Here students can locate TS Inter 2nd Year Accountancy Notes Chapter 6 Retirement and Death of a Partner to prepare for their exam.
TS Inter 2nd Year Accountancy Notes Chapter 6 Retirement and Death of a Partner
→ Retirement means a partner leaves the partnership firm.
→ In the event of the retirement of a partner the following main issues require special attention for giving necessary accounting treatment. They are :
- Ascertainment of new profit sharing ratio and the ratio of gaining.
- Revaluation of Assets and Liabilities.
- Treatment of undistributed profits and losses and accumulated reserves.
- Treatment of goodwill.
→ Ratio of Gaining: The ratio in which the share of the retiring partner is taken over by the continuing partners is called the “Gaining Ratio”.
→ Ratio of Gaining = New Ratio – Old Ratio
→ Goodwill is the reputation of the business.
→ The amount due to the retiring partner may be paid in cash immediately or pay a part of the amount due in cash and transfer the balance to the loan account of the retiring partner.
→ Death of a partner, when a partner dies, the partnership agreement come to an end. The remaining partners may choose to continue the business by setting the amount to decreased partner.
TS Inter 2nd Year Accountancy Notes Chapter 6 భాగస్తుని విరమణ మరియు మరణం
→ భాగస్తుని విరమణ : ఏ కారణం వల్లగాని ఒక భాగస్తుడు బాగస్వామ్య సంస్థనుంచి వెళ్ళిపోవడాన్ని “భాగస్తుని విరమణ” అంటారు.
→ భాగస్తుడు విరమించుకున్నప్పుడు చేయవాల్సిన సర్దుబాట్లు :
- కొత్త లాభనష్టాల నిష్పత్తిని, లబ్ది నిష్పత్తిని కనుగొనడం
- ఆస్తి, అప్పుల పునర్మూల్యాంకనం
- సంచిత నిధులు, పంపకం కాని లాభనష్టాలను పంచడం D) గుడ్విల్ దాని అకౌంటింగ్
- విరమణ చేసే భాగస్తునికి చెల్లింపు
→ కొత్త లాభనష్టాల నిష్పత్తి : భాగస్తుని విరమణ తరవాత కొనసాగుతున్న భాగస్తుల కొత్త లాభనష్టాల నిష్పత్తి లెక్కించాలి. ఒక భాగస్తుని విరమణ వల్ల కొనసాగుతున్న భాగస్తులు లబ్దిపొందుతారు. లబ్దినిష్పత్తి, కొనసాగుతున్న భాగస్తుల కొత్త నిష్పత్తి నుంచి వారి పాత నిష్పత్తిని తీసి వేయడం ద్వారా కనుక్కొంటారు.
→ లబ్ది నిష్పత్తి : లబ్ది నిష్పత్తి = కొత్తనిష్పత్తి – పాతనిష్పత్తి
→ ఆస్తి అప్పుల పునర్మూల్యాంకనం : భాగస్వామ్య ఒప్పందం ప్రకారం, ఒక భాగస్తుడు విరమణ చెందినప్పుడు సంస్థ ఆస్తి అప్పులను పునర్మూల్యాంకనం చేస్తారు. ఆస్తి అప్పుల విలువలలో వచ్చిన మార్పులను పునర్మూల్యాంకనం ఖాతాలో నమోదు చేస్తారు.
→ సంచిత నిధులను, పంపకం కాని లాభనష్టాలు పంచడం : సంచిత నిధులను లాభనష్టాల ఖాతాలోని పంచని లాభాలు/నష్టాలను, పాత భాగస్తులకు, వారి పాత నిష్పత్తిలో మూలధనం ఖాతాలకు మళ్ళిస్తారు.
→ గుడ్విల్ : గుడ్విల్ అనేది భాగస్తులు సంపాదించిన సంస్థ యొక్క పేరు ప్రతిష్ఠలు, విరమణ చేసే భాగస్తునికి కూడా సంస్థ గుడ్విల్లో వాటా ఉంటుంది. కాబట్టి, విరమణ పొందే భాగస్తునికి, సంస్థ గుడ్విల్ వాటా చెల్లించాలి.
→ విరమణ చేసే భాగస్తునికి చెల్లింపు : అవసరమైన అన్ని సర్దుబాట్లు చేసిన తరువాత, విరమణ చేసే భాగస్తునికి చెల్లించవలసిన మొత్తాన్ని వెంటనే కానీ లేదా కొంత మొత్తాన్ని చెల్లించి, మిగిలిన మొత్తాన్ని అతని అప్పుల ఖాతాకు మళ్ళిస్తారు.
→ భాగస్తుని మరణం : ఎప్పుడైనా భాగస్తుడు మరణించినపుడు, భాగస్వామ్య ఒప్పందం రద్దవుతుంది. మిగిలిన భాగస్తులు, కావలెననుకొంటే, మరణించిన భాగస్తునికి చెల్లించవలసిన మొత్తాన్ని పరిష్కరించుకొని, వ్యాపారాన్ని కొనసాగించుకొనవచ్చు. అకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మరణించిన భాగస్తుని మూలధన ఖాతాలోని నిల్వను, వారి వారసులు ఖాతాకు మళ్ళించి, తదుపరి, వారి వారసులకు చెల్లింపు చేయుదురు.
→ ఉమ్మడి జీవిత భీమా : భాగస్తుడు మరణించినప్పుడు సంస్థ పెద్ద మొత్తంలో అతని వారసులకు చెల్లింపులు చేయవలసి యుండును. ఇది సంస్థ ఆర్థిక వనరులపై తీవ్ర ప్రభావం చూపును. దీనిని అధిగమించుటకు, సంస్థలు భాగస్తుల జీవితాలపై ఉమ్మడి జీవిత భీమా పాలసీ అనే ఒక భీమా పాలసీని తీసుకొని, మరణించిన భాగస్తుని వారసులకు చెల్లింపు చేయును.