TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 7th Lesson మంజీర Textbook Questions and Answers.

మంజీర TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి – ఆలోచించి చెప్పండి

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర 3

ప్రశ్న 1.
పై బొమ్మలో ఏమేం కన్పిస్తున్నాయి ? బొమ్మలోని బాలిక ఏం చూస్తున్నది ? ఏం ఆలోచిస్తుండవచ్చు?
జవాబు.
పై బొమ్మలో ప్రవహిస్తున్న నది, నదికి అవతలిగట్టున స్నానాల రేవు, ఆ రేవులో పవిత్ర జలంలో స్నానం చేస్తున్న భక్తులు, నది గట్టున అమ్మవారి ఆలయం కనిపిస్తున్నాయి. బొమ్మలోని బాలిక పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న నది వంక చూస్తున్నది. నది అంత అందంగా ఎలా పరుగెట్ట గలుగుతుందా అని ఆలోచిస్తుండవచ్చు.

ప్రశ్న 2.
ఏదైనా నదిని చూసినప్పుడు మీకు కలిగిన భావాలను చెప్పండి.
జవాబు.
నేను నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు కృష్ణానదిని చూశాను. ఆ నదిని చూసినప్పుడు ఇన్ని నీళ్ళు ఎక్కణ్ణుంచి వచ్చాయి, వేగంగా పరిగెత్తే నీళ్ళు ఎక్కడికి వెడతాయి, నది నీళ్ళు అంత స్వచ్ఛంగా, తియ్యంగా ఎందుకు ఉంటాయి, చలికాలం వెచ్చగానూ, వేసవి కాలంలో చల్లగానూ ఎలా ఉంటాయి. అసలు ఈ నదులు లేకపోతే తాగునీటి కోసం, సాగునీటికోసం మనుషులు ఏం చేసేవారో కదా! మొదలైన భావాలు కలిగాయి.

ప్రశ్న 3.
మీ ప్రాంతంలో ప్రవహించే నదుల పేర్లు చెప్పండి.
జవాబు.
మా ప్రాంతంలో కృష్ణా, గోదావరి, మంజీర, మూసీ, మొదలైన నదులు ప్రవహిస్తాయి.

ప్రశ్న 4.
నదుల వల్ల ఉపయోగాలు ఏమిటి ?
జవాబు.
నదులు ప్రాణులన్నింటికీ తాగు నీటిని ఇస్తాయి. పంటలు పండించడానికి సాగు నీరు ఇస్తాయి. రవాణా సౌకర్యాలకు ఉపయోగపడతాయి. విద్యుత్తు ఉత్పత్తికి తోడ్పడతాయి. భవన నిర్మాణాలకు, కట్టడాలకు కావలసిన ఇసుకను ఇస్తాయి.

ఆలోచించండి – చెప్పండి  (TextBook Page No. 70)

ప్రశ్న 1.
“పైరు పచ్చల కన్నుల పండువుగ విలసిల్లు” అనడంలో మంజీర నదికున్న సంబంధమేమిటి?
జవాబు.
మంజీర నది చల్లని తల్లివంటిది. అది పంట పొలాలకు తీయని నీరు అందిస్తుంది. మంజీరనది ప్రవాహపు సవ్వడి, గాజుల గలగలల వంటి ఆ నది తరంగాల శబ్దం వినగానే రైతు నాగలితో పొలం పనులు మొదలవుతాయి. ఆ నది మంచితనం చూడగానే రెప్పపాటులోనే పచ్చని పైరులు కనుల పండుగగా ప్రకాశిస్తాయి.

ప్రశ్న 2.
మంజీర నదిని కవి “ఎంత తీయని దానవే” అని అనడంలో ఆంతర్యమేమిటి?
జవాబు.
మంజీర నది తన పరిసరాలలో నివసించే ప్రజలకు తాగటానికి తీయని మంచినీరు ఇస్తుంది. ఆ నది నీటి వల్ల పండిన రుచికరమైన పంటలు ప్రజల ఆకలి తీరుస్తున్నాయి. అందువల్ల కవి మంజీర నదిని “ఎంత తీయని దానవే” అని అన్నారు.

ప్రశ్న 3.
ఈ “గిడస బారిన పుడమి ఎడద కరిగించెదవు” అని కవి మంజీర గురించి ఎందుకన్నాడు?
జవాబు.
మంజీర నది నీరు చేరగానే అప్పటి వరకూ ఎండిపోయి బిగుసుకుపోయిన నేల మృదువుగా, పంటలు పండడానికి వీలుగా తయారవుతుంది. అందువల్ల కవి మంజీర గురించి “గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు” అని అన్నాడు.

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

ప్రశ్న 4.
‘మంజీర’ పల్లెటూర్లను తల్లివలె లాలించింది అని కవి ఎందుకన్నాడు?
జవాబు.
ఆహార పంటలు పండించడంలో పల్లెటూళ్ళు ప్రముఖపాత్ర పోషిస్తాయి. అటువంటి పల్లెటూళ్ళలో పంటలు పండటానికి నదుల నీరే ఆధారం. మంజీరా నది పల్లెవాసులకు స్నానాలకూ, తాగడానికీ, సాగు చేయడానికీ నీళ్ళను అందించి కన్నతల్లి లాగా వారిని లాలిస్తుంది. ‘అందువల్ల కవి మంజీర పల్లెటూర్లను తల్లివలె లాలించింది అని అన్నాడు. పిల్లల అన్ని అవసరాలను తల్లి తీర్చినట్లు పల్లె ప్రజల సాగునీటి, తాగునీటి మొదలైన అవసరాలను అన్నింటినీ మంజీర నది తీరుస్తుంది అని తాత్పర్యం.

ప్రశ్న 5.
ఈ పట్టణాలను మంజీరానది తోబుట్టువులవలె ప్రేమిస్తుందని కవి ఎందుకన్నాడు?
జవాబు.
మంజీర నదికి పల్లెలు బిడ్డల వంటివి, పట్టణాలు తోబుట్టువుల వంటివి. బిడ్డలైన పల్లె ప్రజల అన్ని అవసరాలను తన తియ్యని నీటితో తీరుస్తుంది మంజీర తల్లి. తన బిడ్డలు పండించిన ఆహార పంటలను పంపించి తన తోబుట్టువులైన నగరాలను కూడ పోషిస్తుంది. అంటే పల్లెటూళ్ళలో ప్రజలకు అవసరమైన దానికంటే ఎక్కువ పంటలు పండుతాయి అని భావం. అంతేకాక ఆ ధాన్యం రవాణాకు కూడా మంజీర నది నీరు ఉపయోగపడుతుందని తాత్పర్యం.

ప్రశ్న 6.
“పట్టణాలను మంజీరానది పోషిస్తున్నది” ఎట్లాగో మీ మాటల్లో చెప్పండి.
జవాబు.
మంజీరానది ప్రవహించడం వల్లనే పల్లెటూళ్ళలో ఆహారపంటలు అధికంగా పండుతున్నాయి. తమ మిగులు పంటలను పల్లె ప్రజలు పట్టణాలకు పంపిస్తారు. ఈ అధిక దిగుబడికి మంజీర నది అందిస్తున్న తియ్యని నీరే కారణం. అందువల్ల
పట్టణాలను మంజీరానది పోషిస్తున్నది అని చెప్పవచ్చు.

ఇవి చేయండి :

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి.
జవాబు.
విద్యార్థి కృత్యం.

ప్రశ్న 2.
నదుల వల్ల ఏయే ప్రయోజనాలున్నాయో చర్చించండి.
జవాబు.
భూమి మీద నివసించే అన్ని రకాల జీవుల దాహార్తిని తీర్చే నదులు మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రాచీనకాలం నుంచే స్నానానికి, సాగునీటికి ఉపయోగపడుతున్న నదులు నేడు విద్యుత్తు ఉత్పత్తికి, పర్యాటక కేంద్రాలుగా, రవాణా సౌకర్యాలకూ, ఇసుక ఇవ్వడం మొదలైన ఎన్నో విధాలుగా ఉపయోగపడు తున్నాయి.

నేటి కాలంలో ప్రవహించే నది నీటిని ఆపే ఆనకట్టలు, నీటిని నిలవ ఉంచే రిజర్వాయర్ల సౌకర్యాలు పెరిగాయి. అందువల్ల నది నీటిని గొట్టాలద్వారా నేరుగా ఇంటిదగ్గరకే పంపించగలుగుతున్నారు. దీనితో అందరూ నది నీటిని తాగునీరుగా ఉపయోగించుకోగలుగుతున్నారు. నదుల నుంచి నీరు పెద్ద కాలువలోకి, అందులోనుంచి చిన్న కాలవలలోకి, వాటి నుంచి బోదెలలోకి, నీరు చేరడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాక నది నీటి తలానికి ఎత్తులో ఉండే ప్రాంతాలకు కూడా నీళ్ళు తోడిపోసే యంత్రాల ద్వారా నీళ్ళు అందుతున్నాయి. నదులకు ఆనకట్టలు కట్టి నీటిని కాలవల ద్వారా పంపేచోట విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. పంటలకు ఉపయోగపడే నీరే విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల మానవాళికి ఎంతో ఉపయోగం.

నదులలో ముఖ్యంగా ఆనకట్టల ప్రాంతాలలో బోటులు, మరపడవలలో విహారయాత్రలకు వీలు కలుగుతున్నది. ఇది ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతున్నది. తక్కువ ఖర్చుతో ఎంతో బరువున్న వస్తువులను నది నీళ్ళలో రవాణా చేయడం సులువు. దీనివల్ల ఖర్చు, శ్రమ, కలిసివస్తాయి. కొండల్లో నుంచి, గుట్టల్లోనుంచి ప్రవహించే నదులు తమతోపాటు తెచ్చిన ఇసుకను ఒడ్డుల్లో, మధ్యలో, మేటలు వేస్తాయి. ఆ ఇసుక భవన నిర్మాణాలకూ, వంతెన నిర్మాణాలకూ ఎంతో ఉపయోగపడుతున్నది.ఈ విధంగా ఆధునిక కాలంలో నదులు మానవాళికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. నదులు మానవ జీవన విధానంలో విడదీయలేనంత అనుబంధం కలిగి ఉన్నాయి.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

కింది భావాన్నిచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి రాయండి.

(అ) రైతు నాగలి ముందుకు సాగుతుంది.
జవాబు.
కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు

(ఆ) చిన్నబోయిన నేల గుండెను సేదతీరుస్తావు.
జవాబు.
గిడసబారిన పుడమి; ఎడద కరిగించెదవు

(ఇ) హైదరాబాద్ ప్రజలకు తీయని నీళ్ళందిస్తావు.
జవాబు.
భాగ్యనగరములోన వసియించు పౌరులకు పంచదారను బోలు మంచి నీరొసగెదవు.

(ఈ) పల్లెను తల్లి ప్రేమతో లాలిస్తావు.
జవాబు.
పల్లెటూళ్ళను కూర్మి తల్లివలె లాలించి

2. గంగాపురం హనుమచ్చర్మ రాసిన కింది గేయ పంక్తులు చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రవహింతువా దుందుభీ మాసీమ
పాల యేఱుగ దుందుభీ
చిరుగాలి కెరటాల
పొరలెత్తు అలలతో
దరులంటు అమృతశీ
కరములౌ జలముతో
లంటి వాని ని
ర్ఘరులంటి, పైపైని
దరులంటి జాజి క్రొ
వ్విరుల వన్నియలూని ప్రవహింతువా

ప్రశ్నలు :
అ. ఈ గేయం దేన్ని గురించి చెప్పింది ?
జవాబు.
ఈ గేయం దుందుభినది ప్రవాహం గురించి చెప్పింది.

ఆ. దుందుభి నది ప్రవాహాన్ని కవి దేనితో పోల్చాడు ?
జవాబు.
దుందుభి నది ప్రవాహాన్ని కవి పాలయేఱుతో పోల్చాడు.

ఇ. కవి దుందుభి నదిని పాలయేఱు అని ఎందుకన్నాడు?
జవాబు.
తెల్లగా ఉండే కొత్త జాజిపూల రంగుతో ప్రవహించడం వల్ల కవి దుందుభినదిని పాలయేఱు అని అన్నాడు.

ఈ. ‘దరులు’ అనే పదానికి అర్థమేమిటి ?
జవాబు.
దరులు అంటే ఒడ్డులు అని అర్థం.

ఉ. దుందుభి జలం ఎట్లా ఉన్నదని కవి ఉద్దేశం ?
జవాబు.
దుందుభి జలం అమృతపు తుంపరల వలె ఉన్నదని కవి ఉద్దేశం.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. “నది పొలానికి బలం చేకూరుస్తది” అని కవి ఎందుకన్నాడు ?
జవాబు.
తియ్యని నదుల నీటితో పొలాలలో రుచికరమైన పంటలు పండుతాయి. కొండలు, అడవులలో నుంచి ప్రవహిస్తూ వచ్చే నదులలో ఒండ్రుమట్టి, వన మూలికలు, ఆకులు అలములు మొ||వి కొట్టుకు వస్తాయి. ఇవి పొలాలలోకి చేరి పంటమొక్కలకు ఎంతో బలాన్ని అందిస్తాయి. పంటల అధిక దిగుబడికి కారణం అవుతాయి. అందువల్లనే “నది పొలానికి బలం చేకూరుస్తుంది” అని కవి అన్నాడు.

ఆ. భాగ్యనగరానికి, మంజీర నదికి ఉన్న సంబంధం గురించి వివరించండి.
జవాబు.
భాగ్యనగరం అంటే హైదరాబాదు. ఈ నగరాన్ని కులీకుతుబ్షా అనే సుల్తాను నిర్మించాడు. ఈ భాగ్యనగరంలో

ఇ. మనం నదులను ఎట్లా కాపాడుకోవాలి ?
జవాబు.
జీవులన్నింటికీ మంచినీరు ప్రాణాధారం. నదులు మంచినీరు అందించి ప్రాణాలను కాపాడతాయి. కనుక నదులను మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నది నీటిని వ్యర్థాలతో, మలినాలతో కలుషితం చేయకూడదు. ప్రాణాలు నిలబెట్టే నదులలోని మంచినీటిని వృథా చేయకూడదు. భవన నిర్మాణాల కోసమో, నగర నిర్మాణాల కోసమో నదులను దారి మళ్ళించ కూడదు. అట్లా చేయడం వల్ల నదులు కనుమరుగు కావడమే కాక వరదలు, ముంపులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల నదులను కాపాడుకోవాలి.

ఈ. నదులు ‘నాగరికతకు ఆలవాలం’ ఎందుకు ?
జవాబు.
నాగరీకరణం చెందిన మానవ జీవన విధానమే నాగరికత. మానవుడు కొండల్లో, గుహల్లో తలదాచుకున్న దశ నుంచి వ్యవసాయం చేయడం నేర్చుకొని స్థిరనివాసాలు ఏర్పరచుకున్నాడు. అవే గ్రామాలు. గ్రామ దశ నుంచి వర్తక వాణిజ్యాల అభివృద్ధితో నగరాలు ఏర్పడ్డాయి. ఈ నాగరికతలో నదులు ప్రముఖ పాత్ర పోషించాయి. ఆ మాటకొస్తే నదుల వల్లే నాగరికత అభివృద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధ నగరాలు అన్నీ దాదాపు నదుల ఒడ్డున ఏర్పడినవే. ఉదాహరణకు మూసీనది ఒడ్డున హైదరాబాదు, గోదావరి ఒడ్డున రాజమండ్రి, యమునా నది ఒడ్డున ఆగ్రా, గంగానది ఒడ్డున కాశీ, నైలునది ఒడ్డున కైరో, థేమ్సునది ఒడ్డున ఇంగ్లాండు, సీన్ నది ఒడ్డున రోమ్ మొదలైనవి. కనుక నదులు నాగరికతకు నిలయమైనవని చెప్పవచ్చు.

ఉ. మంజీర నది మానవులకు చేసే మేలు ఏమిటి ?
జవాబు.
మంజీర నది జీవులను కన్నతల్లిలా పోషిస్తుంది. తియ్యని మంచినీరు అందిస్తుంది. రుచికరమైన ఆహార పంటలు పండటానికి తోడ్పడుతుంది. ఎండిపోయిన, బీడుబోయిన నేలను తడిపి పంటలు పండటానికి అనువుగా తయారు చేస్తుంది. ఎటువంటి నేలలో అయినా తీయని చెరకు వంటి పంటలు పండటానికి తోడ్పడుతుంది. తన ప్రవాహంతో పాటు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందించి పంటకు బలాన్ని ఇస్తుంది. భాగ్యనగర్ వాసులకు తీయని మంచినీరు అందిస్తుంది. స్నానం, తాగునీరు, సాగునీరు మొదలైన పల్లెవాసుల అవసరాలన్నీ తీరుస్తుంది. పల్లెల్లో పండించిన ధాన్యాన్ని పట్టణాలకు పంపడానికి దోహదపడుతుంది.

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

ఊ. మానవ నాగరికత పరిణామంలో నదుల పాత్ర ఏమిటి ?
జవాబు.
మానవ నాగరికత పరిణామంలో నదులు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలో విలసిల్లిన నాగరికతలు అన్నీ నదుల ఒడ్డున ఏర్పడి అభివృద్ధి చెందినవే. ఉదాహరణకు నైలునది ఒడ్డున కైరో, థేమ్సునది ఒడ్డున ఇంగ్లాండు, యమునానది ఒడ్డున ఆగ్రా, మూసీనది ఒడ్డున హైదరాబాదు, సీన్ నది ఒడ్డున రోమ్ నగరం, గోదావరి నది ఒడ్డున రాజమండ్రి, గంగానది ఒడ్డున కాశీనగరం మొదలైనవి. ప్రాచీనకాలం నుంచి నదులు జీవుల దాహం తీరుస్తున్నాయి. వ్యవసాయానికీ, రవాణా సౌకర్యాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఆధునికకాలంలో విద్యుత్ తయారీకి, పర్యాటకుల్ని ఆకర్షించడానికీ కూడా ఉపయోగపడుతూ మానవులకు ఎంతో మేలు చేస్తున్నాయి.

ఎ. “నీ కంకణ క్వణము నినదించినంతనే” దీన్ని వివరించండి.
జవాబు.
కంకణం అంటే గాజు, క్వణం అంటే ధ్వని. కంకణకణము అంటే గాజులు కదలేటప్పుడు వినిపించే గలగలల శబ్దం. సాధారణంగా నదిని స్త్రీతో పోలుస్తారు. ఇక్కడ కవి మంజీర నదిలోని అలల సవ్వడిని స్త్రీ గాజుల గల గలల లాగా ఉన్నాయని ఊహించాడు. ‘నీ కంకణ క్వణము నినదించినంతనే’ అంటే నీ (మంజీర నది) గాజుల సవ్వడి గలగలలు (అలల సవ్వడి) ధ్వనులు విన్న వెంటనే అని తాత్పర్యం.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయో కారణాలు వివరించండి.
జవాబు.
నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగు కావడానికి వాతావరణ కాలుష్యం, జలకాలుష్యం, నీటివృథా, అజాగ్రత్త, నిర్వహణాలోపం మొదలైనవి ముఖ్యకారణాలు.

  1. వాతావరణ కాలుష్యం : మేఘాలు వర్షించినప్పుడు భూమిపైన ఎత్తుమీద పడిన నీరు పల్లానికి ప్రవహించి చిన్న చిన్న వాగులై అవి మహానదిలా మారి చివరికి సముద్రంలో కలుస్తాయి. భూమి మీద వృక్షసంపద తగ్గిపోతూండడం వల్ల తగినంత వర్షం పడటంలేదు. అందువల్ల నదుల్లో ప్రవహించే నీటి శాతం క్రమంగా తగ్గుతున్నది.
  2. జలకాలుష్యం : ప్రవహించే నీటిలో అనేక పరిశ్రమల వ్యర్థాలు, మలిన పదార్థాలు కలిసిపోవడం వల్ల ఆ నీరు కలుషితమై పోతున్నది. ఆ నీరు తన సహజగుణాన్ని కోల్పోతున్నది.
  3. నీటి వృథా : నీటిని వృథా చేయడం వల్ల కూడా కొంతకాలానికి నదుల్లో నీరు కనుమరుగైపోతుంది.
  4. అజాగ్రత్త : నదుల్లో ప్రవహించే నీటిని జాగ్రత్త చేసుకోలేక పోవడం వల్ల ఎక్కువ శాతం నీరు సముద్రంలో కలిసిపోతున్నది.
  5. నిర్వహణాలోపం : నది నీటికి శాస్త్రీయ పద్ధతులలో నిర్వహణ లేకపోవడం వల్ల కూడా నదినీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
  6. ముగింపు : ఈ విధంగా మన నాగరికతకు మూలాధారాలైన నదులను జాగ్రత్తగా కాపాడకపోతే మానవ జీవనం ప్రశ్నార్థకమౌతుంది.

ఆ. గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు.
డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రచించిన ‘మంజీర’ అనే పాఠ్యభాగంలో మంజీరనది మానవాళికి చేసే మేలును గురించి తేలికైన తేటతెలుగు పదాలలో వివరించారు. మాత్రాఛందస్సులో రచించిన ఈ గేయంలో మంజీరానది సాగునీటిగా తాగు నీరుగా ఉపయోగపడుతూ ప్రజలకు చేసే మేలును వివరించారు.

సాగునీరు : మంజీర నది చల్లని తల్లి వంటిది. గాజుల గలగలలు వంటి ఆమె ప్రవాహపు సవ్వడి వింటేనే రైతన్న నాగలి ముందుకు సాగుతుంది. ఆమె చల్లని చూపు వంటి ప్రవాహంతో పొలాలన్నీ పచ్చని పైర్లతో కనుల పండుగలాగా ప్రకాశిస్తాయి. మంజీర నది ఎండిపోయిన నేలను కూడా తన తీయని నీటితో కరిగించి పంట పండటానికి అనువుగా తయారుచేస్తుంది. ఎటువంటి నేలలో అయినా చెరుకు వంటి తీయని పంటలు పండేటట్లు చేస్తుంది. అంతేకాక తన ప్రవాహంతోపాటు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందిస్తుంది. పంట మొక్కలకు బలాన్ని ఇస్తుంది.

తాగునీరు : మంజీర నది కులీకుతుబ్షా నిర్మించిన భాగ్యనగరం (హైదరాబాదు)లో నివసించే వారికి తీయని మంచి నీరు అందిస్తుంది. తన పరీవాహక పరిసరాలలో నివసించే పల్లె ప్రజలను ప్రేమగా లాలిస్తుంది. వారి సాగునీటి అవసరాలతో పాటు స్నానాల, తాగునీటి అవసరాలను కూడా తీరుస్తుంది.

పట్టణానికి తోబుట్టువులా : మంజీరనది పల్లె ప్రజలను తల్లిలా లాలిస్తుంది. పట్టణ ప్రజలను తోబుట్టువులా ఆదరిస్తుంది. పల్లె ప్రజలకు అవసరమైన దానికంటే అధికంగా దిగుబడిని అందిస్తుంది. పల్లె ప్రజలు తమ మిగులు పంటను పట్టణాలకు పంపించడానికి తోడ్పడుతుంది. ధాన్యాన్ని, ఇతర వస్తువులనూ తరలించడానికి రవాణా కోసం కూడా నది ఉపయోగపడుతుంది.

ముగింపు : ఈ విధంగా మంజీర నది సకల జీవులకూ తాగునీటి అవసరాలను తీరుస్తుంది. మానవులకు సాగునీటి అవసరాలను తీర్చి ఎంతో మేలు చేస్తున్నదని ‘మంజీర’ పాఠ్యభాగంలో కవి వర్ణించాడు.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. మీ ప్రాంతంలోని లేదా మీరు చూసిన వాగు / చెరువు / నదిని వర్ణిస్తూ కవిత / గేయాన్ని రాయండి.

పల్లవి : మా వూరు వచ్చింది మా మంచి ఏరు
మనసార నివ్వింది సిరిమల్లె తీరు
మా దాహమును తీర్చి మా పంట పండించ ॥మా వూరు॥

చరణం 1 : పగటి ఎండల్లోన పరవళ్ళు తొక్కింది
తెల్ల మబ్బుల వంటి నురగల్లు తెచ్చింది.
పండు వెన్నెల్లోన నిండుగా పారింది
ఎండు బీడుల్లోన గుండె ఉప్పొంగంగ ॥మా వూరు॥

చరణం 2 : గలగలా పారుతూ గిలిగింత పెట్టింది.
హలము పొలము దున్న రైతును తట్టింది
తీయని నీటితో తేనెను పోలింది
చక్కని పంటతో సిరులు కురిపించంగ ॥మా వూరు॥

చరణం 3 : జలపాతములతోన జలకాలు ఆడింది
గులకరాళ్ళల్లోన సెల పాటపాడింది
మంచి నీటితోన చెరువు ముంచెత్తింది.
తేటనీటితోన ఏరై పరుగెత్తంగ ॥మా వూరు॥

V. పదజాల వినియోగం

1. కింది పదాలకు సమానార్థక పదాలను పట్టికలో గుర్తించి రాయండి.

(అ) రైతు
(ఆ) చల్లదనం
(ఇ) నేల
(ఈ) స్నేహం
(ఉ) పంపి
(ఊ) ప్రకాశించు

భాష పుడమి నాగలి
అంపి విలసిల్లు చలువ
కర్షకుడు కంకణము సోపతి

(అ) రైతు – కర్షకుడు
(ఆ) చల్లదనం – చలువ
(ఇ) నేల – పుడమి
(ఈ) స్నేహం – సోపతి
(ఉ) పంపి – అంపి
(ఊ) ప్రకాశించు – విలసిల్లు

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు ప్రకృతి పదాలను రాయండి.

“రైతు ఎడద విశాలమైనది. ధాన్య రాసులతో దేశాన్ని సుసంపన్నం చేస్తాడు.

వికృతి ప్రకృతి
ఎడద హృదయం
రాసులు రాశులు

3. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.

(అ) కాకతీయుల కాలం సాహిత్య సంపదతో విల్లసిల్లింది కృష్ణ కుచేలుల కూర్మి గొప్పది. = ప్రకాశించింది
(ఆ) కృష్ణ కుచేలుల కూర్మి గొప్పది. = స్నేహం, సోపతి
(ఇ) పుడమి అనేక సంపదలకు నిలయం = భూమి, ధరణి

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది ఖాళీలను పూరించండి.
ఉదా :

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
సీతజడ సీత యొక్క జడ షష్ఠీ తత్పురుషము
చెట్టు యొక్క నీడ
వయోవృద్ధుడు
రాజులలో శ్రేష్ఠుడు

జవాబు.

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
సీతజడ సీత యొక్క జడ షష్ఠీ తత్పురుషము
చెట్టునీడ చెట్టు యొక్క నీడ షష్ఠీ తత్పురుషము
వయోవృద్ధుడు వయసు చేత వృద్ధుడు తృతీయా తత్పురుషము
రాజశ్రేష్ఠుడు రాజులలో శ్రేష్ఠుడు షష్ఠీ తత్పురుషము
అమంగళం మంగళం కానిది నఞ తత్పురుషము
తిలకధారి తిలకమును ధరించినవాడు బహువ్రీహి సమాసం


2. కింది దానిని చదువండి.

ఇల్లు, మనిషి, పెళ్ళి మంటపం, ఫంక్షన్ హాలు, వాహనం ఏదైనాసరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాం. అట్లానే రచనలు ఆకర్షణీయంగా ఉండడానికి అలంకారాలు ఉపయోగిస్తారు.
ఇది మన బడి
అక్షరాల గుడి
సరస్వతీదేవి ఒడి
మనకు నేర్పును నడవడి

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1.
ఈ కవిత చదువుతుంటే ఎట్లా అనిపించింది?
జవాబు.
ఈ కవిత చదువుతుంటే చెవికి ఇంపుగా ఉన్నది.

ప్రశ్న 2.
ఎందుకని వినసొంపుగా ఉన్నది?
జవాబు.
ప్రతి పాదం ‘డి’ అనే అక్షరంతో ముగియడం వల్ల వినసొంపుగా ఉన్నది.

ప్రశ్న 3.
దీనిలో ఎక్కువసార్లు వచ్చిన అక్షరం ఏది?
జవాబు.
దీనిలో ‘డి’ అనే అక్షరం ఎక్కువసార్లు వచ్చింది. పై కవితలో ‘డి’ అనే అక్షరం అనేకసార్లు రావడం వల్ల కవిత అందంగా, వినసొంపుగా ఉన్నది కదా! ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం. ఆ అందం శబ్దం వల్ల వచ్చింది కాబట్టి శబ్దాలంకారం. అర్థం వల్ల అందం కలిగితే అర్థాలంకారం అవుతుంది. ఇప్పుడు ఒక శబ్దాలంకారం గురించి తెలుసుకుందాం.

కింది వాక్యాలు పరిశీలించండి.

(అ) గడ గడ వడకుచు తడబడి జారిపడెను.
(ఆ) రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది.
పై రెండు వాక్యాల్లో ఎక్కువసార్లు వచ్చిన హల్లు ఏది ?
పై వాక్యాల్లో వరుసగా ‘డ’, ‘త్త’ అనే అక్షరాలు అనేకసార్లు వచ్చాయి కదా! ఇట్లా ఒకే హల్లు అనేకసార్లు రావడాన్ని ‘వృత్యను ప్రాస’ అలంకారం అంటారు.

3. మరికొన్ని వృత్త్యనుప్రాస అలంకారానికి చెందిన వాక్యాలను పాఠాలలో వెతికి రాయండి.

  1. పైరు పచ్చలు కనుల
    పండువుగ విలసిల్లు
  2. గిడసబారిన పుడమి
    ఎడద కరిగించెదవు

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులు, వాటిపై నిర్మించిన ఆనకట్టలు, ఆ నదుల తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలను తెలియజేసే పట్టికను తయారుచేయండి. నివేదిక రాసి ప్రదర్శించండి.
జవాబు.
(అ) ప్రాథమిక సమాచారం :
(1) ప్రాజెక్టు పని పేరు : తెలంగాణ రాష్ట్రంలో నదులు – వాటిపై ప్రాజెక్టులు వాటి – తీరాల్లో పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు.
(2) సమాచారాన్ని సేకరించిన విధానం : గ్రంథాలయ పుస్తకాలు, పెద్దల నుండి సమాచార సేకరణ

(ఆ) నివేదిక :

నది పేరు ప్రాజెక్టు పేరు పుణ్యక్షేత్రం (నదీతీరపు) దర్శనీయ స్థలాలు
1. గోదావరి

 

(1) నిజాంసాగర్ – ప్రాజెక్టు – అచ్చంపేట (1) సత్యనారాయణ స్వామి దేవాలయం లక్షెట్టిపేట్ (గూడెంగుట్ట) ఆదిలాబాద్ జిల్లా (1) కొయ్యబొమ్మల పరిశ్రమ నిర్మల్, జి॥ ఆదిలాబాద్
(2) సింగూరు ప్రాజెక్టు సింగూరు (2) జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర, ఆదిలాబాద్ జిల్లా (2) చేతి బొమ్మల పరిశ్రమ ఆర్మూర్, జి॥ నిజామాబాద్
(3) శ్రీరాంసాగర్ – ప్రాజెక్టు – పోచంపాడు (3) నరసింహస్వామి దేవాలయం, ధర్మపురి, కరీంనగర్ జిల్లా
(4) దుమ్ముగూడెం – పవర్ ప్రాజెక్టు – పాములపల్లి ఖమ్మంజిల్లా (4) శివాలయం, కాళేశ్వరం జి॥ కరీంనగర్
2. కృష్ణా (1) నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (నల్గొండ) నాగార్జున కొండ (1) శ్రీ జోగులాంబదేవి దేవాలయం, ఆలంపూర్ మహబూబ్నగర్ జిల్లా (1) పిల్లలమర్రి మహబూబ్నగర్ జిల్లా
(2) జూరాల ప్రాజెక్టు రేవులపల్లి – మహబూబ్నగర్ (2) శ్రీరంగనాయక స్వామి దేవాలయం, వనపర్తి, మహబూబ్నగర్ (2) గద్వాల్ పోర్టు, మహబూబ్నగర్ జిల్లా

(ఇ) ముగింపు :
తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యనదులైన గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ఆ నదులపై నిర్మించిన ప్రాజెక్టుల వివరాలు మరియు ఆ నదుల పరీవాహక ప్రాంతాలలోని ప్రసిద్ధ దర్శనీయ స్థలాల వివరాలను పట్టికలో పొందుపరిచాను. పెద్దల ద్వారా వాటి గూర్చి తెల్సుకొంటున్నప్పుడు ఆ స్థలాలను దర్శిస్తే బాగుండుననిపించింది.
ఉదా : మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రిలో 700 సం||ల క్రితపు మఱివృక్షం ఉందట. అలాంటి వింతలు విశేషాలు గల స్థలాలను సెలవులలో మా కుటుంబంతో కలిసి దర్శించుకోవాలని నిర్ణయించుకొన్నాను.
TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర 1

TS 8th Class Telugu 7th Lesson Important Questions మంజీర

పర్యాయపదాలు

  • క్వణం = శబ్దం, సవ్వడి, చప్పుడు
  • కర్షకుడు = రైతు, వ్యవసాయదారుడు, కృషీవలుడు, హాలికుడు
  • నాగేలు = నాగలి, హలం
  • చేయి = కరం, హస్తం, పాణి
  • కన్ను = నేత్రం, అక్షం, చక్షువు
  • పండుగ = ఉత్సవం, వేడుక
  • పుడమి = నేల, ధరణి, భూమి
  • పొలం = చేను, క్షేత్రం
  • పురం = నగరం, పట్టణం
  • నీరు = జలం, ఉదకం, నీళ్లు, తోయం
  • తల్లి = అమ్మ,, అంబ, జనని, మాత

ప్రకృతి – వికృతిలు

  • హలము – నాగేలు, నాగలి
  • హృదయం – ఎద, ఎడద, డెందం
  • పృథివి, పృథ్వి – పుడమి

సంధులు

  • చల్ల్దాసవే = చల్లనిదానవు + ఏ = ఉత్వ సంధి
  • తీయనిదానవే = తీయనిదానవు + ఏ = ఉత్వ సంధి
  • చేదైన = చేదు + ఐన = ఉత్వ సంధి = ఉత్వ సంధి
  • నీరొసగెదవు = నీరు + ఒసగెదవు = ఉత్వ సంధి
  • సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
  • నినదించినంతనే = నినదించిన + అంతనే = అత్వ సంధి
  • కనినంత = కనిన + అంత = అత్వ సంధి
  • సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
  • పల్లెటూళ్ళను = పల్లె + ఊళ్లను = టుగాగమ సంధి
  • సూత్రం : కర్మధారయాల్లో ఉత్తునకు అచ్చు పరమైనపుడు టుగాగం అవుతుంది.
  • స్నానపానాదులకు = స్నానపాన + ఆదులకు = సవర్ణదీర్ఘ సంధి
  • సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

సమాసాలు

  • కంకణక్వణం – కంకణం యొక్క క్వణం – షష్ఠీ తత్పురుష సమాసం
  • ధాన్యరాసులు – ధాన్యం యొక్క రాసులు – షష్ఠీ తత్పురుష సమాసం
  • పల్లెటూళ్ళు – పల్లె అయిన ఊళ్ళు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
  • జీవకణములు – జీవమైన కణములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

గేయం – అర్థాలు – తాత్పర్యాలు

I. (i) నీ కంకణక్వణము
నినదించి నంతనే
కర్షకుని నాగేలు
కదలి ముందుకు సాగు
నీ చేతి చలువ చిం
దిలిపాటు గనినంత
పైరు పచ్చలు కనుల
పండువుగ విలసిల్లు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయని దానవే!

అర్థాలు :
మంజీర! = తల్లీ మంజీరా!
సవు = నువ్వు
ఎంత చల్లన
దానవే! = = ఎంత చల్లని దానవో కదా!
ఎంత తీయని
దానవే! = ఎంత తీయని దానవో కదా!
నీ = నీ
కంకణక్వణము = చేతి గాజుల గలగలలు – ఇక్కడ ప్రాహమని అర్థం
నినదించిన + అంతనే = సవ్వడి చేయగానే
కర్షకుని = రైతు
నాగేలు = నాగలి
కదలి = కదలిక వచ్చి ముందుకు
సాగు = ముందుకు సాగుతుంది
నీ = నీ
చేతి చలువ = మంచితనపు (స్వచ్ఛమైన నీరు)
చిందిలిపాటు = పరవళ్ళ
కనిన + అంత = చూడగానే
పైరు పచ్చలు = పైరుల పచ్చదనాలు
కనుల పండువగ = కన్నుల పండుగలాగా
విలసిల్లు = పకాశిసాయి

తాత్పర్యం : అమ్మా! మంజీర! ఎంత చల్లని దానవు నువ్వు. ఎంత తీయని దానవు నువ్వు. నీ నీటి ప్రవాహప సవ్వడి, నీ చేతి గాజుల గలగలల శబ్దం వింటే చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది. నీ మంచితనం చూసిన వెంటనే రెప్పపాటులో పచ్చనిపైర్లు కన్నుల పండుగగా (ప్రకాశిస్తాయి.

(ii) గิడసబారిన పుడమి
ఎడద కరిగించెదవు
చేదైన నేలలో
చెరకు పండించెదవు
చేవగలిగిన మట్టి
జీవకణములు తెచ్చి
పొలముకు ఎరువుగా
బలము చేకూర్చెదవు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయనిదాసవే!

అర్థాలు :
మంజీర! = తల్లీ మంజీరా!
నీవు = సీవు
ఎంత చల్లని దానవే! = ఎంత చల్లని దానవో కదా!
ఎంత తీయని దానవే! = ఎంత తీయని దానవో కదా!
గిడసబారిన = ఎండిపోయిన
పుడమి ఎడద = నేలతల్లి హ్లయాన్ని
కరిగించెదవు = కరిగిస్తావు
చేదు + ఐన = చేదైన
నేలలో = నేలలో
చెరుకు = తీయన చెరకు
పండించెదవు = పండిస్తావు
జీవకణములు = జీవ కణాలు కలిగిన
చేవ గలిగిన = సారవంతమైన
మట్టి = మట్టిని
తెచ్చి = తీసుకొన వచ్చి
పొలముకు = పోలాసిక
ఎరువుగా = ఎరువుగా ఇచ్చ
బలము = బలాన్ని
చేకూర్చెదవు = చేకూరుస్తావు

తాత్పర్యం : తల్లీ! మంజీర! చిన్నటోయిన నేలతల్లి హృదయాన్ని కరిగిస్తావు. చేదైన నేలలో తీయని చెరుకును పండిస్తావు. సారవంతవైన మట్టిని తీసుకువచ్చి పౌలాలకు ఎరువుగా అందించి బలాన్నిస్తావు.

II. (i) ఆనాడు కుతుబు సు
ల్తాను నిలిపిన పురము
ఖాగ్యనగరములోన
వసియించు పౌరులకు
పంచదారసు జోలు
మంచి సీరొసగెదవు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయని దానవే!

అర్థాలు :
మంజీర! = తల్లీ మంజీరా!
నీవు = నీవు
ఎంత చల్లని దానవే! = ఎంత చల్లని దానవో కదా!
ఎంత తీయని దానవే! = ఎంత తీయని దానవో కదా!
ఆనాడు = ఎప్పుడో
కుతుబుసుల్తాను = కులీకుతుబ్షా
నిలిపిన = నిర్మించిన
పురము = నగరమైన
లోస = భాగ్ననగరము (హైదరాబాదు)లోన
వసియించు = నివసించే
పౌరులకు = ఝజలకు
పంచదారను + పోలు = పంచదార లాగా తీయనైన
మంచినీరు = మంచనళ్ళ్రు
ఒసగెదవు = అందిస్తావు

తాత్పర్యం :
అమ్మా! మంజీర! కులీకుతుబ్షా నిర్మించిన భాగ్యనగర్ (హైదరాబాద్) వాసులకు చక్కెర వంటి తీయని తాగునీటిని అందిస్తావు.

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

(ii) పల్లెటూళ్ళను కూర్మి
తల్లివలె లాలించి
స్నానపానాదులను
సమకూర్చెదవు నీవు
పట్టణమ్ములసు తో
బుట్టువలె [పేమించి
ధాన్యరాసుల నంపి
తరచు పోషించెదవు
ఎంత చల్లని దానవే! నీవు మంజీర!
ఎంత తీయని దానవే!

అర్థాలు :
మంజీర! = తల్లీ మంజీరా!
నీవు = నీవు
ఎంత చల్లని దాసవో! = ఎంత చల్లని దానవో కదా!
ఎంత తీయని దాసవో! = ఎంత తీయని దానవో కదా!
నీవు = నువ్వు
పల్లె+ఊళ్ళను = పల్లెటూళ్ళను
కూర్మి = (పేమగా
తల్లివలె = తల్లిలాగా
లాలంచి = లాలించి
స్నాన పాన + ఆదులను = స్నానం, మంచినీరు వంటి అవసరాలను
సమకూర్చెదవు = తీరుస్తావు
పట్టణమ్ములను = నగరాలను
తోబుట్టువల = తోడబుట్టిన వాళ్ళుగా
(పేమించి = (పేమించి
ఢాన్యరాసులను = పల్లెల్లో పండిన ధాన్యాలను
అంపి = ఆ నగరాలకు పంపించి
తరచు = ఎల్లప్పుడూ
పోషించెవు =పోషిస్నావు

తాత్పర్యం:
తల్లీ! మంజీర! పల్లెలను అమ్మలాగ, (పేమగా లాలించి స్నానం, తాగునీరు వంటి అవసరాలను తీరుస్తావు. నగరాలను తోడబుట్టిన వాళ్ళుగ [పేమించి పల్లెల్లో పండిన ఢాన్యాన్ని పంపి ఎల్లప్పుడు పోషిస్తావు. అమ్మా! మంజీర ఎంత చల్లని దానవు నువ్వు. ఎంత తీయని దానవు.

పాఠ్యభాగ ఉద్దేశం :

ప్రశ్న 1.
మంజీర పాఠం ఉద్దేశం తెల్పండి.
జవాబు.
పాడి పంటలకు, సిరిసంపదలకు నదులే మూలం. తెలంగాణా రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్, సింగూర్, ఘనపురం ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి.
ప్రజల జీవనానికి, పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతో మేలును చేకూరుస్తున్నాయని తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు :

ప్రశ్న 1.
గేయ ప్రక్రియ గురించి రాయండి.
జవాబు.
మంజీర పాఠం గేయ ప్రక్రియకు చెందినది. పాడుకోవటానికి వీలుగా ఉండే కవిత్వాన్ని గేయం / పాట అంటారు. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డా॥ వేముగంటి నరసింహాచార్యులు రాసిన “మంజీర నాదాలు” అనే గేయకావ్యంలోనిది.

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర

కవి పరిచయం

ప్రశ్న 1.
వేముగంటి నరసింహాచార్యుల పరిచయం రాయండి.
జవాబు.
పాఠ్యభాగం పేరు : మంజీర
కవి పేరు : డా॥ వేముగంటి నరసింహాచార్యులు
జననం : 30-06-1930
మరణం : 29-10-2005
జన్మస్థలం : సిద్ధిపేట జిల్లాలోని సిద్ధిపేట
తల్లిదండ్రులు : తండ్రి రంగాచార్యులు, తల్లి రామక్క
రచనలు : తిక్కన, రామదాసు, మంజీర నాదాలు, వివేక విజయం మొదలైన 40కిపైగా రచనలు.
బిరుదులు : కవి కోకిల, కావ్యకళానిధి, విద్వత్కవి.
సత్కారాలు : తెలుగు విశ్వవిద్యాలయం వీరిని డాక్టరేట్తో సత్కరించింది.
విశేషాంశాలు : వీరు ‘సాహితీ వికాస మండలి’ అనే సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘం అనే వాటిని స్థాపించి, సాహిత్య వికాసానికి కృషి చేశారు.
శైలి : వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వీటిలోని తెలంగాణ భాష ఇంపు, సొంపు పాఠకులను పరవశింపజేస్తాయి.

ప్రవేశిక:

జలధారలు ప్రాణికోటి జీవనాధారాలు. అందుకే మానవ జీవనమంతా నదీ పరీవాహాల్లో విస్తరించింది. ముఖ్యపట్టణాలు, తీర్థస్థలాలు అన్నీ నదుల నానుకొని వ్యాపించాయి. చినుకులు కాలువలై, కాలువలు నదులై తాగునీరుగా, సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని, ఆరోగ్యన్ని అందిస్తాయి. అందుకే నది పవిత్రమైనది. పుణ్యరపదమైనది. మన రాష్ట్రంలో (్రవహించే ముఖ్యమైన జీవనదుల్లో ‘మంజీర’ ఒకటి. ఆ నదీమతల్లి ప్రస్థాన్ని హృదయంతో దర్శించిన కవి వేముగంటి నరసింహాచార్యుల రచనను ఆస్వాదిద్దాం. అవగాహన చేసుకుందాం….

కఠినపదాలకు అర్థాలు:

  • క్వణము – శబ్దం
  • చిందిలిపాటు – పరవళ్ళు
  • చేవ – శక్తి, సారము
  • హూర్మి – เపేమ
  • చేతి చలువ – చేతి మంచితనము
  • కనుట – చూచుట
  • กิడసబారిన – ఎండిపోయిన
  • అంపి – పంపించి
  • ఆదులు – మొదలైనవన్నీ
  • తరచు – ఎల్లప్పుడు
  • లాలించు – బజజ్జగంంు
  • వసించు – నివసించుట
  • పోలుట పోలిక – సమానమైన
  • పురము – పట్టణం
  • తోబుట్టువు – తనతో పుట్టినవారు (అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు)

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu 7th Lesson Questions and Answers Telangana మంజీర 4

Leave a Comment