TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 2nd Lesson స్టాక్ ఎక్స్ఛేంజ్ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 2nd Lesson స్టాక్ ఎక్స్ఛేంజ్

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటే ఏమిటి ? దాని విధులను వివరించండి.
జవాబు.
అర్ధం:

  1. కంపెనీల వాటాలను కొనడానికి, అమ్మడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థీకృత మార్కెట్ను స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటారు.
  2. ఇంతకు ముందే జారీ చేసిన సెక్యూరిటీలను అమ్మడం, కొనడం లాంటి కార్యకలాపాలు జరిపే వ్యవస్థీకృతమైన సెకండరీ మార్కెట్ను స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటారు.

నిర్వచనాలు:

  1. సెక్యూరిటీల (కాంట్రాక్టు) ఒప్పందాల (నియంత్రణ) చట్టం, 1956 ప్రకారం “సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలను క్రమబద్దీకరించి, నియంత్రించే ఉద్దేశంతో నమోదైన లేదా నమోదు కాని సంఘం, వ్యవస్థ లేదా వ్యక్తుల సముదాయమే స్టాక్ ఎక్స్ఛేంజ్’.
  2. పైలీ ప్రకారం, “పెట్టుబడి లేదా స్పెక్యులేషన్ నిమిత్తం జాబితాలో చేర్చిన సెక్యూరిటీల అమ్మకం, కొనుగోలు జరిగే మార్కెట్ ప్రదేశాన్ని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ నిర్వచించవచ్చు”.

స్టాక్ ఎక్స్ఛేంజ్ విధులు:
1) వర్తకానికి అవసరమైన మౌళిక వసతులు కల్పిస్తుంది: స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీల వర్తకం తక్షణమే అమలు జరుగుతుంది. సెక్యూరిటీల నిరంతర మార్కెటింగ్కు అవసరమైన సమాచారం పెట్టుబడిదారులకు అందిస్తూ వ్యాపారానికి, కంపెనీలకు అధిక మొత్తంలో మూలధనాన్ని పొందడానికి సహకరిస్తుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

2) ధరల సమాచారాన్ని అందిస్తుంది: సెక్యూరిటీల ధరల సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్వసనీయమైన మార్గాల ద్వారా, ప్రచురణకర్తల ద్వారా పెట్టుబడిదారులకు చేరవేస్తుంది. భావి పెట్టుబడిదారుడు తాను కొనుగోలు చేయబోయే సెక్యూరిటీల కొటేషన్ ధరను, అమ్మకందారుడు తన సెక్యూరిటీల విలువను తెలుసుకోవచ్చు.

3) పెట్టుబడిదారుల సంపదను పరిరక్షిస్తుంది: సెక్యూరిటీల వర్తకానికి సంబంధించిన నియమ నిబంధనలను సక్రమంగా అమలుపరుస్తూ, పెట్టుబడిదారుల ఆసక్తులను, సంపదను పరిరక్షిస్తుంది.

4) క్లియరింగ్ హౌస్గా వ్యవహరిస్తుంది: క్లియరింగ్ హౌస్ లేనప్పుడు వర్తకంలో క్రయవిక్రయాలు కుదరవు. స్టాక్ ఎక్స్ఛేంజ్ అమ్మకందారుడు, కొనుగోలుదారుని తరపున వ్యవహరిస్తూ, సెక్యూరిటీల వర్తకంలో సహాయపడుతుంది.

5) ద్రవ్యత్వాన్ని కలిగిస్తుంది: సెక్యూరిటీలను కలిగి ఉన్న వ్యక్తి సులభంగా వాటిని నగదులోకి మార్చుకోవడానికి, తనకు అవసరమయినప్పుడు కొనుగోలుదారునకు అమ్ముకోడానికి సులభమార్కెట్ అవకాశాలను కలుగచేస్తుంది. చేసుకోవడానికి, విస్తృతపరచడానికి

6) కొత్త మూలధనాన్ని పొందడంలో సహాయపడుతుంది: వ్యాపారాన్ని అభివృద్ధి అదనపు మూలధనం అవసరం ఏర్పడుతుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్లల వల్ల ప్రస్తుతం నడుస్తున్న కంపెనీలు తమ అదనపు మూలధన అవసరాలను హక్కు వాటాల జారీ ద్వారా సులభంగా పొందవచ్చు.

7) భారమితిగా వ్యవహరిస్తుంది: దేశంలోని వ్యాపార పరిస్థితులను మదింపు చేయడానికి స్టాక్ ఎక్స్ఛేంజ్లు భారమితిగా / కొలమానంగా వ్యవహరిస్తాయి.

8) కంపెనీ కీర్తి ప్రతిష్టలను పెంచుతాయి: కంపెనీ వాటాలను స్టాక్ ఎక్స్ఛేంజ్ల జాబితాలో చేర్చడం వల్ల కంపెనీ పరపతి పెంపొందించడంతోపాటు, దాని పేరు ప్రఖ్యాతులు కూడా మెరుగవుతాయి.

9) స్పెక్యులేషన్ భయాలు తగ్గుతాయి: వివిధ చట్టాల నియమ, నిబంధనలను పాటించడం వల్ల స్పెక్యులేషన్ భయాలు, ధరలో అవకతవకలను తగ్గించడం సాధ్యమవుతుంది.

10)స్పెక్యులేషన్కు దోహదపడుతుంది: స్టాక్ ఎక్స్ఛేంజ్లు స్పెక్యులేషన్కు కొంతమేరకు దోహదపడతాయి. సెక్యూరిటీల ధరలలో ఏర్పడే మార్పులవల్ల వ్యాపారస్తులు స్పెక్యులేషన్కు పాల్పడి, లాభాలను ఆర్జించవచ్చు.

ప్రశ్న 2.
స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రాముఖ్యతను సవివరంగా తెలపండి.
జవాబు.
వివిధ వర్గల వారికి స్టాక్ ఎక్స్ఛేంజ్ల ప్రాముఖ్యతను, అవసరాన్ని క్రింది విధంగా గుర్తించవచ్చు.
ఎ) పెట్టుబడిదారులకు
బి) కంపెనీలకు
సి) సమాజానికి.

ఎ) పెట్టుబడిదారులకు స్టాక్ ఎక్స్ఛేంజ్ల అవసరం:

  1. పెట్టుబడిదారులు తమ మిగులు నిధులను పేరు ప్రఖ్యాతులు గల కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుంది.
  2. నిరంతర మార్కెట్ సమాచారం లభ్యత వల్ల, సెక్యూరిటీలను సరైన రీతిలో సమీక్షించి, పెట్టుబడిదారులు నష్టభయాన్ని తగ్గించుకోవచ్చు.
  3. ఏ సమయంలో అయినా తమ వద్ద ఉన్న సెక్యూరిటీల విలువను తెలుసుకోవచ్చు.
  4. నిరంతరంగా సెక్యూరిటీలను మార్పు చేసుకునే వీలు ఉన్నందువల్ల సెక్యూరిటీలు ద్రవ్యత్వ గుణాన్ని కలిగి ఉంటాయి.
  5. నియమ నిబంధనలు కఠినంగా అమలుపరచడం వల్ల పెట్టుబడిదారుల ప్రయోజనాలు పరిరక్షింపబడతాయి.
  6. సెక్యూరిటీలను హామీలుగా ఉంచి రుణాలు పొందవచ్చు.
  7. కంపెనీ కార్యకలాపాలు, ఆర్థిక పటిష్ఠతను పెట్టుబడిదారులు తెలుసుకోవచ్చు.
  8. కంపెనీల సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాల వద్ద అని నిర్ణయించుకోడానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది.

కంపెనీలకు స్టాక్ ఎక్స్ఛేంజ్ల అవసరం:

  1. సెక్యూరిటీల జారీని దేశ వ్యాప్తంగా పెట్టుబడిదారులు దృష్టికి స్టాక్ ఎక్స్ఛేంజ్లు తీసుకువస్తాయి కాబట్టి కంపెనీలు భారీ మొత్తంలో మూలధనం సేకరించగలుగుతాయి.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చబడిన కంపెనీలు ఎక్కువ పేరు ప్రతిష్టలను పొందుతూ, ఆర్థిక పటిష్టతను చేకూర్చుకోగలుగుతాయి.
  3. స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేరిన కంపెనీలు తమ ఆర్థిక నివేదికలను సమర్పిస్తాయి కాబట్టి, పెట్టుబడిదారులు నమ్మకాన్ని పొందగలుగుతాయి మరియు కంపెనీ పటిష్టమైన స్థితిని వివరించగలుగుతాయి.
  4. కొత్త వాటాల జారీ కోసం ప్రాథమిక మార్కెట్కు అవసరమైన ప్రోత్సాహాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్లు కలిగిస్తాయి.
  5. స్టాక్ ఎక్స్ఛేంజ్ వల్ల సెక్యూరిటీలకు నిరంతర మార్కెటింగ్ సదుపాయం కలుగుతుంది కాబట్టి కొత్త కంపెనీలు తమకు కావలసిన మూలధనాన్ని సులభంగా సమీకరించుకోగలుగుతాయి.
  6. స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చిన కంపెనీల పట్ల భావి పెట్టుబడిదారుల మనస్సులలో సానుకూలమైన ఆలోచన కలుగుతుంది.
  7. కంపెనీని విస్తృతపరచడానికి, ఆధునీకరించడానికి కంపెనీలు అదనపు నిధులను హక్కు వాటాల జారీ ద్వారా పొవీందవచ్చు.
  8. స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చడం వల్ల కంపెనీల సెక్యూరిటీల మార్కెట్ పరిధి విస్తృతమౌతుంది.
  9. స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చిన కంపెనీల పరపతి సౌకర్యం మెరుగుపడుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

ప్రశ్న 3.
నెక్యూరిటీలను స్టాక్ ఎక్స్చేంజ్ల జాబితాలో చేర్చడానికి పాటించవలసిన విధానక్రమం ఏమిటో తెలపండి ?
జవాబు.
అధికారయుతంగా సెక్యూరిటీలను అమ్మడానికిగాని, కొనగానికి గాని స్టాక్ ఎక్స్ఛేంజ్లలో అవకాశం కల్పించడాన్ని సెక్యూరిటీలను జాబితాలో చేర్చడం అంటారు.
సెక్యూరిటీలను స్టాక్ ఎక్స్ఛేంజ్ల జాబితాలో చేర్చడానికి పాటించాల్సిన విధాన క్రమం:
1) స్టాక్ ఎక్స్ఛేంజ్లో సెక్యూరిటీలను జాబితాలో చేర్చాలంటే, దరఖాస్తు చేసుకునే కంపెనీలు కనీసం 3 కోట్ల జారీ మూలధనం కలిగి ఉండాలి. దీనిలో కౌ 1.80 కోట్లకు (60%) తగ్గకుండా ప్రజలకు ప్రతిపాదించాలి. ఈ నిబంధనలు పాటించిన కంపెనీలు మాత్రమే నిర్దిష్టమైన దరఖాస్తును పూరించి, క్రింద పేర్కొన్న పత్రాలను జతపరచి స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుంది.

  • సంస్థాపన పత్రం, నియమావళి, పరిచయ పత్రం, డైరెక్టర్ల నివేదికలు, ఆస్తి అప్పుల పట్టీ మరియు చందాపూచీదార్లు, బ్రోకర్లతో చేసుకున్న ఒప్పందాల నకలు కాపీలను సమర్పించాలి.
  • వాటాలు, డిబెంచర్ల సర్టిఫికెట్స్, కేటాయింపు లేఖలు, ఆమోదం లేదా పరిత్యజించే లేఖల నమూనాలను జతపరచాలి.
  • మూలధన నిర్మాణ వివరాలు సమర్పించాలి.
  • వాటాల పంపిణీని వివరించే నివేదికను రూపొందించాలి.
  • గత పది సంవత్సరాలుగా చెల్లించిన లేదా ప్రకటించిన డివిడెండు, బోనస్ వివరాలు అందించాలి.
  • వాటాలు, డిబెంచర్లతో వ్యవహరించడానికి అవసరమైన అనుమతులు పొందడానికి దరఖాస్తు చేసుకున్న వివరాలు అందించాలి.
  • కంపెనీ నమోదు కాలం నుంచి కంపెనీ కార్యకలాపాల సంక్షిప్త నివేదికను రూపొందించాలి.
  • సెక్యూరిటీలను జాబితాలోకి చేర్చే నిమిత్తం ఒప్పందం చేసుకోవడానికి గాను అవసరమైన ప్రారంభ మరియు వార్షిక లిస్టింగ్ ఫీజును చెల్లించాలి.

2) ఒక కొత్త కంపెనీ పైన పేర్కొన్న పత్రాలలో కొన్నింటిని సమర్పించే స్థితిలో ఉండకపోవచ్చు. ఇది సెక్యూరిటీలను జాబితాలో చేర్చడానికి గాను అభ్యంతరకరం కాకపోవచ్చు. ఆసక్తిగల కంపెనీలు తమ సెక్యూరిటీలను స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చడానికి గాను నిర్ణీత దరఖాస్తుతో పాటు పైన పేర్కొన్న పత్రాలను జతపరచి సమర్పించిన తరువాత, స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆ దరఖాస్తును నిశితంగా పరిశీలిస్తుంది.

3) దరఖాస్తును అన్ని కోణాలలో అధ్యయనం చేసిన తరువాత, స్టాక్ ఎక్స్ఛేంజ్ పొందుపరచిన వివరాలపట్ల సంతృప్తి చెందితే లిస్టింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకోమని కంపెనీకి సమాచారాన్ని ఇస్తుంది. ఈ ఒప్పంద పత్రంలో కంపెనీ బాధ్యతలు, పరిమితులు ఎలా ఉంటాయో, సెక్యూరిటీల లిస్టింగ్ జరిగాక ఎలా వ్యవహరించాల్సి ఉంటుందో స్పష్టం చేయబడుతుంది.

4) SEBI స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థగా 2003వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడి కేంద్రీయ లిస్టింగ్ అధికారాన్ని కలిగి ఉంది. భారతదేశంలోని అన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీలను జాబితాలో చేర్చడానికి, ఒకే రకమైన, ప్రామాణీకరించబడిన విధానాలను పాటించడానికి, దీని ఏర్పాటు జరిగింది.

5) కంపెనీలు తమ సెక్యూరిటీలను స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో నుంచి స్వచ్చందంగా లేదా నిర్బంధంగానైనా విరమింపచేసుకోవచ్చు. ఒకసారి విరమింపచేసుకున్న తరువాత, తిరిగి తమ వాటాలను స్టాక్ జాబితాలో చేర్చాలనే ఆసక్తిగల కంపెనీలు రెండు సంవత్సరాల వరకు నిరీక్షించాలి. ఈ రెండు సంవత్సరాలు గడిచిన తరువాత మళ్ళీ అవసరమైన అన్ని లాంఛనాలు పూర్తి చేసినప్పుడే కంపెనీ వాటాలను తిరిగి స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చడమవుతుంది.

ప్రశ్న 4.
సెబి అంటే ఏమిటి ? దాని విధులను, అధికారాలను వివరించండి.
జవాబు.
సెబి:

  1. సెబి (SEBI) అనగా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్లలో నెలకొన్న అవాంఛనీయ అలవాట్లను తొలగిస్తుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్, దానిలో పాల్గొనే స్టాక్ బ్రోకర్ల మరియు ఆపరేటర్ల పనులను నియంత్రిస్తుంది.
  3. SEBI ACT 1992ను భారత పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత SEBI అమలులోకి వచ్చింది. SEBIకు శాసనాత్మక అధికారాలను చట్టం కల్పించింది. భారతప్రభుత్వం 1995వ సంవత్సరంలో, SEBI Act 1992ను సవరిస్తూ అనేక అదనపు శాసనాత్మక అధికారాలను SEBIకి కల్పించింది.

సెబి విధులు:
సెబి 3 రకాల విధులను నిర్వర్తిస్తుంది. అవి:

  1. క్వాసీ లెజిస్లేటివ్
  2. క్వాసీ జ్యుడిషియల్
  3. క్వాసీ ఎక్సిక్యూటివ్.

లెజిస్లేటివ్ హోదాలో SEBI నిబంధనలను రూపొందిస్తుంది. ఎక్సిక్యూటివ్ విధులలో భాగంగా సెబి పరిశోధనలను చేపట్టి నిబంధనలను అమలుపరిచే చర్యలను తీసుకుంటుంది. జ్యుడిషియల్ హోదాలో సెబి అవసరమైన తీర్పులను ఇస్తూ ఉత్తర్వులను జారీ చేస్తుంది. SEBI నిర్వర్తించే ఈ మూడు రకాల విధులను కింద సంక్షిప్తపరచడమైంది.

  1. పెట్టుబడిదారులకు పరిజ్ఞానాన్ని కల్పించడం.
  2. సెక్యూరిటీలతో వ్యవహరించే మధ్యవర్తులకు అవసరమైన శిక్షణను ఇవ్వడం.
  3. స్టాక్ ఎక్స్ఛేంజ్ల పనిని నియంత్రించడం
  4. మధ్యవర్తులు అంటే స్టాక్ బ్రోకర్లు, మర్చంట్ బ్యాంకర్లు, చందా పూచీదారులు మొదలయిన వారి పనితీరును నియంత్రించడం, వారి వ్యవహారాలను నమోదు చేయడం.:
  5. మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇతర సామూహిక పెట్టుబడి పథకాల పనితీరును క్రమబద్దీకరించడం.
  6. అవసరమయిన ఆడిట్ కార్యక్రమాలను, తనిఖీలను నిర్వహించడం.
  7. అంతర్గతంగా జరిగే సెక్యూరిటీల వర్తకాన్ని అదుపు చేయడం.

సెబి అధికారాలు:
సెబి తన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించడానికి గాను కింది అధికారాలను కలిగి ఉంటుంది.

  1. స్టాక్ ఎక్స్ఛేంజ్ నియమాలను ఆమోదించడం మరియు సవరణలను చేయడం.
  2. ఆర్థిక మధ్యవర్తుల ఖాతాపుస్తకాలను తనిఖీ చేయడం.
  3. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజ్ల ఖాతా పుస్తకాలను తనిఖీ చేయడం, కాలానుగతంగా నివేదికలను సమర్పించమని పిలుపును ఇవ్వడం.
  4. కంపెనీలకు తమ సెక్యూరిటీలను ఒకటి లేదా అంతకుమించిన స్టాక్ ఎక్స్ఛేంజ్ల జాబితాలో తప్పనిసరిగా చేర్చుకోమని ఆదేశించడం.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

ప్రశ్న 5.
వివిధ రకాల స్టాక్ ఎక్స్ఛేంజ్ స్పెక్యులేటర్స్ గురించి వివరించండి.
జవాబు.
స్పెక్యులేటర్స్:

  1. సెక్యూరిటీల ధరలలో మార్పుల వల్ల లాభం పొందే నిమిత్తం స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యవహారాలను జరిపే చట్టబద్ధమైన వ్యాపారస్తులనే స్పెక్యులేటర్స్ అంటారు.
  2. స్పెక్యులేటర్లు ధరల మార్పుల తేడాను వసూలు చేసుకోవడంగాని, చెల్లించడంగాని చేస్తారు.
  3. స్పెక్యులేషన్ అంటే భవిష్యత్లో సెక్యూరిటీల ధరల మార్పుల వల్ల లాభం పొందే ఉద్దేశం గల వ్యవహారం.
  4. కాబట్టి స్పెక్యులేషన్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారంగా పరిగణిస్తారు. ఆశించిన రీతిలో లాభాలు రాకుంటే స్పెక్యులేటర్స్ నష్టపోతారు.

స్పెక్యులేటర్ల రకాలు: స్పెక్యులేషన్ స్వభావాన్ని బట్టి, స్పెక్యులేటర్లకు బుల్స్ (Bulls), బేర్స్ (Bears), స్టాగ్ (Stag) మరియు లేవొక్ (Lame Duck)గా వర్గీకరించవచ్చు.
1) బుల్స్:

  1. ఈ మధ్యవర్తులు తమ వ్యవహారాలలో ఆశావాదిగా ఉంటారు. సెక్యూరిటీల ధరలు పెరుగుతాయనే ఆశతో వాటిని ప్రస్తుత ధరకు కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్న స్పెక్యులేటర్లను బుల్స్ అంటారు.
  2. వీరు భవిష్యత్ కాలంలో అంచనావేసిన అధిక ధరకు అమ్మగలుగుతారని సెక్యూరిటీలను కొనుగోలు చేస్తారు.
  3. సెక్యూరిటీల ధరలు పెరుగుతాయని ఆశించడం వల్ల, అతని ధోరణిని బుల్తో సరిపోలుస్తారు. సాంకేతిక పరిభాషలో బుల్ను మార్కెట్కు సుదీర్ఘంగా ఉంటాడని పేర్కొంటారు. ఈ బుల్స్ను ‘తేజీవాలాలు’గా కూడా వ్యవహరిస్తారు.

2) బేర్స్:

  1. ఈ మధ్యవర్తులు తమ వ్యవహారాలలో నిరాశావాదులుగా ఉంటారు. సెక్యూరిటీల ధరలు తగ్గుతాయనే భావనతో వాటిని ప్రస్తుత ధరకు అమ్మడానికి ఒప్పందం చేసుకున్న స్పెక్యులేటర్లను ‘బేర్స్’ అంటారు. వీరిని మండివాలాలు అని కూడా వ్యవహరిస్తారు.
  2. వీరు భవిష్యత్తులో సెక్యూరిటీలను ఇప్పటి ధరకంటే తక్కువ ధరతో కొనుగోలు చేసి అమ్మవచ్చనే ఆశతో ఈ వ్యవహారం జరుపుతారు.
  3. బేర్స్ ప్రతిపాదించిన అమ్మకం ధర, కొనుగోలు ధరల మధ్య వ్యత్యాసమే తాము ఆర్జించిన లాభంగా నిర్ధారితమౌతుంది.
  4. బేర్ తన బాధితున్ని భూమిపై తోసి గాయపరుస్తుంది. తన నిరాశావాదతత్వంతో స్పెక్యులేటర్ సెక్యూరిటీల ధరలు తగ్గుతాయని భావిస్తాడు. అందకే అతనికి బేర్ అనే పేరును సార్థకం చేసారు.

3) స్టాగ్:

  1. ఈ స్పెక్యులేటర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించే స్పెక్యులేటర్లు, ఒక కొత్త కంపెనీ వాటాలను జారీ చేసినప్పుడు ఈ స్పెక్యులేటర్లు అధిక మొత్తంలో దరఖాస్తు రుసుము చెల్లించి పెద్ద మొత్తాలలో వాటాల కోసం దరఖాస్తు చేస్తారు. వాటాల కేటాయింపు వీరికి జరిగినట్లయితే తాము పొందిన వాటాలను ప్రీమియానికి అమ్ముతారు.
  2. ఏ కంపెనీ వాటాలకయితే డిమాండు ఎక్కువగా ఉందో గమనించి, ఆ కంపెనీ వాటాలను ఎంచుకొని, ఆ వాటాలపై కేటాయింపు సొమ్ము చెల్లించమని పిలుపు ఇవ్వకముందే, వాటిని ప్రీమియంపై అమ్ముతారు.
  3. తాము వాటాల కోసం చెల్లించిన సొమ్ముకు, అమ్మకం ధరకు మధ్యగల వ్యత్యాసమ్మొత్తాన్ని లాభంగా పరిగణిస్తారు.

4) లేమ్క్:

  1. బేరం దొరకని బేర్ను లేమితో పోలుస్తారు. కొన్ని సందర్భాలలో అమ్ముతానన్న సెక్యూరిటీలు మార్కెట్లో లభ్యం కాకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో బేర్ ఇబ్బందులకు లోను కావలసి వస్తుంది. తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. అమ్ముతానన్న సెక్యూరిటీలను అమ్మలేడు.
  2. తన దగ్గరలేని సెక్యూరిటీల అమ్మకానికి కుదుర్చుకున్న ఒప్పందంలో బేరు ఈ పరిస్థితి ఎదురవుతుంది. అంటే తమ దగ్గరలేని సెక్యూరిటీలను అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకొని వాటిని నెరవేర్చడానికి తక్కువ ధరలకు సెక్యూరిటీలు లభించక అవస్థలు పడే బేర్లను ‘లేమడక్స్’ అంటారు.

ప్రశ్న 6.
BSE, NSEల లక్షణాలను వివరించండి.
జవాబు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ని 1877 సంవత్సరంలో స్థాపించారు. దీనినే “నేటివ్ స్టాక్ అండ్ షేర్ బ్రోకర్స్ అసోసియేషన్” గా పిలుస్తారు. ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం స్టాక్ ఎక్స్ఛేంజ్లో పనిచేసే బ్రోకర్లకు సహాయపడటం, వారి హోదాలను పరిరక్షించడం. స్టాక్ ఎక్స్ఛేంజ్లలో న్యాయమైన, సముచితమైన పనులను మాత్రమే చేపట్టి అవకతవకలను తగ్గించడంలో ఈ సంస్థ ముఖ్యపాత్రను పోషిస్తుంది.

BSE లక్షణాలు:

  1. ఈ ఎక్స్ఛేంజ్ ఆన్లైన్ ట్రేడింగ్ విధానాన్ని 1995 లో ప్రవేశపెట్టింది. ఇది సెక్యూరిటీల వర్తకాన్ని చురుకుగా చేపట్టడమే కాకుండా, స్టాక్ మార్కెట్ వ్యవహారాలను సంరక్షిస్తుంది.
  2. చిన్న తరహా, మధ్యతరహా సంస్థలు తమ ఈక్విటీలను వర్తకం చేసుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది.
  3. సెక్యూరిటీలతో వ్యవహరించేటప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడంలో ఉపయోగపడుతుంది.
  4. ఈక్విటీలు, రుణ పత్రాలు మరియు మ్యూచువల్ ఫండ్స్తో వర్తకం చేయడానికి సమర్థవంతమైన పారదర్శక మార్కెట్ను అందిస్తుంది.
  5. ప్రపంచ వ్యాప్తంగా ఖాతాదారులను కలిగి ఉంటుంది.
  6. రిస్క్ మేనేజ్మెంట్ క్లియరింగ్, సేవలు అందిస్తూ మూలధన మార్కెట్లో పాల్గొనేవారికి పరిజ్ఞానాన్ని అందిస్తుంది.

NSE నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ను నవంబర్, 1992 సంవత్సరంలో నమోదు చేయడమైంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ వర్తక విధానాన్ని కలిగి ఉండి సెక్యూరిటీల వర్తకానికి ఇది దోహదపడుతున్నది.

NSE లక్షణాలు:

  1. దేశవ్యాప్తంగా కంప్యూటీకరించిన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇది. భారతదేశంలోని NSE సభ్యులందరూ శాటిలైట్ మరియు కేబుల్ సిస్టమ్ ద్వారా కలపబడతారు.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీల వర్తకం జరిగేటప్పుడు ధరల నిర్ణయానికి సంబంధించి అరవడం గాని లేదా బెల్ మోగించవలసిన అవసరం గానీ ఈ NSE లో ఉండదు. NSE లో పొందుపరచిన అటోమేటెడ్ కొటేషన్ సిస్టమ్ (Automated Quotation System) ద్వారా సెక్యూరిటీలను అమ్మడం, కొనడం చేయబడతాయి.
  3. NSE రుణ మార్కెట్లోని ప్రభుత్వ సెక్యూరిటీలు, UTI యూనిట్లు మొదలయిన వాటిని టోకు అమ్మకాలుగాచేపడుతుంది.
  4. ధరలకు సంబంధించిన సమాచారంను ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (P.T.I) ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది.
  5. ఈ సంస్థ పరిష్కార విధానాన్ని మెరుగుపరచడమే కాకుండా సెక్యూరిటీల వర్తకంలోని నష్ట భయాన్ని తగ్గిస్తుంది.
  6. NSE సబ్సిడియరీ నేషనల్ సెక్యూరిటీస్ క్లియరింగ్ కార్పొరేషన్ను నెలకొల్పింది. దీని ద్వారా వర్తకాన్ని నిర్వర్తించడానికి అవసరమైన పరిష్కారాలను, గ్యారంటీని ఈ సంస్థ అందిస్తుంది.
  7. ఈ సంస్థ కార్పొరేట్ ఈక్విటీ, రుణ పత్రాలతో వ్యవహరిస్తూ, కొనుగోలుదారులకు, అమ్మకందారులకు బ్రోకర్లుకు అవసరమైన సహాయం అందిస్తుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

ప్రశ్న 7.
స్టాక్ బ్రోకర్ అంటే ఎవరు? అతను నిర్వహించే పాత్ర ఏమిటి ?
జవాబు.
స్టాక్ బ్రోకర్:

  1. సాధారణ ప్రజలకు మరియు జాబర్ల మధ్య విభిన్న సెక్యూరిటీలను కమీషన్ కోసం ఏర్పాట్లు చేసే స్పెక్యులేటర్లను స్టాక్ బ్రోకర్లు అంటారు.
  2. స్టాక్ బ్రోకర్ తన ఖాతాదారుల తరపున స్టాక్స్ మరియు ఇతర సెక్యూరిటీల కోసం కొనుగోలు మరియు అమ్మకం ఆర్డర్లను ప్రాసెస్ చేసే నిపుణుడు. స్టాక్ బ్రోకర్ను “రిజిస్టర్డ్ ప్రతినిది”, “పెట్టుబడి సలహాదారు” లేదా “బ్రోకర్” అని కూడా పిలుస్తారు.
  3. స్టాక్ బ్రోకర్లు సాధారణంగా బ్రోకరేజ్ సంస్థతో సంబంధం కలిగి ఉంటారు మరియు రిటైల్ లేదా సంస్థాగత కస్టమర్ల కోసం లావాదేవీలను నిర్వహిస్తారు. స్టాక్ బ్రోకర్లు తరచూ వారి సేవలకు కమీషన్లు తీసుకుంటారు.

స్టాక్ బ్రోకర్ల పాత్ర:
1) సెక్యూరిటీల కొనుగోలు:

  1. స్టాక్ బ్రోకర్ యొక్క ప్రాథమిక బాధ్యతలలో ఒకటి తన క్లయింట్ తరపున స్టాక్స్ కొనడం. క్లయింట్ కలిగి ఉన్న ఖాతా రకాన్ని బట్టి అతను కొనుగోలును వివిధ మార్గాల్లో చేపట్టవచ్చు.
  2. విచక్షణారహిత ఖాతాలో, స్టాక్ బ్రోకర్ కొన్ని ముందుగా నిర్ణయించిన మార్గదర్శకాల ఆధారంగా క్లయింట్ కోసం స్టాక్ కొనుగోలు చేస్తారు.

2) సెక్యూరిటీల అమ్మకం:

  1. క్లయింట్ తరపున స్టాక్ అమ్మడం స్టాక్ బ్రోకర్కు ఉన్న ఇతర బాధ్యత. స్టాక్ కొనుగోలు విషయంలో మాదిరిగానే, స్టాక్ బ్రోకర్ క్లయింట్ కోరుకున్న మరియు తెరిచిన ఖాతా ఆధారంగా క్లయింట్ యొక్క స్టాక్లను అమ్మవచ్చు.
  2. క్లయింట్కు అమలు మాత్రమే ఖాతా ఉంటే, స్టాక్ బ్రోకర్ క్లయింట్ స్టాక్ను అడిగినప్పుడు మాత్రమే అమ్మవచ్చు.
  3. క్లయింటు సలహా ఖాతా ఉంటే, స్టాక్ బ్రోకర్ క్లయింట్కు తన స్టాక్లను విక్రయించమని మాత్రమే సలహా ఇవ్వగలడు, క్లయింట్కు విచక్షణా ఖాతా ఉంటే, స్టాక్ బ్రోకర్కు ముందుగా నిర్ణయించిన మార్గదర్శకం ఆధారంగా స్టాక్లను విక్రయించడానికి కొంత అవకాశం ఉంది.

3) పరిశోధన మరియు సలహా:

  1. చాలా బ్రోకింగ్ హౌన్లు సంస్థలను మరియు స్టాక్లను స్కాన్ చేయడంతోపాటు, స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేసే స్థూల – ఆర్థిక దృష్టాంతాన్ని విశ్లేషించే అంతర్గత పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేస్తాయి. పరిశోధనా బృందం నుంచి ఇన్పుట్లతో, బ్రోకరేజ్ హౌస్ స్టాక్స్పై సిఫారసుల ఆధారంగా కొనుగోలు చేస్తుంది లేదా అమ్మవచ్చు.
  2. మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం గురించి తమ ఖాతాదారుల జ్ఞానాన్ని మెరుగుపరచడంలో సహాయపడటానికి ‘బ్రోకర్లు పెట్టుబడిదారులకు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.

4) వ్యక్తిగతీకరించిన సేవ: చాలా బ్రోకింగ్ హౌన్లు సలహాదారుగా వ్యవహరించే క్లయింట్తో సంభాషించడానికి సంబంధిత నిర్వాహకుడిని (రిలేషన్షిప్ మేనేజర్ను) నియమిస్తాయి. సంబంధిత నిర్వాహకులు తమ ఖాతాదారులకు ఎప్పుడు లావాదేవీలు చేయాలో సలహా ఇస్తారు మరియు మార్కెట్ లావాదేవీలలో ఏమి చూడాలి అనే దాని గురించి వారికి మార్గనిర్దేశం చేస్తారు.

5) మార్జిన్ పైనాన్సింగ్:

  1. స్టాక్ బ్రోకర్లు ఈ రోజుల్లో బాగా మూలధనీకరణను కలిగి ఉన్నారు.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్ బ్రోకర్లు తమ నికర విలువకు అనుగుణంగా ఎంతవరకు రుణాలు ఇస్తున్నారో పర్యవేక్షిస్తాయి. తత్ఫలితంగా, పరపతి స్థానాలను తీసుకోవాలనుకునే ఖాతాదారులకు అనేక పెద్ద బ్రోకింగ్ హౌస్లు ఫైనాన్సింగ్ సదుపాయాలను కల్పిస్తాయి. దీని అర్థం ట్రేడింగ్ కోసం రుణాలను సమకూర్చుకుంటాయి.
  3. మార్జిన్ మొత్తాన్ని చెల్లించిన తరువాత ఖాతాదారులకు మార్కెట్లో స్థానం పొందటానికి అనుమతి ఉంది. చాలా సందర్భాలలో, పెట్టుబడిదారులు 50% మార్జిన్తో వ్యాపారం చేయడానికి అనుమతించబడతారు.

6) ఇతర రకాల ఆస్తులలో పెట్టుబడులు: స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా, వస్తువులు, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్) మరియు మ్యూచువల్ ఫండ్ వంటి ఇతర రకాల ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి బ్రోకర్లు పెట్టుబడిదారులకు సహాయం చేస్తారు. కంపెనీల ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపిఓ)లో పెట్టుబడులు పెట్టడానికి కూడా వారు తమ ఖాతాదారులకు సహాయం అందిస్తారు.

7) మార్కెటింగ్: స్టాక్ బ్రోకర్ భావి క్లయింట్లను గుర్తించి కస్టమర్ల సమూహాన్ని నిర్మిస్తాడు. వార్తా పత్రికలు మరియు మ్యాగజైనులో వ్యాసాలు రాయడం, రేడియో మరియు టెలివిజన్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అతను మార్కెటింగ్ను చేపట్టవచ్చు.

ప్రశ్న 8.
విత్త మార్కెట్లో స్టాక్ బ్రోకర్ యొక్క ఆవశ్యకతను సవివరంగా తెలపండి.
జవాబు.
ఒక సామాన్యుడికి, ఎక్స్ఛేంజ్ నుంచి నేరుగా స్టాకులను కొనడం సాధ్యం కాదు. సెక్యూరిటీల అమ్మకాలను మరియు కొనుగోలును అమలు చేయడానికి వారికి మధ్యవర్తుల అవసరం ఏర్పడుతుంది. అలాంటి మధ్యవర్తులను ‘స్టాక్ బ్రోకర్లు’ .అంటారు. పెట్టుబడిదారుల తరపున, స్టాక్ మార్కెట్లలో స్టాకుల కొనుగోలు మరియు అమ్మకాన్ని సులభతరం చేయడానికి .స్టాక్ బ్రోకర్ స్టేషలు అవసరం.

స్టాక్ బ్రోకర్లు తమ కాతాదారులకు ఈ దిగువ సేవలను అందిస్తున్నారు:
1) సలహా సేవలను అందించడం: స్టాక్ మార్కెట్ బ్రోకర్లు స్టాక్ మార్కెట్ పనితీరు, మార్కెట్పై పోకడలు, మొదలైన అంశాలలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా, వారు సంబంధం ఉన్న బ్రోకరేజ్ సంస్థల యొక్క డేటాబేస్ మరియు పరిశోధన ఫలితాలతో వారికి మార్కెట్పై అవగాహన ఉంటుంది. అందువల్ల, వారు తమ ఖాతాదారులకు అద్భుతమైన పెట్టుబడి సలహాలను అందించగలరు.

2) పరిమిత బ్యాంకింగ్ సేవలను అందించడం: స్టాక్ మార్కెట్ బ్రోకర్లకు వడ్డీ-బేరింగ్ ఖాతాలు, ఎలక్ట్రానిక్, డిపాజిట్లు మరియు ఉపసంహరణలు వంటి పరిమిత బ్యాంకింగ్ సేవలను అందించడానికి అధికారం ఉంది. ఖాతాదారులకు నామమాత్రపు బ్రోకరేజ్ ఛార్జీని చెల్లించడం ద్వారా స్టాక్ బ్రోకర్ల నుంచి బ్యాంకింగ్ సంబంధిత సేవలను పొందవచ్చు.

3) ఇతర పెట్టుబడి సేవలకు మద్దతు ఇవ్వడం: స్టాక్స్ పాటు, చాలా మంది స్టాక్ బ్రోకర్లు మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ మరియు కమోడిటీ ట్రేడింగ్ వంటి ఇతర సెక్యూరిటీలకు సంబంధించిన పెట్టుబడి సలహాలను వారు తమ ఖాతాదారులకు అందిస్తారు.

4) ఈ-మెయిల్ మద్దతు సేవలను నిర్వహించడం: వ్యాపార సమయంలో కొన్ని గంటల్లో ఈ-మెయిల్కు ప్రత్యత్తురం ఇవ్వడం అనేది సహేతుకమైన చర్యగా పరిగణించబడుతుంది. ఇది వ్యాపార అవసరాన్ని బట్టి ఉంటుంది.

5) ఫోన్ / టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా కమ్యూనికేట్ చేయడం: బ్రోకర్ ఫోన్ మరియు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అద్భుతమైన కస్టమర్ సేవలను అందించగలదు. దీని వలన కస్టమర్ల సంతృప్తిని పొందడమే కాకుండా తమ వ్యాపార విస్తరణకు దోహదపడుతుంది.

6) ప్రత్యక్ష చాట్ మద్దతును అందించడం: ప్రత్యక్ష చాట్ వెళ్ళేంతవరకు, ప్రతిస్పందన తక్షణమే ఉండాలి. అయితే ఇది పని రోజులలో మరియు నిర్దిష్ట సమయం వరకు మాత్రమే సాధ్యమవుతుంది.

7) వెబ్ సైట్లో సందేశాన్ని పంపడం: ఇది క్లయింట్కు వేగంగా సహాయం అందించడంలో సహాయపడుతుంది. మరియు నిర్దిష్ట ప్రతినిధికి సందేశం త్వరితగతిన పంపబడుతుంది.

8) చర్చా వేదికల ద్వారా అవగాహన కల్పించడం: ఈ రకమైన సేవలు సరికొత్తవిగా మరియు జనాదరణ పొందినవిగా చెప్పవచ్చు. ఖాతాదారుడు ఏదైనా ప్రత్యేకమైన అంశం లేదా సమస్యకు సంబంధించి బ్రోకర్తో నేరుగా ప్రశ్నలు అడగవచ్చు. తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చును.

9) నాలెడ్జ్ – బేస్ మరియు వీడియో ట్యుటోరియల్స్ ఏర్పరచడం: నాలెడ్జ్ – బేస్లో పునరావృతమయ్యే సమస్యను శీఘ్రంగా ప్రదర్శించడంలో ఆన్లైన్ కమ్యూనిటీకి సమర్ధవంతమైన మార్గాలలో ఒకటి. వీడియో ట్యుటోరియల్స్ ద్వారా సమస్య – పరిష్కార సాధనాల గురించి ఖాతాదారునికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

ఈ కారణాల వల్ల జాయింట్ స్టాక్ కంపెనీల సెక్యూరిటీల వర్తకంలో స్టాక్ బ్రోకర్ సేవలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
NSE గురించి మీకేమి తెలుసు ?
జవాబు.
NSE నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ను నవంబర్, 1992 సంవత్సరంలో నమోదు చేయడమైంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ వర్తక విధానాన్ని కలిగి ఉండి సెక్యూరిటీల వర్తకానికి ఇది దోహదపడుతున్నది.

NSE లక్షణాలు:
1) దేశవ్యాప్తంగా కంప్యూటీకరించిన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇది. భారతదేశంలోని NSE సభ్యులందరూ శాటిలైట్ మరియు కేబుల్ సిస్టమ్ ద్వారా కలపబడతారు.

2) స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీల వర్తకం జరిగేటప్పుడు ధరల నిర్ణయానికి సంబంధించి అరవడం గాని లేదా బెల్ మోగించవలసిన అవసరం గానీ ఈ NSE లో ఉండదు. NSE లో పొందుపరచిన అటోమేటెడ్ కొటేషన్ సిస్టమ్ (Automated Quotation System) ద్వారా సెక్యూరిటీలను అమ్మడం, కొనడం చేయబడతాయి.

3) NSE రుణ మార్కెట్లోని ప్రభుత్వ సెక్యూరిటీలు, UTI యూనిట్లు మొదలయిన వాటిని టోకు అమ్మకాలుగా చేపడుతుంది.

4) ధరలకు సంబంధించిన సమాచారంను ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (P.T.I) ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది.

5) ఈ సంస్థ పరిష్కార విధానాన్ని మెరుగుపరచడమే కాకుండా సెక్యూరిటీల వర్తకంలోని నష్ట భయాన్ని తగ్గిస్తుంది.

6) NSE సబ్సిడియరీ నేషనల్ సెక్యూరిటీస్ క్లియరింగ్ కార్పొరేషను నెలకొల్పింది. దీనిద్వారా వర్తకాన్ని నిర్వర్తించడానికి అవసరమైన పరిష్కారాలను గ్యారంటీని ఈ సంస్థ అందిస్తుంది.

7) ఈ సంస్థ కార్పొరేట్ ఈక్విటీ, రుణ పత్రాలతో వ్యవహరిస్తూ, కొనుగోలుదారులకు, అమ్మకందారులకు బ్రోకర్లుకు అవసరమైన సహాయం అందిస్తుంది.

ప్రశ్న 2.
BSE అంటే ఏమిటి ?
జవాబు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ని 1877 సంవత్సరంలో స్థాపించారు. దీనినే “నేటివ్ స్టాక్ అండ్ బ్రోకర్స్ అసోషియేషన్” ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం స్టాక్ ఎక్స్ఛేంజ్లో పనిచేసే బ్రోకర్లకు సహాయపడటం, వారి హోదాలను పరిరక్షించడం. స్టాక్ ఎక్స్ఛేంజ్లలో న్యాయమైన, సముచితమైన పనులను మాత్రమే చేపట్టి అవకతవకలను తగ్గించడంలో ఈ సంస్థ ముఖ్యపాత్రను పోషిస్తుంది.

BSE లక్షణాలు:

  1. ఈ ఎక్స్ఛేంజ్ ఆన్లైన్ ట్రేడింగ్ విధానాన్ని 1995 లో ప్రవేశపెట్టింది. ఇది సెక్యూరిటీల వర్తకాన్ని చురుకుగా చేపట్టడమే కాకుండా, స్టాక్ మార్కెట్ వ్యవహారాలను సంరక్షిస్తుంది.
  2. చిన్న తరహా, మధ్యతరహా సంస్థలు తమ ఈక్విటీలను వర్తకం చేసుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది.
  3. సెక్యూరిటీలతో వ్యవహరించేటప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడంలో ఉపయోగపడుతుంది.
  4. ఈక్విటీలు, రుణ పత్రాలు మరియు మ్యూచువల్ ఫండ్స్తో వర్తకం చేయడానికి సమర్థవంతమైన పారదర్శక మార్కెట్ను అందిస్తుంది.
  5. ప్రపంచ వ్యాప్తంగా ఖాతాదారులను కలిగి ఉంటుంది.
  6. రిస్క్ మేనేజ్మెంట్ క్లియరింగ్ సేవలు అందిస్తూ మూలదన మార్కెట్లో పాల్గొనే వారికి పరిజ్ఞానాన్ని అందిస్తుంది.

ప్రశ్న 3.
బుల్స్, బేర్స్ గురించి మీకేమి తెలుసు ?
జవాబు.
బుల్స్:

  1. వీరిని తేజీవాలాలు (Tejiwalas) అని కూడా అంటారు. ఈ మధ్యవర్తులు తమ వ్యవహారాలలో ఆశావాదిగా ఉంటారు. సెక్యూరిటీల ధరలు పెరుగుతాయనే ఆశతో వాటిని ప్రస్తుత ధరకు కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్న స్పెక్యులేటర్లను బుల్స్ అంటారు.
  2. వీరు భవిష్యత్ కాలంలో అంచనావేసిన అధిక ధరకు అమ్మగలుగుతాయని సెక్యూరిటీలను కొనుగోలు చేస్తారు. ఇతడు వాస్తవంగా సెక్యూరిటీల డెలివరీని తీసుకోడు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

బేర్స్:
1) వీరినే మండివాలాలు (Mandiwala) అంటారు. ఈ మధ్యవర్తులు తమ వ్యవహారాలను నిరాశావాదులుగా . ఉంటారు. సెక్యూరిటీల ధరలు తగ్గుతాయనే భావనతో వాటిని ప్రస్తుత ధరకు అమ్మడానికి ఒప్పందం చేసుకున్న సెక్యులేటర్లను బేర్స్ అంటారు.

2) వీరు వాస్తవంగా సెక్యూరిటీలను కొనుగోలు చేయరు, అమ్మరు. కానీ వాటిని ఎక్కువ ధరకు అమ్మజూపుతారు. అంటే భవిష్యత్లో సెక్యూరిటీలను ఇప్పటి ధరకంటే తక్కువ ధరతో కొనుగోలుచేసి అమ్మవచ్చనే ఆశతో ఈ వ్యవహారం జరుపుతారు. బేర్స్ ప్రతిపాదించిన అమ్మకం ధర, కొనుగోలు ధరల మధ్య వ్యత్యాసమే తాము ఆర్జించిన లాభంగా పరిగణిస్తారు.

ప్రశ్న 4.
సెక్యూరిటీలను జాబితాలో చేర్చడానికి సంబంధించిన ఉద్దేశాలు ఏమిటి ?
జవాబు.
సెక్యూరిటీలను జాబితాలో చేర్చడానికి గల ఉద్దేశాలు:

  1. సెక్యూరిటీల వ్యవహారాలపై నియంత్రణ కలిగి ఉండటమే కాకుండా వాటిపై సరైన పర్యవేక్షణను కలిగి ఉండటం.
  2. ఆర్థిక శక్తులను వికేంద్రీకరించడం.
  3. వ్యవస్థాపకుల ఆసక్తులను పరిరక్షించడం.
  4. పెట్టుబడిదారుల, వాటాదారుల ప్రయోజనాలను కాపాడటం.

ప్రశ్న 5.
డీమ్యూచువలైజేషన్ (Demutualisation) అంటే ఏమిటి ?
జవాబు.
నవంబర్, 2002లో కనియా కమిటీ వారు, స్టాక్ ఎక్స్ఛేంజ్లను కార్పొరేట్ తరహాలో వ్యాపారం చేయడానికి కొన్ని సూచనలు చేశారు. దీని ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజ్లన్నీ కంపెనీలుగా మారడమే కాకుండా ఏకీయత కలిగిన సంస్థగా, మార్పు చెందడానికి వీలు లేనిదిగా మారాయి. కాబట్టి స్టాక్ ఎక్స్ఛేంజ్ల లక్షణం ‘లాభాపేక్ష లేకుండా’ (Not for Profit) నుంచి ‘లాభం కోసం’ (For Profit) గా రూపుదిద్దుకున్నాయి. మార్పు చెందడానికి వీలులేదు. (Demutualization) అనే కారణం వల్ల యాజమాన్యం – నిర్వహణల మధ్య వేర్పాటువాదం ఏర్పడింది. ఓవర్ ది కౌంటర్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (OTC EOI) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఏర్పాటు అయినప్పటి నుంచి స్వచ్ఛమైన ‘డిమ్యూచువలైజ్డ్’ నిర్మాణాన్ని పాటిస్తున్నారు.

డీమ్యూచువలైజేషన్ అనగా స్టాక్ ఎక్స్ఛేంజ్లు లాభార్జన ధ్యేయంతో పన్నులు చెల్లిస్తూ కొనసాగే సంస్థగా మారడం డీమ్యూచు వలైజేషన్ నిర్వహణను యాజమాన్యం నుంచి వేరు చేయటం జరిగింది. బ్రోకర్లు తమ అధికారాలను దుర్వినియోగపరచుట వల్ల దీని అవశ్యకత ఏర్పడింది.

ప్రశ్న 6.
భారతదేశంలో మొదటి పది స్టాక్ బ్రోకింగ్ సంస్థలు ఏమిటి ?
జవాబు.
భారతదేశంలో ఉన్నత స్థాయి స్టాక్ బ్రోకింగ్ సంస్థలు
TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్ 1
TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్ 2

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్టాక్ ఎక్స్ఛేంజ్.
జవాబు.

  1. ఇంతకు ముందే జారీ చేసిన కంపెనీ వాటాలను అమ్మడం, కొనడం లాంటి కార్యకలాపాలు జరిపే వ్యవస్థీకృతమైన సెకండరీ మార్కెట్ను స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటారు.
  2. సెక్యూరిటీల కాంట్రాక్ట్ ఒప్పందాల నియంత్రణ చట్టం 1956, ప్రకారం సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలను క్రమబద్దీకరించి, నియంత్రించే ఉద్దేశంతో నమోదైన లేదా నమోదు కాని సంఘం, వ్యవస్థ లేదా వ్యక్తుల సముదాయమే స్టాక్ ఎక్ఛేంజ్.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

ప్రశ్న 2.
సెక్యూరిటీలను జాబితాలో చేర్చడం.
జవాబు.

  1. స్టాక్ ఎక్స్ఛేంజ్ అధికారిక జాబితాలో వర్తకం చేయడానికి గాను కంపెనీ సెక్యూరిటీలను చేర్చడాన్ని సెక్యూరిటీలను జాబితాలో చేర్చడం అంటారు.
  2. సెక్యూరిటీలను జాబితాలో చేర్చడం కోసం కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్ అనుమతి తీసుకోవాలి. ఇందుకుగాను కంపెనీలు కొన్ని లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ప్రశ్న 3.
లేమెదక్.
జవాబు.
తమ దగ్గర లేని సెక్యూరిటీలను అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకొని వాటిని నెరవేర్చడానికి తక్కువ ధరలకు సెక్యూరిటీలు లభించక అవస్థలు పడే బేర్లనే “లేమ్క్”లు అంటారు.

ప్రశ్న 4.
స్టాగ్.
జవాబు.
కొత్త కంపెనీ వాటాలను జారీ చేసినపుడు అధిక మొత్తంలో దరఖాస్తు రుసుము చెల్లించి పెద్ద మొత్తాలలో వాటాల కోసం దరఖాస్తు చేసుకున్న స్పెక్యులేటర్లునే స్టాగ్ అంటారు.

ప్రశ్న 5.
జాబర్.
జవాబు.
సెక్యూరిటీలను కొనుగోలు మరియు అమ్మకం చేస్తూ వాటి ధరలలో వచ్చే మార్పుల ద్వారా ఆదాయం పొందే స్పెక్యులేటర్లను జాబర్స్ అంటారు. కొనుగోలు, అసౌకర్యపు ధరలు మధ్యగల వ్యత్యాసమే జాబర్ యొక్క లాభం / నష్టం అవుతుంది.

ప్రశ్న 6.
స్టాక్ బ్రోకర్.
జవాబు.

  1. సాధారణ ప్రజలకు జాబర్ల మధ్య విభిన్న సెక్యూరిటీలను కమీషన్ కోసం ఏర్పాట్లు చేసే స్పెక్యులేటర్లను స్టాక్ బ్రోకర్స్ అంటారు.
  2. స్టాక్ బ్రోకర్ తన ఖాతాదారుల తరపున స్టాక్స్ మరియు ఇతర సెక్యూరిటీల కోసం కొనుగోలు మరియు అమ్మకం ఆర్డర్లను ప్రాసెస్ చేసే నిపుణుడు. స్టాక్ బ్రోకర్ను ‘రిజిష్టర్డ్ ప్రతినిధి”/పెట్టుబడి సలహాదారు / బ్రోకర్ అని కూడా పిలుస్తారు.

ప్రశ్న 7.
సెబి (SEBI).
జవాబు.

  1. సెబి అనగా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్లలో నెలకొన్న అవాంఛనీయ అలవాట్లను తొలగించడానికి, స్టాక్ ఎక్స్ఛేంజ్, దానిలో పాల్గొనే స్టాక్ బ్రోకర్లను మరియు ఆపరేటర్ల పనులను నియంత్రించడానికి SEBI Act 1992 భారత పార్లమెంట్ ద్వారా సెబిని ఏర్పాటు చేశారు.

ప్రశ్న 8.
అనుమతించిన సెక్యూరిటీలు.
జవాబు.
ఇతర స్టాక్ ఎక్స్ఛేంజ్లలో చురుకుగా వ్యవహారాలను జరుపుకునే సెక్యూరిటీలను, తమ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ కాకపోయినా లావాదేవీలు జరపటానికి అనుమతిస్తారు. ఈ తరహా సెక్యూరిటీలనే అనుమతించిన సెక్యూరిటీలు అంటారు.

ప్రశ్న 9.
స్టాక్ ఎక్స్ఛేంజ్ స్పెక్యులేటర్స్.
జవాబు.

  1. సెక్యూరిటీల ధరలలో మార్పుల వల్ల లాభం పొందే నిమిత్తం స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యవహారాలను జరిపే చట్టబద్దమైన వ్యాపారస్తులనే స్పెక్యులేటర్స్ అంటారు.
  2. వీరు ధరల ‘మార్పుల తేడాను వసూలు చేసుకోవడం గాని, చెల్లించడం గాని చేస్తారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

ప్రశ్న 10.
స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్లు.
జవాబు.

  1. స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యవహారాలు స్టాక్ ఎక్స్ఛేంజ్ సభ్యులు మాత్రమే చేపట్టాలి. ప్రతిస్టాక్ ఎక్స్ఛేంజ్ సభ్యులను చేర్చుకోవడానికి నియమ నిబంధనలు రూపొందించుకుంటుంది. ఆ నియమనిబంధనల ప్రకారం చేర్చుకున్న సభ్యులనే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్లు అంటారు.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్లో వ్యవహారాలు చేపట్టే ఆపరేటర్లను జాబర్లు మరియు బ్రోకర్లుగా వర్గీకరించవచ్చు.

Leave a Comment