Here students can locate TS Inter 1st Year Chemistry Notes 3rd Lesson రసాయన బంధం – అణు నిర్మాణం to prepare for their exam.
TS Inter 1st Year Chemistry Notes 3rd Lesson రసాయన బంధం – అణు నిర్మాణం
→ అణువులోని పరమాణువుల మధ్యగల ఆకర్షణ శక్తిని రసాయన బంధం అంటారు.
→ స్థిరత్వం పొందడానికై పరమాణువులు తమ బాహ్య కర్పరంలో అష్టక విన్యాసం పొందడాన్ని అష్టక సిద్ధాంతం అంటారు.
→ ఎలక్ట్రాన్ల స్థానాంతర గమనం వల్ల ఏర్పడే వేలన్సీని ఎలక్ట్రో వేలన్సీ అని, ఎలక్ట్రాన్లను సమిష్టిగా పంచుకోవడం వల్ల ఏర్పడే వేలన్సీని కోవేలన్సీ అని అంటారు.
→ ఎలక్ట్రాన్ల స్థానాంతర గమనం వల్ల ఏర్పడ్డ విరుద్ద ఆవేశాలు గల అయాన్ల మధ్యగల స్థిర విద్యుదాకర్షణ బలాలను అయానిక బంధం లేక ఎలక్ట్రోవేలంట్ బంధం అంటారు.
→ IP విలువ తక్కువ, సైజు ఎక్కువ మరియు ఆవేశం తక్కువ గల పరమాణువుల నుండి సులభంగా కేటయాన్ ఏర్పడుతుంది.
→ E. A విలువ ఎక్కువ, సైజు తక్కువ మరియు ఆవేశం తక్కువ గల పరమాణువుల నుండి సులభంగా ఆనయాన్ ఏర్పడుతుంది.
→ అనంత దూరంలో ఉన్న విరుద్ధ ఆవేశాలు గల అయాన్లను దగ్గరకు చేర్చినపుడు ఒక మోల్ అయానిక స్ఫటికం ఏర్పడుతుంది. అపుడు విడుదలయ్యే శక్తిని లాటిస్ శక్తి అంటారు.
→ లాటిస్ శక్తిని పరోక్షంగా బోర్న్ హేబర్ వలయ పద్ధతి ద్వారా కనుగొంటారు. ఈ వలయ పద్దతి హెస్ సంకలన నియమంపై ఆధారపడి ఉంటుంది.
→ అయానిక పదార్ధంలోని ఏ అతి సూక్ష్మ విభాగాన్ని త్రిజ్యామితీతంగా పునరావృతం చేస్తే మొత్తం స్ఫటికం ఏర్పడుతుందో ఆ సూక్ష్మ విభాగాన్ని యూనిట్ సెల్ అంటారు.
→ అయానిక స్పటికంలో కేంద్రక అయాన్ చుట్టూ ఆవరించి ఉన్న విరుద్ద ఆవేశ అయాన్ల సంఖ్యను సమన్వయ సంఖ్య అంటారు.
→ సోడియం క్లోరైడ్ ఫలక కేంద్రిత ఘన నిర్మాణాన్ని మరియు సీసియం క్లోరైడ్ అంతఃకేంద్రిత ఘన నిర్మాణాన్నికలిగి ఉంటాయి.
→ అయానిక పదార్థాలు ధృవ శీలతను కలిగి ఉంటాయి. అందువలన అవి నీరు వంటి ధృవ ద్రావణులలో మాత్రమే కరుగుతాయి. కాని బెంజీన్ వంటి అధృవ ద్రావణులలో కరగవు.
→ ఎలక్ట్రాన్లను సమిష్టిగా పంచుకోవడం వల్ల ఏర్పడే బంధాన్ని సమయోజనీయ బంధం అంటారు. దీనిని జంట బంధం అని కూడా అంటారు.
→ ఒకే మూలకానికి చెందిన పరమాణువులను కలిగి ఉన్న అణువులను సజాతీయ అణువులు అని, విభిన్న మూలకాలకు చెందిన పరమాణువులను కలిగి ఉన్న అణువులను విజాతీయ అణువులు అని అంటారు.
→ సమయోజనీయ సమ్మేళనాలు ఎక్కువగా అధృవ ద్రావణులలో కరుగుతాయి. ధృవ ద్రావణులలో కరగవు.
→ ఏ అణువులలోని కేంద్రక పరమాణువుకు ఎనిమిది కన్నా తక్కువ ఎలక్ట్రాన్లు ఉంటాయో అట్టి వానిని ఎలక్ట్రాన్లు కొరత గల అణువులు అంటారు. ఉదా : BeCl2, BF3 మొ||నవి.
→ వేలన్స్ బంధ సిద్ధాంతం ప్రకారం సగం నిండిన పరమాణువులు గల ఆర్బిటాళ్ళు ఆవరింపు చేసుకోవడం వల్ల సమయోజనీయ బంధం ఏర్పడుతుంది.
→ సగం నిండిన ఆర్బిటాళ్ళు పరస్పరం అభిముఖ ఆవరింపు చేసుకోవడం వల్ల ఏర్పడే సమయోజనీయ బంధాన్ని సిగ్మా బంధం అంటారు.
→ సగం నిండిన ఆర్బిటాళ్ళు పరస్పరం ప్రక్క వాటుగా ఆవరింపు చేసుకోవడం వల్ల ఏర్పడే సమయోజనీయ బంధాన్ని పై బంధం అంటారు.
→ సిగ్మా బంధంలో ఆర్బిటాళ్ళ ఆవరింపు పై బంధంలోని ఆర్బిటాళ్ళ ఆవరింపు కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువలన సిగ్మా బంధం పై బంధం కన్నా బలమైనది.
→ VSEPR సిద్ధాంతం అణువుల అకృతులను మరియు బంధ కోణాలను వివరిస్తుంది.
→ కేంద్రక పరమాణువు ఒంటరి ఎలక్ట్రాన్ జంటలను కలిగి ఉంటే అపుడు అణువు ఆకృతిలో విరూపణ మరియు బంధకోణంలో తగ్గుదల ఏర్పడతాయి.
→ అమ్మోనియా అణువు పిరమిడల్ ఆకృతిని కలిగి ఉంటుంది. బంధకోణం 107° ఉంటుంది.
→ నీరు అణువు V ఆకృతిని కలిగి ఉంటుంది. బంధ కోణం 104.5° ఉంటుంది.
→ బంధింపబడి ఉన్న పరమాణువుల మధ్యగల సరాసరి అంతర్కేంద్ర దూరాన్ని బందదైర్ఘ్యం అంటారు.
→ ఒక మోల్ సమయోజనీయ బంధాన్ని దాని అనుఘటక పరమాణువులుగా విడగొట్టడానికి కావలసిన శక్తిని బంధశక్తి అంటారు.
→ దాదాపుగా సమానశక్తి గల పరమాణు ఆర్బిటాళ్ళు ఒక దానితో ఒకటి కలిసిపోయి అంతే సంఖ్యలో సర్వసమానాలైన కొత్త ఆర్బిటాళ్ళను ఏర్పరచే పద్ధతిని సంకరీకరణం అంటారు.
→ PCl5 అణువులో కేంద్రక ‘P’ పరమాణువు sp3d సంకరీకరణం పొందుతుంది. PCl5 అణువు ట్రైగోనల్ బై పిరమిడల్ ఆకృతిని కలిగి ఉంటుంది.
→ SF6 అణువులో కేంద్రక ‘S’ పరమాణువు sp3d2 సంకరీకరణం పొందుతుంది. SF6 అణువు ఆక్టా హెడ్రల్ ఆకృతి కలిగి ఉంటుంది.
→ బంధంలో పాల్గొనే పరమాణువులు సమాన సంఖ్యలో ఎలక్ట్రాన్లను పంచుకున్నప్పుడు ఏర్పడే బంధాన్ని ధృవ సమయోజనీయ బంధం అంటారు. దీనిలో విభిన్న మూలకాలకు చెందిన పరమాణువులు బంధంలో పాల్గొంటాయి.
→ బంధంలో పాల్గొనే పరమాణువులు అసమానంగా ఎలక్ట్రాన్లను పంచుకున్నప్పుడు ఏర్పడే బంధాన్ని ధృవ సమయోజనీయ బంధం అంటారు. దీనిలో విభిన్న మూలకాలకు చెందిన పరమాణువులు బంధంలో పాల్గొంటాయి.
→ ఒక ధృవశీల అణువులో, ధృవాల మీద ఉన్న ఆవేశిత పరిమాణం మరియు ధృవాల అంతర్ కేంద్ర దూరాల లబ్ధాన్ని ద్విధ్రువ భ్రామకం అంటారు. ఇది సదిశ రాశి. దీనిని డీబై ప్రమాణంలో కొలుస్తారు.
→ పంచుకోబడిన ఎలక్ట్రాన్ జంట బంధంలో పాల్గొనే పరమాణువులలో ఒకేదానికి చెందినపుడు ఏర్పడే బంధాన్ని సమన్వయ సమయోజనీయ బంధం అంటారు.
→ బంధం ఏర్పడటానికి కావలసిన ఎలక్ట్రాన్ జంటను ఏ పరమాణువు దానం చేస్తుందో దానిని దాత అంటారు.
→ బంధ ఎలక్ట్రాన్ జంటను స్వీకరించే దానిని స్వీకర్త అంటారు.
→ ఒక H- పరమాణువుకు అత్యధిక E.N. విలువ గల వేరొక పరమాణువుకు మధ్య ఏర్పడే బలహీన విద్యుదాకర్షణ బలాన్ని హైడ్రోజన్ బంధం అంటారు.”
→ అంతరణుక హైడ్రోజన్ బంధం వల్ల అణువుల కలయిక జరిగి పదార్థాల కరుగు మరియు మరుగు ఉష్ణోగ్రతలలో పెరుగుదల ఏర్పడుతుంది.
→ లోహ పరమాణువులను ఒక దానితో ఒకటి బంధించే ఆకర్షణ బలాలను లోహబంధం అంటారు.
→ ఎసిటిక్ ఆమ్లం యొక్క వింత ప్రవర్తనకు కారణం అది డైమర్గా ఉండటమే.
→ అణువులో బంధిత కేంద్రకాల చుట్టూ ఎలక్ట్రాన్లను కనుగొనే సంభావ్యత అధికంగా ఉన్న ప్రాంతాన్ని అణు ఆర్బిటాల్ అంటారు.
→ సంకలనం చెందే పరమాణు ఆర్బిటాళ్ళ సంఖ్య, దాని ఫలితంగా ఏర్పడే అణు ఆర్బిటాల్ల సంఖ్యకు సమానం.
→ పరమాణు ఆర్బిటాల్ల శక్తి కంటె తక్కువ శక్తి స్థాయిలో ఉన్న అణు ఆర్బిటాల్లను బంధక ఆర్బిటాల్లు అంటారు.
→ పరమాణు ఆర్బిటాల్ల శక్తి కంటే ఎక్కువ శక్తి స్థాయిలో ఉన్న అణు ఆర్బిటాల్లను అపబంధన ఆర్బిటాల్లు అంటారు.
→ సంకలన ప్రక్రియలో పాల్గొనని ఆర్బిటాల్లను అబంధక ఆర్బిటాల్లు అంటారు.