TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download ఉపవాచకం 1st Lesson చిత్రగ్రీవం Textbook Questions and Answers.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson చిత్రగ్రీవం

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

1. చిత్రగ్రీవాన్ని గురించి మీకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు ఏవి ?
జవాబు.
నాకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు : గుడ్డు బద్దలుగొట్టి తల్లిపక్షి పిల్లపక్షిని ఈ ప్రపంచంలోకి తీసుకురావడం, పిల్లపక్షి నోటికి తల్లిపక్షి ధాన్యపు గింజల పాలను, తన కంఠంలో మెత్తబరచిన ఆహారాన్ని అందించి పెంచడం నాకు ఆశ్చర్యం కలిగించింది, మనుషుల్లాగానే మెత్తని గూడు అమర్చడం, తల్లిపక్షి పిల్లలకు పిల్లపక్షి ఏపుగా ఎదిగాక పసువు కలిసిన తెలుపు రంగులోకి మారడం, దుమ్ము ధూళి నుంచి ఎండ తీక్షణత నుంచి కళ్ళను కాపాడడానికి పక్షులకు ఉండే తెల్లని పొరలు నాకు ఆశ్చర్యం కలిగించిన అంశాలు.

2. మానవులను పావురాలకు మిత్రులూ, సహచరులని రచయిత ఎందుకు అన్నాడు ?
జవాబు.
కలిసి మెలిసి ఎగురుతూ ఆకాశంలో గుంపులు గుంపులుగా తిరిగే పెంపుడు పావురాలు అన్నీ గంటల తరబడి ఎంత దూరం ఎగిరినా చివరికి తమ తమ ఇళ్ళకూ, గూళ్ళకూ ఖచ్చితంగా చేరుకొంటాయి. పావురాలకు ఉన్న అద్భుతమైన దిశాపరిజ్ఞానం వల్ల తమ యజమానుల పట్ల వాటికి ఉన్న మిక్కిలి విశ్వాసం వల్లా అవి తమ గూళ్ళకు చేరుకోగలుగుతాయి. అందువల్లనే మానవులను పావురాలకు మిత్రులూ, సహచరులూ అని రచయిత అన్నాడు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

3. చిత్రగ్రీవం తండ్రిపక్షి గురించి రాయండి.
జవాబు.
జాతి పావురం : చిత్రగ్రీవం తండ్రిపక్షి ఒక గిరికీల మొనగాడు. అంటే ప్రసిద్ధ జాతి పావురం. తండ్రిపక్షి నుండి వేగం, చురుకుదనం, సాహసం పిల్లపక్షి సంతరించుకున్నది.

గుడ్డుల రక్షణ : రచయిత గుడ్లున్న గూడును శుభ్రం చేస్తున్నప్పుడు వాటిని నాశనం చేస్తున్నాడేమో అనే భయంతో పొరబాటున అతని మీద దాడి చేసింది. ఒక గుడ్డు చెయ్యి జారి నేలపాలు కావడానికి కారణమైంది. పొదగడం : గుడ్లను పొదగడంలో మూడింట రెండు వంతులు పాత్ర తల్లి పక్షిదైతే మూడవ వంతు పాత్ర తండ్రి పక్షిదే. పెంపకం : ఆహారపు గింజల్ని సంపాదించి వాటిని కంఠంలో మెత్తబరిచి బిడ్డలకు అందించి పోషించడంలో తల్లి తండ్రి పక్షులు రెండూ పాలుపంచుకుంటాయి. పిల్లలకు సౌఖ్యం కోసం గూడును మెత్తగా అమరుస్తాయి.

బిడ్డకు శిక్షణ : రెక్కలు వచ్చిన పిల్ల పావురానికి తండ్రి పక్షే ఎగరడం నేర్పించింది. బలవంతంగా మేడమీద నుంచి కిందికి జారేటట్టు చేసిన పిల్లపక్షి రెక్కలకు పని చెప్పింది.

4. చిత్రగ్రీవం తల్లిపక్షి గురించి రాయండి.
జవాబు.
తల్లిపక్షి చాలా అందమైనది. అది వార్తల పావురం. అది గూటిలో గుడ్లు పెట్టి పొదుగుతుంది. మూడింట రెండు వంతులు పొదగడం తల్లి పనే. అప్పుడప్పుడు తండ్రి పక్షి పొదుగుతుంది. సమయమైన తరువాత గుడ్డు పగులగొట్టి పిల్లను జాగ్రత్తగా బయటికి తీసి సంరక్షిస్తుంది. ఆహారం తినడం, ఎగరడం నేర్పుతుంది. పిల్లకు రెక్కలొచ్చే వరకూ కావలసినంత వెచ్చదనాన్ని ఇస్తుంది. గూటిని సౌకర్యవంతంగా ఉంచుతుంది.

5. పావురం గుడ్డు విషయంలో కథకుడు చేసిన తప్పిదం తెలపండి.
జవాబు.
ఒకనాడు కథకుడు తల్లిపావురం గుడ్లను పొదుగుతున్న గూటిని శుభ్రం చేద్దామని వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా పావురం
గుడ్లను పక్కగూటిలో పెట్టి దాని గూడు శుభ్రంచేసి మళ్ళీ యథాస్థానంలో పెడుతున్నాడు. ఒక గుడ్డు పెట్టి రెండవ గుడ్డు పెట్టబోతుండగా తండ్రిపావురం అతనిపై దాడి చేసింది. దాని దాడిని తట్టుకోడానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. ఈ కంగారులో ఆ రెండో గుడ్డు చెయ్యి జారి కిందపడి పగిలిపోయింది. ఇదే అతను చేసిన తప్పిదం. తల్లిపావురం పెట్టిన గుడ్లలో ఒకదాన్ని జారవిడిచి పగలగొట్టినందుకు సిగ్గుపడుతూ, బాధపడుతూ ఉంటాడు.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

6. గుడ్డు నుంచి చిత్రగ్రీవం బయటికి వచ్చిన విధం తెలపండి.
జవాబు.
ఇరవై రోజులు గుడ్డును పొదిగిన తరువాత ఇరవైఒకటవరోజు తల్లి దాని ప్రక్కనే జాగ్రత్తగా గమనించుకుంటూ తిరుగుతోంది. తండ్రిపక్షి గూటిలోకి రాబోతే దూరంగా తరిమేసింది. సుమారు రెండు గంటల తరువాత గుడ్డులోనించి పిల్ల కదులుతున్న శబ్దాలు కాబోలు విన్నది తల్లి. చాలా జాగ్రత్తగా గుడ్డును పరిశీలించి చూసి రెండేసార్లు ముక్కుతో కొట్టి గుడ్డును పగలగొట్టింది. పిల్లపక్షి బయటపడింది. తల్లిపక్షి పిల్లను రెక్కల కింద పొదువుకున్నది.

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

1. చిత్రగ్రీవాన్ని గురించి మీ సొంత మాటల్లో వర్ణించండి.
జవాబు.
పరిచయం : ‘చిత్రగ్రీవం’ ధనగోపాల్ ముఖర్జీ రచించిన ఒక కథ. చిత్రగ్రీవం ఒక పెంపుడు పావురం. తల్లిదండ్రులు : చిత్రగ్రీవం తల్లి ఒక వార్తల పావురం. తండ్రి ఒక గిరికీల మొనగాడు. రెండూ విశిష్టమైనవి కావడం వల్ల చిత్రగ్రీవం ఎంతో సుందరంగా ఉండేది. అంతేగాక తల్లి నుండి తెలివితేటలు, తండ్రి నుంచి వేగం, చురుకుదనం, సాహసం సంతరించుకున్నది. అందువల్లే యుద్ధ రంగాల్లోనూ శాంతి సమయాల్లోనూ అమోఘంగా పని చేయగల వార్తాహరియైన పావురంగా రూపొందింది.

సంరక్షణ : తల్లితో సరిసమానంగా తండ్రి కూడా చిత్రగ్రీవం బాగోగులు చూడడంలోనూ, ఆహారం అందించడంలోనూ పాలుపంచుకున్నది. తల్లిదండ్రుల శ్రద్ధ పుణ్యమా అని చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది. గులాబీ రంగుతో మెరిసే పిల్ల పసుపు కలిసిన తెలుపు రంగులోకి మారింది.

సామర్థ్యం : మూడు వారాల వయసులో ఆహారం అనుకొని చీమను పొడిచి చంపింది. ఐదో వారానికల్లా గెంతుతూ జరగడం నేర్పింది. మరో రెండు వారాల్లో ఎగరడం నేర్చుకొన్నది. తల్లిదండ్రుల రక్షణ, శిక్షణలలో ఆకాశంలో విహరించే విద్య తెలుసుకోగలిగింది.

ముగింపు : ఈ విధంగా చిత్రగ్రీవం తల్లిదండ్రుల గొప్పది లక్షణాలను పుణికి పుచ్చుకొని వారి సంరక్షణలో పెరిగి పెద్దదై వారి శిక్షణ సాయాలతో స్వీయ సామర్థ్యాన్ని పెంపొందించుకున్నది.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

2. శిశువుల పెంపకంలో పక్షులకు, మానవులకు మధ్య ఉన్న సామ్యాలను రాయండి.
జవాబు.
గుడ్డు పొదగడం : పక్షులు గుడ్డు దశలో ఉన్నప్పుడు తండ్రిపక్షి, తల్లిపక్షి పరిణత దశకోసం పొదుగుతాయి. కంటి రెప్పలా కాపాడుతాయి. ఇవి మనుషుల గర్భస్థ శిశువును సంరక్షించుకొనే పద్ధతుల లాగానే ఉంటాయి.

ఆలనా పాలన : మనం చిన్న పిల్లల్ని ఎత్తుకొని లాలిస్తే ఆ పిల్లలకు ఎలాంటి హాయీ సౌఖ్యము లభిస్తాయో పక్షులకు తమ తండ్రిపక్షి, తల్లిపక్షుల నుంచి అలాంటి వెచ్చదనం లభిస్తుంది. తల్లిపక్షి, తండ్రిపక్షి పిల్లపక్షి సుఖ సౌకర్యాల కోసం గూడులో తగిన రీతిలో అమర్చుతాయి. ఈ ఏర్పాటు పసిపిల్లలకు ఏర్పాటు చేసే మెత్తని గుడ్డల బొంతల వంటిది.

పోషణ : పెద్ద పక్షులు తాము సంపాదించిన ధాన్యపు గింజల నుంచి తయారు చేసిన పాలను పిల్ల పక్షుల నోళ్ళలో పోస్తాయి. అంతేగాక గింజల్ని, విత్తనాల్ని తమ కంఠంలో నానబెట్టి మెత్తబరిచాకే పిల్లపక్షులకు అందిస్తాయి. ఇది పళ్ళు రాని బోసి నోటి పెసిపిల్లలకు పెట్టే గుజ్జన గూళ్ళను పోలినదే.

శిక్షణ : పొడవడం, గెంతడం, ఎగరడం నేర్పిన పిల్లపక్షికి తండ్రిపక్షి ఆకాశంలో ఎగరడంలో శిక్షణ ఇస్తుంది. పిల్లపక్షికి ధైర్యం చెప్పేటందుకు తల్లిపక్షి తాను కూడా ఎగిరి సాయం చేస్తుంది. విద్యాభ్యాస దశలో పిల్లలకు తల్లిదండ్రుల నుంచి లభించే ప్రోత్సాహం, ధైర్యం ఇటువంటివే.

3. పశుపక్షులు తమ సంతానాన్ని పెంచే విధానాన్ని సొంతమాటల్లో వివరించండి.
జవాబు.
పశుపక్షులు తమ సంతానాన్ని పెంచే విధానం కూడా మనుషులు తమ బిడ్డలను పెంచే విధానంలాగానే ఉంటుంది. పశువులు కడుపులో మోసిన బిడ్డలను నెలలు నిండాక కంటాయి. పక్షులు మాత్రం గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఆడపక్షితో పాటు మగపక్షి కూడా పొదుగుతుంది. కానీ గుడ్డును ఎప్పుడు ఎలా పగల గొట్టాలో ఆడపక్షికి మాత్రమే తెలుస్తుంది. పశుపక్షులు కూడా తమ పిల్లల ఆలనాపాలన కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటాయి. పశువులు తమ బిడ్డలను సాధ్యమైనంత వరకూ మెత్తని ప్రదేశంలో ఉండేటట్లు చూస్తాయి.

పక్షులైతే తమ పిల్లల కోసం గూళ్ళలోని మెత్తని పక్కలు ఏర్పాటు చేస్తాయి. పశువులు తమ పిల్లలకు పుట్టిన నాటి నుంచే పాలిచ్చి పోషిస్తాయి. పక్షులు మాత్రం తమ కంఠంలో నానబెట్టిన గింజల నుంచి వచ్చే పాలను బిడ్డల గొంతులో పోసి పోషిస్తాయి. పక్షుల పిల్లలు ఎగరడం, గెంతడం అవే నేర్చుకుంటాయి. ఆహారం సంపాదించడం, ప్రాణాలను రక్షించుకోవడం మాత్రం తల్లిదండ్రులను చూసి అలవాటు చేసుకుంటాయి. రెక్కలు వచ్చిన పిల్ల పక్షులకు ఆకాశంలో ఎగరడంలో మెలకువలు నేర్పుతాయి.

4. ఇంట్లో చాలామంది పావురాలను పెంచుకుంటారు కదా ? వారు పొందే అనుభూతిని సొంతమాటల్లో రాయండి.
జవాబు.
పావురాలు చాలా అందంగా ముద్దుముద్దుగా ఉంటాయి. అందుకే కొంతమంది పావురాలను ఇళ్ళలో పెంచుకొంటూ, వాటి పెంపకంలో ఆనందాన్ని పొందుతుంటారు. అవి గుంపులు గుంపులుగా ఎగురుతుంటే చాలా అందంగా ఉండి ఆనందాన్ని కలిగిస్తుంటాయి. మన ప్రాంతంలో కనబడే పావురాలు బూడిద రంగులో బొద్దుగా ఉంటాయి. పావురాలను కొందరు తమ పిల్లల్లాగా అల్లారుముద్దుగా పెంచుకొంటారు. వాటికి కావలసిన ధాన్యపుగింజలు వేస్తూ అవి తినే విధానాన్ని చూసి ఆనందిస్తుంటారు. పావురాలు గుడ్లుపెట్టి, పొదిగి, పిల్లల్ని చేసి, వాటిని జాగ్రత్తగా పెంచే విధానం, ఆ పిల్లలకు ఆహారాన్ని పెట్టే విధానం ఆశ్చర్యం కలిగిస్తుంది.

పావురాల యొక్క కువకువ ధ్వనులు ఎంతో శ్రావ్యంగా ఉంటాయి. ఇళ్ళకు సమీపంలో ఉన్న దేవాలయాల గోపురాల గూళ్ళలో దూరి అవి చేసే హావభావాలు చూసి యజమానితో పాటు, వాటిని చూసిన వారందరూ ఆనందాన్ని పొందుతుంటారు. ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు గోపురాలలో పావురాలు, చిలుకలు చేసే ధ్వనులను చక్కగా వర్ణించారు. పావురాలను, ఇతర పక్షులను పెంచుకోవడం అంటే జీవావరణాన్ని పరిరక్షించడమే. మానవతాదృక్పథంతో వాటిని ఆదరించడమే.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

5. చిత్రగ్రీవం ఎగరడం ఎలా నేర్చుకున్నది ?
జవాబు.
కథకుడు చిత్రగ్రీవాన్ని రోజూ మేడ మీద పిట్టగోడమీద వదిలేవాడు. ఒకనాడు కొన్ని గింజలు నేలమీద వదిలి దాన్ని తినడానికి పిలిచాడు. చాలాసేపటి తర్వాత అతికష్టం మీద అది కిందికి దూకింది. గింజలమీద బాలెన్సు చేసుకొనే భాగంగా అప్రయత్నంగా, హఠాత్తుగా దాని రెక్కలు విప్పుకున్నాయి. కథకుడు చిత్రగ్రీవాన్ని రోజూ మణికట్టు మీద ఉంచుకొని చేతిని పైకీ కిందికీ పదేపదే కదిపేవాడు. అలా కదిపినప్పుడు చిత్రగ్రీవం బాలెన్సు నిలదొక్కుకోవడం కోసం రెక్కలు విప్పడం, ముడవడం చేసేది.

ఒకనాడు తండ్రిపక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పే పని చేపట్టింది. దాన్ని పిట్టగోడ మీద తరుముకుంటూ వెళ్ళి కిందికి తోసి దానిపైనే ఎగురుతూపోయింది. జారిన చిత్రగ్రీవం తన్ను తాను రక్షించుకోడానికి రెక్కలు విప్పి గాలిలో తేలింది. తల్లిపక్షి కూడా వచ్చి సాయంగా ఎగిరింది. అలా ముగ్గురూ పది నిమిషాలు ఎగిరి కిందికి వచ్చి వాలాయి. నేల తాకేటప్పుడు చిత్రగ్రీవం కంగారు పడింది. కొంచెంగా దెబ్బ తగిలింది. కాని ఎగరడం వచ్చేసింది.

6. ‘చిత్రగ్రీవం’ పాఠంలోని బాలుని స్థానంలో నీవుంటే ఏమి చేస్తావో వివరించండి.
జవాబు.
సాధారణంగా పక్షులు గుడ్లు పొదిగేటప్పుడు వాటి జోలికి వెళ్ళకూడదనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే మా యింటి దగ్గర చింతచెట్టు ఉంది. చింతకాయలు కోద్దామని చెట్టు ఎక్కాను. దాని మీద కాకిగూడు ఉంది. దాంట్లో చిన్న చిన్న కాకి పిల్లలు ఉన్నాయి. అయినా నేను వాటి జోలికి వెళ్ళలేదు. చింతకాయలు కొన్ని కోసుకొని చెట్టు దిగుతుండగా కాకులు నన్ను చూశాయి. అవి వచ్చి నను కాళ్ళతో తన్నుతూ ముక్కుతో పొడిచాయి. ఈ విధంగా కాకులు నన్ను వదలకుండా హింసించాయి. దాంతో చాలా భయం వేసింది.

చిత్రగ్రీవం పాఠంలో బాలుని స్థానంలో నేను గనుక ఉంటే – పావురాల గూటి దగ్గరకు వెళ్ళేవాణ్ణికాదు. దాని గూడు శుభ్రం చేయడం, తండ్రి పావురంతో పొడిపించుకోవడం, గుడ్డు జారవిడవడం వంటివి చేసేవాణ్ణికాదు. కాకులతో ఒకసారి దెబ్బతిన్నాను కాబట్టి ఆ బాలుడి లాగా అటువంటి పని చేయలేను. పక్షుల ప్రవర్తనలన్నీ ఒకేమాదిరిగా ఉంటాయని భావించాను.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

7. పాఠం ఆధారంగా పావురాల జీవన విధానాన్ని రాయండి.
జవాబు.
పావురాలు రకరకాల రంగుల్లో ఉంటాయి. మన ప్రాంతంలో పావురాలు దాదాపు బూడిదరంగులో ఉంటాయి. తల్లిపావురం గుడ్డు పెట్టి పొదిగి పిల్లల్ని చేస్తుంది. మెత్తని గూళ్ళలో పిల్లల్ని పెట్టి రక్షిస్తూ పెంచుతుంటాయి. మెత్తని పాలతో నిండిన ధాన్యపు గింజల్ని వాటికి ఆహారంగా అందిస్తాయి. మనుషులలాగానే పిల్లల్ని పెంచడంలో జాగ్రత్తలు తీసుకుంటాయి. పావురాలు గుంపుగుంపులుగా ఆహారం కోసం ఎగిరి వెళతాయి.

మళ్ళీ తిరిగి తమ గూళ్ళకు చేరుకుంటాయి. అన్నీ కలిసిమెలిసి జీవిస్తుంటాయి. పావురాలకున్న దిశాపరిజ్ఞానం చాలా గొప్పది. పూర్వం పావురాల ద్వారానే వార్తలు అందించే వారనే సంగతులు మనకు తెలుసు. పెంపుడు పావురాలకైతే యజమానుల పట్ల ప్రేమ, గౌరవం ఎక్కువ. పావురాల పిల్లలు తల్లి నుండి తెలివితేటలు, తండ్రి నుండి వేగం, చురుకుదనం, సాహసం నేర్చుకుంటాయి. పావురాలు తమ పిల్లలకు మాటలు నేర్పుతాయి. ఎగరడానికి తగిన శిక్షణ ఇస్తాయి. ఈ విధంగా పావురాల జీవనవిధానం చక్కగా సాగుతుంది.

8. చిత్రగ్రీవం ఎదగడంలో వెనకబడడానికి కారణాలు ఏమై ఉంటాయి ?
(లేదా)
చిత్రగ్రీవం ఎదిగిన క్రమాన్ని వివరించండి.
జవాబు.
పరిచయం : ధనగోపాల్ ముఖర్జీ రచించిన చిత్రగ్రీవం కథలో చిత్రగ్రీవం అనే పిల్లపావురానికి ఉన్న ప్రత్యేక లక్షణాలను మనోహరంగా వర్ణించారు. తన దగ్గర ఉన్న పావురాలలో చిత్రగ్రీవం సుందరమైనది. అయినా అది ఎదగడంలో అన్నింటికంటే మందకొడి అని రచయిత వర్ణించారు.

ఇంద్రధనుస్సు లాంటి ఈకలు : చిత్రగ్రీవానికి ఈకలు బూడిరంగు కలిసిన నీలి వర్ణంతోనే ఉండేవి. తరువాత శరీరమంతా ఈకలు పెరిగాక దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు ఈకలతో ధగధగా మెరిసిపోయింది. దాని మెడప్రాంతం సూర్యకాంతిలో ఇంద్రధనుస్సు, రంగుల పూసల గొలుసులా శోభిల్లింది. ఎదిగేటప్పుడు కొన్ని జీవులకు సహజంగానే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండడమే దీనికి కారణం.

ఆహార సంపాదన : చిత్రగ్రీవం ఐదో వారానికల్లా గెంతడం నేర్చుకున్నా ఆహార సంపాదన విషయంలో మాత్రం ఇంకా తల్లిదండ్రుల మీదనే ఆధారపడ్డది. ఈ మందకొడితనానికి దాని సహజలక్షణమే కారణం.

ముగింపు : ఈ విధంగా చిత్రగ్రీవం ఎదగడంలో వెనకబడిపోవడానికి దాని సహజ లక్షణాలు, శిక్షణ అందివ్వకపోవడమే కారణాలుగా చెప్పవచ్చు.

పరిచిత గద్యభాగాలు

1. కింది గద్య భాగాన్ని చదవండి. ఐదు ప్రశ్నలు తయారుచేయండి.

చంటి పక్షులు ఎదిగి వచ్చే సమయంలో వాటి గూళ్ళలో మరీ ఎక్కువగా మెత్తటి దూదీ, పీచు లాంటి పదార్థాలను ఉంచగూడదు. వాటిని తగు మోతాదులోనే ఉంచాలి. లేకపోతే గూడు మరీ వెచ్చనైపోతుంది. అరకొర జ్ఞానపు పావురాల పెంపకందారులు పిల్లపక్షులు ఎదిగే సమయంలో తమ శరీరం నుంచే చాలా మోతాదులో వెచ్చదనాన్ని విడుదల చేస్తాయన్న విషయం గ్రహించరు. ఈ సమయంలో పావురాల గూళ్ళను మరీ తరచుగా శుభ్రం చెయ్యటం కూడా మంచిదిగాదు. తల్లిపక్షి, తండ్రిపక్షి ఆచి తూచి గూటిలో ఉండే ప్రతి వస్తువూ పిల్లపక్షి సుఖసౌకర్యాలకు దోహదం చేస్తాయి.
జవాబు.

  1. చంటి పక్షులు ఎదిగివచ్చే సమయంలో వాటిగూళ్ళలో మరీ ఎక్కువగా ఏం ఉంచకూడదు ?
  2. అలా ఉంచకపోతే ఏం జరుగుతుంది ?
  3. అరకొర జ్ఞానపు పావురాల పెంపకందార్లు ఏ విషయం గహించరు ?
  4. చంటిపక్షులు ఎదిగివచ్చే సమయంలో ఏది మంచది కాదు ?
  5. పిల్ల పక్షి సుఖసౌకర్యాలకు దోహదం చేసేవి ఏవి ?

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

2. కింది గద్య భాగాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

దాని తండ్రిపక్షి ఓ గిరికీల మొనగాడు. తల్లిపక్షి ఓ వార్తల పావురం. ఆ రోజుల్లో అది అతి సుందరమైన కులీన వంశానికి చెందిన పావురం. ఆ రెండు విశిష్టమైన పావురాలు జతకట్టాయి. గుడ్లు పెట్టాయి. వాటికి పుట్టిన చిత్రగ్రీవం అందువల్లనే తర్వాతి రోజుల్లో యుద్ధరంగాల్లోనూ శాంతి సమయాల్లోనూ అమోఘంగా పనిచెయ్యగల వార్తాహరియైన పావురంగా రూపొందింది. తల్లిపక్షి నుండి తెలివితేటలు సంపాదించుకుంది. తండ్రిపక్షి నుండి వేగం, చురుకుదనం, సాహసం సంతరించుకుంది.

ప్రశ్నలు :

1. తల్లిపక్షి ప్రత్యేకత ఏమిటి ?
జవాబు.
తల్లిపక్షి ఓ సమాచారాన్ని ఒకచోటి నుంచి మరొక చోటికి చేరవేసే వార్తల పావురం.

2. చిత్రగ్రీవానికి తెలివితేటలు ఎలా వచ్చాయి ?
జవాబు.
చిత్రగ్రీవానికి తెలివితేటలు తల్లి నుంచి వచ్చాయి.

3. తండ్రి నుంచి వచ్చిన లక్షణాలు ఏవి ?
జవాబు.
తండ్డి పక్షి నుంచి వేగం, చురుకుదనం, సాహసం అనే లక్షణాలు వచ్చాయి.

4. ఇందులో తల్లిదండ్రుల లక్షణాలను పుణికి పుచ్చుకున్నది ఏది ?
జవాబు.
ఇందులో తల్లిదండ్రుల లక్షణాలను పుణికిపుచ్చుకున్నది చిత్రగ్రీవం.

5. ఈ పేరాను రచించినది ఎవరు ?
జవాబు.
ఈ పేరాను రచించినది ధనగోపాల్ ముఖర్జీ.

TS 8th Class Telugu Guide ఉపవాచకం 1st Lesson Telangana చిత్రగ్రీవం

3. క్రింది గద్యభాగమును చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానాలు రాయండి.
చిత్రగ్రీవానికి మూడువారాల వయసప్పుడు దాని గూటిలోకి ఒక చీమ పాకింది. గూటి అంచున కూర్చొని ఉన్న చిత్రగ్రీవం ఎవరి ఉపదేశమూ లేకుండానే ఆ చీమను టక్కున తన ముక్కుతో పొడిచింది. అప్పటిదాకా ఏకఖండంగా సాగిన ఆ చీమ ఒక దెబ్బతో రెండు ముక్కలైపోయింది. తన ముక్కుతో ఆ చీమ తునకలను కదిపి చూసి తాను చేసిన ఘనకార్యం ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది చిత్రగ్రీవం. అది ఏదో తినే వస్తువు అనుకొని తమ పావురాల జాతికి మిత్రుడైన ఆ అమాయికపు నల్లచీమను చిత్రగ్రీవం పొడిచి చంపిందనడంలో సందేహం లేదు. తాను చేసిన పనిచూసి చిత్రగ్రీవం పశ్చాత్తాపపడిందనీ మనం అనుకోవచ్చు. ఏదేమైనా చిత్రగ్రీవం మళ్ళా ఎప్పుడూ తన జీవితంలో మరోసారి చీమను చంపలేదు.

ప్రశ్నలు :

1. చిత్రగ్రీవం చేసిందనుకున్న గొప్ప పని ఏమిటి ?
జవాబు.
నల్ల చీమను ముక్కుతో పొడిచి చంపడం.

2. తాను చేసిన పనికి చిత్రగ్రీవం పశ్చాత్తాపపడిందని రచయిత భావించడానికి కారణం ఏమిటి ?
జవాబు.
ఆ తర్వాత మళ్ళీ ఎప్పడూ మరో చీమను చిత్రగీవం చంపలేదు. అందువల్ల చిత్రగీవం పశ్చాత్తాపపడి ఉండవచ్చని రచయిత భావించాడు.

3. పావురాల జాతికి మిత్రుడెవరు ?
జవాబు.
నల్ల చీమలు

4. చీమను పొడిచి చంపేనాటికి చిత్రగ్రీవం వయసు ఎంత ?
జవాబు.
మూడు వారాలు

5. చీమను చిత్రగ్రీవం ఎందుకు చంపింది ?
జవాబు.
తినే వస్తువనుకొని చంపింది.

Leave a Comment