These TS 9th Class Telugu Important Questions 10th Lesson వాగ్భూషణం will help the students to improve their time and approach.
TS 9th Class Telugu 10th Lesson Important Questions వాగ్భూషణం
PAPER – I : PART – A
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)
అ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘వాగ్భూషణం’ పాఠం ఆధారంగా మీరు నేర్చుకున్న ముఖ్యమైన మూడు విషయాలు రాయండి.
జవాబు:
మాట్లాడడం మనిషికి మాత్రమే లభించిన మంచి వరం. మాటలను అందంగా, ఒక పద్ధతి ప్రకారం, అనుకున్న అంశం మీద మాట్లాడితే శ్రోతలకు వీనులవిందు అవుతుంది. సంస్కారవంతమైన మాట మాత్రమే మనిషికి నిజమైన అలంకారం అంటారు పెద్దలు. ‘వాగ్భూషణం’ పాఠంలో డా॥ ఇరివెంటి కృష్ణమూర్తిగారు అమూల్యమైన అంశాలు ఎన్నో చక్కగా వివరించారు. వాటిలో ముఖ్యమైనవి –
- ఉపన్యాసం చెప్పేటప్పుడు భయం, సిగ్గు లేకుండా మాటలు ధారాప్రవాహంగా మాట్లాడాలని
- ఉపన్యాసంలో క్లుప్తత, స్పష్టత అవసరమని
- వక్తృత్వం రాణించాలంటే తగిన పాండిత్యం ఉండాలని
- విషయానికి తగ్గట్టుగా తన కంఠధ్వనిని పరిమితం చేసుకోవాలని
- వక్తకు జ్ఞాపకశక్తి చాలా అవసరమని
- వక్తృత్వంలో సమయ నియమం అతిముఖ్యమైన విషయమని నేను గ్రహించాను.
ప్రశ్న 2.
‘వక్తృత్వంలో సమయ నియమం అతిముఖ్యమైన విషయం’ ఎందుకో వివరించండి.
జవాబు:
‘వక్తృత్వంలో సమయ నియమం అతిముఖ్యమైన విషయం’ అన్నమాట నూటికి నూరుపాళ్ళు నిజం. ఎందుకంటే తక్కువ సమయం మాట్లాడినంత మాత్రాన శక్తిహీనుడు కాదు. నిజానికి గంటలకొద్దీ మాట్లాడేవాడు మంచివక్త కాడు. అయిదు నిముషాలు మాట్లాడినా చెప్పే అంశం శ్రోతలకు అర్థమైతే చాలు.
సమయం దాటడం వల్ల వక్తకు కీర్తిరాదు. అపోహల పాలవుతాడు. విషయం కూడా శ్రోతలకు పూర్తిగా అర్థంకాదు. ఎక్కువసేపు మాట్లాడాలనే ఉత్సాహం అనవసరమైన అంశాలకు దారితీస్తుంది. క్లుప్తమైన ఉపన్యాసం గొప్పది. అందువల్లనే వక్తృత్వంలో సమయ నియమం అతిముఖ్యమైన విషయం.
ప్రశ్న 3.
“వాక్శక్తి మనిషికి వరప్రసాదం” ఎలాగో తెల్పండి.
జవాబు:
మాట అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. మనిషికీ, పశువుకీ భేదం ప్రధానంగా వాక్కు వల్లనే కలుగుతుంది. మనిషి తన తెలివితేటలవల్ల భాషను సృష్టించుకొన్నాడు. భాష సహజం కాదు కృత్రిమం. మనిషి మారుతున్నకొద్దీ అదీ మారుతూ ఉంటుంది. జీవితంలో వాక్శక్తి నిర్వహించే పాత్ర అమేయమైనది. వాక్ శక్తి వలనే మనిషి తన ఇబ్బందులను పోగొట్టుకోవడంలోను, ఇతరుల బాధలను పంచుకోవడంలోను కృతకృత్యుడవుతున్నాడు. కనుక వాక్శక్తి మనిషికి వరప్రసాదం అని చెప్పవచ్చు. అందుకే ‘మంచివాక్కు కల్పతరువు’ అని పెద్దలంటారు.
ప్రశ్న 4.
మాటకున్న శక్తి అనంతం, అప్రతిహతం అంటే ఏమిటి ?
జవాబు:
‘అనంతం’ అంటే అంతం లేనిది. మాటకున్న శక్తి ‘ఇంత’ అని చెప్పడానికి వీలుకాదు అని అర్థం. అలాగే ‘అప్రతిహతం’ అనగా ఎదురులేనిది. మాటకున్న శక్తితో విజయ పరంపర పొందవచ్చు అని అర్థం. మొత్తం మీద వాక్ శక్తి ‘అంతులేనిది, అడ్డులేనిది’ అని అర్థమవుతుంది. అధికారం ఉన్నవాడు ఆ ప్రాంతం వరకే అతని అధికారం చెల్లుతుంది. మరి మాటకారితనం ఉన్నవాడు ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే భేదం లేకుండా ప్రపంచమంతా రాణిస్తాడు.
ప్రశ్న 5.
‘వాగ్భూషణం’ పాఠంలో అబ్రహాం లింకన్ మాటల ద్వారా నీవేమి గ్రహించావు?
జవాబు:
ఒకసారి అబ్రహాం లింకను ఎవరో గంటసేపు ప్రసంగించమన్నారు. గొప్పవక్తగా ప్రసిద్ధిపొందిన ఆ మహనీయుడు, “సరే పదండి ! అలాగే మాట్లాడుతాను” అన్నారు. అప్పుడు “ఏమీ ఆలోచించనక్కరలేదా ?” అని ప్రశ్నించారు అవతలివారు. లింకన్ “అయిదు నిమిషాలు మాట్లాడానికి ఒక గంటసేపు ఆలోచించవలసి ఉంటుంది. గంటసేపు ఆలోచన అనవసరం” అని సమాధానమిచ్చారు. దీనిని బట్టి సమయ నియమం వక్తకు అతిముఖ్యమైన విషయం అని గ్రహించాను.
ప్రశ్న 6.
‘Brievity is the soul of wit’ సామెత పాల్కురికి ఆలోచనకు ప్రతిధ్వని. ఎట్లా ?
జవాబు:
పరిమిత కాలంలో అభిలషితార్థాన్ని అందివ్వగలగడం సామాన్య విషయం కాదు. ఎంతో తపస్సు ఉంటేనే సాధ్యమవుతుంది. శబ్దప్రయోగంలో నిగ్రహం ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఇందుకు ఉదాహరణగా పాల్కురికి సోమనాథుని “అల్పాక్షరములందు అనల్పార్థ రచన
కల్పించుటయ కాదె కవి వివేకంబు” అన్నది చెప్పవచ్చు. ఈ సూక్తి కేవలం కవిత్వానికే వర్తిస్తుందని అనుకోవడం పొరపాటు. ఆ మనీషి చాలా విస్తృతమైన అర్థాన్ని అందించాడు ఈ ద్విపదలో. అందుకే ‘Brievity is the soul of wit’ అన్న ఆంగ్లాభాణకం పాల్కురికి సోమనాథుని ఆలోచనకు ప్రతిధ్వనిగా చెప్పవచ్చు.
ప్రశ్న 7.
ఉత్తమ ఉపన్యాస కోవకు చెందినవారి పేర్లు మీకు తెల్సినవి రాయండి.
జవాబు:
ధృతరాష్ట్రుని కొలువులో శ్రీకృష్ణుడు చేసిన ఉపన్యాసం, విశ్వమత మహాసభలో వివేకానందస్వామి చేసిన ఉపన్యాసం, పెట్టిన ్బర్గ్ అబ్రహాం లింకన్ చేసిన ఉపన్యాసం, మన స్వాతంత్ర్య సమర కాలంలో బిపిన్ చంద్రపాల్, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ వంటి ధీరోదాత్తుల ఉపన్యాసాలు ఉత్తమ ఉపన్యాస కోవకు చెందినవి.
ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘వాగ్భూషణం’ పాఠంలో మంచివక్తకు ఉండవలసిన లక్షణాలు ఏమేమి చెప్పబడినవో తెలుపండి ?
జవాబు:
“వాగ్భూషణం భూషణం” అన్నారు భర్తృహరి. మాట మాత్రమే మనిషికి నిజమైన అలంకారం. చక్కగా మాట్లాడే వ్యక్తినీ అందరూ గౌరవిస్తారు. మంచివాక్కు ఉన్నవారి మాటకు గౌరవం లభిస్తుంది. అంతేకాదు ఎదుటివారికి నచ్చచెప్పగలం.
విద్వత్తులేని వక్తృత్వం ఎంతోకాలం అంతటా రాణించదు. దానికై మంచివక్తకు ఉండవలసిన లక్షణాలను ‘వాగ్భూషణం’ పాఠం ద్వారా డా॥ ఇరివెంటి కృష్ణమూర్తి ఈ విధంగా తెలియజేస్తున్నారు.
వక్తకు ఉండవలసిన లక్షణాలు :
- మంచి వక్త కావడానికి విద్యావిజ్ఞానాల అవసరం అంతగా లేకపోయినా కొంత మాత్రమైనా విద్య ఉండడం అవసరం.
- వక్తకు జ్ఞాపకశక్తి చాలా అవసరం.
- చెప్పదలచిన అంశాన్ని బిడియ పడకుండా ధారాప్రవాహంగా చెప్పాలి.
- ప్రజల మనఃప్రవృత్తులను అర్థం చేసుకొని సహృదయంతో ఉపన్యసించాలి.
- కన్నులకు కట్టినట్టు ఒక అంశాన్ని అభివర్ణించి చెప్పడం మంచివక్త లక్షణాల్లో ఒకటి.
- పదజాలంతో చక్కని పరిచయం ఉండాలి.
- ఉపన్యాసం వ్యంగ్యార్థాన్ని ఆశ్రయించిప్పుడే ఉత్తమ ఉపన్యాసం అవుతుంది.
- శ్రోతల సంఖ్యను బట్టి తన ధ్వనిని, వక్త పరిమితులను కల్పించుకోవాలి.
- వక్తృత్వంలో సమయ నియమం అతిముఖ్య విషయం.
- వక్త తొలిపలుకులు నుండి చక్కని భాషతో చీకటిలో దివ్వె వెలిగినట్లుండాలి.
PAPER – I : PART – B
భాషాంశాలు – పదజాలం :
I. సొంతవాక్యాలు :
1. అప్రతిహతంగా : అప్రతిహతంగా సాగుతున్న అలెగ్జాండర్ దండయాత్రను పురుషోత్తముడు అడ్డుకున్నాడు.
2. అమేయము : రావణుడు అమేయమైన తపస్సుతో శివుని మెప్పించి ఆత్మలింగాన్ని పొందాడు.
3. ఉదాసీనత : రాముడు విద్యాభ్యాస సమయంలో ఎక్కడా ఉదాసీనత కనిపించనీయలేదు.
4. ఆచరణ : లాల్బహదూర్, టంగుటూరి ప్రకాశం వంటి నాయకులు తమ ఆశయాలను ఆచరణలో చూపించారు.
5. అంతర్లీనం : గంగా, యమునలు కనిపిస్తూ ప్రవహిస్తుంటే అంతర్లీనంగా సరస్వతీనది ప్రయాగ వద్ద ప్రవహించి త్రివేణి సంగమం ఏర్పడింది.
6. వినసొంపు : సామెతలు, జాతీయాలు వినసొంపుగా ఉండటమేగాక ఆలోచింపచేస్తాయి.
7. కల్పతరువు: కాశీనాథుని నాగేశ్వరరావుగారు పేదవిద్యార్థుల పాలిటి కల్పతరువు.
8. రూపుదిద్దుకొను : మంచి చదువు చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తే మన కలలు రూపుదిద్దుకుంటాయి.
9. నిస్సంకోచంగా : పాఠం వింటున్నప్పుడు మనకు కలిగే అనుమానాలను నిస్సంకోచంగా ఉపాధ్యాయుని అడగాలి.
10. వ్యంగ్యార్థం : అన్నదమ్ములు కలిసి ఉండటమే గాక ధర్మాన్ని పాటించాలనే వ్యంగ్యార్థాన్ని రామాయణ, భారతాలు బోధిస్తాయి.
11. ధారాశుద్ధి : శ్లోకాలు, పద్యాలు కంఠస్థం చేయడంతో ధారాశుద్ధి పెరుగుతుంది.
12. వక్తృత్వకళ : సాధువులు, స్వామీజీలు వక్తృత్వకళ ద్వారానే మనలను ధర్మంపట్ల ఆకర్షిస్తారు.
13. తలమున్కలు : తీరిక లేకుండా ఉండటం – విద్యార్థులు రాజకీయాలలో తలమున్కలు కాకూడదు.
14. కన్నులకు కట్టినట్లు : చూస్తున్నట్లు – మా చరిత్ర మాస్టారు పాఠం కన్నులకు కట్టినట్లు చెబుతారు.
II. అర్థాలు:
ప్రశ్న 1.
ధారాళంగా మాట్లాడటం (ఉపన్యసించటం) అనే అర్థం వచ్చే పదం
A) మాట్లాడు
B) జవాబు
C) వక్తృత్వం
D) సంభాషణ
జవాబు:
C) వక్తృత్వం
ప్రశ్న 2.
నిరుద్యోగము యువతను నిద్రాణములో ఉంచుతున్నది – గీత గీసిన పదానికి అర్థం
A) నిద్రాస్థితి
B) ద్రావణస్థితి
C) కదలిక
D) చైతన్యము
జవాబు:
A) నిద్రాస్థితి
ప్రశ్న 3.
రాముని నాయకత్వంలో కపిసేన అమేయము ఐన బలం పొందింది.
A) మరువరాని
B) లెక్కింపశక్యం కాని
C) అద్భుత రసం
D) యుద్ధం చేయగల
జవాబు:
B) లెక్కింపశక్యం కాని
ప్రశ్న 4.
“నిరక్షరాస్యులు” అంటే అర్థం
A) రక్షణ లేనివారు
B) రహస్యంగా జీవించేవారు
C) రక్షణ ఉన్నవారు
D) చదువురానివారు
జవాబు:
D) చదువురానివారు
ప్రశ్న 5.
“కృపాణ ధార” అంటే అర్థం
A) ఆగనిధార
B) కత్తి అంచు
C) పదును పెట్టడం
D) పదునైన గొడ్డలి
జవాబు:
B) కత్తి అంచు
ప్రశ్న 6.
“తిరిగి జ్ఞప్తి చేసుకొంటూ చదవడం” అనే అర్థం గల పదం
A) బాహ్య పఠనం
B) పునశ్చరణ
C) మౌన పఠనం
D) మంత్రము
జవాబు:
B) పునశ్చరణ
ప్రశ్న 7.
ఒళ్ళు మరచిపోవడం – అనే అర్థం గల పదం
A) తన్మయత్వం
B) గర్వము
C) ధారాశుద్ధి
D) పరుండిపోవు
జవాబు:
A) తన్మయత్వం
ప్రశ్న 8.
“దృక్పథము” అనగా అర్థం
A) భాషణము
B) శ్రవణము
C) ఆలోచనా పద్ధతి
D) బాగుచేయుట
జవాబు:
C) సిగ్గుపడుట
ప్రశ్న 9.
చదువు విషయంలో బిడియం కూడదు – గీత గీసిన పదానికి అర్థం
A) సామెత
B) ముడుచుకొనిపోవు
C) సిగ్గుపడుట
D) ఆలోచన
జవాబు:
C) సిగ్గుపడుట
ప్రశ్న 10.
మాట్లాడే పద్ధతి – అనే అర్థం గల పదం
A) తీరుతెన్నులు
B) వచశ్శైలి
C) క్రమపద్ధతి
D) ధారణ పద్ధతి
జవాబు:
B) వచశ్శైలి
ప్రశ్న 11.
మౌనం కంటే, భాషణం మంచి సాధనం – గీత గీసిన పదానికి అర్థం
A) చర్చ
B) మాట్లాడటం
C) వినడం
D) గొడవ
జవాబు:
B) మాట్లాడటం
ప్రశ్న 12.
మాటకున్న శక్తి అనంతం, అప్రతిహతం – గీత గీసిన పదానికి అర్థం
A) అడ్డం
B) ఎదురు
C) అడ్డగించలేనిది
D) చూడలేనిది
జవాబు:
C) అడ్డగించలేనిది
ప్రశ్న 13.
ఆత్మవిశ్వాసమే ఉంటే దీనుడై పడి ఉండడు – గీత గీసిన పదానికి అర్థం
A) తనపై తనకు నమ్మకం
B) తనపై తనకు అధికారం
C) నమ్మకం
D) అధికారం
జవాబు:
A) తనపై తనకు నమ్మకం
ప్రశ్న 14.
ప్రతివ్యక్తి నిరంతర ప్రయత్నం వల్ల ఎంచుకున్న కళలో కౌశలం సంపాదిస్తాడు – గీత గీసిన పదానికి అర్థం
A) ఆరోగ్యం
B) అలవాటు
C) కుశలం
D) నేర్పు
జవాబు:
D) నేర్పు
III. ప్రకృతి, వికృతులు:
ప్రశ్న 1.
శక్తి అనే పదానికి వికృతి
A) సత్తి
B) శత్తి
C) స్తుతి
D) సత్తువ
జవాబు:
A) సత్తి
ప్రశ్న 2.
శాస్త్రము అనే పదానికి వికృతి
A) శాసనము
B) శతరము
C) చట్టము
D) చదును
జవాబు:
C) చట్టము
ప్రశ్న 3.
“స్నేహము” అనే పదానికి వికృతి
A) మైత్రి
B) నెయ్యము
C) నేస్తం
D) దోస్తానా
జవాబు:
B) నెయ్యము
ప్రశ్న 4.
“బాస” అనే పదానికి ప్రకృతి
A) బాష
B) భాష
C) భాషించు
D) బాడుగ
జవాబు:
B) భాష
ప్రశ్న 5.
పసులు మనకు జీవనాధారాలుగా మారాయి – గీత గీసిన పదానికి ప్రకృతి
A) చెట్లు
B) ధాన్యము
C) పశువులు
D) పసుపు
జవాబు:
C) పశువులు
ప్రశ్న 6.
మనిషి జీవితానికి దీపం చదువు – గీత గీసిన పదానికి వికృతి
A) దివ్యం
B) దీపు
C) లాంతరు
D) దివ్పే
జవాబు:
D) దివ్పే
ప్రశ్న 7.
ఎద, ఎడద, డెందము – అనే వికృతి పదాలు గల ప్రకృతి పదం
A) మనస్సు
B) బింబము
C) మతి
D) హృదయం
జవాబు:
D) హృదయం
ప్రశ్న 8.
“సద్దు” అనే పదానికి ప్రకృతి
A) శబ్దము
B) సద్దిమూడ
C) సుద్దులు
D) శుద్ధి
జవాబు:
A) శబ్దము
ప్రశ్న 9.
విన్నాణము – అనే పదానికి ప్రకృతి
A) తార్కాణము
B) విజ్ఞానము
C) విజ్ఞాపనము
D) విశేషణము
జవాబు:
B) విజ్ఞానము
ప్రశ్న 10.
“కష్టము” అనే పదానికి వికృతి
A) కర్జము
B) కసటు
C) కస్తి
D) ఉష్ణము
జవాబు:
C) కస్తి
ప్రశ్న 11.
మంచివక్త కావడానికి కొంత మాత్రమైనా విద్య ఉండడం అవసరం – గీత గీసిన పదానికి వికృతి
A) విద్దె
B) విదియ
C) విదయ
D) చదువు
జవాబు:
A) విద్దె
ప్రశ్న 12.
శ్రోతల హృదయాలలో ఆర్ద్రతను, రసికతను కలిగిస్తారు – గీత గీసిన పదానికి వికృతి
A) ఎదయం
B) ఎరదయం
C) హరదయం
D) ఎద
జవాబు:
D) ఎద
IV. పర్యాయపదాలు :
ప్రశ్న 1.
స్నేహం – అనే పదానికి పర్యాయపదాలు కాని జత.
A) మైత్రి, నెయ్యము
B) దోస్తి, చెలిమి
C) భావం, ద్రోహం
D) సఖ్యం, సంగడి
జవాబు:
C) భావం, ద్రోహం
ప్రశ్న 2.
కృపాణం, కరవాలం, ఖడ్గము – పర్యాయపదాలుగా గల
A) ఛురిక
B) బాకు
C) కైజారు
D) కత్తి
జవాబు:
D) కత్తి
ప్రశ్న 3.
మిత్రుడు – అనే పదానికి పర్యాయపదాలు
A) స్నేహితుడు, చెలిమి
B) నెచ్చెలికాడు, సఖుడు
C) దోస్తు, నేరం
D) సంగడికాడు, సోదరుడు
జవాబు:
B) నెచ్చెలికాడు, సఖుడు
ప్రశ్న 4.
కనకం మిక్కిలి విలువైన లోహం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) కాంచనం, స్వర్ణం
B) పుత్తడి, తుత్తునాగం
C) పసిడి, లోహం
D) ధాతువు, బంగారం
జవాబు:
A) కాంచనం, స్వర్ణం
ప్రశ్న 5.
“తరువు” అనే పదానికి మరొక పర్యాయపదం గుర్తించండి.
A) శాఖ
B) భూరుహం
C) కాండం
D) మేడి
జవాబు:
B) భూరుహం
ప్రశ్న 6.
పలుకు, మాట, భాష, వాణి అనే పర్యాయపదాలు గల పదం
A) వ్యాకరణం
B) పదం
C) వాక్కు
D) ఉచ్చారణ
జవాబు:
C) వాక్కు
ప్రశ్న 7.
నిజం ఎప్పటికి జయిస్తుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) సత్యము, ఋతము, నిక్కము
B) నిక్కువము, ఎక్కువ, మాట
C) సత్తు, నిబద్ధము
D) ధర్మము, న్యాయము, బాస
జవాబు:
A) సత్యము, ఋతము, నిక్కము
ప్రశ్న 8.
వివేకము, బోధ – అను పర్యాయపదాలు గల పదం
A) జ్ఞానము
B) తెలివి
C) సంగతి
D) చదువు
జవాబు:
B) తెలివి
ప్రశ్న 9.
వాక్ శక్తి మనిషికి వరప్రసాదం గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) మాట్లాడటం, వినడం
B) బలం, బలపం
C) సత్తువ, బలం
D) బలగం, మాట్లాడటం
జవాబు:
B) బలం, బలపం
ప్రశ్న 10.
శ్రోతల సంఖ్యను బట్టి తన ధ్వనిని వక్త పరిమితులను కల్పించుకోవాలి – గీత గీసిన పదానికి పర్యాయపదాలు
A) శబ్దం, చప్పుడు
B) సవ్వడి, గొంతు
C) సద్దు, భయం
D) గొంతు, కంఠం
జవాబు:
D) గొంతు, కంఠం
V. నానార్థాలు :
ప్రశ్న 1.
అదృష్టము, సంపద – అనే నానార్థాలు కల పదం
A) బంగారం
B) భాగ్యము
C) భోగము
D) వైభవం
జవాబు:
B) భాగ్యము
ప్రశ్న 2.
అక్షరము బాలుడు దిద్దుతున్నాడు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) నాశనము లేనిది, కరిగిపోయేది.
B) అంకెలు, సంఖ్యలు
C) నాశనము లేనిది, అకారాది వర్ణమాల
D) అక్కరము, పెంపు
జవాబు:
C) నాశనము లేనిది, అకారాది వర్ణమాల
ప్రశ్న 3.
చిలుక, యుక్తితో మాట్లాడేవాడు అనే నానార్థాలు వచ్చే పదం
A) మేధావి
B) వాగ్మి
C) వాచాలుడు
D) అనువాదకుడు
జవాబు:
B) వాగ్మి
ప్రశ్న 4.
కళలు మనిషిని మైమరపిస్తాయి – గీత గీసిన పదానికి నానార్థాలు
A) చంద్రుని కళలు, అరవైనాల్గు కళలు
B) నిద్రకళ, శశికళ
C) కళారంగం, కాళిక
D) కలలు, కళలు
జవాబు:
A) చంద్రుని కళలు, అరవైనాల్గు కళలు
ప్రశ్న 5.
“ఊనిక” అనే పదానికి నానార్థాలు
A) ఉచ్చారణకు ఆధారము, ఆలంబన
B) ఊగులాట, ఒక కొలత
C) ఊతం , కొత్తది
D) చేయూత, పాతది
జవాబు:
A) ఉచ్చారణకు ఆధారము, ఆలంబన
ప్రశ్న 6.
“శక్తి”ని కొందరు ఆరాధిస్తారు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) భుజబలం, యంత్రబలం
B) ఒక ఆయుధం, కారణం
C) బలము, పార్వతి, ఒక ఆయుధం
D) సత్తువ, ద్వారం
జవాబు:
A) భుజబలం, యంత్రబలం
ప్రశ్న 7.
చింత, అనే పదానికి నానార్థాలు
A) ఒక చెట్టు, భాగము
B) పులుపు, చింతపండు
C) ఒక చెట్టు, విచారము, ఆలోచన
D) కొంచెము, దుఃఖము
జవాబు:
C) ఒక చెట్టు, విచారము, ఆలోచన
ప్రశ్న 8.
రసము అనే పదానికి నానార్థాలు
A) నీరసము, పాదరసము
B) నవరసములు, నీరు, పిండిన సారము
C) ధారణ, ఆరు రుచులు
D) చారు, ద్రవము
జవాబు:
B) నవరసములు, నీరు, పిండిన సారము
ప్రశ్న 9.
శ్వాసకోసం ముక్కును సృష్టికర్త ఏర్పాటు చేసాడు – గీత గీసిన పదానికి నానార్థాలు
A) పుట్టించుట, ప్రవర్తన
B) నడక, నడత
C) సృజించుట, ప్రకృతి
D) స్వభావం, నడత
జవాబు:
C) సృజించుట, ప్రకృతి
ప్రశ్న 10.
సమస్య పరిష్కరించేటప్పుడు భాషణం మంచి సాధనం – గీత గీసిన పదానికి నానార్థాలు
A) ఉపకరణం, ఉపాయం
B) సాధించు, ఫలితం
C) ఆలోచన, ధైర్యం
D) తెలివి, వివేకం
జవాబు:
A) ఉపకరణం, ఉపాయం
VI. వ్యుత్పత్యర్థములు :
ప్రశ్న 1.
క్షరము (నాశనము) లేనిది – అనే వ్యుత్పత్తి గల పదము
A) అక్షరము
B) క్షీరము
C) భక్షణము
D) వినాశము
జవాబు:
A) అక్షరము
ప్రశ్న 2.
సృష్టి ఆది నుండి ఉన్న నీరు – అనే వ్యుత్పత్తి గల పదము
A) ఆనీరు
B) కన్నీర
C) మున్నీరు
D) పన్నీరు
జవాబు:
C) మున్నీరు
ప్రశ్న 3.
హృదయం – అనే పదానికి సరియైన వ్యుత్పత్తి
A) సౌందర్యమును గమనించునది (మనస్సు)
B) (సౌందర్యముచే) హరింపబడునది (మనస్సు)
C) సౌందర్యాదులను చూసి సంతోషించునది (మనస్సు)
D) ఒకరికి ఊరక ఇచ్చివేయునది (మనస్సు)
జవాబు:
B) (సౌందర్యముచే) హరింపబడునది (మనస్సు)
ప్రశ్న 4.
“వసుమతి” అనే పదానికి సరియైన వ్యుత్పత్తి
A) (వసు) బంగారము గర్భము నందు కలది (భూమి)
B) వసువు అనే రాజు పాలించునది (భూమి)
C) వసువు మతిగాగలది (భూమి)
D) (వసు) బంగారము అతిగా కలది (భూమి)
జవాబు:
A) (వసు) బంగారము గర్భము నందు కలది (భూమి)
ప్రశ్న 5.
జయింప శక్యము కానివాడు – అనే వ్యుత్పత్తి గల పదం
A) జితుడు
B) జయుడు
C) అజేయుడు
D) విజేత
జవాబు:
C) అజేయుడు
ప్రశ్న 6.
“బాగుగా దాచబడినది” – అనే వ్యుత్పత్తి గల పదం
A) దాగుకొను
B) నిక్షిప్తము
C) ఆక్షేపణము
D) మరుగుపరచు
జవాబు:
B) నిక్షిప్తము
ప్రశ్న 7.
హరింపబడునది – అనే వ్యుత్పత్తి గల పదం
A) హరి
B) స్వర్గం
C) పాపం
D) హృదయం
జవాబు:
D) హృదయం
ప్రశ్న 8.
నాశనం పొందనిది – అనే వ్యుత్పత్తి గల పదం
A) అక్షరం
B) వయస్సు
C) స్త్రీ
D) కీర్తి
జవాబు:
A) అక్షరం
ప్రశ్న 9.
సత్పురుషులందు జనించేది – అనే వ్యుత్పత్తి గల పదం
A) పుణ్యం
B) సత్యం
C) న్యాయం
D) ధర్మం
జవాబు:
B) సత్యం
PAPER – II : PART – A
అపరిచిత గద్యాలు
ప్రశ్న 1.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.
విజ్ఞానశాస్త్రం ఎంతో పెరిగింది. దానివల్ల మనుషుల ఆలోచనలో మార్పు వచ్చింది. దాని ఫలితంగా జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులన్నీ సాహిత్య ప్రక్రియల్లో కనపడుతూ ఉంటాయి. సామాన్య మనుషుల జీవితం, వాళ్ళ జీవితంలో సమస్యలు చిత్రించి, పరిష్కారం సూచించడమే సాహిత్య ప్రక్రియలు చెయ్యవలసిన పని అనే భావం ఏర్పడింది.
అందువల్ల సాహిత్యం ఇదివరకటిలాగా పండితులకు, జమీందారులకు పరిమితం కాదు. సాహిత్యం కేవలం చదివి ఆనందించడానికే అన్న అభిప్రాయాలు మారిపోయాయి. సామాన్యులలోకి సాహిత్యం వచ్చేసింది. అందుకు అనువైన ప్రక్రియలే కథానిక, నాటిక, ప్రహసనం, నవల మొదలైనవి. అందుకే వీటిలోని భాష వినగానే అర్థమయ్యేటంతగా సరళంగా ఉండటం ప్రధాన లక్షణమైంది. అంతేకాక రోజువారీ జీవితంలో సామాన్య ప్రజలు మాట్లాడే భాషే ‘వ్యావహారికం’ అనే పేరున ఒక స్పష్టమైన రూపంతో పత్రికల వల్ల బాగా ప్రచారం అయింది.
ముఖ్యంగా నాటకాల్లో, నాటికల్లో కథ అంతా పాత్రల సంభాషణ ద్వారానే జరుగుతుంది కనుక, ఆయా పాత్రలకు ఉచితమైన భాష ఆయా పాత్రల చేత పలికించడం అనేది ముఖ్యమైన లక్షణమైంది. ఉదాహరణకి, ఒక నాటికలో ఏమీ చదువుకోని ఒక పల్లెటూరి మనిషి గ్రాంథికభాషలో సంభాషణ జరిపినట్లు రచయిత రాస్తే ఆ నాటిక లక్ష్యమే దెబ్బతిని హాస్యాస్పదం అవుతుంది.
జవాబు:
ప్రశ్నలు
- దేనివల్ల మనుషుల ఆలోచనలో మార్పు వచ్చింది ?
- సాహిత్య ప్రక్రియలు చెయ్యవలసిన పని ఏమిటి ?
- భాషకు ప్రధాన లక్షణం ఏమిటి ?
- వ్యావహారికం అంటే ఏమిటి ?
- నాటకాల్లో, నాటికల్లో వాడే భాషకు ముఖ్యమైన లక్షణమేది ?
ప్రశ్న 2.
కింది పేరా చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలు రూపొందించండి.
భాష నేర్చుకోవడం రెండు రకాలు. భాష కోసం భాష, విషయం కోసం భాష, భాషా స్వరూప స్వభావాలను సమగ్రంగా అధ్యయనం చేయడం మొదటి రకంలోనిది. శాస్త్ర సాంకేతిక విషయాలను, సాహిత్య సాంస్కృతిక విషయాల వంటి వాటినీ అధ్యయనం చెయ్యడం రెండో రకంలోనిది. అలాగే భాష కూడా రెండు రకాలుగా తయారయింది. ప్రాచీన (కావ్య) భాష, ఆధునిక (ప్రమాణ) భాష.
సాహిత్యంలో తరతరాల వారసత్వాన్ని అవగాహన చేసుకొని ఆనందించడానికి ప్రాచీన భాష ఉపయోగిస్తుంది. కాని దాన్ని గురించి చెప్పడానికీ, రాయడానికీ ఆధునిక భాషే కావాలి. ఎందువల్లనంటే ఏ కాలంలో జీవించేవాడి ఆలోచనా, అలవాట్లూ ఆ కాలంనాటి భాషలోనే సాగుతుంటాయి కనుక. ప్రాచీన భాష ప్రయోజనం పరిమితం. ఆధునిక భాష ప్రయోజనం అపరిమితం. వివిధ శాస్త్ర విషయాలను వివరించడానికే కాదు, పూర్వ భాషా సాహిత్యాలను వివరించడానికి కూడా ఆధునిక భాషే కావాలి.
జవాబు:
ప్రశ్నలు
- భాషను ఏయే రకాలుగా నేర్చుకొంటాము ?
- భాష ఎన్ని రకాలుగా తయారయింది ?
- ప్రాచీన భాష ఎందుకు ఉపయోగిస్తుంది ?
- ఆధునిక భాష ఉపయోగం ఏమిటి ?
- ఏ భాష ప్రయోజనం పరిమితం ?
PAPER – II : PART – B
భాషాంశాలు – వ్యాకరణం
కింది వాటికి సరైన సమాధానం గుర్తించి, (A, B, C, D) సంకేతాన్ని కుండలీకరణంలో రాయండి.
I. సంధులు:
ప్రశ్న 1.
సవర్ణదీర్ఘ సంధికి ఉదాహరణ కానిది.
A) అల్ప + అక్షరము
B) రస + ఆనందము
C) దీర్ఘ + ఉపన్యాసము
D) అనల్ప + అర్థము
జవాబు:
C) దీర్ఘ + ఉపన్యాసము
ప్రశ్న 2.
గుణసంధికి ఉదాహరణ కానిది.
A) పరభాగ్య + ఉపజీవి
B) యథా + ఉచితం
C) సు + ఉక్తి
D) కళా + ఉపాసన
జవాబు:
C) సు + ఉక్తి
ప్రశ్న 3.
ప్రతి + ఏకత → ప్రత్యేకత. ఇది ఏ సంధి ?
A) గుణసంధి
B) ఇత్వసంధి
C) యణాదేశ సంధి
D) యడాగమ సంధి
జవాబు:
C) యణాదేశ సంధి
ప్రశ్న 4.
ఆమ్రేడిత సంధికి ఉదాహరణ
A) మొదట + మొదట
B) నిడు + ఊర్పు
C) ఏక + ఏక
D) ప్రతి + ఏకత
జవాబు:
A) మొదట + మొదట
ప్రశ్న 5.
వీరందరూ విద్యార్థులు – గీత గీసిన పదం ఏ సంధి ?
A) సరళాదేశ సంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) విసర్గ సంధి
D) స్వాధి సంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి
ప్రశ్న 6.
ప్రణాళికలు అభ్యుదయమునకు బాటలు కావాలి – గీత గీసిన పదాన్ని విడదీస్తే
A) భ్యు + దయము
B) ఉ + ఉదయం
C) అభి + ఉదయం
D) అభ్యు + ఉదయం
జవాబు:
C) అభి + ఉదయం
ప్రశ్న 7.
రాముడు + అతడు; పద్యము + అడిగె అనే సంధి విడదీసిన పదములలో పూర్వ పరస్వరములు
A) ఉ + అతడు
B) ఉ + అడిగె
C) ఉ + అ
D) డు + ము
జవాబు:
C) ఉ + అ
ప్రశ్న 8.
క్రింది వానిలో త్రికములు
A) ఆ, ఈ, ఏ
B) ఏ, ఓ, అర్
C) ఇ, ఉ, ఋ
D) అ, ఇ, ఉ
జవాబు:
A) ఆ, ఈ, ఏ
ప్రశ్న 9.
క్రింది వానిలో పరుషములు
A) క, చ, ట, త, ప
B) గ, స, డ, ద, వ
C) గ, జ, డ, ద, బ
D) క, చ, ట, త, ప
జవాబు:
D) క, చ, ట, త, ప
ప్రశ్న 10.
ప్రథమ మీది పరుషములకు ఆదేశముగా వచ్చు అక్షరములు
A) క, చ, ట, ద, బ
B) గ, జ, డ, త, ప
C) గ, జ, డ, ద, బ
D) చ, త, ప, స, ద, వ
జవాబు:
A) క, చ, ట, ద, బ
ప్రశ్న 11.
ఇ, ఉ, ఋ లకు ఏ, ఓ, అర్లు ఆదేశంగా రావాలంటే ముందు ఉండవలసిన అచ్చు
A) ఇకారం
B) కారం
C) అకారం
D) ఋకారం
జవాబు:
C) అకారం
II. సమాసాలు:
ప్రశ్న 1.
షష్ఠీ తత్పురుష సమాసమునకు ఉదాహరణ
A) ప్రజా హృదయాలు
B) విద్యావిజ్ఞానాలు
C) ధీరోదాత్తులు
D) అప్రతిహతము
జవాబు:
A) ప్రజా హృదయాలు
ప్రశ్న 2.
వాక్కు అనెడు భూషణము. ఈ విగ్రహవాక్యం ఏ సమాసము ?
A) విశేషణ పూర్వపదము
B) సంభావనా పూర్వపదము
C) రూపక సమాసము
D) బహువ్రీహి
జవాబు:
C) రూపక సమాసము
ప్రశ్న 3.
వ్యంగ్యమైన అర్థం అనే విగ్రహవాక్యాన్ని సమాసంగా మార్చగా
A) వ్యంగ్యానికి అర్ధం
B) వ్యంగ్యార్థం
C) వ్యంగ్యముల అర్థం
D) వ్యంగ్యం అర్థం
జవాబు:
B) వ్యంగ్యార్థం
ప్రశ్న 4.
“అంతము కానిది” విగ్రహవాక్యమును సమాసంగా మార్చగా
A) అంతంత మాత్రం
B) అనంతము
C) అనంతపురము
D) విశ్వం
జవాబు:
B) అనంతము
ప్రశ్న 5.
మన శక్తిసామర్ధ్యాలు పెంచుకోవాలి – గీత గీసిన పదానికి విగ్రహవాక్యం
A) శక్తికి తగిన సామర్థ్యం
B) శక్తికి మించిన సామర్థ్యం
C) శక్తి మరియు సామర్థ్యం
D) శక్తి వలన సామర్థ్యం
జవాబు:
C) శక్తి మరియు సామర్థ్యం
ప్రశ్న 6.
మన పఠనాసక్తి గ్రంథాలయం తీరుస్తుంది – గీత గీసిన పదం ఏ సమాసం ?
A) సప్తమీ తత్పురుష
B) షష్ఠీ తత్పురుష
C) పంచమీ తత్పురుష
D) ద్వంద్వ సమాసము
జవాబు:
A) సప్తమీ తత్పురుష
ప్రశ్న 7.
ధీరుడును, ఉదాత్తుడను – సమాసనామం
A) విశేషణ పూర్వపద కర్మధారయం
B) విశేషణ ఉభయపద కర్మధారయం
C) ద్వంద్వ సమాసం
D) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
B) విశేషణ ఉభయపద కర్మధారయం
ప్రశ్న 8.
యథోచితము – అనే సమాసపదమునకు విగ్రహవాక్యము
A) యథా ఉచితము
B) యథాకు ఉచితము
C) ఉచితమునకు తగినట్లు
D) యథా వంటి ఉచితము
జవాబు:
C) ఉచితమునకు తగినట్లు
ప్రశ్న 9.
అప్రతిహతము – సమాసనామము
A) నఞ తత్పురుష
B) ప్రథమా తత్పురుష
C) నజ్ తత్పురుష
D) నయ్ తత్పురుష
జవాబు:
A) నఞ తత్పురుష
ప్రశ్న 10.
ఉభయ పదార్థ ప్రధానము
A) ద్విగు సమాసము
B) ద్వంద్వ సమాసము
C) షష్ఠీ తత్పురుష
D) బహువ్రీహి
జవాబు:
B) ద్వంద్వ సమాసము
ప్రశ్న 11.
సంఖ్య ముందుగా (విశేషణంగా) వచ్చే సమాసం
A) ద్విగు సమాసము
B) ద్వంద్వ సమాసము
C) షష్ఠీ తత్పురుష
D) బహువ్రీహి
జవాబు:
A) ద్విగు సమాసము
III. వాక్యములు :
ప్రశ్న 1.
“వారు ఏమీ ఆలోచించ నక్కరలేదా ?” అని ప్రశ్నించారు. పరోక్ష కథనంలో రాయగా
A) వారు ఏమీ ఆలోచించ నక్కరలేదని చెప్పారు.
B) వారు ఆలోచించి ఏమీ అక్కరలేదన్నారు.
C) ఏమీ ఆలోచించనక్కరలేదని, వారన్నారు.
D) ఏమీ ఆలోచించారు మీరు అన్నారు వారు.
ప్రశ్న 2.
‘మంచివక్త మంచి ఉపన్యాసం ఇస్తాడు”. కర్మణి వాక్యంగా మార్చి రాయగా
A) మంచివక్తకు మంచి ఉపన్యాసం ఇవ్వబడుతుంది.
B) మంచివక్త నుండి మంచి ఉపన్యాసం ఇవ్వబడుతుంది.
C) మంచివక్త చేత మంచి ఉపన్యాసం ఇవ్వబడుతుంది.
D) మంచివక్తలే మంచి ఉపన్యాసకులుగా గుర్తించబడుతారు.
జవాబు:
C) మంచివక్త చేత మంచి ఉపన్యాసం ఇవ్వబడుతుంది.
ప్రశ్న 3.
“గొల్లపూడి మంచి నటుడు, గొల్లపూడి మంచి రచయిత.” సంయుక్త వాక్యంలోకి మార్చి రాయగా
A) గొల్లపూడికి మంచి నటుడుగానే గాక గొల్లపూడి మంచి రచయిత అనవచ్చు.
B) గొల్లపూడి మంచి నటుడుగాను, గొల్లపూడి మంచి రచయితగాను కీర్తి పొందాడు.
C) గొల్లపూడి మంచినటుడు మరియు రచయిత.
D) మంచి నటుడిగా, మంచి రచయితగా గొల్లపూడి పేరు చెప్పవచ్చు.
జవాబు:
C) గొల్లపూడి మంచినటుడు మరియు రచయిత.
ప్రశ్న 4.
లింగయ్య చేత ఉసిరికాయ తీసి నాయకునికి ఇవ్వబడింది. కర్తరి వాక్యంలోకి మార్చండి.
A) లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు.
B) ఉసిరికాయ లింగయ్య చేత నాయకుడు తీసుకున్నాడు.
C) లింగయ్య ఉసిరికాయతో నాయకునికి ఇచ్చాడు.
D) లింగయ్య, నాయకుడు ఉసిరికాయ తీసి ఇచ్చాడు.
జవాబు:
A) లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు.
IV. అలంకారాలు :
ప్రశ్న 1.
నా చొక్కా మల్లెపూవు వలె తెల్లగా ఉన్నది – ఈ వాక్యములో ఉన్న అలంకారము
A) ఉత్ప్రేక్ష
B) ఉపమా
C) ఛేకానుప్రాస
D) రూపక
జవాబు:
B) ఉపమా
ప్రశ్న 2.
వంటశాల గంట ఒంటిగంటకు మోగింది ఈ వాక్యంలో ఉన్న అలంకారం
A) అంత్యానుప్రాస
B) ఛేకానుప్రాస
C) వృత్త్యనుప్రాస
D) యమకము
జవాబు:
C) వృత్త్యనుప్రాస
ప్రశ్న 3.
కురిసింది వానజల్లు; మెరిసింది హరివిల్లు; చిరునవ్వుల విరిజల్లు. ఈ వాక్యాలలో ఉన్న అలంకారం
A) ఛేకానుప్రాస
B) అంత్యానుప్రాస
C) లాటానుప్రాస
D) లాటానుప్రాస
జవాబు:
B) అంత్యానుప్రాస
ప్రశ్న 4.
శార్దూల పద్యానికి యతి
A) 12వ అక్షరం
B) 13వ అక్షరం
C) 14వ అక్షరం
D) యతిలేదు
జవాబు:
B) 13వ అక్షరం