TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 6 भारतभूषा वीरयोषा

Telangana TSBIE TS Inter 2nd Year Sanskrit Study Material 6th Lesson भारतभूषा वीरयोषा Textbook Questions and Answers.

TS Inter 2nd Year Sanskrit Study Material 6th Lesson भारतभूषा वीरयोषा

लघु समाधान प्रश्नाः  (స్వల్ప సమాధాన ప్రశ్నలు) (Short Answer Questions)

पश्न 1.
एकाकिन्यपि चिन्ता कथं खेलति स्म ?
समादान:
एकाकिन्यपि चिन्ता मृदा दुर्गं निर्माय, पुनः तद्भङ्गलीलां खेलति स्म ।

पश्न 2.
रत्नसिंहः कथं कर्माणि कुर्वन् आसीत् ?
समादान:
रत्नसिंहः कर्तव्यबुद्ध्या एव कर्माणि कुर्वन् आसीत् ।

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 6 भारतभूषा वीरयोषा

पश्न 3.
रत्नसिंहः किमर्थं चितां प्राविशत् ?
समादान:
रत्नसिंहः आत्मनः अपराधस्य प्रायश्चित्तं कर्तुं चितां प्राविशत् ।

एकपद समाधान प्रश्नाः (ఏకపద సమాధాన ప్రశ్నలు)(One Word Questions) 

पश्न 1.
चिन्तादेवी केन पालिता आसीत् ?
समादान:
चिन्तादेवी पित्रा पालिता आसीत् ।

पश्न 2.
राजपुत्रयूनः नाम किम् ?
समादान:
राजपुत्रयूनः नाम रत्नसिंहः ।

पश्न 3.
चिन्तादेवी किं कर्तुं सज्जीबभूव ?
समादान:
चिन्तादेवी परलोकयात्रां कर्तुं सज्जीबभूव ।

कठिनशब्दार्थाः (కఠిన పదాలకు అర్ధాలు)

1. आहवः = युद्धम्
2. अविकत्थनः = अहङ्काररहितः
3. चमूः = सैन्यम्
4. वाजी = अश्वः
5. अनलः = अग्निः

व्याकरणांशाः (వ్యాకరణం)

सन्धयः (సంధులు)

1. अनुग्रहः + चेत् = अनुग्रहश्चेत् – श्रुत्वसन्धिः
2. पुनः + समराङ्गणम् = पुनस्समराङ्गणम् – विसर्गसन्धिः
3. वीराः + ते = वीरास्ते – विसर्गसन्धिः
4. पुरः + सरेयुः = पुरस्सरेयुः – विसर्गसन्धिः
5. अविकत्थनः + च = अविकत्थनश्च – श्श्रुत्वसन्धिः
6. निक्षिपन् + अपि = निक्षिपन्नपि – मुडागमसन्धिः
7. पश्चात् + गन्तुम् = पश्चाद्गन्तुम् – जश्त्वसन्धिः
8. अन्ततः + च = अन्ततश्च – श्रुत्वसन्धिः

समासाः (సమాసాలు)

1. कालिन्दी इति नदी, कालिन्दीनदी, कालिन्दीनद्याः तटः, कालिन्दीनदीतटः तस्मिन् – षष्ठीतत्पुरुषः
2. समुपचितश्च असौ समरश्च समुपचितसमरः समुपचितसमरस्य समयः – तस्मिन् समुपचितसमरसमये – षष्ठीतत्पुरुषः
3. लब्धा जनुः यया सा – लब्धजनुः – बहुव्रीहिः
4. मात्रा विहीना, मातृविहीना – तृतीयातत्पुरुषः
5. निर्गता चिन्ता यस्याः सा, निश्चिन्ता – बहुव्रीहिः
6. तस्य भङ्गः, तद्भङ्गः, तद्भङ्गस्य लीला, तद्भङ्गलीला तां तद्भङ्गलीलाम् – षष्ठीतत्पुरुषः
7. आत्मनः बलिदानम्, आत्मबलिदानम् आत्मबलिदानस्य कथाः ताभिः, आत्मबलिदानकथाभिः – षष्ठीतत्पुरुषः
8. सह चरन्ति इति सहचराः – उपपदतत्पुरुषः
9. अश्रुभिः सह – साश्रु – साश्रूणि नयनानि येषां ते साश्रुनयनाः – बहुव्रीहिः
10. स्मितं मुखं यस्याः सा स्मितमुखी – बहुव्रीहिः
11. सन्तोषं बिभर्ति इति सन्तोषभरः तस्य – सन्तोषभरस्य – उपपदतत्पुरुषः
12. न विद्यते नाथः यस्याः सा अनाथा तस्याः – अनाथायाः – बहुव्रीहिः
13. गम्भीरश्च असौ स्वरश्च – गम्भीरस्वर : – गम्भीरस्वरेण – विशेषणपूर्वपदकर्मधारयः
14. वीरश्च असौ पिता च वीरपिता तस्य वीरपितुः – विशेषण – पूर्वपदकर्मधारयः
15. शान्तः स्वभावः यस्य सः – शान्तस्वभावः – बहुव्रीहिः

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 6 भारतभूषा वीरयोषा

भारतभूषा वीरयोषा Summary in Sanskrit

कविपरिचयः

अस्याः कथायाः रचयिता महामहोपाध्यायः राष्ट्रपतिपुरस्कारभाक् ‘गलगली रामाचार्यः’ कर्णाटकराज्यस्थः सकलशास्त्रपारङ्गतः मधुरवाणीति संस्कृत मास पत्रिकायाः संस्थापकः प्रधानसम्पादकः साहित्यरत्न – बिरुदाङ्कितश्च आसीत् । अयं कविपण्डितः क्रि.श. 1893 तमे वर्षे कर्णाटकस्थबीजापुरजनपदस्य कृष्णानदीकूलस्थे गलगलीग्रामे लब्धजनिः । बहूनां ग्रन्थानां सम्पादकः संशोधकश्च श्रीमान् गलगली रामाचार्यः । प्रस्तुतपाठ्यांशः ‘भारतभूषा वीरयोषा “मधुराञ्जलिः” इति नामकात् पण्डितगलगलीरामाचार्याणां रचनासङ्कलनात् सङ्गृहीतः ।

सारांश

मातृविहीना चिन्तादेवी शूरेण पित्रा पालिता । त्रयोदशे वयसि वीरस्वर्गं गते पितरि सेनायाः नायकत्वं स्वीचकार । सा सर्वतः प्रभुत्वम् आविश्चकार । सैनिकेषु अन्यतमं शूराग्रेसरं रत्नसिंहं परिणीतवती चिन्तादेवी । अकस्मात् दुर्गम् आक्रान्तुम् आगतां शत्रुसेनाम् अभिमुखीकर्तुं स्वसेनया गतः रत्नसिंहः मनसा गृहाभिमुख एवासीत् । सेनां विहाय सः कुत्रापि निलीनः । नायकविहीना सेना शत्रुभिः पराजिता । सेनायाः पराजयस्य वार्तां ज्ञात्वा चितां प्रज्वाल्य चिन्तादेवी परलोकयात्राय सज्जीबभूव । समये आगतेन रत्नसिंहेन निवारितापि सा युद्धक्षेत्रात् पलायितं पतिं धिक्कृत्य चितायां स्वशरीरम् आहुतीकृतवती । पश्चात्तापदग्धः रत्नसिंहः तामेव चितां प्रविश्य प्रायश्चित्तं चकार

भारतभूषा वीरयोषा Summary in English

Introduction

Introduction : The lesson Bharatabhusha Virayosha is taken from Madhuranjali written by Sri Galagali Ramacharya. Sri Rama- charya was born in Galagali in Bijapur district, Karnataka in 1893. He was the founder editor of Madhuravani, a Sanskrit monthly magazine. He received President’s medal and was awarded the title Sahityaralia.

भारतभूषा वीरयोषा Summary in Telugu

కవి పరిచయం

“భారతభూషా వీరయోషితా” అనే పాఠ్యభాగాన్ని గలగలీ రామాచార్యులుగారు రచించారు. వీరు రాష్ట్రపతి పురస్కారాన్ని పొందారు. కర్ణాటక ప్రాంత వాసి అయిన వీరు సకల శాస్త్రముల యందు గొప్ప పండితుడు. ‘మధురవాణి’ అనే సంస్కృత పత్రికకు ప్రధాన సంపాదకులుగా పనిచేశారు. సాహిత్యరత్న అనే బిరుదు పొందారు. ఈ మహాకవి క్రీ.శ. 1893వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని కృష్ణానదీ తీరంలో గల గలగలీ గ్రామంలో జన్మించారు. వీరు అనేక గ్రంథాలకు సంపాదకులుగాను, పరిశోధకులుగాను వ్యవహరించారు. ప్రస్తుత పాఠ్యభాగము “భారతభూషా వీరయోషా” అనేది “మధూంజలి” అనే పేరుగల రచనా సంకలనం నుండి సంగ్రహింపబడినది.

సారాంశము

చింతాదేవి అనే స్త్రీ తల్లి మరణంతో తండ్రి సంరక్షణలో పెరిగింది. తండ్రి మరణం తరువాత తన పదమూడవ సంవత్సరంలో సేనకు నాయకత్వం స్వీకరించింది. ఆమె తన ప్రభుత్వాన్ని అంతట విస్తరింపజేసింది. సైనికుల్లో అత్యంత అగ్రేసరుడైన రత్నసింహుడు అనే పేరుగల సైనికుడిని వివాహం చేసుకుంది. ఒకసారి అకస్మాత్తుగా శత్రుసేన రాజ్యాన్ని ఆక్రమించుకుంది. వెంటనే రత్నసింహుడు కత్తిని చేతబట్టి, గుర్రాన్ని ఎక్కి యుద్ధానికి వెళ్ళాడు. అయితే అతని మనసంతా ఇంటియందే లగ్నమైంది. శత్రుసైన్యం దగ్గరకు రాగానే రత్నసింహుడు ఎవరికి కనిపించకుండా దాక్కున్నాడు. నాయకత్వం లేకపోవడంతో సైన్యం చిన్నాభిన్నం అయింది. శత్రుసైన్యం రత్నసింహుని సైన్యాన్ని ఓడించింది. సైనికుని ద్వారా పరాజయవార్తను చింతాదేవి వినింది. అభిమానవతి అయిన ఆమె అగ్నిప్రవేశం చేయాలనుకుంది. చితిని ఏర్పాటుచేయమని ఆదేశించింది. ఆ సమయంలో రత్నసింహుడు వచ్చి ఆమెను నిందించాడు. అయినా ఆమె తన ప్రయత్నం మానుకోలేదు. చితిలో దూకి తన ప్రాణాలను వదులుకుంది. పశ్చాత్తాపంతో రత్నసింహుడు కూడా చితిలో దూకి మరణించాడు.

కాళిందీ నదీతీరంలో కాల్పీ అనే పేరుగల నగరం ఉంది. అక్కడ ఒక వీరునికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు చింతాదేవి. చిన్నతనంలోనే తల్లి మరణించింది. దాంతో ఆమె తండ్రి సంరక్షణలో పెరిగింది. తండ్రి చింతాదేవిని ఒక అరణ్యంలో ఉంచాడు. యుద్ధవిద్యలో శిక్షణ ఇప్పించాడు. తన పదమూడేళ్ళ వయసులో తండ్రి మరణించాడు. తన సహచరుల ద్వారా తండ్రి మరణ వార్త విన్నది. అయినా ధైర్యాన్ని కోల్పోలేదు. ధైర్యంగా జీవించాలని నిర్ణయించుకుంది. తన సేనల సహాయం కోరింది. రాజ్యాన్ని బాగా విస్తరించుకుంది. కొంతకాలానికి తన సైనికులలో ఒక వీరుడైన రత్నసింహుడిని వివాహం చేసుకుంది.

విధి వారిద్దరి అనురాగాన్ని ఎక్కువకాలం నిలువనివ్వలేదు. ఒకసారి శత్రుసైన్యం ఆకస్మికంగా రాజ్యాన్ని చుట్టుముట్టింది. అప్పుడు రత్నసింహుడు కత్తిని చేతబట్టి, గుర్రం ఎక్కి శత్రుసైన్యానికి ఎదురు వెళ్ళాడు. చింతాదేవి వీర తిలకాన్ని దిద్దింది. అయితే అతని మనస్సు ఇంటి మీదనే ఉంది. ఎవరికి చెప్పకుండా, సైన్యాన్ని గాలికి వదిలి ఎక్కడో దాకున్నాడు. నాయకత్వం లేకపోవడంతో సైన్యం ఛిన్నాభిన్నం అయింది. శత్రువుల చేతిలో పరాజయాన్ని పొందింది. ఈ వార్తను ఒక సైనికుని ద్వారా చింతాదేవి వినింది. అది విని వెంటనే చితిని ఏర్పాటుచేయాలని ఆదేశించింది. చితిని ఏర్పాటు చేశారు. అందరు గుమికూడారు. ఆ సమయంలో రత్నసింహుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. భార్యను సమీపించి “నీపై ప్రేమ దగ్గలేదు.

ఈ ప్రయత్నం విరమించు” అని ప్రార్థించాడు. ఆమె అతని మాటలను తిరస్కరించింది. దూరంగా తొలగిపొమ్మని ఆదేశించింది. చితిలో ప్రవేశించి ఆత్మార్పణ చేసుకుంది. ఇదంతా చూచిన రత్నసింహుడు ఆశ్చర్యం పొందాడు. తన తప్పుకు ప్రాయశ్చిత్తాన్ని చేసుకొనదలచిన వాడై రత్నసింహుడు చితిలో ప్రవేశించాడు. ఆత్మార్పణ చేసుకున్నాడు. ఆహా ! మన ప్రాచీన మహిళల తెగింపు, సాహసం ఎంత గొప్పదో కదా !

अनुवादः (అనువాదములు) (Translations)

कालिन्दीनदीतटे काल्पीनाम्नी काचन नगरी आसीत् । तस्यां कस्यचन शूरस्य कन्या चिन्तादेवी या समुपचितसमरसमये लब्धजनुः । बाल्ये एव मातृविहीना सा पितैव पालिता आसीत् । चिन्ताया बाल्यम् अतीयाय समरभूमौ एव । पिता किल तां वने कुटीरे त्यक्त्वा रणाङ्गणम् उपधावति स्म । एकाकिन्यपि निश्चिन्ता चिन्ता मृदा दुर्गं निर्माय पुनः तद्भङ्गलीलां खेलति स्म । सा वीराणामात्म- बलिदानकथाभिः सावेशभटमुखनिस्सृताभिः आत्मानं व्यनोदयत् ।

एकदा दिनत्रयं यावत् सा जनकस्य वार्तामपि नाशृणोत् । तृतीये दिने पितुः सहचराः केचन अभ्येत्य साश्रुनयनाः व्यलपन् । तदा त्रयोदशवर्षीया सा धीरा बालिका स्मितमुखी जगाद ‘पितरि मे वीरस्वर्गं गते सन्तोष्टव्ये अस्मिन् प्रसङ्गे कुतो वा शोकावेगः । नायं विलापस्य समयः किन्तु सन्तोषभरस्य इति ।

కాళిందీ నదీతీరంలో కాల్పీ అనే పేరుగల ఒక నగరం ఉండేది. అక్కడ ఒకానొక వీరుని యొక్క కుమార్తె చింతాదేవి అనే పేరుగల యువతి ఉంది. ఆమెకు యుద్ధ నైపుణ్యంలో ప్రావీణ్యం ఉంది. ఆమె బాల్యంలోనే మాతృవియోగాన్ని పొందింది. అప్పటి నుండి ఆమె తండ్రి సంరక్షణలో పెరిగింది. ఆమె బాల్యమంతా రణభూమిలోనే గడిచింది. తండ్రి ఆమెను అరణ్యంలోని ఒక కుటీరంలో విడిచి రణరంగంలోకి దూకాడు. ఒంటరిగా ఉన్నప్పటికి ఆమె సంతోషంతో మట్టితో కోటను నిర్మించి, దానిని పడగొడుతూ ఆడుతుండేది. ఆమె ఎల్లప్పుడు వీరుల గాధలను చదువుతూ ఆత్మానందాన్ని పొందేది.

ఒకసారి మూడు రోజులు గడిచినా తండ్రికి సంబంధించిన వార్తలను వినలేదు. మూడవరోజు కొంతమంది సహచరులు వచ్చి కన్నీళ్ళు పెడుతూ దుఃఖించారు. తండ్రి మరణవార్తను చెప్పారు. ఆ సమయంలో ఆమెకు పదమూడు సంవత్సరాలు. ఆమె ధైర్యంగా నవ్వుతూ “తండ్రి వీర స్వర్గం పొందితే ఆనందించాలి” ఈ సమయంలో విచారింపకూడదు. ప్రస్తుతం దుఃఖించవలసిన సమయం కాదు.” అని పలికింది.

There was a city named Kalpi on the banks of river Yamuna. Chinta Devi, a warrior’s daughter was bom there during the times of war. she lost her mother in childhood, she was brought up by her father. Chinta spent her childhood in battlefields only. Her father used to leave her in a cottage in a wood and go to battle. She would play making mud forts and destroying them. She listened to the adventurous stories of the soldiers.

Once there was no news of her father for three days. On the third day she received the news of the death of her father from his associates, who were sad. But Chinta smiled and said that it was an occasion for rejoicing and not mourning, as her father achieved the heaven of the warriors.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 6 भारतभूषा वीरयोषा

कश्चन सैनिको व्याजहार ‘वयं न शोचामः ते पितुः कृते, परम् अनाथायाः ते स्थितिं परिचिन्त्य । कुत्र वा स्थास्यते भवत्या इतःपरम्’ इति । चिन्ता गम्भीरस्वरेण आह – ‘अहं वीरपितुः कन्या अस्मि । तम् एव अनुचिकीर्षामि तादृशैः एव कर्मभिः । यदि मम जनके वास्तवो वः अभिमानः तर्हि सङ्गृह्यन्तां सैनिकाः । भगवतः अनुग्रहश्चेत् भवत्साहाय्येन आहवे विजयेन सङ्गत्ता स्याम् । साम्प्रतं गम्यतां पुनस्समराङ्गणम् ।’

व्यतीयुः पञ्च वसन्ताः । सर्वतः प्रभुत्वम् आविश्चकार चिन्तादेवी । विजयश्रियम् इव मूर्तिमतीं समरे निश्शङ्कं निर्भयं च अवस्थितां तां निरीक्ष्यैव सैनिका नितराम् उत्साहशालिनः समपद्यन्त । पुरो गच्छन्त्यां तस्यां वीरास्ते पुरुषाः कथं न पुरस्सरेयुः ।

ఒక సైనికుడు మేము మీ తండ్రి గారిని గురించి దుఃఖించడం లేదు, అయితే అనాథ అయిన మీ పరిస్థితి గురించి విచారిస్తున్నాము. మీరు ఇప్పటి నుండి ఎక్కడ ఉండగలరు ? అని పలికాడు. పిమ్మట ఆమె, నేను వీరుడైన తండ్రి కుమార్తెను. ఒకవేళ మీకు మా తండ్రిపై అభిమానం ఉంటే సైనికులందరిని సమీకరించండి. మీ అనుగ్రహం ఉంటే, మీ సహాయంతో యుద్ధంలో విజయాన్ని పొందగలను. ప్రస్తుతం వెళ్ళండి. తిరిగి యుద్ధంలో కలుద్దాం.

ఐదు సంవత్సరాలు గడిచాయి. చింతాదేవి ప్రభుత్వాన్ని అంతట విస్తరించింది. మిక్కిలి ఉత్సాహశీలురాలైన చింతాదేవిని చూచి సైనికులు ఉత్సాహశీలురైనారు. యుద్ధ రంగంలో ఆమెను వీరులు అంతట అనుసరించారు.

When she was reminded of her lonely state, she said that she was the daughter of a warrior. She would follow her far her only. She asked them to gather soldiers. They could win if there was the grace of god.

Five years passed. Chinta Devi established her every-where. Soldiers were inspired by her presence in the battlefield. They followed her.

तेषु सैनिकेषु रत्नसिंहो नाम राजपुत्रयुवा आसीत् यस्मिन् विशेषतो स्निह्यति स्म चिन्ता | शान्तस्वभावः अविकत्थनश्च रत्नसिंहः कर्तव्यबुद्ध्यैव कर्माणि कुर्वन् आसीत् । तस्य पराक्रमेण सन्तुष्टा चिन्ता तं परिणीतवती । प्रायो विधिः न सहते प्रणयिनोः चिरं विलाससुखम् । अकस्मात् दुर्गम् उपासन्ना रिपुवरूथिनी इति वार्तां श्रुत्वा रत्नसिंहः स्वीचकार करे अरिभीकरं करवालम् । हयमारुढं रत्नसिंहं विलोक्य चिन्ता मनसा प्रार्थयामास विजयाय भगवतीं कुलदेवताम् ।

सहचरैः सैनिकैः सह रणाभिमुखं पदं निक्षिपन्नपि मनसा गृहाभिमुख एवासीत् रत्नसिंहः । अतः समासन्ने समरप्रदेशे अनुयायिवर्गं सहसा विहाय तेन अज्ञातः क्वापि निलिल्ये रत्नसिंहः । ततश्च नायकविहीनां शिथिलितोत्साहां च चिन्तादेव्याः चमूं सकलाम् अपि भृशम् अवासादयद् विपुलं रिपुबलम् ।

सन्ध्यासमये कश्चन सैनिकः अभ्येत्य निश्शस्त्रः तूष्णीम् अतिष्ठत् चिन्तायाः पुरतः । तस्य मुखात् सर्वसैन्यस्य क्षयं शत्रूणां दुर्गाक्रमणं च श्रुत्वा निष्कम्पेन स्वरेण आदिदेश चिन्ता – ‘सत्वरं सज्जीक्रियतां चिता’ ।

ఆ సైనికులలో రత్నసింహుడు అనే పేరుగల యువకుడైన రాజకుమారుడు ఉన్నాడు. శాంతస్వభావుడు, అహంకారంలేని రత్నసింహుడు కర్తవ్య బుద్ధితో తన పనుల్లో ఆసక్తిని ప్రదర్శించేవాడు. అతని పరాక్రమాన్ని చూచి చింతాదేవి సంతోషితురాలై అతడిని వివాహం చేసుకుంది. విధివిలాసం వల్ల వారి ప్రణయకాల సుఖం ఎక్కువకాలం జరుగలేదు. ఆకస్మికంగా శత్రుసైన్యం రాజ్యాన్ని ఆక్రమించిందనే వార్త విని రత్నసింహుడు ఖడ్గాన్ని ధరించాడు. గుర్రాన్ని ఎక్కి బయలుదేరుతున్న భర్తను చూచి ఆమె మనసులో విజయం కలగాలని ఆశించింది.

సహచర సైనికులతో రత్నసింహుడు యుద్ధానికి బయలుదేరాడు. అతని మనసు మాత్రం ఇంటియందే లగ్నమైంది. యుద్ధ రంగాన్ని వీడి వెంటనే రత్నసింహుడు ఎక్కడో దాక్కున్నాడు. దాంతో నాయకత్వ లేమితో వీరసింహుడి సైన్యమంతా చెల్లాచెదురైంది. పరాజయాన్ని పొందింది.

సంధ్యా సమయంలో ఒకానొక సైనికుడు ఆయుధాలు లేనివాడై చింతాదేవి ఎదుట నిలబడ్డాడు. అతడి ద్వారా సైన్యమంతా క్షీణించిందని, దుర్గాలను శత్రువులు ఆక్రమించారని విని గద్గదస్వరంతో “చితిని ఏర్పాటుచేయండి” అని ఆదేశించింది.

There was a young Rajput warrior Ratnasimha among the soldiers. He was composed and devoted to his work. Chinta married him. However, fate would not allow happy times to lovers. Suddenly their fort was attacked by the enemy. Ratnasimha took his sword and Chinta prayed for his victory.

Though Ratnasimha went to the battlefield, his mind was at home only. He left his followers and hid somewhere. The enemy easily defeated the army of Chinta that was without leader.

A soldier reported the matter to Chinta that evening. Chinta firmly order to prepare the funeral pyre.

TS Inter 2nd Year Sanskrit Study Material Chapter 6 भारतभूषा वीरयोषा

सायं दीपप्रज्वालनसमये चितापि प्रज्वालिता । साध्वी चिन्तादेवी सर्वालङ्कारमण्डिता परलोकयात्रां कर्तुं सज्जीबभूव । चितां परितो दिदृक्षूणां जनानां महान् समूहः समागतः । दुर्गं पर्यवृण्वन् शत्रवः । तदा अश्रूयत वाजिनः खुरपुट ध्वनिः । कोऽपि सैनिकवेषधारी युवा प्राविशत् तत्प्राङ्गणम् । जनाः साश्चर्यम् अपश्यन् । सोऽयं रत्नसिंहः ।

रत्नसिंहः चितासमीपम् आगत्य कम्पमानशरीरो अवदत् प्रिये अद्यापि प्राणिमि रत्नसिंहोऽहम् । किमिदम् असाम्प्रतम् आरब्धं त्वया । परं चिन्तादेवी न ददर्श चक्षुरुन्मील्य तम् । केवलं दक्षिणपाणिसंज्ञया पश्चाद्गन्तुम् असूचयत् तं रत्नसिंहम् ।

तस्याः मुखकमलम् अनलेन कवलितम् । तदानीमपि चिन्ता स्पष्टस्वरेण आह – ‘सर्वं जानामि । भवान् न मे रत्नसिंहः । मदीयो रत्नसिंहः सत्यं शूराग्रेसर आसीत् । एतस्य तुच्छदेहस्य रक्षणाय आत्मनः पवित्रक्षत्रियधर्मात् न कदापि प्रच्युतो भवति । यस्याहं चरणदासी स रत्नसिंहो विभ्राजते देवलोके । मा दूषय रत्नसिंहस्य पावनं नामधेयम् । स वीरो राजपुत्रः’ ।

चरमशब्दे समुच्चार्यमाण एव अग्निज्वालाः समाच्छादयन् चिन्तायाः शिरः । रत्नसिंहो विभ्रान्त इव ददर्श तं भीकरं दृश्यम् । अन्ततश्चैकं निश्वासं निस्सार्य आत्मनः अपराधस्य प्रायश्चित्तं विधातुं प्राविशत् सहसा चिताम् । अहो प्राचीनानाम् आर्यललनानाम् ओजस्विता ।

సాయంత్రం దీప ప్రజ్వాలన సమయంలో చితి కూడా ప్రజ్వరిల్లింది. పతివ్రత అయిన చింతాదేవి సర్వాలంకార సంశోభితురాలై పరలోక యాత్రను చేయడానికి సిద్ధు రాలైంది. చితి చుట్టూ ఎంతోమంది చూడటానికి వచ్చారు. శత్రువులు దుర్గాన్ని చుట్టు ముట్టారు. ఆ సమయంలో రత్నసింహుడు ఆ ప్రదేశానికి వచ్చాడు. ప్రజలు అతడిని ఆశ్చర్యంతో చూశారు.

రత్నసింహుడు చితిని సమీపించి వణకిపోతూ తన భార్యతో ఓయీ ! ఇప్పటికీ నీయందు ప్రేమ తగ్గలేదు ఎందుకు ఇలాంటి చేయకూడని పని చేస్తున్నావు ?” అని పలికాడు. ఈ మాటలు విని చింతాదేవి అతడిని చూడటానికి కూడా ఇష్టపడలేదు. చేతి సంజ్ఞతో దూరంగా తొలగిపొమ్మని సూచించింది. ఆమె ముఖం కమిలిపోయింది. ఆ సమయంలోను స్పష్టంగా “ఓయీ ! నాకు అంతా తెలుసు. నీవు నా రత్నసింహుడివి కాదు. నా రత్నసింహుడు శూరాగ్రేసరుడు. అతడు తన తుచ్ఛమైన శరీరాన్ని రక్షించు కోవడానికి క్షత్రియధర్మం నుండి మరలడు నా రత్నసింహుడు దేవలోకంలో ప్రకాశిస్తున్నాడు. నీవు పవిత్రమైన రత్నసింహుని పేరును ఉచ్చరించవద్దు. అతడు వీరుడైన రత్నసింహుడు.

చివరి మాటలు మాట్లాడుతుండగనే అగ్ని జ్వాలలు ఆమె శిరస్సును చుట్టు ముట్టాయి. రత్నసింహుడు భీకరమైన ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూశాడు. చివరిగా ఒక నిట్టూర్పు విడిచి తన తప్పునకు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలనుకున్నాడు. వెంటనే అదే చితిలో ప్రవేశించాడు. తన తనువు చాలించాడు. ఆహా ! మన ప్రాచీన స్త్రీల తేజస్సు తెగువ ఎంత అద్భుతము !

The pyre was lit at the time of lighting the-evening lamps Chinta Devi adorned herself with ornaments in preparation for her final journey. Onlookers gathered around the pyre. Then they heard the sound of hooves. A person entered that place in the attire of a soldier. Lo, he was Ratnasimha.

He came to the pyre and said that he was alive. But Chinta did not look at him. She waved her right hand to indicate to him to step aside.

Her face was singed with heat. She said clearly that she knew everything. He was not her Ratnasimha. Her husband was a true warrior. He would never step away from his royal duty for the sake of worthless body. He was in heaven now. His name should not be sullied.

As she ended her speech, the fire engulfed her head. Ratnasimha saw that in awe. Later sighing deeply, he also entered the fire as if to atone his sin. Oh, the greatness of the women of ancient times!

Leave a Comment