TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 9th Lesson నిర్వహణ సూత్రాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 9th Lesson నిర్వహణ సూత్రాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నిర్వహణ సూత్రాలు అంటే ఏమిటి ?
జవాబు.
20వ శతాబ్దంలో ఏర్పడిన నిర్వహణకు హెన్రీ ఫేయల్ నిర్వహణ సిద్ధాంతాలను రూపొందించారు. అందువల్ల ఇతన్ని “నిర్వహణ పితామహుడు” అని పిలుస్తారు.
హెన్రీ ఫేయల్ రూపొందించిన నిర్వహణ సిద్ధాంతాలు/సూత్రాలు:
1) శ్రమ విభజన:

  1. అన్ని రకాల పనులను ఎక్కువ మంది సిబ్బందికి కేటాయించి విభజించాలని, దానివల్ల పని సులభంగా మరియు ఫలవంతంగా అవుతుందని ఫేయల్ సిఫారసు చేశారు.
  2. వ్యక్తులు ఒక పనిని పలుమార్లు చేయడం వల్ల వారి పనిలో వేగం పెరిగి నైపుణ్యం వస్తుంది, ఇది ప్రత్యేకతకు దారితీస్తుంది. దాని ద్వారా సంస్థ వృద్ధి సాధిస్తుంది.

2) అధికారం బాధ్యత సమానత్వం:

  1. అధికారం అనగా వనరులను ఉపయోగించుకుంటూ, క్షేత్రస్థాయి సిబ్బందికి నియంత్రణా పూర్వక నిర్దేశాన్ని ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకునే హక్కు.
  2. ఈ సూత్రం ప్రకారం అధికారం మరియు బాధ్యత రెండు కూడాను సమానంగా కేటాయించాలి. బాధ్యతా రహితంగా అధికారాన్ని కట్టబెట్టడం వల్ల అధికార దుర్వినియోగానికి దారి తీస్తుంది. అదేవిధంగా బాధ్యతను కల్పించి అధికారాన్ని కేటాయించకపోతే వ్యక్తుల నైపుణ్యత దెబ్బతింటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

3) క్రమశిక్షణ:

  1. క్రమశిక్షణ అనగా ఇతరులతో సత్సంబంధాలు కలిగి సంస్థ నియమ నిబంధనలను పాటిస్తూ విధేయత కలిగి ఉండటము.
  2. వ్యాపారం సజావుగా కొనసాగాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరం. ఈ క్రమశిక్షణ కార్మికుల్లో మాత్రమే కాకుండా యాజమాన్యంలో కూడా ఉండాలి. దీనికొరకు అన్ని స్థాయిలలో నియమాలను రూపొందించాలి.

4) ఆదేశ ఏకత్వం:

  1. ఆదేశ ఏకత్వం సూత్రం ప్రకారం ఒక క్షేత్రస్థాయిలోని ఉద్యోగి అతనిపై అధికారికి మాత్రమే బాధ్యుడై, ఆ అధికారి నుండి ఆదేశాలను పొందవలసి ఉంటుంది. అందువల్ల ఒక ఉద్యోగి ఎక్కువ మంది అధికారుల నుండి ఆదేశాలు పొందకూడదు.
  2. ఏ అధికారి ఏ ఉద్యోగికి, ఎంత మేరకు పనులను అప్పగిస్తున్నారో సూచనప్రాయంగా స్పష్టతలో ఉండాలి. ఆదేశాల ప్రక్రియలలోని వివాదాలను, కలవరాలను, చికాకులను తొలగించడానికి ఈ సూత్రం ఎంతగానో అవసరం.

5) నిర్దేశ ఏకత్వం:

  1. నిర్దేశ ఏకత్వ సూత్రం ప్రకారం సంస్థలోని ప్రతీవ్యక్తి శ్రమ ఆ సంస్థ రూపొందించిన లక్ష్యాలను సాధించే దిశగా ఉండాలి.
  2. ఒక కార్యానికి సంబంధించిన లక్ష్యాల సాధనకు సిబ్బంది బృందానికి ఒకే ప్రణాళిక, ఒకే అధికారి మాత్రమే ఉండాలి.

6) వ్యక్తిగత ఆసక్తికి బదులు సాధారణ ఆసక్తి:

  1. వ్యక్తిగత ఆసక్తులు లేదా కొంతమంది వ్యక్తులు ఉమ్మడి ఆసక్తులు సంస్థాగత లక్ష్యానికి అవరోధంగా ఉండకూడదు.
  2. వ్యక్తిగత నిర్థిష్ట అంచనాలు సంస్థ లక్ష్యసాధనకంటే ఎక్కువేమి కాదు. అందువల్ల వ్యక్తి గత ఆసక్తిని సాధారణ ఆసక్తికి అనుగుణంగా మార్చుకోవడం అవసరం.

7) ఉద్యోగుల వేతనం చెల్లింపు:

  1. ఉద్యోగి వేతన చెల్లింపు పద్ధతి సిబ్బంది సేవలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడి ఉండాలి. ఉద్యోగులు వేతన చెల్లింపుల పట్ల సంతృప్తికరంగా ఉండాలి.
  2. సంస్థలో ఉద్యోగుల అమరిక క్రమంగా ఉంటే ఉద్యోగులు తమ శక్తి మేరకు సక్రమమైన ప్రయత్నాన్ని చేస్తూ ఉత్పాదక వృద్ధికి తోడ్పడతారు. దానికి ప్రతిఫలంగా ఉద్యోగులకు చెల్లించే వేతనం సంతృప్తిదాయకంగా ఉండాలి.

8) కేంద్రీకరించడం:

  1. కేంద్రీకరించడం అనగా ఒక సంస్థలో అధికారం ఏ స్థాయిలో ఉంటుందో సూచించడం.
  2. అనేక సంస్థలలో అధికార కేంద్రీకరణ వివిధ శ్రేణులలో ఏర్పాటు చేయబడుతుంది. కేంద్రీకరణలో నిర్వాహకులు, అధికారులు ముఖ్యమైన పాత్రలను పోషిస్తారు.

9) స్కేలార్ చైన్:

  1. ఫేయల్ భావన ప్రకారం సమాచారం వేగవంతంగా సమర్ధవంతంగా ప్రసారం చేయడానికి గొలుసు అవసరం. దీనినే స్కేలార్ చైన్ అంటారు.
  2. స్కేలార్ గొలుసులో ఛీఫ్ ఎక్జిక్యూటివ్ స్థాయి నుండి సంస్థలోని కనిష్ట స్థాయి వరకు అధికారులను కలిగి ఉంటుంది. ఈ గొలుసు ద్వారా సంస్థలోని వ్యక్తులు సలహా, సహాయం కోసం ఎవరిని సంప్రదించాలో తెలుస్తుంది.

10) ఆర్డర్: ఫేయల్ సూత్రం ప్రకారం ప్రతీ వస్తువు మరియు ప్రతి ఒక్కరూ తమ తమ స్థానాలలో ఉండాలి అని చెబుతుంది. ఈ సూత్రం “సరైన వ్యక్తి సరైన స్థానంలో ఉండాలి” అనే అర్థాన్ని తెలియచేస్తుంది.

11) ధర్మం: ధర్మంలో విధేయత, న్యాయం కలిసి ఉంటాయి. సంస్థలలోని ఉద్యోగుల భక్తి, నమ్మకం సరైన రీతిలో ఉంటాయని భావిస్తారు. క్షేత్రస్థాయి ఉద్యోగుల పట్ల మంచి స్వభావంతో న్యాయపరంగా వ్యవహరించాలి. ధర్మబద్ధమైన సూత్రం వల్ల సంస్థ చేపట్టిన పనులు విజయవంతమవుతాయి.

12) ఉద్యోగి పదవీ భద్రత:

  1. సిబ్బంది మనసులలో నుంచి ఉద్యోగ అభద్రతా భావనను నిర్వహణ తొలగిస్తుంది. ప్రతీ ఉద్యోగా తన ఉద్యోగం సురక్షితం అని భావించాలి. ఉద్యోగి ఒకే చోట భద్రతగా పని చేసినట్లయితే అతను సంపూర్ణ తీరును కనబరుస్తాడు.
  2. ఒకవేళ ఉద్యోగ భద్రత లేనట్లయితే పనిలో శ్రద్ధలోపిస్తుంది. ఉద్యోగ అభద్రతాభావం సంస్థలో ఉన్న లోపాయికారి నడవడిని సూచిస్తుంది.

13) చొరవ:

  1. ఒక ప్రణాళికను ప్రతిపాదించి, దాన్ని అమలుపరచే విధానాన్ని “చొరవ” అంటారు. ఫేయల్ ప్రకారం, నిర్వాహకులు తమ ఉద్యోగుల పని తనంలో వీలైనంత చొరవ చూపే విధంగా చర్యలు తీసుకోవాలి.
  2. ఉద్యోగులు వారి సహచరులు ప్రణాళికలను తయారుచేసుకుని, అమలుపరచడానికి చొరవ తీసుకొని సంస్థ విజయానికి తోడ్పడాలి. ప్రతి ఉద్యోగి తన వంతు చొరవ చూపడం వల్ల సంస్థ అభివృద్ధి జరుగుతుంది.

14) ఎప్పిరిట్ డి కార్ప్స్ (సమైక్యతే బలం):

  1. దళ సభ్యుల విధేయత, సభ్యుల శ్రమ పట్ల గల ప్రాముఖ్యతను ఈ సూత్రం తెలియజేస్తుంది. ఎస్పిరిట్ డి కార్ప్స్ అనగా సిబ్బంది సమాచార సమన్వయం ద్వారా సమైక్య బలం చేకూరుతుందని అర్థం.
  2. యాజమాన్యం ఎప్పుడూ “విభజించు, పాలించు” అనే విధానాన్ని స్వస్తి పలకాలి మరియు సామూహిక ఉత్సాహాన్ని, సామూహిక పనిని ప్రోత్సహించాలి. దీనివల్ల సంస్థ సజావుగా సాగుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

ప్రశ్న 2.
“నిర్వహణను కళగానూ, శాస్త్రంగానూ పరిగణిస్తారు” వివరించండి.
జవాబు.
నిర్వహణను కళగానూ, శాస్త్రంగానూ పరిగణిస్తారు. ఎందుకంటే ఊహ, సృజనాత్మకత, నైపుణ్యం అనేవి అమలుచేయగలము కాబట్టి నిర్వహణకు కళగా అనవచ్చు. అంతే కాకుండా నిర్వహణ అనేక సిద్ధాంతాలను, సూత్రాలను విశ్వవ్యాప్తంగా అమలుచేయటం వల్ల దీనికి శాస్త్రంగా కూడా పరిగణించవచ్చు.

నిర్వహణ – కళ: నిర్వాహకునికి గల గ్రాహ, సృజనాత్మకత, లోతైన ఆలోచనా విధానం లాంటివి కలిగినప్పుడు నిర్వహణ నైపుణ్యం అనేది అమలుపరచడానికి వీలు ఉంటుంది. అందువల్ల దీన్ని కళ అని చెప్పవచ్చు. నిర్వహణను ఇతర శాస్త్రాలైన భౌతిక, రసాయన, గణిత శాస్త్రాల లాగా ఖచ్చితంగా సమాన శాస్త్రాలని చెప్పలేము. కానీ ఏ మాత్రం సంకోచం లేకుండా నిర్వహణకు ఒక శాస్త్రమని చెప్పవచ్చు. కాని అది భౌతిక, రసాయన శాస్త్రాల లాగా అభ్యసన శాస్త్రం అని ఎంత మాత్రం చెప్పలేము. ఎందుకంటే నిర్వహణ శాస్త్రం మానవీయ కోణంతో అనేక భౌతిక అంశాల ఆధారంగా ప్రభావితమవుతుంది. ప్రాకృత శాస్త్రంలాగా నిర్వహణ శాస్త్రం నిర్ణయాలను విశ్వవ్యాప్తంగా అమలు పరచడానికి వీలులేదు. కాని సాంఘిక శాస్త్రాలైన ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రాలతో సరిపోల్చవచ్చు. నిర్వహణ శాస్త్రం ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. అంతేకాక కళలాగా భారీ స్థాయిలో అభ్యసనం చేయవలసి ఉంటుంది. కాని పెరుగుతున్న అవసరాలను బట్టి నిర్వహణ ఒక వృత్తి మాదిరిగా పరిణమిస్తూ ఉంది.

నిర్వహణ – శాస్త్రం: శాస్త్రం అనేది సాధారణ వాస్తవికతను తెలుపుతూ ఒక రంగం యొక్క ప్రత్యేక పరిజ్ఞానాన్ని కలిగిన విద్యావిధానం. వాస్తవానికి, ఒక అంశానికి గల సంబంధ కారణాలను తెలిపే విధానం, నిర్వహణ, నిర్వహణను ఒక శాస్త్రంగా మలచడానికి అనేక సిద్ధాంతాలను ఏర్పరచి వాటిని అనుసంధానంగా గల నడవడిని తెలిపే విద్య నిర్వహణ-విద్య అని చెప్పవచ్చు. ఈ విషయంపై అనేక అంశాలను విశ్వవ్యాప్తంగా అమలు పరచడానికి నిర్వాహణకు యుక్తమైన నిబంధనలను, సూత్రాలను సృష్టించి అవి సరియైనవో కావో కనుగొనడానికి శోధన జరుగుతున్నది. నిర్వాహకులు చేస్తున్న పనిని పూర్తి చేయడానికి శాస్త్రీయ పద్ధతుల ద్వారా విధానాలను అమలుపరచడం పెరుగుతున్నది. ఈ ఆలోచనా విధానం ఎలా ఉందంటే, మొదటగా సమస్యను గుర్తించి, దాన్ని అభ్యసించడానికి తాత్కాలిక భావనను ఏర్పరచుకుని, తగిన ప్రయోగ ప్రక్రియలను, పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రత్యామ్నాయ సమాధానాలను కనుక్కొనే ఆలోచన దిశగా అభివృద్ధి చెందుతోంది.

ప్రశ్న 3.
“నిర్వహణ రంగంలో హెన్రీ ఫేయల్ కృషిని వివరించండి.
జవాబు.
నిర్వహణ రంగంలో హెన్రీ ఫేయల్ కృషి: 20వ శతాబ్దంలో ఏర్పరచిన నిర్వహణ సిద్ధాంతాలకు పేర్కొనదగిన వ్యక్తి హెన్రీ ఫేయల్. ఫేయల్ 1860వ సంవత్సరంలో మైనింగ్ ఇంజనీర్గా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినాడు. సాధారణ పరిపాలన, నిర్వహణలో విజయవంతమైన అనుభవశాలి హెన్రీ ఫేయల్.

ఫేయల్ సిద్ధాంతాలు అన్ని సంస్థలకూ, ఆచరణకు యోగ్యంగా రూపొందించడం జరిగింది. ఫేయల్ రచన ప్రకారం, సంస్థను నిర్వహించడానికి ప్రణాళిక, వ్యవస్థీకరణ, నిర్దేశం, సమన్వయం, నియంత్రణ ‘అవసరం అని తెలిపాడు. ఈ విధంగా నిర్వహణ విధులను ఏ నిపుణుడు తెలియచేయని విధంగా రూపొందించడం జరిగింది. అందువల్ల ఇతన్ని “నిర్వహణ పితామహుడు” అని పిలుస్తారు.

హెన్రీ ఫేయల్ ప్రతిపాదించిన నిర్వహణ సూత్రాలే సర్వజనామోదం పొందాయి. ఇప్పటికీ ఈ సూత్రాలు నిర్వహణా శాస్త్రానికి తలమానికంగా ఉన్నాయి. ఫేయల్ ప్రతిపాదించిన సూత్రాలు విశ్వవ్యాప్తమైనవి అవడమే వాటిలోని గొప్పతనం అన్ని రకాల సంస్థలకు, అన్ని విధులకు, అన్ని స్థాయిలకు ఇవి వర్తిస్తాయి. అందుచేతనే ఈ సూత్రాలకు అంత ప్రాముఖ్యం వచ్చింది. ఫేయల్ 14 నిర్వహణ సూత్రాలను ప్రతిపాదించాడు.

ప్రశ్న 4.
నిర్వహణ స్వభావాన్ని వివరించండి.
జవాబు.
నిర్వహణ స్వభావం:
1) కళ మరియు శాస్త్రం: నిర్వహణను కళగాను మరియు శాస్త్రంగాను పరిగణిస్తారు. విశ్వవ్యాప్తంగా అమలు చేయుటకు నిర్వహణకు కొన్ని నిబంధనలు, సూత్రాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. అందువల్ల దీనిని శాస్త్రంగా పరిగణించవచ్చు. ఈ సిద్ధాంతాలను అమలు చేయుటకు సృజనాత్మకత, నైపణ్యం, ఊహ కూడా తోడవడంతో దీనిని కళగా కూడా పరిగణించవచ్చు.

2) సామాజిక బాధ్యత: నిర్వహణ అనే అంశం శాస్త్రీయ పద్ధతిలో ఒక వృత్తిగా భావింపజేసి, దానికున్న బాధ్యతను పెంచింది. ఒక నిర్వాహకుడు తన సిబ్బందికి మాత్రమే జవాబుదారీ కాడు, అతను సమాజానికి కూడా అదే రీతిలో బాధ్యుడవుతాడు. అతడు సమాజంలో ఒక ప్రతినిధిగా ఉండి, వినియోగదారుల ఆసక్తులను తగిన రీతిలో కాపాడాలి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

3) నిర్వహణ ఒక ప్రత్యేకమైన తత్వం కలది: ఉన్నత స్థాయి నిర్వాహకులు క్షేత్రస్థాయి పనులను చేపట్టరు. వారు ఆ పనిని ఇతరులచే పూర్తిచేయిస్తారు. వారు కనిష్ట మూలాంశాలైన మానవశక్తి, ముడిసరుకు సమయాలను ఉపయోగించి గరిష్ట ఫలితాంశాన్ని పొందడంలోనే వారి విజయ రహస్యం ఉంది.

4) ఉద్దేశపు కార్యం: యాజమాన్యం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశం ఏర్పరచుకుంటుంది. నిర్వహణ అనేది మానవ, భౌతిక వనరులను యోగ్యంగా వినియోగించుకుంటూ ముందుగా ఏర్పరచుకున్న లక్ష్యాలను చేరుకునే ఒక సాధనం.

5) నిర్వహణ అంతటా ఉంటుంది: నిర్వహణకు సంబంధించి ఆర్థిక, రాజకీయ రంగాల లాంటి అన్ని సంస్థలకు చెందే కార్యం. ఎక్కడ ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది వ్యక్తుల సాధారణ లక్ష్యపు కార్యాలు ఉంటాయో అలాంటి పరిస్థితులలో నిర్వహణ ఎంతో అవసరం. అందువల్ల సంస్థ ఆకార, పరిమాణాలతో సంబంధం లేకుండా వ్యవస్థీకరణ కార్యకలాపాల్లో నిర్వహణ అవసరమని క్లుప్తంగి చెప్పబడింది.

6) నిర్వహణ ఒక సామూహిక ప్రక్రియ: ఒక వ్యవస్థీకృత కార్యంలో నిర్వహణ అనేది అత్యవసరమని తెలుసుకున్నప్పుడు అది ఒక సామూహిక ప్రక్రియగా అభిప్రాయపడవచ్చు. ముందుగా ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించడానికి వ్యక్తుల సామూహిక కృషి ఎంతైనా అవసరం.

ప్రశ్న 5.
నిర్వహణ యొక్క ధ్యేయాలు ఏమిటి ? వివరించండి.
జవాబు.
ఏ సంస్థలోనైనా వివిధ లక్ష్యాలు ఉంటాయి. యాజమాన్యం ఆ లక్ష్యాలను ఉపయుక్తంగా నైపుణ్యంతో సాధించడానికి తోడ్పాటునందిస్తుంది. నిర్వహణ లక్ష్యాలను వ్యవస్థీకరణ లక్ష్యాలు, సాంఘిక లక్ష్యాలు, వ్యక్తిగత లక్ష్యాలుగా వర్గీకరించడం జరుగుతుంది.
1. వ్యవస్థీకరణ లక్ష్యాలు:
ఎ) ఒక వ్యాపారం విజయవంతమవడానికి దాని యాజమాన్యం సాధించవలసిన లక్ష్యాలను రూపొందించవలసి ఉంటుంది. వివిధ రకాలైన లక్ష్యాలను సాధించడానికి అన్ని రంగాలలోని వారి ఆసక్తిని లెక్కలోనికి తీసుకోవలసి ఉంటుంది. వారిలో ప్రభుత్వం, వినియోగదారులు, సిబ్బంది, వాటాదారులు ఉంటారు.

బి) ఏ వ్యవస్థ అయినా లక్ష్యాలను సాధించాలంటే, మానవ మరియు ఇతర వనరులను అత్యంత ప్రయోజనకరంగా వనియోగించుకుని వ్యాపార ఆర్థిక లక్ష్యాలైన లాభం, మనుగడ, వ్యాపార వృద్ధిని సాధించాలి.

2. సాంఘిక లక్ష్యాలు:
ఎ) ఈ లక్ష్యాల వల్ల సమాజంలో ప్రయోజనాలను సృష్టించే అంశాలు ఉంటాయి. సామాజిక రంగంలో భాగంగా ఒక వ్యాపార సంస్థ కాని, వ్యాపారేతర సంస్థకాని సాంఘికపరమైన బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుండి.

బి) సంఘంలోని వివిధ వర్గాలలోని వారికి ఆర్థిక విలువలను నిరంతరాయంగా సృష్టిస్తూ ఉండాలి. దీనిలో భాగంగా పర్యావరణ హితమైన ఉత్పత్తి విధానం, అణగారిన వర్గానికి ఉపాధి అవకాశాలు మరియు పాఠశాల, శిశు సంరక్షణా కేంద్రాలలో కనీస సదుపాయాలు కల్పించడం లాంటివి ఉంటాయి.

3. వ్యక్తిగత లక్ష్యాలు:
ఎ) సంస్థలోని వ్యక్తులు విభిన్న వ్యక్తిత్వాలు, గతచరిత్ర, అనుభవాలు, లక్ష్యాలు కలిగి ఉంటారు. వీరందరూ సంస్థలో బహువిధాలైన అవసరాలను తీర్చుకునేవారుగా ఉంటారు. వీరి అవసరాలు, జీతభత్యాలు, సాంఘిక, వ్యక్తిగత ఉన్నత స్థాయి గుర్తింపులను ఆధారం చేసుకుని ఉంటాయి.

బి) అందువల్ల సంస్థ యాజమాన్యం, సంస్థలోని లక్ష్యాలకు సమన్వయంగా వ్యక్తిగత ధ్యేయాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.

ప్రశ్న 6.
నిర్వహణ ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు.
క్లిష్టమైనదిగా భావిస్తున్న మారుతున్న సమాజంలో ఎలాంటి రాజకీయ సిద్ధాంతం, సమాజ రూపం ఉన్నప్పటికి, నిర్వహణ శాస్త్రం అతి ప్రధానమైన పాత్ర పోషిస్తున్నది.
నిర్వహణ ప్రాముఖ్యత:

  1. ఒక సంస్థ లక్ష్యాలను నెరవేర్చడానికి నిర్వహణ విధానం వ్యవస్థీకరించి వనరులను ఒకటిగా చేరుస్తుంది.
  2. మానవ, మానవేతర ఉత్పాదక వనరుల వృద్ధి వల్ల నిర్వహణ విధానం సమాజంలోని వ్యక్తుల జీవన ప్రమాణాన్ని మెరుగుపరుస్తుంది.
  3. ప్రస్తుత పరిస్థితులలో వివేకవంతమైన నిర్వహణ విధానంతో మానవ, ప్రాకృతిక, మూల వస్తు వనరులు – వినియోగించుకొని భారీ స్థాయిలో ఉత్పాదన ప్రక్రియను కొనసాగించవచ్చు.
  4. సామూహికంగా సాధించే లక్ష్యాలకు మరియు సామూహిక జట్టు ప్రయత్నాలకు నిర్వహణ ఎంతో సహాయం చేస్తుంది.
  5. భారీ స్థాయి పోటీలో ఉన్న మార్కెట్లలో సంస్థ మనుగడ సాగించడానికి ముందుగా జరిపిన పరీక్షల ఫలితాలను బట్టి నిర్వహణ విధానం సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
  6. పారిశ్రామిక సంస్థలలో ప్రతిదినం ఏర్పడే సామాజిక, సమస్యలను యాజమాన్యం ఎదుర్కోడానికి నిర్వహణ
    ఉపయోగపడుతుంది.
  7. వేగవంతంగా మారుతున్న సామాజిక, ఆర్థిక స్థితిని బట్టి నిర్వహణ విధానం పరివర్తన చూపుతుంది.
  8. వివిధ ఉత్పాదక కారకాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి, ఇతర కారకాలలై ఆధారపడి ఉండి నైనుణ్యతను సృష్టించడానికి సహాయపడతాయి. ఇలాంటి పరిస్థితులలో నిర్వహణ విధానం ప్రతిఫలాలను అందించడానికి సమానత్వం చూపుతుంది.
  9. పరిశ్రమలో లభ్యంకాని, కొరత గల వనరులను వివిధ ప్రత్యామ్నాయ పద్ధతులో ఉపయోగపడే విధంగా ఎంపిక చేసి, అత్యున్నత స్థాయిలో ఫలితాలనందించే దిశగా నిర్వహణ శాస్త్రం తోడ్పడుతుంది.

ప్రశ్న 7.
నిర్వహణ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటో వివరించండి.
జవాబు.
నిర్వహణ:

  1. సాధారణంగా నిర్వహణ అనగా “ఇతరుల సహాయంచే చేపట్టిన పనిని పూర్తి చేసుకోవడం”.
  2. FW. టేలర్ ప్రకారం నిర్వహణ అంటే ” నీవు చేయదలచుకున్న పనిని అత్యంత విజయవంతంగా స్వల్ప వ్యయంతో పూర్తి చేసుకునే దృష్టిని ఏర్పరచుకునే కళ”.

నిర్వహణ లక్షణాలు:
1) ఆర్థిక కార్యకలాపాలు: సమాజంలో సంతృప్తికరమైన జీవనం కోసం పాటుపడుతున్న వ్యక్తి యొక్క ప్రతి ఆర్థిక కార్యకలాపం నిర్వహణలో అంతర్భాగం. సంస్థ రూపొందించిన లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ముడి సరుకు, మానవ వనరులు, మార్కెట్లు, డబ్బు, యంత్రాలలాంటివి వివిధ ప్రణాళికలను తయారు చేయడానికి సహాయకారిగా ఉంటాయి.

2) సృజనాత్మక ప్రక్రియ: నిర్వహణ అనేది ఒక సృజనాత్మక, అర్థవంతమైన సామూహిక ప్రోత్సాహక, ప్రాతినిథ్య ప్రక్రియ. అన్నింటికంటే మించి ఇది ఒక విధాన నిర్ణయపు ప్రక్రియ.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

3) ఇతరులచే పూర్తి చేయిస్తుంది: నిర్వహణలో గల అనేక పథకాల రూపకల్పనలు ఇతరులచే పూర్తి చేయిస్తుంది. ఒక పని చేయడానికి ఇతరుల సహాయాన్ని పొందుతుంది. ఏ సంస్థలోనైనా ఒక సాధారణ లక్ష్యాన్ని సాధించాలంటే వ్యక్తుల సామూహిక శ్రమ ఎంతైనా చెప్పుకోదగినది. అలాంటి పని పూర్తి కావడానికి ఇతరుల సహాయాన్ని పొందడానికి ప్రోత్సహించడం జరుగుతుంది.

4) ప్రయత్నాలను సమన్వయపరుస్తుంది: సంస్థలో గల వ్యక్తుల, జట్టు సభ్యుల కార్యకలాపాలను సమన్వయపరచడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల దీన్ని మానవ వనరుల సమన్వయం అంటారు.

5) వ్యవహార క్రమం: నిర్వహణను అర్థవంతమైన విశ్లేషణకు, సిద్ధాంతానికి, భావాలకు ప్రత్యామ్నాయంగా నిర్వచించడం జరిగింది. దాని కోసం మానవ వనరుల ప్రయత్నాలను సమన్వయపరచి, నిర్వాహకులు క్రమంగా నిర్దేశిస్తారు.

6) లక్ష్యాల ఆధారితం: నిర్వహణ ముఖ్య ఉద్దేశం లక్ష్యాలను సాధించడం. ఒక సంస్థ లక్ష్యం గరిష్ట లాభార్జన అయినట్లయితే దానికి తగినట్లుగా చర్యలను తీసుకుంటూ ఉండాలి. అవి ఉత్పాదక వ్యయ తగ్గింపు, నూతన ఉత్పత్తి వనరులను చేర్చడం, పాత యంత్రం స్థానంలో నూతన యంత్రాన్ని పునః స్థాపించడం ద్వారా ఉత్పత్తిని పెంచడం లాంటివి
ఉంటాయి.

7) జట్టుగా పని చేస్తుంది: నిర్వహణను యాజమాన్య కార్యకలాపాలలో సమిష్టిగా పనులను కొనసాగించే ఒక వర్గానికి చెందిన వ్యక్తుల జట్టుగా పేర్కొనవచ్చు. యాజమాన్య స్థాయిలో ఉన్న వ్యక్తుల సమూహాన్ని నిర్వాహకులుగా చెప్పవచ్చు. ముఖ్య కార్యనిర్వహణాధికారి మొదలు ఉన్నత స్థాయి పరిశీలకులను నిర్వాహకులుగా పరిగణిస్తారు.

8) క్రమశిక్షణ కలిగినది: నిర్వహణ ఒక ప్రేత్యేక పరిజ్ఞానం గల రంగం. ఎందుకటే నిర్వహణలోని అంశాలు సూచనలు, బోధన పద్ధతుల ద్వారా నేర్చుకునే ఒక ప్రత్యేక క్రమశిక్షణ గల పాఠ్యాంశంగా చెప్పబడుతున్నది. దీనికి గల ప్రధాన కారణం ప్రపంచంలోని అన్ని కళాశాలలు, పాఠశాలలు నిర్వహణను ఒక ప్రత్యేక విద్యగా పరిగణించడం మొదలు పెట్టాయి.

ప్రశ్న 8.
నిర్వహణ స్థాయిలను సవివరంగా చర్చించండి.
జవాబు.
నిర్వహణలో మూడు రకాల స్థాయిలు ఉన్నాయి. అవి: 1) ఉన్నత స్థాయి 2) మధ్య స్థాయి 3) క్షేత్రస్థాయి
TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు 1
1. ఉన్నతస్థాయి:

  1. ఇ.ఎఫ్.ఎల్. బ్రెచ్ దృష్టిలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ల బోర్డు, మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎక్జిక్యూటివ్స్ లాంటివారు, సాధారణ నిర్వాహకులచే నిర్ధార్తిచంబడే పథకాలు, ప్రణాళికలు, లక్ష్యాల విధులు ఉంటాయని చెప్పడం జరిగింది.
  2. అందుకోసం మానవ నైపుణ్యాలు, సృజనాత్మకత కలిగిన నిర్ణయాలు, భావనల స్పష్టత ఎంతో అవసరం.
  3. వారు నిర్వర్తించే విధులలో కొన్నింటిని కింద ఇవ్వడం జరిగింది. అవి:
    ఎ) సంస్థ లక్ష్యాలను నిర్థారించుకుని మదుపరుల ఆసక్తిని కాపాడటం.
    బి) సంస్థ సాధించిన లక్ష్యాలను మూల్యాంకనం చేయడం.
    సి) ప్రధాన అధికారిని ఎంపిక చేసుకుని, రాబడి పంపకం చేసి క్లిష్టమైన, తీవ్రమైన సమస్యలను చర్చించడం.

2. మధ్యస్థాయి:

  1. పై స్థాయి, క్షేత్ర స్థాయి నిర్వాహకులకు వంతెనలాగా, మధ్యస్థాయి యాజమాన్యం విధులను నిర్వర్తిస్తుంది.
  2. వివిధ విభాగాలైన ఆర్థిక, మానవ వనరులు, ఉత్పాదక, మార్కెటింగ్ లాంటి వాటికి వీరు అధిపతులుగా ఉంటారు.
  3. పై స్థాయిలో రూపొందించిన పథకాలకు, కార్యక్రమాలకు విలువైన సేవలను అందిస్తూ విభాగాలు విజయవంతమవడానికి మధ్యస్థాయి నిర్వాహకులు సహకరిస్తూ విధులను నిర్వర్తించవలసి ఉంటుంది.

3. క్షేత్రస్థాయి:

  1. క్షేత్రస్థాయి నిర్వాహకులలో ప్రవర్తకుడు, విచారణాధికారి, మరియు ఇతర సిబ్బంది ఉంటారు.
  2. ప్రవర్తకులు క్రమశిక్షణతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటారు. కార్యాలయాలలో
    వారిని విచారణాధికారులుగాను, నిర్మాణ సంస్థలలో సిబ్బందిగాను పిలుస్తారు.
  3. ఆధునిక కాలంలో యాజమాన్యం దృష్టిలో వీరిని స్నేహితులుగానూ, నిర్దేశకులుగానూ, శ్రామికుల శ్రేయోభిలాషులుగానూ పరిగణిస్తున్నారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నిర్వహణను నిర్వచించండి.
జవాబు.
నిర్వహణ అర్థం: సాధారణంగా నిర్వహణను ‘ఇతరుల సహయంచే చేపట్టన పనిని పూర్తిచేసుకోవడం’ అని నిర్వచించడం జరిగింది.
నిర్వచనాలు:

  1. పీటర్ ఎఫ్. డ్రకర్ ప్రకారం, నిర్వహణ అనేది ‘కార్మికుల, నిర్వాహకుల పనిని వ్యాపారపరంగా నిర్వహించే బహుళ ప్రయోజన భాగం’ గా చెప్పబడింది.
  2. ఎఫ్. డబ్ల్యు. టేలర్ నిర్వచనం ప్రకారం, నిర్వహణ అంటే ‘నీవు చేయదలచుకున్న పనిని అత్యంత విజయవంతంగా, స్వల్ప వ్యయంతో చేసుకొనే దృష్టిని ఏర్పరచుకునే కళ’.
  3. హెన్రీ ఫేయల్ ప్రకారం, ‘నిర్వహించడం అంటే ప్రణాళీకరించడం, భావి సూచన చేయడం, వ్యవస్థీకరించడం, ఆదేశించడం, సమన్వయపరచడం, నియంత్రించడం’ అని అర్థం.

ప్రశ్న 2.
ఏవైనా రెండు నిర్వహణ లక్షణాలను పేర్కొనండి.
జవాబు.
1) ఆర్థిక కార్యకలాపాలు: సమాజంలో సంతృప్తికరమైన జీవనం కోసం పాటుపడుతున్న వ్యక్తి యొక్క ప్రతి ఆర్థిక కార్యకలాపం నిర్వహణలో అంతర్భాగం. సంస్థ రూపొందించిన లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ముడి సరుకు, మానవ వనరులు, మార్కెట్లు, డబ్బు, యంత్రాలలాంటివి వివిధ ప్రణాళికలను తయారు చేయడానికి సహాయకారిగా ఉంటాయి.

2) సృజనాత్మక ప్రక్రియ: నిర్వహణ అనేది ఒక సృజనాత్మక, అర్థవంతమైన సామూహిక ప్రోత్సాహక, ప్రాతినిథ్య ప్రక్రియ. అన్నింటికంటే మించి ఇది ఒక విధాన నిర్ణయపు ప్రక్రియ.

3) ఇతరులచే పూర్తి చేయిస్తుంది: నిర్వహణలో గల అనేక పథకాల రూపకల్పనలు ఇతరులచే పూర్తి చేయిస్తుంది. ఒక పని చేయడానికి ఇతరుల సహాయాన్ని పొందుతుంది. ఏ సంస్థలోనైనా ఒక సాధారణ లక్ష్యాన్ని సాధించాలంటే వ్యక్తుల ‘సామూహిక శ్రమ ఎంతైనా చెప్పుకోదగినది. అలాంటి పని పూర్తి కావడానికి ఇతరుల సహాయాన్ని పొందడానికి ప్రోత్సహించడం జరుగుతుంది.

ప్రశ్న 3.
నిర్దేశ ఏకత్వం అంటే ఏమిటి ?
జవాబు.
1) శ్రమ విభజన:

  1. అన్ని రకాల పనులను ఎక్కువ మంది సిబ్బందికి కేటాయించి విభజించాలని, దానివల్ల పని సులభంగా మరియు ఫలవంతంగా అవుతుందని ఫేయల్ సిఫారసు చేశారు.
  2. వ్యక్తులు ఒక పనిని పలుమార్లు చేయడం వల్ల వారి పనిలో వేగం పెరిగి నైపుణ్యం వస్తుంది, ఇది ప్రత్యేకతకు దారితీస్తుంది. దాని ద్వారా సంస్థ వృద్ధి సాధిస్తుంది.
    నిర్వహణను నిర్వచించండి.

2) అధికారం బాద్యత సమానత్వం:

  1. అధికారం అనగా వనరులను ఉపయోగించుకుంటూ, క్షేత్రస్థాయి సిబ్బందికి నియంత్రణా పూర్వక నిర్దేశాన్ని ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకునే హక్కు.
  2. ఈ సూత్రం ప్రకారం అధికారం మరియు బాధ్యత రెండు కూడాను సమానంగా కేటాయించాలి. బాధ్యతా రహితంగా అధికారాన్ని కట్టబెట్టడం వల్ల అధికార దుర్వినియోగానికి దారి తీస్తుంది. అదేవిధంగా బాధ్యతను కల్పించి అధికారాన్ని కేటాయించకపోతే వ్యక్తుల నైపుణ్యత దెబ్బతింటుంది.

3) క్రమశిక్షణ:

  1. క్రమశిక్షణ అనగా ఇతరులతో సత్సంబంధాలు కలిగి సంస్థ నియమ నిబంధనలను పాటిస్తూ విధేయత కలిగి ఉండటము.,
  2. వ్యాపారం సజావుగా కొనసాగాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరం. ఈ క్రమశిక్షణ కార్మికుల్లో మాత్రమే కాకుండా యాజమాన్యంలో కూడా ఉండాలి. దీనికొరకు అన్ని స్థాయిలలో నియమాలను రూపొందించాలి.

4) ఆదేశ ఏకత్వం:

  1. ఆదేశ ఏకత్వం సూత్రం ప్రకారం ఒక క్షేత్రస్థాయిలోని ఉద్యోగి అతనిపై అధికారికి మాత్రమే బాధ్యుడై, ఆ అధికారి నుండి ఆదేశాలను పొందవలసి ఉంటుంది. అందువల్ల ఒక ఉద్యోగి ఎక్కువ మంది అధికారుల నుండి ఆదేశాలు పొందకూడదు.
  2. ఏ అధికారి ఏ ఉద్యోగికి, ఎంత మేరకు పనులను అప్పగిస్తున్నారో సూచనప్రాయంగా స్పష్టతలో ఉండాలి. ఆదేశాల ప్రక్రియలలోని వివాదాలను, కలవరాలను, చికాకులను తొలగించడానికి ఈ సూత్రం ఎంతగానో అవసరం.

5) నిర్దేశ ఏకత్వం:

  1. నిర్దేశ ఏకత్వ సూత్రం ప్రకారం సంస్థలోని ప్రతీవ్యక్తి శ్రమ ఆ సంస్థ రూపొందించిన లక్ష్యాలను సాధించే దిశగా ఉండాలి.
  2. ఒక కార్యానికి సంబంధించిన లక్ష్యాల సాధనకు సిబ్బంది బృందానికి ఒకే ప్రణాళిక, ఒకే అధికారి మాత్రమే ఉండాలి.

ప్రశ్న 4.
నిర్వహణ స్వభావాన్ని వృత్తిగా వర్ణించండి.
జవాబు.
నిర్వహణ వృత్తి:

  1. కేవలం ప్రత్యక్ష బోధన ద్వారా, తరువాత పరీక్షించి ధ్రువీకరించిన విద్య, సునిశితమైన, కష్టతరమైన శిక్షణ పొందినందువల్ల సమకూరిన నిపుణతతో చేపట్టే పనినిగానీ, ఉపాధిని గానీ వృత్తి అనవచ్చు.
  2. నిర్వహణ శాస్త్రం క్రమంగా మార్పు చెందుతోంది. నిర్వాహకులు నిర్వహణ శాస్త్రం పట్ల తగిన విద్యార్హతలను కలిగి శిక్షణను పొంది ఉండాలి.
  3. అభ్యాసం చేస్తున్న న్యాయవాదులకు గల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ కంపెనీ సెక్రెటరీలకు సంఘాలు ఉన్నట్లు మిగతా వృత్తులలాగా నిర్వహణ రంగంలో, సంఘాలు లేవు.
  4. ఒక విధంగా చెప్పాలంటే నిర్వహణ శాస్త్రం ఒక వృత్తి అని తెలియజేయవచ్చు. కాని నిర్దిష్టమైన వృత్తికి గల లక్షణాలు దీనికి లేవు.
  5. అందువల్ల మనం నిర్వహణను అనేక సిద్ధాంతాలను బట్టి, సాధనాలను బట్టి, పద్ధతులను బట్టి చూస్తే ఒక విద్యకు ఉండవలసిన శిక్షణ, అధ్యాయాలు, నేర్చుకొనే అంశాలు గల ఆధునిక వృత్తిగా ఆవిష్కృతమైందని చెప్పవచ్చు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

ప్రశ్న 5.
నిర్వహణ అనేది కళనా ?
జవాబు.
1) నిర్వాహకునికి గల ఊహ, సృజనాత్మకత, లోతైన ఆలోచనా విధానం లాంటివి కలిగినప్పుడు నిర్వహణ నైపుణ్యం అనేది అమలుపరచడానికి వీలు ఉంటుంది. అందువల్ల దీన్ని కళ అని చెప్పవచ్చు.

2) నిర్వహణను ఇతర శాస్త్రాలైన భౌతిక, రసాయన, గణిత శాస్త్రాల లాగా ఖచ్చితంగా సమాన శాస్త్రాలని చెప్పలేము. కానీ ఏ మాత్రం సంకోచం లేకుండా నిర్వహణకు ఒక శాస్త్రమని చెప్పవచ్చు. కాని అది భౌతిక, రసాయన శాస్త్రాలలాగా అభ్యసన శాస్త్రం అని ఎంత మాత్రం చెప్పలేము. ఎందుకంటే నిర్వహణ శాస్త్రం మానవీయ కోణంతో అనేక భౌతిక అంశాల ఆధారంగా ప్రభావితమవుతుంది.

3) ప్రాకృతిక శాస్త్రాలలాగా నిర్వహణ శాస్త్రం నిర్ణయాలను విశ్వవ్యాప్తంగా అమలుపరచడానికి వీలులేదు. కాని సాంఘిక శాస్త్రాలైన ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రాలతో సరిపోల్చవచ్చు.

4) నిర్వహణ శాస్త్రం ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. అంతేకాక కళలాగా భారీ స్థాయిలో అభ్యసనం చేయవలసి ఉంటుంది. కాని పెరుగుతున్న అవసరాలను బట్టి నిర్వహణ ఒక వృత్తి మాదిరిగా పరిణమిస్తూ ఉంది.

ప్రశ్న 6.
వృత్తి అనేది నిర్వహణలో భాగమా ?
జవాబు.
1) కేవలం ప్రత్యక్ష బోధన ద్వారా, తరవాత పరీక్షించి ధ్రువీకరించిన విద్య, సునిశితమైన, కష్టతరమైన శిక్షణ పొందినందువల్ల సమకూరిన నిపుణతతో చేపట్టే పనినిగానీ, ఉపాధిని గానీ వృత్తి అనవచ్చు.

2) నిర్వహణ శాస్త్రం క్రమంగా మార్పు చెందుతోంది. నిర్వాహకులు నిర్వహణ శాస్త్రం పట్ల తగిన విద్యార్హతలను కలిగి శిక్షణను పొంది ఉండాలి.

3) అభ్యాసం చేస్తున్న న్యాయవాదులకు గల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ కంపెనీ సెక్రెటరీలకు సంఘాలు ఉన్నట్లు మిగతా వృత్తులలాగా నిర్వహణ రంగంలో, సంఘాలు లేవు.

4) ఒక విధంగా చెప్పాలంటే నిర్వహణ శాస్త్రం ఒక వృత్తి అని తెలియజేయవచ్చు. కాని నిర్దిష్టమైన వృత్తికి గల లక్షణాలు దీనికి లేవు.

5) అందువల్ల మనం ‘నిర్వహణను అనేక సిద్ధాంతాలను బట్టి, సాధనాలను బట్టి, పద్ధతులను బట్టి చూస్తే ఒక విద్యకు ఉండవలసిన శిక్షణ, అధ్యాయాలు, నేర్చుకొనే అంశాలు గల ఆధునిక వృత్తిగా ఆవిష్కృతమైందని చెప్పవచ్చు.

ప్రశ్న 7.
నిర్వహణ అనేది శాస్త్రమా ?
జవాబు.
1) శాస్త్రం అనేది సాధారణ వాస్తవికతను తెలుపుతూ ఒక రంగం యొక్క ప్రత్యేక పరిజ్ఞానాన్ని కలిగిన విద్యావిధానం. వాస్తవానికి, ఒక అంశానికి గల సంబంధ కారణాలను తెలిపే విధానం, నిర్వహణ. నిర్వహణను ఒక శాస్త్రంగా మలచడానికి అనేక సిద్ధాంతాలను ఏర్పరచి వాటిని అనుసంధానంగా గల నడవడిని తెలిపే విద్య నిర్వహణ- విద్య అని చెప్పవచ్చు.

2) ఈ విషయంపై అనేక అంశాలను విశ్వవ్యాప్తంగా అమలు పరచడానికి నిర్వాహణకు యుక్తమైన నిబంధనలను, సూత్రాలను సృష్టించి అవి సరియైనవో కావో కనుగొనడానికి శోధన జరుగుతున్నది.

3) నిర్వాహకులు చేస్తున్న పనిని పూర్తి చేయడానికి శాస్త్రీయ పద్ధతుల ద్వారా విధానాలను అమలుపరచడం పెరుగుతున్నది. ఈ ఆలోచనా విధానం ఎలా ఉందంటే, మొదటగా సమస్యను గుర్తించి, దాన్ని అభ్యసించడానికి తాత్కాలిక భావనను ఏర్పరచుకుని, తగిన ప్రయోగ ప్రక్రియలను, పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రత్యామ్నాయ సమాధానాలను కనుక్కొనే ఆలోచన దిశగా అభివృద్ధి చెందుతోంది.

ప్రశ్న 8.
నిర్వహణ యొక్క వ్యవస్థీకృత ధ్యేయాలు ఏమిటి ?
జవాబు.
1) ఒక వ్యాపారం విజయవంతమవడానికి దాని యాజమాన్యం సాధించవలసిన లక్ష్యాలను రూపొందించవలసి ఉంటుంది. వివిధ రకాలైన లక్ష్యాలను సాధించడానికి అన్ని రంగాలలోని వారి ఆసక్తిని లెక్కలోనికి తీసుకోవలసి ఉంటుంది. వారిలో ప్రభుత్వం, వినియోగదారులు, సిబ్బంది, వాటాదారులు ఉంటారు.

2) ఏ వ్యవస్థ అయినా లక్ష్యాలను సాధించాలంటే, మానవ మరియు ఇతర వనరులను అత్యంత ప్రయోజనకరంగా వినియోగించుకుని వ్యాపార ఆర్థిక లక్ష్యాలైన లాభం, మనుగడ, వ్యాపార వృద్ధిని సాధించాలి.

ప్రశ్న 9.
ఉన్నత శ్రేణి నిర్వహణ అంటే ఏమిటి ?
జవాబు.
ఉన్నతస్థాయి:

  1. ఇ.ఎఫ్.ఎల్. బ్రెచ్ దృష్టిలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ల బోర్డు, మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎక్జిక్యూటివ్స్ లాంటివారు, సాధారణ నిర్వాహకులచే నిర్ధారించబడే పథకాలు, ప్రణాళికలు, లక్ష్యాల విధులు ఉంటాయని చెప్పడం జరిగింది.
  2. అందుకోసం మానవ నైపుణ్యాలు, సృజనాత్మకత కలిగిన నిర్ణయాలు, భావనల స్పష్టత ఎంతో అవసరం.
  3. వారు నిర్వర్తించే విధులలో కొన్నింటిని కింద ఇవ్వడం జరిగింది. అవి:
    ఎ) సంస్థ లక్ష్యాలను నిర్ధారించుకుని మదుపరుల ఆసక్తిని కాపాడటం.
    బి) సంస్థ సాధించిన లక్ష్యాలను మూల్యాంకనం చేయడం.
    సి) ప్రధాన అధికారిని ఎంపిక చేసుకుని, రాబడి పంపకం చేసి, క్లిష్టమైన, తీవ్రమైన సమస్యలను చర్చించడం.

ప్రశ్న 10.
నిర్వహణ, పరిపాలనకు మధ్యగల వ్యత్యాసాలు ఏమిటి ?
జవాబు.
నిర్వహణ స్వభావం కంటే పరిపాలన అధికమైందిగా పరిగణించబడుతుంది. ఒక సంస్థ లక్ష్యాలను సాధించడానికి ఏర్పరచే యోచనా విధానం పరిపాలన. అలాంటి యోచనలను అమలుపరచే విధానం నిర్వహణ.
TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు 2
నిర్వహణ పరిపాలనకు మధ్యగల వ్యత్యాసాలు:

  1. పారిశ్రామిక సంస్థలను ఏర్పరచడానికి గల ఉద్దేశాలను లక్ష్యాలను తెలియజేసేది పరిపాలన. ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికను రూపొందించేది నిర్వహణ.
  2. పథకాలకు, సిద్ధాంతాలకు మార్గదర్శకం చేసేది పరిపాలన. అలాంటి పథకాలను అమలుపరచేది నిర్వహణ.
  3. పథకాల అమలుకు సంబంధించి రూపురేఖలను తీర్చిదిద్దేది పరిపాలన. అలాంటి పథకాల అమలును అజమాయిషీ చేయడానికి, నియంత్రించడానికి నిర్వహణను ఉపయోగిస్తారు.
  4. సంస్థలోని కార్యకలాపాలలో నిర్దేశం, మార్గదర్శకం లాంటి నాయకత్వ విధానాన్ని కల్పించేది పరిపాలన. అంతర్గత బహిర్గత కార్యకలాపాలను సమన్వయపరచేది నిర్వహణ.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

ప్రశ్న 11.
ఆదేశ ఏకత్వం, నిర్దేశ ఏకత్వం మధ్యగల వ్యత్యాసాలు ఏమిటి ?
జవాబు.
TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు 3

ప్రశ్న 12.
అధికారం, బాధ్యత సమానత్వం అంటే ఏమిటి ?
జవాబు.

  1. అధికారం అనగా వనరులను ఉపయోగించుకుంటూ, క్షేత్రస్థాయి సిబ్బందికి నియంత్రణా పూర్వక నిర్దేశాన్ని ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకునే హక్కు,
  2. ఈ సూత్రం ప్రకారం అధికారం మరియు బాధ్యత రెండు కూడాను సమానంగా కేటాయించాలి. బాధ్యతా రహితంగా అధికారాన్ని కట్టబెట్టడం వల్ల అధికార దుర్వినియోగానికి దారి తీస్తుంది. అదేవిధంగా బాధ్యతను కల్పించి అధికారాన్ని కేటాయించకపోతే వ్యక్తుల నైపుణ్యత దెబ్బతింటుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్కేలార్ చైన్.
జవాబు.

  1. ఫేయల్ భావన ప్రకారంగా సమాచారం వేగవంతంగా సమర్ధవంతంగా ప్రసారం చేయడానికి గొలుసు అవసరం. దీనినే స్కేలార్ చైన్ అంటారు.
  2. స్కేలార్ గొలుసులో ఛీఫ్ ఎక్జిక్యూటివ్ స్థాయి నుండి సంస్థలోని కనిష్ట స్థాయి వరకు అధికారులను కలిగి ఉంటుంది. ఈ గొలుసు ద్వారా సంస్థలోని వ్యక్తులు సలహా, సహాయం కోసం ఎవరిని సంప్రదించాలో తెలుస్తుంది.

ప్రశ్న 2.
పరిపాలన.
జవాబు.

  1. ఒక సంస్థ లక్ష్యాలను సాధించడానికి ఏర్పరచే యోచనా విధానాన్ని పరిపాలన అంటారు.
  2. సంస్థలోని కార్యకలాపాలలో నిర్దేశం, మార్గదర్శకం లాంటి నాయకత్వ విధానాన్ని కల్పించేది పరిపాలన.

ప్రశ్న 3.
హెన్రీ ఫేయల్ నిర్వహణ సూత్రాలు.
జవాబు.
నిర్వహణ పితామహుడు అయిన హెన్రీ ఫేయల్ 14 నిర్వహణ సూత్రాలను రూపొందించాడు. అవి:

  1. శ్రమ విభజన
  2. అధికారం, బాధ్యత సమానత్వం
  3. క్రమశిక్షణ
  4. ఆదేశ ఏకత్వం
  5. నిర్దేశ ఏకత్వం
  6. వ్యక్తిగత ఆసక్తికి బదులు సాధారణ ఆసక్తి
  7. ఉద్యోగుల వేతనం చెల్లింపు
  8. కేంద్రీకరించడం
  9. ఆర్డర్
  10. ధర్మం
  11. స్కేలార్ చైన్
  12. ఉద్యోగి పదవీకాల భద్రత
  13. చొరవ
  14. సమైక్యమే బలం

ప్రశ్న 4.
ఆదేశ ఏకత్వం.
జవాబు.

  1. ఆదేశ ఏకత్వం సూత్రం ప్రకారం ఒక క్షేత్రస్థాయిలోని ఉద్యోగి అతనిపై అధికారికి మాత్రమే బాధ్యుడై, ఆ అధికారినుండి ఆదేశాలను పొందవలసి ఉంటుంది. అందువల్ల ఒక ఉద్యోగి ఎక్కువ మంది అధికారుల నుండి ఆదేశాలు పొందకూడదు.
  2. ఏ అధికారి ఏ ఉద్యోగికి, ఎంత మేరకు పనులను అప్పగిస్తున్నారో సూచనప్రాయంగా స్పష్టతలో ఉండాలి. ఆదేశాల ప్రక్రియలలోని వివాదాలను, కలవరాలను, చికాకులను తొలగించడానికి ఈ సూత్రం ఎంతగానో అవసరం.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

ప్రశ్న 5.
ఎస్పిరిట్ డి కార్ప్స్.
జవాబు.

  1. దళ సభ్యుల విధేయత, సభ్యుల శ్రమ పట్ల గల ప్రాముఖ్యతను ఈ సూత్రం తెలియజేస్తుంది. ఎస్పిరిట్ డి కార్ప్స్ అనగా సిబ్బంది సమాచార సమన్వయం ద్వారా సమైక్య బలం చేకూరుతుందని అర్థం.
  2. యాజమాన్యం ఎప్పుడూ “విభజించు, పాలించు” అనే విధానాన్ని స్వస్తి పలకాలి మరియు సామూహిక ఉత్సాహాన్ని, సామూహిక పనిని ప్రోత త్సహించాలి. దీనివల్ల సంస్థ సజావుగా సాగుతుంది.

ప్రశ్న 6.
నిర్దేశ ఏకత్వం.
జవాబు.

  1. నిర్దేశ ఏకత్వ సూత్రం ప్రకారం సంస్థలోని ప్రతీవ్యక్తి శ్రమ ఆ సంస్థ రూపొందించిన లక్ష్యాలను సాధించే దిశగా ఉండాలి.
  2. ఒక కార్యానికి సంబంధించిన లక్ష్యాల సాధనకు సిబ్బంది బృందానికి ఒకే ప్రణాళిక, ఒకే అధికారి మాత్రమే ఉండాలి.

ప్రశ్న 7.
అధికారం మరియు బాధ్యత.
జవాబు.

  1. అధికారం అనగా వనరులను ఉపయోగించుకుంటూ, క్షేత్రస్థాయి సిబ్బందికి నియంత్రణా పూర్వక నిర్దేశాన్ని ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకునే హక్కు,
  2. ఈ సూత్రం ప్రకారం అధికారం మరియు బాధ్యత రెండు కూడాను సమానంగా కేటాయించాలి. బాధ్యతా రహితంగా అధికారాన్ని కట్టబెట్టడం వల్ల అధికార దుర్వినియోగానికి దారి తీస్తుంది. అదేవిధంగా బాధ్యతను కల్పించి అధికారాన్ని కేటాయించకపోతే వ్యక్తుల నైపుణ్యత దెబ్బతింటుంది.

ప్రశ్న 8.
కేంద్రీకరణ.
జవాబు.

  1. కేంద్రీకరించడం అనగా ఒక సంస్థలో అధికారం ఏ స్థాయిలో ఉంటుందో సూచించడం.
  2. అనేక సంస్థలలో అధికార కేంద్రీకరణ వివిధ శ్రేణులలో ఏర్పాటు చేయబడుతుంది. కేంద్రీకరణలో నిర్వాహకులు, అధికారులు ముఖ్యమైన పాత్రలను పోషిస్తారు.

ప్రశ్న 9.
చొరవ.
జవాబు.

  1. ఒక ప్రణాళికను ప్రతిపాదించి, దాన్ని అమలుపరచే విధానాన్ని “చొరవ” అంటారు. ఫేయల్ ప్రకారం, నిర్వాహకులు తమ -ఉద్యోగుల పని తనంలో వీలైనంత చొరవ చూపే విధంగా చర్యలు తీసుకోవాలి.
  2. ఉద్యోగులు వారి సహచరులు ప్రణాళికలను తయారుచేసుకుని, అమలుపరచడానికి చొరవ తీసుకొని సంస్థ విజయానికి తోడ్పడాలి. ప్రతి ఉద్యోగి తన వంతు చొరవ చూపడం వల్ల సంస్థ అభివృద్ధి జరుగుతుంది.

ప్రశ్న 10.
మధ్య స్థాయి నిర్వహణ.
జవాబు.

  1. పై స్థాయి, క్షేత్ర స్థాయి నిర్వాహకులకు వంతెనలాగా, మధ్యస్థాయి యాజమాన్యం విధులను నిర్వర్తిస్తుంది.
  2. వివిధ విభాగాలైన ఆర్థిక, మానవ వనరులు, ఉత్పాదక, మార్కెటింగ్ లాంటి వాటికి వీరు అధిపతులుగా ఉంటారు.
  3. పై స్థాయిలో రూపొందించిన పథకాలకు, కార్యక్రమాలకు విలువైన సేవలను అందిస్తూ విభాగాలు విజయవంతమవడానికి మధ్యస్థాయి నిర్వాహకులు సహకరిస్తూ విధులను నిర్వర్తించవలసి ఉంటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 9 నిర్వహణ సూత్రాలు

ప్రశ్న 11.
క్రమ శిక్షణ సూత్రం
జవాబు.

  1. క్రమశిక్షణ అనగా ఇతరులతో సత్సంబంధాలు కలిగి సంస్థ నియమ నిబంధనలను పాటిస్తూ విధేయత కలిగి ఉండటము.
  2. వ్యాపారం సజావుగా కొనసాగాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరం. ఈ క్రమశిక్షణ కార్మికుల్లో మాత్రమే కాకుండా యాజమాన్యంలో కూడా ఉండాలి. దీనికొరకు అన్ని స్థాయిలలో నియమాలను రూపొందించాలి.

Leave a Comment