TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 5th Lesson జానపద కళలు Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 4th Lesson జానపద కళలు

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. జానపద కళలు అంటే ఏమిటి ? వాటి ప్రయోజనమేమి ?
జవాబు.
జానపదులు అంటే పల్లె ప్రజలు. పల్లెల్లో అలరారు కళలను జానపదకళలు అంటారు. ఒగ్గుకథ, బుర్రకథ, యక్షగానం, కోలాటం, భజన, పిట్టల దొర మొదలైనవి జానపదకళలు. భారత భాగవత రామాయణాలు, వీరుల కథలు లాంటివి ఈ కళల ద్వారానే ప్రచారంలోకి వచ్చాయి. చదువురాని పల్లె ప్రజలకు వినోదంతోపాటు విజ్ఞానం కూడా అందించేందుకు
ఈ జానపదకళలు ఉపయోగపడతాయి.

2. యక్షగానాలు అంటే ఏమిటి ?
జవాబు.
యక్షగానాలను కొన్ని చోట్ల బాగోతాలని, నాటకాలని కూడా అంటారు. పాటలు, పద్యాలు, దరువు, ఆదితాళం మొదలైన ప్రక్రియలతో ఇది సాగుతుంది. వీటిని రాత్రిపూట ప్రదర్శిస్తారు. నృత్య, నాటక, సంగీత గాత్రాల కలబోత యక్షగానం. ఆయా పాత్రల్లో నటులు నవరసాలు ఒలికిస్తుంటే ప్రేక్షకులు పరవశించిపోతారు. యక్షగానాలు కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణకు వచ్చిన ఒక ప్రక్రియ.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు

3. యక్షగానాలకు వేదిక ఎలా ఏరా
జవాబు.
యక్షగానం ఆట ఆడే రోజు దగ్గరనో నాలుగు వైపుల ను రంగురంగుల చీరలుగా త్రం ఈ వేదికను ఏర్పాటు చేస్తారు. నాలుగు బజార్ల కూడలి దగ్గరనో, కచేరు ఓంజలు పాతి బొంగులతోనో కర్రలతోనో పందిరేస్తారు. ఎదురుగా తెల్లటి బట్టగాని .తారు. వీలైతే ప్రక్కలకు పరదాలు వేలాడదీస్తారు. ఒక్కోసారి గ్రామంలో నుంచి నాలుగు పెద్దబల్లలు తెచ్చివేస్తారు. లేదంటే నేల మీదనే వేదికకు రెండు వైపులా కరెంటు బల్బులు గాని, పెట్రొమాక్సు లైట్లుగాని, ఏవీ లేకుంటే దివిటీలుగాని పెడతారు. అలా వేదిక ఏర్పాటు చేస్తారు.

4. జానపద కళలు మన జీవితంలో ఎలా కలిసిపోయాయి?
జవాబు.
కొన్ని వందల సంవత్సరాల నుండి వర్థిల్లుతున్న ప్రజాకళలు పల్లె జీవనంతో సంస్కృతితో కలిసిపోయినవి ఈ జానపదకళలు.
ప్రజల సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకొని ఓదార్పునిచ్చిన కళలు. తరతరానికి రూపు మార్చుకుని ప్రజల ఆలోచనా విధానానికి పదును పెట్టిన కళలు. జీవితంలో ఒక భాగంగా సాగి కదిలి కదిలించిన కళలు ఈ జానపదకళలు. వీటిని కాపాడు కోవడం మనందరి బాధ్యత.

5. గొల్ల సుద్దుల వల్ల సమాజానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది ?
జవాబు.
గొల్లసుద్దులు కళారూపం సామాజిక చైతన్యం కలిగిస్తుంది. ఈ ప్రక్రియలో చెబితే సామాన్యులకు చక్కగా అర్థమౌతుంది. గొల్లసుద్దులు పాటల్లో సమాజంలో చెడును తొలగించే ప్రయత్నం కనబడుతుంది. వినోదాన్నే కాకుండా విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. ఇటీవలి కాలంలో ప్రజా ఉద్యమాల్లోనూ, అక్షరాస్యత, ఆరోగ్యం, పర్యావరణం, ఎయిడ్స్ నిర్మూలన, కుటుంబ నియంత్రణ, వ్యవసాయం మొదలైన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి మంచి మార్గంగా ఉంది. ఎన్నో కళాబృందాలు తెలంగాణా సాధన కోసం చేసిన ప్రదర్శనలు విజయానికి కారణమైనాయి.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. గొల్ల సుద్దులు అంటే ఏమిటి ?
జవాబు.
గొల్ల సుద్దులు అంటే గొల్లలు చెప్పే సుద్దులు. అంటే మంచి మాటలు. ఇందులో ప్రధానకథకుడు ఆటపాటలతో ప్రేక్షకులను అలరిస్తాడు. అటూ ఇటూ ఉన్న ఇద్దరు చెవికి చెయి కప్పి సాగదీసి వంతపాడుతారు. ఈ ప్రదర్శనలో వీరణాలు, కొమ్ములనుపయోగిస్తారు. ఈ ప్రదర్శనలో కథకుడు ప్రేక్షకుల మధ్య నుండి రంగస్థలం మీది కొస్తాడు. తప్పిపోయిన గొర్రెలను వెతుకుతున్నట్లు వంతలు ఆ మూలనుంచి ఒకరు ఈ మూలనుంచి ఒకరూ వస్తారు.

వీళ్ళ వేషధారణ మోకాళ్ళ వరకు మడిచి కట్టిన పెద్ద అంచు పంచె, నెత్తికి రుమాలు, చెవులకు దుద్దులు ముంజేతికి కడియాలు, వెండి బిళ్ళల మొలతాడు, భుజం మీద గొంగడి, కాళ్ళకు గజ్జెలు, చేతిలో కర్రతో గమ్మత్తుగా ఉంటారు. రకరకాల యాసభాషతో ఆద్యంతం నవ్విస్తుంటారు. కథను ఎటంటే అటు మలుపుతిప్పుతూ అందరినీ ఆకట్టుకుంటారు. సామాజిక చైతన్యం కలిగించాలంటే ఈ ప్రక్రియలో చెప్తే సామాన్యులు తేలికగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రదర్శనకు డప్పు, డోలక్ ఉపయోగిస్తున్నారు. సమస్యలను పరిష్కారాలను సుద్దుల రూపంలో చెబుతారు. సమాజంలోని చెడును తొలగించే ప్రయత్నం ఈ కళారూపంలో కనబడుతుంది.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు

2. పిట్టల దొర ప్రదర్శన గురించి రాయండి.
జవాబు.
పిట్టల దొర వేషం చూస్తేనే నవ్వొస్తుంది. మాటలు వింటుంటే పగలబడి నవ్వాలనిపిస్తుంది. గమ్మత్తైన వేషం, చిత్రవిచిత్రమైన మాటలు మాట్లాడుతూ పైకి డాంబికాలు చెప్తూనే తన వెనుక నున్న కష్టాన్ని గుర్తించక అందర్నీ నవ్విస్తూ ఇంటింటికీ తిరిగి యాచిస్తుంటాడు. పిట్టల దొర. ఒక పక్క పైకి మడిచిన ఖాకీప్యాంటు, చినిగిన అంగి, తెల్ల ఈకతో కూడిన ఇంగ్లీషు దొరల టోపి, మెడలో రుమాలు, సన్నటి మీసం, కాళ్ళకు బూట్లు, భుజానికి కట్టెతుపాకి, ముఖానికి తెల్లరంగు ఇదీ పిట్టల దొర వేషం. “మా తాత తట్టల్గొర.

మానాన్న బుట్టల్గొర. నేను పిట్టల్గొర. నన్నందరూ లత్కోర్ సాబంటరు. మారాజా! నాకేం తక్కువ లేదు. తీసుకు తింటే తరుక్కపోద్దని అడుక్కతింటున్న. నా పెళ్ళికి అమెరికా, సింగపూర్, చైనా, జర్మనీ, జపాన్ అన్ని దేశాల నుండి అందరచ్చిండ్రు. అందరికి తిండి సరిపోవాలని పేర్ల బియ్యం పోసిన తూంకింద మంట బెట్టిన చింతాకిస్తర్లేసి ఇద్దరికిత్తు సొప్పున మస్తుగ వడ్డిస్తే బద్దం తిన్నరు బాంచెను. మీ అందర్ని సూత్తంటే పెండ్లి కొచ్చినట్లే ఉన్నరు. కాని కట్నాల బుక్కులో ఒక్కరి పేరూ లేదు.” ఇలాంటి హాస్య సంభాషణలకు నవ్వని వారుంటారా ? ఇదీ పిట్టల దొర ప్రదర్శన.

పరిచిత గద్యభాగాలు

1. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఈ కళలు ఇప్పటివి కావు. వందల సంవత్సరాలుగా వర్ధిలుతున్న ప్రజా కళలు పల్లె జీవనంతో, సంస్కృతితో కలిసిపోయిన కళలు. ప్రజల సంతోషాన్ని, దుఃఖాన్ని పంచుకొని ఓదార్పునిచ్చిన కళలు. తరతరానికి రూపాన్ని మార్చుకుని ప్రజల ఆలోచనా విధానానికి పదును పెట్టిన కళలు, జీవితంలో ఓ భాగంగా సాగి కదిలి కదిలించిన ఈ ప్రజాకళలు ఆదరణ లేక కనుమరుగై పోతున్నాయి. వీటిని సంరక్షించుకునే బాధ్యత మనందరిది.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఈ కళలు ఎప్పటివి ?
జవాబు.
వందల సంవత్సరాల నాటివి.

ప్రశ్న 2.
ఇవి ఎవరి కళలు ?
జవాబు.
పజల కళలు

ప్రశ్న 3.
ఇవి వేటికి పదును పెట్టాయి ?
జవాబు.
ప్రజల ఆలోచనలకు

ప్రశ్న 4.
జీవితంలో ఈ కళల స్థానమేమిటి ?
జవాబు.
ఇవి జీవితంలో ఒక భాగం

ప్రశ్న 5.
వీటిని మనం ఏం చేయాలి ?
జవాబు.
సంరక్షించుకోవాలి.

2. కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు రాయండి.

జానపదులు అనగా పల్లె ప్రజలు. పల్లెల్లో అలరారు కళలను జానపద కళలు అంటారు. ఒగ్గుకథ, బుర్రకథ, యక్షగానం, సిందుబాగోతాలు, చిడుతలరామాయణం, కోలాటం, భజన, తుపాకిరాముడు, పిట్టలదొర మొదలగునవి. జానపద కళలకు ఉదాహరణలు. భాగవతం, రామాయణం, భారతం, గ్రామదేవత కథలు, గొల్లసుద్దులు, తుపాకిరాముడు, వీరుల కథలు లాంటివి ఏండ్లకేండ్లుగా ఈ జానపద కళల ద్వారానే ప్రచారంలోకి వచ్చినాయి. పల్లె ప్రజలు నిరక్షరాస్యులు. అట్లాంటి కాలంలో వాళ్లకు వినోదంతో పాటు నీతిసూత్రాల ఆలోచనను కలిగించేందుకు జానపద కళలు ఉపయోగపడేవి. వీటిలో యక్షగానాలు, గొల్లసుద్దులు, తుపాకిరాముడు గురించి తెలుసుకుందాం.
జవాబు.
1. జానపదులు అంటే ఎవరు ?
2. పల్లెల్లో అలరారు కళలను ఏమంటారు ?
3. పల్లె ప్రజలు ఎటువంటివారు ?
4. జానపద కళలకు ఒక ఉదాహరణ రాయండి.
5. జానపదకళలు పల్లె ఏ్రజలకు ఏమి కలిగిస్తాయి ?

TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు

3. కింది పేరాను చదివి వాక్యాలలోని ఖాళీలు పూర్తిచేయండి.

తబల, తాళం, హార్మోనియంలను ఇందులో వాయిద్యాలుగా వాడతారు. వేషకాడు పాట పాడుతుంటే పాటకు అనుగుణంగా తబల తాళం మోగుతుంది. హార్మోనియం వీటితో జతకడుతుంది. తబల తాళం కొట్టేవాళ్లు మ్యాల్లంలో సభ్యులై ఉంటారు. వీరు కూడా వేషం వేస్తారు. వీరు స్టేజిమీదికి వెళ్లినప్పుడు ఆ బాధ్యతను మరొకరు తీసుకుంటారు.

1. తబల, ……………….., …………….. లను ఇందులో వాయిద్యాలుగా వాడతారు.
2. ……………….. పాట పాడుతుంటే తబల తాళం మోగుతుంది.
3. హార్మోనియం వీటితో ……………………
4. తబల తాళం కొట్టేవాళ్ళూ …………………. లో సభ్యులై ఉంటారు.
5. వీరు స్టేజి మీదికి వెళ్ళినప్పుడు ఆ …………………. ను మరొకరు తీసుకుంటారు.
జవాబు.
1. తబల, తాళం, హార్మోనియం లను ఇందులో వాయిద్యాలుగా వాడతారు.
2.వేషకాడు పాట పాడుతుంటే తబల తాళం మోగుతుంది.
3. హార్మోనియం వీటితో జతకడుతుంది
4. తబల తాళం కొట్టేవాళ్ళూ మ్యాల్లం లో సభ్యులై ఉంటారు.
5. వీరు స్టేజి మీదికి వెళ్ళినప్పుడు ఆ జాథ్త ను మరొకరు తీసుకుంటారు.

Leave a Comment