Here students can locate TS Inter 1st Year Chemistry Notes 9th Lesson S-బ్లాక్ మూలకాలు to prepare for their exam.
TS Inter 1st Year Chemistry Notes 9th Lesson S-బ్లాక్ మూలకాలు
→ లిథియమ్, సోడియమ్, పొటాషియమ్, రుబిడియమ్, సీసియమ్ మరియు ఫ్రాన్షియమ్ మూలకాలను IA గ్రూపు మూలకాలు అంటారు.
→ వీటినే క్షారలోహాలు అంటారు. సాధారణ వేలెన్సి కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం – ns1
→ ఇవి ఆక్సీకరణ జ్వాలకు రంగును ప్రదర్శిస్తాయి. ఇవి అధిక ధన విద్యుదాత్మకతగల మూలకాలు. బలమైన క్షయకరణులు.
→ ఇవి ఆక్సిజన్తో చర్య జరిపి మోనాక్సైడ్, పెరాక్సైడ్ మరియు సూపర్ ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి.
→ ఇవి ద్రవ NH3 లో కరిగి నీలం రంగు ద్రావణాన్ని ఏర్పరుస్తాయి.
→ గ్రూపులో ఇతర మూలకాలతో పోలిస్తే లిథియమ్ అసాధారణ ధర్మాలు ప్రదర్శిస్తుంది. లిథియమ్, మెగ్నీషియమ్తో కర్ణ సంబంధాన్ని కలిగి ఉంటుంది.
→ Na2CO3 ని సాధారణంగా సాల్వే పద్ధతిలో తయారుచేస్తారు.
→ Na2CO3. 10H2O ను వాషింగ్ సోడా అంటారు. Na2CO3 ను సోడా యాష్ అంటారు. NaHCO3 ను బేకింగ్ సోడా అంటారు.
→ NaOH ను కాప్టనర్ కెల్నర్ పద్ధతి ద్వారా తయారుచేస్తారు.
→ బెరిలియమ్, మెగ్నీషియమ్, కాల్షియమ్, స్ట్రాన్షియమ్, బేరియమ్ మరియు రేడియమ్ మూలకాలను IIA గ్రూపు మూలకాలు అంటారు.
→ వీటినే క్షారమృతిక లోహాలు అంటారు. సాధారణ వేలెన్ని కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం – ns2
→ Ba, Ca, Sr లు జ్వాలకు రంగును ప్రదర్శిస్తాయి.
→ బెరిలియమ్ అసంగత ప్రవర్తనను ప్రదర్శిస్తుంది. దీని సమ్మేళనాలు సమయోజనీయ సమ్మేళనాలు.
→ కాల్షియమ్ హైడ్రాక్సైడ్, కాల్షియమ్ సల్ఫేట్, కాల్షియమ్ కార్బొనేట్, సిమెంట్ మొదలైనవి కాల్షియమ్ సమ్మేళనాలు.
→ CaSO4 = \(\frac{1}{2}\)H2O ను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటారు. దీనిని గృహ నిర్మాణాల్లో, దంతవైద్యంలో వాడతారు.
→ బంకమట్టి, సున్నపురాయిని కలిపి బాగా వేడిచేస్తే సిమెంట్ క్లింకర్ ఏర్పడుతుంది. దీనిని వంతెనెలు, భవనాల నిర్మాణంలో వాడతారు.
→ జీవ రసాయనశాస్త్రంలో Na, K, Mg, Ca లు ముఖ్య పాత్ర వహిస్తాయి.