Telangana SCERT 9th Class Telugu Grammar Telangana తెలుగు వ్యాకరణం Questions and Answers.
TS 9th Class Telugu Grammar Questions and Answers
సంధులు
పాఠంలోని ముఖ్య సంధి పదాలు :
1) విమానాశ్రయం = విమాన + ఆశ్రయం = సవర్ణదీర్ఘ సంధి
 2) శరీరాకృతి = శరీర + ఆకృతి = సవర్ణదీర్ఘ సంధి
 3) మహోన్నత = మహా + ఉన్నత = గుణసంధి
 4) ప్రత్యర్థి = ప్రతి + అర్థి = యణాదేశ సంధి
 5) ఒక్కొక్క = ఒక్క + ఒక్క = ఆమ్రేడిత సంధి
 6) జీవితాన్నంతా = జీవితాన్ని + అంతా = ఇత్వ సంధి
 7) చెప్పినప్పటికీ = చెప్పిన + అప్పటికీ = అత్వసంధి
 8) జ్ఞాపకముండడం = జ్ఞాపకము + ఉండడం = ఉత్వసంధి
 9) ఎట్లని = ఎట్లు + అని = ఉత్వసంధి
 10) కాలమంటూ = కాలము + అంటూ = ఉత్వసంధి
 11) వరుగులయ్యే = వరుగులు + అయ్యే = ఉత్వసంధి
 12) ఏమని = ఏమి + అని = ఇత్వ సంధి
 13) కాదనుకున్నాడు = కాదు + అనుకున్నాడు = ఉత్వసంధి
 14) పిల్లలందరూ = పిల్లలు + అందరూ = ఉత్వసంధి
 15) కలహాగ్నులు = కలహ + అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి
 16) వేంకటేశ్వరా = వేంకట + ఈశ్వరా = గుణసంధి
 17) యోధులనేకులు = యోధులు + అనేకులు = ఉత్వసంధి
 18) కుండల మొప్పు = కుండలము + ఒప్పు = ఉత్వసంధి
 19) కోపోద్రిక్తులు = కోప + ఉద్రిక్తులు = గుణసంధి
![]()
20) సత్యాహింసలు = సత్య + అహింసలు = సవర్ణదీర్ఘ సంధి
 21) ప్రాణాలర్పించడం = ప్రాణాలు + అర్పించటం = ఉత్వసంధి
 22) జగములేలు = జగములు + ఏలు = ఉత్వసంధి
 23) ఇన్నెలంత = ఈ + నెలంత = త్రికసంధి
 24) నీరాట = నీరు + ఆట = ఉత్వసంధి
 25) విషాదాంతం = విషాద + అంతం = సవర్ణదీర్ఘ సంధి
 26) మేమెంత = మేము + ఎంత = ఉత్వసంధి
 27) విచిత్రమైన = విచిత్రము + ఐన = ఉత్వసంధి
 28) అపార్థం = అప + అర్థం = సవర్ణదీర్ఘ సంధి
 29 గొంతెత్తి = గొంతు + ఎత్తి = ఉత్వసంధి
 30) కళోపాసనం = కళా + ఉపాసనం = గుణసంధి
 31) రసానందం = రస + ఆనందం = సవర్ణదీర్ఘ సంధి
 32) ఉన్నతమైన = ఉన్నతము + ఐన = ఉత్వసంధి
 33) దినములెన్ని = దినములు + ఎన్ని = ఉత్వసంధి
 34) రోజులు + ఐనా = రోజులైనా = ఉత్వసంధి
 35) ఆదర + అభిమానం = ఆదరాభిమానాలు = సవర్ణదీర్ఘ సంధి
 36) లేదనక + ఉండ = లేదనకుండ = అత్వసంధి
 37) వీలు + ఐతే = వీలయితే = ఉత్వసంధి
 38) కావలసినవి + అన్నీ = కావలసినవన్న = ఇత్వ సంధి
 39) పగలు + పగలు = పట్టపగల = ఆమేడ్రిత ద్విరుక్తటకారాదేశ సంధి
సమాసాలు
అభ్యాసం : ఈ కింది సమాసాలకు, విగ్రహవాక్యాలకు, సమాసం పేర్లు రాయండి.
1) ఉదగ్రతేజం – ఉదగ్రమైన తేజం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 2) తొల్లిటిరాజులు – తొల్లిటి వారలైన రాజులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 3) ప్రియాటోపము – ప్రియమైన ఆటోపము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 4) సకల జగములు – సకలమైన జగములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 5) పరసేన – పరమైన సేన – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 6) తమ్ముకుర్రలు – కుర్రవారైన తమ్ములు – విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
 7) కార్మికవృద్ధులు – వృద్ధులైన కార్మికులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 8) చారుసంసారం – చేరువయిన సంసారం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 9) పేదరికపుబుగులు – పేదరిక సంబంధమైన బుగులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
![]()
10) సత్యదూరము – సత్యమునకు దూరము – షష్ఠీ తత్పురుష సమాసం
 11) అమెరికా రాయబారి – అమెరికా యొక్క రాయబారి – షష్ఠీ తత్పురుష సమాసం
 12) వాదనాపటిమ – వాదన యందు పటిమ – సప్తమీ తత్పురుష సమాసం
 13) అసాధ్యం – సాధ్యము కానిది – నఞ తత్పురుష సమాసం
 14) నెలతాల్పు – నెలను ధరించువాడు – ద్వితీయా తత్పురుష సమాసం
 15) గురుదక్షిణ – గురువు కొఱకు దక్షిణ – చతుర్థీ తత్పురుష సమాసం
 16) వయోవృద్ధుడు – వయస్సుచే వృద్ధుడు – తృతీయా తత్పురుష సమాసం
 17) దొంగ భయము – దొంగ వలన భయము – పంచమీ తత్పురుష సమాసం
 18) రెండు రాష్ట్రాలు – రెండై రాష్ట్రాలు – ద్విగు సమాసం
 19) శక్తి సామర్థ్యాలు – శక్తియు, సామర్ధ్యమును – ద్వంద్వ సమాసం
 20) అమూల్య సమయం – అమూల్యమైన సమయం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 21) పూర్ణపురుషులు – పూర్ణులైన పురుషులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 22) ప్రాచీన కావ్యాలు – ప్రాచీనమైన కావ్యాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 23) పెద్ద కుటుంబం – పెద్దదైన కుటుంబం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 24) భద్రాచలం – ‘భద్ర’ అనే పేరుగల అచలం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
 25) విద్యాధనం – విద్య అనెడి ధనం – రూపక సమాసం
 26) దయాభరణం – ‘దయ’ అనెడి ఆభరణం – రూపక సమాసం
 27) కృపారసము – కృప అనెడి రసము – రూపక సమాసం
 28) సరళాసాగరం – ‘సరళ’ అనే పేరుగల సాగరం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
 29) మన్నెంకొండ – మన్నెం అనే పేరుగల కొండ – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
![]()
30) కీర్తి కన్యక – కీర్తి అనే కన్యక – రూపక సమాసం
 31) జ్ఞానజ్యోతి – జ్ఞానమనెడి జ్యోతి – రూపక సమాసం
 32) రెండురోజులు – రెండయిన రోజులు – ద్విగు సమాసం
 33) వజ్రవైఢూర్యములు – వజ్రమూ, వైదూర్యమూ – ద్వంద్వ సమాసం
 34) తల్లీబిడ్డలు – తల్లియూ బిడ్డయు – ద్వంద్వ సమాసం
 35) కార్యదక్షుడు – కార్యమందు దక్షుడు – సప్తమీ తత్పురుష సమాసం
 36) మూడు దోషాలు – మూడైన దోషాలు – ద్విగు సమాసం
 37) కర్మశాల – కర్మ కొఱకు శాల – చతుర్థీ తత్పురుష
 38) ఆశాపాశం – ఆశ అనెడి పాశం – రూపక సమాసం
 39) ప్రత్యంగుళం – అంగుళం అంగుళం – అవ్యయీభావ సమాసం
 40) ధర్మయుద్ధం – ధర్మము కొఱకైన యుద్ధము – అవ్యయీభావ సమాసం
 41) రక్తపాతం. – రక్తము యొక్క పాతం – అవ్యయీభావ సమాసం
 42) శాంతి సందేశం – శాంతి యొక్క సందేశం – అవ్యయీభావ సమాసం
 43) నాలుగెకరాలు – నాలుగైన ఎకరాలు – అవ్యయీభావ సమాసం
 44) రక్కసి తేడు – రక్కసి యొక్క తోడు – అవ్యయీభావ సమాసం
 45) నీరాట – నీరునందు ఆట – సప్తమీ తత్పురుష సమాసం
 46) మాతృదేశం – తల్లి యొక్క దేశం – షష్ఠీ తత్పురుష సమాసం
 47) కర్కశహృదయం – కర్కశమైన హృదయం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 48) సహాయనిరాకరణ – సహాయమునకు నిరాకరించడం – ద్వితీయా తత్పురుష సమాసం
 49) అశ్వత్థవృక్షం – అశ్వత్థం అనే పేరుగల వృక్షం – సంభావన పూర్వపద కర్మధారయం
![]()
50) శాస్త్రదృష్టి – శాస్త్రం యొక్క దృష్టి – షష్ఠీ తత్పురుష సమాసం
 51) నా పాట – నా యొక్క పాట – షష్ఠీ తత్పురుష సమాసం
 52) పఠనశక్తి – పఠనమునందు శక్తి – సప్తమీ తత్పురుష సమాసం
 53) అభ్యుదయ పథం – అభ్యుదయమైన పథం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 54) ఆత్మశక్తి – ఆత్మ యొక్క శక్తి – షష్ఠీ తత్పురుష సమాసం
 55) జీవితసాఫల్యం – జీవితము యొక్క సాఫల్యం – షష్ఠీ తత్పురుష సమాసం
 56) అద్భుతశక్తి – అద్భుతమైన శక్తి – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 57) ఎంగిలిమెతుకులు – ఎంగిలియైన మెతుకులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 58) విషాగ్ని – విషము అనెడి అగ్ని – రూపక సమాసం
 59) అధికారదర్పం – అధికారంచేత దర్పం – తృతీయా తత్పురుష సమాసం
 60) గదితలుపులు – గది యొక్క తలుపులు – షష్ఠీ తత్పురుష సమాసం
 61) మంచిబట్టలు – మంచివైన బట్టలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
 62) పదిగంటలు – పది సంఖ్యగల గంటలు – ద్విగు సమాసం
 63) న్యాయాన్యాయాలు – న్యాయమూ, అన్యాయమూ – ద్వంద్వ సమాసం.
వాక్య భేదములు
అభ్యాసము : కింది సామాన్య వాక్యాల్ని సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది. (సంక్లిష్ట వాక్యం)
 జవాబు:
 విమల వంట చేస్తూ పాటలు వింటుంది
![]()
ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది. (సంక్లిష్ట వాక్యం)
 జవాబు:
 అమ్మ నిద్రలేచీ ముఖం కడుక్కుంది.
అభ్యాసం : కింది సంక్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
ప్రశ్న 1.
 తాత భారతం చదివి నిద్రపోయాడు. (సంక్లిష్ట వాక్యం)
 జవాబు:
 తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు. (సామాన్య వాక్యాలు)
ప్రశ్న 2.
 చెట్లు పూత పూస్తే కాయలు కాస్తాయి. (సంక్లిష్ట వాక్యం)
 జవాబు:
 చెట్లు పూత పూయాలి. చెట్లు కాయలు కాయాలి. (సామాన్య వాక్యాలు)
![]()
ప్రశ్న 3.
 రాముడు నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరాడు. (సంక్లిష్ట వాక్యం)
 జవాబు:
 రాముడు నడుచుకుంటూ వెళ్ళాడు. రాముడు తన ఊరు చేరాడు. (సామాన్య వాక్యాలు)
అభ్యాసం : కింది సామాన్య వాక్యాల్ని సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
ప్రశ్న 1.
 ఆయన ఆంధ్రుడు. ఆయన కృష్ణాతీరమున పుట్టినవాడు (సామాన్య వాక్యాలు)
 జవాబు:
 ఆయన ఆంధ్రుడు మరియు కృష్ణా తీరమున పుట్టినవాడు. (సంయుక్త వాక్యం)
ప్రశ్న 2.
 మోహన కూచిపూడి నృత్యం నేర్చుకొంది. భావన భరతనాట్యం నేర్చుకుంది. (సామాన్య వాక్యాలు)
 జవాబు:
 మోహన కూచిపూడి నృత్యం, భావన భరతనాట్యం నేర్చుకున్నారు. (సంయుక్త వాక్యం)
అభ్యాసం : కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
ప్రశ్న 1.
 చుక్క పొడుపుతో సీత లేచింది. సీత గడపను పూజించింది. (సామాన్య వాక్యాలు)
 జవాబు:
 సీత చుక్క పొడుపుతో లేచి గడపను పూజించింది. (సంక్లిష్ట వాక్యం)
![]()
ప్రశ్న 2.
 బంధుమిత్రులంతా వచ్చేశారు. కావలసిన సంభారాలు ఏర్పాటు చేసుకున్నారు. (సామాన్య వాక్యాలు)
 జవాబు:
 బంధుమిత్రులంతా వచ్చి కావలసిన సంభారాలు ఏర్పాటు చేసుకున్నారు. (సంక్లిష్ట వాక్యం)
అభ్యాసం : కింది సామాన్య వాక్యాలను, సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
ప్రశ్న 1.
 సీతక్క నిశ్చితార్థం జరిగింది. నాగయ్య సంబరపడ్డాడు. (సామాన్య వాక్యాలు)
 జవాబు:
 సీతక్క నిశ్చితార్థం జరిగింది కాబట్టి నాగయ్య సంబరపడ్డాడు. (సంయుక్త వాక్యం)
ప్రశ్న 2.
 సీతక్క పెళ్ళికి ఏర్పాటుచేశారు. సీతమ్మ పెండ్లి పెటాకులయింది. (సామాన్య వాక్యాలు)
 జవాబు:
 సీతక్క పెళ్ళికి ఏర్పాటుచేశారు కాని పెండ్లి పెటాకులయ్యింది. (సంయుక్త వాక్యం)
A. కింది సామాన్య వాక్యాలను, సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు. పర్షియన్ భాషను చదివాడు. ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. (సామాన్య వాక్యాలు)
 జవాబు:
 పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరి పర్షియన్ భాషను చదివి ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. (సంక్లిష్ట వాక్యం)
ఆ)
 1) బూర్గుల హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కు నిచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారుచేశాడు.
 2) బూర్గుల సామ్యవాద వ్యవస్థకు పునాది వేశాడు.
 3) బూర్గుల అజరామకీర్తిని పొందాడు. (సామాన్య వాక్యాలు)
 జవాబు:
 బూర్గుల హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారుచేసి సామ్యవాద వ్యవస్థకు పునాది వేసి అజరామర కీర్తిని పొందాడు. (సంక్లిష్ట వాక్యం)
![]()
B. కింది సామాన్య వాక్యాలను, సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
 అ) వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు. వేలాది యువకులు కారాగారాలకు వెళ్ళారు. (సామాన్య వాక్యాలు)
 జవాబు:
 వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు మరియు కారాగారాలకు వెళ్లారు. (సంయుక్త వాక్యం)
ఆ) గాంధీ విధానాలను ఆచరించాలి.
 గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి. (సామాన్య వాక్యాలు)
 జవాబు:
 గాంధీ విధానాలను ఆచరించాలి మరియు మంచిని సాధించాలి. (సంయుక్త వాక్యం)
కర్తరి వాక్యాలు – కర్మణి వాక్యాలు
అభ్యాసం – 1: `కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
అ) వాల్మీకి రామాయణాన్ని రచించాడు. (కర్తరి వాక్యం)
 జవాబు:
 వాల్మీకిచే రామాయణం రచింపబడింది. (కర్మణి వాక్యం)
ఆ) ప్రజలు శాంతిని కోరుతున్నారు. (కర్తరి వాక్యం)
 జవాబు:
 ప్రజలచే శాంతి కోరబడుతోంది. (కర్మణి వాక్యం)
అభ్యాసం – 2 : కింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.
అ) లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదువబడింది. (కర్మణి వాక్యం)
 జవాబు:
 లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నేను చదివాను. (కర్తరి వాక్యం)
![]()
ఆ) నాచే రచింపబడిన గ్రంథం, నేతాజీ చరిత్ర. (కర్మణి వాక్యం)
 జవాబు:
 నేను రచించిన గ్రంథం, నేతాజీ చరిత్ర. (కర్తరి వాక్యం)
అభ్యాసం 3 : కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయండి.
ఉదా : ఆళ్వారు స్వామి చిన్నప్పుడే కథ రాశారు. (కర్తరి వాక్యం)
 జవాబు:
 చిన్నప్పుడే ఆళ్వారు స్వామిచే కథ రాయబడింది. (కర్మణి వాక్యం)
అ) లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు. (కర్తరి వాక్యం)
 జవాబు:
 లింగయ్య చేత ఉసిరికాయ తీసి నాయకునికి ఇవ్వబడింది. (కర్మణి వాక్యం)
ఆ) నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు. (కర్తరి వాక్యం)
 జవాబు:
 నాయకులచేత పిల్లలతో అరగంట కాలం గడుపబడింది. (కర్మణి వాక్యం)
ఇ) వాద్యాల చప్పుడు విన్నారు. కర్తరి వాక్యం)
 జవాబు:
 వాద్యాల చప్పుడు వినబడింది. (కర్మణి వాక్యం)
అభ్యాసం : కింది వాక్యాల్లో కర్తరి, కర్మణి వాక్యాలను గుర్తించి, వాటిని కర్మణి / కర్తరి వాక్యాలుగా మార్చండి.
ప్రశ్న 1.
 రచయిత్రులు ఎన్నో వివరాలు సేకరించారు. (కర్తరి వాక్యం)
 జవాబు:
 రచయిత్రులచే ఎన్నో వివరాలు సేకరింపబడ్డాయి. (కర్మణి వాక్యం)
![]()
ప్రశ్న 2.
 ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది. (కర్మణి వాక్యం)
 జవాబు:
 ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు. (కర్తరి వాక్యం)
ప్రశ్న 3.
 కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురించారు. (కర్తరి వాక్యం)
 జవాబు:
 కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురింపబడ్డాయి. (కర్మణి వాక్యం)
ప్రశ్న 4.
 వాళ్ళ భాష మార్పు చేయబడలేదు. (కర్మణి వాక్యం)
 జవాబు:
 వాళ్ళ భాషను మార్పు చేయలేదు. (కర్తరి వాక్యం)
ప్రశ్న 5.
 ప్రతివాళ్ళూ భోజనాలు పెట్టి మల్ల రమ్మని పంపించారు. (కర్తరి వాక్యం)
 జవాబు:
 ప్రతివాళ్ళూ భోజనాలు పెట్టి మల్ల రమ్మని పంపించబడ్డారు. (కర్మణి వాక్యం)
ప్రశ్న 6.
 దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేశాం. (కర్తరి వాక్యం)
 జవాబు:
 దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేయబడ్డాయి. (కర్మణి వాక్యం)
![]()
ప్రశ్న 7.
 ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేయబడింది. (కర్మణి వాక్యం)
 జవాబు:
 ఊళ్ళో సమావేశాన్ని ఏర్పాటు చేశాం (లేదా) ఊళ్ళో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. (కర్తరి వాక్యం)
ప్రశ్న 8.
 గోడల మీద అందమైన చిత్రాలు గీయబడ్డాయి. (కర్మణి వాక్యం)
 జవాబు:
 గోడల మీద అందమైన చిత్రాలను గీశారు. (కర్తరి వాక్యం)
ప్రశ్న 9.
 దేహం పంచభూతాలచే నిర్మించబడింది. (కర్మణి వాక్యం)
 జవాబు:
 దేహాన్ని పంచభూతాలు నిర్మించాయి. (కర్తరి వాక్యం)
![]()
ప్రశ్న 10.
 మేం పెద్దలను గౌరవిస్తాం. (కర్తరి వాక్యం)
 జవాబు:
 మాచే పెద్దలు గౌరవింపబడతారు. (కర్మణి వాక్యం)
అలంకారాలు
అభ్యాసం : కింది పంక్తులను గమనించి, వాటిలో ఉన్న అలంకారాలను గుర్తించి రాయండి.
ప్రశ్న 1.
 ‘పువుకీ – ముళ్ళకీ భేదం చెప్తే
 ప్రవాహానికీ నిశ్చలతకీ రూపం కలిస్తే
 ఆలోచనకీ – ఆచరణకీ అర్థం చెప్తే ”
 జవాబు:
 పై పంక్తుల్లో “అంత్యానుప్రాస అలంకారం ఉంది.
ప్రశ్న 2.
 కిశోర్ లేడిపిల్లలా పరుగెత్తుతున్నాడు.
 జవాబు:
 దీనిలో ‘ఉపమాలంకారం’ ఉంది.
ప్రశ్న 3.
 మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణం మా అన్నట్లున్నది.
 జవాబు:
 పై వాక్యంలో ‘ఉత్ప్రేక్షాలంకారం’ ఉంది.
![]()
ఛందస్సు
కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమములకు లోబడి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోడానికి వీలుగా ఉంటాయి.
- లఘువు : రెప్పపాటు కాలంలో లేదా చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలు “లఘువులు”. హ్రస్వాక్షరాలుగా మనం పిలుచుకొనే అక్షరాలు.
 - గురువు : లఘువు ఉచ్చరించే సమయం కంటే ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు “గురువులు”.
 
గురులఘువుల గుర్తులు
లఘువు అని తెలుపడానికి గుర్తు : I
 గురువు అని తెలుపడానికి గుర్తు: U
గురులఘువుల నిర్ణయము
ఎ) గురువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధం.
 1) దీర్ఘాచ్చులు అన్నీ గురువులు. దీర్ఘాచ్చులు మొత్తం తొమ్మిది.
 ఉదా :
 ![]()
2) దీర్ఘాచ్చులతో కూడిన హల్లులు అన్నీ గురువులు.
 ఉదా :
 
3) విసర్గతో కూడిన అక్షరాలు అన్నీ గురువులు.
 ఉదా :
 ![]()
4) నిండు సున్నతో కూడిన అక్షరాలు గురువులు
 ఉదా :
 ![]()
5) పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు.
 ఉదా :
 
6) సంయుక్తాక్షరాలకు, ముందు ఊది పలకబడే అక్షరాలు. గురువులు.
 ఉదా :
 
 ఉదా : క్య, త్ర, క్ష – మొదలైనవి సంయుక్తాక్షరాలు.
7) ద్విత్వాక్షరాలకు ముందుండే అక్షరాలు గురువులు
 ఉదా :
 
 ద్విత్వాక్షరం : ఒకే రకం హల్లులు కలిసిన అక్షరాన్ని ‘ద్విత్వాక్షరం’ అంటారు.
 ఉదా : త్త, క్క, ప్ప, మ్మ – మొ||నవి ద్విత్వాక్షరాలు. వాటికి ముందున్న అక్షరాలు అ, న, అ
![]()
బి) లఘువుల లక్షణాలు – వాటిని గుర్తించే విధం :

 గమనిక : గురువులు కాని, అక్షరాలన్నీ లఘువులు:
 1) ఋ కారంతో కూడిన అక్షరం, సంయుక్తాక్షరం కాదు. ‘ఋ’ అనేది అచ్చు. అందువల్ల అది లఘువు. దానికి ముందు అక్షరం కూడా లఘువే.
 ఉదా :
 ![]()
![]()
2) సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాన్ని ఊది పలికితేనే, అది గురువు అవుతుంది. లేకపోతే లఘువు అవుతుంది.
 ఉదా :
 
3) ఏకపదంలోనూ, సమాసంలోనూ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఊది పలకబడుతుంది. కాబట్టి అది గురువు అవుతుంది.
 ఉదా :
 ![]()
గణ విభజన
1) ఒకే అక్షరం గణాలు : ఒకే అక్షరం గణంగా ఏర్పడితే, అది ఏకాక్షర గణం. ఈ గణంలో ఒక గురువు లేదా ఒక లఘువు ఒక్కొక్కటే గణంగా ఉంటాయి.
 ఉదా :
 
![]()
2) రెండక్షరాల గణాలు : రెండేసి అక్షరాలు కలిసి గణాలుగా ఏర్పడతాయి. వీటిలోనూ గురువులు, లఘువులు ఉంటాయి.
 ఇవి నాలుగు రకాలు.
 అ) ఒక గురువు ఒక లఘువు కలిసి గణంగా ఏర్పడితే ఆ గణాన్ని ‘గలం’ లేదా ‘హ’ గణం అనీ అంటారు.
 ఉదా :
 
ఆ) ఒక లఘువు, ఒక గురువు కలిపి గణంగా ఏర్పడితే అది ‘లగం’, లేదా ‘వ’ గణం అని అంటారు.
 
ఇ) రెండూ గురువులే గల గణాన్ని – ‘గగము’ అంటారు.
 ఉదా :
 
ఈ) రెండూ లఘువులే గల గణాన్ని – ‘లలము’ అంటారు.
 ఉదా :
 
![]()
అభ్యాసం : రెండక్షరాల గణాలు నాలుగు రకాలు ఉన్నాయి కదా ! ఒక్కొక్క దానికి 4 పదాల చొప్పున రాయండి.
 ఉదా :
 
మూడక్షరాల గణములు
మూడక్షరాల గణాలు మొత్తం ఎనిమిది (8).
 
అ) మూడక్షరాల గణాలను గుర్తించే సులభ మార్గం:
 
 య, మా, తా, రా, జ, భా, న, స అనే సూత్రాన్ని కంఠస్థం చేసి, పై విధంగా ఒక చక్రం గీయండి. మీకు కావలసిన గణముపేరు గల మొదటి అక్షరం ఎక్కడ ఉందో గుర్తించండి. ఆ అక్షరాన్నుండి కుడిగా ఉన్న మూడక్షరాలలోనూ, గురు లఘువులు క్రమంగా ఉన్నాయో, మీకు కావలసిన గణానికి గురు లఘువులు ఆ క్రమంలో ఉంటాయి.
![]()
‘ఉదా : మీకు య గణము యొక్క గురు లఘువుల క్రమం కావాలి అనుకోండి. అపుడు ‘య’ నుండి కుడివైపుగా ‘యమాతా’ అనే మూడక్షరాలను వేరుగా వ్రాయండి.
 
ఆ) మూడక్షరాల గణాల నిర్ణయంలో మరో పద్ధతి :
 ![]()
 అని వ్రాసుకొని, దానికి గురు లఘువులు గుర్తించండి. మీకు కావలసిన గణము పేరు గల అక్షరంతో, ప్రక్క రెండు అక్షరాలూ కలిపి, దానిలోని గురు లఘువుఱ ఎలా ఉన్నాయో గమనిస్తే, ఏ గణానికి ఏ అక్షరాలు ఉంటాయో తెలుస్తుంది.
 ఉదా :
- య గణము = యమాతా = I U U = ఆది లఘువు
 - మ గణము = మాతారా = U U U = సర్వ గురువు
 - త గణము = తారాజ = U U I = అంత్య లఘువు
 - ర గణము = రాజభా = U I U = మధ్య లఘువు
 - జ గణము = జభాన = I U I = మధ్య గురువు
 - భ గణము = భానస = U I I = ఆది గురువు
 - న గణము = నసల = I I I = సర్వ లఘువులు
 - లగము (లేక ‘వ’ గణము = I U = లఘువు, గురువు)
 
నాలుగు అక్షరాల గణములు

సూర్య గణములు – ఇంద్ర గణములు
1) సూర్య గణాలు : ఇవి రెండు రకాలు.
 
![]()
యతి ప్రాసలు
I. గమనిక : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు.
 1. యతి : పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.
 2. ప్రాస : పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.
II. గమనిక : నియమం చెప్పినచోట ‘యతి’, ‘ప్రాస’లు ప్రయోగించడం వల్ల చదవడానికీ, వినడానికీ, జ్ఞాపకం పెట్టుకోడానికీ సౌకర్యం కలుగుతుంది.
 3. యతి మైత్రి : పద్యపాదం యొక్క మొదటి అక్షరంతో, ఆ పద్యంలో నిర్ణయింపబడిన స్థానమందలి అక్షరం మైత్రి కలిగి ఉండడాన్ని, యతిమైత్రి అంటారు. యతిమైత్రి యతిస్థానంలోని హల్లుకేకాక, అచ్చుతో కూడా మైత్రి ఉండాలి.
1. ఉత్పలమాల
 కింది పద్య పాదాన్ని పరిశీలించండి. “ఆపుర మేలు మేలు బళియంచు బ్రజల్ జయవెట్టు చుండనా”
 
 గమనిక : పై పాదం ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలు వరుసగా వచ్చాయి. ఇలా పద్యంలో నాలుగు పాదాల్లోనూ ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యాన్ని ‘వృత్త పద్యం’ అంటారు.
యతి : పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు. ఈ యతి అక్షరం గానీ, దాని వర్ణమైత్రి అక్షరం గాని ఆ పాదంలో మరొకచోట రావడాన్ని ‘యతి మైత్రి’ లేదా యతి స్థానం అంటారు.
![]()
పై పద్యపాదాల్లో పదవ అక్షరం (ఆ – య) యతి.
ప్రాస : పై పద్యపాదం రెండవ అక్షరంగా నాలుగు పాదాల్లోనూ ‘ప’ అనే అక్షరం వచ్చింది. ఈ పద్యాలలో రెండవ అక్షరంగా ఒకే గుణింతాక్షరం రావడాన్ని ‘ప్రాస’ నియమం అంటారు. పై లక్షణాలు గల పద్యాన్ని ‘ఉత్పలమాల’ పద్యం అంటారు.
 ఉత్పలమాల పద్యం లక్షణాలు :
- ఇది వృత్తపద్యం.
 - ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
 - ప్రతి పాదంలోనూ భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
 - ప్రాస నియమం ఉంటుంది.
 - ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.
 
2. చంపకమాల
 కింది పద్య పాదాన్ని పరిశీలించండి. “ఒరిమయు భక్తియున్ నెనరు నోర్పుఁగనంబడఁబెద్దపిన్నయం”
 
 చంపకమాల పద్య లక్షణాలు :
- ఇది వృత్తపద్యం.
 - ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
 - ప్రతి పాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ అనే గణాలుంటాయి.
 - ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం (ఒ – ఓ).
 - ప్రాస నియమం ఉంటుంది.
 - ప్రతి పాదంలోనూ 21 అక్షరాలుంటాయి.
 
![]()
3. శార్దూలం
 కింది పద్య పాదాన్ని పరిశీలించండి. “నాశీర్వాదమునొజ్జచే బడసి తానందంగ నౌనంబచితం”
 
శార్దూల పద్య లక్షణాలు :
- ఇది వృత్తపద్యం.
 - ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
 - ప్రతి పాదంలోనూ ‘మ, స, జ, స, త, త, గ’ అనే గణాలుంటాయి.
 - ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం (నా నం).
 - ప్రాస నియమం ఉంటుంది.
 - ప్రతి పాదంలోనూ 19 అక్షరాలుంటాయి.
 
![]()
4. మత్తేభం
 కింది పద్య పాదాన్ని పరిశీలించండి. “చెవికిం గుండల మొప్పుగాదు శ్రుతమేచే దమ్మికి న్గంకణం”
 
మత్తేభ పద్య లక్షణాలు :
- ఇది వృత్తపద్యం.
 - ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
 - ప్రతి పాదంలోనూ ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి.
 - ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం (చె- చే).
 - ప్రాస నియమం ఉంటుంది.
 - ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.
 
![]()
5. ఛందస్సు – తేటగీతి
 ఉదా : ‘తేటగీతి’-.
 ‘తేటగీతి’ పద్యం, సూర్యచంద్రగణాలతో ఏర్పడుతుంది. ఈ పద్య లక్షణాలు తెలుసుకోబోయే ముందు సూర్యగణాలు,
 ఇంద్రగణాలు అంటే ఏవో తెలిసికొందాము.
 సూర్యగణాలు : (2)
 
 
 పై ఉదాహరణ ఆధారంగా తేటగీతి పద్య లక్షణాలను కింది విధంగా చెప్పవచ్చు.
 ‘తేటగీతి’ పద్య లక్షణాలు .:
- ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
 - ప్రతి పాదానికి వరుసగా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి.
 - నాలుగో గణం మొదటి అక్షరం యతిమైత్రి స్థానం. ప్రాసయతి కూడా చెల్లుతుంది.
 - ప్రాస నియమం లేదు.
 













