Here students can locate TS Inter 2nd Year Accountancy Notes Chapter 3 Accounting for Not-for-Profit Organisation to prepare for their exam.
TS Inter 2nd Year Accountancy Notes Chapter 3 Accounting for Not-for-Profit Organisation
→ Not for profit organisation means an organisation whose main object not to earn a profit, but to render service to their members.
→ It includes Education Institutions, Hospitals, Clubs, Religious Institutions, cooperation Societies etc.
→ Final Accounts prepared by not-for-profit organizations consist the following:
- Receipts and Payments Account
- Income and Expenditure Account
- Balance Sheet
→ Receipts and payment account is a summary of cash and bank transactions. All the cash receipts and payments are recorded in this account.
→ Income and Expenditure account is similar to profit and loss account. Revenue Expenditure and Revenue Incomes are recorded in this account. Revenue expenditure and Revenue incomes are recorded in this account.
→ Revenue Expenditure is an expenditure whose benefit expires on or before the accounting period.
→ Revenue Receipt is the receipt or income which are received by the business organisation is the normal course of business activities.
→ Capital Expenditure is an expenditure generally incurred for the acquisition of assets or increasing the earning capacity of the business firm.
→ Capital receipt is the receipt of business consisting of capital contributed by the members or shareholders or legacies etc.
→ Deferred Revenue expenditure means the expenditure is revenue in nature, but its benefit is spread over a number of years.
TS Inter 2nd Year Accountancy Notes Chapter 3 లాభాపేక్ష లేని సంస్థల ఖాతాలు
→ లాఖాపేక్ష లేని సంస్థలు: వీటి ప్రధాన ఉద్దేశం లాభార్జన కాకుండా, సభ్యులకు సేవలను అందించే విధంగా ఉంటాయి.
→ వ్యాపారేతర సంస్థలు లేదా లాభాపేక్ష లేని సంస్థలు: విద్యా సంస్థలు, గ్రంథాలయాలు, ఆసుపత్రులు, మత సంస్థలు, క్లబ్బులు మొదలైనవి.
→ ముగింపు ఖాతాలు: లాభాపేక్ష లేని సంస్థలు ఆర్థిక సంవత్సరాంతన ముగింపు ఖాతాలను క్రింది విధంగా తయారుచేస్తాయి.
- వసూళ్ళు చెల్లింపుల ఖాతా
- ఆదాయ – వ్యయాల ఖాతా
- ఆస్తి – అప్పుల పట్టీ
→ వసూళ్ళు చెల్లింపుల ఖాతా నగదు ఖాతాకు ప్రతిరూపం, ఆదాయ వ్యయాల ఖాతా లాభనష్టాల ఖాతాకు ప్రతిరూపం.
→ పెట్టుబడి లేదా మూలధన నిధి: ఇది వ్యాపార సంస్థల మూలధనం లాంటిది. దీనిని ఆస్తి- అప్పుల పట్టీలో చూపాలి.
→ పెట్టుబడి వ్యయం: సంస్థ స్థిరాస్తిని సేకరించడానికి గాని ఆర్జన చేకూర్చడానికి లేదా ఆర్జన శక్తిని పెంచడానికి చేసిన వ్యయాలనే పెట్టుబడి వ్యయాలు అంటారు.
→ రాబడి వ్యయం: సంస్థ ఆర్జన శక్తిని యధాతథంగా ఉంచడానికి సంస్థ నిర్వహణకు, వస్తువుల ఉత్పత్తికి, అమ్మకాలకు చేసిన వ్యయం రాబడి వ్యయం.
→ పెట్టుబడి వసూళ్ళు: ఈ సంస్థలు స్వీకరించే జీవితకాల చందాలు, ప్రవేశ రుసుం, వారసత్వాలు మొదలైనవి పెట్టుబడి వసూళ్ళు.
→ రాబడి వసూళ్ళు: ఈ సంస్థలకు వచ్చే చందాలు, అద్దె, వడ్డీలు, పాత వార్తాపత్రికల అమ్మకం, వినోదాల వల్ల వసూళ్ళు మొదలైనవి రాబడి వసూళ్ళు.
→ విలంబిత రాబడి ఖర్చులు: చేసిన ఖర్చు వల్ల వచ్చే ప్రయోజనం కొన్ని సంవత్సరాల వరకు అంటే ఈ రకమైన ఖర్చులనే విలంబిత రాబడి ఖర్చులు అంటారు.
→ వారసత్వాలు: వీలునామా ద్వారా సంక్రమించిన మొత్తాలను వారసత్వాలంటారు.
→ ప్రవేశ రుసుము: వ్యాపారేతర సంస్థలో మొదటిసారిగా ప్రవేశించినప్పుడు సభ్యులు చెల్లించే రుసుము.
→ చందాలు: సంస్థలోని సభ్యులు క్రమం తప్పకుండా నిర్ణీత కాల పరిమితిలో చెల్లించే మొత్తాలను చందాలు అంటారు.
→ విరాళాలు: వ్యక్తుల నుంచి, సంస్థల నిర్వహణ కోసం స్వీకరించే మొత్తాలను విరాళాలు అంటారు. ఇవి రెండు రకాలు. అవి:
- సాధారణ విరాళం
- ప్రత్యేక విరాళం
ఎ) సాధారణ విరాళం: సంస్థ విరాళ మొత్తాన్ని ఏ విధంగా ఉపయోగించాలో నిర్దేశించకపోయినప్పుడు వాటిని సాధారణ విరాళం అంటారు.
బి) ప్రత్యేక విరాళం: విరాళ మొత్తాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలి అని ప్రత్యేక సూచన ఇచ్చినప్పుడు దానిని ప్రత్యేక విరాళం అంటారు.