Here students can locate TS Inter 1st Year Chemistry Notes 12th Lesson పర్యావరణ రసాయన శాస్త్రం to prepare for their exam.
TS Inter 1st Year Chemistry Notes 12th Lesson పర్యావరణ రసాయన శాస్త్రం
→ మనం నివసించే ప్రాంతం లేదా మన చుట్టూ ఉండే గాలి, నీరు, నేల, వాతావరణం, మొక్కలు అన్నింటిని ఉమ్మడిగా పరిసరాలు అంటారు.
→ భూమి చుట్టూ పరివేష్టితమై ఉండే వాయువుల పొరను వాతావరణం అంటారు.
→ పర్యావరణాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. అవి
- వాతావరణం
- జలావరణం
- శిలావరణం
- జీవావరణం.
→ మానవులు లేదా ప్రకృతి కార్యకలాపాల ద్వారా పరిసరాలలోకి వదిలిపెట్టబడి, పరిసరాల మీద దుష్ప్రభావం చూపే పదార్థాన్ని మలినం అంటారు.
→ ప్రకృతిలో సహజంగా లభించని, మానవుల లేదా ప్రకృతి కార్యకలాపాల ద్వారా పరిసరాలలోకి వదిలిపెట్టబడిన పదార్థాన్ని మలినం అంటారు.
→ కాలుష్య ప్రభావానికి గురయ్యే మాధ్యమాన్ని గ్రాహకం అంటారు.
→ కాలుష్యాలతో చర్య జరిపే మాధ్యమాన్ని సింక్ అంటారు.
→ నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ పరిమాణాన్ని విద్రావణ ఆక్సిజన్ అంటారు.
→ ఐదురోజుల కాలంలో నీటిలోని అనువైన సూక్ష్మజీవులు ఉపయోగించుకునే ఆక్సిజన్ పరిమాణాన్ని జీవరసాయన ఆక్సిజన్ అవసరం (BOD) అంటారు.
→ కలుషితమైన నీటిలో కరిగి ఉండే కర్బన రసాయనిక పదార్థాలను పూర్తిగా ఆక్సీకరణం చెందించటానికి అవసరమయ్యే ఆక్సిజన్ పరిమాణాన్ని రసాయనిక ఆక్సిజన్ అవసరం (COD) అంటారు.
→ COD, BOD విలువలు నీటి కాలుష్య పరిమాణాన్ని సూచిస్తాయి.
→ ఒక రోజులో ఒక వ్యక్తి 8 గంటల కాలం గాలిలోని విష పదార్థాలకు లేదా కాలుష్యాలకు గురి అయినప్పుడు వ్యక్తి ఆరోగ్యాన్ని భంగపరచటానికి అవసరమయ్యే పదార్థాల కనీసపు స్థాయిని ఆరంభ అవధి విలు (TLV)
→ pH విలువ 4-5 కలిగిన వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు. గాలి కాలుష్యం ఆమ్ల వర్షానికి ప్రధాన కారణం.
→ వాతావరణంలోని CO2, నీటి ఆవిరులపై అధిక గాఢతల కారణంగా, వాటికి బహిర్గమన నిరోధక ప్రభావం కారణంగా భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనిని భూగోళం వేడెక్కడం లేదా గ్రీన్ హౌస్ ఫలితం అంటారు.
→ నీటిలో ఫ్లోరిన్ ఉండదగిన శాతం – < 2 PPM మరియు > 1 PPM.
→ అడవులను నరికివేయటం – గ్రీన్ హౌస్ ఫలితానికి ప్రధాన కారణం.
→ స్ట్రాటో ఆవరణంలోని ఓజోన్ పరిరక్షక పొరగా వ్యవహరిస్తుంది. కానీ, ట్రోపో ఆవరణంలోని ఓజోన్ హానికరమైనది.
→ ఉత్తేజిత చార్కోల్ DDT మరియు ఎండ్రిన్ వంటి కొన్ని సేంద్రీయ పదార్థాలను శోషించుకొంటుంది.
→ అన్ని జీవ పదార్థాలు మరియు వాటి పరిసరాల మధ్య సంబంధాన్ని ఎకోసిస్టమ్ (Eco System) లేదా సమతుల్య వ్యవస్థ అంటారు.
→ అధిక ఫ్లోరిన్ ఫ్లోరోసిస్ వ్యాధిని కలుగచేస్తుంది.
→ కార్బన్, ఫ్లోరిన్ మరియు క్లోరిన్లను కలిగి ఉన్న సమ్మేళనాలను క్లోరోఫ్లోరో కార్బన్లు అంటారు. వీటిని ఫ్రీయాన్లు అని కూడా అంటారు.
→ ఫ్రీయాన్లను శీతలీకరణులుగా ఉపయోగిస్తారు.
→ ఓజోన్ను ఆక్సిజన్గా విఘటనం చెందించే ప్రక్రియలో ఉత్తేజిత క్లోరిన్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
→ సల్ఫ్యూరికామ్లం, నత్రికామ్లములు వర్షపు నీటిలో కరగడం వల్ల ఏర్పడే వర్షాలను ఆమ్ల వర్షాలు అంటారు.
→ ఓజోన్ పొరకు చిల్లులు ఏర్పరచే వాయువులలో ముఖ్యమైనవి : CFC’s, NO, క్లోరిన్.
→ వాతావరణంలోని CO2, NO, N2O, CH4, O3, మొ॥ వాయువులు భూగోళం వేడెక్కడానికి లేదా గ్రీన్ హౌస్ ఫలితానికి కారణాలు.
→ పారిశ్రామిక వ్యర్థాల వల్ల కూడా వాతావరణం కాలుష్యం అవుతుంది.
→ పర్యావరణంలో కాలుష్యం రాకుండా చూడటం గురించి చెప్పే రసాయనశాస్త్ర విభాగాన్ని హరిత రసాయనశాస్త్రం అంటారు.