TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 7th Lesson అంతర్గత వర్తకం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 7th Lesson అంతర్గత వర్తకం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వర్తకాన్ని నిర్వచించి, దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
వర్తకం:వస్తువులను, సేవలను, ద్రవ్యానికి లేదా ద్రవ్యసమానమైన విలువకు కొనడం, అమ్మడాన్ని “వర్తకం” అంటారు.
వర్తకం లక్షణాలు:

  1. వర్తకం వాణిజ్యంలో ఒక భాగము.
  2. వర్తకంలో వస్తు సేవలు ఉత్పత్తి దారుని నుండి తుది వినియోగదారునికి చేరే ప్రక్రియ ఉంటుంది.
  3. వర్తకం వస్తుసేవల మారకం లేదా బదిలీతో సంబంధం కలిగి ఉంటుంది.
  4. వర్తకాన్ని స్వదేశీ వర్తకం మరియు విదేశీ వర్తకంగా వర్గీకరించవచ్చు.
  5. వర్తకం వినియోగదారుల జీవన ప్రమాణాన్ని ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా మెరుగుపరుస్తుంది.
  6. వర్తకం వస్తువులకు స్థాన ప్రయోజనాన్ని కలిపిస్తుంది.

ప్రశ్న 2.
ఉత్పత్తిదారులకు టోకు వర్తకుడు అందజేసే సేవలను పేర్కొనండి.
జవాబు.
ఉత్పత్తిదారునికి టోకు వర్తకుడు అందజేసే సేవలు:

  1. భారీ స్థాయి ఉత్పత్తికి అవకాశమివ్వడం.
  2. నష్టభయాన్ని పంచటం / బదిలీ చేయటం.
  3. ముందు చెల్లింపులు చేయటం ద్వారా ఆర్థిక సహాయం.
  4. మార్కెట్ స్థితిగతుల గురించి సలహాలివ్వటం.
  5. స్థాన అవరోధాన్ని తొలగించటం.
  6. అవిచ్ఛిన్న ఉత్పత్తికి దోహదపడటం.
  7. పంపిణీ బాధ్యతను నిర్వర్తించటం, తద్వారా ఉత్పత్తిదారుని వస్తు ఉత్పత్తిపై దృష్టి ఉంచేటట్లు చూడటం.
  8. గిడ్డంగిలో వస్తువులను నిల్వచేసే భారాన్ని తగ్గించటం.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

ప్రశ్న 3.
ఉత్పత్తిదారులకు చిల్లర వర్తకుడు అందజేసే సేవలేవి ?
జవాబు.
చిల్లర వర్తకుడు ఉత్పత్తిదారునికి అందిచే సేవలు:

  1. వస్తువుల కోసం ఒక సిద్ధంగా ఉన్న మార్కెట్ను తయారుచేయడం (ఏర్పాటుచేయడం).
  2. ఉత్పత్తిదారునికి, మార్కెట్ పరిశోధనకర్తలకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందజేయడం
  3. నష్టభయాన్ని భరించడం/నష్ట భయాన్ని పంచడం.
  4. వస్తువులకు వివిధ ప్రాంతాలకు, మార్కెట్లోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయడం.

ప్రశ్న 4.
సెజ్ (SEZ) ధ్యేయాలను పేర్కొనండి.
జవాబు.

  1. సెజ్ అనగా “ప్రత్యేక ఆర్ధిక క్షేత్రాలు/ప్రత్యేక ఆర్ధిక మండలాలు.
  2. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడానికి “ప్రత్యేక” ఆర్థిక క్షేత్రాల SEZ భావన ప్రవేశపెట్టబడినది.
  3. ఈ క్షేత్రాలలో వ్యాపార, వర్తక చట్టాలు ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి.

సెజ్ ధ్యేయాలు:
సెజ్ల ప్రధాన ధ్యేయాలు క్రింది పేర్కొన్న విధంగా ఉంటాయి.

  1. అదనపు ఆర్థిక కార్యకలాపాల ఉత్పాదన.
  2. వస్తువుల, సేవల ఎగుమతుల పెరుగుదల.
  3. స్వదేశీ, విదేశీ మార్గాల ద్వారా పెట్టుబడిని ప్రోత్సహించటం.
  4. ఉద్యోగ అవకాశాలను సృష్టించడం.
  5. అవస్థాపనకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపరచటం.

ప్రశ్న 5.
సెజ్ (SEZ) ప్రయోజనాలను వివరించండి.
జవాబు.
సెజ్ ప్రధానమైన ప్రయోజనాలు క్రింది విధంగా ఉంటాయి.
ఎ) ఉద్యోగాల కల్పన:సెజ్లు ఉద్యోగాలను సృష్టించడం కోసం అత్యధిక పటిష్టమైన సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి.

బి) ఆర్థికాభివృద్ధి:సెజ్లను ఆర్థికాభివృద్ధికి సంబంధించిన యంత్రాలుగా చూడవచ్చు. సెజ్లను వాస్తవమైన స్ఫూర్తితో అమలు జరిపితే భారతదేశాన్ని ఒక రూపాంతరం చెందిన ఆర్థికవ్యవస్థగా చేయవచ్చు.

సి) శ్రామిక సాంద్రత గల ఉత్పత్తి పరిశ్రమ యొక్క పెరుగుదల:సెజ్ల స్థాపనతో, దేశంలో శ్రామికశక్తితో కూడుకున్న వస్తూత్పత్తి సేవా పరిశ్రమల వేగవంతమైన అభివృద్ధికి దారితీస్తుంది.

డి) సమతౌల్యమైన ప్రాంతీయాభివృద్ధి: సెజ్ల సహాయంతో సమతౌల్యమైన ప్రాంతీయ అభివృద్ధిని సాధించడానికి ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు రూపొందించబడ్డాయి.

ఇ) సామర్థ్యాన్ని పెంపొందించటం:దృఢమైన సామర్థ్య పెంపుదలకు సెజ్లు ప్రధానమైనవిగా ఉంటాయి,

ఎఫ్) ఎగుమతి నిర్వహణ:ఒక దేశం ఎగుమతి నిర్వహణలో సుంకాలు, ఇతర వర్తక అవరోధాల ద్వారా, కార్పొరేట్ పన్ను విధానం మితిమీరిన ఉద్యోగిస్వామ్యం ద్వారా ఎదురయ్యే వికృత మార్పులను తొలగించడానికి, సెజ్లు క్రియాశీలతను ప్రేరేపిస్తాయి.

ప్రశ్న 6.
విభాగ విక్రయశాలల ప్రయోజనాలు, నష్టాలను రాయండి.
జవాబు.
విభాగ విక్రయశాలలు, అనగా ఒక యాజమాన్యం క్రింద అనేక విభాగాలను కలిగి ఉన్న ఒక పెద్ద తరహా చిల్లర వర్తక వ్యవస్థగా చెప్పవచ్చు. ప్రతీ విభాగం, ఒక ప్రత్యేక లేదా ఒక శ్రేణి గల వస్తువులతో ప్రావీణ్యత సాధించిన వాటిని విక్రయిస్తుంది. విభాగ విక్రయశాలలకు క్రింది ప్రయోజనాలు, లోపాలు ఉంటాయి.
ప్రయోజనాలు

  1. ఇది ఒక కేంద్రీయ స్థానంలో ఏర్పాటు చేయబడి వినియోగదారునికి అందుబాటులో ఉంటాయి.
  2. ఇది వివిధ రకాలైన వస్తువులను ఒకే యాజమాన్యం క్రింద ప్రత్యేకత సాధించిన రీతిలో విక్రయిస్తుంది. ఆ ప్రకారంగా ఇది కొనుగోలు దారుకు అనుకూలంగా ఉంటుంది.
  3. ఇది భారీస్థాయి పంపిణీ ఆదాలను పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. 4. ఇది మధ్యవర్తులను తొలగించడానికి సహాయపడుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

లోపాలు/నష్టాలు.

  1. విభాగ విక్రయశాలల నిర్వహణ వ్యయాలు ఆధికంగా ఉంటాయి.
  2. విక్రయశాలల పరిమాణం పెద్దదిగా ఉన్న కారణంగా కొన్ని సమయాలలో ఆయా విభాగాలకు వ్యక్తిగత దృష్టిని ఆకర్షించడానికి కష్టతరమవుతుంది.
  3. భారీ స్థాపన ఖర్చులు, భారీ నిర్వహణ మూలధన అవసరాల వల్ల సాధారణంగా ధరలు అధికంగా ఉంటాయి.
  4. దీనికి భారీ మూలధనం అవసరమవుతుంది. సాధారణంగా విభాగ విక్రయశాలలు సుదూరమైన ఆడంబర ప్రదేశాలలో నెలకొల్పారు. దాని వల్ల మధ్య తరగతి గృహాలున్న ప్రదేశాలలో నివసించే వ్యక్తులు, ఈ విక్రయశాలలను చేరుకోవటం కష్టతరం కావచ్చు.

ప్రశ్న 7.
బహుళ విక్రయశాలల ప్రయోజనాలు, నష్టాలు ఏవి ?
జవాబు.
ఒక నిర్ధిష్టమైన ప్రదేశం లేదా పట్టణం లేదా నగరం యొక్క వివిధ ప్రాంతాలలో ప్రామాణీకృత వస్తువులను విక్రయించే ఒకే రకమైన దుకాణాలను, బహుళ విక్రయశాలలంటారు. బహుళ విక్రయశాలలకు కొన్ని ఉదాహరణలుగా బాస్కిన్ రాబెన్స్, బాంబే డైయింగ్ను చెప్పవచ్చు. బహుళ విక్రయశాలలు క్రింది ప్రయోజనాలు, లోపాలు కలిగి ఉంటాయి.

I ప్రయోజనాలు

  1. ఇవి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి.
  2. ఇవి ప్రామాణీకృత వస్తువులను విక్రయిస్తాయి.
  3. ఖాతాదారులు ఈ సంస్థల పట్ల అత్యంత విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే, ఇవి ఎక్కడయినా, ఒకే రకమైన సంస్థలుగా నిర్వహించబడతాయి.
  4. ఇవి మధ్యవర్తులను తొలగించడానికి సహాయపడతాయి.
  5. ఇవి శ్రమ విభజన చేయడంలో, ప్రత్యేకీకరణ సాధించే విషయంలో సహాయపడతాయి.

II లోపాలు

  1. వీటి నిర్వహణ ఖర్చులు ఆధికంగా ఉంటాయి.
  2. ఇవి పరిమిత రకాలైన వస్తువులను విక్రయిస్తాయి.
  3. వీటికి నిల్వచేసే సౌకర్యాలు ఉండవు. వీటికి భారీ మూలధనం అవసరమవుతుంది.
  4. బహుళ విక్రయ శాలల నిర్వాహణకు భారీ మూలధనం అవసరం అవుతుంది.

ప్రశ్న 8.
పోస్టు ద్వారా వర్తకం లాభనష్టాలు ఏమిటో తెలపండి.
జవాబు.
పోస్టు ద్వారా వర్తకం ప్రయోజనాలు/లాభాలు:

  1. దీనికి అవసరమయ్యే మూలధనం సాపేక్షికంగా తక్కువగా ఉంటుంది.
  2. వస్తువులను కొనుగోలు చేయడం, అమ్మడం రెండింటిలో అనుకూలత ఉంటుంది.
  3. వస్తువులు సరసమైన ధరలతో లభ్యమవుతాయి.
  4. వీటి నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి.
  5. ఈ వర్తకంలో మధ్యవర్తులను తొలగించడం జరుగుతుంది.

పోస్టు ద్వారా వర్తకం లోపాలు/నష్టాలు:

  1. ఇది కొనుగోలుదారును సంతృప్తిపరచడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే, కొనుగోలుదారుడు వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత మాత్రమే, వస్తువులను పరిశీలించే వీలుంటుంది.
  2. వీటికి సమర్థవంతమైన నిర్వహణ లోపిస్తుంది.
  3. వీటికి నిల్వచేసే సౌకర్యం లోపిస్తుంది.
  4. ఎలక్ట్రానిక్ చిల్లర వర్తకం, ఎలక్ట్రానిక్ వాణిజ్యం పోస్టు ద్వారా చేసే చిల్లర వ్యాపారాన్ని అధిగమించింది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
టోకు వర్తకుడు చిల్లర వర్తకునికి అందించే సేవలు ఏమిటి ?
జవాబు.
చిల్లర వర్తకునికి అందించే సేవలు:

  1. సమయానుకూలంగా వస్తువులు లభ్యమయ్యేటట్లు చూడటం.
  2. క్రయవిక్రయాలు జరపడానికి మద్దతు ఇవ్వడం.
  3. అరువు (రుణ) సౌకర్యాలను అనుమతించడం.
  4. వస్తువులకు సంబంధించిన ప్రత్యేక పరిజ్ఞానాన్ని అందించడం.
  5. నష్టభయాన్ని చేపడుతూ, నష్ట భయాన్ని పంచిపెట్టడం.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

ప్రశ్న 2.
వర్తకంను ఎలా వర్గీకరించవచ్చు ?
జవాబు.

  1. ద్రవ్యానికి లేదా ద్రవ్యానికి సమానమైన విలువతో వస్తువులను, సేవలను కొనడం, అమ్మకం చేయడాన్ని “వర్తకం” అంటారు.
  2. భౌగోళిక సరిహద్దుల ఆధారంగా వర్తకాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
    a) స్వదేశీ వర్తకం/అంతర్గత వర్తకం
    b) విదేశీ వర్తకం/అంతర్జాతీయ వర్తకం..
  3. ఒకేదేశ భౌగోళిక సరిహద్దులలో నిర్వహించే వర్తకాన్ని స్వదేశీ వర్తకం అంటారు. స్వదేశీ వర్తకాన్ని మళ్ళీ ఇ) టోకు వర్తకం మరియు b) చిల్లర వర్తకంగా విభజించవచ్చు.
  4. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య కొనుగోలు, అమ్మకాలు జరిగితే దానిని విదేశీ వర్తకం అంటారు. విదేశీ వర్తకాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
    1. ఎగుమతి వర్తకం
    2. దిగుమతి వర్తకం
    3. మారు వర్తకం.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం 1

ప్రశ్న 3.
చిల్లర వర్తకుడు వినియోగదారులకు ఎలాంటి సేవలు అందిస్తాడు ?
జవాబు.
వినియోగదారులకు అందించే సేవలు:

  1. వస్తువులను త్వరితంగా, సమయానికి సప్లయి చేయడం.
  2. వస్తువులను విస్తృతమైన రకాలలో లభ్యమయ్యేటట్లు చూడటం.
  3. ఖాతాదారులకు నిపుణతతో కూడుకొన్న మార్గదర్శకత్వాన్ని అందించడం.
  4. వినియోగదారులకు ముఖాముఖి సంభాషణతో పాటు, వస్తు ప్రదర్శన ఏర్పాటు చేయడం.
  5. విక్రయానంతర సేవ గృహం వద్ద బట్వాడా.
  6. అనువైన మొత్తాలలో లేదా పరిమాణాలలో వస్తువులను సప్లయి చేయడం.
  7. అనుకూలమైన స్థానం/ప్రాంతంలో ఏర్పాటవడం.
  8. అరువు (రుణ) సౌకర్యాలను అనుమతించడం.

ప్రశ్న 4.
స్వదేశీ వర్తకం లక్షణాలు ఏమిటి ?
జవాబు.
అంతర్గత వర్తకానికి కింద పేర్కొన్న లక్షణాలు ఉంటాయి:

  1. ఒక దేశపు సరిహద్దులలో వస్తువుల కొనుగోళ్ళు, అమ్మకాలు జరుగుతాయి.
  2. స్వదేశంలోగల కొనుగోలుదారు వస్తు ధర చెల్లింపును అమ్మకందారుకు స్వదేశీ ద్రవ్య రూపంలో జరుపుతాడు.
  3. వర్తకుడు కొన్ని లాంఛనాలను (నియమాలను) మాత్రమే. పూర్తిచేయాల్సిన ఆవశ్యకతతో ఉంటాడు.
  4. వస్తువు లక్షణాలపై ఖాతాదారులకు పూర్తి అవగాహన ఉంటుంది.
  5. విస్తృతంగా విస్తరించబడి ఉన్న స్థానికత సాధించిన స్వదేశీ మార్కెట్ల నుంచి, వస్తు డిమాండులో సంభవించే మార్పుల కారణంగా, నష్టభయం అధికంగా ఉంటుంది.
  6. విదేశీ వర్తకంతో సరిపోల్చినప్పుడు, దేశ రాజకీయ, న్యాయాత్మక, సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక పరిసరాల ప్రభావం తక్కువగా ఉంటుంది.
  7. స్వదేశీ వినియోగదారుల అవసరాల ప్రకారం వస్తువులను తయారు చేయడం జరుగుతుంది. కొనుగోలుదారుల వద్ద నుంచి నిర్దిష్టమైన సలహాలను స్వీకరించరు.
  8. స్వదేశీ రవాణా పద్ధతిని మాత్రమే ఉపయోగిస్తూ, వస్తువు ఉత్పత్తయ్యే స్థానం నుంచి, వినియోగించబడే స్థానం వరకు, వస్తు ప్రవాహాన్ని కల్పించడం.

ప్రశ్న 5.
సంచార వర్తకులు అంటే ఎవరు ?
జవాబు.

  1. వస్తువుల విక్రయానికి ఎలాంటి స్థిరమైన ప్రదేశం లేని చిల్లర వర్తకులను “సంచార చిల్లర వర్తకులు” అంటారు.
  2. సంచార వర్తకులకు ఉదాహరణ:వీధి విక్రయదారులు, వీధి దుకాణాలు, నియత కాలిక సంచారకులు, చౌకధరల విక్రయదారులు.
  3. వివిధ రకాల సంచార చిల్లర వర్తకులను కింద వివరించడమైనది.
    A) వీధి విక్రయదారులు:ఈ రకపు సంచార వర్తకులు తమ ఖాతాదారులను వెతికే ఉద్దేశంతో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తిరుగుతారు. వీరు సాధారణంగా స్వల్పవెల కలిగిన వస్తువులను అమ్ముతారు.
    B)నియత కాలిక సంచారకులు:నియత కాలిక సంచారకులు క్రమబద్ధంగా లభ్యమయ్యే వస్తువులతో కొన్ని సందర్భాలకు అనుకూలించే వస్తువులతో వ్యాపారం సాగిస్తారు. దీనిని స్థానిక పరిభాషలో “సంత” లేదా “వారానికొకసారి జరిపే మార్కెట్” అంటారు.
    C) వీధి దుకాణాలు:పట్టణ ప్రాంతాలలో వీధి వర్తకులు తమ వస్తువులను కాలి బాటలపై వివిధ ప్రాంతాల వీధి మూలలో ప్రదర్శనకు ఉంచుతారు. వీరు సాధారణంగా తమ వ్యాపారాన్ని రైల్వేస్టేషన్, ఫుట్పాత్, వీధి మూలభాగాలు, తదితర సార్వజనీన ప్రదేశాల దగ్గర నిర్వహిస్తారు.
    D) చౌక ధర విక్రయదారులు:చౌక ధర విక్రయదారులు, ఒక నిర్ధిష్టమైన కాలానికి సంబంధించి, అద్దెపై తీసుకున్న చిన్న దుకాణాల నుంచి, తమ వ్యాపారాన్ని నిర్వహిస్తారు. ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో తమ వర్తకం సక్రమంగా జరగడం లేదని భావించిన వెంటనే మరొక ప్రాంతానికి తరలి వెళ్ళిపోతారు.

ప్రశ్న 6.
వినియోగదారుల సహకార విక్రయశాలల లాభనష్టాలు ఏమిటి ?
జవాబు.
వినియోగదారుల సహకార విక్రయశాలలు:

  1. కొనడానికి, అమ్మడానికి, సహకార సూత్రాలపై ఆధారపడి ఏర్పడిన, ఒక ఐచ్ఛికమైన వ్యక్తుల సముదాయాన్ని ఒక వినియోగదారుల సహకార విక్రయశాలగా” నిర్వచించవచ్చు.
  2. వినియోగదారుల సహకాక విక్రయశాల కింద పేర్కొన్న ప్రయోజనాలను, లోపాలను, కలిగి ఉంటుంది.

I. ప్రయోజనాలు / లాభాలు:

  1. వీటిలో అవసరమయ్యే మూలధనం సాపేక్షికంగా తక్కువగా ఉంటుంది.
  2. విక్రయశాలలో కొనడం, అమ్మడం, రెండింటిలో కూడా అనుకూలత ఉంటుంది.
  3. వీటిలో వస్తువులు సరసమైన ధరలకు లభ్యమవుతాయి.
  4. వీటి నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి.
  5. విక్రయశాలల నుంచి మధ్యవర్తులను తొలగించడం జరుగుతుంది.
  6. వీటి ద్వారా పెద్ద తరహా పంపిణీ యొక్క ఆదాలు లభ్యమవుతాయి.
  7. సహకార సంఘాలు ప్రభుత్వం నుంచి కొన్ని లాభాలను ప్రోత్సాహకాలను అనుభవిస్తాయి.

II. లోపాలు/నష్టాలు:

  1. వీటిలో మూలధనం పరిమితంగా ఉంటుంది.
  2. వీటిలో సమర్థవంతమైన నిర్వహణ లోపిస్తుంది.
  3. వీటికి నిల్వ చేసే సౌకర్యం లోపిస్తుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

ప్రశ్న 7.
SEZ ల ద్వారా కవర్ చేయబడే జోన్లు ఏమిటి ?
జవాబు.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడానికి ‘ప్రత్యేక ఆర్థిక క్షేత్రాల’ భావన ప్రవేశ పెట్టబడింది. ప్రత్యేక ఆర్థిక క్షేత్రాలకు సంబంధించిన చట్టాలు, ప్రోత్సాహకాలను రాష్ట్రాలు కాలానుగుణంగా ప్రకటించాయి.
సెజ్ల కింద ఉండే మండలాలు/జోన్లు:

  1. ఉచిత వర్తక మండలాలు
  2. ఎగుమతుల ప్రోసెసింగ్ క్షేత్రాలు
  3. స్వతంత్ర క్షేత్రాలు
  4. పారిశ్రామిక సముదాయాలు
  5. స్వేచ్ఛాపూర్వక ఓడరేవులు
  6. పట్టణ సంస్థల క్షేత్రాలు

తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రింది రంగాలకు సంబంధించి 29 SEZ లు ఉన్నాయి:

  1. బయోటెక్నాలజి
  2. సమాచార, సాంకేతిక ఆధార సేవలు
  3. ఔషధ సూత్రీకలు
  4. ఏరోస్పేస్, ప్రిసిషన్ ఇంజనీరింగ్
  5. ఎలక్ట్రానిక్, హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్.

అదనపు సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అంతర్జాతీయ వర్తకం (విదేశీ వర్తకం).
జవాబు.
అంతర్జాతీయ/విదేశీ వర్తకం:

  1. రెండు లేదా అంతకుమించిన దేశాల వర్తకుల మధ్య కొనుగోలు, అమ్మకం జరపడాన్ని అంతర్జాతీయ వర్తకం అంటారు. “విదేశీ వర్తకం” అని కూడా పిలువవచ్చు.
  2. విదేశీ వర్తకాన్ని మళ్లీ ఎగుమతి వర్తకం, దిగుమతి వర్తకం, మారు వర్తకంగా ఉపవిభజన చేయవచ్చు.

ఎ) ఎగుమతి వర్తకం:

  1. ఒక నిర్దిష్టమైన దేశానికి చెందిన అంటే స్వదేశానికి చెందిన ఒక వర్తకుడు తన వస్తువులను మరొక దేశంలో నివసిస్తున్న ఒక వర్తకునికి లేదా ఒక ఖాతాదారునికి అమ్మినప్పుడు, దానినే ‘ఎగుమతి వర్తకం’ అని అంటారు.
  2. ఉదా: భారతదేశానికి చెందిన ఒక వర్తకుడు తన వస్తువులను, ఇరాన్ లోని ఒక ఖాతాదారుకు విక్రయించడం.

బి) దిగుమతి వర్తకం:

  1. ఒక వర్తకుడు స్వదేశంలో తన వర్తకాన్ని నిర్వహిస్తూ, మరొక దేశంలో నివసిస్తున్న ఒక వర్తకుని వద్ద నుంచి వస్తువులను కొనుగోలు చేయడాన్ని, దానినే ‘దిగుమతి వర్తకం’ అని అంటారు.
  2. ఉదా:భారతదేశం నుంచి ఒక వర్తకుడు సింగపూర్కు చెందిన ఒక వర్తకుని వద్ద నుంచి వస్తువులను కొనుగోలు చేయడం.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అంతర్గత (స్వదేశీ) వర్తకం.
జవాబు.

  1. ఒక నిర్దిష్టమైన దేశ భౌగోళిక సరిహద్దులోపల నిర్వహించే వర్తకాన్ని అంతర్గత వర్తకం అంటారు. దీనినే “స్వదేశీ వర్తకం” అని కూడా అంటారు.
  2. అంతర్గత వర్తకాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.’ అవి: A) టోకు వర్తకం B) చిల్లర వర్తకం.

ప్రశ్న 2.
టోకు వర్తకం.
జవాబు.

  1. వస్తువులను అధిక పరిమాణంలో కొనుగోలు చేసి చిన్న పరిమాణాలలో చిల్లర వర్తకులకు అమ్మడాన్ని టోకు వర్తకం అంటారు.
  2. టోకు వర్తకుడు ఉత్పత్తిదారునికి, చిల్లర వర్తకునికి మధ్య వారధిగా ఉంటాడు,

ప్రశ్న 3.
చిల్లర వర్తకం.
జవాబు.

  1. టోకు వర్తకుని నుండి వస్తువులను కొనుగోలుచేసి అతిస్వల్ప పరిమాణాలలో తుది వినియోగదారులకు అమ్మడాన్ని చిల్లర వర్తకం అంటారు.
  2. చిల్లర వర్తకుడు టోకు వర్తకునికి, వినియోగదానికి మధ్యగా ఉంటాడు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

ప్రశ్న 4.
సంచార వర్తకులు.
జవాబు.

  1. వస్తువుల విక్రయానికి ఎలాంటి స్థిర ప్రదేశంలేని చిల్లర వర్తకులను “సంచార చిల్లర వర్తకులు” అంటారు.
  2. వివిధ రకాల సంచార వర్తకులు:వీధి విక్రయాదారులు, వీధి దుకాణాలు, నియతకాలిక సంచారకులు, చౌక ధర విక్రయాలు.

ప్రశ్న 5.
వీధుల వెంట తిరిగి అమ్మే వ్యక్తులు (వీధి విక్రయదారులు).
జవాబు.
వీధి విక్రయదారులు:

  1. ఈ రకపు సంచార వర్తకులు తమ ఖాతాదారులను వెతికే ఉద్దేశంతో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తిరుగుతారు.
  2. ఈ వీధుల వెంట తిరిగి విక్రయించే వ్యక్తుల ప్రధాన లక్షణాలు కింది విధంగా ఉంటాయి:
    a) వారు కూరగాయలు, రకరకాల ఆట బొమ్మలు, పూవులు మొదలైన స్వల్ప వెల కలిగిన వస్తువులను అమ్ముతారు.
    b) వారు సాధారణంగా వ్యాపార చిహ్నం (గుర్తింపు) లేదా స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులను విక్రయిస్తారు.

ప్రశ్న 6.
నియత కాలిక సంచారకులు.
జవాబు.
నియత కాలిక సంచారకులు:
1) నియతకాలిక సంచారకులు క్రమబద్ధంగా లభ్యమయ్యే వస్తువులతో, కొన్ని సందర్భాలకు అనుకూలించే వస్తువులతో వ్యాపారం సాగిస్తారు. స్థానిక పరిభాషలో, దీన్ని ‘సంత’ లేదా “వారానికొకసారి జరిపే మార్కెట్” అంటారు.

  1. అంతర్గత (స్వదేశీ) వర్తకం.
  2. టోకు వర్తకం.

2) ఈ నియతకాలిక సంచార వర్తకుల లక్షణాలు కింది విధంగా ఉంటాయి:

  • వారు సాధారణంగా తమ వస్తువులను వివిధ మార్కెట్లలో వారంలో ఒకరోజు చొప్పున విక్రయిస్తారు.
  • వారు దీపావళి సందర్భంగా మట్టితో తయారు చేసే వస్తువులు, సంక్రాంతి సమయంలో గాలి పటాలు మొదలైన సందర్భాలలో వినియోగించే వస్తువులను అమ్మడానికి కూడా దుకాణాలను స్థాపిస్తారు.

ప్రశ్న 7.
వీధి విక్రయశాలలు.
జవాబు.

  1. ఈ రకపు చిల్లర వర్తకులు తమ వస్తువులను బల్లలపై ప్రదర్శించడం లేదా గుడారాల కింద ఉంచుతారు. కాబట్టి వీటిని ‘వీధి విక్రయశాలలుగా’ పిలుస్తారు.
  2. ఈ వీధి విక్రయశాలల లక్షణాలు కింది విధంగా ఉంటాయి:
    • ఈ దుకాణాలను పరిమిత స్థలంలో ఏర్పాటు చేస్తారు.
    • ఇవి తమ వస్తువులను ప్రత్యేకంగా తయారు చేసిన అరలలో లేదా బల్లలపై ప్రదర్శిస్తారు.

ప్రశ్న 8.
చౌకధర విక్రయదారులు.
జవాబు.

  1. చౌకధర విక్రయదారులు, ఒక నిర్దుష్టమైన కాలానికి సంబంధించి, అద్దెపై తీసుకున్న చిన్న దుకాణాల నుంచి, తమ వ్యాపారాన్ని నిర్వహిస్తారు.
  2. ఈ రకపు సంచార వర్తకం లక్షణాలు ఈ ప్రకారంగా ఉంటాయి.
    • వారు తమ వర్తకాన్ని అద్దెపై తీసుకున్న చిన్న దుకాణాల ద్వారా నిర్వహిస్తారు.
    • ఒక నిర్దుష్టమైన ప్రాంతంలో తమ వర్తకం సక్రమంగా జరగడం లేదని భావించిన వెంటనే మరొక ప్రాంతానికి తరలి వెళ్లిపోతారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

ప్రశ్న 9.
స్థిర దుకాణా చిల్లర వర్తకులు.
జవాబు.

  1. వస్తు విక్రయానికి సంబంధించి ఒక స్థిరమైన ప్రదేశం కలిగి ఉన్న చిల్లర వర్తకులను ‘స్థిర దుకాణ చిల్లర వర్తకులు’గా చెప్పవచ్చు.
  2. వారిని మళ్ళీ “చిన్న తరహా స్థిర చిల్లర స్థాయి దుకాణాలు, “పెద్ద తరహా స్థిర దుకాణాలు” గా వర్గీకరించవచ్చు.

ప్రశ్న 10.
సాధారణ విక్రయశాలలు.
జవాబు.

  1. వీటిని సాధారణంగా నివాసయోగ్యమైన ప్రాంతాలలో చిన్న దుకాణాలుగా, సంస్థలుగా నెలకొల్పుతారు. ఇవి సాధారణంగా అత్యవసర వస్తువులను విక్రయిస్తాయి.
  2. సాధారణ విక్రయశాల లక్షణాలు:
    • ఇవి అనేక రకాలైన వినియోగదారుల వస్తువులతో వ్యవహరిస్తాయి.
    • ఇవి వస్తువుల నగదుపై, అరువు ఆధారంగా కూడా వ్యవహరిస్తాయి.

ప్రశ్న 11.
ఏకైక వస్తుశ్రేణి విక్రయశాలలు.
జవాబు.

  1. ఒకే రకపు/ఒకే విధమైన వస్తువులతో వ్యాపారాన్ని నిర్వహించే చిల్లర వర్తకులను ఏకైక వస్తుశ్రేణి విక్రయశాలలు అంటారు.
  2. ఈ విక్రయశాలల్లో ఒకే శ్రేణిలో వివిధ రకాలైన వస్తువులు అమ్ముతారు. ఉదాహరణకు కూరగాయలు, బేకరి వస్తువులు, పాదరక్షలు, ప్లాస్టిక్ వస్తువులు మొదలైన వస్తువులతో వ్యాపారాన్ని నిర్వహిస్తారు.

ప్రశ్న 12.
ప్రత్యేకత సాధించిన విక్రయశాలలు.
జవాబు.
ప్రత్యేకత కలిగిన విక్రయశాలలు:

  1. ప్రత్యేకత కలిగిన విక్రయశాల, ఒక ప్రత్యేక రకానికి చెందిన వస్తువులతో వ్యాపారం చేస్తుంది. ఇవి ఒకే రకపు వస్తువులను మాత్రమే విక్రయించే ప్రత్యేకతను (ప్రావీణ్యత) కలిగి ఉంటాయి.
  2. ఉదాహరణకు, రొట్టెను విక్రయించే ఒక చిల్లర వర్తకుడ, మోడ్రన్, బ్రిటానియా, స్పెన్సర్, హెరిటేజ్ లాంటి వివిధ కంపెనీలు తయారు చేసిన రొట్టెలను విక్రయించవచ్చు.

ప్రశ్న 13.
వీధి దుకాణాలు..
జవాబు.
పట్టణ ప్రాంతాలలో వీధి వర్తకులు తమ వస్తువులను కాలిబాటలపై, వివిధ ప్రాంతాల వీధి మూలలలో ప్రదర్శనకు ఉంచుతారు. వారు సాధారణంగా తమ వ్యాపారాన్ని రైల్వేస్టేషన్లు, వీధి మూలభాగాలు, తదితరమైన సార్వజనీన ప్రదేశాల దగ్గర నిర్వహిస్తారు.

ప్రశ్న 14.
ఒకసారి ఉపయోగించిన వస్తు విక్రయశాలలు.
జవాబు.
ఒకసారి ఉపయోగించిన వస్తువుల దుకాణాలు లోగడవాడిన వస్తువులతో లేదా పాత వస్తువులతో వ్యాపారం చేస్తారు. వీరు ఒకసారి ఉపయోగించిన వస్తువులతో వ్యాపారం నిర్వహిస్తారు. అందువల్ల వస్తువులను తక్కువ ధరకు అమ్ముతారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

ప్రశ్న 15.
లోపాలున్న వస్తువు విక్రయించే దుకాణాలు.
జవాబు.

  1. నాణ్యత లోపించిన, లోపాలున్న వస్తువులను విక్రయించే దుకాణాలను లోపాలున్న వస్తువు విక్రయించే దుకాణాలు అంటారు.
  2. లోపాలున్న వస్తువులను డిస్కౌంట్ చేసిన ధరకు విక్రయిస్తారు.

ప్రశ్న 16.
పెద్ద తరహా స్థిరమైన చిల్లర దుకాణాలు.
జవాబు.
పెద్ద తరహా స్థిరమైన చిల్లర వర్తకులు భారీ స్థాయిలో వ్యాపారాన్ని నిర్వహిస్తారు. వాటిని అధిక పెట్టుబడితో నెలకొల్పుతారు. అవి భారీ మొత్తంలో గల వస్తువులతో వ్యాపారాన్ని నిర్వహిస్తాయి. ఈ చిల్లర వ్యాపార సంస్థలకు, విక్రయశాలల ఏర్పాటుకు అధిక మొత్తాలు అవసరమవుతాయి.
ఉదా:బహుళ విక్రయశాలలు, విభాగ విక్రయశాలలు మొదలైనవి.

ప్రశ్న 17.
బహుళ విక్రయశాలలు.
జవాబు.

  1. ఒక నిర్దుష్టమైన ప్రదేశం లేదా పట్టణం లేదా నగరం యొక్క వివిధ ప్రాంతాలలో ప్రామాణీకృత వస్తువులను విక్రయించే ఒకే రకమైన దుకాణాలను, బహుళ విక్రయశాలలంటారు.
  2. బహుళ విక్రయశాలలకు కొన్ని ఉదాహరణలుగా బాస్కిన్ రాబిన్స్, బాంబే డైయింగ్ను చెప్పవచ్చు.

ప్రశ్న 18.
వినియోగదారుల సహకార విక్రయశాలలు.
జవాబు.

  1. వస్తువులను కొనడానికి, అమ్మడానికి, సహకార సూత్రాలపై ఆధారపడి ఏర్పడిన ఒక ఐచ్ఛికమైన వ్యక్తుల సముదాయాన్ని “వినియోగదారులు సహకార విక్రయశాలలు” అంటారు.
  2. వీటి నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి మరియు వీటికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి.

ప్రశ్న 19.
SEZ (సెజ్).
జవాబు.

  1. సెజ్ అనగా ప్రత్యేక ఆర్థిక క్షేత్రాలు/ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు.
  2. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడానికి సెజ్లను ప్రవేశపెట్టారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 7 అంతర్గత వర్తకం

ప్రశ్న 20.
మారువర్తకం.
జవాబు.

  1. ఒకదేశం నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను వేరే దేశానికి ఎగుమతి చేయడాన్ని మారు వర్తకం అంటారు.
  2. సూక్ష్మంగా చెప్పాలంటే, దిగుమతి చేసుకున్న వస్తువులను తిరిగి ఎగుమతి చేసే పద్ధతినే మారువర్తకం అంటారు.

Leave a Comment