Here students can locate TS Inter 1st Year Chemistry Notes 13th Lesson కర్బన రసాయన శాస్త్రం – సామాన్య సూత్రాలు, విధానాలు to prepare for their exam.
TS Inter 1st Year Chemistry Notes 13th Lesson కర్బన రసాయన శాస్త్రం – సామాన్య సూత్రాలు, విధానాలు
→ కార్బన్ సమ్మేళనాలను గురించి తెలిపే విభాగాన్ని కర్బన రసాయన శాస్త్రం అంటారు.
→ కర్బన సమ్మేళనాలను అచక్రీయ మరియు చక్రీయ సమ్మేళనాలుగా విభజించారు. అచక్రీయ సమ్మేళనాలను సంతృప్త అసంతృప్త సమ్మేళనాలుగా విభజించారు.
→ ఏదైనా పరమాణువు లేదా పరమాణువుల సముదాయం విశిష్ట పద్ధతిలో బంధించబడి ఆ కర్బన సమ్మేళన స్వాభావిక రసాయనిక లక్షణాలకు కారణమైందో దానిని ప్రమేయ సమూహం అంటారు.
→ ఒకే ప్రమేయ సమూహాలున్న కర్బన సమ్మేళనాలను సమజాత శ్రేణులు అంటారు.
→ కర్బన సమ్మేళనాలను IUPAC పద్ధతి ద్వారా నామకరణం చేస్తారు.
→ ఒకే అణు సంకేతం కలిగి ఉండి భిన్న ధర్మాలను ప్రదర్శించే సమ్మేళనాలను సాదృశ్యాలు అంటారు. ఈ ప్రక్రియను సాదృశ్యం అంటారు.
→ సాదృశ్యం రెండు రకాలు.
- నిర్మాణాత్మక సాదృశ్యం,
- త్రిమితీయ సాదృశ్యం.
→ కర్బన కారకాలు మూడు రకాలు.
- ఎలక్ట్రోఫైల్లు,
- న్యూక్లియోఫైల్లు మరియు
- స్వేచ్ఛా ప్రాతిపదికలు.
→ ప్రతిక్షేపణ చర్యలు, సంకలనాత్మక చర్యలు, విలోపన చర్యలు, అణుపునరమరికలు మొదలగునవి సాధారణ కర్బన రసాయన చర్యలు.
→ C – C ఏకబంధం ద్వారా భ్రమణం జరిపితే ఆల్కేన్ల అనురూపకాలు వస్తాయి. ఈథేన్, గ్రహణ మరియు అస్తవ్య అనురూపకాలను ఏర్పరుస్తుంది.
→ సమయోజనీయ బంధంపై శాశ్వత ధ్రువణ ప్రభావాలు ఏర్పడతాయి. అవి ప్రేరేపక ప్రభావం మరియు రెజోనెన్స్ ప్రభావాలు.
→ ఎలక్ట్రోమెరిక్ మరియు ధ్రువణశీలత ప్రభావాలు మొదలగునవి తాత్కాలిక ఎలక్ట్రాన్ స్థానభ్రంశ ప్రభావాలు.
→ స్ఫటికీకరణం, ఉత్పతనం, స్వేదనం, పాక్షిక అంశిక స్వేదనం, నిర్వాత స్వేదనం, ద్రావణి నిష్కర్షణ, క్రోమటోగ్రఫీ మొదలగునవి కర్బన పదార్థాలను శుద్ధి చేసే విధానాలు.
→ లాసైన్ (లేదా) సోడియం నిష్కర్షణ పరీక్ష ద్వారా నైట్రోజన్, హాలోజన్, సల్ఫర్లను గుర్తిస్తారు.
→ డ్యూమా మరియు జెల్దాల్ పద్ధతులతో నైట్రోజన్ భారశాతమును కనుక్కోవచ్చు.
→ కేరియస్ పద్ధతిలో హాలోజన్ల భారశాతం కనుక్కోవచ్చు.
→ ఆల్కైల్ హాలైడ్ల క్షయకరణం ద్వారా లేదా ఉర్జి చర్య ద్వారా కాని ఆల్కేనులను తయారు చేస్తారు.
→ ఈథేన్ ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటుంది. ఈథేన్ క్లోరినేషన్ శృంఖల చర్యకు ఉదాహరణ.
→ ఫ్రూయిండ్ పద్ధతి, విప్లిసెనస్ పద్ధతి, డిక్మెన్ పద్ధతి, డీల్స్-ఆర్డర్ పద్ధతి మొదలగు పద్ధతుల ద్వారా సైక్లోహెక్సేన్ను తయారు చేస్తారు.
→ క్షేత్ర సాదృశ్యం ఆల్కీన్లలో కనిపిస్తుంది. దీనినే సిస్-ట్రాన్స్ సాదృశ్యం అంటారు.
→ ఒక అసమకారకం ద్విబంధం దగ్గర సంకలనం చెందేటప్పుడు మార్కోనికాఫ్ నియమం ప్రకారం జరుగుతుంది.
→ మస్టర్డ్ వాయువు తయారీలో ఇథిలీన్ ను వాడతారు.
→ అయోడోఫామ్ నుంచి లేదా CaC2 నుంచి ఎసిటిలీన్ ను తయారు చేస్తారు.
→ ఎసిటిలీన్లో హైడ్రోజన్లకు ఆమ్ల లక్షణం ఉంటుంది.
→ కోల్తారన్న పాక్షిక స్వేదనానికి గురిచేస్తే బెంజీన్ ఏర్పడుతుంది. ఎసిటిలీన్ ను పాలిమెరీకరణం చేసి బెంజీన్ ను తయారు చేస్తారు.
→ బెంజీన్ ఏరోమాటిక్ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటుంది.
→ క్షేత్ర సాదృశ్యాల నామకరణానికి E – Z పద్ధతిని వాడతారు.
→ బహుకేంద్రక వలయాల హైడ్రోకార్బన్లు క్యాన్సర్ కారకాలు. ఉదా : 1, 2 బెంజ్ పైరీన్.