Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 11th Lesson భారతదేశం – ప్రపంచదేశాలు Textbook Questions and Answers.
TS Inter 2nd Year Political Science Study Material 11th Lesson భారతదేశం – ప్రపంచదేశాలు
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
భారత విదేశాంగ విధానానికి ఉన్న ఏవేని రెండు లక్షణాలను తెలపండి.
జవాబు.
1. వలసవాదం, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకత :
భారత విదేశాంగ విధానం ప్రధానంగా వలసవాదాన్ని సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల్లోని వివిధ దేశాల్లో వలసవాదపాలనలో ఉన్న ప్రజలపట్ల భారతదేశం సానుభూతి ప్రకటించింది.
వలసవాద పాలన ప్రాంతాల్లో ప్రజలపై నిరంకుశ పాశవిక విధానాన్ని భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ప్రాంతాల ప్రజలు స్వాతంత్ర్యాన్ని పొందడానికి రాజకీయ, దౌత్యపర, ఆర్థిక సహాయాలన్నింటినీ భారతదేశం అందించింది. అగ్రరాజ్యాలు రూపొందించిన సామ్రాజ్యవాద వ్యూహాన్ని కూడా విదేశాంగ విధానం వ్యతిరేకిస్తుంది.
2. జాతి విచక్షణకు వ్యతిరేకత :
సుదీర్ఘకాలంగా భారతదేశం వర్ణ, జాతి, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా జరిగే అన్ని రకాల విచక్షణలను వ్యతిరేకిస్తోంది. జాతి విచక్షణ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో సముచితంగా వివిధ వేదికల్లో, చర్చనీయాంశం చేసింది. దక్షిణాఫ్రికా, కాంగో, రొడీషియా (ఇప్పటి జింబాబ్వే)లలో అనుసరిస్తున్న ప్రభుత్వ జాతి విచక్షణ విధానాన్ని తీవ్రంగా విమర్శించింది.
ప్రశ్న 2.
అలీనోద్యమం పాత్రపై ఒక సంక్షిప్త సమాధానం రాయండి.
జవాబు.
అలీనోద్యమం 1955లో బాండుంగ్లో జరిగిన ఆఫ్రో-ఆసియన్ సమావేశం ద్వారా రూపుదిద్దుకుంది. ఇది ఒక విదేశాంగ విధానంగా పశ్చిమ దేశాల కూటమికి, కమ్యూనిస్టు కూటమికి సమానదూరం పాటించే సంవర్థక విధానంగా వృద్ధి చెందింది. అలీనోద్యమ వ్యవస్థాపక నాయకులుగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మార్షల్ టిటో, సుకార్నో, నిక్రోమా, అబ్దుల్ నాజర్ తదితర రాజనీతిజ్ఞులు ఉద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.
అలీనోద్యమ లక్ష్యాలు :
అలీనోద్యమం కొన్ని నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తుంది. వాటిలో ప్రధానమైనవి :
- ప్రపంచ శాంతి, నిరాయుధీకరణ
- వలసప్రాంతాల ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు
- జాతివివక్షకు, వర్ణవివక్షకు వ్యతిరేకంగా ప్రతీవారికి సమానత్వపు హక్కు
- ఆర్థిక సమానత్వాన్ని సాధించండం
- సాంస్కృతిక ఆధిపత్యం లేదా సాస్కృతిక సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడం
- అంతర్జాతీయ వాదాన్ని సమర్ధించడం.
ప్రశ్న 3.
సార్క్ అనగానేమి ? వివరించండి.
జవాబు.
దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంఘం (South Asian Association of Regional Co-operation) లోని ఆంగ్ల ప్రథమాక్షరాల పదబంధంగా సార్క్ (SAARC) అని దీనిని వ్యవహరిస్తారు. ఈ సార్క్ ఏర్పాటులో బంగ్లాదేశ్ అధ్యక్షడు జియాఉర్ రెహమాన్ (Zia-ur Rehaman) ఎంతో ప్రధాన పాత్ర పోషించాడు.
సార్క్న లాంఛనప్రాయంగా డిసెంబర్ 8, 1985న స్థాపించారు. దీనిని బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఏడు సభ్యదేశాలుగా ఏర్పడ్డాయి. ఆ తరువాత ఏప్రియల్ 3, 2007న ఆఫ్ఘనిస్తాన్ సభ్యదేశం కావడంతో ప్రస్తుతం సార్స్లో మొత్తం ఎనిమిది దేశాలు సభ్య రాజ్యాలుగా ఉన్నాయి.
సార్క్ లక్ష్యాలు :
- దక్షిణాసియా ప్రాంతంలో సంక్షేమరంగాన్ని వృద్ధిచేసి జనాభా జీవన పరిస్థితులను గుణాత్మకంగా వృద్ధి చేయడం.
- దక్షిణాసియా ప్రాంత దేశాల మధ్య సమష్టి స్వాబలంబనను బలోపేతం చేయడం.
- ఆర్థికవృద్ధి, సాంఘిక ప్రగతి, సంస్కృతి అభివృద్ధులను వేగిరపరచడం.
- సభ్యదేశాలు తమ సమస్యలపట్ల సానుభూతితో పరస్పర విశ్వాసాన్ని పెంపొందిచుకోవడం.
- ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పరస్పర సహాయంతో తోడ్పాటు అందించుకోవడం.
ప్రశ్న 4.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అధికారాలు, విధులను వివరించండి.
జవాబు.
సాధారణ సభ అధికారాలు – విధులు :
- అంతర్జాతీయ శాంతి భద్రతలు, రక్షణ విషయాలను చర్చించి, సిఫార్సులు చేయడం.
- అంతర్జాతీయ సాంఘిక-ఆర్థిక సహకారానికి సంబంధించిన విషయాల్లో మార్గనిర్దేశనం చేస్తే, పర్యవేక్షించడం.
- స్వయంపాలన చేసుకోలేని ప్రాంతాల పరిపాలనపై సమాచారాన్ని, నివేదికలను సేకరించడం.
- ఐక్యరాజ్యసమితి నిధులపై ప్రత్యేక నియంత్రణ అధికారాన్ని కలిగి, వార్షిక బడ్జెట్ను ఆమోదిస్తుంది.
- భద్రతామండలకి 10 మంది తాత్కాలిక సభ్యులను ఎన్నుకుంటుంది. అలాగే ఆర్థిక సాంఘిక మండలికి 5 మంది సభ్యులను, అంతర్జాతీయ న్యాయస్థానానికి 15 మంది న్యాయమూర్తులను, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిని సాధారణ సభ ఎన్నుకుంటుంది.
- అంతర్జాతీయ ఒప్పందాలను ఆమోదిస్తుంది.
- ఐక్కరాజ్యసమితి ఛార్ట్క అవసరమైన సవరణలు చేసే అధికారం సాధారణ సభకు ఉంటుంది.
- ఐక్యరాజ్యసమితిలోకి కొత్తగా రాజ్యాలను సభ్యులుగా చేర్చుకోడానికి, సస్పెండ్ చేయడానికి, సభ్యరాజ్యాలను తొలగించడానికి సాధారణ సభకు అధికారం ఉంటుంది.
ప్రశ్న 5.
భద్రతామండలి నిర్మాణాన్ని తెల్పి, దీనికి గల ఏవైనా రెండు అధికారాలను, విధులను తెలపండి.
జవాబు.
నిర్మాణం :
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యనిర్వాహక విభాగంగా భద్రతామండలిని పేర్కొనవచ్చు. దీనిలో 15 మంది సభ్యులు ఉంటారు. వీటిలో 5 రాజ్యాలను శాశ్వత దేశాలనీ, వీటో అధికారం ఉన్న పెద్ద దేశాలనీ చెప్పవచ్చు. మిగిలిన 10 తాత్కాలిక దేశాలను సాధారణ సభ రెండు సంంత్సరాల పదవీకాలానికి ఎన్నుకుంటుంది.
ఈ పది తాత్కాలిక దేశాలలో అయిదు ఆఫ్రికా-ఆసియా ఖండాలనుంచి, ఒకటి తూర్పు యూరోపు నుంచి, రెండు లాటిన్ అమెరికా ఖండం నుంచి, రెండు పశ్చిమ యూరోపు తదితర ప్రాంతాలనుంచి ప్రాతినిధ్యం వహించేలా ఎన్నికవుతాయి.
ఇవేకాక, ఏదేని వివాదానికి సంబంధించిన ఏదేని ఒక సభ్యరాజ్యన్నికానీ, రాజ్యేతర సభ్యులు కానీ చర్చలలో పాల్గొనమని భద్రతామండలి కోరవచ్చు. భద్రతామండలి అధ్యక్ష పదవి దానిలోని సభ్యరాజ్యాల మధ్య అక్షర క్రమంలో ప్రతి నెలకు ఒకసారి మారుతూ ఉంటుంది. భద్రతామండలికి సహాయం అందించడానికి మూడు స్థాయూ సంఘాలు ఉంటాయి.
అధికారాలు – విధులు :
అంతర్జాతీయ శాంతిభద్రతలు – రక్షణ వ్యవహారాల నిర్వహణలో ఐక్యరాజ్యసమితికి గణనీయమైన అధికారాలు ఉన్నాయి. భద్రతామండలి అధికారాలు – విధులు ఈ దిగువ తెలిపిన విధంగా ఉంటాయి.
- భద్రతా మండలి అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
- అంతర్జాతీయ శాంతి, భద్రతల నిర్వహణకు కార్యాచరణను అమలుచేసి, శాంతికి విఘాతం కలిగించే వాటిపై నివారక చర్యలు చేపడుతుంది.
ప్రశ్న 6.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అధికారాలు-విధులను సంక్షిప్తంగా రాయండి.
జవాబు.
ప్రధాన కార్యదర్శి అధికారాలు – విధులు :
ఐక్యరాజ్యసమితి ఛార్టర్ నిర్దేశించిన పరిధిలోని అనేక విధులను-బాధ్యతలను ప్రధాన కార్యదర్శి నిర్వహిస్తారు. వీటిలో ప్రధానమైనవి :
- అంతర్జాతీయ శాంతిభద్రతలకు విఘాతం కల్పించే అన్ని విషయాలను ప్రధాన కార్యదర్శి సాధారణ సభ భద్రతామండలి ముందు నివేదిస్తాడు.
- ఐక్యరాజ్యసమితి వార్షిక బడ్జెట్ను రూపొందిస్తాడు. అలాగే ఐక్యరాజ్యసమితి పనితీరుపై నివేదికను ప్రతి సంవత్సరం తయారుచేస్తాడు.
- భద్రతామండలి వినతిపైగాని, ఐక్యరాజ్యసమితి మెజారిటీ సభ్యుల కోరికపైగాని, సాధారణ సభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేస్తారు.
- అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలకు రిజిష్టర్ చేసే అధికారిలాగా వ్యవహరిస్తారు.
- వివిధ సందర్భాలలో ఐక్యరాజ్యసమితి ఏర్పరచిన శాంతి పరిరక్షణ దళాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:
ప్రశ్న 1.
బిమ్ క్ అనగానేమి ?
జవాబు.
ఈ సంస్థను 1997వ సంవత్సరంలో బంగాళాఖాత (సముద్ర) తీరప్రాంతదేశాలైన దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. “బంగాళాఖాత తీరప్రాంత దేశాల బహుళరంగ సాంకేతిక ఆర్థిక సహకార సంస్థ” పేరుతో ఏర్పడిన ఈ సంస్థలో భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, బర్మా (మియన్మార్), థాయ్లాండ్ దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. బిమ్క్ అనే ఈ సంస్థ ప్రధాన కేంద్ర కార్యాలయం బంగ్లాదేశ్ ఢాకాలో ఉంది.
ప్రశ్న 2.
సార్క్ 18వ శిఖరాగ్ర సమావేశం గురించి రాయండి.
జవాబు.
సార్క్ 18వ శిఖరాగ్ర సమావేశం ఖాట్మండ్లో నవంబరు 27, 2014న జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దక్షిణాసియా దేశాలు అన్ని రంగాల్లో సహకారం అందించుకోవడానికి ముందుండాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.
ఈ సహకారం ప్రజలు పరస్పరం ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా సమాచార సాంకేతిక అనుసంధానం ద్వారా మరింత తేలికగా జరుగుతుందని పిలుపునిచ్చారు. సార్క్ ద్వారా వాణిజ్యం, పెట్టుబడులు, సహాయం, సహకారాలు ప్రతి రంగంలో సాధ్యమౌతాయని భారతదేశం భావిస్తోంది.
ప్రశ్న 3.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఎన్ని దేశాలు సభ్యత్వం కల్గి ఉన్నాయి ?
జవాబు.
ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో 194 సభ్య రాజ్యాలు ఉన్నాయి.
ప్రశ్న 4.
సార్క్ లోని సభ్యదేశాలు ఏవి ?
జవాబు.
సార్క్ లోని సభ్యదేశాలు
- బంగ్లాదేశ్
- ఇండియా
- మాల్దీవులు
- నేపాల్
- పాకిస్తాన్
- శ్రీలంక
- భూటాన్
2007లో ఆఫ్ఘనిస్తాన్ కూడా సభ్యదేశం కావటంతో ప్రస్తుతం సార్క్ ఎనిమిది సభ్యదేశాలున్నాయి.
ప్రశ్న 5.
ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగాలు ఏవి ?
జవాబు.
- సాధారణ సభ
- భద్రతా మండలి
- ఆర్థిక-సాంఘిక మండలి
- ధర్మకర్తృత్వ సంఘం
- అంతర్జాతీయ న్యాయస్థానం
- సచివాలయం.
వీటిలో ప్రస్తుతం ధర్మకర్తృత్వమండలి పనిచేయటం లేదు.
ప్రశ్న 6.
ఐక్యరాజ్యసమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు ?
జవాబు.
ఐక్యరాజ్యసమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పోర్చుగీసుకు చెందిన ‘ఆంటోనియో గుటిరస్’.
ప్రశ్న 7.
బ్రిక్స్లోని సభ్యదేశాలేవి ?
జవాబు.
- బ్రెజిల్ (Brazil)
- రష్యా (Russia)
- ఇండియా (India)
- చైనా (China)
- దక్షిణాఫ్రికా (South Africa)
ఈ దేశాల పేర్లలోని మొదటి అక్షరాలతో బ్రిక్స్ (BRICS) అనే పదబంధంతో ఈ సంస్థ ఏర్పడింది.
ప్రశ్న 8.
పంచశీల సూత్రాలను వివరించండి.
జవాబు.
- రాజ్యాల ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించుకోవడం.
- రాజ్యాలు పరస్పర దురాక్రమణకు పాల్పడకుండా ఉండడం.
- ఇతర రాజ్యాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం.
- రాజ్యాల మధ్య సమానత్వం, పరస్పర ప్రయోజనాత్మక సహకారం.
- శాంతియుత సహజీవనం.