TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download అపరిచిత పద్యాలు Questions and Answers.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

పద్యాలు – ప్రశ్నలు

I. క్రింద ఇచ్చిన పద్యాలను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయబోకుము కార్యా
లోచనము లొంటి జేయకు
మాచారము విడువబోకుమయ్య కుమారా !

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఎవరిని ఎదిరింపరాదు?
జవాబు.
గురువులను ఎదిరింపరాదు.

ప్రశ్న 2.
ఎవరిని నింద చేయకూడదు?
జవాబు.
రక్షించిన వారిని నిందించరాదు.

ప్రశ్న 3.
వేటిని ఒంటరిగా చేయకూడదు ?
జవాబు.
పనులను గూర్చి ఆలోచన ఒంటరిగా చేయరాదు.

ప్రశ్న 4.
విడిచి పెట్టకూడనిది ఏది ?
జవాబు.
ఆచారాన్ని విడిచిపెట్టకూడదు.

ప్రశ్న5.
ఈ పద్యానికి మకుటం ఏది ?
జవాబు.
కుమారా!

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

2. కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి మగుడ మీదికి న్నెగయుజుమీ
మందుడు మృత్పిండము వలె
క్రిందంబడి యడగి యుండుఁ కృపణత్వమునన్.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
సుజనుడెట్లా ఉంటాడు ?
జవాబు.
సుజనుడు బంతిలా క్రిందపడ్డా మరల పైకి లేస్తాడు.

ప్రశ్న 2.
మందుడెలా ఉంటాడు ?
జవాబు.
మందుడు మట్టి ముద్దలా క్రిందపడితే, అణగి పోయి, ఇంకలేవడు.

ప్రశ్న 3.
సుజనుని కవి దేనితో పోల్చాడు ?
జవాబు.
బంతితో పోల్చాడు.

ప్రశ్న 4.
ఈ పద్యంలో అలంకారమేది ?
జవాబు.
ఉపమాలంకారం.

ప్రశ్న 5.
కందుకము అర్థమేమి ?
జవాబు.
బంతి

3. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు
సుకవి చేతి కలము సుధలు గురియు
ఆతడేల గలుగు యావత్ప్రపంచంబు
నీతడేల గలుగు ఇహము పరము.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
రక్తాన్ని కురిపించునదేది?
జవాబు.
రాజు చేతిలోని కత్తి రక్తాన్ని కురిపిస్తుంది.

ప్రశ్న 2.
అమృతాన్ని కురిపించునదేది?
జవాబు.
కవి చేతిలోని కలము అమృతాన్ని కురిపిస్తుంది.

ప్రశ్న 3.
యావత్ప్రపంచాన్ని పాలించగలిగేదెవరు?
జవాబు.
రాజు యావత్ప్రపంచాన్ని పాలించగలుగుతాడు.

ప్రశ్న 4.
ఇహమును, పరమును పాలించగలవాడెవరు?
జవాబు.
కవి ఇహమును, పరమును పాలించగలడు.

ప్రశ్న 5.
సుకవి ఏ సమాసము?

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

4. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టదా! గిట్టదా!
విశ్వదాభిరామ! వినురవేమ!

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఎవరి మీద దయ కలిగి ఉండాలి ?
జవాబు.
తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి.

ప్రశ్న 2.
చెదలు ఎక్కడ పుట్టి గిట్టుతుంది ?
జవాబు.
చెదలు పుట్టలో పుట్టి గిట్టుతుంది.

ప్రశ్న 3.
దయలేని కుమారుడిని కవి దేనితో పోల్చాడు.
జవాబు.
దయలేని కుమారుడిని కవి చెదతో పోల్చాడు.

ప్రశ్న 4.
ఈ పద్యంలో అలంకారమేది ?
జవాబు.
ఈ పద్యాన్ని వేమన కవి రచించాడు.

ప్రశ్న 5.
గిట్టుట – అర్థమేమి ?
జవాబు.
చనిపోవుట.

5. అనువుగాని చోట అధికులమనరాదు,
కొంచెముండుటెల్ల కొదువకాదు,
కొండ అద్దమందు కొంచమై యుండదా !
విశ్వదాభిరామ వినురవేమ ! ప్రశ్నలు :

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఎక్కడ గొప్పవారమని అనుకోరాదు ?
జవాబు.
అనుకూలంగా లేని ప్రదేశంలో గొప్పవారమని అనుకోరాదు.

ప్రశ్న 2.
ఏది తక్కువ కాదు ?
జవాబు.
తగ్గి ఉండటం తక్కువ కాదు.

ప్రశ్న 3.
కొండ అద్దంలో ఎలా కనిపిస్తుంది ?
జవాబు.
కొండ అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది.

ప్రశ్న 4.
ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు.
ఈ పద్యం వేమన శతకంలోనిది.

ప్రశ్న 5.
అత్వసంధికి ఒక ఉదాహరణ రాయండి.
జవాబు.
ఉండుట + ఎల్ల = ఉండుటెల్ల.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

6. తివిరి యిసుమున దైలంబు తీయవచ్చు
తవిరి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనము రంజింపరాదు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ప్రయత్నించి ఇసుక నుండి దేనిని తీయవచ్చును?
జవాబు.
ప్రయత్నించి ఇసుక నుండి నూనెను తీయవచ్చును.

ప్రశ్న 2.
ప్రయత్నిస్తే దేని నుండి నీరు త్రాగవచ్చును ?
జవాబు.
ప్రయత్నిస్తే ఎండమావి నుండి నీటిని త్రాగవచ్చును.

ప్రశ్న 3.
ఎక్కడైనా తిరిగి సాధించగలిగేదేమిటి ?
జవాబు.
కుందేటి కొమ్మును కూడా ఎక్కడైనా తిరిగి సాధించవచ్చును.

ప్రశ్న 4.
ఎంత ప్రయత్నించినా దేనిని చేయలేము ?
జవాబు.
ఎంత ప్రయత్నించినా మూర్ఖుని మనస్సును ఆనందింపజేయుటకు సాధ్యం కాదు.

ప్రశ్న 5.
మృగతృష్ణ అంటే ఏమిటి ?
జవాబు.
ఎండమావి.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

7. ఎఱుక గల వారి చరితలు
గఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగిన దానిని
మఱువ కనుష్టించినది సమంజస బుద్ధిన్.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఎవరి చరిత్ర తెలుసుకోవాలి ?
జవాబు.
సజ్జనుల చరిత్ర తెలుసుకోవాలి.

ప్రశ్న 2.
ధర్మాన్ని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి ?
జవాబు.
ధర్మాన్ని సజ్జనుల నుండి తెలుసుకోవాలి.

ప్రశ్న 3.
దేనిని అనుష్టించాలి ?
జవాబు.
ధర్మాన్ని అనుష్టించాలి.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి “ధర్మాచరణ” అను శీర్షిక తగినది.

ప్రశ్న 5.
సమంజస బుద్ధి-విగ్రహ వాక్యం రాయండి.
జవాబు.
సమంజసమైన బుద్ధి.

8. క్రింది పద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారుచేయండి.
మరువవలెగీడు నెన్నడు
మరువంగారాదు మేలు, మర్యాదలలో
దిరుగవలె సర్వజనముల
దరి ప్రేమన్ మెలగవలయు దరుణి కుమారీ !

ప్రశ్నలు :

1. దేనిని మరచిపోవలెను ?
2. దేనిని మరువకూడదు ?
3. అందరియెడల ఎట్లా మెలగాలి ?
4. ఈ పద్యం ఏ శతకంలోనిది ?
5. హద్దు అనే అర్థం వచ్చే పదం ఏది ?

9. అల్పుడెపుడు పల్కునాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఆడంబరంగా మాట్లాడేదెవరు ?
జవాబు.
ఆడంబరంగా మాట్లాడేది దుర్జనుడు.

ప్రశ్న 2.
సజ్జనుండెలా మాట్లాడుతాడు?
జవాబు.
సజ్జనుడు చక్కగా మాట్లాడుతాడు.

ప్రశ్న 3.
ఈ పద్యంలో కవి ఎవరిని ఎవరితో పోల్చాడు.
జవాబు.
ఈ పద్యంలో కవి అల్పుని కంచుతోను, సజ్జనుని బంగారంతోను పోల్చాడు.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

ప్రశ్న 4.
ఈ పద్యానికి తగిన శీర్షికను రాయండి.
జవాబు.
“అల్పుడు- సజ్జనుల మాట తీరు” అనేది ఈ పద్యానికి తగిన శీర్షిక.

ప్రశ్న 5.
అల్పుడు దేని వంటి వాడు?
జవాబు.
కంచు వంటివాడు.

10. అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు :

ప్రశ్న 1.
అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది?
జవాబు.
అంటూ ఉంటే అతిశయిల్లేది రాగం.

ప్రశ్న 2.
తింటూ ఉంటే తీయనయ్యేది ఏది ?
జవాబు.
తింటూ ఉంటే తీయనయ్యేది వేప.

ప్రశ్న 3.
సాధనముతో సమకూరేవి ఏవి ?
జవాబు.
సాధనముతో పనులు సమకూరుతాయి.

ప్రశ్న 4.
ఈ పద్యానికి మకుటం ఏది ?
జవాబు.
ఈ పద్యానికి ‘విశ్వదాభిరామ వినురవేమ’ అనేది మకుటం.

ప్రశ్న 5.
ధర – దీనికి నానార్థాలు రాయండి.
జవాబు.
భూమి, వెల

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

11. క్రింది పద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారుచేయండి.
అఘము వలన మరల్చు హితార్థ కలితు
జేయు, గోప్యంబుదాచు, బోషించు గుణము
విడువడా పన్ను లేవడి వేళ నిచ్చు
మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు !

ప్రశ్నలు :

1. పాపపు పనుల నుండి మరల్చేదెవరు?
2. రహస్యాన్ని దాచిపెట్టేదెవరు?
3. మన దగ్గర డబ్బులేనప్పుడు డబ్బు ఇచ్చేదెవరు?
4. ఈ పద్యానికి తగిన శీర్షిక ఏది?
5. గోప్యము అర్థమేమి?

12. తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తల తోకయనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !
ప్రశ్నలు :

ప్రశ్న 1.
పాముకు విషం ఎక్కడ ఉంటుంది ?
జవాబు.
పాముకు విషం తల (నోటి)లో ఉంటుంది.

ప్రశ్న 2.
తోకలో విషం గలది ఏది ?
జవాబు.
తోకలో విషం గలది తేలు.

ప్రశ్న 3.
దుర్జనుడికి విషం ఎక్కడ ఉంటుంది ?
జవాబు.
దుర్జనుడికి ఒళ్ళంతా విషమే.

ప్రశ్న 4.
ఈ పద్యం ద్వారా నీవు గమనించిందేమిటి ?
జవాబు.
పాము, తేలు కంటే కూడా దుర్జనుడు ప్రమాదకారి అని గమనించాను.

ప్రశ్న 5.
తేలు అనే అర్థాన్నిచ్చే పదమేది ?
జవాబు.
వృశ్చికము.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

13. ఎప్పుడు తప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్
సప్పంబు పడగ నీడను
కప్ప వసించిన విధంబు గదరా సుమతీ!

ప్రశ్నలు :

ప్రశ్న 1.
నిరంతరం తప్పులు వెతికే వాని సన్నిధి ఎటువంటిది ?
జవాబు.
నిరంతరం తప్పులు వెతికేవాని సన్నిధి పాము పడగనీడ వంటిది.

ప్రశ్న 2.
ఎప్పుడూ తప్పులు వెతికేవాడు ఎలాంటివాడు?
జవాబు.
ఎప్పుడూ తప్పులు వెతికేవాడు పాము లాంటివాడు, ప్రమాదకరమైనవాడు.

ప్రశ్న 3.
ఎవరిని సేవించకూడదు?
జవాబు.
ఎప్పుడూ తప్పులు వెతికేవాడిని సేవించకూడదు.

ప్రశ్న 4.
ఈ పద్యం ఏ శతకం లోనిది?
జవాబు.
ఈ పద్యం సుమతీ శతకం లోనిది.

ప్రశ్న 5.
“అప్పురుషుడు” అంటే అర్థం ఏమిటి?
జవాబు.
అప్పురుషుడు అంటే ఎప్పుడూ తప్పులు వెతికే వాడు, ప్రమాదకరమైనవాడు.

14. క్రింది పద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారుచేయండి.

వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కని కల్ల నిజము దెలిసిన
మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ !

ప్రశ్నలు :

1. ఎవరేమి చెప్పినా ఏం చేయాలి ?
2. విన్న తరువాత ఏం చేయాలి ?
3. ఎవరు నీతిపరుడు ?
4. ఈ పద్యానికి తగిన శీర్షిక ఏది ?
5. మంచి బుద్ధి కలవాడు అని అర్థం ఇచ్చే పదం ఏది ?

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

15. పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని గనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ !

ప్రశ్నలు :

ప్రశ్న 1.
తండ్రికి పుత్రోత్సాహం ఎప్పుడు కలుగదు?
జవాబు.
తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు పుత్రోత్సాహం కలుగదు.

ప్రశ్న 2.
తండ్రికి పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుంది?
జవాబు.
పుత్రుడు అందరిచే పొగడబడినపుడు తండ్రి నిజమైన పుత్రోత్సాహాన్ని పొందుతాడు.

ప్రశ్న 3.
ఈ పద్యానికి తగిన శీర్షిక ఏది ?
జవాబు.
“నిజమైన పుత్రోత్సాహం” అనేది ఈ పద్యానికి తగిన శీర్షిక.

ప్రశ్న 4.
ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు.
ఈ పద్యం “సుమతీ శతకం” లోనిది.

ప్రశ్న 5.
పుత్రోత్సాహము – ఏ సంధి ?
జవాబు.
గుణసంధి.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

16. మేడిపండు చూడ మేలిమైయుండును
పొట్టవిప్పి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింక మీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు :

ప్రశ్న 1.
పిరికివాడు దేనితో పోల్చబడినాడు?
జవాబు.
పిరికివాడు మేడిపండుతో పోల్చబడినాడు.

ప్రశ్న 2.
మేడిపండు పైకి ఏ విధంగా ఉంటుంది?
జవాబు.
మేడిపండు పైకి మంచి బంగారంలాగా ఉంటుంది.

ప్రశ్న 3.
మేడిపండు లోపల ఎలా ఉంటుంది?
జవాబు.
మేడిపండు లోపల పురుగులతో నిండి ఉంటుంది.

ప్రశ్న 4.
ఈ పద్యం వల్ల తెలిసిందేమిటి?
జవాబు.
ఈ పద్యం వల్ల పిరికివాడు పైకి మాత్రం మేడిపండు లాగా డాంబికంగా కనిపిస్తాడని భావం.

ప్రశ్న 5.
మేలిమై – ఎలా విడదీయాలి ?
జవాబు.
మేలిమి + ఐ.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

17. మొదల జూచిన కడుగొప్ప. పిదప గురుచ
నాది కొంచెము తర్వాత నధికమగుచు
తనరు దిన పూర్వ పరభాగ జనితమైన
ఛాయ పోలిక, కుజన సజ్జనుల మైత్రి.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
కుజనుల మైత్రి ఎటువంటిది ?
జవాబు.
కుజనుల మైత్రి మొదట ఎక్కువగా ఉండి తరువాత తగ్గిపోతుంది.

ప్రశ్న 2.
సజ్జనుల మైత్రి ఎటువంటిది ?
జవాబు.
సజ్జనుల మైత్రి మొదట తక్కువగా ఉండి తరువాత ఎక్కువవుతుంది.

ప్రశ్న 3.
కుజన, సజ్జనుల మైత్రిని కవి దేనితో పోల్చి చెప్పాడు ?
జవాబు.
కుజన మైత్రిని ఉదయకాలపు నీడతోను, సజ్జనుల మైత్రిని సాయంత్రపు నీడతోను కవి పోల్చి చెప్పాడు.

ప్రశ్న 4.
ఈ పద్యం వల్ల మనకు ఏం తెలుస్తోంది?
జవాబు.
ఈ పద్యం వలన సజ్జనులతో మైత్రి శాశ్వతంగా ఉంటుందని తెలుస్తోంది.

ప్రశ్న 5.
కుజన సజ్జనులు – ఏ సమాసం?
జవాబు.
ద్వంద్వ సమాసం.

18. నడివడి యను మున్నీటం
గడవం బెట్టంగ నోడకరణిం దగి తా
నొడ గూడు ననిన సత్యము
గడచిన గుణమింక నొందుగలదే యరయన్.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ప్రవర్తనను కవి దేనితో పోల్చారు?
జవాబు.
ప్రవర్తనను కవి సముద్రంతో పోల్చారు.

ప్రశ్న 2.
“సత్యగుణం” దేనిలాగా ఉపయోగపడుతుంది?
జవాబు.
సత్యగుణం సముద్రాన్ని దాటించే నావలాగా ఉపయోగపడుతుంది.

ప్రశ్న 3.
ఈ పద్యంలో గల శబ్దాలంకారమేమి?
జవాబు.
వృత్త్యనుప్రాసాలంకారం కలదు.

ప్రశ్న 4.
ఈ పద్య భావానికి తగిన శీర్షికను రాయండి. ?
జవాబు.
“సత్యగుణ ప్రాధాన్యత” అనేది ఈ పద్యానికి తగిన శీర్షిక.

ప్రశ్న 5.
గుణము + ఇంక – ఏ సంధి ?
జవాబు.
ఉత్వసంధి.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

19. క్రింది పద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారుచేయండి.
ఆత్మశుద్ధి లేని ఆచారమది యేల?
భాండ శుద్ధిలేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా?
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు :

1. పాకమునకు దేని శుద్ధి అవసరం?
2. చిత్తశుద్ధి లేకుండా దేనిని చేయకూడదు?
3. పద్యం మనిషికి ఏమి ఉండాలని చెబుతుంది?
4. ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు?
5. ఆచారానికి ఏమి కలిగి ఉండాలి?

20. పూజకన్న నెంచబుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు :

ప్రశ్న 1.
పూజకన్నా ఏది మిన్న ?
జవాబు.
పూజలు చేయటం కన్నా మంచిబుద్ధి కలిగి యుండటం మేలు.

ప్రశ్న 2.
మాటకంటే గొప్పదేది ?
జవాబు.
మాటలు చెప్పటంకన్నా దృఢమైన మనస్సు గలిగియుండటం మంచిది.

ప్రశ్న 3.
కులంకన్నా ప్రధానమైనదేది ?
జవాబు.
కులంకన్నా గుణం చాలా గొప్పది.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక “దేనికంటే ఏది ప్రధానం”.

ప్రశ్న 5.
మిగుల అంటే అర్థమేమి ?
జవాబు.
ఎక్కువగా.

21. ఆకొన్న కూడె యమృతము
తా గొంకక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోకోర్చువాడె మనుజుడు
తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ !

ప్రశ్నలు :

ప్రశ్న 1.
అమృతం వంటిదేది ?
జవాబు.
ఆకలితో ఉన్నప్పుడు తిన్న అన్నం అమృతం వంటిది.

ప్రశ్న 2.
ఎవరిని ‘దాత’ అంటారు ?
జవాబు.
సందేహించకుండా అడిగిన వెంటనే ఇచ్చువాడు దాత.

ప్రశ్న 3.
ఎవడు మనుష్యుడనిపించుకుంటాడు ?
జవాబు.
కష్టములను సహించగలవాడు మనుష్యుడనిపించు కుంటాడు.

ప్రశ్న 4.
వంశానికి అలంకారం వంటివాడెవడు ?
జవాబు.
సాహసం కలవాడు వంశానికి అలంకారం వంటివాడు.

ప్రశ్న 5.
కొంకక – అర్థమేమి ?
జవాబు.
సంకోచించకుండా.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

22. మిరెము చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనఁజురుకు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు :

ప్రశ్న 1.
మిరియపుగింజ ఎలా ఉంటుంది ?
జవాబు.
మిరియపుగింజ నల్లగా ఉంటుంది.

ప్రశ్న 2.
గింజ కొరికితే ఎట్లా ఉంటుంది ?
జవాబు.
మిరియపుగింజ కొరికితే నోరు చుర్రుమంటుంది.

ప్రశ్న 3.
మిరియపుగింజలాంటి వారు ఎవరు?
జవాబు.
మిరియపుగింజ లాంటివారు సజ్జనులు.

ప్రశ్న 4.
ఈ పద్యంలోని అలంకారం ఏది ?
జవాబు.
ఈ పద్యంలో ఉపమాలంకారం కలదు.

ప్రశ్న 5.
సజ్జనులు – ఈ పదాన్ని విడదీయండి.
జవాబు.
సత్ + జనులు.

23. క్రింది పద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారుచేయండి.
ధనము కూడబెట్టి ధర్మంబు సేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ గూర్చి తెరువరి కీయదా
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు :

1. తేనెటీగ ఎవరికి యిస్తున్నది?
2. తాను తినక, కూడబెట్టు వారినేమందురు ?
3. పై పద్యమునందలి భావమేమి ?
4. కూడబెట్టిన ధనము ఎట్లు సద్వినియోగమగును?
5. ధర్మంబు + చేయక – ఏ సంధి ?

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

24. భూమి నాదియనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁజూచి ధనము నవ్వు
కదన భీతుఁజూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్న 1.
భూమి ఎవరిని చూచి నవ్వుతుంది ?
జవాబు.
భూమి నాది అని అన్నవాడిని చూచి ఫక్కున నవ్వుతుంది.

ప్రశ్న 2.
ధనం ఎవరిని చూచి నవ్వుతుంది ?
జవాబు.
దానగుణం లేనివాడైన లోభిని చూచి ధనం నవ్వుతుంది.

ప్రశ్న 3.
యుద్ధంలో భయపడిన వాడిని చూచి ఎవరు నవ్వుతారు ?
జవాబు.
యుద్ధంలో భయపడిన వాడిని చూచి యముడు నవ్వుతాడు.

ప్రశ్న 4.
ఈ పద్యం తెలిపే నీతి ఏమిటి ?
జవాబు.
దురాశ, పిసినారితనం, పిరికితనం పనికిరావనే నీతి ఈ పద్యం బోధిస్తుంది.

ప్రశ్న 5.
దానము చేత హీనుడు – ఏ సమాసం ?
జవాబు.
తృతీయా తత్పురుష సమాసము.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

25. విద్యచే భూషితుండయి వెలయుచున్న
దొడరి వర్ణింపనగు జుమీ దుర్జనుండు
చారుమాణిక్య భూషిత శస్తమస్త
కంబయిన పన్నగము భయంకరముగాదె.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
విద్య ఉన్నప్పటికి విడువదగినవాడెవడు ?
జవాబు.
విద్య ఉన్నప్పటికీ విడువదగినవాడు దుర్జనుడు.

ప్రశ్న 2.
మణి ఉన్నప్పటికి భయం కలిగించేదేది ?
జవాబు.
మణి ఉన్నప్పటికి భయం కలిగించేది పాము.

ప్రశ్న 3.
ఈ పద్యంలో కవి ఎవరిని ఎవరితో పోత్చాడు ?
జవాబు.
ఈ పద్యంలో కవి చదువుకున్న దుర్జనుణ్ణి మణిని కలిగియున్న పాముతో పోల్చాడు.

ప్రశ్న 4.
ఈ పద్యంలో గల అర్థాలంకారమేది ?
జవాబు.
ఈ పద్యంలో అర్థాంతరన్యాసాలంకారం కలదు.

ప్రశ్న 5.
మాణిక్య – ఈ పదానికి వాడిన విశేషణమేది ?
జవాబు.
చారు.

Leave a Comment