Here students can locate TS Inter 1st Year Chemistry Notes 2nd Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు to prepare for their exam.
TS Inter 1st Year Chemistry Notes 2nd Lesson మూలకాల వర్గీకరణ – ఆవర్తన ధర్మాలు
→ మెండలీవ్ ఆవర్తన నియమం : మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు”.
→ మెండలీవ్ సవరింపబడ్డ ఆవర్తన పట్టిక (modified Mendeleef’s periodic table) లో నిలువు గళ్లను ‘గ్రూపు’ ”శ్రేణులను ‘పీరియడ్’ లని మెండలీవ్ పేరు పెట్టాడు.
→ మెండలీవ్ ఆవర్తన పట్టికలో 9 గ్రూపులు (I నుండి VIII వరకు మరియు ‘సున్నా’ గ్రూపు) మరియు 7 పీరియడ్లు ఉన్నాయి.
→ 1913 సం||లో మోస్లే అను శాస్త్రవేత్త, మూలకాలపై X – కిరణాల ప్రయోగం ద్వారా, ‘పరమాణు సంఖ్య’ను మూలకపు అభిలాక్షణిక ధర్మమని కనుగొన్నారు.
→ మూలకాలకు పరమాణు భారం కాక, పరమాణు సంఖ్య, అభిలాక్షణిక ధర్మమని మోస్లే కనుగొన్నాడు.
→ ఆధునిక ఆవర్తన నియమం : “మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు”. ఇది మోస్లే ఆవర్తన నియమము.
→ మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలను ఆధారం చేసుకొని నీల్బోర్ విస్తృతావర్తన పట్టికను నిర్మించాడు.
→ సవరించబడిన ఆధునిక ఆవర్తన నియమం : “మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు”.
→ విస్తృత ఆవర్తన పట్టికలో మూలకాలను వాటి పరమాణు సంఖ్యల ఆరోహణ క్రమంలో అమర్చారు. * విస్తృత ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు, 18 గ్రూపులు ఉన్నాయి.
→ ఆవర్తన పట్టికలోని గ్రూపులను గుర్తించడానికి
- అమెరికన్ సంప్రదాయం
- యూరోపియన్ సంప్రదాయం మరియు
- IUPAC పద్ధతులు ఉన్నాయి..
→ ప్రస్తుత పాఠ్య గ్రంథంలో వాడినది అమెరికన్ సంప్రదాయం. దీనిలో ప్రధాన గ్రూపులను A తోను ఉపగ్రూపులను B తోను సూచిస్తారు.
→ భేదపరచే ఎలక్ట్రాన్ (differentiating electron) ప్రవేశించే ఉపస్థాయిని బట్టి ఆవర్తన పట్టికలోని మూలకాలను s, p, d, f అనే నాల్గు బ్లాకులుగా వర్గీకరించారు.
→ s బ్లాకు మూలకాల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns1-2
→ p బ్లాకు మూలకాల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ns2np1-6
→ జడవాయువుల బాహ్య విన్యాసం ns2 మరియు ns2 np6
→ d బ్లాకు మూలకాల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం (n – 1) d1-10 ns1-2
→ అంతర్ పరివర్తన మూలకాలు రెండు వరుసలలో ఉన్నాయి. అవి
- లాంథనైడ్లు
- ఆక్టినైట్లు
→ అంతర్ పరివర్తన మూలకాల సాధారణ బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం (n – 2) f1-14 (n – 1) d0 లేదా 1ns2 గా ఉంటుంది.
→ పూర్తిగా మరియు అసంపూర్తిగా నిండిన కర్పరాలను బట్టి విస్తృత ఆవర్తన పట్టికలోని మూలకాలను నాల్గు వర్గాలుగా విభజించారు. అవి
- జడవాయువులు
- ప్రాతినిధ్య మూలకాలు
- పరివర్తన మూలకాలు
- అంతర్ పరివర్తన మూలకాలు.
ఈ విభజన, మూలకాల లక్షణాలను మరియు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కూడా ఆధారం చేసుకొని ఉన్నది.
→ Zn, Cd మరియు Hg లు పరివర్తన మూలకాల ధర్మాలు చూపవు. కాని పరివర్తన మూలకాల రసాయన అధ్యయనాన్ని క్రమబద్ధీకరించడానికి వాటిని బ్లాకులో చేర్చారు.
→ ఆవర్తన పట్టికలో మూలకాల ధర్మాలు ఎలక్ట్రాన్ విన్యాసంతో బాటు క్రమంగా మారుతాయి. ధర్మాలలోని ఈ క్రమమైన మార్పు నిర్ణీత వ్యవధుల (మూలకాల తర్వాత) లో పునరావృతమవుతుంది. ఈ విధంగా ఒక ధర్మం (పరమాణు భారం, పరమాణు సంఖ్య కాదు) పునరావృతమవడాన్ని ‘ఆవర్తనం’ అంటారు.
→ పునరావృతమయ్యే ధర్మాలను ‘ఆవర్తన ధర్మాలు’ అంటారు. దీనికి కారణం, ఆ మూలకాల వేలన్నీ కక్ష్యలలో ఒకే సంఖ్యలో ఎలక్ట్రానులుండుట.
→ పరమాణు కేంద్రకం మధ్య బిందువు నుంచి బాహ్యతమ శక్తిస్థాయి ఎలక్ట్రాన్ మేఘానికి మధ్య గల దూరాన్ని పరమాణు వ్యాసార్ధం అంటారు.
→ లోహ స్పటికంలో రెండు ఆసన్న లోహ పరమాణు కేంద్రకాంతర్గత మధ్య బిందువుల మధ్య దూరంలో సగాన్ని ‘స్ఫటిక వ్యాసార్ధం లేదా ‘లోహ వ్యాసార్ధం’ అంటారు.
→ అతి సన్నిహితంగా ఉన్న భిన్న అణువుల్లోని రెండు పరమాణువుల కేంద్రకాల మధ్య దూరంలో సగాన్ని వాన్ డర్ వాల్ వ్యాసార్ధం అంటారు.
→ సజాతీయ పరమాణువులున్న అణువులో కోవెలంట్ బంధంతో కలపబడి ఉన్న రెండు పరమాణుకేంద్రకాల మధ్య దూరంలో సగాన్ని కోవెలంట్ వ్యాసార్ధం అంటారు.
→ మాతృపరమాణువు కన్నా దాని కేటయాన్ సైజు అల్పంగాను, దాని ఆనయాన్ సైజు అధికంగాను ఉంటుంది.
→ Ce నుండి Lu వరకు గల లాంథనైడు పరమాణువులలోని పరిమాణం (size) లోని క్రమమైన తగ్గుదలను ‘లాంథనైడ్ సంకోచం అంటారు.
→ కేంద్రకంలో అదనపు ఆవేశంపై కీ ఎలక్ట్రానుల దుర్బల పరిరక్షక ప్రభావం వలన, ఈ మూలకాల సైజులు వరసగా Ac నుండి Lw వరకు తగ్గుతూ ఉంటాయి. దీన్ని ‘ఆక్టినైడ్ సంకోచం’ అంటారు.
→ ఆక్టినైడ్ సంకోచానికి కారణం, f ఆర్బిటాళ్ల విప్పారిన ప్రత్యేక ఆకారాలు.
→ స్వేచ్ఛా స్థితిలో ఉండే వాయు పరమాణువు నుంచి అత్యంత బలహీనంగా బంధితమైన ఎలక్ట్రాన్ను విడదీసి వాయుస్థితిలో అయాన్ను ఏర్పరచడానికి అవసరమైన కనీస శక్తిని అయనీకరణ ఎంథాల్పీ లేదా అయనీకరణశక్తి అంటారు.
→ “వాయుస్థితిలోని మూలకం తటస్థపరమాణువుకు ఎలక్ట్రాన్ను చేర్చి దాన్ని అయాన్గా మార్చినప్పుడు విడుదలైన శక్తిని ఆ మూలకం ఎలక్ట్రాన్ ఎఫినిటి (లేదా ఎలక్ట్రాన్ అపేక్ష)” అంటారు.
→ “విజాతీయ పరమాణువులున్న ఒక ద్విపరమాణుక అణువులో లేదా ధృవ సంయోజనీయ బంధంలో సమిష్టిగా పంచుకొన్న ఎలక్ట్రాన్ జంట(ల)ను మూలక పరమాణువు తనవైపుకు ఆకర్షించుకునే ప్రవృత్తిని ఆ మూలకం ఋణవిద్యుదాత్మకత” అంటారు.
→ ముల్లికెన్ ఋణవిద్యుదాత్మకత స్కేల్ ప్రకారం, “ఏక సంయోజకత గల పరమాణువుల ఋణవిద్యుదాత్మకత వాటి అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ అపేక్షల సగటు విలువ”.
→ పౌలింగ్, బంధవిలువల నుంచి పరమాణువుల ఋణవిద్యుదాత్మకతను ప్రతిపాదించాడు.
→ పౌలింగ్ ననుసరించి, XA – XB = 0.208\(\sqrt{\Delta_{\mathrm{A}-\mathrm{B}}}\) XA, XB లు A, B పరమాణువుల ఋణవిద్యుదాత్మకతలు.
→ పౌలింగ్, హైడ్రోజన్కు 2.1 ఋణవిద్యుదాత్మకతను ఇచ్చాడు. దీని ఆధారంగా ఫ్లోరిన్కు 4.0 మరియు మిగతా మూలకాల విలువలు నిర్ణయించారు.
→ వేలన్సీ అనగా ‘కలయిక శక్తి’, ఒక మూలకపు పరమాణువు ఎన్ని హైడ్రోజన్ లేదా ఎన్ని క్లోరిన్ లేదా ఎన్ని ఏకసంయోజక (univalent) పరమాణువులతో కలుస్తుందో, అది ఆ మూలకపు సంయోజకత.
→ ఏదైనా ఒక గ్రూపులో వేలన్సీ ఆ గ్రూపు సంఖ్యకు (IV గ్రూపు వరకు) లేదా (8 – గ్రూపు సంఖ్య)కు (V గ్రూపు నుంచి) సమానమవుతుంది.
→ “ఒక నిర్దిష్ట జాతిలో ఉండే ఒక మూలక పరమాణువు పొందుతుందనుకునే విద్యుదావేశాన్ని ఆ మూలకపు -ఆక్సిడేషన్ స్థితి లేదా ఆక్సిడేషన్ సంఖ్య” అంటారు.
→ కొన్ని p మరియు దాదాపు అన్ని d బ్లాకు మూలకాలు కూడా చర సంయోజకత (variable valency) ని ప్రదర్శిస్తాయి.
→ బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రాన్ జంట (అనగా ns’ ఎలక్ట్రాన్లు) ఒంటరి ఎలక్ట్రాన్లుగా విడిపోయి బంధంలో పాల్గొనడానికి చూపే విముఖతను “జడజంట ప్రభావం” అంటారు.
→ జడజంట ప్రభావం, III, IV, V గ్రూపుల ప్రతినిధి మూలకాలలో గ్రూపు చివరి మూలకంలో (Tl, Pb మరియు Bi లలో) గరిష్ఠంగా ఉంటుంది.
→ ఒక మూలకం ఎలక్ట్రాన్లను వదులుకోవడానికి చూపించే సుముఖతను ధనవిద్యుదాత్మకత అంటారు. దీన్నే లోహ ప్రపత్తి (metallic nature) అని కూడా అంటారు.
→ ఆవర్తన పట్టికలో 2వ పీరియడ్లోని ఒక మూలకానికి, ఆ మూలకానికి ఐమూలగా ఉండే తర్వాతి గ్రూపులోని మూలకానికి ధర్మాలలో గల సారూప్యతను, ‘కర్ణ సంబంధం’ అంటారు.
→ కర్ణ సంబంధానికి కారణాలు : రెండు మూలకాలకు
(a) అయాన్ లేదా పరమాణువు సైజులు దాదాపు సమానం.
(b) ఋణవిద్యుదాత్మకతలు దాదాపు సమానం.
(c) ధృవణ సామర్థ్యాలు దాదాపు సమానం.