TS Inter 2nd Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 6th Lesson స్థానిక ప్రభుత్వాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 6th Lesson స్థానిక ప్రభుత్వాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారతదేశంలో ప్రాంతీయ ప్రభుత్వాల చారిత్రక నేపథ్యాన్ని వివరించండి.
జవాబు.
చారిత్రక నేపథ్యం:
చక్కని పరిపాలనా వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్యం భారతదేశానికి ఎంతో అవసరమని గాంధీజీ ఏనాడో ఉద్భోదించారు. అనేక మంది జాతీయ నాయకులు ఈ భావనలను బలపరచారు. అయితే స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన అనేక సంఘటనల కారణంగా భారత రాజ్యాంగ నిర్మాతలు జాతీయ సమైక్యత, సమగ్రతలకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వవలసి వచ్చింది.

ఈ నేపథ్యంలో వారు ప్రాంతీయ ప్రభుత్వాలకు సముచితమైన స్థానాన్ని ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్య ఆశయాన్ని భారతరాజ్యాంగంలోని ఆదేశక సూత్రాలలో 40వ ప్రకరణలో వారు పొందుపరచారు. ఈ ప్రకరణ ప్రకారం “రాజ్యం పంచాయితీరాజ్ సంస్థలను నిర్వహించి, అవి స్వయం పాలనా సంస్థలుగా ఏర్పడటానికి తగిన అధికారాలు ఇవ్వాలి.

సామాన్య ప్రజానీకానికి పరిపాలనలో భాగస్వామ్యం, ప్రాతినిధ్యం కల్పించడానికి స్థానిక ప్రభుత్వాలు ఎంతో అవసరం. ఈ సంస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులలాంటివి. ఈ సంస్థలను స్వయం పాలన సంస్థలుగా రూపొందించడానికి తగిన చర్యలను తీసుకునే ప్రధాన బాధ్యత రాజ్యానికి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పంచాయితీరాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి వివిధ చర్యలను చేపట్టింది. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తరువాత 1952లో సమాజాభివృద్ధి పథకం అమలు కోసం తగిన చర్యలు తీసుకుంది.

గ్రామీణ ప్రాంతంలోని వారికి శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానాన్ని అందించడం కోసం ఈ పథకం ద్వారా ప్రభుత్వం కృషి చేసింది. అయితే, ఈ పథకం ఆచరణలో ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది. 1953లో కేంద్ర ప్రభుత్వం (National Extension Service Scheme – NESS) జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలను గ్రామీణాభివృద్ధి వ్యవహారాలలో భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం కృషి చేసింది. అయితే ఈ పథకం కూడా ఆశించిన ఫలితాలను అందించలేదు. దీంతో భారత ప్రభుత్వం 1957లో బల్వంత్ రాయ్ మెహతా ఆధ్వర్యంలో ఒక పరిశీలనా సంఘాన్ని నియమించింది.

సమాజాభివృద్ధి పథకాల వైఫల్యానికి దారితీసిన పరిస్థితుల గురించి విచారణ జరపవలసిందిగా ఈ సంఘాన్ని ప్రభుత్వం కోరింది. బల్వంత్రెయ్మైహతా కమిటీ సుమారు 10 నెలల కాలంలో అనేక విషయాలను పరిశీలించి 1957 నవంబర్లో తుది నివేదికను సమర్పించింది. సమాజాభివృద్ధి వైఫల్యానికి తగిన కారణం, ఆచరణలో ఉన్న లోపాలు అని కమిటీ అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పేరుతో గ్రామ పంచాయితీలను పునర్వ్యవస్థీకరించాలని కమిటీ సిఫార్సు చేసింది.

ఈ సందర్భంలో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అనేక సిఫార్సులు చేసింది. వాటిలో ప్రధానమైనవి గ్రామపంచాయితీ, పంచాయితీ సమితి, జిల్లాపరిషత్ వంటి మూడు అంచెల ప్రాతినిధ్య సంస్థలను ప్రవేశపెట్టడం, ప్రాంతీయ ప్రభుత్వాలకు తగినంత నిధులు మంజూరు చేయడం మొదలైన అంశాలకు సంబంధించి బల్వంత్రాయ్ మెహతా కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కమిటీ సూచించిన పంచాయితీరాజ్ వ్యవస్థను అనేక రాష్ట్రాలు ఆమోదించాయి. వీటిలో రాజస్థాన్ మొదటి రాష్ట్రం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 2.
73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ప్రధాన లక్షణాలను పేర్కొనండి.
జవాబు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎంతో ప్రముఖమైనది. గ్రామస్థాయిలో, మాధ్యమిక స్థాయిలో, జిల్లాస్థాయిలో ఉన్న మూడంచెల పాలన గల పంచాయితీరాజ్ సంస్థలను ఈ చట్టం వ్యవస్థీకరించింది.

గ్రామీణ ప్రజలలో చక్కని నాయకత్వ లక్షణాలను, వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయాన్ని కలుగజేయడంలో ఈ చట్టం ప్రధానపాత్ర వహిస్తుంది. ఈ చట్టం ప్రధాన లక్షణాలను చట్టంలోని వివిధ ప్రకరణాల ద్వారా సంక్షిప్తంగా తెలుసుకుందాం.

చట్టం ప్రధానాంశాలు :
1. నిర్వచనాలు (243వ ప్రకరణ) :
గ్రామసభ, పంచాయితీ, జిల్లా మొదలైన అనేక పదాలను ఈ చట్టంలో వివిధ సందర్భంలో వాడటం జరిగింది. ఈ పదాల నిర్వచనాలు 243వ ప్రకరణలో ఉన్నాయి.

2. గ్రామసభ (243 – ఎ) :
చట్టం ప్రకారం గ్రామస్థాయిలో ఒక గ్రామ సభ ఉంటుంది. ఇది తన అధికారాలను శాసనసభ నిర్దేశించిన విధంగా చలాయిస్తుంది.

3. పంచాయితీ వ్యవస్థ (243-బి) :
ఈ చట్టం మూడు అంచెల ఏకరూప వ్యవస్థను నిర్దేశించింది. అవి (1) గ్రామస్థాయి (2) (మాధ్యమిక) మండలస్థాయి (3) జిల్లాస్థాయి.

4. పంచాయితీ నిర్మాణం (243-సి) :
పంచాయితీల నిర్మాణం గురించి శాసనసభ తగు నిబంధనలను రూపొందించాలని ఈ చట్టం పేర్కొంది. ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతిపదికపై పంచాయితీలకు ప్రత్యక్ష ఎన్నికలు ఉండాలని ఈ చట్టం పేర్కొంది.

5. సీట్ల రిజర్వేషన్లు (243-డి) :
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల, ప్రజాప్రతినిధులకు పంచాయితీలో వారి జనాభాను బట్టి. సీట్లు రిజర్వేషన్లు ఉండాలని ఈ చట్టం పేర్కొంటుంది. అలాగే 1/3 వంతుకు మించకుండా మహిళలకు రిజర్వేషన్లు కేటాయించాలని చట్టం పేర్కొంటుంది.

6. పంచాయితీల కాల పరిమితి (243-ఇ) :
ఈ చట్టం ప్రకారం పంచాయితీల కాల పరిమితి 5 సం||లు. కాలపరిమితికి ముందే ఒకవేళ అవి రద్దయితే వాటికి ఎన్నికలు నిర్వహించవలసి వస్తుంది.

7. అర్హతలు, అనర్హతలు (243-ఎఫ్) :
ఈ చట్టం పంచాయితీ సంస్థలకు పోటీ చేసే అభ్యర్థుల అర్హతలను, అనర్హతలను నిర్ధిష్టంగా పేర్కొంటుంది.

8. అధికారాలు, విధులు (243-జి):
11వ షెడ్యుల్ ద్వారా 29 అంశాలతో పంచాయితీ కార్యకలాపాలను ఈ చట్టం నిర్ధారించింది.

9. ఆదాయ వనరులు (243-హెచ్) :
పంచాయితీ సంస్థలకు గల వివిధ ఆదాయ వనరుల గురించి ఈ చట్టం పేర్కొనడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, పన్నుల ద్వారా ఆదాయం, భవనాల అద్దె మొ॥॥ వాటి ద్వారా ఈ సంస్థలు ఆదాయ వనరులను పొందుతాయి.

10. ఆర్థిక సంఘం (243 – ఐ) :
పంచాయితీల ఆర్థిక స్థితి సమీక్షకై ఒక ఆర్థిక సంఘాన్ని చట్టం ఏర్పరచి, తగిన విధి విధానాలను పేర్కొంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 3.
74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ప్రధాన లక్షణాలను వివరించండి.
జవాబు.
74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగంలో IXA భాగం చేర్చబడినదని, ఇందులో 243 IP నుంచి 243.2F ప్రకరణలు ఉన్నాయని, ఈ భాగం “మున్సిపాలిటీస్” అనే శీర్షిక ద్వారా వివిధ పట్టణ స్థానిక సంస్థల గురించి వివరిస్తుందని తెలుసుకున్నాం. ఇందులో 243P ప్రకరణలో చట్టంలో ఉపయోగించబడిన అనేక పదాలకు నిర్వచనాలు ఉన్నాయి. ఇతర ప్రకరణలు పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి వివరిస్తాయి. వీటి గురించి తెలుసుకుందాం.

1. మున్సిపాలిటీల వ్యవస్థ (243. Q – ప్రకరణ) :
243Q – ప్రకరణ ప్రకారం, ప్రతి రాష్ట్రంలో ప్రధానంగా మూడు తరహాల మున్సిపాలిటీలు ఉండాలి. అవి :

  1. నగర పంచాయతీ (గ్రామీణ ప్రాంత స్థాయి నుండి పట్టణ ప్రాంతంగా పరివర్తన ప్రాంతంలో).
  2. మున్సిపల్ కౌన్సిల్ (చిన్న పట్టణ ప్రాంతాలలో).
  3. మున్సిపల్ కార్పోరేషన్ (బాగా విస్తరించిన పట్టణ ప్రాంతాలలో).

2. మున్సిపాలిటీల నిర్మాణం (243-R) :
మున్సిపాలిటీల నిర్మాణం గురించి ఈ చట్టం వివరిస్తుంది. దీని ప్రకారం మున్సిపల్ స్థానాలకు ప్రతినిధులు ఎంపిక ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగుతుంది. ఇందుకోసం మున్సిపాలిటీలను వార్డులుగా విభజిస్తారు. వార్డులలోని ప్రజలు తాము ప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఈ చట్టం ప్రకారం కొన్ని ప్రత్యేక అంశాలను సంబంధించి రాష్ట్ర శాసనసభలు శాసనాలు చేయవచ్చు.

ఉదాహరణకు, పురపాలక సంస్థలకు సమావేశాలలో అనుభవజ్ఞులు, నేర్పరితనంగల వ్యక్తులు పాల్గొనడానికి అవసరమైన నియమనిబంధనలను రాష్ట్ర శాసనసభలు చేయవచ్చు. అదేవిధంగా మున్సిపాలిటీ ప్రాంత పరిధిలోని రాష్ట్ర శాసనసభ / పార్లమెంట్ సభ్యులకు ఓటింగ్ హక్కులతో ప్రాతినిధ్యం కలిగించవచ్చు.

3. వార్డు కమిటీలు (243 – S) :
మూడు లక్షలు లేదా అంతకుమించి ఉన్న పురపాలక సంస్థలలో వార్డు కమిటీల ఏర్పాటు విషయంలో శాసనాలను రూపొందించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలు పొందుతాయని 243-S ప్రకరణ పేర్కొంటుంది.

4. సీట్ల రిజర్వేషన్లు (243 – T) :
243 – T ప్రకరణ ప్రకారం మున్సిపల్ ప్రాంతంలోని షెడ్యుల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి సీట్ల రిజర్వేషన్లు ఉండాలి. అంతేకాక 1/3వ వంతు స్థానాలను మహిళలకు కేటాయించాలని కూడా చట్టం నిర్దేశిస్తుంది.

5. మున్సిపాలిటీల పదవీకాలం (243 – U):
ఈ మున్సిపాలిటీల పదవీకాలాన్ని 5 సంగా నిర్ణయించింది. ఒకవేళ ఏ కారణం రీత్యానైనా పదవీకాలం ముగియకముందే మున్సిపాలిటీ రద్దయితే, తిరిగి ఆరుమాసాలలో వాటికి ఎన్నికలు జరిపించాలని కూడా ఈ చట్టం నిర్దేశిస్తుంది.

6. అనర్హతలు (243 – V) :
పురపాలక సంస్థల సభ్యులకు ఎన్నికలలో పోటీ చేయడానికి కావలసిన అర్హతలను, అనర్హతలను నిర్ణయించే అంశాలను ఈ చట్టం నిర్దిష్టంగా పేర్కొంటుంది. దీని ప్రకారం అనర్హతలకు సంబంధించిన వివాదాలను రాష్ట్ర శాసనసభ ఏర్పరచిన ఒక ప్రత్యేక అథారిటీ నిర్ణయిస్తుంది.

7. మున్సిపాలిటీల అధికారాలు, హక్కులు, బాధ్యతలు (243 – W) :
మున్సిపాలిటీలకు అధికారాలు, హక్కులు, బాధ్యతలను రాష్ట్ర శాసనసభలు ప్రత్యేక శాసనాల ద్వారా రూపొందించి, ఈ ప్రభుత్వాలను స్వయంపాలక సంస్థలుగా తీర్చిదిద్దాలని (243 – W) ప్రకరణ పేర్కొంటుంది.

18 అంశాలతో మున్సిపాలిటీలకు గల అధికారాలు, హక్కులు, బాధ్యతలను ఈ చట్టంతో రాజ్యాంగంలో ప్రత్యేకంగా చేర్చబడింది.
ఈ విధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ, స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగపరమైన గుర్తింపును, సాధికారతను కలిగించి క్షేత్రస్థాయిలో ఉన్న ఈ ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి తగిన ప్రధానాంశాలను కలిగి ఉందని చెప్పవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 4.
2018 తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టంపై సంక్షిప్త సమాధానం రాయండి.
జవాబు.
73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలకు అనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేవల్లో 1994లో “ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ “చట్టం” పేరుతో చట్టం చేయడమైనది. ఇది మే 30, 1994 నుంచి అమలులోకి వచ్చింది. జూన్ 2, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక ఇదే చట్టాన్ని కొంతకాలం కొనసాగించారు. అనంతరం మన్యశ్రీ కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం 2018లో “తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం – 32018” పేరుతో నూతన చట్టాన్ని చేసింది.

ఈ చట్టం రాష్ట్రంలో ఏప్రిల్ 18, 2018 నుంచి అమలులోకి వచ్చింది. నూతన రాష్ట్రం ఆశలు, ఆశయాలు తీర్చుతూ తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ఈ చట్టం ప్రధాన లక్ష్యం. ఈ చట్టంలో 8 షెడ్యూల్స్, 9 భాగాలు మరియు 297 సెక్షన్లు ఉన్నాయి.

తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం ముఖ్య లక్షణాలు :

1. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ :
ఈ చట్టం రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచింది. అవి గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ, మండల స్థాయిలో ప్రజాపరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్,

2. అరహతలు అనర్హతలు :
దీని ప్రకారం వివిధ పదవులకు కావలసిన అర్హతలను అనర్హతలను స్పష్టంగా పేర్కొంది. అవి :

  1. అతను/ఆమె 21 సంవత్సరాల వయస్సు పూర్తి అయి ఉండాలి.
  2. అతను/ఆమె పోటీ చేసే స్థానిక ప్రభుత్వ భౌగోళిక పరిధిలో ఓటరై ఉండాలి.
  3. అతను/ఆమె ప్రభుత్వం నుంచి ఆదాయం పొందే లాభసాటి పదవిలో ఉండరాదు.
  4. రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు నిర్ణీత డిపాజిట్లను చెల్లించాలి.
  5. అతను/ఆమె మే, 30, 1995 తరవాత మూడవ సంతానాన్ని పొందితే పోటీకి అనర్హులు.

వివరణ : దీని ప్రకారం ఒక వ్యక్తి మే, 31, 1995 కంటే ముందు ఇద్దరు కంటే ఎక్కువ సంతానాన్ని కలిగి ఉన్నప్పటికీ స్థానిక సంస్థలకు పోటీ చేయడానికి అర్హుడే.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 5.
తెలంగాణ జిల్లా పరిషత్ల నిర్మాణం, అధికారాలు వివరించండి.
జవాబు.
జిల్లా పరిషత్ నిర్మాణం : ప్రతిజిల్లా ప్రజా పరిషత్లో కింది సభ్యులు ఉంటారు.

1. ఎన్నికైన సభ్యులు :
వీరిని జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులని (ZPTC) అంటారు.

2. పదవీరీత్యా సభ్యులు :
జిల్లా పరిధిలో గల నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు (MLA), లోక్ సభ సభ్యుడు (MP), అదే విధంగా జిల్లాలో ఓటర్గా నమోదైన రాష్ట్ర విధాన పరిషత్ సభ్యుడు (MLC) రాజ్యసభ సభ్యుడు (MP), జిల్లా ప్రజాపరిషత్లో పదవీరీత్యా సభ్యులుగా (Ex-officio) ఉంటారు.

వీరు జిల్లా పరిషత్ సమావేశాలలో పాల్గొనవచ్చు, చర్చల్లో భాగస్వామ్యం కావచ్చు. అభిప్రాయాలు చెప్పవచ్చు. అదేవిధంగా జిల్లా పరిషత్ యొక్క వివిధ స్థాయి సంఘాల్లో సభ్యులు కావచ్చు. ఈ సమావేశాల్లో పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. కాని వివిధ తీర్మానాలపై ఓటు వేసే హక్కులేదు.

3. కో-ఆప్ట్ సభ్యులు :
జిల్లా ఓటర్గా నమోదై ఉన్న మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరిని జిల్లా పరిషత్ సభ్యులు కో-ఆప్ట్ చేసుకోవచ్చు. వీరికి 21 సంవత్సరాల వయస్సు పూర్తి అయి ఉండాలి.

జిల్లా పరిషత్ అధికారాలు, విధులు :

  1. జిల్లాలోని అన్ని మండల ప్రజాపరిషత్ల బడ్జెట్లను పరిశీలించి ఆమోదిస్తుంది.
  2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద ఇచ్చే నిధులను జిల్లాలోని అన్ని మండల ప్రజాపరిషత్లకు కేటాయిస్తాడు.
  3. జిల్లాలోని వివిధ మండలాల ప్రణాళికలు క్రోడీకరించి జిల్లా ప్రణాళికను రూపొందించి అమలు చేయడం.
  4. జిల్లాలోని అన్ని మండల ప్రజాపరిషత్లు మరియు గ్రామపంచాయతీల కార్యక్రమాలను పర్యవేక్షించి అవసరమైన సలహాలు, ఆదేశాలివ్వడం.
  5. చట్టం ప్రకారం విధించే పన్నులు లేదా రుసుములను వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవడం, జిల్లా బోర్డ్ అధికారాలను నిర్వహించడం.
  6. గ్రామీణాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికై చేపట్టవలసిన వివిధ కార్యక్రమాలు, సేవల రూపకల్పనకై రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సలహా ఇచ్చింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
బల్వంత్రెయ్ మెహతా కమిటీ.
జవాబు.
మనదేశంలో శ్రీ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫారసులననుసరించి పంచాయితీరాజ్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో ప్రారంభించబడిన సమాజాభివృద్ధి పథకము, జాతీయ విస్తరణ సేవా పధకములు అమలు తీరును సమీక్షించుటకు భారత ప్రభుత్వం 1957లో బల్వంత్ రాయ్ మెహతా ఆధ్వర్యంలో ఒక పరిశీలనా సంఘాన్ని నియమించింది.

ఈ కమిటీ సుమారు 10 నెలల కాలంలో అనేక విషయాలను పరిశీలించి 1957 నవంబరులో తుది నివేదికను సమర్పించింది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పేరుతో గ్రామపంచాయితీ, పంచాయితీ సమితి, జిల్లా పరిషత్ వంటి మూడు అంచెల ప్రాతినిధ్య సంస్థలను ప్రవేశపెట్టాలని సూచించింది.

ప్రశ్న 2.
అశోక్ మెహతా కమిటి.
జవాబు.
మోరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా వ్యవస్థలను బలోపేతం చేయడానికి 1978లో 13
ప్రభుత్వం 1977లో అశోక్ మెహతా నాయకత్వంలో పంచాయతీరాజ్. సూచనలతో తన నివేదికను సమర్పించింది. అందులో ముఖ్యమైనవి.

  1. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో రెండంచెల వ్యవస్థను అమలుచేయాలి. అవి జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్, దిగువ స్థాయిలో వివిధ గ్రామాలతో కూడిన మండల పరిషత్.
  2. జిల్లాస్థాయిలో జిల్లాపరిషత్ కార్యనిర్వాహక వ్యవస్థగా పనిచేస్తుంది. జిల్లాస్థాయిలో అన్ని రకాల ప్రణాళికల రూపకల్పన, అమలు కోసం బాధ్యత వహిస్తుంది.

ప్రశ్న 3.
ఎల్.ఎం. సింఘ్వి కమిటి.
జవాబు.
‘ప్రజాస్వామ్యం, అభివృద్ధి’ పేరుతో పంచాయతారాజ్ వ్యవస్థలను పునఃనిర్మాణానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో L.M. సింఘ్వి నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. దీని సూచనలు :

  1. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పిస్తూ, పటిష్టంగా అమలుచేయాలి.
  2. పంచాయతీరాజ్ సంస్థలకు స్వేచ్ఛగా, నిర్ణీతకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను రాజ్యాంగంలో పొందుపరచాలి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 4.
ఎన్నికల సంఘం.
జవాబు.
రాష్ట్రంలో పంచాయితీరాజ్ సంస్థల మరియు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, ఓటర్ల జాబితా మొదలగు అంశాలను స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్వహించడానికి రాజ్యాంగ ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గవర్నర్ నియమిస్తాడు.

ప్రశ్న 5.
రాష్ట్ర ఆర్థిక సంఘం.
జవాబు.
73 మరియు 74వ రాజ్యాంగ సవరణ చట్టములలో అధికరణలు 243-I మరియు 243-Y వైల ప్రకారం పంచాయతీల ఆర్థికస్థితి సమీక్షపై ఒక ఆర్థిక సంఘం ఏర్పాటవుతుంది. ఈ ఆర్థిక సంఘం మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితిని కూడా సమీక్షించి, తగిన విధి, విధానాల సూచనతో రాష్ట్ర గవర్నర్కు నివేదికను సమర్పిస్తుంది.

ప్రశ్న 6.
జిల్లా ప్రణాళికా కమిటీ:
జవాబు.
ప్రతి రాష్ట్రం 243 (ZD) ప్రకారం, జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణి కోసం ప్రణాళికలను రూపొందించడం దీని విధి. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవీరీత్యా దీని ఛైర్మన్ గా ఉంటాడు. అదే విధంగా జిల్లా కలెక్టర్ దీనికి కన్వీనర్గా వ్యవహరిస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 7.
గ్రామ పంచాయతీ
జవాబు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీరాజ్ సంస్థలో గ్రామపంచాయతీ పునాది నిర్మాణం వంటిది. ఇది గ్రామ స్థాయిలో శాసన నిర్మాణ వ్యవస్థగా, చర్చాసంబంద సంస్థగా ఉంటుంది. గ్రామ పంచాయతీ నెలకు కనీసం ఒకసారి సమావేశం కావాలి.

గ్రామ పంచాయతీ సమావేశానికి సర్పంచ్ అధ్యక్షతవహిలాస్తారు. అతను లేనిచో ఉప సర్పంచ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. అన్ని రకాల నిర్ణయాలు, తీర్మానాలను గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచ్ కలిపి మెజారిటీ తీర్మానంతో ఆమోదిస్తారు.

ప్రశ్న 8.
గ్రామ సభ.
జవాబు.
ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభ ఏర్పాటవుతుంది. దానిలో గ్రామానికి చెందిన రిజిష్టర్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు. అది సంవత్సరానికి కనీసం మూడుసార్లయినా సమావేశమవుతుంది. గ్రామసభ పంచాయితీకి సంబంధించిన వార్షిక పరిపాలన, ఆడిట్ నివేదికలను పరిశీలించి ఆమోదిస్తుంది.

వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాను ఖరారు చేస్తుంది. సమాజ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు శీఘ్రగతిన అమలులో ఉంచడానికి, ప్రజల భౌతిక సేవలను స్వచ్ఛందంగా వినియోగించుకోవడానికి తగిన సూచనలిస్తుంది.

ప్రశ్న 9.
సర్పంచ్.
జవాబు.
గ్రామంలో సర్పంచ్ ప్రథమ పౌరుడు. ఇతను గ్రామ పంచాయతీకి రాజకీయాధిపతిగా ఉంటాడు. సర్పంచ్ గ్రామంలో రిజిష్టర్ ఓటర్లచే ఎన్నికవుతాడు. ఇతను గ్రామపంచాయతీ, గ్రామ సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. గ్రామ పంచాయతీ, గ్రామ సభ తీర్మానాలను అమలుచేసే బాధ్యతను నిర్వహిస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 10.
పంచాయతీ కార్యదర్శి.
జవాబు.
రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీలో ముఖ్య ప్రభుత్వోద్యోగి. గ్రామ పంచాయతీ పరిపాలనా వ్యవహారాలలో సర్పంచి సహాయంగా ఉంటూ అతని ఆదేశాలకు అనుగుణంగా తన విధులను నిర్వహిస్తాడు. ఇతను గ్రామ పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు హాజరు కావచ్చు.. చర్చల్లో పాల్గొనవచ్చు. సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తాడు. కానీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం మాత్రం లేదు.

ప్రశ్న 11.
మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యుడు (MPTC).
జవాబు.
ప్రతి మండల ప్రజాపరిషత్ ను వివిధ ప్రాదేశిక నియోజక వర్గాలుగా విభజిస్తాడు. ఇందలో 3,000 నుంచి 4,000 మంది జనాభా ఉంటారు. ప్రతి ప్రాదేశిక నియోజక వర్గానికి ఒక్కొక్క ప్రతినిధి ఉంటారు. వారిని MPTC అని అంటారు. మండల ప్రజాపరిషత్లోని ఓటర్లచే రహస్య ఓటింగ్ పద్ధతిలో మీరు ఎన్నికౌతారు.

మండల ప్రజాపరిషత్ భౌగోళిక పరిధిలో ఎక్కడైన ఓటర్గా నమోదై ఉన్న వ్యక్తి ఆ మండంలంలోని ఏ ప్రాదేశిక నియోజక వర్గం నుంచి అయిన MPTC పోటీ చేయవచ్చు. మొత్తం MPTC సీట్లలో కొన్ని స్థానాలు చట్టం నిర్దేశించిన విధంగా SC, ST, BC మరియు మహిళలకు రిజర్వ్ చేస్తారు.

ప్రశ్న 12.
మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు (MPP).
జవాబు.
మండల ప్రజాపరిషత్ రాజకీయాధిపతిగా, ప్రథమ పౌరునిగా MPP వ్యవహరిస్తాడు. ప్రతి మండల ప్రజాపరిషత్కు ఒక అధ్యక్షడు, మరొకరు ఉపాధ్యక్షులుగా ఉంటారు. MPTC లు తమలో ఒకరిని MPP గా, మరొకరిని ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు. మండల ప్రజాపరిషత్ సమావేశాలను ఏర్పరచి, దానికి అధ్యక్షత వహిస్తాడు.

మండల ప్రజాపరిషత్ రికార్డు మొత్తం ఇతని అధీనంలో ఉంటాయి. మండల ప్రజాపరిషత్ తీర్మానాల అమలులో MPDO పై పాలనాపరమైన నియంత్రణను కలిగి ఉంటాడు. మండలాభివృద్ధి అనేది సమర్థతపై ఆధారపడి ఉంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 13.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO).
జవాబు.
రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) మండల ప్రజాపరిషత్లో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా వ్యవహరిస్తాడు. మండల ప్రజాపరిషత్ తీర్మానాల అమలు బాధ్యతను కలిగి ఉంటాడు. ప్రభుత్వం ఆదేశించిన ఇతర విధులను కూడా నిర్వర్తించాలి.

మండల పరిధిలోని గ్రామ పంచాయతీలను పర్యవేక్షించే అధికారం ఉంటుంది. మండల ప్రజాపరిషత్ అధ్యక్షుని ఆమోదంతో లేదా ఆదేశానుసారం MPDO నెలకు కనీసం ఒకసారి మండల ప్రజాపరిషత్ సమావేశాలను ఏర్పాటుచేయాలి. MPDO ఈ సమావేశాలకు హాజరు కావచ్చు.

ప్రశ్న 14.
జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ZPTC).
జవాబు.
ప్రతి జిల్లా పరిషత్లో అనేక మండలాలు ఉంటాయి. ప్రతి మండలాన్ని ఒక్కో ప్రాదేశిక నియోజక వర్గంగా ఏర్పాటు చేసి, ఒక్కొక్క దానికి ఒక్కో వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తాడు. వీరిని జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యుడు (ZPTC) అని అంటారు.

ఆయా నియోజక వర్గాలలోని ఓటర్లచే రహస్య ఓటింగ్ ప్రక్రియ ద్వారా ZPTC లు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక పరిధిలో ఓటర్గా నమోదై ఉన్న ఆ జిల్లా ప్రజా పరిషత్ లో ఎక్కడ నుండైన ZPTC గా పోటీచేయవచ్చు. చట్టం నిర్దేశించిన విధంగా SC, ST, BC మరియు మహిళలకు కొన్ని స్థానాలు రిజర్వ్ చేస్తారు.

ప్రశ్న 15.
ముఖ్య కార్యనిర్వాహక అధికారి (CEO).
జవాబు.
రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన ముఖ్య కార్య నిర్వాహక అధికారి (CEO) జిల్లా పరిషత్లో ఉన్నత ప్రభుత్వోద్యోగిగా ఉంటాడు. జిల్లా ప్రజా పరిషత్ తీర్మానాలను అమలుచేయడానికి బాధ్యత వహిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం కాలానుగుణంగా జిల్లా పరిషత్క సంబంధించిన ఇచ్చే ఆదేశాలను కూడా అమలు చేసే బాధ్యతను కలిగి ఉంటాడు.

జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ అనుమతి లేదా ఆదేశంతో జిల్లా ప్రజా పరిషత్ సమావేశాలను CEO నెలకు కనీసం ఒకసారి ఏర్పాటు చేస్తాడు. CEO జిల్లా ప్రజాపరిషత్ సమావేశాలలో, స్థాయి సంఘాల సమావేశాలలో, జిల్లా పరిధిలోని మండల ప్రజాపరిషత్ సమావేశాల్లో పాల్గొనవచ్చు. మాట్లాడవచ్చు. తన అభిప్రాయాన్ని చెప్పవచ్చు. కాని వివిధ తీర్మానాలపై ఓటువేసే హక్కు మాత్రం లేదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 16.
మేయర్.
జవాబు.
నగర పాలక సంస్థ రాజకీయాధినేతగా, ప్రథమ పౌరునిగా మేయర్ ఉంటాడు. ప్రతి నగర పాలక సంస్థల కార్యక్రమాల నిర్వహణకై ఒక మేయర్, డిప్యూటీ మేయర్ ఉంటారు. నగర పాలక సంస్థ ఎన్నికల అనంతరం కార్పొరేటర్స్ తమలో ఒకరిని మేయర్గా, మరొకరిని డిప్యూటీ మేయర్గా ఎన్నుకుంటారు. వీరి ఎన్నికల్లో పదవీరీత్యా సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల రీత్యా మేయర్ పదవి ఖాళీ అయితే నూతన మేయర్ను ఎన్నుకునేంత వరకు డిప్యూటీ మేయర్ ఆ విధులను నిర్వహిస్తాడు.

ప్రశ్న 17.
తెలంగాణ రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్ల పేర్లు రాయండి.
జవాబు.

  1. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్
  2. గ్రేటర్, వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్
  3. కరీంనగర్
  4. ఖమ్మం
  5. నిజామాబాద్
  6. రామగుండం
  7. బడంగ్ పేట్
  8. బండ్లగూడ
  9. మీర్పేట్
  10. బోడుప్పల్
  11. జవహర్ నగర్
  12. ఫీర్ణాధీగూడ
  13. నిజాంపేట

TS Inter 1st Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 7th Lesson పౌరసత్వం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 7th Lesson పౌరసత్వం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
పౌరసత్వాన్ని నిర్వచించి, పౌరసత్వాన్ని సంపాదించే విధానాలను తెలపండి.
జవాబు.
పరిచయం : పౌరసత్వం అనేది ప్రజాస్వామ్య రాజ్యాలలో నివసించే వ్యక్తుల ప్రత్యేక హక్కు వ్యక్తులు తమ దేశంలో పౌరసత్వాన్ని కలిగి ఉండటాన్ని ప్రతిష్టాత్మకంగానూ, గర్వదాయకంగానూ భావిస్తారు. వాస్తవానికి రాజ్యంలోని పౌరులను వివిధ తరహాల వ్యక్తుల నుంచి విడదీసేందుకు పౌరసత్వం దోహదపడుతుంది. రాజ్యంలో సుఖ సంతోషాలు, సహృద్భావాలతో జీవనం కొనసాగించేందుకు పౌరసత్వం సాధనంగా ఉంటుందని ప్రజలు భావిస్తారు.

ఒక్కమాటలో .చెప్పాలంటే పౌరసత్వం ప్రజలలో దేశభక్తి, త్యాగనిరతి, విశాల దృక్పథం వంటి భావాలను పెంపొందిస్తుంది. పౌరసత్వం అనేది సాంప్రదాయాలు లేదా చట్టాల ద్వారా గుర్తించబడే వ్యక్తుల హోదాను సూచిస్తుంది. పౌరసత్వం గల వ్యక్తులనే పౌరులుగా వ్యవహరిస్తారు. అటువంటి పౌరులు రాజకీయ వ్యవస్థ అయిన రాజ్యం వ్యవహారాలలో పాల్గొంటారు. సాల్మండ్ ప్రకారం పౌరులు రాజ్య సభ్యులుగా ఉంటూ రాజ్యంలో వైయక్తిక, శాశ్వతమైన సంబంధాలను కలిగి ఉంటారు.

వారు అనేక హక్కులు, సౌకర్యాలను అనుభవిస్తారు. అటువంటి వాటిలో ఓటుహక్కు, ఆస్తిహక్కు, నివాసం వంటి హక్కులు ఉన్నాయి. అంతేకాకుండా పన్నులను చెల్లించడం, సైనికపరమైన సేవలను అందించడం వంటి కొన్ని బాధ్యతలు కూడా ప్రతి పౌరుడికి ఉంటాయి.

నిర్వచనాలు :

  1. అరిస్టాటిల్ : “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తియే పౌరుడు”.
  2.  ప్రొఫెసర్ లాస్కీ : “ప్రజాహితానికి వ్యక్తులు అందించే నిర్ణాయక సేవయే పౌరసత్వం”.
  3. టి.హెచ్. మార్షల్ : “రాజకీయ సమాజంలో సంపూర్ణ సభ్యులుగా ఉండేవారికి కల్పించే హోదాయే పౌరసత్వం. అటువంటి హోదాగల వ్యక్తులు హక్కులు, బాధ్యతల విషయంలో సమాన హోదాను కలిగి ఉంటారు”.

పౌరసత్వ ఆర్జన పద్ధతులు (Methods of acquiring Citizenship) :
పౌరసత్వం రెండు పద్ధతుల ద్వారా సంక్రమిస్తుంది. అవి : A) సహజమైనది B) సహజీకృతమైనది. ఆ రెండు పద్దతులను కింద అధ్యయనం చేయడమైంది.

A) సహజ పౌరసత్వం :
అధికారులకు ఏ విధమైన విజ్ఞప్తి చేయకుండా లేదా ప్రత్యేక దరఖాస్తును పంపించకుండా వ్యక్తులకు సంక్రమించే పౌరసత్వాన్ని సహజ పౌరసత్వం అంటారు. సహజ పౌరసత్వంలో మూడు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి :

  1. భూమి లేదా జన్మస్థలం (జస్ సోలి),
  2. బంధుత్వం లేదా రక్తసంబంధం (జస్ సాంగ్వినస్),
  3. మిశ్రమ అంశం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

పైన పేర్కొన్న వాటిని కింది విధంగా వివరించవచ్చు.

1. జస్ సోలి – భూమి లేదా జన్మస్థలం (Jus soli’ – Land or Place of Birth) :
‘జస్ సోలి’ అంటే భూమి లేదా జన్మస్థలం సూత్రం ఆధారంగా పౌరసత్వ సంక్రమణగా భావించవచ్చు. ఈ పద్ధతి ప్రకారం తల్లిదండ్రులను బట్టి కాకుండా పుట్టిన ప్రదేశం ప్రాతిపదికపై పౌరసత్వం నిర్ణయించడమవుతుంది. జన్మించిన ప్రదేశమే పౌరసత్వాన్ని నిర్ణయించడంలో కీలకపాత్రను పోషిస్తుంది.

అయితే ఆధునిక కాలంలో ఈ రకమైన పద్దతి అంతగా ప్రాచుర్యం పొందలేదు. భూమితో సంబంధం గల మధ్యయుగంలో ఈ రకమైన పౌరసత్వం ఎంతో ప్రసిద్ధిగాంచింది. వర్తమాన కాలంలో ఈ పద్ధతి అర్జంటీనాలో మాత్రమే పాటించబడుతున్నది.

2. జస్ సాంగ్వినీస్ – బంధుత్వం లేదా రక్తసంబంధం (Jus Sanguinis – Kinship or Blood Relation- ship) :
‘జస్ సాంగ్వినీస్’ అనేది బంధుత్వం లేదా రక్తసంబంధం ద్వారా పౌరసత్వం సంక్రమిస్తుందనే అంశాన్ని సూచిస్తుంది. ఈ పద్ధతి ప్రకారం ఒక శిశువు తాను జన్మించిన ప్రదేశంతో సంబంధం లేకుండానే తన తల్లిదండ్రుల పౌరసత్వాన్ని పొందుతుంది.

ఇక్కడ బంధుత్వం లేదా రక్తసంబంధం ఒక్కటే పౌరసత్వ ఆర్జనను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన శిశువు జన్మస్థలంతో నిమిత్తం లేకుండా భారత పౌరుడిగానే పరిగణించడమవుతుంది.

ఈ రకమైన పౌరసత్వం అనేది ప్రాచీనకాలంలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ ఈ పద్ధతిని ప్రపంచంలోని అనేక రాజ్యాలు అనుసరిస్తున్నాయి. ఈ రకమైన పౌరసత్వ సంక్రమణం అనేది సహజమైనదిగానూ, హేతుబద్ధమైనదిగానూ భావించబడింది. మొత్తం మీద జర్మనీ, నార్వే, ఇటలీ, స్వీడన్ వంటి అనేక రాజ్యాలలో ఈ రకమైన పౌరసత్వ పద్ధతి అమలులో ఉంది.

3. మిశ్రమ సూత్రం (Mixed Principle) :
ఈ సూత్రాన్ని అనుసరించి రక్తసంబంధంతో పాటు జన్మస్థల సంబంధమైన సూత్రం ప్రకారం పౌరసత్వాన్ని ప్రసాదించడమైంది. అనేక రాజ్యాలు ఈ సూత్రాన్ని అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు రక్తసంబంధంతో పాటుగా జన్మస్థల సంబంధమైన అంశం ద్వారా పౌరసత్వాన్ని ప్రసాదిస్తున్నాయి. అయితే ఈ సందర్భంలో పౌరసత్వాన్ని ప్రసాదించడంలో పైన పేర్కొన్న రెండు సూత్రాలను పాటించడంతో ఒకే సమయంలో రెండు దేశాల పౌరసత్వం లభించే అవకాశం ఉంది.

ఉదాహరణకు బ్రిటీష్ తల్లిదండ్రులకు శిశువు అమెరికాలో జన్మిస్తే జన్మస్థల సంబంధమైన పద్ధతి ప్రకారం అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అదే శిశువు రక్తసంబంధమైన పద్ధతిని అనుసరించి బ్రిటీష్ పౌరసత్వం పొందుతుంది. అటువంటి సందర్భంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు ఆ శిశువుకు యుక్తవయస్సు వచ్చిన తరువాత తన ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఉంటుంది.

B. సహజీకృత పౌరసత్వం (Naturalised Citizenship) :
సహజ పౌరసత్వం లేని వ్యక్తి సహజీకృత పద్ధతి ద్వారా రాజ్య పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా విదేశీయులు కొన్ని షరతులకు లోబడి రాజ్య పౌరసత్వాన్ని పొందవచ్చు. అటువంటి షరతులు అన్ని రాజ్యాలలో ఒకే విధంగా ఉండవు. వాటిలో కొన్నింటిని కింద పేర్కొనడమైంది.

1. నివాసం (Residence) :
విదేశీయుడు తాను నివసిస్తున్న రాజ్యంలో పౌరసత్వాన్ని పొందేందుకు నిర్ణీత కాలం పాటు నివసించాలి. అతడు ఆ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా నివసించాల్సి ఉంటుంది. ఆ పరిమితి అన్ని రాజ్యాలలో ఒకే రకంగా లేదు. ఉదాహరణకు ఆ కాలపరిమితి బ్రిటన్, అమెరికాలలో 5 సంవత్సరాలు కాగా, ఫ్రాన్సులో 10 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది.

2. ఎంపిక (Choice) :
విదేశీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత తమ ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొని పొందవచ్చు.

3. దరఖాస్తు (Application) :
విదేశీయుడు తాను కోరుకున్న రాజ్యంలో పౌరసత్వం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాజ్యానికి చెందిన ప్రభుత్వం విధించే షరతులను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు యోగ్యతను రాజ్యం పరిశీలించి ఆమోదించినట్లయితే అతనికి పౌరసత్వం లభిస్తుంది.

నిర్దిష్ట కాలం పాటు నివాసం, సత్ప్రవర్తన, ఆర్థిక సామర్థ్యం, రాజ్యంలోని ఏదైనా ఒక జాతీయ భాషను అవగాహన చేసుకోవడం వంటి షరతులను ఆయా విదేశీయులు ఆమోదించాల్సి ఉంటుంది. పై వాటితో పాటుగా తాము పౌరసత్వం పొందగోరే రాజ్యానికి విధేయతను కలిగి ఉంటామనే లిఖితపూర్వక ప్రమాణం చేయడం ద్వారా విదేశీయులు పౌరసత్వాన్ని పొందగలుగుతారు.

4) స్థిరాస్తులు (Fixed Assets) :
భూమి, ఇళ్ళు వంటి స్థిరాస్తులను సంపాదించుకోవడం ద్వారా రాజ్య పౌరసత్వాన్ని విదేశీయులు పొందగలుగుతారు.

5) సేవలు (Services) (ప్రభుత్వ లేదా ప్రైవేటు):
ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలలో సేవలను అందించడం ద్వారా విదేశీయుడు పౌరసత్వాన్ని పొందవచ్చు. అధికారిక సంస్థలలో పనిచేసినప్పుడే ఈ నియమం వర్తిస్తుంది. విదేశీ పౌరుడు ప్రతిభావంతమైన సేవలను అందించడం ద్వారా తాను కోరుకున్న దేశం పౌరసత్వాన్ని పొందవచ్చు.

6) వివాహం (Marriage) :
వివాహం వల్ల పౌరసత్వం లభించవచ్చు.. కొన్ని దేశాలలో అన్య దేశీయుని వివాహమాడిన స్త్రీ తన భర్త రాజ్యంలో పౌరసత్వం పొందవచ్చు. మరికొన్ని దేశాలలో పౌరులు విదేశ వనిత లేదా విదేశీ పురుషుడిని గానీ వివాహం చేసుకొంటే, వారి భర్త లేదా భార్యకు చెందిన రాజ్య పౌరసత్వం లభిస్తుంది.

ఉదాహరణకు ఒక బ్రిటీష్ దేశస్థురాలు భారతీయుడిని వివాహమాడితే ఆమెకు భారతదేశ పౌరసత్వమివ్వడం జరుగుతుంది. విదేశస్థుడిని వివాహం చేసుకొన్నప్పటికీ జపాన్ దేశస్థురాలు తన స్వదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా జపాన్ దేశస్థురాలిని వివాహమాడిన విదేశీయునికి కూడా జపాన్ పౌరసత్వం ఇవ్వబడుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 2.
ఉత్తమ పౌరుల లక్షణాలను వివరించండి.
జవాబు.
పౌరుడు : “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తియే పౌరుడు” – అరిస్టాటిల్.

మంచి పౌరుడి లక్షణాలు (Qualities of a Good Citizen) :
అరిస్టాటిల్ ఉద్దేశ్యంలో మంచి పౌరులు మంచి రాజ్యాన్ని నిర్మించగలుగుతారు. వారు ఆదర్శ గుణాలను కలిగి ఉండటమే అందుకు కారణం. ఈ సందర్భంలో లార్డ్ బ్రైస్ మంచి పౌరుడి లక్షణాలలో మూడింటిని పేర్కొన్నాడు. అవి : i) అంతరాత్మ ప్రకారం వ్యవహరించడం. ii) తెలివితేటలను కలిగి ఉండటం iii) ఆత్మ నిగ్రహాన్ని పాటించడం. మొత్తం మీద మంచి పౌరుడు కింది లక్షణాలను కలిగి ఉంటాడని చెప్పవచ్చు.

1. మంచి ప్రవర్తన (Good Character) :
మంచి పౌరుడు మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి. అతడు ధైర్యం, న్యాయబుద్ధి, సహాయధోరణి, ఉదార స్వభావం, సానుభూతి, సత్యభాషణ, నిజాయితీ వంటి గుణాలను త్రికరణ శుద్ధిగా కలిగి ఉండాలి.

2. సంపూర్ణ ఆరోగ్యం (Sound Health) :
మంచి పౌరుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, శక్తిని కలిగి ఉండాలి. ఆరోగ్యవంతులైన పౌరులే ఆరోగ్యకరమైన జాతిని నిర్మిస్తారు. ఎందుకంటే మంచి ఆలోచనలు గల వ్యక్తులే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అటువంటి పౌరులు అనేక రంగాలలో రాజ్య ప్రగతికి దోహదపడతారు.

3. తెలివితేటలు, విద్య (Intelligence and Education) :
తెలివితేటలు, విద్య అనేవి పౌరుడికి గల మరొక లక్షణంగా పరిగణించవచ్చు. ప్రతి పౌరుడు తన హక్కులు, బాధ్యతల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వివిధ సంఘటనల పరిశీలనలో ఎటువంటి ఆవేశాలకు లోనుకారాదు.

ఈ సందర్భంలో సరైన విద్యను అభ్యసించిన వారు సమాజంలో తగిన పాత్రను పోషించగలుగుతారు. తెలివితేటలు గల పౌరులు రాజ్యం ఎదుర్కొనే సమస్యలను సరైన రీతిలో అవగాహన చేసుకుంటారు.

4. ఆత్మ నిగ్రహం (Self Control) :
ఆత్మ నిగ్రహం అనేది మంచి పౌరుడి లక్షణాలలో ఒకటిగా భావించవచ్చు. మంచి పౌరుడు రాగ ద్వేషాలకు గురయ్యే స్వభావాన్ని కలిగి ఉండరాదు. ప్రజా వ్యవహారాలలో అతడు ఆత్మ నిగ్రహాన్ని ప్రదర్శించాలి. ఆత్మ నిగ్రహం, ఆత్మ విశ్వాసం అనేవి అతడిని క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడిపేందుకు దోహదపడతాయి. అట్లాగే మంచి పౌరుడనే వ్యక్తి అమానవీయ కార్యక్రమాలలో పాల్గొనరాదు.

5. ప్రజాస్ఫూర్తి (Public Spirit) :
మంచి పౌరుడు విశాలమైన, ఉదారమైన దృక్పథాలను కలిగి ఉండాలి. ప్రజా వ్యవహారాలలో అతడు క్రియాశీలక పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉండాలి. తన హక్కులు, బాధ్యతల వినియోగంలో తెలివితేటలతో వ్యవహరించాలి. అట్లాగే సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి. ప్రజా సేవాభావాన్ని కలిగి ఉంటూ సమాజ సమిష్టి సంక్షేమానికి తన సేవలను అందించేందుకు సదా సంసిద్ధుడై ఉండాలి.

6. స్వార్థ పరిత్యాగం (Self-Sacrifice) :
మంచి పౌరుడు స్వార్థాన్ని పరిత్యజించాల్సి ఉంటుంది. అతడు తన స్వార్థ ప్రయోజనాలను సమాజ ప్రయోజనాల కోసం విస్మరించాలి. సేవాతత్పరతతో పాటుగా సమాజం, ప్రభుత్వం, రాజ్యం పట్ల అంకిత భావాలను కలిగి ఉండాలి.

7. నిజాయితీతో ఓటుహక్కు వినియోగం (Honest exercise of franchise) :
ఓటుహక్కును నిజాయితీతో వినియోగించడం అనేది మంచి పౌరుడి మరొక లక్షణంగా పేర్కొనవచ్చు. స్వార్థబుద్ధి, వర్గం, కులం, మతం వంటి అంశాలు ఈ సందర్భంలో మంచి పౌరసత్వానికి ప్రతిబంధకాలుగా ఉంటాయి.

8. బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించడం (Sincere Performance of Obligations) :
మంచి పౌరుడు తన బాధ్యతలను చిత్తశుద్ధితో, విశ్వాసపాత్రుడిగా నిర్వహిస్తాడు. ఈ విషయంలో అతడు సంబంధిత అధికారులకు తగిన సహకారాన్ని అందిస్తాడు. అట్లాగే వివిధ ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో సరియైన రీతిలో చెల్లిస్తాడు.

9. క్రమానుగత విధేయతలు (Right Ordering of Loyalties) :
మంచి పౌరుడు తన కుటుంబం, వర్గం, కులం, కార్మిక సంఘం, ప్రాంతం, జాతి పట్ల క్రమానుగత విధేయతలను చూపుతాడు. వివిధ సంస్థల పట్ల క్రమానుగత విధేయతలను చూపుతూ, వాటి మధ్య ఘర్షణలు తలెత్తకుండా చూస్తాడు.

విశాల ప్రయోజనాల కోసం స్వప్రయోజనాలను త్యాగం చేస్తాడు. తాను నివసించే కుటుంబం, ప్రాంతాల మధ్య ఘర్షణలు తలెత్తినచో, కుటుంబ ప్రయోజనాలను త్యాగం చేయాల్సి ఉంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 3.
వివిధ రకాల పౌరసత్వాలను విశ్లేషించండి.
జవాబు.
పౌరసత్వాన్ని మూడు రకాలుగా పేర్కొనవచ్చు. అవి :

  • ఏక పౌరసత్వం,
  • ద్వంద్వ పౌరసత్వం,
  • విశ్వ పౌరసత్వం.

i) ఏక పౌరసత్వం (Single Citizenship) :
ఏక పౌరసత్వం అంటే రాజ్యంలో పౌరులు ఒకే రకమైన పౌరసత్వాన్ని కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. అట్లాగే ఒకే రకమైన హక్కులు, సౌకర్యాలు, రక్షణలు పౌరులకు ఏక పౌరసత్వ పద్ధతిలో ఉంటాయి. ఈ రకమైన పౌరసత్వం ఆధునిక ప్రపంచంలోని అనేక రాజ్యాలలో వాడుకలో ఉంది. ఉదాహరణకు భారత రాజ్యాంగం భారత పౌరుల జన్మస్థలం, నివాసం వంటి అంశాలతో సంబంధం లేకుండా ఏక పౌరసత్వాన్ని ప్రసాదించింది.

ii) ద్వంద్వ పౌరసత్వం (Double Citizenship) :
పౌరులకు రెండు రాజ్యాలలో పౌరసత్వం ఉండడాన్ని ద్వంద్వ పౌరసత్వంగా వ్యవహరిస్తారు. ఈ రకమైన పౌరసత్వం అనేక అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలలో వాడుకలో ఉంది. ఉదాహరణకు అమెరికన్ పౌరులకు విదేశాలలో జన్మించిన పిల్లలకు రెండు రాజ్యాల్లోనూ పౌరసత్వం పొందే అవకాశం ఉంది. ఆ రెండింటిలో ఒకటి మాతృదేశ పౌరసత్వం కాగా రెండోది తాము జన్మించిన రాజ్య పౌరసత్వానికి సంబంధించినవై ఉంటాయి.

అయితే ద్వంద్వ పౌరసత్వం గల వ్యక్తులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. వారు రెండు రాజ్యాల చట్టాలకు విధేయులై ఉంటారు. ద్వంద్వ పౌరసత్వం అనేది యుక్తవయస్సు వచ్చే వరకు పిల్లలకు ఉంటుంది. ఆ తరువాత వారు రెండు రాజ్యాలలోని ఏదో ఒకదానిలో పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొంటారు.

iii) విశ్వ పౌరసత్వం (Universal Citizenship) :
అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలలో ఇటీవలి కాలంలో ఆవిష్కృతమైన భావనయే విశ్వ పౌరసత్వం. 1980, 1990 దశకాలలో సంభవించిన నాటకీయ పరిణామాలు విశ్వవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, కమ్యూనికేషన్లు వంటి రంగాలలో ఏర్పడిన పురోగతి మానవ జీవనాన్ని అద్భుతమైన రీతిలో మార్చివేసింది.

సామాన్యులలో అతి సామాన్యులు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వివిధ సాధనాలను వినియోగించుకొని సౌకర్యవంతమైన, సౌఖ్యప్రదమైన, ఆర్థిక ప్రయోజనాలను పొందగలిగారు. అట్లాగే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల కలిగే ఫలితాలు వారికి వరప్రదాయినిగా పరిగణించబడినాయి.

అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా తృతీయ ప్రపంచ దేశాలలోని ప్రభుత్వాలు రక్షణ రంగం నుంచి సామాన్య ప్రజల సంక్షేమం దిశగా తమ ప్రాధాన్యతలను నిర్ణయించుకొన్నాయి. వివిధ రంగాలకు చెందిన మేధావులు విదేశాలకు వెళ్ళి, అశేష ప్రయోజనాలను పొందే విషయంలో ఆసక్తిని ప్రదర్శించసాగారు.

ఈ ప్రక్రియలో భాగంగా వారు స్వదేశంతో పాటుగా, తాము పనిచేసే విదేశాలలో సైతం పౌరసత్వాన్ని పొందేందుకు ప్రయత్నించారు. ఇటువంటి సందర్భాలలో కొన్ని రాజ్యాలు ఇతర పౌరులకు తమ రాజ్య పౌరసత్వాన్ని ప్రసాదించే దిశగా అడుగులు వేశాయి. ఈ భావనే విశ్వ పౌరసత్వానికి ప్రాతిపదిక అయింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
దేశీయీకరణ పౌరసత్వాన్ని ఎలా పొందుతారు ?
జవాబు.
సహజీకృత పౌరసత్వం (Naturalised Citizenship) :
సహజ పౌరసత్వం లేని వ్యక్తి సహజీకృత పద్ధతి ద్వారా రాజ్య పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా విదేశీయులు కొన్ని షరతులకు లోబడి రాజ్య పౌరసత్వాన్ని పొందవచ్చు. అటువంటి షరతులు అన్ని రాజ్యాలలో ఒకే విధంగా ఉండవు. వాటిలో కొన్నింటిని కింద పేర్కొవడమైంది.

1. నివాసం (Residence) :
విదేశీయుడు తాను నివసిస్తున్న రాజ్యంలో పౌరసత్వాన్ని పొందేందుకు నిర్ణీత కాలం పాటు నివసించాలి. అతడు ఆ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా నివసించాల్సి ఉంటుంది. ఆ పరిమితి అన్ని రాజ్యాలలో ఒకే రకంగా లేదు. ఉదాహరణకు ఆ కాలపరిమితి బ్రిటన్, అమెరికాలలో 5 సంవత్సరాలు కాగా, ఫ్రాన్స్లో 10 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది.

2. ఎంపిక (Choice) :
విదేశీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత “తమ ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొని పొందవచ్చు.

3. దరఖాస్తు (Application) :
విదేశీయుడు తాను కోరుకున్న రాజ్యంలో పౌరసత్వం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాజ్యానికి చెందిన ప్రభుత్వం విధించే షరతులను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు యోగ్యతను రాజ్యం పరిశీలించి ఆమోదించినట్లయితే అతనికి పౌరసత్వం లభిస్తుంది.

నిర్దిష్ట కాలం పాటు నివాసం, సత్ప్రవర్తన, ఆర్థిక సామర్థ్యం, రాజ్యంలోని ఏదైనా ఒక జాతీయ భాషను అవగాహన చేసుకోవడం వంటి షరతులను ఆయా విదేశీయులు ఆమోదించాల్సి ఉంటుంది. పై వాటితో పాటుగా తాము పౌరసత్వం పొందగోరే రాజ్యానికి విధేయతను కలిగి ఉంటామనే లిఖితపూర్వక ప్రమాణం చేయడం ద్వారా విదేశీయులు పౌరసత్వాన్ని పొందగలుగుతారు.

4. స్థిరాస్తులు (Fixed Assets) :
భూమి, ఇళ్ళు వంటి స్థిరాస్తులను సంపాదించుకోవడం ద్వారా రాజ్య పౌరసత్వాన్ని విదేశీయులు పొందగలుగుతారు.

5. సేవలు (Services) (ప్రభుత్వ లేదా ప్రైవేటు) :
ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు సంస్థలలో సేవలను అందించడం ద్వారా విదేశీయుడు పౌరసత్వాన్ని పొందవచ్చు. అధికారిక సంస్థలలో పనిచేసినప్పుడే ఈ నియమం వర్తిస్తుంది. విదేశీ పౌరుడు ప్రతిభావంతమైన సేవలను అందించడం ద్వారా తాను కోరుకున్న దేశం పౌరసత్వాన్ని పొందవచ్చు.

6. వివాహం (Marriage) :
వివాహం వల్ల పౌరసత్వం లభించవచ్చు. కొన్ని దేశాలలో అన్య దేశీయుని వివాహమాడిన స్త్రీ తన భర్త రాజ్యంలో పౌరసత్వం పొందవచ్చు. మరికొన్ని దేశాలలో పౌరులు విదేశ వనిత లేదా విదేశీ పురుషుడిని కానీ వివాహం చేసుకొంటే, వారికి భర్త లేదా భార్యకు చెందిన రాజ్య పౌరసత్వం లభిస్తుంది.

ఉదాహరణకు ఒక బ్రిటీష్ దేశస్థురాలు భారతీయుడిని వివాహమాడితే ఆమెకు భారతదేశ పౌరసత్వమివ్వడం జరుగుతుంది. విదేశస్తుడిని వివాహం చేసుకొన్నప్పటికీ జపాన్ దేశస్థురాలు తన స్వదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా జపాన్ దేశస్తురాలిని వివాహమాడిన విదేశీయునికి కూడా జపాన్ పౌరసత్వం ఇవ్వబడుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 2.
పౌరసత్వాన్ని ఎలా కోల్పోతారు ?
జవాబు.
స్వచ్ఛందంగా, తన ప్రమేయం లేకుండా అనే రెండు విధానాల్లో ఒక వ్యక్తి తన పౌరసత్వాన్ని కోల్పోతాడు. పౌరసత్వాన్ని నిలబెట్టుకోవడానికి చేయవలసిన చర్యలు తీసుకోలేనప్పుడు లేదా స్వచ్ఛంద దేశమే పౌరసత్వాన్ని తొలగించినపుడు ఒక వ్యక్తి తన పౌరసత్వాన్ని కోల్పోతాడు. దీనికి విరుద్ధమైనది పౌరుడే తన పౌరసత్వాన్ని త్యజించడం లేదా పరిత్యాగం చేయడం అన్నది పౌరుడే తన పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా కోల్పోవడం అనవచ్చు.

అన్ని సందర్భాల్లో ఈ రెండు విధానాల మధ్య బేధాన్ని (పౌరసత్వం కోల్పోయే విధానాల మధ్య) చూడటం సాధ్యం కాదు. ఉదా : ఇతర దేశాల సైనిక దళాలలో స్వచ్ఛందంగా సేవలు అందించడం లేదా ఇతర దేశాల పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా అంగీకరించడం మొదలైనవి స్వచ్ఛందంగా పౌరసత్వాన్ని కోల్పోవడం లేదా. తన ప్రమేయం లేకుండా కోల్పోవడంగా భావించవచ్చు.

తన ప్రమేయం లేకుండా పౌరసత్వాన్ని కోల్పోవడం అన్నది వెంటనే అమలులోకి వచ్చే అంశంగా భావించాల్సిన అవసరం లేదు. ఏ పరిస్థితుల్లో పౌరుడు పౌరసత్వాన్ని కోల్పోతాడో, ఆ పరిస్థితులు ఏర్పడినప్పటికి సంబంధిత దేశం అధికారులు పౌరసత్వం కోల్పోయినట్లుగా ప్రకటించనంతవరకు అతను ఆ దేశ పౌరుడుగానే భావిస్తారు.

క్రింది పరిస్థితులలో పౌరుడు తన పౌరసత్వాన్ని కోల్పోతాడు.
ఎ. పరిత్యాగం :
స్వంత పౌరసత్వాన్ని పరిత్యాగించి మరోదేశ పౌరసత్వాన్ని అంగీకరించడం ద్వారా ఒక వ్యక్తి తన పౌరసత్వాన్ని పరిత్యాగించవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

బి. ఇతర దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా అంగీకరించడం.

సి. వివాహం :
మహిళ మరో దేశ పౌరున్ని వివాహం చేసుకున్నప్పుడు తన దేశ పౌరసత్వాన్ని కోల్పోతుంది. బ్రిటన్ మహిళలు మరోదేశ పౌరున్ని వివాహం చేసుకున్నప్పటికి బ్రిటన్ పౌరసత్వం కోల్పోకుండా ఉండేలా డిమాండ్ ఉంది. మైనర్ తల్లిదండ్రులు తమ పౌరసత్వాన్ని కోల్పోయినప్పుడు ఇతర దేశాల పౌరులు దత్తత తీసుకున్నప్పుడు, మాతృత్వం లేదా పితృత్వానికి సంబంధించి పిల్లలకు సంబంధించిన న్యాయ సంబంధాలలో మార్పు వచ్చినపుడు.

డి. ఇతర దేశాల సైనిక సేవలు, ఇతర దేశాల బిరుదులను అంగీకరించడం, ఇతర దేశాలకు సైనిక, ఇతర నిషేధిత సేవలందించినపుడు, ఇతర దేశాల బిరుదులను అంగీకరించినప్పుడు తమ పౌరులు పౌరసత్వాన్ని కొన్ని దేశాలు రద్దు చేస్తాయి.

ఇ. దీర్ఘకాలం దేశంలో నివసించక పోవడం :
దీర్ఘకాలం లేదా శాశ్వతంగా ఇతర దేశాలలో నివసించడం వల్ల కూడా కొన్ని దేశాలలో పౌరసత్వం కోల్పోవడం. ఉదా : ఫ్రాన్స్ మరియు జర్మనీకి చెందిన పౌరులు 10 సంవత్సరాలు అంతకంటే అధికంగా తమ దేశంలో నివసించకపోతే తమ పౌరసత్వాన్ని కోల్పోతాడు.

ఎఫ్. దేశద్రోహం లేదా తీవ్రనేరాలు:
రాజద్రోహం, దేశద్రోహం సంఘటనలలో పొల్గొన్నవారు తమ పౌరసత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది. తప్పుడు సమాచారం ఆధారంగా పౌరసత్వాన్ని పొందడం, తప్పుడు పద్ధతుల ద్వారా దేశీయీకరణ పొందడం.
ఉదా : మోసపూరిత వివాహ పద్ధతుల ద్వారా పౌరసత్వాన్ని పొందడం. ఇతర దేశాల పౌరసత్వాన్ని పొందే సమయంలో తమదేశ పౌరసత్వాన్ని వదులుకోకపోవడం.

దేశంలోని నిబంధనలు పాటించకపోవడం
ఉదా : జపాన్ పౌరులకు గల అదనపు పౌరసత్వాన్ని వారికి 22 సంవత్సరాల వయస్సు వచ్చేలోపు వదలుకోకపోతే వారు తమ పౌరసత్వాన్ని కోల్పోతారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 3.
దేశీయీకరణ పౌరసత్వానికి సంబంధించిన మూడు పద్ధతులను తెలపండి.
జవాబు.
1. నివాసం (Residence):
విదేశీయుడు తాను నివసిస్తున్న రాజ్యంలో పౌరసత్వాన్ని పొందేందుకు నిర్ణీత కాలం పాటు నివసించాలి. అతడు ఆ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా నివసించాల్సి ఉంటుంది. ఆ పరిమితి అన్ని రాజ్యాలలో ఒకే రకంగా లేదు. ఉదాహరణకు ఆ కాలపరిమితి బ్రిటన్, అమెరికాలలో 5 సంవత్సరాలు కాగా, ఫ్రాన్స్లో 10 సంవత్సరాలుగా నిర్ణయించడమైంది.

2. ఎంపిక (Choice) :
విదేశీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత తమకు ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొని పొందవచ్చు.

3. దరఖాస్తు (Application) :
విదేశీయుడు తాను కోరుకున్న రాజ్యంలో పౌరసత్వం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాజ్యానికి చెందిన ప్రభుత్వం విధించే షరతులను సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు యోగ్యతను రాజ్యం పరిశీలించి ఆమోదించినట్లయితే అతనికి పౌరసత్వం లభిస్తుంది.

నిర్దిష్ట కాలం పాటు నివాసం, సత్ప్రవర్తన, ఆర్థిక సామర్థ్యం, రాజ్యంలోని ఏదైనా ఒక జాతీయ భాషను అవగాహన చేసుకోవడం వంటి షరతులను ఆయా విదేశీయులు ఆమోదించాల్సి ఉంటుంది. పై వాటితో పాటుగా తాము పౌరసత్వం పొందగోరే రాజ్యానికి విధేయతను కలిగి ఉంటామనే లిఖితపూర్వక ప్రమాణం చేయడం ద్వారా విదేశీయులు పౌరసత్వాన్ని పొందగలుగుతారు.

ప్రశ్న 4.
ప్రపంచ లేదా విశ్వజనీన పౌరసత్వం.
జవాబు.
విశ్వ పౌరసత్వం (Universal Citizenship) :
అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలలో ఇటీవలి కాలంలో ఆవిష్కృతమైన భావనయే విశ్వ పౌరసత్వం. 1980, 1990 దశకాలలో సంభవించిన నాటకీయ పరిణామాలు విశ్వవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, కమ్యూనికేషన్లు వంటి రంగాలలో ఏర్పడిన పురోగతి మానవ జీవనాన్ని అద్భుతమైన రీతిలో మార్చివేసింది.

సామాన్యులలో అతి సామాన్యులు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వివిధ సాధనాలను వినియోగించుకొని సౌకర్యవంతమైన, సౌఖ్యప్రదమైన, ఆర్థిక ప్రయోజనాలను పొందగలిగారు. అట్లాగే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల కలిగే ఫలితాలు వారికి వరప్రదాయినిగా పరిగణించబడినాయి.

అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా తృతీయ ప్రపంచ దేశాలలోని ప్రభుత్వాలు రక్షణ రంగం నుంచి సామాన్య ప్రజల సంక్షేమం దిశగా తమ ప్రాధాన్యతలను నిర్ణయించుకొన్నాయి. వివిధ రంగాలకు చెందిన మేధావులు విదేశాలకు వెళ్ళి, అశేష ప్రయోజనాలను పొందే విషయంలో ఆసక్తిని ప్రదర్శించసాగారు.

ఈ ప్రక్రియలో భాగంగా వారు స్వదేశంతో పాటుగా, తాము పనిచేసే విదేశాలలో సైతం పౌరసత్వాన్ని పొందేందుకు ప్రయత్నించారు. ఇటువంటి సందర్భాలలో కొన్ని రాజ్యాలు ఇతర పౌరులకు తమ రాజ్య పౌరసత్వాన్ని ప్రసాదించే దిశగా అడుగులు వేశాయి. ఈ భావనే విశ్వ పౌరసత్వానికి ప్రాతిపదిక అయింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
పౌరసత్వాన్ని నిర్వచించండి.
జవాబు.

  1. అరిస్టాటిల్ : “రాజ్య వ్యవహారాలలో ప్రత్యక్షంగా, చురుకైన పాత్ర కలిగిన వ్యక్తియే పౌరుడు”.
  2. ప్రొఫెసర్ లాస్కీ : “ప్రజాహితానికి వ్యక్తులు అందించే నిర్ణాయక సేవయే పౌరసత్వం”.
  3. టి.హెచ్. మార్షల్ : “రాజకీయ సమాజంలో సంపూర్ణ సభ్యులుగా ఉండేవారికి కల్పించే హోదాయే పౌరసత్వం. అటువంటి హోదాగల వ్యక్తులు హక్కులు, బాధ్యతల విషయంలో సమాన హోదాను కలిగి ఉంటారు”.

ప్రశ్న 2.
(జస్ సాంగ్వినీస్) తల్లిదండ్రుల ఆధారంగా పౌరసత్వం.
జవాబు.
‘జస్ సాంగ్వినీస్’ అంటే ‘బంధుత్వం’ లేదా ‘రక్తసంబంధం’ అని అర్థం. బంధుత్వం లేదా రక్తసంబంధం ద్వారా పౌరసత్వం సంక్రమిస్తుందని జస్ సాంగ్వినీస్ భావం. ఈ పద్దతి ప్రకారం ఒక శిశువు తాను జన్మించిన ప్రదేశంతో సంబంధం లేకుండానే తన తల్లిదండ్రుల పౌరసత్వాన్ని పొందుతుంది.

ప్రశ్న 3.
ప్రదేశ ఆధార ఫౌరసత్వం.
జవాబు.
జస్ సోలి అంటే భూమి లేదా జన్మస్థలం అని అర్థం. భూమి లేదా పుట్టిన ప్రదేశం ప్రాతిపదికగా పౌరసత్వం సంక్రమించే పద్ధతినే జస్ సోలి అని అంటారు. ఈ పద్ధతి ప్రకారం శిశువుకు తన తల్లిదండ్రులను బట్టి కాకుండా, పుట్టిన ప్రదేశం ప్రాతిపదికగా పౌరసత్వం లభిస్తుంది. ప్రస్తుతం ఈ పద్ధతి అర్జంటీనాలో అమలులో ఉన్నది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 4.
పౌరసత్వం కోల్పోయే పరిస్థితులను తెలపండి.
జవాబు.
క్రింది పరిస్థితులలో పౌరుడు తన పౌరసత్వాన్ని కోల్పోతాడు.

  1. పరిత్యాగం
  2. ఇతరదేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా అంగీకరించడం
  3. వివాహం
  4. దీర్ఘకాలం దేశంలో నివసించకపోవడం
  5. దేశద్రోహం లేదా తీవ్రనేరాలు
  6. సైన్యం నుంచి పారిపోవడం
  7. విదేశాలలో ఉద్యోగం
  8. విదేశీ బిరుదుల స్వీకారం.

ప్రశ్న 5.
ద్వంద్వ పౌరసత్వం అంటే ఏమిటి ?
జవాబు.
ద్వంద్వ పౌరసత్వం (Double Citizenship) :
పౌరులకు రెండు రాజ్యాలలో పౌరసత్వం ఉండడాన్ని ద్వంద్వ పౌరసత్వంగా వ్యవహరిస్తారు. ఈ రకమైన పౌరసత్వం అనేక అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలలో వాడుకలో ఉంది. ఉదాహరణకు అమెరికన్ పౌరులకు విదేశాలలో జన్మించిన పిల్లలకు రెండు రాజ్యాల్లోనూ పౌరసత్వం పొందే అవకాశం ఉంది. ఆ రెండింటిలో ఒకటి మాతృదేశ పౌరసత్వం కాగా రెండోది తాము జన్మించిన రాజ్య పౌరసత్వానికి సంబంధించినవై ఉంటాయి.

అయితే ద్వంద్వ పౌరసత్వం గల వ్యక్తులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు. వారు రెండు రాజ్యాల చట్టాలకు విధేయులై ఉంటారు. ద్వంద్వ పౌరసత్వం అనేది యుక్తవయస్సు వచ్చే వరకు పిల్లలకు ఉంటుంది. ఆ తరువాత వారు రెండు రాజ్యాలలోని ఏదో ఒకదానిలో పౌరసత్వాన్ని ఎంపిక చేసుకొంటారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 7 పౌరసత్వం

ప్రశ్న 6.
ఉత్తమ పౌరుని రెండు లక్షణాలను తెలపండి.
జవాబు.
1. మంచి ప్రవర్తన (Good Character) :
మంచి పౌరుడు మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి. అతడు. ధైర్యం, న్యాయ సహాయధోరణి, ఉదార స్వభావం, సానుభూతి, సత్యభాషణ, నిజాయితీ వంటి గుణాలను త్రికరణ శుద్ధిగా కలిగి ఉండాలి.

2. సంపూర్ణ ఆరోగ్యం (Sound Health) :
మంచి పౌరుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, శక్తిని కలిగి ఉండాలి. ఆరోగ్యవంతులైన పౌరులే ఆరోగ్యకరమైన జాతిని నిర్మిస్తారు. ఎందుకంటే మంచి ఆలోచనలు గల వ్యక్తులే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అటువంటి పౌరులు అనేక రంగాలలో రాజ్య ప్రగతికి దోహదపడతారు.

TS Inter 1st Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 1st Lesson రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 1st Lesson రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్రాన్ని నిర్వచించి దాని పరిధిని వివరించండి.
జవాబు.
పరిచయం : సాంఘిక శాస్త్రాలలో రాజనీతి శాస్త్రము ప్రధానమైనది. ప్రాచీన గ్రీకునగర రాజ్యాలైన ఏథెన్స్, స్పార్టా, గ్రీస్, రోమ్లలో క్రీ.పూ. 4వ శాతబ్దంలో ప్రారంభమైంది. ప్రముఖ గ్రీకు రాజనీతి వేత్తలైన సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ రాజనీతిని తత్వశాస్త్రము నుండి వేరు చేసి ప్రత్యేక అధ్యయన శాస్త్రముగా అభివృద్ధిచేసిరి.

అరిస్టాటిల్ రాజనీతి శాస్త్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. అందువలన ఇతను రాజనీతిశాస్త్ర పితామహుడుగా కీర్తింపబడినాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంథమైన ‘పాలిటిక్స్’ లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతి శాస్త్రమని పేర్కొనినాడు.

పదపరిణామము :
రాజకీయాలు (Politics) అనే పదం గ్రీకు పదమైన పోలిస్ (Polis) అనే పదం నుంచి గ్రహించబడింది. పోలిస్ అంటే నగర రాజ్యం (City – State) అని అర్థం. పాలిటి (Polity) అనే పదం గ్రీకు పదమైన పొలిటియా (Poletieia) అనే గ్రీకు పదం నుంచి గ్రహించబడింది. ‘పాలిటి’ అంటే ప్రభుత్వం – లేదా రాజ్యాంగం అని అర్థం.

రాజనీతిశాస్త్రం – నిర్వచనాలు :
జె.డబ్ల్యు. గార్నర్: “రాజనీతిశాస్త్రానికి ఆది అంతాలు రాజ్యమే” అని నిర్వచించారు.
ఆర్.జి. గెటిల్ : “గతకాలపు రాజ్యం యొక్క చారిత్రక వివరణ, వర్తమాన రాజ్యపు విశ్లేషణాత్మక వర్ణన భవిష్యత్లో రాజ్యం ఎలా ఉంటుందనే రాజకీయ చింతన చేసేదే రాజనీతిశాస్త్రం”.
రాబర్ట్ థాల్ : “అధికారాన్ని, శక్తిని, వాటి ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం” నిర్వచించాడు.
డేవిడ్ ఈస్టన్ : “అధికారంతో కూడిన వివిధ చర్యల, పద్ధతుల ద్వారా సమాజానికి మార్గ నిర్దేశం చేసే నియంత్రణా విధానాలను తెలియజేసేదే రాజనీతిశాస్త్రం”గా నిర్వచించినాడు.

రాజనీతిశాస్త్రం-పరిధి :
రాజనీతిశాస్త్రం సైద్ధాంతిక, అనుభవపూర్వక అంశాలకు చెందిన మానవుల రాజకీయ జీవితాన్ని వర్ణించే పరిధిని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. రాజకీయ సంస్థల విధుల నిర్వహణకు, రాజకీయ ప్రక్రియలకు సంబంధించి రాజకీయ సమాజాలలో ఏమి జరుగుతుందో ఈ శాస్త్రం వివరిస్తుంది. ఈ కారణంవల్ల రాజనీతిశాస్త్ర పరిధి సమగ్రమైనదిగాను, ఇతర సాంఘికశాస్త్రాలతో అంతర్విభాగీయ సంబంధాలను కలిగి ఉండే శాస్త్రంగాను వివరించబడింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

రాజనీతిశాస్త్ర పరిధిని అంశాల వారీగా కింది విధంగా చెప్పవచ్చు.

i) వ్యక్తికి సమాజం, రాజ్యం, ప్రభుత్వానికి గల సంబంధం :
రాజనీతిశాస్త్రం ప్రాథమికంగా వ్యక్తికి, సమాజం, రాజ్యం ప్రభుత్వం వంటి వ్యవస్థలకు గల సంబంధాన్ని వివరిస్తుంది. ఈ సందర్భంగా అరిస్టాటిల్ మాటలు ఉటంకించడం సముచితం. ఆయన “మానవుడు సంఘజీవి అదే విధంగా రాజకీయ జీవి కూడా” అని అభివర్ణించాడు.

ii) రాజ్యాన్ని అధ్యయనం చేసే శాస్త్రం :
రాజనీతిశాస్త్రం రాజ్యం పుట్టుక, పరిణామక్రమం, దాని ఆవశ్యకత, పౌరుడికి రాజ్యానికి గల సంబంధాలను గురించి వివరిస్తుంది. అదే విధంగా రాజ్య అవతరణకు సంబంధించిన పలు సిద్ధాంతాలను కూడా తెలియజేస్తుంది. వీటితోపాటు రాజ్య స్వభావం దాని విధుల నిర్వహణను సైతం వివరిస్తుంది.

iii) ప్రభుత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం :
రాజనీతిశాస్త్ర పరిధిలో ప్రభుత్వానికి సంబంధించిన అధ్యయనం కూడా ఉంటుంది. ఈ శాస్త్రం రాజ్యానికి ప్రభుత్వానికి గల సంబంధం, రాజ్యం యొక్క ఆశయాలను, లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడుతుందో వివరిస్తుంది. అదే విధంగా పలు రకాల ప్రభుత్వ నిర్మాణ రూపాలను వాటి ప్రయోజనాలను, లోపాలను గురించి కూడా వివరిస్తుంది.

iv) సంఘాలను, సంస్థలను అధ్యయనం చేసే శాస్త్రం :
వ్యక్తుల రాజకీయ జీవితాన్ని రాజకీయ సమాజంలోని పలు సంఘాలు, సంస్థలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో రాజనీతిశాస్త్రం అధ్యయనం చేస్తుంది. రాజ్యానికి, పలు సంఘాలకు, సంస్థలకు గల సంబంధాన్ని వివరిస్తుంది.

ఆయా సంస్థల నిర్మాణం, స్వభావాలు, విధులు, అవి చేపట్టే చర్యలను సైతం రాజనీతిశాస్త్రం తెలియజేస్తుంది. అదే విధంగా రాజకీయ ప్రక్రియలో వివిధ స్వచ్ఛంద సంస్థల పాత్రను కూడా రాజనీతిశాస్త్రం వివరిస్తుంది.

v) హక్కులు, విధుల అధ్యయం :
రాజకీయ సమాజంలోని పౌరుల హక్కులను, విధులను గురించి తెలియజేస్తుంది. ఇటీవలి కాలంలో మానవ హక్కులు, పౌరహక్కులకు సంబంధించిన అనేక అంశాలను రాజనీతిశాస్త్రం సమగ్రంగా విశ్లేషించడం జరుగుతోంది.

vi) జాతీయ – అంతర్జాతీయ పరమైన సమస్యల అధ్యయనం :
రాజనీతిశాస్త్ర పరిధి జాతీయ, అంతర్జాతీయ సమస్యలను వివరించేదిగా ఉంది. జాతీయరాజ్యాలు, భౌగోళిక సమైక్యత, సార్వభౌమాధికారం మొదలైన అంశాలు ఈ శాస్త్ర పరిధిలోకి వస్తాయి. అంతేకాదు ఆయుధీకరణ, నిరాయుధీకరణ, సమతౌల్య ప్రాబల్యం, మిలిటరీ – రక్షణ వ్యవహారాలను సైతం రాజనీతిశాస్త్రం వివరిస్తుంది.

vii) తులనాత్మక రాజకీయాలను అధ్యయనం చేసే శాస్త్రం :
రాజనీతిశాస్త్రం, ప్రపంచంలోని పలు రకాల ప్రభుత్వాలను వాటి నిర్మాణాలను అవి నిర్వహించే విధులను తులనాత్మకంగా వివరిస్తుంది. ప్రపంచంలోని సమకాలీన రాజకీయ వ్యవస్థలను తులనాత్మకంగా విశ్లేషిస్తుంది.

viii) ఆధునిక రాజనీతి విశ్లేషణ అధ్యయనం :
20వ శతాబ్దపు రాజనీతిశాస్త్రం అధికార నిర్మాణం, దాని పంపిణీకి సంబంధించి వివరించే శాస్త్రంగా పరిగణించబడింది. అదే విధంగా ఆధునిక రాజకీయ వ్యవస్థల విశ్లేషణ కోసం ఆయా వ్యవస్థల్లోని రాజకీయ సామాజికీకరణ, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయాభివృద్ధి, రాజకీయ సంస్కృతి, రాజకీయ ప్రసరణ వంటి నూతన భావాలను రాజనీతిశాస్త్రం వివరిస్తుంది.

ix) ప్రభుత్వ విధానాల అధ్యయనం :
ఆధునిక రాజనీతిశాస్త్రవేత్తలైన డేవిడ్ ఈస్టర్, గాబ్రియల్, ఎ. ఆల్మండ్ చార్లెస్ మెరియమ్ వంటి వారు ఆధునిక రాజనీతిశాస్త్రం విధానాల అధ్యయనం శాస్త్రంగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. వారి అభిప్రాయంలో రాజ్యం రూపొందించే సంక్షేమ పథకాలు, చేపట్టే అభివృద్ధి చర్యలను అధ్యయనం చేయడమే. ప్రాథమిక విధిగా రాజనీతిశాస్త్రజ్ఞులు భావించాలన్నారు.

ప్రభుత్వం పథకాలను రూపొందించే సందర్భంగా రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు ప్రసార – ప్రచార మాధ్యమాలు ఎటువంటి ప్రభావిత పాత్రలను పోషిస్తున్నాయో రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయాభివృద్ధి కోసం ప్రవేశపెట్టే విధానాలను, ఉదాహరణకు, జాతీయ వ్యవసాయ విధానం పారిశ్రామిక విధానం, పర్యావరణ విధానం, రిజర్వేషన్ విధానం, విద్యావిధానం వంటి జాతీయ ప్రతిష్ఠను నిలబెట్టే విధానాలను కూడా రాజనీతిశాస్త్రం అధ్యయనం చేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్ర ప్రాముఖ్యతను గురించి తెలియజేయండి.
జవాబు.
రాజనీతిశాస్త్రం రాజకీయ వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడమేకాకుండా రాజకీయపరమైన సమస్యల పరిష్కారానికి కూడా తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది. అంతేకాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, బాధ్యతాయుత ప్రభుత్వంగా వ్యవహరించడం, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వడం వంటి విషయాలను పేర్కొనడం ద్వారా రాజనీతిశాస్త్ర ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది.

1. రాజనీతిశాస్త్రం సిద్ధాంతాలను – భావనలను వివరిస్తుంది.
రాజనీతిశాస్త్రం వ్యక్తికి – రాజ్యానికి, సమాజానికి మధ్యగల సంబంధాన్ని వివరిస్తుంది. వ్యక్తుల స్వేచ్ఛా – సమానత్వాల ప్రాముఖ్యతను తెలియజేయడమే కాకుండా అనేక సిద్ధాంతాలను రాజనైతిక భావాలను వివరించడం ద్వారా సమాజాన్ని ప్రగతిశీల సమాజంగా మారుస్తుంది.

2. రాజనీతిశాస్త్రం ప్రభుత్వ రూపాలను, ప్రభుత్వ అంగాలను గురించి వివరిస్తుంది.
రాజనీతి శాస్త్రం ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది. ఉదాహరణకు రాజరికం, కులీనపాలన, ప్రజాస్వామ్యం, నియంతృత్వం, ఇతర ప్రభుత్వ రూపాలను గురించి అవగాహనకు ఈ శాస్త్రం కల్పిస్తుంది. అదే విధంగా ఆధునిక ప్రభుత్వాలు కలిగి ఉండే శాసన నిర్మాణ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖల రూపంలో గల అంగాలను, వాటి ప్రాధాన్యతలను, వాటి మధ్యగల సంబంధాలను – భేదాలను తెలియజేయడం ద్వారా శాస్త్ర ప్రాధాన్యత పెరిగింది.

3. రాజనీతిశాస్త్రం హక్కులను – విధులను గురించి వివరిస్తుంది.
రాజకీయ సమాజంలో పౌరులు ఉత్తమ జీవనాన్ని పొందడానికి కావలసిన హక్కులను వారు నిర్వహించాల్సిన విధులను రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. అదే విధంగా రాజ్యం పౌరులకు ఎటువంటి హక్కులను కల్పించాలి. ప్రజాభిమతానికి ఏ విధమైన ప్రాధాన్యతలనివ్వాలి అనే విషయం పౌరులకు స్పష్టంగా తెలుస్తుంది.

4. రాజనీతిశాస్త్రం రాజనీతి తత్వవేత్తల భావాలకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది.
ఆయా కాలాల్లో, పలు సందర్భాల్లో తత్వవేత్తల భావాలు ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. రూసో, వాల్టేరు వంటి వారి తాత్విక భావాలు ఫ్రెంచి విప్లవం సంభవించడానికి ఏ విధంగా దోహదపడ్డాయో ఈ శాస్త్రం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం.

అదే విధంగా కారల్ మార్క్స్ భావాలు రష్యాలో లెనిన్ నాయకత్వంలో విప్లవం సంభవించడానికి మావో నాయకత్వంలో చైనాలో విప్లవం రావడానికి ఏ విధంగా దోహదపడ్డాయో కూడా రాజనీతిశాస్త్రాన్ని అధ్యయనం చేయడంవల్ల మనం తెలుసుకోవచ్చు.

అంతేకాదు మన భారతదేశంలో ‘ప్రజలను శాంతియుతంగా స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వాములను చేయడంలో మహాత్మాగాంధీ సిద్ధాంత సూత్రాలు ఏ విధంగా ప్రభావిత పరిచాయో మన గమనంలోనే ఉన్నాయి. ఈ విధంగా రాజనీతిశాస్త్రం రాజనీతి తత్వవేత్తల గురించి సంపూర్ణమైన అవగాహన కల్పిస్తుంది.

5. రాజనీతిశాస్త్రం అంతర్జాతీయ సంబంధాలను తెలియజేస్తుంది.
అంతర్జాతీయంగా సార్వభౌమాధికార రాజ్యాలు ప్రపంచ రాజకీయ వ్యవస్థలో ఎటువంటి భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయో రాజనీతిశాస్త్రం వివరిస్తుంది. ప్రపంచ రాజ్యాల మధ్య పలురకాల సంబంధాలను గురించి ఈ శాస్త్రం తెలియజేస్తుంది. ఆధునిక కాలంలో పారిశ్రామిక విప్లవం సంభవించడంతో ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి దోహదపడిన అంశాలను రాజనీతిశాస్త్రం విశ్లేషిస్తుంది.

శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, రోడ్డు రవాణా సౌకర్యాల ఏర్పాటు, ప్రాంతీయ కూటముల ఏర్పాటువల్ల సరిహద్దు రాజ్యాల మధ్య సంబంధాలు మెరుగుపడి అంతర్జాతీయంగా పలు రాజ్యాలు ప్రాధాన్యతను పొందాయి. రాజనీతిశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఇటువంటి అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు.

6. రాజనీతిశాస్త్రం ప్రపంచ సంస్థలను గురించి వివరిస్తుంది.
రాజనీతిశాస్త్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత కలిగి ఉన్న సంస్థలకు సంబంధించి అవగాహనను కల్పిస్తుంది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న దాని అనుబంధ సంస్థలు, అవి నిర్వహించే కార్యకలాపాలను గురించి అవగాహన రాజనీతిశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా కలుగుతుంది.

7. రాజనీతిశాస్త్ర అధ్యయన పద్ధతులు.
రాజనీతిశాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి పలురకాల పద్ధతులున్నాయి. వీటిని ఇతర సాంఘిక శాస్త్రాలలో సైతం పాటించడం జరుగుతుంది. ఈ అధ్యయన పద్ధతులు ముఖ్యంగా చారిత్రక పద్ధతి, పరిశీలనా పద్ధతి, తులనాత్మక పద్ధతి, అనుభవవాద పద్ధతి, తాత్విక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి. ఈ పద్ధతులన్నింటిని అవగాహన చేసుకోవడం ద్వారా రాజనీతిశాస్త్ర విశ్లేషణను సంపూర్ణంగా మనం తెలుసుకోవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 3.
రాజనీతిశాస్త్రానికి చరిత్ర, అర్థశాస్త్రానికి గల సంబంధాలను తెలపండి.
జవాబు.
రాజనీతిశాస్త్రం – చరిత్ర :
చరిత్ర గతాన్ని వివరిస్తుంది. మానవుడు, సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందాయో తెలుసుకోవాలంటే చరిత్ర అధ్యయనం అవసరం. చరిత్ర మానవ అనుభవాల నిధి. మానవగాథ సాంఘికశాస్త్రాలకు ప్రయోగశాలవంటిది. మానవజాతికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మత, సాహిత్యరంగాల గురించి చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు.

తొలిమానవుడి నుంచి నేటి వరకూ ఏర్పడ్డ విభిన్న సంస్థల వర్ణనే చరిత్ర. గతకాలంలోని రాజ్యాభివృద్ధిని, నాగరికతను, సంస్కృతిని, మతసిద్ధాంతాలను, ఆర్థిక విషయాలను చరిత్ర నేటి సమాజానికి అందించింది. చారిత్రక సంఘటనలు, ఉద్యమాలు, వాటి కారణాలు, వాటి మధ్యగల అంతర్ సంబంధాలు లిఖితపత్రమే చరిత్ర.

చరిత్ర రాజకీయాల అధ్యయనానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. గతంలో రాజకీయభావాలు, సంస్థలు ఏ విధంగా రూపొందాయో, రాజ్యం ఎట్లా ఆవిర్భవించి అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికీ, సిద్ధాంతీకరించడానికీ చరిత్ర అవసరమైన మౌలిక సమాచారాన్ని సమకూరుస్తుంది. రాజనీతిశాస్త్రానికీ చరిత్రకూ ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞుడు ‘జె.ఆర్.సీలీ’ వివరిస్తూ “రాజనీతిశాస్త్రంలేని చరిత్ర ఫలరహితం, చరిత్రలేని రాజనీతిశాస్త్రం మూలరహితం” అన్నాడు.

రాజకీయ వ్యవస్థలు ప్రాచీనకాలం నుంచి నేటివరకు వివిధ దశలుగా అభివృద్ధి చెందుతున్నాయి. చరిత్ర వివిధ వ్యవస్థల క్రమపరిణామాలను విశదీకరిస్తుంది. రాజనీతిశాస్త్రానికి చరిత్ర పునాది వంటిది. గత రాజకీయ చరిత్రను వర్తమానంతో పోలిస్తే భవిష్యత్తులో పటిష్టవంతమైన ఆదర్శ రాజకీయ వ్యవస్థలు స్థాపించడానికి సాధ్యమవుతుంది. భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిమీగ్ ద్విజాతి సిద్ధాంతం, ఫ్రెంచి విప్లవం, రష్యావిప్లవం మొదలైన వాటిని అర్థం చేసుకోవడానికీ, వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికీ రాజకీయ పరిజ్ఞానం చాలా అవసరం.

ప్రాచీన యూరప్ చరిత్ర పరిజ్ఞానం ఉన్నప్పుడే ప్లేటో, అరిస్టాటిల్ వంటి తత్త్వవేత్తల భావాలను అధ్యయనం చేయడం సాధ్యమవుతుంది. చారిత్రక సమాచారం ఆధారంగానే మాకియవెల్లి, మాంటెస్క్యూ, లార్డ్ బ్రైస్ వంటి రాజనీతి శాస్త్రజ్ఞులు విభిన్న రాజకీయ సిద్దాంతాలను ప్రతిపాదించారు.

‘రాబ్సన్’ అభిప్రాయపడ్డట్లు ఒక విద్యార్థి తన దేశ రాజ్యాంగాన్ని, విదేశాంగ విధానాన్ని అధ్యయనం చేయాలంటే తన జాతి చారిత్రక క్రమం తెలుసుకోవలసి ఉంటుంది. రాజనీతిశాస్త్ర అభివృద్ధికి చరిత్ర ఎంత అవసరమో రాజనీతిశాస్త్ర పరిజ్ఞానం కూడా చరిత్ర అభివృద్ధికి అంతే అవసరం. చరిత్ర, రాజనీతి శాస్త్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించినప్పుడే నాగరిక సమాజాభివృద్ధికి అవి తోడ్పడతాయి.

చరిత్ర నిర్ధిష్టమైన ఇతివృత్తాలను గురించి చర్చిస్తే, రాజనీతిశాస్త్రం రాజ్యాధికారం, ప్రభుత్వ విధానాలు, రాజ్యాంగాల వర్గీకరణ, వివిధ రాజకీయ పార్టీలు మొదలైనవాటిని గురించి చర్చిస్తుంది. రాజనీతిశాస్త్ర అధ్యయనం, భూత, వర్తమాన పరిణామాలను విశ్లేషించడమే కాకుండా భవిష్యత్తు గురించి ఊహాగానం చేస్తుంది.

రాజనీతిశాస్త్రం – అర్థశాస్త్రం :
అర్థశాస్త్రం సంపద, ఉత్పత్తి పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. సంపదను ఎట్లా సమకూర్చుకోవాలో అర్థశాస్త్రం చర్చిస్తుంది. సంపద, ఉత్పత్తి, పంపిణీ విషయాలకు సంబంధించిన సామాజిక అధ్యయనమే అర్థశాస్త్రం. సామాజిక వ్యవస్థలు, రాజనీతి సిద్ధాంతాలు మానవజీవితాన్ని క్రమబద్ధం చేయడానికి తోడ్పడుతుంది. మానవుడు ఆదర్శ పౌరుడుగా నియమనిబంధనలతో బతకడానికి స్పష్టమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి అది మానవశ్రేయస్సును అనేక విధాలుగా అభివృద్ధిపర్చడానికి అర్థశాస్త్రం ఉపకరిస్తుంది.

అపరిమితమైన కోరికలను పరిమిత వనరులతో తీర్చుకునే మార్గాలను సమన్వయం చేయడానికి అర్థశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆర్థికావసరాలు తీరని సమాజంలో అశాంతి, అసంతృప్తి ఏర్పడతాయి. ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం మొదలైనవి లోపిస్తే మానవజీవితం దుఃఖమయమవుతుంది. కనీసావసరాలు తీరనప్పుడు వ్యక్తి తన మనుగడకోసమే తన శక్తియుక్తులన్నింటిని వినియోగించవలసి వస్తుంది. ‘దారిద్ర్యం విలయతాండవం చేసే సమాజంలో అవినీతి, సంఘవ్యతిరేకశక్తులు భయంకరంగా విజృంభిస్తాయి.

ఆకలితో, అజ్ఞానంతో, అనారోగ్యంతో బాధపడే పౌరుడు తన రాజకీయ లక్ష్యాలను, విలువలను గుర్తించే పరిస్థితిలో ఉండడు. ఆకలి తీర్చుకోవడానికి అతడు అనేక నేరాలకు పాల్పడవచ్చు. సంఘవిద్రోహ చర్యల ద్వారా ప్రగతి సాధించాలనే భావనతో ఉంటాడు. తన హక్కులను, విధులను సరిగ్గా వినియోగించలేడు. బాధ్యతలను నిర్వర్తించలేడు. కనీసావసరాలు తీరని పౌరుడు ఓటుహక్కు విలువను తెలుసుకోలేడు. ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారితీస్తాయని ‘అరిస్టాటిల్’ హెచ్చరించాడు.

అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం వేరైనప్పటికీ ప్రజాసంక్షేమమే ఈ రెండు శాస్త్రాల ప్రధాన లక్ష్యం. ఆధునిక రాజ్యాలు నిర్వర్తించే విధుల్లో ఉత్పత్తి విధానం, వినియోగం మారకద్రవ్య సద్వినియోగం, ధరల పెరుగుదలను అరికట్టడం, జాతిసంపదను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటం ముఖ్యమైనవి. వీటిమీద ఆర్థిక విధానాల ప్రభావం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రాజకీయ వ్యవస్థల ద్వారానే పరిష్కరించడానికి వీలవుతుంది. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది.

ఉత్పత్తి – అభివృద్ధి భావనలను వాస్తవికం చేసేందుకు రాజ్యం పన్నులు, మార్కెటింగ్, ఆహారోత్పత్తి, పంపిణీ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధులను నిర్వర్తించక తప్పదు. ఆర్థిక ఉత్పత్తి శక్తులే సమాజాలలో మ్కార్సిజం వ్యాప్తికి దోహదం చేశాయి. ఆర్థికపరమైన అంశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. నాజీయిజం, ‘ఫాసం సిద్ధాంతాలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం చేయడానికి ఆర్థిక కారణాలే ప్రధానమైనవని చాలా మంది భావిస్తారు. ఆధునిక కాలంలో విస్తరిస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలకూ ఉద్యమాలకూ ఆర్థిక సమస్యలే మూలం. ఆర్థికస్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్రానికి – సమాజశాస్త్రానికి గల సంబంధాలను వివరించండి.
జవాబు.
సమాజశాస్త్రం సాంఘికశాస్త్రాలన్నింటికీ మూలం. సాంఘికవ్యవస్థల పరిణామాలను సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సమాజశాస్త్రం సామాజిక, నైతిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలన్నింటి గురించి చర్చిస్తుంది. మానవ సంబంధాలు, సాంఘిక పరిస్థితులు, వివిధ వ్యవస్థల ఆవిర్భావం – పరిణామం వికాసం వాటి రూపాలు, చట్టాలు, ఆచార వ్యవహారాలు, జీవనోపాధి, నాగరికత, సంస్కృతి మొదలైన వాటి ప్రభావాల గురించి సమాజశాస్త్రం ప్రస్తావిస్తుంది.

అందువల్ల సమాజశాస్త్ర పరిధి చాలా విస్తృతమైంది. ఇతర సాంఘిక శాస్త్రాలన్నీ దీనిలో నుంచి ప్రత్యేకశాస్త్రాలుగా రూపాంతరం చెందాయి. రాజనీతిశాస్త్రం వీటిలో ఒక భాగం మాత్రమే. ఈ రెండు శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం ఉండటమేగాక అవి పరస్పరం ఆధారపడి ఉంటాయి.

రాజనీతిశాస్త్రవేత్తకు సామాజిక శాస్త్రంతో పరిచయం చాలా అవసరం. ఎందుకంటే రాజ్యస్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే దాని సామాజిక మూలాలను అధ్యయనం చేయాలి. గ్రీకు తత్త్వవేత్తలు సాంఘిక విధానాన్నే రాజకీయ విధానంగా భావించారు. వారి దృష్టిలో రాజ్యానికీ సంఘానికీ తేడాలేదు.

గ్రీకుల అభిప్రాయంలో రాజ్యం రాజకీయ వ్యవస్థీకాక ఒక ఉన్నతమైన సాంఘిక వ్యవస్థ కూడా. సమాజ జీవనాన్ని క్రమబద్ధం చేయడంలో సమాజంలోని ఆచారాలు కట్టుబాట్లు తోడ్పడతాయి. రాజనీతిశాస్త్రజ్ఞులు వ్యక్తి సమూహ ప్రవర్తనలను నిర్ణయించడంలో సామాజికీకరణ విధానానికి ప్రాధాన్యత ఇస్తారు.

ఇటీవలి కాలంలో రాజకీయ సమాజశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందింది. దీంతో రాజకీయ జీవనం మీద సామాజిక సంస్థల ప్రభావం ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు. రాజకీయ పార్టీలు, ముఠాలు, ప్రజాభిప్రాయం మొదలైనవి చాలావరకు సామాజిక ప్రభావాలకు లోనవుతున్నాయి.

ఒక దేశంలోని రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవాలంటే, దాని సామాజిక స్థితిగతుల పట్ల అవగాహన ఉండాలి. భారతదేశ రాజకీయాలను చేసుకోవాలంటే కులం, మతం, ప్రాంతం, భాష మొదలైన సామాజిక ప్రక్రియలను తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

రాజనీతిశాస్త్రం క్రమబద్ధమైన వ్యక్తుల సముదాయాలకు పరిమితంకాగా సమాజశాస్త్రం క్రమబద్ధం కాని మానవ సముదాయాలను గురించి కూడా వివరిస్తుంది. రాజనీతిశాస్త్రం భూత, వర్తమాన, భవిష్యత్, రాజకీయ వ్యవస్థల గురించి చర్చిస్తే సమాజశాస్త్రం భూత, వర్తమాన కాలాల్లో ఉన్న సంస్థల పుట్టుక, వికాసం గురించి చర్చిస్తుంది.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్రానికి – అర్థశాస్త్రానికి గల సంబంధాలను చర్చించండి.
జవాబు.
అర్థశాస్త్రం సంపద, ఉత్పత్తి, పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. సంపదను ఎట్లా సమకూర్చుకోవాలో అర్థశాస్త్రం చర్చిస్తుంది. సంపద, ఉత్పత్తి, పంపిణీ విషయాలకు సంబంధించిన సామాజిక అధ్యయనమే అర్థశాస్త్రం.

సామాజిక వ్యవస్థలు, రాజనీతి సిద్ధాంతాలు మానవజీవితాన్ని క్రమబద్ధం చేయడానికి తోడ్పడుతుంది. మానవుడు ఆదర్శపౌరుడుగా నియమనిబంధనలతో బతకడానికి స్పష్టమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి అది మానవశ్రేయస్సును అనేక విధాలుగా అభివృద్ధిపర్చడానికి అర్థశాస్త్రం ఉపకరిస్తుంది.

అపరిమితమైన కోరికలను పరిమిత వనరులతో తీర్చుకునే మార్గాలను సమన్వయం చేయడానికి అర్థశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆర్థికావసరాలు తీరని సమాజంలో అశాంతి, అసంతృప్తి ఏర్పడతాయి.- ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం మొదలైనవి లోపిస్తే మానవజీవితం దుఃఖమయమవుతుంది. కనీసావసరాలు తీరనప్పుడు వ్యక్తి తన మనుగడకోసమే తన శక్తియుక్తులన్నింటిని వినియోగించవలసి వస్తుంది. దారిద్య్రం’ విలయతాండవం చేసే సమాజంలో అవినీతి, సంఘవ్యతిరేకశక్తులు భయంకరంగా విజృంభిస్తాయి.

ఆకలితో, అజ్ఞానంతో, అనారోగ్యంతో బాధపడే పౌరుడు తన రాజకీయ లక్ష్యాలను, విలువలను గుర్తించే పరిస్థితిలో ఉండడు. ఆకలి తీర్చుకోవడానికి అతడు అనేక నేరాలకు పాల్పడవచ్చు. సంఘవిద్రోహ చర్యల ద్వారా ప్రగతి సాధించాలనే భావనతో ఉంటాడు.

తన హక్కులను, విధులను సరిగ్గా వినియోగించలేడు. బాధ్యతలను నిర్వర్తించలేడు. కనీసావసరాలు తీరని పౌరుడు ఓటుహక్కు విలువను తెలుసుకోలేడు. ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారితీస్తాయని ‘అరిస్టాటిల్’ హెచ్చరించాడు.

అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం వేరైనప్పటికీ ప్రజాసంక్షేమమే ఈ రెండు శాస్త్రాల ప్రధాన లక్ష్యం. ఆధునిక రాజ్యాలు నిర్వర్తించే విధుల్లో ఉత్పత్తి విధానం, వినియోగం మారకద్రవ్య సద్వినియోగం, ధరల పెరుగుదలను అరికట్టడం, జాతి సంపదను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటం ముఖ్యమైనవి. వీటిమీద ఆర్థిక విధానాల ప్రభావం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రాజకీయ వ్యవస్థల ద్వారానే పరిష్కరించడానికి వీలవుతుంది.

ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది. ఉత్పత్తి అభివృద్ధి భావనలను వాస్తవికం చేసేందుకు రాజ్యం పన్నులు, మార్కెటింగ్, ఆహారోత్పత్తి, పంపిణీ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధులను నిర్వర్తించక తప్పదు.

ఆర్థిక ఉత్పత్తి శక్తులే సమాజాలలో మార్క్సిజం వ్యాప్తికి దోహడం చేశాయి. ఆర్థికపరమైన అంశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. నాజీయిజం, ఫాసిజం సిద్ధాంతాలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం చేయడానికి ఆర్థిక కారణాలే ప్రధానమైనవని చాలా మంది భావిస్తారు. ఆధునిక కాలంలో విస్తరిస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలకూ ఉద్యమాలకూ ఆర్థిక సమస్యలే మూలం. ఆర్థికస్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 3.
రాజనీతిశాస్త్ర స్వభావం ఏమిటి ?
జవాబు.
రాజకీయాలు (Politics) అనే పదం గ్రీకు పదమైన పోలిస్ (Polis) అనే పదం నుంచి గ్రహించబడింది. ‘పోలిస్’ అంటే నగర – రాజ్యం (City State) అని అర్ధం. ‘పాలిటి (Polity) అనే పదం గ్రీకు పదమైన ‘పొలిటియా’ (Poletieia) అనే గ్రీకు పదం నుంచి గ్రహించబడింది. ‘పాలిటి’ అంటే ‘ప్రభుత్వం – లేదా రాజ్యాంగం’ అని అర్థం.

ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాలు అంటే రాజ్యం, ప్రభుత్వం, రాజ్యానికి సంబంధించిన సంస్థలకు వివరణగా భావించాలి. ప్రాచీనగ్రీకులు రాజకీయాలను రాజ్యానికి సంబంధించిన సైద్ధాంతిక, పాలనా నిర్వహణకు చెందిన అంశంగా పరిగణించారు.

రాజకీయాలకు – రాజనీతి శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాల విషయంలో రాజనీతిశాస్త్రజ్ఞుల మధ్య ఏకాభిప్రాయం లేదు. రాజనీతిశాస్త్రాన్ని సంప్రదాయిక వాదులు, ఆధునిక శాస్త్రవేత్తలు వేరువేరుగా నిర్వచించారు. సంప్రదాయిక రాజనీతిశాస్త్రవేత్తల అభిప్రాయంలో రాజ్యం, ప్రభుత్వం, రాజనీతిశాస్త్ర అధ్యయనానికి కేంద్ర బిందువుగా ఉంటాయి. రాజ్యం లేకుండా ప్రభుత్వం – ప్రభుత్వం లేకుండా రాజ్యం మనుగడకు కొనసాగించలేవని వారు అభిప్రాయపడ్డారు. ఈ కారణం వల్ల రాజ్యం – ప్రభుత్వం రాజనీతిశాస్త్ర అధ్యయనానికి కేంద్ర బిందువులుగా సంప్రదాయ రాజనీతిశాస్త్రవేత్తలు అభివర్ణించారు.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం పశ్చిమదేశాలకు చెందిన రాజనీతి శాస్త్రవేత్తలు వివిధ నూతన సిద్ధాంతాలను, అధ్యయన దృక్పథాలను, పద్ధతులను, నమూనాలను రాజనీతిశాస్త్రంలో పొందుపరచి దాన్ని పునఃనిర్వచించి రాజనీతిశాస్త్ర పరిధిని విస్తృత పరిచారు.

1930వ దశకంలో హెరాల్డ్ లాస్వెల్ (Harold Lasswell) అనే రాజనీతి పండితుడు రాజనీతిశాస్త్రాన్ని, ‘రాజకీయ అధికారాన్ని’ (Political Power) అధ్యయనం చేసే శాస్త్రంగాను, అధికారాన్ని ఎవరు, ఎప్పుడు, ఎలా (Who, When and How) చేజిక్కించుకుంటారనే విషయాన్ని ముఖ్య అధ్యయన అంశంగా రాజనీతిశాస్త్రజ్ఞులు ఎంచుకోవాలని నొక్కి వక్కాణించారు. అటు పిమ్మట రెండు దశాబ్దాల తరవాత 1950వ దశకంలో మరికొంతమంది రాజనీతి పండితులు రాజనీతి శాస్త్రాన్ని విధాన నిర్ణయ శాస్త్రంగా పరిగణించాలన్నారు. ఎందుకంటే ?

ఎవరు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారనే విషయం కంటే ప్రజల సమస్త జీవన రీతులను మెరుగుపర్చటానికి రాజ్యం ఎటువంటి విధానాలను (Policies) రూపొందించి అమలుపరుస్తుందనే అంశం రాజనీతిశాస్త్ర అధ్యయనంగా ఉండాలని వీరు భావించారు. అందువల్ల రాజనీతిశాస్త్రం విధాన నిర్ణయ శాస్త్రంగా స్థిరీకరించబడిన మానవ సమూహాల రాజకీయ చర్యలను, కార్యకలాపాలను విశ్లేషించేదిగా పరిణతి చెందింది.

ఈ క్రమంలో రాజ్యం తీసుకునే విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కలిగి ఉండే రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు, కార్మిక – కర్షక సంఘాలు, ఇతర సంస్థలు, పాలనా యంత్రాంగాలు వాటి పాత్రలను వివరించేదిగా రాజనీతిశాస్త్రం అభివృద్ధి చెందింది.

రాజనీతిశాస్త్రాన్ని విశాల దృక్పథంలో చూసినట్లయితే మనకు రెండు అధ్యయన కోణాలు కనబడతాయి. అవి : ఒకటి సంప్రదాయిక కోణాలు, రెండు ఆధునిక కోణాలు. సంప్రదాయిక కోణంలో రాజనీతిశాస్త్రాన్ని చూసినట్లయితే అది సంప్రదాయాలను, విలువలను, అధ్యయనం చేయడానికి, అదే విధంగా, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి భావాలను, కొన్ని సంప్రదాయిక సిద్ధాంతాలను వివరించడానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది.

ఆధునిక కోణంలో చూసినట్లయితే, భౌతిక పరిస్థితులకు, వాస్తవిక అంశాలకు, వ్యక్తుల రాజకీయ ప్రవర్తనలకు, రాజ్యం – ప్రభుత్వం రూపొందించే విధానాలకు సమాజంలో సంభవించే సాంఘిక ఉద్యమాలను అధ్యయనం చేయడానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది.

ప్రశ్న 4.
రాజనీతిశాస్త్ర పరిణామ క్రమాన్ని వివరించండి.
జవాబు.
రాజకీయాలను గురించి అధ్యయనం ప్రాచీన గ్రీకు సమాజాలలో ప్రారంభమైంది. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి గ్రీకు తాత్వికులు వారి కాలం నాటి సమాజాలలోని రాజకీయాలను గురించి చింతన చేశారు. అయితే, అరిస్టాటిల్ నాటి ప్రభుత్వాలను, రాజకీయ వ్యాసంగాలను హేతుబద్ధంగా తులనాత్మక పద్ధతిలో వివరించినందువల్ల తాను రాజనీతిశాస్త్ర పితామహుడుగా ఆరాధించబడ్డాడు. అరిస్టాటిల్, రాజనీతిశాస్త్రాన్ని “మాస్టరైసైన్స్”గా అభివర్ణించాడు.

అంటే మానవులకు చెందిన సాంఘిక, రాజకీయ సంస్థలను వివరించే శాస్త్రంగా పేర్కొన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాలను గ్రీకులు ఒక సమగ్రమైన భావనగా చూశారు. కాలక్రమంలో రాజకీయాల పట్ల గ్రీకుల భావన అనేక మార్పులకు చేర్పులకు గురై ప్రాధాన్యతను కోల్పోయింది. ఆధునిక కాలంలో రాజకీయాలు అనే భావన విస్తృతార్థాన్ని సంతరించుకుంది.

వాస్తవానికి, సామాజిక పరిణామక్రమంలో వివిధ దశల వారీగా ఉత్పత్తివిధానంలో చోటు చేసుకున్న మార్పులు (వేటాడే దశ, ఆహార సేకరణ దశ, వ్యవసాయ ఉత్పత్తిదశ, పారిశ్రామిక ఉత్పత్తి దశ) రాజకీయాలను విస్తృత పర్చాయి. వ్యక్తుల చర్యలను సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలకు చెందినవిగా వివరించబడ్డాయి.

ఈ నేపథ్యంలో రాజనీతిశాస్త్రం వ్యక్తుల రాజకీయ చర్యలకు సంబంధించిన ‘రాజ్యం – ప్రభుత్వం’ లాంటి సంస్థలను వివరించే శాస్త్రంగా వృద్ధి చెందింది. ఈ విధంగా, రాజ్యపరిణామక్రమం, దాని విధులు, ప్రభుత్వం దాని నిర్మాణం – విధులు వంటివి రాజనీతిశాస్త్ర అధ్యయన అంశాలుగా పరిగణించబడ్డాయి.

సామాన్యశాస్త్రాల్లో జీవరాశుల ప్రవర్తనలను అధ్యయనం చేసే తరహాలో సామాజికశాస్త్రాల్లో సైతం వ్యక్తుల ప్రవర్తనలను అధ్యయనం చేయవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రవర్తనావాద ఉద్యమం ప్రారంభమైంది. 1920వ దశకంలో గుర్తించబడిన అధ్యయన అంశం రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రవర్తనావాద ఉద్యమంగా ఒక ఉప్పెనలా సాంఘికశాస్త్రాల అధ్యయనాన్ని అతలాకుతలం చేసింది. 1950వ దశకం నాటికి చార్లెస్ మెరియం, డేవిడ్ ఈస్టన్, గాబ్రియల్ ఆల్మండ్ వంటి రాజనీతిశాస్త్రవేత్తలు ప్రవర్తనావాద ఉద్యమానికి నాయకత్వం వహించారు.

ఈ ఉద్యమం, వ్యక్తుల రాజకీయ ప్రవర్తనల అధ్యయనానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఒక రాజకీయ వ్యవస్థలోని పౌరులు ఆ రాజకీయ వ్యవస్థపై ఎటువంటి రాజకీయ పరమైన వైఖరులను కలిగి ఉన్నారో శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన ఆవశ్యకతను ప్రవర్తనావాదం నొక్కి చెప్పింది. వ్యవస్థీకృతమైన రాజకీయ సమాజంలో రాజ్యం రూపొందించే విధానాలను, వాటి అమలును, వాటి పట్ల పౌరుల రాజకీయ స్పందనలను వివరించేదిగా రాజనీతిశాస్త్రం పరిణామం చెందింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజనీతిశాస్త్ర నిర్వచనం.
జవాబు.

  1. జె.డబ్ల్యు. గార్నర్ : “రాజనీతిశాస్త్రనికి ఆది అంతాలు రాజ్యమే”.
  2. పాల్ జానెట్ : “రాజ్య మూలాధారాలను, ప్రభుత్వ సూత్రాలను తెలియజేసే సాంఘికశాస్త్రమే రాజనీతిశాస్త్రం”.
  3. రాబర్ట్ థాల్ : “అధికారాన్ని, శక్తిని, వాటి ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే రాజనీతిశాస్త్రం”.

ప్రశ్న 2.
రాజనీతిశాస్త్ర ప్రాముఖ్యతను నాలుగు మాటల్లో తెలపండి.
జవాబు.
రాజనీతిశాస్త్రం రాజకీయ వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడమే కాకుండా రాజకీయపరమైన సమస్యల పరిష్కారానికి కూడా తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది అంతేకాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, బాధ్యతాయుత ప్రభుత్వంగా వ్యవహరించడం, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యతనివ్వడం వంటి విషయాలను పేర్కొంటుంది.

ప్రశ్న 3.
సమాజశాస్త్రం అంటే ఏమిటి ?
జవాబు.
సమాజశాస్త్రం సాంఘికశాస్త్రాలన్నింటికీ మూలం. సాంఘిక వ్యవస్థల పరిణామాలను సమాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సమాజశాస్త్రం సామాజిక, నైతిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలన్నింటి గురించి చర్చిస్తుంది.

మానవ సంబంధాలు, సాంఘిక పరిస్థితులు, వివిధ వ్యవస్థల ఆవిర్భావం వాటి రూపాలు, చట్టాలు, ఆచార వ్యవహారాలు, జీవనోపాధి, నాగరికత, సంస్కృతి మొదలైన వాటి ప్రభావాల గురించి సమాజశాస్త్రం ప్రస్తావిస్తుంది. అందువల్ల సమాజశాస్త్రం పరిధి చాలా విస్తృతమైనది. ఇతర సాంఘిక శాస్త్రాలన్నీ దీనిలో నుంచి ప్రత్యేకశాస్త్రాలుగా
రూపాంతరం చెందాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 4.
అర్థశాస్త్రానికి – రాజనీతిశాస్త్రానికి గల భేదం.
జవాబు.

అర్థశాస్త్రం సంపద, ఉత్పత్తి, పంపిణీ, వస్తు వినిమయం గురించి అధ్యయనం చేస్తుంది. సంపదను ఎట్లా సమకూర్చుకోవాలో అర్థశాస్త్రం చర్చిస్తుంది. సంపద, ఉత్పత్తి, పంపిణీ విషయాలకు సంబంధించిన సామాజిక అధ్యయనమే అర్థశాస్త్రం.

సామాజిక వ్యవస్థలు, రాజనీతి సిద్ధాంతాలు మానవజీవితాన్ని క్రమబద్ధం చేయడానికి తోడ్పడుతుంది. మానవుడు ఆదర్శపౌరుడుగా నియమనిబంధనలతో బతకడానికి స్పష్టమైన రాజకీయ వ్యవస్థ చాలా అవసరం. కాబట్టి అది మానవశ్రేయస్సును అనేక విధాలుగా అభివృద్ధిపర్చడానికి అర్థశాస్త్రం ఉపకరిస్తుంది.

అపరిమితమైన కోరికలను పరిమిత వనరులతో తీర్చుకునే మార్గాలను సమన్వయం చేయడానికి అర్థశాస్త్రం ప్రయత్నిస్తుంది. ఆర్థికావసరాలు తీరని సమాజంలో అశాంతి, అసంతృప్తి ఏర్పడతాయి.- ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, గృహవసతి, విద్య, వైద్యం మొదలైనవి లోపిస్తే మానవజీవితం దుఃఖమయమవుతుంది. కనీసావసరాలు తీరనప్పుడు వ్యక్తి తన మనుగడకోసమే తన శక్తియుక్తులన్నింటిని వినియోగించవలసి వస్తుంది. దారిద్య్రం’ విలయతాండవం చేసే సమాజంలో అవినీతి, సంఘవ్యతిరేకశక్తులు భయంకరంగా విజృంభిస్తాయి.

ఆకలితో, అజ్ఞానంతో, అనారోగ్యంతో బాధపడే పౌరుడు తన రాజకీయ లక్ష్యాలను, విలువలను గుర్తించే పరిస్థితిలో ఉండడు. ఆకలి తీర్చుకోవడానికి అతడు అనేక నేరాలకు పాల్పడవచ్చు. సంఘవిద్రోహ చర్యల ద్వారా ప్రగతి సాధించాలనే భావనతో ఉంటాడు.

తన హక్కులను, విధులను సరిగ్గా వినియోగించలేడు. బాధ్యతలను నిర్వర్తించలేడు. కనీసావసరాలు తీరని పౌరుడు ఓటుహక్కు విలువను తెలుసుకోలేడు. ఆర్థిక అసమానతలు సామాజిక విప్లవాలకు దారితీస్తాయని ‘అరిస్టాటిల్’ హెచ్చరించాడు.

అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం వేరైనప్పటికీ ప్రజాసంక్షేమమే ఈ రెండు శాస్త్రాల ప్రధాన లక్ష్యం. ఆధునిక రాజ్యాలు నిర్వర్తించే విధుల్లో ఉత్పత్తి విధానం, వినియోగం మారకద్రవ్య సద్వినియోగం, ధరల పెరుగుదలను అరికట్టడం, జాతి సంపదను పెంచడం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడటం ముఖ్యమైనవి. వీటిమీద ఆర్థిక విధానాల ప్రభావం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు రాజకీయ వ్యవస్థల ద్వారానే పరిష్కరించడానికి వీలవుతుంది.

ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక విధులను నిర్వర్తిస్తుంది. ఉత్పత్తి అభివృద్ధి భావనలను వాస్తవికం చేసేందుకు రాజ్యం పన్నులు, మార్కెటింగ్, ఆహారోత్పత్తి, పంపిణీ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు మొదలైన విధులను నిర్వర్తించక తప్పదు.

ఆర్థిక ఉత్పత్తి శక్తులే సమాజాలలో మార్క్సిజం వ్యాప్తికి దోహడం చేశాయి. ఆర్థికపరమైన అంశాలే రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమయ్యాయి. నాజీయిజం, ఫాసిజం సిద్ధాంతాలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంలో జాప్యం చేయడానికి ఆర్థిక కారణాలే ప్రధానమైనవని చాలా మంది భావిస్తారు. ఆధునిక కాలంలో విస్తరిస్తున్న కొత్త కొత్త రాజకీయ సిద్ధాంతాలకూ ఉద్యమాలకూ ఆర్థిక సమస్యలే మూలం. ఆర్థికస్థితిగతులు రాజకీయ నిర్ణయాలను, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 5.
ప్రవర్తనావాదం.
జవాబు.
సామాన్యశాస్త్రల్లో జీవరాశుల ప్రవర్తనలను అధ్యయనం చేసే తరహాలో సామాజికశాస్త్రాల్లో సైతం వ్యక్తుల ప్రవర్తనలను అధ్యయనం చేయవలసిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రవర్తనావాద ఉద్యమం ప్రారంభమైంది. చార్లెస్ మెరియం, డేవిడ్ ఈస్టర్, గాబ్రియల్ ఆల్మండ్ వంటి రాజనీతిశాస్త్రవేత్తలు ప్రవర్తనావాద ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఒక రాజకీయ వ్యవస్థలోని పౌరులు ఆ రాజకీయ వ్యవస్థపై ఎటువంటి రాజకీయపరమైన వైఖరులను కలిగి ఉన్నారో శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన ఆవశ్యకతను ప్రవర్తనావాదం నొక్కి చెప్పింది.

ప్రశ్న 6.
ఉత్తర – ప్రవర్తనావాదం.
జవాబు.
రాజనీతిశాస్త్ర అధ్యయన ధృక్పథంలో ప్రవర్తనావాదాన్ని విమర్శిస్తూ ఆవిష్కరించడిన మరో కోణమే ఉత్తర ప్రవర్తనావాదం. ప్రవర్తనావాదం పూర్తి శాస్త్రీయతకు పీటవేయగా, ఉత్తర ప్రవర్తనావాదం విలువలకు – శాస్త్రీయతకు రెండింటికి సమాన ప్రాధాన్యతనిస్తూ రాజకీయ వ్యాసంగాలను విశ్లేషించాలని భావించింది.

ప్రశ్న 7.
మాస్టర్ సైన్స్.
జవాబు.
రాజకీయాలను గురించి అధ్యయనం ప్రాచీన గ్రీకు సమాజాలలో ప్రారంభమైంది. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి గ్రీకు తాత్వికులు వారి కాలం నాటి సమాజాలలోని రాజకీయాలను గురించి చింతన చేశారు.

అయితే, అరిస్టాటిల్ నాటి ప్రభుత్వాలను, రాజకీయ వ్యాసంగాలను హేతుబద్ధంగా తులనాత్మక పద్ధతిలో వివరించినందువల్ల తాను రాజనీతి శాస్త్ర పితామహుడుగా ఆరాధించబడ్డాడు. అరిస్టాటిల్, రాజనీతిశాస్త్రాన్ని “మాస్టర్ సైన్స్”గా అభివర్ణించాడు. అంటే మానవులకు చెందిన సాంఘిక, రాజకీయ సంస్థలను వివరించే శాస్త్రంగా పేర్కొన్నాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 1 రాజనీతిశాస్త్రం – అర్థం, స్వభావం, పరిధి

ప్రశ్న 8.
అరిస్టాటిల్.
జవాబు.
అరిస్టాటిల్ ప్రముఖ గ్రీకు రాజనీతి తత్వవేత్త. ప్లేటో శిష్యుడు. అరిస్టాటిల్ ప్రాచీన గ్రీకు కాలం నాటి ప్రభుత్వాలను, రాజకీయ వ్యాసంగాలను హేతుబద్ధంగా తులనాత్మక పద్ధతిలో వివరించినందువల్ల తాను రాజనీతిశాస్త్ర పితామహుడుగా ఆరాధించబడ్డాడు. అరిస్టాటిల్ రాజనీతిశాస్త్రాన్ని “మాస్టరైసైన్స్”గా అభివర్ణించాడు. అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంధమైన “పాలిటిక్స్”లో రాజ్యము, ప్రభుత్వము గురించి అధ్యయనము చేసే శాస్త్రము రాజనీతిశాస్త్రమని పేర్కొన్నాడు.

TS Inter 1st Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 6th Lesson హక్కులు – విధులు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 6th Lesson హక్కులు – విధులు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
హక్కులను నిర్వచించి పౌర, రాజకీయ హక్కులను వర్ణించండి.
జవాబు.
పరిచయం : రాజనీతిశాస్త్ర అధ్యయనంలో హక్కుల భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సామాజిక జీవనానికి హక్కులనేవి అత్యంత ఆవశ్యకమైనవి. సామాజిక సంక్షేమ సాధనగా హక్కులు పరిగణించబడినాయి. హక్కులను వినియోగించుకోవటం ద్వారానే రాజ్యంలోని పౌర వ్యక్తిత్వం వికసిస్తుంది.

సమాజంలోనూ, రాజ్యంలోనూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి హక్కులు అవసరమవుతాయి. రాజ్యం పౌరులకు ప్రసాధించే హక్కుల ద్వారానే దాని ఔన్నత్యం గుర్తించబడుతుందని హెచ్.జె. లాస్కి పేర్కొన్నాడు. సాధారణంగా ప్రతి రాజ్యం తన పౌరులకు వివిధ రంగాలలో అనేక హక్కులను ప్రసాదిస్తుంది.

హక్కులనేవి రాజ్యం, సమాజం చేత గుర్తించబడే కనీస పరిస్థితులు, అవకాశాలుగా పరిగణించవచ్చు. వాటిని రాజ్యంలోని వివిధ చట్టాలు పరిరక్షిస్తాయి. ఆధునిక రాజ్యాలు తమ రాజ్యాంగం, చట్టాల ద్వారా పౌరుల వికాసానికి అనేక ఏర్పాట్లుగావించాయి. ఇక హక్కులు, బాధ్యతలు అనేవి వ్యక్తుల సంపూర్ణ వికాసానికి అత్యంత ఆవశ్యకమైనవి.

అర్థం :
“హక్కు” అంటే “కలిగి ఉండటము” అని అర్థం. సమాజ సంక్షేమం కోసం, ప్రగతి కోసం వ్యక్తులందరూ పాటించవలసిన బాధ్యతల రూపమే హక్కులు. హక్కులు మానవునకు స్వేచ్ఛను ఇచ్చి, వికాసానికి తోడ్పడతాయి. హక్కుల నిర్వచనాలు : రాజనీతి శాస్త్రవేత్తలు హక్కు అనే పదాన్ని అనేక విధాలుగా నిర్వచించారు. వాటిలో కొన్నింటిని కింద వివరించడమైనది.

  1. ఎర్నెస్ట్ బార్కర్ : “వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే ” హక్కులు”.
  2. బొసాంకే : “సమాజం చేత గుర్తించబడి, రాజ్యం చేత అమలులో ఉంచబడే అధికారాలే హక్కులు”.
  3. టి.హెచ్. గ్రీన్ : “ఉమ్మడి శ్రేయస్సుకు దోహదపడే వాటిని కోరేందుకు, గుర్తించేందుకు ఉండే అధికారాలే హక్కులు.” .
  4. హెచ్.జె. లాస్కి : “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా, అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు.”

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

పౌరహక్కులు :
నాగరిక జీవనాన్ని గడపటానికి అవసరమయ్యే హక్కులనే పౌరహక్కులు అంటారు. అన్ని రాజ్యాలు తమ ప్రజలకు ఈ హక్కులను ఇస్తున్నాయి. ఈ హక్కులపై అనేక మినహాయింపులు ఉంటాయి. ముఖ్యమైన పౌర హక్కులు ఏమనగా :

1. జీవించే హక్కు (Right to Life) :
జీవించే హక్కు అనేది పౌరహక్కులలో అత్యంత ముఖ్యమైనదని టి. హెచ్. గ్రీన్ భావించాడు. ఈ హక్కు వ్యక్తుల జీవనానికి భద్రతను కల్పిస్తుంది. ఈ హక్కు లేనట్లయితే వ్యక్తులు తమ జీవనాన్ని గడిపేందుకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ప్రతి వ్యక్తికీ ఈ హక్కు ఎంతో విలువైనదే కాకుండా, సమాజం, రాజ్యం మొత్తానికి కూడా ఎంత విలువైనదనే ప్రమేయంపై ఈ హక్కు ఆధారపడి ఉంది. అందువల్ల ఈ హక్కు ద్వారా రాజ్యం వ్యక్తుల జీవనానికి ఎంతగానో రక్షణను కల్పిస్తుంది.

అయితే ఈ హక్కును అనుభవించే విషయంలో వ్యక్తులపై రాజ్యం కొన్ని సహేతుకమైన ఆంక్షలను విధించవచ్చు. ఈ సందర్భంలో రాజ్యం ఏ వ్యక్తినైనా జాతి ప్రయోజనం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ఆజ్ఞాపించవచ్చు. ఈ హక్కులలో ఆత్మరక్షణ హక్కు కూడా ఇమిడి ఉంది.

2. స్వేచ్ఛా హక్కు (Right to Liberty) :
స్వేచ్ఛా హక్కు వ్యక్తులకు అనేక రంగాలలో స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ హక్కు వారి జీవనాన్ని అర్థవంతం చేస్తుంది. వ్యక్తులు అనేక రంగాలలో వారి వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకొనేందుకు. వీలు కల్పిస్తుంది. సంచరించే హక్కు, వాక్ స్వాతంత్ర్యపు హక్కు, భావవ్యక్తీకరణ హక్కు, ఆలోచనా హక్కు, నివసించే హక్కు మొదలైనవి ఇందులో ఉన్నాయి.

3. సమానత్వ హక్కు (Right to Equality) :
సమానత్వ హక్కు అంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే. అని అర్థంగా చెప్పవచ్చు. వ్యక్తుల మధ్య కులం, వర్ణం, పుట్టుక, మతం, ప్రాంతం, సంపద, విద్యలాంటి పలురకాల విచక్షణలను ఈ హక్కు నిషేధిస్తుంది. అందరినీ ఒకే రకంగా ఆదరిస్తుంది. రాజ్యంలో చట్టాలను ఒకే విధంగా వర్తించుటకు ఈ హక్కు ఉద్దేశించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో వ్యక్తులందరికీ సమానమైన అవకాశాలను ఈ హక్కు కల్పిస్తుంది.

4. ఆస్తి హక్కు (Right to Property) :
ఈ హక్కు ప్రకారం ప్రతి వ్యక్తి ఆస్తిని సంపాదించేందుకు, అనుభవించేందుకు, దానధర్మాలకు వినియోగించుకొనేందుకు లేదా వారసత్వంగా పొందేందుకు వీలుంటుంది. ప్రతి వ్యక్తి ఉన్నత ప్రమాణాలతో జీవనాన్ని కొనసాగించేందుకు ఈ హక్కు అవసరమవుతుంది. అలాగే వ్యక్తి మూర్తిమత్వ వికాసానికి ఇది ఎంతో కీలకమైనది.

5. కుటుంబ హక్కు (Right to Family) :
కుటుంబం అనేది ఒక ప్రాథమిక, సామాజిక వ్యవస్థ. కుటుంబ హక్కు సమాజంలో వ్యక్తులకు కుటుంబపరమైన సంబంధాలను ఏర్పరచుకొనేందుకు వీలు కల్పిస్తుంది. పర్యవసానంగా ఈ హక్కు ద్వారా వ్యక్తులు తమకు నచ్చినవారిని వివాహం చేసుకొనే స్వేచ్ఛను కలిగి ఉంటారు. అలాగే సంతానాన్ని పొందేందుకు, పిల్లలను పోషించేందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

అయితే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ హక్కుపై రాజ్యం కొన్ని నిర్దిష్టమైన ఆంక్షలను విధించవచ్చు. ఉదాహరణకి ఇటీవలి కాలం వరకు చైనా ప్రభుత్వం అక్కడి పౌరుల కుటుంబసభ్యుల సంఖ్యపై కఠిన ఆంక్షలను విధించింది. ఇప్పుడిప్పుడే ఈ రాజ్యం పైన పేర్కొన్న విషయంలో కొన్ని సవరణలు చేస్తున్నది.

6. మత హక్కు (Right to Religion) :
ఈ హక్కు ప్రకారం వ్యక్తులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించేందుకు, ప్రచారం చేసేందుకు, ప్రభోదించేందుకు స్వేచ్ఛను కలిగి ఉంటారు. వారు ఈ విషయంలో సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా లౌకికరాజ్యాలు తమ పౌరులకు విశేషమైన మత స్వాతంత్ర్యాలను ప్రసాదించాయి.

7. ఒప్పందం హక్కు (Right to Contract) :
ఒప్పందం హక్కు ప్రకారం వ్యక్తులు తమ జీవనం, ఆస్తి, ఉపాధి వంటి విషయాలలో చట్టబద్ధమైన ఏర్పాట్లను చేసుకొనేందుకు లేదా ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు స్వాతంత్య్రాన్ని కలిగి ఉంటారు. ఈ విషయంలో ఈ హక్కు ప్రకారం సంబంధిత వ్యక్తులు స్పష్టమైన నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రాజ్యం వ్యక్తుల శ్రేయస్సును పెంపొందించే ఒప్పందాలను మాత్రమే ఈ సందర్భంలో గుర్తిస్తుంది.

8. విద్యా హక్కు (Right to Education) :
ఆధునిక కాలంలో విద్యా హక్కు అనేది ప్రతి వ్యక్తికి అత్యంత ఆవశ్యకమైనదిగా పరిగణించబడింది. విద్యలేనివారు, అమాయకులు ప్రభుత్వ వ్యవహారాలలో చురుకుగా పాల్గొనలేరు. అలాగే నిరక్షరాస్యులు తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోలేరు.

అందుచేత విద్య, అక్షరాస్యత అనేవి సమాజంలో వివిధ సామాజిక సమస్యలను అవగాహన చేసుకొనేందుకు, ప్రభుత్వ విధానాలను తెలుసుకొనేందుకు దోహదపడతాయి. ప్రజాస్వామ్య రాజ్యాలలో ఈ హక్కు ప్రతి పౌరుడికి కనీసస్థాయి విద్యను అందించేందుకు హామీ ఇస్తుంది.

9. సంస్థలు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు (Right to form Associations and Unions) :
ఈ హక్కు ప్రకారం వ్యక్తులు తమకు ఇష్టమైన సంస్థలు, సంఘాలను నెలకొల్పుకొని, కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను నెరవేర్చుకొనేందుకు వీలుంటుంది.

వ్యక్తులు ఈ హక్కును వినియోగించుకోవటం ద్వారా తమ అభీష్టం ప్రకారం వివిధ సంస్థలు, సంఘాలలో సభ్యులుగా చేరేందుకు, కొనసాగేందుకు మరియు సభ్యత్వాలను ఉపసంహరించుకొనేందుకు పూర్తి స్వేచ్ఛను ఉంటారు. అయితే ఒకవేళ వ్యక్తులు జాతి శ్రేయస్సును విస్మరించి సంస్థలను స్థాపించి నిర్వహించినచో, రాజ్యం వారి చర్యలపై కొన్ని ఆంక్షలను విధించవచ్చు.

10. రాజ్యాంగ పరిహారపు హక్కు (Right to Constitutional Remedies) :
వ్యక్తి హక్కుల పరిరక్షణకు ఈ హక్కు అత్యంత ఆవశ్యకమైనది. ఈ హక్కు లేనిచో పౌరహక్కులనేవి అర్థరహితమవుతాయి. ఈ హక్కు ప్రకారం ఇతరుల జోక్యం లేదా దాడి ఫలితంగా నష్టం పొందిన వ్యక్తి తన స్వాతంత్ర్యాన్ని కోల్పోయినచో, తగిన ఉపశమనాన్ని, న్యాయాన్ని న్యాయస్థానాల ద్వారా పొందుతాడు.

ఈ సందర్భంలో ఉన్నత న్యాయస్థానాలు, అనేక ఆజ్ఞలను (writs) జారీ చేస్తాయి. అటువంటి వాటిలో హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో వారంటో, సెర్షియోరరి లాంటివి ఉన్నాయి.

రాజకీయ హక్కులు : ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనటానికి అవకాశం కల్పించబడింది. ఈ అవకాశాలనే రాజకీయ హక్కులు అందురు. రాజకీయ హక్కులు ముఖ్యంగా 5 అవి :

1. ఓటు హక్కు (Right to Vote) :
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో పౌరులు అనుభవించే అతి ముఖ్యమైన రాజకీయ హక్కు ఓటు హక్కు. వయోజన పౌరులు ఈ హక్కును వివిధ శాసన నిర్మాణ సంస్థలలో తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు శక్తివంతమైన ఆయుధంగా వినియోగిస్తారు.

ఈ హక్కు వారిని నిజమైన సార్వభౌములుగా రూపొందిస్తుంది. వయోజన పౌరులందరూ వర్ణం, పుట్టుక, భాష, తెగ, మతం, ప్రాంతం వంటి తారతమ్యాలు లేకుండా ఈ హక్కును కలిగి ఉంటారు. అయితే విదేశీయులు, మైనర్లకు ఈ హక్కు వర్తించదు.

2. ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు (Right to Contest in Elections) :
రాజ్యంలో పౌరులు వివిధ శాసన నిర్మాణ సంస్థలకు అభ్యర్థులుగా పోటీచేసేందుకు ఈ హక్కు అధికారమిస్తుంది. రాజకీయ సామర్థ్యం ఆసక్తి, శక్తివంతమైన నాయకత్వం వంటి లక్షణాలు గల పౌరులు రాజ్యానికి సంబంధించిన రాజకీయ యంత్రాంగ నిర్వహణలలో చురుకుగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో ఈ హక్కు పౌరులలో విశేషమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, ఆసక్తిని పెంపొందిస్తుంది. ఈ హక్కు ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది.

3. ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు (Right to Hold Public Offices) :
పౌరులు వివిధ రకాల ప్రభుత్వ పదవులను చేపట్టి, నిర్వహించేందుకు ఈ హక్కు అనేక అవకాశాలను కల్పిస్తుంది ఈ హక్కు ప్రకారం ఏ ఒక్క పౌరుడు ఇతరులతో పోల్చినచో ఎటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలను కానీ, మినహాయింపులు కానీ పొందేందుకు వీలులేదు. ప్రభుత్వాధికారాన్ని ఎంతో హుందాగా నిర్వహించేందుకు ఈ హక్కు పౌరులకు సహాయకారిగా ఉంటుంది.

4. విజ్ఞాపన హక్కు (Right to Petition) :
పౌరులు తమ అవసరాలు లేదా సమస్యలను ప్రభుత్వ దృష్టికి విజ్ఞప్తుల ద్వారా తెచ్చేందుకు ఈ హక్కు దోహదపడుతుంది. ఆధునిక రాజ్యంలో ఈ హక్కు ఎంతో ప్రాధాన్యత గల రాజకీయ హక్కుగా పరిగణించబడింది.

ఈ హక్కు ద్వారా పౌరులు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, తగిన పరిష్కారాలను పొందుతారు. అలాగే ప్రభుత్వాధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని సకాలంలో పరిష్కరించేటట్లు ఈ హక్కు సహాయపడుతుంది.

5. విమర్శించే హక్కు (Right to Criticism) :
ఈ హక్కు ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు, కార్యక్రమాలను విమర్శించేందుకు పౌరులకు అవకాశం ఇస్తుంది. అలాగే వివిధ స్థాయిలలో నాయకులు, పరిపాలన సిబ్బంది పాల్పడే అవకతవకలను బహిర్గతం చేసేందుకు ఇది తోడ్పడుతుంది.

అంతేకాకుండా కాలానుగుణంగా ప్రభుత్వం అనుసరించే విధానాలపై, పౌరులు సహేతుకమైన, నిర్మాణాత్మకమైన విమర్శలను చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ హక్కు అంతిమంగా పరిపాలనాధికారులు, విధాన రూపకర్తలు తమ విద్యుక్త ధర్మాలను ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా నిర్వహించేటట్లు చూస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 2.
హక్కుల పరిరక్షణ అంశాలను గుర్తించండి.
జవాబు.
పరిచయం :
రాజనీతిశాస్త్ర అధ్యయనంలో హక్కుల భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సామాజిక జీవనానికి హక్కులనేవి అత్యంత ఆవశ్యకమైనవి. సామాజిక సంక్షేమ సాధనగా హక్కులు పరిగణించబడినాయి. హక్కులను వినియోగించుకోవటం ద్వారానే రాజ్యంలోని పౌర వ్యక్తిత్వం వికసిస్తుంది.

సమాజంలోనూ, రాజ్యంలోనూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి హక్కులు అవసరమవుతాయి. రాజ్యం పౌరులకు ప్రసాదించే హక్కుల ద్వారానే దాని ఔన్నత్యం గుర్తించబడుతుందని హెచ్.జె. లాస్కీ పేర్కొన్నాడు. సాధారణంగా ప్రతి రాజ్యం తన పౌరులకు వివిధ రంగాలలో అనేక హక్కులను ప్రసాదిస్తుంది.

హక్కులనేవి రాజ్యం, సమాజంచేత గుర్తించబడే కనీస పరిస్థితులు, అవకాశాలుగా పరిగణించవచ్చు. వాటిని రాజ్యంలోని వివిధ చట్టాలు పరిరక్షిస్తాయి. ఆధునిక రాజ్యాలు తమ రాజ్యాంగం, చట్టాల ద్వారా పౌరుల వికాసానికి అనేక ఏర్పాట్లుగావించాయి. ఇక హక్కులు, బాధ్యతలు అనేవి వ్యక్తుల సంపూర్ణ వికాసానికి అత్యంత ఆవశ్యకమైనవి.

అర్థం : “హక్కు” అంటే “కలిగి ఉండటము” అని అర్థం. సమాజ సంక్షేమం కోసం, ప్రగతి కోసం వ్యక్తులందరూ పాటించవలసిన బాధ్యతల రూపమే హక్కులు. హక్కులు మానవునకు స్వేచ్ఛను ఇచ్చి, వికాసానికి తోడ్పడతాయి.

హక్కుల నిర్వచనాలు :
రాజనీతి శాస్త్రవేత్తలు హక్కు అనే పదాన్ని అనేక విధాలుగా నిర్వచించారు. వాటిలో కొన్నింటిని కింద వివరించడమైనది.

  1. ఎర్నెస్ట్ బార్కర్ : “వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే ” హక్కులు”.
  2. బొసాంకే : “సమాజం చేత గుర్తించబడి, రాజ్యంచేత అమలులో ఉంచబడే అధికారాలే హక్కులు”.
  3. టి.హెచ్. గ్రీన్: “ఉమ్మడి శ్రేయస్సుకు దోహదపడే వాటిని కోరేందుకు, గుర్తించేందుకు ఉండే అధికారాలే హక్కులు.” .
  4. హెచ్.జె. లాస్కి : “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు.”

హక్కుల పరిరక్షణలు (Safeguards of Rights) :
హక్కులను రాజ్యం ప్రతిరక్షించినప్పుడే వ్యక్తులు వాటిని అనుభవించగలుగుతారు. ఈ సందర్భంలో కింది అంశాలు హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి.

1. ప్రజాస్వామ్య పాలన (Democratic Rule) :
ప్రజాస్వామ్య పాలన ప్రజల హక్కులను పరిరక్షించుటలో ఎంతగానో కృషిచేస్తుంది. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యాలలోనే తమ హక్కులను స్వేచ్ఛగా సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ వారి హక్కులకు రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన నియమనిబంధనల ద్వారా రక్షణలు కల్పిస్తుంది.

2. లిఖిత, దృఢ రాజ్యాంగం (Written and Rigid Constitution) :
లిఖిత రాజ్యాంగం ప్రభుత్వ అధికారాలు, కర్తవ్యాలను స్పష్టంగా నిర్వచిస్తుంది. అలాగే ఇది ప్రభుత్వాధికారానికి గల వివిధ పరిమితులను వివరిస్తుంది. అంతేకాకుండా ప్రజల హక్కులకు హామీ ఇస్తుంది. ఈ రాజ్యాంగాన్ని చిన్న కారణాలతో పాలకులు, శాసనసభ్యులు సవరించేందుకు అనుమతించదు.

3. ప్రాథమిక హక్కులను పొందుపరచుట (Incorporation of Fundamental Rights) :
ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా వ్యక్తుల హక్కులను ప్రభుత్వం అతిక్రమించకుండా చూడవచ్చు. ఇటువంటి ఏర్పాటు వ్యక్తుల హక్కులను ఎంతగానో కాపాడుతుంది.

4. అధికారాల వేర్పాటు (Separation of Powers) :
హక్కుల పరిరక్షణకు అధికారాల వేర్పాటు ఎంతో అవసరం. అధికారాలన్నీ ప్రభుత్వంలోని మూడు శాఖల మధ్య ఏర్పాటు చేసినప్పుడే వ్యక్తి స్వేచ్ఛ కాపాడబడుతుంది. అప్పుడు మాత్రమే ఒక శాఖ నియంతృత్వాన్ని వేరొక శాఖ నివారించగలుగుతుంది.

5. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers) :
ప్రభుత్వాధికారాలు వికేంద్రీకృతం అయినప్పుడే వ్యక్తులు హక్కులను అనుభవిస్తారు. అందుకోసం అధికారాలన్నీ జాతీయ, ప్రాంతీయ, స్థానిక స్థాయిలలో వికేంద్రీకరణం కావాలి. అటువంటి ఏర్పాటు ప్రాదేశిక లేదా కర్తవ్యాల ప్రాతిపదికపై జరుగుతుంది.

6. సమన్యాయపాలన (Rule of Law) :
చట్టం ముందు అందరూ సమానులే అనే అర్థాన్ని సమన్యాయపాలన సూచిస్తుంది. అంతేకాకుండా పౌరులందరికీ చట్టాలు సమానంగా వర్తిస్తాయని దీని అర్థం. చట్టం పౌరుల మధ్య ప్రాంతం, కులం, మతం, వర్ణం, తెగ వంటి తారతమ్యాలను చూపదు. అప్పుడు మాత్రమే వ్యక్తులందరూ హక్కులను అనుభవిస్తారు.

7. స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయశాఖ (Independent and Impartial Judiciary) :
వ్యక్తుల పరిరక్షణకు తోడ్పడే మరో ముఖ్య అంశమే స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయశాఖ. ఉన్నత న్యాయస్థానాలలోని న్యాయమూర్తులు నిష్పక్షపాతంతో, స్వతంత్ర వైఖరితో తీర్పులను అందించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియలో భాగంగా వారు వ్యక్తుల హక్కులను తక్షణమే పరిరక్షించేందుకై కొన్ని రిట్లను (Writs) మంజూరు చేస్తారు.

8. స్వతంత్ర పత్రికలు (Independent Press) :
వ్యక్తుల హక్కుల పరిరక్షణకు దోహదపడే మరొక అంశమే స్వతంత్ర పత్రికలు. స్వతంత్ర దృక్పథం గల పత్రికలు వార్తలు, అభిప్రాయాలను నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు తెలియజేస్తాయి. ఈ విషయంలో రాజ్యం పత్రికలపై ఎటువంటి ఆంక్షలను విధించేందుకు లేదా పత్రికలను అడ్డుకునేందుకు ప్రయత్నించరాదు. అప్పుడు మాత్రమే వ్యక్తులు తమ హక్కులను సంపూర్ణంగా అనుభవిస్తారు.

9. సాంఘిక, ఆర్థిక సమానత్వాలు (Social and Economic Equalities) :
సాంఘిక, ఆర్థిక సమానత్వాలు అనేవి వ్యక్తులకు హక్కులను అనుభవించేందుకు ఎంతగానో అవసరమవుతాయి. రాజ్యంలో సాంఘిక, ఆర్థిక సమానత్వాలు నెలకొన్నప్పుడే వ్యక్తులు తమ హక్కులను సక్రమంగా, సంవర్థక రీతిలో అనుభవిస్తారు. కులతత్త్వం, మతతత్త్వం, భాషాతత్త్వం వంటి సాంఘిక అనర్థాలు, ఆర్థిక అసమానతలు, దోపిడీని పెంచినప్పుడు సాంఘిక, ఆర్థిక సమానత్వాలను సాధించలేము.

10. నిరంతర అప్రమత్తత (Eternal Vigilance) :
వ్యక్తుల హక్కులను పరిరక్షించటంలో నిరంతర అప్రమత్తత అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. వ్యక్తులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలపట్ల అప్రమత్తతతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం కనక నియంతృత్వ ధోరణులను అనుసరిస్తే, వాటిని ప్రజాస్వామ్య, రాజ్యాంగ పద్ధతుల ద్వారా వ్యతిరేకించాలి.

వారు ఎట్టి పరిస్థితులలోనూ అధికారం కోసం ఆరాటపడే స్వార్థపరులైన నాయకులను ప్రోత్సహించరాదు. అంతేకాకుండా న్యాయసమీక్ష (Judicial Review), పునరాయనం (Recall), దృఢమైన ప్రతిపక్షం లాంటి ఇతర అంశాలు కూడా వ్యక్తుల హక్కులను పరిరక్షించేందుకు దోహదపడతాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 3.
మానవ హక్కులపై ఒక వ్యాసాన్ని రాయండి.
జవాబు.
భావం : మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవే మానవ హక్కులు. మానవులందరూ ఈ ” హక్కులను కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గ తారతమ్యాలు లేకుండా అనుభవిస్తారు. ప్రజాస్వామ్య రాజ్యాలలోని రాజ్యాంగ, సాధారణ చట్టాలు ఇటువంటి హక్కులను గుర్తిస్తాయి. అలాగే ఈ హక్కులను ప్రజలకు అందించేందుకై ప్రజాస్వామ్య రాజ్యాలలోని వివిధ ప్రభుత్వాలు అనేక చర్యలను తీసుకొంటాయి.

మానవ హక్కుల ఆవిర్భావం :
ఒకానొక సమయంలో ప్రాచీన, మధ్యయుగ సమాజాలలో ఎవరో కొన్ని వర్గాలు మాత్రమే మానవ హక్కులను అనుభవించేవారు. దాంతో మెజార్టీ ప్రజలు ఆ హక్కులను నోచుకోలేకపోయారు. వారు హక్కుల సాధనకై అవిశ్రాంతంగా ప్రయత్నించారు.

మానవ హక్కుల సాధనకై ప్రయత్నాలు జరిపిన వారిలో గ్రీకు పాలకులను మొదటిసారిగా పేర్కొనవచ్చు. గ్రీకు పాలకులు మానవ వ్యక్తిత్వ వికాసానికి ఆరోగ్యం, దేహదారుఢ్యం తప్పనిసరిగా ఉండాలని గుర్తించారు. అలాగే జాతి అభివృద్ధిలో మానవ హక్కులు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయనే విషయాన్ని పేర్కొన్నారు. అయితే దురదృష్టం కొద్దీ కొందరు పాలకులు అణచివేత, స్వార్థబుద్ధి కారణంగా ప్రజలలో మతతత్త్వం బాగా వ్యాప్తి చెందింది. ఈ పరిస్థితులలో మానవ హక్కులు కనుమరుగయ్యాయి.

మానవ హక్కుల సాధనలో ఇంగ్లాండులోని మాగ్నా కార్టా (Magna Carta) అనేది మానవ హక్కుల సాధనలో చేసిన మొదటి ప్రయత్నంగా చరిత్రకారులు భావించారు. మాగ్నా కార్టా ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను వీలు కల్పించింది. చరిత్రకారులు దానిని బ్రిటీషు రాజ్యంగపు ‘బైబిల్’గా వర్ణించారు.

మానవ హక్కుల ఆశయాలు :

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ్ఛ.
  4. భయం నుండి విముక్తి.
  5. రక్షణ పొందే స్వేచ్ఛ.
  6. అన్యాయానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ.
  7. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వాతంత్య్రం.
  8. సంస్థలను ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
  9. గౌరవప్రదంగా వ్యక్తి తన కార్యకలాపాలు నిర్వర్తించుకొనే స్వేచ్ఛ.
  10. దౌర్జన్యాన్ని నిరోధించి వ్యతిరేకించే స్వేచ్ఛ.

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1995 – 2005 దశకాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దిగా ప్రకటించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా నివసించే ప్రజలందరికీ మానవ హక్కులను ప్రసాదించే ఉద్దేశంతో ఈ కాలంలో అనేక చర్యలను గైకొన్నది.

మానవ హక్కుల వర్గీకరణ :
మానవ హక్కులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి (1) పౌర, రాజకీయ హక్కులు (ii) సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు. సమాజంలో పౌరహక్కులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, వ్యక్తుల భద్రత హక్కు, బానిసత్వం లేదా వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందే హక్కు వంటి అనేక హక్కులు పౌరహక్కులలో పేర్కొనడమైంది.

చట్టం నుంచి సమానంగా రక్షణ పొందేహక్కు, బలవంతంగా నిర్భందించడం నుంచి రక్షణ పొందే హక్కు, నిష్పాక్షికంగా విచారణ పొందే హక్కు ఆస్తి హక్కు, వివాహపు హక్కు వంటి ఇతర హక్కులు కూడా పౌరహక్కులలో ఇమిడి ఉన్నాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
హక్కుల లక్షణాలేవి ?
జవాబు.
హక్కులు-నిర్వచనం :
“హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా ఏ ఒక్కరూ సాధారణంగా అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు” అని హెచ్.జె. లాస్కి పేర్కొన్నారు.

హక్కుల లక్షణాలు (Features of Rights) : హక్కులు కింద పేర్కొన్న లక్షణాలను కలిగి ఉంటాయి.

1. సమాజంలోనే సాధ్యం (Possible only in Society) :
హక్కులు సమాజంలోనే ఉద్భవిస్తాయి. అవి మానవుల సామాజిక జీవనానికి ప్రతీకగా ఉంటాయి. సమాజం వెలుపల అవి ఉండవు.

2. సామాజిక స్వభావం (Social Nature) :
హక్కులను వ్యక్తుల కోర్కెలుగా భావించవచ్చు. అటువంటి కోర్కెలు సమాజంలోనే నెరవేరుతాయి. రాజ్యం వాటిని గుర్తించి పెంపొందించేందుకు దోహదపడుతుంది. కాబట్టి హక్కులనేవి సామాజిక స్వభావమైనవని చెప్పవచ్చు.

3. ప్రకృతిసిద్ధమైనవి (Natural) :
హక్కులనేవి మానవుల సామాజిక ప్రవృత్తికి నిదర్శనంగా ఉంటాయి. ఈ విషయాన్ని సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు ప్రకటించారు. వారి భావాలను ఆధునిక కాలంలో కొంతమేరకు ఆమోదించడమైనది.

4. రాజ్యంచే అమలై రక్షించబడటం (Enforced and Protected by state) :
హక్కులనేవి రాజ్యంచేత అమలుచేయబడి రక్షించబడతాయి. రాజ్యంలోని వివిధ ఉన్నత న్యాయసంస్థలు వాటికి సంరక్షకులుగా వ్యవహరిస్తాయి. వేరొక రకంగా చెప్పాలంటే ఉన్నత న్యాయస్థానాలు హక్కులను కాపాడతాయి. మరొక విషయం ఏమిటంటే హక్కులను ఒక్క ప్రజాస్వామ్య రాజ్యాలలోని పౌరులు మాత్రమే అనుభవిస్తారు.

5. నిరపేక్షమైనవి కావు (Not Absolute):
హక్కులు నిరపేక్షమైనవి కావు. వాటి వినియోగంపై ‘రాజ్యం, సమాజం కొన్ని ఆంక్షలను విధిస్తుంది. అటువంటి ఆంక్షలు సమాజంలో శాంతి భద్రతల నిర్వహణకు ఉద్దేశించినవి. ‘అంతేకాకుండా హక్కులనేవి సామాజిక శ్రేయస్సు, భద్రతలను పెంపొందించేందుకు దోహదపడతాయని చెప్పవచ్చు.

6. సంబంధిత బాధ్యతలు (Corresponding Responsibilities) :
హక్కులు, బాధ్యతలు ఒకదానికొకటి పరస్పర ఆధారాలుగా ఉంటాయి. ప్రతి హక్కు ఒక బాధ్యతను కలిగి ఉంటుంది. అందుచేత సమాజంలో నివసించే ప్రతి వ్యక్తి తనకు గల హక్కులనే తోటివారు కూడా కలిగి ఉంటారని గ్రహించాలి.

అట్లాగే తోటివారు కూడా వారి హక్కులను వినియోగించుకోవటంలో ప్రతి వ్యక్తికి తగిన సహకారాన్ని అందించాలి. హక్కులు లేని బాధ్యతలు లేదా బాధ్యతలు ‘లేని హక్కులు అనేవి నాగరిక సమాజంలో ఉండవు. హక్కులు, బాధ్యతలు రెండూ వ్యక్తుల ప్రశాంత సామాజిక జీవనానికి ఎంతగానో ఆవశ్యకమైనవి.

7. విశ్వవ్యాప్తమైనవి (Universal) :
హక్కులనేవి విశ్వవ్యాప్తమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి అందరికి వర్తిస్తాయి. వీటిని ప్రజలందరు ఎటువంటి తారతమ్యాలు లేకుండా అనుభవిస్తారు.

8. మార్పులకు అవకాశం (Scope for changes) :
హక్కులనేవి కాలానుగుణంగా ప్రజల అవసరాలను బట్టి మారుతుంటాయి. అట్లాగే దేశ కాలపరిస్థితులలో వచ్చే మార్పులనుబట్టి అభివృద్ధి చెందుతాయి. గతంలో లేని కొన్ని హక్కులు వర్తమాన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు వ్యక్తుల హక్కులపై విశేషమైన ప్రభావాన్ని చూపుతాయి.

9. రాజ్యం కంటే ముందుగా ఉండటం (Precede the State) :
చరిత్ర ఫలితాలే హక్కులు. హక్కులు కాలక్రమేణా ఒక క్రమానుగత రీతిలో ఆవిర్భవించాయని విశ్వసించారు. రాజ్యం ఆవిర్భావానికి ముందే హక్కులు ఉన్నాయి. అయితే ఆ తరువాత వాటిని రాజ్యం గుర్తించింది.

10. ఉమ్మడి శ్రేయస్సు (Common Good) :
హక్కులనేవి ఎల్లప్పుడూ ఉమ్మడి శ్రేయస్సును పెంపొందించేందుకై ఏర్పడి వికసించాయి. సమాజం, రాజ్యం చేత గుర్తింపు పొంది, ఉమ్మడి శ్రేయస్సును పెంపొందించే హక్కులను మాత్రమే వ్యక్తులు అనుభవిస్తారు. వ్యక్తులు సుఖ సౌభాగ్యవంతమైన జీవనాన్ని గడిపేందుకు హక్కులు అవసరమవుతాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 2.
రాజకీయ హక్కులను వివరించండి.
జవాబు.
ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనటానికి అవకాశం కల్పించబడింది. ఈ అవకాశాలనే రాజకీయ హక్కులు అందురు. రాజకీయ హక్కులు ముఖ్యంగా 5 అవి :

1. ఓటు హక్కు (Right to Vote) :
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో పౌరులు అనుభవించే అతి ముఖ్యమైన రాజకీయ హక్కు ఓటు హక్కు వయోజన పౌరులు ఈ హక్కును వివిధ శాసన నిర్మాణ సంస్థలలో తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు శక్తివంతమైన ఆయుధంగా వినియోగిస్తారు.

ఈ హక్కు వారిని నిజమైన సార్వభౌములుగా రూపొందిస్తుంది. వయోజన పౌరులందరూ వర్ణం, పుట్టుక, భాష, తెగ, మతం, ప్రాంతం వంటి తారతమ్యాలు లేకుండా ఈ హక్కును కలిగి ఉంటారు. అయితే విదేశీయులు, మైనర్లకు ఈ హక్కు వర్తించదు.

2. ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు (Right to Contest in Elections) :
రాజ్యంలో పౌరులు వివిధ శాసన నిర్మాణ సంస్థలకు అభ్యర్థులుగా పోటీచేసేందుకు ఈ హక్కు అధికారమిస్తుంది. రాజకీయ సామర్థ్యం ఆసక్తి, శక్తివంతమైన నాయకత్వం వంటి లక్షణాలు గల పౌరులు రాజ్యానికి సంబంధించిన రాజకీయ యంత్రాంగ నిర్వహణలలో చురుకుగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. దాంతో ఈ హక్కు పౌరులలో విశేషమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, ఆసక్తిని పెంపొందిస్తుంది. ఈ హక్కు ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రధాన ప్రాతిపదికగా ఉంటుంది.

3. ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు (Right to Hold Public Offices) :
పౌరులు వివిధ రకాల ప్రభుత్వ పదవులను చేపట్టి, నిర్వహించేందుకు ఈ హక్కు అనేక అవకాశాలను కల్పిస్తుంది. ఈ హక్కు ప్రకారం ఏ ఒక్క పౌరుడు ఇతరులతో పోల్చినచో ఎటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలను కానీ, మినహాయింపులు కానీ పొందేందుకు వీలులేదు. ప్రభుత్వాధికారాన్ని ఎంతో హుందాగా నిర్వహించేందుకు ఈ హక్కు పౌరులకు సహాయకారిగా ఉంటుంది.

4. విజ్ఞాపన హక్కు (Right to Petition) :
పౌరులు తమ అవసరాలు లేదా సమస్యలను ప్రభుత్వ దృష్టికి విజ్ఞప్తుల ద్వారా తెచ్చేందుకు ఈ హక్కు దోహదపడుతుంది. ఆధునిక రాజ్యంలో ఈ హక్కు ఎంతో ప్రాధాన్యత గల రాజకీయ హక్కుగా పరిగణించబడింది.

ఈ హక్కు ద్వారా పౌరులు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, తగిన పరిష్కారాలను పొందుతారు. అలాగే ప్రభుత్వాధికారులు ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని సకాలంలో పరిష్కరించేటట్లు ఈ హక్కు సహాయపడుతుంది.

5. విమర్శించే హక్కు (Right to Criticism) :
ఈ హక్కు ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధానాలు, కార్యక్రమాలను విమర్శించేందుకు పౌరులకు అవకాశం ఇస్తుంది. అలాగే వివిధ్య స్థాయిలలో నాయకులు, పరిపాలన సిబ్బంది పాల్పడే అవకతవకలను బహిర్గతం చేసేందుకు ఇది తోడ్పడుతుంది.

అంతేకాకుండా కాలానుగుణంగా ప్రభుత్వం అనుసరించే విధానాలపై పౌరులు సహేతుకమైన, నిర్మాణాత్మకమైన విమర్శలను చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ హక్కు అంతిమంగా పరిపాలనాధికారులు, విధాన రూపకర్తలు తమ విద్యుక్త ధర్మాలను ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా నిర్వహించేటట్లు చూస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 3.
ముఖ్యమైన కొన్ని పౌర, రాజకీయ హక్కులను వివరించండి.
జవాబు.
1. పౌర హక్కులు :
సామాజిక జీవనాన్ని సంతోషం, హుందాతనంతో గడిపేందుకు వ్యక్తులకు అవసరమైన కనీస పరిస్థితులను కల్పించేందుకు పౌర హక్కులను కల్పించడం జరిగింది. ఈ హక్కులు నాగరిక సమాజానికి అత్యంత ఆవశ్యకమైనవి. పౌరహక్కులు ప్రజాస్వామ్యం కల్పించిన ఒక బహుమతిగా భావించాలి. ఈ హక్కులను పౌరులందరికీ కల్పించడంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పౌరులకు నాగరికమైన సామాజిక జీవనం కొనసాగించడానికి పౌర హక్కులు అవకాశాలను కల్పించాయి.

సమాజంలోని మానవులకు ఈ పౌర హక్కులు కల్పించడంతో మౌలికమైన అవసరాలు తీర్చినట్లవుతుంది. జీవించే హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, మతహక్కు, ఆస్తిహక్కు, విద్యాహక్కు, సమానత్వపు హక్కు, కుటుంబ హక్కు వంటివి పౌరహక్కులలో కొన్నింటికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

2. రాజకీయ హక్కులు :
ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులను మౌలిక అవసరంగా పరిగణించవచ్చు. వాస్తవానికి ఈ హక్కుల సద్వినియోగం తీరుపైనే ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు, విజయం ఆధారపడి ఉంటుంది. రాజకీయ సమాజం ఏర్పాటులో ఈ హక్కులు కీలకపాత్ర పోషిస్తాయి.

ఎందుకంటే ఈ హక్కులు ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనేందుకు అనేక అవకాశాలను కల్పిస్తాయి. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యంలో మాత్రమే ఈ హక్కులను పౌరులు సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన. హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మొదలైనవి రాజకీయ హక్కులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 4.
మానవ హక్కుల వర్గీకరణ, లక్ష్యాలను రాయండి.
జవాబు.
మానవ హక్కుల ఆశయాలు (Objectives of Human Rights): మానవ హక్కుల ఆశయాలను కింది విధంగా పేర్కొనవచ్చు.

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ
  4. భయం నుండి విముక్తి.
  5. రక్షణను పొందే స్వేచ్ఛ.
  6. అన్యాయానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ.
  7. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వాతంత్య్రం.
  8. సంస్థలను ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
  9. గౌరవప్రదంగా వ్యక్తి తన కార్యకలాపాలు నిర్వర్తించుకొనే స్వేచ్ఛ.
  10. దౌర్జన్యాన్ని నిరోధించి వ్యతిరేకించే స్వేచ్ఛ.

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1995-2005 దశకాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల దశాబ్దిగా ప్రకటించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా నివసించే ప్రజలందరికీ మానవ హక్కులను ప్రసాదించే ఉద్దేశంతో ఈ కాలంలో అనేక చర్యలను గైకొన్నది.

మానవ హక్కుల వర్గీకరణ :
మానవ హక్కులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  1. పౌర, రాజకీయ హక్కులు
  2. సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు.

1.A. పౌరహక్కులు : సమాజంలో పౌరహక్కులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. పౌరహక్కులకు ఉదాహరణలు.

  1. జీవించే హక్కు
  2. స్వేచ్ఛ హక్కు
  3. వ్యక్తుల భద్రత హక్కు.
  4. వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందే హక్కు
  5. చట్టం నుంచి సమానంగా రక్షణ పొందే హక్కు
  6. బలవంతంగా నిర్భందించడం నుంచి రక్షణ పొందే హక్కు
  7. నిష్పాక్షికంగా విచారణ పొందే హక్కు
  8. ఆస్తి హక్కు
  9. వివాహపు హక్కు
  10.  వాక్ స్వాతంత్య్రపు హక్కు.
  11. భావ ప్రకటన హక్కు
  12. సంస్థలను, సంఘాలను స్థాపించుకునే హక్కు
  13. సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కు
  14. స్వేచ్ఛగా సంచరించే హక్కు.

1.B. రాజకీయ హక్కులు :

  1. ఓటు హక్కు
  2. ఎన్నికలలో పోటీచేసే హక్కు
  3.  అధికారం పొందే హక్కు
  4. విమర్శించే హక్కు
  5. విజ్ఞాపన హక్కు

2.A. సాంఘిక హక్కులు:

  1.  విద్యా హక్కు
  2. ఆరోగ్య హక్కు
  3. వినోదపు హక్కు మొదలైనవి

2.B. ఆర్థిక హక్కులు :

  1. పని హక్కు
  2. సమానమైన పనికి సమానమైన వేతనం పొందే హక్కు
  3. కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు
  4. సంతృప్తికరమైన జీవనస్థాయిని కలిగి ఉండే హక్కు

2.C. సాంస్కృతిక హక్కులు:

  1. నాగరికత
  2. కళలు
  3. సంస్కృతిని గౌరవించడం వంటి అంశాలు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 5.
వివిధ రకాలైన విధులను చర్చించండి.
జవాబు.
బాధ్యతలు :
సమాజంలో నివశించే వ్యక్తులు ఇతర వ్యక్తుల పట్ల నిర్వర్తించే అంశాలనే బాధ్యతలు అంటారు. బాధ్యతలు అనేవి ‘ఇతరుల పట్ల ఒక వ్యక్తి కలిగి ఉండే కర్తవ్యం, విధి అని అర్థం.

బాధ్యతల రకాలు (Types of Responsibilities) :
బాధ్యతలు స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి : (i) నైతిక బాధ్యతలు (ii) చట్టబద్ధమైన బాధ్యతలు. ఈ రెండింటిని కింది విధంగా వివరించవచ్చు.

(i) నైతిక బాధ్యతలు (Moral Responsibilities) :
నైతిక బాధ్యతలు అనేవి నైతిక అంశాల ప్రాతిపదికపై వ్యక్తులు నిర్వహించాల్సిన కర్తవ్యాలను సూచిస్తాయి. వీటకి రాజ్యంచేత రూపొందించబడే చట్టాలు మద్దతు ఇవ్వవు, బలపరచవు. ఇవి ప్రజల నైతిక విశ్వాశాలపై ఆధారపడి రూపొందుతాయి.

సమాజంలోని కొన్ని ఆచార సాంప్రదాయాలు వాడుకల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. వీటి ఉల్లంఘన ఎటువంటి శిక్షకు దారితీయదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, అస్వస్థులకు సహాయపడటంలాంటివి నైతిక బాధ్యతలకు కొన్ని ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

(ii) చట్టబద్ధమైన బాధ్యతలు (Legal Responsibilities) :
చట్టబద్ధమైన బాధ్యతలనేవి న్యాయస్థానాలు, చట్టాల మద్దతుతో అమలులోకి వస్తాయి. వీటికి శాసనాత్మక ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి ఎంతో స్పష్టమైనవి, ఖచ్చితమైనవి. ఇవి నిర్బంధమైన, శిక్షాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి.

కాబట్టి వీటిని ఉల్లంఘించినవారు శిక్షకు పాత్రులవుతారు. రాజ్య చట్టాలకు విధేయత చూపటం, పన్నులు చెల్లించటం, శాంతి భద్రతల నిర్వహణలలో అధికారులకు సహాయం అందించటంలాంటివి చట్టబద్దమైన బాధ్యతలలో ముఖ్యమైనవి.

చట్టబద్ధమైన బాధ్యతలు మరలా రెండు రకాలుగా వర్గీకరించబడినాయి. అవి:

  1. సంవర్థక బాధ్యతలు
  2. సంరక్షక బాధ్యతలు.

1. సంవర్థక బాధ్యతలు (Positive Responsibilities) :
సంవర్థక బాధ్యతలనేవి సమాజ ప్రగతి, సంక్షేమాల సాధన, పటిష్టతలకై ఉద్దేశించబడినవి. రాజ్య చట్టాల పట్ల విధేయత, దేశ రక్షణ, పన్నుల చెల్లింపులాంటివి ఈ రకమైన బాధ్యతలకు ఉదాహరణలు చెప్పవచ్చు. ఇటువంటి బాధ్యతలు రాజ్య ఆశయాలను నెరవేర్చడంలో ప్రభుత్వానికి ప్రజలు సహకారాన్ని అందించేందుకు ఉద్దేశించినాయి.

2. సంరక్షక బాధ్యతలు (Negative Responsibilities) :
చట్టం నిషేధించిన కార్యక్రమాలను చేపట్టకుండా వ్యక్తులు దూరంగా ఉండేందుకు పేర్కొన్నవే సంరక్షక బాధ్యతలు. ఈ రకమైన బాధ్యతలు ప్రజలను కొన్ని నిర్ధిష్టమైన కార్యక్రమాలలో పాల్గొనకుండా ఉంచుతాయి. రాజ్యం తరపున ప్రభుత్వం ఈ సందర్భంలో కొన్ని నియమ నిబంధనలను రూపొందించి అమలుచేస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 6.
పౌర, రాజకీయ హక్కుల మధ్య తేడాలను వ్రాయండి.
జవాబు.
1. పౌర హక్కులు :
సామాజిక జీవనాన్ని సంతోషం, హుందాతనంతో గడిపేందుకు వ్యక్తులకు అవసరమైన కనీస పరిస్థితులను కల్పించేందుకు పౌర హక్కులను కల్పించడం జరిగింది. ఈ హక్కులు నాగరిక సమాజానికి అత్యంత ఆవశ్యకమైనవి. పౌరహక్కులు ప్రజాస్వామ్యం కల్పించిన ఒక బహుమతిగా భావించాలి. ఈ హక్కులను పౌరులందరికీ కల్పించడంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పౌరులకు నాగరికమైన సామాజిక జీవనం కొనసాగించడానికి పౌర హక్కులు అవకాశాలను కల్పించాయి.

సమాజంలోని మానవులకు ఈ పౌర హక్కులు కల్పించడంతో మౌలికమైన అవసరాలు తీర్చినట్లవుతుంది. జీవించే హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, మతహక్కు, ఆస్తిహక్కు, విద్యాహక్కు, సమానత్వపు హక్కు, కుటుంబ హక్కు వంటివి పౌరహక్కులలో కొన్నింటికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

2. రాజకీయ హక్కులు :
ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులను మౌలిక అవసరంగా పరిగణించవచ్చు. వాస్తవానికి ఈ హక్కుల సద్వినియోగం తీరుపైనే ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు, విజయం ఆధారపడి ఉంటుంది. రాజకీయ సమాజం ఏర్పాటులో ఈ హక్కులు కీలకపాత్ర పోషిస్తాయి.

ఎందుకంటే ఈ హక్కులు ప్రభుత్వ వ్యవహారాలలో పౌరులు పాల్గొనేందుకు అనేక అవకాశాలను కల్పిస్తాయి. ఒక్క ప్రజాస్వామ్య రాజ్యంలో మాత్రమే ఈ హక్కులను పౌరులు సంపూర్ణంగా అనుభవిస్తారు. ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన. హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మొదలైనవి రాజకీయ హక్కులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.

ప్రశ్న 7.
హక్కులు, విధుల మధ్య సంబంధాన్ని తెల్పండి.
జవాబు.

హక్కులువిధులు
నిర్వచనంరాజ్యం ప్రజలకందించిన అధికారాలు, హక్కులు.ఓ వ్యక్తి అనుభవించే హక్కు ఇతరుల పట్ల అతను నిర్వహించవలసిన విధి అవుతుంది.
చట్టంసాధారణంగా న్యాయస్థానాల ద్వారా హక్కులకు రక్షణ కలిగేలా రాజ్యం చూస్తుంది లేదా సవాలు చేయవచ్చు.పౌర విధులను న్యాయస్థానాల ద్వారా సవాలు చేసే వీలు కాదు.
ఆధారంగావ్యక్తి అనుభవించే అధికారాలు హక్కులు.వ్యక్తిగతంగా విధులు నిర్వర్తించడం, జవాబుదారీతనం ఆధారంగా విధులు ఉంటాయి.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
హక్కులను నిర్వచించండి.
జవాబు.

  1. “వ్యక్తి మూర్తిమత్వ, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన బాహ్యపరమైన పరిస్థితులే హక్కులు” అని బార్కర్ పేర్కొన్నాడు.
  2. “హక్కులనేవి మానవుల సామాజిక జీవనానికి అవసరమైనవి. అవి లేకుండా… ఏ ఒక్కరూ సాధారణంగా, అత్యుత్తమమైన వ్యక్తిగా రూపొందటం సాధ్యం కాదు” అని హెచ్.జె. లాస్కి పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
హక్కులను ‘వర్గీకరించండి.
జవాబు.
హక్కులను విస్తృత ప్రాతిపదికపై మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  1. సహజ హక్కులు
  2. నైతిక హక్కులు
  3. చట్టబద్ధమైన హక్కులు.

చట్టబద్ధమైన హక్కులు మరలా మూడు రకాలుగా వర్గీకరింపబడినాయి. అవి :

  1.  పౌర హక్కులు
  2. రాజకీయ హక్కులు
  3. ఆర్థిక హక్కులు.

ప్రశ్న 3.
పౌర హక్కులేవి ?
జవాబు.
నాగరిక జీవనాన్ని గడపటానికి అవసరమయ్యే హక్కులనే పౌరహక్కులు అంటారు. అన్ని రాజ్యాలు తమ ప్రజలకు ఈ హక్కులను ఇస్తున్నాయి. ఈ హక్కులపై అనేక మినహాయింపులు ఉంటాయి. ముఖ్యమైన పౌరహక్కులు ఏమనగా :

  1. జీవించే హక్కు
  2. స్వేచ్ఛ హక్కు
  3. సమానత్వపు హక్కు
  4. ఆస్తి హక్కు
  5. కుటుంబపు హక్కు
  6. విద్యా హక్కు మొదలైనవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 4.
సహజ హక్కులు.
జవాబు.
మానవులు జన్మతః అనుభవించే హక్కులే సహజ హక్కులుగా పరిగణించడమైనది. నాగరిక సమాజ ఆవిర్భావానికి ముందే ఈ హక్కులను మానవులు అనుభవించారు. సమాజం, రాజ్యం వీటిని గుర్తించి, గౌరవించాయి. సహజ హక్కులు సిద్ధాంత ప్రతిపాదకుడైన జాన్ లాక్ హక్కులనేవి సమాజం, రాజకీయ వ్యవస్థలు ఏర్పడక ముందే ఉన్నాయన్నాడు.

జీవించే హక్కు, స్వాతంత్ర్యాన్ని అనుభవించే హక్కు, ఆస్తి హక్కు వంటివి ప్రధానమైన సహజ హక్కులకు ఉదాహరణలుగా పేర్కొన్నాడు. మానవులకు గల ఈ హక్కులను రాజ్యం తిరస్కరించరాదన్నాడు.

ప్రశ్న 5.
నైతిక హక్కులు.
జవాబు.
నైతిక హక్కులు సమాజంలోని నైతిక సూత్రాలు ఆధారంగా రూపొందాయి. సమాజంలో నివసించే వ్యక్తులకు నైతికపరమైన అవగాహనను కలిగించేందుకు ఈ రకమైన హక్కులను ఇవ్వటమైనది. సమాజంలోని నైతిక సూత్రాలే ఇటువంటి హక్కులకు ప్రాతిపదికగా ఉన్నాయి.

ప్రజల ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుకలు కూడా వీటికి ఆధారంగా ఉంటాయి. ఇవి ప్రజల అంతరాత్మకు సంబంధించినవి. పౌర సమాజంలోని వ్యక్తులు వీటిని అనుభవిస్తారు. వీటికి చట్టపరమైన మద్దతు లేనప్పటికి సమాజం వీటిని బలపరుస్తుంది. అందుచేత వీటి ఉల్లంఘన ఏ రకమైన శిక్షకు దారితీయదు.

ప్రశ్న 6.
రాజకీయ హక్కులేవి ?
జవాబు.
రాజ్యము, ప్రభుత్వము యొక్క కార్యకలాపాలలో పాల్గొనేందుకై ప్రజలకు పూర్తి అవకాశాలను కల్పించే హక్కులనే రాజకీయ హక్కులని అంటారు. ఉదాహరణకు ఓటు హక్కు, ఎన్నికలలో అభ్యర్థిగా పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, విజ్ఞాపన హక్కు, విమర్శించే హక్కు మొదలగునవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 7.
మానవ హక్కుల లక్ష్యాలను తెల్పండి.
జవాబు.
మానవ హక్కులు కింది ఆశయాలను కలిగి ఉంటాయి.

  1. ప్రజలందరికీ ఎటువంటి వివక్షత లేని స్వాతంత్ర్యాన్ని అందించటం.
  2. పేదరికం నుండి విముక్తి.
  3. వ్యక్తులలో నిబిడీకృతమై ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొనే స్వేచ్ఛ.
  4. భయం నుండి విముక్తి.

ప్రశ్న 8.
మానవ హక్కులు ఎన్ని రకాలు, అవి ఏవి ?
జవాబు.
మానవ హక్కులను స్థూలంగా రెండు రకములుగా వర్గీకరించవచ్చు. అవి 1) పౌర, రాజకీయ హక్కులు 2) సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు.

ప్రశ్న 9.
మానవ హక్కుల ప్రాముఖ్యత.
జవాబు.
మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవే మానవ హక్కులు. మానవులందరూ ఈ హక్కులను కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ తారతమ్యం లేకుండా అనుభవిస్తారు. మానవ హక్కుల సాధనలో ఇంగ్లాండులోని ‘మాగ్నా కార్టా’ అనేది మొదటి ప్రయత్నంగా చెప్పవచ్చు. ఐక్యరాజ్యసమితి కృషి వలన మానవ హక్కులను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రజలు అనుభవిస్తున్నారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 10.
విధులు వర్గీకరణ.
జవాబు.
బాధ్యతలను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి

  • నైతిక బాధ్యతలు
  • చట్టబద్ధమైన బాధ్యతలు.

చట్టబద్ధమైన బాధ్యతలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి

  • సంవర్థక బాధ్యతలు
  • సంరక్షక బాధ్యతలు.

ప్రశ్న 11.
నైతిక బాధ్యతలు.
జవాబు.
నైతిక బాధ్యతలు నైతిక అంశాల ప్రాతిపదికపై వ్యక్తులు నిర్వహించాల్సిన కర్తవ్యాలను సూచిస్తాయి. వీటికి చట్టపరమైన ఆంక్షలు ఉండవు. ఇవి ప్రజల నైతిక విశ్వాసాలపై ఆధారపడి రూపొందుతాయి. సమాజంలోని ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుక పద్ధతుల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. వీటికి ఉదాహరణ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, అస్వస్థులకు సహాయపడటం మొదలైనవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 6 హక్కులు – విధులు

ప్రశ్న 12.
కొన్ని ముఖ్య ఆర్థిక హక్కులను పేర్కొనండి.
జవాబు.
ఆర్థిక హక్కులు :
వ్యక్తులు తమ జీవనభృతికి సహేతుకమైన, చట్టబద్ధమైన మార్గాలద్వారా సంపాదించుకొనేందుకు ఈ హక్కులు అవకాశం కల్పిస్తాయి. అట్లాగే ఇవి వ్యక్తుల దైనందిన అవసరాలకు తోడ్పడుతాయి. హక్కులు వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పిస్తాయి. వర్ధమాన శతాబ్దంలోని (21వ శతాబ్దం) ప్రపంచ దేశాలన్నింటిలో ఈ హక్కులకు ప్రాచుర్యం లభించింది.

కనీస వేతనాన్ని పొందే హక్కు, పనిహక్కు, విశ్రాంతిని పొందే హక్కు, పనిచేసే ప్రదేశాలలో కనీస సదుపాయాలను పొందే హక్కు, కార్మిక సంఘాలను ఏర్పరచుకొనే హక్కు, వృద్ధాప్యం మరియు అంగవైకల్యం నుంచి ఉపశమనం పొందే హక్కు మొదలైనవి ఆర్థిక హక్కులకు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

TS Inter 1st Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 5th Lesson రాజనీతి భావజాలాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 5th Lesson రాజనీతి భావజాలాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వ్యక్తి శ్రేయోవాదం అంటే ఏమిటి ? వివరించండి.
జవాబు.
అర్థం :
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయాలంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతం (Laissez Fair theory) అని కూడా అంటారు. Laissez Fair అనేది ఫ్రెంచ్ పదం.

దాని అర్థం ‘ఓంటరిగా వదిలేయ్’ (Leave alone), అంటే సాంఘిక జీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం’ కలిగి ఉండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.

వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయంలో “రాజ్యం ఆవశ్యకమైన దయ్యం” లాంటిది. రాజ్యం ఎందుకు అవసరమంటే వ్యక్తులను హింస నుంచి, మోసాల నుంచి కాపాడటానికి అవసరమని వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయం. ఇది ఎందుకు దయ్యం లాంటిదంటే వ్యక్తుల స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి, అందువల్ల వ్యక్తుల వ్యక్తిగత విషయంలో ఎంత తక్కువగా జోక్యం చేసుకుంటే అంతమంచిది.

రాజ్యం కింద తెలిపిన పరిమిత విధులను నిర్వహిస్తుంది.

  1. వ్యక్తులకు రక్షణ కల్పించటం విదేశీ దురాక్రమణల నుంచి కాపాడడం.
  2. ఒక వ్యక్తికి మరో వ్యక్తి నుంచి రక్షణ కల్పించడం.
  3. వ్యక్తుల ఆస్తులకు దోపిడి దొంగల నుంచి, విధ్వంసాల నుంచి రక్షణ కల్పించడం.
  4. తప్పుడు ఒప్పందాల నుంచి ఒప్పంద ఉల్లంఘనల నుంచి వ్యక్తులను కాపాడడం.

సిద్ధాంతం పుట్టుక – అభివృద్ధి:
18వ శతాబ్దం నాటికి యూరప్ లో నిరపేక్ష నియంతృత్వ, రాజరిక ప్రభుత్వాలు ఆచరణలో ఉండేవి. యూరప్కు చెందిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు రాజనీతి పండితులైన జాన్లాక్, రూసో వంటి వారు వ్యక్తి స్వేచ్ఛలకు సంబంధించి వివరణలిచ్చారు. ఆ తరువాత 19వ శతాబ్దంలో వ్యక్తి శ్రేయోవాదానికి ఒక సంపూర్ణ రూపం వచ్చింది.

ఈ సిద్ధాంతం ఫ్రాన్స్లో బాగా వేళ్ళూనుకొని అటు పిమ్మట యూరప్ అంతటా విస్తరించింది. దీనిని ఆడమ్ స్మిత్, ఇతర సంప్రదాయ ఆర్థికవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్లు దీనిని ఒక విధానంగాను రాజకీయ సిద్ధాంతంగానూ తీర్చిదిద్దారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

వ్యక్తిశ్రేయోవాదాన్ని పలు రకాలుగా వివరించవచ్చు.

నైతిక వాదన :
జె.ఎస్.మిల్ అభిప్రాయం ప్రకారం వ్యక్తుల విషయంలో రాజ్యం జోక్యం వారి అభీష్టాలను, అభివృద్ధిని నిరోధిస్తుంది. వ్యక్తులు స్వతహాగా నిర్వహించే బాధ్యతలను రాజ్యం తన భుజస్కందాల మీద వేసుకోవడం వల్ల వ్యక్తులు తమ బాధ్యతలను మరచిపోవడమే కాకుండా తమకు తామే కాకుండా పోతారు. దాని పర్యవసానంగా వ్యక్తులు నిస్సారంగా, నిస్సత్తువగా తయారౌతారు.

ఆర్థికవాదన :
వ్యక్తి శ్రేయోవాదానికి మద్దతుగా ఆడమస్మిత్ వాదనను లేవనెత్తాడు. ఆయన అభిప్రాయంలో ప్రతి వ్యక్తి తన అభీష్టం మేరకు శక్తివంచన లేకుండా తన అభివృద్ధికై పాటుపడతాడు. ఒకరకంగా ఆడమస్మిత్ వ్యక్తుల స్వప్రయోజనాలను గురించి ప్రజ్ఞావంతమైన వివరణ ఇచ్చాడని చెప్పవచ్చు.

వ్యక్తుల వ్యాపార, వాణిజ్య పరిశ్రమలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలలో రాజ్యం ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోరాదని స్మిత్ గట్టిగా వాదించాడు. వ్యక్తులకు స్వేచ్ఛ ఇవ్వటంవల్ల స్వచ్ఛందంగా తమ స్వంత శక్తి సామర్థ్యాలను వినియోగించి అభివృద్ధి చెందుతారు.

కాబట్టి “జోక్యరహిత” (లేజాఫెయిర్) విధానంలో వ్యక్తుల అవసరంకంటే సమాజ అవసరమే ఎక్కువగా ఉందని వీరి వాదన. ఈ సిద్ధాంతం 18వ శతాబ్దపు చివరిభాగం 19వ శతాబ్దపు మొదటి దశలో ఇంగ్లాండులో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది.

జీవైకవాదం :
హార్బర్ట్ స్పెన్సర్ అనే శాస్త్రవేత్త వ్యక్తి శ్రేయోవాదాన్ని సమర్థించే ఉద్దేశంతో జీవైక వాదనను ముందుకు తెచ్చాడు. ఇతని అభిప్రాయంలో ప్రాణికోటిలో ఏదైతే నిదొక్కుకోగలుగుతుందో ఆ జీవి మాత్రమే మనుగడను కొనసాగించగలుగుతుంది. ఆ విధంగా సమాజంలోని వ్యక్తులు స్వేచ్ఛాయుత పోటీలో నిలబడగలిగే వారే తమ మనుగడను కొనసాగించగలరు.

సహజ న్యాయం ప్రకారం మనుగడకు వారు మాత్రమే సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కాగలుగుతారు. రాజ్యం చేయగలిగిందల్లా స్వేచ్ఛాయుత పోటీలో వ్యక్తులకు అనుమతినివ్వటం. పేదలకు, వృద్ధులకు, రోగిష్ఠులకు చేయవలసిన అవసరం రాజ్యానికి ఎంతమాత్రం లేదని వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయం.

అనుభవిక వాదం :
ఇప్పటివరకు మనం అనుభవంలో చూస్తున్నదేమంటే, ఎక్కడైనా, ఎప్పుడైనా రాజ్యం పరిశ్రమలను పర్యవేక్షించి నియంత్రిస్తుందో అక్కడ ఫలితాలను వెల్లడించడంలో జాప్యం కలుగుతుంది. అదే విధంగా అసమర్ధత, వస్తువులు వ్యర్థంకావటం జరుగుతుంది.

ఎప్పుడైతే రాజ్యం ప్రజాసమూహాల సాంఘిక, ఆర్థిక జీవన విధానాన్ని నియంత్రించటం లేదా పర్యవేక్షించటానికి చేసే ప్రయత్నాలన్నీ ఘోరంగా విఫలమవుతున్నాయి. అంతేకాదు, రాజ్యనిర్వహణ అంటేనే ఉద్యోగుల నిర్లక్ష్యం, అనవసరపు జాప్యం, ప్రతికూల ఆర్థిక విధానం, లంచగొండితనం మొదలైనవి ఉంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 2.
ఉదారవాదం అంటే ఏమిటి ? దాని ప్రధాన అంశాలను తెలపండి.
జవాబు.
ఉదారవాదం చాలా విశాలమైన సిద్ధాంతం, వ్యక్తి శ్రేయోవాదం, ఉపయోగితావాదం, సంక్షేమ రాజ్యభావన మొదలైనవి దీనిలో అంతర్భాగమైనవే. వ్యక్తి శ్రేయోవాదాన్ని సాంప్రదాయిక ఉదారవాదంలో భాగంగానే చూస్తారు. వ్యక్తి శ్రేయోవాదం ఉద్దేశంలో వ్యక్తి చాలా హేతుబద్ధమైన జీవి.

తనకు కావల్సినవన్నీ సమకూర్చుకునే సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి రాజ్యం కేవలం తనకు రక్షణ కవచంగా ఉంటే చాలు అని భావిస్తాడు. దీన్నే సంప్రదాయ ఉదారవాదం అంటారు. ఉదారవాదం రెండు రకాలు, అవి : సాంప్రదాయిక ఉదారవాదం మొదటిదికాగా ఆధునిక ఉదారవాదం రెండవది.

ఆధునిక ఉదారవాదం 19వ శాతాబ్దపు ఉదారవాదానికి భిన్నమైనది. 20వ శతాబ్దంలో ఉదారవాదం ఎంతో పరిణతి చెందింది. ఎందుకంటే మధ్యతరగతి వర్గ సిద్ధాంతం నుంచి ఒక జన బాహుళ్య సిద్ధాంతంగా మార్పు చెందింది. ముఖ్యంగా టి. హెచ్, గ్రీస్ వివరించిన నైతిక కోణాన్ని తనలో ఇముడ్చుకొని ఆధునిక ఉదారవాదంగా పరిణతి చెందింది.

అదే విధంగా మరికొంత మంది శాస్త్రవేత్తలైన హాబ్ హౌస్, హెచ్.జె. లాస్కీ వంటివారి అభిప్రాయాలతో ప్రభావితమై 20వ శతాబ్దపు అర్ధభాగంలో వ్యక్తుల ప్రయోజనాలను కాపాడేవిధంగా సానుకూల వైఖరిని ఏర్పరచుకొని పాజిటివ్ ఉదారవాదం లేదా ఆధునిక ఉదారవాదంగా గుర్తింపు పొందింది.

అర్థం, నిర్వచనాలు :
ఎంతోమంది అభిప్రాయాలతో అనేక పరిణామాల మధ్య మూడు శతాబ్దాలపాటు పరిణామం చెందిన ఉదారవాదాన్ని నిర్దిష్టంగా నిర్వచించటం చాలా కష్టం. సాంప్రదాయక వైఖరి ప్రకారం ఉదారవాదం వ్యక్తి స్వేచ్ఛలను కాపాడటం, ప్రజాస్వామిక సంస్థల స్థాపన, స్వేచ్ఛా ఆర్థిక విధానం లక్షణాలను కలిగి ఉండేది. ఆధునిక ఉదారవాదం ప్రకారం వ్యక్తి వికాసానికి కావాల్సినంత రక్షణను కల్పిస్తూ సానుకూల వైఖరిని కలిగి ఉంది.

వెబ్స్టర్ నిఘంటువు ప్రకారం వ్యక్తుల హక్కులను, స్వేచ్ఛలను రాజకీయ, ఆర్థిక, ఉద్యోగస్వామ్య ఆధిపత్యాల నుంచి కాపాడే సిద్ధాంతమే ఉదారవాదం. మరో విధంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని ప్రగతిశీలమైన వ్యవస్థగా తీర్చిదిద్దటానికి కావల్సిన సైద్ధాంతిక భూమికయే ఉదారవాద సిద్ధాంతం.

మౌలిక అంశాలు :

  1. వ్యక్తి సహేతుకమైన జీవి, సమాజ శ్రేయస్సుకు కావల్సిన సహాయ సహకారం అందివ్వగలడు. అదేవిధంగా తన అభివృద్ధిని పెంచుకోగలడు. వ్యక్తి పుట్టుకతోనే కొన్ని సహజ హక్కులను కలిగి ఉన్నాడు. వాటిని ఏ అధికార శక్తీ తొలగించలేదు.
  2. వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకు, సమష్టి ప్రయోజనాలకు మధ్య ఎటువంటి వైరుధ్యం లేదు. నిజానికి, పలుకరాల వ్యక్తి ప్రయోజనాలను సమన్వయం చేయడంవల్లనే సమష్టి ప్రయోజనాలు ఏర్పడతాయి.
  3. పౌర సమాజం, రాజ్యం వ్యక్తుల ద్వారా నిర్మితమైన యాంత్రికమైన సంస్థలు. అవి సమష్టి ప్రయోజనాలను కాపాడతాయి.
  4. ఉదారవాదం ప్రకారం స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం వ్యక్తుల సామాజిక జీవనానికి ఎంతో అవసరమైనవి.
  5. ఉదారవాదం, వ్యక్తుల పౌర స్వేచ్ఛలను కాపాడుతుంది. వాటిని పెంపొందించటానికి కావల్సిన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.
  6. ఉదారవాదం వ్యక్తులు తమ సమ్మతి మేరకు వ్యక్తులతో గాని, సంస్థలతోగాని ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
  7. ఉదారవాదం సమాజంలోని వివిధ సమూహాల సమష్టి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ విధానాలు రూపొందించాలని ఆశిస్తుంది.

ఏది ఏమైనప్పటికీ, ఉదారవాదం మార్కెట్ సమాజాన్ని కోరుకుంటుంది. రాజ్యం వ్యక్తుల ఆస్తులకు, ఒప్పందాలకు, కనీసపు సేవలు అందివ్వటానికి తనవంతు బాధ్యతను నెరవేరుస్తుంది. ఉదారవాదం వ్యక్తి ప్రయోజనాలకు లక్ష్యంగానూ వాటిని కాపాడటానికి కావాల్సిన సాధనంగానూ రాజ్యాన్ని గుర్తిస్తుంది. రాజ్యం యొక్క నిరపేక్ష అధికారాన్ని ఉదారవాదం వ్యతిరేకిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 3.
సామ్యవాదం అంటే ఏమిటి ? దాని ప్రధాన సూత్రాలను పరిశీలించండి.
జవాబు.
సామ్యవాదం ఫ్రెంచి, పారిశ్రామిక విప్లవ వీరుల తరువాత ప్రచారంలోకి వచ్చింది. ఫ్రెంచి విప్లవం సాంఘిక విప్లవాన్ని లేవదీస్తే, పారిశ్రామిక విప్లవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే సమూలంగా మార్చివేసింది. సామ్యవాదాన్ని ప్రచారం చేసిన వారిలో రాబర్ట్ ఓవెన్, సైంట్ సైమన్లు ముఖ్యులు.

రాబర్ట్ ఓవెన్ సామ్యవాదాన్ని కాల్పనిక సామ్యవాదంగా ఇంగ్లండ్లో ప్రచారం చేసాడు. ఈ సామ్యవాదాన్నే మార్క్స్, ఏంజెల్సు అనే తత్త్వవేత్తలు శాస్త్రీయ సామ్యవాదంగా రూపొందించారు.

నిర్వచనం వివరణ :
సామ్యవాదం “సోషియస్” (Socious) అనే పదం నుంచి ఉద్భవించింది. అయితే సామ్యవాదాన్ని నిర్వచించటం చాలా కష్టం. అయినా నిఘంటువు ప్రకారం” ఒక కేంద్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం మేలైన పంపిణీ విధానాన్ని, దానికనుగుణంగా ఉత్పత్తి విధానాన్ని ఏర్పరచాలనే ఆశయం గల సిద్ధాంతం సామ్యవాదం”. జార్జి బెర్నాడ్ షా సామ్యవాదమంటే “ఆదాయాలను సమానం చేయటం” అని అన్నాడు.

సామ్యవాదులకు విప్లవం కన్న సంస్కరణల ద్వారా మార్పును తేవటం ఇష్టం. సిద్ధాంతపరమైన సంఘర్షణకన్న నిర్మాణాత్మకమైన కృషిపైన, ఫలితాలపైన వారికి నమ్మకం ఎక్కువ.

ప్రధానసూత్రాలు :
సామ్యవాదపు ప్రధానసూత్రాలను కింది విధంగా చెప్పవచ్చు.

1. సమాజానికి ప్రాముఖ్యత :
సామ్యవాదం వ్యక్తికంటే సమాజానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. సమాజ ప్రయోజనాలకంటే వ్యక్తి ప్రయోజనాలు తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రజలందరి అవసరాలకు సంబంధించిన వస్తూత్పత్తికే మిక్కిలి ప్రాధాన్యతనిస్తుంది. సుఖభోగాలకు సంబంధించిన వస్తువుల ఉత్పత్తి అవసరమైనదిగా భావిస్తుంది. లాభాపేక్షగల వస్తూత్పత్తికంటే సహకార సేవలు అందివ్వగలిగే వస్తూత్పత్తి జరగాలని కోరుకుంటుంది.

2. సామాజిక ఐక్యతను కోరుకుంటుంది:
పెట్టుబడిదారీ సమాజంలో శ్రామికులు, కార్మికులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోతారని సామ్యవాదం పేర్కొంది. సామ్యవాద సమాజంలో మాత్రమే ప్రజలందరికీ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలతో పాటు సమాన అవకాశాలు కల్పించబడతాయని ఈ సిద్ధాంతం నొక్కి చెబుతుంది.

పెట్టుబడిదారీ సమాజంలో కొంతమంది సంపన్నులు మాత్రమే అన్నిరకాల అవకాశాలను పొందుతారని ఎక్కువమంది అనేక అవకాశాలను కోల్పోతారంటుంది. సామ్యవాద సమాజంలో ప్రజలందరు ఎటువంటి అసమానతలు లేని విధంగా సంపూర్ణప్రయోజనం పొందుతారు.

3. పెట్టుబడిదారీ దారీ వ్యవస్థ నిర్మూలన :
పెట్టుబడిదారీ విధానం సంపూర్ణంగా నిర్మూలించబడాలని సామ్యవాదం కోరుకుంటుంది. పెట్టుబడిదారీవర్గం కార్మికవర్గాన్ని దోపిడీచేస్తూ అధికసంపదను ప్రోగుచేసుకుంటుంది. చట్టం ప్రకారం కార్మిక వర్గానికి చెందాల్సిన సౌకర్యాలనుగాని, ఇతరత్రా ప్రయోజనాలను గాని పెట్టుబడిదారి విధానం కల్పించదు.

దీని పర్యవసానంగా కార్మికవర్గం తీవ్రమైన దుర్భరపరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. వీటన్నింటిరీత్యా పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలన కచ్చితంగా జరగాలని సామ్యవాదం అభిప్రాయపడింది.

4. పోటీతత్వాన్ని నిర్మూలించటం:
ఆర్థికరంగంలో ముఖ్యంగా ఉత్పత్తి సంబంధ విషయాలలో పోటీతత్వం సమూలంగా నిర్మూలించబడాలని సామ్యవాద ఆకాంక్ష. పోటీతత్వానికి బదులుగా సహకారం ఉండాలంటుంది. పోటీతత్వం, లంచగొండితనాన్ని, ఏకస్వామ్యాన్ని, అసాంఘిక చర్యలను, విలువలు దిగజారుడుతనాన్ని పెంచిపోషిస్తుందని సామ్యవాదం విమర్శిస్తుంది. అందువల్ల పోటీతత్వం స్థానంలో సహకారం ఎంతో అవసరమని సామ్యవాదం భావిస్తుంది.

5. సమానత్వంపై సంపూర్ణవిశ్వాసం :
సామ్యవాదం సమానత్వ సూత్రాన్ని నమ్ముతుంది. అయితే, సామ్యవాదం సైతం సంపూర్ణ సమానత్వాన్ని సమర్థించదు. వ్యక్తుల ఆలోచనలు, శక్తిసామర్థ్యాలు మరియు నైపుణ్యాల రీత్యా అసమానతలుంటాయని అంగీకరిస్తుంది. అయినంతమాత్రాన ఉద్దేశపూర్వకమైన అసమానతలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామ్యవాదం నొక్కి చెబుతుంది.

6. ప్రయివేటు ఆస్తికి వ్యతిరేకం :
సామ్యవాదం ప్రయివేటు ఆస్తి కలిగి ఉండటాన్ని వ్యతిరేకిస్తుంది. భూమిమీద, పరిశ్రమలమీద, ఇతర ఉత్పత్తి సాధనాలమీద ప్రయివేటు యాజమాన్యపు హక్కులను సామ్యవాదం వ్యతిరేకిస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తులను ప్రజలందరూ సమానంగా వినియోగించుకోవాలని సామ్యవాదం కోరుకుంటుంది.

7. వస్తూత్పత్తిపై సామూహిక యాజమాన్యం :
సమస్త వస్తూత్పత్తి సామూహిక యాజమాన్య ఆధీనంలో ఉండాలని’ సామ్యవాదం ఆశిస్తుంది. సమాజంలోని సంపదనంతా జాతీయం చేయాలని కోరుకుంటుంది. ప్రయివేటు ఆస్తి సంపాదన అంటే దొంగతనంగా కూడగట్టుకున్నదేనని చెబుతుంది. దీన్ని తొలగించడానికి పరిశ్రమలమీద, మైనింగ్ మీద సమష్టి యాజమాన్యం ఉండాలంటుంది.

8. కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ ఉండాలి:
కేంద్రీకృత ప్రణాళికా వ్యవస్థ సమగ్ర అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని సామ్యవాద భావన. శీఘ్ర ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ప్రణాళికా వ్యవస్థే పట్టుకొమ్మవంటిదని చెబుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 4.
గాంధీవాదంపై ఒక వ్యాసం రాయండి.
జవాబు.
మోహన్దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ పట్టణంలో 1869 సంవత్సరంలో జన్మించాడు. గాంధీని మొట్టమొదటిసారి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘మహాత్మ’ అని సంబోధించాడు. మహాత్ముడు భారతదేశ పితామహుడుగా కూడా విఖ్యాతినొందాడు. ప్రాచీన భరతీయ భావాలైన అహింస సత్యాగ్రహం, సత్యం లాంటివాటిని సాధనాలుగా ఉపయోగించి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించాడు. తాను ఏదైతే పాటించాడో దాన్నే బోధించాడు.

గాంధీయిజం – ప్రధాన సూత్రాలు :
1. అతిభౌతిక ఆదర్శవాదం:
ఉపనిషత్ భావాలైన ‘దైవికభావన’ సజీవ నిర్జీవ సమస్త ప్రాణికోటిలో నిక్షిప్తమై ఉండే సార్వజనీన ఆత్మ, అన్ని చోట్ల నిరంతరం వెలిగే దైవిక వెలుతురు మొదలైనవి గాంధీ తాత్విక భావాలు. గాంధీ అభౌతిక ఆదర్శవాదం వేదాంత చింతనతో కూడిన నైతికత, ధార్మిక, అభౌతిక జైన, బౌద్ధ, వైష్ణవ సూత్రాలు. వీటన్నింటి సమ్మిళితమే గాంధీయిజం.

2. నైతిక నిరపేక్షత :
గాంధీ నైతిక విలువలకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. గాంధీ నైతిక వేదాంతంలోని ‘రిత’ లో మనం చూడవచ్చు. ‘రిత’ విశ్వజనీనమైది. సర్వాంతర్యామి అయినట్టఁ భగవంతుడికి విధేయులుగా ఉండునట్లు చేస్తుంది.

3. అహింస – సిద్ధాంతం :
అహింస అంటే ‘హింస చేయకుండుటం’. అంటే ఎవరినీ ‘చంపటానికి వీలులేదు’ అనేది విస్తృత అర్థంలో వాడతాం.

గాంధీ ‘అహింసా’ భావాన్ని రాజకీయాలలో తిరుగులేని అస్త్రంగా వాడాడు. సత్యం, భయం లేకుండటం అహింసకు కావల్సిన కారకాలు. గాంధీజీ అహింసను ఒక వ్యక్తి తన ఆత్మకు తాను విధించుకునే స్వకీయ శిక్షవంటిదని పేర్కొన్నాడు. దయ, ప్రేమ, భయంలేకుండుట, అమాయకత్వం, దయార్ద్రత, నిస్వార్థత మొదలైనవి అహింస పాటించటంలో దోహదపడే అంశాలుగా గాంధీ వివరించాడు.

అహింసా విధానాన్ని ఒక్క బ్రిటీష్వారికి మాత్రమే వ్యతిరేకంగా ప్రయోగించిన ఆయుధంకాదు, సమాజంలోని వివిధ రకాల రుగ్మతలను తొలగించటానికి సైతం దీన్ని ఆయుధంగా వాడవచ్చునన్నాడు.

గాంధీజీ అభిప్రాయంలో స్వరాజ్యం లేదా ప్రజాస్వామ్యాన్ని హింస ద్వారా సాధించలేం. ఎందుకంటే హింసతో ఎవరినీ సంపూర్ణంగా ఓడించలేం. వ్యక్తి స్వేచ్ఛ అంటే హింస కాదు. ఒక్క అహింసా విధానంవల్ల మాత్రమే వ్యక్తిస్వేచ్ఛకు వాస్తవ రూపం వస్తుంది.

గాంధీజీ అభిప్రాయంలో హింసకు నాలుగు కారణాలున్నాయి. అవి :

  1. వ్యవస్థీకృతమైన అధికారం లేదా శక్తి
  2. అంతర్గత వైరుధ్యాలు
  3. విదేశీ దురాక్రమణలు
  4. కుటుంబ వ్యవస్థ

గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు. అది విదేశీపాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు.

అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి (Love Force) మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి (Soul Force). సత్యం ఎన్నడూ హింసను అంగీకరించదు. తప్పు చేసిన వాడిని కూడా ‘హిసా’ పద్ధతిలో శిక్షించకూడదు. ఒకడి దృష్టిలో ”పాపం’ అయినది మరొకరి దృష్టిలో కాకపోవచ్చు.

సత్యాన్ని అన్వేషించటమంటే అహింసావాదాన్ని పాటించడమే అని గాంధీ అభిప్రాయపడ్డాడు. ఒక వ్యక్తికి సంబంధించి అసత్యం అన్యాయం అనే భావనలను తొలగించటానికి తనకు తాను క్షోభను అనుభవించే విధంగా చేయడం ద్వారా మార్పును తీసుకురావాలి. సత్యాగ్రహం అంటే తప్పు చేసినవాడిని క్షోభపెట్టడం కాదు, దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటి వాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ అభిప్రాయం.

సత్యాగ్రహంపై రాజకీయపరమైన నమ్మకం:
రాజకీయంగా సత్యాగ్రహం మూడు సూత్రాల మీద ఆధారపడింది.

  1. అహింస మీద నిరపేక్షమైన నమ్మకం ఉండాలి.
  2. ఏ ప్రభుత్వం అయినా ప్రజాభీష్టం మేరకు ఏర్పడాలి.
  3. ఏ దేశం కూడా స్వకీయంగా క్షోభను, స్వకీయమైన త్యాగం చేయకుండా అభివృద్ధిని సాధించలేదు.

సత్యాగ్రహం సూత్రాలు:
నిజమైన సత్యాగ్రాహి కింది సూత్రాలను పాటించాల్సి ఉంటుంది.

  1. సత్యం అంటే అబద్ధమాడకుండుట. ఇది దైవికమైనది. చెడు చట్టాలను అహింసా పద్ధతుల ద్వారా ప్రతిఘటించాలి.
  2. అహింస అంటే హింసచేయకుండుట, ప్రేమతో జీవితాంతం బ్రతకటం.
  3. సత్యాగ్రాహి జీవితాంతం బ్రహ్మచర్యం పాటించటం. స్త్రీ గాని, పురుషుడుగాని ఇతరులపట్ల చెడు దృష్టిని కలిగి ఉండకూడదు.
  4. అవసరమైన దాని కంటే ఎక్కువగా భుజించకూడదు.
  5. దొంగతనం చేయరాదు.
  6. ప్రతి వ్యక్తి తన శ్రమ మీదనే ఆధారపడి జీవించాలి.
  7. విదేశీ వస్తువులను కొనుగోలు చేయడంగాని, ధరించడంగాని చేయరాదు.
  8. ప్రతి వ్యక్తి భయంలేని జీవితాన్ని గడపాలి.
  9. అంటరానితనాన్ని పాటించరాదు.
  10. మతపరమైన సహనం ఉండాలి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

సత్యాగ్రహం – వివిధ రూపాలు :

  1. శాసనోల్లంఘనం
  2. అహింస
  3. హర్తా నిరసన
  4. హర్తాల్
  5. హిజరత్

ఈ సూత్రాలను పాటించడం ద్వారా విదేశీ పాలన, పలురకాల అన్యాయాల నుంచి దేశాన్ని, మనల్ని మనం కాపాడుకోగల్గుతాం.

అదే విధంగా, సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. సహాయ – నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని తెలియజేయవచ్చు. హర్తాల్, హిజరత్ మరో రకమైన సత్యాగ్రహ నిరసన రూపాలు. సత్యాగ్రహం పద్ధతులు కూడా పలురకాలు. నిరాహారదీక్ష అనేది నిరసన తెలిపే తీవ్రమైన పద్ధతి.

5. మతం రాజకీయాలు :
గాంధీజీ నైతిక భావనలను తరచుగా వ్యక్తపర్చటం చూడవచ్చు. గాంధీజీ అభిప్రాయంలో మతంలేని రాజకీయాలు ప్రభుత్వాన్ని – రాజ్యాన్ని వాటి స్థాయిని తగ్గిస్తాయి. ఎందుకంటే అవి కేవలం భౌతిక అవసరాలు మాత్రమే తీర్చగల్గుతాయి. గాంధీజీ ఉద్దేశంలో అధికారం, నైతికత రెండు సమాంతరంగా రాజకీయాలలో ఉపయోగించబడాలి. అందుకే గాంధీజీ మానవత, మతం, నైతికతను, స్థైర్యాన్ని పెంచినాయన్నాడు.

రాజకీయ కార్యక్రమం కూడా వ్యక్తుల సాంఘిక, నైతిక స్థాయిలను పెంచుతాయన్నాడు. మనిషి జీవితం నుంచి రాజకీయాలను కానీ మతాన్నిగాని విడదీయలేమన్నాడు. గాంధీజీ ఉద్దేశంలో మతమంటే గుడ్డిగా మత విశ్వాసాలను నమ్మటం కాదు, నైతిక విలువలతో మత విశ్వాసాలను సమన్వయం చేసుకోవటంగా పేర్కొన్నాడు. ఏ మతమైనా ఏకపక్ష విధానాన్ని సమర్థించకూడదు. అయితే, గాంధీజీ ఎన్నడూ రాజ్యపరమైన మతాన్ని సమర్థించలేదు. ఆయన ఉద్దేశంలో మతమనేది సమాజంలోని అన్ని రుగ్మతలను తొలగించేదిగా ఉండాలి.

6. లక్షా సాధనాలు :
గాంధీజీ ఉద్దేశంలో సాధనాలు అనేవి ఉదాత్తమైనవి అయి ఉండాలి. అవి అనుకున్న లక్ష్యాలను సాధించేవిగా ఉండాలి. పాశ్చాత్య తత్వవేత్తలు హింసాపూరితమైన సాంఘిక, రాజకీయ విప్లవాలను ప్రతిపాదించారన్నాడు. వాటి ద్వారానే సమాజంలో శాంతి, అభివృద్ధి సాధ్యమౌతాయని వారు పేర్కొన్నారు. అయితే, ఒక్క టాల్ స్టాయ్ మాత్రం హింసను వ్యతిరేకించి “సార్వజనీన ప్రేమ”ను ప్రతిపాదించాడు.

గాంధీజీ, టాల్ స్టాయ్ వీరిరువురు సాంఘిక, రాజకీయ లక్ష్యాలను సాధించటానికి ప్రేమ, కరుణ, దయ వంటి వాటిని ప్రతిపాదించారు. సాధనం అంటే విత్తనం లాంటిది. లక్ష్యం అంటే చెట్టులాంటిది. మంచి విత్తనం నాటితే మంచిదైన చెట్టుపెరిగి మంచి ఫలాన్నిస్తుంది అంటారు గాంధీజీ.

7. ధర్మకర్తృత్వం :
గాంధీజీ, అంతిమ రాజకీయ లక్ష్యం దేశంలో ‘రామరాజ్యం’ ఏర్పాటు చేయటం దాని ద్వారా ప్రజలందరికి సంక్షేమం (సర్వోదయ) కల్పించటం. రామరాజ్యం ఏర్పడిన సమాజంలోని వ్యక్తులు తమ ఆస్తిని పరిశ్రమలను, భూమిని మరియు వ్యాపారాన్ని ధర్మకర్తృత్వంగానే పరిగణిస్తారు. ప్రతి వ్యక్తి తనకు ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగిలిన దాన్నంతా ఇతరులకు ఇచ్చివేయాలి. గాంధీజీ ధర్మకర్తృత్వం సిద్ధాంతాన్ని విప్లవ కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వ్యక్తి శ్రేయోవాదాన్ని చర్చించండి.
జవాబు.
అర్థం :
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయాలంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతం (Laissez Fair Theory) అని కూడా అంటారు. (Laissez Fair) అనేది ఫ్రెంచ్ పదం, దాని అర్థం ‘ఒంటరిగా వదిలేయ్’ (Leave alone), అంటే సాంఘిక జీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం కలిగి ఉండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.

వ్యక్తి శ్రేయోవాదుల అభిప్రాయంలో “రాజ్యం ఆవశ్యకమైన దయ్యం” లాఁటిది. రాజ్యం ఎందుకు అవసరమంటే వ్యక్తులను హింస నుంచి, మోసాల నుంచి కాపాడటానికి అవసరమని వ్యక్తి శ్రేణి దావాదుల అభిప్రాయం. ఇది ఎందుకు దయ్యం లాంటిదంటే వ్యక్తుల స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి, అందువల్ల వ్యక్తుల వ్యక్తిగత విషయంలో ఎంత తక్కువగా జోక్యం చేసుకుంటే అంతమంచిది.

రాజ్యం కింద తెలిపిన పరిమిత విదులను నిర్వహిస్తుంది.

  1. వ్యక్తులకు రక్షణ కల్పించటం విదేశీ దురాక్రమణలనుంచి కాపాడటం.
  2. ఒక వ్యక్తికి మరో వ్యక్తి నుంచి రక్షణ కల్పించడం.
  3. వ్యక్తుల ఆస్తులకు దోపిడి దొంగల నుంచి, విధ్వసాల నుంచి రక్షణ కల్పించడం.
  4. తప్పుడు ఒప్పందాల నుంచి ఒప్పంద ఉల్లంఘనల నుంచి వ్యక్తులను కాపాడడం.

సిద్ధాంతం పుట్టుక – అభివృద్ధి :
18వ శతాబ్దం నాటి యూరప్ లో నిరపేక్ష నియంతృత్వ, రాజరిక ప్రభుత్వాలు ఆచరణలో ఉండేవి. యూరప్కు చెందిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు రాజనీతి పండితులైన జాన్లాక్, రూసో వంటి వారు వ్యక్తి స్వేచ్ఛలకు సంబంధించి వివరణలిచ్చారు. ఆ తరువాత 19వ శతాబ్దంలో వ్యక్తి శ్రేయోవాదానికి ఒక సంపూర్ణ రూపం వచ్చింది.

ఆర్థికపరమైన వ్యక్తి శ్రేయోవాదానికి 18వ శతాబ్దంలో ఫిజియోక్రాట్స్ పునాదులు వేశారు. పరిశ్రమలను, వాణిజ్య వ్యాపారాలను పర్యవేక్షిస్తూ వాటికి సంపూర్ణ మద్దతును తెలిపే విధానాలను సమర్థించే మార్కెంటలిజాన్ని ఫిజి.మోక్రాట్స్ వ్యతిరేకించారు. ఈ ఫిజియోక్రాట్సే లేజాఫెయిర్ (జోక్యరహిత) సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

ఈ సిద్ధాంతం ఫ్రాన్స్లో బాగా వేళ్ళూనుకొని అటు పిమ్మట యూరప్అం తటా విస్తరించింది. దీనిని ఆడమ్స్మిత్, ఇతర సంప్రదాయ ఆర్థికవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే జె.ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్లు దీనిని ఒక విధానంగాను రాజకీయ సిద్ధాంతంగానూ తీర్చిదిద్దారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 2.
సామ్యవాదంలోని లోపాలపై ఒక నోట్ రాయండి.
జవాబు.
సామ్యవాదం లోపాలు :
సామ్యవాదం ఎంతో ఉపయోగకరమైన సిద్ధాంతమైనా దాంట్లో కొన్ని లోపాలున్నాయి. వాటిని క్రింది విధంగా చెప్పవచ్చు.

  1. సామ్యవాద సిద్ధాంతం వ్యక్తికిగల సృజనాత్మక శక్తిని అణచివేస్తుంది. ఉత్పత్తి విధానంలో వ్యక్తిపాత్రను తక్కువచేసి చూపుతుంది.
  2. కొన్ని సామ్యవాద సూత్రాలు ఆచరణ సాధ్యంకానివి. ఉదాహరణకు, ఆర్థిక అసమానతలు తొలగించటం, సాంఘిక వివక్షతలు, సమష్టి యాజమాన్యం, ప్రయివేటు ఆస్తి మొదలైనవి.
  3. సామ్యవాదం వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను నిరాకరిస్తుంది. సమాజానికి అధిక ప్రాధాన్యతనిచ్చి వ్యక్తికి తక్కువ ప్రాధాన్యతనిస్తుంది.
  4. ఆర్థిక వ్యవహారాలలో రాజ్యం జోక్యాన్ని సమర్థించడంవల్ల సత్వర ఆర్థికాభివృద్ధి సాధించటం అసాధ్యమౌతుంది.

సామ్యవాదం – ప్రాముఖ్యత:
సామ్యవాదం ఎంతో ప్రాముఖ్యత కలిగిన సిద్ధాంతం. సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించటానికి ఇది ఏర్పరచుకొన్న లక్ష్యాలు – సాధనాలు ఉదాత్తమైనవి. భౌతిక పరిస్థితులను చక్కదిద్దుకోవటం ద్వారా ప్రజల సంక్షేమాన్ని పెంచుకోవచ్చని సామ్యవాదం భావిస్తుంది. శ్రామికులు, కార్మికుల నిరుద్యోగుల మరియు అన్ని రంగాలలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కేవలం సామ్యవాదం ద్వారానే సాధ్యమౌతుందని ఈ సిద్ధాంతం భావిస్తుంది.

సామ్యవాద సిద్ధాంతం సమసజస్థాపనే ధ్యేయంగా పనిచేస్తుంది. దోపిడీ, అణచివేత, ఆకలి, దారిద్య్రం వంటి వివక్షత రూపుమాపాలంటే సామ్యవాద సిద్ధాంతం ద్వారానే సాధ్యమౌతుందని చెబుతుంది. ప్రయివేటు ఆస్తిని రద్దుచేసి దున్నేవాడిదే భూమి అని నినదించింది.

సామ్యవాద భావాలు భారత రాజకీయాలలో, అమలుచేయబడ్డాయి. రాజ్యాంగ పీఠికలోని అనేక అంశాలలో సామ్యవాదం ఒకటి. ఒకరకంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ లాంటిదేశాలు సామ్యవాదం సిద్ధాంతాల ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 3.
సత్యాగ్రహ భావనను తెలపండి.
జవాబు.
గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు, అది విదేశీపాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు. అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి (Love Fores) మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి (Soul Force). సత్యం ఎన్నడూ హింసను అంగీకరించదు. తప్పు చేసిన వాడిని కూడా ‘హింసా’ పద్ధతిలో శిక్షించకూడదు.

ఒకడి దృష్టిలో ‘పాపం’ అయినది మరొకరి దృష్టిలో కాకపోవచ్చు. సత్యాన్ని అన్వేషించటమంటే అహింసా వాదాన్ని పాటించడమే అని గాంధీ అభిప్రాయపడ్డాడు. ఒక వ్యక్తికి సంబంధించి అసత్యం అన్యాయం అనే భావనలను తొలగించటానికి తనకు తాను క్షోభను అనుభవించే విధంగా చేయడం ద్వారా మార్పును తీసుకురావాలి, సత్యాగ్రహం అంటే తప్పు చేసినవాడిని క్షోభపెట్టడం కాదు, దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటి వాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ అభిప్రాయం.

సత్యాగ్రహంపై రాజకీయపరమైన నమ్మకం :
రాజకీయంగా సత్యాగ్రహం మూడు సూత్రాల మీద ఆధారపడింది.

  1. అహింస మీద నిరపేక్షమైన నమ్మకం ఉండాలి.
  2. ఏ ప్రభుత్వం అయినా ప్రజాభీష్టం మేరకు ఏర్పడాలి.
  3. ఏ దేశం కూడా స్వకీయంగా క్షోభను, స్వకీయమైన త్యాగం చేయకుండా అభివృద్ధిని సాధించలేదు.

సత్యాగ్రహం సూత్రాలు :

  1. సత్యం అంటే అబద్ధమాడకుండుట. ఇది దైవికమైనది. చెడు చట్టాలను అహింసా పద్ధతుల ద్వారా ప్రతిఘటించాలి.
  2. అహింస అంటే హింసచేయకుండుట. ప్రేమతో జీవితాంతం బ్రతకటం.
  3. సత్యాగ్రాహి జీవితాంతం బ్రహ్మచర్యం పాటించటం. స్త్రీ గాని, పురుషుడుగాని, ఇతరులపట్ల చెడు దృష్టిని కలిగి ఉండకూడదు.
  4. అవసరమైన దాని కంటే ఎక్కువగా భుజించకూడదు.
  5. దొంగతనం చేయరాదు.
  6. ప్రతి వ్యక్తి తన శ్రమ మీదనే ఆధారపడి జీవించాలి.
  7. విదేశీ వస్తువులను కొనుగోలు చేయడంగాని, ధరించడంగాని చేయరాదు.
  8. ప్రతి వ్యక్తి భయంలేని జీవితాన్ని గడపాలి.
  9. అంటరానితనాన్ని పాటించరాదు.
  10. మతపరమైన సహనం ఉండాలి.

సత్యాగ్రహం – వివిధ రూపాలు :

  1. శాసనోల్లంఘనం
  2. అహింస
  3. హర్తా నిరసన
  4. హర్తాల్
  5. హిజరత్.

ఈ సూత్రాలను పాటించడం ద్వారా విదేశీ పాలన, పలురకాల అన్యాయాల నుంచి దేశాన్ని మనల్ని మనం కాపాడుకోగల్గుతాం.

అదే విధంగా, సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. సహాయ నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగా గాని, సామూహికంగా గాని తెలియజేయవచ్చు. హర్తాల్, హిజరత్ మరో రకమైన సత్యాగ్రహ నిరసన రూపాలు. సత్యాగ్రహం పద్ధతులు కూడా పలురకాలు. నిరాహారదీక్ష అనేది నిరసన తెలిపే తీవ్రమైన పద్ధతి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 4.
మతం – రాజకీయాలపై గాంధీజీ భావాలను వివరించండి.
జవాబు.
గాంధీజీ నైతిక భావనలను తరచుగా వ్యక్తపర్చటం చూడవచ్చు. గాంధీజీ అభిప్రాయంలో మతంలేని రాజకీయాలు ప్రభుత్వాన్ని రాజ్యాన్ని వాటి స్థాయిని తగ్గిస్తాయి. ఎందుకంటే అవి కేవలం భౌతిక అవసరాలు మాత్రమే తీర్చగల్గుతాయి. గాంధీజీ ఉద్దేశంలో అధికారం, నైతికత రెండు సమాంతరంగా రాజకీయాలలో ఉపయోగించబడాలి. అందుకే గాంధీజీ మానవత, మతం, నైతికతను, స్థైర్యాన్ని పెంచినాయన్నాడు.

రాజకీయ కార్యక్రమం కూడా వ్యక్తుల సాంఘిక, నైతిక స్థాయిలను పెంచుతాయన్నాడు. మనిషి జీవితం నుంచి రాజకీయాలను కానీ మతాన్నిగాని విడదీయలేమన్నాడు. గాంధీజీ ఉద్దేశంలో మతమంటే గుడ్డిగా, మత విశ్వాసాలను నమ్మటం కాదు, నైతిక విలువలతో మత విశ్వాసాలను సమన్వయం చేసుకోవటంగా పేర్కొన్నాడు. ఏ మతమైనా ఏకపక్ష విధానాన్ని సమర్థించకూడదు. అయితే, గాంధీజీ ఎన్నడూ రాజ్యపరమైన మతాన్ని సమర్థించలేదు. ఆయన ఉద్దేశంలో మతమనేది సమాజంలోని అన్ని రుగ్మతలను తొలగించేదిగా ఉండాలి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వ్యక్తి శ్రేయోవాదం.
జవాబు.
వ్యక్తి స్వాతంత్ర్యానికి, స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రచారంలోకి వచ్చిన సిద్ధాంతం వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంతం. ఈ సిద్ధాంతం వ్యాప్తికి దోహదం చేసినవారు జాన్ స్టూవర్ట్మిల్, హెర్బర్ట్ స్పెన్సర్. ప్రధమంగా ఈ సిద్ధాంతం లేజాఫేయిర్ (Laissez Fair) సిద్ధాంతంగా పేర్కొనడం జరిగింది. ఫ్రెంచ్ భాషలో లేజాఫేయిర్ అంటే “జోక్యంచేసుకోకు” అని అర్థం. వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంత ప్రధాన లక్ష్యం వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ప్రాధాన్యమిచ్చి, రాజ్యం జోక్యాన్ని అధికారాన్ని పరిమితం చేయటం.

ప్రశ్న 2.
నయా ఉదారవాదం.
జవాబు.
నయా ఉదారవాదాన్ని ఒకరకంగా సమకాలీన సాంప్రదాయ ఉదారవాదంగా చెప్పవచ్చు. జోక్యరహిత (“లేజాఫెయిర్”) వ్యక్తి శ్రేయోవాదంగా కూడా పరిగణించవచ్చు. ఇది సంక్షేమ రాజ్యాన్ని కోరుకుంటుంది. వ్యక్తుల ఆర్థిక కార్యకలాపం మీద ఎటువంటి నియంత్రణలు ఉండకూడదంటుంది.

నయా – ఉదారవాదాన్ని ముఖ్యంగా కింద పేర్కొన్న శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఎఫ్.ఎ. ఫెయక్ (1899 – 1922), ఆస్ట్రేలియా తత్వవేత్త మిల్టన్ ఫ్రీడ్మాన్ (1912 – 2006), అమెరికా రాజనీతి తత్త్వవేత్త అయిన రాబర్ట్ నోజిక్ (1938 – 2002) మొదలైనవారు.

ప్రశ్న 3.
లేజాఫేయర్ (జోక్యరహితవాదం).
జవాబు.
వ్యక్తి శ్రేయోవాదం ప్రకారం రాజ్యం వ్యక్తుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి వారి అభీష్టానికే వదిలేయా లంటుంది. ఈ సిద్ధాంతాన్ని జోక్యరహిత సిద్ధాంతమని అంటారు.

లేజాఫేయర్ (Laissez Fair) అనేది ఫ్రెంచిపదం. దాని అర్థం “ఒంటరిగా వదిలేయ్” అంటే సాంఘికజీవనంలో వ్యక్తే కేంద్ర బిందువు. ఈ సిద్ధాంతాన్ననుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి. రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం కలిగివుండాలి. అంటే రాజ్యం వ్యక్తులను సమర్థించాలేగాని నియంత్రించకూడదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 4.
జె.యస్.మిల్.
జవాబు.
జాన్ స్టువర్ట్ మిల్ 19వ శతాబ్దపు ఆంగ్ల రాజనీతి తత్వవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతడు వ్యక్తి శ్రేయోవాది మరియు ప్రజా స్వామ్యవాది. ఇతడు రచించిన “ఆన్ లిబర్టీ” అనే గ్రంథము వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చింది. వ్యక్తి స్వేచ్ఛకు ఇతడిచ్చినంత ప్రాధాన్యత ఇంతకుముందు ఏ రాజనీతి శాస్త్రవేత్త ఇవ్వలేదు. జె.యస్.మిల్’ వ్యక్తి శారీరక, మానసిక నైతిక వికాసానికి స్వేచ్ఛ చాలా అవసరమని భావించాడు. సమాజ శ్రేయస్సుకోసం వ్యక్తి స్వేచ్ఛ చాలా అవసరమని, అందువలన వ్యక్తి వ్యవహారాలో ప్రభుత్వ జోక్యము పరిమితంగా వుండాలని చెప్పెను.

ప్రశ్న 5.
సామ్యవాదం అర్థం.
జవాబు.
మ్యవాదం వ్యక్తి వాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు సమాజపరంగా నిర్వహించే విధానమే సామ్య దం. ఇది ఒక విప్లవాత్మక సిద్ధాంతం. ఒక రాజకీయ విధానమే గాక, సామ్యవాదం ఒక జీవిత విధానం కూడా. దీనిని అనేక మంది నిర్వచించారు. సి.యి.యమ్. జోడ్ అనే రచయిత సామ్యవాదం ఒక టోపీ వంటిదని, దానిని అందరూ ధరించటం వలన అసలు రూపమే పోయిందని అంటారు.

నిర్వచనాలు :
“ఒక కేంద్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం మేలైన పంపిణీ విధానాన్ని, దానికనుగుణంగా ఉత్పత్తి విధానాన్ని ఏర్పరచాలనే ఆశయం గల సిద్ధాంతం సామ్యవాదం”. – ఎన్ సైక్లోపీడియా.
“ఆదాయాలను సమానం చేయడం సామ్యవాదం”. – జార్జ్ బెర్నార్డ్ షా.

ప్రశ్న 6.
పెట్టుబడిదారీ విధానం.
జవాబు.
వ్యక్తివాదం వలన పెట్టుబడిదారీ విధానము పెరిగింది. వ్యక్తులు ఉత్పత్తి సాధనాలను తమ ఆధీనంలో ఉంచుకొని లాభాలను ఆర్జించడము కోసం ఆర్థిక రంగాన్ని నియంత్రణ చేయడము ఇందలి ముఖ్య లక్షణం.

లక్షణాలు :

  1. వ్యక్తుల యాజమాన్యం : ఉత్పత్తి సాధనాలు వ్యక్తి ఆధీనంలో ఉంటాయి. దీని వలన వ్యక్తులు శ్రద్ధతో పనిచేస్తారు.
  2. ఆర్థిక రంగంలో స్వేచ్ఛ: యాజమానులు లాభదాయకమైన వస్తువులను ఉత్పత్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వేచ్ఛ వుంటుంది. లాభ, నష్టాలకు వ్యక్తులే బాధ్యులు.
  3. వినియోగదారునికి స్వేచ్ఛ : వినియోగదారుడు తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తాడు.
  4. పోటీ : ఉత్పత్తి వాణిజ్యాలలో తీవ్రమైన పోటీ ఉంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 7.
మార్క్సిజం.
జవాబు.
కారల్ మార్క్స్, ఏంజెల్స్ దీనిని ప్రబోధించారు. ఆర్థిక సమానత్వం దీని ప్రధాన లక్ష్యం. ఇది పెట్టుబడిదారీ విధానాన్ని, ఆస్తి హక్కును వ్యతిరేకిస్తుంది. కమ్యూనిజంలో కార్మిక నియంతృత్వం ద్వారా ప్రభుత్వం చేపట్టి, సంపదనంతా జాతీయంచేసి, విప్లవం ద్వారా ఆర్థిక సమానత్వం తేవాలి.

పేదరికం, నిరుద్యోగం కూడా నిర్మూలింపబడాలి. ప్రజలు తమ అవసరాలను బట్టి సంపద వాడుకుంటారు. కమ్యూనిజం లక్ష్యం నెరవేరిన తరువాత రాజ్యం అంతరిస్తుందని కమ్యూనిస్ట్ల వాదన. దీనిని శాస్త్రీయ సామ్యవాదం అని కూడా అంటారు.

ప్రశ్న 8.
అహింసా సిద్ధాంతం.
జవాబు.
అహింస అంటే “హింస చేయకుండటం” అంటే ఎవరినీ “చంపటానికి వీలులేదు” అనేది విస్తృత అర్థంలో వాడతాం. గాంధీ అహింసా భావాన్ని రాజకీయాలలో తిరుగులేని అస్త్రంగా వాడాడు. సత్యం, భయం లేకుండటం అహింసకు కావల్సిన కారకాలు. గాంధీజీ అహింసను ఒక వ్యక్తి తన ఆత్మకు తాను విధించుకునే స్వకీయ శిక్షవంటిదని పేర్కొన్నాడు.

దయ, ప్రేమ, భయం లేకుండుట, అమాయకత్వం, దయార్ద్రత, నిస్వార్థత మొదలైనవి. అహింస పాటించటంలో దోహదపడే అంశాలుగా గాంధీజీ వివరించాడు. అహింసా విధానాన్ని ఒక్క బ్రిటీష్ వారికి మాత్రమే వ్యతిరేకంగా ప్రయోగించిన ఆయుధం కాదు. సమాజంలోని వివిధ రకాల రుగ్మతలను తొలగించటానికి సైతం దీన్ని ఆయుధంగా వాడవచ్చునన్నాడు.

ప్రశ్న 9.
సత్యాగ్రహం.
జవాబు.
గాంధీజీ ప్రకారం సత్యాగ్రహం కేవలం తాత్విక సిద్ధాంతం మాత్రమే కాదు. అది విదేశీ పాలనను అంతమొందించి సాంఘిక, ఆర్థిక న్యాయాలు సంపాదించేది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు సత్యాగ్రహం అనే భావనను కనిపెట్టాడు.

అతని ఉద్దేశంలో సత్యాగ్రహం అంటే ప్రేమతో కూడిన ఒత్తిడి మరియు ఆత్మ సంబంధమైన ఒత్తిడి. సత్యాగ్రహం అంటే తప్పుచేసినవాడిని క్షోభపెట్టడం కాదు. దాన్ని వ్యతిరేకించేవాడు క్షోభపడి ఎదుటివాడిలో మార్పు తీసుకురావడం అని గాంధీజీ. అభిప్రాయం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 10.
ధర్మకర్తృత్వం.
జవాబు.
గాంధీజీ అంతిమ రాజకీయ లక్ష్యం దేశంలో ‘రామరాజ్యం’ ఏర్పాటు చేయటం దాని ద్వారా ప్రజలందరికి సంక్షేమం (సర్వోదయ) కల్పించటం. రామరాజ్యం ఏర్పడిన సమాజంలోని వ్యక్తులు తమ ఆస్తిని పరిశ్రమలను, భూమిని మరియు వ్యాపారాన్ని’ ధర్మకర్తృత్వంగానే పరిగణిస్తారు.

ప్రతి వ్యక్తి తనకు ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగిలిన దాన్నంతా ఇతరులకు ఇచ్చివేయాలి. గాంధీజీ ధర్మకర్తృత్వం సిద్ధాంతాన్ని విప్లవ కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించాడు.

ప్రశ్న 11.
సహాయ నిరాకరణ.
జవాబు.
సత్యాగ్రహాన్ని అనేక రూపాలలో ఆచరించవచ్చు. వాటిలో సహాయ నిరాకరణ అనేది పరోక్షమైన చాలా చిన్నదైన నిరసన. దీనిని గాంధీజీ భారతజాతీయోద్యమ చిన్నదైన నిరసన. దీనిని గాంధీజీ భారతజాతీయోద్యమ కాలంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా 1920-22 మధ్యకాలంలో నిర్వహించాడు.

అహింసాయుత సహాయ నిరాకరణోద్యమము ప్రకారం విదేశీ వస్తు బహిష్కరణ, ప్రభుత్వ బిరుదులను పరిత్యజించుట, శాసన సభలను, న్యాయస్థానాలను, విద్యాలయాలను బహిష్కరించుట మొదలగు కార్యకలాపాలను గాంధీజీ నాయకత్వాన విజయవంతంగా చేయడము జరిగింది. అయితే ఈ ఉద్యమము 8, ఫిబ్రవరి 1922న చౌరీ చౌరా సంఘటనతో హింసాయుతమైన మలుపు తీసుకోవడంతో గాంధీజీ కలత చెంది ఉద్యమాన్ని నిలుపుదల చేసినాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 5 రాజనీతి భావజాలాలు

ప్రశ్న 12.
శాసనోల్లంఘనం.
జవాబు.
‘సత్యాగ్రహ రూపాలలో శాసనోల్లంఘనం తీవ్రమైన నిరసన. దీన్ని వ్యక్తిగతంగాగాని, సామూహికంగాగాని తెలియజేయవచ్చు. గాంధీజీ 1930వ సంవత్సరంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించెను. గుజరాత్లోని సబర్మతి ఆశ్రమము నుండి “దండి” అనే గుజరాత్ సముద్ర తీరప్రాంత గ్రామానికి తన సహచరులతో పాదయాత్ర నిర్వహించాడు.

సముద్ర తీరంలో ఉప్పు తయారుచేసి, ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఆనాటి బ్రిటీష్ ఉప్పు శాసనాన్ని ధిక్కరించెను. ఈ శాసనోల్లంఘన కార్యక్రమములో గాంధీజీతోపాటు 60 వేల మంది ప్రజలు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొనిరి. అందువలననే దీనిని సామూహిక శాసనోల్లంఘన ఉద్యమంగా అభివర్ణించడం జరిగింది.

TS Inter 1st Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 11th Lesson ప్రభుత్వాంగాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 11th Lesson ప్రభుత్వాంగాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ద్విశాసనసభ నిర్మాణాన్ని వివరిస్తూ, శాసనసభ విధులను తెలపండి.
జవాబు.
శాసన శాఖ ఏకశాసనసభ లేదా ద్విశాసనసభా. విధానాన్ని కలిగి వుండవచ్చు. ఏక శాసనసభా విధానంలో ఒకే. సభ వుంటే ద్విశాసనసభా విధానంలో రెండు సభలుంటాయి. వీటిని దిగువ సభ, ఎగువ సభలుగా పేర్కొనవచ్చు.

దిగువ సభ ప్రజల మనోభావాలకు తార్కాణం కాగా, ఎగువ సభ అన్ని రాష్ట్రాల ప్రయోజనాలకు అద్దం పట్టే విధంగా ఉంటుంది. ఉదాహరణకు భారత పార్లమెంటులో రాజ్యసభ ఎగువ సభ కాగా లోక్సభ దిగువ సభగా వుంది.

శాసనసభ విధులు :
ప్రజల అభిమతాన్ననుసరించి చట్టాలు రూపొందించడమే శాసనసభ ప్రధాన విధి. ఆధునిక సభలు చట్ట నిర్మాణంతోపాటు కొన్ని పాలనా విధులను న్యాయ విధులను కూడా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ రూపాలను బట్టి కూడా శాసనసభ విధులు ఆధారపడి ఉంటాయి. అధ్యక్ష ప్రభుత్వ వ్యవస్థలో శాసనసభ పాత్ర పరిమితంగా ఉంటుంది.

పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థలో శాసనసభ పాత్ర విస్తృతంగా ఉంటుంది. శాసనసభ విధులను కింది శీర్షికల కింద వివరించవచ్చు. శాసన నిర్మాణం, కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణ, ఆర్థిక సంబంధ విధులు, రాజ్యాంగ విధులు, ఇతర విధులు.

శాసన నిర్మాణం :
శాసన నిర్మాణం శాసనసభ ప్రాథమిక విధి. ప్రజల అభిమతాలను గుర్తించి వాటికనుగుణంగా శాసనాలు చేయడమే శాసనసభ ముఖ్య కర్తవ్యం. కొత్త చట్టాలను చేయడానికి, కాలదోషం పట్టిన చట్టాలను మార్పు చేయడానికి, రద్దు చేయడానికి శాసనసభకు అధికారం ఉంది. శాసనాలు చేయడమేకాక వివిధ విషయాల మీద, వివరంగా చర్చలు జరపడం, సమాలోచనలు చేయడం కూడా శాసనసభ విధి. ప్రతి బిల్లు శాసనంగా ఆమోదం పొందే ముందు శాసనసభ దానికి సంబంధించిన అన్ని అంశాలను విపులంగా చర్చిస్తుంది.

కార్య నిర్వాహక వర్గంపై నియంత్రణ :
పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో మంత్రి మండలి శాసనసభకు బాధ్యత వహిస్తుంది. దేశంలో తలెత్తే సమస్యల గురించి, వాటి పరిష్కారాలను గురించి వివిధ తీర్మానాల ద్వారా, ప్రశ్నోత్తరాల సమయం ద్వారా మంత్రి వర్గంపై శాసన సభ అజమాయిషీ చేస్తుంది. అవసరమైతే ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిస్తుంది.

ఆర్థిక సంబంధం విధులు :
ప్రజాస్వామ్య దేశంలో శాసనసభకు ఉండే ఆర్థిక విధులు ముఖ్యమైనవి. శాసనసభ వివిధ పద్దుల కింద ఆదాయ వ్యయాలను బడ్జెట్ రూపంలో ఆమోదిస్తుంది. ప్రభుత్వం ఎంత ఆదాయాన్ని ఏ పద్దుల కింద ఖర్చుపెట్టాలో శాసనసభ నిర్ణయిస్తుంది. శాసనసభ అనుమతి లేకుండా కొత్త పన్నులను విధించరాదు. ఉన్న పన్నులను రద్దు చేయరాదు.

న్యాయ సంబంధ విధులు :
శాసన సభలు ముఖ్యంగా ఎగువ సభలు న్యాయ సంబంధిత విధులను కూడా. నిర్వహిస్తాయి. ఇంగ్లాండులో ప్రభువుల సభ అత్యున్నత న్యాయ స్థానంగా పనిచేస్తుంది. అమెరికా, ఇండియాలో రాష్ట్రపతిపైన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయ మూర్తులపై వచ్చే అభియోగాలను జాతీయ శాసనసభలు విచారిస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను శాసనసభ ప్రత్యేక కమిటీల ద్వారా విచారణ జరుపుతుంది. ప్రత్యేక సభాహక్కులు అతిక్రమించినవారిని దండించడానికి కూడా శాసనసభకు అధికారం ఉంది.

రాజ్యాంగ విధులు :
సాధారణ శాసనాలు చేయడమే కాకుండా శాసనసభలకు రాజ్యాంగాన్ని మార్చే అధికారం కూడా ఉంటుంది. దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా మౌలిక శాసనమైన రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేయడానికి చట్టసభలకు అధికారం ఉంది.

ఇతర విధులు :
పై విధులతోపాటు శాసనసభకు మరొకొన్ని విధులు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి :

  1. ప్రభుత్వం ప్రకటించే ఆర్డినెన్సులను ఆమోదించడం లేదా తిరస్కరించడం.
  2. సభాధ్యక్షులను ఎన్నుకోవడం.
  3. ప్రభుత్వ వ్యవహారాలను దర్యాప్తు చేయడానికి అవసరమైన కమిటీలను నియమించడం.
  4. సభా కార్యక్రమాలకు సంబంధించిన నియమాలను రూపొందించడం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 2.
కార్యనిర్వాహక శాఖ అంటే ఏమిటి ? కార్యనిర్వాహకశాఖ విధులను తెల్పండి.
జవాబు.
పరిచయం :
ప్రభుత్వ నిర్మాణంలో కార్యనిర్వాహకశాఖ అతిముఖ్యమైన రెండవ అంగం. రాజ్య విధానాలను అమలుపరచడంలో కార్యనిర్వాహకశాఖ ముఖ్య సాధనంగా ఉపయోగపడుతుంది. కార్యనిర్వాహకశాఖ అంటే రాజ్యాధిపతులు, వారి మంత్రులు, సలహాదారులు, పరిపాలనాశాఖాధిపతులు కలిసికట్టుగా కార్యనిర్వాహక వర్గంగా ఏర్పడతారు.

కార్యనిర్వాహకశాఖ విధులు (Functions of Executive) :
ఆధునిక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ పలురకాల విధులు నిర్వహిస్తుంది. సైద్ధాంతికంగా, ఈ శాఖ శాసననిర్మాణశాఖ రూపొందించిన చట్టాలను అమలుపరుస్తుంది. అయితే ఆయా ప్రభుత్వ రూపాలను బట్టి ఈ శాఖ నిర్వహించే విధుల్లో మార్పు ఉంటుంది. సాధారణంగా కార్యనిర్వాహకశాఖ ఈ కింది విధులను నిర్వహిస్తుంది.

1. పాలనాపరమైన విధులు (Administrative Functions) :

  • చట్టాలను, న్యాయశాఖ తీర్పులను అమలుపరచడం,
  •  శాంతిభద్రతలను కాపాడటం,
  • విధివిధానాలను రూపొందించడం,
  • సివిల్ సర్వెంట్స్ నియామకం, పదోన్నతి, తొలగింపు (ఉద్యోగంలో నుండి తొలగించడం) మొదలైన విధులు.

2. దౌత్యపరమైన విధులు (Diplomatic Functions) :
కార్యనిర్వాహకశాఖ విదేశీ సంబంధాలను నెరపడము, విదేశాల్లో దౌత్యాధికారులను నియమించడం, దౌత్య వ్యవహారాలను చక్కబెట్టడం, అదే విధంగా, దేశాల మధ్య జరిగే చర్చా సమాలోచనలను, అంతర్జాతీయ ఒప్పందాలను, సదస్సు తీర్మానాలను అమలుపరచడం. అయితే, ఈ చర్యలన్నింటిని శాసన నిర్మాణశాఖ ధృవపరచవలసి ఉంటుంది.

3. సైనికపరమైన విధులు (Military Functions) :
ప్రపంచ దేశాలలోని అనేక రాజ్యాలలో ముఖ్య కార్యనిర్వహణాధిపతి రక్షణశాఖకు అత్యున్నత దేశాధికారిగా ఉంటాడు. ఇతర దేశాలతో యుద్ధాన్ని గాని, లేదా శాంతి సంధినిగాని కార్యనిర్వాహకశాఖ ప్రకటించవచ్చు. అదే విధంగా అత్యవసర సమయాల్లో ఈ శాఖ దేశవ్యాప్తంగా మార్షల్ లా (Martial Law)ను విధించి పౌరుల హక్కులను సైతం రద్దు చేయవచ్చు.

4. ఆర్థికపరమైన విధులు (Financial Functions):
కార్యనిర్వాహకశాఖ కొన్ని ఆర్థికపరమైన విధులను కూడా నిర్వహిస్తుంది. అవి వరుసగా, ఈ శాఖ వార్షిక ఆదాయ వ్యయపట్టికను ఎంతో జాగరూకతతో తయారుచేస్తుంది. వివిధ రకాల రూపాలలో వచ్చే ప్రభుత్వ రాబడులను గుర్తించేందుకు కృషిచేస్తుంది. పన్నుల వసూళ్ళకు కావలసిన యంత్రాంగాన్ని ఏర్పరుస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

5. న్యాయపరమైన విధులు (Judicial Functions) :
అనేక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకంతోపాటు వారిని బదిలీ చేయడం వంటి విధులను నిర్వహిస్తుంది. అదే విధంగా దోషులుగా నిర్ధారించబడ్డ వారి శిక్షలను తగ్గించడం లేదా తొలగించడం, రద్దుచేయడం వంటి విధులను సైతం ఈ శాఖ చేపడుతుంది. అయితే ఇలాంటి అధికారాన్ని కొన్ని ప్రత్యేక సమయాలలో మాత్రమే వినియోగిస్తుంది.

6. రాజ్యాంగపరమైన విధులు (Constitutional Functions) :
చాలా దేశాల్లో కార్యనిర్వాహకశాఖ రాజ్యాంగ సవరణలకు సంబంధించి శాసననిర్మాణశాఖకు సలహాదారుగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగ సూత్రాలను అమలుపరిచే క్రమంలో సమస్యలు ఉత్పన్నమైనట్లయితే వాటిని అధిగమించి ప్రగతిని సాధించడానికి రాజ్యాంగ సవరణలు అవసరమని భావించినట్లయితే వాటిని చేయవలసిందిగా శాసననిర్మాణ శాఖకు విన్నవిస్తుంది.

అలాంటి చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకతను తెలియజేయడానికి ముందస్తు సర్వేలు నిర్వహించి వాటి నివేదికలను పార్లమెంటుకు సమర్పిస్తుంది. ఈ సందర్భంగా, కార్యనిర్వాహకశాఖ శాసనసభ్యుల మద్దతును కూడగట్టి తగిన రాజ్యాంగ సవరణలను చేస్తుంది.

7. ఆర్డినెన్స్ల జారీ (Promulgation of Ordinances) :
అనేక రాజ్యాలలో కార్యనిర్వాహకశాఖ ఆర్డినెన్స్లను జారీ చేస్తుంది. క్లిష్టమైన సమస్యలను అత్యవసరంగా పరిష్కరించడానికి ఈ తరహా బాధ్యతలను అది నిర్వహిస్తుంది. శాసనసభల సమావేశం జరిగేంతవరకు ఈ ఆర్డినెన్స్లు అమలులో ఉంటాయి.

అంతేకాకుండా నియోజిత శాసనం (delegated legislation) అనేది శాసననిర్మాణశాఖ తరపున చట్టాలను రూపొందించేందుకు కార్యనిర్వాహక శాఖకు వీలు కల్పిస్తుంది. శాసన సభ్యులు కొన్ని బిల్లులను సంపూర్ణమైన వివరాలతో తయారు చేసేందుకు కార్యనిర్వాహకశాఖకు అధికారమిచ్చేందుకు తమ సమ్మతిని తెలియజేస్తారు.

8. సంక్షేమ విధులు (Welfare Functions) :
నేడు అనేక రాజ్యాలు సంక్షేమ దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. తద్వారా ప్రజాసంక్షేమంలో వాటి కర్తవ్యాలు నానాటికి విశేషంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా, సంక్షేమంలో పూర్తిగా విస్మరించబడ్డ వర్గాలు, నిరాకరించబడ్డ, కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని ప్రజలను ఉద్దేశించి శాసనాలను రూపొందించి అమలుపరుస్తుంది. ఫలితంగా ఈ శాఖ అనేక బహుళ విధులను, చర్యలను చేపడుతుంది.

9. పాలనాపరమైన న్యాయనిర్ణయ విధులు (Administrative Adjudication Functions) :
అనేక సందర్భాలలో పరిపాలనకు సంబంధించిన కేసులలో, వివాదాలలో కార్యనిర్వాహక శాఖ పాలనాపరమైన న్యాయనిర్ణేతగా ప్రముఖపాత్రను నిర్వహిస్తుంది. ఇలాంటి చర్యలను చేపట్టడం ద్వారా ఈ శాఖ కొన్ని న్యాయ సంబంధమైన అధికారాలను సైతం కలిగి ఉందని చెప్పవచ్చు.

10. అత్యవసర కార్యక్రమాలు (Emergency Operations):
శాంతి భద్రతలు క్షీణించడం, ప్రకృతివైపరీత్యాలు, విదేశీ చొరబాట్లు లేదా మరే విధమైన అత్యవసర పరిస్థితులు వివిధ సమయాలలో వివిధ ప్రాంతాలలో ఉత్పన్నమైనట్లయితే వాటిని చక్కబెట్టే బాధ్యతను కార్యనిర్వాహకశాఖ చేపడుతుంది.

గతకొన్ని సంవత్సరాల నుంచి అనేక దేశాలలో తీవ్రవాదం ఒక ప్రధాన సమస్యగా పరిణమించింది. ఇలాంటి సమస్యలను కార్యనిర్వాహకశాఖ సందర్భానుసారంగా, సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మరే ఇతర ప్రభుత్వ అంగం కూడా ఇలాంటి పరిస్థితులను చక్కబెట్టలేదు.

11. ఇతర విధులు (Miscellaneous Functions) :
ప్రభుత్వానికి కార్యనిర్వాహకశాఖ నాయకత్వాన్ని అందిస్తుంది. శాసననిర్మాణ శాఖ, అధికారంలో ఉన్న పార్టీతోపాటుగా మొత్తం జాతికి నాయకత్వం వహిస్తుంది. ఈ శాఖ రాజ్యానికి నాయకత్వాన్ని అందిస్తూ అంతర్జాతీయ సదస్సులు, సంస్థల కార్యకలాపాలలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 3.
న్యాయశాఖను వివరించి దాని విధులను చర్చించండి.
జవాబు.
ప్రభుత్వాంగాలలో న్యాయశాఖ మూడవది, ఇది శాసనాలను వ్యాఖ్యానిస్తుంది. అవి న్యాయసమ్మతంగా ఉన్నదీ, లేనిదీ నిర్ణయిస్తుంది. “పక్షపాతరహితంగా ప్రజలకు న్యాయం చేకూర్చడంపై దేశ శ్రేయస్సు, ప్రభుత్వ సామర్థ్యం ఆధారపడి ఉంటాయని” లార్డ్ బ్రైస్ అభిప్రాయం. న్యాయస్థానాలు న్యాయశాఖలో భాగం.

న్యాయశాఖ ప్రజాస్వామ్యంలో ప్రజల స్వేచ్ఛను రక్షిస్తుంది. ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో పనిచేసేటట్లు చూస్తుంది. ఆధునిక కాలంలో అనేక విధులను నిర్వహిస్తున్నది. ప్రజల హక్కులను కాపాడి, శాసనాలను వ్యాఖ్యానించి, న్యాయం చేయడమే న్యాయస్థానాల ముఖ్య కర్తవ్యం.

విధులు :
1. శాసనాలను వ్యాఖ్యానించడం :
శాసనశాఖ చేసిన శాసనాలకు అర్థవివరణ ఇవ్వడం న్యాయశాఖ ప్రధాన కర్తవ్యం. న్యాయమూర్తులు చట్టాలను వ్యాఖ్యానించి, వివిధ అంశాలపై తమ నిర్ణయాలు తెలుపుతారు. శాసనాల అభివృద్ధికి న్యాయస్థానాలు పరోక్షంగా దోహదం చేస్తాయి.

2. రాజ్యాంగ రక్షణ :
రాజ్యాంగ రక్షణ చేసి, దాని మౌలిక స్వరూపానికి భంగం లేకుండా చూడవలసిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంది. శాసనశాఖ చేసే చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వాటిని చెల్లవని కొట్టివేసే “న్యాయసమీక్షాధికారం” న్యాయస్థానాలకు ఉంది.

3. హక్కుల రక్షణ :
న్యాయస్థానాలు ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడతాయి. ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కులకు భంగం కలిగితే వారు న్యాయస్థానాల ద్వారా వాటిని రక్షించుకుంటారు. వ్యక్తి స్వేచ్ఛను రక్షించడానికి హెబియస్ కార్పస్ వంటి రిట్లు (writs) జారీచేసే అధికారం న్యాయస్థానాలకు ఉంది.

4. సమాఖ్య సమతౌల్యత:
సమాఖ్యలో న్యాయశాఖ అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. న్యాయశాఖ కేంద్రం రాష్ట్రాల మధ్యగాని, పలు రాష్ట్రాల మధ్యగానీ తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంది. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పరిమితులను దాటకుండా ఇది చూస్తుంది.

5. సలహారూపక విధులు :
కార్యనిర్వాహక లేదా శాసననిర్మాణశాఖల కోరిక మేరకు న్యాయశాఖ తగిన సలహాలిస్తుంది.
ఉదా : భారత రాష్ట్రపతి రాజ్యాంగపర చట్టాలకు సంబంధించి ఏదైనా సందేహం ఉత్పన్నమైనట్లయితే, భారత సుప్రీంకోర్టు సలహాను తీసుకోవచ్చు. ఇంగ్లాండులో ఇలాంటి సలహా సంప్రదింపులు జరపడం సర్వసాధారణం. చట్టానికి సంబంధించిన ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు బ్రిటీష్ రాణి ప్రివీకౌన్సిల్ న్యాయ కమిటీల సలహాలను తీసుకుంటుంది.

6. అప్పీళ్ళ విచారణ పరిధి :
కింది కోర్టులు ఇచ్చిన తీర్పులపై అత్యున్నత కోర్టు అప్పీళ్లను స్వీకరిస్తుంది. కింది కోర్టులు వెలువరించిన తీర్పులను అన్నివేళల పునఃసమీక్షిస్తుంది. కొన్ని సందర్భాలలో వాటికి వ్యతిరేకంగా కూడా తీర్పులను వెలువరిస్తుంది.

7. రికార్డుల నిర్వహణ :
న్యాయశాఖ తన తీర్పులకు సంబంధించిన రికార్డులతోపాటు ఇతర కేసులకు సంబంధించిన రికార్డులను సైతం భద్రపరుస్తుంది. సదరు రికార్డులు భవిష్యత్తులో న్యాయవాదులకు, న్యాయమూర్తులకు అదే తరహా కేసులు వాదించడానికి లేదా తీర్పులు వెలువరించడానికి ప్రాతిపదికగా ఉపయోగపడతాయి.

8. రాజ్యాధిపతిగా వ్యవహరించడం :
అత్యున్నత న్యాయస్థానాలలోని ప్రధాన న్యాయమూర్తి కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్ని దేశాలలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఆయా స్థానాలలో లేనప్పుడు రాజ్యాధిపతిగా వ్యవహరిస్తాడు.

9. పరిపాలనా విధులు :
సుప్రీంకోర్టు, హైకోర్టులు కొన్ని పరిపాలనాపరమైన విధులను నిర్వహిస్తాయి. ఉన్నత న్యాయస్థానాలు కింది న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక అధిపతికి సలహా ఇస్తాయి. అదే విధంగా అవి కింది న్యాయస్థానాల పనితీరును పర్యవేక్షిస్తాయి. ఉదా : భారతదేశంలోని హైకోర్టులు తమ పరిధిలోని అధీన న్యాయస్థానాల కార్యక్రమాలను పర్యవేక్షించే కర్తవ్యాన్ని కలిగి ఉంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
శాసనసభల ప్రాముఖ్యం తగ్గుదలకు గల కారణాలు వివరించండి.
జవాబు.
ఆధునిక రాజ్యాల్లో సిద్ధాంత రీత్యా సర్వాధికారాలున్న శాసనసభ ప్రాముఖ్యం క్రమేణా తగ్గిపోతుందని రాజనీతి శాస్త్రజ్ఞుల భావన. దీనికి అనేక కారణాలున్నాయి. కార్యనిర్వాహకశాఖ అనేక అధికారాలు సంతరించుకుంది. ఆర్థిక, సామాజిక రంగాల్లో సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి రాజ్యాంగపరంగా, చట్టరీత్యా కార్యనిర్వాహకశాఖ నూతన అధికారాలను సంపాదించుకుంది.

సాంకేతిక, వైజ్ఞానిక అభివృద్ధి ఫలితంగా కొత్త విషయాలు ప్రభుత్వ విధానాల్లో- చోటు చేసుకోవడంలో వాటిని అర్థం చేసుకునే సాధారణ సామర్థ్యం శాసనసభలకు పూర్తిగా లేకపోవడంవల్ల శాసనసభ కార్యనిర్వాహక శాఖపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.

ఉన్నత రాజకీయ పదవులన్నీ ఎన్నికల ద్వారా భర్తీ కావడం ప్రారంభమైన తరువాత ప్రభుత్వం ప్రత్యక్షంగా ప్రజలను ప్రభావితం చేసే ప్రాముఖ్యాన్ని పొందింది. దీనితో శాసనసభతో సంబంధం లేకుండా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను ప్రభుత్వం ఏర్పరచుకుంటుంది.

దాని వల్ల శాసనసభ ప్రాముఖ్యం తగ్గడానికి మరోకారణం శాసనసభ ఒక సాధారణ చట్టాన్ని స్థూలంగా ఆమోదించి దానికి సంబంధించిన వివరాలను భర్తీ చేయడానికి కార్య నిర్వాహకశాఖకు ఇచ్చే అధికారమే ‘నియోజిత శాసనం’ ప్రణాళికలు సంక్షేమ పథకాలు అమలు పరిచేందుకు కార్య నిర్వాహకశాఖ నియోజిత శాసనాధికారాన్ని ఉపయోగిస్తుంది.

బలమైన ప్రతిపక్షం లేకపోవడం, పార్లమెంటు సమావేశాల కాలం తగ్గిపోవడం, అధికార పక్షం బాధ్యతారహితంగా ప్రవర్తించడం, సభ్యులు అనుచితంగా ప్రవర్తించడం శాసనసభ ప్రాముఖ్యాన్ని తగ్గిస్తున్నాయని రాజనీతి శాస్త్రజ్ఞులు ఆందోళన చెందుతున్నారు.

ప్రశ్న 2.
కార్యనిర్వాహక శాఖ ప్రాముఖ్యం పెరగడానికి గల కారణాలు చర్చించండి.
జవాబు.
ఆధునిక కాలంలో కార్యనిర్వాహకవర్గం అధికారాల, విధుల పరిధి నానాటికీ విస్తృతమవుతుంది. ఈ స్థితికి కింది కారణాలు ప్రధానమైనవిగా పేర్కొనవచ్చు.

1. సంక్షేమ రాజ్య భావన:
సమాజ సంక్షేమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. పరిశ్రమలు, ఉత్పత్తి పంపిణీ, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, విద్య, వైద్య సేవలు మొదలైనవన్నీ కార్యనిర్వాహకశాఖ పరిధి కిందకు వచ్చాయి. ఈ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేయడం వల్ల కార్యనిర్వాహక వర్గం పరిధి పెరుగుతుంది.

2. పారిశ్రామికీకరణ :
పారిశ్రామిక విస్తరణ కూడా కార్యనిర్వాహకవర్గం పాత్రను పెంచింది. మౌలిక పరిశ్రమలను, భారీ పరిశ్రమలను జాతీయం చేయడంలో కార్యనిర్వాహకవర్గం కీలకపాత్ర వహిస్తుంది. జాతీయం చేసిన పరిశ్రమల నిర్వహణ కూడా కార్యనిర్వాహకశాఖ విధుల పరిధిని పెంచింది.

3. నియోజిత శాసన నిర్మాణం :
కార్యనిర్వాహక వర్గం శాసనసభతో పాటు ఒక రకమైన శాసనాలు చేస్తుంది. ఇట్లాంటి శాసనాలను నియోజిత శాసనాలు అంటారు. శాసన సభ ఆమోదించిన శాసనాలను అమలు చేసే సందర్భంగా కార్యనిర్వాహకవర్గం రకరకాల నిబంధనలు, నియమాలు చెయ్యాలి. ఈ విధంగా రూపొందిన శాసనాలను రెండో తరహా శాసనాలు అని కూడా అంటారు. రానురాను ప్రభుత్వ పరిధి బాగా విస్తరిస్తున్నది.

తత్ఫలితంగా ప్రభుత్వం ఎన్నో రంగాల్లో ఎన్నో శాసనాలు చేయవలసి వస్తుంది. అన్ని శాసనాలు చేయడానికి సమయం శాసనసభలకు ఉండదు. అంతేగాక అన్ని శాసనాల తయారీకి కావలసిన నైపుణ్యం శాసనసభకు వుండదు. ఈ కారణం దృష్ట్యా శాసనాధికారాలు కార్యనిర్వాహకశాఖకు వదిలి పెట్టడం తప్పనిసరైంది.

4. రాజకీయ పార్టీల పనితీరు :
రాజకీయ పార్టీల పనితీరు కూడా కార్యనిర్వాహక వర్గ ప్రాధాన్యం పెరుగుదలకు కారణం. రాజకీయ పార్టీల విస్తృత జాతీయ ప్రయోజనాలకోసం గాక సంకుచిత ప్రయోజనాల కోసం చాలాసార్లు పనిచేయడం మనం చూస్తున్నదే.

5. ప్రణాళికారచన :
నేడు ప్రతి రాజ్యం పెద్ద ఎత్తున ప్రణాళికారచనకు పూనుకుంటున్నది. కార్యనిర్వాహక వర్గం దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయి నుంచి స్థానిక స్థాయి వరకు ప్రణాళికలను కార్యసాధకంగా అమలు చేయడం కార్యనిర్వాహక శాఖ విధిగా మారింది. దీనితో కార్యనిర్వాహక శాఖకు విస్తృత అధికారాలు చెలాయించే అవకాశం ఏర్పడుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 3.
న్యాయసమీక్షాధికారాన్ని చర్చించండి.
జవాబు.
శాసనసభ చేసిన చట్టాలను రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయో లేదా అని సమీక్ష చేసే అధికారమే న్యాయసమీక్షాధికారం. రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలను లేదా నిర్ణయాలను విచారించి అవి రాజ్యాంగ విరుద్ధమైనట్లయితే వాటిని రద్దుచేసే అధికారం పార్లమెంటు, అసెంబ్లీ మండలిలు, పరిషత్లు మొదలయిన శాసనాలను సమీక్ష చేయడం. రాజ్యాంగ వ్యతిరేకమైన అన్ని చట్టాలను న్యాయస్థానాలు కొట్టివేయడం జరుగుతుంది. దీన్ని న్యాయ సమీక్షాధికారం అంటారు.

చట్టాలకు మాత్రమే న్యాయ సమీక్షాధికారం పరిమితం కాదు. కార్యనిర్వాహకశాఖ చేసే కేంద్ర, రాష్ట్ర తుది స్థానిక సంస్థలపై శాసనసభలో చేసిన చట్టాలు మొదలైన అన్నిటికీ ఇది వర్తిస్తుంది. ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. రాజ్యాంగ పరిమితులకు లోనై మౌలిక శాసనం, చట్టాలు ఉంటాయి. రాజ్యాంగం సమర్థించిన ప్రతీ ప్రక్రియ ‘అన్ని చట్టాలు’, తీర్పులు అన్నీ కూడా రాజ్యాంగ పరిధిలోనే ఉంటాయి. న్యాయసమీక్ష అన్ని దేశాలలో కనిపించదు.

న్యాయ సమీక్ష అనే భావన అమెరికాలో ఆవిర్భవించింది. ఇది 1803లో జస్టిస్ మార్షల్ మార్బరీ వర్సెస్ మాడిసన్ వివాదంలో అప్పటి అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శాసనసభ చేసిన చట్టాలు రాజ్యాంగమౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉన్నందువల్ల అవి చెల్లవనే చారిత్రాత్మక తీర్పునిచ్చాడు.

ఈ తీర్పు ప్రకారం శాససభ రూపొందించే చట్టాలు రాజ్యాంగ చట్టానికి అనుగుణంగా ఉన్నాయా లేవాయని పరీక్షించే అధికారం న్యాయస్థానాలకుందని మొట్టమొదటిసారిగా స్పష్టమైంది. రాజ్యాంగపరిధికి లోబడి చేసే చట్టాలు చేసేముందు వివిధ సిద్ధాంతాలను, సూత్రాలను, భావనలన్నిటిని సమీక్షచేసి మాత్రమే చట్టాలు రూపొందించాలి.

న్యాయ సమీక్షా అధికారం క్రింది సిద్ధాంతాలపై ఆధారపడి ఉంది.

  1. శాసన సామర్థ్య సిద్ధాంతం
  2. అధికార పృథక్కరణ సిద్ధాంతం
  3. రాజ్యాంగ చైతన్యతా సిద్ధాంతం
  4. క్రియాశీల సిద్ధాంతం
  5. అనుభవాత్మక నిర్ణయ సిద్ధాంతం
  6. రాజ్యాంగ పురోభావనా సిద్ధాంతం.

రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా శాసనసభలు చేసే చట్టాలే కాబట్టి న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి. కాని న్యాయసమీక్ష పరిధిలోకి రాదు అని ఏ రాజ్యాంగ సవరణ చట్టం చెప్పి ఉంటే ఆ సవరణ చట్టం న్యాయసమీక్ష పరిధిలోకి రాదు. దాన్ని నిర్ణయించేది పార్లమెంట్ అయితే రాజ్యాంగం సవరణ చట్టాలపై న్యాయ సమీక్షాధికారం లేకుండా చేసే శక్తి అధికారం పార్లమెంటుకు ఉందా అనేది ఇటీవల తలెత్తిన ప్రశ్న.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 4.
సమన్యాయపాలనపై చిన్న వ్యాసం రాయండి.
జవాబు. బ్రిటీష్ రాజ్యాంగ విశిష్ఠ లక్షణాలలో సమన్యాయపాలన ఒకటి . సమన్యాయ పాలన తొలుత ఇంగ్లండులో ప్రారంభమైంది. తరువాత ఇండియా అమెరికాలతో సహా అనేక రాజ్యాలు ఈ భావనను అనుసరించాయి. ఎ.వి. డైసీ తన ‘లా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్’ అనే గ్రంథంలో సమన్యాయపాలన భావన గురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వడమైనది. డైసీ ప్రకారం సమన్యాయపాలన అంటే చట్టం ముందు అందరూ సమానులేననే విషయాన్ని సూచిస్తుంది.

చట్టం వ్యక్తుల మధ్య ఏ విధమైన విచక్షణను పాటించదు. ప్రధానమంత్రి మొదలుకొని కార్యాలయంలో నాలుగవ తరగతి ఉద్యోగి వరకు చట్టం ముందు అందరూ సమానులే అని ఈ సందర్భంలో ఎ.వి.డైసీ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం కూడా సమన్యాయ పాలనను రాజ్యాంగ మౌలిక లక్షణంగా గుర్తించింది. సమన్యాయపాలన రాజ్యాంగ మౌలిక నిర్మాణంగా భారత సుప్రీంకోర్టు పదేపదే ప్రకటించింది.

భారత రాజ్యాంగం మూడో భాగంలోని 14 నుండి 21 వరకు గల ప్రకరణలు సమన్యాయపాలన భావనను పొందుపరిచాయి. సమన్యాయపాలన భావన అనేది చట్టం ముందు అందరూ సమానులే, ఏ ఒక్కరు విచక్షణారహితంగా శిక్షకు గురికాకూడదు అనే సూత్రంపై ఆధారపడి వున్నది.

ప్రశ్న 5.
న్యాయశాఖ క్రియాశీలత అంటే ఏమిటి ?
జవాబు.
ముఖ్యంగా ఇతర ప్రభుత్వశాఖలు అన్యాయాలను సరిచేయడంలో వైఫల్యం చెందినప్పుడు న్యాయశాఖ క్రియాశీలత ప్రకారం, న్యాయమూర్తులు అన్యాయాలను సరిచేయడానికి తమ అధికారాలను ఉపయోగిస్తారు. పౌరహక్కులు, వ్యక్తిగత హక్కుల రక్షణ, రాజకీయ అన్యాయం, ప్రజానైతికతవంటి అంశాలపై సామాజిక విధానాన్ని రూపొందించడంలో న్యాయస్థానాలు చురుకైన పాత్రను పోషిస్తాయి.

శాసన, కార్యానిర్వాహక శాఖలు విధాన నిర్ణయీకరణ చేయటంలో న్యాయశాఖ క్రియాశీలత అనేది వాటికి పోటీగా ఒక రకమైన విధాన నిర్ణయీకరణే. ఈ అంశం న్యాయ సమీక్షకు సంబంధించినది. అంతిమంగా న్యాయశాఖ క్రియాశీలత స్ఫూర్తి సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా న్యాయశాఖ నిర్ణయాలను వేలవరించడంగా భావించాలి.

న్యాయశాఖ ప్రతి నిర్ణయం వెనుక, న్యాయశాఖ క్రియాశీలత, స్వీయ నియంత్రణ, నియంత్రణ అనే రెండు అంశాలు న్యాయ శాఖ త్వాన్ని, ప్రేరణను వివరిస్తాయి. న్యాయశాఖ క్రియాశీలత అనేది పూర్తిగా న్యాయశాఖ స్వీయ నియంత్రణకు వ్యతిరేకం. న్యాయశాఖ క్రియాశీలత చట్ట స్ఫూర్తిని, మారుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే, అదే న్యాయశాఖ స్వీయ నియంత్రణ అనేది చట్ట వివరణకు, శాసన ఆనవాయితీకి మాత్రమే ప్రాధాన్యతనిస్తుంది.

న్యాయశాఖ. క్రియాశీలత అనేది మారుతున్న సామాజిక పరిస్థితులనుదృష్టిలో పెట్టుకొనే గతిశీలక ప్రక్రియ. న్యాయశాఖ క్రియాశీలత అనే పదాన్ని 1947లో మొట్టమొదటగా అర్ధర్ క్లెసింగర్ జూనియర్ ప్రతిపాదించాడు. ‘బ్లాక్స్ ‘డిక్షనరీ’ ప్రకారం న్యాయశాఖ క్రియాశీలత అనేది న్యాయమూర్తులను సాంప్రదాయక ఆనవాయితీల నుంచి ప్రగతిశీల, నూతన సామాజిక నిర్ణయాలవైపు ప్రేరేపిస్తుంది.

న్యాయశాఖ క్రియాశీలత ప్రభుత్వాంగాల మధ్య సమతౌల్యతను బంగపరుస్తుందనే విమర్శ ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో శాసన నిర్మాణ ప్రక్రియ అనేది న్యాయశాఖ క్రియాశీలత ద్వారా ఒక కొత్త ఒరవడిని సంతరించుకుంది, మారుతున్న సామాజిక సందర్భంలో న్యాయశాఖ శాసనాన్ని వివరించడంలో ఒక ఆరోగ్యకరమైన ఒరవడిని ప్రారంభించింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ప్రభుత్వాంగాలు ఎన్ని ? అవి ఏవి ?
జవాబు.
ప్రభుత్వ అంగాలు మూడు. అవి

  1. శాసననిర్మాణశాఖ
  2. కార్యనిర్వాహకశాఖ
  3. న్యాయశాఖ.

శాసననిర్మాణ శాఖ శాసనాలను రూపొందిస్తుంది. కార్యనిర్వాహకశాఖ శాసనాలను అమలుచేస్తుంది. న్యాయశాఖ ఈ రెండు శాఖల మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరిస్తూ దేశ ప్రజలందరికి నిష్పక్షపాతంగా న్యాయాన్ని ప్రసాదిస్తుంది.

ప్రశ్న 2.
అధికార పృథక్కరణ సిద్ధాంతం అంటే ఏమిటి ?
జవాబు.
ఫ్రెంచి రచయిత అయిన మాంటెస్క్యూ తాను రచించిన ‘ద స్పిరిట్ ఆఫ్ లాస్’ అనే గ్రంథంలో అధికార వేర్పాటువాద సిద్ధాంతాన్ని పేర్కొనటం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వము యొక్క సర్వాధికారాలను మూడు ప్రభుత్వాంగాలైన శాసననిర్మాణశాఖ, కార్యనిర్వాహకశాఖ మరియు న్యాయశాఖల మధ్య విభజించాలి.

ప్రతి ప్రభుత్వాంగం తన పరిధిలోని అధికారాలపై తిరుగులేని పెత్తనాన్ని కలిగి ఉంటూ, మరొక అంగానికి చెందిన అధికారాల విషయంలో జోక్యం చేసుకోరాదు అని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 3.
బహుసభ్య కార్యనిర్వాహకవర్గం అంటే ఏమిటి ?
జవాబు.
దీనిలో అధికారం అనేకమంది చేతుల్లో వుంటుంది. ఉదాహరణకు మంత్రిమండలి. స్విట్జర్లాండ్లోని ఫెడరల్ కౌన్సిల్, పూర్వపు సోవియట్ యూనియన్లోని ప్రిసీడియం మొదలైనవి. ఈ పద్ధతి పార్లమెంటరీ ప్రభుత్వం వున్న దేశాలలోనూ కొన్ని పూర్వపు సమాఖ్య ప్రభుత్వాలలోనూ కొన్ని మార్పులతో కనిపిస్తుంది.

ప్రశ్న 4.
న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి అంటే ఏమిటి ?
జవాబు.
న్యాయశాఖ సక్రమంగా, స్వతంత్రంగా పనిచేయాలంటే దానికి శాసన శాఖతో కార్యనిర్వాహక శాఖతో సంబంధం ఉండరాదు. ఆ రెండు శాఖల జోక్యం న్యాయశాఖ విధి నిర్వహణలో ఉండకూడదు.

  1. న్యాయశాఖ స్వతంత్రతతో ఉండాలంటే న్యాయమూర్తుల నియామకం రాజకీయాలకు అతీతంగా జరగాలి.
  2. శక్తి సామర్థ్యాలు ప్రతిభావ్యుత్పత్తులు, స్వతంత్ర ఆలోచనాశక్తి ఉన్నవారిని సమర్థులను, అర్హతలున్నవారినీ న్యాయమూర్తులుగా నియమించాలి.
  3. న్యాయమూర్తులు స్వేచ్ఛగా వ్యవహరించాలంటే వారి ఉద్యోగ పరిస్థితులు ఆకర్షణీయంగా ఉండాలి.
  4. పదవిలో ఉన్నప్పుడు, పదవీ విరమణ చేసినప్పుడు వారికి తగిన రక్షణ ఉండాలి.
  5. పదవీ విరమణ తరువాత వేరే పదవుల కోసం ఎదురు చూడకుండా ఉండాలి. పదవీ విరమణ తరువాత ప్రభుత్వోద్యోగాల్లో చేరకూడదనే నియమం ఉండాలి. అప్పుడే వారు ఏ రకమైన ప్రలోభాలకు లోనుకారు.
  6. న్యాయమూర్తుల తీర్పులపై విమర్శ ఉండకూడదు. పై పద్ధతులు, నియమాలు పాటిస్తే న్యాయమూర్తులు ఎట్లాంటి ప్రలోభాలకు ఒత్తిడిలకు, భయాలకు లోనుకాకుండా స్వతంత్రంగా ఉండి న్యాయపాలన బాగా చేయగలరు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 5.
న్యాయ సమీక్ష అంటే ఏమిటి ?
జవాబు.
ప్రజాస్వామ్య దేశాల్లో న్యాయశాఖ రాజ్యాంగానికి సంరక్షణ కర్త. శాసనసభ, కార్యనిర్వాహక వర్గం తమతమ విధుల నిర్వహణలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ చర్యలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటిస్తుంది. రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు అమల్లోకి రాకుండా ఆజ్ఞలను జారీ చేస్తుంది. న్యాయస్థానాలకున్న ఈ అధికారాన్ని న్యాయ సమీక్షాధికారం అంటారు.

ప్రశ్న 6.
సెనేట్.
జవాబు.
అమెరికా సంయుక్త రాష్ట్రాల కేంద్ర శాసనశాఖ అయిన కాంగ్రెస్లోని ఎగువసభను సెనేట్. దీనిలో మొత్తం 100 మంది సభ్యులుంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొత్తం 50 కాగా ఒక్కో రాష్ట్రం నుంచి ఇద్దరు సభ్యులు ప్రతినిధులుగా ఎన్నుకోబడతారు.

ప్రశ్న 7.
రాష్ట్రాల కౌన్సిల్.
జవాబు.
భారత పార్లమెంటులోని ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా రాజ్యసభ అంటారు. ఇది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. వీరు పరోక్షంగా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదిలీ. విధానం ద్వారా ఎన్నుకోబడతారు. దీనిలో మొత్తం 250 సభ్యులుండగా వారిలో 238 సభ్యులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోబడతారు.

మిగిలిన 12 సభ్యులను కళలు, సాహిత్యం, సహకారం, సంఘసేవ, శాస్త్ర, సాంకేతిక రంగాలలోని ప్రముఖులను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు మొత్తం సభ్యులలో 1/3 వంతు మంది పదవీ విరమణ చేస్తారు, వారి స్థానంలో కొత్తవారు ఎన్నుకోబడతారు. ఒక్కో సభ్యుడు 6 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 8.
హౌస్ ఆఫ్ లార్డ్స్.
జవాబు.
బ్రిటన్ పార్లమెంట్లోని ఎగువసభను హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు. దీనిలో 800 మంది సభ్యులున్నారు. వారిని ప్రధానమంత్రి సిఫారసు మేరకు బ్రిటీష్ రాణి నియమిస్తారు.

ప్రశ్న 9.
పార్లమెంటరీ కార్యనిర్వాహకశాఖ.
జవాబు.
ఈ విధానంలో కార్యనిర్వాహక వర్గం శాసనసభలో సభ్యత్వాన్ని పొంది ఉండటమేకాక భారతదేశంలో వలే పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది.

ప్రశ్న 10.
ఏకశాసనసభ అంటే ఏమిటి ?
జవాబు.
శాసనశాఖ ఒకే సభను కలిగి వుంటే దానిని ఏకసభా విధానమని అంటారు. ఈ విధానంలో ఎగువసభ వుండదు. కేవలం ప్రజలచే ఎన్నుకోబడిన దిగువసభ మాత్రమే వుంటుంది. టర్కీ, స్వీడన్, డెన్మార్క్, బల్గేరియా దేశాలను ఏకసభా విధానానికి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 11 ప్రభుత్వాంగాలు

ప్రశ్న 11.
ద్విశాసనసభ అంటే ఏమిటి ?
జవాబు.
శాసనశాఖ రెండు సభలను కలిగి వుండటాన్ని ద్విశాసనసభా విధానం అంటారు. ఇందులో ఒకటి ఎగువ సభ కాగా రెండోది దిగువ సభ. ఉదా : బ్రిటన్, భారత్, అమెరికా దేశాలను ద్విసభా విధానానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారత పార్లమెంటులో రాజ్యసభ ఎగువసభ గాను లోక్సభ దిగువసభ గాను ఉన్నాయి.

TS Inter 1st Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 10th Lesson రాజ్యాంగం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 10th Lesson రాజ్యాంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాంగాన్ని నిర్వచించి, రాజ్యాంగం యొక్క లక్షణాలను వివరించండి.
జవాబు.
పరిచయం :
ఆధునిక కాలంలో ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగముంటుంది. రాజ్యాంగంలో రాజ్యానికి సంబంధించిన అన్ని వ్యవస్థల అధికారాలు, విధులు మొదలైన విషయాలను స్పష్టంగా, నిర్దిష్టంగా, క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు క్రమబద్ధంగా జరగడానికి రాజ్యాంగం చాలా ముఖ్యం.

అర్థం :
Constitution అనే ఇంగ్లీషు పదం “Constitutio” అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో కాన్స్టిట్యూషియో. అంటే “స్థాపించు” అని అర్థం.

నిర్వచనాలు :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

“రాజ్యాంగం మౌలిక లక్షణాలు (Essential features of the Constitution) :
సాధారణంగా రాజ్యాంగాన్ని రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, విషయ నిపుణులు మొదలైనవారు రూపొందిస్తారు. ప్రతి రాజ్యాంగానికి కొన్ని మౌళిక లక్షణాలు ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు :

1. పీఠిక (Preamble) :
ప్రతి రాజ్యాంగం ఒక పీఠికను కలిగి ఉంటుంది. ఆ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలు, ఆకాంక్షలను వ్యక్తీకరిస్తుంది. పీఠిక రాజ్యాంగానికి ఆత్మగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపు ఆవశ్యక లక్షణాలలో పీఠిక అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు.

2. స్పష్టత (Clarity) :
స్పష్టత అనేది రాజ్యాంగపు మరొక ఆవశ్యక లక్షణం. రాజ్యపాలన, ప్రభుత్వ విధానాలను రాజ్యాంగం స్పష్టంగా వివరిస్తుంది. రాజ్యాంగం’ ఎంతో సులభశైలిలో, స్పష్టమైన భాషలో లిఖించబడి ఉంటుంది.

కాబట్టి రాజ్యాంగంలోని వివిధ అంశాలను అర్థం చేసుకోవడంలో ఏ రకమైన సందేహాలకు గానీ, అస్పష్టతకు గానీ అవకాశం ఉండదు. సమాజంలోని అన్ని వర్గాలకు ఎంతగానో సంతృప్తిని కలిగిస్తుంది. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు తరువాతే రాజ్యాంగ రూపకల్పన జరుగుతుంది.

3. ప్రాథమిక హక్కులు (Fundamental Rights) :
ప్రతి రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కులను కలిగి ఉంటుంది. ప్రాథమిక హక్కులనేవి పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షించుటకు ఉద్దేశించినవి. విభిన్న రంగాలలో పౌరులు తమ వ్యక్తిత్వాలను పెంపొందించుకొనేందుకు ఈ హక్కులు వీలు కల్పిస్తాయి. రాజ్యంలో పౌరులు సంతోషకరమైన, గౌరవప్రదమైన జీవనాన్ని గడిపేందుకు ఇవి సహాయపడతాయి.

4. క్లుప్తత (Brevity) :
క్లుప్తత అనేది రాజ్యాంగపు లక్షణాలలో ముఖ్యమైనది. రాజ్యాంగ అంశాలను అర్థం చేసుకోవడంలోను వాటిని వ్యాఖ్యానించడంలోనూ వ్యక్తులలో గందరగోళాన్ని నివారిస్తుంది. రాజ్యాంగంలో అనవసర అంశాలు చేర్చబడవు. కాబట్టి రాజ్యాంగం అనేది క్లుప్తంగా ఉంటుంది. అందులో మితిమీరిన సంఖ్యలో ప్రకరణలు, అధికరణలు, ఇతర నిబంధనలు ఉండవు. రాజ్యాంగంలో లెక్కకు మించిన వివరణలు ఉంటే వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

5. సరళత్వం (Flexibility) :
ప్రజల ఆకాంక్షలను ఎప్పటికప్పుడు గ్రహించి, వాటిని ఆచరణలో పెట్టేందుకు రాజ్యాంగం సరళమైనదిగా ఉండాలి. అవసరమైనప్పుడు రాజ్యాంగంలోని ప్రకరణలను సవరించే వీలు ఉండాలి. అయితే రాజ్యాంగంలోని అంశాలను పలుసార్లు సవరించకూడదు.

అప్పుడే రాజ్యాంగస్ఫూర్తి పదిలంగా ఉంటుంది. ‘ అలాగే ఆధునిక రాజ్యాలలో రాజ్యాంగంలోని అంశాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరించేందుకు అవకాశం ఉండాలి. అనుభవజ్ఞులు, మేధావులు రాజ్యాంగంలోని దోషాలను వెల్లడించినప్పుడు, వాటిని రాజ్యాంగం నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.

6. శాశ్వతత్వం (Permanence) :
రాజ్యాంగం ముఖ్య లక్షణాలలో శాశ్వతత్వం ఒకటి. మొత్తం జాతి సంక్షేమం దృష్ట్యా రాజ్యాంగం సుదీర్ఘకాలంపాటు పనిచేసే విధంగా కొన్ని విలువలు కలిగి ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగమనేది రాజ్యంతో సహా అనేక రాజకీయ సంస్థల నిర్మాణానికి – విధులకు ప్రతీకగా ఉంటుంది. ప్రజల ఆచార సంప్రదాయాలను రాజ్యాంగం గౌరవిస్తూ సామాజిక విలువలతో మమేకమై ఉండాలి.

7. రాజ్యాంగ సవరణ పద్ధతి (Mode of Amendment) :
రాజ్యాంగంలోని అంశాలను సవరించే పద్ధతిని ప్రతి రాజ్యాంగం సూచిస్తుంది. రాజ్యాంగం రాజ్యంలో నెలకొనే సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. రాజ్యాంగ అంశాల సవరణ పద్ధతుల గురించి రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయంలో వివరించటం జరుగుతుంది.

సాధారణంగా రాజ్యాంగ అంశాలను మూడు రకాలుగా సవరించవచ్చు. అవి :

  1. కఠినమైన చర్య పద్ధతి
  2. సరళమైన పద్ధతి
  3. పాక్షిక కఠినమైన, పాక్షిక సరళమైన పద్ధతి.

మొత్తం మీద ప్రతి రాజ్యాంగంలో సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ ఉంటాయి. పర్యవసానంగా రాజ్యంలో ప్రభుత్వం స్థిరత్వం కలిగి ఉంటూ అందరి ఆమోదాన్ని పొందగలుగుతుంది. రాజ్యాంగంలోని సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ రాజకీయ వ్యవస్థ సాఫీగా, సమర్థవంతంగా పనిచేసేటట్లు దోహదపడతాయని అనేక మంది రాజ్యాంగవేత్తలు వర్ణించారు.

8. వివరణాత్మకమైనది (Explanatory):
రాజ్యాంగం వివరణాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదే విధంగా ప్రజలకు, ప్రభుత్వానికి, రాజ్యానికి సంబంధించిన అనేక అంశాలను రాజ్యాంగంలో ప్రస్తావించి చర్చించడమవుతుంది. రాజ్యనిర్మాణం, దాని కార్యకలాపాల పరిధి, విధులకు సంబంధించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పేర్కొనడం జరుగుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 2.
రాజ్యాంగాన్ని నిర్వచించి దృఢ – అదృఢ (సరళ) రాజ్యాంగాల మధ్యగల తేడాలను పేర్కొనండి.
జవాబు.
నిర్వచనం :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

దృఢ రాజ్యాంగం (లేదా) పరుష రాజ్యాంగం :
రాజ్యాంగంలోని అంశాలను అంత సులభంగా సవరించడం సాధ్యంకాని రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. ‘దృఢ రాజ్యాంగం అమలులో ఉన్న రాజ్యాలలో సాధారణ చట్టాల తయారీకి, రాజ్యాంగ చట్టాల రూపకల్పనకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.

దృఢ రాజ్యాంగంలోని ‘అంశాలను సవరించేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. రాజ్యాంగ అంశాల సవరణలో దృఢ రాజ్యాంగం ఎంతో కాఠిన్యతను ప్రదర్శిస్తుంది. దృఢ రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. అమెరికాతో పాటుగా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి రాజ్యాలలో దృఢ రాజ్యాంగాలు వాడుకలో ఉన్నాయి.

సరళ లేదా అదృఢ రాజ్యాంగం :
రాజ్యాంగంలోని అంశాలను అతిసులభంగా మార్చేందుకు అవకాశం ఉన్నట్లయితే దానిని అదృఢ రాజ్యాంగం అంటారు. అదృఢ రాజ్యాంగంలోని అంశాల సవరణకు ప్రత్యేక రాజ్యాంగ సవరణ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం లేదు.

సాధారణ చట్టాల వలె రాజ్యాంగంలోని అంశాలను సైతం సవరించే వీలు ఉంటుంది. అందువల్ల అదృఢ రాజ్యాంగంలో సాధారణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అదృఢ రాజ్యాంగాలనేవి ప్రాచీన కాలంలో వాడుకలో ఉండేవి. అదృఢ రాజ్యాంగానికి బ్రిటన్ మంచి ఉదాహరణ.

సరళ లేదా అదృఢ మరియు దృఢ లేదా పరుష రాజ్యాంగాల మధ్య వ్యత్యాసాలు :

సరళ లేదా అదృఢ రాజ్యాంగం (Flexible constitution)పరుష లేదా దృఢ రాజ్యాంగం (Rigid Constitution)
1. రాజ్యాంగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరగదు.1. రాజ్యాగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది.
2. రాజ్యాంగాన్ని సులభంగా సవరించవచ్చు.2. రాజ్యాంగాన్ని సవరించేందుకు కఠినమైన పద్ధతి ఉంటుంది.
3. ప్రజల హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను న్యాయ శాఖ కాపాడగలుగుతుంది.3. ప్రజల హక్కులు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను న్యాయశాఖ కాపాడలేకపోవచ్చు.
4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది కాదు.4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది.
5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇవ్వదు.5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇస్తుంది.
6. ఈ రాజ్యాంగంలో శాసనసభకు అపరిమితమైన అధికారాలు ఉంటాయి.6. శాసనసభ అధికారాలు పరిమితంగా ఉంటాయి.
7. ఇది మిక్కిలి అస్థిరమైనది.7. ఇది ఎంతో స్థిరత్వంతో కూడుకొని ఉంటుంది.
8. రాజ్యాంగ చట్టాలకు, సాధారణ చట్టాలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు.8. రాజ్యాంగ చట్టాలు, సాధారణ చట్టాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
9. రాజ్యంలో ఒకేరకమైన చట్టాలు ఉంటాయి.9. రాజ్యంలో రెండు రకాల చట్టాలు ఉంటాయి. అవి : 1) రాజ్యాంగ చట్టాలు, 2) సాధారణ చట్టాలు. రాజ్యాంగ చట్టాలు సాధారణ చట్టాలపై ఆధిక్యతను కలిగి ఉంటాయి.
10. రాజకీయ పురోగతి సాధించిన రాజ్యాలకు అదృఢ రాజ్యాంగం అనువైనది.10. అభివృద్ధి చెందుతున్న రాజ్యాలకు దృఢ రాజ్యాంగం అనువైనది.
11. విప్లవాలకు వీలు కల్పించదు.11. విప్లవాలకు అవకాశం ఇస్తుంది.
12. చిన్న రాజ్యాలకు తగినది.12. పెద్ద రాజ్యాలకు సరైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాంగాన్ని నిర్వచించి, దాని లక్షణాలను పేర్కొనండి.
జవాబు.
నిర్వచనాలు :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

రాజ్యాంగం మౌలిక లక్షణాలు (Essential features of the Constitution) :
సాధారణంగా రాజ్యాంగాన్ని రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, విషయ నిపుణులు మొదలైనవారు రూపొందిస్తారు. ప్రతి రాజ్యాంగానికి కొన్ని మౌళిక లక్షణాలు ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు :

1. పీఠిక (Preamble) :
ప్రతి రాజ్యాంగం ఒక పీఠికను కలిగి ఉంటుంది. ఆ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలు, ఆకాంక్షలను వ్యక్తీకరిస్తుంది. పీఠిక రాజ్యాంగానికి ఆత్మగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపు ఆవశ్యక లక్షణాలలో పీఠిక అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు.

2. స్పష్టత (Clarity) :
స్పష్టత అనేది రాజ్యాంగపు మరొక ఆవశ్యక లక్షణం. రాజ్యపాలన, ప్రభుత్వ విధానాలను రాజ్యాంగం స్పష్టంగా వివరిస్తుంది. రాజ్యాంగం ఎంతో సులభశైలిలో, స్పష్టమైన భాషలో లిఖించబడి ఉంటుంది. కాబట్టి రాజ్యాంగంలోని వివిధ అంశాలను అర్థం చేసుకోవడంలో ఏ రకమైన సందేహాలకు గానీ, అస్పష్టతకు గానీ అవకాశం ఉండదు. సమాజంలోని అన్ని వర్గాలకు ఎంతగానో సంతృప్తిని కలిగిస్తుంది. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తరువాతే రాజ్యాంగ రూపకల్పన జరుగుతుంది.

3. ప్రాథమిక హక్కులు (Fundamental Rights) :
ప్రతి రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కులను కలిగి ఉంటుంది. ప్రాథమిక హక్కులనేవి పౌరుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పరిరక్షించుటకు ఉద్దేశించినవి. విభిన్న రంగాలలో పౌరులు తమ వ్యక్తిత్వాలను పెంపొందించుకొనేందుకు ఈ హక్కులు వీలు కల్పిస్తాయి. రాజ్యంలో పౌరులు సంతోషకరమైన, | గౌరవప్రదమైన జీవనాన్ని గడిపేందుకు ఇవి సహాయపడతాయి.

4. క్లుప్తత (Brevity) :
క్లుప్తత అనేది రాజ్యాంగపు లక్షణాలలో ముఖ్యమైనది. రాజ్యాంగ అంశాలను అర్థం చేసుకోవడంలోను వాటిని వ్యాఖ్యానించడంలోనూ వ్యక్తులలో గందరగోళాన్ని నివారిస్తుంది. రాజ్యాంగంలో అనవసర అంశాలు చేర్చబడవు. కాబట్టి రాజ్యాంగం అనేది క్లుప్తంగా ఉంటుంది. అందులో మితిమీరిన సంఖ్యలో ప్రకరణలు, అధికరణలు, ఇతర నిబంధనలు ఉండవు. రాజ్యాంగంలో లెక్కకు మించిన వివరణలు ఉంటే వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

5. సరళత్వం (Flexibility):
ప్రజల ఆకాంక్షలను ఎప్పటికప్పుడు గ్రహించి, వాటిని ఆచరణలో పెట్టేందుకు రాజ్యాంగం సరళమైనదిగా ఉండాలి. అవసరమైనప్పుడు రాజ్యాంగంలోని ప్రకరణలను సవరించే వీలు ఉండాలి. అయితే రాజ్యాంగంలోని అంశాలను పలుసార్లు సవరించకూడదు.

అప్పుడే రాజ్యాంగస్ఫూర్తి పదిలంగా ఉంటుంది. అలాగే ఆధునిక రాజ్యాలలో రాజ్యాంగంలోని అంశాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరించేందుకు అవకాశం ఉండాలి. అనుభవజ్ఞులు, మేధావులు రాజ్యాంగంలోని దోషాలను వెల్లడించినప్పుడు, వాటిని రాజ్యాంగం నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.

6. శాశ్వతత్వం (Permanence) :
రాజ్యాంగం ముఖ్య లక్షణాలలో శాశ్వతత్వం ఒకటి. మొత్తం జాతి సంక్షేమం దృష్ట్యా రాజ్యాంగం సుదీర్ఘకాలంపాటు పనిచేసే విధంగా కొన్ని విలువలు కలిగి ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగమనేది రాజ్యంతో సహా అనేక రాజకీయ సంస్థల నిర్మాణానికి – విధులకు ప్రతీకగా ఉంటుంది. ప్రజల ఆచార సంప్రదాయాలను రాజ్యాంగం గౌరవిస్తూ సామాజిక విలువలతో మమేకమై ఉండాలి.

7. రాజ్యాంగ సవరణ పద్ధతి (Mode of Amendment) :
రాజ్యాంగంలోని అంశాలను సవరించే పద్ధతిని ప్రతి రాజ్యాంగం సూచిస్తుంది. రాజ్యాంగం రాజ్యంలో నెలకొనే సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. రాజ్యాంగ అంశాల సవరణ పద్ధతుల గురించి రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయంలో వివరించటం జరుగుతుంది. సాధారణంగా రాజ్యాంగ అంశాలను మూడు రకాలుగా సవరించవచ్చు. అవి :

  1. కఠినమైన చర్య పద్ధతి
  2. సరళమైన పద్ధతి
  3. పాక్షిక కఠినమైన, పాక్షిక సరళమైన పద్ధతి.

మొత్తం మీద ప్రతి రాజ్యాంగంలో సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ ఉంటాయి. పర్యవసానంగా రాజ్యంలో ప్రభుత్వం స్థిరత్వం కలిగి ఉంటూ అందరి ఆమోదాన్ని పొందగలుగుతుంది. రాజ్యాంగంలోని సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ రాజకీయ వ్యవస్థ సాఫీగా, సమర్థవంతంగా పనిచేసేటట్లు దోహదపడతాయని అనేక మంది రాజ్యాంగవేత్తలు వర్ణించారు.

8. వివరణాత్మకమైనది (Explanatory):
రాజ్యాంగం వివరణాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదే విధంగా ప్రజలకు, ప్రభుత్వానికి, రాజ్యానికి సంబంధించిన అనేక అంశాలను రాజ్యాంగంలో ప్రస్తావించి చర్చించడమవుతుంది. రాజ్యనిర్మాణం, దాని కార్యకలాపాల పరిధి, విధులకు సంబంధించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పేర్కొనడం జరుగుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 2.
లిఖిత రాజ్యాంగం ప్రయోజనాలు, లోపాలు ఏవి ?
జవాబు.
లిఖిత రాజ్యాంగం (Written Constitution) : లిఖిత రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగ పరిషత్తు లేదా ప్రత్యేక సదస్సు రూపొందిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక నియమ నిబంధనలు ఈ రాజ్యాంగంలో ఉంటాయి. లిఖిత రాజ్యాంగానికి భారత రాజ్యాంగం ఒక చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగాన్ని పరిగణించడమైనది.

ప్రయోజనాలు (Merits) :

  1. లిఖిత రాజ్యాంగం మిక్కిలి సులభమైనది. రాజ్యంలోని వివిధ సంస్థల నిర్మాణ, నిర్వహణలను అవగాహన చేసుకోవడంలో లిఖిత రాజ్యాంగం ‘ఏ విధమైన గందరగోళానికి, అస్పష్టతలకు అవకాశం ఇవ్వదు.
  2. లిఖిత రాజ్యాంగం కొంతమేరకు కఠిన స్వభావాన్ని కలిగి ఉంటుంది. దాంతో అది రాజకీయ స్థిరత్వాన్ని అందించగలుగుతుంది.
  3. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతుంది.
  4. కేంద్ర, రాష్ట్రాల మధ్య న్యాయమైన రీతిలో అధికారాల పంపిణి ద్వారా సమతౌల్యతను పాటిస్తుంది..
  5. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది. ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వానికి గుర్తుచేస్తుంది.
  6. ప్రభుత్వ అధికారాలపై కొన్ని పరిమితులను విధిస్తుంది.
  7. సమాఖ్యవ్యవస్థ పవిత్రతను, స్ఫూర్తిని కాపాడుతుంది.

లోపాలు (Demerits) :

  1. లిఖిత రాజ్యాంగం మెరుగైన ప్రభుత్వాన్ని అందించలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలపై ఆ రాజ్యాంగం అనేక ఆంక్షలను విధిస్తుంది..
  2. లిఖిత రాజ్యాంగపు కఠిన స్వభావం రాజ్యం అభివృద్ధికి దోహదపడదు.
  3. ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా ఆ రాజ్యాంగంలోని అంశాలను సవరించడం సాధ్యం కాదు. దాంతో జాతి పురోగతి మందకొడిగా సాగుతుంది.
  4.  న్యాయశాఖ ఆధిపత్యానికి లిఖిత రాజ్యాంగం అవకాశం ఇస్తుంది.
  5. ప్రభుత్వాంగాల మధ్య ఘర్షణలకు వీలు కల్పిస్తుంది.
  6. సంక్షేమ రాజ్యస్థాపనకు అనుకూలం కాదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 3.
అలిఖిత రాజ్యాంగం ప్రయోజనాలు, లోపాలను తెలపండి.
జవాబు.
అలిఖిత రాజ్యాంగం (Unwritten Constitution) :
అలిఖిత రాజ్యాంగం అనేది ప్రత్యేక రాతప్రతిలో పేర్కొనబడని రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగం అనేక ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా ఏర్పడినది. వీటినే శాసనాలకు ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇటువంటి రాజ్యాంగం అత్యంత ప్రాచీనమైన, చట్టబద్దమైన పాలనకు అవకాశం కల్పిస్తుందని పలువురు భావించారు.

18వ శతాబ్దం వరకు ప్రపంచంలో అనేక రాజ్యాలలో రాజ్యాంగబద్ధమైన పాలనకు ఇటువంటి రాజ్యాంగాలు ఆధారంగా ఉంటూ వచ్చాయి. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో శాసనబద్ధమైన పాలనకు ఈ రాజ్యాంగాలు వీలు కల్పించాయి.

బ్రిటన్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణ. బ్రిటన్లో చట్టాలన్నీ ఆచారాలు, సంప్రదాయాలు, వాడుకలు, అలవాట్ల ఆధారంగా రూపొందించబడ్డాయి.

ప్రయోజనాలు (Merits) :

  1. ప్రగతిశీలక శాసన నిర్మాణానికి అలిఖిత రాజ్యాంగం దోహదపడుతుంది. ఇటువంటి రాజ్యాంగం అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది.
  2. అలిఖిత రాజ్యాంగం కాలానుగుణంగా సంభవించిన పరిణామాలకు ప్రతీకగా మార్పు చెందుతూ ఉంటుంది. రాజకీయ వ్యవస్థను ఉత్తమమైందిగా తీర్చిదిద్దేందుకు వీలు కల్పిస్తుంది.
  3. అలిఖిత రాజ్యాంగంలోని అంశాలు వ్యాకోచ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఈ రాజ్యాంగంలో మార్పులను సులభంగా ప్రవేశపెట్టవచ్చు.
  4. ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగంలోని అంశాలను సవరించుకొనే వీలుంటుంది.
  5. అలిఖిత రాజ్యాంగం అవాంఛనీయమైన విప్లవాలు, ఇతర ఆందోళనలకు అవకాశం ఇవ్వదు. ప్రజల డిమాండ్లను పరిష్కరించే వీలు ఈ రాజ్యాంగం కల్పిస్తుంది.

లోపాలు (Demerits) :

  1. అలిఖిత రాజ్యాంగంలోని అంశాలను అధికారంలో ఉన్న పార్టీ స్వీయ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తరచుగా సవరించే అవకాశం ఉంటుంది. దాంతో రాజ్యంలో రాజకీయ సుస్థిరతకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది.
  2. అలిఖిత రాజ్యాంగం న్యాయమూర్తుల చేతిలో ఆటబొమ్మగా మారే అవకాశాలు ఎక్కువ. న్యాయమూర్తులు యధేచ్ఛగా రాజ్యాంగంలోని అంశాలను వ్యాఖ్యానించే అవకాశం ఉంటుంది.
  3. ప్రజాస్వామ్య రాజ్యాలకు అలిఖిత రాజ్యాంగం అనుకూలమైనది కాదు.
  4. సమాఖ్య రాజ్యాలకు ఇటువంటి రాజ్యాంగం సరిపోదు.
  5. ప్రజల హక్కులు, స్వాతంత్ర్యాలకు అలిఖిత రాజ్యాంగం రక్షణ కల్పించడంలో విఫలమవుతుంది.
  6. రాజ్యాంగంలోని అంశాలు తరచుగా సవరణలకు లోనవుతాయి.
  7. అలిఖిత రాజ్యాంగం మిక్కిలి లాంఛనప్రాయమైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 4.
లిఖిత, అలిఖిత రాజ్యాంగాల మధ్య తేడాలను తెలపండి.
జవాబు.
లిఖిత రాజ్యాంగం :
లిఖిత రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగ పరిషత్తు లేదా ప్రత్యేక సదస్సు రూపొందిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక నియమ నిబంధనలు ఈ రాజ్యాంగంలో ఉంటాయి. లిఖిత రాజ్యాంగానికి భారత రాజ్యాంగం ఒక చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగాన్ని పరిగణించడమైనది.

అలిఖిత రాజ్యాంగం :
అలిఖిత రాజ్యాంగం అనేది ప్రత్యేక రాతప్రతిలో పేర్కొనబడని రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగం అనేక ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా ఏర్పడినది. వీటినే శాసనాలకు ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇటువంటి రాజ్యాంగం అత్యంత ప్రాచీనమైన, చట్టబద్ధమైన పాలనకు అవకాశం కల్పిస్తుందని పలువురు భావించారు.

18వ శతాబ్దం వరకు ప్రపంచంలో అనేక రాజ్యాలలో రాజ్యాంగబద్ధమైన పాలనకు ఇటువంటి రాజ్యాంగాలు ఆధారంగా ఉంటూ వచ్చాయి. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో శాసనబద్ధమైన పాలనకు ఈ రాజ్యాంగాలు వీలు కల్పించాయి.

లిఖిత, అలిఖిత రాజ్యాంగాల మధ్య కింద పేర్కొన్న వ్యత్యాసాలను ప్రతి ఒక్కరు అత్యంత సులభంగా గుర్తించవచ్చు.

లిఖిత రాజ్యాంగం (Written Constitution)అలిఖిత రాజ్యాంగం (Unwritten Constitution)
1. లిఖిత రాజ్యాంగం అనేది ఒక రాత ప్రతి లేదా కొన్ని నిర్ణీత రాతప్రతులతో రాయబడి ఉంటుంది. ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఈ రాజ్యాంగం నియంత్రించేందుకు కొన్ని నియమ నిబంధనలను సూచిస్తుంది.1. అలిఖిత రాజ్యాంగం అనేది అనేక ఆచారాలు, సంప్రదాయాలు, వేడుకలు, అలవాట్ల సమాహారం. ఈ రాజ్యాంగంలోని అంశాలు క్రమబద్ధంగా ఒకచోట రాయబడి ఉండవు.
2. రాజ్యానికి సంబంధించిన అన్ని ప్రధాన అంశాలు స్పష్టంగా రాయబడి ఉంటాయి.2. రాజ్యానికి సంబంధించిన అంశాలన్నీ ఆచార సంప్రదాయాలు, వాడుకల రూపంలో ఉంటాయి.
3. లిఖిత రాజ్యాంగాన్ని నిర్దిష్ట సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటైన శాసనసభ రూపొందించి ఆమోదిస్తుంది.3. అలిఖిత రాజ్యాంగంలోని అంశాలు నిర్దిష్ట సమయంలో రూపొందినవి కావు. అవి కాలాను గుణంగా శాసనాల రూపంలో, ముఖ్యమైన నిబంధనల (Charters) ద్వారా వివిధ కాలాలలో అమల్లోకి వస్తాయి.
4. లిఖిత రాజ్యాంగాన్ని సులభంగా సవరించడం సాధ్యం కాదు.4. అలిఖిత రాజ్యాంగాన్ని సవరించడం ఎంతో సులభం.
5. లిఖిత రాజ్యాంగంలో ఉదహరించబడిన పౌరులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను న్యాయస్థానాలు పరిరక్షిస్తాయి.5. అలిఖిత రాజ్యాంగాన్ని పౌరుల ప్రాథమిక హక్కులను న్యాయస్థానాలు సులభమైన రీతిలో కాపాడలేవు.
6. లిఖిత రాజ్యాంగం ఒక నిర్ణీత కాలంలో రూపొందించబడింది.6. అలిఖిత రాజ్యాంగం మారుతూ ఉంటుంది.
7. లిఖిత రాజ్యాంగం రాజకీయ సుస్థిరతను ఏర్పరుస్తుంది.7. అలిఖిత రాజ్యాంగం రాజకీయ స్థిరత్వాన్ని అందించకపోవచ్చు.
8. విద్యావంతులు, అక్షరాస్యులు అధికంగా ఉన్న రాజ్యాలకు లిఖిత రాజ్యాంగం సరైంది.8. నిరక్షరాస్యులు, విద్యావంతులైన ప్రజలకు అలిఖిత రాజ్యాంగం సరైనది.
9. లిఖిత రాజ్యాంగం సమాఖ్య రాజ్యాలకు తగినది.9. అలిఖిత రాజ్యాంగం ఏకకేంద్ర రాజ్యాలకు సరైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 5.
దృఢ, అదృఢ (సరళ) రాజ్యాంగాల మధ్య తేడాలను తెలపండి.
జవాబు.
నిర్వచనం :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే “రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

దృఢ రాజ్యాంగం (లేదా) పరుష రాజ్యాంగం :
రాజ్యాంగంలోని అంశాలను అంత సులభంగా సవరించడం సాధ్యంకాని రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. దృఢ రాజ్యాంగం అమలులో ఉన్న రాజ్యాలలో సాధారణ చట్టాల తయారీకి, రాజ్యాంగ చట్టాల రూపకల్పనకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. దృఢ రాజ్యాంగంలోని అంశాలను సవరించేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. రాజ్యాంగ అంశాల సవరణలో దృఢ రాజ్యాంగం

ఎంతో కాఠిన్యతను ప్రదర్శిస్తుంది. దృఢ రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. అమెరికాతో పాటుగా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి రాజ్యాలలో దృఢ రాజ్యాంగాలు వాడుకలో ఉన్నాయి.

సరళ లేదా అదృఢ రాజ్యాంగం:
రాజ్యాంగంలోని అంశాలను అతిసులభంగా మార్చేందుకు అవకాశం ఉన్నట్లయితే దానిని అదృఢ రాజ్యాంగం అంటారు. అదృఢ రాజ్యాంగంలోని అంశాల సవరణకు ప్రత్యేక రాజ్యాంగ సవరణ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం లేదు.

సాధారణ చట్టాల వలె రాజ్యాంగంలోని అంశాలను సైతం సవరించే వీలు ఉంటుంది. అందువల్ల అదృఢ రాజ్యాంగంలో సాధారణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అదృఢ రాజ్యాంగాలనేవి ప్రాచీన కాలంలో వాడుకలో ఉండేవి. అదృఢ రాజ్యాంగానికి బ్రిటన్ మంచి ఉదాహరణ.

సరళ లేదా అదృఢ మరియు దృఢ లేదా పరుష రాజ్యాంగాల మధ్య వ్యత్యాసాలు :

సరళ లేదా అదృఢ రాజ్యాంగం (Flexible constitution)పరుష లేదా దృఢ రాజ్యాంగం (Rigid Constitution)
1. రాజ్యాంగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరగదు.1. రాజ్యాగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది.
2. రాజ్యాంగాన్ని సులభంగా సవరించవచ్చు.2. రాజ్యాంగాన్ని సవరించేందుకు కఠినమైన పద్ధతి ఉంటుంది.
3. ప్రజల హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను న్యాయ శాఖ కాపాడగలుగుతుంది.3. ప్రజల హక్కులు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను న్యాయశాఖ కాపాడలేకపోవచ్చు.
4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది కాదు.4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది.
5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇవ్వదు.5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇస్తుంది.
6. ఈ రాజ్యాంగంలో శాసనసభకు అపరిమితమైన అధికారాలు ఉంటాయి.6. శాసనసభ అధికారాలు పరిమితంగా ఉంటాయి.
7. ఇది మిక్కిలి అస్థిరమైనది.7. ఇది ఎంతో స్థిరత్వంతో కూడుకొని ఉంటుంది.
8. రాజ్యాంగ చట్టాలకు, సాధారణ చట్టాలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు.8. రాజ్యాంగ చట్టాలు, సాధారణ చట్టాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
9. రాజ్యంలో ఒకేరకమైన చట్టాలు ఉంటాయి.9. రాజ్యంలో రెండు రకాల చట్టాలు ఉంటాయి. అవి : 1) రాజ్యాంగ చట్టాలు, 2) సాధారణ చట్టాలు. రాజ్యాంగ చట్టాలు సాధారణ చట్టాలపై ఆధిక్యతను కలిగి ఉంటాయి.
10. రాజకీయ పురోగతి సాధించిన రాజ్యాలకు అదృఢ రాజ్యాంగం అనువైనది.10. అభివృద్ధి చెందుతున్న రాజ్యాలకు దృఢ రాజ్యాంగం అనువైనది.
11. విప్లవాలకు వీలు కల్పించదు.11. విప్లవాలకు అవకాశం ఇస్తుంది.
12. చిన్న రాజ్యాలకు తగినది.12. పెద్ద రాజ్యాలకు సరైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే కొన్ని నిర్దిష్ట నియమాల సముదాయాన్ని రాజ్యాంగం అని అంటారు. రాజ్యం, ప్రభుత్వాల అధికారాలు, విధులకు రాజ్యాంగం ముఖ్య ప్రాతిపదికగా ఉంటుంది.

అదే విధంగా పౌరుల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన ప్రధాన ప్రామాణికతకు నిదర్శనం రాజ్యాంగమే. అందుకనే “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం” అని లార్డ్ బ్రైస్ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
అలిఖిత రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
అలిఖిత రాజ్యాంగం అంటే రాజ్యాంగ నియమాలన్నింటినీ ఒక రాతప్రతిలో పొందుపరచని రాజ్యాంగం. అనేక ఆచార, సంప్రదాయాలు శాసనాల రూపంలో పొందుపరచినదాన్నే అలిఖిత రాజ్యాంగంగా పేర్కొంటారు. అలిఖిత రాజ్యాంగానికి ఖచ్చితమైన ఉదాహరణ బ్రిటన్ రాజ్యాంగం. ఆచార సంప్రదాయాలు, బ్రిటీష్ పార్లమెంట్ రూపొందించిన సాధారణ శాసనాలే ఆ దేశంలో రాజ్యాంగ శాసనాలుగా పని చేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 3.
లిఖిత రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
లిఖిత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ గానీ లేదా ప్రత్యేక రాజ్యాంగ సదస్సుగాని రూపొందిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక నియమ, నిబంధనలు లిఖిత పత్రం రూపంలో పొందుపరచబడి ఉంటాయి. భారత రాజ్యాంగాన్ని లిఖిత పూర్వక రాజ్యాంగానికి ముఖ్యమైన ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం 1789లో ఆమోదించబడిన అమెరికా రాజ్యాంగం. అమెరికా, భారత రాజ్యాంగాలను ప్రస్తుత ప్రపంచంలో ‘లిఖిత రాజ్యాంగాలకు చక్కని ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 4.
సరళ రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
రాజ్యాంగంలోని అంశాలను అతి సులభంగా మార్చేందుకు అవకాశం ఉన్నట్లయితే దానిని అదృఢ లేదా సరళ రాజ్యాంగం అంటారు. సరళ రాజ్యాంగంలోని అంశాల సవరణకు ప్రత్యేక రాజ్యాంగ సవరణ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం లేదు.

సాధారణ చట్టాలవలె రాజ్యాంగంలోని అంశాలను సైతం సవరించే వీలుంటుంది. అందువలన సరళ రాజ్యాంగంలో సాధారణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మధ్య ఎటువంటి వ్యత్యాసం వుండదు. సరళ రాజ్యాంగాలనేవి ప్రాచీన కాలంలో వాడుకలో ఉండేవి. అదృఢ లేదా సరళ రాజ్యాంగానికి బ్రిటన్ మంచి ఉదాహరణ.

ప్రశ్న 5.
దృఢ రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
రాజ్యాంగంలోని అంశాలను అంత సులభంగా సవరించడం సాధ్యం కాని రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. దృఢ రాజ్యాంగం అమలులో వున్న రాజ్యాలలో సాధారణ చిట్టాల తయారీకి, రాజ్యాంగ చట్టాల రూపకల్పనకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.

దృఢ రాజ్యాంగంలోని అంశాలను సవరించేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. రాజ్యాంగ అంశాల సవరణలో దృఢ రాజ్యాంగం ఎంతో కాఠిన్యతను ప్రదర్శిస్తుంది. దృఢ రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. అమెరికాతో పాటుగా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి రాజ్యాలలో దృఢ రాజ్యాంగాలు వాడుకలో ఉన్నాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 6.
రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి ?
జవాబు.
ప్రతి రాజ్యాంగం ఒక ప్రవేశిక లేదా పీఠికను కలిగి ఉంటుంది. ఆ ప్రవేశిక రాజ్యాంగ లక్ష్యాలు, ఆకాంక్షలను వ్యక్తీకరిస్తుంది. ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపు ఆవశ్యక లక్షణాలలో ప్రవేశిక అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు. ఉదాహరణకు భారత రాజ్యాంగంలోని ప్రవేశిక భారతదేశాన్ని ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొంది.

TS Inter 1st Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 3rd Lesson జాతి – జాతీయత, జాతీయ వాదం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 3rd Lesson జాతి – జాతీయత, జాతీయ వాదం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయత నిర్వచించి, జాతీయతకు అవసరం అయిన లక్షణాలను తెలపండి.
జవాబు.
జాతీయతను ఆంగ్లంలో ‘నేషనాలిటీ” (Nationality) అంటారు. ఈ ఆంగ్ల పదం ‘నేషియో’ (Natio) అనే లాటిన్ భాష నుండి గ్రహించబడినది. దీనికి “పుట్టుక” లేదా “జన్మ” అని అర్థము. సంస్కృతంలో ‘జా’ అంటే ‘పుట్టుక’ అని అర్థం కలదు.

నిర్వచనం :

  1. బర్జెస్ : “మొత్తం జనాభాలో మెజారిటీ సభ్యులతో కూడిన సామాజిక, సాంస్కృతిక సముదాయమే జాతీయత”.
  2. జె.డబ్ల్యు. గార్నర్ : “తెగవంటి అనేక ప్రజాబంధాలతో ఐక్యమైన ప్రజా సముదాయంలో భాగమే జాతీయత”.
  3. ఆర్.జి.గెటిల్ : “ఒకే తెగ, భాష, మతం, ఆచారాలు, చరిత్ర వంటి ఉమ్మడి అంశాలు గల ప్రజానీకమే జాతీయత”.

జాతీయత లక్షణాలు :
1. స్వచ్ఛమైన తెగ (Purity of Race) :
దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్య భావంతో ఉంటారు. అది దృఢమైన జాతీయత, జాతీని పెంపొందిస్తుంది.
ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి.యం.కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒక తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.

2. ఉమ్మడి మతము (Common Religion) :
ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది.’ అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు.
ఉదా : 1947లో ముస్లిమ్లంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.

3. ఉమ్మడి భాష (Common Language) :
ప్రజల మధ్య భావ వ్యక్తీకరణకు, సంప్రదింపులకు భాష అనేది ఒక సాధనం. ఒకే భాషను మాట్లాడే ప్రజలు ఎంతో సులభమైన రీతిలో ఒక జాతిగా రూపొందుతారు. ఉమ్మడి భాష, ఉమ్మడి సాన్నిహిత్యానికి దోహదపడుతుంది. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులు సన్నిహితంగా మెలిగేందుకు భాష ముఖ్య సాధనంగా ఉంటుంది.
ఉదా : స్విట్జర్లాండ్లో భాషాపరమైన వైవిధ్యాలు గల ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నప్పటికీ, వారందరి మధ్య ఉమ్మడి జాతీయత భావాలు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితియే కెనడా, ఇండియా వంటి రాజ్యాలలో గోచరిస్తున్నది.

4. భౌగోళిక ఐక్యత (Geographical Unity) :
జాతీయత, జాతి భావనలో భౌగోళిక ఐక్యత అనేది మరొక ముఖ్య అంశం. భౌగోళిక ఐక్యత అనేది ప్రకృతిలోనే ఇమిడి ఉంది. ఒక దేశపు సమైక్యతకు భౌగోళిక ఐక్యత చిహ్నంగా ఉంటుంది. అంతేకాకుండా, ఒకే రకమైన వాతావరణ పరిస్థితులలో ప్రజలందరూ కలిసికట్టుగా జీవించేందుకు భౌగోళిక ఐక్యత దోహదపడుతుంది. ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజల మనసులు, శరీరాలపై భౌగోళిక ఐక్యత అంశం ప్రకృతి సహజమైన ప్రభావాన్ని చూపుతుంది.

అటువంటి ప్రజలు ఒకే రకమైన భావాలతో కూడిన మానసిక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే భౌగోళిక ఐక్యత ఒక్కటే జాతీయ భావాన్ని పెంపొందిస్తుందని చెప్పలేం.
ఉదా : పాలస్తీనా రాజ్యం ఏర్పాటు జరుగకముందే యూదు జాతికి చెందిన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నివాస స్థావరాలు ఏర్పరచుకొన్నారు.

5. ఉమ్మడి చరిత్ర (Common History) :
జాతీయతాభావ ఆవిర్భావంలో ఉమ్మడి చరిత్రను ఇంకొక ప్రధాన అంశంగా పరిగణించవచ్చు. ఉమ్మడి చరిత్ర ప్రజానీకంలో ఎంతో ఉత్తేజాన్ని నింపి, వారిని కలిపి ఉంచుతుంది. కొన్నిసార్లు, చారిత్రక సంఘటనలు ప్రజలలో జాతీయతాభావాల వ్యాప్తికి దోహదపడతాయి. ఉదా : బ్రిటిష్ పాలన నుంచి భారతీయులు జాతీయతకు సంబంధించిన అనేక పాఠాలను నేర్చుకున్నారు.

6. ఉమ్మడి సంస్కృతి (Common Culture) :
సంస్కృతి అంటే విస్తృతార్థంలో జీవనవిధానం. సంస్కృతి అనేది కొన్ని ఉమ్మడి అంశాలైన దుస్తులు, ఆచారాలు, ఆహారపు అలవాట్లు, మత విశ్వాసాలు, నైతిక విలువలు మొదలైన వాటి ద్వారా వెల్లడించబడుతుంది. ఈ ఉమ్మడి అంశాలు ప్రజలను ఒక త్రాటిపైకి తెచ్చి కలిపి ఉంచుతాయి.

7. ఉమ్మడి రాజకీయ ఆకాంక్షలు (Common Political Aspirations) :
ఒక ప్రదేశంలో నివసించే ప్రజలు ఉమ్మడి రాజకీయ ఆర్థిక ఆకాంక్షలచే ప్రేరణ పొందుతారు. అటువంటి ఆకాంక్షలు జాతి అవతరణలో శక్తివంతమైన పాత్రను పోషిస్తాయి. ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటై రాజ్యాన్ని నిర్వహించే సామర్థ్యం గల ప్రజలు తగినంత మంది ఉంటే, అటువంటివారు స్వతంత్ర రాజకీయ వ్యవస్థగా రూపొందాలనే ఆకాంక్షను కలిగి ఉంటారు.

విభిన్నమైన అంశాలతో కూడిన ప్రజానీకం కూడా ఉమ్మడి జాతీయతగా ఏర్పడే అవకాశం ఉంటుంది. జర్మనీ, ఇటలీలలోని ఏకీకరణ ఉద్యమాలు, అమెరికా స్వాతంత్య్ర పోరాటం, భారత జాతీయోద్యమాల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇవన్నీ ఆయా దేశాల ప్రజల రాజకీయ ఆకాంక్షలకు ప్రతీకలుగా నిలిచాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 2.
జాతి – జాతీయవాదం మధ్య సంబంధాన్ని చర్చించండి.
జవాబు.
ఆధునిక ప్రపంచ వ్యవహారాలలో జాతి, జాతీయవాదం అనేవి చాలా శక్తివంతమైన అంశాలు. ఈ రెండు భావనలు ప్రపంచవ్యాప్తంగా సర్వసత్తాక, సార్వభౌమాధికార రాజ్యవ్యవస్థలు ఏర్పరచుకొనేలా ప్రజలను ఉత్తేజపరిచాయి.

అర్థం :
జాతి, జాతీయవాదం అనే ఈ రెండు పదాలు ఒకదానికొకటి పర్యాయపదాలుగా వాడబడతాయి. “ఈ రెండు పదాలు లాటిన్ భాషలోని “నేషియో” (Natio) అనే పదం నుండి ఉద్భవించాయి. లాటిన్ భాషలో ఆ పదానికి జన్మతః పుట్టుక అనే అర్థం ఉంది.

జాతి (Nation) :
ఈ ఆంగ్ల పదం ‘నేటస్’ (Nates), నేషియో (Natio) అనే లాటిన్ పదాల నుండి గ్రహించబడెను. దీనికి ‘పుట్టుక’ అని అర్థము కలదు. లార్డ్స్ ప్రకారము “స్వాతంత్ర్యం పొందిన లేదా స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలనే” జాతి అంటారు. బర్జెస్ ప్రకారం “భౌగోళిక ఐక్యత కలిగి ఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశములో నివసించే తెగకు సంబంధించిన జాతీయతయే జాతి”.

జాతీయవాదం (Nationalism) :
జాతీయవాదం ఆధునిక రాజ్యానికి ఒక లక్షణం. ఇది ఒక మానసిక భావన. ‘అంతర్గతంగా తమ హక్కులను పరిరక్షించుకునేందుకు, విదేశీ దండయాత్రల నుండి తమ దేశ స్వాతంత్య్రాన్ని రక్షించుకునేందుకు దేశ ప్రజలలో ఐకమత్యాన్ని ప్రేరేపించే మానసిక శక్తి ‘జాతీయవాదం’. దీనిని సంక్షిప్తంగా ‘ఐకమత్య ‘భావన’ అనవచ్చు. జాతుల స్వతంత్రానికి, దేశ అభివృద్ధికి ఇది అవసరం. కానీ సంకుచిత, మితిమీరిన జాతీయతా భావం, హానికరము.

జాతి, జాతీయవాదం మధ్య సంబంధం :

  1. జాతీయవాదం ఒక మానసిక భావన. ఒక ప్రజా సమూహం స్వతంత్రంగా వేరుపడి, ప్రత్యేక రాజ్యం కలిగి ఉండటం అనే అంశం ఇందులో ఇమిడి ఉంటుంది.
  2. ఈ భావం ప్రజలలో బలంగా నాటుకుపోవటంతో ప్రజలు తమ జాతి మనుగడ కోసం వారి సమస్త ప్రయోజనాలను పణంగా పెడతారు. వాదం.
  3. జాతీయత అనేది ప్రజల యొక్క ప్రగాఢమైన ఆకాంక్ష. జాతిరాజ్య ఆవిర్భావానికి దోహదపడుటయే జాతీయ
  4. 16వ శతాబ్దంలో ఐరోపాలో ఆవిర్భవించిన సాంస్కృతిక పునరుజ్జీవనం జాతీయవాదానికి బీజాలు వేసింది.
  5. 1789లో సంభవించిన ఫ్రెంచ్ విప్లవం జాతీయవాదాన్ని ఐరోపాలో మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది. దాని నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఐరోపా జాతీయులలో తీవ్రమైన రాజకీయ చైతన్యాన్ని కలుగజేశాయి.
  6. వియన్నా సమావేశం (1815) ఐరోపాలో జాతీయవాదాన్ని మరింత బలపరచింది.
  7. ఇటలీ ఏకీకరణ మరియు జర్మనీ ఏకీకరణ జాతీయవాదానికి మరింత బలాన్నిచ్చాయి.
  8. 1774లో సంభవించిన అమెరికా స్వాతంత్ర్య యుద్ధం ప్రజలలో జాతీయవాద వ్యాప్తికి బాగా తోడ్పడింది.
  9. 1917లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ ప్రతిపాదించిన “జాతుల స్వయం నిర్ణయహక్కు” ప్రపంచ ప్రజలలో ప్రతి జాతీయ సముదాయం ఒక ప్రత్యేక రాజ్యంగా ఏర్పడాలనే భావాన్ని బలంగా నాటింది.
  10. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలలోని దేశాలలో జాతిరాజ్య ఆవిర్భావం కోసం స్వాతంత్ర్యోద్యమాలు ఊపందుకున్నాయి.
  11. 1885 నుండి 1947 మధ్య సాగిన భారత జాతీయోద్యమం భారత్, పాకిస్థాన్లు స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించటానికి దోహదం చేసింది.

దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే జాతీయవాదం అనే భావం ఎప్పుడైతే ఐక్యతను, స్వాతంత్ర్యాన్ని సాధిస్తుందో, అప్పుడు అది సార్వభౌమాధికార జాతిగా రూపొందుతుంది.
కొంతమంది రాజనీతి శాస్త్రవేత్తలు ఈ రెండింటిని పర్యాయపదాలుగా పరిగణించారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయతకు అవసరం అయిన లక్షణాలను సంక్షిప్తంగా వివరించండి.
జవాబు.
జాతీయత లక్షణాలు :
1. స్వచ్ఛమైన తెగ (Purity of Race) :
దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్యభావంతో ఉంటారు. అది దృఢమైన జాతీయత, జాతిని పెంపొందిస్తుంది.
ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి.యం.కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒకే తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.

2. ఉమ్మడి మతము (Common Religion) :
ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది. అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు.
ఉదా : 1947లో ముస్లిమ్లంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.

3. ఉమ్మడి భాష (Common Language) :
ప్రజల మధ్య భావ వ్యక్తీకరణకు, సంప్రదింపులకు భాష అనేది ఒక సాధనం. ఒకే భాషను మాట్లాడే ప్రజలు ఎంతో సులభమైన రీతిలో ఒక జాతిగా రూపొందుతారు. ఉమ్మడి భాష, ఉమ్మడి సాన్నిహిత్యానికి దోహదపడుతుంది. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులు సన్నిహితంగా మెలిగేందుకు భాష ముఖ్య సాధనంగా ఉంటుంది.
ఉదా : స్విట్జర్లాండ్లో భాషాపరమైన వైవిధ్యాలు గల ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్ జాతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నప్పటికీ, వారందరి మధ్య ఉమ్మడి జాతీయత భావాలు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితియే కెనడా, ఇండియా వంటి రాజ్యాలలో గోచరిస్తున్నది.

4. భౌగోళిక ఐక్యత (Geographical Unity) :
జాతీయత, జాతి భావనలో భౌగోళిక ఐక్యత అనేది మరొక ముఖ్య అంశం. భౌగోళిక ఐక్యత అనేది ప్రకృతిలోనే ఇమిడి ఉంది. ఒక దేశపు సమైక్యతకు భౌగోళిక ఐక్యత చిహ్నంగా ఉంటుంది. అంతేకాకుండా, ఒకే రకమైన వాతావరణ పరిస్థితులలో ప్రజలందరూ కలిసికట్టుగా జీవించేందుకు భౌగోళిక ఐక్యత దోహదపడుతుంది.

ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజల మనసులు, శరీరాలపై భౌగోళిక ఐక్యత అంశం -ప్రకృతి సహజమైన ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి ప్రజలు ఒకేరకమైన భావాలతో కూడిన మానసిక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే భౌగోళిక ఐక్యత ఒక్కటే జాతీయ భావాన్ని పెంపొందిస్తుందని చెప్పలేం.
ఉదా : పాలస్తీనా రాజ్యం ఏర్పాటు జరుగకముందే యూదు జాతికి చెందిన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నివాస స్థావరాలు ఏర్పరచుకొన్నారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 2.
జాతీయవాదం ప్రయోజనాలను తెలపండి ?
జవాబు.
జాతీయవాద లక్షణాలను కలిగిన ఆధునిక రాజ్యాలలో కింద పేర్కొన్న సుగుణాలు కనిపిస్తాయి :

  1. జాతీయ వాదం ప్రజల మధ్య నెలకొన్న పరస్పర వైరుధ్యాలు, వ్యక్తిగత విద్వేషాలు, అంతర్గతమైన ఘర్షణలను నిలువరించగలిగింది. ఒక జాతికి సంబంధించిన ప్రజలలో ఐక్యత, సమగ్రత, సంఘీభావాన్ని పెంపొందించింది. ఇరుగు పొరుగు ప్రజల ఉద్దేశ్యాలను తెలుసుకొనేందుకు వీలు కల్పించింది. కాబట్టి ప్రజల మధ్య చక్కని అవగాహనను పెంపొందించింది.
  2. ప్రజలు ప్రభుత్వం పట్ల విధేయత చూపించేలా జాతీయవాదం దోహదపడింది.
  3. అతిస్వల్ప వ్యవధిలో జాతి అన్ని రంగాలలో ప్రగతిని సాధించేందుకు సహాయపడింది.
  4. రాజ్యంలో అభివృద్ధి వేగం పుంజుకొనేలా చూసింది. ప్రభుత్వానికి ప్రజాస్వామ్య పునాదిని ఏర్పాటు చేసింది. తద్వారా పాలన వ్యవస్థకు బలం చేకూర్చింది.
  5. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించింది. ఆర్థిక దోపిడిని ఖండించింది.
  6. రాజకీయస్థిరత్వాన్ని చేకూర్చింది. ప్రశాంతమైన సామాజిక వాతావరణాన్ని సృష్టించింది.
  7. ప్రజలలో సాంస్కృతిక వికాసానికి దోహదపడింది. అందుకొరకై ప్రజల భాష, సంస్కృతి, సాహిత్యం వేష ధారణలలో సాన్నిహిత్యాన్ని పెంచింది.

ప్రశ్న 3.
జాతి, రాజ్యం ఏ విధంగా వ్యత్యాసాలను కలిగి ఉంటాయి ?
జవాబు.
‘జాతి, రాజ్యం ఒక్కటే అన్న భావాన్ని చాలామంది వ్యక్తపరిచారు. హేస్ అనే శాస్త్రజ్ఞుడి దృష్టిలో రాజకీయ ఐక్యత, సార్వభౌమత్వంతో కూడిన స్వాతంత్ర్యాన్ని పొందిన ఒక జాతీయ సముదాయం జాతి అవుతుంది. అలా ఏర్పడిన జాతినే జాతిరాజ్యం లేదా జాతీయరాజ్యం అని అనవచ్చునని హేస్ పేర్కొన్నాడు.

అందువలన జాతి, రాజ్యం రెండు సమానార్థకాలుగా భావించవచ్చు. ఐక్యరాజ్యసమితి అనే అంతర్జాతీయ సంస్థను ఇంగ్లీషులో United Nations Organisation అంటారు. ఇక్కడ జాతి (Nation) అనే పదానికి రాజ్యం అనే అర్థం.

జాతి : లార్డ్ బ్రైస్ ప్రకారం, “స్వాతంత్ర్యం పొందిన లేదా స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలే జాతి”.
రాజ్యం : ఉడ్రోవిల్సన్ ప్రకారం, “నిర్ణీత భూభాగంలో శాసనబద్ధులై నివసించే ప్రజలే రాజ్యం”

జాతి – రాజ్యం మధ్య వ్యత్యాసాలు (Differences between Nation and State) :

జాతి (Nation)రాజ్యం (State)
1. జాతి అనేది స్వతంత్ర రాజకీయ సముదాయం’ లేదా ఒకానొక బహుళజాతి రాజ్యంలో అంతర్భాగమైందిగా పరిగణించవచ్చు.1. రాజ్యం ఒక జాతి లేదా అనేక జాతుల ప్రజా సముదాయాన్ని కలిగి ఉండవచ్చు.
2. రాజ్యం కంటే జాతి ముందుగా ఆవిర్భవించింది.2. రాజ్యం జాతి తరువాత ఉద్భవించింది. రాజ్యత్వ హోదాను కలిగి ఉండటమే జాతి అంతిమ లక్షణంగా పేర్కొనవచ్చు.
3. ఒకే రకమైన మానసిక భావాలను కలిగి ఉమ్మడి లక్ష్యంతో నివసించే ప్రజా సముదాయమే జాతి.3. ఒక నిర్దిష్ట ప్రదేశంలో శాసనబద్ధులైన ప్రజా సముదాయమే రాజ్యం.
4. జాతి అనేది చారిత్రక, సాంస్కృతిక పరిణామాన్ని కలిగి ఉంటుంది.4. రాజ్యమనేది ఒకే రకమైన రాజకీయ, చట్టబద్ధమైన నిర్మితిని కలిగి ఉంటుంది.
5. జాతి అనే భావన సుదీర్ఘకాలం పాటు జీవనం సాగించిన ప్రజలతో కూడిన సముదాయం.5. రాజ్యం పరిణామాత్మక స్వభావాన్ని కలిగి ఉండక పోవచ్చు. స్వాతంత్ర్యం గల కొన్ని చిన్న రాజకీయ సమాజాలు లేదా విభజన కారణంగా ఏర్పడిన రాజకీయ సమాజాల ఏకీకరణ ఫలితంగా రాజ్యం ఏర్పడుతుంది.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 4.
జాతి, జాతీయతల మధ్య వ్యత్యాసాలు ఏవి ?
జవాబు.
జాతి, జాతీయతల మధ్య కింద అంశాలలో వ్యత్యాసాలు.

జాతి (Nation)జాతీయత (Nationality)
1. జాతి అనేది రాజకీయ భావన.1. జాతీయత అనేది మానసిక భావన.
2. జాతి అనేది ఎల్లప్పుడూ రాజకీయంగా సంఘటితమైన రాజ్యాన్ని సూచిస్తుంది.2. జాతీయత అనేది ఎల్లప్పుడూ అసంఘటితమైన, అతి సులభమైన భావన.
3. జాతి అనే భావన ఎల్లప్పుడూ స్వతంత్రతను కలిగి ఉంటుంది.3. జాతీయత అనే భావన స్వతంత్రతను కలిగి ఉండదు.
4. జాతీయత లేకుండా జాతి అనేది ఉండదు.4. జాతి లేకుండా జాతీయత ఉంటుంది.
5. జాతిగా ఏర్పడిన ప్రజలు రాజ్య శాసనాలకు విధేయులుగా ఉంటారు.5. జాతీయతగల ప్రజలు జాతిగా రూపొందేవరకు, రాజ్యాంగ చట్టాలు ఉండవు. అయితే స్వీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు కొన్ని ఉమ్మడి నియమాలను అనుసరిస్తారు.

 

ప్రశ్న 5.
జాతుల స్వయం నిర్ణయాధికారం సంక్షిప్త సమాధానం రాయండి.
జవాబు.
ప్రతి జాతీయ సముదాయానికి స్వతంత్రంగా ఉండటానికి, అంటే రాజ్యంగా ఏర్పడటానికి సొంతహక్కు ఉన్నది అని చెప్పేదే జాతి స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం. వియన్నా కాంగ్రెసు (1815) కాలం నుంచి 19వ శతాబ్దం చివరి వరకు ‘ఒకే జాతీయ సముదాయం ఒకే జాతి రాజ్యం’ అనే సిద్ధాంతం యూరప్ రాజకీయాలను ప్రభావితం చేస్తూ వచ్చింది.

ఈ సిద్ధాంతాన్ని కారల్మార్క్స్, ఏంజల్స్, లెనిన్ మొదలగువారు బలపరిచారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో తాను ప్రతిపాదించిన ’14 అంశాల కార్యక్రమంలో ఈ సిద్ధాంతాన్ని చేర్చాడు. 1945లో స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి రాజ్యాంగం ఈ సిద్ధాంతానికి మరింత బలాన్ని చేకూర్చింది.

ధర్మకర్తృత్వ మండలి ఉద్దేశ్యం జాతీయ సముదాయాలకు క్రమంగా స్వయం పాలన కలుగజేయటమే. ఒక్కొక్క జాతీయ సముదాయం ఒక్కొక్క జాతీయ రాజ్యంగా అవతరించినందువల్ల పెక్కు ప్రయోజనాలు ఉన్నమాట నిజమే.

అయితే దానివలన కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ భావాన్ని ఖండిస్తూ దానిని మొత్తం ప్రజల వ్యవస్థీకృతమైన స్వార్థ ప్రయోజనంగా (organised self interest of whole people) అభివర్ణించాడు. ఆధునిక కాలంలో జాతీయ భావం ఒక మత భావనకు దారితీస్తున్నదని షిలిటో (Schillito) హెచ్చరించాడు. లార్డ్ యాక్టన్ అభిప్రాయంలో ఏకజాతి రాజ్యం కన్నా బహుళ జాతిరాజ్యమే అన్ని విధాల మెరుగైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయత అంటే ఏమిటి ?
జవాబు.
జాతీయతను ఆంగ్లంలో ‘నేషనాలిటీ’ (Nationality) అంటారు. ఇది ‘నేషియో’ (Natio) అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. దీనికి “పుట్టుక” అని అర్థము. ఒక రాజకీయ వ్యవస్థగా రూపొందే జాతీయత జాతి అనబడుతుంది. అంటే రాజ్యము, జాతీయతల కలయిక జాతి అవుతుంది. “ఒకే రక్త సంబంధం, ఒకే భాష, సాహిత్యం, సంప్రదాయాలు, ఉండి కొన్ని కట్టుబాట్లకు లోనై ఉన్న జనసమూహం” జాతీయత అని ‘లార్డ్ బ్రైస్’ నిర్వచించాడు.

ప్రశ్న 2.
జాతిని నిర్వచించండి.
జవాబు.
జాతిని ఆంగ్లంలో ‘నేషన్’ (Nation) అంటారు. ఈ ఆంగ్ల పదం ‘నేటస్’ (Nates), నేషియో (Natio) అనే లాటిన్ పదాల నుండి గ్రహించబడెను. దీనికి ‘పుట్టుక’ అని అర్థము కలదు. లార్డ్స్ ప్రకారము “స్వాతంత్య్రం పొందిన లేదా స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటూ, రాజకీయంగా వ్యవస్థీకృతమైన ప్రజలనే” జాతి అంటారు. బర్జెస్ ప్రకారం “భౌగోళిక ఐక్యత కలిగిఉంటూ ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించే తెగకు సంబంధించిన జాతీయతయే జాతి”.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 3.
జాతీయవాదం ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
జాతీయవాదాన్ని సూక్ష్మంగా పరిశీలించినచో ప్రపంచ వ్యవహారాలలో ఈ భావన కీలకపాత్ర పోషించినదని చెప్పవచ్చు. గత రెండు శతాబ్దాలుగా జాతీయవాదం అత్యంత ప్రాముఖ్యత గల రాజకీయ సిద్ధాంతంగా ప్రాచుర్యం పొంది ప్రపంచ చరిత్రలో కీలక అంశంగా పరిణమించింది.

అయితే జాతీయవాదం ఒకవైపు ప్రపంచ ప్రజలను ప్రభావితం చేయగా మరొకవైపు ప్రపంచ ప్రజానీకం మధ్య విద్వేషాలను కూడా సృష్టించింది. నియంతృత్వ పాలకుల ప్రతిఘటనల నుంచి ప్రజలకు విముక్తి గావించి అనేక సామ్రాజ్యాలు, పలు రాజ్యాల విభజనలలో నిర్ణయాత్మక పాత్రను పోషించింది. అనేక రాజ్యాల సరిహద్దులను నిర్ణయించడంలో సైతం కీలకపాత్ర పోషించింది.

ప్రశ్న 4.
జాతీయవాదానికి సంబంధించి ఏవైనా రెండు ప్రయోజనాలు తెలపండి.
జవాబు.

  1. దేశాన్ని ప్రేమించడం అనే భావాన్ని ప్రజల్లో ఉత్పన్నం చేయడం జాతీయవాదం యొక్క అత్యంత ప్రధాన ప్రయోజనం ప్రజలు ఎప్పుడైతే దేశాన్ని ప్రేమించడం ఆరంభిస్తారో, ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగలదని ఆశించవచ్చు.
  2. జాతి సంస్కృతులలో గల భిన్నత్వాన్ని జాతీయవాదం పరిరక్షిస్తుంది. తమ సంస్కృతులను కాపాడుకుంటూ ప్రపంచంలోని అన్ని సంస్కృతుల సహజీవనం వల్ల విశ్వమానవత్వ భావన పరిఢవిల్లుతుంది.
  3. ఇతర జాతులకంటే ముందుండాలని లేదా అభివృద్ధి చెందాలని ప్రతి జాతి ప్రయత్నం చేస్తుండటం వల్ల వారి మధ్య ఆరోగ్యకరమైన పోటి ఏర్పడి మానవ జాతి మొత్తం లాభపడే అవకాశం ఉండేలా జాతీయవాదం దేశాల మధ్య జాతీయ దృక్పథంతో కూడిన జాతుల మధ్య పోటీ ఏర్పడుతుంది.
  4. అనేక మంది కవులు, వక్తలు, చిత్రకారులు జాతీయవాదం వల్ల ప్రేరణ పొంది మరపురాని రచనలు, చిత్రాలను ప్రపంచానికి అందించారు.
  5. ప్రతి దేశానికి విముక్తి స్వతంత్ర దేశంగా కొనసాగించాలని జాతీయవాదం కోరుకుంటుంది. అన్ని దేశాలకు స్వాతంత్య్రం లభించినప్పుడు ప్రపంచంలో తక్కువ సంఘర్షణలు, ఉద్రిక్తతలు, కఠినత్వాలు తగ్గే అవకాశం ఉంటుంది.
  6. జాతీయవాదం శక్తుల ఆధారంగా సామ్రాజ్య వాదాన్ని అదుపు చేయవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 5.
జాతీయవాదానికి సంబంధించిన రెండు దుష్పరిణామాలు వివరించండి.
జవాబు.
జాతీయవాదం విమర్శలకు అతీతం ఏమీ కాదు. జాతీయవాదంలో క్రింది దుష్పరిణామాలు ఉన్నాయి.

  1. తమ దేశాన్ని ప్రేమించడం ఎన్నడూ తప్పుకాదు. కాని అది సంకుచితంగా మారి ఇతర దేశాల ప్రయోజనాలకు భంగకరంగా మారకూడదు. ఉదా : జర్మని – ఫ్రెంచ్ల మధ్య జరిగిన యుద్ధం.
  2. సంకుచిత జాతీయవాదం సైనిక సమీకరణకు దారితీస్తుంది. ఈ సమీకరణ దీర్ఘకాలంలో యుద్ధంగా మారే
    అవకాశం ఉంటుంది.
  3. ప్రతి జాతీయవాదం తన వైభవం ఇతరులకంటే అధికంగా ఉండాలని నిరంతరంగా కృషిచేస్తుంది. ఈ వైభవం లేదా ఇతరులకంటే ముందుండాలనే లక్ష్యం ఇతరుల భూభాగాలను చేర్చుకోవడం ద్వారా నెరవేర్చుకోవాలని కోరుకుంటారు. ఇదే జరిగితే ప్రపంచంలో సంఘర్షణలు తలెత్తుతాయి.
  4. తీవ్ర జాతీయవాదం ఆ జాతి ప్రజలలో అసహనాన్ని ఏర్పరుస్తుంది. తమ జాతి అత్యున్నతమైందని భావించి, ఇతర జాతులు పనికిరావని భావించే అవకాశం ఉంది..
  5. జాతీయవాదం సామ్రాజ్య వాదానికి దారి తీస్తుంది. సామ్రాజ్యవాదం మైనారిటి జాతుల సమస్యను తీసుకువస్తుంది.
  6. పెద్ద దేశాలు అనేక జాతీయతలతో కూడుకుని ఉంటాయి. ఆ దేశాలలోని మైనారిటి జాతీయులు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే జాతీయవాదం విభజన శక్తిగా, ఐక్యత శక్తిగా ` కూడ పనిచేస్తుంది.
  7. దూకుడుతో కూడిన జాతీయవాదం ఇతర దేశాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తుంది. ఇతరుల బాధలను అసలు పట్టించుకోదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 3 జాతి – జాతీయత, జాతీయ వాదం

ప్రశ్న 6.
జాతీయత మౌలిక అంశాలలో రెండింటిని తెలపండి.
జవాబు.
జాతీయత లక్షణాలు :
1. స్వచ్ఛమైన తెగ (Purity of Race) :
దీనిని ఏకజాతి లేదా వారసత్వము అనవచ్చు. ఒకే తెగ మనుషుల మధ్య రక్తసంబంధం ఉంటుంది. ఒకే సంతతికి చెందినవారమనే భావంతో ఒకే తెగ ప్రజలు ఐకమత్యభావంతో ఉంటారు. అది ధృఢమైన జాతీయత, జాతిని పెంపొందిస్తుంది.
ఉదా : హిట్లర్ కాలంలో జర్మనులు, తమిళనాడులో డి. యం.కె. పార్టీ తమ జాతీయతలను ప్రత్యేకమైనవిగా చెప్పుకున్నాయి. అయితే ఈ కాలంలో ఒక తెగవారే ఒక రాజ్యంలో ఉండటం సాధ్యం కాదు.

2. ఉమ్మడి మతము (Common Religion) :
ఒకే మతస్థుల మధ్య ఐకమత్య భావం ఏర్పడుతుంది. జాతులను సమైక్యపరచడంలో మతం ప్రముఖ పాత్ర వహించింది. అయితే ఆధునిక కాలంలో జాతీయతా భావానికి ఒకే మతం ఉండాలనే నియమం లేదు.
ఉదా : 1947లో ముస్లిమ్లంతా మత ప్రాతిపదికన పాకిస్థాన్ రాజ్యం ఏర్పరచుకున్నారు. అది 1972లో రెండుగా చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 11 భారతదేశం – ప్రపంచదేశాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 11th Lesson భారతదేశం – ప్రపంచదేశాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 11th Lesson భారతదేశం – ప్రపంచదేశాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత విదేశాంగ విధానానికి ఉన్న ఏవేని రెండు లక్షణాలను తెలపండి.
జవాబు.
1. వలసవాదం, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకత :
భారత విదేశాంగ విధానం ప్రధానంగా వలసవాదాన్ని సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల్లోని వివిధ దేశాల్లో వలసవాదపాలనలో ఉన్న ప్రజలపట్ల భారతదేశం సానుభూతి ప్రకటించింది.

వలసవాద పాలన ప్రాంతాల్లో ప్రజలపై నిరంకుశ పాశవిక విధానాన్ని భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ప్రాంతాల ప్రజలు స్వాతంత్ర్యాన్ని పొందడానికి రాజకీయ, దౌత్యపర, ఆర్థిక సహాయాలన్నింటినీ భారతదేశం అందించింది. అగ్రరాజ్యాలు రూపొందించిన సామ్రాజ్యవాద వ్యూహాన్ని కూడా విదేశాంగ విధానం వ్యతిరేకిస్తుంది.

2. జాతి విచక్షణకు వ్యతిరేకత :
సుదీర్ఘకాలంగా భారతదేశం వర్ణ, జాతి, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా జరిగే అన్ని రకాల విచక్షణలను వ్యతిరేకిస్తోంది. జాతి విచక్షణ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో సముచితంగా వివిధ వేదికల్లో, చర్చనీయాంశం చేసింది. దక్షిణాఫ్రికా, కాంగో, రొడీషియా (ఇప్పటి జింబాబ్వే)లలో అనుసరిస్తున్న ప్రభుత్వ జాతి విచక్షణ విధానాన్ని తీవ్రంగా విమర్శించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 2.
అలీనోద్యమం పాత్రపై ఒక సంక్షిప్త సమాధానం రాయండి.
జవాబు.
అలీనోద్యమం 1955లో బాండుంగ్లో జరిగిన ఆఫ్రో-ఆసియన్ సమావేశం ద్వారా రూపుదిద్దుకుంది. ఇది ఒక విదేశాంగ విధానంగా పశ్చిమ దేశాల కూటమికి, కమ్యూనిస్టు కూటమికి సమానదూరం పాటించే సంవర్థక విధానంగా వృద్ధి చెందింది. అలీనోద్యమ వ్యవస్థాపక నాయకులుగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మార్షల్ టిటో, సుకార్నో, నిక్రోమా, అబ్దుల్ నాజర్ తదితర రాజనీతిజ్ఞులు ఉద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.

అలీనోద్యమ లక్ష్యాలు :
అలీనోద్యమం కొన్ని నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తుంది. వాటిలో ప్రధానమైనవి :

  1. ప్రపంచ శాంతి, నిరాయుధీకరణ
  2. వలసప్రాంతాల ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు
  3. జాతివివక్షకు, వర్ణవివక్షకు వ్యతిరేకంగా ప్రతీవారికి సమానత్వపు హక్కు
  4. ఆర్థిక సమానత్వాన్ని సాధించండం
  5. సాంస్కృతిక ఆధిపత్యం లేదా సాస్కృతిక సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడం
  6. అంతర్జాతీయ వాదాన్ని సమర్ధించడం.

ప్రశ్న 3.
సార్క్ అనగానేమి ? వివరించండి.
జవాబు.
దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంఘం (South Asian Association of Regional Co-operation) లోని ఆంగ్ల ప్రథమాక్షరాల పదబంధంగా సార్క్ (SAARC) అని దీనిని వ్యవహరిస్తారు. ఈ సార్క్ ఏర్పాటులో బంగ్లాదేశ్ అధ్యక్షడు జియాఉర్ రెహమాన్ (Zia-ur Rehaman) ఎంతో ప్రధాన పాత్ర పోషించాడు.

సార్క్న లాంఛనప్రాయంగా డిసెంబర్ 8, 1985న స్థాపించారు. దీనిని బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఏడు సభ్యదేశాలుగా ఏర్పడ్డాయి. ఆ తరువాత ఏప్రియల్ 3, 2007న ఆఫ్ఘనిస్తాన్ సభ్యదేశం కావడంతో ప్రస్తుతం సార్స్లో మొత్తం ఎనిమిది దేశాలు సభ్య రాజ్యాలుగా ఉన్నాయి.

సార్క్ లక్ష్యాలు :

  1. దక్షిణాసియా ప్రాంతంలో సంక్షేమరంగాన్ని వృద్ధిచేసి జనాభా జీవన పరిస్థితులను గుణాత్మకంగా వృద్ధి చేయడం.
  2. దక్షిణాసియా ప్రాంత దేశాల మధ్య సమష్టి స్వాబలంబనను బలోపేతం చేయడం.
  3. ఆర్థికవృద్ధి, సాంఘిక ప్రగతి, సంస్కృతి అభివృద్ధులను వేగిరపరచడం.
  4. సభ్యదేశాలు తమ సమస్యలపట్ల సానుభూతితో పరస్పర విశ్వాసాన్ని పెంపొందిచుకోవడం.
  5. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పరస్పర సహాయంతో తోడ్పాటు అందించుకోవడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 4.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అధికారాలు, విధులను వివరించండి.
జవాబు.
సాధారణ సభ అధికారాలు – విధులు :

  1. అంతర్జాతీయ శాంతి భద్రతలు, రక్షణ విషయాలను చర్చించి, సిఫార్సులు చేయడం.
  2. అంతర్జాతీయ సాంఘిక-ఆర్థిక సహకారానికి సంబంధించిన విషయాల్లో మార్గనిర్దేశనం చేస్తే, పర్యవేక్షించడం.
  3. స్వయంపాలన చేసుకోలేని ప్రాంతాల పరిపాలనపై సమాచారాన్ని, నివేదికలను సేకరించడం.
  4. ఐక్యరాజ్యసమితి నిధులపై ప్రత్యేక నియంత్రణ అధికారాన్ని కలిగి, వార్షిక బడ్జెట్ను ఆమోదిస్తుంది.
  5. భద్రతామండలకి 10 మంది తాత్కాలిక సభ్యులను ఎన్నుకుంటుంది. అలాగే ఆర్థిక సాంఘిక మండలికి 5 మంది సభ్యులను, అంతర్జాతీయ న్యాయస్థానానికి 15 మంది న్యాయమూర్తులను, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిని సాధారణ సభ ఎన్నుకుంటుంది.
  6. అంతర్జాతీయ ఒప్పందాలను ఆమోదిస్తుంది.
  7. ఐక్కరాజ్యసమితి ఛార్ట్క అవసరమైన సవరణలు చేసే అధికారం సాధారణ సభకు ఉంటుంది.
  8. ఐక్యరాజ్యసమితిలోకి కొత్తగా రాజ్యాలను సభ్యులుగా చేర్చుకోడానికి, సస్పెండ్ చేయడానికి, సభ్యరాజ్యాలను తొలగించడానికి సాధారణ సభకు అధికారం ఉంటుంది.

ప్రశ్న 5.
భద్రతామండలి నిర్మాణాన్ని తెల్పి, దీనికి గల ఏవైనా రెండు అధికారాలను, విధులను తెలపండి.
జవాబు.
నిర్మాణం :
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యనిర్వాహక విభాగంగా భద్రతామండలిని పేర్కొనవచ్చు. దీనిలో 15 మంది సభ్యులు ఉంటారు. వీటిలో 5 రాజ్యాలను శాశ్వత దేశాలనీ, వీటో అధికారం ఉన్న పెద్ద దేశాలనీ చెప్పవచ్చు. మిగిలిన 10 తాత్కాలిక దేశాలను సాధారణ సభ రెండు సంంత్సరాల పదవీకాలానికి ఎన్నుకుంటుంది.

ఈ పది తాత్కాలిక దేశాలలో అయిదు ఆఫ్రికా-ఆసియా ఖండాలనుంచి, ఒకటి తూర్పు యూరోపు నుంచి, రెండు లాటిన్ అమెరికా ఖండం నుంచి, రెండు పశ్చిమ యూరోపు తదితర ప్రాంతాలనుంచి ప్రాతినిధ్యం వహించేలా ఎన్నికవుతాయి.

ఇవేకాక, ఏదేని వివాదానికి సంబంధించిన ఏదేని ఒక సభ్యరాజ్యన్నికానీ, రాజ్యేతర సభ్యులు కానీ చర్చలలో పాల్గొనమని భద్రతామండలి కోరవచ్చు. భద్రతామండలి అధ్యక్ష పదవి దానిలోని సభ్యరాజ్యాల మధ్య అక్షర క్రమంలో ప్రతి నెలకు ఒకసారి మారుతూ ఉంటుంది. భద్రతామండలికి సహాయం అందించడానికి మూడు స్థాయూ సంఘాలు ఉంటాయి.

అధికారాలు – విధులు :
అంతర్జాతీయ శాంతిభద్రతలు – రక్షణ వ్యవహారాల నిర్వహణలో ఐక్యరాజ్యసమితికి గణనీయమైన అధికారాలు ఉన్నాయి. భద్రతామండలి అధికారాలు – విధులు ఈ దిగువ తెలిపిన విధంగా ఉంటాయి.

  1. భద్రతా మండలి అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
  2. అంతర్జాతీయ శాంతి, భద్రతల నిర్వహణకు కార్యాచరణను అమలుచేసి, శాంతికి విఘాతం కలిగించే వాటిపై నివారక చర్యలు చేపడుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 6.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అధికారాలు-విధులను సంక్షిప్తంగా రాయండి.
జవాబు.
ప్రధాన కార్యదర్శి అధికారాలు – విధులు :
ఐక్యరాజ్యసమితి ఛార్టర్ నిర్దేశించిన పరిధిలోని అనేక విధులను-బాధ్యతలను ప్రధాన కార్యదర్శి నిర్వహిస్తారు. వీటిలో ప్రధానమైనవి :

  1. అంతర్జాతీయ శాంతిభద్రతలకు విఘాతం కల్పించే అన్ని విషయాలను ప్రధాన కార్యదర్శి సాధారణ సభ భద్రతామండలి ముందు నివేదిస్తాడు.
  2. ఐక్యరాజ్యసమితి వార్షిక బడ్జెట్ను రూపొందిస్తాడు. అలాగే ఐక్యరాజ్యసమితి పనితీరుపై నివేదికను ప్రతి సంవత్సరం తయారుచేస్తాడు.
  3. భద్రతామండలి వినతిపైగాని, ఐక్యరాజ్యసమితి మెజారిటీ సభ్యుల కోరికపైగాని, సాధారణ సభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేస్తారు.
  4. అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలకు రిజిష్టర్ చేసే అధికారిలాగా వ్యవహరిస్తారు.
  5. వివిధ సందర్భాలలో ఐక్యరాజ్యసమితి ఏర్పరచిన శాంతి పరిరక్షణ దళాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు.

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
బిమ్ క్ అనగానేమి ?
జవాబు.
ఈ సంస్థను 1997వ సంవత్సరంలో బంగాళాఖాత (సముద్ర) తీరప్రాంతదేశాలైన దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. “బంగాళాఖాత తీరప్రాంత దేశాల బహుళరంగ సాంకేతిక ఆర్థిక సహకార సంస్థ” పేరుతో ఏర్పడిన ఈ సంస్థలో భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, బర్మా (మియన్మార్), థాయ్లాండ్ దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. బిమ్క్ అనే ఈ సంస్థ ప్రధాన కేంద్ర కార్యాలయం బంగ్లాదేశ్ ఢాకాలో ఉంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 2.
సార్క్ 18వ శిఖరాగ్ర సమావేశం గురించి రాయండి.
జవాబు.
సార్క్ 18వ శిఖరాగ్ర సమావేశం ఖాట్మండ్లో నవంబరు 27, 2014న జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దక్షిణాసియా దేశాలు అన్ని రంగాల్లో సహకారం అందించుకోవడానికి ముందుండాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.

ఈ సహకారం ప్రజలు పరస్పరం ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా సమాచార సాంకేతిక అనుసంధానం ద్వారా మరింత తేలికగా జరుగుతుందని పిలుపునిచ్చారు. సార్క్ ద్వారా వాణిజ్యం, పెట్టుబడులు, సహాయం, సహకారాలు ప్రతి రంగంలో సాధ్యమౌతాయని భారతదేశం భావిస్తోంది.

ప్రశ్న 3.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఎన్ని దేశాలు సభ్యత్వం కల్గి ఉన్నాయి ?
జవాబు.
ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో 194 సభ్య రాజ్యాలు ఉన్నాయి.

ప్రశ్న 4.
సార్క్ లోని సభ్యదేశాలు ఏవి ?
జవాబు.
సార్క్ లోని సభ్యదేశాలు

  1. బంగ్లాదేశ్
  2. ఇండియా
  3. మాల్దీవులు
  4. నేపాల్
  5. పాకిస్తాన్
  6. శ్రీలంక
  7. భూటాన్

2007లో ఆఫ్ఘనిస్తాన్ కూడా సభ్యదేశం కావటంతో ప్రస్తుతం సార్క్ ఎనిమిది సభ్యదేశాలున్నాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 5.
ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగాలు ఏవి ?
జవాబు.

  1. సాధారణ సభ
  2. భద్రతా మండలి
  3. ఆర్థిక-సాంఘిక మండలి
  4. ధర్మకర్తృత్వ సంఘం
  5. అంతర్జాతీయ న్యాయస్థానం
  6. సచివాలయం.

వీటిలో ప్రస్తుతం ధర్మకర్తృత్వమండలి పనిచేయటం లేదు.

ప్రశ్న 6.
ఐక్యరాజ్యసమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు ?
జవాబు.
ఐక్యరాజ్యసమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పోర్చుగీసుకు చెందిన ‘ఆంటోనియో గుటిరస్’.

ప్రశ్న 7.
బ్రిక్స్లోని సభ్యదేశాలేవి ?
జవాబు.

  1. బ్రెజిల్ (Brazil)
  2. రష్యా (Russia)
  3. ఇండియా (India)
  4. చైనా (China)
  5. దక్షిణాఫ్రికా (South Africa)

ఈ దేశాల పేర్లలోని మొదటి అక్షరాలతో బ్రిక్స్ (BRICS) అనే పదబంధంతో ఈ సంస్థ ఏర్పడింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 8.
పంచశీల సూత్రాలను వివరించండి.
జవాబు.

  1. రాజ్యాల ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించుకోవడం.
  2. రాజ్యాలు పరస్పర దురాక్రమణకు పాల్పడకుండా ఉండడం.
  3. ఇతర రాజ్యాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం.
  4. రాజ్యాల మధ్య సమానత్వం, పరస్పర ప్రయోజనాత్మక సహకారం.
  5. శాంతియుత సహజీవనం.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 10th Lesson స్మార్ట్ గవర్నెన్స్ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 10th Lesson స్మార్ట్ గవర్నెన్స్

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఎలక్ట్రానిక్ పాలన (e-Governance) అంటే ఏమిటి ? దాని సుగుణాలను వివరించండి.
జవాబు.
ఇ-గవర్నెన్స్ అంటే ఆంగ్లంలో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. దీన్ని ఎలక్ట్రానిక్ పాలన అని వ్యవహరిస్తారు. దీన్ని కాగిత రహిత పాలన (Paperless Governance) అని కూడా పేర్కొంటారు. దీన్ని అనుసరించి, సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఆధారంగా ప్రభుత్వం విధులు నిర్వహిస్తుంది. దీని వల్ల సేవలలో సమర్థత కార్యసాధకత పెరుగుతుంది.

దీనిలో భాగంగా అంతర్జాలాన్ని (Internet), ఇతర వెబ్ ఆధారిత సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తారు. పాలనలో వేగం ఖచ్చితత్వం దీనికి గల అదనపు లక్షణాలు, పౌరులు, సమూహాలు, సంస్థలు ఎలక్ట్రానిక్ పాలన పద్ధతి వల్ల గుణాత్మకమైన, నిరంతరాయమైన సేవలను పొందుతారు.

ఎలక్ట్రానిక్ పాలన పారదర్వకతను, కార్యసాధకతను, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుంది. భరతదేశంలోని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో దీన్ని అమలుచేస్తున్నారు. 2017 సంవత్సరానికల్లా కాగితపు పాలన సాధన లక్ష్యంతో దీనిని అమలు చేస్తున్నారు.

నిర్వచనం :
భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె అబ్దుల్ కలాం అభిప్రాయంలో భారతదేశపాలన సందర్భంలో ఎలక్ట్రానిక్ పాలన (e-Governance) అంటే, “ఒక పారదర్శక, సత్వర ఎలక్ట్రానిక్ పాలన అవధులు లేని, భద్రమైన విశ్వసనీయ సమాచార ప్రవాహాన్ని, శాఖాంతర అడ్డంకులను అధిగమించాలి. అందుబాటులోకి తెస్తూ పౌరులకు న్యాయబద్ధమైన, పక్షపాతం లేని సేవలను అందిస్తుంది”.

ఇంకా, ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర సాంస్కకృతిక సంస్థ (UNESCO), అభిప్రాయంలో “ఎలక్ట్రానిక్ పాలనలో ప్రభుత్వరంగం సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, సమాచారాన్ని, సేవల బట్వాడాను పెంపొందించడం. నిర్ణయీకరణ ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వం మరింత జవాబుదారీతనంతో, పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండేలా చేయడం తదితర లక్ష్యలతో పనిచేస్తుంది.”

పైన పేర్కొన్న నిర్వచనాలు-అర్థవివరణలు పాతకాలపు రాతపని ఆధారిత పాలన ముగించి, పాలనలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవలసిన ఆవశ్యకతను తెలుపుతాయి. పౌరులకు-ప్రభుత్వానికి మధ్య సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానమై కార్యాచరణ సాధనంగా ఉపయోగపడుతుంది. ఫలితంగా పాలనలో పారదర్శకతను చూడవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఎలక్ట్రానిక్ పాలన ప్రణాళిక (National-Governance Plan-NEGP) అమలులో ఉంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ఎలక్ట్రానిక్ పాలన నమూనాలు (Modules of e-Governance) :

ఎ. ప్రభుత్వం నుంచి పౌరులకు (Government to Citizens G to C) :
ఈ నమూనా ఆధారంగా ప్రభుత్వానికి, పౌరులకు మధ్య కార్యాచరణ, సంబంధాన్ని కల్పించి, విస్తృత స్థాయిలో సేవలు అందించడం జరుగుతుంది. ఇది సాధారణ ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

బి. ప్రభుత్వం నుంచి వ్యాపార రంగానికి (Government to Business G to B) :
వ్యాపార రంగాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం సదుపాయదారునిలాగా పనిచేస్తుంది. లైసెన్సులను జారీచేసి, రెవెన్యూ వసూలు చేస్తుంది. అంతేకాకుండా, వర్తక వాణిజ్యాలకు, పర్యాటక రంగానికి పెట్టుబడులకు సదుపాయాలు కల్పిస్తుంది.

సి. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి (Government to Government G to G) :
ప్రభుత్వ సేవలను అందించడంలో సమాచార-సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించడం జరుగుతోంది. స్వేచ్ఛ సమాచార ప్రవాహం సమాంతరంగా, నిలువుగా అందుబాటులో ఉండటం గమనిస్తాం. దీనితో జాతీయ, రాష్ట్ర స్థానిక నిర్వహణ సులువు అవుతుంది.

డి. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు (Government to Employees G to E) :
ఈ నమూనా కింద ప్రభుత్వం, ఉద్యోగులు సమాచార సాంకేతిక పరిజ్ఞాన సాధనాలతో నిరంతరం స్థిరంగా ఒకరినొకరు సంప్రదించుకొని, కార్యాచరణ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఉద్యోగులలో విస్తృత కార్యసాధనకు, సంతృప్తికి దారితీస్తుంది.

ఎలక్ట్రానిక్ పాలన-సుగుణాలు : ఎలక్ట్రానిక్ పాలన పద్ధతిలో ఈ దిగువ తెలిపిన ఉపయోగాలు ఉంటాయి.

  1. పౌరునికి సమాచారం అందించి, సంప్రదించే అవకాశం.
  2. పాలన ప్రక్రియను సంస్కరించడం.
  3. సమాచార అందుబాటు
  4. పౌరులకు గుణాత్మక సేవలు పెంపొందించడం
  5. సరళతర నియమాలు
  6. కార్యసాధన
  7. జవాబుదారీతనం
  8. పారదర్శకత
  9. ఎక్కువమంది పౌరులకు గుణాత్మక సేవ

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 2.
ఎలక్ట్రానిక్ పాలనలోని సుగుణాలను, లోపాలను చర్చించండి.
జవాబు.
నిర్వచనం :
భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం అభిప్రాయంలో భారతదేశ పరిపాలన సందర్భంలో ఎలక్ట్రానిక్ పాలన (e-Governance) అంటే, “ఒక పారదర్శక, సత్వర ఎలక్ట్రానిక్ పాలన అవధులు లేని, భద్రమైన విశ్వసనీయ సమాచార ప్రవాహాన్ని శాఖాంతర అడ్డంకులను అధిగమించి, అందుబాటులోకి తెస్తూ పౌరులకు న్యాయబద్ధమైన పక్షపాతం లేని సేవలను అందిస్తుంది”.

ఎలక్ట్రానిక్ పాలన-సుగుణాలు :
ఎలక్ట్రానిక్ పాలన పద్ధతిలో ఈ దిగువ తెలిపిన ఉపయోగాలు ఉంటాయి.

  1. పౌరునికి సమాచారం అందించి, సంప్రదించే అవకాశం.
  2. పాలన ప్రక్రియను సంస్కరించడం.
  3. సమాచార అందుబాటు.
  4. పౌరులకు గుణాత్మక సేవలు పెంపొందించడం.
  5. సరళతర నియమాలు.
  6. కార్యసాధకత.
  7. పారదర్శకత.
  8. ఎక్కువమంది పౌరులకు గుణాత్మక సేవ.

ఎలక్ట్రానిక్ పాలన లోపాలు :
ఎలక్ట్రానిక్ పాలనపద్ధతిలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది.

  1. నిర్వహణ, నిర్వర్తన వ్యయాలు అధికం.
  2. సమీకృత సేవలు లేకపోవడం.
  3. మౌలిక సదుపాయాల లేమి
  4. బలహీనమైన న్యాయ ప్రక్రియ, నిస్సారమైన శాసనాలు
  5. న్యాయపర, చట్టపర, పరిపాలనపరమైన, పోలీసు సంస్కరణల అవసరం కలుగుతూ ఉండటం.
  6. పౌరుల అవసరాలను అవగాహన చేసుకోవడం కష్టతరం, భాషాపరమైన అవరోధాలు.
  7. ప్రజావిత్త నిర్వహణ వ్యవస్థ కష్ట సాధ్యం కావడం.
  8. ప్రజా నిర్ణయీకరణలో పౌరసమాజ భాగస్వామ్యాన్ని, పాత్రను నిరోధించడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 3.
సమాచార హక్కు అంటే ఏమిటి ?
జవాబు.
ఆధునిక పాలనలో పౌరుని పాత్రను వివరించడానికి సమాచార హక్కుచట్టం అధ్యయనం ఎంతో మౌలికమైనది. సమాచార హక్కు చట్టం పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచి, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని అందిస్తుంది. 20వ శతాబ్దం రెండో భాగంలో అనేక దేశాలు సమాచార హక్కు చట్టాన్ని రూపొందించాయి.

  1. పాలనలో పౌరులు పాల్గొనగలరా ?
  2. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పౌరులు ఎలా పొందగలరు ?
  3. ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరిస్తోందా ?
  4. ప్రజలకు సమాచానాన్ని బహిర్గతం చేయవచ్చునా ?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సమాచార హక్కుచట్టం స్వభావం, ప్రాధాన్యత అధ్యయనం చేయాలి. దానిలో జవాబులు దొరుకుతాయి.

సమాచార హక్కుచట్టం 2005 రాష్ట్రపతి ఆమోదముద్రను 15 జూన్ 2005న పొంది, అక్టోబర్ 2005 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. ఆ రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక ఏర్పాటు ఉండి.

సమాచార హక్కుచట్టం ప్రకారం దేశంలోని ప్రతీపౌరునికి సంబంధించనదే అయినందున, ప్రభుత్వం ప్రజలతో సమాచారార్ని, పంచుకోవడాన్ని ఈ చట్టం అంగీకరిస్తుంది. ఇది ప్రజాస్వామ్యం మరింత ఆరోగ్యవంతంగా (బలోపేతంగా), లాభదాయకంగా పనిచేయడానికి ఉపకరిస్తుంది. అంతిమంగా సమాచారం ప్రజల్లో వినూత్న అవగాహనకు,య సాధికారతకు దారితీస్తుంది.

ప్రశ్న 4.
సమాచార హక్కులోని నిబంధనలను వివరించండి.
జవాబు.
సమాచార హక్కు ఒక ప్రాథమిక మానవ హక్కు దీనిలో అంతర్గతంగా హక్కులు-బాధ్యతులు కూడా ఉంటాయి. వీటిని ఈ కింది విధంగా వివరించవచ్చు.

  1. ప్రతీ వ్యక్తికి ప్రభుత్వం నుంచి సమాచారాన్ని కోరే హక్కు ఉంటుంది. ప్రైవేటు సంస్థల నుంచి కూడా సమాచారాన్ని కోరవచ్చు.
  2. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ప్రత్యేక కారణాల రీత్యా వెల్లడి చేయకూడని సమాచారాన్ని మినహాయించి, మిగిలిన సమాచారాన్ని ప్రభుత్వం తప్పక అందుబాటులో ఉండాలి.
  3. ప్రభుత్వం సమాచారాన్ని అనుకూల కార్యాచరణతో తప్పక వెల్లడి చేయాలి. సమాచారం ప్రజలకు చెందినదని భావించాలి. అంతేకాని దానిని నిర్వహించే ప్రభుత్వ సంస్థదని భావించరాదు.
  4. సమాచారాన్ని కోరుతూ ప్రశ్నించిన 30 రోజుల లోపు ప్రభుత్వం స్పందించాలి.
  5. సమాచార ప్రసరణకు వీలుగా ప్రభుత్వ రికార్డులను కంప్యూటరీకరణ, డిజిటలీకరణ చేయాలి.
  6. సమాచారాన్ని ప్రింట్ కాగితాల రూపంలో, కంప్యూటర్ ఫ్లాపీలు, వీడియో, క్యాసెట్లు లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ సాధనాల రూపంలోనైనా అందించవచ్చు. ఈ చట్టంలోని 2(ఎఫ్) నిబంధన పైన తెలిపిన వాటిని సమాచారంగా పరిగణిస్తుంది.

ప్రజా సమాచార అధికారుల (PIO’s) నియామకం :
ప్రభుత్వంలోని ప్రతీ కార్యాలయంలో, శాఖలో, సంస్థలో, అథారిటీలో ప్రజాసమాచార అధికారిని (PIO) నియమించాలని ఈ చట్టం నిర్ధేశిస్తుంది. పౌరులు కోరిన సమాచారాన్ని వారికి అందించే బాధ్యత ఈ ప్రజా సమాచార అధికారిపై ఉంటుంది.

అలాగే సమాచార హక్కు అప్పీళ్ళను (వినతులను) స్వీకరించడానికి సహాయక ప్రజా సమాచార అధికారులను (Assistant Public information Officers-APIOs) నియమించాలని ఈ చట్టం సిఫార్సు చేస్తోంది. సమాచారం కోసం ప్రజలు ఆన్లైన్ దరఖాస్తు రూపంలో కూడా వినతిని ఇవ్వవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 5.
స్మార్ట్ గవర్నెన్స్ అంటే ఏమిటి ?
జవాబు.
పరిపాలనలోని దుర్లక్షణాలను తొలగించి, పాలన ప్రజల సాంఘిక-ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో భారతదేశంలోని అనేక రాష్ట్రాలు స్మార్ట్ గవర్నెన్స్న స్వీకరించాయి. స్వాతంత్య్రానంతరం భారతదేశ పాలనలో, ప్రజల సాంఘిక-ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా ఎన్నో సంస్కరణలు వచ్చినప్పటికీ పాలనలో దుర్లక్షణాలైన అవినీతి, అశ్రిత, పక్షపాతం, అధికార దుర్వినియోగం, నిర్ణయీకరణలో జాప్యం, పాలనలో నిర్లక్ష్యం విలయతాండవం చేశాయి.

అయితే ఏ పరిస్థితితో మార్పు తీసుకువచ్చి పాలనను మరింత ప్రజా ప్రయోజనకరంగా మలచేక్రమంలో స్మార్ట్ గవర్నెన్స్ భావన ముందుకు వచ్చింది. ఈ భావనలో SMART అనే పదంలోని ప్రతి ఆంగ్ల అక్షరానికి ఒక్కొక్క నిర్దిష్టమైన అర్థం ఉంది.

దీనిలో S అనగా Simple సరళతరమైన పాలన ప్రక్రియలు
M అనగా Moral, నైతిక విలువలతో కూడిన పాలన
A అనగా Accountable, జవాబుదారీ పాలన
R అనగా Responsive, ప్రజాసమస్యలపై స్పందనాత్మకపాలన
T అనగా Transparent, పారదర్శకత కలిగిన పాలనగా పేర్కొనవచ్చు.

స్మార్ట్ గవర్నెన్స్లో అంతర్గత అంశాలు :

  1. పరిపాలన నిర్వర్తన సామర్థ్యాన్ని వృద్ధి చేయడం.
  2. పాలనలో జవాబుదారీతనం పారదర్శకత పెంచడం.
  3. సంకుచిత, రాజకీయాల నుంచి పాలనను వేరుచేయడం.
  4. ప్రభుత్వ విధానాన్ని విజయవంతంగా అమలుచేయడం
  5. గరిష్ట సామర్ధ్యం సాధించడం
  6. పాలనలో సామాజిక నాయకత్వం కీలకపాత్ర పోషించేలా చేయడం.
  7. ప్రభుత్వ సేవలలో నూతన వరవడి తీసుకురావడం, రాబోయే కాలానికి పాలనను సన్నద్ధం చేయడం.
  8. పాలనలో ఇంటర్నెట్, మొబైల్ తదితర సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తృత స్థాయిలో ఉపయోగించడం.
  9. ఎలక్ట్రానిక్ పాలన.

భారతదేశంలో పాలన ప్రక్రియను పటిష్టంచేయడానికి ఈ దిగువ తెలిపిన సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. స్మార్ట్ గవర్నెన్స్ భావనలోని అనేక అంశాల అమలుకు వివిధ మార్గాలను, పద్ధతులను సూచించడానికి, స్మార్ట్ గవర్నెన్స్ భావనను సంవర్ధకంగా వృద్ధి చేయడానికి ఈ దిగువ తెలిపిన విశిష్ట సంస్థలను స్థాపించడం జరిగింది.

  • ది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవన్నమెంట్, హైదరాబాద్, ఇండియా
    The National Institute for Smart government (NISG), Hyderabad, India
  • ది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, హైదరాబాద్, ఇండియా
    The Centre for Good Governance, Hyderabad, India
  • ది సెంటర్ ఫర్ లా అండ్ గవర్నెన్స్, న్యూఢిల్లీ
    The Centere for Law and Governance, New Delhi
  • ది సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెర్స్, న్యూఢిల్లీ
    The Centre for Public Policy and Governance, New Delhi

ప్రశ్న 5.
లోక్పాల్ అధికారాలు-విధులు పేర్కొనండి.
జవాబు.
లోక్పాల్ వ్యవస్థ ఈ కింద పేర్కొన్న పదవులోరి వారిపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారణ చేస్తారు.

  1. ప్రధానమంత్రి
  2. కేంద్రమంత్రులు
  3. పార్లమెంట్ ఉభయసభల సభ్యులు
  4. గ్రూప్ ‘A’ మరియు గ్రూప్ ‘B’ ఉద్యోగులు
  5. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే గ్రూప్ ‘C’ మరియు గ్రూప్ ‘D’ ఉద్యోగులు
  6. ఇతర సంస్థలు, ట్రస్ట్లు సొసైటీలు (10 లక్షలకు మించి విదేశీ విరాళాలను పొందే సంస్థలు)

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జవాబుదారీతనం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రభుత్వంలోని ఉద్యోగులు, అధికారులు, ప్రజాసేవకులు తమ నిర్ణయాలు, కార్యాచరణలను ప్రజలకు బాద్యత వహించడాన్ని జవాబుదారీతనంగా చెప్పవచ్చు. ఇక నుంచి వారు తమ కార్యకలాపాల విషయంలో ప్రజా పరిశీలనకు గురి కావలసి ఉంటుంది. విస్తృత అర్థంలో చెప్పాలంగే, పౌర, సేవా సంస్థలు, వినియోగదారుల సంస్థలకు ఉద్యోగులు జవాబుదారీగా ఉండాలి. పాలనలో సమన్యాయం, పారదర్శకత పాటిస్తే జవాబుదారీతనం సిద్ధిస్తుంది.

ప్రశ్న 2.
ఎలక్ట్రానిక్ పాలనలోని ఏవైనా రెండు సుగుణాలు రాయండి.
జవాబు.

  1. పౌరునికి సమాచారం అందించి, సంప్రదించే అవకాశం
  2. పాలన ప్రక్రియ సంస్కరించడం.
  3. సమాచార అందుబాటు
  4. పౌరులకు గుణాత్మక సేవలు పెంపొందించడం
  5. సరళతరం నియమాలు

ప్రశ్న 3.
పాలన సంబంధితుల జాబితా తెలపండి.
జవాబు.

  1. కార్యనిర్వాహక వర్గం
  2. శాసన నిర్మాణ శాఖ
  3. న్యాయశాఖ
  4. ప్రచార ప్రసార మాధ్యమాలు
  5. ప్రైవేటు రంగం
  6. సాంఘిక సేవా సంస్థలు
  7. పౌర సమాజం
  8. రాజకీయ పార్టీలు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 4.
ఎలక్ట్రానిక్ పాలనలో ప్రభుత్వం నుంచి పౌరుల నమూన అంటే ఏమిటి ?
జవాబు.
ప్రభుత్వానికి, పౌరులకు మధ్య కార్యాచరణ సంబంధాన్ని కల్పించి, విస్తృత స్థాయిలో సేవలు అందించే విధానాన్నే ప్రభుత్వం నుంచి పౌరుల నమూన అంటారు. ఇది సాధారణ ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రశ్న 5.
పారదర్శకతను కొన్ని పదాలతో వివరించండి.
జవాబు.
పారదర్శకత, పరిపాలనలో ఈ కింది సూచించిన పద్దతుల ద్వారా కార్యసాధకతను పెంపొందిస్తుంది.

  1. సేవల అందుబాటు వ్యవస్థను క్రమబద్ధీకరించండి.
  2. జవాబుదారీదతనాన్ని పెంపొందించడం.
  3. పాలనలో అవినీతి, అక్రమాల తొలగింపు అనుచిత ఆచరణలు తగ్గించడానికి సాంఘిక తనిఖీ సిఫార్సు చేయడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 6.
సమాచార హక్కుచట్టం ఏ సంవత్సరంలో రూపొంది, అమలయింది.
జవాబు.
సమాచార హక్కుచట్టం 2005 రాష్ట్రపతి ఆమోదముద్రను 15 జూన్ 2005న పొంది, అక్టోబర్ 2005 నుంచి ‘పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది.

TS Inter 1st Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 4th Lesson రాజనీతి భావనలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 4th Lesson రాజనీతి భావనలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
శాసనాన్ని నిర్వచించి, దాని ముఖ్య ఆధారాలను వివరించండి.
జవాబు.
పరిచయం : రాజనీతిశాస్త్ర అధ్యయనంలో చట్టం అనేది ఒక ముఖ్యమైన భావన.

రాజ్యం శాసనాల ద్వారా ప్రజలను పరిపాలిస్తుంది. శాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్య సార్వ భౌమాధికారం శాసనాల ద్వారా వ్యక్తమవుతుంది. రాజ్యం ఆశించే సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులు శాసనం ద్వారానే సాధించగలదు. మానవుని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమాలే శాసనాలు. వ్యక్తులు రాజ్యంలో చేయవలసినవి, చేయకూడనివి శాసనం చెబుతుంది. ప్రభుత్వంలోని శాసనశాఖ శాసనాలు చేస్తుంది.

అర్థం :
శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.

నిర్వచనాలు :

  1. “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.
  2. “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
  3. న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

శాసనానికి ఆధారాలు :
హాలండ్ అనే రచయిత సంప్రదాయాలు, మతము, ధర్మబద్ధత (సమత), న్యాయమూర్తుల తీర్పులు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, శాసనశాఖ అనేవి శాసనాలకు ఆధారాలని చెప్పాడు. శాసనాలు వివిధ రంగాలలో క్రమంగా రూపొందుతాయి. అనేక అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పిన శాసనాల ఆధారాలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.

1. ఆచార, సంప్రదాయాలు, వాడుకలు (Customs) :
ఇవి శాసనానికి తొలి ఆధారాలు. ప్రజల ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలు శాసనాలకు మూలాధారము. సంప్రదాయాలు సంఘంలో ఒక అలవాటుగా, క్రమంగా రూపొందుతాయి. పూర్వం సంప్రదాయాలే సమాజ జీవితాన్ని క్రమబద్ధం చేసేవి. రాజ వీటిని గుర్తించి, వాటిని ఆధారం చేసుకొని కొన్ని శాసనాలను రూపొందిస్తుంది.

రాజకీయ ఆచారాలు కూడా రాజ్యంచే గుర్తించబడి అమలు చేయబడితే అవి శాసనాలవుతాయి. బ్రిటన్లో ‘సామాన్య న్యాయం’ సంప్రదాయబద్ధమైన శాసనానికి ఉదాహరణ. అదే విధంగా భారతదేశంలో వివాహ చట్టాలు, ఆస్తి పంపిణీ చట్టాలు మొదలగునవి సంప్రదాయాల ఆధారంగా చేయబడ్డాయి.

2. మతం (Religion) :
ఆచారానికి మతం సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే వ్యవస్థ. సంఘ జీవితం మత నియమాలకు అనుగుణంగా జరుపుకుంటారు. పూర్వం మతాధిపతులు చెప్పే నియమాలు శాసనాల వలె చెలామణి అయ్యేవి. ఆధునిక కాలంలో కూడా శాసనాలు చేయడానికి మతం ఒక ఆధారం. వారసత్వం, వివాహం, కుటుంబ ఆస్తి మొదలైన వాటి శాసనాలు మతం ఆధారంగా చేయబడ్డాయి.

హిందువులు, క్రైస్తవులు, ముస్లిములకు గల శాసనాలు వారి మతాల ఆధారంగా రూపొందాయి. ఇరాన్, పాకిస్థాన్ వంటి మత ప్రమేయ దేశాలలో సంఘ జీవనానికి మత నియమాలే ఆధారం.

3. న్యాయస్థానాల తీర్పులు (Judicial Decisions) :
న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు శాసన నిర్మాణానికి ఆధారాలు. న్యాయస్థానాలు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఈ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు క్రొత్త న్యాయ సూత్రాలను సృష్టిస్తారు. ఈ తీర్పులు అదే విధమైన వివాదాలు తలెత్తినప్పుడు న్యాయసూత్రాల వలె వర్తింపచేస్తారు. నేడు న్యాయమూర్తుల నిర్ణయాలు శాసనాలలో అంతర్భాగమవుతున్నాయి.
ఉదా : భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్ కేసు.

4. శాస్త్రీయ వ్యాఖ్యానాలు (Scientific commentories) :
ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, రచయితలు, విమర్శకులు చేసే వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారమవుతాయి. ఇవి న్యాయస్థానాలలో న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు, వివరణలు, శాసనాలు చేయటానికి ప్రభుత్వానికి ఉపయోగపడతాయి.

న్యాయమూర్తుల నిర్ణయాలు, తీర్పులు, భవిష్యత్లో శాసన నిర్మాణానికి తోడ్పడతాయి. ఇంగ్లండ్లో కోక్, బ్లాక్టన్, అమెరికాలో స్టోరీ, కెంట్, భారతదేశంలో విజ్ఞానేశ్వర, అపరార్క వంటి వారి వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారాలు.

5. సమత లేదా సమబద్ధత (Equity) :
‘సమత’ అనే పదానికి నిష్పక్షపాతం, న్యాయంలాంటి సూత్రాలను పర్యాయపదాలుగా వాడుతున్నారు. సమత అంటే సహజన్యాయం. అమలులో ఉన్న చట్టాలు వివాదాల పరిష్కారానికి సరిపడని సందర్భాలలో న్యాయమూర్తులు తమ విజ్ఞతతో, సక్రమ అవగాహన ద్వారా వివాదాల పరిష్కారంలో కక్షిదారులకు న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నిస్తారు. సమత అనేది సహజన్యాయ భావన ద్వారా రూపొందింది. దానినే న్యాయమూర్తులచే నిర్మితమైన చట్టాలుగా పరిగణించడమైంది.

ఈ సందర్భంలో హెన్రీమెయిన్ అనే పండితుడు సహజన్యాయం గురించి ప్రస్తావిస్తూ అది కొన్ని ప్రత్యేక సూత్రాల ఆధారంగా రూపొంది పౌరన్యాయంతో కూడిన నియమాల సముదాయంగా పేర్కొన్నాడు. పౌరన్యాయం కంటే సమత అనేది ఉన్నతమైనది. సమదృక్పథం, సహజన్యాయం లాంటి సూత్రాల ఆధారంగా పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలను రూపొందించే సాంప్రదాయకమైన పద్ధతికి సమత సంకేతంగా ఉంటుంది.

6. శాసనసభ (Legislature) :
ప్రజాస్వామ్యంలో శాసన నిర్మాణశాఖ చట్టం ఆధారాలలో ముఖ్యమైనదిగా భావిస్తారు. ప్రభుత్వ సంస్థలలో ఒకటైన శాసనసభ చట్టాలను ఆమోదిస్తుంది. అందుచేత శాసననిర్మాణ శాఖను చట్టం ఆధారాలలో ప్రత్యక్షమైన అంశంగా గుర్తించడమైంది.

ఆధునిక కాలంలో చట్టాల రూపకల్పనలో శాసనసభలు ప్రముఖమైనవిగా భావించడమైంది. చట్ట నిర్మాణంలో శాసనసభలు సాధారణ ప్రజానీకం ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటాయి. శాసనసభలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 2.
శాసనం అంటే ఏమిటి ? శాసన లక్షణాలను చర్చించండి.
జవాబు.
ఆధునిక రాజ్య వ్యవస్థలో శాసనాలకు లేదా చట్టాలకు అత్యంత ప్రాముఖ్యత వుంది. రాజ్యం శాసనాలు రూపొందించడం, అమలుపరచడం ద్వారా తన సార్వభౌమాధికారాన్ని వ్యక్తం చేస్తుంది. శాసనం అనేది రాజ్యానికి సంబంధించిన విశిష్ట లక్షణం.

రాజ్యంలోని వివిధ సంస్థల మధ్య, వ్యక్తుల మధ్య, సంస్థలు – వ్యక్తుల మధ్య సంబంధాలను శాసనాల ద్వారా రాజ్యం క్రమబద్ధం చేస్తుంది. రాజ్య లక్ష్యాలు, విధానాలు శాసనాల ద్వారానే సాధించడానికి వీలవుతుంది. రాజ్యంలోని వ్యక్తులు ఏమి చేయ్యాలి ? ఏమి చేయకూడదు ? అని నిర్దేశించేది శాసనం. రాజనీతి శాస్త్రంలోను, న్యాయశాస్త్రంలోను శాసనానికి విస్తృతమైన అర్థం వుంది.

అర్థం – నిర్వచనం :
చట్టాన్ని లేదా శాసనాన్ని ఆంగ్లంలో లా (Law) అంటారు. ఈ పదానికి లాగ్ (Lag) అనే పురాతన ట్యుటానిక్ పదం మూలం ‘లాగ్’ అంటే స్థిరమైంది అని అర్థం. చట్టబద్ధమైన, అధికారిక వ్యవస్థ రూపొందించి, అమలుపరచే స్థిరమైన నియమాలను, నిబంధనలను శాసనంగా చెప్పవచ్చు. రాజనీతి శాస్త్రజ్ఞులు శాసనాన్ని రకరకాలుగా నిర్వచించారు. కొన్ని నిర్వచనాలను కింద ఇవ్వడమైంది.

జాన్ ఎరిక్ సన్ : “ప్రజల జీవన విధానాన్ని నిర్దేశించి దానికి వారు విధేయులై వుండాలని శాసిస్తూ సార్వభౌమాధికారి జారీ చేసే ఆజ్ఞే న్యాయ శాసనం”.
టీ.ఇ. హాలండ్ : “మానవుని బాహ్యప్రవర్తనను క్రమబద్ధం చేయడానికి రాజ్యం అధికారికంగా అమలుచేసే నియమావళే శాసనం”.
జాన్ సాల్మండ్ : “న్యాయ పాలన కోసం రాజ్యం గుర్తించి, అమలుపరిచే నియమాల సముదాయమే శాసనం”.
జాన్ ఆస్టిన్ : “సార్వభౌమాధికారి ఆదేశమే శాసనం”.

శాసనం – లక్షణాలు :
పైన పేర్కొన్న నిర్వచాలను బట్టి శాసనానికి క్రింది లక్షణాలు ఉంటాయని చెప్పవచ్చు.

  1. రాజ్యం ఆశయాలను అభీష్టాలను శాసనాలు వ్యక్తీకరిస్తాయి.
  2. శాసనాలను ఉల్లంఘించే ప్రజలను దండించే అధికారం రాజ్యానికి వుంది.
  3. శాసనాలు లిఖితరూపంలో ఉంటాయి.
  4. మానవుని బాహ్య ప్రవర్తనను శాసనాలు నియంత్రిస్తాయి. మానవుని అంతరాత్మను శాసనాలు నియంత్రించవు.
  5. శాసనాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. శాసనాల అమల్లో రాజ్యం ప్రజల మధ్య విచక్షణ చూపదు.
  6. శాసనాలు క్లుప్తంగా, స్పష్టంగా ఉంటాయి.
  7. శాసనాలను రాజ్యం తనకున్న సార్వభౌమాధికారం ద్వారా అమలు పరుస్తుంది.
  8. శాసనాలు సంఘ సంక్షేమానికి సాధనాలు.
  9. శాసనాలు సామాజిక అవసరాలకు అనుగుణంగా మారుతుంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 3.
న్యాయం రకాలను తెలపండి.
జవాబు.
పరిచయం :
రాజనీతిశాస్త్ర అధ్యయనంలో న్యాయం ఒక ముఖ్యమైన భావన. సమకాలీన సమాజంలో దాదాపు ప్రపంచ రాజ్యాలన్నీ. తమ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాల వైరుధ్యాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో న్యాయం చేకూర్చి కొనసాగేందుకు కృషి చేస్తున్నాయి.

అర్థం : న్యాయం (Justice) అనే ఇంగ్లీష్ పదం “జస్” (Jus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో “జస్” అంటే “బంధించి ఉండటం” లేదా “కలిపి ఉంచడం” అని అర్థం.

నిర్వచనాలు :

  1. ప్లేటో : “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”.
  2. అరిస్టాటిల్ : “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
  3. కెఫాలస్ : “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”.

న్యాయం రకాలు (Types of Justice) :
న్యాయం అనేక రకాలుగా ఉంటుంది. ఇది సహజవాబు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, చట్టబద్ధమైన పార్శాలకు సంబంధించినది. న్యాయభావనలోని వివిధ రకాలను గురించి క్రింద వివరించడం
జరిగింది.

1. సహజ న్యాయం (Natural Justice) :
ప్రపంచంలో లభించే సహజ వనరులను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవచ్చుననే సూత్రం ఆధారంగా ప్రతిపాదించబడినదే సహజ న్యాయం. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ సహజ వనరులు జీవన ఆధారంగా ఉంటాయి. మానవులు ఒక్కరే హేతుబద్ధమైన జీవనం గడపటం వల్ల, సహజ వనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ సందర్భంలో మానవులు భవిష్యతరాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.

2. సామాజిక న్యాయం (Social Justice) :
సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది.

చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.

3. రాజకీయ న్యాయం (Political Justice) :
రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.

  1. సమన్యాయ పాలన
  2. స్వతంత్ర న్యాయశాఖ
  3. ప్రాతినిధ్య సంస్థలకు ఎన్నికలు
  4. రాజకీయ పార్టీలు
  5. పత్రికా స్వాతంత్య్రం
  6. ప్రజాస్వామ్య పాలన మొదలైనవి.

4. ఆర్థిక న్యాయం (Economic Justice) :
వ్యక్తుల మధ్య నిర్హేతుకమైన, ప్రకృతి విరుద్ధమైన వ్యత్యాసాలు లేని పరిస్థితినే ఆర్థికన్యాయంగా పేర్కొనవచ్చు. ఆదాయం, ద్రవ్యం, సంపద, ఆస్తివంటి వ్యత్యాసాలు లేకుండా వ్యక్తులందరికీ సమానమైన ఆదరణ కల్పించేందుకు ఆర్థికన్యాయం ఉద్దేశించింది.

సానుకూల దృష్టిలో ఆర్థిక న్యాయం అనేది శ్రామికులకు చాలినంత వేతనాలను చెల్లించేందుకు దోహదపడుతుంది. సంపద, ఆదాయంలో విపరీతమైన అంతరాలను తొలగించేందుకు కృషి చేస్తుంది.

బడుగు బలహీనవర్గాలు దోపిడీకి గురికావడాన్ని ఎట్టి పరిస్థితులలో ఈ న్యాయం అనుమతించదు. ప్రతి ఒక్కరూ కనీస ప్రాథమికావసరాలను పొందేందుకు ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడు, గుడ్డ, వసతి వంటి ప్రాథమిక అవసరాలు కలిగి ఉండేందుకు చర్యలు తీసుకొంటుంది.

సమాజంలో న్యాయబద్ధమైన ఆర్థిక వ్యవస్థాపనకు తోడ్పడుతుంది. “ప్రతి ఒక్కరూ వారి సామర్థ్యాన్ని బట్టి ఉపాధి పొందడం, అవసరాన్ని బట్టి ఆర్థిక వనరులను వినియోగించుకోవడం” అనే భావనను ఆర్థికన్యాయం బలపరుస్తుంది.

5. చట్టబద్ధమైన న్యాయం (Legal Justice) :
చట్టబద్ధమైన న్యాయం అనేది రాజ్యాంగ శాసనాల ద్వారా వెల్లడి అవుతుంది. సమాజంలో ఎంతోకాలంగా ప్రాచుర్యంలో ఉన్న ఆచార సంప్రదాయాలతో ఈ రకమైన న్యాయం సంబంధాన్ని కలిగి ఉంటుంది. రాజ్యంలోని రాజ్యాంగం, ఇతర శాసనచట్టాల రూపంలో అది వ్యక్తమవుతుంది. న్యాయం చట్టబద్ధమైన పరిమితులను నిర్ణయిస్తుంది. చట్టబద్ధమైన న్యాయంలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి :

1. సమాజంలో చట్టాలన్నీ సమన్యాయ పాలన సూత్రంపై ఆధారపడి రూపొందితమై, అమలులో ఉంటాయి.
2. చట్టాలన్నీ సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా రూపొందుతాయి. మొత్తం సమాజ సంక్షేమాన్ని చట్టాలు ఆకాంక్షిస్తాయి. అయితే చట్టబద్ధమైన న్యాయం అనేది పూర్తిగా న్యాయంగా పరిగణితం కాదు. ఈ సందర్భంలో న్యాయం అంటే చట్టం అని ఎర్నస్ట్ బార్కర్ పేర్కొన్నాడు.

చట్టబద్ధమైన న్యాయం అనేది న్యాయాన్ని ప్రసాదించేందుకు ఉద్దేశించిందని కొందరు పేర్కొన్నారు. మొత్తం మీద చట్టం అనేది న్యాయానికి కొంతమేరకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మరికొందరు భావించారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 4.
స్వేచ్ఛను నిర్వచించండి. వివిధ రకాల స్వేచ్ఛలను తెలపండి.
జవాబు.
పరిచయం :
స్వేచ్ఛ అనేది రాజనీతిశాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.

అర్థం :
స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.

నిర్వచనాలు :

  1. హెచ్.జె. లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ : “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ”.
  3. జె.ఆర్. సీలీ : “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ”.

స్వేచ్ఛ రకములు : స్వేచ్ఛ ఐదు రకాలు. అవి

  1. సహజ స్వేచ్ఛ
  2. పౌర స్వేచ్ఛ
  3. ఆర్థిక స్వేచ్ఛ
  4. రాజకీయ స్వేచ్ఛ.
  5. జాతీయ స్వేచ్ఛ.

వీటిని గురించి ఈ కింద పేర్కొన్న విధంగా విపులీకరించవచ్చు.

1. సహజ స్వేచ్ఛ (Natural Liberty) :
సహజ స్వేచ్ఛ అనేది ఎటువంటి ఆంక్ష లేకుండా ఏదైనా చేయడాన్ని సూచిస్తుంది. ఇది ఎలాంటి జోక్యానికి లేదా నిర్భంధాలకు తావివ్వదు. వ్యక్తులు తమ ఇచ్ఛానుసారం చేయదలచినదాన్ని సుసాధ్యం చేస్తుంది. అయితే, నిర్నిబంధమైన స్వేచ్ఛ వ్యక్తుల స్వేచ్ఛలను హరిస్తుంది.

నేటి సమాజంలో సహజ స్వేచ్ఛ అనేది కనిపించదు. ఇది అన్యాయం అరాచకత్వాలకు పర్యాయపదమైనది. సహజ స్వేచ్ఛగల చోట స్వాతంత్ర్యం మృగ్యమవుతుంది. ఆదిలో రోమన్ రాజనీతి తత్త్వవేత్తలు ఈ భావనను సమర్థించారు. ఎటువంటి అవధుల్లేని ప్రాకృతిక వ్యవస్థలోని మానవులు అపరిమితమైన స్వేచ్ఛను అనుభవించారన్నారు. అటువంటి స్వేచ్ఛ – రాజ్యం, సమాజాల ఆవిర్భావానికి ముందు మాత్రమే ఉనికిలో ఉండేది.

2. పౌర స్వేచ్ఛ (Civil Liberty) :
పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్య్రాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు.

  • సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం
  • ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం
  • నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్య్రం. పౌరస్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది.

సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.

“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు.
పౌరస్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి

  1. జీవించే హక్కు
  2. పనిచేసే హక్కు
  3. ఆస్తిహక్కు
  4. వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

3. ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty) :
ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతి ఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే ఆర్థికస్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరుద్యోగం – అసంపూర్ణతల నుంచి విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.

ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.

  1. కనీస వేతనాలను అందించడం.
  2. పనిహక్కుకు భరోసా కల్పించడం.
  3. నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం.
  4. తగినంత విశ్రాంతిని కల్పించడం.
  5. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.

4. రాజకీయ స్వేచ్ఛ (Political Liberty) :
రాజకీయ స్వేచ్ఛ పౌరులు రాజకీయాంశాలలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛ పౌరులకు రాజ్య కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే శక్తినిస్తుందని లాస్కీ పరిగణించాడు. రాజకీయ స్వేచ్ఛను ప్రజాస్వామ్యానికి పర్యాయపదంగా గిల్ క్రిస్ట్ భావించాడు. రాజకీయ స్వేచ్ఛ అంటే ఎవరికి వారు తమ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకొనే రాజ్యాంగ స్వేచ్ఛగా లీకాక్ వర్ణించాడు. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు మాత్రమే పరిమితమైంది.

అది సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు రాజకీయాంశాలలో వివిధ హక్కులను కల్పిస్తుంది. అటువంటి వాటిలో i) ఓటు వేసే హక్కు ii) ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేసే హక్కు iii) ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు iv) విమర్శించే హక్కువంటివి ఉన్నాయి. విద్య, నిజాయితీ, నిష్పక్షపాతమైన పత్రికలు మొదలైనవి ఉన్నప్పుడే రాజకీయ స్వేచ్ఛ వాస్తవం అవుతుందని లాస్కీ నొక్కి చెప్పాడు.

5. జాతీయ స్వేచ్ఛ (National Liberty) :
జాతీయ స్వేచ్ఛ అంటే రాజ్యం – స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. రాజ్యపు సార్వభౌమత్వాన్ని అది సూచిస్తుంది. ప్రతి రాజ్యం ఈ స్వేచ్ఛను అనుభవిస్తూ ఇతర రాజ్యాల ఆధిపత్యానికి లోనుకాకుండా ఉంటుంది. అన్ని రంగాలలో జాతి అభివృద్ధికి ఈ స్వేచ్ఛ ఆవశ్యకమైంది. ప్రాచీన కాలం నుంచి అనేక దేశాల్లో ఇది విశదమైంది.

ఈ రకమైన స్వేచ్ఛను పొందడం కోసం అనేక దేశాలు ఎంతగానో ప్రయత్నించాయి. గతంలో టర్కీ ప్రజలకు వ్యతిరేకంగా గ్రీకులు స్వాతంత్య్ర సమరం సాగించారు. అట్లాగే మహాత్మాగాంధీ నాయకత్వంలో భారత ప్రజలు బ్రిటీష్ పాలన నుంచి స్వాతంత్య్రం కోసం అహింసాయుత పోరాటం చేశారు. జాతీయ స్వేచ్ఛ ఎంతో విలువైంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 5.
స్వేచ్ఛ అంటే ఏమిటి ? స్వేచ్ఛ పరిరక్షణలను వివరించండి.
జవాబు.
పరిచయం :
స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతిశాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.

అర్థం : స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.

నిర్వచనాలు :

  1. హెచ్.జె.లాస్కీ : “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ : “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్చ”.
  3. జె.ఆర్. సీలీ : “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ”.

స్వేచ్ఛ సంరక్షణలు (లేదా) పరిరక్షణ మార్గాలు :
స్వేచ్ఛ అనేది మానవుల పాలిట అత్యంత విలువైన ఆదర్శం. కాబట్టి దానిని సమాజవాబు. రాజ్య విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పరిరక్షించుకోవాలి. ఈ సందర్భంగా స్వేచ్ఛ పరిరక్షణలో కిందివాటిని పేర్కొనవచ్చు.

1. ప్రజాస్వామ్య వ్యవస్థ (Democratic Rule) :
ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రభుత్వం. ఎన్నికైన ప్రతినిధులు ప్రజల స్వేచ్ఛను నిరంతరం కాపాడుతుంటారు. కేవలం ప్రజాస్వామ్య సంస్థలు మాత్రమే స్వేచ్ఛను పరిరక్షించగలవు.

2. లిఖిత మరియు దృఢ రాజ్యాంగం (Written and Rigid Constitution) :
వ్యక్తి స్వేచ్ఛకు లిఖిత, దృఢ రాజ్యాంగాన్ని వేరొక ముఖ్య లక్షణంగా భావించవచ్చు. ఇటువంటి రాజ్యాంగం అనేక నిబంధనలలో వ్యక్తి స్వాతంత్ర్యాలను పేర్కొంటుంది. ప్రజల స్వేచ్ఛ, హక్కులకు అది రక్షకురాలిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వాంగాల చర్యలకు అది హద్దులను ఏర్పరుస్తుంది.

ప్రభుత్వాధికారులు లేదా మరెవరి చేతనైనా ప్రజల స్వాతంత్ర్యాలు ఉల్లంఘించబడినప్పుడు చేపట్టవలసిన వివిధ చర్యలను వివరిస్తుంది. తమ సంకుచిత ప్రయోజనాల కోసం రాజ్యాంగంలోని అంశాలను సవరించేందుకు ప్రయత్నించే పార్టీలపై ఆంక్షలను విధిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

3. స్వతంత్ర న్యాయవ్యవస్థ (Independent Judiciary) :
పౌరుల స్వేచ్ఛా పరిరక్షణకు స్వయం ప్రతిపత్తి ఉన్న నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ తప్పనిసరి. దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయస్థానాలు ఉన్నప్పుడే అవి శాసనసభ చేయగల ప్రజావ్యతిరేక చట్టాలను, కార్యనిర్వాహకశాఖ అమలుపరచగల ప్రజావ్యతిరేక విధానాలను ఆపగలవు.

4. సమన్యాయపాలన (Rule of Law) :
స్వేచ్ఛకున్న వేరొక పరిరక్షణయే సమన్యాయపాలన. బ్రిటన్, ఇండియా, అమెరికా సంయుక్తరాష్ట్రాలు వంటి అనేక దేశాల్లో ఇది అమలులో ఉంది. వ్యక్తుల స్వేచ్ఛలను సమన్యాయపాలన మూడు విధాలుగా పరిరక్షిస్తుంది. అవి (i) ఇది వ్యక్తులందరినీ సమానంగా చూస్తుంది. (ii) రాజ్యమంతటా. ఒకే విధమైన చట్టాలు అమలయ్యేటట్లు చేస్తుంది. (iii) కార్యనిర్వాహకవర్గపు నిరంకుశాధికారాలపైన తగిన ఆంక్షలను విధిస్తుంది.

5. ప్రాథమిక హక్కులు (Fundamental Rights) :
ప్రాథమిక హక్కులనేవి వ్యక్తి స్వేచ్ఛలను చాలావరకు పరిరక్షిస్తాయి. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఎటువంటి ఆంక్షలు లేకుండా. ప్రజలు స్వేచ్ఛలను పొందుతారు. పౌరులలో నిబిడీకృతమైన నైపుణ్యాలను అభివృద్ధిపరచుటకు, విభిన్న రంగాలలో వారు తమ ప్రతిభను చాటుకొనేందుకు ప్రాథమిక హక్కులు దోహదపడతాయి.

6. ఆర్థిక సమానత్వం (Economic Equality) :
వ్యక్తుల స్వేచ్ఛా పరిరక్షణలో ఆర్థిక సమానత్వం కూడా ప్రధానమైంది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం వంటి దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు వ్యక్తులకు చాలినన్ని అవకాశాలను కల్పించాలనే భావన ఇందులో ఇమిడి ఉంది. ఆర్థిక సమానత్వం నెలకొన్నప్పుడే స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ఆర్థిక సమానత్వంలో ఆర్థిక న్యాయం అంతర్భాగంగా ఉంటుంది. దీనిని రాజ్యం ప్రసాదిస్తుంది.

7. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers) :
అధికారాలు వికేంద్రీకరణ ద్వారా స్వేచ్ఛను మెరుగైన రీతిలో పరిరక్షించవచ్చు. ప్రభుత్వాధికారాల కేంద్రీకరణ నుంచి దేశానికి విముక్తి కలిగినప్పుడే వ్యక్తులు స్వేచ్ఛను అనుభవించగలరు. కేంద్రం రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల మధ్య అధికారాలను కేటాయించినప్పుడు నిరంకుశత్వానికి, వ్యక్తి స్వేచ్ఛల హరింపునకు తావుండదు లేనిచో రాజ్యాంగంలో పొందుపరచిన ‘ హక్కులను అనుభవించటమన్నది ప్రజలకు కష్టమవుతుంది.

8. పత్రికా స్వాతంత్ర్యం (Independent Press) :
ప్రజాస్వామ్యాన్ని కొందరు వ్యక్తి స్వేచ్ఛా పరిరక్షణ కవచంగా భావించారు. తమ పనితీరులో చాలినంత స్వతంత్ర ప్రతిపత్తిని పత్రికలు, ఇతర మాధ్యమాలు కలిగి ఉన్నప్పుడే వ్యక్తులు స్వేచ్ఛలను అనుభవించగలరు. ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచి, సంఘటితపరచి, వ్యక్తీకరించడంలో పత్రికలు ముఖ్యమైన వాహకంగా వ్యవహరిస్తాయి. అవి తమ నిష్పాక్షిక సంపాదకీయాలు, సత్య సమ్మతమైన వార్తలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తి స్వేచ్ఛలను పరిరక్షించగలుగుతాయి.

9. బలమైన ప్రతిపక్షం (Strong Opposition) :
వ్యక్తి స్వేచ్ఛను పెంపొందించేందుకు బలమైన ప్రతిపక్షం అవసరమవుతుంది. ఒకవిధంగా వ్యక్తి స్వేచ్ఛకు ప్రతిపక్షం కాపలాదారుడిగా పనిచేస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వంలో ఉన్నత స్థానంలోని వ్యక్తులు నిరంకుశ చట్టాల అమలు ద్వారా సామాన్యుల స్వేచ్ఛలకు హద్దులు గీసి హరించి వేసినపుడు, ప్రతిపక్షం అట్టి చర్యలను తీవ్రంగా అడ్డుకుంటుంది. అంతిమంగా, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వ్యక్తుల స్వేచ్ఛలను కాపాడుతుంది.

10. ప్రజల అప్రమత్తత (People vigilance) :
స్వేచ్ఛకు అన్నింటికన్నా ముఖ్యమైంది ప్రజల అప్రమత్తత. స్వేచ్ఛ పరిరక్షణకు ప్రజలు నిరంతరం అప్రమత్తతతో ఉండాలి. తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పరిరక్షించుకోవాలనే ఆకాంక్ష, స్ఫూర్తి, పట్టుదల పౌరస్వేచ్ఛకు శక్తివంతమైన రక్షణ కవచంగా పనిచేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 6.
సమానత్వాన్ని నిర్వచించండి. వివిధ రకాల సమానత్వాలను తెలపండి.
జవాబు.
సమానత్వం ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే

  1. ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం
  2. శాసనాలు పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం
  3. చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.

నిర్వచనం :
“సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాశాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు.

అందరికీ సమాన ఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అంతా సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.

సమానత్వం – రకాలు : సమానత్వం ప్రధానంగా ఐదు రకాలు. అవి 1) సహజ సమానత్వం 2) సాంఘిక సమానత్వం 3) ఆర్థిక సమానత్వం 4) రాజకీయ సమానత్వం 5) అంతర్జాతీయ సమానత్వం. వీటిని గురించి ఈ కింద పేర్కొన్న విధంగా విపులీకరించవచ్చు.

1. సహజ సమానత్వం (Natural Equality) :
సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తిపరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది.

పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.

2. సాంఘిక సమానత్వం (Social Equality) :
వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.

ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్పృశ్యతను అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు. ఈ సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.

  1. రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
  2. విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి.
  3. సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
  4. రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
  5. తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
  6. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

3. ఆర్థిక సమానత్వం (Economic Equality) :
ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు.

ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి-ఆదాయాలకు సంబంధించిన అంశం. ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషుల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్స్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.

4. రాజకీయ సమానత్వం (Political Equality):
రాజకీయ సమానత్వం రాజకీయ కార్యకలాపాలలో ప్రజలకు చాలినన్ని అవకాశాలను కల్పించేందుకు అనుకూల పరిస్థితులను సూచిస్తుంది. రాజ్యంలోని పౌరులకు వివిధ రకాల రాజకీయ హక్కులను ప్రసాదించడం ద్వారా ఆ రకమైన సమానత్వాన్ని సాధించవచ్చు. ఈ సందర్భంలో రాజకీయ సమానత్వాన్ని పౌరులు మాత్రమే అనుభవిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యంలో నివసించే అన్యులు, విదేశీయులకు ఇది వర్తించదు.

ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ సమానత్వమన్నది అత్యంత ఆవశ్యకమైంది. వివిధ రాజకీయ హక్కులను ప్రసాదించినప్పుడే పౌరులు రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే, రాజకీయ సమానత్వమనేది రాజకీయ స్వేచ్ఛకు పర్యాయపదంగా భావించవచ్చు.

5. అంతర్జాతీయ సమానత్వం (International Equality) :
అంతర్జాతీయ సమానత్వమంటే భౌగోళిక, ఆర్థిక లేదా సైనికపరమైన అంశాలతో నిమిత్తం లేకుండా అన్ని రాజ్యాలనూ సమానంగా చూడటంగా పేర్కొనవచ్చును. ఈ విధమైన సమానత్వం ద్వారా ప్రపంచంలోని చిన్న, పెద్ద రాజ్యాలన్నీ సమానమవుతాయి. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి తన చార్టర్లో అన్ని రాజ్యాలకు సమానమైన గౌరవం, హోదాలను కల్పించింది.

అంతర్జాతీయ సమానత్వం మానవీయ లక్షణాలను ప్రతిబింబిస్తుంది. రాజ్యాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలను శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని నొక్కిచెబుతుంది. అంతర్జాతీయ న్యాయానికి గౌరవం లోపించినప్పుడు మూడో ప్రపంచ యుద్ధం సంభవించవచ్చని కొందరు హెచ్చరించారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 7.
సమానత్వం అంటే ఏమిటి ? దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
సమానత్వం, అసమానత్వం అనే రాజనీతి భావనలు అరిస్టాటిల్ కాలం నుంచే ఉన్నాయి. విప్లవానికి గల కారణాలలో అసమానత్వం ఒకటని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. 18వ శతాబ్దం వరకు అసమానతలు అనేవి సహజమని ప్రకృతి పరంగా వారసత్వంగా వచ్చినవనే భావనలో ఉండేవారు.

ఆధునిక కాలంలో 17వ శతాబ్దం మొదట్లో సహజ సమానత్వం, సహజన్యాయం, అనే భావనల మూలాలు హాబ్స్, లాక్, రూసోల సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలలో ఉన్నాయి. సమానత్వం అనే భావన ఆధునిక సామాజిక ఉద్యమాలకు, విప్లవాలకు ప్రేరణగా నిలిచింది.

మార్క్సిస్టుల దృష్టిలో సమానత్వం అంటే మానవుల మధ్య సమానత్వం. సమానత్వం అనే సూత్రం ప్రస్తుతం అన్ని ఆధునిక రాజ్యాంగాలలోను, మానవహక్కుల ప్రకటనలోను సాధారణ సూత్రావళిగా ఆమోదించబడింది.

ఒక విధంగా చెప్పాలంటే అమెరికా, ఫ్రెంచి విప్లవాల నుంచి ఆధునిక కాలం వరకు సమానత్వం అనే భావన ప్రముఖ స్థానం వహించింది. ఆధునిక సమాజంలో ఈ భావన అసమానతలను తొలగించి సామాజిక స్పృహను ప్రయత్నం చేసింది. సమానత్వ భావన సమాజంలో కొద్దిమంది మాత్రమే అపరిమిత సంపాదనను కలిగి ఉండడాన్ని, అపరిమిత అధికారం, హెూదా కలిగి ఉండడాన్ని నిరోధించి, దోపిడికి గురైన వారికి వీటిని పంచేలా చేసింది.

ఎ. సమానత్వం అర్థం :
సమానత్వం అనే భావన సమాన హక్కులు, సమాన అవకాశాలు అనే అంశాన్ని సూచిస్తుంది.

  1. హెరాల్డస్కీ తన “ఏ గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్” అనే గ్రంథంలో సమానత్వం అనేది ప్రాథమికంగా సమానత్వం సాధించే ప్రక్రియగా పేర్కొన్నాడు.
  2. బార్కర్ అభిప్రాయంలో “సమానత్వం అంటే కొందరికి ప్రత్యేక హక్కులు, ప్రత్యేక సౌకర్యాలు అనే దాన్ని నిషేధించి అందరికీ సమానహక్కులు కల్పించడం”గా భావించాడు.

బి. సమానత్వం లక్షణాలు :
1. సమానత్వం హక్కులను సాధించడం:
సమానత్వం అనేది సూచనాత్మకమైనదే కాని వివరణాత్మకమైనది కాదు. మానవులంతా తప్పకుండా సమానులే అని మనం భావిస్తాం. కాని అది వాస్తవం కాదు. సమాజంలో సాంఘిక ప్రయోజనాలను విస్తృతం చేసి వాటి ఫలాలను పేద వారికి అందించడం.

2. సమానత్వం ఆధునిక భావన :
మానవ జీవిత చరిత్రలో సంపదలో వ్యత్యాసాలు, అధికారంలో వ్యత్యాసాలు, గౌరవ ప్రతిష్ఠలలో వ్యత్యాసాలు అనేవి దాదాపు ప్రపంచమంతా కనిపిస్తాయి. శాస్త్రీయ యుగ ఆరంభంలో మానవుడు తన హేతుబద్ధమైన అనుభవపూర్వక జ్ఞానంతో ప్రకృతి వైపరీత్యాన్ని నియంత్రించడం నేర్చుకున్నాడు. ఈ పరిజ్ఞానం, ఆలోచన సమాజంలో ఉన్న సాంఘిక అసమానతలు సహజం కాదని, అసమానతలు తొలగించవచ్చనే ఆలోచనకు దారి తీసింది.

3. సామాజిక మార్పుకు సమానత్వం :
శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన ప్రగతి ఎక్కువ ప్రాంతాలలో సహజ అసమానత్వాన్ని ప్రత్యామ్నాయంగా పెంచిపోషించింది. ఆరోగ్యం, శారీరక పటిష్టత అనేది సరైన పౌష్టికాహారం వల్ల, మానసిక పరిపక్వత అనేది సరైన విద్య, రక్షణ ద్వారా సాధించవచ్చని మనకు తెలుసు. కాని ఈ ప్రయోజనాల లభ్యత అనేది వ్యక్తుల వ్యక్తిగత సాంఘిక, ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంది.

4. సామాజిక న్యాయం, స్వేచ్ఛ :
సామాజిక న్యాయ సాధనకు సమానత్వం అత్యవసరం. సమానత్వం, స్వేచ్ఛకు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. నిజం చెప్పాలంటే స్వేచ్ఛ లేనిదే సమానత్వం లేదు. సమానత్వం లేకుండా స్వేచ్ఛ వ్యర్థం.

5. సామాజిక ప్రత్యేకత ప్రజాప్రయోజనంపై ఆధారపడుతుంది :
సమాజంలో బుద్ధిబలం గల వారు సహజంగా మిగిలిన వారిని పీడించే తత్వాన్ని కలిగి ఉంటారు. అధికారం, శ్రామికుల విభజన అనేది హేతుబద్ధంగా ఉంటే అసమానత్వం అనేది ఆక్షేపణ కాదు. సమాజంలో సాధారణ ప్రయోజనం దృష్ట్యా అధికార వ్యవస్థ నిర్వహించే కార్యం చాలా కాలంగా ప్రత్యేక అంశంగా గుర్తించబడలేదు.

6. సమానత్వం సంపూర్ణ సమానత్వాన్ని సూచించదు :
దీని అర్థం అవకాశాలలో సమానత్వం. సామాజిక అసమ నతలలో ఆశించిన మేరకు తగ్గుదల ఉండాలని సమానత్వాన్ని కోరుకుంటుంది. వ్యక్తిగత నైపుణ్యాలు, హెూఒ పురోగతికి సమాన అవకాశాలను సూచిస్తుంది. దీని అర్థం ఫలితాల్లో సమానత్వం కాదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 8.
సమానత్వం సంబంధించి ఏవైనా మూడు రకాలను తెలపండి.
జవాబు.
సమానత్వంకి ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే

  1. ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం
  2. శాసనాలు పాలనలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం
  3. చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.

నిర్వచనం :
“సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాశాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు.

అందరికీ సమాన ఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అంతా సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.

1. సహజ సమానత్వం (Natural Equality) :
సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్య్రాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తి పరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది.

పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.

2. సాంఘిక సమానత్వం (Social Equality) :
వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.

ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్పృశ్యతను ‘అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు.

ఈ సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.

  1. రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
  2. విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి.
  3. సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
  4. రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
  5. తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
  6. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.పేర్కొనవచ్చు.

3. ఆర్థిక సమానత్వం (Economic Equality) :
ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది.

ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయ ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి – ఆదాయాలకు సం ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్త స్త్రీ, పురుషల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్స్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 9.
సమానత్వం మూలం మరియు ప్రాధాన్యతను తెలపండి.
జవాబు.
‘సమానత్వం’ అనే పదం సాధారణంగా మానవులందరూ సమానులే కాబట్టి అందరికీ ఒకే విధమైన ఆదరణ, గుర్తింపు, సంపద ఉండాలనే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. ప్రతి మానవునికి సహజ సిద్ధంగానే సమానత్వ వాంఛ ఉంటుంది. అయితే సమానత్వం అనే పదానికి శాస్త్రీయమైన అర్థాన్ని 1789లో ఫ్రాన్స్ దేశపు జాతీయసభ ఆమోదించిన మానవ హక్కుల ప్రకటనలో వివరించటం జరిగింది.

“మానవులందరూ స్వేచ్ఛా సమానత్వాలతో జన్మించి వాటితోనే జీవితాంతం కొనసాగుతాడ అని ప్రకటించబడింది. “ప్రజలందరూ సృష్టిరీత్యా సమానులే అనే సత్యాన్ని మేము స్పష్టపరచిన దానిగా భావిస్తాం అని 1776లో వెలువడిన అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలో కూడా అనే భావం స్ఫురించే విధంగా వివరించారు.

అంటే సమానత్వం మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదన్న మాట. ఆ పంధాలోనే “స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదత్రయం ఫ్రెంచ్’ విప్లవాన్ని ఎంతగానో ఉత్తేజితపరచింది. 1917లో రష్యన్ భూమిపై ప్రజ్వరిల్లిన కమ్యూనిస్ట్ విప్లవం ఆర్థిక సమానత్వాన్ని సాధించి ఉద్భవించింది.

సమానత్వం ప్రాధాన్యత :

  1. వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది : వ్యక్తి వికాసానికి సమానత్వం అవసరం. మానవుని అభివృద్ధికి కావలసిన పరిస్థితులను సమానత్వం ఉన్న చోట పొందవచ్చు.
  2. ప్రతిభను గుర్తిస్తుంది : సమానత్వం ఉన్న చోట అన్ని వర్గాల ప్రజలు సమానావకాశాలు పొందుతారు. పేదరికం, వెనుకబాటుతనం వంటివి ప్రతిభను నిరూపించుకోవడానికి ఆటంకాలు కావు.
  3. స్వేచ్ఛను పెంపొందిస్తుంది : స్వేచ్ఛ, సమానత్వాలు పరస్పర పోషకాలు సమానత్వం స్వేచ్ఛను పెంపొందిస్తుంది.
  4. ప్రజాస్వామ్య విజయము : సమానత్వం ప్రజారాజ్య ఆదర్శం అదిలేనిదే ప్రజాస్వామ్యం విజయవంతం కాదు. ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమానత్వాలు పౌరులకు లభించాలి.
  5. ప్రతిష్ట పెంచుతుంది : వ్యక్తులంతా సమాన హోదా కలిగి, సాంఘికముగా ప్రతిష్ట పొందుతారు. రాజకీయ సమానత్వం వెనుకబడిన వర్గాల స్థాయిని పెంచింది.
  6. సాంఘిక న్యాయం : సమానత్వం సాంఘిక న్యాయాన్నిస్తుంది. అంటరానితనం, వెట్టిచాకిరి వంటి సాంఘిక దురాచారాలు రూపుమాపుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 10.
న్యాయన్ని నిర్వచించండి. దానిలోని రకాలను తెలపండి.
జవాబు.
పరిచయం :
రాజనీతిశాస్త్ర అధ్యయనంలో న్యాయం ఒక ముఖ్యమైన భావన. సమకాలీన సమాజంలో దాదాపు ప్రపంచ, రాజ్యాలన్నీ తమ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాల వైరుధ్యాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో న్యాయం చేకూర్చి కొనసాగేందుకు కృషి చేస్తున్నాయి.

అర్థం :
న్యాయం (Justice) అనే ఇంగ్లీష్ పదం “జస్” (Jus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో “జస్” అంటే “బంధించి ఉండటం” లేదా “కలిపి ఉంచడం” అని అర్థం.

నిర్వచనాలు :

  1. ప్లేటో : “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”.
  2. అరిస్టాటిల్ : “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
  3. కెఫాలస్ : “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”.

న్యాయం రకాలు (Types of. Justice) :
న్యాయం అనేక రకాలుగా ఉంటుంది. ఇది సహజవాబు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, చట్టబద్ధమైన పార్శాలకు సంబంధించినది. న్యాయభావనలోని వివిధ రకాలను గురించి క్రింద వివరించడం జరిగింది.

1. సహజ న్యాయం (Natural Justice) :
ప్రపంచంలో లభించే సహజ వనరులను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవచ్చుననే సూత్రం ఆధారంగా ప్రతిపాదించబడినదే సహజ న్యాయం. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ సహజ వనరులు జీవన ఆధారంగా ఉంటాయి.

మానవులు ఒక్కరే హేతుబద్ధమైన జీవనం గడపటం వల్ల, సహజ వనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ సందర్భంలో మానవులు భవిష్యతరాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.

2. సామాజిక న్యాయం (Social Justice) :
సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది.

చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

3. రాజకీయ న్యాయం (Political Justice) :
రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది.

ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.

  1. సమన్యాయ పాలన
  2. స్వతంత్ర న్యాయశాఖ
  3. ప్రాతినిధ్య సంస్థలకు ఎన్నికలు
  4. రాజకీయ పార్టీలు
  5. పత్రికా స్వాతంత్ర్యం
  6. ప్రజాస్వామ్య పాలన మొదలైనవి.

4. ఆర్థిక న్యాయం (Economic Justice) :
వ్యక్తుల మధ్య నిర్హేతుకమైన, ప్రకృతి విరుద్ధమైన వ్యత్యాసాలు లేని పరిస్థితినే ఆర్థికన్యాయంగా పేర్కొనవచ్చు. ఆదాయం, ద్రవ్యం, సంపద, ఆస్తివంటి వ్యత్యాసాలు లేకుండా వ్యక్తులందరికీ సమానమైన ఆదరణ కల్పించేందుకు ఆర్థికన్యాయం ఉద్దేశించింది. సానుకూల దృష్టిలో ఆర్థిక న్యాయం అనేది శ్రామికులకు చాలినంత వేతనాలను చెల్లించేందుకు దోహదపడుతుంది. సంపద, ఆదాయంలో విపరీతమైన అంతరాలను తొలగించేందుకు కృషి చేస్తుంది.

బడుగు బలహీనవర్గాలు దోపిడీకి గురికావడాన్ని ఎట్టి పరిస్థితులలో ఈ న్యాయం అనుమతించదు. ప్రతి ఒక్కరూ కనీస ప్రాథమికావసరాలను పొందేందుకు ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడు, గుడ్డ, వసతి వంటి ప్రాథమిక అవసరాలు కలిగి ఉండేందుకు చర్యలు తీసుకొంటుంది. సమాజంలో న్యాయబద్ధమైన ఆర్థిక వ్యవస్థాపనకు తోడ్పడుతుంది. “ప్రతి ఒక్కరూ వారి సామర్థ్యాన్ని బట్టి ఉపాధి పొందడం, అవసరాన్ని బట్టి ఆర్థిక వనరులను వినియోగించుకోవడం” అనే భావనను ఆర్థికన్యాయం బలపరుస్తుంది.

5) చట్టబద్ధమైన న్యాయం (Legal Justice) :
చట్టబద్ధమైన న్యాయం అనేది రాజ్యాంగ శాసనాల ద్వారా వెల్లడి అవుతుంది. సమాజంలో ఎంతోకాలంగా ప్రాచుర్యంలో ఉన్న ఆచార సంప్రదాయాలతో ఈ రకమైన న్యాయం సంబంధాన్ని కలిగి ఉంటుంది. రాజ్యంలోని రాజ్యాంగం, ఇతర శాసనచట్టాల రూపంలో అది వ్యక్తమవుతుంది.

న్యాయం చట్టబద్ధమైన పరిమితులను నిర్ణయిస్తుంది. చట్టబద్ధమైన న్యాయంలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి : 1. సమాజంలో చట్టాలన్నీ సమన్యాయ పాలన సూత్రంపై ఆధారపడి రూపొందితమై, అమలులో ఉంటాయి. 2. చట్టాలన్నీ సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా రూపొందుతాయి. మొత్తం సమాజ సంక్షేమాన్ని చట్టాలు ఆకాంక్షిస్తాయి.

అయితే చట్టబద్ధమైన న్యాయం అనేది పూర్తిగా న్యాయంగా పరిగణితం కాదు. ఈ సందర్భంలో న్యాయం అంటే చట్టం అని ఎర్నస్ట్ బార్కర్ పేర్కొన్నాడు. చట్టబద్ధమైన న్యాయం అనేది న్యాయాన్ని ప్రసాదించేందుకు ఉద్దేశించిందని కొందరు పేర్కొన్నారు. మొత్తం మీద చట్టం అనేది న్యాయానికి కొంతమేరకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మరికొందరు భావించారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 11.
న్యాయం అంటే ఏమిటి ? వివిధ రకాల న్యాయభావనలను తెలపండి.
జవాబు.
న్యాయం అనే పదాన్ని ఆంగ్లంలో జస్టిస్ (Justice) అంటారు. ఈ పదం ‘జస్టీషియా’ అనే లాటిన్ భాషా పదం నుంచి అవతరించింది. ఇందులో ‘జస్’ లేదా ‘జస్టిస్’ అనే పదాలు ఇమిడి ఉన్నాయి. దీని అర్థం ‘కలపటం’ లేదా ‘బంధించడం’. మానవ సమాజానికే సంబంధించి వివిధ వర్గాల ప్రజలను ఒకే వ్యవస్థలో కూర్చటంగా చెప్పవచ్చు. వ్యవస్థీకృత సమాజంలో మనుషుల మధ్య మానవ సంబంధాలను సమన్వయం చేస్తూ, మానవాళికి ఉపకరించటానికి రాజ్యం గుర్తించి, అమలు చేసే సూత్రావళే న్యాయం.

ఈ పదాన్ని ధర్మం, సరైన లేదా న్యాయమైన అని వివిధ అర్థాల్లో కూడా వాడతారు. అన్యాయం, అధిక్యత, తప్పులను ఇది వ్యతిరేకిస్తుంది. కొందరు రాజనీతి వేత్తలు న్యాయాన్ని ‘సుగుణం’ అంటే మరికొందరు ‘సమానత్వం’ అని అర్థ వివరణ ఇచ్చారు. అయితే ఎక్కువ మంది దీన్ని సమన్యాయ పాలనతో పోల్చారు.

న్యాయం అనే భావన కేవలం రాజనీతి శాస్త్రంలో మాత్రమే గాక నీతిశాస్త్రం, న్యాయశాస్త్రం, తత్వశాస్త్రాలలో కూడా అధ్యయన అంశంగా ఉంది. ఇది సహజమైనది, విలువలతో కూడుకున్నది. సమాజంలో మానవ గమనాన్ని తెలుపుతుంది. ఇది ప్రజాజీవనానికే చిహ్నంగా ఉంటూ సామాజిక బాధ్యతతో కూడుకొని ఉంటుంది.

న్యాయ భావనను అనేక మంది రాజనీతి వేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు. అందులో కొన్నింటిని క్రింది విధంగా చెప్పవచ్చు.
ప్లేటో : “ఇతరుల కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా, ఎవరి పనులు వారే నిర్వహించడం అదే విధంగా హేతువు, ధీరత్వం, ఇచ్ఛల సమన్వయమే న్యాయం”
అరిస్టాటిల్ : “సమాజంలో ఎవరికి నిర్దేశించిన నైతిక విధులను వా సక్రమంగా నిర్వహించడమే న్యాయం”.
బార్కర్ : “రాజనీతి విలువల సమ్మేళనం లేదా సమన్వయమే న్యాయం”.
జాన్ రాల్స్ : “సాంఘిక సంస్థల వాస్తవిక తాత్విక చింతన ప్రాథమిక సూత్రమే న్యాయం; సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు విధులను కల్పిస్తూ; సామాజిక ప్రయోజనాలను అన్ని వర్గాలకు అందించడమే న్యాయం”.

బి. న్యాయానికి సంబంధించి ప్రధాన భావనలు :
న్యాయం అనే భావనను వివిధ న్యాయ సిద్ధాంతాలు విస్తృతం చేశాయి. వీటిని స్థూలంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

  1. గ్రీకులు, స్లోయిక్లు, రోమన్ల న్యాయ సిద్ధాంతం
  2. ఆధునిక న్యాయ సిద్ధాంతం
  3. సమకాలీన న్యాయ సిద్ధాంతాలు.

1. గ్రీకులు, స్లోయిక్లు, రోమన్ల న్యాయ సిద్ధాంతం :
న్యాయ భావనను తొలిసారిగా చర్చించిన వారు గ్రీకులు కాగా, దానికి పునాదులు వేసిన వ్యక్తి ప్లేటో, ప్లేటో న్యాయ సిద్ధాంతంలో సుగుణం ప్రధానమైంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఎవరి పనులు వారే నిర్వహించుకోవడమే సుగుణం. అరిస్టాటిల్ ప్రకారం న్యాయం సంపూర్ణంగా సుగుణవంతమైంది.

స్లోయిన్ల ప్రకారం న్యాయం హేతువు ద్వారా కనుగొనబడింది. అదే విధంగా ఇది రాజ్యంచే రూపొందించబడిన సంవర్ధక శాసనం కంటే ఉన్నతమైంది. రోమన్ల ప్రకారం న్యాయం అనే భావన శాసనానికి సన్నిహితంగా ఉంటుంది.

2. ఆధునిక న్యాయ సిద్ధాంతం:
సంస్కరణోద్యమం, సాంస్కృతిక పునరుజ్జీవనం, పారిశ్రామిక విప్లవం అనంతరం ఇది అవతరించింది. హాబ్స్, లాక్, రూసోల సామాజిక ఒడంబడిక సిద్ధాంతంతో ఆధునిక న్యాయ సిద్ధాంతం అవతరించింది. నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి ఇవ్వడమే న్యాయం అని హాబ్స్ పేర్కొన్నాడు. లాక్ సహజ హక్కులలో న్యాయాన్ని గుర్తించగా, రూసో చెప్పిన “జనేచ్ఛ” న్యాయంతో కూడుకున్నదిగా చెప్పాడు.

3. సమకాలీన న్యాయ సిద్ధాంతాలు :
ఈ సిద్ధాంతాలు ప్రధానంగా స్థిరమైన న్యాయం (Substantial Justice), ప్రక్రియాత్మకమైన న్యాయం (Procedural Justice) ల మధ్యగల వ్యత్యాసాలపై దృష్టి పెడుతుంది. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ నియమ, నిబంధనలు మానవుని ప్రవర్తనను నిర్దేశించటానికీ నమూనా నిబంధనలుగా ఉంటాయని ప్రక్రియాత్మకమైన న్యాయం పరిగణిస్తుంది.

అన్ని రకాల వివక్షతలను వ్యతిరేకిస్తూ, మానవుని మధ్య నైతికతను, సమాన గౌరవాన్ని ప్రక్రియాత్మకమైన న్యాయం అనుమతిస్తుంది. F. A. హాయక్, మిల్టన్ ఫ్రీడ్ మన్, నాజిక్ వంటి వారు దీన్ని ప్రతిపాదించిన వారిలో ప్రముఖులు.

స్థిరమైన న్యాయ భావన అనేది సామాన్యవాదం ఆలోచనల నుంచి అవతరించింది. సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల జీవన ప్రమాణాల పెంపుదలకు తగిన అవకాశాలు పొందేందుకు స్థిరమైన న్యాయం తోడ్పడుతుంది. ఇందులో వనరుల పంపిణీ అనేది ప్రధాన అంశం కాగా ప్రక్రియ అనేది ద్వితీయమైంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

4. జాన్రాల్స్ న్యాయ సిద్ధాంతం :
స్థిరమైన న్యాయానికి కావలసిన సాధనాలను రూపొందించటానికి ఉపకరించే పద్ధతిగా ప్రక్రియాత్మకమైన న్యాయం ఏ విధంగా తోడ్పడుతుందో రాల్స్ న్యాయ సిద్ధాంతం తెలుపుతుంది. సమాజంలో గల బలహీన అంశాలను బలోపేతంగా చేయడానికి ఇతను ప్రయత్నించాడు. ఇతని న్యాయ సిద్ధాంతం మూడు అంశాలపై ఆధారపడింది.

  1. సమాన స్వేచ్ఛ సూత్రం.
  2. సమాన అవకాశాల సూత్రం.
  3. అణగారిన వర్గాలకు లబ్ధిని వేకూర్చే ప్రతిపాదనను సమర్థించవచ్చు.
    ఈ విధంగా రాల్స్ సామ్యవాదం పెట్టుబడి దారి విధానం విలువలను చెప్పడానికి ప్రయత్నించాడు.

ప్రశ్న 12.
శక్తిని నిర్వచించి, దానిలోని వివిధ రకాలను తెలపండి.
జవాబు.
ఎ. శక్తి అర్థ వివరణ, నిర్వచనం :
వ్యక్తి తన కోరికలను తీర్చుకోవటానికి లేదా లక్ష్యాన్ని సాధించటానికి అతనిలో గల నైపుణ్యతను తెలియజేసేదే శక్తి. ఒక వ్యక్తి లేదా సమూహం వేరే వ్యక్తి లేదా సమూహంపై చూపే ప్రభావాన్ని శక్తి తెలుపుతుంది. శక్తిని అనేక మంది రాజనీతి పండితులు నిర్వచించారు. అవి :
హెచ్. వి. వైజ్మాన్ : “ఎటువంటి ఆటంకాలనైన ఎదుర్కొని ఒక వ్యక్తి తాను కోరుకున్నది సాధించటానికి గల నైపుణ్యమే శక్తి”.
రాబర్ట్ ధాల్ : “శక్తి అనేది ఒక రకమైన ప్రభావం చూపే భావన, అనంగీకారాన్ని అంగీకరించే విధంగా చేయడానికి ఉపకరించేదే శక్తి”.
ఎడ్వర్డ్ ఎ. షిల్స్ : “స్వప్రయోజనాల సాధన కోసం మానవ ప్రవర్తనను ప్రభావితం చేసే సామర్థ్యమే శక్తి”. బి. శక్తి వివిధ రూపాలు.

1. రాజకీయ శక్తి :
రాజకీయ శక్తి అనేది వ్యవస్థీకృతమైన, అవ్యవస్థీకృతమైన రాజకీయ అంశాలచేత ప్రభావితం అవ్వడాన్ని సూచిస్తుంది. రాజకీయాలలో శక్తి అనేది ఎప్పుడు రాజకీయశక్తి, రాజ్యశక్తి, ప్రభుత్వశక్తి, శాసనాలశక్తి మొదలై ప్రభుత్వ చర్యల మీద ఆధారపడి ఉంది.

కాని ఈ వ్యవస్థీకృత అంశాలు కేవలం ప్రతిపక్షంలో ఉండే పార్టీల చేతనేకాక అతి పెద్ద సంఖ్యలో ఉండి ప్రభావ వర్గాలు, ప్రజాభిప్రాయం, ప్రజా ఉద్యమాలు, మాస్ మీడియా మొదలైన వాటిచే ప్రభావితమవుతుంటాయి. కాబట్టి శక్తి అనేది వ్యవస్థీకృత అంశాలైన రాజ్యంతోపాటు అవ్యవస్థీకృత అంశాలకు కూడా వర్తిస్తుంది.

2. సాంకేతిక శక్తి :
ఆధునిక కాలంలో శక్తిని ప్రదర్శించటంలో సాంకేతిక పరిజ్ఞానం అతి ముఖ్యమైన సాధనంగా ఉంది. ఇటీవలికాలంలో సాంకేతిక మేధస్సు అనేది కృత్రిమ మేధస్సు రూపంలో మనిషి, సమాజం, రాజకీయాలపై విప్లవాత్మక ప్రభావం చూపిస్తుంది. సమకాలీన ప్రజాస్వామ్యాలలో కంప్యూటర్లు, జ్ఞానంలేని యంత్రం, ఎంతో పనిని చేస్తూనే ఉన్నాయి.

రాజకీయ పార్టీలకు వారి ప్రచారాలలో ఈ సాంకేతిక పరిజ్ఞానంతో చాలా సంబంధం ఉంది. ఆరోగ్య సాధనకు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వాలు చాలా వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి.

మనం సాంకేతిక విజ్ఞానంపై ఆధారపడడం అనేది సాంకేతిక విస్ఫోటనానికి (పెరుగుదలకు దారితీసింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి ఓటర్లను వారి ఓటింగ్ ప్రవర్తనపై చాలా సూక్ష్మస్థాయిలో కూడా ప్రభావపరుస్తున్నాయి. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో ఎవరు పైచేయి సాధిస్తారో వారే రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తున్నారు.

3. ఆర్థిక శక్తి :
ఆర్ధిక శక్తి అనేది ప్రధానంగా సంపదను స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రత్యేకించి ఉత్పత్తి, పంపిణీ ద్వారా వస్తుంది. ఆర్థికశక్తి అనేది ఉదార ప్రజాస్వామ్యదేశాలలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఒకవేళ రాజ్యం సమృద్ధిగా సహజవాబు. ఇతర వనరులను కలిగి ఉంటుందో అది ప్రబలమైన ఆర్థికశక్తిగా మారుతుంది.

ప్రముఖ వార్తా పత్రికలు, టి.వి. ఛానెళ్ళు పెద్ద పెద్ద వ్యాపారవేత్తల చేతుల్లో ఉండటం వల్ల, ఈ మీడియా ద్వారా వారికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నారు. వీరి వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగదారుల సంస్కృతిని పెంపొందిస్తున్నారు.

4. సైద్ధాంతికపరమైన శక్తి :
ఆధిపత్య పాలకవర్గం ప్రజల ఆలోచనలను, భావోద్వేగాలపై పూర్తిగా పట్టును సాధించటానికి, వారిలో సమ్మతి అనే భ్రాంతిని సృష్టించటానికి ఉపయోగించే శక్తిని ఇది సూచిస్తుంది. అలాగే సమ్మతిని సృష్టించడంలో భ్రాంతిని కలిగిస్తుంది.

తద్వారా ప్రజలు వారు అంగీకరించిన వాటిలోనే పాలింపబడుతున్నామనే నమ్మకానికి దారితీస్తుంది. ఈ సిద్ధాంతపరంగా “పాలక వర్గంచే ఆధిపత్యం చెలాయించడమనేది పెత్తందారికి దారితీస్తుందని” ఇటలీ మార్క్సిస్టుగా పేరుపడిన ఆంటోనియో గ్రాంస్కీ (1891 1937) అన్నారు.

ఈ విధంగా రాజకీయశక్తి అతిముఖ్య లక్షణమైన రాజకీయ సిద్దాంతం అనేది పాలక వర్గాలకు శాసనబద్ధతను కల్పిస్తూ వారు చాలా దృఢమైన రాజకీయశక్తిని నిర్వహించడంలో సహకరిస్తుంది. ఎప్పుడైతే ప్రజలు ప్రభుత్వ వ్యవస్థలలో ప్రత్యేకించి చాలా మంచిది అని భావిస్తే, ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని సవాలు చేయరు.

5. జాతీయశక్తి :
వాస్తవవాదుల దృష్టి నుంచి చూస్తే రాజకీయాలు అనేవి “శక్తి” కోసం పోరాటమే. అంతర్జాతీయ రాజకీయాల తక్షణ లక్ష్యం కూడా శక్తిని సాధించడమే. అంతర్జాతీయ వ్యవహారాలలో సార్వభౌమాధికార రాజ్యాలు ఇతర సార్వభౌమాధికార రాజ్యాలను, జాతి రాజ్యాలు తమ స్వంత లక్ష్యాలను సాధించడం అనేది అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితపరుస్తుంది.

ఈ సందర్భంలోనే ‘ఏక ధృవ’, ‘ద్వి ధృవ’, ‘బహుళ ధృవ’ ప్రపంచాలు అనే పదాలు ప్రాచుర్యం పోందాయి. ఒకే దేశం ప్రపంచం మొత్తాన్ని శాసిస్తే దానిని ఏక ధృవ ప్రపంచమని; రెండు దేశాలు ఆధిపత్యం చెలాయిస్తే ద్వి ధృవ ప్రపంచం అని; అనేక దేశాలు ఆధిపత్యం చెలాయిస్తే బహుళ ధృవ ప్రపంచం అని అంటారు.

జాతీయశక్తిని ప్రదర్శించటానికి విభిన్న అంశాలు ఉన్నాయి. అవి బలం, ప్రభావం, అధికారం. బలం అనేది బెదిరించటం లేదా సైన్యాన్ని వినియోగించటం, ఆర్థిక, ఇతర సాధనాలను ఉపయోగించి క్రమపద్ధతిలో చెప్పడం ద్వారా ఇతర దేశాల ప్రవర్తనలో మార్పు తీసుకురావటమే ప్రభావం.

ఒక దేశం యొక్క ఆదేశాన్ని మరోదేశం పాటించడమే అధికారం. ఇది గౌరవం, సంఘీభావం, అభిమానం, అనుబంధం, నాయకత్వం, విజ్ఞానం, నైపుణ్యం వంటి దృక్కోణాల్లో ఉండడం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 13.
శక్తి అంటే ఏమిటి ? వివిధ రకాల శక్తి ధృక్పధాలను వివరించండి.
జవాబు.
వ్యక్తి తన కోరికలను తీర్చుకోవటానికి లేదా లక్ష్యాన్ని సాధించటానికి అతనిలో గల నైపుణ్యతను తెలియజేసేదే శక్తి. ఒక వ్యక్తి లేదా సమూహం వేరే వ్యక్తి లేదా సమూహంపై చూపే ప్రభావాన్ని శక్తి తెలుపుతుంది. శక్తిని అనేకమంది రాజనీతి పండితులు నిర్వచించారు. అవి :
హెచ్. వి. వైజ్మాన్ : “ఎటువంటి ఆటంకాలనైన ఎదుర్కొని ఒక వ్యక్తి తాను కోరుకున్నది సాధించటానికి గల నైపుణ్యమే శక్తి”.
రాబర్ట్ ధాల్ : “శక్తి అనేది ఒక రకమైన ప్రభావం చూపే భావన, అనంగీకారాన్ని అంగీకరించే విధంగా చేయడానికి ఉపకరించేదే శక్తి”.

వివిధ రకాల శక్తి దృక్పధాలు (లేదా) ధృక్కోణాలు :
రాజనీతిశాస్త్ర అధ్యయన ఆధునిక ధృక్కోణం శక్తి అనే భావనను ప్రధానమైనదిగా గుర్తించారు. ఏ దేశంలోనైన శక్తి ఎప్పుడు సాంఘిక, ఆర్థిక, సైద్ధాంతిక నిర్మాణంలో నిబిడీకృతమై ఉంటుంది. రాజ్యాంగం అంతస్థు, అవకాశాలలో సమానత్వం కల్పించినప్పటికీ శక్తి ప్రధాన కేంద్రంగా ఉంటుంది.

శక్తిని కలిగి ఉండే సమూహాలు, వర్గాలను తెలుసుకోవడానికి రాజకీయాలను అర్థం చేసుకోవాలి. శక్తిని అధ్యయనం చేయటానికి వివిధ ధృక్కోణాలు ఉన్నాయి. వీటిని స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి ఉదారవాద, మార్క్సస్ట్ ధృకోణాలు. వీటిని కింది విధంగా వివరించవచ్చు.

1. శ్రేష్ట వర్గ ధృక్కోణం :
శక్తికి సంబంధించి శ్రేష్ట వర్గ ధృక్కోణం 20వ శతాబ్దం ప్రారంభంలో పరెటో, మోస్కా, మిచెల్స్ అనే ముగ్గురు సామాజిక శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ప్రకారం సమాజం శ్రేష్ట వర్గం, సామాన్య జన సమ్మేళనంగా చీలి ఉంటుంది.

ఈ విధంగా చీలటానికి వ్యక్తులలో గల పోటీతత్వం, వారి వారి ఆసక్తులపై ఆధారపడి ఉంటుంది. శ్రేష్ఠ వర్గం రాజకీయ శక్తిని ప్రభావితం చేస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం సమాజంలో విభజన అనేది సహజవాబు. కార్యకరణ పరంగా ఉంటుంది. ఇది సంపూర్ణంగా మారుతుందనే నమ్మకాన్ని కలిగి ఉంటుంది.

2. సమూహ ధృక్కోణం :
ఈ ధృక్కోణంను అర్థర్ బెంట్లీ అభివృద్ధి చేశాడు. శక్తిపై సమూహ ధృక్కోణం బహుతా సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది. దీని ప్రకారం శక్తి అనే భావన సమాజాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఇవి ఆధిపత్య సమూహాలు, ఆధారిత సమూహాలు, సమూహ ధృక్కోణం ప్రకారం సమాజంలో శక్తి ఏ ఒక్క సమూహం చేతిలో కేంద్రీకృతం కాకుండా అది విభిన్న సామాజిక వర్గాల మధ్య విభజించబడి ఉంటుంది. ఈ సమూహాలు ఎక్కువగా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండి, స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకుంటాయి.

3. లింగ సంబంధ ధృక్కోణం :
ఇటీవలి కాలంలో శక్తిని అధ్యయనం చేయటానికి లింగపర ధృక్కోణం ముఖ్యాంశంగా ఉంది. ఇది సమాజాన్ని లింగపరంగా రెండు వర్గాలుగా గుర్తిస్తుంది. అవి స్త్రీలు, పురుషులు మానవ జాతి పురోగమించడానికి ఈ విభజనను ప్రకృతి సృష్టించింది. మానవ జీవనం, నాగరికత, సంస్కృతి సార్థకం కావడానికి ఇది తోడ్పడింది.

పరిణామ క్రమంలో సమాజంలో స్త్రీ, పురుషులు పరస్పరం ఆధారపడి జీవించారు. స్త్రీలపై పురుషుల ఆధిపత్యం చెలాయించడం జరిగింది. పితృస్వామిక వ్యవస్థలో అనాదిగా స్త్రీ, పై పురుషుడు ఆధిపత్యం కలిగి ఉంటున్నాడు. పురుష ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ స్త్రీకి విముక్తి కల్పించాలని స్త్రీవాద సిద్ధాంతం కోరుతుంది.

4. వర్గపర ధృక్కోణం :
శక్తి భావనపై వర్గపద ధృక్కోణం 19వ శతాబ్దంలో కారల్ మార్క్స్ (1818 – 83), ఏంజెల్స్ (1820 – 95) లు అభివృద్ధి చేశారు. ఈ సిద్ధాంతం ప్రకారం రాజకీయ శక్తి అనేది ఆర్థిక శక్తిచే సృష్టించబడింది. దీనికి గల కారణం ఉత్పత్తి సాధనాలు ఆర్థిక శక్తి యాజమాన్యంలో ఉండడం, నాగరికత ప్రతీ దశలోను సమాజం రెండు పరస్పర విరుద్ధ వర్గాలుగా విభజించబడి ఉంటుంది. అవి ఉన్నవారు, లేనివారు, ఉత్పత్తి సాధనాల పంపిణీ ద్వారా మాజం యాజమాన్యం గలవారు, యాజమాన్యం లేనివారిగా విభజించబడింది.

ఈ సిద్ధాంతం “వర్గం” అనేది సమాజంలో శక్తిని ప్రదర్శించడానికి ఒక వ్యవస్థీకృత తరగతిగా గుర్తిస్తుంది. సమాజంలో ఉత్పత్తి సాధనాలు అయితే ఎవరి చేతిలో ఉంటాయో వారిని “ఆధిపత్య వర్గం”గా, మిగిలిన వారిని “ఆధారపడిన” లేదా “ఆశ్రిత” వర్గంగా పరిగణిస్తుంది. సామాజిక విప్లవం ద్వారా వర్ణరహిత సమాజాన్ని నెలకొల్పాలని ఈ సిద్ధాంతం నమ్ముతుంది.

5. ఆధునిక ధృక్కోణం :
సాంప్రదాయిక సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ ఆధునిక ధృక్కోణం అవతరించింది. తరతరాలుగా అణగారిన వర్గాల ప్రజలను సాధికారికత దిశగా పయనింపచేయటం కోసం మహిళలకు, సాధారణ ప్రజలకు అధికారం పంచాలని తెలుపుతుంది. గతంలో సాంప్రదాయిక శక్తి సిద్ధాంతం ఆధిపత్య వర్గాలు శక్తిని చెలాయించిన అంశంగా శక్తి సిద్ధాంతాన్ని పరిగణించడం జరిగింది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
శాసనాన్ని నిర్వచించి, దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
పరిచయం :
రాజనీతిశాస్త్ర అధ్యయనంలో చట్టం అనేది ఒక ముఖ్యమైన భావన.

రాజ్యం శాసనాల ద్వారా ప్రజలను పరిపాలిస్తుంది. శాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్య సార్వ భౌమాధికారం శాసనాల ద్వారా వ్యక్తమవుతుంది. రాజ్యం ఆశించే సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులు శాసనం ద్వారానే సాధించగలవు. మానవుని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమాలే శాసనాలు. వ్యక్తులు రాజ్యంలో చేయవలసినవి, చేయకూడనివి శాసనం చెబుతుంది. ప్రభుత్వంలోని శాసనశాఖ శాసనాలు చేస్తుంది.

అర్థం :
శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.
నిర్వచనాలు :

  1. “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.
  2. “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి.ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
  3. న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

శాసనానికి ఆధారాలు :
హాలండ్ అనే రచయిత సంప్రదాయాలు, మతము, ధర్మబద్ధత (సమత), న్యాయమూర్తుల తీర్పులు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, శాసనశాఖ అనేవి శాసనాలకు ఆధారాలని చెప్పాడు. శాసనాలు వివిధ రంగాలలో క్రమంగా రూపొందుతాయి. అనేక అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పిన శాసనాల ఆధారాలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.

చట్టం ముఖ్య లక్షణాలు (Features of Law): చట్టానికి కింద పేర్కొన్న లక్షణాలు ఉన్నాయి.

  1. సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముదాయమే చట్టం.
  2. చట్టాన్ని రాజ్యం అమలుపరుస్తుంది. రాజ్యం అనుమతి పొందడంతో చట్టాన్ని యోగ్యమైందిగా పరిగణించవచ్చు.
  3. చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది, విశ్వవ్యాప్తమైనది.
  4. చట్టం ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తుంది.
  5. చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.
  6. చట్టాలు నిర్బంధమైన, శిక్షాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  7. చట్టం వైయక్తిక, సాధారణ సంక్షేమాన్ని సంరక్షించే ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటుంది.
  8. చట్టం ప్రజల అవసరాల మేరకు మార్చబడుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 2.
శాసనం యొక్క ఏవైనా నాలుగు లక్షణాలను చర్చించండి.
జవాబు.
చట్టం ముఖ్య లక్షణాలు (Features of Law) : చట్టానికి కింద పేర్కొన్న లక్షణాలు ఉన్నాయి.

  1. సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముదాయమే చట్టం.
  2. చట్టాన్ని రాజ్యం అమలుపరుస్తుంది. రాజ్యం అనుమతి పొందడంతో చట్టాన్ని యోగ్యమైందిగా పరిగణించవచ్చు.
  3. చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది, విశ్వవ్యాప్తమైనది.
  4. చట్టం ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తుంది.
  5. చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.
  6. చట్టాలు నిర్బంధమైన, శిక్షాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి.
  7. చట్టం వైయక్తిక, సాధారణ సంక్షేమాన్ని సంరక్షించే ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటుంది.
  8. చట్టం ప్రజల అవసరాల మేరకు మార్చబడుతుంది.

ప్రశ్న 3.
శాసనం యొక్క ఏవైనా మూడు ఆధారాలను తెలపండి.
జవాబు.
1. ఆచార, సంప్రదాయాలు, వాడుకలు (Customs) :
ఇవి శాసనానికి తొలి ఆధారాలు. ప్రజల ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలు శాసనాలకు మూలాధారము. సంప్రదాయాలు సంఘంలో ఒక అలవాటుగా, క్రమంగా రూపొందుతాయి. పూర్వం సంప్రదాయాలే సమాజ జీవితాన్ని క్రమబద్ధం చేసేవి. రాజ్యం వీటిని గుర్తించి, వాటిని ఆధారం చేసుకొని కొన్ని శాసనాలను రూపొందిస్తుంది.

రాజకీయ ఆచారాలు కూడా రాజ్యంచే గుర్తించబడి అమలు చేయబడితే అవి శాసనాలవుతాయి. బ్రిటన్లో ‘సామాన్య న్యాయం’ సంప్రదాయబద్ధమైన శాసనానికి ఉదాహరణ. అదే విధంగా భారతదేశంలో వివాహ చట్టాలు, ఆస్తి పంపిణీ చట్టాలు మొదలగునవి సంప్రదాయాల ఆధారంగా చేయబడ్డాయి.

2. మతం (Religion) :
ఆచారానికి మతం సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే వ్యవస్థ. సంఘ జీవితం మత నియమాలకు అనుగుణంగా జరుపుకుంటారు. పూర్వం మతాధిపతులు చెప్పే నియమాలు శాసనాల వలె చెలామణి అయ్యేవి. ఆధునిక కాలంలో కూడా శాసనాలు చేయడానికి మతం ఒక ఆధారం.

వారసత్వం, వివాహం, కుటుంబ ఆస్తి మొదలైన వాటి శాసనాలు మతం ఆధారంగా చేయబడ్డాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లిములకు గల శాసనాలు వారి మతాల ఆధారంగా రూపొందాయి. ఇరాన్, పాకిస్థాన్ వంటి మత ప్రమేయ దేశాలలో సంఘ జీవనానికి మత నియమాలే ఆధారం.

3. న్యాయస్థానాల తీర్పులు (Judicial Decisions) :
న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు శాసన నిర్మాణానికి ఆధారాలు. న్యాయస్థానాలు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఈ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు క్రొత్త న్యాయ సూత్రాలను సృష్టిస్తారు.

ఈ తీర్పులు అదే విధమైన వివాదాలు తలెత్తినప్పుడు న్యాయసూత్రాల వలె వర్తింపచేస్తారు. నేడు న్యాయమూర్తుల నిర్ణయాలు శాసనాలలో అంతర్భాగమవుతున్నాయి.
ఉదా : భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్ కేసు.

4. శాస్త్రీయ వ్యాఖ్యానాలు (Scientific Commentories) :
ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, రచయితలు, విమర్శకులు చేసే వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారమవుతాయి. ఇవి న్యాయస్థానాలలో న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు, వివరణలు, శాసనాలు చేయటానికి ప్రభుత్వానికి ఉపయోగిస్తాయి.

న్యాయమూర్తుల నిర్ణయాలు, తీర్పులు, భవిష్యత్లో శాసన నిర్మాణానికి తోడ్పడతాయి. ఇంగ్లండ్లో కోక్, బ్లాక్టన్, అమెరికాలో స్టోరీ, కెంట్, భారతదేశంలో విజ్ఞానేశ్వర, అపరార్క వంటి వారి వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారాలు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 4.
సమన్యాయ పాలన అంటే ఏమిటి ? వివరించండి.
జవాబు.
సమన్యాయ పాలన: బ్రిటీష్ రాజ్యాంగ విశిష్ట లక్షణం సమన్యాయ పాలన. ఇది ముందుగా ఇంగ్లాండ్లో అవతరించింది. అనంతరం భారతదేశం, అమెరికా దేశాలలో దీనిని అమలుచేశారు. ‘చట్టం ముందు అందరూ సమానమే, చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది’ అని తెలిపేదే సమన్యాయ పాలన.

రాజ్యంలో నివసించే ప్రతీ పౌరునికి శాసనాలు ఒకే విధంగా వర్తిస్తాయి. సమాజంలో వివిధ వర్గాలకు ప్రత్యేక శాసనాలు అంటూ ఉండవని తెలుపుతుంది. పరిపాలన వ్యవస్థ, గవర్నెన్స్ శాసనం ప్రకారమే కొనసాగుతుంది.

ప్రభుత్వ నిరంకుశ పాలనను అడ్డుకోవడం సమన్యాయ పాలన ప్రధాన లక్ష్యం. ఇది శాసన నిర్మాణశాఖచే నిర్మించి అధికార వ్యవస్థ ద్వారా అమలు చేయబడుతుంది. శాసన ఉల్లంఘన శిక్షార్హం కిందకు వస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే అనేది అధికారులకు, సామాన్యులకు అన్ని వర్గాలకు వర్తిస్తుంది.

సమన్యాయ పాలన అనేది ఇంగ్లాండ్ రాజ్యాంగ విశిష్ట లక్షణంగా చెప్పుకున్నాం. ఇంగ్లాండ్లో అలిఖిత రాజ్యాంగం అమలులో ఉండడం వల్ల పౌరుల హక్కులకు రాజ్యాంగ పరంగా హామీ లేదు. పౌరుల హక్కుల రక్షణకు ఇంగ్లాండ్లో సాధారణ శాసనం రూపంలో సమన్యాయ పాలన అమలులో ఉంది. ఇది బ్రిటీష్ రాజ్యాంగ వ్యవస్థకు మౌలిక పునాదిగా ఉంది.

సమన్యాయ పాలనపై వివిధ పరిమితులు ఉండటం వల్ల అది అనేక విధాలుగా మార్పులకు గురయి సాంఘిక, ఆర్థిక రంగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. శాసన నిర్మాణశాఖ విపరీత పని భారం దృష్ట్యా దీని పరిధిలో మార్పు చోటుచేసుకున్నది. స్థూలంగా “చట్టం ముందు అందరూ సమానమే. ఏ ఒక్కరూ కూడా నిరంకుశంగా శిక్షించరాదు” అనేది సమన్యాయ పాలన ప్రధాన సూత్రం. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ ఆశయం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 5.
స్వేచ్ఛను నిర్వచించి, ఏవైనా మూడు రకాల స్వేచ్ఛలను తెలపండి.
జవాబు.
పరిచయం :
స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.

అర్థం : స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.

నిర్వచనాలు :

  1. హెచ్.జె.లాస్కీ : “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ : “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ”.
  3. జె.ఆర్. సీలీ : “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ”.

1. సహజ స్వేచ్ఛ (Natural Liberty) :
సహజ స్వేచ్ఛ అనేది ఎటువంటి ఆంక్ష లేకుండా ఏదైనా చేయడాన్ని సూచిస్తుంది. ఇది ఎలాంటి జోక్యానికి లేదా నిర్భంధాలకు తావివ్వదు. వ్యక్తులు తమ ఇచ్ఛానుసారం చేయదలచినదాన్ని సుసాధ్యం చేస్తుంది. అయితే, నిర్నిబంధమైన స్వేచ్ఛ వ్యక్తుల స్వేచ్ఛలను హరిస్తుంది. నేటి సమాజంలో సహజ స్వేచ్ఛ అనేది కనిపించదు. ఇది అన్యాయం, అరాచకత్వాలకు పర్యాయపదమైనది. సహజ స్వేచ్ఛగల చోట స్వాతంత్య్రం మృగ్యమవుతుంది.

ఆదిలో రోమన్ రాజనీతి తత్త్వవేత్తలు ఈ భావనను సమర్థించారు. ఎటువంటి అవధుల్లేని ప్రాకృతిక వ్యవస్థలోని మానవులు అపరిమితమైన స్వేచ్ఛను అనుభవించారన్నారు. అటువంటి స్వేచ్ఛ – రాజ్యం, సమాజాల ఆవిర్భావానికి ముందు మాత్రమే ఉనికిలో ఉండేది.

2. పౌర స్వేచ్ఛ (Civil Liberty) :
పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు.

  1. సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం
  2. ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం
  3. నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్ర్యం.

పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.

“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు.

పౌర స్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి –

  1. జీవించే హక్కు
  2. పనిచేసే హక్కు
  3.  ఆస్తి హక్కు
  4. వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిరనివాసపు హక్కులు మొదలైనవి.

3. ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty) :
ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతి ఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే ఆర్థిక స్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరుద్యోగం – అసంపూర్ణతల నుంచి – విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.

ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.

  1. కనీస వేతనాలను అందించడం.
  2. పనిహక్కుకు భరోసా కల్పించడం.
  3. నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం.
  4. తగినంత విశ్రాంతిని కల్పించడం.
  5. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 6.
స్వేచ్ఛ భావన పరిణామాన్ని వివరించండి.
జవాబు.
ఆధునిక కాలంలో ప్రాధాన్యత పొందిన భావనలలో అతి ముఖ్యమైనది స్వేచ్ఛ. క్రీ.శ. 16, 17 శతాబ్దాలలో ఐరోపా ఖండంలో వచ్చిన పారిశ్రామిక విప్లవము మరియు ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితుల ప్రభావం ఫలితంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారి విధానానికి అనుగుణంగా నూతన రాజకీయ సిద్ధాంతాలు, రాజకీయ సంస్థల భావనలు రూపొందాయి.

1688లో ఇంగ్లండ్లో జరిగిన రక్తరహిత విప్లవం, 1776లో అమెరికన్ విప్లవం, 1789 ఫ్రెంచి విప్లవాల ద్వారా ఈ భావనలు మరింత ప్రాబల్యాన్ని సంపాదించాయి. ఫ్రెంచి విప్లవంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నినాదాలుగా వర్థిల్లాయి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత వివిధ జాతులు తమ స్వేచ్ఛకై జాతీయోద్యమాలను కొనసాగించాయి.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం నూతనంగా స్వతంత్రం పొందిన దేశాలలోని ప్రజలు నియంతృత్వాలకు వ్యతిరేకంగా స్వేచ్ఛకోసం ఉద్యమించటం జరుగుచూనే ఉన్నది. ఇటీవల కాలంలో నేపాల్, బర్మా మొదలైన దేశాలలో ప్రజలు స్వేచ్ఛకోసం అనేక ఉద్యమాలను నడిపారు.

పై అంశాలను పరిశీలిస్తే సమకాలీన మానవజాతి చరిత్రను స్వేచ్ఛకోసం మానవులు జరుపుతున్న పోరాటంగా వర్ణించవచ్చు. స్వేచ్ఛ కావాలనటం మానవుని సహజమైన వాంఛ. స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యాన్ని నొక్కి చెపుతూ రూసో స్వేచ్ఛాయుతంగా ఉండకపోవటం మానవుడుగా మనలేకపోవటమే అంటాడు.

ప్రశ్న 7.
స్వేచ్ఛకుగల ఏవైనా మూడు పరిరక్షణలను తెలపండి.
జవాబు.
1. ఆర్థిక సమానత్వం (Economic Equality) :
వ్యక్తుల స్వేచ్ఛా పరిరక్షణలో ఆర్థిక సమానత్వం కూడా ప్రధానమైంది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం వంటి దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు వ్యక్తులకు చాలినన్ని అవకాశాలను కల్పించాలనే భావన ఇందులో ఇమిడి ఉంది. ఆర్థిక సమానత్వం నెలకొన్నప్పుడే స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ఆర్థిక సమానత్వంలో ఆర్థిక న్యాయం అంతర్భాగంగా ఉంటుంది. దీనిని రాజ్యం ప్రసాదిస్తుంది.

2. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers) :
అధికారాలు వికేంద్రీకరణ ద్వారా స్వేచ్ఛను మెరుగైన రీతిలో పరిరక్షించవచ్చు. ప్రభుత్వాధికారాల కేంద్రీకరణ నుంచి దేశానికి విముక్తి కలిగినప్పుడే వ్యక్తులు స్వేచ్ఛను అనుభవించగలరు. కేంద్రం రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల మధ్య అధికారాలను కేటాయించినప్పుడు నిరంకుశత్వానికి, వ్యక్తి స్వేచ్ఛల హరింపునకు తావుండదు, లేనిచో రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను అనుభవించటమన్నది ప్రజలకు కష్టమవుతుంది.

3. పత్రికాస్వాతంత్ర్యం (Independent Press) :
ప్రజాస్వామ్యాన్ని కొందరు వ్యక్తి స్వేచ్ఛా పరిరక్షణ కవచంగా భావించారు. తమ పనితీరులో చాలినంత స్వతంత్ర ప్రతిపత్తిని పత్రికలు, ఇతర మాధ్యమాలు కలిగి ఉన్నప్పుడే వ్యక్తులు స్వేచ్ఛలను అనుభవించగలరు.

ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచి, సంఘటితపరచి, వ్యక్తీకరించడంలో పత్రికలు ముఖ్యమైన వాహకంగా వ్యవహరిస్తాయి. అవి తమ నిష్పాక్షిక సంపాదకీయాలు, సత్య సమ్మతమైన వార్తలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తి స్వేచ్ఛలను పరిరక్షించగలుగుతాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 8.
స్వేచ్ఛ లక్షణాలను వివరించండి.
జవాబు.
పరిచయం :
స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.

అర్థం :
స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు నం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షలనుంచి విముక్తి”.

నిర్వచనాలు :

  1. హెచ్.జె. లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
  2. మాంటెస్క్యూ : “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ”.
  3. జె.ఆర్. సీలీ : “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ”.

స్వేచ్ఛ లక్షణాలు (Characteristics of Liberty) :
స్వేచ్ఛ ముఖ్య లక్షణాలను కింద పేర్కొనడమైనది.

  1. స్వేచ్ఛ ఒక శక్తివంతమైన భావన. దాని వ్యాఖ్యానమనేది స్థలం, కాలం, ప్రాంతం, ప్రజల ఆకాంక్షలను బట్టి ఉంటుంది.
  2. రాజకీయంగా లోబరచుకోవడం, బానిసలుగా మార్చటాన్ని స్వేచ్ఛ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది.
  3. వ్యక్తుల ఆకాంక్షలను సదా వాస్తవం చేయడమే స్వేచ్ఛ లక్ష్యం అవుతుంది.
  4. నిర్హేతుకమైన ఆంక్షలకు బదులు నిరంతరం సానుకూల పరిస్థితులను కలిగి ఉండటమే స్వేచ్ఛ.
  5. ఇది హక్కుల ఫలం.
  6. మానవీయ వ్యక్తిత్వాల సాధనకు అత్యంత ఆవశ్యకమైంది.
  7. ప్రజాస్వామ్య రాజ్యాలలోనే ఇది కనిపిస్తుంది.
  8. హక్కుల రూపంలో ఇది సాకారమవుతుంది.
  9. స్వేచ్ఛ అంటే ఏ ఒక్కరు యధేచ్ఛగా వ్యవహరించడం కాదు. ఇది ఎన్నో పరిమితులతో కూడుకొని ఉంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 9.
పౌర స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు.
పౌర స్వేచ్ఛ (Civil Liberty) :
పౌర స్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌర స్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు.

  1. సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్య్రం
  2. ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం
  3. నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్ర్యం. పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది.

సహజస్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.

“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు. పౌరస్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి

  1. జీవించే హక్కు
  2. పనిచేసే హక్కు
  3. ఆస్తి హక్కు
  4. వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.

ప్రశ్న 10.
స్వేచ్ఛ మరియు సమానత్వాలు పరస్పర పోషకాలు వివరించండి.
జవాబు.
వ్యక్తులకు గల స్వేచ్ఛ – సమానత్వాలపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఈ రెండు అంశాలు విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి. వ్యక్తులు తమ సర్వ సమగ్రమైన అభివృద్ధి కోసం స్వేచ్ఛ, సమానత్వాలను వాంఛిస్తారు.

స్వేచ్ఛ, సమానత్వం మధ్య సంబంధం (Relationship between Liberty and Equality) :
స్వేచ్ఛ – సమానత్వం మధ్యగల సంబంధం గురించి రాజనీతి తత్త్వవేత్తలు రెండు భిన్న అభిప్రాయాలను వెల్లడించారు.

ఆ రెండింటి భావనలు రాజనీతి శాస్త్రం అధ్యయనంలో ముఖ్యమైనవిగా వారు అంగీకరించారు. అయితే కొందరు ఆ రెండింటి మధ్య సంబంధం ఉందని పేర్కొనగా, మరికొందరు అవి ఒకదానికొకటి వ్యతిరేకమైనవిగా పరిగణించారు.

స్వేచ్ఛ, సమానత్వం పరస్పర సంబంధం కలిగి ఉంటాయనే భావనను రాజనీతి తత్త్వవేత్తలైన రూసో, టానీ, లాస్కీ, జి.డి.హెచ్. కోల్ వంటివారు ప్రతిపాదించారు. ఇక స్వేచ్ఛ, సమానత్వం అనేది పరస్పర వ్యతిరేకమైన భావనలని పేర్కొన్న వారిలో లార్డ్ మాధ్యూ, ఆర్నార్డ్, లార్డ్ ఆక్టన్, డి టాక్విల్లీ వంటి రాజనీతి తత్వవేత్తలు ఉన్నారు. పైన పేర్కొన్న రెండు వాదనల గురించి కింది విధంగా తెలపడమైంది.

1. స్వేచ్ఛ, సమానత్వం పరస్పర పోషకాలు :

  1. వ్యక్తి శ్రేయోవాదులు, అరాచకవాదులు, కమ్యూనిస్టుల దృష్టిలో స్వేచ్ఛ, సమానత్వం పరస్పర పోషకాలు.
  2. సమానత్వం లేని స్వేచ్ఛ అర్థరహితం, ‘సమానత్వం’ నెలకొల్పబడిన తరువాతే స్వేచ్ఛను గురించి ఆలోచించాలని కమ్యూనిస్టులు భావిస్తారు.
  3. సక్రమమైన, ఆదర్శమైన రాజ్యం స్థాపించబడాలంటే తప్పనిసరిగా సమానత్వ ప్రాతిపదికగా ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలి. ఈ రెండు విస్తృత పరిధిలో చూడబడాలి.
  4. స్వేచ్ఛ, సమానత్వం – ఈ రెండింటిలో దేన్నీ త్యాగం చేయడానికి ప్రయత్నించరాదు. సమానత్వం, స్వేచ్ఛ లోపించినట్లయితే అరాచకత్వం ప్రబలుతుంది. కావున ప్రభుత్వం శాసనాల ద్వారా ప్రజలందరికి ఎటువంటి జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ భేదము లేకుండా సమానంగా ‘స్వేచ్ఛను’ ప్రసాదించాలి.
  5. రాజకీయ స్వేచ్ఛ ద్వారా భావ ప్రకటనా స్వాతంత్ర్యం, ఓటుహక్కు, అర్హత ప్రాతిపదికగా పదవులకు పోటీచేసే హక్కు లభిస్తాయి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాలను ప్రజలందరూ కలిగి ఉండాలంటే వారందరూ స్వేచ్ఛను పొంది ఉండాలి. అందువలనే స్వేచ్ఛ లేకుండా సమానత్వం, సమానత్వం లేకుండా స్వేచ్ఛ ఉండవు.
  6. ఏ రాజ్యంలో ప్రజలు ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాలలో స్వేచ్ఛ, సమానత్వాలను సమానంగా పొంది ఉంటారో ఆ రాజ్యం బహుముఖంగా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని పరిశీలకులు భావిస్తారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

2. స్వేచ్ఛ-సమానత్వాలు పరస్పర విరుద్దాలు :
స్వేచ్ఛ, సమానత్వం పరస్పర శత్రువులు అని పేర్కొన్న వారిలో లార్డ్ ఆక్టన్ ముఖ్యుడు. రాజ్యముగాని, వ్యక్తులుగాని సమానత్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే స్వేచ్చ మరుగున పడిపోతుంది అని ఆక్టన్ మహాశయుడు వాదిస్తాడు. ‘మితిమీరని ప్రభుత్వ పరిపాలననే స్వేచ్ఛ’ అని సీలీ మహాశయుడు పేర్కొన్నాడు. ప్రభుత్వ అధికారాలు మితిమీరడమంటే ప్రజలు తమ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను కోల్పోవటమేనని వీరు భావిస్తారు.

ప్రజల వ్యక్తిగత వ్యవహారాలలో, కార్యకలాపాలలో ప్రభుత్వము జోక్యం కల్పించుకోరాదు అని ఆక్టన్ అభిప్రాయం. ప్రజలందరికి ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించినట్లయితే శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు, విద్యా పరిజ్ఞానం కలిగినవారు అపారమైన సంపదను కూడబెడితే, అమాయకులు, నిరక్షరాస్యులు, సోమరిపోతులు తమతమ కనీస అవసరాలను కూడా సమకూర్చుకోలేరు. ఇది సమాజములో ఆర్థిక అసమానత్వానికి, వర్గతత్వానికి దారితీస్తుంది. కావున స్వేచ్ఛ- సమానత్వం పరస్పరం శత్రు సంబంధాన్ని కలిగి ఉంటాయి.

“ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో, అక్కడ సమానత్వం ఉండదు. ఎక్కడ సమానత్వం ఉంటుందో, అక్కడ స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ-సమానత్వం రెండు కత్తుల వంటివి. అవి ఒక ఒరలో ఇమడవు” అని ‘లార్డ్ ఆక్టన్’, ‘డి టాక్వెల్లీ’, ‘సీలీ’ మొదలగు రాజనీతిజ్ఞులు వాదిస్తారు.

పైన పేర్కొన్న రెండు రకాల వాదనలు పూర్తిగా నిజమైనవికావు. వాస్తవ అంశం ఆ రెండింటికీ మధ్య ఉంటుంది. స్వేచ్ఛ, సమానత్వాలు రెండూ ఒకదానికొకటి పరస్పర పోషక, పరస్పర వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉండవు. ఈ సందర్భంలో ఆ రెండు భావనల మధ్య ఉండే వాస్తవిక సంబంధాన్ని క్రింది విధంగా వివరించడమైంది.

సమానత్వానికి స్వేచ్ఛ అవసరం (Liberty is essential for Equality) :

  1. స్వేచ్ఛ అంటే నిరపేక్షమైనదికాదు. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని నిబంధనలకు లోబడి సామాజిక సంక్షేమాన్ని సాధించేందుకై ఈ స్వేచ్ఛ అందరికీ అందుబాటులో ఉంటుంది.
  2. స్వేచ్ఛ అంటే ఏ ఒక్కవ్యక్తి లేదా వ్యక్తుల సముదాయపు గుత్తాధికారంగా భావించరాదు.
  3. ఒకానొక వ్యక్తి స్వేచ్ఛను అనుభవించడమనేది ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉండకూడదనే ఈ సూత్రాన్ని ఆమోదించారు. సమానత్వ సూత్రాన్ని గౌరవించవలసి ఉంటుంది.

దాని అర్థం స్వేచ్ఛా ఫలాలు సమానత్వమనే వృక్షానికి చెందిన శాఖలలో ఉంటాయని పేర్కొనవచ్చు. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వాలు ఒకదానికొకటి పరస్పర పోషకాలుగా భావించడమైంది. సమానత్వ సూత్రం ఆధారంగా స్వేచ్ఛను వర్తింపజేస్తే, స్వేచ్ఛాలక్ష్యం వాస్తవానికి నెరవేరినట్లవుతుంది.

స్వేచ్ఛకు సమానత్వం అవసరం (Equality is essential for Liberty) :
సమానత్వం అంటే ఒకే విధమైన ఆదరణ అని అర్థం కాదు. ఎందుకంటే అటువంటి సమానత్వం పౌర సమాజంలో సాధ్యంకాదు. అందుకు బదులుగా ఒకేరకమైన పరిస్థితులలో సమానమైన ఆదరణయే సమానత్వంగా పేర్కొనవచ్చు.

పౌర సమాజంలో కొందరు ఇతరులతో సమానమైన హోదాను కలిగి ఉండరు. అయితే వారికి తమ వ్యక్తిత్వం, హోదాలను పెంపొందించుకొనేందుకై కొన్ని పరిస్థితులు, అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ సమానంగా ఉన్నప్పుడు స్వేచ్ఛా, ఫలాలను వారందరూ అనుభవిస్తారని చెప్పవచ్చు.

పైన పేర్కొన్న విధంగా స్వేచ్ఛ, సమానత్వం ఒకదానికొకటి పరస్పర పోషకాలుగా ఉంటాయి. ఆ రెండు భావనలు ఒకే ఉమ్మడి లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. సమానత్వాన్ని విస్మరించినందునే స్వేచ్ఛ అనే అరాచకం, నియంతృత్వాలకు దారితీస్తుంది. అట్లాగే స్వేచ్ఛను పట్టించుకోకుండా, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తే, బానిసత్వం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యక్తి, సమాజాల ఔన్నత్యానికి ఆ రెండు భావనలు ఆవశ్యకమైనవిగా పేర్కొనవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 11.
సమానత్వానికి సంబంధించి ఏవైనా మూడు లక్షణాలను తెలపండి.
జవాబు.
1. సమానత్వం హక్కులను సాధించడం :
సమానత్వం అనేది సూచనాత్మకమైనదే కాని వివరణాత్మకమైనది కాదు. మానవులంతా తప్పకుండా సమానులే అని మానం భావిస్తాం. కాని అది వాస్తవం కాదు. సమాజంలో సాంఘిక ప్రయోజనాలను విస్తృతం చేసి వాటి ఫలాలను పేద వారికి అందించడం.

2. సమానత్వం ఆధునిక భావన :
మానవ జీవిత చరిత్రలో సంపదలో వ్యత్యాసాలు, అధికారంలో వ్యత్యాసాలు, గౌరవ ప్రతిష్ఠలలో వ్యత్యాసాలు అనేవి దాదాపు ప్రపంచమంతా కనిపిస్తాయి. శాస్త్రీయ యుగ ఆరంభంలో మానవుడు తన హేతుబద్ధమైన అనుభవపూర్వక జ్ఞానంతో ప్రకృతి వైపరీత్యాన్ని నియంత్రించడం నేర్చుకున్నాడు. ఈ పరిజ్ఞానం, ఆలోచన సమాజంలో ఉన్న సాంఘిక అసమానతలు సహజం కాదని, అసమానతలు తొలగించవచ్చనే ఆలోచనకు దారి తీసింది.

3. సామాజిక మార్పుకు సమానత్వం :
శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన ప్రగతి ఎక్కువ ప్రాంతాలలో సహజ అసమానత్వాన్ని ప్రత్యామ్నాయంగా పెంచిపోషించింది. ఆరోగ్యం, శారీరక పటిష్టత అనేది సరైన పౌష్టికాహారం వల్ల, మానసిక పరిపక్వత అనేది సరైన విద్య, రక్షణ ద్వారా సాధించవచ్చని మనకు తెలుసు. కాని ఈ ప్రయోజనాల లభ్యత అనేది వ్యక్తుల వ్యక్తిగత సాంఘిక, ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంది.

ప్రశ్న 12.
సమానత్వానికి సంబంధించి ఏవైనా మూడు రకాలను తెలపండి.
జవాబు.
సమానత్వం ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే

  1. ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం
  2. శాసనాలు, పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం
  3. చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.

నిర్వచనం :
“సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాశాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు. అందరికీ సమాన ఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అంతా సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.

1. సహజ సమానత్వం (Natural Equality) :
సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తి పరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది.

పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.

2. సాంఘిక సమానత్వం (Social Equality) : వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.

ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్పృశ్యతను అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు. ఈ సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.

  1. రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
  2. విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి.
  3. సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
  4. రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
  5. తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
  6. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.

3. ఆర్థిక సమానత్వం (Economic Equality) :
ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి – ఆదాయాలకు సంబంధించిన అంశం.

ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్స్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్చను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 13.
సమానత్వం మూలం మరియు ప్రాధాన్యతను తెలపండి.
జవాబు.
‘సమానత్వం’ అనే పదం సాధారణంగా మానవులందరూ సమానులే కాబట్టి అందరికీ ఒకే విధమైన ఆదరణ, గుర్తింపు, సంపద ఉండాలనే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. ప్రతీ మానవునికి సహజ సిద్ధంగానే సమానత్వ వాంఛ ఉంటుంది.

అయితే సమానత్వం అనే పదానికి శాస్త్రీయమైన అర్థాన్ని 1789లో ఫ్రాన్స్ దేశపు జాతీయసభ ఆమోదించిన మానవ హక్కుల ప్రకటనలో వివరించటం జరిగింది. మానవులందరూ స్వేచ్ఛ సమానత్వలతో జన్మించి వాటితోనే జీవితాంతం కొనసాగుతారు అని ప్రకటించబడింది.

“ప్రజలందరూ సృష్టిరీత్యా సమానులే అనే సత్యాన్ని మేము స్పష్టపరచిన దానిగా భావిస్తాం అని ‘1776లో వెలువడిన అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలో కూడా అనే భావం స్ఫురించే విధంగా వివరించారు. అంటే సమానత్వం మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం.

దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదన్న మాట. ఆ పంధాలోనే “స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదత్రయం ఫ్రెంచ్’ విప్లవాన్ని ఎంతగానో ఉత్తేజితపరచింది. 1917లో రష్యన్ భూమిపై ప్రజ్వరిల్లిన కమ్యూనిస్ట్ విప్లవం ఆర్థిక సమానత్వాన్ని సాధించి ఉద్భవించింది.

సమానత్వం ప్రాధాన్యత :

  1. వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది : వ్యక్తి వికాసానికి సమానత్వం అవసరం. మానవుని అభివృద్ధికి కావలసిన పరిస్థితులను సమానత్వం ఉన్న చోట పొందవచ్చు.
  2. ప్రతిభను గుర్తిస్తుంది : సమానత్వం ఉన్న చోట అన్ని వర్గాల ప్రజలు సమానావకాశాలు పొందుతారు. పేదరికం, వెనుకబాటుతనం వంటివి ప్రతిభను నిరూపించుకోవడానికి ఆటంకాలు కావు.
  3. స్వేచ్ఛను పెంపొందిస్తుంది : స్వేచ్ఛ, సమానత్వాలు పరస్పర పోషకాలు సమానత్వం స్వేచ్ఛను పెంపొందిస్తుంది.
  4. ప్రజాస్వామ్య విజయము : సమానత్వం ప్రజారాజ్య ఆదర్శం అదిలేనిదే ప్రజాస్వామ్యం విజయవంతం కాదు. ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమానత్వాలు పౌరులకు లభించాలి.
  5. ప్రతిష్ట పెంచుతుంది : వ్యక్తులంతా సమాన హోదా కలిగి, సాంఘికముగా ప్రతిష్ట పొందుతారు. రాజకీయ సమానత్వం వెనుకబడిన వర్గాల స్థాయిని పెంచింది. ”
  6. సాంఘిక న్యాయం : సమానత్వం సాంఘిక న్యాయాన్నిస్తుంది. అంటరానితనం, వెట్టిచాకిరి వంటి సాంఘిక దురాచారాలు రూపుమాపుతుంది.

ప్రశ్న 14.
న్యాయానికి సంబంధించి ఏవైనా మూడు రకాలను తెలపండి.
జవాబు.
న్యాయం రకాలు (Types of Justice) :
న్యాయం అనేక రకాలుగా ఉంటుంది. ఇది సహజవాబు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, చట్టబద్ధమైన పార్శాలకు సంబంధించినది. న్యాయభావనలోని వివిధ రకాలను కింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.

1. సహజ న్యాయం (Natural Justice) :
ప్రపంచంలో లభించే సహజ వనరులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చుననే సూత్రం ఆధారంగా ప్రతిపాదించబడినదే సహజ న్యాయం. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ సహజ వనరులు జీవన ఆధారంగా ఉంటాయి. మానవులు ఒక్కరే హేతుబద్ధమైన జీవనం గడపటం వల్ల, సహజ వనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ సందర్భంలో మానవులు భవిష్యతరాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.

2. సామాజిక న్యాయం (Social Justice) :
సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది.

చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు ‘సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.

3. రాజకీయ న్యాయం (Political Justice) :
రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది.

ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ`భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.

  1. సమన్యాయ పాలన
  2. స్వతంత్ర న్యాయశాఖ
  3. ప్రాతినిధ్య సంస్థలకు ఎన్నికలు
  4. రాజకీయ పార్టీలు
  5. పత్రికా స్వాతంత్య్రం
  6. ప్రజాస్వామ్య పాలన మొదలైనవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 15.
న్యాయానికి సంబంధించి ఏవైనా రెండు భావనలను వివరించండి.
జవాబు.
1. గ్రీకులు, స్లోయిక్లు, రోమన్ల న్యాయ సిద్ధాంతం :
న్యాయ భావనను తొలిసారిగా చర్చించిన వారు గ్రీకులు కాగా, దానికి పునాదులు వేసిన వ్యక్తి ప్లేటో, ప్లేటో న్యాయ సిద్ధాంతంలో సుగుణం ప్రధానమైంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఎవరి పనులు వారే నిర్వహించుకోవడమే సుగుణం. అరిస్టాటిల్ ప్రకారం న్యాయం సంపూర్ణంగా సుగుణవంతమైంది.

స్లోయిక్ల ప్రకారం న్యాయం హేతువు ద్వారా కనుగొనబడింది. అదే విధంగా ఇది రాజ్యంచే రూపొందించబడిన సంవర్ధక శాసనం కంటే ఉన్నతమైంది. రోమన్ల ప్రకారం న్యాయం అనే భావన శాసనానికి సన్నిహితంగా ఉంటుంది.

2. ఆధునిక న్యాయ సిద్ధాంతం:
సంస్కరణోద్యమం, సాంస్కృతిక పునరుజ్జీవనం, పారిశ్రామిక విప్లవం అనంతరం ఇది అవతరించింది. హాబ్స్, లాక్, రూసోల సామాజిక ఒడంబడిక సిద్ధాంతంతో ఆధునిక న్యాయ సిద్ధాంతం అవతరించింది. నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి ఇవ్వడమే న్యాయం అని హాబ్స్ పేర్కొన్నాడు. లాక్ సహజ హక్కులలో న్యాయాన్ని గుర్తించగా, రూసో చెప్పిన “జనేచ్ఛ” న్యాయంతో కూడుకున్నదిగా చెప్పాడు.

3. సమకాలీన న్యాయ సిద్ధాంతాలు :
ఈ సిద్ధాంతాలు ప్రధానంగా స్థిరమైన న్యాయం (Substantial Justice), ప్రక్రియాత్మకమైన న్యాయం (Procedural Justice) ల మధ్యగల వ్యత్యాసాలపై దృష్టి పెడుతుంది. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ నియమ, నిబంధనలు మానవుని ప్రవర్తనను నిర్దేశించటానికీ నమూనా నిబంధనలుగా ఉంటాయని ప్రక్రియాత్మకమైన న్యాయం పరిగణిస్తుంది.

అన్ని రకాల వివక్షతలను వ్యతిరేకిస్తూ, మానవుని మధ్య నైతికతను, సమాన గౌరవాన్ని ప్రక్రియాత్మకమైన న్యాయం అనుమతిస్తుంది. F. A.. హాయక్, మిల్టన్ ఫ్రీడ్ మన్, నాజిక్ వంటి వారు దీన్ని ప్రతిపాదించిన వారిలో ప్రముఖులు.

స్థిరమైన న్యాయ భావన అనేది సామాన్యవాదం ఆలోచనల నుంచి అవతరించింది. సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల జీవన ప్రమాణాల పెంపుదలకు తగిన అవకాశాలు పొందేందుకు స్థిరమైన న్యాయం తోడ్పడుతుంది. ఇందులో వనరుల పంపిణీ అనేది ప్రధాన అంశం కాగా ప్రక్రియ అనేది ద్వితీయమైంది.

ప్రశ్న 16.
భారత రాజ్యాంగం మరియు సామాజిక న్యాయం.
జవాబు.
సామాజిక న్యాయం (Social Justice) :
సామాజిక న్యాయం అనే భావన సామాజిక భద్రతను కాంక్షిస్తుంది. అన్ని రకాల వివక్షతలను తొలగించాలని కోరుకుంటుంది. అదే విధంగా కులం, మతం, వర్ణ, లింగం, జాతి, పుట్టుక వంటి అంశాల ప్రాతిపదికన కొన్ని వర్గాలకు కల్పించే ప్రత్యేక హక్కులను నిషేధిస్తుంది.

అదేవిధంగా సామాజిక ప్రక్రియలో కొద్దిమంది ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ అత్యధిక జనాభాకు అన్ని అవకాశాలను పొందటానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడం కూడా సామాజిక న్యాయంలో అంతర్భాగం. సమాజంలో గల పేదరికం, నిరుద్యోగం, ఆకలి చావులు వంటి అంశాలను తొలగిస్తూ, అణగారిన వర్గాల శ్రేయస్సుకు తోడ్పడుతుంది.

ప్రతి వ్యక్తి గౌరవ ప్రదంగా జీవించి విద్యా, సాంస్కృతిక రంగాల్లో ఉన్నతంగా ఉండాలి. అన్ని స్థాయిల్లో సాంఘిక వివక్షతను తొలగిస్తుంది. సామాజిక న్యాయ భావన ద్వారా మూడు రకాల న్యాయాలను అర్థం చేసుకోవచ్చు అవి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. నీటిలో ఆర్థిక న్యాయం అత్యంత ప్రధానమైంది. ఎందుకంటే ఆర్థిక అసమానతలు అన్యాయానికి దారి తీసి శాసన, రాజకీయ న్యాయాలను హరించి వేస్తుంది.

భారత రాజ్యాంగం 1950 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ ప్రవేశికలో మరియు 4వ భాగంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాల్లో న్యాయ భావనను పొందుపరిచారు. అవి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాలు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 17.
శక్తి అంటే ఏమిటి ? దాని ప్రాముఖ్యతను తెలపండి.
జవాబు.
శక్తి – స్వభావం – ఆవశ్యకత:
అర్థశాస్త్రంలో ద్రవ్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో రాజనీతి శాస్త్రంలో శక్తికీ అంతే ప్రాధాన్యత ఉంది. రాజనీతి శాస్త్రంలో శక్తి అనే భావన ప్రధానాంశం కావటంతో ఇది స్వతంత్ర హెూదాను పొందింది. ఇది తత్వశాస్త్రం, చరిత్ర, నీతిశాస్త్రం, న్యాయశాస్త్రాల సరసన చేరి ఒక ప్రముఖ అధ్యయన శాస్త్రంగా గుర్తించబడింది.

రాజకీయాలలో శక్తి భావన విశేషతను సంతరించుకొని దాని దృష్టి శక్తిని పొందటం, నిర్వహించడం, కోల్పోవటం వంటి వాటిపై పెట్టింది. “శక్తిని పొందటం మరియు పంచటం గురించి అధ్యయనం చేయటమే రాజనీతి |శాస్త్రమని” హెరాల్డ్ లాస్పెల్, ఎ. కాప్లాన్లు నిర్వచించారు.

ఆధునిక రాజనీతి శాస్త్రం అభివృద్ధి చెందుతున్న దశలో రాజనీతి శాస్త్రం కేవలం రాజ్యం వంటి వ్యవస్థీకృత సంస్థల గురించి మాత్రమే అధ్యయనం చేసేదిగా భావించేవారు. కాని నేడు అవ్యవస్థీకృత అంశాలైన శక్తి వాటి సంస్థలు కూడా చేరాయి. కాబట్టి వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రాజకీయ వ్యవస్థలతో కూడా రాజనీతిశాస్త్రం తన పరిధిని విస్తరించుకుంది.

సంప్రదాయ ధృక్కోణంలో శక్తి కేవలం సమాజంలో రెండు వర్గాల మధ్య నిర్వహించబడింది. అవి ఆధిపత్య వర్గాలు, అధీన వర్గాలు. కాని ఆధునిక బహుళత సమాజంలో వ్యక్తులు వారి వారి అంతస్థు, అభిరుచులను బట్టి విభిన్న వర్గాలుగా విభజించబడింది. ఈ వర్గాలు ఆధిపత్య, అధీన వర్గాలుగా మాత్రమే విభజించబడలేదు.

ప్రతీ వర్గం తమ తమ ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ వర్గాలు ప్రభుత్వంపై, ప్రభుత్వ విధానంపై ప్రభావితం చూపుతాయి. విధాన నిర్ణయంలో ప్రభుత్వానికి సహకరిస్తాయి. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించటానికి రాజనీతి శాస్త్రంలో శక్తి అధ్యయనం ఆవశ్యకం.

ప్రశ్న 18.
శక్తికి సంబంధించి ఏవైనా రెండు ధృక్పధాలను తెలపండి.
జవాబు.
1. శ్రేష్ఠ వర్గ ధృక్కోణం :
శక్తికి సంబంధించి శ్రేష్ఠ వర్గ దృక్కోణం 20వ శతాబ్దం ప్రారంభంలో పరెటో, మోస్కా, మిచెల్స్ అనే ముగ్గురు సామాజిక శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ప్రకారం సమాజం శ్రేష్ఠ వర్గం, సామాన్య జన సమ్మేళనంగా చీలి ఉంటుంది.

ఈ విధంగా చీలటానికి వ్యక్తులలో గల పోటీతత్వం, వారి వారి ఆసక్తులపై ఆధారపడి ఉంటుంది. శ్రేష్ఠ వర్గం రాజకీయ శక్తిని ప్రభావితం చేస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం సమాజంలో విభజన అనేది సహజవాబు. కార్యకరణ పరంగా ఉంటుంది. ఇది సంపూర్ణంగా మారుతుందనే నమ్మకాన్ని కలిగి ఉంటుంది.

2. సమూహ ధృక్కోణం:
ఈ ధృక్కోణంను అర్ధర్ బెంట్లీ అభివృద్ధి చేశాడు. శక్తిపై సమూహ ధృక్కోణం బహుతా సిద్ధాంతానికీ అనుగుణంగా ఉంటుంది. దీని ప్రకారం శక్తి అనే భావన సమాజాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది.

ఇవి ఆధిపత్య సమూహాలు, ఆధారిత సమూహాలు. సమూహ ధృక్కోణం ప్రకారం సమాజంలో శక్తి ఏ ఒక్క సమూహం చేతిలో కేంద్రీకృతం కాకుండా అది విభిన్న సామాజిక వర్గాల మధ్య విభజించబడి ఉంటుంది. ఈ సమూహాలు ఎక్కువగా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండి, స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకుంటాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 19.
ఏవైనా మూడు రకాల అధికారాలను తెలపండి.
జవాబు.
1. చట్టబద్ధమైన అధికారం :
కొన్ని నిర్ణయాత్మక హక్కులు మరియు విధుల ప్రకారం అధికారంలో వున్న వ్యక్తులు తమ అధికారాలను చెలాయిస్తారు. ప్రదర్శన విధేయత అధికారంలో ఉన్న వ్యక్తిని దృష్టిలో ఉంచుకోకుండా, చట్టం ప్రకారం అధికారం ప్రకారం జరుగుతుంది.

మాక్స్వెబర్ అభిప్రాయంలో ఒక వ్యక్తి తన కార్యాలయం ప్రకారం కొన్ని, ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా మరియు అధికారాన్ని న్యాయమైన రీతిలో నిర్వహించడం ద్వారా చట్టబద్ధం అధికారాన్ని చెలాయిస్తాడు. చట్టబద్ధ అధికారాన్ని రాజ్యాంగబద్ధ అధికారం అనికూడా అంటారు. పార్లమెంటరీ విధానంలో నామమాత్రపు మరియు వాస్తవ కార్యనిర్వాహక అధిపతులైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి చెలాయించే అధికారాన్ని చట్టబద్ధ అధికారంగా చెప్పుకోవచ్చు.

2. సాంప్రదాయ అధికారం :
సాంప్రదాయ అధికారం ప్రాచీన ఆచారాలు, సాంప్రదాయాల ఆధారంగా నిర్వహించబడుతుంది. ఈ అధికారాన్ని చెలాయించే వ్యక్తులు ప్రజల సాంప్రదాయాలు, ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తారు. సాంప్రదాయ అధికారం నిరపేక్షమైనది కాదని, దాన్ని చెలాయించే వ్యక్తుల విచక్షణను బట్టి వుంటుందని మాక్స్వెబర్ పేర్కొన్నాడు.

అభివృద్ధికి నోచుకోని సమాజంలో ఈ విధమైన అధికారం వుంటుంది. ఒకప్పుడు నేపాల్, భూటాన్ లో ఈ విధమైన అధికారం వుండేది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ప్రభావంతో ఈ అధికారం తన ప్రాభవాన్ని, ప్రాముఖ్యతను కోల్పోయింది.

3. సమ్మోహన (లేదా) ఆకర్షణీయమైన అధికారం :
సమ్మోహన అధికారం నేటి ప్రపంచంలోని అనేక రాజ్యాల్లో వుంది. అనేక దేశాల్లో చట్టబద్ధ అధికారం ఆచరణలో వున్నప్పటికీ కొందరు రాజకీయ నాయకులు వారి రాజ్యాంగబద్ధ స్థాయికి బదులుగా సమ్మోహన అధికారం ద్వారానే కార్యకర్తలను, అనుచరులను ప్రభావితం చేస్తున్నారు.

సమ్మోహనాధికారం గల నాయకులు నిజాయితీకి అంకితమైన ధృక్పథంను కలిగి వుంటారు. ఫలితంగా వారు తమ దేశ ప్రజలను ప్రభావితం చేయగల మరియు ప్రేరేపించగల సామర్థ్యం కలిగి వుంటారు.
ఉదా : ‘బాలగంగాధర్ తిలక్, మహాత్మగాంధీ, రాజేంద్రప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్పటేల్, టంగుటూరి ప్రకాశం, షేక్ అబ్దుల్లా, ఎం.జి.రామచంద్రన్, ఎన్.టి.రామారావు.

ప్రశ్న 20.
శక్తి మరియు అధికారం మధ్య తేడాలను తెలపండి.
జవాబు.

శక్తి

అధికారం

1. శక్తి అనేది రాజకీయాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తుంది.1. అధికారం రాజకీయాలను పాలనాపరమైన కోణంలోనే చూస్తుంది.
2. శక్తికి చట్టబద్ధత ఉండవచ్చు, లేకపోవచ్చు.2. శక్తికి చట్టబద్ధత జోడిస్తేనే అధికారమవుతుంది.
3. ఇతరులను ఆదేశించేదే అధికారం.3. శాసనబద్ధమైన ప్రభావమే అధికారం.
4. సమాజంలో శక్తి అనేది ఆదేశం, విధేయతలను వ్యక్తపరుస్తుంది.4. ఉన్నతస్థాయి నుంచి వచ్చే ఆదేశాన్ని దిగువ స్థాయిలో ఆమోదించటాన్ని అధికారం అంటారు.
5. ఇతరుల ఆలోచనలను, చర్యలను ప్రభావితం చేసేది శక్తి.5. ఆదేశాలను, ఆజ్ఞలను ఇచ్చి, నిర్ణయాలను తీసుకునే హక్కును కలిగి వుండేది అధికారం.
6. శక్తికి ప్రధాన ఆధారం జ్ఞానం మరియు అనుభవం.6. ఒక వ్యక్తి యొక్క అధికారాన్ని స్థాయి, పదవి నిర్ణయిస్తాయి.

 

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
శాసనం పదం అవతరణను తెలపండి.
జవాబు.
‘చట్టం’ అనే పదం టైటానిక్ భాష (జర్మన్) లోని ‘లాగ్’ అనే పదం నుండి గ్రహించబడింది. లాగ్ అనగా ”స్థిరంగా ఉండటం’ అని అర్థం. పద అర్థాన్ని బట్టి సార్వభౌమత్వ రాజకీయ అధికారిచే ప్రతిపాదించబడి, అమల్లోకి వచ్చిన ప్రవర్తనా నియమావళియే చట్టం అని భావించవచ్చు.

మరికొందరు రాజనీతిజ్ఞులు ‘చట్టం’ అనే పదం లాటిన్ భాషలోని ‘జస్’, ‘జంగేరి’ అనే రెండు పదాల నుండి గ్రహించబడిందని పేర్కొన్నారు. లాటిన్ భాషలోని ఈ రెండు పదాలకు ‘బంధం’ అనే అర్థం ఉంది.

ప్రశ్న 2.
శాసనానికి సంబంధించి ఏవైనా రెండు నిర్వచనాలను తెలపండి.
జవాబు.

  1. “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలుచేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
  2. “న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.

ప్రశ్న 3.
శాసనం లక్షణాలు ఏవి ?
జవాబు.
చట్టం ఈ క్రింది ముఖ్య లక్షణాలను కలిగి ఉంటుంది.

  1. సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముదాయమే చట్టం.
  2. చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది మరియు విశ్వవ్యాప్తమైనది.
  3. చట్టం ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఉంటుంది.
  4. చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 4.
సమన్యాయ పాలనను నిర్వచించండి.
జవాబు.
సమన్యాయపాలన అంటే చట్టం ఆధిక్యత అని అర్థం. సమన్యాయపాలన అమలులో ఉన్న దేశాలలో ప్రభుత్వాధికారాలు చట్టాల ద్వారా నిర్ణయించబడతాయి. ప్రభుత్వ చర్యలన్నింటికి చట్టసమ్మతి ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించినపుడు మాత్రమే వ్యక్తి శిక్షింపబడతాడు.

ధనిక, పేద అనే విచక్షణ లేకుండా చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. చట్ట ఆధిక్యత లేదా సమన్యాయ పాలన ఉండటం వలన వ్యక్తులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లభిస్తాయి.

ప్రశ్న 5.
సంవర్థక శాసనం అంటే ఏమిటి ?
జవాబు.
మానవ సంస్థలచే రూపొందించబడేదే సంవర్థక శాసనం. ఈ శాసనాన్ని రాజకీయ శాసనం అని కొందరు పేర్కొన్నారు. వర్తమాన సామాజిక రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ శాసనం నిర్మితమైంది. సార్వభౌమత్వ రాజకీయ అధికారి ఈ శాసనానికి అనుమతిస్తారు. ఈ శాసనాన్ని అతిక్రమించినవారు శిక్షార్హులు.

ప్రశ్న 6.
పరిపాలక శాసనం అంటే ఏమిటి ?
జవాబు. పరిపాలక చట్టం (Administrative Law) :
పరిపాలన నిర్విఘ్నంగానూ, ప్రశాంతంగానూ కొనసాగే విషయంలో చట్టం కీలకపాత్రను పోషిస్తుంది. ప్రజలకు, ప్రభుత్వాధికారులకు మధ్య సంబంధాలను ఈ రకమైన చట్టం నియంత్రిస్తుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సంస్కరణలను తీసుకురావడంలో ఇది దోహదపడుతుంది.

పరిపాలక చట్టాలను అనుసరించడం ద్వారా ఈనాటి రాజ్యాలు అనేక దశలుగా శీఘ్రగతిన అభివృద్ధిని సాధించాయి. ప్రభుత్వ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసేటట్లు పరిపాలక చట్టం దోహదపడుతుంది.

ప్రశ్న 7.
శాసనం యొక్క ఏవైనా రెండు ఆధారాలను తెలపండి.
జవాబు.
చట్టానికి గల మూడు ఆధారాలు :

  1. ఆచారాలు
  2. మతం
  3. శాసనసభ.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 8.
రాజ్యాంగ శాసనం అంటే ఏమిటి ?
జవాబు.
రాజ్యాంగ చట్టం (Constitutional Law) :
రాజ్యాంగ చట్టమనేది సాధారణ చట్టం కంటే భిన్నంగా ఉంటుంది. రాజ్యంలో ఈ రకమైన చట్టం అత్యున్నతమైనది. ప్రభుత్వ నిర్మాణానికి ఇది వీలు కల్పిస్తుంది. ప్రభుత్వాంగాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. ప్రభుత్వాంగాల అధికార పరిధిని నిర్ణయిస్తుంది.

ఈ రకమైన చట్టం లిఖిత పూర్వకంగా ఉంటుంది. రాజ్యంలో నివసించే పౌరుల హక్కులు, బాధ్యతల గురించి వివరిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ చట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ప్రజాభీష్టానికి ప్రతీకగా ఉంటుంది.

ప్రశ్న 9.
సామాన్య శాసనం గురించి మీకు తెలిసినది వివరించండి.
జవాబు.
సామాన్య శాసనం :
పబ్లిక్ శాసనాల నుంచి పరిపాలక శాసనాన్ని మినహాయిస్తే మిగిలినవన్నీ సామాన్య శాసనంలో అంతర్భాగం. రాజ్యంలో గల పౌరుల మధ్యగల సంబంధాలను నిర్ణయించేదే సామాన్య శాసనం. వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలను వివరిస్తుంది. వివాహం, విడాకులు, ఒప్పందాలు మొదలైనవి. ఇందులో అంతర్భాగాలు. సామాన్య శాసనాన్ని చట్టబద్ధ శాసనం, సాధారణ శాసనంగా విభజించవచ్చు.

ప్రశ్న 10.
పబ్లిక్ శాసనాన్ని నిర్వచించండి.
జవాబు.
పబ్లిక్ చట్టం (Public Law) :
పబ్లిక్ చట్టం, రాజ్యం వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రిస్తుంది. రాజ్యానికి సంబంధించిన మౌలిక నిర్మితి, విధులను పబ్లిక్ చట్టం వివరిస్తుంది. రాజ్యపు మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా వ్యక్తులకు అవసరమైన హక్కులను అందిస్తుంది. పౌరులందరు ఈ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అతిక్రమించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 11.
బ్రిటిష్ రాజ్యాంగం ప్రత్యేకతను తెలపండి.
జవాబు.
బ్రిటిష్ రాజ్యాంగ విశిష్ట లక్షణం సమన్యాయపాలన. ఇది ముందుగా ఇంగ్లండులో అవతరించింది. అనంతరం భారతదేశం, అమెరికా దేశాలలో దీనిని అమలు చేశారు. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది, అని తెలిపేదే సమన్యాయపాలన. రాజ్యంలో నివశించే ప్రతి పౌరునికి శాసనాలు ఒకే విధంగా వర్తిస్తాయి.

ప్రశ్న 12.
సమత అంటే ఏమిటి ?
జవాబు.
‘సమత’ అనే పదానికి నిష్పక్షపాతం, న్యాయం లాంటి సూత్రాలను పర్యాయపదాలుగా వాడుతున్నారు. సమత అంటే సహజ న్యాయం. అమలులో ఉన్న చట్టాలు వివాదాల పరిష్కారానికి సహాయపడిన సందర్భాలలో న్యాయమూర్తులు తమ విజ్ఞత, విచక్షణతో వివాదాలను పరిష్కరిస్తారు. ఈ పరిష్కారాలే రాజ్యముచేత గుర్తించబడి చట్టాలుగా ప్రకటించబడతాయి.

ప్రశ్న 13.
శాస్త్రీయ వ్యాఖ్యానాలు అంటే ఏమిటి ?
జవాబు.
శాస్త్రవేత్తల వ్యాఖ్యానాలు చట్టానికి మరొక ముఖ్యమైన ఆధారం. ప్రఖ్యాత న్యాయమూర్తులు, న్యాయవాదులు వెల్లడించే అభిప్రాయాలు ఎనలేని ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. న్యాయవేత్తలు తమ వ్యాఖ్యానాల ద్వారా చట్టంలోని దోషాలను గుర్తించి, వాటి నివారణకు కొన్ని సూచనలు చేస్తారు. కాలక్రమంలో ఈ సూచనలే చట్ట నిర్మాణానికి ప్రధాన ఆధారాలవుతాయి.

ప్రశ్న 14.
శాసనానికి శాసన నిర్మాణ శాఖ ఒక ఆధారం తెలపండి.
జవాబు.
ప్రజాస్వామ్యంలో శాసనసభ శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రధానపాత్ర పోషిస్తుంది. కావున శాసనసభను చట్టం యొక్క ప్రత్యక్ష ఆధారంగా పేర్కొంటారు. చట్ట నిర్మాణంలో శాసనసభలు ప్రజానీకం ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటాయి. శాసనసభలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 15.
భారత రాజ్యాంగంలో గల సమన్యాయపాలన.
జవాబు.
భారత రాజ్యాంగం సమన్యాయపాలనను రాజ్యాంగ మౌలిక లక్షణంగా గుర్తించింది. సమన్యాయపాలన రాజ్యాంగ మౌళిక నిర్మాణంగా భారత సుప్రీంకోర్టు పదేపదే ప్రకటించింది. భారత రాజ్యాంగం మూడో భాగంలోని 14 నుంచి 21 వరకు గల ప్రకరణాలు సమన్యాయపాలన భావనను పొందుపరిచాయి. సమన్యాయపాలన భావన అనేది “చట్టం ముందు అందరూ సమానులే” ఏ ఒక్కరు విచక్షణారహితంగా శిక్షకు గురికాకూడదు” అనే సూత్రంపై ఆధారపడి వున్నది.

ప్రశ్న 16.
సంవర్థక స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు.
సకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అనేది వ్యక్తి తన అభీష్టం మేరకు నడుచుకొంటూ ఇతరులు కూడా తనవలె నడుచుకోవాలనే పరిస్థితిని సూచిస్తుంది. వేరొక మాటలో చెప్పాలంటే ఇతరులకు హాని కలిగించని అధికారమే స్వేచ్ఛ అనే ధృక్కోణాన్ని సూచిస్తుంది.

టి.హెచ్.గ్రీన్ అనే ఆదర్శ తత్త్వవేత్త ఈ రకమైన స్వేచ్ఛా ధృక్కోణాన్ని ప్రతిపాదించాడు. ఇతరులతో సమానంగా ఆనందంతో ఏదైనా చేసి అనుభవించేందుకు గల అధికారమే స్వేచ్ఛగా అతడు భావించాడు.

ప్రశ్న 17.
సంరక్షక స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు.
సకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అంటే ఎటువంటి ఆంక్షలు లేకపోవడం. తమ స్వాతంత్య్రాల మీద ఎలాంటిఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వాతంత్ర్యాన్ని పొందగలరు. అయితే కొందరు దీన్ని వాస్తవ విరుద్ధమైనదిగా భావించారు. రాజ్యం ఆవిర్భావానికి పూర్వం మాత్రమే వ్యక్తులకు ఆంక్షల్లేని స్వేచ్ఛ ఉందన్నారు. వారి ప్రకారం అటువంటి రాజ్యం అసాధ్యమైందే కాకుండా, ఆధునిక కాలంలో వ్యక్తులు స్వాతంత్ర్యాన్ని అనుభవించే వీలులేనిది కూడా అవుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 18.
స్వేచ్ఛకు సంబంధించి ఏవైనా నాలుగు లక్షణాలను తెలపండి.
జవాబు.

  1. మానవీయ వ్యక్తిత్వాల సాధనకు అత్యంత ఆవశ్యకమైంది.
  2. స్వేచ్ఛ ఒక శక్తివంతమైన భావన. దాని వ్యాఖ్యానమనేది స్థలం, కాలం, ప్రాంతం, ప్రజల ఆకాంక్షలను బట్టి ఉంటుంది.
  3. వ్యక్తుల ఆకాంక్షలను సదా వాస్తవం చేయడమే స్వేచ్ఛ లక్ష్యం అవుతుంది.
  4. నిర్హేతుకమైన ఆంక్షలకు బదులు నిరంతరం సానుకూల పరిస్థితులను కలిగి ఉండటమే స్వేచ్ఛ.

ప్రశ్న 19.
స్వేచ్ఛకు సంబంధించి ఏవైనా రెండు రకాలను తెలపండి.
జవాబు.
స్వేచ్ఛలోని నాలుగు రకాలు :

  1. సహజ స్వేచ్ఛ
  2. పౌర స్వేచ్ఛ
  3.  రాజకీయ స్వేచ్ఛ
  4. ఆర్థిక స్వేచ్ఛ.

ప్రశ్న 20.
పౌర స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు.
పౌర స్వేచ్ఛ (Civil Liberty) :
పౌర స్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌర స్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు.

  1. సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం
  2. ఆలోచన, అభివ్యక్తి, ముఖ్యమైన ప్రశ్నలు విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం
  3. నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్ర్యం.

పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించ గలిగినప్పుడే పౌర స్వేచ్చ వాస్తవమవుతుంది.

“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్చ” అని గెటిల్ పేర్కొన్నాడు.

పౌర స్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి

  1. జీవించే హక్కు
  2. పనిచేసే హక్కు
  3. ఆస్తి హక్కు
  4.  వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 21.
రాజకీయ స్వేచ్ఛ గురించి తెలపండి.
జవాబు.
రాజకీయ స్వేచ్ఛ (Political Liberty) :
రాజకీయ స్వేచ్ఛ పౌరులు రాజకీయాంశాలలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛ పౌరులకు రాజ్య కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే శక్తినిస్తుందని లాస్కీ పరిగణించాడు. రాజకీయ స్వేచ్ఛను ప్రజాస్వామ్యానికి పర్యాయపదంగా గిల్ క్రిస్ట్ భావించాడు. రాజకీయ స్వేచ్ఛ అంటే ఎవరికి వారు తమ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకొనే రాజ్యాంగ స్వేచ్ఛగా లీకాక్ వర్ణించాడు.

రాజకీయ స్వేచ్ఛ పౌరులకు మాత్రమే పరిమితమైంది. అది సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు రాజకీయాంశాలలో వివిధ హక్కులను కల్పిస్తుంది. అటువంటి వాటిలో i) ఓటు వేసే హక్కు ii) ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేసే హక్కు iii) ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు iv) విమర్శించే హక్కువంటివి ఉన్నాయి. విద్య, నిజాయితీ, నిష్పక్షపాతమైన పత్రికలు మొదలైనవి ఉన్నప్పుడే రాజకీయ స్వేచ్ఛ వాస్తవం అవుతుందని లాస్కీ నొక్కి చెప్పాడు.

ప్రశ్న 22.
ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి కావలసిన సాధనాలు తెలపండి.
జవాబు.
సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛ సాధన ఈ క్రింది చర్యల ద్వారా సాధ్యమవుతుంది. అవి

  1. కనీస వేతనాలను అందించటం
  2. పనిహక్కుకు భరోసా కల్పించటం
  3. నిరుద్యోగం, అనారోగ్యం వంటి అభద్రతల నుండి కార్మికులను రక్షించటం
  4. తగినంత విశ్రాంతిని కల్పించటం
  5. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించటం.

ప్రశ్న 23.
ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు.
ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty) :
ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతిఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే ఆర్థికస్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరుద్యోగం – అసంపూర్ణతల నుంచి విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.

ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.

  1. కనీస వేతనాలను అందించడం.
  2. పని హక్కుకు భరోసా కల్పించడం.
  3. నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం.
  4. తగినంత విశ్రాంతిని కల్పించడం.
  5. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 24.
జాతీయ స్వేచ్ఛ గురించి తెలపండి.
జవాబు.
జాతీయ స్వేచ్ఛ (National Liberty) :
జాతీయ స్వేచ్ఛ అంటే రాజ్యం – స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. రాజ్యపు సార్వభౌమత్వాన్ని అది సూచిస్తుంది. ప్రతి రాజ్యం ఈ స్వేచ్ఛను అనుభవిస్తూ ఇతర రాజ్యాల ఆధిపత్యానికి లోనుగాకుండా ఉంటుంది. అన్ని రంగాలలో జాతి అభివృద్ధికి ఈ స్వేఛ్ఛ ఆవశ్యకమైంది. ప్రాచీనకాలం నుంచి అనేక దేశాల్లో ఇది విశదమైంది.

ఈ రకమైన స్వేచ్ఛను పొందడం కోసం అనేక దేశాలు ఎంతగానో ప్రయత్నించాయి. గతంలో టర్కీ ప్రజలకు వ్యతిరేకంగా గ్రీకులు స్వాతంత్య్ర సమరం సాగించారు. అట్లాగే మహాత్మాగాంధీ నాయకత్వంలో భారత ప్రజలు బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం కోసం అహింసాయుత పోరాటం చేశారు. జాతీయ స్వేచ్ఛ ఎంతో విలువైంది.

ప్రశ్న 25.
స్వేచ్ఛకు సంబంధించి ఏవైనా నాలుగు పరిరక్షణలను తెలపండి.
జవాబు.
స్వేచ్ఛకు గల నాలుగు పరిరక్షణలు :

  1. ప్రజాస్వామ్య పాలన
  2. లిఖిత మరియు దృఢ రాజ్యాంగం
  3. స్వతంత్ర న్యాయవ్యవస్థ
  4. సమన్యాయపాలన.

ప్రశ్న 26.
స్వేచ్ఛ రక్షణకు న్యాయశాఖ స్వతంత్రత ఏ విధంగా తోడ్పడుతుంది ?
జవాబు.
వ్యక్తి స్వేచ్ఛకు పరిరక్షణయే స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయవ్యవస్థ. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని సమర్థించి, ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహించేటట్లు చూస్తుంది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు వివిధ రక్షణలను సూచిస్తుంది. కావున స్వేచ్ఛ పరిరక్షించబడటానికి స్వతంత్ర న్యాయశాఖ అత్యంత అవసరం అని రాజనీతిజ్ఞులు భావిస్తారు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 27.
శాసనబద్ద సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
సమాజంలో అందరికీ పౌరహక్కులు లభించడమే శాసనబద్ద సమానత్వం. కుల, వర్ణ, ‘జన్మ, మతపరమైన అంశాల్లో ఎలాంటి విచక్షణ లేకుండా సామాజిక హోదాపరంగాగాని, మతపరమైన నమ్మకాల విషయంలోగాని, రాజకీయపరమైన అభిప్రాయాల్లోగాని, ప్రతి ఒక్కరు సమానత్వాన్ని కలిగి వుండటమే శాసనబద్ద సమానత్వం. ఏ ఒక్కరు ప్రత్యేక హోదాగాని, అవకాశాలు గాని కలిగి వుండరు.

సమాజంలో చట్టం ముందు అందరూ సమానులే అనే భావన వుంటుంది. ప్రజలందరికీ చట్టపరమైన సమాన రక్షణలను శాసనబద్ధ సమానత్వం కలిగిస్తుంది.

ప్రశ్న 28.
ఆర్థిక సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
ఆర్థిక సమానత్వం (Economic Equality) :
ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్య కార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి – ఆదాయాలకు సంబంధించిన అంశం.

ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలకు తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషుల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నంగా లార్డ్స్ భావించాడు.

ఇక ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను భావించాడు. అదేసమయంలో ఆర్థిక సమానత్వమనేది సమాన ఆదరణ, ప్రతిఫలంగా భావించరాదు. వ్యక్తులు తగిన పనిని పొందే అవకాశం ద్వారా జీవనభృతిని సంపాదించుకొని, తమ ఆర్థిక హోదాను పెంపొందించుకొనేందుకు అది సంకేతంగా ఉంటుంది. అనేక సామ్యవాద దేశాలు ఆర్థిక సమానత్వ సాధనకు ప్రయత్నించి పాక్షికంగా విజయవంతమైనాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 29.
రాజకీయ సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
రాజకీయ సమానత్వం (Political Equality) :
రాజకీయ సమానత్వం రాజకీయ కార్యకలాపాలలో ప్రజలకు చాలినన్ని అవకాశాలను కల్పించేందుకు అనుకూల పరిస్థితులను సూచిస్తుంది. రాజ్యంలోని పౌరులకు వివిధ రకాల రాజకీయ హక్కులను ప్రసాదించడం ద్వారా ఆ రకమైన సమానత్వాన్ని సాధించవచ్చు. ఈ సందర్భంలో రాజకీయ సమానత్వాన్ని పౌరులు మాత్రమే అనుభవిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యంలో నివసించే అన్యులు, విదేశీయులకు ఇది వర్తించదు.

ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ సమానత్వమన్నది అత్యంత ఆవశ్యకమైంది. వివిధ రాజకీయ హక్కులను ప్రసాదించినప్పుడే పౌరులు రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే, రాజకీయ సమానత్వమనేది రాజకీయ స్వేచ్ఛకు పర్యాయపదంగా భావించవచ్చు.

ప్రశ్న 30.
సమానత్వం – సామాజిక మార్పు.
జవాబు.
శాస్త్ర, సాంకేతిక రంగాలలో సాధించిన ప్రగతి ఎక్కువ ప్రాంతాలలో సహజ అసమానత్వాన్ని ప్రత్యామ్నాయంగా పెంచి పోషించింది. ఆరోగ్యం, శారీరక పటిష్టత అనేది సరైన పౌష్ఠికాహారం వల్ల, మానసిక పరిపక్వత అనేది సరైన విద్య, రక్షణ ద్వారా సాధించవచ్చని మనకు తెలుసు. కాని ఈ ప్రయోజనాల లభ్యత అనేది వ్యక్తుల వ్యక్తిగత సాంఘిక, | ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి వుంది.

ప్రశ్న 31.
అంతర్జాతీయ సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
అంతర్జాతీయ సమానత్వం: అంతర్జాతీయ సమానత్వం అంటే ప్రతిదేశం భౌగోళిక, ఆర్థిక, సైనికపరమైన విషయాలలో మాత్రమే కాకుండా అన్నింటా సమానంగా గుర్తింపు పొందడమే. దీని ప్రకారం ప్రపంచంలో చిన్న రాజ్యాలైన లేదా పెద్ద రాజ్యాలైన అన్ని సమానమే.

ఐక్యరాజ్యసమితి ఛార్టర్లో కూడా అన్ని రాజ్యాలకు సమావ హోదా, గౌరవం ఇచ్చింది. తద్వారా ప్రతీ రాజ్యం తమ సార్వభౌమాధికారానికి గౌరవమిస్తూ తమ మధ్య నెలకొనే వివాదాలను పరిష్కరించుకోవాలి. అంతర్జాతీయ సమానత్వం అనేది మానవాళి ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 32.
సాంఘిక సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాను కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణం, లింగం, పుట్టుక మొదలగు అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.

సమాజంలో పౌరులందరినీ సమానమైనవారుగా సాంఘిక సమానత్వం భావిస్తుంది. పౌరులందరూ సమానమైన సాంఘిక, రాజకీయ, ఆర్థిక, చట్టపరమైన హక్కులను అనుభవించేందుకు వీలు కల్పించే సమానత్వాన్నే సాంఘిక సమానత్వం అని అంటారు.

ప్రశ్న 33.
సమానత్వం అనేది స్వేచ్ఛకు ఏవిధంగా అవసరం ?
జవాబు.
సమానత్వం అంటే ఒకే విధమైన ఆదరణ అని అర్థం కాదు. ఎందుకంటే అటువంటి సమానత్వం పౌర సమాజంలో సాధ్యంకాదు. అందుకు బదులుగా ఒకేరకమైన పరిస్థితులలో సమానమైన ఆదరణయే సమానత్వంగా పేర్కొనవచ్చు.

పౌర సమాజంలో కొందరు ఇతరులతో సమానమైన హోదాను కలిగి వుండరు. అయితే వారికి తమ వ్యక్తిత్వం, హోదాలను పెంపొందించుకొనేందుకై కొన్ని పరిస్థితులు, అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ సమానంగా ఉన్నప్పుడు స్వేచ్ఛా ఫలాలను వారందరూ అనుభవిస్తారని చెప్పవచ్చు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 34.
స్వేచ్ఛ అనేది సమానత్వంకు ఏ విధంగా అవసరం ?
జవాబు.
సమానత్వానికి స్వేచ్ఛ అవసరం (Liberty is essential for Equality) :

  1. స్వేచ్ఛ అంటే నిరపేక్షమైనది కాదు. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని నిబంధనలకు లోబడి సామాజిక సంక్షేమాన్ని సాధించేందుకై ఈ స్వేచ్ఛ అందరికీ అందుబాటులో ఉంటుంది.
  2. స్వేచ్ఛ అంటే ఏ ఒక్క వ్యక్తి లేదా వ్యక్తుల సముదాయపు గుత్తాధికారంగా భావించరాదు.
  3.  ఒకానొక వ్యక్తి స్వేచ్ఛను అనుభవించడమనేది ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉండకూడదనే ఈ సూత్రాన్ని ఆమోదించారు. సమానత్వ సూత్రాన్ని గౌరవించవలసి ఉంటుంది.

దాని అర్థం స్వేచ్ఛా ఫలాలు సమానత్వమనే వృక్షానికి చెందిన శాఖలలో ఉంటాయని పేర్కొనవచ్చు. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వాలు ఒకదానికొకటి పరస్పర పోషకాలుగా భావించడమైంది. సమానత్వ సూత్రం ఆధారంగా స్వేచ్ఛను వర్తింపజేస్తే, స్వేచ్ఛా లక్ష్యం వాస్తవానికి నెరవేరినట్లవుతుంది.

ప్రశ్న 35.
అవకాశాలలో సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
రాజకీయ సమానత్వం: రాజకీయ సమానత్వం అంటే ప్రజలందరికీ సమాన రాజకీయ అవకాశాలు, రాజకీయ పదవులు, రాజకీయ హోదా కలిగి ఉండడం. ప్రతీ పౌరుడు ఓటు వేసే హక్కు, ఎన్నికలలో పోటీ చేసే హక్కు, ప్రభుత్వ ఉద్యోగం పొందే హక్కు, ప్రభుత్వాన్ని సద్విమర్శ చేసే హక్కు మొదలైనవి అనుభవిస్తాడు. శతాబ్దాలుగా ఈ రకమైన సమానత్వం. కొద్దిమందికే పరిమితమై చాలా మందికి నిరాకరించబడింది. రాజకీయ హక్కులు కేవలం భూస్వాములు, పన్ను కట్టేవారు, విద్యావంతులు మొదలైన వారికే ఉండేవి.

ఆధునిక ప్రజాస్వామ్యం 17, 18వ శతాబ్దంలో అవతరించినప్పటికి 20వ శతాబ్దం వరకు స్త్రీలకు కూడా రాజకీయ హక్కులు నిరాకరించబడినవి. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చెయ్యాలంటే పౌరులకు రాజకీయ సమానత్వం తప్పనిసరి. రాజకీయ సమానత్వం అనే భావన ప్రజాస్వామ్యం, సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా వెల్లడవుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 36.
న్యాయాన్ని నిర్వచించండి.
జవాబు.
నిర్వచనాలు :

  1. ప్లేటో : “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”.
  2. అరిస్టాటిల్ : “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
  3. కెఫాలస్ : “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”.

ప్రశ్న 37.
న్యాయం లక్షణాన్ని తెలపండి.
జవాబు.
శాసనం, స్వేచ్ఛ, సమానత్వం భావనలను సమన్వయం చేస్తూ, ఐక్యం చేయటానికే న్యాయం ఉపయోగపడుతుంది. అణగారిన వర్గాల, అసహాయుల అణచివేత, పీడన నుంచి విముక్తి కలిగించటానికే న్యాయం తోడ్పడుతుంది. సమకాలీన ప్రపంచంలో వస్తువులు, సేవలు, అవకాశాలు, లాభాలు, శక్తి, గౌరవం వంటివి న్యాయబద్ధంగా లభించటం అనేది న్యాయం వల్లనే సాధ్యమవుతుంది.

ప్రశ్న 38.
రాజకీయ న్యాయం అంటే ఏమిటి ?
జవాబు.
రాజకీయ న్యాయం (Political Justice) :
రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 39.
సామాజిక న్యాయానికి సంబంధించి నీకేమి తెలుసు ?
జవాబు.
సామాజిక న్యాయం (Social Justice) :
సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది.

చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.

ప్రశ్న 40.
శాసనబద్ధ న్యాయం గురించి తెలపండి.
జవాబు.
శాసనబద్ధ న్యాయం : (Legal Justice) :
రాజ్యం రూపొందించిన శాసనాల ద్వారా శాసనబద్ధ న్యాయం గోచరిస్తుంది. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పార్లమెంట్ చట్టం ద్వారా రూపొందించబడుతుంది. ఇది న్యాయ విస్తరణను నిర్ణయిస్తుంది.

ప్రశ్న 41.
న్యాయ భావనపై ప్లేటో అభిప్రాయం.-
జవాబు.
ఇతరుల కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా ఎవరి పనులు వారే నిర్వహించడం; అదే విధంగా హేతువు, ధీరత్వం, ఇచ్ఛల సమన్వయమే న్యాయం”.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 42.
న్యాయ భావనపై అరిస్టాటిల్ అభిప్రాయం.
జవాబు.
“సమాజంలో ఎవరికి నిర్దేశించిన నైతిక విధులను వారు సక్రమంగా నిర్వహించడమే న్యాయం”.

ప్రశ్న 43.
ప్రక్రియాత్మకమైన న్యాయం గురించి తెలపండి.
జవాబు.
మార్కెట్ ఆర్థిక వ్యవస్థ నియమ, నిబంధనలు మానవుని ప్రవర్తనను నిర్దేశించటానికి నమూనా నిబంధనలుగా ఉంటాయని ప్రక్రియాత్మకమైన న్యాయం పరిగణిస్తుంది. అన్ని రకాల వివక్షతలను వ్యతిరేకిస్తూ, మానవుని మధ్య నైతికతను, సమాన గౌరవాన్ని ప్రక్రియాత్మకమైన న్యాయం అనుమతిస్తుంది. ఎఫ్.ఎ. హాయక్, మిల్టన్ ఫ్రీడ్మన్, నాజిక్ వంటి వారు దీన్ని ప్రతిపాదించిన వారిలో ముఖ్యులు.

ప్రశ్న 44.
స్థిరమైన న్యాయం గురించి తెలపండి.
జవాబు.
స్థిరమైన న్యాయభావన అనేది సామాన్యవాదం ఆలోచనల నుంచి అవతరించింది. సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల జీవన ప్రమాణాల పెంపుదలకు తగిన అవకాశాలు పొందేందుకు స్థిరమైన న్యాయం తోడ్పడుతుంది. ఇందులో వనరుల పంపిణీ అనేది ప్రధానాంశం కాగా ప్రక్రియ అనేది ద్వితీయమైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 45.
శక్తి అంటే ఏమిటి ?
జవాబు.
వ్యక్తి తన కోరికలను తీర్చుకోవటానికి లేదా లక్ష్యాన్ని సాధించటానికి అతనిలోగల నైపుణ్యతను తెలియజేసేదే శక్తి. ఒక వ్యక్తి లేదా సమూహం వేరే వ్యక్తి లేదా సమూహంపై చూపే ప్రభావాన్ని శక్తి తెలుపుతుంది.

రాబర్ట్ ధాల్ అభిప్రాయంలో “శక్తి అనేది ఒక రకమైన ప్రభావం చూపే భావన, అనంగీకారాన్ని అంగీకరించే విధంగా చేయడానికి ఉపకరించేదే శక్తి”.

ప్రశ్న 46.
అధికారం అంటే ఏమిటి ?
జవాబు.
ఇతరులను ఆదేశించేదే అధికారం. ఉన్నత స్థాయి నుంచీ వచ్చే ఆదేశాన్ని దిగువ స్థాయిలో ఆమోదించటాన్ని అధికారం అంటారు. రాజకీయాలలో శక్తిని ప్రదర్శించటానికి అత్యంత ప్రభావవంతమైన సాధనంగా అధికారం వుంటుంది. అధికారం అనే భావన రెండు ప్రధానమైన రూపాలను కలిగి వుంటుంది. అది శక్తి, శాసనబద్ధత.

ప్రశ్న 47.
శాసనబద్ధత అంటే ఏమిటి ?
జవాబు.
ఒక చట్టం శాసనబద్ధత ద్వారా సమాజంలోని వ్యక్తులతోపాటు అందరికీ ప్రయోజనకరంగా ఉన్నప్పుడు వ్యక్తులు ఆ చట్టాలకు ఇష్టపూర్వకంగానే విధేయత చూపుతారు. ఒకవేళ శక్తి అనేది దేనినైన బలవంతంగా అమలుచేయడాన్ని సూచిస్తే, శాసనబద్ధత అనేది ఇష్టపూర్వకంగా ఆమోదించటాన్ని తెలుపుతుంది.

సమాజంలో శక్తి అనేది ఆదేశం, విధేయతలను వ్యక్తపరుస్తుంది. ఒకవేళ ఆదేశం అనేది సరైన ప్రేరణపై ఆధారపడితే, విధేయత అనేది ఇష్టపూర్వకంగా ఉంటుంది. ఈ సందర్భంలో శక్తి అనేది శాసనబద్ధమై వుంటుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 48.
ఏకధృవ ప్రపంచం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రచ్ఛన్న యుద్ధ పరిసమాప్తి తర్వాత అంతర్జాతీయ రాజకీయాలలో అమెరికా ఆధిపత్యాన్ని ఏకధృవ ప్రపంచం అని పేర్కొంటున్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఆర్థిక, సైనిక రంగాలలో అమెరికా ప్రథమ దేశంగా కొనసాగుతున్నది. ప్రచ్ఛన్న యుద్ధం సమాప్తం కావడం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడం, అమెరికా శక్తిని, అధికారాన్ని ఎదుర్కొనే మరొక దేశం లేకపోవడం, అమెరికా సైనిక, ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక రంగాలలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండటం మొదలగు కారణాల వలన అమెరికా అధికారానికి తిరుగులేకుండా ఉంది.

ప్రశ్న 49.
రాజ్యంలో శక్తి యొక్క ప్రాథమిక అంశాలు ఏవి ?
జవాబు.

  1. శక్తి అనేది వ్యక్తుల మధ్య లేదా వ్యక్తి సమూహాల మధ్య ఉండే సంబంధం.
  2. మానవ ప్రవర్తనను అదుపులో పెట్టడానికి ఉండే సంబంధం.
  3. వ్యక్తుల మధ్య లేదా వర్గాల మధ్య ఉండే అంతర్గత బంధం.
  4. సమ్మతి, బలాత్కారం ఉన్న అంతర్గత సంబంధం.
  5. స్వాభావిక గుణదోషరహితమైంది శక్తి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 4 రాజనీతి భావనలు

ప్రశ్న 50.
శక్తికి సంబంధించి శ్రేష్ఠ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు.
జవాబు.
శక్తికి సంబంధించి శ్రేష్ఠవర్గ దృక్కోణం 20వ శతాబ్దం ప్రారంభంలో పరెటో, మోస్కా, మిచెల్స్ అనే ముగ్గురు సామాజిక శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.