించండి.
(లేదా)
ముద్దు రామకృష్ణయ్య ప్రయాణించిన పడవలోని సౌకర్యాలు ఏమిటి ?
జవాబు.
రచయిత ముద్దు రామకృష్ణయ్య ప్రయాణం చేసిన పడవలో సౌకర్యాలకు కొదవలేదు. పడవ క్యాబిన్లో ఒక్కొక్కదానిలో 6 బెర్తులు ఉన్నాయి. ప్రతి పడవలోను ‘Life Boats’ ఉన్నట్లు ఈ పడవలో కూడా ఉన్నాయి. పడవ అటు చిన్నది కాదు, ఇటు పెద్దది కాదు. కొత్తగా పడవ ఎక్కినవారికి సముద్ర రోగం వస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. తలనొప్పి, వాంతులు అవుతాయి. డబ్బు తీసుకోకుండా పడవలోని డాక్టర్లు మందులు ఇస్తారు. రోగులు లేవలేని స్థితిలో డాక్టర్ క్యాబిన్లోకి వచ్చి మందులిస్తారు. పడవలో పోస్టాఫీసు కూడా ఉంది.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

ప్రయాణీకులకు జాబు వస్తే క్యాబిను తెచ్చి అందిస్తారు. అలాగే టెలిగ్రాఫ్ ఆఫీసు కూడా ఉంది. పడవలోని దుకాణాలలో మనకు కావలసిన వస్తువులను తెచ్చుకోవచ్చు. పడవ పైన రేడియో డెట్లు, లౌడ్ స్పీకర్లు అమర్చబడి ఉంటాయి. వార్తలు ఎప్పటికప్పుడు తెలుపబడతాయి. పీరియాడికల్స్ లాంజ్లో ఉంటాయి. గొప్పవారి హోదాకు తగ్గట్లుగా లాంజ్లుంటాయి. చిన్నపిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షన్లుంటాయి.

వారి పూర్తి బాధ్యత పడవవారే చూసుకుంటారు. పడవలో లైబ్రరీ కూడా ఉంటుంది. ఆటలు కూడా ఆడుకునే వీలుంటుంది. స్విమ్మింగ్పల్ కూడా ఉంటుంది. సకల సౌకర్యాలతో పాటు అది రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలం అవటం చేత పడవల దిశానిర్దేశం చేస్తూ ఆకాశంలో విమానాలు అనుసరిస్తూ ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత ప్రథమలక్ష్యంగా అవి సాగుతుండేవి.

ప్రశ్న2.
బ్రిటన్ పోలీసుల నిబద్ధతను వివరించండి.
జవాబు.
బ్రిటన్ పోలీసులు చాలా నిబద్ధత కలిగినవారు. వారు ప్రతి విషయాన్ని చాలా సునిశితంగా పరిశీలించేవారు. ఏ మాత్రం తేడా ఉన్నా ఊరుకునేవారు కాదు. ఈ విషయం పట్ల పూర్తి అవగాహన రచయితకు ఆంగ్లో ఇండియన్ మిత్రుడు ఫాల్సెట్టు కలిగించాడు. బ్రిటన్ పోలీసులు చాలా స్ట్రిక్ట్ ఉండేవారు. తగినంత డబ్బు లేకుండా విదేశీయులను బ్రిటన్లో దిగనిచ్చేవారు కాదు. అలాంటివారిని డీపోర్ట్ చేసి వెనక్కి పంపించేవారు. రచయిత కూడా ఈ విషయం విని చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆయన వద్ద కూడా తగినంత డబ్బు లేదు.

రచయితకు తనని కూడా డీపోర్టు చేసి ఇండియాకు పంపిస్తారన్న భయం పట్టుకుంది. అందుకే ఆయన “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుక్షణం భగవంతునికి మొక్కుకున్నాడు. స్కాట్లాండ్ యొక్క గ్లాస్కో రేవు పట్టణంలో పడవ ఆగింది. అక్కడికి పడవ చేరకముందే పోలీసులు పడవలోకి వచ్చారు. ప్యాసింజర్ల పాస్పోర్టులను చెక్చేశారు. కొందరికి దిగటానికి పర్మిషన్ ఇవ్వలేదు. కారణం వారి దగ్గర సరైన పేపర్లు లేకపోవటం.

చివరకు రచయిత వంతు వచ్చింది. ఆయన పాస్పోర్టును చూసి మీరు “స్టడీస్ కొరకు వచ్చారా” అని అడిగి పర్మిటెడ్ అని స్టాంపు వేశారు. రచయిత బ్రతుకు జీవుడా అనుకున్నారు. ప్రతి విషయంలోనూ బ్రిటీషు పోలీసువారు మంచి నిబద్ధతతో వ్యవహరిస్తారనడానికి ఇవన్నీ కొన్ని నిదర్శనాలు.

ప్రశ్న3.
ముద్దు రామకృష్ణ వివరించిన సముద్ర ప్రయాణాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
గ్రేట్ బ్రిటన్ వెళ్ళడానికి ముద్దు రామకృష్ణయ్య పడిన ఇబ్బందులేవి?
(లేదా)
గ్రేట్ బ్రిటన్ వెళ్ళిన రచయిత ప్రయాణ అనుభవాలేవి? ఎలా ప్రయాణం సాగించాడు?
జవాబు.
18 -10 -1907 లో ముద్దు రాజన్న, అమ్మాయి దంపతులకు కరీంనగర్ జిల్లా మంథని గ్రామంలో ముద్దు రామకృష్ణ జన్మించాడు. ఉన్నత విద్య కోసం గ్రేట్ బ్రిటన్ వెళ్ళాలనుకొన్నాడు. తగినంత ధనం లేకున్నా రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో ఎవర్ని కలవాలో, ఎక్కడ దిగాలో, ఏం చేయాలో తెలియకుండానే రెండు జతల బట్టలు, పైజమా కుర్తా సర్దుకొని, 22 పౌండ్ల ధనంతో పడవ ఎక్కాడు.

పడవ ప్రయాణంలో ఆంగ్లో ఇండియన్ “ఫాల్సెట్” అక్కడి అలవాట్లు, పరిస్థితులు వివరించాడు. ధనంలేక డీపోర్టు చేస్తారని భయపడి కరీంనగర్ వాడైన సురేష్బాబు ఇతనికి భరోసా ఇచ్చాడు. స్టడీస్ కోసం వచ్చాడని గమనించిన పోలీసులు ఇతని పాస్పోర్టు చూసి “పర్మిటెడ్” అని అనగానే పట్టరాని సంతోషం కల్గింది. గ్రేట్ బ్రిటన్ చూస్తూ నిలబడ్డాడు. అనుకున్న లక్ష్యాన్ని కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో సాధించాలని అనుకున్నాడు రామకృష్ణయ్య.

ప్రశ్న 4.
విద్యయొక్క అవసరాన్ని తెలియజేస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు.
చదవనివాడు అజ్ఞాని అని, చదువుకుంటే వివేకము కలుగుతుందని, మనిషిగా పుట్టినవాడు జ్ఞానాన్ని సంపాదించాలని పోతన భాగవతంలో వివరించాడు. “విద్య లేనివాడు వింత పశువన్న” నానుడి లోకంలో ఉండనే ఉంది. చదువులు నేర్చిన వారు ఏ రంగంలోనైనా రాణించగలరు. విద్య సుఖ సంతోషాలనిస్తుంది. ఏ దేశమైతే సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తుందో ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. మన తెలంగాణ రాష్ట్రం చదువులలో వెనుకబడి ఉంది.

గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఎంతోమంది నిరక్షరాస్యులుగా ఉండిపోతున్నారు. బాలకార్మిక వ్యవస్థ చదువులలో వెనుకబడటానికి ఒక కారణం. బంగారు తెలంగాణ కావాలంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం చదువులపై శ్రద్ధపెట్టాలి. రాష్ట్రంలోని వారినందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి.

వయోజనులలో కూడా చదువు పట్ల ఆసక్తిని పెంపొందించాలి. ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టి అందరూ చదువుకునేటట్లు చేయాలి. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిని అరికట్టాలి. విద్యాభ్యాసం తరువాత ఉద్యోగం వచ్చి జీవనానికి ఆసరాగా నిలుస్తుందన్న నమ్మకాన్ని కలిగించాలి.

ప్రశ్న 5.
మీరే ముద్దు రామకృష్ణయ్య అయితే, విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
జవాబు.
నేనే ముద్దు రామకృష్ణయ్యను అయితే విద్య యొక్క ఉపయోగాలను గురించి విద్యార్థులకు వివరిస్తాను. ‘కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు” అన్న విషయాన్ని వివరించి వారికి చక్కని మార్గాన్ని చూపిస్తాను. నైతిక విలువలతో కూడిన విద్యను నేర్వమని బోధిస్తాను. కృత నిశ్చయం, దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్తాను.

విద్యార్థులందరు లక్ష్యసాధన దిశగా పయనించి ఉన్నత విద్యలను నేర్చి దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని వివరిస్తాను. నీతి నిజాయితీకి నిలువుటద్దంగా తెలంగాణ పౌరులు నిలవాలని ప్రబోధిస్తాను. పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు, ఆ పల్లెలలోని ప్రజలు చదువుబాట పట్టి విద్యాధికులు కావటానికి వారిలో చైతన్యాన్ని తీసుకువస్తాను. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ విద్యాధికులు కావాలని కోరుకుంటాను.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

పర్యాయపదాలు:

  • యుద్ధము = సమరము, రణము
  • సముద్రము = జలధి, కడలి
  • ఈశ్వరుడు = శివుడు, త్రినేత్రుడు
  • దిక్కు = దిశ, మార్గము
  • ఇల్లు = గృహము, నివాసము
  • తీరము = దరి, ఒడ్డు
  • భూమి = పుడమి, ధరణి
  • నెల = మాసము, 30 రోజులు

నానార్థాలు:

  • దిక్కు = దిశ, శరణము
  • వనము = అడవి, సమూహము
  • శక్తి = బలము, పార్వతి
  • సుధ = పాలు, అమృతము
  • తలపు = ఆలోచన, అభిప్రాయం
  • చీకటి = అంధకారము, దుఃఖము

వ్యుత్పత్త్యర్థాలు:

  • ఈశ్వరుడు పయోధి పుత్రుడు = శుభములను కలిగించువాడు. (శివుడు)
  • పయోధి = వయస్సుకు నెలవైనది (సముద్రం)
  • పుత్రుడు = పున్నామ నరకాన్ని తప్పించువాడు (కుమారుడు)

ప్రకృతి – వికృతులు:

  • ప్రకృతి – వికృతి
  • ప్రాణము – పానము
  • భాష – బాస
  • భోజనము – బోనము
  • సంతోషము – సంతసము
  • ఆశ్చర్యము – అచ్చెరువు
  • కులము – కొలము
  • దీపము – దివ్వె
  • ధర్మము – దమ్మము
  • రాత్రి – రాతిరి
  • వైద్యుడు – వెజ్జు

సంధులు:

  • చారిత్రకమైన = చారిత్రకము + ఐన = ఉత్వసంధి
  • అడుగుతారని = అడుగుతారు + అని = ఉత్వసంధి
    సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.
  • చేర్చినందుకు = చేర్చిన + అందుకు = అత్వసంధి
  • చింతాకు = చింత + ఆకు = అత్వసంధి
    సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.

సమాసములు:

  • తల్లిదండ్రులు – తల్లియును తండ్రియును – ద్వంద్వ సమాసము
  • రాత్రి – రాత్రియును పగలును – ద్వంద్వ సమాసము
  • నా ఉచ్చారణ – నా యొక్క ఉచ్చారణ – షష్ఠీ తత్పురుష సమాసము
  • గ్రంథాలయము – గ్రంథములకు ఆలయము – షష్ఠీ తత్పురుష సమాసము
  • భారతదేశము – భారతము అను పేరు గల దేశము – సంభావన పూర్వపద కర్మధారయ సమాసము
  • మర్రిచెట్టు – మర్రి అను పేరు గల చెట్టు – సంభావన పూర్వపద కర్మధారయ సమాసము
  • సుందర దృశ్యాలు – సుందరమైన దృశ్యాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
  • రమ్య స్థలము – రమ్యమైన స్థలము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
  • ప్రియభాషణం – ప్రియమైన భాషణం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము

పాఠం ఉద్దేశం

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లండనుకి వెళ్ళి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకొన్న పని. అయినప్పటికీ ఉన్నత విద్యకోసం, కరీంనగర్ జిల్లా మంథని గ్రామ వాసియైన ముద్దు రామకృష్ణయ్య సుదూర దేశమైన గ్రేట్ బ్రిటన్ కు సముద్ర ప్రయాణం చేశాడు. ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలే ఈ పాఠం నేపథ్యం. కార్యసాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృత నిశ్చయంతో, దృఢసంకల్పంతో పూర్తిచేసుకుని విజయాన్ని సాధించగలుగుతారని తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

పాఠ్యభాగ వివరాలు

ప్రశ్న.
‘యాత్రా చరిత్ర’ ప్రక్రియను పరిచయం చేయండి.
జవాబు.
‘యాత్రా చరిత్ర’ ప్రక్రియకు చెందినదీ పాఠం. యాత్రవల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రాచరిత్ర. దేశ, విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన “నా ప్రథమ విదేశీ యాత్ర” పుస్తకంలోనిది.

కవి పరిచయం

ప్రశ్న.
ముద్దు రామకృష్ణయ్య గారిని గురించి రాయండి.
జవాబు.
ముద్దు రామకృష్ణయ్య పూర్వపు కరీంనగర్ జిల్లా నేటి పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి యం. ఇడి. పట్టా పొందాడు. 1951-58 మధ్య కాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలుదేశాలు పర్యటించి, అక్కడి విద్యావిధానాలను 18-10-1907 అధ్యయనం చేశాడు. మనదేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అవి నేటికీ ఆదర్శప్రాయాలైనాయి. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ‘ఈచ్ వన్ టీచ్ వన్’ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త.

ప్రవేశిక

ప్రయాణం మొదలయ్యింది. ఎక్కడికి పోవాలో తెలవదు. ఎవరిని కలవాలో తెలవదు. కాని, ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నది. జీవితమంటే అన్నీ ఉంటాయి. కండ్ల ముందు ఒకటే లక్ష్యం. లక్ష్యసాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరుకకపోదు. అనుకున్న విధంగా ఉన్నత విద్య పూర్తి చెయ్యాలి. దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి ? ఎట్లా చెయ్యాలి ? పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నది మనసు. ప్రయాణం కొనసాగుతున్నది ! అనంతాకాశంలాగా పరుచుకున్న దరిలేని సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకున్నది ? ఎట్లా చేరుకున్నది తెలుసుకుందాం.

కఠిన పదాలకు అర్ధాలు

  • దినము = రోజు
  • పాశ్చాత్యులు = విదేశీయులు
  • క్లోజు = దగ్గరగా
  • ఉచ్చారణ = పలుకుబడి
  • తలంపు = ఆలోచన
  • భారము = బరువు
  • తుద = చివర
  • కృతజ్ఞత = చేసిన మేలు మరువకుండుట
  • వందనము = నమస్కారము
  • శరము = బాణము
  • శరణు = ప్రార్ధన
  • క్లుప్తంగా = తక్కువగ
  • వాగ్దానము = మాట ఇవ్వడం
  • స్కాలర్షిప్ = ఉపకార వేతనము
  • బందోబస్తు = జాగ్రత్త చేయు
  • కాన్వాయి = రక్షకదళ సమూహం
  • క్యాబిన్ = చిన్నగది
  • డెక్ = ఓడలో నేలవంటి అడుగు భాగం
  • ఇన్స్పెక్ట్ = తనిఖీ
  • రిసెప్షన్ రూం = వేచియుండు గది
  • ఖుల్లా = తెరచియుండు
  • కనెక్టు = కలుపబడు
  • లాంజ్ = ఆవిరిపడవ (ఓడ)
  • సైక్లోస్టైల్ = నకలు ముద్రణ
  • పీరియాడికల్స్ = నియమిత కాలంలో సంభవించెడిది, కాల నిర్ణయంతో వచ్చే పత్రిక
  • ఫర్నీచర్ = వస్తు సామగ్రి
  • ఫ్లోరు = నేల
  • మఖ్మల్ = వెల్వెటు
  • తివాసీ = కార్పెట్ = నేల మీద పరిచే మందపాటి దుప్పట్టా
  • కంఫర్టబుల్ = సౌకర్యవంతం
  • నర్సరీ = శిశు విహారశాల, బిడ్డలకై ప్రత్యేకింపబడిన గది
  • కిండర్ గార్టెన్ = వస్తువులను చూపించి బోధించే పద్ధతి
  • లైబ్రరీ = గ్రంథాలయం
  • ఔట్ డోర్ గేమ్స్ = బయట ఆటస్థలంలో ఆడే ఆటలు
  • టూర్నమెంట్ = అంతర్గత పోటీలు
  • స్విమ్మింగ్ = ఈత
  • ఓపెన్ ఏర్ = బయటి గాలి
  • మందలించు = కోప్పడు
  • డిఫోర్టు = వెనుకకు తిరిగి పంపుట
  • మొహల్లా = భవంతి
  • డిస్ట్రాయర్లు = నాశనం చేసే పనిముట్లు
  • డేంజరు = అపాయం
  • వైల్డ్ = భయంకరం
  • కస్టం = తనిఖీ
  • పౌండు = సుమారుగా 1 and 1/2 kg, బ్రిటన్ కరెన్సీ
  • పాస్పోర్టు = విదేశాలకు వెళ్ళుటకు అనుమతినిచ్చే అనుమతి పత్రం
  • పర్మిటెడ్ = అనుమతించిరి

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం 3

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 1st Lesson త్యాగనిరతి Textbook Questions and Answers.

త్యాగనిరతి TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana

చదువండి – ఆలోచించి చెప్పండి.

దధీచి మహా తపశ్శాలి. చ్యవన మహర్షి పుత్రుడు. ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకొంటుండగా వాటిని దాచిపెట్టుమని దధీచికి దేవతలు ఇచ్చిపోయారు. కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి దధీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు. అటు తర్వాత దేవతలు మా అస్త్రాలు మాకిమన్నారు. అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకొమ్మన్నాడు. అట్లా దధీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది.

ప్రశ్న 1.
దధీచి ఎవరు ?
జవాబు.
దధీచి గొప్ప తపస్వి. చ్యవన మహర్షి కుమారుడు.

ప్రశ్న 2.
దధీచి చేసిన త్యాగం ఏమిటి ? ఎందుకు ?
జవాబు.
దధీచి తన శరీరాన్ని యోగాగ్నిలో దహించివేసుకొని తన ఎముకలను దేవతలకు ఆయుధాలుగా ఇచ్చాడు.

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

ప్రశ్న 3.
త్యాగం అంటే ఏమిటి ?
జవాబు.
తన కష్టనష్టాలను లెక్కచెయ్యకుండా పరహితం కోసం ప్రాణాలను సైతం ఇచ్చేయడమే త్యాగం.

ప్రశ్న 4.
మీకు తెలిసిన త్యాగమూర్తుల పేర్లను తెలుపండి.
జవాబు.
జీమూత వాహనుడు, బలిచక్రవర్తి, ఏకలవ్యుడు, హరిశ్చంద్రుడు మొదలైన వారు గొప్ప త్యాగధనులు.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 4)

ప్రశ్న 1.
సత్యధర్మ నిర్మలుడని శిబి చక్రవర్తిని ఎందుకన్నారు ?
జవాబు.
శిబి చక్రవర్తి సత్యం వ్రతంగా కలవాడు. ఆడినమాట తప్పనివాడు. అన్ని ధర్మములు తెలిసినవాడు. ధర్మం తప్పక ఆచరించేవాడు. నిర్మలమైన మనస్సు, ప్రవర్తన కలవాడు. అందుచేత ఆయనను సత్యధర్మ నిర్మలుడన్నారు.

ప్రశ్న 2.
“ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్” దీనిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి.
జవాబు.
‘సత్యం మాట్లాడండి. ధర్మం ఆచరించండి.’ అనే విషయాలను వేద శాస్త్రాలు చెబుతున్నాయి. కాని వాటిని పాటించే సమయంలో వాటివల్ల అందరికీ మేలు జరుగుతుందా, లేదా అని పరిశీలించాలి. ఒకవేళ కీడు కలిగేట్లైతే అప్పుడు వాటిని సరి చూసుకోవాలి. ఏ నియమాలైనా ప్రజలమేలు కోసం ఏర్పాటు చేయబడేవే. అందుకే కవి నన్నయ ధర్మం అందరికీ మేలు కలిగించాలి అని ప్రయోగించాడు.

ప్రశ్న 3.
‘ఆశ్రితులను ఎందుకు విడిచి పెట్టరాదు ?
జవాబు.
బలహీనుడు బలవంతుని వద్దకు రక్షణ కోసం వస్తాడు. అతడు తనను కాపాడగలడు అనే నమ్మకంతో వస్తాడు. కనుక అతనికి ఆశ్రయమిచ్చి కాపాడటం బలవంతుని కర్తవ్యం. ఎన్ని ఆటంకాలు కలిగినా వారి నమ్మకాన్ని వృథా చేయకుండా కాపాడాలి. అందుకే ఆశ్రితులను విడిచిపెట్టరాదు.

ప్రశ్న 4.
ఏ సందర్భంలో ఇతరులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు ?
జవాబు.
జంతువుల వలన, ఇతరుల వలన భయం కలిగినప్పుడు, శత్రువులు దండెత్తినప్పుడు, దుష్టుల వలన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, తాను తలపెట్టిన మంచి పనులకు ఆటంకాలు కలిగినప్పుడు, తన కష్టాన్ని ఇతరులు దోచుకుంటున్నప్పుడు – ఇలా అనేక సందర్భాల్లో ఇతరులు మనను ఆశ్రయిస్తారు.

ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 5)

ప్రశ్న 1.
డేగ తన ఆకలిని తీర్చుకోవడానికి శిబి మాంసాన్ని ఎందుకు కోరింది ?
జవాబు.
పావురం డేగకు సహజమైన ఆహారం. శిబి దానికి ఆశ్రయం ఇచ్చాడు. వదిలిపెట్టనంటున్నాడు. ధర్మబద్ధమైన తన ఆహారం తినకపోతే ఆకలితో చనిపోతానని, ఆపై తన భార్య, పిల్లలు కూడా బతకరని డేగ చెప్పింది. నీవు చెప్పింది ధర్మమే ఐనా నేను ఆశ్రయమిచ్చిన పావురాన్ని నీకు ఆహారం కానివ్వను. మరేది కోరినా తెప్పించి యిస్తాను అన్నాడు శిబి. అందుకని డేగ తన ఆకలిని తీర్చుకోడానికి శిబి మాంసాన్ని కోరింది.

ప్రశ్న 2.
‘అనుగ్రహించితి మహా విహగోత్తమ’ అని శిబి చక్రవర్తి అనటాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు?
జవాబు.
పావురాన్ని తప్ప వేరే ఏ ఆహారాన్నైనా కోరుకో. తెప్పించి ఇచ్చి నీ ఆకలి తీరుస్తాను. పావురాన్ని మాత్రం వదలను అన్నాడు శిబి చక్రవర్తి. అప్పుడు డేగ పావురం బరువుకు సరితూగినంత మాంసాన్ని నీ శరీరం నుంచి కోసి యిస్తే ఒప్పుకుంటాను అన్నది. అందుకే శిబి పరమ సంతోషంతో “ఓ పక్షి రాజా ! నన్ను అనుగ్రహించావు. పావురాన్ని కాపాడతానన్న నా మాట నిలబెట్టావు” అని డేగతో అన్నాడు.

ప్రశ్న 3.
బలి చక్రవర్తి పావురాన్ని రక్షించడానికి ప్రాణత్యాగానికి పూనుకున్నాడు కదా ! త్యాగం ఆవశ్యకత ఏమిటి ? (టెక్స్ట్ బుక్ 5)
జవాబు.
త్యాగం అనేది గొప్ప పుణ్యకార్యం. మనకు అక్కరలేని దాన్ని ఇచ్చేసి త్యాగం చేశాను అనుకోవడం త్యాగం అనిపించుకోదు. తనను ఎవరైనా ఆశ్రయించినప్పుడు వారి కోరిక తీర్చడానికి అవసరమైతే తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడాలి. అటువంటి వారే చరిత్రలో నిలచిపోతారు. ఆదర్శప్రాయులౌతారు. అందుకే త్యాగం చాలా గొప్ప గుణం.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న1.
త్యాగం అంటే ఏమిటి ? త్యాగంలోని గొప్పతనం ఏమిటి ?
జవాబు.
తనకు ఉన్నదానిలో కొంత ఇతరులకు ఇవ్వడమే త్యాగం. ఎన్ని కష్టాలకైనా ఓర్చుకొని తనను ఆశ్రయించిన వారికి కావలసిన దానిని ఇవ్వడమే త్యాగం. ఇందులో ప్రాణాలను కూడా లెక్కచేయకుండా త్యాగం చేసిన వారు మహనీయులు. మనం త్యాగం చేసినందువలన ఆ ఫలితాన్ని పొందినవారు, వారి ఆత్మీయులు ఎంతో సంతోషపడతారు. ఆ సంతోషం మనకెంతో తృప్తినిస్తుంది. అదీ త్యాగంలోని గొప్పతనం.

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

ప్రశ్న2.
ఇతరులకోసం, సమాజంకోసం త్యాగం చేసిన వారి గురించి చెప్పండి.
జవాబు.
భారతదేశాన్ని పరాయిపాలన నుంచి విడిపించి ప్రజలు పడుతున్న బానిసత్వపు బాధలను తొలగించడానికి ఎంతోమంది నాయకులు తమ సర్వస్వాన్నీ త్యాగంచేసి ఉద్యమంలో పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ప్రకాశం పంతులు మొదలైన ఎందరో నాయకులు ధనాన్ని ఆస్తులను త్యాగం చేశారు. భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటివారు ప్రాణాలను త్యాగం చేశారు. డా. ద్వారకానాథ్ కొట్నీస్ యుద్ధసైనికుల కోసం అమోఘమైన సేవలందించాడు.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. కింది వాక్యాల ఆధారంగా పాఠంలోని పద్యపాదాలను గుర్తించి రాయండి.

అ) ధర్మం జగత్తుకంతటికీ మేలు చేయాలి
జవాబు.
ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్.

ఆ) ఈ పక్షి నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం
జవాబు.
ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు.

ఇ) ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం ధర్మమవుతుందా చెప్పు
జవాబు.
శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి యధర్మం బొండెద్ది ?

2. కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరిపోయే జవాబును గుర్తించండి.

‘ఆ॥బ్రతికి నన్నినాళ్ళు ఫలము లిచ్చుటెగాదు.
చచ్చిగూడ చీల్చియిచ్చు తనువు
త్యాగ భావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల తెలుగు బాల.

అ) ‘చెట్టు’ అను పదానికి సరిపోయే పదం
ఎ) తరువు
బి) గురువు
సి) ఫలం
డి) గుణం
జవాబు.
ఎ) తరువు

ఆ) త్యాగానికి గురువులు ఎవరు ?
ఎ) మానవులు
బి) చెట్లు
సి) పక్షులు
డి) జంతువులు
జవాబు.
బి) చెట్లు

ఇ) తనువును చీల్చి ఇచ్చేవి
ఎ) మేఘాలు
బి) నదులు
సి) చెట్లు
డి) పక్షులు
జవాబు.
సి) చెట్లు

ఈ) చచ్చుట పదానికి వ్యతిరేకార్థం
ఎ) పెరుగుట
బి) తరుగుట
సి) బ్రతుకుట
డి) మేల్కొనుట
జవాబు.
సి) బ్రతుకుట

ఉ) పై పద్యానికి తగిన శీర్షిక
ఎ) భారం
బి) ప్రాణం
సి) యోగం
డి) త్యాగం
జవాబు.
డి) త్యాగం

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి.
జవాబు.
ఎవరైనా ఆహారం తినేది ఆకలి తీర్చుకోవడానికే. ఎంతో పనిచేసి, కడుపు ఆకలితో కాలిపోతూంటే, భోజనం చేద్దామని కూర్చొన్న వ్యక్తికి, ఆటంకం కలిగిస్తే ఆ వ్యక్తి చాలా బాధపడతాడు. ఆకలితో నీరసించిపోతాడు. ఇక పని చేయలేడు. పనిచేయలేడు కాబట్టి తిండికి కావలసిన ధనం సంపాదించలేడు. చివరికి ఆరోగ్యమే పాడయ్యే ప్రమాదముంది. అందుకే ఆహారం తినేటప్పుడు విఘ్నం కలిగించకూడదంటారు. సైన్సుపరంగా కూడా కారణముంది. భోజనం చేసే సమయంలో కడుపులోని జీర్ణరసాలు ఉత్తేజంగా ఉంటాయి. భోజనానికి ఆటంకం కలిగిస్తే, ఆ ఊరిన రసాలు పేగుల మీద ప్రభావం చూపి అనారోగ్యం కలిగిస్తాయి.

ఆ) ‘అందరూ ధర్మాన్ని ఆచరించాలి’ అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు.
‘సత్యం మాట్లాడండి. ధర్మం ఆచరించండి.’ అనే విషయాలను వేద శాస్త్రాలు చెబుతున్నాయి. కాని వాటిని పాటించే సమయంలో వాటివల్ల అందరికీ మేలు జరుగుతుందా, లేదా అని పరిశీలించాలి. ఒకవేళ కీడు కలిగేట్లైతే అప్పుడు వాటిని సరి చూసుకోవాలి. ఏ నియమాలైనా ప్రజలమేలు కోసం ఏర్పాటు చేయబడేవే. అందుకే కవి నన్నయ ధర్మం అందరికీ మేలు కలిగించాలి అని ప్రయోగించాడు.

ఇ) ఇతరుల కొరకు మనం ఎట్లాంటి త్యాగాలను చేయవచ్చో రాయండి.
జవాబు.
ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రాణాలను కూడా లెక్కచేయకుండా కాపాడాలి. మనం రక్తం దానం చేయవచ్చు. మన పనులను వాయిదా చేసుకొని వారిని హాస్పటల్స్కు తీసుకుని వెళ్ళవచ్చు. మన వాహనంలోనే ప్రమాదానికి గురైన వ్యక్తులను తరలించవచ్చు. నాన్న మనకోసం ఇష్టమైన వస్తువు తెచ్చినప్పుడు చెల్లికి అదే కావాలని అడిగితే తన కోసం మనం దాన్ని తాగ్యం చెయ్యవచ్చు. బస్సులోను, రైలులోను మనకంటే పెద్దవారు నిలబడి మనం కూర్చుని ఉంటే మన సీటు వారికోసం త్యాగం చెయ్యవచ్చు.

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

ఈ) “త్యాగనిరతి” అనే శీర్షిక పాఠానికి ఏ విధంగా తగినదో రాయండి.
జవాబు.
ఈ పాఠంలో డేగ పావురాన్ని తినడానికి వెంటపడింది. పావురానికి ఆశ్రయమిచ్చి శిబి చక్రవర్తి పావురం కోసం ఏమైనా త్యాగం చెయ్యడానికి సిద్ధపడ్డాడు. రాజు త్యాగ గుణాన్ని ఉపయోగించుకోడానికి డేగ పావురాన్ని త్యాగం చేసింది. డేగ రాజు శరీరంలోని మాంసాన్ని పావురం బరువుకు సరిపడ తూచి యిమ్మన్నది. అలా తూచడంలో చివరికి రాజు తానే త్రాసులో కూర్చుని తన ప్రాణాలనే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. తన త్యాగ గుణాన్ని దేవతలు మెచ్చుకున్నారు. అందుచేత ఈ పాఠానికి “త్యాగనిరతి” అనే శీర్షిక తగి ఉన్నది.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) త్యాగం చేయటంలో ఉన్న గొప్పతనాన్ని, అనుభూతిని వివరించండి. (లేదా) త్యాగనిరతి పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి. (లేదా) పావురాన్ని రక్షించుటకు శిబి చక్రవర్తి చేసిన త్యాగాన్ని వివరించండి. (లేదా) శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసివ్వటంలో ఆంతర్యం ఏమిటి ? (లేదా) శిబి చక్రవర్తి త్యాగ గుణాన్ని సొంతమాటల్లో వ్రాయండి. (లేదా) త్యాగ గుణం గొప్పతనాన్ని కవి ఎలా వివరించాడు ?
జవాబు.
ఇంద్రుడు, అగ్నిదేవుడు డేగ పావురాల రూపంలో శిబిచక్రవర్తి త్యాగ గుణాన్ని పరీక్షించడానికి వచ్చారు. శరణుకోరి వచ్చిన పావురానికి శిబి అభయమిచ్చాడు. అలా శరణన్న వారిని రక్షించటంలో ఎంతో ఆనందం ఉంటుంది. లోకంలో ఎంతోమంది ఉన్నా పావురం తన దగ్గరికే వచ్చిందంటే తన మీద ఎంతో నమ్మకం ఉండబట్టే గదా అని తలచుకుంటే శిబి గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆ ఆనందం అనుభవించే వారికే తెలుస్తుంది.

అలాగే ధర్మాధర్మాల గురించి వాదించిన మీదట డేగ పావురానికి సరితూగినంత మాంసం శిబి శరీరం నుంచి తూచి ఇవ్వమన్నప్పుడు “నన్ననుగ్రహించితివి మహావిహగోత్తమ !” అంటూ ఎంతో సంతోషించాడు శిబి, తాను అన్నమాట నిలబెట్టుకోగలుగుతున్నాను గదా అని. అంతేగాక ఒకరిని రక్షించడానికి, మరొకరి ఆకలి తీర్చడానికి తాను ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాడు. రెండు విధాలుగా ధర్మాన్ని రక్షించగలిగానన్న ఆనందం, అనుభూతి ఎంతో గొప్పవి. ఆ ఆనందం అనుభవించే వారికే బాగా అర్థమౌతుంది.

IV. సృజనాత్మకత/ప్రశంస

అ) అన్ని దానాల్లోకెల్ల అన్నదానం గొప్పది. శరీరంలోని అవయవదానం ఇంకా గొప్పది. అవయవదానంపై ప్రజలకు చైతన్యం కలిగించుమని వార్తాపత్రికలకు లేఖ రాయండి.

వరంగల్,
ది.XX. XX. XXXX

జవాబు.
గౌరవనీయులైన పత్రికా సంపాదకులకు,
నమస్తే తెలంగాణ పత్రిక

పుట్టుకతోనే అవయవలోపాలతో కొందరు పుడుతూ ఉంటే, ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకునేవారు కొందరు. కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు – వీటిలో ఏ అవయవం లేకపోయినా బాధాకరమే. మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అందాలను చూసి ఆనందించాలన్నా, చక్కని సంగీతం వినాలన్నా, సుందరమైన ప్రదేశాలకు వెళ్ళాలన్నా కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు తప్పనిసరి. ఇవేకాదు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు వంటి అవయవభాగాలు ముఖ్యమైనవే.

రక్తం అవయవ భాగం కాకపోయినా, అవయవమంత ప్రాముఖ్యమున్నదే. కళ్ళు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, రక్తంవంటి వాటిని దానమిచ్చి మన చుట్టూ ఆయా అవయవాల లోపంతో బాధపడేవారిని ఆదుకోవడమే మానవజన్మకు సార్థకత.
జీవించి ఉండగానే, కళ్ళు, మూత్రపిండాలు వంటివి దానం చేయవచ్చు. మరణించాక కూడా జీవించి ఉండడానికి మార్గం అవయవదానం. తమ మరణానంతరం, తమ కళ్ళను దానం చేస్తామంటూ, ఎంతోమంది నేటికాలంలో ముందుకొస్తున్నారు.

అలా నేత్రదానంతో ఎంతోమంది అంధులకు వెలుగునిస్తూ, మరణించాక కూడా జీవించడం గొప్ప విషయం. అలాగే ఇటీవల బెంగుళూరుకు చెందిన వ్యక్తి గుండె చెన్నైకి చెందిన మరొక వ్యక్తికి మార్పిడి చేయడం ద్వారా ఆ వ్యక్తికి ప్రాణం పోశారు. అలాగే ఇటీవల విజయవాడకు చెందిన మణికంఠ దానం చేసిన గుండె, నేత్రాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం మరికొందరిని జీవించగలిగేట్లు చేశాయి.

ఇలా అవయవ దానం వల్ల కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ఇటువంటివారు రాబోయే తరాలకు స్ఫూర్తిదాతలు. చనిపోయాక కూడా జీవించాలంటే అవయవదానమే మార్గం. అవయవ దానానికి అందరూ ముందుకు వచ్చేలా మీ పత్రిక ద్వారా చైతన్యం కలిగించమని విజ్ఞప్తి.

ఇట్లు
బాలభాను,
ఒక పాఠకుడు.

చిరునామా :
నమస్తే తెలంగాణ పత్రికా కార్యాలయం,
రోడ్ నెం. 10, బంజారా హిల్స్
హైదరాబాద్.

V. పదజాల వినియోగం

1. గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.

ఉదా : కపోతములు శాంతికి చిహ్నాలని భావిస్తారు.
కపోతములు = పావురములు

అ) ఆశ్రితులను వదలి వేయుట ధర్మువు కాదు.
జవాబు.
ధర్మువు = ధర్మము

ఆ) ఉత్తముడు పరుల హితమునే కోరతాడు.
జవాబు.
హితమునే = మేలునే

ఇ) ఎందరో మహానుభావుల పరిత్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.
జవాబు.
పరిత్యాగం = సమర్పించడం

ఈ) దేశంలో సుఖశాంతులు వర్ధిల్లుగాక !
జవాబు.
వర్ధిల్లు = వృద్ధిపొందు

ఉ) బుభుక్షితుడు రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడు.
జవాబు.
బుభుక్షితుడు = ఆకలితో బాధపడువాడు’

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

2. కింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి.

ఉదా : ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి.
వర్షం = సంవత్సరం, వాన

అ) న్యాయంగా ఆలోచిస్తే పాలల్లో నీళ్ళు కలపడం ధర్మం కాదు.
పాడి : __________, __________
జవాబు.
పాడి : న్యాయం, పాలు

ఆ) అడవిలోని జంతువులకు నీరు కరువవుతున్నది.
వనం : __________, __________
జవాబు.
వనం : అడవి, నీరు

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది వాక్యాలను చదువండి. అవి ఎటువంటి వాక్యాలో గుర్తించి జతపరచండి.
ఉదా : లోపలకి రావచ్చు – అనుమత్యర్థక వాక్యం

అ) దయచేసి వినండి1) ఆశ్చర్యార్థక వాక్యం
ఆ) రమ చక్కగా రాయగలదు2) ప్రశ్నార్థక వాక్యం
ఇ) ఆహా ! ఎంత బాగుందో3) సామర్థ్యార్థక వాక్యం
ఈ) అల్లరి చేయవద్దు4) ప్రార్థనార్థక వాక్యం
ఉ) గిరి ! ఎక్కడున్నావు ?5) నిషేధార్థక వాక్యం

జవాబు.
అ) 4
ఆ) 3
ఇ) 1
ఈ) 5
ఉ) 2

2. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

అ) ఇంద్రాగ్నులు = _______ + _______ = _______
జవాబు.
ఇంద్ర + అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

ఆ) త్యాగమిది = _______ + _______ = _______
జవాబు.
త్యాగము + ఇది = ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.

ఇ) ఆహారార్థం = _______ + _______ = _______
జవాబు.
ఆహార + అర్థం = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

ఈ) నేనెట్లు = _______ + _______ = _______
జవాబు.
నేను + ఎట్లు = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.

ఉ) శౌర్యాది = _______ + _______ = _______
జవాబు.
శౌర్య + ఆది = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

ప్రశ్న 1.
త్యాగబుద్ధి కలిగిన ఇద్దరు మహనీయుల వివరాలను లేదా కథలను లేదా సంఘటనలను సేకరించండి. నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు : త్యాగబుద్ధి కలిగిన ఇద్దరు మహనీయులు.
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఉపాధ్యాయుని ద్వారా / ఇంటిలోని పెద్దల (తాత/నానమ్మ/ అమ్మమ్మ) ద్వారా / గ్రంథాలయ పుస్తకాల ద్వారా

ఆ) నివేదిక :
విషయ వివరణ :
“తనకు ఎంతో అవసరమైనప్పటికిని లెక్కచేయకుండా ఇతరులకు ఇవ్వడాన్నే త్యాగం అంటారు.” దానం, త్యాగం అనే రెండు పదాలు దగ్గర అర్థాన్నిచ్చేవిగా ఉన్నా వీటి మధ్య ఎంతో తేడా ఉంది.
తనకున్నంతలో ఇతరులకు ఇవ్వడం దానం అయితే, తనకున్నా లేకున్నా ఇతరులకు ఇవ్వగలిగే గుణాన్ని త్యాగంగా చెప్పవచ్చు. అలాంటి త్యాగబుద్ధి గలిగిన ఇద్దరు మహాపురుషుల గూర్చి, నేను నివేదికలో పొందు పరుస్తున్నాను.

1. రంతిదేవుడు
“అతిథి దేవో భవ” అనేది మన సాంప్రదాయం. దాన్ని అక్షరాల ఆచరించి శాశ్వత కీర్తి పొందిన రంతిదేవుని కథ నాకెంతోగానో నచ్చింది. రంతిదేవుడు ఒక మహారాజు. అమిత దానశీలి. తన రాజ్యాన్ని, సంపదలను దానం చేసి భార్యా బిడ్డలతో అడవికి వెళ్ళాడు.
TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి 1
అడవిలో కాయ, కసరులు తింటూ కడుపు నింపుకొనేవాడు, దైవికంగా లభించినది తిని తృప్తిపడేవాడు తప్ప దేన్నీ కోరేవాడు కాదు. భవిష్యత్ అవసరాలకు కూడా దేన్నీ దాచుకొనేవాడు కాదు. ఒకసారి 48 రోజులు పాటు అతనికి, అతని కుటుంబానికి ఏమీ లభించలేదు. 49వ రోజున కొంత ఆహారం లభించింది. కుటుంబమంతా కూర్చుండి తినడానికి ఉపక్రమించ బోతుండగా ఒక బ్రాహ్మణ అతిథి వచ్చాడు. అతనికి ఆహారం పెట్టాడు. తర్వాత ఒక బీదవాడు వచ్చాడు. రంతిదేవుడు అతని ఆకలి కూడా తీర్చి పంపాడు. తర్వాత ఒకడు, తన కుక్కల క్షుద్బాధ తీర్చమని వేడుకోగా వాటికి ఆహారం పెట్టాడు. చివరికి కొద్ది పాయసం మాత్రమే మిగిలింది. దాన్నే తలా కాస్తా తాగుదామనుకోగా, ఒక ఛండాలుడు వచ్చాడు. ఉన్న పాయసం అతనికి ఇచ్చి, ఆకలి బాధ తట్టుకోలేక రంతి దేవుడు స్పృహ తప్పి పోయాడు. మరుక్షణమే దేవుడు ప్రత్యక్షమై అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు.

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

2. బలిచక్రవర్తి
రాక్షస రాజైన బలి చక్రవర్తి మహా బలవంతుడు. అతనికి ఎదురొడ్డి పోరాడలేక దేవతలు మహావిష్ణువును శరణు కోరతారు. ఎలాగైనా బలి చక్రవర్తిని చంపనైనా చంపు లేదా మాపై ఆధిపత్యం చలాయించకుండానైనా చూడ మంటారు. అప్పుడు విష్ణువు వారికి అభయమిచ్చి, తాను వామనరూప ధారియై బలి వద్దకు వెళ్తాడు. గొడుగు ధరించి వచ్చిన ఆ వామనమూర్తిని చూడగానే రాక్షస గురువైన శుక్రాచార్యుల వారి మనస్సెందుకో కీడు శంకించింది.
TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి 2
దివ్యదృష్టితో అతడు శ్రీ మహావిష్ణువని గ్రహించి బలిని, అతనికి దానమివ్వవద్దని ఎంత చెప్పినా బలి చక్రవర్తి ససేమిరా వినడు. తన కులం, వంశం, దేశం నాశనమైనా, చివరికి తాను చనిపోయినా ఆడిన మాట తప్పను అని వామనునికి 3 అడుగుల నేల దానం చేస్తాడు. 2 అడుగులకే భూమ్యాకాశాలను ఆక్రమించిన వామనుడు, తన 3వ అడుగు ఎక్కడ పెట్టాలో చెప్పమంటాడు. అప్పుడు బలి, తన శిరస్సు పైన ఉంచమంటాడు. వామనుడు, బలి శిరస్సుపై తన పాదాన్ని ఉంచి పాతాళానికి తొక్కి వేస్తాడు. దాంతో దేవతలకు బలి చక్రవర్తి పీడ విరగడైంది.

ఇ) ముగింపు :
ఈ విధంగా తమ సచ్చీలత, త్యాగనిరతి అనే గుణాలతో చరిత్రలో నిలిచిపోయిన ఇరువురు మహాపురుషుల కథలు చదువుతుంటే నాలో ఎంతో ఉత్తేజం, ఉద్వేగం కలిగాయి. ఇలాంటి మహాపురుషులను కన్న భరతభూమికి వందనాలు అర్పించాలనిపించింది.

TS 8th Class Telugu 1st Lesson Important Questions త్యాగనిరతి

ప్రశ్న 1.
“శరణాగత పరిత్యాగంబు కంటె మిక్కిలి యధర్మం బొండెద్ది” అని శిబి అన్నాడు కదా! శరణాగతులను ఎందుకు విడువకూడదు ?
(లేదా)
శరణుకోరిన వారిని వదలకూడదు. ఎందుకు ?
(లేదా)
శరణాగత పరిత్యాగం అధర్మం అంటే నీకేమి అర్థమైంది ?
జవాబు.
తనను ఆశ్రయించినవారు శరణాగతులు. తనను కాపాడ గల్గినవారి వద్దకే, గొప్పనమ్మకంతో వస్తారు. ఆశ్రయమిచ్చిన వారిని కాపాడటం ధర్మం, కర్తవ్యం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆశ్రితులను కాపాడాలి శరణాగతులను వదలకూడదు. వారిని కాపాడకుండా వదిలిపెడితే అది అధర్మం అవుతుంది.

ప్రశ్న 2.
త్యాగం అంటే ఏమిటి ? త్యాగం ఎందుకు చేయాలి? దేనిని గొప్పత్యాగం అంటారు ? త్యాగగుణం ఎందుకు కలిగి
ఉండాలి ?
జవాబు.
తనకి ఉన్నంతలో కొంత ఇతరులకి ఇవ్వడమే త్యాగం. ఎన్ని కష్టాలకైనా ఓర్చుకొని తనను ఆశ్రయించిన వారికి కావలసిన దానిని ఇవ్వడమే త్యాగం. ఆశ్రయించినవారి కోసం తన ప్రాణాలనైనా సంతోషంగా ఇవ్వడానికి సిద్ధపడడాన్ని గొప్పత్యాగం అంటారు.
త్యాగ ఫలితాన్ని పొందినవారు, వారి ఆత్మీయులు ఎంతో సంతోషపడతారు కనుక ఆ సంతోషం మనకెంతో తృప్తినిస్తుంది. అదీ త్యాగంలోని గొప్పతనం. అనిర్వచనీయమైన ఆనందం, సంతృప్తి పొందటం కోసం త్యాగ గుణం కలిగి ఉండాలి.

ప్రశ్న 3.
శిబిచక్రవర్తి వంటి వాళ్ళ కీర్తి శాశ్వతమని వివరించండి.
జవాబు.
ప్రాణభయంతో ఆశ్రయించిన వారు నీచులే అయినా వారిని విడిచి పెట్టడం ధర్మం కాదు. ఆహారమే కావలసివస్తే అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి. వాటిని తిని ప్రాణాలు నిలుపుకోవచ్చు అని డేగతో అన్నాడు. ఆ డేగ శిబితో పావురం తనకు సహజసిద్ధంగా కల్పించబడిన ఆహారం. దీన్ని కాపాడాలనుకుంటే దాని బరువుకు తూగినంత మాంసం నీ శరీరం నుండి నాకు పెట్టమని అన్నది. తన ప్రాణాలను సైతం లక్ష్యపెట్టక ఆశ్రయించిన పావురాన్ని కాపాడటానికి సిద్ధపడ్డ శిబి చక్రవర్తిలాంటి వాళ్ళ కీర్తి శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

ప్రశ్న 4.
త్యాగనిరతి పాఠం ద్వారా డేగ దృష్టిలో ధర్మం అంటే ఏది ?
జవాబు.
అన్ని ప్రాణులు ఆహారం తీసుకొనే బ్రతుకుతాయి. ఆహారం లేకపోతే ప్రాణులు ఉండవు. డేగకు పావురం వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. డేగలు పావురాలను తింటాయి. కాబట్టి పావురాన్ని చంపి తినుట తప్పుకాదని, అది ధర్మబద్ధమే అని డేగ ఉద్దేశం.

ప్రశ్న 5.
త్యాగనిరతి పాఠం ఆధారంగా శిబి చక్రవర్తికి, డేగకు మధ్య జరిగిన సంభాషణ రాయండి.
జవాబు.

సంభాషణ

డేగ : ఓ శిబి చక్రవర్తీ ! నువ్వు గొప్ప సత్యధర్మ పరుడవని విన్నాను. మరి ఆకలిగొన్నవాడినైన నా ఆహారాన్ని తిననీకుండ చేస్తున్నావెందుకు ? నేను ఆకలితో చనిపోతే నా పిల్లలు, భార్య బతకరు. ఇన్ని ప్రాణాలు పోవడానికి నీవు కారణమౌతావు. ఇది నీకు ధర్మమా ?
శిబి చక్రవర్తి : నేను నీ ఆహారమైన పావురాన్ని రక్షిస్తానని మాట ఇచ్చాను. నీ ఆకలి తీర్చడానికి నీకేం కావాలో కోరుకో ఇస్తాను.
డేగ : పావురాలు మా జాతికి ఆహారమని వేదాల్లో కూడా చెప్పబడింది. కనుక నాకీ పావురాన్నిచ్చే సెయ్.
శిబి చక్రవర్తి : అడవిలోని ఏ జంతువుల మాంసం కావాలన్నా తెప్పించి ఇస్తాను. ఈ పావురాన్ని విడిచిపెట్టను. నేను ఆడిన మాట తప్పను.
డేగ : అయితే దీని బరువుకు సమానమైన మాంసము నీ శరీరం నుండి కోసి యివ్వు.
శిబి చక్రవర్తి : చాలా సంతోషం. తప్పక ఇస్తాను. (భటులతో-) భటులారా ! త్రాసు తీసుకురండి.
భటులు : చిత్తం మహాప్రభూ ! (త్రాసు తెచ్చారు. శిబి మాంసం కోసి త్రాసులో పెట్టాడు. రెండవ వైపు పావురాన్ని ఉంచారు.)
శిబి చక్రవర్తి : ఏమి ఆశ్చర్యం ! ఎంత మాంసం ఉంచినా తూగడం లేదు ! నేను స్వయంగా త్రాసులో కూర్చుంటాను. (కూర్చున్నాడు.)
డేగ : భళా ! శిబి చక్రవర్తీ ! నీ త్యాగనిరతి అపూర్వం. మెచ్చాను నీ త్యాగానికి.
శిబి చక్రవర్తి : మహానుభావా ! ఎవరు మీరు ?
డేగ : నేను ఇంద్రుడను. ఈ పావురం అగ్నిదేవుడు. నీ త్యాగాన్ని పరీక్షించడానికి ఈ రూపాలలో వచ్చాము. నీ ధైర్య శౌర్యాదిగుణాలు చాలా గొప్పవి. నీ కీర్తి ఆచంద్రతారార్కంగా వర్ధిల్లుతుంది.

పర్యాయపదాలు:

  • విఘ్నము : ఆటంకము, అడ్డంకి
  • భూతములు : ప్రాణులు, జీవులు
  • ఆహారము : అన్నము, భోజనము
  • పుత్త్రులు : కుమారులు, కొడుకులు
  • భార్య : సతి, ఇల్లాలు, పెండ్లము
  • కపోతము : పావురము, పారావతము
  • పక్షి : ఖగము, పులుగు
  • వనము : అడవి, అరణ్యం
  • మిక్కిలి : ఎక్కువ, అధికము, కడిది
  • అవని : భూమి, పుడమి, ధాత్రి
  • వాసవుడు : ఇంద్రుడు, పాకారి
  • తనువు : శరీరము, దేహము
  • దహనుడు : అనలుడు, అగ్ని, పావకుడు

నానార్థాలు:

  • ఆగ్రహము = పట్టుదల, కోపము
  • పాడి = న్యాయము, ధర్మము, తీర్పుస్వభావం, ఆచారం
  • తుల = త్రాసు, సమానము
  • భూతము = ప్రాణి, గతము

ప్రకృతి – వికృతులు:

  • ప్రకృతి -వికృతి
  • సత్యము – సత్తెము
  • ధర్మము – దమ్మము
  • ఆహారము – ఓగిరము
  • మతి – మది
  • హితము – ఇత
  • పక్షి – పక్కి
  • యత్నము – జనము
  • మృగము – మెకము
  • గుణము – గొనము
  • శబ్దము – సద్దు
  • బ్రహ్మ – బమ్మ, బొమ్మ
  • ఆశ్చర్యము – అచ్చెరువు
  • కీర్తి – కీరితి
  • అగ్ని – అగ్గి

వ్యుత్పత్త్యర్థాలు:

  • పక్షి : పక్షములు కలది (పక్షి)
  • ఖగము : ఆకాశమున తిరుగునది. (పక్షి)
  • దహనుడు : దహించు స్వభావము (అగ్ని)
  • బుభుక్ష : కలవాడు. తినవలెనను కోరిక (ఆకలి)
  • పుత్రుడు : పున్నామ నరకము నుండి రక్షించువాడు. (కొడుకు)

సంధులు

  • విఘ్నమిట్టులు : విఘ్నము + ఇట్టుల = ఉత్వసంధి
  • వియోగంబగు : వియోగంబు + అగు = ఉత్వసంధి
  • ఇమ్మని : ఇమ్ము + అనిన = ఉత్వసంధి
  • అధముడయిన : అధముడు + అయిన = ఉత్వసంధి
  • మాంసమెల్ల : మాంసము + ఎల్ల = ఉత్వసంధి
  • సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.
  • ఇంద్రాగ్నులు : ఇంద్ర + అగ్నుల = సవర్ణదీర్ఘ సంధి
  • శరణాగత : శరణ + ఆగత = సవర్ణదీర్ఘ సంధి
  • ఆహారార్ధం : ఆహార + అర్థం = సవర్ణదీర్ఘ సంధి
  • సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.
  • గుణోన్నతి : గుణ + ఉన్నతి = గుణసంధి
  • విహాగోతామ : విహగ + ఉత్తమ = గుణసంధి
  • సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.
  • ఎట్టియధముడు : ఎట్టి + అధముడు = యడాగమసంధి
  • మిక్కిలి యధర్మము : మిక్కిలి + అధర్మము = యడాగమసంధి
  • తులయెక్కె : తుల + ఎక్కె = యడాగమసంధి = యడాగమసంధి
  • సూత్రం : సంధిలేని చోట స్వరం కంటే పరంగా ఉన్న స్వరానికి యడాగమం అవుతుంది.

సమాసములు

  • ఇంద్రాగ్నులు – ఇంద్రుడును, అగ్నియును – ద్వంద్వ సమాసము
  • వాసవదహనులు -వాసవుడును, దహనుడును – ద్వంద్వ సమాసము
  • తనయంగము – తనదైన అంగము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
  • సర్వభూతములు – సర్వములైన భూతములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
  • పెక్కుజీవములు – అనేకములైన జీవములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
  • వేదవిహితము – వేదముచేత విహితము – తృతీయా తత్పురుష సమాసము
  • విహగోత్తముడు – విహగములలో ఉత్తముడు – షష్ఠీ తత్పురుష సమాసము
  • అవనినాథుడు – అవనికి నాథుడు – షష్ఠీ తత్పురుష సమాసము
  • గుణోన్నతి – గుణములందు ఉన్నతి – సప్తమీ తత్పురుష సమాసము
  • ఒక్క కపోతము – ఒక్కటైన కపోతము – ద్విగు సమాసము
  • శబ్ద బ్రహ్మము – శబ్దమనెడి బ్రహ్మము – రూపక సమాసము

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు

1. ఆ॥ నిన్ను సత్య ధర్మ నిర్మలుఁగా విందు
నట్టి నీకు బాడియయ్య ? యిప్పు
డతి బుభుక్షితుండనై యున్న నాకు నా
హార విఘ్న మిట్టులాచరింప ?

ప్రతిపదార్థం :
అయ్య = ఓ రాజా ! శిబి చక్రవర్తీ!
నిన్ను = నిన్ను గురించి
సత్య ధర్మనిర్మలున్ + కాన్ = సత్యము, ధర్మము పాటించే పవిత్రునిగా
విందున్ = విని ఉన్నాను
అట్టి నీకు = అంత గొప్పవాడివైన నీకు
ఇప్పుడు = ఈ సమయంలో
అతి = మిక్కిలి
బుభుక్షితుండను + ఐ =ఆకలి గొన్నవాడనై
ఉన్న నాకున్ = ఉన్నటువంటి నాకు
ఇట్టులు = ఈ విధంగా
ఆహార విఘ్నము = భోజనానికి ఆటంకము
ఆచరింప = కలిగించుట
పాడి + అ = న్యాయమేనా ?

తాత్పర్యం:
ఓ శిబి చక్రవర్తీ ! నీవు సత్య ధర్మాలను ఆచరించటం చేత కళంకం లేనివాడివని విన్నాను. అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకకుండా చేయటం న్యాయమేనా ?

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

2. వ॥ సర్వ భూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు, నిదినాకు, భక్ష్యంబు గానినాఁడు
బుభుక్షావేదనం జేసి ప్రాణ వియోగంబగు, నట్లయిన నా పుత్రులు భార్యయు జీవింపనేర,
రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింససేయుట ధర్మవిరోధంబు

ప్రతిపదార్థం :

సర్వభూతంబులు ఆహారంబున = ప్రాణులన్నియు
జీవించి = బతికి
వర్ధిల్లు = వృద్ధిపొందును.
ఇది = ఈ పావురము
నాకు = డేగనైన నాకు
భక్ష్యంబు + కానినాడు = ఆహారం కాకపోతే
బుభుక్షావేదనన్ + చేసి = = ఆకలిబాధ వలన
ప్రాణ వియోగంబు + అగున్ = ప్రాణములు పోవును
అట్లు + అయిన = అలా జరిగితే
నా పుత్రులు = నా బిడ్డలు
భార్యయు = భార్యయును
జీవింప నేరరు = బ్రతకలేరు
ఒక్క కపోతంబు = ఒక్క పావురాన్ని
రక్షించి = కాపాడి
పెక్కు జీవులకు = అనేక ప్రాణులకు
హింస + చేయుట = బాధ కలిగించుట
ధర్మ విరోధంబు = ధర్మానికి విరుద్ధము

తాత్పర్యం:
అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ వృద్ధి పొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలి బాధతో నా ప్రాణాలు పోతాయి. అట్లైతే పిల్లలు, భార్య కూడా బతుకజాలరు. ఒక్క పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణులను హింసించటం ధర్మానికి వ్యతిరేకమే కదా!

3. క॥ ధర్మజ్ఞులైన పురుషులు
ధర్మువునకు బాధసేయు ధర్మువునైనన్ ధర్మముగా మదిఁ దలఁపరు
ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్

ప్రతిపదార్థం:
ధర్మజ్ఞులు + ఐన = ధర్మమును తెలిసిన
పురుషులు = మనుషులు
ధర్మువునకు = ధర్మానికి
బాధ + చేయు = హాని కలిగించే
ధర్మువున్ + ఐనన్ = ధర్మాన్నైనా సరే
మదిన్ = మనసులో
ధర్మముగా = ధర్మము అని
తలపరు = ఆలోచించరు
ధర్మువు = ధర్మమెప్పుడూ
సర్వంబునకు = ఎల్లరకు
హితంబుగ = మేలు కలిగించేదిగ
వలయున్ = ఉండవలెను.

తాత్పర్యం:
ధర్మం తెలిసినవారు ధర్మానికి కీడుచేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనస్సులో తలచుకోరు. ధర్మం అనేది అన్నింటికీ మేలును కలిగించేదిగానే ఉండాలి.

4. వ॥ ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు.
‘శ్యేనాః కపోతాన్ ఖాదయన్తి’ యను వేదవచనంబు
గలదు గావున దీని నాకు నాహారంబుగా నిమ్మనిన
దానికి శిబి యిట్లనియె

ప్రతిపదార్థం:
ఈ + కపోతంబు = ఈ పావురము
నాకు = డేగనైన నాకు
వేదవిహితంబు + ఐన = వేదములు నిర్దేశించిన
ఆహారంబు = ఆహారము
శ్యేనాః = డేగలు
కపోతాన్ = పావురాలను
ఖాదయంతి = తింటాయి
అను = అనునది
వేదవచనంబు+కలదు = వేదములు చెప్పిన మాట ఉన్నది.
కావున = అందుచేత
నాకున్ = నాకు
దీనిన్ = ఈ పావురాన్ని
ఆహారంబుగాన్ = భోజనంగా
ఇమ్ము = ఇవ్వవలసినది
అనిన = అనగా
దానికి = ఆ డేగకు
శిబి = శిబి చక్రవర్తి
ఇట్లు + అనియె = ఇలా అన్నాడు.

తాత్పర్యం:
ఈ పావురం నాకు వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. “డేగలు పావులను తింటాయి” అనే వేద వాక్యం ఉన్నది. కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇవ్వుమని అడిగిన డేగతో శిబి ఈ విధంగా బదులు పలికాడు.

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

5. తే॥ ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను
నాశ్రయించె నాశ్రితునెట్టి యధముఁడయిన విడువఁడనినను నేనెట్లు విడుతు దీని ?
నాశ్రిత త్యాగమిది ధర్మువగునె ? చెపుమ

ఈ + పక్షి = ఈ పక్షియైన పావురము
ప్రాణభయమున = ప్రాణం పోతుందనే భయంతో
వచ్చి = నా దగ్గరకు వచ్చి
నన్నున్+ఆశ్రయించెన్ = నా శరణు కోరింది.
ఎట్టి = ఎటువంటి
అధముడు+అయిన = నీచుడైనా కూడా
విడువడు = వదిలిపెట్టడు
అనినను = అంటారు గదా !
నేను = రాజునైన నేను
దీనిన్ = ఈ పక్షిని
ఎట్లు విడుతును = ఎలా వదిలిపెట్టగలను ?
ఇది = ఇలా
ఆశ్రిత త్యాగము = శరణు అన్నవారిని విడిచిపెట్టటం
ధర్మువు+అగును+ఎ = ధర్మము అనిపించుకుంటుందా ?
చెపుము + అ = నీవే చెప్పుము

తాత్పర్యం:
ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడయినా రక్షించుమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టడు. నేనెట్లా విడిచిపెడతాను? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుందో నీవే చెప్పు.

6. వ॥ నీవు పక్షివయ్యును ధర్మమెఱింగినట్లు పలికితి, శరణాగత పరిత్యాగంబు కంటె మిక్కిలి యధర్మం బొండెద్ది?
నీ యాఁకలి దీననకాని యొంట నుపశమింపదే ? నీ యత్నం బాహారార్థం బేని యిప్పు డివ్వనంబున మృగ
మహిష వరాహ ఖగ మాంసంబులు దీనికంటె మిక్కిలిగాఁ బెట్టెద, నిక్కపోతంబు వలని యాగ్రహం బుడుగుము,
దీని నేనెట్లును విడువ’ననిన శ్యేనం బిట్లనియె ..

ప్రతిపదార్థం:
నీవు = నీవు
పక్షివి + అయ్యును = పక్షివై యుండి కూడా
ధర్మము+ఎఱింగిన + అట్లు = ధర్మాలు తెలిసిన వానివలె
పలికితి = మాట్లాడావు
శరణ + ఆగత = శరణు అంటూ వచ్చినవారిని
పరిత్యాగంబు కంటె = విడిచిపెట్టుట కంటె
అధర్మంబు = అధర్మం
ఒండు + ఎద్ది = వేరొకటి ఏమున్నది?
నీ + ఆకలి = నీ ఆకలి
దీనన కాని = దీనితోనే తప్ప
ఒంటన్ = వేరొకదానితో
ఉపశమింపదు + ఏ = = శాంతించదా ?
నీ యత్నంబు = నీ ప్రయత్నము
ఆహార + అర్థంబు +ఏని = ఆహారం కోసమే ఐతే
ఇప్పుడు = ఈ సమయంలో
ఈ + వనంబున = ఈ అడవిలోని
మృగ = జింకల
మహిష = దున్నల
వరాహ = పందులు
ఖగ = పక్షుల
మాంసంబులు = మాంసములను
దీనికంటె = ఈ పావురం కంటె
మిక్కిలి = ఎక్కువగా
పెట్టెదన్ = తినడానికి పెడతాను
ఈ + కపోతంబువలని = ఈ పావురం విషయంలో
ఆగ్రహంబు = పట్టుదల
ఉడుగుము = విడిచిపెట్టు
దీనిని = ఈ పావురాన్ని
నేను = నేను
ఎట్లును = ఏ పరిస్థితిలోనూ
విడువను = వదిలిపెట్టను
అనిన = అని రాజు పలుకగా
శ్యేనం = డేగ
ఇట్లు + అనియె = ఇలా అన్నది.

తాత్పర్యం:
నీవు పక్షివి ఐనప్పటికీ ధర్మం తెలిసిన దానివలె మాట్లాడావు. రక్షించుమని కోరి వచ్చిన వారిని విడిచిపెట్టటం కన్న అధర్మం మరొకటుంటుందా ? నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కానీ తీరదా ? నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే ఇప్పుడు అడవిలో ఎన్ని జంతువులు లేవు ? లేళ్ళు, దున్నలు, పందులు, పక్షులు మొదలైన వాటి మాంసాలు దీని కన్నా ఎక్కువగా పెడతాను. ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు. దీన్ని మాత్రం నేను విడువను. అని శిబి చెప్పగా డేగ ఇట్లా బదులు పలికింది.

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

7. ఆ॥ నాకు విహిత భక్షణంబిది; యిప్పక్షి బూని కావ నీకు బుద్ధియేని
యవని నాథ ! దీని యంత నీ మాంసంబు
దూచి నాకుఁ బెట్టు తొలగ కిపుడ

ప్రతిపదార్థం:
అవని నాథ = ఓ రాజా!
ఇది = ఈ పావురము
నాకు = డేగనైన నాకు
విహిత భక్షణంబు = విధించబడిన ఆహారము
పూని = పట్టుదలతో
ఈ + పక్షిన్ = ఈ పావురాన్ని
కావన్ = రక్షించడానికి
నీకు = నీకు
బుద్ధి + ఏని = ఇష్టమైనట్లైతే
దీని + అంత = దీనితో సమానమైన
నీ మాంసంబు = నీ శరీర మాంసాన్ని
తూచి = తూకంవేసి
తొలగక = తప్పించుకోకుండా
ఇపుడు + అ = ఇప్పుడే
నాకున్ + పెట్టు = నాకు ఆహారంగా పెట్టు

తాత్పర్యం :
ఓ రాజా ! ఈ పావురం నాకు సహజసిద్ధంగా కల్పించబడిన ఆహారం. ఒకవేళ దీన్ని నీవు కాపాడాలని అనుకుంటే, దాని బరువుకు తూగినంత మాంసాన్ని నీ శరరీం నుంచి నాకు పెట్టుమని అడిగింది.

8. చ॥ అనిన ‘ననుగ్రహించితి మహా విహగోత్తమ’ యంచు సంతసం
బున శిబి తత్క్షణంబ యసి పుత్రిక నాత్మశరీర కర్తనం ‘
బనఘుఁడు సేసి చేసి తన యంగమునం గల మాంసమెల్లఁ బె
ట్టినను గపోతభాగమ కడిందిగ డిందుచు నుండె నత్తులన్

ప్రతిపదార్థం:

అనినన్ = ఆ డేగ ఇలా పలుకగా
శిబి = శిబి చక్రవర్తి
మహావిహగ+ఉత్తమ = ఓ శ్రేష్ఠుడైన పక్షిరాజా !
ననున్ = నన్ను
అనుగ్రహించితి = కరుణించావు
అంచు = అని పలుకుతూ
సంతసంబున = సంతోషముతో
అనఘుడు = పుణ్యాత్ముడైన ఆ శిబి
తత్ + క్షణంబు + అ = వెంటనే
అసి పుత్రికన్ = చిన్న కత్తితో
ఆత్మ = తన యొక్క
శరర = దేహమును
కర్తనంబు
చేసి చేసి = కత్తిరించుట = ఎన్నోసార్లు చేసి
తన = తన యొక్క
అంగంబునన్ + కల = శరీరము నందున్న
మాంసము + ఎల్లన్ = మాంసమంతయు
ఆ + తులన్ = ఆ త్రాసులో
పెట్టినను = పెట్టినా
కపోత భాగము = పావురము ఉన్నవైపు
కడిందిగ = మిక్కిలిగా
డిందుచున్ + ఉండెన్ = దిగిపోతూ ఉన్నది.

తాత్పర్యం:
అనగా సంతోషించిన శిబి పక్షులన్నింటిలో గొప్ప.. దానివైన నీవు నాపై దయ చూపావు అని చెప్పి వెంటనే చిన్న కత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తక్కెడలో వేస్తూ పావురం బరువుతో తూకం వేశాడు. తన దేహంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ పావురం ఉన్నవైపే తక్కెడ మొగ్గుతున్నది.

9. క॥ దానికి నచ్చెరువడి ధర
ణీ నాథుఁడు తనువు నందు నెత్తురు దొరుఁగం దాన తుల యెక్కె నంతన్
వాని గుణోన్నతికి మెచ్చి వాసవ దహనుల్

ప్రతిపదార్థం :

ధరణీ నాథుడు = శిబి మహారాజు
దానికిన్ = ఆ విచిత్రానికి
అచ్చెరు + పడి = ఆశ్చర్యపడి
తనువునందు = తన శరీరమందు
నెత్తురు = రక్తము
తొరుగన్ = కారుచుండగా
తాను + అ = తానే
తుల + ఎక్కెన్ = త్రాసులో కూర్చున్నాడు.
అంతన్ = వెంటనే
వాసవ దహనుల్ = ఇంద్రుడు, అగ్నిదేవుడు
వాని = ఆ రాజు యొక్క
గుణ + ఉన్నతికిన్ = గుణముల ఔన్నత్యానికి
మెచ్చి = మెచ్చుకొని

తాత్పర్యం :
తన శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూగక పోవటంతో ఆశ్చర్యపడ్డ శిబి చక్రవర్తి తానే తక్కెడలో కూర్చున్నాడు. ఇటువంటి ఆత్మార్పణతో కూడిన అతని త్యాగ గుణాన్ని చూసి ఇంద్రుడు, అగ్నిదేవుడు మెచ్చుకొని

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

10. వ॥ శ్యేనకపోత రూపంబులు విడిచి నిజరూపంబులఁ జూపి ‘నీ ధైర్య శౌర్యాది గుణంబు లనన్యసాధారణంబులు
గావున నీ కీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబు వర్తిల్లుచుండు’మని శిబికి వరంబిచ్చి ఇంద్రాగ్నులు
చనిరి.

ప్రతిపదార్థం :

శ్యేన కపోత రూపంబులు = డేగ పావురం రూపాలను
విడిచి = వదిలిపెట్టి
నిజరూపంబులన్ చూపి =తమ స్వీయరూపాలను చూపించి
నీ ధైర్యశౌర్య + ఆది = నీ ధైర్యము, శౌర్యము మొదలైన
గుణంబులు = లక్షణాలు
అనన్య సాధారణంబులు = ఇతరులెవ్వరికీ లేనివి
కావున = అందువలన
నీ కీర్తి = నీ యశస్సు
నిత్యంబు + ఐ = శాశ్వతమై
శబ్ద బ్రహ్మంబు + కల + అంతకాలంబు = శబ్దము ఉన్నంతకాలము
వర్తిల్లుచున్ = స్థిరముగా
ఉండుము + అని = ఉండిపోతావు అని
శిబికి = శిబి చక్రవర్తికి
వరంబు + ఇచ్చి = వరమిచ్చి
ఇంద్ర + అగ్నులు = ఇంద్రుడును, అగ్నియును
చనిరి = వెళ్ళారు.

తాత్పర్యం :
డేగ, పావురం రూపాల్లో ఉన్న ఇంద్రుడు, అగ్ని వారి నిజరూపాలతో సాక్షాత్కరించి “నీ ధైర్య, శౌర్య గుణాలు చాలా గొప్పవి. ఇవి ఇతరులకు సాధ్యంకావు. కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది” అని వెళ్ళిపోయారు.

పాఠం ఉద్దేశం:
ప్రశ్న.
త్యాగనిరతి పాఠం నేపథ్యం వివరించండి.
జవాబు.
పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబిచక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు. అగ్ని పావురంగా మారాడు. ఇంద్రుడు డేగ రూపం ధరించాడు. డేగంటే భయంతో పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది.

పాఠ్యభాగ వివరాలు:
ప్రశ్న, త్యాగనిరతి పాఠ్యభాగ వివరాలు తెల్పండి.
జవాబు.
త్యాగనిరతి పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందినది. ఇతిహాసం అంటే ‘ఇది ఇట్లా జరిగింది’ అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాక ముందు వాగ్రూపంలో ఉండేవి. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించారు.

కవి పరిచయం:
ప్రశ్న.
త్యాగనిరతి పాఠం రచించిన కవిని పరిచయం చేయండి.
జవాబు.
రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి నన్నయ. ఇతనికి వాగనుశాసనుడనే బిరుదు ఉన్నది. 11వ శతాబ్దం వాడు.

వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది, సభా పర్వాలు, అరణ్యపర్వంలో 4వ ఆశ్వాసంలో “శారదరాత్రులు” అనే పద్యం (11వ శతాబ్దం) వరకు తెలుగులోకి అనువదించాడు. “ఆంధ్రశబ్ద చింతామణి” అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ‘అక్షరరమ్యత, ప్రసన్నకథా కలితార్థయుక్తి, నానారుచిరార్థసూక్తి నిధిత్వం’ అనే లక్షణాలున్నాయని చెప్పుకున్నాడు.
(గమనిక : జవాబు రాసేటప్పుడు గీతగీసిన వాక్యాలు రాస్తే చాలు.)

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి

ప్రవేశిక:
మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. భారత, రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి. వారిలో శిబి చక్రవర్తి త్యాగగుణానికి తార్కాణంగా నిలుస్తాడు. తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయడు. అది ఎట్లానో తెలియజేయడం ఈ పాఠం నేపథ్యం.

కఠిన పదాలకు అర్ధాలు

భూతము = ప్రాణి
బుభుక్షావేదన = ఆకలిబాధ
పాడి = న్యాయము, ధర్మము
కపోతం = పావురం
ఖాదయంతి = తింటాయి
శ్యేనం = డేగ
అధముడు = నీచుడు
ఆశ్రితులు = ఆశ్రయించినవారు
పరిత్యాగం = విడిచిపెట్టుట
ఒండు = మరొకటి
మహిషం = దున్న
ఖగం = పక్షి, విహగము
వరాహం = పంది
ఉపశమించు = శాంతించు
విహితము = విధించబడిన, చెప్పబడిన
అసి = కత్తి
అపుత్రిక = చిన్నకత్తి
కర్తనము = కత్తిరించుట
అంగము = శరీరభాగము
కడు = మిక్కిలి
ధరణి= భూమి
నాథుడు = భర్త
ధరణీనాథుడు = = భూ భర్త = రాజు
తొరుగు = కారుచుండగా
వాసవ దహనులు = ఇంద్రుడు, అగ్నిదేవుడు
ఉన్నతి = ఔనత్యం
చనుట = వెళ్ళుట

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి 4

TS 8th Class Telugu Guide Answers Study Material Telangana

TS 8th Class Telugu Guide Study Material Telangana Pdf Download

Class 8 Telugu Textbook Solutions Telangana

TS 8th Class Telugu Guide Telangana ఉపవాచకం

TS 8th Class Study Material

TS 8th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson Telangana ఇల్లు – ఆనందాలహరివిల్లు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 4th Lesson ఇల్లు – ఆనందాలహరివిల్లు Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson ఇల్లు – ఆనందాలహరివిల్లు

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. “దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నెముక” అనడానికి కారణాలు రాయండి.
జవాబు.
‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనే సూత్రం ఆధారంగా ఉమ్మడి కుటుంబం కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూర్చేది. స్వార్థానికి తావు తక్కువ. ‘మన’ అనే భావం అందరిలో ఉండేది. రైతు కుటుంబాల్లో ఇంటిల్లిపాది ఇంటా, బయటా పనుల్లో పాలుపంచుకొనేవారు. శ్రామిక వర్గం కూడా అలాగే ఉండేది. ఊరిలో ఏదన్నా పెళ్లి లాంటి కార్యక్రమాలు జరిగితే అందరూ శ్రమను పంచుకొని ఆ కార్యక్రమం చేసే వారికి ఆనందం కల్గించేవారు. ఈ సంఘీభావమే దేశానికి వెన్నెముక అయింది.

2. “అసలు కంటే వడ్డీయే ముద్దు” ఈ సామెతను పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు.
ఉమ్మడి కుటుంబాలలో పిల్లలు సరదా సరదాగా ఉండేవారు. ఆటపాటల్లోను, కొట్లాటల్లోను పోటీపడుతుంటారు. అవసరాలు తీర్చుకోవడంలోనూ పోటీపడేవారు. కాని పెద్దల కనుసన్నలలో భయభక్తులతో క్రమశిక్షణతో ఉండేవారు. ఏం కావాలన్నా, ఏదైనా జరిగినా అమ్మమ్మ, నాన్నమ్మల దగ్గరకు చేరేవారు. వాళ్ళు కూడా ప్రేమతో దగ్గరకు తీసుకొనేవారు. తమ కొడుకులు, కోడళ్ళ కంటే వారి పిల్లలంటే వారికి అభిమానం ఎక్కువ. “అసలు కంటే వడ్డీయే ముద్దు” కదా!

TS 8th Class Telugu ఉపవాచకం 4th Lesson Telangana ఇల్లు – ఆనందాలహరివిల్లు

3. “కలిసి ఉంటే కలదు సుఖం” దీన్ని వివరించండి.
జవాబు.
“కలిసి ఉంటే కలదు సుఖం” అంటే అందరూ కలిసికట్టుగా జీవిస్తే సుఖంగా ఉంటారు అని అర్థం. కలిసి ఉంటే కలదు సుఖం అనే సూత్రం ఆధారంగా సమిష్టి కుటుంబం, కుటుంబవ్యవస్థకు బలాన్ని చేకూర్చేది. కొందరి మనోభావాలు భిన్నంగా ఉన్నప్పటికీ మొత్తం కుటుంబానికి అక్కరకు వచ్చేదే అమలయ్యేది. స్వార్థపరతకు తావు తక్కువ. ‘మన’ అనే భావనకు అందరూలోనై ఉండేవారు. రైతుకుటుంబాల్లో ఐతే ఇంటిల్లిపాది ఇంటి పనుల్లో పాలు పంచుకొనేవారు. శ్రామిక వర్గం అంతా దాదాపు అలానే ఉండేది. ఊరిలో ఏదన్నా పెళ్ళి లాంటి కార్యక్రమాలు జరిగితే అందరూ శ్రమను పంచుకొని ఆ కార్యక్రమం చేసేవారికి ఆనందం కలిగించేవారు. ఈ సంఘీభావమే దేశానికి వెన్నెముక అయింది. సిరిసంపదలను పోగు చేసింది. ప్రపంచంలోనే భారతదేశాన్ని ఉన్నతస్థానంలో నిలబెట్టింది ఆనాడు. మన ఇతిహాసాలైన రామాయణ భారతాలు ఈ సమష్టి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తాయి.

4. యాంత్రిక జీవనం అంటే ఏమిటి ?
జవాబు.
యాంత్రిక జీవనం అంటే యంత్రాల్లా జీవించడం. యంత్రాలు ఎటువంటి ఆనందాలు, బాధలు, అనుభూతులు లేకుండా జీవిస్తాయి. అలాగే మనుషులు ఎటువంటి భావనలు లేకుండా జీవిస్తున్నారు. ఎక్కువగా యంత్రాలపైన ఆధారపడి జీవిస్తున్నారు. బద్దకస్తులు అవుతున్నారు. అందరితో కలసి జీవించకుండా ఎవరికి వారే, యమునాతీరే అన్నట్లు బ్రతుకుతున్నారు. యాంత్రిక జీవనం సాగిస్తూ, రోగాలపాలౌతున్నారు.

5. మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలే ఈ సమాజంలో నిలదొక్కుకుంటున్నారు. ఎందుకు ?
జవాబు.
మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలకు కష్టం, సుఖం, బరువు, బాధ్యత తెలుస్తాయి. క్రమశిక్షణతో ఎదుగుతారు. వారు తమ తల్లిదండ్రుల ప్రభావంతో అందరితో కలిసిమెలిసి ఉంటారు. పెద్ద వారితో కష్ట సుఖాలు పంచుకుంటారు. ఎటువంటి అశాంతికి, హింసకు లోనుగాకుండా ఉంటారు. తల్లిదండ్రులు తమపై చూపించిన అభిమానాన్ని ఇతరులపైనా చూపిస్తారు. పెద్దవారంటే గౌరవం ఉంటుంది. మంచి వారితో స్నేహం చేస్తారు. అందువల్లనే మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలే ఈ సమాజంలో నిలదొక్కుకుంటున్నారు.

TS 8th Class Telugu ఉపవాచకం 4th Lesson Telangana ఇల్లు – ఆనందాలహరివిల్లు

6. ‘మన’ అనే భావనవల్ల కలిగే ప్రయోజనాలేమిటి ?
జవాబు.
‘మన’ అనే భావన వలన అనేక ప్రయోజనాలు కల్గుతాయి. అందరం ఒకరికి ఒకరు సాయం చేసుకొనే అవకాశం ఉంటుంది. పిల్లలకు, అందరికీ సహాయం చెయ్యాలనే స్వభావం అలవడుతుంది. ‘మన’ అనే భావం వలన కుటుంబం, ఊరు వాడతో పాటు దేశం బాగుపడుతుంది. సమాజంలో అందరితో కలిసికట్టుగా జీవించే అవకాశం కల్గుతుంది. మంచి కుటుంబం, మంచి సమాజం, మంచి దేశం, మంచి ప్రపంచం ఏర్పడతాయి. ఎవరిలోను స్వార్థం పెరగదు. దాని వలన అన్యాయాలు, అక్రమాలు జరగవు. ప్రపంచమంతా శాంతితో నిండి ఉంటుంది. మన అనే భావనలో సార్థపరతకు తావు తక్కువ.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. తల్లిదండ్రులు ఇతరులతో పోటీపడుతూ పరుగెడుతున్న నేటి సమాజంలో పిల్లల పరిస్థితులేమిటి ?
జవాబు.
తల్లిదండ్రులు ఇతరులతో పోటీపడుతూ పరుగెడుతున్నారు. అందువలన నేటి సమాజంలో పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు సంపాదనే ముఖ్యంగా భావించి పిల్లల గురించి ఆలోచించట్లేదు. దానివల్ల పిల్లలు ప్రేమకు, ఆప్యాయతకు దూరం అవుతున్నారు. మానవతావిలువల గురించి చెప్పేవారు లేక క్రమశిక్షణకు దూరమవుతున్నారు. చదువులో ఒత్తిడి పెరిగి, మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నారు.

కొందరు అందరూ ఉండి ఎవరూ లేని అనాథ పిల్లలుగా తయారవుతున్నారు. కొందరు పిల్లలు సమాజ వ్యతిరేక శక్తులుగా మారిపోతున్నారు. అశాంతికి, హింసకు ప్రధాన కారకులవుతున్నారు. మంచిని, నీతిని చెప్పే వారు లేక దురలవాట్లకు బానిసలవుతున్నారు. మానవతా విలువలు తెలియకుండా పెరుగుతున్నారు. ఇలా అనేక రకాలుగా నేటి సమాజంలో పిల్లల పరిస్థితి దయనీయంగా తయారవుతున్నది. అన్ని కుటుంబాల్లో ఇలా జరగకపోయినప్పటికీ ఎక్కువ కుటుంబాల్లో పరిస్థితి ఇలాగే ఉంది.

TS 8th Class Telugu ఉపవాచకం 4th Lesson Telangana ఇల్లు – ఆనందాలహరివిల్లు

2. సమిష్టి కుటుంబానికీ, వ్యష్టి కుటుంబానికీ మధ్య వ్యత్యాసమేమిటి ? దాని పరిణామాలెలా ఉన్నాయి ?
జవాబు.
సమిష్టి అంటే కలిసి ఉండేది అని అర్థం. సమిష్టి కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం. అంటే ఇంటి యజమాని, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరూ కలిసి ఉండడం. వ్యష్టి అంటే ఒంటరిపాటు అని అర్థం. వ్యష్టి కుటుంబం అనగా ఇంటి యజమాని తన భార్యా పిల్లలతో మాత్రమే చిన్న కుటుంబంగా ఉండడం. సమష్టి కుటుంబాల్లో ‘మన’ అనే భావన ఉండేది. ఒకరిపై ఒకరు అభిమానంతో, గౌరవంతో ఉండేవారు. అందరూ కలిసికట్టుగా ఉండేవారు. వ్యష్టి కుటుంబాల్లో డబ్బు పరంగా స్వేచ్ఛ, ప్రత్యేక గుర్తింపు, స్వార్థం ఉంటాయి. దీని వలన కుటుంబపరమైన

వారసత్వ భావనలు అందడంలేదు. మానవ సంబంధాలు, ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. భాషను ప్రయోగించడం తగ్గుతుంది. పిల్లలపట్ల తల్లిదండ్రులకు శ్రద్ధ తగ్గిపోతుంది. పిల్లలకు మంచి అలవాట్లు నేర్చుకొనే అవకాశం ఉండదు. ఇలా అనేక పరిణామాలు కల్గుతాయి.
ఇది పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. పెద్దల పట్ల గౌరవం తగ్గిపోతుంది. పిల్లల యొక్క భావనలు
సంకుచితమౌతాయి.

3. వృష్టి కుటుంబమైనా, సమష్టి కుటుంబమైనా సమాజానికి, దేశానికి పనికొచ్చే పిల్లల్ని అందించాలంటే ఏం చేయాలి ?
జవాబు.
వ్యష్టి కుటుంబమైనా, సమష్టి కుటుంబమైనా దేశానికి పనికొచ్చే పిల్లల్ని అందించడం కుటుంబ బాధ్యత. తల్లిదండ్రులు పిల్లలపట్ల శ్రద్ధ చూపించి, ప్రేమను పంచాలి. పిల్లలకు వారసత్వంగా సంస్కారం, చదువు, పరోపకారం మొదలైనవి అందించాలి. తల్లిదండ్రులు ఉద్యోగ వ్యాపకాలలో ఎంత తిరుగుతున్నా పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలి.

కుటుంబంలోని పెద్దలు నీతికి సంబంధించిన విషయాలు చెప్పాలి. తల్లిదండ్రులు మంచి నడవడికతో పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. సమాజంలో ఎలా నడచుకోవాలో పిల్లలకు వివరించి చెప్పాలి. కుటుంబంలో అందరూ మన అనే భావనతో ఉండాలి. కుటుంబ విలువలు, భావనలు పిల్లలకు వివరించి చెప్పాలి. ఇలా పిల్లల గురించి శ్రద్ధ తీసుకున్ననాడు దేశానికి మంచి పౌరులుగా పిల్లలు ఎదుగుతారు.

TS 8th Class Telugu ఉపవాచకం 4th Lesson Telangana ఇల్లు – ఆనందాలహరివిల్లు

4. కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి ?
జవాబు.
ఉమ్మడి కుటుంబంలో, వ్యష్టి కుటుంబంలో ఉండే మంచి గుణాల కలయికతో ఒక కొత్త కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. సమానత్వం, ఆర్థిక స్వాతంత్య్రం, వ్యక్తి స్వేచ్ఛ – వీటికి భంగం కలగకుండా ఉండాలి. ఆధిపత్యాల పోరు ఉండకూడదు. ప్రేమానురాగాలు, విలువలు, మానవ సంబంధాలు కలిగి ఉండాలి. ‘మన’ అనే భావం ఉండే విధంగా కొత్త కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి.

కుటుంబం అనే హరివిల్లులో అమ్మ, నాన్న, పిల్లలతో పాటు నాన్నమ్మ, తాతయ్య ఉండాలి. పెద్దల బలాన్ని, బలగాన్ని పెంపొందించుకోవాలి. బాధ్యతలను అందరూ పంచుకోవాలి. కుటుంబంలో అందరూ సమస్యలపై పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకోవాలి. యాంత్రికత తగ్గాలి. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అపుడే మన కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగుతుంది.

5. కుటుంబ వ్యవస్థలో క్రమంగా వస్తున్న మార్పులు తెల్పండి.
జవాబు.
పూర్వపు రోజులో సమిష్టి కుటుంబాలు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంటి యజమాని, తల్లిదండ్రులు, భార్యా పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉండేవారు. నానమ్మ, తాతయ్య, అమ్మమ్మలు, పిల్లలకు మంచి భక్తి, నీతి కథలు చెప్పేవారు. పెద్దవారిపట్ల ఎలా గౌరవంగా ఉండాలో, పిల్లలు చూసి తెలుసుకునేవారు. ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలు కలిగి ఉండేవారు. ఇల్లంతా సందడి సందడిగా ఉండేది. ఒకరికొకరు నిస్వార్థంగా కష్టసుఖాల్లో సహాయం చేసుకునేవారు. సమిష్టి కుటుంబంలోని పిల్లలకు ఆరోగ్యం, సంస్కారం, చదువు, విజ్ఞానం, మంచితనం, పరోపకారం వారసత్వంగా వచ్చేవి. పిల్లలు నిజాయితీ గల ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉండేది. సమిష్టి కుటుంబంలో “మన” అనే భావన ఉంటుంది.

వారసత్వ భావనలు అందడంలేదు. మానవ సంబంధాలు, ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. భాషను ప్రయోగించడం తగ్గుతుంది. పిల్లలపట్ల తల్లిదండ్రులకు శ్రద్ధ తగ్గిపోతుంది. పిల్లలకు మంచి అలవాట్లు నేర్చుకొనే అవకాశం ఉండదు. ఇలా అనేక పరిణామాలు కల్గుతాయి.
ఇది పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. పెద్దల పట్ల గౌరవం తగ్గిపోతుంది. పిల్లల యొక్క భావనలు
సంకుచితమౌతాయి.

TS 8th Class Telugu ఉపవాచకం 4th Lesson Telangana ఇల్లు – ఆనందాలహరివిల్లు

3. వ్యష్టి కుటుంబమైనా, సమష్టి కుటుంబమైనా సమాజానికి, దేశానికి పనికొచ్చే పిల్లల్ని అందించాలంటే ఏం చేయాలి?
జవాబు.
వ్యష్టి కుటుంబమైనా, సమష్టి కుటుంబమైనా దేశానికి పనికొచ్చే పిల్లల్ని అందించడం కుటుంబ బాధ్యత. తల్లిదండ్రులు పిల్లలపట్ల శ్రద్ధ చూపించి, ప్రేమను పంచాలి. పిల్లలకు వారసత్వంగా సంస్కారం, చదువు, పరోపకారం మొదలైనవి అందించాలి. తల్లిదండ్రులు ఉద్యోగ వ్యాపకాలలో ఎంత తిరుగుతున్నా పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలి. కుటుంబంలోని పెద్దలు నీతికి సంబంధించిన విషయాలు చెప్పాలి.

తల్లిదండ్రులు మంచి నడవడికతో పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. సమాజంలో ఎలా నడచుకోవాలో పిల్లలకు వివరించి చెప్పాలి. కుటుంబంలో అందరూ మన అనే భావనతో ఉండాలి. కుటుంబ విలువలు, భావనలు పిల్లలకు వివరించి చెప్పాలి. ఇలా పిల్లల గురించి శ్రద్ధ తీసుకున్ననాడు దేశానికి మంచి పౌరులుగా పిల్లలు ఎదుగుతారు.

4. కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి ?
జవాబు.
ఉమ్మడి కుటుంబంలో, వ్యష్టి కుటుంబంలో ఉండే మంచి గుణాల కలయికతో ఒక కొత్త కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. సమానత్వం, ఆర్థిక స్వాతంత్య్రం, వ్యక్తి స్వేచ్ఛ – వీటికి భంగం కలగకుండా ఉండాలి. ఆధిపత్యాల పోరు ఉండకూడదు. ప్రేమానురాగాలు, విలువలు, మానవ సంబంధాలు కలిగి ఉండాలి.

‘మన’ అనే భావం ఉండే విధంగా కొత్త కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. కుటుంబం అనే హరివిల్లులో అమ్మ, నాన్న, పిల్లలతో పాటు నాన్నమ్మ, తాతయ్య ఉండాలి. పెద్దల బలాన్ని, బలగాన్ని పెంపొందించుకోవాలి. బాధ్యతలను అందరూ పంచుకోవాలి. కుటుంబంలో అందరూ సమస్యలపై పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకోవాలి. యాంత్రికత తగ్గాలి. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అపుడే మన కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగుతుంది.

5. కుటుంబ వ్యవస్థలో క్రమంగా వస్తున్న మార్పులు తెల్పండి.
జవాబు.
పూర్వపు రోజులో సమిష్టి కుటుంబాలు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంటి యజమాని, తల్లిదండ్రులు, భార్యా పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉండేవారు. నానమ్మ, తాతయ్య, అమ్మమ్మలు, పిల్లలకు మంచి భక్తి, నీతి కథలు చెప్పేవారు. పెద్దవారిపట్ల ఎలా గౌరవంగా ఉండాలో, పిల్లలు చూసి తెలుసుకునేవారు.

ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలు కలిగి ఉండేవారు. ఇల్లంతా సందడి సందడిగా ఉండేది. ఒకరికొకరు నిస్వార్థంగా కష్టసుఖాల్లో సహాయం చేసుకునేవారు. సమిష్టి కుటుంబంలోని పిల్లలకు ఆరోగ్యం, సంస్కారం, చదువు, విజ్ఞానం, మంచితనం, పరోపకారం వారసత్వంగా వచ్చేవి. పిల్లలు నిజాయితీ గల ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉండేది. సమిష్టి కుటుంబంలో “మన” అనే భావన ఉంటుంది.

నేడు సమిష్టి కుటుంబాలు తగ్గి వ్యష్టి (ఒంటరి) కుటుంబాలు వచ్చాయి. ఇంటి యజమాని తన భార్యాపిల్లలతో మాత్రమే చిన్న కుటుంబంగా ఉంటున్నాడు. ఆర్థిక స్వేచ్ఛ తక్కువగా ఉండటం, ప్రజలలో స్వార్థం పెరగటం, ప్రత్యేక గుర్తింపు కోసం ఆరాటం వల్ల ఈ వ్యష్టి కుటుంబాలు ఏర్పడ్డాయి. దీనివల్ల కుటుంబపరమైన వారసత్వ భావనలు ముందు తరాలవారికి అందటం లేదు. మనుషుల్లో “మన” అనే భావన క్రమంగా తగ్గిపోతున్నది.

మానవ సంబంధాలు పరిమితంగా ఉండి, బంధాలు క్రమంగా తగ్గుతూ, ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమాభిమానాలు, పెద్దలపట్ల గౌరవ భావం, క్రమశిక్షణ తగ్గిపోతున్నది. పిల్లలకు మంచి అలవాట్లు రావటం కష్టమై హింస, పెరిగి అనాథలుగా మారి, సమాజ వ్యతిరేక శక్తులుగా మారే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా ఉమ్మడి, వ్యష్టి కుటుంబాలలో విలువలతో కూడిన మానవసంబంధాలు, “మన” అనే భావన ఉంటేనే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. లేకపోతే కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుంది.

పరిచిత గద్యభాగాలు

1. కింది పేరాను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
వేదకాలంనాటికే నాగరికమైన పద్ధతుల్లో ఈ కుటుంబవ్యవస్థ ఏర్పడిందని కొందరు చరిత్రకారుల భావన. వారి రాతల వల్ల కుటుంబ జీవనవిధానం ఆ కాలంలో అత్యున్నత స్థాయిలో ఉండేదనీ, భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు ఉన్నతశ్రేణిలో ఉండేవని తెలుస్తూంది. వేల ఏండ్ల నుంచి విలువలకు కట్టుబడి జీవిస్తూ విశ్వానికి ఆదర్శంగా నిలిచిన కుటుంబ వ్యవస్థ మనది.

ప్రశ్నలు :

1. కుటుంబ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది ?
జవాబు.
వేదకాలం నాటికే కుటుంబ వ్యవస్థ ఏర్పడింది.

2. ఆనాటి జీవన విధానం ఎలా ఉండేది ?
జవాబు.
ఆనాటి జీవన విధానం అత్యనన్నత స్థాయిలో ఉండేది.

3. ఎవరి సంబంధ బాంధవ్యాలు ఉన్నత శ్రేణిలో ఉండేవి ?
జవాబు.
భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు ఉన్నత (శేణిలో ఉండేవి.

4. విలువలకు కట్టుబడి మనం ఎప్పటి నుండి జీవిస్తున్నాం ?
జవాబు.
వేల ఏండ్ల నుండి విలువలకు కట్టుబడి మనం జీవిస్తున్నాం.

5. మన కుటుంబ వ్యవస్థ ఎటువంటిది ?
జవాబు.
మస కుటుంబ వ్యవస్థ విశ్వానికి ఆదర్శంగా నిలిచింది.

TS 8th Class Telugu ఉపవాచకం 4th Lesson Telangana ఇల్లు – ఆనందాలహరివిల్లు

2. ఈ క్రింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఈ యాంత్రిక జీవన విధానం వల్ల కుటుంబంలోని అందాలు, ఆనందాలు హరించిపోతున్నాయి. వ్యష్టి కుటుంబంలోని లోపభూయిష్టమైన, స్వార్థంతో కూడిన జీవన విధానం వల్ల ఈ మార్పులు సంభవించాయి. కుటుంబసభ్యులు సుఖాల్నీ, సంతోషాల్నీ, కష్టాల్నీ, బాధల్నీ, పరస్పరం పంచుకోవాల్సి ఉండగా ఎవరికి వారే యమునాతీరే’ అన్న విధంగా మెలగుతున్నారు. ఈ బలీయమైన కారణాల వల్లే పిల్లల్లో కొందరు అందరూ ఉండీ అనాథలుగా, మరికొందరు సమాజ వ్యతిరేకశక్తులుగా మారిపోతున్నారు. సమాజానికి పెను సవాళ్ళను విసురుతున్నారు; అశాంతి, హింసలకు ప్రధాన కారకులవుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావంతో పాటు, సమాజం, సమవయస్కులు, ప్రసారసాధనాల ప్రభావం కూడా ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. కాని ఇప్పటికీ మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు వీటన్నింటినీ అధిగమించి సమాజంలో నిలదొక్కుకుంటున్నారు.

ప్రశ్నలు :

1. యాంత్రిక జీవనం వలన ఏమి కోల్పోతున్నాము ?
జవాబు.
యాం|తిక జీవన విధానం వల్ల కుటుంబంలోని అందాలు, ఆనందాలు కోల్పోతున్నాము.

2. యాంత్రిక జీవనం వలన కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి ?
జవాబు.
యాంత్రిక జీవనం వలన కుటుంబ సభ్యులు సుఖాల్నీ, సంతోషాల్ని, కష్టాల్నీ, బాధల్నీ పరస్పరం పంచుకోలేకపోతున్నారు.

3. పిల్లలపై ఎవరెవరి ప్రభావం ఉంటుంది ?
జవాబు.
పిల్లలపై తల్లిదండ్రుల (ప్రభావంతో పాటు, సమాజం, సమవయస్కులు, ప్రసార సాధనాల ప్రభావం ఉంటుంది.

4. ఎటువంటి పిల్లలు సమాజంలో నిలదొక్కుకోగల్గుతున్నారు ?
జవాబు.
మంచి కుటుంబ నేసథ్యం నుంచి వచ్చిన పిల్లలు సమాజంలో నిలదొక్కుకుంటున్నారు.

5. పై పేరాలో ఉపయోగించిన ‘జాతీయము’ను గుర్తించుము.
జవాబు.
‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నది పై పేరాలోని జాతీయం.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. ఎల్లమ్మ విద్యాభ్యాసం గురించి తెల్పండి.
జవాబు.
ఎల్లమ్మ చిన్నతనంలో ఎక్క అయ్యగారు చదువు చెప్పేవారు. కాని ఆమె దగ్గర చదువుకోడానికి పలకలుగాని ఆయనకివ్వడానికి పైసలుగాని లేవు. పగిలిన కుండ పెంకులు పెద్దవి ఏరుకొచ్చుకొని వాటిమీద బొగ్గుతో రాసుకొనేవాళ్ళు. అయ్యవారి దగ్గరున్న పెద్దబాలశిక్ష ఒక్కటే పుస్తకం. అదే చదివేవాళ్ళు. అలా ఎల్లమ్మ చదువుకోడానికి ఎంతో కష్టపడ్డది.

2. ఎల్లమ్మకు చిందుభాగోతంలో ప్రవేశం ఎలా జరిగింది ?
జవాబు.
ఎల్లమ్మ చిన్నతనంలో రెండు మూడు కథలే ఆడేవాళ్ళట. చిన్నప్పటి నుండే భాగోతం నేర్పుతుండే వాళ్ళు. ఆమెకు నాలుగేళ్ళ వయసులో మొహానికి రంగువేసి వేషం కట్టమన్నారు. బాలకృష్ణుని వేషంతో ఆమె రంగ ప్రవేశం చేసింది. తెర వెనుక పాడుతుంటే తెర ముందు ఎగిరిందట. అలా అలవాటై ఎనిమిదేళ్ళప్పుడు బాలకృష్ణుడు, రంభవేషాలు వేసింది. తరువాత రకరకాల ఆడ, మగ పాత్రలు వేసింది.

TS 8th Class Telugu ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

3. చిందు భాగోతం గురించి రాయండి.
జవాబు.
చిందు భాగోతం అన్నా యక్షగానమన్నా రెండూ ఒకటే. ఏమీ తేడా లేదు. చిందోళ్ళ ఆట అంటే అగ్ర కులస్థులు రారని చిందు యక్షగానం అని పిలిచేవారు. ఉదయం పదిగంటలకు ఆట మొదలు పెడితే సాయంత్రం దీపాలు పెట్టేదాకా ఆడేవాళ్ళు. యక్షగానం పుస్తకాల్లో చూసి కావలసినవి తీసుకొని నేర్చుకుంటారు. చిరుతల భాగోతులు, దాసరులు, చిందు భాగోతులు తీసుకొనే కథలు ఒకటే అయిన వాటి దరువులను బట్టి వేరుగా ఉంటాయి.

4. చిందు భాగోతంలో ఏఏ కథలు ఆడేవారు ? ఎల్లమ్మ పోషించిన పాత్రలేవి ?
జవాబు.
చిందు భాగోతంలో సారంగధర, చెంచులక్ష్మి, సతీసావిత్రి, ప్రహ్లాద, మైరావణ, మాంధాత చరిత్ర, రామాంజనేయ, సతీ అనసూయ, సతీ తులసి, బబృవాహన, బాలనాగమ్మ, హరిశ్చంద్ర, అల్లీరాణి, గంగా కళ్యాణం, రామదాసు చరిత్ర, సుగ్రీవ విజయం మొదలైన ఇరవైఐదు కథలు ఆడేవాళ్ళు. ఆ కథలన్నింటిలోనూ ఎల్లమ్మ ప్రధాన పాత్రలు పోషించేది. ఆడపాత్రలే కాదు. మగపాత్రలు గూడా ధరించేది.

5. చిందు భాగవతులు జీవనం ఎలా గడిపేవారు ?
జవాబు.
పాత రోజుల్లో భాగోత మాడితే ఏమంత ఆదాయం వచ్చేది కాదు. చాలా కష్టపడి బతుకీడ్చేవాళ్ళు. దసరాకు పెట్టెపూజ చేస్తారు. దీపావళి వెళ్ళాక ఊరూరూ తిరగటం మొదలు పెడతారు. సంక్రాంతి, శివరాత్రి దాక భాగోతాలు ఆడుతూనే ఉంటారు. మళ్ళీ వానాకాలం అప్పుడు ఇంటికొస్తారు. కొంతకాలం తెచ్చుకున్నదేదో తింటారు. లేకుంటే అప్పుతెచ్చుకుంటారు. కొంతమంది కూలికి పోతారు.

TS 8th Class Telugu ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

6. చిందు భాగోతానికి గుర్తింపు ఎలా వచ్చింది ?
జవాబు.
ప్రజలు చిందు భాగోతాన్ని ఆదరించి పోషించారు. కాని ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టించుకోలేదు. ఒకసారి నటరాజ రామకృష్ణ ఎల్లమ్మను పిలిచి చిందు పాడమన్నాడు. ఆయనకోసమని చెంచులక్ష్మి భాగోతం ఆడారు. ఆయన తన శాలువా తీసి ఎల్లమ్మకు కప్పాడు. చిందును గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాడు. ఎల్లమ్మ బృందాన్ని పరిచయం చేశాడు. అలా చిందు భాగోతానికి గుర్తింపు లభించింది.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. ఎల్లమ్మ చిన్నతనంలో చిందు భాగోతాల ప్రదర్శనల ఏర్పాట్లు ఎలా జరిగేవి ?
జవాబు.
భాగోతంలో ముందుగా అంబకీర్తన పాడి ఆట మొదలు పెడతారు. ముందు రంభ వేషం, వెనుక నుంచి గోపాల కృష్ణుని వేషం వస్తాయి.
“రంభా ఊర్వశులమమ్మా, మాయమ్మ” అని పాడుకుంటూ పిల్లలందర్నీ పరదా ముందు ఆడిస్తారు. అదే అంబ కీర్తన. అంటే ప్రార్థన అన్నమాట. ఇక ఆట మొదలౌతుంది. తెరవెనుక వేషాలు తయారయ్యేదాకా పిల్లలు చిన్నికృష్ణుడి పాట చిందేస్తూ ఉంటారు. పిల్లలకు ఆటనేర్పినట్టూ ఉంటుంది. ప్రజలను కూర్చోబెట్టిట్టూ ఉంటుంది. వేషాల తయారీ పూర్తవుతుంది. ఎక్కడ ఏ కొత్తపాట విన్నా పాడేస్తూ ఉండేది ఎల్లమ్మ. అసలు భాగోతం మొదలు పెట్టగానే ముందు గణపతి ప్రార్థన, తర్వాత సరస్వతీ ప్రార్థన చేసి ఆట మొదలు పెడతారు. ఇలా చుట్టు పక్కల ఊళ్ళల్లో గూడ ప్రదర్శనలిచ్చేవారు.

TS 8th Class Telugu ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

2. ఎల్లమ్మబృందం వారి చిందు భాగోతం ప్రత్యేకతలు తెల్పండి.
జవాబు.
ఎల్లమ్మ చిన్నప్పుడు మద్దెల తాళాలు గజ్జెలు మాత్రమే వాయిద్యాలుగా ఉండేవి. పూపూ అని ఊదే బుర్ర ఒకటుండేది. దాన్ని పుంగి అంటారు. ఈ పుంగిని ఆట మొదలైనప్పటి నుంచి చివరి వరకూ ఊదాలి. దీని కోసం ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. తెరముందు ఎవరివేషం ఐపోతే వారు వెనక్కొచ్చి ఊదుతుండేవారు. అందరికీ చేతనౌను. ఎండిన సొరకాయను తయారుచేసుకొని ఊదుకొనేవారు.

తరువాత తబల, హార్మోనియం, తాళం, గజ్జెలు ఉపయోగించేవారు. అవీ బృందంలో వాళ్ళే వాయిస్తారు. ప్రతివారికి వాయించటం వచ్చు. మరొక ప్రత్యేకత ఏమంటే వాళ్ళ భాగోతానికి తెరవెనుక పల్లవి ఉంటుంది. ‘తైతకథోం తకథోం’ అని ఆ పల్లవి పాడేవాళ్ళు అన్న తరువాతే తెరముందు పాత్ర చిందు మొదలు పెడుతుంది. బుడ్డర్ ఖాన్ వేషం హాస్యపాత్ర. అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది. భాగోతానికి అదే నిండుదనం ఇస్తుంది. ఎప్పుడైనా ఏ పాత్రైనా రాకపోతే బృందంలో వాళ్ళే సర్దుకుంటారు. ఇవి ఎల్లమ్మ బృందం చిందు విశేషాలు

పరిచిత గద్యభాగాలు

1. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

మాఊర్ల అందరికి సిన్నప్పటి నుండి భాగోతం నేర్పుతుండె. పెద్దోళ్లు నాకు నాలుగేండ్లు ఉండంగ నా ముఖంకు రంగు ఏసిండ్రు. బాలకృష్ణుని ఏషం గట్టిచ్చినరు. మావోల్లు పర్ద ఎనుక పాట పాడితే నేను పర్దముంగట ఎగిరిన. ఇగ అప్పటి నుండి మాతల్లి దండ్రులు యేషం ఏయించి నాచేయి పట్టుకపోయి తోలేసి ఎగురుమని అంటుండె. అట్ల నాకు భాగోతం ఆడుడు అలవాటు చేసినరు. నేను ఎనిమిదేండ్లప్పుడు బాలకృష్ణుని యేషం, తర్వాత రంభ యేషం కడుతుంటిని.

ప్రశ్నలు :

1. ఎల్లమ్మ ఎంత వయసులో మొదటిసారి భాగోతం ఆడింది ?
జవాబు.
నాలుగేళ్ళ వయసులో

2. ఆ ఊళ్ళో భాగోతం ఎప్పటి నుండి నేర్పేవారు ?
జవాబు.
చిన్న పిల్లలప్పటి నుండి

3. తల్లిదండ్రులు ఎల్లమ్మను ఏం చెయ్యమన్నారు ?
జవాబు.
చెయ్యి పట్టుకుని ప్రదర్శనలకు తీసుకెళ్ళి చిందు వెయమన్నారు.

TS 8th Class Telugu ఉపవాచకం 3rd Lesson చిందు ఎల్లమ్మ

4. ఎల్లమ్మ ఏఏ వేషాలు వేసింది ?
జవాబు.
బాలకృష్ణుడు, రంభ

5. ‘పర్ద’ అంటే ఏమిటి ?
జవాబు.
తెర

2. కింది పేరాను చదివి వాక్యాలలోని ఖాళీలు పూర్తిచేయండి.

మాకు అందరి కళారూపాలు నచ్చుతయి. హైదరాబాదుల కథల మల్లవ్వ ఉంటది. ఆమె కథలు మంచిగ చెపుతది… నాకు మనసౌతది. అది శారదకాల్లది.
ప్రజలు మమ్ముల ఎప్పటినుంచో బతికించుకుంటున్నరు గనీ, సర్కారుమాత్రం మమ్ములను నటరాజ రామకృష్ణవల్ల పట్టించుకున్నది. ఒకసారాయన చిందు పాడమని అన్నడు. ఆయనకోసమని చెంచులక్ష్మి భాగోతం ఆడినం. తన షాలువాతీసి నాకు కప్పిండు. సింధును సర్కారుకు గుర్తుజేసిండు ఆయన. మాకు సర్కారును సూపిచ్చిండు. ఈ సుట్టుపక్కల ఇసుంటి కళాకారులు లేరు. ‘చిందుల ఎల్లవ్వది సాగుతది ఇట్ల’ అంటారు. ఇతర కళాకారులు….దాసుడు (దాచిపెట్టడం) ఏంటికి ఉన్నది చెప్పాల….! ఇగ ఇట్లనే చెప్పుకుంట పోతం…. బతుకంతా…

1. హైదరాబాదుల కథల …………… ఉంటది.
2. సర్కారు మాత్రం మమ్ములను ………………. వల్ల పట్టించుకున్నది
3. ఆయన కోసమని …………… భాగోతం ఆడిన.
4. ఈ సుట్టుపక్కల ఇసుంటి …………… లేరు.
5. ఒకసారాయన …………… పాడమని అన్నడు.
జవాబు.
1. హైదరాబాదుల కథల మల్లవ్వ ఉంటది.
2. సర్కారు మాత్రం మమ్ములను నటరాజ రామకృష్ణ వల్ల పట్టించుకున్నది
3. ఆయన కోసమని చెంచులక్ష్మి భాగోతం ఆడిన.
4. ఈ సుట్టుపక్కల ఇసుంటి కళాకారులు లేరు.
5. ఒకసారాయన చిందు పాడమని అన్నడు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్ Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. కథకుడు ఎవరెవరికి వందనాలు చేశాడు ? ఎందుకు ?
జవాబు.
కథకుడు ముందుగా వీరులను కన్నతల్లి భారతమాతకు వందనాలు చేశాడు. తరువాత మహాత్మాగాంధీకి, జవహర్లాల్ నెహ్రూకు , సుభాష్ చంద్రబోసుకు, వల్లభాయ్ పటేలు ఇంకా అనేక స్వాతంత్ర్య సమర వీరులకు వందనాలు చేశాడు. ఎందుకంటే వారంతా భారతదేశపు బానిసత్వాన్ని తొలగించడానికి అనేక కష్టనష్టాల కోర్చినవారు. జైళ్ళకు వెళ్ళి, ప్రాణాలు బలి ఇచ్చి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టిన సత్పురుషులు. మహామహులు. జనవందితులు. పూజనీయులు.

2. కథకుడు ఎవరి కథను చెప్తానన్నాడు ?
జవాబు.
కథకుడు రామరావణయుద్ధమో, కౌరవ పాండవుల కథో, పూర్వరాజుల చరిత్రో చెప్పలేదు. మహాత్మాగాంధీకి ఎంతో ప్రియమైన భక్తుడు, దేశసేవకే అంకితమైనవాడు, పక్షపాత రహితుడు అయిన షోయబుల్లాఖాన్ కథను చెప్తానన్నాడు. దుర్మార్గులు రాక్షసులు ఐన రజాకార్లను, నిజాం రాజును వ్యతిరేకించినందుకు వారి దుర్మార్గానికి బలియై వారి చేత హత్య చేయబడిన షోయబుల్లాఖాన్ కథ చెప్తానన్నాడు.

TS 8th Class Telugu ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

3. షోయబుల్లాఖాన్ బాల్యవిశేషాలు తెల్పండి.
జవాబు.
షోయబుల్లాఖాన్ హైదరాబాదులో మానుకోట తాలూకాలో శుభ్రవాడు అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి హబీబుల్లాఖాన్. తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం పుట్టిచనిపోగా ఎనిమిదవ సంతానం షోయబుల్లాఖాన్. చిన్నప్పటి నుంచే ఎంతో తెలివితేటలు కలవాడు. దేశసేవే దేవునిసేవ అని నమ్మాడు. ప్రజలందరూ సహెూదరులని భావించాడు. అంత చిన్నతనంలోనే అంత గొప్ప భావాలు కలిగి ఉండటం ఆశ్చర్యకరం. అలా శుక్లపక్ష చంద్రునిలా వెలిగిపోతూ పెరిగి పెద్దవాడైనాడు. ఔజా అనే ఆమెను పెళ్ళిచేసుకున్నాడు.

4. హబీబుల్లా ఖానుకు గాంధీజీపై భక్తి భావం ఎలా కలిగింది ?
జవాబు.
ఒకసారి గాంధీజీ విజయవాడకు వెళుతున్నారు. దారిలో ఉన్న మానుకోట స్టేషన్లో హబీబుల్లాఖాన్ పోలీసు ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. బాపూజీని రెప్పవెయ్యకుండా చూశాడు. వెంటనే అత్యంత భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆయన దివ్యమంగళ విగ్రహం అతని కళ్ళల్లో నిండిపోయింది. అదే సమయంలో ఇంటిదగ్గర షోయబుల్లాఖాన్ పుట్టాడు. కుమారుడిలో తండ్రికి గాంధీజీ పోలికలే కనిపించాయి. ఎంతో సంతోషపడ్డాడు. అలా హబీబుల్లాఖాన్క గాంధీజీపై భక్తి భావం కలిగింది.

5. నిజాం రజాకార్లను షోయబుల్లాఖాన్ పైకి ఎందుకు, ఎలా ఉసి గొల్పాడు ?
జవాబు.
షోయబుల్లాఖాన్ తను పెట్టిన ఇమ్రోజ్ పత్రికలో జాతీయభావాలు, దేశభక్తి ప్రబోధించాడు. నిజాం చర్యలను ఖండించాడు. అందుకు కోపంతో నిజాం హిందూ-ముస్లిం తేడా లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారి ప్రాణాలు తీయమని, చేతులు నరకమని రజాకార్లను ఉసిగొల్పాడు. వారు ముందుగా షోయబ్ను హెచ్చరించారు. కాని ప్రయోజనం లేదు. షోయబు బెదరలేదు. చంపుతామని బెదిరించారు. ఐనా అతడు లొంగలేదు. అలా చివరికి వాళ్ళచేతిలో హతమైపోయాడు.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. షోయబుల్లాఖాన్ను రజాకార్లు అంతం చేసిన విధం తెల్పండి. (లేదా)
జవాబు.
షోయబుల్లాఖాన్ పట్ల నిజాం ప్రభుత్వం వ్యవహరించిన తీరు తెల్పండి.
హైదరాబాదు ప్రభుత్వం మత ప్రేరణచేస్తూ రజాకార్లు అనే దుర్మార్గులను పోషించేది. వాళ్ళు రాష్ట్రమంతా అరాచకాలు సృష్టిస్తున్నారు. షోయబుల్లాఖాన్ తాజ్వీ అనే ఉర్దూ పత్రిక ద్వారా వారి అన్యాయాలను ఖండించాడు. ప్రభుత్వం ఆ పత్రికను నిలిపివేసింది. షోయబు ‘ఇమ్రోజ్’ అనే దినపత్రికను ప్రారంభించి ప్రజలలో జాతీయ భావాలను నింపుతూ ప్రభుత్వాన్ని విమర్శించాడు.

ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు కలిగించినా షోయబు భయపడలేదు. ఖాసింరజ్వీ తన సైన్యాన్ని పిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినవారు హిందువైనా ముస్లిమైనా సరే వారి ప్రాణాలు తియ్యమని ఆదేశించాడు. రజాకార్లు హెచ్చరిక ఉత్తరాలెన్నో రాశారు. షోయబు భయపడలేదు. “నీవు గాంధీ కొడుకువా ? డొక్క చీల్చేస్తాం” అంటూ ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది.

షోయబు పట్టించుకోలేదు. ఒకనాడు రాత్రి “నేటి భావాలు” అనే వ్యాసం రాసి, ఆ చీకట్లో దగ్గరలోనే ఉన్న తన ఇంటికి వెళుతున్నాడు షోయబు. రజాకార్లు వేట కుక్కల్లాగా వెంట తరిమి అతని చేతులు నరికేశారు. తుపాకులతో కాల్చి చంపేశారు. అలా ఆ స్వాతంత్ర్య వీరుణ్ణి అంతం చేశారు.

TS 8th Class Telugu ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

2. రజాకార్ల చేతికి చిక్కిన షోయబుల్లాఖాన్ చనిపోయేముందు జరిగిన విషయాలు వివరించండి.
జవాబు.
చీకట్లో ఇంటికి వెళ్తున్న షోయబుల్లాఖాన్ ను రజాకార్లు తుపాకీ గుండ్లతో పేల్చారు. ఇమ్రోజ్ పత్రికను తీర్చిదిద్దిన చేతిని నరికేశారు. షోయబు బావమరిది వెనక నుండి కేకలు వేస్తూ వచ్చాడు. ఆయనకు కూడా గుండు దెబ్బతగిలింది. ఆయన రెండు చేతులు మణికట్టుదాకా నరికారు. బాధతో అరిచేసరికి జనమంతా పోగయ్యారు. రజాకార్లు పారిపోయారు. షోయబు భార్య, తల్లిదండ్రులు అతని మీదబడి కన్నీరు మున్నీరుగా ఏడ్చారు.

స్నేహితులంతా అక్కడికి చేరుకున్నారు. షోయబు శరీరం నుంచి రక్తంధారలు కారిపోతున్నాయి. స్పృహతప్పక ముందే తన వారిని కళ్ళారా చూసుకున్నాడు. నువ్వెందుకు అరవలేదని భార్య అడిగింది. అరిస్తే పిరికితనమౌతుంది. వీరుడిగా చనిపోతే స్వర్గం లభిస్తుంది. ఇదే అహింసా సిద్ధాంతం అన్నాడు షోయబు.

తల్లిని చూసి ‘అమ్మా! వీరుడిగా మరణిస్తున్నాను. నీవు వీరమాతవు. నా భార్య వీరపత్ని. నిండుచూలాలైన నా భార్య వీరమాత కావాలి. మీరు నా కోసం ఏడవకండి. నా ధైర్యం కోల్పోతున్నాను. నా వీర మరణానికి గర్వపడతానని నువ్వు మాట ఇచ్చావు కదమ్మా! ఏడవొద్దు” అని పలుకుతూ ప్రాణాలు వదిలాడు. షోయబుల్లాఖాన్ అమరజీవి అయ్యాడు.

3. నిజాం రాజులు మరియు పెట్టుబడిదారుల నుండి ప్రజలకు విముక్తి కలిగించి చైతన్యవంతులను చేయుటకు నాయకులు చేసిన కృషి ఎట్టిది ?
జవాబు.

  1. నాయకులు ఎన్నో కష్టనష్టాల కోర్చారు.
  2. పక్షపాత రహితులై దేశసేవ చేశారు.
  3. దుర్మార్గంగా, రాక్షసంగా ఉన్నవారిని ఎదిరించారు.
  4. తెలివితేటలతో వ్యవహరించి అందరిలో ఐక్యత తెచ్చారు.
  5. దేశసేవే దేవుని సేవగా భావించారు.
  6. వీరుల పట్ల, దేశభక్తుల పట్ల పూజ్యభావం కలిగి ఉన్నారు.
  7. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. పత్రికలు కూడా నడిపారు.
  8. చంపుతామని బెదిరించినా భయపడకుండా ఉద్యమం కొనసాగించారు.
  9. అహింసా సిద్ధాంతాన్ని నమ్మారు.
  10. వీరమరణానికే సిద్ధపడ్డారు కానీ విప్లవంలో వెనుకంజవెయ్యలేదు. వెనుదిరిగి పోలేదు.

నిజాం రాజుల నిరంకుశత్వం, పెట్టుబడిదారులు దోపిడీలను చూసి ప్రజలకు విముక్తిని కలిగించి చైతన్యవంతులను చేయటానికి నాయకులు ఎంతగానో కృషి చేశారు.

TS 8th Class Telugu ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

4. షోయబుల్లాఖాన్ జీవిత విశేషాలను పొందుపరచండి.
జవాబు.
షోయబుల్లాఖాన్ హబీబుల్లాఖాన్ దంపతులకు ఎనిమిదవ సంతానంగా హైదరాబాదు మానుకోట తాలూకాలో శుభ్రవాడు అనే గ్రామంలో జన్మించాడు. చిన్నతనం నుంచే గాంధీజీ సిద్ధాంతాలు అతనిని ఆకట్టుకున్నాయి. ఆయనకు పరమభక్తుడైనాడు. దేశసేవే దేవునిసేవ అనీ, మానవులంతా సోదరులనీ నమ్మినవాడు. అతని భార్య ఔజా. ఏ ప్రలోభాలకూ లొంగకుండా ప్రజాక్షేమం కోరుతూ సత్యం, అహింసలను ప్రచారం చేశాడు.

హైదరాబాదు ప్రభుత్వం రజాకార్లు అనే దుష్టశక్తులను పోషిస్తూ మతప్రేరణ చేస్తుంటే రజాకార్లు ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. తాజ్వీ అనే ఉర్దూ పత్రిక ద్వారా షోయబు ఆ అకృత్యాలను ఖండించాడు. ఆ పత్రిక నిలిపి వేస్తే తానే ఇమ్రోజు అనే పత్రిక స్థాపించి నిర్భయంగా నిష్పక్షపాతంగా నిజాలు ప్రకటించ సాగాడు. ప్రభుత్వం ఈర్ష్యతో ఎన్నో ఆటంకాలు కలిగించింది. అయినా షోయబు తన ప్రయత్నం విరమించలేదు.

అకస్మాత్తుగా జరిగిన గాంధీజీ అకాల మరణానికి క్రుంగిపోయాడు. పదినెలల నుండి షోయబు రాసిన సంపాదకీయాలు ప్రభుత్వాన్ని, సంఘ వ్యతిరేక శక్తులను గడగడ లాడించాయి. ప్రభుత్వం రజాకార్లను అతనిపైకి ఉసిగొల్పింది. వారు కొన్ని హెచ్చరికలు చేసి చివరకు ఒక రాత్రి అతను పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా తుపాకులు పేల్చి చేయి నరికేశారు. అడ్డువచ్చిన బావమరిదిని కూడా అంతం చేశారు. అలా తాను నమ్మిన సిద్ధాంతాలను విడిచిపెట్టకుండా ప్రభుత్వంతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు. అమరజీవి అయ్యాడు షోయబుల్లాఖాన్.

పరిచిత గద్యభాగాలు

1. కింది అంశమును చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

షోయబుల్లాఖానుకు అదివరకే ఈ నిశాచరులు తన ప్రవర్తనను మార్చుకొమ్మని జాబులు రాశారు. అట్లు మార్చుకొనకుండినచో ప్రాణములు దక్కవని యెన్నో తీర్ల బెదరించినారు. అయినప్పటికిని సత్యమునకు పాటుపడ్డ మన షోయబు యా బెదిరింపులకు జంకలేదు. తనను ఇంచుకైనను మార్చుకోలేదు. ఇట్లుండ 20-08-1948 నాడు ఒక పేరు వూరులేని ఉత్తరం ఒకటి వచ్చింది. అందులో “నీవు గాంధీ కొడుకువా” జాగ్రత్త డొక్క చీల్చి వేస్తాం. ఇదివరకీలాటివెన్నో ఉత్తరాలు రాలేదా! అనుకొన్నాడు. తన పత్రికాలయములో కాంగ్రెసు నాయకులు రామకృష్ణారావు. రంగారెడ్డి మొదలగు షోయబు మిత్రులు యా బెదరింపు ఉత్తరములను గూర్చి చర్చించారు. శ్రీయుత రామకృష్ణారావుగారు షోయబు నామాట నీవు తప్పుగా భావించవద్దు, ఎందుకంటే రాక్షస రజాకార్లు నీ మీద కక్ష పెంచుకున్నారు. ఎప్పుడైనా ఏమైనా జరుగవచ్చు. నీవు జాగ్రత్తగా ఉండుము అని చెప్పినప్పటికిన్ని షోయబ్ తన విశ్వాసమును విడవలేదు.

ప్రశ్నలు :

1. నిశాచరులు షోయబును ఏమని బెదిరించారు ?
జవాబు.
నిశాచరులు షోయబును అతని ప్రవర్తన మార్చుకోమని, లేకపోతే ప్రాణాలు తీస్తామని బెదిరించారు.

2. ఉత్తరంలో ఏమని రాసుంది ?
జవాబు.
ఉత్తరంలో “నీవు గాంధీ కొడుకువా ? జాగ్తత్త డొక్క చీల్చేస్తాం” అని రాసుంది.

3. ఆ నిశాచరులు ఎవరు ?
జవాబు.
ఆ సిశాచరులు రజాకార్లు.

4. ఈ పేరాలో చెప్పిన షోయబు మిత్రులెవరు ?
జవాబు.
కాంగగగసు నాయకులు రామకృష్ణారావు, రంగారెడ్డి మొదలైనవారు.

TS 8th Class Telugu ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

5. మిత్రులు షోయబుకు ఏమని నచ్చచెప్పారు ?
జవాబు.
మిత్రులు షోయబును జాగగత్తగా ఉండమని, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చని హెచ్చరించారు.

2. ఈ కింది వాక్యాలను కథా క్రమంలో అమర్చండి.

షోయబు కుడిచేతిని దుండగులు నరికివేశారు.
షోయబుల్లాఖాన్ ను తుపాకులతో ఢాంఢాంఢాం అని కాల్చినారు. రెండు చేతులు మణికట్టు వరకు తీశారు.
ఆయనకు కూడా గుండు దెబ్బతగిలింది.
షోయబు బావమరిది వెనుకాల నుండి వస్తూ అరిచాడు.
జవాబు.

  1. షోయబుల్లాఖాన్ను తుపాకులతో ఢాం ఢాం ఢాం అని కాల్చినారు.
  2. షోయబు కుడి చేతిని దుండగులు నరికివేశారు.
  3. షోయబు బావమరిది వెనుకాల నుండి వస్తూ అరిచాడు.
  4. ఆయనకు కూడా గుండు దెబ్బ తగిలింది.
  5. రెండు చేతులు మణికట్లు వరకు తీశారు.

3. కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు రాయండి.

ఇట్లుండగా మహాత్ముడి అకాలమరణవార్త అకస్మాత్తుగా షోయబు విన్నాడు. నిర్ఘాంతపడ్డాడు. ఇంట తనగదిలో వెక్కివెక్కి యేడుస్తున్నాడు. బలమైన అతని శరీరం దుఃఖావేశంతో వణికి పోవుచున్నది. నోరు పెకలటం లేదాతనికి. ఇంతలో తన తల్లి వచ్చి నాయన ఏడవకుము. ఆయన మహాత్ముడు అతనికి అంతా సమానమే. చావుబ్రతుకుల్లో ఆయనకు భేదం లేదు. హిందూ, ముస్లింలలో సోదర భావాన్ని పెంపొందించుటకై ఆయన మహోత్కృష్టమైన సేవ జేశాడు. నీవు దుఃఖించుట మానుము. నాయనా ? ఏది ఒకసారి నవ్వుము. అని దీనంగా బ్రతిమాలుతున్న తన తల్లిని జూసి షోయబుల్లాఖానుడు అమ్మా! రేపు నీకొడుకు స్వాతంత్య్రము కొరకు బలైతే నీవు దుఃఖించవా యని యడిగినాడు.
జవాబు.
1. షోయబు ఏ వార్త విన్నాడు ?
2. గాంధీజీ ఎవరిలో సోదరభావం పెంచాడు ?
3. మహాత్ముడు వేదిని సమానంగా చూస్తాడు ?
4. ఔోయబు తల్లిని ఏమడిగాడు ?
5. ఈ పేరాలో ఉన్న పాత్రలేవి ?

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 1st Lesson చిత్రగ్రీవం Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson చిత్రగ్రీవం

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. చిత్రగ్రీవాన్ని గురించి మీకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు ఏవి ?
జవాబు.
నాకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు : గుడ్డు బద్దలుగొట్టి తల్లిపక్షి పిల్లపక్షిని ఈ ప్రపంచంలోకి తీసుకురావడం, పిల్లపక్షి నోటికి తల్లిపక్షి ధాన్యపు గింజల పాలను, తన కంఠంలో మెత్తబరచిన ఆహారాన్ని అందించి పెంచడం నాకు ఆశ్చర్యం కలిగించింది, మనుషుల్లాగానే మెత్తని గూడు అమర్చడం, తల్లిపక్షి పిల్లలకు పిల్లపక్షి ఏపుగా ఎదిగాక పసువు కలిసిన తెలుపు రంగులోకి మారడం, దుమ్ము ధూళి నుంచి ఎండ తీక్షణత నుంచి కళ్ళను కాపాడడానికి పక్షులకు ఉండే తెల్లని పొరలు నాకు ఆశ్చర్యం కలిగించిన అంశాలు.

2. మానవులను పావురాలకు మిత్రులూ, సహచరులని రచయిత ఎందుకు అన్నాడు ?
జవాబు.
కలిసి మెలిసి ఎగురుతూ ఆకాశంలో గుంపులు గుంపులుగా తిరిగే పెంపుడు పావురాలు అన్నీ గంటల తరబడి ఎంత దూరం ఎగిరినా చివరికి తమ తమ ఇళ్ళకూ, గూళ్ళకూ ఖచ్చితంగా చేరుకొంటాయి. పావురాలకు ఉన్న అద్భుతమైన దిశాపరిజ్ఞానం వల్ల తమ యజమానుల పట్ల వాటికి ఉన్న మిక్కిలి విశ్వాసం వల్లా అవి తమ గూళ్ళకు చేరుకోగలుగుతాయి. అందువల్లనే మానవులను పావురాలకు మిత్రులూ, సహచరులూ అని రచయిత అన్నాడు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

3. చిత్రగ్రీవం తండ్రిపక్షి గురించి రాయండి.
జవాబు.
జాతి పావురం : చిత్రగ్రీవం తండ్రిపక్షి ఒక గిరికీల మొనగాడు. అంటే ప్రసిద్ధ జాతి పావురం. తండ్రిపక్షి నుండి వేగం, చురుకుదనం, సాహసం పిల్లపక్షి సంతరించుకున్నది.

గుడ్డుల రక్షణ : రచయిత గుడ్లున్న గూడును శుభ్రం చేస్తున్నప్పుడు వాటిని నాశనం చేస్తున్నాడేమో అనే భయంతో పొరబాటున అతని మీద దాడి చేసింది. ఒక గుడ్డు చెయ్యి జారి నేలపాలు కావడానికి కారణమైంది. పొదగడం : గుడ్లను పొదగడంలో మూడింట రెండు వంతులు పాత్ర తల్లి పక్షిదైతే మూడవ వంతు పాత్ర తండ్రి పక్షిదే. పెంపకం : ఆహారపు గింజల్ని సంపాదించి వాటిని కంఠంలో మెత్తబరిచి బిడ్డలకు అందించి పోషించడంలో తల్లి తండ్రి పక్షులు రెండూ పాలుపంచుకుంటాయి. పిల్లలకు సౌఖ్యం కోసం గూడును మెత్తగా అమరుస్తాయి.

బిడ్డకు శిక్షణ : రెక్కలు వచ్చిన పిల్ల పావురానికి తండ్రి పక్షే ఎగరడం నేర్పించింది. బలవంతంగా మేడమీద నుంచి కిందికి జారేటట్టు చేసిన పిల్లపక్షి రెక్కలకు పని చెప్పింది.

4. చిత్రగ్రీవం తల్లిపక్షి గురించి రాయండి.
జవాబు.
తల్లిపక్షి చాలా అందమైనది. అది వార్తల పావురం. అది గూటిలో గుడ్లు పెట్టి పొదుగుతుంది. మూడింట రెండు వంతులు పొదగడం తల్లి పనే. అప్పుడప్పుడు తండ్రి పక్షి పొదుగుతుంది. సమయమైన తరువాత గుడ్డు పగులగొట్టి పిల్లను జాగ్రత్తగా బయటికి తీసి సంరక్షిస్తుంది. ఆహారం తినడం, ఎగరడం నేర్పుతుంది. పిల్లకు రెక్కలొచ్చే వరకూ కావలసినంత వెచ్చదనాన్ని ఇస్తుంది. గూటిని సౌకర్యవంతంగా ఉంచుతుంది.

5. పావురం గుడ్డు విషయంలో కథకుడు చేసిన తప్పిదం తెలపండి.
జవాబు.
ఒకనాడు కథకుడు తల్లిపావురం గుడ్లను పొదుగుతున్న గూటిని శుభ్రం చేద్దామని వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా పావురం
గుడ్లను పక్కగూటిలో పెట్టి దాని గూడు శుభ్రంచేసి మళ్ళీ యథాస్థానంలో పెడుతున్నాడు. ఒక గుడ్డు పెట్టి రెండవ గుడ్డు పెట్టబోతుండగా తండ్రిపావురం అతనిపై దాడి చేసింది. దాని దాడిని తట్టుకోడానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. ఈ కంగారులో ఆ రెండో గుడ్డు చెయ్యి జారి కిందపడి పగిలిపోయింది. ఇదే అతను చేసిన తప్పిదం. తల్లిపావురం పెట్టిన గుడ్లలో ఒకదాన్ని జారవిడిచి పగలగొట్టినందుకు సిగ్గుపడుతూ, బాధపడుతూ ఉంటాడు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

6. గుడ్డు నుంచి చిత్రగ్రీవం బయటికి వచ్చిన విధం తెలపండి.
జవాబు.
ఇరవై రోజులు గుడ్డును పొదిగిన తరువాత ఇరవైఒకటవరోజు తల్లి దాని ప్రక్కనే జాగ్రత్తగా గమనించుకుంటూ తిరుగుతోంది. తండ్రిపక్షి గూటిలోకి రాబోతే దూరంగా తరిమేసింది. సుమారు రెండు గంటల తరువాత గుడ్డులోనించి పిల్ల కదులుతున్న శబ్దాలు కాబోలు విన్నది తల్లి. చాలా జాగ్రత్తగా గుడ్డును పరిశీలించి చూసి రెండేసార్లు ముక్కుతో కొట్టి గుడ్డును పగలగొట్టింది. పిల్లపక్షి బయటపడింది. తల్లిపక్షి పిల్లను రెక్కల కింద పొదువుకున్నది.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

1. చిత్రగ్రీవాన్ని గురించి మీ సొంత మాటల్లో వర్ణించండి.
జవాబు.
పరిచయం : ‘చిత్రగ్రీవం’ ధనగోపాల్ ముఖర్జీ రచించిన ఒక కథ. చిత్రగ్రీవం ఒక పెంపుడు పావురం. తల్లిదండ్రులు : చిత్రగ్రీవం తల్లి ఒక వార్తల పావురం. తండ్రి ఒక గిరికీల మొనగాడు. రెండూ విశిష్టమైనవి కావడం వల్ల చిత్రగ్రీవం ఎంతో సుందరంగా ఉండేది. అంతేగాక తల్లి నుండి తెలివితేటలు, తండ్రి నుంచి వేగం, చురుకుదనం, సాహసం సంతరించుకున్నది. అందువల్లే యుద్ధ రంగాల్లోనూ శాంతి సమయాల్లోనూ అమోఘంగా పని చేయగల వార్తాహరియైన పావురంగా రూపొందింది.

సంరక్షణ : తల్లితో సరిసమానంగా తండ్రి కూడా చిత్రగ్రీవం బాగోగులు చూడడంలోనూ, ఆహారం అందించడంలోనూ పాలుపంచుకున్నది. తల్లిదండ్రుల శ్రద్ధ పుణ్యమా అని చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది. గులాబీ రంగుతో మెరిసే పిల్ల పసుపు కలిసిన తెలుపు రంగులోకి మారింది.

సామర్థ్యం : మూడు వారాల వయసులో ఆహారం అనుకొని చీమను పొడిచి చంపింది. ఐదో వారానికల్లా గెంతుతూ జరగడం నేర్పింది. మరో రెండు వారాల్లో ఎగరడం నేర్చుకొన్నది. తల్లిదండ్రుల రక్షణ, శిక్షణలలో ఆకాశంలో విహరించే విద్య తెలుసుకోగలిగింది.

ముగింపు : ఈ విధంగా చిత్రగ్రీవం తల్లిదండ్రుల గొప్పది లక్షణాలను పుణికి పుచ్చుకొని వారి సంరక్షణలో పెరిగి పెద్దదై వారి శిక్షణ సాయాలతో స్వీయ సామర్థ్యాన్ని పెంపొందించుకున్నది.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

2. శిశువుల పెంపకంలో పక్షులకు, మానవులకు మధ్య ఉన్న సామ్యాలను రాయండి.
జవాబు.
గుడ్డు పొదగడం : పక్షులు గుడ్డు దశలో ఉన్నప్పుడు తండ్రిపక్షి, తల్లిపక్షి పరిణత దశకోసం పొదుగుతాయి. కంటి రెప్పలా కాపాడుతాయి. ఇవి మనుషుల గర్భస్థ శిశువును సంరక్షించుకొనే పద్ధతుల లాగానే ఉంటాయి.

ఆలనా పాలన : మనం చిన్న పిల్లల్ని ఎత్తుకొని లాలిస్తే ఆ పిల్లలకు ఎలాంటి హాయీ సౌఖ్యము లభిస్తాయో పక్షులకు తమ తండ్రిపక్షి, తల్లిపక్షుల నుంచి అలాంటి వెచ్చదనం లభిస్తుంది. తల్లిపక్షి, తండ్రిపక్షి పిల్లపక్షి సుఖ సౌకర్యాల కోసం గూడులో తగిన రీతిలో అమర్చుతాయి. ఈ ఏర్పాటు పసిపిల్లలకు ఏర్పాటు చేసే మెత్తని గుడ్డల బొంతల వంటిది.

పోషణ : పెద్ద పక్షులు తాము సంపాదించిన ధాన్యపు గింజల నుంచి తయారు చేసిన పాలను పిల్ల పక్షుల నోళ్ళలో పోస్తాయి. అంతేగాక గింజల్ని, విత్తనాల్ని తమ కంఠంలో నానబెట్టి మెత్తబరిచాకే పిల్లపక్షులకు అందిస్తాయి. ఇది పళ్ళు రాని బోసి నోటి పెసిపిల్లలకు పెట్టే గుజ్జన గూళ్ళను పోలినదే.

శిక్షణ : పొడవడం, గెంతడం, ఎగరడం నేర్పిన పిల్లపక్షికి తండ్రిపక్షి ఆకాశంలో ఎగరడంలో శిక్షణ ఇస్తుంది. పిల్లపక్షికి ధైర్యం చెప్పేటందుకు తల్లిపక్షి తాను కూడా ఎగిరి సాయం చేస్తుంది. విద్యాభ్యాస దశలో పిల్లలకు తల్లిదండ్రుల నుంచి లభించే ప్రోత్సాహం, ధైర్యం ఇటువంటివే.

3. పశుపక్షులు తమ సంతానాన్ని పెంచే విధానాన్ని సొంతమాటల్లో వివరించండి.
జవాబు.
పశుపక్షులు తమ సంతానాన్ని పెంచే విధానం కూడా మనుషులు తమ బిడ్డలను పెంచే విధానంలాగానే ఉంటుంది. పశువులు కడుపులో మోసిన బిడ్డలను నెలలు నిండాక కంటాయి. పక్షులు మాత్రం గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఆడపక్షితో పాటు మగపక్షి కూడా పొదుగుతుంది. కానీ గుడ్డును ఎప్పుడు ఎలా పగల గొట్టాలో ఆడపక్షికి మాత్రమే తెలుస్తుంది. పశుపక్షులు కూడా తమ పిల్లల ఆలనాపాలన కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటాయి. పశువులు తమ బిడ్డలను సాధ్యమైనంత వరకూ మెత్తని ప్రదేశంలో ఉండేటట్లు చూస్తాయి.

పక్షులైతే తమ పిల్లల కోసం గూళ్ళలోని మెత్తని పక్కలు ఏర్పాటు చేస్తాయి. పశువులు తమ పిల్లలకు పుట్టిన నాటి నుంచే పాలిచ్చి పోషిస్తాయి. పక్షులు మాత్రం తమ కంఠంలో నానబెట్టిన గింజల నుంచి వచ్చే పాలను బిడ్డల గొంతులో పోసి పోషిస్తాయి. పక్షుల పిల్లలు ఎగరడం, గెంతడం అవే నేర్చుకుంటాయి. ఆహారం సంపాదించడం, ప్రాణాలను రక్షించుకోవడం మాత్రం తల్లిదండ్రులను చూసి అలవాటు చేసుకుంటాయి. రెక్కలు వచ్చిన పిల్ల పక్షులకు ఆకాశంలో ఎగరడంలో మెలకువలు నేర్పుతాయి.

4. ఇంట్లో చాలామంది పావురాలను పెంచుకుంటారు కదా ? వారు పొందే అనుభూతిని సొంతమాటల్లో రాయండి.
జవాబు.
పావురాలు చాలా అందంగా ముద్దుముద్దుగా ఉంటాయి. అందుకే కొంతమంది పావురాలను ఇళ్ళలో పెంచుకొంటూ, వాటి పెంపకంలో ఆనందాన్ని పొందుతుంటారు. అవి గుంపులు గుంపులుగా ఎగురుతుంటే చాలా అందంగా ఉండి ఆనందాన్ని కలిగిస్తుంటాయి. మన ప్రాంతంలో కనబడే పావురాలు బూడిద రంగులో బొద్దుగా ఉంటాయి. పావురాలను కొందరు తమ పిల్లల్లాగా అల్లారుముద్దుగా పెంచుకొంటారు. వాటికి కావలసిన ధాన్యపుగింజలు వేస్తూ అవి తినే విధానాన్ని చూసి ఆనందిస్తుంటారు. పావురాలు గుడ్లుపెట్టి, పొదిగి, పిల్లల్ని చేసి, వాటిని జాగ్రత్తగా పెంచే విధానం, ఆ పిల్లలకు ఆహారాన్ని పెట్టే విధానం ఆశ్చర్యం కలిగిస్తుంది.

పావురాల యొక్క కువకువ ధ్వనులు ఎంతో శ్రావ్యంగా ఉంటాయి. ఇళ్ళకు సమీపంలో ఉన్న దేవాలయాల గోపురాల గూళ్ళలో దూరి అవి చేసే హావభావాలు చూసి యజమానితో పాటు, వాటిని చూసిన వారందరూ ఆనందాన్ని పొందుతుంటారు. ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు గోపురాలలో పావురాలు, చిలుకలు చేసే ధ్వనులను చక్కగా వర్ణించారు. పావురాలను, ఇతర పక్షులను పెంచుకోవడం అంటే జీవావరణాన్ని పరిరక్షించడమే. మానవతాదృక్పథంతో వాటిని ఆదరించడమే.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

5. చిత్రగ్రీవం ఎగరడం ఎలా నేర్చుకున్నది ?
జవాబు.
కథకుడు చిత్రగ్రీవాన్ని రోజూ మేడ మీద పిట్టగోడమీద వదిలేవాడు. ఒకనాడు కొన్ని గింజలు నేలమీద వదిలి దాన్ని తినడానికి పిలిచాడు. చాలాసేపటి తర్వాత అతికష్టం మీద అది కిందికి దూకింది. గింజలమీద బాలెన్సు చేసుకొనే భాగంగా అప్రయత్నంగా, హఠాత్తుగా దాని రెక్కలు విప్పుకున్నాయి. కథకుడు చిత్రగ్రీవాన్ని రోజూ మణికట్టు మీద ఉంచుకొని చేతిని పైకీ కిందికీ పదేపదే కదిపేవాడు. అలా కదిపినప్పుడు చిత్రగ్రీవం బాలెన్సు నిలదొక్కుకోవడం కోసం రెక్కలు విప్పడం, ముడవడం చేసేది.

ఒకనాడు తండ్రిపక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పే పని చేపట్టింది. దాన్ని పిట్టగోడ మీద తరుముకుంటూ వెళ్ళి కిందికి తోసి దానిపైనే ఎగురుతూపోయింది. జారిన చిత్రగ్రీవం తన్ను తాను రక్షించుకోడానికి రెక్కలు విప్పి గాలిలో తేలింది. తల్లిపక్షి కూడా వచ్చి సాయంగా ఎగిరింది. అలా ముగ్గురూ పది నిమిషాలు ఎగిరి కిందికి వచ్చి వాలాయి. నేల తాకేటప్పుడు చిత్రగ్రీవం కంగారు పడింది. కొంచెంగా దెబ్బ తగిలింది. కాని ఎగరడం వచ్చేసింది.

6. ‘చిత్రగ్రీవం’ పాఠంలోని బాలుని స్థానంలో నీవుంటే ఏమి చేస్తావో వివరించండి.
జవాబు.
సాధారణంగా పక్షులు గుడ్లు పొదిగేటప్పుడు వాటి జోలికి వెళ్ళకూడదనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే మా యింటి దగ్గర చింతచెట్టు ఉంది. చింతకాయలు కోద్దామని చెట్టు ఎక్కాను. దాని మీద కాకిగూడు ఉంది. దాంట్లో చిన్న చిన్న కాకి పిల్లలు ఉన్నాయి. అయినా నేను వాటి జోలికి వెళ్ళలేదు. చింతకాయలు కొన్ని కోసుకొని చెట్టు దిగుతుండగా కాకులు నన్ను చూశాయి. అవి వచ్చి నను కాళ్ళతో తన్నుతూ ముక్కుతో పొడిచాయి. ఈ విధంగా కాకులు నన్ను వదలకుండా హింసించాయి. దాంతో చాలా భయం వేసింది.

చిత్రగ్రీవం పాఠంలో బాలుని స్థానంలో నేను గనుక ఉంటే – పావురాల గూటి దగ్గరకు వెళ్ళేవాణ్ణికాదు. దాని గూడు శుభ్రం చేయడం, తండ్రి పావురంతో పొడిపించుకోవడం, గుడ్డు జారవిడవడం వంటివి చేసేవాణ్ణికాదు. కాకులతో ఒకసారి దెబ్బతిన్నాను కాబట్టి ఆ బాలుడి లాగా అటువంటి పని చేయలేను. పక్షుల ప్రవర్తనలన్నీ ఒకేమాదిరిగా ఉంటాయని భావించాను.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

7. పాఠం ఆధారంగా పావురాల జీవన విధానాన్ని రాయండి.
జవాబు.
పావురాలు రకరకాల రంగుల్లో ఉంటాయి. మన ప్రాంతంలో పావురాలు దాదాపు బూడిదరంగులో ఉంటాయి. తల్లిపావురం గుడ్డు పెట్టి పొదిగి పిల్లల్ని చేస్తుంది. మెత్తని గూళ్ళలో పిల్లల్ని పెట్టి రక్షిస్తూ పెంచుతుంటాయి. మెత్తని పాలతో నిండిన ధాన్యపు గింజల్ని వాటికి ఆహారంగా అందిస్తాయి. మనుషులలాగానే పిల్లల్ని పెంచడంలో జాగ్రత్తలు తీసుకుంటాయి. పావురాలు గుంపుగుంపులుగా ఆహారం కోసం ఎగిరి వెళతాయి.

మళ్ళీ తిరిగి తమ గూళ్ళకు చేరుకుంటాయి. అన్నీ కలిసిమెలిసి జీవిస్తుంటాయి. పావురాలకున్న దిశాపరిజ్ఞానం చాలా గొప్పది. పూర్వం పావురాల ద్వారానే వార్తలు అందించే వారనే సంగతులు మనకు తెలుసు. పెంపుడు పావురాలకైతే యజమానుల పట్ల ప్రేమ, గౌరవం ఎక్కువ. పావురాల పిల్లలు తల్లి నుండి తెలివితేటలు, తండ్రి నుండి వేగం, చురుకుదనం, సాహసం నేర్చుకుంటాయి. పావురాలు తమ పిల్లలకు మాటలు నేర్పుతాయి. ఎగరడానికి తగిన శిక్షణ ఇస్తాయి. ఈ విధంగా పావురాల జీవనవిధానం చక్కగా సాగుతుంది.

8. చిత్రగ్రీవం ఎదగడంలో వెనకబడడానికి కారణాలు ఏమై ఉంటాయి ?
(లేదా)
చిత్రగ్రీవం ఎదిగిన క్రమాన్ని వివరించండి.
జవాబు.
పరిచయం : ధనగోపాల్ ముఖర్జీ రచించిన చిత్రగ్రీవం కథలో చిత్రగ్రీవం అనే పిల్లపావురానికి ఉన్న ప్రత్యేక లక్షణాలను మనోహరంగా వర్ణించారు. తన దగ్గర ఉన్న పావురాలలో చిత్రగ్రీవం సుందరమైనది. అయినా అది ఎదగడంలో అన్నింటికంటే మందకొడి అని రచయిత వర్ణించారు.

ఇంద్రధనుస్సు లాంటి ఈకలు : చిత్రగ్రీవానికి ఈకలు బూడిరంగు కలిసిన నీలి వర్ణంతోనే ఉండేవి. తరువాత శరీరమంతా ఈకలు పెరిగాక దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు ఈకలతో ధగధగా మెరిసిపోయింది. దాని మెడప్రాంతం సూర్యకాంతిలో ఇంద్రధనుస్సు, రంగుల పూసల గొలుసులా శోభిల్లింది. ఎదిగేటప్పుడు కొన్ని జీవులకు సహజంగానే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండడమే దీనికి కారణం.

ఆహార సంపాదన : చిత్రగ్రీవం ఐదో వారానికల్లా గెంతడం నేర్చుకున్నా ఆహార సంపాదన విషయంలో మాత్రం ఇంకా తల్లిదండ్రుల మీదనే ఆధారపడ్డది. ఈ మందకొడితనానికి దాని సహజలక్షణమే కారణం.

ముగింపు : ఈ విధంగా చిత్రగ్రీవం ఎదగడంలో వెనకబడిపోవడానికి దాని సహజ లక్షణాలు, శిక్షణ అందివ్వకపోవడమే కారణాలుగా చెప్పవచ్చు.

పరిచిత గద్యభాగాలు

1. కింది గద్య భాగాన్ని చదవండి. ఐదు ప్రశ్నలు తయారుచేయండి.

చంటి పక్షులు ఎదిగి వచ్చే సమయంలో వాటి గూళ్ళలో మరీ ఎక్కువగా మెత్తటి దూదీ, పీచు లాంటి పదార్థాలను ఉంచగూడదు. వాటిని తగు మోతాదులోనే ఉంచాలి. లేకపోతే గూడు మరీ వెచ్చనైపోతుంది. అరకొర జ్ఞానపు పావురాల పెంపకందారులు పిల్లపక్షులు ఎదిగే సమయంలో తమ శరీరం నుంచే చాలా మోతాదులో వెచ్చదనాన్ని విడుదల చేస్తాయన్న విషయం గ్రహించరు. ఈ సమయంలో పావురాల గూళ్ళను మరీ తరచుగా శుభ్రం చెయ్యటం కూడా మంచిదిగాదు. తల్లిపక్షి, తండ్రిపక్షి ఆచి తూచి గూటిలో ఉండే ప్రతి వస్తువూ పిల్లపక్షి సుఖసౌకర్యాలకు దోహదం చేస్తాయి.
జవాబు.

  1. చంటి పక్షులు ఎదిగివచ్చే సమయంలో వాటిగూళ్ళలో మరీ ఎక్కువగా ఏం ఉంచకూడదు ?
  2. అలా ఉంచకపోతే ఏం జరుగుతుంది ?
  3. అరకొర జ్ఞానపు పావురాల పెంపకందార్లు ఏ విషయం గహించరు ?
  4. చంటిపక్షులు ఎదిగివచ్చే సమయంలో ఏది మంచది కాదు ?
  5. పిల్ల పక్షి సుఖసౌకర్యాలకు దోహదం చేసేవి ఏవి ?

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

2. కింది గద్య భాగాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

దాని తండ్రిపక్షి ఓ గిరికీల మొనగాడు. తల్లిపక్షి ఓ వార్తల పావురం. ఆ రోజుల్లో అది అతి సుందరమైన కులీన వంశానికి చెందిన పావురం. ఆ రెండు విశిష్టమైన పావురాలు జతకట్టాయి. గుడ్లు పెట్టాయి. వాటికి పుట్టిన చిత్రగ్రీవం అందువల్లనే తర్వాతి రోజుల్లో యుద్ధరంగాల్లోనూ శాంతి సమయాల్లోనూ అమోఘంగా పనిచెయ్యగల వార్తాహరియైన పావురంగా రూపొందింది. తల్లిపక్షి నుండి తెలివితేటలు సంపాదించుకుంది. తండ్రిపక్షి నుండి వేగం, చురుకుదనం, సాహసం సంతరించుకుంది.

ప్రశ్నలు :

1. తల్లిపక్షి ప్రత్యేకత ఏమిటి ?
జవాబు.
తల్లిపక్షి ఓ సమాచారాన్ని ఒకచోటి నుంచి మరొక చోటికి చేరవేసే వార్తల పావురం.

2. చిత్రగ్రీవానికి తెలివితేటలు ఎలా వచ్చాయి ?
జవాబు.
చిత్రగ్రీవానికి తెలివితేటలు తల్లి నుంచి వచ్చాయి.

3. తండ్రి నుంచి వచ్చిన లక్షణాలు ఏవి ?
జవాబు.
తండ్డి పక్షి నుంచి వేగం, చురుకుదనం, సాహసం అనే లక్షణాలు వచ్చాయి.

4. ఇందులో తల్లిదండ్రుల లక్షణాలను పుణికి పుచ్చుకున్నది ఏది ?
జవాబు.
ఇందులో తల్లిదండ్రుల లక్షణాలను పుణికిపుచ్చుకున్నది చిత్రగ్రీవం.

5. ఈ పేరాను రచించినది ఎవరు ?
జవాబు.
ఈ పేరాను రచించినది ధనగోపాల్ ముఖర్జీ.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

3. క్రింది గద్యభాగమును చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానాలు రాయండి.
చిత్రగ్రీవానికి మూడువారాల వయసప్పుడు దాని గూటిలోకి ఒక చీమ పాకింది. గూటి అంచున కూర్చొని ఉన్న చిత్రగ్రీవం ఎవరి ఉపదేశమూ లేకుండానే ఆ చీమను టక్కున తన ముక్కుతో పొడిచింది. అప్పటిదాకా ఏకఖండంగా సాగిన ఆ చీమ ఒక దెబ్బతో రెండు ముక్కలైపోయింది. తన ముక్కుతో ఆ చీమ తునకలను కదిపి చూసి తాను చేసిన ఘనకార్యం ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది చిత్రగ్రీవం. అది ఏదో తినే వస్తువు అనుకొని తమ పావురాల జాతికి మిత్రుడైన ఆ అమాయికపు నల్లచీమను చిత్రగ్రీవం పొడిచి చంపిందనడంలో సందేహం లేదు. తాను చేసిన పనిచూసి చిత్రగ్రీవం పశ్చాత్తాపపడిందనీ మనం అనుకోవచ్చు. ఏదేమైనా చిత్రగ్రీవం మళ్ళా ఎప్పుడూ తన జీవితంలో మరోసారి చీమను చంపలేదు.

ప్రశ్నలు :

1. చిత్రగ్రీవం చేసిందనుకున్న గొప్ప పని ఏమిటి ?
జవాబు.
నల్ల చీమను ముక్కుతో పొడిచి చంపడం.

2. తాను చేసిన పనికి చిత్రగ్రీవం పశ్చాత్తాపపడిందని రచయిత భావించడానికి కారణం ఏమిటి ?
జవాబు.
ఆ తర్వాత మళ్ళీ ఎప్పడూ మరో చీమను చిత్రగీవం చంపలేదు. అందువల్ల చిత్రగీవం పశ్చాత్తాపపడి ఉండవచ్చని రచయిత భావించాడు.

3. పావురాల జాతికి మిత్రుడెవరు ?
జవాబు.
నల్ల చీమలు

4. చీమను పొడిచి చంపేనాటికి చిత్రగ్రీవం వయసు ఎంత ?
జవాబు.
మూడు వారాలు

5. చీమను చిత్రగ్రీవం ఎందుకు చంపింది ?
జవాబు.
తినే వస్తువనుకొని చంపింది.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download అపరిచిత గద్యాలు Questions and Answers.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

ఈ క్రింది వచనాలను చదివి వాటి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజాన్ని పరిపాలించిన రాజులలో అగ్రగణ్యులు. వీరి ఆస్థానంలో అష్టదిగ్గజములనే పేరుతో ఎనిమిది మంది కవి పండితులుండేవారు. వారిలో అల్లసాని పెద్దన మొదటివాడు. వీరు ‘మనుచరిత్ర’ అను ప్రబంధమును రాశారు. శ్రీకృష్ణదేవరాయలు తాను స్వయంగా కవి, ఆయన ‘ఆముక్త మాల్యద’ అను ప్రబంధాన్ని రాశాడు. దీనికే ‘విష్ణుచిత్తీయము’ అను నామాంతరం కలదు. ‘వికటకవి’ అని పేరుగాంచిన తెనాలి రామకృష్ణుడు తెలుగు నుడికారము వెల్లివిరియునట్లు ‘పాండురంగ మాహాత్మ్యము’ అను గ్రంథాన్ని రాసాడు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
వికటకవి ఎవరు?
జవాబు.
వికటకవి తెనాలి రామకృష్ణుడు.

ప్రశ్న 2.
పెద్దన రాసిన ప్రబంధమేది?
జవాబు.
పెద్దన ‘మనుచరిత్ర’ అను ప్రబంధమును రాశాడు.

ప్రశ్న 3.
ఆముక్తమాల్యదకు గల మరియెక పేరేది?
జవాబు.
ఆముక్తమాల్యదకు ‘విష్ణుచిత్తీయము’ అని మరొక పేరు కలదు.

ప్రశ్న 4.
అష్టదిగ్గజములు ఎవరి ఆస్థానములో వెలుగొందారు?
జవాబు.
అష్టదిగ్గజ కవులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో వెలుగొందారు.

ప్రశ్న 5.
తెనాలి రామకృష్ణుడు రాసిన గ్రంథమేది?
జవాబు.
తెనాలి రామకృష్ణుడు ‘పాండురంగ మాహాత్మ్యము’ అను గ్రంథాన్ని రాశాడు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

2. 1929 జనవరి 15న జార్జియాలోని అట్లాంటాలో మార్టిన్ లూథర్ కింగ్ జన్మించాడు. అమెరికాలో ఉన్న ఆఫ్రికన్ జాతీయుల నాయకుడితడు. మహాత్మాగాంధీ ఉపన్యాసం విని, ఉత్తేజితుడై తన నల్ల జాతీయుల విముక్తి కోసం పోరాటం సాగించాడు. మహాత్ముని పుస్తకాలను కొన్నాడు. 1951 లో బోస్టన్ యూనివర్శిటీలో డాక్టరేటు పేరు నమోదు చేసుకొని 1955లో డాక్టరేట్ను సంపాదించాడు. 1963లో ఆఫ్రికన్ అమెరికన్లతో శాంతియాత్రను కొనసాగించాడు. తన 35 వ ఏట అనగా 1964లో నోబెల్ శాంతి బహుమతిని పొందాడు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
మార్టిన్ లూథర్ కింగ్ ఎప్పుడు జన్మించాడు?
జవాబు.
1929 జనవరి 15న జన్మించాడు.

ప్రశ్న 2.
కింగ్ ఎవరి పుస్తకాలు కొన్నాడు?
జవాబు.
మహాత్ముని పుస్తకాలు కొన్నాడు.

ప్రశ్న 3.
నోబెల్ శాంతి బహుమతిని ఎపుడు పొందాడు?
జవాబు.
తన 35వ ఏట 1964లో పొందాడు.

ప్రశ్న 4.
కింగ్ ఏ జాతీయుల నాయకుడు?
జవాబు.
అమెరికాలో ఉన్న ఆఫ్రికన్ జాతీయుల నాయకుడు.

ప్రశ్న 5.
నల్ల జాతీయుల విముక్తి కోసం పోరాడడానికి కింగ్కు ప్రేరణ ఏది?
జవాబు.
మహాత్మాగాంధీ ఉపన్యాసం.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

3. కవిత్వానికి లేని కొత్త సమస్య ఒకటి ఇప్పుడు తలెత్తింది. కవిత్వానికి ఛందస్సు అవసరమా ? అనవసరమా ? ఛందస్సు అంటే ఇక్కడ గణ, యతిప్రాసలతో నిబద్ధమైన పద్య నియమావళి. అప్పకవీయమూ తదితర గ్రంథాలలో వున్నది. నన్నయ మొదలుకొని తిరుపతి వేంకట కవుల వరకు పండిత కవులు అనుసరించినది. భావ కవులు గేయ ఛందస్సులను అనుసరించినా, ఈ పద్య ఛందస్సులను తిరస్కరించలేదు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఛందస్సు అనగా నేమి?
జవాబు.
గణ, యతిప్రాసలతో నిబద్ధమైన పద్య నియమావళినే ‘ఛందస్సు’ అని అంటారు.

ప్రశ్న 2.
గేయ ఛందస్సులను అనుసరించినవారు ఎవరు?
జవాబు.
భావ కవులు గేయ ఛందస్సులను అనుసరించారు.

ప్రశ్న 3.
ఇప్పుడు తలెత్తిన సమస్య ఏది?
జవాబు.
ఇప్పుడు కవిత్వానికి ఛందస్సు అవసరమా ? అనవసరమా ? అనే సమస్య తలెత్తింది.

ప్రశ్న 4.
భావ కవులు వేనిని తిరస్కరించలేదు?
జవాబు.
భావ కవులు పద్య ఛందస్సులను తిరస్కరించలేదు.

ప్రశ్న 5.
ఈ పేరాలోని జంటకవులు ఎవరు ?
జవాబు.
తిరుపతి వేంకట కవులు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

4. సమాజంలో మతం అంతర్భాగం. మన సమాజంలో ఎన్నో మతాలున్నాయి. ఏ మతమైనా అందరికి ప్రయోజనాన్ని చేకూర్చే సిద్ధాంతాలనే కలిగి ఉంటుంది. ఇతరులు మతం కంటే తమ మతం గొప్పదని చెప్పుకొనేవారు అవివేకులు. వారు తమ స్వార్థానికే ఇతర మతాలను దూషించుటకు ప్రయత్నిస్తారు. సర్వమతాలను సమానంగా భావించి మంచిని స్వీకరించువారే ఉత్తములు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
సమాజంలో అంతర్భాగమైనదేది ?
జవాబు.
మతం

ప్రశ్న 2.
ప్రతి మతంలోని ప్రధాన సిద్ధాంతమేమి ?
జవాబు.
అందరికీ ప్రయోజనాన్ని చేకూర్చడమే ప్రధాన సిద్ధాంతం.

ప్రశ్న 3.
ఎవరు అవివేకులు ?
జవాబు.
ఇతరుల మతం కంటే తమ మతం గొప్పదని చెప్పుకొనువారు అవివేకులు.

ప్రశ్న 4.
ఉత్తములు ఎవరు ?
జవాబు.
సర్వ మతాలను సమానంగా భావించి మంచిని స్వీకరించు వారే ఉత్తములు.

ప్రశ్న 5.
స్వార్థపరులు ఏం చేస్తారు ?
జవాబు.
ఇతర మతాలను దూషిస్తారు.

5. వీరేశలింగం పంతులు గారు ఆంధ్రభాషకు చేసిన సేవ ఎనలేనిది. పంతులుగారికి పూర్వము నవలా రచనలేదు. వారు రచించిన ‘రాజశేఖర చరిత్ర’ తెలుగులో ప్రసిద్ధి గాంచినది. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞానశాకుంతలము’ను పంతులుగారు తెలుగున కనువదించారు. ఆంధ్ర కవుల చరిత్ర, స్వీయచరిత్ర మొదలగు క్రొత్త పోకడలను తెలుగు భాషలో వెలువరించారు. వారు కవిగా సంపాదించిన కీర్తి కంటే సంఘసంస్కర్తగా ఎనలేని ఖ్యాతి గడించారు. వితంతు వివాహములను, స్త్రీ విద్యను ప్రోత్సహించారు. ‘హితకారిణి’ సమాజమును స్థాపించి దాని ద్వారా అనాథ స్త్రీ ఉద్ధరణకు పాటుపడ్డారు.

ప్రశ్న 1.
తెలుగు భాషలో మొదటి నవల ఏది ?
జవాబు.
తెలుగు భాషలో మొదటి నవల ‘రాజశేఖర చరిత్ర’.

ప్రశ్న 2.
హితకారిణి సమాజ స్థాపన ఉద్దేశ్యమేమి ?
జవాబు.
హితకారిణి సమాజ స్థాపన ఉద్దేశ్యం అనాథ స్త్రీల ఉద్ధరణ.

ప్రశ్న 3.
వీరేశలింగం పంతులు గారు తెలుగులోనికి అనువదించిన నాటకమేది ?
జవాబు.
వీరేశలింగం పంతులు గారు ‘అభిజ్ఞాన శాకుంతలం’ అను నాటకాన్ని తెలుగులోనికి అనువదించారు.

ప్రశ్న 4.
ఆయన వేనిని ప్రోత్సహించారు ?
జవాబు.
ఆయన (కందుకూరి) వితంతు వివాహాలను, స్త్రీ విద్యను ప్రోత్సహించారు.

ప్రశ్న 5.
ఆయన తెలుగు భాషలో చూపిన కొత్త పోకడలకు రెండు ఉదాహరణలేవి?
జవాబు.
ఆంధ్ర కవుల చరిత్ర, స్వీయ చరిత్ర రచనలు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

6. “కవిత్వం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం ఈ ఐదింటిని లలితకళలంటారు. ఈ కళలలో కృష్ణదేవరాయలకు తగినంత చొరవ ఉండేది. ఆయన ఆస్థానంలో కవులు, గాయకులు, నాట్యకారులు, చిత్రకారులు, శిల్పులు ఉండేవారు. వారు తమ తమ కళలను అద్భుత రీతిలో ప్రదర్శించి రాయల మన్ననలందుకొనేవారు. కళలు మానవుని హృదయాన్ని స్పందింపజేసే స్వభావం కలవి. కళలను ఆనందించలేనివాడు రాయిలాగే జడుడని చెప్పవచ్చు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
లలితకళలేవి ?
జవాబు.
కవిత్వం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం అనేవి లలితకళలు.

ప్రశ్న 2.
కవులు రాయల మన్ననలందుకొనడానికి గల కారణమేమి ?
జవాబు.
అన్ని కళలలో రాయలకు తగినంత చొరవ ఉండటం కవులు తమ కళలను అద్భుత రీతిలో ప్రదర్శించడం రాయల మన్ననలందుకోవడానికి కారణం.

ప్రశ్న 3.
“కళలను ఆనందించలేనివారు రాయిలాగే జడుడు” అంటే అర్థం ఏమిటి ?
జవాబు.
కళలను చూచి విని ఆనందించలేనివాడు ప్రాణంలేని పదార్థం వంటివాడని, మూర్ఖుడని అర్థం.

ప్రశ్న 4.
సంగీతం పాడేవారిని గాయకులంటారు. అలాగే చిత్రాలను వేసేవారిని ఏమంటారు ?
జవాబు.
చిత్రాలను వేసేవారిని చిత్రకారులు అంటారు.

ప్రశ్న 5.
కళలకు ఏ స్వభావం ఉన్నది ?
జవాబు.
కళలకు మానవుని స్పందింపజేసే స్వభావం ఉంది.

7.క్రింది గద్యభాగాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయండి.

మానవుని హృదయమును మధుర భావములతో నింపునది కవిత్వము. హృదయము దయార్ధమయినప్పుడు కవిత్వ మావిర్భవించునని వాల్మీకి చెప్పెను. ధర్మార్థకామమోక్షములు సాధించుటయే కవిత్వ ప్రయోజనమని కొందరు అంటారు. సంస్కృత కవితను వెలయించి భారతీయ సంస్కృతి, ధర్మములను నిలబెట్టిన వ్యాస, వాల్మీకి, కాళిదాసాదులు నిత్యస్మరణీయులు. తెలుగులో కవిత్రయము, శ్రీనాథ, పోతనలు, అష్టదిగ్గజ కవులు సుప్రసిద్ధులు.

ప్రశ్నలు :

1. కవిత్వము ఎటువంటిది ?
2. వాల్మీకి ఏమి చెప్పెను ?
3. కవిత్వ ప్రయోజనమేమి ?
4. నిత్యస్మరణీయులు ఎవరు ?
5. పై పేరాలో సంస్కృత కవులు ఎవరు ?

8. పొదుపు మానవ జీవితానికి అత్యవసరం. పొదుపు లేని మానవుడు దారం తెగిన గాలిపటం వంటివాడు. పొదుపు చేయకుండా అడ్డుపడే వాటిల్లో అతి ముఖ్యమైనవి కోరికలు. కోరికలు మానవుని మానసికంగా బలహీనుణ్ణి చేస్తాయి. పొదుపు అనేక విషయాలలో పాటించవచ్చు. ధనము, జలము, భాషణము మొదలగు వానిలో పొదుపు పాటించడం ద్వారా దేశాభివృద్ధిని సాధించగలము. పొదుపును నిర్లక్ష్యం చేస్తే అప్పులు చేయక తప్పదు. అప్పుచేయటం వలన మన వ్యక్తిత్వాన్నే కోల్పోతాము.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
పొదుపు పాటించవలసిన ముఖ్య విషయాలేవి ?
జవాబు.
పొదుపు పాటించవలసిన ముఖ్య విషయాలు ధనం, జలం, భాషణం.

ప్రశ్న 2.
పొదుపును నిర్లక్ష్యం చేస్తే ఏమి జరుగుతుంది ?
జవాబు.
పొదుపును నిర్లక్ష్యం చేస్తే అప్పులు చేయడం జరుగుతుంది.

ప్రశ్న 3.
అప్పు చేయటం వలన మనమేమి కోల్పోతాము ?
జవాబు.
అప్పు చేయటం వలన మనం వ్యక్తిత్వాన్ని కోల్పోతాము.

ప్రశ్న 4.
కోరికలు మానవుని ఏమి చేస్తాయి ?
జవాబు.
కోరికలు మానవుని మానసికంగా బలహీనుణ్ణి చేస్తాయి.

ప్రశ్న 5.
పొదుపు లేని మానవుడు ఎటువంటివాడు ?
జవాబు.
దారం తెగిన గాలిపటం వంటివాడు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

9. బ్రౌనును ఒక వ్యక్తిగా గాక, పెద్ద సాహిత్య సంస్థగా భావించడం అవసరం. యుగ సంధిలో నిలిచిన ఈ వ్యక్తి అనేకానేక తాళపత్ర లిఖిత ప్రతులను సేకరించి, అవి ఎక్కడున్నాసరే, ఎంత ధనవ్యయమైనా సరే, లెక్కపెట్టకుండా, తన ఉద్యోగుల ద్వారా సంపాదించాడు. కొందరు పండితులను సమీకరించి, వారికి జీతభత్యాలిచ్చి, శుద్ధప్రతులు వ్రాయించి, కొన్నిటికి అర్థతాత్పర్యాలు సిద్ధం చేయించాడు. ‘విశ్వదాభిరామ వినురవేమ’ పద్యం తెలియని తెలుగువాడు లేడు. అయితే ఈ పద్యాలను మొదట తెలుగువాళ్ళకు పరిచయం చేసినది విదేశీయుడైన బ్రౌను. బ్రౌను పేరు స్మరించగానే మనకు స్ఫురించేది బ్రౌను నిఘంటువు. ఈ కృషి 1832లో ఆరంభించబడి 1853లో పూర్తి అయి ప్రథమ ముద్రణయింది.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు బ్రౌనును ఎట్లా పరిగణించడం భావ్యం ?
జవాబు.
తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు బ్రౌనును ఒక వ్యక్తిగా కాక ఒక పెద్ద సాహిత్య సంస్థగా పరిగణించడం భావ్యం.

ప్రశ్న 2.
బ్రౌను వేటిని సేకరించాడు ?
జవాబు.
బ్రౌను అనేక తాళపత్ర లిఖిత ప్రతులను సేకరించాడు.

ప్రశ్న 3.
పండితులతో బ్రౌను చేయించిన పనులు ఏమిటి ?
జవాబు.
పండితులతో బ్రౌను శుద్ధ ప్రతులను రాయించి కొన్నింటికి అర్థతాత్పర్యాలు సిద్ధం చేయించాడు.

ప్రశ్న 4.
నిఘంటువు ప్రథమ ముద్రణ ఎప్పుడు పూర్తి అయింది ?
జవాబు.
నిఘంటువు ప్రథమ ముద్రణ 1853లో పూర్తి అయింది.

ప్రశ్న 5.
బ్రౌను తెలుగు వారికి మొదట పరిచయం చేసిన దేమి ?
జవాబు.
వేమన పద్యాలు.

10. వీరభద్రారెడ్డికి అంకితంగా కాశీఖండం రచించిన శ్రీనాథుడు పోతనకు సమకాలికుడు. శ్రీనాథుడు కాశీఖండం, భీమఖండం పురాణాలను తెనిగించినా, వానిని స్వతంత్రించి ప్రబంధాలవలె తెనిగించాడు. భీమఖండం, గోదావరి తీరదేశ దివ్యవైభవ వర్ణనా గ్రంథమని చెప్పవచ్చు. కాశీఖండం ప్రౌఢాంధ్ర కవితా పరిజ్ఞానానికి చదువదగిన ప్రబంధం. “శివరాత్రి మాహాత్మ్యం” అనే గ్రంథాన్ని కూడా శ్రీనాథుడే రచించాడు. శ్రీనాథునకు ప్రౌఢకవి పాకం మీద ప్రీతి ఎక్కువ. ఆయన ‘హరవిలాసం’ రచించి అవచి తిప్పయ్య సెట్టికి అంకితమిచ్చాడు. ‘కవి సార్వభౌముడు’గా ప్రసిద్ధి చెందిన శ్రీనాథుడు 15వ శతాబ్దికి చెందినవాడు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
శ్రీనాథుడు రచించిన గ్రంథాలేవి ?
జవాబు.
శ్రీనాథుడు కాశీఖండం, భీమఖండం, శివరాత్రి మాహాత్మ్యం, హరవిలాసం మొదలైన గ్రంథాలను రచించాడు.

ప్రశ్న 2.
శ్రీనాథుడు ఎవరి సమకాలికుడు ?
జవాబు.
శ్రీనాథుడు పోతనకు సమకాలికుడు.

ప్రశ్న 3.
శ్రీనాథుడు తన ‘హరవిలాసం’ కావ్యాన్ని ఎవరికి అంకితమిచ్చాడు ?
జవాబు.
శ్రీనాథుడు తన హరవిలాస కావ్యాన్ని అవచి తిప్పయ్య సెట్టికి అంకితమిచ్చాడు.

ప్రశ్న 4.
శ్రీనాథుని బిరుదు ఏమిటి ?
జవాబు.
శ్రీనాథుని బిరుదు ‘కవి సార్వభౌముడు’.

ప్రశ్న 5.
భీమఖండం దేనిని వర్ణిస్తుంది ?
జవాబు.
గోదావరీ తీరదేశ వైభవాన్ని

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

11. క్రింది గద్యభాగాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయండి.

తెలుగుభాషలో కావ్యరచన నన్నయతో మొదలయింది. తిక్కనాదులు విస్తృతం చేశారు. బమ్మెర పోతన భాగవతాన్ని తెనిగించాడు. పెద్దనాదులు ప్రబంధ రచన చేశారు. తిరుపతి వేంకట కవులు అవధాన విద్య ద్వారా వీరవిహారం చేశారు. వెయ్యేళ్ళ నుంచి నేటికీ పద్యం నిలద్రొక్కుకొని విరాజిల్లుతూ ఉంది.

ప్రశ్నలు :

1. తొలి తెలుగు కావ్యం ఎవరు రాశారు ?
2. భాగవతాన్ని తెలుగులో రాసింది ఎవరు?
3. ఎంతకాలం నుంచి పద్యం నిలచి ఉంది?
4. తిరుపతి వేంకటకవులు ఏ విద్యలో ప్రసిద్ధులు?
5. తెలుగులో కావ్య రచనను ఎవరు విస్తృతం చేశారు?

12. నేడు గ్రంథాలయాలు అనుసరిస్తున్న శాస్త్రీయ విధానాన్ని రూపొందించినవారు డా॥ ఎన్.ఆర్.రంగనాథన్ గారు. వృత్తిపరమైన వారి అనుభవంలోంచి పుట్టిందే ఈ కృషి. ఆయన భారతీయ గ్రంథాలయాలకు సరిపోయే విధంగా మూడు కార్డుల పద్దతి, చార్జింగ్ సిస్టమ్, బైండింగ్ ప్రమాణాలు లాంటి కొత్త మార్గాలను ప్రవేశపెట్టారు. ఆయన రూపొందించిన “గ్రంథాలయ సిబ్బంది విభజన ఫార్ములా” ప్రామాణికంగా ఇప్పటికీ పాటించబడుతోంది. పరిమిత వనరులతో, ఇబ్బందులతో కొనసాగే భారతీయ గ్రంథాలయాలకు రంగనాథన్ కనిపెట్టిన మార్గాలు ఎంతో ఉపయోగకరమైనవి.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
గ్రంథాలయాల విధానాన్ని రూపొందించిన వారెవరు ?
జవాబు.
గ్రంథాలయాల విధానాన్ని రూపొందించినది డా॥ ఎన్. ఆర్. రంగనాథన్.

ప్రశ్న 2.
రంగనాథన్ కృషి ఎందులోంచి పుట్టింది ?
జవాబు.
రంగనాథన్ కృషి వారి వృత్తిపరమైన అనుభవం లోంచి పుట్టింది.

ప్రశ్న 3.
ఆయన రూపొందించిన ఫార్ములా ఏది ?
జవాబు.
ఆయన రూపొందించిన ఫార్ములా “గ్రంథాలయ సిబ్బంది విభజన ఫార్ములా”.

ప్రశ్న 4.
రంగనాథన్ కనిపెట్టిన మార్గాలు వేటికి ఉపయోగకరమైనవి ?
జవాబు.
రంగనాథన్ కనిపెట్టిన మార్గాలు భారతీయ గ్రంథాలయాలకు ఉపయోగకరమైనవి.

ప్రశ్న 5.
రంగనాథన్ ప్రవేశపెట్టిన కొత్త మార్గాలేవి ?
జవాబు.
మూడు కార్డుల పద్ధతి, చార్జింగ్ సిస్టమ్, బైండింగ్ ప్రమాణాలు.

13. స్త్రీజనోద్ధరణము కూడా సంఘసేవయే. పురుషులు మాత్రమే చదివి లోకమున విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకొనుట చాలదు. స్త్రీలు సహితము పురుషులతో బాటుగా చదువుకొన్నప్పుడే సంఘము బాగుపడును. సంఘమను బండికి స్త్రీ, పురుషులిద్దరు రెండు చక్రముల వంటివారు. అందులో ఏ చక్రము అవిటిగా నున్నను ఆ బండి నడువజాలదు. కావున రెండు చక్రములును సరిగా నడుచునట్లు చూచుకొన్నప్పుడే బండి చక్కగా సాగిపోవును.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
సంఘసేవ యనదగినదేది ?
జవాబు.
స్త్రీ జనోద్ధరణము సంఘసేవ యనదగినది.

ప్రశ్న 2.
సంఘము ఎప్పుడు బాగుపడును ?
జవాబు.
స్త్రీలు కూడా పురుషులతో పాటుగా చదువు కున్నప్పుడే సంఘము బాగుపడును.

ప్రశ్న 3.
సంఘమనే బండికి చక్రములవంటి వారెవరు ?
జవాబు.
సంఘమనే బండికి స్త్రీ, పురుషులిద్దరు చక్రములంటివారు.

ప్రశ్న 4.
బండి ఎప్పుడు చక్కగా సాగును ?
జవాబు.
రెండు చక్రములు సరిగా నడుచునప్పుడే బండి చక్కగా సాగును.

ప్రశ్న 5.
పురుషులు ఏమని చెప్పుకుంటున్నారు ?
జవాబు.
తామే విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకుంటున్నారు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

14. సర్దార్పటేల్ వ్యక్తిత్వం ఓర్పు, నేర్పు, పట్టుదల మొదలైన సుగుణాలతో కూడినది. ఆయనకు ప్రతి విషయంపై ఇష్టానిష్టాలుండేవి. ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత ఆ విషయాన్ని గురించి సందేహములుండేవి కావు. వాటిని అమలు జరపడంలో బలప్రయోగం అవసరమైనా జంకేవాడు కాదు. ఆయన తీరిక సమయంలో వ్యవసాయం చేసేవాడు. భారతదేశ దాస్యానికి భారతీయులలో గల అనైక్యత, క్రమశిక్షణారాహిత్యం కారణమని చెప్పినాడు. పటేల్ బారిష్టర్ పట్టా పొందుటతో సర్వతోముఖ న్యాయశాస్త్రమును విస్తృతపరచుట, కార్యదీక్ష, ఐకమత్యం ద్వారా స్వాతంత్య్రం సముపార్జన కొరకు పాటుపడుట అతని ఆశయం. దేశ ప్రజల మధ్య తరతమ భేదాలు పూర్తిగా అదృశ్యమై “నవరూపకల్పన” భారత ఉపప్రధాని పటేల్ అవిరళ కృషి ఫలితం.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
పటేల్లోని సుగుణములేవి ?
జవాబు.
ఓర్పు, నేర్పు, పట్టుదల మొదలైనవి పటేల్లోని గుణాల

ప్రశ్న 2.
పటేల్గారి నిర్ణయములెట్లుండేవి ?
జవాబు.
పటేల్ గారి నిర్ణయాలు నిస్సందేహంగా ఉండేవి.

ప్రశ్న 3.
పటేల్ తీరిక సమయంలో ఏమి చేసేవాడు ?
జవాబు.
పటేల్ తీరిక సమయంలో వ్యవసాయం చేసేవాడు.

ప్రశ్న 4.
పటేల్ ఏ పదవినలంకరించెను ?
జవాబు.
పటేల్ “భారత ఉపప్రధాని” పదవిని అలంకరించెను.

ప్రశ్న 5.
స్వాతంత్ర్యం పొందాలంటే ఏమి కావాలి ?
జవాబు.
కార్యదీక్ష, ఐకమత్యం.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

15. క్రింది గద్యభాగాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయండి.
“జో అచ్యుతానంద జోజో ముకుందా ” అన్న జోలపాట ఒకనాడు పసిబిడ్డ గల ప్రతియింటా కన్న తల్లుల జిహ్వాగ్రాలపై నాట్యమాడేది. ఈ పదకర్తే క్రీ.శ. 1424 1503 మధ్యకాలంలో జీవించి 32 వేల మధుర భక్తి సంకీర్తనలతో తిరుమలేశుని గొలిచి, ఆంధ్రభారతిని స్వతస్సిద్ధమైన తెలుగుభాషా భూషలతో భూషింపజేసి, సర్వజనరంజనం చేసిన పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు అన్నమాచార్యుడు. తెలుగులో సంకీర్తన యుగం పన్నెండవ శతాబ్దిలో కృష్ణమాచార్యుని “సింహగిరి” వచనాలతో ప్రారంభమైనప్పటికీ, అన్నమయ్య దానిని ఉన్నతోన్నతి శిఖరాల నధిరోహింపజేసి పదకవితకు యుగకర్త అయినాడు. తెలుగులో పదకవిత్రయం (అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య)లో ఆద్యుడైనాడు.

ప్రశ్నలు :

1. “జో అచ్యుతానంద ! జోజో ముకుందా ! అన్న జోలపాటను వ్రాసింది ఎవరు ?
2. తెలుగులో సంకీర్తన యుగం ఎప్పుడు ప్రారంభమైనది ?
3. పద కవిత్రయంగా వాసికెక్కిన వారెవరు ?
4. అన్నమాచార్యుడు తన సంకీర్తనలతో ఎవరిని సేవించాడు ?
5. సింహగిరి వచనాలు రాసిందెవరు ?

16. 20వ శతాబ్దపు తొలి రోజులలో కుటుంబ నియంత్రణను బూతుమాట క్రింద జమకట్టేవారు. అటువంటి సమయంలో నర్స్గా పనిచేసే మార్గరేట్ సాంగర్ అనేక కష్టాలకోర్చి కుటుంబ నియంత్రణను గూర్చి ప్రచారం చేశారు. 1914లో “ఉమన్ రెబల్” అన్న వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపు నిచ్చారు. అమెరికా ప్రభుత్వ వత్తిడి తట్టుకోలేక ఆమె యూరప్కు వలస వెళ్ళి 1916 లో తిరిగి వచ్చి అదే ప్రచారాన్ని మళ్ళీ మొదలుపెట్టారు. పోలీసులు ఆమె ప్రారంభించిన ఆస్పత్రిపై దాడి చేశారు. అయినా ఆమె చలించకుండా 1923లో కుటుంబ నియంత్రణా పరిశోధనాశాలను నెలకొల్పారు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్ పేరేమి ?
జవాబు.
కుటుంబ నియంత్రణ కోసం ప్రచారం చేసిన నర్స్ మార్గరేట్ సాంగర్,

ప్రశ్న 2.
ఏ సంవత్సరంలో, ఏ వ్యాసంలో ఆమె కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు ?
జవాబు.
ఆమె 1914లో “ఉమన్ రెబెల్” అనే వ్యాసంలో కుటుంబ నియంత్రణ కోసం తిరగబడమని పిలుపునిచ్చారు.

ప్రశ్న 3.
మార్గరేట్ సాంగర్ ఎప్పుడు, ఎక్కడికి వలస వెళ్ళింది ?
జవాబు.
1914 నుండి 1916 మధ్య కాలంలో మార్గరేట్ సాంగర్ యూరప్ కు వలస వెళ్ళింది.

ప్రశ్న 4.
1923లో సాంగర్ దేనిని నెలకొల్పింది ?
జవాబు.
1923లో సాంగర్ కుటుంబ నియంత్రణా పరిశోధనాశాలను నెలకొల్పింది.

ప్రశ్న 5.
మార్గరెట్ సాంగర్పై వత్తిడి తెచ్చిందెవరు ?
జవాబు.
అమెరికా ప్రభుత్వం.

17. ప్రాణికి కన్ను ప్రధానమైనది. “సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్” అను సూక్తి కూడా ఆ సత్యమునే చాటుచున్నది. అందము ఆనందహేతువు. సౌందర్యమును జూచి పులకించుట చూపులేనిదే సాధ్యముగాదు. కన్నులున్న ప్రతి మానవుడు సౌందర్యమును జూచి సంతోషించుననుటయు సత్యముకాదు. ప్రకృతిలోని అందమైన వస్తువు కొన్ని కన్నులలో ప్రతిబింబించును. ఆ నేత్రములు నిలువుటద్దములు మాత్రమే. అట్లుగాక కొన్ని కన్నులు తమలో ప్రతిబింబించిన అందాన్ని అంతరంగంలో ప్రతిఫలింపజేయగలవు. అవియే నిజమైన నేత్రములు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
కన్ను ప్రాధాన్యతను తెలియజేయు సూక్తి ఏది ?
జవాబు.
“సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్” అనేది కన్ను ప్రాధాన్యతను తెలియజేయు సూక్తి.

ప్రశ్న 2.
సౌందర్యాన్ని చూచి సంతోషించడానికేమి కావాలి ?
జవాబు.
సౌందర్యాన్ని చూచి సంతోషించడానికి కంటిచూపు కావాలి.

ప్రశ్న 3.
నిలువుటద్దములని కవి వేటిని గూర్చి చెప్పాడు ?
జవాబు.
ప్రకృతిలోని అందాన్ని తమలో మాత్రమే ప్రతిబింబింపజేసే కన్నులు నిలువుటద్దములని కవి చెప్పాడు.

ప్రశ్న 4.
ఏవి నిజమైన నేత్రములు ?
జవాబు.
తమలో ప్రతిబింబించిన అందాన్ని అంతరంగంలో ప్రతిఫలింపజేయగలవే నిజమైన నేత్రములు.

ప్రశ్న 5.
చూపు లేకుంటే ఏది సాధ్యం కాదు ?
జవాబు.
సౌందర్యాన్ని చూసి ఆనందించ లేము.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

18. వార్తను యథాతథంగా ప్రకటించడం వార్తాపత్రికలకు తొలినాళ్ళలో ఆదర్శంగా ఉంది. ఇప్పుడు దానికి పూర్తిగా విరుద్ధంగా ముద్రణలో, వ్రాయడంలో, అభిప్రాయ స్ఫురణలో భిన్నంగా వార్తను ప్రకటిస్తున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఏ విధంగా అనే అంశాలు వార్తల్లో స్పష్టం కావాలి. అదే సమగ్ర వార్త. ఏదైనా క్రొత్త అంశాన్ని ప్రజల దృష్టికి తేవడం వార్తకున్న ప్రత్యేక లక్షణం. లభించిన సమాచారం నుండి ఒక ప్రత్యేక అంశాన్ని, అపూర్వ విషయాన్ని వెలికితేవడం, వార్త వ్రాయడం కోసం అన్వేషించడం పత్రికా రచయిత చేసే నిరంతర కృషి, ఒకే వార్తను అనేక పత్రికలు అనేక విధాలుగా ప్రచురిస్తుంటాయి. వార్తలోని ప్రత్యేకాంశం, కొత్తసంగతి, వాళ్ళ విజ్ఞానం, సంస్కారం, నైపుణ్యాల మీద ఆధారపడి ఒక్కొక్క పద్ధతిలో ముద్రింపబడుతుంది. ఇదే వార్తకు వైవిధ్యాన్ని సంపాదించి పెడుతుంది.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఇప్పుడు వార్తాపత్రికలు ఏమి చేస్తున్నాయి ?
జవాబు.
ఇప్పుడు వార్తాపత్రికలు వార్తను ముద్రించడంలో, వ్రాయడంలో, అభిప్రాయ ప్రకటనలో కొంత తేడాతో ప్రకటిస్తున్నాయి.

ప్రశ్న 2.
వార్తకున్న ప్రత్యేక లక్షణమేమిటి?
జవాబు.
క్రొత్త అంశాన్ని ప్రజల దృష్టికి తేవడమనేది వార్తకున్న ప్రత్యేక లక్షణం.

ప్రశ్న 3.
సమగ్రమైన వార్త లక్షణమేమిటి ?
జవాబు.
ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఏవిధంగా అనే అంశాలు స్పష్టమయ్యేట్లు ప్రకటించడం సమగ్ర వార్త లక్షణం.

ప్రశ్న 4.
వార్తకు వైవిధ్యాన్ని సంపాదించి పెట్టునవేవి ?
జవాబు.
వార్తల్లోని ప్రత్యేకాంశం, కొత్త సంగతి, వాళ్ళ విజ్ఞానం, సంస్కారం, నైపుణ్యం అనేవి వార్తకు వైవిధ్యాన్ని సంపాదించి పెడతాయి.

ప్రశ్న 5.
తొలినాళ్ళలో వార్తా పత్రికల ఆదర్శమేమిటి ?
జవాబు.
వార్తను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడం.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

ప్రశ్న 19.
సమాజ శ్రేయస్సు కొరకు మతము ఏర్పడినది. ప్రతి మతము ఉన్నతాశయములు కలిగియున్నది. ఏ మతము చెడును బోధించదు. ఈ మతము గొప్పది, పరమతము నీచమైనదని ప్రచారము చేయువారు విశాల హృదయము లేనివారని సంకుచిత స్వభావులని భావింపవచ్చును. స్వార్థపరులని తలంపవచ్చును. అట్టివారి మాటలను నమ్ముట మన అజ్ఞానమునకు ప్రతీకయగును.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
మతము ఎందుకు ఏర్పడినది ?
జవాబు.
మతము సమాజ శ్రేయస్సు కొరకు ఏర్పడినది.

ప్రశ్న 2.
దేన్ని మతము బోధించదు ?
జవాబు.
చెడును మతము బోధించదు.

ప్రశ్న 3.
ప్రతి మతము ఏవి కల్గియున్నది ?
జవాబు.
ప్రతి మతము ఉన్నత ఆశయములు కలిగియున్నది.

ప్రశ్న 4.
ఎవరు విశాల హృదయం లేనివారు ?
జవాబు.
ఈ మతము గొప్పది, పరమతము నీచమైనదని ప్రచారము చేయువారు విశాల హృదయము లేనివారు.

ప్రశ్న 5.
మత భేదాలను ప్రచారం చేసేవారి మాటలను నమ్మటం దేనికి గుర్తు ?
జవాబు.
మన అజ్ఞానానికి గుర్తు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

20. విద్యార్థికి క్రమశిక్షణ చాలా అవసరం. ఒక క్రమపద్ధతి ప్రకారం తన పనులన్నీ తానే చేసుకోవాలి. ఇతరులపై ఆధారపడకూడదు. ఎప్పటి పని అప్పుడే చేయాలి. పనిని వాయిదా వేయకూడదు. ఆత్మనిగ్రహాన్ని అలవరచుకోవాలి. చీటికీ మాటికీ కోపం తెచ్చుకోకూడదు. తోటివారిని చూసి ఈర్ష్య పడకూడదు. అసూయ పడకూడదు. చదువులోనూ, సత్ప్రవర్తనలోనూ తోటి వారిని మించాలనే పట్టుదలతో కృషి చేయాలి. అంతేకాని వాళ్ళు నీ కంటే ముందున్నారని అసూయ పడకూడదు. నీకంటే ముందున్న వారిపట్ల అసూయ కూడనట్లే, నీకంటే వెనుకబడినవారి పట్ల చులకన భావం కూడా ఉండకూడదు. వాళ్ళకు తగిన ప్రోత్సాహమివ్వాలి.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
విద్యార్థికి ఏది అవసరం ?
జవాబు.
విద్యార్థికి క్రమశిక్షణ అవసరం.

ప్రశ్న 2.
విద్యార్థి దేన్ని అలవరచుకోవాలి ?
జవాబు.
విద్యార్థి ఆత్మనిగ్రహాన్ని అలవరచుకోవాలి.

ప్రశ్న 3.
ఏ విషయంలో పట్టుదలతో కృషి చేయాలి ?
జవాబు.
చదువులోను, సత్ప్రవర్తనలోను తోటివారిని మించాలనే పట్టుదలతో కృషి చేయాలి.

ప్రశ్న 4.
విద్యార్థికి ఎవరిపై చులకన భావం ఉండకూడదు?
జవాబు.
విద్యార్థికి తనకంటే వెనుకబడిన వారిపై చులకన భావం ఉండకూడదు.

ప్రశ్న 5.
పనులు ఎలా చేసుకోవాలి?
జవాబు.
క్రమ పద్ధతి ప్రకారం.

21. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని సాహితీ సమరాంగణ సార్వభౌములచే ప్రశంసింపబడిన భాష మన తెలుగుభాష, భాషాభ్యుదయమునకు సాహిత్య సంపద జీవగర్ర. ఆదికవి నన్నయభట్టారకుని నాటి నుండి నేటి వరకు ఆంధ్రభాషా సాహిత్యము అవిచ్ఛిన్నముగా, బహుముఖములుగా రాణించింది. ముద్రణాది సౌకర్యములు ఏర్పడిన తరువాత మన తెలుగు భాషలో ప్రాచీన కావ్య పురాణాది వివిధ గ్రంథములు ప్రచురింపబడి సుప్రకాశితములయ్యాయి.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
తెలుగుభాష ఏమని ప్రశంసింపబడినది?
జవాబు.
తెలుగుభాష ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ప్రశంసింపబడింది.

ప్రశ్న 2.
ముద్రణా సౌకర్యము ఏర్పడుట ద్వారా భాషకు కల్గిన ప్రయోజనమేమి ?
జవాబు.
ముద్రణా సౌకర్యము ఏర్పడుట ద్వారా భాషకు ప్రాచీన కావ్య పురాణాది గ్రంథములు ప్రచురింపబడ్డాయి.

ప్రశ్న 3.
ఆదికవి ఎవరు?
జవాబు.
ఆదికవి నన్నయ.

ప్రశ్న 4.
భాషాభ్యుదయమునకు ఏది జీవగర్ర?
జవాబు.
భాషాభ్యుదయమునకు జీవగర్ర సాహిత్య సంపద

ప్రశ్న 5.
తెలుగు భాషను మెచ్చుకున్న రాజెవరు?
జవాబు.
సాహితీ సమరాంగణ సార్వ భౌముడు శ్రీకృష్ణ దేవరాయలు.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

22. కొమర్రాజు లక్ష్మణరావు విద్యాభ్యాస కాలంలో పలుభాషలు నేర్చెను. అందువలన ఆయనకు విశాలమైన దృక్పథం ఏర్పడి అనేక పరిశోధనలకు, చర్చలకు ఉపయోగపడింది. ఇంగ్లీషు పండితుల ఒరవడిలో ప్రామాణిక ప్రతులను ప్రచురించారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపించి సాంస్కృతిక పునరుజ్జీవనానికి నారు పోశారు. శాసనాలు సేకరించి, పరిశోధన చేసి, సాక్ష్యాధారాలతో చరిత్ర రచన చేశారు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగు ప్రజలందరకు అందుబాటులోకి తేవడానికి ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం’ రచనకు పూనుకున్నారు. ఏ విషయమైనా మొక్కుబడిగా కాకుండా దాని లోతులు చూచి అందివ్వడానికి ఆయన కృషి చేశారు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
లక్ష్మణరావుకు పలుభాషలు నేర్చుకోవడం ఎలా ఉపయోగపడింది ?
జవాబు.
లక్ష్మణరావుకు పలుభాషలు నేర్చుకోవడం అనేక పరిశోధనలకు, చర్చలకు ఉపయోగపడింది.

ప్రశ్న 2.
లక్ష్మణరావు చరిత్ర రచన ఎలా చేశారు?
జవాబు.
లక్ష్మణరావు శాసనాలు సేకరించి, పరిశోధన చేసి, సాక్ష్యాధారాలతో చరిత్ర రచన చేశారు.

ప్రశ్న 3.
తెలుగు ప్రజల కోసము ఏ రచనకు ఆయన పూనుకొన్నాడు?
జవాబు.
తెలుగు ప్రజల కోసం ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం’ రచనకు ఆయన పూనుకున్నాడు.

ప్రశ్న 4.
ఎవరి ఒరవడిలో ప్రామాణిక ప్రతులను ప్రచురించారు ?
జవాబు.
ఇంగ్లీషు పండితుల ఒరవడిలో ప్రామాణిక ప్రతులను ప్రచురించారు.

ప్రశ్న 5.
లక్ష్మణరావు స్థాపించిన సంస్థ ఏది ?
జవాబు.
శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

23. క్రింది గద్యభాగాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయండి.

భాష కాలక్రమేణ మారే స్వభావం కలది. కాబట్టి ఒక భాషలో కాలక్రమేణ వర్ణాలు, వ్యాకరణ నిర్మాణము మారినట్లుగానే కూడా మారతాయి. ఒక భాషలో పదములకు గల అర్థాలతో వచ్చిన మార్పును అర్థవిపరిణామం అంటారు. ఉదాహరణకు ప్రాచీన తెలుగులో ‘లావు’ అనే పదానికి ఇప్పటి ‘స్థాల్యం’ అవిగాక, ‘బలం’ అని అర్థం. పదాల అర్థాలకు, భాషను వాడేవారి సంస్కృతి సంప్రదాయములకు సన్నిహిత సంబంధముంది. పాశ్చాత్యులకు గోధుమరొట్టె ముఖ్యాహారం కాబట్టి ఇంగ్లీషులో ‘బ్రడ్’ అనే మాట ‘రొట్టె’ అనే అర్థంలోనే గాక ‘ఆహారం’ అనే సామాన్యార్థంలో కూడా వాడబడుతుంది. నిషిద్ధ ప్రయోగం, సభ్యోక్తి అనే ప్రక్రియలవల్ల కూడా అర్థ విపరిణామం ఏర్పడుతుంది.

ప్రశ్నలు :

1. భాషా స్వభావం ఎట్టిది ?
2. అర్థ విపరిణామం అంటే ఏమిటి ?
3. అర్థ విపరిణామానికి ఉదాహరణ వ్రాయండి. అర్ధానికి, సంస్కృతి సంప్రదాయములకు సంబంధం ఉందనడానికి ఉదాహరణ వ్రాయండి.
4. అర్థ విపరిణామం ఏర్పడడానికి కారణం ఏమిటి ?
5. భాషలో వచ్చే మార్పులేమిటి ?

24. లోకంలో రానురాను మంచితనం, నిజాయితీ తగ్గిపోతున్నాయి. చెప్పే మాటకు, చేసే పనికి సంబంధం ఉండడం లేదు. మోసం, అన్యాయం, అవినీతి పెరిగిపోతున్నాయి. ఎదుటివారు బాధపడుతుంటే తాము సంతోషపడే సంస్కృతి పెచ్చు
మీరుతోంది. ఆదర్శంగా ఉండాల్సిన పెద్దలే అప్పులు చేస్తుంటే మరి పిల్లలు మంచివాళ్ళెలా అవుతారన్నది జవాబు లేని ప్రశ్న కాదా ?

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఏ సంస్కృతి పెచ్చుమీరుతోంది ?
జవాబు.
ఎదుటివారు బాధపడుతుంటే తాము సంతోషపడే సంస్కృతి పెచ్చుమీరుతోంది.

ప్రశ్న 2.
జవాబు లేని ప్రశ్న ఏది ?
జవాబు.
ఆదర్శంగా ఉండాల్సిన పెద్దలే తప్పులు చేస్తుంటే మరి పిల్లలు మంచివాళ్ళెలా అవుతారన్నది జవాబులేని ప్రశ్న.

ప్రశ్న 3.
లోకంలో ఏవి తగ్గిపోతున్నాయి ?
జవాబు.
లోకంలో మంచితనం, నిజాయితీ తగ్గిపోతున్నాయి.

ప్రశ్న 4.
వేటికి సంబంధం ఉండడం లేదు ?
జవాబు.
చెప్పేమాటకు, చేసే పనికి సంబంధం ఉండదు.

ప్రశ్న 5.
లోకంలో ఏవి పెరిగిపోతున్నాయి ?
జవాబు.
మోసం, అన్యాయం, అవినీతి.

TS 8th Class Telugu అపరిచిత గద్యాలు

25. దేశభాషలో పరిపాలన, విద్యాబోధన, సమాచార వినిమయం వీటి ప్రాముఖ్యం రోజురోజుకు పెరిగిపోతోంది. అన్ని రంగాలలో భాష బహుముఖంగా వినియోగంలో ఉంది. ఈనాడు భాషా ప్రయోగరంగాలు విస్తరిస్తున్నాయి. ఆయాస్థాయిలలో విద్యార్థుల మానసిక స్థాయిని దృష్టిలో ఉంచుకొని భాషా పాఠ్యగ్రంథాలను రూపొందించవలసి ఉంది. భిన్నమైన శైలులు, భిన్నమైన ప్రక్రియలకు చెందిన పాఠ్యాంశాలను భాషా పాఠ్యగ్రంథాలలో చేర్చాలి. ఆధునిక వచన రచనాశైలికి విద్యార్థులకు పరిచయం చేయడం అత్యవసరం. పాఠ్యాంశాలు సమకాలీన సామాజిక దృషికి అభ్యంతరకరమైనవి కాకుండా ఉండాలి.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
దేనిని దృష్టిలో ఉంచుకొని భాషా పాఠ్యగ్రంథాలను రూపొందించాలి ?
జవాబు.
విద్యార్థుల మానసిక స్థాయిని దృష్టిలో ఉంచుకొని భాషా పాఠ్యగ్రంథాలను రూపొందించవలసి ఉంది.

ప్రశ్న 2.
భాషా పాఠ్యగ్రంథాలలో పాఠ్యాంశాలు ఎలాంటివి ఉండాలి ?
జవాబు.
భిన్నమైన శైలులు, భిన్నమైన ప్రక్రియలకు చెందిన పాఠ్యాంశాలు పాఠ్యగ్రంథాల్లో ఉండాలి.

ప్రశ్న 3.
ఎటువంటి పాఠ్యాంశాలు ఉండరాదు ?
జవాబు.
పాఠ్యాంశాలు సమకాలీన సామాజిక దృష్టికి అభ్యంతరకరమైనవిగా ఉండకూడదు.

ప్రశ్న 4.
విద్యార్థులకు దేనిని పరిచయం చేయడం అత్యవసరం ?
జవాబు.
విద్యార్థులకు ఆధునిక వచన రచనాశైలిని పరిచయం చేయడం అత్యవసరం.

ప్రశ్న 5.
ప్రస్తుతం వేటికి ప్రాముఖ్యం పెరిగి పోతోంది?
జవాబు.
దేశ భాషలో పరిపాలన, విద్యాబోధన, సమాచార వినిమయం.