TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 8th Lesson అంతర్జాతీయ వర్తకం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 8th Lesson అంతర్జాతీయ వర్తకం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అంతర్జాతీయ వర్తకం అంటే ఏమిటి ? ఇది ఏ విధంగా అంతర్గత వర్తకంతో విభేదిస్తుంది?
జవాబు.
అంతర్జాతీయ వర్తకం:

  1. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల వర్తకుల మధ్య కొనుగోలు, అమ్మకం జరగడాన్ని అంతర్జాతీయ వర్తకం అంటారు.
  2. అంతర్జాతీయ వర్తకాన్ని ‘విదేశీ వర్తకం’ లేదా ‘బహిర్గత వర్తకం’ అని కూడా అంటారు.

స్వదేశీ వర్తకానికి, విదేశీ వర్తకానికి మధ్యగల తేడా:
విదేశీ వర్తకం లేదా అంతర్జాతీయ వర్తకం, స్వదేశీ వర్తకం లేదా గృహ సంబంధ వర్తకం నుంచి ఏ ప్రకారంగా విభేదిస్తుందో కింద వివరించబడినది.
స్వదేశీ వర్తకం

  1. దేశంలో జరిగే వర్తకాన్ని సూచిస్తుంది.
  2. ఎలాంటి నాణేల మారకంతో సంబంధం ఉండదు
  3. ఎలాంటి ఆంక్షలు ఉండవు.
  4. డిమాండు, సప్లయి శక్తుల ప్రభావానికి అవకాశం ఉంటుంది.
  5. రవాణా వ్యయం, నష్ట భయాలు తక్కువగా ఉంటాయి.
  6. ఇది ఒక దేశంలో ప్రత్యేకీకరణ ప్రయోజనాలను పొందడానికి సహాయపడుతుంది.
  7. వస్తువుల గమనం అంతర్గత రవాణా అభివృద్ధి ప్రత్యేకించి రోడ్డు, రైల్వే రవాణా మార్గాలపై ఆధారపడి ఉంటుంది.
  8. వస్తువుల ఉత్పత్తి జరిగిన కేంద్రాల నుంచి, స్వదేశంలో అవి వినియోగించే కేంద్రాల వరకు తరలించడానికి దోహదపడుతుంది.
  9. వర్తకం యొక్క పరిమాణం జనాభా మొత్తం, ఉత్పత్తి మొత్తం, బ్యాంకింగ్ అభివృద్ధి లాంటి ఇతర మద్దతునిచ్చే సౌకర్యాలపై కూడా ఆధారపడి ఉంటుంది.

విదేశీ వర్తకం

  1. ఇతర దేశాలతో జరిపే వర్తకాన్ని సూచిస్తుంది.
  2. నాణేల మారకంతో సంబంధం ఉంటుంది.
  3. ఇది అనేక ఆంక్షలకు లోబడి ఉంటుంది.
  4. డిమాండు, సప్లయి శక్తుల ప్రభావానికి అవకాశం పరిమితంగా ఉంటుంది.
  5. రవాణా వ్యయం, నష్ట భయాలు ఎక్కువగా ఉంటాయి.
  6. ఇది వర్తకం చేసే అన్ని దేశాలు ప్రత్యేకీకరణ ప్రయోజనాలను పొందడానికి దోహదపడుతుంది.
  7. వస్తువుల గమనం సాధారణంగా రోడ్డు రవాణా, రైల్వే రవాణా, వాయు రవాణా, నీటి రవాణా లాంటి అనేక సౌకర్యాల ద్వారా జరుగుతుంది.
  8. ఇది వివిధ దేశాలకు, ఒక నిర్దిష్టమైన వస్తుశ్రేణి తయారీలో, ప్రత్యేకతను సాధించడానికి, తరువాత, ఆ వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా విక్రయించడానికి దోహదపడుతుంది.
  9. వస్తువులు స్వేచ్ఛగా ప్రవేశించడంపై ఆంక్షలు విధించబడినవి. వస్తుసేవలపై పన్నులు, సుంకాలను చెల్లించవలసి ఉంటుంది. పైన పేర్కొన్న అంశాలపై (కారకాలపై) వర్తక పరిమాణం ఆధారపడి ఉంటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

ప్రశ్న 2.
అంతర్జాతీయ వర్తకం పరిధిని, ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు.
అంతర్జాతీయ వర్తకం పరిధి: అంతర్జాతీయ వర్తకం పరిధి చాలా విస్తృతమైనది. క్రింది అంశాలు అంతర్జాతీయ వర్తకపు పరిథిలోకి వస్తాయి.

  1. అంతర్జాతీయ ఆర్థిక విషయాలు, వర్తక సిద్ధాంతాలు.
  2. విదేశీ వర్తకానికి పరిమాణాత్మక విధానాలు.
  3. అంతర్జాతీయ వ్యాపార సందేశాలివ్వడం, ప్రజా సంబంధాలు ఏర్పరుచుకోవటం.
  4. విదేశీ వర్తకంలో అంతర్జాల ఉపయోగం.
  5. విదేశీ వర్తకంలో బీమా, నష్టభయ నిర్వహణ.
  6. అంతర్జాతీయ మార్కెటింగ్ నిర్వహణ, వినియోగదారులు ప్రవర్తన.
  7. అంతర్జాతీయ మానవ వనరుల నిర్వహణ, వ్యవస్థా ప్రవర్తన.
  8. అంతర్జాతీయ వ్యాపార చట్టాలు.
  9. ఎగుమతి, దిగుమతి విత్తం.
  10. విదేశీ మారకం, మారకం, నియంత్రణ.
  11. ఎగుమతి ప్రోత్సాహకాలు.
  12. ఎగుమతి ధరల నిర్ణయం.

అంతర్జాతీయ ప్రాముఖ్యత:
1) ప్రపంచంలోని ఏ దేశం కూడా స్వయం సమృద్ధితో ఉండదు. ఏ దేశమూ తనకవసరమయ్యే వస్తువులను ఉత్పత్తి చేయదు. ఏ దేశం కూడా ఆర్థిక ఏకాంతత్వంలో జీవించడం, ఒకదేశం మరొక దేశంపై ఆధారపడి ఉండే ఈ పరిస్థితి అంతర్జాతీయ వర్తక ఆవశ్యకతను కల్పించింది.

2) కొన్ని దేశాలు, కొన్ని రకాలైన వస్తువులను, ఆధా పూర్వకంగా పెద్ద మొత్తంలో, ఉత్పత్తి చేయడానికి అధిక యోగ్యమైనవిగా పేర్కొనబడినవి. అలాంటి దేశం తన మిగులు ఉత్పత్తిని ఇతర దేశాలకు విక్రయిస్తుంది, అదే విధంగా ఆయా దేశాల నుంచి తనకు అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేస్తుంది. ఈ ప్రకారంగా, ప్రపంచంలోని అన్ని దేశాలు, తమ అవసరాలను తీర్చుకోవడానికి ఒకదానిపై మరొకటి ఆధారపడవలసి ఉంటుంది.

3) మన ఆధునిక వాణిజ్య ప్రపంచానికి అంతర్జాతీయ వర్తకం ఒక వెన్నెముక లాంటిది. అంతర్జాతీయ వర్తకం, ప్రజల మానసిక దృక్పథాన్ని విస్తృతపరుస్తుంది. ఇది జాతీయ పరిశీలనలకు సంకుచిత దృష్టికి మాత్రమే పరిమితం కాకుండా, దాన్ని అధిగమించి ఆలోచించేటట్లు ప్రోత్సహిస్తుంది.

4) అంతర్జాతీయ వర్తకం, ఆలోచనల బదిలీని, సంస్కృతిని, ప్రపంచ శాంతిని, అంతర్జాతీయ అవగాహనను పెంపొందిస్తుంది.

5) విదేశీ వర్తకం ద్వారా ఒక వర్తకుడు తన వస్తువులను తనకిష్టమైన ఏ దేశంలోనైనా విక్రయించవచ్చు.

6) అంతర్జాతీయ వర్తకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వస్తుసేవలను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

7) ప్రభుత్వాల ప్రపంచీకరణ, స్వేచ్ఛాయుత వర్తక పథకాలు ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయ వర్తకానికి ప్రత్యేక సంబంధాన్ని కలిగించాయి.

ప్రశ్న 3.
అంతర్జాతీయ వర్తకం ప్రయోజనాలను చర్చించండి.
జవాబు.
అంతర్జాతీయ వర్తకం వల్ల కలిగే ప్రయోజనాలు క్రింద చర్చించబడినవి:

  1. ఇది అందుబాటులో ఉన్న వనరులను చక్కగా వినియోగించడానికి దారితీస్తుంది.
  2. ఇది వనరుల వృథాను తగ్గిస్తుంది.
  3. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలను సమానం చేస్తుంది. విస్తృతమైన హెచ్చు తగ్గులను తొలగిస్తుంది.
  4. ఇది మిగులుగా ఉన్న వస్తువులను ఇతర దేశాలకు వాటిని అమ్మడానికి, అలాగే కొరతగా ఉన్న వస్తువులను ఇతర దేశాల నుంచి కొనడానికి సహాయపడుతుంది.
  5. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు, తమ ఉత్పత్తులను ఎగుమతులు చేయడానికి బదులుగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.
  6. ఇది వివిధ దేశాలకు చెందిన ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాన్ని సృష్టిస్తుంది. తద్వారా సాంస్కృతిక వికాసానికి, అంతర్జాతీయ శాంతికి దోహదపడుతుంది.
  7. ఇది అంతర్జాతీయ శ్రమ విభజన, ప్రత్యేకీకరణ సాధిస్తుంది.
  8. ఇది ప్రజల ఆదాయాలలో పెరుగుదలకు దారితీస్తుంది. తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.
  9. ఇది ఉద్యోగిత అవకాశాలను పెంచి, విదేశీ మారకపు రిజర్వులను అధికం చేస్తుంది.
  10. ఇది పేదరికం, అల్ప ఉద్యోగిత, మాంద్యంలాంటి ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుంది. ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచుతుంది.
  11. ఇది ఆరోగ్యకరమైన పోటీని కల్పిస్తుంది.

ప్రశ్న 4.
ఎగుమతి వర్తకంలో పాటించాల్సిన విధాన క్రమాలను వివరించండి.
జవాబు.
భారతదేశంలో ఉన్న ఎగుమతి నియంత్రణ నిబంధనల ప్రకారం, ఒక ఎగుమతి వ్యవహారం అమలు కింద పేర్కొన్న దశలవారీగా జరుగుతుంది.
1) వస్తు విచారణలు, వస్తు ప్రకటనలు:
1) కొనుగోలుదార్ల వద్ద నుంచి వస్తు విచారణ పత్రం స్వీకరించగానే, ఎగుమతి వర్తకం ప్రారంభమవుతుంది. వస్తుధరను, ఇతర సేవల సమాచారాన్ని కోరుతూ, అతని వద్ద నుంచి వచ్చిన రాతపూర్వక విజ్ఞప్తిని ఒక ‘వస్తు విచారణ’గా చెప్పవచ్చు..

2) అలాంటి విచారణలకు ఇచ్చే సమాధానాన్ని ‘వస్తు ప్రకటనలు’గా చెప్పవచ్చు. వస్తు ప్రకటనల్లో, విచారణలో కోరిన వివరాలన్నింటిని సమకూర్చాలి. వస్తుధర, కాలం, బట్వాడా చేసే పద్ధతి, ప్యాకింగ్ చేసే పద్ధతులను వాటిలో పేర్కొంటారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

2) ఆర్డర్లు లేదా ఇండెంట్లు:
1) వస్తు ప్రకటనలలో (కొటేషన్లలో) సప్లయి చేసిన వివరాలతో కొనుగోలుదారుడు సంతృప్తి చెందితే, అతడు వస్తువులకు ఆర్డరు వేస్తాడు. ఒక విదేశీ కొనుగోలుదారుడు, వస్తువులను కొనుగోలు చేసే నిమిత్తం చేసిన ప్రతిపాదనను ‘ఇండెంట్’ అంటారు.

2) ఇండెంట్ను ఎగుమతిదారుడు ఆమోదిస్తే, అప్పుడది ఒక ‘ఆర్డరు’ అవుతుంది. ఇండెంటులో అవసరమైన వస్తు వివరాలన్నింటితోపాటు, రవాణా, ప్యాకింగ్ మొదలైన వాటికి సంబంధించిన వివిధ రకాలైన ఇతర సూచనలు కూడా ఉంటాయి.

3) లైసెన్సును సంపాదించడం:
1) భారతదేశం నుంచి వస్తువుల ఎగుమతి, “దిగుమతి మరియు ఎగుమతి నియంత్రణ’ చట్టం కింద జరుగుతుంది. నియంత్రణలో ఉన్న వస్తువులను, ఎగుమతి లైసెన్సు లేకుండా, ఎగుమతి చేయకూడదు.

2) కొన్ని వస్తువులను ‘బహిరంగ సాధారణ లైసెన్సు జాబితా’లో ఉంచుతారు. వస్తువులు బహిరంగ సాధారణ లైసెన్స్ జాబితాలో లేకపోతే, అప్పుడు అతడు ఒక సముచిత (తగిన) అధికారికి నిర్ణీత రుసుం చెల్లించడం ద్వారా ఎగుమతి లైసెన్స్ పొందడానికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

4) మారకపు నిబంధనలను పాటించడం:
1) విదేశీ మారకపు నిబంధనల చట్ట ప్రకారం ఎగుమతిదారుడు ఒక నిర్ణీత కాలంలోగా భారతీయ రిజర్వు బ్యాంకుకు, ఎగుమతి చేసే వస్తువుల పూర్తి విలువ మేరకు, విదేశీ మారకాన్ని వదులుకుంటున్నట్లు ఒక ప్రకటనను అందజేయాల్సి ఉంటుంది.

2) ఎగుమతిదారుడు వస్తువుల విలువను, చెల్లింపును పొందడానికి ఆశించిన పద్ధతి, మొదలయిన పూర్తి వివరాలను, నిర్ణీత దరఖాస్తు పత్రాలలో పేర్కొంటూ, వాటిని కస్టమ్స్ (customs) కార్యాలయానికి, విదేశీ మారకపు బ్యాంకుకు కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది.

5) పరపతి లేఖ:
1) ఎగుమతి వర్తక విధానంలో, దిగుమతిదారుని వద్ద నుంచి పరపతి లేఖను సంపాదించడాన్ని తరవాతి దశగా పేర్కొనవచ్చు. వస్తువులను పంపడానికి ముందు, దిగుమతిదారుని పరపతి స్థితి గురించి ఎగుమతిదారుడు తప్పనిసరిగా తృప్తి చెందాల్సి ఉంటుంది.

2) కొన్ని సందర్భాలలో, కేవలం బ్యాంకు ప్రస్తావన సరిపోతుంది. అయితే కొత్త కొనుగోలుదారుల విషయంలో, ఎగుమతిదారుడు వస్తువుల యొక్క పూర్తి ధరను ముందుగా చెల్లించాలని కోరవచ్చు.

6) షిప్పింగ్ ఆర్డర్:
1) దిగుమతిదారుని పరపతి గురించి సంతృప్తి చెందిన తరువాత, దిగుమతిదారుని కోరిక ప్రకారం, వస్తువులను రేవుకు చేరవేయడానికి, నౌకలో కొంత స్థలాన్ని అద్దెపై తీసుకోవడానికి, ఎగుమతిదారుడు ఒక నౌకా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటాడు.

2) ఎగుమతిదారుడు వద్ద నుంచి నిర్దుష్టమైన పరిమాణం గల వస్తువులను నౌకలోకి తీసుకోవలసిందిగా నౌకా రవాణా సంస్థ అధిపతికి (Captain) సూచనలిస్తూ, నౌకా సంస్థ ఉత్తర్వును జారీ చేస్తుంది.

7) మారకపు రేటు:

  1. ఒకదేశం నాణేలను, మరో దేశం నాణేలతో మారకం చేసుకోవడాన్ని ‘మారకం రేటు’ అంటారు.
  2. విదేశీ మారకం రేట్లలో వచ్చే హెచ్చు తగ్గులతో సంభవించే నష్టాలను తొలగించుకోవడానికి, దిగుమతి చేసుకునే దేశం కరెన్సీని, ఎగుమతి చేసుకునే దేశం కరెన్సీలోకి మార్పుదల చేయడానికి, ఎగుమతిదారు తన బ్యాంకుతో రేటును నిర్ణయిస్తాడు.

8) ప్యాకింగ్ చేయడం, పంపడం:
1) రవాణా ఛార్జీలను తగ్గించుకోవడానికి, నౌకలో సరుకు కనిష్ఠ స్థలం ఆక్రమించే విధంగా, ప్యాకింగ్ను ఇమిడికతో చేయాలి. ఈ విషయంలో, దిగుమతిదారుడు తనకు ఇచ్చిన సూచనలను పాటించవలసి ఉంటుంది. వస్తువులకు పూర్తి రక్షణ కల్పిస్తూ, తక్కువ ఖర్చు అయ్యేటట్లు ప్యాకింగ్ను చేయాల్సి ఉంటుంది.

2) వస్తువులను ప్యాక్ చేసిన తరువాత, ప్రతీ మూటపై (bundle) దిగుమతిదారుని పేరు, చేరవలసిన గమ్యస్థానం యొక్క రేవును, ప్రత్యేకమైన గుర్తులతో ముద్రించాలి. దీన్ని సులభంగా గుర్తించే ఉద్దేశంతో వేస్తారు.

9) కస్టమ్స్ లాంఛనాలు:
1) ఈ దశలో, ఎగుమతిదారుడు కొన్ని కస్టమ్స్ లాంఛనాలను పాటించవలసి ఉంటుంది. ఎగుమతిదారుడు నౌకా రవాణా బిల్లును మూడు ప్రతులలో బర్తీ చేయాలి. ఈ పౌకా రవాణా బిల్లుకు ఇతర పత్రాలను జత చేయాల్సి ఉంటుంది.

10) ఉపనౌకాధిపతి రశీదు:

  1. వస్తువులు రేవుకు చేరుకున్నట్లయితే, ఎగుమతిదారుడు ఒక రేవుకు సంబంధించిన రశీదును ఇస్తారు.
  2. వస్తువులను నేరుగా నౌకాధిపతికి, లేదా ‘ఉపనౌకాధిపతిగా’ పిలవబడే అతడి సహాయకుడికి అందజేసినప్పుడు, అతడు ‘ఉపనౌకాధిపతి’ (Mate) రశీదును జారీ చేస్తాడు.

11) నౌకాభారపత్రం:

  1. నౌకలోకి వస్తువులు చేరినట్లుగా ఒప్పుకుంటూ నౌకా రవాణా సంస్థ ఇచ్చిన అధికారిక రశీదును ‘నౌకా భార పత్రం’ అంటారు.
  2. ఇదొక వస్తువుల యాజమాన్యపు హక్కును సూచించే పత్రం. నౌకా భార పత్రాన్ని చూపకుండా, దిగుమతిదారుడు వస్తువుల బట్వాడాను పొందలేడు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

12) వస్తువుల బీమా:

  1. అంతర్జాతీయ వర్తకంలోకి ప్రవేశించే వస్తువులు సముద్రంలోని ప్రమాదాలను, అపాయాలను ఎదుర్కొనడానికి, వాటిని సక్రమంగా బీమా చేయవలసి ఉంటుంది.
  2. అందుకోసం బీమా కంపెనీ నుంచి, ఒక సముద్ర బీమా పాలసీని కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఈ పాలసీని దిగుమతిదారుకు, నౌకా భారపత్రం లాంటి తదితర పత్రాలతో పాటు అందజేయాలి.

13) ఉత్పత్తి స్థాన ధ్రువపత్రం:

  1. ఈ ధ్రువపత్రం ఎగుమతుల ఉత్పత్తి స్థానం గురించి సాక్ష్యాధారంగా ఉన్న ప్రకటన లాంటిది.
  2. దిగుమతిదారునిపై ‘సుంకం బాధ్యత’ తగ్గించడానికి వీలుండునట్లు అతడికి ‘ఉత్పత్తి స్థాన ధ్రువ పత్రాన్ని’ పంపాలి. ఈ ధ్రువ పత్రం అధీకృత వాణిజ్యమండలి లేదా వర్తక సమితి చేత జారీ చేయబడుతుంది.

14) వాణిజ్య సంబంధిత పత్రం:

  1. వస్తువుల విలువను అంచనా వేయడానికి, దానిపై విధించే సుంకాల మొత్తాన్ని నిర్ధారించడానికి, కస్టమ్స్ అధికారులు సాధారణంగా అధిక సమయాన్ని తీసుకుంటారు.
  2. ఈ జాప్యాన్ని నివారించడానికి, వస్తు. ఎగుమతిదారు, వస్తువులు గమ్యస్థానపు రేవుకు చేరుకున్న తరువాత, వాటిని దిగుమతిదారు సత్వరమే పొందడానికి వీలుగా, ఒక వాణిజ్య సంబంధిత పత్రాన్ని సంపాదిస్తాడు.

15) ఇన్వాయిస్ తయారీ:

  1. వస్తువులను పంపడానికి లాంఛనాలన్నింటినీ పూర్తి చేసిన తరువాత, ఎగుమతిదారుడు ఒక ఇన్వాయిస్ను తయారు చేయాలి.
  2. ఈ ఇన్వాయిస్ ను మూడు ప్రతులుగా తయారు చేస్తారు. ఇది లోగడ అంగీకరించిన ధర, ఇతర షరతులపై ఆధారపడి ఉంటుంది.

16) చెల్లింపును పొందడం:

  1. వస్తు దిగుమతి విధానంలో, వ్యవహారం యొక్క పరిష్కారం కింద చెల్లింపు పొందడమనేది చివరి దశగా
  2. ఎగుమతిదారుడు మూడు విభిన్న పద్ధతులలో చెల్లింపును పొందుతాడు.
    • దిగుమతిదారునిపై ఒక బిల్లును (హుండీని) రాయడం
    • ఒక వేళ ఎగుమతిదారుడు తక్షణమే సొమ్ము పొందాలనుకుంటే అతడు తన బ్యాంకుతో, దిగుమతిదారునిపై రాసిన హుండీని డిస్కౌంటు చేసుకుంటాడు. ఇందుకోసం అతడు తన బ్యాంకుకు ఒక తాకట్టు పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
    • ఎగుమతిదారుని బ్యాంకు ఎగుమతిదారునికి అనుకూలంగా ఒక పరపతి లేఖను జారీ చేస్తుంది.

ప్రశ్న 5.
దిగుమతి వర్తకంలో అనుసరించవలసిన లాంఛనాలు ఏమిటి ? వివరించండి.
జవాబు.
విదేశం నుంచి కొనుగోలుదారులుండే స్వదేశానికి వస్తువులను కొనుగోలు చేసి తెచ్చినపుడు, దాన్ని ‘దిగుమతి వర్తకం’ అని అంటారు. విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి ఒక క్రమమైన పద్ధతి ఉంటుంది.
1) లైసెన్సును సంపాదించడం:
1) ఒక దిగుమతిదారు తనకిష్టమొచ్చిన వస్తువులను దిగుమతి చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉండడం. మన దేశంలోనికి క్రమబద్ధమైన లైసెన్సు లేకుండా, ఎలాంటి వస్తువులూ దిగుమతి చేసుకోలేము.

2) ఒక దిగుమతిదారు సాధారణ లైసెన్సు లేదా వ్యక్తిగత లైసెన్సు కింద వస్తువులను దిగుమతి చేసుకోవచ్చు. ఏ దేశంనుంచైనా వస్తువులను దిగుమతి చేసుకోవడానికి సాధారణ లైసెన్సు ఉపయోగపడుతుండగా, వ్యక్తిగత లైసెన్సు మాత్రం నిర్దిష్టమైన దేశాలకు వర్తిస్తుంది.

3) ఒక దిగుమతి లైసెన్సును సంపాదించడానికి, దిగుమతిదారు ఒక నిర్ణీత పద్ధతిలో దరఖాస్తును అందచేయాలి. దరఖాస్తుదారుని గత కాలపు దిగుమతుల ‘పరిమాణాన్ని ఆధారం చేసుకొని, ఒక నిర్దిష్టభాగం (కోటా)గా ఒక ధ్రువ పత్రాన్ని కూడా లైసెన్సింగ్ అధికారులు జారీ చేస్తారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

2. మారకాన్ని సంపాదించడం: దిగుమతి లైసెన్సును సంపాదించిన తరువాత, అవసరమైన మొత్తంలో విదేశీ మారకాన్ని సంపాదించడానికి ఏర్పాట్లు చేయాలి. అవసరమైన విదేశీ మారకాన్ని విడుదల చేయడానికి “మారకం నియంత్రణ అధికారులకు” ఒక దరఖాస్తును అందజేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తును ఒక విదేశీ మారకపు బ్యాంకు ఆమోదించాలి.

3. ఇండెంట్ (లేదా) ఉత్తర్వు:

  1. విదేశీ మారకం పొందిన తరువాత దిగుమతిదారుడు, తనకు అవసరమయ్యే వస్తువులకు ఒక ఆర్డరును అందచేస్తాడు. ఈ ఆర్డరు (ఉత్తర్వు)ను ఇండెంట్ (Indent) అంటారు.
  2. ఈ ఇండెంట్ ఎగుమతిదారునికి ఇచ్చే వస్తువుల నాణ్యత, పరిమాణం, వస్తువులను పంపే విధానం, ప్యాకింగ్ స్వభావం, చెల్లింపు చేసే పద్ధతి, మొదటి శ్రేణి ధర మొదలయిన సూచనలు ఉంటాయి.

4. పరపతి లేఖ: దిగుమతిదారుడు తన పరపతి యోగ్యతను ఎగుమతిదారుడు రుజువు చేయాల్సి ఉంటుంది. దీనికోసం, అతడు ఒక పరపతి లేఖను ఎగుమతిదారుడు పంపాలి. దిగుమతిదారుని దేశంలో, ఎగుమతిదారుని పేరిట ఒక పరపతి లేఖను బ్యాంకువారు జారీ చేస్తారు. ఎగుమతిదారు, దిగుమతిదారునిపై జారీ చేసిన హుండీలు ఆదరణ చెందుతాయని బ్యాంకువారు ఒక హామీని / వాగ్ధానాన్ని ఇస్తారు.

5. షిప్పింగ్ పత్రాలను పొందడం: ఎగుమతిదారుడు వస్తువులను రవాణా చేసిన తరువాత, అతడు దిగుమతిదారుడు ఒక సలహా పత్రాన్ని పంపుతాడు. ఎగుమతిదారుడు, దిగుమతిదారునిపై ఒక హుండీని కూడా రాస్తాడు. ఇన్వాయిస్, బీమా పాలసీ, నౌక భార పత్రం, వాణిజ్య సంబంధిత పత్రం మొదలయిన ఇతర పత్రాలను హుండీతో జతచేయాల్సి ఉంటుంది. అందుచేత, దీన్ని ‘పత్ర సహిత హుండీ’ అంటారు. దీన్ని ఎగుమతిదారుని బ్యాంకు ద్వారా దిగుమతిదారునికి పంపడం జరుగుతుంది.

6. వస్తువులను స్వీకరించడం: నౌకా రవాణా పత్రాలను స్వాధీనంలోకి తీసుకున్న తరువాత, దిగుమతిదారు కింద పేర్కొన్న లాంఛనాలను పాటించి ఆ తర్వాత వస్తువులను స్వాధీనంలోకి తీసుకోవచ్చు.
ఎ) ముందుగా, దిగుమతిదారుడు నౌక రవాణా సంస్థ నుంచి ‘బట్వాడా ఉత్తర్వు’ను సంపాదించాలి.
బి) బట్వాడా ఉత్తర్వును స్వీకరించిన తర్వాత దిగుమతిదారుడు ‘ప్రవేశ బిల్లును’ (Bill of Entry) మూడు కాపీలుగా అందజేయాలి.
సి) వస్తువులను స్వాధీనపరచుకోవడానికి దిగుమతిదారుడు మరొక దరఖాస్తు పత్రాన్ని భర్తీ చేయాలి. అతడు కొన్ని రేవు బకాయిలను, నౌకా రేవు పాలక సంస్థ కార్యాలయానికి తరువాత చెల్లించాలి. అప్పుడు, వారు ‘నౌకా రేవు పాలక సంస్థ బకాయిలు రశీదు’ను జారీ చేస్తారు.

7. వస్తువుల బట్వాడా:
1) ప్రవేశ బిల్లును పరిశీలించిన తరువాత, నౌకా రేవు పాలక సంస్థ అధికారుల చేత ఆమోదించబడిన దిగుమతికి సంబంధించిన దరఖాస్తును కస్టమ్స్ కార్యాలయం వారు, దిగుమతిదారు దిగుమతి చేయబడిన వస్తువులను స్వాధీనపరచుకోవడానికి అనుమతిస్తారు.

2) ఒక వేళ ఏవైనా సుంకాలను విధించినట్లయితే, దిగుమతిదారుడు, కస్టమ్స్ అధికారులు లెక్కించిన ప్రకారం, ఆ సుంకాలను చెల్లించవలసి ఉంటుంది.

8. గిడ్డంగులు:
1) స్వంత గోదాములు లేని దిగుమతిదారుల సౌకర్యం కోసం, రేవు అధికారులు భారీ గిడ్డంగులను నిర్వహిస్తారు. వారు సముచితమైన అద్దెను వసూలు చేస్తారు.

2) ఒకవేళ, దిగుమతిదారుడు ఆ వస్తువులు తక్షణమే అవసరం లేనప్పుడు లేదా వాటిని తిరిగి ఎగుమతి చేయదలచినప్పుడు, కస్టమ్స్ లేదా ఎక్సైజ్ సుంకాల చెల్లింపు చేసే వరకు, వాటిని అతడు గిడ్డంగులలో నిల్వ చేసుకోవచ్చు. అలాంటి గిడ్డంగిని ‘ఆశ్రయ గిడ్డంగి’గా అభివర్ణించవచ్చు.

ప్రశ్న 6.
ఇ.పి.జడ్ల ముఖ్య లక్షణాలు మరియు ప్రయోజనాలను వివరించండి.
జవాబు.

  1. ఇ.పి.జడ్ (E.P.Z) అనగా “ఎగుమతి వర్తక ప్రక్రియలు నిర్వహించే మండలాలు.
  2. భారత ప్రభుత్వం ఎగుమతులను పెంపొందించడానికి, ఎగుమతి వర్తక ప్రక్రియలు మండలాలను ఏర్పాటు చేసినది. సాధారణంగా ఆతిథ్యమిచ్చే దేశం యొక్క వెనుకబడిన ప్రాంతాలలో ఈ మండలాలను స్థాపించడం జరుగుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

ఇ.సి.జడ్ల లక్షణాలు:

  1. ఇ.పి.జడ్లలో నిర్వహించే కార్యకలాపాలకు ఎలాంటి లైసెన్సు అవసరముండదు.
  2. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కొన్ని కొలమానాలను పాటిస్తూ, సంస్థలు ఇ.పి.జడ్లలో తమకు నచ్చిన ప్రదేశంలోనే తమ సంస్థను నెలకొల్పవచ్చు.
  3. ఇ.పి.జడ్లు చురుకైన ఎగుమతి దిగుమతి విధానాన్ని కఠినంగా అనుసరించవచ్చు.
  4. ఇ.పి.జడ్లలోని సంస్థలు పూర్తిగా కస్టమ్స్ శాఖ వారి అజ్ఞానుసారం వ్యవహరిస్తాయి.
  5. భారతదేశంలో ఇ.పి.జడ్లలోని సంస్థలను స్థాపించడానికి చేసే ప్రతిపాదనలు, ఆమోదంకోసం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఆటోమేటిక్ మార్గాన్ని అనుసరించే హక్కును కలిగి ఉంటాయి.

ఇ.పి.జడ్ల ప్రయోజనాలు:

  1. ఇ.పి.జడ్లు దేశ పారిశ్రామీకరణకు, ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చాయి.
  2. కోటాలు, సుంకాలు తొలగించబడినప్పుడు, దేశంలో ఇ.పి.జడ్లు ప్రత్యేకత సాధించిన ప్రాంతాలుగా కొనసాగుతాయి.
  3. ఇ.పి.జడ్లు అధిక సంఖ్యలో కార్మికులను నియమించి, ఉత్పత్తి జరిపే కేంద్రాలుగా పేరు తెచ్చుకున్నాయి.
  4. ఎగుమతుల ద్వారా విదేశీ మారకపు ఆర్జనలను పెంచడానికి, ఇ.పి.జడ్ సంస్థలు నిరంతరం ముడిసరుకుల దిగుమతిలో, తయారైన వస్తువుల ఎగుమతిలో నిమగ్నమై ఉంటాయి.
  5. ఇ.పి.జడ్లలో వస్తు ఉత్పత్తిచేసే కార్యకలాపాలన్నింటిలో, 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతిస్తారు.
  6. ఆదాయపన్ను విరామంలాంటి వివిధ ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే, వ్యాట్, ఎగుమతి సుంకం, ఇతర వివిధ పన్నులకు సంబంధించి కూడా అనేక మినహాయింపులను కల్పించారు.

ప్రశ్న 7.
ఇ.పి.జడ్ అంటే ఏమిటి ? భారతదేశంలో వీటిని నెలకొల్పడానికి గల కారణాలు ఏమిటో వివరించండి.
జవాబు.
1) ఇ.పి.జడ్ (E.P.Z) అనగా “ఎగుమతి వర్తక ప్రక్రియలు నిర్వహించే మండలాలు”.
2) భారతప్రభుత్వం ఎగుమతులను పెంపొందించడానికి, ఎగుమతి వర్తక ప్రక్రియలు మండలాలను ఏర్పాటు చేసినది. సాధారణంగా ఆతిథ్యమిచ్చే దేశం యొక్క వెనుకబడిన ఈ మండలాలను ప్రాంతాలలో స్థాపించడం జరుగుతుంది. భారతదేశంలో ఇ.పి.జడ్లు నెలకొల్పడానికి గల కారణాలు:

భారతదేశంలో ఇ.పి.జడ్లను నెలకొల్పడానికి వెనుకగల ప్రధాన కారణాలు క్రింద పేర్కొనబడినవి.

  1. ఇ.పి.జడ్లలో నెలకొల్పిన పారిశ్రామిక సంస్థలలో మెరుగైన అవస్థాపన సౌకర్యాలను కల్పించడం.
  2. పన్ను విరామ హక్కును ప్రవేశపెట్టడం.
  3. ఇ.పి.జడ్లలో 100 శాతం ఎగుమతి ప్రాధాన్యత గల పద్ధతిని ఏర్పాటుచేయడం.
  4. ఇ.పి.జడ్లను పూర్తిగా అన్ని రకాలైన పన్నుల, సుంకాల నుంచి మినహాయించడం.
  5. మండలంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష, పెట్టుబడిని ప్రతిపాదిస్తూ, భారత ప్రభుత్వంచేత నిర్దేశింపబడిన ఆటోమేటిక్ మార్గాన్ని అనుసరిస్తున్న, ఇ.పి. జడ్ లోని సంస్థలు.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అంతర్జాతీయ వర్తకం ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు.
ప్రాముఖ్యత (Importance):
1) ప్రపంచంలోని ఏ దేశం కూడా స్వయం సమృద్ధితో ఉండదు. ఏ దేశమూ తనకవసరమయ్యే వస్తువులను ఉత్పత్తి చేయదు. ఏ దేశం కూడా ఆర్థిక ఏకాంతత్వంలో జీవించడం. ఒకదేశం మరొక దేశంపై ఆధారపడి ఉండే ఈ పరిస్థితి అంతర్జాతీయ వర్తక ఆవశ్యకతను కల్పించింది.

2) కొన్ని దేశాలు, కొన్ని రకాలైన వస్తువులను, ఆదా పూర్వకంగా పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడానికి అధిక యోగ్యమైనవిగా పేర్కొనబడినవి. అలాంటి దేశం తన మిగులు ఉత్పత్తిని ఇతర దేశాలకు విక్రయిస్తుంది, అదే విధంగా ఆయా దేశాల నుంచి తనకు అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేస్తుంది. ఈ ప్రకారంగా, ప్రపంచంలోని అన్ని దేశాలు, తమ అవసరాలను తీర్చుకోవడానికి ఒకదానిపై మరొకటి ఆధారపడవలసి ఉంటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

3) మన ఆధునిక వాణిజ్య ప్రపంచానికి అంతర్జాతీయ వర్తకం ఒక వెన్నెముక లాంటిది. అంతర్జాతీయ వర్తకం, ప్రజల మానసిక దృక్పథాన్ని విస్తృతపరుస్తుంది. ఇది జాతీయ పరిశీలనలకు సంకుచిత దృష్టికి మాత్రమే పరిమితం కాకుండా, దాన్ని అధిగమించి ఆలోచించేటట్లు ప్రోత్సహిస్తుంది.

4) అంతర్జాతీయ వర్తకం, ఆలోచనల బదిలీని, సంస్కృతిని, ప్రపంచ శాంతిని, అంతర్జాతీయ అవగాహనను పెంపొందిస్తుంది.

5) విదేశీ వర్తకం ద్వారా, ఒక వర్తకుడు తన వస్తువులను తనకిష్టమైన ఏ దేశంలోనైనా విక్రయించవచ్చు.

6) అంతర్జాతీయ వర్తకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వస్తుసేవలను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

7) ప్రభుత్వాల ప్రపంచీకరణ, స్వేచ్ఛాయుత వర్తక పథకాలు ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయ వర్తకానికి ప్రత్యేక సంబంధాన్ని కలిగించాయి.

ప్రశ్న 2.
దేశీయ వర్తకం, విదేశీ వర్తకంతో ఎలా విభేదిస్తుంది ?
జవాబు.
స్వదేశీ వర్తకం

  1. దేశంలో జరిగే వర్తకాన్ని సూచిస్తుంది.
  2. ఎలాంటి నాణేల మారకంతో సంబంధం ఉండదు.
  3. డిమాండు, సప్లయి శక్తుల ప్రభావానికి అవకాశం ఉంటుంది.
  4. ఎలాంటి ఆంక్షలు ఉండవు.
  5. రవాణా వ్యయం, నష్ట భయాలు తక్కువగా ఉంటాయి.
  6. `ఇది ఒక దేశంలో ప్రత్యేకీకరణ ప్రయోజనాలను పొందడానికి సహాయపడుతుంది.

విదేశీ వర్తకం

  1. ఇతర దేశాలతో జరిపే వర్తకాన్ని సూచిస్తుంది.
  2. నాణేల మారకంతో సంబంధం ఉంటుంది.
  3. డిమాండు, సప్లయి శక్తుల ప్రభావానికి అవకాశం పరిమితంగా ఉంటుంది.
  4. ఇది అనేక ఆంక్షలకు లోబడి ఉంటుంది.
  5. రవాణా వ్యయాలు, నష్ట భయాలు ఎక్కువగా ఉంటాయి.
  6. ఇది వర్తకం చేసే అన్ని దేశాలు ప్రత్యేకీకరణ ప్రయోజనాలను పొందడానికి దోహదపడుతుంది.

ప్రశ్న 3.
అంతర్జాతీయ వర్తకం నాలుగు ప్రయోజనాలు ఏమిటి ?
జవాబు.
అంతర్జాతీయ వర్తకం వల్ల కలిగే ప్రయోజనాలు క్రింద చర్చించబడినవి:

  1. ఇది అందుబాటులో ఉన్న వనరులను చక్కగా వినియోగించడానికి దారితీస్తుంది. .
  2. ఇది వనరుల వృథాను తగ్గిస్తుంది.
  3. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలను సమానం చేస్తుంది. విస్తృతమైన హెచ్చు తగ్గులను తొలగిస్తుంది.
  4. ఇది మిగులుగా ఉన్న వస్తువులను ఇతర దేశాలకు వాటిని అమ్మడానికి, అలాగే కొరతగా ఉన్న వస్తువులను ఇతర దేశాల నుంచి కొనడానికి సహాయపడుతుంది.
  5. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు, తమ ఉత్పత్తులను ఎగుమతులు చేయడానికి బదులుగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.
  6. ఇది వివిధ దేశాలకు చెందిన ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాన్ని సృష్టిస్తుంది. తద్వారా సాంస్కృతిక వికాసానికి, అంతర్జాతీయ శాంతికి దోహదపడుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

ప్రశ్న 4.
నౌక రవాణా ఉత్తర్వు అనగానేమి ?
జవాబు.
1) దిగుమతిదారుని పరపతి గురించి సంతృప్తిచెందిన తరువాత, దిగుమతిదారుని కోరిక ప్రకారం, వస్తువులను రేవుకు చేరవేయడానికి, నౌకలో కొంత స్థలాన్ని అద్దెపై తీసుకోడానికి, ఎగుమతిదారుడు ఒక నౌకా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటాడు.

2) ఎగుమతిదారు వద్ద నుంచి నిర్దిష్టమైన పరిమాణంగల వస్తువులను నౌకలోకి తీసుకోవలసిందిగా నౌకా రవాణా సంస్థ అధిపతికి సూచనలిస్తూ, జారీ చేసిన పత్రాన్ని నౌక రవాణా ఉత్తర్వు అంటారు.

3) ఒకవేళ ఎగుమతిదారుడు నౌకలో పూర్తి స్థలాన్ని అద్దెపై తీసుకుంటే, ఈ మేరకు, ఎగుమతిదారుకు, నౌక యజమానికి మధ్య కుదుర్చుకున్న ఒప్పందాన్ని ‘చార్టర్ పార్టీ ఒప్పందం’ అంటారు. ఈ ఒప్పందం ఎగుమతిదారు నుంచి నిర్దిష్టమైన పరిమాణంలోగల వస్తువులను నౌకలోకి తీసుకునే విషయమై, నౌక అధిపతిని బాధ్యునిగా చేస్తుంది.

4) చార్టర్ పార్టీ ఒప్పందం, వస్తువులను ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి రవాణా చేయడానికి నౌక యజమానిని బాధ్యునిగా చేస్తుంది. అలాంటి ఒప్పందం క్రింద, ఎవరి వస్తువులను రవాణా చేయడం జరుగుతుందో, అతడిని ‘చార్టర్’ అని అంటారు. చార్టర్ పార్టీ అనేది ఒక ‘నౌక యాత్ర. చార్టర్ పార్టీ’ లేదా ‘ఒక కాల ఆధార చార్టర్ పార్టీ’గా ఉండవచ్చు.

ప్రశ్న 5.
అంతర్జాతీయ వర్తకంలో ప్యాకేజింగ్, ఫార్వార్డింగ్ అంటే ఏమిటి ?
జవాబు.
1) రవాణా ఛార్జీలను తగ్గించుకోవడానికి, నౌకలో సరుకు కనిష్ఠ స్థలం ఆక్రమించే విధంగా, ప్యాకింగ్ను ఇమిడికతో చేయాలి. ఈ విషయంలో, దిగుమతిదారుడు తనకు ఇచ్చిన సూచనలను పాటించవలసి ఉంటుంది. వస్తువులకు పూర్తి రక్షణ కల్పిస్తూ, తక్కువ ఖర్చు అయ్యేటట్లు ప్యాకింగ్ను చేయాల్సి ఉంటుంది.

2) వస్తువులను ప్యాక్ చేసిన తరువాత, ప్రతీ మూటపై (bundle) దిగుమతిదారుని పేరు, చేరవలసిన గమ్యస్థానం యొక్క రేవును, ప్రత్యేకమైన గుర్తులతో ముద్రించాలి. దీన్ని సులభంగా గుర్తించే ఉద్దేశంతో వేస్తారు.

ప్రశ్న 6.
దిగుమతి వర్తకంలో లైసెన్సును ఎలా పొందుతారు ?
జవాబు.
లైసెన్సును సంపాదించడం:
1) ఒక దిగుమతిదారు తనకిష్టమొచ్చిన వస్తువులను దిగుమతి చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉండడం. మన దేశంలోనికి క్రమబద్ధమైన లైసెన్సు లేకుండా, ఎలాంటి వస్తువులూ దిగుమతి చేసుకోలేము.

2) ఒక దిగుమతిదారు’ సాధారణ లైసెన్సు లేదా వ్యక్తిగత లైసెన్సు కింద వస్తువులను దిగుమతి చేసుకోవచ్చు. ఏ దేశం నుంచైనా వస్తువులను దిగుమతి చేసుకోవడానికి సాధారణ లైసెన్సు ఉపయోగపడుతుండగా, వ్యక్తిగత లైసెన్సు మాత్రం నిర్దిష్టమైన దేశాలకు వర్తిస్తుంది.

3) ఒక దిగుమతి లైసెన్సును సంపాదించడానికి, దిగుమతిదారు ఒక నిర్ణీత పద్ధతిలో దరఖాస్తును అందచేయాలి. దరఖాస్తుదారుని గత కాలపు దిగుమతుల పరిమాణాన్ని ఆధారం చేసుకొని, ఒక నిర్దిష్టభాగం (కోటా)గా ఒక ధ్రువ పత్రాన్ని కూడా లైసెన్సింగ్ అధికారులు జారీ చేస్తారు.

ప్రశ్న 7.
భారతదేశంలో ఇ.పి.జడ్ల స్థాపన వెనుకున్న ప్రధాన కారణాలు ఏమిటి ?
జవాబు.
భారతదేశంలో ఇ.పి.జడ్లను నెలకొల్పడానికి వెనుకగల ప్రధాన కారణాలు క్రింద పేర్కొనబడినవి.

  1. ఇ.పి.జడ్లలో నెలకొల్పిన పారిశ్రామిక సంస్థలలో మెరుగైన అవస్థాపన సౌకర్యాలను కల్పించడం.
  2. పన్ను విరామ హక్కును ప్రవేశపెట్టడం.
  3. ఇ.పి.జడ్లలో 100 శాతం ఎగుమతి ప్రాధాన్యత గల పద్ధతిని ఏర్పాటుచేయడం.
  4. ఇ.పి.జడ్లను పూర్తిగా అన్ని రకాలైన పన్నుల, సుంకాల నుంచి మినహాయించడం.
  5. మండలంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష, పెట్టుబడిని ప్రతిపాదిస్తూ, భారత ప్రభుత్వం చేత నిర్దేశింపబడిన ఆటోమేటిక్ మార్గాన్ని అనుసరిస్తున్న, ఇ.పి.జడ్లలోని సంస్థలు.

ప్రశ్న 8.
అంతర్జాతీయ వర్తకం పరిధి ఏమిటి ?
జవాబు.
అంతర్జాతీయ వర్తకం పరిధి చాలా విస్తృతమైనది. క్రింది అంశాలు అంతర్జాతీయ వర్తకపు పరిథిలోకి వస్తాయి.

  1. అంతర్జాతీయ ఆర్థిక విషయాలు, వర్తక సిద్ధాంతాలు.
  2. విదేశీ వర్తకానికి పరిమాణాత్మక విధానాలు.
  3. అంతర్జాతీయ వ్యాపార సందేశాలివ్వడం, ప్రజా సంబంధాలు ఏర్పరుచుకోవటం.
  4. విదేశీ వర్తకంలో అంతర్జాల ఉపయోగం.
  5. విదేశీ వర్తకంలో బీమా, నష్టభయ నిర్వహణ.
  6. అంతర్జాతీయ మార్కెటింగ్ నిర్వహణ, వినియోగదారులు ప్రవర్తన.
  7. అంతర్జాతీయ మానవ వనరుల నిర్వహణ, వ్యవస్థా ప్రవర్తన. 8) అంతర్జాతీయ వ్యాపార చట్టాలు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

ప్రశ్న 9.
ఇ.పి.జడ్ల లక్షణాలు ఏమిటి ?
జవాబు.
భారతదేశంలోని ఇ.పి.జడ్ల ముఖ్య లక్షణాలలో కొన్ని క్రింది విధంగా ఉంటాయి.

  1. ఇ.పి.జడ్లలో నిర్వహించే కార్యకలాపాలకు ఎలాంటి లైసెన్సు అవసరముండదు.
  2. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కొన్ని కొలమానాలను పాటిస్తూ, సంస్థలు ఇ.పి.జడ్లలో తమకు నచ్చిన ప్రదేశంలోనే తమ సంస్థను నెలకొల్పవచ్చు.
  3. ఇ.పి.జడ్లు చురుకైన ఎగుమతి దిగుమతి విధానాన్ని కఠినంగా అనుసరించవచ్చు.
  4. ఇ.పి.జడ్లలోని సంస్థలు పూర్తిగా కస్టమ్స్ శాఖ వారి అజ్ఞానుసారం వ్యవహరిస్తాయి.
  5. భారతదేశంలో ఇ.పి.జడ్లలోని సంస్థలను స్థాపించడానికిచేసే ప్రతిపాదనలు, ఆమోదంకోసం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఆటోమేటిక్ మార్గాన్ని అనుసరించే హక్కును కలిగి ఉంటాయి.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వస్తు వివరణలు (Quotations), విచారణలు (Enquiries).
జవాబు.
1) కొనుగోలుదార్ల వద్ద నుంచి వస్తు విచారణ పత్రం స్వీకరించగానే, ఎగుమతి వర్తకం ప్రారంభమవుతుంది. వస్తుధరను, ఇతర సేవల సమాచారాన్ని కోరుతూ, అతని వద్ద నుంచి వచ్చిన రాతపూర్వక విజ్ఞప్తిని ఒక ‘వస్తు విచారణ’గా చెప్పవచ్చు.

2) అలాంటి విచారణకు ఇచ్చే సమాధానాన్ని వస్తు ప్రకటనలుగా చెప్పవచ్చు. వస్తు ప్రకటనల్లో, విచారణలో కోరిన వివరాలన్నింటిని సమకూర్చాలి. వస్తుధర, కాలం, బట్వాడా చేసే పద్ధతి, ప్యాకింగ్ చేసే పద్ధతులను వాటిలో పేర్కొంటారు.

ప్రశ్న 2.
పరపతి లేఖ / పత్రం (Letter of credit).
జవాబు.

  1. వస్తువులను పంపడానికి ముందు దిగుమతిదారునికి పరపతి స్థితి గురించి ఎగుమతిదారుడు సంపాదించే లేఖను “పరపతి లేఖ” లేదా పరపతి పత్రం అంటారు.
  2. ఈ పరపతి పత్రాన్ని దిగుమతి దారుడి తరపున బ్యాంకువారు జారీ చేస్తారు.

ప్రశ్న 3.
నౌకా భార పత్రం (Bill of lading).
జవాబు.

  1. నౌకలోకి వస్తువులు చేరినట్లుగా ఒప్పుకుంటూ నౌకా రవాణా సంస్థ ఇచ్చిన అధికారిక రసీదును ‘నౌకా భార పత్రం’ అంటారు.
  2. ఇదొక వస్తువుల యాజమాన్యపు హక్కును సూచించే పత్రం. నౌకా భార పత్రాన్ని చూడకుండా, దిగుమతిదారుడు వస్తువుల బట్వాడాను పొందలేడు.
  3. ఇది నౌకా రవాణా సంస్థకు, ఎగుమతిదారుకు మధ్య ఉన్న ఒప్పందానికి ఒక సాక్ష్యంగా ఉంటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

ప్రశ్న 4.
ప్రవేశ బిల్లు (Bill of Entry).
జవాబు.
1) దిగుమతి చేసుకున్న సరుకు వివరాలు తెలియజేస్తూ చేసే ప్రకటనే ప్రవేశబిల్లు. బట్వాడా ఉత్తర్వులను స్వీకరించిన తర్వాత దిగుమతి దారుడు ప్రవేశ బిల్లును మూడు కాపీలుగా అందించాలి. క్రింద రకాలైన వస్తువులకు వేరు వేరు ప్రవేశ బిల్లులు నింపవలసి ఉంటుంది.

  • కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించిన వస్తువులు.
  • స్వంత వినియోగానికి దిగుమతి చేసుకోబడుతున్న సుంకం విధించదగ్గ వస్తువులు.
  • సుంకం విధించదగ్గ ‘’బ్రాండెడ్’ వస్తువులు.

ప్రశ్న 5.
సమాచారయుత ఇండెంట్.
జవాబు.

  1. దిగుమతిదారుడు తనకు కావాల్సిన వస్తువులకు ఒక ఆర్డరును అందజేస్తాడు. ఆ ఆర్డరు ఉత్తర్వును ఇండెంట్ అంటారు.
  2. ఇండెంట్ కావాల్సిన వస్తు వివరాలను పేర్కొన్నప్పుడు దాన్ని సమాచారయుత ఇండెంట్ అంటారు.

ప్రశ్న 6.
భారతదేశంలో ఇ.పి.జడ్ (E.P.Z) విధానం యొక్క నాలుగు దశలు.
జవాబు.
భారతదేశంలో ఇ.పి.జడ్. విధానంలో నాలుగు దశలు:
మొదటి దశ: ప్రారంభపు దశ (1964-1985)
రెండవ దశ: విస్తరణ దశ (1985-1991) మూడవ దశ: ఏకీకరించే దశ (1991-2000)
నాల్గవదశ: ప్రస్ఫుటపరచిన దశ (2000 నుంచి మొదలుకొని)

ప్రశ్న 7.
బాండెడ్ గిడ్డంగులు (Bonded Warehouses).
జవాబు.
విదేశం నుంచి సరుకు దిగుమతి చేసుకున్న దిగుమతిదారునకు ఆ సరుకు వెంటనే అవసరంలేకపోయినా లేదా సరుకు భద్రపరచడానికి తగిన సొంత గిడ్డంగి వసతి లేకపోయినా లేదా సరుకును తిరిగి ఎగుమతి చేయదలచినా, ఆ సరుకును వెంటనే దిగుమతి సుంకం చెల్లించకుండా, భద్రపరచడానికి ప్రభుత్వం గిడ్డంగులను నిర్వహిస్తుంది. వాటినే బాండెడ్ గిడ్డంగులు అంటారు. ఇవి ప్రభుత్వానికి చెందినవి, వీటి మీద కస్టమ్స్ అధికారులు అజమాయిషి నిర్వహిస్తాయి. వీటిలో భద్రపరిచే సరుకును ‘బాండ్’లో ఉన్న సరుకు అంటారు. వీటినే గిడ్డంగులను “దస్తావేజు పూర్వక గిడ్డంగులు” అంటారు.

ప్రశ్న 8.
మారకపు రేటు.
జవాబు.
1) ఒకదేశం నాణేల (Currency)ను, మరో దేశం నాణేలతో మారకం చేసుకోవడాన్ని ‘మారకం రేటు’ అంటారు. 2) విదేశీ మారకం రేట్లలో వచ్చే హెచ్చు తగ్గులతో సంభవించే నష్టాలను తొలగించుకోవడానికి, దిగుమతి చేసుకునే దేశం కరెన్సీని, ఎగుమతి చేసుకునే దేశం కరెన్సీలోకి మార్పుదల చేయడానికి, ఎగుమతిదారు తన బ్యాంకుతో రేటును నిర్ణయిస్తాడు.

ప్రశ్న 9.
ఉత్పత్తి స్థాన ధ్రువపత్రం.
జవాబు.

  1. ఈ ధ్రువపత్రం ఎగుమతుల ఉత్పత్తి స్థానం గురించి సాక్ష్యాధారంగా ఉన్న ప్రకటన లాంటిది.
  2. దిగుమతిదారునిపై ‘సుంకం బాధ్యత’ తగ్గించడానికి వీలుండునట్లు అతడికి ‘ఉత్పత్తి స్థాన ధ్రువ పత్రాన్ని’ పంపాలి. ఈ ధ్రువ పత్రం అధీకృత వాణిజ్యమండలి లేదా వర్తక సమితి చేత జారీ చేయబడుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 8 అంతర్జాతీయ వర్తకం

ప్రశ్న 10.
వాణిజ్య సంబంధిత పత్రం (Consular Invoice).
జవాబు.
ఎగుమతిదారు వస్తువులు గమ్యస్థాన రేవుకు చేరుకున్న తరువాత, వాటిని దిగుమతిదారు సత్వరమే పొందడానికి వీలుగా తయారుచేసే పత్రాన్ని వాణిజ్య సంబంధిత పత్రం అంటారు.

ప్రశ్న 11.
గిడ్డంగి.
జవాబు.
వస్తువులను దీర్ఘకాలంపాటు కాల ప్రయోజనాన్ని కల్పిస్తూ భద్రపరిచే ఏర్పాటును “గిడ్డంగి” అంటారు.

ప్రశ్న 12.
‘తులనాత్మక వ్యయ ప్రయోజనం’ సిద్ధాంతం.
జవాబు.
ఒక దేశం తనకు వ్యయ ప్రయోజనం ఉన్న వస్తువులను దిగుమతి చేసి, ఇతర దేశాలకు వ్యయ ప్రయోజనం ఉన్న వస్తువులను ఎగుమతి చేసుకుంటుంది. దీనిని ఆర్థికశాస్త్ర పరిభాషలో ‘తులనాత్మక వ్యయ సిద్ధాంతం’ అంటారు.

Leave a Comment