TS Inter 1st Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 10th Lesson రాజ్యాంగం Textbook Questions and Answers.

TS Inter 1st Year Political Science Study Material 10th Lesson రాజ్యాంగం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాంగాన్ని నిర్వచించి, రాజ్యాంగం యొక్క లక్షణాలను వివరించండి.
జవాబు.
పరిచయం :
ఆధునిక కాలంలో ప్రతి రాజ్యానికి ఒక రాజ్యాంగముంటుంది. రాజ్యాంగంలో రాజ్యానికి సంబంధించిన అన్ని వ్యవస్థల అధికారాలు, విధులు మొదలైన విషయాలను స్పష్టంగా, నిర్దిష్టంగా, క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు క్రమబద్ధంగా జరగడానికి రాజ్యాంగం చాలా ముఖ్యం.

అర్థం :
Constitution అనే ఇంగ్లీషు పదం “Constitutio” అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో కాన్స్టిట్యూషియో. అంటే “స్థాపించు” అని అర్థం.

నిర్వచనాలు :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

“రాజ్యాంగం మౌలిక లక్షణాలు (Essential features of the Constitution) :
సాధారణంగా రాజ్యాంగాన్ని రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, విషయ నిపుణులు మొదలైనవారు రూపొందిస్తారు. ప్రతి రాజ్యాంగానికి కొన్ని మౌళిక లక్షణాలు ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు :

1. పీఠిక (Preamble) :
ప్రతి రాజ్యాంగం ఒక పీఠికను కలిగి ఉంటుంది. ఆ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలు, ఆకాంక్షలను వ్యక్తీకరిస్తుంది. పీఠిక రాజ్యాంగానికి ఆత్మగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపు ఆవశ్యక లక్షణాలలో పీఠిక అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు.

2. స్పష్టత (Clarity) :
స్పష్టత అనేది రాజ్యాంగపు మరొక ఆవశ్యక లక్షణం. రాజ్యపాలన, ప్రభుత్వ విధానాలను రాజ్యాంగం స్పష్టంగా వివరిస్తుంది. రాజ్యాంగం’ ఎంతో సులభశైలిలో, స్పష్టమైన భాషలో లిఖించబడి ఉంటుంది.

కాబట్టి రాజ్యాంగంలోని వివిధ అంశాలను అర్థం చేసుకోవడంలో ఏ రకమైన సందేహాలకు గానీ, అస్పష్టతకు గానీ అవకాశం ఉండదు. సమాజంలోని అన్ని వర్గాలకు ఎంతగానో సంతృప్తిని కలిగిస్తుంది. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు తరువాతే రాజ్యాంగ రూపకల్పన జరుగుతుంది.

3. ప్రాథమిక హక్కులు (Fundamental Rights) :
ప్రతి రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కులను కలిగి ఉంటుంది. ప్రాథమిక హక్కులనేవి పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పరిరక్షించుటకు ఉద్దేశించినవి. విభిన్న రంగాలలో పౌరులు తమ వ్యక్తిత్వాలను పెంపొందించుకొనేందుకు ఈ హక్కులు వీలు కల్పిస్తాయి. రాజ్యంలో పౌరులు సంతోషకరమైన, గౌరవప్రదమైన జీవనాన్ని గడిపేందుకు ఇవి సహాయపడతాయి.

4. క్లుప్తత (Brevity) :
క్లుప్తత అనేది రాజ్యాంగపు లక్షణాలలో ముఖ్యమైనది. రాజ్యాంగ అంశాలను అర్థం చేసుకోవడంలోను వాటిని వ్యాఖ్యానించడంలోనూ వ్యక్తులలో గందరగోళాన్ని నివారిస్తుంది. రాజ్యాంగంలో అనవసర అంశాలు చేర్చబడవు. కాబట్టి రాజ్యాంగం అనేది క్లుప్తంగా ఉంటుంది. అందులో మితిమీరిన సంఖ్యలో ప్రకరణలు, అధికరణలు, ఇతర నిబంధనలు ఉండవు. రాజ్యాంగంలో లెక్కకు మించిన వివరణలు ఉంటే వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

5. సరళత్వం (Flexibility) :
ప్రజల ఆకాంక్షలను ఎప్పటికప్పుడు గ్రహించి, వాటిని ఆచరణలో పెట్టేందుకు రాజ్యాంగం సరళమైనదిగా ఉండాలి. అవసరమైనప్పుడు రాజ్యాంగంలోని ప్రకరణలను సవరించే వీలు ఉండాలి. అయితే రాజ్యాంగంలోని అంశాలను పలుసార్లు సవరించకూడదు.

అప్పుడే రాజ్యాంగస్ఫూర్తి పదిలంగా ఉంటుంది. ‘ అలాగే ఆధునిక రాజ్యాలలో రాజ్యాంగంలోని అంశాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరించేందుకు అవకాశం ఉండాలి. అనుభవజ్ఞులు, మేధావులు రాజ్యాంగంలోని దోషాలను వెల్లడించినప్పుడు, వాటిని రాజ్యాంగం నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.

6. శాశ్వతత్వం (Permanence) :
రాజ్యాంగం ముఖ్య లక్షణాలలో శాశ్వతత్వం ఒకటి. మొత్తం జాతి సంక్షేమం దృష్ట్యా రాజ్యాంగం సుదీర్ఘకాలంపాటు పనిచేసే విధంగా కొన్ని విలువలు కలిగి ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగమనేది రాజ్యంతో సహా అనేక రాజకీయ సంస్థల నిర్మాణానికి – విధులకు ప్రతీకగా ఉంటుంది. ప్రజల ఆచార సంప్రదాయాలను రాజ్యాంగం గౌరవిస్తూ సామాజిక విలువలతో మమేకమై ఉండాలి.

7. రాజ్యాంగ సవరణ పద్ధతి (Mode of Amendment) :
రాజ్యాంగంలోని అంశాలను సవరించే పద్ధతిని ప్రతి రాజ్యాంగం సూచిస్తుంది. రాజ్యాంగం రాజ్యంలో నెలకొనే సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. రాజ్యాంగ అంశాల సవరణ పద్ధతుల గురించి రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయంలో వివరించటం జరుగుతుంది.

సాధారణంగా రాజ్యాంగ అంశాలను మూడు రకాలుగా సవరించవచ్చు. అవి :

  1. కఠినమైన చర్య పద్ధతి
  2. సరళమైన పద్ధతి
  3. పాక్షిక కఠినమైన, పాక్షిక సరళమైన పద్ధతి.

మొత్తం మీద ప్రతి రాజ్యాంగంలో సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ ఉంటాయి. పర్యవసానంగా రాజ్యంలో ప్రభుత్వం స్థిరత్వం కలిగి ఉంటూ అందరి ఆమోదాన్ని పొందగలుగుతుంది. రాజ్యాంగంలోని సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ రాజకీయ వ్యవస్థ సాఫీగా, సమర్థవంతంగా పనిచేసేటట్లు దోహదపడతాయని అనేక మంది రాజ్యాంగవేత్తలు వర్ణించారు.

8. వివరణాత్మకమైనది (Explanatory):
రాజ్యాంగం వివరణాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదే విధంగా ప్రజలకు, ప్రభుత్వానికి, రాజ్యానికి సంబంధించిన అనేక అంశాలను రాజ్యాంగంలో ప్రస్తావించి చర్చించడమవుతుంది. రాజ్యనిర్మాణం, దాని కార్యకలాపాల పరిధి, విధులకు సంబంధించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పేర్కొనడం జరుగుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 2.
రాజ్యాంగాన్ని నిర్వచించి దృఢ – అదృఢ (సరళ) రాజ్యాంగాల మధ్యగల తేడాలను పేర్కొనండి.
జవాబు.
నిర్వచనం :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

దృఢ రాజ్యాంగం (లేదా) పరుష రాజ్యాంగం :
రాజ్యాంగంలోని అంశాలను అంత సులభంగా సవరించడం సాధ్యంకాని రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. ‘దృఢ రాజ్యాంగం అమలులో ఉన్న రాజ్యాలలో సాధారణ చట్టాల తయారీకి, రాజ్యాంగ చట్టాల రూపకల్పనకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.

దృఢ రాజ్యాంగంలోని ‘అంశాలను సవరించేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. రాజ్యాంగ అంశాల సవరణలో దృఢ రాజ్యాంగం ఎంతో కాఠిన్యతను ప్రదర్శిస్తుంది. దృఢ రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. అమెరికాతో పాటుగా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి రాజ్యాలలో దృఢ రాజ్యాంగాలు వాడుకలో ఉన్నాయి.

సరళ లేదా అదృఢ రాజ్యాంగం :
రాజ్యాంగంలోని అంశాలను అతిసులభంగా మార్చేందుకు అవకాశం ఉన్నట్లయితే దానిని అదృఢ రాజ్యాంగం అంటారు. అదృఢ రాజ్యాంగంలోని అంశాల సవరణకు ప్రత్యేక రాజ్యాంగ సవరణ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం లేదు.

సాధారణ చట్టాల వలె రాజ్యాంగంలోని అంశాలను సైతం సవరించే వీలు ఉంటుంది. అందువల్ల అదృఢ రాజ్యాంగంలో సాధారణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అదృఢ రాజ్యాంగాలనేవి ప్రాచీన కాలంలో వాడుకలో ఉండేవి. అదృఢ రాజ్యాంగానికి బ్రిటన్ మంచి ఉదాహరణ.

సరళ లేదా అదృఢ మరియు దృఢ లేదా పరుష రాజ్యాంగాల మధ్య వ్యత్యాసాలు :

సరళ లేదా అదృఢ రాజ్యాంగం (Flexible constitution) పరుష లేదా దృఢ రాజ్యాంగం (Rigid Constitution)
1. రాజ్యాంగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరగదు. 1. రాజ్యాగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది.
2. రాజ్యాంగాన్ని సులభంగా సవరించవచ్చు. 2. రాజ్యాంగాన్ని సవరించేందుకు కఠినమైన పద్ధతి ఉంటుంది.
3. ప్రజల హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను న్యాయ శాఖ కాపాడగలుగుతుంది. 3. ప్రజల హక్కులు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను న్యాయశాఖ కాపాడలేకపోవచ్చు.
4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది కాదు. 4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది.
5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇవ్వదు. 5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇస్తుంది.
6. ఈ రాజ్యాంగంలో శాసనసభకు అపరిమితమైన అధికారాలు ఉంటాయి. 6. శాసనసభ అధికారాలు పరిమితంగా ఉంటాయి.
7. ఇది మిక్కిలి అస్థిరమైనది. 7. ఇది ఎంతో స్థిరత్వంతో కూడుకొని ఉంటుంది.
8. రాజ్యాంగ చట్టాలకు, సాధారణ చట్టాలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు. 8. రాజ్యాంగ చట్టాలు, సాధారణ చట్టాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
9. రాజ్యంలో ఒకేరకమైన చట్టాలు ఉంటాయి. 9. రాజ్యంలో రెండు రకాల చట్టాలు ఉంటాయి. అవి : 1) రాజ్యాంగ చట్టాలు, 2) సాధారణ చట్టాలు. రాజ్యాంగ చట్టాలు సాధారణ చట్టాలపై ఆధిక్యతను కలిగి ఉంటాయి.
10. రాజకీయ పురోగతి సాధించిన రాజ్యాలకు అదృఢ రాజ్యాంగం అనువైనది. 10. అభివృద్ధి చెందుతున్న రాజ్యాలకు దృఢ రాజ్యాంగం అనువైనది.
11. విప్లవాలకు వీలు కల్పించదు. 11. విప్లవాలకు అవకాశం ఇస్తుంది.
12. చిన్న రాజ్యాలకు తగినది. 12. పెద్ద రాజ్యాలకు సరైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాంగాన్ని నిర్వచించి, దాని లక్షణాలను పేర్కొనండి.
జవాబు.
నిర్వచనాలు :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

రాజ్యాంగం మౌలిక లక్షణాలు (Essential features of the Constitution) :
సాధారణంగా రాజ్యాంగాన్ని రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, విషయ నిపుణులు మొదలైనవారు రూపొందిస్తారు. ప్రతి రాజ్యాంగానికి కొన్ని మౌళిక లక్షణాలు ఉంటాయి. వాటిని క్రింది విధంగా వివరించవచ్చు :

1. పీఠిక (Preamble) :
ప్రతి రాజ్యాంగం ఒక పీఠికను కలిగి ఉంటుంది. ఆ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలు, ఆకాంక్షలను వ్యక్తీకరిస్తుంది. పీఠిక రాజ్యాంగానికి ఆత్మగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపు ఆవశ్యక లక్షణాలలో పీఠిక అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు.

2. స్పష్టత (Clarity) :
స్పష్టత అనేది రాజ్యాంగపు మరొక ఆవశ్యక లక్షణం. రాజ్యపాలన, ప్రభుత్వ విధానాలను రాజ్యాంగం స్పష్టంగా వివరిస్తుంది. రాజ్యాంగం ఎంతో సులభశైలిలో, స్పష్టమైన భాషలో లిఖించబడి ఉంటుంది. కాబట్టి రాజ్యాంగంలోని వివిధ అంశాలను అర్థం చేసుకోవడంలో ఏ రకమైన సందేహాలకు గానీ, అస్పష్టతకు గానీ అవకాశం ఉండదు. సమాజంలోని అన్ని వర్గాలకు ఎంతగానో సంతృప్తిని కలిగిస్తుంది. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తరువాతే రాజ్యాంగ రూపకల్పన జరుగుతుంది.

3. ప్రాథమిక హక్కులు (Fundamental Rights) :
ప్రతి రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కులను కలిగి ఉంటుంది. ప్రాథమిక హక్కులనేవి పౌరుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను పరిరక్షించుటకు ఉద్దేశించినవి. విభిన్న రంగాలలో పౌరులు తమ వ్యక్తిత్వాలను పెంపొందించుకొనేందుకు ఈ హక్కులు వీలు కల్పిస్తాయి. రాజ్యంలో పౌరులు సంతోషకరమైన, | గౌరవప్రదమైన జీవనాన్ని గడిపేందుకు ఇవి సహాయపడతాయి.

4. క్లుప్తత (Brevity) :
క్లుప్తత అనేది రాజ్యాంగపు లక్షణాలలో ముఖ్యమైనది. రాజ్యాంగ అంశాలను అర్థం చేసుకోవడంలోను వాటిని వ్యాఖ్యానించడంలోనూ వ్యక్తులలో గందరగోళాన్ని నివారిస్తుంది. రాజ్యాంగంలో అనవసర అంశాలు చేర్చబడవు. కాబట్టి రాజ్యాంగం అనేది క్లుప్తంగా ఉంటుంది. అందులో మితిమీరిన సంఖ్యలో ప్రకరణలు, అధికరణలు, ఇతర నిబంధనలు ఉండవు. రాజ్యాంగంలో లెక్కకు మించిన వివరణలు ఉంటే వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

5. సరళత్వం (Flexibility):
ప్రజల ఆకాంక్షలను ఎప్పటికప్పుడు గ్రహించి, వాటిని ఆచరణలో పెట్టేందుకు రాజ్యాంగం సరళమైనదిగా ఉండాలి. అవసరమైనప్పుడు రాజ్యాంగంలోని ప్రకరణలను సవరించే వీలు ఉండాలి. అయితే రాజ్యాంగంలోని అంశాలను పలుసార్లు సవరించకూడదు.

అప్పుడే రాజ్యాంగస్ఫూర్తి పదిలంగా ఉంటుంది. అలాగే ఆధునిక రాజ్యాలలో రాజ్యాంగంలోని అంశాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సవరించేందుకు అవకాశం ఉండాలి. అనుభవజ్ఞులు, మేధావులు రాజ్యాంగంలోని దోషాలను వెల్లడించినప్పుడు, వాటిని రాజ్యాంగం నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.

6. శాశ్వతత్వం (Permanence) :
రాజ్యాంగం ముఖ్య లక్షణాలలో శాశ్వతత్వం ఒకటి. మొత్తం జాతి సంక్షేమం దృష్ట్యా రాజ్యాంగం సుదీర్ఘకాలంపాటు పనిచేసే విధంగా కొన్ని విలువలు కలిగి ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగమనేది రాజ్యంతో సహా అనేక రాజకీయ సంస్థల నిర్మాణానికి – విధులకు ప్రతీకగా ఉంటుంది. ప్రజల ఆచార సంప్రదాయాలను రాజ్యాంగం గౌరవిస్తూ సామాజిక విలువలతో మమేకమై ఉండాలి.

7. రాజ్యాంగ సవరణ పద్ధతి (Mode of Amendment) :
రాజ్యాంగంలోని అంశాలను సవరించే పద్ధతిని ప్రతి రాజ్యాంగం సూచిస్తుంది. రాజ్యాంగం రాజ్యంలో నెలకొనే సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. రాజ్యాంగ అంశాల సవరణ పద్ధతుల గురించి రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయంలో వివరించటం జరుగుతుంది. సాధారణంగా రాజ్యాంగ అంశాలను మూడు రకాలుగా సవరించవచ్చు. అవి :

  1. కఠినమైన చర్య పద్ధతి
  2. సరళమైన పద్ధతి
  3. పాక్షిక కఠినమైన, పాక్షిక సరళమైన పద్ధతి.

మొత్తం మీద ప్రతి రాజ్యాంగంలో సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ ఉంటాయి. పర్యవసానంగా రాజ్యంలో ప్రభుత్వం స్థిరత్వం కలిగి ఉంటూ అందరి ఆమోదాన్ని పొందగలుగుతుంది. రాజ్యాంగంలోని సరళమైన, కఠినమైన సవరణ పద్ధతులు రెండూ రాజకీయ వ్యవస్థ సాఫీగా, సమర్థవంతంగా పనిచేసేటట్లు దోహదపడతాయని అనేక మంది రాజ్యాంగవేత్తలు వర్ణించారు.

8. వివరణాత్మకమైనది (Explanatory):
రాజ్యాంగం వివరణాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదే విధంగా ప్రజలకు, ప్రభుత్వానికి, రాజ్యానికి సంబంధించిన అనేక అంశాలను రాజ్యాంగంలో ప్రస్తావించి చర్చించడమవుతుంది. రాజ్యనిర్మాణం, దాని కార్యకలాపాల పరిధి, విధులకు సంబంధించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పేర్కొనడం జరుగుతుంది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 2.
లిఖిత రాజ్యాంగం ప్రయోజనాలు, లోపాలు ఏవి ?
జవాబు.
లిఖిత రాజ్యాంగం (Written Constitution) : లిఖిత రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగ పరిషత్తు లేదా ప్రత్యేక సదస్సు రూపొందిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక నియమ నిబంధనలు ఈ రాజ్యాంగంలో ఉంటాయి. లిఖిత రాజ్యాంగానికి భారత రాజ్యాంగం ఒక చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగాన్ని పరిగణించడమైనది.

ప్రయోజనాలు (Merits) :

  1. లిఖిత రాజ్యాంగం మిక్కిలి సులభమైనది. రాజ్యంలోని వివిధ సంస్థల నిర్మాణ, నిర్వహణలను అవగాహన చేసుకోవడంలో లిఖిత రాజ్యాంగం ‘ఏ విధమైన గందరగోళానికి, అస్పష్టతలకు అవకాశం ఇవ్వదు.
  2. లిఖిత రాజ్యాంగం కొంతమేరకు కఠిన స్వభావాన్ని కలిగి ఉంటుంది. దాంతో అది రాజకీయ స్థిరత్వాన్ని అందించగలుగుతుంది.
  3. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతుంది.
  4. కేంద్ర, రాష్ట్రాల మధ్య న్యాయమైన రీతిలో అధికారాల పంపిణి ద్వారా సమతౌల్యతను పాటిస్తుంది..
  5. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది. ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వానికి గుర్తుచేస్తుంది.
  6. ప్రభుత్వ అధికారాలపై కొన్ని పరిమితులను విధిస్తుంది.
  7. సమాఖ్యవ్యవస్థ పవిత్రతను, స్ఫూర్తిని కాపాడుతుంది.

లోపాలు (Demerits) :

  1. లిఖిత రాజ్యాంగం మెరుగైన ప్రభుత్వాన్ని అందించలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలపై ఆ రాజ్యాంగం అనేక ఆంక్షలను విధిస్తుంది..
  2. లిఖిత రాజ్యాంగపు కఠిన స్వభావం రాజ్యం అభివృద్ధికి దోహదపడదు.
  3. ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా ఆ రాజ్యాంగంలోని అంశాలను సవరించడం సాధ్యం కాదు. దాంతో జాతి పురోగతి మందకొడిగా సాగుతుంది.
  4.  న్యాయశాఖ ఆధిపత్యానికి లిఖిత రాజ్యాంగం అవకాశం ఇస్తుంది.
  5. ప్రభుత్వాంగాల మధ్య ఘర్షణలకు వీలు కల్పిస్తుంది.
  6. సంక్షేమ రాజ్యస్థాపనకు అనుకూలం కాదు.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 3.
అలిఖిత రాజ్యాంగం ప్రయోజనాలు, లోపాలను తెలపండి.
జవాబు.
అలిఖిత రాజ్యాంగం (Unwritten Constitution) :
అలిఖిత రాజ్యాంగం అనేది ప్రత్యేక రాతప్రతిలో పేర్కొనబడని రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగం అనేక ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా ఏర్పడినది. వీటినే శాసనాలకు ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇటువంటి రాజ్యాంగం అత్యంత ప్రాచీనమైన, చట్టబద్దమైన పాలనకు అవకాశం కల్పిస్తుందని పలువురు భావించారు.

18వ శతాబ్దం వరకు ప్రపంచంలో అనేక రాజ్యాలలో రాజ్యాంగబద్ధమైన పాలనకు ఇటువంటి రాజ్యాంగాలు ఆధారంగా ఉంటూ వచ్చాయి. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో శాసనబద్ధమైన పాలనకు ఈ రాజ్యాంగాలు వీలు కల్పించాయి.

బ్రిటన్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణ. బ్రిటన్లో చట్టాలన్నీ ఆచారాలు, సంప్రదాయాలు, వాడుకలు, అలవాట్ల ఆధారంగా రూపొందించబడ్డాయి.

ప్రయోజనాలు (Merits) :

  1. ప్రగతిశీలక శాసన నిర్మాణానికి అలిఖిత రాజ్యాంగం దోహదపడుతుంది. ఇటువంటి రాజ్యాంగం అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది.
  2. అలిఖిత రాజ్యాంగం కాలానుగుణంగా సంభవించిన పరిణామాలకు ప్రతీకగా మార్పు చెందుతూ ఉంటుంది. రాజకీయ వ్యవస్థను ఉత్తమమైందిగా తీర్చిదిద్దేందుకు వీలు కల్పిస్తుంది.
  3. అలిఖిత రాజ్యాంగంలోని అంశాలు వ్యాకోచ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఈ రాజ్యాంగంలో మార్పులను సులభంగా ప్రవేశపెట్టవచ్చు.
  4. ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగంలోని అంశాలను సవరించుకొనే వీలుంటుంది.
  5. అలిఖిత రాజ్యాంగం అవాంఛనీయమైన విప్లవాలు, ఇతర ఆందోళనలకు అవకాశం ఇవ్వదు. ప్రజల డిమాండ్లను పరిష్కరించే వీలు ఈ రాజ్యాంగం కల్పిస్తుంది.

లోపాలు (Demerits) :

  1. అలిఖిత రాజ్యాంగంలోని అంశాలను అధికారంలో ఉన్న పార్టీ స్వీయ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తరచుగా సవరించే అవకాశం ఉంటుంది. దాంతో రాజ్యంలో రాజకీయ సుస్థిరతకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది.
  2. అలిఖిత రాజ్యాంగం న్యాయమూర్తుల చేతిలో ఆటబొమ్మగా మారే అవకాశాలు ఎక్కువ. న్యాయమూర్తులు యధేచ్ఛగా రాజ్యాంగంలోని అంశాలను వ్యాఖ్యానించే అవకాశం ఉంటుంది.
  3. ప్రజాస్వామ్య రాజ్యాలకు అలిఖిత రాజ్యాంగం అనుకూలమైనది కాదు.
  4. సమాఖ్య రాజ్యాలకు ఇటువంటి రాజ్యాంగం సరిపోదు.
  5. ప్రజల హక్కులు, స్వాతంత్ర్యాలకు అలిఖిత రాజ్యాంగం రక్షణ కల్పించడంలో విఫలమవుతుంది.
  6. రాజ్యాంగంలోని అంశాలు తరచుగా సవరణలకు లోనవుతాయి.
  7. అలిఖిత రాజ్యాంగం మిక్కిలి లాంఛనప్రాయమైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 4.
లిఖిత, అలిఖిత రాజ్యాంగాల మధ్య తేడాలను తెలపండి.
జవాబు.
లిఖిత రాజ్యాంగం :
లిఖిత రాజ్యాంగాన్ని ఒక రాజ్యాంగ పరిషత్తు లేదా ప్రత్యేక సదస్సు రూపొందిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక నియమ నిబంధనలు ఈ రాజ్యాంగంలో ఉంటాయి. లిఖిత రాజ్యాంగానికి భారత రాజ్యాంగం ఒక చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగాన్ని పరిగణించడమైనది.

అలిఖిత రాజ్యాంగం :
అలిఖిత రాజ్యాంగం అనేది ప్రత్యేక రాతప్రతిలో పేర్కొనబడని రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగం అనేక ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా ఏర్పడినది. వీటినే శాసనాలకు ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇటువంటి రాజ్యాంగం అత్యంత ప్రాచీనమైన, చట్టబద్ధమైన పాలనకు అవకాశం కల్పిస్తుందని పలువురు భావించారు.

18వ శతాబ్దం వరకు ప్రపంచంలో అనేక రాజ్యాలలో రాజ్యాంగబద్ధమైన పాలనకు ఇటువంటి రాజ్యాంగాలు ఆధారంగా ఉంటూ వచ్చాయి. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో శాసనబద్ధమైన పాలనకు ఈ రాజ్యాంగాలు వీలు కల్పించాయి.

లిఖిత, అలిఖిత రాజ్యాంగాల మధ్య కింద పేర్కొన్న వ్యత్యాసాలను ప్రతి ఒక్కరు అత్యంత సులభంగా గుర్తించవచ్చు.

లిఖిత రాజ్యాంగం (Written Constitution) అలిఖిత రాజ్యాంగం (Unwritten Constitution)
1. లిఖిత రాజ్యాంగం అనేది ఒక రాత ప్రతి లేదా కొన్ని నిర్ణీత రాతప్రతులతో రాయబడి ఉంటుంది. ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను ఈ రాజ్యాంగం నియంత్రించేందుకు కొన్ని నియమ నిబంధనలను సూచిస్తుంది. 1. అలిఖిత రాజ్యాంగం అనేది అనేక ఆచారాలు, సంప్రదాయాలు, వేడుకలు, అలవాట్ల సమాహారం. ఈ రాజ్యాంగంలోని అంశాలు క్రమబద్ధంగా ఒకచోట రాయబడి ఉండవు.
2. రాజ్యానికి సంబంధించిన అన్ని ప్రధాన అంశాలు స్పష్టంగా రాయబడి ఉంటాయి. 2. రాజ్యానికి సంబంధించిన అంశాలన్నీ ఆచార సంప్రదాయాలు, వాడుకల రూపంలో ఉంటాయి.
3. లిఖిత రాజ్యాంగాన్ని నిర్దిష్ట సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటైన శాసనసభ రూపొందించి ఆమోదిస్తుంది. 3. అలిఖిత రాజ్యాంగంలోని అంశాలు నిర్దిష్ట సమయంలో రూపొందినవి కావు. అవి కాలాను గుణంగా శాసనాల రూపంలో, ముఖ్యమైన నిబంధనల (Charters) ద్వారా వివిధ కాలాలలో అమల్లోకి వస్తాయి.
4. లిఖిత రాజ్యాంగాన్ని సులభంగా సవరించడం సాధ్యం కాదు. 4. అలిఖిత రాజ్యాంగాన్ని సవరించడం ఎంతో సులభం.
5. లిఖిత రాజ్యాంగంలో ఉదహరించబడిన పౌరులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను న్యాయస్థానాలు పరిరక్షిస్తాయి. 5. అలిఖిత రాజ్యాంగాన్ని పౌరుల ప్రాథమిక హక్కులను న్యాయస్థానాలు సులభమైన రీతిలో కాపాడలేవు.
6. లిఖిత రాజ్యాంగం ఒక నిర్ణీత కాలంలో రూపొందించబడింది. 6. అలిఖిత రాజ్యాంగం మారుతూ ఉంటుంది.
7. లిఖిత రాజ్యాంగం రాజకీయ సుస్థిరతను ఏర్పరుస్తుంది. 7. అలిఖిత రాజ్యాంగం రాజకీయ స్థిరత్వాన్ని అందించకపోవచ్చు.
8. విద్యావంతులు, అక్షరాస్యులు అధికంగా ఉన్న రాజ్యాలకు లిఖిత రాజ్యాంగం సరైంది. 8. నిరక్షరాస్యులు, విద్యావంతులైన ప్రజలకు అలిఖిత రాజ్యాంగం సరైనది.
9. లిఖిత రాజ్యాంగం సమాఖ్య రాజ్యాలకు తగినది. 9. అలిఖిత రాజ్యాంగం ఏకకేంద్ర రాజ్యాలకు సరైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 5.
దృఢ, అదృఢ (సరళ) రాజ్యాంగాల మధ్య తేడాలను తెలపండి.
జవాబు.
నిర్వచనం :

  1. అరిస్టాటిల్ : “రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా అన్నింటిని క్రమబద్ధంగా ఏర్పాటు చేసేదే “రాజ్యాంగం”.
  2. లార్డ్ బ్రైస్ : “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం”.
  3. స్టీఫెన్ లీకాక్ : “రాజ్యాంగం అంటే ప్రభుత్వరూపం”.

దృఢ రాజ్యాంగం (లేదా) పరుష రాజ్యాంగం :
రాజ్యాంగంలోని అంశాలను అంత సులభంగా సవరించడం సాధ్యంకాని రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. దృఢ రాజ్యాంగం అమలులో ఉన్న రాజ్యాలలో సాధారణ చట్టాల తయారీకి, రాజ్యాంగ చట్టాల రూపకల్పనకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. దృఢ రాజ్యాంగంలోని అంశాలను సవరించేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. రాజ్యాంగ అంశాల సవరణలో దృఢ రాజ్యాంగం

ఎంతో కాఠిన్యతను ప్రదర్శిస్తుంది. దృఢ రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. అమెరికాతో పాటుగా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి రాజ్యాలలో దృఢ రాజ్యాంగాలు వాడుకలో ఉన్నాయి.

సరళ లేదా అదృఢ రాజ్యాంగం:
రాజ్యాంగంలోని అంశాలను అతిసులభంగా మార్చేందుకు అవకాశం ఉన్నట్లయితే దానిని అదృఢ రాజ్యాంగం అంటారు. అదృఢ రాజ్యాంగంలోని అంశాల సవరణకు ప్రత్యేక రాజ్యాంగ సవరణ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం లేదు.

సాధారణ చట్టాల వలె రాజ్యాంగంలోని అంశాలను సైతం సవరించే వీలు ఉంటుంది. అందువల్ల అదృఢ రాజ్యాంగంలో సాధారణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అదృఢ రాజ్యాంగాలనేవి ప్రాచీన కాలంలో వాడుకలో ఉండేవి. అదృఢ రాజ్యాంగానికి బ్రిటన్ మంచి ఉదాహరణ.

సరళ లేదా అదృఢ మరియు దృఢ లేదా పరుష రాజ్యాంగాల మధ్య వ్యత్యాసాలు :

సరళ లేదా అదృఢ రాజ్యాంగం (Flexible constitution) పరుష లేదా దృఢ రాజ్యాంగం (Rigid Constitution)
1. రాజ్యాంగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరగదు. 1. రాజ్యాగంలోని అంశాలు స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది.
2. రాజ్యాంగాన్ని సులభంగా సవరించవచ్చు. 2. రాజ్యాంగాన్ని సవరించేందుకు కఠినమైన పద్ధతి ఉంటుంది.
3. ప్రజల హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను న్యాయ శాఖ కాపాడగలుగుతుంది. 3. ప్రజల హక్కులు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను న్యాయశాఖ కాపాడలేకపోవచ్చు.
4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది కాదు. 4. ఇది సమాఖ్య రాజ్యానికి సరైనది.
5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇవ్వదు. 5. ఇది న్యాయసమీక్షకు అవకాశం ఇస్తుంది.
6. ఈ రాజ్యాంగంలో శాసనసభకు అపరిమితమైన అధికారాలు ఉంటాయి. 6. శాసనసభ అధికారాలు పరిమితంగా ఉంటాయి.
7. ఇది మిక్కిలి అస్థిరమైనది. 7. ఇది ఎంతో స్థిరత్వంతో కూడుకొని ఉంటుంది.
8. రాజ్యాంగ చట్టాలకు, సాధారణ చట్టాలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండదు. 8. రాజ్యాంగ చట్టాలు, సాధారణ చట్టాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
9. రాజ్యంలో ఒకేరకమైన చట్టాలు ఉంటాయి. 9. రాజ్యంలో రెండు రకాల చట్టాలు ఉంటాయి. అవి : 1) రాజ్యాంగ చట్టాలు, 2) సాధారణ చట్టాలు. రాజ్యాంగ చట్టాలు సాధారణ చట్టాలపై ఆధిక్యతను కలిగి ఉంటాయి.
10. రాజకీయ పురోగతి సాధించిన రాజ్యాలకు అదృఢ రాజ్యాంగం అనువైనది. 10. అభివృద్ధి చెందుతున్న రాజ్యాలకు దృఢ రాజ్యాంగం అనువైనది.
11. విప్లవాలకు వీలు కల్పించదు. 11. విప్లవాలకు అవకాశం ఇస్తుంది.
12. చిన్న రాజ్యాలకు తగినది. 12. పెద్ద రాజ్యాలకు సరైనది.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే కొన్ని నిర్దిష్ట నియమాల సముదాయాన్ని రాజ్యాంగం అని అంటారు. రాజ్యం, ప్రభుత్వాల అధికారాలు, విధులకు రాజ్యాంగం ముఖ్య ప్రాతిపదికగా ఉంటుంది.

అదే విధంగా పౌరుల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన ప్రధాన ప్రామాణికతకు నిదర్శనం రాజ్యాంగమే. అందుకనే “ప్రభుత్వం పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం” అని లార్డ్ బ్రైస్ పేర్కొన్నాడు.

ప్రశ్న 2.
అలిఖిత రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
అలిఖిత రాజ్యాంగం అంటే రాజ్యాంగ నియమాలన్నింటినీ ఒక రాతప్రతిలో పొందుపరచని రాజ్యాంగం. అనేక ఆచార, సంప్రదాయాలు శాసనాల రూపంలో పొందుపరచినదాన్నే అలిఖిత రాజ్యాంగంగా పేర్కొంటారు. అలిఖిత రాజ్యాంగానికి ఖచ్చితమైన ఉదాహరణ బ్రిటన్ రాజ్యాంగం. ఆచార సంప్రదాయాలు, బ్రిటీష్ పార్లమెంట్ రూపొందించిన సాధారణ శాసనాలే ఆ దేశంలో రాజ్యాంగ శాసనాలుగా పని చేస్తాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 3.
లిఖిత రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
లిఖిత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ గానీ లేదా ప్రత్యేక రాజ్యాంగ సదస్సుగాని రూపొందిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక నియమ, నిబంధనలు లిఖిత పత్రం రూపంలో పొందుపరచబడి ఉంటాయి. భారత రాజ్యాంగాన్ని లిఖిత పూర్వక రాజ్యాంగానికి ముఖ్యమైన ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం 1789లో ఆమోదించబడిన అమెరికా రాజ్యాంగం. అమెరికా, భారత రాజ్యాంగాలను ప్రస్తుత ప్రపంచంలో ‘లిఖిత రాజ్యాంగాలకు చక్కని ఉదాహరణగా పేర్కొనవచ్చు.

ప్రశ్న 4.
సరళ రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
రాజ్యాంగంలోని అంశాలను అతి సులభంగా మార్చేందుకు అవకాశం ఉన్నట్లయితే దానిని అదృఢ లేదా సరళ రాజ్యాంగం అంటారు. సరళ రాజ్యాంగంలోని అంశాల సవరణకు ప్రత్యేక రాజ్యాంగ సవరణ పద్ధతిని అనుసరించాల్సిన అవసరం లేదు.

సాధారణ చట్టాలవలె రాజ్యాంగంలోని అంశాలను సైతం సవరించే వీలుంటుంది. అందువలన సరళ రాజ్యాంగంలో సాధారణ చట్టాలు, రాజ్యాంగ చట్టాల మధ్య ఎటువంటి వ్యత్యాసం వుండదు. సరళ రాజ్యాంగాలనేవి ప్రాచీన కాలంలో వాడుకలో ఉండేవి. అదృఢ లేదా సరళ రాజ్యాంగానికి బ్రిటన్ మంచి ఉదాహరణ.

ప్రశ్న 5.
దృఢ రాజ్యాంగం అంటే ఏమిటి ?
జవాబు.
రాజ్యాంగంలోని అంశాలను అంత సులభంగా సవరించడం సాధ్యం కాని రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. దృఢ రాజ్యాంగం అమలులో వున్న రాజ్యాలలో సాధారణ చిట్టాల తయారీకి, రాజ్యాంగ చట్టాల రూపకల్పనకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.

దృఢ రాజ్యాంగంలోని అంశాలను సవరించేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. రాజ్యాంగ అంశాల సవరణలో దృఢ రాజ్యాంగం ఎంతో కాఠిన్యతను ప్రదర్శిస్తుంది. దృఢ రాజ్యాంగానికి అత్యుత్తమ ఉదాహరణగా అమెరికా రాజ్యాంగాన్ని పేర్కొనవచ్చు. అమెరికాతో పాటుగా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ వంటి రాజ్యాలలో దృఢ రాజ్యాంగాలు వాడుకలో ఉన్నాయి.

TS Board Inter First Year Political Science Study Material Chapter 10 రాజ్యాంగం

ప్రశ్న 6.
రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి ?
జవాబు.
ప్రతి రాజ్యాంగం ఒక ప్రవేశిక లేదా పీఠికను కలిగి ఉంటుంది. ఆ ప్రవేశిక రాజ్యాంగ లక్ష్యాలు, ఆకాంక్షలను వ్యక్తీకరిస్తుంది. ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగపు ఆవశ్యక లక్షణాలలో ప్రవేశిక అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించవచ్చు. ఉదాహరణకు భారత రాజ్యాంగంలోని ప్రవేశిక భారతదేశాన్ని ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొంది.

Leave a Comment