Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 4th Lesson బీమా సేవలు Textbook Questions and Answers.
TS Inter 2nd Year Commerce Study Material 4th Lesson బీమా సేవలు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
బీమాను నిర్వచించండి. బీమాకు సూత్రాలు ఏమిటో తెలపండి.
జవాబు.
బీమా అర్థం:: బీమా అనగా సంభవించిన ఆర్థిక నష్టాన్ని అనేక మందికి వ్యాప్తి చేసే ఒక సాంఘిక పరిష్కారం. బీమా కాంట్రాక్టులో ఒక పార్టీకి సంభవించే ఆపదలకు, నష్టానికి, కొంత సొమ్ముకు బదులుగా, పరిహారాన్ని చెల్లించే అంగీకారం ఉంటుంది.
బీమా – నిర్వచనాలు:
- ఆచార్య విల్లెట్ బీమాను నిర్వచించిన ప్రకారం “ఒక వ్యక్తికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి వ్యక్తుల సమూహంలోని నష్టాన్ని బదిలీ కల్పించే ఒక సామాజిక సాధనం”.
- ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం బీమా అనేది “ఒక ప్రత్యేక నష్టానికి, చెడిపోయిన వస్తువునకు, వ్యాధికి లేదా మరణానికి కొంత ప్రీమియం చెల్లించిన తరువాత నష్ట పరిహారాన్ని చెల్లించడానికి కంపెనీ లేదా రాజ్యం చేసిన ఏర్పాటు”.
- న్యాయశాస్త్రం దృష్ట్యా బీమా అనగా “ఏర్పడిన ఒక నిర్దిష్టమైన నష్టానికి కొంత సొమ్మును ప్రతిఫలంగా చెల్లించడానికి ఒక పార్టీకి వేరొక పార్టీకి మధ్య కుదిరిన ఒప్పందం”.
బీమా సూత్రాలు: బీమా ఏదైనా ఈ క్రింది ప్రధాన సూత్రాలకు లోబడి ఉంటుంది.
1) అత్యంత విశ్వాసం:
- బీమా ప్రక్రియలో ‘పార్టీలలో పరస్పర నమ్మకం కలిగి ఉండాలనే’ సూత్రం ఉంది. బీమా కాంట్రాక్టులలోని పార్టీలు తమకు సంబంధించిన సమాచారాన్ని సంపూర్తిగా తెలియజేస్తూ కాంట్రాక్టు ఏర్పాటుకు మార్గాన్ని సృష్టించవలసి ఉంటుంది.
- దీని వల్ల పాలసీదారుడి ఆస్తి లేదా ప్రాణ సంబంధిత విషయాన్ని నమ్మకంగా కంపెనీ వారికి అందజేసే బాధ్యత కలిగి ఉంటాడు.
2) బీమాపై ఆసక్తి:
- ఒక ఆస్తిపై కాని, జీవనంపై కాని ఆర్థికపరమైన ప్రయోజనం కలగాలంటే బీమా పట్ల ఆసక్తి కలిగి ఉండాలి.
- తన జీవనంపైగానీ, ఆస్తిపై గాని బీమా చేయడానికి ఆసక్తి లేని వ్యక్తి న్యాపరమైన బీమా కాంట్రాక్టును ఏర్పరచలేడు. అలా కాకుండా, ఒక వ్యక్తి ఏ రకమైన ఆస్తిపైనైనా ఇష్టం ఉన్నట్లు బీమా చేసుకున్నట్లయితే అలాంటి ఆసక్తి ఒక జూదంగానో, మాయగానో ఉండేది. ఆ పరిస్థితులలో బీమా కాంట్రాక్టులు పందెముల లాగా గోచరించి న్యాయపరంగా చెల్లుబాటు కాని కాంట్రాక్టులు అవుతాయి.
3) నష్ట పరిహారం / నష్ట పూర్తి:
- ఒక నిర్దిష్టమైన సంఘటన జరిగినప్పుడు బీమాదారునికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి, దానిని బీమా సంస్థ చెల్లించడాన్ని నష్టపూర్తి అంటారు. ఇది బీమా ఆస్తి విలువకు మించరాదు.
- జీవిత బీమా వ్యక్తిగత బీమాలకు ఈ విమోచన సూత్రం వర్తించదు.
4) ప్రతినివేశం:
- ఈ సూత్రం ప్రకారం నష్టపోయిన వ్యక్తికి చెల్లింపులు చేసిన తర్వాత, బీమా కంపెనీకి ఆ ఆస్తిపై హక్కు సంక్రమిస్తుంది.
- వస్తువు పాక్షికంగా లేదా పూర్తిగా పాడైనప్పటికీ ఈ సూత్రం వర్తిస్తుంది. అలాంటి సందర్భంలో క్లెయిమ్ ద్వారా పొందిన దాని కంటే వ్యర్థం ద్వారా అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చు.
5) వంతులవారీ చెల్లింపు:
- కొన్ని సందర్భాలలో వ్యక్తులు ఒక కంపెనీ కంటే ఎక్కువ కంపెనీలలో బీమా చేయిస్తారు. దీన్ని ‘ద్వంద్వ బీమా’ అంటారు. నష్టం సంభవించిన పక్షంలో, బీమా చేసిన వ్యక్తి వాస్తవ సొమ్మును పొంది విమోచనం పొందాలంటే బీమా ద్వారా పరిష్కార ఏర్పాట్లు చేయబడతాయి. అలాంటి సందర్భంలో బీమా కంపెనీలు వంతులవారీ చెల్లింపు సూత్రాన్ని పాటిస్తాయి.
- ఒకవేళ బీమా చేసిన వ్యక్తి ఒక కంపెనీ కంటే ఎక్కువ కంపెనీల ద్వారా క్లెయిమ్ చేసినట్లయితే, చెల్లించిన మొత్తాన్ని కంపెనీలు సర్దుబాటు చేసుకుంటాయి.
6) నష్టాన్ని తగ్గించడం:
- ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రమాదం సంభవించినట్లయితే పాలసీదారుడు అలాంటి ప్రమాదం ద్వారా ఏర్పడే నష్టాన్ని తగ్గించడానికి తగిన చర్యలను తీసుకునే బాధ్యత కలిగి ఉంటాడు.
- ఈ సూత్రం వర్తింపజేయడానికి గల కారణమేమంటే, ప్రమాదం జరిగినపుడు పాలసీదారుడు అజాగ్రత్తగా ఉండక సామాన్యుడిలాగా చైతన్యవంతులై నష్టాన్ని తగ్గించడానికి ఉపక్రమించాలి.
7) సమీప కారణం:
- ప్రమాదం సంభవించిన సందర్భంగా బీమా కంపెనీ పూర్తి నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే సంభవించిన నష్టం తీసుకున్న పాలసీలోని ఘటనకు ప్రత్యక్ష సామీప్యతను కలిగి ఉండాలి.
- ప్రమాదం సంభవించినప్పుడు నిజనిర్ధారణ చేయడానికి సమీప క్రియను మాత్రమే పరిగణించి, లోతైన కారణాలను చూడదనే ఆచారాన్ని పాటిస్తుంది.
ప్రశ్న 2.
బీమా విధులను వివరించండి.
జవాబు.
బీమా విధులను రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి: (1) ప్రాథమిక విధులు (2) సెకండరీ విధులు.
బీమా విధులను వివరించండి.
1) ప్రాథమిక విధులు
ఎ) నిశ్చిత స్థితి: బీమా ద్వారా నష్టపరిహారాన్ని చెల్లించడం నిశ్చయం అని తెలియజేస్తుంది. అనిశ్చితి గల నష్టాన్ని తగ్గించడానికి తగిన ప్రణాళిక, వ్యూహం ఉండాలి. బీమా అనే ఏర్పాటు ఆ నష్టం నుంచి ఉపశమనాన్ని కల్పిస్తుంది.. నష్ట భయాలు వివిధ రకాలుగా ఉంటాయి, ఘటన సంభవించినా సంభవించకపోయినా పరిహార చెల్లింపు విషయంలో కంపెనీలు నిశ్చయంగా ఉంటాయి. దాని కోసం కొంత మొత్తంగా ప్రీమియం రూపంలో వసూలు చేస్తాయి.
బి) భద్రతను కల్పించడం ప్రమాదం ఏర్పడు ముందు నష్టానికి తగిన భద్రతను బీమా కల్పిస్తుంది. బీమా లేనట్లయితే ప్రమాదం సంభవించినపుడు ఆసక్తిగల వ్యక్తి సమయం, డబ్బు భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు పడే అవస్థ నుంచి కాపాడే బాధ్యతను బీమా కంపెనీ తీసుకుంటుంది.
సి) నష్టభయాన్ని పంచుకోవడం: జరగబోయే నష్టం అనిశ్చితిగా ఉంటుంది. ప్రమాదం సంభవించినపుడు నష్టాన్ని వ్యాప్తి చేసి అందరికీ పంపకం చేయబడుతుంది. ఆధునిక కాలంలో ప్రీమియం ద్వారా పొందిన సొమ్ము మొత్తాన్ని పాలసీదారులకు వ్యాప్తి చేసి నష్టాన్ని పరిహరించేటట్లు అభయం ఇస్తాయి.
2. అనుబంధ విధులు:
ఎ) నష్ట నివారణ: ప్రమాదం సంభవించినపుడు జరిగే నష్టాన్ని నివారించడానికి బీమా కంపెనీలు కలిసికట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ప్రీమియం చెల్లింపులు తగ్గి బీమా చేసే వ్యక్తికి ఎంతో ఉపకరిస్తుంది.
బి) మూలధన ఏర్పాటు: సమాజానికి కావలసిన మూలధన ఏర్పాట్లను బీమా కంపెనీలు సృష్టిస్తాయి. సేకరించిన సొమ్మును ఉత్పత్తి మార్గంలో పెట్టును. మూలధన కొరతను తగ్గించును.
సి) నైపుణ్యతను మెరుగుపరచడం: ప్రమాదం సంభవించినప్పుడు ఏర్పడిన నష్టాన్ని, బాధలను బీమా వ్యవస్థ రూపుమాపుతుంది. ఆర్థికబాగుకోసం తన జీవితాన్ని మనస్సును ‘బీమా సంస్థల పట్ల శ్రద్ధ చూపును. దీనివల్ల స్వంతంగా నైపుణ్యత పెంచుకోవడమేకాక ప్రజల నైపుణ్యాన్ని కూడా పెంచడానికి అవకావం ఉంది.
డి) ఆర్థిక ప్రగతి: సాధారణ ప్రజలకు, వ్యాపార సంస్థలకు బీమా సంస్థలు తీసుకునే భద్రత చర్యల ద్వారా మరియు పెట్టుబడుల ద్వారా ఆర్థిక ప్రగతిని ఏర్పరచును.
ప్రశ్న 3.
జీవిత బీమాను వర్ణించి వివిధ పథకాలను తెలపండి.
జవాబు.
1. జీవిత బీమా:
1) బీమా సంస్థ, తాను పొందిన ప్రీమియంకు బదులుగా, ఆ ప్రీమియం మొత్తం ఒకేసారి గాని లేదా వాయిదాల పద్ధతిలో గాని, బీమాదారుడు మరణించినప్పుడు లేదా నిర్ణీతమైన సమయం పూర్తి అయినప్పుడు సొమ్ము చెల్లింపుకు ఇచ్చిన కాంట్రాక్టును జీవిత బీమా అంటారు.
2) కాంట్రాక్టులో అంగీకరించిన విధంగా సంభవంచిన వ్యక్తి మరణానికి, తగిన ప్రతిఫలానికి బదులుగా పూర్తిగానైనా, వాయిదా పద్ధతిలో నైనా కొంత కాలానికి చెల్లించేటట్టు చేసే ఏర్పాటును జీవిత బీమాగా నిర్వచించవచ్చు. జీవిత బీమాలోని వివిధ పథకాలు: జీవిత బీమా పాలసీలలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. అవి:
ఎ) సంపూర్ణ జీవిత పాలసీ
బి) ఎండోమెంట్ పాలసీ,
ఎ) సంపూర్ణ జీవిత పాలసీ:
- ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం, పాలసీదారుని జీవితం మొత్తం కొనసాగే విధంగా పాలసీ ఉండటం. ఈ విధమైన పాలసీలో వ్యక్తి మరణం తరవాత చెల్లింపులు జరిగే విధంగా ఏర్పాట్లు చేయడమైనది.
- ఈ పథకంలో వ్యక్తి జీవించినంత కాలం కంపెనీకి ప్రీమియం మొత్తం చెల్లించవలసి ఉంటుంది. ఇలాంటి పథకాలలో ప్రీమియం చెల్లింపు స్వల్పంగా ఉండి కుటుంబానికి భద్రత కల్పిస్తుంది.
బి) ఎండోమెంట్ పాలసీ:
- ఈ పాలసీ ఒక ప్రత్యేక కాలపరిమితి కలిగి లేదా ఒక పరిమిత వయస్సు వరకు వర్తిస్తుంది.
- ఒకవేళ కాల పరిమితికి ముందే వ్యక్తి మరణించినట్లయితే, తక్షణమే క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. అలా కాకుండా పరిమిత కాలం వరకు ప్రీమియం చెల్లించినట్లయితే, పూర్తయిన కాలం తరువాత క్లెయిమ్ మొత్తం చెల్లించడం జరుగుతుంది.
బీమా కంపెనీలు అమలుచేసే వివిధ పాలసీలు:
ఎ) వార్షిక పాలసీ: ఈ పాలసీలో పాలసీదారునికి ప్రతి సంవత్సరం జీవింతాంతం వరకు కొంత మొత్తంలో చెల్లించడం జరుగుతుంది.
బి) నిక్షేప నిధి పాలసీ: ఈ పాలసీలో ద్వారా ఆస్తిని పునఃస్థాపనకు ఏర్పాటుచేసే భద్రతను కల్పిస్తుంది.
సి) పరిమిత కాల అభయ పాలసీ: ఈ పాలసీలో ఒక వ్యక్తి పరిమిత కాలానికి లేదా వయస్సుకు ముందు, మరణం సంభవించినప్పుడు మాత్రమే సొమ్ము చెల్లించడం జరుగుతుంది. ఇలాంటి పాలసీలలో ప్రాథమికంగా స్వల్ప ప్రీమియం కలిగి ఉంది. కాలాన్ని బట్టి ప్రీమియం పెరుగుతంది. దీనినే ‘ఆరోహణ స్థాయి పాలసీ’ అంటారు.
డి) ద్వంద్వ ప్రమాద విమోచన పాలసీ: ఇలాంటి పాలసీలలో పాలసీదారుడు ప్రమాదంలో మరణించినట్లయితే రెట్టింపైన సొమ్మును చెల్లించడం జరుగుతుంది.
ఇ) సమిష్టి జీవన పాలసీ: ఇలాంటి పాలసీలలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది జీవితాలపై బీమా చేయబడుతుంది. ప్రమాదం సంభవించినప్పుడు మరణించినట్లయితే జీవించి ఉన్న మిగతా వారిలో ఒకరికి సొమ్ము చెల్లించడం జరుగుతుంది.
ఎఫ్) బృంద బీమా పాలసీ: ఈ రకమైన పాలసీలు కుటుంబపరంగా కాని లేదా సంస్థలలో పనిచేసే సిబ్బంది మొత్తానికి వర్తిస్తాయి.
జి) జనతా పాలసీ: ఈ పాలసీ కింద ఎండోమెంట్ పాలసీలను జారీ చేయడం జరుగుతుంది. జనతా పాలసీ 10, 15, 25 సంవత్సరాల కాల పరిమితి కలిగి 60 సంవత్సరాల వయస్సును మించకుండా ఉన్న వ్యక్తులకు వర్తిస్తుంది. వీటిని గరిష్ఠంగా 45 సం॥ల వరకు మాత్రమే జారీ చేయడం జరుగుతుంది. పాలసీ తీసుకోవడానికి 35 సం॥ల వరకు ఏ విధమైన ఆరోగ్య పరీక్షలు అవసరం లేదు.
ప్రశ్న 4.
నౌకాయాన బీమా అంటే ఏమిటి ? నౌకాయాన బీమా పథకాలను వివరించండి.
జవాబు.
సముద్రయానంలో నావలోని సరుకు ప్రమాదవశాత్తు పాడయిపోయినట్లయితే సొంతదారునికి విమోచనం కల్పించే సౌకర్యమే “సముద్ర బీమా” ఈ బీమా సాధారణంగా నౌకకు లేదా నౌకలో గల సరుకుకు వర్తిస్తుంది.
సముద్ర బీమా రకాలు:
1) టైమ్ పాలసి: ఈ పాలసీలో బీమా అంశం ప్రత్యేక కాలానికి లోబడి ఉంటుంది. ఈ పాలసీకి ప్రధానంగా తెట్ట బీమా సంబంధించిన స్థిర, చర వస్తువులకు వర్తిస్తుంది.
2) వాయేజ్ పాలసి: సముద్ర యానం ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సరుకు తరలించేటపుడు అమలుపరచడానికి ఈ పాలసి వర్తిస్తుంది. నౌకాయానంలో ఏర్పడే నష్టాన్ని ఈ పాలసీ తీరుస్తుంది.
3) మిశ్రమ పాలసి: ఈ పాలసీ ఒక నిర్ణీత కాలానికి ప్రత్యేక సముద్ర మార్గంలో సరుకును చేరవేసే బీమాను కల్పిస్తుంది. ఈ పాలసీకి కాల సంబంధిత, సముద్రయాన పాలసీ అంటారు.
4) ఫ్లోటింగ్ పాలసి: పాలసీలో సరుకు యజమానులు క్రమంగా సరుకును చేరవేసే వ్యవహారాలు చేపట్టినట్లయితే ఫ్లోటింగ్ అంటారు.
5) బ్లాంకెట్ పాలసి: ఈ పాలసీలో కొంత సొమ్ముకు బీమా తీసుకుని మొదటి ప్రీమియం చెల్లించి సొమ్ము పూర్తయ్యే వరకు నష్ట భయాన్ని సర్దుబాటు చేస్తారు.
6) ప్లీట్ పాలసి: ఆవిరి యంత్రపు నౌకలు మరియు అన్ని నౌకలకు బీమా కల్పించే పాలసి ప్లీట్ పాలసి.
7) విలువ కట్టిన పాలసి: ఈ బీమాలో పూచి పరిహారాన్ని తెలియజేసి ప్రత్యేకంగా విలువ కడతారు. ఒకవేళ పరిహారపు విలువ తెలియకపోతే దాన్ని ఓపెన్ పాలసి అంటారు.
8) ఇతర బీమా పాలసీలు: సాధారణ బీమా కంపెనీలు అన్ని రకాల నష్టభయమును కలుపుతూ వివిధ పాలసీలు అందిస్తారు.
ఉదా: మోటారు సైకిల్ బీమా, మూడవ పార్టీ బీమా అపహరణ బీమా మొదలైనవి.
ప్రశ్న 5.
అగ్ని బీమా అంటే ఏమిటి ? వివిధ రకాల అగ్ని బీమాలను వివరించండి.
జవాబు.
I. అగ్ని ప్రమాద బీమా:
- ఒక పార్టీకి సంభవించిన ఆర్థిక నష్టాన్ని, కొంత సొమ్ముకు బదులుగా, అగ్ని లేదా దానికి సంబంధించిన ప్రమాదం వల్ల పాడైన లేదా నాశనమైన వస్తువుకు పరిహార రూపంలో చెల్లించే ఏర్పాటును అగ్ని ప్రమాద బీమా అంటారు.
- క్లెయిమ్ చేసే సొమ్ముకు ప్రధానంగా రెండు షరతులు వర్తిస్తాయి. ఎ) వాస్తవ అగ్ని ప్రమాద సందర్భం బి) అగ్ని ప్రమాదం అకస్మాత్తుగా జరిగి ఉండాలి కాని ఉద్దేశపూర్వకంగా ఉండకూడదు.
II. అగ్ని ప్రమాద బీమా పాలసీలు:
క్రింద పేర్కొన్న పాలసీలు అగ్ని ప్రమాద బీమాకు వర్తిస్తాయి.
1) విలువ కట్టిన పాలసీ: ఈ పాలసీలో ఆస్తి విలువను లెక్కించి ప్రమాదం సంభవించినపుడు, చెల్లించడానికి గల విలువను అంగీకరించిన విధంగా తగిన ఏర్పాటు చేయబడుతుంది.
2) సగటు పాలసీ:
ఎ) సగటు పాలసీలో సరాసరి క్లాజ్ ఉంది. ఈ క్లాజ్ ప్రకారం ఆస్తిని తరుగు విలువ గలదిగా బీమా చేసినట్లయితే, బీమా చేసిన వ్యక్తికి అనుపాత విలువతో నష్ట సమయానికి అనుబంధంగా బీమా విలువ కలిగి ఉంటుంది.
బి) ఉదా: ఒక వ్యక్తికి గల ఆస్తి విలువ కౌ 15,000గా ఉన్నట్లయితే, గౌ 8,000ల నష్టాన్ని లెక్కించగా, అలాంటి సమయానికి మార్కెట్ విలువ 20,000 ఉంటే, క్లెయింట్ సెటిల్ చేసే మొత్తం 6,000 నిర్ణయించవచ్చు. అంటే (15,000/20,000) 8,000. తదనుగుణంగా ఇలాంటి పరిస్థితిలో బీమా చేసిన వ్యక్తి శ 2,000 నష్టాన్ని భరించవలసి
ఉంటుంది.
3) నిర్దిష్ట పాలసీ:
1) ఈ పాలసీ ద్వారా ‘ఒక ప్రత్యేక సొమ్ముకై బీమా చేయబడుతుంది. ప్రమాదం సంభవించి నష్టం కలిగినట్లయితే కంపెనీ వారు పూర్తి నష్టాన్ని చెల్లిస్తారు. ఇలాంటి సందర్భంలో ఆస్తి మొత్తం విలువ పరిగణనలోకి తీసుకోబడదు. 2) ఉదా: ఒక భవంతి విలువ 1,00,000లు ఉండి, 50,000ల అగ్ని ప్రమాదపు నష్టాన్ని పొందినట్లయితే దాని విలువ ఔ 30,000గా నిర్ధారించినపుడు బీమా చేసిన వ్యక్తికి శ 30,000లను పరిహారంగా కంపెనీ చెల్లిస్తుంది.
4) ఫ్లోటింగ్ పాలసీ:
- ఒకసారి చెల్లించే ప్రీమియంనకు వివిధ ప్రాంతాలలో నిల్వ చేసిన సరుకుకు పాలసీని అమలుపరచే పథకాన్ని ఫ్లోటింగ్ పాలసీ అంటారు.
- ఇలాంటి పాలసీలలో నిల్వ చేసిన సరుకు విలువలలో సగటు విలువ ఆధారం చేసుకుని నిర్ణయించిన ప్రీమియం ద్వారా. బీమా పాలసీ వర్తిస్తుంది.
5) అధిక నష్ట పాలసీ:
- వర్తకులు సరుకును నిల్వ ఉంచిన పక్షంలో పరిణమించే విలువలను మార్పుకనుగుణంగా అత్యంత అదనపు ప్రయోజనాన్ని కల్పించే పరిహారం గల పాలసీ.
- ఉదా: ఒక వర్తకుడు నిల్వ ఉంచిన సరుకు విలువ 7 1,00,000 మరియు 1,50,000 మధ్య ఉన్నట్లయితే, ప్రథమంగా 1,00,000 పొంది అటు తరువాత 50,000 అధిక నష్ట పాలసీ కింద ప్రయోజనాన్ని పొందవచ్చు.
6) బ్లాంకెట్ పాలసీ: ఇలాంటి పాలసీలలో అన్ని విధాలైన స్థిర మరియు చర ఆస్తులను ఒకే పాలసీలో అమలయ్యే ఏర్పాటు చేయబడుతుంది.
7) విస్తారమైన పాలసీ: ఇలాంటి పాలసీలలో అన్ని రకాల నష్టభయాలైన అగ్ని, పేలుడు, మెరుపు, పిడుగు, దోపిడీలు, సాంఘిక కలహాలు, ధర్నాలు, కన్నం వేయడం, కొంతమేరకు నష్టపోయన అద్దెల వల్ల కలిగే నష్టాలు చేరి ఉంటాయి. దీన్ని ‘సర్వ బీమా పాలసీ అని కూడా అంటారు.
8) నష్ట సంభవ పాలసీ: ఒక వ్యాపారం నడిచేటప్పుడు సంభవించే ఆటంకపు నష్టాల నుంచి లాభలోటును విమోచనం చేసే పాలసీ ‘నష్ట సంభవ పాలసీ’.
9) పునః స్థాపన పాలసీ: ఈ పాలసీ ద్వారా ఒక ఆస్తిని పునఃస్థాపనకు కంపెనీ వారు పరిహార ఏర్పాట్లును చేస్తారు. చెల్లింపు విలువను లెక్కించే సమయంలో తరుగుదలను ఆస్తి విలువ నుంచి తీసివేయడం జరుగదు.
ప్రశ్న 6.
IRDA అంటే ఏమిటి ? IRDA అధికారాలను, విధులను వివరించండి.
జవాబు.
మల్హోత్రా కమిటి సిఫారసు ప్రకారం దేశంలోని బీమా వ్యాపార అభివృద్ధికి, నియంత్రణకు భారత ప్రభుత్వం “బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటి” (Insurance Regulatory and Development authority IRDA) ని 1999లో స్థాపించినది. హైదరాబాదు ప్రధాన కార్యాలయంగా బీమా, బీమాయేతర కంపెనీలకు జాతీయ స్థాయిలో నిర్వహణకు, నియంత్రణకు ఉద్దేశించిన భారత ప్రభుత్వం నడుపుతున్నది.
IRDA అధికారాలు విధులు:
- బీమా కాంట్రాక్టులోగల నియమ నిబంధనలకు లోబడి పాలసీదారులకు సంబంధించిన నామినేషన్, బీమాపై గల ఆసక్తి, బీమా క్లెయిమ్లు, అప్పగింత విలువకు భద్రత కల్పించడం.
- బీమా ఏజెంట్లకు, మధ్యవర్తులకు అవసరమైన అర్హత, శిక్షణకు సంబంధించిన అంశాలను నిర్ధారించడం.
- సర్వేయర్లకు, విలువ నిర్ధారితులకు నడవడి విధానాన్ని తెల్పడం.
- బీమా వ్యాపారం వృద్ధికై ప్రోత్సాహాన్ని కల్పించడం.
- IRDA చట్టం పరిధిలో చెల్లింపులు, ఇతర ఛార్జీలకు సంబంధించి వృత్తిపరమైన సంస్థలతో ఏర్పాటు చేయడం.
- బీమా వ్యాపార వ్యవహారాలకు గల పరిశీలన, తనిఖీ, వ్యాజ్యం, బీమా ఆడిట్కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం.
- బీమా కంపెనీలు పెట్టే పెట్టుబడుల నిర్వహణ, నియంత్రణను శక్తికి తగినట్లుగా చర్యలు తీసుకోవడం.
- బీమా కంపెని, మధ్యవర్తులకు ఏర్పడిన వివాదాలకు తీర్పు ఇవ్వడం.
- సుంకాల సలహా సంఘం వ్యవహార తీరును పర్యవేక్షించడం.
- నిర్దేశింపబడిన ఏ ఇతర విధులైనా చేపట్టడం.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
బీమా లక్షణాలను తెలపండి.
జవాబు.
1) నష్టభయాన్ని పంచుకునే సాధనం: సంభవించబోయే నష్టాలకు భద్రతను కల్పించే ఏర్పాటు చేయడమే బీమా ప్రధాన లక్షణం. ఒక వ్యక్తి తనకు తానుగా భరించలేని ఆర్థిక నష్టాలను కల్పించే అగ్ని ప్రమాదం, దొంగతనం, సహజ ప్రమాదం, మరణం లాంటివి భారీ మూల్యం కలిగినవి. ఇలాంటి నష్టభయాన్ని బీమా అందరికీ సమంగా పంచబడుతుంది. అందువల్ల బీమా అనేది నష్టభయాన్ని పంచుకునే సాధనం బీమా లక్షణాలలో చెప్పబడింది.
2) సహకార సాధనం: ఒక నష్టభయానికి సంబంధించి వ్యక్తుల సమూహం ముందుకు వచ్చి ఆ నష్టభయాన్ని సమంగా పంచుకుంటారు. కాబట్టి దీన్ని సహకార సాధనంగా చెప్పవచ్చు.
3) భద్రత కల్పించే సాధనం: అన్ని రకాలైన నష్టాలకు భద్రత కల్పించేది బీమాయే. బీమా లేనట్లయితే జరగబోయే అన్ని నష్టాలకు సొంతదారుడే బాధ్యుడవుతాడు కాని అలా జరగడం అసాధ్యం’ అందువల్ల బీమా అనేది భద్రత కల్పించే ఒక సాధనం.
4) నష్టభయాన్ని కొలిచే సాధనం: సంభవించే నష్టాన్ని ముందుగా అంచనా వేయడం వల్ల ఎంతమేరకు నష్టపరిహారాన్ని చెల్లించవచ్చో ముందుగానే గుర్తించవచ్చు. బీమా చేయడానికి ముందే, చెల్లించబోయే ప్రీమియాన్ని, నష్టపరిహారాన్ని లెక్కించడం ఎంతో శ్రేయస్కరం.
5) చెల్లింపు సాధనం: ఒక బీమా కాంట్రాక్టులో నష్టభయం చోటు చేసుకున్నా, లేకున్నా పాలసీదారుడు కొంత మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరిస్తాడు. ఉదా: జీవిత బీమా కాంట్రాక్టులో తటస్థించబోయే అంశాలు రెండు. అవి వ్యక్తి మరణించడం లేదా పాలసీకాలం పూర్తవడం కూడా. ఇతర బీమా కాంట్రాక్టులైన అగ్ని ప్రమాద బీమా, నౌకా ప్రమాద బీమాలలో నష్టం సంభవించినపుడు నష్టపరిహారాన్ని చెల్లించవలసి ఉంటుంది.
ప్రశ్న 2.
బీమా, హామీ వ్యత్యాసాలను తెలపండి.
జవాబు.
బీమా మరియు హామీ అనే రెండు పదాలను తరచుగా ఒకే అర్థం వచ్చే విధంగా వాడుతారు. కాని అవి పర్యాయపదాలు కావు.
బీమా మరియు హామీల వ్యత్యాసాలు:
బీమా
- బీమా అనగా నష్టం సంభవించినా, సంభవించక పోయినా చెల్లించే నష్టపరిహార ఒప్పందం
- బీమాలో నష్టం సంభవించితేనే పరిహారం చెల్లిస్తారు. నష్టం జరగకపోతే పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.
హామీ
- హామి అనగా తీసుకున్న పాలసీకు క్లెయిమ్ చేసుకోవచ్చు.
- హామీ ప్రకారం పరిహారం చెల్లించడం తప్పనిసరి అవుతుంది. జీవిత బీమాలో మరణం సంభవించిన లేదా టర్మ్ కాలం ముగిసిన బీమా విలువను చెల్లించాల్సి వస్తుంది.
బీమా లక్షణాలను తెలపండి.
ప్రశ్న 3.
IRDA కూర్పు ఏమిటి ?
జవాబు.
IRDA లో ఒక చైర్పర్సన్, తొమ్మిది మంది సభ్యులకు మించకుండా ఐదుగురు సభ్యులు భారత ప్రభుత్వం ద్వారా నియమించబడి ఉంటారు. వీరికి పరిపాలన, గణక శాస్త్రం, న్యాయ విద్య, అర్ధశాస్త్రం, ఫైనాన్స్, బీమా, బీమాయేతర సంబంధ విద్యలలో సంపూర్ణ పరిజ్ఞానం, అనుభవం, కీర్తి, నిజాయితీ, సామర్థ్యం కలిగి ఉండాలి. వీరి పదవీ కాలం 5 సంliలుగా నిర్ధారించబడి, పూర్తికాల సభ్యులకు 62 సం||ల వయస్సు వచ్చేవరకు కొనసాగుతారు. కాని చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి 65 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగవచ్చు.
ప్రశ్న 4.
జీవిత బీమా కింద ప్రతిపాదించే వివిధ పాలసీలు ఏమిటి ?
జవాబు.
బీమా కంపెనీలు అమలు చేసే వివిధ పాలసీలు:
- వార్షిక పాలసీ: ఈ పాలసీలో పాలసీదారునికి ప్రతి సంవత్సరం జీవితాంతం వరకు కొంత మొత్తంలో చెల్లించడం జరుగుతుంది.
- నిక్షేప నిధి పాలసీ: ఈ పాలసీ ద్వారా ఒక ఆస్తిని పునఃస్థాపనకు ఏర్పాటు చేసే భద్రతను కల్పిస్తుంది.
- పరిమిత కాల అభయ పాలసీ: ఈ పాలసీలో ఒక వ్యక్తి పరిమిత కాలానికి లేదా వయస్సుకు ముందు, మరణం సంభవించినప్పుడు మాత్రమే సొమ్ము చెల్లించడం జరుగుతుంది. ఇలాంటి పాలసీలలో ప్రాథమికంగా స్వల్ప ప్రీమియం కలిగి ఉండి, కాలాన్ని బట్టి ప్రీమియం పెరుగుతుంది. దీనినే ‘ఆరోహణ స్థాయి పాలసీ’ అంటారు.
- ద్వంద్వ ప్రమాద విమోచన పాలసీ: ఇలాంటి పాలసీలలో పాలసీదారుడు ప్రమాదంలో మరణించినట్లయితే రెట్టింపైన సొమ్మును చెల్లించడం జరుగుతుంది.
- సమిష్టి జీవన పాలసీ: ఇలాంటి పాలసీలలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది జీవితాలపై బీమా చేయబడుతుంది. ప్రమాదం సంభవించినప్పుడు మరణించినట్లయితే జీవించి ఉన్న మిగతా వారిలో ఒకరికి సొమ్ము చెల్లించడం జరుగుతుంది.
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
అగ్ని ప్రమాద బీమా.
జవాబు.
- ఒక పార్టీకి సంభవించిన ఆర్థిక నష్టాన్ని, కొంత సొమ్ముకు బదులుగా అగ్ని లేదా దానికి సంబంధించిన ప్రమాదం వల్ల పాడైన లేదా నాశనమైన వస్తువుకు పరిహార రూపంలో చెల్లించే ఏర్పాటును అగ్ని ప్రమాద బీమా అంటారు.
- అగ్ని ప్రమాద బీమా క్లెయిమ్ చేసేందుకు రెండు షరతులు వర్తిస్తాయి. అవి:
ఎ) వాస్తవ అగ్నిప్రమాద సందర్భం
బి) అగ్ని ప్రమాదం అకస్మాత్తుగా జరిగి ఉండాలి కాని ఉద్దేశ పూర్వకంగా ఉండకూడదు.
ప్రశ్న 2.
IRDA పాత్ర.
జవాబు.
IRDA పాత్ర:
- పాలసీదారుల ఆసక్తులను కాపాడటం.
- బీమా వ్యాపార పరిశ్రమ, దాని అనుబంధ వ్యవహారాలు క్రమమైన అభివృద్ధి జరగడానికి తోడ్పడటం. 3) నైతిక విధానంలో బీమా వ్యాపారాన్ని భారత భూభాగంలో నిర్వహించడం.
ప్రశ్న 3.
మిశ్రమ పాలసీ,
జవాబు.
ఈ పాలసీని “కాల సంబంధిత, సముద్రయాన పాలసీ” అంటారు. ఈ పాలసీ ఒక నిర్ణీత కాలానికి ప్రత్యేక సముద్ర మార్గం ద్వారా సరుకును చేరవేసే బీమాను కల్పిస్తుంది.
ఉదా: చెన్నై నుంచి టోక్యో వరకు ఆరు నెలల కాలానికి మిశ్రమ పాలసీని తీసుకోవడం.
ప్రశ్న 4.
ఎండోమెంట్ పాలసీ
జవాబు.
- ఈ పాలసీ ఒక ప్రత్యేక కాలపరిమితి కలిగి లేదా ఒక పరిమిత వయస్సు వరకు వర్తిస్తుంది.
- ఒక వేళ కాల పరిమితికి ముందే వ్యక్తి మరణించినట్లయితే, తక్షణమే క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. అలా కాకుండా పరిమిత కాలం వరకు ప్రీమియం చెల్లించినట్లయితే, పూర్తయిన కాలం తరువాత క్లెయిమ్ మొత్తం చెల్లించడం జరుగుతుంది.
ప్రశ్న 5.
బీమా.
జవాబు.
- ఏర్పడిన ఒక నిర్ధిష్టమైన నష్టానికి కొంత సొమ్మును ప్రతిఫలంగా చెల్లించడానికి ఒక పార్టీకి వేరొక పార్టీకి మధ్య కుదిరిన ఒప్పందాన్ని బీమా అంటారు.
- బీమా అనగా సంభవించిన ఆర్థిక నష్టాన్ని అనేక మందికి వ్యాప్తి చేసే ఒక సాంఘిక పరిష్కారం.
ప్రశ్న 6.
అప్పగింత విలువ.
జవాబు.
- పాలసీదారుడు మెచ్యురిటీకి ముందే పాలసీని కంపెనీకి అప్పగించినట్లయితే అప్పగింత విలువను కంపెనీ చెల్లిస్తుంది.
- అప్పగింత విలువ చెల్లించడానికి కనీసం మూడు సంవత్సరాల వ్యవధి దాటి ఉండాలి. ఈ విలువ పాలసీదారుడు చెల్లించిన బీమా ప్రీమియం ఆధారంగా లెక్కించబడుతుంది.
ప్రశ్న 7.
విలువ కట్టిన పాలసీ.
జవాబు.
ఈ పాలసీలో ఆస్తి విలువను లెక్కించి ప్రమాదం సంభవించినపుడు, చెల్లించడానికి గల విలువను అంగీకరించిన విధంగా తగిన ఏర్పాటు చేయబడుతుంది.
ప్రశ్న 8.
ఫ్లోటింగ్ పాలసీ.
జవాబు.
- ఒక పాలసీలో సరుకు యజమానులు క్రమంగా సరుకును చేరవేసే వ్యవహారాలు చేపట్టినట్లయితే దానిని ఫ్లోటింగ్ పాలసీ అంటారు.
- పాలసీను స్థిరమైన మొత్తానికి ఏర్పాటు చేస్తారు. సరుకును చేరవేసే ప్రాంతాన్ని నిర్ధారించుకున్న తరువాత బీమా విలువను సరుకు విలువకు తగ్గిస్తారు. ఇలాంటి ప్రకటనలు సమయానుకూలంగా ఏర్పరచి సొమ్ము మొత్తం పూర్తయ్యే వరకు బీమా చేస్తారు.
ప్రశ్న 9.
సగటు పాలసీ.
జవాబు.
1) సగటు పాలసీలో సరాసరి క్లాజ్ ఉంది. ఈ క్లాజ్ ప్రకారం ఆస్తిని తరుగు విలువ గలదిగా బీమా చేసినట్లయితే, బీమా చేసిన వ్యక్తికి అనుపాత విలువతో నష్ట సమయానికి అనుబంధంగా బీమా విలువ కలిగి ఉంటుంది.
మిశ్రమ పాలసీ.
ఫ్లోటింగ్ పాలసీ.
2) ఉదా: ఒక వ్యక్తికి గల ఆస్తి విలువ 15,000గా ఉన్నట్లయితే, కౌ 8000ల నష్టాన్ని లెక్కించగా, అలాంటి సమయానికి మార్కెట్ విలువ 20,000 ఉంటే, క్లెయిమ్ సెటిల్ చేసే మొత్తం 6,000 నిర్ణయించవచ్చు. అంటే (15,000/20,000) 8000. తదనుగుణంగా, ఇలాంటి పరిస్థితిలో బీమా చేసిన వ్యక్తి కౌ 2000 నష్టాన్ని భరించవలసి ఉంటుంది.
ప్రశ్న 10.
విస్తారమైన పాలసీ.
జవాబు.
ఇలాంటి పాలసీలలో అన్ని రకాల నష్టభయాలైన అగ్నీ, పేలుడు మెరుపు, పిడుగు, దోపిడీలు, సాంఘిక కలహాలు, ధర్నాలు, కన్నం వేయడం, కొంత మేరకు నష్టపోయిన అద్దెల వల్ల కలిగే నష్టాలు చేరి ఉంటాయి. దీన్ని ‘సర్వ బీమా పాలసీ’ అని కూడా అంటారు.
ప్రశ్న 11.
సముద్ర బీమా.
జవాబు.
- బీమా పద్ధతులలో అతి ప్రాచీనమైనది సముద్ర బీమా. సముద్రయానంలో నావలోని వరకు ప్రమాదవశాత్తు పాడయిపోయినట్లయితే సొంతదారునికి విమోచనం కల్పించే సౌకర్యం సముద్ర బీమా.
- ఈ బీమా సాధారణంగా నౌకకు కాని లేదా నౌకలో గల సరుకుకు గాని వర్తిస్తుంది.
ప్రశ్న 12.
టైమ్ పాలసీ.
జవాబు.
- ఈ పాలసీలో బీమా అంశం ప్రత్యేక కాలానికి లోబడి ఉంటుంది.
- ఈ పాలసీ ప్రధానంగా తెట్ట బీమాకు సంబంధించి స్థిర, చర వస్తువులకు వర్తిస్తుంది.
ప్రశ్న 13.
వయోజ్ పాలసీ,
జవాబు.
- సముద్రయానం ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సరుకు తరలించేటపుడు అమలుపరచడానికి ఈ పాలసీ వర్తిస్తుంది.
- నౌకాయానంలో ఏర్పడే నష్టాన్ని ఈ పాలసీ తీరుస్తుంది.
ప్రశ్న 14.
సంపూర్ణ జీవిత పాలసీ,
జవాబు.
ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం పాలసీదారుని జీవితం మొత్తం కొనసాగే విధంగా పాలసీ ఉండటం. ఈ విధమైన పాలసీలో వ్యక్తి మరణం తరువాత చెల్లింపులు జరిగే విధంగా ఏర్పాట్లు చేయడమైనది. ఈ పథకంలో వ్యక్తి జీవించనంత కాలం కంపెనీకి ప్రీమియం మొత్తం చెల్లించవలసి ఉంటుంది. ఇలాంటి పధకాలలో ప్రీపియం చెల్లింపు స్వల్పంగా ఉండి కుటుంబానిక భద్రత కల్పిస్తుంది.