TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 10th Lesson సింగరేణి Textbook Questions and Answers.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

బొమ్మను చూడండి ఆలోచించి చెప్పండి
TS-8th-Class-Telugu-Guide-10th-Lesson-సింగరేణి-1

ప్రశ్న 1.
చిత్రంలో కనపడుతున్నవాళ్ళు ఏం పనులు చేస్తున్నారు ?
జవాబు.
చిత్రంలో కనపడుతున్నవాళ్ళు బొగ్గు గనుల నుండి బొగ్గును బయటకు తెస్తున్నారు.

ప్రశ్న 2.
చిత్రంలో ఏయే వస్తువులు కనపడుతున్నాయి ?
జవాబు.
చిత్రంలో బ్యాటరీలైట్లు, బొగ్గుతో నిండిన గంపలు, తలలకు హెల్మెట్లు కన్పిస్తున్నాయి.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

ప్రశ్న 3.
చిత్రం దేనికి సంబంధించిందని మీరు అనుకొంటున్నారు ?
జవాబు.
ఈ చిత్రం బొగ్గు గనులకు సంబంధించిందని అనుకుంటున్నాను.

ప్రశ్న 4.
తెలంగాణలో బొగ్గు గనులు ఏ ఏ జిల్లాలలో ఉన్నాయి ?
జవాబు.
తెలంగాణలో కరీంనగర్, వరంగల్లు, ఖమ్మం జిల్లాలలో బొగ్గు గనులున్నాయి.

ప్రశ్న 5.
నేలబొగ్గు వల్ల ఉపయోగాలేవి ?
జవాబు.
నేలబొగ్గు పరిశ్రమలకు ఇంధనంగా, విద్యుత్ ఉత్పత్తికి, రోడ్లు వేయటానికి తారుగా, ప్లాస్టిక్ను తయారు చేయటానికి, తలకు రాసే సువాసన నూనెలను తయారు చేయటానికి, బట్టలకు వేసే అద్దకాల రంగులను తయారుచేయటానికి ఉపయోగపడుతుంది.

ఆలోచించండి – చెప్పండి

1. “శ్రమజీవే జగతికి మూలం … చెమటోడ్చక జరుగదు కాలం’ అన్న వాక్యాన్ని ఏవిధంగా అర్థం చేసుకున్నారు?
జవాబు.
మానవ జీవితం సుఖమయం కావాలంటే అందరి అవసరాలు తీరాలి. అందరి అవసరాలు తీరాలంటే జాతీయోత్పత్తులు పెరగాలి. జాతీయోత్పత్తులు పెరగాలంటే అందరూ కష్టపడి పని చేయాలి. అందుకే శ్రమజీవే జగతికి మూలం అని అర్థం చేసుకున్నాం.

2. ఈ నేల బొగ్గును ‘నల్ల బంగారం’ అని ఎందుకంటారు ?
జవాబు.
బంగారం ఎన్ని రకాలుగా ఉపయోగపడుతూ మన విలువను పెంచుతుందో అన్నివిధాలుగా బొగ్గుకూడా ఉపయోగపడుతున్నది. కావున బొగ్గును బంగారంతో పోల్చి ‘నల్ల బంగారం’ అని అంటున్నాం.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

3. ‘సహజ సంపదను వినియోగించుకొనే విజ్ఞానం పైననే మానవ నాగరికత నిర్మించబడుతున్నది’ చర్చించండి.
జవాబు.
ఒకదేశం తనకున్న సహజవనరులను ఎంత విరివిగా ఉపయోగించుకుంటే అంత అభివృద్ధిని సాధిస్తుంది. ఉదాహరణకు ప్రకృతి ప్రసాదించిన సహజ సంపద బొగ్గు. దానిని పలు పరిశ్రమలు పలురకాలుగా వాడుకుంటున్నాయి. అలాగే అటవీ సంపద, జల సంపద వీటిని పూర్తి వినియోగంలోనికి తేవటం ద్వారా సామాజిక ఎదుగుదలకు అవకాశాలుంటాయి.

4. ఈ ‘దేశంలో మరే ఇతర బొగ్గు సంస్థకు లేని ప్రత్యేకత సింగరేణి గనులకు ఉన్నది’ ఎందుకో చర్చించండి.
జవాబు.
సింగరేణి గనుల్లో అపారంగా, తరిగిపోనన్ని బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ గనుల్లోని బొగ్గు నాణ్యమైంది. ఇవి తెలంగాణా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తూ, సామాజిక, ఆర్థిక స్థితులను మెరుగుపరిచాయి.

5.”బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలకమైన పనిముట్టు” అని ఎందుకన్నారు?
జవాబు.
సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషించేది కార్మికులే! వారందరూ తెలంగాణ గ్రామీణ ప్రాంత వాసులు. గనులలోకి వెళ్ళి బొగ్గును త్రవ్వి పోగుచేసి తట్టల్లో ఎత్తి వెలుపలికి పంపిస్తారు. ఆ నైపుణ్యం గని కార్మికులకే ఉంటుంది. అందుకే బొగ్గు ఉత్పత్తిలో కార్మికుడే అత్యంత కీలకమైన పనిముట్టు అని అన్నారు.

6. ‘గడియారం ముండ్లవలె పనిచేస్తున్న కార్మికులు’ అన్న వాక్యాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు?
జవాబు.
శ్రమకు ప్రతినిధిగా గడియారం ముల్లును సూచిస్తాం. అట్లాగే బొగ్గుగనిలో పనిచేసే కార్మికులు కోడికూత కంటే ముందే లేచి గనులలోకి వెళ్ళేవారు వెళ్తుంటారు, వచ్చేవారు వస్తుంటారు. ఇలా గడియారం ముల్లులు తిరిగినట్లు కార్మికులు కూడా విరామం లేకుండా మూడు షిఫ్టుల్లో పనిచేస్తూనే ఉంటారని అర్థమయింది.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

7. ప్రమాదాల అంచున నిలబడి పని చేయటం అంటే ఏమిటి?
జవాబు.
ప్రమాదాల అంచున నిలబడి పనిచేయట మంటే గనిలోకి వెళ్ళిన కార్మికులకు ఎపుడు ఏవిధంగా ప్రమాదం ఏర్పడుతుందో తెలియదు. గనులు విరిగిపడి, గనులలోకి నీరువచ్చి, గాలి వెలుతురులు లేక ఊపిరితిత్తుల సమస్యలు తరచు వారి ఆరోగ్యాన్ని పాడుచేస్తుంటాయి. అందుకే వారు ప్రమాదాల అంచున పనిచేసే కార్మికులని అర్థమౌతుంది. ఏ ప్రమాదం ఎక్కడ పొంచి వున్నదో చెప్పలేని పరిస్థితి..

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. సింగరేణి కార్మికులు కాయకష్టం చేసి బొగ్గు తీస్తున్నారు కదా! కార్మికుల జీవితాల గురించి మీకేం అర్థమయిందో చెప్పండి.
జవాబు.
తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనులు దేశంలోనే ప్రసిద్ధి వహించినవి. దానికి కారకులు సింగరేణి గనులలో పనిచేసే గని కార్మికులే! ఆ కార్మికులందరూ తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజలే! వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు సింగరేణికి ఊపిరులయ్యాయి. బ్రతుకు భారాన్ని మోయటానికి కష్టం చేయక తప్పిందికాదు. ప్రారంభంలో వారి శ్రమకు తగిన ఫలితం కూడా వచ్చేది కాదు.

తరువాత కార్మిక సంఘాల చైతన్యంతో తగిన కూలీ రెట్లతో వారి జీవితాలు కొంతలో కొంత మెరుగు పడ్డాయి. బొగ్గు గనుల్లో పనిచేయట మంటే ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవటమే! ఏ బతుకుదెరువు లేకపోతే ఈ పనిలో చేరేవారు. కార్మికులు రాత్రి పగలు అను భేదం లేకుండా కష్టపడి పనిచేస్తుంటారు. గడియారంలో ముల్లు విరామం లేకుండా ఎట్లా తిరుగుతుందో సింగరేణి కార్మికులు కూడా నిరంతరం కృషికి ప్రతినిధులని అర్థమౌతుంది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం చదువడం-అర్థం

1. కింది గేయాన్ని చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఇష్టదేవతకు దండం పెట్టి
గనిలోనికి నువు అడుగుబెట్టి
బళ్ళున బొగ్గు కూలుత ఉంటే
ప్రాణాలకు వెనుకాడక నువ్వు
రక్తమాంసాలు చెమటగ మార్చి
టబ్బుల్లోన బొగ్గు నింపుతవ్
జాతికి వెలుగులు అందిస్తుంటవు
“నల్లసూర్యుని”వై వెలుగొందుతవు.

ప్రశ్నలు :

అ. గేయం ఎవరిని గురించి తెలుపుతుంది?
జవాబు.
ఈ గేయం బొగ్గు కార్మికుని గురించి తెలుపుతుంది.

ఆ. ఇష్టదేవతకు ఎందుకు దండం పెడతారు ?
జవాబు.
ఇష్టదేవతకు తమకు కష్టం రానీయవద్దని దండం పెడతారు.

ఇ. కార్మికుడిని ‘నల్లసూర్యుడు’ అని ఎందుకన్నారు?
జవాబు.
సూర్యుడు లోకాలకు వెలుగులను పంచినట్లు, నల్లసూర్యునిగా పిలువబడుతున్న గని కార్మికుడు ప్రపంచానికి కరెంటు కాంతిని అందిస్తున్నాడు. అందుకే బొగ్గుగని కార్మికుడిని నల్లసూర్యుడని అన్నారు.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

ఈ. జాతికి వెలుగు అందించడమంటే ఏమిటి?
జవాబు.
జాతికి వెలుగు అందించట మంటే జాతి పురోభివృద్ధికి పాటుపడటమని అర్థం.

ఉ. తెలంగాణలో బొగ్గుగనులు ఎక్కడున్నాయి?
జవాబు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లందులోను, అదిలాబాద్ జిల్లా తాండూరులోను, కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోను, తెలంగాణలోని గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో బొగ్గుగనులు విస్తరించి ఉన్నాయి.

2. కింది పేరా చదువండి. అయిదు ప్రశ్నలను తయారు చేయండి.

తెలంగాణ బట్టల అద్దకం విషయంలో అనాదిగా ప్రాముఖ్యత వహించిన ప్రదేశం. ఒకప్పుడు ఆ పరిశ్రమ ఉన్నతదశలో ఉండేది. కాని దేశంలో వచ్చిన ఆర్థిక చిక్కులు ఈ పరిశ్రమను కష్టనష్టాలకు గురిచేశాయి. విదేశాలలో యంత్రాలపై తయారైన బట్టలకు అలవాటుపడిన ఈ నాటి వారికి మన చేతి పనుల వలన తయారయ్యే సుందర వస్త్రాల గురించి నేటికైనా కనువిప్పు కలిగింది.

అ. ఈ పేరా మనకు దేనిని గురించి వివరిస్తుంది?
ఆ. ఒకప్పుడు తెలంగాణ దేనికి ప్రాముఖ్యత వహించిన ప్రదేశం?
ఇ. ఒకప్పుడు ఏ కుటీర పరిశ్రమ తెలంగాణలో ఉన్నతస్థితిలో ఉండేది?
ఈ. బట్టల అద్దకం పరిశ్రమ ఎందుకు కష్టనష్టాలకు గురి అయింది?
ఉ. విదేశాలలోని యంత్రాలపై ఎట్లాంటి వస్తువులు తయారయ్యేవి?
ఊ. చేతి పనులపై తయారయ్యే వస్తువులు ఎలా ఉంటాయి?
ఎ. నేటికి ప్రజలలో ఏ విషయంలో కనువిప్పు కలిగింది?

III. స్వీయరచన:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. సహజ సంపదలను వినియోగించుకునే విజ్ఞానం పైన మానవ నాగరికత నిర్మించబడుతుందని ఎట్లా చెప్పగలవు?
జవాబు.
ఒక దేశం తనకున్న సహజ వనరులను చక్కగా వినియోగించుకుంటేనే మంచి అభివృద్ధిని సాధించగలుగుతుంది. ప్రపంచదేశాలన్నీ పారిశ్రామికంగా ముందంజలో ఉన్నాయి. భారతదేశం కూడా వాటితో పోటీ పడాలంటే పారిశ్రామిక అభివృద్ధిని సాధించాలంటే సహజ సంపదలను వినియోగించుకోక తప్పదు. అప్పుడే నిజమైన మానవ నాగరికత నిర్మించబడుతుంది. ఉదాహరణకు జలవనరులను, ఖనిజ సంపదను ఉపయోగించుకోవటం ద్వారా మనం దేశాభివృద్ధిని చేసుకోగలిగాం. అట్లాగే పలు పరిశ్రమలకు, విద్యుదుత్పత్తికి, రంగుల తయారీకి, రోడ్లకు మూలమైన నేలబొగ్గును ఒక సహజవనరుగా ఉపయోగించటం వలన అభివృద్ధికి రాచబాటలు వేసుకోగలమని చెప్పగలను.

ఆ. “బుక్కెడు బువ్వకోసం బతుకు పోరాటానికి సిద్ధమైనారు” దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారో తెల్పండి.
జవాబు.
తెలంగాణా పోరాటగడ్డ. వారు జీవితంలో తిండికి గుడ్డకు, స్వాతంత్ర్యానికి పోరాటం అనాదిగా సాగిస్తూనే ఉన్నారు. శ్రమలేకుండా సుఖం లేదన్నది వారి సిద్ధాంతం. శ్రమజీవే జగతికి మూలం. చెమటోడ్చక జరుగదు కాలం. అందుకే శ్రమజీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని శ్రీశ్రీ అని ఉంటారు. తెలంగాణ గ్రామీణులు మిక్కిలి పేదవారు. నీటికి కటకట పడుతున్న ప్రాంతమది. నీటి సదుపాయం లేకపోవటం వలన వర్షం మీద ఆధారపడి పంటలు పండిస్తారు. వర్షం పడకపోతే క్షామం తప్పనిసరి. అందుకే ‘బుక్కెడు బువ్వకోసం బతుకు పోరాటానికి సిద్దమై ప్రమాదం పొంచి ఉన్నా బొగ్గు గనులలో పనిచేయుటకు సిద్ధమయ్యారు. బొగ్గుగనులు వారికి జీవన భృతినిస్తున్నాయి.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

ఇ. పగలు, రేయి తేడా లేకుండా గడియారం ముండ్లవలె పని చేయటం అంటే ఏమిటి ? కార్మికుల పనితో అన్వయించి రాయండి.
జవాబు.
సింగరేణి కార్మికులు పగలు రేయి తేడా లేకుండా గడియారం ముండ్లవలే పనిచేస్తుంటారు. కోడి కూతకు ముందే లేచి తయారై గనిలోకి పోయేవారు కొందరైతే, పగలు మూడు గంటలకు గనులలోకి పోయేవారు మరికొందరు. అర్ధరాత్రి పనికి పోయేవారు ఇంకొందరు. ఇట్లా ప్రొద్దున నుండి అర్ధరాత్రి వరకు మూడు షిఫ్టుల్లో గనుల్లో పని చేస్తూనే ఉంటారు. ఇలా గడియారం ముళ్ళు విసుగు విరామం లేకుండా ఎట్లా పనిచేస్తాయో అట్లానే సింగరేణి కార్మికులు కూడా పనిచేస్తున్నారని తెలుస్తుంది.

ఈ. డాక్టర్ కింగ్ పరిశోధనల వల్ల కల్గిన మేలు ఏమిటి?
జవాబు.
సింగరేణి గనుల విశిష్టతలను లోకానికి తెలియజేసిన వాడు డాక్టర్ కింగ్. ఆయన పరిశోధనల వలన దేశంలోని ఏ ఇతర బొగ్గు గనులకు లేని విశిష్టత వీటికి వచ్చింది. 1841లో ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామానికి చెందిన కొందరు గ్రామస్థులు భూమిని త్రవ్వుతుండగా బొగ్గు విషయం లోకానికి తెలిసింది. ఈ సంఘటన ఆధారంతో 1871లో డాక్టర్ కింగ్ ఇల్లందు గ్రామ పరిసరాలలో శ్రేష్టమైన బొగ్గు ఉన్నదని తన పరిశోధనలో గుర్తించాడు. ఈ బొగ్గు భూమి లోపల ఆరు పొరల్లో నిక్షిప్తమై ఉన్నదని కనుగొన్నాడు. గనిలోని క్రింది బొగ్గుపొరకు ‘కింగ్ సీమ్’ అని, పై బొగ్గు పొరకు ‘క్వీన్ సీమ్’ అని పేరు పెట్టారు. కింగ్ పరిశోధనల వలన వేలాది కార్మికులకు ఉపాధి, ప్రకృతి వనరులను ఉపయోగించుకోగలిగిన అవకాశం మనకు లభించింది.

ఉ. బొగ్గు గనులలో కార్మికులను ఎలా ఎంపిక చేసేవారు?
జవాబు.
తెలంగాణ గ్రామీణ ప్రజలు బతుకు పోరాటానికి అలవాటు పడినవారు. బుక్కెడు బువ్వకోసం తెలంగాణ పల్లెల నుండి గనులలో కూలీలుగా తరలి వచ్చేవారు. చదువురాకపోయినా, బరువులు మోయటం, గుంజీలు తీయటం, పరుగు పోటీలు వంటి వాటిద్వారా అర్హులను ఎంపిక చేసి వారిని బొగ్గు గని కార్మికులుగా తీసుకొనేవారు. వారు మూడు షిఫ్టులలో పనిచేయాల్సి వచ్చేది. గనుల్లో పనిచేయటం ప్రాణాలకు ముప్పు అని తెలిసినా గత్యంతరం లేక వారు పెట్టే పరీక్షలలో నెగ్గి గని కార్మికులుగా చేరిపోయేవారు. తరువాత తరువాత గనుల యజమానులు కార్మికుల రక్షణకు శ్రద్ధ చూపించటంతో ఎక్కువ మంది గనులలో పనిచేయటానికి ముందుకు వచ్చారు. యూనియన్ల ద్వారా ప్రస్తుతం మంచి జీవన భృతిని అందుకుంటున్నారు.

ఊ. సింగరేణి గని కార్మికుడు వ్రాసిన పాటకు అర్థాన్ని తెలుపండి.
జవాబు.
ఆలోచనలను ప్రక్కనపెట్టి హాయిగా కష్టపడు. అరవై ఐదు అంగుళాల సమతలంలో నలభై అంగుళాల లోతు వరకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో మందుకూరి మందుపాతరను పేల్చమని షార్టు ఫైరన్నకు వివరిస్తున్నాడు. పైకప్పు కూలకుండా బోల్టులు వేసి ప్రమాదాలను జరుగకుండా చూడమంటున్నాడు. బొగ్గు జారిపోకుండా దిమ్మలను సరిచేయమంటున్నాడు. టబ్బు తరువాత టబ్బును పెట్టి మెల్ల మెల్లగా టబ్బును నింపమని ఫిల్లరన్నకు చెప్తున్నాడు.

చక్కగా ఆ బొగ్గుతో నిండిన టబ్బులను రోప్తో పైకి నడిపించమని హాలరన్నను కోరుతున్నాడు. బాధ లెన్నో పడి చక్కని కష్టం చేసి బొగ్గును పైకి చేర్చాము. దానికి తగిన ఫలితాన్ని బ్యాంకు ద్వారా మాకు అందించమని సింగరేణి గని కార్మికుడు పాట ద్వారా తన కష్టాన్ని మరచి పోతున్నాడు అని దీని అర్థం.

ఎ. బొగ్గు గనులు ఎలా ఏర్పడి ఉంటాయి ? అవి సహజ వనరులు ఎలా అయ్యాయి?
జవాబు.
బొగ్గు గనులు గోదావరి నది పరీవాహక ప్రాంతమంతా వ్యాపించి ఉన్నాయి. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. రెండు వందల మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఆ అడవులు తగలబడి భూమి మీదున్న ఆ వృక్షముల అవశేషాలు క్రమ క్రమంగా భూమిలోకి కూరుకుపోయాయి.

అట్లా కూరుకుపోయిన వాటి మీద మట్టి, రాళ్ళు పడి లోపలికి చేరి పొరలు పొరలుగా బొగ్గు ఏర్పడిందని శాస్త్రజ్ఞుల భావన. అట్లా ఏర్పడిన బొగ్గు మనకు ఇపుడు పలు అవసరాలకు ఉపయోగపడుతోంది. ప్రకృతి ప్రసాదించిన సహజవనరుల్లో ఇది కూడా ఒకటి అయింది. సహజంగా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా భూమి నుండి తీసుకొని వాడుకుంటున్నాం కాబట్టి ఇది ఒక సహజ వనరు అయింది.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం మనకు లేకపోవచ్చు. కానీ పరోక్ష సంబంధం ఉన్నది. ఎట్లాగో వివరించండి.
జవాబు.
సింగరేణి కార్మికులతో ప్రత్యక్ష సంబంధం మనకు లేకపోయినా ఆ కార్మికులు ఉత్పత్తి చేసిన బొగ్గు మన అవసరాల నెన్నింటినో తీరుస్తున్నది కావున మనకు వారితో పరోక్ష సంబంధం ఉన్నట్లే. వారు తయారుగా ఉంచిన బొగ్గు యంత్రాలు నడపటానికి ఉపకరిస్తుంది. దానివలన ఎందరికో ఉపాధి కలుగుతున్నది. బొగ్గుతో విద్యుచ్ఛక్తి తయారవుతుంది. అది లేనిదే ఈ మన దైనందిన జీవితం చాలా కష్టతరమౌతుంది.

బొగ్గుతో ఎన్నో పరిశ్రమలు నడుస్తున్నాయి. ఆ పరిశ్రమలలో పనిచేసేవారికి ఉపాధికారి అవుతుంది. మనం నడవటానికి సరైన రహదారులు కావాలి. రహదారుల నిర్మాణంలో బొగ్గు నుండి ఉత్పత్తి చేసే తారు ప్రధానపాత్ర వహిస్తుంది. పంట పొలాలకు వేస్తున్న రసాయనిక ఎరువులు బొగ్గుతో తయారవుతున్నాయి. బట్టలకు అద్దకం పనిచేయటానికి రంగులను బొగ్గుతోనే తయారు చేస్తున్నారు. మనదేశంలో విరివిగా అందుబాటులో ఉన్న సహజవనరు బొగ్గు, ఆ బొగ్గును అందించే కార్మికుడితో మన సమాజంలో బతుకుతున్న వారందరికి పరోక్ష సంబంధం ఉన్నది.

చివరకు బట్టలను ఇస్త్రీ చేయటానికి కూడా ఈ బొగ్గు ఉపయోగింప బడుతున్నది కదా! కాబట్టి సింగరేణి కార్మికులు అక్కడ బొగ్గు గనులలో పనిచేస్తున్నా వారితో మనకు పరోక్ష సంబంధం తప్పనిసరి అవుతుంది. ఎంతో మందికి జీవనోపాధిని కల్పించి, ఎన్నెన్నో అవసరాలు తీర్చే సింగరేణి తెలంగాణ ప్రాంతానికి తలమానికం అని చెప్పవచ్చు.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

ఆ. ఆ సింగరేణి గనుల పూర్వాపరాలను తెలియజేయండి. (లేదా) సింగరేణి తెలంగాణాకు తలమానికం వంటిదని ఎలా చెప్పగలవు ?
జవాబు.
ఏ దేశం తన సహజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకుంటుందో ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. మన నేలల్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనులు చెప్పుకోదగినవి.
గోదావరి నదీ పరీవాహక ప్రాంతమంతా ఒకప్పుడు దట్టమైన అడవులతో నిండి ఉండేది. రెండు మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఆ అడవులు తగలబడి ఆ చెట్ల అవశేషాలు భూమిలోపలకు చేరి పొరలు పొరలుగా ఏర్పడ్డాయి. అవే బొగ్గుగనులు. దానినే నేలబొగ్గు అని, నల్ల బంగారం అని పిలుస్తున్నాం.

మొట్టమొదటిగా ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామస్తుల త్రవ్వకాలలో ఈ బొగ్గు గనుల చరిత్ర బయటపడింది. భారత ప్రభుత్వానికి చెందిన భూగర్భ పరిశోధన శాఖ పరిశోధనలు చేసి ఇది అంత మంచిది కాదని తేల్చింది. ఆ తరువాత 1871లో డాక్టర్ కింగ్ అనే శాస్త్రజ్ఞుడు ఇల్లందు గ్రామ పరిసరాలలో శ్రేష్టమైన బొగ్గును గుర్తించాడు. ఇది భూమి అడుగు పొరలలో ఉందని అన్నాడు. 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీవారు తొలి భూగర్భ గనిని ఇల్లందులో ప్రారంభించారు.

దీనిలోని క్రింది బొగ్గుపొరకు ‘కింగ్సీమ్’ అని పైపొరకు ‘క్వీన్ సీమ్’ అని పేరుపెట్టారు. బొగ్గును రవాణా చేయటానికి డోర్నకల్ నుండి ఖాజీపేట వరకు రైల్వేలైను వేసి దానికి ‘సింగరేణి కాలరీస్’ అను పేరు పెట్టారు. హైదరాబాద్ దక్కన్ కంపెనీ, సింగరేణి కాలరీస్ కంపెనీగా మారిపోయింది. ఎంతోమందికి జీవనోపాధిని కల్పించి, ఎన్నెన్నో అవసరాలు తీర్చే సింగరేణి తెలంగాణ ప్రాంతానికి తలమానికం అని చెప్పవచ్చు.

ఇ. బొగ్గు గనులలో పనిచేసే విభాగాలు, వాటి పేర్లు, కార్మికుల హోదాలను రాయండి.
జవాబు.
బొగ్గుగనులలో పనిచేసేవారు గడియారం ముళ్ళవలే శ్రమజీవులు. మూడు షిఫ్ట్లలో పనిచేస్తారు. గనిలోకి పోయేముందు హాజరు వేయించుకుంటారు. ‘ఓర్మెన్’ పనిని విభజించి ఎవరెవరు ఏం చేయాలో చెప్తాడు. పొట్టినిక్కరు, కాళ్ళకు బూట్లు, తలపై లైటుతో ఉన్న టోపి, నడుముకు బాటరీ కట్టుకొని కార్మికులు గనిలోకి ప్రవేశిస్తారు. సర్దార్ పని ప్రదేశాన్ని పరిశీలించి టింబర్మెన్ చేయవలసిన పనిని నిర్దేశిస్తాడు. ‘కోల్ కట్టర్’ ఉళ్ళు కోసి మందుపాతరలను పెడతాడు. ‘షార్ట్ ఫైర్మెన్’ వాటిని పేలుస్తాడు. తర్వాత ‘సర్దార్’ ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తాడు.

ఇతడు పైకప్పు కూలకుండా ప్రమాదాలను పసికడుతుంటాడు. ‘కోల్ ఫిల్లర్’లు చెమ్మత్తో బొగ్గును తట్టల్లోకి ఎత్తి టబ్బులు నింపుతారు. ‘హాలర్’ టబ్బులన్నీ నిండిన తరువాత రోప్ సాయంతో పైకి చేరుస్తాడు. ఇట్లా సేఫ్టీ అధికారి, అండర్మెన్, సర్వేయర్, చైర్మెన్, ఓర్మెన్, సర్దార్ (మొకద్దం) షార్ట్ఫర్, కోల్కట్టర్, టింబర్మెన్, లైన్మెన్, ట్రామర్, హాలర్, కోల్ ఫిల్లర్, జనరల్ మద్దూర్లు, బొగ్గును వెలికి తీసే పనిలో భాగస్వాములు అవుతారు. వీరందరూ కలసికట్టుగా పనిచేస్తేనే బొగ్గు త్రవ్వి తీయటం సాధ్యమౌతుంది. అపుడే దేశ పురోభివృద్ధి సాధ్యమౌతుంది.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

ఈ. “సింగరేణిని వెలుగులు విరజిమ్మే సింగరేణి” అని ఎందుకు అన్నారు ?
జవాబు.
సింగరేణిని “సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం” అని అంటారు. ఎందుకంటే మొత్తం దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేసే ఏకైక కంపెనీ; వేల మందికి ముఖ్యంగా గ్రామీణ పేద ప్రజలకి జీవనోపాధిని, పనిని కల్పించిన కంపెనీ అయిన సింగరేణికి తెలంగాణలో ఎంతో విశిష్టత ఉంది. సామాజిక జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పరిశ్రమల్లో సింగరేణి ఒకటి. దేశ ప్రగతికి తోడ్పడే సింగరేణి గనులు, బొగ్గు, థర్మల్ స్టేషన్ గొప్పతనం చెప్పారు.

బొగ్గును అందించి పరిశ్రమలు పనిచేసేలా భగభగమండి వెలుగులు విరజిమ్ముతుంది. ఆ గనుల్లో, కర్మాగారాలలో పనిచేసే కార్మికుల జీవితాలలో వెలుగును నింపుతుంది. అక్కడ పనిచేసే వారి జీవితాలకు సిరిసంపదలనిస్తుంది. ఎంతో సహజ ఖనిజ సంపద అణువణువున కల్గి ఉంది. అక్కడి బొగ్గుతో విద్యుచ్ఛక్తి తయారుచేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఆ విద్యుత్ వెలుగులను సింగరేణి ఇస్తుంది. కనుక సింగరేణిని “వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం” అని, “అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం” అని అంటారు.

IV. సృజనాత్మకత/ప్రశంస:

1. సింగరేణి కార్మికులు గనిలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుపుతూ ఒక పోస్టరు తయారుచేయండి.

గనిలో పాటించవలసిన జాగ్రత్తలు.

  1. గనులలోకి పోయే కార్మికులు ‘మస్టర్’ (హాజరు) తప్పనిసరిగా వేయించుకోవాలి.
  2. తన పనేదో దానికే పరిమితం కావాలి.
  3. సులువుగా నడవటానికి, పరిగెత్తటానికి వీలయ్యే పొట్టి నిక్కరునే ధరించాలి.
  4. కాళ్ళకు దెబ్బలు తగలకుండా బూట్లు వేసుకోవాలి.
  5. తలపై టోపీకున్న లైటు సరిగా వెలుగుతుందో లేదో పరీక్షించుకోవాలి.
  6. నడుముకున్న బాటరీ సరిగా ఉన్నదో లేదో చూసుకోవాలి.
  7. మందు పాతరలు పెట్టేటప్పుడు, పేల్చేటప్పుడు అందరినీ అప్రమత్తం చేయాలి.
  8. గనులలోకి నీరు ప్రవేశించినపుడు వెంటనే బయటకు వచ్చేయాలి.
  9. గనులు కూలిపోతాయన్న అనుమానం వచ్చినపుడు వేగంగా బయటకు రావాలి.
  10. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.
  11. మత్తుపానీయాలు సేవించి గనులలోకి ప్రవేశించరాదు.
  12. నిప్పుపట్ల జాగ్రత్త వహించాలి.
  13. బొగ్గును పైకి చేర్చే రోప్ ను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి.
  14. ఆరోగ్య విషయంలో తరచుగా డాక్టర్ను సంప్రదించాలి.
  15. ఒంటికి శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి.

(లేదా)

2. సింగరేణి గనులు / కార్మికుల గురించి ఒకపాట రాయండి.

పల్లవి: చీకటిలో కష్టపడే శ్రమ జీవన సాంద్రుడు
పరుల బతుకులకు వెలుగులు పంచు నల్ల చంద్రుడు. ॥

అనుపల్లవి: శ్రేష్ఠుడురా మాయన్న సింగరేణి కార్మికుడు
నిష్ఠాయుతుడైన నల్ల బంగారం ప్రేమికుడు. ॥

1 చరణం: ఫ్యాక్టరీ కూత విని పరుగెత్తే సైనికుడు
పగలు రేయి పని వీణను మోగించే వైణికుడు
ఊపిరాడలేని గనుల లోపల ఒక యాత్రికుడు
చెమటను బంగారంగా చేయగలుగు మాంత్రికుడు.

2 చరణం: చావుకు వెరువక పోరే ఒక సాహస వీరుడు
కఠిన పరిస్థితులనైన కరిగించే ధీరుడు
తన వాళ్ళ సుఖం కోసం తపియించు ఋషీంద్రుడు
పెనుసవాళ్ళు ఎదురైనా వెరవని గంభీరుడు.

3 చరణం: జీవితమొక పోరాటంగా సాగే యోధుడు
త్యాగ జీవనానికే నిదర్శనమౌ ధన్యుడు
కడలివంటి కన్నీళ్ళను దాచుకునే సాగరుడు
జనతకు ప్రభుతకు జాతికి నిజమైన సేవకుడు.

V. పదజాల వినియోగం:

1. కింద ఇచ్చిన జాతీయాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

ఉదా : కోడికూత = తెల్లవారు సమయం
పల్లె ప్రజలు కోడికూత కు ముందే లేచి పనులు మొదలు పెడతారు.

(అ) చెమటోడ్చు = కష్టపడు
తెలంగాణ ప్రజలందరు చెమటోడ్చి పనిచేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమౌతుంది.

(ఆ) మూలస్తంభం = ముఖ్యమైనది
దేశ అభివృద్ధిలో కార్మికులే మూలస్తంభాలు

(ఇ) బతుకుపోరు = కష్టపడి పనిచేసేవారే బతుకు పోరులో విజయం సాధిస్తారు.

(ఈ) మసిబారు = చేతి వృత్తుల వారి జీవితాలు రోజురోజుకు మసిబారుతున్నాయి.

(ఉ) తలమానికం = శ్రేష్ఠము – గొప్పది
సింగరేణి గనులు మనదేశానికి తలమానికం

2. కింద ఇవ్వబడిన పదాలకు పట్టికలోని పదాల సహాయంతో పర్యాయపదాలు రాయండి.

శరీరం పుడమి నిశీథిని సుగంధం
సౌరభం రాత్రి వసుధ మేను
ధరణి దేహం యామిని పరిమళం

(అ) తనువు = శరీరము మేను దేహం
(ఆ) భూమి = పుడమి, వసుధ, ధరణి
(ఇ) రేయి = నిశీథిని, రాత్రి, యామిని
(ఈ) సువాసన = సుగంధం, పరిమళం, సౌరభం

కింది పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి, వికృతులను రాయండి.

(అ) అచ్చెరువు అచ్చెరువు
(ఆ) ఖని
(ఇ) జంత్రము
(ఈ) ప్రాణం

(అ) అచ్చెరువు – ఆశ్చర్యము (ప్ర)
(ఆ) ఖని (ప్ర) – గని (వి)
(ఇ) జంత్రము (వి) – యంత్రము (ప్ర)
(ఈ) ప్రాణం (ప్ర) – పానం (వి)

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

VI. భాషను గురించి తెలుసుకుందాం:

1. కింది విడదీసిన పదాలను కలిపి రాయండి. సంధిపేరు రాయండి.

(అ) కావాలి + అంటే = కావాలంటే – ఇత్వ సంధి
సూత్రం : ఏమి మొదలైన పదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

(ఆ) మూల + ఆధారం = మూలాధారం – సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

(ఇ) ప్రాంతము + అంతా = ప్రాంతమంతా – ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.

(ఈ) ఎప్పుడు + ఎప్పుడు = ఎప్పుడ్సండు – ఆమ్రేడితసంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైనపుడు సంధి తరచుగా అవుతుంది.

(ఉ) మహా + ఉద్యమం = మహోద్యమం – గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋలు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.

2. కింది విగ్రహ వాక్యాలకు సమాసపదం రాయండి. సమాసం పేరు రాయండి.

(అ) మానవుని యొక్క నాగరికత = మానవ నాగరికత – షష్ఠీతత్పురుష సమాసము
(ఆ) సాధ్యం కానిది = అసాధ్యము -నఞ తత్పురుష సమాసము
(ఇ) రక్తమును, మాంసమును = రక్తమాంసాలు – ద్వంద్వ సమాసము
(ఈ) నేలలోని బొగ్గు = నేలబొగ్గు – షష్ఠీతత్పురుష సమాసము
(ఉ) మూడైన పూటలు = మూడు పూటలు – ద్విగు సమాసము

3. కింది వాక్యం చదువండి.

“ఈ మేఘాలు గున్న ఏనుగులా! అన్నట్టు ఉన్నాయి.”
దేన్ని దేనితో పోల్చారు ?
పై వాక్యంలో కనిపిస్తున్న పోలిక ఊహించి చెప్పబడింది. పై వాక్యంలో
ఉపమేయం : మేఘాలు
ఉపమానం : గున్న ఏనుగులు
అంటే మేఘాలను ఏనుగు పిల్లలవలె ఊహిస్తున్నామన్న మాట
దీనిని బట్టి పోలికను ఊహించి చెబితే అది “ఉత్ప్రేక్ష” అలంకారం.

4. కింది వాక్యాల్లో దేనిని దేనిగా ఊహించి చెప్పారో రాయండి.

(అ) మండే ఎండ నిప్పుల కొలిమా! అన్నట్లు ఉన్నది.
జవాబు.
మండే ఎండను నిప్పుల కొలిమితో ఊహించి చెప్పారు. ఇలా ఊహించి పోలిక చెప్తే దానిని ఉత్ప్రేక్షాలంకారం అంటారు. దీనిలో ఉపమేయం మండే ఎండలు. ఉపమానం నిప్పుల కొలిమి.

(ఆ) ఆకాశంలో నక్షత్రాలు కొలనులోని పువ్వులా! అన్నట్లు ఉన్నాయి.
జవాబు.
ఆకాశంలోని నక్షత్రాలను కొలనులోని పువ్వులుగా ఊహించి చెప్పారు. ఇలా ఊహించి పోలిక చెప్తే దానిని ఉత్ప్రేక్షాలంకారమంటారు. దీనిలో ఉపమేయం ఆకాశంలోని నక్షత్రాలు. ఉపమానం కొలనులోని పువ్వులు.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని:

1. మీ ప్రాంతంలోని కార్మికులను / శ్రామికులను కలిసి, పనిలో వారు పొందిన అనుభవాలను, అనుభూతులను తెలుసుకొని, ఆ వివరాలను నివేదిక రూపంలో వ్రాసి తరగతిలో ప్రదర్శించండి.
జవాబు.

(అ) ప్రాథమిక సమాచారం :
(1) ప్రాజెక్టు పని పేరు : : కార్మికులు/శ్రామికులు పనిలో వారు పొందిన అనుభవాలు, అనుభూతులు
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఆయా కార్మికులు/శ్రామికులను కలువడం ద్వారా

(ఆ) నివేదిక :

విషయ వివరణ :
ఇటీవలే నేను మా ఊరికి దగ్గరలో ఉన్న సిరిసిల్లకు బంధువుల ఇంటికి వెళ్ళాను. సిరిసిల్ల ప్రముఖ వస్త్ర ఉత్పత్తి కేంద్రం. అందులో మరమగ్గాలపై ఆధారపడి వందలాది మంది నేతన్నలు జీవిస్తున్నారు. పనిలో వారి అనుభవాలు, అనుభూతులు తెలిసికోవడానికై వారి పని గూర్చి, ఆ పని పట్ల వారి అభిప్రాయం అడిగాను. చాలా మంది వారి వృత్తి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు వారి మాటల ద్వారా నాకు అర్థమైంది. సొంత ఊరు విడిచి, పొట్ట చేత పట్టుకుని వచ్చిన నేతన్నలకు ఈ వస్త్ర పరిశ్రమ తగిన ఉపాధి కల్పించడం లేదనే చెప్పాలి.

ఇంటి అద్దె, పిల్లల చదువులు, జీవనయానంకై అయ్యే కిరాణ సామాను ఖర్చు, కూరగాయల ఖర్చు .. ఇలా ఎన్నో ఉన్నాయి. వారికి ఈ పనిలో లభించే డబ్బు సరిపోవడం లేదు … కుటుంబాన్ని నెట్టుకు రావడానికో, పిల్లల చదువులకో, పిల్లల పెళ్ళిళ్ళకో చేసిన అప్పు తీర్చే మార్గం కన్పించక కొందరు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. తాగుడుకు బానిసలై తమ ఇంటిని, ఒంటిని గుల్ల చేసుకొంటున్నారు.

  1. రోజుకు 12 గంటలు పనిచేయాలి. కార్మిక చట్టం 8 గంటలు పనే అని చెబుతున్నా పట్టించుకొనే నాథుడే లేడు.
  2. డే & నైట్ రెండు షిఫ్టులలో పనిచేయాలి. నైట్ షిఫ్ట్లో పనిచేసేప్పుడు నిద్రలేక …. అనారోగ్యం బారిన పడుతున్నారు.
  3. విపరీతమైన శబ్దం మధ్య పనిచేయడంవల్ల వినికిడి శక్తి తగ్గడం, తలనొప్పి, రోజంతా చికాకుగా ఉండడం లాంటి లక్షణాలు వేధిస్తున్నాయి.
  4. ఒక్కసారి 8 మరమగ్గాలను పర్యవేక్షించాలి … ఎంతో ఒత్తిడి మధ్య నిలబడే పని చేయాల్సి వస్తుంది.
  5. చిన్న చిన్న దారపు పోగులు గాలిలో కలిసి, శ్వాస వ్యవస్థలో ప్రవేశించి శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉదా ॥ ఆస్త్మా లాంటివి వస్తున్నాయి.
  6. 12 గంటల పనిలో కనీసం 300 రూ॥లు సంపాదించ లేకపోతున్నారు. ఇంకా స్త్రీలకు ఈ రంగంలో మరీ అన్యాయం జరుగుతోంది. 12 గంటల పాటు కండెలు చుడితే 50-60 రూ॥లే వస్తున్నాయి. ఈ విధంగా వృత్తిలో వారెదుర్కొంటున్న సాదక బాధకాలు వివరించారు.

(ఇ) ముగింపు :
నేత కార్మికుల సాదక బాధకాలు వింటుంటే చాలా బాధనిపించింది. 8 గంటల పని అమలు చేస్తే బాగుండు ననిపించింది. పెరిగిన రేట్ల కనుగుణంగా వారి కూలీ రేట్లు కూడా పెంచితే బాగుండు ననిపించింది. వారి నెల జీతంలో కొంత డబ్బు మినహాయించుకొని వారిని, వారి కుటుంబాలను Health scheme లో చేర్పిస్తే బాగుండు ననిపించింది.

TS 8th Class Telugu 10th Lesson Important Questions సింగరేణి

పర్యాయపదాలు:

  • వ్యవసాయం – సేద్యము, కృషి
  • ప్రపంచము – లోకము, జగత్తు
  • సిరి – సంపదలు, ఐశ్వర్యము
  • నీరు – జలము, ఉదకము
  • బంగారము – స్వర్ణము, పసిడి

నానార్థాలు:

  • కాలము – సమయము, నలుపు
  • కార్యము – పని, పయోజనము
  • కుప్స – ధాన్యరాళ, ప్రోగు
  • కులము – వంశము, జాతి
  • కృషి. – ప్రయత్నము, వ్యవసాయం
  • గుహ – కొండ యందలి బిల్వము, హ్దయము
  • చరణము – పాదము, పద్యపాదము
  • చీకటి – అంధకారము, దుఃఖము

ప్రకృతిలు – వికృతిలు:

  • భూమి = బూమి
  • శక్తి = సత్తి
  • బంగారము = బంగరము
  • స్థిరము = తిరము
  • శ్రద్ధ = సడ్డ
  • భారము = బరువు
  • నిద్ర = నిదుర

సంధులు:

నడవాలంటే = నడవాలి + అంటే = ఇత్వసంధి
సూత్రం : క్రియా పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

విస్తారమైన = విస్తారము + ఐన = ఉత్వసంధి
నిలయమై = సిలయము + ఐన = ఉత్వసంధి
అద్భుతమైన = అద్భుతము + ఐన = ఉత్వసంధి
కష్టమైన = కష్టము + ఐన = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.

దశాబ్దము = దశ + అబ్దము = సవర్ణదీర్ఘసంధి
దేశాభివృధద్ధి = దేశ + అభివృద్ధి = సవర్ణదీర్ఘసంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

TS 8th Class Telugu 10th Lesson Questions and Answers Telangana సింగరేణి

సమాసాలు:

  • నల్ల బంగారము = నల్లనైన బంగారము – విశేషణ పూర్వపద కర్మధారయము
  • శ్రద్ధాసక్తులు = శ్రద్ధయును, ఆసక్తియును – ద్వంద్వ సమాసము
  • కష్టనష్టాలు = కష్టమును నష్టమును – ద్వంద్వ సమాసము
  • జీతభత్యాలు = జీతమును భత్యమును – ద్వంద్వ సమాసము
  • కార్మికలోకము = కార్మికుల యొక్క లోకము – షష్ఠీ తత్పురుష సమాసం
  • ఊపిరితిత్తుల సమస్యలు = ఊపిరితిత్తుల యొక్క సమస్యలు – షష్ఠీ తత్పురుష సమాసం
  • దేశాభివృద్ధ = దేశము యొక్క అభివృద్ధి – షష్ఠీ. తత్పురుష సమాసం
  • ఆరు పొరలు = ఆరు సంఖ్య గల పొరలు – ద్విగు సమాసము
  • భారతదేశము = భారతమను పేరుగల దేశము – సంభావనా పూర్వపద కర్మధారయము
  • గోదావరినది = గోదావరి అను పేరు గల నది – సంభావనా పూర్వపద కర్మధారయము

పాఠం ఉద్దేశం:

ఏ దేశం తన సహజ సంపదను సమర్థంగా వినియోగించుకోగలుగుతుందో ఆ దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుంది. మన దేశం సకల సంపదలకు నిలయం. ఇక్కడి నేలల్లో అపారమైన ఖనిజ సంపద దాగి ఉన్నది. ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి దొగ్గుగనులు దేశంలోనే ప్రసిద్దిపొందాయి. దేశ ప్రగతికి దోహదపడే ‘సింగరేణి గనుల’ గురించి తెలియజేయటమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. సింగరేణి దాగ్గు గనులు, దాగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని తెలిపే వ్యాసం.

ప్రవేశిక:

ఒక దేశ పారిశ్రామిక పురోగమనానికి, ఆర్థిక పుష్టికి అతి ప్రధానమైన వనరుల్లో దొగ్గు ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిలో ‘సింగరేణి కాలరీస్’ ప్రధాన భూమికను పోషిస్తున్నది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని శ్రీశ్రీ అన్నాడు. ఆధునిక ప్రపంచంలో కార్మికుల పాత్ర అమోఘమైనది. ఉాగ్గు ఉత్పత్తిలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. ప్రతి రోజూ పొంచివున్న ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా…. గనుల్లో పనిచేస్తూ…. తమ స్వేదాన్ని శక్తిగా మార్చి నేల బొగ్గును వెలికి తీస్తున్న సింగరేణి కార్మికుల జీవితాలను ఆవిష్కరించే విషయాన్ని ఈ పాఠంలో చదువుదాం.

కఠినపదాలకు అర్థాలు:

  • సిరి – సంపద
  • విశిష్టత – గొప్పతనం
  • విరివిగా – ఎక్కుయగా
  • అనూహ్యంగా – ఊహించనివిధంగా
  • (శేష్ఠము – మేలైన / ప్రసిద్ధి చెందిన
  • సిక్షిప్తము – దాచిన
  • మస్టర్ – హాజరు
  • రంగరించు – కలిపినా
  • దుర్ఖరంగ – ఈష్టంగా, భారంగా
  • సౌకర్యాలు – వసతులు
  • జగతి – లోకం
  • పరీవాహకం – ప్రవహించే పరిసర ప్రాంతం
  • డాంబరు – తారు
  • తనువు – శరీరం
  • సింగారం – అలంకారం
  • ఖ్యాతి – ప్రసిద్ధి
  • గని – ఖని
  • బదిలీ – షిఫ్ట్ట = విధి పూర్తి అయిన తర్వాత వ్యక్తులు మూరే సమయం
  • తెరువు – మార్గం
  • సాదాసీదాగా – అతిసామాన్యంగా
  • మజ్దూర్ – కార్మికుడు
  • ఎన్. టి. పి. సి – నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్
  • సల్ల బంగారం – బొగ్గు
  • ప్రగతి – పురోగతి, అభివృద్ధి
  • సీదీ – సమానంగా

Leave a Comment