TS Inter 1st Year Chemistry Notes Chapter 10 P-బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్

Here students can locate TS Inter 1st Year Chemistry Notes 10th Lesson P-బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్ to prepare for their exam.

TS Inter 1st Year Chemistry Notes 10th Lesson P-బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్

→ బోరాన్, అల్యూమినియమ్, గాలియమ్, ఇండియమ్ మరియు థాలియమ్ మూలకాలను 13వ గ్రూపు మూలకాలు అంటారు.

→ ఈ మూలకాల సాధారణ బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns2 np1.

→ బోరాన్ యొక్క పరమాణు పరిమాణం తక్కువగా ఉండటం వలన ఇది అసంగత ధర్మాలు ప్రదర్శిస్తుంది.

→ బోరాన్ ఒక అలోహం సంయోజనీయ సమ్మేళనాలను ఏర్పరచును.

→ ఈ గ్రూపు మూలకాలు +1, +3 ఆక్సీకరణ స్థితులు ప్రదర్శిస్తాయి. జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం వలన +3 ఆక్సీకరణ స్థితి యొక్క స్థిరత్వం పై నుంచి క్రిందకు తగ్గుతుంది.

→ బోరాన్ ఆక్సైడ్కు ఆమ్ల స్వభావం, Al, Ga ఆక్సైడ్లు ద్విస్వభావం TV ఆక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది.

→ బోరాన్ సమ్మేళనాలలో బోరాక్స్, డై బోరేన్ ముఖ్యమైనవి.

TS Inter 1st Year Chemistry Notes Chapter 10 P-బ్లాక్ మూలకాలు – 13వ గ్రూప్

→ బోరాన్ పూస పరీక్షను పరివర్తన లోహాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు.

→ బోరాన్ జల ద్రావణాన్ని వేడిచేస్తే ఆర్థో బోరిక్ ఆమ్లం ఏర్పడుతుంది.

→ బోరిక్ ఆమ్లంను వేడిచేస్తే చివరగా B2O3 ఏర్పడుతుంది.

→ డై బోరేన్లో బోరాన్ Sp3 సంకరీకరణం జరుపుకుంటుంది. దీనిలో B – H – B బ్రిడ్జ్ బంధాలు ఉంటాయి. వీటినే ‘3 కేంద్రక 2 ఎలక్ట్రాన్ల బంధం’ అని ‘బనానా బంధం’ అని కూడా అంటారు.

→ బోరానన్ను నారపోగులు, తుపాకిగుండు నిరోధక వస్త్రాల తయారీలో వాడతారు.

→ Al ను పరిశ్రమలలో, నిత్యజీవితంలో విస్తృతంగా వాడుతారు.

Leave a Comment