TS Inter 2nd Year Economics Notes Chapter 3 National Income, Poverty and Unemployment

Here students can locate TS Inter 2nd Year Economics Notes Chapter 3 National Income, Poverty and Unemployment to prepare for their exam.

TS Inter 2nd Year Economics Notes Chapter 3 National Income, Poverty and Unemployment

→ Several estimates of national income were prepared by dada bhai naoroji (1868, william Digby (1899), Findlay shirras (1911, 1922 and 1931) shah and khambatta (1921), Dr. .R. . Rao (1925-29) and R.C. Desai (1931-40).

→ C.S.O. is estimating national income by adopting the product method in primary sectors and secondary sectors, the income method in the tertiary sector or the expenditure method in construction.

→ The growth of per capita income at constant prices is an indicator of the change, in the standard of living people.

→ Sectoral contribution to national income – contribution of the primary sector – contribution of the secondary sector-contribution of the tertiary sector.

TS Inter 2nd Year Economics Notes Chapter 3 National Income, Poverty and Unemployment

→ After the introduction of economic reforms the share of the private sector in the national income increased from 76.8 in 2000 – 01 to 78.8 in 2010.

→ Two basic causes of income inequalities: The existing system is based on the institution of private poverty, and low of inheritance.

→ Poverty is a situation where a part of the society is unable to satisfy even the basic minimum necessities such, as food, shelter, and clothing.

→ Causes of poverty: Concentration of economic power under exploitation of natural, resources, heavy population pressure, unemployment, poor education, inflation, low technology, capital deficiency, failure of plans, economic reforms, and social factors.

→ Types of unemployment: Structural disguised, seasonal, cyclical, technological, and fictoral unemployment.

→ Causes of unemployment: jobless growth, increase in labour force, inappropriate technology, inappropriate educational system, neo-liberal economic policy.

→ To overcome the problem of unemployment the gest took many measures to provide employment and alleviation underemployment and poverty. For instance, SFDA, MFAL, DPAP, IRDF, NREP, RLECP, and MGNRES. etc.

TS Inter 2nd Year Economics Notes Chapter 3 జాతీయాదాయం, పేదరికం, నిరుద్యోగిత

→ ఒక దేశంలో ఒక సంవత్సరకాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల నికర విలువను జాతీయాదాయం అంటారు. రెండు మార్లు లెక్కించకుండా నిర్ణీత కాల వ్యవధిలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల మొత్తం పరిమాణాన్ని జాతీయాదాయపు అంచనా మదింపు చేస్తుంది.

→ 1950–51, 2012-13 మధ్య కాలాలను పరిగణనలోకి తీసుకొన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ పని తీరును సమీక్షించినపుడు మొదటి, రెండవ ప్రణాళికలలో నిర్దేశించబడిన లక్ష్యాల దృష్ట్యా, వ్యవస్థ పని తీరు నిరాశాజనకంగా ఉందని చెప్పవచ్చు. తలసరి నికర జాతీయోత్పత్తిలో పెరుగుదల రేటు చాలా తక్కువగా
ఉంది.

TS Inter 2nd Year Economics Notes Chapter 3 National Income, Poverty and Unemployment

→ మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండు కలిసి జాతీయాదాయాన్ని ఉత్పత్తి చేస్తాయి. మన దేశంలో 1951కి పూర్వం జాతీయాదాయంలో ప్రభుత్వ రంగం వాటా చాలా తక్కువగా ఉంది. పంచవర్ష ప్రణాళికలు ప్రవేశ పెట్టినప్పటి నుంచి ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పెరగడం వల్ల జాతీయాదాయంలో ప్రభుత్వ రంగం వాటా క్రమంగా పెరిగింది.

→ మన దేశంలోని నికర దేశీయోత్పత్తి ప్రస్తుతం సేవల రంగం యొక్క వాటా మిగతా రంగాల వాటా కంటే ఎక్కువగా ఉంది. అనగా 2013-14లో సేవా రంగం వాటా 59.9% గా వ్యవసాయ రంగం వాటా 13.9 మరియు పారిశ్రామిక రంగం వాటా 26.2%గా ఉంది.

→ భారత దేశంలో ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మన దేశంలో వీటికి సంబంధించిన దత్తాంశాన్ని కూర్చడానికి అధికారిక సంస్థ లేదు.
కారణాలు –

  1. భూ యాజమాన్యంలోని అసమానతలు
  2. ప్రైవేటు కార్పోరేటు రంగంలో అస్తుల కేంద్రీకరణ
  3. వృత్తిపరమైన తేడాలు
  4. ద్రవ్యోల్బణం
  5. పరపతి సౌకర్యాలలో అసమానతి
  6. పట్టణాల వైపు ప్రైవేటు పెట్టుబడి
  7. ప్రభుత్వపాత్ర.

→ నివారణ చర్యలు :

  1. భూ సంస్కరణ అమలు
  2. ఏకస్వామ్య వ్యాపార కార్యక్రమాల నియంత్రణ
  3. ఉపాధి వేతన విధానాలు
  4. సాంఘిక భద్రతా చర్యలు
  5. కనీస అవసరాల పథకం
  6. గ్రామీణ పేదరిక నిర్మూలన పథకాలు
  7. పన్నుల వ్యవస్థ.

→ సమాజంలోని ఒక సమూహం తన కనీస జీవితావసరాలైన తిండి, బట్ట, గూడు తీర్చుకోలేని స్థితిని పేదరికం అంటారు. ఇవి రెండు రకాలు. 1. సాపేక్ష పేదరికం 2. నిరపేక్ష పేదరికం

TS Inter 2nd Year Economics Notes Chapter 3 National Income, Poverty and Unemployment

→ అమలులో ఉన్న వేతన రేటు వద్ద వ్యక్తికి పని చేయాలనే కోరిక ఉన్నప్పటికి అతనికి ఉద్యోగ అవకాశం లభ్యం కాకపోవడాన్నే నిరుద్యోగిత అంటారు. ఇదీ పలురకాలుగా ఉంటుంది.
కారణాలు :

  1. ఉపాధి రహిత వృద్ధి
  2. శ్రామిక శక్తితో పెరుగుదల
  3. ప్రతికూల సాంకేతికత
  4. ప్రతికూల విద్యావ్యవస్థ
  5. నవ్య ఆర్థిక సరళీకరణ విధానాలు మొదలగునవి.

→ ఈ పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తొలగించడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో ముఖ్యమైనవి SFDA, MFAL, DAAP, IRDP, NREP, RLEGP, MGNREGS మొదలగునవి.

TS Inter 2nd Year Political Science Notes Chapter 3 Union Government

Here students can locate TS Inter 2nd Year Political Science Notes Chapter 3 Union Government to prepare for their exam.

TS Inter 2nd Year Political Science Notes Chapter 3 Union Government

→ The President is the Constitutional Head of the State.

→ The Executive powers of the union are vested in the President.

→ The Vice President is elected by all the members of Parliament in accordance with the system of proportional representation by means of Single Transferable Vote.

→ The Vice President acts as the Ex – officio chairman of Rajya Sabha.

→ The President appoints the Leader of the majority, party in the Lok Sabha as Prime Minister.

→ The Prime Minister is the head of the Government. He is the key stone of the Cabinet arch.

TS Inter 2nd Year Political Science Notes Chapter 3 Union Government

→ The union council of ministers remain in office as long as they enjoy the support of the majority of the members of Lok Sabha.

→ The union council of ministers led by the Prime Minister is collectively responsible to the Parliament for all their acts of omissions and commissions.

→ Indian Parliament is Bicameral. It consists of two houses.They are 1. Lok Sabha, 2. Rajya Sabha.

→ Quorum is required to conduct the business of the house, which is 1/10 of the total number of members of the House.

→ The Supreme Court was inaugurated on January 28, 1950 at New Delhi.

→ At Present there are a chief Justice and 30 other Judges in the Supreme Court.

→ There are 24 High Courts in India.

TS Inter 2nd Year Political Science Notes Chapter 3 కేంద్ర ప్రభుత్వం

→ కేంద్ర ప్రభుత్వ అధికారం భారత భూభాగమంతటికి వర్తిస్తుంది.

→ కేంద్ర ప్రభుత్వం క్రింది మూడు భాగాలతో ఏర్పడుతుంది. అవి:-

  1. కేంద్ర కార్యనిర్వాహక శాఖ
  2. కేంద్ర శాసన నిర్మాణశాఖ
  3. కేంద్ర న్యాయశాఖ.

→ కేంద్ర కార్యనిర్వాహకశాఖ i) భారత రాష్ట్రపతి ii) భారత ఉపరాష్ట్రపతి iii) భారత ప్రధానమంత్రి iv) కేంద్ర మంత్రిమండలి అనే భాగాలను కలిగి ఉంటుంది.

→ కేంద్ర శాసన నిర్మాణశాఖ i) లోక్సభ ii) రాజ్యసభ, iii) భారత రాష్ట్రపతితో కూడి ఉంటుంది.

→ కేంద్ర న్యాయశాఖ అంటే సుప్రీంకోర్టు. ఇది ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను కలిగి ఉంటుంది.

→ భారత రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, రాజ్యాధినేత.

TS Inter 2nd Year Political Science Notes Chapter 3 Union Government

→ రాష్ట్రపతి దేశంలో మూడు రకాల అత్యవసర పరిస్థితులను ప్రకటించవచ్చు. (352, 356, 360 అధికరణల ద్వారా) ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షుడిగా (ఛైర్మన్) వ్యవహరించును.

→ ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమించును. లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడు ప్రధానిగా నియమించబడును.

→ ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత. కేంద్ర మంత్రిమండలికి కీలకమైన వ్యక్తి.

→ కేంద్ర మంత్రిమండలిలో మూడు రకాలైన మంత్రులు ఉంటారు. అంటే కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, డిప్యూటీ మంత్రులు.

→ కేబినెట్ అనే పదం రాజ్యాంగంలో 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది.

→ భారత పార్లమెంట్లో రెండు సభలు కలవు. అవి: 1) లోక్ సభ 2) రాజ్యసభ.

→ భారత సుప్రీంకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తిని, 30 మంది న్యాయమూర్తులను కలిగి ఉంది.

TS Inter 2nd Year Commerce Notes Chapter 5 Entrepreneurship

Here students can locate TS Inter 2nd Year Commerce Notes Chapter 5 Entrepreneurship to prepare for their exam.

TS Inter 2nd Year Commerce Notes Chapter 5 Entrepreneurship

→ Entrepreneur is an economic agent who unites all means of production to maximize his profits by innovations.

→ An entrepreneur should be one who bears, innovates or initiates and organizes the business.

TS Inter 2nd Year Commerce Notes Chapter 5 Entrepreneurship

→ Innovation, Risk Taking, Self-confidence, hard work, Goal setting, Accountability, Leadership, Managerial skills, etc., are the important characteristics of an Entrepreneur.

→ Modern writers have emphasised that an entrepreneur is supposed to perform functions, like Innovation, Risk Bearing, Organisation and Management, Business planning and decision-making.

→ Danhof has classified entrepreneurs into 4 types

  1. Innovating entrepreneurs
  2. Adoptive or imitative entrepreneurs
  3. Fabian Entrepreneurs and
  4. Drone entrepreneurs

→ The term entreprise means the actions as someone who shows some initiative by taking a risk by setting up, inverting in and running a business.

→ Entrepreneurship plays an important role in the development of a society. It is the barometer of overall economic, social and industrial growth of the country.

TS Inter 2nd Year Commerce Notes Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

→ ఎంట్రప్రిన్యూర్ అనే పదం ఫ్రెంచి మూలమైన “entrependre” అనే పదం నుండి ఆవిర్భవించింది. దీని అర్థం కొత్త పనిని చేపట్టడం.

→ నష్టం భరించిఒక కొత్త సంస్థను స్థాపించడమనే కార్యాన్ని చేపట్టేవాడే ఎంట్రప్రిన్యూర్/ఔత్సాహికుడు.

→ ఎంట్రప్రిన్యూర్ క నవకల్పన, రిస్కూ భరించడం, ఆత్మవిశ్వాసం, జవాబుదారీతనం, నాయకత్వం, నిర్వహణ నైపుణ్యం వంటి లక్షణాలు ఉంటాయి.

→ ఆధునిక కాలంలోని రచయితలు ఎంట్రప్రిన్యూర్లు నవకల్పన, రిస్కూభరించడం, వ్యవస్థీకరణ, నిర్వహణ, వ్యాపార ప్రణాళికీకరణ, మరియు నిర్ణయాలు తీసుకోవడం మొదలైన విధులు నిర్వర్తించ వాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

TS Inter 2nd Year Commerce Notes Chapter 5 Entrepreneurship

→ డన్ హోఫ్ ప్రకారు ఎంట్రప్రిన్యూర్లను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు
  2. అనుకరణ ఎట్రప్రిన్యూర్లు
  3. నిదానపు ఎట్తు ప్రిన్యూర్లు
  4. స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు.

→ ఏదేశపు ఆర్థికాభివృద్ధిలోనైనా ఎంట్రప్రిన్యూర్షిప్ యొక్క పాత్ర అత్యంత విశిష్టమైనది. ఎంట్రప్రిన్యూర్షిప్ పారిశ్రామికాభివృద్ధికి, మూలధన సేకరణలో, సమతౌల్య ప్రాంతీయాభివృద్ధిలో, ఉపాధి కల్పనలో, జీవన ప్రమాణ స్థాయి పెరగుదలలో ప్రముఖపాత్రను కలిగి ఉంది.

TS Inter 2nd Year Economics Notes Chapter 1 Economic Growth and Economic Development

Here students can locate TS Inter 2nd Year Economics Notes Chapter 1 Economic Growth and Economic Development to prepare for their exam.

TS Inter 2nd Year Economics Notes Chapter 1 Economic Growth and Economic Development

→ The increase in the real output of goods and services is called economic growth. It is progressive changes in the socio-economic structure of a country.

→ Economic development is a process where an economy’s real national income increases over a long period of time.

→ Objectives of Economic development – High rate of growth, Economic self-reliance, Social justice, Modernization, Economic stability, Inclusive growth.

→ Indicators of Economic Development, National income, per Percapita income, Real National income, PQLI, HDI, GDI, GEM, SPI, and MPI.

TS Inter 2nd Year Economics Notes Chapter 1 Economic Growth and Economic Development

→ Factors Hindering Economic development – Lack of national resources, lower rate of growth of human capital, poor infrastructure, vicious circle of poverty.

→ Factors promoting economic development – Economic factors, non – Economic factors.

→ Characteristics of developed economies – the significance of the industrial sector, High rate of capital formation, use of High production Techniques, low growth of population, per capita gross National income.

→ Characteristics of developing economies – Low level of income, the predominance of agriculture, capital deficiency, technological backwardness, inadequate infrastructure, high population, high rate of literacy, High infant mortality rate, traditions, joint family system.

TS Inter 2nd Year Economics Notes Chapter 1 ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి

→ దీర్ఘకాలంలో వస్తు సేవల వాస్తవిక ఉత్పత్తి పెరుగుదలను తెలియజేయడాన్ని ఆర్థికవృద్ధి అంటారు.

→ ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థిక వృద్ధి కంటే చాలా విస్తృతమైన భావన. ఇది ఒక దేశంలోని ఆర్థిక వృద్ధితో పాటు, సాంఘిక, ఆర్థిక, వ్యవస్థాపూర్వక మార్పులను సూచించును.

→ ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు:

  1. అధిక వృద్ధి రేటు,
  2. ఆర్థిక స్వావలంబన,
  3. సామాజిక న్యాయం,
  4. ఆధునికీకరణ,
  5. ఆర్థిక స్థిరత్వం,
  6. సమ్మిళిత వృద్ధి.

→ ఆర్థికాభివృద్ధి సూచికలు:

  1. జాతీయాదాయం
  2. తలసరి ఆదాయం
  3. నిజ జాతీయాదాయం
  4. భౌతిక జీవన ప్రమాణ సూచిక
  5. మానవ అభివృద్ధి సూచిక
  6. లింగ సంబంధ అభివృద్ధి సూచిక
  7. బహుపార్శ్వ పేదరిక సూచిక.

TS Inter 2nd Year Economics Notes Chapter 1 Economic Growth and Economic Development

→ ఆర్థికాభివృద్ధి నిరోధకాలు:

  1. సహజ వనరుల కొరత,
  2. అల్పమానవ మూలధన వృద్ధి రేటు,
  3. అవస్థాపనా సదుపాయాల కొరత,
  4. పేదరిక విషవలయాలు.

→ ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే కారకాలు: ఆర్థిక కారకాలు, ఆర్థికేతర కారకాలు.
TS Inter 2nd Year Economics Notes Chapter 1 Economic Growth and Economic Development 1

→ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ లక్షణాలు: పారిశ్రామిక రంగ ప్రాధాన్యత, అధిక స్థాయిలో మూలధన కల్పన, ఆధునిక ఉత్పత్తి, సాంకేతికత, నైపుణ్యం, తక్కువ జనాభా వృద్ధి, తలసరి స్థూల జాతీయాదాయం.

TS Inter 2nd Year Economics Notes Chapter 1 Economic Growth and Economic Development

→ అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు: అల్పఆదాయం, వ్యవసాయ రంగ ప్రాధాన్యత, మూలధన లోటు, సాంకేతికంగా వెనుకబడి ఉండటం, తక్కువ అవస్థాపనా సదుపాయాలు, అధిక స్థాయిలో జనాభా వృద్ధి, నిరక్షరాస్యత, శిశు మరణాల రేటు అధికం, సంప్రదాయ హద్దులు, దృక్పథాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.

TS Inter 2nd Year Political Science Notes Chapter 2 Fundamental Rights and Directive Principles of State Policy

Here students can locate TS Inter 2nd Year Political Science Notes Chapter 2 Fundamental Rights and Directive Principles of State Policy to prepare for their exam.

TS Inter 2nd Year Political Science Notes Chapter 2 Fundamental Rights and Directive Principles of State Policy

→ Fundamental Rights are enriched in Part-Ill of the constitution covering articles from 12 to 35.

→ In 1978, the 44 constitutional amendments deleted the right to property from the list of Fundamental Rights.

→ Right to constitutional remedies is the very soul and heart of the constitution:

→ Through the 42nd Constitutional Amendment Act -10 fundamental duties were incorporated in Part- IV of the constitution.

TS Inter 2nd Year Political Science Notes Chapter 2 Fundamental Rights and Directive Principles of State Policy

→ Article 19 provides now to Indian citizens with six kinds of Freedom.

→ The directive principles of state policy are included in Part – IV of the constitution covering articles 36 to 51.

→ The directive principles are classified into three categories i.e., Socialist, Gandhian and Liberal principles.

→ The 42nd amendment gave precedence to directive principles than to fundamental rights.

→ Directive principles are considered as New Year greeting by Sri Naseeruddin.

TS Inter 2nd Year Political Science Notes Chapter 2 ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు

→ ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలోని 3వ భాగంలో 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు ప్రస్తావించారు.

→ ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్యాన్ని అర్థవంతం చేస్తాయి.

→ రాజ్యాంగం రూపొందించినప్పుడు 7 ప్రాథమిక హక్కులుండేవి. ఇప్పుడు 6 ప్రాథమిక హక్కులు మాత్రమే కలవు.

→ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా రూపొందించారు. 300 (ఎ) అధికరణం ఆస్తి హక్కుకు సంబంధించినది.

→ ప్రాథమిక హక్కులలోని రాజ్యాంగ పరిహార హక్కు అత్యంత విలువైనది. ఈ హక్కు ద్వారా పౌరులు తమ హక్కులకు భంగం వాటిల్లితే న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందవచ్చు. ఉన్నత న్యాయస్థానాలు రిట్లను జారీచేసి పౌరుల హక్కులను కాపాడతాయి.

→ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగానికి 10 ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి.

TS Inter 2nd Year Political Science Notes Chapter 2 Fundamental Rights and Directive Principles of State Policy

→ ప్రాథమిక విధులను స్వరణ్ సింగ్ అధ్యక్షతన ఏర్పడిన ఒక సంఘం సూచించింది.

→ ప్రాథమిక విధులను న్యాయస్థానాల ద్వారా అమలు చేయడానికి వీలులేదు.

→ 19వ అధికరణం ప్రకారం పౌరులకు ఆరు రకాల స్వాతంత్ర్యాలు ఉంటాయి.

→ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిహార హక్కును “ప్రాథమిక హక్కులకు ఆత్మవంటి”దని వర్ణించాడు.

→ భారత రాజ్యాంగం 4వ భాగంలో ఆదేశక సూత్రాలను పేర్కొనడం జరిగింది.

→ భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగాను, వర్గరహిత రాజ్యంగాను ఏర్పరచడమే ఈ నియమాల లక్ష్యం.

→ ఆదేశక సూత్రాలు రాజ్యకలాపాల పరిధిని విస్తృతం చేశాయి.

→ ఈ సూత్రాలు శాసనపరమైనవి కావు. వీటిని అమలు జరపడంలో ఆయా ప్రభుత్వాలకు విచక్షణాధికారాలు ఉన్నాయి.

→ వీటిని సామ్యవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు, ఉదారవాద సూత్రాలుగా వర్గీకరించడం జరిగింది.

TS Inter 2nd Year Political Science Notes Chapter 2 Fundamental Rights and Directive Principles of State Policy

→ 42, 44వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ఆదేశక సూత్రాలకు ప్రాథమిక హక్కుల కంటే ఎక్కువ ప్రాధాన్యము ఉందని తెలిసింది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 10th Lesson నిర్వహణ విధులు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 10th Lesson నిర్వహణ విధులు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రణాళిక నిర్వచనంలోని ముఖ్యమైన అంశాలు ఏమిటో వివరించండి ?
జవాబు.
ప్రణాళిక నిర్వచనంలోని ముఖ్యమైన అంశాలు:
1) ఒక పనిని ఏవిధంగా, ఎలా చేయాలో ముందుగా నిర్ణయించడమే ప్రణాళిక. ప్రణాళిక అనేది నిర్వహణ విధులలో ప్రాథమికమైంది.

2) ఏదైనా ఒక పనిని చేపట్టబోయేటప్పుడు, ఒక నిర్వాహకుడు అలాంటి లక్ష్యం సాధించడానికి కార్యకలాపాలను సూత్రప్రాయంగా క్రమపరచాలి. అందువల్ల ప్రణాళిక, సృజనాత్మకతకు, కల్పనకు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నది అని చెప్పవచ్చు.

3) ప్రణాళిక వల్ల ప్రస్తుతమున్న స్థితి నుంచి చేరవలసిన స్థితికి వంతెనలాగా తోడ్పడుతుంది. నిర్వాహకులు అన్ని దశలలోనూ ప్రణాళిక కొనసాగించే ప్రక్రియ. ప్రణాళికలో వివిధ ప్రత్యామ్నాయ పరిస్థితులలో తీసుకొనవలసిన నిర్ణయాలు ఉంటాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

4) యాజమాన్యం చేపట్టే చర్యలకు, నిర్ణయాలకు ఏర్పరచిన లక్ష్యాలు దిశానిర్దేశం చేస్తాయి. ముందుగా నిర్ణయించిన లక్ష్యాలకు యదార్థమైన మార్గాన్ని చూపడానికి ప్రణాళిక ఏర్పాట్లను చేస్తుంది.

5) లక్ష్యాలను సాధించడానికి రూపకల్పన చేసేది, పనిని ఏ విధంగా, చేయాలనే సాధ్యాసాధ్యాలు నిర్ణయించేది, తీసుకొనే చర్యలకు కార్యరూపాన్ని చూపేది ప్రణాళిక.

6) భవిష్యత్లో ఏర్పడే ఘటనలకు, ప్రణాళికలు ముందు జాగ్రత్త ప్రయోజనాల్ని కల్పిస్తాయి.

7) ప్రణాళికలో అనేక దశలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

  • సంస్థలోని ప్రతి విభాగానికి లక్ష్యాలను ముందుగా నిర్ణయించుకోవాలి.
  • పథకాలను అమలుపరచడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
  • పని క్రమాన్ని, పని విధానం కొనసాగించడానికి తగిన ప్రమాణాలు ఏర్పరచుకోవాలి.
  • సంస్థ మొత్తానికి బడ్జెట్లను తయారు చేసుకొని, ఉత్పత్తి, అమ్మకాల, నగదుకు సంబంధించిన విభాగాల కోసం ప్రత్యేక బడ్జెట్లను రూపొందించవలసి ఉంటుంది.

ప్రశ్న 2.
మారుతున్న పర్యావరణంలో ప్రణాళికీకరణ పని చేస్తుందని నీవు భావిస్తున్నావా ? (or) ప్రణాళికీకరణ ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు.
ఒక పనిని ఏ విధంగా, ఎలా చేయాలో ముందుగా నిర్ణయించడమే ప్రణాళిక. భవిష్యత్లో ఏర్పడే ఘటనలకు, ప్రణాళికలు ముందు జాగ్రత్త ప్రయోజనాల్ని కల్పిస్తాయి.

మారుతున్న పర్యావరణంలో ప్రణాళికీకరణ ఎంతగానో ఉపయోగపడుతుంది.
వివిధ కారణాల దృష్ట్యా అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నది. ప్రణాళిక ప్రాముఖ్యతను కింది విధంగా చెప్పవచ్చు.

1. లక్ష్యాలపై దృష్టి: సంస్థలోగల వివిధ విభాగాల లక్ష్యాలను ప్రణాళిక ద్వారా రూపొందించవలసి ఉంటుంది. అంతేకాకుండా, లక్ష్యాలను సాధించడం కోసం ప్రణాళిక ఎంతైనా అవసరం. వేగంగా మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు అనేక విషయాలను పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుంది.

2. ఆదాపూర్వకంగా కార్యాచరణ వ్యాపారాన్ని నైపుణ్యవంతంగా నడిపించడానికి ప్రణాళిక విశేషంగా దృష్టి సారిస్తుంది. ఒక పనిని ఎలా చేయాలి ? ఎవరు చేయాలి ? ఏవిధంగా చేయాలి ? ఎప్పుడు చేయాలి అనే వాటిని ప్రణాళిక నిర్ణయిస్తుంది. ప్రణాళికీకరణ వల్ల సంస్థ లక్ష్యాలను సమిష్టి కృషితో సాధించుకుంటారు. వారి మధ్య సమన్వయ లోపం లేకుండా, పనులను విభజించకుండా సంయుక్త నిర్దేశకత్వం ఉంటుంది. సంస్థకు లభించే వనరులన్నీ సమర్ధవంతంగా ఉపయోగించడం
జరుగుతుంది.

3. అనిశ్చితిని, మార్పును తగ్గిస్తుంది: భవిష్యత్ అనిశ్చితం కాబట్టి వ్యాపార పర్యావరణం, ఆర్థిక విధానాలు, వనరుల సప్లయిలలో మార్పుల వల్ల వ్యాపారం అనిశ్చిత స్థితిలోకి నెట్టివేయబడుతుంది. వీటికి తోడుగా సాంకేతిక మార్పులు కూడా మార్కెట్లో చోటు చేసుకోవచ్చు. కాని ప్రణాళికీకరణ వల్ల సంస్థ అనిశ్చిత పరిస్థితులను భవిష్యత్ కాలంలో సమర్ధవంతంగా, విజయవంతంగా ఎదుర్కొనగలుగుతాయి. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా సంస్థ పురోగతిని సాధించడానికి వీలు కలుగుతుంది.

4. నియంత్రణ సులువుగా జరుగుతుంది: అర్ధవంతమైన ప్రణాళిక వల్ల సిబ్బందిపై సరైన రీతిలో నియంత్రణ చేయవచ్చు. వాస్తవ పనిని, అంచనా వేసిన ఫలితాలను బేరీజు వేసుకోవాలి. ఒకవేళ వాస్తవ ఫలితాలు అంచనా వేసిన ఫలితాలకంటే భిన్నంగా నమోదయితే భవిష్యత్ ప్రణాళికకు తగిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అందువల్ల సరియైన నియంత్రణ కోసం తగిన ప్రణాళిక అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రణాళిక లేనిదే నియంత్రణ లేదు.

ప్రశ్న 3.
ప్రణాళికలో ముందుచూపు ఇమిడి ఉంటే, అది ఎందుకు విజయాన్ని అందించదు ? (లేదా) ప్రణాళికీకరణ పరిమితులను వివరించండి.
జవాబు.
ప్రణాళికలో ముందు చూపు ఇమిడి ఉంటుంది కాని కొన్ని కారణాల వల్ల ప్రణాళికలు విజయాన్ని అందించలేవు. ప్రణాళికలో అనేక పరిమితులు ఉన్నాయి. వాటివల్ల ప్రణాళికలు విజయాన్ని అందించలేవు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

ప్రణాళిక – పరిమితులు:
1) అనిశ్చితమైన భవిష్యత్తు: భవిష్యత్తులో సంభవించగల అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. కాని భవిష్యత్లోని అవరోధ కారణాలను కచ్చితంగా ఊహించడం కష్టమవుతుంది. ప్రణాళిక అంచనా వేసిన ఫలితాలను అందించలేదు. ఈ పరిమితిని అధిగమించాలంటే సరియైన సమాచారాన్ని సేకరించి, దాని విశ్వసనీయతను నిర్ధారణ. చేయడంతోపాటు భవిష్యత్ అంచనాలకై సాంకేతిక పద్ధతులను వాడవలసి ఉంటుంది.

2) కఠినమైనది: ప్రణాళికలో పథకాలను, కార్యక్రమాలను, విధానాలను ముందుగా నిర్ణయిస్తారు. దీన్ని అందరూ అమలు చేయాలి. వ్యక్తిగత స్వేచ్ఛ, చొరవ అణచివేయబడతాయి. అంతేకాక ప్రణాళికలోని అంశాలు కఠినంగానూ, మార్చడానికి వీలు లేకుండా ఉంటాయి.

3) వ్యయమైంది: ప్రణాళికను రూపొందించడానికి ఎంతో సమయం, వ్యయం అవసరం, ప్రణాళికీకరణ వ్యయంతో కూడుకున్నది. అందువల్ల చిన్న సంస్థలు ప్రణాళిక తయారు చేయడానికి, అమలు చేయడం కోసం అయ్యే వ్యయాలను భరించలేవు.

4) నిధుల పెట్టుబడి: ఇదివరకే సంస్థలో ఆస్తుల స్థాపనకై అయిన వ్యయాలు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికైన వ్యయాలు భవిష్యత్ ప్రణాళికల తయారీకి అవరోధంగా మారతాయి. భవిష్యత్ ప్రణాళికలు తయారు చేయవలసి వస్తే, గతంలో పెట్టిన పెట్టుబడిని ఎలా రాబట్టుకోవాలి అనే దృక్పథం తప్ప ఇంకే విషయమూ యాజమాన్యం వారు ఆలోచించరు.

5) బహిర్గత అంశాలు: అంతర్గతంగా ఏర్పాటు చేసుకున్న ప్రణాళికలకు యాజమాన్యం వారి నియంత్రణలో లేని బహిర్గత అంశాలు తోడవుతాయి. వాటి కార్యకలాపాలు జాతీయ స్థాయిలోని కార్మిక విధానాలు, కార్మిక సంఘాల నుంచి వచ్చే ఒత్తిడులను బట్టి కొనసాగుతాయి. ప్రణాళికలోని పరిమితులు ప్రభుత్వం రూపొందించిన నియమాలను బట్టి, న్యాయపరమైన అంశాల కారణంగా వెల్లడి అవుతాయి.

ప్రశ్న 4.
ప్రణాళిక రకాలు ఏమిటో వివరిచండి ?
జవాబు.
నిర్వాహకులు రూపొందించే ప్రణాళికలు రెండు రకాలుగా వర్గీకరించారు.
1. వ్యూహాపరమైన ప్రణాళిక: వ్యాపార రంగంలో ఏర్పడే వాతావరణ మార్పులను బట్టి దీర్ఘకాలిక ఏకీకృత ప్రణాళికలను రూపొందించవలసి ఉంటుంది. ఈ ప్రణాళికలో దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి వ్యూహరచన చేయబడుతుంది. వ్యూహాపరమైన ప్రణాళికకు కాలపరిమితి ఉంటుంది. భవిష్యత్తులో రాగల సమస్యలను గుర్తించి ప్రణాళిక తయారుచేస్తారు.

2. కార్యరూప ప్రణాళిక: కార్యరూప ప్రణాళికలు వ్యూహాల అమలు కోసం స్వల్పకాలానికి తయారుచేస్తారు. సంస్థ కార్యకలాపాల మనుగడ కోసం స్వల్పకాల ప్రణాళికలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.

ప్రశ్న 5.
వ్యవస్థీకరణను నిర్వచించి, దానిలోని దశలను తెలియపరచండి.
జవాబు.
1) మానవ ప్రయత్నాలను సమన్వయపరచి, వనరులను ఏకం చేసి ప్రత్యేకంగా రూపొందించిన లక్ష్యాలను సాధించడానికి ఏర్పరచే ప్రక్రియే వ్యవస్థీకరణ

2) వ్యవస్థీకరణలో వ్యక్తులు చేపట్టవలసిన కార్యకలాపాలను నిర్ధారించడం జరుగుతుంది. ఈ కార్యకలాపాలను వివిధ వర్గాలుగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రతి వర్గానికి చెందిన ఆయా విభాగాలకు కేటాయింపు పనులను చేయడం జరుగుతుంది. ప్రతి విభాగంలోని వ్యక్తులకు విధులు, బాధ్యతలను నిర్వచించడం జరుగుతుంది.

3) ఆచార్య అర్విక్ ప్రకారం ఏ ఉద్దేశం కోసం కార్యకలాపాలను నిర్ధారించుకున్నామో వాటిని ‘వివిధ వర్గాలకు కేటాయించే క్రమమే వ్యవస్థీకరణ అని చెప్పబడింది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

వ్యవస్థీకరణలోని దశలు:
1) పనిని గుర్తించి విభజించడం: ఒక సంస్థ గతంలో నిర్ధారించిన విధంగా పనిని గుర్తించి విభజించడం వ్యవస్థీకరణలో మొదటి దశ. సంస్థలోని పనిని మొత్తం సిబ్బంది విభజించుకుని చేసిన పనిని తిరిగి చేయడాన్ని నివారించడం ఎంతైనా శ్రేయస్కరం.

2) విభాగీకరణ: ఒక పనిని నిర్వహించడానికి కార్యకలాపాల విభజన జరిగిన తరువాత, ఒకే స్వభావం గల పనిని ఏకీకృతం చేసి అప్పగించాలి. అలాంటి విభాగీకరణ ప్రత్యేకతకు దారితీస్తుంది. ఈ కార్యకలాపాల విభజననే విభాగీకరణ అంటారు. విజయవంతమయ్యే విభాగీకరణ కోసం వివిధ అంశాలను పరిగణలోనికి తీసుకోవలసి ఉంటుంది.

3) బాధ్యతలను అప్పగించడం: సంస్థలో ఉన్న స్థాయిలను బట్టి వివిధ విభాగాలకు కేటాయించవలసిన పనులను నిర్వచించడం ఎంతో అవసరం. ఏర్పడిన ప్రతి విభాగానికి ఒక అధిపతిని నియమించాలి. అటు తరువాత వారి సామర్ధ్యం, నేర్పరితనం ఆధారంగా పనులను కేటాయించాలి.

4) నివేదికలను సమర్ధించే సంబంధాలను ఏర్పాటు చేయడం: సంస్థలోని పనులను సిబ్బందికి కేటాయించడంతో పాటు ప్రతీ వ్యక్తి తాను చేపట్టవలసిన పనులు మరియు ఎవరికి జవాబుదారి అవుతాడో తెలుసుకొని ఉండాలి. ఈ విధమైన సత్సంబంధాలు ఉండడం వల్ల విభాగాలలోని వ్యక్తుల మధ్య సమన్వయం ఏర్పడుతుంది.

ప్రశ్న 6.
నియంత్రణను నిర్వచించి, దాని ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు.

  1. నియంత్రణ అంటే ఒక సంస్థ ఏర్పరచిన నియమ నిబంధనల మేరకు ప్రతి కార్యాచరణ తగిన విధంగా నడిచేటట్లు చేయడం.
  2. నిర్వహణ శాస్త్రం సూచించిన చివరి విధి నియంత్రణ. సంస్థలో ఏర్పరచిన ప్రమాణాలతో వాస్తవ కార్యాలను పోల్చాలి. ఏదైనా తేడా గమనించినట్లయితే తగిన నివారణాత్మక చర్యలను తీసుకుని సంస్థ ప్రమాణాలను పాటించే దిశగా ప్రయత్నించాలి.

నియంత్రణ – ప్రాముఖ్యత:
1) సంస్థ లక్ష్యాలను సాధించడం: సంస్థ నెరవేర్చుకునే లక్ష్యాలను, వాటి పురోగతిని నియంత్రణ విధానం కొంతమట్టుకు కొలిచే సాధనంగా పనిచేస్తుంది. అంతేకాక వ్యత్యాసాలేమైనా ఉంటే దిద్దుబాటుకై తేలికైన మార్గాన్ని చూపుతుంది. సంస్థను సరియైన మార్గంలో నడిపి లక్ష్యాలను చేరడానికి సహాయకారిగా ఉంటుంది.

2) ప్రమాణాల ఖచ్చితత్వాన్ని నిర్ణయించడం: మేలైన నియంత్రణ విధానం ద్వారా యాజమాన్యం ఖచ్చితమైన ప్రమాణాలను నెలకొల్పుతుంది. సమర్ధవంతమైన నియంత్రణ విధానం ద్వారా పరిణమిస్తున్న మార్పులను శ్రద్ధగా గమనిస్తూ, తదనుగుణంగా సంస్థ యొక్క ప్రమాణాలను పునఃపరిశీలన చేయవలసి ఉంటుంది.

3) సమర్ధవంతమైన వనరుల వినియోగం: మేలైన నియంత్రణ ఆచరణలో నిర్వాహకుడు వినియోగించే వనరుల దుబారా, పాడయ్యే విధానాన్ని నిరోధిస్తుంది. ప్రతి కార్యక్రమంను ముందుగా నిర్ణయించిన ప్రమాణాల ఆధారంగా చేపట్టవలసి ఉంటుంది. ఈ నియంత్రణ వల్ల వనరులను నైపుణ్యవంతంగా వినియోగించుకోవడం సాధ్యపడుతుంది.

4) సిబ్బంది ప్రేరణను మెరుగుపరచడం: ఒక మంచి నియంత్రణ విధానం ద్వారా సంస్థలోని సిబ్బంది చేయవలసిన పనిని ముందుగానే తెలుసుకుని, ప్రమాణాలను అనుసరించి ప్రశంసించబడే విధంగా నిర్వర్తించబడుతుంది.

5) క్రమశిక్షణను చేపట్టడం ఒక సంస్థలోని నియంత్రణా విధానాన్ని దానిలోగల క్రమశిక్షణ, క్రమమైన పని విధానాన్ని బట్టి సృష్టించవలసి ఉంటుంది. సిబ్బంది మోసపూరితమైన నడవడిని తగ్గించి వారు చేపట్టే కార్యకలాపాలను తగిన సమయాలలో తనిఖీ చేస్తుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

ప్రశ్న 7.
POSDCORB అంటే ఏమిటి ? దాని ఉపయోగాలు, పరిమితులను వివరించండి.
జవాబు.

  1. లూథర్ గల్లిక్, ప్రధాన అధికారి యొక్క కార్యకలాపాలను ఏడు రకాలైన కార్యాలుగా అభివర్ణించారు.
  2. గల్లిక్ తెలిపిన నిర్వహణ విధులను POSDCORB అని అంటారు.
  3. POSDCORB అనగా ప్రణాళిక (Planning), వ్యవస్థీకరణ (Organising), సిబ్బందీకరణ (Staffing), నిర్దేశం (Directing), సమన్వయాధికారం (Co-ordinating), నివేదిక (Reporting), బడ్జెటింగ్ (Budgeting).

I) POSDCORB ఉపయోగాలు:
1) ఒక సంస్థ దాని లక్ష్యాలను సాధించడానికి ప్రారంభదశగా ఈ నిర్వహణ విధులను అన్వయిస్తుంది.
2) ఒక సంస్థ రూపకల్పనలో గల కార్యకలాపాలను నెరవేర్చేదిశగా ఈ నిర్వహణ విధులు సహాయాన్ని’ అందిస్తాయి.

II) POSDCORB పరిమితులు:
1) మార్క్ మూర్ అనే నిష్ణాతుడు POSDCORB ను మానసదృష్టి కలదిగా భావించాడు. అతని దృష్టిలో ఒక సంస్థ తన వినియోగదారులకు అందించే సేవలు ఆ సంస్థలో గల వాతావరణాన్ని బట్టి ఉంటాయని అర్థం చేసుకోవాలి.

2) డా|| లూయిస్ మెరియమ్ చెప్పినట్లు POSDCORB పదంలో లోపించిన అంశం ఏమిటంటే వాటికి సంబంధించిన పరిజ్ఞానం. నిర్వాహకులు ఏదో ప్రణాళికను వేసి, వ్యవస్థీకరించి, ఆదేశాలు జారీ చేస్తారు కాని ఏ లక్ష్యాలపై దృష్టి పెడుతున్నారో తెలుసుకోవడం కష్టం.

ప్రశ్న 8.
వ్యవస్థీకరణ యొక్క ప్రాముఖ్యత ఏమిటో సవివరంగా వివరించండి.
జవాబు.
వ్యవస్థీకరణ: ఏ ఉద్దేశం కోసం కార్యకలాపాలను నిర్ధారించుకున్నామో వాటిని వివిధ వర్గాలకు కేటాయించే ప్రక్రియను వ్యవస్థీకరణ అంటారు.

వ్యవస్థీకరణ – ప్రాముఖ్యత:
ఏ సంస్థ అయినా విజయవంతంగా కొనసాగడానికి వ్యవస్థీకరణ విధిని ఖచ్చితంగా అమలు పరచవలసి ఉంటుంది. వ్యవస్థీకరణ వల్ల సంస్థ అనేక సమస్యలను అధిగమించి, నిలదొక్కుకుని, వృద్ధి పొందవచ్చు. వ్యవస్థీకరణ ప్రాముఖ్యత కింద వివరించబడినది.
1) ప్రత్యేకీకరణ ప్రయోజనాలు: శ్రామిక శక్తికి కేటాయించవలసిన పనులను బట్టి వ్యవస్థీకరణ క్రమమైనదిగా ఉంటుంది. వ్యక్తుల సామర్థ్యాన్ని ఆధారం చేసుకుని పనులను నిర్వర్తిస్తారు. కాబట్టి పని భారం తగ్గి ఉత్పాదకత పెరుగుతుంది. చేసే పనులు అనేక పర్యాయాలు చేయడం వల్ల అనుభవం పెరిగి ప్రత్యేకీకరణకు దారి తీస్తుంది.

2) స్పష్టమైన కార్యసంబంధాలు: సంస్థలో పనిచేసే సిబ్బంది మధ్య సంబంధాలను గుర్తించడం ద్వారా సమాచారాన్ని ఎవరు ఎవరికి నివేదించాలని స్పష్టమవుతుంది. దీనివల్ల సమాచారాన్ని, సూచనలను చేరవేయడంలో అస్పష్టతను తొలగించవచ్చు.

3) అభిషణీయమైన వనరుల వినియోగం: వ్యవస్థీకరణ వల్ల లభ్యమయ్యే ఆర్థిక, మౌలిక మరియు మానవ వనరుల వినియోగం సక్రమంగా జరుగుతుంది. దానితో వనరుల దుర్వినియోగం తగ్గించబడి గందరగోళాన్ని నిరోధిస్తుంది.

4) మార్పుల ఆమోదం: వ్యవస్థీకరణ ప్రక్రియ ఒక వ్యాపార సంస్థలో జరిగే మార్పులను ఆమోదిస్తుంది. దీనివల్ల వ్యవస్థ నిర్మాణాన్ని సముచిత రీతిలో సవరించడం జరుగుతుంది. తద్వారా వివిధ మార్పులు జరుగుతున్నప్పటికీ సంస్థ ఎదుగుదల, మనుగడకు అవసరమయిన స్థిరత్వాన్ని కల్పిస్తుంది.

5) సమర్ధవంతమైన పరిపాలన సంస్థలోని ఉద్యోగ బాధ్యతలను స్పష్టంగా నిర్వచించడానికి వ్యవస్థీకరణ సహాయపడుతుంది. ఈ విధానం గందరగోళాన్ని, నకలు చేయడాన్ని తొలగిస్తుంది. దానితో పరిపాలనలో సౌలభ్యమేర్పడి, నిర్వహణలో సామర్థ్యాన్ని సంపాదించడానికి వీలవుతుంది.

6) సిబ్బంది వృద్ధి: వ్యవస్థీకరణ నిర్వాహకుల మధ్య సృజనాత్మకతను పెంపొందిస్తుంది. సమర్థవంతమైన అధికారదత్తత వల్ల ప్రతీ నిర్వాహకుడి పని భారం తగ్గి, క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన పనులను కేటాయిస్తుంది ఈ విధమైన పనిభారం తగ్గింపు కేవలం పరిమితమైన సామర్థ్యం కోసమేకాక నిర్వాహకులు క్రొత్తపద్ధతులను వృద్ధిపరచి లక్ష్యాలను నిర్ధారించేందుకు ఉపయోగపడుతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రణాళికను రూపొందించేటప్పుడు సంస్థ నిర్వాహకులు పరిగణించవలసిన ముఖ్యమైన లక్షణాలు ఏమిటి ?
జవాబు.
ఒక పనిని ఏవిధంగా, ఎలా చేయాలో ముందుగా నిర్ణయించడమే ప్రణాళిక. భవిష్యత్లో ఏర్పడే ఘటనలకు, ప్రణాళికలు ముందు జాగ్రత్త ప్రయోజనాల్ని కల్పిస్తాయి. ప్రణాళికను రూపొందించేటప్పుడు సంస్థ నిర్వహకులు పరిగణించవల్సిన ముఖ్యమైన అంశాలు:

  1. సంస్థలోని ప్రతి విభాగానికి లక్ష్యాలను ముందుగా నిర్ణయించుకోవాలి.
  2. పథకాలను అమలు పరచడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
  3. పని క్రమాన్ని, పని విధానం కొనసాగించడానికి తగిన ప్రమాణాలు ఏర్పరచుకోవాలి.
  4. సంస్థ మొత్తానికి బడ్జెట్లను తయారుచేసుకొని, ఉత్పత్తి అమ్మకాల, నగదుకు సంబంధించిన విభాగాల కోసం ప్రత్యేక బడ్జెట్ రూపొందించుకోవాలి.

ప్రణాళిక లక్షణాలు:
1) ప్రణాళిక · ఒక వివేకవంతమైన ప్రక్రియ: ప్రతి నిర్వాహకుడు తన మనసులో ‘మునిగే ముందు చూడు’ అని తనను తానే ప్రశ్నించుకోవాలి. ఏ కార్యాన్నైనా ప్రారంభించకముందే ప్రణాళికకు సంబంధించిన పనులు చేయడానికి పూనుకోవాలి. నిర్వాహకుడు తగిన వాస్తవాలను సేకరించి సంస్థ లక్ష్యాలను సాధించే విధంగా వ్యవస్థీకరించవలసి ఉంటుంది. లక్ష్యాలను ఏర్పరచే దిశలో ప్రతి నిర్వాహకుడు వివేకవంతమైన ప్రక్రియ చేబడతాడు.

2) లక్ష్యం ఆధారంగా ప్రణాళిక: సంస్థ రూపొందించే ప్రణాళికలన్నీ లక్ష్యానికి వలయంగా ఏర్పడతాయి. ప్రతి ప్రణాళిక లక్ష్యాల సాధన దిశగా అనుకూలమైన మద్దతును ఇవ్వాలి. లక్ష్యం లేనిదే ప్రణాళికకు అర్థం లేదు. లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోకుండా తీసుకునే ప్రతి చర్య శూన్యమైన అభ్యాసం అవుతుంది.

3) నిర్వహణ ప్రక్రియలో ప్రణాళిక ఒక ప్రాథమిక విధి: ఒక సంస్థ యొక్క ప్రణాళిక కార్యం నిర్వహణ శాస్త్రాలు అన్నింటిలోకి ప్రాథమిక విధి. మిగిలిన నిర్వాహక విధులన్నీ కూడా ప్రణాళికను రూపొందించిన తరవాత అమలుపరుస్తారు. దీనితో ప్రణాళికలో సమూల మార్పులకు ఆస్కారం ఉంటుంది.

4) ప్రణాళిక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది: ప్రణాళికలో నైపుణ్యం అంతర్భాగం. తక్కువ వ్యయంతో స్వల్ప వనరులను ఉపయోగించి ప్రారంభించిన కార్యాన్ని అత్యంత లాభసాటిగా మార్చడానికి తోడ్పడే మెళకువనే ప్రణాలిక అనవచ్చు. దాని కోసం నిర్వాహకుడు ఒక పనిని నైపుణ్యవంతంగా నిర్విర్తించడానికి గల ప్రత్యామ్నాయాలను పరిశీలించి నిర్ధారణ చేయాలి.

ప్రశ్న 2.
ప్రణాళిక ప్రక్రియలో ఇమిడి ఉన్న నిర్వహణ చర్యలు ఏమిటో వివరించండి. (లేదా) ప్రణాళికా ప్రక్రియలో గల దశలను వివరించండి.
జవాబు.
ప్రణాళికా దశలు:
1. వ్యాపార అవకాశాల అవగాహన: వాస్తవానికి వ్యాపారంలో అనేక అవకాశాలు ఉంటాయి. యాజమాన్యం. అలాంటి అవకాశాలపట్ల అవగాహన కలిగిఉండాలి. ఒక వ్యాపార అవకాశంపట్ల నిర్వాహకులకు ఉన్న అవగాహన కారణంగా . ప్రణాళికా ప్రయోజనం ఉన్నట్లు తయారు చేయాలి. అదే భవిష్యత్తులో సమస్యలకు పరిష్కారం శోధన సమస్యలను అధిగమిస్తుంది.

2. లక్ష్యాల నిర్ధారణ: ఒక సంస్థ యొక్క లక్ష్యాలను నిర్ధారించడం ప్రణాళికలోని రెండవదశ. యాజమాన్యం సాధించవలసిన లక్ష్యాలను క్లుప్తంగా తెలియజేయాలి. లక్ష్యాల నిర్ధారణ వల్ల ఏ పనిపై ఎక్కువ శ్రద్ధను కనబరచాలో తెలుస్తుంది. సంస్థ తన లక్ష్యాలను సాధించడానికి తగిన వ్యూహరచనలను, పథకాలను, విధానాలను, నియమాలను “ఏర్పరచుకోవాలి.

3. ప్రణాళికా సిద్ధాంతం – నిర్ధారణ: వస్తువులకున్న మార్కెట్, పెట్టుబడి మార్కెట్, ప్రభుత్వ పథకాలు, సాంకేతిక మార్పులలాంటి వివిధ కారకాలు, శక్తులు సంస్థ లాభాలపై ప్రభావాన్ని చూపుతాయి. వ్యాపారంపై ప్రభావం చూపే ఎలాంటి కారకాలైనప్పటికీ యాజమాన్యం వాటిని ముందుగా అంచనావేసుకోవలసి వస్తుంది. ఇలాంటి నిర్ధారణకు రావాలంటే ముందు జాగ్రత్త ఎంతైనా అవసరం.

4. ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టడం: ఆశించిన ఫలితాలను పొందడానికి అనేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉంటాయి. ఆ విధంగా ప్రత్యామ్నాయ ఫలితాలను పొందడానికి గల ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించి సరైనది ఎన్నుకోవడం.

5. అవసరార్థం ప్రణాళికలు: ఆమోదయోగ్యమైన చర్యను ఎంపిక చేసి ప్రాథమిక ప్రణాళికను అనుబంధంగాను, తోడ్పాటుగాను ఉండటం కోసం ఈ ప్రణాళికలను ఏర్పాటుచేయవచ్చు. భవిష్యత్తులో సంస్థ లక్ష్యాలు సాధించడానికి సహాయపడతాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

ప్రశ్న 3.
సిబ్బందీకరణను నిర్వచించి, దానిలోని వివిధ దశలు వివరించండి.
జవాబు.
సిబ్బందీకరణ అంటే వ్యక్తులను వివిధ స్థాయిలలోని ఉద్యోగాలలో నియమించడం. శ్రామిక శక్తి, ప్రక్రియ ప్రణాళికా సిబ్బంది ఎంపికతో మొదలై నియామకం, శిక్షణ, వృద్ధి, పదోన్నతి, నష్టపరిహారం నిర్వహణ విశ్లేషణతో ముగుస్తుంది. సిబ్బందీకరణ దశలు:
1. సిబ్బంది అవసరాలను అంచనావేయడం: ఒక సంస్థ రూపకల్పన చేయబడినప్పుడు వివిధ స్థాయిలలో సిబ్బంది అవసరాలను అంచనావేయడం జరుగుతుంది. ప్రతి స్థాయిలో ఒక వ్యక్తికి గల అర్హత, నేర్పు, అనుభవాన్ని బట్టి నియామకం చేపట్టడం జరుగుతుంది. అందువల్ల సంస్థ పరిమాణం ఆధారంగా ఎంతమేరకు, ఏ రకమైన సిబ్బంది అవసరమో తెలుసుకోవచ్చు. కార్యభారం విశ్లేషణ చేయడంవల్ల సంస్థ సిబ్బంది సంఖ్యను అంచనావేసి సంస్థ లక్ష్యాలను సాధించడానికి తగిన చర్యలు తీసుకుంటూ నియామకాలు చేపట్టవచ్చు.

2. నియామకం: ఒక సంస్థకు కావలసిన భావి ఉద్యోగులను వెదికి, అభ్యర్థించే వ్యక్తులను తగిన ఉద్యోగాలలో నియమించి ప్రోత్సహించే ప్రక్రియనే నియామకం అంటారు. నియామకాలు చేపట్టడానికి ఫ్యాక్టరీ గేటు వద్దగాని, కార్యాలయపు నోటీసు బోర్డు వద్దగాని, పత్రికలలోగాని, ఎలక్ట్రానిక్ మీడియాలలోగాని ప్రకటనలు చేయవచ్చు. దీనివల్ల కాబోయే ఉద్యోగార్థులను నిర్ధారించుకోవడానికి తగిన అవకాశాలు ఏర్పడతాయి.

3. ఎంపిక: నియామక ప్రక్రియలో సరైన వ్యక్తిని తెలుసుకోవడమే ఎంపిక. ఎంపిక వల్ల రెండు ముఖ్యమైన ప్రయోజనాలుంటాయి. మొదటిది సంస్థకు కావలసిన వ్యక్తులలో అత్యంత ప్రావీణ్యమైన వ్యక్తులు లభించడం మరియు రెండవది, సంస్థకు వారిపట్ల ఉన్న స్థాయిని తెలిపే చర్యలను చేపట్టడం. సంస్థ ఏర్పాటు చేసిన నియామక ప్రక్రియలో లిఖిత పూర్వక పరీక్ష మరియు మౌఖిక పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి నియమనిబంధనలతో కూడిన నియామక పత్రాన్ని అందజేసి విధులలో చేరే తేదీని లేఖాపూర్వకంగా తెలియజేస్తారు.

4. స్థానీకరణ, పునఃశ్చరణ: ఒకే స్థానానికి నియమింపబడిన వ్యక్తి విధులకు హాజరయ్యే పత్రాన్ని సంస్థకు అందజేసిన తరువాత, అలాంటి వ్యక్తులకు కంపెనీకి సంబంధించిన అంశాలను వ్యక్తులను పరిచయం చేస్తారు. ఆ వ్యక్తిని తగిన విభాగానికి పంపి ఉద్యోగ బాధ్యతలను అప్పగిస్తారు. ఈ రకమైన ప్రక్రియల ద్వారా వ్యక్తులకు కంపెనీ పట్ల అవగాహన ఏర్పడుతుంది. స్థానీకరణ అంటే ఏ స్థాయికైతే ఒక వ్యక్తిని ఎంపిక చేస్తారో అదే స్థాయిలో అతనిని నియమించడం అన్నమాట.

5. శిక్షణ, వికాసం: ప్రతి ఉద్యోగికి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉండాలి. అలాంటి అవకాశాన్ని ఇవ్వడానికి శిక్షణ ద్వారా తగిన విధంగా నేర్చుకునే సదుపాయాన్ని సంస్థ కల్పించాలి. నిరంతరం విద్య నేర్చుకునే సదుపాయాలు అంతర్గతంగా శిక్షణ కేంద్రంలో ఉండే అవకాశం ఉంటుంది. లేనట్లయితే బహిరంగ ప్రాంతాలలో గల శిక్షణా కేంద్రాల ద్వారా విషయ సమాచారాన్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది. శిక్షణా కార్యక్రమాల వల్ల నైపుణ్యాలు పెంచుకోవచ్చు.

ప్రశ్న 4.
ఉద్యోగుల ఎంపికకు పాటించాల్సిన విధాన క్రమాన్ని తెలియపరచండి.
జవాబు.

  1. ఒక సంస్థలో మానవ వనరుల ఆవశ్యకాలను అర్ధం చేసుకోవడంతో సిబ్బందీకరణ ప్రక్రియ మొదలవుతుంది.
  2. మానవ వనరుల కోసం సంస్థ అంతర్గతంగా లేదా బహిర్గత ఆధారాల ద్వారా గుర్తించవచ్చు.
  3. నియామకాలు చేపట్టడానికి ఫ్యాక్టరీ గేటువద్ద గాని, కార్యాలయపు నోటీసు బోర్డు వద్దగానీ, పత్రికలలో గాని ప్రకటనలు చేయవచ్చు.
  4. నియామక ప్రక్రియలో సరైన వ్యక్తిని తెలుసుకోవడాన్ని “ఎంపిక” అంటారు.
  5. సంస్థ ఏర్పాటు చేసిన నియామక ప్రక్రియలో లిఖిత పూర్వక పరీక్ష మరియు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు.
  6. సంస్థ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి నియమనిబంధనలతో కూడి నియామక పత్రాన్ని అందజేసి, విధులలో చేరే తేదీని లేఖ పూర్వకంగా తెలియజేస్తారు.
  7. ఎంపిక అయిన వ్యక్తికి నైపుణ్యం ఉన్న వ్యక్తులతో శిక్షణ ఇస్తారు. ఈ విధంగా సిబ్బంది ఎంపికా విధానం కొనసాగును.

ప్రశ్న 5.
`నిర్దేశక సూత్రాలను వివరించండి.
జవాబు.
నిర్దేశ సూత్రాలు:
1. వ్యక్తుల అత్యున్నత కృషి: సంస్థ లక్ష్యాలను సాధించడానికి ప్రతివ్యక్తి తమవంతు కృషిని కనబరుస్తాడు. ఈ సూత్రం ద్వారా అనేక పద్ధతులను పాటించి వ్యక్తిగతంగా అత్యున్నత ప్రతిభను చూపడానికి కృషి చేయవలసి ఉంటుంది. సిబ్బందిలో గల నిగూఢమైన శక్తిని వెలికితీసి సంస్థ సామర్థ్యాన్ని పెంచడానికి వీలు ఉంటుంది.

2. లక్ష్యాల పొందిక: సాధారణంగా, సంస్థ లక్ష్యాలు, వ్యక్తిగత లక్ష్యాలు వేరుగా ఉండి వివాదాలకు కారణమౌతాయని ‘మనం గమనిస్తూ ఉంటాం. కాని మంచి నిర్దేశ సూత్రాల వల్ల లక్ష్యాల పొందిక ఏర్పడి వ్యక్తుల సహకారంతో పని నైపుణ్యం పెరుగును.

3. అనుగుణమైన నిర్దేశ సంకేతం: ఈ సూత్రం ప్రకారం సిబ్బందికి నిర్దేశించే సూచనలు వారి సామర్థ్యం, నడవడిలాంటి వాటిలో విచిత్రమైన మార్పులు చోటుచేసుకునే అంశాలు లెక్కలోనికి తీసుకుని వారికి ప్రోత్సాహాన్ని కలిపించాలి..

4. నిర్వాహక సమాచారం: సంస్థలోని అన్ని స్థాయిలలో సమర్థవంతమైన నిర్దేశ సూత్రాలను అమలుపరచడానికి సమాచారాన్ని అత్యంత శ్రద్ధతో అందించాలి. ఈ సూత్రం వల్ల క్షేత్రస్థాయి సిబ్బందిపట్ల పూర్తి అవగాహన ఏర్పడును.

5. లాంఛనప్రాయమైన వర్గాల వినియోగం: ప్రతి సంస్థలోను అధికార, అనధికార వర్గాలు ఉంటాయని నిర్వాహకులు తెలుసుకోవాలి. వీటిని అధికారులు గుర్తించి సమర్థవంతమైన నిర్దేశకత్వానికి ఈ వర్గాలను ఉపయోగించుకోవాలి.

6. ఆజ్ఞా ఏకత్వం: ఈ సూత్రం ప్రకారం సంస్థలోని సిబ్బంది ఓకే అధికారి నుంచి సూచనలు పొందవలసి ఉంటుంది. దీన్ని పాటించడం వల్ల సమర్థవంతమైన నిర్దేశంగా పరిగణించబడుతుంది.

7. నాయకత్వం నిర్వాహకులు, తమవద్ద గల క్షేత్రస్థాయి సిబ్బంది అసంతృప్తికి లోనుకాకుండా నాయకత్వ ప్రతిభ ప్రాభవాన్ని చూపుతూ సరిఅయిన మార్గంలో తీసుకెళ్ళాలి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

ప్రశ్న 6.
ప్రణాళిక అంటే ముందు చూపు, నియంత్రణ అంటే వెనక్కి చూడటం వ్యాఖ్యానించండి.
జవాబు.
1) ఒక పనిని ఏ విధంగా, ఎలా చేయాలో ముందుగా నిర్ణయించడమే ప్రణాళిక. ప్రణాళిక అనేది నిర్వహణ విధులలో ప్రాథమికమైంది.

2) ఒక సంస్థ ఏర్పరిచిన నియమ నిబందనల మేరకు ప్రతి కార్యాచరణ తగిన విధంగా నడిచేటట్లు పరిశీలన చేయడం

3) ప్రణాళికలో చేయబోయే పనికి నియమ నిబంధనలు తయారుచేస్తే, నియంత్రణలో వాస్తవ కార్యాలు నిబంధనలు ప్రకారం జరిగినవో లేదో, ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటికి నివారణాత్మక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిని బట్టి ప్రణాళిక అంటే ముందు చూపు, నియంత్రణ అంటే వెనక్కి చూడటం అని తెలుస్తుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రణాళిక లక్షణాలు.
జవాబు.
ప్రణాళిక లక్షణాలు:

  1. ప్రణాళిక ఒక వివేకవంతమైన ప్రక్రియ.
  2. లక్ష్యం ఆధారంగా ప్రణాళిక తయారు చేస్తారు.
  3. నిర్వహణ ప్రక్రియలో ప్రణాళిక ఒక ప్రాథమిక విధి.
  4. ప్రణాళిక నైపుణ్యం పెంపొందిస్తుంది.

ప్రశ్న 2.
వ్యవస్థీకరణ ప్రక్రియ.
జవాబు.

  1. ఏ ఉద్దేశం కోసం కార్యకలాపాలను నిర్ధారించుకున్నామో వాటిని వివిధ వర్గాలకు కేటాయించే క్రమమే వ్యవస్థీకరణ అంటారు.
  2. వ్యవస్థీకరణ ప్రక్రియ దశలు: a) పనికి గుర్తించి విభజించడం b) విభాగీకరణ c) సంస్థలోని వివిధ స్థాయి వారి విధులు, బాధ్యతలు అప్పగించడం d) నివేదికలను సమర్పించే సంబంధాలను ఏర్పరచడం.

ప్రశ్న 3.
వ్యవస్థ స్వరూపం.
జవాబు.
వ్యవస్థ రూపం:

  1. పనిని గుర్తించడం.
  2. విభాగీకరణ.
  3. సంస్థలోని వివిధ స్థాయిల వారి విధులను, బాధ్యతను నిర్ధారించడం.
  4. నివేదికలను సమర్పించే సంబంధాన్ని ఏర్పరచడం.

ప్రశ్న 4.
సిబ్బందీకరణ.
జవాబు.

  1. వ్యక్తులను వివిధ స్థాయిలోని ఉద్యోగాలలో నియమించడాన్ని “సిబ్బందీకరణ” అంటారు.
  2. సిబ్బందీకరణతో సరియైన వ్యక్తులను సరియైన స్థానంలో నియమించడం జరుగుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

ప్రశ్న 5.
సిబ్బంది ఆవశ్యకత.
జవాబు.

  1. ఏ సంస్థలోనైనా పనిచేసే సిబ్బంది ఎంతో అవసరం. సిబ్బందీకరణతో సరియైన వ్యక్తులను సరియైన స్థానంలో నియమించడం జరుగుతుంది. దీని ద్వారా ఉన్నత ప్రమాణాలు గల పనితనం సృష్టించబడుతుంది.
  2. అభిలషణీయమైన మానవ వనరుల, వినియోగానికి ఉపకరిస్తుంది. పరిమితికి మించిన సిబ్బందిని నివారించడం వల్ల హెచ్చు శ్రామిక వ్యయాన్ని తొలగించవచ్చు.

ప్రశ్న 6.
నిర్దేశం ప్రాముఖ్యత.
జవాబు.

  1. సంస్థ లక్ష్యాలను సాధించడానికి నిర్దేశ సూచనలు ఎంతో అవసరం.
  2. నిర్వాహకులు ఇచ్చే దిశగా నిర్దేశం ద్వారా సిబ్బంది ఎప్పుడు, ఏ విధంగా ఎలా అమలుపరచాలో తెలియజేస్తారు.
  3. నిర్దేశం ద్వారా సంస్థలో సంభవించే మార్పులకు సూచనలు ప్రవేశపెట్టవచ్చు. సిబ్బంది సహాయ సహకారాలతో బాధ్యతాయుతమైన నిర్దేశ ప్రాబల్యం వల్ల సంస్థలో స్థిరత్వం ఏర్పడుతుంది.

 

ప్రశ్న 7.
నియంత్రణ.
జవాబు.

  1. నియంత్రణ అంటే ఒక సంస్థ ఏర్పరచిన నియమనిబంధనల మేరకు ప్రతి కార్యాచరణ తగిన విధంగా నడిచేటట్లు పరిశీలించడం.
  2. నియంత్రణ, నిర్వహణ శాస్త్రం సూచించిన చివరి విధి.

ప్రశ్న 8.
ప్రణాళికకు, నియంత్రణకు మధ్యగల సంబంధం.
జవాబు.

  1. నిర్వహణ శాస్త్రంలో మొదటి విధి ప్రణాళిక మరియు చివరి విధి నియంత్రణ.
  2. ప్రణాళికలో ఏపనిని ఎలా చెయ్యాలో నియమనిబంధనలు రూపొందిస్తే, ఆ ‘నియమ నిబంధనలను పాటిస్తూ పని జరిగిందో లేదో పరిశీలించడం నియంణలోకి వస్తుంది.
  3. ప్రణాళిక అంటే ముందుచూపు, నియంత్రణ అంటే వెనక్కి చూడటం అని చెప్పవచ్చు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

ప్రశ్న 9.
POSDCORB.
జవాబు.

  1. లూథర్ గల్లిక్ ప్రకారం నిర్వహణ విధులను POSDCORB అని అమర్చడం జరిగింది.
  2. POSDCORB అనగా ప్రణాళిక, వ్యవస్థీకరణ, నిర్దేశం, సిబ్బంది, సమన్వయం, రిపోర్టింగ్, బడ్జెట్లుగా చెప్పబడింది.

TS Inter 2nd Year Commerce Notes Chapter 3 Banking Services

Here students can locate TS Inter 2nd Year Commerce Notes Chapter 3 Banking Services to prepare for their exam.

TS Inter 2nd Year Commerce Notes Chapter 3 Banking Services

→ Banking services include acivities such as banking, insurance, transpotation, warehousing, advertising.

→ The word ‘Bank’ in derived from French word ‘Banco’ which mean Bench.

TS Inter 2nd Year Commerce Notes Chapter 3 Banking Services

→ Bank is an institution which attracts deposits for the purpose of lending to business and others.

→ 14 major banks on July 19, 1969, and 6 more major banks on 15 April 1980 are nationalized.

→ Acceptance of deposits; lending loans; agency services and general public utility services are major functions of commercial banks.

→ Deposits can be classified into fixed deposits, saving deposits, recurring deposits, current depos¬its, home save deposits and kiddy bank deposits.

→ The banks ae classified s scheduled and non scheduled banks.

→ E – Banking enables a customer to transact with his bank from anywhere.

→ ATM, Anywhere banking (tele banking, Internet banking) are the part of E – Banking.

→ The various types of payments facilitated by banks are cheque, NEFT, RTGS, IMPS and wallets.

TS Inter 2nd Year Commerce Notes Chapter 3 బ్యాంకింగ్ సేవలు

→ బ్యాంకు అనే పదం ఫ్రెంచ్ భాషలోని బాంకో (Banco) అనే పదం నుండి గ్రహించబడింది. ఫ్రెంచి భాషలో దీని అర్థం ‘బల్ల’.

→ బాంకు నిర్వచనం : ‘అప్పులు’ ఇవ్వడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి ప్రజల వద్ద నుంచి డిపాజిట్లను స్వీకరించి, తరువాత వారి అభ్యర్థన మేరకు చెక్కు, డ్రాఫ్ట్ మొదలైనవాటి ద్వారా తిరిగి చెల్లించే సంస్థ.

→ బ్యాంకుల ప్రధాన విధులు నాలుగు. అవి :
ఎ) ప్రజల నుంచి నగదు రూపంలో డిపాజిట్లను స్వీకరించడం.
బి) ప్రజలకు రుణాలు మంజూరు చేయడం.
సి) ఏజెన్సీ (ప్రతినిధి) సేవలు చేపట్టడం.
డి) సాధారణ ప్రయోజన సేవలను చేయడం.

→ ఈ-బాంకింగ్ : ఇది ఈ-కామర్స్లోలో అంతర్భాగం. ఈ-బాంకింగ్ అనగా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్. అనగా పనివేళలతో నిమిత్తం లేకుండా ఖాతాదారుడు ఎప్పుడైనా, ఎక్కడినుండైనా తన బ్యాంకుతో వ్యవహారాలు 800. (24 × 7)

TS Inter 2nd Year Commerce Notes Chapter 3 Banking Services

→ భారతదేశ పరిధిలోని బ్యాంకులు అన్ని రిజర్వు బ్యాంకు అధీనంలో ఉండి, షెడ్యూల్డ్ మరియు నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులుగా వర్గీకరించబడినాయి.

→ షెడ్యూల్డ్ బ్యాంకులను మరల సహకారబ్యాంకులు, వాణిజ్య బ్యాంకలు మరియు స్థానిక ప్రాంతీయ బ్యాంకులుగా వర్గీకరించబడినవి.
TS Inter 2nd Year Commerce Notes Chapter 3 Banking Services 3

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 9th Lesson నిర్వహణ సూత్రాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 9th Lesson నిర్వహణ సూత్రాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నిర్వహణ సూత్రాలు అంటే ఏమిటి ?
జవాబు.
20వ శతాబ్దంలో ఏర్పడిన నిర్వహణకు హెన్రీ ఫేయల్ నిర్వహణ సిద్ధాంతాలను రూపొందించారు. అందువల్ల ఇతన్ని “నిర్వహణ పితామహుడు” అని పిలుస్తారు.
హెన్రీ ఫేయల్ రూపొందించిన నిర్వహణ సిద్ధాంతాలు/సూత్రాలు:
1) శ్రమ విభజన:

  1. అన్ని రకాల పనులను ఎక్కువ మంది సిబ్బందికి కేటాయించి విభజించాలని, దానివల్ల పని సులభంగా మరియు ఫలవంతంగా అవుతుందని ఫేయల్ సిఫారసు చేశారు.
  2. వ్యక్తులు ఒక పనిని పలుమార్లు చేయడం వల్ల వారి పనిలో వేగం పెరిగి నైపుణ్యం వస్తుంది, ఇది ప్రత్యేకతకు దారితీస్తుంది. దాని ద్వారా సంస్థ వృద్ధి సాధిస్తుంది.

2) అధికారం బాధ్యత సమానత్వం:

  1. అధికారం అనగా వనరులను ఉపయోగించుకుంటూ, క్షేత్రస్థాయి సిబ్బందికి నియంత్రణా పూర్వక నిర్దేశాన్ని ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకునే హక్కు.
  2. ఈ సూత్రం ప్రకారం అధికారం మరియు బాధ్యత రెండు కూడాను సమానంగా కేటాయించాలి. బాధ్యతా రహితంగా అధికారాన్ని కట్టబెట్టడం వల్ల అధికార దుర్వినియోగానికి దారి తీస్తుంది. అదేవిధంగా బాధ్యతను కల్పించి అధికారాన్ని కేటాయించకపోతే వ్యక్తుల నైపుణ్యత దెబ్బతింటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

3) క్రమశిక్షణ:

  1. క్రమశిక్షణ అనగా ఇతరులతో సత్సంబంధాలు కలిగి సంస్థ నియమ నిబంధనలను పాటిస్తూ విధేయత కలిగి ఉండటము.
  2. వ్యాపారం సజావుగా కొనసాగాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరం. ఈ క్రమశిక్షణ కార్మికుల్లో మాత్రమే కాకుండా యాజమాన్యంలో కూడా ఉండాలి. దీనికొరకు అన్ని స్థాయిలలో నియమాలను రూపొందించాలి.

4) ఆదేశ ఏకత్వం:

  1. ఆదేశ ఏకత్వం సూత్రం ప్రకారం ఒక క్షేత్రస్థాయిలోని ఉద్యోగి అతనిపై అధికారికి మాత్రమే బాధ్యుడై, ఆ అధికారి నుండి ఆదేశాలను పొందవలసి ఉంటుంది. అందువల్ల ఒక ఉద్యోగి ఎక్కువ మంది అధికారుల నుండి ఆదేశాలు పొందకూడదు.
  2. ఏ అధికారి ఏ ఉద్యోగికి, ఎంత మేరకు పనులను అప్పగిస్తున్నారో సూచనప్రాయంగా స్పష్టతలో ఉండాలి. ఆదేశాల ప్రక్రియలలోని వివాదాలను, కలవరాలను, చికాకులను తొలగించడానికి ఈ సూత్రం ఎంతగానో అవసరం.

5) నిర్దేశ ఏకత్వం:

  1. నిర్దేశ ఏకత్వ సూత్రం ప్రకారం సంస్థలోని ప్రతీవ్యక్తి శ్రమ ఆ సంస్థ రూపొందించిన లక్ష్యాలను సాధించే దిశగా ఉండాలి.
  2. ఒక కార్యానికి సంబంధించిన లక్ష్యాల సాధనకు సిబ్బంది బృందానికి ఒకే ప్రణాళిక, ఒకే అధికారి మాత్రమే ఉండాలి.

6) వ్యక్తిగత ఆసక్తికి బదులు సాధారణ ఆసక్తి:

  1. వ్యక్తిగత ఆసక్తులు లేదా కొంతమంది వ్యక్తులు ఉమ్మడి ఆసక్తులు సంస్థాగత లక్ష్యానికి అవరోధంగా ఉండకూడదు.
  2. వ్యక్తిగత నిర్థిష్ట అంచనాలు సంస్థ లక్ష్యసాధనకంటే ఎక్కువేమి కాదు. అందువల్ల వ్యక్తి గత ఆసక్తిని సాధారణ ఆసక్తికి అనుగుణంగా మార్చుకోవడం అవసరం.

7) ఉద్యోగుల వేతనం చెల్లింపు:

  1. ఉద్యోగి వేతన చెల్లింపు పద్ధతి సిబ్బంది సేవలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడి ఉండాలి. ఉద్యోగులు వేతన చెల్లింపుల పట్ల సంతృప్తికరంగా ఉండాలి.
  2. సంస్థలో ఉద్యోగుల అమరిక క్రమంగా ఉంటే ఉద్యోగులు తమ శక్తి మేరకు సక్రమమైన ప్రయత్నాన్ని చేస్తూ ఉత్పాదక వృద్ధికి తోడ్పడతారు. దానికి ప్రతిఫలంగా ఉద్యోగులకు చెల్లించే వేతనం సంతృప్తిదాయకంగా ఉండాలి.

8) కేంద్రీకరించడం:

  1. కేంద్రీకరించడం అనగా ఒక సంస్థలో అధికారం ఏ స్థాయిలో ఉంటుందో సూచించడం.
  2. అనేక సంస్థలలో అధికార కేంద్రీకరణ వివిధ శ్రేణులలో ఏర్పాటు చేయబడుతుంది. కేంద్రీకరణలో నిర్వాహకులు, అధికారులు ముఖ్యమైన పాత్రలను పోషిస్తారు.

9) స్కేలార్ చైన్:

  1. ఫేయల్ భావన ప్రకారం సమాచారం వేగవంతంగా సమర్ధవంతంగా ప్రసారం చేయడానికి గొలుసు అవసరం. దీనినే స్కేలార్ చైన్ అంటారు.
  2. స్కేలార్ గొలుసులో ఛీఫ్ ఎక్జిక్యూటివ్ స్థాయి నుండి సంస్థలోని కనిష్ట స్థాయి వరకు అధికారులను కలిగి ఉంటుంది. ఈ గొలుసు ద్వారా సంస్థలోని వ్యక్తులు సలహా, సహాయం కోసం ఎవరిని సంప్రదించాలో తెలుస్తుంది.

10) ఆర్డర్: ఫేయల్ సూత్రం ప్రకారం ప్రతీ వస్తువు మరియు ప్రతి ఒక్కరూ తమ తమ స్థానాలలో ఉండాలి అని చెబుతుంది. ఈ సూత్రం “సరైన వ్యక్తి సరైన స్థానంలో ఉండాలి” అనే అర్థాన్ని తెలియచేస్తుంది.

11) ధర్మం: ధర్మంలో విధేయత, న్యాయం కలిసి ఉంటాయి. సంస్థలలోని ఉద్యోగుల భక్తి, నమ్మకం సరైన రీతిలో ఉంటాయని భావిస్తారు. క్షేత్రస్థాయి ఉద్యోగుల పట్ల మంచి స్వభావంతో న్యాయపరంగా వ్యవహరించాలి. ధర్మబద్ధమైన సూత్రం వల్ల సంస్థ చేపట్టిన పనులు విజయవంతమవుతాయి.

12) ఉద్యోగి పదవీ భద్రత:

  1. సిబ్బంది మనసులలో నుంచి ఉద్యోగ అభద్రతా భావనను నిర్వహణ తొలగిస్తుంది. ప్రతీ ఉద్యోగా తన ఉద్యోగం సురక్షితం అని భావించాలి. ఉద్యోగి ఒకే చోట భద్రతగా పని చేసినట్లయితే అతను సంపూర్ణ తీరును కనబరుస్తాడు.
  2. ఒకవేళ ఉద్యోగ భద్రత లేనట్లయితే పనిలో శ్రద్ధలోపిస్తుంది. ఉద్యోగ అభద్రతాభావం సంస్థలో ఉన్న లోపాయికారి నడవడిని సూచిస్తుంది.

13) చొరవ:

  1. ఒక ప్రణాళికను ప్రతిపాదించి, దాన్ని అమలుపరచే విధానాన్ని “చొరవ” అంటారు. ఫేయల్ ప్రకారం, నిర్వాహకులు తమ ఉద్యోగుల పని తనంలో వీలైనంత చొరవ చూపే విధంగా చర్యలు తీసుకోవాలి.
  2. ఉద్యోగులు వారి సహచరులు ప్రణాళికలను తయారుచేసుకుని, అమలుపరచడానికి చొరవ తీసుకొని సంస్థ విజయానికి తోడ్పడాలి. ప్రతి ఉద్యోగి తన వంతు చొరవ చూపడం వల్ల సంస్థ అభివృద్ధి జరుగుతుంది.

14) ఎప్పిరిట్ డి కార్ప్స్ (సమైక్యతే బలం):

  1. దళ సభ్యుల విధేయత, సభ్యుల శ్రమ పట్ల గల ప్రాముఖ్యతను ఈ సూత్రం తెలియజేస్తుంది. ఎస్పిరిట్ డి కార్ప్స్ అనగా సిబ్బంది సమాచార సమన్వయం ద్వారా సమైక్య బలం చేకూరుతుందని అర్థం.
  2. యాజమాన్యం ఎప్పుడూ “విభజించు, పాలించు” అనే విధానాన్ని స్వస్తి పలకాలి మరియు సామూహిక ఉత్సాహాన్ని, సామూహిక పనిని ప్రోత్సహించాలి. దీనివల్ల సంస్థ సజావుగా సాగుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

ప్రశ్న 2.
“నిర్వహణను కళగానూ, శాస్త్రంగానూ పరిగణిస్తారు” వివరించండి.
జవాబు.
నిర్వహణను కళగానూ, శాస్త్రంగానూ పరిగణిస్తారు. ఎందుకంటే ఊహ, సృజనాత్మకత, నైపుణ్యం అనేవి అమలుచేయగలము కాబట్టి నిర్వహణకు కళగా అనవచ్చు. అంతే కాకుండా నిర్వహణ అనేక సిద్ధాంతాలను, సూత్రాలను విశ్వవ్యాప్తంగా అమలుచేయటం వల్ల దీనికి శాస్త్రంగా కూడా పరిగణించవచ్చు.

నిర్వహణ – కళ: నిర్వాహకునికి గల గ్రాహ, సృజనాత్మకత, లోతైన ఆలోచనా విధానం లాంటివి కలిగినప్పుడు నిర్వహణ నైపుణ్యం అనేది అమలుపరచడానికి వీలు ఉంటుంది. అందువల్ల దీన్ని కళ అని చెప్పవచ్చు. నిర్వహణను ఇతర శాస్త్రాలైన భౌతిక, రసాయన, గణిత శాస్త్రాల లాగా ఖచ్చితంగా సమాన శాస్త్రాలని చెప్పలేము. కానీ ఏ మాత్రం సంకోచం లేకుండా నిర్వహణకు ఒక శాస్త్రమని చెప్పవచ్చు. కాని అది భౌతిక, రసాయన శాస్త్రాల లాగా అభ్యసన శాస్త్రం అని ఎంత మాత్రం చెప్పలేము. ఎందుకంటే నిర్వహణ శాస్త్రం మానవీయ కోణంతో అనేక భౌతిక అంశాల ఆధారంగా ప్రభావితమవుతుంది. ప్రాకృత శాస్త్రంలాగా నిర్వహణ శాస్త్రం నిర్ణయాలను విశ్వవ్యాప్తంగా అమలు పరచడానికి వీలులేదు. కాని సాంఘిక శాస్త్రాలైన ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రాలతో సరిపోల్చవచ్చు. నిర్వహణ శాస్త్రం ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. అంతేకాక కళలాగా భారీ స్థాయిలో అభ్యసనం చేయవలసి ఉంటుంది. కాని పెరుగుతున్న అవసరాలను బట్టి నిర్వహణ ఒక వృత్తి మాదిరిగా పరిణమిస్తూ ఉంది.

నిర్వహణ – శాస్త్రం: శాస్త్రం అనేది సాధారణ వాస్తవికతను తెలుపుతూ ఒక రంగం యొక్క ప్రత్యేక పరిజ్ఞానాన్ని కలిగిన విద్యావిధానం. వాస్తవానికి, ఒక అంశానికి గల సంబంధ కారణాలను తెలిపే విధానం, నిర్వహణ, నిర్వహణను ఒక శాస్త్రంగా మలచడానికి అనేక సిద్ధాంతాలను ఏర్పరచి వాటిని అనుసంధానంగా గల నడవడిని తెలిపే విద్య నిర్వహణ-విద్య అని చెప్పవచ్చు. ఈ విషయంపై అనేక అంశాలను విశ్వవ్యాప్తంగా అమలు పరచడానికి నిర్వాహణకు యుక్తమైన నిబంధనలను, సూత్రాలను సృష్టించి అవి సరియైనవో కావో కనుగొనడానికి శోధన జరుగుతున్నది. నిర్వాహకులు చేస్తున్న పనిని పూర్తి చేయడానికి శాస్త్రీయ పద్ధతుల ద్వారా విధానాలను అమలుపరచడం పెరుగుతున్నది. ఈ ఆలోచనా విధానం ఎలా ఉందంటే, మొదటగా సమస్యను గుర్తించి, దాన్ని అభ్యసించడానికి తాత్కాలిక భావనను ఏర్పరచుకుని, తగిన ప్రయోగ ప్రక్రియలను, పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రత్యామ్నాయ సమాధానాలను కనుక్కొనే ఆలోచన దిశగా అభివృద్ధి చెందుతోంది.

ప్రశ్న 3.
“నిర్వహణ రంగంలో హెన్రీ ఫేయల్ కృషిని వివరించండి.
జవాబు.
నిర్వహణ రంగంలో హెన్రీ ఫేయల్ కృషి: 20వ శతాబ్దంలో ఏర్పరచిన నిర్వహణ సిద్ధాంతాలకు పేర్కొనదగిన వ్యక్తి హెన్రీ ఫేయల్. ఫేయల్ 1860వ సంవత్సరంలో మైనింగ్ ఇంజనీర్గా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినాడు. సాధారణ పరిపాలన, నిర్వహణలో విజయవంతమైన అనుభవశాలి హెన్రీ ఫేయల్.

ఫేయల్ సిద్ధాంతాలు అన్ని సంస్థలకూ, ఆచరణకు యోగ్యంగా రూపొందించడం జరిగింది. ఫేయల్ రచన ప్రకారం, సంస్థను నిర్వహించడానికి ప్రణాళిక, వ్యవస్థీకరణ, నిర్దేశం, సమన్వయం, నియంత్రణ ‘అవసరం అని తెలిపాడు. ఈ విధంగా నిర్వహణ విధులను ఏ నిపుణుడు తెలియచేయని విధంగా రూపొందించడం జరిగింది. అందువల్ల ఇతన్ని “నిర్వహణ పితామహుడు” అని పిలుస్తారు.

హెన్రీ ఫేయల్ ప్రతిపాదించిన నిర్వహణ సూత్రాలే సర్వజనామోదం పొందాయి. ఇప్పటికీ ఈ సూత్రాలు నిర్వహణా శాస్త్రానికి తలమానికంగా ఉన్నాయి. ఫేయల్ ప్రతిపాదించిన సూత్రాలు విశ్వవ్యాప్తమైనవి అవడమే వాటిలోని గొప్పతనం అన్ని రకాల సంస్థలకు, అన్ని విధులకు, అన్ని స్థాయిలకు ఇవి వర్తిస్తాయి. అందుచేతనే ఈ సూత్రాలకు అంత ప్రాముఖ్యం వచ్చింది. ఫేయల్ 14 నిర్వహణ సూత్రాలను ప్రతిపాదించాడు.

ప్రశ్న 4.
నిర్వహణ స్వభావాన్ని వివరించండి.
జవాబు.
నిర్వహణ స్వభావం:
1) కళ మరియు శాస్త్రం: నిర్వహణను కళగాను మరియు శాస్త్రంగాను పరిగణిస్తారు. విశ్వవ్యాప్తంగా అమలు చేయుటకు నిర్వహణకు కొన్ని నిబంధనలు, సూత్రాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. అందువల్ల దీనిని శాస్త్రంగా పరిగణించవచ్చు. ఈ సిద్ధాంతాలను అమలు చేయుటకు సృజనాత్మకత, నైపణ్యం, ఊహ కూడా తోడవడంతో దీనిని కళగా కూడా పరిగణించవచ్చు.

2) సామాజిక బాధ్యత: నిర్వహణ అనే అంశం శాస్త్రీయ పద్ధతిలో ఒక వృత్తిగా భావింపజేసి, దానికున్న బాధ్యతను పెంచింది. ఒక నిర్వాహకుడు తన సిబ్బందికి మాత్రమే జవాబుదారీ కాడు, అతను సమాజానికి కూడా అదే రీతిలో బాధ్యుడవుతాడు. అతడు సమాజంలో ఒక ప్రతినిధిగా ఉండి, వినియోగదారుల ఆసక్తులను తగిన రీతిలో కాపాడాలి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

3) నిర్వహణ ఒక ప్రత్యేకమైన తత్వం కలది: ఉన్నత స్థాయి నిర్వాహకులు క్షేత్రస్థాయి పనులను చేపట్టరు. వారు ఆ పనిని ఇతరులచే పూర్తిచేయిస్తారు. వారు కనిష్ట మూలాంశాలైన మానవశక్తి, ముడిసరుకు సమయాలను ఉపయోగించి గరిష్ట ఫలితాంశాన్ని పొందడంలోనే వారి విజయ రహస్యం ఉంది.

4) ఉద్దేశపు కార్యం: యాజమాన్యం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశం ఏర్పరచుకుంటుంది. నిర్వహణ అనేది మానవ, భౌతిక వనరులను యోగ్యంగా వినియోగించుకుంటూ ముందుగా ఏర్పరచుకున్న లక్ష్యాలను చేరుకునే ఒక సాధనం.

5) నిర్వహణ అంతటా ఉంటుంది: నిర్వహణకు సంబంధించి ఆర్థిక, రాజకీయ రంగాల లాంటి అన్ని సంస్థలకు చెందే కార్యం. ఎక్కడ ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది వ్యక్తుల సాధారణ లక్ష్యపు కార్యాలు ఉంటాయో అలాంటి పరిస్థితులలో నిర్వహణ ఎంతో అవసరం. అందువల్ల సంస్థ ఆకార, పరిమాణాలతో సంబంధం లేకుండా వ్యవస్థీకరణ కార్యకలాపాల్లో నిర్వహణ అవసరమని క్లుప్తంగి చెప్పబడింది.

6) నిర్వహణ ఒక సామూహిక ప్రక్రియ: ఒక వ్యవస్థీకృత కార్యంలో నిర్వహణ అనేది అత్యవసరమని తెలుసుకున్నప్పుడు అది ఒక సామూహిక ప్రక్రియగా అభిప్రాయపడవచ్చు. ముందుగా ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించడానికి వ్యక్తుల సామూహిక కృషి ఎంతైనా అవసరం.

ప్రశ్న 5.
నిర్వహణ యొక్క ధ్యేయాలు ఏమిటి ? వివరించండి.
జవాబు.
ఏ సంస్థలోనైనా వివిధ లక్ష్యాలు ఉంటాయి. యాజమాన్యం ఆ లక్ష్యాలను ఉపయుక్తంగా నైపుణ్యంతో సాధించడానికి తోడ్పాటునందిస్తుంది. నిర్వహణ లక్ష్యాలను వ్యవస్థీకరణ లక్ష్యాలు, సాంఘిక లక్ష్యాలు, వ్యక్తిగత లక్ష్యాలుగా వర్గీకరించడం జరుగుతుంది.
1. వ్యవస్థీకరణ లక్ష్యాలు:
ఎ) ఒక వ్యాపారం విజయవంతమవడానికి దాని యాజమాన్యం సాధించవలసిన లక్ష్యాలను రూపొందించవలసి ఉంటుంది. వివిధ రకాలైన లక్ష్యాలను సాధించడానికి అన్ని రంగాలలోని వారి ఆసక్తిని లెక్కలోనికి తీసుకోవలసి ఉంటుంది. వారిలో ప్రభుత్వం, వినియోగదారులు, సిబ్బంది, వాటాదారులు ఉంటారు.

బి) ఏ వ్యవస్థ అయినా లక్ష్యాలను సాధించాలంటే, మానవ మరియు ఇతర వనరులను అత్యంత ప్రయోజనకరంగా వనియోగించుకుని వ్యాపార ఆర్థిక లక్ష్యాలైన లాభం, మనుగడ, వ్యాపార వృద్ధిని సాధించాలి.

2. సాంఘిక లక్ష్యాలు:
ఎ) ఈ లక్ష్యాల వల్ల సమాజంలో ప్రయోజనాలను సృష్టించే అంశాలు ఉంటాయి. సామాజిక రంగంలో భాగంగా ఒక వ్యాపార సంస్థ కాని, వ్యాపారేతర సంస్థకాని సాంఘికపరమైన బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుండి.

బి) సంఘంలోని వివిధ వర్గాలలోని వారికి ఆర్థిక విలువలను నిరంతరాయంగా సృష్టిస్తూ ఉండాలి. దీనిలో భాగంగా పర్యావరణ హితమైన ఉత్పత్తి విధానం, అణగారిన వర్గానికి ఉపాధి అవకాశాలు మరియు పాఠశాల, శిశు సంరక్షణా కేంద్రాలలో కనీస సదుపాయాలు కల్పించడం లాంటివి ఉంటాయి.

3. వ్యక్తిగత లక్ష్యాలు:
ఎ) సంస్థలోని వ్యక్తులు విభిన్న వ్యక్తిత్వాలు, గతచరిత్ర, అనుభవాలు, లక్ష్యాలు కలిగి ఉంటారు. వీరందరూ సంస్థలో బహువిధాలైన అవసరాలను తీర్చుకునేవారుగా ఉంటారు. వీరి అవసరాలు, జీతభత్యాలు, సాంఘిక, వ్యక్తిగత ఉన్నత స్థాయి గుర్తింపులను ఆధారం చేసుకుని ఉంటాయి.

బి) అందువల్ల సంస్థ యాజమాన్యం, సంస్థలోని లక్ష్యాలకు సమన్వయంగా వ్యక్తిగత ధ్యేయాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.

ప్రశ్న 6.
నిర్వహణ ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు.
క్లిష్టమైనదిగా భావిస్తున్న మారుతున్న సమాజంలో ఎలాంటి రాజకీయ సిద్ధాంతం, సమాజ రూపం ఉన్నప్పటికి, నిర్వహణ శాస్త్రం అతి ప్రధానమైన పాత్ర పోషిస్తున్నది.
నిర్వహణ ప్రాముఖ్యత:

  1. ఒక సంస్థ లక్ష్యాలను నెరవేర్చడానికి నిర్వహణ విధానం వ్యవస్థీకరించి వనరులను ఒకటిగా చేరుస్తుంది.
  2. మానవ, మానవేతర ఉత్పాదక వనరుల వృద్ధి వల్ల నిర్వహణ విధానం సమాజంలోని వ్యక్తుల జీవన ప్రమాణాన్ని మెరుగుపరుస్తుంది.
  3. ప్రస్తుత పరిస్థితులలో వివేకవంతమైన నిర్వహణ విధానంతో మానవ, ప్రాకృతిక, మూల వస్తు వనరులు – వినియోగించుకొని భారీ స్థాయిలో ఉత్పాదన ప్రక్రియను కొనసాగించవచ్చు.
  4. సామూహికంగా సాధించే లక్ష్యాలకు మరియు సామూహిక జట్టు ప్రయత్నాలకు నిర్వహణ ఎంతో సహాయం చేస్తుంది.
  5. భారీ స్థాయి పోటీలో ఉన్న మార్కెట్లలో సంస్థ మనుగడ సాగించడానికి ముందుగా జరిపిన పరీక్షల ఫలితాలను బట్టి నిర్వహణ విధానం సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
  6. పారిశ్రామిక సంస్థలలో ప్రతిదినం ఏర్పడే సామాజిక, సమస్యలను యాజమాన్యం ఎదుర్కోడానికి నిర్వహణ
    ఉపయోగపడుతుంది.
  7. వేగవంతంగా మారుతున్న సామాజిక, ఆర్థిక స్థితిని బట్టి నిర్వహణ విధానం పరివర్తన చూపుతుంది.
  8. వివిధ ఉత్పాదక కారకాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి, ఇతర కారకాలలై ఆధారపడి ఉండి నైనుణ్యతను సృష్టించడానికి సహాయపడతాయి. ఇలాంటి పరిస్థితులలో నిర్వహణ విధానం ప్రతిఫలాలను అందించడానికి సమానత్వం చూపుతుంది.
  9. పరిశ్రమలో లభ్యంకాని, కొరత గల వనరులను వివిధ ప్రత్యామ్నాయ పద్ధతులో ఉపయోగపడే విధంగా ఎంపిక చేసి, అత్యున్నత స్థాయిలో ఫలితాలనందించే దిశగా నిర్వహణ శాస్త్రం తోడ్పడుతుంది.

ప్రశ్న 7.
నిర్వహణ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటో వివరించండి.
జవాబు.
నిర్వహణ:

  1. సాధారణంగా నిర్వహణ అనగా “ఇతరుల సహాయంచే చేపట్టిన పనిని పూర్తి చేసుకోవడం”.
  2. FW. టేలర్ ప్రకారం నిర్వహణ అంటే ” నీవు చేయదలచుకున్న పనిని అత్యంత విజయవంతంగా స్వల్ప వ్యయంతో పూర్తి చేసుకునే దృష్టిని ఏర్పరచుకునే కళ”.

నిర్వహణ లక్షణాలు:
1) ఆర్థిక కార్యకలాపాలు: సమాజంలో సంతృప్తికరమైన జీవనం కోసం పాటుపడుతున్న వ్యక్తి యొక్క ప్రతి ఆర్థిక కార్యకలాపం నిర్వహణలో అంతర్భాగం. సంస్థ రూపొందించిన లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ముడి సరుకు, మానవ వనరులు, మార్కెట్లు, డబ్బు, యంత్రాలలాంటివి వివిధ ప్రణాళికలను తయారు చేయడానికి సహాయకారిగా ఉంటాయి.

2) సృజనాత్మక ప్రక్రియ: నిర్వహణ అనేది ఒక సృజనాత్మక, అర్థవంతమైన సామూహిక ప్రోత్సాహక, ప్రాతినిథ్య ప్రక్రియ. అన్నింటికంటే మించి ఇది ఒక విధాన నిర్ణయపు ప్రక్రియ.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

3) ఇతరులచే పూర్తి చేయిస్తుంది: నిర్వహణలో గల అనేక పథకాల రూపకల్పనలు ఇతరులచే పూర్తి చేయిస్తుంది. ఒక పని చేయడానికి ఇతరుల సహాయాన్ని పొందుతుంది. ఏ సంస్థలోనైనా ఒక సాధారణ లక్ష్యాన్ని సాధించాలంటే వ్యక్తుల సామూహిక శ్రమ ఎంతైనా చెప్పుకోదగినది. అలాంటి పని పూర్తి కావడానికి ఇతరుల సహాయాన్ని పొందడానికి ప్రోత్సహించడం జరుగుతుంది.

4) ప్రయత్నాలను సమన్వయపరుస్తుంది: సంస్థలో గల వ్యక్తుల, జట్టు సభ్యుల కార్యకలాపాలను సమన్వయపరచడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల దీన్ని మానవ వనరుల సమన్వయం అంటారు.

5) వ్యవహార క్రమం: నిర్వహణను అర్థవంతమైన విశ్లేషణకు, సిద్ధాంతానికి, భావాలకు ప్రత్యామ్నాయంగా నిర్వచించడం జరిగింది. దాని కోసం మానవ వనరుల ప్రయత్నాలను సమన్వయపరచి, నిర్వాహకులు క్రమంగా నిర్దేశిస్తారు.

6) లక్ష్యాల ఆధారితం: నిర్వహణ ముఖ్య ఉద్దేశం లక్ష్యాలను సాధించడం. ఒక సంస్థ లక్ష్యం గరిష్ట లాభార్జన అయినట్లయితే దానికి తగినట్లుగా చర్యలను తీసుకుంటూ ఉండాలి. అవి ఉత్పాదక వ్యయ తగ్గింపు, నూతన ఉత్పత్తి వనరులను చేర్చడం, పాత యంత్రం స్థానంలో నూతన యంత్రాన్ని పునః స్థాపించడం ద్వారా ఉత్పత్తిని పెంచడం లాంటివి
ఉంటాయి.

7) జట్టుగా పని చేస్తుంది: నిర్వహణను యాజమాన్య కార్యకలాపాలలో సమిష్టిగా పనులను కొనసాగించే ఒక వర్గానికి చెందిన వ్యక్తుల జట్టుగా పేర్కొనవచ్చు. యాజమాన్య స్థాయిలో ఉన్న వ్యక్తుల సమూహాన్ని నిర్వాహకులుగా చెప్పవచ్చు. ముఖ్య కార్యనిర్వహణాధికారి మొదలు ఉన్నత స్థాయి పరిశీలకులను నిర్వాహకులుగా పరిగణిస్తారు.

8) క్రమశిక్షణ కలిగినది: నిర్వహణ ఒక ప్రేత్యేక పరిజ్ఞానం గల రంగం. ఎందుకటే నిర్వహణలోని అంశాలు సూచనలు, బోధన పద్ధతుల ద్వారా నేర్చుకునే ఒక ప్రత్యేక క్రమశిక్షణ గల పాఠ్యాంశంగా చెప్పబడుతున్నది. దీనికి గల ప్రధాన కారణం ప్రపంచంలోని అన్ని కళాశాలలు, పాఠశాలలు నిర్వహణను ఒక ప్రత్యేక విద్యగా పరిగణించడం మొదలు పెట్టాయి.

ప్రశ్న 8.
నిర్వహణ స్థాయిలను సవివరంగా చర్చించండి.
జవాబు.
నిర్వహణలో మూడు రకాల స్థాయిలు ఉన్నాయి. అవి: 1) ఉన్నత స్థాయి 2) మధ్య స్థాయి 3) క్షేత్రస్థాయి
TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు 1
1. ఉన్నతస్థాయి:

  1. ఇ.ఎఫ్.ఎల్. బ్రెచ్ దృష్టిలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ల బోర్డు, మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎక్జిక్యూటివ్స్ లాంటివారు, సాధారణ నిర్వాహకులచే నిర్ధార్తిచంబడే పథకాలు, ప్రణాళికలు, లక్ష్యాల విధులు ఉంటాయని చెప్పడం జరిగింది.
  2. అందుకోసం మానవ నైపుణ్యాలు, సృజనాత్మకత కలిగిన నిర్ణయాలు, భావనల స్పష్టత ఎంతో అవసరం.
  3. వారు నిర్వర్తించే విధులలో కొన్నింటిని కింద ఇవ్వడం జరిగింది. అవి:
    ఎ) సంస్థ లక్ష్యాలను నిర్థారించుకుని మదుపరుల ఆసక్తిని కాపాడటం.
    బి) సంస్థ సాధించిన లక్ష్యాలను మూల్యాంకనం చేయడం.
    సి) ప్రధాన అధికారిని ఎంపిక చేసుకుని, రాబడి పంపకం చేసి క్లిష్టమైన, తీవ్రమైన సమస్యలను చర్చించడం.

2. మధ్యస్థాయి:

  1. పై స్థాయి, క్షేత్ర స్థాయి నిర్వాహకులకు వంతెనలాగా, మధ్యస్థాయి యాజమాన్యం విధులను నిర్వర్తిస్తుంది.
  2. వివిధ విభాగాలైన ఆర్థిక, మానవ వనరులు, ఉత్పాదక, మార్కెటింగ్ లాంటి వాటికి వీరు అధిపతులుగా ఉంటారు.
  3. పై స్థాయిలో రూపొందించిన పథకాలకు, కార్యక్రమాలకు విలువైన సేవలను అందిస్తూ విభాగాలు విజయవంతమవడానికి మధ్యస్థాయి నిర్వాహకులు సహకరిస్తూ విధులను నిర్వర్తించవలసి ఉంటుంది.

3. క్షేత్రస్థాయి:

  1. క్షేత్రస్థాయి నిర్వాహకులలో ప్రవర్తకుడు, విచారణాధికారి, మరియు ఇతర సిబ్బంది ఉంటారు.
  2. ప్రవర్తకులు క్రమశిక్షణతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటారు. కార్యాలయాలలో
    వారిని విచారణాధికారులుగాను, నిర్మాణ సంస్థలలో సిబ్బందిగాను పిలుస్తారు.
  3. ఆధునిక కాలంలో యాజమాన్యం దృష్టిలో వీరిని స్నేహితులుగానూ, నిర్దేశకులుగానూ, శ్రామికుల శ్రేయోభిలాషులుగానూ పరిగణిస్తున్నారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నిర్వహణను నిర్వచించండి.
జవాబు.
నిర్వహణ అర్థం: సాధారణంగా నిర్వహణను ‘ఇతరుల సహయంచే చేపట్టన పనిని పూర్తిచేసుకోవడం’ అని నిర్వచించడం జరిగింది.
నిర్వచనాలు:

  1. పీటర్ ఎఫ్. డ్రకర్ ప్రకారం, నిర్వహణ అనేది ‘కార్మికుల, నిర్వాహకుల పనిని వ్యాపారపరంగా నిర్వహించే బహుళ ప్రయోజన భాగం’ గా చెప్పబడింది.
  2. ఎఫ్. డబ్ల్యు. టేలర్ నిర్వచనం ప్రకారం, నిర్వహణ అంటే ‘నీవు చేయదలచుకున్న పనిని అత్యంత విజయవంతంగా, స్వల్ప వ్యయంతో చేసుకొనే దృష్టిని ఏర్పరచుకునే కళ’.
  3. హెన్రీ ఫేయల్ ప్రకారం, ‘నిర్వహించడం అంటే ప్రణాళీకరించడం, భావి సూచన చేయడం, వ్యవస్థీకరించడం, ఆదేశించడం, సమన్వయపరచడం, నియంత్రించడం’ అని అర్థం.

ప్రశ్న 2.
ఏవైనా రెండు నిర్వహణ లక్షణాలను పేర్కొనండి.
జవాబు.
1) ఆర్థిక కార్యకలాపాలు: సమాజంలో సంతృప్తికరమైన జీవనం కోసం పాటుపడుతున్న వ్యక్తి యొక్క ప్రతి ఆర్థిక కార్యకలాపం నిర్వహణలో అంతర్భాగం. సంస్థ రూపొందించిన లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ముడి సరుకు, మానవ వనరులు, మార్కెట్లు, డబ్బు, యంత్రాలలాంటివి వివిధ ప్రణాళికలను తయారు చేయడానికి సహాయకారిగా ఉంటాయి.

2) సృజనాత్మక ప్రక్రియ: నిర్వహణ అనేది ఒక సృజనాత్మక, అర్థవంతమైన సామూహిక ప్రోత్సాహక, ప్రాతినిథ్య ప్రక్రియ. అన్నింటికంటే మించి ఇది ఒక విధాన నిర్ణయపు ప్రక్రియ.

3) ఇతరులచే పూర్తి చేయిస్తుంది: నిర్వహణలో గల అనేక పథకాల రూపకల్పనలు ఇతరులచే పూర్తి చేయిస్తుంది. ఒక పని చేయడానికి ఇతరుల సహాయాన్ని పొందుతుంది. ఏ సంస్థలోనైనా ఒక సాధారణ లక్ష్యాన్ని సాధించాలంటే వ్యక్తుల ‘సామూహిక శ్రమ ఎంతైనా చెప్పుకోదగినది. అలాంటి పని పూర్తి కావడానికి ఇతరుల సహాయాన్ని పొందడానికి ప్రోత్సహించడం జరుగుతుంది.

ప్రశ్న 3.
నిర్దేశ ఏకత్వం అంటే ఏమిటి ?
జవాబు.
1) శ్రమ విభజన:

  1. అన్ని రకాల పనులను ఎక్కువ మంది సిబ్బందికి కేటాయించి విభజించాలని, దానివల్ల పని సులభంగా మరియు ఫలవంతంగా అవుతుందని ఫేయల్ సిఫారసు చేశారు.
  2. వ్యక్తులు ఒక పనిని పలుమార్లు చేయడం వల్ల వారి పనిలో వేగం పెరిగి నైపుణ్యం వస్తుంది, ఇది ప్రత్యేకతకు దారితీస్తుంది. దాని ద్వారా సంస్థ వృద్ధి సాధిస్తుంది.
    నిర్వహణను నిర్వచించండి.

2) అధికారం బాద్యత సమానత్వం:

  1. అధికారం అనగా వనరులను ఉపయోగించుకుంటూ, క్షేత్రస్థాయి సిబ్బందికి నియంత్రణా పూర్వక నిర్దేశాన్ని ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకునే హక్కు.
  2. ఈ సూత్రం ప్రకారం అధికారం మరియు బాధ్యత రెండు కూడాను సమానంగా కేటాయించాలి. బాధ్యతా రహితంగా అధికారాన్ని కట్టబెట్టడం వల్ల అధికార దుర్వినియోగానికి దారి తీస్తుంది. అదేవిధంగా బాధ్యతను కల్పించి అధికారాన్ని కేటాయించకపోతే వ్యక్తుల నైపుణ్యత దెబ్బతింటుంది.

3) క్రమశిక్షణ:

  1. క్రమశిక్షణ అనగా ఇతరులతో సత్సంబంధాలు కలిగి సంస్థ నియమ నిబంధనలను పాటిస్తూ విధేయత కలిగి ఉండటము.,
  2. వ్యాపారం సజావుగా కొనసాగాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరం. ఈ క్రమశిక్షణ కార్మికుల్లో మాత్రమే కాకుండా యాజమాన్యంలో కూడా ఉండాలి. దీనికొరకు అన్ని స్థాయిలలో నియమాలను రూపొందించాలి.

4) ఆదేశ ఏకత్వం:

  1. ఆదేశ ఏకత్వం సూత్రం ప్రకారం ఒక క్షేత్రస్థాయిలోని ఉద్యోగి అతనిపై అధికారికి మాత్రమే బాధ్యుడై, ఆ అధికారి నుండి ఆదేశాలను పొందవలసి ఉంటుంది. అందువల్ల ఒక ఉద్యోగి ఎక్కువ మంది అధికారుల నుండి ఆదేశాలు పొందకూడదు.
  2. ఏ అధికారి ఏ ఉద్యోగికి, ఎంత మేరకు పనులను అప్పగిస్తున్నారో సూచనప్రాయంగా స్పష్టతలో ఉండాలి. ఆదేశాల ప్రక్రియలలోని వివాదాలను, కలవరాలను, చికాకులను తొలగించడానికి ఈ సూత్రం ఎంతగానో అవసరం.

5) నిర్దేశ ఏకత్వం:

  1. నిర్దేశ ఏకత్వ సూత్రం ప్రకారం సంస్థలోని ప్రతీవ్యక్తి శ్రమ ఆ సంస్థ రూపొందించిన లక్ష్యాలను సాధించే దిశగా ఉండాలి.
  2. ఒక కార్యానికి సంబంధించిన లక్ష్యాల సాధనకు సిబ్బంది బృందానికి ఒకే ప్రణాళిక, ఒకే అధికారి మాత్రమే ఉండాలి.

ప్రశ్న 4.
నిర్వహణ స్వభావాన్ని వృత్తిగా వర్ణించండి.
జవాబు.
నిర్వహణ వృత్తి:

  1. కేవలం ప్రత్యక్ష బోధన ద్వారా, తరువాత పరీక్షించి ధ్రువీకరించిన విద్య, సునిశితమైన, కష్టతరమైన శిక్షణ పొందినందువల్ల సమకూరిన నిపుణతతో చేపట్టే పనినిగానీ, ఉపాధిని గానీ వృత్తి అనవచ్చు.
  2. నిర్వహణ శాస్త్రం క్రమంగా మార్పు చెందుతోంది. నిర్వాహకులు నిర్వహణ శాస్త్రం పట్ల తగిన విద్యార్హతలను కలిగి శిక్షణను పొంది ఉండాలి.
  3. అభ్యాసం చేస్తున్న న్యాయవాదులకు గల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ కంపెనీ సెక్రెటరీలకు సంఘాలు ఉన్నట్లు మిగతా వృత్తులలాగా నిర్వహణ రంగంలో, సంఘాలు లేవు.
  4. ఒక విధంగా చెప్పాలంటే నిర్వహణ శాస్త్రం ఒక వృత్తి అని తెలియజేయవచ్చు. కాని నిర్దిష్టమైన వృత్తికి గల లక్షణాలు దీనికి లేవు.
  5. అందువల్ల మనం నిర్వహణను అనేక సిద్ధాంతాలను బట్టి, సాధనాలను బట్టి, పద్ధతులను బట్టి చూస్తే ఒక విద్యకు ఉండవలసిన శిక్షణ, అధ్యాయాలు, నేర్చుకొనే అంశాలు గల ఆధునిక వృత్తిగా ఆవిష్కృతమైందని చెప్పవచ్చు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

ప్రశ్న 5.
నిర్వహణ అనేది కళనా ?
జవాబు.
1) నిర్వాహకునికి గల ఊహ, సృజనాత్మకత, లోతైన ఆలోచనా విధానం లాంటివి కలిగినప్పుడు నిర్వహణ నైపుణ్యం అనేది అమలుపరచడానికి వీలు ఉంటుంది. అందువల్ల దీన్ని కళ అని చెప్పవచ్చు.

2) నిర్వహణను ఇతర శాస్త్రాలైన భౌతిక, రసాయన, గణిత శాస్త్రాల లాగా ఖచ్చితంగా సమాన శాస్త్రాలని చెప్పలేము. కానీ ఏ మాత్రం సంకోచం లేకుండా నిర్వహణకు ఒక శాస్త్రమని చెప్పవచ్చు. కాని అది భౌతిక, రసాయన శాస్త్రాలలాగా అభ్యసన శాస్త్రం అని ఎంత మాత్రం చెప్పలేము. ఎందుకంటే నిర్వహణ శాస్త్రం మానవీయ కోణంతో అనేక భౌతిక అంశాల ఆధారంగా ప్రభావితమవుతుంది.

3) ప్రాకృతిక శాస్త్రాలలాగా నిర్వహణ శాస్త్రం నిర్ణయాలను విశ్వవ్యాప్తంగా అమలుపరచడానికి వీలులేదు. కాని సాంఘిక శాస్త్రాలైన ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రాలతో సరిపోల్చవచ్చు.

4) నిర్వహణ శాస్త్రం ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. అంతేకాక కళలాగా భారీ స్థాయిలో అభ్యసనం చేయవలసి ఉంటుంది. కాని పెరుగుతున్న అవసరాలను బట్టి నిర్వహణ ఒక వృత్తి మాదిరిగా పరిణమిస్తూ ఉంది.

ప్రశ్న 6.
వృత్తి అనేది నిర్వహణలో భాగమా ?
జవాబు.
1) కేవలం ప్రత్యక్ష బోధన ద్వారా, తరవాత పరీక్షించి ధ్రువీకరించిన విద్య, సునిశితమైన, కష్టతరమైన శిక్షణ పొందినందువల్ల సమకూరిన నిపుణతతో చేపట్టే పనినిగానీ, ఉపాధిని గానీ వృత్తి అనవచ్చు.

2) నిర్వహణ శాస్త్రం క్రమంగా మార్పు చెందుతోంది. నిర్వాహకులు నిర్వహణ శాస్త్రం పట్ల తగిన విద్యార్హతలను కలిగి శిక్షణను పొంది ఉండాలి.

3) అభ్యాసం చేస్తున్న న్యాయవాదులకు గల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ కంపెనీ సెక్రెటరీలకు సంఘాలు ఉన్నట్లు మిగతా వృత్తులలాగా నిర్వహణ రంగంలో, సంఘాలు లేవు.

4) ఒక విధంగా చెప్పాలంటే నిర్వహణ శాస్త్రం ఒక వృత్తి అని తెలియజేయవచ్చు. కాని నిర్దిష్టమైన వృత్తికి గల లక్షణాలు దీనికి లేవు.

5) అందువల్ల మనం ‘నిర్వహణను అనేక సిద్ధాంతాలను బట్టి, సాధనాలను బట్టి, పద్ధతులను బట్టి చూస్తే ఒక విద్యకు ఉండవలసిన శిక్షణ, అధ్యాయాలు, నేర్చుకొనే అంశాలు గల ఆధునిక వృత్తిగా ఆవిష్కృతమైందని చెప్పవచ్చు.

ప్రశ్న 7.
నిర్వహణ అనేది శాస్త్రమా ?
జవాబు.
1) శాస్త్రం అనేది సాధారణ వాస్తవికతను తెలుపుతూ ఒక రంగం యొక్క ప్రత్యేక పరిజ్ఞానాన్ని కలిగిన విద్యావిధానం. వాస్తవానికి, ఒక అంశానికి గల సంబంధ కారణాలను తెలిపే విధానం, నిర్వహణ. నిర్వహణను ఒక శాస్త్రంగా మలచడానికి అనేక సిద్ధాంతాలను ఏర్పరచి వాటిని అనుసంధానంగా గల నడవడిని తెలిపే విద్య నిర్వహణ- విద్య అని చెప్పవచ్చు.

2) ఈ విషయంపై అనేక అంశాలను విశ్వవ్యాప్తంగా అమలు పరచడానికి నిర్వాహణకు యుక్తమైన నిబంధనలను, సూత్రాలను సృష్టించి అవి సరియైనవో కావో కనుగొనడానికి శోధన జరుగుతున్నది.

3) నిర్వాహకులు చేస్తున్న పనిని పూర్తి చేయడానికి శాస్త్రీయ పద్ధతుల ద్వారా విధానాలను అమలుపరచడం పెరుగుతున్నది. ఈ ఆలోచనా విధానం ఎలా ఉందంటే, మొదటగా సమస్యను గుర్తించి, దాన్ని అభ్యసించడానికి తాత్కాలిక భావనను ఏర్పరచుకుని, తగిన ప్రయోగ ప్రక్రియలను, పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రత్యామ్నాయ సమాధానాలను కనుక్కొనే ఆలోచన దిశగా అభివృద్ధి చెందుతోంది.

ప్రశ్న 8.
నిర్వహణ యొక్క వ్యవస్థీకృత ధ్యేయాలు ఏమిటి ?
జవాబు.
1) ఒక వ్యాపారం విజయవంతమవడానికి దాని యాజమాన్యం సాధించవలసిన లక్ష్యాలను రూపొందించవలసి ఉంటుంది. వివిధ రకాలైన లక్ష్యాలను సాధించడానికి అన్ని రంగాలలోని వారి ఆసక్తిని లెక్కలోనికి తీసుకోవలసి ఉంటుంది. వారిలో ప్రభుత్వం, వినియోగదారులు, సిబ్బంది, వాటాదారులు ఉంటారు.

2) ఏ వ్యవస్థ అయినా లక్ష్యాలను సాధించాలంటే, మానవ మరియు ఇతర వనరులను అత్యంత ప్రయోజనకరంగా వినియోగించుకుని వ్యాపార ఆర్థిక లక్ష్యాలైన లాభం, మనుగడ, వ్యాపార వృద్ధిని సాధించాలి.

ప్రశ్న 9.
ఉన్నత శ్రేణి నిర్వహణ అంటే ఏమిటి ?
జవాబు.
ఉన్నతస్థాయి:

  1. ఇ.ఎఫ్.ఎల్. బ్రెచ్ దృష్టిలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ల బోర్డు, మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎక్జిక్యూటివ్స్ లాంటివారు, సాధారణ నిర్వాహకులచే నిర్ధారించబడే పథకాలు, ప్రణాళికలు, లక్ష్యాల విధులు ఉంటాయని చెప్పడం జరిగింది.
  2. అందుకోసం మానవ నైపుణ్యాలు, సృజనాత్మకత కలిగిన నిర్ణయాలు, భావనల స్పష్టత ఎంతో అవసరం.
  3. వారు నిర్వర్తించే విధులలో కొన్నింటిని కింద ఇవ్వడం జరిగింది. అవి:
    ఎ) సంస్థ లక్ష్యాలను నిర్ధారించుకుని మదుపరుల ఆసక్తిని కాపాడటం.
    బి) సంస్థ సాధించిన లక్ష్యాలను మూల్యాంకనం చేయడం.
    సి) ప్రధాన అధికారిని ఎంపిక చేసుకుని, రాబడి పంపకం చేసి, క్లిష్టమైన, తీవ్రమైన సమస్యలను చర్చించడం.

ప్రశ్న 10.
నిర్వహణ, పరిపాలనకు మధ్యగల వ్యత్యాసాలు ఏమిటి ?
జవాబు.
నిర్వహణ స్వభావం కంటే పరిపాలన అధికమైందిగా పరిగణించబడుతుంది. ఒక సంస్థ లక్ష్యాలను సాధించడానికి ఏర్పరచే యోచనా విధానం పరిపాలన. అలాంటి యోచనలను అమలుపరచే విధానం నిర్వహణ.
TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు 2
నిర్వహణ పరిపాలనకు మధ్యగల వ్యత్యాసాలు:

  1. పారిశ్రామిక సంస్థలను ఏర్పరచడానికి గల ఉద్దేశాలను లక్ష్యాలను తెలియజేసేది పరిపాలన. ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికను రూపొందించేది నిర్వహణ.
  2. పథకాలకు, సిద్ధాంతాలకు మార్గదర్శకం చేసేది పరిపాలన. అలాంటి పథకాలను అమలుపరచేది నిర్వహణ.
  3. పథకాల అమలుకు సంబంధించి రూపురేఖలను తీర్చిదిద్దేది పరిపాలన. అలాంటి పథకాల అమలును అజమాయిషీ చేయడానికి, నియంత్రించడానికి నిర్వహణను ఉపయోగిస్తారు.
  4. సంస్థలోని కార్యకలాపాలలో నిర్దేశం, మార్గదర్శకం లాంటి నాయకత్వ విధానాన్ని కల్పించేది పరిపాలన. అంతర్గత బహిర్గత కార్యకలాపాలను సమన్వయపరచేది నిర్వహణ.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

ప్రశ్న 11.
ఆదేశ ఏకత్వం, నిర్దేశ ఏకత్వం మధ్యగల వ్యత్యాసాలు ఏమిటి ?
జవాబు.
TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు 3

ప్రశ్న 12.
అధికారం, బాధ్యత సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.

  1. అధికారం అనగా వనరులను ఉపయోగించుకుంటూ, క్షేత్రస్థాయి సిబ్బందికి నియంత్రణా పూర్వక నిర్దేశాన్ని ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకునే హక్కు,
  2. ఈ సూత్రం ప్రకారం అధికారం మరియు బాధ్యత రెండు కూడాను సమానంగా కేటాయించాలి. బాధ్యతా రహితంగా అధికారాన్ని కట్టబెట్టడం వల్ల అధికార దుర్వినియోగానికి దారి తీస్తుంది. అదేవిధంగా బాధ్యతను కల్పించి అధికారాన్ని కేటాయించకపోతే వ్యక్తుల నైపుణ్యత దెబ్బతింటుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్కేలార్ చైన్.
జవాబు.

  1. ఫేయల్ భావన ప్రకారంగా సమాచారం వేగవంతంగా సమర్ధవంతంగా ప్రసారం చేయడానికి గొలుసు అవసరం. దీనినే స్కేలార్ చైన్ అంటారు.
  2. స్కేలార్ గొలుసులో ఛీఫ్ ఎక్జిక్యూటివ్ స్థాయి నుండి సంస్థలోని కనిష్ట స్థాయి వరకు అధికారులను కలిగి ఉంటుంది. ఈ గొలుసు ద్వారా సంస్థలోని వ్యక్తులు సలహా, సహాయం కోసం ఎవరిని సంప్రదించాలో తెలుస్తుంది.

ప్రశ్న 2.
పరిపాలన.
జవాబు.

  1. ఒక సంస్థ లక్ష్యాలను సాధించడానికి ఏర్పరచే యోచనా విధానాన్ని పరిపాలన అంటారు.
  2. సంస్థలోని కార్యకలాపాలలో నిర్దేశం, మార్గదర్శకం లాంటి నాయకత్వ విధానాన్ని కల్పించేది పరిపాలన.

ప్రశ్న 3.
హెన్రీ ఫేయల్ నిర్వహణ సూత్రాలు.
జవాబు.
నిర్వహణ పితామహుడు అయిన హెన్రీ ఫేయల్ 14 నిర్వహణ సూత్రాలను రూపొందించాడు. అవి:

  1. శ్రమ విభజన
  2. అధికారం, బాధ్యత సమానత్వం
  3. క్రమశిక్షణ
  4. ఆదేశ ఏకత్వం
  5. నిర్దేశ ఏకత్వం
  6. వ్యక్తిగత ఆసక్తికి బదులు సాధారణ ఆసక్తి
  7. ఉద్యోగుల వేతనం చెల్లింపు
  8. కేంద్రీకరించడం
  9. ఆర్డర్
  10. ధర్మం
  11. స్కేలార్ చైన్
  12. ఉద్యోగి పదవీకాల భద్రత
  13. చొరవ
  14. సమైక్యమే బలం

ప్రశ్న 4.
ఆదేశ ఏకత్వం.
జవాబు.

  1. ఆదేశ ఏకత్వం సూత్రం ప్రకారం ఒక క్షేత్రస్థాయిలోని ఉద్యోగి అతనిపై అధికారికి మాత్రమే బాధ్యుడై, ఆ అధికారినుండి ఆదేశాలను పొందవలసి ఉంటుంది. అందువల్ల ఒక ఉద్యోగి ఎక్కువ మంది అధికారుల నుండి ఆదేశాలు పొందకూడదు.
  2. ఏ అధికారి ఏ ఉద్యోగికి, ఎంత మేరకు పనులను అప్పగిస్తున్నారో సూచనప్రాయంగా స్పష్టతలో ఉండాలి. ఆదేశాల ప్రక్రియలలోని వివాదాలను, కలవరాలను, చికాకులను తొలగించడానికి ఈ సూత్రం ఎంతగానో అవసరం.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

ప్రశ్న 5.
ఎస్పిరిట్ డి కార్ప్స్.
జవాబు.

  1. దళ సభ్యుల విధేయత, సభ్యుల శ్రమ పట్ల గల ప్రాముఖ్యతను ఈ సూత్రం తెలియజేస్తుంది. ఎస్పిరిట్ డి కార్ప్స్ అనగా సిబ్బంది సమాచార సమన్వయం ద్వారా సమైక్య బలం చేకూరుతుందని అర్థం.
  2. యాజమాన్యం ఎప్పుడూ “విభజించు, పాలించు” అనే విధానాన్ని స్వస్తి పలకాలి మరియు సామూహిక ఉత్సాహాన్ని, సామూహిక పనిని ప్రోత త్సహించాలి. దీనివల్ల సంస్థ సజావుగా సాగుతుంది.

ప్రశ్న 6.
నిర్దేశ ఏకత్వం.
జవాబు.

  1. నిర్దేశ ఏకత్వ సూత్రం ప్రకారం సంస్థలోని ప్రతీవ్యక్తి శ్రమ ఆ సంస్థ రూపొందించిన లక్ష్యాలను సాధించే దిశగా ఉండాలి.
  2. ఒక కార్యానికి సంబంధించిన లక్ష్యాల సాధనకు సిబ్బంది బృందానికి ఒకే ప్రణాళిక, ఒకే అధికారి మాత్రమే ఉండాలి.

ప్రశ్న 7.
అధికారం మరియు బాధ్యత.
జవాబు.

  1. అధికారం అనగా వనరులను ఉపయోగించుకుంటూ, క్షేత్రస్థాయి సిబ్బందికి నియంత్రణా పూర్వక నిర్దేశాన్ని ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకునే హక్కు,
  2. ఈ సూత్రం ప్రకారం అధికారం మరియు బాధ్యత రెండు కూడాను సమానంగా కేటాయించాలి. బాధ్యతా రహితంగా అధికారాన్ని కట్టబెట్టడం వల్ల అధికార దుర్వినియోగానికి దారి తీస్తుంది. అదేవిధంగా బాధ్యతను కల్పించి అధికారాన్ని కేటాయించకపోతే వ్యక్తుల నైపుణ్యత దెబ్బతింటుంది.

ప్రశ్న 8.
కేంద్రీకరణ.
జవాబు.

  1. కేంద్రీకరించడం అనగా ఒక సంస్థలో అధికారం ఏ స్థాయిలో ఉంటుందో సూచించడం.
  2. అనేక సంస్థలలో అధికార కేంద్రీకరణ వివిధ శ్రేణులలో ఏర్పాటు చేయబడుతుంది. కేంద్రీకరణలో నిర్వాహకులు, అధికారులు ముఖ్యమైన పాత్రలను పోషిస్తారు.

ప్రశ్న 9.
చొరవ.
జవాబు.

  1. ఒక ప్రణాళికను ప్రతిపాదించి, దాన్ని అమలుపరచే విధానాన్ని “చొరవ” అంటారు. ఫేయల్ ప్రకారం, నిర్వాహకులు తమ -ఉద్యోగుల పని తనంలో వీలైనంత చొరవ చూపే విధంగా చర్యలు తీసుకోవాలి.
  2. ఉద్యోగులు వారి సహచరులు ప్రణాళికలను తయారుచేసుకుని, అమలుపరచడానికి చొరవ తీసుకొని సంస్థ విజయానికి తోడ్పడాలి. ప్రతి ఉద్యోగి తన వంతు చొరవ చూపడం వల్ల సంస్థ అభివృద్ధి జరుగుతుంది.

ప్రశ్న 10.
మధ్య స్థాయి నిర్వహణ.
జవాబు.

  1. పై స్థాయి, క్షేత్ర స్థాయి నిర్వాహకులకు వంతెనలాగా, మధ్యస్థాయి యాజమాన్యం విధులను నిర్వర్తిస్తుంది.
  2. వివిధ విభాగాలైన ఆర్థిక, మానవ వనరులు, ఉత్పాదక, మార్కెటింగ్ లాంటి వాటికి వీరు అధిపతులుగా ఉంటారు.
  3. పై స్థాయిలో రూపొందించిన పథకాలకు, కార్యక్రమాలకు విలువైన సేవలను అందిస్తూ విభాగాలు విజయవంతమవడానికి మధ్యస్థాయి నిర్వాహకులు సహకరిస్తూ విధులను నిర్వర్తించవలసి ఉంటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

ప్రశ్న 11.
క్రమ శిక్షణ సూత్రం
జవాబు.

  1. క్రమశిక్షణ అనగా ఇతరులతో సత్సంబంధాలు కలిగి సంస్థ నియమ నిబంధనలను పాటిస్తూ విధేయత కలిగి ఉండటము.
  2. వ్యాపారం సజావుగా కొనసాగాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరం. ఈ క్రమశిక్షణ కార్మికుల్లో మాత్రమే కాకుండా యాజమాన్యంలో కూడా ఉండాలి. దీనికొరకు అన్ని స్థాయిలలో నియమాలను రూపొందించాలి.

TS Inter 2nd Year Political Science Notes Chapter 1 Indian Constitution-Historical Background

Here students can locate TS Inter 2nd Year Political Science Notes Chapter 1 Indian Constitution-Historical Background to prepare for their exam.

TS Inter 2nd Year Political Science Notes Chapter 1 Indian Constitution-Historical Background

→ The constitution of India in one of the best and most powerful constitutions in the modern world.

→ The Indian National Movement was organized during 1857 – 1947.

→ British rule in India had both positive and negative impacts on Indian Society.

→ The constitution of India was formulated by the constituent Assembly.

TS Inter 2nd Year Political Science Notes Chapter 1 Indian Constitution-Historical Background

→ The constitutional drafting committee headed by Dr. B.R. Ambedkar.

→ The constitution of India is a written document. It consists of 395 articles divided into 22 parts with 12 schedules.

→ The Indian constitution hinted at certain specific directives for the development of scheduled castes and scheduled tribes in India.

→ Indian constitution has noble aims and objectives.

TS Inter 2nd Year Political Science Notes Chapter 1 భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం

→ భారత జాతీయోద్యమం 1857-1947 సంవత్సరాల మధ్య ఎన్నో సంఘటనలతో నడిచింది. * భారత జాతీయోద్యమాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. అవి:

  1. మితవాద దశ (1885-1905)
  2. అతివాద దశ (1906-1919)
  3. గాంధీయుగం (1920-1947)

→ మింటో-మార్లే సంస్కరణలుగా 1909 చట్టం ప్రసిద్ధి పొందింది.

→ 1919, భారత ప్రభుత్వ చట్టం లేదా మాంటేగ్ – ఛేమ్స్ఫర్డ్ సంస్కరణలు ప్రకటించడమైనది. ఈ ప్రకటన సారాంశం – భారతీయులను ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఇతోధికంగా చేర్చటం.

→ భారత జాతీయ కాంగ్రెస్ 1885లో A.O. హ్యూమ్చే స్థాపించబడింది.

→ దాదాబాయి నౌరోజీ, డబ్ల్యుసి, బెనర్జీ, సురేంద్రనాధ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే మొదలగువారు మితవాద నాయకులు. వీరు శాంతియుత, రాజ్యాంగ పద్దతులను అవలంభించారు.

→ బాలగంగాధర్ తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అరవిందఘోష్ మొదలగువారు అతివాద నాయకులు. వీరు స్వరాజ్యం – స్వదేశీ నినాదాలను లేవనెత్తిరి.

TS Inter 2nd Year Political Science Notes Chapter 1 Indian Constitution-Historical Background

→ ఆగస్టు 1, 1920న గాంధీజీ సహాయ నిరాకరణోద్యమంను ప్రారంభించారు. ఈ ఉద్యమంలో ఇమిడి ఉన్న అంశాలు ! విదేశీ వస్తువులను బహిష్కరించుట, న్యాయస్థానాలను బహిష్కరించుట, పాఠశాలలు, కళాశాలలను, శాసనసభలను బహిష్కరించుట మొదలగునవి.

→ 1930 మార్చిలో గాంధీజీ “శాసనోల్లంఘన” లేదా ఉప్పు సత్యాగ్రహ” ఉద్యమాన్ని ప్రారంభించారు.

→ 1935 భారత ప్రభుత్వ చట్టం కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది.

→ 1942వ సం||లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది.

→ స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగ నిర్మాణం చేయడానికి 9 డిసెంబర్, 1946లో రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది.

→ డిసెంబర్ 11, 1946న రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడిగా డా॥ బాబూ రాజేంద్రప్రసాద్ ను, ఉపాధ్యక్షుడిగా హెచ్.సి. ముఖర్జీని ఎన్నుకున్నారు.

→ 1947వ సం||లో మౌంట్బాటన్ ప్రణాళిక ప్రకటించారు.

→ 1947వ సం||లో దేశ విభజన జరిగింది.

→ రాజ్యంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా డా॥ బి.ఆర్. అంబేద్కర్ వ్యవహరించారు.

→ 1950, జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

TS Inter 2nd Year Political Science Notes Chapter 1 Indian Constitution-Historical Background

→ రాజ్యాంగాన్ని పూర్తి చేయటానికి రాజ్యాంగ పరిషత్తుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది.

TS Inter 1st Year Accountancy Study Material Chapter 3 సహాయక చిట్టాలు

Telangana TSBIE TS Inter 1st Year Accountancy Study Material 3rd Lesson సహాయక చిట్టాలు Textbook Questions and Answers.

TS Inter 1st Year Accountancy Study Material 3rd Lesson సహాయక చిట్టాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
వివిధ సహాయక చిట్టాల గురించి వివరించండి.
జవాబు.
1. కొనుగోలు చిట్టా :
ఈ చిట్టాలో సరుకును అరువు మీద కొన్నప్పుడే రాయాలి. సరుకును నగదు మీద కొన్నప్పుడు లేదా ఆస్తులను కొన్నప్పుడు ఈ పుస్తకములో నమోదు చేయరాదు. ఈ చిట్టాలో పద్దును వచ్చిన ఇన్వాయిస్ ఆధారముగా వ్రాస్తారు.

అమ్మకపుదారుడు సరుకును పంపేటపుడు సరుకు ధర, పరిమాణము, ఇచ్చిన డిస్కౌంట్, ఇతర షరతులు మొదలైన వాటిని వ్రాసి పంపే పట్టికను ఇన్వాయిస్ అంటారు. ఈ పుస్తకములో వర్తకపు డిస్కౌంట్ తీసిన తర్వాత బాకీ పడిన మొత్తముతో వ్యవహారము రికార్డు చేయబడుతుంది.

2. కొనుగోలు వాపసుల చిట్టా :
వ్యాపార సంస్థ కొనుగోలు చేసిన సరుకును కొన్ని కారణాల వలన అనగా సరుకులో నాణ్యత లేకపోవడం, సరుకు పాడవటము, ధర, పరిమాణములో తేడా ఉండటము వలన సరుకును వాపసు చేస్తారు. ఈ వాపసులను నమోదు చేయడానికి ఉపయోగించే పుస్తకము కొనుగోలు వాపసుల చిట్టా.

దీనిలో పద్దును డెబిట్ నోట్ ఆధారముగా వ్రాస్తారు. సరుకును వాపసు చేసినపుడు సరుకు విలువను సప్లయ్చారుని ఖాతాకు డెబిట్ చేస్తూ పంపే పత్రమును డెబిట్ నోట్ అంటారు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 3 సహాయక చిట్టాలు

3. అమ్మకాల చిట్టా :
సరుకును అరువు మీద అమ్మినపుడు నమోదు చేసే చిట్టాను అమ్మకాల చిట్టా అంటారు. దీనిలో నగదు అమ్మకాలు, ఆస్తి అమ్మకాలు వ్రాయకూడదు. ఈ చిట్టాను రోజువారీ పుస్తకము అంటారు. దీనిలోని పద్దును ఇచ్చిన ఇన్వాయిస్ ఆధారముగా వ్రాస్తారు.

4. అమ్మకాల వాపసుల చిట్టా :
అమ్మిన సరుకు వాపసు వచ్చినపుడు ఈ పుస్తకములో వ్రాస్తారు. సాధారణముగా అమ్మిన సరుకు కొనుగోలుదారుడు సరుకులో నాణ్యత లేనపుడు, ఆర్డరు చేసిన సరుకు కంటే ఎక్కువ సప్లయ్ చేసినపుడు లేదా సప్లయ్ చేయబడిన సరుకు శాంపిలక్కు అనుగుణముగా లేనపుడు వాపసు చేయవచ్చు.

దీనిలోని పద్దు క్రెడిట్ నోట్ ఆధారముగా వ్రాస్తారు. వాపసు చేసిన సరుకు విలువను కొనుగోలుదారు ఖాతాకు క్రెడిట్ చేసినట్లుగా తెలుపుతూ పంపే పత్రమే క్రెడిట్ నోట్.

5. నగదు చిట్టా :
ఈ పుస్తకములో నగదు వసూళ్ళు మరియు నగదు చెల్లింపులను రికార్డు చేయటం జరుగుతుంది. ఈ చిట్టా ఖాతా స్వరూపములో ఉండి రెండు పుస్తకాల (చిట్టా మరియు ఆవర్జా) ప్రయోజనా ను చేకూరుస్తుంది.

6. వసూలు హుండీల చిట్టా :
సంస్థకు వసూలు కావలసిన వర్తకపు బిల్లులే వసూలు హుండీల బిల్లుల వివరాలు. అనగా బిల్లు తేది, స్వీకర్త పేరు, బిల్లు మొత్తము, బిల్లు కాలము, చెల్లింపు స్థానము మొదలైనవి పేర్కొంటారు.

7. చెల్లింపు హుండీల చిట్టా :
వ్యాపార సంస్థ ఉత్పత్తిదారులు లేదా టోకు వర్తకుల నుంచి అరువు మీద కొన్నప్పుడు లేదా అప్పు తీసుకున్నప్పుడు, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని తెలిపే స్వీకృతి పత్రమే చెల్లింపు హుండీలు. ఈ వివరాలను చెల్లింపు హుండీల చిట్టాలో వ్రాస్తారు.

8. అసలు చిట్టా :
కొన్ని వ్యవహారములు పై ఏ చిట్టాలోను నమోదు కాకుండాపోతే వాటిని అసలు చిట్టాలో వ్రాస్తారు. ఉదా : ప్రారంభపు పద్దులు, సర్దుబాటు పద్దులు, సవరించే పద్దులు మొదలైనవి.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 3 సహాయక చిట్టాలు

ప్రశ్న 2.
సహాయక చిట్టాల ప్రయోజనాలు తెలపండి.
జవాబు.
వ్యాపార పరిమాణము పెరిగి వ్యవహారాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఆవర్జాలో విడివిడిగా సంబంధిత ఖాతాలలో నమోదు చేయడం చాలా కష్టమైన పని. దాని వలన అధిక శ్రమ, కాలం వృథా, దుబారా ఖర్చులు అవుతాయి. ఈ నష్టాలను అధిగమించడానికి ఒక్కొక్క తరహా వ్యవహారాన్ని వ్రాయడానికి ఒక్కొక్క పుస్తకాన్ని ఏర్పాటు చేస్తారు.

ఒకే స్వభావముగల వ్యవహారములన్నింటిని ఒకే పుస్తకములో వ్రాయడం వలన ఆ వ్యవహారాల మొత్తాన్ని ఒకేసారి ఆవర్జాలో నమోదు చేయడం తేలిక అవుతుంది. వ్యవహారాల స్వభావాన్ని బట్టి వివిధ చిట్టాలుగా విభజించి ఒక్కొక్క చిట్టాలో దానికి సంబంధించిన వ్యవహారాన్ని వ్రాస్తారు. ఈ పుస్తకాలను ‘సహాయక చిట్టాలు’, తొలి పద్దు పుస్తకాలు లేదా సహాయక పుస్తకాలు అంటారు.

సహాయక చిట్టాల వలన ప్రయోజనాలు :
1. కాలము ఆదా :
వ్యాపార వ్యవహారాలకు చిట్టాపద్దులు వ్రాయనవసరము లేకుండా నేరుగా సంబంధిత పుస్తకాలలో నమోదు చేయవచ్చు. దీని వలన కాలము, శ్రమ ఆదా అవుతుంది.

2. శ్రమవిభజన :
సహాయక చిట్టాల నమోదును, నిర్వహణ బాధ్యతను వివిధ వ్యక్తులకు అప్పగించవచ్చు. పని విభజన వలన పనిలో నాణ్యత పెరుగుతుంది.

3. నమోదు సులభతరము :
సహాయక చిట్టాలలో సంక్షిప్త వివరణ అవసరము లేకుండా పద్దులు వ్రాయవచ్చు. దీని వలన వ్యాపార వ్యవహారాలను వేగముగాను, సులభముగాను నమోదు చేయవచ్చు.

4. సామర్థ్యము పెరుగుతుంది :
పనిని విభజించి కేటాయించడము వలన సిబ్బంది తమ పనిలో ప్రత్యేకతను, సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు.

5. తప్పులను కనుగొనుట :
ఒకే స్వభావము కల వ్యవహారాలను ప్రత్యేక చిట్టాలలో నమోదు చేయడం వలన తప్పులను సులభముగా కనిపెట్టి సరిచేసుకోవచ్చు.

6. అవసరమైన సమాచారము:
నిర్ణీత కాలాంతము లేదా అవసరమైనప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారాన్ని సహాయక చిట్టాలు అందించగలుగుతాయి.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 3 సహాయక చిట్టాలు

ప్రశ్న 3.
కొనుగోలు మరియు అమ్మకాల పుస్తకాలను గురించి వివరించి, వాటి నమూనాలను గీయండి.
జవాబు.
ఈ చిట్టాలో సరుకును అరువు మీద కొన్నప్పుడే రాయాలి. సరుకును నగదు మీద కొన్నప్పుడు లేదా ఆస్తులను కొనుగోలు చేసినపుడు ‘ఈ పుస్తకములో నమోదు చేయరాదు. ఈ చిట్టాలో పద్దును వచ్చిన ఇన్వాయిస్ ఆధారముగా వ్రాస్తారు.

అమ్మకపుదారుడు సరుకును పంపేటపుడు సరుకు ధర, పరిమాణము, ఇచ్చిన డిస్కౌంట్ ఇతర షరతులు మొదలైన వాటిని వ్రాసి పంపే పట్టికను ఇన్వాయిస్ అంటారు. ఈ పుస్తకములో వర్తకపు డిస్కౌంట్ తీసిన తర్వాత బాకీ పడిన మొత్తముతో వ్యవహారము రికార్డు చేయబడుతుంది.

TS Inter 1st Year Accountancy Study Material 3rd Lesson సహాయక చిట్టాలు 1

సరుకు అరువు అమ్మకాలను ఉపయోగించే చిట్టా అమ్మకాల చిట్టా. ఈ చిట్టాలో సరుకు నగదు అమ్మకాలు, ఆస్తి అమ్మకాలు నమోదు చేయకూడదు. ఈ చిట్టాను అమ్మకాల రోజువారీ పుస్తకము అని కూడా వ్యవహరిస్తారు. దీనిలోని పద్దును వచ్చిన ఇన్వాయిస్ ఆధారముగా వ్రాస్తారు. అమ్మకాల చిట్టా నమూనా

TS Inter 1st Year Accountancy Study Material 3rd Lesson సహాయక చిట్టాలు 2

TS Board Inter First Year Accountancy Study Material Chapter 3 సహాయక చిట్టాలు

ప్రశ్న 4.
అసలు చిట్టా అంటే ఏమిటి ? దానిలో నమోదు చేసే ఏవేని ఐదు అంశాలను రాయండి.
జవాబు.
దిగువ వ్యవహారాలను అసలు చిట్టాలో నమోదుచేస్తారు.
1. ప్రారంభపు పద్దులు :
కొత్త ఆర్థిక సంవత్సరములో నూతన పుస్తకాలను ప్రారంభిస్తూ రాసే చిట్టాపద్దులను ప్రారంభపు పద్దులు అంటారు. గత సంవత్సరము ఆస్తి అప్పుల నిల్వలను ప్రస్తుత సంవత్సరానికి బదిలీ చేయడానికి రాసే పద్దులను ప్రారంభపు పద్దులు అంటారు.

2. ముగింపు పద్దులు :
ప్రతి సంవత్సరాంతాన నామమాత్రపు ఖాతాల నిల్వలను వర్తకపు, లాభనష్టాల ఖాతాలకు మళ్ళించడానికి రాసే చిట్టాపద్దులను ముగింపు పద్దులు అంటారు. నామమాత్రపు ఖాతాలు అంటే ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు, లాభాలకు సంబంధించిన ఖాతాలు.

3. ఆస్తుల అరువు కొనుగోలు, అమ్మకాలు :
ప్రతి వ్యాపార సంస్థ ఆస్తులను నగదు మీద గాని, అరువుమీద గాని కొనుగోలు చేసి అమ్మకము చేస్తుంది. ఆస్తులను అరువు మీద కొనుగోలు చేసి, అమ్మకాలు చేసినపుడు వాటిని అసలు చిట్టాలో వ్రాయాలి.

4. సవరణ పద్దులు :
చిట్టాపద్దులు వ్రాయడంలోగాని, ఆవర్జా ఖాతాలలో నమోదు చేయడంలోగాని, ఖాతాల నిల్వలను తేల్చడంలోగాని తప్పులు దొర్లే అవకాశము ఉంటుంది. అలాంటప్పుడు నికరలాభాన్ని ఖచ్చితముగా లెక్కగట్ట టానికి వీలుండదు. ఈవిధముగా తప్పులు దొర్లినపుడు వాటిని సవరణ చేస్తూ వ్రాయవలసిన పద్దులను సవరణ పద్దులు అంటారు.

5. సర్దుబాటు పద్దులు :
ముగింపు లెక్కలు తయారుచేసేటప్పుడు వ్యాపార సంస్థ కొన్ని సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది. ఆస్తులకు, ఆదాయాలకు, ఖర్చులకు చేసే సర్దుబాట్లకు రాసే పద్దులను సర్దుబాటు పద్దులు అంటారు. ఉదా : చెల్లించవలసిన ఖర్చులు, రావలసిన ఆదాయాలు, ఆస్తులపై తరుగుదల మొదలైన సర్దుబాట్లను అసలు చిట్టాలో నమోదు చేయాలి.

6. బదిలీ పద్దులు :
ఒక ఖాతాలోని కొంత మొత్తాన్ని మరొక ఖాతాలోకి బదిలీ చేయడానికి రాసే పద్దులను బదిలీ పద్దులు అంటారు.
ఉదా : వ్యాపార సంస్థ ఆర్జించిన లాభాన్ని రిజర్వు నిధికి మళ్ళించడం, సొంతవాడకాలను మూలధన ఖాతాకు బదిలీ చేయడం మొదలైనవి.

పైన పేర్కొన్న వివిధ రకాల పద్దులతో పాటు కొన్ని ఇతర పద్దులు.
ఉదా : అగ్ని ప్రమాదము వలన సరుకు నష్టం, బిల్లులు అనాదరణ, కన్సైన్మైంట్ మీద పంపిన సరుకు, అసలు చిట్టాలో నమోదు చేయవలసి ఉంటుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 3 సహాయక చిట్టాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
డెబిట్ నోటు అంటే ఏమిటి ?
జవాబు.

  1. సరుకు వాపసు చేసేటపుడు ఆ సరుకు విలువను సప్లయారు ఖాతాకు డెబిట్ చేస్తూ పంపే నోట్ను డెబిట్ నోట్ అంటారు.
  2. సరుకు వాపసు చేయడానికి గల కారణాలు కూడా ఇందులో పొందుపరుస్తారు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 3 సహాయక చిట్టాలు

ప్రశ్న 2.
క్రెడిట్ నోటు అంటే ఏమిటి ?
జవాబు.

  1. సరుకు వాపసు వచ్చినపుడు, ఆ సరుకు విలువను అమ్మకపుదారు ఖాతాకు క్రెడిట్ చేస్తూ పంపే నోట్ను క్రెడిట్ నోటు అంటారు.
  2. దీనిని ఎర్ర సిరాతో వ్రాసి రెండు ప్రతులుగా తయారుచేస్తారు. ఒకటి కొనుగోలుదారుకు పంపి రెండవది సంస్థలో ఫైల్ చేస్తారు.

ప్రశ్న 3.
ఇన్వాయిస్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. సరుకును అరువుపై కొనుగోలు చేసినప్పుడు సరుకు యొక్క సరఫరాదారుడు సరుకుతో పాటు వర్తకునికి ఇన్వాయిస్ను తయారు చేసి పంపుతాడు. దీనినే కొనుగోలు బిల్లు అని కూడా పిలుస్తారు.
  2. సప్లదారుడు ఆర్డరు ప్రకారము సప్లయ్ చేసినామని సరుకు ధర, పరిమాణము, ఇచ్చిన డిస్కౌంట్, ఇతర షరతులు వాటి వివరాలను వ్రాసి ఒక పట్టీని తయారు చేసి వ్యాపారస్తునికి పంపుతాడు. ఈ పట్టీని ఇన్వాయిస్ అంటారు.

ప్రశ్న 4.
వర్తకపు డిస్కౌంటు.
జవాబు.

  1. టోకు వర్తకుడు సరుకులను చిల్లర వర్తకులకు అమ్మేటపుడు ఆ వస్తువుపై ముద్రించిన ధర లేదా జాబితా ధరపై కొంత శాతాన్ని తగ్గింపు ఇస్తారు. దీనిని వర్తకపు డిస్కౌంట్ అంటారు.
  2. వర్తకపు డిస్కౌంట్ తగ్గించిన తర్వాత నికర మొత్తాన్ని మాత్రమే పుస్తకాలలో వ్రాయటం జరుగుతుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 3 సహాయక చిట్టాలు

ప్రశ్న 5.
అసలు చిట్టా.
జవాబు.

  1. సహాయక చిట్టాలలో రాయడానికి వీలులేని వ్యవహారములు ఏవైతే ఉన్నాయో వాటిని అసలు చిట్టాలో వ్రాస్తారు.
  2. ఉదా : అరువుపై యంత్రాన్ని కొనుగోలు చేస్తే దీనిని కొనుగోలు చిట్టాలో రాసే వీలులేదు. ఇది అరువు వ్యవహారం అయినా సరుకు కాదు. కాబట్టి దీనిని అసలు చిట్టాలో వ్రాస్తారు.
  3. అసలు చిట్టా ‘8’వ సహాయక చిట్టా మొదటి 7 సహాయక చిట్టాలలో రాయడానికి వీలులేని వ్యాపార వ్యవహారాలను అసలు చిట్టాలో రాస్తారు.

TS Inter 2nd Year Economics Notes Chapter 2 Demography and Human Resource Development

Here students can locate TS Inter 2nd Year Economics Notes Chapter 2 Demography and Human Resource Development to prepare for their exam.

TS Inter 2nd Year Economics Notes Chapter 2 Demography and Human Resource Development

→ The theory of demographic transition postulates a three stages sequence of birth and death rate as typically associated with economic development.

→ Demographic features of Indian population – size and growth rate of population, birth and death rates. The sex ratio, age composition.

→ Concept of population explosion: Population increases faster than food supply and this imbalance, leads to overpopulation is called population explosion.

→ Causes for rapid growth of population – 1. Causes of decline in the death rate 2. Causes of high birth rate, social factors.

TS Inter 2nd Year Economics Notes Chapter 2 Demography and Human Resource Development

→ Remedies for population explosion – Economic measures, social measures, family planning programme.

→ Occupational distribution of the working population in India, The percentage of the labour force engaged in primary sectors is 67 from 1991. It is falling to 51 in 2010. In 20:10, 22 of the working population is employed in the secondary sector as against 11 in 1951. In 2010 27 of the working population is employed in service sectors, as against 17 in 1951.

→ Role of education in economic development – Reduction of income inequalities, rural development, family planning, and on-the-job training.

→ Literacy rate has increased from 18 in 1951 to 74 in 2011.

→ Health Programmes in India – National Rural Health Mission, Janani Suraksha Yojana, National Urban Health Mission, Clean Drinking water and Sanitation.

→ Human Development Index – Life expectancy – Adult literacy rate – Standard of living.

→ Gender-Related Development Index – Female life expectancy – Female adult literacy – Female per capita income.

→ Gender Empowerment Measure (GEM) – The GEM indicates whether women are able to actively participate in economic and political life.

→ Human Poverty Index – Longevity, knowledge and decent living standard.

TS Inter 2nd Year Economics Notes Chapter 2 జనాభా, మానవ వనరుల అభివృద్ధి

→ జనన మరణాల రేటుకు, ఆర్థికాభివృద్ధికి ఉన్న సంబంధాన్ని బట్టి జనాభా పరిణామ సిద్ధాంతాన్ని మూడు దశలుగా పరిశీలించవచ్చు.

  1. మొదటి దశలో వ్యవసాయ ప్రాధాన్యత గల ఆర్థిక వ్యవస్థలో జనన-మరణాల రేటు అధికంగా ఉంటుంది.
  2. రెండవ దశలో ఆర్థిక కార్యకలాపాలు చోటు చేసుకొని మరణాల రేటు తగ్గుతుంది. కాని జననాల వృద్ధి రేటు అధికంగా ఉంటుంది.
  3. మూడవ దశలో జననాల రేటు – మరణాల రేటు తగ్గుతుంది. ఈ దశలో పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ, నగరీకరణ, అక్షరాస్యత అభివృద్ధి చెందుతాయి.

TS Inter 2nd Year Economics Notes Chapter 2 Demography and Human Resource Development

→ ప్రపంచ భూమి వైశాల్యంలో భారతదేశం 2.4% వాటాను కలిగి ఉంటే, ప్రపంచ జనాభాలో 17.5% వాటాను కల్గి ఉంది. జనాభా పరిమాణ విషయంలో చైనా తరువాత భారతదేశం రెండవ స్థానాన్ని పొందింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 1210 మిలియన్లు.

→ భారతదేశంలో అధిక జనాభా వృద్ధికి కారణాలు

  1. మరణాల రేటు తగ్గుదలకు కారణాలు
  2. అధిక జనాభా రేటుకు కారణాలు : i) ఆర్థిక కారణాలు ii) సాంఘిక కారణాలు

→ నివారణ చర్యలు – ఆర్థిక చర్యలు – సాంఘిక చర్యలు – కుటుంబ నియంత్రణ పథకం.

→ జాతీయ జనాభా విధానం, 2000 తక్షణమే సాధించవలసిన ఆశయాలను, మధ్యకాలిక, దీర్ఘకాలిక ఆశయాలను నిర్ణయించింది.

→ ఒక దేశ జనాభా వివిధ రకాలైన వృత్తుల మధ్య విభజింపబడి ఉండటాన్ని వృత్తులవారీగా జనాభా విభజన అంటారు.

→ 2011 సం||లో ప్రాథమిక రంగంలో 51% ద్వితీయరంగంలో 22% తృతీయ, రంగంలో 27% మంది ఉన్నారు.

→ విద్యపై పెట్టుబడి పెట్టడం వల్ల మానవ మూలధనం పెరుగుతుంది. ఆరోగ్యం, విద్య, శిక్షణ, సాంఘిక సేవలపైన చేసే వ్యయంను మానవ మూలధన పెట్టుబడి వ్యయం అంటారు.

→ వీటిలో మానవ వనరుల అభివృద్ధిలో విద్య ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మానవ వనరుల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఒకదానిపై ఒకటి ప్రభావితమై ఉంటాయి. 2011 సంవత్సరం నాటి మనదేశ అక్షరాస్యత 74% పెరిగింది.

→ ప్రజల ఆరోగ్యం మెరుగుగా ఉండే వారి ఉత్పాదక శక్తి పెరిగి, మానవ మూలధనం నాణ్యత కూడా మెరుగవుతుంది. మంచి ఆరోగ్యానికి సంతులిత పౌష్టికాహారం, వైద్య సంరక్షణ అవసరం.

→ ప్రభుత్వం ఎన్నో ఆరోగ్య పథకాలు ప్రవేశపెట్టినది. అందులో ముఖ్యమైనవి జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్, జననీ సురక్షా యోజన, జాతీయ నగర ఆరోగ్య మిషన్ మొదలైనవి.

TS Inter 2nd Year Economics Notes Chapter 2 Demography and Human Resource Development

→ మానవ అభివృద్ధికి సంబంధించిన మూడు అంశాల అభివృద్ధి సగటును మానవ అభివృద్ధి సూచిక కొలుస్తుంది.