Here students can locate TS Inter 2nd Year Political Science Notes Chapter 2 Fundamental Rights and Directive Principles of State Policy to prepare for their exam.
TS Inter 2nd Year Political Science Notes Chapter 2 Fundamental Rights and Directive Principles of State Policy
→ Fundamental Rights are enriched in Part-Ill of the constitution covering articles from 12 to 35.
→ In 1978, the 44 constitutional amendments deleted the right to property from the list of Fundamental Rights.
→ Right to constitutional remedies is the very soul and heart of the constitution:
→ Through the 42nd Constitutional Amendment Act -10 fundamental duties were incorporated in Part- IV of the constitution.
→ Article 19 provides now to Indian citizens with six kinds of Freedom.
→ The directive principles of state policy are included in Part – IV of the constitution covering articles 36 to 51.
→ The directive principles are classified into three categories i.e., Socialist, Gandhian and Liberal principles.
→ The 42nd amendment gave precedence to directive principles than to fundamental rights.
→ Directive principles are considered as New Year greeting by Sri Naseeruddin.
TS Inter 2nd Year Political Science Notes Chapter 2 ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు
→ ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలోని 3వ భాగంలో 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు ప్రస్తావించారు.
→ ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్యాన్ని అర్థవంతం చేస్తాయి.
→ రాజ్యాంగం రూపొందించినప్పుడు 7 ప్రాథమిక హక్కులుండేవి. ఇప్పుడు 6 ప్రాథమిక హక్కులు మాత్రమే కలవు.
→ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా రూపొందించారు. 300 (ఎ) అధికరణం ఆస్తి హక్కుకు సంబంధించినది.
→ ప్రాథమిక హక్కులలోని రాజ్యాంగ పరిహార హక్కు అత్యంత విలువైనది. ఈ హక్కు ద్వారా పౌరులు తమ హక్కులకు భంగం వాటిల్లితే న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందవచ్చు. ఉన్నత న్యాయస్థానాలు రిట్లను జారీచేసి పౌరుల హక్కులను కాపాడతాయి.
→ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగానికి 10 ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి.
→ ప్రాథమిక విధులను స్వరణ్ సింగ్ అధ్యక్షతన ఏర్పడిన ఒక సంఘం సూచించింది.
→ ప్రాథమిక విధులను న్యాయస్థానాల ద్వారా అమలు చేయడానికి వీలులేదు.
→ 19వ అధికరణం ప్రకారం పౌరులకు ఆరు రకాల స్వాతంత్ర్యాలు ఉంటాయి.
→ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిహార హక్కును “ప్రాథమిక హక్కులకు ఆత్మవంటి”దని వర్ణించాడు.
→ భారత రాజ్యాంగం 4వ భాగంలో ఆదేశక సూత్రాలను పేర్కొనడం జరిగింది.
→ భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగాను, వర్గరహిత రాజ్యంగాను ఏర్పరచడమే ఈ నియమాల లక్ష్యం.
→ ఆదేశక సూత్రాలు రాజ్యకలాపాల పరిధిని విస్తృతం చేశాయి.
→ ఈ సూత్రాలు శాసనపరమైనవి కావు. వీటిని అమలు జరపడంలో ఆయా ప్రభుత్వాలకు విచక్షణాధికారాలు ఉన్నాయి.
→ వీటిని సామ్యవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు, ఉదారవాద సూత్రాలుగా వర్గీకరించడం జరిగింది.
→ 42, 44వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ఆదేశక సూత్రాలకు ప్రాథమిక హక్కుల కంటే ఎక్కువ ప్రాధాన్యము ఉందని తెలిసింది.