TS Inter 2nd Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 1st Lesson భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 1st Lesson భారత రాజ్యాంగం – చారిత్రక నేపథ్యం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి కారణాలను వివరించండి.
జవాబు.
ప్రజాబాహుళ్యంలో స్వయంపాలన – స్వేచ్ఛ తదితర సంవర్ధక ఆకాంక్షల ప్రాతిపదికగా భారతదేశంలో జాతీయవాదం వెళ్ళాలనుకుంది. ప్రపంచంలోని ఇతర దేశాల జాతీయోద్యమాల కంటే భారత జాతీయోద్యమం ఎంతో విశిష్టమైనదిగా మేధావులు పేర్కొంటారు.

భారతీయులకు ఒక సుసంపన్న వారసత్వం, సంస్కృతి, గత వైభవం ఉన్నాయి. సగర్వంగా స్వయంపాలన చేపట్టే సామర్థ్యం భారతీయులకు ఉంది. ఈ కారణం వల్ల భారతీయులు స్వయంపాలనకు జాతీయోద్యమాన్ని చేపట్టడంలో ఆశ్చర్యం లేదు.

మానసికంగా గతవైభవ, సుసంపన్న సంస్కృతి వారసత్వ భావనలు ఒకవైపు, బ్రిటీష్ పాలన దోపిడి- నిరంకుశత్వం మరోవైపు భారతీయులు ఒక బలమైన జాతీయోద్యమాన్ని చేపట్టడానికి దారితీసింది.

1. బ్రిటిష్ వలసవాద పాలన :
భారతదేశంలో బ్రిటీషు వారి పాలనకు అనుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉన్నాయి. బ్రిటిషు పాలన భారతదేశంలో ఒక గట్టి పరిపాలన నిర్మాణాన్ని వివిధ శాఖల రూపంలో హేతుబద్ధంగా విభజించి ప్రవేశపెట్టింది. బ్రిటిషువారు పరిపాలన అవసరాల కోసం ఇండియన్ సివిల్ సర్వీస్ (ICS) ప్రారంభించారు.

భారత శిక్షా స్మృతి (Indian Penal Code), నేర విచారణ స్మృతి (Criminal Procedure Code) సంహితలను తయారుచేసి భారతదేశంలో పటిష్టమైన న్యాయవ్యవస్థ ఏర్పాటుకు కృషి చేశారు. పోస్టు – టెలిగ్రాఫ్, సమాచారవ్యవస్థ, రైల్వేలు, జాతీయ రహదారులు, ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులు ఏర్పరచి అభివృద్ధికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ఏర్పరచారు.

2. సాంఘిక-సాంస్కృతిక పునరుజ్జీవం :
భారతదేశంలో 19వ శతాబ్దంలో వచ్చిన అనేక సాంఘిక-సాంస్కృతిక ఉద్యమాలు ప్రజల్లో సాంఘిక చైతన్యాన్ని, సాంస్కృతిక జాతీయవాద భావనలను ప్రోది చేశాయి.

ఈ ఉద్యమాలన్నింటికీ రాజా రామ్ మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మసమాజ్ ఉద్యమం అగ్రగామిగా నిలిచి, సాంఘిక దురాచారాలైన సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతువులుగా మార్చడం, విగ్రహారాధన తదితరులకు వ్యతిరేకంగా సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చింది.

దీనిని అనుసరించి ఆర్యసమాజం, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజం ప్రార్థన సమాజం, సత్యశోధక సమాజం, అలీఘర్ ఉద్యమం, వహాబీ ఉద్యమం తదితర సాంఘిక ఉద్యమాలు వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రజల్లో జాతీయతవాద భావనను, సాంఘిక – సాంస్కృతిక గుర్తింపును, దేశభక్తిని నింపి పరోక్షంగా ప్రజలు స్వయంపాలన కోరుకోవడానికి ప్రేరణ నిచ్చాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

3. మహాతిరుగుబాటు :
1857 వ సంవత్సరంలో భారతీయ సైన్యంలోని వేలాదిమంది సిపాయిలు, పదవీచ్యుతులైన సంస్థానాధీశులు, గ్రామీణ చేతివృత్తులవారు, చిన్నకారు సన్నకారు రైతులు భారతదేశంలో బ్రిటిషు వారి పాలనను అంతమొందించడానికి సమైక్య తిరుగుబాటు చేశారు.

బ్రిటిషు పాలకులు స్వదేశీ సంస్థానాల పాలకుల పట్ల సాధారణ ప్రజానీకంపట్ల చూపే నిరంకుశ పాశవిక విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయారు. ప్రత్యేకంగా లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ‘రాజ్యాసంక్రమణ సిద్ధాంతం’ (Doctrine of Lapse) స్వదేశీ సంస్థానాధీశుల్లో ఆగ్రహం తెప్పించింది.

4. ఆంగ్లవిద్య :
భారతదేశంలో బ్రిటీషువారు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. దీనివల్ల సహేతుక శాస్త్రీయ భావనలు ప్రజాభిప్రాయాలను తీర్చిదిద్దాయి. ఆంగ్లవిద్య భారతీయులకు కీలక రాజకీయ ఆదర్శాలైన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం తదితర విలువలపై అవగాహన కల్పించాయి. ఆంగ్ల విద్యను అభ్యసించిన మధ్యతరగతి వర్గాలు పాశ్చాత్య రాజనీతి తత్త్వవేత్తలైన జెర్మీబెంథాం.

జాన్ సూవర్ట్ మిల్, జాన్లాక్ రూసో, ఆడమస్మిత్, హెర్బర్ట్ స్పెన్సర్ తదితరుల తాత్త్విక భావజాలం నుంచి స్ఫూర్తిని పొందారు. అయితే ఈ ఆదర్శాలను, విలువలను బ్రిటిష్ వారు తమ మాతృదేశమైన ఇంగ్లాండును మాత్రమే గౌరవించి, భారతదేశంలో ఆచరించేవారు కాదు.

ఈ విధమైన ద్వంద్వప్రమాణాలు మధ్య తరగతి వర్గాలను ఆగ్రహానికి గురిచేశాయి. వారు భారత ప్రజానీకాన్ని రాజకీయ ఆదర్శాలు – విలువలపై చైతన్యపరచి, బ్రిటిష్ పాలనను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రధానంగా సమన్యాయ పాలన (Rule of Law) జాతీయవాదం, స్వయం ప్రభుత్వం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగత వాదం విద్యావంతులైన వర్గాల్లో ఆశలు రేకెత్తించాయి. దానితో మధ్యతరగతి విద్యావంతులు స్వయంపాలన, స్వాతంత్య్రం లక్ష్యాలుగా జాతీయోద్యమాన్ని ప్రారంభించారు.

5. ఆర్థిక దోపిడి :
బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని ఒక వలస ప్రాంతంగా మార్చి, ఆర్థిక వ్యవస్థను తమ ప్రయోజనాల కోసం దోపిడి చేశారు. బ్రిటిష్వారు భారతదేశంలోని ముడిపదార్థాలను ఇంగ్లాండ్లోని తమ పరిశ్రమలను నిర్వహించుకోవడానికి అతి స్వల్ప ధరలతో తరలించుకు పోయేవారు.

అలాగే ఇంగ్లాండ్లోని తయారైన వస్తువులను భారత మార్కెట్లో నింపివేసేవారు. భారతీయ పారిశ్రామికవేత్తల నుండి, చిన్న తరహా గ్రామీణ చేతివృత్తుల వారినుండి వస్తువులు-సేవల విషయంలో పోటీని నివారించడానికి కఠినతరమైన చర్యలకు పాల్పడేవారు.

ముఖ్యంగా బ్రిటిష్ వారు భారతీయ కుటీర పరిశ్రమలపైన, గ్రామీణ చేతివృత్తుల వారిపైన కఠిన నిబంధనలు విధించేవారు. దీనివల్ల భారతీయ చేతివృత్తులవారు తమతమ వృత్తులను వదిలివేసి, అప్పటికే ఎంతోమందితో పెనుభారంగా ఉన్న వ్యవసాయరంగంలోకి బదిలీ అయ్యారు. మరికొంతమంది గ్రామీణ చేతివృత్తుల వారు మహాసముద్రాలను కూడా లెక్కచేయక, విదేశాలకు కడుపు చేతపట్టుకొని వలసలు పోయారు.

6. కరువు కాటకాలు, పేదరికం :
భారతదేశం 19వ శతాబ్దం చివరిభాగంలో ఎన్నో కరువు కాటక పరిస్థితులను, అంట వ్యాధులను ఎదుర్కొంది. ప్రధానంగా 1873, 1875, 1877, 1895 సంవత్సరాలలో వందలాది మంది ప్రజలు కరువు కాటకాలతో, ఆకలి చావులతో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలు భారతీయ, సమాజంలో అశాంతిని, అలజడిని తీసుకువచ్చింది.

7. వార్తాపత్రికలు :
బ్రిటిష్ పాలన కాలంలో ఎన్నో వార్తాపత్రికలు, దినపత్రికలు, నియతకాలిక పత్రికలు భారతీయులలో జాతీయవాద భావాలను ప్రేరేపించాయి. వీటిలో ప్రముఖమైనవి అమృత బజారపత్రిక, కేసరి, పాట్రియాట్, ది హిందూ నవజీవన్, ఆంధ్రపత్రిక మొదలైనవి. ఈ పత్రికలు ప్రజలలో దేశభక్తి, జాతీయవాద భావాలను పెంచి పోషించాయి.

8. పాశవిక పాలన :
భారతదేశంలో బ్రిటిష్ పాలనా యంత్రాంగం భారతీయులకు వ్యతిరేకంగా పాశవికంగా వ్యవహరిస్తూ, నిరంకుశ చట్టాలను ప్రయోగించేది. వీటిలో దేశద్రోహ సమావేశాల చట్టం (Seditious Meetings Act), ఆయుధాల చట్టం (Arms Act), ప్రాంతీయ వార్తాపత్రికల చట్టం, (Vernacular press Act), రౌలత్ చట్టం (Rowlat Act) తదితర చట్టాలను ప్రయోగించి ప్రజల స్వేచ్ఛలను హరించేది. ప్రజల స్వేచ్ఛలను అడ్డుకోవడమేకాక, పత్రికాస్వేచ్ఛపై నిర్హేతుకమైన ఆంక్షలు విధించేది.

9. జాతి విచక్షణ :
బ్రిటిష్ ప్రభుత్వం న్యాయప్రక్రియల్లో, సివిల్ సర్వీసుల ఉద్యోగాల ప్రవేశంలో, హక్కులను అనుమతించడంలో ఎంతో వివక్షపూరిత ధోరణి ప్రదర్శించేది. జాతీయోద్యమ ప్రారంభదశలో భారతీయులు, సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో ప్రవేశాలకు సంబంధించి విషయాలలో బ్రిటీషు అభ్యర్థులతో సమానంగా అవకాశాలు ఉండాలని డిమాండ్ చేసేవారు.

అలాగే బ్రిటిష్వారి వివక్షత విధానం. ఇల్బర్ట్ బిల్లు వివాదంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశంలోని యూరోపియన్ సమూహాలు భారతీయ న్యాయ మార్పులు తమ నేరాలను విచారించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తరహా ధోరణులు భారతీయుల మనోభావాలను దెబ్బతీయడంతో, అది జాతీయోద్యమానికి దారితీసింది.

10. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (Inceptino of Indian National Congress) :
భారత జాతీయోద్యమ చరిత్రలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (1885) ఒక మైలురాయిగా వర్ణించవచ్చు. మాజీ బ్రిటిష్ అధికారులు స్థాపించిన ఆ సంస్థ ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను వెల్లడించడం, నిర్మాణాత్మక విమర్శలను చేయడం వంటి కర్తవ్యాలను నిర్వర్తించింది.

క్రమేణా ఆ సంస్థ భారతీయుల స్వపరిపాలన ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచింది. ప్రజా సమస్యలపై సమిష్టి పోరాటం, భారతీయుల జాతీయలో భావాలను పెంపొందించడం వంటి ఆశయాలతో జాతీయోద్యమానికి చోదక శక్తిగా ఎదిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 2.
భారత జాతీయోద్యమంలోని వివిధ దశలను వర్ణించండి.
జవాబు.
ప్రసిద్ధ భారతీయ చరిత్రకారుడు రమేష్ చంద్ర భారత జాతీయోద్యమాన్ని మూడు దశలుగా విభజించాడు. అవి:

  1. మితవాద దశ (1885 – 1905)
  2. అతివాద దశ (1906 -1919)
  3. గాంధీ దశ (1920 – 1947).

1. మితవాద దశ (1885 – 1905) :
భారత జాతీయ కాంగ్రెస్ లోని తొలి నాయకులు “మితవాదులు”గా పేర్కొనబడిరి. 1885 నుండి 1905 వరకు ఉన్న దశను భారత జాతీయోద్యమంలో మితవాద దశ అంటారు.

కాంగ్రెస్లోని మితవాదులు :
భారత జాతీయ కాంగ్రెస్లోని తొలి నాయకులను మితవాదులందురు. 1885 – 1905 -మధ్యకాలంలో మితవాద నాయకుల నాయకత్వంలో కాంగ్రెన్ నడిచెను. వారికి బ్రిటిష్ వారి న్యాయ విధానం నందు పూర్తి విశ్వాసము కలదు. అందువల్లనే మితవాదులు “ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన” (Prayer, Petition, Protest) అనే పద్ధతులను అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వంతో బేరసారాలాడే దృక్పథాన్ని అవలంభించారు.

కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ మితవాదులు దాదాబాయి నౌరోజీ, ఫిరోజే మెహతా, డి.యి. వాచా, డబ్ల్యు.సి. జెనర్జీ, ఎస్.ఎన్. బెనర్జీ, R.C. దత్తు, L.M. గోష్ మరియు G.K. గోఖలే మొదలగువారు.

మితవాదుల కోర్కెలు :

  1. సైనిక ఖర్చును తగ్గించుట
  2. ఇండియన్ కౌన్సిల్ను రద్దుచేయుట
  3. ఇంగ్లండ్ బాటు భారతదేశంలో కూడా సివిల్ పరీక్షలు నిర్వహించుట
  4. శాసన మండలిని విస్తృతపరచి భారతీయులను ఎక్కువ సంఖ్యలో సభ్యులను చేయుట.

2. అతివాద దశ (1905 – 1920) :
భారత జాతీయోద్యమంలోని రెండవ దశను అతివాద దశగా పేర్కొంటారు. 1906-1919 మధ్యకాలంలో కాంగ్రెస్లో అతివాదులు ప్రధాన పాత్ర పోషించారు. అతివాదులలో ప్రముఖులు బాలగంగాధర్ తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అరవిందఘోష్ మొదలగువారు. వీరు అతివాద ఉద్యమంలో అగ్రశ్రేణి నాయకులు మితవాదుల సామరస్య వైఖరిని అతివాదులు విమర్శించారు.

అతివాద విధానాలు :

  1. అతివాదులలో ప్రముఖుడైన బాలగంగాధర్ తిలక్ ‘స్వరాజ్యం నా జన్మహక్కు – దాన్ని సాధించి తీరుతాను’ అని ప్రకటించెను. –
  2. అతివాదులకు బ్రిటిష్ వారి దయాదాక్షిణ్యాలపై ఏ మాత్రం విశ్వాసం లేదు. అనుకొన్నది సాధించుటయే అతివాదుల కార్యక్రమం.
  3. స్వరాజ్యం – స్వదేశీ నినాదాలను లేవనెత్తిరి.
  4. జాతీయ విద్యా విధానాన్ని సమర్థించిరి, ప్రాంతీయ భారతీయ భాషల ద్వారా విద్యాబోధన జరగాలి అని తెల్పిరి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

3. గాంధీ దశ (1920 – 1947) :
స్వాత్రంత్రోద్యమ మూడవ దశ గాంధీజీ నాయకత్వంలో నడిచింది. 1920-1947 మధ్యకాలంలో మహాత్మాగాంధీ నాయకత్వంలో జాతీయోద్యమం నడిచింది. అందుచే ఈ కాలమును గాంధీయుగం అందురు. ఈ సమయంలో క్రాంగ్రెస్ శాంతియుత పద్ధతుల ద్వారా పూర్ణస్వరాజ్య సాధన కోసం ఉద్యమించెను. విప్లవ మార్గంలో పోతున్న ప్రజలను శాంతియుత, ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా నడిపించిన ఖ్యాతి మహాత్ముడికి దక్కెను.

సత్యాగ్రహం :
గాంధీజీ సత్యాగ్రహం అనే విధానాన్ని ప్రతిపాదించెను. సత్యాగ్రహం అంటే సత్యమైన సహనం. దీనికి అహింసా విధానమే మూలము.

రౌలత్ చట్టం వ్యతిరేకత :
భారత రాజకీయోద్యమాన్ని నడిపించిన తిలక్ మరణించడంతో మహాత్మాగాంధీ జాతీయోద్యమ నాయకుడయ్యెను. నాయకత్వం చేపట్టిన వెంటనే మొట్టమొదట రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హర్తాళ్లు జరపవలసిందిగా గాంధీజీ పిలుపు ఇచ్చెను.

సహాయ నిరాకరణోద్యమం :
1920 ఆగస్టులో గాంధీజీ తొలిసారిగా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించెను. ఈ ఉద్యమంలో కొన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి. అవి : విదేశీ వస్తువులను బహిష్కరించుట, న్యాయస్థానాలను బహిష్కరించుట, పాఠశాలలు, కళాశాలలను, శాసనసభలను బహిష్కరించుట మొదలగునవి. ఈ అంశాల ప్రాతిపదికపై సత్యం అహింసా పద్ధతుల ద్వారా మాత్రమే పోరాటం సాగించాలని గాంధీజీ పిలుపునిచ్చెను.

శాసనోల్లంఘన ఉద్యమం:
జాతీయోద్యమ చరిత్రలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక గొప్ప మలుపు. 1930 మార్చితో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రారంభించెను. గుజరాత్ తీరంలోని దండి గ్రామంలో ఉప్పు తయారుచేయడం ద్వారా ఉప్పు చట్టాన్ని గాంధీజీ అతిక్రమించెను. ఈ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ, ఖద్దరు ధరించుట, మద్యపాన నిషేధం, జెండా ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు చేపట్టారు.

గాంధీ – ఇర్విన్ ఒడంబడిక :
మహాత్మాగాంధీ – వైశ్రాయ్ ఇర్విన్ల మధ్య ఒక అవగాహన కుదరడంతో శాసనోల్లంఘన ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

క్విట్ ఇండియా ఉద్యమం :
క్రిప్స్ రాయబారం విఫలం కావడంతో కాంగ్రెస్ గాంధీజీ అధ్యక్షతన 1942, ఆగస్టు 8న బొంబాయిలో సమావేశమై క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించెను. చిట్టచివరి స్వాతంత్ర్యోద్యమ ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమం. ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ గాంధీజీ తన ఉపన్యాసాన్ని “విజయమో – వీరస్వర్గమో” (Do or Die) అంటూ ముగించారు. ఈ పిలుపు ప్రజల్లో ఉద్రేకం, ఉత్సాహం నింపి పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగడానికి దారితీసెను.

చివరగా క్యాబినెట్ మిషన్ ప్లాన్, మౌంట్ బాటన్ సూచనల మేర దేశ విభజనకు కాంగ్రెస్ నాయకులు అంగీకరించిరి. భారతదేశం, భారత్-పాకిస్తాన్లుగా విడిపోయెను. 1947, ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రమును పొందెను.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 3.
భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రధాన అంశాలను, విమర్శనాత్మకంగా విశ్లేషించండి.
జవాబు.
1919 చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించెను. కొన్ని ఇతర కారణాలు కూడా ఈ చట్ట రూపకల్పనకు దోహదం చేశాయి. సైమన్ కమిషన్ నివేదిక పరిణామాలు, స్వరాజ్యవాదుల ఉద్యమాలు, నెహ్రూ నివేదిక, జిన్నా నివేదిక, గాంధీజీ ఆధ్వర్యంలో సాగిన శాసనోల్లంఘన ఉద్యమం మొదలగునవి ఈ చట్టం చేయడానికి దారితీసిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఈ చట్టం చాలా విస్తృతమైనది. ఇందులో 321 అధికరణాలు, 13 షెడ్యూళ్ళు ఉన్నాయి.

ప్రధానాంశాలు :
1. 1935 భారత ప్రభుత్వ చట్టం అతివివరణాత్మకమైన శాసనం.

2. బ్రిటిష్ పాలిత ప్రాంతాలలోనూ, సంస్థానాలలోనూ అఖిల భారత సమాఖ్య అనే ఒక నూతన వ్యవస్థను ఈ చట్టం ఆవిష్కరించెను.

3. పరిపాలనాంశాలను మూడు జాబితాలుగా విభజించెను. అవి :
i) 59 పాలనాంశాలతో కూడిన కేంద్ర జాబితా (Central list)
ii) 54 పాలనాంశాలతో కూడిన ప్రాంతీయ జాబితా (Provincial list)
iii) 36 పాలనాంశాలతో కూడిన ఉమ్మడి జాబితా (Concurrent list)

ఈ మూడు జాబితాలలో పేర్కొనని అవశిష్టాంశాల (Residuary items) పై శాసనాధికారం గవర్నర్ జనరల్ కు ఇచ్చెను.
ఎ) కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వానికే శాసనాధికారం ఉంటుంది.
ఉదా : విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, నాణేలు, సైనిక దళాలు మొదలగు అంశాలు.
బి) ప్రాంతీయ లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాంతీయ జాబితాలో ఉన్న అంశాలపై శాసనాధికారం కలదు.
ఉదా : పోలీస్, విద్య, ప్రాంతీయ పబ్లిక్ సర్వీసులు మొదలైన అంశాలు.
సి) ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ శాసనం చేయవచ్చును.
ఉదా : క్రిమినల్ లా & ప్రొసీజర్, సివిల్ ప్రొసీజర్, వివాహాలు, విడాకుల వంటి అంశాలు

4. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిరి. కేంద్ర కార్యనిర్వహణాధికారం గవర్నర్ జనరల్కు ఇచ్చారు. కేంద్ర పాలనాంశాలను రిజర్వుడ్ ట్రాన్స్ఫర్డ్ పాలనాంశాలని విభజించారు. దేశ రక్షణ, మత విషయాలు, విదేశీ వ్యవహారాలు మొదలైన ప్రాముఖ్యం ఉన్న అంశాలు అన్నీ రిజర్వుడ్ పాలనాంశాలు.

వీటిని గవర్నర్ జనరల్ నిర్వహిస్తాడు. మిగిలిన అంశాలు ట్రాన్స్ఫర్డ్ అంశాలు. వీటిని ప్రజాప్రతినిధులైన శాసనసభలోని మంత్రులు నిర్వహిస్తారు. ఆరు రాష్ట్రాల్లో ద్వంద్వ సభా విధానాన్ని అమలు చేయడం జరిగెను.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

5. రాష్ట్రాల్లో స్వయం పాలనా ప్రతిపత్తి ప్రవేశపెట్టడం జరిగెను. అక్కడ బాధ్యతాయుత ప్రభుత్వం కూడా నెలకొల్పారు. గవర్నర్లకు విశేషమైన విచక్షణాధికారాలు ఇచ్చారు.

6. ఫెడరల్ న్యాయస్థానాన్ని ఢిల్లీలో స్థాపించారు. దానికి 1935 చట్టాన్ని కూడా వ్యాఖ్యానించే అధికారం కలదు.

7. 1858 చట్టము సృష్టించిన భారత మండలిని రద్దు చేశారు.

8. 1935 చట్టాన్ని సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్క అధికారం ఇచ్చారు. సంస్థానాలకు ప్రత్యేక హోదా కల్పించారు.

9. గవర్నర్ జనరల్కు విస్తృత అధికారాలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో గవర్నర్ జనరల్ సమాఖ్య వ్యవస్థను రద్దు చేయవచ్చు.

10. ఓటు హక్కును ఇతర వర్గాలకు కూడా విస్తరించారు.

విమర్శ :
భారత రాజ్యాంగ చరిత్రలో భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రగతి శీలక చట్టమని రాజ్యాంగ వాదులు భావించారు. ఎందుకంటే ఈ చట్టం ఆధారంగానే స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. పూర్వ చట్టాలతో పోల్చితే ఈ చట్టం భారతదేశంలో మరింత బాధ్యతాయుత ప్రభుత్వ నిర్మాణానికి, స్పష్టమైన శాసన నిర్మాణ, న్యాయశాఖల అధికారాల పరిధిని విస్తృతం చేసింది.

అయితే ఈ చట్టాన్ని భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, నిశితంగా విమర్శించాయి. భారత వ్యతిరేక చట్టంగా సి.వై.చింతామణి పేర్కొన్నాడు. ఈ చట్టం ప్రాథమికంగా చెడిపోయిన, ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని చట్టంగా మహ్మదాలీ జిన్నా విమర్శించాడు.

ఇక జవహర్లాల్ నెహ్రూ ఈ చట్టం గురించి వ్యాఖ్యానిస్తూ సామ్రాజ్యవాద దృక్పథం ఉన్న బ్రిటన్ రాజనీతిజ్ఞతతో భారతదేశం కోసం రూపొందించిన చట్టంగా వర్ణించాడు. రాజేంద్రప్రసాద్ మినూమసానీ, కె.టి.షా వంటి ప్రముఖ నాయకులు ఈ చట్టంలో ఎన్నో అసంగతమైన విషయాలున్నాయని వ్యాఖ్యానించారు.

ఇక బ్రిటన్లో క్లిమెంట్ అట్లీ వంటి ప్రతిపక్ష నాయకులు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. ఏమాత్రం ఇష్టంలేని ప్రాంతాలను కలిపి ఉంచే ఉద్దేశంతో రూపొందిన, వింత పోకడలు గల రాజ్యాంగ సమ్మేళనంగా కొందరు ఈ చట్టాన్ని పరిగణించారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో గోచరించే భూస్వామ్య వ్యవస్థను దృఢతరం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకమే ఈ చట్టమని సుభాష్ చంద్రబోస్ విమర్శించాడు.

ఈ చట్టం సూచించిన అఖిల భారత సమాఖ్య ఆచరణ సాధ్యం కాదని కొందరు వాదించారు. ప్రతిపాదిత సమాఖ్యలో పాల్గొనే వివిధ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల, సంస్థానాధికారుల స్థాయిలలో తేడాలుండటం, రాష్ట్రాలు, సంస్థానాల మధ్య పాలనపరమైన వైవిధ్యాలు ఉండటంతో సమాఖ్య వ్యవస్థ సజావుగా కొనసాగదని వారు భావించారు.

అలాగే గవర్నర్ జనరల్, రాష్ట్ర గవర్నర్లకు మితిమీరిన అధికారాలను ఈ చట్టం కల్పించడంతో భారతీయులు కోరుకున్న స్వయంప్రతిపత్తి ఒక నినాదంగా మిగిలిపోయింది. ఈ చట్టం ద్వారా మైనారిటీలకు కల్పించిన ప్రత్యేక రక్షణలు భారతదేశంలో జాతీయతాభావ వికాసానికి అవరోధంగా నిలిచాయి.

ఈ చట్టం భారత వ్యవహారాల కార్యదర్శిని ఒక రాజులాగా వ్యవహరించే అవకాశాన్ని ఇచ్చింది. ఇక కేంద్ర శాసనసభలోని రాష్ట్రాల మండలి (Council of State) ని ఈ చట్టం ప్రగతి నిరోధక భావాలు, దుష్టజనకూటమి, సాంప్రదాయ భావాలు ఉన్న రాజకీయ నాయకుల నిలయంగా రూపొందించింది. మొత్తంమీద ఈ చట్టం ద్వారా కల్పించిన రక్షణలన్నీ కంటితుడుపు చర్యగా మిగిలిపోయాయని చెప్పవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 4.
భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలను వివరించండి.
జవాబు.
భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు :

1. అతిపెద్ద లిఖిత, వివరణాత్మక రాజ్యాంగం :
భారత రాజ్యాంగం ఒక అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపకల్పన చేసి, చర్చించి మౌలిక చట్టంగా తయారు చేసింది. భారత రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది.

భారత రాజ్యాంగాన్ని 395 నిబంధనలు, 22 భాగాలు. 12 షెడ్యూళ్ళతో ఏర్పరచారు. భారత రాజ్యాంగం అతిపెద్ద పరిమాణంలో రూపొందడానికి ఎన్నో కారణాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తదితర పాలన ఏర్పాట్ల గురించి ఒకే రాజ్యాంగంలో చర్చించారు.

అలాగే సమాజంలోని షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, ఇతర వెనుకబడ్డ వర్గాలు మొదలైన వారి ప్రయోజనాల పరిరక్షణకు వివిధ ఏర్పాట్లు రాజ్యంగంలో పొందుపరచారు. ఇదే క్రమంలో ప్రత్యేక రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎన్నికల సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్, రాష్ట్రపబ్లిక్ సర్వీసు కమీషన్ల ఏర్పాట్లు అధికారాలపై సంగ్రహ వివరణ రాజ్యాంగంలో ఉంది.

ఇదే విధంగా భారత రాజ్యాంగం పౌరులకు గల ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, నిర్దేశక నియమాలు, కేంద్ర – రాష్ట్ర సంబంధాలు, అధికార భాష – వివిధ ప్రాంతీయ భాషల గుర్తింపుకు సంబంధించిన అంశాలను విస్తృతంగా చర్చించింది. వీటన్నింటివల్ల భారత రాజ్యాంగం పరిమాణంలో పెద్దదిగా తయారైంది.

2. సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం:
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించడంతో భారతదేశం ఒక సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారింది. భారతదేశం పూర్తి సాధికారతతో స్వేచ్ఛ – స్వాతంత్య్రాలలో దేశీయంగా బాహ్యంగా నిర్ణయాలు తీసుకొనే సార్వభౌమాధికారాన్ని పొందింది.

రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద లౌకిక అనే పదాలను రాజ్యాంగం 42వ సవరణ ద్వారా 1976 లో పొందుపరచారు. దీనివల్ల రాజ్యం ప్రజలందరికీ సాంఘిక-ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తూ, అన్ని రకాల దోపిడీలను అంతం చేస్తుంది.

3. విశిష్ట ఆశయాలు లక్ష్యాలు :
భారత రాజ్యాంగం ఎన్నో విశిష్ట ఆశయాలు-లక్ష్యాలను కలిగి ఉంది. భారత రాజ్యాంగం తన పౌరులందరికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అన్ని విషయాల్లో అందిస్తుంది. అలాగే పౌరులందరికీ ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన తదితర విషయాల్లో స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది.

ఇదే క్రమంలో భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు కల్పిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజలలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి, వ్యక్తి గౌరవాన్ని – జాతి సమైక్యత, సమగ్రతలను పరిరక్షించడానికి హామీ ఇస్తుంది.

4. దృఢ – అదృఢల మేలు కలయిక :
భారత రాజ్యాంగాన్ని సవరించడానికి దృఢ అదృఢ పద్ధతులు ఉన్నాయి. కేంద్ర పార్లమెంట్ రాజ్యాంగంలోని కొన్ని భాగాలను సాధారణ మెజారిటీతో సవరించే అధికారాన్ని కలిగి ఉంది. ఉదాహరణకు భారత సమాఖ్యలో నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దులు మార్చడం, పౌరసత్వానికి సంబంధించిన నియమ నిబంధనలు మొదలైన వాటిని సాధారణ మెజారిటీతో సవరించవచ్చు.

ఇది అదృఢ పద్ధతి. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, నిర్దేశక నియమాలు తదితర అంశాలను పార్లమెంట్లో మూడింట రెండువంతుల మెజారిటీ (2/3) తో సవరించవవచ్చు. ఇది దృఢ పద్ధతి. రాజ్యాంగంలోని మరికొన్ని అంశాల సవరణకు ఒక ప్రత్యేక మెజారిటీ పద్ధతి ఉంది. దీని ప్రకారం పార్లమెంట్లోని రెండు సభల్లో 2/3 మెజారిటీతోపాటు, కనీసం 50% రాష్ట్రాల శాసన సభలు సవరణకు ఆమోదించాలి. ఇది చాలా సంక్లిష్టమైన దృఢ పద్ధతి.

5. ఏకకేంద్ర – సమాఖ్య లక్షణాలు :
భారత రాజ్యాంగం భారతదేశాన్ని రాష్ట్రాల సమ్మేళనం (Union of States) గా అభివర్ణిస్తుంది. భారతదేశాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో సమాఖ్య వ్యవస్థగా ఏర్పరచింది. అంటే సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య విధానాన్ని, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర నిర్మాణాన్ని పేర్కొంటుంది.

భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణాలైన ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, ఒకే ఒక్క ఎన్నికల సంఘం, రాష్ట్రాల పరిపాలనలో అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల పాత్ర, కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్లు ఏజెంట్లుగా ఉండడం, రాజ్యాంగ సవరణ ప్రక్రియలో పార్లమెంట్కు గల విశేష అధికారాలు తదితర లక్షణాలు ఉన్నాయి.

ఇదే క్రమంలో భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలైన లిఖిత దృఢ-సర్వోన్నత రాజ్యాంగం రెండు స్థాయిల్లో (కేంద్ర – రాష్ట్ర) ప్రభుత్వాలు, ద్విసభా పద్ధతి, కేంద్రపార్లమెంట్ ఎగువ సభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తదితర లక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు కె.సి. వైర్ భారతదేశాన్ని అర్థసమాఖ్యగా వర్ణించాడు.

6. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం:
భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వంలో, వివిధ రాష్ట్రాల స్థాయిలో బ్రిటీష్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. అయితే బ్రిటీష్ తరహా వారసత్వ రాజరికాన్ని భారతదేశం స్వీకరించలేదు. దీనికి బదులుగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికయ్యే అధ్యక్షుడు ఉండే వ్యవస్థను సూచించారు.

అలాగే బ్రిటీషు రాజకీయ వ్యవస్థ మిగిలిన ఇతర లక్షణాలైన రెండు రకాల కార్యనిర్వాహక నాయకత్వం (రాష్ట్రపతి – ప్రధానమంత్రి), కేంద్రంలో ప్రధానమంత్రి నాయకత్వం, సమిష్టి బాధ్యత నియమం, కేంద్ర కార్యనిర్వాహక వర్గం (మంత్రిమండలి) పై పార్లమెంటు నియంత్రణ, రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు తదితర లక్షణాలను భారత రాజ్యాంగం స్వీకరించింది. ఇదే తరహా రాజకీయ వ్యవస్థను వివిధ రాష్ట్రాలకు కూడా అన్వయింపజేసింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

7. స్వతంత్ర న్యాయశాఖ:
భారత రాజ్యాంగం భారతీయులకు ఒక స్వతంత్ర, ఏకీకృత న్యాయశాఖను అందించింది. అందువల్ల భారత సుప్రీంకోర్టు వివిధ హైకోర్టులు శాసన నిర్మాణ శాఖకు – కార్యనిర్వాహక వర్గానికి భయం లేదా అనుకూలతలు లేకుండా స్వతంత్రంగా వ్యవహరించే అధికారాన్ని కలిగి ఉన్నాయి.

8. రాజ్య విధానాలపై ఆదేశక సూత్రాలు :
భారత రాజ్యాంగంలోని నాలుగో భాగంలో 36వ నిబంధన నుండి 51వ నిబంధన వరకు రాజ్యవిధానాల రూపకల్పనలో రాజ్యాంగ ఆదేశక సూత్రాలు పొందుపరచారు. భారత రాజ్యాంగ నిర్మాతలు వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు.

ఈ ఆదేశక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా, గాంధేయవాద దేశంగా, ఉదారవాద రాజ్యంగా రూపొందిస్తాయి. రాజకీయ భావజాలాలతో సంబంధం కాకుండా కేంద్ర ప్రభుత్వంలోని – రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టే అన్ని పార్టీలు ఈ మూల సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలి.

9. ప్రాథమిక హక్కులు:
భారత రాజ్యాంగ ఉదారవాద ప్రజాస్వామ్య స్వభావం ప్రాథమిక హక్కుల్లో ప్రతిబింబిస్తుంది. ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలోని మూడో భాగంలో 12వ నిబంధన నుండి 35వ నిబంధన వరకు పొందుపరచారు. భారత పౌరులు కొన్ని హేతుబద్ధమైన పరిమితులకు లోబడి హక్కులను వినియోగించుకోవచ్చు. ఈ హక్కుల విషయంలో ప్రభుత్వంతో సహా ఎవ్వరి జోక్యాన్ని అనుమతించడం జరగదు. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ పౌరులకు హక్కుల పరిరక్షణలో తోడ్పడుతుంది.

రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఏడురకాల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉండేవి. ప్రస్తుతం ఇవి ఆరు హక్కులుగా ఉన్నాయి. అవి

  1. సమానత్వపు హక్కు
  2. స్వాతంత్రపు హక్కు
  3. పీడనను, దోపిడిని వ్యతిరేకించే హక్కు
  4. మత స్వేచ్ఛ హక్కు
  5. విద్య – సాంస్కృతిక హక్కులు
  6. రాజ్యాంగ పరిహార హక్కు
    అయితే ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ఆధారంగా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.

10. ప్రాథమిక విధులు :
భారత రాజ్యాంగ సంస్కరణలపై స్వర్ణసింగ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగం లోని నాలుగు-ఎ (Part – IV A) భాగంలో 51 ఎ (51 A) నిబంధనలో ప్రాథమిక విధులను పొందుపరచారు. మొదట్లో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ఆధారంగా పది ప్రాథమిక విధులుగా వీటిని ఏర్పరచారు. అయితే ఆ తరువాత భారత రాజ్యాంగ 86వ సవరణ చట్టం (2002) ఆధారంగా మరో ప్రాథమిక విధిని వీటికి జత చేశారు.

11. ఏక పౌరసత్వం :
భారత రాజ్యాంగం భారతదేశంలో జన్మించిన వారందరికీ, లేదా ఒక నిర్దిష్ట కాలంపాటు -భారతదేశంలో నివసిస్తున్న వారికి ఏకపౌరసత్వాన్ని అందిస్తుంది. భారతదేశ సమైక్యత – సమగ్రతను పరిరక్షించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. భారతదేశంలో విచ్చిన్నకర ధోరణులు తలెత్తకుండా రాజ్యాంగ నిర్మాతలు ఏక పౌరసత్వం ఏర్పాటు చేశారు.

12. సార్వజనీన వయోజన ఓటు హక్కు:
భారత రాజ్యంగం భారతదేశ వయోజన పౌరులందరికీ సార్వజనీన ఓటుహక్కును కల్పించింది. దీని ఫలితంగా భారత పౌరులు కులం, మతం, భాష, ప్రాంతం, లింగ విచక్షణ, వర్ణం, జాతి సంపద తదితర అంశాల ఆధారంగా ఉండే విచక్షణలకు అతీతంగా, కేవలం వయోపరిమితితో మాత్రమే ఓటు హక్కును పొందుతారు.

భారతపౌరులు ఈ హక్కును సక్రమంగా వినియోగించుకోవచ్చు. వయోజన ఓటింగ్ వయస్సు 1950-1987 మధ్య కాలంలో 21 సంవత్సరాలుగా ఉండేది. అయితే ఈ వయోపరిమితిని భారత రాజ్యాంగ 61వ సవరణ ఆధారంగా 1988లో 18 సంవత్సరాలకు తగ్గించారు.

13. ద్విసభా పద్ధతి :
భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా భారత పార్లమెంట్లో లోక్సభ (దిగువసభ), రాజ్యసభ (ఎగువసభ) అనే రెండు సభలుంటాయి. లోక్సభ ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

14. పంచాయతీ రాజ్ – నగరపాలిక చట్టాలు :
దీనిని భారత రాజ్యాంగ విశిష్ట లక్షణంగా పేర్కొనవచ్చు. మహాత్మాగాంధీ ఎన్నో సందర్భాలలో స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏర్పాటుచేసి, బలోపేతం చేయవలసిన అవసరాన్ని పేర్కొన్నాడు. ఈ సంస్థల కార్యసాధకతను పెంపొందించడానికి తగిన సదుపాయాలు అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని విశ్వసించాడు. స్వాతంత్య్రానంతరం స్థానిక స్వపరిపాలన సంస్థల పటిష్టతకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వీటన్నింటి ఫలితంగా భారత నగరపాలిక చట్టం 1992లో రూపొందింది.

15. షెడ్యూలు కులాలు, తెగల అభ్యున్నతికి ప్రత్యేక నిబంధనలు :
భారత రాజ్యాంగం భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతికి కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను సూచించింది. కేంద్రప్రభుత్వం – వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతికి పెంపొందించే చర్యలను సమీక్షించడానికి వీలుగా స్వతంత్ర హోదాగల కమీషన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. వాటి సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడానికి అవకాశం కల్పించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి ఏవేని నాలుగు కారణాలను తెలపండి.
జవాబు.
1. సాంఘిక-సాంస్కృతిక పునరుజ్జీవం :
భారతదేశంలో 19వ శతాబ్దంలో వచ్చిన అనేక సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలు ప్రజల్లో సాంఘిక చైతన్యాన్ని, సాంస్కృతిక జాతీయవాద భావనలను ప్రోది చేశాయి. ఈ ఉద్యమాలన్నింటికి రాజా రామ్మోహన్రాయ్ స్థాపించిన బ్రహ్మసమాజ్ ఉద్యమం అగ్రగామిగా నిలిచి, సాంఘిక దురాచారాలైన సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతువులుగా మార్చడం, విగ్రహారాధన తదితరులకు వ్యతిరేకంగా సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చింది.

దీనిని అనుసరించి ఆర్యసమాజం, రామకృష్ణ మిషన్, దివ్యజ్ఞాన సమాజం, ప్రార్థన సమాజం, సత్యశోధక సమాజం, అలీఘర్ ఉద్యమం, వహాబీ ఉద్యమం తదితర సాంఘిక ఉద్యమాలు వచ్చాయి. ఈ ఉద్యమాలు ప్రజల్లో జాతీయవాద భావనను, సాంఘిక – సాంస్కృతిక గుర్తింపును, దేశభక్తిని నింపి పరోక్షంగా ప్రజలు స్వయంపాలన కోరుకోవడానికి ప్రేరణ నిచ్చాయి.

2. వార్తాపత్రికలు :
బ్రిటిష్ పాలన కాలంలో ఎన్నో వార్తాపత్రికలు, దినపత్రికలు నియతకాలిక పత్రికలు భారతీయులలో జాతీయవాద భావాలను ప్రేరేపించాయి. వీటిలో ముఖ్యమైనవి అమృతబజార్ పత్రిక, కేసరి, పాట్రియాట్, ది హిందూ, నవజీవన్, ఆంధ్రపత్రిక మొదలైనవి. ఈ పత్రికలు ప్రజలలో దేశభక్తి, జాతీయవాద భావాలను పెంచి పోషించాయి.

జాతీయవాద భావాల వ్యాప్తిలోను, ప్రజల ఆకాంక్షలు, ఆశలు, డిమాండ్లు మొదలైన వాటిని బ్రిటిష్ ప్రభుత్వం ముందు వ్యక్తీకరించడంలోను వార్తాపత్రికలు కీలక పాత్ర పోషించాయి. ప్రఖ్యాత స్వాతంత్ర్యోద్యమ జాతీయ నాయకులు మోతీలాల్ నెహ్రూ, సురేంద్రనాధ్ బెనర్జీ, బాలగంగాధర్ తిలక్, మహాత్మాగాంధీ, డా॥బి.ఆర్. అంబేద్కర్ తదితరులు వార్తాపత్రికలు ద్వారా జాతీయవాద ఆదర్శాలను వ్యాపింపచేయడానికి ఎంతో కృషి చేశారు.

3. జాతి విచక్షణ :
బ్రిటిష్ ప్రభుత్వం న్యాయప్రక్రియల్లో, సివిల్ సర్వీసుల ఉద్యోగాల ప్రవేశంలో హక్కులను, అనుమతించడంలో ఎంతో వివక్షపూరిత ధోరణి ప్రదర్శించేది. జాతీయోద్యమ ప్రారంభదశలో భారతీయులు, సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో ప్రవేశాలకు సంబంధించి విషయాలలో బ్రిటిషు అభ్యర్థులతో సమానంగా అవాకాశాలు ఉండాలని డిమాండ్ చేసేవారు.

అలాగే బ్రిటిష్వారి వివక్షత విధానం ఇల్బర్ట్ బిల్లు వివాదంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశంలోని యూరోపియన్ సమూహాలు భారతీయ న్యాయ మార్పులు తమ నేరాలను విచారించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తరహా ధోరణులు భారతీయుల మనోభావాలను దెబ్బతీయడంతో, అది జాతీయోద్యమానికి దారితీసింది.

4. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (Inceptin of Indian National Congress) :
భారత జాతీయోద్యమ చరిత్రలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (1885) ఒక మైలురాయిగా వర్ణించవచ్చు. మాజీ బ్రిటిష్ అధికారులు స్థాపించిన ఆ సంస్థ ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను వెల్లడించడం, నిర్మాణాత్మక విమర్శలను చేయడం వంటి కర్తవ్యాలను నిర్వర్తించింది.

క్రమేణా ఆ సంస్థ భారతీయుల స్వపరిపాలన ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచింది. ప్రజా సమస్యలపై సమిష్టి పోరాటం, భారతీయులలో జాతీయ భావాలను పెంపొందించడం వంటి ఆశయాలతో జాతీయోద్యమానికి చోదక శక్తిగా ఎదిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 2.
భారత జాతీయోద్యమంలో అతివాదుల పాత్ర వివరించండి.
జవాబు.
భారతజాతీయోద్యమంలో రెండో దశయే అతివాదదశ. ఈ దశను కొందరు చరిత్రకారులు తీవ్ర జాతీయతా దశగా వర్ణించారు. హిందూ పునరుజ్జీవనం, బ్రిటిష్ పాలకులపట్ల ద్వేషం లార్డ్ కర్జన్ క్రూరపాలన, బెంగాల్ విభజన, క్షీణించిన ఆర్థిక పరిస్థితులు, సమకాలీన అంతర్జాతీయ సంఘటనలు, విదేశాలలో భారతీయుల కడగండ్లు మొదలైన అంశాలు భారతీయులను ఈ దశలో జాతీయోద్యమం వైపు మొగ్గు చూపేటట్లు ప్రభావితం చేశాయి. అలాగే మితవాదులు అనుసరించిన మెతకవైఖరి కూడా ఈ కాలంలో ఉద్యమకారులలో అసంతృప్తిని పెంపొందించింది.

బాలగంగాధర తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అరవిందఘోష్ వంటి నాయకులు అతివాదులుగా పరిగణించబడి ఈ దశలో కీలకపాత్ర పోషించారు. బ్రిటిష్ పాలకులు బెంగాల్ను రెండు ముక్కలుగా విభజించడాన్ని అతివాదులు తీవ్రంగా వ్యతిరేకించారు.

బ్రిటిష్ పాలకులు ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుత, ఉదార ప్రియులనే మితవాదుల అభిప్రాయంలో అతివాదులు విభేదించారు. బ్రిటిష్పాలకులు భారతదేశంపట్ల అనుసరించిన అణచివేత, ప్రగతి వ్యతిరేకత, అప్రజాస్వామిక పద్ధతుల వల్లనే భారతీయులు బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.

బాలగంగాధరతిలక్ ‘స్వరాజ్యం నా జన్మహక్కు- దాన్ని సాధించి తీరుతాను’ అనే నినాదంతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అలాగే మిగిలిన అతివాదులు బ్రిటిష్ పాలకులపట్ల సకారాత్మక (passive) ప్రతిఘటన వైఖరిని అనుసరించారు. మొత్తం మీద అతివాదులు కింద పేర్కొన్న పద్ధతులను భారతీయులు అనుసరించవలసి ఉంటుందని ఉద్భోదించారు.

  1. వస్తువులను, బ్రిటిష్ ప్రభుత్వ గౌరవ బిరుదులను, కార్యాలయాలను బహిష్కరించడం.
  2. స్వదేశీ విద్యను ప్రోత్సహించడం.
  3. శాసన మండలల్లో భారతీయులకు సభ్యత్వం వంటి అంశాల అమలు కోసం కృషిచేయడం.
  4. స్వదేశీ వస్తువులను, పరిశ్రమలను ఆదరించడం.
  5. నకారాత్మక ప్రతిఘటనకు (Passive resistence) పాల్పడటం.

వందేమాతరం, స్వదేశీ వంటి ఉద్యమాలను అతివాదులు నిర్వహించారు. భారతీయులకు స్వయం పాలన, స్వరాజ్యం సాధించాలనే ప్రధాన ఆశయంతో వారు ఆ ఉద్యమాలను చేపట్టారు. తమ ఆశయసాధన కోసం ముస్లింలీగ్ వంటి ఇతర పార్టీలు, సంస్థలతో కలిసి ఉద్యమించారు.

అతివాదుల ఒత్తిడికి లోనైన బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ పునరేకీకరణ (reunification) కు అంగీకరించింది. అలాగే మాంటేగు ఛేమ్స్ఫర్డ్ పథకం ద్వారా ప్రాతినిథ్య సంస్థలలో భారతీయులకు సముచిత ప్రాధాన్యాన్ని ఇవ్వడానికి అంగీకరించారు. భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 3.
భారత జాతీయోద్యమంలోని గాంధీ దశలోని ప్రధాన సంఘటనలు రాయండి.
జవాబు.
1920 నుండి 1947 మధ్య జరిగిన భారత జాతీయోద్యమంలో గాంధీదశ చిట్ట చివరి దశగా, ముగింపు దశగా పేర్కొనవచ్చు. ఈ దశలో మహాత్మాగాంధీ కీలక పాత్ర పోషించి, మితవాద పద్ధతులు – అతివాద పద్ధతులను మేళవించి, జాతీయోద్యమాన్ని నడిపించారు.

గాంధీ దశలోని సంఘటనలు సహాయ నిరాకరణ ఉద్యమము :
భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో సహాయ నిరాకరణోద్యమం ఒక గొప్ప మలుపుగా చరిత్రకారులు భావించారు. ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతునిస్తూ, జలియన్వాలాబాగ్ ఘోర సంఘటనను నిరసిస్తూ గాంధీజీ ఉద్యమాన్ని 1920 ఆగస్టులో ప్రారంభించారు. అవి ఏమిటంటే :

  • సకారాత్మక కార్యక్రమాలు
  • నకారాత్మక కార్యక్రమాలు.

ఆ రెండింటిని కింద పేర్కొనడమైంది.

1. సకారాత్మక కార్యక్రమాలు (Positive or Constructive Programmes) :
సకారాత్మక కార్యక్రమాలలో క్రింది అంశాలు ఇమిడి ఉన్నాయి.
అ) సహాయ నిరాకరణ కార్యక్రమాలను అమలులో ఉంచడానికి కోటి రూపాయల విరాళాల సేకరణ.
ఆ) భారతీయులకు ఉపాధి కల్పించడానికి ఇరవై లక్షల రాట్నాల పంపకం.
ఇ) జాతీయ విద్యా ప్రణాళికల రూపకల్పన, అమలు మొదలగునవి.

2. నకారాత్మక కార్యక్రమాలు (Negative Programmes):
నకారాత్మక కార్యక్రమాలలో కింది అంశాలను ప్రస్తావించడమైంది.
అ) బ్రిటిష్ ప్రభుత్వం ప్రసాదించిన బిరుదులు, గౌరవ పదవులను పరిత్యజించడం.
ఆ) బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించే అధికారిక సమావేశాలకు గైర్హాజరవడం.
ఇ) బ్రిటిష్ న్యాయస్థానాల బహిష్కరణ మొదలగునవి.

శాసనోల్లంఘనోద్యమం (Civil Disobedience Movement (1930 – 34) :
సహాయ నిరాకరణోద్యమం తరువాత భారత జాతీయోద్యమంలో చెప్పుకోదగిన సంఘటనలలో శాసనోల్లంఘన ఒకటి. ఈ ఉద్యమాన్ని 1930 మార్చి 12న భారత జాతీయ కాంగ్రెస్ గాంధీజీ మార్గదర్శకత్వంలో ప్రారంభించింది.

అంతకుముందు 1929 డిసెంబర్ 29న లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన సమావేశమైన భారత జాతీయ కాంగ్రెస్ భారతీయులకు సంపూర్ణ స్వరాజ్య సాధనయే తన ఆశయంగానూ, అందుకు బ్రిటిష్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయాలనే అల్టిమేటము జారీచేసింది.

శాసనోల్లంఘన ఉద్యమంలో మూడు ప్రధాన దశలున్నాయి. మొదటి దశలో భారతీయులు ఉప్పుసత్యాగ్రహాన్ని నిర్వహించాలని గాంధీజీ సూచించాడు గాంధీజీ స్వయంగా 78 మంది అనుచరులతో కాలిబాటన సబర్మతీ ఆశ్రమం నుంచి 240 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న ‘దండి’ అనే గ్రామానికి వెళ్ళి ఉప్పును తయారుచేశాడు. గాంధీజీతో సహా దేశవ్యాప్తంగా వేలాదిమంది ప్రజలు ఆయా ప్రాంతాలలో ఉప్పు సత్యాగ్రహాన్ని పాటించడానికి పోటీ పడ్డారు.

క్విట్ ఇండియా ఉద్యమం (Quit India Movement, 1942 August – 1994 May) :
భారత జాతీయోద్యమంలో అంతిమ ఘట్టమే క్విట్ ఇండియా ఉద్యమం. భారతదేశానికి స్వాతంత్య్రం, భారతీయులకు స్వీయ రాజ్యాంగం కావాలని అనేకసార్లు బ్రిటిష్ ప్రభుత్వానికి భారత జాతీయ నాయకులు విజ్ఞప్తి చేసినప్పటికీ వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. ప్రతిసారీ బ్రిటిష్ పాలకులు భారతీయుల స్వాతంత్ర్య ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చక, అరకొర పథకాలను మాత్రమే ప్రకటించారు.

వేరొకవైపు రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభంలో బ్రిటిష్ పాలకులు సంబంధిత భారత జాతీయ నాయకులతో చర్చించకుండానే భారతదేశాన్ని మిత్ర రాజ్యంగా ప్రకటించడం జరిగింది. 1942 నాటి క్రిప్స్ ప్రతిపాదనలు భారతీయులకు ఏ మాత్రం సంతృప్తినివ్వలేకపోయాయి.

అంతలో జపాన్ సైన్యం భారతదేశం వైపు దండయాత్రకు పాల్పడుతుందనే పుకార్లు వ్యాపించాయి. బ్రిటిష్ పాలకులు ఆ సమయంలో భారతదేశం వదలి వెళ్ళడం భావ్యమని, తద్వారా జపాన్ సైన్యం దండయాత్రను నివారించవచ్చనే అభిప్రాయాన్ని గాంధీజీ వెల్లడించాడు.

భారతీయులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని, రాజ్యాంగ పరిషత్తును వెంటనే ఏర్పాటు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తన నిర్ణయాన్ని కాంగ్రెస్ భారత రాజప్రతినిధితో తెలపడానికి మీరాబెన్ అనే కార్యకర్తను పంపించింది.

అయితే ఆమెతో భారత రాజప్రతినిధి సమావేశమవడానికి అంగీకరించలేదు. దాంతో గాంధీజీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని 1942 ఆగస్టు 9న ప్రారంభించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 4.
భారత స్వాతంత్ర్య పోరాటంలో హోమ్హూల్ ఉద్యమాన్ని వర్ణించండి.
జవాబు.
హోమ్హూల్ ఉద్యమం :
భారత జాతీయోద్యమ కాలంలో నిర్వహించబడిన ఉద్యమాలలో హోమ్హూల్ ఉద్యమం ఒకటి. ఈ ఉద్యమానికి లోకమాన్య బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్లు సారధ్యం వహించారు. మాండలే జైలులో ఆరేళ్ళపాటు కారాగార శిక్ష అనుభవించిన లోకమాన్య బాలగంగాధర్ తిలకన్ను 1914 జూన్లో బ్రిటిష్ ప్రభుత్వం వదిలిపెట్టింది.

భారతదేశానికి తిరిగి వచ్చిన తిలక్ భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో సహృద్భావ సంబంధాలు పునరుద్ధరించుకొని నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని నొప్పించకుండా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఐర్లాండ్ తరహాలో కొన్ని హోంరూల్ మండలులను నెలకొల్పడానికి కృషి చేశాడు. అందులో భాగంగా మద్రాస్లో దివ్యజ్ఞాన సమాజ

స్థాపకురాలు అనిబిసెంట్ అనే ఐరిష్ నాయకురాలితో సమన్వయం ఏర్పరచుకున్నాడు. 1916లో తిలక్, అనిబిసెంట్లు విడివిడిగా హోంరూల్ లీగ్్న స్థాపించి ప్రజలలో రాజకీయ చైతన్యం, ఆధ్యాత్మిక వికాసం సాధించడానికి కృషిచేశారు.

అనిబిసెంట్ న్యూఇండియా, కామన్వీల్ అనే పత్రికలను స్థాపించి జార్జి అరెండెల్ అనే వ్యక్తిని హోంరూల్ లీగ్ వ్యవస్థాపరమైన కార్యదర్శిగా నియమించింది. ఒక్క బొంబాయి మినహా మహారాష్ట్ర అంతటా, మైసూరు సెంట్రల్ ప్రావిన్సెస్, బీరార్లలోనూ, అనిబిసెంట్ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో హోంరూల్ లీగ్ విధివిధానాలను ప్రజలలో వ్యాప్తిచేశారు.

హోంరూల్ లీగ్ కు సంబంధించిన కరపత్రాలను వారు దేశవ్యాప్తంగా విస్తృతంగా పంపిణీ చేశారు. అయితే తిలక్ సత్ప్రవర్తనతో వ్యవహరించలేదనే నెపంతో బ్రిటిష్ ప్రభుత్వం అతడిని 1916 జులైలో నిర్బంధంలో ఉంచింది.

దాంతో తిలక్ అభిమానులు, హోంరూల్ లీగ్ కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోయారు. నిర్బంధం నుంచి తిలకన్ను విడిపించడానికి మహమ్మదాలీ జిన్నా జిల్లాకోర్టు, హైకోర్టులలో తిలక్ తరఫున వాదించాడు. తిలకై తన పోరాటాన్ని ఉధృతం చేశాడు. తిలక్ 6 చోట్ల, అనిబిసెంట్ 20 చోట్ల హోంరూల్ లీగ్ కార్యాలయాలను స్థాపించారు.

హోంరూల్ ఉద్యమంలో భాగంగా గ్రంథాలయాలను స్థాపించడం, విద్యార్థులకు జాతీయ రాజకీయాలపై అవగాహన కల్పించడం, సామాజీక పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొనడం, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం వంటి అనేక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా వారు ప్రారంభించారు.

భారతీయులకు స్వపరిపాలన (self rule) విషయంలో ఆసక్తిని పెంపొందించాడు. హోంరూల్ లీగ్ ఉద్యమ ఉధృతిని నివారించడానికి బ్రిటిష్ ప్రభుత్వం వారిరువురిని అనేక ప్రాంతాలలో బహిరంగ సభలలో పాల్గొనడాన్ని నిషేధించింది.

1916 డిసెంబర్లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో హోంరూల్ లీగ్ సభ్యులు విరివిగా పాల్గొన్నారు. ఆ సమావేశంలో చివరి రోజున హోంరూల్ల సభ్యులతో తిలక్ సమావేశాలు నిర్వహించాడు.

అయితే హోంరూల్ లీగ్ కు హెచ్చిన ప్రాధాన్యతను నివారించడానికి 1917 జూన్లో అనిబిసెంట్, ఆమె అనుచరుల బృందాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మొత్తం మీద స్వపరిపాలన సంస్థలను ఏర్పరచి, వాటిని భారతీయ ప్రతినిధులతో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలనే హోంరూలీగ్ డిమాండ్ బ్రిటిష్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

భారత వ్యవహారాల కార్యదర్శి మాంటెగ్ 1917 ఆగస్టులో చారిత్రాత్మక ప్రకటన ద్వారా భారతీయులకు స్వపరిపాలన, స్వేచ్ఛలను ప్రసాదించడానికి అంగీకరించాడు. మాంటెంగ్ ప్రకటన తరువాత 1917 సెప్టెంబర్ లో అనిబిసెంట్ను బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేయడంతో హోంరూల్ ఉద్యమం సద్దుమనిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 5.
సహాయ నిరాకరణ ఉద్యమంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను తెలపండి.
జవాబు.
ఈ ఉద్యమం భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో గొప్ప సంఘటనగా మిగిలిపోతుంది. మహాత్మాగాంధీ ఈ ఉద్యమాన్ని పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ లో జరిగిన మారణకాండకు నిరసనగా 1920-22 మధ్య కాలంలో నిర్వహించారు. ఉద్యమంలో చేపట్టిన కార్యక్రమాలు :

నకారాత్మక కార్యక్రమాలు: సకారాత్మక కార్యక్రమాలలో క్రింది అంశాలు ఇమిడి ఉన్నాయి.

  1. సహాయ నిరాకరణ కార్యక్రమాలను అమలులో ఉంచడానికి కోటిరూపాయల విరాళాల సేకరణ.
  2. భారతీయులకు ఉపాధి కల్పించడానికి ఇరవై లక్షల రాట్నాల పంపకం.
  3. జాతీయ విద్యా ప్రణాళికల రూపకల్పన, అమలు.
  4. బ్రిటిష్ శాసన మండలుల స్థానంలో కాంగ్రెస్ శాసన సంస్థల ఏర్పాటు.
  5. స్వదేశీ వస్తువుల వినియోగం.

సకారాత్మక కార్యక్రమాలు :
నకారాత్మక కార్యక్రమాలలో క్రింది అంశాలను ప్రస్తావించడమైంది.

  1. బ్రిటిష్ ప్రభుత్వం ప్రసాదించిన బిరుదులు, గౌరవ పదవులను పరిత్యజించడం.
  2. బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించే అధికారిక సమావేశాలకు గైర్హాజరవడం.
  3. బ్రిటిష్ న్యాయస్థానాల బహిష్కరణ.
  4. శాసన మండలులకు జరిగే ఎన్నికల బహిష్కరణ.
  5. స్థానిక సంస్థల పదవులకు రాజీనామా సమర్పించడం.
  6. విదేశీ వస్తువుల బహిష్కరణ.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 6.
భారత ప్రభుత్వ చట్టం 1919 లోని ప్రధాన అంశాలేవి ?
జవాబు.
1919 భారత ప్రభుత్వ చట్టములోని ప్రధానాంశాలు :

  1. బ్రిటిష్ ఇండియా బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగానే కొనసాగుతుంది.
  2. భారత ప్రభుత్వం, దాని ఆదాయాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలపైన, చర్యలపైన పరిశీలన, నియంత్రణాధికారాలు భారత కార్యదర్శికే చెంది ఉంటాయి. ఆయన బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. రాష్ట్ర పాలనాంశాలపై భారత కార్యదర్శి అధికారాలను తగ్గించింది.
  3. ప్రభుత్వ పాలనాంశాలు రెండుగా విభజింపబడెను. అవి : 1) కేంద్ర పాలనాంశాలు (47), 2) రాష్ట్ర పాలనాంశాలు (51). రాష్ట్ర పాలనాంశాలను మళ్ళీ రెండుగా విభజించారు. అవి : 1) రిజర్వుడు పాలనాంశాలు (28), 2) ట్రాన్స్ఫర్డ్ పాలనాంశాలు (22). అఖిల భారత ప్రాముఖ్యం ఉన్న అంశాలు కేంద్ర పాలనాంశాల జాబితాలోను రాష్ట్ర ప్రాముఖ్యం ఉన్న పాలనాంశాలను రాష్ట్ర పాలనాంశాల జాబితాలోను చేర్చెను.
  4. భారత మండలి నిర్మాణంలో మార్పులు చేసిరి. భారత వ్యవహారాల కార్యదర్శి అధికారాలను కొన్నింటిని తొలగించి వాటిని భారత హైకమీషనర్ క్కు ఇచ్చారు.
  5. భారత ప్రభుత్వ బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్లను వేరుచేశారు. ప్రాంతీయ వనరులకు సంబంధించి ప్రాంతీయ శాసనసభలకు తమ బడ్జెట్లను తామే సమర్పించుకోవడానికి, సొంతంగా పన్నులు విధించుకోవడానికి అధికారాలు కల్పించారు.
  6. కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టబడింది. రాజ్యసభ ఎగువసభ కాగా, కేంద్ర శాసనసభ దిగువసభ అయ్యెను. ఎగువసభ పదవీకాలం 5 సంవత్సరాలుగా, దిగువసభ పదవీకాలం 8 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.
  7. కేంద్ర శాసనసభ అధికారాలు పెరిగెను. అది బ్రిటిష్ ఇండియా మొత్తానికి, భారతీయ విషయాలకు ప్రభుత్వ ఉద్యోగులకు, బ్రిటిష్ రాజరికానికి సంబంధించిన సైనిక దళాలకు వర్తించేలా శాసనాలు రూపొందించవచ్చును.
  8. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర పాలనాంశాలు రెండు భాగాలుగా విభజించారు. అవి: 1) రిజర్వుడు పాలనాంశాలు, 2) ట్రాన్స్ఫర్డ్ పాలనాంశాలు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 7.
భారత స్వాతంత్య్ర చట్టం – 1947 ముఖ్యాంశాలను వివరించండి.
జవాబు.
భారత వ్యవహారాల నిర్వహణ కోసం బ్రిటిష్ పార్లమెంటు రూపొందించి, అమలు చేసిన చట్టాలలో చిట్టచివరి చట్టమే భారత స్వాతంత్ర్య చట్టము 1947 ప్రధాని అట్లీ ఆధ్వర్యంలోని బ్రిటిష్ ప్రభుత్వం భారత గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ సలహామేరకు 1947, జులై 4వ తేదీన కామన్స్ సభలో భారత స్వాతంత్య్ర చట్ట ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

తరువాత బ్రిటిష్ పార్లమెంటులోని రెండు సభలు దానిని రెండు వారాల్లోగా ఆమోదించాయి. భారత స్వాతంత్య్ర చట్ట ముసాయిదా తీర్మానంపై బ్రిటిష్ రాణి 1947, జులై 18వ తేదీన సంతకం చేసింది.

ప్రధానాంశాలు :

  1. ఇండియా, పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర రాజ్యాలు ఏర్పడతాయి.
  2. ఇండియా పాకిస్తాన్లకు వేర్వేరుగా రాజ్యాంగ పరిషత్తులు ఏర్పడతాయి.
  3. స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారం రద్దవుతుంది.
  4. భారత వ్యవహారాల కార్యదర్శి పదవి రద్దవుతుంది.
  5. బ్రిటిష్ రాజు/రాణికి ఇప్పటివరకు ఉన్న “భారత చక్రవర్తి” అనే బిరుదు రద్దవుతుంది.”
  6. ఇండియా పాకిస్తాన్లు రెండింటికీ చెరొక గవర్నర్ జనరల్ నియమితులవుతారు.

ప్రశ్న 8.
భారత్ రాజ్యాంగ మౌలిక లక్షణాలలో ఏవేని మూడింటిని రాయండి.
జవాబు.
1. విశిష్ట ఆశయాలు లక్ష్యాలు :
భారత రాజ్యాంగం ఎన్నో విశిష్ట ఆశయాలు లక్ష్యాలను కలిగి ఉంది. భారత రాజ్యాంగం తన పౌరులందరికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అన్ని విషయాల్లో అందిస్తుంది. అలాగే పౌరులందరికీ, ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన తదితర విషయాల్లో స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది.

ఇదే క్రమంలో భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హోదా, సమాన అవకాశాలు కల్పిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజలలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి వ్యక్తి గౌరవాన్ని జాతి సమైక్యత, సమగ్రతలను పరిరక్షించడానికి హామీ ఇస్తుంది.

2. రాజ్య విధానాలపై ఆదేశిక సూత్రాలు :
భారత రాజ్యాంగంలోని నాలుగో భాగంలో 36వ నిబంధన నుండి 51వ నిబంధన వరకు రాజ్య విధానాల రూపకల్పనలో రాజ్యాంగ ఆదేశక సూత్రాలు పొందుపరుచారు. భారత రాజ్యాంగ నిర్మాతలు వీటిని ఐర్లాండ్, రాజ్యాంగం నుండి స్వీకరించారు.

ఈ ఆదేశక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా, గాంధేయవాద దేశంగా, ఉదారవాద రాజ్యంగా రూపొందిస్తాయి. రాజకీయ భావజాలాలతో సంబంధం కాకుండా కేంద్ర ప్రభుత్వంలో-రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టే అన్ని పార్టీలు ఈ మూల సూత్రాలను తప్పనిసరిగా అమలు చేయాలి.

3. ఏక పౌరసత్వం :
భారత రాజ్యాంగం భారతదేశంలో జన్మించిన వారందరికీ, లేదా ఒక నిర్దిష్ట కాలంపాటు భారతదేశంలో నివసిస్తున్నవారికి ఏక పౌరసత్వాన్ని అందిస్తుంది. భారతదేశ సమైక్యత – సమగ్రతను పరిరక్షించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. భారతదేశంలో విచ్ఛిన్నకర ధోరణులు తలెత్తకుండా రాజ్యాంగ నిర్మాతలు ఏకపౌరసత్వం ఏర్పాటు చేశారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత జీతీయోద్యమంలో మితవాదులు.
జవాబు.
మితవాద దశనే సంస్కరణల శకంగా వర్ణించడం జరిగింది. ఈ దశలో ప్రముఖ జాతీయ నాయకులైన గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయ్ నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ వంటి ప్రముఖ నాయకులు కీలకపాత్ర పోషించారు. బ్రిటిష్ పాలకుల ఉదార వైఖరి పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వారు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో క్రమానుగత సంస్కరణలను అమలు చేయాలని సూచించారు.

బ్రిటిష్ ప్రజలు నిజమైన ప్రజాస్వామ్య, స్వేచ్ఛావాద ప్రియులనే, భారతీయులలో బ్రిటిష్ పాలకులు రాజకీయ చైతన్యాన్ని విజ్ఞప్తులు, మధ్యవర్తిత్వం వంటి పద్ధతులను అనుసరించడం ద్వారా బ్రిటిష్ పాలకుల దృష్టిని మితవాదులు ఆకర్షించగలిగారు. బ్రిటిష్ పాలన అనేది దైవ సమ్మతం, దైవ నిర్ణయంగా వారు పరిగణించారు.

ప్రశ్న 2.
అతివాదులు అనుసరించిన పద్ధతులు.
జవాబు.

  1. బ్రిటిష్ వస్తువులను, బ్రిటిష్ ప్రభుత్వ గౌరవ బిరుదులను, కార్యాలయాలను బహిష్కరించడం.
  2. స్వదేశీ విద్యను ప్రోత్సహించడం.
  3. శాసనమండలల్లో భారతీయులకు సభ్యత్వం వంటి అంశాల అమలు కోసం కృషి చేయడం.
  4. స్వదేశీ వస్తువులను, పరిశ్రమలను ఆదరించడం.
  5. నకారాత్మక ప్రతిఘటనకు పాల్పడటం.

ప్రశ్న 3.
సైమన్ కమీషన్.
జవాబు.
బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ‘భారత ప్రభుత్వ చట్టం 1919’ అమలు తీరును సమీక్షించి, సంస్కరణలు చేపట్టడానికి వీలుగా చర్యలు సూచించమని ఒక శాసనబద్ధ కమిషన్ ను నియమించింది. ఏడుగురు ఆంగ్లేయులతో కూడిన ఈ కమిషన్కు సర్ఆన్ సైమన్ చైర్మన్ గా వ్యవహరించాడు. భారత జాతీయ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సైమన్ కమిషన్ కార్యవ్యవహారాలను బహిష్కరించాలని పిలుపునిచ్చి, ‘సైమన్ గో బ్యాక్’ (Simon Go Back) పేరుతో ఒక నినాదాన్నిచ్చింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 4.
శాసనోల్లంఘన ఉద్యమం.
జవాబు.
ఈ ఉద్యమాన్ని 1930 మార్చి 12న భారత జాతీయ కాంగ్రెస్ మార్గదర్శకత్వంలో ప్రారంభించుట జరిగినది. 1930 జనవరి 26వ తేదీన సంపూర్ణ స్వరాజ్యదినంగా పాటించాలని భారతీయులకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. శాసనోల్లంఘన ఉద్యమంలో మూడు ప్రధాన దశలున్నాయి. మొదటి దశలో భారతీయులు ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించాలని గాంధీజీ సూచించాడు.

గాంధీజీ స్వయంగా 78 మంది అనుచరులతో కాలిబాటన సబర్మతి ఆశ్రమం నుంచి 240 మైళ్ళ దూరంలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న “దండి” అనే గ్రామానికి వెళ్ళి ఉప్పును తయారుచేశాడు. రెండోదశ గాంధీజీ ఎర్రవాడ (పూణె) కారాగారంలో ఉండగా 1932 జనవరి-1933 జులైల మధ్య నిర్వహించడం జరిగింది. శాసనోల్లంఘనలో మూడవదశ 1933 ఆగష్టు, 1934 మే నెల మధ్య కాలంలో నిర్వహించడం జరిగింది. ఆ దశలో భారత కాంగ్రెస్ నాయకులు సామూహిక శాసనోల్లంఘన స్థానాలలో వ్యక్తిగత శాసనోల్లంఘనోద్యమాన్ని కొనసాగించారు.

ప్రశ్న 5.
మింటో – మార్లే సంస్కరణల చట్టం.
జవాబు.
ఈ చట్ట రూపకల్పనలో భారత ప్రతినిధి లార్డ్మింటో భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ మార్లేలు కీలకపాత్ర పోషించారు. దీనిని మింటోమార్లే సంస్కరణల చట్టంగా వర్ణించడం జరిగింది. భారతదేశంలో శాసనమండలాల నిర్మాణ, నిర్వహణలలో గణనీయమైన మార్పులకు ఈ నాంది పలికింది.

బెంగాల్ విభజనకు నిరసనగా ఉవ్వెత్తున ప్రారంభమైన వందేమాతరం ఉద్యమం, హిందూ-ముస్లింల మధ్య వైషమ్యాలు, లార్డ్ కర్జన్ నియంతృత్వ పోకడలు, పెద్ద దేశమైన రష్యాపై చిన్న దేశమైన జపాన్ విజయం, కాంగ్రెస్ నాయకులలో చీలికలు, ప్రవాస భారతీయుల కడగండ్లు, దుర్భర దారిద్య్రం, విప్లవ భావాలను రేకెత్తించిన కొన్ని రహస్య సంస్థల కార్యకలాపాలు వంటి అనేక అంశాలు ఈ చట్టం రూపకల్పనలో బ్రిటిష్ పాలకులను విశేషంగా ప్రభావితం చేశాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 6.
రాజ్యాంగ పరిషత్.
జవాబు.
భారత రాజ్యాంగ పరిషత్తులో 389 సభ్యులున్నారు. బ్రిటిష్ ఇండియాకు చెందిన 296 సభ్యులు ఉన్నారు. మిగిలిన 93 మంది స్వదేశీ సంస్థానాలకు చెందినవారు. భారత రాజ్యాంగ పరిషత్తుకు 1946 జులై – ఆగష్టులలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది.

మొత్తం సభ్యులలో 210 స్థానాలు జనరల్ కేటగిరీకి నిర్దేశించగా, వాటిలో 199 స్థానాలను కాంగ్రెస్ కైవశం చేసుకుంది. రాజ్యాంగ పరిషత్తులో ఆ పార్టీ బలం 208గా ఉంది. కాగా ముస్లింలీగ్ 73 స్థానాలను గెలుచుకుంది.

కాంగ్రెస్ తరఫున గెలిచిన సభ్యులలో మహాత్మాగాంధీ సూచించిన వివిధ రంగాలకు చెందిన 16 మంది మేధావులు ఉండటం విశేషం. మొత్తం మీద కాంగ్రెస్కు సంబంధించిన 30 మంది సభ్యులు రాజ్యాంగ పరిషత్తుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్రప్రసాద్, అంబేద్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, దుర్గాబాయ్ దేశ్ ముఖ్, సరోజిని నాయుడు, విజయలక్ష్మి పండిట్, రాజ్కుమారి అమృత్కర్ ముఖ్య సభ్యులు. 1946 డిసెంబర్ 11న రాజేంద్రప్రసాద్ను రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడమైంది.

ప్రశ్న 7.
రాజ్యాంగ ముసాయిదా కమిటి.
జవాబు.
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీని భారత రాజ్యాంగ పరిషత్తు 1947 ఆగష్టు 29న ఏర్పరచింది. కమిటీలో ఛైర్మన్, ఆరుగురు సభ్యులు ఉన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆ కమిటీ ఛైర్మన్గా వ్యవహరించారు. ఆ కమిటీలో సభ్యులుగా సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ మహమ్మద్ సాధుల్లా, డాక్టర్ కె.ఎమ్. మునీ, బి.ఎల్. మిత్తర్ సభ్యులుగా ఉన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటి ముఖ్య లేఖకుడిగా ఎస్.ఎన్ ముఖర్జీ నియమితులయ్యారు.

ముసాయిదా కమిటీ అనేక దఫాలు సమావేశమై రాజ్యాంగ ముసాయిదాను రూపొందించి 1947 నవంబర్ 5న రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించింది. రాజ్యాంగ ముసాయిదా ప్రతి 1948 ఫిబ్రవరి 21న ముద్రితమైంది. రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగ ముసాయిదాను నవంబరు 26న ఆమోదించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 8.
భారత రాజ్యాంగ ధృఢ అధృఢ లక్షణాలు.
జవాబు.
రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను అత్యంత కఠినమైన రీతిలో సవరించడానికి వీలుంటే, మరికొన్ని అంశాలను సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు. ఇంకొన్ని అంశాలను సగం కఠినమైన, సగం సరళమైన రీతిలో మార్పు చేయవచ్చు.

భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారాలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు వంటి అంశాలను సవరించడానికి రాజ్యాంగ నిర్మాతలు పరుషమైన పద్ధతిని సూచించారు. రాష్ట్రాల పేర్లు, సరిహద్దులు, విస్తీర్ణం, విలీనం లేదా విభజన, రాష్ట్ర శాసనమండళ్ళ ఏర్పాటు లేదా రద్దు వంటి అంశాలను సులభమైన రీతిలో సవరించడానికి వీలుకల్పించారు. ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు వంటి అంశాలను మార్పు చేయడానికి పాక్షిక కఠిన, పాక్షిక సరళ పద్ధతికి అవకాశం ఇచ్చారు.

ప్రశ్న 9.
భారత రాజ్యాంగ ప్రవేశిక.
జవాబు.
రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, ఆకాంక్షలు, లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. జవహర్లాల్నెహ్రూ ప్రవేశికను ఒక నిశ్చయాత్మక తీర్మానం ప్రమాణం హామిగా వర్ణించారు. ప్రవేశిక భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయాలను ప్రసాదిస్తున్నట్లు వెల్లడించింది.

భారతదేశంలోని సర్వసత్తాధికారం అంతిమంగా భారత ప్రజలకే చెందుతుందని సృష్టీకరించింది. ప్రవేశికను సుప్రీంకోర్టు న్యాయమూర్తి యధోల్కర్ రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం అని వర్ణిస్తే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా రాజ్యాంగపు ఆత్మగా ప్రస్తుతించారు.

ప్రశ్న 10.
పార్లమెంటరీ ప్రభుత్వం.
జవాబు.
భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వంలో, వివిధ రాష్ట్రాల స్థాయిలో బ్రిటిష్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. అయితే బ్రిటిష్ తరహా వారసత్వ రాజరికాన్ని భారతదేశం స్వీకరించలేదు. దీనికి బదులుగా భారత రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ తరహాలో ఎన్నికయ్యే అధ్యక్షుడు ఉండే వ్యవస్థను సూచించారు.

అలాగే బ్రిటిష్ రాజకీయ వ్యవస్థ మిగిలిన ఇతర లక్షణాలైన రెండు రకాల కార్యనిర్వాహక నాయకత్వం (రాష్ట్రపతి – ప్రధానమంత్రి), కేంద్రంలో ప్రధాన మంత్రినాయకత్వం, సమిష్టి బాధ్యత నియమం, కేంద్ర కార్యనిర్వాహక వర్గం (మంత్రిమండలి) పై పార్లమెంటు నియంత్రణ, రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు తదితర లక్షణాలను భారత రాజ్యాంగం స్వీకరించింది. ఇదే తరహా రాజకీయ వ్యవస్థను వివిధ రాష్ట్రాలకు కూడా అన్వయింపజేసింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 1 భారత రాజ్యాంగం - చారిత్రక నేపథ్యం

ప్రశ్న 11.
భారత రాజ్యాంగ ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాలు.
జవాబు.
ఏకకేంద్ర రాజ్యలక్షణాలైన ఒకే పౌరసత్వం, ఒకే సమీకృత న్యాయశాఖ, ఒకే ఎన్నికల సంఘం, రాష్ట్రాల పాలనలో అఖిల భారత సర్వీసుల సిబ్బంది పాత్ర, రాష్ట్రాల రాజ్యాంగ అధిపతులుగా గవర్నర్ల నియామకం, రెండు ప్రభుత్వాలు, పార్లమెంటు ఎగువసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, రాజ్యాంగ అంశాల సవరణలో పార్లమెంటు చొరవ వంటి అంశాలు సమాఖ్య లక్షణాలైన లిఖిత రాజ్యాంగం, అధికారాల విభజన, న్యాయశాఖ ఔన్నత్యం, ద్విసభా విధానం వంటివి భారత రాజ్యాంగంలో పేర్కొనడమైంది. అయితే మొత్తం మీద భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర రాజ్యం కంటే లక్షణాలే భారత రాజ్యాంగంలో అధికంగా ఉన్నాయి.

ప్రశ్న 12.
సార్వజనిక ఓటు హక్కు.
జవాబు.
భారతదేశంలో వయోజన పౌరులందరికి సార్వజనీన ఓటు హక్కును భారత రాజ్యాంగం ప్రసాదించింది. భారత పౌరులందరూ ఒక్క వయో సంబంధమైన పరిమితి మినహా ఇతర అంశాలైన కులం, మతం, భాష, ప్రాంతం, వర్ణం, వర్గం, ఆస్తులతో నిమిత్తం లేకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారు.

ఓటు హక్కు ద్వారా ప్రజా సార్వభౌమాధికార భావన ఆచరణలోకి వస్తుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. భారతదేశంలో స్వాతంత్య్రానంతరం ఓటు హక్కును పౌరులకు ప్రసాదించడానికి వయోపరిమితి 1950 నుంచి 1987 వరకు 21 ఏళ్ళగానూ, 1998 నుంచి (రాజ్యాంగం 61వ సవరణ చట్టం మేరకు) 18 ఏళ్ళుగానూ నిర్ణయించడమైనది.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 8th Lesson భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 8th Lesson భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
అవినీతిని నిర్మూలించి, వివిధ అవినీతి రూపాలను తెలపండి.
జవాబు.
అవినీతి నిర్వచనం : ప్రపంచ బ్యాంకు నిర్వచనంలో “ప్రభుత్వ పదవిని (లేదా కార్యాలయాన్ని) ప్రైవేటు లాభార్జన కోసం వినియోగించడమే అవినీతి”.

అవినీతి రూపాలు :
అవినీతికి అనేక రూపాలున్నాయి. వీటిలో లంచాలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బలవంతపు వసూల, ప్రభుత్వ ధనం దుర్వినియోగం, కుల-మత ప్రీతికర వివక్షత చూపడం వంటివి ఉన్నాయి. 1988లో వచ్చిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచగొండితనం, నిధుల దుర్వినియోగం, ధన సంబంధ ప్రయోజనాలు పొందడం, అధికార పదవిని హోదాను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించడం, ఆదాయానికి మించి ఎన్నోరెట్లు ఆస్తులను కలిగి ఉండడం తదితర చర్యలు అవినీతి చర్యలుగా, చట్టపరంగా శిక్షార్హమైనవిగా పేర్కొంది.

ఇటీవలి సమకాలీన భారతదేశ అవినీతి రూపాలలో “పరస్పర ప్రతిఫల ప్రేరేపిత అవినీతి” ఎన్నోచోట్ల వెలుగులోకి వస్తోంది. దీని ప్రకారం, రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు కార్పొరేటర్లకు, బడా వ్యాపారవేత్తలకు అనుకూలంగా అధికారిక (ప్రభుత్వ) నిర్ణయాలు తీసుకున్నప్పుడు దీనికి బదులుగా (ప్రతిఫలంగా) వారు సంబంధిత నాయకులు-అధికారుల బంధువర్గానికి చెందిన పారిశ్రామిక యూనిట్లలో షేరు విలువలకు మించి కుప్పలు తెప్పలుగా అక్రమ పెట్టుబడులు పెట్టడం, స్వచ్ఛంద సేవా సంస్థలకు భారీస్థాయిలో విరాళాలు ఇవ్వడం జరుగుతోంది.

మరోవిధంగా చెప్పాలంగే, ప్రతిఫలాలను, ప్రయోజనాలను పరస్పరం (నాయకులు–అధికారులు, కార్పొరేట్లు- వాణిజ్యవేత్తలు) ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతోంది. ఇటీవటి కాలంలో కేంద్ర నేరపరిశోధక సంస్థ (CBI) ఈ తరహా కేసులను (Quid Pro quo Cases) విచారిస్తూ కుంభకోణం ఆరోపణలను విచారిస్తోంది.

భారతదేశంలో అవినీతి భారతీయ విలువల వ్యవస్థలో ఒక పెద్ద ఉపద్రవంగా, సవాలుగా మారింది. ఇది అంటువ్యాధిలాగా వ్యపిస్తూ పరిపాలన యంత్రాంగాన్నీ, అభివృద్ధి ప్రక్రియలను, ప్రజాస్వామ్యాన్నీ అపహాస్యం చేస్తోంది. అవినీతి ఆర్థిక అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు వ్యతిరేకమైనది. జాతి వ్యతిరేకత లక్షణంగా గల అవినీతిలో రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు, ప్రభుత్వేతర సంస్థలు, నేరగాళ్ళు క్రియాశీల పాత్ర పోషిస్తూ ఉంటారు.

అవినీతి, వస్తువులు-సేవలు కొరతవల్ల, పరిపాలనలో తీవ్ర జాప్యం వల్ల, వ్యవస్థలో పారదర్శకత లోపించడంవల్ల తలెత్తుతుంది. అవినీతి ప్రజలలో అశాంతిని కలుగజేసి, వ్యవస్థపై ప్రజల నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. ఫలితంగా తీవ్రవాదం, హింసావాదం, ఉగ్రవాదం ప్రబలే అవకాశం ఉంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 2.
సంకీర్ణ రాజకీయాలు అంటే ఏమిటి ? వాటి లక్షణాలను, సంకీర్ణ రాజకీయాలలోని వివిధ దశలను
వివరించండి.
జవాబు.
సంకీర్ణ రాజకీయాలు-భావం :
కొన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వ అధికారం పొందడం లేదా ఉమ్మడి ప్రతిపక్షాన్ని ఏర్పరచి రాజకీయ ప్రక్రియను ప్రజాస్వామీకరించం లక్ష్యంగా ఒక వ్యవస్థగా ఏర్పడడాన్ని సంకీర్ణ రాజకీయాలుగా పేర్కొనవచ్చు. ఈ విధంగా ఉమ్మడి కూటమిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీలు తమలో తాము అంగీకరించిన ఎజెండా ఆధారంగా కనీస ఉమ్మడి కార్యక్రమం (Common Munimum Programme) ఏర్పరచుకొంటాయి.

లక్షణాలు :
సంకీర్ణ రాజకీయాలు భారతదేశానికి కొత్తేమీకాదు, వాస్తవానికి, నాలుగో సాధారణ ఎన్నికల తరువాత భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడి, వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి అశ్యర్థులను నిలబెట్టాయి. ప్రస్తుతం భారతదేశంలో రెండు ప్రధాన రాజకీయ కూటములు క్రియాశీలంగా పనిచేస్తున్నాయి.

వీటిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అకాలీదళ్, లోక్ జనశక్తి పార్టీ తదితర ప్రధాన రాజకీయ పార్టీలు “జాతీయ జాస్వామ్య కూటమి” (NDA) పేరుతో సంకీర్ణంగా ఏర్పడ్డాయి. మరో ప్రధాన సంకీర్ణ కూటమి ఐక్య ప్రగతిశీల కూటమి (UPA) పేరుతో భారత జాతీయ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, డి.ఎం.కె. తదితర పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా కొనసాగుతోంది.

వివిధ దశలు :
భారతదేశంలో సంకీర్ణరాజకీయాల పరిణామ క్రమాన్ని వాటి స్వభావం-పనితీరు ఆధారంగా వివిధ దశలుగా అధ్యయనం చేసుకోవచ్చు. మొదటిదశ సంకీర్ణ రాజకీయాలు 1967-1971 మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అవతరించి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను సవాలు చేయడంతో ప్రారంభమవుతుంది. భారతీయ జనసంఘ్, లోక్ దళ్, సోషలిస్టు పార్టీ, సంయుక్త విధాయక దళ్ మొదలైనవి ఉత్తర భారత రాష్ట్రాల్లో అవతరించి, సంకీర్ణాలు ఏర్పరచాయి.

సంకీర్ణ రాజకీయాలు రెండోదశ 1977-1980 మధ్య కాలంలో కేరళ, త్రిపుర, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో వామపక్ష సిద్ధాంత భావజాలం ఆధారంగా వామపక్ష కూటిమి ప్రభుత్వాల ఏర్పాటులో ప్రతిబింబిస్తుంది. అలాగే 1977లో వచ్చిన జనతాపార్టీ కూడా సంకీర్ణ రాజకీయాల్లో భాగమని కొద్దిమంది భావిస్తారు. జనతాప్రయోగం కొద్దినెలలు మాత్రమే కేంద్రంలో అధికారంలో ఉంది.

సంకీర్ణ రాజకీయాల్లో మూడో దశ 1989-1991 మధ్యకాలంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో, వివిధ రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అయితే ఈ దశలోని సంకీర్ణ రాజకీయాలలో సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాల్లో ఒక నూతన ధోరణి కనిపిస్తుంది. సంకీర్ణ పక్షాలు కొన్ని ప్రభుత్వంలో చేరకుడా వెలుపలి నుండి మద్దతు (outside support) అందించి సంకీర్ణ రాజకీయాల్లో పాల్గొనేవి.

సంకీర్ణ రాజకీయాల్లో నాలుగో దశ 1996-1999 మధ్యకాలంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో అస్థిరతను, తరచుగా ప్రభుత్వాలు పతనం కావడాన్ని రాజీకీయ యుక్తులు-కుయుక్తులను సూచిస్తుంది. ఈ దశలో సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు అనేక సంక్షోభాలను సృష్టిస్తూ తరచుగా ప్రభుత్వం నుంచి దూరంగా ఉండడం, మద్దతు ఉపయోగించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎంతో అస్థిరతను ఎదుర్కొంది. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంకీర్ణ రాజకీయాల ఫలితంగా పతనం చెందడం జరిగింది.

సంకీర్ణ రాజకీయాల్లో అయిదో దశగా 2004-2020 మధ్యకాలంలో హేతుబద్ధంగా కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికగా భాగస్వామ్యపక్షాలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గమనిస్తారు. దీనిలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ఐక్య ప్రగతిశీల కూటమి (UPA) సంకీర్ణాలు భాగస్వామ్య పక్షాలందరికీ ఆమోదయోగ్యమైన ఎజెండాను “కనీస ఉమ్మడి కార్యక్రమం” (Common Minimum Programme) ప్రాతిపదికగా ఏర్పరచుకొని, ప్రభుత్వాలను పూర్తి పదవీకాలం, విజయవంతంగా నిర్వహించాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలు, అవతరణకు గల కారణాలను వివరించండి.
జవాబు.
భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడానికి ఎన్నో కారణాలు దోహదం చేశాయి. ఆధిపత్య పార్టీగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ దేశంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనోవడం, మెజారిటీ సాధించే స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికల విజయాలు సాధించడం కారణంగా అనేక ఇతర పార్టీలు అవతరించి, అభివృద్ధి చెందాయి.

అలాగే వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని సవాలు చేసే విధంగా ప్రాంతీయ రాజకీయ పార్టీలు అవతరించి, ఇతర జాతీయ పార్టీలతో మైత్రి కూటములు ఏర్పాటు చేసుకోవడం కూడా సంకీర్ణ రాజకీయాలకు దారితీసింది.

సంకీర్ణ రాజకీయాలు వృద్ధి చెందడానికి గల కారణాలను ఈ కింది విధంగా పేర్కొనవచ్చు.

  1. ఏకపార్టీ ఆధిపత్యం నశించడం.
  2. ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రయోజనాలు సంతృప్తి పరచడానికి ప్రాంతీయ రాజకీయ పార్టీలు అవతరించడం.
  3. సమాజంలోని వివిధ సమూహాలు తమ హక్కుల పట్ల చైతన్యం పొందడంతో సాంఘిక-రాజకీయ ఉద్యమాలు వ్యాప్తి చెందడం.
  4. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో, రాష్ట్రాలస్థాయిలో రాజకీయ సంకీర్ణాలు ఏర్పరచవలసిన పరిస్థితులు ఏర్పడటం.

ప్రశ్న 2.
భారతదేశ నేపథ్యంలో వివిధ ఉగ్రవాద రూపాలను తెలియజేయండి.
జవాబు.
1. తెగల-జాతీయవాద ఉగ్రవాదం (Ethno-Nationalist Terrorism) :
ఉగ్రవాద సమూహాలు భారతదేశం నుంచి వేర్పాటును కోరుతూ లేదా భారత సమాఖ్యలో నూతన రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఉగ్రవాద చర్యలకు, హింసకు పాల్పడడాన్ని తెగల జాతీయవాద ఉగ్రవాదంగా పేర్కొనవచ్చు.

2. మతమౌఢ్య ఉగ్రవాదం (Religious Terrorism) :
ఈ తరహా ఉగ్రవాదం మత మౌఢ్యవాదం ఆధారంగా జనిస్తుంది. భారతదేశంలో ఎన్నో ఉగ్రవాద చర్యలు, సంఘటనలు, దాడులు ఈ కోవలోకి వస్తాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ (ISI) సహాయంతో ఉగ్రవాద సంస్థలు-సమూహాలు ఎన్నో ప్రాంతాల్లో మతమౌఢ్య ఉగ్రవాదానికి పాల్పడ్డాయి.

2008 నవంబర్ 26న ముంబాయిలో ఉగ్రవాద దాడులు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడులు, ప్రజలకు ఎంతో ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని కలిగించాయి. దీన్ని కొద్దిమంది జిహాదీ ఉగ్రవాదం పేరుతో కూడా వ్యవహరిస్తారు.

3. సిద్ధాంత (భావజాల) ఆధారిత ఉగ్రవాదం :
దీనినే వామపక్ష తీవ్రవాదమని కూడా వ్యవహరిస్తారు. సమాజ ఆర్థిక దోపిబిని, అణచివేతను, ఆర్థిక అసమానతలను నిర్మూలించడానికి వామపక్ష పోరాటమే మార్గమని నమ్ముతుంది. ప్రఖ్యాత కమ్యూనిస్టు సిద్ధాంతవేత్తలు కారల్ మార్క్స్, మావో, లెనిన్ తదితరుల సిద్ధాంత భావనల ఆధారంగా ఈ తీవ్రవాదం వ్యవహరిస్తుంది. సమాజంలోని విప్లవాత్మక మార్పు లక్ష్యాన్ని హింస, ఉగ్రవాదంతో చేరుకోవచ్చని నమ్ముతుంది.

4. రాజ్యప్రాయోజిక ఉగ్రవాదం (సీమాంతర ఉగ్రవాదం):
పొరుగు రాజ్యాలనుంచి పరోక్ష రూపంలో వ్యక్తమయ్యే ఉగ్రవాదం. సరిహద్దులకు వెలుపల ఇతర రాజ్యాలలో ఉగ్రవాద సంస్థలకు సమూహాలకు తోడ్పాటు అందిస్తూ భయానక వాతావరణాన్ని, అస్థిరతను కలుగజేసే లక్ష్యంతో ఉగ్రవాద చర్యలు ఉంటాయి.

భారతదేశం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ చేతిలో ఈ తరహా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. భారతదేశంలోని ఉగ్రవాద సమూహాలకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ (ISI), ఇతర ఏజెన్సీలు సహాయం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

5.మాదక ద్రవ్య (గంధపు చెక్కలు మొదలైన వాటి అక్రమరవాణా) ఉగ్రవాదం :
ఈ తరహా ఉగ్రవాదం నిషేధించిన మాదకద్రవ్యాలు, గంధపు చెక్కల అక్రమరవాణాపై దృష్టి కేంద్రీకరిస్తుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 3.
భారతదేశంలో అమలులో ఉన్న ఉగ్రవాద నిరోధక చట్టాలు ఏవి ?
జవాబు.
ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టు, జాతీయ భద్రతాచట్టం (MISA), Conservation of Foreign Exchange and Preven- tion of Smuggle Activities Act (COFEPOSA), National Security ACT (NSA), ఉగ్రవాద నిరోధక చట్టం మొదలగునవి.

ప్రశ్న 4.
భారతదేశంలో వివిధ అవినీతి నిరోధక చట్టాలను పేర్కొనండి.
జవాబు.
భారత ప్రభుత్వం అవినీతి నిరోధానికి వివిధ స్థాయిలో అనేక చర్యలు చేపట్టింది. భారతదేశంలో ప్రజా జీవితంలో అవినీతిని అదుపు చేయడానికి అవినీతి నివారక చట్టాన్ని 1988లో రూపొందించింది. ఈ చట్టంలో మరిన్ని సవరణలు చేసి అవినీతి నివారణ చట్టం, 2018 రూపొందించింది.

దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక విధులను నిర్వహించే క్రమంలో చట్ట వ్యతిరేకంగా ప్రతిఫలాన్ని ఆశించండం లేదా లంచాలు తీసుకోవడాన్ని నిషేధించడం.

ఈ చట్టం లంచాలను ఇచ్చేవారిని, మధ్యవర్తులను కూడా దోషులుగా పరిగణిస్తుంది. అయితే కొద్దిమంది ఉన్నత పదవులలో ఉండే నాయకులు లేదా అధికారులపై అవినీతి కేసులు నమోదు చేయడానికి రాజ్యాంగ వ్యవహర్తల ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై ఆరోపణల విషయంలో రాష్ట్ర గవర్నర్, కేంద్ర ప్రభుత్వ అధికారుల విషయంలో భారత రాష్ట్రపతి అనుమతి అవసరం అవుతుంది.

ఇదేకాక భారతీయ శిక్షాస్మృతి (Indian Penal code) లోని అనేక నిబంధనలు అవినీతి చర్యలకు పాల్పడే ఉద్యోగులపై శిక్షలు విధించడానికి తోడ్పడతాయి దీనితో పాటు మనీలాండరింగ్ నివారణ చట్టం (2002), సమాచార హక్కు చట్టం (2005) మొదలైనవి కూడా అవినీతి గుర్తించి, కేసులను నమోదు చేయడానికి తోడ్పడతాయి.

ప్రభుత్వోద్యోగులలో అవినీతిని నిరోధించడానికి 1964లో కేంద్ర నిఘా వ్యవహారాల కమిషన& (Central Vigilance Commission-CVC) ని స్థాపించారు. అవినీతికి సంబంధించిన అంశాల్లో పౌరులు చేయవలసిన, చేయకూడని పనులను ఈ కమిషన్ మార్గదర్శకాల రూపంలో రూపొందించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జాతీయ స్థాయిలో సంకీర్ణ రాజకీయాలు.
జవాబు.
జాతీయ స్థాయిలో ఎన్నోసార్లు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్రప్రభుత్వంలో మొదటిసారిగా 1977లో భారతీయ లోక్ దళ్, కాంగ్రెస్ (ఒ), జనసంఘ్, సోషలిస్టు పార్టీ, కొన్ని ఇతర చిన్న పార్టీలు కలిసి జనతా పార్టీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇది జనతా ప్రయోగంగా ప్రఖ్యాత గాంచింది.

మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఈ ప్రభుతవ &ం ఏర్పడింది. కేంద్రప్రభుత్వంలో 1989లో వి.పి.సింగ్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. జనమోర్చా, లోక్ దళ్ పార్టీలు నేషనల్ ఫ్రంట్ పేరుతో సంయుక్తంగా, భారతీయ జనతాపార్టీ, వామపక్షాల వెలుపలి మద్దతు అందించడంతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచాయి.

1996 మే నెలలో హెచ్.డి. దేవగౌడ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ (UF) ప్రభుత్వం ఏర్పడిది. దీనిలో జనతాదళ్, సి.పి.ఐ-సి.పి.ఎం తదితర పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఈ సంకీర్ణం తదనంతర కాలంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమిగా (NDA) ఆవిర్భవించింది. ఆ తరువాత 2004 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటిమి (UPA) డా॥ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అధికారాన్ని చేపట్టింది.

ప్రశ్న 2.
సంకీర్ణ రాజకీయాల ప్రయోజనాలు, నష్టాలు.
జవాబు.
భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలు రాజకీయ సర్దుబాట్లకు, సహాయ సహకారాలకు దారితీశాయి. దీనికి అనుగుణంగా భారత సమాఖ్య స్వభావం మార్పుచెంది, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య అతి తక్కువ స్థాయికి వివాదాలు తగ్గిపోయాయి.

భారతాయ సమాఖ్య ఒక సహకార సమాఖ్యగా రూపాంతరం చెందింది. అలాగే సంకీర్ణ రాజకీయాలు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి దేశంలోని వివిధ స్థాయిల్లో ప్రత్యామ్నాయాన్ని ప్రజాసమస్యలు బాగా వెలుగులోకి రాగలగడతో భారత కాంగ్రెస్ పార్టీకి దేశంలోని వివిధ స్థాయిల్లో ప్రత్యామ్నాయాన్ని ప్రజాసమస్యలు బాగా వెలుగులోకి రాగలగడంతో భారత రాజకీయ వ్యవస్థ తన సామర్థ్యాలను పెంపొందించుకొని ప్రజల డిమాండ్లను పరిష్కరించడానికి సమాయత్తమవుతోంది.’

సంకీర్ణ రాజీకీయాల వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు తమ సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో రాజకీయ బేరసారాలకు దిగుతాయి. కొన్నిసార్లు దీని ఫలితంగా రాజకీయ కుయుక్తులు పెరిగి, రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. చాలా రాజకీయ పార్టీలకు స్వార్థ ప్రయోజనాలతో నిండిన ఎజెండా ఉండడం ఫలితంగా రాజకీయ నీచత్వం, దురాచారాలు, బెదిరింపులు, కుతంత్రాలు రాజ్యమేలుతాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 3.
ఉగ్రవాదం లక్షణాలు.
జవాబు.
ఉగ్రవాదంపై జరిగిన అనేక అధ్యయనాలు, ఉగ్రవాద చర్యలలో కనిపించే సారూప్యతలను, ధోరణులను, లక్షణాలుగా తెలిపాయి.

  1. కొద్దిమంది వ్యక్తులు ప్రణాళికాబద్ధంగా, వ్యవస్థీకృతంగా బుద్ధి పూర్వకంగా చేసే హింసాత్మక చర్య ఉగ్రవాదంగా ఉంటుంది.
  2. ఉగ్రవాదం అమాయకపు ప్రజలను లేదా ఒక నిర్దిష్ట వర్గాన్ని పోలీసు అధికారులను, సాయుధ దళాలను లేదా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని చేసే హింసాత్మక చర్య.
  3. సమాజంలోని సాంఘిక-ఆర్థిక లేదా రాజకీయ వ్యవస్థను సవాలుచేస్తూ, కొద్దిమంది ప్రేరణతో జరిగే హింస ఉగ్రవాదం లేదా తీవ్రవాదం రూపంలో బహిర్గతమవుతుంది.
  4. ఉగ్రవాదం ప్రభుత్వంపైన, రాజకీయ వ్యవస్థపైన జరిపే అనధికార యుద్ధంగా కనబడుతుంది.
  5. బెదిరింపులకు, పాశవికతకు ఉగ్రవాదం సాధనంలాగా ఉంటుంది. కొద్దిమంది తమ డిమాండ్లను హింసాత్మక ఉగ్రవాద చర్యలు ద్వారా వ్యక్తీకరిస్తారు.

ప్రశ్న 4.
అవినీతి రూపాలు.
జవాబు.
అవినీతికి అనేక రూపాలున్నాయి. వీటిలో లంచాలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బలవంతపు వసూలు, ప్రభుత్వ ధనం, దుర్వినియోగం, కుల-మత ప్రీతికర వివక్షచూపడం వంటివి ఉన్నాయి.

1988లో వచ్చిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచగొండితనం, నిధుల దుర్వినియోగం, ధన సంబంధ ప్రయోజనాలు పొందడం, అధికార పదవిని, హెూదాను స్వార్థప్రయోజనాలకు ఉపయోగించడం, ఆదాయానికి మించి ఎన్నోరెట్లు ఆస్తులను కలిగిఉండం తదితర చర్యలు అవినీతి చర్యలుగా, చట్టపరంగా శిక్షార్హమైనదిగా పేర్కొంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 8 భారత రాజకీయాల్లో సమకాలీన అంశాలు

ప్రశ్న 5.
ప్రజావేగులు.
జవాబు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని వెల్లడించి, బహిర్గతం చేసి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను అప్రమత్తులను చేసే కార్యకర్తలలే (Whistle Blowers). వీరికి అవినీతి అధికారులు, నాయకుల నుంచి ప్రమాదాలు ఎదురవుతాయి. ఇటీవలి కాలంలో జాతీయ రహదారుల అథారిటీ కుంభకోణాన్ని వెలికితీసిన శ్రీ సత్యేంద్ర దూబే హత్య, సమాచార హక్కు కార్యకర్తల షీలా మసూద్ హత్య తదితర సంఘలనలు ప్రజావేగులకు రక్షణ కల్పించవలసిన అవసరాన్ని తెలియజేస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం “ప్రజా ప్రయోజనాల వెల్లడి తీర్మానం” (Public Interest Disclosure resolution-PIDR) పేరుతో ఈ ప్రజావేగుల జీవితాలకు భద్రత కల్పించడానికి అనేక చర్యలు తీసుకొంటోంది.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 6th Lesson స్థానిక ప్రభుత్వాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 6th Lesson స్థానిక ప్రభుత్వాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారతదేశంలో ప్రాంతీయ ప్రభుత్వాల చారిత్రక నేపథ్యాన్ని వివరించండి.
జవాబు.
చారిత్రక నేపథ్యం:
చక్కని పరిపాలనా వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్యం భారతదేశానికి ఎంతో అవసరమని గాంధీజీ ఏనాడో ఉద్భోదించారు. అనేక మంది జాతీయ నాయకులు ఈ భావనలను బలపరచారు. అయితే స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన అనేక సంఘటనల కారణంగా భారత రాజ్యాంగ నిర్మాతలు జాతీయ సమైక్యత, సమగ్రతలకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వవలసి వచ్చింది.

ఈ నేపథ్యంలో వారు ప్రాంతీయ ప్రభుత్వాలకు సముచితమైన స్థానాన్ని ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్య ఆశయాన్ని భారతరాజ్యాంగంలోని ఆదేశక సూత్రాలలో 40వ ప్రకరణలో వారు పొందుపరచారు. ఈ ప్రకరణ ప్రకారం “రాజ్యం పంచాయితీరాజ్ సంస్థలను నిర్వహించి, అవి స్వయం పాలనా సంస్థలుగా ఏర్పడటానికి తగిన అధికారాలు ఇవ్వాలి.

సామాన్య ప్రజానీకానికి పరిపాలనలో భాగస్వామ్యం, ప్రాతినిధ్యం కల్పించడానికి స్థానిక ప్రభుత్వాలు ఎంతో అవసరం. ఈ సంస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులలాంటివి. ఈ సంస్థలను స్వయం పాలన సంస్థలుగా రూపొందించడానికి తగిన చర్యలను తీసుకునే ప్రధాన బాధ్యత రాజ్యానికి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పంచాయితీరాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి వివిధ చర్యలను చేపట్టింది. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తరువాత 1952లో సమాజాభివృద్ధి పథకం అమలు కోసం తగిన చర్యలు తీసుకుంది.

గ్రామీణ ప్రాంతంలోని వారికి శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానాన్ని అందించడం కోసం ఈ పథకం ద్వారా ప్రభుత్వం కృషి చేసింది. అయితే, ఈ పథకం ఆచరణలో ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది. 1953లో కేంద్ర ప్రభుత్వం (National Extension Service Scheme – NESS) జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలను గ్రామీణాభివృద్ధి వ్యవహారాలలో భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం కృషి చేసింది. అయితే ఈ పథకం కూడా ఆశించిన ఫలితాలను అందించలేదు. దీంతో భారత ప్రభుత్వం 1957లో బల్వంత్ రాయ్ మెహతా ఆధ్వర్యంలో ఒక పరిశీలనా సంఘాన్ని నియమించింది.

సమాజాభివృద్ధి పథకాల వైఫల్యానికి దారితీసిన పరిస్థితుల గురించి విచారణ జరపవలసిందిగా ఈ సంఘాన్ని ప్రభుత్వం కోరింది. బల్వంత్రెయ్మైహతా కమిటీ సుమారు 10 నెలల కాలంలో అనేక విషయాలను పరిశీలించి 1957 నవంబర్లో తుది నివేదికను సమర్పించింది. సమాజాభివృద్ధి వైఫల్యానికి తగిన కారణం, ఆచరణలో ఉన్న లోపాలు అని కమిటీ అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పేరుతో గ్రామ పంచాయితీలను పునర్వ్యవస్థీకరించాలని కమిటీ సిఫార్సు చేసింది.

ఈ సందర్భంలో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అనేక సిఫార్సులు చేసింది. వాటిలో ప్రధానమైనవి గ్రామపంచాయితీ, పంచాయితీ సమితి, జిల్లాపరిషత్ వంటి మూడు అంచెల ప్రాతినిధ్య సంస్థలను ప్రవేశపెట్టడం, ప్రాంతీయ ప్రభుత్వాలకు తగినంత నిధులు మంజూరు చేయడం మొదలైన అంశాలకు సంబంధించి బల్వంత్రాయ్ మెహతా కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కమిటీ సూచించిన పంచాయితీరాజ్ వ్యవస్థను అనేక రాష్ట్రాలు ఆమోదించాయి. వీటిలో రాజస్థాన్ మొదటి రాష్ట్రం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 2.
73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ప్రధాన లక్షణాలను పేర్కొనండి.
జవాబు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎంతో ప్రముఖమైనది. గ్రామస్థాయిలో, మాధ్యమిక స్థాయిలో, జిల్లాస్థాయిలో ఉన్న మూడంచెల పాలన గల పంచాయితీరాజ్ సంస్థలను ఈ చట్టం వ్యవస్థీకరించింది.

గ్రామీణ ప్రజలలో చక్కని నాయకత్వ లక్షణాలను, వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయాన్ని కలుగజేయడంలో ఈ చట్టం ప్రధానపాత్ర వహిస్తుంది. ఈ చట్టం ప్రధాన లక్షణాలను చట్టంలోని వివిధ ప్రకరణాల ద్వారా సంక్షిప్తంగా తెలుసుకుందాం.

చట్టం ప్రధానాంశాలు :
1. నిర్వచనాలు (243వ ప్రకరణ) :
గ్రామసభ, పంచాయితీ, జిల్లా మొదలైన అనేక పదాలను ఈ చట్టంలో వివిధ సందర్భంలో వాడటం జరిగింది. ఈ పదాల నిర్వచనాలు 243వ ప్రకరణలో ఉన్నాయి.

2. గ్రామసభ (243 – ఎ) :
చట్టం ప్రకారం గ్రామస్థాయిలో ఒక గ్రామ సభ ఉంటుంది. ఇది తన అధికారాలను శాసనసభ నిర్దేశించిన విధంగా చలాయిస్తుంది.

3. పంచాయితీ వ్యవస్థ (243-బి) :
ఈ చట్టం మూడు అంచెల ఏకరూప వ్యవస్థను నిర్దేశించింది. అవి (1) గ్రామస్థాయి (2) (మాధ్యమిక) మండలస్థాయి (3) జిల్లాస్థాయి.

4. పంచాయితీ నిర్మాణం (243-సి) :
పంచాయితీల నిర్మాణం గురించి శాసనసభ తగు నిబంధనలను రూపొందించాలని ఈ చట్టం పేర్కొంది. ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతిపదికపై పంచాయితీలకు ప్రత్యక్ష ఎన్నికలు ఉండాలని ఈ చట్టం పేర్కొంది.

5. సీట్ల రిజర్వేషన్లు (243-డి) :
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల, ప్రజాప్రతినిధులకు పంచాయితీలో వారి జనాభాను బట్టి. సీట్లు రిజర్వేషన్లు ఉండాలని ఈ చట్టం పేర్కొంటుంది. అలాగే 1/3 వంతుకు మించకుండా మహిళలకు రిజర్వేషన్లు కేటాయించాలని చట్టం పేర్కొంటుంది.

6. పంచాయితీల కాల పరిమితి (243-ఇ) :
ఈ చట్టం ప్రకారం పంచాయితీల కాల పరిమితి 5 సం||లు. కాలపరిమితికి ముందే ఒకవేళ అవి రద్దయితే వాటికి ఎన్నికలు నిర్వహించవలసి వస్తుంది.

7. అర్హతలు, అనర్హతలు (243-ఎఫ్) :
ఈ చట్టం పంచాయితీ సంస్థలకు పోటీ చేసే అభ్యర్థుల అర్హతలను, అనర్హతలను నిర్ధిష్టంగా పేర్కొంటుంది.

8. అధికారాలు, విధులు (243-జి):
11వ షెడ్యుల్ ద్వారా 29 అంశాలతో పంచాయితీ కార్యకలాపాలను ఈ చట్టం నిర్ధారించింది.

9. ఆదాయ వనరులు (243-హెచ్) :
పంచాయితీ సంస్థలకు గల వివిధ ఆదాయ వనరుల గురించి ఈ చట్టం పేర్కొనడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, పన్నుల ద్వారా ఆదాయం, భవనాల అద్దె మొ॥॥ వాటి ద్వారా ఈ సంస్థలు ఆదాయ వనరులను పొందుతాయి.

10. ఆర్థిక సంఘం (243 – ఐ) :
పంచాయితీల ఆర్థిక స్థితి సమీక్షకై ఒక ఆర్థిక సంఘాన్ని చట్టం ఏర్పరచి, తగిన విధి విధానాలను పేర్కొంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 3.
74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ప్రధాన లక్షణాలను వివరించండి.
జవాబు.
74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగంలో IXA భాగం చేర్చబడినదని, ఇందులో 243 IP నుంచి 243.2F ప్రకరణలు ఉన్నాయని, ఈ భాగం “మున్సిపాలిటీస్” అనే శీర్షిక ద్వారా వివిధ పట్టణ స్థానిక సంస్థల గురించి వివరిస్తుందని తెలుసుకున్నాం. ఇందులో 243P ప్రకరణలో చట్టంలో ఉపయోగించబడిన అనేక పదాలకు నిర్వచనాలు ఉన్నాయి. ఇతర ప్రకరణలు పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి వివరిస్తాయి. వీటి గురించి తెలుసుకుందాం.

1. మున్సిపాలిటీల వ్యవస్థ (243. Q – ప్రకరణ) :
243Q – ప్రకరణ ప్రకారం, ప్రతి రాష్ట్రంలో ప్రధానంగా మూడు తరహాల మున్సిపాలిటీలు ఉండాలి. అవి :

  1. నగర పంచాయతీ (గ్రామీణ ప్రాంత స్థాయి నుండి పట్టణ ప్రాంతంగా పరివర్తన ప్రాంతంలో).
  2. మున్సిపల్ కౌన్సిల్ (చిన్న పట్టణ ప్రాంతాలలో).
  3. మున్సిపల్ కార్పోరేషన్ (బాగా విస్తరించిన పట్టణ ప్రాంతాలలో).

2. మున్సిపాలిటీల నిర్మాణం (243-R) :
మున్సిపాలిటీల నిర్మాణం గురించి ఈ చట్టం వివరిస్తుంది. దీని ప్రకారం మున్సిపల్ స్థానాలకు ప్రతినిధులు ఎంపిక ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగుతుంది. ఇందుకోసం మున్సిపాలిటీలను వార్డులుగా విభజిస్తారు. వార్డులలోని ప్రజలు తాము ప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఈ చట్టం ప్రకారం కొన్ని ప్రత్యేక అంశాలను సంబంధించి రాష్ట్ర శాసనసభలు శాసనాలు చేయవచ్చు.

ఉదాహరణకు, పురపాలక సంస్థలకు సమావేశాలలో అనుభవజ్ఞులు, నేర్పరితనంగల వ్యక్తులు పాల్గొనడానికి అవసరమైన నియమనిబంధనలను రాష్ట్ర శాసనసభలు చేయవచ్చు. అదేవిధంగా మున్సిపాలిటీ ప్రాంత పరిధిలోని రాష్ట్ర శాసనసభ / పార్లమెంట్ సభ్యులకు ఓటింగ్ హక్కులతో ప్రాతినిధ్యం కలిగించవచ్చు.

3. వార్డు కమిటీలు (243 – S) :
మూడు లక్షలు లేదా అంతకుమించి ఉన్న పురపాలక సంస్థలలో వార్డు కమిటీల ఏర్పాటు విషయంలో శాసనాలను రూపొందించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలు పొందుతాయని 243-S ప్రకరణ పేర్కొంటుంది.

4. సీట్ల రిజర్వేషన్లు (243 – T) :
243 – T ప్రకరణ ప్రకారం మున్సిపల్ ప్రాంతంలోని షెడ్యుల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి సీట్ల రిజర్వేషన్లు ఉండాలి. అంతేకాక 1/3వ వంతు స్థానాలను మహిళలకు కేటాయించాలని కూడా చట్టం నిర్దేశిస్తుంది.

5. మున్సిపాలిటీల పదవీకాలం (243 – U):
ఈ మున్సిపాలిటీల పదవీకాలాన్ని 5 సంగా నిర్ణయించింది. ఒకవేళ ఏ కారణం రీత్యానైనా పదవీకాలం ముగియకముందే మున్సిపాలిటీ రద్దయితే, తిరిగి ఆరుమాసాలలో వాటికి ఎన్నికలు జరిపించాలని కూడా ఈ చట్టం నిర్దేశిస్తుంది.

6. అనర్హతలు (243 – V) :
పురపాలక సంస్థల సభ్యులకు ఎన్నికలలో పోటీ చేయడానికి కావలసిన అర్హతలను, అనర్హతలను నిర్ణయించే అంశాలను ఈ చట్టం నిర్దిష్టంగా పేర్కొంటుంది. దీని ప్రకారం అనర్హతలకు సంబంధించిన వివాదాలను రాష్ట్ర శాసనసభ ఏర్పరచిన ఒక ప్రత్యేక అథారిటీ నిర్ణయిస్తుంది.

7. మున్సిపాలిటీల అధికారాలు, హక్కులు, బాధ్యతలు (243 – W) :
మున్సిపాలిటీలకు అధికారాలు, హక్కులు, బాధ్యతలను రాష్ట్ర శాసనసభలు ప్రత్యేక శాసనాల ద్వారా రూపొందించి, ఈ ప్రభుత్వాలను స్వయంపాలక సంస్థలుగా తీర్చిదిద్దాలని (243 – W) ప్రకరణ పేర్కొంటుంది.

18 అంశాలతో మున్సిపాలిటీలకు గల అధికారాలు, హక్కులు, బాధ్యతలను ఈ చట్టంతో రాజ్యాంగంలో ప్రత్యేకంగా చేర్చబడింది.
ఈ విధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ, స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగపరమైన గుర్తింపును, సాధికారతను కలిగించి క్షేత్రస్థాయిలో ఉన్న ఈ ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి తగిన ప్రధానాంశాలను కలిగి ఉందని చెప్పవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 4.
2018 తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టంపై సంక్షిప్త సమాధానం రాయండి.
జవాబు.
73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలకు అనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేవల్లో 1994లో “ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ “చట్టం” పేరుతో చట్టం చేయడమైనది. ఇది మే 30, 1994 నుంచి అమలులోకి వచ్చింది. జూన్ 2, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక ఇదే చట్టాన్ని కొంతకాలం కొనసాగించారు. అనంతరం మన్యశ్రీ కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం 2018లో “తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం – 32018” పేరుతో నూతన చట్టాన్ని చేసింది.

ఈ చట్టం రాష్ట్రంలో ఏప్రిల్ 18, 2018 నుంచి అమలులోకి వచ్చింది. నూతన రాష్ట్రం ఆశలు, ఆశయాలు తీర్చుతూ తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ఈ చట్టం ప్రధాన లక్ష్యం. ఈ చట్టంలో 8 షెడ్యూల్స్, 9 భాగాలు మరియు 297 సెక్షన్లు ఉన్నాయి.

తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం ముఖ్య లక్షణాలు :

1. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ :
ఈ చట్టం రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచింది. అవి గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ, మండల స్థాయిలో ప్రజాపరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్,

2. అరహతలు అనర్హతలు :
దీని ప్రకారం వివిధ పదవులకు కావలసిన అర్హతలను అనర్హతలను స్పష్టంగా పేర్కొంది. అవి :

  1. అతను/ఆమె 21 సంవత్సరాల వయస్సు పూర్తి అయి ఉండాలి.
  2. అతను/ఆమె పోటీ చేసే స్థానిక ప్రభుత్వ భౌగోళిక పరిధిలో ఓటరై ఉండాలి.
  3. అతను/ఆమె ప్రభుత్వం నుంచి ఆదాయం పొందే లాభసాటి పదవిలో ఉండరాదు.
  4. రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు నిర్ణీత డిపాజిట్లను చెల్లించాలి.
  5. అతను/ఆమె మే, 30, 1995 తరవాత మూడవ సంతానాన్ని పొందితే పోటీకి అనర్హులు.

వివరణ : దీని ప్రకారం ఒక వ్యక్తి మే, 31, 1995 కంటే ముందు ఇద్దరు కంటే ఎక్కువ సంతానాన్ని కలిగి ఉన్నప్పటికీ స్థానిక సంస్థలకు పోటీ చేయడానికి అర్హుడే.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 5.
తెలంగాణ జిల్లా పరిషత్ల నిర్మాణం, అధికారాలు వివరించండి.
జవాబు.
జిల్లా పరిషత్ నిర్మాణం : ప్రతిజిల్లా ప్రజా పరిషత్లో కింది సభ్యులు ఉంటారు.

1. ఎన్నికైన సభ్యులు :
వీరిని జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులని (ZPTC) అంటారు.

2. పదవీరీత్యా సభ్యులు :
జిల్లా పరిధిలో గల నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు (MLA), లోక్ సభ సభ్యుడు (MP), అదే విధంగా జిల్లాలో ఓటర్గా నమోదైన రాష్ట్ర విధాన పరిషత్ సభ్యుడు (MLC) రాజ్యసభ సభ్యుడు (MP), జిల్లా ప్రజాపరిషత్లో పదవీరీత్యా సభ్యులుగా (Ex-officio) ఉంటారు.

వీరు జిల్లా పరిషత్ సమావేశాలలో పాల్గొనవచ్చు, చర్చల్లో భాగస్వామ్యం కావచ్చు. అభిప్రాయాలు చెప్పవచ్చు. అదేవిధంగా జిల్లా పరిషత్ యొక్క వివిధ స్థాయి సంఘాల్లో సభ్యులు కావచ్చు. ఈ సమావేశాల్లో పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. కాని వివిధ తీర్మానాలపై ఓటు వేసే హక్కులేదు.

3. కో-ఆప్ట్ సభ్యులు :
జిల్లా ఓటర్గా నమోదై ఉన్న మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరిని జిల్లా పరిషత్ సభ్యులు కో-ఆప్ట్ చేసుకోవచ్చు. వీరికి 21 సంవత్సరాల వయస్సు పూర్తి అయి ఉండాలి.

జిల్లా పరిషత్ అధికారాలు, విధులు :

  1. జిల్లాలోని అన్ని మండల ప్రజాపరిషత్ల బడ్జెట్లను పరిశీలించి ఆమోదిస్తుంది.
  2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద ఇచ్చే నిధులను జిల్లాలోని అన్ని మండల ప్రజాపరిషత్లకు కేటాయిస్తాడు.
  3. జిల్లాలోని వివిధ మండలాల ప్రణాళికలు క్రోడీకరించి జిల్లా ప్రణాళికను రూపొందించి అమలు చేయడం.
  4. జిల్లాలోని అన్ని మండల ప్రజాపరిషత్లు మరియు గ్రామపంచాయతీల కార్యక్రమాలను పర్యవేక్షించి అవసరమైన సలహాలు, ఆదేశాలివ్వడం.
  5. చట్టం ప్రకారం విధించే పన్నులు లేదా రుసుములను వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవడం, జిల్లా బోర్డ్ అధికారాలను నిర్వహించడం.
  6. గ్రామీణాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికై చేపట్టవలసిన వివిధ కార్యక్రమాలు, సేవల రూపకల్పనకై రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సలహా ఇచ్చింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
బల్వంత్రెయ్ మెహతా కమిటీ.
జవాబు.
మనదేశంలో శ్రీ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫారసులననుసరించి పంచాయితీరాజ్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో ప్రారంభించబడిన సమాజాభివృద్ధి పథకము, జాతీయ విస్తరణ సేవా పధకములు అమలు తీరును సమీక్షించుటకు భారత ప్రభుత్వం 1957లో బల్వంత్ రాయ్ మెహతా ఆధ్వర్యంలో ఒక పరిశీలనా సంఘాన్ని నియమించింది.

ఈ కమిటీ సుమారు 10 నెలల కాలంలో అనేక విషయాలను పరిశీలించి 1957 నవంబరులో తుది నివేదికను సమర్పించింది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పేరుతో గ్రామపంచాయితీ, పంచాయితీ సమితి, జిల్లా పరిషత్ వంటి మూడు అంచెల ప్రాతినిధ్య సంస్థలను ప్రవేశపెట్టాలని సూచించింది.

ప్రశ్న 2.
అశోక్ మెహతా కమిటి.
జవాబు.
మోరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా వ్యవస్థలను బలోపేతం చేయడానికి 1978లో 13
ప్రభుత్వం 1977లో అశోక్ మెహతా నాయకత్వంలో పంచాయతీరాజ్. సూచనలతో తన నివేదికను సమర్పించింది. అందులో ముఖ్యమైనవి.

  1. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో రెండంచెల వ్యవస్థను అమలుచేయాలి. అవి జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్, దిగువ స్థాయిలో వివిధ గ్రామాలతో కూడిన మండల పరిషత్.
  2. జిల్లాస్థాయిలో జిల్లాపరిషత్ కార్యనిర్వాహక వ్యవస్థగా పనిచేస్తుంది. జిల్లాస్థాయిలో అన్ని రకాల ప్రణాళికల రూపకల్పన, అమలు కోసం బాధ్యత వహిస్తుంది.

ప్రశ్న 3.
ఎల్.ఎం. సింఘ్వి కమిటి.
జవాబు.
‘ప్రజాస్వామ్యం, అభివృద్ధి’ పేరుతో పంచాయతారాజ్ వ్యవస్థలను పునఃనిర్మాణానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో L.M. సింఘ్వి నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. దీని సూచనలు :

  1. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పిస్తూ, పటిష్టంగా అమలుచేయాలి.
  2. పంచాయతీరాజ్ సంస్థలకు స్వేచ్ఛగా, నిర్ణీతకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను రాజ్యాంగంలో పొందుపరచాలి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 4.
ఎన్నికల సంఘం.
జవాబు.
రాష్ట్రంలో పంచాయితీరాజ్ సంస్థల మరియు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, ఓటర్ల జాబితా మొదలగు అంశాలను స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్వహించడానికి రాజ్యాంగ ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గవర్నర్ నియమిస్తాడు.

ప్రశ్న 5.
రాష్ట్ర ఆర్థిక సంఘం.
జవాబు.
73 మరియు 74వ రాజ్యాంగ సవరణ చట్టములలో అధికరణలు 243-I మరియు 243-Y వైల ప్రకారం పంచాయతీల ఆర్థికస్థితి సమీక్షపై ఒక ఆర్థిక సంఘం ఏర్పాటవుతుంది. ఈ ఆర్థిక సంఘం మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితిని కూడా సమీక్షించి, తగిన విధి, విధానాల సూచనతో రాష్ట్ర గవర్నర్కు నివేదికను సమర్పిస్తుంది.

ప్రశ్న 6.
జిల్లా ప్రణాళికా కమిటీ:
జవాబు.
ప్రతి రాష్ట్రం 243 (ZD) ప్రకారం, జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణి కోసం ప్రణాళికలను రూపొందించడం దీని విధి. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవీరీత్యా దీని ఛైర్మన్ గా ఉంటాడు. అదే విధంగా జిల్లా కలెక్టర్ దీనికి కన్వీనర్గా వ్యవహరిస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 7.
గ్రామ పంచాయతీ
జవాబు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీరాజ్ సంస్థలో గ్రామపంచాయతీ పునాది నిర్మాణం వంటిది. ఇది గ్రామ స్థాయిలో శాసన నిర్మాణ వ్యవస్థగా, చర్చాసంబంద సంస్థగా ఉంటుంది. గ్రామ పంచాయతీ నెలకు కనీసం ఒకసారి సమావేశం కావాలి.

గ్రామ పంచాయతీ సమావేశానికి సర్పంచ్ అధ్యక్షతవహిలాస్తారు. అతను లేనిచో ఉప సర్పంచ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. అన్ని రకాల నిర్ణయాలు, తీర్మానాలను గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచ్ కలిపి మెజారిటీ తీర్మానంతో ఆమోదిస్తారు.

ప్రశ్న 8.
గ్రామ సభ.
జవాబు.
ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభ ఏర్పాటవుతుంది. దానిలో గ్రామానికి చెందిన రిజిష్టర్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు. అది సంవత్సరానికి కనీసం మూడుసార్లయినా సమావేశమవుతుంది. గ్రామసభ పంచాయితీకి సంబంధించిన వార్షిక పరిపాలన, ఆడిట్ నివేదికలను పరిశీలించి ఆమోదిస్తుంది.

వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాను ఖరారు చేస్తుంది. సమాజ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు శీఘ్రగతిన అమలులో ఉంచడానికి, ప్రజల భౌతిక సేవలను స్వచ్ఛందంగా వినియోగించుకోవడానికి తగిన సూచనలిస్తుంది.

ప్రశ్న 9.
సర్పంచ్.
జవాబు.
గ్రామంలో సర్పంచ్ ప్రథమ పౌరుడు. ఇతను గ్రామ పంచాయతీకి రాజకీయాధిపతిగా ఉంటాడు. సర్పంచ్ గ్రామంలో రిజిష్టర్ ఓటర్లచే ఎన్నికవుతాడు. ఇతను గ్రామపంచాయతీ, గ్రామ సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. గ్రామ పంచాయతీ, గ్రామ సభ తీర్మానాలను అమలుచేసే బాధ్యతను నిర్వహిస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 10.
పంచాయతీ కార్యదర్శి.
జవాబు.
రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీలో ముఖ్య ప్రభుత్వోద్యోగి. గ్రామ పంచాయతీ పరిపాలనా వ్యవహారాలలో సర్పంచి సహాయంగా ఉంటూ అతని ఆదేశాలకు అనుగుణంగా తన విధులను నిర్వహిస్తాడు. ఇతను గ్రామ పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు హాజరు కావచ్చు.. చర్చల్లో పాల్గొనవచ్చు. సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తాడు. కానీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం మాత్రం లేదు.

ప్రశ్న 11.
మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యుడు (MPTC).
జవాబు.
ప్రతి మండల ప్రజాపరిషత్ ను వివిధ ప్రాదేశిక నియోజక వర్గాలుగా విభజిస్తాడు. ఇందలో 3,000 నుంచి 4,000 మంది జనాభా ఉంటారు. ప్రతి ప్రాదేశిక నియోజక వర్గానికి ఒక్కొక్క ప్రతినిధి ఉంటారు. వారిని MPTC అని అంటారు. మండల ప్రజాపరిషత్లోని ఓటర్లచే రహస్య ఓటింగ్ పద్ధతిలో మీరు ఎన్నికౌతారు.

మండల ప్రజాపరిషత్ భౌగోళిక పరిధిలో ఎక్కడైన ఓటర్గా నమోదై ఉన్న వ్యక్తి ఆ మండంలంలోని ఏ ప్రాదేశిక నియోజక వర్గం నుంచి అయిన MPTC పోటీ చేయవచ్చు. మొత్తం MPTC సీట్లలో కొన్ని స్థానాలు చట్టం నిర్దేశించిన విధంగా SC, ST, BC మరియు మహిళలకు రిజర్వ్ చేస్తారు.

ప్రశ్న 12.
మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు (MPP).
జవాబు.
మండల ప్రజాపరిషత్ రాజకీయాధిపతిగా, ప్రథమ పౌరునిగా MPP వ్యవహరిస్తాడు. ప్రతి మండల ప్రజాపరిషత్కు ఒక అధ్యక్షడు, మరొకరు ఉపాధ్యక్షులుగా ఉంటారు. MPTC లు తమలో ఒకరిని MPP గా, మరొకరిని ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు. మండల ప్రజాపరిషత్ సమావేశాలను ఏర్పరచి, దానికి అధ్యక్షత వహిస్తాడు.

మండల ప్రజాపరిషత్ రికార్డు మొత్తం ఇతని అధీనంలో ఉంటాయి. మండల ప్రజాపరిషత్ తీర్మానాల అమలులో MPDO పై పాలనాపరమైన నియంత్రణను కలిగి ఉంటాడు. మండలాభివృద్ధి అనేది సమర్థతపై ఆధారపడి ఉంటుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 13.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO).
జవాబు.
రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) మండల ప్రజాపరిషత్లో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా వ్యవహరిస్తాడు. మండల ప్రజాపరిషత్ తీర్మానాల అమలు బాధ్యతను కలిగి ఉంటాడు. ప్రభుత్వం ఆదేశించిన ఇతర విధులను కూడా నిర్వర్తించాలి.

మండల పరిధిలోని గ్రామ పంచాయతీలను పర్యవేక్షించే అధికారం ఉంటుంది. మండల ప్రజాపరిషత్ అధ్యక్షుని ఆమోదంతో లేదా ఆదేశానుసారం MPDO నెలకు కనీసం ఒకసారి మండల ప్రజాపరిషత్ సమావేశాలను ఏర్పాటుచేయాలి. MPDO ఈ సమావేశాలకు హాజరు కావచ్చు.

ప్రశ్న 14.
జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ZPTC).
జవాబు.
ప్రతి జిల్లా పరిషత్లో అనేక మండలాలు ఉంటాయి. ప్రతి మండలాన్ని ఒక్కో ప్రాదేశిక నియోజక వర్గంగా ఏర్పాటు చేసి, ఒక్కొక్క దానికి ఒక్కో వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తాడు. వీరిని జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యుడు (ZPTC) అని అంటారు.

ఆయా నియోజక వర్గాలలోని ఓటర్లచే రహస్య ఓటింగ్ ప్రక్రియ ద్వారా ZPTC లు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక పరిధిలో ఓటర్గా నమోదై ఉన్న ఆ జిల్లా ప్రజా పరిషత్ లో ఎక్కడ నుండైన ZPTC గా పోటీచేయవచ్చు. చట్టం నిర్దేశించిన విధంగా SC, ST, BC మరియు మహిళలకు కొన్ని స్థానాలు రిజర్వ్ చేస్తారు.

ప్రశ్న 15.
ముఖ్య కార్యనిర్వాహక అధికారి (CEO).
జవాబు.
రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన ముఖ్య కార్య నిర్వాహక అధికారి (CEO) జిల్లా పరిషత్లో ఉన్నత ప్రభుత్వోద్యోగిగా ఉంటాడు. జిల్లా ప్రజా పరిషత్ తీర్మానాలను అమలుచేయడానికి బాధ్యత వహిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం కాలానుగుణంగా జిల్లా పరిషత్క సంబంధించిన ఇచ్చే ఆదేశాలను కూడా అమలు చేసే బాధ్యతను కలిగి ఉంటాడు.

జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ అనుమతి లేదా ఆదేశంతో జిల్లా ప్రజా పరిషత్ సమావేశాలను CEO నెలకు కనీసం ఒకసారి ఏర్పాటు చేస్తాడు. CEO జిల్లా ప్రజాపరిషత్ సమావేశాలలో, స్థాయి సంఘాల సమావేశాలలో, జిల్లా పరిధిలోని మండల ప్రజాపరిషత్ సమావేశాల్లో పాల్గొనవచ్చు. మాట్లాడవచ్చు. తన అభిప్రాయాన్ని చెప్పవచ్చు. కాని వివిధ తీర్మానాలపై ఓటువేసే హక్కు మాత్రం లేదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 6 స్థానిక ప్రభుత్వాలు

ప్రశ్న 16.
మేయర్.
జవాబు.
నగర పాలక సంస్థ రాజకీయాధినేతగా, ప్రథమ పౌరునిగా మేయర్ ఉంటాడు. ప్రతి నగర పాలక సంస్థల కార్యక్రమాల నిర్వహణకై ఒక మేయర్, డిప్యూటీ మేయర్ ఉంటారు. నగర పాలక సంస్థ ఎన్నికల అనంతరం కార్పొరేటర్స్ తమలో ఒకరిని మేయర్గా, మరొకరిని డిప్యూటీ మేయర్గా ఎన్నుకుంటారు. వీరి ఎన్నికల్లో పదవీరీత్యా సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల రీత్యా మేయర్ పదవి ఖాళీ అయితే నూతన మేయర్ను ఎన్నుకునేంత వరకు డిప్యూటీ మేయర్ ఆ విధులను నిర్వహిస్తాడు.

ప్రశ్న 17.
తెలంగాణ రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్ల పేర్లు రాయండి.
జవాబు.

  1. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్
  2. గ్రేటర్, వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్
  3. కరీంనగర్
  4. ఖమ్మం
  5. నిజామాబాద్
  6. రామగుండం
  7. బడంగ్ పేట్
  8. బండ్లగూడ
  9. మీర్పేట్
  10. బోడుప్పల్
  11. జవహర్ నగర్
  12. ఫీర్ణాధీగూడ
  13. నిజాంపేట

TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 3rd Lesson నా సాహిత్య పరిశోధన Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 3rd Lesson నా సాహిత్య పరిశోధన

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
బిరుదురాజు రామరాజు సాహిత్య పరిశోధనలను తెలుపండి.
జవాబు:
బిరుదురాజు రామరాజు ప్రారంభ కాలంలో కొన్ని గేయాలు, పద్యాలు, నవలలు రాశారు. ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసాల్లో మొదటి రెండు తక్కువగా ఉన్నాయనుకొని సృజనాత్మక సాహిత్యరంగంలో రాణింపు రాదని భావించారు. గుర్తింపు కోసం లోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో పరిశోధనను ప్రారంభించారు. బి. రామరాజు ఉద్యోగంలో ఉన్నప్పుడే వరంగల్ స్నాతకోత్తర కేంద్రం తెలుగు శాఖకు విమర్శని పేరుతో, ఉస్మానియా తెలుగు శాఖకు వివేచన అనే పేరుతో రీసెర్చ్ జర్నల్స్ ప్రకటించే ఏర్పాటు చేసి అందుకు కావలసిన ఆర్థిక వనరులు యూనివర్సిటీ బడ్జెట్లోనే పొందుపరిచేటట్లు చూశారు.

బిరుదురాజు రామరాజు హైస్కూలు విద్యార్థిగా ఉండినప్పటి నుంచే భారతి మొదలైన పత్రికల్లో మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభారక శాస్త్రి, నిడదవోలు వేంకటరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి పరిశోధకులు వ్యాసాలు, వారు సంపాదకత్వం వహించిన గ్రంథాల పీఠికలు చదివారు. అందువల్ల వారిలాగ ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టారు. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో తెలుగు జానపదగేయ సాహిత్యము అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథమైనది.

ఆ రంగంలో అనేక జానపద గేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్ ఇన్టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. అముద్రితంగా పడిఉన్న తెలుగు సంస్కృత రచనలు దాదాపు నూరు మొదటి సారి సాహిత్య ప్రపంచానికి తెలియపరిచారు. మరుగు పడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులు ఇతర ప్రత్యేక సంచికల్లో ప్రకటించిన వ్యాసాలు ఈ కోవకు చెందినవే.

సంస్కృత సాహిత్యానికి రామరాజు కృషి : సంస్కృతంలో కాళహస్తి కవి రచించిన వసుచరిత్రం, మధురవాణి రచించిన రామాయణ సారతిలకం, అభినవ కాళిదాసు వెల్లాల ఉమామహేశ్వరుల శృంగార శేఖర భాణం, శ్రీకృష్ణదేవరాయల జాంబవతీపరిణయ నాటకం మొదటిసారిగా పరిష్కరించి ప్రకటించారు.

ఇంకా కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి ఉషా రాగోదయం, బెల్లంకొండ రామారావుగారి రుక్మిణీ కల్యాణం, తిరుమల బుక్కపట్టణం, అణయాచార్యుల రసోదారభాణం, భారద్వాజ రామాచార్యుల భద్రగిరి చంపూ, ఓరుగంటి లక్ష్మణ యజ్వ సీతారామ విహారం (ఉ.వి. సంస్కృత అకాడమీ పక్షాన అర్యేంద్రశర్మగారి పేరుతో ప్రకటితం) పరశురామపంతుల అనంతరామయ్య సీతావిజయ చంపూ వంటి సంస్కృత కృతులు పరిష్కరించారు.

తెలుగు సాహిత్యానికి రామరాజు చేసిన కృషి : తెలుగులో బొడ్డుచెర్ల చినతిమ్మకవి ప్రసన్న రాఘవనాట్య ప్రబంధం, చింతలపల్లి ఛాయాపతి రాఘవాభ్యుదయం, సాయప వెంకటాద్రి నాయకుని సకలజీవ సంజీవనం, పాల్కురికి సోమనాథుని పండితారాధ్యోదాహరణం మొదటిసారి పరిష్కరించి ప్రకటించారు. శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్యం సంపూర్ణ గ్రంథం సంపాదించి పరిష్కరించి ప్రకటించారు. మడికి సింగన పద్మపురాణం, పాలవేకరి కదరీపతిరాజు శుకసప్తతి, సంశోధిత ముద్రణలు విపులమైన పీఠికలతో ప్రకటించారు. ఈ రెండు గ్రంథాల్లోని వందల సంఖ్యలో తప్పుడు పాఠాలు సవరించి చూపారు.

ఇంటర్ దాకా చదివిన ఉర్దూ సార్ధకమయ్యే విధంగా ఉర్దూ తెలుగు నిఘంటువును రాశారు. ఇంగ్లీషు నుంచి, హిందీ నుంచి నాలుగు గ్రంథాలు తెలుగులోనికి అనువదించారు. 38 మంది పరిశోధకులు రామరాజు పర్యవేక్షణలో ఎం.ఫిల్, పిహెచ్. పట్టాలు సంపాదించుకున్నారు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన

ప్రశ్న 2.
జానపద గేయాలు సేకరించడంలో బిరుదురాజు అనుభవాలు ఎలాంటివి ?
జవాబు:
జానపద గేయాలు సేకరించినప్పటి అనుభవాలు : బిరుదురాజు రామరాజు సాహిత్యలోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టారు. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో తెలుగు జానపదగేయ సాహిత్యము అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథమైనది.

ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెన్ ఇన్ టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. జానపద గేయాలు సేకరించిన రామరాజు అనుభవాలు కూడా ఆసక్తిదాయంగా ఉన్నాయి.

తెలంగాణ అంతటా తిరిగి 1953-1955 సంవత్సరాల మధ్య జానపద గేయాలు తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు సేకరించారు. ఆ రోజుల్లో పల్లెటూళ్ళకు బస్సులు లేవు, జిల్లా, తాలూకా కేంద్రాల నుండి కొన్ని చోట్లకు నడచి కొన్ని చోట్లకు సైకిల్ పైన, కొన్నిచోట్లకు ఎడ్లబండి పైన పోయి గేయాలు సేకరించారు. స్త్రీలకు రవిక ముక్కలు, పురుషులకు బీడీలు, చుట్టలు, కల్లుకు పైసలు ఇచ్చి గేయాలు పాడించి రాసుకున్నారు.

నల్గొండ జిల్లా నకిరేకల్లు గ్రామంలో కోలాటం పాటలు పాడేవారున్నారని విని అక్కడకు పోతే అక్కడి యువకులు సహకరించలేదు. రామరాజుకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ చేత బలవంతాన పట్టి తెప్పించి రాత్రి 11 గంటల నుండి ఒంటిగంట దాకా కోలాటాలు వేయించారు. ఇద్దరు యువకులు ఎదురు తిరిగితే పోలీసు సి.ఐ. వాళ్ళను కొట్టాడు కూడా. ఆ తెల్లవారి వారి ఇంటికి వెళ్ళి క్షమార్పణ చెప్పి డబ్బులిచ్చాడు. అట్లా బలవంతాన పాడించటం తప్పే అని తెలిసి కూడా చేసినందుకు బాధపడ్డాడు. గాయక భిక్షుకులు డబ్బులు, పాతబట్టలిస్తే సంతోషంగా గేయగాథలు పాడేవాళ్ళు. కాని ఫోటోలు తీయనిచ్చేవారు కాదు.

ఫోటోలు తీస్తే వాళ్ళ కంఠమాధుర్యం పోతుందని వారి భావన. వారికి నచ్చచెప్పి డబ్బులిచ్చి గాయక భిక్షుకుల ఫొటోలు తీసుకున్నారు. తాళపత్రాలకోసం ఒక వేసవిలో కరీంనగరం జిల్లా ఎల్లారెడ్డి పేటకు నడచిపోయి ఎండ తీవ్రతకు తట్టుకోలేక సొమ్మసిల్లి ఊరి బయట కొట్టం వద్ద, మూర్చపోయారు. కొట్టం యజమాని బలిజాయన మంచినీళ్ళు, పాలు ఇచ్చాడు. రెండు రూపాయలిస్తే బండి కట్టాడు. ఆ నారాయణపురం పోయి మురళీధరశర్మ అనే ఆయన దగ్గర బస్తా (సంచి) నిండా తాళపత్ర గ్రంథాలు తీసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో వీరమ్మ-శివరాజం అనే ఆ బలిజ దంపతులే నీళ్ళచారు అన్నం పెట్టి బస్సెక్కించారు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
జానపద సాహిత్య పరిశోధనలో బిరుదురాజు ముద్ర ఎట్టిది ? (Imp) (M.P.)
జవాబు:
బిరుదురాజు రామరాజు సాహిత్యలోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలోకి అడుగు పెట్టారు. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో “తెలుగు జానపదగేయ సాహిత్యము” అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథం. ఆ రంగంలో అనేక జానపద గేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు.

ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెస్ ఇన్ టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. జానపద గేయాలు సేకరించిన రామరాజు అనుభవాలు కూడా ఆసక్తిదాయకంగా ఉన్నాయి. తెలంగాణ అంతటా తిరిగి 1953-1955 సంవత్సరాల మధ్య జానపద గేయాలు తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు సేకరించారు.

ప్రశ్న 2.
ఆంధ్రుల సంస్కృత సాహిత్యానికి బిరుదురాజు చేసిన కృషి తెలుపండి.
జవాబు:
బిరుదురాజు రామరాజు సంస్కృతంలో కృషిచేసిన తెలుగు వారి గురించి ప్రపంచానికి తెలిపారు. కాళహస్తి కవి రచించిన వసుచరిత్రం, మధురవాణి రచించిన రామాయణ సారతిలకం, అభినవ కాళిదాసు బిరుదాంకితుడైన వెల్లాల ఉమామహేశ్వరుల శృంగార శేఖర భాణం, శ్రీకృష్ణదేవరాయల జాంబవతీ పరిణయ నాటకం మొదటిసారిగా పరిష్కరించి ప్రకటించారు.

ఇంకా కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి ఉషా రాగోదయం, బెల్లంకొండ రామారావుగారి రుక్మిణీ కల్యాణం తిరుమల బుక్కపట్టణం, అణయాచార్యులు రసోదార భాణం, భారద్వాజ రామాచార్యులు భద్రగిరి చంపూ, ఓరుగంటి లక్ష్మణ యజ్వ సీతారామ విహారం, పరశురామపంతుల అనంతరామయ్య సీతావిజయ చంపూ వంటి సంస్కృత కృతులను పరిష్కరించి సాహిత్య చరిత్రలో వారి పేర్లకు చిరస్థాయి నందించారు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన

ప్రశ్న 3.
విశ్వవిద్యాలయ ఆచార్యులుగా బిరుదురాజు రామరాజు సేవ ఎలాంటిది ?
జవాబు:
బి. రామరాజు ఉద్యోగంలో ఉన్నప్పుడు వరంగల్ స్నాతకోత్తర కేంద్రం తెలుగుశాఖకు విమర్శని పేరుతో, ఉస్మానియా తెలుగు శాఖకు వివేచన అనే పేరుతో రీసెర్చ్ జర్నల్స్ ప్రకటించే ఏర్పాటు చేశారు. అందుకు కావలసిన ఆర్థిక వనరులు యూనివర్సిటీ బడ్జెట్లోనే పొందుపరిచేటట్లు చూశారు. జానపద విజ్ఞానంలో దాక్షిణాత్య విశ్వవిద్యాలయాలలో మొదటిసారి సమ్మర్ కోర్సు నిర్వహించారు. ఏడవ అఖిలభారత జానపద విజ్ఞానసదస్సు తెలుగుశాఖ పక్షాన నిర్వహించాడు. 1978లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వత్రోత్సవాల (అరవై ఏళ్ళ ఉత్సవం) సందర్భంగా “బోధన భాషగా తెలుగు” అనే సదస్సును నిర్వహించాడు.

వరంగల్ పి.జి. సెంటర్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు చిన్నప్పుడు ఈతకొట్టిన బాలసముద్రం వైపు సరదాగా తిరగడానికి వెళ్ళాడు. అక్కడ నరసముద్రం కోసం ఆ జలసముద్రం పాడు చేస్తున్నారు.

ఆ చెఱువుకట్ట గండిలో గణపతి దేవ చక్రవర్తి మంత్రి వేయించిన శాసనం సగం విరిగిన ముక్క లభిస్తే దానిని పి.జి. సెంటర్ తెలుగు శాఖ ముందు ప్రతిష్ఠించి జిల్లా కలెక్టరుకు, ఆర్షశాఖ డైరెక్టరుకు తెలియపరచారు. ఎం.ఏ. తెలుగు విద్యార్థులకు ఆ శాసనం ఆధారంగా శాసనలిపి చదివే విధానం. శాసనం తీసే విధానం ప్రాక్టికల్గా నేర్పించారు. ఆంధ్రలిపి పరిణామం తెలిపే లిపి బొమ్మలు ఛార్జ్ ఫోటోలు తీయించి ముందుగా ఎం.ఏ. తెలుగు క్లాసురూంలో, తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో పెట్టించారు.

ప్రశ్న 4.
బిరుదురాజు మల్లినాధసూరి తాళపత్ర గ్రంథాలు ఎట్లా సంపాదించాడు ?
జవాబు:
తెలుగుజాతికి గర్వకారణం తొలి మహామహోపాధ్యాయుడు కోలాచలం మల్లినాథసూరి. ఆయన స్వగ్రామం మెదక్ జిల్లాలోని కొలిచెలమ. అక్కడి కొలిచెలిమ వారింట్లో తాళపత్ర గ్రంథాలున్నాయని తెలిసి తన మిత్రుడు తహసీల్దార్ సి. హెచ్. కొండయ్యతో కలిసి వెళ్లి అమూల్యమైన తాళపత్ర గ్రంథాలు తెచ్చుకున్నారు. అంతటితో సంతృప్తి పడక వారి పూజాగృహంలో పెట్టుకున్న మల్లినాథసూరి ఘంటాలు చూచి కన్నుల కద్దుకొని వాటిని తనకివ్వండని డబ్బు ఇవ్వబోయారు. కాని అవి తరతరాల నుండి పూజాద్రవ్యాలుగా ఉన్నాయని చెప్పి వారు ఇవ్వలేదు.

తమకున్న రెండెకరాల పొలం అక్కడి భూస్వామి దున్నుతూ నామమాత్రపు కౌలు ఇస్తున్నాడనీ, భూమి తమ జీవనాధారమనీ కంటతడి పెట్టడం చూసి తన మిత్రుడు కొండయ్య సహకారంతో ఆ భూస్వామిని ఒప్పించి, భూమిని పురోహితునికి ఇప్పించారు. ఆ పురోహితుడు మల్లినాథ సూరి రెండు ఘంటాలను బిరుదురాజు రామరాజుకు ఇచ్చాడు.

III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బిరుదురాజు రామరాజు స్వగ్రామమేది ?
జవాబు:
వరంగ్ జిల్లా దేవునూరు.

ప్రశ్న 2.
బిరుదురాజు రామరాజు పిహెచ్.డి గ్రంథం పేరేమి ?
జవాబు:
తెలుగు జానపద గేయ సాహిత్యం.

ప్రశ్న 3.
పరిణతవాణి పేరుతో ప్రసంగాలు ఏర్పాటుచేసిన సంస్థ ఏది ?
జవాబు:
ఆంధ్ర సారస్వత పరిషత్తు.

ప్రశ్న 4.
రామరాజు చిన్నప్పటినుండి ఎటువంటి భావాలు ప్రోది చేసుకున్నాడు ?
జవాబు:
దేశభక్తి భావాలు.

ప్రశ్న 5.
బిరుదురాజు రామరాజు ఎవరి పరిశోధనలను ఆదర్శంగా పెట్టుకున్నాడు ?
జవాబు:
మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడదవోలు వేంకటరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ.

ప్రశ్న 6.
ఉస్మానియా విశ్వవిద్యాలయం (1978) వత్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన సదస్సు ఏది ?
జవాబు:
భోదనా భాషగా తెలుగు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన

ప్రశ్న 7.
తెలుగుజాతికి గర్వకారణమైన తొలి మహామహోపాధ్యాయుడు ఎవరు ?
జవాబు:
శ్రీ కోలాచలం మల్లినాథ సూరి.

ప్రశ్న 8.
బిరుదురాజు సాహిత్య వ్యాసంగం ఏ గేయంతో ప్రారంభమైంది ?
జవాబు:
ఆంధ్రుడా ! ఓ ఆంధ్రుడా !

కఠిన పదాలకు అర్ధములు

55వ పుట

అధ్యాపకుడు = ఉపన్యాసకుడు, లెక్చరర్ (ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటున్నారు)
రీడర్ = అసోసియేట్ ప్రొఫెసర్
ఆచార్యుడు = ప్రొఫెసర్
డీన్ = పీఠాధిపతి
మార్గదర్శకుడు = ఆదర్శప్రాయుడు
తాళపత్ర గ్రంథాలు = తాటి ఆకులపై రాసిన పుస్తకాల
శిలా శాసనాలు = రాళ్ళపై చెక్కిన చట్టాలు, సమాచారం

56వ పుట

భవిష్యత్ తరాలకు = రాబోయే తరాలకు
పరిణతవాణి = (ఇక్కడ కార్యక్రమం పేరు), అనుభవజ్ఞుల మాట
ప్రసంగాలు = ఉపన్యాసాలు
తలచడం = అనుకోవడం
దైవమొకటి = దైవం మరొకటి
ఆశించినవి = కోరుకున్నవి
ప్రసాదించిన = ఇచ్చిన
ఆసక్తి = ఇష్టం
కృషి = శ్రమ, పని
ప్రోది = పోషించు, పెంచు
విలాయత్ = విదేశాలకు
ఐ.సి.ఎస్. = (ఇండియన్ సివిల్ సర్వీసెస్) ఇప్పటి ఐ.ఏ.ఎస్ లాంటి విద్య
దైవ + ఇచ్చ = దేవుని కోరిక
ప్రతిభా = పుట్టుకతో వచ్చిన తెలివి
వ్యుత్పత్తి = పాండిత్య౦
అభ్యాసం = సాధన
రాణింపు = గుర్తింపు
కొత్త పుంతలు = నూతన మార్గాలు
కృతకృత్యుడు = విజయం సాధించినవాడు
అభిరుచి = ఇష్టం
అరుదు = తక్కువ
దాక్షిణాత్య = దక్షిణ భారత
ప్రథముడు = మొదటివాడు
మధ్యకాలీన = మధ్యయుగం నాటి
కృతులు = రచనలు
పరిష్కరించి = తప్పొప్పులను సవరించి
ప్రకటించు = ప్రచురించు
సాటి = సమానమైన
తోటివారు = వెంట ఉన్నవాళ్ళు

57వ పుట

మెప్పు = పొగడ్త, గౌరవం
దృష్టి సోకని = కనిపించని
శ్రమించినట్లు = కృషి చేసినట్లు
థీసిస్ = పరిశోధనా గ్రంథం
అముద్రిత = ప్రచురించబడని
ఎమిరిటస్ ప్రొఫెసర్ = గౌరవ ఆచార్యుడు
సర్వేక్షణం = సర్వే చేయించడం, సేకరించడం
స్నాతకోత్తర = పోస్ట్ గ్రాడ్యుయేట్
రీసర్చ్ జర్నల్ = పరిశోధన పత్రిక
ఆర్థిక వనరులు = డబ్బుకు సంబంధించిన వనరులు
పక్షాన = తరపున
వత్రోత్సవాలు = అరవై సంవత్సరాల సందర్భంగా నిర్వహించే ఉత్సాహం
సదస్సు = సమావేశం
సంగ్రహంగా = క్లుప్తంగా, తక్కువగా
మనవి చేస్తాను = చెప్తాను
సంపాదించిన = సంపాదకత్వం వహించిన
పీఠికలు = ముందుమాటలు

58వ పుట

జానపద గేయ సంకలనం = జానపద గేయాలతో కూడిన పుస్తకం
ఎరుక పరచడం = తెలియజేయడం
మరుగు = కనపడకుండా
చరితార్థులు = చరిత్రను సృష్టించిన వారు, గొప్పవారు
సంచిక = ప్రత్యేక పుస్తకం
ఈ కోవకు = ఈ పద్ధతికి
పాఠాలు = ఒక గ్రంథానికి చెందిన వేరు వేరు తాళపత్రాలలో వేరు వేరుగా ఉన్న విషయాలు
నిఘంటువు = అక్షర క్రమంలో పదాల అర్థాలను సూచించే పుస్తకం
కూర్చడం = తయారుచేయడం
అనువాదం = భాషాంతరీకరణ

59వ పుట

గేయాలు = పాటలు
రవిక కనుములు =
జాకెట్ పీస్లలు, స్త్రీల వస్త్ర విశేషం
క్షమార్పణ = క్షమాపణ, మన్నించమనడం
గాయక భిక్షుకులు = పాటలుపాడి అడుక్కునే వారు
పాత గుడ్డలు = పాత బట్టలు
వేసవి = ఎండాకాలం
సొమ్మసిల్లి = స్పృహ తప్పి
బలిజాయన = బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆయన (శైవుడు)
బస్తేడు = సంచి నిండా
ఆర్ష శాక = ఇప్పటి దేవాదాయ శాఖ వంటిది
లిపి = రాసే విధానం
తొలి పాఠాలు = మొదటిసారి నేర్చుకున్నవి, ప్రాథమిక అంశాలు
ఏటవాలులో = ఒక పక్క వంపులో
నూరడం = మొనతేల్చడానికి రాయడం
వరాహ లాంచనం = పంది గుర్తు
సత్యం + అప్రియం = అప్రియమైన (బాధ కలిగించే) సత్యాన్ని
న బ్రూయాత్ = చెప్పకూడదు

TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన

60వ పుట

లెదర్ పాడ్ = శాసనాల అధ్యయనానికి ఉపయోగించే తోలు సంచి
మంది మార్బలం = ఎక్కువ మందితో
బ్రహ్మరథం (జాతీయం) = అధిక గౌరవం
వాహ్యాళి = సరదాగా తిరగడం, విహారం
గండి = చేరుకట్టకు పడిన రంధ్రం.
ప్రతిష్ఠించి = స్థాపించి
లిపి పరిణామం = రాత మారిన విధానం
తహసీల్దార్ = ఒక తాలూకాకు ఉన్నతాధికారి
పూజాగృహ = పూజగది
ఘంటాలు = తాళపత్రాలపై రాయడానికి వాడే ఇనుప కలాలు
కన్నులకద్దుకొని (జాతీయం) = నమస్కరించి
పూజాద్రవ్యం = పూజింపదగిన సామాగ్రి
నామమాత్రపు (జాతీయం) = అతి తక్కువ
కౌలు = వ్యవసాయ భూమి వినియోగించుకున్నందుకు భూ యజమానికి ఇచ్చే మొత్తం
కంటతడి (జాతీయం) = ఏడవడం
ఉపాయశాలి = ఉపాయం గల వ్యక్తి
పురోహితుడు = పూజారి, బ్రాహ్మణుడు
ఓరియంటల్ కాన్ఫరెన్సు = భాషాపరమైన సమావేశం

61వ పుట

అమూల్య = వెలకట్టలేని
వరివస్య = సేవ
భగవత్ + ఇష్టమే = భగవంతుని ఇష్టం
నమస్సులు = నమస్కారాలు

నా సాహిత్య పరిశోధన Summary in Telugu

రచయిత పరిచయం

TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన 1

పాఠం పేరు : నా సాహిత్య పరిశోధన
దేని నుండి ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించిన పరిణత వాణి కార్యక్రమంలో
గ్రహింపబడినది : ఉపన్యాసం
రచయిత పేరు : ఆచార్య బిరుదురాజు రామరాజు
రచయిత కాలం : జననం : ఏప్రిల్ 16, 1925, మరణం : ఫిబ్రవరి 8, 2010
రచయిత స్వస్థలం : వరంగల్ జిల్లా దేవునూరు
తల్లిదండ్రులు : లక్ష్మీదేవమ్మ, నారాయణరాజు
చదువు : నిజాం కళాశాలలో బి.ఏ., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., పిహెచ్.డి.
పరిశోధనాంశం : : తెలుగు జానపద గేయసాహిత్యం
పరిశోధన పర్యవేక్షణ : ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం

ఉద్యోగం : 1952లో ఉస్మానియా తెలుగుశాఖలో అధ్యాపకుడు. 1973 నుంచి 1983 వరకు తెలుగు శాఖాధ్యక్షుడిగా ఉన్నారు. 1967 నుంచి 1974 వరకు వరంగల్ స్నాతకోత్తర పని చేశారు. 1978 నుంచి 1982 మధ్య ఆర్ట్స్ విభాగం పీఠాధిపతిగా ఉన్నారు. 1980 నుంచి 1981 వరకు నేషనల్ లెక్చరర్గా ఉన్నారు. 1983లో పదవీ విరమణ చేశారు.
తెలుగు రచనలు : ‘మరుగు పడిన మాణిక్యాలు’ ‘చరిత్రకెక్కని చరితార్థులు’, ఎన్నో జానపద గేయ సంకలనాలు.
ఆంగ్ల రచనలు : ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెస్ ఇన్టూ తెలుగు ఫోక్లోర్.
జానపద గేయ సాహిత్యం : వీరి తెలుగు జానపద గేయసాహిత్యం అనే పరిశోధన దక్షిణ భారతదేశభాషల్లోనే మొదటి జానపద సాహిత్య పరిశోధన.

గ్రంథాలు : బిరుదు రామరాజు వందలకొద్దీ జానపద గేయాలను, అనేక తాళపత్ర గ్రంథాలను, శిలాశాసనాలను సేకరించాడు. ప్రాచీన కావ్యాలను పరిష్కరించాడు. ఆంధ్రదేశంలోని యోగుల చరిత్రలను సేకరించి పుస్తకాలుగా వెలువరించాడు.
‘జాతీయాచార్య’ పదవి : ఈయన చేసిన సాంస్కృతిక సేవకుగాను ‘జాతీయాచార్య’ పదవి లభించింది.

పాఠ్యభాగ నేపథ్యం

సాహిత్యరంగంలో 70 ఏండ్లు పైబడిన వారి జీవిత విశేషాలు, అనుభవాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉంటాయనే ఉద్దేశంతో ఆంధ్రసారస్వత పరిషత్తు పరిణతవాణి అనే పేరుతో ప్రసంగాలు ఏర్పాటుచేసింది. అందులో భాగంలో 27 జులై 1995న ఆచార్య బిరుదురాజు రామరాజు చేసిన ప్రసంగమే ప్రస్తుత పాఠ్యాంశం.
ఇది ప్రసంగ వ్యాసం కాబట్టి ఉత్తమపురుషలో ఉంది. వారి భావాలను అర్థంచేసుకోవడానికి ప్రథమ పురుషలోకి మార్చి సారాంశాన్ని అందిస్తున్నాం.

పాఠ్యభాగ సారాంశం

అంతా దైవ నిర్ణయమే : తెలుగులో “తానొకటి తలచిన దైవమొకటి తలచును” అనీ, ఇంగ్లీషులో “మాన్ ప్రపోజెస్ (బట్) గాడ్ డిస్పోజెస్” అనే సామెతలున్నాయి. ఆ సామెతలు తనకోసమే పుట్టాయని, తన జీవితంలో చాలావరకు దైవమనుకున్నవే జరిగాయని బిరుదురాజు రామరాజు అన్నారు. అందువలన దైవం ప్రసాదించిన వాటిలోనే తన ఆసక్తిని పెంచుకొని కృషి చేశాడు. చిన్నప్పటి నుంచి దేశభక్తి భావాలు పెంచుకుని రాజకీయాల్లోకి పోదామనుకున్నాడు. వారి పెద్దలు తనను విదేశాలకు పంపించి ఐ.సి.ఎస్. చేయించాలనుకున్నారు. దైవం తెలుగు పంతుల్ని చేస్తే, దైవేచ్ఛనే తనయిష్టంగా మలచుకొని తెలుగు సాహిత్యరంగంలో స్థిరపడ్డాడు.

జానపద సాహిత్య పరిశోధనకు కారణాలు : బిరుదురాజు రామరాజు ప్రారంభ కాలంలో కొన్ని గేయాలు, పద్యాలు, నవలలు రాశారు. ప్రతిభా, వ్యుత్పత్తి అభ్యాసాల్లో మొదటి రెండు తక్కువగా ఉన్నాయనుకొని సృజనాత్మక సాహిత్యరంగంలో రాణింపు రాదని భావించారు. మంచి గుర్తింపు కోసం లోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో పరిశోధనను ప్రారంభించారు. కొత్త మార్గంలో కృషి చేసి గుర్తింపు పొందవచ్చునని జానపద విజ్ఞాన రంగంలో పరిశోధన ప్రారంభించి విజయం సాధించాడు. జానపద గేయాలతోపాటు వందల సంఖ్యలో తాళపత్ర గ్రంథాలు, పదుల సంఖ్యలో శిలాశాసనాలు సేకరించారు.

వారి తరం యూనివర్సిటీ తెలుగు అధ్యాపకుల్లో తాళపత్ర గ్రంథాల్లో, శాసనాల్లో అభిరుచిగల వాళ్ళు తక్కువ. కావున ఆ కృషి కూడా మంచి ఫలితాలను ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించేలా చేసింది. ఈ విధంగా విశ్వవిద్యాలయ స్థాయిలో జానపద విజ్ఞానంలో దాక్షిణాత్య సాహిత్యభాషల్లో పరిశోధన చేసిన వారిలో మొదటివాడుగా గుర్తింపు పొందారు.

జానపద సాహిత్య సేవలో బి. రామరాజు : మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడుదవోలు వేంకటరావు వంటి పెద్దల పరిశోధనలు ఆదర్శంగా పెట్టుకొని సాహిత్య చరిత్రలకెక్కని ప్రాచీన మధ్యకాలంనాటి దాదాపు వంద తెలుగు, సంస్కృత కావ్యాలను మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. అంతవరకు వెలుగు చూడని తెలుగు, సంస్కృత గ్రంథాలు పన్నెండు వరకు పరిష్కరించి ప్రకటించారు. ఈ రంగంలో సాటివారిలో, తోటివారిలో ఎవరూ చేయని పని చేసినందుకు పెద్దల మెప్పు పొందారు.

జానపద సాహిత్యం కోసం తాళపత్ర గ్రంథాల సేకరణ కోసం పల్లెటూళ్ళు తిరిగినపుడే ఇంతకు పూర్వం చారిత్రకుల దృష్టి సోకని క్రొత్త శిలాశాసనాలు నాలుగైదు కనుగొన్నాడు. జానపద గేయ సాహిత్యం గూర్చి శ్రమించినట్లే ఆంధ్రుల సంస్కృత సాహిత్య సేవ గురించి శ్రమించాడు. వాటినన్నిటిని గూర్చి సంస్కృత పరిశోధనా గ్రంథంలో రాశాడు. మద్రాసు, తంజావూరు, కాకినాడ, విశాఖపట్నాలలో ఉన్న తాళపత్ర గ్రంథాల్లోని ‘ఆంధ్రుల అముద్రిత సంస్కృత కృతుల పరిచయం కూడా చేశాడు.

1978-1982 మధ్యకాలం కళ పీఠాధిపతిగా ఉన్నప్పుడు, 1980-1981 యు.జి.సి. నేషనల్ లెక్చరర్ కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా ఐదు ప్రముఖ విశ్వవిద్యాలయాలలో తెలుగు జానపద సాహిత్యం గురించి ప్రసంగాలు చేశారు. రిటైర్ అయిన తరువాత ఉస్మానియా, యు.జి.సి. ఎమిరిటస్ ప్రొఫెసర్ గా ఉండి ఫోక్లోర్ సర్వే ఆఫ్ తెలంగాణ అనే ప్రాజెక్టును నిర్వహించారు. ఓరుగల్లు మండలం జానపద విజ్ఞానం సర్వేక్షణం కూడా చేయించారు.

బి. రామరాజు ఉద్యోగంలో ఉన్నప్పుడే వరంగల్ స్నాతకోత్తర కేంద్రం తెలుగు శాఖకు విమర్శని పేరుతో, ఉస్మానియా తెలుగు శాఖకు వివేచన అనే పేరుతో రీసెర్చ్ జర్నల్స్ ప్రకటించే ఏర్పాటు చేసి, దానికి కావలసిన ఆర్థిక వనరులు యూనివర్సిటీ బడ్జెట్లోనే పొందుపరిచేటట్లు చేశారు. జానపద విజ్ఞానంలో దాక్షిణాత్య విశ్వవిద్యాలయాలలో మొదటిసారి సమ్మర్ కోర్సు నిర్వహించారు. ఏడవ అఖిలభారత జానపద విజ్ఞానసదస్సు తెలుగు శాఖ పక్షాన నిర్వహించాడు. 1978లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్రోత్సవాల (అరవై ఏళ్ళ ఉత్సవం) సందర్భంగా “బోధన భాషగా తెలుగు” అనే సదస్సును నిర్వహించాడు.

బిరుదురాజు రామరాజు హైస్కూలు విద్యార్థిగా ఉండినప్పటి నుంచే భారతి మొదలైన పత్రికల్లో మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడుదవోలు వేంకటరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి పరిశోధకుల వ్యాసాలు, వారు సంపాదకత్వం వహించిన గ్రంథాల పీఠికలు చదివారు. అందువల్ల వారిలాగ ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టారు.

జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో తెలుగు జానపదగేయ సాహిత్యము అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథమైనది. ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు.

ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెస్ ఇన్టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. మరుగు పడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులతో పాటు ఇతర ప్రత్యేక సంచికల్లో ప్రకటించిన వ్యాసాల ద్వారా అముద్రితంగా పడిఉన్న తెలుగు సంస్కృత రచనలు దాదాపు వందకుపైగా మొదటిసారి సాహిత్య ప్రపంచానికి తెలియచేశారు.

సంస్కృత సాహిత్యానికి రామరాజు కృషి: సంస్కృతంలో కాళహస్తి కవి రచించిన వసుచరిత్రం, మధురవాణి రచించిన రామాయణ సారతిలకం, అభినవ కాళిదాసు వెల్లాల ఉమామహేశ్వరుడు రాసిన శృంగార శేఖర భాణం, శ్రీకృష్ణదేవరాయల జాంబవతీపరిణయ నాటకం మొదటిసారిగా పరిష్కరించి ప్రకటించారు. ఇంకా కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి ఉషా రాగోదయం, బెల్లంకొండ రామారావు రాసిన రుక్మిణీ కల్యాణం, తిరుమల బుక్కపట్టణం, అణయాచార్యుల రసోదార భాణం, భారద్వాజ రామాచార్యులు భద్రగిరి చంపూ, ఓరుగంటి లక్ష్మణ యజ్వ సీతారామ విహారం, పరశురామ పంతుల అనంత రామయ్య సీతావిజయ చంపూ వంటి సంస్కృత కృతులు పరిష్కరించారు.

తెలుగు సాహిత్యానికి రామరాజు చేసిన కృషి : తెలుగులో బొడ్డుచెర్ల చినతిమ్మకవి ప్రసన్నరాఘవ నాట్య ప్రబంధం, చింతలపల్లి ఛాయాపతి రాఘవాభ్యుదయం, సాయప వెంకటాద్రి నాయకుని సకలజీవ సంజీవనం, పాల్కురికి సోమనాథుని పండితారాధ్యోదాహరణం మొదటిసారి పరిష్కరించి ప్రకటించారు. శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్యం, సంపూర్ణ గ్రంథం సంపాదించి పరిష్కరించి ప్రకటించారు. మడికి సింగన పద్మపురాణం, పాలవేకరి కదరీపతిరాజు శుకసప్తతి సంశోధిత ముద్రణలు విపులమైన పీఠికలతో ప్రకటించారు.

ఈ రెండు గ్రంథాల్లోని వందల సంఖ్యలో తప్పుడు పాఠాలు సవరించి చూపారు. ఇంటర్ వరకు ఉర్దూ నేర్చుకున్నందున ఉర్దూ – తెలుగు నిఘంటువును రాశారు. ఇంగ్లీషు, హిందీల నుంచి నాలుగు గ్రంథాలు తెలుగులోనికి అనువదించారు. 38 మంది పరిశోధకులు రామరాజు పర్యవేక్షణలో ఎం.ఫిల్., పిహెచ్.డి పట్టాలు సంపాదించుకున్నారు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన

జానపద గేయాలు సేకరించినప్పటి అనుభవాలు : జానపద గేయాలు సేకరించిన రామరాజు అనుభవాలు కూడా ఆసక్తిదాయంగా ఉన్నాయి. తెలంగాణ అంతటా తిరిగి 1953 – 1955 సంవత్సరాల మధ్య కాలంలో జానపద గేయాలు తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు సేకరించారు. ఆ రోజుల్లో పల్లెటూళ్ళకు బస్సులు లేవు, జిల్లా, తాలూకా కేంద్రాల నుండి కొన్ని చోట్లకు నడచి కొన్ని చోట్లకు సైకిల్ పైన, కొన్నిచోట్లకు ఎడ్లబండి పైన పోయి గేయాలు సేకరించారు. స్త్రీలకు రవిక (జాకెట్) ముక్కలు, పురుషులకు బీడీలు, చుట్టలు, కల్లుకు పైసలు ఇచ్చి గేయాలు పాడించి రాసుకున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్లు గ్రామంలో కోలాటం పాటలు పాడేవారున్నారని విని అక్కడకు పోతే అక్కడి యువకులు సహకరించలేదు. రామరాజుకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ చేత బలవంతాన పట్టి తెప్పించి రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట దాకా కోలాటాలు వేయించారు.

ఇద్దరు యువకులు ఎదురు తిరిగితే పోలీసు సి.ఐ. వాళ్ళను కొట్టాడు కూడా. ఆ తెల్లవారి వారి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పి డబ్బులిచ్చారు. అట్లా బలవంతాన పాడించటం తప్పే అని తెలిసి కూడా చేసినందుకు బాధపడ్డారు. గాయక భిక్షుకులు డబ్బులు, పాతబట్టలిస్తే సంతోషంగా గేయగాథలు పాడేవాళ్ళు. కాని ఫొటోలు తీయనిచ్చేవారు కాదు.

ఫొటోలు తీస్తే వాళ్ళ కంఠమాధుర్యం పోతుందని వారి భావన. వారికి నచ్చచెప్పి డబ్బులిచ్చి గాయక భిక్షుకుల ఫొటోలు తీసుకున్నారు. తాళపత్రాలకోసం ఒక వేసవిలో కరీంనగరం జిల్లా ఎల్లారెడ్డి పేటకు నడచిపోయి ఎండ తీవ్రతకు తట్టుకోలేక సొమ్మసిల్లి ఊరి బయట కొట్టం వద్ద, మూర్చపోయారు. కొట్టం యజమాని బలిజాయన మంచినీళ్ళు, పాలు ఇచ్చాడు. రెండు రూపాయలిస్తే బండి కట్టాడు. ఆ బండిలో నారాయణపురం పోయి మురళీధరశర్మ అనే ఆయన దగ్గర బస్తా (సంచి) నిండా తాళపత్ర గ్రంథాలు తీసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో వీరమ్మ – శివరాజం అనే ఆ బలిజ దంపతులే నీళ్ళచారు అన్నం పెట్టి బస్సెక్కించారు.

శాసనాల సేకరణలో అనుభవాలు : అప్పటి ఆర్షశాఖ (ఇప్పటి దేవాదాయ శాఖ వంటిది) డైరెక్టర్ గొప్ప చారిత్రక పరిశోధకులు. వారివద్ద శాసన లిపులు చదివే తొలిపాఠాలు నేర్చుకున్నారు. తాళపత్రాల కోసం పోతూ ముస్తాబాదులో 29-10-1954 బస్సెక్కి మానేరు వద్ద దిగి ఆ ప్రాజెక్ట్ చూచి కాలినడకన గంభీరావుపేటకు పోతుంటే గంభీరావుపేట చెరువు కట్టకు ఏటవాలులో ఒక శిలాశాసనం కనబడింది. కొడవండ్లు, గొడ్డండ్లు నూరటం చేత శాసనం కొంత భాగం అరిగిపోయింది. వరాహ లాంఛనం (పంది గుర్తు) ఉండటం వల్ల అది కాకతీయుల కాలపు శాసనమని గుర్తించారు.

గంభీరావుపేటలో వై. రామేశ్వర శర్మ, కటకం వెంకటేశ్వర్ల ఇంట్లో వంద తాళపత్ర గ్రంథాలు తీసుకొని ఇద్దరు మనుషులను తీసుకొని చెరువు కట్ట దగ్గరున్న శాసనాన్ని తవ్వించారు. దానిని భూమిలోపల కనపడకుండా పూడ్చి పెట్టించారు. హైదరాబాదు వెళ్ళి ఆర్షశాఖ డైరెక్టరుకు ఈ విషయం చెప్తే శాసనలిపులు నేర్చి శాసనాలు తీసి ప్రకటించటం ఇష్టం లేకనో ఏమోగాని, ఆయన పాఠాలు చెప్పటం మానేశారు. అప్రియమైన సత్యాన్ని పలుకకూడదు. (నబ్రూయాత్ సత్యమప్రియం).

ఈ విషయం ఆదిరాజు వీరభద్రరావు గారికి చెప్పితే వారు శాసనలిపులు బోధించటమేకాక శాసనాలు తీసే విధానం నేర్పి, తమ వద్ద ఉన్న ఇనుప బ్రష్షు, మసి లెదర్ పాడ్ ఇచ్చారు. వాటి సహాయంతో రెండు మూడు శాసనాలు తీయించాడు. కరీంనగరం జిల్లా గంగాధర గ్రామం జమీందారు కొడుకు రామరాజు విద్యార్థి. తమ గ్రామం గుట్టపై శాసనముందని చెప్పితేపోయి చూసి చాలా గొప్ప శాసనం అనే గుర్తించారు. ఈ విషయం ఒక సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకునికి చెప్పితే వచ్చే ఆదివారం కలిసి పోదాం.

శాసనం తీసుకువద్దాం అని చెప్పి మరునాడే మంది మార్బలంతో పోయి శాసనం తీసుకువచ్చి మైసూరులో జరిగిన హిస్టరీ కాంగ్రెస్లో ఆ శాసనం గూర్చి పేపరు చదివి గొప్ప సన్మానం పొందాడు. వరంగల్ పి.జి. సెంటర్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఈతకొట్టిన బాలసముద్రం వైపు సరదాగా తిరగడానికి వెళ్ళినప్పుడు నరసముద్రం కోసం ఆ జలసముద్రం పాడు చేస్తున్నారు.

ఆ చెఱువుకట్ట గండిలో గణపతి దేవచక్రవర్తి మంత్రి వేయించిన శాసనం సగం విరిగిన ముక్క లభిస్తే దానిని పి.జి. సెంటర్ తెలుగు శాఖ ముందు ప్రతిష్ఠించి జిల్లా కలెక్టరుకు, ఆర్షశాఖ డైరెక్టరుకు తెలియపరచారు. ఎం.ఏ. తెలుగు విద్యార్థులకు ఆ శాసనం ఆధారంగా శాసనలిపి చదివే విధానం, శాసనం తీసే విధానం ప్రాక్టికల్గా నేర్పించారు. ఆంధ్రలిపి పరిణామం తెలిపే లిపి బొమ్మలు ఛార్ట్ ఫొటోలు తీయించి ముందుగా ఎం.ఏ. తెలుగు క్లాసురూంలో, ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో పెట్టించారు. వారి తరువాత తెలుగు విద్యార్థులకు శాసనాలతోపాటు శాసనలిపి కూడా బోధించవలెననే కోరికతో ఆ పటాలు పెట్టించినా ఇప్పుడా పటాలు లేవు, శాసనలిపి పాఠాలూ లేవు.

మల్లినాథ సూరి ఘంటాలు పొందిన విధానం : తెలుగుజాతికి గర్వకారణం తొలి మహామహోపాధ్యాయుడు కోలాచలం మల్లినాథసూరి. ఆయన స్వస్థలం మెదక్ జిల్లాలోని కొలిచెలమ. అక్కడి కొలిచెలిమ వారింట్లో తాళపత్ర గ్రంథాలున్నాయని తెలిసి తన మిత్రుడైన తహసీల్దార్ సి. హెచ్. కొండయ్యతో కలిసిపోయి అమూల్యమైన తాళపత్ర గ్రంథాలు తెచ్చుకున్నారు. పూజాగృహంలో పెట్టుకున్న మల్లినాథసూరి ఘంటాలు చూచి కన్నుల కద్దుకొని వాటిని తనకివ్వండని డబ్బు ఇస్తే వారు ఇవ్వలేదు. అవి తరతరాల నుండి పూజాద్రవ్యాలుగా ఉన్నాయని చెప్పారు. తమకున్న రెండెకరాల పొలం అక్కడి భూస్వామి దున్నుతూ నామమాత్రపు కౌలు ఇస్తున్నాడనీ ఆ భూమి తమ జీవనాధారమనీ కంటతడి పెట్టారు.

మిత్రుడు కొండయ్య సహకారంతో, ఆ భూస్వామిని ఒప్పించి భూమిని పురోహితునికి ఇప్పించాడు. ఆ పురోహితుడు మల్లినాథ సూరి రెండు ఘంటాలు రామరాజుకు ఇచ్చాడు. ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్కు తీసుకొనిపోయి పండితులకు చూపించారు. పద్మవిభూషణ ఆర్.ఎన్. దాండేకర్ రామరాజు గారి ఇంటికి వచ్చి వాటిని చూసిపోయారు. మల్లినాథసూరి గూర్చి పి. హెచ్. డి పరిశోధన చేసిన వారెవరో వాటి ఫొటోలు తమ గ్రంథంలో ప్రచురించారు. అటువంటి అమూల్య సంపదను కాపాడుకునే సంస్థ లేనందుకు బాధ పడ్డారు. బరోడా ప్రాచ్య సంస్థ వారికి గాని, పూనా ప్రాచ్యసంస్థవారికి గాని ఇస్తే కాపాడుతారేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు.

చివరి కోరిక : 1945వ సంవత్సరంలో ‘ఆంధ్రుడా ! ఓ ఆంధ్రుడా !’ అనే గేయంతో ప్రారంభమైన తన సాహిత్య వ్యాసంగం “ఆంధ్ర యోగుల చరిత్రలు ఐదు సంపుటాలు”, “ఆంధ్రుల సంస్కృత సాహిత్య వరివస్య”, “నేను నా సాయి” అనే రచనలతో ముగిస్తే బాగుంటుందనేవి తన చివరి కోరికలన్నారు. అవి తీరి ఏ కోరిక కోరని స్థితి కల్పించవలెనని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఇకపై భగవంతుని ఇష్టమే తన ఇష్టమని, నమస్కారాలతో బిరుదురాజు రామరాజు తన ప్రసంగాన్ని ముగించారు.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 11 భారతదేశం – ప్రపంచదేశాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 11th Lesson భారతదేశం – ప్రపంచదేశాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 11th Lesson భారతదేశం – ప్రపంచదేశాలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత విదేశాంగ విధానానికి ఉన్న ఏవేని రెండు లక్షణాలను తెలపండి.
జవాబు.
1. వలసవాదం, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకత :
భారత విదేశాంగ విధానం ప్రధానంగా వలసవాదాన్ని సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తుంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల్లోని వివిధ దేశాల్లో వలసవాదపాలనలో ఉన్న ప్రజలపట్ల భారతదేశం సానుభూతి ప్రకటించింది.

వలసవాద పాలన ప్రాంతాల్లో ప్రజలపై నిరంకుశ పాశవిక విధానాన్ని భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ప్రాంతాల ప్రజలు స్వాతంత్ర్యాన్ని పొందడానికి రాజకీయ, దౌత్యపర, ఆర్థిక సహాయాలన్నింటినీ భారతదేశం అందించింది. అగ్రరాజ్యాలు రూపొందించిన సామ్రాజ్యవాద వ్యూహాన్ని కూడా విదేశాంగ విధానం వ్యతిరేకిస్తుంది.

2. జాతి విచక్షణకు వ్యతిరేకత :
సుదీర్ఘకాలంగా భారతదేశం వర్ణ, జాతి, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా జరిగే అన్ని రకాల విచక్షణలను వ్యతిరేకిస్తోంది. జాతి విచక్షణ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో సముచితంగా వివిధ వేదికల్లో, చర్చనీయాంశం చేసింది. దక్షిణాఫ్రికా, కాంగో, రొడీషియా (ఇప్పటి జింబాబ్వే)లలో అనుసరిస్తున్న ప్రభుత్వ జాతి విచక్షణ విధానాన్ని తీవ్రంగా విమర్శించింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 2.
అలీనోద్యమం పాత్రపై ఒక సంక్షిప్త సమాధానం రాయండి.
జవాబు.
అలీనోద్యమం 1955లో బాండుంగ్లో జరిగిన ఆఫ్రో-ఆసియన్ సమావేశం ద్వారా రూపుదిద్దుకుంది. ఇది ఒక విదేశాంగ విధానంగా పశ్చిమ దేశాల కూటమికి, కమ్యూనిస్టు కూటమికి సమానదూరం పాటించే సంవర్థక విధానంగా వృద్ధి చెందింది. అలీనోద్యమ వ్యవస్థాపక నాయకులుగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మార్షల్ టిటో, సుకార్నో, నిక్రోమా, అబ్దుల్ నాజర్ తదితర రాజనీతిజ్ఞులు ఉద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.

అలీనోద్యమ లక్ష్యాలు :
అలీనోద్యమం కొన్ని నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తుంది. వాటిలో ప్రధానమైనవి :

  1. ప్రపంచ శాంతి, నిరాయుధీకరణ
  2. వలసప్రాంతాల ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు
  3. జాతివివక్షకు, వర్ణవివక్షకు వ్యతిరేకంగా ప్రతీవారికి సమానత్వపు హక్కు
  4. ఆర్థిక సమానత్వాన్ని సాధించండం
  5. సాంస్కృతిక ఆధిపత్యం లేదా సాస్కృతిక సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడం
  6. అంతర్జాతీయ వాదాన్ని సమర్ధించడం.

ప్రశ్న 3.
సార్క్ అనగానేమి ? వివరించండి.
జవాబు.
దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంఘం (South Asian Association of Regional Co-operation) లోని ఆంగ్ల ప్రథమాక్షరాల పదబంధంగా సార్క్ (SAARC) అని దీనిని వ్యవహరిస్తారు. ఈ సార్క్ ఏర్పాటులో బంగ్లాదేశ్ అధ్యక్షడు జియాఉర్ రెహమాన్ (Zia-ur Rehaman) ఎంతో ప్రధాన పాత్ర పోషించాడు.

సార్క్న లాంఛనప్రాయంగా డిసెంబర్ 8, 1985న స్థాపించారు. దీనిని బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఏడు సభ్యదేశాలుగా ఏర్పడ్డాయి. ఆ తరువాత ఏప్రియల్ 3, 2007న ఆఫ్ఘనిస్తాన్ సభ్యదేశం కావడంతో ప్రస్తుతం సార్స్లో మొత్తం ఎనిమిది దేశాలు సభ్య రాజ్యాలుగా ఉన్నాయి.

సార్క్ లక్ష్యాలు :

  1. దక్షిణాసియా ప్రాంతంలో సంక్షేమరంగాన్ని వృద్ధిచేసి జనాభా జీవన పరిస్థితులను గుణాత్మకంగా వృద్ధి చేయడం.
  2. దక్షిణాసియా ప్రాంత దేశాల మధ్య సమష్టి స్వాబలంబనను బలోపేతం చేయడం.
  3. ఆర్థికవృద్ధి, సాంఘిక ప్రగతి, సంస్కృతి అభివృద్ధులను వేగిరపరచడం.
  4. సభ్యదేశాలు తమ సమస్యలపట్ల సానుభూతితో పరస్పర విశ్వాసాన్ని పెంపొందిచుకోవడం.
  5. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పరస్పర సహాయంతో తోడ్పాటు అందించుకోవడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 4.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అధికారాలు, విధులను వివరించండి.
జవాబు.
సాధారణ సభ అధికారాలు – విధులు :

  1. అంతర్జాతీయ శాంతి భద్రతలు, రక్షణ విషయాలను చర్చించి, సిఫార్సులు చేయడం.
  2. అంతర్జాతీయ సాంఘిక-ఆర్థిక సహకారానికి సంబంధించిన విషయాల్లో మార్గనిర్దేశనం చేస్తే, పర్యవేక్షించడం.
  3. స్వయంపాలన చేసుకోలేని ప్రాంతాల పరిపాలనపై సమాచారాన్ని, నివేదికలను సేకరించడం.
  4. ఐక్యరాజ్యసమితి నిధులపై ప్రత్యేక నియంత్రణ అధికారాన్ని కలిగి, వార్షిక బడ్జెట్ను ఆమోదిస్తుంది.
  5. భద్రతామండలకి 10 మంది తాత్కాలిక సభ్యులను ఎన్నుకుంటుంది. అలాగే ఆర్థిక సాంఘిక మండలికి 5 మంది సభ్యులను, అంతర్జాతీయ న్యాయస్థానానికి 15 మంది న్యాయమూర్తులను, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిని సాధారణ సభ ఎన్నుకుంటుంది.
  6. అంతర్జాతీయ ఒప్పందాలను ఆమోదిస్తుంది.
  7. ఐక్కరాజ్యసమితి ఛార్ట్క అవసరమైన సవరణలు చేసే అధికారం సాధారణ సభకు ఉంటుంది.
  8. ఐక్యరాజ్యసమితిలోకి కొత్తగా రాజ్యాలను సభ్యులుగా చేర్చుకోడానికి, సస్పెండ్ చేయడానికి, సభ్యరాజ్యాలను తొలగించడానికి సాధారణ సభకు అధికారం ఉంటుంది.

ప్రశ్న 5.
భద్రతామండలి నిర్మాణాన్ని తెల్పి, దీనికి గల ఏవైనా రెండు అధికారాలను, విధులను తెలపండి.
జవాబు.
నిర్మాణం :
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యనిర్వాహక విభాగంగా భద్రతామండలిని పేర్కొనవచ్చు. దీనిలో 15 మంది సభ్యులు ఉంటారు. వీటిలో 5 రాజ్యాలను శాశ్వత దేశాలనీ, వీటో అధికారం ఉన్న పెద్ద దేశాలనీ చెప్పవచ్చు. మిగిలిన 10 తాత్కాలిక దేశాలను సాధారణ సభ రెండు సంంత్సరాల పదవీకాలానికి ఎన్నుకుంటుంది.

ఈ పది తాత్కాలిక దేశాలలో అయిదు ఆఫ్రికా-ఆసియా ఖండాలనుంచి, ఒకటి తూర్పు యూరోపు నుంచి, రెండు లాటిన్ అమెరికా ఖండం నుంచి, రెండు పశ్చిమ యూరోపు తదితర ప్రాంతాలనుంచి ప్రాతినిధ్యం వహించేలా ఎన్నికవుతాయి.

ఇవేకాక, ఏదేని వివాదానికి సంబంధించిన ఏదేని ఒక సభ్యరాజ్యన్నికానీ, రాజ్యేతర సభ్యులు కానీ చర్చలలో పాల్గొనమని భద్రతామండలి కోరవచ్చు. భద్రతామండలి అధ్యక్ష పదవి దానిలోని సభ్యరాజ్యాల మధ్య అక్షర క్రమంలో ప్రతి నెలకు ఒకసారి మారుతూ ఉంటుంది. భద్రతామండలికి సహాయం అందించడానికి మూడు స్థాయూ సంఘాలు ఉంటాయి.

అధికారాలు – విధులు :
అంతర్జాతీయ శాంతిభద్రతలు – రక్షణ వ్యవహారాల నిర్వహణలో ఐక్యరాజ్యసమితికి గణనీయమైన అధికారాలు ఉన్నాయి. భద్రతామండలి అధికారాలు – విధులు ఈ దిగువ తెలిపిన విధంగా ఉంటాయి.

  1. భద్రతా మండలి అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
  2. అంతర్జాతీయ శాంతి, భద్రతల నిర్వహణకు కార్యాచరణను అమలుచేసి, శాంతికి విఘాతం కలిగించే వాటిపై నివారక చర్యలు చేపడుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 6.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అధికారాలు-విధులను సంక్షిప్తంగా రాయండి.
జవాబు.
ప్రధాన కార్యదర్శి అధికారాలు – విధులు :
ఐక్యరాజ్యసమితి ఛార్టర్ నిర్దేశించిన పరిధిలోని అనేక విధులను-బాధ్యతలను ప్రధాన కార్యదర్శి నిర్వహిస్తారు. వీటిలో ప్రధానమైనవి :

  1. అంతర్జాతీయ శాంతిభద్రతలకు విఘాతం కల్పించే అన్ని విషయాలను ప్రధాన కార్యదర్శి సాధారణ సభ భద్రతామండలి ముందు నివేదిస్తాడు.
  2. ఐక్యరాజ్యసమితి వార్షిక బడ్జెట్ను రూపొందిస్తాడు. అలాగే ఐక్యరాజ్యసమితి పనితీరుపై నివేదికను ప్రతి సంవత్సరం తయారుచేస్తాడు.
  3. భద్రతామండలి వినతిపైగాని, ఐక్యరాజ్యసమితి మెజారిటీ సభ్యుల కోరికపైగాని, సాధారణ సభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేస్తారు.
  4. అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలకు రిజిష్టర్ చేసే అధికారిలాగా వ్యవహరిస్తారు.
  5. వివిధ సందర్భాలలో ఐక్యరాజ్యసమితి ఏర్పరచిన శాంతి పరిరక్షణ దళాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు.

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
బిమ్ క్ అనగానేమి ?
జవాబు.
ఈ సంస్థను 1997వ సంవత్సరంలో బంగాళాఖాత (సముద్ర) తీరప్రాంతదేశాలైన దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. “బంగాళాఖాత తీరప్రాంత దేశాల బహుళరంగ సాంకేతిక ఆర్థిక సహకార సంస్థ” పేరుతో ఏర్పడిన ఈ సంస్థలో భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, బర్మా (మియన్మార్), థాయ్లాండ్ దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. బిమ్క్ అనే ఈ సంస్థ ప్రధాన కేంద్ర కార్యాలయం బంగ్లాదేశ్ ఢాకాలో ఉంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 2.
సార్క్ 18వ శిఖరాగ్ర సమావేశం గురించి రాయండి.
జవాబు.
సార్క్ 18వ శిఖరాగ్ర సమావేశం ఖాట్మండ్లో నవంబరు 27, 2014న జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దక్షిణాసియా దేశాలు అన్ని రంగాల్లో సహకారం అందించుకోవడానికి ముందుండాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.

ఈ సహకారం ప్రజలు పరస్పరం ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా సమాచార సాంకేతిక అనుసంధానం ద్వారా మరింత తేలికగా జరుగుతుందని పిలుపునిచ్చారు. సార్క్ ద్వారా వాణిజ్యం, పెట్టుబడులు, సహాయం, సహకారాలు ప్రతి రంగంలో సాధ్యమౌతాయని భారతదేశం భావిస్తోంది.

ప్రశ్న 3.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఎన్ని దేశాలు సభ్యత్వం కల్గి ఉన్నాయి ?
జవాబు.
ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో 194 సభ్య రాజ్యాలు ఉన్నాయి.

ప్రశ్న 4.
సార్క్ లోని సభ్యదేశాలు ఏవి ?
జవాబు.
సార్క్ లోని సభ్యదేశాలు

  1. బంగ్లాదేశ్
  2. ఇండియా
  3. మాల్దీవులు
  4. నేపాల్
  5. పాకిస్తాన్
  6. శ్రీలంక
  7. భూటాన్

2007లో ఆఫ్ఘనిస్తాన్ కూడా సభ్యదేశం కావటంతో ప్రస్తుతం సార్క్ ఎనిమిది సభ్యదేశాలున్నాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 5.
ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగాలు ఏవి ?
జవాబు.

  1. సాధారణ సభ
  2. భద్రతా మండలి
  3. ఆర్థిక-సాంఘిక మండలి
  4. ధర్మకర్తృత్వ సంఘం
  5. అంతర్జాతీయ న్యాయస్థానం
  6. సచివాలయం.

వీటిలో ప్రస్తుతం ధర్మకర్తృత్వమండలి పనిచేయటం లేదు.

ప్రశ్న 6.
ఐక్యరాజ్యసమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు ?
జవాబు.
ఐక్యరాజ్యసమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పోర్చుగీసుకు చెందిన ‘ఆంటోనియో గుటిరస్’.

ప్రశ్న 7.
బ్రిక్స్లోని సభ్యదేశాలేవి ?
జవాబు.

  1. బ్రెజిల్ (Brazil)
  2. రష్యా (Russia)
  3. ఇండియా (India)
  4. చైనా (China)
  5. దక్షిణాఫ్రికా (South Africa)

ఈ దేశాల పేర్లలోని మొదటి అక్షరాలతో బ్రిక్స్ (BRICS) అనే పదబంధంతో ఈ సంస్థ ఏర్పడింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 11 భారతదేశం - ప్రపంచదేశాలు

ప్రశ్న 8.
పంచశీల సూత్రాలను వివరించండి.
జవాబు.

  1. రాజ్యాల ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించుకోవడం.
  2. రాజ్యాలు పరస్పర దురాక్రమణకు పాల్పడకుండా ఉండడం.
  3. ఇతర రాజ్యాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం.
  4. రాజ్యాల మధ్య సమానత్వం, పరస్పర ప్రయోజనాత్మక సహకారం.
  5. శాంతియుత సహజీవనం.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 10th Lesson స్మార్ట్ గవర్నెన్స్ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 10th Lesson స్మార్ట్ గవర్నెన్స్

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఎలక్ట్రానిక్ పాలన (e-Governance) అంటే ఏమిటి ? దాని సుగుణాలను వివరించండి.
జవాబు.
ఇ-గవర్నెన్స్ అంటే ఆంగ్లంలో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. దీన్ని ఎలక్ట్రానిక్ పాలన అని వ్యవహరిస్తారు. దీన్ని కాగిత రహిత పాలన (Paperless Governance) అని కూడా పేర్కొంటారు. దీన్ని అనుసరించి, సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఆధారంగా ప్రభుత్వం విధులు నిర్వహిస్తుంది. దీని వల్ల సేవలలో సమర్థత కార్యసాధకత పెరుగుతుంది.

దీనిలో భాగంగా అంతర్జాలాన్ని (Internet), ఇతర వెబ్ ఆధారిత సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తారు. పాలనలో వేగం ఖచ్చితత్వం దీనికి గల అదనపు లక్షణాలు, పౌరులు, సమూహాలు, సంస్థలు ఎలక్ట్రానిక్ పాలన పద్ధతి వల్ల గుణాత్మకమైన, నిరంతరాయమైన సేవలను పొందుతారు.

ఎలక్ట్రానిక్ పాలన పారదర్వకతను, కార్యసాధకతను, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుంది. భరతదేశంలోని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో దీన్ని అమలుచేస్తున్నారు. 2017 సంవత్సరానికల్లా కాగితపు పాలన సాధన లక్ష్యంతో దీనిని అమలు చేస్తున్నారు.

నిర్వచనం :
భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె అబ్దుల్ కలాం అభిప్రాయంలో భారతదేశపాలన సందర్భంలో ఎలక్ట్రానిక్ పాలన (e-Governance) అంటే, “ఒక పారదర్శక, సత్వర ఎలక్ట్రానిక్ పాలన అవధులు లేని, భద్రమైన విశ్వసనీయ సమాచార ప్రవాహాన్ని, శాఖాంతర అడ్డంకులను అధిగమించాలి. అందుబాటులోకి తెస్తూ పౌరులకు న్యాయబద్ధమైన, పక్షపాతం లేని సేవలను అందిస్తుంది”.

ఇంకా, ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర సాంస్కకృతిక సంస్థ (UNESCO), అభిప్రాయంలో “ఎలక్ట్రానిక్ పాలనలో ప్రభుత్వరంగం సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, సమాచారాన్ని, సేవల బట్వాడాను పెంపొందించడం. నిర్ణయీకరణ ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వం మరింత జవాబుదారీతనంతో, పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండేలా చేయడం తదితర లక్ష్యలతో పనిచేస్తుంది.”

పైన పేర్కొన్న నిర్వచనాలు-అర్థవివరణలు పాతకాలపు రాతపని ఆధారిత పాలన ముగించి, పాలనలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవలసిన ఆవశ్యకతను తెలుపుతాయి. పౌరులకు-ప్రభుత్వానికి మధ్య సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానమై కార్యాచరణ సాధనంగా ఉపయోగపడుతుంది. ఫలితంగా పాలనలో పారదర్శకతను చూడవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఎలక్ట్రానిక్ పాలన ప్రణాళిక (National-Governance Plan-NEGP) అమలులో ఉంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ఎలక్ట్రానిక్ పాలన నమూనాలు (Modules of e-Governance) :

ఎ. ప్రభుత్వం నుంచి పౌరులకు (Government to Citizens G to C) :
ఈ నమూనా ఆధారంగా ప్రభుత్వానికి, పౌరులకు మధ్య కార్యాచరణ, సంబంధాన్ని కల్పించి, విస్తృత స్థాయిలో సేవలు అందించడం జరుగుతుంది. ఇది సాధారణ ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

బి. ప్రభుత్వం నుంచి వ్యాపార రంగానికి (Government to Business G to B) :
వ్యాపార రంగాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం సదుపాయదారునిలాగా పనిచేస్తుంది. లైసెన్సులను జారీచేసి, రెవెన్యూ వసూలు చేస్తుంది. అంతేకాకుండా, వర్తక వాణిజ్యాలకు, పర్యాటక రంగానికి పెట్టుబడులకు సదుపాయాలు కల్పిస్తుంది.

సి. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి (Government to Government G to G) :
ప్రభుత్వ సేవలను అందించడంలో సమాచార-సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించడం జరుగుతోంది. స్వేచ్ఛ సమాచార ప్రవాహం సమాంతరంగా, నిలువుగా అందుబాటులో ఉండటం గమనిస్తాం. దీనితో జాతీయ, రాష్ట్ర స్థానిక నిర్వహణ సులువు అవుతుంది.

డి. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు (Government to Employees G to E) :
ఈ నమూనా కింద ప్రభుత్వం, ఉద్యోగులు సమాచార సాంకేతిక పరిజ్ఞాన సాధనాలతో నిరంతరం స్థిరంగా ఒకరినొకరు సంప్రదించుకొని, కార్యాచరణ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఉద్యోగులలో విస్తృత కార్యసాధనకు, సంతృప్తికి దారితీస్తుంది.

ఎలక్ట్రానిక్ పాలన-సుగుణాలు : ఎలక్ట్రానిక్ పాలన పద్ధతిలో ఈ దిగువ తెలిపిన ఉపయోగాలు ఉంటాయి.

  1. పౌరునికి సమాచారం అందించి, సంప్రదించే అవకాశం.
  2. పాలన ప్రక్రియను సంస్కరించడం.
  3. సమాచార అందుబాటు
  4. పౌరులకు గుణాత్మక సేవలు పెంపొందించడం
  5. సరళతర నియమాలు
  6. కార్యసాధన
  7. జవాబుదారీతనం
  8. పారదర్శకత
  9. ఎక్కువమంది పౌరులకు గుణాత్మక సేవ

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 2.
ఎలక్ట్రానిక్ పాలనలోని సుగుణాలను, లోపాలను చర్చించండి.
జవాబు.
నిర్వచనం :
భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం అభిప్రాయంలో భారతదేశ పరిపాలన సందర్భంలో ఎలక్ట్రానిక్ పాలన (e-Governance) అంటే, “ఒక పారదర్శక, సత్వర ఎలక్ట్రానిక్ పాలన అవధులు లేని, భద్రమైన విశ్వసనీయ సమాచార ప్రవాహాన్ని శాఖాంతర అడ్డంకులను అధిగమించి, అందుబాటులోకి తెస్తూ పౌరులకు న్యాయబద్ధమైన పక్షపాతం లేని సేవలను అందిస్తుంది”.

ఎలక్ట్రానిక్ పాలన-సుగుణాలు :
ఎలక్ట్రానిక్ పాలన పద్ధతిలో ఈ దిగువ తెలిపిన ఉపయోగాలు ఉంటాయి.

  1. పౌరునికి సమాచారం అందించి, సంప్రదించే అవకాశం.
  2. పాలన ప్రక్రియను సంస్కరించడం.
  3. సమాచార అందుబాటు.
  4. పౌరులకు గుణాత్మక సేవలు పెంపొందించడం.
  5. సరళతర నియమాలు.
  6. కార్యసాధకత.
  7. పారదర్శకత.
  8. ఎక్కువమంది పౌరులకు గుణాత్మక సేవ.

ఎలక్ట్రానిక్ పాలన లోపాలు :
ఎలక్ట్రానిక్ పాలనపద్ధతిలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది.

  1. నిర్వహణ, నిర్వర్తన వ్యయాలు అధికం.
  2. సమీకృత సేవలు లేకపోవడం.
  3. మౌలిక సదుపాయాల లేమి
  4. బలహీనమైన న్యాయ ప్రక్రియ, నిస్సారమైన శాసనాలు
  5. న్యాయపర, చట్టపర, పరిపాలనపరమైన, పోలీసు సంస్కరణల అవసరం కలుగుతూ ఉండటం.
  6. పౌరుల అవసరాలను అవగాహన చేసుకోవడం కష్టతరం, భాషాపరమైన అవరోధాలు.
  7. ప్రజావిత్త నిర్వహణ వ్యవస్థ కష్ట సాధ్యం కావడం.
  8. ప్రజా నిర్ణయీకరణలో పౌరసమాజ భాగస్వామ్యాన్ని, పాత్రను నిరోధించడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 3.
సమాచార హక్కు అంటే ఏమిటి ?
జవాబు.
ఆధునిక పాలనలో పౌరుని పాత్రను వివరించడానికి సమాచార హక్కుచట్టం అధ్యయనం ఎంతో మౌలికమైనది. సమాచార హక్కు చట్టం పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచి, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని అందిస్తుంది. 20వ శతాబ్దం రెండో భాగంలో అనేక దేశాలు సమాచార హక్కు చట్టాన్ని రూపొందించాయి.

  1. పాలనలో పౌరులు పాల్గొనగలరా ?
  2. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పౌరులు ఎలా పొందగలరు ?
  3. ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరిస్తోందా ?
  4. ప్రజలకు సమాచానాన్ని బహిర్గతం చేయవచ్చునా ?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సమాచార హక్కుచట్టం స్వభావం, ప్రాధాన్యత అధ్యయనం చేయాలి. దానిలో జవాబులు దొరుకుతాయి.

సమాచార హక్కుచట్టం 2005 రాష్ట్రపతి ఆమోదముద్రను 15 జూన్ 2005న పొంది, అక్టోబర్ 2005 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. ఆ రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక ఏర్పాటు ఉండి.

సమాచార హక్కుచట్టం ప్రకారం దేశంలోని ప్రతీపౌరునికి సంబంధించనదే అయినందున, ప్రభుత్వం ప్రజలతో సమాచారార్ని, పంచుకోవడాన్ని ఈ చట్టం అంగీకరిస్తుంది. ఇది ప్రజాస్వామ్యం మరింత ఆరోగ్యవంతంగా (బలోపేతంగా), లాభదాయకంగా పనిచేయడానికి ఉపకరిస్తుంది. అంతిమంగా సమాచారం ప్రజల్లో వినూత్న అవగాహనకు,య సాధికారతకు దారితీస్తుంది.

ప్రశ్న 4.
సమాచార హక్కులోని నిబంధనలను వివరించండి.
జవాబు.
సమాచార హక్కు ఒక ప్రాథమిక మానవ హక్కు దీనిలో అంతర్గతంగా హక్కులు-బాధ్యతులు కూడా ఉంటాయి. వీటిని ఈ కింది విధంగా వివరించవచ్చు.

  1. ప్రతీ వ్యక్తికి ప్రభుత్వం నుంచి సమాచారాన్ని కోరే హక్కు ఉంటుంది. ప్రైవేటు సంస్థల నుంచి కూడా సమాచారాన్ని కోరవచ్చు.
  2. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ప్రత్యేక కారణాల రీత్యా వెల్లడి చేయకూడని సమాచారాన్ని మినహాయించి, మిగిలిన సమాచారాన్ని ప్రభుత్వం తప్పక అందుబాటులో ఉండాలి.
  3. ప్రభుత్వం సమాచారాన్ని అనుకూల కార్యాచరణతో తప్పక వెల్లడి చేయాలి. సమాచారం ప్రజలకు చెందినదని భావించాలి. అంతేకాని దానిని నిర్వహించే ప్రభుత్వ సంస్థదని భావించరాదు.
  4. సమాచారాన్ని కోరుతూ ప్రశ్నించిన 30 రోజుల లోపు ప్రభుత్వం స్పందించాలి.
  5. సమాచార ప్రసరణకు వీలుగా ప్రభుత్వ రికార్డులను కంప్యూటరీకరణ, డిజిటలీకరణ చేయాలి.
  6. సమాచారాన్ని ప్రింట్ కాగితాల రూపంలో, కంప్యూటర్ ఫ్లాపీలు, వీడియో, క్యాసెట్లు లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ సాధనాల రూపంలోనైనా అందించవచ్చు. ఈ చట్టంలోని 2(ఎఫ్) నిబంధన పైన తెలిపిన వాటిని సమాచారంగా పరిగణిస్తుంది.

ప్రజా సమాచార అధికారుల (PIO’s) నియామకం :
ప్రభుత్వంలోని ప్రతీ కార్యాలయంలో, శాఖలో, సంస్థలో, అథారిటీలో ప్రజాసమాచార అధికారిని (PIO) నియమించాలని ఈ చట్టం నిర్ధేశిస్తుంది. పౌరులు కోరిన సమాచారాన్ని వారికి అందించే బాధ్యత ఈ ప్రజా సమాచార అధికారిపై ఉంటుంది.

అలాగే సమాచార హక్కు అప్పీళ్ళను (వినతులను) స్వీకరించడానికి సహాయక ప్రజా సమాచార అధికారులను (Assistant Public information Officers-APIOs) నియమించాలని ఈ చట్టం సిఫార్సు చేస్తోంది. సమాచారం కోసం ప్రజలు ఆన్లైన్ దరఖాస్తు రూపంలో కూడా వినతిని ఇవ్వవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 5.
స్మార్ట్ గవర్నెన్స్ అంటే ఏమిటి ?
జవాబు.
పరిపాలనలోని దుర్లక్షణాలను తొలగించి, పాలన ప్రజల సాంఘిక-ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో భారతదేశంలోని అనేక రాష్ట్రాలు స్మార్ట్ గవర్నెన్స్న స్వీకరించాయి. స్వాతంత్య్రానంతరం భారతదేశ పాలనలో, ప్రజల సాంఘిక-ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా ఎన్నో సంస్కరణలు వచ్చినప్పటికీ పాలనలో దుర్లక్షణాలైన అవినీతి, అశ్రిత, పక్షపాతం, అధికార దుర్వినియోగం, నిర్ణయీకరణలో జాప్యం, పాలనలో నిర్లక్ష్యం విలయతాండవం చేశాయి.

అయితే ఏ పరిస్థితితో మార్పు తీసుకువచ్చి పాలనను మరింత ప్రజా ప్రయోజనకరంగా మలచేక్రమంలో స్మార్ట్ గవర్నెన్స్ భావన ముందుకు వచ్చింది. ఈ భావనలో SMART అనే పదంలోని ప్రతి ఆంగ్ల అక్షరానికి ఒక్కొక్క నిర్దిష్టమైన అర్థం ఉంది.

దీనిలో S అనగా Simple సరళతరమైన పాలన ప్రక్రియలు
M అనగా Moral, నైతిక విలువలతో కూడిన పాలన
A అనగా Accountable, జవాబుదారీ పాలన
R అనగా Responsive, ప్రజాసమస్యలపై స్పందనాత్మకపాలన
T అనగా Transparent, పారదర్శకత కలిగిన పాలనగా పేర్కొనవచ్చు.

స్మార్ట్ గవర్నెన్స్లో అంతర్గత అంశాలు :

  1. పరిపాలన నిర్వర్తన సామర్థ్యాన్ని వృద్ధి చేయడం.
  2. పాలనలో జవాబుదారీతనం పారదర్శకత పెంచడం.
  3. సంకుచిత, రాజకీయాల నుంచి పాలనను వేరుచేయడం.
  4. ప్రభుత్వ విధానాన్ని విజయవంతంగా అమలుచేయడం
  5. గరిష్ట సామర్ధ్యం సాధించడం
  6. పాలనలో సామాజిక నాయకత్వం కీలకపాత్ర పోషించేలా చేయడం.
  7. ప్రభుత్వ సేవలలో నూతన వరవడి తీసుకురావడం, రాబోయే కాలానికి పాలనను సన్నద్ధం చేయడం.
  8. పాలనలో ఇంటర్నెట్, మొబైల్ తదితర సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తృత స్థాయిలో ఉపయోగించడం.
  9. ఎలక్ట్రానిక్ పాలన.

భారతదేశంలో పాలన ప్రక్రియను పటిష్టంచేయడానికి ఈ దిగువ తెలిపిన సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. స్మార్ట్ గవర్నెన్స్ భావనలోని అనేక అంశాల అమలుకు వివిధ మార్గాలను, పద్ధతులను సూచించడానికి, స్మార్ట్ గవర్నెన్స్ భావనను సంవర్ధకంగా వృద్ధి చేయడానికి ఈ దిగువ తెలిపిన విశిష్ట సంస్థలను స్థాపించడం జరిగింది.

  • ది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవన్నమెంట్, హైదరాబాద్, ఇండియా
    The National Institute for Smart government (NISG), Hyderabad, India
  • ది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, హైదరాబాద్, ఇండియా
    The Centre for Good Governance, Hyderabad, India
  • ది సెంటర్ ఫర్ లా అండ్ గవర్నెన్స్, న్యూఢిల్లీ
    The Centere for Law and Governance, New Delhi
  • ది సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెర్స్, న్యూఢిల్లీ
    The Centre for Public Policy and Governance, New Delhi

ప్రశ్న 5.
లోక్పాల్ అధికారాలు-విధులు పేర్కొనండి.
జవాబు.
లోక్పాల్ వ్యవస్థ ఈ కింద పేర్కొన్న పదవులోరి వారిపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారణ చేస్తారు.

  1. ప్రధానమంత్రి
  2. కేంద్రమంత్రులు
  3. పార్లమెంట్ ఉభయసభల సభ్యులు
  4. గ్రూప్ ‘A’ మరియు గ్రూప్ ‘B’ ఉద్యోగులు
  5. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే గ్రూప్ ‘C’ మరియు గ్రూప్ ‘D’ ఉద్యోగులు
  6. ఇతర సంస్థలు, ట్రస్ట్లు సొసైటీలు (10 లక్షలకు మించి విదేశీ విరాళాలను పొందే సంస్థలు)

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
జవాబుదారీతనం అంటే ఏమిటి ?
జవాబు.
ప్రభుత్వంలోని ఉద్యోగులు, అధికారులు, ప్రజాసేవకులు తమ నిర్ణయాలు, కార్యాచరణలను ప్రజలకు బాద్యత వహించడాన్ని జవాబుదారీతనంగా చెప్పవచ్చు. ఇక నుంచి వారు తమ కార్యకలాపాల విషయంలో ప్రజా పరిశీలనకు గురి కావలసి ఉంటుంది. విస్తృత అర్థంలో చెప్పాలంగే, పౌర, సేవా సంస్థలు, వినియోగదారుల సంస్థలకు ఉద్యోగులు జవాబుదారీగా ఉండాలి. పాలనలో సమన్యాయం, పారదర్శకత పాటిస్తే జవాబుదారీతనం సిద్ధిస్తుంది.

ప్రశ్న 2.
ఎలక్ట్రానిక్ పాలనలోని ఏవైనా రెండు సుగుణాలు రాయండి.
జవాబు.

  1. పౌరునికి సమాచారం అందించి, సంప్రదించే అవకాశం
  2. పాలన ప్రక్రియ సంస్కరించడం.
  3. సమాచార అందుబాటు
  4. పౌరులకు గుణాత్మక సేవలు పెంపొందించడం
  5. సరళతరం నియమాలు

ప్రశ్న 3.
పాలన సంబంధితుల జాబితా తెలపండి.
జవాబు.

  1. కార్యనిర్వాహక వర్గం
  2. శాసన నిర్మాణ శాఖ
  3. న్యాయశాఖ
  4. ప్రచార ప్రసార మాధ్యమాలు
  5. ప్రైవేటు రంగం
  6. సాంఘిక సేవా సంస్థలు
  7. పౌర సమాజం
  8. రాజకీయ పార్టీలు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 4.
ఎలక్ట్రానిక్ పాలనలో ప్రభుత్వం నుంచి పౌరుల నమూన అంటే ఏమిటి ?
జవాబు.
ప్రభుత్వానికి, పౌరులకు మధ్య కార్యాచరణ సంబంధాన్ని కల్పించి, విస్తృత స్థాయిలో సేవలు అందించే విధానాన్నే ప్రభుత్వం నుంచి పౌరుల నమూన అంటారు. ఇది సాధారణ ప్రజానీకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రశ్న 5.
పారదర్శకతను కొన్ని పదాలతో వివరించండి.
జవాబు.
పారదర్శకత, పరిపాలనలో ఈ కింది సూచించిన పద్దతుల ద్వారా కార్యసాధకతను పెంపొందిస్తుంది.

  1. సేవల అందుబాటు వ్యవస్థను క్రమబద్ధీకరించండి.
  2. జవాబుదారీదతనాన్ని పెంపొందించడం.
  3. పాలనలో అవినీతి, అక్రమాల తొలగింపు అనుచిత ఆచరణలు తగ్గించడానికి సాంఘిక తనిఖీ సిఫార్సు చేయడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 10 స్మార్ట్ గవర్నెన్స్

ప్రశ్న 6.
సమాచార హక్కుచట్టం ఏ సంవత్సరంలో రూపొంది, అమలయింది.
జవాబు.
సమాచార హక్కుచట్టం 2005 రాష్ట్రపతి ఆమోదముద్రను 15 జూన్ 2005న పొంది, అక్టోబర్ 2005 నుంచి ‘పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 6th Lesson సృజనశీలత Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 6th Lesson సృజనశీలత

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
సృజనాత్మకత గురించి రచయిత అభిప్రాయం తెలుపండి.
జ.
సృజనాత్మకత గురించి సృజనశీలత అనే పాఠంలో రచయిత ఎ.పి.జె. అబ్దుల్ కలాం తన అభిప్రాయాలను కింది విధంగా వివరించాడు. సృజనాత్మకత నిష్కల్మషమైన హృదయాల నుండి పుడుతుంది. అది దేశంలో ఎక్కడి నుండైనా, ఏమూల నుండైనా వస్తుంది. జాలరి ఓడ, రైతుల గుడిసె, గొల్ల పల్లె, పశువుల కొట్టం, తరగతి గదులు, లేబరేటరీలు, పారిశ్రామిక వాడలు, పరిశోధనా నిలయాలు ఇలా ఎక్కడనుండైనా ప్రారంభం అవుతుంది. సృజనాత్మకత వివిధ కోణాలు : సృజనాత్మకతకు చాలా కోణాలున్నాయి. అవి నూతన ఆవిష్కరణలు కావచ్చు. కొత్త ప్రయోగాలు కావచ్చు. లేదా ఉన్న వాటినే కొత్తగా తెలుసుకోవడం కూడా కావచ్చు.

ఉన్న భావాలను తిరిగి ప్రయోగించడం ద్వారా, జతపరచడం ద్వారా, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కోగలిగే సామర్థ్యం, ఊహించగలిగే సామర్థ్యాలను సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అనేది ఒక వైఖరి. అది కొత్తదనాన్ని, మార్పునీ అంగీకరించగలిగే భావాలతో, ఊహలతో కూడిన మానసిక స్థితి. మానవ జీవనాన్ని విజయవంతంగా గడపడం, మంచిదైన ప్రతిదాన్నీ అనందిస్తూనే దాన్ని మరింత మంచిగా చేయగలిగే అవకాశాలకోసం వెదకడాన్ని సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే కష్టించి పనిచేయటం. మన భావాల్నీ, మనకు లభ్యమవుతున్న పరిష్కారాల్నీ క్రమంగా మార్చుకుంటూ, మరింత పదును పెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడం. దేన్నైనా అందరూ చూస్తున్నట్లే చూసి ఆ చూసిన దాని గురించి మిగిలిన వారికంటే భిన్నంగా ఆలోచించటమే సృజనాత్మకత ముఖ్యలక్షణం.

మానవుడి మేధస్సు అతడికి మాత్రమే లభించిన గొప్ప బహుమానం. మానవ జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలైనా రానివ్వండి. ఆలోచించడం అత్యంత విలువైన ఆస్తి అని గుర్తించాలి. ఆలోచించడమే ప్రగతి. ఆలోచించ లేకపోవటం వ్యక్తుల్ని, సంస్థల్ని, దేశాన్ని నాశనం చేస్తుంది. ఆలోచించడం పనులకు దారితీస్తుంది. క్రియా రూపం పొందని ఆలోచనలు నిష్ప్రయోజనం, వ్యర్థం. కార్యరూపం దాల్చిన విజ్ఞానం మాత్రమే సౌభాగ్యాన్ని ఇస్తుంది.

సృజనాత్మకతను పెంపొందించడం : ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందనే విషయంలో సందేహంలేదు. కాని దాన్ని బహిర్గతం చేయాలంటే మాత్రం గట్టి ప్రయత్నం కావాలి. ప్రతి హృదయం సృజనాత్మకమైనది, ప్రతి హృదయంలో కొత్తవి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. పిల్లలు చిన్నప్పట్నించి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మనసుల్లో భావాలను రేఖాచిత్రాలుగా, కథలుగా, కవితలుగా మారుస్తుంది. నేర్చుకోవడం సృజనాత్మకతను కలిగిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. ఆలోచన జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం మానవులను సమున్నత స్థానానికి చేరుస్తుంది.

ప్రశ్న 2.
ప్రపంచంలో రాబోయే పరిణామాలను రచయిత ఏవిధంగా ఊహిస్తున్నాడు ?
జ.
ది ఏజ్ ఆఫ్ ది స్పిరుట్యువల్ మెషిన్స్ అనే పుస్తకాన్ని రాసిన రే కురువైల్ చెప్పిన దాని ప్రకారం 2009 నాటికి 50,000 ఖరీదు చేయగల కంప్యూటరు ఒక్క సెకండులో కోటి లక్షల లెక్కలు చేయగలదు. 2019 నాటికి సెకండుకు 10 లక్షల కోట్ల లక్షల లెక్కలు చేయగలదు. అంటే అప్పటికి దాదాపుగా మానవ మేధకు సమానమైన సామర్థ్యాన్ని సాధించగలదు. 2029 నాటికి అది ఒక వెయ్యి మానవ మేధస్సులకు సమానమైన సామర్థ్యాన్ని పొందుతుంది.

అంటే భవిష్యత్తులో మానవులు నేడు తాము చేసే పనులు కొన్నింటిని కంప్యూటర్లతో నడిచే రోబోట్స్కి అప్పజెప్పి తమ మెదడుల్ని మరింత ప్రయోజనకరమైన పనులకు అప్పజెప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్లు తమ భావనా సామర్థ్యంతో ప్రయోగశీల ఆలోచనతో తిరిగి మళ్లీ కంప్యూటర్లను ఓడించగలిగే స్థాయికి చేరుకుంటారు.

ఈ శతాబ్దం చివరికి మానవ ఆలోచనలను, యంత్రాల తెలివితేటలను విలీనం చేసే ధోరణి బలంగా పెరుగుతుంది. అప్పుడు మానవుడు ఒకప్పుడు రూపొందించిన యంత్రాలకూ, మానవ మేధాశక్తికీ మధ్య సరిహద్దులు చెరిగిపోతాయి. అటువంటి పరిస్థితిలో యంత్రాల బారినుండి మానవుడి ప్రత్యేకతను మనం ఏవిధంగా నిలబెట్టుకోగలుగుతామో తెలియదు. నిస్సందేహంగా కంప్యూటర్లు ఒక సవాలుగా మారుతున్నాయి.

ఈ సమస్య కేవలం జీవశాస్త్రవేత్తలదీ, జీవసాంకేతికవేత్తలదీ మాత్రమేకాదు. మొత్తం శాస్త్రవేత్తలు అందరు మనుష్యులు రూపొందించిన కంప్యూటర్లకన్నా మానవ జాతిని ఒక మెట్టు పైనే ఉంచవలసిన గొప్ప బాధ్యత తలకెత్తుకోవలసి ఉంది. అదృష్టవశాత్తూ మానవ మేధ సృజనాత్మకత, ప్రయోగశీల పార్శ్వాలు ఎంత గొప్పవంటే అవి మనిషిని ఎన్నటికి యంత్రం ముందు ఓడిపోనివ్వవు. మానవజాతిలో సహజసిద్ధమైన, అంతర్గతమైన మహాశక్తిని పరిపూర్ణంగా ఆవిష్కరించే దిశగా హ్యూమన్ జీనోమ్ సాఫ్ట్వేర్ను మనమింకా అభివృద్ధి చేయవలసి ఉంది. అని ప్రపంచంలో రాబోయే పరిణామాలను కలాం ఉహించాడు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
సృజనాత్మకతకు ఉన్న పార్శ్వాలను వివరించండి. జతపరచడం
జవాబు:
సృజనాత్మకతకు చాలా కోణాలున్నాయి. అవి నూతన ఆవిష్కరణలు కావచ్చు. కొత్త ప్రయోగాలు కావచ్చు. లేదా ఉన్న వాటినే కొత్తగా తెలుసుకోవడం కూడా కావచ్చు. ఉన్న భావాలను తిరిగి ప్రయోగించడం ద్వారా, ద్వారా, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కోగలిగే సామర్థ్యం, ఊహించగలిగే సామర్థ్యాలను సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అనేది ఒక వైఖరి.

అది కొత్తదనాన్ని, మార్పునీ అంగీకరించగలిగే భావాలతో, ఊహలతో కూడిన మానసిక స్థితి. జీవనాన్ని విజయవంతంగా గడపడం, మంచిదైన ప్రతిదాన్నీ అనందిస్తూనే దాన్ని మరింత మంచిగా చేయగలిగే అవకాశాలకోసం వెదకడాన్ని సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే కష్టించి పనిచేయటం. మన భావాల్నీ, మనకు లభ్యమవుతున్న పరిష్కారాల్నీ క్రమంగా మార్చుకుంటూ, మరింత పదును పెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడం. దేన్నైనా అందరూ చూస్తున్నట్లే చూసి ఆ చూసిన దాని గురించి మిగిలిన వారికంటే భిన్నంగా ఆలోచించటమే సృజనాత్మకత ముఖ్యలక్షణం.

ప్రశ్న 2.
‘సృజనాత్మకత’ ఎలా పెంపొందుతుంది ? (V. Imp) (M.P.)
జవాబు:
ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందనే విషయంలో సందేహంలేదు. కాని దాన్ని వ్యక్తీకరింపచేయాలంటే మాత్రం గట్టి ప్రయత్నం అవసరం. ప్రతి హృదయం సృజనాత్మకమైనది, ప్రతి హృదయంలో కొత్త విషయాలపట్ల ఆసక్తి, ఉత్సాహం ఉంటాయి. పిల్లలు చిన్నప్పటి నుంచి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మనసుల్లోని భావాలను చిత్రాలుగా, కథలుగా, కవితలుగా మారుస్తుంది. నేర్చుకోవడం సృజనాత్మకతను కలిగిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. ఆలోచన జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం మానవులను సమున్నత స్థానానికి చేరుస్తుంది.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత

ప్రశ్న 3.
బలమైన సంకల్పంతో చేసే కృషి ఎలాంటి ఫలితమిస్తుంది ?
జవాబు:
ఒక చిన్న తుమ్మెద ఆకారానికి ఏరోడైనమిక్ సూత్రాల ఆధారంగా చూస్తే ఆ తుమ్మెద ఎగరడం అసాధ్యమని తెలుస్తుంది. కాని తుమ్మెదలో ఎగరాలనే కోరిక, సంకల్పం ఎంత బలంగా ఉంటాయంటే అది ఎప్పుడూ తన రెక్కలు అల్లాడిస్తూనే ఉంటుంది. అలా పదేపదే తన రెక్కలు కొట్టుకుంటున్నందువల్ల వచ్చే ఉన్నత తరంగదైర్ఘ్య సంవేదనలు ఒక ఆవర్తనాన్ని సృష్టించి దాన్ని ముందుకు తోస్తాయి.

ఆవిధంగా తుమ్మెదకు ఎగరడం సాధ్యమవుతుంది. కాబట్టి బలమైన సంకల్పాలతో చేపట్టే కృషివల్ల సువ్యస్థిత విశ్వాసాలకు (ఎన్నో ఏళ్ల నుండి పాతుకు పోయిన నమ్మకాలకు) నిస్సందేహంగా ఎదురీదగలమని కలాం ప్రబోధించాడు.

ప్రశ్న 4.
ఆర్ద్రకృష్ణ ఊహించిందేమిటి ?
జవాబు:
పదమూడేళ్ల ఆర్రాకృష్ణ తన ఆలోచన అనే ఆకాశంలో స్వేచ్ఛగా విహారించింది. క్రీ.శ. 3000 సంవత్సరంలో ఈ భూమి ఎలా ఉంటుందో ఊహించే ప్రయత్నం చేసింది. అప్పుడు ఈ ప్రపంచ పౌరులు, అంగారక గ్రహానికి వలసపోయి అక్కడొక కొత్త నాగరికతను నిర్మించుకుంటారనీ, అంతలో బృహస్పతి గ్రహంనుండి అంగారకుడి మీదికి రాబోయే ఒక ఏస్టరాయడ్ వల్ల మొత్తం మానవాళి నశించే ప్రమాదమేర్పడుతుందనీ ఆమె ఊహించింది.

అప్పుడు అంగారక గ్రహంమీద ఉండే శాస్త్రవేత్తలు తమ మీద విరుచుకుపడబోతున్న ఏస్టరాయడును అణు శర పరంపర ద్వారా విచ్ఛేదపరుస్తారని ఆమె చెప్పింది. ఆవిధంగా క్రీ.శ. 3000 లలో అంగారక నాగరికత ప్రాకృతిక ఆగ్రహానికి ఎదురునిలిచి జీవించగలుగుతుందనీ ఆమె విశ్వాసం ప్రకటిస్తుంది. ‘ఆర్ద్రకృష్ణ శాస్త్రీయ ఆలోచన ఎంత సుందరంగా కొత్తగా ఉంది అని అబ్దుల్ కలాం గుర్తు చేసుకున్నారు.

III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భారతదేశపు ‘మిస్సైల్ మ్యాన్’ అని ఎవరికి పేరు ? (V. Imp) (Model Paper)
జవాబు:
ఎ.పి.జె. అబ్దుల్ కలాంకు.

ప్రశ్న 2.
ఎ.పి.జె. అబ్దుల్ కలాం పూర్తి పేరు ఏమిటి ?
జవాబు:
అవుల్ ఫకీర్ జైనులాద్దీన్ అబ్దుల్ కలాం.

ప్రశ్న 3.
‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తక రచయిత ఎవరు ?
జవాబు:
ఎ.పి.జె. అబ్దుల్ కలాం.

ప్రశ్న 4.
‘సృజనాత్మకత’ ఎక్కడి నుండి ప్రభవిస్తుంది ?
జవాబు:
సుందర హృదయాల నుండి.

ప్రశ్న 5.
మానవునికి మాత్రమే లభించిన అద్వితీయ బహుమానం ఏది ?
జవాబు:
మానవుని మేధ.

ప్రశ్న 6.
సృజనాత్మకత దేనికి దారితీస్తుంది ?
జవాబు:
నూతన ఆలోచనలకు.

ప్రశ్న 7.
“అనారోగ్యం గురించి ఆలోచించకు” కవిత రాసిందెవరు ?
జవాబు:
రష్యాకు చెందిన పన్నెండేళ్ళ అన్నా సిన్య కోవ.

ప్రశ్న 8.
“నాకే గనక అధికారముంటే నిఘంటువుల్లోంచి అసాధ్యమనే పదాన్ని తీసేస్తాను” అన్నది. ఎవరు ?
జవాబు:
రాకెట్ రూపశిల్పి వాన్ బ్రౌన్.

కఠిన పదాలకు అర్ధములు

81వ పుట మిస్సైల్

మిస్సైల్ = క్షిపణి
చేదోడు వాదోడు
(జాతీయం) = సహాయకారి
ఆచార్యులు = ప్రొఫెసర్
అత్యన్నత = గొప్ప
అనువాద = భాషాంతరీకరణ

82వ పుట

మేధాశక్తి = తెలివి
సృజనాత్మకత = కొత్తగా ఆలోచించడం
నిలబడదు = నిలువదు
దార్శనిక దృష్టి = దూర దృష్టి
సుందర = అందమైన, కల్మషం లేని
ప్రభవిస్తుంది = పుడుతుంది
తలెత్తగలదు = ప్రారంభం కావచ్చు
జాలరి = చేపలు పట్టేవారు
కొట్టం = పశువుల పాక
లేబరేటరీ = ప్రయోగశాల
పార్శ్వాలు = కోణాలు
ఆవిష్కరణ = కొత్తగా కనుగొనడం
నవీన ప్రయోగాలు = కొత్త ప్రయోగాలు
అనువర్తింపచేయడం = అనుసరించేలా చేయడం, ప్రయోగపూర్వకంగా పరిశీలించడం
సామర్థ్యం = శక్తి
సంభావించ గలిగే = ఊహించ గలిగే
వైఖరి = వక్తిత్వ పద్ధతి
క్రీడించ గలిగే = ఆనందంగా చేయగలిగే
మనః స్థితి = మానసిక స్థితి
దృక్పథం = చూసే తీరు
సారళ్యం = సులభం
మంగళ ప్రదమైన = మంచిని కోరే
వెతుకులాడటం = అన్వేషించడం
లభ్యమవుతున్న = అందుబాటులో ఉన్న, దొరుకుతున్న
పరిష్కారం = సమస్యను అధిగమించడం
క్రమేపి = క్రమంగా
పురోగమనం = ముందుకు వెళ్ళడం
తక్కిన వారు = మిగిలిన వారి
భిన్నంగా = కొత్తగా
అద్వితీయ = గొప్ప, సాటిలేని
బహుమానం = బహుమతి
ఒడిదొడుకులకైనా = ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు

TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత

83వ పుట

తొలచివేస్తుంది
(జాతీయం) = చెడగొడుతుంది
కార్యాలకు = పనులకు
దారితీస్తుంది
(జాతీయం) = ప్రారంభిస్తుంది
=
నిష్ప్రయోజనం = ప్రయోజనం లేకపోవడం
నిరర్థకం = అర్థం లేని
కార్యశీలం = పనిరూపంలోకి రావడం
విజ్ఞానం = శాస్త్రీయ జ్ఞానం
సౌభాగ్య = సంపద
సందేహం = అనుమానం
వ్యక్తీకరింప చేయడం = వ్యక్త పరచడం
ఏకాగ్ర ప్రయత్నం = ఒకే విషయంపై కృషి చేయడం
కుతూహలం = ఉత్సాహం
వికసిస్తుంది = పెరుగుతుంది
నిలయం = నివాసమైనది
చిత్తరువు = రేఖా చిత్రం
అభ్యసనం = నేర్చుకోవడం
సమున్నతపరచడం = అభివృద్ధిని కలిగించడం
అవధి = హద్దు
సంపుటి = పుస్తకం
చిత్ర లేఖనాల సమాహారం = చిత్రాలతో కూడినది
ప్రతిభ = తెలివి
అబ్బుర పరిచింది = ఆశ్చర్యపరిచింది
అవధులకు అతీతం = హద్దులు లేకుండా
విశుద్ధ౦ = పరిశుభ్రం, నిర్మలం
విభజన శీల = విడగొట్టేతత్వం
గోచరించింది = కనిపించింది
ప్రోది = పోషించు, పెంచు
భద్రంగా = సురక్షితంగా
భావ గగనం = ఆలోచనలు అనే ఆకాశం
స్వేచ్ఛా విహారం = స్వేచ్చగా తిరగడం

84వ పుట

పౌరులు = ప్రజలు
వలసపోయి = జీవించడానికి మరొక్కచోటికి పోవడం
వర్థమాన నాగరికత = పెరుగుతున్న నాగరికత
ఏస్టరాయిడ్ = గ్రహశకలం
కనుమరుగయ్యే = అంతరించే
అణుశరపరంపర = అణుశక్తితో నడిచే బాణాలతో
విచ్చేద పరిచే = ముక్కలు చేసే
ప్రాకృతిక = ప్రకృతికి సంబంధించిన
ఆగ్రహం = కోపం
‘మనగలుగుతుంది = జీవిస్తుంది.
విశ్వాసం = నమ్మకం
శాస్త్రీయ చింతన = శాస్త్ర బద్దమైన ఆలోచన
శాసించ కూడదు = అదుపు చేయకూడదు
అధిగమించండి = దాటండి
విజయం సాధించండి = విజయాన్ని పొందండి
భావాలు = ఆలోచనలు
ప్రతిధ్వనించాయి = వినిపించాయి
వ్యాధి = జబ్బు
ఎదుర్కొనే = ఎదిరించే
పరిణామం = మార్పు
ఆవిర్భావం = ప్రారంభం
టెక్నాలజీ = సాంకేతికత
జాతి వివక్ష = = జాతిని బట్టి భేదాన్ని చూపడం
అహింస = హింస లేని
సంఘటనలు = సన్నివేశాలు, జరిగిన అంశాలు
అసాధ్యం = సాధ్యం కానిది

85వ పుట

వైమానిక రంగం = విమానాలకు సంబంధించిన రంగం
అంతరిక్ష = ఆకాశానికి సంబంధించిన
బహుశ = కావచ్చు కాకపోవచ్చు, అంచనా
భూమి + ఆకర్షణ = భూమికి గల ఆకర్షణ శక్తి
సమన్వయ పరచి = ఒక క్రమంలో ఉంచి
ఏకీకృత = = ఒకటే దిశగా
జన + ఆవాసం = మనుషులు ఉండే చోటు
నెలకొల్పే = స్థాపించే
శిలాజ నిక్షేపాలు = భూమి అంతర్భాగంలో దొరికే పెట్రోల్ మొదలైన ఇంధనాలు
అరుదై పోయె = అంతరించి పోయె
తిరిగితిరిగి
ప్రయోగించగల = పునర్వినియోగ శక్తి గల
అంతరిక్ష నౌక = రాకెట్ లాంచర్
సౌరశక్తి = సూర్యుని నుండి వచ్చే శక్తి
ఉపగ్రహాలు = మానవులు ప్రయోగించిన కృత్రిమ గ్రహాలు
సృజనశీల = కొత్తగా కనిపెట్టే స్వభావం గల
ఏరోడైనమిక్ = చలన సిద్ధాంతం
ఇచ్ఛ = కోరిక
సంకల్పం = గట్టి ఆలోచన
సదా = ఎల్లప్పుడు
అల్లాడిస్తూనే = కదిలిస్తూనే
పదేపదే = మళ్ళీ మళ్ళీ
ప్రభవించే = ఉత్పన్నమయ్యే
తరంగదైర్ఘ్యం = తరంగాల వేగం
ఆవర్తనం = వలయం
సువ్యవస్థిత = చక్కగా ఏర్పాటు చేసిన
నిస్సందేహంగా = అనుమానం లేకుండా
ఎదురీదగలవు = ఎదుర్కోగలవు, విజయం సాధించగలవు
తేల్చేశాడు = నిశ్చయించాడు, తీర్మానించాడు.
రెండు దశాబ్దాలు = ఇరవై సంవత్సరాలు
తిరగకుండానే = గడవకముందే
కొట్టిపారేశారు = తప్పు అని నిరూపించారు
మానవ + ఆవిష్కరణ = మానవునిచే కనిపెట్టబడింది
అనూహ్య = ఊహించలేని
రవాణా విప్లవం = రవాణాలో వచ్చిన వేగవంతమైన మార్పు
కుగ్రామం = చిన్నపల్లెటూరు
సులువు = సులభం

86వ పుట

ప్రయోగనౌక = = అంతరిక్షంలోకి తీసుకువెళ్ళే వాహనం
వ్యోమగాములు = అంతరిక్షంలో ప్రయాణించే వారు
ఆరోహణ = దిగడం
నిఘంటువులు = అక్షర క్రమంలో అర్థాలు తెలిపే పుస్తకం
రోబోట్స్ = కృత్రిమ మానవులు.
భావనా సామర్థ్యం = ఆలోచించే శక్తి
ప్రయోగశీల = ప్రయోగించే స్వభావం
వివేచన = మంచి చెడుల ఆలోచన
శతాబ్ద + అంతానికి = వంద సంవత్సరాల కాలం ముగిసే సరికి
విలీనం = కలిసిపోయి
ధోరణి = వైఖరి, మానసిక స్థితి
తలకెత్తుకోవాలి
(జాతీయం) = బాధ్యత తీసుకోవాలి
తలవాల్చనీయవు
(జాతీయం) = ఓడిపోనియ్యవు
అంతః గర్భితమైన = అంతర్గతంగా (లోపల) ఉన్న
పరిపూర్ణంగా = పూర్తిగా
దిశ = మార్గం వైపు
దోహదం = అనుకూలించు, సహకరించు

87వ పుట

అంకురార్పణ
(జాతీయం) = ప్రారంభం
హేతుబద్ధంగా = కారణం తెలుసుకొని
సాహసం = తెగువ
అపజయాలను = ఓటములను
అణగదొక్కుట
(జాతీయం) = పెరగకుండా చేయడం
వ్యవస్థాపరమైన = సౌకర్యాల పరంగా
తక్షణ = వెంటనే
కొల్లగొట్టు (జాతీయం) = ఏకమొత్తంగా లాభంపొందు
సముపార్జన = సంపాదన
జీర్ణం చేసుకొను
(జాతీయం) = జీర్ణించుకొను, ఆలోచనల్లో కలిసిపోవడం
అంతిమం = చివరికి
దుర్భేద్య దుర్గం = ప్రవేశించలేని దృఢమైన కోట

సృజనశీలత Summary in Telugu

TS Inter 2nd Year Telugu Study Material Lesson 6 సృజనశీలత 12

రచయిత పరిచయం

పాఠం పేరు : సృజనశీలత
దేనినుండి గ్రహింపబడినది : అబ్దుల్ కలాం ప్రసంగ వ్యాసాల సంపుటి “ఇన్ డామిటబుల్ స్పిరిట్” (Indomitable Spirit) అనే ఆంగ్ల పుస్తకం.
తెలుగు అనువాదం : వాడ్రేవు చినవీరభద్రుడు – “ఎవరికీ తలవంచకు” అనే పుస్తకం.
రచయిత పేరు : ఎ.పి.జె. అబ్దుల్ కలాం.
పూర్తి పేరు : అవుల్ ఫకీర్ జైనులాబ్దిన్ అబ్దుల్ కలాం.
కాలం : జననం : అక్టోబర్ 15, 1931 – మరణం : జూలై 27, 2015
తల్లిదండ్రులు : ఆషియమ్మ, జైనులబ్దిన్.
స్వస్థలం : తమిళనాడు రామేశ్వరం.
విశేషతలు : పేదరికంలో పేపర్ బాయ్గా చేసి రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారు. భారతదేశపు రక్షణ రంగంలో ‘మిస్సైల్ మ్యాన్’గా పేరుపొందారు.
కలాం శాస్త్రవేత్తగా : అంతరిక్ష రంగంలో విశిష్టసేవలు అందించారు. “డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్” (DRDO) లో చేరి సైన్యం కోసం చిన్న హెలికాఫ్టర్ను తయారు చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. భారతీయ అంతరిక్ష పరిశోధనాసంస్థలో, రక్షణరంగ పరిశోధనాసంస్థలో వివిధ పదవులు నిర్వహించాడు. భారత ప్రభుత్వానికి ప్రధాన వైజ్ఞానిక సలహాదారుగా పనిచేశాడు. కొంతకాలంపాటు చెన్నైలో అన్నా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశాడు.
పురస్కారాలు : భారత ప్రభుత్వం అత్యున్నత పౌరసత్కారాలు పద్మభూషణ్ (1981), పద్మవిభూషణ్ (1991), . భారతరత్న (1997) లతో గౌరవించింది.
రచనలు : ఇండియా 2020 : ఎ విజన్ ఫర్ న్యూ మిలీనియం”, “వింగ్స్ ఆఫ్ ఫైర్”, “ఇగ్నైటెడ్ మైండ్స్”, “ఎన్విజనింగ్ యాన్ ఎంపవర్డ్ నేషన్”, ఇన్ డామిటబుల్ స్పిరిట్ మొదలైనవి.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 6 సృజనశీలత

పాఠ్యభాగ ఉద్దేశం

మానవ మేధాశక్తి, సృజనాత్మకతల ముందు ఏ కంప్యూటరూ నిలవదు. ఈ సమస్త విశ్వం మనతో స్నేహపూర్వకంగా ఉంటుంది. మనలో కలలు కనేవారికి, కష్టించి పనిచేసే వారికి అత్యుత్తమైనదాన్ని ఇస్తుంది. దానికోసం యువత కొత్తగా ఆలోచించాలి. నూతన ఆవిష్కరణలకు సిద్ధం కావాలి అని విద్యార్థులకు తెలియజేయడం, అబ్దుల్ కలాం దార్శనిక దృష్టిని, ఆలోచనలను, ఆదర్శాలను అందివ్వడం ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

పాఠ్యభాగ సారాంశం

సుందర హృదయాలే సృజనాత్మకతా నిలయాలు : సృజనాత్మకత నిష్కల్మషమైన హృదయాల నుండి పుడుతుంది. అది దేశంలో ఎక్కడ నుంచైనా, ఏ మూలనుండైనా వస్తుంది. జాలరి ఓడ, రైతుల గుడిసె, గొల్ల పల్లె, పశువుల కొట్టం, తరగతి గదులు, లేబరేటరీలు, పారిశ్రామిక వాడలు, పరిశోధనా నిలయాలు ఇలా ఎక్కడనుండైనా ప్రారంభం కావచ్చు.

సృజనాత్మకత వివిధ పార్శ్వాలు : సృజనాత్మకతకు చాలా కోణాలున్నాయి. అవి నూతన ఆవిష్కరణలు కావచ్చు. కొత్త ప్రయోగాలు కావచ్చు. లేదా ఉన్న వాటినే కొత్తగా తెలుసుకోవడం కూడా కావచ్చు. ఉన్న భావాలను తిరిగి ప్రయోగ పూర్వకంగా పరిశీలించడం ద్వారా, జతపరచడం ద్వారా, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కోగలిగే సామర్థ్యం, ఊహించగలిగే సామర్థ్యాలను సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అనేది ఒక వైఖరి. అది కొత్తదనాన్ని, మార్పునీ అంగీకరించగలిగే భావాలతో, ఊహలతో కూడిన మానసిక స్థితి.

మానవ జీవనాన్ని విజయవంతంగా గడపడం, మంచిదైన ప్రతిదాన్నీ అనందిస్తూనే దాన్ని మరింత మంచిగా చేయగలిగే అవకాశాలకోసం వెదకడాన్ని సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే కష్టించి పనిచేయటం. మన భావాల్నీ, మనకు లభ్యమవుతున్న పరిష్కారాల్నీ క్రమంగా మార్చుకుంటూ, మరింత పదును పెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడం. దేన్నైనా అందరూ చూస్తున్నట్లే చూసి ఆ చూసిన దాని గురించి మిగిలిన వారికంటే భిన్నంగా ఆలోచించటమే సృజనాత్మకత ముఖ్యలక్షణం.

మానవుడి మేధస్సు అతడికి మాత్రమే లభించిన గొప్ప బహుమానం. మానవ జీవితం ఎటువంటి ఒడిదుడుకులకైనా లోనుకానివ్వండి, ఆలోచించడం అత్యంత విలువైన ఆస్తి అని గుర్తించాలి. ఆలోచించడమే ప్రగతి. ఆలోచించ లేకపోవటం వ్యక్తుల్ని, సంస్థల్ని, దేశాన్ని నాశనం చేస్తుంది. ఆలోచించడం పనులకు దారితీస్తుంది. క్రియారూపం పొందని ఆలోచన నిష్ప్రయోజనం, వ్యర్థం. కార్యరూపం దాల్చిన విజ్ఞానం సౌభాగ్యాన్ని ఇస్తుంది.

సృజనాత్మకతను పెంపొందించడం : ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుందనే విషయంలో సందేహంలేదు. కాని దాన్ని వ్యక్తీకరింపచేయాలంటే మాత్రం గట్టి ప్రయత్నం చేయాలి. ప్రతి హృదయం సృజనాత్మకమైనది, ప్రతి హృదయంలో కుతూహలముంటుంది. పిల్లలు చిన్నప్పట్నించి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. సృజనాత్మకత మనసుల్లో భావాలను చిత్రాలుగా, కథలుగా, కవితలుగా మారుస్తుంది.

నేర్చుకోవడం సృజనాత్మకతను కలిగిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. ఆలోచన జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం మానవులను సమున్నత స్థానానికి చేరుస్తుంది.

సృజనాత్మకతకు అవధుల్లేవు : 1949 నుండి శంకర్స్ అంతర్జాతీయ విద్యార్థుల పోటీ ప్రతి ఏడాదీ జరుగుతుంది. శంకర్స్ పోటీలో 68 దేశాలకు చెందిన పిల్లలు పాల్గొన్నారు. వారు చిత్రించిన చిత్రలేఖనాలతో ఉన్న 55వ సంపుటిని కలాం చూసి ఆశ్చర్యపోయారు. ఆ పిల్లలు తమ చిత్రలేఖనాల్లో, కవితల్లో, కథల్లో, వ్యాసాల్లో చూపించిన ప్రతిభ ఆయన్ని అబ్బురపరచింది. ప్రపంచంలో పెద్దవాళ్లు, వయోజనులు దేశాల గురించి, సరిహద్దుల గురించి, కులాల గురించి, మతాల గురించి, పేదల గురించి, ధనికుల గురించి మాట్లాడుతుండగా పిల్లలు చేసిన కృషి మాత్రం సరిహద్దులకూ, అవధులకూ అతీతంగా ఆయనకు కనిపించింది.

పిల్లల హృదయం అత్యంత పరిశుద్ధంగా, అన్ని విభజనశీల మనస్తత్వాలకూ అతీతంగా కనిపించింది. మానవాళి భవిష్యత్తుకు మనలో ఆశను పెంచేది పిల్లల ప్రపంచం మాత్రమే అని, వాళ్ల చేతుల్లో ఈ భూగోళం భద్రంగా ఉండగలదని వారికి నమ్మకం కలిగింది.

పదమూడేళ్ల అర్ధాకృష్ణ తన ఆలోచన అనే ఆకాశంలో స్వేచ్ఛగా విహరించింది. క్రీ.శ. 3000 సంవత్సరంలో ఈ భూమి ఎలా ఉంటుందో ఊహించే ప్రయత్నం చేసింది. అప్పుడు ఈ ప్రపంచ పౌరులు, అంగారక గ్రహానికి వలసపోయి అక్కడొక కొత్త నాగరికతను నిర్మించుకుంటారనీ, అంతలో బృహస్పతి గ్రహంనుండి అంగారకుడి మీదికి రాబోయే ఒక ఏస్టరాయడ్ వల్ల మొత్తం మానవాళి నశించే ప్రమాదమేర్పడుతుందనీ ఆమె ఊహించింది. అప్పుడు అంగారకగ్రహంమీద ఉండే శాస్త్రవేత్తలు తమమీద విరుచుకుపడబోతున్న ఏస్టరాయడును అణుశరపరంపర ద్వారా విచ్ఛేదపరుస్తారని ఆమె చెప్పింది. ఆవిధంగా క్రీ.శ. 3000 లలో అంగారక నాగరికత ప్రాకృతిక ఆగ్రహానికి ఎదురు నిలిచి జీవించగలుగుతుందనీ ఆమె విశ్వాసం ప్రకటిస్తుంది. అర్ధాకృష్ణ శాస్త్రీయ ఆలోచన ఎంత సుందరంగా కొత్తగా ఉంది అని అబ్దుల్ కలాం గుర్తు చేసుకున్నారు.

రష్యాకు చెందిన పన్నెండేళ్ల అన్నాసిన కోవ రాసిన ‘అనారోగ్యం గురించి ఆలోచించకు’ కవితకూడా వారిని అబ్బురపరచింది. ఏమైనా ముఖ్యమైన పనులు చేపట్టినప్పుడు సమస్యలు తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. కాని ఆ సమస్యలు శాసించకూడదని అబ్దుల్ కలాం నమ్ముతారు. దానినే మీరు సమస్యలు అధిగమించండి విజయం సాధించండి అని యువతీయువకులకు చెప్తారు.

ఇటువంటి భావాలే అన్నాసిన్యకోవ కవితలో కూడా ప్రతిధ్వనించాయి. ఆరోగ్యవంతమైన జీవితాల్ని నిలబెట్టుకోవటం కోసం ఎటువంటి వ్యాధినైనా, అనారోగ్యాన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలనే బలమైన సందేశం ఆమె కవితలో కలాంకు కనబడింది.

సృజనాత్మకత జీవనసరళుల్ని మారుస్తుంది : ప్రకృతిసిద్ధంగా జరిగే పరిణామ క్రమంలో ప్రకృతి చేసుకునే ఎంపిక గురించి చార్లెస్ డార్విన్ వివరించాడు. మానవజాతి పుట్టుక గురించి కొత్తగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుచ్ఛక్తి కనుగొనడం ద్వారా థామస్ ఆల్వా ఎడిసన్ సైన్సుకూ, టెక్నాలజీకి చెందిన ప్రతి రంగాన్ని పూర్తిగా మార్చాడు. దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణతకు వ్యతిరేకంగా తన అహింసా ధర్మ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధీ అహింస ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ పాలననుండి విడిపించి స్వాతంత్ర్యాన్ని సంపాదించాడు. 20వ శతాబ్దానికి చెందిన ఈ మూడు ప్రధాన సంఘటనలు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు అని కలాం చెప్పాడు.

సృజనాత్మకత అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది : గత 60 ఏళ్లుగా సైన్సులో, టెక్నాలజీలో వస్తున్న మార్పుల ద్వారా రెండు విషయాలు తెలుస్తున్నాయి. మొదటిది ఒకప్పుడు అసాధ్యమనుకున్నది నేడు సాధ్యమవుతుంది. అలాగే సులభసాధ్యమనుకున్నది ఇంకా సాధ్యం కాలేదుకాని, తప్పక సాధ్యమై తీరుతుంది. ముఖ్యంగా వైమానిక రంగం, అంతరిక్ష సాంకేతిక శాస్త్రం, ఎలక్ట్రానిక్స్ వస్తు పరిశోధన, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఉత్పత్తులు వంటి రంగాలలో ప్రపంచం కొత్త కోణాలవైపు ప్రయాణిస్తుంది. రాబోయే దశాబ్దాలలో బహుశా భూమ్యాకర్షణ శక్తుల్నీ, విద్యుదయస్కాంత శక్తుల్నీ, సాధారణ సాపేక్షతా సిద్ధాంతాన్ని సమన్వయపరిచి కాలాన్నీ, స్థలాన్ని అర్థం చేసుకోగలిగే ఏకీకృత శక్తి క్షేత్ర సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తారు. సౌరకుటుంబంలో ఏదో ఒక గ్రహం మీద, లేదా చంద్రుని మీద మానవజాతి జనావాసాన్ని లేదా ఏదో ఒక పరిశ్రమను నెలకొల్పే అవకాశాన్ని మన చిన్నారులు వాళ్ల జీవితకాలంలోనే చూడవచ్చునని అబ్దుల్ కలాం అనుకున్నారు.

రాబోయే కాలంలో అంటే 50 ఏళ్లనుంచి 100 ఏళ్లలోపే మనకు ప్రస్తుతం లభ్యమవుతున్న ఇంధన వనరులు అంతరించి పోయే పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు విద్యుత్ అవసరాలకోసం తిరిగి ఉపయోగించగల అంతరిక్షనౌకల ఆధారంగా సౌరశక్తి ఉపగ్రహాలు ప్రయోగిస్తామేమో. ఇటువంటివన్నీ సృజనశీల ఆలోచనలవల్ల మాత్రమే సాధ్యపడతాయని కలాం అన్నారు.

ఒక చిన్న తుమ్మెద ఆకారానికి ఏరోడైనమిక్ సూత్రాల ఆధారంగా చూస్తే ఆ తుమ్మెద ఎగరడం అసాధ్యమని తెలుస్తుంది. కాని తుమ్మెదలో ఎగిరే ఇచ్ఛ, సంకల్పం ఎంత బలంగా ఉంటాయంటే అది ఎప్పుడూ తన రెక్కలు అల్లాడిస్తూనే ఉంటుంది. అలా పదేపదే తన రెక్కలు కొట్టుకుంటున్నందువల్ల వచ్చే ఉన్నత తరంగదైర్ఘ్య సంవేదనలు ఒక ఆవర్తనాన్ని సృష్టించి దాన్ని ముందుకు తోస్తాయి.

ఆవిధంగా తుమ్మెదకు ఎగరడం సాధ్యమవుతుంది. కాబట్టి బలమైన సంకల్పాలతో చేపట్టే కృషివల్ల సువ్యస్థిత విశ్వాసాలకు నిస్సందేహంగా ఎదురీదగలము అని కలాం ప్రబోధించాడు. సృజనాత్మకశక్తి

తుమ్మెద ఎగరడమేకాదు, అసలు ఒకప్పుడు మానవుడు తను కూడా ఆకాశంలో ఎగరడమనేది అసాధ్యమని నమ్మాడు. 1890లో అప్పటి రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ అధ్యక్షుడుగా ఉన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త లార్డ్ కెల్విన్ బరువుగా ఉండేవేవీ కూడా ఆకాశంలో ఎగరడం అసాధ్యమని తేల్చేశాడు. కాని అతడి మాటల్ని రెండు దశాబ్దాలు తిరగకుండానే రైట్ సోదరులు కొట్టి పారేశారు.

వారి సంకల్పంవల్ల, కృషివల్ల మనిషి కూడా ఆకాశంలో ఎగరగలడని నిరూపితమైంది. పట్టినపట్టు విడవకుండా సృజనాత్మకంగా ఆలోచించగలిగితే మనిషి విజయం ఎట్లా సాధిస్తాడో చెప్పే ఒక విజయగాథ ఇది. ఈ ఒక్క మానవావిష్కరణను తీసుకున్నా కూడా అది ఒక అనూహ్య రవాణా విప్లవానికి దారి తీసిందనీ, ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చివేసిందనీ నేడు మనం సులువుగా గుర్తించవచ్చు.

శాటర్న్-V ప్రయోగనౌకను నిర్మించి దానిద్వారా వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించి. చంద్రుడిపై మానవ ఆరోహణను సాధ్యంచేసిన ప్రఖ్యాత రాకెట్ రూపశిల్పి వాన్ బ్రౌన్ “నాకే గనక అధికారముంటే నిఘంటువుల్లోంచి అసాధ్యమనే పదాన్ని తీసేస్తాను” అన్నాడు.

రాబోయే పరిణామాలు : ది ఏజ్ ఆఫ్ ది స్పిరిట్యువల్ మెషిన్స్ అనే పుస్తకాన్ని రాసిన రే కురువైల్ చెప్పిన దాని ప్రకారం 2009 నాటికి 50,000 ఖరీదు చేయగల కంప్యూటరు ఒక్క సెకండులో కోటి లక్షల లెక్కలు చేయగలదు. 2019 నాటికి సెకండుకు 10 లక్షల కోట్ల లక్షల లెక్కలు చేయగలదు. అంటే అప్పటికి దాదాపుగా మానవ మేధకు సమానమైన సామర్ధ్యాన్ని సాధించగలదు. 2029 నాటికి అది ఒక వెయ్యి మానవ మేధస్సులకు సమానమైన సామర్థ్యాన్ని పొందుతుంది. అంటే భవిష్యత్తులో మానవులు నేడు తాము చేసే పనులు కొన్నింటిని కంప్యూటర్లతో నడిచే రోబోట్స్కి అప్పజెప్పి తమ మెదడుల్ని మరింత ప్రయోజనకరమైన పనులకు అప్పజెప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్లు తమ భావనా సామర్థ్యంతో ప్రయోగశీల ఆలోచనతో తిరిగి మళ్లీ కంప్యూటర్లను ఓడించగలిగే స్థాయికి చేరుకుంటారు.

ఈ శతాబ్దం చివరికి మానవ ఆలోచనలను, యంత్రాలు తెలివితేటలను విలీనం చేసే ధోరణి బలంగా పెంపొందుతుంది. అప్పుడు మానవుడు ఒకప్పుడు రూపొందించిన యంత్రాలకూ, మానవ మేధాశక్తికీ మధ్య సరిహద్దులు చెరిగిపోతాయి. అటువంటి పరిస్థితిలో యంత్రాల బారినుండి మానవుడి ప్రత్యేకతను మనం ఏవిధంగా నిలబెట్టుకోగలుగుతాం ? నిస్సందేహంగా కంప్యూటర్లు ఒక సవాలుగా మారుతున్నాయి.

ఈ సమస్య కేవలం జీవశాస్త్రవేత్తలదీ, జీవసాంకేతికవేత్తలదీ మాత్రమేకాదు. మొత్తం శాస్త్రవేత్తలు అందరు మనుష్యులు రూపొందించిన కంప్యూటర్లకన్నా మానవ జాతిని ఒక మెట్టు పైనే ఉంచవలసిన గొప్ప బాధ్యత తలకెత్తుకోవలసి ఉంది. అదృష్టవశాత్తూ మానవ మేధ సృజనాత్మకత, ప్రయోగశీల పార్శ్వాలు ఎంత గొప్పవంటే అవి మనిషిని ఎన్నటికీ యంత్రం ముందు తల వాల్చనివ్వవు. మానవజాతిలో సహజసిద్ధమైన, అంతఃగర్భితమైన మహాశక్తిని పరిపూర్ణంగా ఆవిష్కరించే దిశగా హ్యూమన్ జీనోమ్ సాఫ్ట్వేర్ను మనమింకా అభివృద్ధి చేయవలసి ఉందని కలాం ఉహించాడు.

సృజనాత్మకత నూతన ఆవిష్కరణలకు, సరికొత్త సంపదలకు దారితీస్తుంది. : నిలకడగా ఉండే సమాచారం ఎదుగుదలను ప్రోత్సహించదు. నేటి సరికొత్త డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఒకరితో మరొకరు ఇచ్చిపుచ్చుకునే సమాచారం కొత్త ఆవిష్కరణలకు దారితీసి తద్వారా జాతీయ సంపద పెరుగుదలకు దోహదం చేస్తుంది. కొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ చేయడం ద్వారా విజ్ఞానం సంపదగా రూపొందుతుంది. నూతన ఆవిష్కరణ అనేది ఒక పద్ధతి ప్రకారం సువ్యవస్థితంగా, హేతుబద్దంగా చేసే పని. అది విశ్లేషణలు, ప్రయోగాలు, ప్రయోగ పరీక్షలు వంటి వివిధ దశలద్వారా చేపట్టబడే పని.

నూతన ఆవిష్కరణలకు కొత్తగా ఆలోచించే సాహసం, కొత్తవి కనుగొనే సాహసం, అసాధ్యాన్ని ఆవిష్కరించే సాహసం, అపజయాలను అణగదొక్కే సాహసం కావాలి. నూతన ఆవిష్కరణలు సాధారణంగా పరిశోధనాత్మక అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వ్యవస్థాపరమైన మార్పు వంటి ఇతర అంశాలపైన కూడా ఆధారపడి ఉంటాయి.

కాబట్టి దేశంలో సమర్థవంతమైన నూతన ఆవిష్కరణల వ్యవస్థను నెలకొల్పవలసిన తక్షణ అవసరముంది. అటువంటి వ్యవస్థ సాధ్యంకావాలంటే ప్రయోగశీలమైన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థలు ఏవైనా సముదాయాలు పెంపొందవలసి ఉంటుంది.

వాటికీ, వాటి వినియోగదారులకూ, వారిద్దరినీ అనుసంధానపరిచే సంస్థలకూ మధ్య పరస్పర ఆధారిత అనుసంధాన వ్యవస్థలు అభివృద్ధి చెందవలసి ఉంటుంది. ఆ విధంగా నెలకొల్పబోయే పరిశోధనా వ్యవస్థ తన వైజ్ఞానిక సముదాయాల ఆధారంగా విశ్వవ్యాప్త విజ్ఞానాన్ని కొల్లగొట్టుకో గలుగుతుంది. ఆవిధంగా సముపార్జించుకున్న విజ్ఞానాన్ని జీర్ణం చేసుకుని స్థానిక అవసరాలకు తగ్గట్టుగా మలుచుకొని చివరికి కొత్త విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకోగలుగుతుంది.

మానవ వివేచనా ప్రాతిపదిక : సృజనాత్మకత పునాదులపైనే మానవ వివేచన నిలిచి ఉంది. ఎంత వేగవంతమైన కంప్యూటర్లు ఎంత తీవ్రమైన జ్ఞాపకశక్తి కలిగిన కంప్యూటర్లు వృద్ధి చెందినప్పటికీ సృజనాత్మకత ఆ శక్తులన్నిటి పైనా సదా అత్యున్నత స్థానంలో నిలిచే ఉంటుంది. సృజనశీలమైన మానవమేధ కంప్యూటర్లు అందిస్తున్న అపార సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఈ ప్రపంచాన్ని మరింత సుఖంగా జీవించే దిశగా తన ప్రణాళికలను అమలుచేస్తూనే ఉంటుంది.

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar సంభాషణ రచనా నైపుణ్యం Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

ఇద్దరు వ్యక్తుల మధ్య మాటల ద్వారా జరిగే భావప్రసారాన్ని ‘సంభాషణ’ అంటారు. మనం రోజూ ఇంట్లోనూ, బయట ఎంతమందితోనో మాట్లాడుతూ ఉంటాం. ఈ మాటల్లో లెక్కలేనన్ని పదాలు దొర్లుతుంటాయి. ఎదుటి వారితో అర్థవంతంగా, గౌరవంతో కూడిన మాటలు మాట్లాడటం ప్రతి ఒక్కరు అభ్యసించాలి. నైపుణ్యంతో మాట్లాడటం ఒక కళ.

సంభాషణ రచన ద్వారా రచనలో నైపుణ్యాలను సాధించవచ్చు. సంభాషణలో నేర్పును సాధించడానికి కింది అభ్యాసాలు అందుకు ఎంతగానో తోడ్పడుతాయి. సూచించిన పదాలను ఆధారం చేసుకొని సందర్భోచితంగా వ్యక్తుల మధ్య సంభాషణ రాయాల్సి ఉంటుంది. సంభాషణలో వ్యవహారిక భాషలో వాడే ఇతర భాషా పదాలు కూడా వాడవచ్చు. సందర్భోచితంగా వాడే జాతీయాలు, సామెతలు, పదబంధాలు సంభాషణలను ఆసక్తికరంగా మారుస్తాయి.

ప్రశ్న 1.
కాలిదెబ్బలకు వైద్యం కోసం వెళ్ళినపుడు వైద్యునితో సంభాషణ.
(క్రికెట్ ఆడటం – దెబ్బ తగలడం – నొప్పి – ఫస్ఎయిడ్ – మందులు – కాపడం – పథ్యం)
జవాబు:
విద్యార్థి  :  నమస్తే డాక్టర్ !
డాక్టర్  :  నమస్తే సురేశ్ ! ఎలా ఉన్నావు ? కుంటుతున్నావెందుకు ?
విద్యార్థి :  మా కళాశాలలో క్రికెట్ ఆడుతుంటే కాలిబొటన వేలికి దెబ్బ తగిలింది.
డాక్టర్  :  రక్తం ఏమైనా పోయిందా ? ఫస్ట్ ఎయిడ్ ఏమైనా చేశారా !
విద్యార్థి  :  చాలా రక్తం పోయింది. బాగా నొప్పిగా ఉంది డాక్టర్ ! దెబ్బ తగలగానే మా టీచర్ శుభ్రంగా కడిగి పసుపు పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేసింది.
డాక్టర్  :  భేష్ పసుపు పెట్టి మీ టీచరు మంచి పని చేసింది. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చేది.
విద్యార్థి  :  అవును డాక్టర్ ! నా మోకాలు బాగా కమిలి పోయింది. మా అమ్మ కాలికి వేడినీళ్ళతో కాపడం కూడా పెట్టింది.
డాక్టర్  :  మంచి పనిచేసింది సురేశ్ ! దెబ్బను ప్రతిపూటా డెట్టాల్ నీళ్ళతో కడగాలి. నేనిచ్చే మందు పెట్టు, దుమ్ము తగలనీయకు.
విద్యార్థి  :  ఏమైనా పథ్యం చెయ్యాలా డాక్టర్ ?
డాక్టర్  :  అవసరం లేదు. బలమైన ఆహారం తీసుకో !
విద్యార్థి  :  సరే డాక్టర్ ! నమస్కారం.

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

ప్రశ్న 2.
ఆదాయ పత్రం జారీ కొరకు విజ్ఞాపన చేయడానికి వెళ్ళినపుడు అధికారితో సంభాషణ. *(M.P.)
(ఆదాయపత్రం – దరఖాస్తు – జతపరుచు – తహశీల్దార్ – ఉపకారవేతనం)
జవాబు:
విద్యార్థి  :  తహశీల్దార్ సర్ నమస్కారం ! నా పేరు శ్రీరాం.
అధికారి  :  నమస్తే చెప్పు బాబూ, ఏ పనిమీద వచ్చావు ?
విద్యార్థి  :  ఆదాయపత్రం కొరకు దరఖాస్తు చేసుకుందామని వచ్చాను సార్ !
అధికారి  :  దరఖాస్తు తెచ్చావా ! వివరాలు అన్నీ ఉన్నాయా ?
విద్యార్థి  :  ఉన్నాయి సర్! సంబంధిత పత్రాలన్నీ జతపరిచాను. ఈ ఆదాయ పత్రం నాకెంతో ఉపయోగపడుతుంది సర్.
అధికారి  :  ఉపకార వేతనం ఏ రకంగా ఉపయోగిస్తావు శ్రీరాం.
విద్యార్థి  :  ఉపకార వేతనంతో పుస్తకాలు, దుస్తులు ఇతర వస్తువులు కొనడానికి తల్లిదండ్రులపై ఆధారపడే ఇబ్బంది ఉండదు సర్.
అధికారి  :  మంచిది ! నేను కూడా ఉపకార వేతనం సాయంతోనే ఎమ్.ఎ. వరకు చదివాను.
విద్యార్థి  :  అలాగా సర్ ! మరి ఆదాయపత్రం ఎప్పుడు ఇస్తారు ?
అధికారి  :  రెండు రోజుల్లో.
విద్యార్థి  :  ధన్యవాదాలు సర్ !

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

ప్రశ్న 3.
బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు విజ్ఞప్తి చేయడానికి వెళ్ళినపుడు ప్రిన్సిపాల్తో సంభాషణ.
(ఎన్.సి.సి లో ప్రవేశం – కవాతు – ఆత్మవిశ్వాసం – ధన్యవాదాలు)
జవాబు:
విద్యార్థిని  :  నమస్తే సర్ !
ప్రిన్సిపాల్  :  నమస్తే ! చెప్పమ్మా సుప్రజా ! ఏం కావాలి !
విద్యార్థిని  :  సర్ బోనఫైడ్ సర్టిఫికెట్ కొరకు వచ్చాను సర్.
ప్రిన్సిపాల్  :  దరఖాస్తు తెచ్చావా! సర్టిఫికెట్ దేనికి అమ్మా !
విద్యార్థిని  :  దరఖాస్తు ఇదిగో సర్ ! ఎన్.సి.సి లో చేరాలంటే నేను మన కళాశాల విద్యార్థిని అని సర్టిఫికెట్ కావాలి.
ప్రిన్సిపాల్  :  ఎన్.సి.సిలో చేరాలని ఎందుకనుకుంటున్నావు ?
విద్యార్థిని  :  నాకు కవాతు, రైఫిల్ ఘాటింగ్ అంటే చాలా ఇష్టం.
ప్రిన్సిపాల్  :  అంతేకాదు నీకు ఎన్.సి.సిలో ‘బి’ సర్టిఫికెట్ ఉంటే పై చదువుల్లో సీట్లలో, ఉద్యోగాలలో కూడా ప్రాధాన్యం ఇస్తారు.
విద్యార్థిని  :  అవును సర్ ! మా నాన్నగారు ఎన్.సి.సిలో చేరమన్నారండి.
ప్రిన్సిపాల్  :  మంచిది ఎన్.సి.సి వల్ల నీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. మధ్యాహ్న సమయంలో సర్టిఫికెట్ తీసుకోమ్మా.
విద్యార్థిని  :  అట్లాగే సర్ ! ధన్యవాదాలు.

TS Inter 2nd Year Telugu Grammar సంభాషణ రచనా నైపుణ్యం

ప్రశ్న 4.
పత్రికా విలేకరితో కళాశాల ఉత్సవం గురించి ఫోన్లో వివరించే సంభాషణ.
(కళాశాల వార్షికోత్సవం – కలం, కాగితం ముఖ్య అతిథి ఉపన్యాసం – ఉత్తేజకరం – బహుమతులు – పాటలు – నృత్యాలు.)
జవాబు:
వందన  :  నమస్తే రమణ సర్ ! నా పేరు వందన నేను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిని మాట్లాడుతున్నాను.
రమణ  :  నమస్తే వందనా ! నిన్న మీ కళాశాలలో వార్షికోత్సవం జరిగిందట కదా ?
వందన  :  అవును సర్ ! ఆ విషయమే మీకు వివరిద్దామని ఫోన్ చేశాను సర్.
రమణ  :  ఒక నిముషం ఆగమ్మా ! కాగితం, కలం తీసుకుంటాను…. ఇంక చెప్పమ్మా !
వందన  :  నిన్న మా కళాశాల వార్షికోత్సవం వైభవంగా జరిగింది. జూనియర్ కళాశాలల జిల్లా అధికారి ముఖ్య అతిథిగా వచ్చాడు.
రమణ  :  అవునా ! ముఖ్య అతిథి ఏమని ఉపన్యసించాడో చెప్పగలవా ?
వందన  :  మా జిల్లా అధికారి సత్యనారాయణ రెడ్డి ఉపన్యాసం చాలా ఉత్తేజకరంగా సాగింది. జీవితలక్ష్యం కొరకు కృషి, సాధన, ఏకాగ్రత గురించి వివరించాడు.
రమణ  :  బాగుంది వందనా ! ఇంకా వివరాలు చెప్పమ్మా!
వందన  :  వార్షికోత్సవం సందర్భంగా ఆటలపోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
రమణ  :  ఏయే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి ?
వందన  :  ఒక నాటిక, నృత్యాలు, పాటలు, హాస్యసంభాషణలు, ధ్వన్యనుకరణ, అనుకరణ మొదలైన అంశాలతో రెండు గంటలపాటు కార్యక్రమాలు జరిగాయి. అందరికీ బాగా నచ్చాయి. ఫోటోలు ఈమెయిల్ చేస్తాను సర్ ! రేపటి మీ పత్రికలో ఫోటోలు వివరాలు ప్రచురిస్తారా ?
రమణ  :  తప్పకుండానమ్మా ! మంచిదమ్మా !
వందన  :  ధన్యవాదాలు సర్ !

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 2nd Lesson తెలంగాణ సాహితీ వికాసం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 2nd Lesson తెలంగాణ సాహితీ వికాసం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధి వెనకబడటానికి కారణాలు వివరించండి.
జవాబు:
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భాస్కరరామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతి చరిత్ర రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే. తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి.

దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగి ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించారు. తెలంగాణ శాసనాలలో కొన్నింటిని హైదరాబాదులోని లక్ష్మణరాయ పరిశోధక మండలివారు ప్రచురించారు. మరికొన్ని శాసనాలు పురావస్తు శాఖకు అప్పగించారు. వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి.

హైదరాబాదు సంస్థానంలో తెలుగు దుస్థితికి కారణాలు : గోలకొండ సుల్తానుల ఉత్తమ సంప్రదాయాన్ని అసఫ్ జాహీ వంశీయులు పాటించలేదు. భాషా సంస్కృతులను అణచి వేశారు. హైదరాబాదు పైన పోలీసు చర్య జరిగే వరకు, నిజాం ప్రభుత్వ విధానాలు ప్రజల భాషలను అణచివేశాయి. బ్రిటిషు పరిపాలనలో భాషలపై ఇటువంటి ప్రయత్నాలు జరుగలేదు. నైజామేతర ప్రాంతాలలో బ్రిటీషువారు గ్రంథాలయాల స్థాపనను నిషేధించలేదు. రాజకీయాలతో సంబంధంలేని సారస్వత కృషి నిరంతరాయంగా జరిగింది. సి.పి. బ్రౌన్ వంటి ఉన్నత అధికారులు ప్రజల భాషల వికాసానికి కృషిచేశారు.

వీరేశలింగం పంతులు మొదలైన వారి సారస్వత కృషికి ప్రభుత్వం ఆటంకాలు కలిగించలేదు. కానీ తెలంగాణా ప్రాంతంలో మాతృభాషల వికాసానికి గొడ్డలి పెట్టువంటి విధానాలను హైదరాబాదు ప్రభుత్వం అమలు చేసింది. ఈ ప్రాంతంలోని 90% ప్రజల భాష తెలుగు అయినప్పటికీ తెలుగు చదువుకొనడానికి అవకాశాలు లేవు. ఒక గ్రంథాలయాన్ని పెట్టుకోవడమే చాలాకష్టమైన పని. కవిసమ్మేళనాలు, సారస్వత సభలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి అవసరమయ్యేది. ఆంధ్ర అనే పేరుతో ఏ ఉద్యమం సాగినా దానిని ప్రభుత్వం శత్రుభావముతో చూసేది. ఈ పరిస్థితినే వాగ్బంధన శాసన పైశాచిక తాండవం (నోటిని కట్టివేసే పిశాచాల నర్తనం) అని సురవరం ప్రతాపరెడ్డి అన్నారు.

తెలంగాణా ప్రాంతంలో ఎందరో గొప్పవారైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికీ వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు లేవు. ప్రజలలో పది శాతం మందికి కూడా రాని ఉర్దూ భాషను రాజభాషగా రుద్దారు. ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు ఉర్దూయే బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి అవకాశం లేదు. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పంగా మారి అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచం నుండి వేరు చేసింది. (నిజాం రాజ్యంలో సంస్కృతి సంప్రదాయాలన్నీ ఇతర ప్రాంతాలకంటే భిన్నంగా ఉండేవి.)

అందువల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు తెలంగాణలో అక్షరాస్యత చాలా తక్కువ. సంస్కృతాంధ్ర పండితులు, కవులు తిండికి, నివాసానికి కూడా డబ్బుల్లేక పల్లెటూళ్ళలో బాధలు పడ్డారు. కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉర్దూ, ఫారసీ భాషలను నేర్చుకొని తమ జీవనం సాగించారు. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టింది.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

ప్రశ్న 2.
కొమర్రాజు లక్ష్మణరావు సాహిత్యసేవను తెలియజేయండి.
జవాబు:
తెలంగాణలో తెలుగు భాషా సంస్కృతులపై జరుగుతున్న దాడిని గమనించి ఈప్రాంతంలో సాహిత్య వికాసానికి కృషి చేసినవారిలో ముఖ్యులు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. ఆయన గొప్ప పరిశోధకుడు, తెలుగు భాషా వికాసానికి అపారమైన కృషి చేసిన మేధావి. నిష్కళంక దేశభక్తుడు. ఆ రోజులలో చాలామంది ఆంధ్ర ప్రాంతం వారికి తెలంగాణ గురించి సరైన అవగాహన లేదు. లక్ష్మణరావు మునగాల సంస్థానంలో దివానులుగా పనిచేసేవారు. మునగాల సంస్థానాధీశ్వరులకు తెలంగాణా ప్రాంతంతో సంబంధాలు ఉండేవి. వారిద్దరూ హైదరాబాదుకు వస్తూపోతూ ఉండే వారు.

లక్ష్మణరావు కృషికి మునగాల రాజా తోడ్పాటు అందించారు. ఆ కారణంగా 1900వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము స్థాపితమైంది. తరువాత 1904వ సంవత్సరంలో రాజరాజనరేంద్ర భాషా నిలయం హనుమకొండలో స్థాపితమైనది. ఆ తరువాత వరంగల్లులో శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయం స్థాపితమైంది. లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి కూడా 1900 సంవత్సరంలోనే హైదరాబాదులో స్థాపితమైంది. లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మునగాల రాజాగారి తోడ్పాటుతో తెలంగాణలో సాహిత్య వికాసానికి, సాంస్కృతిక చైతన్యానికి గట్టి పునాదులను నిర్మించారు. తరువాత క్రమక్రమంగా తెలంగాణాలో అనేక గ్రంథాలయాల ద్వారా సాహిత్య సభలు జరిగాయి.

కవి పండితులను చైతన్య పరిచి తెలుగు భాషాభ్యుదయానికి కృషి చేశాయి. లక్ష్మణరావు ప్రోత్సాహంతో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావులు ఈ కృషిలో పాలుపంచుకున్నారు. మొత్తంమీద ఉర్దూ, ఫారసీ భాషల ప్రభావానికి లోనై తన మాతృభాషకు అంత ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితి ఆనాటి తెలంగాణలో కనిపించింది. పైన పేర్కొన్న ముగ్గురు మహనీయులు గ్రంథాలయాలు, పత్రికలు, గ్రంథమాలలు స్థాపించి తెలంగాణను మేలుకొల్పారు. వీరి కారణంగా యువకులు సాహిత్య వికాసానికి కంకణబద్ధులైనారు.

తెలంగాణ సాహిత్యరంగంలో నవయుగోదయమైనది. కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని స్థాపించిన 1900 సంవత్సరము నుంచి ఈ నవ యుగము ప్రారంభమై 1948 సెప్టెంబరులో జరిగిన పోలీసు చర్య వరకు సాగింది. చరిత్ర పరిశోధన, భాషాపరిశోధన, విజ్ఞాన వాఙ్మయాభివృద్ధి, వచన వాఙ్మయ ప్రగతి అనేవి కొమర్రాజు లక్ష్మణరావుగారి ఆశయాలు. ఈ ఆశయాలకనుగుణంగా వారు తమ అనుయాయులను తీర్చిదిద్దారు. వారిలో ముఖ్యులు ముగ్గురు. వారు మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి. వీరు ముగ్గురూ తెలంగాణలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి తీవ్రమైన కృషి చేశారు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ ప్రాంత విశిష్టత ఎట్టిది ? (Imp) (M.P.)
జవాబు:
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భారత, రామాయణ, భాగవతాలకు తెలంగాణా ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. భాస్కరరామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతిచరిత్రను రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే. ప్రాచీన సాహిత్యం తెలంగాణాలో వర్ధిల్లింది.

తెలంగాణా ప్రాంతంలో తెలుగు పాండిత్యం లేదని, తెలుగు సంస్కృతికి చోటులేదని, కొన్ని వర్గాలలో వ్యాపించిన అభిప్రాయం సరైంది కాదు. తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి. దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగి ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించి సాహిత్య పరిషత్తుకు అప్పగించారు. వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి. హైదరాబాదు నగరంలోని పరిస్థితి ఎట్లున్నా పల్లె ప్రాంతాలలో తెలుగు భాషా, సాహిత్యాలు అంతరించలేదని తెలుస్తుంది.

ప్రశ్న 2.
తెలుగుభాషను ఆదరించడంలో సంస్థానాల కృషిని తెలుపండి.
జవాబు:
నిజాం నిరంకుశ పాలనలో తెలుగు భాషా సంస్కృతులు నిరాదరణకు గురైనాయి. అటువంటి పరిస్థితులలో గద్వాల, వనపర్తి, ఆత్మకూరు మొదలైన సంస్థానాలు తెలుగు భాషా సంస్కృతుల రక్షణకు విశేషమైన కృషిచేశాయి. ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక విధంగా ఈ సంస్థానాల ఆదరణి వల్ల సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రాంతం నుంచి కవులు, పండితులు వచ్చి ఈ సంస్థానాలలో సన్మానాలు పొందేవారు. ఇటువంటి వారిలో తిరుపతి వేంకటకవులు కూడా ఉన్నారు.

అవధానాలు తెలంగాణా ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి మధ్య భాషాపరమైన వంతెనలుగా పనిచేశాయి. వీటికితోడు కొన్ని నాటక సంఘాలు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో కొన్ని పట్టణాల్లో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. మైలవరము, సురభి మొదలైన నాటక సంఘాలు వరంగల్లు మొదలైన తెలంగాణా ప్రాంతాలలో నాటకాలను ప్రదర్శించి ఈ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సమైక్యతను బలపరిచాయి.

ప్రశ్న 3.
సురవరం ప్రతాపరెడ్డి సాహిత్యసేవను తెలుపండి.
జవాబు:
సురవరం ప్రతాపరెడ్డి సంపన్న కుటుంబీకులు. బి.ఏ. బి. ఎల్ పట్టభద్రులు. న్యాయవాద వృత్తి చేపట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి, ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయకుండా, జీవితాంతం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన త్యాగమూర్తి సురవరం ప్రతాపరెడ్డి. ఈయన బహుభాషావేత్త, అనేక గ్రంథాలు రాశారు. ఉత్తమశ్రేణి పరిశోధకులు, నిర్భయంగా పత్రికను నడిపిన సంపాదకులు.

ఆయన గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజలను అన్ని రంగాలలో మేలుకొల్పినారు. గోలకొండ పత్రికా సంపాదకునిగా వీరు వ్రాసిన సంపాదకీయాలు అనేక విషయాలకు విజ్ఞాన నిక్షేపాలవంటివి. రామాయణ రహస్యాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైన గొప్ప పరిశోధనాత్మకమైన గ్రంథాలను రాశారు. ప్రతాపరెడ్డి మంచికవులు, కథకులు, విమర్శకులు, వ్యాసకర్తలు, బహుముఖ ప్రతిభాసంపన్నులు. వారు రాసిన నిరీక్షణము వంటి కథలు కథానికా వాఙ్మయంలో మొదటి శ్రేణికి చెందిన కథలు. తమ రచనల ద్వారా తెలంగాణా సమాజాన్ని చైతన్యవంతం చేశారు. గోలకొండ కవుల సంచిక ద్వారా తెలంగాణలో మరుగున పడిన శతాధిక కవులను వెలుగులోకి తెచ్చారు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

ప్రశ్న 4.
తెలంగాణ ప్రాంతంనుండి వెలువడిన పత్రికల గురించి వివరించండి.
జవాబు:
తెలంగాణాలోని మొదటి పత్రిక హితబోధిని 1818వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఒక సంవత్సరం మాత్రమే నడిచింది. తరువాత 1920వ సంవత్సరంలో తెనుగు అనే పత్రిక ఒద్దిరాజు సోదరుల సంపాదకత్వంలో వరంగల్లు జిల్లా ఇనుగుర్తి నుంచి, నీలగిరి అనే పత్రిక షబ్నవీసు నరసింహారావు సంపాదకత్వంలో నల్లగొండ నుండి నడిచాయి. ఈరెండు పత్రికలూ ఐదేండ్లు మాత్రమే నడిచాయి. 1925వ సంవత్సరంలో గోలకొండ పత్రిక అర్ధ వారపత్రికగా ప్రారంభమైంది. తరువాత 1947లో దినపత్రికగా మారి సుమారు ఇరువై సంవత్సరాలు నడిచింది.

సుజాత అనే మాసపత్రిక పి.ఎన్. శర్మ సంపాదకత్వంలో వెలువడింది. ఆంధ్రాభ్యుదయం అనే పత్రిక హన్మకొండ నుంచి, దేశబంధు అనే పత్రిక హైదరాబాదు జిల్లా తూప్రాన్ నుండి, తెలుగు తల్లి, విభూతి, దివ్యవాణి అనే తెలుగు పత్రికలు సికిందరాబాదు నుండి వెలువడినాయి.

తరువాత 1945 లో అడవి బాపిరాజు సంపాదకత్వంలో మీజాన్, బి.ఆర్. చారి సంపాదకత్వంలో తెలంగాణా అనే రెండు దినపత్రికలు వెలువడినాయి. సికింద్రాబాదు నుంచి ఆంధ్ర కేసరి, ఆంధ్రవాణి అనే వార పత్రికలు, తరణి అనే దినపత్రిక వచ్చింది. శోభ అనే సాహిత్య పత్రిక వరంగల్లు నుండి వెలువడింది. ఈ విధంగా తెలంగాణలో నూతన యుగోదయమై అనేకమంది రచయితలు ఆవిర్భవించారు. ఈ పత్రికలన్నీ జాతీయోద్యమ ప్రభావితాలై నవీన వాఙ్మయ నిర్మాణానికి దోహదం చేశాయి.

III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దేవులపల్లి రామానుజరావు స్వగ్రామం ఏది ?
జవాబు:
వరంగల్లు జిల్లా దేశాయిపేట.

ప్రశ్న 2.
రామానుజరావు స్థాపించిన సాహిత్య పత్రిక ఏది ?
జవాబు:
శోభ

ప్రశ్న 3.
రామానుజరావు అధ్యక్షుడిగా పనిచేసిన సాహిత్య సంస్థ ఏది ?
జవాబు:
ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.

ప్రశ్న 4.
రామానుజరావు రాసిన ఖండ కావ్యసంపుటి పేరేమిటి ?
జవాబు:
పచ్చతోరణం.

ప్రశ్న 5.
కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ఏ సంవత్సరంలో స్థాపించారు ?
జవాబు:
క్రీ. శ. 1900

ప్రశ్న 6.
మున్షీ ప్రేమచంద్ కథలను మొదటిసారి తెలుగులోకి అనువదించింది ఎవరు ?
జవాబు:
మాడపాటి హనుమంతరావు.

ప్రశ్న 7.
తెలంగాణాలోని మొదటి పత్రిక ఏది ?
జవాబు:
హితబోధిని.

ప్రశ్న 8.
‘మీజాన్’ పత్రిక ఎవరి సంపాదకత్వంలో వెలువడింది ?
జవాబు:
అడవి బాపిరాజు.

కఠిన పదాలకు అర్ధములు

జాతీయం అంటే ఒక భాషకు సొంతమైన పదబంధాలు. ఇవి నిఘంటువుల పరంగా ఉన్న అర్థం కాకుండా విశేషమైన అర్థాన్ని ఇస్తాయి. సందర్భాన్ని బట్టి అర్థాన్ని స్వీకరించాలి.)

47వ పుట

బహుముఖ ప్రజ్ఞాశాలి = అనేక అంశాల్లో మేధావి
సహాధ్యాయులు = కలిసి చదువుకున్నవారు
సన్నిహిత = దగ్గరి
వి + ఆసంగం
(వ్యాసంగం) = మిక్కిలి ఆసక్తి
సంపుటి = ఒకే రచయిత రాసిన రచనల సమాహారంగా వచ్చిన పుస్తకం

48వ పుట

ఆవిర్భవించిన = పుట్టిన, ప్రారంభమైన
విస్మృతి = మరుపు
విశిష్టమైన, ప్రశస్తమైన,
గణుతికెక్కిన = గొప్ప
ఏకశిలా నగరం = వరంగల్లు
జాను తెలుగు = అచ్చమైన తెలుగు
వర్ధిల్లినది,
ప్రవర్ధమానమైనది = = పెరిగినది
తాళపత్ర గ్రంథాలు = తాటి ఆకులపై రాసిన పుస్తకాలు
ఏబది = యాబై

49వ పుట

స్వర్గీయ = స్వర్గానికి చేరిన (మరణించిన)
విజ్ఞుల = మేధావులు, తెలిసిన వారు
ఆర్క్యాలజీ శాఖ = పురావస్తు పరిశోధక శాఖ
ప్రకటితమైనవి = ప్రచురింప బడినవి
తెలుగు దీపాలు = తెలుగు అనే దీపాలు
దేదీప్యమానంగా = ప్రకాశవంతంగా
మిణుకుమిణుకుమని = చిన్నగా
ఆదరించినారు = గౌరవించినారు, కాపాడి నారు
అణచివేత = అభివృద్ధి కాకుండా చూడటం
నిరంతరాయంగా = అంతరాయం (అడ్డంకి) లేకుండా
సివిలియన్ అధికారులు = పౌర (ఉన్నత) అధికారులు
వికాసం = అభివృద్ధి
గొడ్డలిపెట్టు(జాతీయం) = అడ్డంకి (మూలం నుండి నశింప చేయడం)
కవి సమ్మేళనాలు = కవులు కలిసే సమావేశాలు
సారస్వత సభలు = సాహిత్య సభలు
కంటగింపు (జాతీయం)= విరోధించు
అస్తిత్వ౦ = ఉనికి
ఉద్యమం = ప్రయత్నం

50వ పుట

తుద = చివర
ప్రామాణిక = శాస్త్రీయ
ప్రచ్ఛన్నంగా = రహస్యంగా (మరోవిధంగా)
వాగ్బంధన = మాటలను బంధించడం
తాండవం = గంభీర నాట్యం
ఉద్దండులైన = గొప్పవారైన
సంస్కృత + ఆంధ్ర = సంస్కృతము లోనూ, తెలుగు లోను
బొత్తిగా = అసలే
సంకటం = కష్టం
ద్వీపకల్పం = మూడువైపులా నీళ్ళుండి, ఒక వైపుమాత్రమే దారి ఉండే ప్రదేశం
స్వాతంత్ర్య ప్రాప్తి = స్వాతంత్రం రావడం
మిక్కిలి = ఎక్కువ
గ్రాస = తిండి
వాసః = బట్టలకు, నివాసానికి
దైన్య౦ = దీన స్థితి (లేకపోవడం)
కృశించిరి = చిక్కిపోయారు, కష్టపడ్డారు
గ్రహణం పట్టింది
(జాతీయం) = ఆటంకం ఏర్పడింది
అవధానం = పద్యాలతో ఆడే ఒక సాహిత్య క్రీడ, ఏకాగ్రత

51వ పుట

సంకల్పించుట = నిశ్చయించుట
నిష్కళంక = మచ్చలేని, కళంకము లేని
కూర్చి = గురించి
దివాను = మంత్రి
ఉభయులు = ఇద్దరు
తోడ్పాటు = సహకారం
అభ్యుదయము = అభివృద్ధి
మేల్కొల్పుట = చైతన్య పరుచుట
మహనీయులు = గొప్పవారు
మార్గదర్శకత్వం = నాయకత్వం
కంకణ బద్దులు
కావడం (జాతీయం) = (కంకణం కట్టుకున్నవారు) సిద్ధం కావడం
నవ యుగ + ఉదయం = కొత్త కాలం ప్రారంభం
వాఙ్మయము = రచనలు
అనుయాయులను = అనుసరించే వారిని (శిష్యులను)

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

52వ పుట

గోచరించుట = కనిపించుట
అడుగు జాడలలో
(జాతీయం) = మార్గదర్శకత్వంలో (చూపిన మార్గంలో)
ప్రవీణులు = పాండిత్యం కలిగిన వారు
మహారాష్ట్రము
(భాషాపరంగా) = మరాఠీ భాష
సరళమైన = సులభమైన
పేర్కొనవలసి = చెప్పవలసి
అనువాదం = భాషాంతరీకరణం
మిత వాది = శాంతిని కోరేవాడు (తక్కువ వాదించేవాడు)
వైతాళికుడు = మేల్కొల్పేవాడు, చైతన్య పరిచే వాడు
వ్యాసకర్త = వ్యాసాలు రాసే వ్యక్తి
సంపన్న కుటుంబం = ధనవంతుల కుటుంబం
అవలంబింపక = ఆశ్రయించక, చేయక
స్వీకరింపక = తీసుకోక
అర్పించిన = ఇచ్చిన
త్యాగమూర్తి = ఏది ఆశించకుండా ఇచ్చిన వ్యక్తి
నిర్భయంగా = భయం లేకుండా
విజ్ఞాన నిక్షేపాలు = జ్ఞానాన్ని దాచబడినవి
పరిశోధనాత్మకము = పరిశోధన చేసి చెప్పినది
విమర్శకులు = ఒక రచనలోని మంచి చెడులను చెప్పేవారు
ప్రతిభా సంపన్నులు = ప్రతిభ అనే సంపద కలవారు
నిరీక్షణము = (ఇక్కడ కథ పేరు) వేచి ఉండటం
ప్రథమ శ్రేణి = ఉత్తమ శ్రేణి
హితబోధిని = (ఇక్కడ పత్రిక పేరు) మంచిని బోధించేది

53వ పుట

ఇంచుమించు = దాదాపు
ఒకే పర్యాయం = ఒకటే సారి
జాతీయోద్యమం = స్వాతంత్ర్యోద్యమం
చారిత్రాత్మకమైనది = చరిత్రలో నిలిచిపోయేది
అర్థ వార పత్రిక = వారానికి రెండు సార్లు వచ్చే పత్రిక
ప్రబుద్ధము = చైతన్య వంతము
దేశ + అభ్యుదయానికి = దేశ అభివృద్ధికి
గాఢమైన = ప్రచురించబడినవి
నవీన = కొత్త, నూతన
హర్షించి = సంతోషించి
ప్రశంసాత్మకమైన = పొగడదగిన

54వ పుట

ప్రస్తావించని = చెప్పని
దోహదము = ఉపయోగం
పరంపర + ఆగతము = ఒకరినుండి మరొకరికి
విభిన్న = కొత్త
పుంఖాను పుంఖాలుగా (జాతీయం)
= ఒకదాని తరువాత మరొకటి
(ఎక్కువగా)

తెలంగాణ సాహితీ వికాసం Summary in Telugu

(సాహిత్యోపన్యాసాలు అనే గ్రంథంలోనిది)

రచయిత పరిచయం

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం 1

పాఠం పేరు : తెలంగాణ సాహితీ వికాసం
గ్రంథం : సాహిత్యోపన్యాసాలు
రచయిత : డా. దేవులపల్లి రామానుజరావు
కాలం : జననం : ఆగస్టు 25, 1917 – మరణం : జూన్ 8, 1993
స్వస్థలం : వరంగల్లు జిల్లా, దేశాయిపేట
తల్లిదండ్రులు : అండాలమ్మ, చలపతిరావు
చదువు : నిజాం కళాశాలలో బి.ఏ., నాగపూర్ విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం
సహాధ్యాయులు : ఉన్నత పాఠశాలలో కాళోజి నారాయణరావు, న్యాయ కళాశాలలో పి. వి. నరసింహారావు
మొదటి రచన : పచ్చ తోరణం (ఖండ కావ్య సంపుటి)

రచనలు :
1) సారస్వత నవనీతం
2) తెలుగుసీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం
3) తెలంగాణలో జాతీయోద్యమాలు
4) నా రేడియో ప్రసంగాలు
5) ఉపన్యాసతోరణం
6) వేగుజుక్కలు
7) తెనుగు సాహితి
8) యాభై సంవత్సరాల జ్ఞాపకాలు
9) సాహిత్యోపన్యాసాలు
10) తలపుల దుమారం
11) పంచవర్ష ప్రణాళికలు
12) బంకించంద్ర ఛటర్జీ జీవితం
13) హైదరాబాద్లో స్వాతంత్ర్యోద్యమం
14) మన దేశం – తెలుగు సీమ
15) జవహర్లాల్ నెహ్రూ
16) గౌతమ బుద్ధుడు
17) కావ్యమాల.

సాహిత్య సేవ : వరంగల్లులోని శబ్దానుశాసన గ్రంథాలయానికి కార్యదర్శి, 1946లో శోభ సాహిత్య పత్రిక నిర్వహణ, 15 సంవత్సరాలు గోల్కొండ పత్రికకు సహ సంపాదకులు, ఆంధ్ర సారస్వతపరిషత్తు కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు, ఆంధ్రపదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడు, కేంద్రసాహిత్య అకాడమి కార్యనిర్వాహక సభ్యుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయ సెనెట్ సభ్యుడు, మూడు సార్లు ఆక్టింగ్ వైస్ చాన్సలర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయానికి, తెలుగు విశ్వవిద్యాలయానికి, డా॥ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు.

డాక్టరేట్ పట్టము : 1960-62 కాలంలో సాహిత్యరంగం నుంచి రాజ్యసభ సభ్యుడు, గురజాడ శతవార్షికోత్సవ సంచిక, రవీంద్రనాధ్ ఠాగూర్ శత వార్షికోత్సవ సంచిక, తెలుగు మహాసభల ప్రత్యేక సంచికలకు సంపాదకత్వం వహించారు. డా॥ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1990 లో గౌరవ డాక్టరేట్తో సత్కరించింది.

పాఠ్యభాగ సారాంశం

దేవులపల్లి రామానుజరావు రాసిన సాహిత్యోపన్యాసాలు అనే గ్రంథంలో తెలంగాణా సాహితీ వికాసం అనే వ్యాసంలో తెలంగాణా సాహిత్య వైభవాన్ని వివరించారు. ఆ వ్యాసంలోని ముఖ్యాంశాలు.

ప్రాచీన సాహిత్యంలో తెలంగాణా కృషి : తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భారత, రామాయణ, భాగవతాలకు తెలంగాణా ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. భాస్కరరామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతిచరిత్ర రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే. ప్రాచీన సాహిత్యం కూడా తెలంగాణాలో వర్ధిల్లింది. రాజకీయంగా వేరుపడి పోయినప్పటికిని భాషా దృష్ట్యా తెలంగాణా ప్రాంతం ఆంధ్ర ప్రాంతంతో సన్నిహిత సంబంధాలు కలిగిఉంది.

ఈ సంబంధాలు ఎన్నడూ తెగిపోలేదు. కావున తెలంగాణా ప్రాంతంలో తెలుగు పాండిత్యం లేదని, తెలుగు సంస్కృతికి చోటులేదని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు కొన్ని వర్గాలలో వ్యాపించిన అభిప్రాయం సరైంది కాదు. తెలంగాణాలోని ప్రతీ గ్రామాంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి. కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు తరపున జయంతి రామయ్య పంతులు ఆదేశంపై దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగారు. ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించి సాహిత్య పరిషత్తుకు అప్పగించారు.

ఈ తెలంగాణ- శాసనాలలో కొన్నింటిని హైదరాబాదులోని లక్ష్మణరాయ పరిశోధక మండలివారు ప్రచురించారు. మరికొన్ని శాసనాలు పురావస్తు శాఖకు అప్పగించారు. వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి. హైదరాబాదు నగరంలోని పరిస్థితి ఎట్లున్నా పల్లె ప్రాంతాలలో తెలుగు భాషా, సాహిత్యాలు అంతరించలేదు.

హైదరాబాదు సంస్థానంలో తెలుగు దుస్థితి గోలకొండ సుల్తానుల ఉత్తమ సంప్రదాయాన్ని అసఫ్ జాహీ వంశీయులు పాటించలేదు. భాషా సంస్కృతులను అణచి వేశారు. హైదరాబాదు పైన పోలీసు చర్య జరిగే వరకు, నిజాం ప్రభుత్వ విధానాలు ప్రజల భాషలను అణచివేశాయి. బ్రిటిషు పరిపాలనలో భాషలపై ఇటువంటి ప్రయత్నాలు జరుగలేదు. నిజామేతర ప్రాంతాలలో బ్రిటీషువారు గ్రంథాలయాల స్థాపనను నిషేధించలేదు. రాజకీయాలతో సంబంధంలేని సారస్వత కృషి నిరంతరాయంగా జరిగింది. సి.పి. బ్రౌన్ వంటి ఉన్నత అధికారులు ప్రజల భాషల వికాసానికి కృషిచేశారు. వీరేశలింగం పంతులు మొదలైన వారి సారస్వత కృషికి ప్రభుత్వం ఆటంకాలు కలిగించలేదు. కానీ తెలంగాణా ప్రాంతంలో మాతృభాషల వికాసానికి గొడ్డలి పెట్టువంటి విధానాలను హైదరాబాదు ప్రభుత్వం అమలు చేసింది.

ఈ ప్రాంతంలోని 90% ప్రజల భాష తెలుగు ఐనప్పటికీ తెలుగు చదువుకొనడానికి అవకాశాలు లేవు. ఒక గ్రంథాలయాన్ని పెట్టుకోవడమే చాలాకష్టమైన పని. కవిసమ్మేళనాలు, సారస్వత సభలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి అవసరమయ్యేది. ఆంధ్ర అనే పేరుతో ఏ ఉద్యమం సాగినా దానిని ప్రభుత్వం శత్రుభావముతో చూసేది. ఈ పరిస్థితినే వాగ్బంధన శాసన పైశాచిక తాండవం (నోటిని కట్టివేసే పిశాచాల నర్తనం) అని సురవరం ప్రతాపరెడ్డి అన్నారు.

తెలంగాణలో తెలుగు భాషా స్థితి : తెలంగాణా ప్రాంతంలో ఎందరో గొప్పవారైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికీ వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు లేవు. రాజభాష ఉర్దూ, ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి అవకాశం లేదు. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పంగా మారి అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచము నుండి వేరు చేసింది. (నిజాం రాజ్యంలో సంస్కృతి సంప్రదాయాలన్నీ ఇతర ప్రాంతాలకంటే భిన్నంగా ఉండేవి.) అందువల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు అక్షరాస్యత చాలా తక్కువ.

సంస్కృతాంధ్ర పండితులు, కవులు తిండికి, నివాసానికి కూడా లేక పల్లెటూళ్ళలో బాధలు పడ్డారు. కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉర్దూ, ఫారసీ భాషలను నేర్చుకొని తమ జీవనం సాగించారు. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టింది.

తెలుగు భాషాభివృద్ధికి సంస్థానాల కృషి అటువంటి పరిస్థితులలో తెలుగు భాషను ఆదరించి, ప్రోత్సహించిన సంస్థానాల కృషిని మరచిపోకూడదు. గద్వాల, వనపర్తి, ఆత్మకూరు సంస్థానాల కృషిని ప్రశంసించాలి. ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక విధంగా ఈ సంస్థానాల ఆదరణ వల్ల సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రాంతం నుంచి కవులు, పండితులు వచ్చి ఈ సంస్థానాలలో సన్మానాలు పొందేవారు. ఇటువంటి వారిలో తిరుపతి వేంకటకవులు కూడా ఉన్నారు.

ఈ అవధానాలు తెలంగాణా ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి మధ్య భాషాపరమైన వంతెనలుగా పనిచేశాయి. వీటికితోడు కొన్ని నాటక సంఘాలు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో కొన్ని పట్టణాల్లో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. మైలవరము, సురభి మొదలైన నాటక సంఘాలు వరంగల్లు మొదలైన తెలంగాణా ప్రాంతాలలో నాటకాలను ప్రదర్శించి ఈ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సమైక్యతను బలపరిచాయి.

తెలంగాణలో తెలుగు అభివృద్ధి – కొమర్రాజు లక్ష్మణరావు కృషి : తెలంగాణలోని పరిస్థితులను గమనించి ఈప్రాంతంలో సాహిత్య వికాసానికి కృషి చేసినవారు వారు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. ఆయన గొప్ప పరిశోధకుడు, తెలుగు భాషా వికాసానికి అపారమైన కృషి చేసిన మేధావి. నిష్కళంక దేశభక్తుడు. ఆ రోజులలో చాలామంది ఆంధ్ర ప్రాంతంవారికి తెలంగాణ గురించి సరైన అవగాహన లేదు. లక్ష్మణరావు మునగాల సంస్థానంలో దివానులుగా పనిచేసేవారు. మునగాల సంస్థానాధీశ్వరులకు తెలంగాణా ప్రాంతంతో సంబంధాలు ఉండేవి. వారిద్దరూ హైదరాబాదుకు వస్తూపోతూ ఉండే వారు. లక్ష్మణరావు కృషికి మునగాల రాజా తోడ్పాటు అందింది. ఆ కారణంగా 1900వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము స్థాపితమైంది. తరువాత 1904వ సంవత్సరంలో రాజరాజనరేంద్ర భాషా నిలయం హనుమకొండలో స్థాపితమైనది. ఆ తరువాత వరంగల్లులో శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయం స్థాపితమైంది. లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక గ్రంధమండలి కూడా 1900 సంవత్సరంలోనే హైదరాబాదులో స్థాపితమైంది. లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మునగాల రాజాగారి తోడ్పాటుతో తెలంగాణలో సాహిత్య వికాసానికి, సాంస్కృతిక చైతన్యానికి గట్టి పునాదులను నిర్మించారు. తరువాత క్రమక్రమంగా తెలంగాణాలో అనేక గ్రంథాలయాల ద్వారా సాహిత్య సభలు జరిగాయి.

కవి పండితులను చైతన్య పరిచి తెలుగు భాషాభ్యుదయానికి కృషి చేశాయి. లక్ష్మణరావు ప్రోత్సాహంతో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావులు ఈ కృషిలో పాలుపంచుకున్నారు. మొత్తంమీద ఉర్దూ, ఫారసీ భాషల ప్రభావానికి లోనై తన మాతృభాషకు అంత ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితి ఆనాటి తెలంగాణలో కనిపించింది. పైన పేర్కొన్న ముగ్గురు మహనీయులు గ్రంథాలయాలు, పత్రికలు, గ్రంథమాలలు స్థాపించి తెలంగాణను మేలుకొల్పారు. వీరి కారణంగా యువకులు సాహిత్య వికాసానికి కంకణబద్ధులైనారు.

తెలంగాణ సాహిత్యరంగంలో నవయుగోదయమైనది. కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని స్థాపించిన 1900 సంవత్సరము నుంచి ఈ నవ యుగము ప్రారంభమై 1948 సెప్టెంబరులో జరిగిన పోలీసు చర్య వరకు సాగింది. చరిత్ర పరిశోధన, భాషాపరిశోధన, విజ్ఞాన వాఙ్మయాభివృద్ధి, వచన వాఙ్మయ ప్రగతి అనేవి కొమర్రాజు లక్ష్మణరావుగారి ఆశయాలు. ఈ ఆశయాలకనుగుణంగా వారు తమ అనుయాయులను తీర్చిదిద్దారు.

మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డిల కృషి : మాడపాటి హనుమంతరావు ఇంగ్లీషు, ఉర్దూ, ఫారసీ, తెలుగు భాషలలో ప్రవీణులు. మరాఠి, హిందీ, సంస్కృత భాషలతో తగినంత పరిచయం కూడా ఉంది. ఉర్దూలో కూడా మంచి రచయిత. ముషీర్ దక్కన్ అనే ఉర్దూ దినపత్రికకు అనేక సంవత్సరాలు సంపాదకీయాలు రాశారు. తెలుగులో సరళమైన వచనరచన చేయగలిగిన మేధావి. “క్షాత్ర కాలపు హింద్వార్యులు” అనే గ్రంథాన్ని మరాఠి నుండి తెలుగులోకి అనువదించారు. తెలుగులో మొదటి కథానికా రచయితలలో హనుమంతరావు ఒకరు. స్వయంగా మంచి కథలను రాయడమేగాక మున్నీ ప్రేమ్ చంద్ కథలను మొదటిసారి అనువదించి తెలుగువారికి పరిచయం చేశారు. భారత రాజకీయాలలో గోపాలకృష్ణ గోఖలేవంటి మితవాది మాడపాటి హనుమంతరావు.

తెలంగాణాలో రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలకు మార్గదర్శకులు. రాజకీయాలతో సంబంధం లేనివారు, గొప్ప పండితులు, బహుగ్రంథ రచయిత, ఉత్తమ వ్యాసకర్త, గ్రంథాలయోద్యమ నిర్వాహకులు ఆదిరాజు వీరభద్రరావు. ఈయన తెలంగాణాలో నవచైతన్యానికి తోడ్పడినారు.

సురవరం ప్రతాపరెడ్డి సంపన్న కుటుంబీకులు. బి.ఏ. బి.ఎల్ పట్టభద్రులు. న్యాయవాద వృత్తి చేపట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి, ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయక, జీవితాంతం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన త్యాగమూర్తి సురవరం. ఈయన బహుభాషావేత్త, అనేక గ్రంథాలు రాశారు. ఉత్తమశ్రేణి పరిశోధకులు, నిర్భయంగా పత్రికను నడిపిన సంపాదకులు. ఆయన గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజలను అన్ని రంగాలలో మేలుకొల్పినారు. గోలకొండలో వీరు వ్రాసిన సంపాదకీయాలు అనేక విషయాలకు సంబంధించిన విజ్ఞాన నిక్షేపాలవంటివి.

రామాయణ రహస్యాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైన గొప్ప పరిశోధనాత్మకమైన గ్రంథాలను రాశారు. వారు కవులు, కథకులు, విమర్శకులు, వ్యాసకర్తలు, బహుముఖ ప్రతిభాసంపన్నులు. వారు రాసిన నిరీక్షణము వంటి కథలు కథానికా వాఙ్మయంలో మొదటి శ్రేణికి చెందిన కథలు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

తెలంగాణా సంస్కృతికాభివృద్ధి – పత్రికల పాత్ర : తెలంగాణను ఆధునిక యుగానికి అనుగుణంగా చైతన్యవంతం చేసిన మరికొన్ని సంస్థలున్నాయి. అందులో రెండు పత్రికలు ముఖ్యమైనవి. తెలంగాణాలోని మొదటి పత్రిక “హితబోధిని” 1818 వ సంవత్సరమున స్థాపితమైంది. ఒక సంవత్సరం మాత్రమే నడిచింది. తరువాత 1920వ సంవత్సరంలో రెండు పత్రికలు దాదాపు ఒకే కాలంలో ప్రారంభమైనాయి. అందులో ఒకటి తెనుగు పత్రిక. ఒద్దిరాజు సోదరుల సంపాదకత్వంలో వరంగల్లు జిల్లా ఇనుగుర్తి నుంచి వెలువడి ఐదేండ్లు నడిచింది. రెండవది నీలగిరి. ఇది నల్లగొండ నుండి షబ్నవీసు నరసింహారావు సంపాదకత్వంలో వచ్చింది.

ఇది కూడా ఐదేండ్లు నడిచింది. ఈ రెండు పత్రికలు సాహిత్య ప్రచారానికి, రచయితలకు, జాతీయోద్యమానికి చేయూతనిచ్చాయి. దీని తరువాత 1925వ సంవత్సరంలో గోలకొండ పత్రిక అర్ధ వారపత్రికగా ప్రారంభమైంది. తరువాత 1947లో దినపత్రికగా మారి సుమారు ఇరువై సంవత్సరాలు నడిచింది. తెలంగాణను చైతన్యవంతం చేయడంలో గోలకొండ పత్రిక చేసిన కృషి చరిత్రాత్మకమైంది. సురవరం ప్రతాపరెడ్డి ఈ పత్రికకు సంపాదకులుగా ఉండి, దేశాభ్యుదయానికి, భాషాభివృద్ధికి అపారమైన కృషిచేశారు. ఈ విధంగా తెలంగాణా రచనా రంగంలో నూతన యుగము ప్రారంభమైంది.

మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి ప్రోత్సాహంతో యువ రచయితల కోసం సుజాత అనే మాసపత్రిక పి.ఎన్. శర్మ సంపాదకత్వంలో వెలువడింది. ఈ పత్రికలో విమర్శనాత్మకమైన వ్యాసాలు, కథలు, కవితలు, విజ్ఞానాత్మకమైన వచన రచనలు వచ్చేవి. బూర్గుల రామకృష్ణారావు ఉర్దూ భాష సారస్వతాలను గురించి, ఉమర్ ఖయాంను గురించి వ్రాసిన వ్యాసాలు యిందులో ప్రకటితమయ్యాయి.

రామకృష్ణారావు స్వయంగా బహుభాషాప్రవీణులు, కవులు, విమర్శకులు. ఆయన ఆ రోజులలో ఎంకి పాటల వంటి నవీన కావ్యాలను హర్షించి ప్రశంసాత్మకమైన వ్యాసాలను రాశారు. ఈ పత్రికలతో పాటు ఆంధ్రాభ్యుదయం అనే పత్రిక హన్మకొండ నుంచి, దేశబంధు అనేపత్రిక హైదరాబాదు జిల్లా తూప్రాన్ నుండి, తెలుగు తల్లి, విభూతి, దివ్యవాణి అనే తెలుగు పత్రికలు సికిందరాబాదు నుండి వెలువడినాయి. తరువాత 1945 లో అడవి బాపిరాజు సంపాదకత్వంలో మీజాన్, బి. ఆర్. చారి సంపాదకత్వంలో తెలంగాణా అనే రెండు దినపత్రికలు వెలువడినాయి.

సికింద్రాబాదు నుంచి, ఆంధ్ర కేసరి, ఆంధ్రవాణి, అనే వార పత్రికలు, తరణి అనే దినపత్రిక వచ్చింది. శోభ అనే సాహిత్య పత్రిక వరంగల్లు నుండి వెలువడి కొంతకాలం నడిచింది. ఈ విధంగా తెలంగాణలో నూతన యుగోదయమై అనేకమంది రచయితలు ఆవిర్భవించారు. ఈ పత్రికలన్నీ జాతీయోద్యమ ప్రభావితాలై నవీన వాఙ్మయ నిర్మాణానికి దోహదం చేశాయి. తెనుగు, నీలగిరి, గోలకొండ, సుజాత మొదలైన పత్రికల ఆవిర్భావంతో యువ రచయితలకు ప్రోత్సాహం లభించింది. దీనితో ఒకే రకమైన సంప్రదాయ సాహిత్యమే కాకుండా విభిన్నమైన సాహిత్యం పుంఖానుపుంఖంగా (ఎక్కువగా) వెలువడింది.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 5th Lesson మా భాగోతంలో మేము Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 5th Lesson మా భాగోతంలో మేము

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
పాఠ్యాంశం ఆధారంగా చిందు భాగోతం ప్రదర్శన గురించి తెలుపండి.
జవాబు:
చిందు భాగవతం ప్రదర్శించడానికి ముందు నాలుగు గుంజలు, వెనక రెండు గుంజలు పాతి పందిరి వేస్తారు. ఆ పందిరి కిందనే భాగోతం ప్రదర్శిస్తారు. పందిరి లేకుంటే భాగోతం ఆడరు. పందిరిని చాందిని అని కూడా అంటారు. పందిరికి మూడుపక్కల ఎడ్లకు కట్టే పగ్గాల కంటే లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్లను కట్టేవారు. భాగోతం చూడడానికి వచ్చిన వారు మీద పడకుండా ఈ తాళ్ళను కట్టేవారు.

దొమ్మరి బిడ్డ గడ (రెండువైపులా కర్రలు పాతి వాటి మధ్యలో తాడు కట్టేవారు. ఆ తాడుపై పెద్ద కర్ర పట్టుకొని నడిచేవారు) ఎక్కి, సాలా పులిగోలిగా అని బియ్యం సల్తది. మాదిగ చిందోల్లు ఎల్లమ్మ యేషం గట్టి చెరువులు మొకం కడిగితేనే మోక్షం, బరుకతు అని భావించే వారు. అట్లాంటిది మారిపోయి నడి ఊర్లో భాగోతం ఆడటం ఎల్లమ్మ తాతల కాలంలోనే ప్రారంభమైంది.

“ఇవ్వాల చిందు భాగోతం ఆడుతుండ్రట, పోవాలరా” అనేవారు. ఇవ్వాల “ఎల్లమ్మ ఆట ఆడుతున్నరు. గావు పట్టేదున్నదట పోవాల” అని ఊరివాల్లు వచ్చేవారు. పాత రోజుల్లో రాత్రులు ఊర్లో భాగోతం ఆడుతున్నపుడు మంగలోలు దివిటీలు పట్టేవారు.

వేషాలు తయారు అయేటపుడు ఎవరూ చూడకుండా జాగ్రత్తపడేవారు. తెరముందు ఆడేటప్పుడు మాత్రమే అందరూ చూడాలి అనుకునేవారు. అందుకోసం మాదిగ ఇండ్లల్లో వేషం ధరించేవారు. అలా కుదరనప్పుడు పందిరికి కొంత దూరంలోనో, అలాకూడా కుదరనప్పుడు చుట్టూ దుప్పటి కట్టుకొని రంగులు వేసుకునే వారు. రంగులు వేసుకున్నాక దుప్పటి కప్పుకొని భాగోతం ప్రదర్శించే పందిరి లోపలికి వచ్చేవారు. కళాకారులు ఎవరి వేషం (మేకప్) వాల్లే వేసుకునే వారు. ఎవరి అద్దం వాల్లదగ్గరే ఉండేది.

మొకంకు రేవిడిని, లేకుంటే పసుపు పచ్చ పౌడరును వేసుకునే వారు. తెల్ల వెంట్రుకలు కావాలంటే మెంచు, లేదా అర్దూలం (జింక్ ఆక్సైడ్) వాడేవారు. ఆ అర్దూలం చెమటకు వెంటనే కరిగిపోయేది. చూసేవారు కంటికి ధారలుపడేటట్టు ఏడుస్తున్నారు అనుకునే వాళ్ళు.

పాత రోజుల్లో ఏడుపు రావాలంటే కంట్లో వేలు పెట్టుకోవడం లేదా నూనె చుక్కలు వేసుకునేవారు. కాని ఎల్లమ్మకు దుఃఖం పాట పాడగానే ఏడుపు వచ్చేది. భాగోతం చూసేవారు కూడా వెక్కివెక్కి ఏడ్చేవారు. వారు ఏడిస్తే చీరకొంగులు తడిసిపోయేవి. అంత కష్టపడి భాగోతాన్ని రసవంతంగా ప్రదర్శించేవారు. సత్యహరిశ్చంద్ర భాగోతం ఆడితే చూసేవారు కూడా ఏడ్చేవారు. అలా ప్రదర్శిస్తున్నప్పుడు ఒక్కోసారి ఆఊరి దొరలు “మేం ఇట్లనే కొంగులు పెట్టుకొని ఏడుద్దుమా? బంజేస్తరా? ఓ గంగారం!, ఓ ఎల్లవ్వా! ఇదేం ఏడుసుడు. ఏం కథ, దేవుడా… జర బందు జేయుండ్రి గదా!” అని చెప్పేవారు. అంత లీనమై ఆ ప్రదర్శనను చూసేలా ఆడేవారు. అంత కష్టపడి ప్రదర్శిస్తేనే ఆ కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు భాగోతం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభిస్తే సాయంత్రం ఆరు, యేడు గంటల దాకా ఆడతారు.

ఈ భుజకీర్తులు, కిరీటాలను అంతసేపు అట్లనే ధరించాలి. వేషాల మధ్య తబలకొట్టినా కూడా వాటిని అలానే ధరించేవారు. భాగోతం పూర్తయి ఇంటికి వచ్చి, ఆరతి ఇచ్చిన తరువాతనే వేషాన్ని విప్పేవారు.
ప్రదర్శన ప్రారంభ ముగింపు సన్నివేశాలు: ఏదైనా గ్రామంలో ప్రదర్శన ప్రారంభించే ముందు ఆవూర్లోని విశ్వబ్రాహ్మణుల ఇంటికి వెళ్లి వారి కొలిమికి నమస్కరించేవారు. భాగోతం ఆడటం అయిపోయినంక రాముని

పేరుతో మంగళహారతి ఇస్తారు. పక్కవాయిద్యాల వారు కూడా మంగళారతి పాట పాడేవారు. ప్రధాన వేషం ధరించిన స్త్రీ పాత్ర మంగళహారతి పట్టుకొని ప్రేక్షకుల దగ్గరికి పొతే, వారు ఆ హారతికి నమస్కరించి వారికి తోచినంత డబ్బును హారతి పళ్ళెంలో వేసేవారు. ఆ తరువాత ఆ హారతితోనే కళాకారుల బృందం అంతా ఇంటికి వెళ్తారు. అందరు కలిసి మరొక్కసారి హారతి తీసుకుంటారు.

హారతి ఒకరినొకరిని హృదయాలకు హత్తుకుని ఆడవారితో ఆడవారు, మగవారితో మగవారు దాసున్ని అనే అర్థంలో ‘దాసున్, దాసున్’ అనుకుంటారు. అప్పుడు భాగోతం సామాగ్రినంతా తీసి, ఎవరి సామాను వారు సర్దుకొని వేషాన్ని విప్పేస్తారు. ప్రదర్శనలో భాగంగా అరేయ్ దుర్మార్గా అని, ఓరి సుగ్రీవా అని పాడి, ఎగిరి తంతారు. అలా చేయడం తప్పు కాబట్టి భాగోతం పూర్తికాగానే పెద్దవారి కాళ్లకు నమస్కరిస్తారు. అలా భాగోతంలో అన్నా అనకున్నా, తన్నినా తన్నకున్నా, చిన్నవారు పెద్దలకు నమస్కరిస్తారు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

ప్రశ్న 2.
చిందు భాగోతం ప్రదర్శనకు వస్తువుల తయారీని వివరించండి.
జవాబు:
ప్రదర్శనకు వాడే వస్తువుల తయారీ : చిందు భాగవత ప్రదర్శనలో అలంకరణకు చాల ప్రాధాన్యత ఉంది. అలంకరణలో భాగంగా వాడే భుజకీర్తులు, కిరీటాలు మొదలైన ఆభరణాలను కళాకారులే తయారు చేసుకునేవారు. కొంత మంది మగవారికి మాత్రమే వాటిని తయారు చేయడం వచ్చేది. పొనికి కట్టెతో వీటిని తయారు చేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. కలిపెల్లిగుట్టకు ఈకర్ర చాలా లభించేది. పూర్వం పెద్దపెద్ద గుట్టలు, అడవులు ఉండేవి.

దొనకంటి, కథారుపల్లె వైపు ఈ కలప లభించేది. అడవులను నరికిన కారణంగా ఇప్పుడు లభించడం లేదు. భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారు చేసుకునేవారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది.

కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాళ్ళ హారాలు, దండలు తయారు చేయడం చాలా కష్టం. శంఖ చక్రాలు, కిరీటము, భుజకీర్తులు, సూర్య కిరీటము, మకర కుండలాలు, కంఠసారె, పెద్ద పేరు ఇవన్నీ రాజు వేషానికి అవసరమవుతాయి.

జడ, కొప్పుజడ (దాన్ని షాంపూజడ అంటారు) సిగరేకులు, పక్క గొలుసు, చెక్క బవిలీలు, గూబగున్నాలు వేలాడే గున్నాలు స్త్రీ వేషానికి అవసరం. మిగతా జిల్లాల చిందు కళాకారులు ఎన్నో నగల్ని తీసేస్తున్నారు. కానీ నిజామాబాదు జిల్లా కళాకారులు మొదటి నుంచి ఉన్నవాటిని ఇప్పటి దాకా వాడుతున్నారు.

కిరీటాలు, భుజకీర్తులు కట్టుకొని యేషాలు యేసి, ఆది, ఆటయినంక సూసుకుంటే అవన్నీ సెమటకు ఉబ్బేవి. ఆ నగలను ఆరు, యేడు గంటల పాటు ధరించే ఉండాలి. ప్రదర్శన పూర్తయ్యేవరకు నగలను ‘విప్పకపోయేవారు. అందుకోసం వేషాలు వేసుకునేటప్పుడే అవి జారిపోకుండా గట్టిగ లాగి కట్టేవారు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
భాగోతం ప్రదర్శనకు వేదికను ఎలా సిద్ధం చేసేవారు ?
జవాబు:
చిందు భాగవతం ప్రదర్శించడానికి ముందు నాలుగు గుంజలు, వెనక రెండు గుంజలు పాతి పందిరి వేస్తారు. ఆ పందిరి కిందనే భాగోతం ప్రదర్శిస్తారు. పందిరి లేకుంటే భాగోతం ఆడరు. పందిరిని చాందిని అని కూడా అంటారు. పందిరికి మూడుపక్కల ఎడ్లకు కట్టే పగ్గాల కంటే లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్లను కట్టేవారు. భాగోతం చూడడానికి వచ్చిన వారు మీద పడకుండా ఈ తాళ్ళను కట్టేవారు.

ప్రశ్న 2.
భుజకీర్తులు, కిరీటాల తయారీ ఎలా జరిగేది ? (V.Imp) (Model Paper)
జవాబు:
చిందు భాగవత ప్రదర్శనకు అవసరమైన ఆభరణాలను పొనికి కట్టెతో తయారుచేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారుచేసుకునేవారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది. కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాళ్ళ హారాలు, దండలు తయారు చేయడం చాలా కష్టం.

ప్రశ్న 3.
భాగోతం ఆడిన తరువాత వాటాలు ఎలా పంచుకునేవారు ?
జవాబు:
భాగోతం ఆడిన తరువాత హారతి పళ్ళెంలో వేసిన డబ్బును వాటాలు వేసుకొని పంచుకుంటారు. ప్రదర్శనలో పాల్గొన్న భార్యాభర్తలకు ఒక వాటా, పెళ్లి కాని పిల్లలుంటే, వాళ్లు ఆడితే, ఒక వాటాలో ఐదు భాగాలు చేసి ఆడపిల్లలకు రెండు భాగాలు, మగ పిల్లలయితే మూడు భాగాలు ఇస్తారు. ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఒక పాలు ఇస్తారు కాని ఎల్లమ్మకు భర్తలేడు. అయినా ప్రధాన పాత్రలు ధరిస్తుంది కాబట్టి ఒక వాటా ఇచ్చేవారు. పెండ్లయి ఒక్కడే భాగోతంలో ప్రధాన వేషం వేస్తే కూడా ఒక భాగం ఇస్తారు.

అతనికి భార్యతో విడాకులైనా, ఆమె చనిపోయినా ఆయనకు వాటా ఇస్తారు. మరి పెండ్లయినా చిన్న వేషం ధరిస్తే పాలు ఇవ్వరు. మూడు భాగాలే ఇస్తారు. ఈ పంపకాలు గురించి అప్పుడప్పుడు గొడవలు కూడా అవుతాయి. మళ్ళీ వారిలో వారే పరిష్కరించుకుంటారు.

ప్రశ్న 4.
చిందుల ఎల్లమ్మ ప్రదర్శనలు, పురస్కారాలు తెలుపండి.
జవాబు:
చిందు ఎల్లమ్మ ఇచ్చిన ప్రదర్శనలు : ఎల్లమ్మ నాలుగేళ్ల వయసులోనే బాలకృష్ణుని వేషంతో చిందు యక్షగాన రంగంలో అడుగు పెట్టింది. 1918లో కళారంగంలో ప్రవేశించిన ఎల్లమ్మ గ్రామాల్లో కొన్ని వేల ప్రదర్శనలిచ్చింది. ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన 1979లో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఇచ్చింది. మొదటి రాష్ట్రస్థాయి ప్రదర్శన 1980లో రవీంద్రభారతిలో నాటి ముఖ్యమంత్రి సమక్షంలో ఇచ్చింది. 1984వ సంవత్సరంలో మాస్కో నగరంలో తొలి అంతర్జాతీయ ప్రదర్శన ఇచ్చింది. 1986లో ఢిల్లీలో జరిగిన అప్నా ఉత్సవ్ జాతీయ ప్రదర్శన ఇచ్చింది.

ఎల్లమ్మ పొందిన అవార్డులు : చిందు కళలో తన అభినయానికి 1998-99 లో కళారత్న పురస్కారం, 1999లో హంస పురస్కారం, 2004లో రాజీవ్ ప్రతిభా పురస్కారాలు అందుకుంది. 1982లో రాష్ట్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం లభించింది. 2004లో అప్పటి ప్రభుత్వం ఆమె గౌరవార్ధం నిజామాబాద్ నుండి బోధన్ వరకు గల రహదారికి ‘ఎల్లమ్మ రహదారి’గా నామకరణం చేసింది.

III ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1. ఎల్లమ్మ ఏ వయసులో రంగస్థల ప్రవేశం చేసింది ?
జవాబు:
నాలుగేళ్ల వయసులో.

ప్రశ్న 2.
ఎల్లమ్మ ప్రదర్శన చూసి ప్రశంసించిన నాట్యాచార్యుడు ఎవరు ?
జవాబు:
నటరాజ రామకృష్ణ.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

ప్రశ్న 3.
ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన ఏ సంవత్సరంలో ఇచ్చింది ?
జవాబు:
ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన 1979లో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఇచ్చింది.

ప్రశ్న 4.
1999లో ఎల్లమ్మ పొందిన పురస్కారం ఏది ?
జవాబు:
హంస పురస్కారం

ప్రశ్న 5.
ఎక్కడినుండి ఎక్కడి వరకు ఎల్లమ్మ రహదారి అని పిలుస్తారు ?
జవాబు:
నిజామాబాద్ నుండి బోధన్ వరకు ఉన్న రహదారిని.

ప్రశ్న 6.
భుజకీర్తులు, కిరీటాలు ఏ కట్టెతో తయారుచేస్తారు ?
జవాబు:
పొనికి లేదా బూరుగు కట్టె.

ప్రశ్న 7.
న్యాయమున్నచోట ఎవరు ఉంటారు ?
జవాబు:
నారాయణుడు.

ప్రశ్న 8.
అలాయి బలాయి ఎప్పుడు తీసుకుంటారు ? (V.Imp) (Model Paper)
జవాబు:
ప్రదర్శన ముగిసిన తరువాత హారతి తీసుకున్న తరువాత.

కఠిన పదాలకు అర్థములు

71వ పుట

జానపద కళ = జానపదుల అంటే గ్రామీణ ప్రజల కళ
ఔన్నత్యం = గొప్పతనం
ఆసక్తి = కోరిక, ఇష్టం
స్థిరపడ్డారు = స్థిరనివాసం ఏర్పరుచు కున్నారు
ప్రాయం = వయసు
వేషం = పాత్ర ధరించడం
అడుగుపెట్టింది (జాతీయం) = ప్రారంభించింది
అలరించింది. = సంతోషపరిచింది
ఉగ్రరూపం = భయం కలిగించే రూపం
వైవాహిక జీవితం = వివాహ జీవితం
స్వస్తి పలకడం
(జాతీయం) = ముగింపు చెప్పడం
మేటి = గొప్ప, ప్రధాన
పామర స్త్రీ = చదువురాని మహిళ
అభినయం = నటన
విస్మయం = ఆశ్చర్యం
అరుదు = తక్కువ
ప్రశంసించారు = మెచ్చుకున్నారు
సమక్షంలో = ఎదురుగా
విశిష్ట సభ్యత్వం = ప్రత్యేక సభ్యత్వం

72వ పుట

పురస్కారం = గౌరవం, సన్మానం
గౌరవార్థం = గౌరవ సూచకంగా
నామకరణం = పేరుపెట్టడం
గుంజలు = కర్ర స్థంబాలు
ఎనక = వెనక
పందిరేస్తం = పందిరి వేస్తాం
ఆడేది = ప్రదర్శించేది
పక్కల = వైపుల
సోల్లు = లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్ళు
దొడ్డుగా = లావుగా
మస్తుకోరుతనం = కావాలని అల్లరి చేయాలనే
నడి ఊల్లె = ఊరి మధ్యలో
గడి + ఎక్కి = వెదురు కర్ర సహాయంతో తాడుపై నడవడం
బరుకతు (ఉర్దూ పదం) = లాభం కంటే మించినది
దొమ్మరి బిడ్డ = దొమ్మరి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి
సల్లా పులిగోలిగా = ఒక రకమైన అరుపు
సల్తది = చల్లుతది
మోక్షం = పుణ్యం, కైవల్యం
అంటుండ్రి = అనేవారు

73వ పుట

గావు పట్టుట = పశువు గొంతు కొరికి బలి ఇవ్వడం
ఊరోళ్ళు = ఊరి జనం
దివిటీలు = కాగడాలు
పడుతుండ్రి = పట్టుకునే వారు
యేషాలు = వేషాలు
సూడద్దు = చూడకూడదు
తెరముందే = వేదికపైనే
సూడాల = చూడాలి
భాగ్యం = సంపద
మాదిగిండ్లల్ల = మాదిగ కులస్థుల ఇండ్లలో యేషాలు
యేసుకుంటుంటిమి = వేషం ధరించే వారం
పందిట్లకు = పందిరి లోపలికి
అస్తం = వస్తాము
రేవిడి = రేగడి మన్ను
మెంచు = తెల్లని పదార్ధం
అర్దూలం = జింక్ ఆక్సైడ్
నూరి = రుద్ది
లావు = చాలా
ఏసుకుంటుంటిమి = వేసుకునే వారం
ఏడుపోస్తది = దుఃఖం వస్తుంది
ఎగ పోస్తరు = వెక్కివెక్కి ఏడుస్తారు
చెంగులు = చీర కొంగులు
కంగారు కంగారుగా = చిందరవందరగా
అయితయు = అవుతాయి
నేరుస్తం = నేర్చుకుంటాము
రంజు కట్టిస్తాం
(జాతీయం) = కొంగులు పట్టుకొని ఏడిపిస్తం
యెడబాసి = విడిపోయి
అమ్మినంక = అమ్మిన తరువాత

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

74వ పుట

ప్రాణ + ఈశ = భర్త
నను బాసి పోయెదవ = నన్ను వదిలి వెళ్తావా
ప్రాణంబు = ప్రాణాలను
యెటుల = ఏవిధంగా
భరియింతు = కాపాడుకుంటాను
నయ్యయ్యో = అయ్యో
పశువులనమ్మిన పగిది = పశువులను అమ్మిన విధంగా
శిశువును = కొడుకును
నను = నన్ను
అమ్మించి = అమ్మివేసి
వశము గానట్టి = భరించలేని
ఆపదలు = కష్టాలు
వచ్చే మనకు = మనకు వచ్చాయి
మంది = జనాలు, ప్రేక్షకులు
ఎక్కెక్కి = వెక్కి వెక్కి
ఏడుస్తుండ్రి = ఏడ్చే వారు
దొరలూ = పెత్తందారులు
ఇట్లానే = ఈ విధంగానే
ఏడుద్దుమా = ఏడ్చుకుంటూ ఉండాల్నా
బంజేస్తరా = ముగిస్తారా, ఆపేస్తారా
ఇట్లా పేరు వచ్చింది = ప్రఖ్యాతి లభించింది
అచ్చింది = వచ్చింది
భుజకీర్తులు = – భుజాలపై ఉండే ఆభరణాలు
కిరీటాలు = మకుటాలు
మొగోళల్లే, పొనికి కట్టే, = పురుషులే
బూరుగు కట్టే = ఆభరణాలు తయారు చేయడానికి వాడే ఒకరకం కర్ర
మస్తుగ = ఎక్కువగా
దొరుకుతుండే = లభించేది
ఉంటుండే = ఉండేవి
గట్టు యాడుంది = అడవి ఎక్కడుంది
సెట్టు యాడుంది = చెట్లు ఎక్కడున్నాయి
నాశనం చేసిరి = కనబడకుండా చెడగొట్టారు
ఆడోల్ల నగల కాడికెల్లి = ఆడవారి నగలు కూడా
చేసేతందుకు = చేయడానికి
యాడాది నర్దం = పద్దెనిమిది నెలలు
పడుతది = పడుతుంది
నడుస్తాయి = ఉపయోగించవచ్చు
రేపే ! అంటయి = త్వరగా పాడవుతాయి
హారాలు, పేర్లు = దండలు

75వ పుట

శంఖ చక్రాలు, కిరీటము,
భుజకీర్తులు, సూర్య
కిరీటము, మకర
కుండలాలు, కంఠసారె,
పెద్ద పేరు, జడ, కొప్పుజడ
సిగరేకులు, పక్క గొలుసు,
సెక్క బవిలీలు, గూబగున్నాలు,
వేలాడే గున్నాలు = ఇవన్నీ వేషధారణలో భాగంగా ధరించే ఆభరణాలు
మకర కుండలాలు = మొసలి ఆకారంలో ఉండే చెవులకు పెట్టుకునే నగలు
కంఠసారె = కంఠానికి పెట్టుకునే ఒక ఆభరణం
సిగరేకులు = శిఖలో పెట్టుకునే ఆభరణాలు
సెక్క బవిలీలు = చెక్కతో చేసిన నగలు
గూబగున్నాలు = చెవులకు వేలాడే నగలు
దాక = వరకు
సెమటకు = చెమటకు
అవ్విటిని = వాటిని
ఆపగాలగాల = వేసుకొని మోయాలి
యిప్పేది = విప్పడం
బద్దం గుంజి = గట్టిగా లాగి
పొద్దుగాల = ఉదయం
పొద్దువంగినాక = సూర్యాస్తమయం తరువాత, సాయంత్రం
అట్లనే = అలాగే
నడిమిట్ల = మధ్యలో
ఆరతి ఇచ్చిన మంటేనే = మంగళహారతి ఇచ్చిన తరువాతనే
అవ్విటను = వాటిని, నగలను
ఇసబ్రహ్మ = విశ్వబ్రాహ్మకు
సురూ, షురూ = ప్రారంభం
తిత్తి = కొలిమిలో గాలి ఊదడానికి తోలుతో చేసిన పరికరం
చేతిల కత్తి = చేతిలో ఉండే కత్తి
చేసిచ్చిండ్లు = చేసి ఇచ్చారు
కొంగవలి కత్తి = వంకరగా ఉండే కత్తి
మేళం = కళాకారుల సమూహం
మేటి యేశం = ప్రధాన పాత్ర
ఎంత తోస్తే అంత = ఎంత వేయాలని అనిపిస్తే అంత, తోచినంత
మంగళారతి తీసుకుంటరు = హారతికి నమస్కరిస్తారు
ఇచ్చుడు ఉంటది = ఇవ్వడం ఉంటుంది
అదయినంక = ఆతరువాత
ఇంటిస్తం = ఇంటికి వస్తారు

76వ పుట

అలాయి బలాయి = ఆలింగనం
దాసున్ని = సేవకున్ని
జండర్ సంబంధం లేకుండా = లింగ భేదం పాటించకుండా
ಅಲ್ಲು = వారు
అరేయ్ దుర్మార్గ = ఓరి దుర్మార్గుడా
అంటి = అన్నాను
ఇట్టి = ఇలాంటి
ఘోర కృత్య౦ = ఘోరమైన పని
దండం పెడతాం = నమస్కరిస్తం
మొక్కుతం = నమస్కరిస్తం
సిన్నోల్లు = వయసులో చిన్న వారు
పెద్దోల్లకు = వయసులో పెద్ద వారికి
చెయ్యాల్సిందే = చేయవలసిందే
బారా = పన్నెండు
కెల్లి = నుండి
ఆడంగనే = ప్రదర్శించగానే
సాలు జేయ్యుండ్రి = ఆపేయండి
నిక్కీర్త = ఖచ్చితంగా
పొద్దుపొడవాల = తెల్లారాలి
గొంత = కొద్దిగా కూడా
సూస్తం ఇంకా = ఇంకా చూస్తాము
నోరు కూసోవడం = గొంతు బొంగురుపోవడం
తయారుగుంటరు = సిద్ధంగా ఉంటారు.
పడగొట్టం = వదిలిపెట్టం
ఉల్లాసం = ఉత్సాహం
మందు = మద్యం, సారా
పాడయిరి = చెడిపోతారు
మనసు కరి ఎక్కది = మనస్సు అంగీకరించదు

77వ పుట

లావు అయిపాయే = ఎక్కువై పోతది (చూడరు అని)
నొచ్చె = నొస్తున్నాయి, నొప్పి లేస్తుంది
ఇంటి కాడ = ఇంటి దగ్గర
తెల్లగోలు = వివరంగా
ఆల్ల మొదలార
(తిట్టుపదం) = వాళ్ళ మొదళ్ళు ఆరిపోని అంటే వారు చనిపోని అన్నట్లు
గమ్మతు పడతరు = ఆనందిస్తారు
పైసల్ = డబ్బు
రైకలు = రవికలు
అంగీలు = చొక్కాలు
దోతులు = పంచలు
మస్తు ఇస్తారు = చాలా ఇస్తారు
సౌలత్ = సౌకర్య౦
వాళ్లకు కష్టమే = వాళ్లకు కష్టం వస్తే మాకు కష్టం వచ్చినట్లే
పాలు = వాటా
జింగాలు = ఒక వాటాలో ఐదవవంతు
లగ్గం = పెళ్లి
యేషకాడు = పురుష వేషధారి
యేషకత్తె = స్త్రీ వేషధారి
సమ్మతిస్తే = అంగీకరిస్తే
సహి = సరే

78వ పుట

పంపకాలు = పంచుకోవడం
పోట్లాటలు, తగాదాలు = గొడవలు
మా అండ్ల మేమే = మాలో మేము
పరిష్కరించుకుంటం = సరి చేసుకుంటాం
దబ్బున = ఒకవేళ
చేసుకున్నదే కష్టం = చేసుకున్నంతే సంపాదన
ఆముదాని = ఆదాయం
సూడనిచ్చినావురా ? = చూసే అవకాశం ఇచ్చావారా
ఇయ్యమంట ఆస్తివి = ఇవ్వుమని వచ్చావు
మొకంమీదనే = ముఖం ముందర
కలకల అనిపిస్తది = బాధ అనిపిస్తుంది
సూసేతందుకు = చూడటానికి
ఆడుతున్నమాయే = ప్రదర్శిస్తున్నాం కదా
మానెడు బియ్యం = రెండు అడ్డల బియ్యం (కొలత పదం)
పంచుకుంటిమి = పంచుకున్నాము
లగుంటే = శక్తి ఉంటే
తలా = ఒక్కొక్కరికి
ఇంకొకల్లు = వేరేవాళ్ళు
అటువోరు = ఆ వైపు వెళ్ళరు
మోటు మాట = బూతు, చెడ్డమాట
మా అసుంటోల్లను = మా లాంటి వారిని
ఐదు నూర్లు = ఐదు వందలు
గరుజు = చాలా అవసరం
అసుంటప్పుడు = అలాంటి సమయంలో
తాట = దగ్గర
నారాయణమూర్తి = దేవుడు

మా భాగోతంలో మేము Summary in Telugu

రచయిత్రి పరిచయం

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము 1

పాఠం పేరు : మా భాగోతంలో మేము
దేని నుండి గ్రహింపబడినది : నేను చిందుల ఎల్లమ్మ మాటల్లోనే ఆమె జీవితాన్ని రికార్డు చేసిన “చిందుల ఎల్లమ్మ”ను .. అనే చిందు భాగవతం ఆత్మకథలో నుండి గ్రహింపబడినది.
రచయిత్రి : చిందు ఎల్లమ్మ
జన్మస్థలం : ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుతం నిర్మల్ జిల్లా) బాసర
నివాస స్థలం : నిజామాబాదు జిల్లా అమ్డాపూర్
కాలం : జననం : ఏప్రిల్ 1, 1914 – మరణం : నవంబర్ 9, 2005
తల్లిదండ్రులు : ఎల్లవ్వ, పిల్లిట్ల నాభిసాబ్.
చదువు : నిరక్షరాస్యురాలు

విశేషతలు : భారతీయ జానపదకళ ఔన్నత్యాన్ని, వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన కళాకారిణి
ధరించిన పాత్రలు : సత్యభామ, మోహిని, సత్యవతి, సావిత్రి, రంభ, లక్ష్మి, రత్నాంగి వంటి స్త్రీ పాత్రలు, ధర్మాంగదుడు, మాంధాత, కుశలుడు, హనుమంతుడు, నరసింహస్వామి వంటి పురుష పాత్రలు. ఎల్లమ్మకు 14 సంవత్సరాల వయస్సులోనే వివాహం జరిగింది. కాని చిందు కళకే అంకితం కావాలనే ధ్యేయంతో వైవాహిక జీవితానికి స్వస్తిపలికి తన జీవితాన్ని కళకు అంకితం చేసింది.

నటరాజ రామకృష్ణచే సన్మానం : క్షణకాలం తేడాలోనే స్త్రీ, పురుష పాత్రలలో మెప్పించగలిగిన మేటి కళాకారిణి ఎల్లమ్మ. ఒక పామర స్త్రీ ఇంత అద్భుతంగా అభినయాన్ని ప్రదర్శించటం నాకు విస్మయాన్ని కలిగించింది. ఇలాంటి కళాకారుల్ని అరుదుగా చూస్తాం. అని ఆమె ప్రదర్శనను చూసిన నాట్యాచార్య నటరాజ రామకృష్ణ ప్రశంసించి విలువైన శాలువాతో సత్కరించారు.

ప్రదర్శనలు : ఎల్లమ్మ నాలుగేళ్ల వయసులోనే బాలకృష్ణుని వేషంతో చిందు యక్షగాన రంగంలో అడుగు పెట్టింది. 1918లో కళారంగంలో ప్రవేశించిన ఎల్లమ్మ గ్రామాల్లో వేల ప్రదర్శనలిచ్చింది. తొలి అధికారిక ప్రదర్శన 1979లో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఇచ్చింది. మొదటి రాష్ట్రస్థాయి ప్రదర్శన 1980లో రవీంద్రభారతిలో నాటి ముఖ్యమంత్రి సమక్షంలో ఇచ్చింది.

రాష్ట్ర సాహిత్య అకాడమి సభ్యత్వం : 1982లో రాష్ట్ర సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం లభించింది.
జాతీయ ప్రదర్శనలు : 1984వ సంవత్సరంలో మాస్కో నగరంలో తొలి అంతర్జాతీయ ప్రదర్శన ఇచ్చింది. 1986లో ఢిల్లీలో జరిగిన అప్నా ఉత్సవ్లో జాతీయ ప్రదర్శన ఇచ్చింది..
పురస్కారాలు : చిందు కళలో తన అభినయానికి 1998-99 లో కళారత్న పురస్కారం, 1999లో హంస పురస్కారం, 2004లో రాజీవ్ ప్రతిభా పురస్కారాలు అందుకుంది.
ఎల్లమ్మ రహదారి : అప్పటి ప్రభుత్వం ఆమె గౌరవార్ధం నిజామాబాద్ నుండి బోధన్ వరకు గల రహదారికి ‘ఎల్లమ్మ రహదారి’గా నామకరణం చేసింది.

పాఠ్యభాగ సందర్భం

ప్రస్తుత పాఠ్యభాగం చిందు ఎల్లమ్మ మాటల్లోనే ఆమె జీవితాన్ని రికార్డు చేసిన పుస్తకం “నేను చిందుల ఎల్లమ్మను – చిందు భాగవతం ఆత్మకథ” లోనిది. ఈ పుస్తకానికి సంపాదకుడు డా.కె. ముత్యం.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 5 మా భాగోతంలో మేము

పాఠ్యభాగ సారాంశం

(ఈ పాఠ్యాంశం తెలంగాణ మాండలికంలో ఉంది. మరీముఖ్యంగా నిరక్షరాస్యులు యాసలో ఉత్తమ పురుషలో ఉంది. దాని సారాంశాన్ని సరళ ప్రామాణిక భాషలో, ప్రథమపురుషలో అందిస్తున్నాం.)

చిందు భాగోతం ప్రదర్శన : చిందు భాగవతం ప్రదర్శించడానికి ముందు నాలుగు గుంజలు, వెనక రెండు గుంజలు పాతి పందిరి వేస్తారు. ఆ పందిరి కిందనే భాగోతం ప్రదర్శిస్తారు. పందిరి లేకుంటే భాగోతం ఆడరు. పందిరిని చాందిని అని కూడా అంటారు. పందిరికి మూడుపక్కల ఎడ్లకు కట్టే పగ్గాల కంటే లావుగా ఉండే జనుముతో చేసిన తాళ్లను కట్టేవారు. భాగోతం చూడడానికి వచ్చిన వారు మీద పడకుండా ఈ తాళ్ళను కట్టేవారు. దొమ్మరి బిడ్డ గడ (రెండువైపులా కర్రలు పాతి వాటి మధ్యలో తాడు కట్టేవారు. ఆ తాడుపై పెద్ద వెదురు కర్ర పట్టుకొని నడిచేవారు) ఎక్కి సాలా పులిగోలిగా అని బియ్యం సల్తది. మాదిగ చిందోల్లు ఎల్లమ్మ యేషం గట్టి చెరువులు మొకం కడిగితేనే మోక్షం, బరుకతు అని భావించే వారు. అట్లాంటిది మారిపోయి నడి ఊర్లో భాగోతం ఆడటం ఎల్లమ్మ తాతల కాలంలోనే ప్రారంభమైంది.

“ఇవ్వాల చిందు భాగోతం ఆడుతుండ్రట, పోవాలరా” అనేవారు. ఇవ్వాల “ఎల్లమ్మ ఆట ఆడుతున్నరు. గావు పట్టేదున్నదట పోవాల” అని ఊరివాల్లు వచ్చేవారు. పాత రోజుల్లో రాత్రులు ఊర్లో భాగోతం ఆడుతున్నపుడు మంగలోల్లు దివిటీలు పట్టేవారు.

వేషాలు వేసేటప్పుడు ఎవరూ చూడకుండా జాగ్రత్తపడేవారు. తెరముందు ఆడేటప్పుడు మాత్రమే అందరూ చూడాలి అనుకునేవారు. అందుకోసం మాదిగ ఇండ్లల్లో వేషం ధరించేవారు. అలా కుదరనప్పుడు పందిరికి కొంత దూరంలోనో, అలాకూడా కుదరనప్పుడు చుట్టూ దుప్పటి కట్టుకోని రంగులు వేసుకునే వారు. రంగులు వేసుకున్నాక దుప్పటి కప్పుకొని భాగోతం ప్రదర్శించే పందిరి లోపలికి వచ్చేవారు. కళాకారులు ఎవరి వేషం (మేకప్) వాల్లే వేసుకునే వారు. ఎవరి అద్దం వాల్లదగ్గరే ఉండేది. మొకంకు రేవిడిని, లేకుంటే పసుపు పచ్చ పౌడరును వేసుకునే వారు. తెల్ల వెంట్రుకలు కావాలంటే మెంచు, లేదా అర్దూలం (జింక్ ఆక్సైడ్) వాడేవారు. ఆ అర్దూలం చెమటకు వెంటనే కరిగిపోయేది. చూసేవారు కంటికి ధారలుపడేటట్టు ఏడుస్తున్నారు అనుకునే వాళ్ళు. పాత రోజుల్లో ఏడుపు రావాలంటే కంట్లో వేలు పెట్టుకునే వారు లేదా నూనె చుక్కలు వేసుకునేవారు.

కాని ఎల్లమ్మకు దుఃఖం పాట పాడగానే ఏడుపు వచ్చేది. భాగోతం చూసేవారు కూడా వెక్కివెక్కి ఏడ్చేవారు. వారు ఏడిస్తే చీరకొంగులు తడిసిపోయేవి. అంత కష్టపడి భాగోతాన్ని రసవంతంగా ప్రదర్శించేవారు. సత్యహరిశ్చంద్ర భాగోతం ఆడితే చూసేవారు కూడా ఏడ్చేవారు. అలా ప్రదర్శిస్తున్నప్పుడు ఒక్కోసారి ఆఊరి దొరలు “మేం ఇట్లనే కొంగులు పెట్టుకొని ఏడుద్దుమా? బంజేస్తరా? ఓ గంగారం!, ఓ ఎల్లవ్వా! ఇదేం ఏడుసుడు. ఏం కథ, దేవుడా… జర బందు జేయుండ్రి గదా!” అని చెప్పేవారు. అంత లీనమై ఆ ప్రదర్శనను చూసేలా ఆడేవారు. అంత కష్టపడి ప్రదర్శిస్తేనే ఆ కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.

ప్రదర్శనకు వాడే వస్తువుల తయారీ : భుజకీర్తులు, కిరీటాలు మొదలైన ఆభరణాలను కళాకారులే తయారు చేసుకునేవారు. కొంత మంది మగవారికి మాత్రమే వాటిని తయారు చేయడం తెలుసు. “పొనికి కట్టెతో వీటిని తయారు చేస్తారు. దాన్ని బూరుగు కట్టె అనికూడా అంటారు. అగ్గిపుల్లలను కూడా ఈ కర్రతోనే తయారు చేస్తారు. కలిపెల్లిగుట్టలో ఈకర్ర చాలా లభించేది. పూర్వం పెద్దపెద్ద గుట్టలు, అడవులు ఉండేవి. దొనకంటి, కథారుపల్లె వైపు ఈ కలప లభించేది. అడవులను నరికిన కారణంగా ఇప్పుడు లభించడం లేదు.

భుజకీర్తులు, కిరీటాల డిజైన్లు చెక్కుడు, అంతా వారే తయారు చేసుకునే వారు. పురుషుల కిరీటము చేయడానికి పన్నెండు నెలలు, ఆడవారి కిరీటం చేయడానికి పద్దెనిమిది నెలలు పట్టేది. కష్టపడి చేసిన నగలను జాగ్రత్తగా కాపాడుకొని పది, పన్నెండేండ్లు ఉపయోగించేవారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అవి పనికి రాకుండా పోయేవి. ఆడవాల్ల హారాలు, దండలు తయారు చేయడం చాలా కష్టం. శంఖ చక్రాలు, కిరీటము, భుజకీర్తులు, సూర్య కిరీటము, మకర కుండలాలు, కంఠసారె, పెద్ద పేరు ఇవన్నీ రాజు వేషానికి అవసరమవుతాయి.

జడ, కొప్పుజడ (దాన్ని షాంపూజడ అంటారు) సిగరేకులు, పక్క గొలుసు, చెక్క బవిలీలు, గూబగున్నాలు, వేలాడే గున్నాలు స్త్రీ వేషానికి అవసరం. మిగతా జిల్లాల చిందు కళాకారులు ఎన్నో నగల్ని తీసేస్తున్నరు. కానీ నిజామాబాదు జిల్లా కళాకారులు మొదటి నుంచి ఉన్నవాటిని ఇప్పటికీ వాడుతున్నారు.

కిరీటాలు, భుజకీర్తులు కట్టుకొని యేషాలు యేసి, ఆడి, ఆటయినంక చూసుకుంటే అవన్నీ చెమటకు ఉబ్బేవి. నగలను ఆరు, యేడు గంటల పాటు ధరించే ఉండాలి. ప్రదర్శన పూర్తయ్యేవరకు నగలను విప్పకపోయేవారు. అందుకోసం వేషాలు వేసుకునేటప్పుడే అవి జారిపోకుండా గట్టిగ లాగి కట్టేవారు. భాగోతం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభిస్తే సాయంత్రం ఆరు, యేడు గంటల దాకా ఆడతారు. ఈ భుజకీర్తులు, కిరీటాలను అంతసేపు అట్లనే ధరించాలి. వేషాల మధ్య తబలకొట్టినా కూడా వాటిని అలానే ధరించేవారు. భాగోతం పూర్తయి ఇంటికి వచ్చి, ఆరతి ఇచ్చిన తరువాతనే వేషాన్ని విప్పేవారు.

ప్రదర్శన ప్రారంభ, ముగింపు సన్నివేశాలు : ఏదైనా గ్రామంలో ప్రదర్శన ప్రారంభించే ముందు ఆవూర్లోని విశ్వబ్రాహ్మణుల ఇంటికి వెళ్లి కమ్మరి కొలిమికి నమస్కరించే వారు. భాగోతం ఆడటం అయిపోయినంక రాముని పేరుతో మంగళ హారతి ఇస్తారు. పక్కవాయిద్యాల వారు కూడా మంగళారతి పాట పాడేవారు. ప్రధాన వేషం ధరించిన స్త్రీ పాత్ర మంగళహారతి పట్టుకొని ప్రేక్షకుల దగ్గరికి పొతే, వారు ఆ హారతికి నమస్కరించి వారికి తోచినంత డబ్బును హారతి పళ్ళెంలో వేసేవారు. ఆ తరువాత ఆ హారతితోనే కళాకారుల బృందం అంతా ఇంటికి వెళ్తారు. అందరు కలిసి మరొక్కసారి హారతి తీసుకుంటారు.

హారతి తరువాత ఒకరినొక ఆలింగనం చేసుకుంటారు. ఆడవారితో ఆడవారు, మగవారితో మగవారు దాసున్ని అనే అర్థంలో లింగ భేదం లేకుండా ‘దాసున్, దాసున్’ అనుకుంటారు. అప్పుడు భాగోతం సామాగ్రినంతా తీసి, ఎవరి సామాను వారు సర్దుకొని వేషాన్ని విప్పేస్తారు. ప్రదర్శనలో భాగంగా అరేయ్ దుర్మార్గా అని, ఓరి సుగ్రీవా అని పాడి, ఎగిరి తంతారు. అలా చేయడం తప్పు కాబట్టి భాగోతం పూర్తికాగానే పెద్దవారి కాళ్లకు నమస్కరిస్తారు. అలా భాగోతంలో అన్నా అనకున్నా, తన్నినా తన్నకున్నా, చిన్నవారు పెద్దలకు నమస్కరిస్తారు.

ప్రదర్శనల్లో వస్తున్న మార్పులు : మంగళ హారతిలో మంది వేసిన డబ్బులను అందరూ కలిసి పంచుకుంటారు. భాగోతం మధ్యాహ్నం పన్నెండు, ఒకటి నుంచి ఆరు, ఏడు గంటల వరకు ప్రదర్శిస్తారు. ఇపుడు కొంతమంది మూడు గంటలసేపు ఆడగానే ఆపుమంటున్నారు. కాని ఖచ్చితంగా ఆడాలంటే రాత్రి పది గంటలకు ప్రారంభించి, ఉదయం వరకు ప్రదర్శిస్తారు. భాగోతం అయిపోయే వరకు ప్రేక్షకులను కదలనీయనంత ఆకర్షణీయంగా ప్రదర్శిస్తారు. అవకాశముంటే వరుసగా పదిహేను రోజులపాటు భాగోతాలు ఆడుతారు. ఒకవేళ ఎవరి గొంతుకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఇతరులు సహకరిస్తారు. సారా ముట్టరు. మందు ముడితే పాడయిపోతారని గట్టి నమ్మకం.

పెద్ద కథని రెండు గంటల్లో ఆడమంటే “అయ్యో చెప్పి ఏమి లాభం? చెప్పక ఏమి లాభం? అనుకుంటారు. అలా తక్కువ సమయంలో పూర్తి చేస్తే వాళ్లకు సంతృప్తి కలగదు. ఈ రోజుల్లో మూడు గంటలు భాగోతం చూడడానికి జనాలకు ఓపిక ఉండటం లేదు. “అయ్యో! నడుములు నొచ్చె, ఇంటికాడ ఏమాయెనో” అంటారు.

ఇతరుల ప్రదర్శనలకంటె చిందు ప్రదర్శనలకు ఎక్కువ మొగ్గు చూపేవారు. కళాకారులకు డబ్బుతోపాటు, చీరలు, రవికలు, అంగీలు, ధోతులు ఇచ్చేవారు. అన్ని గ్రామాలలో చిందు కళాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే వారు. మాదిగ ఇండ్లలో అడుక్కునేవారు కాబట్టి వారిని గౌరవించేవారు.

ఆదాయాన్ని పంచుకునే పద్ధతి : భాగోతం ఆడిన భార్యాభర్తలకు ఒక వాటా, పెళ్లి కాని పిల్లలుంటే, వాళ్లు ఆడితే, ఒక వాటాలో ఐదు భాగాలు చేసి ఆడపిల్లలకు రెండు భాగాలు, మగ పిల్లలకు మూడు భాగాలు ఇస్తారు. ఇద్దరు భార్యాభర్తలకు ఒక పాలు ఇస్తారు కాని ఎల్లమ్మకు భర్తలేడు. అయినా ప్రధాన పాత్రలు ధరిస్తుంది కాబట్టి ఒక వాటా ఇచ్చేవారు. పెండ్లయి ఒక్కడే భాగోతంలో ప్రధాన వేషం వేస్తే కూడా ఒక భాగం ఇస్తారు.

అతనికి భార్యతో విడాకులైనా, ఆమె చచ్చిపోయినా ఆయనకు పాలు ఇస్తారు. మరి పెండ్లయినా చిన్న వేషం ధరిస్తే పాలు ఇవ్వరు. మూడు భాగాలే ఇస్తారు. ఈ పంపకాలు గురించి అప్పుడప్పుడు గొడవలు కూడా అవుతాయి. మళ్ళీ వారిలో వారే పరిష్కరించుకుంటారు.

చిందు వాళ్ళు టిక్కెట్లు పెట్టి భాగోతం ఆడరు. వరంగల్ జిల్లాల ఆడుతున్నరట. టిక్కెటుకు పైసలు ఇస్తేనే భాగోతం చూడనివ్వాలి లేకుంటే లేదు అంటే పైసలు ఉండకపోతే ప్రదర్శన చూడలేకపోతారు. ఒక వేల టిక్కెట్లు పెట్టి ఆడితే ఆ ఆదాయంతోనే బతకాలి. ఊల్లోకి వెళ్లి అడుక్కోవడానికి అవకాశం ఉండదు. అలా అడుక్కుంటే “నువ్వు సూడనిచ్చినావురా? పైసలు తక్కువ వున్నయంటే రానియ్యక పోతివి. మిట్ట మిట్ట సూడంగ ఎల్లగొడితివి. మల్లా అదీ ఇదీ ఇయ్యమంట అస్తివి” అని మొకం మీదనే కసురుకుంటారు. కళాకారులకు తమ ప్రదర్శన ఎక్కువమంది చూడాలనే కోరిక ఉంటుంది. టిక్కెట్టు పెట్టకపోవడానికి మరొక కారణం ఒక గ్రామంలో అడుక్కుంటే బియ్యం, కూరగాయలు, పప్పు, ఉప్పు చింతపండు, బట్టలు ఇలా అనేకరకాల వస్తువులు ఇస్తారు. డబ్బువస్తే దేనికయినా ఖర్చు అవుతాయి కాబట్టి వారు టిక్కెట్టు పెట్టరు.

చిందు కళాకారులు రాజ్యం పంచుకోవడం : చిందు కళాకారులు ప్రారంభంలో యే గ్రామంలోనైనా ప్రదర్శనలు ఇచ్చేవారు. కాని మధ్యలో గ్రామాలు పంచుకొని ఒకరికి వచ్చిన గ్రామంలోకి ఇంకొకరు వెళ్లి ప్రదర్శనలు ఇవ్వరు. ఒక్కో కళాకారుల బృందానికి ఇరవై నుండి ముప్పై గ్రామాలు ఉండేవి. ఇలా గ్రామాలను పంచుకోవడాన్ని రాజ్యం పంచుకునుడు అంటారు. రొట్టె తినని కారణంగా మహారాష్ట్ర వైపు ఎక్కువగా చిందు కళాకారులు లేరు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, గాంధారి, పిట్లం, రెంజల్, నవీపేట, కుందాపురం, నందిపేటల్లో ఉన్నారు. మల్లారం, మాకులూరు, బొంకిన పల్లెల్లో వున్నారు. ఆరమూరు వైపు ఎక్కువగా ఉన్నారు.

అలా ఊల్లు పంచుకున్న కుటుంబాలు భాగోతాలు ఆడాలనుకుంటే కళాకారుల దగ్గరికి వచ్చి, ఆటకు ఐదు వందలు రూపాయలు ఇచ్చి తీసుకుపోతారు. వారి అవసరం కనుక సామాన్లు కూడా నెత్తిమీద పెట్టుకొని తీసుకెళ్తారు. ఎవరికన్నా ఊర్లుండి కళాకారుల బృందం లేకుంటే ముందే మాట్లాడుకుంటారు. వచ్చిన దానిలో సగం సగం తీసుకుంటారు. న్యాయం ఉన్నదగ్గరే నారాయణుడు (దేవుడు) ఉంటాడు అని నమ్మి పంపకాలలో న్యాయం పాటిస్తారు. అని చిందు ఎల్లమ్మ డా. కె.ముత్యం కు చెప్తే ఆమె చెప్పినట్టుగానే ఆయన పుస్తకంలో రాశారు.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar సంక్షిప్తీకరణ Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

ఇటీవల రచనల్లో సంక్షిప్తీకరణకు ప్రాధాన్యత పెరిగిపోయింది. పెద్ద పెద్ద పేరాలలో ఉండే విషయాలను కుదించి మొత్తం విషయాన్ని క్లుప్తంగా చెప్పడం రాతనైపుణ్యాలలో ఒక అంశంగా చెప్పుకుంటున్నాం. మూలంలోని అంశం ప్రతిబింబించేలా తక్కువ పదాల్లో భావాన్ని వ్యక్తీకరించడమే సంక్షిప్తీకరణ. విద్యార్థులలో ఈ నైపుణ్యాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో దీనిని ఒక అంశంగా చేర్చాం.

ప్రశ్న 1.
తెలంగాణా ప్రాంతంలో ఊరూర ఉద్ధండులైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికిని వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు బొత్తిగా లేకుండెను. రాజభాషయైన ఉర్దూ, ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి గొప్ప సంకట పరిస్థితి యేర్పడినది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పముగా సిద్ధమై అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచము నుండి వేరు చేసినది. అందుచేత గత శతాబ్దమునుంచి భారత స్వాతంత్య్ర ప్రాప్తివరకు అక్షరాస్యులైన ప్రజల సంఖ్య మిక్కిలి తక్కువగా ఉండెను. సంస్కృతాంధ్ర పండితులు కవులు గ్రాసవాసోదైన్యానికి గురియై పల్లెటూళ్ళలో కృశించిరి. కొద్దిమంది ఉర్దూ, ఫారసీ భాషలతో పరిచయం చేసుకొని ప్రభుత్వ ఆశ్రయముతో తమ పనులను నెరవేర్చుకొనిరి. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టినది.
జవాబు:
సంక్షిప్తరూపం :
తెలంగాణ ప్రాంతంలో సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికి సభలకు అవకాశాలు లేకుండేది. ఉర్దూ రాజభాషగా, బోధనాభాషగా ఉండటం వల్ల తెలుగు భాషాభివృద్ధికి సంకట స్థితి ఏర్పడింది. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రంలో భారత స్వాతంత్ర్యప్రాప్తి వరకు అక్షరాస్యత తక్కువగా ఉండేది. కొందరు సంస్కృతాంధ్ర పండితులు, కవులు పల్లెటూళ్ళలో కృశించిపోతే, మరికొందరు రాజభాషను నేర్చుకొని తమ పనులు నెరవేర్చుకొన్నారు.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

ప్రశ్న 2.
ఇక నేను తెలుగు సాహిత్య రంగంలో చేసిన పరిశోధన గురించి సంగ్రహంగా మనవి చేస్తాను. హైస్కూలు విద్యార్ధిగా ఉండినప్పటినుంచే భారతి తదితర పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, ఈయుణ్ణి, మల్లంపల్లి వంటి పరిశోధకుల వ్యాసాలు, వారు సంపాదించిన గ్రంథాల పీఠికలు చదవటంచేత వారివలె ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పవలెననే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టినాను. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణభారతదేశ భాషలన్నిటిలో నా తెలుగు జానపదగేయ సాహిత్యము మొదటి సిద్ధాంత గ్రంథమైనది. ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించినాను. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదులకొలది పరిశోధనాత్మకపత్రాలు చదివినాను. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించినాను.
జవాబు:
సంక్షిప్తరూపం :
హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటినుండే భారతిలాంటి పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, మల్లంపల్లి వంటి వాళ్ళ వ్యాసాలు చదివాను. అందువల్ల కొత్త సాహిత్య విషయాలు చెప్పాలని పరిశోధక రంగంలో అడుగుపెట్టాను. దక్షిణ భారతదేశ భాషల్లోనే నా తెలుగు జానపదగేయ సాహిత్యం మొదటి సిద్ధాంత గ్రంథం. తెలుగు, ఆంగ్లంలో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ఎన్నో పరిశోధక పత్రాలు చదివాను. ఆంగ్లంలో ‘ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్ లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్లోలోర్ గ్రంథాలు ప్రకటించాను.

TS Inter 2nd Year Telugu Grammar సంక్షిప్తీకరణ

ప్రశ్న 3.
ప్రకృతిసిద్ధంగా జరిగే పరిణామక్రమంలో ప్రకృతి చేసుకునే ఎంపిక గురించి చార్లెస్ డార్విన్ వివరిస్తూ మానవజాతి ఆవిర్భావం గురించి విభిన్నంగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుచ్ఛక్తి కనుగొనడం ద్వారా థామస్ ఆల్వా ఎడిసన్ సైన్సుకూ, టెక్నాలజీకి చెందిన ప్రతి రంగాన్ని సమూలంగా మార్చివేశాడు. దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణతకు వ్యతిరేకంగా తన అహింసా ధర్మ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధీ అహింస ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ పాలననుండి విడిపించి స్వాతంత్ర్యాన్ని సంపాదించాడు. 20వ శతాబ్దానికి చెందిన ఈ మూడు ప్రధాన సంఘటనలు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు. *(M.P.)
జవాబు:
సంక్షిప్తరూపం :
ప్రకృతిసిద్ధమైన పరిణామక్రమాన్ని చార్లెస్ డార్విన్ మనం విభిన్నంగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుచ్ఛక్తి కనుగొని థామస్ ఆల్వా ఎడిసన్ సైన్స్ & టెక్నాలజీని మొత్తం మార్చేశాడు. అహింసా ఉద్యమాన్ని మహాత్మాగాంధీ ఉపయోగించి బ్రిటీషువారిని భారతదేశం నుండి పంపించేశాడు. ఈ మూడు 20వ శతాబ్దపు సృజనాత్మక ఆలోచనల ఫలితాలు.