TS Inter 1st Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

Telangana TSBIE TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం Textbook Questions and Answers.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వోచర్ (Vouchers) ను ఏ విధంగా తయారు చేస్తారు ?
జవాబు.
వ్యవహారాలను ఖాతా పుస్తకాలలో నమోదు చేయుటకు మూలమైన వోచర్లను సేకరించి / తయారుచేసి భద్రపరచాలి. కొన్ని వోచర్ పత్రాలను తయారు / సృష్టించటం గురించి క్రింద ఇవ్వడమైంది.

వోచర్లను రూపొందించటం :
a) నగదు మెమో :
సంస్థ సరుకులను నగదుకు కొనుగోలు చేసినప్పుడు నగదు మెమోను పొందటం, అమ్మినప్పుడు నగదు మెమోను ఇవ్వడం జరుగుతుంది.

b) కొనుగోలు ఇన్వాయిస్ :
సరుకులను అరువుపై కొనుగోలు చేసినప్పుడు, సరుకులతో పాటు, కొనుగోలు ఇన్వాయిస్ను సప్లయిదారు ఇస్తారు. దీనిలో, తేదీ, కొనుగోలుదారు పేరు, సరుకుల వివరణ, పరిమాణం, వాటి విలువ మొదలైన విషయాలు ఉంటాయి. ఇన్వాయిస్ మొదటి / అసలు పత్రం కొనుగోలుదారునికి ఇవ్వబడుతుంది. రెండవ నకలు పత్రం సంస్థ వద్ద భద్రపరచబడుతుంది.

c) అమ్మకపు ఇన్వాయిస్ :
సరుకులను అరువుపై అమ్మినప్పుడు, అమ్మకందారు దీనిని తయారుచేస్తారు. దీనిలో కొనుగోలుదారు పేరు, సరుకు వివరాలు, వాటి పరిమాణం, విలువ మొదలగునవి ఇందులో పొందుపరచబడతాయి. ఇన్వాయిస్ అసలు పత్రం కొనుగోలుదారునికి పంపబడతాయి. నకలు పత్రం సంస్థ తన వద్ద భద్రపరచుకుంటుంది.

d) వసూలు పత్రం :
ఖాతాదారుల నుండి సంస్థ నగదు తీసుకున్నప్పుడు, ఈ పత్రాన్ని జారీ చేయడమౌతుంది. దీని నకలు కూడా తయారు చేయబడతాయి. అసలు పత్రాన్ని ఖాతాదారునికి ఇచ్చి, నకలు (రెండవ) పత్రాన్ని సంస్థ వద్ద భద్రపరచబడుతుంది.

e) చెల్లింపు పత్రం :
సంస్థ ఎవరికైతే నగదు కాని చెక్కును గాని బ్యాంకులో జమచేసినప్పుడు ఈ పత్రం తయారుచేయబడుతుంది. ఈ పత్రంలోని ఒక భాగం బ్యాంకు ఉంచుకొని, రెండవ భాగం (ఎడమచేతి వైపు భాగం) జమచేసిన వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇది చెల్లింపును ధృవీకరిస్తుంది.

f) చెక్కు :
చెక్కు అనేది చెక్కులో రాసిన మొత్తాన్ని, పేర్కొన్న వ్యక్తికి చెల్లించమని, ఖాతాదారుడు (depositor) బ్యాంకుకు చేసే ఆదేశం. చెక్కులు జారీ చేసినప్పుడు, ఎవరికి జారీ చేసింది, చెల్లించే మొత్తం, తేదీ మొదలైన విషయాలు చెక్కు పుస్తకంలోని counterfoil లో రాయబడుతుంది.

g) డెబిట్ నోట్ :
ఇది సరుకులు వాపసు చేసినప్పుడు, ఖాతాదారుడు, సప్లయ్చారునికి రాతపూర్వకంగా పంపే పత్రం. దీనిలో, వాపసు చేసిన సరుకుల వివరాలు, విలువ, పరిమాణం ఉంటాయి. ఇది సప్లయ్చారు ఖాతాకు డెబిట్ చేసిన మొత్తాన్ని తెలియజేస్తుంది. దీన్ని భవిష్యత్తు అవసరానికై భద్రపరచబడుతుంది.

h) క్రెడిట్ నోట్ :
ఇది సరుకులు వాపసు చేసినప్పుడు, సప్లయ్చారుడు ఖాతాదారునికి పంపే వ్రాతపూర్వక పత్రం. దీనిలో, ఖాతాదారుని ఖాతాకు, సరుకు వాపసుకు సంబంధించి ఎంత మొత్తం క్రెడిట్ చేయబడిందో తెలుపుతుంది. దీని మొదటిపత్రం (Original copy) ఖాతాదారునికి పంపి, రెండవ పత్రం (నకలు)ను సంస్థ భద్రపరచుతుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 2.
అకౌంటింగ్ సమీకరణాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.
జవాబు.
అకౌంటింగ్ సమీకరణం :
1. అకౌంటింగ్ సమీకరణం అనేది, అకౌంటింగ్ సూత్రాలలోని ద్వంద్వ రూప భావన ఆధారంగా నిర్మితమైంది.
2. ఈ అకౌంటింగ్ సమీకరణం, వ్యాపారం యొక్క ఆర్థిక వనరులకు ఆ ఆర్థిక వనరులపై గల రుణబాధ్యతల మధ్యగల సంబంధాన్ని తెలుపుతుంది.
3. ఖాతా పుస్తకాలలో నమోదు చేసిన ప్రతి వ్యవహారము సంస్థ యొక్క ఆర్థిక స్థితి గతులలో మార్పులు తెస్తుంది.
4. దీనిని, అకౌంటింగ్ సమీకరణం రూపంలో క్రింద వివరించడమైంది.
ఆస్తులు (వనరులు) = సంస్థ కున్న బాధ్యతలు (లేదా)
ఆస్తులు = మూలధనం + అప్పులు
5. ఈ క్రింది ఉదాహరణలు, వివిధ వ్యవహారాలు, అకౌంటింగ్ సమీకరణంపై ఎలాంటి ప్రభావాన్ని కలిగించునో వివరిస్తాయి.

1. గణేష్ 7 50,000 నగదుతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. దీనిని అకౌంటింగ్ సమీకరణంలో కూర్చినప్పుడు నగదు 50,000 = మూలధనం ₹ 50,000 + అప్పులు ₹ 0.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 1

2. ఫర్నీచర్ నగదుకు కొనుగోలు కౌ 10,000. ఇప్పుడు అకౌంటింగ్ సమీకరణం ఈ విధంగా ఉండును.
నగదు 40,000 + ఫర్నీచర్ ₹ 10,000 = మూలధనం ₹ 50,000 + అప్పులు ₹ 0.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 2

3. శంకర్ నుండి అరువుపై సరుకు కొనుగోళ్ళు ₹ 15,000.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 3

ఆస్తులు = మూలధనం + అప్పులు
నగదు + ఫర్నీచర్ + సరుకులు = మూలధనం + శంకర్కు చెల్లించవలసిన అప్పులు
40,000 + 10,000 + 15,000 = 50,000 + 15,000
65,000 = 65,000.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 3.
వ్యవహారాలను నమోదు చేయు విధానాలను గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు.
వ్యాపార ఆర్థిక వ్యవహారాలను, ఈ క్రింద తెలిపిన ఏదో ఒక పద్ధతిలో నిర్వహించబడుతుంది.

1. ఒంటి పద్దు విధానం (Single Entry System) :

  1. దీనిని అసంపూర్ణ బుక్ కీపింగ్ విధానంగా పరిగణిస్తారు. దీనిని సాధారణంగా చిన్న వ్యాపార సంస్థలు పాటిస్తాయి.
  2. కోహిలర్ ప్రకారం, ఇది ఒక బుక్ కీపింగ్ విధానం, దీనిలో, విధిగా, నగదు మరియు వ్యక్తిగత ఖాతాలను మాత్రమే నిర్వహిస్తారు.
  3. ఇది ఎప్పుడు అసంపూర్ణ విధానం, మరియు పరిస్థితులను అనుసరించి మారుతుంది. కేవలం నగదు, మరియు వ్యక్తిగత ఖాతాలనే నిర్వహించటం వల్ల ఈ విధానంలో పూర్తి సమాచారం అందుబాటులో ఉండదనే విషయాన్ని ప్రధాన లోపంగా పరిగణిస్తారు.
  4. కాబట్టి దీన్ని తరచుగా, అసంపూర్తిగా ఉన్న రికార్డుల నుండి అకౌంట్స్ను తయారుచేయు పద్ధతిగా వ్యవహరిస్తారు.

2. జంట పద్దు విధానం (Double Entry System) :

  1. ఈ విధానంలో అన్ని వ్యాపార వ్యవహారాలలోని రెండు అంశాలను నమోదు చేస్తారు. ప్రతి వ్యవహారంలో రెండు అంశాలు ఉంటాయి. అవి ఇవ్వటం, తీసుకొనటం.
  2. ఉదాహరణకు, మనం నగదు చెల్లించినప్పుడు, దానిని స్వీకరించే ఒక వ్యక్తి ఉండును. అదేవిధంగా, మనం నగదు స్వీకరించినప్పుడు, మనకు చెల్లించే ఒక వ్యక్తి ఉంటారు.
  3. ఈ విధంగా, ప్రతి వ్యవహారం, ఏకకాలంలో ఒకే మొత్తంతో రెండు ఖాతాలు ప్రభావితమగును. అవి, ఒక ఖాతా లబ్ధి ఇచ్చే అంశం, రెండవది లబ్ది పొందే అంశం. ఒక దానిని డెబిట్గాను, వేరొక దానిని క్రెడిట్గా వ్యవహరిస్తారు.
  4. జంట పద్దు విధానంలో ఒక వ్యవహారంలోని రెండు అంశాలైన డెబిట్, క్రెడిట్ను గుర్తించి నమోదు చేస్తారు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 4.
ఖాతాల వర్గీకరణను, ఉదాహరణలతో తెలపండి.
జవాబు.
ఒక వ్యాపారములో జరిగే వ్యవహారములన్నింటిని సంపూర్ణముగా రికార్డు చేయడమే అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. కాబట్టి వ్యక్తికిగాని, ఆస్తికిగాని, అప్పుడుగాని, ఖర్చుకుగాని లేదా ఆదాయానికిగాని సంబంధించిన అన్ని వ్యవహారముల సంక్షిప్త స్వరూపము లేదా రికార్డును ఖాతా అనవచ్చు.

ఖాతాలను స్థూలముగా రెండు రకాలుగా విభజించవచ్చు.

  • వ్యక్తిగత ఖాతాలు
  • వ్యక్తిగతము కాని ఖాతాలు

1. వ్యక్తిగత ఖాతాలు :
వ్యాపార సంస్థ ఏఏ వ్యక్తులతో వ్యవహారాలు జరుపుతుందో లేదా సంస్థలతో వ్యవహారాలు జరుపుతుందో ఆ ఖాతాలను వ్యక్తిగత ఖాతాలు అంటారు. ఈ ఖాతాలు సాధారణముగా సహజ వ్యక్తులు. ఉదా : రాముని ఖాతా, గోవింద్ ఖాతా లేదా న్యాయాత్మక లేదా కృత్రిమ వ్యక్తులు కావచ్చు.
ఉదా : స్టేట్ బ్యాంక్ ఖాతా, జీవిత భీమా సంస్థ ఖాతా మొదలైనవి.

వ్యక్తిగత ఖాతాలలో డెబిట్, క్రెడిట్ సూత్రాలు :
“పుచ్చుకునే వాని ఖాతాకు డెబిట్ చేయండి. ఇచ్చేవాని ఖాతాకు క్రెడిట్ చేయండి”. అనగా ప్రయోజనము పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి. ప్రయోజనము ఇచ్చిన వ్యక్తిని క్రెడిట్ చేయాలి.

2. వ్యక్తిగతం కాని ఖాతాలు : ఈ ఖాతాలను మరల రెండు రకాలుగా విభజించవచ్చు.

  • వాస్తవిక ఖాతాలు
  • నామమాత్రపు ఖాతాలు

i) వాస్తవిక ఖాతాలు : సంస్థకు చెందిన ఆస్తుల ఖాతాలు వాస్తవిక ఖాతాలు. ఈ ఆస్తులు కనిపించే ఆస్తులకు సంబంధించినవి కావచ్చు.
ఉదా: యంత్రాలు, భవనాలు, ఫర్నీచర్ మొదలైనవి లేదా కనిపించని ఆస్తులకు సంబంధించిన ఖాతాలు కావచ్చు.
ఉదా : గుడ్విల్, పేటెంటు హక్కులు మొ॥.
వాస్తవిక ఖాతాకు సంబంధించిన సూత్రము : “వచ్చే ఆస్తిని డెబిట్ చేయండి. పోయే ఆస్తిని క్రెడిట్ చేయండి”.

ii) నామమాత్రపు ఖాతాలు : వీటికి రూపము, చలనము ఉండదు. ఈ ఖాతాలు ఖర్చులు, నష్టాలు, లాభాలు, ఆదాయాలకు సంబంధించినవి.
ఉదా : జీతాల ఖాతా, అద్దె ఖాతా, వచ్చిన డిస్కౌంట్ ఖాతా మొ॥.
నామమాత్రపు ఖాతాలకు సంబంధించిన సూత్రము : “వ్యయాలను, నష్టాలను డెబిట్ చేయండి. ఆదాయాలను, లాభాలను క్రెడిట్ చేయండి.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 5.
డెబిట్, క్రెడిట్ సూత్రాలను ఉదాహరణలతో తెలపండి.
జవాబు.
డెబిట్, క్రెడిట్ సూత్రాలు :
ప్రతి వ్యవహారంలో రెండు అంశాలు ఉంటాయి. ఒక అంశాన్ని డెబిట్ అని, రెండవ అంశాన్ని క్రెడిట్ అని వ్యవహరిస్తాము. జంట పద్దు విధానంలో ఏ అంశాన్ని డెబిట్గా లేదా క్రెడిట్గా చేయవలెనో గుర్తించడానికి గాను డెబిట్, క్రెడిట్ సూత్రాలు ఏర్పరచబడినవి. అవి

1. వ్యక్తిగత ఖాతాలు : (సహజ, కృత్రిమ ప్రాతినిధ్య వ్యక్తులు)
సూత్రం :
పుచ్చుకొనే వారి ఖాతాకు డెబిట్ చేయండి. ఇచ్చే వారి ఖాతాకు క్రెడిట్ చేయండి.

  1. ఏ వ్యక్తి అయితే సంస్థ నుంచి ప్రయోజనం పొందుతున్నాడో, అతని ఖాతాకు డెబిట్ చేయాలి. అదే విధంగా, ఏ వ్యక్తి అయితే సంస్థకు ప్రయోజనం చేకూర్చునో, ఆ వ్యక్తి ఖాతాకు క్రెడిట్ చేయాలి.
  2. ఉదాహరణకు, రమేష్కు ₹ 5,000 సరుకును అరువుపై అమ్మడమైంది. ఈ సందర్భంలో రమేష్ సంస్థ నుండి ప్రయోజనం పొందుతున్నాడు. కాబట్టి అతని ఖాతాకు డెబిట్ చేయాలి.
  3. ఇదే విధంగా, మహేష్ నుండి ₹ 2,000 సరుకును సంస్థ అరువుపై కొనుగోలు చేసినప్పుడు, మహేష్ ప్రయోజనం చేకూర్చే వ్యక్తి కాబట్టి అతని ఖాతాకు క్రెడిట్ చేయవలెను.
  4. ఈ విధంగా సంస్థ నుండి ప్రయోజనం పొందే వారి (పుచ్చుకొనేవారు) ఖాతాకు డెబిట్, ప్రయోజనం ఇచ్చే వారి ఖాతాకు క్రెడిట్ చేయవలెను.

2. వాస్తవిక ఖాతాలు : (ఆస్తులు)
సూత్రం :
వచ్చే ఆస్తిని డెబిట్ చేయండి
వెళ్ళే ఆస్తిని క్రెడిట్ చేయండి
ఈ సూత్రం ప్రకారం సంస్థలోనికి వచ్చే ఆస్తులను డెబిట్ చేయాలి. వెళ్ళే ఆస్తులను క్రెడిట్ చేయాలి.

3. నామమాత్రపు ఖాతాలు : (వ్యయాలు, నష్టాలు, ఆదాయాలు, లాభాలు)
సూత్రం :
అన్ని వ్యయాలను, నష్టాలను డెబిట్ చేయండి
అన్ని ఆదాయాలను, లాభాలను క్రెడిట్ చేయండి.
ఈ సూత్రం ప్రకారం సంస్థ యొక్క అన్ని వ్యయాలను, నష్టాలను డెబిట్ చేయాలి. ఆదాయాలను, లాభాలను క్రెడిట్ చేయాలి.
ఉదాహరణ : ఈ క్రింద పట్టికలో డెబిట్, క్రెడిట్ సూత్రాల్ని అన్వయించి వ్యవహారంలోని రెండు అంశాలను గుర్తించి, ఖాతాకు సంబంధించినవో వివరించడమైంది.

కొన్ని వ్యవహారాలను క్రింద ప్రస్తావించడమైంది

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 4

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 6.
అకౌంటింగ్ పద్ధతులను క్లుప్తంగా వివరించండి.
జవాబు.
అకౌంట్స్ను ఏదేని క్రింద తెలిపిన పద్ధతిలో నిర్వహించవచ్చును.

1. నగదు పద్ధతిలో అకౌంటింగ్ :

  1. ఈ పద్ధతిలో, నగదు వసూళ్ళు, చెల్లింపులకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే నమోదు చేస్తారు.
  2. ఈ పద్ధతిలో చెల్లించవలసిన ఖర్చులు, రావలసిన ఆదాయాల నమోదుకు ఎలాంటి ఆస్కారము లేదు.
  3. సాధారణంగా, ప్రభుత్వ ఖాతాలు, నగదు పద్దతిలో నిర్వహించబడుతుంది. కొంతమంది professionals, professional సంస్థలు కూడా కొద్దిపాటి మార్పులతో ఈ పద్ధతిని పాటిస్తున్నారు. వీరు వాస్తవంగా వసూలైన ఆదాయాలను నమోదు చేస్తారు. కాని ఖర్చులను నమోదు చేసినప్పుడు, చెల్లించిన మరియు చెల్లించవలసిన ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
  4. ఈ విషయంలో వీరు కొంతవరకు మితవాద సాంప్రదాయాన్ని (conservatism) పాటిస్తారు. ఇలాంటి సందర్భాలలో వారి ఆదాయ నివేదిక వసూళ్ళు మరియు వ్యయాల ఖాతాగా చూపబడుతుంది.

2. సముపార్జన (Accrual) పద్ధతిలో అకౌంటింగ్ :

  1. ఈ పద్ధతిలో అన్ని వ్యాపార వ్యవహారాల పూర్తి ప్రభావాన్ని నమోదు చేస్తారు. అంటే వసూలైన, రావలసిన ఆదాయం, చెల్లించిన, చెల్లించవలసిన ఖర్చులను కూడా నమోదు చేస్తారు.
  2. ఆర్థిక నివేదికలు తయారుచేసినప్పుడు, ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వచ్చిన, రావలసిన ఆదాయాలను మరియు చెల్లించిన, చెల్లించవలసిన వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఉదా : చెల్లించవలసిన జీతాలు, రావలసిన అద్దె మొదలైనవి.
  3. సముపార్జన (Accrual) పద్ధతిలో, ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని వ్యయాలను, ఆదాయాలను, వాటి వాస్తవ చెల్లింపులు, వసూళ్ళతో ప్రమేయం లేకుండా, అవసరమైన చిట్టా పద్దులు రాసి ఖాతా పుస్తకాలలో నమోదు చేయబడుతుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 7.
ఆవర్జాలో నమోదు. అనగా నేమి? నమోదు చేయుటకు అవలంబించు విధానాన్ని వివరించండి.
జవాబు.

  1. చిట్టాలోగాని, సహాయక చిట్టాలో గాని నమోదు చేసిన పద్దులు ఆవర్జాలో సంబంధిత ఖాతాను ప్రారంభించి అందులో వ్రాయడాన్ని ‘ఆవర్జాలో నమోదు చేయడం’ అంటారు.
  2. చిట్టాలలో రాసిన పద్దులన్నింటిని ఆవర్జాలో వాటికి సంబంధించిన ఖాతాలలో నమోదు చేయడం వలన, ఒక నిర్ణీత కాలానికి సంబంధించిన ఖాతాల నికర మొత్తాలను తెలుసుకోవడానికి వీలవుతుంది.

నమోదుకు సంబంధించిన నియమాలు (లేదా) నమోదు చేయుటకు అవలంభించు విధానం :
చిట్టాపద్దులను ఆవర్జాలోకి నమోదు చేసేటపుడు దిగువ అంశాలను పరిగణనలోకి తీసుకోవలెను.

1. ఖాతాల ఏర్పాటు :
ప్రతి వ్యవహారములోను రెండు ఖాతాలు ఉంటాయి. వాటికి వేరు వేరుగా ఆవర్జాలో ఖాతాలను ఏర్పాటుచేయాలి. ఈ ఖాతాలు వ్యక్తిగత, వాస్తవిక, నామమాత్రపు ఖాతాలకు సంబంధించినవై ఉండవచ్చు. ఖాతా నికర ఫలితాన్ని తెలుసుకోవడానికి వ్యాపార వ్యవహారముల డెబిట్, క్రెడిట్ మొత్తాలను సంబంధిత ఖాతాలో నమోదు చేయాలి.

2. చిట్టాపద్దును ఖాతాలో నమోదు :
ఖాతా అంశము చిట్టాపద్దులో డెబిట్ పంక్తిలో ఉంటే డెబిట్ వైపు, ఖాతా అంశము క్రెడిట్ పంక్తిలో ఉన్నప్పుడు క్రెడిట్ వైపు నమోదు చేయాలి.

3. To, By పదములు :
ఖాతాలో డెబిట్ వైపు వివరాల వరుసలో To అనే పదముతో, క్రెడిట్ వైపు By అనే పదముతో ప్రారంభించాలి.

4. ఖాతా నిల్వ :
ఖాతాలోని డెబిట్ వరుస మొత్తము, క్రెడిట్ వరుస మొత్తము తేడా ఖాతా నిల్వను సూచిస్తుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వోచర్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. వోచర్ (Voucher) అనేది మూలపత్రం. దీని ఆధారంగానే వ్యవహారాలను ఖాతా పుస్తకాలలో నమోదు చేస్తారు.
  2. ఈ వోచర్ అనేది నగదు మెమో, ఇన్వాయిస్, బిల్లు, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ మొదలైన రూపాలలో ఉంటుంది. వీటిని ఖాతాలు తనిఖీ చేసే నిమిత్తం భద్రపరచాలి.

ప్రశ్న 2.
అకౌంటింగ్ సమీకరణాన్ని తెలపండి.
జవాబు.
అకౌంటింగ్ సమీకరణ ద్వందరూప భావనపై (డెబిట్, క్రెడిట్) ఆధారపడి ఉన్నది. అకౌంటింగ్ సమీకరణ సంస్థ ఆస్తుల మొత్తానికి, అప్పుల మొత్తానికి మధ్య ఉన్న సంబంధాన్ని వ్యక్తపరుస్తుంది.
ఆర్థిక వనరులు (ఆస్తులు) = బాధ్యతలు (అప్పులు)
సమీకరణం దిగువ విధముగా ఉంటుంది.
ఆస్తులు = సంస్థకున్న బాధ్యతలు లేదా
ఆస్తులు = మూలధనము + అప్పులు

ప్రశ్న 3.
నగదు పద్ధతి అకౌంటింగ్ అంటే ఏమిటి ?
జవాబు.
1. నగదు పద్ధతిలో అకౌంటింగ్ :

  1. ఈ పద్ధతిలో నగదు వసూళ్ళు, చెల్లింపులకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే నమోదు చేస్తారు.
  2. ఈ పద్ధతిలో చెల్లించవలసిన ఖర్చులు, రావలసిన ఆదాయాల నమోదుకు ఎలాంటి ఆస్కారము లేదు.
  3. సాధారణంగా, ప్రభుత్వ ఖాతాలు, నగదు పద్ధతిలో నిర్వహించబడుతుంది. కొంతమంది professionals, professional సంస్థలు కూడా కొద్దిపాటి మార్పులతో ఈ పద్దతిని పాటిస్తున్నారు. వీరు వాస్తవంగా వసూలైన ఆదాయాలను నమోదు చేస్తారు. కాని ఖర్చులను నమోదు చేసినప్పుడు, చెల్లించిన మరియు చెల్లించవలసిన ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
  4. ఈ విషయంలో వీరు కొంతవరకు మితవాద సాంప్రదాయాన్ని (conservatism) పాటిస్తారు. ఇలాంటి సందర్భాలలో వారి ఆదాయ నివేదిక వసూళ్ళు మరియు వ్యయాల ఖాతాగా చూపబడుతుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 4.
సముపార్జన పద్ధతి (Accrual) అకౌంటింగ్ అంటే ఏమిటి ?
జవాబు.
1. సముపార్జన (Accrual) పద్ధతిలో అకౌంటింగ్ :

  1. ఈ పద్ధతిలో అన్ని వ్యాపార వ్యవహారాల పూర్తి ప్రభావాన్ని నమోదు చేస్తారు. అంటే, వసూలైన, రావలసిన ఆదాయం, చెల్లించిన, చెల్లించవలసిన ఖర్చులను కూడా నమోదు చేస్తారు.
  2. ఆర్థిక నివేదికలు తయారుచేసినప్పుడు, ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన, వచ్చిన, రావలసిన ఆదాయాలను మరియు చెల్లించిన, చెల్లించవలసిన వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఉదా : చెల్లించవలసిన జీతాలు, రావలసిన అద్దె మొదలైనవి.
  3. సముపార్జన (Accrual) పద్ధతిలో, ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని వ్యయాలను, ఆదాయాలను, వాటి వాస్తవ చెల్లింపులు, వసూళ్ళతో ప్రమేయం లేకుండా, అవసరమైన చిట్టా పద్దులు రాసి ఖాతా పుస్తకాలలో నమోదు చేయబడుతుంది.

ప్రశ్న 5.
ఖాతా అంటే ఏమిటి ?
జవాబు.
ప్రతి వ్యాపార వ్యవహారములోని రెండు అంశాలు రెండు ఖాతాలుగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాలకు సంబంధించి ఒక సంక్షిప్త రికార్డును ఖాతా అనవచ్చు. ఖాతాలో దిగువ అంశాలు ఉంటాయి.

  1. ప్రతి ఖాతాపైన పేరు ఉంటుంది.
  2. ఖాతా ఎడమవైపు భాగాన్ని డెబిట్ అంటారు.
  3. ఖాతా కుడివైపు భాగాన్ని క్రెడిట్ అంటారు.
    -ఖాతా స్వరూపము దిగువ విధముగా T ఆకారములో ఉంటుంది.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 5

ప్రశ్న 6.
ఖాతాలలో రకాలు తెలుపండి.
జవాబు.

  1. ఖాతాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి (1) వ్యక్తిగత ఖాతాలు (2) వ్యక్తిగతేతర ఖాతాలు.
  2. వ్యక్తిగత ఖాతాలు సహజ వ్యక్తులకు గాని, కృత్రిమ వ్యక్తులకు గాని, ప్రాతినిధ్య వ్యక్తులకు గాని సంబంధించినవై ఉంటాయి.
  3. వ్యక్తిగతేతర ఖాతాలను మరల నామమాత్రపు ఖాతాలు మరియు వాస్తవిక ఖాతాలుగా విభజించవచ్చు.
  4. వాస్తవిక ఖాతాలు సంస్థ ఆస్తులకు సంబంధించినవి, నామమాత్రపు ఖాతాలు సంస్థ వ్యయాలు, నష్టాలకు మరియు ఆదాయాలకు, లాభాలకు సంబంధించినవి.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 7.
వాస్తవిక ఖాతాలు ఏవి ?
జవాబు.
వాస్తవిక ఖాతాలు :
సంస్థకు చెందిన ఆస్తుల ఖాతాలు వాస్తవిక ఖాతాలు. ఈ ఖాతాలు కనిపించే ఆస్తులకు సంబంధించినవి కావచ్చు.
ఉదా: యంత్రాలు, భవనాలు, ఫర్నీచర్ మొదలైనవి లేదా కనిపించని ఆస్తులకు సంబంధించిన ఖాతాలు కావచ్చు.
ఉదా : గుడ్విల్, పేటెంటు హక్కులు మొ॥.
వాస్తవిక ఖాతాకు సంబంధించిన సూత్రము : “వచ్చే ఆస్తిని డెబిట్ చేయండి. పోయే ఆస్తిని క్రెడిట్ చేయండి”.

ప్రశ్న 8.
వ్యక్తిగత ఖాతాలు ఏవి ?
జవాబు.
వ్యాపార సంస్థ ఏఏ వ్యక్తులతో వ్యవహారాలు జరుపుతుందో లేదా సంస్థలతో వ్యవహారాలు జరుపుతుందో ఆ ఖాతాలను వ్యక్తిగత ఖాతాలు అంటారు. ఈ ఖాతాలు సాధారణముగా సహజ వ్యక్తులు.
ఉదా : రాముని ఖాతా, గోవింద్ ఖాతా లేదా న్యాయాత్మక లేదా కృత్రిమ వ్యక్తులు కావచ్చు.
ఉదా : స్టేట్ బ్యాంక్ ఖాతా, జీవిత బీమా సంస్థ ఖాతా మొదలైనవి.
వ్యక్తిగత ఖాతాలలో డెబిట్, క్రెడిట్ సూత్రాలు :
“పుచ్చుకునే వాని ఖాతాకు డెబిట్ చేయండి. ఇచ్చేవాని ఖాతాకు క్రెడిట్ చేయండి”. అనగా ప్రయోజనము పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి. ప్రయోజనము ఇచ్చిన వ్యక్తిని క్రెడిట్ చేయాలి.

ప్రశ్న 9.
నామమాత్రపు ఖాతాలు ఏవి ?
జవాబు.
నామమాత్రపు ఖాతాలు : వీటికి రూపము, చలనము ఉండదు. ఈ ఖాతాలు ఖర్చులు, నష్టాలు, లాభాలు, ఆదాయాలకు సంబంధించినవి.
ఉదా. : జీతాల ఖాతా, అద్దె ఖాతా, వచ్చిన డిస్కౌంట్ ఖాతా మొ||.
నామమాత్రపు ఖాతాలకు సంబంధించిన సూత్రము : “వ్యయాలను, నష్టాలను డెబిట్ చేయండి. ఆదాయాలను, లాభాలను క్రెడిట్ చేయండి.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 10.
వివిధ రకాల వ్యక్తిగత ఖాతాలను తెలుపండి.
జవాబు.
వ్యక్తిగత ఖాతాలు :
వ్యక్తిగత ఖాతాలు, సహజ వ్యక్తులకు గాని, కృత్రిమ వ్యక్తులకు గాని, ప్రాతినిధ్య వ్యక్తులకు గాని సంబంధించినవై ఉంటాయి.

a) సహజ వ్యక్తులు :
ఇవి సహజ మానవులకు సంబంధించినవి. ఉదాహరణకు రామ్, రమేష్, సురేష్, రాబర్టు, అక్బర్, లక్ష్మీ మొదలైనవి. వీరు సహజ వ్యక్తులు.

b) కృత్రిమ వ్యక్తులు :
ఇవి సంస్థలు, వ్యక్తుల సమూహానికి సంబంధించినవి. ఉదాహరణకు ఇన్ఫోసిస్ లిమిటెడ్, ఆంధ్రాబ్యాంకు, భారత జీవిత బీమా సంస్థ, లైయన్స్ క్లబ్, ఎల్ & టి లిమిటెడ్, విప్రో లిమిటెడ్ మొదలైనవి.

c) ప్రాతినిధ్య వ్యక్తులు :
ఇవి కూడా వ్యక్తిగత ఖాతాల స్వభావం కలిగి ఉంటాయి. ఉదాహరణకు, చెల్లించవలసిన (ఉద్యోగులకు) జీతాల ఖాతా, రావలసిన అద్దె (కౌలుదారు నుండి) ఖాతా, ముందుగా చెల్లించిన బీమా (బీమా కంపెనీకి) ఖాతా, మొదలైనవి. ఇవి వ్యక్తులకు గాని, వ్యక్తుల సమూహానికి గాని ప్రాతినిధ్యం వహిస్తాయి.
సూత్రం : పుచ్చుకునే వారి ఖాతాకు డెబిట్ చేయండి. ఇచ్చేవారి ఖాతాకు క్రెడిట్ చేయండి.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 11.
చిట్టా అంటే ఏమిటి ?
జవాబు.

  1. చిట్టా అంటే రోజు వారి వ్యవహారాలను నమోదు చేసే పుస్తకం.
  2. వ్యాపార వ్యవహారాలను విశ్లేషించి, అందులోగల ప్రయోజనాలను వర్గీకరించి, సరైన సూత్రాలను వర్తింపజేస్తూ, డెబిట్, క్రెడిట్ అంశాలను తెలుసుకొని, తేదీలవారీగా వాటిని రాసే పుస్తకాన్ని ‘చిట్టా’ అంటారు.
  3. వ్యాపార సంస్థకు సంబంధించిన వ్యవహారాలను మొదటగా ఈ పుస్తకములోనే నమోదు చేస్తారు. కాబట్టి చిట్టాను అసలైన పద్దు పుస్తకము లేదా తొలి పద్దు పుస్తకము అని కూడా వ్యవహరిస్తారు.

ప్రశ్న 12.
పద్దు అంటే ఏమిటి ?
జవాబు.
వ్యాపార వ్యవహారాలను విశ్లేషించి, ఖాతాలవారీగా వర్గీకరించి, డెబిట్, క్రెడిట్లుగా విభజించి తేదీలవారీగా చిట్టాలో రాసే ప్రక్రియను ‘పద్దు’ అంటారు.

ప్రశ్న 13.
చిట్టా పద్దు అంటే ఏమిటి ?
జవాబు.

  1. వ్యాపార వ్యవహారాలను విశ్లేషించి, ఖాతాలవారీగా వర్గీకరించి, డెబిట్, క్రెడిట్లుగా విభజించి తేదీలవారీగా చిట్టాలో రాసే ప్రక్రియను ‘పద్దు’ అంటారు.
  2. చిట్టాలో వ్రాసే వ్యవహారాలన్నీ పద్దుల రూపములో ఉంటాయి. అందువల్ల వీటిని “చిట్టాపద్దులు” అంటారు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 14.
ఆవర్జా అంటే ఏమిటి ?
జవాబు.

  1. వాస్తవిక ఖాతాను పరిశీలించినపుడు ఆస్తి యొక్క పుస్తకపు విలువను తెలుసుకోవచ్చు. నామమాత్రపు ఖాతాను చూసినప్పుడు ఏ మేరకు ఖర్చు చెల్లించారో తెలుస్తుంది. ఈ విధముగా వ్యక్తిగత, వాస్తవిక, నామమాత్రపు ఖాతాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను విడివిడిగా సంబంధిత ఖాతాలను ఏర్పాటు చేయడానికి పెట్టిన పుస్తకాన్ని ఆవర్జా అంటారు.
  2. ఖాతాలన్నింటిని సేకరించి నిర్వహించేదే. “ఆవర్జా”. దీనినే “మలిపద్దు పుస్తకం” అని కూడా అంటారు.

ప్రశ్న 15.
ఖాతాలో నమోదు అంటే ఏమిటి ?
జవాబు.
తొలిపద్దు పుస్తకములో నమోదు చేసిన వ్యవహారాలను ఆవర్జాలో వాటి సంబంధిత ఖాతాలలోకి బదిలీ చేసే ప్రక్రియను ఆవర్జాలో నమోదు చేయడం అంటారు. ఆవర్జా నమోదు ప్రతి దినము, వారానికి గాని, నెలకు గాని వ్యాపార సంస్థ సౌలభ్యం, అవసరాన్ని బట్టి చేస్తారు.

ప్రశ్న 16.
ఖాతా నిల్వ తేల్చటం అంటే ఏమిటి ?
జవాబు.
ఖాతాలో డెబిట్ మొత్తాలు క్రెడిట్ మొత్తాలకు గల వ్యత్యాసము తెలుసుకోవడాన్ని ఖాతా నిల్వలు తేల్చే ప్రక్రియ అంటారు. నమోదు అయిన తర్వాత డెబిట్ వైపున, క్రెడిట్ వైపున ఉన్న మొత్తాలలో ఎక్కువ మొత్తము నుంచి, తక్కువ మొత్తాన్ని తీసివేస్తే వచ్చే తేడాను తేల్చిన నిల్వగా గుర్తించి, తక్కువవైపు మొత్తము వరుసలో ఆ వ్యత్యాసాన్ని చూపాలి.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 17.
డెబిట్ నిల్వ అంటే ఏమిటి ?
జవాబు.
ఖాతాలో క్రెడిట్ వైపు ఉన్న మొత్తము కంటే, డెబిట్ వైపు మొత్తము ఎక్కువగా ఉంటే దానిని డెబిట్ నిల్వ అంటారు.

ప్రశ్న 18.
క్రెడిట్ నిల్వ అంటే ఏమిటి ?
జవాబు.
ఖాతాలో డెబిట్ వైపు ఉన్న మొత్తము కంటే, క్రెడిట్ వైపు మొత్తము ఎక్కువగా ఉంటే దానిని క్రెడిట్ నిల్వ అంటారు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

Problems:

ప్రశ్న 1.
అనిల్ కౌ 75,000 తో జనవరి 1, 2018న వ్యాపారం ప్రారంభించెను. జనవరి నెలకు అతని వ్యవహారాలు ఈ విధంగా ఉన్నాయి. చిట్టా పద్దులు రాయండి.

2018 జనవరి
జనవరి 02 నగదు అమ్మకాలు ₹ 10,000
జనవరి 05 నగదు కొనుగోళ్ళు ₹ 12,000
జనవరి 07 రహీమ్కు అరువుపై అమ్మిన సరుకు ₹ 20,000
జనవరి 08 నగదు అమ్మకాలు ₹ 20,000
జనవరి 09 వేతనాల చెల్లింపు ₹ 5,000
జనవరి 10 బ్యాంకులో జమచేసిన నగదు ₹ 8,000
జనవరి 13 మహేష్కు చెల్లించిన నగదు ₹ 6,000
జనవరి 15 యంత్రాలు నగదుకు కొనుగోలు ₹ 12,000
జనవరి 18 అనిత నుండి కొనుగోళ్ళు ₹ 5,000
జనవరి 20 రమ్య నుండి వసూలైన నగదు ₹ 3,000
జనవరి 22 చెల్లించిన కమీషన్ ₹ 1,500
జనవరి 24 తపాల, స్టేషనరీకి చెల్లింపు ₹ 500
జనవరి 27 సొంతవాడకాలకై బ్యాంకు నుండి తీసింది ₹ 7,000
జనవరి 30 వసూలైన అద్దె ₹ 1,200
జవాబు.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 7

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 8

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 2.
రామ్ పుస్తకాలలో అవసరమైన చిట్టా పద్దులు రాయండి.

2019 మార్చి
మార్చి 01 రామ్ ₹ 1,00,000 తో వ్యాపారం ప్రారంభించెను.
మార్చి 02 కెనరా బ్యాంకులో జమచేసిన నగదు ₹ 60,000
మార్చి 04 రమ నుండి కొనుగోళ్ళు ₹ 4,000
మార్చి 06 కంప్యూటర్ కొనుగోలు, చెక్కు ద్వారా చెల్లింపు ₹ 15,000
మార్చి 09 సొంత ఖర్చులకై రామ్ తీసుకున్న నగదు ₹ 5,000
మార్చి 13 ఫర్నీచర్ కొనుగోలు ₹ 10,000
మార్చి 15 రమకు వాపసు చేసిన సరుకులు ₹ 500
మార్చి 18 అమీర్ వాపస్ చేసిన సరుకులు ₹ 1,000
మార్చి 20 ప్రకటన ఖర్చులు ₹ 1,000
మార్చి 23 కెనరా బ్యాంకులో నగదు జమ ₹ 3,000
మార్చి 25 సొంత అవసరాలకై తీసుకొన్న సరుకు ₹ 2,000
మార్చి 27 రమేష్కు చెల్లించిన నగదు ₹ 3,900, వచ్చిన డిస్కౌంట్
మార్చి 28 రాము నుంచి వసూలైన నగదు ₹ 2,800 ఇచ్చిన డిస్కౌంట్
మార్చి 29 ఆఫీసు అవసరాలకు బ్యాంకు నుంచి తీసిన నగదు ₹ 6,000
మార్చి 31 చెక్కు ద్వారా చెల్లించిన జీతాలు ₹ 8,000
జవాబు.
రామ్ పుస్తకాలలో చిట్టాపద్దులు

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 10

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 11

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 3.
అక్బర్ పుస్తకాలలో క్రింద వ్యవహారాలకు చిట్టా పద్దులు రాయండి.

2019 మార్చి
మార్చి 01 అక్బర్ ₹ 50,000 తో వ్యాపారం ప్రారంభించాడు
మార్చి 02 నగదు అమ్మకాలు ₹ 30,000
మార్చి 04 నగదు కొనుగోళ్ళు ₹ 40,000
మార్చి 06 మహేష్కు అమ్మకాలు ₹ 35,000
మార్చి 09 రాధిక నుండి కొనుగోళ్ళు ₹ 25,000
మార్చి 11 స్వాతికి, నగదుకు అమ్మిన సరుకు ₹ 10,000
మార్చి 15 మహేష్ వాపసు చేసిన సరుకులు ₹ 5,000
మార్చి 18 వచ్చిన కమీషన్ ₹ 1,000
మార్చి 19 చెల్లించిన ఆఫీసు ఖర్చులు ₹ 500
మార్చి 20 ప్రమోద్కు చెల్లించిన నగదు ₹ 6,000
మార్చి 22 రాధికకు వాపసు చేసిన సరుకులు ₹ 2,000
మార్చి 25 సొంతవాడకానికై వాడుకున్న సరుకు ₹ 5,000
మార్చి 27 ఆనంద్ నుండి వచ్చిన నగదు 3800 ఇచ్చిన డిస్కౌంట్ ₹ 200
మార్చి 28 వసూలైన వడ్డీ ₹ 500
మార్చి 29 రామను చెల్లించిన నగదు ₹ 4,900 వచ్చిన డిస్కౌంట్ ₹ 100
మార్చి 31 చెల్లించిన కమీషన్ ₹ 300
సాధన.
అక్బర్ పుస్తకాలలో చిట్టాపద్దులు

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 13

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 14

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 4.
భగత్ పుస్తకాలలో చిట్టాపద్దులు రాయండి.

జనవరి 2019
జనవరి 01 భగత్ ₹ 40,000 నగదు, ₹ 10,000 ఫర్నీచరుతో వ్యాపారం ప్రారంభించాడు.
జనవరి 02 సుచిత్రకు అమ్మకాలు ₹ 20000
జనవరి 03 యంత్రాల కొనుగోలు ₹30000
జనవరి 05 చెల్లించిన అద్దె ₹5000
జనవరి 09 చెల్లించిన కరెంటు బిల్లు ₹ 1000
జనవరి 12 నగదు అమ్మకాలు ₹ 6000
జనవరి 15 నిఖిల్ నుంచి అరువుపై కొనుగోళ్ళు ₹ 10000
జనవరి 18 చెల్లించిన వేతనాలు ₹ 5000
జనవరి 21 చెక్కుద్వారా వసూలైన వడ్డీ ₹ 5000
జనవరి 25 చెల్లించిన ప్రకటన ఖర్చులు ₹ 3000

సాధన.
భగత్ పుస్తకాలలో చిట్టా పద్దులు

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 16

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 5.
దినేష్ పుస్తకాలలో కింది వ్యవహారాలకు చిట్టాపద్దులు రాయండి.

2019 ఏప్రిల్
ఏప్రిల్ 01 దినేష్ ₹ 50,000 తో వ్యాపారం ప్రారంభించాడు.
ఏప్రిల్ 02 నగదు అమ్మకాలు ₹ 10000
ఏప్రిల్ 04 నగదు కొనుగోళ్ళు ₹ 15000
ఏప్రిల్ 06 ప్లాంటు, యంత్రాల అమ్మకం ₹ 5000
ఏప్రిల్ 10 రహీమ్కు చెల్లించిన నగదు ₹ 3000
ఏప్రిల్ 14 చెల్లించిన జీతాలు ₹ 8000
సాధన.
దినేష్ పుస్తకాలలో చిట్టాపద్దులు

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 18

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 6.
ఆత్మారామ్ పుస్తకాలలో ఈ వ్యవహారాలకు చిట్టాపద్దులు రాయండి.

జనవరి 2019
జనవరి 01 ₹ 25,000 తో వ్యాపారం ప్రారంభించాడు.
జనవరి 03 కంప్యూటర్ కొనుగోలు ₹ 5000
జనవరి 06 నగదు కొనుగోళ్ళు ₹ 6000
జనవరి 07 మహేష్ నుండి అరువుపై కొనుగోళ్ళు ₹ 8000
జనవరి 10 కొనుగోళ్ళు, చెక్కుద్వారా చెల్లింపు ₹ 7000
జనవరి 12 నగదు అమ్మకాలు ₹ 10000
జనవరి 15 సరుకు అమ్మకాలు ₹ 15,000 ఇందులో ₹ 8,000
నగదుగా మిగిలిన చెక్కుద్వారా వచ్చినవి. ₹ 7000
సాధన.
ఆత్మారామ్ పుస్తకాలలో చిట్టాపద్దులు

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 20

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 7.
ఈ వ్యవహారాలను చిట్టాలో రాయండి.

మార్చి 2019
మార్చి 01 ఆంథోని, ₹ 13,000 నగదు ₹ 7,000 సరుకులతో వ్యాపారం ప్రారంభించాడు.
మార్చి 02 యంత్రం కొనుగోలు ₹ 5,000.
మార్చి 03 తపాల ఖర్చులు ₹ 500.
మార్చి 05 చెల్లించిన చిల్లర ఖర్చులు ₹ 500.
మార్చి 06 బ్యాంకులో జమ చేసిన నగదు ₹ 10,000.
మార్చి 07 చెల్లించిన జీతాలు ₹ 5,000.
మార్చి 09 ఆఫీసు అవసరాలకై బ్యాంకు నుండి తీసిన నగదు ₹ 1,200.
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 22

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 8.
సుధ పుస్తకాలలో చిట్టా పద్దులు రాయండి.

2019 ఏప్రిల్
ఏప్రిల్ 01 ₹ 90,000 మూలధనంతో వ్యాపారం ప్రారంభించాడు.
ఏప్రిల్ 01 తరుణ్ నుండి అరువుపై కొనుగోళ్ళు ₹ 20,000
ఏప్రిల్ 02 సోనుకు అమ్మకాలు ₹ 30,000
ఏప్రిల్ 03 రాఘవ నుండి నగదుకు కొనుగోళ్ళు ₹ 25,000
ఏప్రిల్ 04 టోనీకి అమ్మిన సరుకులు ₹ 16,000
ఏప్రిల్ 05 తరుణ్కు వాపసు చేసిన సరుకులు ₹ 5,000
ఏప్రిల్ 06 నగదుకు ఫర్నీచర్ కొనుగోలు ₹ 15,000
ఏప్రిల్ 18 సుదీప్కు అమ్మిన సరుకు ₹ 12,500
ఏప్రిల్ 19 సుదీప్ వాపసు చేసిన సరుకు ₹ 2,000
ఏప్రిల్ 25 సుదీప్ నుండి వచ్చిన నగదు ₹ 5,500
ఏప్రిల్ 28 సొంతానికై సుధ వాడుకున్న సరుకు ₹ 3,000
సాధన.
సుధ పుస్తకాలలో చిట్టాపద్దులు;

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 24

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 9.
క్రింది వ్యవహారాలను ప్రహ్లాద్ పుస్తకాలలో రాసి, ఆవర్జాలో నమోదు చేసి ఖాతాల నిల్వలు తేల్చండి.

ఫిబ్రవరి 2019
ఫిబ్రవరి 01 ప్రహ్లాద్ ఔ50,000 తో వ్యాపారం ప్రారంభించాడు. ₹ 6,000
ఫిబ్రవరి 02 బ్యాంకులో జమ చేసిన నగదు ₹ 2,000
ఫిబ్రవరి 05 ఫర్నీచర్ కొనుగోలు ₹ 5,000
ఫిబ్రవరి 07 నగదు కొనుగోళ్ళు ₹ 2,000
ఫిబ్రవరి 10 నగదు అమ్మకాలు ₹ 10,000
ఫిబ్రవరి 15 బ్యాంకు నుండి తీసిన నగదు ₹ 2,000
ఫిబ్రవరి 25 చెల్లించిన వడ్డీ ₹ 800
ఫిబ్రవరి 28 చెల్లించిన జీతాలు ₹ 8,000
సాధన.
ప్రహ్లాద్ పుస్తకాలలో చిట్టాపద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 26

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 27

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 28

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 10.
క్రింద సమాచారం నుండి పవన్ ఖాతాను తయారుచేయండి.

2018 మార్చి
మార్చి 1 పవన్ నుండి సరుకు కొనుగోళ్ళు ₹ 38,000
మార్చి 6 పవన్కు చెల్లించిన నగదు ₹ 5,000
మార్చి 10 పవన్ కు వాపసు చేసిన సరుకు ₹ 1,500
మార్చి 14 చెక్కు ద్వారా పవన్కు చెల్లింపు ₹ 6,800
మార్చి 20 పవన్ ఇచ్చిన డిస్కౌంట్ ₹ 500
మార్చి 26 పవన్ నుండి నగదుకు కొనుగోళ్ళు ₹ 2,500
మార్చి 28 పవన్ నుండి ఫర్నీచర్ కొనుగోలు ₹ 8,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 30

ప్రశ్న 11.
క్రింద సమాచారం నుండి సుధ ఖాతాను తయారుచేయండి.

ఫిబ్రవరి 2018
ఫిబ్రవరి 1 సుధ నుండి రావలసిన మొత్తం ₹ 8,000
ఫిబ్రవరి 4 సుధకు అమ్మిన సరుకు ₹ 11,000
ఫిబ్రవరి 12 సుధ వాపసు చేసిన సరుకులు ₹ 4,000
ఫిబ్రవరి 16 సుధ నుండి వచ్చిన నగదు₹ 3,000
ఫిబ్రవరి 22 సుధ నుండి వచ్చిన చెక్కు ₹ 6,000
ఫిబ్రవరి 28 సుధ ఖాతా 10% డిస్కౌంట్తో పరిష్కారమైంది.
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 32

గమనిక : డిస్కౌంట్ = 6000 × \(\frac{10}{100}\) = 600.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 12.
క్రింద సమాచారం నుండి స్వామి ఖాతాను తయారుచేయండి.

2018 జనవరి
జనవరి 2 స్వామికి చెల్లించవలసిన మొత్తం ₹ 12,000
జనవరి 8 స్వామి నుండి కొనుగోళ్ళు ₹ 16,000
జనవరి 15 స్వామికి వాపసు చేసిన సరుకులు ₹ 5,000
జనవరి 20 స్వామికి చెల్లించిన నగదు ₹ 16,000
జనవరి 24 స్వామి నుండి కొనుగోళ్ళు ₹ 9000
30 స్వామి ఖాతాను చెక్కు ద్వారా 10% డిస్కౌంట్ చెల్లించి పరిష్కరించడమైంది.
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 34

ప్రశ్న 13.
క్రింద సమాచారం నుండి యంత్రాల ఖాతాను తయారుచేయండి.

2018 మార్చి
మార్చి 1 విక్రమ్ కంపెనీ నుండి కొన్ని యంత్రాలు ₹ 42,000
మార్చి 6 విరాట్ నుండి కొన్న యంత్రాలు ₹ 16,000
మార్చి 12 ₹ 8,000 ఖరీదు గల యంత్రాన్ని ₹ 5,000 కు అమ్మడమైంది.
మార్చి 16 యంత్రాలపై ఏర్పాటు చేసిన తరుగుదల ₹ 3,000
మార్చి 22 స్వామి నుండి సరుకు కొనుగోళ్ళు ₹ 9,000
మార్చి 30 నగదుకు యంత్రాల కొనుగోలు ₹ 8,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 36

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 14.
క్రింద సమాచారం నుండి రాణి పుస్తకాలలో ఆవర్జాఖాతాలు తయారుచేయండి.

2018 జూన్
జూన్ 1 శివ నుండి వచ్చిన నగదు ₹ 75,000
జూన్ 4 నగదు కొనుగోళ్ళు ₹ 40,000
జూన్ 6 సురేష్కు అమ్మకాలు ₹ 40,000
జూన్ 12 ప్రవీణ్ నుండి కొనుగోళ్ళు ₹ 50,000
జూన్ 16 గణేష్కు అమ్మిన సరుకు ₹ 35,000
జూన్ 20 సొంతానికి వాడుకున్న నగదు ₹ 20,000
జూన్ 26 వచ్చిన కమీషన్ ₹ 2,000
జూన్ 30 చెల్లించిన అద్దె ₹ 5,000
జూన్ 30 చెల్లించిన జీతాలు ₹ 10,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 38

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 39

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 40

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 15.
31 మార్చి 2018 వరకు ప్రవీణ్ ఖాతాను తయారుచేయండి.

మార్చి 2018
మార్చి 7 ప్రవీణ్ నుండి రావలసినది ₹ 3,500
మార్చి 7 ప్రవీణ్ కు అమ్మిన సరుకు ₹ 1,500
మార్చి 10 ప్రవీణ్ నుండి కొనుగోళ్ళు ₹ 1,000
మార్చి 15 ప్రవీణ్కు చెల్లించిన నగదు ₹ 800
మార్చి 23 ప్రవీణ్ నుండి వచ్చిన నగదు ₹ 500
మార్చి 25 ప్రవీణ్ కు వాపసు చేసిన సరుకు ₹ 200
ప్రవీణ్ ఖాతాను 10% డిస్కౌంట్తో పరిష్కరించడమైంది.
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 42

గమనిక : డిస్కౌంట్ = 4500 × \(\frac{10}{100}\) = 450

ప్రశ్న 16.
క్రింద సమాచారం నుండి వంశీ ఖాతాను తయారుచేయండి.

ఆగస్టు 2018
ఆగస్టు 1 వంశీకి చెల్లించవలసిన మొత్తం ₹ 4,400
ఆగస్టు 5 వంశీ నుండి కొనుగోళ్ళు ₹ 1,500
ఆగస్టు 10 వంశీకి అమ్మిన సరుకులు ₹ 1,200
ఆగస్టు 13 వంశీ నుండి వచ్చిన చెక్కు ₹ 1,000
ఆగస్టు 17 వంశీకి చెల్లించిన నగదు ₹ 100
ఆగస్టు 23 వంశీ వాపసు చేసిన సరుకులు ₹ 200
ఆగస్టు 29 వంశీ నుండి కొనుగోళ్ళు ₹ 500
వంశీ ఖాతా 5% డిస్కౌంట్ తో పరిష్కారమైంది.
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 44

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 17.
క్రింద సమాచారం నుండి అనూరాధ ఖాతాను తయారుచేయండి.

2018 డిసెంబరు
డిసెంబరు 1 అనూరాధ నుండి రావలసిన మొత్తం ₹ 1,900
డిసెంబరు 9 అనూరాధకు అమ్మిన సరుకు ₹ 1,000
డిసెంబరు 12 అనూరాధ నుండి కొనుగోళ్ళు ₹ 700
డిసెంబరు 15 అనూరాధకు వాపసు చేసిన సరుకులు ₹ 200
డిసెంబరు 20 అనూరాధ వాపసు చేసిన సరుకులు ₹ 100
డిసెంబరు 25 అనూరాధ నుండి వచ్చిన చెక్కు ₹ 400
డిసెంబరు 28 అనూరాధకు చెల్లించిన నగదు ₹ 600
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 46

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

Textual Examples:

ప్రశ్న 1.
తేదీ 2019 మార్చి
1 గణేష్ ఔ 90,000 నగదుతో వ్యాపారము ప్రారంభించాడు.
2 ఆఫీసు కొరకై నగదుకు కంప్యూటర్ కొనుగోలు కౌ 10,000.
4 శంకర్ నుండి కొనుగోళ్ళు కౌ 8,000.
5 నరేషు నగదుకు అమ్మిన సరుకు 12,000.
8 సురేష్ నుండి నగదుకు కొన్న సరుకు 75,000.
9 మహేష్కు అరువుపై అమ్మిన సరుకు 15,000.
11 చెల్లించిన ముద్రణ ఖర్చులు కౌ 900.
13 శంకర్కు వాపసు చేసిన సరుకు 600.
14 నగదు అమ్మకాలు 18,000.
15 చెల్లించిన వేతనాలు { 3,000.
17 మహేష్ వాపసు చేసిన సరుకులు కౌ 2,000.
18 ఖాతాపై శంకర్కు చెల్లించినది 3,400.
20 ఖాతాపై మహేష్ నుండి వచ్చిన నగదు < 7,000.
23 చెల్లించిన అద్దె 1,500.
25 వసూలైన కమీషన్ కౌ 1,200.
28 చెల్లించిన జీతాలు 5,000.
30 గణేష్ (యజమాని) సొంతఖర్చులకు తీసుకున్న నగదు 1,000.
31 సొంత వాడకానికి తీసుకున్న సరుకులు 800.
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 47

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 48

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 49

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 2.
క్రింద వ్యవహారాలకు చిట్టా పద్దులు రాయండి.
తేదీ 2019 జనవరి
01 రామ్ ₹ 98,000 తో వ్యాపారం ప్రారంభించాడు.
02 స్టేట్ బ్యాంకులో జమచేసిన నగదు ₹ 50,000.
04 ఆఫీసు ఫర్నీచరు కొనుగోలు ₹ 10,000 బ్యాంకు నుండి చెల్లింపు.
05 అమర్ నుండి సరుకు కొనుగోళ్ళు ₹ 12,000.
07 రమేష్ నుండి నగదు కొనుగోళ్ళు ₹ 5,000.
08 నగదు అమ్మకాలు ₹ 11,000.
10 అక్బర్కు అమ్మిన సరుకు ₹ 10,000.
12 చెక్కు ద్వారా చెల్లించిన అద్దె ₹ 4,000.
14 ఖాతాపై అమర్కు చెల్లించిన నగదు ₹ 6,000.
15 అక్బరు వాపసు చేసిన సరుకులు ₹ 1,000.
16 అమర్కు వాపసు చేసిన సరుకులు ₹ 1,500.
18 ప్రకటనలకై చెల్లింపు ₹ 1,200.
19 అక్బర్ నుంచి వచ్చిన చెక్కు 3,000.
21 రాజు నుంచి తీసుకున్న అప్పు 9,000.
25 సరుకు కొనుగోళ్ళు ₹ 15,000, చెక్కు ద్వారా చెల్లింపు.
28 రామ్ బ్యాంకు నుండి సొంతవాడకాలు ₹ 1,500.
31 చెక్కు ద్వారా చెల్లించిన జీతాలు ₹ 12,000.
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 50

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 51

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 3.
క్రింద వ్యవహారాలకు చిట్టాపద్దులు రాయండి.
తేదీ 2019
జనవరి 05 రమేష్ నుండి వచ్చిన నగదు ₹ 2,800, ఇచ్చిన డిస్కౌంట్ కే 200.
జనవరి 10 మోహన్కు 8,500 చెల్లించి అతని బాకీ ₹ 9,000 పరిష్కరించడమైంది.
జనవరి 18 రహీమ్ అనే ఖాతాదారు నుండి ₹ 5,000 రావలసి ఉంది. అతను దివాలా తీయటం వల్ల తుది పరిష్కారంగా అతని ఆస్తి నుండి ₹ 3,000 మాత్రమే వసూలైనవి.
జనవరి 24 పెట్టుబడులపై వడ్డీ ₹ 1,200, చెక్కు ద్వారా వచ్చినవి. (మన బ్యాంకు కెనరా బ్యాంకు)
జనవరి 28 చెల్లించిన కమీషన్ ₹ 1,200.
జనవరి 30 అప్పుపై చెల్లించిన వడ్డీ ₹ 3,000.
సాధన.
చిట్టాపద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 52

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 4.
క్రింది వ్యవహారాలకు, చిట్టాపద్దులు రాసి, వాటి సంబంధిత ఖాతాలలో నమోదు చేయండి.
తేదీ 2019
జనవరి 05 రమేష్ ₹ 25,000 తో వ్యాపారం ప్రారంభించాడు.
జనవరి 10 ఫర్నీచర్ నగదుపై కొనుగోలు ₹ 10,000.
జనవరి 12 రావు నుండి అరువుపై సరుకు కొనుగోలు ₹ 8,000.
జనవరి 25 రామ్కు అరువుపై అమ్మిన సరుకు ₹ 12,000.
సాధన.
రమేష్ పుస్తకాలలో చిట్టాపద్దులు

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 53

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 54

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

ప్రశ్న 5.
క్రింద వ్యవహారాలకు చిట్టాపద్దులు రాసి, ఆవర్జాలో నమోదు చేసి, ఖాతాల నిల్వలను తేల్చండి.
తేదీ 2019
జనవరి 1 గణేష్ ₹ 40,000 తో వ్యాపారం ప్రారంభించాడు.
జనవరి 2 ఆఫీసుకై కంప్యూటర్ కొనుగోలు ₹ 5,000.
జనవరి 4 గోద్రెజ్ కంపెనీ నుండి కొన్న ఫర్నీచర్ ₹ 15,000.
జనవరి 5 శ్రీనివాస్ నుండి సరుకు కొనుగోళ్ళు ₹ 6,000.
జనవరి 7 నగదు అమ్మకాలు ₹ 8,000.
జనవరి 9 నగదు కొనుగోళ్ళు ₹ 2,000.
జనవరి 10 గోద్రెజ్ కంపెనీకి చెల్లించినది ₹ 15,000.
12 స్టేషనరీ కొనుగోలు ₹ 500.
13 వేతనాల చెల్లింపు 800.
15 నరేష్ నుండి సరుకు కొనుగోళ్ళు ₹ 10,000.
16 శ్రీనివాస్కు ఖాతాపై చెల్లింపు ₹ 4,000.
17 రమేష్కు సరుకు అమ్మకాలు ₹ 12,000.
18 వసూలైన అద్దె ₹ 1,800.
19 గణేష్ (యజమాని) సొంతవాడకాలకై తీసుకున్న నగదు ₹ 600.
20 శ్రీనివాస్కు వాపసు చేసిన సరుకు ₹ 700.
23 రమేష్ నుండి వచ్చిన నగదు ₹ 8,000.
25 ముద్రణకై చెల్లించినది ₹ 900.
27 రమేష్ వాపసు చేసిన సరుకులు ₹ 1,000.
28 చెల్లించిన జీతాలు ₹ 3,500.
29 సుందర్ నుండి కొనుగోలు చేసిన సరుకులు ₹ 4,000.
30 రవికి అమ్మిన సరుకులు ₹ 5,000.
సాధన.
గణేష్ మూలధనం ఖాతా

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 55

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 56

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 57

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 58

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 59

TS Board Inter First Year Accountancy Study Material Chapter 2 వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం

TS Inter 1st Year Accountancy Study Material 2nd Lesson వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం 60

TS Inter 1st Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

Telangana TSBIE TS Inter 1st Year Accountancy Study Material 1st Lesson బుక్ కీపింగ్ Textbook Questions and Answers.

TS Inter 1st Year Accountancy Study Material 1st Lesson బుక్ కీపింగ్

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వ్యవహారం అంటే ఏమిటి ?
జవాబు.

  1. వ్యవహారాలు అనేవి వ్యాపారంలో జరిగే కార్యకలాపాలు. ఇవి ద్రవ్యం కాని, వస్తువులు కాని, సేవలు కాని, ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ఖాతాల మధ్య జరిగే విలువ మార్పిడికి సంబంధించినవి.
  2. ఉదా : వస్తువుల కొనుగోలు, అమ్మకాలు, బ్యాంకు నుంచి ఋణం, జీతాలు చెల్లింపు, అద్దె చెల్లింపు, వచ్చిన కమీషన్.
  3. వ్యవహారాలు రెండు రకాలు. అవి నగదు వ్యవహారాలు, అరువు వ్యవహారాలు. ప్రతి వ్యవహారం వ్యాపార ఆర్థిక స్థితి గతులపై ప్రభావం చూపుతుంది.

ప్రశ్న 2.
బుక్ కీపింగ్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. సంస్థ ఆర్థిక వ్యాపార వ్యవహారములను ఒక నిర్దిష్టమైన క్రమపద్ధతిలో కాలానుక్రమముగా వ్రాసే ప్రక్రియను బుక్ కీపింగ్ అంటారు. ద్రవ్య సంబంధమైన వ్యాపార వ్యవహారాలు మాత్రమే గణకశాస్త్రము రికార్డు చేస్తుంది. అన్ని వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన శాశ్వతమైన రికార్డును రూపొందించడానికి బుక్ కీపింగ్ తోడ్పడుతుంది.
  2. R.N. కార్టర్ బుక్ కీపింగ్ను ఈ క్రింది విధముగా నిర్వచించారు.
    “ద్రవ్య లేదా ద్రవ్యముతో సమానమైన వ్యాపార వ్యవహారములను శాస్త్రీయ పద్ధతిలో వ్యాపారసంస్థ వ్రాసే ప్రక్రియ లేదా కళనే బుక్ కీపింగ్ అంటారు.”

TS Board Inter First Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

ప్రశ్న 3.
అకౌంటింగ్ను నిర్వచించండి.
జవాబు.

  1. రికార్డు చేసిన వ్యవహారాలను సంక్షిప్తపరచి, వర్గీకరణ చేసి, ఫలితాలను నివేదించటాన్ని అకౌంటింగ్ అనవచ్చు. వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి వ్యక్తులకు ఈ ఆర్థిక సమాచారము, నివేదికలు ఎంతో ఉపయోగపడతాయి.
  2. అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్ వారి నిర్వచనము ప్రకారము అకౌంటింగ్ అంటే “ఆర్థిక సమాచారాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని గుర్తించి, కొలిచి తెలియజేసే ప్రక్రియ”.
  3. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ సంస్థ అకౌంటింగ్ను ఈ విధంగా నిర్వచించినది “పూర్తిగా గాని, కొంతమేరకు గాని ఆర్థిక సంబంధమున్న వ్యవహారాలను శాస్త్రీయ పద్ధతిలో నమోదు చేసి, వర్గీకరించి, సంక్షిప్తపరచి, వ్యాపార నిర్వాహకులకు, యజమానులకు వాటి ఫలితాలను వివరించే కళే గణకశాస్త్రము”.

ప్రశ్న 4.
అకౌంటింగ్ వలయం అంటే ఏమిటి ?
జవాబు.
1. అకౌంటింగ్ వలయం అనేది వ్యాపార వ్యవహారములు నమోదు చేయడముతో ప్రారంభమై ఆర్థిక నివేదికలు తయారు చేయడముతో ముగిసే ప్రక్రియ. దీనినే “అకౌంటింగ్ చక్రం” అని కూడా అంటారు.

2. అకౌంటింగ్ వలయంలో ఈ క్రింది దశలు ఉంటాయి.

  1. చిట్టాలో నమోదు చేయడము
  2. ఆవర్జాలో నమోదు చేయడము
  3. ఖాతాల నిల్వలను తేల్చడం
  4. అంకణా తయారుచేయడము
  5. లాభనష్టాల ఖాతా తయారుచేయడము
  6. ఆస్తి – అప్పుల పట్టిక తయారుచేయడము.

TS Inter 1st Year Political Science Study Material 1st Lesson ప్రభుత్వం – రకాలు 1

TS Board Inter First Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

ప్రశ్న 5.
అకౌంటింగ్ ప్రమాణం అంటే ఏమిటి ?
జవాబు.

  1. అకౌంటింగ్ పద్ధతులు, ఆచరణలు నిర్దేశించే, ప్రమాణీకరించే సూత్రాన్ని “అకౌంటింగ్ ప్రమాణాలు” అంటారు.
  2. సాధారణముగా అంగీకరించిన గణక సూత్రాలు ఈ అకౌంటింగ్ ప్రమాణాలలో ఒక భాగము. వ్యాపార సంస్థ ఆర్థిక నివేదికలు అర్థవంతం కావడానికి, సమర్థవంతముగా తయారుచేయడానికి ఈ ప్రమాణాలు ఉపకరిస్తాయి.
  3. ప్రస్తుతం మన దేశంలో 35 ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నవి.

ప్రశ్న 6.
IFRS అంటే ఏమిటి ?
జవాబు.

  1. IFRS అనగా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్.
  2. అంతర్జాతీయ ఆర్థిక నివేదికల ప్రమాణాలను, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్, (IASB) మరియు IFRS ఫౌండేషన్లు జారీచేస్తాయి. ఇవి వ్యాపార వ్యవహారాలను సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాడే భాషలో పొందుపరుస్తారు. కాబట్టి, కంపెనీ ఖాతాలను ప్రపంచ వ్యాప్తంగా అర్థం చేసుకోవడానికి, పోల్చుకోవడానికి వీలవుతుంది.
  3. వివిధ దేశాలు క్రమంగా వాటి అకౌంటింగ్ ప్రమాణాల స్థానంలో IFRS ప్రమాణాలను అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం 160 దేశాలు ఈ IFRS ప్రమాణాలను అమలు చేస్తున్నాయి.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

ప్రశ్న 7.
సాధారణంగా ఆమోదించిన అకౌంటింగ్ సూత్రాలు (GAAP) అంటే ఏమిటి ?
జవాబు.

  1. అనుభవాలు, ఆచరణల నుంచి ఉద్భవించిన చర్యల ప్రవర్తనా నియమాలను “సాధారణంగా ఆమోదించిన అకౌంటింగ్ సూత్రాలు (GAAP)” గా చెప్పవచ్చు. ఇవి బహుళ జనాదరణ పొంది, ఉపయుక్తంగా ఉన్నప్పుడు ఇవే ఆమోదించిన అకౌంటింగ్ సూత్రాలుగా రూపుదిద్దుకొంటాయి.
  2. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ల ప్రకారం, ఏ సూత్రాలయితే బహుళజన ఆమోదం పొంది విరివిగా ఉపయోగిస్తారో అవి సాధారణంగా అంగీకరించిన సూత్రాలలో అంతర్భాగం అవుతాయి.
  3. సాధారణంగా ఆమోదించిన సూత్రాలు. ఉపయుక్తత, విశ్వసనీయత మరియు ఆచరణ యోగ్యతలపై ఆధారపడి ఉన్నవి.

ప్రశ్న 8.
అకౌంటింగ్ భావన అంటే ఏమిటి ?
జవాబు.

  1. అకౌంటింగ్ భావనలు అనేవి, అకౌంటింగ్కు అవసరమైన ప్రమేయాలు, షరతులు లేదా నియమాలకు సంబంధించినవి. వీటిపై ఆధారపడి అకౌంటింగ్ నిర్మితమైంది.
  2. వీటిని అకౌంటింగ్ సమాచారం ఉపయోగించే వ్యక్తులకు కావలసిన సమాచారం అందజేయుటకు అభివృద్ధి పరచడమైనది.
  3. వ్యాపార అస్థిత్వం, ద్వంద రూప, గతిశీల సంస్థ, ద్రవ్యకొలమాన, వ్యయ సముపార్జన, జతపరచే మొదలగునవి ముఖ్యమైన అకౌంటింగ్ భావనలు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

ప్రశ్న 9.
అకౌంటింగ్ సంప్రదాయం అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఆర్థిక నివేదికల / ఖాతాల తయారీకి మార్గం సుగమం చేసే ఆచారాలను లేదా పద్ధతులను “అకౌంటింగ్ సంప్రదాయాలు” అంటారు.
  2. వీటిని పాటించడం వల్ల ఆర్థిక నివేదికలు అర్థవంతంగా, స్పష్టంగా తయారవుతాయి.
  3. క్రింద ముఖ్యమైన నాలుగు అకౌంటింగ్ సంప్రదాయాలను తెలపడమైంది.

అవి :

  1. సమాచారాన్ని వెల్లడి చేసే సంప్రదాయం,
  2. విషయ ప్రాధాన్యత సంప్రదాయం,
  3. అనురూప (ఏకరూప) సంప్రదాయం,
  4. మితవాద సంప్రదాయం.

ప్రశ్న 10.
మితవాద సంప్రదాయం అంటే ఏమిటి ?
జవాబు.

  1. పరిస్థితి యొక్క ఉదాసీన దృక్పథాన్ని తీసుకోవడమే మితవాదము. అనిశ్చిత వాతావరణము నెలకొన్న పరిస్థితులలో రాబోయే నష్టాలన్నింటిని ఎదుర్కొనేందుకు జాగ్రత్తపడటమే ఈ సంప్రదాయ ఉద్దేశ్యము. అన్ని విపత్కర పరిస్థితులలోనూ వ్యాపారస్తుడు పదిలముగా ఉండటానికి ఈ సంప్రదాయము ఒక విషయాన్ని రూపొందించినది.
  2. ఈ సంప్రదాయం ప్రకారం, ఊహించిన లాభాలను చూపకుండా, సంభవించడానికి అవకాశం ఉన్న నష్టాలను పొందుపరచవచ్చు.
  3. దీని అర్థం, అన్ని సంభవించడానికి అవకాశం ఉన్న నష్టాలను పరిగణనలోకి తీసుకొని, అనుమానాస్పదంగా ఉన్న ఆదాయాలను వదిలివేసి, పుస్తకాలలో నమోదు చేయాలి.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

ప్రశ్న 11.
అనురూప సంప్రదాయం అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఈ సంప్రదాయము ప్రకారము గణక నియమాలు, ఆచరణ పద్ధతులు ప్రతి సంవత్సరము ఒకే రకముగా ఉండాలి. వాటిని మార్చకూడదు. ఆ విధముగా ఉంటేనే ఒక సంవత్సరము ఫలితాలు మరొక సంవత్సరము ఫలితాలతో పోల్చడానికి అవకాశము ఉంటుంది.
  2. ఉదా : వ్యాపార సంస్థ స్థిరాస్తులపై తరుగుదలను స్థిర వాయిదాల పద్ధతి లేదా తగ్గుతున్న నిల్వల పద్ధతి, ఏదైనా ఒక పద్ధతిలో మాత్రమే ప్రతి సంవత్సరము ఏర్పాటు చేయాలి. కాని సంవత్సరములో పద్ధతులు మార్చకూడదు. అదే విధముగా ముగింపు సరుకును విలువ కట్టడానికి FIFO లేదా LIFO పద్ధతిలో ఏదో ఒకటి మాత్రమే ప్రతి సంవత్సరము పాటించాలి.

ప్రశ్న 12.
వ్యాపార అస్థిత్వ భావన అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఈ భావన అత్యంత విశిష్టమైన, మౌలికమైన అకౌంటింగ్ భావన. ఈ భావన ప్రకారము వ్యాపార వ్యవహారములు నమోదు చేసేటప్పుడు వ్యాపార సంస్థ, యజమాని వేరువేరని భావించడం జరుగుతుంది.
  2. యజమానులు లేదా వాటాదారుల వ్యక్తిగత వ్యవహారములను వ్యాపార సంస్థ వ్యవహారాలనుంచి వేరు చేయడానికి ఈ భావన ఉపకరిస్తుంది. అంతేగాక వ్యాపార వ్యవహారములు వ్రాసేటప్పుడు సంస్థ దృష్ట్యా మాత్రమే పరిగణించడం జరుగుతుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

ప్రశ్న 13.
ద్రవ్య కొలమాన భావన అంటే ఏమిటి?
జవాబు.

  1. ఈ భావన ప్రకారము ద్రవ్యరూపములో వ్యక్తము చేయగల వ్యవహారాలను మాత్రమే నమోదు చేయాలి. ద్రవ్య రూపములో వ్యక్తం చేయడానికి వీలుకాని అంశాలను ఖాతా పుస్తకాలలో చూపకూడదు.
  2. ఆదాయ వసూళ్ళు, ఖర్చుల చెల్లింపులు, ఆస్తుల కొనుగోలు, అమ్మకం మొదలైన ద్రవ్యపరమైన వ్యవహారాలను ఖాతా పుస్తకాలలో నమోదు చేయాలి.
  3. యంత్రం పనిచేయకపోవడం, సిబ్బంది విధేయత మొదలైనవి చూపకూడదు. కారణము వీటిని ద్రవ్యరూపంలో కొలవలేము. యంత్రం మరమ్మత్తులు ద్రవ్యరూపములో కొలిచి, ద్రవ్య విలువ పుస్తకాలలో చూపాలి.

ప్రశ్న 14.
జతపరచే భావనను తెలపండి.
జవాబు.

  1. ఒక గణన కాలంలో ఆర్జించిన ఆదాయాలను వాటిని సంపాదించుటకు చేసిన వ్యయంతో అనుసంధానించి (జతపరిచి) సంస్థ లాభాలను కనుక్కోవడానికి ఉపయోగించేదే “జతపరచే భావన”.
  2. ఈ భావన ప్రకారం, ఆదాయాలను వాటి అనుబంధ ఖర్చులతోను, లేదా వ్యయాలను వాటి అనుబంధ ఆదాయాలతో సరిపోల్చి, ఒక నిర్దిష్ట కాలానికి, లాభాన్ని లెక్కిస్తారు.
  3. యజమానులకు సక్రమంగా చెందవలసిన ఖచ్చితమైన లాభాలను కనుక్కోవడానికి ఈ భావన ప్రాతిపదిక అవుతుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఏవేని 5 అకౌంటింగ్ వల్ల కలిగే లాభాలను తెలపండి.
జవాబు.
నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన సమాచారము తెలియజేయడానికి, వాటిని ఉపయోగించేవారి కోసం ఆ వ్యవహారములు, సంఘటనలను నమోదు చేసి, వర్గీకరించి, సంక్షిప్తపరిచే ప్రక్రియను అకౌంటింగ్ అంటారు.

అకౌంటింగ్ వలన లాభాలు :
1. శాశ్వతమైన విశ్వసనీయమైన నమోదు :
మానవ మేధస్సు గుర్తుంచుకోవడానికి సాధ్యము కాని అసంఖ్యాక వ్యాపార సంస్థ ఆర్థిక కార్యకలాపములు నమోదు చేసి అవసరమైన వ్యక్తులకు విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తుంది.

2. ఆర్థిక ఫలితాలు :
నిర్దిష్ట కాలములో సంస్థ ఆర్జించిన లాభము లేదా నష్టము కనుక్కోవడానికి అకౌంటింగ్ సహాయపడుతుంది.

3. ఆర్థిక పరిస్థితి :
కేవలము లాభనష్టాలను వెల్లడించడమే కాక, సంస్థ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. దీనివలన సంస్థలు తమ వనరుల ఆధారముగా భవిష్యత్ వ్యాపార ప్రణాళికలు తయారు చేసుకోవచ్చు.

4. సరిపోల్చుకోవడానికి :
సంస్థ కార్యకలాపాలు లేదా వస్తు ఉత్పాదనలో ఏవి లాభదాయకమైనవో తెలుస్తుంది. దీనివలన భవిష్యత్తులో ఏఏ కార్యకలాపాలు కొనసాగించాలి, ఏఏ వస్తువుల ఉత్పాదన జరపాలో తెలుసుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించిన లాభాలు, అమ్మకాలు, ఖర్చులు గత సంవత్సరం ఫలితాలతో పోల్చుకొని అవసరమైన సర్దుబాట్లు చేసుకోవచ్చు.

5. నియంత్రణ :
సంస్థలు వ్యాపార కార్యకలాపాలు కొనసాగించే క్రమములో సేకరించిన భూములు, భవనాలు, యంత్రాలు మొదలైన ఆస్తులు సమర్థవంతంగా నియంత్రించడానికి, వాటి సక్రమ వినియోగానికి సహాయపడుతుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

ప్రశ్న 2.
అకౌంటింగ్ పరిమితులను తెల్పండి.
జవాబు.
అకౌంటింగ్ పరిమితులు :

1. ద్రవ్య సంబంధ వ్యవహారాల నమోదు:
అకౌంటింగ్ కేవలం ద్రవ్య సంబంధమైన వ్యవహారాలను మాత్రమే నమోదు చేస్తుంది. ఇది గుణాత్మకమైన అంశాలు అయిన మానవ వనరులు, నైపుణ్యం, యాజమాన్య సామర్థ్యము మొదలైన వాటిని పరిగణలోకి తీసుకోవు.

2. చారిత్రాత్మక స్వభావము :
వ్యవహారము జరిగిన తేదీ నుంచి ఖాతా పుస్తకాలలో వ్రాయడం జరుగుతుంది. వ్యవహారాలకు సంబంధించిన భవిష్యత్ అంచనాలు, విలువలను రికార్డు చేయరు.

3. ధరల మార్పులు :
ధరల స్థాయిలో వచ్చే మార్పులు, ప్రస్తుత విలువలు ఆర్థిక ఖాతాలలో ప్రతిబింబించవు.

4. వాస్తవిక పరిస్థితులను తెలియజేయలేదు:
అకౌంటెంట్ పక్షపాత ధోరణి, సంస్థల వార్షిక ఖాతాలను ప్రభావితం చేయడానికి అవకాశమున్నది. అందువలన వాస్తవిక పనితీరును, ఆర్థిక పరిస్థితులను అంచనా వేయలేరు.

ప్రశ్న 3.
బుక్ కీపింగ్, అకౌంటింగ్ మధ్య గల ఏవేని 5 వ్యత్యాసాలను తెలపండి.
జవాబు.
బుక్ కీపింగ్, అకౌంటింగ్ మధ్య దిగువ వ్యత్యాసాలు ఉన్నవి.

తేడా గల అంశముబుక్ కీపింగ్అకౌంటింగ్
1. పరిధిఇది కేవలం వ్యాపార వ్యవహారాలను నమోదు నమోదు చేయడానికి సంబంధించిన ప్రక్రియ.నమోదు చేసిన వ్యవహారాలను వర్గీకరించి, విశ్లేషణ చేసి, ఆర్థిక ఫలితాలను వివరించే ప్రక్రియ.
2. ఉద్దేశ్యముసంస్థ వ్యవహారాలను నిర్దిష్టమైన క్రమ పద్ధతిలో నిర్వహించడం.సంస్థ లాభదాయకత, ఆర్థిక పరిస్థితిని తెలుసు కోవడము.
3. స్వభావమురోజువారీ జరిగే వ్యవహారాలతో సంబంధాలు కలిగి ఉంటుంది.ఫలితాలను పరిశీలించడం, విశ్లేషించడం మొదలైన ముఖ్య కార్యకలాపాలను కలిగి ఉంటుంది.
4. బాధ్యతవ్యాపార వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేయుట, నిర్వహించుట బుక్ కీపింగ్ వారి బాధ్యత.ఆర్థిక నివేదికలు తయారుచేయడము, నికర ఫలితాలను కనుక్కోవడం అకౌంటెంట్ బాధ్యత.
5. అజమాయిషీబుక్ కీపింగ్ ప్రక్రియలో అకౌంటింగ్ విధులను అజమాయిషీ, నియంత్రణ చేయడానికి అవకాశము ఉంటుంది.అకౌంటింగ్ బుక్ కీపింగ్ విధానాన్ని పరిశీలించి, నియంత్రణ చేసి, అజమాయిషీ చేయవచ్చును.
6. సిబ్బందిసాధారణ పరిజ్ఞానము ఉన్న సిబ్బందితో బుక్ కీపింగ్ నిర్వహించవచ్చు.అకౌంటింగ్ ప్రక్రియకు ఎక్కువ అనుభవము, పరిజ్ఞానము గల సిబ్బంది అవసరము.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

ప్రశ్న 4.
అకౌంటింగ్ ప్రక్రియలోని వివిధ దశలను తెలపండి.
జవాబు.
అకౌంటింగ్ ప్రక్రియలో వ్యాపార వ్యవహారాలను గుర్తించడము, నమోదు చేయడము, వర్గీకరించడము, సంక్షిప్త పరచడము, నివేదన, విశ్లేషణ, వివరణ ఇవ్వడం మొదలైన దశలుంటాయి.

1. గుర్తించడము :
సంబంధిత ఫలితాల ఆధారముగా వ్యాపార వ్యవహారాలను గుర్తించాలి.

2. నమోదు చేయడము :
వ్యాపార వ్యవహారాలు జరిగిన వెంటనే శాస్త్రీయముగా, ఒక క్రమపద్ధతిలో చిట్టా మరియు సహాయక చిట్టాలలో నమోదు చేయవలెను.

3. వర్గీకరించడము :
నమోదు చేసిన వ్యాపార వ్యవహారములను వర్గీకరించి, ఒకే స్వభావము కలిగిన వ్యవహారాలను ప్రత్యేక ఆవర్జాలో ఒకే శీర్షిక కింద చూపవలెను. ఖాతాల మొత్తాలను, నిల్వలను కనుగొనవలెను.

4. సంక్షిప్తపరచడం :
ఖాతాల నిల్వల ఆధారముగా అంకణాను తయారు చేయడం జరుగుతుంది.

5. నివేదించుట :
అంకణా సహాయముతో లాభనష్టాల ఖాతాను ఆస్తి – అప్పుల పట్టికను తయారుచేసి, ఆ ఆర్థిక నివేదికలను అవసరమైన వ్యక్తులకు అందజేయవలసి ఉంటుంది.

6. విశ్లేషణ :
లాభనష్టాల ఖాతా, ఆస్తి – అప్పుల పట్టికలోని వివిధ అంశాల మధ్య నెలకొని ఉన్న సంబంధాన్ని విశ్లేషణ చేయడము వలన వ్యాపార సంస్థ ఆర్థిక పటిష్టతను, లోపాలను తెలుసుకొనవచ్చును. ఈ సమాచారము భవిష్యత్తులో ఒక అంశాన్ని మరొక అంశముతో పోల్చడానికి పనికి వస్తుంది. అంతేగాక వ్యాపార సంస్థకు చెందిన వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది.

7. వివరణ :
యాజమాన్యము, నిర్వాహకులు నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా అకౌంటింగ్ సమాచారము విశ్లేషణ ద్వారా నెలకొల్పిన సంబంధాల అర్థాన్ని, ప్రాముఖ్యతను వివరించడం జరుగుతుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

ప్రశ్న 5.
అకౌంటింగ్ ధ్యేయాలు తెలపండి.
జవాబు.
ప్రధానమైన అకౌంటింగ్ ధ్యేయాలు కింద ఇవ్వబడినవి :

  1. వ్యాపార వ్యవహారాల పుస్తకాలను నిర్వహించడం.
  2. వ్యాపార కార్యకలాపాల ఫలితాలను తెలుసుకోవడం.
  3. ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడం.
  4. తెలుసుకున్న వ్యాపార ఫలితాలను, ఆర్థిక స్థితిగతులను వీటిని ఉపయోగించే వ్యక్తులకు అందజేయటం మొదలగునవి.

ప్రశ్న 6.
IFRS సాధారణ లక్షణాలను తెలపండి.
జవాబు.
IFRS సాధారణ లక్షణాలు :

  1. సరియైన నివేదికల సమర్పణ, IFRS లను పాటించడం.
  2. సంస్థ గతిశీల భావనను పాటించటం.
  3. సముపార్జన (accrual) ప్రాతిపదికన అకౌంట్స్ తయారు చేయటం.
  4. మెటీరియాలిటి (మెటీరియాలిటీ, ఎగ్రిగేషన్), ఏకీకరణ విషయాలు.
  5. ప్రత్యేక సందర్భాల్లో ‘రద్దు’ (Off setting) ను అనుమతించటం.
  6. నివేదికల మధ్య వ్యవధి.
  7. సమాచారాన్ని పోల్చటం.
  8. నివేదించటంలో ఏకరూపకత అనునవి ఇమిడి ఉన్నవి.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

ప్రశ్న 7.
ఏవేని 5 అకౌంటింగ్ భావనలను క్లుప్తంగా వివరించండి.
జవాబు.
సర్వసమ్మతమైన అకౌంటింగ్ శాస్త్రానికి మూలమైన అకౌంటింగ్ ప్రమేయాలను అకౌంటింగ్ భావనలు అంటారు. అకౌంటింగ్ శాస్త్రాన్ని ఆచరణలో పెట్టడానికి అవసరమైన ప్రమేయాలను, షరతులను లేదా సర్వసమ్మతాలను అకౌంటింగ్ భావనలుగా పరిగణించవచ్చును.

1. గతిశీల సంస్థ భావన :
ఈ భావన ప్రకారము వ్యాపార సంస్థ సముచితమైన లాభాలను ఆర్జిస్తూ సుదీర్ఘకాలము కొనసాగగలదని, సుదీర్ఘ భవిష్యత్తులో సంస్థను మూసివేయడం జరగదని ఆశించడం జరుగుతుంది. కాబట్టి వ్యవహారాలను గతిశీల సంస్థ భావనను దృష్టిలో పెట్టుకొని పుస్తకాలు వ్రాస్తారు.

ఈ భావన మూలముగానే వస్తు సరఫరాదారులు వస్తు సేవలను వ్యాపార సంస్థకు సరఫరా చేయడం, ఇతర సంస్థలతో వ్యాపార వ్యవహారాలు జరపడం జరుగుతుంది. ఆస్తి – అప్పుల పట్టికలో ఆస్తులను వసూలయ్యే విలువకు కాకుండా తగ్గింపు విలువకు చూపడం జరుగుతుంది.

2. వ్యయ భావన :
వ్యాపార సంస్థ తన కార్యకలాపాలను సమర్థవంతముగా నిర్వహించవలెనంటే పలు రకాల ఆస్తులను సేకరించవలసి ఉంటుంది. ఆస్తులను సేకరించడానికి యదార్థముగా చెల్లించిన మూల్యాన్ని వ్యయము అంటారు. వ్యయ భావన ప్రకారము ఆస్తులను, వాటి సేకరణ చెల్లించిన ధర ప్రకారము పుస్తకాలలో నమోదు చేయాలి.

3. ద్వంద రూప భావన :
ఈ భావన ప్రకారము వ్యవహారమునకు ఉన్న రెండు ప్రయోజనాలను అనగా పుచ్చుకొనే ప్రయోజనము, ఇచ్చే ప్రయోజనము ఖాతా పుస్తకాలలో వ్రాయడం జరుగుతుంది. ప్రతి వ్యవహారములో ప్రతి డెబిట్ విలువకు సమానమైన క్రెడిట్ విలువ, ప్రతి క్రెడిట్ విలువకు సమానమైన డెబిట్ విలువ ఉంటుంది. అకౌంటింగ్ సమీకరణము (ఆస్తులు = అప్పులు + మూలధనము) ఈ ద్వంద రూప భావనపై ఆధారపడి ఉన్నది.

4. గణకకాల భావన :
ఈ భావన ప్రకారము వ్యాపార సంస్థ ఆర్థిక స్థితిగతులు తెలుసుకొనడానికి అవసరమైన ఆర్థిక నివేదికలను నిర్దిష్ట కాలానికి ఒకేసారి తయారుచేయాలి. ఈ విధముగా తయారుచేసిన ఆర్థిక నివేదికలు సకాలములో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, అవసరమైన అభివృద్ధి వ్యూహరచనకు ఉపయోగపడతాయి. సాధారణముగా 12 నెలల కాలపరిమితిని అకౌంటింగ్ కాలము అంటారు. ప్రతి సంవత్సరము మార్చి లేదా డిసెంబరు చివరన ఖాతా పుస్తకాలు ముగిస్తారు.

5. జతపరిచే భావన :
ఈ భావన ప్రకారము ఒక అకౌంటింగ్ కాలములో ఆర్జించిన లాభాన్ని కనుక్కోవడానికి ఆ
కాలములో వచ్చిన రాబడిని, ఆ రాబడి పొందడానికి ఆ కాలములో చేసిన వ్యయాన్ని జతపరచాలి. యజమానులకు సక్రమముగా చెందాల్సిన ఖచ్చితమైన లాభాలను కనుక్కోవడానికి ఈ భావన ప్రాతిపదికగా ఉంటుంది.

6. వసూలు భావన :
ఈ భావన ప్రకారము లాభాన్ని వసూలు అయిన తర్వాతనే పుస్తకాలలో నమోదు చేయాలి. రాబడిని గుర్తించడానికి నగదు వసూలు కానవసరం లేదు. సంస్థ సేవలను అందించడం ద్వారా, వస్తువులను అమ్మకం చేయుట ద్వారా రాబడిని పొందడానికి వసూలు చేసుకోవడానికి న్యాయాత్మక హక్కు కలిగి ఉండాలి.

7. సంపాదన భావన :
అకౌంటింగ్ నగదు ప్రాతిపదిక క్రింద కేవలం ఆదాయాలు వసూలు అయినపుడు, ఖర్చులను చెల్లించినపుడు చూపాలి. కాని పెరుగుదల భావన ప్రకారం చెల్లించవలసిన ఖర్చులను, ముందుగా చెల్లించిన ఖర్చులు, రావలసిన ఆదాయాలు, ముందుగా వచ్చిన ఆదాయాలను కూడా ఖాతా పుస్తకాలలో ప్రత్యేకముగా చూపాలి.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

ప్రశ్న 8.
అకౌంటింగ్ సంప్రదాయాలను క్లుప్తంగా వివరించండి.
జవాబు.
అకౌంటింగ్ నివేదికలను తయారు చేయడంలో దీర్ఘ కాలము నుంచి ఉపయోగించి, అనుసరించి స్థాపించిన ఆచార సంప్రదాయాలను అకౌంటింగ్ సంప్రదాయాలు అంటారు. వీటిని పాటించడము ద్వారా ఆర్థిక నివేదికలు అర్థవంతంగా, స్పష్టంగా తయారవుతాయి.

ముఖ్యమైన అకౌంటింగ్ సంప్రదాయాలు :
1. సమాచారాన్ని వెల్లడిచేయాలనే సంప్రదాయము :
వ్యాపారముతో సంబంధమున్న వాటాదారులు, ఋణదాతలు, ప్రభుత్వం, కార్మికులు మొదలైనవారు సంస్థ ఫలితాలను గురించి ఆసక్తికరముగా చూస్తారు. వ్యాపార ఆస్తులను, అప్పులను, నికర ఫలితాలను ప్రకటించాలి. సంస్థకు సంబంధించిన వ్యక్తులు దేశములో నలుమూలలా వ్యాపించి ఉంటారు.

వ్యాపార కార్యకలాపాలను డైరెక్టర్ల బోర్డు నిర్వహిస్తుంది. వ్యాపార ఫలితాలను సక్రమమైన పద్ధతిలో సమర్పించ వలసిన బాధ్యత డైరెక్టర్లదే. వ్యాపార ఆస్తులు, అప్పులపై ప్రభావాన్ని చూపే ప్రతి సంఘటన బహిరంగపరచాలి.

2. విషయ ప్రాధాన్యత సంప్రదాయము :
ఆర్థిక ఖాతాలు నిర్వహిస్తున్నప్పుడు, నివేదికలు తయారు చేస్తున్నప్పుడు, వ్యవహారముల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొనవలెను. ప్రాధాన్యత గల విషయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ప్రాధాన్యత లేని విషయాలను విస్మరించవచ్చు. అనవసరమయిన చిల్లర విషయాలను చూపడం వలన ముఖ్యమైన విషయాలు మరుగునపడి, సమాచారము క్లిష్టతరము కావడం జరుగుతుంది.

3. అనురూప సంప్రదాయాలు :
ఈ సంప్రదాయము ప్రకారము గణక నియమాలు, ఆచరణ పద్ధతులు ప్రతి సంవత్సరము ఒకే రకముగా ఉండాలి. వాటిని మార్చకూడదు. ఆ విధముగా ఉంటేనే ఒక సంవత్సరము ఫలితాలను మరొక సంవత్సరము ఫలితాలతో పోల్చడానికి అవకాశము ఉంటుంది.

ఉదా : వ్యాపార సంస్థ స్థిరాస్థులపై తరుగుదలను, స్థిర వాయిదాల పద్ధతి లేదా తగ్గుతున్న నిల్వల పద్ధతుల్లో ఏదైనా ఒక పద్ధతిలో మాత్రమే ప్రతి సంవత్సరము ఏర్పాటు చేయాలి. కాని సంవత్సరములో పద్ధతులు మార్చకూడదు. అదే విధముగా ముగింపు సరుకు విలువ కట్టడానికి FIFO లేదా LIFO పద్ధతిలో ఏదో ఒకటి మాత్రమే ప్రతి సంవత్సరము పాటించాలి.

4. మితవాద సంప్రదాయము :
పరిస్థితి యొక్క ఉదాసీన దృక్పథాన్ని తీసుకోవడమే మితవాదము. అనిశ్చిత వాతావరణము నెలకొన్న పరిస్థితిలో రాబోయే నష్టాలన్నింటిని ఎదుర్కొనేందుకుగాను జాగ్రత్తపడటమే ఈ సంప్రదాయ ఉద్దేశ్యము. అన్ని విపత్కర పరిస్థితులలోను వ్యాపారస్తుడు పదిలముగా ఉండటానికి ఈ సంప్రదాయము ఒక విషయాన్ని రూపొందించినది.

ఈ నియమము లాభాలను ఊహించవద్దని కాని, అన్ని నష్టాలకు తగిన ఏర్పాటు చేయాలని చెబుతుంది. ముగింపు సరుకును విలువ కట్టేటప్పుడు కొన్న ధర లేదా మార్కెట్ ధర ఏది తక్కువైతే ఆ ధరకే విలువ కడతారు. ముగింపు సరుకు విలువ కట్టడములో మితవాద సూత్రము ప్రతిబింబిస్తుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

ప్రశ్న 9.
అకౌంటింగ్ ప్రమాణాలపై ఒక వ్యాఖ్య రాయండి.
జవాబు.

  1. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార సంస్థల ఖాతాల తయారీలో ఏకరూపత తీసుకురావడానికి 1973లో 7 దేశాల సభ్యులు కలిసి అంతర్జాతీయ గణక ప్రమాణాల సంస్థ “ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీ (IASC) ని స్థాపించారు.
  2. ఈ కమిటీ ఉద్దేశం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ఆడిట్ చేసిన ఆర్థిక నివేదికలను సమర్పించడంలో పాటించాల్సిన ప్రమాణాలను నిర్దేశిస్తూ, వాటిని ప్రపంచ వ్యాప్తంగా అంగీకరింపజేసి, అమలు చేయడానికి ప్రోత్సహించడం.
  3. వివిధ దేశాలలో పాటిస్తున్న అకౌంటింగ్ విధానాలలోని వ్యత్యాసాలను తొలగించుటకై పనిచేస్తుంది.
  4. మన దేశంలో “ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా” (ICAI) 1977వ సంవత్సరంలో “అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్” (ASB) ని స్థాపించింది.
  5. ఈ ASB కు అకౌంటింగ్ ప్రమాణాలను రూపొందించి, జారీ చేయడానికి కావల్సిన అధికారాన్ని ఇవ్వడమైంది. ఇది జారీ చేసిన అకౌంటింగ్ ప్రమాణాలను దేశంలోని అన్ని వ్యాపార సంస్థలు విధిగా పాటించాలి.
  6. అకౌంటింగ్ పద్ధతులు, ఆచరణలు నిర్దేశించి ప్రమాణీకరించే సూత్రాన్ని “అకౌంటింగ్ ప్రమాణాలు” అంటారు. సాధారణంగా అంగీకరించిన గణక సూత్రాలు ఈ అకౌంటింగ్ ప్రమాణాలలో ఒక భాగము.
  7. ప్రస్తుతం మన దేశంలో 35 ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నవి. వ్యాపార సంస్థ ఆర్థిక నివేదికలు అర్థవంతం కావడానికి, సమర్థవంతంగా తయారు చేయడానికి ఈ ప్రమాణాలు ఉపకరిస్తాయి.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

అదనపు ప్రశ్నలు:

ప్రశ్న 1.
జంటపద్దు విధానాన్ని నిర్వచించి, ముఖ్య లక్షణాలను వివరించండి.
జవాబు.
1. వ్యాపార సంస్థలో ప్రతిరోజు అనేక వ్యాపార వ్యవహారాలు రికార్డు చేయాల్సి ఉంటుంది. ప్రతి వ్యవహారంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ‘వచ్చిన అంశం’ లేదా ‘ఖర్చు / నష్టం అంశం’, దీన్నే డెబిట్ అంశం అంటారు. రెండవది ‘ఇచ్చిన అంశాన్ని’ ‘క్రెడిట్ అంశం’ అని వ్యవహరిస్తారు. జంటపద్దు విధానానికి ఈ రెండు అంశాలే మూలాధారం. వ్యాపార వ్యవహారాల్లో ఇచ్చి, పుచ్చుకునే 2 అంశాలను పుస్తకాలలో నమోదు చేసే పద్ధతిని జంటపద్దు విధానం అంటారు.

2. ప్రతి వ్యాపార వ్యవహారములో 2 విభిన్న అంశములుంటాయి. అవి :

  1. ప్రయోజనాన్ని పొందే అంశము.
  2. ప్రయోజనాన్ని ఇచ్చే అంశము.

ఈ రెండు అంశాలు రెండు వేర్వేరు ఖాతాలకు సంబంధించి ఉంటాయి. కాబట్టి ఒక వ్యవహారానికి చెందిన రెండు అంశాలు రెండు ఖాతాలలో విరుద్ధముగా వ్రాయవలసి ఉంటుంది. గణక శాస్త్రములో పుచ్చుకునే ప్రయోజనాన్ని సూచించడానికి ‘డెబిట్’ అనే పదాన్ని, ఇచ్చే ప్రయోజనాన్ని సూచించడానికి ‘క్రెడిట్’ అనే పదాన్ని వాడతారు.

ఉదా : నగదుకు సరుకులు కొన్నట్లయితే సరుకులు సంస్థలోకి వస్తాయి. నగదు సంస్థ నుంచి పోతుంది. అనగా సరుకుల ఖాతా ప్రయోజనాన్ని పొందుతుంది. నగదు ఖాతా ప్రయోజనాన్ని ఇస్తుంది. అదే విధముగా జీతాలు చెల్లిస్తే, జీతాల ఖాతా ప్రయోజనాన్ని పుచ్చుకోవడం నగదు ఖాతా ప్రయోజనాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యాపార వ్యవహారము జరిగినపుడు అది మార్పును కలిగించే రెండు అంశాలను రెండు వేర్వేరు ఖాతాలలో వ్రాయడాన్ని ‘జంటపద్దు విధానము’ అంటారు.

జంటపద్దు విధానము – ముఖ్య లక్షణాలు :

  1. వ్యాపార వ్యవహారము రెండు ఖాతాలను ప్రభావితం చేస్తాయి.
  2. రెండు అంశాలను డెబిట్, క్రెడిట్గా వ్యవహరిస్తారు.
  3. గణక భావనలు, సంప్రదాయాలు, సూత్రాల ఆధారముగా జంటపద్దు విధానములో లెక్కలను వ్రాయడం జరుగుతుంది.
  4. ఈ విధానము గణక ఖచ్చితాన్ని నిరూపించడానికి, అంకణా తయారు చేయడానికి దోహదం చేస్తుంది.
  5. అంకణా సహాయముతో వ్యాపార సంస్థ ముగింపు లెక్కలను తయారు చేస్తుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

ప్రశ్న 2.
జంటపద్దు విధానంలోని ప్రయోజనాలు వివరించండి.
జవాబు.
జంటపద్దు విధానము అవలంబించుట ద్వారా దిగువ ప్రయోజనాలు కలుగుతాయి.

1. వ్యవహారాల సంపూర్ణ నమోదు :
జంటపద్దు విధానములో వ్యవహారములోని రెండు అంశాలను రెండు విభిన్న ఖాతాలలో నమోదు చేస్తారు. కాబట్టి లెక్కలు వ్రాయడములో సంపూర్ణత చేకూరుతుంది.

2. శాస్త్రీయ పద్ధతి :
ఈ విధానములో వ్యాపార వ్యవహారాలను గణకసూత్రాలు అనుసరించి వ్రాయటం జరుగుతుంది. కాబట్టి అకౌంటింగ్ ధ్యేయము నెరవేరుతుంది.

3. అంకగణితపు ఖచ్చితము :
ఈ పద్ధతిలో ఖాతాల నిల్వలతో అంకణాను తయారు చేస్తారు. ఇది అంకగణితపు ఖచ్చితాన్ని ఋజువు చేస్తుంది.

4. దోషాలను కనుగొని నివారించవచ్చు :
అంకణాలో డెబిట్, క్రెడిట్ నిల్వలు సమానము కాకపోతే, లెక్కలు వ్రాయడంలో దోషాలు జరిగినవని భావించవచ్చు. వాటిని సరిచేసి, నివారించడానికి చర్యలు తీసుకోవచ్చు.

5. వ్యాపార ఫలితాలు :
లాభనష్టాల ఖాతాను తయారుచేయుట ద్వారా వ్యాపార నికర ఫలితాన్ని కనుగొనవచ్చును.

6. ఆర్థిక స్థితి :
సంవత్సరాంతాన ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయుట ద్వారా సంస్థ ఆర్థిక స్థితిగతులను కనుక్కోవచ్చు.

7. నియంత్రణ :
అన్ని ఖాతాలు సక్రమముగా నిర్వహించుట ద్వారా యజమానికి వ్యాపార వ్యవహారాలపై నియంత్రణ ఉంటుంది.

8. ఫలితాలను పోల్చడం :
వ్యాపార సంస్థ ప్రస్తుత ఆర్థిక ఫలితాలను గత సంవత్సరం ఫలితాలతో లేదా ఇతర సంస్థల ఫలితాలతో పోల్చి, సాధించిన ప్రగతిని కనుగొనవచ్చు.

9. నిర్ణయాలు :
జంటపద్దు విధానము ద్వారా యజమానులు సకాలములో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్థిక సమాచారము తోడ్పడుతుంది.

10. నమ్మదగిన సమాచారము :
ఈ పద్దతి వ్యాపారస్తులకు నమ్మదగిన సమాచారాన్ని అందజేస్తుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 1 బుక్ కీపింగ్

ప్రశ్న 3.
జంటపద్దు విధానం (లేదా) జంటపద్దు బుక్ కీపింగ్ విధానం.
జవాబు.

  1. జంటపద్దు విధానాన్ని ఇటలీ దేశస్తుడు “లుకాస్ పాసియోలి” ప్రవేశపెట్టాడు. ప్రతి వ్యాపార వ్యవహారములో రెండు అంశాలు రెండు ఖాతాలను ప్రభావితం చేస్తాయి. వ్యాపార వ్యవహారములలో వచ్చే అంశాన్ని, ఇచ్చే అంశాన్ని నమోదు చేసే విధానము జంటపద్దు విధానము.
  2. ఈ విధానము డెబిట్, కెడ్రిట్ అంశాలను రికార్డు చేస్తుంది. ప్రతి డెబిట్క, క్రెడిట్ ఉంటుంది. ప్రతి క్రెడిటు డెబిట్ ఉంటుంది. డెబిట్ మొత్తము క్రెడిట్ మొత్తముతో సమానముగా ఉండటమే జంటపద్దు విధానపు ముఖ్య లక్షణము.
  3. వ్యాపార వ్యవహారాల్లో ఇచ్చి, పుచ్చుకునే రెండు అంశాలను పుస్తకాల్లో నమోదు చేసే పద్ధతిని జంటపద్దు విధానం అంటారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 8th Lesson అంతర్జాతీయ వర్తకం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 8th Lesson అంతర్జాతీయ వర్తకం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అంతర్జాతీయ వర్తకం అంటే ఏమిటి ? ఇది ఏ విధంగా అంతర్గత వర్తకంతో విభేదిస్తుంది?
జవాబు.
అంతర్జాతీయ వర్తకం:

  1. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల వర్తకుల మధ్య కొనుగోలు, అమ్మకం జరగడాన్ని అంతర్జాతీయ వర్తకం అంటారు.
  2. అంతర్జాతీయ వర్తకాన్ని ‘విదేశీ వర్తకం’ లేదా ‘బహిర్గత వర్తకం’ అని కూడా అంటారు.

స్వదేశీ వర్తకానికి, విదేశీ వర్తకానికి మధ్యగల తేడా:
విదేశీ వర్తకం లేదా అంతర్జాతీయ వర్తకం, స్వదేశీ వర్తకం లేదా గృహ సంబంధ వర్తకం నుంచి ఏ ప్రకారంగా విభేదిస్తుందో కింద వివరించబడినది.
స్వదేశీ వర్తకం

  1. దేశంలో జరిగే వర్తకాన్ని సూచిస్తుంది.
  2. ఎలాంటి నాణేల మారకంతో సంబంధం ఉండదు
  3. ఎలాంటి ఆంక్షలు ఉండవు.
  4. డిమాండు, సప్లయి శక్తుల ప్రభావానికి అవకాశం ఉంటుంది.
  5. రవాణా వ్యయం, నష్ట భయాలు తక్కువగా ఉంటాయి.
  6. ఇది ఒక దేశంలో ప్రత్యేకీకరణ ప్రయోజనాలను పొందడానికి సహాయపడుతుంది.
  7. వస్తువుల గమనం అంతర్గత రవాణా అభివృద్ధి ప్రత్యేకించి రోడ్డు, రైల్వే రవాణా మార్గాలపై ఆధారపడి ఉంటుంది.
  8. వస్తువుల ఉత్పత్తి జరిగిన కేంద్రాల నుంచి, స్వదేశంలో అవి వినియోగించే కేంద్రాల వరకు తరలించడానికి దోహదపడుతుంది.
  9. వర్తకం యొక్క పరిమాణం జనాభా మొత్తం, ఉత్పత్తి మొత్తం, బ్యాంకింగ్ అభివృద్ధి లాంటి ఇతర మద్దతునిచ్చే సౌకర్యాలపై కూడా ఆధారపడి ఉంటుంది.

విదేశీ వర్తకం

  1. ఇతర దేశాలతో జరిపే వర్తకాన్ని సూచిస్తుంది.
  2. నాణేల మారకంతో సంబంధం ఉంటుంది.
  3. ఇది అనేక ఆంక్షలకు లోబడి ఉంటుంది.
  4. డిమాండు, సప్లయి శక్తుల ప్రభావానికి అవకాశం పరిమితంగా ఉంటుంది.
  5. రవాణా వ్యయం, నష్ట భయాలు ఎక్కువగా ఉంటాయి.
  6. ఇది వర్తకం చేసే అన్ని దేశాలు ప్రత్యేకీకరణ ప్రయోజనాలను పొందడానికి దోహదపడుతుంది.
  7. వస్తువుల గమనం సాధారణంగా రోడ్డు రవాణా, రైల్వే రవాణా, వాయు రవాణా, నీటి రవాణా లాంటి అనేక సౌకర్యాల ద్వారా జరుగుతుంది.
  8. ఇది వివిధ దేశాలకు, ఒక నిర్దిష్టమైన వస్తుశ్రేణి తయారీలో, ప్రత్యేకతను సాధించడానికి, తరువాత, ఆ వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా విక్రయించడానికి దోహదపడుతుంది.
  9. వస్తువులు స్వేచ్ఛగా ప్రవేశించడంపై ఆంక్షలు విధించబడినవి. వస్తుసేవలపై పన్నులు, సుంకాలను చెల్లించవలసి ఉంటుంది. పైన పేర్కొన్న అంశాలపై (కారకాలపై) వర్తక పరిమాణం ఆధారపడి ఉంటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

ప్రశ్న 2.
అంతర్జాతీయ వర్తకం పరిధిని, ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు.
అంతర్జాతీయ వర్తకం పరిధి: అంతర్జాతీయ వర్తకం పరిధి చాలా విస్తృతమైనది. క్రింది అంశాలు అంతర్జాతీయ వర్తకపు పరిథిలోకి వస్తాయి.

  1. అంతర్జాతీయ ఆర్థిక విషయాలు, వర్తక సిద్ధాంతాలు.
  2. విదేశీ వర్తకానికి పరిమాణాత్మక విధానాలు.
  3. అంతర్జాతీయ వ్యాపార సందేశాలివ్వడం, ప్రజా సంబంధాలు ఏర్పరుచుకోవటం.
  4. విదేశీ వర్తకంలో అంతర్జాల ఉపయోగం.
  5. విదేశీ వర్తకంలో బీమా, నష్టభయ నిర్వహణ.
  6. అంతర్జాతీయ మార్కెటింగ్ నిర్వహణ, వినియోగదారులు ప్రవర్తన.
  7. అంతర్జాతీయ మానవ వనరుల నిర్వహణ, వ్యవస్థా ప్రవర్తన.
  8. అంతర్జాతీయ వ్యాపార చట్టాలు.
  9. ఎగుమతి, దిగుమతి విత్తం.
  10. విదేశీ మారకం, మారకం, నియంత్రణ.
  11. ఎగుమతి ప్రోత్సాహకాలు.
  12. ఎగుమతి ధరల నిర్ణయం.

అంతర్జాతీయ ప్రాముఖ్యత:
1) ప్రపంచంలోని ఏ దేశం కూడా స్వయం సమృద్ధితో ఉండదు. ఏ దేశమూ తనకవసరమయ్యే వస్తువులను ఉత్పత్తి చేయదు. ఏ దేశం కూడా ఆర్థిక ఏకాంతత్వంలో జీవించడం, ఒకదేశం మరొక దేశంపై ఆధారపడి ఉండే ఈ పరిస్థితి అంతర్జాతీయ వర్తక ఆవశ్యకతను కల్పించింది.

2) కొన్ని దేశాలు, కొన్ని రకాలైన వస్తువులను, ఆధా పూర్వకంగా పెద్ద మొత్తంలో, ఉత్పత్తి చేయడానికి అధిక యోగ్యమైనవిగా పేర్కొనబడినవి. అలాంటి దేశం తన మిగులు ఉత్పత్తిని ఇతర దేశాలకు విక్రయిస్తుంది, అదే విధంగా ఆయా దేశాల నుంచి తనకు అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేస్తుంది. ఈ ప్రకారంగా, ప్రపంచంలోని అన్ని దేశాలు, తమ అవసరాలను తీర్చుకోవడానికి ఒకదానిపై మరొకటి ఆధారపడవలసి ఉంటుంది.

3) మన ఆధునిక వాణిజ్య ప్రపంచానికి అంతర్జాతీయ వర్తకం ఒక వెన్నెముక లాంటిది. అంతర్జాతీయ వర్తకం, ప్రజల మానసిక దృక్పథాన్ని విస్తృతపరుస్తుంది. ఇది జాతీయ పరిశీలనలకు సంకుచిత దృష్టికి మాత్రమే పరిమితం కాకుండా, దాన్ని అధిగమించి ఆలోచించేటట్లు ప్రోత్సహిస్తుంది.

4) అంతర్జాతీయ వర్తకం, ఆలోచనల బదిలీని, సంస్కృతిని, ప్రపంచ శాంతిని, అంతర్జాతీయ అవగాహనను పెంపొందిస్తుంది.

5) విదేశీ వర్తకం ద్వారా ఒక వర్తకుడు తన వస్తువులను తనకిష్టమైన ఏ దేశంలోనైనా విక్రయించవచ్చు.

6) అంతర్జాతీయ వర్తకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వస్తుసేవలను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

7) ప్రభుత్వాల ప్రపంచీకరణ, స్వేచ్ఛాయుత వర్తక పథకాలు ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయ వర్తకానికి ప్రత్యేక సంబంధాన్ని కలిగించాయి.

ప్రశ్న 3.
అంతర్జాతీయ వర్తకం ప్రయోజనాలను చర్చించండి.
జవాబు.
అంతర్జాతీయ వర్తకం వల్ల కలిగే ప్రయోజనాలు క్రింద చర్చించబడినవి:

  1. ఇది అందుబాటులో ఉన్న వనరులను చక్కగా వినియోగించడానికి దారితీస్తుంది.
  2. ఇది వనరుల వృథాను తగ్గిస్తుంది.
  3. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలను సమానం చేస్తుంది. విస్తృతమైన హెచ్చు తగ్గులను తొలగిస్తుంది.
  4. ఇది మిగులుగా ఉన్న వస్తువులను ఇతర దేశాలకు వాటిని అమ్మడానికి, అలాగే కొరతగా ఉన్న వస్తువులను ఇతర దేశాల నుంచి కొనడానికి సహాయపడుతుంది.
  5. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు, తమ ఉత్పత్తులను ఎగుమతులు చేయడానికి బదులుగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.
  6. ఇది వివిధ దేశాలకు చెందిన ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాన్ని సృష్టిస్తుంది. తద్వారా సాంస్కృతిక వికాసానికి, అంతర్జాతీయ శాంతికి దోహదపడుతుంది.
  7. ఇది అంతర్జాతీయ శ్రమ విభజన, ప్రత్యేకీకరణ సాధిస్తుంది.
  8. ఇది ప్రజల ఆదాయాలలో పెరుగుదలకు దారితీస్తుంది. తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.
  9. ఇది ఉద్యోగిత అవకాశాలను పెంచి, విదేశీ మారకపు రిజర్వులను అధికం చేస్తుంది.
  10. ఇది పేదరికం, అల్ప ఉద్యోగిత, మాంద్యంలాంటి ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుంది. ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచుతుంది.
  11. ఇది ఆరోగ్యకరమైన పోటీని కల్పిస్తుంది.

ప్రశ్న 4.
ఎగుమతి వర్తకంలో పాటించాల్సిన విధాన క్రమాలను వివరించండి.
జవాబు.
భారతదేశంలో ఉన్న ఎగుమతి నియంత్రణ నిబంధనల ప్రకారం, ఒక ఎగుమతి వ్యవహారం అమలు కింద పేర్కొన్న దశలవారీగా జరుగుతుంది.
1) వస్తు విచారణలు, వస్తు ప్రకటనలు:
1) కొనుగోలుదార్ల వద్ద నుంచి వస్తు విచారణ పత్రం స్వీకరించగానే, ఎగుమతి వర్తకం ప్రారంభమవుతుంది. వస్తుధరను, ఇతర సేవల సమాచారాన్ని కోరుతూ, అతని వద్ద నుంచి వచ్చిన రాతపూర్వక విజ్ఞప్తిని ఒక ‘వస్తు విచారణ’గా చెప్పవచ్చు..

2) అలాంటి విచారణలకు ఇచ్చే సమాధానాన్ని ‘వస్తు ప్రకటనలు’గా చెప్పవచ్చు. వస్తు ప్రకటనల్లో, విచారణలో కోరిన వివరాలన్నింటిని సమకూర్చాలి. వస్తుధర, కాలం, బట్వాడా చేసే పద్ధతి, ప్యాకింగ్ చేసే పద్ధతులను వాటిలో పేర్కొంటారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

2) ఆర్డర్లు లేదా ఇండెంట్లు:
1) వస్తు ప్రకటనలలో (కొటేషన్లలో) సప్లయి చేసిన వివరాలతో కొనుగోలుదారుడు సంతృప్తి చెందితే, అతడు వస్తువులకు ఆర్డరు వేస్తాడు. ఒక విదేశీ కొనుగోలుదారుడు, వస్తువులను కొనుగోలు చేసే నిమిత్తం చేసిన ప్రతిపాదనను ‘ఇండెంట్’ అంటారు.

2) ఇండెంట్ను ఎగుమతిదారుడు ఆమోదిస్తే, అప్పుడది ఒక ‘ఆర్డరు’ అవుతుంది. ఇండెంటులో అవసరమైన వస్తు వివరాలన్నింటితోపాటు, రవాణా, ప్యాకింగ్ మొదలైన వాటికి సంబంధించిన వివిధ రకాలైన ఇతర సూచనలు కూడా ఉంటాయి.

3) లైసెన్సును సంపాదించడం:
1) భారతదేశం నుంచి వస్తువుల ఎగుమతి, “దిగుమతి మరియు ఎగుమతి నియంత్రణ’ చట్టం కింద జరుగుతుంది. నియంత్రణలో ఉన్న వస్తువులను, ఎగుమతి లైసెన్సు లేకుండా, ఎగుమతి చేయకూడదు.

2) కొన్ని వస్తువులను ‘బహిరంగ సాధారణ లైసెన్సు జాబితా’లో ఉంచుతారు. వస్తువులు బహిరంగ సాధారణ లైసెన్స్ జాబితాలో లేకపోతే, అప్పుడు అతడు ఒక సముచిత (తగిన) అధికారికి నిర్ణీత రుసుం చెల్లించడం ద్వారా ఎగుమతి లైసెన్స్ పొందడానికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

4) మారకపు నిబంధనలను పాటించడం:
1) విదేశీ మారకపు నిబంధనల చట్ట ప్రకారం ఎగుమతిదారుడు ఒక నిర్ణీత కాలంలోగా భారతీయ రిజర్వు బ్యాంకుకు, ఎగుమతి చేసే వస్తువుల పూర్తి విలువ మేరకు, విదేశీ మారకాన్ని వదులుకుంటున్నట్లు ఒక ప్రకటనను అందజేయాల్సి ఉంటుంది.

2) ఎగుమతిదారుడు వస్తువుల విలువను, చెల్లింపును పొందడానికి ఆశించిన పద్ధతి, మొదలయిన పూర్తి వివరాలను, నిర్ణీత దరఖాస్తు పత్రాలలో పేర్కొంటూ, వాటిని కస్టమ్స్ (customs) కార్యాలయానికి, విదేశీ మారకపు బ్యాంకుకు కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది.

5) పరపతి లేఖ:
1) ఎగుమతి వర్తక విధానంలో, దిగుమతిదారుని వద్ద నుంచి పరపతి లేఖను సంపాదించడాన్ని తరవాతి దశగా పేర్కొనవచ్చు. వస్తువులను పంపడానికి ముందు, దిగుమతిదారుని పరపతి స్థితి గురించి ఎగుమతిదారుడు తప్పనిసరిగా తృప్తి చెందాల్సి ఉంటుంది.

2) కొన్ని సందర్భాలలో, కేవలం బ్యాంకు ప్రస్తావన సరిపోతుంది. అయితే కొత్త కొనుగోలుదారుల విషయంలో, ఎగుమతిదారుడు వస్తువుల యొక్క పూర్తి ధరను ముందుగా చెల్లించాలని కోరవచ్చు.

6) షిప్పింగ్ ఆర్డర్:
1) దిగుమతిదారుని పరపతి గురించి సంతృప్తి చెందిన తరువాత, దిగుమతిదారుని కోరిక ప్రకారం, వస్తువులను రేవుకు చేరవేయడానికి, నౌకలో కొంత స్థలాన్ని అద్దెపై తీసుకోవడానికి, ఎగుమతిదారుడు ఒక నౌకా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటాడు.

2) ఎగుమతిదారుడు వద్ద నుంచి నిర్దుష్టమైన పరిమాణం గల వస్తువులను నౌకలోకి తీసుకోవలసిందిగా నౌకా రవాణా సంస్థ అధిపతికి (Captain) సూచనలిస్తూ, నౌకా సంస్థ ఉత్తర్వును జారీ చేస్తుంది.

7) మారకపు రేటు:

  1. ఒకదేశం నాణేలను, మరో దేశం నాణేలతో మారకం చేసుకోవడాన్ని ‘మారకం రేటు’ అంటారు.
  2. విదేశీ మారకం రేట్లలో వచ్చే హెచ్చు తగ్గులతో సంభవించే నష్టాలను తొలగించుకోవడానికి, దిగుమతి చేసుకునే దేశం కరెన్సీని, ఎగుమతి చేసుకునే దేశం కరెన్సీలోకి మార్పుదల చేయడానికి, ఎగుమతిదారు తన బ్యాంకుతో రేటును నిర్ణయిస్తాడు.

8) ప్యాకింగ్ చేయడం, పంపడం:
1) రవాణా ఛార్జీలను తగ్గించుకోవడానికి, నౌకలో సరుకు కనిష్ఠ స్థలం ఆక్రమించే విధంగా, ప్యాకింగ్ను ఇమిడికతో చేయాలి. ఈ విషయంలో, దిగుమతిదారుడు తనకు ఇచ్చిన సూచనలను పాటించవలసి ఉంటుంది. వస్తువులకు పూర్తి రక్షణ కల్పిస్తూ, తక్కువ ఖర్చు అయ్యేటట్లు ప్యాకింగ్ను చేయాల్సి ఉంటుంది.

2) వస్తువులను ప్యాక్ చేసిన తరువాత, ప్రతీ మూటపై (bundle) దిగుమతిదారుని పేరు, చేరవలసిన గమ్యస్థానం యొక్క రేవును, ప్రత్యేకమైన గుర్తులతో ముద్రించాలి. దీన్ని సులభంగా గుర్తించే ఉద్దేశంతో వేస్తారు.

9) కస్టమ్స్ లాంఛనాలు:
1) ఈ దశలో, ఎగుమతిదారుడు కొన్ని కస్టమ్స్ లాంఛనాలను పాటించవలసి ఉంటుంది. ఎగుమతిదారుడు నౌకా రవాణా బిల్లును మూడు ప్రతులలో బర్తీ చేయాలి. ఈ పౌకా రవాణా బిల్లుకు ఇతర పత్రాలను జత చేయాల్సి ఉంటుంది.

10) ఉపనౌకాధిపతి రశీదు:

  1. వస్తువులు రేవుకు చేరుకున్నట్లయితే, ఎగుమతిదారుడు ఒక రేవుకు సంబంధించిన రశీదును ఇస్తారు.
  2. వస్తువులను నేరుగా నౌకాధిపతికి, లేదా ‘ఉపనౌకాధిపతిగా’ పిలవబడే అతడి సహాయకుడికి అందజేసినప్పుడు, అతడు ‘ఉపనౌకాధిపతి’ (Mate) రశీదును జారీ చేస్తాడు.

11) నౌకాభారపత్రం:

  1. నౌకలోకి వస్తువులు చేరినట్లుగా ఒప్పుకుంటూ నౌకా రవాణా సంస్థ ఇచ్చిన అధికారిక రశీదును ‘నౌకా భార పత్రం’ అంటారు.
  2. ఇదొక వస్తువుల యాజమాన్యపు హక్కును సూచించే పత్రం. నౌకా భార పత్రాన్ని చూపకుండా, దిగుమతిదారుడు వస్తువుల బట్వాడాను పొందలేడు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

12) వస్తువుల బీమా:

  1. అంతర్జాతీయ వర్తకంలోకి ప్రవేశించే వస్తువులు సముద్రంలోని ప్రమాదాలను, అపాయాలను ఎదుర్కొనడానికి, వాటిని సక్రమంగా బీమా చేయవలసి ఉంటుంది.
  2. అందుకోసం బీమా కంపెనీ నుంచి, ఒక సముద్ర బీమా పాలసీని కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఈ పాలసీని దిగుమతిదారుకు, నౌకా భారపత్రం లాంటి తదితర పత్రాలతో పాటు అందజేయాలి.

13) ఉత్పత్తి స్థాన ధ్రువపత్రం:

  1. ఈ ధ్రువపత్రం ఎగుమతుల ఉత్పత్తి స్థానం గురించి సాక్ష్యాధారంగా ఉన్న ప్రకటన లాంటిది.
  2. దిగుమతిదారునిపై ‘సుంకం బాధ్యత’ తగ్గించడానికి వీలుండునట్లు అతడికి ‘ఉత్పత్తి స్థాన ధ్రువ పత్రాన్ని’ పంపాలి. ఈ ధ్రువ పత్రం అధీకృత వాణిజ్యమండలి లేదా వర్తక సమితి చేత జారీ చేయబడుతుంది.

14) వాణిజ్య సంబంధిత పత్రం:

  1. వస్తువుల విలువను అంచనా వేయడానికి, దానిపై విధించే సుంకాల మొత్తాన్ని నిర్ధారించడానికి, కస్టమ్స్ అధికారులు సాధారణంగా అధిక సమయాన్ని తీసుకుంటారు.
  2. ఈ జాప్యాన్ని నివారించడానికి, వస్తు. ఎగుమతిదారు, వస్తువులు గమ్యస్థానపు రేవుకు చేరుకున్న తరువాత, వాటిని దిగుమతిదారు సత్వరమే పొందడానికి వీలుగా, ఒక వాణిజ్య సంబంధిత పత్రాన్ని సంపాదిస్తాడు.

15) ఇన్వాయిస్ తయారీ:

  1. వస్తువులను పంపడానికి లాంఛనాలన్నింటినీ పూర్తి చేసిన తరువాత, ఎగుమతిదారుడు ఒక ఇన్వాయిస్ను తయారు చేయాలి.
  2. ఈ ఇన్వాయిస్ ను మూడు ప్రతులుగా తయారు చేస్తారు. ఇది లోగడ అంగీకరించిన ధర, ఇతర షరతులపై ఆధారపడి ఉంటుంది.

16) చెల్లింపును పొందడం:

  1. వస్తు దిగుమతి విధానంలో, వ్యవహారం యొక్క పరిష్కారం కింద చెల్లింపు పొందడమనేది చివరి దశగా
  2. ఎగుమతిదారుడు మూడు విభిన్న పద్ధతులలో చెల్లింపును పొందుతాడు.
    • దిగుమతిదారునిపై ఒక బిల్లును (హుండీని) రాయడం
    • ఒక వేళ ఎగుమతిదారుడు తక్షణమే సొమ్ము పొందాలనుకుంటే అతడు తన బ్యాంకుతో, దిగుమతిదారునిపై రాసిన హుండీని డిస్కౌంటు చేసుకుంటాడు. ఇందుకోసం అతడు తన బ్యాంకుకు ఒక తాకట్టు పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
    • ఎగుమతిదారుని బ్యాంకు ఎగుమతిదారునికి అనుకూలంగా ఒక పరపతి లేఖను జారీ చేస్తుంది.

ప్రశ్న 5.
దిగుమతి వర్తకంలో అనుసరించవలసిన లాంఛనాలు ఏమిటి ? వివరించండి.
జవాబు.
విదేశం నుంచి కొనుగోలుదారులుండే స్వదేశానికి వస్తువులను కొనుగోలు చేసి తెచ్చినపుడు, దాన్ని ‘దిగుమతి వర్తకం’ అని అంటారు. విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి ఒక క్రమమైన పద్ధతి ఉంటుంది.
1) లైసెన్సును సంపాదించడం:
1) ఒక దిగుమతిదారు తనకిష్టమొచ్చిన వస్తువులను దిగుమతి చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉండడం. మన దేశంలోనికి క్రమబద్ధమైన లైసెన్సు లేకుండా, ఎలాంటి వస్తువులూ దిగుమతి చేసుకోలేము.

2) ఒక దిగుమతిదారు సాధారణ లైసెన్సు లేదా వ్యక్తిగత లైసెన్సు కింద వస్తువులను దిగుమతి చేసుకోవచ్చు. ఏ దేశంనుంచైనా వస్తువులను దిగుమతి చేసుకోవడానికి సాధారణ లైసెన్సు ఉపయోగపడుతుండగా, వ్యక్తిగత లైసెన్సు మాత్రం నిర్దిష్టమైన దేశాలకు వర్తిస్తుంది.

3) ఒక దిగుమతి లైసెన్సును సంపాదించడానికి, దిగుమతిదారు ఒక నిర్ణీత పద్ధతిలో దరఖాస్తును అందచేయాలి. దరఖాస్తుదారుని గత కాలపు దిగుమతుల ‘పరిమాణాన్ని ఆధారం చేసుకొని, ఒక నిర్దిష్టభాగం (కోటా)గా ఒక ధ్రువ పత్రాన్ని కూడా లైసెన్సింగ్ అధికారులు జారీ చేస్తారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

2. మారకాన్ని సంపాదించడం: దిగుమతి లైసెన్సును సంపాదించిన తరువాత, అవసరమైన మొత్తంలో విదేశీ మారకాన్ని సంపాదించడానికి ఏర్పాట్లు చేయాలి. అవసరమైన విదేశీ మారకాన్ని విడుదల చేయడానికి “మారకం నియంత్రణ అధికారులకు” ఒక దరఖాస్తును అందజేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తును ఒక విదేశీ మారకపు బ్యాంకు ఆమోదించాలి.

3. ఇండెంట్ (లేదా) ఉత్తర్వు:

  1. విదేశీ మారకం పొందిన తరువాత దిగుమతిదారుడు, తనకు అవసరమయ్యే వస్తువులకు ఒక ఆర్డరును అందచేస్తాడు. ఈ ఆర్డరు (ఉత్తర్వు)ను ఇండెంట్ (Indent) అంటారు.
  2. ఈ ఇండెంట్ ఎగుమతిదారునికి ఇచ్చే వస్తువుల నాణ్యత, పరిమాణం, వస్తువులను పంపే విధానం, ప్యాకింగ్ స్వభావం, చెల్లింపు చేసే పద్ధతి, మొదటి శ్రేణి ధర మొదలయిన సూచనలు ఉంటాయి.

4. పరపతి లేఖ: దిగుమతిదారుడు తన పరపతి యోగ్యతను ఎగుమతిదారుడు రుజువు చేయాల్సి ఉంటుంది. దీనికోసం, అతడు ఒక పరపతి లేఖను ఎగుమతిదారుడు పంపాలి. దిగుమతిదారుని దేశంలో, ఎగుమతిదారుని పేరిట ఒక పరపతి లేఖను బ్యాంకువారు జారీ చేస్తారు. ఎగుమతిదారు, దిగుమతిదారునిపై జారీ చేసిన హుండీలు ఆదరణ చెందుతాయని బ్యాంకువారు ఒక హామీని / వాగ్ధానాన్ని ఇస్తారు.

5. షిప్పింగ్ పత్రాలను పొందడం: ఎగుమతిదారుడు వస్తువులను రవాణా చేసిన తరువాత, అతడు దిగుమతిదారుడు ఒక సలహా పత్రాన్ని పంపుతాడు. ఎగుమతిదారుడు, దిగుమతిదారునిపై ఒక హుండీని కూడా రాస్తాడు. ఇన్వాయిస్, బీమా పాలసీ, నౌక భార పత్రం, వాణిజ్య సంబంధిత పత్రం మొదలయిన ఇతర పత్రాలను హుండీతో జతచేయాల్సి ఉంటుంది. అందుచేత, దీన్ని ‘పత్ర సహిత హుండీ’ అంటారు. దీన్ని ఎగుమతిదారుని బ్యాంకు ద్వారా దిగుమతిదారునికి పంపడం జరుగుతుంది.

6. వస్తువులను స్వీకరించడం: నౌకా రవాణా పత్రాలను స్వాధీనంలోకి తీసుకున్న తరువాత, దిగుమతిదారు కింద పేర్కొన్న లాంఛనాలను పాటించి ఆ తర్వాత వస్తువులను స్వాధీనంలోకి తీసుకోవచ్చు.
ఎ) ముందుగా, దిగుమతిదారుడు నౌక రవాణా సంస్థ నుంచి ‘బట్వాడా ఉత్తర్వు’ను సంపాదించాలి.
బి) బట్వాడా ఉత్తర్వును స్వీకరించిన తర్వాత దిగుమతిదారుడు ‘ప్రవేశ బిల్లును’ (Bill of Entry) మూడు కాపీలుగా అందజేయాలి.
సి) వస్తువులను స్వాధీనపరచుకోవడానికి దిగుమతిదారుడు మరొక దరఖాస్తు పత్రాన్ని భర్తీ చేయాలి. అతడు కొన్ని రేవు బకాయిలను, నౌకా రేవు పాలక సంస్థ కార్యాలయానికి తరువాత చెల్లించాలి. అప్పుడు, వారు ‘నౌకా రేవు పాలక సంస్థ బకాయిలు రశీదు’ను జారీ చేస్తారు.

7. వస్తువుల బట్వాడా:
1) ప్రవేశ బిల్లును పరిశీలించిన తరువాత, నౌకా రేవు పాలక సంస్థ అధికారుల చేత ఆమోదించబడిన దిగుమతికి సంబంధించిన దరఖాస్తును కస్టమ్స్ కార్యాలయం వారు, దిగుమతిదారు దిగుమతి చేయబడిన వస్తువులను స్వాధీనపరచుకోవడానికి అనుమతిస్తారు.

2) ఒక వేళ ఏవైనా సుంకాలను విధించినట్లయితే, దిగుమతిదారుడు, కస్టమ్స్ అధికారులు లెక్కించిన ప్రకారం, ఆ సుంకాలను చెల్లించవలసి ఉంటుంది.

8. గిడ్డంగులు:
1) స్వంత గోదాములు లేని దిగుమతిదారుల సౌకర్యం కోసం, రేవు అధికారులు భారీ గిడ్డంగులను నిర్వహిస్తారు. వారు సముచితమైన అద్దెను వసూలు చేస్తారు.

2) ఒకవేళ, దిగుమతిదారుడు ఆ వస్తువులు తక్షణమే అవసరం లేనప్పుడు లేదా వాటిని తిరిగి ఎగుమతి చేయదలచినప్పుడు, కస్టమ్స్ లేదా ఎక్సైజ్ సుంకాల చెల్లింపు చేసే వరకు, వాటిని అతడు గిడ్డంగులలో నిల్వ చేసుకోవచ్చు. అలాంటి గిడ్డంగిని ‘ఆశ్రయ గిడ్డంగి’గా అభివర్ణించవచ్చు.

ప్రశ్న 6.
ఇ.పి.జడ్ల ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలను వివరించండి.
జవాబు.

  1. ఇ.పి.జడ్ (E.P.Z) అనగా “ఎగుమతి వర్తక ప్రక్రియలు నిర్వహించే మండలాలు.
  2. భారత ప్రభుత్వం ఎగుమతులను పెంపొందించడానికి, ఎగుమతి వర్తక ప్రక్రియలు మండలాలను ఏర్పాటు చేసినది. సాధారణంగా ఆతిథ్యమిచ్చే దేశం యొక్క వెనుకబడిన ప్రాంతాలలో ఈ మండలాలను స్థాపించడం జరుగుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

ఇ.సి.జడ్ల లక్షణాలు:

  1. ఇ.పి.జడ్లలో నిర్వహించే కార్యకలాపాలకు ఎలాంటి లైసెన్సు అవసరముండదు.
  2. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కొన్ని కొలమానాలను పాటిస్తూ, సంస్థలు ఇ.పి.జడ్లలో తమకు నచ్చిన ప్రదేశంలోనే తమ సంస్థను నెలకొల్పవచ్చు.
  3. ఇ.పి.జడ్లు చురుకైన ఎగుమతి దిగుమతి విధానాన్ని కఠినంగా అనుసరించవచ్చు.
  4. ఇ.పి.జడ్లలోని సంస్థలు పూర్తిగా కస్టమ్స్ శాఖ వారి అజ్ఞానుసారం వ్యవహరిస్తాయి.
  5. భారతదేశంలో ఇ.పి.జడ్లలోని సంస్థలను స్థాపించడానికి చేసే ప్రతిపాదనలు, ఆమోదంకోసం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఆటోమేటిక్ మార్గాన్ని అనుసరించే హక్కును కలిగి ఉంటాయి.

ఇ.పి.జడ్ల ప్రయోజనాలు:

  1. ఇ.పి.జడ్లు దేశ పారిశ్రామీకరణకు, ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చాయి.
  2. కోటాలు, సుంకాలు తొలగించబడినప్పుడు, దేశంలో ఇ.పి.జడ్లు ప్రత్యేకత సాధించిన ప్రాంతాలుగా కొనసాగుతాయి.
  3. ఇ.పి.జడ్లు అధిక సంఖ్యలో కార్మికులను నియమించి, ఉత్పత్తి జరిపే కేంద్రాలుగా పేరు తెచ్చుకున్నాయి.
  4. ఎగుమతుల ద్వారా విదేశీ మారకపు ఆర్జనలను పెంచడానికి, ఇ.పి.జడ్ సంస్థలు నిరంతరం ముడిసరుకుల దిగుమతిలో, తయారైన వస్తువుల ఎగుమతిలో నిమగ్నమై ఉంటాయి.
  5. ఇ.పి.జడ్లలో వస్తు ఉత్పత్తిచేసే కార్యకలాపాలన్నింటిలో, 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతిస్తారు.
  6. ఆదాయపన్ను విరామంలాంటి వివిధ ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే, వ్యాట్, ఎగుమతి సుంకం, ఇతర వివిధ పన్నులకు సంబంధించి కూడా అనేక మినహాయింపులను కల్పించారు.

ప్రశ్న 7.
ఇ.పి.జడ్ అంటే ఏమిటి ? భారతదేశంలో వీటిని నెలకొల్పడానికి గల కారణాలు ఏమిటో వివరించండి.
జవాబు.
1) ఇ.పి.జడ్ (E.P.Z) అనగా “ఎగుమతి వర్తక ప్రక్రియలు నిర్వహించే మండలాలు”.
2) భారతప్రభుత్వం ఎగుమతులను పెంపొందించడానికి, ఎగుమతి వర్తక ప్రక్రియలు మండలాలను ఏర్పాటు చేసినది. సాధారణంగా ఆతిథ్యమిచ్చే దేశం యొక్క వెనుకబడిన ఈ మండలాలను ప్రాంతాలలో స్థాపించడం జరుగుతుంది. భారతదేశంలో ఇ.పి.జడ్లు నెలకొల్పడానికి గల కారణాలు:

భారతదేశంలో ఇ.పి.జడ్లను నెలకొల్పడానికి వెనుకగల ప్రధాన కారణాలు క్రింద పేర్కొనబడినవి.

  1. ఇ.పి.జడ్లలో నెలకొల్పిన పారిశ్రామిక సంస్థలలో మెరుగైన అవస్థాపన సౌకర్యాలను కల్పించడం.
  2. పన్ను విరామ హక్కును ప్రవేశపెట్టడం.
  3. ఇ.పి.జడ్లలో 100 శాతం ఎగుమతి ప్రాధాన్యత గల పద్ధతిని ఏర్పాటుచేయడం.
  4. ఇ.పి.జడ్లను పూర్తిగా అన్ని రకాలైన పన్నుల, సుంకాల నుంచి మినహాయించడం.
  5. మండలంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష, పెట్టుబడిని ప్రతిపాదిస్తూ, భారత ప్రభుత్వంచేత నిర్దేశింపబడిన ఆటోమేటిక్ మార్గాన్ని అనుసరిస్తున్న, ఇ.పి. జడ్ లోని సంస్థలు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అంతర్జాతీయ వర్తకం ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు.
ప్రాముఖ్యత (Importance):
1) ప్రపంచంలోని ఏ దేశం కూడా స్వయం సమృద్ధితో ఉండదు. ఏ దేశమూ తనకవసరమయ్యే వస్తువులను ఉత్పత్తి చేయదు. ఏ దేశం కూడా ఆర్థిక ఏకాంతత్వంలో జీవించడం. ఒకదేశం మరొక దేశంపై ఆధారపడి ఉండే ఈ పరిస్థితి అంతర్జాతీయ వర్తక ఆవశ్యకతను కల్పించింది.

2) కొన్ని దేశాలు, కొన్ని రకాలైన వస్తువులను, ఆదా పూర్వకంగా పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడానికి అధిక యోగ్యమైనవిగా పేర్కొనబడినవి. అలాంటి దేశం తన మిగులు ఉత్పత్తిని ఇతర దేశాలకు విక్రయిస్తుంది, అదే విధంగా ఆయా దేశాల నుంచి తనకు అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేస్తుంది. ఈ ప్రకారంగా, ప్రపంచంలోని అన్ని దేశాలు, తమ అవసరాలను తీర్చుకోవడానికి ఒకదానిపై మరొకటి ఆధారపడవలసి ఉంటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

3) మన ఆధునిక వాణిజ్య ప్రపంచానికి అంతర్జాతీయ వర్తకం ఒక వెన్నెముక లాంటిది. అంతర్జాతీయ వర్తకం, ప్రజల మానసిక దృక్పథాన్ని విస్తృతపరుస్తుంది. ఇది జాతీయ పరిశీలనలకు సంకుచిత దృష్టికి మాత్రమే పరిమితం కాకుండా, దాన్ని అధిగమించి ఆలోచించేటట్లు ప్రోత్సహిస్తుంది.

4) అంతర్జాతీయ వర్తకం, ఆలోచనల బదిలీని, సంస్కృతిని, ప్రపంచ శాంతిని, అంతర్జాతీయ అవగాహనను పెంపొందిస్తుంది.

5) విదేశీ వర్తకం ద్వారా, ఒక వర్తకుడు తన వస్తువులను తనకిష్టమైన ఏ దేశంలోనైనా విక్రయించవచ్చు.

6) అంతర్జాతీయ వర్తకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వస్తుసేవలను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

7) ప్రభుత్వాల ప్రపంచీకరణ, స్వేచ్ఛాయుత వర్తక పథకాలు ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయ వర్తకానికి ప్రత్యేక సంబంధాన్ని కలిగించాయి.

ప్రశ్న 2.
దేశీయ వర్తకం, విదేశీ వర్తకంతో ఎలా విభేదిస్తుంది ?
జవాబు.
స్వదేశీ వర్తకం

  1. దేశంలో జరిగే వర్తకాన్ని సూచిస్తుంది.
  2. ఎలాంటి నాణేల మారకంతో సంబంధం ఉండదు.
  3. డిమాండు, సప్లయి శక్తుల ప్రభావానికి అవకాశం ఉంటుంది.
  4. ఎలాంటి ఆంక్షలు ఉండవు.
  5. రవాణా వ్యయం, నష్ట భయాలు తక్కువగా ఉంటాయి.
  6. `ఇది ఒక దేశంలో ప్రత్యేకీకరణ ప్రయోజనాలను పొందడానికి సహాయపడుతుంది.

విదేశీ వర్తకం

  1. ఇతర దేశాలతో జరిపే వర్తకాన్ని సూచిస్తుంది.
  2. నాణేల మారకంతో సంబంధం ఉంటుంది.
  3. డిమాండు, సప్లయి శక్తుల ప్రభావానికి అవకాశం పరిమితంగా ఉంటుంది.
  4. ఇది అనేక ఆంక్షలకు లోబడి ఉంటుంది.
  5. రవాణా వ్యయాలు, నష్ట భయాలు ఎక్కువగా ఉంటాయి.
  6. ఇది వర్తకం చేసే అన్ని దేశాలు ప్రత్యేకీకరణ ప్రయోజనాలను పొందడానికి దోహదపడుతుంది.

ప్రశ్న 3.
అంతర్జాతీయ వర్తకం నాలుగు ప్రయోజనాలు ఏమిటి ?
జవాబు.
అంతర్జాతీయ వర్తకం వల్ల కలిగే ప్రయోజనాలు క్రింద చర్చించబడినవి:

  1. ఇది అందుబాటులో ఉన్న వనరులను చక్కగా వినియోగించడానికి దారితీస్తుంది. .
  2. ఇది వనరుల వృథాను తగ్గిస్తుంది.
  3. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలను సమానం చేస్తుంది. విస్తృతమైన హెచ్చు తగ్గులను తొలగిస్తుంది.
  4. ఇది మిగులుగా ఉన్న వస్తువులను ఇతర దేశాలకు వాటిని అమ్మడానికి, అలాగే కొరతగా ఉన్న వస్తువులను ఇతర దేశాల నుంచి కొనడానికి సహాయపడుతుంది.
  5. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు, తమ ఉత్పత్తులను ఎగుమతులు చేయడానికి బదులుగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.
  6. ఇది వివిధ దేశాలకు చెందిన ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాన్ని సృష్టిస్తుంది. తద్వారా సాంస్కృతిక వికాసానికి, అంతర్జాతీయ శాంతికి దోహదపడుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

ప్రశ్న 4.
నౌక రవాణా ఉత్తర్వు అనగానేమి ?
జవాబు.
1) దిగుమతిదారుని పరపతి గురించి సంతృప్తిచెందిన తరువాత, దిగుమతిదారుని కోరిక ప్రకారం, వస్తువులను రేవుకు చేరవేయడానికి, నౌకలో కొంత స్థలాన్ని అద్దెపై తీసుకోడానికి, ఎగుమతిదారుడు ఒక నౌకా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటాడు.

2) ఎగుమతిదారు వద్ద నుంచి నిర్దిష్టమైన పరిమాణంగల వస్తువులను నౌకలోకి తీసుకోవలసిందిగా నౌకా రవాణా సంస్థ అధిపతికి సూచనలిస్తూ, జారీ చేసిన పత్రాన్ని నౌక రవాణా ఉత్తర్వు అంటారు.

3) ఒకవేళ ఎగుమతిదారుడు నౌకలో పూర్తి స్థలాన్ని అద్దెపై తీసుకుంటే, ఈ మేరకు, ఎగుమతిదారుకు, నౌక యజమానికి మధ్య కుదుర్చుకున్న ఒప్పందాన్ని ‘చార్టర్ పార్టీ ఒప్పందం’ అంటారు. ఈ ఒప్పందం ఎగుమతిదారు నుంచి నిర్దిష్టమైన పరిమాణంలోగల వస్తువులను నౌకలోకి తీసుకునే విషయమై, నౌక అధిపతిని బాధ్యునిగా చేస్తుంది.

4) చార్టర్ పార్టీ ఒప్పందం, వస్తువులను ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి రవాణా చేయడానికి నౌక యజమానిని బాధ్యునిగా చేస్తుంది. అలాంటి ఒప్పందం క్రింద, ఎవరి వస్తువులను రవాణా చేయడం జరుగుతుందో, అతడిని ‘చార్టర్’ అని అంటారు. చార్టర్ పార్టీ అనేది ఒక ‘నౌక యాత్ర. చార్టర్ పార్టీ’ లేదా ‘ఒక కాల ఆధార చార్టర్ పార్టీ’గా ఉండవచ్చు.

ప్రశ్న 5.
అంతర్జాతీయ వర్తకంలో ప్యాకేజింగ్, ఫార్వార్డింగ్ అంటే ఏమిటి ?
జవాబు.
1) రవాణా ఛార్జీలను తగ్గించుకోవడానికి, నౌకలో సరుకు కనిష్ఠ స్థలం ఆక్రమించే విధంగా, ప్యాకింగ్ను ఇమిడికతో చేయాలి. ఈ విషయంలో, దిగుమతిదారుడు తనకు ఇచ్చిన సూచనలను పాటించవలసి ఉంటుంది. వస్తువులకు పూర్తి రక్షణ కల్పిస్తూ, తక్కువ ఖర్చు అయ్యేటట్లు ప్యాకింగ్ను చేయాల్సి ఉంటుంది.

2) వస్తువులను ప్యాక్ చేసిన తరువాత, ప్రతీ మూటపై (bundle) దిగుమతిదారుని పేరు, చేరవలసిన గమ్యస్థానం యొక్క రేవును, ప్రత్యేకమైన గుర్తులతో ముద్రించాలి. దీన్ని సులభంగా గుర్తించే ఉద్దేశంతో వేస్తారు.

ప్రశ్న 6.
దిగుమతి వర్తకంలో లైసెన్సును ఎలా పొందుతారు ?
జవాబు.
లైసెన్సును సంపాదించడం:
1) ఒక దిగుమతిదారు తనకిష్టమొచ్చిన వస్తువులను దిగుమతి చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉండడం. మన దేశంలోనికి క్రమబద్ధమైన లైసెన్సు లేకుండా, ఎలాంటి వస్తువులూ దిగుమతి చేసుకోలేము.

2) ఒక దిగుమతిదారు’ సాధారణ లైసెన్సు లేదా వ్యక్తిగత లైసెన్సు కింద వస్తువులను దిగుమతి చేసుకోవచ్చు. ఏ దేశం నుంచైనా వస్తువులను దిగుమతి చేసుకోవడానికి సాధారణ లైసెన్సు ఉపయోగపడుతుండగా, వ్యక్తిగత లైసెన్సు మాత్రం నిర్దిష్టమైన దేశాలకు వర్తిస్తుంది.

3) ఒక దిగుమతి లైసెన్సును సంపాదించడానికి, దిగుమతిదారు ఒక నిర్ణీత పద్ధతిలో దరఖాస్తును అందచేయాలి. దరఖాస్తుదారుని గత కాలపు దిగుమతుల పరిమాణాన్ని ఆధారం చేసుకొని, ఒక నిర్దిష్టభాగం (కోటా)గా ఒక ధ్రువ పత్రాన్ని కూడా లైసెన్సింగ్ అధికారులు జారీ చేస్తారు.

ప్రశ్న 7.
భారతదేశంలో ఇ.పి.జడ్ల స్థాపన వెనుకున్న ప్రధాన కారణాలు ఏమిటి ?
జవాబు.
భారతదేశంలో ఇ.పి.జడ్లను నెలకొల్పడానికి వెనుకగల ప్రధాన కారణాలు క్రింద పేర్కొనబడినవి.

  1. ఇ.పి.జడ్లలో నెలకొల్పిన పారిశ్రామిక సంస్థలలో మెరుగైన అవస్థాపన సౌకర్యాలను కల్పించడం.
  2. పన్ను విరామ హక్కును ప్రవేశపెట్టడం.
  3. ఇ.పి.జడ్లలో 100 శాతం ఎగుమతి ప్రాధాన్యత గల పద్ధతిని ఏర్పాటుచేయడం.
  4. ఇ.పి.జడ్లను పూర్తిగా అన్ని రకాలైన పన్నుల, సుంకాల నుంచి మినహాయించడం.
  5. మండలంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష, పెట్టుబడిని ప్రతిపాదిస్తూ, భారత ప్రభుత్వం చేత నిర్దేశింపబడిన ఆటోమేటిక్ మార్గాన్ని అనుసరిస్తున్న, ఇ.పి.జడ్లలోని సంస్థలు.

ప్రశ్న 8.
అంతర్జాతీయ వర్తకం పరిధి ఏమిటి ?
జవాబు.
అంతర్జాతీయ వర్తకం పరిధి చాలా విస్తృతమైనది. క్రింది అంశాలు అంతర్జాతీయ వర్తకపు పరిథిలోకి వస్తాయి.

  1. అంతర్జాతీయ ఆర్థిక విషయాలు, వర్తక సిద్ధాంతాలు.
  2. విదేశీ వర్తకానికి పరిమాణాత్మక విధానాలు.
  3. అంతర్జాతీయ వ్యాపార సందేశాలివ్వడం, ప్రజా సంబంధాలు ఏర్పరుచుకోవటం.
  4. విదేశీ వర్తకంలో అంతర్జాల ఉపయోగం.
  5. విదేశీ వర్తకంలో బీమా, నష్టభయ నిర్వహణ.
  6. అంతర్జాతీయ మార్కెటింగ్ నిర్వహణ, వినియోగదారులు ప్రవర్తన.
  7. అంతర్జాతీయ మానవ వనరుల నిర్వహణ, వ్యవస్థా ప్రవర్తన. 8) అంతర్జాతీయ వ్యాపార చట్టాలు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

ప్రశ్న 9.
ఇ.పి.జడ్ల లక్షణాలు ఏమిటి ?
జవాబు.
భారతదేశంలోని ఇ.పి.జడ్ల ముఖ్య లక్షణాలలో కొన్ని క్రింది విధంగా ఉంటాయి.

  1. ఇ.పి.జడ్లలో నిర్వహించే కార్యకలాపాలకు ఎలాంటి లైసెన్సు అవసరముండదు.
  2. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కొన్ని కొలమానాలను పాటిస్తూ, సంస్థలు ఇ.పి.జడ్లలో తమకు నచ్చిన ప్రదేశంలోనే తమ సంస్థను నెలకొల్పవచ్చు.
  3. ఇ.పి.జడ్లు చురుకైన ఎగుమతి దిగుమతి విధానాన్ని కఠినంగా అనుసరించవచ్చు.
  4. ఇ.పి.జడ్లలోని సంస్థలు పూర్తిగా కస్టమ్స్ శాఖ వారి అజ్ఞానుసారం వ్యవహరిస్తాయి.
  5. భారతదేశంలో ఇ.పి.జడ్లలోని సంస్థలను స్థాపించడానికిచేసే ప్రతిపాదనలు, ఆమోదంకోసం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఆటోమేటిక్ మార్గాన్ని అనుసరించే హక్కును కలిగి ఉంటాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వస్తు వివరణలు (Quotations), విచారణలు (Enquiries).
జవాబు.
1) కొనుగోలుదార్ల వద్ద నుంచి వస్తు విచారణ పత్రం స్వీకరించగానే, ఎగుమతి వర్తకం ప్రారంభమవుతుంది. వస్తుధరను, ఇతర సేవల సమాచారాన్ని కోరుతూ, అతని వద్ద నుంచి వచ్చిన రాతపూర్వక విజ్ఞప్తిని ఒక ‘వస్తు విచారణ’గా చెప్పవచ్చు.

2) అలాంటి విచారణకు ఇచ్చే సమాధానాన్ని వస్తు ప్రకటనలుగా చెప్పవచ్చు. వస్తు ప్రకటనల్లో, విచారణలో కోరిన వివరాలన్నింటిని సమకూర్చాలి. వస్తుధర, కాలం, బట్వాడా చేసే పద్ధతి, ప్యాకింగ్ చేసే పద్ధతులను వాటిలో పేర్కొంటారు.

ప్రశ్న 2.
పరపతి లేఖ / పత్రం (Letter of credit).
జవాబు.

  1. వస్తువులను పంపడానికి ముందు దిగుమతిదారునికి పరపతి స్థితి గురించి ఎగుమతిదారుడు సంపాదించే లేఖను “పరపతి లేఖ” లేదా పరపతి పత్రం అంటారు.
  2. ఈ పరపతి పత్రాన్ని దిగుమతి దారుడి తరపున బ్యాంకువారు జారీ చేస్తారు.

ప్రశ్న 3.
నౌకా భార పత్రం (Bill of lading).
జవాబు.

  1. నౌకలోకి వస్తువులు చేరినట్లుగా ఒప్పుకుంటూ నౌకా రవాణా సంస్థ ఇచ్చిన అధికారిక రసీదును ‘నౌకా భార పత్రం’ అంటారు.
  2. ఇదొక వస్తువుల యాజమాన్యపు హక్కును సూచించే పత్రం. నౌకా భార పత్రాన్ని చూడకుండా, దిగుమతిదారుడు వస్తువుల బట్వాడాను పొందలేడు.
  3. ఇది నౌకా రవాణా సంస్థకు, ఎగుమతిదారుకు మధ్య ఉన్న ఒప్పందానికి ఒక సాక్ష్యంగా ఉంటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

ప్రశ్న 4.
ప్రవేశ బిల్లు (Bill of Entry).
జవాబు.
1) దిగుమతి చేసుకున్న సరుకు వివరాలు తెలియజేస్తూ చేసే ప్రకటనే ప్రవేశబిల్లు. బట్వాడా ఉత్తర్వులను స్వీకరించిన తర్వాత దిగుమతి దారుడు ప్రవేశ బిల్లును మూడు కాపీలుగా అందించాలి. క్రింద రకాలైన వస్తువులకు వేరు వేరు ప్రవేశ బిల్లులు నింపవలసి ఉంటుంది.

  • కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించిన వస్తువులు.
  • స్వంత వినియోగానికి దిగుమతి చేసుకోబడుతున్న సుంకం విధించదగ్గ వస్తువులు.
  • సుంకం విధించదగ్గ ‘’బ్రాండెడ్’ వస్తువులు.

ప్రశ్న 5.
సమాచారయుత ఇండెంట్.
జవాబు.

  1. దిగుమతిదారుడు తనకు కావాల్సిన వస్తువులకు ఒక ఆర్డరును అందజేస్తాడు. ఆ ఆర్డరు ఉత్తర్వును ఇండెంట్ అంటారు.
  2. ఇండెంట్ కావాల్సిన వస్తు వివరాలను పేర్కొన్నప్పుడు దాన్ని సమాచారయుత ఇండెంట్ అంటారు.

ప్రశ్న 6.
భారతదేశంలో ఇ.పి.జడ్ (E.P.Z) విధానం యొక్క నాలుగు దశలు.
జవాబు.
భారతదేశంలో ఇ.పి.జడ్. విధానంలో నాలుగు దశలు:
మొదటి దశ: ప్రారంభపు దశ (1964-1985)
రెండవ దశ: విస్తరణ దశ (1985-1991) మూడవ దశ: ఏకీకరించే దశ (1991-2000)
నాల్గవదశ: ప్రస్ఫుటపరచిన దశ (2000 నుంచి మొదలుకొని)

ప్రశ్న 7.
బాండెడ్ గిడ్డంగులు (Bonded Warehouses).
జవాబు.
విదేశం నుంచి సరుకు దిగుమతి చేసుకున్న దిగుమతిదారునకు ఆ సరుకు వెంటనే అవసరంలేకపోయినా లేదా సరుకు భద్రపరచడానికి తగిన సొంత గిడ్డంగి వసతి లేకపోయినా లేదా సరుకును తిరిగి ఎగుమతి చేయదలచినా, ఆ సరుకును వెంటనే దిగుమతి సుంకం చెల్లించకుండా, భద్రపరచడానికి ప్రభుత్వం గిడ్డంగులను నిర్వహిస్తుంది. వాటినే బాండెడ్ గిడ్డంగులు అంటారు. ఇవి ప్రభుత్వానికి చెందినవి, వీటి మీద కస్టమ్స్ అధికారులు అజమాయిషి నిర్వహిస్తాయి. వీటిలో భద్రపరిచే సరుకును ‘బాండ్’లో ఉన్న సరుకు అంటారు. వీటినే గిడ్డంగులను “దస్తావేజు పూర్వక గిడ్డంగులు” అంటారు.

ప్రశ్న 8.
మారకపు రేటు.
జవాబు.
1) ఒకదేశం నాణేల (Currency)ను, మరో దేశం నాణేలతో మారకం చేసుకోవడాన్ని ‘మారకం రేటు’ అంటారు. 2) విదేశీ మారకం రేట్లలో వచ్చే హెచ్చు తగ్గులతో సంభవించే నష్టాలను తొలగించుకోవడానికి, దిగుమతి చేసుకునే దేశం కరెన్సీని, ఎగుమతి చేసుకునే దేశం కరెన్సీలోకి మార్పుదల చేయడానికి, ఎగుమతిదారు తన బ్యాంకుతో రేటును నిర్ణయిస్తాడు.

ప్రశ్న 9.
ఉత్పత్తి స్థాన ధ్రువపత్రం.
జవాబు.

  1. ఈ ధ్రువపత్రం ఎగుమతుల ఉత్పత్తి స్థానం గురించి సాక్ష్యాధారంగా ఉన్న ప్రకటన లాంటిది.
  2. దిగుమతిదారునిపై ‘సుంకం బాధ్యత’ తగ్గించడానికి వీలుండునట్లు అతడికి ‘ఉత్పత్తి స్థాన ధ్రువ పత్రాన్ని’ పంపాలి. ఈ ధ్రువ పత్రం అధీకృత వాణిజ్యమండలి లేదా వర్తక సమితి చేత జారీ చేయబడుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

ప్రశ్న 10.
వాణిజ్య సంబంధిత పత్రం (Consular Invoice).
జవాబు.
ఎగుమతిదారు వస్తువులు గమ్యస్థాన రేవుకు చేరుకున్న తరువాత, వాటిని దిగుమతిదారు సత్వరమే పొందడానికి వీలుగా తయారుచేసే పత్రాన్ని వాణిజ్య సంబంధిత పత్రం అంటారు.

ప్రశ్న 11.
గిడ్డంగి.
జవాబు.
వస్తువులను దీర్ఘకాలంపాటు కాల ప్రయోజనాన్ని కల్పిస్తూ భద్రపరిచే ఏర్పాటును “గిడ్డంగి” అంటారు.

ప్రశ్న 12.
‘తులనాత్మక వ్యయ ప్రయోజనం’ సిద్ధాంతం.
జవాబు.
ఒక దేశం తనకు వ్యయ ప్రయోజనం ఉన్న వస్తువులను దిగుమతి చేసి, ఇతర దేశాలకు వ్యయ ప్రయోజనం ఉన్న వస్తువులను ఎగుమతి చేసుకుంటుంది. దీనిని ఆర్థికశాస్త్ర పరిభాషలో ‘తులనాత్మక వ్యయ సిద్ధాంతం’ అంటారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 7th Lesson అంతర్గత వర్తకం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 7th Lesson అంతర్గత వర్తకం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వర్తకాన్ని నిర్వచించి, దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
వర్తకం:వస్తువులను, సేవలను, ద్రవ్యానికి లేదా ద్రవ్యసమానమైన విలువకు కొనడం, అమ్మడాన్ని “వర్తకం” అంటారు.
వర్తకం లక్షణాలు:

  1. వర్తకం వాణిజ్యంలో ఒక భాగము.
  2. వర్తకంలో వస్తు సేవలు ఉత్పత్తి దారుని నుండి తుది వినియోగదారునికి చేరే ప్రక్రియ ఉంటుంది.
  3. వర్తకం వస్తుసేవల మారకం లేదా బదిలీతో సంబంధం కలిగి ఉంటుంది.
  4. వర్తకాన్ని స్వదేశీ వర్తకం మరియు విదేశీ వర్తకంగా వర్గీకరించవచ్చు.
  5. వర్తకం వినియోగదారుల జీవన ప్రమాణాన్ని ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా మెరుగుపరుస్తుంది.
  6. వర్తకం వస్తువులకు స్థాన ప్రయోజనాన్ని కలిపిస్తుంది.

ప్రశ్న 2.
ఉత్పత్తిదారులకు టోకు వర్తకుడు అందజేసే సేవలను పేర్కొనండి.
జవాబు.
ఉత్పత్తిదారునికి టోకు వర్తకుడు అందజేసే సేవలు:

  1. భారీ స్థాయి ఉత్పత్తికి అవకాశమివ్వడం.
  2. నష్టభయాన్ని పంచటం / బదిలీ చేయటం.
  3. ముందు చెల్లింపులు చేయటం ద్వారా ఆర్థిక సహాయం.
  4. మార్కెట్ స్థితిగతుల గురించి సలహాలివ్వటం.
  5. స్థాన అవరోధాన్ని తొలగించటం.
  6. అవిచ్ఛిన్న ఉత్పత్తికి దోహదపడటం.
  7. పంపిణీ బాధ్యతను నిర్వర్తించటం, తద్వారా ఉత్పత్తిదారుని వస్తు ఉత్పత్తిపై దృష్టి ఉంచేటట్లు చూడటం.
  8. గిడ్డంగిలో వస్తువులను నిల్వచేసే భారాన్ని తగ్గించటం.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

ప్రశ్న 3.
ఉత్పత్తిదారులకు చిల్లర వర్తకుడు అందజేసే సేవలేవి ?
జవాబు.
చిల్లర వర్తకుడు ఉత్పత్తిదారునికి అందిచే సేవలు:

  1. వస్తువుల కోసం ఒక సిద్ధంగా ఉన్న మార్కెట్ను తయారుచేయడం (ఏర్పాటుచేయడం).
  2. ఉత్పత్తిదారునికి, మార్కెట్ పరిశోధనకర్తలకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందజేయడం
  3. నష్టభయాన్ని భరించడం/నష్ట భయాన్ని పంచడం.
  4. వస్తువులకు వివిధ ప్రాంతాలకు, మార్కెట్లోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయడం.

ప్రశ్న 4.
సెజ్ (SEZ) ధ్యేయాలను పేర్కొనండి.
జవాబు.

  1. సెజ్ అనగా “ప్రత్యేక ఆర్ధిక క్షేత్రాలు/ప్రత్యేక ఆర్ధిక మండలాలు.
  2. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడానికి “ప్రత్యేక” ఆర్థిక క్షేత్రాల SEZ భావన ప్రవేశపెట్టబడినది.
  3. ఈ క్షేత్రాలలో వ్యాపార, వర్తక చట్టాలు ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి.

సెజ్ ధ్యేయాలు:
సెజ్ల ప్రధాన ధ్యేయాలు క్రింది పేర్కొన్న విధంగా ఉంటాయి.

  1. అదనపు ఆర్థిక కార్యకలాపాల ఉత్పాదన.
  2. వస్తువుల, సేవల ఎగుమతుల పెరుగుదల.
  3. స్వదేశీ, విదేశీ మార్గాల ద్వారా పెట్టుబడిని ప్రోత్సహించటం.
  4. ఉద్యోగ అవకాశాలను సృష్టించడం.
  5. అవస్థాపనకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపరచటం.

ప్రశ్న 5.
సెజ్ (SEZ) ప్రయోజనాలను వివరించండి.
జవాబు.
సెజ్ ప్రధానమైన ప్రయోజనాలు క్రింది విధంగా ఉంటాయి.
ఎ) ఉద్యోగాల కల్పన:సెజ్లు ఉద్యోగాలను సృష్టించడం కోసం అత్యధిక పటిష్టమైన సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి.

బి) ఆర్థికాభివృద్ధి:సెజ్లను ఆర్థికాభివృద్ధికి సంబంధించిన యంత్రాలుగా చూడవచ్చు. సెజ్లను వాస్తవమైన స్ఫూర్తితో అమలు జరిపితే భారతదేశాన్ని ఒక రూపాంతరం చెందిన ఆర్థికవ్యవస్థగా చేయవచ్చు.

సి) శ్రామిక సాంద్రత గల ఉత్పత్తి పరిశ్రమ యొక్క పెరుగుదల:సెజ్ల స్థాపనతో, దేశంలో శ్రామికశక్తితో కూడుకున్న వస్తూత్పత్తి సేవా పరిశ్రమల వేగవంతమైన అభివృద్ధికి దారితీస్తుంది.

డి) సమతౌల్యమైన ప్రాంతీయాభివృద్ధి: సెజ్ల సహాయంతో సమతౌల్యమైన ప్రాంతీయ అభివృద్ధిని సాధించడానికి ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు రూపొందించబడ్డాయి.

ఇ) సామర్థ్యాన్ని పెంపొందించటం:దృఢమైన సామర్థ్య పెంపుదలకు సెజ్లు ప్రధానమైనవిగా ఉంటాయి,

ఎఫ్) ఎగుమతి నిర్వహణ:ఒక దేశం ఎగుమతి నిర్వహణలో సుంకాలు, ఇతర వర్తక అవరోధాల ద్వారా, కార్పొరేట్ పన్ను విధానం మితిమీరిన ఉద్యోగిస్వామ్యం ద్వారా ఎదురయ్యే వికృత మార్పులను తొలగించడానికి, సెజ్లు క్రియాశీలతను ప్రేరేపిస్తాయి.

ప్రశ్న 6.
విభాగ విక్రయశాలల ప్రయోజనాలు, నష్టాలను రాయండి.
జవాబు.
విభాగ విక్రయశాలలు, అనగా ఒక యాజమాన్యం క్రింద అనేక విభాగాలను కలిగి ఉన్న ఒక పెద్ద తరహా చిల్లర వర్తక వ్యవస్థగా చెప్పవచ్చు. ప్రతీ విభాగం, ఒక ప్రత్యేక లేదా ఒక శ్రేణి గల వస్తువులతో ప్రావీణ్యత సాధించిన వాటిని విక్రయిస్తుంది. విభాగ విక్రయశాలలకు క్రింది ప్రయోజనాలు, లోపాలు ఉంటాయి.
ప్రయోజనాలు

  1. ఇది ఒక కేంద్రీయ స్థానంలో ఏర్పాటు చేయబడి వినియోగదారునికి అందుబాటులో ఉంటాయి.
  2. ఇది వివిధ రకాలైన వస్తువులను ఒకే యాజమాన్యం క్రింద ప్రత్యేకత సాధించిన రీతిలో విక్రయిస్తుంది. ఆ ప్రకారంగా ఇది కొనుగోలు దారుకు అనుకూలంగా ఉంటుంది.
  3. ఇది భారీస్థాయి పంపిణీ ఆదాలను పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. 4. ఇది మధ్యవర్తులను తొలగించడానికి సహాయపడుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

లోపాలు/నష్టాలు.

  1. విభాగ విక్రయశాలల నిర్వహణ వ్యయాలు ఆధికంగా ఉంటాయి.
  2. విక్రయశాలల పరిమాణం పెద్దదిగా ఉన్న కారణంగా కొన్ని సమయాలలో ఆయా విభాగాలకు వ్యక్తిగత దృష్టిని ఆకర్షించడానికి కష్టతరమవుతుంది.
  3. భారీ స్థాపన ఖర్చులు, భారీ నిర్వహణ మూలధన అవసరాల వల్ల సాధారణంగా ధరలు అధికంగా ఉంటాయి.
  4. దీనికి భారీ మూలధనం అవసరమవుతుంది. సాధారణంగా విభాగ విక్రయశాలలు సుదూరమైన ఆడంబర ప్రదేశాలలో నెలకొల్పారు. దాని వల్ల మధ్య తరగతి గృహాలున్న ప్రదేశాలలో నివసించే వ్యక్తులు, ఈ విక్రయశాలలను చేరుకోవటం కష్టతరం కావచ్చు.

ప్రశ్న 7.
బహుళ విక్రయశాలల ప్రయోజనాలు, నష్టాలు ఏవి ?
జవాబు.
ఒక నిర్ధిష్టమైన ప్రదేశం లేదా పట్టణం లేదా నగరం యొక్క వివిధ ప్రాంతాలలో ప్రామాణీకృత వస్తువులను విక్రయించే ఒకే రకమైన దుకాణాలను, బహుళ విక్రయశాలలంటారు. బహుళ విక్రయశాలలకు కొన్ని ఉదాహరణలుగా బాస్కిన్ రాబెన్స్, బాంబే డైయింగ్ను చెప్పవచ్చు. బహుళ విక్రయశాలలు క్రింది ప్రయోజనాలు, లోపాలు కలిగి ఉంటాయి.

I ప్రయోజనాలు

  1. ఇవి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి.
  2. ఇవి ప్రామాణీకృత వస్తువులను విక్రయిస్తాయి.
  3. ఖాతాదారులు ఈ సంస్థల పట్ల అత్యంత విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే, ఇవి ఎక్కడయినా, ఒకే రకమైన సంస్థలుగా నిర్వహించబడతాయి.
  4. ఇవి మధ్యవర్తులను తొలగించడానికి సహాయపడతాయి.
  5. ఇవి శ్రమ విభజన చేయడంలో, ప్రత్యేకీకరణ సాధించే విషయంలో సహాయపడతాయి.

II లోపాలు

  1. వీటి నిర్వహణ ఖర్చులు ఆధికంగా ఉంటాయి.
  2. ఇవి పరిమిత రకాలైన వస్తువులను విక్రయిస్తాయి.
  3. వీటికి నిల్వచేసే సౌకర్యాలు ఉండవు. వీటికి భారీ మూలధనం అవసరమవుతుంది.
  4. బహుళ విక్రయ శాలల నిర్వాహణకు భారీ మూలధనం అవసరం అవుతుంది.

ప్రశ్న 8.
పోస్టు ద్వారా వర్తకం లాభనష్టాలు ఏమిటో తెలపండి.
జవాబు.
పోస్టు ద్వారా వర్తకం ప్రయోజనాలు/లాభాలు:

  1. దీనికి అవసరమయ్యే మూలధనం సాపేక్షికంగా తక్కువగా ఉంటుంది.
  2. వస్తువులను కొనుగోలు చేయడం, అమ్మడం రెండింటిలో అనుకూలత ఉంటుంది.
  3. వస్తువులు సరసమైన ధరలతో లభ్యమవుతాయి.
  4. వీటి నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి.
  5. ఈ వర్తకంలో మధ్యవర్తులను తొలగించడం జరుగుతుంది.

పోస్టు ద్వారా వర్తకం లోపాలు/నష్టాలు:

  1. ఇది కొనుగోలుదారును సంతృప్తిపరచడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే, కొనుగోలుదారుడు వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత మాత్రమే, వస్తువులను పరిశీలించే వీలుంటుంది.
  2. వీటికి సమర్థవంతమైన నిర్వహణ లోపిస్తుంది.
  3. వీటికి నిల్వచేసే సౌకర్యం లోపిస్తుంది.
  4. ఎలక్ట్రానిక్ చిల్లర వర్తకం, ఎలక్ట్రానిక్ వాణిజ్యం పోస్టు ద్వారా చేసే చిల్లర వ్యాపారాన్ని అధిగమించింది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
టోకు వర్తకుడు చిల్లర వర్తకునికి అందించే సేవలు ఏమిటి ?
జవాబు.
చిల్లర వర్తకునికి అందించే సేవలు:

  1. సమయానుకూలంగా వస్తువులు లభ్యమయ్యేటట్లు చూడటం.
  2. క్రయవిక్రయాలు జరపడానికి మద్దతు ఇవ్వడం.
  3. అరువు (రుణ) సౌకర్యాలను అనుమతించడం.
  4. వస్తువులకు సంబంధించిన ప్రత్యేక పరిజ్ఞానాన్ని అందించడం.
  5. నష్టభయాన్ని చేపడుతూ, నష్ట భయాన్ని పంచిపెట్టడం.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

ప్రశ్న 2.
వర్తకంను ఎలా వర్గీకరించవచ్చు ?
జవాబు.

  1. ద్రవ్యానికి లేదా ద్రవ్యానికి సమానమైన విలువతో వస్తువులను, సేవలను కొనడం, అమ్మకం చేయడాన్ని “వర్తకం” అంటారు.
  2. భౌగోళిక సరిహద్దుల ఆధారంగా వర్తకాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
    a) స్వదేశీ వర్తకం/అంతర్గత వర్తకం
    b) విదేశీ వర్తకం/అంతర్జాతీయ వర్తకం..
  3. ఒకేదేశ భౌగోళిక సరిహద్దులలో నిర్వహించే వర్తకాన్ని స్వదేశీ వర్తకం అంటారు. స్వదేశీ వర్తకాన్ని మళ్ళీ ఇ) టోకు వర్తకం మరియు b) చిల్లర వర్తకంగా విభజించవచ్చు.
  4. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య కొనుగోలు, అమ్మకాలు జరిగితే దానిని విదేశీ వర్తకం అంటారు. విదేశీ వర్తకాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
    1. ఎగుమతి వర్తకం
    2. దిగుమతి వర్తకం
    3. మారు వర్తకం.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం 1

ప్రశ్న 3.
చిల్లర వర్తకుడు వినియోగదారులకు ఎలాంటి సేవలు అందిస్తాడు ?
జవాబు.
వినియోగదారులకు అందించే సేవలు:

  1. వస్తువులను త్వరితంగా, సమయానికి సప్లయి చేయడం.
  2. వస్తువులను విస్తృతమైన రకాలలో లభ్యమయ్యేటట్లు చూడటం.
  3. ఖాతాదారులకు నిపుణతతో కూడుకొన్న మార్గదర్శకత్వాన్ని అందించడం.
  4. వినియోగదారులకు ముఖాముఖి సంభాషణతో పాటు, వస్తు ప్రదర్శన ఏర్పాటు చేయడం.
  5. విక్రయానంతర సేవ గృహం వద్ద బట్వాడా.
  6. అనువైన మొత్తాలలో లేదా పరిమాణాలలో వస్తువులను సప్లయి చేయడం.
  7. అనుకూలమైన స్థానం/ప్రాంతంలో ఏర్పాటవడం.
  8. అరువు (రుణ) సౌకర్యాలను అనుమతించడం.

ప్రశ్న 4.
స్వదేశీ వర్తకం లక్షణాలు ఏమిటి ?
జవాబు.
అంతర్గత వర్తకానికి కింద పేర్కొన్న లక్షణాలు ఉంటాయి:

  1. ఒక దేశపు సరిహద్దులలో వస్తువుల కొనుగోళ్ళు, అమ్మకాలు జరుగుతాయి.
  2. స్వదేశంలోగల కొనుగోలుదారు వస్తు ధర చెల్లింపును అమ్మకందారుకు స్వదేశీ ద్రవ్య రూపంలో జరుపుతాడు.
  3. వర్తకుడు కొన్ని లాంఛనాలను (నియమాలను) మాత్రమే. పూర్తిచేయాల్సిన ఆవశ్యకతతో ఉంటాడు.
  4. వస్తువు లక్షణాలపై ఖాతాదారులకు పూర్తి అవగాహన ఉంటుంది.
  5. విస్తృతంగా విస్తరించబడి ఉన్న స్థానికత సాధించిన స్వదేశీ మార్కెట్ల నుంచి, వస్తు డిమాండులో సంభవించే మార్పుల కారణంగా, నష్టభయం అధికంగా ఉంటుంది.
  6. విదేశీ వర్తకంతో సరిపోల్చినప్పుడు, దేశ రాజకీయ, న్యాయాత్మక, సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక పరిసరాల ప్రభావం తక్కువగా ఉంటుంది.
  7. స్వదేశీ వినియోగదారుల అవసరాల ప్రకారం వస్తువులను తయారు చేయడం జరుగుతుంది. కొనుగోలుదారుల వద్ద నుంచి నిర్దిష్టమైన సలహాలను స్వీకరించరు.
  8. స్వదేశీ రవాణా పద్ధతిని మాత్రమే ఉపయోగిస్తూ, వస్తువు ఉత్పత్తయ్యే స్థానం నుంచి, వినియోగించబడే స్థానం వరకు, వస్తు ప్రవాహాన్ని కల్పించడం.

ప్రశ్న 5.
సంచార వర్తకులు అంటే ఎవరు ?
జవాబు.

  1. వస్తువుల విక్రయానికి ఎలాంటి స్థిరమైన ప్రదేశం లేని చిల్లర వర్తకులను “సంచార చిల్లర వర్తకులు” అంటారు.
  2. సంచార వర్తకులకు ఉదాహరణ:వీధి విక్రయదారులు, వీధి దుకాణాలు, నియత కాలిక సంచారకులు, చౌకధరల విక్రయదారులు.
  3. వివిధ రకాల సంచార చిల్లర వర్తకులను కింద వివరించడమైనది.
    A) వీధి విక్రయదారులు:ఈ రకపు సంచార వర్తకులు తమ ఖాతాదారులను వెతికే ఉద్దేశంతో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తిరుగుతారు. వీరు సాధారణంగా స్వల్పవెల కలిగిన వస్తువులను అమ్ముతారు.
    B)నియత కాలిక సంచారకులు:నియత కాలిక సంచారకులు క్రమబద్ధంగా లభ్యమయ్యే వస్తువులతో కొన్ని సందర్భాలకు అనుకూలించే వస్తువులతో వ్యాపారం సాగిస్తారు. దీనిని స్థానిక పరిభాషలో “సంత” లేదా “వారానికొకసారి జరిపే మార్కెట్” అంటారు.
    C) వీధి దుకాణాలు:పట్టణ ప్రాంతాలలో వీధి వర్తకులు తమ వస్తువులను కాలి బాటలపై వివిధ ప్రాంతాల వీధి మూలలో ప్రదర్శనకు ఉంచుతారు. వీరు సాధారణంగా తమ వ్యాపారాన్ని రైల్వేస్టేషన్, ఫుట్పాత్, వీధి మూలభాగాలు, తదితర సార్వజనీన ప్రదేశాల దగ్గర నిర్వహిస్తారు.
    D) చౌక ధర విక్రయదారులు:చౌక ధర విక్రయదారులు, ఒక నిర్ధిష్టమైన కాలానికి సంబంధించి, అద్దెపై తీసుకున్న చిన్న దుకాణాల నుంచి, తమ వ్యాపారాన్ని నిర్వహిస్తారు. ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో తమ వర్తకం సక్రమంగా జరగడం లేదని భావించిన వెంటనే మరొక ప్రాంతానికి తరలి వెళ్ళిపోతారు.

ప్రశ్న 6.
వినియోగదారుల సహకార విక్రయశాలల లాభనష్టాలు ఏమిటి ?
జవాబు.
వినియోగదారుల సహకార విక్రయశాలలు:

  1. కొనడానికి, అమ్మడానికి, సహకార సూత్రాలపై ఆధారపడి ఏర్పడిన, ఒక ఐచ్ఛికమైన వ్యక్తుల సముదాయాన్ని ఒక వినియోగదారుల సహకార విక్రయశాలగా” నిర్వచించవచ్చు.
  2. వినియోగదారుల సహకాక విక్రయశాల కింద పేర్కొన్న ప్రయోజనాలను, లోపాలను, కలిగి ఉంటుంది.

I. ప్రయోజనాలు / లాభాలు:

  1. వీటిలో అవసరమయ్యే మూలధనం సాపేక్షికంగా తక్కువగా ఉంటుంది.
  2. విక్రయశాలలో కొనడం, అమ్మడం, రెండింటిలో కూడా అనుకూలత ఉంటుంది.
  3. వీటిలో వస్తువులు సరసమైన ధరలకు లభ్యమవుతాయి.
  4. వీటి నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి.
  5. విక్రయశాలల నుంచి మధ్యవర్తులను తొలగించడం జరుగుతుంది.
  6. వీటి ద్వారా పెద్ద తరహా పంపిణీ యొక్క ఆదాలు లభ్యమవుతాయి.
  7. సహకార సంఘాలు ప్రభుత్వం నుంచి కొన్ని లాభాలను ప్రోత్సాహకాలను అనుభవిస్తాయి.

II. లోపాలు/నష్టాలు:

  1. వీటిలో మూలధనం పరిమితంగా ఉంటుంది.
  2. వీటిలో సమర్థవంతమైన నిర్వహణ లోపిస్తుంది.
  3. వీటికి నిల్వ చేసే సౌకర్యం లోపిస్తుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

ప్రశ్న 7.
SEZ ల ద్వారా కవర్ చేయబడే జోన్లు ఏమిటి ?
జవాబు.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడానికి ‘ప్రత్యేక ఆర్థిక క్షేత్రాల’ భావన ప్రవేశ పెట్టబడింది. ప్రత్యేక ఆర్థిక క్షేత్రాలకు సంబంధించిన చట్టాలు, ప్రోత్సాహకాలను రాష్ట్రాలు కాలానుగుణంగా ప్రకటించాయి.
సెజ్ల కింద ఉండే మండలాలు/జోన్లు:

  1. ఉచిత వర్తక మండలాలు
  2. ఎగుమతుల ప్రోసెసింగ్ క్షేత్రాలు
  3. స్వతంత్ర క్షేత్రాలు
  4. పారిశ్రామిక సముదాయాలు
  5. స్వేచ్ఛాపూర్వక ఓడరేవులు
  6. పట్టణ సంస్థల క్షేత్రాలు

తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రింది రంగాలకు సంబంధించి 29 SEZ లు ఉన్నాయి:

  1. బయోటెక్నాలజి
  2. సమాచార, సాంకేతిక ఆధార సేవలు
  3. ఔషధ సూత్రీకలు
  4. ఏరోస్పేస్, ప్రిసిషన్ ఇంజనీరింగ్
  5. ఎలక్ట్రానిక్, హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్.

అదనపు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అంతర్జాతీయ వర్తకం (విదేశీ వర్తకం).
జవాబు.
అంతర్జాతీయ/విదేశీ వర్తకం:

  1. రెండు లేదా అంతకుమించిన దేశాల వర్తకుల మధ్య కొనుగోలు, అమ్మకం జరపడాన్ని అంతర్జాతీయ వర్తకం అంటారు. “విదేశీ వర్తకం” అని కూడా పిలువవచ్చు.
  2. విదేశీ వర్తకాన్ని మళ్లీ ఎగుమతి వర్తకం, దిగుమతి వర్తకం, మారు వర్తకంగా ఉపవిభజన చేయవచ్చు.

ఎ) ఎగుమతి వర్తకం:

  1. ఒక నిర్దిష్టమైన దేశానికి చెందిన అంటే స్వదేశానికి చెందిన ఒక వర్తకుడు తన వస్తువులను మరొక దేశంలో నివసిస్తున్న ఒక వర్తకునికి లేదా ఒక ఖాతాదారునికి అమ్మినప్పుడు, దానినే ‘ఎగుమతి వర్తకం’ అని అంటారు.
  2. ఉదా: భారతదేశానికి చెందిన ఒక వర్తకుడు తన వస్తువులను, ఇరాన్ లోని ఒక ఖాతాదారుకు విక్రయించడం.

బి) దిగుమతి వర్తకం:

  1. ఒక వర్తకుడు స్వదేశంలో తన వర్తకాన్ని నిర్వహిస్తూ, మరొక దేశంలో నివసిస్తున్న ఒక వర్తకుని వద్ద నుంచి వస్తువులను కొనుగోలు చేయడాన్ని, దానినే ‘దిగుమతి వర్తకం’ అని అంటారు.
  2. ఉదా:భారతదేశం నుంచి ఒక వర్తకుడు సింగపూర్కు చెందిన ఒక వర్తకుని వద్ద నుంచి వస్తువులను కొనుగోలు చేయడం.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అంతర్గత (స్వదేశీ) వర్తకం.
జవాబు.

  1. ఒక నిర్దిష్టమైన దేశ భౌగోళిక సరిహద్దులోపల నిర్వహించే వర్తకాన్ని అంతర్గత వర్తకం అంటారు. దీనినే “స్వదేశీ వర్తకం” అని కూడా అంటారు.
  2. అంతర్గత వర్తకాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.’ అవి: A) టోకు వర్తకం B) చిల్లర వర్తకం.

ప్రశ్న 2.
టోకు వర్తకం.
జవాబు.

  1. వస్తువులను అధిక పరిమాణంలో కొనుగోలు చేసి చిన్న పరిమాణాలలో చిల్లర వర్తకులకు అమ్మడాన్ని టోకు వర్తకం అంటారు.
  2. టోకు వర్తకుడు ఉత్పత్తిదారునికి, చిల్లర వర్తకునికి మధ్య వారధిగా ఉంటాడు,

ప్రశ్న 3.
చిల్లర వర్తకం.
జవాబు.

  1. టోకు వర్తకుని నుండి వస్తువులను కొనుగోలుచేసి అతిస్వల్ప పరిమాణాలలో తుది వినియోగదారులకు అమ్మడాన్ని చిల్లర వర్తకం అంటారు.
  2. చిల్లర వర్తకుడు టోకు వర్తకునికి, వినియోగదానికి మధ్యగా ఉంటాడు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

ప్రశ్న 4.
సంచార వర్తకులు.
జవాబు.

  1. వస్తువుల విక్రయానికి ఎలాంటి స్థిర ప్రదేశంలేని చిల్లర వర్తకులను “సంచార చిల్లర వర్తకులు” అంటారు.
  2. వివిధ రకాల సంచార వర్తకులు:వీధి విక్రయాదారులు, వీధి దుకాణాలు, నియతకాలిక సంచారకులు, చౌక ధర విక్రయాలు.

ప్రశ్న 5.
వీధుల వెంట తిరిగి అమ్మే వ్యక్తులు (వీధి విక్రయదారులు).
జవాబు.
వీధి విక్రయదారులు:

  1. ఈ రకపు సంచార వర్తకులు తమ ఖాతాదారులను వెతికే ఉద్దేశంతో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తిరుగుతారు.
  2. ఈ వీధుల వెంట తిరిగి విక్రయించే వ్యక్తుల ప్రధాన లక్షణాలు కింది విధంగా ఉంటాయి:
    a) వారు కూరగాయలు, రకరకాల ఆట బొమ్మలు, పూవులు మొదలైన స్వల్ప వెల కలిగిన వస్తువులను అమ్ముతారు.
    b) వారు సాధారణంగా వ్యాపార చిహ్నం (గుర్తింపు) లేదా స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులను విక్రయిస్తారు.

ప్రశ్న 6.
నియత కాలిక సంచారకులు.
జవాబు.
నియత కాలిక సంచారకులు:
1) నియతకాలిక సంచారకులు క్రమబద్ధంగా లభ్యమయ్యే వస్తువులతో, కొన్ని సందర్భాలకు అనుకూలించే వస్తువులతో వ్యాపారం సాగిస్తారు. స్థానిక పరిభాషలో, దీన్ని ‘సంత’ లేదా “వారానికొకసారి జరిపే మార్కెట్” అంటారు.

  1. అంతర్గత (స్వదేశీ) వర్తకం.
  2. టోకు వర్తకం.

2) ఈ నియతకాలిక సంచార వర్తకుల లక్షణాలు కింది విధంగా ఉంటాయి:

  • వారు సాధారణంగా తమ వస్తువులను వివిధ మార్కెట్లలో వారంలో ఒకరోజు చొప్పున విక్రయిస్తారు.
  • వారు దీపావళి సందర్భంగా మట్టితో తయారు చేసే వస్తువులు, సంక్రాంతి సమయంలో గాలి పటాలు మొదలైన సందర్భాలలో వినియోగించే వస్తువులను అమ్మడానికి కూడా దుకాణాలను స్థాపిస్తారు.

ప్రశ్న 7.
వీధి విక్రయశాలలు.
జవాబు.

  1. ఈ రకపు చిల్లర వర్తకులు తమ వస్తువులను బల్లలపై ప్రదర్శించడం లేదా గుడారాల కింద ఉంచుతారు. కాబట్టి వీటిని ‘వీధి విక్రయశాలలుగా’ పిలుస్తారు.
  2. ఈ వీధి విక్రయశాలల లక్షణాలు కింది విధంగా ఉంటాయి:
    • ఈ దుకాణాలను పరిమిత స్థలంలో ఏర్పాటు చేస్తారు.
    • ఇవి తమ వస్తువులను ప్రత్యేకంగా తయారు చేసిన అరలలో లేదా బల్లలపై ప్రదర్శిస్తారు.

ప్రశ్న 8.
చౌకధర విక్రయదారులు.
జవాబు.

  1. చౌకధర విక్రయదారులు, ఒక నిర్దుష్టమైన కాలానికి సంబంధించి, అద్దెపై తీసుకున్న చిన్న దుకాణాల నుంచి, తమ వ్యాపారాన్ని నిర్వహిస్తారు.
  2. ఈ రకపు సంచార వర్తకం లక్షణాలు ఈ ప్రకారంగా ఉంటాయి.
    • వారు తమ వర్తకాన్ని అద్దెపై తీసుకున్న చిన్న దుకాణాల ద్వారా నిర్వహిస్తారు.
    • ఒక నిర్దుష్టమైన ప్రాంతంలో తమ వర్తకం సక్రమంగా జరగడం లేదని భావించిన వెంటనే మరొక ప్రాంతానికి తరలి వెళ్లిపోతారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

ప్రశ్న 9.
స్థిర దుకాణా చిల్లర వర్తకులు.
జవాబు.

  1. వస్తు విక్రయానికి సంబంధించి ఒక స్థిరమైన ప్రదేశం కలిగి ఉన్న చిల్లర వర్తకులను ‘స్థిర దుకాణ చిల్లర వర్తకులు’గా చెప్పవచ్చు.
  2. వారిని మళ్ళీ “చిన్న తరహా స్థిర చిల్లర స్థాయి దుకాణాలు, “పెద్ద తరహా స్థిర దుకాణాలు” గా వర్గీకరించవచ్చు.

ప్రశ్న 10.
సాధారణ విక్రయశాలలు.
జవాబు.

  1. వీటిని సాధారణంగా నివాసయోగ్యమైన ప్రాంతాలలో చిన్న దుకాణాలుగా, సంస్థలుగా నెలకొల్పుతారు. ఇవి సాధారణంగా అత్యవసర వస్తువులను విక్రయిస్తాయి.
  2. సాధారణ విక్రయశాల లక్షణాలు:
    • ఇవి అనేక రకాలైన వినియోగదారుల వస్తువులతో వ్యవహరిస్తాయి.
    • ఇవి వస్తువుల నగదుపై, అరువు ఆధారంగా కూడా వ్యవహరిస్తాయి.

ప్రశ్న 11.
ఏకైక వస్తుశ్రేణి విక్రయశాలలు.
జవాబు.

  1. ఒకే రకపు/ఒకే విధమైన వస్తువులతో వ్యాపారాన్ని నిర్వహించే చిల్లర వర్తకులను ఏకైక వస్తుశ్రేణి విక్రయశాలలు అంటారు.
  2. ఈ విక్రయశాలల్లో ఒకే శ్రేణిలో వివిధ రకాలైన వస్తువులు అమ్ముతారు. ఉదాహరణకు కూరగాయలు, బేకరి వస్తువులు, పాదరక్షలు, ప్లాస్టిక్ వస్తువులు మొదలైన వస్తువులతో వ్యాపారాన్ని నిర్వహిస్తారు.

ప్రశ్న 12.
ప్రత్యేకత సాధించిన విక్రయశాలలు.
జవాబు.
ప్రత్యేకత కలిగిన విక్రయశాలలు:

  1. ప్రత్యేకత కలిగిన విక్రయశాల, ఒక ప్రత్యేక రకానికి చెందిన వస్తువులతో వ్యాపారం చేస్తుంది. ఇవి ఒకే రకపు వస్తువులను మాత్రమే విక్రయించే ప్రత్యేకతను (ప్రావీణ్యత) కలిగి ఉంటాయి.
  2. ఉదాహరణకు, రొట్టెను విక్రయించే ఒక చిల్లర వర్తకుడ, మోడ్రన్, బ్రిటానియా, స్పెన్సర్, హెరిటేజ్ లాంటి వివిధ కంపెనీలు తయారు చేసిన రొట్టెలను విక్రయించవచ్చు.

ప్రశ్న 13.
వీధి దుకాణాలు..
జవాబు.
పట్టణ ప్రాంతాలలో వీధి వర్తకులు తమ వస్తువులను కాలిబాటలపై, వివిధ ప్రాంతాల వీధి మూలలలో ప్రదర్శనకు ఉంచుతారు. వారు సాధారణంగా తమ వ్యాపారాన్ని రైల్వేస్టేషన్లు, వీధి మూలభాగాలు, తదితరమైన సార్వజనీన ప్రదేశాల దగ్గర నిర్వహిస్తారు.

ప్రశ్న 14.
ఒకసారి ఉపయోగించిన వస్తు విక్రయశాలలు.
జవాబు.
ఒకసారి ఉపయోగించిన వస్తువుల దుకాణాలు లోగడవాడిన వస్తువులతో లేదా పాత వస్తువులతో వ్యాపారం చేస్తారు. వీరు ఒకసారి ఉపయోగించిన వస్తువులతో వ్యాపారం నిర్వహిస్తారు. అందువల్ల వస్తువులను తక్కువ ధరకు అమ్ముతారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

ప్రశ్న 15.
లోపాలున్న వస్తువు విక్రయించే దుకాణాలు.
జవాబు.

  1. నాణ్యత లోపించిన, లోపాలున్న వస్తువులను విక్రయించే దుకాణాలను లోపాలున్న వస్తువు విక్రయించే దుకాణాలు అంటారు.
  2. లోపాలున్న వస్తువులను డిస్కౌంట్ చేసిన ధరకు విక్రయిస్తారు.

ప్రశ్న 16.
పెద్ద తరహా స్థిరమైన చిల్లర దుకాణాలు.
జవాబు.
పెద్ద తరహా స్థిరమైన చిల్లర వర్తకులు భారీ స్థాయిలో వ్యాపారాన్ని నిర్వహిస్తారు. వాటిని అధిక పెట్టుబడితో నెలకొల్పుతారు. అవి భారీ మొత్తంలో గల వస్తువులతో వ్యాపారాన్ని నిర్వహిస్తాయి. ఈ చిల్లర వ్యాపార సంస్థలకు, విక్రయశాలల ఏర్పాటుకు అధిక మొత్తాలు అవసరమవుతాయి.
ఉదా:బహుళ విక్రయశాలలు, విభాగ విక్రయశాలలు మొదలైనవి.

ప్రశ్న 17.
బహుళ విక్రయశాలలు.
జవాబు.

  1. ఒక నిర్దుష్టమైన ప్రదేశం లేదా పట్టణం లేదా నగరం యొక్క వివిధ ప్రాంతాలలో ప్రామాణీకృత వస్తువులను విక్రయించే ఒకే రకమైన దుకాణాలను, బహుళ విక్రయశాలలంటారు.
  2. బహుళ విక్రయశాలలకు కొన్ని ఉదాహరణలుగా బాస్కిన్ రాబిన్స్, బాంబే డైయింగ్ను చెప్పవచ్చు.

ప్రశ్న 18.
వినియోగదారుల సహకార విక్రయశాలలు.
జవాబు.

  1. వస్తువులను కొనడానికి, అమ్మడానికి, సహకార సూత్రాలపై ఆధారపడి ఏర్పడిన ఒక ఐచ్ఛికమైన వ్యక్తుల సముదాయాన్ని “వినియోగదారులు సహకార విక్రయశాలలు” అంటారు.
  2. వీటి నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి మరియు వీటికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి.

ప్రశ్న 19.
SEZ (సెజ్).
జవాబు.

  1. సెజ్ అనగా ప్రత్యేక ఆర్థిక క్షేత్రాలు/ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు.
  2. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడానికి సెజ్లను ప్రవేశపెట్టారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

ప్రశ్న 20.
మారువర్తకం.
జవాబు.

  1. ఒకదేశం నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను వేరే దేశానికి ఎగుమతి చేయడాన్ని మారు వర్తకం అంటారు.
  2. సూక్ష్మంగా చెప్పాలంటే, దిగుమతి చేసుకున్న వస్తువులను తిరిగి ఎగుమతి చేసే పద్ధతినే మారువర్తకం అంటారు.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 7th Lesson భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 7th Lesson భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత ఎన్నికల సంఘం నిర్మాణం. అధికారాలు, విధులపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
ఎన్నికల సంఘం నిర్మాణం :
రాజ్యాంగంలోని 324 నిబంధన ప్రకారం ‘ఎన్నికల సంఘం’ ప్రధాన ఎన్నికల కమిషనర్, భారత రాష్ట్రపతి కాఆనుగుణంగా నిర్దేశించే సంఖ్య ఆధారంగా ఇతర ఎన్నికల కమిషనర్లతో ఏర్పాటవుతుంది. వివిధ నిబంధనల కనుగుణంగా భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనరు, ఇతర ఎన్నికల కమిషనర్లను నియమిస్తారు.

అధికారాలు విధులు :
భారత ఎన్నికల సంఘం విస్తృతమైన అధికారాలను కలిగి, విదులను నిర్వహిస్తుంది.

  1. ఎన్నికల సంఘం భారతదేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు గుర్తింపు నిచ్చి, రాజకీయ పార్టీలను జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఉపప్రాంతీయ పార్టీలుగా వర్గీకరిస్తుంది. రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయిస్తుంది.
  2. ఎన్నికల నిర్వహణకై ఓటర్ల జాబితాలు రూపొందిస్తుంది. 18 సంవత్సరాలు వయస్సు నిండిన పౌరులందరినీ ఓటర్లుగా నమోదు చేసుకుంటుంది. ఓటర్ల జాబితాకు మార్పులు చేర్పులు చేస్తుంది.
  3. సముచిత తేదీలతో ఎన్నికల షెడ్యూళ్ళను ప్రకటిస్తుంది. (సాధారణ ఎన్నికలు, ఉపఎన్నికలు రెండింటినీ ప్రకటిస్తుంది).
  4. ఎన్నికలలో రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన ఎన్నికలు ప్రవర్తన నియమావళిని రూపొందిస్తుంది.
  5. దేశంలో ఎన్నికల యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తుంది. ఇతర పరిపాలన శాఖలు, విభాగాల సహాయంతో ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తుంది.
  6. ఎన్నికల సమయంలో హింస, రిగ్గింగు వంటి అక్రమాలు జరిగినప్పుడు ఎన్నికలను రద్దు చేయడం లేదా వాయితా వేయడం చేస్తుంది.
  7. పార్లమెంటు సభ్యులు లేదా రాష్ట్ర శాసన సభ్యుల అనర్హతలకు సంబంధించి భారత రాష్ట్రపతికి లేదా సంబంధిత రాష్ట్ర గవర్నర్కు సలహాలు, సూచనలు చేస్తుంది.
  8. ఎన్నికల సంఘం భారతదేశంలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర అసెంబ్లీలు, రాష్ట్రశాసన మండలి మొదలైన వాటికి సాధారణ ఎన్నికలను నిర్వహిస్తుంది. అంతేకాక, భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు కూడా ఎన్నికలు నిర్వహిస్తుంది.
  9. ఎన్నికల వివాదాలను పరిష్కరించడానికి ఎన్నికల ట్రిబ్యునళ్ళను నియమిస్తుంది. రాజకీయ పార్టీలకు గుర్తింపు, ఎన్నికల చిహ్నాల కేటాయింపు, ఎన్నికల వివాదాలు తదితర అంశాల్లో వివిదాలను పరిష్కరించడానికో ఒక న్యాయస్థానం వలె పనిచేస్తుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 2.
భారత రాజకీయ పార్టీల వ్యవస్థ లక్షణాలను వివరించండి.
జవాబు.
భారతదేశంలో రాజకీయ పార్టీల ప్రధాన లక్షణాలను ఈ కింది విధంగా పేర్కొనవచ్చు.

1. బహుళ పార్టీ వ్యవస్థ :
స్వాతంత్య్రానంతరం అనేక దశాబ్దాల పాటు భారతదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏకపార్టీ ప్రాబల్య వ్యవస్థ కొనసాగింది. కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్య వ్యవస్థ ఉండేది. అయితే 1990 దశకం నుంచి జరిగిన అనేక పరిణామాలు భారతదేశం ఒక బహుళపార్టీ వ్యవస్థగా అవతరించడానికి దోహదం చేశాయి. ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలు 53 ప్రాంతీయ రాజకీయ పార్టీలు ప్రబలంగా పనిచేస్తున్నాయి.

2. సిద్ధాంత భావజాలాల సమాచారం :
వివిధ రాజకీయ పార్టీలు అనుసరించే రాజకీయ భావజాలాల ప్రాతిపదికన భారదేశంలోని రాజకీయ పార్టీలను సాంప్రదాయ భావజాల పార్టీలు, వామ పక్ష భావజాల పార్టీలు, మధ్య మార్గ భావజాల పార్టీలుగా వర్గీకరించవచ్చు. భారతీయ జనతా పార్టీ, శివసేన తదితర పార్టీలు భారతీయ సంస్కృతి, వారసత్వం సాంప్రదాయ ప్రతీకలు, గతవైభవవాదం, హిందుత్వ తదితర అంశాలపట్ల విశ్వాసాన్ని కలిగి సాంప్రదాయ భావజాల పార్టీలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.

కమ్యూనిస్టు పార్టీలు, ఫార్వర్డ్ బ్లాక్ తదితర పార్టీలు సామ్యవాద సిద్ధాంత భావజాలాన్ని విశ్వసించి పేదల పక్షం వహించే వామపక్ష పార్టీలుగా గుర్తింపు పొందాయి ఈ రెండు ప్రధాన భావజాలాలను, ఇతర భావజాలాలను మేళవించి అనేక ఇతర రాజకీయ పార్టీలు మధ్యేమార్గ భావజాల పార్టీలుగా ప్రచారంలో ఉన్నాయి.

3. కార్యకర్తల బలం గల పార్టీలు – శాశ్వత కార్యకర్తలు లేని పార్టీలు :
భారతదేశంలోని అనేక రాజకీయ పార్టీలు రాజకీయ కార్యకర్తలు ఇతర నిర్వాహకులను ఎన్నికల సందర్భంగా మాత్రమే నియమించుకుంటాయి. శాశ్వత కార్యకర్తలు లేకపోవడంతో తాత్కాలికంగా ఎన్నికల సమయంలో మాత్రమే కొన్ని రాజకీయ పార్టీలు కార్యకర్తలను ఈ విధంగా నియమించుకుంటాయి.

అయితే భారతీయ జనగా పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సస్టు పార్టీ తెలుగుదేశం పార్టీ తదితర పార్టీలు బలీయమైన కార్యకర్తల వ్యవస్థలను కలిగి ఎన్నికల సమయంలోను, సాధారణ సమయాల్లోను చురుకుగా పనిచేస్తాయి.

4. అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం :
భారతదేశంలోని చాలా రాజకీయ పార్టీలు తమతమ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వవు. కొన్ని పార్టీలను మినహాయిస్తే మిగిలిన పార్టీలన్నీ క్షేత్ర స్థాయిలో గ్రామాల నుంచి, జాతీయ స్థాయిలో కేంద్ర కార్యవర్గం వరకు అన్ని పదవులకు అధిష్టానవర్గం నామినేట్ చేసే నాయకుడే ఎక్కువగా ఉంటారు. ప్రధాన సమస్యలపై పార్టీల్లో చర్చ కూడా ఉండదు. అధిష్టానం నిర్ణయమే అందరికీ శిరోధార్యం అవుతుంది.

5. నిరంతర చీలికలు-వర్గవైషమ్యాలు, :
భారతదేశంలోని రాజకీయ పార్టీలు నాయకుల మధ్య విభేదాల కారణంగా చీలికలకు గురి అవుతాయి. నాయకుల మధ్య అభిప్రాయభేదాలు, సంఘర్షణలు వివిధ పార్టీలలో చీలికలకు, అనేక ఇతర రాజకీయ పార్టీల అవతరణకు దారితీస్తాయి. దేశంలోని ప్రధాన జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వర్గ వైషమ్యాలు, ముఠాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

6. రాజకీయ సంకీర్ణాలు :
భారతదేశంలోని అనేక రాజకీయ పార్టీలు ఇతర పార్టీలతో రాజకీయ సర్దుబాట్లు, సంకీర్ణాలు, మైత్రికూటములు, ఏర్పరచుకోవడానికి ఆసక్తి కనబరుస్తాయి. ఈ సంకీర్ణాలు, మైత్రీకూటములు ఎన్నికల పూర్వ మైత్రి, ఎన్నికల అనంతర మైత్రి కూటములుగా ఏర్పడతాయి.

7. జనాకర్షక నాయకత్వం :
భారతదేశంలోని అనేక రాజకీయ పార్టీలు ఆ పార్టీల్లోని నాయకుల జనాకర్షణ శక్తిపై ఆధారపడతాయి. దీనినే జనాకర్షక నాయకత్వమని వ్యవహరిస్తారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 3.
ఫిరాయింపుల నిరోధక చట్టం లక్షణాలను విశదీకరించండి.
జవాబు.
ఫిరాయింపుల నిరోధక చట్టం లక్షణాలు :

1. రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు అనర్హులయ్యే సందర్భం :
ఒక రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధి. ఎన్నికలలో గెలిచిన తరువాత మరో రాజకీయ పార్టీలోకి ఫిరాయించినప్పుడు ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం అనర్హతను ఎదుర్కొంటారు. అంతేకాక, పార్లమెంటుకు లేదా రాష్ట్రశాసన సభలకు ఒక పార్టీ ద్వారా ఎన్నికైన సభ్యుడు ఎ) ఆ పార్టీకి రాజీనామా చేసేటప్పుడు లేదా బి) తాను ఎన్నికైన పార్టీ జారీ చేసే విప్ (whip) ఆదేశాలకు వ్యతిరేకంగా పార్లమెంటులోగానీ, రాష్ట్రశాసనసభల్లో కానీ ఏదైనా అంశానికి జరిపే ఓటింగ్కు దూరంగా ఉండడం లేదా భిన్నంగా ఓటువేయడం జరిగినప్పుడు, అనర్హత వేటును ఎదుర్కొంటాడు.

2. ఇండిపెండెంట్ సభ్యులు, నామినేషన్ సభ్యులు అనర్హులయ్యే సందర్భం :
పార్లమెంటుకు లేదా రాష్ట్రశాసన సభలకు ఒక సభ్యుడు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన తరువాత ఏదైనా ఒక రాజకీయ పార్టీలో చేరితే దాని ఫలితంగా తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఇదే విధంగా పార్లమెంటుకు లేదా రాష్ట్రాల శాసన సభలకు నామినేట్ అయిన సభ్యుడు తాను నామినేట్ అయిన ఆరునెలల తరువాత ఏదైనా ఒక రాజకీయ షార్టీలో చేరినప్పుడు సభ్యత్వానికి అనర్హుడవుతాడు.

3. ఫిరాయింపుల నిరోధక చట్టం-కొన్ని మినహాయింపులు :
ఒక రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికైన సభ్యులు ఆ పార్టీ సంఖ్యా బలంలోని2/3 వంతు సభ్యులతో చీలిక ద్వారా మరొక పార్టీలో చేసినప్పుడు లేదా చీలిక పరంగా ఉండడానికి నిర్ణయించుకున్నప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలు వారికి వర్తించవు.

4. పార్టీనుంచి బహిష్కరణలకు వర్తించని నిబంధనలు :
ఏదైనా ఒక రాజకీయ పార్టీ తమ పార్టీ ద్వారా ఎన్నికైన సభ్యుని ఆ పార్టీ నుంచి బహిష్కరించనప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలు ఆ సభ్యునికి వర్తించవు. ఆ సభ్యుడు అనర్హతను ఎదుర్కొనే అవకాశం లేదు. ఎన్నికైన పదవీకాలాన్ని సభ్యుడు పూర్తి చేయవచ్చు.

5. ఫిరాయింపుల నిరోధక చట్టం నిర్ణయాత్మక అధికారం :
పార్లమెంటు లేదా రాష్ట్రాల శాసనసభల సభాధ్యక్షులకు (స్పీకర్) సభ్యులపై ఫిరాయింలు నిరోధక చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది. సభ్యుని ఎన్నిక జరిగిన సభ పదవీ కాలంలో అతని అనర్హతలకు సంబంధించిన అన్ని అంశాలపైన నిర్ణయాత్మక అధికారం స్పీకర్కు మాత్రమే ఉంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
కేంద్ర ఎన్నికల సంఘం గురించి వివరించండి.
జవాబు.
భారతదేశంలో ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణలో అన్ని ఎన్నికలు నిర్వహిస్తారు. రాజ్యాంగంలోని 324 నిబంధన ప్రకారం, “ఎన్నికల సంఘం” ప్రధాన ఎన్నికల కమిషనర్, భారత రాష్ట్రపతి కాలానుగతంగా నిర్దేశించే సంఖ్య ఆధారంగా ఇతర ఎన్నికల కమిషనర్లతో ఏర్పాటవుతుంది. వివిధ నిబంధనలకు అనుగుణంగా భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనర్ ను, ఇతర ఎన్నికల కమిషనర్లను నియమిస్తారు.

ఈ విధంగా భారతదేశంలో ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తుంది. భారతదేశంలోని అన్ని రకాల ఎన్నికలను నిర్వహించి, పర్యవేక్షించి, నియంత్రణ చేసే అధికారాలను రాజ్యాంగం ఎన్నికల కమిషనుకు దాఖలు పరిచింది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఇతర ఎన్నికల కమిషనర్లు ఉన్నారు. వీరిలో ప్రధాన ఎన్నికల అధికారి ఎన్నికల సంఘానికి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. వీరిని భారత రాష్ట్రపతి నియమిస్తారు.

సాధారణంగా వీరి పదవీకాలం ఆరు సంవత్సరాలు లేదా వారి వయస్సు 65 సంవత్సరాలు వచ్చేవరకు ఉంటుంది. రాష్ట్రపతి విశ్వాసం మేరకు పదవిలో కానసాగుతారు. వారు తమ పదవికి రాజీనామా చేయవచ్చు. అలాగే అసమర్థత, అనుచిత ప్రవర్తన, రాజ్యాంగ బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేకపోన్వీడం తదితర కారణాలపై వారిని పదవి నుంచి తొలగించవచ్చు.

ఈ తొలగింపు ప్రక్రియలో భాగంగా పార్లమెంటులోని రెండు సభలు ఒక తీర్మానాన్ని ఒక్కొక్క సభలో హాజరై, ఓటింగ్లో పాల్గొన్న సభ్యులు సంపూర్ణ మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 2.
భారతదేశంలో ఎన్నికల సంస్కరణలపై ఒక సంక్షిప్త వ్యాఖ్య రాయండి.
జవాబు.
భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు :

1. రాజకీయాలు నేరపూరితం కావటం-నివారణ చర్యలు :
దేశంలో రాజకీయాలు కొన్ని ప్రాంతాలలో నేరపూరితం అయ్యే ధోరణి వృద్ధి చెందింది. ఈ సమస్యను నివారించేందుకై సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలతోపాలు, వారిపై ఉన్న నేరారోపణలకు సంబంధించిన కేసుల వివరాలను జతపరచాలి.

2. ఎన్నికలలో ధనప్రభావం విపరీతంగా పెరగటం-ఎన్నికల వ్యయంపై పరిమితులు :
భారతదేశ ఎన్నికలలో ధన ప్రభావం విపరీతంగా పెరిగింది. ఎన్నికలలో అవాంఛనీయమైన అక్రమాలు నివారించటానికి 2003 సంవత్సరం నుండి ఎన్నికల సంఘం ఎన్నికల వ్యయంపై పరిమితులు విధిస్తూ వస్తోంది.

3. ఎన్నికలలో కులం, మతం తదితర అంశాల వినియోగం :
ఎన్నికలలో కొంతమంది అభ్యర్ధులు కులం, మతం, లింగపర తెగలు మొదలగు అంశాలతో ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఎన్నికల సంఘం నివారణాచర్యలు చేపట్టింది.

4. ఎన్నికల ప్రవర్తన నియమావళి :
భారత ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు, అధికారులు, సాధారణ ప్రజలు పాటించవలసిన ప్రవర్తన నియమావళికి కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించటం జరిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 3.
భారత జాతీయ కాంగ్రెస్ గురించి పేర్కొనండి.
జవాబు.
భారత జాతీయ కాంగ్రెస్కు 1885లో ఏర్పరచారు. భారత జాతీయోద్యమంలో ఈ పార్టీ గణనీయమైన పాత్ర పోషించింది. కొద్దిమంది చరిత్రకారులు భారత జాతీయోద్యమ చరిత్రను భారత జాతీయ కాంగ్రెస్తో సరిపోల్చారు. స్వాతంత్ర్యానంతర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ఆధిపత్య పార్టీగా 1980 దశకం వరకు కొనసాగింది.

ఈ పార్టీ స్వాతంత్రానంతరం తొలి మూడు దశాబ్దాల కాలం కేంద్ర ప్రభుత్వంలో ఏకఛత్రాధిపత్యంతో అధికారంలో కొనసాగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధి తదితరులు నాయకత్వం వహించి,

దేశ ప్రధాన మంత్రులుగా ఉండేవారు. అదే సందర్భంలో భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయింది. అనతికాలంలోనే 1980 ఎన్నికలలో విజయం సాధించి కేంద్ర ప్రభుత్వంలోను అనేక రాష్ట్రాల్లోను అధికారంలోకి వచ్చింది.

1984లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అప్పటి భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి హత్యకు గురయ్యారు. తదనంతరం జరిపిప సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా తిరిగి అధికారంలోకి వచ్చారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 4.
భారతీయ జనతా పార్టీ గురించి చర్చించండి.
జవాబు.
భారతీయ జనతా పార్టీని 1980 ఏప్రిల్, 6న లాంఛనప్రాయంగా ఏర్పరిచారు. అటల్ బిహారీ వాజ్పాయ్ నాయకత్వంలో ఈ పార్టీ ఏర్పడింది. ఈ పార్టీకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సాంఘిక-సాంస్కృతిక సంస్థతో బలమైన సంబంధాలు ఉన్నాయి.

హిందుత్వ భావజాలానికి కట్టుబడి ఉంటుంది. పార్టీ అవతరణ మొదలు ఈ పార్టీ క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఒక బలీయమైన శక్తిగా రూపొందింది. లోక్ సభలో ఆధిక్యం సంపాదించడం ద్వారా కేంద్రంలో 1998, 1999, 2014, 2019 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అటల్ బిహారీ వాజ్పాయ్, నరేంద్రమోడీ ఈ పార్టీ తరఫున ప్రధానమంత్రులుగా ఉన్నారు. భారీతీయ జనతా పార్టీ ఈన మిత్రపక్షాలతో కలిసి జాతీయ ప్రజాస్వామ్యకూటమిని (National Democratic Alliance-NDA) ఏర్పరచింది. ఈ పార్టీ సిద్ధాంత భావజాలాలలో సురక్ష (భధ్రత), సూచిత (పరిశుద్ధ-పారదర్శకత), స్వదేశీ (దేశీయ వస్తువుల వినియోగానికి ప్రోత్సాహం, సంరక్ష (సంక్షేమం) తదితర అంశాలు ఉన్నాయి.

భారతదేశ సాంస్కృతిక జాతీయవాదంపట్ల ఈ పార్టీకి విశ్వాసం ఉంది. గాంధేయ సామ్యవాదాన్ని విశ్వసిస్తుంది. అయోధ్యలో రామమందిన నిర్మాణం, భారతదేశంలోని ఉన్నత పదవులు చేపట్టకుండా విదేశాలలో జన్మించిన వారినవ అడ్డకోవడం, పార్లమెంటులో మూడవ వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్లు ఈ పార్టీ ఎన్నికల ప్రణాళిక (మానిఫెస్టో)లో ప్రధానంగా ప్రస్తావించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 5.
నమూనా ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎం.సి.సి) అనగానేమి ?
జవాబు.
భారత ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, అధికారులు, సాధారణ ప్రజలు పాటించవలసిన ప్రవర్తన నియమావళిని కొన్ని మార్గదర్వకాల రూపంలో విడుదల చేస్తుంది. దీనినే నమూనా ఎన్నికల నియమావళిగా పేర్కొంటారు.

వీటిలో, ప్రభుత్వం ఎన్నికల సమయంలో కొత్త ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా నిరోధించడం, ప్రభుత్వ సంస్థలు ఎన్నికల సమయంలో కొత్త నియామకాలు చేపట్టకుండా నివారించడం, ఎన్నికల ప్రచారంపై హేతుబద్ధమైన పరిమితులు విధించడం, సాధారణ జనజీవనం ఎన్నికల సమయంలో ఎలాంటి గందరగోళం ఎదుక్కొనకుండా చేడడం, ఎన్నికలలో మద్యం, సారా తదితర, మత్తు పదార్థాలు పంపిణీ చేయకుండా నిరోధించడం, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అధికార దుర్వినియోగం చేయకుండా నివారించడం తదితర అంశాలు ఉన్నాయి.

పోలింగ్ రోజున అన్ని రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల అధికారులు ఎన్నికల అధికారులు, సిబ్బందికి తమవంతు పూర్తి సహకారాన్ని అందించాల్సి ఉంటుంది. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో అభ్యర్ధులు తమ తమ ఎన్నికల చిహ్నాలను, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ప్రదర్శించడం నిషేధం, ఎన్నికల నమూనా ప్రవర్తన నియమావళి పూర్తిగా అమలుచేయడానికి ఎన్నికల సంఘం పరిశీలకులను నియమిస్తుంది. దీనికి సంబంధించిన ఫిర్యాదులు ఎన్నికల పరిశీలకులకు సమర్పించవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు అనగానేమి ?
జవాబు.
ముద్రణ చేసిన బ్యాలట్ పేపర్ పద్ధతి స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. వీటిని ఈవిఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీను) గా వ్యవహరిస్తారు. వీటిలో బ్యాలట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అనే పరికరాలు ఉంటాయి. బ్యాలట్ యూనిట్లో ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు, వారి ఎన్నికల చిహ్నాలు ఉంటాయి. ఓటర్లు కంట్రోల్ యూనిట్ ద్వారా ఓటు వేస్తారు. కంట్రోల్ యూనిట్ను బ్యాలట్ యూనిట్తో అనుసంధానిస్తారు.

బారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2013 సంవత్సరంలో నోటా (NOTA) అనే బటన్ ఏర్పాటు చేశారు. ఒక ఓటరు ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులెవ్వరూ సరైన వారు కాదని భావించినప్పుడు పైన పేర్కొన్న అభ్యర్థులెవ్వరూ కాదు (None of the abvoe) అనే బటన్ వినియోగించుకోవచ్చు.

ప్రశ్న 2.
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ?
జవాబు.
భారతదేశంలో ఎన్నికల సంఘాన్ని 1950 జనవరి 25వ తేదీన ఏర్పరచారు. ఎన్నికల సంఘం స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 25వ తీదీని జాతీయ నియోజకుల దినోత్సవం (National Voters Day) గా పాటిస్తారు. దేశంలోని యువకులు ఓటర్లుగా నమోదై, రాజకీయ ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొనే విధంగా వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 3.
ఎన్నికలలో ధన ప్రభావం వృద్ధిచెందడాన్ని వివరించండి.
జవాబు.
భారతదేశ ఎన్నికలలో ధనప్రభావం విపరీతంగా పెరుగుతోంది. ప్రభుత్వానికి లెక్కలు చూపని నల్లధనం ఉపయోగించి కొద్దిమంది అభ్యర్థులు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడటం జరుగుతోంది. ధనాన్ని ఉపయోగించి కొద్దిమంది నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టడం, ఓట్లు కొనుగోలు చేయటం, ఓటర్లకు క్రికెట్ కిట్లు, చీరలు, మొదలైన బహుమతులను ఎరవేయటం, కుల సంఘాలకు, ఇతర సంఘాలకు భారీగా విరాళాలు ఇవ్వటం సర్వసాధారణమైంది.

ప్రశ్న 4.
ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు (E.P.I.C) లను వివరించండి.
జవాబు.
`ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డులనే ఓటరు గుర్తింపు కార్డులని పేర్కొంటారు. భారత ఎన్నికల సంఘం ఓటర్లకు వారి ఫొటో, అడ్రస్ తదితర వివరాలతో కూడిన గుర్తింపు కార్డును జారీ చేస్తుంది. పోలింగ్ జరిగే రోజు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ ఓటరు గుర్తింపు కార్డు తీసుకురావాల్సి ఉంటుంది.

ఈ కార్డుకు ప్రత్యామ్నాయంగా ఏ ఇతర గుర్తింపు కార్డునైనా ఓటర్లు పోలింగ్ కేంద్రంలో చూపి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికలలో జరిగే బోగస్ ఓటింగ్ నివారించడానికి ఈ గుర్తింపు కార్డు పద్ధతిని ఒక ఎన్నికల సంస్కరణగా ప్రవేశపెట్టారు.

ప్రశ్న 5.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) గురించి తెలపండి.
జవాబు.
భారత కమ్యూనిస్టు పార్టీలో 1964లో ఏర్పడిన చీలిక ఫలితంగా మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (సిపిఎం) ఏర్పడింది. పార్టీ ఏర్పడిన అనతికాలంలోనే ఒక బలీయమైన శక్తిగా మారి విస్తరించింది. ఈ పార్టీ ఏర్పరిచిన సంకీర్ణాల ఆధారంగా కేరళ, పశ్చిమ ‘బెంగాల్, త్రిపుర తదితర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది.

ఈ పార్టీ సిద్దాంత భావజాల అంశాల్లో భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం, ప్రాథమిక హక్కుల్లో పనిచేసే హక్కు చేర్చడం, బహుళజాతి సంస్థలను జాతీయకరణ చేయడం, కార్మికులు, సంఘాల హక్కుల పరిరక్షణ, భూసంస్కరణలు తదితరాలు ప్రధానమైనవి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 6.
శివసేనపై ఒక లఘు వ్యాఖ్య రాయండి.
జవాబు.
శివసేన పార్టీని మహారాష్ట్రలో బాలా థాకరే 1966లో స్థాపించారు. మరాఠి ప్రజల సంస్కృతి, గౌరవ మర్యాదల పరిరక్షణ ధ్యేయంగా ఈ పార్టీ ఏర్పడింది. దీనితో బాటు హిందుత్వ భావజాలానికి కట్టుబడి, అల్పసంఖ్యాక వర్గాలను సంతృప్తిపరచే విధానాలను వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.

ప్రశ్న 7.
సిఫాలజీ అనగానేమి ?
జవాబు.
రాజనీతిశాస్త్రం అధ్యయనంలో భాగంతా ఎన్నికల పరిమాణాత్మక విశ్లేషణ మరియు బ్యాలెటింగ్, ఎన్నికలను శాస్త్రీయంగా వివరించి, విశ్లేషించటాన్ని ‘సిఫాలజీ’ అంటారు. దీనిలో భాగంగా ఓటర్ల ఎన్నికల ప్రవర్తన, మనోగతాలను అధ్యయనం చేయడం జరుగుతుంది.

ప్రశ్న 8.
ఎన్నికల సంస్కరణలపై ఏర్పడిన ఏవేని రెండు కమిటీలు లేదా కమిషన్లు పేర్కొనండి.
జవాబు.
ఎ) సంయుక్త పార్లమెంటరీ కమిటీ (1972).
బి) తార్కండే కమిటీ (1975).

TS Board Inter Second Year Political Science Study Material Chapter 7 భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

ప్రశ్న 9.
ఎన్నికల సర్వేలు అనగానేమి ?
జవాబు.
ఎన్నికల సందర్భంగా వివిధ పరిశోధన సంస్థలు, మీడియా విభాగాలు ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకునే విధంగా సర్వే చేపట్టడం జరుగుతుంది. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులపై ఓటర్ల అభిప్రాయాలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈ సర్వేలు వివరించే ప్రయత్నం చేస్తాయి. ఈ సర్వేలు మూడు రకాలు.

  1. ఎన్నికల పూర్వ సర్వే (Pre Poll Survey)
  2. ఎగ్జిట్ పోల్ సర్వే (Exit Poll Survey)
  3. ఎన్నికల అనంతర సర్వే (Post Poll Survey)

ప్రశ్న 10.
బహుజన సమాజ్ పార్టీపై ఒక లఘువ్యాఖ్య రాయండి.
జవాబు.
బహుజన సమాజ్ పార్టీ దేశంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, అప్ప సంఖ్యక వర్గాలు తదితరుల సంక్షేమానికి పాటుపడుతుంది. ఈ పార్టీ దేశంలోని దళితులు, సమాజంలో అణచివేతకు గురైన పీడితవర్గాలు తదితరుల అభ్యున్నతికి కంకణం కట్టుకుంది. బహుజన సమాజ్ పార్టీని 1985లో కాన్షిరాం స్థాపించారు.

ఆ తరువాత పార్టీ నాయకత్వం మాయావతి చేతికి వచ్చింది. ఈ పార్టీకి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, తదితర రాష్ట్రాల్లో ఎంతో పలుకుబడి ఉండి. బహుజన సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో అధికారంలో కొనసాగింది. అనేకసార్లు కేంద్ర ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వామిగా ఉంది. బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల చిహ్నం ఏనుగు.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 5 కేంద్ర రాష్ట్ర సంబంధాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 5th Lesson కేంద్ర రాష్ట్ర సంబంధాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 5th Lesson కేంద్ర రాష్ట్ర సంబంధాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
కేంద్రం – రాష్ట్రాల మధ్య ఉన్న శాసన సంబంధాలను వివరించండి.
జవాబు.
మన రాజ్యాంగం తొమ్మిదో భాగంలో 245 నుంచి 255 వరకు గల ప్రకరణాలు కేంద్ర-రాష్ట్రాల మధ్య. శాసన సంబంధాలను స్పష్టంగా పేర్కొన్నవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ భారతదేశ ప్రజల శాంతి, సంతోషం, ప్రగతికి దోహదపడే శాసనాలను రూపొందిస్తాయి.

భారత పార్లమెంట్ దేశం మొత్తానికిగానీ, దేశంలో ఏదో ఒక ప్రాంతానికిగానీ వర్తించే విధంగా శాసనాలను రూపొందించే అధికారం కలిగి ఉంటుంది. కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాలలోని అంశాలపై శాసనాలను రూపొందిస్తుంది. ఇక రాష్ట్ర శాసనసభలు రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలోని అంశాలపై శాసనాలను రూపొందిస్తాయి.

రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ ఆధిక్యత :
కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పార్లమెంట్ రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందించే అధికారాన్ని కలిగి ఉంటుంది. వాటిని కింది విధంగా వివరించవచ్చు.

  1. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలలోని అంశాలపై చట్టాలు చేయాలని రాజ్యసభలో హాజరైన సభ్యులలో 2/3 వంతు సభ్యులు తీర్మానిస్తే వాటిపై పార్లమెంట్ చట్టం చేయవచ్చు. అయితే అటువంటి చట్టం ఆరు మాసాలపాటు అమలులో ఉంటుంది. అవసరమైతే, దాన్ని మరో ఆరు మాసాలు పొడిగించవచ్చు. (ప్రకరణం 249).
  2. రాష్ట్రపతి ప్రకటించిన అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పడు పార్లమెంట్ జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందిస్తుంది. అటువంటి శాసనం అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నంతకాలం చెల్లుబాటవుతుంది. అత్యవసర పరిస్థితి ఉపసంహరణ జరిగిన ఆరుమాసాల తరువాత రద్దవుతుంది.
  3. 352వ ప్రకరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనం చేస్తుంది. (ప్రకరణం 250).
  4. ఏవైనా రెండు లేదా అంతకుమించిన రాష్ట్ర శాసన సభలు తమ ఉమ్మడి ప్రయోజనాల నిమిత్తం ఒక శాసనం అవసరమని ఒక తీర్మానం ద్వారా పార్లమెంట్ని కోరితే అందుకు తగిన శాసనం చేస్తుంది. 1953 ఎస్టేట్ సుంకం చట్టం, 1955 ప్రైజ్ కాంపిటీషన్ చట్టం, 1974 జలకాలుష్య నివారణ చట్టం 1976 పట్టణ భూపరిమితి చట్టం మొదలైనవి. పార్లమెంట్ ఆమోదించిన వాటిలోనివి (ప్రకరణం 252).
  5. భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు కోసం దేశం యావత్తు లేదా కొన్ని ప్రాంతాలకు ఉద్దేశించిన శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంట్కు ఉంది. వీటిలో 1960 జెనీలా కన్వెన్షన్ చట్టం, 1982 యాంటి హైజాకింగ్ చట్టం మొదలైనవి. (ప్రకరణం 253)
  6. ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం కారణంగా రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధిస్తే ఆ రాష్ట్ర శాసనసభ తరపున పార్లమెంట్ శాసనాలను రూపొందిస్తుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 5 కేంద్ర రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 2.
కేంద్రం – రాష్ట్రాల మధ్య ఉన్న పరిపాలనా సంబంధాలను వివరించండి.
జవాబు.
రాజ్యాంగం రెండవ భాగంలో కేంద్రం – రాష్ట్రాల మధ్య ఉండే పరిపాలన సంబంధాలు వివరించబడ్డాయి. పరిపాలన సంబంధాలలో కేంద్రం ఆధిపత్యాన్ని వివిధ నిబంధనలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన కార్యనిర్వాహక, శాసనపరమైన అధికారాల ద్వారా కింది విషయాలలో రాష్ట్రాలపై నియంత్రణ చేస్తుంది.

  1. రాష్ట్రాల గవర్నర్లను నియమించడం, బదిలీ చేయటం, తొలగించటం వంటి అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయి. గవర్నర్ల నియామకం అధికారం మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది.
  2. గవర్నర్ పంపే కొన్ని రకాల రాష్ట్ర బిల్లులను వీటో చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. (ప్రకరణం 2000)
  3. కొన్ని ప్రత్యేక అంశాలపై ఆర్డినెన్సున్ను జారీ చేసేటపుడు రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతిని సంప్రదించవచ్చు. (ప్రకరణం 213)
  4. జాతీయ, మిలటరి ప్రాధాన్యత కలిగిన సమాచార వ్యవస్థకు అవసరమైన నిర్మాణాలు మరియు నిర్వహణకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేయవచ్చు.
  5. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిపాలనా విధులను పరస్పరం బదిలీ చేసుకోవడానికి రాజ్యాంగం వీలు కల్పించింది. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వ పాలనావిధిని రాష్ట్రానికి అప్పగించవచ్చు. (ప్రకరణం 258)
  6. ఏదైనా అంతర్రాష్ట్ర నది, నదీలోయకు చెందిన జలాల వినియోగం పంపిణీ లేదా నియంత్రణకు సంబంధించిన వివాదం ఏర్పడితే దాని పరిష్కారానికి అవసరమైన శాసనాన్ని పార్లమెంట్ రూపొందించవచ్చు. (ప్రకరణం 262)
  7. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. CRPF వంటి పారామిలటరి దళాలను రాష్ట్రాలకు పంపే అధికారం కేంద్రానికి ఉంది.
  8. అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. (ప్రకరణం 263)
  9. కొత్త ఆల్ ఇండియా సర్వీసును సృష్టించటం లేదా ఉన్న వాటిలో దేనినైనా రద్దు చేసే అధికారం భారత రాజ్యాంగం రాజ్యసభకు ఇచ్చింది. (ప్రకరణం 312)
  10. ప్రతీ రాష్ట్రంలో అంతర్గత అశాంతిని, బహిర్గత దాడుల నుంచి రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వపు రాజ్యాంగబద్ధమైన విధి.
  11. రాజ్యాంగ ప్రకరణం 352 ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినపుడు కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను రాష్ట్రాలకు విస్తరించవచ్చు. కార్యనిర్వాహక అధికారాలు విస్తరించడంలో ఏవైనా రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేయవచ్చు.
  12. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైతే రాష్ట్రపతిపాలన విధించవచ్చు. (ప్రకరణం 356)
  13. దేశమంతటా కేంద్రం, రాష్ట్రాల చట్టాలు, రికార్డులు, న్యాయపరమైన ఉత్తర్వుల పట్ల పూర్తి విశ్వాసం నమ్మకం ఉండి తీరాలి.

పైన పేర్కొన్నవి సాధారణ పరిస్థితులలో కేంద్రం – రాష్ట్రాల మధ్య ఉండే పరిపాలనా సంబంధాలు. అయితే అత్యవసర పరిస్థితి అమలు కాలంలో మన రాజకీయ వ్యవస్థ ఏకకేంద్ర రాజ్యాంగంగా రూపొందుతుంది. రాష్ట్రపతి రాజ్యాంగంలోని 352, 356, 360వ ప్రకరణాల ప్రకారం అత్యవసర పరిస్థితి ప్రకటించినపుడు ఇటువంటి ఏర్పాటు జరుగుతుంది. పరిపాలనా సంబంధాలలో కేంద్ర ప్రభుత్వ ఆధిక్యతను రాజ్యాంగం చాటుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 5 కేంద్ర రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 3.
కేంద్రం – రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలను తెలపండి.
జవాబు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాసన, పరిపాలనాపరమైన వ్యవహారాలను నిర్వహించుకునేందుకు ఎంతో విత్తం అవసరమవుతుంది. ఆర్థిక రంగంలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల విధింపు వసూలు పంపిణీల గురించి మన రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. ఈ విషయాలను మన రాజ్యాంగం 12వ భాగంలో 264 నుంచి 300 ఎ వరకు గల అధికరణాలలో ప్రస్తావించారు.

1. కేంద్రం విధించే పన్నులు, సుంకాలు:
కొన్ని రకాల పన్నులు కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసుకునే అధికారం ఉంటుంది. ఇందులో కస్టమ్స్, ఎగుమతి సుంకాలు, ఆదాయపు పన్ను, పొగాకుపై సుంకం, జూట్ మొదలైనవి. కార్పోరేషన్ పన్ను, ఆస్తి విలువపై పన్ను, వ్యవసాయేతర భూమిపై ఎస్టేట్ సుంకం, రైల్వేలు, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్స్, టెలిఫోన్, వైర్లెస్ సెట్స్, విదేశీమారకం, నాణాలు మొదలైనవి.

2. రాష్ట్రాలు విధించే పన్నులు, సుంకాలను రాష్ట్రాలు వాడుకోవడం :
కొన్ని రకాల పన్నులపై ప్రత్యేకంగా రాష్ట్రాలకు అధికారం ఉంటుంది. అవి : భూమిశిస్తు, కేంద్ర జాబితాలో గల డాక్యుమెంట్లు మినహా విధించే స్టాంపు డ్యూటీ, వారసత్వ సుంకం, ఎస్టేట్ సుంకం, వ్యవసాయ భూమిపై ఆదాయపు పన్ను, రహదారి వాహనాలపై పన్నులు, ప్రకటనలపై పన్నులు, విద్యుత్ వినియోగంపై పన్ను మొదలైనవి.

3. కేంద్రం విధించే పన్నులను రాష్ట్రాలు వసూలు చేసుకుని వాడుకోవడం :
కొన్ని రకాల పన్నులను కేంద్రమే విధిస్తుంది. కానీ రాష్ట్రాలు ఆ పన్నుల మొత్తాలను వసూలు చేసుకుని వినియోగించుకుంటాయి. వీటిలో స్టాంపు డ్యూటీ, ఔషధాలు, టాయిలెట్ సంబంధమైన పదార్థాలపై ఎక్సెజ్ సుంకం, బిల్లుల మారకంపై స్టాంపు డ్యూటీ, చెక్కులు, ప్రామిసరీ నోట్లు, వడ్డీ వ్యాపారం, వాటా ధనం మార్పిడి మొదలైనవి.

4. కేంద్రం విధించి, వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చే పన్నులు :
రైల్వే ఛార్టీలు, రైల్, సముద్రపు రవాణా లేదా విమాన ప్రయాణీకులు వెంట తెచ్చే వస్తువులపై, సరుకు రవాణాలపై టర్మినల్ పన్నులు, వ్యవసాయేతర భూములపై ఎస్టేట్ డ్యూటీ విధించడం మొదలైనవి.

5. కేంద్రం విధించి, వసూలు చేసి కేంద్ర – రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే పన్నులు :
కొన్ని వస్తువులపై కేంద్రం పన్నులు విధించి, వసూలు చేస్తుంది. అయితే వాటిని రాష్ట్రాలకు పంపిణి చేస్తుంది. ఉదా: వ్యవసాయేతర ఆదాయంపై పన్ను, ఔషధాలు, టాయిలెట్ సంబంధమైనవి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 5 కేంద్ర రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 4.
సర్కారియా కమీషన్ చేసిన సిఫార్సులను వివరించండి.
జవాబు.
జూన్ 9, 1983న కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రంజిత్సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిషన్ ఏర్పాటు చేసింది. కేంద్ర – రాష్ట్ర సంబంధాల మధ్యనున్న అధికారాలు, విధులు, బాధ్యతలను పునఃపరిశీలన చేయవలసిందిగా ఈ కమీషన్ ను కోరింది.

1987 అక్టోబర్ 27న తన నివేదికను సర్కారియా కమీషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దశాబ్దం తరువాత ఆ కమీషన్ పేర్కొన్న మొత్తం సిఫార్సుల్లో 230 సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంది. మొత్తం సిఫార్సులలో 170 సిఫార్సులను అమలు చేసింది.

సిఫారసులు: సర్కారియా కమీషన్ సిఫారసులలో క్రింది పేర్కొన్నవి అత్యంత ప్రధానమైనవి.

1. బలమైన కేంద్రం :
బలమైన కేంద్ర ప్రభుత్వం వైపు కమిషన్ మొగ్గుచూపింది. జాతి సమైక్యత, సమగ్రతల కోసం విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ అధికారాలు తగ్గించే డిమాండ్ను కమిషన్ తిరస్కరించింది.

2. సంప్రదింపులు :
రాష్ట్రాల అధికారాల జాబితా నుంచి కొన్నింటిని ఉమ్మడి జాబితాలోకి బదిలీ చేయాలనే డిమాండ్ను కమిషన్ తిరస్కరించింది. అంతేకాదు ఉమ్మడి జాబితాలోని అంశాలతో సహా కేంద్రం రాష్ట్రాలను తప్పనిసరిగా సంప్రదించాలని సూచించింది.

3. సహకార సమాఖ్య :
ప్రణాళికల రూపకల్పన అమలులో కేంద్ర-రాష్ట్రాల మధ్య అత్యున్నత సహకారం పరస్పరం అందించుకోవాలని సూచించింది.

4. గవర్నర్ల నియామకం :
గవర్నర్ పదవిని రద్దు పర్చాలనే డిమాండ్ను కమిషన్ తిరస్కరించింది. అయితే క్రియాశీల రాజకీయాలలో ఉన్న నాయకులను గవర్నర్లుగా నియమించడాన్ని వ్యతిరేకించింది. రాజకీయేతర వివాదాస్పదం కాని ప్రముఖ వ్యక్తులను మరీ ముఖ్యంగా మైనారిటీలను గవర్నర్లుగా నియమించాలని సూచించింది. గవర్నర్లుగా పదవీ విరమణ పొందిన వ్యక్తి ఆ తరువాత ఎటువంటి లాభదాయకమైన పదవిలో పనిచేయడానికి అనుమతించరాదని సూచించింది.

5. ముఖ్యమంత్రి నియామకం :
ముఖ్యమంత్రి నియామకం శాసనసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఆధారంగా జరగాలని కమిషన్ సూచించింది. ఏ ఒక్క పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రానపుడు ఏ నాయకుడికి మెజారిటీ సభ్యుల మద్ధతు లభిస్తుందో ఆ వ్యక్తినే గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమించాలి.

6. రాష్ట్రపతి పాలన :
అరుదైన సందర్భాలలో మాత్రమే రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించాలి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 5 కేంద్ర రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 5.
M.M. పూంఛీ కమీషన్ సిఫారసులను తెలపండి.
జవాబు.
కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై అద్యయనం చేసి తగిన సిఫార్సులు చేయడానికి 2007లో కేంద్రంలో అధికారంలో ఉన్న UPA ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తియైన జస్టిస్ మదన్ మోహన్ పూంఛీ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమీషన్ ఏర్పాటు చేసింది. పూంఛీ కమీషన్ 31 మార్చి 2010లో తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

“భారతదేశ సుస్థిరతను కాపాడి దేశ సమైక్య, సమగ్రతలను పరిరక్షించాలన్నా, సామాజిక, ఆర్థికాభివృద్ధిని సాధించాలన్నా కూడా మనదేశంలో సహకార సమాఖ్య కీలకంగా పనిచేయాలని” పూంఛీ కమీషన్ భావించింది. కమీషన్ చేసిన సిఫార్పులలో ముఖ్యమైనవి కింద పేర్కొనబడ్డాయి.

1. గవర్నర్ల నియామకం :
కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల నియామకాన్ని సర్కారియా కమీషన్ సూచించిన విధంగా ఖచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాలి. గబర్నర్ గా నియమించబడే వ్యక్తి నిష్ణాతుడై వ్యక్తియై ఉండాలి. క్రియాశీలకర రాజకీయాలలో పాల్గొనని వ్యక్తియై ఉండటంతోపాటు ఆ రాష్ట్రానికి చెందని వారై ఉండాలి. గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు నిర్దిష్టంగా ఉండాలి.

2. రాష్ట్రపతి పరిపాలన :
రాష్ట్రపతి పరిపాలనను దుర్వినియోగం చేయకుండా రాష్ట్రాల హక్కులను, కాపాడే విధంగా సూచనలు చేసింది. రాష్ట్రపతి పరిపాలనను అవసరమైనప్పుడు సమస్యాత్మక స్థానిక ప్రాంతాలకు మాత్రమే వర్తించే విధంగా 356 అధికరణలో మార్పులు చేయాలి.

3. ముఖ్యమంత్రుల నియామకం :
కమీషన్ అభిప్రాయం ప్రకారం రాష్ట్ర శాసనసభలో మెజార్టీ పార్టీ నాయకుడిని మాత్రమే ముఖ్యమంత్రిగా నియమించాలి. ఒకవేళ ఏ రాజకీయ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించని సందర్భంలో అంటే “ హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి నియామకం విషయంలో వివరణాత్మకమైన మార్గదర్శకాలను రాజ్యాంగ సాంప్రదాయంగా ఏర్పాటు చేయాలి.

4. అఖిల భారత సర్వీసులు :
మూడంచెల సాలనా వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించేటప్పుడు అఖిల భారత సర్వీసులో సమగ్రంగా మార్పులు చేయాలి. దీని వల్ల అఖిల భారత సర్వీసుల ఉద్యోగులు పరిపాలనలో ‘ కీలకపాత్రను పోషిస్తారు.

5. విత్తపరమైన సంబంధాలు :
కమీషన్ అభిఆయం ప్రకారం రాష్ట్రాలకు విస్తృతమైన విధుల కేటాయింపు జరపడంతోపాటు వెనకబడిన రాష్ట్రాలకు ఎక్కువగా నిధులు కేటాయించడం ద్వారా విత్తపరంగా రాష్ట్రాలు సుస్థిరతను సాధించగలుగుతాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 5 కేంద్ర రాష్ట్ర సంబంధాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
కేంద్ర – రాష్ట్రాల మధ్య ఉన్న శాసన సంబంధాలను నిర్దేశించే రెండు అంశాలు.
జవాబు.
కేంద్ర – రాష్ట్రాల సంబంధాలను ప్రభావితం చేసే అంశాలు: భారత రాజ్యాంగం 9వ భాగంలో 245 నుంచి 255 వరకు గల అధికరణాలు కేంద్ర, రాష్ట్ర శాసన సంబంధాలను వివరించాయి. కేంద్ర – రాష్ట్రాలు శాసనపరమైన పరిధిని ప్రధానంగా రెండు అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి 1. ప్రాదేశిక పరిధి 2. విషపరమైన పరిధి.

ప్రశ్న 2.
కేంద్ర – రాష్ట్రాల మధ్య శాసన సంబంధ విషయాలను ఎలా విభజిస్తారు ?
జవాబు.
కేంద్ర – రాష్ట్రాల సంబంధాలు: భారత ప్రభుత్వ చట్టం 1935ను అనుసరించి రాజ్యాంగం నిర్మాతలు శాసనపరమైన అంశాలను మూడు జాబితాలు క్రింద విభజించారు. అవి: 1. కేంద్ర జాబితా 2. రాష్ట్ర జాబితా 3. ఉమ్మడి జాబితా. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో వీటి సవరణ ఉంది.

ప్రశ్న 3.
కేంద్ర జాబితాపై ఒక నోట్ రాయండి.
జవాబు.
కేంద్ర జాబితా : కేంద్ర జాబితాకు సంబంధించిన అంశాలపై శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఇందులో ప్రస్తుతం 100 అంశాలున్నాయి.
ఉదా : దేశరక్షణ, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, తంతితపాలా మొదలగునవి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 5 కేంద్ర రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 4.
ఆర్థిక సంఘం నిర్మాణం.
జవాబు.
ఆర్థిక సంఘం నిర్మాణం :
ఆర్థిక సంఘ నిర్మాణాన్ని రాష్ట్రపతి పార్లమెంటు ఆమోదించిన విత్తచట్టం, 1951 ప్రకారం నిర్ణయిస్తారు. ఆ చట్టం ప్రకారం ఆర్థిక సంఘంలో ఒక ఛైర్మన్, నలుగురు ఇతర సభ్యులు ఉంటారు. వారిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఛైర్మన్గా నియమితుడయ్యే వ్యక్తి ప్రభుత్వ వ్యవహారాలలో అనుభవజ్ఞుడై ఉంటాడు. మిగతా నలుగురు సభ్యులు క్రింది పేర్కొన్న విభాగాలకు సంబంధించినవాడై ఉంటారు.

  1. హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించిన లేదా హైకోర్టు న్యాయమూర్తి నియామాకానికి అర్హతగల వ్యక్తియై ఉండాలి.
  2. ప్రభుత్వంలో విత్తం, పద్దులు విషయాల గురించి ప్రత్యేక పరిజ్ఞానం గలవాడై ఉండాలి.
  3. పరిపాలన, ఆర్థిక విషయాల గురించి అపారమైన అనుభవం ఉండాలి.
  4. అర్థశాస్త్రంలో ప్రత్యేక పరిజ్ఞానం ఉండాలి.

ప్రశ్న 5.
సర్కారియా కమిషన్
జవాబు.
సర్కారియా కమిషన్ : 1983 జూన్ తొమ్మిదో తేదీన కేంద్ర ప్రభుత్వం రంజిత్సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిషన్ను ఏర్పరచింది. కేంద్ర – రాష్ట్ర సంబంధాలను పునఃపరిశీలన చేయవలసిందిగా ఈ కమిషన్ను కోరడమైనది. ఆ కమిషన్లో బి. శివరామన్, ఎస్ పేన్ అనే ఇద్దరు సభ్యులున్నారు. కమిషన్ కార్యదర్శిగా ఎమ్.ఆర్.సుబ్రహ్మణ్యం, రాజ్యాంగ సలహాదారుడిగా ఎల్.ఎన్. సిన్హా వ్యవహరించారు.

1987 అక్టోబర్ 27వ తేదీ 247 సిఫారసులతో కూడిన 5000 పేజీలకు పైగా ఒక అంతిమ నివేదికను సర్కారియా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. శాసన, పరిపాలన, ఆర్థిక, రాజ్యాంగపరమైన రంగాలకు సంబంధించి అనేక సిఫారసులను పేర్కొంది. దశాబ్దం తరువాత ఆ కమీషనర్ పేర్కొన్న మొత్తం సిఫారసుల్లో 230 సిఫారసులపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంది. మొత్తం సిఫారసుల్లో 170 సిఫారసులను – అమలు చేసింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 5 కేంద్ర రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 6.
నీతి ఆయోగ్.
జవాబు.
NITI ఆయోగ్ (National Institution of Transforming India Ayog 2013) జనవరి 1 నుంచి ఉనికిలోనికి వచ్చింది. జాతీయాభివృద్ధి ప్రాథమ్యాలలో కేంద్ర – రాష్ట్రాల సంబంధాలను, భాగస్వామ్యాన్ని మరింత పటిష్టవంతం చేసేందుకు సహకార సమాఖ్యను ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్రాలను బలోపేతం చేయడం ద్వారా జాతి నిర్మాణం జరపడం దీని విధి.

నీతి ఆయోగ్ ప్రధాన లక్ష్యాలు :

  • పేదరిక నిర్మూలన.
  • అసమానతల తొలగింపు.
  • సంస్థాగత అభివృద్ధి ప్రక్రియ ద్వారా గ్రామాల సమగ్ర వృద్ధి.
  • పర్యావరణ పరిరక్షణ మరియు వాతావరణ అంచనా.

నీతి ఆయోగ్క ప్రధానమంత్రి ఛైర్మన్ గా ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రాంతీయ మండళ్ళతో కూడిన గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. గతంలో ఉన్న ప్రణాళికా సంఘాన్ని రద్దుపరచి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. సమకాలీన ప్రపంచీకరణ అవసరాలకు అనుగుణంగా నీతి ఆయోగ్ సంస్థ పనిచేస్తుంది.

ప్రశ్న 7.
ఉమ్మడి జాబితా.
జవాబు.
ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంట్ రాష్ట్ర శాసనసభలు రెండింటికీ ఉంటుంది. ఈ జాబితాలో ప్రధాన అంశాలు : క్రిమినల్లా, వివాహ, విడాకులు, వ్యవసాయేతర సంబంధ సంపద, బదిలీ, ఒప్పందాలు, అపరిష్కృత అంశాలు, అడవులు, విద్య, కార్మిక సంక్షేమం, కార్మిక సంఘాలు స్టాంపులు మొదలైనవి. ప్రస్తుతం ఈ జాబితాలో 52 అంశాలున్నాయి.

ఈ జాబితాలో అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు రెండింటికీ ఉంటుంది. అయితే కేంద్ర శాసనానికి, రాష్ట్రశాసనానికీ మధ్య వైరుధ్యం ఏర్పడితే శాసనానికే ఆధిక్యం ఉంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 5 కేంద్ర రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 8.
అంతః రాష్ట్ర కౌన్సిల్.
జవాబు.
భారత రాజ్యాంగం 263వ ప్రకరణం ఆధారంగా అంతరాష్ట్రమండలి ఏర్పాటయింది. రాష్ట్రాల మధ్య సహకార సమన్వయాలను సాధించే లక్ష్యంతో ఈ మండలి పనిచేస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చే ఆశయంతో రాష్ట్రపతి ఈ మండలిని అవసరమైన సందర్భాలలో నెలకొల్పుతాడు.

అంతర్రాష్ట్ర మండలి కింద పేర్కొన్న అంశాల నిర్వహణకు దోహదపడుతుంది.

  1. రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాల పరిష్కారంలో తగిన సూచనలివ్వటం.
  2. దేశంలోని కొన్ని లేదా అన్ని రాష్ట్రాలు నిర్వహించే విధుల విషయంలో ఎదురయ్యే వివాదాలను పరిష్కరించడం.
  3. ఏదైనా ఒక అంశంపై రాష్ట్రాల మధ్య విధానపరమైన సమన్వయాన్ని సూచించడం.

నిర్మాణం :
భారత రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ 1990, మే 28న అంతఃరాష్ట్ర మండలిని వి.పి. సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఏర్పాటు చేశారు. అందులో కిందివారు సభ్యులుగా ఉన్నారు.

  1. ప్రధానమంత్రి
  2. రాష్ట్ర ముఖ్యమంత్రులు
  3. కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, పరిపాలకులు
  4. ప్రధానమంత్రితో సూచించబడిన ఆరుగురు కేంద్రమంత్రులు.

అంతరాష్ట్ర మండలికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటాడు. దాని సమావేశాలకు నిర్వహిస్తాడు. కొన్ని సందర్భాలలో ఆ మండలి సమావేశాలకు అధ్యక్షత వహించవలసిందిగా కేంద్ర మంత్రులతో ఒకరిని నామినేట్ చేస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 5 కేంద్ర రాష్ట్ర సంబంధాలు

ప్రశ్న 9.
అవశిష్ట అధికారాలు.
జవాబు.
రాజ్యాంగంలోని 248 అధికరణ ప్రకారం అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు మూడింటిలోను లేని అంశాలనూ అవశిష్ట అంశాలు అంటారు. అవశిష్ట అంశాలపై శాసనాలను చేసే అధికారం పార్లమెంట్కు మాత్రమే ఉంటుంది.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 4th Lesson రాష్ట్ర ప్రభుత్వం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 4th Lesson రాష్ట్ర ప్రభుత్వం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాష్ట్ర గవర్నర్ అధికారాలు, విధుల గురించి రాయండి.
జవాబు.
గవర్నర్ రాష్ట్ర కార్యనిర్వాహకశాఖకు రాజ్యాంగబద్ధమైన అధిపతి. రాష్ట్రపతిచే నియమితుడైన గవర్నర్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ గవర్నర్ పేరు మీద అమలవుతాయి.
గవర్నర్ అధికారాలు విధులు : గవర్నర్ ముఖ్యమైన అధికారాలు, విధులను నిర్వర్తిస్తాడు. అవి :

  1. కార్యనిర్వాహక అధికారాలు – విధులు
  2. శాసనాధికారాలు విధులు
  3. ఆర్థికాధికారాలు – విధులు
  4. న్యాయాధికారాలు – విధులు
  5. ఇతర అధికారాలు – విధులు
  6. విచక్షణాధికారాలు విధులు

1. కార్యనిర్వాహక అధికారాలు-విధులు :
రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలన్నీ గవర్నర్ అధీనంలో ఉంటాయి. రాజ్యాంగం 154వ ప్రకరణంలో పేర్కొన్న అధికారాలను గవర్నర్ స్వయంగానూ లేదా విధేయులైన కొందరు అధికారుల ద్వారా వినియోగిస్తాడు.

  1. గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు.
  2. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను నియమిస్తాడు.
  3. మంత్రులకు శాఖలు కేటాయించడం, వాటిని మార్పు చేయడం చేస్తాడు.
  4. ముఖ్యమంత్రి సూచనలపై మంత్రులను తొలగిస్తాడు.
  5. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమిస్తాడు.
  6. రాష్ట్రస్థాయిలో కొనసాగుతున్న వివిధ కమిషన్ల ఛైర్మన్, సభ్యులను నియమిస్తాడు. అవి,
    ఎ) పబ్లిక్ సర్వీస్ కమిషన్
    బి) అధికార భాషా సంఘం
    సి) మైనారిటీ కమిషన్
    డి) మహిళా కమీషన్
    ఇ) ప్రభుత్వరంగ సంస్థల కమిటీలు

TS Board Inter Second Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం

2. శాసన నిర్మాణాధికారాలు :
గవర్నర్ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగంగా ఉంటాడు.

  1. గవర్నర్ రాష్ట్ర శాసన సభలను సమావేశపరుస్తాడు. వాయిదా వేస్తాడు. రాష్ట్ర శాసన సభను రద్దుచేస్తాడు.
  2. శాసనసభలో స్వయంగా ప్రసంగిస్తాడు, లేదా తన సందేశాలు పంపుతాడు.
  3. శాసనమండలిలో 1/6 వంతు సభ్యులను నామినేట్ చేస్తాడు.
  4. ఆంగ్లో-ఇండియన్ తెగకు చెందిన వారెవరూ శాసనసభకు ఎన్నిక కాకపోతే ఆ తెగకు సంబంధించిన ఒకరిని నామినేట్ చేస్తాడు.
  5. శాసనసభ తొలివార్షిక సమావేశాన్ని లేదా సాధారణ ఎన్నికల తరువాత మొదటి సమావేశాన్ని ప్రారంభిస్తాడు.
  6. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై సంతకం చేస్తాడు. బిల్లులలో మార్పులు లేదా సవరణలు సూచిస్తూ శాసనసభల పునఃపరిశీలనకు పంపుతాడు.

ఆర్థికాధికారాలు :
గవర్నర్ ప్రతి ఆర్థిక సంవత్సరంలో శాసనసభలో ద్రవ్యబిల్లులు సమర్పించేందుకు అనుమతిస్తాడు. శాసనసభలో సభ్యులు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సహకరిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ అగంతుక నిధిని గవర్నర్ నిర్వహిస్తాడు. వివిధ విత్త సంబంధమైన నివేదికలను విధానసభకు సమర్పించేలా చూస్తాడు.

న్యాయాధికారాలు :
గవర్నర్కు న్యాయసంబంధ అధికారాలు, విధులు ఉన్నాయి. జిల్లా న్యాయమూర్తులు, ఇతర అధికారుల నియామకం, పదోన్నతులను గవర్నర్ ప్రభావితం చేస్తాడు. రాష్ట్ర స్థాయిలో న్యాయస్థానాలు విధించిన శిక్షను తగ్గించడానికి, క్షమాభిక్ష పెట్టడానికి లేదా రద్దుచేయడానికి అధికారం ఉంటుంది.

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో గవర్నర్ రాష్ట్రపతికి సలహాలిస్తాడు. రాష్ట్రంలోని అధీన న్యాయస్థానాలలోని న్యాయసిబ్బందిని హైకోర్టు సూచనలపై నియమిస్తాడు.

ఇతర అధికారాలు :
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమర్పించిన వార్షిక నివేదికను గవర్నర్ మంత్రిమండలి పరిశీలనకు పంపుతాడు. తరువాత ఆ నివేదికపై మంత్రిమండలి సూచనలను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టేందుకు స్పీకర్కు పంపుతాడు.

విచక్షణాధికారాలు : ఈ అధికారాలను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రిమండలి సలహాలతో నిమిత్తం లేకుండా గవర్నర్ స్వయంగా వినియోగిస్తాడు. అవి :

  1. ముఖ్యమంత్రిని ఎంపిక చేయటం.
  2. రాష్ట్ర మంత్రిమండలిని తొలగించడం.
  3. శాసన, పరిపాలనా, సంబంధమైన అంశాలపై సమాచారం అందించవలసిందిగా ముఖ్యమంత్రిని కోరడం.
  4. శాసనసభను రద్దుపరచడం.
  5. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టవలసిందిగా రాష్ట్రపతికి సలహా ఇవ్వడం.
  6. శాసనసభ ఆమోదించిన బిల్లుపై సంతకం చేయడానికి తిరస్కరించి, దానిని పునఃపరిశీలన కోసం వెనకకు పంపడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 2.
ముఖ్యమంత్రి అధికారాలు, విధులు వివరించండి.
జవాబు.
రాజ్యాంగం 164వ ప్రకరణను అనుసరించి ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు. సాధారణంగా శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత మెజారిటీ పార్టీ నాయకుడిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు.

అధికారాలు విధులు : ముఖ్యమంత్రి ఎన్నో అధికారాలను, విభిన్నమైన విధులను నిర్వర్తిస్తాడు. వాటిని క్రింది విధంగా పరిశీలించవచ్చు.

1. మంత్రిమండలి ఏర్పాటు :
రాష్ట్ర మంత్రిమండలిని ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి స్వతంత్ర అధికారం, బాధ్యత. తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పార్టీలలో కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నర్కు సిఫారసు చేసి మంత్రులుగా వారు నియమితులయ్యేట్లు చూస్తాడు.

మంత్రుల శాఖలు కేటాయింపు, మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై గవర్నర్కు సలహా ఇస్తాడు. ఎవరినైనా మంత్రిమండలి నుంచి తొలగించవలసిందిగా కూడా గవర్నర్కు సలహా ఇస్తాడు.

2. మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహించడం :
ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి అధ్యక్షుడు. ఇతడు రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. మంత్రిమండలి సమావేశాల అజెండాను నిర్ణయిస్తాడు. సమావేశాలలో చర్చలను ప్రారంభిస్తాడు. మంత్రిమండలి విధానాలను ప్రభావితం చేస్తాడు.

3. గవర్నర్ – మంత్రిమండలి మధ్య వారధి :
గవర్నర్ – మంత్రిమండలి మధ్య ముఖ్యమంత్రి ప్రధానమైన వారధిగా ఉంటాడు. మంత్రిమండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను తెలియపరచవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, రాష్ట్రశాసనాల ప్రతిపాదనల గురించి గవర్నర్కు తెలుపుతాడు. గవర్నర్కు ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తాడు.

4. శాసనసభ నాయకుడు :
ముఖ్యమంత్రి శాసనసభకు నాయకుడిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర శాసనసభలో మెజారిటీ పార్టీ సభ్యుల నాయకుడిగా ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే వివిధ పథకాలు, కార్యక్రమాలను ఇతడు శాసనసభలో తెలుపుతాడు. ప్రభుత్వ విధానాలు మరింత సమర్థవంతంగాను, విజయవంతంగాను అమలయ్యేలా శాసనసభ్యుల మద్దతు కోరతాడు.

5. అధికార ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య విధానాలు, కార్యక్రమాలను ప్రకటిస్తాడు. శాసనసభ సమావేశాలలోనూ, శాసనసభ వెలుపలా అతడు చేసే ప్రకటనలకు ఎంతో ప్రభావం, చట్టబద్ధత ఉంటాయి.

6. అధికారపార్టీ నాయకుడు :
రాష్ట్రంలో అధికారపార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తాడు. పార్టీ సమావేశాలలో అతను పాల్గొంటాడు. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను పార్టీ సభ్యులకు తెలుపుతాడు. ప్రభుత్వ విధానాలను విజయవంతంగా, సమర్థవంతంగా అమలుచేయడానికి పార్టీ సభ్యుల సహకారం, మద్దతు కోరతాడు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేకూరుస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 3.
రాష్ట్ర మంత్రిమండలి అధికారాలను తెలపండి.
జవాబు.
రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్ర మంత్రిమండలి అంతర్భాగం. మంత్రి మండలిలో ఒకటి లేదా అంతకుమించిన పార్టీలకు చెందిన శాసన సభ్యులు ఉండవచ్చు. వారందరూ సమిష్టిగా ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తారు.

నిర్మాణం:
రాష్ట్ర మంత్రిమండలిలో ముఖ్యమంత్రి, కేబినేట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా ఉంటారు. ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ గవర్నర్చే నియమించబడతారు. రాష్ట్ర శాసనసభలో తన పార్టీకి చెందిన కొందరు సభ్యులను ఎంపిక చేసుకొని వారి పేర్లను గవర్నరు నివేదించి, వారిని మంత్రులుగా నియమించవలసిందిగా ముఖ్యమంత్రి గవర్నర్కు తగిన సూచనలిస్తాడు.

అధికారాలు – విధులు :
రాష్ట్ర మంత్రిమండలికి క్రింద పేర్కొన్న అధికారాలు విధులు ఉంటాయి.

1. రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన :
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధానాలను రూపొందించి, ఖరారు చేసి అమలులో ఉండే బాధ్యత రాష్ట్ర మంత్రిమండలికి ఉంది. కాబట్టి ప్రభుత్వ నిర్వహణ కోసం మంత్రిమండలి లోతుగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది.

ఈ సందర్భంలో మంత్రిమండలి సభ్యులు అన్ని అంశాలపై కూలంకషంగా చర్చిస్తారు. ముఖ్యంగా కేబినెట్ మంత్రులు అనేక పర్యాయాలు సమావేశమై మొత్తం మంత్రిమండలి పేరుతో విధానపరమైన నిర్ణయాలు తీసుకొంటారు.

2. పరిపాలన నిర్వహణ :
రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను నిర్వహిస్తుంది. ప్రభుత్వ విధి విధానాల ప్రకారం శాసనసభ ఆమోదించిన తీర్మానాలు, చట్టాలను అనుసరించి మంత్రివర్గ సభ్యులు పరిపాలన నిర్వహిస్తారు. ప్రతీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒకటి లేదా అంతకు మించిన శాఖల పరిపాలనపై నియంత్రణను, బాధ్యతను కలిగి ఉంటాడు.

3. సమన్వయ విధి :
రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల మధ్య సమన్వయం సాధిస్తుంది. ఒకవేళ మంత్రుల మధ్య సమన్వయం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సాఫీగా నిర్వహించటం సాధ్యంకాదు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలలో తీసుకొన్న నిర్ణయాలను మంత్రులందరూ ఏకగ్రీవంగా ఆమోదించి, మద్దతునిస్తారు.

4. నియామక అధికారాలు :
రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులనందరినీ మంత్రిమండలి గవర్నర్ పేరుతో నియమిస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి అభీష్టం చెల్లుబాటవుతుంది. మంత్రిమండలి నియామకాలు జరిపే వారిలో అడ్వకేట్ జనరల్, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్, సభ్యులు మొదలైనవి అనేకం ఉంటాయి.

5. శాసన నిర్మాణంలో పాత్ర :
రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాసనాల రూపకల్పనకు సంబంధించిన విషయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలకు సంబంధించిన విషయాలన్నింటినీ వాస్తవానికి మంత్రిమండలే నిర్ణయిస్తుంది.

శాసనసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంతకాలం మంత్రిమండలి శాసననిర్మాణ విషయంలో కీలకమైన సంస్థగా కొనసాగుతుంది. శాసనసభ సమావేశాల తేదీల నిర్ణయం, సమావేశాల ప్రారంభం, కొనసాగింపు, వాయిదాలకు సంబంధించిన విషయాలపై రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్కు సలహాలిస్తుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
రాష్ట్ర శాసనమండలి నిర్మాణాన్ని వివరించండి.
జవాబు.
శాసనమండలి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఎగువ సభ. ప్రస్తుతం కేవలం ఏడు రాష్ట్రాలలోనే శాసనమండలి ఉంది. అవి : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్ము అండ్ కాశ్మీర్, కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు.

శాసనమండలి సభ్యత్వ సంఖ్య కనీసం 40 లేదా శాసనసభ సభ్యులలో 1/3 వంతు మించరాదు. శాసనమండలి ఏర్పాటు లేదా రద్దు. విషయంలో రాష్ట్ర శాసనసభ చేసిన సిఫారసును భారత పార్లమెంట్ ఆమోదిస్తుంది.

అర్హతలు : శాసనమండలి సభ్యత్వానికి పోటీచేసే అభ్యర్థి కింది అర్హతలు కలిగి ఉండాలి.

  1. భారత పౌరుడై ఉండాలి.
  2. 30 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
  3. కాలానుగుణంగా పార్లమెంట్ చేసే చట్టాలకు అనుగుణమైన అర్హతలు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఏకకాలంలో పార్లమెంట్ ఉభయసభలలోనూ లేదా రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉండరాదు.

కాలపరిమితి :
శాసనమండలి శాశ్వతసభ. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. ప్రతీ సభ్యుడు ఆరు సంవత్సరాల పదవీకాలం కలిగి ఉంటాడు. ఏడాదిలో కనీసం రెండు పర్యాయాలు శాసనమండలి సమావేశమవ్వాలి. రెండు సమావేశాల మధ్య కాలం ఆరు నెలల వ్యవధి మించరాదు.

నిర్మాణం : శాసనమండలికి ఎన్నికయ్యే సభ్యులు అయిదు విభిన్న రకాలుగా ఎన్నుకోబడతారు.

  1. మొత్తం సభ్యులలో 1/3 వంతు మంది సభ్యులలో రాష్ట్రంలోని స్థానిక సంస్థలైన పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు సభ్యులతో కూడిన ఎన్నికలగణం ఎన్నుకొంటుంది.
  2. మొత్తం సభ్యులలో 1/3 వంతు మంది సభ్యులను శాసనసభ సభ్యులు ఎన్నుకొంటారు.
  3. మొత్తం సభ్యులలో 1/12 వంతు మంది సభ్యులను రాష్ట్రంలో కనీసం మూడేళ్ళపాటు నివాసం ఉంటున్న అన్ని విశ్వవిద్యాలయాల పట్టభద్రులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకొంటుంది.
  4. మొత్తం సభ్యులలో 1/12 వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని సెకండరీ పాఠశాల స్థాయికి తగ్గకుండా కనీసం మూడేళ్ళపాటు పనిచేసిన ఉపాధ్యాయులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకొంటుంది.
  5. మిగిలిన సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తాడు. గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులు సాహిత్యం, విజ్ఞానం, కళలు, సహకార ఉద్యమం, సామాజిక, సేవారంగాలకు సంబంధించిన వారై ఉంటారు.

శాసనమండలి సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్దతి ప్రకారం ఒక ఓటు బదిలీ సూత్రం ప్రకారం ఎన్నుకోబడతారు. సభా నిర్వహణ కోసం ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లు ఉంటారు. శాసనమండలి సభ్యుల ద్వారా వీరు ఎన్నికవుతారు. శాసనసభ సభ్యులకున్న అధికారాలే శాసనమండలి సభ్యులకు ఉంటాయి.

శాసనమండలి అవిశ్వాస తీర్మానం ఆమోదించడం ద్వారా ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లను పదవి నుంచి తొలగించవచ్చు. దీనిని సమావేశానికి హాజరైన వారిలో మెజారిటీ సభ్యులు ఆమోదించవలసి ఉంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 5.
రాష్ట్ర శాసనసభలపై ఒక నోట్ రాయండి.
జవాబు.
ప్రజాస్వామ్యయుతమైన శక్తిమంతమైన, ప్రజామోదం పొందిన శాసనసభ సభ్యులను రాష్ట్ర ప్రజలు ఎన్నుకొంటారు.

నిర్మాణం :
ప్రతీ రాష్ట్రానికి శాసనసభ ఉంటుంది. శాసనసభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. శాసనసభ సభ్యత్వం సంఖ్య 60-500 మధ్య ఉంటుంది. శాసనసభ సభ్యులను రాష్ట్రంలోని వివిధ నియోజక వర్గాలకు చెందిన ఓటర్లు ఎన్నుకొంటారు. శాసనసభ సభ్యత్వ సంఖ్య రాష్ట్ర జనాభా నిష్పత్తికి తగిన విధంగా ఉంటుంది.

శాసనసభలో కొన్ని స్థానాలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రతినిధులకు కేటాయించబడ్డాయి. ఆంగ్లో ఇండియన్ తెగకు చెందిన వారికి శాసనసభలో ప్రాతినిధ్యం లేదని గవర్నర్ భావిస్తే ఆ తెగకు చెందిన ఒకరిని నామినేట్ చేస్తాడు.

అర్హతలు : శాసనసభ సభ్యత్వానికి పోటీచేసే అభ్యర్థికి కింది అర్హతలు ఉండాలి.

  1. భారతపౌరుదై ఉండాలి.
  2. 25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
  3. లాభసాటి ప్రభుత్వ పదవిలో ఉండరాదు.
  4. కాలానుగుణంగా పార్లమెంట్ చేసే చట్టాలకు అనుగుణమైన అర్హతలు కలిగి ఉండాలి.

ఒకే వ్యక్తి ఏకకాలంలో పార్లమెంట్ ఉభయసభలలోనూ లేదా రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉండరాదు.
కాలపరిమితి :
లోకసభలాగా శాసనసభ కూడా శాశ్వతసభ కాదు. దీని సాధారణ కాలపరిమితి 5 సంవత్సరాలు. ఏ సమయంలోనైనా గవర్నర్ దీన్ని రద్దు చేయవచ్చు. 356 వ ప్రకరణం ఆధారంగా రాష్ట్రపతి శాసనసభను సస్పెన్షన్లో ఉంచడం లేదా రద్దు పరచడం చేయవచ్చు.

జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న సమయంలో శాసనసభ కాలపరిమితిని పార్లమెంట్ చట్టం ద్వారా ఆరునెలలు పొడిగించవచ్చు. అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన ఆరునెలలలోపు శాసనసభకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్ :
శాసనసభ కార్యకలాపాల నిర్వహణకు ఇద్దరు ఎన్నుకోబడ్డ సభా నిర్వహణాధిపతులు ఉంటారు. ఒకరు స్పీకర్, మరొకరు డిప్యూటీ స్పీకర్. శాసనసభా నిర్వహణకు సంబంధించిన స్థానం, అధికారాలు, విధులు స్పీకర్కు, డిప్యూటీ స్పీకర్కు ఒకే విధంగా ఉంటాయి.

వీరిని శాసనసభ తీర్మానం ద్వారా తొలగించవచ్చు. అలాంటి తీర్మానాన్ని శాసనసభలో సమావేశానికి హాజరైన వారిలో మెజారిటీ సభ్యులు ఆమెదించవలసి ఉంటుంది. ప్రతీ ఏటా శాసనసభ కనీసం రెండుసార్లు సమావేశమవుతుంది. సమావేశాల మధ్య ఆరునెలలు మించిన వ్యవధి ఉండకూడదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 6.
హైకోర్టు యొక్క అధికారాలు మరియు విధులను వివరించండి.
జవాబు.
హైకోర్టు అధికారాలు, విధులు :
హైకోర్టు ఈ కింది అధికారాలు, విధులను కలిగి ఉంటుంది.

ప్రాథమిక అధికార పరిధి :

  1. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన చట్టాలు, ఆదేశాలు, వివాహాలు, విడాకులు, కోర్టు ధిక్కరణ కేసులపై హైకోర్టు ప్రాథమిక అధికార పరిధిని కలిగి ఉంటుంది.
  2. అధికరణ 226 ప్రకారం హైకోర్టు హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరి, కో-వారెంటో మరియు పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకై నిషేధపు ఉత్తర్వులు వాటి రిట్లను జారీచేసే అధికారం కలిగి ఉంటుంది.
  3. పార్లమెంట్, శాసనసభల సభ్యుల ఎన్నికల వివాదాలను పరిష్కరించడం.

అప్పీళ్ళ అధికార పరిధి :
1. పౌర వివాదాలు :
జిల్లా కోర్టు లేదా కిందిస్థాయి కోర్టు యొక్క తీర్పుపై హైకోర్టుకు అప్పీలు చేయవచ్చు. 5,000 రూపాలయలకు మించిన విలువగల కేసులను చట్టానికి సంబంధించిన కేసులను హైకోర్టు స్వీకరిస్తుంది.

2. క్రిమినల్ వివాదాలు :
సెషన్స్ కోర్టు ద్వారా 4 సంవత్సరాలకంటే ఎక్కువ శిక్ష పడిన కేసులు, పెద్ద శిక్షలను కలిగి ఉన్న అన్ని కేసులను హైకోర్టుకు అప్పీలు చేయవచ్చు. సెషన్ కోర్టు ద్వారా విధించబడ్డ మరణ శిక్ష హైకోర్టు ద్వారా ఆమోదించబడవలసి ఉంటుంది.

3. కోర్ట్ ఆఫ్ రికార్డ్ (Court of Record) :
హైకోర్టు యొక్క నిర్ణయాలు, తీర్పులు నమోదు చేయబడి భద్రపరచబడతాయి. న్యాయపరంగా ప్రామాణికంగా భావించబడతాయి.

4. ధృవీకరించే అధికారం (Power of Certification) :
చాలా కేసులలో హైకోర్టు తన తీర్పులపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవడానికి ఒక ధృవీకరణ పత్రం జారీ చేస్తుంది.

5. న్యాయసమీక్షాధికారం (Judicial Review) :
హైకోర్టుకు ఏ చట్టాన్నైనా, ఆర్డినెన్సైనైనా పునఃపరిశీలించి దాన్ని రాజ్యాంగానికి వ్యతిరేకమైనదిగా ప్రకటించే అధికారం ఉంది. రాజ్యాంగాన్ని సంరక్షించడానికి భారత న్యాయవ్యవస్థ న్యాయ సమీక్షాధికారాన్ని కలిగిఉంది.

ఇందుకోసమే కాకుండా ప్రభుత్వంలోని అన్ని అంగాలు రాజ్యాంగ అధికార పరిధి కింద పని చేస్తాయని హామీ ఇవ్వడం కూడా న్యాయ సమీక్షాధికారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ప్రాథమిక హక్కులను ప్రత్యేకంగా ఆస్తిహక్కును కాపాడుతుంది.

6. పరిపాలన అధికారాలు (Administrative Functions) :
అధికరణ 227 ప్రకారం ప్రతీకోర్టు తన కింది కోర్టులను పర్యవేక్షించే అధికారం కలిగి ఉంది.

  1. ఇది తన కింది కోర్టులో వ్యవహారాల్లో అనుసరించాల్సిన నియమాలను, వాటి విధానాలను తయారుచేసి క్రమబద్దం చేయవచ్చు.
  2. తన కింది కోర్టులకు సంబంధించిన వివరాలను, సమాచారాన్ని తెప్పించుకోవచ్చు.
  3. ఒక కేసుని ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకి బదిలీ చేయగలదు (అధికరణ 228) లేదా ఆ వివాదాన్ని తన వద్దకు బదిలీ చేయించుకుని తీర్పు ఇవ్వగలదు.
  4. తన కింది న్యాయస్థానాలకు సంబంధించిన దస్త్రాలు, రికార్డులను పరిశోధించే పరిశీలించే అధికారం కలిగి ఉంది.
  5. కింది కోర్టులో ఉద్యోగులను నియమించి, వారి వేతనం, ఇతర సదుపాయాలు, పని నియమాలను నిర్ణయించే అధికారం హైకోర్టుకి ఉంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాష్ట్ర కార్యనిర్వాహకశాఖ.
జవాబు.
రాష్ట్ర కార్యనిర్వాహకశాఖ:
భారత రాజ్యాంగంలోని 153 నుంచి 167 వరకు ఉన్న 15 అధికరణాలు రాష్ట్ర కార్యనిర్వాహకశాఖ గురించి పేర్కొన్నాయి. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో

  1. గవర్నర్
  2. ముఖ్యమంత్రి
  3. రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు కొందరు ఉంటారు.

ప్రశ్న 2.
గవర్నర్కు ఉన్న రెండు శాసనాధికారాలు.
జవాబు.
గవర్నర్కు రెండు శాసన నిర్మాణాధికారాలు. గవర్నర్ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగం.

  1. అతడు రాష్ట్ర శాసనసభ్యులను సమావేశపరుస్తాడు. వాయిదా, రాష్ట్ర శాసననిర్మాణ శాఖలోని విధాన సభను రద్దు చేస్తాడు.
  2. విధాన సభలో స్వయంగా ప్రసంగిస్తాడు. లేదా తన సందేశాలను పంపుతాడు.
  3. విధాన పరిషత్లోని ఆరోవంతు సభ్యులను నామినేట్ చేస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 3.
రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణం.
జవాబు.
రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణం :
రాష్ట్ర మంత్రిమండలి

  • ముఖ్యమంత్రి, కొందరు
  • కాబినెట్ హోదా ఉన్న మంత్రులు
  • స్టేట్ హోదా ఉన్న మంత్రులు ఉంటారు.
    కొన్నిసార్లు దానిలో డిప్యూటీ మంత్రులు కూడా ఉంటారు.

ప్రశ్న 4.
గవర్నర్ విచక్షణాధికారాలు.
జవాబు.
గవర్నర్ విచక్షణాధికారాలు :

  1. ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం.
  2. రాష్ట్ర మంత్రిమండలిని తొలగించడం.
  3. శాసన, పరిపాలనా సంబంధమైన అంశాలపై సమాచారం అందించవలసిందిగా ముఖ్యమంత్రిని కోరడం.
  4. విధాన సభను రద్దు చేయడం మొదలైనవి.

ప్రశ్న 5.
ముఖ్యమంత్రి నియామకం.
జవాబు.
ముఖ్యమంత్రి నియామకం:
రాజ్యాంగం 164వ అధికరణం ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు. విధాన సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత మెజారిటీ పార్టీ నాయకుడిని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. కొన్నిసార్లు విధానసభలో ఏ ఒక్క పార్టీకీ మెజారిటీ లభించకపోతే, స్థిరత్వంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో గవర్నర్ అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తాడు.

విధాన సభలో మిగిలిన పార్టీల శాసన సభ్యులతో సహా మెజారిటీ సభ్యుల మద్దతును పొందగలిగే పార్టీ లేదా పార్టీల నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానిస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 6.
శాసనసభ.
జవాబు.
శాసనసభనే రాష్ట్ర విధానసభ అని, అసెంబ్లీ అని, ప్రజాప్రతినిధుల సభ అని వ్యవహరిస్తారు. రాష్ట్ర శాసన నిర్మాణశాఖలో దిగువ సభ విధానసభ, అందులో రాష్ట్రంలోని ఓటర్లచే ఎన్నుకోబడిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

ప్రశ్న 7.
శాసనసభ మండలి (లేదా) విధాన పరిషత్తు.
జవాబు.
విధానపరిషత్తు లేదా శాసనమండలి రాష్ట్ర శాసన నిర్మాణశాఖలో రెండోసభ లేదా ఎగువసభ. ప్రస్తుతం భారతదేశంలో ఆరు రాష్ట్రాలలో విధానపరిషత్తులు ఉన్నాయి. అవి ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్ము & కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లు. విధాన పరిషత్తు సభ్యత్వ సంఖ్యలో మూడోవంతు మించకూడదు. విధానపరిషత్తు ఏర్పాటు లేదా రద్దు విషయంలో భారత పార్లమెంటు తీర్మానం చేస్తుంది.

ప్రశ్న 8.
శాసనసభ స్పీకర్.
జవాబు.
సభా కార్యక్రమాల నిర్వహణ కొరకు విధాన సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకొంటారు. స్పీకరు పదవీకాలం 5 సంవత్సరములు. స్పీకర్ విధానసభ సభ్యుల హక్కులు, స్వేచ్ఛలకు సంరక్షకుడిగా వ్యవహరిస్తాడు. సభలో క్రమశిక్షణా చర్యలు అమలు అధికారం అతడికి ఉంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 4 రాష్ట్ర ప్రభుత్వం

ప్రశ్న 9.
హైకోర్టు నిర్మాణాన్ని తెలపండి.
జవాబు.
హైకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను కల్గి ఉంటుంది. రాజ్యాంగం రెండు సంవత్సరాలకు మించకుండా తాత్కాలిక న్యాయమూర్తులను నియమించడానికి వెసులుబాటు కల్పించింది. ఈ తాత్కాలిక న్యాయమూర్తులు హైకోర్టులో అధికమైన పనిభారాన్ని నిర్వహించడానికి నియమించబడతారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 4th Lesson బీమా సేవలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 4th Lesson బీమా సేవలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బీమాను నిర్వచించండి. బీమాకు సూత్రాలు ఏమిటో తెలపండి.
జవాబు.
బీమా అర్థం:: బీమా అనగా సంభవించిన ఆర్థిక నష్టాన్ని అనేక మందికి వ్యాప్తి చేసే ఒక సాంఘిక పరిష్కారం. బీమా కాంట్రాక్టులో ఒక పార్టీకి సంభవించే ఆపదలకు, నష్టానికి, కొంత సొమ్ముకు బదులుగా, పరిహారాన్ని చెల్లించే అంగీకారం ఉంటుంది.

బీమా – నిర్వచనాలు:

  1. ఆచార్య విల్లెట్ బీమాను నిర్వచించిన ప్రకారం “ఒక వ్యక్తికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి వ్యక్తుల సమూహంలోని నష్టాన్ని బదిలీ కల్పించే ఒక సామాజిక సాధనం”.
  2. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం బీమా అనేది “ఒక ప్రత్యేక నష్టానికి, చెడిపోయిన వస్తువునకు, వ్యాధికి లేదా మరణానికి కొంత ప్రీమియం చెల్లించిన తరువాత నష్ట పరిహారాన్ని చెల్లించడానికి కంపెనీ లేదా రాజ్యం చేసిన ఏర్పాటు”.
  3. న్యాయశాస్త్రం దృష్ట్యా బీమా అనగా “ఏర్పడిన ఒక నిర్దిష్టమైన నష్టానికి కొంత సొమ్మును ప్రతిఫలంగా చెల్లించడానికి ఒక పార్టీకి వేరొక పార్టీకి మధ్య కుదిరిన ఒప్పందం”.

బీమా సూత్రాలు: బీమా ఏదైనా ఈ క్రింది ప్రధాన సూత్రాలకు లోబడి ఉంటుంది.
1) అత్యంత విశ్వాసం:

  1. బీమా ప్రక్రియలో ‘పార్టీలలో పరస్పర నమ్మకం కలిగి ఉండాలనే’ సూత్రం ఉంది. బీమా కాంట్రాక్టులలోని పార్టీలు తమకు సంబంధించిన సమాచారాన్ని సంపూర్తిగా తెలియజేస్తూ కాంట్రాక్టు ఏర్పాటుకు మార్గాన్ని సృష్టించవలసి ఉంటుంది.
  2. దీని వల్ల పాలసీదారుడి ఆస్తి లేదా ప్రాణ సంబంధిత విషయాన్ని నమ్మకంగా కంపెనీ వారికి అందజేసే బాధ్యత కలిగి ఉంటాడు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

2) బీమాపై ఆసక్తి:

  1. ఒక ఆస్తిపై కాని, జీవనంపై కాని ఆర్థికపరమైన ప్రయోజనం కలగాలంటే బీమా పట్ల ఆసక్తి కలిగి ఉండాలి.
  2. తన జీవనంపైగానీ, ఆస్తిపై గాని బీమా చేయడానికి ఆసక్తి లేని వ్యక్తి న్యాపరమైన బీమా కాంట్రాక్టును ఏర్పరచలేడు. అలా కాకుండా, ఒక వ్యక్తి ఏ రకమైన ఆస్తిపైనైనా ఇష్టం ఉన్నట్లు బీమా చేసుకున్నట్లయితే అలాంటి ఆసక్తి ఒక జూదంగానో, మాయగానో ఉండేది. ఆ పరిస్థితులలో బీమా కాంట్రాక్టులు పందెముల లాగా గోచరించి న్యాయపరంగా చెల్లుబాటు కాని కాంట్రాక్టులు అవుతాయి.

3) నష్ట పరిహారం / నష్ట పూర్తి:

  1. ఒక నిర్దిష్టమైన సంఘటన జరిగినప్పుడు బీమాదారునికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి, దానిని బీమా సంస్థ చెల్లించడాన్ని నష్టపూర్తి అంటారు. ఇది బీమా ఆస్తి విలువకు మించరాదు.
  2. జీవిత బీమా వ్యక్తిగత బీమాలకు ఈ విమోచన సూత్రం వర్తించదు.

4) ప్రతినివేశం:

  1. ఈ సూత్రం ప్రకారం నష్టపోయిన వ్యక్తికి చెల్లింపులు చేసిన తర్వాత, బీమా కంపెనీకి ఆ ఆస్తిపై హక్కు సంక్రమిస్తుంది.
  2. వస్తువు పాక్షికంగా లేదా పూర్తిగా పాడైనప్పటికీ ఈ సూత్రం వర్తిస్తుంది. అలాంటి సందర్భంలో క్లెయిమ్ ద్వారా పొందిన దాని కంటే వ్యర్థం ద్వారా అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

5) వంతులవారీ చెల్లింపు:

  1. కొన్ని సందర్భాలలో వ్యక్తులు ఒక కంపెనీ కంటే ఎక్కువ కంపెనీలలో బీమా చేయిస్తారు. దీన్ని ‘ద్వంద్వ బీమా’ అంటారు. నష్టం సంభవించిన పక్షంలో, బీమా చేసిన వ్యక్తి వాస్తవ సొమ్మును పొంది విమోచనం పొందాలంటే బీమా ద్వారా పరిష్కార ఏర్పాట్లు చేయబడతాయి. అలాంటి సందర్భంలో బీమా కంపెనీలు వంతులవారీ చెల్లింపు సూత్రాన్ని పాటిస్తాయి.
  2. ఒకవేళ బీమా చేసిన వ్యక్తి ఒక కంపెనీ కంటే ఎక్కువ కంపెనీల ద్వారా క్లెయిమ్ చేసినట్లయితే, చెల్లించిన మొత్తాన్ని కంపెనీలు సర్దుబాటు చేసుకుంటాయి.

6) నష్టాన్ని తగ్గించడం:

  1. ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రమాదం సంభవించినట్లయితే పాలసీదారుడు అలాంటి ప్రమాదం ద్వారా ఏర్పడే నష్టాన్ని తగ్గించడానికి తగిన చర్యలను తీసుకునే బాధ్యత కలిగి ఉంటాడు.
  2. ఈ సూత్రం వర్తింపజేయడానికి గల కారణమేమంటే, ప్రమాదం జరిగినపుడు పాలసీదారుడు అజాగ్రత్తగా ఉండక సామాన్యుడిలాగా చైతన్యవంతులై నష్టాన్ని తగ్గించడానికి ఉపక్రమించాలి.

7) సమీప కారణం:

  1. ప్రమాదం సంభవించిన సందర్భంగా బీమా కంపెనీ పూర్తి నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే సంభవించిన నష్టం తీసుకున్న పాలసీలోని ఘటనకు ప్రత్యక్ష సామీప్యతను కలిగి ఉండాలి.
  2. ప్రమాదం సంభవించినప్పుడు నిజనిర్ధారణ చేయడానికి సమీప క్రియను మాత్రమే పరిగణించి, లోతైన కారణాలను చూడదనే ఆచారాన్ని పాటిస్తుంది.

ప్రశ్న 2.
బీమా విధులను వివరించండి.
జవాబు.
బీమా విధులను రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి: (1) ప్రాథమిక విధులు (2) సెకండరీ విధులు.
బీమా విధులను వివరించండి.
1) ప్రాథమిక విధులు
ఎ) నిశ్చిత స్థితి: బీమా ద్వారా నష్టపరిహారాన్ని చెల్లించడం నిశ్చయం అని తెలియజేస్తుంది. అనిశ్చితి గల నష్టాన్ని తగ్గించడానికి తగిన ప్రణాళిక, వ్యూహం ఉండాలి. బీమా అనే ఏర్పాటు ఆ నష్టం నుంచి ఉపశమనాన్ని కల్పిస్తుంది.. నష్ట భయాలు వివిధ రకాలుగా ఉంటాయి, ఘటన సంభవించినా సంభవించకపోయినా పరిహార చెల్లింపు విషయంలో కంపెనీలు నిశ్చయంగా ఉంటాయి. దాని కోసం కొంత మొత్తంగా ప్రీమియం రూపంలో వసూలు చేస్తాయి.

బి) భద్రతను కల్పించడం ప్రమాదం ఏర్పడు ముందు నష్టానికి తగిన భద్రతను బీమా కల్పిస్తుంది. బీమా లేనట్లయితే ప్రమాదం సంభవించినపుడు ఆసక్తిగల వ్యక్తి సమయం, డబ్బు భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు పడే అవస్థ నుంచి కాపాడే బాధ్యతను బీమా కంపెనీ తీసుకుంటుంది.

సి) నష్టభయాన్ని పంచుకోవడం: జరగబోయే నష్టం అనిశ్చితిగా ఉంటుంది. ప్రమాదం సంభవించినపుడు నష్టాన్ని వ్యాప్తి చేసి అందరికీ పంపకం చేయబడుతుంది. ఆధునిక కాలంలో ప్రీమియం ద్వారా పొందిన సొమ్ము మొత్తాన్ని పాలసీదారులకు వ్యాప్తి చేసి నష్టాన్ని పరిహరించేటట్లు అభయం ఇస్తాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

2. అనుబంధ విధులు:
ఎ) నష్ట నివారణ: ప్రమాదం సంభవించినపుడు జరిగే నష్టాన్ని నివారించడానికి బీమా కంపెనీలు కలిసికట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ప్రీమియం చెల్లింపులు తగ్గి బీమా చేసే వ్యక్తికి ఎంతో ఉపకరిస్తుంది.

బి) మూలధన ఏర్పాటు: సమాజానికి కావలసిన మూలధన ఏర్పాట్లను బీమా కంపెనీలు సృష్టిస్తాయి. సేకరించిన సొమ్మును ఉత్పత్తి మార్గంలో పెట్టును. మూలధన కొరతను తగ్గించును.

సి) నైపుణ్యతను మెరుగుపరచడం: ప్రమాదం సంభవించినప్పుడు ఏర్పడిన నష్టాన్ని, బాధలను బీమా వ్యవస్థ రూపుమాపుతుంది. ఆర్థికబాగుకోసం తన జీవితాన్ని మనస్సును ‘బీమా సంస్థల పట్ల శ్రద్ధ చూపును. దీనివల్ల స్వంతంగా నైపుణ్యత పెంచుకోవడమేకాక ప్రజల నైపుణ్యాన్ని కూడా పెంచడానికి అవకావం ఉంది.

డి) ఆర్థిక ప్రగతి: సాధారణ ప్రజలకు, వ్యాపార సంస్థలకు బీమా సంస్థలు తీసుకునే భద్రత చర్యల ద్వారా మరియు పెట్టుబడుల ద్వారా ఆర్థిక ప్రగతిని ఏర్పరచును.

ప్రశ్న 3.
జీవిత బీమాను వర్ణించి వివిధ పథకాలను తెలపండి.
జవాబు.
1. జీవిత బీమా:
1) బీమా సంస్థ, తాను పొందిన ప్రీమియంకు బదులుగా, ఆ ప్రీమియం మొత్తం ఒకేసారి గాని లేదా వాయిదాల పద్ధతిలో గాని, బీమాదారుడు మరణించినప్పుడు లేదా నిర్ణీతమైన సమయం పూర్తి అయినప్పుడు సొమ్ము చెల్లింపుకు ఇచ్చిన కాంట్రాక్టును జీవిత బీమా అంటారు.

2) కాంట్రాక్టులో అంగీకరించిన విధంగా సంభవంచిన వ్యక్తి మరణానికి, తగిన ప్రతిఫలానికి బదులుగా పూర్తిగానైనా, వాయిదా పద్ధతిలో నైనా కొంత కాలానికి చెల్లించేటట్టు చేసే ఏర్పాటును జీవిత బీమాగా నిర్వచించవచ్చు. జీవిత బీమాలోని వివిధ పథకాలు: జీవిత బీమా పాలసీలలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. అవి:
ఎ) సంపూర్ణ జీవిత పాలసీ
బి) ఎండోమెంట్ పాలసీ,

ఎ) సంపూర్ణ జీవిత పాలసీ:

  1. ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం, పాలసీదారుని జీవితం మొత్తం కొనసాగే విధంగా పాలసీ ఉండటం. ఈ విధమైన పాలసీలో వ్యక్తి మరణం తరవాత చెల్లింపులు జరిగే విధంగా ఏర్పాట్లు చేయడమైనది.
  2. ఈ పథకంలో వ్యక్తి జీవించినంత కాలం కంపెనీకి ప్రీమియం మొత్తం చెల్లించవలసి ఉంటుంది. ఇలాంటి పథకాలలో ప్రీమియం చెల్లింపు స్వల్పంగా ఉండి కుటుంబానికి భద్రత కల్పిస్తుంది.

బి) ఎండోమెంట్ పాలసీ:

  1. ఈ పాలసీ ఒక ప్రత్యేక కాలపరిమితి కలిగి లేదా ఒక పరిమిత వయస్సు వరకు వర్తిస్తుంది.
  2. ఒకవేళ కాల పరిమితికి ముందే వ్యక్తి మరణించినట్లయితే, తక్షణమే క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. అలా కాకుండా పరిమిత కాలం వరకు ప్రీమియం చెల్లించినట్లయితే, పూర్తయిన కాలం తరువాత క్లెయిమ్ మొత్తం చెల్లించడం జరుగుతుంది.

బీమా కంపెనీలు అమలుచేసే వివిధ పాలసీలు:
ఎ) వార్షిక పాలసీ: ఈ పాలసీలో పాలసీదారునికి ప్రతి సంవత్సరం జీవింతాంతం వరకు కొంత మొత్తంలో చెల్లించడం జరుగుతుంది.

బి) నిక్షేప నిధి పాలసీ: ఈ పాలసీలో ద్వారా ఆస్తిని పునఃస్థాపనకు ఏర్పాటుచేసే భద్రతను కల్పిస్తుంది.

సి) పరిమిత కాల అభయ పాలసీ: ఈ పాలసీలో ఒక వ్యక్తి పరిమిత కాలానికి లేదా వయస్సుకు ముందు, మరణం సంభవించినప్పుడు మాత్రమే సొమ్ము చెల్లించడం జరుగుతుంది. ఇలాంటి పాలసీలలో ప్రాథమికంగా స్వల్ప ప్రీమియం కలిగి ఉంది. కాలాన్ని బట్టి ప్రీమియం పెరుగుతంది. దీనినే ‘ఆరోహణ స్థాయి పాలసీ’ అంటారు.

డి) ద్వంద్వ ప్రమాద విమోచన పాలసీ: ఇలాంటి పాలసీలలో పాలసీదారుడు ప్రమాదంలో మరణించినట్లయితే రెట్టింపైన సొమ్మును చెల్లించడం జరుగుతుంది.

ఇ) సమిష్టి జీవన పాలసీ: ఇలాంటి పాలసీలలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది జీవితాలపై బీమా చేయబడుతుంది. ప్రమాదం సంభవించినప్పుడు మరణించినట్లయితే జీవించి ఉన్న మిగతా వారిలో ఒకరికి సొమ్ము చెల్లించడం జరుగుతుంది.

ఎఫ్) బృంద బీమా పాలసీ: ఈ రకమైన పాలసీలు కుటుంబపరంగా కాని లేదా సంస్థలలో పనిచేసే సిబ్బంది మొత్తానికి వర్తిస్తాయి.

జి) జనతా పాలసీ: ఈ పాలసీ కింద ఎండోమెంట్ పాలసీలను జారీ చేయడం జరుగుతుంది. జనతా పాలసీ 10, 15, 25 సంవత్సరాల కాల పరిమితి కలిగి 60 సంవత్సరాల వయస్సును మించకుండా ఉన్న వ్యక్తులకు వర్తిస్తుంది. వీటిని గరిష్ఠంగా 45 సం॥ల వరకు మాత్రమే జారీ చేయడం జరుగుతుంది. పాలసీ తీసుకోవడానికి 35 సం॥ల వరకు ఏ విధమైన ఆరోగ్య పరీక్షలు అవసరం లేదు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

ప్రశ్న 4.
నౌకాయాన బీమా అంటే ఏమిటి ? నౌకాయాన బీమా పథకాలను వివరించండి.
జవాబు.
సముద్రయానంలో నావలోని సరుకు ప్రమాదవశాత్తు పాడయిపోయినట్లయితే సొంతదారునికి విమోచనం కల్పించే సౌకర్యమే “సముద్ర బీమా” ఈ బీమా సాధారణంగా నౌకకు లేదా నౌకలో గల సరుకుకు వర్తిస్తుంది.

సముద్ర బీమా రకాలు:
1) టైమ్ పాలసి: ఈ పాలసీలో బీమా అంశం ప్రత్యేక కాలానికి లోబడి ఉంటుంది. ఈ పాలసీకి ప్రధానంగా తెట్ట బీమా సంబంధించిన స్థిర, చర వస్తువులకు వర్తిస్తుంది.

2) వాయేజ్ పాలసి: సముద్ర యానం ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సరుకు తరలించేటపుడు అమలుపరచడానికి ఈ పాలసి వర్తిస్తుంది. నౌకాయానంలో ఏర్పడే నష్టాన్ని ఈ పాలసీ తీరుస్తుంది.

3) మిశ్రమ పాలసి: ఈ పాలసీ ఒక నిర్ణీత కాలానికి ప్రత్యేక సముద్ర మార్గంలో సరుకును చేరవేసే బీమాను కల్పిస్తుంది. ఈ పాలసీకి కాల సంబంధిత, సముద్రయాన పాలసీ అంటారు.

4) ఫ్లోటింగ్ పాలసి: పాలసీలో సరుకు యజమానులు క్రమంగా సరుకును చేరవేసే వ్యవహారాలు చేపట్టినట్లయితే ఫ్లోటింగ్ అంటారు.

5) బ్లాంకెట్ పాలసి: ఈ పాలసీలో కొంత సొమ్ముకు బీమా తీసుకుని మొదటి ప్రీమియం చెల్లించి సొమ్ము పూర్తయ్యే వరకు నష్ట భయాన్ని సర్దుబాటు చేస్తారు.

6) ప్లీట్ పాలసి: ఆవిరి యంత్రపు నౌకలు మరియు అన్ని నౌకలకు బీమా కల్పించే పాలసి ప్లీట్ పాలసి.

7) విలువ కట్టిన పాలసి: ఈ బీమాలో పూచి పరిహారాన్ని తెలియజేసి ప్రత్యేకంగా విలువ కడతారు. ఒకవేళ పరిహారపు విలువ తెలియకపోతే దాన్ని ఓపెన్ పాలసి అంటారు.

8) ఇతర బీమా పాలసీలు: సాధారణ బీమా కంపెనీలు అన్ని రకాల నష్టభయమును కలుపుతూ వివిధ పాలసీలు అందిస్తారు.
ఉదా: మోటారు సైకిల్ బీమా, మూడవ పార్టీ బీమా అపహరణ బీమా మొదలైనవి.

ప్రశ్న 5.
అగ్ని బీమా అంటే ఏమిటి ? వివిధ రకాల అగ్ని బీమాలను వివరించండి.
జవాబు.
I. అగ్ని ప్రమాద బీమా:

  1. ఒక పార్టీకి సంభవించిన ఆర్థిక నష్టాన్ని, కొంత సొమ్ముకు బదులుగా, అగ్ని లేదా దానికి సంబంధించిన ప్రమాదం వల్ల పాడైన లేదా నాశనమైన వస్తువుకు పరిహార రూపంలో చెల్లించే ఏర్పాటును అగ్ని ప్రమాద బీమా అంటారు.
  2. క్లెయిమ్ చేసే సొమ్ముకు ప్రధానంగా రెండు షరతులు వర్తిస్తాయి. ఎ) వాస్తవ అగ్ని ప్రమాద సందర్భం బి) అగ్ని ప్రమాదం అకస్మాత్తుగా జరిగి ఉండాలి కాని ఉద్దేశపూర్వకంగా ఉండకూడదు.

II. అగ్ని ప్రమాద బీమా పాలసీలు:
క్రింద పేర్కొన్న పాలసీలు అగ్ని ప్రమాద బీమాకు వర్తిస్తాయి.
1) విలువ కట్టిన పాలసీ: ఈ పాలసీలో ఆస్తి విలువను లెక్కించి ప్రమాదం సంభవించినపుడు, చెల్లించడానికి గల విలువను అంగీకరించిన విధంగా తగిన ఏర్పాటు చేయబడుతుంది.

2) సగటు పాలసీ:
ఎ) సగటు పాలసీలో సరాసరి క్లాజ్ ఉంది. ఈ క్లాజ్ ప్రకారం ఆస్తిని తరుగు విలువ గలదిగా బీమా చేసినట్లయితే, బీమా చేసిన వ్యక్తికి అనుపాత విలువతో నష్ట సమయానికి అనుబంధంగా బీమా విలువ కలిగి ఉంటుంది.

బి) ఉదా: ఒక వ్యక్తికి గల ఆస్తి విలువ కౌ 15,000గా ఉన్నట్లయితే, గౌ 8,000ల నష్టాన్ని లెక్కించగా, అలాంటి సమయానికి మార్కెట్ విలువ 20,000 ఉంటే, క్లెయింట్ సెటిల్ చేసే మొత్తం 6,000 నిర్ణయించవచ్చు. అంటే (15,000/20,000) 8,000. తదనుగుణంగా ఇలాంటి పరిస్థితిలో బీమా చేసిన వ్యక్తి శ 2,000 నష్టాన్ని భరించవలసి
ఉంటుంది.

3) నిర్దిష్ట పాలసీ:
1) ఈ పాలసీ ద్వారా ‘ఒక ప్రత్యేక సొమ్ముకై బీమా చేయబడుతుంది. ప్రమాదం సంభవించి నష్టం కలిగినట్లయితే కంపెనీ వారు పూర్తి నష్టాన్ని చెల్లిస్తారు. ఇలాంటి సందర్భంలో ఆస్తి మొత్తం విలువ పరిగణనలోకి తీసుకోబడదు. 2) ఉదా: ఒక భవంతి విలువ 1,00,000లు ఉండి, 50,000ల అగ్ని ప్రమాదపు నష్టాన్ని పొందినట్లయితే దాని విలువ ఔ 30,000గా నిర్ధారించినపుడు బీమా చేసిన వ్యక్తికి శ 30,000లను పరిహారంగా కంపెనీ చెల్లిస్తుంది.

4) ఫ్లోటింగ్ పాలసీ:

  1. ఒకసారి చెల్లించే ప్రీమియంనకు వివిధ ప్రాంతాలలో నిల్వ చేసిన సరుకుకు పాలసీని అమలుపరచే పథకాన్ని ఫ్లోటింగ్ పాలసీ అంటారు.
  2. ఇలాంటి పాలసీలలో నిల్వ చేసిన సరుకు విలువలలో సగటు విలువ ఆధారం చేసుకుని నిర్ణయించిన ప్రీమియం ద్వారా. బీమా పాలసీ వర్తిస్తుంది.

5) అధిక నష్ట పాలసీ:

  1. వర్తకులు సరుకును నిల్వ ఉంచిన పక్షంలో పరిణమించే విలువలను మార్పుకనుగుణంగా అత్యంత అదనపు ప్రయోజనాన్ని కల్పించే పరిహారం గల పాలసీ.
  2. ఉదా: ఒక వర్తకుడు నిల్వ ఉంచిన సరుకు విలువ 7 1,00,000 మరియు 1,50,000 మధ్య ఉన్నట్లయితే, ప్రథమంగా 1,00,000 పొంది అటు తరువాత 50,000 అధిక నష్ట పాలసీ కింద ప్రయోజనాన్ని పొందవచ్చు.

6) బ్లాంకెట్ పాలసీ: ఇలాంటి పాలసీలలో అన్ని విధాలైన స్థిర మరియు చర ఆస్తులను ఒకే పాలసీలో అమలయ్యే ఏర్పాటు చేయబడుతుంది.

7) విస్తారమైన పాలసీ: ఇలాంటి పాలసీలలో అన్ని రకాల నష్టభయాలైన అగ్ని, పేలుడు, మెరుపు, పిడుగు, దోపిడీలు, సాంఘిక కలహాలు, ధర్నాలు, కన్నం వేయడం, కొంతమేరకు నష్టపోయన అద్దెల వల్ల కలిగే నష్టాలు చేరి ఉంటాయి. దీన్ని ‘సర్వ బీమా పాలసీ అని కూడా అంటారు.

8) నష్ట సంభవ పాలసీ: ఒక వ్యాపారం నడిచేటప్పుడు సంభవించే ఆటంకపు నష్టాల నుంచి లాభలోటును విమోచనం చేసే పాలసీ ‘నష్ట సంభవ పాలసీ’.

9) పునః స్థాపన పాలసీ: ఈ పాలసీ ద్వారా ఒక ఆస్తిని పునఃస్థాపనకు కంపెనీ వారు పరిహార ఏర్పాట్లును చేస్తారు. చెల్లింపు విలువను లెక్కించే సమయంలో తరుగుదలను ఆస్తి విలువ నుంచి తీసివేయడం జరుగదు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

ప్రశ్న 6.
IRDA అంటే ఏమిటి ? IRDA అధికారాలను, విధులను వివరించండి.
జవాబు.
మల్హోత్రా కమిటి సిఫారసు ప్రకారం దేశంలోని బీమా వ్యాపార అభివృద్ధికి, నియంత్రణకు భారత ప్రభుత్వం “బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటి” (Insurance Regulatory and Development authority IRDA) ని 1999లో స్థాపించినది. హైదరాబాదు ప్రధాన కార్యాలయంగా బీమా, బీమాయేతర కంపెనీలకు జాతీయ స్థాయిలో నిర్వహణకు, నియంత్రణకు ఉద్దేశించిన భారత ప్రభుత్వం నడుపుతున్నది.

IRDA అధికారాలు విధులు:

  1. బీమా కాంట్రాక్టులోగల నియమ నిబంధనలకు లోబడి పాలసీదారులకు సంబంధించిన నామినేషన్, బీమాపై గల ఆసక్తి, బీమా క్లెయిమ్లు, అప్పగింత విలువకు భద్రత కల్పించడం.
  2. బీమా ఏజెంట్లకు, మధ్యవర్తులకు అవసరమైన అర్హత, శిక్షణకు సంబంధించిన అంశాలను నిర్ధారించడం.
  3. సర్వేయర్లకు, విలువ నిర్ధారితులకు నడవడి విధానాన్ని తెల్పడం.
  4. బీమా వ్యాపారం వృద్ధికై ప్రోత్సాహాన్ని కల్పించడం.
  5. IRDA చట్టం పరిధిలో చెల్లింపులు, ఇతర ఛార్జీలకు సంబంధించి వృత్తిపరమైన సంస్థలతో ఏర్పాటు చేయడం.
  6. బీమా వ్యాపార వ్యవహారాలకు గల పరిశీలన, తనిఖీ, వ్యాజ్యం, బీమా ఆడిట్కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం.
  7. బీమా కంపెనీలు పెట్టే పెట్టుబడుల నిర్వహణ, నియంత్రణను శక్తికి తగినట్లుగా చర్యలు తీసుకోవడం.
  8. బీమా కంపెని, మధ్యవర్తులకు ఏర్పడిన వివాదాలకు తీర్పు ఇవ్వడం.
  9. సుంకాల సలహా సంఘం వ్యవహార తీరును పర్యవేక్షించడం.
  10. నిర్దేశింపబడిన ఏ ఇతర విధులైనా చేపట్టడం.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బీమా లక్షణాలను తెలపండి.
జవాబు.
1) నష్టభయాన్ని పంచుకునే సాధనం: సంభవించబోయే నష్టాలకు భద్రతను కల్పించే ఏర్పాటు చేయడమే బీమా ప్రధాన లక్షణం. ఒక వ్యక్తి తనకు తానుగా భరించలేని ఆర్థిక నష్టాలను కల్పించే అగ్ని ప్రమాదం, దొంగతనం, సహజ ప్రమాదం, మరణం లాంటివి భారీ మూల్యం కలిగినవి. ఇలాంటి నష్టభయాన్ని బీమా అందరికీ సమంగా పంచబడుతుంది. అందువల్ల బీమా అనేది నష్టభయాన్ని పంచుకునే సాధనం బీమా లక్షణాలలో చెప్పబడింది.

2) సహకార సాధనం: ఒక నష్టభయానికి సంబంధించి వ్యక్తుల సమూహం ముందుకు వచ్చి ఆ నష్టభయాన్ని సమంగా పంచుకుంటారు. కాబట్టి దీన్ని సహకార సాధనంగా చెప్పవచ్చు.

3) భద్రత కల్పించే సాధనం: అన్ని రకాలైన నష్టాలకు భద్రత కల్పించేది బీమాయే. బీమా లేనట్లయితే జరగబోయే అన్ని నష్టాలకు సొంతదారుడే బాధ్యుడవుతాడు కాని అలా జరగడం అసాధ్యం’ అందువల్ల బీమా అనేది భద్రత కల్పించే ఒక సాధనం.

4) నష్టభయాన్ని కొలిచే సాధనం: సంభవించే నష్టాన్ని ముందుగా అంచనా వేయడం వల్ల ఎంతమేరకు నష్టపరిహారాన్ని చెల్లించవచ్చో ముందుగానే గుర్తించవచ్చు. బీమా చేయడానికి ముందే, చెల్లించబోయే ప్రీమియాన్ని, నష్టపరిహారాన్ని లెక్కించడం ఎంతో శ్రేయస్కరం.

5) చెల్లింపు సాధనం: ఒక బీమా కాంట్రాక్టులో నష్టభయం చోటు చేసుకున్నా, లేకున్నా పాలసీదారుడు కొంత మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరిస్తాడు. ఉదా: జీవిత బీమా కాంట్రాక్టులో తటస్థించబోయే అంశాలు రెండు. అవి వ్యక్తి మరణించడం లేదా పాలసీకాలం పూర్తవడం కూడా. ఇతర బీమా కాంట్రాక్టులైన అగ్ని ప్రమాద బీమా, నౌకా ప్రమాద బీమాలలో నష్టం సంభవించినపుడు నష్టపరిహారాన్ని చెల్లించవలసి ఉంటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

ప్రశ్న 2.
బీమా, హామీ వ్యత్యాసాలను తెలపండి.
జవాబు.
బీమా మరియు హామీ అనే రెండు పదాలను తరచుగా ఒకే అర్థం వచ్చే విధంగా వాడుతారు. కాని అవి పర్యాయపదాలు కావు.

బీమా మరియు హామీల వ్యత్యాసాలు:

బీమా

  1. బీమా అనగా నష్టం సంభవించినా, సంభవించక పోయినా చెల్లించే నష్టపరిహార ఒప్పందం
  2. బీమాలో నష్టం సంభవించితేనే పరిహారం చెల్లిస్తారు. నష్టం జరగకపోతే పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.

హామీ

  1. హామి అనగా తీసుకున్న పాలసీకు క్లెయిమ్ చేసుకోవచ్చు.
  2. హామీ ప్రకారం పరిహారం చెల్లించడం తప్పనిసరి అవుతుంది. జీవిత బీమాలో మరణం సంభవించిన లేదా టర్మ్ కాలం ముగిసిన బీమా విలువను చెల్లించాల్సి వస్తుంది.
    బీమా లక్షణాలను తెలపండి.

ప్రశ్న 3.
IRDA కూర్పు ఏమిటి ?
జవాబు.
IRDA లో ఒక చైర్పర్సన్, తొమ్మిది మంది సభ్యులకు మించకుండా ఐదుగురు సభ్యులు భారత ప్రభుత్వం ద్వారా నియమించబడి ఉంటారు. వీరికి పరిపాలన, గణక శాస్త్రం, న్యాయ విద్య, అర్ధశాస్త్రం, ఫైనాన్స్, బీమా, బీమాయేతర సంబంధ విద్యలలో సంపూర్ణ పరిజ్ఞానం, అనుభవం, కీర్తి, నిజాయితీ, సామర్థ్యం కలిగి ఉండాలి. వీరి పదవీ కాలం 5 సంliలుగా నిర్ధారించబడి, పూర్తికాల సభ్యులకు 62 సం||ల వయస్సు వచ్చేవరకు కొనసాగుతారు. కాని చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి 65 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగవచ్చు.

ప్రశ్న 4.
జీవిత బీమా కింద ప్రతిపాదించే వివిధ పాలసీలు ఏమిటి ?
జవాబు.
బీమా కంపెనీలు అమలు చేసే వివిధ పాలసీలు:

  1. వార్షిక పాలసీ: ఈ పాలసీలో పాలసీదారునికి ప్రతి సంవత్సరం జీవితాంతం వరకు కొంత మొత్తంలో చెల్లించడం జరుగుతుంది.
  2. నిక్షేప నిధి పాలసీ: ఈ పాలసీ ద్వారా ఒక ఆస్తిని పునఃస్థాపనకు ఏర్పాటు చేసే భద్రతను కల్పిస్తుంది.
  3. పరిమిత కాల అభయ పాలసీ: ఈ పాలసీలో ఒక వ్యక్తి పరిమిత కాలానికి లేదా వయస్సుకు ముందు, మరణం సంభవించినప్పుడు మాత్రమే సొమ్ము చెల్లించడం జరుగుతుంది. ఇలాంటి పాలసీలలో ప్రాథమికంగా స్వల్ప ప్రీమియం కలిగి ఉండి, కాలాన్ని బట్టి ప్రీమియం పెరుగుతుంది. దీనినే ‘ఆరోహణ స్థాయి పాలసీ’ అంటారు.
  4. ద్వంద్వ ప్రమాద విమోచన పాలసీ: ఇలాంటి పాలసీలలో పాలసీదారుడు ప్రమాదంలో మరణించినట్లయితే రెట్టింపైన సొమ్మును చెల్లించడం జరుగుతుంది.
  5. సమిష్టి జీవన పాలసీ: ఇలాంటి పాలసీలలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది జీవితాలపై బీమా చేయబడుతుంది. ప్రమాదం సంభవించినప్పుడు మరణించినట్లయితే జీవించి ఉన్న మిగతా వారిలో ఒకరికి సొమ్ము చెల్లించడం జరుగుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అగ్ని ప్రమాద బీమా.
జవాబు.

  1. ఒక పార్టీకి సంభవించిన ఆర్థిక నష్టాన్ని, కొంత సొమ్ముకు బదులుగా అగ్ని లేదా దానికి సంబంధించిన ప్రమాదం వల్ల పాడైన లేదా నాశనమైన వస్తువుకు పరిహార రూపంలో చెల్లించే ఏర్పాటును అగ్ని ప్రమాద బీమా అంటారు.
  2. అగ్ని ప్రమాద బీమా క్లెయిమ్ చేసేందుకు రెండు షరతులు వర్తిస్తాయి. అవి:
    ఎ) వాస్తవ అగ్నిప్రమాద సందర్భం
    బి) అగ్ని ప్రమాదం అకస్మాత్తుగా జరిగి ఉండాలి కాని ఉద్దేశ పూర్వకంగా ఉండకూడదు.

ప్రశ్న 2.
IRDA పాత్ర.
జవాబు.
IRDA పాత్ర:

  1. పాలసీదారుల ఆసక్తులను కాపాడటం.
  2. బీమా వ్యాపార పరిశ్రమ, దాని అనుబంధ వ్యవహారాలు క్రమమైన అభివృద్ధి జరగడానికి తోడ్పడటం. 3) నైతిక విధానంలో బీమా వ్యాపారాన్ని భారత భూభాగంలో నిర్వహించడం.

ప్రశ్న 3.
మిశ్రమ పాలసీ,
జవాబు.
ఈ పాలసీని “కాల సంబంధిత, సముద్రయాన పాలసీ” అంటారు. ఈ పాలసీ ఒక నిర్ణీత కాలానికి ప్రత్యేక సముద్ర మార్గం ద్వారా సరుకును చేరవేసే బీమాను కల్పిస్తుంది.
ఉదా: చెన్నై నుంచి టోక్యో వరకు ఆరు నెలల కాలానికి మిశ్రమ పాలసీని తీసుకోవడం.

ప్రశ్న 4.
ఎండోమెంట్ పాలసీ
జవాబు.

  1. ఈ పాలసీ ఒక ప్రత్యేక కాలపరిమితి కలిగి లేదా ఒక పరిమిత వయస్సు వరకు వర్తిస్తుంది.
  2. ఒక వేళ కాల పరిమితికి ముందే వ్యక్తి మరణించినట్లయితే, తక్షణమే క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. అలా కాకుండా పరిమిత కాలం వరకు ప్రీమియం చెల్లించినట్లయితే, పూర్తయిన కాలం తరువాత క్లెయిమ్ మొత్తం చెల్లించడం జరుగుతుంది.

ప్రశ్న 5.
బీమా.
జవాబు.

  1. ఏర్పడిన ఒక నిర్ధిష్టమైన నష్టానికి కొంత సొమ్మును ప్రతిఫలంగా చెల్లించడానికి ఒక పార్టీకి వేరొక పార్టీకి మధ్య కుదిరిన ఒప్పందాన్ని బీమా అంటారు.
  2. బీమా అనగా సంభవించిన ఆర్థిక నష్టాన్ని అనేక మందికి వ్యాప్తి చేసే ఒక సాంఘిక పరిష్కారం.

ప్రశ్న 6.
అప్పగింత విలువ.
జవాబు.

  1. పాలసీదారుడు మెచ్యురిటీకి ముందే పాలసీని కంపెనీకి అప్పగించినట్లయితే అప్పగింత విలువను కంపెనీ చెల్లిస్తుంది.
  2. అప్పగింత విలువ చెల్లించడానికి కనీసం మూడు సంవత్సరాల వ్యవధి దాటి ఉండాలి. ఈ విలువ పాలసీదారుడు చెల్లించిన బీమా ప్రీమియం ఆధారంగా లెక్కించబడుతుంది.

ప్రశ్న 7.
విలువ కట్టిన పాలసీ.
జవాబు.
ఈ పాలసీలో ఆస్తి విలువను లెక్కించి ప్రమాదం సంభవించినపుడు, చెల్లించడానికి గల విలువను అంగీకరించిన విధంగా తగిన ఏర్పాటు చేయబడుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

ప్రశ్న 8.
ఫ్లోటింగ్ పాలసీ.
జవాబు.

  1. ఒక పాలసీలో సరుకు యజమానులు క్రమంగా సరుకును చేరవేసే వ్యవహారాలు చేపట్టినట్లయితే దానిని ఫ్లోటింగ్ పాలసీ అంటారు.
  2. పాలసీను స్థిరమైన మొత్తానికి ఏర్పాటు చేస్తారు. సరుకును చేరవేసే ప్రాంతాన్ని నిర్ధారించుకున్న తరువాత బీమా విలువను సరుకు విలువకు తగ్గిస్తారు. ఇలాంటి ప్రకటనలు సమయానుకూలంగా ఏర్పరచి సొమ్ము మొత్తం పూర్తయ్యే వరకు బీమా చేస్తారు.

ప్రశ్న 9.
సగటు పాలసీ.
జవాబు.
1) సగటు పాలసీలో సరాసరి క్లాజ్ ఉంది. ఈ క్లాజ్ ప్రకారం ఆస్తిని తరుగు విలువ గలదిగా బీమా చేసినట్లయితే, బీమా చేసిన వ్యక్తికి అనుపాత విలువతో నష్ట సమయానికి అనుబంధంగా బీమా విలువ కలిగి ఉంటుంది.
మిశ్రమ పాలసీ.
ఫ్లోటింగ్ పాలసీ.

2) ఉదా: ఒక వ్యక్తికి గల ఆస్తి విలువ 15,000గా ఉన్నట్లయితే, కౌ 8000ల నష్టాన్ని లెక్కించగా, అలాంటి సమయానికి మార్కెట్ విలువ 20,000 ఉంటే, క్లెయిమ్ సెటిల్ చేసే మొత్తం 6,000 నిర్ణయించవచ్చు. అంటే (15,000/20,000) 8000. తదనుగుణంగా, ఇలాంటి పరిస్థితిలో బీమా చేసిన వ్యక్తి కౌ 2000 నష్టాన్ని భరించవలసి ఉంటుంది.

ప్రశ్న 10.
విస్తారమైన పాలసీ.
జవాబు.
ఇలాంటి పాలసీలలో అన్ని రకాల నష్టభయాలైన అగ్నీ, పేలుడు మెరుపు, పిడుగు, దోపిడీలు, సాంఘిక కలహాలు, ధర్నాలు, కన్నం వేయడం, కొంత మేరకు నష్టపోయిన అద్దెల వల్ల కలిగే నష్టాలు చేరి ఉంటాయి. దీన్ని ‘సర్వ బీమా పాలసీ’ అని కూడా అంటారు.

ప్రశ్న 11.
సముద్ర బీమా.
జవాబు.

  1. బీమా పద్ధతులలో అతి ప్రాచీనమైనది సముద్ర బీమా. సముద్రయానంలో నావలోని వరకు ప్రమాదవశాత్తు పాడయిపోయినట్లయితే సొంతదారునికి విమోచనం కల్పించే సౌకర్యం సముద్ర బీమా.
  2. ఈ బీమా సాధారణంగా నౌకకు కాని లేదా నౌకలో గల సరుకుకు గాని వర్తిస్తుంది.

ప్రశ్న 12.
టైమ్ పాలసీ.
జవాబు.

  1. ఈ పాలసీలో బీమా అంశం ప్రత్యేక కాలానికి లోబడి ఉంటుంది.
  2. ఈ పాలసీ ప్రధానంగా తెట్ట బీమాకు సంబంధించి స్థిర, చర వస్తువులకు వర్తిస్తుంది.

ప్రశ్న 13.
వయోజ్ పాలసీ,
జవాబు.

  1. సముద్రయానం ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సరుకు తరలించేటపుడు అమలుపరచడానికి ఈ పాలసీ వర్తిస్తుంది.
  2. నౌకాయానంలో ఏర్పడే నష్టాన్ని ఈ పాలసీ తీరుస్తుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

ప్రశ్న 14.
సంపూర్ణ జీవిత పాలసీ,
జవాబు.
ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం పాలసీదారుని జీవితం మొత్తం కొనసాగే విధంగా పాలసీ ఉండటం. ఈ విధమైన పాలసీలో వ్యక్తి మరణం తరువాత చెల్లింపులు జరిగే విధంగా ఏర్పాట్లు చేయడమైనది. ఈ పథకంలో వ్యక్తి జీవించనంత కాలం కంపెనీకి ప్రీమియం మొత్తం చెల్లించవలసి ఉంటుంది. ఇలాంటి పధకాలలో ప్రీపియం చెల్లింపు స్వల్పంగా ఉండి కుటుంబానిక భద్రత కల్పిస్తుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 3rd Lesson బ్యాంకింగ్ సేవలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 3rd Lesson బ్యాంకింగ్ సేవలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బ్యాంకింగ్ను నిర్వచించి, బ్యాంకింగ్ విధులను వివరించండి.
జవాబు.
బ్యాంకింగ్:

  1. ‘బ్యాంకు’ అనే పదం ఫ్రెంచి పదమైన బాంకో (Banco) అనే పదం నుండి గ్రహించబడింది. బాంకో అనగా బల్ల అని అర్థము.
  2. ద్రవ్యం మరియు పరపతితో కార్యకలాపాలను నిర్వహించే వ్యాపార సంస్థలను బ్యాంకు అంటారు.
  3. బ్యాంకింగ్ క్రమబద్దీకరణ చట్టం ప్రకారం “ప్రజల నుంచి నగదు రూపంలో సేకరించిన డిపాజిట్లను పెట్టుబడి పెట్టడానికి లేదా ఇతరులకు రుణాలుగా ఇవ్వడానికి ఆమోదించి, వారు కోరినప్పుడు లేదా ఇతరత్రా తిరిగి చెల్లించడానికి, చెక్కు, డ్రాఫ్టు, ఆదేశం లేదా ఇతరత్రా నగదును పొందడాన్ని బ్యాంకింగ్ గా నిర్వచించవచ్చు”.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు 1

బ్యాంకింగ్ విధులు: బ్యాంకింగ్ విధులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:

  1. ప్రాథమిక విధులు,
  2. ద్వితీయ విధులు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

ఎ) ప్రాథమిక విధులు:
1) డిపాజిట్లు ఆమోదం: వాణిజ్య బ్యాంకుల ప్రాథమిక విధులలో డిపాజిట్లు ఆమోదం ముఖ్యమైంది. గృహ రంగం నుంచి బ్యాంకులు పొదుపు రూపంలో నగదును సమీకరిస్తాయి. వినియోగదారుల నుంచి ఆమోదించే వివిధ డిపాజిట్లు స్థిర డిపాజిట్లు, కరెంటు డిపాజిట్లు, పొదుపు డిపాజిట్లు మరియు రికరింగ్ డిపాజిట్లుగా ఉంటాయి.

2) రుణాలు అందించడం: ప్రాథమిక విధులలో రెండవది రుణాలను, అడ్వాన్స్లను వ్యక్తులను, వ్యాపారులకు, ఔత్సాహికులకు కల్పించడం. రుణాలను వ్యక్తిగత పూచీ కత్తు, బంగారం, వెండి, సరుకు నిల్వ మరియు ఇతర ఆస్తుల ఆధారంగా జారీ చేస్తారు. బ్యాంకులు సాధారణంగా ఓవర్ డ్రాఫ్ట్, నగదు రుణం, ద్రవ్యపిలుపు, కాలపరిమిత రుణాలు, బిల్లు డిస్కౌంట్ మొదలైన రుణాలను అందిస్తాయి.

బి) ద్వితీయ విధులు: బ్యాంకులు నిర్వహించే ద్వితీయ విధులను ఏజెన్సీ సేవలు మరియు సాధారణ ప్రయోజన సేవలుగా వర్గీకరించవచ్చు.
1) ఏజెన్సీ సేవలు: బ్యాంకులు తమ వినియోగదారులకోసం, వారి తరపున ఏజెన్సీ సేవలనందిస్తాయి. బ్యాంకులు అందించే వివిధ ఏజెన్సీ సేవలు క్రింద పేర్కొనబడ్డాయి.

  1. బ్యాంకులు వినియోగదారుని తరపున వివిధ రుణపత్రాలైన చెక్కులు, ప్రామిసరీ నోట్లు సేకరించి, చెల్లింపులను కూడా చేస్తాయి.
  2. బ్యాంకులు వినియోగదారుల తరపున వాటాలు, స్టాక్లు, బాండ్లు, డిబెంచర్లు వంటి సెక్యూరిటీలు విక్రయాలను కొనసాగిస్తాయి.
  3. బ్యాంకు ఖాతాదారుల సొంత వాటాలపై డివిడెండు, డిబెంచర్లపై వడ్డీని సేకరించి ఖాతాలకు జమ చేసే సౌకర్యాన్ని బ్యాంకులు కల్పిస్తాయి.
  4. కొన్ని సందర్భాలలో బ్యాంకులు వినియోగదారుల ప్రతినిధులుగా, కరెస్పాండెంట్లుగా వ్యవహరిస్తాయి. (పాస్పోర్ట్, ప్రయాణీకుల టికెట్లు మొ||నవి)
  5. వినియోగదారుల ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు కోసం నిష్ణాతులను నియమించి, పన్ను రిటర్ను దాఖలు మరియు రిఫండ్ పొందేందుకు సహాయం చేస్తాయి.

2) సాధారణ ప్రయోజన సేవలు: బ్యాంకులు ఏజెన్సీ సేవలతో పాటు అదనంగా సాధారణ ప్రయోజన సేవలను కూడా అందిస్తాయి. ఆ సేవలు క్రింద పేర్కొనబడ్డాయి.

  1. బ్యాంకులు వినియోగదారులకు లాకర్ సదుపాయం కల్పిస్తాయి.
  2. బ్యాంకులు వినియోగదారులు ప్రయాణించే సందర్భంలో నగదు దొంగల బారిన పడకుండా, పోగొట్టుకోకుండా ట్రావెలర్స్ చెక్కులు జారీ చేస్తాయి.
  3. వినియోగదారుల పరపతి విలువను ధృవీకరిస్తూ బ్యాంకులు పరపతి పత్రాన్ని జారీ చేస్తాయి.
  4. పబ్లిక్ మరియు-ప్రైవేట్ కంపెనీలు జారీ చేసే వాటాలను, డిబెంచర్లకు బ్యాంకులు పూచీ ఇస్తాయి.
  5. బ్యాంకులు దేశీయ మరియు విదేశీయ బిల్లులను కూడా ఆమోదిస్తాయి.

ప్రశ్న 2.
బ్యాంకుల వివిధ రకాల డిపాజిట్ ఖాతాల గురించి వివరించండి.
జవాబు.
డిపాజిట్ల రకాలు: సాధారణంగా బ్యాంకులు నాలుగు రకాల డిపాజిట్లను స్వీకరిస్తాయి. అవి కరెంట్ డిపాజిట్లు, పొదుపు డిపాజిట్లు, ఫిక్స్డ్ మరియు రికరింగ్ డిపాజిట్లు అని ఉంటాయి.
ఎ) కరెంటు డిపాజిట్లు:

  1. ఈ డిపాజిట్లను డిమాండ్ డిపాజిట్లు అని కూడా పిలుస్తారు. ఈ డిపాజిట్లలోని సొమ్మును ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.
  2. బ్యాంకులలో భారీ డిపాజిట్లు, ఉపసంహరణలు చేసే పెద్ద వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు కరెంట్ డిపాజిట్లను నిర్వహిస్తాయి.
  3. ఖాతాదారుడు బ్యాంకు సూచనల మేరకు కనీస నిల్వను ఉంచినప్పటికీ ఎటువంటి వడ్డీని చెల్లించరు.

బి) పొదుపు డిపాజిట్లు:

  1. చిన్న మొత్తాలలో పొదుపు చేసుకునే మధ్యతరగతి ప్రజలు, వృత్తిదారులు పొదుపును నిర్వహించడానికి సులువైన మార్గం పొదుపు డిపాజిట్లు.
  2. కొంత కాలానికి పరిమితితో కూడిన నగదు ఉపసంహరణ వంటి నిబంధన ఖాతాదారునికి వర్తిస్తుంది.
  3. ఈ డిపాజిట్లలో నగదు నిల్వపై వడ్డీ లెక్కించి, చెల్లించబడుతుంది. వీటిలో వడ్డీ చెల్లింపు ఫిక్స్డ్ డిపాజిట్లలో వాటి కంటే తక్కువగా చెల్లిస్తారు. ప్రస్తుతం ఎస్బిఐ చెల్లించే పొదుపు డిపాజిట్లపై వడ్డీ సంవత్సరానికి 2.75% ఉంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

సి) ఫిక్స్డ్ డిపాజిట్లు:

  1. ఫిక్స్డ్ డిపాజిట్లను టైమ్ డిపాజిట్లని కూడా పిలుస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఖాతాదారులు జమచేసిన కాలం ముగిసేంత వరకు ముందస్తు సూచన చేయకుండా నగదును ఉపసంహరించుకోలేరు.
  2. ఫిక్స్డ్ డిపాజిట్లను ఖాతాదారులు భద్రతపరంగాను మరియు వడ్డీ రేటు పట్ల ఇష్టపడతారు.
  3. భారతదేశంలో ఫిక్స్డ్ డిపాజిట్లను ఏడు రోజులు మొదలుకుని అయిదు సంవత్సరాల వరకు ఆమోదిస్తారు. ప్రస్తుత ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు సాలుకు 4.5% నుంచి 6.10% వరకు చెల్లిస్తారు.

డి) రికరింగ్ డిపాజిట్లు:

  1. రికరింగ్ డిపాజిట్లలో ఖాతాదారుడు ప్రతీ నెల నిర్ణీత సొమ్మును స్థిరంగా డిపాజిట్ చేయడానికి సౌకర్యం కల్పిస్తుంది.
  2. గడువు తీరిన కాలానికి మొత్తం డిపాజిట్ తోపాటు వడ్డీని కూడా చెల్లిస్తారు.
  3. ప్రస్తుతం ఎఐ చెల్లిస్తున్న వడ్డీరేటు సాలుకు 5.8% నుంచి 6.25% ఉన్నది.

ప్రశ్న 3.
బ్యాంకులు సమకూర్చే వివిధ రకాల రుణాల గురించి చర్చించండి.
జవాబు.
ప్రాథమిక విధులలో చెప్పుకోదగిన విధి రుణాలను, అడ్వాన్స్లను వ్యక్తులకు, వ్యాపారస్తులకు, ఔత్సాహికులకు కల్పించడం. రుణాలను వ్యక్తిగత పూచీకత్తు, బంగారం, వెండి, సరుకుల నిల్వ మరియు ఇతర ఆస్తుల ఆధారంగా జారీ చేస్తారు. బ్యాంకులు సాధారణంగా ఈ దిగువ పేర్కొన్న రుణాలను అందిస్తాయి.
1) ఓవర్ డ్రాఫ్ట్: బ్యాంకు ఖాతాదారుడు పరిమితికి లోబడి అంగీకారం ప్రకారం బ్యాంకులో ఖాతాదారుని నిల్వకు మించి నగదును ఉపసంహరించుకునే సదుపాయం కల్పిస్తుంది.

2) నగదు రుణం: నగదు రుణ సదుపాయంలో ఖాతాదారునికి బ్యాంకు కొంత రుణాన్ని పూచీకత్తు మీద ఏర్పాటు చేస్తుంది. కాని రుణం ఏకమొత్తంగా కాకుండా బ్యాంకు ఖాతాలో జమచేస్తుంది. అత్యవసర పరిస్థితిలో నగదును కూడా ఇస్తుంది. ఖాతాదారుడు తన ఖాతాలో నుంచి ఉపసంహరించిన నగదుపై మాత్రమే వడ్డీని చెల్లించవలసి ఉంటుంది.

3) బిల్లుల డిస్కౌంట్: ఆధునిక బ్యాంకులు రుణాలను అందించే విధానాలలో ప్రజాదరణ పొందిన మరో పద్ధతి బిల్లుల డిస్కౌంట్. వినిమయ బిల్లుదారునికి నగదు అవసరమైనపుడు బ్యాంకులచే బిల్లు డిస్కౌంట్ పొందగలడు. తగిన కమీషన్ ను తగ్గించుకుని బ్యాంకులు ప్రస్తుత విలువ చెల్లిస్తారు. వాణిజ్య బ్యాంకులు, కేంద్ర బ్యాంకులతో డిస్కౌంట్ చేయబడిన బిల్లులను, తిరిగి డిస్కౌంట్ చేయబడిన బిల్లులను, తిరిగి డిస్కౌంట్ చేస్తాయి. ఈ బిల్లులు భద్రమైన మరియు హామీ గల బిల్లులు. బిల్లులు గడువు తీరినట్లయితే ఆమోదించిన పార్టీల నుంచి నగదును వసూలు చేస్తాయి.

ద్రవ్య పిలుపు:

  1. బ్యాంకులు అతి స్వల్ప కాలపరిమితి అంటే వారం రోజులకు మించని కాలానికి రుణాలను గ్రహీతలకు అందజేస్తారు.
  2. సాధారణంగా ఈక్విటీ వాటాలు, డిబెంచర్లు వంటి అనుషంగిక హామీలకు కలిగిన బ్రోకర్లు ఈ తరహా లబ్దిని పొందుతారు.
  3. ఈ సొమ్మును నిర్ణీత కాలంలో తిరిగి చెల్లిస్తారు. అందువల్ల వీటిని ద్రవ్య పిలుపులు అని అంటారు.

1) కాలపరిమిత రుణాలు: స్థిరమైన తగిన కాలానికి బ్యాంకులు రుణాలను అందించి, స్థిరమైన వడ్డీకి, వాయిదా పద్ధతులలో సొమ్మును తిరిగి చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తాయి.

2) వినియోగదారుని రుణాలు: వినియోగదారుడు వ్యక్తిగత అవసరాలకోసం వస్తు సేవలను రుణ రూపంలో బ్యాంకు నుంచి పొందే సదుపాయం.

3) ఋణాలు సృష్టించడం: బ్యాంకులు వర్తకులకు రుణాన్ని మంజూచు చేసినపుడు నగదును చెల్లించకుండా రుణగ్రహీత పేరున ఖాతాను తెరుస్తారు. రుణగ్రహీత అవసరం మేరకు నగదును చెక్కు రూపంలో ఉపసంహరించుకోవచ్చును. ఈ విధంగా డిపాజిట్ చేయకుండానే ఖాతాను బ్యాంకులు తెరవడంవల్ల రుణాలను సృష్టించడం జరుగుతుంది.

4) చెక్కుల వినియోగం పెంచడం: వాణిజ్య బ్యాంకులు కల్పించే అత్యంత ముఖ్యమైన సేవలలో వినియోగదారులకు నగదు మార్పిడికి బదులుగా చెక్కులను అందజేయడం జరుగుతుంది. దీనివల్ల చెల్లించవలసిన అప్పులకు నగదుకు బదులుగా చెక్కులను జారీ చేయడం ఎంతో సులభమైనది. ద్రవ్య మార్కెట్లో పెంపొందిన రుణ పత్రాలలో చెక్కులు ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.

5) దేశీయ, విదేశీ వర్తకాలనికి ఆర్థిక సదుపాయం: బ్యాంకులు దేశీయ మరియు విదేశీ వర్తకానికి ఆర్థిక సహాయాన్ని కల్పిస్తాయి. కొన్ని సమయాలలో బ్యాంకులు స్వల్పకాలిక రుణాల విభాగంలో వాణిజ్య పత్రాల హామీపై రుణాలను కల్పిస్తాయి. ఈ విధమైన సదుపాయం దేశీయ వర్తకానికి, విదేశీ వర్తకానికి ఎంతో దోహదం చేస్తుంది.

6) నిధుల చెల్లింపులు: వినియోగదారుల తరపున వాణిజ్య బ్యాంకులు దేశంలో ఉన్న వివిధ బ్రాండ్ నెట్వర్క్స్ ద్వారా బ్యాంకు డ్రాఫ్టులు, మెయిల్ బదిలీ, టెలిగ్రాఫిక్ బదిలీలు నామమాత్రపు చార్జీలతో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నగదు చెల్లింపుల సదుపాయాన్ని కల్పిస్తాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

ప్రశ్న 4.
భారతదేశంలో బ్యాంకులను ఎలా వర్గీకరించవచ్చును. వివరించండి.
జవాబు.
బ్యాంకుల వర్గీకరణ: భారతదేశ పరిధిలోని బ్యాంకులు అన్ని రిజర్వు బ్యాంకు ఆధీనంలో ఉండి షెడ్యూల్డ్ మరియు నాన్ షెడ్యూల్డ్ వర్గీకరించబడినవి.
TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు 2
ఎ) షెడ్యూల్డ్ బ్యాంకులు: బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1965 రెండవ షెడ్యూలలో పేర్కొనబడిన బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులు అనబడతాయి. ఈ షెడ్యూలు ప్రకారం షెడ్యూల్ బ్యాంకు అంటే:

  1. చెల్లించబడిన మూలధనం మరియు రిజర్వు 35,00,000 తక్కువ కాకుండా.
  2. బ్యాంకు లావాదేవీలను డిపాజిట్ దారుల ఆసక్తికి విరుద్ధంగా వ్యవహరించనట్లు రిజర్వు బ్యాంకును సంతృప్తిపరచాలి. షెడ్యూల్ బ్యాంకులను తిరిగి షెడ్యూల్డ్ సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, స్థానిక ప్రాంతీయ బ్యాంకులుగా వర్గీకరిస్తారు.

1) షెడ్యూల్డ్ సహకార బ్యాంకులు: ఏ సహకార బ్యాంకులైతే ఆర్.బి.ఐ. రెండవ షెడ్యూల్డ్ లోని నియమ నిబంధనలు పాటిస్తాయో, వాటిని షెడ్యూల్డ్ సహకార బ్యాంకులు అంటారు. ఇవి అర్బన్ సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు కావచ్చు.

  • అర్బన్ సహకార బ్యాంకులు: పట్టణ ప్రాంతాలో లేదా సెమి – పట్టణ ప్రాంతాలలో నెలకొల్పబడిన ప్రాథమిక సహకార బ్యాంకులనే అర్బన్ సహకార బ్యాంకులు అంటారు.
  • రాష్ట్ర సహకార బ్యాంకులు: ఈ బ్యాంకులు రాష్ట్రాలతో నిర్వహించే యాజమాన్యాన్ని కలిగి ఉంటాయి.

2) వాణిజ్య బ్యాంకులు: బ్యాంకులు ప్రధానంగా డిపాజిట్లను సేకరించి రుణాలను అందించే విధులను కలిగి ఉంటాయి. ఈ బ్యాంకుల ప్రధాన లక్ష్యం లాభాల గరిష్ఠీకరణతో పాటు వాటాదారుల విలువను పెంపొందించడం ఈ వాణిజ్య బ్యాంకులను భారతీయ బ్యాంకులు, విదేశీ బ్యాంకులుగా వర్గీకరించవచ్చు.
i) భారతీయ బ్యాంకులు: భారతదేశంలో స్థాపించిన కంపెనీల చట్టం, ప్రకారం రిజిష్టర్ చేసిన బ్యాంకులను భారతీయ బ్యాంకులు అని పిలుస్తారు. భారతీయ. బ్యాంకులను తిరిగి ప్రభుత్వ బాంకు, ప్రైవేట్ రంగ బ్యాంకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుగా వర్గీకరించవచ్చు.

  • ప్రభుత్వ రంగ బ్యాంకులు (Public Sector Banks): ఏ బ్యాంకులో అయితే ప్రభుత్వం 50%కు మించిన వాటాలను కలిగి ఉంటుందో, ఆ బ్యాంకులను ప్రభుత్వ రంగ బ్యాంకు అంటారు.
  • ప్రైవేట్ రంగ బ్యాంకులు (Private Sector Banks): ప్రభుత్వం ద్వారా కాకుండా ప్రైవేట్ వాటాదారులు ఏ బ్యాంకులో అయితే అత్యధిక ఈక్విటీ వాటాలను కలిగి ఉంటారో, ఆ బ్యాంకును ప్రైవేట్ రంగ బ్యాంకు అంటారు.
  • ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో కార్యనిర్వహణ నిర్వర్తిస్తూ చిన్న, సన్నకారు రైతులకు, వ్యవసాయదారులకు, హస్తకళాకారులకు, చిన్నస్థాయి ఔత్సాహికులకు రుణ సదుపాయం కల్పిస్తాయి.

ii) విదేశీ బ్యాంకులు: విదేశంలో స్థాపించబడి, విదేశాలలో నమోదు చేయబడిన బ్యాంకులను విదేశీ బ్యాంకులు అని పిలవబడతాయి.

iii) స్థానిక ప్రాంతీయ బ్యాంకులు: వీటినే లోకల్ ఏరియా బ్యాంకులు (LABs) అని వ్యవహరిస్తారు. ఇవి చిన్న తరహా ప్రైవేట్ బ్యాంకులు. ఇది తక్కువ ఖర్చుతో కూడిన బ్యాంకు నిర్మాణంగా భావించబడుతుంది. LAB పరిమిత ఆపరేషన్లతో సమర్ధవంతమైన, పోటీతో కూడిన ఆర్థిక మధ్యవర్తిత్వ సేవలను అందిస్తుంది.

iv) షెడ్యూల్దేతర బ్యాంకులు: ‘బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1965లోని రెండవ షెడ్యూల్డ్ లేని బ్యాంకులను షెడ్యూల్దేతర బ్యాంకులు అనబడతాయి. అంటే, షెడ్యూలులో పేర్కొన్న షరతులను వర్తింపజేయనట్లయి ఉంటాయి. ఈ బ్యాంకులు సాధారణ బ్యాంకింగ్ అవసరాల కోసం రిజర్వు బ్యాంకు నుంచి నగదును పొందలేవు. కాలానుగుణంగా రిజర్వు బ్యాంకుకు దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి క్లియరింగ్ హౌజ్ సభ్యత్వం పొందవు.

ప్రశ్న 5.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ లక్షణాలను వివరించండి.
జవాబు.
ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడాన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటారు. దీనినే “ఆన్లైన్ బ్యాంకింగ్” లేదా “అంతర్జాల బ్యాంకింగ్” అని పిలుస్తారు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ లక్షణాలు:

  1. వివిధ దేశాలలో విస్తరించి ఉన్న వినియోగదారులను చేరడానికి వీలుగా సంప్రదాయమైన భౌగోళిక అడ్డంకులను ఇంటర్నెట్ బ్యాంకింగ్ తొలగిస్తుంది.
  2. బ్యాంకు కార్యకలాపాలతో సంబంధమున్న సంప్రదాయక నష్ట భయాలను తొలగిస్తుంది.
  3. ఇది వినియోగదారునికి విద్యుత్ బిల్లులు, బీమా ప్రీమియం, మొదలైన వాటి చెల్లింపులు ఈ- చెల్లింపు పథకం ద్వారా చేయడానికి వీలు కల్పిస్తుంది.
  4. రైల్వే టికెట్లను కూడా ‘ఈ- రైల్’ ద్వారా పొందవచ్చు.
  5. అంతర్జాల బ్యాంకింగ్ సహాయంతో, ప్రత్యక్ష పన్నులను ‘ఆన్-లైన్’ పద్ధతిలో చెల్లింప చేయవచ్చు.
  6. బ్యాంకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునీకరించాలి.
  7. ఇది ఒక సమర్ధవంతమైన, పటిష్ఠమైన వ్యయ నియంత్రణకు అనుకూల పద్దతిని ఏర్పాటు చేయడానికి దారి తీస్తుంది.
  8. అంతర్జాలం అనేది ఒక సార్వజనీన (ప్రజల) ఆస్తి కావడం చేత, దానిపై ఏకైక అధికారికి లేదా వర్గానికి నియంత్రణ చేసే వీలుండదు.
  9. ఇది వాస్తవ కాల స్థూల పరిష్కారానికి RTGS దోహదపడుతుంది. అంటే, అంతరబ్యాంకు నిధుల బదిలీకి అవకాశం కల్పించడం. ఇది ఒక వ్యవహారాన్ని పూర్తి చేయడానికి, కేవలం రెండు గంటల సమయం మాత్రమే తీసుకుంటుంది.
  10. ఇది ఈ-బ్యాంకింగ్ చేయడానికి తోడ్పడుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

ప్రశ్న 6.
బ్యాంకుల ప్రాథమిక విధులను వివరించండి.
జవాబు.
బ్యాంకుల ప్రాథమిక విధులు రెండు రకాలు:
అవి:
ఎ) డిపాజిట్లు ఆమోదం (స్వీకరించడం)
బి) రుణాలు అందించడం (మంజూరు చేయడం).
A) డిపాజిట్లు స్వీకరించడం: సాధారణంగా బ్యాంకులు నాలుగు రకాల డిపాజిట్లను స్వీకరిస్తాయి. అవి కరెంట్ డిపాజిట్లు, పొదుపు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు రికరింగ్ డిపాజిట్లు అని ఉంటాయి.
i) కరెంటు డిపాజిట్లు:

  1. ఈ డిపాజిట్లను డిమాండు డిపాజిట్లు అని కూడా పిలుస్తారు. ఈ డిపాజిట్లలోని సొమ్మును ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చును.
  2. బ్యాంకులలో భారీ డిపాజిట్లు, ఉపసంహరణలు చేసే పెద్ద వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు కరెంట్ డిపాజిట్లను నిదిర్వహిస్తారు.
  3. ఖాతాదారుడు బ్యాంకు సూచనల మేరకు కనీస నిల్వను ఉంచినప్పటికి ఎటువంటి వడ్డీని చెలించరు.

ii) పొదుపు డిపాజిట్లు:

  1. చిన్న మొత్తాలలో పొదుపు చేసుకునే మధ్యతరగతి ప్రజలు, వృత్తిదారులు పొదుపును నిర్వహించడానికి సులువైన మార్గం పొదుపు డిపాజిట్లు.
  2. కొంత కాలానికి పరిమితితో కూడిన నగదు ఉపసంహరణ వంటి నిబంధన ఖాతాదారునికి వర్తిస్తుంది.
  3. ఈ డిపాజిట్లలో నగదు నిల్వపై వడ్డీ లెక్కించి, చెల్లించబడుతుంది. వీటిలో వడ్డీ చెల్లింపు ఫిక్స్డ్ డిపాజిట్లలో వాటి కంటే తక్కువగా చెల్లిస్తారు. ప్రస్తుతం ఎస్బిఐ చెల్లించే పొదుపు డిపాజిట్లపై వడ్డీ సంవత్సరానికి 2.75% ఉంది.

iii) ఫిక్స్డ్ డిపాజిట్లు:

  1. ఫిక్స్డ్ డిపాజిట్లను టైమ్ డిపాజిట్లని కూడా పిలుస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఖాతాదారులు జమచేసిన కాలం ముగిసేంత వరకు ముందస్తు సూచన చేయకుండా నగదును ఉపసంహరించుకోలేం.
  2. ఫిక్స్డ్ డిపాజిట్లను ఖాతాదారులు భద్రతపరంగాను మరియు వడ్డీ రేటు పట్ల ఇష్టపడతారు.
  3. భారతదేశంలో ఫిక్స్డ్ డిపాజిట్లను ఏడు రోజులు మొదలుకుని అయిదు సంవత్సరాల వరకు ఆమోదిస్తారు. ప్రస్తుత ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు సాలుకు 4.5% నుంచి 6.10% వరకు చెల్లిస్తారు.

డి) రికరింగ్ డిపాజిట్లు:

  1. రికరింగ్ డిపాజిట్లలో ఖాతాదారుడు ప్రతీ నెల నిర్ణీత సొమ్మును స్థిరంగా డిపాజిట్ చేయడానికి సౌకర్యం కల్పిస్తుంది.
  2. గడువు తీరిన కాలానికి మొత్తం డిపాజిట్ తోపాటు వడ్డీని కూడా చెల్లిస్తారు.
  3. ప్రస్తుతం ఎఐ చెల్లిస్తున్న వడ్డీరేటు సాలుకు 5.8% నుంచి 6.25% ఉన్నది.

B) రుణాలు అందించడం:
1) నగదు క్రెడిట్: ఒక బ్యాంకు తన ఖాతాదారుకు ఒక నిర్దిష్టమైన పరిమితి మేరకు సొమ్మును రుణంగా పొందడానికి వారి మధ్య కుదుర్చుకొన్న ఒక ఒప్పందాన్ని ‘నగదు క్రెడిట్’గా చెప్పవచ్చు. ఒప్పుకున్న నిర్ణీత మొత్తాన్ని రుణగ్రహీత ఖాతాకు క్రెడిట్ చేస్తారు. రుణగ్రహీత తనకు అవసరమున్నప్పుడు సొమ్మును బ్యాంకు నుంచి తీసుకుంటాడు. అతను వాస్తవంగా తీసుకున్న సొమ్ముపై మాత్రమే వడ్డీ విధిస్తారు. కాని రుణగ్రహీత ఖాతాను క్రెడిట్ చేసిన మొత్తంపై కాదు. భారతదేశంలో ఇదొక ఆచరణ పొందిన రుణ పద్ధతిగా ఉన్నది.

2) రుణాలు’: ఒక బ్యాంకు తన ఖాతాదారుకు ఒక నిర్ణీత మొత్తాన్ని మంజూరు చేయడాన్ని రుణంగా చెప్పవచ్చు. దీన్ని ఒక నిర్ణీత కాలానికి మంజూరు చేస్తారు. అంటే, 6 మాసాలు లేదా ఒక సంవత్సర కాలం మంజూరు చేసిన నిర్దిష్ట మొత్తాన్ని రుణగ్రహీత ఖాతాకు క్రెడిట్ చేస్తారు. అతను ఆ సొమ్మును ఒకే మొత్తంగా లేదా వాయిదాలలో తీసుకుంటాడు. ఈ రుణాలను రెండు రకాలుగా చెప్పవచ్చు.
ఎ) అడిగినప్పుడు చెల్లించవలసిన రుణం: కోరినప్పుడు తిరిగి చెల్లించవలసిన రుణాన్ని డిమాండ్ రుణం లేదా అడిగినప్పుడు చెల్లించవలసిన రుణంగా చెప్పవచ్చు. ఈ రుణాలను తక్కువ కాల వ్యవధిలో తిరిగి చెల్లించాలి. ఈ రకపు రుణ పద్ధతిలో పూర్తి మొత్తాన్ని ఒక పర్యాయం ఇస్తారు. దానిపై రుణ గ్రహీత వడ్డీని చెల్లించాలి. రుణ గ్రహీత రుణాన్ని ఒకే మొత్తంలో చెల్లించవచ్చు లేదా బ్యాంకులో ఒప్పుకున్న ప్రకారం చెల్లించవచ్చు.

బి) కాలపరిమితి గల రుణం: మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను కాలపరిమితి గల రుణాలంటారు. ఈ కాల పరిమితి గల రుణాలను ఒక సంవత్సరంకంటే మించిన కాలానికి మంజూరు చేస్తారు. సాధారణంగా అలాంటి రుణాలు తిరిగి చెల్లింపు దీర్ఘకాలంపాటు విస్తరిస్తారు.

3. హుండీల కొనుగోలు, డిస్కౌంట్ చేయటం: హుండీని పొంది ఉన్న వ్యక్తికి, హుండీ గడువుకు ముందే అత్యవసరంగా సొమ్ము ఆవశ్యకత ఉండవచ్చు. అలాంటి సందర్భాలలో అతడు ఆ హుండీని తన బ్యాంకరుకు వాస్తవమొత్తం కంటే తక్కువ మొత్తానికి విక్రయించవచ్చు. దీన్నే బిల్లు డిస్కౌంటు చేసుకోవడం అంటారు.

4. ఓవర్ డ్రాఫ్టు: వర్తమాన ఖాతాలను పొంది ఉన్న వ్యక్తులకు వాణిజ్య బ్యాంకులు ఓవర్ డ్రాఫ్టు సదుపాయాన్ని కల్పిస్తాయి. ఈ పద్ధతిలో ఖాతాదారుడు తన ఖాతాలో ఉన్న సొమ్ము నిల్వ కంటే మించిన మొత్తాన్ని తీసుకోవడానికి అనుమతిస్తారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

ప్రశ్న 7.
బ్యాంకుల ద్వితీయ శ్రేణి విధులు ఏమిటో తెలియజేయండి.
జవాబు.
ద్వితీయ విధులు: బ్యాంకు నిర్వహించే ద్వితీయ విధులను ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
ఎ) ఏజెన్సీ సేవలు: బ్యాంకులు తమ వినియోగదారుల కోసం, వారి తరపున ఏజెన్సీ సేవలనందిస్తాయి. ప్రజలందరికీ ఏజెన్సీ సేవలు ఎంతో ప్రాధాన్యమైనవి. బ్యాంకు అందించే వివిధ, ఏజెన్సీ సేవలు క్రింద పేర్కొనబడ్డాయి.

  1. రుణపత్రాల సేకరణ మరియు చెల్లింపులు: బ్యాంకులు వినియోగదారుల తరపున వివిధ రుణపత్రాలైన చెక్కులు, ప్రామిసరీ నోట్లు సేకరించి, చెల్లింపులను కూడా చేస్తాయి.
  2. సాధనాల క్రయవిక్రయాలు: బ్యాంకులు వినియోగదారుల తరపున వాటాలు, స్టాక్ లు, బాండ్లు, డిబెంచర్ల వంటి సెక్యూరిటీలు క్రయవిక్రయాలను కొనసాగిస్తాయి.
  3. వాటాలపై డివిడెండ్ల సేకరణ: బ్యాంకు ఖాతాదారుల సొంత వాటాలపై డివిడెండు, డిబెంచర్లపై వడ్డీని సేకరించి ఖాతాలకు జమ చేసే సౌకర్యాన్ని బ్యాంకులు కల్పిస్తాయి.
  4. కరెస్పాండెంట్గా వ్యవహరించడం కొన్ని సందర్భాలలో బ్యాంకులు వినియోగదారుల ప్రతినిధులుగా, కరస్పాండెంటుగా వ్యవహరిస్తారు. ఈ రకమైన చర్యల ద్వారా పాస్పోర్ట్, ప్రయాణీకుల టికెట్లు మరియు జల, వాయు రవాణా ప్రయాణీకులకు వివిధ సౌకర్యాలను కల్పిస్తాయి.
  5. ఆదాయపు పన్ను కన్సల్టెన్సీ: వినియోగదారుల ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు కోసం బ్యాంకులు నిష్ణాతులను నియమించి, పన్ను రిటర్నులు దాఖలు చేయడంతో పాటు రిఫండ్ పొందేందుకు సహాయం చేస్తాయి.
  6. స్థిత ఆజ్ఞల అమలు: బ్యాంకులు వినియోగదారుల ఆజ్ఞానుసారం కాలానుగుణంగా వివిధ చెల్లింపులు చేస్తాయి. దీని పరంగా వినియోగదారుల తరపున చందా చెల్లింపు, అద్దె చెల్లింపు, బీమా ప్రీమియం చెల్లింపులు చేస్తాయి.
  7. ధర్మకర్త మరియు కార్యనిర్వాహకులుగా వ్యవహరించడం: బ్యాంకులు వాటి వినియోగదారులు వీలునామాలను సంరక్షించి వారి మరణానంతరము అమలు పరుస్తాయి.

బి) సాధారణ ప్రయోజన సేవలు: ఆధునిక బ్యాంకులు ఏజెన్సీ సేవలకు అదనంగా సాధారణ ప్రయోజన సేవలను కూడా అందిస్తాయి. ఆ సేవలను క్రింద పేర్కొనబడ్డాయి.
1) లాకర్ సదుపాయం: బ్యాంకులు వాటి వినియోగదారులకు లాకర్ సదుపాయాన్ని కల్పిస్తాయి. వినియోగదారులు విలువైన బంగారు మరియు వెండి ఆభరణాలు ముఖ్యమైన దస్తావేజులు, వాటాలు, డిబెంచర్లు వంటివి భద్రపరచడానికి లాకరు ఉపయోగపడుతుంది.

2) ట్రావెలర్స్ చెక్కులు మరియు క్రెడిట్ కార్డులు: బ్యాంకులు వినియోగదారులు ప్రయాణించే సందర్భంలో నగదు దొంగల బారిన పడకుండా, పోగొట్టుకోకుండా ట్రావెలర్స్ చెక్కులు జారీ చేస్తాయి.

3) పరపతి పత్రం: వినియోగదారుల పరపతి విలువను ధృవీకరిస్తూ బ్యాంకులు పరపతి పత్రాన్ని జారీ చేస్తాయి. విదేశీ వర్తకానికి పరపతి పత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

4) గణాంక సేకరణ: బ్యాంకులు విలువైన మరియు ముఖ్యమైన సమాచారమైన వర్తక, వాణిజ్య, పారిశ్రామిక, ద్రవ్య మరియు బ్యాంకింగ్ సంబంధిత గణాంకాలను సేకరిస్తాయి.

5) రిఫరీగా వ్యవహరించడం: వినియోగదారుల గౌరవం, వ్యాపార ప్రతిష్ట, ఆర్థిక స్థాయిలకు సంబంధించిన వ్యవహారాలకు రిఫరీగా బ్యాంకులు వ్యవహరిస్తాయి.

6) సాధనాల పూచీ: పబ్లిక్ మరియు ప్రైవేట్ కంపెనీలు జారీ చేసే వాటాలకు, డిబెంచర్లకు బ్యాంకులు పూచీ ఇస్తాయి..

7) బహుమాన చెక్కులు: కొన్ని బ్యాంకులు వివిధ శుభ కార్యాలకు సంబంధించి వివిధ మొత్తాలతో కూడిన చెక్కులను జారీ చేస్తాయి.

8) వినియోగదారుల తరపున బిల్లులను ఆమోదించడం: కొన్ని సందర్భాలలో బ్యాంకులు బిల్లులను, దేశీయ మరియు విదేశీయ బిల్లులను ఆమోదిస్తాయి. దీని ప్రయోజనంతో ఎగుమతులు, దిగుమతులు సులభమవుతాయి.

ప్రశ్న 8.
వివిధ రకాల బ్యాంకుల చెల్లింపులను వివరించండి.
జవాబు.
చెల్లింపుల రకాలు: భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకుంటోంది. డిజిటల్ చెల్లింపుల యొక్క పద్ధతులు వివిధ రకాలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని డెబిట్/క్రెడిట్ కార్డులు అంతర్జాల బాంకింగ్, మొబైల్ వాలెట్లు, డిజిటల్ చెల్లింపు అనువర్తనాలు, ఏకీకృత చెల్లింపుల వంటి సేవలు ఉన్నాయి.

ముఖ్యమైన చెల్లింపుల రకాలు క్రింద సూచించబడ్డాయి:
TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు 3
1) చెక్కు: ఒక వ్యక్తి యొక్క ఖాతా నుంచి ఒక నిర్దిష్ట మొత్తాన్ని మరొక వ్యక్తికి లేదా కంపెనీ ఖాతాకు చెల్లించమని బ్యాంకును ఆదేశించే పత్రం చెక్కు భద్రతగల, సురక్షితమైన మరియు అనుకూలమైన చెల్లింపులు కొనసాగించడానికి చెక్కు ఉపయోగపడుతుంది. బదిలీ ప్రక్రియలో నగదు ప్రమేయం లేనందువల్ల సురక్షితమైనదిగా చెప్పబడుతున్నది. అందువల్ల దొంగతనం, నష్టభయం వంటివి తగ్గించబడతాయి.

2) నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (NEFT):
1) నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఒక బాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకు ఖాతాలోనికి దేశవ్యాప్తంగా డబ్బు పంపించడానికి గల భద్రమైన, చింతలేని ఎలక్ట్రానిక్ వ్యవస్థ.

2) ఈ వ్యవస్థను ఉపయోగించుకుని భారతదేశంలో ఉన్న (NEFT) సంబంధిత అనుసంధానించబడిన బ్యాంకులకు వ్యక్తిగత ప్రాతిపదికన నగదు పంపవచ్చు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

3) రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS): RTGS అనే సౌకర్యం ద్వారా నగదును ఆలస్యం కాకుండా వాస్తవ కాల ప్రాతిపదికన పంపబడుతుంది. ఈ పద్ధతి ద్వారా పంపిన నగదును లబ్ధిదారునికి. వెంటనే చేరుకోవడానికి లావాదేవీలను త్వరితగతిన వీలు కల్పిస్తుంది.

ఆర్.టి.జి.ఎస్ అనేది అధిక విలువ గల లావాదేవీలకు ఉద్దేశించబడిన కనీసం 2 లక్షల నగదును బదిలీ చేసే సౌకర్యం కల్పిస్తుంది. ఆర్.టి.జి.ఎస్ లావాదేవీ కోసం చెల్లింపుదారుని ఖాతా సంఖ్య, ఖాతాదారుని పేరు, బ్యాంక్ పేరు, ఐ.ఎఫ్.ఎస్. ని కోడ్ వంటి వివరాలను సేకరించడం చాలా ముఖ్యం.

4) తక్షణ చెల్లింపు సేవ (IMPS): తక్షణ చెల్లింపు సేవ అనేది రియల్ టైమ్ ఎలక్ట్రానిక్ ఫండ్ పద్ధతి. దీని ద్వారా నగదు లబ్దిదారు ఖాతాకు వెంటనే జమ చేయబడుతుంది. IMPS నగదు బదిలీలు సంవత్సరంలో 365 రోజులు ఎప్పుడైనా వారంలో ఏ సమయమైనా కొనసాగించవచ్చు. బ్యాంకు సెలవు, ఆదివారం లాంటి మినహాయింపులు లేవు. IMPS ద్వారా మొబైల్ బ్యాంకింగ్, అంతర్జాల బాంకింగ్ SMS, ATM వంటి మాధ్యమం ద్వారా అంతర్గత బ్యాంకు బదిలీలను ప్రారంభించవచ్చు.

5) చెల్లింపు వాలెట్లు (Payment Wallets): వాలెట్ అనేది అంతర్జాల పరంగా కొనుగోలుకు సంబంధించిన చెల్లింపు కోసం ఉపయోగించే ఒక చిన్న సాఫ్ట్వేర్ ప్రోగ్రాం. ఈ వాలెట్ అనేది ఒక రకమైన ఎలక్ట్రానిక్ కార్డు. ఇది కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో జరిగే లావాదేవీల కోసం వినియోగించడం జరుగుతుంది. నగదు మాదిరి చెల్లింపులు చేయడానికి ఈ-వాలెట్ను వ్యక్తి యొక్క బ్యాంక్ ఖాతాతో అనుసంధానించబడాలి. దీనిలో వినియోగదారుడు తన సొమ్మును భవిష్యత్తులో ఏదైనా ఆన్లైన్లో లావాదేవీల కోసం నిల్వను ఉంచవచ్చు. ఈ-వాలెట్ పాస్వర్డ్లో భద్రపరచడం జరుగుతుంది. ఈ -వాలెట్ సహాయంతో కిరాణా, ఆన్లైన్ కొనుగోలు, విమాన టెకెట్ల వంటివి కొనుగోలు చేయవచ్చును.

ప్రశ్న 9.
వివిధ రకాల రిటైల్ రుణాలు ఏమిటో సవివరంగా తెలపండి.
జవాబు.
రిటైల్ రుణాలు: ఆస్తి కొనుగోలు, స్థిరాస్థి కొనుగోలు వంటి వాటికి బాంకు రిటైల్ రుణాలను అందిస్తుంది. ఇవి వ్యక్తిగత వినియోగదారులకు, రుణదాతలకు రుణాలుగా మంజూరు చేస్తారు. రిటైల్ రుణాలను బ్యాంకులు వివిధ రూపాల్లో అందిస్తున్నాయి. అవి గృహ రుణాలు, వాహన రుణాలు, విద్య రుణాలు, వ్యక్తిగత రుణాలు మరియు క్రెడిట్ కార్డులు.
రకాలు:
ఎ) గృహ రుణాలు:

  1. గృహము మానవుల ప్రాథమిక అవసరం కాబట్టి ప్రతి వ్యక్తి కుటుంబానికి గృహం అవసరమవుతుంది. గృహ రుణాలను గృహ నిర్మాణాలకు లేదా నూతన గృహ కొనుగోలుకు అందించబడుతాయి.
  2. జాతీయ గృహ బాంక్ ఆర్టిఐ సహాయ సహకారాలతో గృహ పథకాలను అందించాలనే ఉద్దేశంతో స్థాపించబడింది. ఎల్ఎస్ఐసీ, ఎస్ఐ, యుటిఐ మరియు ఇతర ఆర్థిక సంస్థలు గృహ రుణ సదుపాయం కల్పిస్తాయి.
  3. కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యలలో భాగంగా అందరికీ గృహం అందించాలనే సంకల్పంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం బలహీన, మధ్యతరగతి ప్రజలకు కూడా వర్తిస్తుంది.

బి) వాహన రుణాలు:

  1. వాహన ఋణాల సౌకర్యాన్ని బ్యాంకులు ఖాతాదారులకు అందించి వాహన విలువ మొత్తాన్ని సులభవాయిదాలలో చెల్లించే ఏర్పాట్లు చేస్తాయి.
  2. ఖాతాదారుడు తీసుకున్న రుణం మొత్తాన్ని విక్రేతకు నియంత్రిత పద్ధతిలో ప్రాసెస్ చేయబడుతుంది. వాయిదాల చెల్లింపులో వడ్డీ మొత్తాన్ని బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు నిర్ణయిస్తారు.
  3. వాహన రుణాలను నెలవారి జీతం పొందే ఉద్యోగులకు, స్వయం ఉపాధి కలిగిన వ్యక్తులకు అవసరమైన పత్రాల దాఖలు తరువాత రుణాలు మంజూరు చేయబడతాయి. వాహన రుణాన్ని పొందడానికి వ్యక్తి యొక్క కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండి ఒక సంస్థలో 72.50 లక్షల వార్షిక ఆదాయాన్ని పొంది కనీసం ఒక సంవత్సరం నిరంతర సేవ చేస్తూ ఉండాలి.

సి) విద్యా రుణం:

  1. విద్యా రుణం విద్యార్థులకు స్నేహ పూర్వకంగా రూపొందించిన రుణం. డబ్బు కొరత కారణంగా భారతదేశంలో మరియు విదేశాలలో ఉన్నత విద్యను కొనసాగించలేని విద్యార్థులకు ఈ రుణాలు ఇవ్వబడతాయి.
  2. విద్యా రుణాలను గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, వృత్తి విద్యా కోర్సులు మరియు సంబంధిత ప్రొఫెషనల్ వంటి కోర్సులు ఉన్నత విద్యగా అభ్యసించడానికి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా గల అధికారం బ్యాంకులకు ఉంటుంది.
  3. భారతదేశంలో ఉన్నత విద్య అభ్యసించడానికి 10లక్షల వరకు, విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి 7 25 లక్షల వరకు రుణంగా మంజూరు చేస్తాయి.

డి. వ్యక్తిగత రుణాలు:

  1. వ్యక్తిగత రుణం అనేది వ్యక్తిగత అవసరాలు తీర్చడానికి బ్యాంకులు మంజూరు చేసే, పూచీ లేని రుణం. వ్యక్తిగత ఋణాల కోసం నిర్దేశిత బ్యాంకులో ఖాతా ఉన్నపుడు మాత్రమే మంజూరు చేయబడుతుంది.
  2. ఇటువంటి రుణాలను అర్హత ఆధారంగా వివాహం, గృహ మరమ్మతులు, గృహ పునర్నిర్మాణాలు వంటి అవసరాల కోసం పొందవచ్చు ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లపై కనీస పత్రాలతో మంజూరు చేయవచ్చు.
  3. వ్యక్తిగత రుణాలను 1సం॥ నుంచి 3 సం॥ల కాలపరిమితితో కూడా తిరిగి చెల్లించే సౌకర్యం కల్పిస్తారు.

ఇ) క్రెడిట్ కార్డు

  1. క్రెడిట్ కార్డు అయస్కాంత స్క్రిప్ట్ కార్డు. వినియోగదారునికి వస్తువులను కొనుగోలు చేసినపుడు చెల్లింపులు నిర్ణీత కాలానికి చెల్లింపు జరిగేట్లు సౌకర్యం కల్పించే కార్డు.
  2. క్రెడిట్ కార్డులు దేశీయ, విదేశీ కార్డులుగా ఉంటాయి. బ్యాంకులోని ఖాతాదారులకు వ్యక్తిగత, వ్యాపార సంస్థల కోసం కార్డులను జారీ చేస్తాయి.
  3. క్రెడిట్ కార్డులను వ్యక్తిగత పరపతి స్థాయిని బట్టి జారీ చేస్తారు.

ప్రశ్న 10.
ఈ – బ్యాంకింగ్ లాభ నష్టాలను గురించి చర్చించండి.
జవాబు.
ఈ- బ్యాంకింగ్ ప్రయోజనాలు:

  1. వినియోగదారునికి వారానికి 7 రోజుల చొప్పున, రోజుకు 24 గంటల చొప్పున నిరంతరం సేవలు అందించడం (అంటే, 24 × 7).
  2. వ్యవహారాలలో వేగం, మార్పులు చేసే అవకాశం కల్పించడం.
  3. బ్యాంకులకు తక్కువ నిర్వహణ ఖర్చులు.
  4. సమాచార మారకంలో వేగాన్ని, ఖచ్చితత్వాన్ని పెంచడం.
  5. బ్యాంకు ఖాతాను ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా సులభంగా పరిశీలించగలగడం.
  6. వినియోగదారుని సంతృప్తి అధికం కావడానికి దోహదపడటం.
  7. ఒక ఉన్నతస్థాయి గల వ్యక్తిగత హోదా.
  8. ఎన్.ఆర్.ఐ.లు ఎక్కడ స్థిరపడినా, వారు భారతదేశంలోని బ్యాంకులలో తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించగలగడం, వారు తమ ఖాతాలను ప్రపంచంలో ఎక్కడి నుంచయినా నిర్వహించుకోవచ్చు.
  9. బ్యాంకులకు తమ బ్రాంచీల పని భారాన్ని తగ్గించుకోవడానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సహాయపడుతుంది.
    ఉదా: నివేదికలను తయారు చేయడం, సొమ్ము నిల్వను తెలుసుకోవడం మొదలయినవి.

ఈ – బ్యాంకింగ్ పరిమితులు:

  1. రక్షణకు, విశ్వసనీయతకు సంబంధించిన సమస్యలు ఎదురుకావచ్చు.
  2. బ్యాంకింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం అనేది ఒక పెద్ద సవాలుగా ఉంటుంది.
  3. గ్రామీణ ప్రాంతాలలో, అధికవేగం గల బ్యాండు వైశాల్యంతో కూడుకున్న ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేకపోవడం.
  4. పేపరు ఉపయోగం లేని వ్యవహారాల పట్ల వినియోగదారుల విముఖత, ఎందుకంటే వారు తమ వ్యవహారాలకు పేపరు సహాయంతో సాక్ష్యాన్ని కోరవచ్చు..
  5. భారతదేశంలో అధిక నిరక్షరాస్యత, ఈ బ్యాంకింగ్ విధానానికి ఒక పెద్ద అవరోధంగా ఉంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నగదు క్రెడిట్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఒక ఖాతాదారుడు నిర్దిష్ట పరిమితి మేరకు రుణం పొందడానికి బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని “నగదు క్రెడిట్” అంటారు.
  2. ఒప్పుకున్న నిర్ణీత మొత్తాన్ని రుణగ్రహీత ఖాతాకు క్రెడిట్ చేస్తారు.
  3. రుణ గ్రహీత తనకు అవసరమున్నప్పుడు సొమ్మును బ్యాంకు నుంచి తీసుకుంటాడు.
  4. ఖాతాదారుడు తన ఖాతాలో నుంచి ఉపసంహరించిన నగదుపై మాత్రమే వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

ప్రశ్న 2.
ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఫిక్స్డ్ డిపాజిట్లను టైమ్ డిపాజిట్లని కూడా పిలుస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఖాతాదారులు జమచేసిన కాలం ముగిసేంత వరకు ముందస్తు సూచన చేయకుండా నగదును ఉపసంహరించుకోలేం.
  2. ఫిక్స్డ్ డిపాజిట్లను ఖాతాదారులు భద్రతపరంగాను మరియు వడ్డీ రేటు పట్ల ఇష్టపడతారు.
  3. భారతదేశంలో ఫిక్స్డ్ డిపాజిట్లను ఏడు రోజులు మొదలుకుని అయిదు సంవత్సరాల వరకు ఆమోదిస్తారు.  ప్రస్తుత ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు సాలుకు 4.5% నుంచి 6.10% వరకు చెల్లిస్తారు.

ప్రశ్న 3.
క్రెడిట్ కార్డు అంటే ఏమిటి ?
జవాబు.

  1. క్రెడిట్ కార్డు అయస్కాంత స్క్రిప్ట్ కార్డు. వినియోగదారునికి వస్తువులను కొనుగోలు చేసినపుడు చెల్లింపులు నిర్ణీత కాలానికి చెల్లింపు జరిగేట్లు సౌకర్యం కల్పించే కార్డు.
  2. క్రెడిట్ కార్డులు దేశీయ, విదేశీ కార్డులుగా ఉంటాయి. బ్యాంకులోని ఖాతాదారులకు వ్యక్తిగత, వ్యాపార సంస్థల కోసం కార్డులను జారీ చేస్తాయి.
  3. క్రెడిట్ కార్డులను వ్యక్తిగత పరపతి స్థాయిని బట్టి జారీ చేస్తారు.

ప్రశ్న 4.
ఎచ్చటి నుంచి అయినా బ్యాంకింగ్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఒక బ్యాంకు వినియోగదారునికి అందచేసే బ్యాంకింగ్ సేవల అదనపు సాంకేతిక పురోగతిలో గొప్ప మార్పు చెందింది. భారతదేశంలో నెలకొల్పబడిన బ్యాంకు, ఏ బ్రాంచి నుంచి అయిన వినియోగదారుడు తన ఖాతాను నిర్వహించుకోవచ్చు. దీనినే “ప్రధాన బ్యాంకింగ్” (కోర్ బ్యాంకింగ్) అంటారు.
  2. ఎక్కడి నుంచైనా బ్యాంకింగ్ అనగా భారతదేశంలో వినియోగదారుడు ఎక్కడినుంచైనా తన ఖాతాను నిర్వహించుకోవచ్చు.
  3. ఎక్కడి నుంచైనా బ్యాంకింగ్ విధానంలో అందించే వివిధ సేవలు కింది విధంగా ఉన్నాయి.
    ఎ) టెలి బ్యాంకింగ్, బి) ఇంటర్నెట్ బ్యాంకింగ్ (ఈ-బ్యాంకింగ్).

ప్రశ్న 5.
బ్యాంకులలో ఎ.టి.ఎం. సేవ గురించి నీకేమి తెలుసు రాయండి.
జవాబు.

  1. ఎ.టి.యం. అనగా ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్
  2. ఎ.టి.యం. వినియోగదారుల సేవలలో కాల సంబంధిత పరిమితులను తొలగించింది.
  3. బ్యాంకు ఆవరణలో లేదా దగ్గరలో సాధారణంగా దీన్ని వ్యక్తుల సహాయం లేకుండా ఏర్పాటు చేస్తారు.
  4. ఎ.టి.యం.లో కార్డును ప్రవేశపెట్టగానే, నిర్వహణ ప్రక్రియ ప్రారంభమై, చివరలో ఉన్న సాధనం అధ్యయనం చేసి, నమోదు చేసిన సమాచారాన్ని ప్రాసెసర్కు పంపుతుంది. అది ఖాతాను క్రియాశీలకం చేస్తుంది.
  5. ఇది రోజుకు 24 గంటల చొప్పున, వారంలో 7 రోజులపాటు పనిచేస్తుంది.
  6. బ్యాంకుతో కార్యకలాపాలు చేయదలచుకున్న వ్యక్తులు, బ్యాంకుకు నిర్ణీత వేళలతో సంబంధం లేకుండా వారు ఎ.టి.యం. సహాయంతో నగదును తిరిగిపొందడం, విజ్ఞప్తులు, సూచనలు, నగదు బదిలీ చేయగలరు.
  7. భద్రతకు సంబంధించి వినియోగదారునికి పూర్తి హామీ ఉంటుంది. ఎందుకంటే, ఎ.టి.యం. సేవలను, ప్రత్యేక వ్యక్తిగత గుర్తింపు నంబరు (PIN)తో కూడుకున్న ఎ.టి.యం. కార్డు ద్వారానే పొందగలం. అంతేకాకుండా, ప్రతీ ఎ.టి.యం. వద్ద ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు.
  8. ఇప్పుడు ఎ.టి.యం.ను సెల్ఫోను రీ-చార్జ్ చేయడానికి, బిల్లు చెల్లింపుకు, మొదలై సేవల కోసం కూడా ఉపయోగిస్తున్నారు.

ప్రశ్న 6.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకులు ఎలాంటి సేవలను అందిస్తాయి.
జవాబు.
ఇంటర్ నెట్ ద్వారా బ్యాంకింగ్ వ్యవహారాలు చేయడాన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటారు. దీనినే అంతర్జాల బ్యాంకింగ్ అని కూడా పిలుస్తారు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకులు అందించే సేవలు:

  1. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారుడు బ్యాంకు వెబ్సైట్ల ద్వారా సాధారణ ఉద్దేశ సమాచారాన్ని పాస్వర్డ్ ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిధుల బదిలీని జరపవచ్చు.
  2. RTGS ద్వారా వినియోగదారులు సూచనలు ఇచ్చిన వెంటనే నిధుల బదిలీ, చెల్లింపులను చేయవచ్చు.
  3. కాలానుగుణంగా భారీ చెల్లింపుల వ్యవహారాలను నిర్వహించడానికి ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సేవ (ECS)ను అందిస్తుంది.
  4. వ్యక్తులకు, సంస్థలకు తమ నిధులు ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు గరిష్ఠ పరిమితి లేకుండా బదిలీ చేయడానికి జాతీయ ఎలక్ట్రానిక్ నిధుల బదిలీ (NEFT)ను అందుబాటులోకి తెచ్చింది.
  5. ఖాతాదారుడు మొబైల్ బ్యాంకింగ్ సహాయంతో తన ఖాతా డెబిట్ క్రెడిట్ వ్యవహారాలు తెలుసుకోవచ్చు.
  6. ఈ చెక్కు ద్వారా వినియోగదారుడు వివిధ రకాల చెల్లింపులను చెయ్యవచ్చు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పిలుపు ద్రవ్యం.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
జవాబు.

  1. బ్యాంకులు అతి స్వల్ప కాలపరిమితి అంటే వారం రోజులకు మించని కాలానికి రుణాలను గ్రహీతలకు అందజేస్తాయి.
  2. సాధారణంగా ఈక్విటీ వాటాలు, డిబెంచర్ల వంటి అనుషంగిక హామీలకు కలిగిన బ్రోకర్లు ఈ తరహా లబ్దిని పొందుతారు.
  3. ఈ సొమ్మును నిర్ణీత కాలంలో తిరిగి చెల్లిస్తారు. అందువల్ల వీటిని ద్రవ్య పిలుపులు అని అంటారు.

ప్రశ్న 2.
రికరింగ్ డిపాజిట్.
జవాబు.

  1. రికరింగ్ డిపాజిట్లలో ఖాతాదారుడు ప్రతీ నెల నిర్ణీత సొమ్మును స్థిరంగా డిపాజిట్ చేయడానికి సౌకర్యం కల్పిస్తుంది.
  2. గడువు తీరిన కాలానికి మొత్తం డిపాజిట్ తోపాటు వడ్డీని కూడా చెల్లిస్తారు.
  3. ప్రస్తుతం ఎస్ఐ చెల్లిస్తున్న వడ్డీరేటు సాలుకు 5.8% నుంచి 6.25% ఉన్నది.

ప్రశ్న 3.
క్యాష్ క్రెడిట్.
జవాబు.

  1. ఒక ఖాతాదారుడు నిర్దిష్ట పరిమితి మేరకు రుణం పొందడానికి బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని “నగదు క్రెడిట్” అంటారు.
  2. ఒప్పుకున్న నిర్ణీత మొత్తాన్ని రుణగ్రహీత ఖాతాకు క్రెడిట్ చేస్తారు.
  3. ఖాతాదారుడు తన ఖాతాలో నుంచి ఉపసంహరించిన నగదుపై మాత్రమే వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

ప్రశ్న 4.
కారు రుణం.
జవాబు.

  1. కారు ఋణాల సౌకర్యాన్ని బ్యాంకులు ఖాతాదారులకు అందించి కారు విలువ మొత్తాన్ని సులభవాయిదాలలో చెల్లించే ఏర్పాట్లు చేస్తాయి.
  2. వాయిదాల చెల్లింపులో వడ్డీమొత్తాన్ని బ్యాంకు అధికారులు నిర్ణయిస్తారు. ఈ వాహన రుణాలను నెలవారి జీతం పొందే ఉద్యోగులకు, స్వయం ఉపాధి కలిగిన వ్యక్తులకు అవసరమైన పత్రాల దాఖలు తర్వాత రుణాలు మంజూరు చేయబడతాయి
  3. కారు రుణం తీసుకునే వ్యక్తికి 21 సం॥రాలు నిండి ఉండాలి మరియు వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు ఉండాలి.

ప్రశ్న 5.
క్రెడిట్ కార్డు.
జవాబు.

  1. క్రెడిట్ కార్డు అయస్కాంత స్క్రిప్ట్ కార్డు. వినియోగదారునికి వస్తువులను కొనుగోలు చేసినపుడు చెల్లింపులు నిర్ణీత కాలానికి చెల్లింపు జరిగేట్లు సౌకర్యం కల్పించే కార్డు.
  2. క్రెడిట్ కార్డులు దేశీయ, విదేశీ కార్డులుగా ఉంటాయి. బ్యాంకులోని ఖాతాదారులకు వ్యక్తిగత, వ్యాపార సంస్థల కోసం కార్డులను జారీ చేస్తాయి.
  3. క్రెడిట్ కార్డులను వ్యక్తిగత పరపతి స్థాయిని బట్టి జారీ చేస్తారు.

ప్రశ్న 6.
పొదుపు ఖాతా.
జవాబు.
పొదుపు డిపాజిట్లు:

  1. చిన్న మొత్తాలలో పొదుపు చేసుకునే మధ్యతరగతి ప్రజలు, వృత్తిదారులు పొదుపును నిర్వహించడానికి సులువైన మార్గం పొదుపు డిపాజిట్లు.
  2. కొంత కాలానికి పరిమితితో కూడిన నగదు ఉపసంహరణ వంటి నిబంధన ఖాతాదారునికి వర్తిస్తుంది.
  3. ఈ డిపాజిట్లలో నగదు నిల్వపై వడ్డీ లెక్కించి, చెల్లించబడుతుంది. వీటిలో వడ్డీ చెల్లింపు ఫిక్స్డ్ డిపాజిట్లలో వాటి కంటే తక్కువగా చెల్లిస్తారు. ప్రస్తుతం ఎస్బిఐ చెల్లించే పొదుపు డిపాజిట్లపై వడ్డీ సంవత్సరానికి 2.75% ఉంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

ప్రశ్న 7.
ఫిక్స్డ్ డిపాజిట్.
జవాబు.

  1. ఫిక్స్డ్ డిపాజిట్లను టైమ్ డిపాజిట్లని కూడా పిలుస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఖాతాదారులు జమచేసిన కాలం ముగిసేంత వరకు ముందస్తు సూచన చేయకుండా నగదును ఉపసంహరించుకోలేం.
  2. ఫిక్స్డ్ డిపాజిట్లను ఖాతాదారులు భద్రతపరంగాను మరియు వడ్డీ రేటు పట్ల ఇష్టపడతారు.
  3. భారతదేశంలో ఫిక్స్డ్ డిపాజిట్లను ఏడు రోజులు మొదలుకుని అయిదు సంవత్సరాల వరకు ఆమోదిస్తారు. ప్రస్తుత ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు సాలుకు 4.5% నుంచి 6.10% వరకు చెల్లిస్తారు.

ప్రశ్న 8.
విదేశీ బ్యాంకు.
జవాబు.

  1. విదేశంలో స్థాపించబడి, విదేశాలలో నమోదు చేయబడిన బ్యాంకులను విదేశీ బ్యాంకులు అంటారు.
  2. ప్రస్తుతం మనదేశంలో 45 విదేశీ బ్యాంకులు ఉన్నాయి.

ప్రశ్న 9.
కాల వ్యవధి రుణం.
జవాబు.
మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను కాలపరిమితి గల రుణాలంటారు. ఈ కాల పరిమితి గల రుణాలను ఒక సంవత్సరం కంటే మించిన కాలానికి మంజూరు చేస్తారు. సాధారణంగా అలాంటి. రుణాలు తిరిగి చెల్లింపు దీర్ఘకాలంపాటు విస్తరిస్తారు.

ప్రశ్న 10.
డిమాండు రుణం
జవాబు.
కోరినప్పుడు తిరిగి చెల్లించవలసిన రుణాన్ని డిమాండ్ రుణం లేదా అడిగినప్పుడు చెల్లించవలసిన రుణంగా చెప్పవచ్చు. ఈ రుణాలను తక్కువ కాల వ్యవధిలో తిరిగి చెల్లించాలి. ఈ రకపు రుణ పద్ధతిలో పూర్తి మొత్తాన్ని ఒక పర్యాయం ఇస్తారు. దానిపై రుణ గ్రహీత వడ్డీని చెల్లించాలి. రుణ గ్రహీత రుణాన్ని ఒకే మొత్తంలో చెల్లించవచ్చు లేదా బ్యాంకులో ఒప్పుకున్న ప్రకారం చెల్లించవచ్చు.

ప్రశ్న 11.
ఓవర్ డ్రాఫ్టు.
జవాబు.

  1. ఖాతాదారుడు తన బ్యాంకులో గల నిల్వకంటే అధిక మొత్తంలో తీసుకొనే ఏర్పాటును ఓవర్ డ్రాఫ్ట్ అంటారు.
  2. ఈ అవకాశాన్ని కరెంటు ఖాతాదారునికి మాత్రమే కల్పించడం జరుగుతుంది.

ప్రశ్న 12.
షెడ్యూల్డ్ బ్యాంకు.
జవాబు.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1965 రెండవ షెడ్యూలులో పేర్కొనబడిన బ్యాంకులను షెడ్యూల్డు బ్యాంకులు అనబడతాయి. ఈ షెడ్యూలు ప్రకారం షెడ్యూల్ బ్యాంకు అంటే:

  1. చెల్లించబదిన మూలధనం మరియు రిజర్వు 5,00,000 తక్కువ కాకుండా.
  2. బ్యాంకు లావాదేవీలను డిపాజిట్ దారుల ఆసక్తికి విరుద్ధంగా వ్యవహరించనట్లు రిజర్వు బ్యాంకును సంతృప్తిపరచాలి.

ప్రశ్న 13.
నాన్ – షెడ్యూల్డ్ బ్యాంకు.
జవాబు.

  1. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1965లోని రెండవ షెడ్యూల్డ్ లేని బ్యాంకులను షెడ్యూల్డేతర బ్యాంకులు అనబడతాయి. అంటే, షెడ్యూలులో పేర్కొన్న షరతులను వర్తింపజేయనట్లయి ఉంటాయి.
  2. ఈ బ్యాంకులు సాధారణ బ్యాంకింగ్ అవసరాల కోసం రిజర్వు బ్యాంకు నుంచి నగదును పొందలేవు. కాలానుగుణంగా రిజర్వు బ్యాంకుకు దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి క్లియరింగ్ హౌజ్ సభ్యత్వం పొందవు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

ప్రశ్న 14.
ATM.
జవాబు.
ఎ.టి.యం (ATM) అనగా ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఎలక్ట్రానిక్ నిధి బదిలీకి ఎ.టి.యం. ఒకానొక పద్ధతిగా ఉంది. బ్యాంకు ఆవరణలో లేదా దగ్గరలో సాధారణంగా దీన్ని వ్యక్తుల సహాయం లేకుండా ఏర్పాటు చేస్తారు. ఎ.టి.యం.లో కార్డును ప్రవేశపెట్టగానే, నిర్వహణ ప్రక్రియ ప్రారంభమై చివరలో ఉన్న సాధనం అధ్యయనం చేసి, నమోదు చేసిన సమాచారాన్ని ప్రాసెసర్కు పంపుతుంది. అది ఖాతాను క్రియాశీలకం చేస్తుంది. ఇది రోజుకు 24 గంటల చొప్పున, వారంలో 7 రోజుల పాటు పనిచేస్తుంది. (24×7).

ప్రశ్న 15.
టెలి బ్యాంకింగ్.
జవాబు.
టెలీ బ్యాంకింగ్ అంటే టెలిఫోన్ ద్వారా బ్యాంకింగ్ చేయడం. వినియోగదారుడు, బ్రాంచి నిర్దిష్టమైన టెలిఫోన్ నంబరును సంప్రదిస్తే, అది కంప్యూటరుకు అనుసంధానం చేయబడి ఉంటుంది. టెలీ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారుడు తన ఖాతా నిల్వ, గతంలో జరిగిన వ్యవహారాల వివరాలు తెలుసుకోవచ్చు.

ప్రశ్న 16.
RTGS
జవాబు.

  1. RTGS అనగా రియల్టైమ్ గ్రాస్ సెటిల్మెంట్.
  2. RTGS అనే సౌకర్యం ద్వారా నగదును ఆలస్యం కాకుండా వాస్తవ కాల ప్రాతిపదికన పంపబడుతుంది. ఈ పద్ధతి ద్వారా పంపిన నగదును లబ్ధిదారునికి వెంటనే చేరుకోవడానికి లావాదేవీలను త్వరితగతిన వీలు కల్పిస్తుంది. 3) ఆర్.టి.జి.ఎస్ అనేది అధిక విలువ గల లావాదేవీలకు ఉద్దేశించబడిన కనీసం రూ. 2 లక్షల నగదును బదిలీ చేసే సౌకర్యం కల్పిస్తుంది.

ప్రశ్న 17.
ECS.
జవాబు.

  1. ECS అనగా ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సేవ.
  2. ఈ పథకం కాలానుగుణంగా జరిపే భారీ చెల్లింపుల వ్యవహారాలను నిర్వహించడానికి ఒక ప్రత్యామ్నాయ పద్ధతిగా ఉంటుంది.
  3. ఈ కార్యనిర్వహణ 15 కేంద్రాలలో ఆర్బిఐ చేత క్లియరింగ్ హౌస్ గా నిర్వహించబడుతుంది. SBI చేత 21 కేంద్రాలలోనూ మరియు PNB, ఇతర బ్యాంకుల ద్వారా 29 కేంద్రాలలో నిర్వహించబడుతుంది.

ప్రశ్న 18.
NEFT.
జవాబు.

  1. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకు ఖాతాలోనికి దేశవ్యాప్తంగా డబ్బు పంపించడానికి గల భద్రమైన, చింతలేని ఎలక్ట్రానిక్ వ్యవస్థ.
  2. ఈ వ్యవస్థను ఉపయోగించుకుని భారతదేశంలో ఉన్న (NEFT) సంబంధిత అనుసంధానించబడిన బ్యాంకులకు వ్యక్తిగత ప్రాతిపదికన నగదు పంపవచ్చు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

ప్రశ్న 19.
మొబైల్ బ్యాంకింగ్.
జవాబు.

  1. మొబైల్ సహాయంతో బ్యాంకింగ్ వ్యవహారాలు జరపడాన్ని మొబైల్ బ్యాంకింగ్ అంటారు.
  2. ఈ సేవ బ్యాంకు ఖాతాదారులందరికి ఉచితంగా లభిస్తుంది. దీనికి ఖాతాదారుని మొబైల్ నెట్వర్క్ తో సంబంధం ఉండదు.
  3. దీని సహాయంతో వినియోగదారుడు వారి ఖాతా డెబిట్, క్రెడిట్ వ్యవహారాలతో పాటు బ్యాంకు నిల్వలను పంపే హెచ్చరిక సందేశాలు ద్వారా తెలుసుకోవచ్చు.

TS Inter 1st Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

Telangana TSBIE TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ Textbook Questions and Answers.

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఆకృత తప్పులు అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఒక వ్యవహారాన్ని పూర్తిగా గానీ లేదా పాక్షికంగా గానీ పుస్తకాలలో నమోదు చేయకుండా వదిలివేయటం వల్ల జరిగే తప్పులను ఆకృత తప్పులు అంటారు.
  2. వ్యవహారములను సహాయక చిట్టాలలో వ్రాయకపోవడము వలన లేదా ఆవర్జాలో నమోదు చేయకపోవడం వలన ఇలాంటి దోషాలు ఏర్పడతాయి.
  3. ఉదా : అరువు మీద 300 లకు సరుకు కొనుగోలు చేసి, కొనుగోలు పుస్తకములో నమోదు చేయకపోవడం, గణేశ్ చెల్లించిన నగదు 1,000 నగదు పుస్తకములో వ్రాయలేదు.

ప్రశ్న 2.
ఆకార్యకరణ దోషాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు.

  1. ఇవి వ్రాతపూర్వకమైన దోషాలు.
  2. వ్యవహారాన్ని చిట్టాపద్దులో తప్పుగా రాయటం, ఖాతాల్లో తప్పుగా నమోదుచేయటం. కూడికలలో నిల్వ తేల్చటములో లేదా నిల్వలను ముందుగా తీసుకొని వెళ్ళడంలో జరిగిన తప్పులను ఆకార్యకరణ దోషాలు అంటారు.
  3. ఉదా : కొనుగోలు ఖాతాలో ₹ 1,000 కు బదులు ₹ 100గా నమోదు చేయడము. X చెల్లించిన ₹ 100 y ఖాతాకు క్రెడిట్ చేయడం.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 3.
సిద్ధాంత రీత్యా దోషాన్ని రెండు ఉదాహరణలతో వివరించండి.
జవాబు.

  1. గణకశాస్త్ర సూత్రాలకు విరుద్ధముగా వ్యాపార వ్యవహారాలు వ్రాసినపుడు జరిగే దోషాలను “సిద్ధాంతరీత్యా దోషాలు” అంటారు.
  2. పెట్టుబడికి, రాబడికి మధ్య వ్యత్యాసాన్ని గమనించకుండా లెక్కలు వ్రాసినపుడు సిద్ధాంతపు దోషాలు ఏర్పడతాయి.
  3. ఉదా : ₹ 10,000 కు ఫర్నీచర్ కొని, కొనుగోలు ఖాతాకు డెబిట్ చేయడం, యంత్రాల మరమ్మత్తులకు ₹ 500 చెల్లించి, యంత్రాల ఖాతాకు డెబిట్ చేయడం.

ప్రశ్న 4.
సరిపెట్టె తప్పులు అంటే ఏమిటి ?
జవాబు.

  1. రెండు లేదా అంతకన్నా ఎక్కువ తప్పులు జరిగి ఒక తప్పును మరొక తప్పుతో సర్దుబాటు అయితే దానిని సరిపెట్టే తప్పులు అంటారు.
  2. ఖాతాలలో ఒకవైపున చేసిన తప్పులు, మరొక వైపున చేసిన తప్పులతో సమానమై రద్దు అవుతాయి.
  3. ఉదా : రాముకి చెల్లించిన 500 పుస్తకాలలో 450గా నమోదు చేయటం, అలాగే రమేష్ నుండి వచ్చిన నగదు కౌ 1,000లను కౌ950గా నమోదు చేయటం.

ప్రశ్న 5.
అనామతు ఖాతాను నిర్వచించండి.
జవాబు.

  1. వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేసే ప్రక్రియలో అంకణాలోని డెబిట్, క్రెడిట్ మొత్తాలు కొన్ని సందర్భాలలో సమానంగా ఉండకపోవచ్చును. అంకణాలోని డెబిట్, క్రెడిట్ మొత్తాలలోని తేడాను ఒక ప్రత్యేకమైన ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. దీనినే ‘అనామతు ఖాతా’ అంటారు.
  2. అనామతు ఖాతా అనేది ఒక ఊహజనిత ఖాతా, దీనిని అంకణాలోని రెండు వరసలు సమానత్వం పొందటం కోసం తాత్కాలికంగా మాత్రమే తెరువబడుతుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
దోషాలు ఎన్ని రకాలు ? తగిన ఉదాహరణలతో వివరించండి.
జవాబు.
తప్పు ఏదో ఒక రకమైన దోషము. తప్పుల వ్యవహారములను చిట్టాపద్దులలో నమోదు చేసేటప్పుడు గాని, సహాయక చిట్టాలలో నమోదు చేసేటప్పుడుగాని, ఆవర్జా ఖాతాలలో నమోదు చేసేటప్పుడుగాని, ఖాతా నిల్వలను తేల్చేటప్పుడుగాని లేదా నిల్వలను బదిలీ చేసేటప్పుడుగాని ఏర్పడతాయి. ఈ తప్పులు ముగింపు లెక్కలపై ప్రభావాన్ని చూపుతాయి.

గణక శాస్త్రములో తప్పులను కొట్టివేసి వాటి స్థానములో వేరే రాయటానికి వీలులేదు. ఇది ఆచరణయోగ్యము కాదు. అందువలన తప్పు పాక్షికమయితే వదిలిన భాగమునకు సవరణ పద్దు రాయటం ద్వారా లేదా అదనపు పద్దు నమోదు చేయటము ద్వారాగాని సవరించవచ్చును. ఈ విధముగా సవరించడాన్ని తప్పుల సవరణ అంటారు.

దోషాలను రెండు రకాలుగా వర్గీకరించడం జరిగినది. అవి :

  1. సిద్ధాంతపరమైన దోషాలు
  2. రాతపూర్వకమైన దోషాలు

1. సిద్ధాంతపరమైన దోషాలు :
గణక శాస్త్ర సూత్రాలకు విరుద్ధముగా వ్యాపార వ్యవహారములను వ్రాయడం వలన జరిగే దోషాలను సిద్ధాంతపరమైన దోషాలు అంటారు. పెట్టుబడి వ్యయాన్ని రాబడి వ్యయముగా చూపినపుడు, రాబడి ఆదాయాన్ని పెట్టుబడి వ్యయముగా చూపినపుడు ఇలాంటి దోషాలు ఏర్పడతాయి. జీతాలను చెల్లించి వ్యక్తిగత ఖాతాలకు నమోదు చేయడం, ఫర్నీచర్ కొని కొనుగోలు ఖాతాలో వ్రాయడం. ఈ దోషాలు అంకణా ద్వారా వెల్లడి కావు.

2. రాతపూర్వకమైన దోషాలు :
వ్యాపార వ్యవహారాలను తొలిపద్దు పుస్తకములో గాని ఆవర్జాలో నమోదు చేసేటప్పుడు సిబ్బంది చేసే తప్పులను రాతపూర్వకమైన దోషాలు అంటారు. ఇవి మూడు రకాలు :

  • ఆకృత దోషాలు
  • అకార్యాకరణ దోషాలు
  • సరిపెట్టే దోషాలు.

ఎ) ఆకృత దోషాలు :
వ్యవహారములను సహాయక చిట్టాలలో వ్రాయకపోవడం వలన లేదా ఆవర్జాలో నమోదు చేయకపోవడం వలన ఇలాంటి దోషాలు ఏర్పడతాయి. జరిగిన వ్యవహారము పుస్తకాలలో వ్రాయకపోవడం ఆకృత దోషము. ఇది అంకణా సమానతకు భంగము కలిగించదు. ఉదా : అరువు మీద ₹ 300 సరుకు కొనుగోలు చేసి, కొనుగోలు పుస్తకములో వ్రాయకపోవడం.

బి) అకార్యాకరణ దోషాలు :
వ్యాపార వ్యవహారాలను నమోదు చేసేటపుడు కేవలము సిబ్బంది చేసే తప్పులను అకార్యాకరణ దోషాలు అంటారు. తప్పు వరసల వలన, తప్పుగా ముందుకు తీసుకొని రావడం, తప్పుగా నిల్వలు తేల్చడం, ద్వంద దోషాలు, తప్పుగా పద్దులు వేయడం ద్వారా ఇలాంటి దోషాలు ఏర్పడతాయి.

ఇవి అంకణా సమానతకు భంగము కలిగించవచ్చు లేదా కలిగించకపోవచ్చు. ఉదా : కొనుగోలు ఖాతాకు ₹ 1,000 బదులు ₹ 100 నమోదు చేయడము.

సి) సరిపెట్టే దోషాలు :
ఒక తప్పును మరొక తప్పుతో సర్దుబాటు చేయడము వలన సరిపెట్టే దోషాలు ఏర్పడతాయి. ఖాతాలలో ఒకవైపు చేసిన తప్పులు మరొక వైపున చేసే తప్పులతో సమానమై రద్దు అయిపోతాయి.
ఉదా : జీతాల ఖాతాలో 7 500 ఎక్కువగా డెబిట్ చేసి, అమ్మకాల ఖాతాలో కూడా ₹ 500 ఎక్కువ క్రెడిట్ చేయడం. ఈ దోషాల వలన అంకణా సమానతకు భంగము కలగదు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 2.
అంకణా వల్ల వెల్లడి అయ్యే తప్పులను, వెల్లడి కాని తప్పులను వివరించండి.
జవాబు.
తప్పులు అనేవి వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేసే క్రమంలో కాని, వాటిని ఆవర్జాలో నమోదు చేసే సందర్భంలో కానీ లేదా అంకణా తయారుచేయునప్పుడు గానీ దొర్లే పొరపాట్లు.
తప్పులు (దోషాలు) – రకాలు :
తప్పులు అంకణాపై ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో అనే అంశం ఆధారంగా తప్పులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  • అంకణా వల్ల వెల్లడి కాని తప్పులు
  • అంకణా వల్ల వెల్లడి అయ్యే తప్పులు

I. అంకణా వల్ల వెల్లడి కాని తప్పులు:

  1. సిద్ధాంతపరమైన తప్పులు
  2. ఆకృత (తొలగింపు) తప్పులు
  3. ఆకార్యకరణ దోషాలు
  4. సరిపెట్టే తప్పులు
  5. ఖాతాలో తప్పువైపున నమోదు చేసే దోషాలు

II. అంకణా వల్ల వెల్లడి అయ్యే తప్పులు

  1. ఖాతాలో తప్పువైపున నమోదు చేసే దోషం
  2. తప్పు మొత్తాన్ని చూపటం
  3. కూడికలలో తప్పులు
  4. తప్పుగా ముందుకు తీసుకుపోవడం
  5. వ్యవహారాన్ని పాక్షికంగా వదలివేయటం
  6. ఒకే అంశాన్ని రెండు సార్లు ఒకే ఖాతాలో నమోదు చేయటం.

I. అంకణా వల్ల వెల్లడి కాని తప్పులు :
ఈ రకమైన తప్పులు అంకణా తయారు చేయటం వల్ల వెల్లడి కావు, ఎందుకంటే ఈ తప్పులు అంకణా సమానతపై ఎలాంటి ప్రభావం చూపవు. ఈ తప్పులను విపులంగా క్రింద చర్చించడమైనది.

a) సిద్ధాంతపరమైన తప్పులు :

  1. వ్యాపార వ్యవహారాలు సాధారణంగా ఆమోదింపబడే గణకశాస్త్ర సిద్ధాంతాల ప్రకారం నమోదు చేయబడతాయి. ఏ సిద్ధాంతమైనా అమలు చేయునప్పుడు కానీ లేదా వాటిని పట్టించుకోకుండా వ్యవహారాలను నమోదు చేయటం వల్ల గానీ సంభవించే దోషాలను సిద్ధాంతపరమైన దోషాలు అంటారు.
  2. పెట్టుబడి అంశాలను రాబడి అంశాలుగా భావించడం వల్ల ఈ రకమైన తప్పులు సంభవిస్తాయి.
  3. ఉదాహరణకి యంత్రాల కొనుగోలు అనే వ్యవహారాన్ని, కొనుగోలు ఖాతాలో నమోదు చేయటం.

b) ఆకృత (తొలగింపు) తప్పులు :

  1. ఒక వ్యవహారాన్ని పూర్తిగా గానీ లేదా పాక్షికంగా గానీ (పుస్తకాలలో) నమోదు చేయకుండా వదిలివేయటం వల్ల జరిగే తప్పులను ఆకృత తప్పులు అంటారు.
  2. ఈ రకమైన తప్పులు రెండు రకాలుగా సంభవించవచ్చును. అవి
    1. సంపూర్ణ ఆకృత తప్పులు
    2. పాక్షిక ఆకృత తప్పులు.

1. సంపూర్ణ ఆకృత దోషం (సంపూర్ణ తొలగింపు) :

  • ఒక వ్యవహారాన్ని పుస్తకాలలో నమోదు చేయకుండా పూర్తిగా వదలివేయటాన్ని సంపూర్ణ ఆకృత దోషం అంటారు.
  • ఉదాహరణకు సాకేత్ & కంపెనీ నుండి కొన్న ఫర్నీచరు పుస్తకాలలో పూర్తిగా నమోదు చేయలేదు.
  • ఈ తప్పు అంకణా సమానత్వానికి భంగం వాటిల్లదు.

2. పాక్షిక ఆకృత తప్పులు :

  • వ్యవహారంలోని ఒక అంశాన్ని మాత్రమే నమోదు చేసి ఇంకొక అంశాన్ని వదిలివేసినట్లయితే అలాంటి దోషాలను పాక్షిక ఆకృత దోషాలు అంటారు.
  • ఉదాహరణకి, సుందర్కి అరువుపై అమ్మిన సరుకు అమ్మకాల పుస్తకాలలో నమోదు చేశారు కాని, సుందర్ ఖాతాలో నమోదు చేయటం జరగలేదు.
  • ఇలాంటి దోషాలు అంకణా సమానత్వానికి భంగం కలుగుతాయి. కాబట్టి అంకణా సరితూగదు.

c) అకార్యకరణ దోషాలు :

  • వ్యవహారాన్ని చిట్టా పద్దులో తప్పుగా రాయటం, ఖాతాలలో తప్పుగా నమోదు చేయటం, ఖాతా మొత్తాలను తప్పుగా కూడటం, ఖాతాలను తప్పుగా నిల్వ తేల్చటం, తప్పుగా ముందుకు తీసుకువెళ్లడం వంటి దోషాలను అకార్యకరణ దోషాలు అంటారు.
  • ఉదాహరణకి, ప్రవీణ్ నుంచి ₹ 8,500 సరుకును అరువుపై కొనుగోలు చేసిన వ్యవహారాన్ని పుస్తకాలలో ₹ 5,800గా (తప్పుగా) నమోదు చేయటం.

d) సరిపెట్టే తప్పులు :

  • రెండు లేదా అంతకన్నా ఎక్కువ తప్పులు జరిగి, ఒక తప్పును మరొక తప్పుతో సరిపెట్టినట్లయితే, దానిని సరిపెట్టే తప్పు అంటారు. దీని ద్వారా (అంకణా యొక్క) అంకగణితపు ఖచ్చితత్వానికి భంగం వాటిల్లదు.
  • ఉదాహరణకి, రాముకి చెల్లించిన ₹ 5,000, ₹ 4,500లుగా నమోదు చేయటం, అలానే శ్యాము నుండి వచ్చిన నగదు ₹ 10,000లు, ₹ 9,500లుగా నమోదు చేయటం.

e) ఖాతాలో తప్పువైపున నమోదు చేసే దోషాలు :

  • ఒక ఖాతాలో రాయవలసిన దానిని వేరొక ఖాతాలో రాయటం వల్ల ఈ రకమైన దోషాలు సంభవిస్తాయి.
  • ఉదాహరణకి, మహేష్కి చెల్లించిన మొత్తం ₹ 1,000 సురేష్ ఖాతాకి డెబిట్ చేయటం.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

II. అంకణా వల్ల వెల్లడి అయ్యే తప్పులు :
అంకణా తయారు చేయటం ద్వారా తెలుసుకొనగలిగే తప్పులను అంకణా ద్వారా వెల్లడి అయ్యే తప్పులు అంటారు. ఈ క్రింది దోషాలు అంకణా తయారుచేయటం వల్ల వెల్లడి అవుతాయి.

a) వ్యవహరాన్ని ఖాతాలో, తప్పువైపున నమోదు చేయటం :
ఉదాహరణకి ఇచ్చిన డిస్కౌంట్ను, డిస్కౌంటు ఖాతాలో క్రెడిట్ వైపున నమోదు చేయటం.

b) ఖాతాలో తప్పు మొత్తాన్ని నమోదు చేయటం :
ఉదాహరణకి ₹ 25,000 ల అమ్మకాలు, ₹ 2,500 లుగా అమ్మకాల ఖాతాలో నమోదు చేయటం.

c) కూడికలలో తప్పులు :
సహాయక పుస్తకాలలో కానీ, ఆవర్జాలలో కానీ, వ్యవహారాల మొత్తాన్ని తప్పుగా కూడినప్పుడు అది అంకణా కచ్చితత్వానికి ప్రభావం చూపుతుంది.
ఉదా :
1) అమ్మకాల వాపసుల పుస్తకం ₹ 1,000లు ఎక్కువగా కూడటం.
2) ఫర్నీచరు ఖాతాను ₹ 1,500 లుకు బదులుగా, ₹ 1,750 గా కూడటం.

d) తప్పుగా ముందుకు తీసుకుపోవడం :
ఒక పేజీలోని మొత్తాన్ని తదుపరి పేజీలోకి తీసుకోపోతున్నప్పుడు చేసే దోషాలను తప్పుగా ముందుకు తీసుకుపోయే దోషాలు అంటారు. ఈ రకమైన తప్పు అంకణా సమానత్వానికి భంగం వాటిల్లుతుంది.
ఉదా : కొనుగోలు పుస్తకం మొత్తం ₹ 150 లకు బదులుగా ₹ 1,500 లుగా ముందు పేజీలో చూపటం.

e) పాక్షిక తొలగింపు దోషాలు :
వ్యవహారాలను చిట్టా నుంచి ఆవర్జాలోని ఖాతాలకు బదిలీ చేసే సందర్భంలో చిట్టా పద్దులో రెండు అంశాలలో ఒకే అంశాన్ని ఖాతాలోకి బదిలీ చేయటం వల్ల పాక్షిక తొలగింపు దోషాలు సంభవిస్తాయి. ఉదా : రమేష్ నుండి కొన్న సరుకు ₹ 2,000 కొనుగోలు పుస్తకంలో మాత్రమే నమోదు చేయటమైనది.

f) రెండు సార్లు నమోదుకు సంబంధించిన దోషం :
ఒకే అంశాన్ని రెండు సార్లు చిట్టాలో రాయటం వల్ల ఈ రకమైన దోషాలు సంభవిస్తాయి.
ఉదా : చెల్లించిన జీతాలు ₹ 600లు జీతాల ఖాతాలో రెండు సార్లు నమోదు చేయటం.

ప్రశ్న 3.
అనామతు ఖాతా అంటే ఏమిటి ? దానిని గురించి సూక్ష్మంగా వివరించండి.
జవాబు.

  1. వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేసే ప్రక్రియలో అంకణాలోని డెబిట్, క్రెడిట్ మొత్తాలు కొన్ని సందర్భాలలో సమానంగా ఉండకపోవచ్చును. అంకణాలోని డెబిట్, క్రెడిట్ మొత్తాలలోని తేడాను ఒక ప్రత్యేకమైన ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. దీనినే ‘అనామతు ఖాతా’ అంటారు.
  2. అనామతు ఖాతా అనేది ఒక ఊహజనిత ఖాతా, దీనిని అంకణాలోని రెండు వరసలు సమానత్వం పొందటం కోసం తాత్కాలికంగా మాత్రమే తెరువబడుతుంది.
  3. అంకణా ద్వారా వెల్లడి అయిన, వెల్లడి కాని తప్పులను గుర్తించి ఈ అనామతు ఖాతా ద్వారా దోషాలను సవరిస్తారు. అలా దోషాలను గుర్తించి, వాటిని సవరించటం ద్వారా ఈ ‘అనామతు ఖాతా’ ముగుస్తుంది. అంటే అనామతు ఖాతా ఎలాంటి నిల్వ చూపదు.
  4. దోషాలు సవరించే సందర్భంలో ఒకవేళ అంకణా యొక్క డెబిట్ మొత్తాలు, క్రెడిట్ మొత్తాల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అనామతు ఖాతాను ఆ తేడా మొత్తంతో క్రెడిట్ చేయాలి. అలాగే ఒకవేళ క్రెడిట్ మొత్తాలు, డెబిట్ మొత్తాల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అనామతు ఖాతాను ఆ వ్యత్యాసంతో డెబిట్ చేయాలి. అంటే అంకణా ఏవైపు తక్కువ చూపుతుందో ఆ వైపున అనామతు ఖాతా నిల్వ చూపుతుంది.

అనామతు ఖాతా ఉపయోగించి సవరణ పద్దులు రాసేటప్పుడు ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోవాలి :

  1. అంకణాను ప్రభావితం చేసే దోషాలను సవరించటానికి అనామతు ఖాతా ఉపయోగించాలి.
  2. a) సవరణ పద్దులో సవరించాల్సిన అంశానికి డెబిట్ చేయ్యాల్సి వస్తే, అనామతు ఖాతాకు క్రెడిట్ చేసి, జంట పద్దు పూర్తి చేస్తాం.
    b) సవరణ పద్దులో సవరించాల్సిన అంశానికి క్రెడిట్ చేయ్యాల్సి వస్తే, అనామతు ఖాతాకు డెబిట్ చేసి, జంట పద్దు విధానాన్ని పూర్తి చేస్తాం.

ప్రశ్న 4.
పాక్షిక ఆకృత తప్పులకు, సంపూర్ణ ఆకృత తప్పులకు మధ్యగల తేడాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు.
పాక్షిక ఆకృత తప్పులు, సంపూర్ణ ఆకృత తప్పులకు మధ్యగల తేడాలు :

తేడాకు ఆధారంపాక్షిక ఆకృత తప్పులుసంపూర్ణ ఆకృత తప్పులు
1. అర్థమువ్యవహారంలో ఒక అంశాన్ని మాత్రమే నమోదు చేసి, ఇంకొక అంశాన్ని వదిలివేసినట్లయితే అలాంటి దోషాలను పాక్షిక ఆకృత తప్పులు అంటారు.ఒక వ్యవహారాన్ని పుస్తకాలలో నమోదు చేయకుండా పూర్తిగా వదిలివేయ్యటాన్ని సంపూర్ణ ఆకృత దోషం అంటారు.
2. ఉదాహరణఉదాహరణకు : రమేష్కి అరువుపై అమ్మిన సరుకు అమ్మకాల పుస్తకాలలో నమోదు చేశారు కాని రమేష్ ఖాతాలో నమోదు చేయలేదు.ఉదాహరణకు : శ్రీను నుండి కొన్న ఫర్నీచర్ పుస్తకాలలో పూర్తిగా నమోదు చేయలేదు.
3. అంకణాపై ప్రభావంపాక్షిక ఆకృత తప్పుల వల్ల అంకణా సమానత్వానికి ప్రభావం భంగం కలుగుతుంది. కాబట్టి అంకణా సరితూగదు.సంపూర్ణ ఆకృత తప్పుల వల్ల అంకణా సమానత్వానికి భంగం వాటిల్లదు. అంకణా సరితూగుతుంది.


TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

Problems:

ప్రశ్న 1.
కింది దోషాలను సవరించండి.
a) ఆదిత్యకు అమ్మిన సరుకు ₹ 2,500 కొనుగోలు పుస్తకంలో రాసుకొన్నారు.
b) సందీప్కి చెల్లించిన జీతం ₹ 800 అతని వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేశారు.
c) శేఖర్ వద్ద అరువుకి కొన్న ఫర్నీచర్ ₹ 1,000 కొనుగోలు పుస్తకంలో రాశారు.
d) భవనాల విస్తృతి కోసం పెట్టిన ఖర్చు ₹ 5,000 తప్పుగా భవనాల మరమ్మత్తుల ఖాతాలో డెబిట్ చేశారు.
e) శైలేష్ వాపసు చేసిన సరుకు ₹ 1,200 కొనుగోలు వాపసుల పుస్తకంలో నమోదు చేసుకొన్నారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 1

ప్రశ్న 2.
కింది తప్పులను సవరించండి.
a) ఫర్నీచర్ కొనుగోలు ₹ 10,000 తప్పుగా కొనుగోలు ఖాతాకు డెబిట్ అయ్యింది.
b) రమణ వద్ద అరువుకి కొన్న యంత్రాలు ₹ 20,000 కొనుగోలు పుస్తకంలో రాయడమైంది.
c) యంత్రం మరమ్మత్తుల ఖర్చు ₹ 1,400 యంత్రాల ఖాతాకు డెబిట్ చేశారు.
d) పాత యంత్రం మరమ్మత్తులకైన ఖర్చు ₹ 2,000 మరమ్మత్తుల ఖాతాకు డెబిట్ చేశారు.
e) యంత్రం అమ్మకాలు ₹ 3,000 అమ్మకాల ఖాతాలో క్రెడిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 2

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 3.
కింది తప్పులను సవరించడానికి చిట్టా పద్దులు రాయండి.
a) యంత్రం కొనుగోలు ₹ 5,000 కొనుగోలు ఖాతాకు డెబిట్ చేయడమైంది.
b) రుచిరకి చెల్లించిన న్యాయాత్మక ఖర్చులు ₹ 700 ఆమె వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేయడమైంది.
c) ఎస్కార్ట్స్ కంపెనీ వద్ద కొనుగోలు చేసిన యంత్రం ₹ 10,000 ఎస్కార్ట్స్ కంపెనీ ఖాతాకు డెబిట్ చేశారు.
d) టైప్ రైటర్ కొనుగోలు ₹ 6,000 తప్పుగా కొనుగోలు పుస్తకంలో రాశారు.
e) యజమాని తనకోసం కొనుగోలు చేసిన మోటారు సైకిల్ ₹ 20,000 సాధారణ ఖర్చుల ఖాతాలో రాశారు.
f) గ్యాస్ ఇంజన్ కొనుగోలు ₹ 15,000 కొనుగోలు ఖాతాకు డెబిట్ చేశారు.
g) సరితకు చెల్లించిన నగదు ₹ 400 ఆమని ఖాతాకు డెబిట్ చేయడమైంది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 3

ప్రశ్న 4.
కింది తప్పులకు సవరణ పద్దులు రాయండి.
a) ఫర్నీచర్ తయారీదారుకి చెల్లించాల్సిన వేతనాలు ₹ 670 వేతనాల ఖాతాకు డెబిట్ చేశారు.
b) శ్రీనివాస్కు అరువుపై అమ్మిన సరుకు ₹ 150 శివరామ్ ఖాతాకు డెబిట్ చేశారు.
c) వర్షిణికి చెల్లించిన జీతం ₹ 1,000 అసలు పుస్తకాల్లో నమోదు కాలేదు.
d) హర్షిణి వద్ద అరువుకి కొన్న సరుకు 140 పుస్తకాల్లో ₹ 410 గా నమోదు అయ్యింది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 4

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 5.
కింది దోషాలకు సవరణ పద్దులు రాయండి.
a) వ్యాపారస్తుడి కొనుగోలు పుస్తకాన్ని ₹ 200 ఎక్కువగా కూడారు.
b) పాత ఫర్నీచర్ అమ్మకం ₹ 100 తప్పుగా అమ్మకాల ఖాతాకు క్రెడిట్ అయ్యింది.
c) చెల్లించిన వడ్డీ ₹ 100 కమీషన్ ఖాతాకు డెబిట్ చేశారు.
d) సోనీ నుంచి వచ్చిన నగదు ₹ 125 ఆమె ఖాతాలో తప్పుగా ₹ 152 క్రెడిట్ అయ్యింది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 5

ప్రశ్న 6.
కింది తప్పులను సవరించండి.
a) ఫర్నీచర్ కొనుగోలు ₹ 1,200 కొనుగోలు పుస్తకంలో రికార్డు అయ్యింది.
b) యంత్రం మరమ్మత్తులు ₹ 200 యంత్రం ఖాతాకు డెబిట్ చేశారు.
c) రమేష్కి అరువుపై అమ్మిన సరుకు ₹ 200 అమ్మకాల పుస్తకంలో సరిగానే నమోదు అయినప్పటికీ అతడి ఖాతా, డెబిట్ చేశారు.
d) కొనుగోలు పుస్తకాన్ని ₹ 200 ఎక్కువగా కూడారు.
e) మేనేజర్కి చెల్లించిన జీతం ₹ 2,000 అతడి వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 6

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 7.
కింది తప్పులను సవరించండి.
a) పాత యంత్రం అమ్మకం ₹ 500 అమ్మకాల పుస్తకంలో రాసుకొన్నారు.
b) రాకేష్ చెల్లించిన ₹ 300 రాజేష్ ఖాతాకు క్రెడిట్ చేశారు.
c) షా & కంపెనీ ₹ 250 వారి ఖాతాకు ₹ 520గా డెబిట్ అయ్యింది.
d) రామంజికి వాపసు చేసిన సరుకు ₹ 350 అసలు పుస్తకాల్లో రికార్డు కాలేదు.
e) రమణకి చెల్లించిన జీతం ₹ 1,500 అతడి ఖాతాకు డెబిట్ చేశారు.
f) గుప్త వద్ద కొన్న సరుకు ₹ 700 అమ్మకాల పుస్తకంలో రాసుకొన్నారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 7

ప్రశ్న 8.
కింది దోషాలను సవరించండి.
a) ఫర్నీచర్ మరమ్మత్తులకై చెల్లించిన ₹ 100 ఫర్నీచర్ ఖాతాకు డెబిట్ చేశారు.
b) అమ్మకాల పుస్తకాన్ని ₹ 500 తో ఎక్కువగా కూడారు.
c) ఖర్చులు ₹ 1500 ఆవర్జా ఖాతాలో ₹ 150 గా నమోదు అయ్యింది.
d) Mr. S కి అమ్మిన సరుకు ₹ 200 Mr. V ఖాతాకు డెబిట్ చేశారు.
e) పాత ఫర్నీచర్ అమ్మకం ₹ 500 అమ్మకాల ఖాతాకు క్రెడిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 8

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 9.
కింది తప్పులకు సవరణ పద్దులు రాయండి.
a) అమ్మకాల పుస్తకాన్ని ₹ 300 ఎక్కువగా కూడారు.
b) మాధవికి అమ్మకాలు ₹ 100 తప్పుగా శరత్ ఖాతాకు డెబిట్ చేశారు.
c) సాధారణ ఖర్చులు ₹ 200 ఆవర్జా ఖాతాలో 300గా నమోదు అయ్యింది.
d) శంకర్ నుంచి వచ్చిన నగదు ₹ 500 సంధ్య ఖాతాకు డెబిట్ చేశారు.
e) సరితకు చెల్లించిన న్యాయాత్మక ఖర్చులు ₹ 200 ఆమె వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేశారు.
f) రమేష్కి చెల్లించిన ₹ 200 అసలు పుస్తకాల్లో రికార్డు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 9

ప్రశ్న 10.
కింది తప్పులను సవరిస్తూ చిట్టాపద్దులు రాయండి.
a) కొనుగోలు పుస్తకాన్ని ₹ 200 తక్కువగా కూడారు.
b) వైష్ణవి వద్ద అరువుకి కొన్న సరుకు ₹ 1,000 తప్పుగా అమ్మకాల పుస్తకంలో రాశారు.
c) చెల్లించిన వేతనాలు ₹ 200 తప్పుగా జీతాల ఖాతాకు డెబిట్ చేశారు.
d) వచ్చిన వడ్డీ ₹ 100 తప్పుగా కమీషన్ ఖాతాకు క్రెడిట్ చేశారు.
e) మేనేజర్ కృష్ణకు చెల్లించిన జీతం ₹ 500 అతని ఖాతాకు డెబిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 10

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 11.
కింది తప్పులను సవరించండి.
a) కొనుగోలు పుస్తకాన్ని ₹ 2,000 తో తక్కువగా కూడారు.
b) చెల్లించిన అద్దె ₹ 350 ఆ ఖాతాకు 530గా డెబిట్ అయ్యింది.
c) రామా & కంపెనీ నుంచి వచ్చిన డిస్కౌంట్ ₹ 250 అసలు పుస్తకాల్లో రికార్డు కాలేదు.
d) చెల్లించిన వడ్డీ ₹ 89 తప్పుగా ₹ 98 గా క్రెడిట్ అయ్యింది.
e) అమ్మకాల పుస్తకాన్ని ₹ 1,700 తో ఎక్కువగా కూడారు.
f) కొనుగోలు వాపసుల పుస్తకం ₹ 275 తక్కువగా కూడారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 11

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 12.
కింది దోషాలను సవరించండి.
a) అమ్మకాల పుస్తకాన్ని ₹ 1,000 తక్కువగా కూడారు.
b) పాత ఫర్నీచర్ అమ్మకాలు ₹ 4,000 అమ్మకాల ఖాతాకు క్రెడిట్ చేశారు.
c) వడ్డీ నిమిత్తం చెల్లించిన ₹ 250 కమీషన్ ఖాతాకు డెబిట్ చేయడమైంది.
d) సందీప్కి చెల్లించిన ₹ 125 అతని ఖాతాలో ₹ 152 గా నమోదు అయ్యింది.
e) కొనుగోలు పుస్తకంలో ₹ 750 ఎక్కువగా కూడారు.
f) హెడ్ గుమాస్తా శేఖరుకి చెల్లించిన జీతం ₹ 4,500 అతని ఖాతాకు డెబిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 12

ప్రశ్న 13.
కింది తప్పులను సవరించండి.
a) ఫర్నీచర్ కొనుగోలు ₹ 3,500 కొనుగోలు పుస్తకంలో రాశారు.
b) వచ్చిన వాపసుల పుస్తకాన్ని ₹ 250 తో ఎక్కువగా కూడారు.
c) యంత్రం మరమ్మత్తుల ఖర్చులు ₹ 800 యంత్రాల ఖాతాకు డెబిట్ చేశారు.
d) శ్రీమన్నారాయణకి చేసిన అమ్మకాలు ₹ 750 అమ్మకాల పుస్తకంలో నమోదు అయినప్పటికీ అతడి ఖాతాలో క్రెడిట్ చేశారు.
e) రాధిక వద్ద చేసిన కొనుగోలు ₹ 760 ఆమె ఖాతాలో ₹ 670 గా క్రెడిట్ అయ్యింది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 13

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 14.
కింది దోషాలను సవరించండి.
a) యజమాని వైద్య ఖర్చులు ₹ 250 వివిధ ఖర్చుల ఖాతాకు డెబిట్ చేశారు.
b) సంధ్య & కంపెనీకి అమ్మిన సరుకు ₹ 2,900 కొనుగోలు పుస్తకంలో నమోదు చేశారు.
c) పాత యంత్రం ₹ 5,000 అమ్మకాల ఖాతాకు క్రెడిట్ చేశారు.
d) కొనుగోలు పుస్తకాన్న ₹ 2,000 తో ఎక్కువగా కూడారు.
e) కిట్టుకి చెల్లించిన జీతం ₹ 4,500 వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 14

ప్రశ్న 15.
కింద ఇచ్చిన తప్పులను సవరించండి.
a) గోపాల్ నుంచి వచ్చిన నగదు ₹ 1,500 చందు ఖాతాకు క్రెడిట్ చేశారు.
b) కొనుగోలు పుస్తకాన్ని ₹ 1,000 తక్కువగా కూడారు.
c) యంత్రం మరమ్మత్తులు ₹ 800 యంత్రాల ఖాతాకు డెబిట్ చేశారు.
d) చింటుకి అనుమతించిన డిస్కౌంట్ ₹ 200 నగదు పుస్తకంలో సరిగానే నమోదు అయినప్పటికీ వ్యక్తిగత ఖాతాలో అసలు నమోదు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 15

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

Textual Examples:

ప్రశ్న 1.
కింద ఇచ్చిన దోషాలను సవరించండి.
a) పవనికి చెల్లించిన జీతం ₹ 1,200 అతని వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేశారు.
b) ఇంటి యజమాని మురళికి చెల్లించిన అద్దె ₹ 5,000 అతని ఖాతాకు డెబిట్ చేశారు.
c) భవనాల మరమ్మతుల కోసం చెల్లించిన ₹ 2,000 భవనాల ఖాతాకు డెబిట్ చేశారు.
d) యజమాని తన సొంతానికి వాడుకొన్న ₹ 850 ను వర్తక ఖర్చులకు డెబిట్ చేశారు.
e) రమేష్ బ్రదర్స్ వాపసు చేసిన సరుకు ₹ 235 అసలు పుస్తకాల్లో నమోదు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 16

ప్రశ్న 2.
కింది తప్పులను సవరించండి.
a) ఆఫీసు ఫర్నిచర్ కొనుగోలు ₹ 7,200 తప్పుగా ఆఫీసు ఖర్చుల ఖాతాకి డెబిట్ చేశారు.
b) ప్రదీప్ అరువుపై అమ్మిన సరుకు ₹ 1,500 పొరపాటున కొనుగోలు ఖాతాలో రాసారు.
c) వెంకట్ నుంచి వచ్చిన చెక్కు ₹ 1,600 అనాదరణ చెందగా తప్పుగా అమ్మకాల వాపసుల పుస్తకంలో డెబిట్ చేశారు.
d) సుధకి అమ్మిన సరుకు ₹ 4,000 పుస్తకాల్లో రికార్డు కాలేదు.
e) సుధీర్ నుంచి వచ్చిన నగదు ₹ 2,000 తప్పుగా సందీప్ ఖాతాకు క్రెడిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 17

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 3.
లక్ష్మీనారాయణ్ & సన్స్ పుస్తకాల్లో కింది తప్పులు కనుగొన్నారు. వాటిని సవరించే చిట్టా పద్దులు రాయండి.
a) ఫర్నిచర్ కొనుగోలు ₹ 500 కొనుగోలు ఖాతాలో రాశారు.
b) మరమ్మతుల ఖర్చు ₹ 50 భవనాల ఖాతాకు డెబిట్ చేశారు.
c) చెల్లించిన అద్దె ₹ 1000 భూస్వామి ఖాతాకు డెబిట్ చేశారు.
d) షా & కో నుంచి వచ్చిన నగదు ₹ 100 షా & కంపెనీ నుంచి వచ్చినట్లుగా రాసుకొన్నారు.
e) యజమాని తన సొంతానికి తీసుకున్న నగదు ₹ 1150 ప్రయాణ ఖర్చుల ఖాతాకు డెబిట్ చేశారు.
f) టైప్ రైటర్ కొనుగోలు ₹ 1,500 ఆఫీసు ఖర్చుల ఖాతాలో రాసుకొన్నారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 18

ప్రశ్న 4.
అంకణా తయారుచేసేటప్పుడు కనుగొన్న తప్పులకు సవరణ పద్దులు రాయండి.
a) వచ్చిన కమీషన్ ₹ 200 తప్పుగా వడ్డీ ఖాతాకు క్రెడిట్ చేశారు.
b) కొనుగోలు వాపసుల పుస్తకాన్ని ₹ 500 తక్కువగా కూడారు.
c) ఫర్నిచర్ కొనుగోలు ₹ 600 కొనుగోలు ఖాతాకు డెబిట్ చేయడమైంది.
d) శ్రీ భీమ్రాజ్ నుంచి వచ్చిన నగదు ₹ 300 శ్రీరామ్ రాజ్ ఖాతాకు తప్పుగా క్రెడిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 19

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 5.
వరుణ్ బ్రదర్స్, వరంగల్ వారి ఖాతా పుస్తకాల నుంచి కింది దోషాలను కనుగొన్నారు. సవరణపద్దులు రాయండి.
a) ఫర్నిచర్ అమ్మకాలు ₹ 1,500 సరుకు అమ్మకాలుగా నమోదు అయ్యింది.
b) రామ్ వద్ద నుంచి వచ్చిన నగదు ₹ 3500 శ్యామ్ ఖాతాకు క్రెడిట్ చేయడమైంది.
c) మోహన్ వద్ద కొనుగోలు చేసిన సరుకు ₹ 1,000 అసలు పుస్తకాల్లో నమోదు కాలేదు.
d) ముఖేష్ వద్ద నుంచి వాపసు వచ్చిన సరుకు ₹ 120 అతని ఖాతాకు డెబిట్ చేశారు.
e) యజమాని ఇంటి అద్దె ₹ 600 అద్దె ఖాతాకు డెబిట్ చేయడమైంది.
f) రఫీకి చెల్లించిన ₹ 215 అతని ఖాతాలో ₹ 125 గా క్రెడిట్ చేయడమైంది.
g) అమ్మకాల పుస్తకంలో ₹ 400 తక్కువగా కూడారు.
h) వసూలు బిల్లుల పుస్తకంలో ₹ 1,500 పుస్తకాల్లో నమోదు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 20

ప్రశ్న 6.
కింద ఇచ్చిన తప్పులను అనామతు ఖాతా సహాయంతో సవరించండి.
a) మోహన్క అరువుకి అమ్మిన సరుకు ₹ 7,000 శ్రీను ఖాతాలో ₹ 5,000 గా నమోదు అయ్యింది.
b) శరత్ వద్ద అరువు కొనుగోళ్ళు ₹ 9,000 కిరణ్ ఖాతాలో ₹ 10,000 గా డెబిట్ చేశారు.
c) శైలజకు వాపసు చేసిన సరుకు ₹ 4,000 పావని ఖాతాలో ₹ 3,000 లుగా క్రెడిట్ చేశారు.
d) రత్నాజీ నుంచి వాపసు వచ్చిన సరుకు ₹ 1,000 సంధ్య ఖాతాలో ₹ 2,000 గా నమోదయ్యింది.
e) నగదు అమ్మకాలు ₹ 2,000 కమీషన్ ఖాతాలో ₹ 200 గా నమోదు అయ్యింది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 21

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 7.
కింది తప్పులను సవరించండి.
a) లలిత నుంచి వచ్చిన నగదు ₹ 200 ఆమె ఖాతాలో ₹ 180 గా నమోదు చేశారు.
b) అశోకికి అమ్మిన సరుకు ₹ 75 అసలు ఖాతా పుస్తకాల్లో నమోదు కాలేదు.
c) హరి ఖాతాలో క్రెడిట్ వైపు ఎక్కువగా కూడిన మొత్తం ₹ 200.
d) రమేష్ నుంచి వాపసు వచ్చిన సరుకు ₹ 650 అతని ఖాతాలో నమోదు కాలేదు.
e) అమ్మకాల పుస్తకాన్ని ₹ 500 తక్కువగా కూడారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 22

ప్రశ్న 8.
కింద ఇచ్చిన తప్పులను అనామతు ఖాతా సహాయంతో సవరించండి.
a) కొనుగోలు పుస్తకాన్ని ₹ 650 ఎక్కువగా కూడారు.
b) కొనుగోలు వాపసుల పుస్తకాన్ని ₹ 250 తక్కువగా కూడారు.
c) అమల నుంచి వచ్చిన నగదు ₹ 222 ఆమె ఖాతాలో ₹ 2,222 గా నమోదు అయ్యింది.
d) రాజేష్ అమ్మిన సరుకు ₹ 296 అతని ఖాతాలో ₹ 269 గా నమోదు అయ్యింది.
e) శరత్ నుంచి వచ్చిన నగదు ₹ 350 అతని ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 23

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 9.
మహేంద్ర ట్రేడర్స్ పుస్తకాల ద్వారా తయారుచేసిన అంకణా సరితూగలేదు. ఖాతాల్లో ₹ 1,310 తేడా కనపడగా దాన్ని అనామతు ఖాతాకి క్రెడిట్ వైపుకు మళ్ళించారు. కింది దోషాలను కనుగొన్నారు. వాటిని సవరించి, అనామతు ఖాతాను తయారుచేయండి.
a) వినయ్ వద్ద కొనుగోలు చేసిన సరుకు ₹ 800 కొనుగోలు పుస్తకంలో సరిగా నమోదు అయ్యింది కానీ అతని ఖాతాకు తప్పుగా డెబిట్ అయ్యింది.
b) అమ్మకాల పుస్తకాన్ని ₹ 600 ఎక్కువగా కూడారు.
c) ₹ 115 సాధారణ ఖర్చు కింద చెల్లించగా అది ₹ 150 గా నమోదు అయ్యింది.
d) అమర్కి అనుమతించిన డిస్కౌంట్ ₹ 225 నగదు పుస్తకంలో సరిగానే నమోదు అయ్యింది. కానీ అతని వ్యక్తిగత ఖాతాలో నమోదు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 24

ప్రశ్న 10.
ఒక సంస్థ అంకణాలోని వ్యత్యాసాలు ₹ 750 (డెబిట్ వైపు ఎక్కువగా ఉన్నది) అందుకు గాను ఆ మొత్తాన్ని అనామతు ఖాతాలో క్రెడిట్ వైపు ఉంచారు మరియు క్రింది తప్పులను గుర్తించారు. ఆ దోషాలను సవరించి అనామతు ఖాతా తయారుచేయండి.
a) రాజేష్ నుంచి వచ్చిన నగదు ₹ 250 అతని వ్యక్తిగత ఖాతాలో డెబిట్ చేశారు.
b) మహేష్కి అమ్మిన సరుకు ₹ 540 అమ్మకాల పుస్తకంలో ₹ 450గా నమోదు అయ్యింది.
c) వచ్చిన డిస్కౌంట్ ₹ 150 నగదు పుస్తకంలో రాసుకొన్నారు. కానీ డిస్కౌంట్ ఖాతాలో నమోదు కాలేదు.
d) కొనుగోలు వాపసులు ₹ 50 కొనుగోలు ఖాతాకు డెబిట్ చేశారు.
e) యంత్రాల మరమ్మతులు ₹ 370 మరమ్మతుల ఖాతాలో తప్పుగా ₹ 170 గా డెబిట్ అయ్యింది.
f) అమ్మకాల పుస్తకాన్ని ₹ 200 తక్కువగా కూడారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 25

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 11.
కింది దోషాలను సవరించండి.
a) ఆనంద్ నుంచి వచ్చిన నగదు ₹ 188 ని ₹ 180 గా నమోదు చేసుకొన్నారు.
b) వర్ధనికి అమ్మిన సరుకు ₹ 75 రికార్డు చేయడం మర్చిపోయారు.
c) దీక్షిత్ ఖాతాలో క్రెడిట్ వైపు ₹ 20 ఎక్కువగా కూడారు.
d) రాధిక నుంచి వాపసు వచ్చిన ₹ 35 ల సరుకు ఆమె ఖాతాలో నమోదు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 26

ప్రశ్న 12.
a) కొనుగోలు పుస్తకం ₹ 400 ఎక్కువగా కూడటమైనది.
b) కొనుగోలు వాపసుల పుస్తకం ₹ 260 తక్కువగా కూడటం జరిగింది.
c) సుందర్ నుండి వచ్చిన నగదు ₹ 660 అతని ఖాతాలో ₹ 1,660 గా నమోదు అయ్యింది.
d) పరమ్కి అమ్మిన సరుకు ₹ 550 అతని ఖాతాలో ₹ 450గా నమోదు అయ్యింది.
e) కిరణ్ నుంచి వచ్చిన నగదు ₹ 1050 అతని ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 27

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 13.
అకౌంటెంట్ అంకణాని సరిపోల్చలేకపోయాడు. అంకణాలో ఉన్న ₹ 5,180 తేడాను ముగింపు లెక్కలు తయారు చేయటం కొరకు (ప్రస్తుతానికి) అనామతు ఖాతాలో క్రెడిట్ వైపున వేయటం జరిగింది. ఈ క్రింది తప్పులను గుర్తించడం జరిగింది.
a) చెల్లించిన కమీషన్ ₹ 500. రెండు సార్లు అనగా చెల్లించిన డిస్కౌంటు ఖాతాకి మరియు కమీషన్ ఖాతాకి నమోదు చేయుటమైనది.
b) అమ్మకాల పుస్తకం ₹ 1,000 తక్కువ కూడటమైనది.
c) సుధకి అరువుపై అమ్మిన సరుకు ₹ 2,780 అమ్మకాల పుస్తకాలలో సరిగి నమోదు చేసినప్పటికీ, తన వ్యక్తిగత ఖాతాలో ₹ 3,860 గా తప్పుగా డెబిట్ చేయుటమైనది.
d) నటరాజ్ నుండి అరువు కొనుగోలు ₹ 1,500 కొనుగోలు పుస్తకాలలో సరిగా నమోదు చేసినప్పటికీ, అతని వ్యక్తిగత ఖాతాకి తప్పుగా డెబిట్ చేయటమైనది.
e) నగదు పుస్తకంలోని చెల్లింపు వైపున డిస్కౌంట్ వరసలో ₹ 2,400 కు బదులు, ₹ 2,800 గా తప్పుగా చూపటమైనది. అవసరమైన సవరణ పద్దులు రాసి, అనామతు ఖాతాను తయారు చేయండి.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 28

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 14.
శేషు & బ్రదర్స్, వరంగల్ వారి పుస్తకాలలో 2018 సం॥రానికి క్రింద తెలిపిన దోషాలు వారి ఖాతాలను ప్రభావితం చేస్తున్నాయి.
a) పాత ఫర్నీచర్ అమ్మకం ₹ 1,500 సరుకు అమ్మకాలుగా చూపడమైంది.
b) సాయిరాం నుండి వచ్చిన ₹ 5,000 రాంసాయి ఖాతాలో క్రెడిట్ చేయడమైంది.
c) పవన్ కుమార్ నుంచి కొన్న సరుకు ₹ 1,200 పుస్తకాలలో నమోదు కాలేదు.
d) యజమాని సొంత నివాసం అద్దె ₹ 7,500, అద్దె ఖాతాకి డెబిట్ చేయడమైంది.
e) మరమత్తులకు అయిన ఖర్చు ₹ 600 భవనాల ఖాతాకి డెబిట్ చేయటమైంది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 29

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 15.
కింది తప్పులను సవరించండి.
a) కొనుగోలు పుస్తకం ₹ 2,500 ఎక్కువగా కూడటం జరిగింది.
b) అమ్మకాల పుస్తకం ₹ 4,200 తక్కువగా కూడటం జరిగింది.
c) కొనుగోలు వాపసుల పుస్తకం ₹ 1,450 ఎక్కువగా చూపటం జరిగింది.
d) అమ్మకాల వాపసుల పుస్తకం ₹ 3,500 తక్కువగా చూపటం జరిగింది.
సాధన.
a) కొనుగోలు ఖాతాకి ₹ 2,500 క్రెడిట్ చేయాలి.
b) అమ్మకాల ఖాతాకి ₹ 4,200 క్రెడిట్ చేయాలి.
c) కొనుగోలు వాపసుల పుస్తకాన్ని ₹ 1,450 తో డెబిట్ చేయాలి.
d) అమ్మకాల వాపసుల పుస్తకాన్ని ₹ 3,500 తో డెబిట్ చేయాలి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 2nd Lesson స్టాక్ ఎక్స్ఛేంజ్ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 2nd Lesson స్టాక్ ఎక్స్ఛేంజ్

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటే ఏమిటి ? దాని విధులను వివరించండి.
జవాబు.
అర్ధం:

  1. కంపెనీల వాటాలను కొనడానికి, అమ్మడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థీకృత మార్కెట్ను స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటారు.
  2. ఇంతకు ముందే జారీ చేసిన సెక్యూరిటీలను అమ్మడం, కొనడం లాంటి కార్యకలాపాలు జరిపే వ్యవస్థీకృతమైన సెకండరీ మార్కెట్ను స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటారు.

నిర్వచనాలు:

  1. సెక్యూరిటీల (కాంట్రాక్టు) ఒప్పందాల (నియంత్రణ) చట్టం, 1956 ప్రకారం “సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలను క్రమబద్దీకరించి, నియంత్రించే ఉద్దేశంతో నమోదైన లేదా నమోదు కాని సంఘం, వ్యవస్థ లేదా వ్యక్తుల సముదాయమే స్టాక్ ఎక్స్ఛేంజ్’.
  2. పైలీ ప్రకారం, “పెట్టుబడి లేదా స్పెక్యులేషన్ నిమిత్తం జాబితాలో చేర్చిన సెక్యూరిటీల అమ్మకం, కొనుగోలు జరిగే మార్కెట్ ప్రదేశాన్ని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ నిర్వచించవచ్చు”.

స్టాక్ ఎక్స్ఛేంజ్ విధులు:
1) వర్తకానికి అవసరమైన మౌళిక వసతులు కల్పిస్తుంది: స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీల వర్తకం తక్షణమే అమలు జరుగుతుంది. సెక్యూరిటీల నిరంతర మార్కెటింగ్కు అవసరమైన సమాచారం పెట్టుబడిదారులకు అందిస్తూ వ్యాపారానికి, కంపెనీలకు అధిక మొత్తంలో మూలధనాన్ని పొందడానికి సహకరిస్తుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

2) ధరల సమాచారాన్ని అందిస్తుంది: సెక్యూరిటీల ధరల సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్వసనీయమైన మార్గాల ద్వారా, ప్రచురణకర్తల ద్వారా పెట్టుబడిదారులకు చేరవేస్తుంది. భావి పెట్టుబడిదారుడు తాను కొనుగోలు చేయబోయే సెక్యూరిటీల కొటేషన్ ధరను, అమ్మకందారుడు తన సెక్యూరిటీల విలువను తెలుసుకోవచ్చు.

3) పెట్టుబడిదారుల సంపదను పరిరక్షిస్తుంది: సెక్యూరిటీల వర్తకానికి సంబంధించిన నియమ నిబంధనలను సక్రమంగా అమలుపరుస్తూ, పెట్టుబడిదారుల ఆసక్తులను, సంపదను పరిరక్షిస్తుంది.

4) క్లియరింగ్ హౌస్గా వ్యవహరిస్తుంది: క్లియరింగ్ హౌస్ లేనప్పుడు వర్తకంలో క్రయవిక్రయాలు కుదరవు. స్టాక్ ఎక్స్ఛేంజ్ అమ్మకందారుడు, కొనుగోలుదారుని తరపున వ్యవహరిస్తూ, సెక్యూరిటీల వర్తకంలో సహాయపడుతుంది.

5) ద్రవ్యత్వాన్ని కలిగిస్తుంది: సెక్యూరిటీలను కలిగి ఉన్న వ్యక్తి సులభంగా వాటిని నగదులోకి మార్చుకోవడానికి, తనకు అవసరమయినప్పుడు కొనుగోలుదారునకు అమ్ముకోడానికి సులభమార్కెట్ అవకాశాలను కలుగచేస్తుంది. చేసుకోవడానికి, విస్తృతపరచడానికి

6) కొత్త మూలధనాన్ని పొందడంలో సహాయపడుతుంది: వ్యాపారాన్ని అభివృద్ధి అదనపు మూలధనం అవసరం ఏర్పడుతుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్లల వల్ల ప్రస్తుతం నడుస్తున్న కంపెనీలు తమ అదనపు మూలధన అవసరాలను హక్కు వాటాల జారీ ద్వారా సులభంగా పొందవచ్చు.

7) భారమితిగా వ్యవహరిస్తుంది: దేశంలోని వ్యాపార పరిస్థితులను మదింపు చేయడానికి స్టాక్ ఎక్స్ఛేంజ్లు భారమితిగా / కొలమానంగా వ్యవహరిస్తాయి.

8) కంపెనీ కీర్తి ప్రతిష్టలను పెంచుతాయి: కంపెనీ వాటాలను స్టాక్ ఎక్స్ఛేంజ్ల జాబితాలో చేర్చడం వల్ల కంపెనీ పరపతి పెంపొందించడంతోపాటు, దాని పేరు ప్రఖ్యాతులు కూడా మెరుగవుతాయి.

9) స్పెక్యులేషన్ భయాలు తగ్గుతాయి: వివిధ చట్టాల నియమ, నిబంధనలను పాటించడం వల్ల స్పెక్యులేషన్ భయాలు, ధరలో అవకతవకలను తగ్గించడం సాధ్యమవుతుంది.

10)స్పెక్యులేషన్కు దోహదపడుతుంది: స్టాక్ ఎక్స్ఛేంజ్లు స్పెక్యులేషన్కు కొంతమేరకు దోహదపడతాయి. సెక్యూరిటీల ధరలలో ఏర్పడే మార్పులవల్ల వ్యాపారస్తులు స్పెక్యులేషన్కు పాల్పడి, లాభాలను ఆర్జించవచ్చు.

ప్రశ్న 2.
స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రాముఖ్యతను సవివరంగా తెలపండి.
జవాబు.
వివిధ వర్గల వారికి స్టాక్ ఎక్స్ఛేంజ్ల ప్రాముఖ్యతను, అవసరాన్ని క్రింది విధంగా గుర్తించవచ్చు.
ఎ) పెట్టుబడిదారులకు
బి) కంపెనీలకు
సి) సమాజానికి.

ఎ) పెట్టుబడిదారులకు స్టాక్ ఎక్స్ఛేంజ్ల అవసరం:

  1. పెట్టుబడిదారులు తమ మిగులు నిధులను పేరు ప్రఖ్యాతులు గల కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుంది.
  2. నిరంతర మార్కెట్ సమాచారం లభ్యత వల్ల, సెక్యూరిటీలను సరైన రీతిలో సమీక్షించి, పెట్టుబడిదారులు నష్టభయాన్ని తగ్గించుకోవచ్చు.
  3. ఏ సమయంలో అయినా తమ వద్ద ఉన్న సెక్యూరిటీల విలువను తెలుసుకోవచ్చు.
  4. నిరంతరంగా సెక్యూరిటీలను మార్పు చేసుకునే వీలు ఉన్నందువల్ల సెక్యూరిటీలు ద్రవ్యత్వ గుణాన్ని కలిగి ఉంటాయి.
  5. నియమ నిబంధనలు కఠినంగా అమలుపరచడం వల్ల పెట్టుబడిదారుల ప్రయోజనాలు పరిరక్షింపబడతాయి.
  6. సెక్యూరిటీలను హామీలుగా ఉంచి రుణాలు పొందవచ్చు.
  7. కంపెనీ కార్యకలాపాలు, ఆర్థిక పటిష్ఠతను పెట్టుబడిదారులు తెలుసుకోవచ్చు.
  8. కంపెనీల సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాల వద్ద అని నిర్ణయించుకోడానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది.

కంపెనీలకు స్టాక్ ఎక్స్ఛేంజ్ల అవసరం:

  1. సెక్యూరిటీల జారీని దేశ వ్యాప్తంగా పెట్టుబడిదారులు దృష్టికి స్టాక్ ఎక్స్ఛేంజ్లు తీసుకువస్తాయి కాబట్టి కంపెనీలు భారీ మొత్తంలో మూలధనం సేకరించగలుగుతాయి.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చబడిన కంపెనీలు ఎక్కువ పేరు ప్రతిష్టలను పొందుతూ, ఆర్థిక పటిష్టతను చేకూర్చుకోగలుగుతాయి.
  3. స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేరిన కంపెనీలు తమ ఆర్థిక నివేదికలను సమర్పిస్తాయి కాబట్టి, పెట్టుబడిదారులు నమ్మకాన్ని పొందగలుగుతాయి మరియు కంపెనీ పటిష్టమైన స్థితిని వివరించగలుగుతాయి.
  4. కొత్త వాటాల జారీ కోసం ప్రాథమిక మార్కెట్కు అవసరమైన ప్రోత్సాహాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్లు కలిగిస్తాయి.
  5. స్టాక్ ఎక్స్ఛేంజ్ వల్ల సెక్యూరిటీలకు నిరంతర మార్కెటింగ్ సదుపాయం కలుగుతుంది కాబట్టి కొత్త కంపెనీలు తమకు కావలసిన మూలధనాన్ని సులభంగా సమీకరించుకోగలుగుతాయి.
  6. స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చిన కంపెనీల పట్ల భావి పెట్టుబడిదారుల మనస్సులలో సానుకూలమైన ఆలోచన కలుగుతుంది.
  7. కంపెనీని విస్తృతపరచడానికి, ఆధునీకరించడానికి కంపెనీలు అదనపు నిధులను హక్కు వాటాల జారీ ద్వారా పొవీందవచ్చు.
  8. స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చడం వల్ల కంపెనీల సెక్యూరిటీల మార్కెట్ పరిధి విస్తృతమౌతుంది.
  9. స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చిన కంపెనీల పరపతి సౌకర్యం మెరుగుపడుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

ప్రశ్న 3.
నెక్యూరిటీలను స్టాక్ ఎక్స్చేంజ్ల జాబితాలో చేర్చడానికి పాటించవలసిన విధానక్రమం ఏమిటో తెలపండి ?
జవాబు.
అధికారయుతంగా సెక్యూరిటీలను అమ్మడానికిగాని, కొనగానికి గాని స్టాక్ ఎక్స్ఛేంజ్లలో అవకాశం కల్పించడాన్ని సెక్యూరిటీలను జాబితాలో చేర్చడం అంటారు.
సెక్యూరిటీలను స్టాక్ ఎక్స్ఛేంజ్ల జాబితాలో చేర్చడానికి పాటించాల్సిన విధాన క్రమం:
1) స్టాక్ ఎక్స్ఛేంజ్లో సెక్యూరిటీలను జాబితాలో చేర్చాలంటే, దరఖాస్తు చేసుకునే కంపెనీలు కనీసం 3 కోట్ల జారీ మూలధనం కలిగి ఉండాలి. దీనిలో కౌ 1.80 కోట్లకు (60%) తగ్గకుండా ప్రజలకు ప్రతిపాదించాలి. ఈ నిబంధనలు పాటించిన కంపెనీలు మాత్రమే నిర్దిష్టమైన దరఖాస్తును పూరించి, క్రింద పేర్కొన్న పత్రాలను జతపరచి స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుంది.

  • సంస్థాపన పత్రం, నియమావళి, పరిచయ పత్రం, డైరెక్టర్ల నివేదికలు, ఆస్తి అప్పుల పట్టీ మరియు చందాపూచీదార్లు, బ్రోకర్లతో చేసుకున్న ఒప్పందాల నకలు కాపీలను సమర్పించాలి.
  • వాటాలు, డిబెంచర్ల సర్టిఫికెట్స్, కేటాయింపు లేఖలు, ఆమోదం లేదా పరిత్యజించే లేఖల నమూనాలను జతపరచాలి.
  • మూలధన నిర్మాణ వివరాలు సమర్పించాలి.
  • వాటాల పంపిణీని వివరించే నివేదికను రూపొందించాలి.
  • గత పది సంవత్సరాలుగా చెల్లించిన లేదా ప్రకటించిన డివిడెండు, బోనస్ వివరాలు అందించాలి.
  • వాటాలు, డిబెంచర్లతో వ్యవహరించడానికి అవసరమైన అనుమతులు పొందడానికి దరఖాస్తు చేసుకున్న వివరాలు అందించాలి.
  • కంపెనీ నమోదు కాలం నుంచి కంపెనీ కార్యకలాపాల సంక్షిప్త నివేదికను రూపొందించాలి.
  • సెక్యూరిటీలను జాబితాలోకి చేర్చే నిమిత్తం ఒప్పందం చేసుకోవడానికి గాను అవసరమైన ప్రారంభ మరియు వార్షిక లిస్టింగ్ ఫీజును చెల్లించాలి.

2) ఒక కొత్త కంపెనీ పైన పేర్కొన్న పత్రాలలో కొన్నింటిని సమర్పించే స్థితిలో ఉండకపోవచ్చు. ఇది సెక్యూరిటీలను జాబితాలో చేర్చడానికి గాను అభ్యంతరకరం కాకపోవచ్చు. ఆసక్తిగల కంపెనీలు తమ సెక్యూరిటీలను స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చడానికి గాను నిర్ణీత దరఖాస్తుతో పాటు పైన పేర్కొన్న పత్రాలను జతపరచి సమర్పించిన తరువాత, స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆ దరఖాస్తును నిశితంగా పరిశీలిస్తుంది.

3) దరఖాస్తును అన్ని కోణాలలో అధ్యయనం చేసిన తరువాత, స్టాక్ ఎక్స్ఛేంజ్ పొందుపరచిన వివరాలపట్ల సంతృప్తి చెందితే లిస్టింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకోమని కంపెనీకి సమాచారాన్ని ఇస్తుంది. ఈ ఒప్పంద పత్రంలో కంపెనీ బాధ్యతలు, పరిమితులు ఎలా ఉంటాయో, సెక్యూరిటీల లిస్టింగ్ జరిగాక ఎలా వ్యవహరించాల్సి ఉంటుందో స్పష్టం చేయబడుతుంది.

4) SEBI స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థగా 2003వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడి కేంద్రీయ లిస్టింగ్ అధికారాన్ని కలిగి ఉంది. భారతదేశంలోని అన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీలను జాబితాలో చేర్చడానికి, ఒకే రకమైన, ప్రామాణీకరించబడిన విధానాలను పాటించడానికి, దీని ఏర్పాటు జరిగింది.

5) కంపెనీలు తమ సెక్యూరిటీలను స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో నుంచి స్వచ్చందంగా లేదా నిర్బంధంగానైనా విరమింపచేసుకోవచ్చు. ఒకసారి విరమింపచేసుకున్న తరువాత, తిరిగి తమ వాటాలను స్టాక్ జాబితాలో చేర్చాలనే ఆసక్తిగల కంపెనీలు రెండు సంవత్సరాల వరకు నిరీక్షించాలి. ఈ రెండు సంవత్సరాలు గడిచిన తరువాత మళ్ళీ అవసరమైన అన్ని లాంఛనాలు పూర్తి చేసినప్పుడే కంపెనీ వాటాలను తిరిగి స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చడమవుతుంది.

ప్రశ్న 4.
సెబి అంటే ఏమిటి ? దాని విధులను, అధికారాలను వివరించండి.
జవాబు.
సెబి:

  1. సెబి (SEBI) అనగా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్లలో నెలకొన్న అవాంఛనీయ అలవాట్లను తొలగిస్తుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్, దానిలో పాల్గొనే స్టాక్ బ్రోకర్ల మరియు ఆపరేటర్ల పనులను నియంత్రిస్తుంది.
  3. SEBI ACT 1992ను భారత పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత SEBI అమలులోకి వచ్చింది. SEBIకు శాసనాత్మక అధికారాలను చట్టం కల్పించింది. భారతప్రభుత్వం 1995వ సంవత్సరంలో, SEBI Act 1992ను సవరిస్తూ అనేక అదనపు శాసనాత్మక అధికారాలను SEBIకి కల్పించింది.

సెబి విధులు:
సెబి 3 రకాల విధులను నిర్వర్తిస్తుంది. అవి:

  1. క్వాసీ లెజిస్లేటివ్
  2. క్వాసీ జ్యుడిషియల్
  3. క్వాసీ ఎక్సిక్యూటివ్.

లెజిస్లేటివ్ హోదాలో SEBI నిబంధనలను రూపొందిస్తుంది. ఎక్సిక్యూటివ్ విధులలో భాగంగా సెబి పరిశోధనలను చేపట్టి నిబంధనలను అమలుపరిచే చర్యలను తీసుకుంటుంది. జ్యుడిషియల్ హోదాలో సెబి అవసరమైన తీర్పులను ఇస్తూ ఉత్తర్వులను జారీ చేస్తుంది. SEBI నిర్వర్తించే ఈ మూడు రకాల విధులను కింద సంక్షిప్తపరచడమైంది.

  1. పెట్టుబడిదారులకు పరిజ్ఞానాన్ని కల్పించడం.
  2. సెక్యూరిటీలతో వ్యవహరించే మధ్యవర్తులకు అవసరమైన శిక్షణను ఇవ్వడం.
  3. స్టాక్ ఎక్స్ఛేంజ్ల పనిని నియంత్రించడం
  4. మధ్యవర్తులు అంటే స్టాక్ బ్రోకర్లు, మర్చంట్ బ్యాంకర్లు, చందా పూచీదారులు మొదలయిన వారి పనితీరును నియంత్రించడం, వారి వ్యవహారాలను నమోదు చేయడం.:
  5. మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇతర సామూహిక పెట్టుబడి పథకాల పనితీరును క్రమబద్దీకరించడం.
  6. అవసరమయిన ఆడిట్ కార్యక్రమాలను, తనిఖీలను నిర్వహించడం.
  7. అంతర్గతంగా జరిగే సెక్యూరిటీల వర్తకాన్ని అదుపు చేయడం.

సెబి అధికారాలు:
సెబి తన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించడానికి గాను కింది అధికారాలను కలిగి ఉంటుంది.

  1. స్టాక్ ఎక్స్ఛేంజ్ నియమాలను ఆమోదించడం మరియు సవరణలను చేయడం.
  2. ఆర్థిక మధ్యవర్తుల ఖాతాపుస్తకాలను తనిఖీ చేయడం.
  3. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజ్ల ఖాతా పుస్తకాలను తనిఖీ చేయడం, కాలానుగతంగా నివేదికలను సమర్పించమని పిలుపును ఇవ్వడం.
  4. కంపెనీలకు తమ సెక్యూరిటీలను ఒకటి లేదా అంతకుమించిన స్టాక్ ఎక్స్ఛేంజ్ల జాబితాలో తప్పనిసరిగా చేర్చుకోమని ఆదేశించడం.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

ప్రశ్న 5.
వివిధ రకాల స్టాక్ ఎక్స్ఛేంజ్ స్పెక్యులేటర్స్ గురించి వివరించండి.
జవాబు.
స్పెక్యులేటర్స్:

  1. సెక్యూరిటీల ధరలలో మార్పుల వల్ల లాభం పొందే నిమిత్తం స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యవహారాలను జరిపే చట్టబద్ధమైన వ్యాపారస్తులనే స్పెక్యులేటర్స్ అంటారు.
  2. స్పెక్యులేటర్లు ధరల మార్పుల తేడాను వసూలు చేసుకోవడంగాని, చెల్లించడంగాని చేస్తారు.
  3. స్పెక్యులేషన్ అంటే భవిష్యత్లో సెక్యూరిటీల ధరల మార్పుల వల్ల లాభం పొందే ఉద్దేశం గల వ్యవహారం.
  4. కాబట్టి స్పెక్యులేషన్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారంగా పరిగణిస్తారు. ఆశించిన రీతిలో లాభాలు రాకుంటే స్పెక్యులేటర్స్ నష్టపోతారు.

స్పెక్యులేటర్ల రకాలు: స్పెక్యులేషన్ స్వభావాన్ని బట్టి, స్పెక్యులేటర్లకు బుల్స్ (Bulls), బేర్స్ (Bears), స్టాగ్ (Stag) మరియు లేవొక్ (Lame Duck)గా వర్గీకరించవచ్చు.
1) బుల్స్:

  1. ఈ మధ్యవర్తులు తమ వ్యవహారాలలో ఆశావాదిగా ఉంటారు. సెక్యూరిటీల ధరలు పెరుగుతాయనే ఆశతో వాటిని ప్రస్తుత ధరకు కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్న స్పెక్యులేటర్లను బుల్స్ అంటారు.
  2. వీరు భవిష్యత్ కాలంలో అంచనావేసిన అధిక ధరకు అమ్మగలుగుతారని సెక్యూరిటీలను కొనుగోలు చేస్తారు.
  3. సెక్యూరిటీల ధరలు పెరుగుతాయని ఆశించడం వల్ల, అతని ధోరణిని బుల్తో సరిపోలుస్తారు. సాంకేతిక పరిభాషలో బుల్ను మార్కెట్కు సుదీర్ఘంగా ఉంటాడని పేర్కొంటారు. ఈ బుల్స్ను ‘తేజీవాలాలు’గా కూడా వ్యవహరిస్తారు.

2) బేర్స్:

  1. ఈ మధ్యవర్తులు తమ వ్యవహారాలలో నిరాశావాదులుగా ఉంటారు. సెక్యూరిటీల ధరలు తగ్గుతాయనే భావనతో వాటిని ప్రస్తుత ధరకు అమ్మడానికి ఒప్పందం చేసుకున్న స్పెక్యులేటర్లను ‘బేర్స్’ అంటారు. వీరిని మండివాలాలు అని కూడా వ్యవహరిస్తారు.
  2. వీరు భవిష్యత్తులో సెక్యూరిటీలను ఇప్పటి ధరకంటే తక్కువ ధరతో కొనుగోలు చేసి అమ్మవచ్చనే ఆశతో ఈ వ్యవహారం జరుపుతారు.
  3. బేర్స్ ప్రతిపాదించిన అమ్మకం ధర, కొనుగోలు ధరల మధ్య వ్యత్యాసమే తాము ఆర్జించిన లాభంగా నిర్ధారితమౌతుంది.
  4. బేర్ తన బాధితున్ని భూమిపై తోసి గాయపరుస్తుంది. తన నిరాశావాదతత్వంతో స్పెక్యులేటర్ సెక్యూరిటీల ధరలు తగ్గుతాయని భావిస్తాడు. అందకే అతనికి బేర్ అనే పేరును సార్థకం చేసారు.

3) స్టాగ్:

  1. ఈ స్పెక్యులేటర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించే స్పెక్యులేటర్లు, ఒక కొత్త కంపెనీ వాటాలను జారీ చేసినప్పుడు ఈ స్పెక్యులేటర్లు అధిక మొత్తంలో దరఖాస్తు రుసుము చెల్లించి పెద్ద మొత్తాలలో వాటాల కోసం దరఖాస్తు చేస్తారు. వాటాల కేటాయింపు వీరికి జరిగినట్లయితే తాము పొందిన వాటాలను ప్రీమియానికి అమ్ముతారు.
  2. ఏ కంపెనీ వాటాలకయితే డిమాండు ఎక్కువగా ఉందో గమనించి, ఆ కంపెనీ వాటాలను ఎంచుకొని, ఆ వాటాలపై కేటాయింపు సొమ్ము చెల్లించమని పిలుపు ఇవ్వకముందే, వాటిని ప్రీమియంపై అమ్ముతారు.
  3. తాము వాటాల కోసం చెల్లించిన సొమ్ముకు, అమ్మకం ధరకు మధ్యగల వ్యత్యాసమ్మొత్తాన్ని లాభంగా పరిగణిస్తారు.

4) లేమ్క్:

  1. బేరం దొరకని బేర్ను లేమితో పోలుస్తారు. కొన్ని సందర్భాలలో అమ్ముతానన్న సెక్యూరిటీలు మార్కెట్లో లభ్యం కాకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో బేర్ ఇబ్బందులకు లోను కావలసి వస్తుంది. తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. అమ్ముతానన్న సెక్యూరిటీలను అమ్మలేడు.
  2. తన దగ్గరలేని సెక్యూరిటీల అమ్మకానికి కుదుర్చుకున్న ఒప్పందంలో బేరు ఈ పరిస్థితి ఎదురవుతుంది. అంటే తమ దగ్గరలేని సెక్యూరిటీలను అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకొని వాటిని నెరవేర్చడానికి తక్కువ ధరలకు సెక్యూరిటీలు లభించక అవస్థలు పడే బేర్లను ‘లేమడక్స్’ అంటారు.

ప్రశ్న 6.
BSE, NSEల లక్షణాలను వివరించండి.
జవాబు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ని 1877 సంవత్సరంలో స్థాపించారు. దీనినే “నేటివ్ స్టాక్ అండ్ షేర్ బ్రోకర్స్ అసోసియేషన్” గా పిలుస్తారు. ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం స్టాక్ ఎక్స్ఛేంజ్లో పనిచేసే బ్రోకర్లకు సహాయపడటం, వారి హోదాలను పరిరక్షించడం. స్టాక్ ఎక్స్ఛేంజ్లలో న్యాయమైన, సముచితమైన పనులను మాత్రమే చేపట్టి అవకతవకలను తగ్గించడంలో ఈ సంస్థ ముఖ్యపాత్రను పోషిస్తుంది.

BSE లక్షణాలు:

  1. ఈ ఎక్స్ఛేంజ్ ఆన్లైన్ ట్రేడింగ్ విధానాన్ని 1995 లో ప్రవేశపెట్టింది. ఇది సెక్యూరిటీల వర్తకాన్ని చురుకుగా చేపట్టడమే కాకుండా, స్టాక్ మార్కెట్ వ్యవహారాలను సంరక్షిస్తుంది.
  2. చిన్న తరహా, మధ్యతరహా సంస్థలు తమ ఈక్విటీలను వర్తకం చేసుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది.
  3. సెక్యూరిటీలతో వ్యవహరించేటప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడంలో ఉపయోగపడుతుంది.
  4. ఈక్విటీలు, రుణ పత్రాలు మరియు మ్యూచువల్ ఫండ్స్తో వర్తకం చేయడానికి సమర్థవంతమైన పారదర్శక మార్కెట్ను అందిస్తుంది.
  5. ప్రపంచ వ్యాప్తంగా ఖాతాదారులను కలిగి ఉంటుంది.
  6. రిస్క్ మేనేజ్మెంట్ క్లియరింగ్, సేవలు అందిస్తూ మూలధన మార్కెట్లో పాల్గొనేవారికి పరిజ్ఞానాన్ని అందిస్తుంది.

NSE నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ను నవంబర్, 1992 సంవత్సరంలో నమోదు చేయడమైంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ వర్తక విధానాన్ని కలిగి ఉండి సెక్యూరిటీల వర్తకానికి ఇది దోహదపడుతున్నది.

NSE లక్షణాలు:

  1. దేశవ్యాప్తంగా కంప్యూటీకరించిన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇది. భారతదేశంలోని NSE సభ్యులందరూ శాటిలైట్ మరియు కేబుల్ సిస్టమ్ ద్వారా కలపబడతారు.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీల వర్తకం జరిగేటప్పుడు ధరల నిర్ణయానికి సంబంధించి అరవడం గాని లేదా బెల్ మోగించవలసిన అవసరం గానీ ఈ NSE లో ఉండదు. NSE లో పొందుపరచిన అటోమేటెడ్ కొటేషన్ సిస్టమ్ (Automated Quotation System) ద్వారా సెక్యూరిటీలను అమ్మడం, కొనడం చేయబడతాయి.
  3. NSE రుణ మార్కెట్లోని ప్రభుత్వ సెక్యూరిటీలు, UTI యూనిట్లు మొదలయిన వాటిని టోకు అమ్మకాలుగాచేపడుతుంది.
  4. ధరలకు సంబంధించిన సమాచారంను ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (P.T.I) ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది.
  5. ఈ సంస్థ పరిష్కార విధానాన్ని మెరుగుపరచడమే కాకుండా సెక్యూరిటీల వర్తకంలోని నష్ట భయాన్ని తగ్గిస్తుంది.
  6. NSE సబ్సిడియరీ నేషనల్ సెక్యూరిటీస్ క్లియరింగ్ కార్పొరేషన్ను నెలకొల్పింది. దీని ద్వారా వర్తకాన్ని నిర్వర్తించడానికి అవసరమైన పరిష్కారాలను, గ్యారంటీని ఈ సంస్థ అందిస్తుంది.
  7. ఈ సంస్థ కార్పొరేట్ ఈక్విటీ, రుణ పత్రాలతో వ్యవహరిస్తూ, కొనుగోలుదారులకు, అమ్మకందారులకు బ్రోకర్లుకు అవసరమైన సహాయం అందిస్తుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

ప్రశ్న 7.
స్టాక్ బ్రోకర్ అంటే ఎవరు? అతను నిర్వహించే పాత్ర ఏమిటి ?
జవాబు.
స్టాక్ బ్రోకర్:

  1. సాధారణ ప్రజలకు మరియు జాబర్ల మధ్య విభిన్న సెక్యూరిటీలను కమీషన్ కోసం ఏర్పాట్లు చేసే స్పెక్యులేటర్లను స్టాక్ బ్రోకర్లు అంటారు.
  2. స్టాక్ బ్రోకర్ తన ఖాతాదారుల తరపున స్టాక్స్ మరియు ఇతర సెక్యూరిటీల కోసం కొనుగోలు మరియు అమ్మకం ఆర్డర్లను ప్రాసెస్ చేసే నిపుణుడు. స్టాక్ బ్రోకర్ను “రిజిస్టర్డ్ ప్రతినిది”, “పెట్టుబడి సలహాదారు” లేదా “బ్రోకర్” అని కూడా పిలుస్తారు.
  3. స్టాక్ బ్రోకర్లు సాధారణంగా బ్రోకరేజ్ సంస్థతో సంబంధం కలిగి ఉంటారు మరియు రిటైల్ లేదా సంస్థాగత కస్టమర్ల కోసం లావాదేవీలను నిర్వహిస్తారు. స్టాక్ బ్రోకర్లు తరచూ వారి సేవలకు కమీషన్లు తీసుకుంటారు.

స్టాక్ బ్రోకర్ల పాత్ర:
1) సెక్యూరిటీల కొనుగోలు:

  1. స్టాక్ బ్రోకర్ యొక్క ప్రాథమిక బాధ్యతలలో ఒకటి తన క్లయింట్ తరపున స్టాక్స్ కొనడం. క్లయింట్ కలిగి ఉన్న ఖాతా రకాన్ని బట్టి అతను కొనుగోలును వివిధ మార్గాల్లో చేపట్టవచ్చు.
  2. విచక్షణారహిత ఖాతాలో, స్టాక్ బ్రోకర్ కొన్ని ముందుగా నిర్ణయించిన మార్గదర్శకాల ఆధారంగా క్లయింట్ కోసం స్టాక్ కొనుగోలు చేస్తారు.

2) సెక్యూరిటీల అమ్మకం:

  1. క్లయింట్ తరపున స్టాక్ అమ్మడం స్టాక్ బ్రోకర్కు ఉన్న ఇతర బాధ్యత. స్టాక్ కొనుగోలు విషయంలో మాదిరిగానే, స్టాక్ బ్రోకర్ క్లయింట్ కోరుకున్న మరియు తెరిచిన ఖాతా ఆధారంగా క్లయింట్ యొక్క స్టాక్లను అమ్మవచ్చు.
  2. క్లయింట్కు అమలు మాత్రమే ఖాతా ఉంటే, స్టాక్ బ్రోకర్ క్లయింట్ స్టాక్ను అడిగినప్పుడు మాత్రమే అమ్మవచ్చు.
  3. క్లయింటు సలహా ఖాతా ఉంటే, స్టాక్ బ్రోకర్ క్లయింట్కు తన స్టాక్లను విక్రయించమని మాత్రమే సలహా ఇవ్వగలడు, క్లయింట్కు విచక్షణా ఖాతా ఉంటే, స్టాక్ బ్రోకర్కు ముందుగా నిర్ణయించిన మార్గదర్శకం ఆధారంగా స్టాక్లను విక్రయించడానికి కొంత అవకాశం ఉంది.

3) పరిశోధన మరియు సలహా:

  1. చాలా బ్రోకింగ్ హౌన్లు సంస్థలను మరియు స్టాక్లను స్కాన్ చేయడంతోపాటు, స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేసే స్థూల – ఆర్థిక దృష్టాంతాన్ని విశ్లేషించే అంతర్గత పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేస్తాయి. పరిశోధనా బృందం నుంచి ఇన్పుట్లతో, బ్రోకరేజ్ హౌస్ స్టాక్స్పై సిఫారసుల ఆధారంగా కొనుగోలు చేస్తుంది లేదా అమ్మవచ్చు.
  2. మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం గురించి తమ ఖాతాదారుల జ్ఞానాన్ని మెరుగుపరచడంలో సహాయపడటానికి ‘బ్రోకర్లు పెట్టుబడిదారులకు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.

4) వ్యక్తిగతీకరించిన సేవ: చాలా బ్రోకింగ్ హౌన్లు సలహాదారుగా వ్యవహరించే క్లయింట్తో సంభాషించడానికి సంబంధిత నిర్వాహకుడిని (రిలేషన్షిప్ మేనేజర్ను) నియమిస్తాయి. సంబంధిత నిర్వాహకులు తమ ఖాతాదారులకు ఎప్పుడు లావాదేవీలు చేయాలో సలహా ఇస్తారు మరియు మార్కెట్ లావాదేవీలలో ఏమి చూడాలి అనే దాని గురించి వారికి మార్గనిర్దేశం చేస్తారు.

5) మార్జిన్ పైనాన్సింగ్:

  1. స్టాక్ బ్రోకర్లు ఈ రోజుల్లో బాగా మూలధనీకరణను కలిగి ఉన్నారు.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్ బ్రోకర్లు తమ నికర విలువకు అనుగుణంగా ఎంతవరకు రుణాలు ఇస్తున్నారో పర్యవేక్షిస్తాయి. తత్ఫలితంగా, పరపతి స్థానాలను తీసుకోవాలనుకునే ఖాతాదారులకు అనేక పెద్ద బ్రోకింగ్ హౌస్లు ఫైనాన్సింగ్ సదుపాయాలను కల్పిస్తాయి. దీని అర్థం ట్రేడింగ్ కోసం రుణాలను సమకూర్చుకుంటాయి.
  3. మార్జిన్ మొత్తాన్ని చెల్లించిన తరువాత ఖాతాదారులకు మార్కెట్లో స్థానం పొందటానికి అనుమతి ఉంది. చాలా సందర్భాలలో, పెట్టుబడిదారులు 50% మార్జిన్తో వ్యాపారం చేయడానికి అనుమతించబడతారు.

6) ఇతర రకాల ఆస్తులలో పెట్టుబడులు: స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా, వస్తువులు, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్) మరియు మ్యూచువల్ ఫండ్ వంటి ఇతర రకాల ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి బ్రోకర్లు పెట్టుబడిదారులకు సహాయం చేస్తారు. కంపెనీల ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపిఓ)లో పెట్టుబడులు పెట్టడానికి కూడా వారు తమ ఖాతాదారులకు సహాయం అందిస్తారు.

7) మార్కెటింగ్: స్టాక్ బ్రోకర్ భావి క్లయింట్లను గుర్తించి కస్టమర్ల సమూహాన్ని నిర్మిస్తాడు. వార్తా పత్రికలు మరియు మ్యాగజైనులో వ్యాసాలు రాయడం, రేడియో మరియు టెలివిజన్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అతను మార్కెటింగ్ను చేపట్టవచ్చు.

ప్రశ్న 8.
విత్త మార్కెట్లో స్టాక్ బ్రోకర్ యొక్క ఆవశ్యకతను సవివరంగా తెలపండి.
జవాబు.
ఒక సామాన్యుడికి, ఎక్స్ఛేంజ్ నుంచి నేరుగా స్టాకులను కొనడం సాధ్యం కాదు. సెక్యూరిటీల అమ్మకాలను మరియు కొనుగోలును అమలు చేయడానికి వారికి మధ్యవర్తుల అవసరం ఏర్పడుతుంది. అలాంటి మధ్యవర్తులను ‘స్టాక్ బ్రోకర్లు’ .అంటారు. పెట్టుబడిదారుల తరపున, స్టాక్ మార్కెట్లలో స్టాకుల కొనుగోలు మరియు అమ్మకాన్ని సులభతరం చేయడానికి .స్టాక్ బ్రోకర్ స్టేషలు అవసరం.

స్టాక్ బ్రోకర్లు తమ కాతాదారులకు ఈ దిగువ సేవలను అందిస్తున్నారు:
1) సలహా సేవలను అందించడం: స్టాక్ మార్కెట్ బ్రోకర్లు స్టాక్ మార్కెట్ పనితీరు, మార్కెట్పై పోకడలు, మొదలైన అంశాలలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా, వారు సంబంధం ఉన్న బ్రోకరేజ్ సంస్థల యొక్క డేటాబేస్ మరియు పరిశోధన ఫలితాలతో వారికి మార్కెట్పై అవగాహన ఉంటుంది. అందువల్ల, వారు తమ ఖాతాదారులకు అద్భుతమైన పెట్టుబడి సలహాలను అందించగలరు.

2) పరిమిత బ్యాంకింగ్ సేవలను అందించడం: స్టాక్ మార్కెట్ బ్రోకర్లకు వడ్డీ-బేరింగ్ ఖాతాలు, ఎలక్ట్రానిక్, డిపాజిట్లు మరియు ఉపసంహరణలు వంటి పరిమిత బ్యాంకింగ్ సేవలను అందించడానికి అధికారం ఉంది. ఖాతాదారులకు నామమాత్రపు బ్రోకరేజ్ ఛార్జీని చెల్లించడం ద్వారా స్టాక్ బ్రోకర్ల నుంచి బ్యాంకింగ్ సంబంధిత సేవలను పొందవచ్చు.

3) ఇతర పెట్టుబడి సేవలకు మద్దతు ఇవ్వడం: స్టాక్స్ పాటు, చాలా మంది స్టాక్ బ్రోకర్లు మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ మరియు కమోడిటీ ట్రేడింగ్ వంటి ఇతర సెక్యూరిటీలకు సంబంధించిన పెట్టుబడి సలహాలను వారు తమ ఖాతాదారులకు అందిస్తారు.

4) ఈ-మెయిల్ మద్దతు సేవలను నిర్వహించడం: వ్యాపార సమయంలో కొన్ని గంటల్లో ఈ-మెయిల్కు ప్రత్యత్తురం ఇవ్వడం అనేది సహేతుకమైన చర్యగా పరిగణించబడుతుంది. ఇది వ్యాపార అవసరాన్ని బట్టి ఉంటుంది.

5) ఫోన్ / టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా కమ్యూనికేట్ చేయడం: బ్రోకర్ ఫోన్ మరియు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అద్భుతమైన కస్టమర్ సేవలను అందించగలదు. దీని వలన కస్టమర్ల సంతృప్తిని పొందడమే కాకుండా తమ వ్యాపార విస్తరణకు దోహదపడుతుంది.

6) ప్రత్యక్ష చాట్ మద్దతును అందించడం: ప్రత్యక్ష చాట్ వెళ్ళేంతవరకు, ప్రతిస్పందన తక్షణమే ఉండాలి. అయితే ఇది పని రోజులలో మరియు నిర్దిష్ట సమయం వరకు మాత్రమే సాధ్యమవుతుంది.

7) వెబ్ సైట్లో సందేశాన్ని పంపడం: ఇది క్లయింట్కు వేగంగా సహాయం అందించడంలో సహాయపడుతుంది. మరియు నిర్దిష్ట ప్రతినిధికి సందేశం త్వరితగతిన పంపబడుతుంది.

8) చర్చా వేదికల ద్వారా అవగాహన కల్పించడం: ఈ రకమైన సేవలు సరికొత్తవిగా మరియు జనాదరణ పొందినవిగా చెప్పవచ్చు. ఖాతాదారుడు ఏదైనా ప్రత్యేకమైన అంశం లేదా సమస్యకు సంబంధించి బ్రోకర్తో నేరుగా ప్రశ్నలు అడగవచ్చు. తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చును.

9) నాలెడ్జ్ – బేస్ మరియు వీడియో ట్యుటోరియల్స్ ఏర్పరచడం: నాలెడ్జ్ – బేస్లో పునరావృతమయ్యే సమస్యను శీఘ్రంగా ప్రదర్శించడంలో ఆన్లైన్ కమ్యూనిటీకి సమర్ధవంతమైన మార్గాలలో ఒకటి. వీడియో ట్యుటోరియల్స్ ద్వారా సమస్య – పరిష్కార సాధనాల గురించి ఖాతాదారునికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

ఈ కారణాల వల్ల జాయింట్ స్టాక్ కంపెనీల సెక్యూరిటీల వర్తకంలో స్టాక్ బ్రోకర్ సేవలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
NSE గురించి మీకేమి తెలుసు ?
జవాబు.
NSE నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ను నవంబర్, 1992 సంవత్సరంలో నమోదు చేయడమైంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ వర్తక విధానాన్ని కలిగి ఉండి సెక్యూరిటీల వర్తకానికి ఇది దోహదపడుతున్నది.

NSE లక్షణాలు:
1) దేశవ్యాప్తంగా కంప్యూటీకరించిన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇది. భారతదేశంలోని NSE సభ్యులందరూ శాటిలైట్ మరియు కేబుల్ సిస్టమ్ ద్వారా కలపబడతారు.

2) స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీల వర్తకం జరిగేటప్పుడు ధరల నిర్ణయానికి సంబంధించి అరవడం గాని లేదా బెల్ మోగించవలసిన అవసరం గానీ ఈ NSE లో ఉండదు. NSE లో పొందుపరచిన అటోమేటెడ్ కొటేషన్ సిస్టమ్ (Automated Quotation System) ద్వారా సెక్యూరిటీలను అమ్మడం, కొనడం చేయబడతాయి.

3) NSE రుణ మార్కెట్లోని ప్రభుత్వ సెక్యూరిటీలు, UTI యూనిట్లు మొదలయిన వాటిని టోకు అమ్మకాలుగా చేపడుతుంది.

4) ధరలకు సంబంధించిన సమాచారంను ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (P.T.I) ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది.

5) ఈ సంస్థ పరిష్కార విధానాన్ని మెరుగుపరచడమే కాకుండా సెక్యూరిటీల వర్తకంలోని నష్ట భయాన్ని తగ్గిస్తుంది.

6) NSE సబ్సిడియరీ నేషనల్ సెక్యూరిటీస్ క్లియరింగ్ కార్పొరేషను నెలకొల్పింది. దీనిద్వారా వర్తకాన్ని నిర్వర్తించడానికి అవసరమైన పరిష్కారాలను గ్యారంటీని ఈ సంస్థ అందిస్తుంది.

7) ఈ సంస్థ కార్పొరేట్ ఈక్విటీ, రుణ పత్రాలతో వ్యవహరిస్తూ, కొనుగోలుదారులకు, అమ్మకందారులకు బ్రోకర్లుకు అవసరమైన సహాయం అందిస్తుంది.

ప్రశ్న 2.
BSE అంటే ఏమిటి ?
జవాబు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ని 1877 సంవత్సరంలో స్థాపించారు. దీనినే “నేటివ్ స్టాక్ అండ్ బ్రోకర్స్ అసోషియేషన్” ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం స్టాక్ ఎక్స్ఛేంజ్లో పనిచేసే బ్రోకర్లకు సహాయపడటం, వారి హోదాలను పరిరక్షించడం. స్టాక్ ఎక్స్ఛేంజ్లలో న్యాయమైన, సముచితమైన పనులను మాత్రమే చేపట్టి అవకతవకలను తగ్గించడంలో ఈ సంస్థ ముఖ్యపాత్రను పోషిస్తుంది.

BSE లక్షణాలు:

  1. ఈ ఎక్స్ఛేంజ్ ఆన్లైన్ ట్రేడింగ్ విధానాన్ని 1995 లో ప్రవేశపెట్టింది. ఇది సెక్యూరిటీల వర్తకాన్ని చురుకుగా చేపట్టడమే కాకుండా, స్టాక్ మార్కెట్ వ్యవహారాలను సంరక్షిస్తుంది.
  2. చిన్న తరహా, మధ్యతరహా సంస్థలు తమ ఈక్విటీలను వర్తకం చేసుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది.
  3. సెక్యూరిటీలతో వ్యవహరించేటప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడంలో ఉపయోగపడుతుంది.
  4. ఈక్విటీలు, రుణ పత్రాలు మరియు మ్యూచువల్ ఫండ్స్తో వర్తకం చేయడానికి సమర్థవంతమైన పారదర్శక మార్కెట్ను అందిస్తుంది.
  5. ప్రపంచ వ్యాప్తంగా ఖాతాదారులను కలిగి ఉంటుంది.
  6. రిస్క్ మేనేజ్మెంట్ క్లియరింగ్ సేవలు అందిస్తూ మూలదన మార్కెట్లో పాల్గొనే వారికి పరిజ్ఞానాన్ని అందిస్తుంది.

ప్రశ్న 3.
బుల్స్, బేర్స్ గురించి మీకేమి తెలుసు ?
జవాబు.
బుల్స్:

  1. వీరిని తేజీవాలాలు (Tejiwalas) అని కూడా అంటారు. ఈ మధ్యవర్తులు తమ వ్యవహారాలలో ఆశావాదిగా ఉంటారు. సెక్యూరిటీల ధరలు పెరుగుతాయనే ఆశతో వాటిని ప్రస్తుత ధరకు కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్న స్పెక్యులేటర్లను బుల్స్ అంటారు.
  2. వీరు భవిష్యత్ కాలంలో అంచనావేసిన అధిక ధరకు అమ్మగలుగుతాయని సెక్యూరిటీలను కొనుగోలు చేస్తారు. ఇతడు వాస్తవంగా సెక్యూరిటీల డెలివరీని తీసుకోడు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

బేర్స్:
1) వీరినే మండివాలాలు (Mandiwala) అంటారు. ఈ మధ్యవర్తులు తమ వ్యవహారాలను నిరాశావాదులుగా . ఉంటారు. సెక్యూరిటీల ధరలు తగ్గుతాయనే భావనతో వాటిని ప్రస్తుత ధరకు అమ్మడానికి ఒప్పందం చేసుకున్న సెక్యులేటర్లను బేర్స్ అంటారు.

2) వీరు వాస్తవంగా సెక్యూరిటీలను కొనుగోలు చేయరు, అమ్మరు. కానీ వాటిని ఎక్కువ ధరకు అమ్మజూపుతారు. అంటే భవిష్యత్లో సెక్యూరిటీలను ఇప్పటి ధరకంటే తక్కువ ధరతో కొనుగోలుచేసి అమ్మవచ్చనే ఆశతో ఈ వ్యవహారం జరుపుతారు. బేర్స్ ప్రతిపాదించిన అమ్మకం ధర, కొనుగోలు ధరల మధ్య వ్యత్యాసమే తాము ఆర్జించిన లాభంగా పరిగణిస్తారు.

ప్రశ్న 4.
సెక్యూరిటీలను జాబితాలో చేర్చడానికి సంబంధించిన ఉద్దేశాలు ఏమిటి ?
జవాబు.
సెక్యూరిటీలను జాబితాలో చేర్చడానికి గల ఉద్దేశాలు:

  1. సెక్యూరిటీల వ్యవహారాలపై నియంత్రణ కలిగి ఉండటమే కాకుండా వాటిపై సరైన పర్యవేక్షణను కలిగి ఉండటం.
  2. ఆర్థిక శక్తులను వికేంద్రీకరించడం.
  3. వ్యవస్థాపకుల ఆసక్తులను పరిరక్షించడం.
  4. పెట్టుబడిదారుల, వాటాదారుల ప్రయోజనాలను కాపాడటం.

ప్రశ్న 5.
డీమ్యూచువలైజేషన్ (Demutualisation) అంటే ఏమిటి ?
జవాబు.
నవంబర్, 2002లో కనియా కమిటీ వారు, స్టాక్ ఎక్స్ఛేంజ్లను కార్పొరేట్ తరహాలో వ్యాపారం చేయడానికి కొన్ని సూచనలు చేశారు. దీని ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజ్లన్నీ కంపెనీలుగా మారడమే కాకుండా ఏకీయత కలిగిన సంస్థగా, మార్పు చెందడానికి వీలు లేనిదిగా మారాయి. కాబట్టి స్టాక్ ఎక్స్ఛేంజ్ల లక్షణం ‘లాభాపేక్ష లేకుండా’ (Not for Profit) నుంచి ‘లాభం కోసం’ (For Profit) గా రూపుదిద్దుకున్నాయి. మార్పు చెందడానికి వీలులేదు. (Demutualization) అనే కారణం వల్ల యాజమాన్యం – నిర్వహణల మధ్య వేర్పాటువాదం ఏర్పడింది. ఓవర్ ది కౌంటర్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (OTC EOI) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఏర్పాటు అయినప్పటి నుంచి స్వచ్ఛమైన ‘డిమ్యూచువలైజ్డ్’ నిర్మాణాన్ని పాటిస్తున్నారు.

డీమ్యూచువలైజేషన్ అనగా స్టాక్ ఎక్స్ఛేంజ్లు లాభార్జన ధ్యేయంతో పన్నులు చెల్లిస్తూ కొనసాగే సంస్థగా మారడం డీమ్యూచు వలైజేషన్ నిర్వహణను యాజమాన్యం నుంచి వేరు చేయటం జరిగింది. బ్రోకర్లు తమ అధికారాలను దుర్వినియోగపరచుట వల్ల దీని అవశ్యకత ఏర్పడింది.

ప్రశ్న 6.
భారతదేశంలో మొదటి పది స్టాక్ బ్రోకింగ్ సంస్థలు ఏమిటి ?
జవాబు.
భారతదేశంలో ఉన్నత స్థాయి స్టాక్ బ్రోకింగ్ సంస్థలు
TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్ 1
TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్ 2

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్టాక్ ఎక్స్ఛేంజ్.
జవాబు.

  1. ఇంతకు ముందే జారీ చేసిన కంపెనీ వాటాలను అమ్మడం, కొనడం లాంటి కార్యకలాపాలు జరిపే వ్యవస్థీకృతమైన సెకండరీ మార్కెట్ను స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటారు.
  2. సెక్యూరిటీల కాంట్రాక్ట్ ఒప్పందాల నియంత్రణ చట్టం 1956, ప్రకారం సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలను క్రమబద్దీకరించి, నియంత్రించే ఉద్దేశంతో నమోదైన లేదా నమోదు కాని సంఘం, వ్యవస్థ లేదా వ్యక్తుల సముదాయమే స్టాక్ ఎక్ఛేంజ్.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

ప్రశ్న 2.
సెక్యూరిటీలను జాబితాలో చేర్చడం.
జవాబు.

  1. స్టాక్ ఎక్స్ఛేంజ్ అధికారిక జాబితాలో వర్తకం చేయడానికి గాను కంపెనీ సెక్యూరిటీలను చేర్చడాన్ని సెక్యూరిటీలను జాబితాలో చేర్చడం అంటారు.
  2. సెక్యూరిటీలను జాబితాలో చేర్చడం కోసం కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్ అనుమతి తీసుకోవాలి. ఇందుకుగాను కంపెనీలు కొన్ని లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ప్రశ్న 3.
లేమెదక్.
జవాబు.
తమ దగ్గర లేని సెక్యూరిటీలను అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకొని వాటిని నెరవేర్చడానికి తక్కువ ధరలకు సెక్యూరిటీలు లభించక అవస్థలు పడే బేర్లనే “లేమ్క్”లు అంటారు.

ప్రశ్న 4.
స్టాగ్.
జవాబు.
కొత్త కంపెనీ వాటాలను జారీ చేసినపుడు అధిక మొత్తంలో దరఖాస్తు రుసుము చెల్లించి పెద్ద మొత్తాలలో వాటాల కోసం దరఖాస్తు చేసుకున్న స్పెక్యులేటర్లునే స్టాగ్ అంటారు.

ప్రశ్న 5.
జాబర్.
జవాబు.
సెక్యూరిటీలను కొనుగోలు మరియు అమ్మకం చేస్తూ వాటి ధరలలో వచ్చే మార్పుల ద్వారా ఆదాయం పొందే స్పెక్యులేటర్లను జాబర్స్ అంటారు. కొనుగోలు, అసౌకర్యపు ధరలు మధ్యగల వ్యత్యాసమే జాబర్ యొక్క లాభం / నష్టం అవుతుంది.

ప్రశ్న 6.
స్టాక్ బ్రోకర్.
జవాబు.

  1. సాధారణ ప్రజలకు జాబర్ల మధ్య విభిన్న సెక్యూరిటీలను కమీషన్ కోసం ఏర్పాట్లు చేసే స్పెక్యులేటర్లను స్టాక్ బ్రోకర్స్ అంటారు.
  2. స్టాక్ బ్రోకర్ తన ఖాతాదారుల తరపున స్టాక్స్ మరియు ఇతర సెక్యూరిటీల కోసం కొనుగోలు మరియు అమ్మకం ఆర్డర్లను ప్రాసెస్ చేసే నిపుణుడు. స్టాక్ బ్రోకర్ను ‘రిజిష్టర్డ్ ప్రతినిధి”/పెట్టుబడి సలహాదారు / బ్రోకర్ అని కూడా పిలుస్తారు.

ప్రశ్న 7.
సెబి (SEBI).
జవాబు.

  1. సెబి అనగా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్లలో నెలకొన్న అవాంఛనీయ అలవాట్లను తొలగించడానికి, స్టాక్ ఎక్స్ఛేంజ్, దానిలో పాల్గొనే స్టాక్ బ్రోకర్లను మరియు ఆపరేటర్ల పనులను నియంత్రించడానికి SEBI Act 1992 భారత పార్లమెంట్ ద్వారా సెబిని ఏర్పాటు చేశారు.

ప్రశ్న 8.
అనుమతించిన సెక్యూరిటీలు.
జవాబు.
ఇతర స్టాక్ ఎక్స్ఛేంజ్లలో చురుకుగా వ్యవహారాలను జరుపుకునే సెక్యూరిటీలను, తమ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ కాకపోయినా లావాదేవీలు జరపటానికి అనుమతిస్తారు. ఈ తరహా సెక్యూరిటీలనే అనుమతించిన సెక్యూరిటీలు అంటారు.

ప్రశ్న 9.
స్టాక్ ఎక్స్ఛేంజ్ స్పెక్యులేటర్స్.
జవాబు.

  1. సెక్యూరిటీల ధరలలో మార్పుల వల్ల లాభం పొందే నిమిత్తం స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యవహారాలను జరిపే చట్టబద్దమైన వ్యాపారస్తులనే స్పెక్యులేటర్స్ అంటారు.
  2. వీరు ధరల ‘మార్పుల తేడాను వసూలు చేసుకోవడం గాని, చెల్లించడం గాని చేస్తారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

ప్రశ్న 10.
స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్లు.
జవాబు.

  1. స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యవహారాలు స్టాక్ ఎక్స్ఛేంజ్ సభ్యులు మాత్రమే చేపట్టాలి. ప్రతిస్టాక్ ఎక్స్ఛేంజ్ సభ్యులను చేర్చుకోవడానికి నియమ నిబంధనలు రూపొందించుకుంటుంది. ఆ నియమనిబంధనల ప్రకారం చేర్చుకున్న సభ్యులనే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్లు అంటారు.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్లో వ్యవహారాలు చేపట్టే ఆపరేటర్లను జాబర్లు మరియు బ్రోకర్లుగా వర్గీకరించవచ్చు.