Here students can locate TS Inter 1st Year Chemistry Notes 11th Lesson P-బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్ to prepare for their exam.
TS Inter 1st Year Chemistry Notes 11th Lesson P-బ్లాక్ మూలకాలు – 14వ గ్రూప్
→ కార్బన్ (C), సిలికాన్ (Si), జెర్మేనియం (Ge), టిన్ (Sn), లెడ్ (Pb) మూలకాలు గ్రూపు 14 లో ఉన్నాయి.
→ భూపటలంపై చాలా విస్తారంగా ఉండే మూలకాలలో ద్రవ్యరాశిపరంగా కార్బన్ పదిహేడోది.
→ సిలికాన్ భూపటలంపై విస్తృతంగా లభించే మూలకాలలో రెండోది (27.7% ద్రవ్యరాశిలో)
→ స్వచ్ఛమైన జెర్మేనియం సిలికాన్లను ట్రాన్సిష్టర్లు, అర్ధవాహక ఉపకరణాల తయారీలో ఉపయోగిస్తారు.
→ 14వ గ్రూపు మూలకాలన్నీ ఘనపదార్థాలు. కార్బన్, సిలికాన్లు అలోహాలు. జెర్మేనియం అర్ధలోహం. టిన్, లెడ్ లు తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రత కల మృదువైన లోహాలు.
→ 14వ గ్రూపు మూలకాల ఆక్సీకరణ స్థితులు +4, +2.
→ లెడ్ సమ్మేళనాలు +2 స్థితిలో స్థిరమైనవి.
→ CCl4, జలవిశ్లేషణం చెందదు. కాని SiCl4, జల విశ్లేషణ చెందుతుంది. దీనికి కారణం Si లో d ఆర్బిటాల్ ఉండటమే.
→ CO2, SiO2, GeO2, లకు ఆమ్ల స్వభావం ఉంది. SnO2, GeO2, లకు ద్విస్వభావం ఉంటుంది.
→ CO తటస్థం. GEO కు స్పష్టంగా ఆమ్లధర్మం. అయితే SnO2, PbO లు ద్విస్వభావం గల ఆక్సెడులు.
→ SiCl4, జలవిశ్లేషణ వల్ల సిలిసిలిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
→ కార్బన్ పరమాణువులకు ఒకదానితో ఒకటి సమయోజనీయ బంధాల ద్వారా శృంఖలాలను, వలయాలను ఏర్పరచే ప్రవృత్తి ఉంటుంది. దీనినే కెటనేషన్ అంటారు.
→ కెటనేషన్ సామర్థ్యం C >> Si > Ge = Sn లెడ్ కెటనేషన్ చూపదు.
→ డైమండ్లో ప్రతి కార్బన్ Sp3 సంకరీకరణంలో ఉంటుంది. ప్రతి కార్బన్ నాలుగు ఇతర కార్బన్ పరమాణువులతో Sp3 సంకర ఆర్బిటాల్లను టెట్రా హైడ్రల్ రీతిలో ఉపయోగించుకొని బంధాలను ఏర్పరుస్తుంది. డైమండ్ అత్యంత గట్టి పదార్థం.
→ గ్రాఫైట్ పొర నిర్మాణం ఉంటుంది. ఈ స్థిరమైన పొరల మధ్య మధ్య వానర్వాల్ ఆకర్షణ బలాలుంటాయి. గ్రాఫైట్లో షట్కోణ వలయంలో ప్రతి కార్బన్ పరమాణువు Sp2 సంకరీకరణం చెందుతుంది.
→ జడవాయువులైన హీలియం లేదా ఆర్గాన్ల సమక్షంలో గ్రాఫైట్ను విద్యుచ్ఛాపంతో వేడి చేసిన పుల్లరిన్ తయారవుతుంది.
→ C60 అణువు సాకర్ బంతిని పోలిన నిర్మాణం ఉండటంవల్ల దీనిని బక్ మినిష్టర్ ఫుల్లరిన్ అంటారు. * దీనిలో ఆరు కార్బన్లు ఉన్న వలయాలు 20, ఐదు కార్బన్లు ఉన్న వలయాలు పన్నెండు ఉన్నాయి.
→ గ్రాఫైట్ అధిక స్థిరమైన కార్బన్ రూపాంతరం.
→ SiO2 + 2NaOH → Na2SiO3 + H2O
SiO2 + 4HF → SiF4 + 2 H2O
→ సిలికోన్లు ఆర్గానో సిలికాన్ పొలిమర్లు.
→ అధ్రువ ఆల్కెల్ సమూహాలతో చుట్టుకొన్న సిలికోన్లు జల వికర్షణ స్వభావం ఉన్నవి.
→ సిలికేటులలో నిర్మాణాత్మక యూనిట్ [SiO4]4-.
→ కృత్రిమంగా తయారుచేసిన రెండు ముఖ్య
→ త్రిమితీయ అల్లిక గల సిలికాన్ డై ఆక్సైడులో కొన్ని సిలికాన్ పరమాణువులను అల్యూమినియం పరమాణువులు స్థానభ్రంశం చేస్తే అల్యూమినియం సిలికేట్లు ఏర్పడతాయి. వీటినే జియొలైటులు అంటారు.
→ ZSM – 5 జియొలైట్ ఆల్కహాల్లను నేరుగా గాసోలిన్గా మార్చడానికి ఉపయోగిస్తారు.