TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar భాషాభాగములు Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

భాషా భాగములు : తెలుగు భాషలోని శబ్దాలన్నీ ప్రధానంగా, ఐదురకాలైన భాషాభాగాలతో కూడి యుంటాయి. భాషలోని భాగాలే భాషాభాగాలు. ఇవి ప్రధానంగా ఐదు రకాలు.

  1. నామవాచకం
  2. సర్వనామం
  3. విశేషణం
  4. క్రియ
  5. అవ్యయం

1. నామవాచకం :
‘నామం’ అంటే పేరు. పేర్లను తెలియజేసే భాషా పదాలు, ‘నామవాచకాలు’. నామవాచకానికి, ‘విశేష్యం’ అని పేరు కూడా ఉంది.
ఉదా :
రాము, రఘ, వరంగల్, నల్లగొండ, కూచిపూడి, భద్రాచలం, వనిత, కవిత మొదలయినవి నామవాచకములు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. రాము కళాశాలకు వెళ్ళాడు. – (‘రాము’ అనేది నామవాచకం)
  2. వరంగల్ పెద్ద పట్టణం – (వరంగల్ అనేది నామవాచకం)
  3. వనిత, కవిత అక్కా చెల్లెళ్ళు – (వనిత, కవిత అనే పదాలు నామవాచకాలు)
  4. భద్రాచలం గొప్ప పుణ్యక్షేత్రం – (‘భద్రాచలం’ అనేది నామవాచకం)
  5. కూచిపూడి నాట్యం గొప్పది – (‘కూచిపూడి’ అనేది నామవాచకం)

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

2. సర్వనామం :
నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం.
ఉదా :
వాడు, వీడు, అతడు, ఆమె, ఇతడు, ఈమె, ఎన్ని, ఇన్ని, కొన్ని, మీరు, మనం, మేము, అన్ని, వారు, వీరు, ఎవరు, ఏది మొదలయినవి సర్వనామాలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. ఈ పని ఎవడు చేస్తాడో అతడే గొప్పవాడు. – (‘అతడే’ సర్వనామం)
  2. అతడు శ్రీరాముడు. – (‘అతడు’ సర్వనామం)
  3. వీడు అబద్దాల కోరు. – (‘వీడు’ సర్వనామం)
  4. ఆమె సౌందర్యవతి. – (‘ఆమె’ సర్వనామం)
  5. మనం భారతీయులం. – (‘మనం’ సర్వనామం)

3. విశేషణం :
నామవాచకం, సర్వనామాల గుణాలను తెలియజేసేవి ‘విశేషణాలు’.
ఉదా :
నల్లని, తెల్లని, మనోహరమైన, సరసమైన, పచ్చని, పుల్లని, తియ్యని మొదలయినవి విశేషణాలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. శ్రీజ మంచి తెలివిగల పిల్ల. – (‘మంచి’ విశేషణము)
  2. స్వాతి అందమైన పాప. – (‘అందమైన’ విశేషణము)
  3. కృష్ణుడు నల్లని వాడు. – (‘నల్లని’ విశేషణము)
  4. మాధవి మనోహరమైన స్త్రీ. – (‘మనోహరమైన’ అనేది విశేషణము)
  5. శ్రీనివాసుడు ధనవంతుడు. – (‘ధనవంతుడు’ విశేషణము)

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

4. క్రియ :
చేసే పనిని తెలియజేసే పదాన్ని ‘క్రియ’ అంటారు.
ఉదా :
కొట్టు, తిట్టు, తిను, వెళ్ళు, చూచు, నిద్రించు, మాట్లాడు, నడుచు మొదలయినవి క్రియలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. రాముడు రావణుని సంహరించాడు. – (‘సంహరించాడు’ అనేది క్రియ)
  2. వాల్మీకి రామాయణం రచించాడు. – (‘రచించాడు’ అనేది క్రియ)
  3. రాము గ్రంథాలయానికి వెళ్ళాడు. – (‘వెళ్ళాడు’ అనేది క్రియ)
  4. మాధవరావు నాతో మాట్లాడుతున్నాడు. – (‘మాట్లాడుతున్నాడు’ అనేది క్రియ)
  5. సుప్రజ నిద్రిస్తుంది. – (‘నిద్రిస్తుంది’ అనేది క్రియ)

5. అవ్యయం :
లింగ, విభక్తి, వచనం లేని శబ్దములను ‘అవ్యయాలు’ అంటారు.
ఉదా :
అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, ఔరా, ఆహా, అయ్యో, ఊరక, మిన్నక, అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచట, ఇచట, ఎచట – మొదలయినవి అవ్యయాలు.

వాక్యరూప ఉదాహరణలు :

  1. ఎక్కడ ఆరోగ్యం వుంటుందో అక్కడ సంపద వుంటుంది. – (ఎక్కడ, అక్కడ అనేవి అవ్యయాలు)
  2. మా అమ్మ అప్పుడు చెప్పిన పనిని ఇప్పుడు చేస్తున్నాను. – (‘అప్పుడు అవ్యయం’)
  3. బంగారు లేడిని చూచి సీత ఆహా ! అనుకుంది. – (‘ఆహా’ అనేది అవ్యయం)

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

గమనిక :
భాషాభాగాలపై ఈ అభ్యాసములోని ప్రశ్నలలో నుండి ఐదు ప్రశ్నలు పరీక్షలలో ఇస్తారు. ఐదు జవాబులకూ, ఐదు మార్కులు. మీకు ఈ అభ్యాసంలో 12 ప్రశ్నలు ఉన్నాయి. వీటి నుండే, మీకు పేపర్లో ప్రశ్నలు వస్తాయి. కాబట్టి, శ్రద్ధగా చదువండి. ఐదుకి ఐదుమార్కులు పొందండి.

అభ్యాసం

ప్రశ్న 1.
అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి ? *(M.P)
జవాబు:
ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది.
పై వాక్యంలోని ఎక్కడ, అక్కడ అనేవి అవ్యయాలు.

ప్రశ్న 2.
‘ఎప్పుడు’ అన్నది ఏ భాషాభాగం ? *(M.P)
జవాబు:
‘ఎప్పుడు’ అన్నది, ‘అవ్యయము’ అనే భాషాభాగము.

ప్రశ్న 3.
సర్వనామాల గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు ?
జవాబు:
సర్వనామాల గుణాలను తెలియజేసే పదాలను ‘విశేషణం’ అంటారు.

ప్రశ్న 4.
‘శ్రీజ మంచి తెలివిగల పిల్ల’ వాక్యంలోని విశేషణం ఏమిటి ?
జవాబు:
పై వాక్యంలో ‘మంచి’ అనే శబ్దము, ‘విశేషణము’.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

ప్రశ్న 5.
‘స్వాతి అందమైన అమ్మాయి’ వాక్యంలో అందమైన అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలోని ‘అందమైన’ అనే శబ్దము, ‘విశేషణం’ అనే భాషాభాగం అవుతుంది.

ప్రశ్న 6.
‘వీడు అబద్ధాల కోరు’ వాక్యంలోని ‘వీడు’ అన్నది ఏ భాషాభాగం ? *(M.P)
జవాబు:
ఈ వాక్యంలోని ‘వీడు’ అనేది సర్వనామం.

ప్రశ్న 7.
‘రాము గ్రంథాలయానికి వెళ్ళాడు’ వాక్యంలోని క్రియ ఏమిటి ? *(M.P)
జవాబు:
ఈ వాక్యంలోని క్రియ ‘వెళ్ళాడు’ అనే శబ్దము.

ప్రశ్న 8.
‘రాముడు రావణుని సంహరించాడు’ వాక్యంలో ‘సంహరించాడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
ఈ వాక్యంలో ‘సంహరించాడు’ అనేది ‘క్రియ’.

ప్రశ్న 9.
భాషాభాగములు ఎన్ని రకాలు ?
జవాబు:
భాషాభాగములు ఐదు రకాలు.

ప్రశ్న 10.
నామవాచకానికి గల మరో పేరు ఏమిటి ? *(M.P)
జవాబు:
నామవాచకానికి గల మరో పేరు, ‘విశేష్యము’.

TS Inter 2nd Year Telugu Grammar భాషాభాగములు

ప్రశ్న 11.
‘సర్వనామం’ అనగానేమి ?
జవాబు:
నామవాచకానికి బదులు వాడబడే శబ్దాన్ని ‘సర్వనామం’ అంటారు.

ప్రశ్న 12.
‘అతడు శ్రీరాముడు’ వాక్యంలో ‘అతడు’ అన్నది ఏ భాషాభాగం ?
జవాబు:
‘అతడు’ అనేది, ‘సర్వనామము’.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 4th Lesson గోల్కొండ మధుర స్మృతులు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 4th Lesson గోల్కొండ మధుర స్మృతులు

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
గోల్కొండ కోట ప్రత్యేకతలను వర్ణించండి. (V.Imp) (M.P)
జవాబు:
అంతఃపురంలోని వసతులు: గోల్కొండ కోట కాకతీయ ప్రోలరాజు కన్నా ప్రాచీనమైంది. కాకతీయులనాడు ఈ కోట కొత్త వైభవాన్ని సంతరించుకుంది. రాజ ప్రతినిధులకు స్థావరంగా, యువరాజుకు నివాసంగా, కాకతీయ సైన్యానికి నిలయంగా, అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా రూపొందింది. ఖుతుబుషాహీల కాలంలో ఈ కోటలో అనేక సుందర భవనములు నిర్మించబడ్డాయి. అందులోని ఏర్పాట్లు ఈనాటికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రాణులు నివసించే అంతఃపురం అన్నిరకాల భద్రతా ఏర్పాట్లతోపాటు సర్వాంగ సుందరంగా ఉంది.

మురికినీరు, వర్షపునీరు బైటికి పోవడానికి చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయిదారు అంతస్తుల మేడలు. ప్రతి అంతస్తుకు అవసరమయిన శుభ్రమైన నీరు రావడానికి, మురికి నీరు బైటకు పోవడానికి శాస్త్రీయమైన ఏర్పాట్లు చేశారు. మూడు వందల సంవత్సరాలు గడిచినా అవి ఇంకా నిలిచి ఉన్నాయి. కోటలో నీటి ఏర్పాటుకు వివిధ స్థాయిలలో దాదాపు ఎనిమిది బావులున్నాయి. మొదటి బావి అన్నిటికన్న క్రిందస్థాయిలో ఉంది.

అది అన్నింటికన్న పెద్దది. కోటకు పడమర ఆరుమైళ్ళ దూరంలో మొదటి బావికి సమాన స్థాయిలో “దుర్గమ్మ చెరువు” ఉంది. అది చాలా లోతుగా, విశాలంగా, శుభ్రంగా ఉండి మంచి నీటితో కొండల మధ్య ఉంది. మొదటి బావి నుంచి రెండవ బావికి ఆపై ఒకదానినుంచి వేరొకదానికి నీరు నింపబడేలా ఏర్పాట్లు చేశారు. అలా నింపడానికి ఉపయోగించే పర్ష్యా ఛత్రాలను తిప్పడానికి మానవులును, పశువులును ఉపయోగించేవారు.

ఉద్యానవనాల సౌందర్యం : గోల్కొండ కోటలో, చుట్టుప్రక్కల విశాలంగా, వివిధ రకాల పూలతోటలు ఉన్నాయి. అందులో ఆనాడు పుష్పించిన పూలపేర్లను ఈ రోజు పుస్తకాలలో చదవవలసిందే గాని అవి ఎలా ఉండేవో ఉహించలేము. ఆ పుష్పజాతులు అంతరించిపోయాయి. అంతఃపురంలో పెద్దకోనేరు, బయట “కటోర హవుజు” ఉన్నాయి. ఇందు ప్రతిరోజు నీటిని, రోజా పూవులను నింపేవారు. కటోరా హవుజు రాణీవాసపు స్త్రీలకు జలక్రీడా “స్థలం. దానిని అక్కడ ఉండే స్త్రీలు స్నానాలు జేయడానికి, ఈదులాటకు, నౌకా విహారం చేయడానికి ఉపయోగించేవారు. కటోరా హవుజు ఇప్పటికి ఉంది. కాని అంత శుభ్రంగా లేదు.

గోలకొండ కోటలో విశాలమైన, అందమైన రాజోద్యాన వనాలు, పుర ఉద్యానవనాలు ఉండేవి. అవి ఇంద్రలోకంలోని నందనవనాన్ని గుర్తు చేసే విధంగా ఉండేవి. సాయంకాల సమయములో కవులు, పండితులు ఆ పురోద్యానవనాలలో గుంపులు గుంపులుగా కూర్చుండి సారస్వత చర్చలు, కవితా గోష్ఠులు చేసేవారు. నగీనాబాఘ్ అనే ఉద్యానవనం చారిత్రక ప్రసిద్ది కలిగినది.

కోటలో ఉన్న భవనాలు : కోటలో అంతఃపురాలు, సభాభవనాలు, కార్యాలయాలు, జలాశయాలు, క్రీడామైదానాలు మాత్రమే గాక సైనిక సమూహాలు నివసించే ఇండ్లు, అధికారుల నివాసస్థానాలు, పారిశ్రామికుల ఇండ్లు, పండిత, పామర నాగరికుల ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకు మరుగుదొడ్లు, మురుగు నీరుపారే వసతులు, స్నానపు గదులు, వాటికి వేడి, చల్లనీటి ఏర్పాట్లు మొదలైన సామాజిక ఆరోగ్యానికి అవసరమైన ఇతర వసతులు కల్పించబడ్డాయి.

ఆయుధ కర్మాగారాలు, టంకశాలలు, సైనిక శిక్షణ కేంద్రాలు, పాఠశాలలు, వైద్యశాలలు, సత్రాలు, సైనిక సమూహ ప్రణాళికా రచన, పరిశీలన స్థావరాలు ఉండేవి. ఖుతుబుషాహీల టంకశాల, భాండాగారము ఈనాటికీ “ఖజాన బిల్డింగు” అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖవారి ఆధీనంలో ఉంది. దానిని ఆనుకొని ఖుతుబుషాహీల ఆయుధాగారము ఉండేది. దానికి ఆనుకొని ఉన్న భవనాలలో సైనిక ప్రజా పరిపాలనాధికారులుండే గృహాలు ఉండేవి. వాటిని దారికి ఇరువైపులా అందమైన వరుసలలో నిర్మించారు.

రాతిఫలకం విశేషత : రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది. ఇది జహంగీరు చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రం కంటే గొప్ప విషయం. కోటలో రాజాంతఃపురాలను దాటిపోతే భాండాగారాలు, తుపాకి మందుగుండు నిలువజేసే గదులు, జైలుగదులు కనిపిస్తాయి. బాలాహిస్సారుకు పోయేదారిలో మస్జిదు, మందిరం ఒకదాని పక్కన మరొకటి ఉంటాయి. ఖుతుబుషాహీల మత సహనానికి సజీవ సాక్ష్యంగా ఈనాటికీ అవి కనిపిస్తాయి. “బాలా హిస్సారు” కు పోయే దారిలో రామదాసు చెఱశాల అని ఒక రాతి గుహను చూపిస్తారు. అందులో ఉన్న చలువరాతిపై శ్రీరాముని ఆకారము రామదాసు చెక్కినదే అని కూడా అంటారు. ఇది రామదాసున్న బందీఖాన యని చెప్పు ఆధారాలు లేవు. కాళ్లు చేతులు సంకెళ్ళతో బంధించబడిన గోపన్న ఉలి సుత్తి లేకుండా శిలపై రాముని చిత్రం చెక్కడం నమ్మదగిన విషయం కాదు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

ప్రశ్న 2.
ఖులీఖుతుబ్ షా సమాధుల నిర్మాణ విశేషాలను తెలుపండి.
జవాబు:
గోల్కొండ దుర్గమునకు పడమర సుమారు మైలుదూరంలో ఒక ఎత్తైన సహజసుందరమైన మైదానముంది. ఆ ప్రదేశములో ఖుతుబుషాహీ పాలకుల సమాధులున్నాయి. ఈ ప్రదేశములో ఫలాలతో, పుష్పాలతో నిండిన తోటలుండేవి. కొన్ని ఈనాటికీ ఉన్నాయి. ఈ సమాధుల చుట్టు ఎత్తైన రాతి గోడ ఉంది. ఇందులో ఉన్న సమాధులలో కొన్ని ఖుతుబుషాహి రాజులవికావు. వీటిలో ప్రేమావతి తారామతి, రాజవైద్యుని సమాధులు మాత్రమే గాక రాజాదరణ పొందిన వేరొకరి సమాధికూడా ఉంది. రాజు బంధువులని చెప్పబడేవారి సమాధులు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. మహమ్మదు ఖులీ ఖుతుబుషా సమాధి నిర్మించిన పద్ధతికన్న జమీదు ఖులీ గోరి నిర్మించిన పద్ధతి వేరు. రెండు పర్ష్యా దేశపు నిర్మాణ రీతులనే విశేషంగ అనుకరించి నిర్మించారు.

ఇబ్రహీము ఖులీఖుతుబుషా సమాధి కూడా పెద్దదే. అందలి శిల్పవిజ్ఞానము, నిర్మాణరీతులు క్రొత్తపుంతలు తొక్కినవి. దాని దగ్గరనే మహమ్మదు ఖుతుబుషా సమాధి ఉంది. సమచతురశ్రమగు ఉన్నత వేదికపై అత్యంత సుందరంగ కట్టబడిన బ్రహ్మాండమైన కట్టడమిది. అందులోని శిల్పనిర్మాణ చాతుర్యం హిందూ, ముస్లిం, ఇండో, ఈరానియన్ శిల్ప సాంస్కృతుల కలయికకు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. అందులోని రాతి పుష్పాలు ఇస్లాం మతానికి వ్యతిరేకం అని వాటిని ధ్వంసం చేశారు. అయినా అవి సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తూనే ఉన్నాయి.

మహమ్మదు ఖుతుబ్ షా భాగ్యనగర నిర్మాత. గుల్జారుహౌజు, మక్కా మసీదు, చార్ మినార్ వంటి విఖ్యాత కట్టడాలు ఇతను ప్రారంభించినవే. దక్షిణాపథములో ఉర్దూ భాషకు ఇతన్ని పిత అంటారు. అతని సమాధివద్ద ఈనాటికి ప్రార్థనలు, మత కర్మకాండలు మాత్రమే గాక ఉర్దూ దినం, ఖుతుబుషాహి దినం జరుపుతారు. ఈ సందర్భంగా పండితులతో సారస్వతోపన్యాసములు జరుగుతాయి. ఆ దినాలలో అక్కడ చరిత్ర సంస్కృతులను గురించిన చర్చలు జరుగుతాయి. ఇతని భార్య పేరు హయ్యతు బట్టీ బేగం, ఈమెకు ఈ వంశ చరిత్రలోను గోల్కొండ సంస్కృతిలోను ఒక విశిష్ట స్థానముంది. ఆమె ఖుతుబుషాహీ రాజులలో వరుసగ ఒకనికి కూతురు.

వేరొకనికి భార్య, మరొకనికి తల్లి. ఈమెకు బ్రహ్మాండమైన సమాధి నిర్మించబడింది. దీని నిర్మాణ పద్ధతికూడా విశిష్టమైనది. అబ్దుల్లా ఖుతుబుషా సమాధి చాల పెద్దది. దాని నిర్మాణ పద్ధతికూడా విభిన్నమైనది. దానిని డబుల్ డోల పద్ధతి అంటారు. దీనిలో పైకి కనిపించే గుమ్మటమే గాక దానిలోన కూడా ఎక్కువ నేర్పు గల మరొక గుమ్మటముంది.

ఈ సమాధులు బ్రహ్మాండమైన కట్టడములు. వీటిని చూడడానికి తండోపతండములుగా జనాలు నేటికి చాలా మంది వస్తుంటారు. విదేశీయులు సైతం ఈ సమాధులను చూసి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందుతారు. చనిపోయిన రాజుల భౌతిక దేహాలను, వారి బంధువుల శవములను ఇక్కడికి తెచ్చి చివరిస్నానము చేయిస్తారు. అంత్య క్రియలు చేయడానికి ఇక్కడ ఒక చిన్న అందమైన కట్టడముంది. ఈ రాజులు షియా సంప్రదాయానికి చెందినవారు. వారు పన్నెండు మంది ఇమాములను పూజిస్తారు. కావున ఈ కట్టడంలో పన్నెండు కోణాలు,

పన్నెండు మెట్లు, పన్నెండు చెంబులు, పన్నెండు ఆకుల ఆకారాలు, ఇలా అన్నీ పన్నెండు ఉంటాయి. ఇది చూడవలసిన చక్కని చిన్న కట్టడం. ఈ సమాధులు అత్యున్నతాలు, అపూర్వాలు, అతిసుందరాలు. ఒకప్పుడివి సర్ఫేఖాస్ (నిజాం నవాబు) ఆస్తి. ఆపై కేంద్రపురావస్తు పర్యవేక్షణలోకి వచ్చాయి. ఇప్పుడవి పురావస్తు శాఖవారి అధీనములో ఉన్నాయి. సుమారు ఎనిమిది లక్షల వ్యయముతో ఈ సమాధులను, పెద్ద ఉద్యానవనములను, క్రీడాసరోవరములను, నౌకా విహారావకాశములను, రమణీయ ఆరామాలను, విశ్రాంతి భవనాలను, పురావస్తు ప్రదర్శనశాలలను, మిరుమిట్లుగొలుపు దీపమాలికలను, జలయంతరాలను, అపురూపమైన పూదోటలను ఏర్పాటు జేసి, దీనిని భారతదేశములోనే ప్రథమ శ్రేణికి చెందిన యాత్రిక కేంద్రముగ రూపొందించే ఆలోచన ఉన్నది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి తప్పక దీనిని అభివృద్ధి పరచాలని ఎందరో ఒప్పుకుంటారు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
గోల్కొండ కోటలోని నీటి ఏర్పాట్లను తెలుపండి.
జవాబు:
గోలకొండ కోటలో అనేక సుందర భవనములు నిర్మించబడ్డాయి. అందులోని ఏర్పాట్లు ఈనాటికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రాణులు నివసించే అంతఃపురం అన్నిరకాల భద్రతా ఏర్పాట్లతోపాటు సర్వాంగ సుందరంగా ఉంది. మురికినీరు, వర్షపునీరు బైటికి పోవడానికి చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయిదారు అంతస్తుల మేడలు. ప్రతి అంతస్తుకు అవసరమయిన శుభ్రమైన నీరు రావడానికి, మురికి నీరు బైటకు పోవడానికి శాస్త్రీయమైన ఏర్పాట్లు చేశారు. మూడు వందల సంవత్సరాలు గడిచినా అవి ఇంకా నిలిచి ఉన్నాయి. కోటలో నీటి ఏర్పాటుకు వివిధ స్థాయిలలో దాదాపు ఎనిమిది బావులున్నాయి.

మొదటి బావి అన్నిటికన్న క్రిందస్థాయిలో ఉంది. అది అన్నింటికన్న పెద్దది. కోటకు పడమర ఆరుమైళ్ళ దూరంలో మొదటి బావికి సమాన స్థాయిలో “దుర్గమ్మ చెరువు” ఉంది. అది చాల లోతుగా, విశాలంగా, శుభ్రంగా ఉండి మంచి నీటితో కొండల మధ్య ఉంది. మొదటి బావి నుంచి రెండవ బావికి ఆపై ఒకదానినుంచి వేరొకదానికి నీరు నింపబడేలా ఏర్పాట్లు చేశారు. అలా నింపడానికి ఉపయోగించే పర్ష్యా ఛత్రాలను తిప్పడానికి మానవులును, పశువులును ఉపయోగించేవారు.

ప్రశ్న 2.
‘పురానపుల్’ నిర్మించుటకు గల కారణాలు ఏవి ?
జవాబు:
భాగ్యమతి ప్రేమ వలలో చిక్కుకున్న నవయువకుడు, యువరాజు మహమ్మదు ఖులీ కుతుబ్షా పొంగి పొరిలే ముచుకుందా నదిని తన గుర్రంతో దాటి ఆవలి తీరానికి సురక్షితముగ జేరుకున్నాడు. అలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిలోకి వెళ్ళిన తమ కుమారున్ని చూసి అతని తల్లిదండ్రులు మహమ్మదు ఇబ్రహీం ఖుతుబుషా (మల్కిభరాముడు), అతని భార్య తల్లడిల్లిపోయారు. ఇటువంటి ప్రమాడం మళ్ళీ రాకూడదని మూసీనదిపై రాజ దంపతులు పురానపుల్ను నిర్మించారు. అది ఇప్పటికి ప్రజోపయోగకరంగ నిలచి ఉంది. భాగ్యమతి పేరు మీదనే హైద్రాబాదు నిర్మించబడింది.

ప్రశ్న 3.
గోల్కొండ కళాకారుల వైశిష్ట్యాన్ని వివరించండి.
జవాబు:
రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతః పురంలోకి వినిపిస్తుంది. ఇది జహంగీరు చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రం కంటే గొప్ప విషయం. కోట పడమటి ద్వారాన్ని బంజార దర్వాజ అంటారు. స్థానికముగ లభించే తెల్లటి గ్రానైటురాయితో ఈ కోటను నిర్మించారు. తుపాకి గుండ్లను కూడా బంతులలాగా తిరుగ గొట్టేంత గట్టితనమున్న రాయి అది. ఆ గట్టితనమును కొట్టలేకనే మొఘలులు ఈ కోట గోడలను, సొరంగముల ద్వారా కూల్చే ప్రయత్నం చేశారు. అయినా మూడు సార్లు విఫలులైనారు. తూర్పుభాగంలో ఉన్న బురుజును మాత్రము వారు కూల్చగలిగారు. కాని మరునాటి ఉదయం వరకే దానిని గోల్కొండవారు ఎప్పటిమాదిరి నిలబెట్టారు. అదిచూసి మొఘలులు ఆశ్చర్యపోయారు. ఆ బురుజు నిజమయిన రాతితో నిర్మించబడింది కాదని వారికి తెలియదు. కాగితము పనితనమునకు అది ఒక పరాకాష్ట. గోల్కొండ కళాకారుల వైశిష్ట్యమునకు అదొక గొప్ప ఉదాహరణ.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

ప్రశ్న 4.
ఖజానా బిల్డింగ్లోని పురావస్తు ప్రదర్శనశాల విశేషాలను తెలుపండి.
జవాబు:
గోలకొండకోట కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖవారి యాజమాన్యంలో, షంషీరుకోట్, ఖజాన బిల్డింగులు ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ వారి పర్యవేక్షణలో ఉన్నాయి. వారు ఖజాన బిల్డింగును పురావస్తు ప్రదర్శనశాలగా మార్చారు. అందులో వివిధ శతాబ్దముల సంస్కృతులకు చెందిన సుందర శిల్పకళాఖండాలు, అమూల్యములైన శిలాశాసనాలు ప్రదర్శించబడుచున్నాయి. ఆ శిల్పసంపద, ఆనాటి సాంస్కృతీ, సామాజిక వైభవాలకు దర్పణంగా నిలుస్తుంది. ఆ పురావస్తుశాల పర్యవేక్షణకు ఒక అధికారి, కొంత సిబ్బంది నియమితులైనారు. దీని ప్రక్కనే షంషీరుకోట్ ఉంది. దానిలో ఆనాటి వివిధ ఆయుధాలు భద్రపరిచారు. వీటిని సాధారణంగా ప్రదర్శించరు. కాని ప్రదర్శించుట చాల అవసరం.

III ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
భూపాలరావుకు తెలిసిన భాషలను పేర్కొనండి.
జవాబు:
తెలుగు, సంస్కృతం, కన్నడ, మరాఠి, హిందీ, ఫ్రెంచి, డచ్.

ప్రశ్న 2.
భూపాలరావు రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి ఏ గ్రంథాన్ని రచించాడు ?
జవాబు:
దేవాలయ చరిత్ర

ప్రశ్న 3.
‘గోల్కొండ మధురస్మృతులు’ పాఠం ఏ పుస్తకం లోనిది ?
జవాబు:
మహామంత్రి మాదన్న

ప్రశ్న 4.
సింహద్వారం నేలపైనున్న రాతిఫలకము ప్రత్యేకత ఏమిటి ?
జవాబు:
రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది.

ప్రశ్న 5.
మొహర్రం పదవరోజున ఏ ఉత్సవాలు జరుగుతాయి ?
జవాబు:
బీబీకా ఆలం, ఏనుగు అంబారీ లంగరు ఉత్సవాలు.

ప్రశ్న 6.
‘ఎనుగల చెట్టు’ గొప్పదనం తెలుపండి.
జవాబు:
గోలకొండ కోటలో ఎనుగల చెట్టు అని పిలువబడే ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. దీని చుట్టుకొలత సుమారు వంద అడుగులు. ఇంత పెద్ద చుట్టుకొలత ఉన్న జువ్విచెట్లు చాల తక్కువ.

ప్రశ్న 7.
‘డబుల్ డోల పద్ధతి’లో ఎవరి సమాధి నిర్మించారు ?
జవాబు:
అబ్దుల్లా కుతుబ్షా

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

ప్రశ్న 8.
భాగ్యనగర నిర్మాత ఎవరు ?
జవాబు:
మహమ్మదు ఖుతుబ్ షా

కఠిన పదాలకు అర్ధములు

63వ పుట

రజాకారులు = నిజాం రాజు పాలన కోసం పాకిస్తాన్ నుండి తెచ్చుకున్న ఖాసిం రజ్వి తయారు చేసిన సైన్యం
అరాచకాలు = దుర్మార్గాలు

64వ పుట

దుర్గ౦ = కోట
పురాతనము = ప్రాచీనం
క్రమేపి = క్రమంగా, కాలం గడిచిన కొద్ది
సంతరించుకున్న = పొందిన
దుర్నిరీక్షత = చూడ శక్యం కాని
నాడు = ఆ రోజుల్లో
అబ్దములు = సంవత్సరాలు
దశాంతర = వివిధ దశల్లో
వైభవం = గొప్పతనం
స్థావరం = ఉండే చోట
నివేశనము = నివసించే చోటు, ఇల్లు
వాహిని = సైన్యం
స్కందావారము = సైన్యం ఉండే చోటు
సంభ్రమ + ఆశ్చర్యములు = సంతోషం, అచ్చెరువు
రాణివాసం = రాణులు నివసించే చోటు
సర్వతో భద్రము = అన్ని రకాలుగా సురక్షిత
అంతఃపురం = రాణులు నివసించే చోటు
మనోరంజకము = మనస్సును ఆనందపరిచేది
ముర్కినీరు = మురికి నీరు
ముచ్చట గొలుపు = కోరికను కలిగించు
శుభ్ర + ఉదకము = శుభ్రమైన నీరు
శాస్త్రీయ = శాస్త్రము చెప్పిన విధంగా

65వ పుట

ఎన్మిది = ఎనిమిది
మైలు = ఎనిమిది ఫర్లాంగుల దూరం
అగాధం = లోతైన
విస్తృత = విశాలమైన
నిర్మల = శుభ్రమైన
మధుర = తీయని
జలాశయము = చెరువు
పటిష్ఠము = దృఢమైన
నిరంతరము = ఎల్లప్పుడూ
పర్ష్యా ఛత్రపు = పర్ష్యా దేశంలో వాడే గిరక వంటిది
తోచుట = అనిపించుట
జల సమృద్ధి = కావలిసినంత నీరు
దృవపడింది = ఋజువైంది
విస్తార = విశాల
మెండు = ఎక్కువ
అంతరించు = నశించు, లేకుండా పోవు
కోనేరు = చెరువు
కటోరా హవుజు = గిన్నె ఆకారంలో నిర్మితమైన చెరువు
రోజా పూవులు = గులాబి పూవులు
కేళి కాసారము = ఆడుకునే సరస్సు
నౌకా విహారము = పడవలలో తిరుగుట
పన్నీరు = సువాసననిచ్చే జలం
కన్నీరు = కంటి నీరు (బాధ)
విపులము = విశాలము
సుందర = అందమైన
రాజ + ఉద్యానములు = రాజులు విహరించే పూల తోటలు
పుర + ఉద్యానములు = పుర ప్రజలు విహరించే పూల తోటలు
ఆకర్షణ = మనసును లాగడం
నందన వనం = స్వర్గంలోని పూలతోట (ఇంద్రుని ఉద్యానవనం పేరు)
తలపించెడి = గుర్తు చేసే
సాయం సమయం = సాయంకాల సమయం
గుములుగా = గుంపులుగా
సారస్వత చర్చలు = సాహిత్య చర్చలు
కవితా గోష్ఠులు = కవిత్వ చర్చలు
చారిత్రకము = చరిత్రలో నిలిచినది
ప్రసిద్ధము = పేరు పొందినది
సమృద్ధ = కావలిసినంత
క్రీడ + ఆరామములు = ఆటలాడే స్థలాలు
సైనిక = సైనికుల
నికాయ = సమూహం
వసతి గృహాలు = నివసించే స్థలాలు (ఇళ్ళు)
పారిశ్రామికుల = పరిశ్రమలను స్థాపించిన వారు
గేహము = గృహం, ఇల్లు చదువుకున్నవారు
పండితులు = చదువుకున్నారు
పామరులు = చదువు లేనివారు
నాగరికుల = ప్రజల
టంకశాల = నాణెములు తయారు చేసే స్థలం
సత్రం = ఉచిత భోజన వసతి కల్పించే స్థలం
వ్యూహం = ప్రణాళిక
భాండాగారము = ధనం ఉంచే స్థలం
ఖజానా = భాండాగారం

66వ పుట

స్వాధీనమందు = అధీనంలో, పర్యవేక్షణలో
ఆయుధాగారము = ఆయుధములు ఉంచే స్థలం
యాజమాన్యములో = పాలనలో
నికేతనములు = ఇండ్లు
బారులు తీరి = వరుసగా
సింహ ద్వారము = ప్రధాన మార్గం
రాతి ఫలకం = రాతితో చేసిన ఫలకం
అపూర్వమగు = అంతకుముందు లేని, విశేషమైన
చెరశాల = బందిఖానా, జైలు కనిపిస్తాయి
అగుపడును = కనిపిస్తాయి
మార్గం = దారి
సరసన = పక్కన
మతసహనం = ఇతరమతాలపై ఓర్పు
తార్కాణం = నిదర్శనం
చూపింతురు = చూపిస్తారు
చట్రాతిపై = చలువరాతిపై
ఆధారములు = సాక్ష్యములు
నిగళ బద్ధములై = సంకెళ్ళతో బంధించిన
ఉలి = రాళ్ళను చెక్కే సాధనం
సుత్తి = ఉలిని కొట్టడానికి వాడే ఇనుప సాధనం
రూఢిగా = నిశ్చయముగా
రూపాంతరము = రూపము మార్చుకొని
ప్రేమ వాగురులు = ప్రేమ అనే వలలు
తగుల్కొని = చిక్కుకొని
పరవళ్ళు తొక్కుతూ = వేగంగా ప్రవహిస్తూ
నురుగులు గ్రక్కుతూ = ప్రవాహ వేగానికి నురగలు వస్తుంటే
ముచుకుందు నది = మూసి నది
సీరికిస్థానక = లెక్క చేయక
భీషణ ఘోషలు = భయంకర శబ్దాలు
నలు దిశల = నాలుగు వైపులా
మ్రానుల = చెట్లను
సమూలంగా = వేర్లతోసహా
పెకిలించి = ఊడదీసి
తరంగ డోలికల = “అలల ఉయ్యాలలో
కొనిపోవుచున్న = తీసుకొని పోతున్న
ప్రవేశించు = పోవు
దేవేరి = భార్య, రాణి
తల్లడిల్లిరి = బాధపడ్డారు
పునరావృతము కారాదని = మళ్ళీ రాకూడదని
పూనికతో = సంకల్పంతో
అతిలోక సుందరి = అన్ని లోకాలలో వారికంటే అందమైనది
రూపసంపద = రూపము అనే సంపద (అందం)

67వ పుట

ప్రజా + ఉపయోగ = ప్రజలకు ఉపయోగపడే
అంతేవాసిని = దగ్గర ఉన్నది
ఆసీనయై = కూర్చున్నప్పుడు
మత్తెక్కి = మదమెక్కి
మావటిని = ఏనుగును నడిపేవాడిని
మట్టుబెట్టి = చంపి
రాకుమారుని యుక్తముగా = రాకుమారునితో సహా
సమీప = దగ్గరి
అరణ్య = అడవి
రాజమాత = రాకుమారుని తల్లి, రాణి
తల్లడిల్లు హృదయంతో = బాధతో నిండిన మనస్సుతో
పీరులు = లోహంతో అర్థ చంద్రాకారంగా ఉండేవి
లంగరు ఉత్సవం తీయింతును = లంగరు అనే పేరుతో ఊరేగింపు తీయిస్తాను
మొహర్రం పదియవ రోజున = ఇస్లాం ప్రకారం హిజరీ శకం మొహర్రం నెలలో పదవ రోజు
రూపకల్పన = రూపాన్ని ఉహించడం
హృదయఫలకము మీద = హృదయము అనే ఫలకం మీద (మనస్సులో)
ఏనుగు అంబారిలంగరు = ఏనుగు అంబారీలపై ఊరేగించే ఉత్సవం
ప్రసిద్ధములు = పేరుపొందినవి
అనంతరం = తరువాత
ఉత్సవమును = పండగ
కోటకాల = కోటకు అవతలి వైపు
గవిని ( గైన్ అనే పదం ) = ప్రవేశ ద్వారం
సొరంగముల ద్వారా = భూమి లోపలనుండి తొలచిన ద్వారముల ద్వారా
ముమ్మారు = మూడు సార్లు
విఫలులైరి = విఫలం చెందారు
బురుజు = రాతితో ఎత్తుగా కట్టిన కట్టడం
శిథిలమైన = కూలిపోయిన
వేకువ, = ఉదయం
యథారూపంగా = ఎప్పటిమాదిరి
విభ్రాంతులైరి = ఆశ్చర్యపోయారు
నిస్పృహ = నిరాశ
నిస్తేజులను = మొఖంలో తేజస్సు కోల్పోయిన వారిగా ఉన్నత స్థితి
పరాకాష్ట = ఉన్నత స్థితి
వైశిష్ట్య౦ = విశిష్టత
ఉజ్వల + ఉదాహరణ = తిరుగులేని ఉదాహరణ
వృక్షరాజం = గొప్ప చెట్టు
అశేషజనం = జనులందరూ
కైవారము = చుట్టుకొలత
అరుదు = తక్కువ

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

68వ పుట

అమూల్యం = వెలకట్టలేని
ముగ్గులగుచుందురు = మురిసిపోతారు
దర్పణం = అద్దం
ప్రదర్శించరు = చూపించరు
రమారమి = సుమారు
ఫల పుష్ప భరిత = ఫలాలతో, పుష్పాలతో నిండినది
రాతి ప్రాకారం = రాతితో నిర్మించిన ప్రహరి గోడ
మకుటాధిపతులు = కిరీటాన్ని ధరించినవారు, రాజులు
చెదురుగా = అక్కడక్కడ
శిల్ప విన్నాణము = శిల్ప విజ్ఞానం, శిల్పాలు చెక్కడంలో నేర్పు
బ్రహ్మాండము = గొప్ప
శిల్ప ప్రాగల్భ్యం = శిల్పకళలో నేర్పు
ఈరానియన్ = ఇరాన్ దేశ సంప్రదాయం
కూడలి = కలయిక
శిలాపుష్పాలు = శిలపై చెక్కిన పుష్పాలు
వైకృత్తిక = వికారమైన
భిత్తిక = గోడ
సంభ్రమ + ఆశ్చర్యం = సంతోషం, ఆశ్చర్యం
కొలుపును = కలిగిస్తాయి
విఖ్యాత = ప్రఖ్యాత
సారస్వత + ఉపన్యాసాలు = సాహిత్య ప్రసంగాలు

69వ పుట

గుమ్మటం = దీపముంచే ఎత్తైన కట్టడం
తండోపతండాలు = గుంపులు గుంపులుగా
ధీటైన = సమానమైన
అరుదు = తక్కువ
చతురత = నేర్పు
తుది స్నానం = చనిపోయిన తరువాత చివరి స్నానం
చరమ కర్మకాండ = అంత్యక్రియలు
ఇమాం = ఇస్లాం మత పెద్ద
దళములు = ఆకులు
సమాధులు+అతి+ఉన్నతములు = మిక్కిలి ఎత్తైన సమాధులు
అధీనం = స్వాధీనంలో
వ్యయం = ఖర్చు
అపురూపమైన = అపూర్వమైన
నిర్వివాదాంశం = వివాదం లేని విషయం

గోల్కొండ మధుర స్మృతులు Summary in Telugu

TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు 1

రచయిత పరిచయం

పాఠం పేరు : గోల్కొండ మధురస్కృతులు
గ్రంథం : మహామంత్రి మాదన్న
దేనినుండి గ్రహించబడినది : ఇది మహామంత్రి మాదన్న పుస్తకము నుండి గ్రహించబడినది
రచయిత : కొమరగిరి వేంకట భూపాలరావు
తల్లిదండ్రులు : కమలమ్మ, సీతారామయ్య
కాలం : జననం : ఏప్రిల్ 12, 1916; మరణం : జనవరి 8, 2004
స్వస్థలం : హనుమకొండ దగ్గర వెంకటాపురం
తెలిసిన భాషలు : తెలుగు, సంస్కృతం, కన్నడ, మరాఠి, హిందీ, ఫ్రెంచి, డచ్
పరిశోధనాంశం : భాగ్యనగర చరిత్ర
రచనలు : తెలుగులో మహామంత్రి మాదన్న, ఆంగ్లంలో (The Illustrious Prime Minister). ఆచార్య రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి దేవాలయ చరిత్ర, హైదరాబాద్ నగరంపై సుమారు 20 పుస్తకాలు ఆంగ్లం, తెలుగు భాషల్లో రచించారు.
ఉద్యోగాలు : పురావస్తు శాఖలో కొన్ని రోజులు. తహసీల్దార్ నుండి కలెక్టర్ వరకు వివిధ పదవులు

విశేషతలు :

  • పురావస్తు శాఖలో పని చేసేటప్పుడు శిల్పకళను అధ్యయనం చేశారు.
  • కలెక్టర్గా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలల్లో మౌలిక వసతుల కల్పన చేశారు.
  • ఆయన సేవలకు గుర్తింపుగా భూపాలరావు పేరు మీద భూపాలపల్లి ఏర్పాటైంది.
  • రజాకార్ల అరాచకాల సమయంలో హైద్రాబాద్ విడిచివెళ్ళారు.
  • రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేయటం వల్ల జైలుజీవితం అనుభవించారు.
  • ఉద్యోగ విరమణ తర్వాత తిరిగి తన చారిత్రక పరిశోధన కొనసాగించి మహామంత్రి మాదన్న జీవితంపై “The Illustrious Prime Minister” పేరుతో ఆంగ్లంలో పుస్తకం రచించారు.
  • వరంగల్ సుబేదారీ ప్రాంతంలో మాదన్న విగ్రహస్థాపన చేయించారు.

పాఠ్యభాగ సందర్భం

కొమరగిరి భూపాలరావు విద్యాభ్యాసం కోసం హైదరాబాదుకు రావడంవల్ల, అక్కడ మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావుల పరిచయం కారణంగా హైదరాబాదు చరిత్రపట్ల ఆసక్తి పెరిగింది. హైదరాబాదు చరిత్రపై విస్తృత పరిశోధన చేసి ఇరవైకి పైగా తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు రాశారు. ఉద్యోగ విరమణ తరువాత మహామంత్రి మాదన్నపై విస్తృత పరిశోధన చేశారు. ఆయన జీవితంపై తెలుగులో, ఆంగ్లంలో పుస్తకాలు రాశారు. మహామంత్రి మాదన్న పుస్తకంలో గోలకొండ కోట గురించి రాసిన వ్యాసం ప్రస్తుత మన పాఠ్యభాగం. అది గ్రాంథికంలో ఉంది. సరళ ప్రామాణిక భాషలో సారాంశాన్ని ఇస్తున్నాము.

పాఠ్యభాగ సారాంశం

అంతఃపురంలోని వసతులు : గోల్కొండ కోట కాకతీయ ప్రోలరాజు కన్నా ప్రాచీనమైంది. కాకతీయులనాడు ఈ కోట కొత్త వైభవాన్ని సంతరించుకుంది. రాజ ప్రతినిధులకు స్థావరంగా, యువరాజుకు నివాసంగా, కాకతీయ సైన్యానికి నిలయంగా, అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా రూపొందింది. ఖుతుబుషాహీల కాలంలో ఈ కోటలో అనేక సుందర భవనములు నిర్మించబడ్డాయి. అందులోని ఏర్పాట్లు ఈ నాటికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రాణులు నివసించే అంతఃపురం అన్నిరకాల భద్రతా ఏర్పాట్లతోపాటు సర్వాంగ సుందరంగా ఉంది.

మురికినీరు, వర్షపునీరు బైటికి పోవడానికి చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయిదారు అంతస్తుల మేడలు. ప్రతి అంతస్తుకు అవసరమయిన శుభ్రమైన నీరు రావడానికి, మురికి నీరు బైటకు పోవడానికి శాస్త్రీయమైన ఏర్పాట్లు చేశారు. మూడు వందల సంవత్సరాలు i^చినా అవి ఇంకా నిలిచి ఉన్నాయి. కోటలో నీటి ఏర్పాటుకు వివిధ స్థాయిలలో దాదాపు ఎనిమిది బావులున్నాయి.

మొదటి బా ఇన్నిటికన్న క్రిందస్థాయిలో ఉంది. అది అన్నింటికన్న పెద్దది. కోటకు పడమర ఆరుమైళ్ళ దూరంలో మొదటి బావికి సమాన స్థాయిలో “దుర్గమ్మ చెరువు” ఉంది. అది చాలా లోతుగా, విశాలంగా, శుభ్రంగా ఉండి మంచి నీటితో కొండల మధ్య ఉంది. మొదటి బావి నుంచి రెండవ బావికి ఆపై ఒకదానినుంచి వేరొకదానికి నీరు నింపబడేలా ఏర్పాట్లు చేశారు. అలా నింపడానికి ఉపయోగించే పర్యా ఛత్రాలను తిప్పడానికి మానవులును, పశువులును ఉపయోగించే వారు.

ఉద్యానవనాల సౌందర్యం : గోల్కొండ కోటలో, చుట్టుప్రక్కల విశాలంగా, వివిధ రకాల పూలతోటలు ఉన్నాయి. అందులో ఆనాడు పుష్పించిన పూలపేర్లను ఈ రోజు పుస్తకాలలో చదవవలసిందే గాని అవి ఎలా ఉండేవో ఉహించలేము. ఆ పుష్పజాతులు అంతరించిపోయాయి. అంతఃపురంలో పెద్దకోనేరు, బయట “కటోర హవుజు” ఉన్నాయి. ఇందు ప్రతిరోజు నీటిని, రోజా పూవులను నింపేవారు. కటోరా హవుజు రాణీవాసపు స్త్రీలకు జలక్రీడా స్థలం. దానిని అక్కడ ఉండే స్త్రీలు స్నానాలు జేయడానికి, ఈదులాటకు, నౌకా విహారం చేయడానికి ఉపయోగించేవారు. కటోరా హవుజు ఇప్పటికి ఉంది. కాని అంత శుభ్రంగా లేదు.

గోలకొండ కోటలో విశాలమైన, అందమైన రాజోద్యాన వనాలు, పుర ఉద్యానవనాలు ఉండేవి. అవి ఇంద్రలోకంలోని నందనవనాన్ని గుర్తు చేసే విధంగా ఉండేవి. సాయంకాల సమయములో కవులు, పండితులు ఆ పురోద్యానవనాలలో గుంపులు గుంపులుగా కూర్చుండి సారస్వత చర్చలు, కవితా గోష్ఠులు చేసేవారు. నగీనాబాఘ్ అనే ఉద్యానవనం చారిత్రక ప్రసిద్ధి కలిగినది.

కోటలో ఉన్న భవనాలు : కోటలో అంతఃపురాలు, సభాభవనాలు, కార్యాలయాలు, జలాశయాలు, క్రీడామైదానాలు మాత్రమే గాక సైనిక సమూహాలు నివసించే ఇండ్లు, అధికారుల నివాసస్థానాలు, పారిశ్రామికుల ఇండ్లు, పండిత, పామర నాగరికుల ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకు మరుగుదొడ్లు, మురుగు నీరుపారే వసతులు, స్నానపు గదులు, వాటికి వేడి, చల్లనీటి ఏర్పాట్లు మొదలైన సామాజిక ఆరోగ్యానికి అవసరమైన ఇతర వసతులు కల్పించబడ్డాయి.

ఆయుధ కర్మాగారాలు, టంకశాలలు, సైనిక శిక్షణ కేంద్రాలు, పాఠశాలలు, వైద్యశాలలు, సత్రాలు, సైనిక సమూహ ప్రణాళికా రచన, పరిశీలన స్థావరాలు ఉండేవి. ఖుతుబుషాహీల టంకశాల, భాండాగారము ఈనాటికీ “ఖజాన బిల్డింగు” అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖవారి ఆధీనంలో ఉంది. దానిని అనుకొని ఖుతుబుషాహీల ఆయుధాగారము ఉండేది. దానికి ఆనుకొని ఉన్న భవనాలలో సైనిక ప్రజా పరిపాలనాధికారులుండే గృహాలు ఉండేవి. వాటిని దారికి ఇరువైపులా అందమైన వరుసలలో నిర్మించారు.

రాతిఫలకం విశేషత : రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది. ఇది జహంగీరు చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రం కంటే గొప్ప విషయం. కోటలో రాజాంతఃపురాలను దాటిపోతే భాండాగారాలు, తుపాకి మందుగుండు నిలువజేసే గదులు, జైలుగదులు కనిపిస్తాయి. బాలాహిస్సారుకు పోయేదారిలో మస్జిదు, మందిరం ఒకదాని పక్కన మరొకటి ఉంటాయి. ఖుతుబుషాహీల మత సహనానికి సజీవ సాక్ష్యంగా ఈనాటికీ అవి కనిపిస్తాయి. “బాలా హిస్సారు” కు పోయే దారిలో రామదాసు చెఱశాల అని ఒక రాతి గుహను చూపిస్తారు. అందులో ఉన్న చలువరాతిపై శ్రీరాముని ఆకారము రామదాసు చెక్కినదే అని కూడా అంటారు.

ఇది రామదాసున్న బందీఖాన యని చెప్పు ఆధారాలు లేవు. కాళ్లు చేతులు సంకెళ్ళతో బంధించబడిన గోపన్న ఉలి సుత్తి లేకుండా శిలపై రాముని చిత్రం చెక్కడం నమ్మదగిన విషయం కాదు.

పురానాపూల్ నిర్మాణం : మరికొంత దూరం పోతే “బాలాహిస్సారు” కనిపిస్తుంది. అది తన మొదటి రూపమును . గోల్పోయి ఉంది. భాగ్యమతి ప్రేమ వలలో చిక్కుకున్న నవయువకుడయిన యువరాజు మహమ్మదు ఖులీ ఖుతుబుషా పొంగి పొరిలే ముచుకుందా నదిని తన గుర్రంతో ఆవలి తీరానికి సురక్షితముగ జేరుకున్నాడు. అలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిలోకి వెళ్ళిన తమ కుమారున్ని చూసి అతని తల్లిదండ్రులు మహమ్మదు ఇబ్రహీం ఖుతుబుషా (మల్కిభరాముడు), అతని భార్య తల్లడిల్లిపోయారు. ఇటువంటి ప్రమాదం మళ్ళీ రాకూడదని మూసీనదిపై ఆ రాజ దంపతులు పురానపుల్ను నిర్మించారు. అది ఇప్పటికి ప్రజోపయోగకరంగ నిలచిఉంది. భాగ్యమత్తి పేరు మీదనే హైద్రాబాదు నిర్మించబడింది.

బిబికా ఆలం నిర్వహణకు కారణం : ఆ బాలాహిస్సారులో యున్నప్పుడే మరొకసారి యువరాజు ఎక్కిన ఏనుగుకు మత్తెక్కి మావటీని చంపింది. రాకుమారునితో సహా దగ్గరలో ఉన్న అడవిలోకి పారిపోయింది. అది చూసిన రాజమాత తల్లడిల్లే హృదయంతో తన కొడుకు సురక్షితంగా తిరిగివస్తే పేరులను చేయిస్తానని, లంగరు ఉత్సవం చేస్తానని, ఏనుగుపై నెక్కించి నూరేగిస్తానని మొక్కుకుంది. మొహర్రము పదవరోజు హైద్రాబాదులో ఈనాటికీ కనిపించే బీబీకా ఆలం, లంగరు ఉత్సవముల రూపకల్పన రాణి హృదయ ఫలకం మీద ఈ బాలాహిస్సారులోనే జరిగింది. భారతదేశము మొత్తం మీద ఈ బీబీకా ఆలం, ఈ ఏనుగు అంబారీ లంగరు ప్రసిద్ధమైనవి.

ఖుతుబుషాహీల తర్వాత ఆసఫ్ జాహీలు కూడ ఈ ఉత్సవాన్ని పెద్ద ఎత్తున జరిపించారు. నేటికి పదవ మొహర్రము నాడు లక్షలమంది ఈ వేడుకలలో పాల్గొంటారు.

కోట పటిష్టత : కోటకు అవతలి వైపు తూర్పున తానాషా గురువయిన (రజియొద్దీన్) షా రాజు ఖత్తాల్ సమాధి ఉంది. కోట పడమటి ద్వారాన్ని బంజార దర్వాజ అంటారు. స్థానికముగా లభించే తెల్లటి గ్రానైటురాయితో ఈ కోటను నిర్మించారు. తుపాకి గుండ్లను కూడా బంతులలాగా తిరుగ గొట్టేంత గట్టితనమున్న రాయి అది. ఆ గట్టితనమును కొట్టలేకనే మొఘలులు ఈ కోట గోడలను, సొరంగముల ద్వారా కూల్చేప్రయత్నం చేశారు. అయినా మూడుసార్లు విఫలులైనారు. తూర్పుభాగంలో ఉన్న బురుజును మాత్రము వారు కూల్చగలిగారు.

కాని మరునాటి ఉదయం వరకే దానిని గోల్కొండవారు ఎప్పటిమాదిరి నిలబెట్టారు. అది చూసి మొఘలులు ఆశ్చర్యపోయారు. ఆ బురుజు నిజమయిన రాతితో నిర్మించబడింది కాదని వారికి తెలియదు. కాగితము పనితనమునకు అది ఒక పరాకాష్ట. గోల్కొండ కళాకారుల వైశిష్ట్యమునకు అదొక గొప్ప ఉదాహరణ.

ఏనుగల చెట్టు విశిష్టత : ఈ కోటలో ఎనుగల చెట్టు అని పిలువబడే ఒక పెద్ద వృక్షమున్నది. అది ఖుతుబుషాహీలకు పూర్వముదని దానిని గౌరవించేవారు. దీనిని చూడటానికి అశేషజనం ఈనాటికీ వస్తారు. దీని చుట్టుకొలత సుమారు నూరడుగులు. ఇంత పెద్ద చుట్టుకొలత ఉన్న జువ్విచెట్లు చాలా తక్కువ.

ప్రదర్శనశాలగా కోట : గోలకొండకోట కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖవారి యాజమాన్యంలో, షంషీరుకోట్, ఖజాన బిల్డింగులు ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ వారి పర్యవేక్షణలో ఉన్నాయి. వారు ఖజాన బిల్డింగును పురావస్తు ప్రదర్శనశాలగా మార్చారు. అందులో వివిధ శతాబ్దముల సంస్కృతులకు చెందిన సుందర శిల్పకళాఖండాలు,

అమూల్యములైన శిలాశాసనాలు ప్రదర్శించబడుచున్నాయి. ఆ శిల్పసంపద, ఆనాటి సాంస్కృతీ, సామాజిక వైభవాలకు దర్పణంగా నిలుస్తుంది. ఆ పురావస్తుశాల పర్యవేక్షణకు ఒక అధికారి, కొంత సిబ్బంది నియమితులైనారు. దీని ప్రక్కనే షంషీరుకోట్ ఉంది. దానిలో ఆనాటి వివిధ ఆయుధాలు భద్రపరిచారు. వీటిని సాధారణంగా ప్రదర్శించరు. కాని ప్రదర్శించుట చాల అవసరం.

సమాధుల విశిష్టత : గోల్కొండ దుర్గమునకు పడమర సుమారు మైలుదూరంలో ఒక ఎత్తైన సహజసుందరమైన మైదానముంది. ఆ ప్రదేశములో ఖుతుబుషాహీ పాలకుల సమాధులున్నాయి. ఈ ప్రదేశములో ఫలాలతో, పుష్పాలతో నిండిన తోటలుండేవి. కొన్ని ఈనాటికీ ఉన్నాయి. ఈ సమాధుల చుట్టు ఎత్తైన రాతి గోడ ఉంది. ఇందులో ఉన్న సమాధులలో కొన్ని ఖుతుబుషాహి రాజులవికావు. వీటిలో ప్రేమావతి తారామతి, రాజవైద్యుని సమాధులు మాత్రమే గాక రాజాదరణ పొందిన వేరొకరి సమాధికూడా ఉంది. రాజు బంధువులని చెప్పబడేవారి సమాధులు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. మహమ్మదు ఖులీ ఖుతుబుషా సమాధి నిర్మించిన పద్ధతికన్న జమీదు ఖులీ గోరి నిర్మించిన పద్ధతి వేరు. రెండు పర్ష్యా దేశపు నిర్మాణ రీతులనే విశేషంగా అనుకరించి నిర్మించారు. ఇబ్రహీము ఖులీఖుతుబుషా సమాధి కూడా పెద్దదే.

అందలి శిల్పవిజ్ఞానము, నిర్మాణరీతులు క్రొత్తపుంతలు తొక్కినవి. దాని దగ్గరనే మహమ్మదు ఖుతుబుషా సమాధి ఉంది. సమచతురశ్రమగు ఉన్నత వేదికపై అత్యంత సుందరంగా కట్టబడిన బ్రహ్మాండమైన కట్టడమిది. అందులోని శిల్పనిర్మాణ చాతుర్యం హిందూ, ముస్లిం, ఇండో, ఈరానియన్ శిల్ప సాంస్కృతుల కలయికకు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. అందులోని రాతి పుష్పాలు ఇస్లాం మతానికి వ్యతిరేకం అని వాటిని ధ్వంసం చేశారు. అయినా అవి సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తూనే ఉన్నాయి.

మహమ్మదు ఖుతుబ్ షా భాగ్యనగర నిర్మాత. గుల్జారుహౌజు, మక్కా మసీదు, చార్మినార్ వంటి విఖ్యాత కట్టడాలు ఇతను ప్రారంభించినవే. దక్షిణాపథములో ఉర్దూ భాషకు ఇతన్ని పిత అంటారు. అతని సమాధి వద్ద ఈనాటికి ప్రార్థనలు, మత కర్మకాండలు మాత్రమే గాక ఉర్దూ దినం, ఖుతుబుషాహి దినం జరుపుతారు.

ఈ సందర్భంగా పండితులతో సారస్వతోపన్యాసములు జరుగుతాయి. ఆ దినాలలో అక్కడ చరిత్ర సంస్కృతులను గురించిన చర్చలు జరుగుతాయి. ఇతని భార్య పేరు హయ్యతు బట్టీ బేగం, ఈమెకు ఈ వంశ చరిత్రలోను, గోల్కొండ సంస్కృతిలోను ఒక విశిష్ట స్థానముంది. ఆమె ఖుతుబుషాహీ రాజులలో వరుసగ ఒకనికి కూతురు. వేరొకనికి భార్య, మరొకనికి తల్లి. ఈమెకు’ బ్రహ్మాండమైన సమాధి నిర్మించబడింది. దీని నిర్మాణ పద్ధతికూడా విశిష్టమైనది. అబ్దుల్లా ఖుతుబుషా సమాధి చాల పెద్దది. దాని నిర్మాణ పద్ధతికూడా విభిన్నమైనది. దానిని డబుల్ డోల పద్ధతి అంటారు. దీనిలో పైకి కనిపించే గుమ్మటమే గాక దానిలోన కూడా ఎక్కువ నేర్పు గల మరొక గుమ్మటముంది.

ఈ సమాధులు బ్రహ్మాండమైన కట్టడములు. వీటిని చూడడానికి తండోపతండములుగా జనాలు నేటికి చాలా మంది వస్తుంటారు. విదేశీయులు సైతం ఈ సమాధులను చూసి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందుతారు. చనిపోయిన రాజుల భౌతిక దేహాలను, వారి బంధువులు శవములను ఇక్కడికి తెచ్చి చివరిస్నానము చేయిస్తారు. అంత్యక్రియలు చేయడానికి ఇక్కడ ఒక చిన్న అందమైన కట్టడముంది.

ఈ రాజులు షియా సంప్రదాయానికి చెందినవారు. వారు పన్నెండు మంది ఇమాములను పూజిస్తారు. కావున ఈ కట్టడంలో పన్నెండు కోణాలు, పన్నెండు మెట్లు, పన్నెండు చెంబులు, పన్నెండు ఆకుల ఆకారాలు, ఇలా అన్నీ పన్నెండు ఉంటాయి. ఇది చూడవలసిన చక్కని చిన్న కట్టడం. ఈ సమాధులు అత్యున్నతాలు, అపూర్వాలు, అతిసుందరాలు. ఒకప్పుడివి సర్ఫేఖాస్ (నిజాం నవాబు) ఆస్తి. ఆపై కేంద్రపురావస్తు పర్యవేక్షణలోకి వచ్చాయి. ఇప్పుడవి పురావస్తు శాఖవారి అధీనములో ఉన్నాయి.

సుమారు ఎనిమిది లక్షల వ్యయముతో ఈ సమాధులను, పెద్ద ఉద్యానవనములను, క్రీడాసరోవరములను, నౌకా విహారావకాశములను, రమణీయ ఆరామాలను, విశ్రాంతిభవనాలను, పురావస్తు ప్రదర్శనశాలలను, మిరుమిట్లుగొలుపు దీపమాలికలను, జలయంత్రాలను, అపురూపమైన పూదోటలను ఏర్పాటు జేసి, దీనిని భారతదేశములోనే ప్రథమ శ్రేణికి చెందిన యాత్రిక కేంద్రముగా రూపొందించే ఆలోచన ఉన్నది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి తప్పక దీనిని అభివృద్ధి పరచాలని ఎందరో ఒప్పుకుంటారు.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar ఛందస్సు Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

పద్య లక్షణాలను తెలిపేది ఛందస్సు. లయ ప్రాధాన్యత ఛందస్సులో అంతర్గతంగా వుంటుంది. గణాల కూర్పుతో పద్యపాదాలు ఏర్పడతాయి. ఆ గణాలు గురు లఘువులతో కలిసి ఉంటాయి.

  1. లఘువు : ఒక మాత్ర కాలంలో పలుక బడేది లఘువు. లఘువుని (I) ఈ గుర్తుతో సూచిస్తాం.
  2. గురువు : రెండు మాత్రల కాలంలో పలికేది గురువు. గురువును (U) ఈ గుర్తుతో సూచిస్తాం.
  3. యతి : పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి, ప్రాసలు. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.
  4. యతి మైత్రి : పద్యంలో నియమిత స్థానంలో ఉండే మైత్రికి, ‘యతిమైత్రి’ అని పేరు.
  5. ప్రాస : పద్య పాదంలో రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.
  6. ప్రాస నియమం : నాలుగు పద్య పాదాలలోనూ, ఒకే హల్లును ప్రాస స్థానంలో ప్రయోగిస్తే, దానిని ‘ప్రాసనియమం’ అంటారు.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

పద్యాలు ప్రధానం మూడు రకాలు.

  1. వృత్తాలు,
  2. జాతులు,
  3. ఉపజాతులు.

వృత్త పద్యాలు

1. ఉత్పలమాల లక్షణము:

  1. ప్రతి పాదానికి వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  2. ప్రతి పాదానికి ‘20′ అక్షరాలుంటాయి.
  3. ప్రతి పాదంలో, 10 వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
  4. నాలుగు పాదాల్లో ప్రాస నియమం ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానం..
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 1
    యతిమైత్రి : 1-10 అక్షరాలైన ‘డ, టా’ లకు యతిమైత్రి చెల్లుతుంది.

2. చంపకమాల లక్షణము :

  1. ప్రతి పాదానికి 21 అక్షరాలుంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలుంటాయి.
  3. ప్రతి పాదానికి 11వ అక్షరం యతిమైత్రి కల్గివుంటుంది.
  4. నాలుగు పాదాలలోనూ ప్రాసనియమం ఉంటుంది.
  5. నాలుగు పాదాలకూ లక్షణాలు సమానం.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 2
    యతిమైత్రి : 1-11 అక్షరాలైన ‘అఆ’ లకు యతిమైత్రి చెల్లుతుంది.

గమనిక : (ఎసగన్ + ఆర్యులు) అని విడదీసినపుడున్న ‘ఆ-తో” యతి.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

3. శార్దూలం లక్షణము :

  1. ప్రతి పాదానికి 19 అక్షరాలుంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా మ, స, జ, స, త, త, గ అనే గణాలుంటాయి.
  3. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
  4. అన్ని పాదాలలో ‘ప్రాసనియమం’ ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానము.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 3
    యతిమైత్రి : 1-13 అక్షరాలైన ‘శ్రే – రే’ లకు యతిమైత్రి.

4. మత్తేభం లక్షణము :

  1. ప్రతి పాదానికి స, భ, ర, న, మ, య, వ అనే గణాలుంటాయి.
  2. ప్రతి పాదానికి 20 అక్షరాలుంటాయి.
  3. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిమైత్రి కల్గి ఉంటుంది.
  4. నాలుగు పాదాలకు ‘ప్రాసనియమం’ ఉంటుంది.
  5. నాలుగు పాదాలకు లక్షణాలు సమానం.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 4
    యతిమైత్రి : 1-14 అక్షరాలైన ‘స-త్స’లకు యతిమైత్రి చెల్లుతుంది.

జాతులు

1. కందం లక్షణము

  1. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  2. ఒకటి మూడు పాదాలకు మూడేసి గణాలు, రెండు నాలుగు పాదాలకు అయిదేసి గణాల చొప్పున ఉంటాయి.
    మొదటి రెండు పాదాలను ఒక భాగంగాను, చివరి రెండు పాదాలను ఒక భాగంగాను చెప్తారు.
  3. కంద పద్యంలో, నల, గగ, భ, జ, స అనే చతుర్మాత్రా గణాలు మాత్రమే ఉపయోగించాలి.
  4. బేసి గణాలలో మాత్రం (1, 3, 5, 7), ‘జ’ గణం ఉండకూడదు.
  5. ఆరవ గణం, ‘నల’ లేదా ‘జ’ గణం ఉండాలి.
  6. 2, 4 పాదాల్లో చివరి అక్షరం, విధిగా గురువు అయి ఉండాలి.
  7. రెండు, నాలుగు పాదాల్లో, 1-4 గణాల మొదటి అక్షరానికి, యతిమైత్రి ఉంటుంది.
  8. ప్రాసనియమం ఉండాలి.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 5
    యతిమైత్రి : 2వ పాదములోని 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘ప-బ’ లకు యతిమైత్రి చెల్లింది.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ఉపజాతులు

ప్రాస యతి ఉండి, ప్రాస నియమం లేకపోవడం, ఉపజాతి పద్యాల ప్రత్యేకత.

1. ఆటవెలది లక్షణము :

  1. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
  2. 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు; 2-4 పాదాల్లో వరుసగా, ఐదు సూర్య గణాలు ఉంటాయి.
  3. ప్రతి పాదంలోను 1-4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి ఉండాలి.
  4. ప్రాసయతిని పాటింపవచ్చును.
  5. ప్రాసనియమం ఉండదు.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 6
    యతిమైత్రి : 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘క-గా’ లకు, ‘పు-వు’ లకు యతిమైత్రి.

2. తేటగీతి లక్షణము :

  1. తేటగీతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ప్రతి పాదానికీ వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, మరల రెండు సూర్యగణాలు ఉంటాయి.
  3. ప్రతిపాదంలోనూ 1-4 గణాల మొదటి అక్షరానికి యతిమైత్రి ఉంటుంది.
  4. ప్రాసయతిని పాటింపవచ్చు.
  5. ప్రాస నియమం ఉండదు.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 7
    యతిమైత్రి : 1-4 గణాల మొదటి అక్షరాలైన ‘పా – ఫ’ లకు యతిమైత్రి చెల్లింది.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

3. సీసం లక్షణము :

  1. సీస పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి.
  2. ప్రతి పాదానికి వరుసగా ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
  3. పఠన సౌలభ్యం కోసం సీసాన్ని 8 అర్ధపాదాలుగా విభజిస్తారు.
  4. ప్రతి అర్ధపాదంలోనూ 1-3, 5-7 గణాల మొదటి అక్షరాలకు, యతిమైత్రి చెల్లుతుంది.
  5. ప్రాస నియమం ఉండదు. కాని ప్రాసయతి ఉంటుంది.
  6. సీస పద్యానికి, అనుబంధంగా ఆటవెలది గాని, తేటగీతి గాని చేర్చాలి.
    ఉదా :
    TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు 8
    యతిమైత్రి : 1-3 లో-లో, 5-7 క-గ లకు యతిమైత్రి చెల్లింది. లో-లో, క-గ-యతిమైత్రి చెల్లింది.

గమనిక :
ఈ అభ్యాసములో 22 చిన్న ప్రశ్నలున్నాయి. వీని నుండి మీకు పేపరులో, ఎనిమిది ప్రశ్నలు ఇస్తారు. అందులో మీరు ఆరు ప్రశ్నలకు జవాబులు వ్రాయాలి. వాటికి ఆరుమార్కులు వస్తాయి. కాబట్టి వీటిని, అతిశ్రద్ధగా చదివి, ఆరుమార్కులను మీ స్వంతము చేసికోండి.

అభ్యాసం

ప్రశ్న 1.
‘లఘువు’ అనగానేమి ?
జవాబు:
ఒక మాత్ర కాలములో పలుకబడేది, ‘లఘువు’. లఘువును (I) గుర్తుతో సూచిస్తారు.

ప్రశ్న 2.
‘గురువు’ అనగానేమి ? * (M.P)
జవాబు:
రెండు మాత్రల కాలములో, పలికేది ‘గురువు’. గురువును (U) గుర్తుతో సూచిస్తాము.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 3.
‘ఛందస్సు’ అనగానేమి ?
జవాబు:
పద్య లక్షణాలను తెలిపేది ఛందస్సు. లయ ప్రాధాన్యత, ఛందస్సులో అంతర్గతంగా ఉంటుంది.

ప్రశ్న 4.
ప్రాస అనగానేమి ?
జవాబు:
పద్య పాదంలోని రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు.

ప్రశ్న 5.
యతి అనగానేమి ?
జవాబు:
పద్య పాదంలోని, మొదటి అక్షరాన్ని ‘యతి’ అంటారు.

ప్రశ్న 6.
పద్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు ? * (M.P.)
జవాబు:
పద్యాలు ప్రధానంగా మూడు రకాలు :

  1. వృత్తాలు
  2. జాతులు
  3. ఉపజాతులు.

ప్రశ్న 7.
‘ఉత్పలమాల’లో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదములోనూ వరుసగా భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉంటాయి.

ప్రశ్న 8.
‘ఉత్పలమాల’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ? * (M.P.)
జవాబు:
ఉత్పలమాలలో 10వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 9.
‘ఉత్పలమాల’ పద్యంలో ప్రతీ పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
ఉత్పలమాలలో ప్రతి పాదానికీ 20 అక్షరాలు ఉంటాయి.

ప్రశ్న 10.
‘చంపకమాల’లో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
చంపకమాలలో వచ్చే గణాలు, వరుసగా న, జ, భ, జ, జ, జ, ర అనేవి.

ప్రశ్న 11.
‘చంపకమాల’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
చంపకమాలలో 11వ అక్షరం యతిస్థానం.

ప్రశ్న 12.
‘చంపకమాల’ పద్యంలో ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
జవాబు:
చంపకమాల పద్యంలో, ప్రతి పాదానికీ 21 అక్షరాలు చొప్పున ఉంటాయి.

ప్రశ్న 13.
‘శార్దూలం’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
శార్దూలంలో వచ్చే గణాలు వరుసగా మ, స, జ, స, త, త, గ అనేవి.

ప్రశ్న 14.
‘శార్దూలం’లో ఎన్నవ అక్షరం యతిస్థానం ?
జవాబు:
శార్దూలంలో, 13వ అక్షరం యతిస్థానం.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 15.
‘మత్తేభం’లో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
మత్తేభంలో ప్రతి పాదంలోనూ వరుసగా వచ్చే గణాలు, స, భ, ర, న, మ, య, వ అనే గణాలు.

ప్రశ్న 16.
‘మత్తేభం’ ఎన్నవ అక్షరం యతి స్థానం ?
జవాబు:
మత్తేభం, 14వ అక్షరం, యతిస్థానం.

ప్రశ్న 17.
‘కందపద్యం’లో ఆరవగణంలో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
కందపద్యంలో, ఆరవ గణంగా, ‘నలము’ లేదా ‘జ గణం’ ఉండాలి.

ప్రశ్న 18.
‘ఆటవెలది’ పద్యంలో ప్రతి పాదంలో వచ్చే గణాలు ఏవి ?
జవాబు:
ఆటవెలది పద్యంలో ప్రతి పాదంలోనూ వచ్చే గణాలు, ఒకే రకంగా ఉండవు. ఈ పద్యంలో 1-3 పాదాల్లో మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలూ ఉంటాయి. 2-4 పాదాల్లో ఐదునూ సూర్యగణాలే ఉంటాయి.

ప్రశ్న 19.
‘ఇంద్రగణాలు’ ఎన్ని ? * (M.P.)
జవాబు:
ఇంద్రగణాలు ‘ఆరు’, అవి : నల, నగ, సల, భ, ర, త అనేవి.

ప్రశ్న 20.
‘సూర్యగణాలు’ ఎన్ని ?
జవాబు:
సూర్యగణాలు రెండు. అవి :

  1. హ గణము (గలము)
  2. న గణము అనేవి.

TS Inter 2nd Year Telugu Grammar ఛందస్సు

ప్రశ్న 21.
‘తేటగీతి’ పద్యంలో వచ్చే గణాలు ఏవి ? * (M.P.)
జవాబు:
తేటగీతి పద్యంలో, ప్రతి పాదంలోనూ, వరుసగా ఒక సూర్య గణము, రెండు ఇంద్ర గణములు, మరలా రెండు సూర్య గణములూ వస్తాయి.

ప్రశ్న 22.
సీసపద్యానికి అనుబంధంగా ఉండే పద్యాలు ఏవి ?
జవాబు:
సీసపద్యానికి అనుబంధంగా ఆటవెలది గాని, తేటగీతి గాని ఉంటుంది.

TS Inter 2nd Year Telugu Study Material

TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 6th Poem ఆడపిల్లలంటేనే Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 6th Poem ఆడపిల్లలంటేనే

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
‘ఆడపిల్లలంటెనే’ పాఠ్యభాగం ద్వారా కవి అందించిన సందేశం తెలియజేయండి.
జవాబు:
ఆడపిల్లలంటేనే అనే పాఠ్యభాగం ద్వారా నిసార్ మహిళాలోకానికి సందేశాన్ని ఇచ్చాడు. ఆడపిల్లలు అంటేనే లోకానికి చులకన భావం ఏర్పడింది. ఆడవారు లేకుండా ఈ లోకం ఎక్కడుంది అని సమాజాన్ని నిలబెట్టి స్పష్టంగా అడుగుమని సలహా ఇచ్చాడు. పిల్లలు పుట్టాలని పూజలు, వ్రతాలు చేస్తారు. కాని ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వెక్కిరిస్తారు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు. మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ భావన.

కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి వరకట్నం, కానుకలు తెచ్చే పంటగామారి వారి ఇల్లు నింపాలని అనుకుంటారు. నువ్వు కట్నంగా తెచ్చిన డబ్బుతో, బంగారంతో, వాహనంతో, వంట పాత్రలతో ఇల్లు నింపినా ఇంకా సరిపోలేదని అంటారు. తెచ్చిన కట్నంలో ఏ కొద్దిగా తగ్గినా నీ మొఖం పాడుగాను, నువ్వేం తెచ్చావని అంటారు. నిన్ను వాళ్ళే చంపేసి వంటింట్లో చచ్చిందని వార్తాపత్రికలకు ఇస్తారని నిసార్ హెచ్చరించాడు.

ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, ‘వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఎదో ఒకపని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన భర్త మాత్రం ఆడవారిమీద ఎగిరి ఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. అయినా మగవారికే కూలి ఎక్కువ ఎందుకిస్తారు అని నిసార్ ప్రశ్నించాడు. పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడతారని, చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించి ఒంటిలో ఓపిక ఉన్నతకాలం సంసారపు బరువును మోస్తారని కవి చెప్పాడు. ముసలి దానివి అని దూరంగా ఉంచుతారు. వయసుమీద పడి పెంచుకున్న ఆశలు ఎండిపోయి తొడిమలాగా మిగిలిపోయారని ఆడవారి పట్లజాలి చూపాడు.

స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి వారని చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోయి, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని అన్నాడు. ఇంకా ఎన్ని రోజులు కష్టాల కొలిమిలో ఉంటారని, ఈ చెడిపోయిన వాళ్ళను వెళ్ళగొట్టడానికి లేచి ముందుకు రావాలని, సహించినంత కాలం కష్టాలను భరించాల్సి ఉంటుందని, ఎదిరిస్తేనే బాధలు దూరమవుతాయని దానికోసం పోరాటం చేయాలని నిసార్ మహిళలకు సందేశం ఇచ్చాడు.

ప్రశ్న 2.
‘ఆడపిల్లలంటెనే’ పాటలో కవి చిత్రించిన స్త్రీల శ్రమతత్త్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
ఆడపిల్లలంటేనే లోకానికి చులకన భావం ఏర్పడిందని కవి నిసార్ స్త్రీల శ్రమ తత్వాన్ని తెలపడం ప్రారంభించాడు. ఆడవారు లేకుండా ఈ లోకం ఎక్కడుంది అని సమాజాన్ని నిలబెట్టి స్పష్టంగా అడగమని స్త్రీలకు సూచించాడు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు. మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ భావన.

కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి తెచ్చిన కట్నంలో ఏ కొద్దిగా తగ్గినా నీ మొఖం పాడుగాను, నువ్వేం తెచ్చావని అంటారు. నిన్ను వాళ్ళే చంపేసి వంటింట్లో చచ్చిందని వార్తాపత్రికలకు ఇస్తారని నిసార్ హెచ్చరించాడు.

ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఎదో ఒకపని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన నీ భర్త మాత్రం నీ మీద ఎగిరిఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. అయినా మగవారికే కూలి ఎక్కువ ఎందుకిస్తారు అని నిసార్ ప్రశ్నించాడు.

పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడ్డా, చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించినా, ఒంటిలో ఓపిక ఉన్నతకాలం సంసారపు బరువును మోసి ముసలితనం పొందితే దూరంగా ఉంచుతారని చెప్పాడు. వయసుమీద పడి నీవు పెంచుకున్న ఆశలు ఎండి పోయి తొడిమలాగా మిగిలిపోయావని చెప్తూ స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాల తేనెతుట్టె లాంటి వారని అన్నాడు. చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోతారని, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని నిసార్ స్త్రీల శ్రమ తత్వాన్ని విశ్లేషించాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
నిసార్ కవి పరిచయం రాయండి.
జవాబు:
ఆడపిల్లలంటేనే అనే పాఠాన్ని ‘నిసార్ పాట’ అనే ఉద్యమగీతాల సంపుటిలోనుండి గ్రహించారు. దీని రచయిత నిసార్. ఈయన పూర్తి పేరు మహమ్మద్ నిసార్ అహమద్. నిస్సార్ డిసెంబర్ 16, 1964 న జన్మించాడు. జూలై 8, 2020 న కరోనా కారణంగా చనిపోయాడు. ఈయన స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామం. తల్లిదండ్రులు హాలీమాబీ, మహమ్మద్ అబ్బాస్. సుద్దాలలో ప్రాథమిక విద్యను, సీతారాంపురం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేశాడు. ఉన్నత చదువులు అభ్యసించాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ పేదరికం కారణంగా నిసార్ చదువుకు స్వస్తిచెప్పి, ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్కు చేరుకున్నాడు.

దూర విద్య ద్వారా బి.ఏ. డిగ్రీ పట్టా అందుకున్నాడు తొలితరం ప్రజావాగ్గేయకారుల స్ఫూర్తితో 1986 సం॥ నుంచి పాటలు రాయడం ప్రారంభించాడు. “చుట్టుప ఎక్కడ జూచిన పొట్టలల్లో ఆకలిమంటలు/చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టిలేపుతున్నాయి” అంటూ తొలిపాట రాసి, అంతులేని ఆకలిబాధలను ఆర్ద్రంగా గానం చేశాడు.

ప్రశ్న 2.
సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షను తెలియజేయండి.
జవాబు:
పిల్లలు పుట్టాలని పూజలు, వ్రతాలు చేస్తారు. కాని ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వెక్కిరిస్తారు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు. మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ స్త్రీలపట్ల ఉన్న వివక్షను ఎత్తి చూపాడు.

ప్రశ్న 3.
కుటుంబ ప్రగతిలో స్త్రీ పాత్రను వివరించండి.
జవాబు:
ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఎదో ఒకపని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన నీ భర్త మాత్రం నీ మీద ఎగిరి ఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. ఇలా కుటుంబ ప్రగతిలో స్త్రీపాత్ర కీలకం అని నిసార్ తెలిపాడు.

ప్రశ్న 4.
స్త్రీ త్యాగనిరతిని తెలుపండి.
జవాబు:
పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడతారని, చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించి ఒంటిలో ఓపిక ఉన్నతకాలం సంసారపు బరువును మోస్తారని కవి చెప్పాడు. ముసలి దానివి అని దూరంగా ఉంచుతారు. వయసుమీద పడి ఆశలు ఎండిపోయి, పెంచుకున్న ఆశలు ఎండిపోయి తొడిమలాగా మిగిలిపోయారని ఆడవారి పట్ల జాలి చూపాడు. స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి వారని చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోయి, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని స్త్రీల త్యాగ నిరతిని నిసార్ తెలియచేశాడు.

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నిసార్ జన్మస్థలం ఏది ?
జవాబు:
నల్లగొండ జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం

ప్రశ్న 2.
నిసార్ తల్లిదండ్రులెవరు ?
జవాబు:
హాలీమాబీ, మహమ్మద్ అబ్బాస్

TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే

ప్రశ్న 3.
నిసార్ ఏ సంస్థకు కార్యదర్శిగా ఉన్నాడు ?
జవాబు:
ప్రజా నాట్యమండలికి

ప్రశ్న 4.
కనుమరుగవుతున్న కళారూపాలపై నిసార్ రాసిన పాట ఏది ?
జవాబు:
“చుట్టుపక్కల ఎక్కడ జూచిన పొట్టలల్లో ఆకలిమంటలు/చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టిలేపుతున్నాయి” అంటూ తొలిపాట రాసి, అంతులేని ఆకలిబాధలను ఆర్ద్రంగా గానం చేశాడు.

ప్రశ్న 5.
‘ఆడపిల్లలంటేనే’ పాఠ్యభాగం ఏ సంపుటి లోనిది?
జవాబు:
నిసార్ పాట అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి

ప్రశ్న 6.
నిసార్ ఏ సంవత్సరం నుంచి పాటలు రాస్తున్నాడు ?
జవాబు:
1986 నుండి

ప్రశ్న 7.
బ్రతుకు పండేది ఎప్పుడు ? (V.Imp.MP)
జవాబు:
ఆడ, మగ ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటే బ్రతుకు పండుతుంది.

ప్రశ్న 8.
ఆకు రాల్చినట్లు కష్టాలు మరిచేది ఎవరు ?
జవాబు:
ఆడవారు, స్త్రీలు

IV సందర్భసహిత వ్యాఖ్యలు

1. కట్నకానుకల పంటవయి నిండాలె (V.Imp)
జవాబు:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడపిల్లలంటెనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది ఈ వాక్యం. నిసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి. సందర్భం : కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి వరకట్నం, కానుకలు తెచ్చే పంటలగామారి వారి ఇల్లు నింపాలని అనుకుంటారు. నువ్వు కట్నంగా తెచ్చిన డబ్బుతో, బంగారంతో, వాహనంతో, వంట పాత్రలతో ఇల్లు నింపినా ఇంకా సరిపోలేదని అంటారని కవి చెప్పిన సందర్భం లోనిది ఈ వాక్యం.

అర్థం : కట్నం అనే పంటతో ఇల్లంతా నింపాలని అర్థం.

వ్యాఖ్య : ఆడపిల్లలు ఎంత కట్నం తెచ్చినా ఇంకా కావాలని వేధిస్తారని భావం.

2. వొళ్లెంత వొంచిన పని వొడవదోయమ్మా
జవాబు:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడపిల్లలంటెనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది ఈ వాక్యం. నిసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి. సందర్భం : ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదని నిసార్ చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం : శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని పూర్తి కాదని అర్థం.

వ్యాఖ్య : స్త్రీలు ఒళ్ళు హూనం చేసుకునేలా పని చేసినా వారికి తీరిక లభించదు అని భావం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే

3. ఏ లెక్క జూసినా నువు జేసె కష్టమే ఎక్కువాయే
జవాబు:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడపిల్లలంటెనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది ఈ వాక్యం. నీసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి.

సందర్భం : ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికమని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం : ఏ లెక్క ప్రకారం చూసినా స్త్రీలు చేసే పని విలువనే అధికం అని అర్థం.

వ్యాఖ్య : స్త్రీలు చేసే పనివిలువ ఎక్కువ అయినా స్త్రీలకు తక్కువ కూలి ఇస్తారని భావం.

4. కష్టాల కొలిమిలో ఇంకెంత కాలమేడుస్తవమ్మా
జవాబు:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడపిల్లలంటెనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది ఈ వాక్యం. నిసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి. సందర్భం : స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి వారని చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోయి, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని ఇంకా ఎన్ని రోజులు కష్టాల కొలిమిలో ఉంటారని, ఈ చెడిపోయిన వాళ్ళను వెళ్ళగొట్టడానికి లేచి ముందుకు రావాలని, కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం : కష్టాలనే కొలిమిలో ఇంకా ఎన్ని రోజులు కాలం గడుపుతారని అర్థం.

వ్యాఖ్య : స్త్రీలు వారి జీవితాన్ని వారి కుటుంబంకోసం త్యాగం చేస్తారు. ఇంకా ఎన్ని రోజులు ఆ బాధలను భరిస్తారు ఎదిరించాలని భావం.

గేయాలు – గేయ సారాంశములు

1 నుండి 2 పంక్తులు

ఆడపిల్లలంటేనే లోకాన లోకువై పాయె తల్లీ
ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లీ.

అర్ధములు :

తల్లీ = ఓ అమ్మా
ఆడపిల్లలు + అంటేనే = ఆడపిల్లలు అంటేనే
లోకాన = లోకంలో
లోకువై పాయె = చులకన అయింది.
ఆడోళ్ళు లేనిదే = ఆడవారు లేకుండా
లోకము + ఏడుందని = లోకం ఎక్కడుంది (లేదని భావం)
నిలదీసి అడుగు చెల్లీ = నిలబెట్టి స్పష్టంగా అడుగు

సారాంశము : ఓ అమ్మా! ఆడపిల్లలు అంటేనే లోకానికి చులకన భావం ఏర్పడింది. ఆడవారు లేకుండా ఈ లోకం ఎక్కడుంది అని సమాజాన్ని నిలబెట్టి స్పష్టంగా అడుగు చెల్లి అని నిసార్ సలహా ఇస్తున్నాడు.

3 నుండి 8వ పంక్తి వరకు

ఆడపిల్లలు పుడితే మూతులె ముడిచేరు
మగపిల్లలా కొరకు నోములె న్తోచేరు
ఆడపిల్లను లేపి అంట్లుముందేసేరు
మగపిల్లవాడిని బడికి పంపించేరు.
ఆడ మగ తేడా లెందుకు, ఇద్దరు వుండాలిగా
వొకరి కొకరు తోడు నీడగా లేకుంటే బ్రతుకే పండదుగా – ఆడ ”

అర్ధములు :

పిల్లల కొరకు = పిల్లలు పుట్టాలని
నోము నోచేరు = దేవుళ్లకు పూజలు చేస్తారు
ఆడపిల్లలు పుడితే = ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే
మూతులె ముడిచేరు = వెక్కిరిస్తారు
ఆడపిల్లను లేపి = ఆడపిల్ల పడుకుంటే నిద్ర లేపి
అంట్లు ముందు+ఏసేరు = అంట్ల పాత్రలు శుభ్రం చేయమని ముందు వేస్తారు
మగపిల్లవాడిని = మగపిల్లలను
బడికి పంపించేరు = పాఠశాలకు పంపిస్తారు
ఆడ మగ తేడాలు + ఎందుకు = ఆడ మగ అనే భేద భావాలు ఎందుకు ఉండాలి
ఒకరి కొకరు తోడు నీడగా = ఒకరికి ఒకరు సహకరించుకుంటూ
ఇద్దరు వుండాలిగా = ఆడ, మగ ఇద్దరు ఉండాలి
లేకుంటే = అలా లేకుంటే
బ్రతుకే పండదుగా = జీవితం సఫలం కాదు

సారాంశము : పిల్లలు పుట్టాలని పూజలు, వ్రతాలు చేస్తారు. కాని ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వెక్కిరిస్తారు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు. మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ భావన.

TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే

9 నుండి 12వ పంక్తి వరకు

కొత్తగా పెండ్లితె అత్తవారింటిలో
కట్నకానుకల పంటవయి నిండాలె
డబ్బు బంగారము బండి, బాసండ్లతో
ఇల్లంత నింపినా ఇంతేనా అంటారు. – ” ఆడ

అర్థములు :

కొత్తగా పెండ్లితె = కొత్తగా పెండ్లి కాగానే
అత్తవారింటిలో = అత్తగారి ఇంటికి
కట్న కానుకల = వరకట్నాలు కానుకలు తెచ్చే
పంటవయి నిండాలె = పంటలా మారి వారి ఇల్లు నిండా నింపాలి
డబ్బు = కట్నంగా తెచ్చిన డబ్బుతో
బంగారము = బంగారంతో
బండి = వాహనంతో
బాసండ్లతో = వంట పాత్రలతో
ఇల్లంత నింపినా = ఇల్లు పూర్తిగా నింపినా
ఇంతేనా అంటారు = ఇంకా సరిపోలేదు అంటారు

సారాంశము : కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి వరకట్నం, కానుకలు తెచ్చే పంటలగామారి వారి ఇల్లు నింపాలని అనుకుంటారు. నువ్వు కట్నంగా తెచ్చిన డబ్బుతో, బంగారంతో, వాహనంతో, వంట పాత్రలతో ఇల్లు నింపినా ఇంకా సరిపోలేదని అంటారు.

13 నుండి 15వ పంక్తి వరకు

ఏది తక్కువయిననూ ఓచెల్లి నిన్నేడిపిస్తరమ్మా
నీ మొఖం పాడుగాను నువ్వేమి తెచ్చినావంటరమ్మా
నిను చంపి వంటింట్లో కాలి చచ్చినవంటు పేపర్లకిస్తరమ్మ ఆడ ”

అర్థములు :

చెల్లి = ఓ చెల్లి
ఏది తక్కువయిననూ = నీవు తెచ్చిన కట్నంలో ఏది తక్కువయినా
నిన్ను+ఏడిపిస్తారు+అమ్మా = నిన్ను ఏడిపిస్తారు
నీ మొఖం పాడుగాను = నీ ముఖం పాడు గాను అని తిట్టి
నువ్వేమి తెచ్చినావంటరు + అమ్మా = నువ్వు ఏం తెచ్చావని అంటారమ్మ
నిను చంపి = నిన్ను చంపేసి
వంటింట్లో కాలి = వంట చేస్తుంటే కాలి పోయి
చచ్చినవు + అంటు = చనిపోయిందని అంటూ
పేపర్లకు + ఇస్తరమ్మ = వార్తాపత్రికలకు ఇస్తారు.

సారాంశము : ఓ చెల్లెమ్మా! నీవు తెచ్చిన కట్నంలో ఏ కొద్దిగా తగ్గినా నీ మొఖం పాడుగాను, నువ్వేం తెచ్చావని అంటారు. నిన్ను వాళ్ళే చంపేసి వంటింట్లో చచ్చిందని వార్తాపత్రికలకు ఇస్తారని నిసార్ హెచ్చరించాడు.

16 నుండి 21వ పంక్తి వరకు

ఊడ్చాలె, చల్లాలె, కడుగాలె, వుతకాలె
వండాలె, వడ్డించి తినేదాక వుండాలె
వొళ్లెంత వొంచిన పని వొడవదోయమ్మా
తెల్లారి పొద్దుకె తీరువాట మేదమ్మా
రోజుకిరవయి నాలుగు గంటలు నీకు డ్యూటుంటదమ్మా
ఎనిమిదే గంటలు చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరిపడతడమ్మ

అర్థములు :

ఊడ్చాలె, చల్లాలె = ఇల్లు వాకిలి ఊడ్చాలి, కల్లాపి చల్లాలి
కడుగాలె, వుతకాలె = వంటపాత్రలు కడగాలి, ఇంటిల్లిపాది బట్టలు ఉతకాలి
వండాలె, = వంట చేయాలి
వడ్డించి = ఇంటి వారికి వడ్డించాలి
తినేదాక వుండాలె = వారంతా తినేదాక వేచిచూడాలి
ఒళ్లెంత ఒంచిన = నీ శరీరాన్ని ఎంత వంచి పని చేసినా
‘పని ఒడవదోయమ్మా = పని పూర్తి కాదు
తెల్లారి పొద్దుకె = తెల్లవారింది మొదలు
తీరువాట మేదమ్మా = నీకు తీరిక దొరకదు
రోజుకిరవయి నాలుగు = ఒక్క రోజులో ఉండే ఇరవై
గంటలు = నాలుగు ‘గంటలూ
నీకు డ్యూటుంటదమ్మా = నీకు ఎదో ఒక పని ఉంటుంది.
ఎనిమిదే గంటలు చేసొచ్చి = కేవలం ఎనిమిది గంటలు పని చేసి ఇంటికి వచ్చే
నీ మొగుడు = నీ భర్త
ఎగిరెగిరిపడతడమ్మ = చాలా గర్విస్తాడు అమ్మ

సారాంశము : ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఎదో ఒకపని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన నీ భర్త మాత్రం నీ మీద ఎగిరి ఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

22 నుండి 27వ పంక్తి వరకు

ఇల్లంత సరిజేసి పిల్లలా సవరించి
అత్తమామల జూసి, మొగని మెప్పుపొంది
కూలి నాలి జేసి పొద్దూక ఇల్లొచ్చి
ఆకలి మంటతో పొయ్యి రాజేసేవు
ఏ లెక్కనా జూసినా నువుజేసే కష్టమే ఎక్కువాయే
కూలి డబ్బుల కాడ మగవాల్ల కన్న నీకెందుకు తక్కువాయే – “ఆడ ”

అర్థములు :

ఇల్లంత సరిజేసి = ఇంటికి కావలసిన పనులు చేసి
పిల్లలా సవరించి = పిల్లలను పోషించి
అత్తమామల జూసి, = అత్తను మామను సరిగా పోషించి
మొగని మెప్పుపొంది = భర్త సంతోషించేలా చేసి
కూలి నాలి జేసి = కూలిపని మొదలయినవి చేసి
పొద్దూక ఇల్లొచ్చి = సాయంత్రం సమయంలో ఇంటికి చేరి
ఆకలి మంటతో = ఆకలి వేస్తుండగా
పొయ్యి రాజేసేవు = వంట చేయడానికి పొయ్యిని వెలిగిస్తావు
ఏ లెక్కనా జూసినా = ఇలా ఏ లెక్క ప్రకారం చూసినా
నువుజేసే కష్టమే = నువ్వు (ఆడవారు) చేసే కష్టమే
ఎక్కువాయే = అధికం
కూలి డబ్బుల కాడ = కూలి చేసినందుకు ఇచ్చే డబ్బుల్లో కూడా
మగవాల్ల కన్న = మగవారితో పోల్చితే
నీకెందుకు = నీకు (ఆడవారికి) ఎందుకు
తక్కువాయే = తక్కువగా ఇస్తారు.

సారాంశము : ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. అయినా మగవారికే కూలి ఎక్కువ ఎందుకిస్తారు అని నిసార్ ప్రశ్నించాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే

28 నుండి 33వ పంక్తి వరకు

పేగుతెంచుకొని పిల్లలా కన్నావు
పెంచినవు పెండ్లీలు చేసి మురిసినవు
చావు బతుకులల్ల సంసార మీదినవు
చాతనయి నందక బరువంత మోసినవు
ముసలి దానవంటూ నిన్ను కసిరించు కుంటరమ్మా
వయసు పండి నీ ఆశలెండి వుత్త తొడిమోలె మిగిలేవమ్మా

అర్థములు :

పేగుతెంచూ కొని = పేగులను తెంపుకొని, నొప్పులు భరించి
పిల్లలా కన్నావు = పిల్లల్ని కన్నావు
పెంచినవు = పెంచి పెద్ద చేశావు
పెండ్లీలు చేసి = పెళ్ళిళ్ళు చేసి
మురిసినపు = ఆనందపడ్డావు
చావు బతుకులల్ల = చావులో, బతుకులో (కష్ట సుఖాల్లో)
సంసారము ఈదినవు = సంసారాన్ని సాగించావు
చాతనయి నందక = ఒంటిలో ఓపిక ఉన్నంత కాలం
బరువంత మోసినవు = సంసారం బరువును మోసావు
ముసలిదానివి అయ్యావని = ముసలి దానవంటూ
నిన్ను కసిరించు కుంటారమ్మా = దూరంగా ఉంచుతారు
వయసు పండి = వయసు మీద పడి
నీ ఆశలెండి = నీవు పెట్టుకున్న ఆశలు ఎండిపోయి, ఆశలను చాలించుకుని
వుత్త తొడిమోలె = పండు విడిచిన తొడిమ లాగ
మిగిలేవమ్మా = మిగిలి పోతావు, ఉండిపోతావు.

సారాంశము : పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడ్డావు. చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించావు. నీ ఒంటిలో ఓపిక ఉన్నతకాలం సంసారపు బరువును మోసావు. ముసలిదానివి అని ఇప్పుడు దూరంగా ఉంచుతున్నారు. వయసుమీద పడి నీవు పెంచుకున్న ఆశలు ఎండి పోయి తొడిమలాగా మిగిలిపోయావు.

34 నుండి 37వ పంక్తి వరకు

నడిచేటి చెట్టువమ్మా వో తల్లి త్యాగాల తెట్టెవమ్మా
ఆకు రాల్చినట్టు కష్టాలు మరిచేవు ప్రేమలే పంచేవమ్మా
కష్టాల కొలిమిలోనా ఇంకెంత కాలమేడుస్తవమ్మా
ఈ బష్టుగాళ్ళ తరుమ లేచిరా ముందుకు ఆలస్యమెందుకమ్మ – “ఆడ”

అర్థములు :

ఓ తల్లి = ఓ అమ్మా
నడిచేటి చెట్టువమ్మా = నీవు నడుస్తున్న చెట్టువు
త్యాగాల తెట్టెవమ్మా = త్యాగాలు అనే తేనె తెట్టెవు అమ్మ
ఆకు రాల్చినట్టు = ఆకులను రాల్చేసినట్టు
కష్టాలు మరిచేవు = కష్టాలను మరిచిపోతావు
ప్రేమలే పంచేవు + అమ్మా= ప్రేమలను పంచుతావు
కష్టాల కొలిమిలోనా = కష్టాలు అనే కొలిమిలో
ఇంక + ఎంత కాలము = ఇంకా ఎన్ని రోజులు
ఏడుమ్మా = ఏడుస్తూ ఉంటావమ్మ
ఈ బద్దుగాళ్ళ తరుమ = ఈ చెడిపోయిన వాళ్ళను వెళ్ళగొట్టడానికి
లేచిరా ముందుకు = లేచి ముందుకు రా
ఆలస్యము+ఎందుకమ్మ = ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తావు

సారాంశము : ఓ అమ్మా! నీవు నడిచే చెట్టులాంటి దానివి. త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి దానివి. చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోతావు. తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతావు. ఇంకా ఎన్ని రోజులు కష్టాల కొలిమిలో ఉంటావమ్మ. ఈ చెడిపోయిన వాళ్ళను వెళ్ళగొట్టడానికి లేచి ముందుకు రావాలి అని, సహించినంత కాలం కష్టాలను భరించాల్సి ఉంటుందని, ఎదిరిస్తేనే బాధలు దూరమవుతాయని దానికోసం పోరాటం చేయాలని నిసార్ మహిళలకు మార్గదర్శనం చేశాడు.

ఆడపిల్లలంటేనే Summary in Telugu

TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే 1

కవి పరిచయం

పాఠ్యాంశం పేరు : ఆడపిల్లలంటేనే
కవి పేరు : మహమ్మద్ నిసార్ అహమద్
గ్రంథం : ‘నిసార్ పాట’ అనే ఉద్యమగీతాల సంపుటిలోనిది.
కాలం : డిసెంబర్ 16, 1964 – మరణం: జూలై 8, 2020
స్వస్థలం : ఉమ్మడి నల్లగొండ జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామం
తల్లిదండ్రులు : హాలీమాబీ, మహమ్మద్ అబ్బాస్
చదువు : సుద్దాలలో ప్రాథమిక విద్యను, సీతారాంపురం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేశాడు. ఉన్నత చదువులు అభ్యసించాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ పేదరికం కారణంగా నిసార్ చదువుకు స్వస్తిచెప్పి, ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్కు చేరుకున్నాడు. దూరవిద్య ద్వారా బి.ఏ. డిగ్రీ పట్టా అందుకున్నాడు.

రచనలు : తొలితరం ప్రజావాగ్గేయకారుల స్ఫూర్తితో 1986 సం|| నుంచి పాటలు రాయడం ప్రారంభించాడు. “చుట్టుపక్కల ఎక్కడ జూచిన పొట్టలల్లో ఆకలిమంటలు/చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టిలేపుతున్నాయి” అంటూ తొలిపాట రాసి, అంతులేని ఆకలిబాధలను ఆర్ద్రంగా గానం చేశాడు. అనునిత్యం ప్రజల కష్టనష్టాలకు ప్రతిస్పందిస్తూ పదునైన పాటలల్లి సమాజాన్ని చైతన్యపరిచాడు. తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని కాపాడుకోవలసిన అవసరముందని నిసార్ తన పాటల్లో ప్రబోధించాడు.

తాపీ మేస్త్రీ, కల్లుగీత కార్మికులు, హమాలీలు, అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు, నిరుపేద ముస్లింలు తదితర బడుగుజీవుల బతుకు వెతలను కళ్ళకు కట్టినట్లుగా నిసార్ తన పాటల్లో చిత్రించాడు. లాక్ డౌన్ నేపథ్యంలో చిన్నాభిన్నమైన రోజుకూలీల మూగరోదనలను రాగరంజితంగా వినిపించాడు. ‘నిసార్ పాట’ అనే శీర్షికతో 2008 సం॥లో ప్రచురితమైన ఈ కవి ఉద్యమగీతాలకు సముచితమైన ప్రాచుర్యం లభించింది.

ప్రజానాట్యమండలి కార్యదర్శిగా విశేషమైన సేవలందించిన నిసార్ కరోన బారినపడి మరణించాడు. నిసార్ అంటే ఉర్దూలో ‘త్యాగధనుడు’ అనిఅర్థం. ప్రజాచైతన్యపూరితమైన పాటలతో సమాజానికి తనను తాను అర్పించుకున్న సార్ధక నామధేయుడు నిసార్.

పాఠ్యభాగ సందర్భం

ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళలపై నిరాఘాటంగా అణిచివేత పెరుగుతూనే ఉంది. బాల్యంనుంచి వృద్ధాప్యం వరకూ స్త్రీ అంతులేని వివక్షతను ఎదుర్కొంటూనే ఉంది. ప్రపంచంలో పనిగంటల నియమం లేకుండా ఇంటా బయట పరిశ్రమించే నిత్యశ్రామికులు మహిళలు మాత్రమే. రోజువారీ జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న బహుముఖీన శ్రమభారాన్ని అర్ధంచేసుకొని, వారి కష్టంలో పాలుపంచుకోవాలి. మహిళాభివృద్ధియే దేశాభివృద్ధి అని గుర్తించాలి. స్త్రీ, పురుషుల్లో పరస్పర గౌరవ భావన పెంపొందినప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుంది. ఈ రకమైన సమానత్వ ఎరుకను విద్యార్థుల్లో కలిగించడమే ఈ పాఠ్యభాగ సారాంశం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే

పాఠ్యభాగ సారాంశం

ఓ అమ్మా! ఆడపిల్లలు అంటేనే లోకానికి చులకన భావం ఏర్పడింది. ఆడవారు లేకుండా ఈ లోకం ఎక్కడుంది అని సమాజాన్ని నిలబెట్టి స్పష్టంగా అడుగు చెల్లి అని నిసార్ సలహా ఇస్తున్నాడు. పిల్లలు పుట్టాలని పూజలు, వ్రతాలు చేస్తారు. కాని ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వెక్కిరిస్తారు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు. మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ భావన.

కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి వరకట్నం, కానుకలు తెచ్చే పంటలగా మారి వారి ఇల్లు నింపాలని అనుకుంటారు. నువ్వు కట్నంగా తెచ్చిన డబ్బుతో, బంగారంతో, వాహనంతో, వంట పాత్రలతో ఇల్లు నింపినా ఇంకా సరిపోలేదని అంటారు. ఓ చెల్లెమ్మా! నీవు తెచ్చిన కట్నంలో ఏ కొద్దిగా తగ్గినా నీ మొఖం పాడుగాను, నువ్వేం తెచ్చావని అంటారు. నిన్ను వాళ్ళే చంపేసి వంటింట్లో చచ్చిందని వార్తాపత్రికలకు ఇస్తారని నిసార్ హెచ్చరించాడు.

ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఎదో ఒకపని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన నీ భర్త మాత్రం నీ మీద ఎగిరి ఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కీ వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు.

ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. అయినా మగవారికే కూలి ఎక్కువ ఎందుకిస్తారు అని నిసార్ ప్రశ్నించాడు. పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడ్డావు. చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించావు. నీ ఒంటిలో ఓపిక ఉన్నంతకాలం సంసారపు బరువును మోసావు. ముసలి దానివి అని ఇప్పుడు దూరంగా ఉంచుతున్నారు. వయసుమీద పడి నీవు పెంచుకున్న ఆశలు ఎండిపోయి తొడిమలాగా మిగిలిపోయావు.

ఓ అమ్మా! నీవు నడిచే చెట్టులాంటి దానివి. త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి దానివి. చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోతావు. తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతావు. ఇంకా ఎన్ని రోజులు కష్టాల కొలిమిలో ఉంటావమ్మ. ఈ చెడిపోయిన వాళ్ళను వెళ్ళగొట్టడానికి లేచి ముందుకు రావాలి అని, సహించినంత కాలం కష్టాలను భరించాల్సి ఉంటుందని, ఎదిరిస్తేనే బాధలు దూరమవుతాయని దానికోసం పోరాటం చేయాలని నిసార్ మహిళలకు మార్గదర్శనం చేశాడు.

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material Grammar అలంకారాలు Questions and Answers.

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

ఛందస్సు ‘లయ’ ప్రధానం కాగా, అలంకారం ‘సౌందర్య’ ప్రధానం. వస్తువును అలంకరించేది అలంకారం. చెప్పదలచిన విషయాన్ని అందంగా మలిచేది అలంకారం.
అలంకారాలు రెండు రకాలు :
(అ) శబ్దాలంకారాలు,
(ఆ) అర్థాలంకారాలు

అ) శబ్దాలంకారాలు :
శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉండేవి శబ్దాలంకారాలు. శబ్ద చమత్కారంతో పాఠకునికి మనోహరంగా ఇవి భాసిస్తాయి. (కనబడతాయి, తోస్తాయి)

  1. వృత్త్యనుప్రాస
  2. ఛేకానుప్రాస
  3. లాటానుప్రాస
  4. అంత్యానుప్రాస
  5. యమకం

1. వృత్త్యనుప్రాస :
ఒకటిగాని, అంతకంటే ఎక్కువ హల్లులుగాని అనేకసార్లు ఆవృత్తి (మరల మరల రావడం) అయినట్లైతే దానిని వృత్త్యనుప్రాస అంటారు.
ఉదాహరణలు :
1) చిటపట చినుకులు పటపట కురిసెను.
2) జలజల కాలువలు గలగల పారెను.
గమనిక : మొదటి ఉదాహరణలో ‘ట’కారం, మళ్ళీ మళ్ళీ వచ్చింది. రెండవ ఉదాహరణలో ‘ల’కారం, మళ్ళీ మళ్ళీ వచ్చింది.

2. ఛేకానుప్రాస :
రెండు లేక అంతకంటే ఎక్కువ హల్లులు వ్యవధి లేకుండా అర్థ భేదంతో మళ్ళీ వచ్చినట్లయితే అది ‘ఛేకానుప్రాస’ అలంకారము.
ఉదా : పాప సంహరుడు హరుడు.
వివరణ : ఈ పై ఉదాహరణలో, మొదటి ‘హరుడు’ అనగా, హరించేవాడు అని, రెండవ ‘హరుడు’ అనే పదానికి, ‘శివుడు’ అని అర్థం. మొత్తం వాక్యానికి “పాపాలను హరించేవాడు శివుడు” అని అర్థం. ఈ విధంగా ఒకే పదం, అనగా ‘హరుడు’ అనే పదం, అర్థభేదంతో వెంటవెంటనే వచ్చింది. కాబట్టి ఇది ‘ఛేకానుప్రాస’
అలంకారము.

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

3. లాటానుప్రాస :
ఒకే అర్థమున్న పదాలు తాత్పర్య భేదంతో వ్యవధి లేకుండా వచ్చినట్లయితే, అది ‘లాటానుప్రాస’ అలంకారం అవుతుంది.
ఉదా : కమలాక్షు నర్చించు కరములు కరములు.
వివరణ : ఈ పై ఉదాహరణలో, ‘కరములు’ అనే మొదటి పదానికి, సామాన్యమైన చేతులు అనీ, రెండవ ‘కరములు’ అనేదానికి శ్రేష్ఠమైన చేతులు అనీ, తాత్పర్య భేదము ఉంది. ‘కరములు’ అనే పదాలు, రెండింటికీ “చేతులు” అనే అర్థం. కాని, రెండవ కరములు అనే పదానికి, శ్రేష్ఠమైన చేతులు అనే తాత్పర్యము, భేదంగా ఉంది. .కాబట్టి ఇది “లాటానుప్రాస అలంకారము.

4. అంత్యానుప్రాస :
ఒకే హల్లుగానీ, ఒకే పదంగానీ పాదం యొక్క అంతంలో గాని, పదం యొక్క అంతంలో గానీ, వాక్యం చివరలో గానీ వచ్చినట్లయితే దాన్ని ‘అంత్యానుప్రాస’ అంటారు.
ఉదాహరణలు :
1) బురద నవ్వింది కమలాలుగా
పువ్వు నవ్వింది భ్రమరాలుగా
పుడమి కదిలింది చరణాలుగా
జడిమ కదిలింది హరిణాలుగా
వివరణ : ఇందులో ‘గా’ అనే హల్లు, నాలుగు పాదాల చివర వచ్చింది. కాబట్టి, ఇది ‘అంత్యానుప్రాస’.

2) భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో
ఈ మానవరూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఇందులో, పై పాదాల చివరలో ‘న్నో’ అనే పదం, పునరావృతమయింది. (తిరిగి వచ్చింది)

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

5. యమకం :
అక్షర సముదాయం అర్థభేదంతో పునరావృతమైనచో దాన్ని ‘యమకాలంకార’ మంటారు.
ఉదాహరణ : లేమా ! దనుజుల గెలవగ
లేమా ! నీవేల కడగి లేచితి విటులన్
లే, మాను ! మాన వేనియు
లే మా విల్లందు కొనుము లీలిన్ గేలన్.
వివరణ : పై పద్యంలో మొదటి ‘లేమా’ అనేది, స్త్రీ సంబోధన వాచకం. రెండవ ‘లేమా’ అనేది, గెలువలేకపోతామా ? అనే అర్థాన్ని ఇచ్చేది. మూడవ చోట, ‘లే’ కు, లెమ్మని, మానుకొమ్మని అర్థం. నాలుగో చోట, లేచి మా విల్లు అందుకొమ్మని ప్రేరేపించటం. అందువల్ల ఇది యమకాలంకారం.

ఆ) అర్థాలంకారాలు :
వివరణ :
అర్థం ప్రధానంగా కలిగి చమత్కారం కలిగించేవి ‘అర్థాలంకారాలు’. పాఠకులకు మనోల్లాసం కలిగించటంలో వీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సుమారు వంద వరకు అర్థాలంకారాలు ఉన్నప్పటికీ ప్రసిద్ధమైనవి “ఆఱు అలంకారాలు”.
అవి :

  1. ఉపమాలంకారం
  2. ఉత్ప్రేక్షాలంకారం
  3. రూపకాలంకారం
  4. అతిశయోక్తి అలంకారం
  5. అర్ధాంతరన్యాసాలంకారం
  6. స్వభావోక్తి అలంకారం

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

1. ఉపమాలంకార లక్షణము :
ఉపమాన ఉపమేయాలకు చక్కని సాదృశ్యాన్ని చెప్పడం “ఉపమాలంకారం”. ఇందులో (1) “ఉపమేయం” (వర్ణించే వస్తువు), (2) “ఉపమానం” (పోల్చు వస్తువు), (3) సమాన ధర్మం, (4) ఉపమావాచకం అనే నాలుగు ప్రధాన భాగాలుగా ఉంటాయి.
ఉదాహరణ : ఓ రాజా ! నీ కీర్తి హంసవలె ఆకాశ గంగలో ఓలలాడుతున్నది.
దీనిలో,

  1. ఉపమేయం : “రాజుకీర్తి”
  2. ఉపమానం : ‘హంస’
  3. సమాన ధర్మం : “ఓలలాడటం”
  4. ఉపమావాచకం : ‘వలె’

2. ఉత్ప్రేక్షాలంకార లక్షణము :
‘ఉత్ప్రేక్ష’ అంటే ఊహించడం అని అర్థం. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం.
ఉదాహరణలు :

  1. ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుచున్నవా అన్నట్లున్నవి.
  2. గాంధీ మహాత్ముని హత్య వల్ల భారతజాతికి కలిగిన దుఃఖాన్ని చూడలేకపోయాడా అన్నట్లుగా సూర్యుడు అస్తమించాడు.

వివరణ : పై రెండు ఉదాహరణలలోనూ, ఊహ ప్రధానంగా ఉన్నది. మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు, దుః ఖం చూడలేకనే సూర్యుడు అస్తమించాడా అన్నట్లు, అనే రెండు చోట్లనూ ఊహలే ఉన్నాయి. అందువల్ల, ఇవి ‘ఉత్ప్రేక్ష’లకు ఉదాహరణలు.

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

3. రూపకాలంకార లక్షణము :
ఉపమేయ ఉపమానములకు భేదం ఉన్నా, భేదం లేనట్లు చెప్పడం “రూపకం”. ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించినట్లయితే అది ‘రూపకాలంకారం’.
`ఉదాహరణ : “నా శిరమున పోసికొంటిని నశింపని దుఃఖపుటగ్ని ఖండముల్”
వివరణ : దుఃఖం వేరు, అగ్ని వేరు. ఈ రెండింటికీ భేదం ఉన్నా, ‘దుఃఖపుటగ్ని’ అని, దుఃఖానికీ, అగ్నికీ భేదం లేనట్లు చెప్పడం జరిగింది. అగ్ని ధర్మాన్ని దుఃఖములో ఆరోపించడం జరిగింది. కనుక ఇది ‘రూపకం’.

4. అతిశయోక్తి అలంకార లక్షణము :
గోరంతను కొండంతలుగా వర్ణించడం, ‘అతిశయోక్తి’. ఉన్నదాని కంటె అతిశయం చేసి చెప్పడమే, అతిశయోక్తి అలంకారం.
ఉదాహరణ : ఆ నగరమందలి మేడలు ఆకాశాన్నంటుచున్నవి.
ఇక్కడ మేడలు ఆకాశాన్ని తాకడం ‘అతిశయోక్తి’.

5. అర్ధాంతరన్యాసాలంకార లక్షణము :
సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోనూ, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోనూ, సమర్థించి చెప్పినట్లయితే ‘అర్ధాంతరన్యాసాలంకారము’.
ఉదాహరణ : గాంధీజీ భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టాడు.
మహాత్ములకు సాధ్యము కానిది లోకమున లేదు కదా !
వివరణ : భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడం, విశేష విషయము. దాన్ని ‘మహాత్ములకు సాధ్యముకానిది లేదు కదా !’ అనే సామాన్య వాక్యంతో సమర్థించడం వల్ల ఇది ‘అర్ధాంతరన్యాసాలంకారం’.

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

6. స్వభావోక్తి లక్షణము :
జాతి, గుణ, క్రియాదులచేత వస్తువు యొక్క స్వరూప స్వభావాలను ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే, “స్వభావోక్తి”.
ఉదాహరణ : ‘ఆ లేళ్ళు బెదురు చూపులతో నిక్క పొడుచుకున్న చెవులతో భయభ్రాంత చిత్తములతో అటు ఇటు చూస్తున్నాయి’. – ఇక్కడ లేళ్ళ సహజ ప్రవృత్తి ఉన్నది ఉన్నట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా వర్ణించడంవల్ల స్వభావోక్తి అలంకారం.

గమనిక :
ఈ అభ్యాసములో అలంకారాలపై కేవలము 16 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. వీటిలో నుండియే, ఎనిమిది ప్రశ్నలు, మీకు పరీక్షల్లో ఇచ్చి, వాటిలో ఆరింటికి, జవాబులు వ్రాయమని అడుగుతారు. వాటికి “ఆఱు మార్కులు” ఇస్తారు. కాబట్టి వీటిని బాగా శ్రద్ధగా చదువండి.

అభ్యాసం

ప్రశ్న 1.
శబ్దాలంకారాలు అనగానేమి ?
జవాబు:
శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉండేవి ‘శబ్దాలంకారాలు’.

ప్రశ్న 2.
ఒకే హల్లు అనేకసార్లు ఆవృతి అయితే అది’ ఏ అలంకారం ?
జవాబు:
ఒకే హల్లు, అనేకసార్లు ఆవృతి అయితే, అది ‘వృత్త్యనుప్రాస’ అలంకారం.

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

ప్రశ్న 3.
‘పాప సంహరుడు హరుడు’ ఏ అలంకారం ?
జవాబు:
ఇది ‘ఛేకానుప్రాస’ అలంకారము.

ప్రశ్న 4.
‘కమలాక్షు నర్చించు కరములు కరములు’ ఏ అలంకారం ?
జవాబు:
ఇది ‘లాటానుప్రాస’ అలంకారము.

ప్రశ్న 5.
ఒకే పదం ప్రతి పాదం యొక్క అంతంలో వచ్చినట్లయితే దాన్ని ఏ అలంకారం అంటారు ?
జవాబు:
దీనిని ‘అంత్యానుప్రాస’ అలంకారం అంటారు.

ప్రశ్న 6.
‘యమకం’ అనగానేమి ? *(M.P)
జవాబు:
అక్షర సముదాయంతో, అర్థభేదంతో, పునరావృతమైనచో, దాన్ని, ‘యమకాలంకారమంటారు.

ప్రశ్న 7. *(M.P)
‘ఉపమానం’ అనగానేమి ?
జవాబు:
‘ఉపమానం’ అనగా, పోల్చు వస్తువు. (ఉదా : ‘హంస’)

ప్రశ్న 8.
‘ఉపమేయం’ అనగానేమి ? *(M.P)
జవాబు:
ఉపమేయం అనగా, వర్ణించు వస్తువు. (ఉదా : ‘రాజు కీర్తి’).

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

ప్రశ్న 9.
‘ఉత్ప్రేక్ష’ అనగా అర్థం ఏమిటి ? *(M.P)
జవాబు:
‘ఉత్ప్రేక్ష’ అనగా, ఊహించడం అని అర్థం.

ప్రశ్న 10.
ఉపమాన, ఉపమేయములకు రెండింటికి భేదం ఉన్నా లేనట్లు చెప్పడం ఏ అలంకారం ?
జవాబు:
రూపకాలంకారము.

ప్రశ్న 11.
‘అతిశయోక్తి’ అనగానేమి ? *(M.P)
జవాబు:
గోరంతను కొండంతలుగా వర్ణించడం, ‘అతిశయోక్తి’.

ప్రశ్న 12.
‘ఆ నగరమందలి మేడలు ఆకాశాన్నంటుచున్నవి’ ఏ అలంకారం ? *(M.P)
జవాబు:
ఇది ‘అతిశయోక్తి’ అలంకారం.

ప్రశ్న 13.
‘స్వభావోక్తి’ అలంకారం అనగానేమి ?
జవాబు:
జాతి, గుణ, క్రియాదుల చేత, వస్తువు యొక్క స్వరూప స్వభావాలను, ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించడమే “స్వభావోక్తి”.

ప్రశ్న 14.
సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతోను, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతోను సమర్థించడం ఏ అలంకారం ?
జవాబు:
అర్థాంతరన్యాసాలంకారం.

TS Inter 2nd Year Telugu Grammar అలంకారాలు

ప్రశ్న 15.
‘దుఃఖపుటగ్ని’ ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. *(M.P)
జవాబు:
‘దుఃఖపుటగ్ని’ అనే పదములో ‘రూపకాలంకారము’ ఉంది.

ప్రశ్న 16.
ఉపమావాచకాలు ఏవి ? *(M.P)
జవాబు:
పోలె, వలె, బలె, అట్లు, లాగు మొదలైనవి ఉపమావాచకాలు.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 1st Lesson మిత్రలాభం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 1st Chapter మిత్రలాభం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
ముసలి గద్ద, మార్గాల వృత్తాంతాన్ని రాయండి.
జవాబు:
భాగీరథీ నదీ తీరంలో పెద్ద జువ్విచెట్టు ఉంది. దాని తొర్రలో జరద్దవము అనే గుడ్డి ముసలిగద్ద నివసించేది. ఆ చెట్టు మీఁద ఉండే పక్షులు తాము తెచ్చుకున్న ఆహారం నుండి కొంత కొంత ఇచ్చిన ఆహారంతో జీవించేది. ఒకనాఁడు దీర్ఘకర్ణం అనే పిల్లి పక్షిపిల్లలను తినడానికి ఆ చెట్టు దగ్గరికి చప్పుడు చేయకుండా వచ్చింది. దానిని చూసి పక్షిపిల్లలు భయపడి అరిచాయి. ఆ అల్లరిని విని ఎవరో వచ్చారని గ్రహించిన గద్ద హెచ్చరించింది.

అప్పుడు పిల్లి గద్దను చూసి భయపడి అయ్యో ! చాలా దగ్గరికి వచ్చాను ఇప్పుడు వెనుదిరిగి వెళ్ళలేను. ఎలా తప్పించుకోవాలని ఆలోచించి, అయ్యేదేదో అవుతుంది రోటిలో తలపెట్టి రోకటి పోటుకు ఎందుకు భయపడాలని అనుకున్నది. ఇప్పుడు మంచితనం నటించి దీనికి నమ్మకం కలిగిస్తానని నిశ్చయించుకుంది. గద్ద దగ్గరికి వెళ్లి అయ్యా! నమస్కారము అనగానే గద్ద నీవెవరని అడిగింది.

నేను పిల్లిని, నన్ను దీర్ఘకర్ణమని పిలుస్తారు అన్నది. అలా అనగానే గద్ద కోపంతో నువ్వు తొందరగా ఇక్కడ నుండి వెళ్ళు, లేదంటే నీ ప్రాణాలు తీస్తానని అన్నది. ముందు నామాట వినండి. ఆ తరువాత నేను చంపదగిన వాడనా, కాదా నిర్ణయించండి. లక్షణాలను పరిశీలించి వీడు గౌరవించదగినవాడు వీడు శిక్షించదగిన వాడు అని నిర్ణయించాలి కాని పుట్టిన జాతిని చూసి కాదు అని పిల్లి చెప్పింది.

ఇంతకు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావని గద్ద అడగగా పిల్లి తనగురించి చెప్పింది. ఇక్కడ గంగలో ప్రతిరోజూ స్నానం చేస్తూ, మాంసాహారము మాని, బ్రహ్మచారిగా ఉంటూ చాంద్రాయణ వ్రతము చేస్తున్నాను. మిమ్మల్ని ధర్మజ్ఞులని, మంచివారని యిక్కడి పక్షులు అప్పుడప్పుడు మెచ్చుకుంటుంటే విన్నాను. చాలా రోజుల నుండి మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాను. అది ఇన్ని రోజులకు ఫలించింది. మీరు విద్యలో, వయస్సులో పెద్దవారు. కాబట్టి మీ నుండి ధర్మసూక్ష్మాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను.

ధర్మజ్ఞులయిన మీరే వచ్చినవాన్ని చంపాలని చూశారు. గృహస్థులు ఇలా చేయవచ్చా ? శత్రువులకు కూడా ఆతిథ్యమియ్యాలని అంటారు. ఇంటికి వచ్చిన వారు నిరాశతో పోకూడదు. అది మహా పాపం కదా అని పిల్లి అనగానే, పిల్లులు మాంసాహారులు. ఇక్కడ నా పక్షిపిల్లలున్నాయి. అందువల్ల నేను అలా అన్నానని గద్ద చెప్పగానే పిల్లి రెండు చెవులు మూసికొని కృష్ణ కృష్ణ! ఎంతపాపముచేసి ఈ పిల్లిజన్మ ఎత్తానో ? అది చాలదని ఈపాపం కూడా చేయాలా ? ఎంత మాట వినవలసివచ్చింది.

ధర్మశాస్త్రము విని, నిష్కాముఁడనై చాంద్రాయణ వ్రతము చేస్తున్న నేను ఈ పాపం చేస్తానా? ధర్మశాస్త్రములు అన్ని అహింసా పరమో ధర్మః అని ఏక కంఠంతో బోధిస్తున్నాయి. ఏ హింస చేయకుండా అన్ని ప్రాణులను దయతో చూసేవారికి స్వర్గము సులభంగా అందుతుంది.

భూతదయ గలవాఁడు అన్ని ధర్మాలు చేసిన వాడితో సమానం. అది లేనివాఁడు ఎన్ని దానధర్మాలు చేసినా చేయనివాడితో సమానం. చివరకు తాను చేసిన ధర్మాలే తనకు సహాయం చేస్తాయి. కాని మిగిలినవేవి తోడురావు. తెలియక చెడిపోయిన కాలము పోని, తెలిసి ఇంకా ఎందుకు చెడిపోవాలి ? అడవిలో స్వచ్ఛందంగా మొలచిన ఏ ఆకులతోనో, దుంపలతోనో ఆకలి తీర్చుకోవచ్చు.

కాని ఈపాడు పొట్టకోసం ఇంత పాపం ఎవరైనా చేస్తారా ? ఆహా ! యెంతమాట అన్నారు. అని అనగా గద్దవిని కోపం తెచ్చుకోకండి. కొత్తగా వచ్చిన వారిస్వభావం ఎలా తెలుస్తుంది ? అప్పుడు తెలియక అన్న మాటను తప్పుగా అనుకోకు. పోయినమాట పోని. నీవు ఇకపై ఇష్టం వచ్చినట్లు రావచ్చు, పోవచ్చు, ఇక్కడ ఉండవచ్చు. నీకు ఎటువంటి ఆటంకం లేదని చెప్పింది. తరువాత పిల్లి గద్దతో చాలా స్నేహంగా ఉంటూ, ఆ చెట్టు తొర్రలో నివసించేది.

ఇలా కొన్ని రోజులు గడచిన తర్వాత పిల్లి ప్రతి రోజు అర్థరాత్రి చప్పుడు చేయకుండా చెట్టు ఎక్కి పక్షి పిల్లల గొంతు కొరికితెచ్చి తొర్రలో పెట్టుకొని తినేది. అక్కడి పక్షులు తమపిల్లలు కనిపించకపోవడంతో చాలా బాధ పడి వెతకడం ప్రారంభించాయి. అది తెలుసుకున్న పిల్లి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆపక్షులు వెతుకుతూ ఆ ముసలి గద్ద ఉండే తొర్రలో తమ పిల్లల ఎముకలు, ఈకలు ఉండటం చూసి ఈ గద్దయే తమ పిల్లలను తిన్నదని భావించి దానిని గోళ్లతో రక్కి, ముక్కులతో పొడిచి
చంపాయి.

ప్రశ్న 2.
కాకి మృగాన్ని రక్షించిన విధమును తెలియజేయండి. (V.Imp) (M.P)
జవాబు:
మగధ అనే దేశంలో మందారవతి అనే అడవిలో ఒక జింక, కాకి చాలా స్నేహంగా ఉన్నాయి. బాగా తిని బలిసిన జింక అడవిలో అటూఇటూ తిరుగుతుండగా ఒక నక్క చూసింది. దానిని ఎలా అయినా తినాలని, అందుకోసం స్నేహం నటించాలని అనుకున్నది. నేను నీతో స్నేహం చేయాలని చాలా కోరికతో ఉన్నాను. దయచేసి నన్ను నీ స్నేహితునిగా అంగీకరించు అనగానే జింక ఒప్పుకున్నది. జింక నక్కను తీసుకొని తాను నివసించే స్థలానికి వెళ్ళింది. అక్కడ మందారపు చెట్టుమీద ఉన్న కాకి ఇతనెవరు అని అడిగింది. ఈతఁడు సుబుద్ధి అనే మంచి నక్క నాతో స్నేహం చేయడానికి ఇక్కడికి వచ్చాడని జింక చెప్పింది.

ఆ మాటలు విని కొత్తగా వచ్చినవారిని నమ్మవచ్చా ? ఇప్పుడు నీవు చేసినపని మంచిది కాదు. గతంలో ఒక ముసలి గుడ్డి నక్క ఇలానే పిల్లిని నమ్మి చనిపోయినదని ఆ కథ చెప్పినా జింక నక్కతో స్నేహం చేసింది. కొన్ని రోజుల తరువాత నక్క ఒక పొలాన్ని చూపించింది. జింక రోజూ అక్కడికి మేతకు వెళ్ళేది. అది గమనించిన పొలం యజమాని వలపన్ని ఇంటికి వెళ్ళాడు. అలవాటు ప్రకారం మేయడానికి వెళ్లి జింక వలలో చిక్కుకుంది. దాన్ని గమనించి లోపల సంతోషించిన నక్క ఆదివారం కాబట్టి పేగులు, నరాలతో చేసిన వల తాళ్ళను కొరకను అని చెప్పింది.

సాయంకాలం అవుతున్నా తన మిత్రుడు ఇంకా ఇంటికి రాకపోయే సరికి కాకి వెతుకుతూ ఆ పొలం దగ్గరికి వచ్చింది. అక్కడ వలలో చిక్కుకున్న జింకను చూసి అయ్యో! మిత్రుడా ఇది ఎలా జరిగిందని అడిగింది. మిత్రుని మాట వినని దానికి ఇది ప్రతిఫలము అని, చెడు కాలం వచ్చిన వారికి మంచివారి మాటలు చెవికెక్కవని జింక చెప్పింది. దానికి కాకి మరి నక్క ఎక్కడికి పోయిందని అడగగా నామాంసము తినవలెనని ఇక్కడనే ఎక్కడో కాచుకొని ఉండవచ్చునని జింక తెలిపింది. నేను ముందే హెచ్చరించాను.

నామాట వినక పోతివి. నేను ఇతరులకు చెడు చేయడం లేదు కాబట్టి నాకు ఎవరూ చెడు చేయరు అని భావించడం మంచిది కాదు. మంచి వారికి కూడా చెడ్డవారితో అపాయం ఉంటుంది. పోగాలము వచ్చినవారు దీపం ఆరిపోతే వచ్చే వాసనను గుర్తించలేరు.

అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరు, మిత్రులమాటలు వినరని పెద్దలు చెప్తారు. ముందర మంచి మాటలు చెప్పి వెనుక మోసం చేసే మిత్రుడు పయోముఖ విషకుంభము వంటివాఁడు. వారితో స్నేహాన్ని వెంటనే మానుకోవాలి.

అనఁగానే జింక ఒక నిట్టూర్పు విడిచి “సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయములు, దుర్జన సాంగత్యం వల్ల ‘ సర్వానర్థాలు కలుగుతాయి అనడానికి ఇదే నిదర్శనం. ఆ జిత్తులమారి నక్క చెప్పిన తేనెమాటలకు మోస పోయాను. మాటల్లో తీపి చూపి లోపల విషముంటదని ఉహించలేదని జింక అంటుండగానే, ఆ పొలం యజమాని రావడాన్ని చూసి, కాకి ఇప్పుడు ఎదోఒక ఉపాయం ఆలోచించకపోతే కష్టమవుతుంది. ఆ పొలం యజమాని కర్ర తీసుకొని యమునిలాగా వస్తున్నాడు. నాకొక ఉపాయము తోచింది. నువ్వు ఉపిరి బిగబట్టి, కడుపు ఉబ్బించి.

కాళ్ళు చాపి, చచ్చినట్లు కదలకుండా బిగుసుకొని పడుకో. నేను నీ పైన కూర్చొని నీ కళ్ళను పొడిచినట్లు కూర్చుంటాను. సమయం చూసి నేను అరుస్తాను. నువ్వు వెంటనే లేచి పారిపో అని చెప్పింది. జింక అలానే పడుకుంది. తరువాత దగ్గరికి వచ్చిన పొలం యజమాని జింకను చూసి, చనిపోయిందనుకొని, వలను విడిచాడు. వెంటనే కాకి కూసింది. అది విని జింక లేచి పరిగెత్తింది. అయ్యో ! ఈ జింక నన్ను మోసం చేసిందని కోపగించుకున్న పొలం యజమాని తన చేతిలోని కర్రను గట్టిగా విసిరాడు. దైవికంగా ఆ దెబ్బ తగిలి నక్క చచ్చింది.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
ముసలి గద్దను చూసి బిడాలము ఏమనుకుంది ?
జవాబు:
భాగీరథీ తీరంలో పెద్ద జువ్విచెట్టు ఉంది. దాని తొర్రలో జరద్దవము అనే ఒక గుడ్డి ముసలిగద్ద నివసించేది. ఆ చెట్టు మీఁద ఉండే పక్షులు తాము తెచ్చుకున్న ఆహారం నుండి కొంత కొంత ఇచ్చిన ఆహారంతోనే జీవించేది. ఒకనాఁడు దీర్ఘకర్ణం అనే పిల్లి పక్షిపిల్లలను తినడానికి ఆ చెట్టు దగ్గరికి చప్పుడు చేయకుండా వచ్చింది. దానిని చూసి పక్షిపిల్లలు భయపడి అరిచాయి. ఆ అల్లరిని విని ఎవరో వచ్చారని గ్రహించి గద్ద హెచ్చరించింది. అప్పుడు పిల్లి గద్దను చూసి భయపడి అయ్యో ! చాలా దగ్గరికి వచ్చాను ఇప్పుడు వెనుదిరిగి వెళ్ళలేను.

ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి ? అని ఆలోచించి అయ్యేదేదో అవుతుంది “రోటిలో తలపెట్టి రోకటి పోటుకు ఎందుకు భయపడాల”ని అనుకున్నది. ఇప్పుడు మంచితనం నటించి దీనికి నమ్మకం కలిగిస్తానని నిశ్చయించుకున్నది.

ప్రశ్న 2.
గృహస్థుని ధర్మమేమిటి?
జవాబు:
భాగీరథి తీరంలోని జువ్వి చెట్టుపై ఉన్న గద్దతో కపట స్నేహం చేయాలని వచ్చిన పిల్లిని ఇంతకు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావని గద్ద అడిగింది. పిల్లి తనగురించి చెప్తూ ఇక్కడ గంగలో ప్రతిరోజూ స్నానం చేస్తూ, మాంసాహారము మాని, బ్రహ్మచారిగా ఉంటూ చాంద్రాయణ వ్రతము చేస్తున్నానని అన్నది. మీరు విద్యలో, వయస్సులో పెద్దవారు. కాబట్టి మీనుండి ధర్మసూక్ష్మాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ధర్మజ్ఞులయిన మీరే వచ్చినవాన్ని చంపాలని చూశారు. గృహస్థులు ఇలా చేయవచ్చా ? అని ప్రశ్నించింది.

అంటే గృహస్థులు ఇంటికి వచ్చిన వారిని చంపకూడదని చెప్పింది. ఇంకా శత్రువులకు కూడా ఆతిథ్యమియ్యాలని ఆతిథ్యమిచ్చే శక్తి, ధనము లేకపోతే కనీసం మంచి మాటలతో అయినా తృప్తిపరచాలని అన్నది. ఇంటికి వచ్చిన వారిని నిరాశతో పంపకూడదని అలాపంపడం మహా పాపం అని పిల్లి గద్దకు చెప్పింది.

ప్రశ్న 3.
తనను రక్షించమని వేడుకున్న జింకతో నక్క ఏమన్నది ?
జవాబు:
భాగీరథి తీరంలో మందారవతి అనే వనంలో తిరుగుతున్న జింకను చూసి మోసబుద్ధితో నక్క స్నేహం చేసింది. తన ప్రణాళికలో భాగంగా ఒకరోజు నక్క జింకకు బాగా పండిన ఒక పొలం చూపించింది. ఆ రోజునుండి జింక ప్రతిరోజు ఆ పొలానికి వెళ్లి మేయగా, ఒకరోజు ఆ పొలం యజమాని రహస్యంగా ఒక వలను పెట్టి ఇంటికి పోయాడు. ఎప్పటిలానే జింక మేయడానికి వెళ్లి ఆవలలో చిక్కుకుంది. ఇప్పుడు నా మిత్రుడైన నక్క వస్తే నన్ను రక్షిస్తాడని అనుకుంటుండగా నక్క వచ్చింది. జింకను చూసి ఇన్ని రోజులకు నా ప్రయత్నము ఫలించిందని నక్క లోలోపల సంతోషించింది.

దీని రక్తమాంసాలతో నేను పండగ చేసుకోవచ్చునని మనసులో అనుకొని ఆ జింక దగ్గరికి వెళ్ళింది. నక్కను చూసిన జింక త్వరగా వచ్చి ఈ వల తాళ్ళను కొరికి నన్ను రక్షించు అని అడిగింది. అలా అనగానే నక్క ఇంకా దగ్గరికి వెళ్లి అయ్యో ! ఈ వల పేగులు, నరములతో చేసినది. ఈ రోజు ఆదివారము, నేను నరములను పంటితో తాకలేను. నన్ను మరోరకంగా అనుకోకు. ఇంక వేరే ఏ పనైనా చేస్తానని చెప్పింది.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం

ప్రశ్న 4.
ఎలాంటి వారి సాంగత్యము వెంటనే మానుకోవాలి ?
జవాబు:
భాగీరథి తీరంలో మందారవతి అనే వనంలో తిరుగుతున్న జింకను చూసి మోసబుద్ధితో నక్క స్నేహం చేసింది. తన ప్రణాళికలో భాగంగా ఒక పొలం చూపించి యజమాని పన్నిన వలలో చిక్కుకునేల చేసింది. రక్షించమని వేడుకున్నా రక్షించలేదు. సాయంకాలమైనా తన మిత్రుడు ఇంటికి రాకపోయే సరికి కాకి వెతుకుతూ వచ్చి వలలో ఉన్న జింకను చూసింది. నేను ముందే హెచ్చరించినా నామాట వినక పోతివి. మంచివారికి కూడా ‘చెడ్డవారితో అపాయం ఉంటుంది. పోగాలము వచ్చినవారు దీపం ఆరిపోతే వచ్చేవాసనను గుర్తించలేరు. అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరు. మిత్రులమాటలు వినరని పెద్దలు చెప్తారు.

ముందర మంచి మాటలు చెప్పి వెనుక మోసం చేసే మిత్రుడు పయోముఖ విషకుంభము వంటివాఁడు. వారితో స్నేహాన్ని వెంటనే మానుకోవాలి. అని చెప్పింది. అది విన్న జింక ఒక నిట్టూర్పు విడిచి “సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయములు, దుర్జన సాంగత్యం వల్ల సర్వానర్థాలు కలుగుతాయి అనడానికి ఇదే నిదర్శనం. ఆ జిత్తులమారి నక్క చెప్పిన తేనెమాటలకు మోసపోయాను. మాటల్లో తీపి చూపి లోపల విషముంటదని నేను ఉహించలేదని చెప్పింది.

III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చిన్నయసూరి జన్మస్థలమేది ?
జవాబు:
శ్రీ పెరంబుదూరు

ప్రశ్న 2.
చిన్నయసూరి రాసిన లక్షణ గ్రంథమేది ?
జవాబు:
శబ్ద లక్షణ సంగ్రహం

ప్రశ్న 3.
నీతిచంద్రికకు ఆధార గ్రంథాలేవి ? (V.Imp) (M.P)
జవాబు:
విష్ణుశర్మ పంచతంత్రం, నారాయణ పండితుని హితోపదేశం.

ప్రశ్న 4.
సుదర్శన మహారాజు ఏ పట్టణాన్ని పరిపాలించాడు ?
జవాబు:
పాటలీపుత్రం

ప్రశ్న 5.
దయాళువులకు కరస్థమైనది ఏది ?
జవాబు:
స్వర్గం

ప్రశ్న 6.
ధర్మశాస్త్రములు ఏమని బోధిస్తున్నవి ?
జవాబు:
అహింసా పరమోధర్మః

TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం

ప్రశ్న 7.
లోకమే కుటుంబమని భావించు వారెవరు ?
జవాబు:
మహాత్ములు

ప్రశ్న 8.
పరులకు హాని చేయగోరువారు ఏమైపోతారు ?
జవాబు:
చెడిపోతారు

చాంద్రాయణ వ్రత విశేషం

చాంద్రాయణ వ్రత విధానమేమిటంటే చంద్రుని యొక్క కళలను బట్టి ఆహారాన్ని స్వీకరించడం. అమావాస్య నాడు నిరాహారంగా ఉండడం. పూర్ణిమ నాడు సంపూర్ణంగా భోజనం చేయడం. శుద్ధ పాడ్యమి రోజు ఒక ముద్ద (సాలగ్రామ పరిమాణం) తినాలి. అలా పూర్ణిమ వరకు పెంచుకుంటూ పదిహేను ముద్దలు (సాలగ్రామ పరిమాణం) తీసుకోవాలి. మళ్ళీ బహుళ పాడ్యమి నాడు పదునాలుగు ముద్దలు తిని అలా రోజు రోజుకు ఒక ముద్ద తగ్గించుకుంటూ అమావాస్యనాడు ఉపవాసం చేయాలి. దీనినే చాంద్రాయణ వ్రతమంటారు. కొన్ని పాపాలకు శాస్త్రంలో ప్రాయశ్చిత్తం చెప్పబడలేదు. అటువంటి పాపాలన్నీ చాంద్రాయణ వ్రతం వలన నశిస్తాయని నమ్మకం. పాప ప్రక్షాళన కోసం కాకుండా పుణ్య సముపార్జన కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఈ వ్రతం చేస్తే మరణించిన తరువాత మహాపుణ్యాన్ని పొంది చంద్రలోకాన్ని చేరుకుంటారని ప్రతీతి. ఈ వ్రతానికి కుల గోత్రాలకు సంబంధం లేదు. అందరూ ఆచరించవచ్చు.

పాఠంలోని సామెతలు / జాతీయాలు :

  • రోటిలో తలదూర్చి రోకటి పోటుకు వెరయుట.
  • మ్రాను లేని దేశంలో ఆముదపు చెట్టు మహా వృక్షం కాదా.
  • చేటుగాలము దాపురించినవాడు హితులమాట వినడు.
  • నాలిక తీపు లోను విషమని యెఱుగరునా.

పాఠంలోని కొన్ని నీతి వాక్యాలు

  • కులశీలములు తెలియక యెవ్వరికి తావు ఇవ్వరాదు.
  • కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు.
  • సజ్జన సాంగత్యం సమస్తదోషములు పోగొట్టును; సర్వశుభములిచ్చును.
  • మహాత్ములకు లోకమే కుటుంబం.
  • ప్రపంచమున్నంత కాలం బ్రతుకబోము.
  • ఎప్పుడో కాలుడు మ్రింగ కాచియున్నాడు.
  • మంచివారికి సహితం దుష్టుల వలన భయము గలదు.
  • సజ్జన సాంగత్యము వలన సర్వశ్రేయములవలె; దుర్జన సాంగత్యము వలన సర్వానర్ధములు ప్రాప్తించును.
  • పరులకు హాని చేయ కోరువారు తామే చెడిపోవుదురు.

అలంకారం : క్రమాలంకారం
“పోగాలము దాపించిన వారు దీప నిర్వాణ గంధము, నరుంధతిని, మిత్రవాక్యమును
మార్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురు”
పోగాలము వచ్చినవారు
దీపం ఆరిపోతే వచ్చే వాసనను – గుర్తించలేరు.
అరుంధతీ నక్షత్రాన్ని – చూడలేరు.
మిత్రుని మాటలు వినరని పెద్దలు చెప్తారు అని క్రమంగా అన్వయించుకోవాలి.
ఇలా అన్వయించుకునే అలంకారాన్ని క్రమాలంకారం అంటారు.

కఠిన పదాలకు అర్ధములు

40వ పుట

మిత్ర లాభం = స్నేహం వలన లాభం
మైత్రి = స్నేహం
కాకము = కాకి
కూర్మము = తాబేలు
మృగము = జింక
మూషికము = ఎలుక
సవిస్తరముగా = వివరంగా
వనము, = అడవి
సఖ్యము = స్నేహం
వాసము = నివాసం
పోతరించి = బలిసి
సమీపమునకు = దగ్గరికి
మృతకల్పుడన = జీవచ్ఛవంగా

41వ పుట

తార్కాణము = నిదర్శనము
సావాసము = స్నేహం, కలిసి నివసించడం
జంబుకము = నక్క
మార్గాలము = పిల్లి
మృతి పొందెను = చనిపోయినది
జరద్దవము = గద్ద పేరు
చీకు ముసలి = గుడ్డి ముసలి
భక్షించుట = తినుట
మ్రాను = చెట్టు
సద్గు = చప్పుడు
కోలాహలము = పెద్ద శబ్దం, అల్లరి
బిడాలము = పిల్లి
కడు దాపునకు = చాలా దగ్గరికి
సురిగి = వెనుదిరిగి
శీఘ్రము = వెంటనే
వధ్యుడనో = చంపదగిన వాడనో
పూజ్యుడు = గౌరవింప దగినవాడు

42వ పుట

మాంసాశనము = మాంసాహారము
చాంద్రాయణ వ్రతము = ఒక వ్రతం పేరు (వివరణ చూడండి)
వధింప = చంపడానికి
మిక్కుటము = ఎక్కువ
నిష్కాముడు = కోరికలు లేని వాడను
కరస్థము = సులభము (చేతిలో ఉన్నట్లు)
భూత దయ = జీవుల పట్ల దయ
కడపట = చివరకు
తక్కినది = మిగిలినది
క్షుధ = ఆకలి
యథేచ్ఛముగా = ఇష్టం వచ్చినట్లుగా
మార్జాలము = పిల్లి

TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం

43వ పుట

చుంచువులు = పక్షి ముక్కులు
ప్రథమ దర్శనము = మొదటిసారి చూడటం
వర్ధిల్లు చున్నది = కొనసాగుతున్నది, పెరుగుతున్నది
మాఱు = బదులు
లఘు బుద్ధులకు = చిన్న బుద్ధి కలవారికి, తెలివిలేని వారికి
కాలుడు = యముడు
కాచి = వేచి
నావిని = అనగా విని
క్షేత్రము = పొలము
క్షేత్ర స్వామి = పొలం యజమాని
గూఢముగా = రహస్యంగా
ఎప్పటివాడుక = అలవాటుగా
కాలపాశము = యముని చేతిలోని తాడు
విపత్తు = ఆపద

44వ పుట

యత్నము = కృషి, పని
నేడుగా పండుగు = ఈ రోజు పండుగ (ఆనందం)
దాపునకు, కదియ = దగ్గరికి
నులి, నరములతో = పేగులు, నరములతో
భట్టారక వారము = ఆదివారము
హరిణము = జింక
తావు చేరమికి = నివాస స్థలానికి రాలేదని
చేటు గాలము = చెడు కాలము
హితులు = మేలు కోరేవారు
దీప నిర్వాణ గంధము = దీపము ఆరినప్పుడు వచ్చే వాసన
మూర్కొనరు = వాసనను గుర్తించలేరు
కనరు = చూడరు
ప్రత్యక్షమందు = ఎదురుగా
ఇచ్చకములు = ప్రియవచనములు
పరోక్షమందు = వెనక
కార్యహాని చేయు = పని చెడగొట్టె
సంగాతకుడు = స్నేహితుడు
పయోముఖ = పాలవంటి ముఖము కలిగిన
విషకుంభము = విషముతో నిండిన కుండ
సాంగత్యము = స్నేహం
అవశ్యము = తప్పక
దుర్జనులు = చెడ్డవారు
అనర్థము = కీడు
ప్రాప్తించును = కలుగుతాయి
జిత్తుల మారి = మోసము చేయు జీవి
నాలిక తీపు లోను విషము = మాటల్లో తీపి లోపల విషము ఉండుట (కపటం)
వెరపు = ఉపాయం
మసలరాదు = కదలకు
బడియ = కర్ర
(మీ) / బూరటించి = ఉబ్బించి

45వ పుట

తాకుపడి = దెబ్బతిని

మిత్రలాభం Summary in Telugu

TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం 1

రచయిత పరిచయం

పాఠం పేరు : మిత్రలాభం
దేని నుండి గ్రహింపబడినది : నీతి చంద్రికలో మిత్రలాభం అనే మొదటి భాగంలోనిది.
రచయిత పేరు : పరవస్తు చిన్నయసూరి
రచయిత కాలం : జననం : 20-12-1806, మరణం : 1861
రచయిత స్వస్థలం : తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా శ్రీపెరంబుదూరు

తల్లిదండ్రులు : శ్రీనివాసాంబ, వేంకటరంగ రామానుజాచార్యులు
సంప్రదాయం : చాత్తాద శ్రీ వైష్ణవ సంప్రదాయం
తండ్రి వృత్తి : మదరాసు సుప్రింకోర్టు (ఇప్పటి హై కోర్టు) లో న్యాయమూర్తి

గురువులు : కంచి రామానుజాచార్యులు, (తర్క, మీమాంస, అలంకార శాస్త్రాలు) ప్రతివాద భయంకర శ్రీనివాసాచార్యులు, శ్రీరామశాస్త్రులు (వేదాలను, వేదార్థాలను, హయగ్రీవ మంత్రోపదేశం)
బహుభాషావేత్త : సంస్కృత, ఆంధ్ర, ప్రాకృత, తమిళభాషలలో విద్వాంసుడు.
ఉద్యోగం : ఆఫ్ఘన్ మిషన్ పాఠశాలలో (1836), పచ్చయప్ప కళాశాలలో తెలుగు పండితునిగా (1844), రాజధాని కళాశాలలో ఆచార్యునిగా (1847), మదరాసు విశ్వవిద్యాలయంలో ప్రధాన పండితుడు (1857) పదవులను నిర్వహించాడు.

ప్రధాన రచనలు : చిన్నయసూరికి కీర్తిని ఆర్జించి పెట్టిన రచనలు బాలవ్యాకరణం, నీతిచంద్రిక.
ఇతర రచనలు : మొత్తం ఇరవై నాలుగు రచనలు. వాటిలో ప్రధానమైనవి: ఆంధ్ర శబ్దానుశాసనము, ఆంధ్ర ధాతుమాల, శబ్ద లక్షణ సంగ్రహం, నీతి సంగ్రహం, విభక్తి బోధిని, పద్యాంధ్ర వ్యాకరణం, సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణం, అక్షరగుచ్చము, లక్ష్మీనారాయణ తంత్రము, హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము.

పరిష్కరణ : నన్నయ భారత ఆదిపర్వాన్ని, కూచిమంచి తిమ్మకవి ‘నీలాసుందరీ పరిణయము’ను పరిష్కరించి ముద్రించాడు.
పత్రికలు : ‘వర్తమాన తరంగిణి’ పత్రికలో రచనలు చేశాడు. ‘సుజనరంజని’ అనే మాసపత్రికను నడిపాడు. నీతి చంద్రిక అంటే నీతులనే వెన్నెల.

సూరి బిరుదు : ఈ గ్రంథాన్ని రాజధాని కళాశాల అధికారి అర్బత్ నాట్కు అంకితమిచ్చాడు. అర్బత్నాట్ ‘చిన్నయసూరి’ అని ఆంగ్లాక్షరాలలో చెక్కిన బంగారు కడియాన్ని చిన్నయకు బహూకరించి ‘సూరి’ (పండితుడు) అనే బిరుదును ప్రదానం చేశాడు.

నీతి చంద్రిక పరిచయం

* వచన సాహిత్యంలో ధృవతార వంటిది నీతి చంద్రిక.
* నీతిచంద్రికకు మూలం సంస్కృతంలో విష్ణుశర్మ రాసిన పంచతంత్రం, నారాయణ పండితుడు రాసిన హితోపదేశం అనే గ్రంథాలు
* విష్ణుశర్మ రాసిన పంచతంత్రంలో ఐదు తంత్రాలున్నాయి. అవి

  1. మిత్రభేద తంత్రం,
  2. మిత్ర సంప్రాప్తి,
  3. కాకోలుకీయం,
  4. లబ్ది ప్రణాశం,
  5. అపరీక్షిత కారిత్వం.

* నారాయణ పండితుడు రాసిన హితోపదేశంలో నాలుగు భాగాలున్నాయి. అవి

  1. మిత్రలాభ,
  2. సుహృద్భేద,
  3. విగ్రహ,
  4. సంధి

* ఈ రెండింటిని సమన్వయపరుస్తూ ‘నీతి చంద్రిక’ అనే వచనగ్రంథాన్ని 1853లో చిన్నయసూరి ప్రచురించాడు.
* నీతి చంద్రికలో మిత్ర లాభం, మిత్ర భేదం అనే రెండు భాగాలున్నాయి.
* చిన్నయ సూరి కంటే ముందు, తరువాత ఇతరులు పై రచనలను తెలుగులోకి అనువదించే ప్రయత్నం చేశారు. కాని అన్నింటికంటే ఎక్కువ స్తూరి రచనయే పండిత లోక ప్రశంసలు అందుకున్నది.
* ఈ గ్రంథ పఠనం వల్ల లోకజ్ఞానం, వ్యవహారదక్షత, సమయస్ఫూర్తి, మూర్తిమత్వం, నీతి కుశలతలతో పాటు భాషాజ్ఞానం, సృజనాత్మకతలు అలవడుతాయి.

TS Inter 2nd Year Telugu Study Material Chapter 1 మిత్రలాభం

పాఠ్యభాగ నేపథ్యం

గంగానది తీరంలో పాటలీపుత్రమనే పట్టణాన్ని సుదర్శనుడనే రాజు పరిపాలించాడు. సుదర్శనుడు విష్ణుశర్మను తన పుత్రులకు చదువు చెప్పమని కోరాడు. విష్ణుశర్మ రాజకుమారులకు నీతిచంద్రికను బోధించి నీతిమంతులుగా మార్చాడు. ఇందులోని మిత్రలాభమే ఈ పాఠ్యభాగం. ఈ పాఠ్యభాగంలో నక్క జింకతో చెలిమి చేయుటకు ప్రయత్నించుట, ముసలిగద్ద, మార్జాల వృత్తాంతం, మృగకాక జంబుకముల కథ మొదలైనవి ఉన్నాయి.

పాఠ్యభాగ సారాంశం

విష్ణుశర్మ రాజకుమారులకు కథల ద్వారా విద్య నేర్పిస్తూ సంపాదన లేకున్నా కాకి, తాబేలు, జింక, ఎలుకలు స్నేహంగా ఉండి తమ కార్యాలను సాధించుకున్నాయి అని చెప్పాడు. అప్పుడు రాకుమారులు వాటి కథను వివరంగా చెప్పుమని కోరారు. విష్ణుశర్మ కాకి, నక్క, జింకల కథను చెప్పాడు.

నక్క జింకతో స్నేహం చేయడం : మగధ అనే దేశంలో మందారవతి అనే అడవి ఉంది. అందులో చాల రోజులనుండి ఒక జింక, కాకి చాలా స్నేహంగా ఉన్నాయి. పుష్టిగా తిని బలిసిన జింక అడవిలో అటూఇటూ తిరుగుతుండగా ఒక నక్క చూసింది. దానిని ఎలా అయినా తినాలని, అందుకోసం స్నేహం నటించాలని అనుకున్నది. నెమ్మదిగా జింక దగ్గరకు వచ్చి మిత్రమా అని పిలిచింది. ఎవరు నువ్వు అని జింక అడిగితే, నేను నక్కను. నాపేరు సుబుద్ధి. నా బంధువులందరూ చనిపోయారు. నేను ఒంటరిగా ఈ అడవిలో జీవచ్ఛవం లాగా ఉంటున్నాను. నిన్ను దేవునిలా అనుకొని చెప్పుతున్నాను. నిన్ను చూడఁగానే నాబంధువులందఱు వచ్చినట్లు అనిపించింది. మంచి వారిని చూస్తే అన్ని పాపాలు పోతాయి.

అన్ని శుభాలు కలుగుతాయి అనడానికి నిన్ను కలవడమే నిదర్శనం. నేను నీతో స్నేహం చేయాలని చాలా కోరికతో ఉన్నాను. దయచేసి నన్ను నీ స్నేహితునిగా అంగీకరించు అనగానే జింక ఒప్పుకున్నది. జింక నక్కను తీసుకొని తాను నివసించే స్థలానికి వెళ్ళింది. అక్కడ మందారపు చెట్టుమీద ఉన్న కాకి ఇతనెవరు అని అడిగింది. ఈతడు సుబద్ధి అనే మంచి నక్క, నాతో స్నేహం చేయడానికి ఇక్కడికి వచ్చాడు అని జింక చెప్పింది. ఆ మాటలు విని కొత్తగా వచ్చినవారిని నమ్మవచ్చా? ఇప్పుడు నీవు చేసినపని మంచిది కాదు. గతంలో ఒక ముసలి గుడ్డి గద్ద ఇలానే పిల్లిని నమ్మి చనిపోయినది. ఆ కథ చెప్తాను విను అని చెప్పింది.

ముసలిగద్ద – పిల్లి కథ : భాగీరథీ తీరంలో పెద్ద జువ్విచెట్టు ఉంది. దాని తొర్రలో జరద్దవము అనే ఒక గుడ్డి ముసలిగద్ద నివసించేది. ఆ చెట్టు మీఁద ఉండే పక్షులు తాము తెచ్చుకున్న ఆహారం నుండి కొంత కొంత ఇచ్చేవి. గద్ద ఆ ఆహారంతోనే జీవించేది. ఒకనాఁడు దీర్ఘకర్ణం అనే పిల్లి పక్షిపిల్లలను తినడానికి ఆ చెట్టు దగ్గరికి చప్పుడు చేయకుండా వచ్చింది. దానిని చూసి పక్షిపిల్లలు భయపడి అరిచాయి. ఆ అల్లరిని విని ఎవరో వచ్చారని గ్రహించి గద్ద హెచ్చరించింది. అప్పుడు పిల్లి గద్దను చూసి భయపడి అయ్యో ! చాలా దగ్గరికి వచ్చాను ఇప్పుడు వెనుదిరిగి వెళ్ళలేను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? అని ఆలోచించి అయ్యేదేదో అవుతుంది రోటిలో తలపెట్టి రోకటి పోటుకు ఎందుకు భయపడాలని అనుకున్నది. ఇప్పుడు మంచితనం నటించి దీనికి నమ్మకం కలిగిస్తానని నిశ్చయించుకున్నది. గద్ద దగ్గరికి వెళ్లి అయ్యా! నమస్కారము అనగానే గద్ద నీవెవరని అడిగింది.

నేను పిల్లిని, నన్ను దీర్ఘకర్ణమని పిలుస్తారు అన్నది. అలా అనగానే గద్ద కోపంతో నువ్వు తొందరగా ఇక్కడనుండి వెళ్ళు, లేదంటే నీ ప్రాణాలు తీస్తానని అన్నది. ముందు నామాట వినండి. తరువాత నేను చంపదగినవాడనా కాదా నిర్ణయించండి: లక్షణాలను పరిశీలించి వీడు గౌరవించదగినవాడు వీడు శిక్షించదగిన వాడు అని నిర్ణయించాలి కాని పుట్టిన జాతిని చూసి కాదు అని పిల్లి చెప్పింది.

ఇంతకు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావని గద్ద అడగగా పిల్లి తనగురించి చెప్పింది. ఇక్కడ గంగలో ప్రతిరోజూ స్నానం చేస్తూ, మాంసాహారము మాని, బ్రహ్మచారిగా ఉంటూ చాంద్రాయణ వ్రతము చేస్తున్నాను. మిమ్మల్ని ధర్మజ్ఞులని, మంచివారని యిక్కడి పక్షులు అప్పుడప్పుడు మెచ్చుకుంటుంటే విన్నాను. చాలా రోజుల నుండి మిమ్మల్ని చూడాలను అనుకుంటున్నాను. అది ఇన్ని రోజులకు ఫలించింది. మీరు విద్యలో, వయస్సులో పెద్దవారు. కాబట్టి మీనుండి ధర్మసూక్ష్మాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను.

ధర్మజ్ఞులయిన మీరే వచ్చినవాణ్ణి చంపాలని చూశారు. గృహస్థులు ఇలా చేయవచ్చా? శత్రువులకు కూడా ఆతిథ్యమియ్యాలని అంటారు. ఆతిథ్యమిచ్చే శక్తి, ధనము లేకపోతే కనీసం మంచి మాటలైనా చెప్పాలి కాని ఇంటికి వచ్చిన వారు నిరాశతో పోకూడదు. అది మహా పాపం కదా అని పిల్లి అనగానే, పిల్లులు మాంసాహారులు.

ఇక్కడ నా పక్షిపిల్లలున్నాయి. అందువల్ల నేను అలా అన్నానని గద్ద చెప్పింది. అలా అనఁగానే పిల్లి రెండు చెవులు మూసికొని కృష్ణ కృష్ణ ! ఎంత పాపముచేసి ఈ పిల్లిజన్మ ఎత్తానో అది చాలదని ఈ పాపం కూడా చేయాలా ? ఎంత మాట వినవలసివచ్చింది. ధర్మశాస్త్రము విని నిష్కాముఁడనై చాంద్రాయణ వ్రతము చేస్తున్న నేను ఈ పాపం చేస్తానా ? ధర్మశాస్త్రములు అన్ని అహింసా పరమో ధర్మః అని బోధిస్తున్నాయి.

ఏ హింస చేయకుండా అన్ని ప్రాణులను దయతో చూసేవారికి స్వర్గము సులభంగా అందుతుంది. భూతదయ గలవాఁడు అన్ని ధర్మాలు చేసిన వాడితో సమానం. అది లేనివాఁడు ఎన్ని దానధర్మాలు చేసినా చేయనివాడితో సమానం. చివరకు తాను చేసిన ధర్మాలే తనకు సహాయం చేస్తాయి. కాని మిగిలినవేవి తోడురావు. తెలియక చెడిపోయిన కాలము పోని, తెలిసి ఇంకా ఎందుకు చెడిపోవాలి ? అడవిలో స్వచ్ఛందంగా మొలచిన ఏ ఆకులతోనో, దుంపలతోనో ఆకలి తీర్చుకోవచ్చు. కాని ఈపాడు పొట్టకోసం ఇంత పాపం ఎవరైనా చేస్తారా ? ఆహా ! యెంతమాట అన్నారు. అని అనఁ గా గద్దవిని కోపం తెచ్చుకోకండి.

కొత్తగా వచ్చిన వారిస్వభావం ఎలా తెలుస్తుంది ? అప్పుడు తెలియక అన్న మాటను తప్పుగా అనుకోకు. పోయినమాట పోని. నీవు ఇకపై ఇష్టం వచ్చినట్లు రావచ్చు, బోవచ్చు, ఇక్కడ ఉండవచ్చు. నీకు ఎటువంటి ఆటంకం లేదని చెప్పింది. తరువాత పిల్లి గద్దతో చాలా స్నేహంగా ఉంటూ ఆ చెట్టు తొర్రలో నివసించేది.

ఇలా కొన్ని రోజులు గడచిన తర్వాత పిల్లి ప్రతి రోజు అర్ధరాత్రి చప్పుడు చేయకుండా చెట్టు ఎక్కి పక్షి పిల్లల గొంతు కొరికితెచ్చి తొర్రలో పెట్టుకొని తినేది. అక్కడి పక్షులు తమపిల్లలు కనిపించకపోవడంతో చాలా బాధపడి వెతకడం ప్రారంభించాయి. అది తెలుసుకున్న పిల్లి అక్కడినుండి వెళ్ళిపోయింది. ఆపక్షులు వెతుకుతూ ఆ ముసలి గద్ద ఉండే తొర్రలో తమ పిల్లల ఎముకలు, ఈకలు ఉండటం చూసి ఈ గద్దయే తమ పిల్లలను తిన్నదని భావించి దానిని గోళ్లతో రక్కి ముక్కులతో పొడిచి చంపాయి. కాబట్టి కొత్తగా వచ్చినవారిని నమ్మరాదని కాకి జింకకు చెప్పింది. అనగా విని నక్క కాకిని మిక్కిలి కోపంతో చూసి ఇలా అన్నది.

మృగ, కాక, జంబుకముల కథ : “మొదటి సారి చూసినప్పుడు నీవు కూడా కొత్త వాడివే కదా, మరి మీ మధ్య స్నేహం ఎలా పెరిగింది. నీకు ఎదురు చెప్పేవారు లేరు కాబట్టి నోటికొచ్చినట్లు నీతులు చెప్తున్నావు. మేధావులు లేనిదగ్గర చిన్న తెలివైన వారుకూడా మేధావులుగా గౌరవాన్ని పొందుతారు. చెట్లు లేని దగ్గర ఆముదం చెట్టే మహావృక్షంగా అనిపిస్తుంది. వీడు నావాడు, వీడు పరాయివాడు అని కొంచెపు బుద్ధిఉన్నవారే అనుకుంటారు. మహాత్ములైనవారికి లోకమంతా తనకుటుంబమే. ఈ జింక నాకు బంధువు ఐనట్లు నీవు కాదా ? మనం ప్రపంచమున్నన్ని రోజులు బతుకుతామా? యముడు చంపడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

బతికినంత కాలం అందరితో మంచివాడని పించుకోవాలి గాని ఇలా విషపు భావన అవసరమా?” అని నక్క అనగానే జింక ఇలా అన్నది. ఈ మాటలన్నీ ఎందుకు మనందరం కలిసి మెలిసి ఉంటూ కాలక్షేపంచేద్దాం. వీళ్ళకు వీళ్ళు మిత్రులు, వీళ్ళకు వీళ్ళు శత్రువులు అనే నియమం ఏమిలేదు. ప్రవర్తన కారణంగానే మిత్రులు, శత్రువులు అవుతారు. అనగానే కాకి అలాగేనని చెప్పింది. ఆ మూడు చాలా రోజులు స్నేహంగా జీవించాయి. ఒకరోజు నక్క జింకతో మిత్రమా! ఈ వనం దగ్గరలో మంచిగా పండిన పొలమును నేను చూశాను.

నీవు నావెంట వస్తే నీకు చూపిస్తానని చెప్పి తనతో తీసుకువెళ్ళింది. ఆ రోజునుండి జింక ప్రతిరోజు ఆ పొలానికి వెళ్లి మేయడం ప్రారంభించింది. ఒకరోజు ఆ పొలం యజమాని దానిని గమనించి ఆ జింకను ప్రాణంతో విడవకూడదని భావించి, రహస్యంగా ఒక వలను పెట్టి ఇంటికి పోయాడు. ఎప్పటిలాగానే జింక మేయడానికి వెళ్లి ఆవలలో చిక్కుకుంది. అయ్యో! తెలియక వచ్చి ఈ వలలో చిక్కుకున్నాను కదా. నన్ను ఈ ప్రమాదం నుండి రక్షించేవారెవరున్నారు అని ఆలోచించ సాగింది. ఇప్పుడు నా మిత్రుడైన నక్క వస్తే నన్ను రక్షిస్తాడని అనుకుంటుండగా నక్క వచ్చింది. జింకను చూసి ఇన్ని రోజులకు నా ప్రయత్నము ఫలించిందని నక్క లోలోపల సంతోషించింది. ఇప్పుడు ఆ పొలం యజమాని వస్తే దీన్ని చంపకమానడు.

దీని రక్తమాంసాలతో నేను పండగ చేసుకోవచ్చునని మనసులో అనుకొని ఆ జింక దగ్గరికి వెళ్ళింది. నక్కను చూసిన జింక మిత్రమా త్వరగా వచ్చి ఈ వల తాళ్ళను కొరికి నన్ను రక్షించు. అనగానే నక్క ఇంకా దగ్గరికి వెళ్లి అయ్యో ! ఈ వల పేగులు, నరములతో చేసినది. ఈ రోజు ఆదివారము, నేను నరములను పంటితో తాకలేను. నన్ను మరోరకంగా అనుకోకు. ఇంక వేరే ఏ పనైనా చేస్తానని చెప్పింది.

సాయంకాలం అవుతున్నా తన మిత్రుడు ఇంకా ఇంటికి రాకపోయే సరికి కాకి వెతుకుతూ ఆ పొలం దగ్గరికి వచ్చింది. అక్కడ వలలో చిక్కుకున్న జింకను చూసి అయ్యో! మిత్రుడా ఇది ఎలా జరిగిందని అడిగింది. మిత్రుని మాట వినని దానికి ఇది ప్రతిఫలము అని. చెడుకాలం వచ్చిన వారికి మంచివారి మాటలు చెవికెక్కవని జింక చెప్పింది. దానికి కాకి మరి నక్క ఎక్కడికి పోయిందని అడగగా నామాంసము తినవలెనని ఇక్కడే ఎక్కడో కాచుకొని ఉండవచ్చునని జింక తెలిపింది. నేను ముందే హెచ్చరించాను. నామాట వినక పోతివి. నేను ఇతరులకు చెడు చేయడం లేదు కాబట్టి నాకు ఎవరూ చెడు చేయరు అని భావించడం మంచిది కాదు.

మంచి వారికి కూడా చెడ్డవారితో అపాయం ఉంటుంది. పోగాలము వచ్చినవారు దీపం ఆరిపోతే వచ్చే వాసనను గుర్తించలేరు. అరుంధతీ నక్షత్రాన్ని చూడలేరు. మిత్రులమాటలు వినరని పెద్దలు చెప్తారు. ముందర మంచి మాటలు చెప్పి వెనుక మోసం చేసే మిత్రుడు పయోముఖ విషకుంభము వంటివాఁడు. వారితో స్నేహాన్ని వెంటనే మానుకోవాలి. అనఁగానే జింక ఒక నిట్టూర్పు విడిచి “సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయములు, దుర్జన సాంగత్యం వల్ల సర్వానర్థాలు కలుగుతాయి అనడానికి ఇదే నిదర్శనం. ఆ జిత్తులమారి నక్క

చెప్పిన తేనెమాటలకు మోస పోయాను. మాటల్లో తీపి చూపి లోపల విషముంటదని ఉహించలేదని జింక అంటుండగానే, ఆ పొలం యజమాని రావడాన్ని చూసి, కాకి ఇప్పుడు ఎదో ఒక ఉపాయం ఆలోచించకపోతే కష్టమవుతుంది. ఆ పొలం యజమాని కర్ర తీసుకొని యమునిలాగా వస్తున్నాడు. నాకొక ఉపాయము తోచింది. నువ్వు ఊపిరి బిగబట్టి, కడుపు ఉబ్బించి. కాళ్ళు చాపి, చచ్చినట్లు కదలకుండా బిగుసుకొని పడుకో. నేను నీ పైన కూర్చొని నీ కళ్ళను పొడిచినట్లు కూర్చుంటాను. సమయం చూసి నేను అరుస్తాను.

నువ్వు వెంటనే లేచి పారిపో అని చెప్పింది. జింక అలానే పడుకుంది, తరువాత దగ్గరికి వచ్చిన పొలం యజమాని జింకను చూసి, చనిపోయిందనుకొని, వలను విడిచాడు. వెంటనే కాకి కూసింది. అదివిని జింక లేచి పరిగెత్తింది. అయ్యో! ఈ జింక నన్ను మోసం చేసిందని కోపగించుకున్న పొలం యజమాని తన చేతిలోని కర్రను గట్టిగా విసిరాడు. దైవికంగా ఆ దెబ్బ తగిలి నక్కచచ్చింది. చూడండి నక్క ఏమనుకున్నది, అక్కడ ఏమి జరిగింది. పరులకు హాని చేయాలని చూస్తే తమకే హాని కలుగుతుంది అని విష్ణుశర్మ రాజకుమారులకు తెలిపాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 3rd Poem జ్ఞానబోధ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 3rd Poem జ్ఞానబోధ

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
సిద్ధప్ప జ్ఞానబోధలోని నీతులు వివరించండి. (V.Imp) (M.P)
జవాబు:
నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండని చెప్తూ వరకవి సిద్ధప్ప తన జ్ఞానబోధలో నీతులను వివరించాడు. కుమ్మరి చేసే కుండల్లో కొన్ని చేస్తున్నప్పుడు, కొన్ని సారెమీద, కొన్ని తెలియకుండానే పగిలిపోతాయి. కొన్ని ఆవములో పగలగా కొన్ని మాత్రమే మంచిగా తయారై కొన్ని రోజులు ఉపయోగపడిన తరువాత పగిలిపోతాయి.

అలాగే మానవులు కూడా మర్యాదతో ప్రవర్తిస్తేనే ఈ భూమిపై మోక్షాన్ని పొందుతారు. కోపంతో మానవత్వం పోతుంది. కోపం నష్టపరుస్తుంది, పాపం పెరిగేలా చేస్తుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను అవమానపరుస్తుంది. కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. కాబట్టి కోపానికి దూరం ఉండాలని చెప్పాడు.

డబ్బు ఉన్నవారిని గౌరవిస్తారు. కాని పేదవారి గుర్తించరు. సమయం ఎప్పటికీ ఒకే విధంగా గడవదు. నేనే బలవంతుణ్ణి అని గర్వించడం సరికాదు. చలిచీమలు కూడా పామును చంపుతాయి. కాబట్టి ఎదుటి వారి ముందు గొప్పలు చెప్పుకోవద్దు. కుండవంటి ఈ శరీరాన్ని నమ్మరాదు. తొమ్మిది రంధ్రాలున్న ఇల్లు ఇది. బతుకమ్మలాగా ఎప్పుడైనా నీటిలో ప్రవేశించవచ్చు. చనిపోయిన తరువాత తల్లి, తండ్రి, బంధువులు ఎవరూ తిరిగి చూడరు. మరిచిపోతారు. కాటికి వెళ్ళేటపుడు ఒక్క కాసుకూడా వెంటరాదు.

సంసారం అంతా అబద్ధం అని తెలియక పప్పు తినడానికి వెళ్ళిన ఎలుక లాగ అనేక రకాలుగా డబ్బును సంపాదిస్తుంది. ఆస్తులు, కులం, అధికారం, సంసారం ఇలా అనేక విషయాలపై మోహంతో భక్తి లేక ఉన్నతమైన మానవ జన్మ ఎత్తి కూడా చేప గాలాన్ని మింగినట్లు మనుషులు సంసారమనే మాయలో పడి యమధర్మరాజు చేతికి చిక్కి బాధపడతారు.

వేదాలు తెలిసిన వేమన తాతలాంటి వాడు. సురలను ఆనందింపచేసే సుమతి శతక కర్త బద్దెన పెద్దమ్మ వంటి వాడు. కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మం తండ్రి లాంటి వారు. ఈశ్వరమ్మ అక్క లాంటిది. సిద్ధప్ప అన్న వంటి వాడు. కాళిదాసు మా చిన్నన్న. అమరసింహుడు, యాగంటి ఆత్మ బంధువుల వంటి వారు. వీరంతా చనిపోయికూడా జనాల హృదయాలలో బతికే ఉన్నారు. వారిలాగా లోక కళ్యాణం కోసం జీవించాలి.

నాలుక తండ్రి పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్ద నాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు.

చేదుగా ఉన్న ఆనగపు కాయను చేతిలో పట్టుకొని గంగానదిలో స్నానం చేసి దాని రుచిచూస్తే అంతకు ముందు ఉన్న చేదు రుచి పోదు. లేని తీపి రుచి రాదు. ఆ సొరకాయలాగా మానవులు కూడా గంగలో మునిగి తేలితే వారి మూర్ఖత్వం పోదు. ఎన్ని నదుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని వ్రతాలు పట్టినా పాపాత్ములు మోక్ష పదవిని అలంకరించలేరు. వంకరగా ఉన్న కుక్క తోకకు వెదురు కర్రలు ఎంత లాగి కట్టినా దాని వంకర గుణం పోదు. గురువును మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చు.

ఎవరైతే తన ఆత్మను పరమాత్మతో సమానంగా భావించి, అన్ని జీవులను సమానంగా చూసి జ్ఞాన వైరాగ్యాలనే యజ్ఞాన్ని, దానాలను, తపస్సులను చేస్తారో వారు మోక్షాన్ని పొందుతారు. తామరాకులు నీటిలో ఉండి కూడా తడవకుండా ఉన్నట్లుగానే భూమిపై జీవిస్తున్న జ్ఞానులు కూడా అలసిపోయినట్లు, కళా విహీనంగా కనిపిస్తారు. కాని తరువాత వారి ముఖంలో కళ వస్తుందని సిద్దప్ప నీతులను చెప్పాడు.

ప్రశ్న 2.
జ్ఞానబోధ పాఠ్యాంశ సందేశాన్ని తెలియజేయండి. (V. Imp)
జవాబు:
నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండని చెప్తూ వరకవి సిద్ధప్ప తన జ్ఞానబోధను రచించాడు. దీనిలో మానవులకు కావలసిన సందేశాన్ని ఇచ్చాడు. కుమ్మరి చేసిన కుండలన్ని ఎలా అయితే పనికిరావో అలానే మానవులు అందరూ మోక్షాన్ని పొందలేరని చెప్పాడు. కేవలం మర్యాదతో మంచి పనులు చేసినవారే మోక్షాన్ని పొందుతారు.

కోపం వల్ల డబ్బు, పరువు, ఆరోగ్యం అన్ని నశిస్తాయి. కోపం కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. కాబట్టి కోపానికి దూరం ఉండాలని హితవు పలికాడు. ఏళ్ల కాలం ఒక్క తీరుగా గడవదు. ఎత్తుగా, పొడువుగా, లావుగా, ఎర్రగా ఉన్నప్పటికీ గొడ్డలి దెబ్బకు చెట్టు కూలుతుంది. కాబట్టి తెలివిగలవారు, పుణ్యం సంపాదించుకున్నవారు తమ ప్రజ్ఞను గురించి ఎదుటివారి ముందు చెప్పుకోకూడదనే సందేశాన్ని ఇచ్చాడు.

కుండవంటి ఈ శరీరాన్ని నమ్మరాదు. తొమ్మిది రంధ్రాలున్న ఇల్లు ఇది. బతుకమ్మలాగా ఎప్పుడైనా నీటిలో ప్రవేశించవచ్చు. కాటికి వెళ్ళేటపుడు ఒక్క కాసుకూడా వెంటరాదు. సంసారం అంతా అబద్ధం అని తెలియక పప్పు తినడానికి వెళ్ళిన ఎలుక లాగ అనేక రకాలుగా డబ్బును సంపాదిస్తుంది. ఆస్థులు శాశ్వతమని భావించరాదు.

ప్రజలు సంసారంపై గల కోరికను వదిలిపెట్టక, తిండి బట్టలకు అలవాటుపడి మా కులమే గొప్పది అనుకుంటూ గర్వాన్ని ప్రదర్శిస్తారు. అలా ఉంటే ఉన్నతమైన మానవ జన్మ ఎత్తి కూడా చేప గాలాన్ని మింగినట్లు మనుషులు సంసారమనే మాయలో పడి యమధర్మరాజు చేతికి చిక్కి బాధపడతారని హెచ్చరించాడు.

వేమన, బద్దెన, వీరబ్రహ్మంగారు, ఈశ్వరమ్మ, సిద్ధప్ప, కాళిదాసు, అమరసింహుడు, యాగంటి మొదలైన మహానుభావులు కవికి ఆత్మ బంధువుల వంటివారని చెప్పడం ద్వారా వారిలాగా ప్రజల మేలు కొరకు జీవించాలని సూచించాడు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపాడు. వంకరగా ఉన్న కుక్క తోకకు వెదురు కర్రలు ఎంత లాగి కట్టినా దాని వంకర గుణం పోదు. జ్ఞానం లేని వానికి ఒక పుస్తకం ఇచ్చి జ్ఞానవంతునిగా చేయగలవాడే నిజమైన జ్ఞాన సంపన్నుడు.

ఊపిరిని బిగపట్టి శరీరం పైకి లేచేలా చేయవచ్చు. ప్రతీ గడియకు ఒక వేషం వేయవచ్చు. అన్న -పానాలు లేకుండా అడవిలో తిరగవచ్చు. నీళ్ళలో కప్పలాగా ప్రయత్నం చేసి పైకి తేలవచ్చు. బలంగా వెయ్యి సంవత్సరాలు బతకవచ్చు. ప్రతీగ్రామం తిరిగి ఉపన్యాసాలు ఇవ్వవచ్చు. మోసపూరితమైన వారి మనస్సును మార్చవచ్చు. భూమిపై ఎన్నో వేషాలు వేయవచ్చు. గురువును మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చు. ఎవరైతే తన ఆత్మను పరమాత్మతో సమానంగా భావించి, అన్ని జీవులను సమానంగా చూసి జ్ఞాన వైరాగ్యాలనే యజ్ఞాన్ని, దానాలను, తపస్సులను చేస్తే మోక్షాన్ని పొందుతారు.

తామరాకులు నీటిలో ఉండి కూడా తడవకుండా ఉన్నట్లుగానే భూమిపై జీవిస్తున్న జ్ఞానులు కూడా అలసిపోయినట్లు, కళా విహీనంగా కనిపిస్తారు. కాని తరువాత వారి ముఖంలో కళ వస్తుంది. వారు ఒకరిని తిట్టి, మరొకరిని మెచ్చుకోరు. వారు ఎల్లప్పుడూ సుఖాన్ని దుఃఖాన్ని ఒకే విధంగా చూస్తారని సందేశాన్ని ఇచ్చాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
“కోపమంత చేదు ఫలము లేదు” వివరించండి ?
జవాబు:
కోపంతో మానవులు మానవత్వాన్ని కోల్పోతారు. కోపం మానవులను నష్టపరుస్తుంది. కోపం వల్ల పాపం పెరుగుతుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను తగ్గిస్తుంది అవమానపరుస్తుంది. కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను నాశనం చేస్తుంది. కాబట్టి కోపానికి దూరం ఉండాలని భావం.

ప్రశ్న 2.
బుద్ధిమంతులు ఎలా ఉంటారు ?
జవాబు:
డబ్బు ఉన్నవారికి కుర్చీలు ఇస్తారు కాని పేదవాడు కూర్చోవడానికి కనీసం చెక్కపీటను కూడా ఇవ్వరు. సమయం ఎప్పటికీ ఒకే విధంగా గడవదు. ఒక్కోసారి దోమ కూడా ఏనుగును ఎత్తుతుంది. నేనే బలవంతుణ్ణి అని గర్వించడం సరికాదు. చిన్న చలిచీమలు కూడా పామును చంపడం సాధ్యమే కదా. ఎత్తుగా, పొడువుగా, లావుగా, ఎర్రగా ఉన్నప్పటికీ గొడ్డలి దెబ్బకు చెట్టు కూలుతుంది కదా. కాబటి బుద్ధిమంతులు, పుణ్యం సంపాదించుకున్నవారు తమ ప్రజ్ఞను గురించి ఎదుటివారి ముందు చెప్పుకోరు.

ప్రశ్న 3.
సిద్ధప్ప తన ఆత్మ బంధువులుగా ఎవరిని భావించాడు ?
జవాబు:
వరకవి సిద్ధప్ప వేదాలు తెలిసిన వేమన మా తాతలాంటి వాడు. సురలను ఆనందింప చేసే సుమతి శతక కర్త బద్దెన మా పెద్దమ్మ వంటి వాడు. కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మం గారు తండ్రి లాంటి వారు. బ్రహ్మం గారి మనుమరాలు ఈశ్వరమ్మ అక్క లాంటిది. బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధప్ప అన్న వంటి వాడు. సంస్కృత కవి కాళిదాసు మా చిన్నన్న. అమర కోశం రాసిన అమరసింహుడు, యాగంటి ఆత్మ బంధువుల వంటి వారు. వీరంతా చనిపోయికూడా జనాల హృదయాలలో బతికే ఉన్నారు అని చెప్పాడు. వీరందరూ వరకవి సిద్దప్పకు ఆదర్శప్రాయులని సూచించాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

ప్రశ్న 4.
శరీర అవయవాలను సిద్ధప్ప ఏమని భావించాడు ?
జవాబు:
నాలుక నాకు తండ్రి, పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్దనాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత అన్నాడు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలి అని కవి భావం.

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు (V. Imp) (Model Paper)

ప్రశ్న 1.
వరకవి సిద్ధప్ప ఎప్పుడు జన్మించాడు ?
జవాబు:
జూలై 9, 1903

ప్రశ్న 2.
వరకవి సిద్ధప్పకు ఏయే విద్యలలో ప్రావీణ్యం ఉన్నది?
జవాబు:
జ్యోతిష్యం, ఆయుర్వేదం, వాస్తు యోగ విద్యల్లో

ప్రశ్న 3.
కుండలను చేసేది ఎవరు ?
జవాబు:
కుమ్మరి

ప్రశ్న 4.
ఒక్కరీతిగా నడవనిది ఏది ?
జవాబు:
కాలం

ప్రశ్న 5.
బతుకమ్మలాగ నీటిలో మునిగి ముగిసేది ఏది ?
జవాబు:
తొమ్మిది రంధ్రాల మానవ శరీరం

ప్రశ్న 6.
చేప దేనిని మింగుతుంది ?
జవాబు:
గాలాన్ని

ప్రశ్న 7.
సుఖదుఃఖాలను ఒకే విధంగా చూసేదెవరు ?
జవాబు:
సుజ్ఞానులు

ప్రశ్న 8.
వెళ్ళిపోయేనాడు వెంటరానిది ఏమిటి ?
జవాబు:
ఒక కాసు కూడా రాదు

IV. సందర్భసహిత వ్యాఖ్యలు

1. ఐక్యమయ్యెదరు నిటులు అవని విడిచి ★(Imp)

కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.

సందర్భం : కుమ్మరి చేసే కుండల్లో కొన్ని చేస్తున్నప్పుడే పాడైపోతాయి. కొన్ని సాకెమీద పాడవుతాయి. కొన్ని తెలియకుండానే పగిలిపోతాయి. కొన్ని ఆవములో పెట్టి కాల్చినప్పుడు పగిలిపోతాయి. కొన్ని మాత్రం క్షేమంగా తయారై కొన్ని రోజులు ఉపయోగపడిన తరువాత పగిలిపోతాయి. నీటిలో పడి కొన్ని పోతాయి. అంత్యక్రియలలో కొన్ని పగిలిపోతాయి. అలాగే మానవులు కూడా మర్యాదతో ప్రవర్తిస్తేనే ఈ భూమిని వదిలి మోక్షాన్ని పొందుతారని వరకవి సిద్ధప్ప చెప్పిన సందర్భంలోనిది.

అర్థం : దైవంలో ఐక్యమవుతారని అర్థం

వివరణ : కుమ్మరి చేసిన కుండలన్నీ ఉపయోగపడనట్లే మానవులందరూ మోక్షాన్ని పొందలేరని భావం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

2. కోపము నరుని సాంతము కూల్చునిలను

కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.

సందర్భం : కోపంతో మానవులు మానవత్వాన్ని కోల్పోతారు. కోపం మానవులను నష్టపరుస్తుంది. కోపం వల్ల పాపం పెరుగుతుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను అవమానపరుస్తుంది. కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను పూర్తిగా నాశనం చేస్తుందని వరకవి చెప్పిన సందర్భంలోనిది. (కాబట్టి)

అర్థం : కోపం మానవులను పూర్తిగా నాశనం చేస్తుందని అర్థం.

వివరణ : కోపానికి దూరం ఉండాలని భావం.

3. నాలుకయు మాకు నిలవేల్పునాది శక్తి

కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.

సందర్భం : నాలుక తండ్రి, పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్దనాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత అని వరకవి సిద్దప్ప చెప్పిన సందర్భంలోనిది.

అర్థం : నాలుక మాకు ఇంటి దేవత అయిన ఆదిశక్తితో సమానం అని అర్థం.

వివరణ : జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలి అని భావం.

4. గురుని మదిలోన నిల్పుట గుర్తువచ్చు

కవి పరిచయం : సిద్దిపేట జిల్లాకు చెందిన వరకవి సిద్ధప్ప రాసిన “సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని” అనే గ్రంథం నుండి తీసుకున్న “జ్ఞానబోధ” అనే పాఠ్యాంశం లోనిది ఈ వాక్యం. వరకవి సిద్ధప్ప నలభైకి పైగా పుస్తకాలు రాశాడు.

సందర్భం : ఊపిరిని బిగపట్టి శరీరం పైకి లేచేలా చేయవచ్చు. ప్రతీ గడియకు ఒక వేషం వేయవచ్చు. అన్న పానాలు లేకుండా అడవిలో తిరగవచ్చు. జపమాలను సరిగ్గా తిప్పవచ్చు. నీళ్ళలో కప్పలాగా ప్రయత్నం చేసి పైకి తేలవచ్చు. బలంగా వెయ్యి సంవత్సరాలు బతకవచ్చు. ప్రతీగ్రామం తిరిగి ఉపన్యాసాలు ఇవ్వవచ్చు. మోసపూరితమైన వారి మనస్సును మార్చవచ్చు. భూమిపై ఎన్నో వేషాలు వేయవచ్చు. గురువును మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చునని వరకవి సిద్ధప్ప చెప్పిన సందర్భంలోనిది.

అర్థం : గురువును మనస్సులో నిలిపితే మనకు గుర్తింపు వస్తుందని అర్థం.

వివరణ : గురువును నమ్ముకుంటే అసాధ్యాలను సుసాధ్యాలు చేసి పేరు పొందవచ్చునని భావం.

పద్యములు – ప్రతిపదార్థ తాత్పర్యములు

1వ పద్యం :

సీ ||
కుమ్మరాతడు జేయు కుండలు నవికొన్ని
చేయుచుండగ బోవు చేతిలోన
కొన్ని సానముమీద కొన్ని చాటునబోవు
కాలి నావము కొన్ని కూలిపోవు
కొన్ని క్షేమము బొంది కొన్నాళ్లకును బోవు
కొన్ని భిన్నములయ్యి కొంతబోవు
కొన్ని యుర్విలొ బోవు కొన్ని వనమున బోవు
కొన్ని మృతికి బోవు కొరివి నుండి
తే.గీ॥ మానవులు మరియాదతో మంచిరీతి
ఐక్యమయ్యెదరు నిటుల అవని విడిచి
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప.

ప్రతిపదార్థం :

మా + అప్ప వినుడి = మా నాయనలారా!(సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
కుమ్మరి + అతడు = కుండలు చేసే వారు
చేయు కుండలున్ + అవి = చేసే కుండలలో
కొన్ని సానముమీద = కొన్ని కుండలు చేసే సారె (సానె) మీద
కొన్ని = కొన్ని
చేయుచుండగన్ = = తయారు చేస్తుండగానే
చేతిలోన పోవు = చేతిలోనే
కొన్ని చాటునబోవు = కొన్ని తెలియకుండా పగిలి పోతాయి
కాలిన + ఆవము = కాల్చే ఆవము (బట్టి) లో
కొన్ని కూలిపోవు = కొన్ని పగిలి పోతాయి
కొన్ని క్షేమము బొంది = కొన్ని మంచిగా తయారై
కొన్నాళ్లకు బోవు = కొన్ని రోజులు ఉండి
కొన్ని భిన్నములయ్యి = కొన్ని పగిలిపోయి
కొంతబోవు = కొన్ని పగిలిపోతాయి
కొన్ని యుర్విలొ బోవు = కొన్ని నేలపై పడి పగిలి పోవును
కొన్ని వనమున బోవు = కొన్ని నీటిలో పగిలి పోతాయి
కొరివి నుండి = తల కొరివి పెట్టినప్పుడు
కొన్ని మృతికి బోవు = కొన్ని పగిలిపోతాయి.
మానవులు = మనుషులు
మరియాదతో = మర్యాదపూర్వకంగా
మంచిరీతి = మంచి రీతితో
ఇటల = ఈ విధంగా
అవని = భూమిని
విడిచి = వదిలిపెట్టి
ఐక్యమయ్యెదరు = కలిసిపోతారు (మోక్షం పొందుతారు)

తాత్పర్యం: నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. కుమ్మరి చేసే కుండల్లో కొన్ని చేస్తున్నప్పుడే పాడైపోతాయి. కొన్ని సారెమీద పాడవుతాయి. కొన్ని తెలియకుండానే పగిలిపోతాయి. కొన్ని ఆవములో పెట్టి కాల్చినప్పుడు పగిలిపోతాయి. కొన్ని మాత్రం క్షేమంగా తయారై కొన్ని రోజులు ఉపయోగపడిన తరువాత పగిలిపోతాయి. కొన్ని భూమిపై పడిముక్కలై పోతాయి. నీటిలో పడి కొన్ని పోతాయి. అంత్యక్రియలలో కొన్ని పగిలిపోతాయి. అలాగే మానవులు కూడా మర్యాదతో ప్రవర్తిస్తేనే ఈ భూమిని వదిలి మోక్షాన్ని పొందుతారు. (మంచి పనుల ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకోవాలని భావం).

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

2వ పద్యం :

సీ|| కోపంబుచే నరుల్ క్రూరాత్ములగుదురు
కోపంబు మనుషుల కొంప ముంచు
కోపంబు వలననె పాపంబులును హెచ్చు
కోపంబు ననె నిందగూడవచ్చు
కోపంబు తనచావు కొంచెంబు నెరగదు
కోపంబు మిత్రులన్ కొంచపరచు
కోపంబు హెచ్చినన్ శాపంబులున్ వచ్చు
కోపంబు జూడగాకొరివియగును.
తే.గీ॥ కోపము నరుని సాంతము కూల్చునిలను
లేదు వెదికిన యిటువంటి చేదుఫలము
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప వినుడి = మా నాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
కోపంబుచే = కోపంతో
నరుల్ = మానవుల
క్రూర + ఆత్ములగుదురు = మానవత్వ౦ లేని వారుగా మారుతారు
కోపంబు = కోపమే
మనుషుల = మానవుల
కొంప ముంచు(జాతీయం) = కొంపలు ముంచుతుంది, నష్టపరుస్తుంది
కోపంబు వలననె = కోపం వల్ల
పాపంబులును హెచ్చు = పాపాలు పెరుగుతాయి
కోపంబుననే = కోపంతోనే
నింద గూడవచ్చు = నిందలు కూడా వస్తాయి
కోపంబు = కోపం
తన చావున్ = తన చావును
కొంచెంబున్ + ఎరుగదు = కొంచెం కూడా ఎరుగదు
కోపంబు = కోపం
మిత్రులన్ = స్నేహితులను
కొంపరచు = తగ్గిస్తుంది (అవమాన పరుస్తుంది)
కోపంబు హెచ్చినన్ = కోపం పెరిగితే
శాపంబులున్ వచ్చు = శాపాలు వస్తాయి
కోపంబు జూడగా = చూస్తుండగానే కోపం
కొరివియగును = పెద్ద ఆపదగా మారుతుంది
కోపము = కోపం
నరుని = మానవులను
సాంతము కూల్చున్ = పూర్తిగా నాశనం చేస్తుంది
ఇలను = భూమిపై
లేదు వెదికిన = వెతికినా దొరకదు
యిటువంటి = దీనివంటి
చేదుఫలము (జాతీయం) – చేదుగా ఉండే ఫలం, చెడు చేసేది

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. కోపంతో మానవులు మానవత్వాన్ని కోల్పోతారు. కోపం మానవులను నష్టపరుస్తుంది. కోపం వల్ల పాపం పెరుగుతుంది. కోపం వల్ల నిందలు వస్తాయి. కోపం ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కోపం స్నేహితులను తగ్గిస్తుంది. (అవమానపరుస్తుంది.) కోపంతో శాపాలు వస్తాయి. చూస్తుండగానే కొరివిగా మారి మానవులను పూర్తిగా నాశనం చేస్తుంది. (కాబట్టి కోపానికి దూరం ఉండాలని భావం.)

3వ పద్యం :

సీ||
విత్తంబు గలవారి కిత్తురే కుర్చీలు
పేదవారికియరు పీటచెక్క
కాలంబు నొకరీతి గడవ దెల్లప్పుడు
యేనుగు దోమచే యెత్తబడద
నేనే బలియుడని నిక్కుచునుంటేమి
చలిచీమలు ఫణుల జంపలేద
నిడివి పొడవు దొడ్డు నెట్టగ నుంటేమి
గొడ్డలిచే మాను కోలుపోద
తే.గీ॥ బుద్ధిమంతులు పుణ్యంపు పురుషులైన
వారు పదిమందిలో ప్రజ్ఞ బలుకబోరు
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం:

మా + అప్ప = మా నాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్దప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్దప్ప రాసిన కవిత్వమును)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
విత్తంబు గలవారికి = డబ్బు ఉన్న వారికి
ఇత్తురే కుర్చీలు = కుర్చీలను ఇస్తారు
పేదవారికి = డబ్బు లేని పేదవారికి
పీటచెక్క = చెక్క పీట కూడా ఇవ్వరు
ఇయర = ఇవ్వరు
కాలంబున్ = సమయమంతా
ఒకరీతి = ఒకే విధంగా
గడవదు + ఎల్లప్పుడు = ఎప్పటికి నడవదు
యేనుగు = ఏనుగు
దోమచే = దోమతో
యెత్తబడద = ఎత్త బడుతుంది
నేనే బలియుడన్ + అని = నేనే బలవంతుణ్ణి అని
నిక్కుచునుంటే + ఏమి = గర్వాన్ని ప్రదర్శిస్తే ఏం లాభం
చలిచీమలు = చిన్న చీమలు కూడా
ఫణుల = పాములను
జంపలేద = చంపాయి కదా
నిడివి పొడవు = ఎత్తు, పొడువు
దొడ్దున్ = లావు
ఎఱ్ఱగన్ = మంచి రంగు
ఉంటేమి = ఉన్నా కాని
గొడ్డలిచే = గొడ్డలితో
మాను = చెట్టు
కోలుపోద = ప్రాణం పోతుంది కదా
బుద్ధిమంతులు = తెలివి గలవారు
పుణ్యంపు = పుణ్యం సంపాదించుకున్న
పురుషులు +అయినవారు = మానవులు
పదిమందిలో = అందరి ఎదురుగా
ప్రజ్ఞ = తమ తెలివిని
బలకబోర = చెప్పుకోరు

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. డబ్బు ఉన్నవారికి కుర్చీలు ఇస్తారు కాని పేదవాడు కూర్చోవడానికి కనీసం చెక్క పీటను కూడా ఇవ్వరు. సమయం ఎప్పటికీ ఒకే విధంగా గడవదు. ఒక్కోసారి దోమ కూడా ఏనుగును ఎత్తుతుంది. నేనే బలవంతుణ్ణి అని గర్వించడం సరికాదు. చిన్న చలిచీమలు కూడా పామును చంపడం సాధ్యమే కదా. ఎత్తుగా, పొడువుగా, లావుగా, ఎర్రగా ఉన్నప్పటికీ గొడ్డలి దెబ్బకు చెట్టు కూలుతుంది కదా. కాబట్టి తెలివిగలవారు, పుణ్యం సంపాదించుకున్నవారు తమ ప్రజ్ఞను గురించి ఎదుటివారి ముందు చెప్పుకోరు.

4వ పద్యం :

సీ|| నమ్మరాది ఘటము నవరంధ్రముల కొంప
బతుకమ్మవలె నీళ్ళబడును యెపుడొ
యుర్విలో నున్నాళ్ళు ఉయ్యాలలును బాడి
పొయ్యెద రొకరోజు శయ్యమీద
తల్లి యెవ్వరు తండ్రి తన బాంధవులెవరు
మళ్ళి జూడక నరుల్ మరుతురయ్య
వెళ్ళిపోయెడినాడు వెంట రాదొక కాసు
కల్ల సంసారంబు గానలేక
తే.గీ॥ పప్పు దినబోయి చిక్కాన బడిన యెలుక
విధము నర్ధంబు చేకూర్చు వివిధ గతుల
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప = మా నాయనలారా ! (సంబోధన)
వినుడి = వినండి
వివాహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్ధప్ప = ఈ సిద్ధప్ప
విహితుడు + అప్ప = బంగారం వంటి
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
నమ్మరాదు + ఈ ఘటము = కుండ వంటి ఈ శరీరాన్ని నమ్మరాదు
నవరంధ్రముల కొంప = తొమ్మిది రంధ్రాలతో ఉన్న ఇల్లు
బతుకమ్మవలె = బతుకమ్మ లాగ
యెపుడొ = ఎప్పుడైనా
నీళ్ళబడును = నీటిలో పడుతుంది
యుర్విలోన్ + ఉన్నాళ్ళు = భూమిపై జీవించినంతకాలం
ఉయ్యాలలును బాడి = ఊయల పాటలు పాడి
శయ్యమీద = మరణ శయ్యపై, పాడెపై
పొయ్యెదరు + ఒకరోజు = ఒకరోజు వెళ్లిపోతారు
తల్లి = కన్నతల్లి
తండ్రి = కన్న తండ్రి
యెవ్వరు = ఎవరు కూడా
తన బాంధవులెవరు = బంధువులు, చుట్టాలు ఎవరూ
మళ్ళి జూడక = తిరిగి చూడరు
నరుల్ = మనుషులు
మారుతురయ్య = మర్చిపోతారు
వెళ్ళిపోయెడినాడు = కాటికి వెళ్ళే రోజు
ఒక్క కాసు = ఒక్క కాసు కూడా
వెంట రాదు = తన వెంబడి రాదు
కల్ల సంసారంబు = సంసారం అంతా అబద్ధమని
గానలేక = తెలియక
పప్పు దినబోయి = పప్పును తినడానికి వెళ్లి
చిక్కాన బడిన = బోనులో చిక్కిన
యెలుక విధమున్ = ఎలుక లాగ
వివిధ గతుల = అనేక రకాలుగా
అర్ధంబు చేకూర్చు = (ఈ శరీరం) డబ్బును సంపాదిస్తుంది.

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. కుండవంటి ఈ శరీరాన్ని నమ్మరాదు. తొమ్మిది రంధ్రాలున్న ఇల్లు ఇది. బతుకమ్మలాగా ఎప్పుడైనా నీటిలో ప్రవేశించవచ్చు. కాని భూమిపై ఉన్నంతకాలం ఊయల పాటలు పాడి ఏదో ఒకరోజు మరణశయ్యపై వెళ్ళిపోతుంది. చనిపోయిన తరువాత తల్లి, తండ్రి, బంధువులు ఎవరూ తిరిగి చూడరు. మరిచిపోతారు. కాటికి వెళ్ళేటపుడు ఒక్క కాసు కూడా వెంటరాదు. సంసారం అంతా అబద్ధం అని తెలియక పప్పు తినడానికి వెళ్ళిన ఎలుక లాగ అనేక రకాలుగా డబ్బును సంపాదిస్తుంది.

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

5వ పద్యం :

ఎత్తుమేడలు యిండ్లు యిరువైన సంపదల్
నిత్యమని జనులు నిహమునందు
మమకార మొదలక మదిలొ సద్గురువుని
గనలేక సంసార కాంక్ష విడక
కూటిగుడ్డకు మర్గి కులము నెక్కువ యంచు
యెత్తు పై గూర్చుండు హెచ్చునరులు
భక్తి హీనతగాను పావన భవులయ్యి
మీనంబు గాలమున్ మ్రింగు విధము
తే.గీ॥ మానవులు మాయసంసార మగ్నులగుచు
చిక్కెదరెముని చేతిలో చింతపడుచు
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప = మా నాయనలారా ! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్ధప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
ఎత్తుమేడలు = ఎత్తైన భవనాలు
యిండ్లు = ఇళ్ళు
యిరువైన సంపదల్ = స్థిరాస్తులు
నిత్యమని = శాశ్వతమని
జనులున్ = ప్రజలు
ఇహమునందు = భూమిపై
మమకారము + ఒదలక = ఇష్టాన్ని వదులుకోలేక
మదిలొ = మనసులో
సద్గురువుని = మంచి గురువును
గనక = చూడక, దర్శించక
సంసార కాంక్ష = సంసారంపై గల కోరిక
విడక = వదలక
కూటిగుడ్డకు = తిండికి, బట్టలకు
మర్గి (మరిగి) = అలవాటు పడి
కులము నెక్కువ యంచు = మా కులమే గొప్పది అని
హెచ్చునరులు = గర్వంతో ఉన్న నరులు
యెత్తు పై గూర్చుండు = ఎత్తులపై కూర్చొంటారు
భక్తి హీనతగాను = భక్తి లేని కారణంగా
పావన భవులయ్యి = మంచి జన్మ ఎత్తి కూడా
మీనంబు = చేప
గాలమున్ = గాలాన్ని
మ్రింగు విధము = మింగిన తీరుగా
మానవులు = మనుషులు
మాయసంసార = సంసారమనే మాయలో
మగ్నులగుచు = మునిగి
యముని చేతిలో = యమధర్మరాజు చేతికి
చింతపడుచు = బాధపడుతూ
చిక్కెదరు = చిక్కుకుంటారు

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. ఎత్తైన భవనాలు, ఇళ్ళు, స్థిరమైన ఆస్థులు శాశ్వతమని భావించి ప్రజలు ఈ భూమిపై ఇష్టాన్ని వదులుకోలేక, మనసులోనైన మంచి గురువును దర్శించక, సంసారంపై గల కోరికను వదిలిపెట్టక, తిండి బట్టలకు అలవాటుపడి మా కులమే గొప్పది అనుకుంటూ, ఎత్తైన ఆసనాలపై కూర్చుంటారు. భక్తి లేని కారణంగా ఉన్నతమైన మానవ జన్మ ఎత్తి కూడా చేప గాలాన్ని మింగినట్లు మనుషులు సంసారమనే మాయలో పడి యమధర్మరాజు చేతికి చిక్కి బాధపడతారు.

6వ పద్యం :

సీ|| వేమన్న మా తాత వేదవేద్యులు మాకు
సుమతి మా పెదతల్లి సురవినోది
వీరబ్రహ్మముగారు వినుడి నా జనకుండు
నింపుగా మాయక్క ఈశ్వరమ్మ
ననువుగా సిధ్ధప్ప నన్న గావలె నాకు
కడగొట్టు మాయన్న కాళిదాసు
అమరసింహుడు మాకు నాత్మబంధువులౌను
యాగంటివారు మాయన్న గారు
తే.గీ॥ ఆత్మబంధువులండి మా కంత వీరు
చచ్చిన బ్రతికియున్నారు జగతి యందు
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప = మా నాయనలారా ! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్దప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది.
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
వేదవేద్యులు = వేదాలు తెలిసిన
వేమన్న = వేమన శతకకర్త
మా తాత = మాకు తాత వంటి వాడు
సురవినోది = సురలకు వినోదాన్ని కలిగించే వాడు
సుమతి = సుమతి శతకకర్త బద్దెన
మా పెదతల్లి = మా పెద్ద అమ్మ వంటి వాడు
వీరబ్రహ్మముగారు = కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మం గారు
వినుడి = వినండి
నా జనకుండును = నాకు తండ్రి వంటి వారు
ఇంపుగా = ఇష్టంతో
మా + అక్క = అక్కలాంటిది
ఈశ్వరమ్మ = ఈశ్వరమ్మ
అనువుగా = అనుకూలంగా
సిద్ధప్ప = బ్రహ్మం గారి శిష్యుడు సిద్ధప్ప
అన్న గావలె నాకు = అన్న లాంటి వాడు
కడగొట్టు = చిన్న
మా + అన్న = అన్న
కాళిదాసు = సంస్కృత కవి కాళిదాసు
అమరసింహుడు = అమర కోశం రాసిన
మాకున్ = అమర సింహుడు మాకు
ఆత్మ బంధువులౌను = ఆత్మ బంధువుల వంటి వారు
యాగంటివారు = యాగంటి అనే గొప్ప వారు
మా + అన్న గారు = అన్న వంటి వారు
మాకు అంత = వీరందరూ మాకు
ఆత్మబంధువులండి = ఆత్మ బంధువులు
వీరు = పైన చెప్పిన వారందరూ
చచ్చిన = చనిపోయి కూడా
జగతి యందు = ఈ భూమిపై
బ్రతికియున్నారు = (ప్రజల హృదయాలలో) జీవించే ఉన్నారు.

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. వేదాలు తెలిసిన వేమన మా తాతలాంటి వాడు. సురలను ఆనందింప చేసే సుమతి శతక కర్త బద్దెన మా పెద్దమ్మ వంటి వాడు. కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మం గారు తండ్రి లాంటి వారు. బ్రహ్మం గారి మనుమరాలు ఈశ్వరమ్మ అక్క లాంటిది. బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధప్ప అన్న వంటి వాడు. సంస్కృత కవి కాళిదాసు మా చిన్నన్న. అమర కోశం రాసిన అమరసింహుడు, యాగంటి ఆత్మ బంధువుల వంటి వారు. వీరంతా చనిపోయికూడా జనాల హృదయాలలో బతికే ఉన్నారు. (వీరందరూ వరకవి సిద్ధప్పకు ఆదర్శప్రాయులని అర్థం)

7వ పద్యం :

సీ|| జిహ్వయే మాతండ్రి జీవేశ్వరుడు మాకు
కాళ్ళు మా కల్లుండ్రు గానవినుడి
హస్తంబులును రెండు నాత్మబంధువులైరి
కడుపు నా పెదతండ్రి, కొడుకు నరయ
నయనంబులును రెండు నా మాతృ ననుజులు
చెవులు సోదరులును శ్రవణపరులు
ముక్కు నా ప్రియురాలు ముఖము నా మేనత్త
నడుము నా పెదమామ నడిపికొడుకు
తే.గీ॥ పండ్లు మా యింటి చుట్టాలు భక్తవరులు
నాలుకయు మాకు నిలవేల్పు నాదిశక్తి
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం:

మా + అప్ప = మానాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవా
సిద్ధప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
జిహ్వయే = నాలుకయే
మాతండ్రి = మా తండ్రి లాంటి
జీవేశ్వరుడు = జీవానికి ఆధారం అయిన దైవం
మాకు కాళ్ళు = మా కాళ్ళు
మాకు + అల్లుండ్రు = అల్లుళ్ల వంటివి
గానవినుడి = కావున వినండి
హస్తంబులును రెండు = రెండు చేతులు
ఆత్మ బంధువులైరి = ఆత్మ బంధువుల వంటివి
కడుపు = కడుపు
నా పెదతండ్రి కొడుకు = పెద నాన్న కొడుకు
అరయ = చూడగా
నయనంబులును రెండు = రెండు కళ్ళు
నా మాతృ అనుజులు = నా కన్నా తల్లి అన్నతమ్ములు (మేన -మామలు)
శ్రవణ పరులు చెవులు = వినడానికి ఉపయోగపడే చెవులేమో
సోదరులును = అన్నదమ్ములు
ముక్కు నా ప్రియురాలు = ముక్కు ప్రియురాలు
ముఖము నా మేనత్త = ముఖం మేనత్త (తండ్రి సోదరి)
నడుము = నడుమేమో
నా పెదమామ = పెద్దమామ నడిమి
నడిపికొడుకు = కొడుకు
పండ్లు మా యింటి చుట్టాలు = పండ్లేమో చుట్టాలు
భక్తవరులు = భక్తులు
నాలుకయు మాకున్ = నాకున్న నాలుక
ఇలవేల్పు = ఇంటి దేవత
ఆదిశక్తి = ఆదిశక్తి

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. నాలుక నాకు తండ్రి పరమాత్మ వంటిది. కళ్ళు అల్లుళ్ల వంటివి, రెండు చేతులు ఆత్మ బంధువుల వంటివి. కడుపు పెద్ద నాన్న కొడుకు, చూసే రెండు కళ్ళు మేనమామలు, వినే రెండు చెవులు అన్నదమ్ములు, ముక్కు ప్రియురాలు, ముఖం మేనత్త, దంతాలు చుట్టాలు, భక్తులు. నాలుక ఆదిపరాశక్తి అయిన మా ఇంటి దేవత. (జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మానవ జీవనానికి అత్యంత ప్రధానమైనవి వాటిని పవిత్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలి అని భావం)

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

8వ పద్యం :

సీ|| చేదు ఆన్గపుకాయ చేతిలో చేకొని
గంగ స్నానము చేసి గనుడిచేదు
పోదు తీపికిరాదు బుర్రకాయ విధము
మునిగి తేలిన పోదు మూర్ఖతనము
నదులెల్ల దిరిగియు నేమముల్ బట్టినా
పదవి జేరుట యెట్లు పాపినరుడు
వెదురు బద్దలు కుక్క వాలంబునకు వేసి
గుంజికట్టిన దాని గుణముబోదు
తే.గీ॥ జ్ఞానహీనుల కెప్పుడు గ్రంథ మెచ్చి
జ్ఞానులను జేయువాడెపో జ్ఞానుడతడు
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప = మానాయనలారా! (సంబోధన)
మా + అప్ప = మా నాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్ధప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి.
చేదు ఆన్గపుకాయ = చేదుగా ఉన్న ఆనగపుకాయ (సొరకాయ)
చేదుపోదు = ఉన్న చెడు పోదు
తీపికిరాదు = లేని తీపి రాదు
బుర్రకాయ విధము = ఆ సొరకాయ లాగ
మునిగి తేలిన = (గంగలో) మునిగి తేలితే
మూర్ఖతనము పోదు = మూర్కత్వం పోదు
నదులెల్ల = అన్ని నదుల దగ్గరికి
దిరిగియు = వెళ్ళినా.
నేమముల్ బట్టినా = నియమాలు (వ్రతాలు) పట్టినా
పాపినరుడు = పాపం గల మానవుడు
పదవి జేరుట యెట్లు = మోక్ష పదవిని ఎలా చేరగలడు
వెదురు బద్దలు = వెదురు కర్రలతో
కుక్క, వాలంబునకు = కుక్క తోకకు
వేసి గుంజికట్టిన = గట్టిగా లాగి కట్టినా
దాని గుణముబోదు = దాని (వంకర) గుణం పోదు
జ్ఞానహీనులకు = జ్ఞానం లేని వారికి
ఎప్పుడు = ఎప్పుడైనా
గ్రంథ మిచ్చి = పుస్తకాన్ని ఇచ్చి
జ్ఞానులను = జ్ఞానవంతులుగా చేసేవాడే
చేయువాడెపో = చేసేవాడు
జ్ఞానుడతడు = నిజమైన జ్ఞానవంతుడు

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. చేదుగా ఉన్న ఆనగపు కాయను చేతిలో పట్టుకొని గంగానదిలో స్నానం చేసి దాని రుచిచూస్తే అంతకు ముందు ఉన్న చేదు రుచి పోదు. లేని తీపి రుచి రాదు. ఆ సొరకాయలాగా మానవులు కూడా గంగలో మునిగి తేలితే వారి మూర్ఖత్వం పోదు. ఎన్ని నదుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని వ్రతాలు పట్టినా పాపాత్ములు మోక్ష పదవిని అలంకరించలేరు. వంకరగా ఉన్న కుక్క తోకకు వెదురు కర్రలు ఎంత లాగి కట్టినా దాని వంకర గుణం పోదు. జ్ఞానం లేని వానికి ఒక పుస్తకం ఇచ్చి జ్ఞానవంతునిగా చేయగలవాడే నిజమైన జ్ఞాన సంపన్నుడు.

9వ పద్యం :

సీ|| ప్రాణముల్ బిగబట్టి పైకి లేవగవచ్చు
ఘడియకో వేషంబు గట్టవచ్చు
అన్నహారములేక అడవి తిరగవచ్చు
తిన్నగా జపమాల ద్రిప్పవచ్చు
కప్పలా చెరువులొ గడగి తేలగవచ్చు
బలువుగా వెయినాళ్ళు బ్రతుకవచ్చు
వూరూరు తిరుగుచు ఉపమివ్వగావచ్చు
కపటవృత్తుల మనసు గరపవచ్చు
తే.గీ॥ ధరణిలో వేషముల్ చాల దాల్చవచ్చు
గురుని మదిలోన నిల్పుట గుర్తువచ్చు
వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప = మా నాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్ధప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది.
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
ప్రాణముల్ = ప్రాణాలు (ఊపిరి)
బిగబట్టి = ఆపి
పైకి లేవగవచ్చు = పైకి లేవవచ్చు
ఘడియకో = సమయాన్ని సూచించే పదం
వేషంబు = వేషాలు
కట్టవచ్చు = వేయవచ్చు
అన్న హారములేక = అన్నము ఆహారము లేకుండా
అడవి తిరగవచ్చు = అడవిలో తిరగవచ్చు
తిన్నగా = సరిగ్గా
జపమాల = జపమాలను
ద్రిప్పవచ్చు = తిప్పవచ్చు
కప్పలా = కప్పలాగ
చెరువులో = చెరువులో
కడగి = ప్రయత్న పూర్వకంగా
తేలగవచ్చు = నీళ్ళలో తేలవచ్చు
బలువుగా = బలంగా
వెయినాళ్ళు = వెయ్యి సంవత్సరాలు
బ్రతుకవచ్చు = బతికి ఉండవచ్చు
వూరూరు తిరుగుచు = ప్రతీ గ్రామం తిరిగి
ఉపమివ్వగావచ్చు = ఉపన్యాసం ఇవ్వవచ్చు
కపటవృత్తుల మనసు = మోసపూరిత మనస్సు కలిగిన వారిని
గరపవచ్చు = మార్చవచ్చు
ధరణిలో = భూమిపై
వేషముల్ చాల దాల్చవచ్చు = ఎన్నో వేషాలు వేయవచ్చు
గురుని = గురువు
మదిలోన = మనస్సులో
నిల్పుటన్ = నిలిపితే
గుర్తు = పేరు, ప్రతిష్ఠ
వచ్చు = వస్తుంది.

తాత్పర్యం: నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్దప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. ఊపిరిని బిగపట్టి శరీరం పైకి లేచేలా చేయవచ్చు. ప్రతీ గడియకు ఒక వేషం వేయవచ్చు. అన్న పానాలు లేకుండా అడవిలో తిరగవచ్చు. జపమాలను సరిగ్గా తిప్పవచ్చు. నీళ్ళలో కప్పలాగా ప్రయత్నం చేసి పైకి తేలవచ్చు. బలంగా వెయ్యి సంవత్సరాలు బతక వచ్చు. ప్రతీగ్రామం తిరిగి ఉపన్యాసాలు ఇవ్వవచ్చు. మోసపూరితమైన వారి మనస్సును మార్చవచ్చు. భూమిపై ఎన్నో వేషాలు వేయవచ్చు. గురువును మనస్సులో నిలిపితే పైన చెప్పిన అసాధ్యమైన పనులు చేసి ప్రతిష్ఠ పొందవచ్చు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ

10వ పద్యం :

సీ||
ఎవరు తనాత్మను యేకంబుగా జేసి
సర్వభూతాలని సమము జూచి
జ్ఞాన వైరాగ్య యజ్ఞము దానతపములన్
చేయుచుండిన ముక్తి చెందగలరు
తామరాకులు నీళ్ళ దడువకుండిన యట్లు
నుందురు సుజ్ఞానులుర్విలోన
నలసియుందురు చూడకళలేని విధముగ
గానవత్తురుధవ కాంతిబొందు
తే.గీ॥ నొకరి దూషించి భూషింపరొకరి నెపుడు
సుఖము దుఃఖమొక పదము జూతురయ్య
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప

ప్రతిపదార్థం :

మా + అప్ప వినుడి = మా నాయనలారా! (సంబోధన)
వినుడి = వినండి
విహితుడు + అప్ప = నాయనా! మీ హితమును కోరేవాడు
సిద్దప్ప = ఈ సిద్ధప్ప
కనకము + అప్ప = బంగారం వంటిది
కవికుప్ప = కవిత్వపు రాశిని (సిద్ధప్ప రాసిన కవిత్వాన్ని)
కనుడి కరమొప్ప = జాగ్రత్తగా గమనించండి
ఎవరు = ఎవరైతే
తన + ఆత్మను = తన ఆత్మను
యేకంబుగా జేసి = పరమాత్మతో సమానంగా చేసి
సర్వభూతాలని = అన్ని జీవులను
సమము జూచి = సమానంగా చూసి
జ్ఞాన వైరాగ్య యజ్ఞము = జ్ఞానము, వైరాగ్యము అనే యజ్ఞం
దాన, తపములన్ = దానాలు తపస్సులు
చేయుచుండిన = చేస్తే
ముక్తి చెందగలరు = మోక్షాన్ని పొందుతారు
తామరాకులు = తామర ఆకులు
నీళ్ళ = నీటిలో
తడువకుండిన యట్లు = తడవకుండా ఉన్నట్లు
ఉందురు = ఉంటారు
సుజ్ఞానులు + ఉర్విలోన = భూమిపై జ్ఞానం ఉన్నవారు
అలసి యుందురు = అలసిపోయి ఉంటారు.
చూడ = చూస్తే
కళలేని విధముగ = మొఖంలో కళ లేకుండా
గానవత్తురు = కనిపిస్తారు
అధవ = తరువాత
కాంతిబొందు = కాంతి వస్తుంది
నొకరి దూషించి = ఒకరిని తిట్టి
భూషింపరు + ఒకరిని = మరొకరిని మెచ్చుకోరు
ఎపుడు = ఎల్లప్పుడు
సుఖము = సుఖాన్ని
దుఃఖము = దుఃఖాన్ని
ఒక పదము = ఒకే విధంగా
చూతురయ్య = చూస్తారు

తాత్పర్యం : నాయనలారా! వినండి. మీ హితాన్ని కోరే ఈ సిద్ధప్ప చెప్పిన కవిత్వం బంగారపు కుప్పవంటిది జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే తన ఆత్మను పరమాత్మతో సమానంగా భావించి, అన్ని జీవులను సమానంగా చూసి జ్ఞాన వైరాగ్యాలనే యజ్ఞాన్ని, దానాలను, తపస్సులను చేస్తే మోక్షాన్ని పొందుతారు. తామరాకులు నీటిలో ఉండి కూడా తడవకుండా ఉన్నట్లుగానే భూమిపై జీవిస్తున్న జ్ఞానులు కూడా అలసిపోయినట్లు, కళా విహీనంగా కనిపిస్తారు. కాని తరువాత వారి ముఖంలో కళ వస్తుంది. వారు ఒకరిని తిట్టి, మరొకరిని మెచ్చుకోరు. వారు ఎల్లప్పుడూ సుఖాన్ని దుఃఖాన్ని ఒకే విధంగా చూస్తారు.

జ్ఞానబోధ Summary in Telugu

(సిద్దప్ప వరకవి ‘జ్ఞానబోధిని’ గ్రంథ౦ నుండి)

TS Inter 2nd Year Telugu Study Material Poem 3 జ్ఞానబోధ 1

* కవి పరిచయం *

పాఠ్యాంశం పేరు : జ్ఞానబోధ
కవి పేరు : “వరకవి సిద్ధప్ప
ఇది దేని నుండి గ్రహించబడినది : ఈ పాఠ్యభాగము సిద్దప్ప వరకవి ‘జ్ఞానబోధిని’ గ్రంథములో నుండి గ్రహింపబడినది
కాలం :  జననం: జూలై 9, 1903 – మరణం: మార్చి 23, 1984
స్వస్థలం : సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి
తల్లిదండ్రులు : లక్ష్మి, పెదరాజయ్య
చదువు : ఉర్దూ మీడియంలో 7వ తరగతి
ప్రావీణ్యం గల భాషలు : తెలుగు, హిందీ, ఉర్దూ, పార్శీ, ఇంగ్లీష్, సంస్కృతం
వృత్తి : ఉపాధ్యాయుడు
మకుటం : “వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప – కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప’
విశేషతలు : ‘గొప్పవాడను గాను కోవిదుడగాను తప్పులున్నను దిద్దుడి తండ్రులార’ అంటూ వినయంగా చెప్పుకున్నాడు.
నిరాడంబర జీవితాన్ని గడిపాడు. సాహిత్యంతోపాటు జ్యోతిష్యం, వాస్తు, ఆయుర్వేదం, యోగ విద్యల్లో ప్రావీణ్యం సాధించాడు.
సిద్దప్ప వరకవి రచనలు : సుమారు 40 గ్రంథాలు రచించాడు. సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని (నాలుగు భాగాలు), వర్ణమాల కందార్థములు, కాలజ్ఞాన వర్థమాన కందార్థములు, యాదగిరి నరసింహస్వామి వర్ణమాల, విష్ణు భజనావళి, శివభజనావళి, నీతిమంతుడు, గోవ్యాఘ్ర సంభాషణ, కాకి హంసోపాఖ్యానం, అర్చకుల సుబోధిని, అశోక సామ్రాజ్యము యక్షగానము, జీవ నరేంద్ర నాటకము మొదలైనవి. ఈయనకు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా గుండారెడ్డిపల్లెలో సమారాధనోత్సవం జరుగుతుంది. గోలుకొండ కవుల సంచికలో ఈయన పద్యాలు ప్రచురితమయ్యాయి.

పాఠ్యభాగ సందర్భం

సిద్ధప్పకు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలలో భక్తులు, అభిమానులు ఉన్నారు. వారి మనసులను చూరగొన్నాడు. పండిత పామర జనులు సైతం అలవోకగా పాడుకునే విధంగా రచనలు చేసిన సిద్ధప్ప పద్యాల్ని రాశాడు. వారు రాసిన పద్యాలను నేటికి భజన మండళ్లలో పాడుతుంటారు. సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని పేరుతో రాసిన పద్యాలు బహుళ ప్రచారం పొందాయి. సమాజంలోని మూఢాచారాలను నిరసిస్తూ ఆత్మజ్ఞానాన్ని ఎరుకచేస్తూ సిద్ధప్ప రాసిన సీస పద్యాలను పరిచయం చేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 5th Poem కోకిలా! ఓ కోకిలా !! Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 5th Poem కోకిలా! ఓ కోకిలా !!

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
కోకిల స్వభావాన్ని వర్ణించండి. (V.Imp)
జవాబు:
కోకిల గానం భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమన లాగ ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. ఏ కరెంటు స్తంభం పైననో, ఏ` ఏడంతస్తుల మేడపైననో కనబడకుండా ఉంది. కోకిలను కళాకారులకు ప్రతీకగా తీసుకొని ఆధ్యాత్మికతను, దేశభక్తిని ప్రబోధించే కళాకారులు కనబడకుండా ఉన్నారని కవి భావించాడు. కొందరు కళాకారులు ఏడంతస్తుల మేడలో రాజభోగాలు అనుభవిస్తుంటే మరికొందరు డబ్బులేక పేదరికంలో ఉన్నారని ధ్వనింప జేశాడు. ఈ పట్టపగలు, మండుటెండలో కోకిల పాడుతున్న పాటతో కవి గుండె కరిగింది.

ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్లో ఎవరో కోటిమందిలో ఒకడు కవి వంటి వాడికి తప్ప పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? కోకిల ఎవరో వన్స్ మోర్ అని అన్నట్లు పాడిన పాటనే మళ్ళీ మళ్ళీ పాడుతుంది. ఆహా ఓహో అనే పొగడ్తల మాటలే తప్ప డబ్బు ఎవరూ ఇవ్వరే అని చెప్తున్నాడు కవి. కళాకారులకు చప్పట్లు తప్ప నగదు బహుమతులు, ప్రోత్సాహాలు ఉండడం లేదని భావం.

కోకిల కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే కోకిల చేసిన ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. కోకిల గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఎందుకోసం పాడుతున్నావు. సంవత్సరకాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నావా? అని కవి కోకిలను అడిగాడు. నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు.

కవులు మాత్రమె కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారని కూడా అన్నాడు. చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న వారిని సమాజం గుర్తించదు అని కవి అన్నాడు.

కోకిలా ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక నీకు లేదనే విషయం కవికి తెలుసు. కోకిలకు సూర్యుడు చూపిన మార్గం మాత్రమే తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారి తెలియదు అని కవి అన్నాడు. అంటే కొంతమంది కళాకారులు పైరవీల ద్వారా గుర్తింపును పొందుతున్నారని ఆ గుర్తింపు కోసమే ప్రదర్శనలు చేస్తారని చెప్తున్నాడు. కోకిల అలా కాకుండా తనకు దేవుడు ఇచ్చిన కళను నిస్వార్థంగా ప్రదర్శిస్తుందని తెలిపాడు.

కోకిల చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతుంది. కాని మానవులు మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నారు. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు.

కోకిల చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలదు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా రాగాలతో అనురాగాలను పంచగలదు. కుల మతాల భేదం పాటించని కోకిల సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలు కోకిల అని కవి అంటున్నాడు. కోకిలలకు గూడు నిర్మించుకోవడం తెలియదు అది తన గుడ్లను కాకి గూటిలో పెడితే కాకి ఆ గుడ్లను పొదిగి పిల్లను చేస్తుంది.

కోకిల పెరిగి శబ్దం చేసినప్పుడు అది తనపిల్ల కాదని కాకి దానిని వెళ్లగొడుతుంది. అదే విధంగా తమ జాతి, తమ కులం, తమ మతం కాదు అని అనేకమంది మంచివారిని దూరం చేసుకుంటున్నారని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు. ఓ కోకిలా ఆ పక్కకు చూడు. ఆ పెద్దకోకిలకు నీ మీద ఎంత ద్వేషం ఉందొ నీతో పోటీ పెట్టుకున్నట్లు నువ్వు ఎలా కూస్తే అది కూడా అలాగే కూస్తుంది. తెలివితేటలకు కులభేదాలు లేనట్టే ఈర్ష్యాద్వేషాలకు వయస్సు భేదం లేదు అని కవి చెప్పాడు. ఒక స్థాయిలో ఉన్న కళాకారులు వెనుక వస్తున్న కొత్త తరం కళాకారులను ఎదగనివ్వడం లేదని కవి భావన. దీనిలో కోకిల స్వభావాన్ని కవి కనపర్తి రామచంద్రాచార్యులు వర్ణించారు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

ప్రశ్న 2.
కోకిలకు సమాజానికి ఉన్న సంబంధాన్ని వివరించండి.
జవాబు:
కోకిల భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమన లాగ ఉత్సాహాన్ని సమాజానికి కలిగిస్తుంది. పట్టపగలు, మండుటెండలో కోకిల పాడుతున్న పాటతో కవి గుండెను కరిగించింది. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోరీ సెంటర్ లో ఎవరో కోటిమందిలో ఒకడు తప్ప పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని భావం.

ఈ నగర జనాల్లో ఎవరి తొందర వారికి ఉంది. ఎవరి పనులు వారికి ఉన్నాయి. ఇష్టం ఉన్నా లేకున్నా వేగంగా వెళ్ళాల్సిన స్థితిలో ఉన్నారు. అందరూ ఒకరిని తొక్కి పైకి రావాలని ఆశిస్తున్నవారే. అందరూ తమ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వారిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నవారే. కోకిల ఎవరో వన్స్ మోర్ అని అన్నట్లు పాడిన పాటనే మళ్ళీ మళ్ళీ పాడుతున్నావు. ఆహా ఓహో అనే పొగడ్తల మాటలే తప్ప డబ్బు ఎవరూ ఇవ్వరే అని చెప్తున్నాడు కవి. కళాకారులకు చప్పట్లు తప్ప నగదు బహుమతులు, ప్రోత్సాహాలు ఉండడం లేదని భావం.

కోకిల నువ్వు కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. కోకిల శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. కోకిల గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఇందుకోసం ఈ సమయంలో సంవత్సరకాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నట్లు కోకిలను అడిగాడు.

నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు. కవులు మాత్రమె కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారు. చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న నిన్ను సమాజం గుర్తించదు అని కవి అన్నాడు.

కోకిలకు ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక లేదనే విషయం నాకు తెలుసు. కోకిలకు సూర్యుడు చూపిన మార్గం మాత్రమె తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారీ తెలియదు అని కవి అన్నాడు. కోకిల చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే నువ్వు ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతున్నది. మానవులు మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నారు.

తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు. కోకిలకు ఇల్లు వాకిలి వంటి ఆస్తులు లేవు, బరువు బాధ్యతలు అసలే లేవు. మనుషుల లాగ బస్సులకోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆకులు అలములు ఇలా ఏది దొరికితే అదే తినుకుంటూ సంతృప్తిగా జీవిస్తుంది.

కోకిల చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలదు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా రాగాలతో అనురాగాలను పంచుతావు. కుల మతాల భేదం పాటించని సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే కోకిల మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా కోకిలను పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలివి అని కవి అంటున్నాడు.

పెద్దకోకిలకు నీ మీద ఎంత ద్వేషం ఉందో కోకిలతో పోటీ పెట్టుకున్నట్లు నువ్వు ఎలా కూస్తే అది కూడా అలాగే కూస్తుంది. తెలివితేటలకు కులభేదాలు లేనట్టే ఈర్ష్యాద్వేషాలకు వయస్సు భేదం లేదు అని కవి చెప్పాడు. ఒక స్థాయిలో ఉన్న కళాకారులు వెనుక వస్తున్న కొత్త తరం కళాకారులను ఎదగనివ్వడం లేదని కవి భావన.

నీ కళకు గుర్తింపు లేని ఈ పట్నంలో ఎందుకు ఉండటం ? నాతో మా పల్లెకు పోదాం రా. అక్కడ ప్రతీచెట్టు నీకు కట్టని వేదికలాగా, పైరగాలి పెట్టని మైకులాగా అబద్దాలు, మోసాలు తెలియని పల్లెజనం నీ కళను ఆస్వాదించే శ్రోతలుగా ఉంటారని కవి చెప్పాడు. అంటే పట్నాలలో భారీ వేదికలు, మైకులు, హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నా ఆ కళను ఆస్వాదించే శ్రోతలు లేరని, ఆ లోటు పల్లెటూరిలో తీరుతుందని భావం.

ఆ పల్లెటూరికి వెళ్లి ప్రతీకొమ్మను తన గానమాధుర్యంతో పరవశించే విధంగా, ప్రతీ చెట్టు తన కమ్మని గానంతో నిండిపోవాలని, ప్రతీ హృదయం, ప్రతీ ఇల్లు తన మధురమైన పాటలతో నిండాలని కవి సూచించాడు. అంటే కళకు గుర్తింపు ఉన్న దగ్గరే కళాకారుడు ఉండాలని కవి సూచన. ఇలా కోకిలకు సమాజానికి సంబంధం ఉందని కనపర్తి రామచంద్రాచార్యులు వివరించాడు.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
కోకిల ఎక్కడ ఉంది ? దాని పాటకు స్పందన ఎలా ఉంది ? (V.Imp) (M.P)
జవాబు:
కోకిల భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమనలాగ ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. ఏ కరెంటు స్తంభం పైననో, ఏ ఏడంతస్తుల మేడపైననో కనబడకుండా ఉంది. కోకిలను కళాకారులకు ప్రతీకగా తీసుకొని ఆధ్యాత్మికతను, దేశభక్తిని ప్రబోధించే కళాకారులు కనబడకుండా ఉన్నారని కవి భావించాడు.

ఈ పట్టపగలు, మండుటెండలో కోకిల పాడుతున్న పాటతో కవి గుండెను కరిగించింది. ఎంతో హడావిడిగా ఉండే కోరీ సెంటర్ లో ఎవరో కోటి మందిలో ఒకడికి తప్ప కోకిల పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని అందుకే స్పందన తక్కువగా ఉందని కనపర్తి రామచంద్రాచార్యులు చెప్పాడు.

ప్రశ్న 2.
కోకిల పాట ఎలా అనిపిస్తుంది ? అది ఏం చేస్తున్నట్టుంది ?
జవాబు:
కోకిల కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే కోకిల చేసే ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. కోకిల గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఇందుకోసం ఈ సంవత్సరం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నట్లు అనిపించిందని కోకిలను అడిగాడు.

ప్రశ్న 3.
కోకిల మార్గము, సంస్కారము ఎలాంటిది ?
జవాబు:
కోకిలకు ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక లేడు. కోకిలకు పైన ఉన్న సూర్యుడు చూపిన మార్గం మాత్రమె తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారి తెలియదు. అంటే కొంతమంది కళాకారులు పైరవీల ద్వారా గుర్తింపును పొందుతున్నారని ఆ గుర్తింపు కోసమే ప్రదర్శనలు చేస్తారని కనపర్తి రామచంద్రాచార్యులు చెప్తున్నాడు. కోకిల అలా కాకుండా తనకు దేవుడు ఇచ్చిన కళను నిస్వార్థంగా ప్రదర్శిస్తుందని తెలిపాడు.

కోకిల చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతున్నది. మానవులు మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నారు. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

ప్రశ్న 4.
పట్టణంలో విహరిస్తూ కోకిల ఏం చేస్తుంది ?
జవాబు:
కోకిల చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలదు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా రాగాలతో అనురాగాలను పంచగలదు. కుల మతాల భేదం పాటించని సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే కోకిల మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా కోకిలను పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలు అని కవి అంటున్నాడు.

కోకిలలకు గూడు నిర్మించుకోవడం తెలియదు అది తన గుడ్లను కాకి గూటిలో పెడితే కాకి ఆ గుడ్లను పొదిగి పిల్లను చేస్తుంది. కోకిల పెరిగి శబ్దం చేసినప్పుడు అది తనపిల్ల కాదని కాకి దానిని వెళ్లగొడుతుంది. అదే విధంగా తమ జాతి, తమ కులం, తమ మతం కాదు అని అనేకమంది మంచివారిని దూరం చేసుకుంటున్నారని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు.

III ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
కనపర్తి రాసిన కోకిల కవిత ఏ కావ్యంలోనిది ?
జవాబు:
నైమిశారణ్యం కవితా సంపుటి లోనిది

ప్రశ్న 2.
కనపర్తికి ఉన్న బిరుదు ఏమిటి ?
జవాబు:
వచన కవితా ప్రవీణ

ప్రశ్న 3.
కోకిల ఎలాంటి ఉత్తేజాన్నిస్తుంది ?
జవాబు:
జాతీయ గీతం వంటి

ప్రశ్న 4.
కోకిలను ఎవరు ఆవాహన చేసుకుంటారు ?
జవాబు:
కవులు

ప్రశ్న 5.
కోకిలను ఎవరు తరిమి కొడతారు ?
జవాబు:
తనను పెంచిన వారు, కాకులు

ప్రశ్న 6.
ప్రతిభకు ఏది ఉండదు ?
జవాబు:
వర్ణ భేదం

ప్రశ్న 7.
ధవళ పారావతం అంటే ఏమిటి ?
జవాబు:
తెల్లని పావురం

ప్రశ్న 8.
కోకిలకు వేదిక ఏది ?
జవాబు:
పచ్చని చెట్టు

IV సందర్భసహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
ఎవరికుందే నీ పాట వినే తీరిక (V.Imp) (M.P)
జవాబు:
కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా ! ఓ కోకిలా !! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.

సందర్భం : పట్టపగలు, మండుటెండలో నీవు పాడుతున్న పాటతో నా గుండెను కరిగించావు. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్లో ఎవరో కోటిమందిలో ఒకడు నా వంటి వాడికి తప్ప నీ పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? అని కవి కోకిలను అడిగిన సందర్భం లోనిది ఈ వాక్యం.

అర్థం : నీ కమ్మని పాట వినే తీరిక ఎవరికి ఉంది ? అని అర్థం.

వ్యాఖ్య : ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని
భావం.

2. నీ గళమే ఒక మధుర కవితల క్యాసెట్ (V.Imp)
జవాబు:
కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా! ఓ కోకిలా!! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.

సందర్భం : ఓ కోకిలా నువ్వు కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే నీ ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. నీ గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం : నీ గొంతు మధురమైన కవితలతో కూడిన క్యాసెట్ వంటిది అని అర్థం.

వ్యాఖ్య : కోకిల ప్రతీ కూతలో కొత్త భావాలు వస్తున్నాయని భావం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

3. ఏ దేవుళ్లు నిన్ను వాహనం చేసుకొంటారు ?
జవాబు:
కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా ! ఓ కోకిలా !! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 వ్యా రాశాడు.

సందర్భం : కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయం తెలియకుండా అడుక్కున్నట్లు ఎందుకోసం ఈ సమయంలో పాడుతున్నావు. సంవత్సర కాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నావా అని కవి కోకిలను అడిగాడు. నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు. అని సమాధానం చెప్పుకున్నాడు. కవులు మాత్రమే కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారని, చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న నిన్ను ఏ దేవుడు వాహనంగా అగీకరిస్తాదని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం : ఉద్యోగాలు ఇచ్చేవారు కూడా శరీరపు రంగును చూస్తున్నారని వ్యంగ్య అర్థం.

వ్యాఖ్య : వాహనంగా వాడుకోవడం అంటే ఉపాధి ఉద్యోగాలను చూపడం అని భావం.

4. కల్లాకపటమెరుగని పల్లె ప్రజలే నిన్ను గుర్తించే శ్రోతలు
జవాబు:
కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా! ఓ కోకిలా !! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.

సందర్భం : నీ కళకు గుర్తింపు లేని ఈ పట్నంలో ఎందుకు ఉండటం ? నాతో మా పల్లెకు పోదాం రా. అక్కడ ప్రతీచెట్టు నీకు కట్టని వేదికలాగా, పైరగాలి పెట్టని మైకులాగా అబద్దాలు, మోసాలు తెలియని పల్లెజనం నీ కళను ఆస్వాదించే శ్రోతలుగా ఉంటారని కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం : అమాయకులైన పల్లె ప్రజలు కోకిల గానాన్ని ఆస్వాదిస్తారని అర్థం.

వ్యాఖ్య : పట్నాలలో భారీ వేదికలు, మైకులు, హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నా ఆ కళను ఆస్వాదించే శ్రోతలు లేరని, ఆ లోటు పల్లెటూరిలో తీరుతుందని భావం.

గేయ పంక్తులు – భావములు

1 నుండి 5వ పంక్తి వరకు :

భగవద్గీతలా ఉల్లాసాన్ని కల్గిస్తున్నావు ;
జాతీయగీతంలా ఉత్తేజాన్నందిస్తున్నావు;
ఏ ఎలక్ట్రికల్ స్తంభంమీద కూర్చున్నావో ?
ఏ ఏడంతస్తుల మేడమీద దాక్కున్నావో,
కోకిలా! ఓ కోకిలా!!

అరాలు:

కోకిలా! ఓ కోకిలా!! = ఇలా కోకిల సంబోధిస్తున్నాడు కవి
భగవద్గీతలా = భగవద్గీత లాగా ఉల్లాసాన్ని కల్గిస్తున్నావు: సంతోషాన్ని
జాతీయగీతంలా = జనగణమన లాగా
ఉత్తేజాన్ని + అందిస్తున్నావు = ఉత్సాహాన్ని కలిగిస్తున్నావు
ఏ ఎలక్ట్రికల్ స్తంభంమీద = యే కరెంటు స్థంభం పైన
కూర్చున్నావో ? = కూర్చున్నావో
ఏ ఏడంతస్తుల మేడమీద = యే ఏడు అంతస్తుల భవనం మీద
దాక్కున్నావో = కనబడకుండా ఉన్నావో

భావం : ఓ కోకిలా! భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమన లాగ ఉత్సాహాన్ని కలిగిస్తున్నావు. నువ్వు ఏ కరెంటు స్తంభం పైన, ఏ ఏడంతస్తుల మేడపైన కనబడకుండా ఉన్నావో అని కోకిలను కళాకారులకు ప్రతీకగా తీసుకొని ఆధ్యాత్మికతను, దేశభక్తిని ప్రబోధించే కళాకారులు కనబడకుండా ఉన్నారని కవి భావించాడు. కొందరు కళాకారులు ఏడంతస్తుల మేడలో రాజభోగాలు అనుభవిస్తుంటే మరికొందరు డబ్బులేక పేదరికంలో ఉన్నారని ధ్వనింప జేశాడు.

6 నుండి 10వ పంక్తి వరకు :

ఈ మధ్యాహ్నం మండుటెండలో-
నీ పాటతో నా గుండెలు తోడేస్తున్నావు !
ఈ ‘కోఠీ సెంటర్’లో ………
ఏ కోటికొక్కడో నా బోటివాడు తప్ప
ఎవరికుందే నీ పాట వినే తీరిక ? !

అర్థాలు :

ఈ మధ్యాహ్నం = ఈ పట్టపగలు
మండుటెండలో = మండుతున్న ఎండలో
నీ పాటతో = నీవు పాడే ఈ పాటతో
నా గుండెలు = నా (కవి) గుండెలు
తోడేస్తున్నావు! = కరిగిస్తున్నావు
ఈ కోఠీ సెంటర్’లో = చాలా బిజీ గా ఉండే కోఠీ సెంటర్లో
ఏ కోటికి +ఒక్కడు +ఓ = కోటి మందిలో ఒక్కడు
నా బోటివాడు తప్ప = నా వంటి వాడు తప్ప
నీ పాట వినే తీరిక ?! = నీ పాట వినే అంత ఖాళీ సమయం
ఎవరికి + ఉందే = ఎవరికి ఉంది.

భావం : ఈ పట్టపగలు, మండుటెండలో నీవు పాడుతున్న పాటతో నా గుండెను కరిగించావు. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్లో ఎవరో కోటిమందిలో ఒకడు నా వంటి వాడికి తప్ప నీ పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని భావం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

10 నుండి 16వ పంక్తి వరకు :

ఎవడి తొందర వాడిది.
ఎవరి పనులు వారివి;
రొప్పుకుంటూ, రోజుకుంటూ-
అంతా పరుగెత్తే వాళ్ళే !
త్రొక్కుకుంటూ, త్రోసుకుంటూ-
అంతా ఎక్కివెళ్లే వాళ్లే !

అర్థాలు :

ఎవడి తొందర వాడిది = ఈ ప్రజల్లో ఎవరి వేగిరపాటు వాళ్లకు ఉంది
ఎవరి పనులు వారివి = ఎవరి పనులు వారికి ఉన్నాయి
రొప్పుకుంటూ = వేగంగా నడవడం వల్ల వచ్చే అధిక శ్వాస
రోజుకుంటూ = ఆయాసపడుతూ (ఇష్టం లేకున్నా)
అంతా పరుగెత్తే వాళ్ళే = అందరూ వేగంగా వెళ్ళే వారే
త్రొక్కుకుంటూ = ఒకరినొకరు తొక్కుతూ (బలవంతులు బలహీనులను తొక్కుతున్నారు)
త్రోసుకుంటూ = మరొకరిని తోసేస్తూ (అభివృద్ధి మార్గంలో అడొచ్చిన వారిని తోసేస్తున్నారు)
అంతా ఎక్కివెళ్లే వాళ్లే != అందరూ ఎదో ఒక వాహనం ఎక్కి వెళ్ళే వారే (అందరూ ఇతరుల పై అధికారాన్ని ప్రదర్శించాలని ఆలోచించే వారే)

భావం : ఈ నగర జనాల్లో ఎవరి తొందర వారికి ఉంది. ఎవరి పనులు వారికి ఉన్నాయి. ఇష్టం ఉన్నా లేకున్నా వేగంగా వెళ్ళాల్సిన స్థితిలో ఉన్నారు. అందరూ ఒకరిని తొక్కి పైకి రావాలని ఆశిస్తున్నవారే. అందరూ తమ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వారిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నవారే.

17 నుండి 21వ పంక్తి వరకు :

అయినా ఎవరో ‘వన్స్ మోర్’ అన్నట్లు
పాడిందే పాడుతున్నావు.
‘ఆహా ఓహో’ల నోటి పదాలు తప్ప – ‘
నూటపదార్లె’వరిస్తారే నీకు ?
కోకిలా ! ఓ కోకిలా !!

అర్థాలు :

అయినా = అయిననూ
ఎవరో = ఎవరో రసికుడు
‘వన్స్ మోర్’ అన్నట్లు = మళ్ళీ పాడండి అని చెప్పినట్లుగా
పాడిందే పాడుతున్నావు = పాడిన పాటనే మళ్ళీ పాడుతున్నావు
‘ఆహా ఓహో’ల = ఆహా, ఓహో అనే పొగడ్తల మాటలు
నోటి పదాలు తప్ప = నోటినుండి వచ్చే మాటలే తప్ప
‘నూటపదార్లె’వరిస్తారే నీకు ? = నూట పదహారు రూపాయలు ఎవరు ఇస్తారు నీకు (డబ్బు ఎవరూ ఇవ్వరు అని భావం)

భావం: ఓ కోకిలా! ఎవరో వన్స్ మోర్ అని అన్నట్లు పాడిన పాటనే మళ్ళీ మళ్ళీ పాడుతున్నావు. ఆహా ఓహో అనే పొగడ్తల మాటలే తప్ప డబ్బు ఎవరూ ఇవ్వరే అని చెప్తున్నాడు కవి. కళాకారులకు చప్పట్లు తప్ప నగదు బహుమతులు, ప్రోత్సాహాలు ఉండడం లేదని భావం.

22 నుండి 25వ పంక్తి వరకు :

నువు ‘కుహూ కుహూ’ అన్నప్పుడల్లా
ఓ ‘మినీ కవిత’ రాలిపడ్డట్లనిపిస్తుంది !
నీ గళమే ఒక
“మధుర కవితల క్యాసెట్’ లా కనిపిస్తుంది !

అర్థాలు :

నువు ‘కుహూ కుహూ’ అన్నప్పుడల్లా = నువ్వు పాడుతున్నప్పుడల్లా
ఓ ‘మినీ కవిత’ = ఒక చిన్న కవిత (ప్రక్రియ)
రాలిపడ్డట్లు + అనిపిస్తుంది! = వేలువడ్డట్లు అనిపిస్తుంది
నీ గళ ఒక = నీ గొంతు ఒక
మధుర = మధురమైన
కవితల క్యాసెట్ లా = కవితలు ఉన్న టేపు రికార్డర్లో వేసి నే క్యాసెట్ లాగా
కనిపిస్తుంది! = అనిపిస్తుంది

భావం: ఓ కోకిలా నువ్వు కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే నీ ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. నీ గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు.

26 నుండి 29వ పంక్తి వరకు :

“కొత్త బిచ్చగాడు పొద్దెరుగ”నట్లు
ఎందుకే ఈ వేళ కూస్తున్నావు,
ఏడాదిపాటు సాగిన ‘మౌనవ్రతా’నికి
‘ఉద్యాపన’ చేస్తున్నావా ?

అర్థాలు :

కొత్త బిచ్చగాడు = కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు
పొద్దెరగనట్లు = సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు
ఎందుకే = ఎందుకోసం
ఈ వేళ కూస్తున్నావు = ఈ సమయంలో పాడుతున్నావు
ఏడాదిపాటు సాగిన = సంవత్సరం పాటు పాటించిన
మౌనవ్రతానికి = మౌనంగా ఉండటం అనే వ్రతానికి
‘ఉద్యాపన’ చేస్తున్నావా? = ఈ రోజు ముగింపు పలుకుతున్నావా ?

భావం : కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఎందుకోసం ఈ సమయంలో సంవత్సరకాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నావా అని కవి కోకిలను అడిగాడు.

30 నుండి 37వ పంక్తి వరకు :

ఔను మరి,
నువు ‘నోరుమూసు’క్కూర్చుంటే
ఎవరునిన్ను గుర్తిస్తారు ?
మా కవులు ‘ఆవాహనం’ చేసుకోవడం తప్ప –
చిలుకలా, హంసలా, నెమిలిలా
ఏ దేవుళ్లు నిన్ను ‘వాహనం’ చేసుకొంటారు ?
నల్లని వాళ్ల బ్రతుకు ఎప్పుడూ
ఈ సమాజంలో ఇంతే :

అర్థాలు :

ఔను మరి = నిజమే
నువు ‘నోరుమూసుకు’ + కూర్చుంటే = నువ్వు నోరుతెరవకుండా కూర్చొంటే
ఎవరునిన్ను గుర్తిస్తారు ? = ఎవరూ నిన్ను గుర్తించరు
మా కవులు = కవిత్వాన్ని చెప్పేవారు
‘ఆవాహనం’ చేసుకోవడం తప్ప = మాధుర్యాన్ని తమలో నింపుకోవాలని అనుకుంటారు తప్ప
చిలుకలా, హంసలా, నెమిలిలా = చిలుకలాగా, హంసలాగా, నెమలి లాగా
ఏ దేవుళ్లు నిన్ను ‘వాహనం’ చేసుకొంటారు ? = దేవుళ్ళెవరూ నిన్ను తమ వాహనంగా చేసుకోరు
నల్లని వాళ్ల బ్రతుకు ఎప్పుడూ = నల్లగా ఉండే వారి జీవితం ఎప్పటికి
ఈ సమాజంలో ఇంతే = ఈ సమాజం తక్కువగానే చూస్తుంది

భావం : నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు. కవులు మాత్రమె కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారు. చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న నిన్ను సమాజం గుర్తించదు అని కవి అన్నాడు. వాహనంగా వాడుకోవడం అంటే ఉపాధి ఉద్యోగాలను చూపడం. ఉద్యోగాలు ఇచ్చేవారు కూడా శరీరపు రంగును చూస్తున్నారని వ్యంగ్యంగా చెప్పాడు. చిలుకపలుకులు అనడంలో ఆంగ్ల విద్య ప్రభావం కనిపిస్తుంది.

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

38 నుండి 42వ పంక్తి వరకు :

కోకిలా! నాకు తెలుసు
ఎవరో సన్మానించాలన్న ఆశ నీకులేదు;
పై రవి మార్గం తప్ప –
‘పైరవి’ మార్గం నీకు తెలియదు
దైవమిచ్చిన కళను గళంవిప్పి ప్రదర్శిస్తున్నావు!

అర్థాలు:

కోకిలా ! = ఓ కోకిలా
ఎవరో సన్మానించాలన్న = ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే
ఆశ నీకులేదు = కోరిక నీకు లేదని
నాకు తెలుసు = నాకు బాగా తెలుసు
పై రవి మార్గం తప్ప = పైన ఉన్న సూర్యుడు చూపిన మార్గం తప్ప
‘పైరవి’ మార్గం = పైరవీలు చేసే దారి
నీకు తెలియదు = నీకు తెలియదు
దైవమిచ్చిన కళను = దేవుడు ప్రసాదించిన కళను
గళంవిప్పి ప్రదర్శిస్తున్నావు! = నీ గొంతు విప్పి ప్రదర్శిస్తున్నావు

భావం: ఓ కోకిలా ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక నీకు లేదనే విషయం నాకు తెలుసు. నీకు పైన ఉన్న సూర్యుడు చూపిన మార్గం మాత్రమె తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారి తెలియదు అని కవి అన్నాడు. అంటే కొంతమంది కళాకారులు పైరవీల ద్వారా గుర్తింపును పొందుతున్నారని ఆ గుర్తింపు కోసమే ప్రదర్శనలు చేస్తారని చెప్తున్నాడు. కోకిల అలా కాకుండా తనకు దేవుడు ఇచ్చిన కళను నిస్వార్థంగా ప్రదర్శిస్తుందని తెలిపాడు.

43 నుండి 48వ పంక్తి వరకు :

మావి చివుళ్లు మేస్తే నే –
నీ వింత మధురంగా కూస్తున్నావు !
మావిపళ్లు తిన్నా మేము
కఱకు కూతలే కూస్తున్నాము!!
ఆహారంలో ఏముందే కోకిలా
ఆ ‘సంస్కారం’ లో ఉంది కాని !

అర్థాలు :

కోకిలా = ఓ కోకిలా
మావి చివుళ్లు = మామిడి చిగురాకులు
మేస్తేనే = తిన్నందుకే
నీవు+ఇంత మధురంగా = నీవు ఇంత సంతోషాన్ని కలిగించే విధంగా
కూస్తున్నావు ! = పాడుతున్నావు
మావిపళ్లు తిన్నా = మామిడి పళ్ళు తిని కూడా
మేము = మానవులమైన మేము
కఱకు కూతలే = = బాధకల్గించే మాటలే
కూస్తున్నాము!! = మాట్లాడుతున్నాము
ఆహారంలో ఏముందే = తినే తిండిలో ఏముంటుంది
ఆ సంస్కారంలో ఉంది కాని ! = నేర్చుకునే సంస్కారంలోనే మన మాట తీరు ఉంటుంది

భావం : ఓ కోకిలా చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే నువ్వు ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతున్నావు. మానవులమైన మేము మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నాము. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు.

49 నుండి 56వ పంక్తి వరకు :

కోకిలా ! ఓ కోకిలా !!
నీకు ఇల్లు లేదు, వాకిలి లేదు ;
బరువు – బాధ్యతలసలే లేవు ;
నాలాగా బస్సు కోసం –
ఎదిరి చూడాల్సిన పని అంతకంటే లేదు !
‘ఆకులలములు’ మేసుకొంటూ,
హాయిగా ఆడుకొంటూ పాడుకొంటూ,
ఆకాశంలో విహరించే “రాగాల” దొరసానివి !

అరాలు:

కోకిలా ! కోలా ఓ కోలా !! = కోకిలా
నీకు ఇల్లు లేదు, వాకిలి లేదు = నీకు ఇల్లువాకిలి వంటి ఆస్తులు లేవు
బరువు బాధ్యతలు = చేయాల్సిన పనులు
అసలే లేవు; = అసలే లేవు
నాలాగా బస్సు కోసం = నా లాగ (మానవుల లాగ) బస్సుల కోసం
ఎదిరి చూడాల్సిన పని = ఎదురు చూడాల్సిన అవసరం (ఎవరిపైనా ఆధారపడవలసిన అవసరం నీకు లేదు. నీ రెక్కల కష్టాన్ని నమ్ముకున్నావని భావం)
అంతకంటే లేదు ! = అసలే లేదు
‘ఆకులలములు’ = ఆకులు అలములు (ఏది దొరికితే అదే తిని సంతోషిస్తావని అర్థం)
మేసుకొంటూ = తినుకుంటూ
హాయిగా = ఆనందంగా
ఆడుకొంటూ = ఆటలు ఆడుకుంటూ
పాడుకొంటూ = పాటలు పాడుకుంటూ
ఆకాశంలో విహరించే = ఆకాశంలో తిరిగే
“రాగాల” దొరసానివి ! = రాగాల దొరసానివి

భావం : కోకిలా నీకు ఇల్లు వాకిలి వంటి ఆస్తులు లేవు, బరువు బాధ్యతలు అసలే లేవు. మా మనుషుల లాగ బస్సులకోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆకులు అలములు ఇలా ఏది దొరికితే అదే తినుకుంటూ సంతృప్తిగా జీవిస్తావు. ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆకాశంలో తిరిగే రాగాల దొరసానివి.

57 నుండి 68వ పంక్తి వరకు :

“చార్మినార్” కొమ్ముమీద వాలుతావు,
“నౌబతపహాడ్” తొమ్ము మీద కాలూనుతావు;
మత విద్వేషాల రక్తం చిందేచోట –
సరిగమల రాగరక్తిమలారబోస్తావు !
“వర్ణ, వర్గ విభేదం” లేని
స్వేచ్ఛాపూరిత “సమతా” విహంగానివి నీవు !
నీ “జాతి సమైక్యత”ను అర్థంచేసుకోలేక,
నీ మధుర వాక్కుల్ని భరించలేక,
ఈ “కాకులు” నిన్ను తరిమికొడతాయి !
మంచి మాటలు ఎవరికి రుచిస్తాయి ?
“పెంచి పోషించే వాళ్ల” చేతనే
దూరం కొట్టబడే అభాగ్యురాలివి !

అర్థాలు :

“చార్మినార్” కొమ్ము మీద = చార్మినార్ మినార్ మీద
వాలుతావు = ఆగుతావు
“నౌబత్పహాడ్” తొమ్ము మీద = బిర్లా మందిరం పైనా
కాలూనుతావు; = కాలు పెడతావు
మత విద్వేషాల రక్తం = మతాల మధ్య విద్వేషాలు అనే రక్తం
చిందేచోట = ప్రవహించే స్థలాల్లో
సరిగమల రాగరక్తిమలు ఆరబోస్తావు ! = సరిగమలతో రాగాలు అనే అనురాగాలను పంచుతావు
“వర్ణ, వర్గ విభేదం” లేని = కులం, వర్గం అనే భేదాలు లేకుండా
స్వేచ్ఛాపూరిత = స్వేచ్ఛ కలిగిన
“సమతా” = సమానతను చాటి చెప్పే
విహంగానివి నీవు ! = పక్షివి
నీ “జాతి సమైక్యత”ను = అందరిని సమానంగా చూసే భావనను
అర్ధంచేసుకోలేక, = అర్థం చేసుకోలేని వారు
నీ మధుర వాక్కుల్ని = నీ అందమైన మాటలను
భరించలేక = భరించలేక, సహించలేక
ఈ “కాకులు” నిన్ను = లోకులు అనే కాకులు
తరిమికొడతాయి ! = తరిమి కొడుతాయి
మంచి మాటలు = మంచిని కలిగించే మాటలు
ఎవరికి రుచిస్తాయి ? = ఎవరికీ నచ్చావు అని భావం
“పెంచి పోషించే వాళ్ల చేతనే = నిన్ను పెంచిన పోషించిన వారి ద్వారానే
దూరం కొట్టబడే = దూరం కొట్టబడ్డ
అభాగ్యురాలివి ! = పేదరాలివివి

భావం : ఓ కోకిలా! నీవు చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైన స్వేచ్ఛగా వాలగలవు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా నీ రాగాలతో అనురాగాలను పంచుతావు. కుల మతాల భేదం పాటించని నీ సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే నీ మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా నిన్ను పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాల్సివి అని కవి అంటున్నాడు. కోకిలలకు గూడు నిర్మించుకోవడం తెలియదు అది తన గుడ్లను కాకి గూటిలో పెడితే కాకి ఆ గుడ్లను పొదిగి పిల్లను చేస్తుంది. కోకిల పెరిగి శబ్దం చేసినప్పుడు అది తనపిల్ల కాదని కాకి దానిని వెళ్లగొడుతుంది. అదే విధంగా తమ జాతి, తమ కులం, తమ మతం కాదు అని అనేకమంది మంచివారిని దూరం చేసుకుంటున్నారని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

69 నుండి 75వ పంక్తి వరకు :

కోకిలా, అటుచూడు !
కోకిలా, అటుచూడు ! ఆ పెద్దకోకిలకు
నీ మీద ఎందుకే అంత ద్వేషం.
నువ్వు “కుహూ కుహూ” అంటే –
అదీ “కుహూ కుహూ” అని
నీతో పోటీపడి కూస్తుంది !
“ప్రతిభ”కు “వర్ణభేదం” లేనట్లే
“ఈర్యా-ద్వేషాలకు” “వయోభేదం” లేదు !

అర్థాలు :

కోకిలా = ఓ కోకిలా!
అటుచూడు! = ఆ వైపు చూడు
ఆ పెద్ద కోకిలకు = వయసులో పెద్దదయిన ఆ కోకిలకు
నీ మీద ఎందుకే అంత ద్వేషం = నీ మీద ఎందుకు అంత కసి
నువ్వు “కుహూ కుహూ” అంటే = నువ్వు కుహు కుహు అంటే
అదీ కుహూ కుహూ” అని = అదికూడా కుహు కుహు అంటుంది
నీతో పోటీపడి కూస్తుంది ! = నీతో పోటీ పెట్టుకున్నట్లు కూస్తుంది
“ప్రతిభ”కు = తెలివికి, ప్రజ్ఞకు
“వర్ణ భేదం” = కులమతాల భేదం
లేనట్లే = లేని విధంగానే
“ఈర్ష్యా ద్వేషాలకు” =
ఈర్ష్య ద్వేషాలకు కూడా
“వయోభేదం” లేదు ! = వయస్సులలో భేదం లేదు

భావం : ఓ కోకిలా ఆ పక్కకు చూడు. ఆ పెద్దకోకిలకు నీ మీద ఎంత ద్వేషం ఉందో నీతో పోటీ పెట్టుకున్నట్లు నువ్వు ఎలా కూస్తే అది కూడా అలాగే కూస్తుంది. తెలివితేటలకు కులభేదాలు లేనట్టే ఈర్ష్యాద్వేషాలకు వయస్సు భేదం లేదు అని కవి చెప్పాడు. ఒక స్థాయిలో ఉన్న కళాకారులు వెనుక వస్తున్న కొత్త తరం కళాకారులను ఎదగనివ్వడం లేదని కవి భావన.

76 నుండి 84వ పంక్తి వరకు :

కోకిలా ! ఓ కోకిలా !!
నీ వెంతపాడినా
నీ పాటనూ, నీ పాటునూ గుర్తించదు – ఈ “విశ్వ” విద్యాలయం !
నిన్ను గుర్తించడానికి నువ్వు – “జాతీయ పక్షివి” కాదు, “ధవళ పారావతానివీ” కాదు; ప్రజలచే మొక్కులందుకోవడానికి – పాలపిట్టవూ కాదు !
కోకిలా ! ఓ కోకిలా !!
నీవు + ఎంతపాడినా

అర్థాలు :

కోకిలా ! ఓ కోకిలా = ఓ కోకిలా
నీవు + ఎంతపాడినా = నీవు ఎంతసేపు పాడినా
నీ పాటనూ = నీ పాట మాధుర్యాన్ని
నీ పాటనూ = నీ కష్టాన్ని
ఈ “విశ్వ” విద్యాలయం ! = ఈ విశ్వం అనే విద్యాలయం
గుర్తించదు = గుర్తింపును ఇవ్వదు
నిన్ను గుర్తించడానికి నువ్వు = నిన్ను గుర్తించి గౌరవించడానికి
“జాతీయ పక్షివి” కాదు = నీవు నెమలివి కావు
“ధవళ పారావతానివీ” కాదు = తెల్లని పావురానివి కావు
ప్రజలచే మొక్కులందుకోవడానికి = ప్రజలందరిచేత పూజలు పొందడానికి
పాలపిట్టవూ కాదు ! = పాలపిట్టవూ కావు

భావం : ఓ కోకిలా! నీవు ఎంతసేపు పాడినా నీ పాటలోని మాధుర్యాన్ని గాని, ఆ పాట పాడడానికి నువ్వు పడుతున్న కష్టాన్ని గాని ఈ విశ్వమనే విద్యాలయము గుర్తించడు అని కవి అనడంలో ఈ రోజుల్లో విశ్వవిద్యాలయాల గుర్తింపు కూడా రాజకీయాలతో ముడిపడి ఉందని సూచించాడు. జాతీయ పక్షి నెమలిని, తెల్లని పావురాన్ని, పాలపిట్టలను అగ్రవర్ణాలకు లేదా డబ్బున్న వారికి ప్రతీకలుగా తీసుకొని డబ్బుద్వారా లేదా కులం ద్వారా మాత్రమే గుర్తింపు లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

85 నుండి 97వ పంక్తి వరకు :

అందుకే – ఈ పట్నంలో ఎందుకే ?
రా, పోదాం మా పల్లెకు !
అక్కడ –
పచ్చని చెట్టే నీకు కట్టని వేదిక,
పైరగాలే నీకు పెట్టని మైకు;
కల్లా కపట మెరుగని పల్లెప్రజలే –
నిన్ను గుర్తించే శ్రోతలు !
ప్రతి “కొమ్మా” నీ “కళా” కౌశలంతో
పులకించి పోవాలి !
ప్రతి చెట్టూ నీ కమ్మని రాగంతో
సంగీత నిలయమైపోవాలి.
ప్రతి గుండె, ప్రతి గూడూ –
నీ మధుర గీతాలలో నిండిపోవాలి !

అర్థాలు :

అందుకే = అందుకే
ఈ పట్నంలో ఎందుకే ? = ఎవరూ పట్టించుకోని ఈ పట్నంలో ఎందుకుంటావు
మా పల్లెకు ! = మా పల్లెటూరికి
రా, పోదాం = రా పోదాం
అక్కడ = మా పల్లెటూరిలో
పచ్చని చెట్టే = పచ్చగా ఉన్న చెట్టు
నీకు కట్టని వేదిక = కట్టకుండా ఏర్పడ్డ వేదిక వంటిది
పైరగాలే, నీకు = చల్లని గాలి, నీకు
పెట్టని మైకు; = పెట్టకుండానే నీ పాటను మోసుకెళ్ళే మైకు వంటిది
కల్లా కపట మెరుగని = అబద్ధాలు, మోసాలు తెలియని
పల్లెప్రజలే = ఆ జానపదులే
నిన్ను గుర్తించే = నీ కళను గుర్తించి ఆస్వాదించే
శ్రోతలు ! = శ్రోతలు, వినేవారు
ప్రతి “కొమ్మా” = ఆ ఊరిలో ఉండే ప్రతీ కొమ్మా
నీ “కళా” కౌశలంతో = నీ గళ మాధుర్యంతో
పులకించి పోవాలి ! = పరవశించి పోవాలి
ప్రతి చెట్టూ = ఆ పల్లెలోని ప్రతీ చెట్టూ
నీ కమ్మని రాగంతో = నీ కమ్మని గానంతో
సంగీత నిలయమైపోవాలి = సంగీత భరితం కావాలి
ప్రతి గుండె = ప్రతీ వ్యక్తి హృదయం
ప్రతి గూడూ = ప్రతీ ఇల్లు, నివాసం
నీ మధుర గీతాలలో = నీ మధురమైన పాటలతో
నిండిపోవాలి ! = నిండాలి

భావం: నీ కళకు గుర్తింపు లేని ఈ పట్నంలో ఎందుకు ఉండటం ? నాతో మా పల్లెకు పోదాం పద. అక్కడ ప్రతీచెట్టు నీకు కట్టని వేదికలాగా, పైరగాలి పెట్టని మైకులాగా అబద్దాలు, మోసాలు తెలియని పల్లెజనం నీ కళను ఆస్వాదించే శ్రోతలుగా ఉంటారని కవి చెప్పాడు. అంటే పట్నాలలో భారీ వేదికలు, మైకులు, హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నా ఆ కళను ఆస్వాదించే శ్రోతలు లేరని, ఆ లోటు పల్లెటూరిలో తీరుతుందని భావం.

ఆ పల్లెటూరికి వెళ్లి ప్రతీకొమ్మను తన గానమాధుర్యంతో పరవశించే విధంగా, ప్రతీ చెట్టు తన కమ్మని గానంతో నిండిపోవాలని, ప్రతీ హృదయం, ప్రతీ ఇల్లు తన మధురమైన పాటలతో నిండాలని కవి సూచించాడు. అంటే కళకు గుర్తింపు ఉన్న దగ్గరే కళాకారుడు ఉండాలని కవి సూచన.

కోకిలా! ఓ కోకిలా ! Summary in Telugu

(‘నైమిశారణ్యం’ కవితా సంపుటిలో నుండి)

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !! 1

కవి పరిచయం

పాఠం పేరు : కోకిలా ! ఓ కోకిలా!
గ్రంథం : నైమిశారణ్యం అనే కవిత సంపుటి
దేని నుండి గ్రహించబడినది : “నైమిశారణ్యం” అనే కవితా సంపుటి నుండి గ్రహింపబడింది.
రచయిత : కనపర్తి రామచంద్రాచార్యులు
కాలం : జననం : ఆగస్టు 8, 1947 మరణం : జూన్ 16, 2011
స్వస్థలం : పూర్వీకులది మెదక్ జిల్లా గట్లమల్యాల – జననం భద్రాచలంలో
తల్లిదండ్రులు : భూలక్ష్మమ్మ, రంగయ్య

ఇతరాలు :

  • కనపర్తి తల్లి భూలక్ష్మమ్మ తెలుగు పండిట్గా పనిచేసింది.
  • తండ్రి రంగయ్య తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లాడు.
  • ఆ భద్రాద్రిరాముని సన్నిధిలో జన్మించినందున రామచంద్రుడు అని పేరు పెట్టారు.
  • తల్లి దగ్గర భారత, భాగవత, రామాయణాది కావ్యాలు చదివాడు.

విద్యాభ్యాసం :

  • ఉపనిషత్తులపట్ల అమితాసక్తి ఉండేది.
  • పి.యు.సి సిద్దిపేటలో, బి.ఓ.యల్ హైదరాబాదులోని ఆంధ్రసారస్వత పరిషత్లో పూర్తి చేశాడు. తరువాత తెలుగు పండిత శిక్షణ తీసుకున్నాడు.

వృత్తి : మొదట పశుసంవర్ధకశాఖలో ఉద్యోగిగా, విద్యాశాఖలో ఉపాధ్యాయునిగా పనిచేశాడు.

రచనలు :

  • ఈయన మొత్తం 48 కావ్యాలు రాశాడు.
  • ఈయన వచన కవిత్వం, పద్యం, గేయం, కథ, అనువాద సాహిత్యం, వ్యాసాలు రాశాడు. ‘హృదయాంజలి’ పేరుతో రవీంద్రుని గీతాంజలి తెలుగులోకి అనువాదం చేశాడు. + వచన కవితా విస్తృతి కోసం విశేషంగా కృషిచేశాడు.
  • ఈయనకు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, సంస్కృత భాషలలో మంచి ప్రావీణ్యం ఉంది.
  • బెర్నార్డ్ షా రచనలు, తులసీదాస్ ‘దోహాలు’ చిన్న చిన్న నీతికథలుగా అనువదించాడు.

పురస్కారాలు : ‘అక్షర శిల్పాలు’ కావ్యానికి వేముగంటి పురస్కారం,

బిరుదులు :

  • వెలుతురుపూలు’ కావ్యానికి జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారం
  • వచన కవితాప్రవీణ బిరుదు, స్వర్ణకంకణ పురస్కారం అందుకున్నాడు.

కనపర్తి విద్యాభ్యాసం జరిగిన ప్రదేశాలు : “కనపర్తి’ విద్యాభ్యాసం మిట్టపల్లి, సిద్ధిపేట, చిన్నకోడూరులలో జరిగింది.
రచయిత ఇంటిపేరు ఎలా స్థిరపడింది : రచయిత తల్లి పేరు “కనపర్తి భూలక్ష్మమ్మ” కావడంతో ‘కనపర్తి’ అనేది, రచయిత ఇంటిపేరుగా స్థిరపడింది.

TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

పాఠ్యభాగ సందర్భం

ఒకరోజు హైదరాబాద్ కోఠి సెంటర్లో బస్సుకోసం ఎదురు చూస్తున్నప్పుడు వినిపించిన కోకిల కుహూరావాలకు ప్రతిస్పందించి రాసింది కోకిలా! ఓ కోకిలా! అనే ఈ కవిత. కోకిల పాటను ఆలంబనగా చేసుకొని నగర జీవితాన్ని, సమాజంలోని వర్ణవివక్షను, సామాన్యుల ప్రతిభను అందంగా వ్యంగ్య గర్భితంగా చెప్పాడు కవి. జాతి సమైక్యతను, సమతాభావాన్ని చాటిచెప్పే ప్రబోధాత్మక కవిత ఇది.

పాఠ్యభాగ సారాంశం

పట్నంలో కళను ఆస్వాదించే సమయం లేదని చెప్పడం : ఓ కోకిలా! భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమన లాగ ఉత్సాహాన్ని కలిగిస్తున్నావు. నువ్వు ఏ కరెంటు స్తంభం పైన, ఏ ఏడంతస్తుల మేడపైన కనబడకుండా ఉన్నావో అని, కోకిలను కళాకారులకు ప్రతీకగా తీసుకొని ఆధ్యాత్మికతను, దేశభక్తిని ప్రబోధించే కళాకారులు కనబడకుండా ఉన్నారని కవి భావించాడు. కొందరు కళాకారులు ఏడంతస్తుల మేడలో రాజభోగాలు అనుభవిస్తుంటే మరికొందరు డబ్బులేక పేదరికంలో ఉన్నారని ధ్వనింపజేశాడు.

ఈ పట్టపగలు, మండుటెండలో నీవు పాడుతున్న పాటతో నా గుండెను కరిగించావు. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్లో ఎవరో కోటిమందిలో ఒకడు నా వంటి వాడికి తప్ప నీ పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని భావం.

ఈ నగర జనాల్లో ఎవరి తొందర వారికి ఉంది. ఎవరి పనులు వారికి ఉన్నాయి. ఇష్టం ఉన్నా లేకున్నా వేగంగా వెళ్ళాల్సిన స్థితిలో ఉన్నారు. అందరూ ఒకరిని తొక్కి పైకి రావాలని ఆశిస్తున్నవారే. అందరూ తమ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వారిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నవారే. ఓ కోకిలా ! ఎవరో వన్స్ మోర్ అని అన్నట్లు పాడిన పాటనే మళ్ళీ మళ్ళీ పాడుతున్నావు. ఆహా ఓహో అనే పొగడ్తల మాటలే తప్ప డబ్బు ఎవరూ ఇవ్వరే అని చెప్తున్నాడు కవి. కళాకారులకు చప్పట్లు తప్ప నగదు బహుమతులు, ప్రోత్సాహాలు ఉండడం లేదని భావం.

కళాకారులను వారి కులం రంగు ఆధారంగా గౌరవించడం : ఓ కోకిలా నువ్వు కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే నీ ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. నీ గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఎందుకోసం ఈ సమయంలో పాడుతున్నావు. సంవత్సర కాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నావా అని కవి కోకిలను అడిగాడు.

నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు. కవులు మాత్రమె కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారు. చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న నిన్ను సమాజం గుర్తించదు అని కవి అన్నాడు. వాహనంగా వాడుకోవడం అంటే ఉపాధి ఉద్యోగాలను చూపడం. ఉద్యోగాలు ఇచ్చేవారు కూడా శరీరపు రంగును చూస్తున్నారని వ్యంగ్యంగా చెప్పాడు. చిలుకపలుకులు అనడంలో ఆంగ్ల విద్య ప్రభావం కనిపిస్తుంది.

కళాకారుల నిస్వార్థత : ఓ కోకిలా ! ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక నీకు లేదనే విషయం నాకు తెలుసు. నీకు పైన ఉన్న సూర్యుడు చూపిన మార్గం మాత్రమె తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారీ తెలియదు అని కవి అన్నాడు. అంటే కొంతమంది కళాకారులు పైరవీల ద్వారా గుర్తింపును పొందుతున్నారని ఆ గుర్తింపు కోసమే ప్రదర్శనలు చేస్తారని చెప్తున్నాడు. కోకిల అలా కాకుండా తనకు దేవుడు ఇచ్చిన కళను నిస్వార్థంగా ప్రదర్శిస్తుందని తెలిపాడు. ఓ కోకిలా ! చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే నువ్వు ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతున్నావు.

మానవులమైన మేము మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నాము. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు. ఓ కోకిలా ! నీకు ఇల్లు వాకిలి వంటి ఆస్తులు లేవు, బరువు బాధ్యతలు అసలే లేవు. మా మనుషుల లాగ బస్సులకోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఆకులు అలములు ఇలా ఏది దొరికితే అదే తినుకుంటూ సంతృప్తిగా జీవిస్తావు. ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆకాశంలో తిరిగే రాగాల దొరసానివి.

కోకిల సామాజిక సమరసత : ఓ కోకిలా! నీవు చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలవు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా నీ రాగాలతో అనురాగాలను పంచుతావు. కుల మతాల భేదం పాటించని నీ సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే నీ మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా నిన్ను పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలివి అని కవి అంటున్నాడు. కోకిలలకు గూడు నిర్మించుకోవడం తెలియదు అది తన గుడ్లను కాకి గూటిలో పెడితే కాకి ఆ గుడ్లను పొదిగి పిల్లను చేస్తుంది. కోకిల పెరిగి శబ్దం చేసినప్పుడు అది తనపిల్ల కాదని కాకి దానిని వెళ్లగొడుతుంది. అదే విధంగా తమ జాతి, తమ కులం, తమ మతం కాదు అని అనేకమంది మంచివారిని దూరం చేసుకుంటున్నారని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు.

ఓ కోకిలా ! ఆ పక్కకు చూడు. ఆ పెద్దకోకిలకు నీ మీద ఎంత ద్వేషం ఉందొ నీతో పోటీ పెట్టుకున్నట్లు నువ్వు ఎలా కూస్తే అది కూడా అలాగే కూస్తుంది. తెలివితేటలకు కులభేదాలు లేనట్టే ఈర్ష్యాద్వేషాలకు వయస్సు భేదం లేదు అని కవి చెప్పాడు. ఒక స్థాయిలో ఉన్న కళాకారులు వెనుక వస్తున్న కొత్త తరం కళాకారులను ఎదగనివ్వడం లేదని కవి భావన.

ఓ కోకిలా ! నీవు ఎంతసేపు పాడినా నీ పాటలోని మాధుర్యాన్ని గాని, ఆ పాటపాడడానికి నువ్వు పడుతున్న కష్టాన్ని గాని ఈ విశ్వమనే విద్యాలయము గుర్తించదు అని కవి అనడంలో ఈ రోజుల్లో విశ్వవిద్యాలయాల గుర్తింపు కూడా రాజకీయాలతో ముడిపడి ఉందని సూచించాడు. జాతీయ పక్షి నెమలిని, తెల్లని పావురాన్ని, పాలపిట్టలను అగ్రవర్ణాలకు లేదా డబ్బున్న వారికి ప్రతీకలుగా తీసుకొని డబ్బుద్వారా లేదా కులం ద్వారా మాత్రమే గుర్తింపు లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

పల్లెల్లో కళకు గౌరవం : నీ కళకు గుర్తింపు లేని ఈ పట్నంలో ఎందుకు ఉండటం ? నాతో మా పల్లెకు పోదాం రా. అక్కడ ప్రతీచెట్టు నీకు కట్టని వేదికలాగా, పైరగాలి పెట్టని మైకులాగా అబద్దాలు, మోసాలు తెలియని పల్లెజనం నీ కళను ఆస్వాదించే శ్రోతలుగా ఉంటారని కవి చెప్పాడు.

అంటే పట్నాలలో భారీ వేదికలు, మైకులు, హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నా ఆ కళను ఆస్వాదించే శ్రోతలు లేరని, ఆ లోటు పల్లెటూరిలో తీరుతుందని భావం. ఆ పల్లెటూరికి వెళ్లి ప్రతీకొమ్మను తన గానమాధుర్యంతో పరవశించే విధంగా, ప్రతీ చెట్టు తన కమ్మని గానంతో నిండి పోవాలని, ప్రతీ హృదయం, ప్రతీ ఇల్లు తన మధురమైన పాటలతో నిండాలని కవి సూచించాడు. అంటే కళకు గుర్తింపు ఉన్న దగ్గరే కళాకారుడు ఉండాలని కవి సూచన.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 4th Poem దుందుభి Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 4th Poem దుందుభి

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
‘దుందుభి’ ప్రవాహ దృశ్యాలను వివరించండి. (V.Imp)
జవాబు:
దుందుభి ప్రవాహ దృశ్యాలను గంగాపురం హనుమచ్ఛర్మ మనోహరంగా వర్ణించాడు. తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ ప్రవహిస్తుంది. గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చి, కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మనసులను ‘ఆనందపరిచి, గోదావరి కృష్ణా నదులు అందడం లేదనే బాధను తీర్చి ప్రసిద్ధి పొందింది.

తలచుకోగానే హృదయమనే వీణ తెగలపై ఝం అనే ధ్వనులు చేస్తూ, కదలగానే అమాయకత్వము నీరుగా మారి, రాళ్లు కరిగి, హృదయంలో కీర్తించే భర్తపై ప్రేమలు గిలిగింతలు పెడుతుంటే ఆగకుండా వస్తున్నది.

దుందుభి అధికమైన కరుణతో పేదల వైపు నిలిచి, ధనమే ప్రధానమని భావించే గుణాన్ని అసహ్యించుకుంటూ, జనుమును తుంగ గడ్డిని, చాలా పొడుగ్గా పెంచి, వారు నివసించడానికి గుడిసెలను కట్టిచ్చి, తాగడానికి మంచి నీటిని ఇచ్చినందుకు కలిగిన సంతోషంతో గంతులు వేస్తున్నది.

రాయిని ఉలితో మలచి, మూసలో కరిగించి పోసిన చిత్రాల లాగా, స్వేచ్ఛగా కల్పించిన ఆకారాలకు రూపం ఇచ్చి చూసిన ప్రజలకును ఆనందపరచి, పేరుకూడా ఆశించని శిల్పకులంలోని గొప్పవారి చేతి నైపుణ్యం లాగ ఆనందింప చేయడానికి ప్రతీ వర్షాకాలంలో ప్రవహిస్తుంది.

కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోన బుద్ధారెడ్డి నీస్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. అటువంటి సుకుమారమైన నీ శరీరంలో వరదల సమయంలో కఠినత్వాన్ని పెంచుకుని ప్రవహిస్తుంది.

తెలియని సమయంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై నీ మనస్సులో అనాసక్తత లేదు. మంచి తులసి చెట్ల వరుసలతో, మారేడు వృక్షాల సమూహాలతో నీ రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలవై ప్రవహిస్తున్నది. అందంగా ప్రవహించే ఓ దుందుభి వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, మా పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు సాగిపోతున్నది.

హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆనకట్టచే బంధించబడి, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహించి, పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామి పూజలు చేసి అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపి, ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, లోకంలో అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా మాకు పాలవెల్లిగా, పాల ఏరుగా ప్రవహించింది.

ప్రశ్న 2.
దుందుభి గొప్పతనాన్ని తెలుపండి. (V.Imp) (M.P)
జవాబు:
గంగాపురం హనుమచ్ఛర్మ దుందుభి నది గొప్పతనాన్ని చక్కగా వర్ణించాడు. కొంతమంది స్వార్థపరులు వారి విలాసాలకోసం ఏవో చట్టాలు చేసి ఈ భూమిని ఆక్రమించుకుని గర్వాన్ని పొంది వారి ఆనందం కోసం చేసిన ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తీసుకోలేక బాధతో మరణించి దీనస్థితిలో ఎండిపోయిన వారి అస్థిపంజరాలు దుందుభి ఒడిలో శాశ్వతమైన శాంతిని సుఖాన్ని పొందాయన్నారు.

పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు దుందుభి తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారు.

అద్దంలాగా స్వచ్ఛంగా ఉన్న నీటిలో తన రూపాన్ని చూసుకుంటున్న ఆ అందమైన చందమామ దుందుభి ఒడిలో నిద్రపోతున్నప్పుడు కీచురాయి శబ్దాలతో జోలపాటలు పాడిన విధంగా ఊగుతున్న అలలు అనే ఊయలలో ముద్దుగొలిపే విధంగా ప్రకాశవంతమైన శరత్కాలంలోని వెన్నెలలో తల్లిలాగామారి నిద్రపుచ్చుతుంది. పేదవారి ఇండ్లకోసం తమ శరీరాన్ని పెంచి, భిన్నత్వం లేని విధంగా పేర్చుచు, తాటికమ్మలతో గుడిసె కప్పును తయారు చేసి మెప్పును పొందుచు, వాటి శక్తి నశించగానే తాటి ఆకుల కుప్పతో వేసిన చలి మంటలతో పేదవారు చలిని పోగొట్టుకుంటారు. దుందుభి పెంచిన కారణంగా తాటిచెట్లపై ప్రేమలు పెరిగాయి.

లోకంలో సాగిన హింసను లేకుండా చేయడానికి పాదాల దగ్గర ఉన్న చీమలుకూడా చనిపోకుండా చూసే, నశించి పోతున్న మానవత్వాన్ని తిరిగి నిలపడానికి ప్రయత్నించిన జైన తీర్థంకరులకు కూడా తాగడానికి అనువైన జలాన్ని ఇచ్చిన కీర్తిని పొందింది. పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన దుందుభి నదిని బంధించడం పిచ్చి పని. పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కల దుందుభి విషయంలో సాధ్యపడదు.

సగం పేగును తడపడానికి సరిపోని అత్యంత తక్కువ ఆహారం కూడా లేని, రక్తాన్ని ఆవిరిగా చేసి, లోకానికి మంచి చేయడానికి ప్రయత్నం చేసి ఈ భూమిని తమ చెమటతో తడిపి కష్టాలతో బాధపడే మానవులకు అత్యంత ప్రేమతో మంచి మొదటి పంటగా సీతాఫలాలను ఇచ్చి తన కారుణ్యాన్ని చూపినందుకు కవి మెచ్చుకున్నాడు.

అలలు అనే చేతులతో ఆడే ఆటలు చూసి చెట్లు పూలతో పులకరించాయి. ఒక్కొక్క పులకరింత ఒక్కొక్క పుష్పమై వికసించింది. పుష్పించిన ఒక్కొక్క పూవు ఒక్కొక్క తేనె నిండిన పాత్రగా ఆతిథ్యం ఇచ్చింది. దుందుభి ప్రవహించి తెలుగు భూములను పవిత్రంగా మార్చింది. తెలుగు సంస్కృతులతో ప్రకాశించే దుందుభి పంట భూములకు పాలు ఇవ్వడానికి ప్రవహించింది కావున తన గొప్పతనాన్ని కావ్యంలో పెట్టాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
దుందుభిని తలచుకొని కవి పొందిన అనుభూతి ఏమిటి ?
జవాబు:
తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ, గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చిందని గంగాపురం హనుమచ్ఛర్మ భావించాడు. తమ కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మనసులను ఆనందపరిచిందని, గోదావరి కృష్ణా నదులు మాకు అందడం లేదనే బాధను తీర్చడమే నిజమైన ప్రసిద్ధి అవుతుందని అనుకున్నాడు. ఇంకా బంగారు రంగులు నిండిన సంధ్యా సమయాలు, మామిడి పూతను తిని ఎక్కువగా సంతోషించి కోకిలలు చేస్తున్న శబ్దాలు, తొలకరి వర్షానికి ముందు కనిపించే నల్లని మేఘాలు, ఆ మబ్బుల్లోంచి తొంగి చూసే మెరుపులు నాకు ఒక ఆలోచనను కలిగించి కొత్త గీతాలతో నిన్ను ఆనంద పరచుమన్నవని గంగాపురం హనుమచ్ఛర్మ అనుభూతిని పొందాడు.

ప్రశ్న 2.
దుందుభితో కవులకున్న సంబంధాన్ని తెలుపండి. (V.Imp) (M.P)
జవాబు:
కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోనబుద్ధారెడ్డి. అతని దుందుభి స్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. తెలియని సమయంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై దుందుభి మనస్సులో అనాసక్తత లేదు. మంచి తులసి చెట్ల వరుసలతో, మారేడు వృక్షాల సమూహాలతో రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలుగా ప్రవహిస్తున్నదని చెప్పడం ద్వారా దుందుభికి కవులకు ఉన్న సంబంధాన్ని గంగాపురం హనుమచ్ఛర్మ వివరించాడు.

ప్రశ్న 3.
జంతువులను, పక్షులను దుందుభి ఎలా ఆదరిస్తుంది ?
జవాబు:
కదులుతున్న గడ్డిపోచకు కూడా భయపడి చెల్లాచెదరుగా పారిపోయే జింకలు, దుప్పుల సమూహాలు అడవిలో తిరిగితిరిగి అలిసిపోయి దాహంతో నీరు తాగడానికి దుందుభి దగ్గరకు వస్తాయి. కింది పెదవులు ఆనించి నీరు తాగుతుండగా చేపలు గంతులు వేస్తుంటే భయపడతాయి. దాహం తీరక కలిగే బాధతో అవి దిక్కులు పట్టుకొని పారిపోతుంటే దుందుభి ఉపాయంతో చూస్తుంది. వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు పోతుంది.

ప్రశ్న 4.
దుందుభి ఎక్కడ పుట్టి ఎక్కడెక్కడ పారింది ?
జవాబు:
హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆనకట్ట దగ్గర కొంత ఆగుతుంది. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహిస్తుంది. పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామికి పూజలు చేస్తుంది. అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపుతుంది.

ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపుతుంది. శాశ్వతంగా తెలుగు బిడ్డలకు ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి తల్లిగా, పాలవెల్లిగా, పాల ఏరుగా ప్రవహిస్తుంది.

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గంగాపురం హనుమచ్ఛర్మ స్వగ్రామం ఏది ?
జవాబు:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి దగ్గర ఉన్న గూడూరు. జన్మ స్థలం వేపూరు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

ప్రశ్న 2.
దుందుభి ఒడిలో శాంతి పొందినవి ఏవి ?
జవాబు:
దైన్య, శుష్క కంకాలములు. ఎండిన అస్థిపంజరాలు

ప్రశ్న 3.
జాతి వికాసానికి జీవగఱ్ఱ ఏది ?
జవాబు:
దేవాలయాల వికాసం

ప్రశ్న 4.
హనుమచ్ఛర్మ అముద్రిత సుప్రభాతం పేరేమిటి ?
జవాబు:
గంగాపురం చెన్నకేశవ సుప్రభాతం

ప్రశ్న 5.
దుందుభి అద్దాన్ని చూసి రూపము దిద్దుకొనేదెవరు ?
జవాబు:
చందమామ

ప్రశ్న 6.
తొలి పంటగా దుందుభి ఏ ఫలాలనిస్తుంది ?
జవాబు:
సీతాఫలాలను

ప్రశ్న 7.
విజయపురిని ఏలిన వారెవరు ?
జవాబు:
ఇక్ష్వాకులు

ప్రశ్న 8.
దుందుభి నది ఎక్కడ పుట్టింది ?
జవాబు:
భాగ్యనగరానికి అత్యంత సమీపంలో.

IV సందర్భసహిత వ్యాఖ్యలు

1. నీదు తీరమున రాచరికమ్ముల నోచిరెందరో
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.

సందర్భం : పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి, జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు దుందుభి తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారని కవి చెప్పిన సందర్భం లోనిది ఈ వాక్యం.

అర్థం : నీ సమీపంలోనే రాజ్య పాలన చేసే అదృష్టాన్ని పొందారు అని అర్థం.

వివరణ : దుందుభి నదీ తీరంలో ఎంతో మంది చాళుక్య రాజులు చాల ఆనందంగా రాజ్య పాలన చేశారని

2. పారెదవు తాత్వికత న్శివకేశవాఢ్యవై
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.

సందర్భం : ప్రాచీన కాలంలో కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై దుందుభి మనస్సులో అనాసక్తత లేదు. విష్ణువుకు ఇష్టమైన మంచి తులసి చెట్ల వరుసలతో, శివునికి ఇష్టమైన మారేడు వృక్షాల సమూహాలతో రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన హరి హరాద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలిగా ప్రవహిస్తుందని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం : శివ కేశవ అద్వైత తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలిగా ప్రవహిస్తావని అర్థం.

వివరణ : దుందుభి నదికి రెండు వైపులా తులసీ, మారేడు చెట్లు ఉన్నవి కావున హరి హరాద్వైతాన్ని పాటించిందని భావం.

3. విమలభాస్వద్రూప శైవాలినీ
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.

సందర్భం : పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ ! నిన్ను బంధించారు. ఇదెక్కడి పిచ్చి తెలివి? పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కలదానివైన నీ విషయంలో సాధ్యమవుతుందా ? అని కవి ప్రశించిన సందర్భం లోనిది ఈ వాక్యం.

అర్థం : పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ అని అర్థం.

వివరణ : పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యం కానట్టే పవిత్రమైన దుందుభిని ఆపడం సాధ్యం కాదని భావం.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

4. మముబెంచు తల్లివై మా పాలవెల్లివై
జవాబు:
కవి పరిచయం : గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన దుందుభి కావ్యం నుండి గ్రహించిన దుందుభి అనే పాఠం నుండి తీసుకున్నది ఈ వాక్యం. హనుమచ్ఛర్మ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కవి.

సందర్భం : ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా, మాకు పాల వెల్లిగా ప్రవహిస్తావా ! అని దుందుభిని కవి అడుగుతున్న సందర్భం లోనిది ఈ వాక్యం.

అర్థం : మమ్మల్ని పెంచి తల్లివి, మా పాలిట పాల నదివి అని అర్థం.

వివరణ : దుందుభి తెలుగు వారందరికీ తల్లిలాగా పోషణకు కావలిసినవన్నీ ఇస్తుందని భావం.

పద్యములు – ప్రతిపదార్థ తాత్పర్యములు

1వ పద్యం :

మ॥ తొలిజల్లు ల్గురియంగ ! పేరలల పొత్తుంగొంచు పోరాడి యొ
డ్డులతో రాయుచు గ్రామసీమలకు గోడుంబాప నేతెంచి, మా
తలపు ల్ముట్టియు సస్యపాకముల నాత్మ ల్దేర్చి; గోదమ్మ
కృ స్థలు మాకందని కుందు దీర్చితి ప్రశస్తం బిద్దియౌ ! దుందుభీ !

ప్రతిపదార్థం :

దుందుభీ ! = ఓ దుందుభి నదీ!
తొలిజల్లుల్ = తొలకరి వాన
కురియం = పడగానే
పేరు + అలల = పెద్ద అలలతో
పొత్తుంగొంచు = స్నేహం చేసి
పోరాడి = పోరాటం చేసి
ఒడ్డులతో రాయుచు = గట్లను తాకుతూ
గ్రామసీమలకు = గ్రామాల్లోని భూములకు
గోడు = బాధ
బాపన్ = పోగొట్టడానికి
ఏతెంచి = వచ్చి
మా తలపులు = మా కోరికలు
ముట్టియు = తాకి, తీర్చి
సస్య = పైరు
పాకములన్ = పంటలతో
ఆత్మల్ + తేర్చి = మనసులను ఆనందపరచి
గోదమ్మ = గోదావరి నదీ
కృష్ణలు = కృష్ణా నది మొదలైనవి
మాకు + అందని = మాకు అందడం లేవు అనే
కుందున్ = “బాధ
తీర్చితి = తీర్చావు
ప్రశస్తంబు + ఇద్దియౌ ! = ఇదే నిజమైన ప్రసిద్ధి అవుతుంది

తాత్పర్యం : ఓ దుందుబి,! తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ, మా గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చి, మా కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మా మనసులను ఆనందపరిచి, గోదావరి కృష్ణా నదులు మాకు అందడం లేదనే బాధను తీర్చావు. ఇదే నిజమైన ప్రసిద్ధి అవుతుంది.

2వ పద్యం :

ఉ||
బంగరు రంగుల న్విరియఁ బారిన సంధ్యలు మావిపూత ను
ప్పొంగిన కోయిలమ్మ రుతముల్ ! తొలికారు మొయిళ్ళు ! వానిలో
వంగి చలించు చంచలలు ! నాకొక భావన నేర్పరించి ని
న్నుం గిలిగింతగొల్పుమనె నూతనగీతి మదంబ దుందుభీ !

ప్రతిపదార్థం :

మత్+అంబ దుందుభీ != మా అమ్మ వంట దుందుభి
బంగరు రంగులన్ = బంగారపు రంగులు
విరియం బారిన = వ్యాపించిన
సంధ్యలు = సంధ్యా సమయాలు (ఉదయాలు, సాయంత్రాలు)
మావి పూతన్ = మామిడి పూతతో
ఉప్పొంగిన = ఎక్కువ సంతోషించి
కోయిలమ్మ రుతముల్ = కోకిలలు చేసే శబ్దాలు, ధ్వనులు
తొలికారు మొయిళ్ళు! = తొలకరి వర్షానికి ముందు ఉండే నల్లని మబ్బులు
వానిలో = ఆ మేఘాలలో నుండి
వంగి చలించు = వంపులతో కదిలే
చంచలలు! = మెరుపులు
నాకున్ + ఒక = నాకు ఒక రకమైన
భావనన్ = ఆలోచనను, ఊహను
ఏర్పరిచి = కలిగించి
నిన్నుం = నిన్ను (దుందుభిని)
నూతనగీతి = కొత్త పాటలతో
గిలిగింత గొల్పుము+అనె = ఆనంద పరుచుమన్నవి

తాత్పర్యం : మా అమ్మ వంటి దుందుభి! బంగారు రంగులు నిండిన సంధ్యా సమయాలు, మామిడి పూతను తిని ఎక్కువగా సంతోషించి కోకిలలు చేస్తున్న శబ్దాలు, తొలకరి వర్షానికి ముందు కనిపించే నల్లని మేఘాలు, ఆ మబ్బుల్లోంచి తొంగి చూసే మెరుపులు నాకు ఒక ఆలోచనను కలిగించి కొత్త గీతాలతో నిన్ను ఆనంద పరచుమన్నవి.

3వ పద్యం :

చ||
తలచినయంతనే హృదయ తంత్రుల ఝమ్మని మ్రోతలెత్తెనో
మలచినగుండెలోపలి యమాయికత ల్జలమై స్రవించెనో
శిలలు ద్రవించెనో, యెద భజించు ప్రియుండగు స్వీయనాథుపై
వలపులు పుల్కరించుడు నభంగురతం జనుదెంతు దుందుభీ!

ప్రతిపదార్థం :

దుందుభీ! = ఓ దుందుభి
తలచిన అంతనే = మనసులో తలుచుకోగానే, అనుకోగానే
హృదయ తంత్రుల = హృదయమనే వీణ తీగలపై
ఝం + అని = ఝం అనే
మ్రోతలు+ఎత్తైన్+ఓ = ధ్వనులు వచ్చాయా ?
మలచిన = కదిలిన
అమాయికతల్ = అమాయకత్వం, తెలియనితనం
జలమై = నీరై
స్రవించెనో = కారిందా
శిలలు = రాళ్లు
ద్రవించెనో = కరిగాయా
ఎద = హృదయంలో
భజించు = కీర్తించే
ప్రియుండు + అగు = ప్రియమైన వాడైన
స్వీయ నాథుపై = భర్తపై
వలపులు = ప్రేమలు
పుల్కరించుడున్ = గిలిగింతలు పెడుతున్నాయా
అభంగురతన్ = ఆగకుండా (భంగం = ఆటంకం)
చనుదెంతు = వస్తున్నావు

తాత్పర్యం : ఓ దుందుభి ! తలచుకోగానే నీ హృదయమనే వీణ తీగలపై ఝం అనే ధ్వనులు వెలువడ్డాయా ? కదలగానే నీ అమాయకత్వము నీరుగా మారిందా ? రాళ్లు కరిగాయా ? నీ హృదయంలో కీర్తించే నీ ప్రియుడైన భర్తపై ప్రేమలు గిలిగింతలు పెడుతున్నాయా ? ఆగకుండా వస్తున్నావు ?

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

4వ పద్యం :

ఉ||
కూళలు కొంద రేవొ తమ కోసము శాసనముల్ సృజించి, భూ
గోళము నాక్రమించుకొని, క్రొవ్వగ వారి విలాసఘట్టనన్
వేళకు కూడుగానక తపించి గతించిన దైన్య శుష్క కం
కాళము లెన్నొ నీయొడిని గాంచె నిరంతర శాంతి సౌఖ్యముల్.

ప్రతిపదార్థం:

కొందరు = కొంత మంది
కూళలు = క్రూరులు
తమ కోసము = స్వార్థం కోసం
శాసనముల్ = చట్టాలను
సృజించి = తయారు చేసి
భూగోళమున్ = భూమిని
ఆక్రమించుకొని = వశపరచుకొని
క్రొవ్వగ = గర్వాన్ని పొంది
వారి విలాస ఘట్టనన్ = వారి యొక్క ఆనందం కోసం చేసే ఒత్తిడివల్ల
వేళకు = సమయానికి
కూడు గానక = తిండి పొందక
తపించి = బాధపడి
గతించిన = మరణించిన
దైన్య = దీనస్థితిలో
శుష్క = ఎండిన
కంకాళములు+ఎన్నో = ఎన్నో అస్థిపంజరాలు
నీయొడినిన్ = నీ ఒడిలో
నిరంతర = ఎల్లప్పుడు
శాంతి సౌఖ్యముల్ = శాంతిని సుఖాలను
కాంచెన్ = చూశాయి, పొందాయి

తాత్పర్యం : కొంతమంది స్వార్థపరులు వారి విలాసాలకోసం ఏవో చట్టాలు చేసి ఈ భూమిని ఆక్రమించుకుని గర్వాన్ని పొంది వారి ఆనందం కోసం చేసిన ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తీసుకోలేక బాధతో మరణించి దీన స్థితిలో ఎండిపోయిన వారి అస్థిపంజరాలు నీ ఒడిలో శాశ్వతమైన శాంతిని, సుఖాన్ని పొందాయి.

5వ పద్యం :

ఉ|| మాయురె దుందుభీ! ప్రబల మైన కృపాధిషణన్ దరిద్రనా
రాయణ పక్షమై ధన పరత్వము రోయుచు ‘జమ్ము’ ‘తుంగ’ ల
త్యాయతవృత్తి బెంచి నిలయమ్ముగ బాకను గూర్చి స్వాదుపా
నీయము నిచ్చి త్రావగ జనించిన ప్రేమను చిందె దీగతిన్,

ప్రతిపదార్థం :

మాయురె దుందుభీ ! = ఆహా దుందుభి !
ప్రబలమైన = బలమైన, అధికమైన
కృపాధిషణన్ = కరుణతో
దరిద్రనారాయణ పక్షమై = పేదల వైపు ఉండి
ధన పరత్వము = ధనమే ప్రధానమనే గుణాన్ని
రోయుచు = అసహ్యించుకుంటూ
జమ్ము, తుంగ ల = జనుమును, తుంగ అనే గడ్డిని
అతి + ఆయత వృత్తి = చాలా పొడుగ్గా
బెంచి = పెంచి
నిలయమ్ముగ = నివాసంగా
పాకను గూర్చి = గుడిసెను కట్టి
స్వాదు పానీయమును = = తీయటి నీటిని
త్రావగ ఇచ్చి = తాగడానికి ఇచ్చి
జనించిన = పుట్టిన
ప్రేమను = ప్రేమతో
చిందెదు ఈ గతిన్ = ఈ విధంగా గంతులు వేస్తున్నావు

తాత్పర్యం : ఆహా! ఓ దుందుభి! అధికమైన కరుణతో పేదల వైపు నిలిచి, ధనమే ప్రధానమని భావించే గుణాన్ని అసహ్యించుకుంటూ, జనుమును తుంగ గడ్డిని, చాలా పొడుగ్గా పెంచి, వారు నివసించడానికి గుడిసెలను కట్టి ఇచ్చి, తాగడానికి మంచి నీటిని ఇచ్చినందుకు కలిగిన సంతోషంతో గంతులు వేస్తున్నావు.

6వ పద్యం :

చ||
శిల నులిమూసలోఁ గరగి చిత్తరువుంబలె స్వేచ్చ రూపురే
ఖల వరభావ మచ్చునిడి, కాంచు జగమ్ముల నేలి పేరులన్
వలవని మేటి శిల్పకుల వర్యుల మంజుల దివ్యహస్తకౌ
శలమును బోలి వర్షములు సాగెదవా మము దేర్చ వాహినీ.

ప్రతిపదార్థం :

వాహినీ = నదీ (దుందుభి)
శిలన్ = రాయిని
ఉలి = ఉలితో
మూసలో = అచ్చులో
కరగి = కరిగిన
చిత్తరువున్ బలె = చిత్రాల వంటి
స్వేచ్చన్ = స్వేచ్ఛతో
రూపురేఖలన్ = ఆకారాలను
వరభావము = గొప్ప కల్ప
అచ్చునిడి = రూపం ఇచ్చి
కాంచు = చూసే
జగమ్ములన్ = ప్రజలను
ఏలి = పాలించి, ఆనందపరచి
పేరులన్ = ప్రఖ్యాతులను
వలవని = ఆశించని
మేటి = గొప్ప
శిల్ప కుల వర్యుల = శిల్పులలో గొప్పవారి
మంజుల = అందమైన, మనోజ్ఞమైన
దివ్య = గొప్ప
హస్త కౌశలమును = చేతి నైపుణ్యం
బోలి = లాగా
మము దేర్చ = మిమ్మల్ని ఆనందపరచడానికి
వర్షములన్ = వర్షాకాలంలో, సంవత్సరాల పాటు
సాగెదవా = పారుతున్నావా

తాత్పర్యం : ఓ దుందుభి నదీ! రాయిని ఉలితో మలచి, మూసలో కరిగించి పోసిన చిత్రాల లాగా స్వేచ్ఛగా కల్పించిన ఆకారాలకు రూపం ఇచ్చి చూసిన ప్రజలను ఆనందపరచి పేరుకూడా ఆశించని శిల్పకులంలోని గొప్పవారి చేతి నైపుణ్యం లాగ మమ్మల్ని ఆనందింప చేయడానికి ప్రతీ వర్షాకాలంలో ప్రవహిస్తావా ?

7వ పద్యం :

ఉ||
కత్తిని గంటము నెదిపి కావ్యరసమ్మున రౌద్రవృత్తి రే
కెత్త రసజ్ఞచిత్త ముడికించు కళాత్మక వీరమూర్తి నీ
పొత్తున గోనబుద్ధుడు సపూర్వచరిత్ర రచించే తద్విధిన్
మెత్తనిమేనిలో బిరుసు మీరెదవా వరద ల్వరించినన్.

ప్రతిపదార్థం:

కత్తిని = కరవాలాన్ని, ఖడ్గాన్ని
గంటమున్ = గంటమును, కలమును
మెదిపి = కదిలించి, ఉపయోగించి
కావ్యరసమ్మున = కావ్యంలోని రసాలను
రౌద్రవృత్తి రేకెత్త = రౌద్రస్వభావంతో
రసజ్ఞ చిత్తము = రసాన్ని గుర్తించి ఆనందించే మనసు
ఉడికించు = తపించే విధంగా
కళాత్మక = సృజనశీలి అయిన
వీరమూర్తి = వీరుడు
నీ పొత్తున = నీ స్నేహంలో (నీ పక్కన ఉండి)
గోనబుద్ధుడున్ = గోన బుద్ధారెడ్డి అనే పేరుగల వాడు
అపూర్వ చరిత్రన్ = ముందు లేని గొప్ప చరిత్రను (రంగనాథ రామాయణాన్ని) రచించాడు
రచించే = రచించాడు
తత్ + విధిన్ మెత్తని = అటువంటి
మెత్తని = సుకుమారమైన
మేనిలో = శరీరంలో
వరదల్+వరించినన్ = వరదలు వచ్చినప్పుడు
బిరుసు = గట్టిదనాన్ని, కఠినత్వాన్ని
మీరెదవా = పెంచుకుంటావా

తాత్పర్యం : కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోనబుద్ధారెడ్డి. నీస్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు. అటువంటి సుకుమారమైన నీ శరీరంలో వరదల సమయంలో కఠినత్వాన్ని పెంచుకుంటావా?

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

8వ పద్యం :

చ||
అవమతిలేదు నీయెద రహస్యపు వేళలనైన శైవవై
ష్ణవములపైన దానికిల సత్తులసీద్రుమపాళి బిల్వప
త్రవనము తీరదేశముల దాల్చుచు తిక్కన గంటమీను స
త్కవితను బోలి పారెదపు తాత్వికత నివకేశవాఢ్యవై.

ప్రతిపదార్థం:

రహస్యము+వేళలన్+ ఐనన్ = తెలియని సమయంలో కూడా (ప్రాచీన కాలంలో)
శైవ = శివునికి సంబంధించిన
వైష్ణవము = విష్ణుకు సంబంధించిన
ల పైన = అంశాలపై
దానికి = ఆ మతాలకు సంబంధించి
ఇలన్ = ఈ భూమిపై
నీ యెద = నీ మనసులో
అవమతిలేదు = అనాసక్తత లేదు
సత్ + తులసీ = మంచి తులసి
ద్రుమపాళి = చెట్ల వరుసతో
బిల్వపత్ర వనము = మారేడు పత్ర వృక్షాల సమూహంతో
తీర దేశముల = నీ రెండు అంచులు,
తాల్చుచు = నింపి ఉంచుతూ
తిక్కన = కవిబ్రహ్మ తిక్కన
గంటము + ఈను = కాలము ఇచ్చిన
సత్కవితను బోలి = మంచి కవిత తీరుగా
శివ = శివుని
కేశవ = నారాయణుని
తాత్వికతన్ = తత్వాలతో
ఆఢ్యపై = సంపన్నురాలవై
పారెదవు = ప్రవహిస్తావు

తాత్పర్యం : తెలియని సమయంలో (ప్రాచీన కాలంలో) కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై నీ మనస్సులో అనాసక్తత లేదు. (విష్ణువుకు ఇష్టమైన) మంచి తులసి చెట్ల వరుసలతో, (శివునికి ఇష్టమైన) మారేడు వృక్షాల సమూహాలతో నీ రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన (హరి హరాద్వైత) శివకేశవ తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలవై ప్రవహిస్తున్నావు.

9వ పద్యం :

ఉ|| పేదలయిండ్లకై తనువు బెంచి యభిన్నత బేర్చు బుద్ధి సాం
ద్రాదర భావవీచుల విధమ్మగు కమ్మల కప్పుగూర్చి; మె
ప్పూదుచు చేవ బోవ తమ ప్రోవుల మంట దరిద్రశీతముల్
ఏదెడు తాళవృక్షముల కేర్పడె ప్రేమలు నీవుబెంచుటన్.

ప్రతిపదార్థం:

పేదలయిండ్లకి + ఐ = పేదవారి ఇండ్లకోసం
తనువు బెంచి = శరీరాన్ని పెంచి
అభిన్నత = భిన్నత్వం లేని విధంగా
పేర్చు = పేర్చుచు
బుద్ది సాంద్ర = మనసులో గాఢమైన
ఆదర బావ వీచులన్ = గౌరవ భావమనే తరంగాల
విధమ్ము + అగు = విధంగా
కమ్మలన్ = తాటి ఆకులతో (తాటి ఆకులను కమ్మలు అంటారు)
కప్పు గూర్చి = కప్పును తయారు చేసి
మెప్పుదుచున్ = మెప్పును పొందుచు
చేవ బోవన్ = శక్తి నశించగా
తమ ప్రోవుల = తమ సమూహంతో (తాటి ఆకుల కుప్పతో) వేసిన
మంటన్ = చలి మంటలతో
దరిద్ర శీతముల్ = దరిద్రమైన చలినుండి
ఏదెడు = పోగొట్టుకుంటారు
నీవు బెంచుటన్ = నీవు పెంచిన కారణంగా
తాళ వృక్షములకున్ = తాటిచెట్లపై
ప్రేమలు = ప్రేమలు
ఏర్పడెన్ = ఏర్పడ్డాయి, పెరిగాయి

తాత్పర్యం : పేదవారి ఇండ్లకోసం తమ శరీరాన్ని పెంచి, భిన్నత్వం లేని విధంగా పేర్చుచు, మనసులో గాఢమైన గౌరవ భావతరంగాల వలె తాటి కమ్మలతో గుడిసె కప్పును తయారు చేసి మెప్పును పొందుచు, వాటి శక్తి నశించగానే తాటి ఆకుల కుప్పతో వేసిన చలి మంటలతో పేదవారు చలిని పోగొట్టుకుంటారు. నీవు పెంచిన కారణంగా తాటి చెట్లపై ప్రేమలు పెరిగాయి.

10వ పద్యం :

ఉ||
శంకను దక్కి లోకమున సాగిన హింసను రూపుమాపఁ బా
దాంకములందుఁ జీమలు గతాసువులై చెడకుండునట్లు క్షే
మంకరబుద్ధి మాసి చను మానవతం బ్రకటించు జైన తీ
ర్ధంకర పానయోగ్య జల దాయినివై యశము స్వహింపవా!

ప్రతిపదార్థం :

శంకను దక్కి = అనుమానం లేకుండా, భయం లేకుండా
లోకమున = లోకములో
సాగిన హింసను = నడిచిన హింసను
రూపుమాపన్ = లేకుండా చేయడానికి
పాద + అంకములందున = పాదాల దగ్గర ఉన్న
చీమలు = చీమలు
గత + అసువులు + ఐ = పోయిన ప్రాణాలు
చెడకుండునట్లు = చెడిపోకుండా ఉండేటట్లు
క్షేమంకరబుద్ధి = శుభాన్ని కలిగించే మనసుతో
మాసి = నశించి
చను = పోయె
మానవతన్ = మానవత్వాన్ని
ప్రకటించు = తెలపడానికి, నిలపడానికి
జైన తీర్థంకర = జైన తీర్థంకరులకు
పానయోగ్య = తాగడానికి అనుకూలమైన
జల దాయినివై = నీటిని ఇచ్చే దానివై
యశమున్ = కీర్తిని
వహింపవా ! = పొందవా

తాత్పర్యం : భయంలేకుండా లోకంలో సాగిన హింసను లేకుండా చేయడానికి పాదాల దగ్గర ఉన్న చీమలుకూడా చనిపోకుండా చూసే శుభాన్ని కలిగించే మనసుతో, నశించి పోతున్న మానవత్వాన్ని తిరిగి నిలపడానికి ప్రయత్నించిన జైన తీర్థంకరులకు కూడా తాగడానికి అనువైన జలాన్ని ఇచ్చిన కీర్తిని పొందవా (పొందావు అని భావం).

11వ పద్యం :

మ|
నిను బంధించి రిదేటి వెర్రితల పాండిత్యమ్ము? శక్యంబె పా
వనభావమ్ముల నిగ్రహింప కడు తీవ్రంబైన జ్వాలావళిన్
గొనిమూట న్బిగియింపగా సలిల సంకోచంబు స్వేచ్ఛెకజీ
వనవౌ నీయెడ సాగునే విమల భాస్వద్రూప శైవాలినీ!

ప్రతిపదార్థం :

విమల = పరిశుద్ధమైన
భాస్వత్రూప = ప్రకాశవంతమైన
శైవాలినీ! = ఓ నదీ
నిను బంధించిరి = నిన్ను బంధించారు
ఇది ఏటి = ఇదెక్కడి
వెర్రితల = పిచ్చెక్కిన
పాండిత్యమ్ము = తెలివి
పావన = పవిత్రమైన
భావమ్ముల = భావాలను
నిగ్రహింప = ఆపడం
శక్యంబె = సాధ్యమా
కడు = మిక్కిలి
తీవ్రంబైన = తీవ్రమైన
జ్వాల + ఆవళిన్ కొని = అగ్ని సమూహాన్ని
కొని = “తీసుకొని
మూటన్ + బిగియింపగా = మూటలో బంధించడం
సలిల = నీటిని
సంకోచంబు = ఆపడం, చిన్నగా చేయడం
స్వేచ్ఛ + ఏక జీవనవు + ఔ = స్వేచ్ఛయే జీవితముగా కలదానివి అయిన నీ విషయంలో
నీయెడ = నీ విషయంలో
సాగునే = సాధ్యమవుతుందా ?

తాత్పర్యం:పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ! నిన్ను బంధించారు. ఇదెక్కడి పిచ్చి తెలివి ? పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కలదానివైన నీ విషయంలో సాధ్యమవుతుందా ?

12వ పద్యం :

ప్రతిపదార్థం :

చ||
కదలెడు పూరిపుల్లకు గకావికలై భయమొంది డప్పితో
బొదలిన జింక దుప్పి కదుపుల్ జలముల్గొన నిన్నుజేరి
బెదవుల ముట్టువేళ గని పెంపగు చేపల బల్లటీ ల్గొనం
గదిమి తృష్ణార్తతన్ వెరవు గల్గియు దిక్కుల బార జూతువా ?

ప్రతిపదార్థం :

కదలెడు = కదులుతున్న
పూరిపుల్లకు = గడ్డిపోచకు కూడా
భయమొంది = భయపడి
కకావికలై = చెల్లాచెదురై
పొదలిన = తిరిగి అలసిన
డప్పితో = దాహంతో
జింక, దుప్పి కదుపుల్ = జింకల దుప్పుల గుంపులు
జలముల్ + గొనన్ = నీరు తాగడానికి
నిన్ను + చేరి = నీ దగ్గరికి వచ్చి
క్రీ = కింది
పెదవుల = పెదవులతో
ముట్టువేళన్ = నీటిని తాకుతుండగా
కని = చూసి
కదిమి = స్వార్థంతో
పెంపు + అగు = పెరిగిన
చేపల పల్లటీల్ = చేపలు గంతులు
కొనన్ = వేస్తుంటే
తృష + ఆర్తతన్ = దాహం తీరక కలిగే బాధతో
దిక్కులన్ = దిక్కులు పట్టుకొని
వెరవు గల్గియు = ఉపాయంతో
పారన్ + చూతువా ? = వెళ్ళడం చూస్తావా ?

తాత్పర్యం : కదులుతున్న గడ్డిపోచకు కూడా భయపడి చెల్లాచెదరుగా పారిపోయే జింకల, దుప్పుల, సమూహాలు అడవిలో తిరిగి తిరిగి అలిసిపోయి దాహంతో నీరు తాగడానికి నీ దగ్గరకు వచ్చి కింది పెదవులు ఆనించి నీరు తాగుతుండగా చూసి స్వార్థంతో పెరిగిన చేపలు గంతులు వేస్తుంటే దాహం తీరక కలిగే బాధతో అవి దిక్కులు పట్టుకొని పారిపోతుంటే ఉపాయంతో చూస్తావా ?

13వ పద్యం :
మ||
అరప్రేవుం దడుపంగజాలని నిర ల్పాహారమై, రక్త మా
విరిగా, లోకహితార్థమై కడగు చుర్విం జెమ్మట న్ముంచి, క
ష్టరతిం గుందెడు మానవాళికి గరిష్ఠప్రేమ “సీతాఫలో”
త్కరమున్ మేలొలిపంటగా నొసగు నీకారుణ్యమగ్గించెదన్.

ప్రతిపదార్థం :

అర ప్రేవున్ = సగం పేగును కూడా
తడుపంగ = తడపడానికి
చాలని = సరిపోని
నిర్ + అల్పాహారము + ఐ = అల్పాహారము లేని వారై
రక్తము + ఆవిరిగా = రక్తాన్ని ఆవిరిగా చేసి
లోకహిత + అర్థమై = లోకానికి మంచి చేయడానికి
కడగుచు = ప్రయత్నం చేసే
ఉర్విన్ = ఈ భూమిని
చెమ్మటన్ = చెమటతో, స్వేదంతో
ముంచి = మునిగేలా చేసి, తడిపి
కష్టరతిం = కష్టాలతో
కుందెడు = బాధపడే
మానవాళికి = మానవులకు
గరిష్ఠప్రేమన్ = అత్యంత ఎక్కువ ప్రేమతో
మేల్ తొలిపంట గాన్ = మంచి మొదటి పంటగా
సీతాఫల + ఉత్కరమున్ = సీతాఫలాలను
ఒసగు
నీ కారుణ్యము +  = ఇచ్చే
+ అగ్గించెదన్ = నీ కరుణను స్థుతిస్తాను, మెచ్చుకుంటాను

తాత్పర్యం : సగం పేగును తడపడానికి సరిపోని అత్యంత తక్కువ ఆహారం కూడా లేని, రక్తాన్ని ఆవిరిగా చేసి, లోకానికి మంచి చేయడానికి ప్రయత్నం చేసి ఈ భూమిని తమ చెమటతో తడిపి కష్టాలతో బాధపడే మానవులకు అత్యంత ప్రేమతో మంచి మొదటి పంటగా సీతాఫలాలను ఇచ్చే నీ కారుణ్యాన్ని మెచ్చుకుంటాను.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

14వ పద్యం :

తే.గీ॥ ప్రచురతర రసవాదాన బ్రభవమందు
స్వర్ణయోగం బదేమాయె ? సరవి నష్ట
సిద్ధు లేనీట మునిగె ? యజించు క్రమము
డెలియలేనట్టి జడబుద్ధి తేలివచ్చె !

ప్రతిపదార్థం:

ప్రచురతర = ప్రచారంలో గల
రసవాదాన = రసవాద విద్య (బంగారాన్ని తయారు చేసే విద్య)
ప్రభవము అందు = పుట్టు
స్వర్ణయోగంబు = బంగారు యోగము
అది + ఏమాయె ? = అది (స్వర్ణ యోగం) ఏమైనది
సరవిన్ అష్టసిద్ధులు = క్రమంగా అష్టసిద్ధులు
ఏనీట మునిగె ? = ఏ నీటిలో మునిగి పోయాయి
యజించు క్రమము = యజ్ఞాలు చేసే పద్ధతులు
తెలియలేనట్టి = తెలుసుకోలేని
జడబుద్ధి = తెలివి తక్కువతనం
తేలివచ్చె ! = ప్రకటితమైనది

తాత్పర్యం : గతంలో ప్రచారంలో ఉన్న రసవాద విద్యద్వారా బంగారాన్ని పుట్టించే స్వర్ణయోగం ఏమైనది ? వరుసగా అష్టసిద్ధులు ఏ నీటిలో మునిగి పోయాయి. యజ్ఞ యాగాలు చేసే విధానాలు తెలుసుకోలేని తెలివి తక్కువతనం ప్రకటితమయింది. (తెలివి తక్కువతనం అందరికి తెలిసింది అని భావం).

15వ పద్యం :

తే.గీ॥ ఆర్ష జీవిత పద్దతులంతరింప
నవనవోన్మేష పాశ్చాత్య నాగరకత
పెల్లుగ గమించి తుది కొక పొల్లునైతి
భారతాంబ సహింపని బరువుగానొ.

ప్రతిపదార్థం :

ఆర్ష = ఋషుల ద్వారా తెలుపబడిన
జీవిత పద్ధతులు = = జీవన విలువలు
అంతరింప = నశించగా
నవనవ + ఉన్మేష = కొత్తగా వికసించిన
పాశ్చాత్య = పశ్చిమ దేశాల
నాగరకత = నాగరికతను
పెల్లుగన్ = ఎక్కువగా
గమించి = వెంట నడిచి, ఆచరించి
తుదికి + ఒక = చివరికి ఒక
పొల్లును + ఐతి = పొల్లు గింజగా పనికి రాకుండా పోతిని
భారత + అంబ = భారతమాతకు
సహింపని = భరించలేని
బరువు గానొ = బరువుగా మారాను కదా

తాత్పర్యం : ఋషుల ద్వారా (వేదాల ద్వారా) తెలుపబడిన జీవన విలువలను పాటించక కొత్తగా వచ్చిన పాశ్చాత్య నాగరికతను ఆచరించి చివరికి ఒక పొల్లు గింజలాగా ఎందుకు పనికి రాకుండా పోయాను. భారతమాత భరించలేని భారంగా మారాను కదా !

16వ పద్యం :

ఉ||
జేనెడు పొట్టకై పరుల సేవకు కాయము నమ్మి నైచ్యసం
ధానపు జీవితమ్మున వ్యథం గొని చాల కృశించు వ్యక్తి, సం
ఘానికి జాతికౌ నొక విఘాతము మాన్పగలేడు ఎట్టిదౌ
పూనికతోడ కొల్వునకుఁ బోయిన స్వేచ్ఛ నశించు దుందుభీ !

ప్రతిపదార్థం :

దుందుభీ ! = ఓ దుందుభి !
జానెడు పొట్టకై = జానెడు ఉన్న కడుపు కోసం
పరుల సేవకు = ఇతరులక సేవచేయడానికి
కాయమును + అమ్మి = శరీరాన్ని అమ్మి
నైచ్య సంధానపు = నీచత్వంతో కూడిన
జీవితమ్మున = జీవితంలో
వ్యథన్ + కొని = జీవితంలో
చాల కృశించు = చాల బాధపడే
వ్యక్తి = మనిషి
సంఘానికి = సమాజానికి
జాతికి ఔ = జాతికి కూడా
నొక = ఒక
విఘాతము = చేటును
మాన్పగలేడు = పోగొట్టలేడు
ఎట్టిది + ఔ = ఎటువంటిది అయినా
పూనికతోడ = ప్రయత్నముతో
కొల్వునకున్ = సేవకు, ఉద్యోగానికి
పోయిన = వెళ్ళినా, వెళ్తే
స్వేచ్ఛ నశించు = స్వేచ్ఛ నశిస్తుంది.

తాత్పర్యం : ఓ దుందుభి! జానెడు పొట్టకోసం ఇతరులకు సేవ చేయడానికి శరీరాన్ని అమ్మి నీచత్వాన్ని ఇచ్చే జీవితంలో దుఃఖాన్ని పొంది చాలా బాధపడే వ్యక్తి సమాజానికి, తన జాతికి ఒక చేటును కూడా పోగొట్టలేడు. ఎటువంటిది అయినా ప్రయత్నపూర్వకంగా ఉద్యోగానికి వెళ్తే స్వేచ్ఛ నశిస్తుంది.

17వ పద్యం :

దుందుభీ ! అలల చేతుల నెత్తి నీ వాడు
నాటలన్ గని తరుపు లలరులం బులకించె
పులకపులకయు నొక్క పుష్పమై వికసించె
పుష్ప మొక మధుపాత్రబోలి విందులు వెట్ట
ప్రవహించి మాసీమ పావనమ్ముగ జేసి
తెలుగు సంస్కృతులతో తేజరిల్లెడి నీవు
మా పొలాలకు పాలు జేప బారితిగాన
నీ యుదంతము కొంత నిలిపితిని కావ్యాన.

ప్రతిపదార్థం :

దుందుభి ! = ఓ దుందుభి
అలల చేతుల నెత్తి = అలలు అనే చేతులతో
నీవు + ఆడున్ = నీవు ఆడే
ఆటలన్ గని = ఆటలు చూసి
తరువులు = = చెట్లు
అలరులన్ = పూవులతో
పులకించె = పులకరించాయి
పులక పులకయున్ = ఒక్కొక్క పులకరింత
ఒక్క = ఒక్కొక్క
పుష్పము + ఐ = పూవుగా
వికసించే = వికసించింది
పుష్పము + ఒక = ప్రతీ పూవు ఒక
మధు పాత్రన్ + బోలి = తేనె నింపిన పాత్ర లాగా
విందులు + పెట్టన్ = ఆతిథ్యమివ్వగా
ప్రవహించి = ప్రవహించి
మా సీమన్ = మా భూమిని
పావనమ్ముగ జేసి = పవిత్రంగా మార్చి
తెలుగు సంస్కృతులతో = తెలుగు వారి సంస్కృతులతో
తేజరిల్లెడి = ప్రకాశించే
నీవు = నీవు
మా పొలాలకున్ = మా పంట భూములకు
పాలు చేపన్ = పాలు ఇవ్వడానికి
పారితి కానన్ = ప్రవహించావు కావున
నీ + ఉదంతము = నీ చరిత్రను,
కావ్యాన = కావ్యంలో
కొంత = కొద్దిగా
నిలిపితిన్ = నిలిపాను, తెలిపాను

తాత్పర్యం : ఓ దుందుభి ! అలలు అనే చేతులతో నీవు ఆడే ఆటలు చూసి చెట్లు పూలతో పులకరించాయి. ఒక్కొక్క పులకరింత ఒక్కొక్క పుష్పమై వికసించింది. పుష్పించిన ఒక్కొక్క పూవు ఒక్కొక్క తేనె నిండిన పాత్రగా ఆతిథ్యం ఇచ్చింది. నీవు ప్రవహించి మా సీమను పవిత్రంగా మార్చావు. తెలుగు సంస్కృతులతో ప్రకాశించే నీవు మా పంట భూములకు పాలు (పాలవంటి బలమైన నీరు) ఇవ్వడానికి ప్రవహించావు కావున నీ చరిత్రను కొంచెం కావ్యంలో నిలిపాను.

18వ పద్యం :

భాగ్యనగరాత్యంత పరిసరమ్ముల బుట్టి
పాలమూ ర్మండలపు భాగాన బంధింప
బడి నీలగిరిసీమ బరగు దేవరకొండ
భూముల బండించి ముందు కటునటు సాగి
పలనాటి బ్రహ్మయ్య పరగణాలో బారు
కృష్ణమ్మలో గలసి కెలకుల నడయాడి
ఏలేశ్వరుని పూజ కేగి భక్తులతోడ
అట నుపాధ్యాయు కీర్త్యంశముల గొన్నింటి
వెలువరచి చరిత కొక వెలుగుబాటను జూపి

ప్రతిపదార్థం :

భాగ్యనగర = హైదరాబాదుకు
అత్యంత పరిసరమ్ములన్ = అతి సమీపములో
పుట్టి = జన్మించి
పాలమూరు మండలపు భాగాన = పాలమూరు (మహబూబ్నగర్) జిల్లా ప్రాంతంలో
బంధింపబడి = ఆనకట్టచే నిలుపబడి
నీలగిరిసీమన్ + పరగు = నీలగిరి (నల్లగొండ జిల్లా) ప్రాంతంలో ఉన్న
దేవరకొండ = దేవరకొండ
భూములన్ పండించి = పొలాలను పండే విధంగా చేసి
ముందుకు = ఇంకా ముందుకు
అటునటు = అలా అలా
సాగి = ప్రవహించి
పలనాటి బ్రహ్మయ్య = పలనాటి బ్రహ్మనాయుడు
పరగణాలో = పాలించిన ప్రాంతంలో
పారు = పారి
కృష్ణమ్మలో గలసి = కృష్ణానదిలో
కెలకుల = దగ్గరలో
నడయాడి = ప్రవహించి
ఏలేశ్వరుని పూజకు ఏగి = ఏలేశ్వర స్వామి పూజకు పోయి
భక్తుల తోడ = భక్తులతో
అటన్ = అక్కడ
ఉపాధ్యాయున్ = నాగార్జునుని
కీర్తి + అంశములన్ = కీర్తికి సంబంధించిన అంశాలను
కొన్నింటి = కొన్నిటిని
వెలువరచి = చెప్పి
చరితకు ఒక = చరిత్ర రాయడానికి ఒక
వెలుగుబాటను = కాంతి మార్గాన్ని
చూపి = చూపించి

తాత్పర్యం : హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆనకట్టచే బంధించబడి, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహించి, పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామి పూజలు చేసి అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపి,

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

19వ పద్యం :

ఇక్ష్వాకువంశీయు లేలిన విజయపురిం
దరిసి నాగార్జునుని దర్శించి ధన్యవై
తెలుగుభూముల సస్యఫలభరితముల జేసి
ఆచంద్రతారార్క మాంధ్రసంతతికి ఆ
శీరక్షతలను సచ్చీలంబు జేకూర్చి
ఇహపరమ్ములను సర్వేప్పితమ్ము లొసంగి
మము బెంచు తల్లివై మా పాలవెల్లివై
ప్రవహింతువా దుందుభీ !
మా సీమ
పాలయేఱుగ దుందుభీ !

ప్రతిపదార్థం :

దుందుభి! = ఓ దుందుభి
ఇక్ష్వాకువంశీయు లేలిన = ఇక్ష్వాకు వంశస్థులు పరిపాలించిన
విజయపురిన్ = విజయపురాన్ని
తరిసి = చేరి
నాగార్జునుని = ఆచార్య నాగార్జునున్ని
దర్శించి = చూసి
ధన్యవై = ధన్యతను పొంది
తెలుగు భూములన్ = తెలుగు నేలలో
సస్య ఫల భరితముల జేసి = పైరు పంటలతో నింపి
ఆ చంద్ర తార + అర్కము = నక్షత్రాలు, సూర్య చంద్రులు ఉన్నంతకాలం (శాశ్వతంగా)
ఆంధ్ర సంతతికి = తెలుగుతల్లి బిడ్డలకు
ఆశీః + అక్షతలను = ఆశీర్వదపూర్వక అక్షతలను
సత్ + శీలంబున్ = మంచి నడవడిని
చేకూర్చి = అందించి
ఇహ పరమ్ములను = ఈ లోకములో, పరలోకంలో
సర్వ + ఈప్పితమ్ములు = అన్ని కోరికలను
ఒసంగి = తీర్చి
మము బెంచు తల్లివై = మమ్మల్ని పెంచే తల్లిగా మారి
మా పాలవెల్లివి + ఐ = మాకు పాల ప్రవాహానివై
ప్రవహించువా = ప్రవహిస్తావా
మా సీమ = మా ప్రాంతాలలో
పాలయేఱుగ = పాల నదిలాగా
దుందుభీ! = దుందుభి నదీ!

తాత్పర్యం : ఓ దుందుభి ! ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో (బతికుండగా, చనిపోయిన తరువాత) అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా మాకు పాలవెల్లిగా ప్రవహిస్తావా ! మా ప్రాంతంలో పాల ఏరుగా ప్రవహిస్తావా !

కంఠస్థం చేయవలసిన పద్యాలు, ప్రతిపదార్థ, తాత్పర్యములు :

కవి పరిచయం : ఈ పద్యం గంగాపురం హనుమచ్ఛర్మ గారు రాసిన దుందుభి కావ్యం నుంచి గ్రహింపబడినది.
(ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసే ముందు కవి పరిచయం రాయాలి.)

1వ పద్యం :

ఉ||
పట్టినరాయి శిల్పమయి, పాతిన బండలు శాసనమ్ములై,
కట్టిన దేవళమ్ముల వికాసము జాతికి జీవగఱ్ఱయై,
పుట్టువు సార్ధతం బొరయ పొల్పుమిగిల్చిన శ్రీచళుక్య స
మ్రాట్టులు నీదు తీరమున రాచరికమ్ముల నోచి రెందరో.

ప్రతిపదార్థం :

పట్టినరాయి = (వారు) పట్టుకున్న ప్రతీ రాయి
శిల్పము + ఐ = శిల్పంగా మరి
పాతిన = భూమిలో నిలిపిన
బండలు = రాళ్లు అన్ని
శాసనమ్ములు + ఐ = శాసనాలుగా మారి
కట్టిన = కట్టించిన
దేవళమ్ముల = దేవాలయాల
వికాసము = అభివృద్ధి
జాతికి = తెలుగు జాతికి
జీవగఱ్ఱయై = జీవనాధారమై
పుట్టువు = జన్మ
సార్ధతంబు ఒరయ = సాఫల్యం చెందగా
పొల్పు మిగిల్చిన = స్థిరత్వాన్ని పొందిన
శ్రీచళుక్య సమ్రాట్టులు శ్రీ చాళుక్య వంశానికి చెందిన చక్రవర్తులు
నీదు = నీ యొక్క
తీరమున = తీరంలో
ఎందరో = ఎంతో మంది
రాచరికమ్ములన్ = రాజులుగా
నోచిరి = నోచుకున్నారు, అదృష్టాన్ని పొందారు

తాత్పర్యం : పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు నీ తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారు.

2వ పద్యం :

ఉ||
అద్దమువంటి నీజలము లందు స్వరూపము దిద్దుచున్న యా
నిద్దపు చందమామ యొడి నిద్దుర నొందగ కీచురాళ్ళతో
దద్దయు జోలబాడిన విధమ్మున, నూగు తరంగడోలికన్
ముద్దుగ నిద్రబుచ్చెదు ప్రపుల్లశరత్తుల మాతృమూర్తివై.

ప్రతిపదార్థం:

అద్దమువంటి = అద్దం లాంటి స్వచ్ఛమైన
నీ జలముల+అందు = నీ నీటిలో
స్వరూపమున్ = తన రూపాన్ని
దిద్దుచున్న = చూసుకుంటున్న, అలంకరించుకుంటున్న
ఆ నిద్దపు = ఆ అందమైన
చందమామ = చందమామ
ఒడి నిద్దురన్ ఒందగ = నీ ఒడిలో నిద్ర పోతున్నప్పుడు
కీచురాళ్ళతో = కీచురాయి కీటకాల శబ్దాలతో
తద్దయు జోల = మంచి జోల పాటలను
పాడిన విధమ్మునన్ = పాడిన తీరుగా
ఊగు = ఊగుతున్న
తరంగ డోలికన్ = అలలు అనే ఉయ్యాలలో
ముద్దుగ = ముద్దుగొలిపే విధంగా
ప్రపుల్ల = ప్రకాశవంతమైన
శరత్తుల = శరత్కాలంలోని వెన్నెలలో
మాతృమూర్తివై = తల్లిలాగ మారి
నిద్రపుచ్చెదు = నిద్రపుచ్చుతున్నావు

అద్దంలాగా స్వచ్చంగా ఉన్న నీ నీటిలో తన రూపాన్ని చూసుకుంటున్న ఆ అందమైన చందమామ నీ ఒడిలో నిద్రపోతున్నప్పుడు కీచురాయి శబ్దాలతో జోలపాటలు పాడిన విధంగా ఊగుతున్న అలలు అనే ఊయలలో ముద్దుగొలిపే విధంగా ప్రకాశవంతమైన శరత్కాలంలోని వెన్నెలలో తల్లిలాగామారి నిద్రపుచ్చుతున్నావు.

అలతులు శ్రావ్యమౌ పలుకు లందము చిందగ రంగు దిద్దిన
ట్టులు తమరెక్క లొప్ప నుదుటుం గొని సచ్ఛకునాళిఁ జూపి మా
పొలముల క్రొత్తగింజల బుభుక్షల బాసెడు పాలపిట్ట జం
టలఁ గనుగొంచు ముందుకు హుటాహుటి సాగుము రమ్యవాహినీ !

రమ్యవాహినీ ! = అందంగా ప్రవహించేదానా!, దుందుభి !
అలతులు = అతి కానివి, చిన్నవి
శ్రావ్యము + ఔ = వినడానికి బాగున్న, విన సొంపైన
పలుకుల = మాటలతో
అందము చిందగ = అందం ఏర్పడగా
రంగు దిద్దినట్టులు = రంగులు వేసినట్లు
తమరెక్కలు + ఒప్ప = తమ రెక్కలు ప్రకాశించగా
ఉదుటుం గొని = గర్వంతో
సత్ + శకున + ఆళిన్ = మంచి శకునాల సమూహాన్ని
చూపి = చూపించి
మా పొలముల = మా పొలాలలోని
క్రొత్తగింజల = కొత్తగా పండిన పంట గింజలను
బుభుక్షల బాసెడు = ఆకలిని తీర్చుకునే
పాలపిట్ట జంటలన్ = పాలపిట్టల జంటలను
కనుగొంచు = చూస్తూ
హుటాహుటి = హడావిడిగా
ముందుకు = ముందు వైపు
సాగుము = సాగిపొమ్ము

అందంగా ప్రవహించే ఓ దుందుభి! వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, మా పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు సాగిపొమ్ము.

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి

దుందుభి Summary in Telugu

(‘దుందుభి ‘ కావ్యంలోనిది)

TS Inter 2nd Year Telugu Study Material Poem 4 దుందుభి 1

కవి పరిచయం

పాఠ్యాంశం పేరు దేని నుండి : దుందుభి
గ్రహింపబడినది : ‘దుందుభి’ కావ్యము నుండి గ్రహింపబడింది.
కవి పేరు : గంగాపురం హనుమచ్ఛర్మ
కాలం : జననం : 1925 మరణం : ఆగష్టు 15, 1996
స్వస్థలం : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి దగ్గరున్న గుండూరు (జన్మస్థలం: వేపూరు)
తల్లిదండ్రులు : సీతమ్మ, రామకిష్టయ్య
చదువు : సంస్కృతాంధ్రసాహిత్యం, వ్యాకరణం, అలంకారశాస్త్రం క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఋగ్వేదాన్ని నేర్చుకోవడమేగాక తర్వాత కాలంలో నృసింహ దీక్షితులతో కలిసి “ఋగ్వేద విజ్ఞానం” రచించాడు.
విశేషతలు : స్వాతంత్రోద్యమం, భూదానోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తన స్వగ్రామంతోపాటు కల్వకుర్తి తాలూకాలో అనేక గ్రామాల్లో విద్యార్థుల కొరకు పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు కృషిచేశాడు. అన్ని కులాల వారి ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు, వ్రతాలు ఇతర పౌరోహిత కార్యక్రమాలు హనుమచ్ఛర్మ చేస్తుంటే అందరూ ఆ కాలంలో వింతగా చూసేవారు. అది అతనిలోని సామాజిక సమరసతకు నిదర్శనం. హనుమచ్ఛర్మకు బాల్యంనుంచి కవిత్వంపై కూడా ఆసక్తి ఎక్కువ.
రచనలు : హనుమచ్ఛర్మ ‘దుందుభి’ కావ్యం ముద్రితంకాగా మల్కిభరాముడు, గోపన, గంగాపురం చెన్నకేశవ సుప్రభాతం అముద్రితాలు.

పాఠ్యభాగ సందర్భం

పూర్వ పాలమూరు (మహబూబ్ నగర్) జిల్లా జీవనాధారం దుందుభి నది. ఈ నది షాబాద్ కొండల్లో పుట్టి డిండి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. హనుమచ్ఛర్మ ఈ నదిని చూసి ఉప్పొంగి కవిత్వం రాశాడు. దుందుభిలా సాగిన హనుమచ్ఛర్మ పద్య ధార శ్రావ్యంగా ఉంటుంది. దుందుభి అందచందాలను, విశిష్టతను పరిచయం చేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

పాఠ్యభాగ సారాంశం

ఓ దుందుభి ! తొలకరి వాన కురవగానే పెద్ద అలలతో స్నేహం చేసి, గట్లతో యుద్ధంచేసి వాటిని తాకుతూ, మా గ్రామాల్లోని భూముల బాధ పోగొట్టడానికి వచ్చి, మా కోరికలు తీర్చే విధంగా పైరు పంటలతో మా మనసులను ఆనందపరిచి, గోదావరి కృష్ణా నదులు మాకు అందడం లేదనే బాధను తీర్చావు. ఇదే నిజమైన ప్రసిద్ధి అవుతుంది. మా అమ్మ వంటి దుందుభి ! బంగారు రంగులు నిండిన సంధ్యా సమయాలు, మామిడి పూతను తిని ఎక్కువగా సంతోషించి కోకిలలు చేస్తున్న శబ్దాలు, తొలకరి వర్షానికి ముందు కనిపించే నల్లని మేఘాలు, ఆ మబ్బుల్లోంచి తొంగి చూసే మెరుపులు నాకు ఒక ఆలోచనను కలిగించి కొత్త గీతాలతో నిన్ను ఆనంద పరచుమన్నవి.

ఓ దుందుభి ! తలచుకోగానే నీ హృదయమనే వీణ తెగలపై ఝం అనే ధ్వనులు వెలువడ్డాయా ? కదలగానే నీ అమాయకత్వము నీరుగా మారిందా ? రాళ్లు కరిగాయా ? నీ హృదయంలో కీర్తించే నీ ప్రియుడైన భర్తపై ప్రేమలు గిలిగింతలు పెడుతున్నాయా ? ఆగకుండా వస్తున్నావు ? కొంతమంది స్వార్థపరులు వారి విలాసాలకోసం ఏవో చట్టాలు చేసి ఈ భూమిని ఆక్రమించుకుని గర్వాన్ని పొంది వారి ఆనందం కోసం చేసిన ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తీసుకోలేక బాధతో మరణించి దీనస్థితిలో ఎండిపోయిన వారి అస్థిపంజరాలు నీ ఒడిలో శాశ్వతమైన శాంతిని, సుఖాన్ని పొందాయి.

పట్టుకున్న ప్రతీ రాయి శిల్పంగా మారి, భూమిలో పాతిన బండలన్ని శాసనాలుగా మారి, కట్టించిన దేవాలయాల అభివృద్ధి తెలుగు జాతికి జీవనాధారంగా మారి జన్మ సార్థకం చేసుకున్న ఎందరో శ్రీ చాళుక్య చక్రవర్తులు నీ తీరంలోనే రాజులుగా అదృష్టాన్ని పొందారు.

ఆహా! ఓ దుందుభి! అధికమైన కరుణతో పేదల వైపు నిలిచి, ధనమే ప్రధానమని భావించే గుణాన్ని అసహ్యించుకుంటూ, జనుమును తుంగ గడ్డిని, చాలా పొడుగ్గా పెంచి, వారు నివసించడానికి గుడిసెలను కట్టిచ్చి, తాగడానికి మంచి నీటిని ఇచ్చినందుకు కలిగిన సంతోషంతో గంతులు వేస్తున్నావు.

ఓ దుందుభి నదీ! రాయిని ఉలితో మలచి, మూసలో కరిగించి పోసిన చిత్రాల లాగా స్వేచ్ఛగా కల్పించిన ఆకారాలకు రూపం ఇచ్చి చూసిన ప్రజలను ఆనందపరచి, పేరుకూడా ఆశించని శిల్పకులంలోని గొప్పవారి చేతి నైపుణ్యం లాగ మమ్మల్ని ఆనందింప చేయడానికి ప్రతీ వర్షాకాలంలో ప్రవహిస్తావా ?

కత్తిని, కలాన్ని సమానంగా ఉపయోగించి కావ్యాలలోను, ప్రవృత్తిలోను రౌద్ర రసాలను కోరేవారికి ఆనందాన్ని కలిగించేలా చేసిన కళాకారుడైన వీరుడు గోనబుద్ధారెడ్డి నీస్నేహం కారణంగా అపూర్వమైన చరిత్ర రంగనాథ రామాయణాన్ని రచించాడు.

అటువంటి సుకుమారమైన నీ శరీరంలో వరదల సమయంలో కఠినత్వాన్ని పెంచుకుంటావా ? తెలియని సమయంలో (ప్రాచీన కాలంలో) కూడా శైవానికి, వైష్ణవానికి సంబంధించిన అంశాలపై నీ మనస్సులో అనాసక్తత లేదు. (విష్ణువుకు ఇష్టమైన) మంచి తులసి చెట్ల వరుసలతో, (శివునికి ఇష్టమైన) మారేడు వృక్షాల సమూహాలతో నీ రెండు తీరాలను నింపి ఉంచుతూ, తిక్కన కలము చెప్పిన (హరి హరాద్వైత) శివకేశవ తత్వాన్ని తెలుసుకొని సంపన్నురాలవై ప్రవహిస్తున్నావు.

అద్దంలాగా స్వచ్చంగా ఉన్న నీ నీటిలో తన రూపాన్ని చూసుకుంటున్న ఆ అందమైన చందమామ నీ ఒడిలో నిద్రపోతున్నప్పుడు కీచురాయి శబ్దాలతో జోలపాటలు పాడిన విధంగా ఊగుతున్న అలలు అనే ఊయలలో ముద్దుగొలిపే విధంగా ప్రకాశవంతమైన శరత్కాలంలోని వెన్నెలలో తల్లిలాగామారి నిద్రపుచ్చుతున్నావు.

పేదవారి ఇండ్లకోసం తమ శరీరాన్ని పెంచి, భిన్నత్వం లేని విధంగా పేర్చుచు, మనసులో గాఢమైన గౌరవ భావతరంగాల వలె తాటి కమ్మలతో గుడిసె కప్పును తయారు చేసి మెప్పును పొందుచు, వాటి శక్తి నశించగానే తాటి ఆకుల కుప్పతో వేసిన చలి మంటలతో పేదవారు చలిని పోగొట్టుకుంటారు.

నీవు పెంచిన కారణంగా తాటి చెట్లపై ప్రేమలు పెరిగాయి. భయంలేకుండా లోకంలో సాగిన హింసను లేకుండా చేయడానికి పాదాల దగ్గర ఉన్న చీమలుకూడా చనిపోకుండా చూసే, శుభాన్ని కలిగించే మనసుతో, నశించి పోతున్న మానవత్వాన్ని తిరిగి నిలపడానికి ప్రయత్నించిన జైన తీర్థంకరులకు కూడా తాగడానికి అనువైన జలాన్ని ఇచ్చిన కీర్తిని పొందవా (పొందావు అని భావం)

పరిశుద్ధమైన, ప్రకాశవంతమైన, ఓ దుందుభి నదీ! నిన్ను బంధించారు. ఇదెక్కడి పిచ్చి తెలివి ? పవిత్రమైన భావాలను ఆపడం సాధ్యమా ? మిక్కిలి తీవ్రమైన అగ్నిని తీసుకొని మూటలో బంధించడం, నీటిని ఆపడం స్వేచ్ఛయే జీవితంగా కలదానివైన నీ విషయంలో సాధ్యమవుతుందా ?

కదులుతున్న గడ్డిపోచకు కూడా భయపడి చెల్లాచెదరుగా పారిపోయే జింకల, దుప్పుల, సమూహాలు అడవిలో తిరిగి తిరిగి అలిసిపోయి దాహంతో నీరు తాగడానికి నీ దగ్గరకు వచ్చి కింది పెదవులు ఆనించి నీరు తాగుతుండగా చూసి స్వార్థంతో పెరిగిన చేపలు గంతులు వేస్తుంటే దాహం తీరక కలిగే బాధతో అవి దిక్కులు పట్టుకొని పారిపోతుంటే ఉపాయంతో చూస్తావా !

సగం పేగును తడపడానికి సరిపోని అత్యంత తక్కువ ఆహరం కూడా లేని, రక్తాన్ని ఆవిరిగా చేసి, లోకానికి మంచి చేయడానికి ప్రయత్నం చేసి ఈ భూమిని తమ చెమటతో తడిపి కష్టాలతో బాధపడే మానవులకు అత్యంత ప్రేమతో మంచి మొదటి పంటగా సీతాఫలాలను ఇచ్చే నీ కారుణ్యాన్ని మెచ్చుకుంటాను. అందంగా ప్రవహించే ఓ దుందుభి ! వినసొంపైన చిన్న మాటలతో అందంగా రంగులు వేసినట్లున్న రెక్కలు ప్రకాశిస్తుండగా, గర్వంతో మంచి శకునాలను చూపించి, మా పొలాలలో కొత్తగా పండిన పంట గింజలతో ఆకలిని తీర్చుకుంటున్న పాలపిట్టల జంటలను చూస్తూ హడావిడిగా ముందుకు సాగిపొమ్ము.

గతంలో ప్రచారంలో ఉన్న రసవాద విద్యద్వారా బంగారాన్ని పుట్టించే స్వర్ణయోగం ఏమైనది ? వరుసగా అష్టసిద్ధులు ఏ నీటిలో మునిగిపోయాయి. యజ్ఞ యాగాలు చేసే విధానాలు తెలుసుకోలేని తెలివి తక్కువతనం ప్రకటితమయింది. (తెలివి తక్కువతనం అందరికి తెలిసింది అని భావం)

ఋషుల ద్వారా (వేదాల ద్వారా) తెలుపబడిన జీవన విలువలను పాటించక కొత్తగా వచ్చిన పాశ్చాత్య నాగరికతను ఆచరించి చివరికి ఒక పొల్లు గింజలాగా ఎందుకు పనికి రాకుండా పోయాను. భారతమాత భరించలేని భారంగా మారాను కదా ! ఓ దుందుభి ! జానెడు పొట్టకోసం ఇతరులకు సేవ చేయడానికి శరీరాన్ని అమ్మి నీచత్వాన్ని ఇచ్చే జీవితంలో దుఃఖాన్ని పొంది చాలా బాధపడే వ్యక్తి సమాజానికి, తన జాతికి ఒక చేటును కూడా పోగొట్ట లేడు. ఎటువంటిది అయినా ప్రయత్నపూర్వకంగా ఉద్యోగానికి వెళ్తే స్వేచ్ఛ నశిస్తుంది.

ఓ దుందుభి ! అలలు అనే చేతులతో నీవు ఆడే ఆటలు చూసి చెట్లు పూలతో పులకరించాయి. ఒక్కొక్క పులకరింత ఒక్కొక్క పుష్పమై వికసించింది. పుష్పించిన ఒక్కొక్క పూవు ఒక్కొక్క తేనె నిండిన పాత్రగా ఆతిథ్యం ఇచ్చింది. నీవు ప్రవహించి మా సీమను పవిత్రంగా మార్చావు. తెలుగు సంస్కృతులతో ప్రకాశించే నీవు మా పంట భూములకు పాలు (పాలవంటి బలమైన నీరు) ఇవ్వడానికి ప్రవహించావు కావున నీ చరిత్రను కొంచెం కావ్యంలో నిలిపాను.

హైదరాబాదుకు అతి సమీపంలో జన్మించి, మహబూబ్నగర్ జిల్లాలో ఆనకట్టచే బంధించబడి, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలోని భూములలో పంటలు పండించి, ఇంకా ముందుకు అలాఅలా ప్రవహించి, పలనాటి బ్రహ్మనాయుడు పాలించిన ప్రాంతంలో పారి కృష్ణానదికి అతి దగ్గరలో ఏలేశ్వర స్వామి పూజలు చేసి అక్కడి భక్తులకు ఆచార్య నాగార్జునుని కీర్తిని చెప్పి చరిత్ర రాయడానికి వెలుగు బాటలు చూపి, ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురాన్ని చేరి, ఆచార్య నాగార్జునున్ని చూసి ధన్యతను పొంది, తెలుగు నేలను పైరు పంటలతో నింపి, శాశ్వతంగా తెలుగు బిడ్డలకు నీ ఆశిస్సులనే అక్షతలను, మంచి నడవడిని అందించి, ఈ లోకంలో, పరలోకంలో (బతికుండగా, చనిపోయిన తరువాత) అన్ని కోరికలను తీర్చి మమ్మల్ని పెంచే తల్లిగా మాకు పాలవెల్లిగా ప్రవహిస్తావా! మా ప్రాంతంలో పాల ఏరుగా ప్రవహిస్తావా ! దుందుభి !

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas

Telangana TSBIE TS Inter 2nd Year English Study Material 12th Lesson A Gift for Christmas Textbook Questions and Answers.

TS Inter 2nd Year English Study Material 12th Lesson A Gift for Christmas

Paragraph Questions & Answers (Section A, Q.No.5, Marks: 4)
Answer the following Questions in about 100 words

Question 1.
“Love, sacrifice and generosity are the essential elements for happy living.” Explain this statement with reference to the story “A Gift for Christmas”. (Revision Test – II)
Answer:
“A Gift for Christmas” is a well-known short story by O. Henry. The original name of the author is William Sydney Porter. This story was first published in 1905.

A Gift for Christmas” is a Christmas story, and it functions as a parable about both the nature of love and the true meaning of generosity. Della’s earnest desire to buy a meaningful Christmas gift for Jim drives the plot of the story, and Jim’s reciprocity of that sentiment is shown when he presents Della with the tortoise-shell combs. Both Jim and Della give selflessly, without expectation of reciprocity. Their sole motivation is to make the other person happy. This, combined with the personal meaning imbued in each of the gifts, conveys the story’s moral that true generosity is both selfless and thoughtful.

Della scours every store in town for two hours before finding the perfect gift for Jim. She notes the similarities between the simple yet valuable watch chain and her understated but loving husband. The watch chain is not merely a shiny trinket; instead, it represents Della’s regard for Jim, and the inherent value she sees in him. Similarly, the combs are not merely an extravagant bauble meant to impress Della; instead, they represent Jim’s commitment to Della and to their relationship. He willingly sells his most valuable possession, handed down from his father, in order to buy Della the combs, suggesting that for Jim, Della and their future family are the most important things in his life.

“ఎ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్” అనేది ఓ. హెన్రీ రాసిన చిన్న కథ. రచయిత అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఈ కథ మొదట 1905లో ప్రచురించబడింది.

క్రిస్మస్ కోసం ఒక బహుమతి” అనేది ఒక క్రిస్మస్ కథ, మరియు ఇది ప్రేమ యొక్క స్వభావం మరియు దాతృత్వం యొక్క నిజమైన అర్ధం రెండింటి గురించి ఒక ఉపమానంగా పనిచేస్తుంది. జిమ్ కోసం అర్థవంతమైన క్రిస్మస్ బహుమతిని కొనుగోలు చేయాలనే డెల్లా యొక్క గంభీరమైన కోరిక కథ యొక్క కథాంశాన్ని నడిపిస్తుంది మరియు డెల్లాకు తాబేలు-పెంకు దువ్వెనలను అందించినప్పుడు జిమ్ యొక్క ఆ సెంటిమెంట్ యొక్క అన్యోన్యత చూపబడుతుంది. జిమ్ మరియు డెల్లా ఇద్దరూ పరస్పరం ఆశించకుండా నిస్వార్థంగా ఇస్తారు. ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టడమే వారి ఏకైక ప్రేరణ. ఇది, ప్రతి బహుమతులలో నింపబడిన వ్యక్తిగత అర్ధంతో కలిపి, నిజమైన దాతృత్వం నిస్వార్థంగా మరియు ఆలోచనాత్మకంగా ఉంటుందని కథ యొక్క నైతికతను తెలియజేస్తుంది.

డెల్లా జిమ్కి సరైన బహుమతిని కనుగొనడానికి ముందు పట్టణంలోని ప్రతి దుకాణాన్ని రెండు గంటల పాటు వెతుకుతాడు. ఆమె సరళమైన ఇంకా విలువైన వాచ్ చైన్ మరియు తన పేలవమైన కానీ ప్రేమగల భర్త మధ్య సారూప్యతలను పేర్కొంది. వాచ్ చైన్ కేవలం మెరిసే ట్రింకెట్ కాదు; బదులుగా, ఇది జిమ్ పట్ల డెల్లా యొక్క గౌరవాన్ని మరియు అతనిలో ఆమె చూసే స్వాభావిక విలువను సూచిస్తుంది. అదేవిధంగా, దువ్వెనలు కేవలం డెల్లాను ఆకట్టుకోవడానికి ఉద్దేశించిన విపరీతమైన బాబుల్ కాదు; బదులుగా, వారు డెల్లా పట్ల మరియు వారి సంబంధానికి జిమ్ యొక్క నిబద్ధతను సూచిస్తారు. అతను ఇష్టపూర్వకంగా డెల్లా దువ్వెనలను కొనుగోలు చేయడానికి తన తండ్రి నుండి అందజేసిన తన అత్యంత విలువైన ఆస్తిని విక్రయిస్తాడు, జిమ్కు డెల్లా మరియు వారి భవిష్యత్తు కుటుంబం తన జీవితంలో అత్యంత ముఖ్యమైనవి అని సూచిస్తూ.

Question 2.
Analyse the character of Della?
Answer:
A Gift for Christmas” is a well-known short story by O. Henry. The original name of the author is William Sydney Porter. This story was first published in 1905.

Della is a beautiful and fashionable women. She had so beautiful hair that it would make the jewels of Queen of Sheba look worthless. She loves her husband and sees a world in him. She is a really caring wife who would do anything for her husband. She even sold her beautiful hair to buy a present for her husband.

ఎ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్” అనేది ఓ. హెన్రీ రాసిన చిన్న కథ. రచయిత అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఈ కథ మొదట 1905లో ప్రచురించబడింది.

డెల్లా ఒక అందమైన మరియు ఫ్యాషన్ మహిళల. ఆమె చాలా అందమైన జుట్టును కలిగి ఉంది, అది షెబా రాణి యొక్క ఆభరణాలకు విలువ లేకుండా చేస్తుంది. ఆమె తన భర్తను ప్రేమిస్తుంది మరియు అతనిలో ఒక ప్రపంచాన్ని చూస్తుంది. ఆమె తన భర్త కోసం ఏదైనా చేసే నిజంగా శ్రద్ధగల భార్య. తన భర్తకు కానుక కొనడానికి తన అందమైన జుట్టును కూడా అమ్మేసింది.

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas

Question 3.
Sketch the character of Jim (Revision Test – II)
Answer:
A Gift for Christmas” is a well-known short story by O. Henry. The original name of the author is William Sydney Porter. This story was first published in 1905.

Jim is a thin man of twenty two. He does not have enough income to support his wife. He bears the burden of fulfilling everyday demands of his wife. He is a very punctual person that why he constantly looks at his watch.

ఎ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్” అనేది ఓ. హెన్రీ రాసిన చిన్న కథ. రచయిత అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఈ కథ మొదట 1905లో ప్రచురించబడింది.

జిమ్ ఇరవై రెండు సంవత్సరాల సన్నటి మనిషి. భార్యను పోషించేంత ఆదాయం అతనికి లేదు. అతను తన భార్య యొక్క రోజువారీ డిమాండ్లను నెరవేర్చే భారాన్ని మోస్తున్నాడు. అతను చాలా సమయపాలన ఉన్న వ్యక్తి, అతను నిరంతరం తన గడియారం వైపు చూస్తాడు.

Question 4.
‘A Gift for Christmas” is an example of O. Henry’s comic irony. Justify.
Answer:
A Gift for Christmas” is a well-known short story by O. Henry. The original name of the author is William Sydney Porter. This story was first published in1905.

A Gift for Christmas is a classic example of irony in literature. Irony is a literary tech- nique in which an expectation of what is supposed to occur differs greatly from the actual outcome. In this case, Jim and Della sacrifice their most treasured posses- sions so that the other can fully enjoy his or her gift. Jim sells his watch to buy Della’s combs, expecting her to be able to use them. Della sells her hair to buy Jim a chain for his watch. Neither expects the other to have made that sacrifice. The irony here works both on a practical and on a deeper, more sentimental level. Both Della and Jim buy each other a gift that ultimately seems financially foolish. Being poor, they can’t afford to waste money on things they can’t use. However, what they get is something they don’t expect: a more intangible gift that reminds them how much they love each other and are willing to sacrifice to make each other happy.

ఏ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్” అనేది ఓ. హెన్రీ రాసిన చిన్న కథ. రచయిత అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఈ కథ మొదట 1905లో ప్రచురించబడింది.

క్రిస్మస్ కోసం బహుమతి అనేది సాహిత్యంలో వ్యంగ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. వ్యంగ్యం అనేది ఒక సాహిత్య సాంకేతికత, దీనిలో ఏమి జరుగుతుందనే అంచనా వాస్తవ ఫలితం నుండి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ సందర్భంలో, జిమ్ మరియు డెల్లా వారి అత్యంత విలువైన ఆస్తులను త్యాగం చేస్తారు, తద్వారా మరొకరు అతని లేదా ఆమె బహుమతిని పూర్తిగా ఆనందిస్తారు. జిమ్ డెల్లా యొక్క దువ్వెనలను కొనడానికి తన గడియారాన్ని విక్రయిస్తాడు, ఆమె వాటిని ఉపయోగించగలదని ఆశించాడు. డెల్లా జిమ్ తన వాచ్ కోసం గొలుసు కొనడానికి తన జుట్టును అమ్ముతుంది. మరొకరు ఆ త్యాగం చేసి ఉంటారని ఎవరూ ఊహించరు. ఇక్కడ వ్యంగ్యం ఆచరణాత్మకంగా మరియు లోతైన, మరింత సెంటిమెంట్ స్థాయిలో పనిచేస్తుంది. డెల్లా మరియు జిమ్ ఇద్దరూ ఒకరికొకరు బహుమతిని కొనుగోలు చేస్తారు, అది చివరికి ఆర్థికంగా మూర్ఖంగా కనిపిస్తుంది. పేదవారు కావడంతో వారు ఉపయోగించలేని వస్తువులపై డబ్బును వృథా చేయలేరు. అయినప్పటికీ, వారు పొందేది వారు ఊహించనిది: ఒకరినొకరు ఎంతగా ప్రేమిస్తున్నారో మరియు ఒకరినొకరు సంతోషపెట్టడానికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని వారికి గుర్తుచేసే మరింత కనిపించని బహుమతి.

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas

A Gift for Christmas Summary in English

About Author

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas 1

William Sydney Porter (September 11, 1862 – June 5, 1910), better known by his pen name O. Henry, was an American writer known primarily for his short stories, though he also wrote poetry and non-fiction. His works include “The Gift of the Magi”, “The Duplicity of Hargraves”, and “The Ransom of Red Chief”, as well as the novel Cabbages and Kings. Porter’s stories are known for their naturalist observations, witty narration and surprise endings.
Porter’s legacy includes the O. Henry Award, an annual prize awarded to outstanding short stories.

A Gift for Christmas” is a well-known short story by O. Henry. The original name of the author is William Sydney Porter. This story was first published in1905.

The story narrates the life of a young married couple James who is known as Jim and Della Dillingham. The couple lives in a modest apartment. They have only two valuable possessions: Jim’s gold pocket watch that belonged to his grandfather and Della’s long hair that falls almost to her knees.

It is Christmas Eve. Della wants to buy Jim a Christmas present. But, she has only $1.87. When Della looks at herself in the mirror, she suddenly gets an idea. She sells her hair for $20.00. With that money, she buys a platinum chain for $21.00. She is very happy about the present. She thinks that the chain will add beauty to his watch.

When Jim comes home from work, he stares at Della. She prays to God that he should not find the absence of her hair at first sight. She admits that she sold her hair to buy his present. Before she can give it to him, however, Jim pulls a package out of his overcoat pocket and gives it to her. Inside, Della finds a pair of costly decorative hair combs that she admired cnce. Eut, they are now completely useless since she has cut off the hair. Hiding her tears, she holds out her gift for Jim- the watch chain. Jim tells Della that he has sold his watch to buy her present. He asks her to forget about the presents and enjoy Christmas eve saying “They’re too nice to use just at present”.

The story ends with a comparison of Jim and Della’s gifts to the gifts that the A Gift for Christmas the three wise men who visited Baby Jesus. The narrator concludes that Jim and D’ella are far wiser than the Magi because their gifts are gifts of love. Those who give out of love and self-sacrifice are truly the wisest since they know the value love. Their deed is nothing but, as the writer says, “generosity added to love”.

A Gift for Ch is mis is a classic example of irony in literature. The author ends the story with a twist which surprises the readers. Thus, O. Henry illustrates true love in the story A Gift for Christmas.

A Gift for Christmas Summary in Telugu

Note: This summary is only meant for Lesson Reference, not for examination purpose

“ఎ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్” అనేది ఓ. హెన్రీ రాసిన చిన్న కథ. రచయిత అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. ఈ కథ మొదట 1905లో ప్రచురించబడింది.

ఈ కథ జిమ్ మరియు డెల్లా డిల్లింగ్హామ్ అని పిలువబడే యువ వివాహిత జంట జేమ్స్ జీవితాన్ని వివరిస్తుంది. ఈ జంట నిరాడంబరమైన అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వారి వద్ద కేవలం రెండు విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయి: జిమ్ తన తాతకు చెందిన బంగారు జేబు గడియారం మరియు దాదాపు మోకాళ్ల వరకు పడిపోయే డెల్లా పొడవాటి జుట్టు.

ఇది క్రిస్మస్ ఈవ్. డెల్లా జిమ్కి క్రిస్మస్ కానుకను కొనాలనుకుంటోంది. కానీ, ఆమె వద్ద $1.87 మాత్రమే ఉంది. డెల్లా అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు, ఆమెకు అకస్మాత్తుగా ఒక ఆలోచన వస్తుంది. ఆమె తన జుట్టును $20.00కి అమ్ముతుంది. ఆ డబ్బుతో, ఆమె ప్లాటినం చైన్ని $21.00కి కొనుగోలు చేసింది. ఆమె వర్తమానం గురించి చాలా సంతోషంగా ఉంది. ఆ గొలుసు అతని వాచీకి అందం చేకూరుస్తుందని ఆమె అనుకుంటోంది.

జిమ్ పని నుండి ఇంటికి వచ్చినప్పుడు, అతను డెల్లా వైపు చూస్తూ ఉంటాడు. మొదటి చూపులో తన జుట్టు లేకపోవడం అతనికి కనిపించకూడదని ఆమె దేవుడిని ప్రార్థిస్తుంది. అతని బహుమతిని కొనడానికి తన జుట్టును అమ్మినట్లు ఆమె అంగీకరించింది. అయితే, ఆమె అతనికి ఇవ్వడానికి ముందు, జిమ్ తన ఓవర్ కోట్ జేబులోంచి ఒక ప్యాకేజీని తీసి ఆమెకు ఇచ్చాడు. లోపల, డెల్లా ఒకప్పుడు మెచ్చుకున్న ఒక జత ఖరీదైన అలంకార జుట్టు దువ్వెనలను కనుగొంటుంది. కానీ, ఆమె జుట్టు కత్తిరించినందున అవి ఇప్పుడు పూర్తిగా పనికిరావు. తన కన్నీళ్లను దాచిపెట్టి, ఆమె జిమ్- వాచ్ చైన్ కోసం తన బహుమతిని అందజేస్తుంది. జిమ్ డెల్లాకు బహుమతిగా కొనడానికి తన గడియారాన్ని అమ్మినట్లు చెప్పాడు. బహుమతుల గురించి మరచిపోయి, “ప్రస్తుతం వాటిని ఉపయోగించడం చాలా బాగుంది” అని క్రిస్మస్ సందర్భంగా ఆనందించమని అతను ఆమెను అడుగుతాడు.

జిమ్ మరియు డెల్లా యొక్క బహుమతులను, క్రిస్మస్ బహుమతిగా బేబీ జీసస్ను సందర్శించిన ముగ్గురు జ్ఞానులు బహుమతులతో పోల్చడంతో కథ ముగుస్తుంది. జిమ్ మరియు డెల్లా మాగీల కంటే చాలా తెలివైనవారని కథకుడు ముగించారు ఎందుకంటే వారి బహుమతులు ప్రేమ బహుమతులు. ప్రేమ మరియు ఆత్మత్యాగంతో ఇచ్చే వారు నిజంగా తెలివైనవారు, ఎందుకంటే వారికి ప్రేమ విలువ తెలుసు. వారి దస్తావేజు మరొకటి కాదు, రచయిత చెప్పినట్లుగా, “ప్రేమకు దాతృత్వం జోడించబడింది”.

క్రిస్మస్ కోసం బహుమతి అనేది సాహిత్యంలో వ్యంగ్యానికి ఒక అద్భుమైన ఉదాహరణ. పాఠకులను ఆశ్చర్యపరిచే ట్విస్ట్లో రచయిత కథను ముగించారు. ఈ విధంగా, ఓ. హెన్రీ ఎ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్ కథలో నిజమైన ప్రేమను వివరిస్తాడు.

A Gift for Christmas Summary in Hindi

Note: This summary is only meant for Lesson Reference, not for examination purpose

‘ए गिफ़्ट ऑफ़ क्रिसमस’ एक प्रसिद्ध लघु कथा है, जो ओ. हेनवी द्वारा लिखित है । यह कहानी पहली बार 1905 में प्रकाशित हुई थी ।

यह कहानी एक युवा विवाहित जोड़े जेम्स के जीवन का वर्णन करती हैं जिसे जिम और डेला डिलिंघम के नाम से जाना जाता है । दंपति एक मामूली अपार्टमेंट में वहते हैं । उनके पास केवल मूल्यवान संपत्तियाँ हैं : जिम के सोने की जेब घड़ी जो उनके दादाजी की थी और डेला के लंबे केश जो लगभग उसके घूटनों तक गिरते हैं ।

यह क्रिस्मस की पूर्व संध्या है । डेला जिम को क्रिस्मस का उपहार खरीदना चाहती है । लेकिन उसके पास $ 1.87 है । जब डेला खुद को आईने में देखती है, तो उसे अचानक एक विचार आता है । वह अपने केशों को $ 20.00 में बेचती है। उस पैसे से वह 21.00 डॉलर में एक प्लैटिनम चेन खरीदती है । वह उपहार के लेकर बहुत खुश है । वह सोचती है कि चेन उसकी घड़ी की सुंदरता में चार चांद लगा देगी ।

जब जिम काम से घर आता है, तो वह डेली को देखता है । वह भगवान से प्रार्थना करती है कि पहली नजर में जिम डेला के केशों की अनुपस्थिति न पहचाने। वह स्वीकार करती है कि उसने अपने उपहार खरीदने के लिए अपने केश बेचे । इससे पहले कि वह उसे दे पाती, जिम अपने ओवर कोट की जेब से एक पैकेट निकालता है और उसे देता है। पैकेट के अंदर डेला को एक मूल्यवान जोड़ा मिलता हैं । पहली नजर में इसके केशों की अनुपस्थिति | वह स्वीकार करती है कि उसने अपना उपहार खरीदने के लिए अपने बाल बेचे । इसने पहले कि वह उसे दे पाती, हालांकि, जिम अपने ओवरकोट की जेब से एक पैकेज निकालता है और उसे देता है। उसके अंदर डेला को मूल्यवान केशों की सजावटी कंघी की जोड़ी मिलती है । जिसकी उसने एक बार प्रशंसा की थी । लेकिने वे अब पूवी तरह से बेकार हैं क्यों कि उसने केश काट दिए हैं |

अपने आँसुओं को छिपाते हुए, वह जिम के लिए अपना उपहार रखती है – घड़ी की चेन । जिम डेला को बताता है कि उसने उसे उपहार खरीदने के लिए अपनी घड़ी बेच दी है । वह उसे उपबरों के बारे में भूल जाने और क्रिस्मस की पूर्व संध्या का आनंद लेने के लिए कहता है, “वे अभी उपयोग करने के लिए बहुत अच्छे साथ समाप्त होती है, जो कि क्रिस्मस के हैं ।” कहानी जिम और डेला के उपहारों की तुलना के लिए एक उपहार तीन बुद्धिमान पुरुष जो बेबी जीसस का दोरा करते थे । वशकार ने निष्कर्ष निकालता है कि जिम और उपहार प्रेम के उपहार हैं। जो लोग प्रेम और आत्म – बलिदान से देते हैं, वे वास्तव में सब से बुद्धिमान हैं क्यों कि वे प्रेम का मूल्य जानते हैं । उनका काम कुछ भी नहीं है । लेकिन, जैसा कि लेखक कहते हैं, “उदारता जुड़ गई प्यार से”

‘क्रिस्मस के लिए एक उपहार’ साहित्य में बिडंबना का एक उत्कृष्ट उदाहरण है । लेखक कहानी का अंत एक ऐसे ट्विस्ट के साथ करता है जो पाठकों को हरान कर देता है । इस प्रकार ओ. हेमरी ‘ए गिफ़्ट फ़र क्रिस्मस’ कहानी में सच्चें प्यार का चित्रण रकते हैं ।

Meanings and Explanations

dollar (n) / (డాలర్) / ‘dɒl.ər : a monetary unit of the US – US: všL KIS v265 अमरिका की मौद्रिक इकाई

cent (n)/(సెంట్)/sent : a monetary unit equal to one hundredth of a dollar
-ఒక డాలర్లో వందవ వంతుకు సమానమైన ద్రవ్య యూనిట్
एक डॉलर के सौवें हिस्से के बराबर एक मौद्रिक इकाई

couch (n)/(కౌచ్) / kaʊtʃ : a long upholstered piece of furniture for several people to sit on – అనేక మంది వ్యక్తులు కూర్చోవడానికి ఒక పొడవైన అప్రోల్స్టర్డ్ ఫర్నిచర్, कई लोगों के बैटने के लिए फ़र्नीचर के सोफ़े का एक हिस्सा

furnished (adj) / (ఫ (ర్)నిష్ ట్) / ‘f3:.nɪʃt : (of accommodation) with furniture -ఫర్నిచర్తో అమర్చిన వసతి, फ़नीचिर से सुसज्जित

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas

dully (adv)/dalli/(డల్లి)/ ‘dʌl.li : excitement – ఉత్సాహం, निरुत्साह

looking-glass (n)/(లుకింగ్ గ్లాస్)/ ‘lʊk.ɪŋ, a mirror, ఒక అద్ధం, एक दर्पण

expenses (n-pl) / (ఎక్స్ పెన్స్)/ik’spens : money needed or used to do or buy something డబ్బు అవసరం లేదా ఏదైనా చేయడానికి లేదా కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు, कुछ खरीदने, या करने के लिए उपयोग किस जाता है

worthy (adj) / (వర్తి)/ ‘w3:.ði : suitable for or characteristic of something – దేనికైనా అనుకూలం లేదా లక్షణం, किसी चीज के लिए उपयुक्त था उसकी विशेषता के लिए

lost its colour (phrase) : became pale – లేతగా మారింది, पीला हो जाना

rapidly (adv)/(ర్యాపిడ్ లి)/’ræp.ɪd.li : very quickly; at a great rate a grey cat walking on a grey fence; an expression to state one is staring – చాలా త్వరగా; గొప్ప రేటుతో బూడిద కంచె మీద నడిచే బూడిద పిల్లి; ఒక వ్యక్తి తదేకంగా చూస్తున్నట్లు చెప్పడానికి ఒక వ్యక్తీకరణ बहुत तेजी से, बहुत रफ़्तार से

in a grey background : at nothing; a state of blankness or desperation ఏమీ లేదు; ఖాళీ లేదా నిరాశ స్థితి, एक अभिव्यक्ति यह बताने के लिए है कि कुछ भी नही देख रहा है । खालीपन या हताश की स्थिति

possession (n) / (పజె షన్ జ్) / pəzeʃ.ən, a thing owned-ఒక వస్తువు స్వ౦తం, स्वामित्ववाली वस्तु

pride (n) / (ఫ్రైడ్) / praɪd a feeling or deep pleasure or satisfaction derived from one’s own achievements – ఒకరి స్వ౦త విజయాల నుండి పొందిన అనుభూతి లేదా లోతైన ఆనందం లేదా సంతృప్తి एक भावना या गहरा आनंद था संतुस्ट जो स्वयं से प्राप्त होती है

faltered (v-pt)/(ఫోల్ ట (ర్)డ్)/ ‘fɒl.tər : became weaker – బలహీనంగా మారింది, कमजोर हो गया

fluttered (v-pt)/(ఫ్లట(ర్)డ్)/ ‘flʌt.ər : moved with a light irregular or trembling motion – తేలికపాటి సక్రమంగా లేదా వణుకుతున్న కదలికతో కదిలింది, एक हलकी अनिभमित या कंपन के साथ चली गई गति

cascade (n)/(క్యాస్ కె ఇడ్)/kæs’keɪd : large amount of something like hair falling down – వెంట్రుకలు రాలడం వంటి వాటి మొత్తం, बालों के गिरने जैसी किली चीज की एक बदी मात्रा

nervous (adj) / (నర్వస్)/ tense /’n3:vəs : anxious – ఆతృతగా, तनावग्रस्त स्थिति

burdened (v-pt)/(బర్డెన్ డ్)//b3:dən : loaded heavily, difficult to bear – భారంగా లోడ్ చేయబడింది, భరించడం కష్టం भारी भरी हुई, मुश्किल से सहना

stared (v-pt) /(స్టార్డ్)/ steər : looked fixedly or vacantly at someone or something with one’s eyes wide open, లేదా దేనినైనా కళ్ళు పెద్దవి చేసి చూసారు, निश्चित रूप से यारिक्त रूप से किसी को देखा गया
थार खुली आँखों से किसी को देखा गया

TS Inter 2nd Year English Study Material Chapter 12 A Gift for Christmas

strange (adj)/(స్ట్రెంజ్) / streɪndʒ : unusual or surprising – అసాధారణమైన లేదా ఆశ్చర్యకరమైన, असामान्य या आश्चर्यजनक

expression (n) / (ఎక్స్ ప్రెషన్)/ ik’spreʃ.ən : a look on someone’s face that conveys a particular emotion – ఒక నిర్దిష్ట భావోద్వేగాన్ని తెలియజేసే వ్యక్తి ముఖం, किसी के चेहरे पर एक नज़र जो बता देती है, एक विशेष भावना

cut off (phrase)/(కట్ ఆఫ్) / kʌt.ɒf : remove something using a sharp tool- పదునైన సాధనాన్ని ఉపయోగించి ఏదైనా తీసివేయండి, किसी नुकीले उपकरण का उपयोग करके किसी चीज़ को हटाना

remembered (v-pt) / remembered (రిమెంబర్డ్)/ ri’mem.bər : recalled-గుర్తుచేసుకున్నారు, कोयाद किया

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 2nd Poem భగీరథ ప్రయత్నం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Study Material 2nd Poem భగీరథ ప్రయత్నం

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
‘భగీరథ ప్రయత్నం’ పాఠ్య సారాంశం రాయండి.
జవాబు:
సమస్త భూమండలాన్ని పరిపాలిస్తున్న కోసలరాజు భగీరథుడు. తన పూర్వీకులైన సగర మహారాజు పుత్రులు ఏవిధంగా కపిల మహర్షి కోపానికి భస్మం అయిన తీరును మంత్రుల ద్వారా తెలుసుకున్నాడు. వారికి మోక్షం కలిగించాలని నిశ్చయించుకున్నాడు. భగీరథునికి పుత్ర సంతానం లేని కారణంగా తన రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి, గోకర్ణం వెళ్లి, అక్కడ వేయి సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు.

ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకో అంటే భగీరథుడు సంతోషించి, సాగరుల భస్మరాశులపై దేవనదీ నీటిని ప్రవహింప చేయమని మొదటి వరంగా, తన వంశాన్ని ఉద్ధరించే ఒక కుమారున్ని అనుగ్రహించమని రెండవ వరంగా కోరాడు.

అలా భగీరథుడు కోరుకోగానే బ్రహ్మదేవుడు తేజస్సు కల కుమారుడు నీకు జన్మిస్తాడు. కానీ దివ్యలోకాలలో ప్రవహించే నది భూమిపై పడితే భూమండలం భరించలేదు. కావున శివున్ని మెప్పిస్తే దేవనదిని ఆయన భరిస్తాడు అని చెప్పి బ్రహ్మ అదృశ్యం అయ్యాడు. భక్తితో కాలి బొటన వేలును మాత్రమే భూమిపై మోపి, తన హృదయాన్ని పద్మంగా మార్చుకొని శంకరుని గూర్చి కఠినమైన తపస్సు చేశాడు. ఆరాజు తపస్సుకు మెచ్చిన శివుడు దేవలోకంలోని నీటి ప్రవాహాన్ని నా తలపై భరిస్తాను.

అని చెప్పగా భగీరథుడు విజయం సాధించానని సంతోషించాడు. శివుడు ఇచ్చిన మాటకు కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని భావించింది. గంగాదేవి గర్వానికి అత్యంత కోప స్వభావుడైన శివుడు ఆమె గర్వాన్ని తొలగించాలని మనస్సులో అనుకున్నాడు.

దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా శబ్దం చేస్తూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది. ఆ శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉండి పోయింది. దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది. నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్పతనము కలుగుతుంది. అని దేవతలు వేడుకొనగా శివుడు పరమ సంతోషంతో ఆ గంగానదిని సముద్రంలోకి వదిలాడు.

శివుని జడలనుండి గంగానది ఏడు పాయలుగా ప్రవహించింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లు గల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి. సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం భగీరథుని వద్దకు బయలుదేరింది. అలా గంగానది తనవెంట రావడం గమనించిన భగీరథుడు గొప్ప రథం ఎక్కి కదిలాడు.

అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందంగా దేవనదీ జలాలలో స్నానాలు చేశారు. వారంతా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు. శివుని శరీరాన్ని తాకి మరింత పవిత్రంగా మారిన దేవనదీ జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు అనేకసార్లు ఆనదిలో స్నానం చేశారు.

జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆనదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్య చకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఇలా అన్నారు. ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి గర్వం అణిగింది. ఇకపై ఈ భూమిపై గంగ నీకూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను. అనగానే జహ్ను మహర్షి తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. ఆ రోజునుండి జహ్ను మహర్షి కూతురు కావున జాహ్నవి అనే పేరుతో గంగానది భూమిపై ప్రవహించింది.

భగీరథుని రథం వెంబడి సముద్రానికి వెళ్ళింది. ఎండిపోయిన సముద్రంలో, సాగరులు తవ్విన రంధ్రం ద్వారా, గంగ తనవెంట రాగ, భగీరథుడు పాతాళానికి వెళ్లి, సగరపుత్రుల బూడిద కుప్పలను దీనంగా చూశాడు. ఆ బూడిదకుప్పలు తడిసే విధంగా గంగ ప్రవహించింది. కావున వారు పాపములు పోయినవారై, పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గానికి చేరుకున్నారు.

బ్రహ్మ దేవతలందరితో కలిసి వెళ్ళి భగీరథునితో “భూమిపై ఎప్పటివరకు ఈ సముద్రం ఉంటుందో, అస్నటి వరకు సగర పుత్రులు స్వర్గంలో నివసిస్తారు. నీవు కూడా అదేవిధంగా ఆగొప్ప లోకంలో ఉంటావు. గంగానది ఈ భూమిపై జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని, నీ కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ప్రవహిస్తుందని అన్నాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

ప్రశ్న 2.
‘గంగా ప్రవాహం’ ఎలా కొనసాగిందో తెలుపండి.
జవాబు:
భగీరథుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను, శివున్ని ప్రసన్నం చేసుకున్నాడు. గంగను తన తలపై భరిస్తానని శివుడు ఇచ్చిన మాట గంగకు కోపం తెప్పించింది. తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని గంగ భావించింది. గంగ గర్వాన్ని తొలగించాలని శివుడు అనుకున్నాడు. ఆ సమయంలో దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దంచేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది.

ఈ విధంగా శివుని తలపై పడి శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది. దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నమస్కరించి, కీర్తించి మూడు లోకాలకు పాలకుడా! నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది. నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. తమరు అనుగ్రహిస్తే ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్ప మేలు కలుగుతుంది అని దేవతలు వేడుకొనగా పరమశివుడు గంగానదిని సముద్రంలోకి వదిలాడు.

శివుని జడలనుండి విడువబడిన గంగానది భాసురహ్లాదినీ, పావనీ, నందినీ, సీతా, సుచక్షు, సింధు, అనే ఆరుపాయలు తూర్పు, పడమరలకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా ఆ భగీరథుని వద్దకు బయలుదేరింది. అలా గంగానది తనవెంట రావడం గమనించిన భగీరథుడు గొప్ప రథంపై ఎక్కి పాతాళానికి కదిలాడు.

అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంగా స్నానాలు చేశారు. వారంతా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు. శివుని శరీరాన్ని తాకినందున మరింత పవిత్రంగా మారిన దేవనది జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు వారి కోరికలు తీరేలాగా అనేక సార్లు ఆనదిలో స్నానం చేశారు.

జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆనదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి పొగరు (గర్వం) అణిగింది. ఇకపై ఈ భూమిపై గంగ నీకూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను అని అనగానే జహ్నుమహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. గంగ భగీరథుని రథం వెంబడి సముద్రం వైపు వెళ్ళింది.

ఎండిపోయిన సముద్రంలో, సాగరులు తవ్విన రంధ్రం ద్వారా, భగీరథుని వెంట పాతాళానికి వెళ్ళి, సగరపుత్రుల బూడిదకుప్పలు తడిసేవిధంగా ప్రవహించింది. దానితో సాగరులకు పాపములు పోయి దివ్యరూపాలు వచ్చాయి. వారు దేవతలలాగా విమానాలలో పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గాన్ని అధిరోహించారు. అప్పటి నుండి గంగానది జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని, భగీరథుని కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ఈ భూమిపై ప్రవహిస్తుంది.

II సంగ్రహరూప ప్రశ్నలు

ప్రశ్న 1.
పండరీనాథుడి గురించి రాయండి.
జవాబు:
భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం నాటివాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. మోతుకూరి వంశంలో జన్మించిన పండరీనాథుడు ఆరువేల నియోగిశాఖకు చెందినవాడు. పండరీనాథరావు తల్లిదండ్రులు వేంకటాబిన్, గోపాలరావు.
శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే ఆయన గ్రంథాన్ని 1810, మే ఏడవ తేదీన శంకర జయంతి రోజు శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. పండరీనాథుడు సంస్కృతంలో “రామకథా కల్పలత” అనే గ్రంథం రాసినట్లు తెలుస్తుంది. కాని అది అలభ్యం. శివకేశవులకు సమాన ప్రాధాన్యమిచ్చి సమరసతను ప్రదర్శించాడు.

ప్రశ్న 2.
కపిల మహర్షికి కోపం ఎందుకు వచ్చింది ?
జవాబు:
సగరునికి సుమతి, కేశిని అనే ఇద్దరు భార్యలున్నారు. వారికి సంతానం కలగక పోవటంచేత, సగరుడు తన భార్యలతో భృగుశ్రవణ పర్వతం చేరి నూరు సంవత్సరాలు తపస్సు చేశాడు. భృగువు ప్రత్యక్షమై ఒక భార్య అరవై వేలమంది పుత్రులను, మరొక భార్య వంశోద్ధారకుడైన ఒక పుత్రునికి జన్మనిస్తారని దీవించాడు. సుమతి అరవై వేలమందిని, కేశిని ఒక పుత్రుణ్ణి కోరారు. తరువాత కేశిని అసమంజునునికి, సుమతి ఒక మాంసపుముద్దకు జన్మనిచ్చారు. ఆ మాంసపు ముద్దను ముక్కలు చేసి నేతికుండలలో వుంచగా అరవై వేలమంది శిశువులు జన్మించారు. వీరు పెరిగి ప్రజలను కష్టపెట్టసాగారు.

వీరి గర్వమణిచేందుకు ఇంద్రుడు సగరుని యాగాశ్వాన్ని పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. సగర చక్రవర్తి కుమారులైన సాగరులు యజ్ఞాశ్వాన్ని కనుగొనే ప్రయత్నంలో పాతాళానికి వెళ్ళారు. అక్కడ తమ యాగాశ్వాన్ని చూశారు. అక్కడ ఎన్నో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న కపిలమహర్షిని చూశారు. ఆ మహర్షీ తమ యాగాశ్వాన్ని అక్కడ దాచిపెట్టాడని అతని తపస్సును భగ్నం చేయ ప్రయత్నించారు. అలా కపిల మహర్షి కోపాగ్నికి భస్మమైపోయారు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

ప్రశ్న 3.
గంగకు ‘జాహ్నవి’ అనే పేరు ఎందుకు వచ్చింది ?
జవాబు:
భగీరథుని తపస్సుకు మెచ్చి శివుడు తన తలపై గంగను నిలిపాడు. దేవతల కోరికపై శివుడు తన జటాజూటం నుండి గంగను విడిచాడు. గంగ ఏడు పాయలుగా ప్రవహించింది. అందులో ఒకటి భగీరథుని వెంట వెళుతూ జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యుని లాగా ఆ నదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో “ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి గర్వాన్ని అణచావు.

ఇకపై ఈ భూమిపై గంగ నీకూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను అన్నారు. అలా అనగానే జహ్ను మహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. జహ్ను మహర్షి చెవుల నుండి పుట్టింది కావున జాహ్నవి అనే పేరుతో భూలోకంలో గంగ పిలువబడుతుంది.

ప్రశ్న 4.
గంగ ఏ పేర్లతో పాయలుగా ప్రవహించింది ?
జవాబు:
శివుడు ఇచ్చిన మాటకు కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తానని భావించింది. శివుడు ఆమె గర్వాన్ని తొలగించాలనుకున్నాడు. దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దంచేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది. శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది. దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను.

ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్పతనము కలుగుతుంది అని వేడుకొనగా పరమశివుడు నవ్వి, పరమ సంతోష హృదయుడై ఆ గంగా నదిని సముద్రంలోకి వదిలాడు. శివుని జడలనుండి విడువబడిన గంగానది ఏడు పాయలుగా రూపాంతరం చెందింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లుగల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి. సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా ఆ భగీరథుని వద్దకు బయలుదేరింది.

III ఏకపద/ వాక్య సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎవరి కోపం వల్ల సగరపుత్రులు భస్మం అయ్యారు ?
జవాబు:
కపిల మహర్షి

ప్రశ్న 2.
‘పండరీనాథ రామాయణం’ ఎవరికి అంకితం ఇచ్చారు ?
జవాబు:
శ్రీరామచంద్రునికి

ప్రశ్న 3.
భగీరథుడు ఏ క్షేత్రంలో తపస్సు చేశాడు ?
జవాబు:
గోకర్ణంలో

ప్రశ్న 4.
గంగను శిరస్సుపై ఎవరు ధరించారు ?
జవాబు:
శివుడు

ప్రశ్న 5.
‘నాకము’ అనగానేమి ?
జవాబు:
స్వర్గం

ప్రశ్న 6.
‘భగీరథ ప్రయత్నం’ ఏ కావ్యం లోనిది ?
జవాబు:
శ్రీమత్ పండరీనాథ రామాయణం

ప్రశ్న 7.
భగీరథుడిని ఎవరు ఆశీర్వదించారు ?
జవాబు:
బ్రహ్మ

ప్రశ్న 8.
సగరుల భస్మం ఏ లోకంలో ఉంది ?
జవాబు:
పాతాళం

IV. సందర్భసహిత వ్యాఖ్యలు

1. శంభుమస్తకముపైఁ బడియె గడు నద్భుతంబుగాన్
జవాబు:
కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.

అర్థం : శంకరుని తలపై అందంగా పడింది.

సందర్భం : శివునిపై కోపంతో శివున్ని పాతాళానికి తొక్కి వేయాలని దేవలోకంలో ప్రవహించే గంగానది హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై మిక్కిలి అద్భుతంగా పడిన సందర్భంలోనిది.

వ్యాఖ్య : భగీరథుని తపస్సుకు బ్రహ్మ, మహేశ్వరులు మెచ్చి దివిజ గంగను భువికి తేవడానికి సహకరించారు. దానికి గంగ శివునిపై కోపం పెంచుకుంది. దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దం చేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడి శివుని జటాజూటంలో చిక్కుకున్నది.

2. నాకంబునకుద్గమించె భయ కృత్రేతత్వ నిర్ముక్తమై (Imp)
జవాబు:
కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.

అర్థం : భయంకరమైన ప్రేత స్వభావాన్ని వదిలి స్వర్గానికి వెళ్ళారు.

సందర్భం : భగీరథుని తపస్సుకు బ్రహ్మ, మహేశ్వరులు మెచ్చి దివిజ గంగను భువికి తేవడానికి సహకరించారు. అల ఇలపై అడుగిడిన గంగా జలంలో సామాన్యులు స్నానం చేసి పుణ్యలోకాలకు వెళ్తున్న సందర్భంలోనిది.

వ్యాఖ్య : అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంతో స్నానాలు చేశారు. అలా పవిత్రులై తమ భయంకరమైన ప్రేతరూపాలను వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు.

3. నాటనుండి జహ్నునకు కూఁతురగుట
జవాబు:
కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.

అర్థం : ఆ రోజు నుండి జహ్ను మహర్షికి కూతురైనది.

సందర్భం : భగీరథుని వెంట వెళ్తున్న గంగ జహ్ను మహర్షి యాగశాలను ముంచి వేస్తే జహ్నువు గంగను మింగాడు. దేవతల ప్రార్థనతో మళ్ళీ చెవుల నుండి వదిలిన సందర్భంలోనిది.

వ్యాఖ్య : జహ్నువు గంగను తాగేయడాన్ని చూసిన దేవతలందరూ ఆశ్చర్యచకితులై “నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింపచేశావు. గంగాదేవి యొక్క గర్వం అణిచివేశావు. ఇకపై ఈ గంగ నీ కూతురుగా `’గుర్తించబడుతుంది అని అన్నారు. అలా అనగానే జహ్ను మహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. ఆ రోజు నుండి గంగ జాహ్నవిగా పిలువబడుతున్నది.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

4. నుతింపఁగా సకలదైవతకోటులకైన శక్యమే (V.Imp) (M.P)
జవాబు:
కవి పరిచయం : భగీరథ ప్రయత్నం అనే ఈ పాఠ్యభాగాన్ని రాసిన కవి మోతుకూరి పండరీనాథరావు. ఈయన 18వ శతాబ్దం వాడు. ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ అతని స్వగ్రామం. ఈ పాఠ్యాంశం శ్రీమత్ పండరీనాథ రామాయణం అనే గ్రంథంలోని బాలకాండ ద్వితీయాశ్వాసంలోనిది. దీనిని శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.

అర్థం : కీర్తించడానికి సమస్త దేవ సమూహాలకూ సాధ్యం కాదు

సందర్భం : ఎంతో తపస్సు చేసి, మరెన్నో అడ్డంకులను అధిగమించి, పాతాళంలో పడిఉన్న తన పితరుల భస్మ రాశులపై గంగను ప్రవహింపజేసిన భగీరథున్ని బ్రహ్మదేవు మెచ్చుకుంటున్న సందర్భంలోనిది.

వ్యాఖ్య : బ్రహ్మ భగీరథున్ని కరుణతో చూసి “కుమారా! సగరుడు మొదలైన మీ పూర్వీకులకు ఈ ప్రతిజ్ఞ అనే సముద్రాన్ని తరించడం సాధ్యం కాలేదు. దానిని సాధించిన నిన్ను, నీ తపస్సును మెచ్చుకోవడం సమస్త దేవతా సమూహాలకు కూడా సాధ్యం కాదు” అని అన్నాడు.

పద్యములు – ప్రతిపదార్థ తాత్పర్యములు :

1వ పద్యం :

ఉ||
అంత భగీరథుండు చతురంతమహీవలయంబుఁ బ్రోవుచున్
మంత్రులు చెప్ప సాగరసమాజము కాపిల కోపవహ్ని చే
నంతకు ప్రోలి కేఁగుట సమగ్రముగా విని కోసలేశుఁ డ
త్యంత విచారమగ్నమతి యయ్యెను దత్పరమార్ధసిద్ధికై.

ప్రతిపదార్థం:

అంత = అప్పుడు
చతురంత = నాలుగు వైపులా సముద్రంచే చుట్టబడిన
మహీవలయంబుఁ = భూ మండలాన్ని
బ్రోవుచున్ = పరిపాలిస్తూ
సాగరసమాజము = సగర మహారాజు పుత్రులు
కాపిల కోపవహ్ని చే = కపిల మహర్షి కోపాగ్నికి
నంతకు ప్రోలి కేఁగుట = భస్మీపటలం అయిన విధానాన్ని
సమగ్రముగా = వివరంగా
మంత్రులు చెప్ప = మంత్రులు చెప్తుండగా
కోసలేశుఁ డు = కోసల రాజ్యాన్ని పాలిస్తున్న
భగీరథుండు = భగీరథుడు
విని = ఆలకించి
తత్ + పరమార్థసిద్ధికై = ఆ పనిని పూర్తి చేయడానికి
అత్య౦త = ఎక్కువైన
విచారమగమతి = బాధతో నిండిన మనస్సు కలవాడు
యయ్యెను = అయ్యాడు

తాత్పర్యం : నాలుగు వైపులా సముద్రంచే చుట్టబడిన భూమండలాన్ని పరిపాలిస్తున్న కోసల రాజు అయిన భగీరథుడు, తన పూర్వీకులైన సగర మహారాజు పుత్రులు ఏవిధంగా కపిల మహర్షి కోపానికి భస్మం అయ్యారో మంత్రుల ద్వారా తెలుసుకొని ఆపనిని పూర్తిచేయడానికి సిద్ధపడ్డాడు.

2వ పద్యం :

అ ||
తనకు సుతులు లేమిఁ దద్రాజ్యభర మెల్ల,
మంత్రులందు నిల్పి మనుజవరుఁడు
వీఁక మెఱయఁ దాను గోకర్ణమున కేఁగి
యందుఁ జేసె ఘోరమైన తపము.

ప్రతిపదార్థం :

తనకు = భాగీరథునికి
సుతులు లేమిఁ = కొడుకులు లేని కారణంగా
తత్ రాజ్య = ఆ రాజ్య
భర మెల్ల = భారాన్ని
మంత్రులందు నిల్పి = మంత్రులకు అప్పగించి
మనుజవరుఁడు = మానవులను కాపాడేవాడు (మహారాజు)
వీఁకము + ఎరయ = ఉత్సాహము ఏర్పడే విధంగా
తాను = భగీరథుడు
గోకర్ణమునకు + ఏగి = గోకర్ణము అనే ప్రదేశానికి వెళ్లి
అందున్ = అందులో (అక్కడ)
ఘోరమైన = గొప్పదైన
తపము = తపస్సును
జేసె = చేశాడు

తాత్పర్యం : భాగీరథునికి పుత్ర సంతానం లేని కారణంగా తన రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి, (తన పితరుల ఆత్మలకు శాంతి లభింప చేయడానికి) గోకర్ణం వెళ్లి అక్కడ గొప్ప తపస్సు చేశాడు.

3వ పద్యం :

తే ||
వాయుభక్షకుఁడై యూర్ధ్వబాహుఁ డగుచు
మహిత పంచానలంబుల మధ్యమందు
స్థాణువోయన నచలుఁడై తగ వసించి
తపము గావించె వేయువత్సరము లిట్లు.

ప్రతిపదార్థం :

వాయుభక్షకుఁడై = గాలిని ఆహారంగా తీసుకొని
యూర్ధ్వబాహుఁ డగుచు = చేతులు పైకెత్తి
మహిత = గొప్ప
పంచ = ఐదు
అనలంబుల = అగ్నుల
మధ్యమందు = మధ్యలో
స్థాణువోయనన్ = రాయి ఏమో అనగా
అచలుఁడై = కదలకుండా
తగ వసించి = నిలిచి
ఇట్లు = ఈ విధంగా
వేయువత్సరములు = వేయి యేళ్ళు
తపము = తపస్సు
గావించె = చేశాడు

తాత్పర్యం : గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని, రెండు చేతులు పైకెత్తి, ఐదు రకాల అగ్నుల మధ్య రాయి ఏమో అనేవిధంగా కదలకుండా వేయి సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

4వ పద్యం :

ఉ||
దానికి మెచ్చి యిట్లనుఁ బితామహుఁ డోమను జేశ ! యోతప
శ్రీనిధి యోభగీరథ ! విశిష్టజనస్తుతమైన నీతపం
బే నిదె మెచ్చినాఁడ భవదిష్టము వేఁడుము దాని నిచ్చెదన్
మానవనాథ యంచుఁ గడు మన్ననఁ బల్క నతండు హృష్టుఁడై.

ప్రతిపదార్థం :

దానికి మెచ్చి = ఆ తపస్సుకు మెచ్చి
పితామహుఁడు = బ్రహ్మ
యిట్లనున్ = ఈ విధంగా అన్నాడు
ఓ మనుజ + ఈ శ ! = ఓ మహారాజా !
ఓ తపశ్రీనిధి = తపస్సంపన్నుడా !
ఓ భగీరథ ! = ఓ భగీరథ !
విశిష్టజనస్తుతము + ఐన = జనులచే పొగడబడే
నీతపంబున్ = నీ తపస్సును
ఏ + ఇదె = నేను ఇప్పుడే
మెచ్చినాఁడ = మెచ్చినాను
భవత్ + ఇష్టము = నీ కోరికను కోరుకొనుము
వేడుము = కోరుకొనుము
దానిన్ + ఇచ్చెదన్ = దానిని తీర్చుతాను
మానవనాథ = మహారాజా
అనుచున్ = అంటూ
కడు = ఎక్కువైనా
మన్ననఁ బల్కన్ = గౌరవంతో పలకగా
అతండు = భగీరథుడు
హృష్టుఁడై = సంతోషించి

తాత్పర్యం : గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని, రెండు చేతులు పైకెత్తి, ఐదు రకాల అగ్నుల మధ్య రాయి ఏమో అనేవిధంగా కదలకుండా వేయి సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు.

5వ పద్యం :

ఉ ||
అంజలి చేసి మ్రొక్కి వినయావనతాననుఁడై జగత్ప్రభున్
గంజభవుం గనుంగొని జగజ్జన గీతయశుండు భూమిభృ
త్కుంజరుఁ డిట్లనున్ మొదలు గోరెద సాగరభస్మమున్ జగ
ద్రంజన ! దేవతాసరి దుదంచిత వారిపరిఫ్లుతంబుగాన్.

ప్రతిపదార్థం :

అంజలి చేసి = రెండు చేతులు జోడించి
మ్రొక్కి = నమస్కరించి
వినయ + అవనత + ఆననుఁడై = వినయంతో తల వంచుకొని
జగత్ప్రభున్ = ఆ దేవుణ్ణి
కంజభవున్ = పద్మము నుండి పుట్టినవాడు (బ్రహ్మను)
కనుంగొని = చూసి
జగజ్జన గీతయశుండు = జనులందరిచే పొగడబడే కీర్తి కలవాడు
భూమి భృత్కుంజరుడు = మహారాజు (భగీరథుడు)
ఇట్లు + అనున్ = ఈ విధంగా పలికాడు
జగద్రంన ! = జనులకు ఆనందాన్ని కలిగించే వాడా
మొదలు = మొదట
సాగరభస్మమున్ = సాగరుల భస్మరాశులపై
దేవతాసరిత్ = దేవనది యొక్క
ఉదంచిత వారి = గొప్ప నీటిని
పరిఫ్లుతంబుగాన్ = ప్రవహించే విధంగా
గోరెదన్ = కోరుకుంటా

తాత్పర్యం : రెండు చేతులు జోడించి, నమస్కరించి, వినయంతో తల వంచుకొని అ బ్రహ్మను చూసి జనులచే పొగడబడే కీర్తి కలిగిన భగీరథుడు మొదట సాగరుల భస్మరాశులపై దేవనది యొక్క నీటిని ప్రవహింప చేయమని కోరాడు.

6వ పద్యం :

ఉ||
వెండియుఁ గోరెదన్ భువన విశ్రుతుఁడై న తనూజు సద్యశో
మండితు నప్రమేయగుణు మత్కులవర్ధను దేవదేవ ! యీ
రెండువరంబు లిచ్చి కృతకృత్యుఁగ నన్నానరింపవే ! నతా
ఖండల ! వాగధీశ ! శ్రితకల్పమహీజ ! త్రిలోకనాయకా !

ప్రతిపదార్థం :

వెండియుఁన్ = మళ్ళీ (తరువాత)
కోరెదన్ = కోరుకుంటాను
దేవదేవ ! = ఓ దేవా
నత + ఆఖండల ! = ఇంద్రునిచే నమస్కరించబడే వాడా !
వాగధీశ ! = వాక్కులకు అధిపతీ (సరస్వతికి భర్తా !)
(ఆ)శ్రితకల్పమహీజ ! = ఆశ్రయించిన వారికి కల్పవృక్షము వంటి వాడా
త్రిలోకనాయకా ! = మూడు లోకాలకు నాయకుడా!
భువన = భూమండలంలో
విశ్రుతుఁడై న = ప్రసిద్ధుడయ్యే
తనూజున్ = కొడుకును
సత్ + యశో మండితున్ = మంచి కీర్తి పొందే వాడిని ఎదురులేని గుణాలు కలిగిన వాడిని
అప్రమేయగుణున్ = ఎదురులేని గుణాలు కలిగిన వాడిని
మత్ కులవర్ధనున్ = మా వంశోద్ధారకున్ని
యీ రెండువరంబులు = ఈ రెండు కోరికలను
ఇచ్చి = ఇచ్చి
కృతకృత్యుఁగ = అనుకున్న పని పూర్తి చేసినవాడిగా
నన్నున్ + ఒనరింపవే ! = నన్ను అనుగ్రహించు

తాత్పర్యం : ఓ వాక్కులకు అధిపతి అయినవాడా!, ఇంద్రునిచే నమస్కరించబడే వాడా!, ఆశ్రయించిన వారికి లేదనక ఇచ్చే కల్ప వృక్షము వంటి వాడా, మూడు లోకాలకు నాయకుడా! భూమండలంలో ప్రసిద్ధి పొంది, మంచి గుణాలు కలిగి, మా వంశాన్ని ఉద్ధరించే ఒక కుమారున్ని రెండవవరంగా అనుగ్రహించు.

7వ పద్యం :

మ॥
అని యభ్యర్థితుఁ జేయ మెచ్చి యపు డయ్యంభోజసంభూతుఁ డి
ట్లనియెన్ వంశవివర్ధనుండు సుతుఁ డుద్యత్తేజుఁడుం గల్గు నీ
కనఘా ! దివ్య సరిత్ప్రవాహ పతనంబై నన్ భరింపంగ నో
పునె భూమిస్థలి ? దేవదేవుఁడగు శంభుం డొక్కడుం దక్కఁగాన్.

ప్రతిపదార్థం :

అని = అలా
యభ్యర్థితుఁన్ + చేయ = కోరుకొనగా
మెచ్చి = మెచ్చుకొని
అపుడు = అప్పుడు
ఆ + అంభోజ సంభూతుఁడు = కమలము నుండి పుట్టినవాడు (బ్రహ్మదేవుడు)
ఇట్లనియెన్ = ఈ విధంగా అన్నాడు.
అనఘా ! = పాపము లేని వాడా (పుణ్యాత్ముడా)
వంశవివర్ధనుండు = వంశాన్ని పెంచే తేజస్సు కల
సుతుఁడు = కొడుకు
నీకున్ + కల్గున్ = నీకు పుడుతాడు
దివ్య సరిత్ ప్రవాహ = దివ్య లోకాలలో ప్రవహించే (నది)
పతనంబై నన్ = కింద పడితే
దేవదేవుఁడగు = దేవతలకు దేవుడైన
శంభుం డొక్కడున్ = శంకరుడు ఒక్కడు
తక్కఁగాన్ = తప్ప
భూమిస్టలి ? = భూమండలం
భరింపంగన్ + ఓపునే = ఓర్చుకోగలదా ?

తాత్పర్యం : అలా భగీరథుడు కోరుకోగానే బ్రహ్మదేవుడు ఈ విధంగా అన్నాడు. “ఓ పుణ్యాత్ముడా ! నీ వంశాన్ని పెంచేవాడు, తేజస్సు కల కుమారుడు నీకు జన్మిస్తాడు. దివ్యలోకాలలో ప్రవహించే నది భూమిపై పడితే పరమ శివుడు తప్ప భూమండలం భరిస్తుందా?”

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

8వ పద్యం :

మ||
అని యిట్లయ్యజుఁ డానతిచ్చి మఱి దా నంతర్హితుండైన నె
క్కొను సద్భక్తి భగీరథుండు చరణాంగుష్ఠం బిలన్నిల్పి శం
భుని హృత్పద్మగుఁ జేసి దుష్కర తపంబుం జేయ నద్దేవుఁ డ
మ్మనుజాధీశు తపంబు మెచ్చి పలికెన్ మాధుర్య మేపారఁగన్.

ప్రతిపదార్థం :

యిట్లు = ఈ విధంగా
అని = చెప్పి
ఆ + అజుడు = బ్రహ్మ
ఆనతిచ్చి = చెప్పి
మఱి దాన్ = తాను
అంతర్హితుండైనన్ = అంతర్ధానం (మాయం) అయ్యాడు
ఎక్కొను = ఎక్కువైన
సద్భక్తి = భక్తి తో
భగీరథుండు = భాగీరథుడు
చరణ + అంగుష్ఠంబు = కాలి బొటన వేలును
ఇలన్ నిల్పి = భూమిపై నిలిపి
శంభుని = శంకరుని గూర్చి
హృత్ + పద్మగుఁ జేసి = హృదయాన్ని పద్మముగా చేసి
దుష్కర = కఠినమైన
తపంబున్ చేయన్ = తపస్సు చేస్తే
ఆ + దేవుడు = ఆ శివుడు
ఆ + మనుజాధీశు = రాజు
తపంబు మెచ్చి = తపస్సుకు సంతోషించి
మాధుర్యము + ఏపారఁగన్ = ఆప్యాయత నిండగా
పలికెన్ = పలికాడు

తాత్పర్యం : అని చెప్పి బ్రహ్మ అదృశ్యం అయ్యాడు. అపుడు భక్తితో కాలి బొటన వేలును మాత్రమే భూమిపై మోపి, తన హృదయాన్ని పద్మంగా మార్చుకొని శంకరుని గూర్చి కఠినమైన తపస్సు చేస్తే ఆ రాజు తపస్సుకు మెచ్చిన శివుడు ఆప్యాయతతో పలికాడు.

9వ పద్యం :

మ.కో॥
నీ తపంబున కేను మెచ్చితి నిరోదక వాహినిన్
నా తలస్ ధరియించెదన్ జననాథ! లెమ్మని పల్క ను
ర్వీతలేశుఁడు హృష్టుఁడై కనువిచ్చి శంకరుఁ జూచి సం
ప్రీతి మ్రొక్కి నుతించి తన్ గృతకృత్యుఁగాఁ దలఁచెన్ మదిన్.

ప్రతిపదార్థం:

జననాథ ! = ఓ రాజా
లెమ్ము + అని = లేవుమని
నీ = నీ
తపంబునకున్ = తపస్సుకు
ఏను = నేను
మెచ్చితి = సంతోషించాను
నిర్జర = దేవలోకంలోని
ఉదక = నీటి
వాహినిన్ = ప్రవాహాన్ని (నదిని)
నా తలన్ = నా తలపై
ధరియించెదన్ = ధరిస్తాను
పల్కన్ = చెప్పగా
ఉర్వీతలేశుఁడు = రాజు (భగీరథుడు)
హృష్టుడై = సంతోషించి
కనువిచ్చి = కన్నులు తెరిచి
శంకరుఁన్ + చూచి = శంకరుణ్ణి చూసి
సంప్రీతి మ్రొక్కి = మనస్ఫూర్తిగా మొక్కి
నుతించి = కీర్తించి
తన్ = తాను
కృతకృత్యుఁగాఁన్ = విజయము సాధించానని
మదిన్ = మనసులో
తలచెన్ = అనుకున్నాడు

తాత్పర్యం : ఓ రాజా నీ తపస్సుకు నేను సంతోషించాను. దేవలోకంలోని నీటి ప్రవాహాన్ని నా తలపై ధరిస్తాను. అని చెప్పగా రాజు సంతోషించి, కన్నులు తెరచి, శంకరున్ని చూసి, మనస్ఫూర్తిగా మొక్కి, కీర్తించి తాను విజయం సాధించిన వాడుగా మనసులో భావించాడు.

10వ పద్యం :

క ||
భూతేశు ప్రతిజ్ఞకు సం
జాతాతి క్రోధ యగుచు స్వర్గంగ నిజ
స్రోతోవేగంబున హరుఁ,
బాతాళం బంటంద్రొక్కు భావం బిడియెన్.

ప్రతిపదార్థం :

భూతేశు = శివుని
ప్రతిజ్ఞకు = మాటకు
సంజాతాతి = పుట్టిన పెద్ద
క్రోధ యగుచు = కోపంతో
స్వర్గంగ = స్వర్గంలోని గంగ
నిజస్రోతో = తన ప్రవాహ
వేగంబున = వేగంతో
హరుఁ న్ = శివున్ని
స్వర్గంగ = స్వర్గంలోని గంగ
నిజస్రోతో = తన ప్రవాహ
వేగంబున = వేగంతో
హరుఁ న్ = శివున్ని
పాతాళంబు + అంటన్ = పాతాళం చేరే విధంగా
త్రొక్కు = తొక్కేస్తాను
భావంబు + ఇడియెన్ = భావించింది

తాత్పర్యం : శివుడు ఇచ్చిన మాటకు పెద్దగా కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివుణ్ణి పాతాళానికి తొక్కి వేస్తాను అని భావించింది.

11వ పద్యం :
క||
హరుఁ డయ్యవలేపమునకుఁ,
బరమక్రోధాకుల స్వభావుం డగుచున్,
సరిదుత్త మయగు గంగం,
దిరోహితను జేయంగా మదిం దలపోసెన్.

ప్రతిపదార్థం :

హరుఁడు = శివుడు
ఆ + అవలేపమునకుఁ = గంగాదేవి గర్వానికి
బరమ = ఎక్కువైన
క్రోధాకులస్వభావుండు = కోపముచే నిండిన స్వభావుడు
అగుచు = అయి
సరిత్ + ఉత్తమయగు = ఉత్తమమైన నది
గంగన్ = గంగను
తిరోహితన్ చేయగా = మరుగు పరచాలి అని
మదిన్ + తలపోసెన్ = మనస్సులో అనుకున్నాడు

తాత్పర్యం : గంగాదేవి గర్వానికి అత్యంత కోప స్వభావుడైన శివుడు గంగ గర్వాన్ని మరుగుపర్చాలి అని మనస్సులో అనుకున్నాడు.

12వ పద్యం :

ఆ ||
ఇవ్విధమున వార లిరువు రొండొరుల ని
గ్రహమునకుఁ దలంపఁగా నెఱంగి
దానిఁ జూచుటకుఁ బితామహముఖదేవ,
దేవయోను లరుగుదెంచి రపుడు.

ప్రతిపదార్థం :

ఈ + విధమున = ఈ విధంగా
వారలు + ఇరువురు = గంగా, శివుడు ఇద్దరూ
ఒండొరులన్ = ఒకరిని ఒకరు
నిగ్రహమునకుఁ = ఓడించాలని
దలంపఁగాన్ = అనుకోవడం
ఎఱంగి = తెలుసుకొని
దానిఁన్ = ఆ సన్నివేశాన్ని
చూచుటకుఁన్ = చూడడానికి
పితామహముఖ = బ్రహ్మ మొదలైన
దేవయోనులు = దేవతలకు జన్మించిన వారు
అరుగుదెంచిరి = వచ్చారు
అపుడు = అప్పుడు

తాత్పర్యం : ఈ విధంగా గంగా, శివుడు ఇద్దరూ ఒకరిని మరొకరు ఓడించాలని అనుకుంటున్న విషయం తెలుసుకున్న బ్రహ్మ మొదలైన దేవతలందరూ ఆ సన్నివేశాన్ని చూడటానికి వచ్చారు. అప్పుడు

13వ పద్యం :

ఆ||
మాననీయ తద్విమానమండల సహ
స్రములతోడ నభము చాల మెఱసి
భాసమాన భూరిభానుమండల సహ
స్రములతోడ మెఱయు క్రమము దోఁప.

ప్రతిపదార్థం :

మాననీయ = గౌరవింప తగిన
సహస్రముల = వేల
తత్ విమానమండల = ఆ విమాన సముదాయం
తోడ = తో
నభము = ఆకాశం
చాల మెఱసి = చాల మెరిసింది
భాసమాన = సూర్య సమానమైన
సహస్రముల = వేల
భూరి భానుమండల = గొప్ప సూర్యలోకాల
తోడ = తీరుగా
మెఱయు = మెరుస్తున్నట్లు
క్రమము దోఁప = అనిపించింది

తాత్పర్యం : అనేకులైన దేవతలు తమ విమానాలలో వచ్చేసరికి ఆ విమానాల తేజస్సుతో ఆకాశం వేల సూర్య మండలాలుగా అనిపించింది.

14వ పద్యం :

శా||
ఈరీతిన్ జగదీశు మస్తకముపై నేపారి యగ్గంగ దు
ర్వారప్రక్రియ వ్రాలియున్ వెడలిపోవన్ లేక తన్మాయచే
వారింపంబడి తజ్జటాటవి భ్రమింపం జొచ్చెం బెక్కేండ్లుగా
సారోదార పయోదమండల చరత్ సౌదామనీ తుల్యయై.

ప్రతిపదార్థం :

ఈరీతిన్ = ఈ విధంగా
జగదీశ = శివుని
మస్తకముపైన్ + ఏపారి = తలపై పడి
ఆ + గంగ = ఆ గంగా
దుర్వార = నివారింపలేని
ప్రక్రియ = విధంగా
వ్రాలియున్ = పడి
వెడలిపోవన్ లేక = వెళ్ళలేక
తత్ + మాయచే = శివుని మాయచే
వారింపంబడి = నిలుపబడి
తత్ + జటాటవి = ఆ శివుని జడలనే అడవిలో
పక్కెండ్లుగా = ఎన్నో సంవత్సరాలు
సార + ఉదార = గొప్ప
పయోదమండల = మబ్బులలో
చరత్ సౌదామనీ = కదులుతున్న మెరుపు
తుల్యమై = లాగ
భ్రమింపన్ చొచ్చెన్ = తిరిగింది

తాత్పర్యం : ఈ విధంగా శివుని తలపై పడి బయటకి రాలేక శివుని మాయచే నిలువరింపబడి ఆ శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

15వ పద్యం :

ఉ||
ఆ సమయంబునన్ జలరుహాసను మున్నిడి నిర్జరుల్ జగ
ద్భాసకుఁడైన శంకరుని పాలికి వచ్చి నుతించి యంజలుల్
చేసి జగత్రయీశ! సురసింధ్వవలేపము నీదు మాయచేఁ
బాసె భవన్మహామహిమ భావమునందుఁ దలంపకుండుటన్

ప్రతిపదార్థం :

ఆ సమయంబునన్ = ఆ సమయంలో
జలరుహాసను = బ్రహ్మ
మున్నిడి = ముందుంచుకొని
నిర్జరుల్ = దేవతలు
జగత్ భా సకుఁడైన = జగానికి వెలుగును ఇచ్చే మిత్రుడైన
శంకరుని పాలికి వచ్చి = శంకరుని వద్దకు వచ్చి
నుతించి = కీర్తించి
యంజలుల్ చేసి = నమస్కరించి
జగత్రయ + ఈశ ! = మూడు లోకాలకు పాలకుడా దేవనది
సురసింధు = దేవనది
అవలేపము = గర్వము
నీదు మాయచే = నీ మాయచేత
బాసెన్ = పోయింది
భవన్ = నీ
మహా మహిమ = గొప్ప మహిమ చేత
భావమునందుఁన్ = మనసులో
తలంపక + ఉండుటన్ = గ్రహించకపోవడం చేత

తాత్పర్యం : ఆ సమయంలో బ్రహ్మను ముందుంచుకొని దేవతలందరూ జగానికి జ్ఞానమనే వెలుతురునిచ్చే శంకరుని వద్దకు వచ్చి, నమస్కరించి, కీర్తించి మూడు లోకాలకు పాలకుడా ! నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది.

16వ పద్యం :

క॥ పర్వత సమభావం బీ
యుర్విం బరమాణు వొందనోపని భంగిన్
సర్వేశ! భవత్సమత సు
పర్వాపగ పొందఁ గలదె భావింపంగన్ :

ప్రతిపదార్థం :

సర్వేశ ! = సర్వమునకు ఈశుడా !
ఈ + ఉర్విన్ = ఈ భూమిపై
పర్వత సమభావంబు = పర్వతముతో సమానమైనవి కూడా
పరమాణువు = అతిచిన్న (విలువను)
ఒందనోపని = పొందలేని
భంగిన్ = తీరుగా
భవత్ + సమత = నీ సమభావం
సుపర్వ + ఆపగ = దేవనది
భావింపగన్ = మనసులో నైనా
పొందఁ గలదె = పొందగలదా

తాత్పర్యం : ఓ ‘సర్వేశ్వరా! ఈ భూమిపై (నీ సృష్టిలో) పర్వత సమాలు కూడా చిన్న పరమాణు విలువను కూడా పొందలేవు. ఆ విధంగా నీ సమభావాన్ని గంగానది మనస్సులోనైనా ఉహించగలదా ?

17వ పద్యం :

ఉ ||
పాలితసర్వలోక ! నిజభక్తు భగీరథు దీను పైఁ గృపా
శీలతఁ బూనియైన సురసింధు విమోచన మాచరింపఁగాఁ
బోలును దీనిచే సగరపుత్ర విముక్తి మనుష్యలోక సా
తాళ పవిత్రభావము లుదార భవత్కృప నుల్లసిల్లెడిన్.

ప్రతిపదార్థం:

పాలిత సర్వలోక ! = సర్వలోకాలను పాలించే వాడా
నిజభక్తున్ = నీ భక్తున్ని
భగీరథున్ = భాగీరథునిపై
దీనున్ + పైఁన్ = దీనునిపై
కృపాశీలతఁన్ = కృపతో
పూనియైన = అయినా
సురసింధు = దేవనదిని
విమోచనము = విడుదల
ఆచరింపఁగాఁన్సోలును = చేయవలెను
దీనిచే = ఈ గంగ జలముచే
సగరపుత్ర = సగరుని పుత్రుల ఆత్మలకు
విముక్తి = ప్రశాంతత
మనుష్యలోక = మానవలోకానికి
పాతాళ = పాతాళలోకానికి
పవిత్రభావముల్ = పవిత్రభావములు
ఉదార = గొప్పతనము
భవత్కృపన్ = నీ కృప కారణంగా
ఉల్లసిల్లెడిన్ = కలుగుతుంది

తాత్పర్యం : సర్వలోకాలను పాలించేవాడా ! నీ భక్తుడైన భగీరథుని, దీనునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. ఈ గంగాజలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవలోకానికి, పాతాళలోకానికి నీ కరుణ కారణంగా గొప్పతనము కలుగుతుంది.

18వ పద్యం :

ఆ||
అని నుతింప నవ్వి యద్దేవదేవుండు,
పరమ సుప్రసన్న భావుఁ డగుచు
గంగ నపుడు విడిచె ఘనతరంబగు బిందు,
సరమునందు సురలు సంతసిల్ల

ప్రతిపదార్థం :

అని = అని
నుతింప = వేడుకొనగా
ఆ + దేవదేవుండు = ఆ శివుడు
నవ్వి = నవ్వి
పరమ = చాలా
సుప్రసన్న భావుఁ డు + అగుచు = చాలా ఆనందంతో
గంగన్+ అపుడు = అప్పుడు గంగానదిని
సురలు = దేవతలు
సంతసిల్లను = సంతోసించగా
ఘనతరంబగు = గొప్పదైన
బిందు సరమునందు = ‘సముద్రంలోకి
విడిచె = వదిలాడు

తాత్పర్యం : అని దేవతలు వేడుకొనగా పరమశివుడు నవ్వి పరమ సంతోష హృదయుడై ఆ గంగానదిని దేవతలు సంతోషిస్తుండగా సముద్రంలోకి వదిలాడు.

19వ పద్యం :

సీ॥
అబ్బంగి హరముక్త యై గంగ సప్తప్ర,
వాహ రూపంబులు వరుసఁ దాల్చి
భాసురహ్లాదినీ పావనీ నందినీ,
నామముల్గల మహానదులు మూఁడు
సురరాజుదిక్కున కరిగి సీతాసుచ
క్షుస్సింధు నామక ప్రోతములును
బశ్చిమదిశ కేఁగెఁ బదఁపడి యేడవ,
యగు ప్రవాహం బద్భుతాభిరామ
ఆ॥ మగుచు నబ్బగీరథావరు చెంత
కరుగు దేరఁజూచి యవ్విభుండ
రమ్యమైన దివ్య రథమెక్కి కదలెన
య్యమరసింధు వెంట ననుగమింప

ప్రతిపదార్థం :

ఆ + బంగి = ఆ విధంగా
హరముక్త యై = శివునిచే విడువబడిన
గంగ = గంగానది
సప్తప్రవాహ = ఏడు పాయలుగా
రూపంబులువరుసం దాల్చి = రూపాంతరం చెంది
భాసురహ్లాదినీ, పావనీ, నందినీ = భాసురహ్లాదినీ, పావనీ, నందినీ (పేర్లు)
నామముల్గల = పేర్లు గల
మహానదులు మూఁడు = మూడు నదులు
సురరాజు = ఇంద్రుని (తూర్పు)
దిక్కునకు + అరిగి = దిక్కుకుపోయాయి
సీతా, సుచక్షు, సింధు = సీతా, సుచక్షు, సింధు (పేర్లు)
నామక ఫ్రోతములును = పేర్లు గల ప్రవాహాలు
పదపడి = అత్యంత వేగంతో
పశ్చిమదిశకు + ఏగెఁ = పశ్చిమానికి వెళ్ళాయి
యేడవయగు = ఏడవది అయిన
ప్రవాహంబు = ప్రవాహం
అద్భుత + అభిరామము = ఎంతో మనోజ్ఞం
అగుచున్ = అయి
ఆ + భగీరథావరు = గౌరవింపదగిన ఆ భగీరథుని
చెంతకున్ = వద్దకు
అరుగున్ = వెళ్ళుటను
తేరఁజూచి = పరిశీలించి
ఆ + అమరసింధు = ఆ దేవనది
వెంటన్ = తన వెంబడి
అనుగమింప = వస్తుండగా
ఆ + విభుండు + అ = ఆ రాజు
రమ్యమైన = అందమైన
దివ్య రథమెక్కి = గొప్ప రథాన్ని ఎక్కి
కదలెన్ = కదిలాడు

తాత్పర్యం : ఆ విధంగా శివుని జడలనుండి విడువబడిన గంగా నది ఏడుపాయలుగా రూపాంతరం చెందింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లు గల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి. సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా తన వద్దకు రావడం గమనించిన భగీరథుడు గంగానది తనను అనుసరించి రాగా అందమైన గొప్ప రథంపై ఎక్కి కదిలాడు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

20వ పద్యం :

తే||
హర తనుస్రుష్టమగుటచే నతిపవిత్ర,
మయ్యె నమరాపగాతోయ మనుచు నింద్ర
ముఖ్యసురయక్షగంధర్వమునిగణములు,
కోర్కులలరంగఁ బలుమాఱుఁగ్రుంకెనందు.

ప్రతిపదార్థం :

హర = శివుని
తను = శరీరాన్ని
స్ర్పుష్టము + అగుటచేన్ = స్పర్శించినందున
అతి పవిత్రమయ్యెన్ = ఇంకా పవిత్రంగా మారింది
అమర + ఆపగ = దేవనది యొక్క
తోయము = జలము
అనుచున్ = అనుకుంటూ
ఇంద్రముఖ్యసుర = ఇంద్రుడు మొదలైన దేవతలు
యక్షగంధర్వ = యక్షులు, గంధర్వులు
మునిగణములు = మునుల సమూహాలు
కో ర్కు లలరంగఁ = వారి కోరికలు తీరేలాగా అనేకసార్లు
పలుమాఱు = అనేక సార్లు
గ్రుంకెనందు = అందులో దుమికారు

తాత్పర్యం : శివుని శరీరాన్ని తాకినందున మరింత పవిత్రంగా మారిన దేవనది యొక్క జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు వారి కోరికలు తీరేలాగా అనేకసార్లు నదిలో స్నానం చేశారు.

21వ పద్యం :

ఆ||
అంత జహ్నుఁ డను మహారాజు యజ్ఞంబు,
సేయుచుండ నమర సింధు వతని
యజ్ఞశాల ముంప నాతఁ డన్నది మ్రింగె,
జలధి మ్రింగు కుంభజన్ముఁడట్లు.

ప్రతిపదార్థం :

అంత = అపుడు
జహ్నుఁ డను = జహ్నువు అనే పేరుగల
మహారాజు = మహారాజు
యజ్ఞంబు = యజ్ఞం
సేయుచుండన్ = చేస్తుండగా
అమర సింధువు = దేవనది
అతని = ఆ జహ్నువు యొక్క
యజ్ఞశాల = యజ్ఞశాలను
ముంపన్ = ముంచి వేయగా
ఆతఁడు = ఆ జహ్నువు
జలధి = సముద్రాన్ని
కుంభజన్ముఁడట్లు = అగస్త్యుని లాగ
ఆ + నదిన్ = ఆ గంగా నదిని
మింగె = మ్రింగాడు

తాత్పర్యం : అపుడు జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యునిలాగా ఆ నదిని మింగినాడు.

22వ పద్యం :

సీ|| దానికి సుర లద్భుతం బొంది రాజర్షి
వరుఁడైన జహ్ను భూవల్లభునకు
నిట్లని రో మానవేశ! తావక తపం
బత్యమోఘము గదా యవనిలోన !
నధిప ! నిప్పీతవారిధి యగస్త్యుఁడు నేఁడు,
విస్మృతుండయ్యె నీ విపుల మహిమ
గర్వ మంతయుఁ బాసె గంగకు నిఁక నీదు,
తనయయై వర్తించు ధరణిలోనఁ

ఆ|| గాన దీని విడువఁగాఁ దగు నీ వన్న,
నమ్మహానుభావుఁ డపుడు తనదు
శ్రుతుల వలననుండి సురసరిత్ప్రవరను,
విడిచె దివిజు లెల్ల విస్మితులుగ.

ప్రతిపదార్థం:

దానికి = అప్పుడు
సురలు = దేవతలు
అద్భుతం బొంది = ఆశ్చర్యం పొంది
రాజర్షివరుఁడైన = రాజ ఋషులలో శ్రేష్ఠుడైన
జహ్ను భూవల్లభునకున్ = జహ్నువు అనే రాజుతో
ఇట్లనిరి = ఈ విధంగా అన్నారు
ఓ మానవేశ ! = ఓ మానవులకు ఈశ్వరా
తావక = తమరి
తపంబు = తపస్సు
అతి + అమోఘము గదా = చాల గొప్పది కదా
అవనిలోన ! = ఈ భూమిపై
నధిప! = గొప్పవాడా!, (రాజా !)
నిష్పీతవారిధి = సముద్రాన్ని తాగిన
యగస్తుడు = అగస్త్య ముని
నేఁడు = ఈ రోజు
నీ విపుల మహిమన్ = = నీ గొప్ప మహిమ చేత
విస్మృతుండయ్యె = గుర్తు లేకుండా అయ్యాడు (మరిపించావు)
గంగకున్ = గంగాదేవి యొక్క
గర్వ మంతయుఁ బాసె = పొగరు అణిగింది
ఇక = ఇక పై
నీదు = నీ యొక్క
తనయయై = కూతురుగా
వర్తించు = గుర్తింపు పొందును
ధరణిలోనఁ = భూమిపై
గాన = కావున
దీనిన్ = ఈ గంగను
నీవు విడువఁగాఁ దగున్ = నీవు విడిచి పెట్టవలెను
అన్నన్ = అనగానే
ఆ + మహానుభావుఁడు = ఆ జహ్ను రాజర్షి
అపుడు = అప్పుడు
దివిజుల్ + ఎల్ల = దేవతలందరూ
విస్మితులుగ = = ఆశ్చర్యపడగా
తనదు = తనయొక్క
శ్రుతుల వలన నుండి = శ్రవనేంద్రియాల (చెవుల) నుండి
సురసరిత్ + ప్రవరను = దేవలోకంలో ప్రవహించే నదిని
విడిచెన్ = విడిచిపెట్టాడు

తాత్పర్యం : అప్పుడు దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఇలా అన్నారు. ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. ఓ మహారాజా నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి యొక్క పొగరు (గర్వం) అణిగింది. ఇకపై ఈ భూమిపై ఈ గంగ నీ కూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెను. అనగానే జహ్ను మహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు.

23వ పద్యం :

ఆ||
నాఁటనుండి జహ్నునకు కూఁతు రగుట జా
హ్నవి యనంగ గంగ భువిఁ జరించె
నంత నబ్బగీరథావనీపతి రథం
బనుగమించి చనియె నంబునిధికి.

ప్రతిపదార్థం :

నాఁటనుండి = ఆ రోజు నుండి
జహ్నునకు = జహ్ను మహర్షికి
కూతురగుట = కూతురు కావడం వలన
జాహ్నవి = జాహ్నవి
యనగంగ = అనే పేరుతో
గంగ = గంగాదేవి
భువిఁన్ + చరించెన్ అంతన్ = భూమిపై ప్రవహించింది.
ఆ + భగీరథ + అవనీపతి = భగీరథుడు అనే పేరు గల రాజు యొక్క
రథంబు + అనుగమించి = రథాన్ని అనుసరించి
అంబునిధికి = సముద్రానికి
చనియెన్ = వెళ్ళింది

తాత్పర్యం : ఆ రోజునుండి జహ్ను మహర్షి కూతురు కావున జాహ్నవి అనే పేరుతో గంగానది భూమిపై ప్రవహించింది. భగీరథుని రథాన్ని అనుసరించి (రథం వెంబడి) సముద్రానికి వెళ్ళింది.

24వ పద్యం :

సీ||
అంత శుష్కంబైన యబ్ధిలో సాగరుల్,
ద్రవ్విన వివరంబు దరియఁ జొచ్చి
యబ్బగీరథుఁడు గంగానుగతుండైర
సాతలంబున కేఁగి సగరపుత్ర
భస్మరాసులు దీనభావుఁడై కనునంత,
నగ్గంగ తద్రాసు లన్ని దడిఁయఁ
బ్రవహించెఁ దాన నిష్పాపులై సాగరుల్
దివ్యరూపములొంది దివిజులట్లు.

ఆ||
తక్షణమ విమాన తతులతో నబ్బగీ,
రథుఁడు చూడ నమరరాజి పొగడ
బృథులమైన నాకపృష్ఠ మారోహించి,
వెలసి రతుల హర్ష వివశు లగుచు..

ప్రతిపదార్థం :

అంత = అపుడు
శుష్కంబైన = ఎండిపోయిన
అబ్ధిలో = సముద్రంలో
సాగరుల్ = సగర పుత్రులు
ద్రవ్విన వివరంబు = తవ్వినరంధ్రం (మార్గం)లో
దరియఁ జొచ్చి = తరింప చేయడానికి
ఆ + భగీరథుఁడు = ఆ భగీరథుడు
గంగాగుతుండై = గంగ వెంట రాగా
రసాతలంబునకు + ఏగి = పాతాళానికి వెళ్లి
సగరపుత్ర = సగర పుత్రుల
భస్మరాసులు = బూడిద కుప్పలను
దీనభావుఁడై = దీన భావముతో
కనునంతన్ = చూస్తుండగా
ఆ + గంగ = ఆ గంగానది
తత్ + రాసులన్ని = ఆ కుప్పలన్నిటిని
ద డియాఁ = తడిచే విధంగా
బ్రవహించెఁ = ప్రవహించింది
దాన = కావున
నిష్పాపులై = పాపము పోయిన వారై
సాగరుల్ = సగర పుత్రులు
దివ్యరూపములొంది = దివ్యమైన రూపాలు పొంది
దివిజులట్లు = దేవతలలాగా
తక్షణమ = ఆ క్షణంలో
విమాన తతులతో = విమాన వరుసలతో
ఆ + భగీరథుఁడు = ఆ భగీరథుడు
చూడన్ = చూస్తుండగా
అమరరాజి = దేవతల సమూహం
పొగడ = పొగిడే విధంగా
అతుల = అసామాన్యమైన
వివశులగుచు = పట్టరాని
హర్ష = ఆనందంతో
బృథులమైన = గొప్పదైన
నాకపృష్ఠమారోహించి
వెలసిరి = స్వర్గాన్ని చేరుకున్నారు

తాత్పర్యం : అపుడు ఎండిపోయిన సముద్రంలో సాగరులు తవ్విన మార్గంలో వారిని తరింపజేయడానికి గంగ తనవెంట రాగ భగీరథుడు పాతాళానికి వెళ్లి సగరపుత్రుల బూడిద కుప్పలను దీనంగా చూశాడు. ఆ బూడిదకుప్పలు తడిసేవిధంగా గంగ ప్రవహించింది. కావున వారు పాపములు పోయినవారై దివ్యరూపాలను పొంది, దేవతలలాగా విమానాలలో దేవతల సమూహం అభినందిస్తుండగా, అసామాన్య రీతిలో పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గాన్ని అధిరోహించారు. (స్వర్గానికి చేరుకున్నారు)

25వ పద్యం :

చ||
అపుడు చతుర్ముఖుండు దివిజావృతుఁడై చని యబ్బగీరథుం
గృప దళుకొత్తఁ జూచి పలికెన్ సగరాదులచేతఁ గాని యీ
యపరిమిత ప్రతిజ్ఞ యను నబ్ధిఁ దరించితి వత్స నీవు, నీ
తపము నుతింపఁగా సకలదైవత కోటులకైన శక్యమే !

ప్రతిపదార్థం :

అపుడు = అప్పుడు
చతుర్ముఖుండు = బ్రహ్మ
దివిజ + ఆవృతుఁడై = దేవతా సమూహముచే
చనిన్ = వెళ్లి
ఆ + భగీరథున్ = ఆ భగీరథున్ని
గృపన్ + తళుకొత్తఁ = కరుణతో
చూచి = చూసి
పలికెన్ = (ఈ విధంగా) పలికాడు
సగరాదులచేతఁ గాని = సగరుడు మొదలైన వారిచే సాధ్యం కాని
ఈ + అపరిమిత = ఈ గొప్ప
ప్రతిజ్ఞ యనున్ = ప్రతిజ్ఞ అనే
అబ్ధిఁని + తరించితివి = సముద్రాన్ని దాటావు
వత్స = కుమారా
నీవు = నిన్ను
నీ తపమున్ = నీ తపస్సును
నుతింపఁగా = మెచ్చుకోవడం
సకల = అందరు
దైవత కోటులకైన = దేవతల సమూహానికైనా
శక్యమే ! = సాధ్యమా ! (సాధ్యం ‘కాదు అని భావం)

తాత్పర్యం : అపుడు బ్రహ్మ దేవతలందరితో కలిసి వెళ్ళి భగీరథున్ని కరుణతో చూసి ఈ విధంగా పలికాడు. “కుమారా! సగరుడు మొదలైన మీ పూర్వీకులకు ఈ ప్రతిజ్ఞ అనే సముద్రాన్ని తరించడం సాధ్యంకాలేదు. దానిని సాధించిన నిన్ను నీ తపస్సును మెచ్చుకోవడం సమస్త దేవతా సమూహాలకు కూడా సాధ్యం కాదు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

26వ పద్యం :

సీ||
దేవయుగంబున దేవతాహితమున
కై కుంభజుండు ము న్నబ్ధి గ్రోలెఁ
దత్కారణంబున ధరను శుష్కీభూత
మై యుండె నిందాఁక నప్పయోధి;
నృప ! సాగరుఁడవైన నీవు నేఁ డిగ్గంగ,
నీటిచే సంభోధి నించు కతన
సాగరుండన మూఁడు జగములఁ బెంపొందు;
నయ్యబ్ధి యెందాఁక నవని మెఱయుఁ

ఆ||
బృధులమైన నాకపృష్ఠమం దందాఁక,
సంచరింపఁగలరు సగరసుతులు;
అనఘ! నీవు నట్ల యస్మ దుద్దామా ధా
మమున నుండఁగలవు మనుజనాథ !

ప్రతిపదార్థం:

దేవయుగంబున = సత్య యుగంలో
దేవతాహితమునకై = దేవతల మేలు కొరకు
కుంభజుండు = కుండనుండి జన్మించిన వాడు (అగస్త్యుడు)
మున్ను + అబ్దిన్ = మునుపు సముద్రాన్ని
గ్రోలెఁన్ = త్రాగాడు
తత్కారణంబున = ఆ కారణముతో
ధరను = భూమిపై
ఇందాఁక = ఇప్పటివరకు
ఆ + పయోధి = ఈ సముద్రం
శుషీభూతమై = ఎండిపోయి
యుండెన్ = ఉన్నది
నృప ! = రాజా
నీవున్ = నీవు
సాగరుఁడవైన = సగర వంశంలో జన్మించిన వాడవు
నేఁ డు = ఈ రోజు
ఈ + గంగ = ఈ గంగ
నీటిచే = నీటితో
అంభోధిన్ = సముద్రాన్ని
ఇంచు కతన = నింపిన కారణంగా
సాగరుండన = సాగరుడనే పేరుతో
మూఁడుజగములఁ = మూడు లోకాలలో
బెంపొందు = ప్రసిద్ధి చెందును
మనుజనాథ ! = రాజా
ఆ + అబ్ధి = ఆ సముద్రం
యెంకన్ = ఎప్పటివరకు
అవనిన్ = ఈ భూమిపై
మెఱయున్ = వెలుస్తుందో
బృధులమైన = గొప్పదైనా
నాకపృష్ఠమందు = స్వర్గ లోకంలో
అందాఁక = అప్పటిదాకా
సంచరింపఁగలరు = ఉండగలరు
సగరసుతులు = సగరుని పుత్రులు
అనఘ ! = పాపములేని వాడా
నీవున్ = నీవు కూడా
అట్ల = అదే విధంగా
అస్మ దుద్దామ = ఆ కాంతివంతమైన
ధామమునన్ = లోకంలో
ఉండఁగలవు = ఉంటావు

తాత్పర్యం : సత్య యుగంలో దేవతల మేలు కొరకు కుంభ సంభవుడైన అగస్త్యుడు సముద్రాన్ని త్రాగాడు. అప్పటి నుండి సముద్రం ఎండి పోయి ఉంది. సగర వంశంలో పుట్టిన నీవు దేవనది గంగ నీటిచే ఈ సముద్రాన్ని నింపినావు కావున సాగరుడు అనే పేరుతో సముద్రుడు మూడు లోకాలలో పిలువబడుతాడు. ఓ రాజా ఈ భూమిపై ఎప్పటివరకు ఈ సముద్రం ఉంటుందో అప్పటివరకు సగర పుత్రులు స్వర్గంలో నివసిస్తారు. నీవు కూడా అదేవిధంగా ఆ కాంతివంతమైన లోకంలో ఉంటావు.

27వ పద్యం :

ఆ||
జగతి జహ్ను తనయ యగుట నిగ్గంగ జా
హ్నవి యనంగ బరఁగు నవనిలోనఁ
ద్వత్తనూజ యగుటవలన భాగీరథి,
యనఁ జరించు లోకమున నృపాల !

ప్రతిపదార్థం:

నృపాల = ఓ రాజా!
ఈ + గంగ = ఈ గంగా నది
జగతిన్ = ఈ భూమిపై
జహ్ను = జహ్ను మహర్షి
తనయ = కూతురు
అగుటన్ = కావడం వలన
అవనిలోన = ఈ భూమిపై
జాహ్నవి = జాహ్నవి.
అనంగ = అనే పేరుతో
బరగున్ = పిలువబడుతుంది
లోకమున = ఈ లోకంలో
త్వత్ + తనూజ = నీ కూతురు
అగుటవలన = కావడం వలన
భాగీరథి = భాగీరథి
ఆనన్ = అనే పేరుతో
చరించున్ = ప్రవహిస్తుంది

తాత్పర్యం : ఓ రాజా! గంగానది ఈ భూమిపై జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని, నీ కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ప్రవహిస్తుంది.

కంఠస్థం చేయవలసిన పద్యాలు, ప్రతిపదార్థ, తాత్పర్యములు

కవి పరిచయం : ఈ పద్యం మోతుకూరి పండరీనాథరావు గారు రాసిన శ్రీమత్ పండరీనాథ రామాయణంలోని బాలకాండ ద్వితీయాశ్వాసము నందు భగీరథ ప్రయత్నం అనే పాఠ్యాంశం లోనిది.
(ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసే ముందు కవి పరిచయం రాయాలి.)

1వ పద్యం :

చ||
గగన ధునీ నిపాతము జగత్ప్రభుఁడైన త్రిలోచనుండు స
ర్వగుఁడు సహింపఁజాలు ననవద్య తపోమహిమన్ బ్రసన్నుఁ జే
యఁగఁదగు, నాతనిం; గరుణ నాతఁడు మేలని పల్కినన్ సురా
పగ తదుదగ్ర మస్తకముపైఁ బడు దతణమంద భూవరా!

ప్రతిపదార్థం :

భూవరా ! = రాజా
గగన ధునీ = ఆకాశ నది
నిపాతము = పడితే
జగత్ + ప్రభుఁడైన = జగత్తును పాలించే
త్రి లోచనుండు = మూడు కన్నులు కలవాడు
సర్వగుఁడు = సర్వము తెలిసినవాడు
సహింపఁజాలున్ = భరిస్తాడు
అనవద్య = గొప్ప
తపోమహిమన్ = తపో మహిమ చేత
ప్రసన్నున్ + చేయగఁన్ + తగున్ = ప్రసన్నం చేసుకోవడం ఉత్తమం
ఆతని = శివుని
కరుణన్ = కరుణ చూపడంలో
నాడు మేలని = శివుడే ఉత్తముడు అని
పల్కినన్ = చెప్పగా
సుర + ఆపగ = దేవ నది
తత్ + ఉదగ్ర = అతని గొప్ప
మస్తకముపైఁన్ పడు = తలపై పడును
తత్ + క్షణమందు = ఆ క్షణంలో

తాత్పర్యం : ఓ మహారాజా! ఆకాశగంగ పడితే జగత్తుని పాలించేవాడు, మూడు కన్నులు కలవాడు, సర్వం తెలిసిన వాడు, అయిన శివుడు మాత్రమే భరించగలడు. కావున గొప్ప తపస్సుచే శివున్ని మెప్పిస్తే దేవనది అయిన అతని శిరస్సుపై పడుతుంది.

2వ పద్యం :

ఉ||
ఆ సమయంబునందు దివిజాపగ వేగము దుస్సహంబుగాఁ
జేసి మహాఘనధ్వనివిజి న్నిజనిస్వనముల్ జగత్రయ
త్రాసకరంబులై మొరయ దారుణలీల హిమాచలాభమై
భాసీలు శంభుమస్తకముపైఁ బడియెం గడు నద్భుతంబుగాన్. (V.Imp)

ప్రతిపదార్థం :

ఆ సమయంబునందు = ఆ సమయంలో
దివిజ + ఆపగ = దేవలోకంలో ప్రవహించే నది
దుస్సహంబుగా = సహింప రాని
వేగము = వేగంతో
మహాఘనధ్వని = పెద్ద శబ్దం
జేసి = చేసి
విజిన్ + నిజ = గెలవాలనే కోరికతో
నిస్వనముల్ = మ్రోత
జగత్రయ = మూడు లోకాలకు
త్రాసకరంబులై = భయం కలిగించేవిగా
మొరయు = మోగగా
దారుణలీల = భయంకరముగా
హిమాచలాభమై సిలు = హిమాలయ పర్వతము లాగ
భాసిలు = ప్రకాశిస్తున్న
శంభు = శంకరుని
మస్తకము పైఁ = తలపై
కడున్ అద్భుతంబుగాన్ = మిక్కిలి అద్భుతముగా
బడియెన్ = పడింది

తాత్పర్యం : ఆ సమయంలో దేవలోకంలో ప్రవహించే గంగా నది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, పెద్ద శబ్దం చేస్తూ, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై మిక్కిలి అద్భుతంగా పడింది.

3వ పద్యం :

శా||
నానాదేశ నివాసులైన జను లానందంబు సంధిల్ల సు
స్నానంబుల్ సురవాహినీ జలములన్ సంతుష్టులై చేయని
త్యానూనంబగు వైభవంబునఁ దదీయంబౌ పితృవ్రాతమున్
వే నాకంబున కుర్గమించె భయకృత్రేతత్వ నిర్ముక్తమై.

ప్రతిపదార్థం :

నానాదేశ = అనేక ప్రదేశాలలో
నివాసులైన = నివసించే
జనులు = ప్రజలు
ఆనందంబు = ఆనందం
సంధిల్ల = ఉట్టిపడగా
సురవాహినీ = దేవనది యొక్క
జలములన్ = జలములలో
సంతుష్టులై = సంతోషంతో
సుస్నానంబుల్ = స్నానములు
చేయ = చేయగా
నిత్య + అనూనంబగు = శాశ్వతమైన
వైభవంబునఁన్ = వైభవాన్ని
తదీయంబౌ = దానికి సంబంధించిన
వే = వేలమంది (అసంఖ్యాకము)
పితృవాతమున్ = పితరుల సమూహము
భయకృత్ = భయాన్ని కలిగించే
ప్రేతత్వ = ప్రేత తత్వం నుండి
నిర్ముక్తమై = విడిచిన వారై
నాకంబునకున్ = స్వర్గానికి
ఉద్గమించెన్ = వెళ్ళారు

తాత్పర్యం : అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంతో స్నానాలు చేయగా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు.

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం

భగీరథ ప్రయత్నం Summary in Telugu

పాఠ్యాంశం పేరు ఏ గ్రంథం నుండి గ్రహించబడినది

TS Inter 2nd Year Telugu Study Material Poem 2 భగీరథ ప్రయత్నం 1

కవి పరిచయం

పాఠ్యాంశ పేరు : భగీరథ ప్రయత్నం
ఏ గ్రంధం నుండి గ్రహించబడినది : ప్రస్థుత పాఠ్యభాగం “శ్రీమత్ పండరీనాథ రామాయణం” లోని బాలకాండ ద్వితీయాశ్వాసం లోనిది.
కవి పేరు : మోతుకూరి పండరీనాథరావు
కవి కాలం : 18వ శతాబ్దానికి చెందినవాడు.
స్వస్థలం : ఓరుగల్లు పట్టణానికి సమీపాన గల మడికొండ.
కవిగారి వంశం : మోతుకూరి వంశంలో జన్మించిన పండరీనాథుడు ఆరువేల నియోగిశాఖకు చెందినవాడు.
తల్లిదండ్రులు : వేంకటాబిన్, గోపాలరావు,
తండ్రి ప్రత్యేకత : తండ్రి గోపాలరావు సంస్కృతాంధ్ర భాషలలో మంచి పండితుడు.
గ్రంథం : శ్రీమత్ పండరీనాథ రామాయణం
అంకితం : 7 మే,1810న శంకర జయంతిరోజున శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు.
రచన విశేషత : శ్రీమత్ పండరీనాథ రామాయణంలో వాల్మీకి రామాయణ ఘట్టాలతోపాటు కొన్ని స్వీయకల్పనలు చేయడం వల్ల ఆరుకాండల్లో సుమారు 7,335 పద్యగద్యాలతో రసవత్తర కావ్యంగా పండితలోకం ప్రశంసలు పొందింది.
ఇతర గ్రంథాలు : పండరీనాథుడు సంస్కృతంలో “రామకథా కల్పలత” అనే గ్రంథం రాసినట్లు తెలుస్తుంది. అది అలభ్యం.
కవి శివకేశవ భక్తుడు : శివకేశవులకు సమాన ప్రాధాన్యమిచ్చి సమరసతను ప్రదర్శించాడు.

పాఠ్యభాగ సందర్భం

శ్రీరాముని వంశంలోని పూర్వీకుడు సగరుడు. అయోధ్యను పాలించిన సూర్యవంశంలో ఇతని పూర్వీకులైన ఇక్ష్వాకు, మాంధాత, త్రిశంకు, హరిశ్చంద్రుడు, రఘువు, దశరథుడు మొదలైన వారు పేరుపొందిన చక్రవర్తులు. సగరునికి సుమతి (వైదర్భి), కేశిని (శైభ్య) అనే ఇద్దరు భార్యలున్నారు. వారికి సంతానం కలగక పోవటంచేత, సగరుడు తన భార్యలతో భృగుశ్రవణ పర్వతం చేరి నూరు సంవత్సరాలు తపస్సుచేశాడు.

భృగువు ప్రత్యక్షమై ఒక భార్య అరవై వేలమంది పుత్రులను, మరొక భార్య వంశోద్ధారకుడైన ఒక పుత్రునికి జన్మనిస్తారని దీవించాడు. సుమతి అరవై వేలమందిని, కేశిని ఒక పుత్రుణ్ణి కోరారు. తరువాత కేశిని అసమంజుసునికి, సుమతి ఒక మాంసపుముద్దకు జన్మనిచ్చారు.

వాటిని ఖండాలుగా చేసి నేతికుండలలో వుంచగా అరవై వేలమంది శిశువులు తయారయ్యారు. వీరు పెరిగి ప్రజలను కష్ట పెట్టసాగారు. వీరి గర్వమణిచేందుకు ఇంద్రుడు సగరుని యాగాశ్వాన్ని పాతాళంలోని కపిలమహర్షి ఆశ్రమంలో దాచాడు. సగర చక్రవర్తి కుమారులైన సాగరులు యజ్ఞాశ్వాన్ని కనుగొనే ప్రయత్నంలో కపిలమహర్షి కోపాగ్నికి భస్మమైపోతారు. వారికి ఊర్ధ్వగతులు కల్పించడానికి అసమంజసుడు, అంశుమంతుడు మొదలైన అనేకులు ప్రయత్నం చేశారు. కాని ఎవరూ విజయం సాధించలేదు.

దిలీప చక్రవర్తి కుమారుడైన భగీరథుడు సురగంగను భువికి దింపి, పాతాళంలో ఉన్న సాగరుల భస్మరాసులపై ప్రవహింపజేసి, ఉత్తమగతులను కల్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ ‘భగీరథ ప్రయత్నం’ అనే పాఠ్యభాగం. పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యాలు సైతం సుసాధ్యమవుతాయనే విషయాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ముఖ్యోద్దేశ్యం.

పాఠ్యభాగ సారాంశం

భగీరథుడు బ్రహ్మను వరాలు కోరడం : నాలుగు వైపులా సముద్రంచే చుట్టబడిన భూమండలాన్ని పరిపాలిస్తున్న కోసలరాజు భగీరథుడు. తన పూర్వీకులైన సగర మహారాజు పుత్రులు ఏవిధంగా కపిల మహర్షి కోపానికి భస్మం అయ్యారో మంత్రుల ద్వారా తెలుసుకున్నాడు. వారికి మోక్షం కలిగించాలని సంకల్పించాడు. భగీరథునికి పుత్ర సంతానం లేని కారణంగా తన రాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించి, గోకర్ణం వెళ్లి, అక్కడ గొప్ప తపస్సు చేశాడు. గాలిని మాత్రమే ఆహారంగా తీసుకొని, రెండు చేతులు పైకెత్తి, ఐదురకాల అగ్నులమధ్య రాయిలాగా కదలకుండా వేయి సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ “ఓ మహారాజా! జనులందరూ పొగిడే విధంగా నువ్వు చేసిన తపస్సుకు నేను సంతోషించాను.

నీకు ఏం వరం కావాలో కోరుకో. దానిని తీరుస్తాను”. అని ఎంతో గౌరవంతో అన్నాడు. భగీరథుడు సంతోషించి, రెండు చేతులు జోడించి, నమస్కరించి, వినయంతో తలవంచుకొని ఆ బ్రహ్మను. చూసి సాగరుల భస్మరాశులపై దేవనది నీటిని ప్రవహింప చేయమని మొదటి వరంగా, భూమండలంలో ప్రసిద్ధి పొంది, మంచి గుణాలు కలిగి, మా వంశాన్ని ఉద్ధరించే ఒక కుమారున్ని అనుగ్రహించమని రెండవ వరంగా
కోరాడు.

భగీరథునికి శివుడు ప్రత్యక్షం కావడం : అలా భగీరథుడు కోరుకోగానే బ్రహ్మదేవుడు “ఓ పుణ్యాత్ముడా! నీ వంశాన్ని పెంచేవాడు, తేజస్సు కల కుమారుడు నీకు జన్మిస్తాడు. దివ్యలోకాలలో ప్రవహించే నది భూమిపై పడితే భూమండలం భరించలేదు. ఆకాశగంగను శివుడు మాత్రమే భరించగలడు. కావున గొప్ప తపస్సుచే శివున్ని మెప్పిస్తే దేవనది అయిన గంగ అతని శిరస్సుపై పడుతుంది” అని చెప్పి బ్రహ్మ అదృశ్యం అయ్యాడు. అపుడు భక్తితో కాలి బొటన వేలును మాత్రమే భూమిపై మోపి, తన హృదయాన్ని పద్మంగా మార్చుకొని శంకరుని గూర్చి కఠినమైన తపస్సు చేశాడు.

ఆ రాజు తపస్సుకు మెచ్చిన శివుడు ఆప్యాయతతో “ఓ రాజా! నీ తపస్సుకు నేను సంతోషించాను. దేవలోకంలోని నీటి ప్రవాహాన్ని నా తలపై భరిస్తాను” అని చెప్పగా రాజు సంతోషించి, కన్నులు తెరచి, శంకరున్ని చూసి, మనస్ఫూర్తిగా మొక్కి కీర్తించి తాను విజయం సాధించిన వాడుగా మనసులో భావించాడు.

గంగ శివుని జటాజూటంలో చిక్కుకొనుట : శివుడు ఇచ్చిన మాటకు కోపగించిన గంగ తన ప్రవాహ వేగంతో శివున్ని పాతాళానికి తొక్కి వేస్తాను అని భావించింది. గంగాదేవి గర్వానికి అత్యంత కోప స్వభావుడైన శివుడు ఆమె గర్వాన్ని తొలగించాలి అని మనస్సులో అనుకున్నాడు. ఈ విధంగా గంగా, శివుడు ఇద్దరూ ఒకరిని మరొకరు ఓడించాలని అనుకుంటున్న విషయం తెలుసుకున్న బ్రహ్మ మొదలైన దేవతలందరూ ఆ సన్నివేశాన్ని చూడటానికి వచ్చారు. దేవతలు తమ విమానాలలో వచ్చేసరికి ఆ విమానాల తేజస్సుతో ఆకాశం వేల సూర్య మండలాలుగా వెలిగింది.

ఆ సమయంలో దేవలోకంలో ప్రవహించే గంగానది సహింపరాని వేగంతో, గెలవాలనే కోరికతో, మూడులోకాలకు భయాన్ని కలిగించే విధంగా పెద్ద శబ్దంతో మ్రోగుతూ హిమాలయ పర్వతంలాగా ప్రకాశిస్తున్న శివుని తలపై పడింది. ఈ విధంగా శివుని తలపై పడి బయటకి రాలేక శివుని మాయచే నిలువరింపబడి ఆ శివుని జడలనే అడవిలో ఎన్నో సంవత్సరాలు మబ్బులలో కదులుతున్న మెరుపులాగా తిరుగుతూ ఉంది.

దేవతలందరూ శంకరుని వద్దకు వచ్చి, నమస్కరించి, కీర్తించి మూడు లోకాలకు పాలకుడా! నీ గొప్ప మహిమ తెలియక దేవనది అయిన గంగ ప్రదర్శించిన గర్వము నీ మాయచేత నశించింది. ఓ సర్వేశ్వరా! ఈ నీ సృష్టిలో పర్వతసమాలు చిన్న పరమాణు విలువను కూడా పొందలేవు. ఈ విధమైన నీ సమతాభావం గంగానదికి తెలియదు.

శివుడు గంగను వదులుట : సర్వలోకాలను పాలించేవాడా! నిజభక్తుడైన భగీరథునిపై గల కరుణతో అయినా దేవనదిని విడుదల చేయవలెను. ఈ గంగా జలముతో సగరపుత్రుల ప్రేతాత్మలు శాంతిని పొందుతాయి. మానవ లోకానికి, పాతాళ లోకానికి గొప్పతనము కలుగుతుంది అని దేవతలు వేడుకొనగా పరమశివుడు నవ్వి, పరమ సంతోష హృదయుడై ఆ గంగా నదిని సముద్రంలోకి వదిలాడు. శివుని జడలనుండి విడువబడిన గంగానది ఏడు పాయలుగా రూపాంతరం చెందింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లు గల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి.

సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా ఆ భగీరథుని వద్దకు బయలుదేరింది. అలా గంగా నది తనవెంట రావడం గమనించిన భగీరథుడు గొప్ప రథంపై ఎక్కి కదిలాడు.

గంగ జహ్నుమహర్షి యాగశాలను ముంచుట : అనేక ప్రదేశాలలో నివసించే ప్రజలు ఆనందం ఉట్టిపడగా దేవనదీ జలాలలో సంతోషంగా స్నానాలు చేశారు. వారంతా భయాన్ని కలిగించే ప్రేత స్వభావాన్ని వదిలి శాశ్వతమైన వైభవాన్ని కలిగించే స్వర్గానికి చేరుకున్నారు. శివుని శరీరాన్ని తాకినందున మరింత పవిత్రంగా మారిన దేవనది జలములు అనుకుంటూ ఇంద్రుడు మొదలైన దేవతలు, యక్షులు, గంధర్వులు, మునుల సమూహాలు వారి కోరికలు తీరేలాగా అనేక సార్లు ఆ నదిలో స్నానం చేశారు.

జహ్నువు అనే మహారాజు యజ్ఞం చేస్తుండగా గంగానది అతని యాగశాలను ముంచి వేసింది. దానికి కోపించిన జహ్నువు సముద్రాన్ని మింగిన అగస్త్యునిలాగా ఆ నదిని మింగినాడు. దేవతలందరూ ఆశ్చర్యచకితులై రాజర్షులలో శ్రేష్ఠుడైన జహ్నువుతో ఇలా అన్నారు. ఓ మహానుభావా నీ తపస్సు అద్భుతము. నీ మహిమతో సముద్రాన్ని తాగిన అగస్త్యున్ని మరిపింప చేశావు. గంగాదేవి పొగరు (గర్వం) అణిగింది.

ఇకపై ఈ భూమిపై గంగ నీ కూతురుగా గుర్తించబడుతుంది. కావున నీవు గంగను విడువవలెనని అనగానే జహ్ను మహర్షి దేవతలందరూ ఆశ్చర్యపడగా తన చెవుల నుండి గంగను వదిలిపెట్టాడు. ఆ రోజునుండి జహ్ను మహర్షి కూతురు కావున జాహ్నవి అనే పేరుతో గంగానది భూమిపై ప్రవహించింది. భగీరథుని రథం వెంబడి సముద్రానికి వెళ్ళింది.

ఎండిపోయిన సముద్రంలో, సాగరులు తవ్విన మార్గం ద్వారా, గంగ తనవెంట రాగ, భగీరథుడు పాతాళానికి వెళ్లి, సగరపుత్రుల బూడిద కుప్పలను దీనంగా చూశాడు. ఆ బూడిదకుప్పలు తడిసేవిధంగా గంగ ప్రవహించింది. కావున వారు (సాగరులు) పాపములు పోయినవారై, దివ్యరూపాలను పొంది, దేవతలలాగా విమానాలలో దేవతల సమూహం అభినందిస్తుండగా, అసామాన్య రీతిలో, పట్టరాని ఆనందంతో భగీరథుడు చూస్తుండగా గొప్పదైన స్వర్గాన్ని అధిరోహించారు. (స్వర్గానికి చేరుకున్నారు

సగర పుత్రుల శాపవిమోచనం : బ్రహ్మ, దేవతలందరితో కలిసి వెళ్లి భగీరథుణ్ణి కరుణతో చూసి ఈ విధంగా పలికాడు. “కుమారా! సగరుడు మొదలైన మీ పూర్వీకులకు సాధ్యంకాని ప్రతిజ్ఞా అనే సముద్రాన్ని నీవు దాటావు. నిన్నూ, నీ తపస్సును మెచ్చుకోవడం సమస్త దేవతా సమూహాలకు కూడా సాధ్యం కాదు. సత్య యుగంలో దేవతల మేలు కొరకు కుంభసంభవుడైన అగస్త్యుడు సముద్రాన్ని తాగాడు.

(కాలకేయులనే రాక్షసులు దేవతలకు కనబడకుండా సముద్రంలో దాక్కున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి అగస్త్యుడు సముద్రాన్ని పూర్తిగా తాగాడు. అప్పటి నుండి సముద్రం ఎండిపోయి ఉంది. సగర వంశంలో పుట్టిన నీవు దేవనది నీటిచే ఈ సముద్రాన్ని నింపినావు కావున సాగరుడు అనే పేరుతో ఈ సముద్రుడు మూడు లోకాలలో పిలువబడుతాడు. ఓ రాజా! ఈ భూమిపై ఎప్పటివరకు ఈ సముద్రం ఉంటుందో, అప్పటి వరకు సగర పుత్రులు స్వర్గంలో నివసిస్తారు.

నీవు కూడా అదేవిధంగా ఆ గొప్ప లోకంలో ఉంటావు. ఓ రాజా! గంగానది ఈ భూమిపై జహ్ను మహర్షి కూతురు కాబట్టి జాహ్నవి అని, నీ కూతురు కాబట్టి భాగీరథి అనే పేర్లతో ప్రవహిస్తుంది అని బ్రహ్మదేవుడు దీవించాడు.