TS 8th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్ Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. కథకుడు ఎవరెవరికి వందనాలు చేశాడు ? ఎందుకు ?
జవాబు.
కథకుడు ముందుగా వీరులను కన్నతల్లి భారతమాతకు వందనాలు చేశాడు. తరువాత మహాత్మాగాంధీకి, జవహర్లాల్ నెహ్రూకు , సుభాష్ చంద్రబోసుకు, వల్లభాయ్ పటేలు ఇంకా అనేక స్వాతంత్ర్య సమర వీరులకు వందనాలు చేశాడు. ఎందుకంటే వారంతా భారతదేశపు బానిసత్వాన్ని తొలగించడానికి అనేక కష్టనష్టాల కోర్చినవారు. జైళ్ళకు వెళ్ళి, ప్రాణాలు బలి ఇచ్చి స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టిన సత్పురుషులు. మహామహులు. జనవందితులు. పూజనీయులు.

2. కథకుడు ఎవరి కథను చెప్తానన్నాడు ?
జవాబు.
కథకుడు రామరావణయుద్ధమో, కౌరవ పాండవుల కథో, పూర్వరాజుల చరిత్రో చెప్పలేదు. మహాత్మాగాంధీకి ఎంతో ప్రియమైన భక్తుడు, దేశసేవకే అంకితమైనవాడు, పక్షపాత రహితుడు అయిన షోయబుల్లాఖాన్ కథను చెప్తానన్నాడు. దుర్మార్గులు రాక్షసులు ఐన రజాకార్లను, నిజాం రాజును వ్యతిరేకించినందుకు వారి దుర్మార్గానికి బలియై వారి చేత హత్య చేయబడిన షోయబుల్లాఖాన్ కథ చెప్తానన్నాడు.

TS 8th Class Telugu ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

3. షోయబుల్లాఖాన్ బాల్యవిశేషాలు తెల్పండి.
జవాబు.
షోయబుల్లాఖాన్ హైదరాబాదులో మానుకోట తాలూకాలో శుభ్రవాడు అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి హబీబుల్లాఖాన్. తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం పుట్టిచనిపోగా ఎనిమిదవ సంతానం షోయబుల్లాఖాన్. చిన్నప్పటి నుంచే ఎంతో తెలివితేటలు కలవాడు. దేశసేవే దేవునిసేవ అని నమ్మాడు. ప్రజలందరూ సహెూదరులని భావించాడు. అంత చిన్నతనంలోనే అంత గొప్ప భావాలు కలిగి ఉండటం ఆశ్చర్యకరం. అలా శుక్లపక్ష చంద్రునిలా వెలిగిపోతూ పెరిగి పెద్దవాడైనాడు. ఔజా అనే ఆమెను పెళ్ళిచేసుకున్నాడు.

4. హబీబుల్లా ఖానుకు గాంధీజీపై భక్తి భావం ఎలా కలిగింది ?
జవాబు.
ఒకసారి గాంధీజీ విజయవాడకు వెళుతున్నారు. దారిలో ఉన్న మానుకోట స్టేషన్లో హబీబుల్లాఖాన్ పోలీసు ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. బాపూజీని రెప్పవెయ్యకుండా చూశాడు. వెంటనే అత్యంత భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆయన దివ్యమంగళ విగ్రహం అతని కళ్ళల్లో నిండిపోయింది. అదే సమయంలో ఇంటిదగ్గర షోయబుల్లాఖాన్ పుట్టాడు. కుమారుడిలో తండ్రికి గాంధీజీ పోలికలే కనిపించాయి. ఎంతో సంతోషపడ్డాడు. అలా హబీబుల్లాఖాన్క గాంధీజీపై భక్తి భావం కలిగింది.

5. నిజాం రజాకార్లను షోయబుల్లాఖాన్ పైకి ఎందుకు, ఎలా ఉసి గొల్పాడు ?
జవాబు.
షోయబుల్లాఖాన్ తను పెట్టిన ఇమ్రోజ్ పత్రికలో జాతీయభావాలు, దేశభక్తి ప్రబోధించాడు. నిజాం చర్యలను ఖండించాడు. అందుకు కోపంతో నిజాం హిందూ-ముస్లిం తేడా లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారి ప్రాణాలు తీయమని, చేతులు నరకమని రజాకార్లను ఉసిగొల్పాడు. వారు ముందుగా షోయబ్ను హెచ్చరించారు. కాని ప్రయోజనం లేదు. షోయబు బెదరలేదు. చంపుతామని బెదిరించారు. ఐనా అతడు లొంగలేదు. అలా చివరికి వాళ్ళచేతిలో హతమైపోయాడు.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. షోయబుల్లాఖాన్ను రజాకార్లు అంతం చేసిన విధం తెల్పండి. (లేదా)
జవాబు.
షోయబుల్లాఖాన్ పట్ల నిజాం ప్రభుత్వం వ్యవహరించిన తీరు తెల్పండి.
హైదరాబాదు ప్రభుత్వం మత ప్రేరణచేస్తూ రజాకార్లు అనే దుర్మార్గులను పోషించేది. వాళ్ళు రాష్ట్రమంతా అరాచకాలు సృష్టిస్తున్నారు. షోయబుల్లాఖాన్ తాజ్వీ అనే ఉర్దూ పత్రిక ద్వారా వారి అన్యాయాలను ఖండించాడు. ప్రభుత్వం ఆ పత్రికను నిలిపివేసింది. షోయబు ‘ఇమ్రోజ్’ అనే దినపత్రికను ప్రారంభించి ప్రజలలో జాతీయ భావాలను నింపుతూ ప్రభుత్వాన్ని విమర్శించాడు.

ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు కలిగించినా షోయబు భయపడలేదు. ఖాసింరజ్వీ తన సైన్యాన్ని పిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినవారు హిందువైనా ముస్లిమైనా సరే వారి ప్రాణాలు తియ్యమని ఆదేశించాడు. రజాకార్లు హెచ్చరిక ఉత్తరాలెన్నో రాశారు. షోయబు భయపడలేదు. “నీవు గాంధీ కొడుకువా ? డొక్క చీల్చేస్తాం” అంటూ ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది.

షోయబు పట్టించుకోలేదు. ఒకనాడు రాత్రి “నేటి భావాలు” అనే వ్యాసం రాసి, ఆ చీకట్లో దగ్గరలోనే ఉన్న తన ఇంటికి వెళుతున్నాడు షోయబు. రజాకార్లు వేట కుక్కల్లాగా వెంట తరిమి అతని చేతులు నరికేశారు. తుపాకులతో కాల్చి చంపేశారు. అలా ఆ స్వాతంత్ర్య వీరుణ్ణి అంతం చేశారు.

TS 8th Class Telugu ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

2. రజాకార్ల చేతికి చిక్కిన షోయబుల్లాఖాన్ చనిపోయేముందు జరిగిన విషయాలు వివరించండి.
జవాబు.
చీకట్లో ఇంటికి వెళ్తున్న షోయబుల్లాఖాన్ ను రజాకార్లు తుపాకీ గుండ్లతో పేల్చారు. ఇమ్రోజ్ పత్రికను తీర్చిదిద్దిన చేతిని నరికేశారు. షోయబు బావమరిది వెనక నుండి కేకలు వేస్తూ వచ్చాడు. ఆయనకు కూడా గుండు దెబ్బతగిలింది. ఆయన రెండు చేతులు మణికట్టుదాకా నరికారు. బాధతో అరిచేసరికి జనమంతా పోగయ్యారు. రజాకార్లు పారిపోయారు. షోయబు భార్య, తల్లిదండ్రులు అతని మీదబడి కన్నీరు మున్నీరుగా ఏడ్చారు.

స్నేహితులంతా అక్కడికి చేరుకున్నారు. షోయబు శరీరం నుంచి రక్తంధారలు కారిపోతున్నాయి. స్పృహతప్పక ముందే తన వారిని కళ్ళారా చూసుకున్నాడు. నువ్వెందుకు అరవలేదని భార్య అడిగింది. అరిస్తే పిరికితనమౌతుంది. వీరుడిగా చనిపోతే స్వర్గం లభిస్తుంది. ఇదే అహింసా సిద్ధాంతం అన్నాడు షోయబు.

తల్లిని చూసి ‘అమ్మా! వీరుడిగా మరణిస్తున్నాను. నీవు వీరమాతవు. నా భార్య వీరపత్ని. నిండుచూలాలైన నా భార్య వీరమాత కావాలి. మీరు నా కోసం ఏడవకండి. నా ధైర్యం కోల్పోతున్నాను. నా వీర మరణానికి గర్వపడతానని నువ్వు మాట ఇచ్చావు కదమ్మా! ఏడవొద్దు” అని పలుకుతూ ప్రాణాలు వదిలాడు. షోయబుల్లాఖాన్ అమరజీవి అయ్యాడు.

3. నిజాం రాజులు మరియు పెట్టుబడిదారుల నుండి ప్రజలకు విముక్తి కలిగించి చైతన్యవంతులను చేయుటకు నాయకులు చేసిన కృషి ఎట్టిది ?
జవాబు.

  1. నాయకులు ఎన్నో కష్టనష్టాల కోర్చారు.
  2. పక్షపాత రహితులై దేశసేవ చేశారు.
  3. దుర్మార్గంగా, రాక్షసంగా ఉన్నవారిని ఎదిరించారు.
  4. తెలివితేటలతో వ్యవహరించి అందరిలో ఐక్యత తెచ్చారు.
  5. దేశసేవే దేవుని సేవగా భావించారు.
  6. వీరుల పట్ల, దేశభక్తుల పట్ల పూజ్యభావం కలిగి ఉన్నారు.
  7. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. పత్రికలు కూడా నడిపారు.
  8. చంపుతామని బెదిరించినా భయపడకుండా ఉద్యమం కొనసాగించారు.
  9. అహింసా సిద్ధాంతాన్ని నమ్మారు.
  10. వీరమరణానికే సిద్ధపడ్డారు కానీ విప్లవంలో వెనుకంజవెయ్యలేదు. వెనుదిరిగి పోలేదు.

నిజాం రాజుల నిరంకుశత్వం, పెట్టుబడిదారులు దోపిడీలను చూసి ప్రజలకు విముక్తిని కలిగించి చైతన్యవంతులను చేయటానికి నాయకులు ఎంతగానో కృషి చేశారు.

TS 8th Class Telugu ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

4. షోయబుల్లాఖాన్ జీవిత విశేషాలను పొందుపరచండి.
జవాబు.
షోయబుల్లాఖాన్ హబీబుల్లాఖాన్ దంపతులకు ఎనిమిదవ సంతానంగా హైదరాబాదు మానుకోట తాలూకాలో శుభ్రవాడు అనే గ్రామంలో జన్మించాడు. చిన్నతనం నుంచే గాంధీజీ సిద్ధాంతాలు అతనిని ఆకట్టుకున్నాయి. ఆయనకు పరమభక్తుడైనాడు. దేశసేవే దేవునిసేవ అనీ, మానవులంతా సోదరులనీ నమ్మినవాడు. అతని భార్య ఔజా. ఏ ప్రలోభాలకూ లొంగకుండా ప్రజాక్షేమం కోరుతూ సత్యం, అహింసలను ప్రచారం చేశాడు.

హైదరాబాదు ప్రభుత్వం రజాకార్లు అనే దుష్టశక్తులను పోషిస్తూ మతప్రేరణ చేస్తుంటే రజాకార్లు ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. తాజ్వీ అనే ఉర్దూ పత్రిక ద్వారా షోయబు ఆ అకృత్యాలను ఖండించాడు. ఆ పత్రిక నిలిపి వేస్తే తానే ఇమ్రోజు అనే పత్రిక స్థాపించి నిర్భయంగా నిష్పక్షపాతంగా నిజాలు ప్రకటించ సాగాడు. ప్రభుత్వం ఈర్ష్యతో ఎన్నో ఆటంకాలు కలిగించింది. అయినా షోయబు తన ప్రయత్నం విరమించలేదు.

అకస్మాత్తుగా జరిగిన గాంధీజీ అకాల మరణానికి క్రుంగిపోయాడు. పదినెలల నుండి షోయబు రాసిన సంపాదకీయాలు ప్రభుత్వాన్ని, సంఘ వ్యతిరేక శక్తులను గడగడ లాడించాయి. ప్రభుత్వం రజాకార్లను అతనిపైకి ఉసిగొల్పింది. వారు కొన్ని హెచ్చరికలు చేసి చివరకు ఒక రాత్రి అతను పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా తుపాకులు పేల్చి చేయి నరికేశారు. అడ్డువచ్చిన బావమరిదిని కూడా అంతం చేశారు. అలా తాను నమ్మిన సిద్ధాంతాలను విడిచిపెట్టకుండా ప్రభుత్వంతో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు. అమరజీవి అయ్యాడు షోయబుల్లాఖాన్.

పరిచిత గద్యభాగాలు

1. కింది అంశమును చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

షోయబుల్లాఖానుకు అదివరకే ఈ నిశాచరులు తన ప్రవర్తనను మార్చుకొమ్మని జాబులు రాశారు. అట్లు మార్చుకొనకుండినచో ప్రాణములు దక్కవని యెన్నో తీర్ల బెదరించినారు. అయినప్పటికిని సత్యమునకు పాటుపడ్డ మన షోయబు యా బెదిరింపులకు జంకలేదు. తనను ఇంచుకైనను మార్చుకోలేదు. ఇట్లుండ 20-08-1948 నాడు ఒక పేరు వూరులేని ఉత్తరం ఒకటి వచ్చింది. అందులో “నీవు గాంధీ కొడుకువా” జాగ్రత్త డొక్క చీల్చి వేస్తాం. ఇదివరకీలాటివెన్నో ఉత్తరాలు రాలేదా! అనుకొన్నాడు. తన పత్రికాలయములో కాంగ్రెసు నాయకులు రామకృష్ణారావు. రంగారెడ్డి మొదలగు షోయబు మిత్రులు యా బెదరింపు ఉత్తరములను గూర్చి చర్చించారు. శ్రీయుత రామకృష్ణారావుగారు షోయబు నామాట నీవు తప్పుగా భావించవద్దు, ఎందుకంటే రాక్షస రజాకార్లు నీ మీద కక్ష పెంచుకున్నారు. ఎప్పుడైనా ఏమైనా జరుగవచ్చు. నీవు జాగ్రత్తగా ఉండుము అని చెప్పినప్పటికిన్ని షోయబ్ తన విశ్వాసమును విడవలేదు.

ప్రశ్నలు :

1. నిశాచరులు షోయబును ఏమని బెదిరించారు ?
జవాబు.
నిశాచరులు షోయబును అతని ప్రవర్తన మార్చుకోమని, లేకపోతే ప్రాణాలు తీస్తామని బెదిరించారు.

2. ఉత్తరంలో ఏమని రాసుంది ?
జవాబు.
ఉత్తరంలో “నీవు గాంధీ కొడుకువా ? జాగ్తత్త డొక్క చీల్చేస్తాం” అని రాసుంది.

3. ఆ నిశాచరులు ఎవరు ?
జవాబు.
ఆ సిశాచరులు రజాకార్లు.

4. ఈ పేరాలో చెప్పిన షోయబు మిత్రులెవరు ?
జవాబు.
కాంగగగసు నాయకులు రామకృష్ణారావు, రంగారెడ్డి మొదలైనవారు.

TS 8th Class Telugu ఉపవాచకం 2nd Lesson షోయబుల్లాఖాన్

5. మిత్రులు షోయబుకు ఏమని నచ్చచెప్పారు ?
జవాబు.
మిత్రులు షోయబును జాగగత్తగా ఉండమని, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చని హెచ్చరించారు.

2. ఈ కింది వాక్యాలను కథా క్రమంలో అమర్చండి.

షోయబు కుడిచేతిని దుండగులు నరికివేశారు.
షోయబుల్లాఖాన్ ను తుపాకులతో ఢాంఢాంఢాం అని కాల్చినారు. రెండు చేతులు మణికట్టు వరకు తీశారు.
ఆయనకు కూడా గుండు దెబ్బతగిలింది.
షోయబు బావమరిది వెనుకాల నుండి వస్తూ అరిచాడు.
జవాబు.

  1. షోయబుల్లాఖాన్ను తుపాకులతో ఢాం ఢాం ఢాం అని కాల్చినారు.
  2. షోయబు కుడి చేతిని దుండగులు నరికివేశారు.
  3. షోయబు బావమరిది వెనుకాల నుండి వస్తూ అరిచాడు.
  4. ఆయనకు కూడా గుండు దెబ్బ తగిలింది.
  5. రెండు చేతులు మణికట్లు వరకు తీశారు.

3. కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు రాయండి.

ఇట్లుండగా మహాత్ముడి అకాలమరణవార్త అకస్మాత్తుగా షోయబు విన్నాడు. నిర్ఘాంతపడ్డాడు. ఇంట తనగదిలో వెక్కివెక్కి యేడుస్తున్నాడు. బలమైన అతని శరీరం దుఃఖావేశంతో వణికి పోవుచున్నది. నోరు పెకలటం లేదాతనికి. ఇంతలో తన తల్లి వచ్చి నాయన ఏడవకుము. ఆయన మహాత్ముడు అతనికి అంతా సమానమే. చావుబ్రతుకుల్లో ఆయనకు భేదం లేదు. హిందూ, ముస్లింలలో సోదర భావాన్ని పెంపొందించుటకై ఆయన మహోత్కృష్టమైన సేవ జేశాడు. నీవు దుఃఖించుట మానుము. నాయనా ? ఏది ఒకసారి నవ్వుము. అని దీనంగా బ్రతిమాలుతున్న తన తల్లిని జూసి షోయబుల్లాఖానుడు అమ్మా! రేపు నీకొడుకు స్వాతంత్య్రము కొరకు బలైతే నీవు దుఃఖించవా యని యడిగినాడు.
జవాబు.
1. షోయబు ఏ వార్త విన్నాడు ?
2. గాంధీజీ ఎవరిలో సోదరభావం పెంచాడు ?
3. మహాత్ముడు వేదిని సమానంగా చూస్తాడు ?
4. ఔోయబు తల్లిని ఏమడిగాడు ?
5. ఈ పేరాలో ఉన్న పాత్రలేవి ?

Leave a Comment