Telangana TSBIE TS Inter 1st Year Political Science Study Material 4th Lesson రాజనీతి భావనలు Textbook Questions and Answers.
TS Inter 1st Year Political Science Study Material 4th Lesson రాజనీతి భావనలు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
శాసనాన్ని నిర్వచించి, దాని ముఖ్య ఆధారాలను వివరించండి.
జవాబు.
పరిచయం : రాజనీతిశాస్త్ర అధ్యయనంలో చట్టం అనేది ఒక ముఖ్యమైన భావన.
రాజ్యం శాసనాల ద్వారా ప్రజలను పరిపాలిస్తుంది. శాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్య సార్వ భౌమాధికారం శాసనాల ద్వారా వ్యక్తమవుతుంది. రాజ్యం ఆశించే సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులు శాసనం ద్వారానే సాధించగలదు. మానవుని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమాలే శాసనాలు. వ్యక్తులు రాజ్యంలో చేయవలసినవి, చేయకూడనివి శాసనం చెబుతుంది. ప్రభుత్వంలోని శాసనశాఖ శాసనాలు చేస్తుంది.
అర్థం :
శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.
నిర్వచనాలు :
- “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.
- “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
- న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.
శాసనానికి ఆధారాలు :
హాలండ్ అనే రచయిత సంప్రదాయాలు, మతము, ధర్మబద్ధత (సమత), న్యాయమూర్తుల తీర్పులు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, శాసనశాఖ అనేవి శాసనాలకు ఆధారాలని చెప్పాడు. శాసనాలు వివిధ రంగాలలో క్రమంగా రూపొందుతాయి. అనేక అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పిన శాసనాల ఆధారాలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.
1. ఆచార, సంప్రదాయాలు, వాడుకలు (Customs) :
ఇవి శాసనానికి తొలి ఆధారాలు. ప్రజల ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలు శాసనాలకు మూలాధారము. సంప్రదాయాలు సంఘంలో ఒక అలవాటుగా, క్రమంగా రూపొందుతాయి. పూర్వం సంప్రదాయాలే సమాజ జీవితాన్ని క్రమబద్ధం చేసేవి. రాజ వీటిని గుర్తించి, వాటిని ఆధారం చేసుకొని కొన్ని శాసనాలను రూపొందిస్తుంది.
రాజకీయ ఆచారాలు కూడా రాజ్యంచే గుర్తించబడి అమలు చేయబడితే అవి శాసనాలవుతాయి. బ్రిటన్లో ‘సామాన్య న్యాయం’ సంప్రదాయబద్ధమైన శాసనానికి ఉదాహరణ. అదే విధంగా భారతదేశంలో వివాహ చట్టాలు, ఆస్తి పంపిణీ చట్టాలు మొదలగునవి సంప్రదాయాల ఆధారంగా చేయబడ్డాయి.
2. మతం (Religion) :
ఆచారానికి మతం సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే వ్యవస్థ. సంఘ జీవితం మత నియమాలకు అనుగుణంగా జరుపుకుంటారు. పూర్వం మతాధిపతులు చెప్పే నియమాలు శాసనాల వలె చెలామణి అయ్యేవి. ఆధునిక కాలంలో కూడా శాసనాలు చేయడానికి మతం ఒక ఆధారం. వారసత్వం, వివాహం, కుటుంబ ఆస్తి మొదలైన వాటి శాసనాలు మతం ఆధారంగా చేయబడ్డాయి.
హిందువులు, క్రైస్తవులు, ముస్లిములకు గల శాసనాలు వారి మతాల ఆధారంగా రూపొందాయి. ఇరాన్, పాకిస్థాన్ వంటి మత ప్రమేయ దేశాలలో సంఘ జీవనానికి మత నియమాలే ఆధారం.
3. న్యాయస్థానాల తీర్పులు (Judicial Decisions) :
న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు శాసన నిర్మాణానికి ఆధారాలు. న్యాయస్థానాలు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఈ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు క్రొత్త న్యాయ సూత్రాలను సృష్టిస్తారు. ఈ తీర్పులు అదే విధమైన వివాదాలు తలెత్తినప్పుడు న్యాయసూత్రాల వలె వర్తింపచేస్తారు. నేడు న్యాయమూర్తుల నిర్ణయాలు శాసనాలలో అంతర్భాగమవుతున్నాయి.
ఉదా : భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్ కేసు.
4. శాస్త్రీయ వ్యాఖ్యానాలు (Scientific commentories) :
ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, రచయితలు, విమర్శకులు చేసే వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారమవుతాయి. ఇవి న్యాయస్థానాలలో న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు, వివరణలు, శాసనాలు చేయటానికి ప్రభుత్వానికి ఉపయోగపడతాయి.
న్యాయమూర్తుల నిర్ణయాలు, తీర్పులు, భవిష్యత్లో శాసన నిర్మాణానికి తోడ్పడతాయి. ఇంగ్లండ్లో కోక్, బ్లాక్టన్, అమెరికాలో స్టోరీ, కెంట్, భారతదేశంలో విజ్ఞానేశ్వర, అపరార్క వంటి వారి వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారాలు.
5. సమత లేదా సమబద్ధత (Equity) :
‘సమత’ అనే పదానికి నిష్పక్షపాతం, న్యాయంలాంటి సూత్రాలను పర్యాయపదాలుగా వాడుతున్నారు. సమత అంటే సహజన్యాయం. అమలులో ఉన్న చట్టాలు వివాదాల పరిష్కారానికి సరిపడని సందర్భాలలో న్యాయమూర్తులు తమ విజ్ఞతతో, సక్రమ అవగాహన ద్వారా వివాదాల పరిష్కారంలో కక్షిదారులకు న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నిస్తారు. సమత అనేది సహజన్యాయ భావన ద్వారా రూపొందింది. దానినే న్యాయమూర్తులచే నిర్మితమైన చట్టాలుగా పరిగణించడమైంది.
ఈ సందర్భంలో హెన్రీమెయిన్ అనే పండితుడు సహజన్యాయం గురించి ప్రస్తావిస్తూ అది కొన్ని ప్రత్యేక సూత్రాల ఆధారంగా రూపొంది పౌరన్యాయంతో కూడిన నియమాల సముదాయంగా పేర్కొన్నాడు. పౌరన్యాయం కంటే సమత అనేది ఉన్నతమైనది. సమదృక్పథం, సహజన్యాయం లాంటి సూత్రాల ఆధారంగా పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలను రూపొందించే సాంప్రదాయకమైన పద్ధతికి సమత సంకేతంగా ఉంటుంది.
6. శాసనసభ (Legislature) :
ప్రజాస్వామ్యంలో శాసన నిర్మాణశాఖ చట్టం ఆధారాలలో ముఖ్యమైనదిగా భావిస్తారు. ప్రభుత్వ సంస్థలలో ఒకటైన శాసనసభ చట్టాలను ఆమోదిస్తుంది. అందుచేత శాసననిర్మాణ శాఖను చట్టం ఆధారాలలో ప్రత్యక్షమైన అంశంగా గుర్తించడమైంది.
ఆధునిక కాలంలో చట్టాల రూపకల్పనలో శాసనసభలు ప్రముఖమైనవిగా భావించడమైంది. చట్ట నిర్మాణంలో శాసనసభలు సాధారణ ప్రజానీకం ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటాయి. శాసనసభలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.
ప్రశ్న 2.
శాసనం అంటే ఏమిటి ? శాసన లక్షణాలను చర్చించండి.
జవాబు.
ఆధునిక రాజ్య వ్యవస్థలో శాసనాలకు లేదా చట్టాలకు అత్యంత ప్రాముఖ్యత వుంది. రాజ్యం శాసనాలు రూపొందించడం, అమలుపరచడం ద్వారా తన సార్వభౌమాధికారాన్ని వ్యక్తం చేస్తుంది. శాసనం అనేది రాజ్యానికి సంబంధించిన విశిష్ట లక్షణం.
రాజ్యంలోని వివిధ సంస్థల మధ్య, వ్యక్తుల మధ్య, సంస్థలు – వ్యక్తుల మధ్య సంబంధాలను శాసనాల ద్వారా రాజ్యం క్రమబద్ధం చేస్తుంది. రాజ్య లక్ష్యాలు, విధానాలు శాసనాల ద్వారానే సాధించడానికి వీలవుతుంది. రాజ్యంలోని వ్యక్తులు ఏమి చేయ్యాలి ? ఏమి చేయకూడదు ? అని నిర్దేశించేది శాసనం. రాజనీతి శాస్త్రంలోను, న్యాయశాస్త్రంలోను శాసనానికి విస్తృతమైన అర్థం వుంది.
అర్థం – నిర్వచనం :
చట్టాన్ని లేదా శాసనాన్ని ఆంగ్లంలో లా (Law) అంటారు. ఈ పదానికి లాగ్ (Lag) అనే పురాతన ట్యుటానిక్ పదం మూలం ‘లాగ్’ అంటే స్థిరమైంది అని అర్థం. చట్టబద్ధమైన, అధికారిక వ్యవస్థ రూపొందించి, అమలుపరచే స్థిరమైన నియమాలను, నిబంధనలను శాసనంగా చెప్పవచ్చు. రాజనీతి శాస్త్రజ్ఞులు శాసనాన్ని రకరకాలుగా నిర్వచించారు. కొన్ని నిర్వచనాలను కింద ఇవ్వడమైంది.
జాన్ ఎరిక్ సన్ : “ప్రజల జీవన విధానాన్ని నిర్దేశించి దానికి వారు విధేయులై వుండాలని శాసిస్తూ సార్వభౌమాధికారి జారీ చేసే ఆజ్ఞే న్యాయ శాసనం”.
టీ.ఇ. హాలండ్ : “మానవుని బాహ్యప్రవర్తనను క్రమబద్ధం చేయడానికి రాజ్యం అధికారికంగా అమలుచేసే నియమావళే శాసనం”.
జాన్ సాల్మండ్ : “న్యాయ పాలన కోసం రాజ్యం గుర్తించి, అమలుపరిచే నియమాల సముదాయమే శాసనం”.
జాన్ ఆస్టిన్ : “సార్వభౌమాధికారి ఆదేశమే శాసనం”.
శాసనం – లక్షణాలు :
పైన పేర్కొన్న నిర్వచాలను బట్టి శాసనానికి క్రింది లక్షణాలు ఉంటాయని చెప్పవచ్చు.
- రాజ్యం ఆశయాలను అభీష్టాలను శాసనాలు వ్యక్తీకరిస్తాయి.
- శాసనాలను ఉల్లంఘించే ప్రజలను దండించే అధికారం రాజ్యానికి వుంది.
- శాసనాలు లిఖితరూపంలో ఉంటాయి.
- మానవుని బాహ్య ప్రవర్తనను శాసనాలు నియంత్రిస్తాయి. మానవుని అంతరాత్మను శాసనాలు నియంత్రించవు.
- శాసనాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. శాసనాల అమల్లో రాజ్యం ప్రజల మధ్య విచక్షణ చూపదు.
- శాసనాలు క్లుప్తంగా, స్పష్టంగా ఉంటాయి.
- శాసనాలను రాజ్యం తనకున్న సార్వభౌమాధికారం ద్వారా అమలు పరుస్తుంది.
- శాసనాలు సంఘ సంక్షేమానికి సాధనాలు.
- శాసనాలు సామాజిక అవసరాలకు అనుగుణంగా మారుతుంటాయి.
ప్రశ్న 3.
న్యాయం రకాలను తెలపండి.
జవాబు.
పరిచయం :
రాజనీతిశాస్త్ర అధ్యయనంలో న్యాయం ఒక ముఖ్యమైన భావన. సమకాలీన సమాజంలో దాదాపు ప్రపంచ రాజ్యాలన్నీ. తమ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాల వైరుధ్యాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో న్యాయం చేకూర్చి కొనసాగేందుకు కృషి చేస్తున్నాయి.
అర్థం : న్యాయం (Justice) అనే ఇంగ్లీష్ పదం “జస్” (Jus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో “జస్” అంటే “బంధించి ఉండటం” లేదా “కలిపి ఉంచడం” అని అర్థం.
నిర్వచనాలు :
- ప్లేటో : “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”.
- అరిస్టాటిల్ : “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
- కెఫాలస్ : “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”.
న్యాయం రకాలు (Types of Justice) :
న్యాయం అనేక రకాలుగా ఉంటుంది. ఇది సహజవాబు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, చట్టబద్ధమైన పార్శాలకు సంబంధించినది. న్యాయభావనలోని వివిధ రకాలను గురించి క్రింద వివరించడం
జరిగింది.
1. సహజ న్యాయం (Natural Justice) :
ప్రపంచంలో లభించే సహజ వనరులను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవచ్చుననే సూత్రం ఆధారంగా ప్రతిపాదించబడినదే సహజ న్యాయం. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ సహజ వనరులు జీవన ఆధారంగా ఉంటాయి. మానవులు ఒక్కరే హేతుబద్ధమైన జీవనం గడపటం వల్ల, సహజ వనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ సందర్భంలో మానవులు భవిష్యతరాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.
2. సామాజిక న్యాయం (Social Justice) :
సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది.
చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.
3. రాజకీయ న్యాయం (Political Justice) :
రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.
- సమన్యాయ పాలన
- స్వతంత్ర న్యాయశాఖ
- ప్రాతినిధ్య సంస్థలకు ఎన్నికలు
- రాజకీయ పార్టీలు
- పత్రికా స్వాతంత్య్రం
- ప్రజాస్వామ్య పాలన మొదలైనవి.
4. ఆర్థిక న్యాయం (Economic Justice) :
వ్యక్తుల మధ్య నిర్హేతుకమైన, ప్రకృతి విరుద్ధమైన వ్యత్యాసాలు లేని పరిస్థితినే ఆర్థికన్యాయంగా పేర్కొనవచ్చు. ఆదాయం, ద్రవ్యం, సంపద, ఆస్తివంటి వ్యత్యాసాలు లేకుండా వ్యక్తులందరికీ సమానమైన ఆదరణ కల్పించేందుకు ఆర్థికన్యాయం ఉద్దేశించింది.
సానుకూల దృష్టిలో ఆర్థిక న్యాయం అనేది శ్రామికులకు చాలినంత వేతనాలను చెల్లించేందుకు దోహదపడుతుంది. సంపద, ఆదాయంలో విపరీతమైన అంతరాలను తొలగించేందుకు కృషి చేస్తుంది.
బడుగు బలహీనవర్గాలు దోపిడీకి గురికావడాన్ని ఎట్టి పరిస్థితులలో ఈ న్యాయం అనుమతించదు. ప్రతి ఒక్కరూ కనీస ప్రాథమికావసరాలను పొందేందుకు ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడు, గుడ్డ, వసతి వంటి ప్రాథమిక అవసరాలు కలిగి ఉండేందుకు చర్యలు తీసుకొంటుంది.
సమాజంలో న్యాయబద్ధమైన ఆర్థిక వ్యవస్థాపనకు తోడ్పడుతుంది. “ప్రతి ఒక్కరూ వారి సామర్థ్యాన్ని బట్టి ఉపాధి పొందడం, అవసరాన్ని బట్టి ఆర్థిక వనరులను వినియోగించుకోవడం” అనే భావనను ఆర్థికన్యాయం బలపరుస్తుంది.
5. చట్టబద్ధమైన న్యాయం (Legal Justice) :
చట్టబద్ధమైన న్యాయం అనేది రాజ్యాంగ శాసనాల ద్వారా వెల్లడి అవుతుంది. సమాజంలో ఎంతోకాలంగా ప్రాచుర్యంలో ఉన్న ఆచార సంప్రదాయాలతో ఈ రకమైన న్యాయం సంబంధాన్ని కలిగి ఉంటుంది. రాజ్యంలోని రాజ్యాంగం, ఇతర శాసనచట్టాల రూపంలో అది వ్యక్తమవుతుంది. న్యాయం చట్టబద్ధమైన పరిమితులను నిర్ణయిస్తుంది. చట్టబద్ధమైన న్యాయంలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి :
1. సమాజంలో చట్టాలన్నీ సమన్యాయ పాలన సూత్రంపై ఆధారపడి రూపొందితమై, అమలులో ఉంటాయి.
2. చట్టాలన్నీ సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా రూపొందుతాయి. మొత్తం సమాజ సంక్షేమాన్ని చట్టాలు ఆకాంక్షిస్తాయి. అయితే చట్టబద్ధమైన న్యాయం అనేది పూర్తిగా న్యాయంగా పరిగణితం కాదు. ఈ సందర్భంలో న్యాయం అంటే చట్టం అని ఎర్నస్ట్ బార్కర్ పేర్కొన్నాడు.
చట్టబద్ధమైన న్యాయం అనేది న్యాయాన్ని ప్రసాదించేందుకు ఉద్దేశించిందని కొందరు పేర్కొన్నారు. మొత్తం మీద చట్టం అనేది న్యాయానికి కొంతమేరకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మరికొందరు భావించారు.
ప్రశ్న 4.
స్వేచ్ఛను నిర్వచించండి. వివిధ రకాల స్వేచ్ఛలను తెలపండి.
జవాబు.
పరిచయం :
స్వేచ్ఛ అనేది రాజనీతిశాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.
అర్థం :
స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.
నిర్వచనాలు :
- హెచ్.జె. లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
- మాంటెస్క్యూ : “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ”.
- జె.ఆర్. సీలీ : “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ”.
స్వేచ్ఛ రకములు : స్వేచ్ఛ ఐదు రకాలు. అవి
- సహజ స్వేచ్ఛ
- పౌర స్వేచ్ఛ
- ఆర్థిక స్వేచ్ఛ
- రాజకీయ స్వేచ్ఛ.
- జాతీయ స్వేచ్ఛ.
వీటిని గురించి ఈ కింద పేర్కొన్న విధంగా విపులీకరించవచ్చు.
1. సహజ స్వేచ్ఛ (Natural Liberty) :
సహజ స్వేచ్ఛ అనేది ఎటువంటి ఆంక్ష లేకుండా ఏదైనా చేయడాన్ని సూచిస్తుంది. ఇది ఎలాంటి జోక్యానికి లేదా నిర్భంధాలకు తావివ్వదు. వ్యక్తులు తమ ఇచ్ఛానుసారం చేయదలచినదాన్ని సుసాధ్యం చేస్తుంది. అయితే, నిర్నిబంధమైన స్వేచ్ఛ వ్యక్తుల స్వేచ్ఛలను హరిస్తుంది.
నేటి సమాజంలో సహజ స్వేచ్ఛ అనేది కనిపించదు. ఇది అన్యాయం అరాచకత్వాలకు పర్యాయపదమైనది. సహజ స్వేచ్ఛగల చోట స్వాతంత్ర్యం మృగ్యమవుతుంది. ఆదిలో రోమన్ రాజనీతి తత్త్వవేత్తలు ఈ భావనను సమర్థించారు. ఎటువంటి అవధుల్లేని ప్రాకృతిక వ్యవస్థలోని మానవులు అపరిమితమైన స్వేచ్ఛను అనుభవించారన్నారు. అటువంటి స్వేచ్ఛ – రాజ్యం, సమాజాల ఆవిర్భావానికి ముందు మాత్రమే ఉనికిలో ఉండేది.
2. పౌర స్వేచ్ఛ (Civil Liberty) :
పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్య్రాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు.
- సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం
- ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం
- నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్య్రం. పౌరస్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది.
సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.
“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు.
పౌరస్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి
- జీవించే హక్కు
- పనిచేసే హక్కు
- ఆస్తిహక్కు
- వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.
3. ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty) :
ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతి ఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే ఆర్థికస్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరుద్యోగం – అసంపూర్ణతల నుంచి విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.
ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.
- కనీస వేతనాలను అందించడం.
- పనిహక్కుకు భరోసా కల్పించడం.
- నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం.
- తగినంత విశ్రాంతిని కల్పించడం.
- పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.
4. రాజకీయ స్వేచ్ఛ (Political Liberty) :
రాజకీయ స్వేచ్ఛ పౌరులు రాజకీయాంశాలలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛ పౌరులకు రాజ్య కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే శక్తినిస్తుందని లాస్కీ పరిగణించాడు. రాజకీయ స్వేచ్ఛను ప్రజాస్వామ్యానికి పర్యాయపదంగా గిల్ క్రిస్ట్ భావించాడు. రాజకీయ స్వేచ్ఛ అంటే ఎవరికి వారు తమ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకొనే రాజ్యాంగ స్వేచ్ఛగా లీకాక్ వర్ణించాడు. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు మాత్రమే పరిమితమైంది.
అది సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు రాజకీయాంశాలలో వివిధ హక్కులను కల్పిస్తుంది. అటువంటి వాటిలో i) ఓటు వేసే హక్కు ii) ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేసే హక్కు iii) ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు iv) విమర్శించే హక్కువంటివి ఉన్నాయి. విద్య, నిజాయితీ, నిష్పక్షపాతమైన పత్రికలు మొదలైనవి ఉన్నప్పుడే రాజకీయ స్వేచ్ఛ వాస్తవం అవుతుందని లాస్కీ నొక్కి చెప్పాడు.
5. జాతీయ స్వేచ్ఛ (National Liberty) :
జాతీయ స్వేచ్ఛ అంటే రాజ్యం – స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. రాజ్యపు సార్వభౌమత్వాన్ని అది సూచిస్తుంది. ప్రతి రాజ్యం ఈ స్వేచ్ఛను అనుభవిస్తూ ఇతర రాజ్యాల ఆధిపత్యానికి లోనుకాకుండా ఉంటుంది. అన్ని రంగాలలో జాతి అభివృద్ధికి ఈ స్వేచ్ఛ ఆవశ్యకమైంది. ప్రాచీన కాలం నుంచి అనేక దేశాల్లో ఇది విశదమైంది.
ఈ రకమైన స్వేచ్ఛను పొందడం కోసం అనేక దేశాలు ఎంతగానో ప్రయత్నించాయి. గతంలో టర్కీ ప్రజలకు వ్యతిరేకంగా గ్రీకులు స్వాతంత్య్ర సమరం సాగించారు. అట్లాగే మహాత్మాగాంధీ నాయకత్వంలో భారత ప్రజలు బ్రిటీష్ పాలన నుంచి స్వాతంత్య్రం కోసం అహింసాయుత పోరాటం చేశారు. జాతీయ స్వేచ్ఛ ఎంతో విలువైంది.
ప్రశ్న 5.
స్వేచ్ఛ అంటే ఏమిటి ? స్వేచ్ఛ పరిరక్షణలను వివరించండి.
జవాబు.
పరిచయం :
స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతిశాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.
అర్థం : స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.
నిర్వచనాలు :
- హెచ్.జె.లాస్కీ : “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
- మాంటెస్క్యూ : “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్చ”.
- జె.ఆర్. సీలీ : “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ”.
స్వేచ్ఛ సంరక్షణలు (లేదా) పరిరక్షణ మార్గాలు :
స్వేచ్ఛ అనేది మానవుల పాలిట అత్యంత విలువైన ఆదర్శం. కాబట్టి దానిని సమాజవాబు. రాజ్య విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పరిరక్షించుకోవాలి. ఈ సందర్భంగా స్వేచ్ఛ పరిరక్షణలో కిందివాటిని పేర్కొనవచ్చు.
1. ప్రజాస్వామ్య వ్యవస్థ (Democratic Rule) :
ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రభుత్వం. ఎన్నికైన ప్రతినిధులు ప్రజల స్వేచ్ఛను నిరంతరం కాపాడుతుంటారు. కేవలం ప్రజాస్వామ్య సంస్థలు మాత్రమే స్వేచ్ఛను పరిరక్షించగలవు.
2. లిఖిత మరియు దృఢ రాజ్యాంగం (Written and Rigid Constitution) :
వ్యక్తి స్వేచ్ఛకు లిఖిత, దృఢ రాజ్యాంగాన్ని వేరొక ముఖ్య లక్షణంగా భావించవచ్చు. ఇటువంటి రాజ్యాంగం అనేక నిబంధనలలో వ్యక్తి స్వాతంత్ర్యాలను పేర్కొంటుంది. ప్రజల స్వేచ్ఛ, హక్కులకు అది రక్షకురాలిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వాంగాల చర్యలకు అది హద్దులను ఏర్పరుస్తుంది.
ప్రభుత్వాధికారులు లేదా మరెవరి చేతనైనా ప్రజల స్వాతంత్ర్యాలు ఉల్లంఘించబడినప్పుడు చేపట్టవలసిన వివిధ చర్యలను వివరిస్తుంది. తమ సంకుచిత ప్రయోజనాల కోసం రాజ్యాంగంలోని అంశాలను సవరించేందుకు ప్రయత్నించే పార్టీలపై ఆంక్షలను విధిస్తుంది.
3. స్వతంత్ర న్యాయవ్యవస్థ (Independent Judiciary) :
పౌరుల స్వేచ్ఛా పరిరక్షణకు స్వయం ప్రతిపత్తి ఉన్న నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ తప్పనిసరి. దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయస్థానాలు ఉన్నప్పుడే అవి శాసనసభ చేయగల ప్రజావ్యతిరేక చట్టాలను, కార్యనిర్వాహకశాఖ అమలుపరచగల ప్రజావ్యతిరేక విధానాలను ఆపగలవు.
4. సమన్యాయపాలన (Rule of Law) :
స్వేచ్ఛకున్న వేరొక పరిరక్షణయే సమన్యాయపాలన. బ్రిటన్, ఇండియా, అమెరికా సంయుక్తరాష్ట్రాలు వంటి అనేక దేశాల్లో ఇది అమలులో ఉంది. వ్యక్తుల స్వేచ్ఛలను సమన్యాయపాలన మూడు విధాలుగా పరిరక్షిస్తుంది. అవి (i) ఇది వ్యక్తులందరినీ సమానంగా చూస్తుంది. (ii) రాజ్యమంతటా. ఒకే విధమైన చట్టాలు అమలయ్యేటట్లు చేస్తుంది. (iii) కార్యనిర్వాహకవర్గపు నిరంకుశాధికారాలపైన తగిన ఆంక్షలను విధిస్తుంది.
5. ప్రాథమిక హక్కులు (Fundamental Rights) :
ప్రాథమిక హక్కులనేవి వ్యక్తి స్వేచ్ఛలను చాలావరకు పరిరక్షిస్తాయి. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఎటువంటి ఆంక్షలు లేకుండా. ప్రజలు స్వేచ్ఛలను పొందుతారు. పౌరులలో నిబిడీకృతమైన నైపుణ్యాలను అభివృద్ధిపరచుటకు, విభిన్న రంగాలలో వారు తమ ప్రతిభను చాటుకొనేందుకు ప్రాథమిక హక్కులు దోహదపడతాయి.
6. ఆర్థిక సమానత్వం (Economic Equality) :
వ్యక్తుల స్వేచ్ఛా పరిరక్షణలో ఆర్థిక సమానత్వం కూడా ప్రధానమైంది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం వంటి దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు వ్యక్తులకు చాలినన్ని అవకాశాలను కల్పించాలనే భావన ఇందులో ఇమిడి ఉంది. ఆర్థిక సమానత్వం నెలకొన్నప్పుడే స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ఆర్థిక సమానత్వంలో ఆర్థిక న్యాయం అంతర్భాగంగా ఉంటుంది. దీనిని రాజ్యం ప్రసాదిస్తుంది.
7. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers) :
అధికారాలు వికేంద్రీకరణ ద్వారా స్వేచ్ఛను మెరుగైన రీతిలో పరిరక్షించవచ్చు. ప్రభుత్వాధికారాల కేంద్రీకరణ నుంచి దేశానికి విముక్తి కలిగినప్పుడే వ్యక్తులు స్వేచ్ఛను అనుభవించగలరు. కేంద్రం రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల మధ్య అధికారాలను కేటాయించినప్పుడు నిరంకుశత్వానికి, వ్యక్తి స్వేచ్ఛల హరింపునకు తావుండదు లేనిచో రాజ్యాంగంలో పొందుపరచిన ‘ హక్కులను అనుభవించటమన్నది ప్రజలకు కష్టమవుతుంది.
8. పత్రికా స్వాతంత్ర్యం (Independent Press) :
ప్రజాస్వామ్యాన్ని కొందరు వ్యక్తి స్వేచ్ఛా పరిరక్షణ కవచంగా భావించారు. తమ పనితీరులో చాలినంత స్వతంత్ర ప్రతిపత్తిని పత్రికలు, ఇతర మాధ్యమాలు కలిగి ఉన్నప్పుడే వ్యక్తులు స్వేచ్ఛలను అనుభవించగలరు. ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచి, సంఘటితపరచి, వ్యక్తీకరించడంలో పత్రికలు ముఖ్యమైన వాహకంగా వ్యవహరిస్తాయి. అవి తమ నిష్పాక్షిక సంపాదకీయాలు, సత్య సమ్మతమైన వార్తలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తి స్వేచ్ఛలను పరిరక్షించగలుగుతాయి.
9. బలమైన ప్రతిపక్షం (Strong Opposition) :
వ్యక్తి స్వేచ్ఛను పెంపొందించేందుకు బలమైన ప్రతిపక్షం అవసరమవుతుంది. ఒకవిధంగా వ్యక్తి స్వేచ్ఛకు ప్రతిపక్షం కాపలాదారుడిగా పనిచేస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వంలో ఉన్నత స్థానంలోని వ్యక్తులు నిరంకుశ చట్టాల అమలు ద్వారా సామాన్యుల స్వేచ్ఛలకు హద్దులు గీసి హరించి వేసినపుడు, ప్రతిపక్షం అట్టి చర్యలను తీవ్రంగా అడ్డుకుంటుంది. అంతిమంగా, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వ్యక్తుల స్వేచ్ఛలను కాపాడుతుంది.
10. ప్రజల అప్రమత్తత (People vigilance) :
స్వేచ్ఛకు అన్నింటికన్నా ముఖ్యమైంది ప్రజల అప్రమత్తత. స్వేచ్ఛ పరిరక్షణకు ప్రజలు నిరంతరం అప్రమత్తతతో ఉండాలి. తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పరిరక్షించుకోవాలనే ఆకాంక్ష, స్ఫూర్తి, పట్టుదల పౌరస్వేచ్ఛకు శక్తివంతమైన రక్షణ కవచంగా పనిచేస్తాయి.
ప్రశ్న 6.
సమానత్వాన్ని నిర్వచించండి. వివిధ రకాల సమానత్వాలను తెలపండి.
జవాబు.
సమానత్వం ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే
- ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం
- శాసనాలు పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం
- చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.
నిర్వచనం :
“సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాశాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు.
అందరికీ సమాన ఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అంతా సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.
సమానత్వం – రకాలు : సమానత్వం ప్రధానంగా ఐదు రకాలు. అవి 1) సహజ సమానత్వం 2) సాంఘిక సమానత్వం 3) ఆర్థిక సమానత్వం 4) రాజకీయ సమానత్వం 5) అంతర్జాతీయ సమానత్వం. వీటిని గురించి ఈ కింద పేర్కొన్న విధంగా విపులీకరించవచ్చు.
1. సహజ సమానత్వం (Natural Equality) :
సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తిపరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది.
పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.
2. సాంఘిక సమానత్వం (Social Equality) :
వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.
ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్పృశ్యతను అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు. ఈ సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.
- రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
- విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి.
- సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
- రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
- తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
- కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.
3. ఆర్థిక సమానత్వం (Economic Equality) :
ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు.
ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి-ఆదాయాలకు సంబంధించిన అంశం. ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషుల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్స్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.
4. రాజకీయ సమానత్వం (Political Equality):
రాజకీయ సమానత్వం రాజకీయ కార్యకలాపాలలో ప్రజలకు చాలినన్ని అవకాశాలను కల్పించేందుకు అనుకూల పరిస్థితులను సూచిస్తుంది. రాజ్యంలోని పౌరులకు వివిధ రకాల రాజకీయ హక్కులను ప్రసాదించడం ద్వారా ఆ రకమైన సమానత్వాన్ని సాధించవచ్చు. ఈ సందర్భంలో రాజకీయ సమానత్వాన్ని పౌరులు మాత్రమే అనుభవిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యంలో నివసించే అన్యులు, విదేశీయులకు ఇది వర్తించదు.
ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ సమానత్వమన్నది అత్యంత ఆవశ్యకమైంది. వివిధ రాజకీయ హక్కులను ప్రసాదించినప్పుడే పౌరులు రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే, రాజకీయ సమానత్వమనేది రాజకీయ స్వేచ్ఛకు పర్యాయపదంగా భావించవచ్చు.
5. అంతర్జాతీయ సమానత్వం (International Equality) :
అంతర్జాతీయ సమానత్వమంటే భౌగోళిక, ఆర్థిక లేదా సైనికపరమైన అంశాలతో నిమిత్తం లేకుండా అన్ని రాజ్యాలనూ సమానంగా చూడటంగా పేర్కొనవచ్చును. ఈ విధమైన సమానత్వం ద్వారా ప్రపంచంలోని చిన్న, పెద్ద రాజ్యాలన్నీ సమానమవుతాయి. ఉదాహరణకు ఐక్యరాజ్యసమితి తన చార్టర్లో అన్ని రాజ్యాలకు సమానమైన గౌరవం, హోదాలను కల్పించింది.
అంతర్జాతీయ సమానత్వం మానవీయ లక్షణాలను ప్రతిబింబిస్తుంది. రాజ్యాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలను శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని నొక్కిచెబుతుంది. అంతర్జాతీయ న్యాయానికి గౌరవం లోపించినప్పుడు మూడో ప్రపంచ యుద్ధం సంభవించవచ్చని కొందరు హెచ్చరించారు.
ప్రశ్న 7.
సమానత్వం అంటే ఏమిటి ? దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
సమానత్వం, అసమానత్వం అనే రాజనీతి భావనలు అరిస్టాటిల్ కాలం నుంచే ఉన్నాయి. విప్లవానికి గల కారణాలలో అసమానత్వం ఒకటని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. 18వ శతాబ్దం వరకు అసమానతలు అనేవి సహజమని ప్రకృతి పరంగా వారసత్వంగా వచ్చినవనే భావనలో ఉండేవారు.
ఆధునిక కాలంలో 17వ శతాబ్దం మొదట్లో సహజ సమానత్వం, సహజన్యాయం, అనే భావనల మూలాలు హాబ్స్, లాక్, రూసోల సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలలో ఉన్నాయి. సమానత్వం అనే భావన ఆధునిక సామాజిక ఉద్యమాలకు, విప్లవాలకు ప్రేరణగా నిలిచింది.
మార్క్సిస్టుల దృష్టిలో సమానత్వం అంటే మానవుల మధ్య సమానత్వం. సమానత్వం అనే సూత్రం ప్రస్తుతం అన్ని ఆధునిక రాజ్యాంగాలలోను, మానవహక్కుల ప్రకటనలోను సాధారణ సూత్రావళిగా ఆమోదించబడింది.
ఒక విధంగా చెప్పాలంటే అమెరికా, ఫ్రెంచి విప్లవాల నుంచి ఆధునిక కాలం వరకు సమానత్వం అనే భావన ప్రముఖ స్థానం వహించింది. ఆధునిక సమాజంలో ఈ భావన అసమానతలను తొలగించి సామాజిక స్పృహను ప్రయత్నం చేసింది. సమానత్వ భావన సమాజంలో కొద్దిమంది మాత్రమే అపరిమిత సంపాదనను కలిగి ఉండడాన్ని, అపరిమిత అధికారం, హెూదా కలిగి ఉండడాన్ని నిరోధించి, దోపిడికి గురైన వారికి వీటిని పంచేలా చేసింది.
ఎ. సమానత్వం అర్థం :
సమానత్వం అనే భావన సమాన హక్కులు, సమాన అవకాశాలు అనే అంశాన్ని సూచిస్తుంది.
- హెరాల్డస్కీ తన “ఏ గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్” అనే గ్రంథంలో సమానత్వం అనేది ప్రాథమికంగా సమానత్వం సాధించే ప్రక్రియగా పేర్కొన్నాడు.
- బార్కర్ అభిప్రాయంలో “సమానత్వం అంటే కొందరికి ప్రత్యేక హక్కులు, ప్రత్యేక సౌకర్యాలు అనే దాన్ని నిషేధించి అందరికీ సమానహక్కులు కల్పించడం”గా భావించాడు.
బి. సమానత్వం లక్షణాలు :
1. సమానత్వం హక్కులను సాధించడం:
సమానత్వం అనేది సూచనాత్మకమైనదే కాని వివరణాత్మకమైనది కాదు. మానవులంతా తప్పకుండా సమానులే అని మనం భావిస్తాం. కాని అది వాస్తవం కాదు. సమాజంలో సాంఘిక ప్రయోజనాలను విస్తృతం చేసి వాటి ఫలాలను పేద వారికి అందించడం.
2. సమానత్వం ఆధునిక భావన :
మానవ జీవిత చరిత్రలో సంపదలో వ్యత్యాసాలు, అధికారంలో వ్యత్యాసాలు, గౌరవ ప్రతిష్ఠలలో వ్యత్యాసాలు అనేవి దాదాపు ప్రపంచమంతా కనిపిస్తాయి. శాస్త్రీయ యుగ ఆరంభంలో మానవుడు తన హేతుబద్ధమైన అనుభవపూర్వక జ్ఞానంతో ప్రకృతి వైపరీత్యాన్ని నియంత్రించడం నేర్చుకున్నాడు. ఈ పరిజ్ఞానం, ఆలోచన సమాజంలో ఉన్న సాంఘిక అసమానతలు సహజం కాదని, అసమానతలు తొలగించవచ్చనే ఆలోచనకు దారి తీసింది.
3. సామాజిక మార్పుకు సమానత్వం :
శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన ప్రగతి ఎక్కువ ప్రాంతాలలో సహజ అసమానత్వాన్ని ప్రత్యామ్నాయంగా పెంచిపోషించింది. ఆరోగ్యం, శారీరక పటిష్టత అనేది సరైన పౌష్టికాహారం వల్ల, మానసిక పరిపక్వత అనేది సరైన విద్య, రక్షణ ద్వారా సాధించవచ్చని మనకు తెలుసు. కాని ఈ ప్రయోజనాల లభ్యత అనేది వ్యక్తుల వ్యక్తిగత సాంఘిక, ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంది.
4. సామాజిక న్యాయం, స్వేచ్ఛ :
సామాజిక న్యాయ సాధనకు సమానత్వం అత్యవసరం. సమానత్వం, స్వేచ్ఛకు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. నిజం చెప్పాలంటే స్వేచ్ఛ లేనిదే సమానత్వం లేదు. సమానత్వం లేకుండా స్వేచ్ఛ వ్యర్థం.
5. సామాజిక ప్రత్యేకత ప్రజాప్రయోజనంపై ఆధారపడుతుంది :
సమాజంలో బుద్ధిబలం గల వారు సహజంగా మిగిలిన వారిని పీడించే తత్వాన్ని కలిగి ఉంటారు. అధికారం, శ్రామికుల విభజన అనేది హేతుబద్ధంగా ఉంటే అసమానత్వం అనేది ఆక్షేపణ కాదు. సమాజంలో సాధారణ ప్రయోజనం దృష్ట్యా అధికార వ్యవస్థ నిర్వహించే కార్యం చాలా కాలంగా ప్రత్యేక అంశంగా గుర్తించబడలేదు.
6. సమానత్వం సంపూర్ణ సమానత్వాన్ని సూచించదు :
దీని అర్థం అవకాశాలలో సమానత్వం. సామాజిక అసమ నతలలో ఆశించిన మేరకు తగ్గుదల ఉండాలని సమానత్వాన్ని కోరుకుంటుంది. వ్యక్తిగత నైపుణ్యాలు, హెూఒ పురోగతికి సమాన అవకాశాలను సూచిస్తుంది. దీని అర్థం ఫలితాల్లో సమానత్వం కాదు.
ప్రశ్న 8.
సమానత్వం సంబంధించి ఏవైనా మూడు రకాలను తెలపండి.
జవాబు.
సమానత్వంకి ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే
- ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం
- శాసనాలు పాలనలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం
- చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.
నిర్వచనం :
“సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాశాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు.
అందరికీ సమాన ఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అంతా సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.
1. సహజ సమానత్వం (Natural Equality) :
సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్య్రాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తి పరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది.
పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.
2. సాంఘిక సమానత్వం (Social Equality) :
వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.
ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్పృశ్యతను ‘అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు.
ఈ సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.
- రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
- విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి.
- సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
- రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
- తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
- కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.పేర్కొనవచ్చు.
3. ఆర్థిక సమానత్వం (Economic Equality) :
ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది.
ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయ ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి – ఆదాయాలకు సం ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్త స్త్రీ, పురుషల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్స్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.
ప్రశ్న 9.
సమానత్వం మూలం మరియు ప్రాధాన్యతను తెలపండి.
జవాబు.
‘సమానత్వం’ అనే పదం సాధారణంగా మానవులందరూ సమానులే కాబట్టి అందరికీ ఒకే విధమైన ఆదరణ, గుర్తింపు, సంపద ఉండాలనే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. ప్రతి మానవునికి సహజ సిద్ధంగానే సమానత్వ వాంఛ ఉంటుంది. అయితే సమానత్వం అనే పదానికి శాస్త్రీయమైన అర్థాన్ని 1789లో ఫ్రాన్స్ దేశపు జాతీయసభ ఆమోదించిన మానవ హక్కుల ప్రకటనలో వివరించటం జరిగింది.
“మానవులందరూ స్వేచ్ఛా సమానత్వాలతో జన్మించి వాటితోనే జీవితాంతం కొనసాగుతాడ అని ప్రకటించబడింది. “ప్రజలందరూ సృష్టిరీత్యా సమానులే అనే సత్యాన్ని మేము స్పష్టపరచిన దానిగా భావిస్తాం అని 1776లో వెలువడిన అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలో కూడా అనే భావం స్ఫురించే విధంగా వివరించారు.
అంటే సమానత్వం మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదన్న మాట. ఆ పంధాలోనే “స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదత్రయం ఫ్రెంచ్’ విప్లవాన్ని ఎంతగానో ఉత్తేజితపరచింది. 1917లో రష్యన్ భూమిపై ప్రజ్వరిల్లిన కమ్యూనిస్ట్ విప్లవం ఆర్థిక సమానత్వాన్ని సాధించి ఉద్భవించింది.
సమానత్వం ప్రాధాన్యత :
- వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది : వ్యక్తి వికాసానికి సమానత్వం అవసరం. మానవుని అభివృద్ధికి కావలసిన పరిస్థితులను సమానత్వం ఉన్న చోట పొందవచ్చు.
- ప్రతిభను గుర్తిస్తుంది : సమానత్వం ఉన్న చోట అన్ని వర్గాల ప్రజలు సమానావకాశాలు పొందుతారు. పేదరికం, వెనుకబాటుతనం వంటివి ప్రతిభను నిరూపించుకోవడానికి ఆటంకాలు కావు.
- స్వేచ్ఛను పెంపొందిస్తుంది : స్వేచ్ఛ, సమానత్వాలు పరస్పర పోషకాలు సమానత్వం స్వేచ్ఛను పెంపొందిస్తుంది.
- ప్రజాస్వామ్య విజయము : సమానత్వం ప్రజారాజ్య ఆదర్శం అదిలేనిదే ప్రజాస్వామ్యం విజయవంతం కాదు. ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమానత్వాలు పౌరులకు లభించాలి.
- ప్రతిష్ట పెంచుతుంది : వ్యక్తులంతా సమాన హోదా కలిగి, సాంఘికముగా ప్రతిష్ట పొందుతారు. రాజకీయ సమానత్వం వెనుకబడిన వర్గాల స్థాయిని పెంచింది.
- సాంఘిక న్యాయం : సమానత్వం సాంఘిక న్యాయాన్నిస్తుంది. అంటరానితనం, వెట్టిచాకిరి వంటి సాంఘిక దురాచారాలు రూపుమాపుతుంది.
ప్రశ్న 10.
న్యాయన్ని నిర్వచించండి. దానిలోని రకాలను తెలపండి.
జవాబు.
పరిచయం :
రాజనీతిశాస్త్ర అధ్యయనంలో న్యాయం ఒక ముఖ్యమైన భావన. సమకాలీన సమాజంలో దాదాపు ప్రపంచ, రాజ్యాలన్నీ తమ రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాల వైరుధ్యాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో న్యాయం చేకూర్చి కొనసాగేందుకు కృషి చేస్తున్నాయి.
అర్థం :
న్యాయం (Justice) అనే ఇంగ్లీష్ పదం “జస్” (Jus) అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో “జస్” అంటే “బంధించి ఉండటం” లేదా “కలిపి ఉంచడం” అని అర్థం.
నిర్వచనాలు :
- ప్లేటో : “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”.
- అరిస్టాటిల్ : “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
- కెఫాలస్ : “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”.
న్యాయం రకాలు (Types of. Justice) :
న్యాయం అనేక రకాలుగా ఉంటుంది. ఇది సహజవాబు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, చట్టబద్ధమైన పార్శాలకు సంబంధించినది. న్యాయభావనలోని వివిధ రకాలను గురించి క్రింద వివరించడం జరిగింది.
1. సహజ న్యాయం (Natural Justice) :
ప్రపంచంలో లభించే సహజ వనరులను ప్రతి ఒక్కరూ వినియోగించు కోవచ్చుననే సూత్రం ఆధారంగా ప్రతిపాదించబడినదే సహజ న్యాయం. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ సహజ వనరులు జీవన ఆధారంగా ఉంటాయి.
మానవులు ఒక్కరే హేతుబద్ధమైన జీవనం గడపటం వల్ల, సహజ వనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ సందర్భంలో మానవులు భవిష్యతరాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.
2. సామాజిక న్యాయం (Social Justice) :
సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది.
చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.
3. రాజకీయ న్యాయం (Political Justice) :
రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది.
ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.
- సమన్యాయ పాలన
- స్వతంత్ర న్యాయశాఖ
- ప్రాతినిధ్య సంస్థలకు ఎన్నికలు
- రాజకీయ పార్టీలు
- పత్రికా స్వాతంత్ర్యం
- ప్రజాస్వామ్య పాలన మొదలైనవి.
4. ఆర్థిక న్యాయం (Economic Justice) :
వ్యక్తుల మధ్య నిర్హేతుకమైన, ప్రకృతి విరుద్ధమైన వ్యత్యాసాలు లేని పరిస్థితినే ఆర్థికన్యాయంగా పేర్కొనవచ్చు. ఆదాయం, ద్రవ్యం, సంపద, ఆస్తివంటి వ్యత్యాసాలు లేకుండా వ్యక్తులందరికీ సమానమైన ఆదరణ కల్పించేందుకు ఆర్థికన్యాయం ఉద్దేశించింది. సానుకూల దృష్టిలో ఆర్థిక న్యాయం అనేది శ్రామికులకు చాలినంత వేతనాలను చెల్లించేందుకు దోహదపడుతుంది. సంపద, ఆదాయంలో విపరీతమైన అంతరాలను తొలగించేందుకు కృషి చేస్తుంది.
బడుగు బలహీనవర్గాలు దోపిడీకి గురికావడాన్ని ఎట్టి పరిస్థితులలో ఈ న్యాయం అనుమతించదు. ప్రతి ఒక్కరూ కనీస ప్రాథమికావసరాలను పొందేందుకు ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడు, గుడ్డ, వసతి వంటి ప్రాథమిక అవసరాలు కలిగి ఉండేందుకు చర్యలు తీసుకొంటుంది. సమాజంలో న్యాయబద్ధమైన ఆర్థిక వ్యవస్థాపనకు తోడ్పడుతుంది. “ప్రతి ఒక్కరూ వారి సామర్థ్యాన్ని బట్టి ఉపాధి పొందడం, అవసరాన్ని బట్టి ఆర్థిక వనరులను వినియోగించుకోవడం” అనే భావనను ఆర్థికన్యాయం బలపరుస్తుంది.
5) చట్టబద్ధమైన న్యాయం (Legal Justice) :
చట్టబద్ధమైన న్యాయం అనేది రాజ్యాంగ శాసనాల ద్వారా వెల్లడి అవుతుంది. సమాజంలో ఎంతోకాలంగా ప్రాచుర్యంలో ఉన్న ఆచార సంప్రదాయాలతో ఈ రకమైన న్యాయం సంబంధాన్ని కలిగి ఉంటుంది. రాజ్యంలోని రాజ్యాంగం, ఇతర శాసనచట్టాల రూపంలో అది వ్యక్తమవుతుంది.
న్యాయం చట్టబద్ధమైన పరిమితులను నిర్ణయిస్తుంది. చట్టబద్ధమైన న్యాయంలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి : 1. సమాజంలో చట్టాలన్నీ సమన్యాయ పాలన సూత్రంపై ఆధారపడి రూపొందితమై, అమలులో ఉంటాయి. 2. చట్టాలన్నీ సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా రూపొందుతాయి. మొత్తం సమాజ సంక్షేమాన్ని చట్టాలు ఆకాంక్షిస్తాయి.
అయితే చట్టబద్ధమైన న్యాయం అనేది పూర్తిగా న్యాయంగా పరిగణితం కాదు. ఈ సందర్భంలో న్యాయం అంటే చట్టం అని ఎర్నస్ట్ బార్కర్ పేర్కొన్నాడు. చట్టబద్ధమైన న్యాయం అనేది న్యాయాన్ని ప్రసాదించేందుకు ఉద్దేశించిందని కొందరు పేర్కొన్నారు. మొత్తం మీద చట్టం అనేది న్యాయానికి కొంతమేరకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మరికొందరు భావించారు.
ప్రశ్న 11.
న్యాయం అంటే ఏమిటి ? వివిధ రకాల న్యాయభావనలను తెలపండి.
జవాబు.
న్యాయం అనే పదాన్ని ఆంగ్లంలో జస్టిస్ (Justice) అంటారు. ఈ పదం ‘జస్టీషియా’ అనే లాటిన్ భాషా పదం నుంచి అవతరించింది. ఇందులో ‘జస్’ లేదా ‘జస్టిస్’ అనే పదాలు ఇమిడి ఉన్నాయి. దీని అర్థం ‘కలపటం’ లేదా ‘బంధించడం’. మానవ సమాజానికే సంబంధించి వివిధ వర్గాల ప్రజలను ఒకే వ్యవస్థలో కూర్చటంగా చెప్పవచ్చు. వ్యవస్థీకృత సమాజంలో మనుషుల మధ్య మానవ సంబంధాలను సమన్వయం చేస్తూ, మానవాళికి ఉపకరించటానికి రాజ్యం గుర్తించి, అమలు చేసే సూత్రావళే న్యాయం.
ఈ పదాన్ని ధర్మం, సరైన లేదా న్యాయమైన అని వివిధ అర్థాల్లో కూడా వాడతారు. అన్యాయం, అధిక్యత, తప్పులను ఇది వ్యతిరేకిస్తుంది. కొందరు రాజనీతి వేత్తలు న్యాయాన్ని ‘సుగుణం’ అంటే మరికొందరు ‘సమానత్వం’ అని అర్థ వివరణ ఇచ్చారు. అయితే ఎక్కువ మంది దీన్ని సమన్యాయ పాలనతో పోల్చారు.
న్యాయం అనే భావన కేవలం రాజనీతి శాస్త్రంలో మాత్రమే గాక నీతిశాస్త్రం, న్యాయశాస్త్రం, తత్వశాస్త్రాలలో కూడా అధ్యయన అంశంగా ఉంది. ఇది సహజమైనది, విలువలతో కూడుకున్నది. సమాజంలో మానవ గమనాన్ని తెలుపుతుంది. ఇది ప్రజాజీవనానికే చిహ్నంగా ఉంటూ సామాజిక బాధ్యతతో కూడుకొని ఉంటుంది.
న్యాయ భావనను అనేక మంది రాజనీతి వేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు. అందులో కొన్నింటిని క్రింది విధంగా చెప్పవచ్చు.
ప్లేటో : “ఇతరుల కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా, ఎవరి పనులు వారే నిర్వహించడం అదే విధంగా హేతువు, ధీరత్వం, ఇచ్ఛల సమన్వయమే న్యాయం”
అరిస్టాటిల్ : “సమాజంలో ఎవరికి నిర్దేశించిన నైతిక విధులను వా సక్రమంగా నిర్వహించడమే న్యాయం”.
బార్కర్ : “రాజనీతి విలువల సమ్మేళనం లేదా సమన్వయమే న్యాయం”.
జాన్ రాల్స్ : “సాంఘిక సంస్థల వాస్తవిక తాత్విక చింతన ప్రాథమిక సూత్రమే న్యాయం; సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు విధులను కల్పిస్తూ; సామాజిక ప్రయోజనాలను అన్ని వర్గాలకు అందించడమే న్యాయం”.
బి. న్యాయానికి సంబంధించి ప్రధాన భావనలు :
న్యాయం అనే భావనను వివిధ న్యాయ సిద్ధాంతాలు విస్తృతం చేశాయి. వీటిని స్థూలంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
- గ్రీకులు, స్లోయిక్లు, రోమన్ల న్యాయ సిద్ధాంతం
- ఆధునిక న్యాయ సిద్ధాంతం
- సమకాలీన న్యాయ సిద్ధాంతాలు.
1. గ్రీకులు, స్లోయిక్లు, రోమన్ల న్యాయ సిద్ధాంతం :
న్యాయ భావనను తొలిసారిగా చర్చించిన వారు గ్రీకులు కాగా, దానికి పునాదులు వేసిన వ్యక్తి ప్లేటో, ప్లేటో న్యాయ సిద్ధాంతంలో సుగుణం ప్రధానమైంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఎవరి పనులు వారే నిర్వహించుకోవడమే సుగుణం. అరిస్టాటిల్ ప్రకారం న్యాయం సంపూర్ణంగా సుగుణవంతమైంది.
స్లోయిన్ల ప్రకారం న్యాయం హేతువు ద్వారా కనుగొనబడింది. అదే విధంగా ఇది రాజ్యంచే రూపొందించబడిన సంవర్ధక శాసనం కంటే ఉన్నతమైంది. రోమన్ల ప్రకారం న్యాయం అనే భావన శాసనానికి సన్నిహితంగా ఉంటుంది.
2. ఆధునిక న్యాయ సిద్ధాంతం:
సంస్కరణోద్యమం, సాంస్కృతిక పునరుజ్జీవనం, పారిశ్రామిక విప్లవం అనంతరం ఇది అవతరించింది. హాబ్స్, లాక్, రూసోల సామాజిక ఒడంబడిక సిద్ధాంతంతో ఆధునిక న్యాయ సిద్ధాంతం అవతరించింది. నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి ఇవ్వడమే న్యాయం అని హాబ్స్ పేర్కొన్నాడు. లాక్ సహజ హక్కులలో న్యాయాన్ని గుర్తించగా, రూసో చెప్పిన “జనేచ్ఛ” న్యాయంతో కూడుకున్నదిగా చెప్పాడు.
3. సమకాలీన న్యాయ సిద్ధాంతాలు :
ఈ సిద్ధాంతాలు ప్రధానంగా స్థిరమైన న్యాయం (Substantial Justice), ప్రక్రియాత్మకమైన న్యాయం (Procedural Justice) ల మధ్యగల వ్యత్యాసాలపై దృష్టి పెడుతుంది. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ నియమ, నిబంధనలు మానవుని ప్రవర్తనను నిర్దేశించటానికీ నమూనా నిబంధనలుగా ఉంటాయని ప్రక్రియాత్మకమైన న్యాయం పరిగణిస్తుంది.
అన్ని రకాల వివక్షతలను వ్యతిరేకిస్తూ, మానవుని మధ్య నైతికతను, సమాన గౌరవాన్ని ప్రక్రియాత్మకమైన న్యాయం అనుమతిస్తుంది. F. A. హాయక్, మిల్టన్ ఫ్రీడ్ మన్, నాజిక్ వంటి వారు దీన్ని ప్రతిపాదించిన వారిలో ప్రముఖులు.
స్థిరమైన న్యాయ భావన అనేది సామాన్యవాదం ఆలోచనల నుంచి అవతరించింది. సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల జీవన ప్రమాణాల పెంపుదలకు తగిన అవకాశాలు పొందేందుకు స్థిరమైన న్యాయం తోడ్పడుతుంది. ఇందులో వనరుల పంపిణీ అనేది ప్రధాన అంశం కాగా ప్రక్రియ అనేది ద్వితీయమైంది.
4. జాన్రాల్స్ న్యాయ సిద్ధాంతం :
స్థిరమైన న్యాయానికి కావలసిన సాధనాలను రూపొందించటానికి ఉపకరించే పద్ధతిగా ప్రక్రియాత్మకమైన న్యాయం ఏ విధంగా తోడ్పడుతుందో రాల్స్ న్యాయ సిద్ధాంతం తెలుపుతుంది. సమాజంలో గల బలహీన అంశాలను బలోపేతంగా చేయడానికి ఇతను ప్రయత్నించాడు. ఇతని న్యాయ సిద్ధాంతం మూడు అంశాలపై ఆధారపడింది.
- సమాన స్వేచ్ఛ సూత్రం.
- సమాన అవకాశాల సూత్రం.
- అణగారిన వర్గాలకు లబ్ధిని వేకూర్చే ప్రతిపాదనను సమర్థించవచ్చు.
ఈ విధంగా రాల్స్ సామ్యవాదం పెట్టుబడి దారి విధానం విలువలను చెప్పడానికి ప్రయత్నించాడు.
ప్రశ్న 12.
శక్తిని నిర్వచించి, దానిలోని వివిధ రకాలను తెలపండి.
జవాబు.
ఎ. శక్తి అర్థ వివరణ, నిర్వచనం :
వ్యక్తి తన కోరికలను తీర్చుకోవటానికి లేదా లక్ష్యాన్ని సాధించటానికి అతనిలో గల నైపుణ్యతను తెలియజేసేదే శక్తి. ఒక వ్యక్తి లేదా సమూహం వేరే వ్యక్తి లేదా సమూహంపై చూపే ప్రభావాన్ని శక్తి తెలుపుతుంది. శక్తిని అనేక మంది రాజనీతి పండితులు నిర్వచించారు. అవి :
హెచ్. వి. వైజ్మాన్ : “ఎటువంటి ఆటంకాలనైన ఎదుర్కొని ఒక వ్యక్తి తాను కోరుకున్నది సాధించటానికి గల నైపుణ్యమే శక్తి”.
రాబర్ట్ ధాల్ : “శక్తి అనేది ఒక రకమైన ప్రభావం చూపే భావన, అనంగీకారాన్ని అంగీకరించే విధంగా చేయడానికి ఉపకరించేదే శక్తి”.
ఎడ్వర్డ్ ఎ. షిల్స్ : “స్వప్రయోజనాల సాధన కోసం మానవ ప్రవర్తనను ప్రభావితం చేసే సామర్థ్యమే శక్తి”. బి. శక్తి వివిధ రూపాలు.
1. రాజకీయ శక్తి :
రాజకీయ శక్తి అనేది వ్యవస్థీకృతమైన, అవ్యవస్థీకృతమైన రాజకీయ అంశాలచేత ప్రభావితం అవ్వడాన్ని సూచిస్తుంది. రాజకీయాలలో శక్తి అనేది ఎప్పుడు రాజకీయశక్తి, రాజ్యశక్తి, ప్రభుత్వశక్తి, శాసనాలశక్తి మొదలై ప్రభుత్వ చర్యల మీద ఆధారపడి ఉంది.
కాని ఈ వ్యవస్థీకృత అంశాలు కేవలం ప్రతిపక్షంలో ఉండే పార్టీల చేతనేకాక అతి పెద్ద సంఖ్యలో ఉండి ప్రభావ వర్గాలు, ప్రజాభిప్రాయం, ప్రజా ఉద్యమాలు, మాస్ మీడియా మొదలైన వాటిచే ప్రభావితమవుతుంటాయి. కాబట్టి శక్తి అనేది వ్యవస్థీకృత అంశాలైన రాజ్యంతోపాటు అవ్యవస్థీకృత అంశాలకు కూడా వర్తిస్తుంది.
2. సాంకేతిక శక్తి :
ఆధునిక కాలంలో శక్తిని ప్రదర్శించటంలో సాంకేతిక పరిజ్ఞానం అతి ముఖ్యమైన సాధనంగా ఉంది. ఇటీవలికాలంలో సాంకేతిక మేధస్సు అనేది కృత్రిమ మేధస్సు రూపంలో మనిషి, సమాజం, రాజకీయాలపై విప్లవాత్మక ప్రభావం చూపిస్తుంది. సమకాలీన ప్రజాస్వామ్యాలలో కంప్యూటర్లు, జ్ఞానంలేని యంత్రం, ఎంతో పనిని చేస్తూనే ఉన్నాయి.
రాజకీయ పార్టీలకు వారి ప్రచారాలలో ఈ సాంకేతిక పరిజ్ఞానంతో చాలా సంబంధం ఉంది. ఆరోగ్య సాధనకు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వాలు చాలా వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి.
మనం సాంకేతిక విజ్ఞానంపై ఆధారపడడం అనేది సాంకేతిక విస్ఫోటనానికి (పెరుగుదలకు దారితీసింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి ఓటర్లను వారి ఓటింగ్ ప్రవర్తనపై చాలా సూక్ష్మస్థాయిలో కూడా ప్రభావపరుస్తున్నాయి. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో ఎవరు పైచేయి సాధిస్తారో వారే రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తున్నారు.
3. ఆర్థిక శక్తి :
ఆర్ధిక శక్తి అనేది ప్రధానంగా సంపదను స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రత్యేకించి ఉత్పత్తి, పంపిణీ ద్వారా వస్తుంది. ఆర్థికశక్తి అనేది ఉదార ప్రజాస్వామ్యదేశాలలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఒకవేళ రాజ్యం సమృద్ధిగా సహజవాబు. ఇతర వనరులను కలిగి ఉంటుందో అది ప్రబలమైన ఆర్థికశక్తిగా మారుతుంది.
ప్రముఖ వార్తా పత్రికలు, టి.వి. ఛానెళ్ళు పెద్ద పెద్ద వ్యాపారవేత్తల చేతుల్లో ఉండటం వల్ల, ఈ మీడియా ద్వారా వారికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నారు. వీరి వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగదారుల సంస్కృతిని పెంపొందిస్తున్నారు.
4. సైద్ధాంతికపరమైన శక్తి :
ఆధిపత్య పాలకవర్గం ప్రజల ఆలోచనలను, భావోద్వేగాలపై పూర్తిగా పట్టును సాధించటానికి, వారిలో సమ్మతి అనే భ్రాంతిని సృష్టించటానికి ఉపయోగించే శక్తిని ఇది సూచిస్తుంది. అలాగే సమ్మతిని సృష్టించడంలో భ్రాంతిని కలిగిస్తుంది.
తద్వారా ప్రజలు వారు అంగీకరించిన వాటిలోనే పాలింపబడుతున్నామనే నమ్మకానికి దారితీస్తుంది. ఈ సిద్ధాంతపరంగా “పాలక వర్గంచే ఆధిపత్యం చెలాయించడమనేది పెత్తందారికి దారితీస్తుందని” ఇటలీ మార్క్సిస్టుగా పేరుపడిన ఆంటోనియో గ్రాంస్కీ (1891 1937) అన్నారు.
ఈ విధంగా రాజకీయశక్తి అతిముఖ్య లక్షణమైన రాజకీయ సిద్దాంతం అనేది పాలక వర్గాలకు శాసనబద్ధతను కల్పిస్తూ వారు చాలా దృఢమైన రాజకీయశక్తిని నిర్వహించడంలో సహకరిస్తుంది. ఎప్పుడైతే ప్రజలు ప్రభుత్వ వ్యవస్థలలో ప్రత్యేకించి చాలా మంచిది అని భావిస్తే, ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని సవాలు చేయరు.
5. జాతీయశక్తి :
వాస్తవవాదుల దృష్టి నుంచి చూస్తే రాజకీయాలు అనేవి “శక్తి” కోసం పోరాటమే. అంతర్జాతీయ రాజకీయాల తక్షణ లక్ష్యం కూడా శక్తిని సాధించడమే. అంతర్జాతీయ వ్యవహారాలలో సార్వభౌమాధికార రాజ్యాలు ఇతర సార్వభౌమాధికార రాజ్యాలను, జాతి రాజ్యాలు తమ స్వంత లక్ష్యాలను సాధించడం అనేది అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితపరుస్తుంది.
ఈ సందర్భంలోనే ‘ఏక ధృవ’, ‘ద్వి ధృవ’, ‘బహుళ ధృవ’ ప్రపంచాలు అనే పదాలు ప్రాచుర్యం పోందాయి. ఒకే దేశం ప్రపంచం మొత్తాన్ని శాసిస్తే దానిని ఏక ధృవ ప్రపంచమని; రెండు దేశాలు ఆధిపత్యం చెలాయిస్తే ద్వి ధృవ ప్రపంచం అని; అనేక దేశాలు ఆధిపత్యం చెలాయిస్తే బహుళ ధృవ ప్రపంచం అని అంటారు.
జాతీయశక్తిని ప్రదర్శించటానికి విభిన్న అంశాలు ఉన్నాయి. అవి బలం, ప్రభావం, అధికారం. బలం అనేది బెదిరించటం లేదా సైన్యాన్ని వినియోగించటం, ఆర్థిక, ఇతర సాధనాలను ఉపయోగించి క్రమపద్ధతిలో చెప్పడం ద్వారా ఇతర దేశాల ప్రవర్తనలో మార్పు తీసుకురావటమే ప్రభావం.
ఒక దేశం యొక్క ఆదేశాన్ని మరోదేశం పాటించడమే అధికారం. ఇది గౌరవం, సంఘీభావం, అభిమానం, అనుబంధం, నాయకత్వం, విజ్ఞానం, నైపుణ్యం వంటి దృక్కోణాల్లో ఉండడం.
ప్రశ్న 13.
శక్తి అంటే ఏమిటి ? వివిధ రకాల శక్తి ధృక్పధాలను వివరించండి.
జవాబు.
వ్యక్తి తన కోరికలను తీర్చుకోవటానికి లేదా లక్ష్యాన్ని సాధించటానికి అతనిలో గల నైపుణ్యతను తెలియజేసేదే శక్తి. ఒక వ్యక్తి లేదా సమూహం వేరే వ్యక్తి లేదా సమూహంపై చూపే ప్రభావాన్ని శక్తి తెలుపుతుంది. శక్తిని అనేకమంది రాజనీతి పండితులు నిర్వచించారు. అవి :
హెచ్. వి. వైజ్మాన్ : “ఎటువంటి ఆటంకాలనైన ఎదుర్కొని ఒక వ్యక్తి తాను కోరుకున్నది సాధించటానికి గల నైపుణ్యమే శక్తి”.
రాబర్ట్ ధాల్ : “శక్తి అనేది ఒక రకమైన ప్రభావం చూపే భావన, అనంగీకారాన్ని అంగీకరించే విధంగా చేయడానికి ఉపకరించేదే శక్తి”.
వివిధ రకాల శక్తి దృక్పధాలు (లేదా) ధృక్కోణాలు :
రాజనీతిశాస్త్ర అధ్యయన ఆధునిక ధృక్కోణం శక్తి అనే భావనను ప్రధానమైనదిగా గుర్తించారు. ఏ దేశంలోనైన శక్తి ఎప్పుడు సాంఘిక, ఆర్థిక, సైద్ధాంతిక నిర్మాణంలో నిబిడీకృతమై ఉంటుంది. రాజ్యాంగం అంతస్థు, అవకాశాలలో సమానత్వం కల్పించినప్పటికీ శక్తి ప్రధాన కేంద్రంగా ఉంటుంది.
శక్తిని కలిగి ఉండే సమూహాలు, వర్గాలను తెలుసుకోవడానికి రాజకీయాలను అర్థం చేసుకోవాలి. శక్తిని అధ్యయనం చేయటానికి వివిధ ధృక్కోణాలు ఉన్నాయి. వీటిని స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి ఉదారవాద, మార్క్సస్ట్ ధృకోణాలు. వీటిని కింది విధంగా వివరించవచ్చు.
1. శ్రేష్ట వర్గ ధృక్కోణం :
శక్తికి సంబంధించి శ్రేష్ట వర్గ ధృక్కోణం 20వ శతాబ్దం ప్రారంభంలో పరెటో, మోస్కా, మిచెల్స్ అనే ముగ్గురు సామాజిక శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ప్రకారం సమాజం శ్రేష్ట వర్గం, సామాన్య జన సమ్మేళనంగా చీలి ఉంటుంది.
ఈ విధంగా చీలటానికి వ్యక్తులలో గల పోటీతత్వం, వారి వారి ఆసక్తులపై ఆధారపడి ఉంటుంది. శ్రేష్ఠ వర్గం రాజకీయ శక్తిని ప్రభావితం చేస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం సమాజంలో విభజన అనేది సహజవాబు. కార్యకరణ పరంగా ఉంటుంది. ఇది సంపూర్ణంగా మారుతుందనే నమ్మకాన్ని కలిగి ఉంటుంది.
2. సమూహ ధృక్కోణం :
ఈ ధృక్కోణంను అర్థర్ బెంట్లీ అభివృద్ధి చేశాడు. శక్తిపై సమూహ ధృక్కోణం బహుతా సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది. దీని ప్రకారం శక్తి అనే భావన సమాజాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఇవి ఆధిపత్య సమూహాలు, ఆధారిత సమూహాలు, సమూహ ధృక్కోణం ప్రకారం సమాజంలో శక్తి ఏ ఒక్క సమూహం చేతిలో కేంద్రీకృతం కాకుండా అది విభిన్న సామాజిక వర్గాల మధ్య విభజించబడి ఉంటుంది. ఈ సమూహాలు ఎక్కువగా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండి, స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకుంటాయి.
3. లింగ సంబంధ ధృక్కోణం :
ఇటీవలి కాలంలో శక్తిని అధ్యయనం చేయటానికి లింగపర ధృక్కోణం ముఖ్యాంశంగా ఉంది. ఇది సమాజాన్ని లింగపరంగా రెండు వర్గాలుగా గుర్తిస్తుంది. అవి స్త్రీలు, పురుషులు మానవ జాతి పురోగమించడానికి ఈ విభజనను ప్రకృతి సృష్టించింది. మానవ జీవనం, నాగరికత, సంస్కృతి సార్థకం కావడానికి ఇది తోడ్పడింది.
పరిణామ క్రమంలో సమాజంలో స్త్రీ, పురుషులు పరస్పరం ఆధారపడి జీవించారు. స్త్రీలపై పురుషుల ఆధిపత్యం చెలాయించడం జరిగింది. పితృస్వామిక వ్యవస్థలో అనాదిగా స్త్రీ, పై పురుషుడు ఆధిపత్యం కలిగి ఉంటున్నాడు. పురుష ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ స్త్రీకి విముక్తి కల్పించాలని స్త్రీవాద సిద్ధాంతం కోరుతుంది.
4. వర్గపర ధృక్కోణం :
శక్తి భావనపై వర్గపద ధృక్కోణం 19వ శతాబ్దంలో కారల్ మార్క్స్ (1818 – 83), ఏంజెల్స్ (1820 – 95) లు అభివృద్ధి చేశారు. ఈ సిద్ధాంతం ప్రకారం రాజకీయ శక్తి అనేది ఆర్థిక శక్తిచే సృష్టించబడింది. దీనికి గల కారణం ఉత్పత్తి సాధనాలు ఆర్థిక శక్తి యాజమాన్యంలో ఉండడం, నాగరికత ప్రతీ దశలోను సమాజం రెండు పరస్పర విరుద్ధ వర్గాలుగా విభజించబడి ఉంటుంది. అవి ఉన్నవారు, లేనివారు, ఉత్పత్తి సాధనాల పంపిణీ ద్వారా మాజం యాజమాన్యం గలవారు, యాజమాన్యం లేనివారిగా విభజించబడింది.
ఈ సిద్ధాంతం “వర్గం” అనేది సమాజంలో శక్తిని ప్రదర్శించడానికి ఒక వ్యవస్థీకృత తరగతిగా గుర్తిస్తుంది. సమాజంలో ఉత్పత్తి సాధనాలు అయితే ఎవరి చేతిలో ఉంటాయో వారిని “ఆధిపత్య వర్గం”గా, మిగిలిన వారిని “ఆధారపడిన” లేదా “ఆశ్రిత” వర్గంగా పరిగణిస్తుంది. సామాజిక విప్లవం ద్వారా వర్ణరహిత సమాజాన్ని నెలకొల్పాలని ఈ సిద్ధాంతం నమ్ముతుంది.
5. ఆధునిక ధృక్కోణం :
సాంప్రదాయిక సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ ఆధునిక ధృక్కోణం అవతరించింది. తరతరాలుగా అణగారిన వర్గాల ప్రజలను సాధికారికత దిశగా పయనింపచేయటం కోసం మహిళలకు, సాధారణ ప్రజలకు అధికారం పంచాలని తెలుపుతుంది. గతంలో సాంప్రదాయిక శక్తి సిద్ధాంతం ఆధిపత్య వర్గాలు శక్తిని చెలాయించిన అంశంగా శక్తి సిద్ధాంతాన్ని పరిగణించడం జరిగింది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
శాసనాన్ని నిర్వచించి, దాని లక్షణాలను వివరించండి.
జవాబు.
పరిచయం :
రాజనీతిశాస్త్ర అధ్యయనంలో చట్టం అనేది ఒక ముఖ్యమైన భావన.
రాజ్యం శాసనాల ద్వారా ప్రజలను పరిపాలిస్తుంది. శాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్య సార్వ భౌమాధికారం శాసనాల ద్వారా వ్యక్తమవుతుంది. రాజ్యం ఆశించే సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులు శాసనం ద్వారానే సాధించగలవు. మానవుని బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమాలే శాసనాలు. వ్యక్తులు రాజ్యంలో చేయవలసినవి, చేయకూడనివి శాసనం చెబుతుంది. ప్రభుత్వంలోని శాసనశాఖ శాసనాలు చేస్తుంది.
అర్థం :
శాసనాన్ని ఆంగ్లంలో ‘లా’ అంటారు. ‘లాగ్’ అనే ట్యూటానిక్ పదం నుండి ‘లా’ అనే మాట వచ్చింది. ‘లాగ్’ అంటే ‘సమమైన’ లేదా ‘స్థిరమైన’ అని అర్థం. శాసనాలు స్థిరమైన నిబంధనలు.
నిర్వచనాలు :
- “సార్వభౌముడి ఆదేశమే చట్టం. ప్రజలందరూ సార్వభౌముడికి విధేయులుగా ఉండేందుకు చట్టం కొన్ని ఉమ్మడి నియమాలను రూపొందిస్తుంది” అని జాన్ ఎరిస్కిన్ పేర్కొన్నాడు.
- “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలు చేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి.ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
- న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.
శాసనానికి ఆధారాలు :
హాలండ్ అనే రచయిత సంప్రదాయాలు, మతము, ధర్మబద్ధత (సమత), న్యాయమూర్తుల తీర్పులు, శాస్త్రీయ వ్యాఖ్యానాలు, శాసనశాఖ అనేవి శాసనాలకు ఆధారాలని చెప్పాడు. శాసనాలు వివిధ రంగాలలో క్రమంగా రూపొందుతాయి. అనేక అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్పిన శాసనాల ఆధారాలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు.
చట్టం ముఖ్య లక్షణాలు (Features of Law): చట్టానికి కింద పేర్కొన్న లక్షణాలు ఉన్నాయి.
- సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముదాయమే చట్టం.
- చట్టాన్ని రాజ్యం అమలుపరుస్తుంది. రాజ్యం అనుమతి పొందడంతో చట్టాన్ని యోగ్యమైందిగా పరిగణించవచ్చు.
- చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది, విశ్వవ్యాప్తమైనది.
- చట్టం ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తుంది.
- చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.
- చట్టాలు నిర్బంధమైన, శిక్షాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి.
- చట్టం వైయక్తిక, సాధారణ సంక్షేమాన్ని సంరక్షించే ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటుంది.
- చట్టం ప్రజల అవసరాల మేరకు మార్చబడుతుంది.
ప్రశ్న 2.
శాసనం యొక్క ఏవైనా నాలుగు లక్షణాలను చర్చించండి.
జవాబు.
చట్టం ముఖ్య లక్షణాలు (Features of Law) : చట్టానికి కింద పేర్కొన్న లక్షణాలు ఉన్నాయి.
- సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముదాయమే చట్టం.
- చట్టాన్ని రాజ్యం అమలుపరుస్తుంది. రాజ్యం అనుమతి పొందడంతో చట్టాన్ని యోగ్యమైందిగా పరిగణించవచ్చు.
- చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది, విశ్వవ్యాప్తమైనది.
- చట్టం ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తుంది.
- చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.
- చట్టాలు నిర్బంధమైన, శిక్షాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి.
- చట్టం వైయక్తిక, సాధారణ సంక్షేమాన్ని సంరక్షించే ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటుంది.
- చట్టం ప్రజల అవసరాల మేరకు మార్చబడుతుంది.
ప్రశ్న 3.
శాసనం యొక్క ఏవైనా మూడు ఆధారాలను తెలపండి.
జవాబు.
1. ఆచార, సంప్రదాయాలు, వాడుకలు (Customs) :
ఇవి శాసనానికి తొలి ఆధారాలు. ప్రజల ఆచారాలు, వాడుకలు, సంప్రదాయాలు శాసనాలకు మూలాధారము. సంప్రదాయాలు సంఘంలో ఒక అలవాటుగా, క్రమంగా రూపొందుతాయి. పూర్వం సంప్రదాయాలే సమాజ జీవితాన్ని క్రమబద్ధం చేసేవి. రాజ్యం వీటిని గుర్తించి, వాటిని ఆధారం చేసుకొని కొన్ని శాసనాలను రూపొందిస్తుంది.
రాజకీయ ఆచారాలు కూడా రాజ్యంచే గుర్తించబడి అమలు చేయబడితే అవి శాసనాలవుతాయి. బ్రిటన్లో ‘సామాన్య న్యాయం’ సంప్రదాయబద్ధమైన శాసనానికి ఉదాహరణ. అదే విధంగా భారతదేశంలో వివాహ చట్టాలు, ఆస్తి పంపిణీ చట్టాలు మొదలగునవి సంప్రదాయాల ఆధారంగా చేయబడ్డాయి.
2. మతం (Religion) :
ఆచారానికి మతం సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే వ్యవస్థ. సంఘ జీవితం మత నియమాలకు అనుగుణంగా జరుపుకుంటారు. పూర్వం మతాధిపతులు చెప్పే నియమాలు శాసనాల వలె చెలామణి అయ్యేవి. ఆధునిక కాలంలో కూడా శాసనాలు చేయడానికి మతం ఒక ఆధారం.
వారసత్వం, వివాహం, కుటుంబ ఆస్తి మొదలైన వాటి శాసనాలు మతం ఆధారంగా చేయబడ్డాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లిములకు గల శాసనాలు వారి మతాల ఆధారంగా రూపొందాయి. ఇరాన్, పాకిస్థాన్ వంటి మత ప్రమేయ దేశాలలో సంఘ జీవనానికి మత నియమాలే ఆధారం.
3. న్యాయస్థానాల తీర్పులు (Judicial Decisions) :
న్యాయస్థానాలలో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు శాసన నిర్మాణానికి ఆధారాలు. న్యాయస్థానాలు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఈ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు క్రొత్త న్యాయ సూత్రాలను సృష్టిస్తారు.
ఈ తీర్పులు అదే విధమైన వివాదాలు తలెత్తినప్పుడు న్యాయసూత్రాల వలె వర్తింపచేస్తారు. నేడు న్యాయమూర్తుల నిర్ణయాలు శాసనాలలో అంతర్భాగమవుతున్నాయి.
ఉదా : భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పులిచ్చిన గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వామిల్స్ కేసు.
4. శాస్త్రీయ వ్యాఖ్యానాలు (Scientific Commentories) :
ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, రచయితలు, విమర్శకులు చేసే వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారమవుతాయి. ఇవి న్యాయస్థానాలలో న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు, వివరణలు, శాసనాలు చేయటానికి ప్రభుత్వానికి ఉపయోగిస్తాయి.
న్యాయమూర్తుల నిర్ణయాలు, తీర్పులు, భవిష్యత్లో శాసన నిర్మాణానికి తోడ్పడతాయి. ఇంగ్లండ్లో కోక్, బ్లాక్టన్, అమెరికాలో స్టోరీ, కెంట్, భారతదేశంలో విజ్ఞానేశ్వర, అపరార్క వంటి వారి వ్యాఖ్యానాలు శాసన నిర్మాణానికి ఆధారాలు.
ప్రశ్న 4.
సమన్యాయ పాలన అంటే ఏమిటి ? వివరించండి.
జవాబు.
సమన్యాయ పాలన: బ్రిటీష్ రాజ్యాంగ విశిష్ట లక్షణం సమన్యాయ పాలన. ఇది ముందుగా ఇంగ్లాండ్లో అవతరించింది. అనంతరం భారతదేశం, అమెరికా దేశాలలో దీనిని అమలుచేశారు. ‘చట్టం ముందు అందరూ సమానమే, చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది’ అని తెలిపేదే సమన్యాయ పాలన.
రాజ్యంలో నివసించే ప్రతీ పౌరునికి శాసనాలు ఒకే విధంగా వర్తిస్తాయి. సమాజంలో వివిధ వర్గాలకు ప్రత్యేక శాసనాలు అంటూ ఉండవని తెలుపుతుంది. పరిపాలన వ్యవస్థ, గవర్నెన్స్ శాసనం ప్రకారమే కొనసాగుతుంది.
ప్రభుత్వ నిరంకుశ పాలనను అడ్డుకోవడం సమన్యాయ పాలన ప్రధాన లక్ష్యం. ఇది శాసన నిర్మాణశాఖచే నిర్మించి అధికార వ్యవస్థ ద్వారా అమలు చేయబడుతుంది. శాసన ఉల్లంఘన శిక్షార్హం కిందకు వస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే అనేది అధికారులకు, సామాన్యులకు అన్ని వర్గాలకు వర్తిస్తుంది.
సమన్యాయ పాలన అనేది ఇంగ్లాండ్ రాజ్యాంగ విశిష్ట లక్షణంగా చెప్పుకున్నాం. ఇంగ్లాండ్లో అలిఖిత రాజ్యాంగం అమలులో ఉండడం వల్ల పౌరుల హక్కులకు రాజ్యాంగ పరంగా హామీ లేదు. పౌరుల హక్కుల రక్షణకు ఇంగ్లాండ్లో సాధారణ శాసనం రూపంలో సమన్యాయ పాలన అమలులో ఉంది. ఇది బ్రిటీష్ రాజ్యాంగ వ్యవస్థకు మౌలిక పునాదిగా ఉంది.
సమన్యాయ పాలనపై వివిధ పరిమితులు ఉండటం వల్ల అది అనేక విధాలుగా మార్పులకు గురయి సాంఘిక, ఆర్థిక రంగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. శాసన నిర్మాణశాఖ విపరీత పని భారం దృష్ట్యా దీని పరిధిలో మార్పు చోటుచేసుకున్నది. స్థూలంగా “చట్టం ముందు అందరూ సమానమే. ఏ ఒక్కరూ కూడా నిరంకుశంగా శిక్షించరాదు” అనేది సమన్యాయ పాలన ప్రధాన సూత్రం. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ ఆశయం.
ప్రశ్న 5.
స్వేచ్ఛను నిర్వచించి, ఏవైనా మూడు రకాల స్వేచ్ఛలను తెలపండి.
జవాబు.
పరిచయం :
స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.
అర్థం : స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు పదం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షల నుంచి విముక్తి”.
నిర్వచనాలు :
- హెచ్.జె.లాస్కీ : “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
- మాంటెస్క్యూ : “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ”.
- జె.ఆర్. సీలీ : “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ”.
1. సహజ స్వేచ్ఛ (Natural Liberty) :
సహజ స్వేచ్ఛ అనేది ఎటువంటి ఆంక్ష లేకుండా ఏదైనా చేయడాన్ని సూచిస్తుంది. ఇది ఎలాంటి జోక్యానికి లేదా నిర్భంధాలకు తావివ్వదు. వ్యక్తులు తమ ఇచ్ఛానుసారం చేయదలచినదాన్ని సుసాధ్యం చేస్తుంది. అయితే, నిర్నిబంధమైన స్వేచ్ఛ వ్యక్తుల స్వేచ్ఛలను హరిస్తుంది. నేటి సమాజంలో సహజ స్వేచ్ఛ అనేది కనిపించదు. ఇది అన్యాయం, అరాచకత్వాలకు పర్యాయపదమైనది. సహజ స్వేచ్ఛగల చోట స్వాతంత్య్రం మృగ్యమవుతుంది.
ఆదిలో రోమన్ రాజనీతి తత్త్వవేత్తలు ఈ భావనను సమర్థించారు. ఎటువంటి అవధుల్లేని ప్రాకృతిక వ్యవస్థలోని మానవులు అపరిమితమైన స్వేచ్ఛను అనుభవించారన్నారు. అటువంటి స్వేచ్ఛ – రాజ్యం, సమాజాల ఆవిర్భావానికి ముందు మాత్రమే ఉనికిలో ఉండేది.
2. పౌర స్వేచ్ఛ (Civil Liberty) :
పౌరస్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌరస్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు.
- సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం
- ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం
- నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్ర్యం.
పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.
“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు.
పౌర స్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి –
- జీవించే హక్కు
- పనిచేసే హక్కు
- ఆస్తి హక్కు
- వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిరనివాసపు హక్కులు మొదలైనవి.
3. ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty) :
ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతి ఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే ఆర్థిక స్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరుద్యోగం – అసంపూర్ణతల నుంచి – విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.
ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.
- కనీస వేతనాలను అందించడం.
- పనిహక్కుకు భరోసా కల్పించడం.
- నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం.
- తగినంత విశ్రాంతిని కల్పించడం.
- పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.
ప్రశ్న 6.
స్వేచ్ఛ భావన పరిణామాన్ని వివరించండి.
జవాబు.
ఆధునిక కాలంలో ప్రాధాన్యత పొందిన భావనలలో అతి ముఖ్యమైనది స్వేచ్ఛ. క్రీ.శ. 16, 17 శతాబ్దాలలో ఐరోపా ఖండంలో వచ్చిన పారిశ్రామిక విప్లవము మరియు ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితుల ప్రభావం ఫలితంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారి విధానానికి అనుగుణంగా నూతన రాజకీయ సిద్ధాంతాలు, రాజకీయ సంస్థల భావనలు రూపొందాయి.
1688లో ఇంగ్లండ్లో జరిగిన రక్తరహిత విప్లవం, 1776లో అమెరికన్ విప్లవం, 1789 ఫ్రెంచి విప్లవాల ద్వారా ఈ భావనలు మరింత ప్రాబల్యాన్ని సంపాదించాయి. ఫ్రెంచి విప్లవంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నినాదాలుగా వర్థిల్లాయి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత వివిధ జాతులు తమ స్వేచ్ఛకై జాతీయోద్యమాలను కొనసాగించాయి.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం నూతనంగా స్వతంత్రం పొందిన దేశాలలోని ప్రజలు నియంతృత్వాలకు వ్యతిరేకంగా స్వేచ్ఛకోసం ఉద్యమించటం జరుగుచూనే ఉన్నది. ఇటీవల కాలంలో నేపాల్, బర్మా మొదలైన దేశాలలో ప్రజలు స్వేచ్ఛకోసం అనేక ఉద్యమాలను నడిపారు.
పై అంశాలను పరిశీలిస్తే సమకాలీన మానవజాతి చరిత్రను స్వేచ్ఛకోసం మానవులు జరుపుతున్న పోరాటంగా వర్ణించవచ్చు. స్వేచ్ఛ కావాలనటం మానవుని సహజమైన వాంఛ. స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యాన్ని నొక్కి చెపుతూ రూసో స్వేచ్ఛాయుతంగా ఉండకపోవటం మానవుడుగా మనలేకపోవటమే అంటాడు.
ప్రశ్న 7.
స్వేచ్ఛకుగల ఏవైనా మూడు పరిరక్షణలను తెలపండి.
జవాబు.
1. ఆర్థిక సమానత్వం (Economic Equality) :
వ్యక్తుల స్వేచ్ఛా పరిరక్షణలో ఆర్థిక సమానత్వం కూడా ప్రధానమైంది. ఆకలి, పేదరికం, నిరుద్యోగం వంటి దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు వ్యక్తులకు చాలినన్ని అవకాశాలను కల్పించాలనే భావన ఇందులో ఇమిడి ఉంది. ఆర్థిక సమానత్వం నెలకొన్నప్పుడే స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ఆర్థిక సమానత్వంలో ఆర్థిక న్యాయం అంతర్భాగంగా ఉంటుంది. దీనిని రాజ్యం ప్రసాదిస్తుంది.
2. అధికారాల వికేంద్రీకరణ (Decentralisation of Powers) :
అధికారాలు వికేంద్రీకరణ ద్వారా స్వేచ్ఛను మెరుగైన రీతిలో పరిరక్షించవచ్చు. ప్రభుత్వాధికారాల కేంద్రీకరణ నుంచి దేశానికి విముక్తి కలిగినప్పుడే వ్యక్తులు స్వేచ్ఛను అనుభవించగలరు. కేంద్రం రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల మధ్య అధికారాలను కేటాయించినప్పుడు నిరంకుశత్వానికి, వ్యక్తి స్వేచ్ఛల హరింపునకు తావుండదు, లేనిచో రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను అనుభవించటమన్నది ప్రజలకు కష్టమవుతుంది.
3. పత్రికాస్వాతంత్ర్యం (Independent Press) :
ప్రజాస్వామ్యాన్ని కొందరు వ్యక్తి స్వేచ్ఛా పరిరక్షణ కవచంగా భావించారు. తమ పనితీరులో చాలినంత స్వతంత్ర ప్రతిపత్తిని పత్రికలు, ఇతర మాధ్యమాలు కలిగి ఉన్నప్పుడే వ్యక్తులు స్వేచ్ఛలను అనుభవించగలరు.
ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచి, సంఘటితపరచి, వ్యక్తీకరించడంలో పత్రికలు ముఖ్యమైన వాహకంగా వ్యవహరిస్తాయి. అవి తమ నిష్పాక్షిక సంపాదకీయాలు, సత్య సమ్మతమైన వార్తలు, అభిప్రాయాల ద్వారా వ్యక్తి స్వేచ్ఛలను పరిరక్షించగలుగుతాయి.
ప్రశ్న 8.
స్వేచ్ఛ లక్షణాలను వివరించండి.
జవాబు.
పరిచయం :
స్వేచ్ఛ అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన భావన. వ్యక్తులకు గల స్వేచ్ఛపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు తమ సర్వతోముఖాభివృద్ధి కోసం స్వేచ్ఛను వాంఛిస్తారు. సామాజిక స్థితిగతులను మెరుగుపరచుకోవడంలో వ్యక్తులకు స్వేచ్ఛ తగిన శక్తిని ప్రసాదిస్తుంది. జె. ఎస్. మిల్, హెర్బర్ట్ స్పెన్సర్, మాంటెస్క్యూ, హెచ్. జె. లాస్కీ, సీలీ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలు స్వేచ్ఛను పెంపొందించటంలో ప్రధాన పాత్రను పోషించారు.
అర్థం :
స్వేచ్ఛను ఇంగ్లీషులో ‘లిబర్టీ’ (LIBERTY) అంటారు. లిబర్టీ (LIBERTY) అనే ఇంగ్లీషు నం “లిబర్” (LIBER) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్ భాషలో “లిబర్” అనే పదానికి అర్థం “ఆంక్షలనుంచి విముక్తి”.
నిర్వచనాలు :
- హెచ్.జె. లాస్కీ: “వ్యక్తులు వారంతటవారు ఉత్తమమైన అవకాశాలను పొందగలిగి, నిర్వహించుకోగల వాతావరణమే స్వేచ్ఛ”.
- మాంటెస్క్యూ : “వ్యక్తులు సంకల్పించుకొని, సాధించగలిగే శక్తియే స్వేచ్ఛ”.
- జె.ఆర్. సీలీ : “మితిమీరిన ప్రభుత్వానికి వ్యతిరేకమైనదే స్వేచ్ఛ”.
స్వేచ్ఛ లక్షణాలు (Characteristics of Liberty) :
స్వేచ్ఛ ముఖ్య లక్షణాలను కింద పేర్కొనడమైనది.
- స్వేచ్ఛ ఒక శక్తివంతమైన భావన. దాని వ్యాఖ్యానమనేది స్థలం, కాలం, ప్రాంతం, ప్రజల ఆకాంక్షలను బట్టి ఉంటుంది.
- రాజకీయంగా లోబరచుకోవడం, బానిసలుగా మార్చటాన్ని స్వేచ్ఛ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుంది.
- వ్యక్తుల ఆకాంక్షలను సదా వాస్తవం చేయడమే స్వేచ్ఛ లక్ష్యం అవుతుంది.
- నిర్హేతుకమైన ఆంక్షలకు బదులు నిరంతరం సానుకూల పరిస్థితులను కలిగి ఉండటమే స్వేచ్ఛ.
- ఇది హక్కుల ఫలం.
- మానవీయ వ్యక్తిత్వాల సాధనకు అత్యంత ఆవశ్యకమైంది.
- ప్రజాస్వామ్య రాజ్యాలలోనే ఇది కనిపిస్తుంది.
- హక్కుల రూపంలో ఇది సాకారమవుతుంది.
- స్వేచ్ఛ అంటే ఏ ఒక్కరు యధేచ్ఛగా వ్యవహరించడం కాదు. ఇది ఎన్నో పరిమితులతో కూడుకొని ఉంటుంది.
ప్రశ్న 9.
పౌర స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు.
పౌర స్వేచ్ఛ (Civil Liberty) :
పౌర స్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌర స్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు.
- సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్య్రం
- ఆలోచన, అభివ్యక్తి, విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం
- నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్ర్యం. పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది.
సహజస్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించగలిగినప్పుడే పౌర స్వేచ్ఛ వాస్తవమవుతుంది.
“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్ఛ” అని గెటిల్ పేర్కొన్నాడు. పౌరస్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి
- జీవించే హక్కు
- పనిచేసే హక్కు
- ఆస్తి హక్కు
- వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.
ప్రశ్న 10.
స్వేచ్ఛ మరియు సమానత్వాలు పరస్పర పోషకాలు వివరించండి.
జవాబు.
వ్యక్తులకు గల స్వేచ్ఛ – సమానత్వాలపైనే రాజకీయ వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఈ రెండు అంశాలు విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి. వ్యక్తులు తమ సర్వ సమగ్రమైన అభివృద్ధి కోసం స్వేచ్ఛ, సమానత్వాలను వాంఛిస్తారు.
స్వేచ్ఛ, సమానత్వం మధ్య సంబంధం (Relationship between Liberty and Equality) :
స్వేచ్ఛ – సమానత్వం మధ్యగల సంబంధం గురించి రాజనీతి తత్త్వవేత్తలు రెండు భిన్న అభిప్రాయాలను వెల్లడించారు.
ఆ రెండింటి భావనలు రాజనీతి శాస్త్రం అధ్యయనంలో ముఖ్యమైనవిగా వారు అంగీకరించారు. అయితే కొందరు ఆ రెండింటి మధ్య సంబంధం ఉందని పేర్కొనగా, మరికొందరు అవి ఒకదానికొకటి వ్యతిరేకమైనవిగా పరిగణించారు.
స్వేచ్ఛ, సమానత్వం పరస్పర సంబంధం కలిగి ఉంటాయనే భావనను రాజనీతి తత్త్వవేత్తలైన రూసో, టానీ, లాస్కీ, జి.డి.హెచ్. కోల్ వంటివారు ప్రతిపాదించారు. ఇక స్వేచ్ఛ, సమానత్వం అనేది పరస్పర వ్యతిరేకమైన భావనలని పేర్కొన్న వారిలో లార్డ్ మాధ్యూ, ఆర్నార్డ్, లార్డ్ ఆక్టన్, డి టాక్విల్లీ వంటి రాజనీతి తత్వవేత్తలు ఉన్నారు. పైన పేర్కొన్న రెండు వాదనల గురించి కింది విధంగా తెలపడమైంది.
1. స్వేచ్ఛ, సమానత్వం పరస్పర పోషకాలు :
- వ్యక్తి శ్రేయోవాదులు, అరాచకవాదులు, కమ్యూనిస్టుల దృష్టిలో స్వేచ్ఛ, సమానత్వం పరస్పర పోషకాలు.
- సమానత్వం లేని స్వేచ్ఛ అర్థరహితం, ‘సమానత్వం’ నెలకొల్పబడిన తరువాతే స్వేచ్ఛను గురించి ఆలోచించాలని కమ్యూనిస్టులు భావిస్తారు.
- సక్రమమైన, ఆదర్శమైన రాజ్యం స్థాపించబడాలంటే తప్పనిసరిగా సమానత్వ ప్రాతిపదికగా ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలి. ఈ రెండు విస్తృత పరిధిలో చూడబడాలి.
- స్వేచ్ఛ, సమానత్వం – ఈ రెండింటిలో దేన్నీ త్యాగం చేయడానికి ప్రయత్నించరాదు. సమానత్వం, స్వేచ్ఛ లోపించినట్లయితే అరాచకత్వం ప్రబలుతుంది. కావున ప్రభుత్వం శాసనాల ద్వారా ప్రజలందరికి ఎటువంటి జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ భేదము లేకుండా సమానంగా ‘స్వేచ్ఛను’ ప్రసాదించాలి.
- రాజకీయ స్వేచ్ఛ ద్వారా భావ ప్రకటనా స్వాతంత్ర్యం, ఓటుహక్కు, అర్హత ప్రాతిపదికగా పదవులకు పోటీచేసే హక్కు లభిస్తాయి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాలను ప్రజలందరూ కలిగి ఉండాలంటే వారందరూ స్వేచ్ఛను పొంది ఉండాలి. అందువలనే స్వేచ్ఛ లేకుండా సమానత్వం, సమానత్వం లేకుండా స్వేచ్ఛ ఉండవు.
- ఏ రాజ్యంలో ప్రజలు ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాలలో స్వేచ్ఛ, సమానత్వాలను సమానంగా పొంది ఉంటారో ఆ రాజ్యం బహుముఖంగా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని పరిశీలకులు భావిస్తారు.
2. స్వేచ్ఛ-సమానత్వాలు పరస్పర విరుద్దాలు :
స్వేచ్ఛ, సమానత్వం పరస్పర శత్రువులు అని పేర్కొన్న వారిలో లార్డ్ ఆక్టన్ ముఖ్యుడు. రాజ్యముగాని, వ్యక్తులుగాని సమానత్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే స్వేచ్చ మరుగున పడిపోతుంది అని ఆక్టన్ మహాశయుడు వాదిస్తాడు. ‘మితిమీరని ప్రభుత్వ పరిపాలననే స్వేచ్ఛ’ అని సీలీ మహాశయుడు పేర్కొన్నాడు. ప్రభుత్వ అధికారాలు మితిమీరడమంటే ప్రజలు తమ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను కోల్పోవటమేనని వీరు భావిస్తారు.
ప్రజల వ్యక్తిగత వ్యవహారాలలో, కార్యకలాపాలలో ప్రభుత్వము జోక్యం కల్పించుకోరాదు అని ఆక్టన్ అభిప్రాయం. ప్రజలందరికి ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించినట్లయితే శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు, విద్యా పరిజ్ఞానం కలిగినవారు అపారమైన సంపదను కూడబెడితే, అమాయకులు, నిరక్షరాస్యులు, సోమరిపోతులు తమతమ కనీస అవసరాలను కూడా సమకూర్చుకోలేరు. ఇది సమాజములో ఆర్థిక అసమానత్వానికి, వర్గతత్వానికి దారితీస్తుంది. కావున స్వేచ్ఛ- సమానత్వం పరస్పరం శత్రు సంబంధాన్ని కలిగి ఉంటాయి.
“ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో, అక్కడ సమానత్వం ఉండదు. ఎక్కడ సమానత్వం ఉంటుందో, అక్కడ స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ-సమానత్వం రెండు కత్తుల వంటివి. అవి ఒక ఒరలో ఇమడవు” అని ‘లార్డ్ ఆక్టన్’, ‘డి టాక్వెల్లీ’, ‘సీలీ’ మొదలగు రాజనీతిజ్ఞులు వాదిస్తారు.
పైన పేర్కొన్న రెండు రకాల వాదనలు పూర్తిగా నిజమైనవికావు. వాస్తవ అంశం ఆ రెండింటికీ మధ్య ఉంటుంది. స్వేచ్ఛ, సమానత్వాలు రెండూ ఒకదానికొకటి పరస్పర పోషక, పరస్పర వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉండవు. ఈ సందర్భంలో ఆ రెండు భావనల మధ్య ఉండే వాస్తవిక సంబంధాన్ని క్రింది విధంగా వివరించడమైంది.
సమానత్వానికి స్వేచ్ఛ అవసరం (Liberty is essential for Equality) :
- స్వేచ్ఛ అంటే నిరపేక్షమైనదికాదు. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని నిబంధనలకు లోబడి సామాజిక సంక్షేమాన్ని సాధించేందుకై ఈ స్వేచ్ఛ అందరికీ అందుబాటులో ఉంటుంది.
- స్వేచ్ఛ అంటే ఏ ఒక్కవ్యక్తి లేదా వ్యక్తుల సముదాయపు గుత్తాధికారంగా భావించరాదు.
- ఒకానొక వ్యక్తి స్వేచ్ఛను అనుభవించడమనేది ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉండకూడదనే ఈ సూత్రాన్ని ఆమోదించారు. సమానత్వ సూత్రాన్ని గౌరవించవలసి ఉంటుంది.
దాని అర్థం స్వేచ్ఛా ఫలాలు సమానత్వమనే వృక్షానికి చెందిన శాఖలలో ఉంటాయని పేర్కొనవచ్చు. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వాలు ఒకదానికొకటి పరస్పర పోషకాలుగా భావించడమైంది. సమానత్వ సూత్రం ఆధారంగా స్వేచ్ఛను వర్తింపజేస్తే, స్వేచ్ఛాలక్ష్యం వాస్తవానికి నెరవేరినట్లవుతుంది.
స్వేచ్ఛకు సమానత్వం అవసరం (Equality is essential for Liberty) :
సమానత్వం అంటే ఒకే విధమైన ఆదరణ అని అర్థం కాదు. ఎందుకంటే అటువంటి సమానత్వం పౌర సమాజంలో సాధ్యంకాదు. అందుకు బదులుగా ఒకేరకమైన పరిస్థితులలో సమానమైన ఆదరణయే సమానత్వంగా పేర్కొనవచ్చు.
పౌర సమాజంలో కొందరు ఇతరులతో సమానమైన హోదాను కలిగి ఉండరు. అయితే వారికి తమ వ్యక్తిత్వం, హోదాలను పెంపొందించుకొనేందుకై కొన్ని పరిస్థితులు, అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ సమానంగా ఉన్నప్పుడు స్వేచ్ఛా, ఫలాలను వారందరూ అనుభవిస్తారని చెప్పవచ్చు.
పైన పేర్కొన్న విధంగా స్వేచ్ఛ, సమానత్వం ఒకదానికొకటి పరస్పర పోషకాలుగా ఉంటాయి. ఆ రెండు భావనలు ఒకే ఉమ్మడి లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. సమానత్వాన్ని విస్మరించినందునే స్వేచ్ఛ అనే అరాచకం, నియంతృత్వాలకు దారితీస్తుంది. అట్లాగే స్వేచ్ఛను పట్టించుకోకుండా, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తే, బానిసత్వం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యక్తి, సమాజాల ఔన్నత్యానికి ఆ రెండు భావనలు ఆవశ్యకమైనవిగా పేర్కొనవచ్చు.
ప్రశ్న 11.
సమానత్వానికి సంబంధించి ఏవైనా మూడు లక్షణాలను తెలపండి.
జవాబు.
1. సమానత్వం హక్కులను సాధించడం :
సమానత్వం అనేది సూచనాత్మకమైనదే కాని వివరణాత్మకమైనది కాదు. మానవులంతా తప్పకుండా సమానులే అని మానం భావిస్తాం. కాని అది వాస్తవం కాదు. సమాజంలో సాంఘిక ప్రయోజనాలను విస్తృతం చేసి వాటి ఫలాలను పేద వారికి అందించడం.
2. సమానత్వం ఆధునిక భావన :
మానవ జీవిత చరిత్రలో సంపదలో వ్యత్యాసాలు, అధికారంలో వ్యత్యాసాలు, గౌరవ ప్రతిష్ఠలలో వ్యత్యాసాలు అనేవి దాదాపు ప్రపంచమంతా కనిపిస్తాయి. శాస్త్రీయ యుగ ఆరంభంలో మానవుడు తన హేతుబద్ధమైన అనుభవపూర్వక జ్ఞానంతో ప్రకృతి వైపరీత్యాన్ని నియంత్రించడం నేర్చుకున్నాడు. ఈ పరిజ్ఞానం, ఆలోచన సమాజంలో ఉన్న సాంఘిక అసమానతలు సహజం కాదని, అసమానతలు తొలగించవచ్చనే ఆలోచనకు దారి తీసింది.
3. సామాజిక మార్పుకు సమానత్వం :
శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన ప్రగతి ఎక్కువ ప్రాంతాలలో సహజ అసమానత్వాన్ని ప్రత్యామ్నాయంగా పెంచిపోషించింది. ఆరోగ్యం, శారీరక పటిష్టత అనేది సరైన పౌష్టికాహారం వల్ల, మానసిక పరిపక్వత అనేది సరైన విద్య, రక్షణ ద్వారా సాధించవచ్చని మనకు తెలుసు. కాని ఈ ప్రయోజనాల లభ్యత అనేది వ్యక్తుల వ్యక్తిగత సాంఘిక, ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంది.
ప్రశ్న 12.
సమానత్వానికి సంబంధించి ఏవైనా మూడు రకాలను తెలపండి.
జవాబు.
సమానత్వం ఆధునికకాలంలో ఒక ప్రధాన ఆశయం. అది ప్రజాస్వామ్య ఆదర్శం. మానవులంతా పుట్టుకతో సమానులని కొందరు నమ్మారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో ప్రజలందరికి జాతి, మత, కుల, లింగ, భాషా, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సమానావకాశాలుండటమే సమానత్వము. సమానత్వం అంటే
- ఏ అడ్డంకులూ లేకుండా ప్రతి వ్యక్తీ వికాసం పొందడం
- శాసనాలు, పాలనలలో వ్యక్తుల మధ్య భేదం లేకుండా చేయడం
- చట్టం ప్రకారం లభించే హక్కులు సమానంగా లభించడం.
నిర్వచనం :
“సమానత్వం అంటే సమాజంలో కొందరికి మాత్రమే ప్రత్యేకమైన హక్కులు, అవకాశాలు కాకుండా అందరికీ సమానావకాశాలు ఉండటమే” అని లాస్కీ నిర్వచించాడు. పుట్టుక, కులం, మతం, ఆస్తి వంటి అర్హతలనుబట్టి వ్యక్తులకు అవకాశాలు కలుగజేస్తే సమానత్వం లభించదు. అందరికీ సమాన ఆదరణ ఉండటమే సమానత్వానికి అవసరం. సమానత్వ సిద్ధాంతం ప్రకారం చట్టం ముందు అంతా సమానులే. ఆధునిక రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానావకాశాలు కల్పించాలి.
1. సహజ సమానత్వం (Natural Equality) :
సహజ సమానత్వం అంటే అన్ని రకాల అవరోధాలు, సాంఘిక కట్టుబాట్ల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందడం. దీని అర్థం వ్యక్తి పరిధిలో ఎటువంటి ఆంక్షలు ఉండకపోవడం. సహజ సమానత్వం గురించి థామస్ హాబ్స్ ప్రతిపాదించిన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పేర్కొనడమైంది.
పౌర సమాజం ఆవిర్భవించక ముందే ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో జీవించారని ఈ సిద్ధాంతం పేర్కొన్నది. అసమానతలు, బంధనాలకు నాగరికత దారితీసిందని హాబ్స్ ఉద్ఘాటించాడు. గ్రీకు రోమన్ రాజకీయ తత్త్వవేత్తల రచనలలో ఈ భావం కనపడుతుంది.
2. సాంఘిక సమానత్వం (Social Equality) : వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాలు కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణ, లింగం, పుట్టుక వంటి అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.
ఉదాహరణకు భారతరాజ్యాంగం కుల, వర్గపరమైన వ్యత్యాసాలను నిషేధించింది. వాస్తవానికి అస్పృశ్యతను అది వ్యతిరేకించింది. పౌరులందరూ సాంఘిక సమానత్వాన్ని అనుభవించినప్పుడు, ఏ ఒక్కరు ఇతరులతో పోల్చినచో కులం, వర్గం, వర్ణం, పుట్టుక, తెగ, జన్మస్థలం వంటి అంశాలపై ఏ విధమైన వివక్షతకు గురికారు. ఈ సందర్భంలో క్రింద పేర్కొన్న అంశాలు సాంఘిక సమానత్వ సాధన, కొనసాగింపులకు సహాయపడతాయని చెప్పవచ్చు.
- రాజ్యం ఏ ఒక్క పౌరుడికి ప్రత్యేక సౌకర్యాలను అనుమతించరాదు.
- విద్య, ఉపాధి, పరిపాలన, శాసన నిర్మాణం వంటి రంగాలలో ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించి, అమలు చేయాలి.
- సాంఘిక, మతపరమైన వ్యవహారాలలో ప్రజలు సహనం, త్యాగం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి.
- రాజ్యంలోని పౌరులు తోటి పౌరులతో సహృద్భావ సంబంధాలను ఏర్పరచుకొని కొనసాగించుకోవాలి.
- తమ విజ్ఞాపనలను పంపించేటప్పుడు కులం, తెగ, లేక మతం వంటి వాటిని సూచించే పేర్లను ప్రజలు ఉపయోగించరాదు.
- కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి.
3. ఆర్థిక సమానత్వం (Economic Equality) :
ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్యకార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి – ఆదాయాలకు సంబంధించిన అంశం.
ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలను తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నం”గా లార్డ్స్ భావించాడు. ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్చను నిషేధించడాన్ని ఆర్థిక సమానత్వం”గా భావించాడు.
ప్రశ్న 13.
సమానత్వం మూలం మరియు ప్రాధాన్యతను తెలపండి.
జవాబు.
‘సమానత్వం’ అనే పదం సాధారణంగా మానవులందరూ సమానులే కాబట్టి అందరికీ ఒకే విధమైన ఆదరణ, గుర్తింపు, సంపద ఉండాలనే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. ప్రతీ మానవునికి సహజ సిద్ధంగానే సమానత్వ వాంఛ ఉంటుంది.
అయితే సమానత్వం అనే పదానికి శాస్త్రీయమైన అర్థాన్ని 1789లో ఫ్రాన్స్ దేశపు జాతీయసభ ఆమోదించిన మానవ హక్కుల ప్రకటనలో వివరించటం జరిగింది. మానవులందరూ స్వేచ్ఛ సమానత్వలతో జన్మించి వాటితోనే జీవితాంతం కొనసాగుతారు అని ప్రకటించబడింది.
“ప్రజలందరూ సృష్టిరీత్యా సమానులే అనే సత్యాన్ని మేము స్పష్టపరచిన దానిగా భావిస్తాం అని ‘1776లో వెలువడిన అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలో కూడా అనే భావం స్ఫురించే విధంగా వివరించారు. అంటే సమానత్వం మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం.
దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదన్న మాట. ఆ పంధాలోనే “స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదత్రయం ఫ్రెంచ్’ విప్లవాన్ని ఎంతగానో ఉత్తేజితపరచింది. 1917లో రష్యన్ భూమిపై ప్రజ్వరిల్లిన కమ్యూనిస్ట్ విప్లవం ఆర్థిక సమానత్వాన్ని సాధించి ఉద్భవించింది.
సమానత్వం ప్రాధాన్యత :
- వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది : వ్యక్తి వికాసానికి సమానత్వం అవసరం. మానవుని అభివృద్ధికి కావలసిన పరిస్థితులను సమానత్వం ఉన్న చోట పొందవచ్చు.
- ప్రతిభను గుర్తిస్తుంది : సమానత్వం ఉన్న చోట అన్ని వర్గాల ప్రజలు సమానావకాశాలు పొందుతారు. పేదరికం, వెనుకబాటుతనం వంటివి ప్రతిభను నిరూపించుకోవడానికి ఆటంకాలు కావు.
- స్వేచ్ఛను పెంపొందిస్తుంది : స్వేచ్ఛ, సమానత్వాలు పరస్పర పోషకాలు సమానత్వం స్వేచ్ఛను పెంపొందిస్తుంది.
- ప్రజాస్వామ్య విజయము : సమానత్వం ప్రజారాజ్య ఆదర్శం అదిలేనిదే ప్రజాస్వామ్యం విజయవంతం కాదు. ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమానత్వాలు పౌరులకు లభించాలి.
- ప్రతిష్ట పెంచుతుంది : వ్యక్తులంతా సమాన హోదా కలిగి, సాంఘికముగా ప్రతిష్ట పొందుతారు. రాజకీయ సమానత్వం వెనుకబడిన వర్గాల స్థాయిని పెంచింది. ”
- సాంఘిక న్యాయం : సమానత్వం సాంఘిక న్యాయాన్నిస్తుంది. అంటరానితనం, వెట్టిచాకిరి వంటి సాంఘిక దురాచారాలు రూపుమాపుతుంది.
ప్రశ్న 14.
న్యాయానికి సంబంధించి ఏవైనా మూడు రకాలను తెలపండి.
జవాబు.
న్యాయం రకాలు (Types of Justice) :
న్యాయం అనేక రకాలుగా ఉంటుంది. ఇది సహజవాబు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, చట్టబద్ధమైన పార్శాలకు సంబంధించినది. న్యాయభావనలోని వివిధ రకాలను కింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
1. సహజ న్యాయం (Natural Justice) :
ప్రపంచంలో లభించే సహజ వనరులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చుననే సూత్రం ఆధారంగా ప్రతిపాదించబడినదే సహజ న్యాయం. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికీ సహజ వనరులు జీవన ఆధారంగా ఉంటాయి. మానవులు ఒక్కరే హేతుబద్ధమైన జీవనం గడపటం వల్ల, సహజ వనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ సందర్భంలో మానవులు భవిష్యతరాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.
2. సామాజిక న్యాయం (Social Justice) :
సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది.
చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు ‘సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.
3. రాజకీయ న్యాయం (Political Justice) :
రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది.
ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ`భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.
- సమన్యాయ పాలన
- స్వతంత్ర న్యాయశాఖ
- ప్రాతినిధ్య సంస్థలకు ఎన్నికలు
- రాజకీయ పార్టీలు
- పత్రికా స్వాతంత్య్రం
- ప్రజాస్వామ్య పాలన మొదలైనవి.
ప్రశ్న 15.
న్యాయానికి సంబంధించి ఏవైనా రెండు భావనలను వివరించండి.
జవాబు.
1. గ్రీకులు, స్లోయిక్లు, రోమన్ల న్యాయ సిద్ధాంతం :
న్యాయ భావనను తొలిసారిగా చర్చించిన వారు గ్రీకులు కాగా, దానికి పునాదులు వేసిన వ్యక్తి ప్లేటో, ప్లేటో న్యాయ సిద్ధాంతంలో సుగుణం ప్రధానమైంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఎవరి పనులు వారే నిర్వహించుకోవడమే సుగుణం. అరిస్టాటిల్ ప్రకారం న్యాయం సంపూర్ణంగా సుగుణవంతమైంది.
స్లోయిక్ల ప్రకారం న్యాయం హేతువు ద్వారా కనుగొనబడింది. అదే విధంగా ఇది రాజ్యంచే రూపొందించబడిన సంవర్ధక శాసనం కంటే ఉన్నతమైంది. రోమన్ల ప్రకారం న్యాయం అనే భావన శాసనానికి సన్నిహితంగా ఉంటుంది.
2. ఆధునిక న్యాయ సిద్ధాంతం:
సంస్కరణోద్యమం, సాంస్కృతిక పునరుజ్జీవనం, పారిశ్రామిక విప్లవం అనంతరం ఇది అవతరించింది. హాబ్స్, లాక్, రూసోల సామాజిక ఒడంబడిక సిద్ధాంతంతో ఆధునిక న్యాయ సిద్ధాంతం అవతరించింది. నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి ఇవ్వడమే న్యాయం అని హాబ్స్ పేర్కొన్నాడు. లాక్ సహజ హక్కులలో న్యాయాన్ని గుర్తించగా, రూసో చెప్పిన “జనేచ్ఛ” న్యాయంతో కూడుకున్నదిగా చెప్పాడు.
3. సమకాలీన న్యాయ సిద్ధాంతాలు :
ఈ సిద్ధాంతాలు ప్రధానంగా స్థిరమైన న్యాయం (Substantial Justice), ప్రక్రియాత్మకమైన న్యాయం (Procedural Justice) ల మధ్యగల వ్యత్యాసాలపై దృష్టి పెడుతుంది. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ నియమ, నిబంధనలు మానవుని ప్రవర్తనను నిర్దేశించటానికీ నమూనా నిబంధనలుగా ఉంటాయని ప్రక్రియాత్మకమైన న్యాయం పరిగణిస్తుంది.
అన్ని రకాల వివక్షతలను వ్యతిరేకిస్తూ, మానవుని మధ్య నైతికతను, సమాన గౌరవాన్ని ప్రక్రియాత్మకమైన న్యాయం అనుమతిస్తుంది. F. A.. హాయక్, మిల్టన్ ఫ్రీడ్ మన్, నాజిక్ వంటి వారు దీన్ని ప్రతిపాదించిన వారిలో ప్రముఖులు.
స్థిరమైన న్యాయ భావన అనేది సామాన్యవాదం ఆలోచనల నుంచి అవతరించింది. సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల జీవన ప్రమాణాల పెంపుదలకు తగిన అవకాశాలు పొందేందుకు స్థిరమైన న్యాయం తోడ్పడుతుంది. ఇందులో వనరుల పంపిణీ అనేది ప్రధాన అంశం కాగా ప్రక్రియ అనేది ద్వితీయమైంది.
ప్రశ్న 16.
భారత రాజ్యాంగం మరియు సామాజిక న్యాయం.
జవాబు.
సామాజిక న్యాయం (Social Justice) :
సామాజిక న్యాయం అనే భావన సామాజిక భద్రతను కాంక్షిస్తుంది. అన్ని రకాల వివక్షతలను తొలగించాలని కోరుకుంటుంది. అదే విధంగా కులం, మతం, వర్ణ, లింగం, జాతి, పుట్టుక వంటి అంశాల ప్రాతిపదికన కొన్ని వర్గాలకు కల్పించే ప్రత్యేక హక్కులను నిషేధిస్తుంది.
అదేవిధంగా సామాజిక ప్రక్రియలో కొద్దిమంది ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ అత్యధిక జనాభాకు అన్ని అవకాశాలను పొందటానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడం కూడా సామాజిక న్యాయంలో అంతర్భాగం. సమాజంలో గల పేదరికం, నిరుద్యోగం, ఆకలి చావులు వంటి అంశాలను తొలగిస్తూ, అణగారిన వర్గాల శ్రేయస్సుకు తోడ్పడుతుంది.
ప్రతి వ్యక్తి గౌరవ ప్రదంగా జీవించి విద్యా, సాంస్కృతిక రంగాల్లో ఉన్నతంగా ఉండాలి. అన్ని స్థాయిల్లో సాంఘిక వివక్షతను తొలగిస్తుంది. సామాజిక న్యాయ భావన ద్వారా మూడు రకాల న్యాయాలను అర్థం చేసుకోవచ్చు అవి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. నీటిలో ఆర్థిక న్యాయం అత్యంత ప్రధానమైంది. ఎందుకంటే ఆర్థిక అసమానతలు అన్యాయానికి దారి తీసి శాసన, రాజకీయ న్యాయాలను హరించి వేస్తుంది.
భారత రాజ్యాంగం 1950 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ ప్రవేశికలో మరియు 4వ భాగంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాల్లో న్యాయ భావనను పొందుపరిచారు. అవి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాలు.
ప్రశ్న 17.
శక్తి అంటే ఏమిటి ? దాని ప్రాముఖ్యతను తెలపండి.
జవాబు.
శక్తి – స్వభావం – ఆవశ్యకత:
అర్థశాస్త్రంలో ద్రవ్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో రాజనీతి శాస్త్రంలో శక్తికీ అంతే ప్రాధాన్యత ఉంది. రాజనీతి శాస్త్రంలో శక్తి అనే భావన ప్రధానాంశం కావటంతో ఇది స్వతంత్ర హెూదాను పొందింది. ఇది తత్వశాస్త్రం, చరిత్ర, నీతిశాస్త్రం, న్యాయశాస్త్రాల సరసన చేరి ఒక ప్రముఖ అధ్యయన శాస్త్రంగా గుర్తించబడింది.
రాజకీయాలలో శక్తి భావన విశేషతను సంతరించుకొని దాని దృష్టి శక్తిని పొందటం, నిర్వహించడం, కోల్పోవటం వంటి వాటిపై పెట్టింది. “శక్తిని పొందటం మరియు పంచటం గురించి అధ్యయనం చేయటమే రాజనీతి |శాస్త్రమని” హెరాల్డ్ లాస్పెల్, ఎ. కాప్లాన్లు నిర్వచించారు.
ఆధునిక రాజనీతి శాస్త్రం అభివృద్ధి చెందుతున్న దశలో రాజనీతి శాస్త్రం కేవలం రాజ్యం వంటి వ్యవస్థీకృత సంస్థల గురించి మాత్రమే అధ్యయనం చేసేదిగా భావించేవారు. కాని నేడు అవ్యవస్థీకృత అంశాలైన శక్తి వాటి సంస్థలు కూడా చేరాయి. కాబట్టి వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రాజకీయ వ్యవస్థలతో కూడా రాజనీతిశాస్త్రం తన పరిధిని విస్తరించుకుంది.
సంప్రదాయ ధృక్కోణంలో శక్తి కేవలం సమాజంలో రెండు వర్గాల మధ్య నిర్వహించబడింది. అవి ఆధిపత్య వర్గాలు, అధీన వర్గాలు. కాని ఆధునిక బహుళత సమాజంలో వ్యక్తులు వారి వారి అంతస్థు, అభిరుచులను బట్టి విభిన్న వర్గాలుగా విభజించబడింది. ఈ వర్గాలు ఆధిపత్య, అధీన వర్గాలుగా మాత్రమే విభజించబడలేదు.
ప్రతీ వర్గం తమ తమ ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ వర్గాలు ప్రభుత్వంపై, ప్రభుత్వ విధానంపై ప్రభావితం చూపుతాయి. విధాన నిర్ణయంలో ప్రభుత్వానికి సహకరిస్తాయి. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించటానికి రాజనీతి శాస్త్రంలో శక్తి అధ్యయనం ఆవశ్యకం.
ప్రశ్న 18.
శక్తికి సంబంధించి ఏవైనా రెండు ధృక్పధాలను తెలపండి.
జవాబు.
1. శ్రేష్ఠ వర్గ ధృక్కోణం :
శక్తికి సంబంధించి శ్రేష్ఠ వర్గ దృక్కోణం 20వ శతాబ్దం ప్రారంభంలో పరెటో, మోస్కా, మిచెల్స్ అనే ముగ్గురు సామాజిక శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ప్రకారం సమాజం శ్రేష్ఠ వర్గం, సామాన్య జన సమ్మేళనంగా చీలి ఉంటుంది.
ఈ విధంగా చీలటానికి వ్యక్తులలో గల పోటీతత్వం, వారి వారి ఆసక్తులపై ఆధారపడి ఉంటుంది. శ్రేష్ఠ వర్గం రాజకీయ శక్తిని ప్రభావితం చేస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం సమాజంలో విభజన అనేది సహజవాబు. కార్యకరణ పరంగా ఉంటుంది. ఇది సంపూర్ణంగా మారుతుందనే నమ్మకాన్ని కలిగి ఉంటుంది.
2. సమూహ ధృక్కోణం:
ఈ ధృక్కోణంను అర్ధర్ బెంట్లీ అభివృద్ధి చేశాడు. శక్తిపై సమూహ ధృక్కోణం బహుతా సిద్ధాంతానికీ అనుగుణంగా ఉంటుంది. దీని ప్రకారం శక్తి అనే భావన సమాజాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది.
ఇవి ఆధిపత్య సమూహాలు, ఆధారిత సమూహాలు. సమూహ ధృక్కోణం ప్రకారం సమాజంలో శక్తి ఏ ఒక్క సమూహం చేతిలో కేంద్రీకృతం కాకుండా అది విభిన్న సామాజిక వర్గాల మధ్య విభజించబడి ఉంటుంది. ఈ సమూహాలు ఎక్కువగా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండి, స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకుంటాయి.
ప్రశ్న 19.
ఏవైనా మూడు రకాల అధికారాలను తెలపండి.
జవాబు.
1. చట్టబద్ధమైన అధికారం :
కొన్ని నిర్ణయాత్మక హక్కులు మరియు విధుల ప్రకారం అధికారంలో వున్న వ్యక్తులు తమ అధికారాలను చెలాయిస్తారు. ప్రదర్శన విధేయత అధికారంలో ఉన్న వ్యక్తిని దృష్టిలో ఉంచుకోకుండా, చట్టం ప్రకారం అధికారం ప్రకారం జరుగుతుంది.
మాక్స్వెబర్ అభిప్రాయంలో ఒక వ్యక్తి తన కార్యాలయం ప్రకారం కొన్ని, ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా మరియు అధికారాన్ని న్యాయమైన రీతిలో నిర్వహించడం ద్వారా చట్టబద్ధం అధికారాన్ని చెలాయిస్తాడు. చట్టబద్ధ అధికారాన్ని రాజ్యాంగబద్ధ అధికారం అనికూడా అంటారు. పార్లమెంటరీ విధానంలో నామమాత్రపు మరియు వాస్తవ కార్యనిర్వాహక అధిపతులైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి చెలాయించే అధికారాన్ని చట్టబద్ధ అధికారంగా చెప్పుకోవచ్చు.
2. సాంప్రదాయ అధికారం :
సాంప్రదాయ అధికారం ప్రాచీన ఆచారాలు, సాంప్రదాయాల ఆధారంగా నిర్వహించబడుతుంది. ఈ అధికారాన్ని చెలాయించే వ్యక్తులు ప్రజల సాంప్రదాయాలు, ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తారు. సాంప్రదాయ అధికారం నిరపేక్షమైనది కాదని, దాన్ని చెలాయించే వ్యక్తుల విచక్షణను బట్టి వుంటుందని మాక్స్వెబర్ పేర్కొన్నాడు.
అభివృద్ధికి నోచుకోని సమాజంలో ఈ విధమైన అధికారం వుంటుంది. ఒకప్పుడు నేపాల్, భూటాన్ లో ఈ విధమైన అధికారం వుండేది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ప్రభావంతో ఈ అధికారం తన ప్రాభవాన్ని, ప్రాముఖ్యతను కోల్పోయింది.
3. సమ్మోహన (లేదా) ఆకర్షణీయమైన అధికారం :
సమ్మోహన అధికారం నేటి ప్రపంచంలోని అనేక రాజ్యాల్లో వుంది. అనేక దేశాల్లో చట్టబద్ధ అధికారం ఆచరణలో వున్నప్పటికీ కొందరు రాజకీయ నాయకులు వారి రాజ్యాంగబద్ధ స్థాయికి బదులుగా సమ్మోహన అధికారం ద్వారానే కార్యకర్తలను, అనుచరులను ప్రభావితం చేస్తున్నారు.
సమ్మోహనాధికారం గల నాయకులు నిజాయితీకి అంకితమైన ధృక్పథంను కలిగి వుంటారు. ఫలితంగా వారు తమ దేశ ప్రజలను ప్రభావితం చేయగల మరియు ప్రేరేపించగల సామర్థ్యం కలిగి వుంటారు.
ఉదా : ‘బాలగంగాధర్ తిలక్, మహాత్మగాంధీ, రాజేంద్రప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్పటేల్, టంగుటూరి ప్రకాశం, షేక్ అబ్దుల్లా, ఎం.జి.రామచంద్రన్, ఎన్.టి.రామారావు.
ప్రశ్న 20.
శక్తి మరియు అధికారం మధ్య తేడాలను తెలపండి.
జవాబు.
శక్తి |
అధికారం |
1. శక్తి అనేది రాజకీయాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తుంది. | 1. అధికారం రాజకీయాలను పాలనాపరమైన కోణంలోనే చూస్తుంది. |
2. శక్తికి చట్టబద్ధత ఉండవచ్చు, లేకపోవచ్చు. | 2. శక్తికి చట్టబద్ధత జోడిస్తేనే అధికారమవుతుంది. |
3. ఇతరులను ఆదేశించేదే అధికారం. | 3. శాసనబద్ధమైన ప్రభావమే అధికారం. |
4. సమాజంలో శక్తి అనేది ఆదేశం, విధేయతలను వ్యక్తపరుస్తుంది. | 4. ఉన్నతస్థాయి నుంచి వచ్చే ఆదేశాన్ని దిగువ స్థాయిలో ఆమోదించటాన్ని అధికారం అంటారు. |
5. ఇతరుల ఆలోచనలను, చర్యలను ప్రభావితం చేసేది శక్తి. | 5. ఆదేశాలను, ఆజ్ఞలను ఇచ్చి, నిర్ణయాలను తీసుకునే హక్కును కలిగి వుండేది అధికారం. |
6. శక్తికి ప్రధాన ఆధారం జ్ఞానం మరియు అనుభవం. | 6. ఒక వ్యక్తి యొక్క అధికారాన్ని స్థాయి, పదవి నిర్ణయిస్తాయి. |
అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
శాసనం పదం అవతరణను తెలపండి.
జవాబు.
‘చట్టం’ అనే పదం టైటానిక్ భాష (జర్మన్) లోని ‘లాగ్’ అనే పదం నుండి గ్రహించబడింది. లాగ్ అనగా ”స్థిరంగా ఉండటం’ అని అర్థం. పద అర్థాన్ని బట్టి సార్వభౌమత్వ రాజకీయ అధికారిచే ప్రతిపాదించబడి, అమల్లోకి వచ్చిన ప్రవర్తనా నియమావళియే చట్టం అని భావించవచ్చు.
మరికొందరు రాజనీతిజ్ఞులు ‘చట్టం’ అనే పదం లాటిన్ భాషలోని ‘జస్’, ‘జంగేరి’ అనే రెండు పదాల నుండి గ్రహించబడిందని పేర్కొన్నారు. లాటిన్ భాషలోని ఈ రెండు పదాలకు ‘బంధం’ అనే అర్థం ఉంది.
ప్రశ్న 2.
శాసనానికి సంబంధించి ఏవైనా రెండు నిర్వచనాలను తెలపండి.
జవాబు.
- “రాజకీయాధికారాన్ని పొందిన సార్వభౌముడిచే అమలుచేసే బాహ్య చర్యలకు సంబంధించిన సాధారణ నియమమే చట్టం” అని టి. ఇ. హాలండ్ పేర్కొన్నాడు.
- “న్యాయపాలనలో రాజ్యం ఉపయోగించే సూత్ర సముదాయమే చట్టం” అని జాన్ సాల్మండ్ పేర్కొన్నాడు.
ప్రశ్న 3.
శాసనం లక్షణాలు ఏవి ?
జవాబు.
చట్టం ఈ క్రింది ముఖ్య లక్షణాలను కలిగి ఉంటుంది.
- సార్వభౌముడు ఆమోదించిన నియమ నిబంధనల సముదాయమే చట్టం.
- చట్టం నిర్దిష్టమైనది, ఖచ్చితమైనది మరియు విశ్వవ్యాప్తమైనది.
- చట్టం ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఉంటుంది.
- చట్టం ఉల్లంఘన శిక్షకు దారితీస్తుంది.
ప్రశ్న 4.
సమన్యాయ పాలనను నిర్వచించండి.
జవాబు.
సమన్యాయపాలన అంటే చట్టం ఆధిక్యత అని అర్థం. సమన్యాయపాలన అమలులో ఉన్న దేశాలలో ప్రభుత్వాధికారాలు చట్టాల ద్వారా నిర్ణయించబడతాయి. ప్రభుత్వ చర్యలన్నింటికి చట్టసమ్మతి ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించినపుడు మాత్రమే వ్యక్తి శిక్షింపబడతాడు.
ధనిక, పేద అనే విచక్షణ లేకుండా చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. చట్ట ఆధిక్యత లేదా సమన్యాయ పాలన ఉండటం వలన వ్యక్తులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లభిస్తాయి.
ప్రశ్న 5.
సంవర్థక శాసనం అంటే ఏమిటి ?
జవాబు.
మానవ సంస్థలచే రూపొందించబడేదే సంవర్థక శాసనం. ఈ శాసనాన్ని రాజకీయ శాసనం అని కొందరు పేర్కొన్నారు. వర్తమాన సామాజిక రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ శాసనం నిర్మితమైంది. సార్వభౌమత్వ రాజకీయ అధికారి ఈ శాసనానికి అనుమతిస్తారు. ఈ శాసనాన్ని అతిక్రమించినవారు శిక్షార్హులు.
ప్రశ్న 6.
పరిపాలక శాసనం అంటే ఏమిటి ?
జవాబు. పరిపాలక చట్టం (Administrative Law) :
పరిపాలన నిర్విఘ్నంగానూ, ప్రశాంతంగానూ కొనసాగే విషయంలో చట్టం కీలకపాత్రను పోషిస్తుంది. ప్రజలకు, ప్రభుత్వాధికారులకు మధ్య సంబంధాలను ఈ రకమైన చట్టం నియంత్రిస్తుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సంస్కరణలను తీసుకురావడంలో ఇది దోహదపడుతుంది.
పరిపాలక చట్టాలను అనుసరించడం ద్వారా ఈనాటి రాజ్యాలు అనేక దశలుగా శీఘ్రగతిన అభివృద్ధిని సాధించాయి. ప్రభుత్వ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసేటట్లు పరిపాలక చట్టం దోహదపడుతుంది.
ప్రశ్న 7.
శాసనం యొక్క ఏవైనా రెండు ఆధారాలను తెలపండి.
జవాబు.
చట్టానికి గల మూడు ఆధారాలు :
- ఆచారాలు
- మతం
- శాసనసభ.
ప్రశ్న 8.
రాజ్యాంగ శాసనం అంటే ఏమిటి ?
జవాబు.
రాజ్యాంగ చట్టం (Constitutional Law) :
రాజ్యాంగ చట్టమనేది సాధారణ చట్టం కంటే భిన్నంగా ఉంటుంది. రాజ్యంలో ఈ రకమైన చట్టం అత్యున్నతమైనది. ప్రభుత్వ నిర్మాణానికి ఇది వీలు కల్పిస్తుంది. ప్రభుత్వాంగాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. ప్రభుత్వాంగాల అధికార పరిధిని నిర్ణయిస్తుంది.
ఈ రకమైన చట్టం లిఖిత పూర్వకంగా ఉంటుంది. రాజ్యంలో నివసించే పౌరుల హక్కులు, బాధ్యతల గురించి వివరిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఈ చట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ప్రజాభీష్టానికి ప్రతీకగా ఉంటుంది.
ప్రశ్న 9.
సామాన్య శాసనం గురించి మీకు తెలిసినది వివరించండి.
జవాబు.
సామాన్య శాసనం :
పబ్లిక్ శాసనాల నుంచి పరిపాలక శాసనాన్ని మినహాయిస్తే మిగిలినవన్నీ సామాన్య శాసనంలో అంతర్భాగం. రాజ్యంలో గల పౌరుల మధ్యగల సంబంధాలను నిర్ణయించేదే సామాన్య శాసనం. వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలను వివరిస్తుంది. వివాహం, విడాకులు, ఒప్పందాలు మొదలైనవి. ఇందులో అంతర్భాగాలు. సామాన్య శాసనాన్ని చట్టబద్ధ శాసనం, సాధారణ శాసనంగా విభజించవచ్చు.
ప్రశ్న 10.
పబ్లిక్ శాసనాన్ని నిర్వచించండి.
జవాబు.
పబ్లిక్ చట్టం (Public Law) :
పబ్లిక్ చట్టం, రాజ్యం వ్యక్తుల మధ్య సంబంధాలను నియంత్రిస్తుంది. రాజ్యానికి సంబంధించిన మౌలిక నిర్మితి, విధులను పబ్లిక్ చట్టం వివరిస్తుంది. రాజ్యపు మితిమీరిన జోక్యానికి వ్యతిరేకంగా వ్యక్తులకు అవసరమైన హక్కులను అందిస్తుంది. పౌరులందరు ఈ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అతిక్రమించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.
ప్రశ్న 11.
బ్రిటిష్ రాజ్యాంగం ప్రత్యేకతను తెలపండి.
జవాబు.
బ్రిటిష్ రాజ్యాంగ విశిష్ట లక్షణం సమన్యాయపాలన. ఇది ముందుగా ఇంగ్లండులో అవతరించింది. అనంతరం భారతదేశం, అమెరికా దేశాలలో దీనిని అమలు చేశారు. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది, అని తెలిపేదే సమన్యాయపాలన. రాజ్యంలో నివశించే ప్రతి పౌరునికి శాసనాలు ఒకే విధంగా వర్తిస్తాయి.
ప్రశ్న 12.
సమత అంటే ఏమిటి ?
జవాబు.
‘సమత’ అనే పదానికి నిష్పక్షపాతం, న్యాయం లాంటి సూత్రాలను పర్యాయపదాలుగా వాడుతున్నారు. సమత అంటే సహజ న్యాయం. అమలులో ఉన్న చట్టాలు వివాదాల పరిష్కారానికి సహాయపడిన సందర్భాలలో న్యాయమూర్తులు తమ విజ్ఞత, విచక్షణతో వివాదాలను పరిష్కరిస్తారు. ఈ పరిష్కారాలే రాజ్యముచేత గుర్తించబడి చట్టాలుగా ప్రకటించబడతాయి.
ప్రశ్న 13.
శాస్త్రీయ వ్యాఖ్యానాలు అంటే ఏమిటి ?
జవాబు.
శాస్త్రవేత్తల వ్యాఖ్యానాలు చట్టానికి మరొక ముఖ్యమైన ఆధారం. ప్రఖ్యాత న్యాయమూర్తులు, న్యాయవాదులు వెల్లడించే అభిప్రాయాలు ఎనలేని ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. న్యాయవేత్తలు తమ వ్యాఖ్యానాల ద్వారా చట్టంలోని దోషాలను గుర్తించి, వాటి నివారణకు కొన్ని సూచనలు చేస్తారు. కాలక్రమంలో ఈ సూచనలే చట్ట నిర్మాణానికి ప్రధాన ఆధారాలవుతాయి.
ప్రశ్న 14.
శాసనానికి శాసన నిర్మాణ శాఖ ఒక ఆధారం తెలపండి.
జవాబు.
ప్రజాస్వామ్యంలో శాసనసభ శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రధానపాత్ర పోషిస్తుంది. కావున శాసనసభను చట్టం యొక్క ప్రత్యక్ష ఆధారంగా పేర్కొంటారు. చట్ట నిర్మాణంలో శాసనసభలు ప్రజానీకం ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటాయి. శాసనసభలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.
ప్రశ్న 15.
భారత రాజ్యాంగంలో గల సమన్యాయపాలన.
జవాబు.
భారత రాజ్యాంగం సమన్యాయపాలనను రాజ్యాంగ మౌలిక లక్షణంగా గుర్తించింది. సమన్యాయపాలన రాజ్యాంగ మౌళిక నిర్మాణంగా భారత సుప్రీంకోర్టు పదేపదే ప్రకటించింది. భారత రాజ్యాంగం మూడో భాగంలోని 14 నుంచి 21 వరకు గల ప్రకరణాలు సమన్యాయపాలన భావనను పొందుపరిచాయి. సమన్యాయపాలన భావన అనేది “చట్టం ముందు అందరూ సమానులే” ఏ ఒక్కరు విచక్షణారహితంగా శిక్షకు గురికాకూడదు” అనే సూత్రంపై ఆధారపడి వున్నది.
ప్రశ్న 16.
సంవర్థక స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు.
సకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అనేది వ్యక్తి తన అభీష్టం మేరకు నడుచుకొంటూ ఇతరులు కూడా తనవలె నడుచుకోవాలనే పరిస్థితిని సూచిస్తుంది. వేరొక మాటలో చెప్పాలంటే ఇతరులకు హాని కలిగించని అధికారమే స్వేచ్ఛ అనే ధృక్కోణాన్ని సూచిస్తుంది.
టి.హెచ్.గ్రీన్ అనే ఆదర్శ తత్త్వవేత్త ఈ రకమైన స్వేచ్ఛా ధృక్కోణాన్ని ప్రతిపాదించాడు. ఇతరులతో సమానంగా ఆనందంతో ఏదైనా చేసి అనుభవించేందుకు గల అధికారమే స్వేచ్ఛగా అతడు భావించాడు.
ప్రశ్న 17.
సంరక్షక స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు.
సకారాత్మక ధృక్కోణంలో స్వేచ్ఛ అంటే ఎటువంటి ఆంక్షలు లేకపోవడం. తమ స్వాతంత్య్రాల మీద ఎలాంటిఆంక్షలు లేనప్పుడే వ్యక్తులు స్వాతంత్ర్యాన్ని పొందగలరు. అయితే కొందరు దీన్ని వాస్తవ విరుద్ధమైనదిగా భావించారు. రాజ్యం ఆవిర్భావానికి పూర్వం మాత్రమే వ్యక్తులకు ఆంక్షల్లేని స్వేచ్ఛ ఉందన్నారు. వారి ప్రకారం అటువంటి రాజ్యం అసాధ్యమైందే కాకుండా, ఆధునిక కాలంలో వ్యక్తులు స్వాతంత్ర్యాన్ని అనుభవించే వీలులేనిది కూడా అవుతుంది.
ప్రశ్న 18.
స్వేచ్ఛకు సంబంధించి ఏవైనా నాలుగు లక్షణాలను తెలపండి.
జవాబు.
- మానవీయ వ్యక్తిత్వాల సాధనకు అత్యంత ఆవశ్యకమైంది.
- స్వేచ్ఛ ఒక శక్తివంతమైన భావన. దాని వ్యాఖ్యానమనేది స్థలం, కాలం, ప్రాంతం, ప్రజల ఆకాంక్షలను బట్టి ఉంటుంది.
- వ్యక్తుల ఆకాంక్షలను సదా వాస్తవం చేయడమే స్వేచ్ఛ లక్ష్యం అవుతుంది.
- నిర్హేతుకమైన ఆంక్షలకు బదులు నిరంతరం సానుకూల పరిస్థితులను కలిగి ఉండటమే స్వేచ్ఛ.
ప్రశ్న 19.
స్వేచ్ఛకు సంబంధించి ఏవైనా రెండు రకాలను తెలపండి.
జవాబు.
స్వేచ్ఛలోని నాలుగు రకాలు :
- సహజ స్వేచ్ఛ
- పౌర స్వేచ్ఛ
- రాజకీయ స్వేచ్ఛ
- ఆర్థిక స్వేచ్ఛ.
ప్రశ్న 20.
పౌర స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు.
పౌర స్వేచ్ఛ (Civil Liberty) :
పౌర స్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడ అంటారు. ఇది సామాజిక సంస్థలోని సభ్యుడైన వ్యక్తి జీవనంలోని స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. పౌర స్వేచ్ఛలో కింద పేర్కొన్న మూడు అంశాలు ఇమిడి ఉంటాయని బార్కర్ పేర్కొన్నాడు.
- సంచార స్వేచ్ఛను సూచించే భౌతిక స్వాతంత్ర్యం
- ఆలోచన, అభివ్యక్తి, ముఖ్యమైన ప్రశ్నలు విశ్వాసాన్ని కలిగి ఉండే భౌద్ధిక స్వాతంత్ర్యం
- నిజజీవితంలోని ఆచరణాత్మక ఐచ్ఛిక స్వాతంత్ర్యం.
పౌర స్వేచ్ఛ అనేది మిగతా స్వేచ్ఛలకు ప్రాతిపదికగా ఉంటుంది. సహజ స్వేచ్ఛకు ఇది విరుద్ధమైంది. సమాజంలోని పౌరులు దానిని అనుభవిస్తారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకిది ఆవశ్యకమైనది. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రాపంచిక విషయాలను ఉమ్మడిగా అనుభవించ గలిగినప్పుడే పౌర స్వేచ్చ వాస్తవమవుతుంది.
“రాజ్యం చేత గుర్తించబడి అమలయ్యే హక్కుల సముదాయమే పౌర స్వేచ్చ” అని గెటిల్ పేర్కొన్నాడు.
పౌర స్వేచ్ఛ అనేది అనేక హక్కుల రూపంలో ఉంటుంది. అవి
- జీవించే హక్కు
- పనిచేసే హక్కు
- ఆస్తి హక్కు
- వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ, సమావేశ, సంచార, స్థిర నివాసపు హక్కులు మొదలైనవి.
ప్రశ్న 21.
రాజకీయ స్వేచ్ఛ గురించి తెలపండి.
జవాబు.
రాజకీయ స్వేచ్ఛ (Political Liberty) :
రాజకీయ స్వేచ్ఛ పౌరులు రాజకీయాంశాలలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఈ రకమైన స్వేచ్ఛ పౌరులకు రాజ్య కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే శక్తినిస్తుందని లాస్కీ పరిగణించాడు. రాజకీయ స్వేచ్ఛను ప్రజాస్వామ్యానికి పర్యాయపదంగా గిల్ క్రిస్ట్ భావించాడు. రాజకీయ స్వేచ్ఛ అంటే ఎవరికి వారు తమ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకొనే రాజ్యాంగ స్వేచ్ఛగా లీకాక్ వర్ణించాడు.
రాజకీయ స్వేచ్ఛ పౌరులకు మాత్రమే పరిమితమైంది. అది సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ స్వేచ్ఛ పౌరులకు రాజకీయాంశాలలో వివిధ హక్కులను కల్పిస్తుంది. అటువంటి వాటిలో i) ఓటు వేసే హక్కు ii) ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేసే హక్కు iii) ప్రభుత్వ పదవులను చేపట్టే హక్కు iv) విమర్శించే హక్కువంటివి ఉన్నాయి. విద్య, నిజాయితీ, నిష్పక్షపాతమైన పత్రికలు మొదలైనవి ఉన్నప్పుడే రాజకీయ స్వేచ్ఛ వాస్తవం అవుతుందని లాస్కీ నొక్కి చెప్పాడు.
ప్రశ్న 22.
ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి కావలసిన సాధనాలు తెలపండి.
జవాబు.
సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛ సాధన ఈ క్రింది చర్యల ద్వారా సాధ్యమవుతుంది. అవి
- కనీస వేతనాలను అందించటం
- పనిహక్కుకు భరోసా కల్పించటం
- నిరుద్యోగం, అనారోగ్యం వంటి అభద్రతల నుండి కార్మికులను రక్షించటం
- తగినంత విశ్రాంతిని కల్పించటం
- పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించటం.
ప్రశ్న 23.
ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి ?
జవాబు.
ఆర్థిక స్వేచ్ఛ (Economic Liberty) :
ఆర్థిక స్వేచ్ఛ అంటే ప్రతిఒక్కరూ తమ జీవనోపాధిని తామే సంపాదించుకోగలగడం. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారాన్ని హేతుబద్ధంగా సంపాదించుకొనే భద్రమైన అవకాశమే ఆర్థికస్వేచ్ఛగా లాస్కీ అభివర్ణించాడు. కోరిక – భయము, ఆకలి – పస్తులు, నిరుద్యోగం – అసంపూర్ణతల నుంచి విముక్తి కలిగించేదే ఆర్థిక స్వేచ్ఛ. ఇది ఆర్థిక సంబంధమైన లేమి లేదా అభద్రతల నుంచి స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛలేని ప్రజాస్వామ్యం అర్థరహితమైంది.
ఈ దిగువ పేర్కొన్న చర్యల అమలు ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు.
- కనీస వేతనాలను అందించడం.
- పని హక్కుకు భరోసా కల్పించడం.
- నిరుద్యోగం, అనారోగ్యం వంటి వివిధ రకాల అభద్రతల నుంచి కార్మికులను రక్షించడం.
- తగినంత విశ్రాంతిని కల్పించడం.
- పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించడం.
ప్రశ్న 24.
జాతీయ స్వేచ్ఛ గురించి తెలపండి.
జవాబు.
జాతీయ స్వేచ్ఛ (National Liberty) :
జాతీయ స్వేచ్ఛ అంటే రాజ్యం – స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. రాజ్యపు సార్వభౌమత్వాన్ని అది సూచిస్తుంది. ప్రతి రాజ్యం ఈ స్వేచ్ఛను అనుభవిస్తూ ఇతర రాజ్యాల ఆధిపత్యానికి లోనుగాకుండా ఉంటుంది. అన్ని రంగాలలో జాతి అభివృద్ధికి ఈ స్వేఛ్ఛ ఆవశ్యకమైంది. ప్రాచీనకాలం నుంచి అనేక దేశాల్లో ఇది విశదమైంది.
ఈ రకమైన స్వేచ్ఛను పొందడం కోసం అనేక దేశాలు ఎంతగానో ప్రయత్నించాయి. గతంలో టర్కీ ప్రజలకు వ్యతిరేకంగా గ్రీకులు స్వాతంత్య్ర సమరం సాగించారు. అట్లాగే మహాత్మాగాంధీ నాయకత్వంలో భారత ప్రజలు బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం కోసం అహింసాయుత పోరాటం చేశారు. జాతీయ స్వేచ్ఛ ఎంతో విలువైంది.
ప్రశ్న 25.
స్వేచ్ఛకు సంబంధించి ఏవైనా నాలుగు పరిరక్షణలను తెలపండి.
జవాబు.
స్వేచ్ఛకు గల నాలుగు పరిరక్షణలు :
- ప్రజాస్వామ్య పాలన
- లిఖిత మరియు దృఢ రాజ్యాంగం
- స్వతంత్ర న్యాయవ్యవస్థ
- సమన్యాయపాలన.
ప్రశ్న 26.
స్వేచ్ఛ రక్షణకు న్యాయశాఖ స్వతంత్రత ఏ విధంగా తోడ్పడుతుంది ?
జవాబు.
వ్యక్తి స్వేచ్ఛకు పరిరక్షణయే స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయవ్యవస్థ. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని సమర్థించి, ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహించేటట్లు చూస్తుంది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు వివిధ రక్షణలను సూచిస్తుంది. కావున స్వేచ్ఛ పరిరక్షించబడటానికి స్వతంత్ర న్యాయశాఖ అత్యంత అవసరం అని రాజనీతిజ్ఞులు భావిస్తారు.
ప్రశ్న 27.
శాసనబద్ద సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
సమాజంలో అందరికీ పౌరహక్కులు లభించడమే శాసనబద్ద సమానత్వం. కుల, వర్ణ, ‘జన్మ, మతపరమైన అంశాల్లో ఎలాంటి విచక్షణ లేకుండా సామాజిక హోదాపరంగాగాని, మతపరమైన నమ్మకాల విషయంలోగాని, రాజకీయపరమైన అభిప్రాయాల్లోగాని, ప్రతి ఒక్కరు సమానత్వాన్ని కలిగి వుండటమే శాసనబద్ద సమానత్వం. ఏ ఒక్కరు ప్రత్యేక హోదాగాని, అవకాశాలు గాని కలిగి వుండరు.
సమాజంలో చట్టం ముందు అందరూ సమానులే అనే భావన వుంటుంది. ప్రజలందరికీ చట్టపరమైన సమాన రక్షణలను శాసనబద్ధ సమానత్వం కలిగిస్తుంది.
ప్రశ్న 28.
ఆర్థిక సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
ఆర్థిక సమానత్వం (Economic Equality) :
ఆర్థిక సమానత్వాన్ని సాంఘిక, రాజకీయ సమానత్వాలకు పునాదిగా పరిగణించడమైంది. ఆధునిక రాజ్య కార్యకలాపాల వెనుక అదొక ముఖ్యమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సమానత్వమంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో విపరీతమైన వ్యత్యాసాలు లేకుండా చేయడంగా పేర్కొనవచ్చు. ఎర్నెస్ట్ బార్కర్ దృష్టిలో ఆర్థిక సమానత్వం అనేది హోదాకు, పాక్షికంగా ఆస్తి – ఆదాయాలకు సంబంధించిన అంశం.
ఆర్థిక సమానత్వాన్ని “సంపదకు చెందిన వ్యత్యాసాలకు తొలగించి ప్రయత్నంగా, ప్రాపంచిక వస్తువులను స్త్రీ, పురుషుల మధ్య సమానంగా పంపిణీ చేయాల్సిన ప్రయత్నంగా లార్డ్స్ భావించాడు.
ఇక ప్రొఫెసర్ లాస్కీ “పారిశ్రామిక ప్రపంచంలో విశృంఖలమైన, బాధ్యతారహిత ఇచ్ఛను భావించాడు. అదేసమయంలో ఆర్థిక సమానత్వమనేది సమాన ఆదరణ, ప్రతిఫలంగా భావించరాదు. వ్యక్తులు తగిన పనిని పొందే అవకాశం ద్వారా జీవనభృతిని సంపాదించుకొని, తమ ఆర్థిక హోదాను పెంపొందించుకొనేందుకు అది సంకేతంగా ఉంటుంది. అనేక సామ్యవాద దేశాలు ఆర్థిక సమానత్వ సాధనకు ప్రయత్నించి పాక్షికంగా విజయవంతమైనాయి.
ప్రశ్న 29.
రాజకీయ సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
రాజకీయ సమానత్వం (Political Equality) :
రాజకీయ సమానత్వం రాజకీయ కార్యకలాపాలలో ప్రజలకు చాలినన్ని అవకాశాలను కల్పించేందుకు అనుకూల పరిస్థితులను సూచిస్తుంది. రాజ్యంలోని పౌరులకు వివిధ రకాల రాజకీయ హక్కులను ప్రసాదించడం ద్వారా ఆ రకమైన సమానత్వాన్ని సాధించవచ్చు. ఈ సందర్భంలో రాజకీయ సమానత్వాన్ని పౌరులు మాత్రమే అనుభవిస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యంలో నివసించే అన్యులు, విదేశీయులకు ఇది వర్తించదు.
ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ సమానత్వమన్నది అత్యంత ఆవశ్యకమైంది. వివిధ రాజకీయ హక్కులను ప్రసాదించినప్పుడే పౌరులు రాజకీయ స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే, రాజకీయ సమానత్వమనేది రాజకీయ స్వేచ్ఛకు పర్యాయపదంగా భావించవచ్చు.
ప్రశ్న 30.
సమానత్వం – సామాజిక మార్పు.
జవాబు.
శాస్త్ర, సాంకేతిక రంగాలలో సాధించిన ప్రగతి ఎక్కువ ప్రాంతాలలో సహజ అసమానత్వాన్ని ప్రత్యామ్నాయంగా పెంచి పోషించింది. ఆరోగ్యం, శారీరక పటిష్టత అనేది సరైన పౌష్ఠికాహారం వల్ల, మానసిక పరిపక్వత అనేది సరైన విద్య, రక్షణ ద్వారా సాధించవచ్చని మనకు తెలుసు. కాని ఈ ప్రయోజనాల లభ్యత అనేది వ్యక్తుల వ్యక్తిగత సాంఘిక, | ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి వుంది.
ప్రశ్న 31.
అంతర్జాతీయ సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
అంతర్జాతీయ సమానత్వం: అంతర్జాతీయ సమానత్వం అంటే ప్రతిదేశం భౌగోళిక, ఆర్థిక, సైనికపరమైన విషయాలలో మాత్రమే కాకుండా అన్నింటా సమానంగా గుర్తింపు పొందడమే. దీని ప్రకారం ప్రపంచంలో చిన్న రాజ్యాలైన లేదా పెద్ద రాజ్యాలైన అన్ని సమానమే.
ఐక్యరాజ్యసమితి ఛార్టర్లో కూడా అన్ని రాజ్యాలకు సమావ హోదా, గౌరవం ఇచ్చింది. తద్వారా ప్రతీ రాజ్యం తమ సార్వభౌమాధికారానికి గౌరవమిస్తూ తమ మధ్య నెలకొనే వివాదాలను పరిష్కరించుకోవాలి. అంతర్జాతీయ సమానత్వం అనేది మానవాళి ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు.
ప్రశ్న 32.
సాంఘిక సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
వర్గ వ్యత్యాసాలు లేకపోవడం, సమానమైన హోదాను కలిగి ఉండటాన్ని సాంఘిక సమానత్వం సూచిస్తుంది. ఏ వ్యక్తి మతం, వర్గం, వర్ణం, లింగం, పుట్టుక మొదలగు అంశాల ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉంటే సాంఘిక సమానత్వం నెలకొంటుంది.
సమాజంలో పౌరులందరినీ సమానమైనవారుగా సాంఘిక సమానత్వం భావిస్తుంది. పౌరులందరూ సమానమైన సాంఘిక, రాజకీయ, ఆర్థిక, చట్టపరమైన హక్కులను అనుభవించేందుకు వీలు కల్పించే సమానత్వాన్నే సాంఘిక సమానత్వం అని అంటారు.
ప్రశ్న 33.
సమానత్వం అనేది స్వేచ్ఛకు ఏవిధంగా అవసరం ?
జవాబు.
సమానత్వం అంటే ఒకే విధమైన ఆదరణ అని అర్థం కాదు. ఎందుకంటే అటువంటి సమానత్వం పౌర సమాజంలో సాధ్యంకాదు. అందుకు బదులుగా ఒకేరకమైన పరిస్థితులలో సమానమైన ఆదరణయే సమానత్వంగా పేర్కొనవచ్చు.
పౌర సమాజంలో కొందరు ఇతరులతో సమానమైన హోదాను కలిగి వుండరు. అయితే వారికి తమ వ్యక్తిత్వం, హోదాలను పెంపొందించుకొనేందుకై కొన్ని పరిస్థితులు, అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ సమానంగా ఉన్నప్పుడు స్వేచ్ఛా ఫలాలను వారందరూ అనుభవిస్తారని చెప్పవచ్చు.
ప్రశ్న 34.
స్వేచ్ఛ అనేది సమానత్వంకు ఏ విధంగా అవసరం ?
జవాబు.
సమానత్వానికి స్వేచ్ఛ అవసరం (Liberty is essential for Equality) :
- స్వేచ్ఛ అంటే నిరపేక్షమైనది కాదు. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని నిబంధనలకు లోబడి సామాజిక సంక్షేమాన్ని సాధించేందుకై ఈ స్వేచ్ఛ అందరికీ అందుబాటులో ఉంటుంది.
- స్వేచ్ఛ అంటే ఏ ఒక్క వ్యక్తి లేదా వ్యక్తుల సముదాయపు గుత్తాధికారంగా భావించరాదు.
- ఒకానొక వ్యక్తి స్వేచ్ఛను అనుభవించడమనేది ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉండకూడదనే ఈ సూత్రాన్ని ఆమోదించారు. సమానత్వ సూత్రాన్ని గౌరవించవలసి ఉంటుంది.
దాని అర్థం స్వేచ్ఛా ఫలాలు సమానత్వమనే వృక్షానికి చెందిన శాఖలలో ఉంటాయని పేర్కొనవచ్చు. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వాలు ఒకదానికొకటి పరస్పర పోషకాలుగా భావించడమైంది. సమానత్వ సూత్రం ఆధారంగా స్వేచ్ఛను వర్తింపజేస్తే, స్వేచ్ఛా లక్ష్యం వాస్తవానికి నెరవేరినట్లవుతుంది.
ప్రశ్న 35.
అవకాశాలలో సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.
రాజకీయ సమానత్వం: రాజకీయ సమానత్వం అంటే ప్రజలందరికీ సమాన రాజకీయ అవకాశాలు, రాజకీయ పదవులు, రాజకీయ హోదా కలిగి ఉండడం. ప్రతీ పౌరుడు ఓటు వేసే హక్కు, ఎన్నికలలో పోటీ చేసే హక్కు, ప్రభుత్వ ఉద్యోగం పొందే హక్కు, ప్రభుత్వాన్ని సద్విమర్శ చేసే హక్కు మొదలైనవి అనుభవిస్తాడు. శతాబ్దాలుగా ఈ రకమైన సమానత్వం. కొద్దిమందికే పరిమితమై చాలా మందికి నిరాకరించబడింది. రాజకీయ హక్కులు కేవలం భూస్వాములు, పన్ను కట్టేవారు, విద్యావంతులు మొదలైన వారికే ఉండేవి.
ఆధునిక ప్రజాస్వామ్యం 17, 18వ శతాబ్దంలో అవతరించినప్పటికి 20వ శతాబ్దం వరకు స్త్రీలకు కూడా రాజకీయ హక్కులు నిరాకరించబడినవి. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చెయ్యాలంటే పౌరులకు రాజకీయ సమానత్వం తప్పనిసరి. రాజకీయ సమానత్వం అనే భావన ప్రజాస్వామ్యం, సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా వెల్లడవుతుంది.
ప్రశ్న 36.
న్యాయాన్ని నిర్వచించండి.
జవాబు.
నిర్వచనాలు :
- ప్లేటో : “వ్యక్తి తన పని తాను చేసుకుంటూ, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే న్యాయం”.
- అరిస్టాటిల్ : “న్యాయం అంటే సమాజంలో ప్రతి వ్యక్తీ తన నైతిక బాధ్యతలను నిర్వర్తించడం తప్ప మరేదీకాదు”.
- కెఫాలస్ : “న్యాయం అంటే ప్రతి ఒక్కరూ సత్యాన్ని పలకడం, ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వడం”.
ప్రశ్న 37.
న్యాయం లక్షణాన్ని తెలపండి.
జవాబు.
శాసనం, స్వేచ్ఛ, సమానత్వం భావనలను సమన్వయం చేస్తూ, ఐక్యం చేయటానికే న్యాయం ఉపయోగపడుతుంది. అణగారిన వర్గాల, అసహాయుల అణచివేత, పీడన నుంచి విముక్తి కలిగించటానికే న్యాయం తోడ్పడుతుంది. సమకాలీన ప్రపంచంలో వస్తువులు, సేవలు, అవకాశాలు, లాభాలు, శక్తి, గౌరవం వంటివి న్యాయబద్ధంగా లభించటం అనేది న్యాయం వల్లనే సాధ్యమవుతుంది.
ప్రశ్న 38.
రాజకీయ న్యాయం అంటే ఏమిటి ?
జవాబు.
రాజకీయ న్యాయం (Political Justice) :
రాజకీయ న్యాయం అనేది రాజకీయ సమానత్వాన్ని సూచిస్తుంది. రాజ్యంలోని వయోజనులైన పౌరులకు రాజకీయ హక్కులను ఈ రకమైన న్యాయం ప్రతిపాదిస్తుంది. దేశ పాలనలో పౌరులు స్వేచ్ఛగానూ, నిర్భయంగానూ పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ న్యాయ భావన విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది. రోజువారి పాలనలో పౌరులు చురుకుగా పాల్గొనేందుకు రాజకీయ న్యాయం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ప్రతి ఒక్కరూ ఇతరులతో పాటుగా సమానులేనని, ఏ ఒక్కరూ ఇతరుల కంటే ఏ విషయంలోనూ అధికులు కారనీ, ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉండరనే సూత్రంపై ఈ భావన రూపొందింది. రాజ్యంలో రాజకీయ న్యాయం ఉండాలంటే కింద పేర్కొన్న పరిస్థితులు నెలకొనాలి.
ప్రశ్న 39.
సామాజిక న్యాయానికి సంబంధించి నీకేమి తెలుసు ?
జవాబు.
సామాజిక న్యాయం (Social Justice) :
సామాజిక న్యాయం అనేది వ్యక్తుల హక్కులు, సమాజం నియంత్రణల మధ్య చక్కని సమతౌల్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించింది. వర్తమాన చట్టాలకు లోబడి వ్యక్తుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చుకొనేందుకు ఈ రకమైన న్యాయం వీలు కల్పిస్తుంది.
చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రాన్ని సామాజిక న్యాయం నమ్ముతుంది, సామాజిక అనర్థాలైన పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఆకలి వంటి వాటిని అధిగమించేందుకు సామాజిక న్యాయం హామీ ఇస్తుంది. సమాజంలోని నిమ్నవర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు రక్షణ కల్పిస్తుంది. అంతిమంగా వ్యక్తుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది.
ప్రశ్న 40.
శాసనబద్ధ న్యాయం గురించి తెలపండి.
జవాబు.
శాసనబద్ధ న్యాయం : (Legal Justice) :
రాజ్యం రూపొందించిన శాసనాల ద్వారా శాసనబద్ధ న్యాయం గోచరిస్తుంది. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పార్లమెంట్ చట్టం ద్వారా రూపొందించబడుతుంది. ఇది న్యాయ విస్తరణను నిర్ణయిస్తుంది.
ప్రశ్న 41.
న్యాయ భావనపై ప్లేటో అభిప్రాయం.-
జవాబు.
ఇతరుల కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా ఎవరి పనులు వారే నిర్వహించడం; అదే విధంగా హేతువు, ధీరత్వం, ఇచ్ఛల సమన్వయమే న్యాయం”.
ప్రశ్న 42.
న్యాయ భావనపై అరిస్టాటిల్ అభిప్రాయం.
జవాబు.
“సమాజంలో ఎవరికి నిర్దేశించిన నైతిక విధులను వారు సక్రమంగా నిర్వహించడమే న్యాయం”.
ప్రశ్న 43.
ప్రక్రియాత్మకమైన న్యాయం గురించి తెలపండి.
జవాబు.
మార్కెట్ ఆర్థిక వ్యవస్థ నియమ, నిబంధనలు మానవుని ప్రవర్తనను నిర్దేశించటానికి నమూనా నిబంధనలుగా ఉంటాయని ప్రక్రియాత్మకమైన న్యాయం పరిగణిస్తుంది. అన్ని రకాల వివక్షతలను వ్యతిరేకిస్తూ, మానవుని మధ్య నైతికతను, సమాన గౌరవాన్ని ప్రక్రియాత్మకమైన న్యాయం అనుమతిస్తుంది. ఎఫ్.ఎ. హాయక్, మిల్టన్ ఫ్రీడ్మన్, నాజిక్ వంటి వారు దీన్ని ప్రతిపాదించిన వారిలో ముఖ్యులు.
ప్రశ్న 44.
స్థిరమైన న్యాయం గురించి తెలపండి.
జవాబు.
స్థిరమైన న్యాయభావన అనేది సామాన్యవాదం ఆలోచనల నుంచి అవతరించింది. సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల జీవన ప్రమాణాల పెంపుదలకు తగిన అవకాశాలు పొందేందుకు స్థిరమైన న్యాయం తోడ్పడుతుంది. ఇందులో వనరుల పంపిణీ అనేది ప్రధానాంశం కాగా ప్రక్రియ అనేది ద్వితీయమైనది.
ప్రశ్న 45.
శక్తి అంటే ఏమిటి ?
జవాబు.
వ్యక్తి తన కోరికలను తీర్చుకోవటానికి లేదా లక్ష్యాన్ని సాధించటానికి అతనిలోగల నైపుణ్యతను తెలియజేసేదే శక్తి. ఒక వ్యక్తి లేదా సమూహం వేరే వ్యక్తి లేదా సమూహంపై చూపే ప్రభావాన్ని శక్తి తెలుపుతుంది.
రాబర్ట్ ధాల్ అభిప్రాయంలో “శక్తి అనేది ఒక రకమైన ప్రభావం చూపే భావన, అనంగీకారాన్ని అంగీకరించే విధంగా చేయడానికి ఉపకరించేదే శక్తి”.
ప్రశ్న 46.
అధికారం అంటే ఏమిటి ?
జవాబు.
ఇతరులను ఆదేశించేదే అధికారం. ఉన్నత స్థాయి నుంచీ వచ్చే ఆదేశాన్ని దిగువ స్థాయిలో ఆమోదించటాన్ని అధికారం అంటారు. రాజకీయాలలో శక్తిని ప్రదర్శించటానికి అత్యంత ప్రభావవంతమైన సాధనంగా అధికారం వుంటుంది. అధికారం అనే భావన రెండు ప్రధానమైన రూపాలను కలిగి వుంటుంది. అది శక్తి, శాసనబద్ధత.
ప్రశ్న 47.
శాసనబద్ధత అంటే ఏమిటి ?
జవాబు.
ఒక చట్టం శాసనబద్ధత ద్వారా సమాజంలోని వ్యక్తులతోపాటు అందరికీ ప్రయోజనకరంగా ఉన్నప్పుడు వ్యక్తులు ఆ చట్టాలకు ఇష్టపూర్వకంగానే విధేయత చూపుతారు. ఒకవేళ శక్తి అనేది దేనినైన బలవంతంగా అమలుచేయడాన్ని సూచిస్తే, శాసనబద్ధత అనేది ఇష్టపూర్వకంగా ఆమోదించటాన్ని తెలుపుతుంది.
సమాజంలో శక్తి అనేది ఆదేశం, విధేయతలను వ్యక్తపరుస్తుంది. ఒకవేళ ఆదేశం అనేది సరైన ప్రేరణపై ఆధారపడితే, విధేయత అనేది ఇష్టపూర్వకంగా ఉంటుంది. ఈ సందర్భంలో శక్తి అనేది శాసనబద్ధమై వుంటుంది.
ప్రశ్న 48.
ఏకధృవ ప్రపంచం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రచ్ఛన్న యుద్ధ పరిసమాప్తి తర్వాత అంతర్జాతీయ రాజకీయాలలో అమెరికా ఆధిపత్యాన్ని ఏకధృవ ప్రపంచం అని పేర్కొంటున్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఆర్థిక, సైనిక రంగాలలో అమెరికా ప్రథమ దేశంగా కొనసాగుతున్నది. ప్రచ్ఛన్న యుద్ధం సమాప్తం కావడం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడం, అమెరికా శక్తిని, అధికారాన్ని ఎదుర్కొనే మరొక దేశం లేకపోవడం, అమెరికా సైనిక, ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక రంగాలలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండటం మొదలగు కారణాల వలన అమెరికా అధికారానికి తిరుగులేకుండా ఉంది.
ప్రశ్న 49.
రాజ్యంలో శక్తి యొక్క ప్రాథమిక అంశాలు ఏవి ?
జవాబు.
- శక్తి అనేది వ్యక్తుల మధ్య లేదా వ్యక్తి సమూహాల మధ్య ఉండే సంబంధం.
- మానవ ప్రవర్తనను అదుపులో పెట్టడానికి ఉండే సంబంధం.
- వ్యక్తుల మధ్య లేదా వర్గాల మధ్య ఉండే అంతర్గత బంధం.
- సమ్మతి, బలాత్కారం ఉన్న అంతర్గత సంబంధం.
- స్వాభావిక గుణదోషరహితమైంది శక్తి.
ప్రశ్న 50.
శక్తికి సంబంధించి శ్రేష్ఠ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు.
జవాబు.
శక్తికి సంబంధించి శ్రేష్ఠవర్గ దృక్కోణం 20వ శతాబ్దం ప్రారంభంలో పరెటో, మోస్కా, మిచెల్స్ అనే ముగ్గురు సామాజిక శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.