TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 4th Lesson బీమా సేవలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 4th Lesson బీమా సేవలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బీమాను నిర్వచించండి. బీమాకు సూత్రాలు ఏమిటో తెలపండి.
జవాబు.
బీమా అర్థం:: బీమా అనగా సంభవించిన ఆర్థిక నష్టాన్ని అనేక మందికి వ్యాప్తి చేసే ఒక సాంఘిక పరిష్కారం. బీమా కాంట్రాక్టులో ఒక పార్టీకి సంభవించే ఆపదలకు, నష్టానికి, కొంత సొమ్ముకు బదులుగా, పరిహారాన్ని చెల్లించే అంగీకారం ఉంటుంది.

బీమా – నిర్వచనాలు:

  1. ఆచార్య విల్లెట్ బీమాను నిర్వచించిన ప్రకారం “ఒక వ్యక్తికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి వ్యక్తుల సమూహంలోని నష్టాన్ని బదిలీ కల్పించే ఒక సామాజిక సాధనం”.
  2. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం బీమా అనేది “ఒక ప్రత్యేక నష్టానికి, చెడిపోయిన వస్తువునకు, వ్యాధికి లేదా మరణానికి కొంత ప్రీమియం చెల్లించిన తరువాత నష్ట పరిహారాన్ని చెల్లించడానికి కంపెనీ లేదా రాజ్యం చేసిన ఏర్పాటు”.
  3. న్యాయశాస్త్రం దృష్ట్యా బీమా అనగా “ఏర్పడిన ఒక నిర్దిష్టమైన నష్టానికి కొంత సొమ్మును ప్రతిఫలంగా చెల్లించడానికి ఒక పార్టీకి వేరొక పార్టీకి మధ్య కుదిరిన ఒప్పందం”.

బీమా సూత్రాలు: బీమా ఏదైనా ఈ క్రింది ప్రధాన సూత్రాలకు లోబడి ఉంటుంది.
1) అత్యంత విశ్వాసం:

  1. బీమా ప్రక్రియలో ‘పార్టీలలో పరస్పర నమ్మకం కలిగి ఉండాలనే’ సూత్రం ఉంది. బీమా కాంట్రాక్టులలోని పార్టీలు తమకు సంబంధించిన సమాచారాన్ని సంపూర్తిగా తెలియజేస్తూ కాంట్రాక్టు ఏర్పాటుకు మార్గాన్ని సృష్టించవలసి ఉంటుంది.
  2. దీని వల్ల పాలసీదారుడి ఆస్తి లేదా ప్రాణ సంబంధిత విషయాన్ని నమ్మకంగా కంపెనీ వారికి అందజేసే బాధ్యత కలిగి ఉంటాడు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

2) బీమాపై ఆసక్తి:

  1. ఒక ఆస్తిపై కాని, జీవనంపై కాని ఆర్థికపరమైన ప్రయోజనం కలగాలంటే బీమా పట్ల ఆసక్తి కలిగి ఉండాలి.
  2. తన జీవనంపైగానీ, ఆస్తిపై గాని బీమా చేయడానికి ఆసక్తి లేని వ్యక్తి న్యాపరమైన బీమా కాంట్రాక్టును ఏర్పరచలేడు. అలా కాకుండా, ఒక వ్యక్తి ఏ రకమైన ఆస్తిపైనైనా ఇష్టం ఉన్నట్లు బీమా చేసుకున్నట్లయితే అలాంటి ఆసక్తి ఒక జూదంగానో, మాయగానో ఉండేది. ఆ పరిస్థితులలో బీమా కాంట్రాక్టులు పందెముల లాగా గోచరించి న్యాయపరంగా చెల్లుబాటు కాని కాంట్రాక్టులు అవుతాయి.

3) నష్ట పరిహారం / నష్ట పూర్తి:

  1. ఒక నిర్దిష్టమైన సంఘటన జరిగినప్పుడు బీమాదారునికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి, దానిని బీమా సంస్థ చెల్లించడాన్ని నష్టపూర్తి అంటారు. ఇది బీమా ఆస్తి విలువకు మించరాదు.
  2. జీవిత బీమా వ్యక్తిగత బీమాలకు ఈ విమోచన సూత్రం వర్తించదు.

4) ప్రతినివేశం:

  1. ఈ సూత్రం ప్రకారం నష్టపోయిన వ్యక్తికి చెల్లింపులు చేసిన తర్వాత, బీమా కంపెనీకి ఆ ఆస్తిపై హక్కు సంక్రమిస్తుంది.
  2. వస్తువు పాక్షికంగా లేదా పూర్తిగా పాడైనప్పటికీ ఈ సూత్రం వర్తిస్తుంది. అలాంటి సందర్భంలో క్లెయిమ్ ద్వారా పొందిన దాని కంటే వ్యర్థం ద్వారా అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

5) వంతులవారీ చెల్లింపు:

  1. కొన్ని సందర్భాలలో వ్యక్తులు ఒక కంపెనీ కంటే ఎక్కువ కంపెనీలలో బీమా చేయిస్తారు. దీన్ని ‘ద్వంద్వ బీమా’ అంటారు. నష్టం సంభవించిన పక్షంలో, బీమా చేసిన వ్యక్తి వాస్తవ సొమ్మును పొంది విమోచనం పొందాలంటే బీమా ద్వారా పరిష్కార ఏర్పాట్లు చేయబడతాయి. అలాంటి సందర్భంలో బీమా కంపెనీలు వంతులవారీ చెల్లింపు సూత్రాన్ని పాటిస్తాయి.
  2. ఒకవేళ బీమా చేసిన వ్యక్తి ఒక కంపెనీ కంటే ఎక్కువ కంపెనీల ద్వారా క్లెయిమ్ చేసినట్లయితే, చెల్లించిన మొత్తాన్ని కంపెనీలు సర్దుబాటు చేసుకుంటాయి.

6) నష్టాన్ని తగ్గించడం:

  1. ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రమాదం సంభవించినట్లయితే పాలసీదారుడు అలాంటి ప్రమాదం ద్వారా ఏర్పడే నష్టాన్ని తగ్గించడానికి తగిన చర్యలను తీసుకునే బాధ్యత కలిగి ఉంటాడు.
  2. ఈ సూత్రం వర్తింపజేయడానికి గల కారణమేమంటే, ప్రమాదం జరిగినపుడు పాలసీదారుడు అజాగ్రత్తగా ఉండక సామాన్యుడిలాగా చైతన్యవంతులై నష్టాన్ని తగ్గించడానికి ఉపక్రమించాలి.

7) సమీప కారణం:

  1. ప్రమాదం సంభవించిన సందర్భంగా బీమా కంపెనీ పూర్తి నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే సంభవించిన నష్టం తీసుకున్న పాలసీలోని ఘటనకు ప్రత్యక్ష సామీప్యతను కలిగి ఉండాలి.
  2. ప్రమాదం సంభవించినప్పుడు నిజనిర్ధారణ చేయడానికి సమీప క్రియను మాత్రమే పరిగణించి, లోతైన కారణాలను చూడదనే ఆచారాన్ని పాటిస్తుంది.

ప్రశ్న 2.
బీమా విధులను వివరించండి.
జవాబు.
బీమా విధులను రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి: (1) ప్రాథమిక విధులు (2) సెకండరీ విధులు.
బీమా విధులను వివరించండి.
1) ప్రాథమిక విధులు
ఎ) నిశ్చిత స్థితి: బీమా ద్వారా నష్టపరిహారాన్ని చెల్లించడం నిశ్చయం అని తెలియజేస్తుంది. అనిశ్చితి గల నష్టాన్ని తగ్గించడానికి తగిన ప్రణాళిక, వ్యూహం ఉండాలి. బీమా అనే ఏర్పాటు ఆ నష్టం నుంచి ఉపశమనాన్ని కల్పిస్తుంది.. నష్ట భయాలు వివిధ రకాలుగా ఉంటాయి, ఘటన సంభవించినా సంభవించకపోయినా పరిహార చెల్లింపు విషయంలో కంపెనీలు నిశ్చయంగా ఉంటాయి. దాని కోసం కొంత మొత్తంగా ప్రీమియం రూపంలో వసూలు చేస్తాయి.

బి) భద్రతను కల్పించడం ప్రమాదం ఏర్పడు ముందు నష్టానికి తగిన భద్రతను బీమా కల్పిస్తుంది. బీమా లేనట్లయితే ప్రమాదం సంభవించినపుడు ఆసక్తిగల వ్యక్తి సమయం, డబ్బు భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది. పాలసీదారుడు పడే అవస్థ నుంచి కాపాడే బాధ్యతను బీమా కంపెనీ తీసుకుంటుంది.

సి) నష్టభయాన్ని పంచుకోవడం: జరగబోయే నష్టం అనిశ్చితిగా ఉంటుంది. ప్రమాదం సంభవించినపుడు నష్టాన్ని వ్యాప్తి చేసి అందరికీ పంపకం చేయబడుతుంది. ఆధునిక కాలంలో ప్రీమియం ద్వారా పొందిన సొమ్ము మొత్తాన్ని పాలసీదారులకు వ్యాప్తి చేసి నష్టాన్ని పరిహరించేటట్లు అభయం ఇస్తాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

2. అనుబంధ విధులు:
ఎ) నష్ట నివారణ: ప్రమాదం సంభవించినపుడు జరిగే నష్టాన్ని నివారించడానికి బీమా కంపెనీలు కలిసికట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ప్రీమియం చెల్లింపులు తగ్గి బీమా చేసే వ్యక్తికి ఎంతో ఉపకరిస్తుంది.

బి) మూలధన ఏర్పాటు: సమాజానికి కావలసిన మూలధన ఏర్పాట్లను బీమా కంపెనీలు సృష్టిస్తాయి. సేకరించిన సొమ్మును ఉత్పత్తి మార్గంలో పెట్టును. మూలధన కొరతను తగ్గించును.

సి) నైపుణ్యతను మెరుగుపరచడం: ప్రమాదం సంభవించినప్పుడు ఏర్పడిన నష్టాన్ని, బాధలను బీమా వ్యవస్థ రూపుమాపుతుంది. ఆర్థికబాగుకోసం తన జీవితాన్ని మనస్సును ‘బీమా సంస్థల పట్ల శ్రద్ధ చూపును. దీనివల్ల స్వంతంగా నైపుణ్యత పెంచుకోవడమేకాక ప్రజల నైపుణ్యాన్ని కూడా పెంచడానికి అవకావం ఉంది.

డి) ఆర్థిక ప్రగతి: సాధారణ ప్రజలకు, వ్యాపార సంస్థలకు బీమా సంస్థలు తీసుకునే భద్రత చర్యల ద్వారా మరియు పెట్టుబడుల ద్వారా ఆర్థిక ప్రగతిని ఏర్పరచును.

ప్రశ్న 3.
జీవిత బీమాను వర్ణించి వివిధ పథకాలను తెలపండి.
జవాబు.
1. జీవిత బీమా:
1) బీమా సంస్థ, తాను పొందిన ప్రీమియంకు బదులుగా, ఆ ప్రీమియం మొత్తం ఒకేసారి గాని లేదా వాయిదాల పద్ధతిలో గాని, బీమాదారుడు మరణించినప్పుడు లేదా నిర్ణీతమైన సమయం పూర్తి అయినప్పుడు సొమ్ము చెల్లింపుకు ఇచ్చిన కాంట్రాక్టును జీవిత బీమా అంటారు.

2) కాంట్రాక్టులో అంగీకరించిన విధంగా సంభవంచిన వ్యక్తి మరణానికి, తగిన ప్రతిఫలానికి బదులుగా పూర్తిగానైనా, వాయిదా పద్ధతిలో నైనా కొంత కాలానికి చెల్లించేటట్టు చేసే ఏర్పాటును జీవిత బీమాగా నిర్వచించవచ్చు. జీవిత బీమాలోని వివిధ పథకాలు: జీవిత బీమా పాలసీలలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. అవి:
ఎ) సంపూర్ణ జీవిత పాలసీ
బి) ఎండోమెంట్ పాలసీ,

ఎ) సంపూర్ణ జీవిత పాలసీ:

  1. ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం, పాలసీదారుని జీవితం మొత్తం కొనసాగే విధంగా పాలసీ ఉండటం. ఈ విధమైన పాలసీలో వ్యక్తి మరణం తరవాత చెల్లింపులు జరిగే విధంగా ఏర్పాట్లు చేయడమైనది.
  2. ఈ పథకంలో వ్యక్తి జీవించినంత కాలం కంపెనీకి ప్రీమియం మొత్తం చెల్లించవలసి ఉంటుంది. ఇలాంటి పథకాలలో ప్రీమియం చెల్లింపు స్వల్పంగా ఉండి కుటుంబానికి భద్రత కల్పిస్తుంది.

బి) ఎండోమెంట్ పాలసీ:

  1. ఈ పాలసీ ఒక ప్రత్యేక కాలపరిమితి కలిగి లేదా ఒక పరిమిత వయస్సు వరకు వర్తిస్తుంది.
  2. ఒకవేళ కాల పరిమితికి ముందే వ్యక్తి మరణించినట్లయితే, తక్షణమే క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. అలా కాకుండా పరిమిత కాలం వరకు ప్రీమియం చెల్లించినట్లయితే, పూర్తయిన కాలం తరువాత క్లెయిమ్ మొత్తం చెల్లించడం జరుగుతుంది.

బీమా కంపెనీలు అమలుచేసే వివిధ పాలసీలు:
ఎ) వార్షిక పాలసీ: ఈ పాలసీలో పాలసీదారునికి ప్రతి సంవత్సరం జీవింతాంతం వరకు కొంత మొత్తంలో చెల్లించడం జరుగుతుంది.

బి) నిక్షేప నిధి పాలసీ: ఈ పాలసీలో ద్వారా ఆస్తిని పునఃస్థాపనకు ఏర్పాటుచేసే భద్రతను కల్పిస్తుంది.

సి) పరిమిత కాల అభయ పాలసీ: ఈ పాలసీలో ఒక వ్యక్తి పరిమిత కాలానికి లేదా వయస్సుకు ముందు, మరణం సంభవించినప్పుడు మాత్రమే సొమ్ము చెల్లించడం జరుగుతుంది. ఇలాంటి పాలసీలలో ప్రాథమికంగా స్వల్ప ప్రీమియం కలిగి ఉంది. కాలాన్ని బట్టి ప్రీమియం పెరుగుతంది. దీనినే ‘ఆరోహణ స్థాయి పాలసీ’ అంటారు.

డి) ద్వంద్వ ప్రమాద విమోచన పాలసీ: ఇలాంటి పాలసీలలో పాలసీదారుడు ప్రమాదంలో మరణించినట్లయితే రెట్టింపైన సొమ్మును చెల్లించడం జరుగుతుంది.

ఇ) సమిష్టి జీవన పాలసీ: ఇలాంటి పాలసీలలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది జీవితాలపై బీమా చేయబడుతుంది. ప్రమాదం సంభవించినప్పుడు మరణించినట్లయితే జీవించి ఉన్న మిగతా వారిలో ఒకరికి సొమ్ము చెల్లించడం జరుగుతుంది.

ఎఫ్) బృంద బీమా పాలసీ: ఈ రకమైన పాలసీలు కుటుంబపరంగా కాని లేదా సంస్థలలో పనిచేసే సిబ్బంది మొత్తానికి వర్తిస్తాయి.

జి) జనతా పాలసీ: ఈ పాలసీ కింద ఎండోమెంట్ పాలసీలను జారీ చేయడం జరుగుతుంది. జనతా పాలసీ 10, 15, 25 సంవత్సరాల కాల పరిమితి కలిగి 60 సంవత్సరాల వయస్సును మించకుండా ఉన్న వ్యక్తులకు వర్తిస్తుంది. వీటిని గరిష్ఠంగా 45 సం॥ల వరకు మాత్రమే జారీ చేయడం జరుగుతుంది. పాలసీ తీసుకోవడానికి 35 సం॥ల వరకు ఏ విధమైన ఆరోగ్య పరీక్షలు అవసరం లేదు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

ప్రశ్న 4.
నౌకాయాన బీమా అంటే ఏమిటి ? నౌకాయాన బీమా పథకాలను వివరించండి.
జవాబు.
సముద్రయానంలో నావలోని సరుకు ప్రమాదవశాత్తు పాడయిపోయినట్లయితే సొంతదారునికి విమోచనం కల్పించే సౌకర్యమే “సముద్ర బీమా” ఈ బీమా సాధారణంగా నౌకకు లేదా నౌకలో గల సరుకుకు వర్తిస్తుంది.

సముద్ర బీమా రకాలు:
1) టైమ్ పాలసి: ఈ పాలసీలో బీమా అంశం ప్రత్యేక కాలానికి లోబడి ఉంటుంది. ఈ పాలసీకి ప్రధానంగా తెట్ట బీమా సంబంధించిన స్థిర, చర వస్తువులకు వర్తిస్తుంది.

2) వాయేజ్ పాలసి: సముద్ర యానం ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సరుకు తరలించేటపుడు అమలుపరచడానికి ఈ పాలసి వర్తిస్తుంది. నౌకాయానంలో ఏర్పడే నష్టాన్ని ఈ పాలసీ తీరుస్తుంది.

3) మిశ్రమ పాలసి: ఈ పాలసీ ఒక నిర్ణీత కాలానికి ప్రత్యేక సముద్ర మార్గంలో సరుకును చేరవేసే బీమాను కల్పిస్తుంది. ఈ పాలసీకి కాల సంబంధిత, సముద్రయాన పాలసీ అంటారు.

4) ఫ్లోటింగ్ పాలసి: పాలసీలో సరుకు యజమానులు క్రమంగా సరుకును చేరవేసే వ్యవహారాలు చేపట్టినట్లయితే ఫ్లోటింగ్ అంటారు.

5) బ్లాంకెట్ పాలసి: ఈ పాలసీలో కొంత సొమ్ముకు బీమా తీసుకుని మొదటి ప్రీమియం చెల్లించి సొమ్ము పూర్తయ్యే వరకు నష్ట భయాన్ని సర్దుబాటు చేస్తారు.

6) ప్లీట్ పాలసి: ఆవిరి యంత్రపు నౌకలు మరియు అన్ని నౌకలకు బీమా కల్పించే పాలసి ప్లీట్ పాలసి.

7) విలువ కట్టిన పాలసి: ఈ బీమాలో పూచి పరిహారాన్ని తెలియజేసి ప్రత్యేకంగా విలువ కడతారు. ఒకవేళ పరిహారపు విలువ తెలియకపోతే దాన్ని ఓపెన్ పాలసి అంటారు.

8) ఇతర బీమా పాలసీలు: సాధారణ బీమా కంపెనీలు అన్ని రకాల నష్టభయమును కలుపుతూ వివిధ పాలసీలు అందిస్తారు.
ఉదా: మోటారు సైకిల్ బీమా, మూడవ పార్టీ బీమా అపహరణ బీమా మొదలైనవి.

ప్రశ్న 5.
అగ్ని బీమా అంటే ఏమిటి ? వివిధ రకాల అగ్ని బీమాలను వివరించండి.
జవాబు.
I. అగ్ని ప్రమాద బీమా:

  1. ఒక పార్టీకి సంభవించిన ఆర్థిక నష్టాన్ని, కొంత సొమ్ముకు బదులుగా, అగ్ని లేదా దానికి సంబంధించిన ప్రమాదం వల్ల పాడైన లేదా నాశనమైన వస్తువుకు పరిహార రూపంలో చెల్లించే ఏర్పాటును అగ్ని ప్రమాద బీమా అంటారు.
  2. క్లెయిమ్ చేసే సొమ్ముకు ప్రధానంగా రెండు షరతులు వర్తిస్తాయి. ఎ) వాస్తవ అగ్ని ప్రమాద సందర్భం బి) అగ్ని ప్రమాదం అకస్మాత్తుగా జరిగి ఉండాలి కాని ఉద్దేశపూర్వకంగా ఉండకూడదు.

II. అగ్ని ప్రమాద బీమా పాలసీలు:
క్రింద పేర్కొన్న పాలసీలు అగ్ని ప్రమాద బీమాకు వర్తిస్తాయి.
1) విలువ కట్టిన పాలసీ: ఈ పాలసీలో ఆస్తి విలువను లెక్కించి ప్రమాదం సంభవించినపుడు, చెల్లించడానికి గల విలువను అంగీకరించిన విధంగా తగిన ఏర్పాటు చేయబడుతుంది.

2) సగటు పాలసీ:
ఎ) సగటు పాలసీలో సరాసరి క్లాజ్ ఉంది. ఈ క్లాజ్ ప్రకారం ఆస్తిని తరుగు విలువ గలదిగా బీమా చేసినట్లయితే, బీమా చేసిన వ్యక్తికి అనుపాత విలువతో నష్ట సమయానికి అనుబంధంగా బీమా విలువ కలిగి ఉంటుంది.

బి) ఉదా: ఒక వ్యక్తికి గల ఆస్తి విలువ కౌ 15,000గా ఉన్నట్లయితే, గౌ 8,000ల నష్టాన్ని లెక్కించగా, అలాంటి సమయానికి మార్కెట్ విలువ 20,000 ఉంటే, క్లెయింట్ సెటిల్ చేసే మొత్తం 6,000 నిర్ణయించవచ్చు. అంటే (15,000/20,000) 8,000. తదనుగుణంగా ఇలాంటి పరిస్థితిలో బీమా చేసిన వ్యక్తి శ 2,000 నష్టాన్ని భరించవలసి
ఉంటుంది.

3) నిర్దిష్ట పాలసీ:
1) ఈ పాలసీ ద్వారా ‘ఒక ప్రత్యేక సొమ్ముకై బీమా చేయబడుతుంది. ప్రమాదం సంభవించి నష్టం కలిగినట్లయితే కంపెనీ వారు పూర్తి నష్టాన్ని చెల్లిస్తారు. ఇలాంటి సందర్భంలో ఆస్తి మొత్తం విలువ పరిగణనలోకి తీసుకోబడదు. 2) ఉదా: ఒక భవంతి విలువ 1,00,000లు ఉండి, 50,000ల అగ్ని ప్రమాదపు నష్టాన్ని పొందినట్లయితే దాని విలువ ఔ 30,000గా నిర్ధారించినపుడు బీమా చేసిన వ్యక్తికి శ 30,000లను పరిహారంగా కంపెనీ చెల్లిస్తుంది.

4) ఫ్లోటింగ్ పాలసీ:

  1. ఒకసారి చెల్లించే ప్రీమియంనకు వివిధ ప్రాంతాలలో నిల్వ చేసిన సరుకుకు పాలసీని అమలుపరచే పథకాన్ని ఫ్లోటింగ్ పాలసీ అంటారు.
  2. ఇలాంటి పాలసీలలో నిల్వ చేసిన సరుకు విలువలలో సగటు విలువ ఆధారం చేసుకుని నిర్ణయించిన ప్రీమియం ద్వారా. బీమా పాలసీ వర్తిస్తుంది.

5) అధిక నష్ట పాలసీ:

  1. వర్తకులు సరుకును నిల్వ ఉంచిన పక్షంలో పరిణమించే విలువలను మార్పుకనుగుణంగా అత్యంత అదనపు ప్రయోజనాన్ని కల్పించే పరిహారం గల పాలసీ.
  2. ఉదా: ఒక వర్తకుడు నిల్వ ఉంచిన సరుకు విలువ 7 1,00,000 మరియు 1,50,000 మధ్య ఉన్నట్లయితే, ప్రథమంగా 1,00,000 పొంది అటు తరువాత 50,000 అధిక నష్ట పాలసీ కింద ప్రయోజనాన్ని పొందవచ్చు.

6) బ్లాంకెట్ పాలసీ: ఇలాంటి పాలసీలలో అన్ని విధాలైన స్థిర మరియు చర ఆస్తులను ఒకే పాలసీలో అమలయ్యే ఏర్పాటు చేయబడుతుంది.

7) విస్తారమైన పాలసీ: ఇలాంటి పాలసీలలో అన్ని రకాల నష్టభయాలైన అగ్ని, పేలుడు, మెరుపు, పిడుగు, దోపిడీలు, సాంఘిక కలహాలు, ధర్నాలు, కన్నం వేయడం, కొంతమేరకు నష్టపోయన అద్దెల వల్ల కలిగే నష్టాలు చేరి ఉంటాయి. దీన్ని ‘సర్వ బీమా పాలసీ అని కూడా అంటారు.

8) నష్ట సంభవ పాలసీ: ఒక వ్యాపారం నడిచేటప్పుడు సంభవించే ఆటంకపు నష్టాల నుంచి లాభలోటును విమోచనం చేసే పాలసీ ‘నష్ట సంభవ పాలసీ’.

9) పునః స్థాపన పాలసీ: ఈ పాలసీ ద్వారా ఒక ఆస్తిని పునఃస్థాపనకు కంపెనీ వారు పరిహార ఏర్పాట్లును చేస్తారు. చెల్లింపు విలువను లెక్కించే సమయంలో తరుగుదలను ఆస్తి విలువ నుంచి తీసివేయడం జరుగదు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

ప్రశ్న 6.
IRDA అంటే ఏమిటి ? IRDA అధికారాలను, విధులను వివరించండి.
జవాబు.
మల్హోత్రా కమిటి సిఫారసు ప్రకారం దేశంలోని బీమా వ్యాపార అభివృద్ధికి, నియంత్రణకు భారత ప్రభుత్వం “బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటి” (Insurance Regulatory and Development authority IRDA) ని 1999లో స్థాపించినది. హైదరాబాదు ప్రధాన కార్యాలయంగా బీమా, బీమాయేతర కంపెనీలకు జాతీయ స్థాయిలో నిర్వహణకు, నియంత్రణకు ఉద్దేశించిన భారత ప్రభుత్వం నడుపుతున్నది.

IRDA అధికారాలు విధులు:

  1. బీమా కాంట్రాక్టులోగల నియమ నిబంధనలకు లోబడి పాలసీదారులకు సంబంధించిన నామినేషన్, బీమాపై గల ఆసక్తి, బీమా క్లెయిమ్లు, అప్పగింత విలువకు భద్రత కల్పించడం.
  2. బీమా ఏజెంట్లకు, మధ్యవర్తులకు అవసరమైన అర్హత, శిక్షణకు సంబంధించిన అంశాలను నిర్ధారించడం.
  3. సర్వేయర్లకు, విలువ నిర్ధారితులకు నడవడి విధానాన్ని తెల్పడం.
  4. బీమా వ్యాపారం వృద్ధికై ప్రోత్సాహాన్ని కల్పించడం.
  5. IRDA చట్టం పరిధిలో చెల్లింపులు, ఇతర ఛార్జీలకు సంబంధించి వృత్తిపరమైన సంస్థలతో ఏర్పాటు చేయడం.
  6. బీమా వ్యాపార వ్యవహారాలకు గల పరిశీలన, తనిఖీ, వ్యాజ్యం, బీమా ఆడిట్కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం.
  7. బీమా కంపెనీలు పెట్టే పెట్టుబడుల నిర్వహణ, నియంత్రణను శక్తికి తగినట్లుగా చర్యలు తీసుకోవడం.
  8. బీమా కంపెని, మధ్యవర్తులకు ఏర్పడిన వివాదాలకు తీర్పు ఇవ్వడం.
  9. సుంకాల సలహా సంఘం వ్యవహార తీరును పర్యవేక్షించడం.
  10. నిర్దేశింపబడిన ఏ ఇతర విధులైనా చేపట్టడం.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బీమా లక్షణాలను తెలపండి.
జవాబు.
1) నష్టభయాన్ని పంచుకునే సాధనం: సంభవించబోయే నష్టాలకు భద్రతను కల్పించే ఏర్పాటు చేయడమే బీమా ప్రధాన లక్షణం. ఒక వ్యక్తి తనకు తానుగా భరించలేని ఆర్థిక నష్టాలను కల్పించే అగ్ని ప్రమాదం, దొంగతనం, సహజ ప్రమాదం, మరణం లాంటివి భారీ మూల్యం కలిగినవి. ఇలాంటి నష్టభయాన్ని బీమా అందరికీ సమంగా పంచబడుతుంది. అందువల్ల బీమా అనేది నష్టభయాన్ని పంచుకునే సాధనం బీమా లక్షణాలలో చెప్పబడింది.

2) సహకార సాధనం: ఒక నష్టభయానికి సంబంధించి వ్యక్తుల సమూహం ముందుకు వచ్చి ఆ నష్టభయాన్ని సమంగా పంచుకుంటారు. కాబట్టి దీన్ని సహకార సాధనంగా చెప్పవచ్చు.

3) భద్రత కల్పించే సాధనం: అన్ని రకాలైన నష్టాలకు భద్రత కల్పించేది బీమాయే. బీమా లేనట్లయితే జరగబోయే అన్ని నష్టాలకు సొంతదారుడే బాధ్యుడవుతాడు కాని అలా జరగడం అసాధ్యం’ అందువల్ల బీమా అనేది భద్రత కల్పించే ఒక సాధనం.

4) నష్టభయాన్ని కొలిచే సాధనం: సంభవించే నష్టాన్ని ముందుగా అంచనా వేయడం వల్ల ఎంతమేరకు నష్టపరిహారాన్ని చెల్లించవచ్చో ముందుగానే గుర్తించవచ్చు. బీమా చేయడానికి ముందే, చెల్లించబోయే ప్రీమియాన్ని, నష్టపరిహారాన్ని లెక్కించడం ఎంతో శ్రేయస్కరం.

5) చెల్లింపు సాధనం: ఒక బీమా కాంట్రాక్టులో నష్టభయం చోటు చేసుకున్నా, లేకున్నా పాలసీదారుడు కొంత మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరిస్తాడు. ఉదా: జీవిత బీమా కాంట్రాక్టులో తటస్థించబోయే అంశాలు రెండు. అవి వ్యక్తి మరణించడం లేదా పాలసీకాలం పూర్తవడం కూడా. ఇతర బీమా కాంట్రాక్టులైన అగ్ని ప్రమాద బీమా, నౌకా ప్రమాద బీమాలలో నష్టం సంభవించినపుడు నష్టపరిహారాన్ని చెల్లించవలసి ఉంటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

ప్రశ్న 2.
బీమా, హామీ వ్యత్యాసాలను తెలపండి.
జవాబు.
బీమా మరియు హామీ అనే రెండు పదాలను తరచుగా ఒకే అర్థం వచ్చే విధంగా వాడుతారు. కాని అవి పర్యాయపదాలు కావు.

బీమా మరియు హామీల వ్యత్యాసాలు:

బీమా

  1. బీమా అనగా నష్టం సంభవించినా, సంభవించక పోయినా చెల్లించే నష్టపరిహార ఒప్పందం
  2. బీమాలో నష్టం సంభవించితేనే పరిహారం చెల్లిస్తారు. నష్టం జరగకపోతే పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.

హామీ

  1. హామి అనగా తీసుకున్న పాలసీకు క్లెయిమ్ చేసుకోవచ్చు.
  2. హామీ ప్రకారం పరిహారం చెల్లించడం తప్పనిసరి అవుతుంది. జీవిత బీమాలో మరణం సంభవించిన లేదా టర్మ్ కాలం ముగిసిన బీమా విలువను చెల్లించాల్సి వస్తుంది.
    బీమా లక్షణాలను తెలపండి.

ప్రశ్న 3.
IRDA కూర్పు ఏమిటి ?
జవాబు.
IRDA లో ఒక చైర్పర్సన్, తొమ్మిది మంది సభ్యులకు మించకుండా ఐదుగురు సభ్యులు భారత ప్రభుత్వం ద్వారా నియమించబడి ఉంటారు. వీరికి పరిపాలన, గణక శాస్త్రం, న్యాయ విద్య, అర్ధశాస్త్రం, ఫైనాన్స్, బీమా, బీమాయేతర సంబంధ విద్యలలో సంపూర్ణ పరిజ్ఞానం, అనుభవం, కీర్తి, నిజాయితీ, సామర్థ్యం కలిగి ఉండాలి. వీరి పదవీ కాలం 5 సంliలుగా నిర్ధారించబడి, పూర్తికాల సభ్యులకు 62 సం||ల వయస్సు వచ్చేవరకు కొనసాగుతారు. కాని చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి 65 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగవచ్చు.

ప్రశ్న 4.
జీవిత బీమా కింద ప్రతిపాదించే వివిధ పాలసీలు ఏమిటి ?
జవాబు.
బీమా కంపెనీలు అమలు చేసే వివిధ పాలసీలు:

  1. వార్షిక పాలసీ: ఈ పాలసీలో పాలసీదారునికి ప్రతి సంవత్సరం జీవితాంతం వరకు కొంత మొత్తంలో చెల్లించడం జరుగుతుంది.
  2. నిక్షేప నిధి పాలసీ: ఈ పాలసీ ద్వారా ఒక ఆస్తిని పునఃస్థాపనకు ఏర్పాటు చేసే భద్రతను కల్పిస్తుంది.
  3. పరిమిత కాల అభయ పాలసీ: ఈ పాలసీలో ఒక వ్యక్తి పరిమిత కాలానికి లేదా వయస్సుకు ముందు, మరణం సంభవించినప్పుడు మాత్రమే సొమ్ము చెల్లించడం జరుగుతుంది. ఇలాంటి పాలసీలలో ప్రాథమికంగా స్వల్ప ప్రీమియం కలిగి ఉండి, కాలాన్ని బట్టి ప్రీమియం పెరుగుతుంది. దీనినే ‘ఆరోహణ స్థాయి పాలసీ’ అంటారు.
  4. ద్వంద్వ ప్రమాద విమోచన పాలసీ: ఇలాంటి పాలసీలలో పాలసీదారుడు ప్రమాదంలో మరణించినట్లయితే రెట్టింపైన సొమ్మును చెల్లించడం జరుగుతుంది.
  5. సమిష్టి జీవన పాలసీ: ఇలాంటి పాలసీలలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది జీవితాలపై బీమా చేయబడుతుంది. ప్రమాదం సంభవించినప్పుడు మరణించినట్లయితే జీవించి ఉన్న మిగతా వారిలో ఒకరికి సొమ్ము చెల్లించడం జరుగుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
అగ్ని ప్రమాద బీమా.
జవాబు.

  1. ఒక పార్టీకి సంభవించిన ఆర్థిక నష్టాన్ని, కొంత సొమ్ముకు బదులుగా అగ్ని లేదా దానికి సంబంధించిన ప్రమాదం వల్ల పాడైన లేదా నాశనమైన వస్తువుకు పరిహార రూపంలో చెల్లించే ఏర్పాటును అగ్ని ప్రమాద బీమా అంటారు.
  2. అగ్ని ప్రమాద బీమా క్లెయిమ్ చేసేందుకు రెండు షరతులు వర్తిస్తాయి. అవి:
    ఎ) వాస్తవ అగ్నిప్రమాద సందర్భం
    బి) అగ్ని ప్రమాదం అకస్మాత్తుగా జరిగి ఉండాలి కాని ఉద్దేశ పూర్వకంగా ఉండకూడదు.

ప్రశ్న 2.
IRDA పాత్ర.
జవాబు.
IRDA పాత్ర:

  1. పాలసీదారుల ఆసక్తులను కాపాడటం.
  2. బీమా వ్యాపార పరిశ్రమ, దాని అనుబంధ వ్యవహారాలు క్రమమైన అభివృద్ధి జరగడానికి తోడ్పడటం. 3) నైతిక విధానంలో బీమా వ్యాపారాన్ని భారత భూభాగంలో నిర్వహించడం.

ప్రశ్న 3.
మిశ్రమ పాలసీ,
జవాబు.
ఈ పాలసీని “కాల సంబంధిత, సముద్రయాన పాలసీ” అంటారు. ఈ పాలసీ ఒక నిర్ణీత కాలానికి ప్రత్యేక సముద్ర మార్గం ద్వారా సరుకును చేరవేసే బీమాను కల్పిస్తుంది.
ఉదా: చెన్నై నుంచి టోక్యో వరకు ఆరు నెలల కాలానికి మిశ్రమ పాలసీని తీసుకోవడం.

ప్రశ్న 4.
ఎండోమెంట్ పాలసీ
జవాబు.

  1. ఈ పాలసీ ఒక ప్రత్యేక కాలపరిమితి కలిగి లేదా ఒక పరిమిత వయస్సు వరకు వర్తిస్తుంది.
  2. ఒక వేళ కాల పరిమితికి ముందే వ్యక్తి మరణించినట్లయితే, తక్షణమే క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. అలా కాకుండా పరిమిత కాలం వరకు ప్రీమియం చెల్లించినట్లయితే, పూర్తయిన కాలం తరువాత క్లెయిమ్ మొత్తం చెల్లించడం జరుగుతుంది.

ప్రశ్న 5.
బీమా.
జవాబు.

  1. ఏర్పడిన ఒక నిర్ధిష్టమైన నష్టానికి కొంత సొమ్మును ప్రతిఫలంగా చెల్లించడానికి ఒక పార్టీకి వేరొక పార్టీకి మధ్య కుదిరిన ఒప్పందాన్ని బీమా అంటారు.
  2. బీమా అనగా సంభవించిన ఆర్థిక నష్టాన్ని అనేక మందికి వ్యాప్తి చేసే ఒక సాంఘిక పరిష్కారం.

ప్రశ్న 6.
అప్పగింత విలువ.
జవాబు.

  1. పాలసీదారుడు మెచ్యురిటీకి ముందే పాలసీని కంపెనీకి అప్పగించినట్లయితే అప్పగింత విలువను కంపెనీ చెల్లిస్తుంది.
  2. అప్పగింత విలువ చెల్లించడానికి కనీసం మూడు సంవత్సరాల వ్యవధి దాటి ఉండాలి. ఈ విలువ పాలసీదారుడు చెల్లించిన బీమా ప్రీమియం ఆధారంగా లెక్కించబడుతుంది.

ప్రశ్న 7.
విలువ కట్టిన పాలసీ.
జవాబు.
ఈ పాలసీలో ఆస్తి విలువను లెక్కించి ప్రమాదం సంభవించినపుడు, చెల్లించడానికి గల విలువను అంగీకరించిన విధంగా తగిన ఏర్పాటు చేయబడుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

ప్రశ్న 8.
ఫ్లోటింగ్ పాలసీ.
జవాబు.

  1. ఒక పాలసీలో సరుకు యజమానులు క్రమంగా సరుకును చేరవేసే వ్యవహారాలు చేపట్టినట్లయితే దానిని ఫ్లోటింగ్ పాలసీ అంటారు.
  2. పాలసీను స్థిరమైన మొత్తానికి ఏర్పాటు చేస్తారు. సరుకును చేరవేసే ప్రాంతాన్ని నిర్ధారించుకున్న తరువాత బీమా విలువను సరుకు విలువకు తగ్గిస్తారు. ఇలాంటి ప్రకటనలు సమయానుకూలంగా ఏర్పరచి సొమ్ము మొత్తం పూర్తయ్యే వరకు బీమా చేస్తారు.

ప్రశ్న 9.
సగటు పాలసీ.
జవాబు.
1) సగటు పాలసీలో సరాసరి క్లాజ్ ఉంది. ఈ క్లాజ్ ప్రకారం ఆస్తిని తరుగు విలువ గలదిగా బీమా చేసినట్లయితే, బీమా చేసిన వ్యక్తికి అనుపాత విలువతో నష్ట సమయానికి అనుబంధంగా బీమా విలువ కలిగి ఉంటుంది.
మిశ్రమ పాలసీ.
ఫ్లోటింగ్ పాలసీ.

2) ఉదా: ఒక వ్యక్తికి గల ఆస్తి విలువ 15,000గా ఉన్నట్లయితే, కౌ 8000ల నష్టాన్ని లెక్కించగా, అలాంటి సమయానికి మార్కెట్ విలువ 20,000 ఉంటే, క్లెయిమ్ సెటిల్ చేసే మొత్తం 6,000 నిర్ణయించవచ్చు. అంటే (15,000/20,000) 8000. తదనుగుణంగా, ఇలాంటి పరిస్థితిలో బీమా చేసిన వ్యక్తి కౌ 2000 నష్టాన్ని భరించవలసి ఉంటుంది.

ప్రశ్న 10.
విస్తారమైన పాలసీ.
జవాబు.
ఇలాంటి పాలసీలలో అన్ని రకాల నష్టభయాలైన అగ్నీ, పేలుడు మెరుపు, పిడుగు, దోపిడీలు, సాంఘిక కలహాలు, ధర్నాలు, కన్నం వేయడం, కొంత మేరకు నష్టపోయిన అద్దెల వల్ల కలిగే నష్టాలు చేరి ఉంటాయి. దీన్ని ‘సర్వ బీమా పాలసీ’ అని కూడా అంటారు.

ప్రశ్న 11.
సముద్ర బీమా.
జవాబు.

  1. బీమా పద్ధతులలో అతి ప్రాచీనమైనది సముద్ర బీమా. సముద్రయానంలో నావలోని వరకు ప్రమాదవశాత్తు పాడయిపోయినట్లయితే సొంతదారునికి విమోచనం కల్పించే సౌకర్యం సముద్ర బీమా.
  2. ఈ బీమా సాధారణంగా నౌకకు కాని లేదా నౌకలో గల సరుకుకు గాని వర్తిస్తుంది.

ప్రశ్న 12.
టైమ్ పాలసీ.
జవాబు.

  1. ఈ పాలసీలో బీమా అంశం ప్రత్యేక కాలానికి లోబడి ఉంటుంది.
  2. ఈ పాలసీ ప్రధానంగా తెట్ట బీమాకు సంబంధించి స్థిర, చర వస్తువులకు వర్తిస్తుంది.

ప్రశ్న 13.
వయోజ్ పాలసీ,
జవాబు.

  1. సముద్రయానం ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సరుకు తరలించేటపుడు అమలుపరచడానికి ఈ పాలసీ వర్తిస్తుంది.
  2. నౌకాయానంలో ఏర్పడే నష్టాన్ని ఈ పాలసీ తీరుస్తుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 4 బీమా సేవలు

ప్రశ్న 14.
సంపూర్ణ జీవిత పాలసీ,
జవాబు.
ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం పాలసీదారుని జీవితం మొత్తం కొనసాగే విధంగా పాలసీ ఉండటం. ఈ విధమైన పాలసీలో వ్యక్తి మరణం తరువాత చెల్లింపులు జరిగే విధంగా ఏర్పాట్లు చేయడమైనది. ఈ పథకంలో వ్యక్తి జీవించనంత కాలం కంపెనీకి ప్రీమియం మొత్తం చెల్లించవలసి ఉంటుంది. ఇలాంటి పధకాలలో ప్రీపియం చెల్లింపు స్వల్పంగా ఉండి కుటుంబానిక భద్రత కల్పిస్తుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 3rd Lesson బ్యాంకింగ్ సేవలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 3rd Lesson బ్యాంకింగ్ సేవలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
బ్యాంకింగ్ను నిర్వచించి, బ్యాంకింగ్ విధులను వివరించండి.
జవాబు.
బ్యాంకింగ్:

  1. ‘బ్యాంకు’ అనే పదం ఫ్రెంచి పదమైన బాంకో (Banco) అనే పదం నుండి గ్రహించబడింది. బాంకో అనగా బల్ల అని అర్థము.
  2. ద్రవ్యం మరియు పరపతితో కార్యకలాపాలను నిర్వహించే వ్యాపార సంస్థలను బ్యాంకు అంటారు.
  3. బ్యాంకింగ్ క్రమబద్దీకరణ చట్టం ప్రకారం “ప్రజల నుంచి నగదు రూపంలో సేకరించిన డిపాజిట్లను పెట్టుబడి పెట్టడానికి లేదా ఇతరులకు రుణాలుగా ఇవ్వడానికి ఆమోదించి, వారు కోరినప్పుడు లేదా ఇతరత్రా తిరిగి చెల్లించడానికి, చెక్కు, డ్రాఫ్టు, ఆదేశం లేదా ఇతరత్రా నగదును పొందడాన్ని బ్యాంకింగ్ గా నిర్వచించవచ్చు”.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు 1

బ్యాంకింగ్ విధులు: బ్యాంకింగ్ విధులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:

  1. ప్రాథమిక విధులు,
  2. ద్వితీయ విధులు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

ఎ) ప్రాథమిక విధులు:
1) డిపాజిట్లు ఆమోదం: వాణిజ్య బ్యాంకుల ప్రాథమిక విధులలో డిపాజిట్లు ఆమోదం ముఖ్యమైంది. గృహ రంగం నుంచి బ్యాంకులు పొదుపు రూపంలో నగదును సమీకరిస్తాయి. వినియోగదారుల నుంచి ఆమోదించే వివిధ డిపాజిట్లు స్థిర డిపాజిట్లు, కరెంటు డిపాజిట్లు, పొదుపు డిపాజిట్లు మరియు రికరింగ్ డిపాజిట్లుగా ఉంటాయి.

2) రుణాలు అందించడం: ప్రాథమిక విధులలో రెండవది రుణాలను, అడ్వాన్స్లను వ్యక్తులను, వ్యాపారులకు, ఔత్సాహికులకు కల్పించడం. రుణాలను వ్యక్తిగత పూచీ కత్తు, బంగారం, వెండి, సరుకు నిల్వ మరియు ఇతర ఆస్తుల ఆధారంగా జారీ చేస్తారు. బ్యాంకులు సాధారణంగా ఓవర్ డ్రాఫ్ట్, నగదు రుణం, ద్రవ్యపిలుపు, కాలపరిమిత రుణాలు, బిల్లు డిస్కౌంట్ మొదలైన రుణాలను అందిస్తాయి.

బి) ద్వితీయ విధులు: బ్యాంకులు నిర్వహించే ద్వితీయ విధులను ఏజెన్సీ సేవలు మరియు సాధారణ ప్రయోజన సేవలుగా వర్గీకరించవచ్చు.
1) ఏజెన్సీ సేవలు: బ్యాంకులు తమ వినియోగదారులకోసం, వారి తరపున ఏజెన్సీ సేవలనందిస్తాయి. బ్యాంకులు అందించే వివిధ ఏజెన్సీ సేవలు క్రింద పేర్కొనబడ్డాయి.

  1. బ్యాంకులు వినియోగదారుని తరపున వివిధ రుణపత్రాలైన చెక్కులు, ప్రామిసరీ నోట్లు సేకరించి, చెల్లింపులను కూడా చేస్తాయి.
  2. బ్యాంకులు వినియోగదారుల తరపున వాటాలు, స్టాక్లు, బాండ్లు, డిబెంచర్లు వంటి సెక్యూరిటీలు విక్రయాలను కొనసాగిస్తాయి.
  3. బ్యాంకు ఖాతాదారుల సొంత వాటాలపై డివిడెండు, డిబెంచర్లపై వడ్డీని సేకరించి ఖాతాలకు జమ చేసే సౌకర్యాన్ని బ్యాంకులు కల్పిస్తాయి.
  4. కొన్ని సందర్భాలలో బ్యాంకులు వినియోగదారుల ప్రతినిధులుగా, కరెస్పాండెంట్లుగా వ్యవహరిస్తాయి. (పాస్పోర్ట్, ప్రయాణీకుల టికెట్లు మొ||నవి)
  5. వినియోగదారుల ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు కోసం నిష్ణాతులను నియమించి, పన్ను రిటర్ను దాఖలు మరియు రిఫండ్ పొందేందుకు సహాయం చేస్తాయి.

2) సాధారణ ప్రయోజన సేవలు: బ్యాంకులు ఏజెన్సీ సేవలతో పాటు అదనంగా సాధారణ ప్రయోజన సేవలను కూడా అందిస్తాయి. ఆ సేవలు క్రింద పేర్కొనబడ్డాయి.

  1. బ్యాంకులు వినియోగదారులకు లాకర్ సదుపాయం కల్పిస్తాయి.
  2. బ్యాంకులు వినియోగదారులు ప్రయాణించే సందర్భంలో నగదు దొంగల బారిన పడకుండా, పోగొట్టుకోకుండా ట్రావెలర్స్ చెక్కులు జారీ చేస్తాయి.
  3. వినియోగదారుల పరపతి విలువను ధృవీకరిస్తూ బ్యాంకులు పరపతి పత్రాన్ని జారీ చేస్తాయి.
  4. పబ్లిక్ మరియు-ప్రైవేట్ కంపెనీలు జారీ చేసే వాటాలను, డిబెంచర్లకు బ్యాంకులు పూచీ ఇస్తాయి.
  5. బ్యాంకులు దేశీయ మరియు విదేశీయ బిల్లులను కూడా ఆమోదిస్తాయి.

ప్రశ్న 2.
బ్యాంకుల వివిధ రకాల డిపాజిట్ ఖాతాల గురించి వివరించండి.
జవాబు.
డిపాజిట్ల రకాలు: సాధారణంగా బ్యాంకులు నాలుగు రకాల డిపాజిట్లను స్వీకరిస్తాయి. అవి కరెంట్ డిపాజిట్లు, పొదుపు డిపాజిట్లు, ఫిక్స్డ్ మరియు రికరింగ్ డిపాజిట్లు అని ఉంటాయి.
ఎ) కరెంటు డిపాజిట్లు:

  1. ఈ డిపాజిట్లను డిమాండ్ డిపాజిట్లు అని కూడా పిలుస్తారు. ఈ డిపాజిట్లలోని సొమ్మును ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.
  2. బ్యాంకులలో భారీ డిపాజిట్లు, ఉపసంహరణలు చేసే పెద్ద వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు కరెంట్ డిపాజిట్లను నిర్వహిస్తాయి.
  3. ఖాతాదారుడు బ్యాంకు సూచనల మేరకు కనీస నిల్వను ఉంచినప్పటికీ ఎటువంటి వడ్డీని చెల్లించరు.

బి) పొదుపు డిపాజిట్లు:

  1. చిన్న మొత్తాలలో పొదుపు చేసుకునే మధ్యతరగతి ప్రజలు, వృత్తిదారులు పొదుపును నిర్వహించడానికి సులువైన మార్గం పొదుపు డిపాజిట్లు.
  2. కొంత కాలానికి పరిమితితో కూడిన నగదు ఉపసంహరణ వంటి నిబంధన ఖాతాదారునికి వర్తిస్తుంది.
  3. ఈ డిపాజిట్లలో నగదు నిల్వపై వడ్డీ లెక్కించి, చెల్లించబడుతుంది. వీటిలో వడ్డీ చెల్లింపు ఫిక్స్డ్ డిపాజిట్లలో వాటి కంటే తక్కువగా చెల్లిస్తారు. ప్రస్తుతం ఎస్బిఐ చెల్లించే పొదుపు డిపాజిట్లపై వడ్డీ సంవత్సరానికి 2.75% ఉంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

సి) ఫిక్స్డ్ డిపాజిట్లు:

  1. ఫిక్స్డ్ డిపాజిట్లను టైమ్ డిపాజిట్లని కూడా పిలుస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఖాతాదారులు జమచేసిన కాలం ముగిసేంత వరకు ముందస్తు సూచన చేయకుండా నగదును ఉపసంహరించుకోలేరు.
  2. ఫిక్స్డ్ డిపాజిట్లను ఖాతాదారులు భద్రతపరంగాను మరియు వడ్డీ రేటు పట్ల ఇష్టపడతారు.
  3. భారతదేశంలో ఫిక్స్డ్ డిపాజిట్లను ఏడు రోజులు మొదలుకుని అయిదు సంవత్సరాల వరకు ఆమోదిస్తారు. ప్రస్తుత ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు సాలుకు 4.5% నుంచి 6.10% వరకు చెల్లిస్తారు.

డి) రికరింగ్ డిపాజిట్లు:

  1. రికరింగ్ డిపాజిట్లలో ఖాతాదారుడు ప్రతీ నెల నిర్ణీత సొమ్మును స్థిరంగా డిపాజిట్ చేయడానికి సౌకర్యం కల్పిస్తుంది.
  2. గడువు తీరిన కాలానికి మొత్తం డిపాజిట్ తోపాటు వడ్డీని కూడా చెల్లిస్తారు.
  3. ప్రస్తుతం ఎఐ చెల్లిస్తున్న వడ్డీరేటు సాలుకు 5.8% నుంచి 6.25% ఉన్నది.

ప్రశ్న 3.
బ్యాంకులు సమకూర్చే వివిధ రకాల రుణాల గురించి చర్చించండి.
జవాబు.
ప్రాథమిక విధులలో చెప్పుకోదగిన విధి రుణాలను, అడ్వాన్స్లను వ్యక్తులకు, వ్యాపారస్తులకు, ఔత్సాహికులకు కల్పించడం. రుణాలను వ్యక్తిగత పూచీకత్తు, బంగారం, వెండి, సరుకుల నిల్వ మరియు ఇతర ఆస్తుల ఆధారంగా జారీ చేస్తారు. బ్యాంకులు సాధారణంగా ఈ దిగువ పేర్కొన్న రుణాలను అందిస్తాయి.
1) ఓవర్ డ్రాఫ్ట్: బ్యాంకు ఖాతాదారుడు పరిమితికి లోబడి అంగీకారం ప్రకారం బ్యాంకులో ఖాతాదారుని నిల్వకు మించి నగదును ఉపసంహరించుకునే సదుపాయం కల్పిస్తుంది.

2) నగదు రుణం: నగదు రుణ సదుపాయంలో ఖాతాదారునికి బ్యాంకు కొంత రుణాన్ని పూచీకత్తు మీద ఏర్పాటు చేస్తుంది. కాని రుణం ఏకమొత్తంగా కాకుండా బ్యాంకు ఖాతాలో జమచేస్తుంది. అత్యవసర పరిస్థితిలో నగదును కూడా ఇస్తుంది. ఖాతాదారుడు తన ఖాతాలో నుంచి ఉపసంహరించిన నగదుపై మాత్రమే వడ్డీని చెల్లించవలసి ఉంటుంది.

3) బిల్లుల డిస్కౌంట్: ఆధునిక బ్యాంకులు రుణాలను అందించే విధానాలలో ప్రజాదరణ పొందిన మరో పద్ధతి బిల్లుల డిస్కౌంట్. వినిమయ బిల్లుదారునికి నగదు అవసరమైనపుడు బ్యాంకులచే బిల్లు డిస్కౌంట్ పొందగలడు. తగిన కమీషన్ ను తగ్గించుకుని బ్యాంకులు ప్రస్తుత విలువ చెల్లిస్తారు. వాణిజ్య బ్యాంకులు, కేంద్ర బ్యాంకులతో డిస్కౌంట్ చేయబడిన బిల్లులను, తిరిగి డిస్కౌంట్ చేయబడిన బిల్లులను, తిరిగి డిస్కౌంట్ చేస్తాయి. ఈ బిల్లులు భద్రమైన మరియు హామీ గల బిల్లులు. బిల్లులు గడువు తీరినట్లయితే ఆమోదించిన పార్టీల నుంచి నగదును వసూలు చేస్తాయి.

ద్రవ్య పిలుపు:

  1. బ్యాంకులు అతి స్వల్ప కాలపరిమితి అంటే వారం రోజులకు మించని కాలానికి రుణాలను గ్రహీతలకు అందజేస్తారు.
  2. సాధారణంగా ఈక్విటీ వాటాలు, డిబెంచర్లు వంటి అనుషంగిక హామీలకు కలిగిన బ్రోకర్లు ఈ తరహా లబ్దిని పొందుతారు.
  3. ఈ సొమ్మును నిర్ణీత కాలంలో తిరిగి చెల్లిస్తారు. అందువల్ల వీటిని ద్రవ్య పిలుపులు అని అంటారు.

1) కాలపరిమిత రుణాలు: స్థిరమైన తగిన కాలానికి బ్యాంకులు రుణాలను అందించి, స్థిరమైన వడ్డీకి, వాయిదా పద్ధతులలో సొమ్మును తిరిగి చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తాయి.

2) వినియోగదారుని రుణాలు: వినియోగదారుడు వ్యక్తిగత అవసరాలకోసం వస్తు సేవలను రుణ రూపంలో బ్యాంకు నుంచి పొందే సదుపాయం.

3) ఋణాలు సృష్టించడం: బ్యాంకులు వర్తకులకు రుణాన్ని మంజూచు చేసినపుడు నగదును చెల్లించకుండా రుణగ్రహీత పేరున ఖాతాను తెరుస్తారు. రుణగ్రహీత అవసరం మేరకు నగదును చెక్కు రూపంలో ఉపసంహరించుకోవచ్చును. ఈ విధంగా డిపాజిట్ చేయకుండానే ఖాతాను బ్యాంకులు తెరవడంవల్ల రుణాలను సృష్టించడం జరుగుతుంది.

4) చెక్కుల వినియోగం పెంచడం: వాణిజ్య బ్యాంకులు కల్పించే అత్యంత ముఖ్యమైన సేవలలో వినియోగదారులకు నగదు మార్పిడికి బదులుగా చెక్కులను అందజేయడం జరుగుతుంది. దీనివల్ల చెల్లించవలసిన అప్పులకు నగదుకు బదులుగా చెక్కులను జారీ చేయడం ఎంతో సులభమైనది. ద్రవ్య మార్కెట్లో పెంపొందిన రుణ పత్రాలలో చెక్కులు ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.

5) దేశీయ, విదేశీ వర్తకాలనికి ఆర్థిక సదుపాయం: బ్యాంకులు దేశీయ మరియు విదేశీ వర్తకానికి ఆర్థిక సహాయాన్ని కల్పిస్తాయి. కొన్ని సమయాలలో బ్యాంకులు స్వల్పకాలిక రుణాల విభాగంలో వాణిజ్య పత్రాల హామీపై రుణాలను కల్పిస్తాయి. ఈ విధమైన సదుపాయం దేశీయ వర్తకానికి, విదేశీ వర్తకానికి ఎంతో దోహదం చేస్తుంది.

6) నిధుల చెల్లింపులు: వినియోగదారుల తరపున వాణిజ్య బ్యాంకులు దేశంలో ఉన్న వివిధ బ్రాండ్ నెట్వర్క్స్ ద్వారా బ్యాంకు డ్రాఫ్టులు, మెయిల్ బదిలీ, టెలిగ్రాఫిక్ బదిలీలు నామమాత్రపు చార్జీలతో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నగదు చెల్లింపుల సదుపాయాన్ని కల్పిస్తాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

ప్రశ్న 4.
భారతదేశంలో బ్యాంకులను ఎలా వర్గీకరించవచ్చును. వివరించండి.
జవాబు.
బ్యాంకుల వర్గీకరణ: భారతదేశ పరిధిలోని బ్యాంకులు అన్ని రిజర్వు బ్యాంకు ఆధీనంలో ఉండి షెడ్యూల్డ్ మరియు నాన్ షెడ్యూల్డ్ వర్గీకరించబడినవి.
TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు 2
ఎ) షెడ్యూల్డ్ బ్యాంకులు: బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1965 రెండవ షెడ్యూలలో పేర్కొనబడిన బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులు అనబడతాయి. ఈ షెడ్యూలు ప్రకారం షెడ్యూల్ బ్యాంకు అంటే:

  1. చెల్లించబడిన మూలధనం మరియు రిజర్వు 35,00,000 తక్కువ కాకుండా.
  2. బ్యాంకు లావాదేవీలను డిపాజిట్ దారుల ఆసక్తికి విరుద్ధంగా వ్యవహరించనట్లు రిజర్వు బ్యాంకును సంతృప్తిపరచాలి. షెడ్యూల్ బ్యాంకులను తిరిగి షెడ్యూల్డ్ సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, స్థానిక ప్రాంతీయ బ్యాంకులుగా వర్గీకరిస్తారు.

1) షెడ్యూల్డ్ సహకార బ్యాంకులు: ఏ సహకార బ్యాంకులైతే ఆర్.బి.ఐ. రెండవ షెడ్యూల్డ్ లోని నియమ నిబంధనలు పాటిస్తాయో, వాటిని షెడ్యూల్డ్ సహకార బ్యాంకులు అంటారు. ఇవి అర్బన్ సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు కావచ్చు.

  • అర్బన్ సహకార బ్యాంకులు: పట్టణ ప్రాంతాలో లేదా సెమి – పట్టణ ప్రాంతాలలో నెలకొల్పబడిన ప్రాథమిక సహకార బ్యాంకులనే అర్బన్ సహకార బ్యాంకులు అంటారు.
  • రాష్ట్ర సహకార బ్యాంకులు: ఈ బ్యాంకులు రాష్ట్రాలతో నిర్వహించే యాజమాన్యాన్ని కలిగి ఉంటాయి.

2) వాణిజ్య బ్యాంకులు: బ్యాంకులు ప్రధానంగా డిపాజిట్లను సేకరించి రుణాలను అందించే విధులను కలిగి ఉంటాయి. ఈ బ్యాంకుల ప్రధాన లక్ష్యం లాభాల గరిష్ఠీకరణతో పాటు వాటాదారుల విలువను పెంపొందించడం ఈ వాణిజ్య బ్యాంకులను భారతీయ బ్యాంకులు, విదేశీ బ్యాంకులుగా వర్గీకరించవచ్చు.
i) భారతీయ బ్యాంకులు: భారతదేశంలో స్థాపించిన కంపెనీల చట్టం, ప్రకారం రిజిష్టర్ చేసిన బ్యాంకులను భారతీయ బ్యాంకులు అని పిలుస్తారు. భారతీయ. బ్యాంకులను తిరిగి ప్రభుత్వ బాంకు, ప్రైవేట్ రంగ బ్యాంకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుగా వర్గీకరించవచ్చు.

  • ప్రభుత్వ రంగ బ్యాంకులు (Public Sector Banks): ఏ బ్యాంకులో అయితే ప్రభుత్వం 50%కు మించిన వాటాలను కలిగి ఉంటుందో, ఆ బ్యాంకులను ప్రభుత్వ రంగ బ్యాంకు అంటారు.
  • ప్రైవేట్ రంగ బ్యాంకులు (Private Sector Banks): ప్రభుత్వం ద్వారా కాకుండా ప్రైవేట్ వాటాదారులు ఏ బ్యాంకులో అయితే అత్యధిక ఈక్విటీ వాటాలను కలిగి ఉంటారో, ఆ బ్యాంకును ప్రైవేట్ రంగ బ్యాంకు అంటారు.
  • ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో కార్యనిర్వహణ నిర్వర్తిస్తూ చిన్న, సన్నకారు రైతులకు, వ్యవసాయదారులకు, హస్తకళాకారులకు, చిన్నస్థాయి ఔత్సాహికులకు రుణ సదుపాయం కల్పిస్తాయి.

ii) విదేశీ బ్యాంకులు: విదేశంలో స్థాపించబడి, విదేశాలలో నమోదు చేయబడిన బ్యాంకులను విదేశీ బ్యాంకులు అని పిలవబడతాయి.

iii) స్థానిక ప్రాంతీయ బ్యాంకులు: వీటినే లోకల్ ఏరియా బ్యాంకులు (LABs) అని వ్యవహరిస్తారు. ఇవి చిన్న తరహా ప్రైవేట్ బ్యాంకులు. ఇది తక్కువ ఖర్చుతో కూడిన బ్యాంకు నిర్మాణంగా భావించబడుతుంది. LAB పరిమిత ఆపరేషన్లతో సమర్ధవంతమైన, పోటీతో కూడిన ఆర్థిక మధ్యవర్తిత్వ సేవలను అందిస్తుంది.

iv) షెడ్యూల్దేతర బ్యాంకులు: ‘బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1965లోని రెండవ షెడ్యూల్డ్ లేని బ్యాంకులను షెడ్యూల్దేతర బ్యాంకులు అనబడతాయి. అంటే, షెడ్యూలులో పేర్కొన్న షరతులను వర్తింపజేయనట్లయి ఉంటాయి. ఈ బ్యాంకులు సాధారణ బ్యాంకింగ్ అవసరాల కోసం రిజర్వు బ్యాంకు నుంచి నగదును పొందలేవు. కాలానుగుణంగా రిజర్వు బ్యాంకుకు దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి క్లియరింగ్ హౌజ్ సభ్యత్వం పొందవు.

ప్రశ్న 5.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ లక్షణాలను వివరించండి.
జవాబు.
ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడాన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటారు. దీనినే “ఆన్లైన్ బ్యాంకింగ్” లేదా “అంతర్జాల బ్యాంకింగ్” అని పిలుస్తారు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ లక్షణాలు:

  1. వివిధ దేశాలలో విస్తరించి ఉన్న వినియోగదారులను చేరడానికి వీలుగా సంప్రదాయమైన భౌగోళిక అడ్డంకులను ఇంటర్నెట్ బ్యాంకింగ్ తొలగిస్తుంది.
  2. బ్యాంకు కార్యకలాపాలతో సంబంధమున్న సంప్రదాయక నష్ట భయాలను తొలగిస్తుంది.
  3. ఇది వినియోగదారునికి విద్యుత్ బిల్లులు, బీమా ప్రీమియం, మొదలైన వాటి చెల్లింపులు ఈ- చెల్లింపు పథకం ద్వారా చేయడానికి వీలు కల్పిస్తుంది.
  4. రైల్వే టికెట్లను కూడా ‘ఈ- రైల్’ ద్వారా పొందవచ్చు.
  5. అంతర్జాల బ్యాంకింగ్ సహాయంతో, ప్రత్యక్ష పన్నులను ‘ఆన్-లైన్’ పద్ధతిలో చెల్లింప చేయవచ్చు.
  6. బ్యాంకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునీకరించాలి.
  7. ఇది ఒక సమర్ధవంతమైన, పటిష్ఠమైన వ్యయ నియంత్రణకు అనుకూల పద్దతిని ఏర్పాటు చేయడానికి దారి తీస్తుంది.
  8. అంతర్జాలం అనేది ఒక సార్వజనీన (ప్రజల) ఆస్తి కావడం చేత, దానిపై ఏకైక అధికారికి లేదా వర్గానికి నియంత్రణ చేసే వీలుండదు.
  9. ఇది వాస్తవ కాల స్థూల పరిష్కారానికి RTGS దోహదపడుతుంది. అంటే, అంతరబ్యాంకు నిధుల బదిలీకి అవకాశం కల్పించడం. ఇది ఒక వ్యవహారాన్ని పూర్తి చేయడానికి, కేవలం రెండు గంటల సమయం మాత్రమే తీసుకుంటుంది.
  10. ఇది ఈ-బ్యాంకింగ్ చేయడానికి తోడ్పడుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

ప్రశ్న 6.
బ్యాంకుల ప్రాథమిక విధులను వివరించండి.
జవాబు.
బ్యాంకుల ప్రాథమిక విధులు రెండు రకాలు:
అవి:
ఎ) డిపాజిట్లు ఆమోదం (స్వీకరించడం)
బి) రుణాలు అందించడం (మంజూరు చేయడం).
A) డిపాజిట్లు స్వీకరించడం: సాధారణంగా బ్యాంకులు నాలుగు రకాల డిపాజిట్లను స్వీకరిస్తాయి. అవి కరెంట్ డిపాజిట్లు, పొదుపు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు రికరింగ్ డిపాజిట్లు అని ఉంటాయి.
i) కరెంటు డిపాజిట్లు:

  1. ఈ డిపాజిట్లను డిమాండు డిపాజిట్లు అని కూడా పిలుస్తారు. ఈ డిపాజిట్లలోని సొమ్మును ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చును.
  2. బ్యాంకులలో భారీ డిపాజిట్లు, ఉపసంహరణలు చేసే పెద్ద వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు కరెంట్ డిపాజిట్లను నిదిర్వహిస్తారు.
  3. ఖాతాదారుడు బ్యాంకు సూచనల మేరకు కనీస నిల్వను ఉంచినప్పటికి ఎటువంటి వడ్డీని చెలించరు.

ii) పొదుపు డిపాజిట్లు:

  1. చిన్న మొత్తాలలో పొదుపు చేసుకునే మధ్యతరగతి ప్రజలు, వృత్తిదారులు పొదుపును నిర్వహించడానికి సులువైన మార్గం పొదుపు డిపాజిట్లు.
  2. కొంత కాలానికి పరిమితితో కూడిన నగదు ఉపసంహరణ వంటి నిబంధన ఖాతాదారునికి వర్తిస్తుంది.
  3. ఈ డిపాజిట్లలో నగదు నిల్వపై వడ్డీ లెక్కించి, చెల్లించబడుతుంది. వీటిలో వడ్డీ చెల్లింపు ఫిక్స్డ్ డిపాజిట్లలో వాటి కంటే తక్కువగా చెల్లిస్తారు. ప్రస్తుతం ఎస్బిఐ చెల్లించే పొదుపు డిపాజిట్లపై వడ్డీ సంవత్సరానికి 2.75% ఉంది.

iii) ఫిక్స్డ్ డిపాజిట్లు:

  1. ఫిక్స్డ్ డిపాజిట్లను టైమ్ డిపాజిట్లని కూడా పిలుస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఖాతాదారులు జమచేసిన కాలం ముగిసేంత వరకు ముందస్తు సూచన చేయకుండా నగదును ఉపసంహరించుకోలేం.
  2. ఫిక్స్డ్ డిపాజిట్లను ఖాతాదారులు భద్రతపరంగాను మరియు వడ్డీ రేటు పట్ల ఇష్టపడతారు.
  3. భారతదేశంలో ఫిక్స్డ్ డిపాజిట్లను ఏడు రోజులు మొదలుకుని అయిదు సంవత్సరాల వరకు ఆమోదిస్తారు. ప్రస్తుత ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు సాలుకు 4.5% నుంచి 6.10% వరకు చెల్లిస్తారు.

డి) రికరింగ్ డిపాజిట్లు:

  1. రికరింగ్ డిపాజిట్లలో ఖాతాదారుడు ప్రతీ నెల నిర్ణీత సొమ్మును స్థిరంగా డిపాజిట్ చేయడానికి సౌకర్యం కల్పిస్తుంది.
  2. గడువు తీరిన కాలానికి మొత్తం డిపాజిట్ తోపాటు వడ్డీని కూడా చెల్లిస్తారు.
  3. ప్రస్తుతం ఎఐ చెల్లిస్తున్న వడ్డీరేటు సాలుకు 5.8% నుంచి 6.25% ఉన్నది.

B) రుణాలు అందించడం:
1) నగదు క్రెడిట్: ఒక బ్యాంకు తన ఖాతాదారుకు ఒక నిర్దిష్టమైన పరిమితి మేరకు సొమ్మును రుణంగా పొందడానికి వారి మధ్య కుదుర్చుకొన్న ఒక ఒప్పందాన్ని ‘నగదు క్రెడిట్’గా చెప్పవచ్చు. ఒప్పుకున్న నిర్ణీత మొత్తాన్ని రుణగ్రహీత ఖాతాకు క్రెడిట్ చేస్తారు. రుణగ్రహీత తనకు అవసరమున్నప్పుడు సొమ్మును బ్యాంకు నుంచి తీసుకుంటాడు. అతను వాస్తవంగా తీసుకున్న సొమ్ముపై మాత్రమే వడ్డీ విధిస్తారు. కాని రుణగ్రహీత ఖాతాను క్రెడిట్ చేసిన మొత్తంపై కాదు. భారతదేశంలో ఇదొక ఆచరణ పొందిన రుణ పద్ధతిగా ఉన్నది.

2) రుణాలు’: ఒక బ్యాంకు తన ఖాతాదారుకు ఒక నిర్ణీత మొత్తాన్ని మంజూరు చేయడాన్ని రుణంగా చెప్పవచ్చు. దీన్ని ఒక నిర్ణీత కాలానికి మంజూరు చేస్తారు. అంటే, 6 మాసాలు లేదా ఒక సంవత్సర కాలం మంజూరు చేసిన నిర్దిష్ట మొత్తాన్ని రుణగ్రహీత ఖాతాకు క్రెడిట్ చేస్తారు. అతను ఆ సొమ్మును ఒకే మొత్తంగా లేదా వాయిదాలలో తీసుకుంటాడు. ఈ రుణాలను రెండు రకాలుగా చెప్పవచ్చు.
ఎ) అడిగినప్పుడు చెల్లించవలసిన రుణం: కోరినప్పుడు తిరిగి చెల్లించవలసిన రుణాన్ని డిమాండ్ రుణం లేదా అడిగినప్పుడు చెల్లించవలసిన రుణంగా చెప్పవచ్చు. ఈ రుణాలను తక్కువ కాల వ్యవధిలో తిరిగి చెల్లించాలి. ఈ రకపు రుణ పద్ధతిలో పూర్తి మొత్తాన్ని ఒక పర్యాయం ఇస్తారు. దానిపై రుణ గ్రహీత వడ్డీని చెల్లించాలి. రుణ గ్రహీత రుణాన్ని ఒకే మొత్తంలో చెల్లించవచ్చు లేదా బ్యాంకులో ఒప్పుకున్న ప్రకారం చెల్లించవచ్చు.

బి) కాలపరిమితి గల రుణం: మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను కాలపరిమితి గల రుణాలంటారు. ఈ కాల పరిమితి గల రుణాలను ఒక సంవత్సరంకంటే మించిన కాలానికి మంజూరు చేస్తారు. సాధారణంగా అలాంటి రుణాలు తిరిగి చెల్లింపు దీర్ఘకాలంపాటు విస్తరిస్తారు.

3. హుండీల కొనుగోలు, డిస్కౌంట్ చేయటం: హుండీని పొంది ఉన్న వ్యక్తికి, హుండీ గడువుకు ముందే అత్యవసరంగా సొమ్ము ఆవశ్యకత ఉండవచ్చు. అలాంటి సందర్భాలలో అతడు ఆ హుండీని తన బ్యాంకరుకు వాస్తవమొత్తం కంటే తక్కువ మొత్తానికి విక్రయించవచ్చు. దీన్నే బిల్లు డిస్కౌంటు చేసుకోవడం అంటారు.

4. ఓవర్ డ్రాఫ్టు: వర్తమాన ఖాతాలను పొంది ఉన్న వ్యక్తులకు వాణిజ్య బ్యాంకులు ఓవర్ డ్రాఫ్టు సదుపాయాన్ని కల్పిస్తాయి. ఈ పద్ధతిలో ఖాతాదారుడు తన ఖాతాలో ఉన్న సొమ్ము నిల్వ కంటే మించిన మొత్తాన్ని తీసుకోవడానికి అనుమతిస్తారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

ప్రశ్న 7.
బ్యాంకుల ద్వితీయ శ్రేణి విధులు ఏమిటో తెలియజేయండి.
జవాబు.
ద్వితీయ విధులు: బ్యాంకు నిర్వహించే ద్వితీయ విధులను ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
ఎ) ఏజెన్సీ సేవలు: బ్యాంకులు తమ వినియోగదారుల కోసం, వారి తరపున ఏజెన్సీ సేవలనందిస్తాయి. ప్రజలందరికీ ఏజెన్సీ సేవలు ఎంతో ప్రాధాన్యమైనవి. బ్యాంకు అందించే వివిధ, ఏజెన్సీ సేవలు క్రింద పేర్కొనబడ్డాయి.

  1. రుణపత్రాల సేకరణ మరియు చెల్లింపులు: బ్యాంకులు వినియోగదారుల తరపున వివిధ రుణపత్రాలైన చెక్కులు, ప్రామిసరీ నోట్లు సేకరించి, చెల్లింపులను కూడా చేస్తాయి.
  2. సాధనాల క్రయవిక్రయాలు: బ్యాంకులు వినియోగదారుల తరపున వాటాలు, స్టాక్ లు, బాండ్లు, డిబెంచర్ల వంటి సెక్యూరిటీలు క్రయవిక్రయాలను కొనసాగిస్తాయి.
  3. వాటాలపై డివిడెండ్ల సేకరణ: బ్యాంకు ఖాతాదారుల సొంత వాటాలపై డివిడెండు, డిబెంచర్లపై వడ్డీని సేకరించి ఖాతాలకు జమ చేసే సౌకర్యాన్ని బ్యాంకులు కల్పిస్తాయి.
  4. కరెస్పాండెంట్గా వ్యవహరించడం కొన్ని సందర్భాలలో బ్యాంకులు వినియోగదారుల ప్రతినిధులుగా, కరస్పాండెంటుగా వ్యవహరిస్తారు. ఈ రకమైన చర్యల ద్వారా పాస్పోర్ట్, ప్రయాణీకుల టికెట్లు మరియు జల, వాయు రవాణా ప్రయాణీకులకు వివిధ సౌకర్యాలను కల్పిస్తాయి.
  5. ఆదాయపు పన్ను కన్సల్టెన్సీ: వినియోగదారుల ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు కోసం బ్యాంకులు నిష్ణాతులను నియమించి, పన్ను రిటర్నులు దాఖలు చేయడంతో పాటు రిఫండ్ పొందేందుకు సహాయం చేస్తాయి.
  6. స్థిత ఆజ్ఞల అమలు: బ్యాంకులు వినియోగదారుల ఆజ్ఞానుసారం కాలానుగుణంగా వివిధ చెల్లింపులు చేస్తాయి. దీని పరంగా వినియోగదారుల తరపున చందా చెల్లింపు, అద్దె చెల్లింపు, బీమా ప్రీమియం చెల్లింపులు చేస్తాయి.
  7. ధర్మకర్త మరియు కార్యనిర్వాహకులుగా వ్యవహరించడం: బ్యాంకులు వాటి వినియోగదారులు వీలునామాలను సంరక్షించి వారి మరణానంతరము అమలు పరుస్తాయి.

బి) సాధారణ ప్రయోజన సేవలు: ఆధునిక బ్యాంకులు ఏజెన్సీ సేవలకు అదనంగా సాధారణ ప్రయోజన సేవలను కూడా అందిస్తాయి. ఆ సేవలను క్రింద పేర్కొనబడ్డాయి.
1) లాకర్ సదుపాయం: బ్యాంకులు వాటి వినియోగదారులకు లాకర్ సదుపాయాన్ని కల్పిస్తాయి. వినియోగదారులు విలువైన బంగారు మరియు వెండి ఆభరణాలు ముఖ్యమైన దస్తావేజులు, వాటాలు, డిబెంచర్లు వంటివి భద్రపరచడానికి లాకరు ఉపయోగపడుతుంది.

2) ట్రావెలర్స్ చెక్కులు మరియు క్రెడిట్ కార్డులు: బ్యాంకులు వినియోగదారులు ప్రయాణించే సందర్భంలో నగదు దొంగల బారిన పడకుండా, పోగొట్టుకోకుండా ట్రావెలర్స్ చెక్కులు జారీ చేస్తాయి.

3) పరపతి పత్రం: వినియోగదారుల పరపతి విలువను ధృవీకరిస్తూ బ్యాంకులు పరపతి పత్రాన్ని జారీ చేస్తాయి. విదేశీ వర్తకానికి పరపతి పత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

4) గణాంక సేకరణ: బ్యాంకులు విలువైన మరియు ముఖ్యమైన సమాచారమైన వర్తక, వాణిజ్య, పారిశ్రామిక, ద్రవ్య మరియు బ్యాంకింగ్ సంబంధిత గణాంకాలను సేకరిస్తాయి.

5) రిఫరీగా వ్యవహరించడం: వినియోగదారుల గౌరవం, వ్యాపార ప్రతిష్ట, ఆర్థిక స్థాయిలకు సంబంధించిన వ్యవహారాలకు రిఫరీగా బ్యాంకులు వ్యవహరిస్తాయి.

6) సాధనాల పూచీ: పబ్లిక్ మరియు ప్రైవేట్ కంపెనీలు జారీ చేసే వాటాలకు, డిబెంచర్లకు బ్యాంకులు పూచీ ఇస్తాయి..

7) బహుమాన చెక్కులు: కొన్ని బ్యాంకులు వివిధ శుభ కార్యాలకు సంబంధించి వివిధ మొత్తాలతో కూడిన చెక్కులను జారీ చేస్తాయి.

8) వినియోగదారుల తరపున బిల్లులను ఆమోదించడం: కొన్ని సందర్భాలలో బ్యాంకులు బిల్లులను, దేశీయ మరియు విదేశీయ బిల్లులను ఆమోదిస్తాయి. దీని ప్రయోజనంతో ఎగుమతులు, దిగుమతులు సులభమవుతాయి.

ప్రశ్న 8.
వివిధ రకాల బ్యాంకుల చెల్లింపులను వివరించండి.
జవాబు.
చెల్లింపుల రకాలు: భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకుంటోంది. డిజిటల్ చెల్లింపుల యొక్క పద్ధతులు వివిధ రకాలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని డెబిట్/క్రెడిట్ కార్డులు అంతర్జాల బాంకింగ్, మొబైల్ వాలెట్లు, డిజిటల్ చెల్లింపు అనువర్తనాలు, ఏకీకృత చెల్లింపుల వంటి సేవలు ఉన్నాయి.

ముఖ్యమైన చెల్లింపుల రకాలు క్రింద సూచించబడ్డాయి:
TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు 3
1) చెక్కు: ఒక వ్యక్తి యొక్క ఖాతా నుంచి ఒక నిర్దిష్ట మొత్తాన్ని మరొక వ్యక్తికి లేదా కంపెనీ ఖాతాకు చెల్లించమని బ్యాంకును ఆదేశించే పత్రం చెక్కు భద్రతగల, సురక్షితమైన మరియు అనుకూలమైన చెల్లింపులు కొనసాగించడానికి చెక్కు ఉపయోగపడుతుంది. బదిలీ ప్రక్రియలో నగదు ప్రమేయం లేనందువల్ల సురక్షితమైనదిగా చెప్పబడుతున్నది. అందువల్ల దొంగతనం, నష్టభయం వంటివి తగ్గించబడతాయి.

2) నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (NEFT):
1) నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఒక బాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకు ఖాతాలోనికి దేశవ్యాప్తంగా డబ్బు పంపించడానికి గల భద్రమైన, చింతలేని ఎలక్ట్రానిక్ వ్యవస్థ.

2) ఈ వ్యవస్థను ఉపయోగించుకుని భారతదేశంలో ఉన్న (NEFT) సంబంధిత అనుసంధానించబడిన బ్యాంకులకు వ్యక్తిగత ప్రాతిపదికన నగదు పంపవచ్చు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

3) రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS): RTGS అనే సౌకర్యం ద్వారా నగదును ఆలస్యం కాకుండా వాస్తవ కాల ప్రాతిపదికన పంపబడుతుంది. ఈ పద్ధతి ద్వారా పంపిన నగదును లబ్ధిదారునికి. వెంటనే చేరుకోవడానికి లావాదేవీలను త్వరితగతిన వీలు కల్పిస్తుంది.

ఆర్.టి.జి.ఎస్ అనేది అధిక విలువ గల లావాదేవీలకు ఉద్దేశించబడిన కనీసం 2 లక్షల నగదును బదిలీ చేసే సౌకర్యం కల్పిస్తుంది. ఆర్.టి.జి.ఎస్ లావాదేవీ కోసం చెల్లింపుదారుని ఖాతా సంఖ్య, ఖాతాదారుని పేరు, బ్యాంక్ పేరు, ఐ.ఎఫ్.ఎస్. ని కోడ్ వంటి వివరాలను సేకరించడం చాలా ముఖ్యం.

4) తక్షణ చెల్లింపు సేవ (IMPS): తక్షణ చెల్లింపు సేవ అనేది రియల్ టైమ్ ఎలక్ట్రానిక్ ఫండ్ పద్ధతి. దీని ద్వారా నగదు లబ్దిదారు ఖాతాకు వెంటనే జమ చేయబడుతుంది. IMPS నగదు బదిలీలు సంవత్సరంలో 365 రోజులు ఎప్పుడైనా వారంలో ఏ సమయమైనా కొనసాగించవచ్చు. బ్యాంకు సెలవు, ఆదివారం లాంటి మినహాయింపులు లేవు. IMPS ద్వారా మొబైల్ బ్యాంకింగ్, అంతర్జాల బాంకింగ్ SMS, ATM వంటి మాధ్యమం ద్వారా అంతర్గత బ్యాంకు బదిలీలను ప్రారంభించవచ్చు.

5) చెల్లింపు వాలెట్లు (Payment Wallets): వాలెట్ అనేది అంతర్జాల పరంగా కొనుగోలుకు సంబంధించిన చెల్లింపు కోసం ఉపయోగించే ఒక చిన్న సాఫ్ట్వేర్ ప్రోగ్రాం. ఈ వాలెట్ అనేది ఒక రకమైన ఎలక్ట్రానిక్ కార్డు. ఇది కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో జరిగే లావాదేవీల కోసం వినియోగించడం జరుగుతుంది. నగదు మాదిరి చెల్లింపులు చేయడానికి ఈ-వాలెట్ను వ్యక్తి యొక్క బ్యాంక్ ఖాతాతో అనుసంధానించబడాలి. దీనిలో వినియోగదారుడు తన సొమ్మును భవిష్యత్తులో ఏదైనా ఆన్లైన్లో లావాదేవీల కోసం నిల్వను ఉంచవచ్చు. ఈ-వాలెట్ పాస్వర్డ్లో భద్రపరచడం జరుగుతుంది. ఈ -వాలెట్ సహాయంతో కిరాణా, ఆన్లైన్ కొనుగోలు, విమాన టెకెట్ల వంటివి కొనుగోలు చేయవచ్చును.

ప్రశ్న 9.
వివిధ రకాల రిటైల్ రుణాలు ఏమిటో సవివరంగా తెలపండి.
జవాబు.
రిటైల్ రుణాలు: ఆస్తి కొనుగోలు, స్థిరాస్థి కొనుగోలు వంటి వాటికి బాంకు రిటైల్ రుణాలను అందిస్తుంది. ఇవి వ్యక్తిగత వినియోగదారులకు, రుణదాతలకు రుణాలుగా మంజూరు చేస్తారు. రిటైల్ రుణాలను బ్యాంకులు వివిధ రూపాల్లో అందిస్తున్నాయి. అవి గృహ రుణాలు, వాహన రుణాలు, విద్య రుణాలు, వ్యక్తిగత రుణాలు మరియు క్రెడిట్ కార్డులు.
రకాలు:
ఎ) గృహ రుణాలు:

  1. గృహము మానవుల ప్రాథమిక అవసరం కాబట్టి ప్రతి వ్యక్తి కుటుంబానికి గృహం అవసరమవుతుంది. గృహ రుణాలను గృహ నిర్మాణాలకు లేదా నూతన గృహ కొనుగోలుకు అందించబడుతాయి.
  2. జాతీయ గృహ బాంక్ ఆర్టిఐ సహాయ సహకారాలతో గృహ పథకాలను అందించాలనే ఉద్దేశంతో స్థాపించబడింది. ఎల్ఎస్ఐసీ, ఎస్ఐ, యుటిఐ మరియు ఇతర ఆర్థిక సంస్థలు గృహ రుణ సదుపాయం కల్పిస్తాయి.
  3. కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యలలో భాగంగా అందరికీ గృహం అందించాలనే సంకల్పంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం బలహీన, మధ్యతరగతి ప్రజలకు కూడా వర్తిస్తుంది.

బి) వాహన రుణాలు:

  1. వాహన ఋణాల సౌకర్యాన్ని బ్యాంకులు ఖాతాదారులకు అందించి వాహన విలువ మొత్తాన్ని సులభవాయిదాలలో చెల్లించే ఏర్పాట్లు చేస్తాయి.
  2. ఖాతాదారుడు తీసుకున్న రుణం మొత్తాన్ని విక్రేతకు నియంత్రిత పద్ధతిలో ప్రాసెస్ చేయబడుతుంది. వాయిదాల చెల్లింపులో వడ్డీ మొత్తాన్ని బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు నిర్ణయిస్తారు.
  3. వాహన రుణాలను నెలవారి జీతం పొందే ఉద్యోగులకు, స్వయం ఉపాధి కలిగిన వ్యక్తులకు అవసరమైన పత్రాల దాఖలు తరువాత రుణాలు మంజూరు చేయబడతాయి. వాహన రుణాన్ని పొందడానికి వ్యక్తి యొక్క కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండి ఒక సంస్థలో 72.50 లక్షల వార్షిక ఆదాయాన్ని పొంది కనీసం ఒక సంవత్సరం నిరంతర సేవ చేస్తూ ఉండాలి.

సి) విద్యా రుణం:

  1. విద్యా రుణం విద్యార్థులకు స్నేహ పూర్వకంగా రూపొందించిన రుణం. డబ్బు కొరత కారణంగా భారతదేశంలో మరియు విదేశాలలో ఉన్నత విద్యను కొనసాగించలేని విద్యార్థులకు ఈ రుణాలు ఇవ్వబడతాయి.
  2. విద్యా రుణాలను గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, వృత్తి విద్యా కోర్సులు మరియు సంబంధిత ప్రొఫెషనల్ వంటి కోర్సులు ఉన్నత విద్యగా అభ్యసించడానికి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా గల అధికారం బ్యాంకులకు ఉంటుంది.
  3. భారతదేశంలో ఉన్నత విద్య అభ్యసించడానికి 10లక్షల వరకు, విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి 7 25 లక్షల వరకు రుణంగా మంజూరు చేస్తాయి.

డి. వ్యక్తిగత రుణాలు:

  1. వ్యక్తిగత రుణం అనేది వ్యక్తిగత అవసరాలు తీర్చడానికి బ్యాంకులు మంజూరు చేసే, పూచీ లేని రుణం. వ్యక్తిగత ఋణాల కోసం నిర్దేశిత బ్యాంకులో ఖాతా ఉన్నపుడు మాత్రమే మంజూరు చేయబడుతుంది.
  2. ఇటువంటి రుణాలను అర్హత ఆధారంగా వివాహం, గృహ మరమ్మతులు, గృహ పునర్నిర్మాణాలు వంటి అవసరాల కోసం పొందవచ్చు ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లపై కనీస పత్రాలతో మంజూరు చేయవచ్చు.
  3. వ్యక్తిగత రుణాలను 1సం॥ నుంచి 3 సం॥ల కాలపరిమితితో కూడా తిరిగి చెల్లించే సౌకర్యం కల్పిస్తారు.

ఇ) క్రెడిట్ కార్డు

  1. క్రెడిట్ కార్డు అయస్కాంత స్క్రిప్ట్ కార్డు. వినియోగదారునికి వస్తువులను కొనుగోలు చేసినపుడు చెల్లింపులు నిర్ణీత కాలానికి చెల్లింపు జరిగేట్లు సౌకర్యం కల్పించే కార్డు.
  2. క్రెడిట్ కార్డులు దేశీయ, విదేశీ కార్డులుగా ఉంటాయి. బ్యాంకులోని ఖాతాదారులకు వ్యక్తిగత, వ్యాపార సంస్థల కోసం కార్డులను జారీ చేస్తాయి.
  3. క్రెడిట్ కార్డులను వ్యక్తిగత పరపతి స్థాయిని బట్టి జారీ చేస్తారు.

ప్రశ్న 10.
ఈ – బ్యాంకింగ్ లాభ నష్టాలను గురించి చర్చించండి.
జవాబు.
ఈ- బ్యాంకింగ్ ప్రయోజనాలు:

  1. వినియోగదారునికి వారానికి 7 రోజుల చొప్పున, రోజుకు 24 గంటల చొప్పున నిరంతరం సేవలు అందించడం (అంటే, 24 × 7).
  2. వ్యవహారాలలో వేగం, మార్పులు చేసే అవకాశం కల్పించడం.
  3. బ్యాంకులకు తక్కువ నిర్వహణ ఖర్చులు.
  4. సమాచార మారకంలో వేగాన్ని, ఖచ్చితత్వాన్ని పెంచడం.
  5. బ్యాంకు ఖాతాను ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా సులభంగా పరిశీలించగలగడం.
  6. వినియోగదారుని సంతృప్తి అధికం కావడానికి దోహదపడటం.
  7. ఒక ఉన్నతస్థాయి గల వ్యక్తిగత హోదా.
  8. ఎన్.ఆర్.ఐ.లు ఎక్కడ స్థిరపడినా, వారు భారతదేశంలోని బ్యాంకులలో తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించగలగడం, వారు తమ ఖాతాలను ప్రపంచంలో ఎక్కడి నుంచయినా నిర్వహించుకోవచ్చు.
  9. బ్యాంకులకు తమ బ్రాంచీల పని భారాన్ని తగ్గించుకోవడానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సహాయపడుతుంది.
    ఉదా: నివేదికలను తయారు చేయడం, సొమ్ము నిల్వను తెలుసుకోవడం మొదలయినవి.

ఈ – బ్యాంకింగ్ పరిమితులు:

  1. రక్షణకు, విశ్వసనీయతకు సంబంధించిన సమస్యలు ఎదురుకావచ్చు.
  2. బ్యాంకింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం అనేది ఒక పెద్ద సవాలుగా ఉంటుంది.
  3. గ్రామీణ ప్రాంతాలలో, అధికవేగం గల బ్యాండు వైశాల్యంతో కూడుకున్న ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేకపోవడం.
  4. పేపరు ఉపయోగం లేని వ్యవహారాల పట్ల వినియోగదారుల విముఖత, ఎందుకంటే వారు తమ వ్యవహారాలకు పేపరు సహాయంతో సాక్ష్యాన్ని కోరవచ్చు..
  5. భారతదేశంలో అధిక నిరక్షరాస్యత, ఈ బ్యాంకింగ్ విధానానికి ఒక పెద్ద అవరోధంగా ఉంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నగదు క్రెడిట్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఒక ఖాతాదారుడు నిర్దిష్ట పరిమితి మేరకు రుణం పొందడానికి బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని “నగదు క్రెడిట్” అంటారు.
  2. ఒప్పుకున్న నిర్ణీత మొత్తాన్ని రుణగ్రహీత ఖాతాకు క్రెడిట్ చేస్తారు.
  3. రుణ గ్రహీత తనకు అవసరమున్నప్పుడు సొమ్మును బ్యాంకు నుంచి తీసుకుంటాడు.
  4. ఖాతాదారుడు తన ఖాతాలో నుంచి ఉపసంహరించిన నగదుపై మాత్రమే వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

ప్రశ్న 2.
ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఫిక్స్డ్ డిపాజిట్లను టైమ్ డిపాజిట్లని కూడా పిలుస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఖాతాదారులు జమచేసిన కాలం ముగిసేంత వరకు ముందస్తు సూచన చేయకుండా నగదును ఉపసంహరించుకోలేం.
  2. ఫిక్స్డ్ డిపాజిట్లను ఖాతాదారులు భద్రతపరంగాను మరియు వడ్డీ రేటు పట్ల ఇష్టపడతారు.
  3. భారతదేశంలో ఫిక్స్డ్ డిపాజిట్లను ఏడు రోజులు మొదలుకుని అయిదు సంవత్సరాల వరకు ఆమోదిస్తారు.  ప్రస్తుత ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు సాలుకు 4.5% నుంచి 6.10% వరకు చెల్లిస్తారు.

ప్రశ్న 3.
క్రెడిట్ కార్డు అంటే ఏమిటి ?
జవాబు.

  1. క్రెడిట్ కార్డు అయస్కాంత స్క్రిప్ట్ కార్డు. వినియోగదారునికి వస్తువులను కొనుగోలు చేసినపుడు చెల్లింపులు నిర్ణీత కాలానికి చెల్లింపు జరిగేట్లు సౌకర్యం కల్పించే కార్డు.
  2. క్రెడిట్ కార్డులు దేశీయ, విదేశీ కార్డులుగా ఉంటాయి. బ్యాంకులోని ఖాతాదారులకు వ్యక్తిగత, వ్యాపార సంస్థల కోసం కార్డులను జారీ చేస్తాయి.
  3. క్రెడిట్ కార్డులను వ్యక్తిగత పరపతి స్థాయిని బట్టి జారీ చేస్తారు.

ప్రశ్న 4.
ఎచ్చటి నుంచి అయినా బ్యాంకింగ్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఒక బ్యాంకు వినియోగదారునికి అందచేసే బ్యాంకింగ్ సేవల అదనపు సాంకేతిక పురోగతిలో గొప్ప మార్పు చెందింది. భారతదేశంలో నెలకొల్పబడిన బ్యాంకు, ఏ బ్రాంచి నుంచి అయిన వినియోగదారుడు తన ఖాతాను నిర్వహించుకోవచ్చు. దీనినే “ప్రధాన బ్యాంకింగ్” (కోర్ బ్యాంకింగ్) అంటారు.
  2. ఎక్కడి నుంచైనా బ్యాంకింగ్ అనగా భారతదేశంలో వినియోగదారుడు ఎక్కడినుంచైనా తన ఖాతాను నిర్వహించుకోవచ్చు.
  3. ఎక్కడి నుంచైనా బ్యాంకింగ్ విధానంలో అందించే వివిధ సేవలు కింది విధంగా ఉన్నాయి.
    ఎ) టెలి బ్యాంకింగ్, బి) ఇంటర్నెట్ బ్యాంకింగ్ (ఈ-బ్యాంకింగ్).

ప్రశ్న 5.
బ్యాంకులలో ఎ.టి.ఎం. సేవ గురించి నీకేమి తెలుసు రాయండి.
జవాబు.

  1. ఎ.టి.యం. అనగా ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్
  2. ఎ.టి.యం. వినియోగదారుల సేవలలో కాల సంబంధిత పరిమితులను తొలగించింది.
  3. బ్యాంకు ఆవరణలో లేదా దగ్గరలో సాధారణంగా దీన్ని వ్యక్తుల సహాయం లేకుండా ఏర్పాటు చేస్తారు.
  4. ఎ.టి.యం.లో కార్డును ప్రవేశపెట్టగానే, నిర్వహణ ప్రక్రియ ప్రారంభమై, చివరలో ఉన్న సాధనం అధ్యయనం చేసి, నమోదు చేసిన సమాచారాన్ని ప్రాసెసర్కు పంపుతుంది. అది ఖాతాను క్రియాశీలకం చేస్తుంది.
  5. ఇది రోజుకు 24 గంటల చొప్పున, వారంలో 7 రోజులపాటు పనిచేస్తుంది.
  6. బ్యాంకుతో కార్యకలాపాలు చేయదలచుకున్న వ్యక్తులు, బ్యాంకుకు నిర్ణీత వేళలతో సంబంధం లేకుండా వారు ఎ.టి.యం. సహాయంతో నగదును తిరిగిపొందడం, విజ్ఞప్తులు, సూచనలు, నగదు బదిలీ చేయగలరు.
  7. భద్రతకు సంబంధించి వినియోగదారునికి పూర్తి హామీ ఉంటుంది. ఎందుకంటే, ఎ.టి.యం. సేవలను, ప్రత్యేక వ్యక్తిగత గుర్తింపు నంబరు (PIN)తో కూడుకున్న ఎ.టి.యం. కార్డు ద్వారానే పొందగలం. అంతేకాకుండా, ప్రతీ ఎ.టి.యం. వద్ద ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు.
  8. ఇప్పుడు ఎ.టి.యం.ను సెల్ఫోను రీ-చార్జ్ చేయడానికి, బిల్లు చెల్లింపుకు, మొదలై సేవల కోసం కూడా ఉపయోగిస్తున్నారు.

ప్రశ్న 6.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకులు ఎలాంటి సేవలను అందిస్తాయి.
జవాబు.
ఇంటర్ నెట్ ద్వారా బ్యాంకింగ్ వ్యవహారాలు చేయడాన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటారు. దీనినే అంతర్జాల బ్యాంకింగ్ అని కూడా పిలుస్తారు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకులు అందించే సేవలు:

  1. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారుడు బ్యాంకు వెబ్సైట్ల ద్వారా సాధారణ ఉద్దేశ సమాచారాన్ని పాస్వర్డ్ ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిధుల బదిలీని జరపవచ్చు.
  2. RTGS ద్వారా వినియోగదారులు సూచనలు ఇచ్చిన వెంటనే నిధుల బదిలీ, చెల్లింపులను చేయవచ్చు.
  3. కాలానుగుణంగా భారీ చెల్లింపుల వ్యవహారాలను నిర్వహించడానికి ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సేవ (ECS)ను అందిస్తుంది.
  4. వ్యక్తులకు, సంస్థలకు తమ నిధులు ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు గరిష్ఠ పరిమితి లేకుండా బదిలీ చేయడానికి జాతీయ ఎలక్ట్రానిక్ నిధుల బదిలీ (NEFT)ను అందుబాటులోకి తెచ్చింది.
  5. ఖాతాదారుడు మొబైల్ బ్యాంకింగ్ సహాయంతో తన ఖాతా డెబిట్ క్రెడిట్ వ్యవహారాలు తెలుసుకోవచ్చు.
  6. ఈ చెక్కు ద్వారా వినియోగదారుడు వివిధ రకాల చెల్లింపులను చెయ్యవచ్చు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పిలుపు ద్రవ్యం.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
జవాబు.

  1. బ్యాంకులు అతి స్వల్ప కాలపరిమితి అంటే వారం రోజులకు మించని కాలానికి రుణాలను గ్రహీతలకు అందజేస్తాయి.
  2. సాధారణంగా ఈక్విటీ వాటాలు, డిబెంచర్ల వంటి అనుషంగిక హామీలకు కలిగిన బ్రోకర్లు ఈ తరహా లబ్దిని పొందుతారు.
  3. ఈ సొమ్మును నిర్ణీత కాలంలో తిరిగి చెల్లిస్తారు. అందువల్ల వీటిని ద్రవ్య పిలుపులు అని అంటారు.

ప్రశ్న 2.
రికరింగ్ డిపాజిట్.
జవాబు.

  1. రికరింగ్ డిపాజిట్లలో ఖాతాదారుడు ప్రతీ నెల నిర్ణీత సొమ్మును స్థిరంగా డిపాజిట్ చేయడానికి సౌకర్యం కల్పిస్తుంది.
  2. గడువు తీరిన కాలానికి మొత్తం డిపాజిట్ తోపాటు వడ్డీని కూడా చెల్లిస్తారు.
  3. ప్రస్తుతం ఎస్ఐ చెల్లిస్తున్న వడ్డీరేటు సాలుకు 5.8% నుంచి 6.25% ఉన్నది.

ప్రశ్న 3.
క్యాష్ క్రెడిట్.
జవాబు.

  1. ఒక ఖాతాదారుడు నిర్దిష్ట పరిమితి మేరకు రుణం పొందడానికి బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని “నగదు క్రెడిట్” అంటారు.
  2. ఒప్పుకున్న నిర్ణీత మొత్తాన్ని రుణగ్రహీత ఖాతాకు క్రెడిట్ చేస్తారు.
  3. ఖాతాదారుడు తన ఖాతాలో నుంచి ఉపసంహరించిన నగదుపై మాత్రమే వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

ప్రశ్న 4.
కారు రుణం.
జవాబు.

  1. కారు ఋణాల సౌకర్యాన్ని బ్యాంకులు ఖాతాదారులకు అందించి కారు విలువ మొత్తాన్ని సులభవాయిదాలలో చెల్లించే ఏర్పాట్లు చేస్తాయి.
  2. వాయిదాల చెల్లింపులో వడ్డీమొత్తాన్ని బ్యాంకు అధికారులు నిర్ణయిస్తారు. ఈ వాహన రుణాలను నెలవారి జీతం పొందే ఉద్యోగులకు, స్వయం ఉపాధి కలిగిన వ్యక్తులకు అవసరమైన పత్రాల దాఖలు తర్వాత రుణాలు మంజూరు చేయబడతాయి
  3. కారు రుణం తీసుకునే వ్యక్తికి 21 సం॥రాలు నిండి ఉండాలి మరియు వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు ఉండాలి.

ప్రశ్న 5.
క్రెడిట్ కార్డు.
జవాబు.

  1. క్రెడిట్ కార్డు అయస్కాంత స్క్రిప్ట్ కార్డు. వినియోగదారునికి వస్తువులను కొనుగోలు చేసినపుడు చెల్లింపులు నిర్ణీత కాలానికి చెల్లింపు జరిగేట్లు సౌకర్యం కల్పించే కార్డు.
  2. క్రెడిట్ కార్డులు దేశీయ, విదేశీ కార్డులుగా ఉంటాయి. బ్యాంకులోని ఖాతాదారులకు వ్యక్తిగత, వ్యాపార సంస్థల కోసం కార్డులను జారీ చేస్తాయి.
  3. క్రెడిట్ కార్డులను వ్యక్తిగత పరపతి స్థాయిని బట్టి జారీ చేస్తారు.

ప్రశ్న 6.
పొదుపు ఖాతా.
జవాబు.
పొదుపు డిపాజిట్లు:

  1. చిన్న మొత్తాలలో పొదుపు చేసుకునే మధ్యతరగతి ప్రజలు, వృత్తిదారులు పొదుపును నిర్వహించడానికి సులువైన మార్గం పొదుపు డిపాజిట్లు.
  2. కొంత కాలానికి పరిమితితో కూడిన నగదు ఉపసంహరణ వంటి నిబంధన ఖాతాదారునికి వర్తిస్తుంది.
  3. ఈ డిపాజిట్లలో నగదు నిల్వపై వడ్డీ లెక్కించి, చెల్లించబడుతుంది. వీటిలో వడ్డీ చెల్లింపు ఫిక్స్డ్ డిపాజిట్లలో వాటి కంటే తక్కువగా చెల్లిస్తారు. ప్రస్తుతం ఎస్బిఐ చెల్లించే పొదుపు డిపాజిట్లపై వడ్డీ సంవత్సరానికి 2.75% ఉంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

ప్రశ్న 7.
ఫిక్స్డ్ డిపాజిట్.
జవాబు.

  1. ఫిక్స్డ్ డిపాజిట్లను టైమ్ డిపాజిట్లని కూడా పిలుస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఖాతాదారులు జమచేసిన కాలం ముగిసేంత వరకు ముందస్తు సూచన చేయకుండా నగదును ఉపసంహరించుకోలేం.
  2. ఫిక్స్డ్ డిపాజిట్లను ఖాతాదారులు భద్రతపరంగాను మరియు వడ్డీ రేటు పట్ల ఇష్టపడతారు.
  3. భారతదేశంలో ఫిక్స్డ్ డిపాజిట్లను ఏడు రోజులు మొదలుకుని అయిదు సంవత్సరాల వరకు ఆమోదిస్తారు. ప్రస్తుత ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు సాలుకు 4.5% నుంచి 6.10% వరకు చెల్లిస్తారు.

ప్రశ్న 8.
విదేశీ బ్యాంకు.
జవాబు.

  1. విదేశంలో స్థాపించబడి, విదేశాలలో నమోదు చేయబడిన బ్యాంకులను విదేశీ బ్యాంకులు అంటారు.
  2. ప్రస్తుతం మనదేశంలో 45 విదేశీ బ్యాంకులు ఉన్నాయి.

ప్రశ్న 9.
కాల వ్యవధి రుణం.
జవాబు.
మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను కాలపరిమితి గల రుణాలంటారు. ఈ కాల పరిమితి గల రుణాలను ఒక సంవత్సరం కంటే మించిన కాలానికి మంజూరు చేస్తారు. సాధారణంగా అలాంటి. రుణాలు తిరిగి చెల్లింపు దీర్ఘకాలంపాటు విస్తరిస్తారు.

ప్రశ్న 10.
డిమాండు రుణం
జవాబు.
కోరినప్పుడు తిరిగి చెల్లించవలసిన రుణాన్ని డిమాండ్ రుణం లేదా అడిగినప్పుడు చెల్లించవలసిన రుణంగా చెప్పవచ్చు. ఈ రుణాలను తక్కువ కాల వ్యవధిలో తిరిగి చెల్లించాలి. ఈ రకపు రుణ పద్ధతిలో పూర్తి మొత్తాన్ని ఒక పర్యాయం ఇస్తారు. దానిపై రుణ గ్రహీత వడ్డీని చెల్లించాలి. రుణ గ్రహీత రుణాన్ని ఒకే మొత్తంలో చెల్లించవచ్చు లేదా బ్యాంకులో ఒప్పుకున్న ప్రకారం చెల్లించవచ్చు.

ప్రశ్న 11.
ఓవర్ డ్రాఫ్టు.
జవాబు.

  1. ఖాతాదారుడు తన బ్యాంకులో గల నిల్వకంటే అధిక మొత్తంలో తీసుకొనే ఏర్పాటును ఓవర్ డ్రాఫ్ట్ అంటారు.
  2. ఈ అవకాశాన్ని కరెంటు ఖాతాదారునికి మాత్రమే కల్పించడం జరుగుతుంది.

ప్రశ్న 12.
షెడ్యూల్డ్ బ్యాంకు.
జవాబు.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1965 రెండవ షెడ్యూలులో పేర్కొనబడిన బ్యాంకులను షెడ్యూల్డు బ్యాంకులు అనబడతాయి. ఈ షెడ్యూలు ప్రకారం షెడ్యూల్ బ్యాంకు అంటే:

  1. చెల్లించబదిన మూలధనం మరియు రిజర్వు 5,00,000 తక్కువ కాకుండా.
  2. బ్యాంకు లావాదేవీలను డిపాజిట్ దారుల ఆసక్తికి విరుద్ధంగా వ్యవహరించనట్లు రిజర్వు బ్యాంకును సంతృప్తిపరచాలి.

ప్రశ్న 13.
నాన్ – షెడ్యూల్డ్ బ్యాంకు.
జవాబు.

  1. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1965లోని రెండవ షెడ్యూల్డ్ లేని బ్యాంకులను షెడ్యూల్డేతర బ్యాంకులు అనబడతాయి. అంటే, షెడ్యూలులో పేర్కొన్న షరతులను వర్తింపజేయనట్లయి ఉంటాయి.
  2. ఈ బ్యాంకులు సాధారణ బ్యాంకింగ్ అవసరాల కోసం రిజర్వు బ్యాంకు నుంచి నగదును పొందలేవు. కాలానుగుణంగా రిజర్వు బ్యాంకుకు దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి క్లియరింగ్ హౌజ్ సభ్యత్వం పొందవు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

ప్రశ్న 14.
ATM.
జవాబు.
ఎ.టి.యం (ATM) అనగా ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఎలక్ట్రానిక్ నిధి బదిలీకి ఎ.టి.యం. ఒకానొక పద్ధతిగా ఉంది. బ్యాంకు ఆవరణలో లేదా దగ్గరలో సాధారణంగా దీన్ని వ్యక్తుల సహాయం లేకుండా ఏర్పాటు చేస్తారు. ఎ.టి.యం.లో కార్డును ప్రవేశపెట్టగానే, నిర్వహణ ప్రక్రియ ప్రారంభమై చివరలో ఉన్న సాధనం అధ్యయనం చేసి, నమోదు చేసిన సమాచారాన్ని ప్రాసెసర్కు పంపుతుంది. అది ఖాతాను క్రియాశీలకం చేస్తుంది. ఇది రోజుకు 24 గంటల చొప్పున, వారంలో 7 రోజుల పాటు పనిచేస్తుంది. (24×7).

ప్రశ్న 15.
టెలి బ్యాంకింగ్.
జవాబు.
టెలీ బ్యాంకింగ్ అంటే టెలిఫోన్ ద్వారా బ్యాంకింగ్ చేయడం. వినియోగదారుడు, బ్రాంచి నిర్దిష్టమైన టెలిఫోన్ నంబరును సంప్రదిస్తే, అది కంప్యూటరుకు అనుసంధానం చేయబడి ఉంటుంది. టెలీ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారుడు తన ఖాతా నిల్వ, గతంలో జరిగిన వ్యవహారాల వివరాలు తెలుసుకోవచ్చు.

ప్రశ్న 16.
RTGS
జవాబు.

  1. RTGS అనగా రియల్టైమ్ గ్రాస్ సెటిల్మెంట్.
  2. RTGS అనే సౌకర్యం ద్వారా నగదును ఆలస్యం కాకుండా వాస్తవ కాల ప్రాతిపదికన పంపబడుతుంది. ఈ పద్ధతి ద్వారా పంపిన నగదును లబ్ధిదారునికి వెంటనే చేరుకోవడానికి లావాదేవీలను త్వరితగతిన వీలు కల్పిస్తుంది. 3) ఆర్.టి.జి.ఎస్ అనేది అధిక విలువ గల లావాదేవీలకు ఉద్దేశించబడిన కనీసం రూ. 2 లక్షల నగదును బదిలీ చేసే సౌకర్యం కల్పిస్తుంది.

ప్రశ్న 17.
ECS.
జవాబు.

  1. ECS అనగా ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సేవ.
  2. ఈ పథకం కాలానుగుణంగా జరిపే భారీ చెల్లింపుల వ్యవహారాలను నిర్వహించడానికి ఒక ప్రత్యామ్నాయ పద్ధతిగా ఉంటుంది.
  3. ఈ కార్యనిర్వహణ 15 కేంద్రాలలో ఆర్బిఐ చేత క్లియరింగ్ హౌస్ గా నిర్వహించబడుతుంది. SBI చేత 21 కేంద్రాలలోనూ మరియు PNB, ఇతర బ్యాంకుల ద్వారా 29 కేంద్రాలలో నిర్వహించబడుతుంది.

ప్రశ్న 18.
NEFT.
జవాబు.

  1. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకు ఖాతాలోనికి దేశవ్యాప్తంగా డబ్బు పంపించడానికి గల భద్రమైన, చింతలేని ఎలక్ట్రానిక్ వ్యవస్థ.
  2. ఈ వ్యవస్థను ఉపయోగించుకుని భారతదేశంలో ఉన్న (NEFT) సంబంధిత అనుసంధానించబడిన బ్యాంకులకు వ్యక్తిగత ప్రాతిపదికన నగదు పంపవచ్చు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 3 బ్యాంకింగ్ సేవలు

ప్రశ్న 19.
మొబైల్ బ్యాంకింగ్.
జవాబు.

  1. మొబైల్ సహాయంతో బ్యాంకింగ్ వ్యవహారాలు జరపడాన్ని మొబైల్ బ్యాంకింగ్ అంటారు.
  2. ఈ సేవ బ్యాంకు ఖాతాదారులందరికి ఉచితంగా లభిస్తుంది. దీనికి ఖాతాదారుని మొబైల్ నెట్వర్క్ తో సంబంధం ఉండదు.
  3. దీని సహాయంతో వినియోగదారుడు వారి ఖాతా డెబిట్, క్రెడిట్ వ్యవహారాలతో పాటు బ్యాంకు నిల్వలను పంపే హెచ్చరిక సందేశాలు ద్వారా తెలుసుకోవచ్చు.

TS Inter 1st Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

Telangana TSBIE TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ Textbook Questions and Answers.

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఆకృత తప్పులు అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఒక వ్యవహారాన్ని పూర్తిగా గానీ లేదా పాక్షికంగా గానీ పుస్తకాలలో నమోదు చేయకుండా వదిలివేయటం వల్ల జరిగే తప్పులను ఆకృత తప్పులు అంటారు.
  2. వ్యవహారములను సహాయక చిట్టాలలో వ్రాయకపోవడము వలన లేదా ఆవర్జాలో నమోదు చేయకపోవడం వలన ఇలాంటి దోషాలు ఏర్పడతాయి.
  3. ఉదా : అరువు మీద 300 లకు సరుకు కొనుగోలు చేసి, కొనుగోలు పుస్తకములో నమోదు చేయకపోవడం, గణేశ్ చెల్లించిన నగదు 1,000 నగదు పుస్తకములో వ్రాయలేదు.

ప్రశ్న 2.
ఆకార్యకరణ దోషాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు.

  1. ఇవి వ్రాతపూర్వకమైన దోషాలు.
  2. వ్యవహారాన్ని చిట్టాపద్దులో తప్పుగా రాయటం, ఖాతాల్లో తప్పుగా నమోదుచేయటం. కూడికలలో నిల్వ తేల్చటములో లేదా నిల్వలను ముందుగా తీసుకొని వెళ్ళడంలో జరిగిన తప్పులను ఆకార్యకరణ దోషాలు అంటారు.
  3. ఉదా : కొనుగోలు ఖాతాలో ₹ 1,000 కు బదులు ₹ 100గా నమోదు చేయడము. X చెల్లించిన ₹ 100 y ఖాతాకు క్రెడిట్ చేయడం.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 3.
సిద్ధాంత రీత్యా దోషాన్ని రెండు ఉదాహరణలతో వివరించండి.
జవాబు.

  1. గణకశాస్త్ర సూత్రాలకు విరుద్ధముగా వ్యాపార వ్యవహారాలు వ్రాసినపుడు జరిగే దోషాలను “సిద్ధాంతరీత్యా దోషాలు” అంటారు.
  2. పెట్టుబడికి, రాబడికి మధ్య వ్యత్యాసాన్ని గమనించకుండా లెక్కలు వ్రాసినపుడు సిద్ధాంతపు దోషాలు ఏర్పడతాయి.
  3. ఉదా : ₹ 10,000 కు ఫర్నీచర్ కొని, కొనుగోలు ఖాతాకు డెబిట్ చేయడం, యంత్రాల మరమ్మత్తులకు ₹ 500 చెల్లించి, యంత్రాల ఖాతాకు డెబిట్ చేయడం.

ప్రశ్న 4.
సరిపెట్టె తప్పులు అంటే ఏమిటి ?
జవాబు.

  1. రెండు లేదా అంతకన్నా ఎక్కువ తప్పులు జరిగి ఒక తప్పును మరొక తప్పుతో సర్దుబాటు అయితే దానిని సరిపెట్టే తప్పులు అంటారు.
  2. ఖాతాలలో ఒకవైపున చేసిన తప్పులు, మరొక వైపున చేసిన తప్పులతో సమానమై రద్దు అవుతాయి.
  3. ఉదా : రాముకి చెల్లించిన 500 పుస్తకాలలో 450గా నమోదు చేయటం, అలాగే రమేష్ నుండి వచ్చిన నగదు కౌ 1,000లను కౌ950గా నమోదు చేయటం.

ప్రశ్న 5.
అనామతు ఖాతాను నిర్వచించండి.
జవాబు.

  1. వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేసే ప్రక్రియలో అంకణాలోని డెబిట్, క్రెడిట్ మొత్తాలు కొన్ని సందర్భాలలో సమానంగా ఉండకపోవచ్చును. అంకణాలోని డెబిట్, క్రెడిట్ మొత్తాలలోని తేడాను ఒక ప్రత్యేకమైన ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. దీనినే ‘అనామతు ఖాతా’ అంటారు.
  2. అనామతు ఖాతా అనేది ఒక ఊహజనిత ఖాతా, దీనిని అంకణాలోని రెండు వరసలు సమానత్వం పొందటం కోసం తాత్కాలికంగా మాత్రమే తెరువబడుతుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
దోషాలు ఎన్ని రకాలు ? తగిన ఉదాహరణలతో వివరించండి.
జవాబు.
తప్పు ఏదో ఒక రకమైన దోషము. తప్పుల వ్యవహారములను చిట్టాపద్దులలో నమోదు చేసేటప్పుడు గాని, సహాయక చిట్టాలలో నమోదు చేసేటప్పుడుగాని, ఆవర్జా ఖాతాలలో నమోదు చేసేటప్పుడుగాని, ఖాతా నిల్వలను తేల్చేటప్పుడుగాని లేదా నిల్వలను బదిలీ చేసేటప్పుడుగాని ఏర్పడతాయి. ఈ తప్పులు ముగింపు లెక్కలపై ప్రభావాన్ని చూపుతాయి.

గణక శాస్త్రములో తప్పులను కొట్టివేసి వాటి స్థానములో వేరే రాయటానికి వీలులేదు. ఇది ఆచరణయోగ్యము కాదు. అందువలన తప్పు పాక్షికమయితే వదిలిన భాగమునకు సవరణ పద్దు రాయటం ద్వారా లేదా అదనపు పద్దు నమోదు చేయటము ద్వారాగాని సవరించవచ్చును. ఈ విధముగా సవరించడాన్ని తప్పుల సవరణ అంటారు.

దోషాలను రెండు రకాలుగా వర్గీకరించడం జరిగినది. అవి :

  1. సిద్ధాంతపరమైన దోషాలు
  2. రాతపూర్వకమైన దోషాలు

1. సిద్ధాంతపరమైన దోషాలు :
గణక శాస్త్ర సూత్రాలకు విరుద్ధముగా వ్యాపార వ్యవహారములను వ్రాయడం వలన జరిగే దోషాలను సిద్ధాంతపరమైన దోషాలు అంటారు. పెట్టుబడి వ్యయాన్ని రాబడి వ్యయముగా చూపినపుడు, రాబడి ఆదాయాన్ని పెట్టుబడి వ్యయముగా చూపినపుడు ఇలాంటి దోషాలు ఏర్పడతాయి. జీతాలను చెల్లించి వ్యక్తిగత ఖాతాలకు నమోదు చేయడం, ఫర్నీచర్ కొని కొనుగోలు ఖాతాలో వ్రాయడం. ఈ దోషాలు అంకణా ద్వారా వెల్లడి కావు.

2. రాతపూర్వకమైన దోషాలు :
వ్యాపార వ్యవహారాలను తొలిపద్దు పుస్తకములో గాని ఆవర్జాలో నమోదు చేసేటప్పుడు సిబ్బంది చేసే తప్పులను రాతపూర్వకమైన దోషాలు అంటారు. ఇవి మూడు రకాలు :

  • ఆకృత దోషాలు
  • అకార్యాకరణ దోషాలు
  • సరిపెట్టే దోషాలు.

ఎ) ఆకృత దోషాలు :
వ్యవహారములను సహాయక చిట్టాలలో వ్రాయకపోవడం వలన లేదా ఆవర్జాలో నమోదు చేయకపోవడం వలన ఇలాంటి దోషాలు ఏర్పడతాయి. జరిగిన వ్యవహారము పుస్తకాలలో వ్రాయకపోవడం ఆకృత దోషము. ఇది అంకణా సమానతకు భంగము కలిగించదు. ఉదా : అరువు మీద ₹ 300 సరుకు కొనుగోలు చేసి, కొనుగోలు పుస్తకములో వ్రాయకపోవడం.

బి) అకార్యాకరణ దోషాలు :
వ్యాపార వ్యవహారాలను నమోదు చేసేటపుడు కేవలము సిబ్బంది చేసే తప్పులను అకార్యాకరణ దోషాలు అంటారు. తప్పు వరసల వలన, తప్పుగా ముందుకు తీసుకొని రావడం, తప్పుగా నిల్వలు తేల్చడం, ద్వంద దోషాలు, తప్పుగా పద్దులు వేయడం ద్వారా ఇలాంటి దోషాలు ఏర్పడతాయి.

ఇవి అంకణా సమానతకు భంగము కలిగించవచ్చు లేదా కలిగించకపోవచ్చు. ఉదా : కొనుగోలు ఖాతాకు ₹ 1,000 బదులు ₹ 100 నమోదు చేయడము.

సి) సరిపెట్టే దోషాలు :
ఒక తప్పును మరొక తప్పుతో సర్దుబాటు చేయడము వలన సరిపెట్టే దోషాలు ఏర్పడతాయి. ఖాతాలలో ఒకవైపు చేసిన తప్పులు మరొక వైపున చేసే తప్పులతో సమానమై రద్దు అయిపోతాయి.
ఉదా : జీతాల ఖాతాలో 7 500 ఎక్కువగా డెబిట్ చేసి, అమ్మకాల ఖాతాలో కూడా ₹ 500 ఎక్కువ క్రెడిట్ చేయడం. ఈ దోషాల వలన అంకణా సమానతకు భంగము కలగదు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 2.
అంకణా వల్ల వెల్లడి అయ్యే తప్పులను, వెల్లడి కాని తప్పులను వివరించండి.
జవాబు.
తప్పులు అనేవి వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేసే క్రమంలో కాని, వాటిని ఆవర్జాలో నమోదు చేసే సందర్భంలో కానీ లేదా అంకణా తయారుచేయునప్పుడు గానీ దొర్లే పొరపాట్లు.
తప్పులు (దోషాలు) – రకాలు :
తప్పులు అంకణాపై ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో అనే అంశం ఆధారంగా తప్పులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  • అంకణా వల్ల వెల్లడి కాని తప్పులు
  • అంకణా వల్ల వెల్లడి అయ్యే తప్పులు

I. అంకణా వల్ల వెల్లడి కాని తప్పులు:

  1. సిద్ధాంతపరమైన తప్పులు
  2. ఆకృత (తొలగింపు) తప్పులు
  3. ఆకార్యకరణ దోషాలు
  4. సరిపెట్టే తప్పులు
  5. ఖాతాలో తప్పువైపున నమోదు చేసే దోషాలు

II. అంకణా వల్ల వెల్లడి అయ్యే తప్పులు

  1. ఖాతాలో తప్పువైపున నమోదు చేసే దోషం
  2. తప్పు మొత్తాన్ని చూపటం
  3. కూడికలలో తప్పులు
  4. తప్పుగా ముందుకు తీసుకుపోవడం
  5. వ్యవహారాన్ని పాక్షికంగా వదలివేయటం
  6. ఒకే అంశాన్ని రెండు సార్లు ఒకే ఖాతాలో నమోదు చేయటం.

I. అంకణా వల్ల వెల్లడి కాని తప్పులు :
ఈ రకమైన తప్పులు అంకణా తయారు చేయటం వల్ల వెల్లడి కావు, ఎందుకంటే ఈ తప్పులు అంకణా సమానతపై ఎలాంటి ప్రభావం చూపవు. ఈ తప్పులను విపులంగా క్రింద చర్చించడమైనది.

a) సిద్ధాంతపరమైన తప్పులు :

  1. వ్యాపార వ్యవహారాలు సాధారణంగా ఆమోదింపబడే గణకశాస్త్ర సిద్ధాంతాల ప్రకారం నమోదు చేయబడతాయి. ఏ సిద్ధాంతమైనా అమలు చేయునప్పుడు కానీ లేదా వాటిని పట్టించుకోకుండా వ్యవహారాలను నమోదు చేయటం వల్ల గానీ సంభవించే దోషాలను సిద్ధాంతపరమైన దోషాలు అంటారు.
  2. పెట్టుబడి అంశాలను రాబడి అంశాలుగా భావించడం వల్ల ఈ రకమైన తప్పులు సంభవిస్తాయి.
  3. ఉదాహరణకి యంత్రాల కొనుగోలు అనే వ్యవహారాన్ని, కొనుగోలు ఖాతాలో నమోదు చేయటం.

b) ఆకృత (తొలగింపు) తప్పులు :

  1. ఒక వ్యవహారాన్ని పూర్తిగా గానీ లేదా పాక్షికంగా గానీ (పుస్తకాలలో) నమోదు చేయకుండా వదిలివేయటం వల్ల జరిగే తప్పులను ఆకృత తప్పులు అంటారు.
  2. ఈ రకమైన తప్పులు రెండు రకాలుగా సంభవించవచ్చును. అవి
    1. సంపూర్ణ ఆకృత తప్పులు
    2. పాక్షిక ఆకృత తప్పులు.

1. సంపూర్ణ ఆకృత దోషం (సంపూర్ణ తొలగింపు) :

  • ఒక వ్యవహారాన్ని పుస్తకాలలో నమోదు చేయకుండా పూర్తిగా వదలివేయటాన్ని సంపూర్ణ ఆకృత దోషం అంటారు.
  • ఉదాహరణకు సాకేత్ & కంపెనీ నుండి కొన్న ఫర్నీచరు పుస్తకాలలో పూర్తిగా నమోదు చేయలేదు.
  • ఈ తప్పు అంకణా సమానత్వానికి భంగం వాటిల్లదు.

2. పాక్షిక ఆకృత తప్పులు :

  • వ్యవహారంలోని ఒక అంశాన్ని మాత్రమే నమోదు చేసి ఇంకొక అంశాన్ని వదిలివేసినట్లయితే అలాంటి దోషాలను పాక్షిక ఆకృత దోషాలు అంటారు.
  • ఉదాహరణకి, సుందర్కి అరువుపై అమ్మిన సరుకు అమ్మకాల పుస్తకాలలో నమోదు చేశారు కాని, సుందర్ ఖాతాలో నమోదు చేయటం జరగలేదు.
  • ఇలాంటి దోషాలు అంకణా సమానత్వానికి భంగం కలుగుతాయి. కాబట్టి అంకణా సరితూగదు.

c) అకార్యకరణ దోషాలు :

  • వ్యవహారాన్ని చిట్టా పద్దులో తప్పుగా రాయటం, ఖాతాలలో తప్పుగా నమోదు చేయటం, ఖాతా మొత్తాలను తప్పుగా కూడటం, ఖాతాలను తప్పుగా నిల్వ తేల్చటం, తప్పుగా ముందుకు తీసుకువెళ్లడం వంటి దోషాలను అకార్యకరణ దోషాలు అంటారు.
  • ఉదాహరణకి, ప్రవీణ్ నుంచి ₹ 8,500 సరుకును అరువుపై కొనుగోలు చేసిన వ్యవహారాన్ని పుస్తకాలలో ₹ 5,800గా (తప్పుగా) నమోదు చేయటం.

d) సరిపెట్టే తప్పులు :

  • రెండు లేదా అంతకన్నా ఎక్కువ తప్పులు జరిగి, ఒక తప్పును మరొక తప్పుతో సరిపెట్టినట్లయితే, దానిని సరిపెట్టే తప్పు అంటారు. దీని ద్వారా (అంకణా యొక్క) అంకగణితపు ఖచ్చితత్వానికి భంగం వాటిల్లదు.
  • ఉదాహరణకి, రాముకి చెల్లించిన ₹ 5,000, ₹ 4,500లుగా నమోదు చేయటం, అలానే శ్యాము నుండి వచ్చిన నగదు ₹ 10,000లు, ₹ 9,500లుగా నమోదు చేయటం.

e) ఖాతాలో తప్పువైపున నమోదు చేసే దోషాలు :

  • ఒక ఖాతాలో రాయవలసిన దానిని వేరొక ఖాతాలో రాయటం వల్ల ఈ రకమైన దోషాలు సంభవిస్తాయి.
  • ఉదాహరణకి, మహేష్కి చెల్లించిన మొత్తం ₹ 1,000 సురేష్ ఖాతాకి డెబిట్ చేయటం.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

II. అంకణా వల్ల వెల్లడి అయ్యే తప్పులు :
అంకణా తయారు చేయటం ద్వారా తెలుసుకొనగలిగే తప్పులను అంకణా ద్వారా వెల్లడి అయ్యే తప్పులు అంటారు. ఈ క్రింది దోషాలు అంకణా తయారుచేయటం వల్ల వెల్లడి అవుతాయి.

a) వ్యవహరాన్ని ఖాతాలో, తప్పువైపున నమోదు చేయటం :
ఉదాహరణకి ఇచ్చిన డిస్కౌంట్ను, డిస్కౌంటు ఖాతాలో క్రెడిట్ వైపున నమోదు చేయటం.

b) ఖాతాలో తప్పు మొత్తాన్ని నమోదు చేయటం :
ఉదాహరణకి ₹ 25,000 ల అమ్మకాలు, ₹ 2,500 లుగా అమ్మకాల ఖాతాలో నమోదు చేయటం.

c) కూడికలలో తప్పులు :
సహాయక పుస్తకాలలో కానీ, ఆవర్జాలలో కానీ, వ్యవహారాల మొత్తాన్ని తప్పుగా కూడినప్పుడు అది అంకణా కచ్చితత్వానికి ప్రభావం చూపుతుంది.
ఉదా :
1) అమ్మకాల వాపసుల పుస్తకం ₹ 1,000లు ఎక్కువగా కూడటం.
2) ఫర్నీచరు ఖాతాను ₹ 1,500 లుకు బదులుగా, ₹ 1,750 గా కూడటం.

d) తప్పుగా ముందుకు తీసుకుపోవడం :
ఒక పేజీలోని మొత్తాన్ని తదుపరి పేజీలోకి తీసుకోపోతున్నప్పుడు చేసే దోషాలను తప్పుగా ముందుకు తీసుకుపోయే దోషాలు అంటారు. ఈ రకమైన తప్పు అంకణా సమానత్వానికి భంగం వాటిల్లుతుంది.
ఉదా : కొనుగోలు పుస్తకం మొత్తం ₹ 150 లకు బదులుగా ₹ 1,500 లుగా ముందు పేజీలో చూపటం.

e) పాక్షిక తొలగింపు దోషాలు :
వ్యవహారాలను చిట్టా నుంచి ఆవర్జాలోని ఖాతాలకు బదిలీ చేసే సందర్భంలో చిట్టా పద్దులో రెండు అంశాలలో ఒకే అంశాన్ని ఖాతాలోకి బదిలీ చేయటం వల్ల పాక్షిక తొలగింపు దోషాలు సంభవిస్తాయి. ఉదా : రమేష్ నుండి కొన్న సరుకు ₹ 2,000 కొనుగోలు పుస్తకంలో మాత్రమే నమోదు చేయటమైనది.

f) రెండు సార్లు నమోదుకు సంబంధించిన దోషం :
ఒకే అంశాన్ని రెండు సార్లు చిట్టాలో రాయటం వల్ల ఈ రకమైన దోషాలు సంభవిస్తాయి.
ఉదా : చెల్లించిన జీతాలు ₹ 600లు జీతాల ఖాతాలో రెండు సార్లు నమోదు చేయటం.

ప్రశ్న 3.
అనామతు ఖాతా అంటే ఏమిటి ? దానిని గురించి సూక్ష్మంగా వివరించండి.
జవాబు.

  1. వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేసే ప్రక్రియలో అంకణాలోని డెబిట్, క్రెడిట్ మొత్తాలు కొన్ని సందర్భాలలో సమానంగా ఉండకపోవచ్చును. అంకణాలోని డెబిట్, క్రెడిట్ మొత్తాలలోని తేడాను ఒక ప్రత్యేకమైన ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. దీనినే ‘అనామతు ఖాతా’ అంటారు.
  2. అనామతు ఖాతా అనేది ఒక ఊహజనిత ఖాతా, దీనిని అంకణాలోని రెండు వరసలు సమానత్వం పొందటం కోసం తాత్కాలికంగా మాత్రమే తెరువబడుతుంది.
  3. అంకణా ద్వారా వెల్లడి అయిన, వెల్లడి కాని తప్పులను గుర్తించి ఈ అనామతు ఖాతా ద్వారా దోషాలను సవరిస్తారు. అలా దోషాలను గుర్తించి, వాటిని సవరించటం ద్వారా ఈ ‘అనామతు ఖాతా’ ముగుస్తుంది. అంటే అనామతు ఖాతా ఎలాంటి నిల్వ చూపదు.
  4. దోషాలు సవరించే సందర్భంలో ఒకవేళ అంకణా యొక్క డెబిట్ మొత్తాలు, క్రెడిట్ మొత్తాల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అనామతు ఖాతాను ఆ తేడా మొత్తంతో క్రెడిట్ చేయాలి. అలాగే ఒకవేళ క్రెడిట్ మొత్తాలు, డెబిట్ మొత్తాల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అనామతు ఖాతాను ఆ వ్యత్యాసంతో డెబిట్ చేయాలి. అంటే అంకణా ఏవైపు తక్కువ చూపుతుందో ఆ వైపున అనామతు ఖాతా నిల్వ చూపుతుంది.

అనామతు ఖాతా ఉపయోగించి సవరణ పద్దులు రాసేటప్పుడు ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోవాలి :

  1. అంకణాను ప్రభావితం చేసే దోషాలను సవరించటానికి అనామతు ఖాతా ఉపయోగించాలి.
  2. a) సవరణ పద్దులో సవరించాల్సిన అంశానికి డెబిట్ చేయ్యాల్సి వస్తే, అనామతు ఖాతాకు క్రెడిట్ చేసి, జంట పద్దు పూర్తి చేస్తాం.
    b) సవరణ పద్దులో సవరించాల్సిన అంశానికి క్రెడిట్ చేయ్యాల్సి వస్తే, అనామతు ఖాతాకు డెబిట్ చేసి, జంట పద్దు విధానాన్ని పూర్తి చేస్తాం.

ప్రశ్న 4.
పాక్షిక ఆకృత తప్పులకు, సంపూర్ణ ఆకృత తప్పులకు మధ్యగల తేడాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు.
పాక్షిక ఆకృత తప్పులు, సంపూర్ణ ఆకృత తప్పులకు మధ్యగల తేడాలు :

తేడాకు ఆధారంపాక్షిక ఆకృత తప్పులుసంపూర్ణ ఆకృత తప్పులు
1. అర్థమువ్యవహారంలో ఒక అంశాన్ని మాత్రమే నమోదు చేసి, ఇంకొక అంశాన్ని వదిలివేసినట్లయితే అలాంటి దోషాలను పాక్షిక ఆకృత తప్పులు అంటారు.ఒక వ్యవహారాన్ని పుస్తకాలలో నమోదు చేయకుండా పూర్తిగా వదిలివేయ్యటాన్ని సంపూర్ణ ఆకృత దోషం అంటారు.
2. ఉదాహరణఉదాహరణకు : రమేష్కి అరువుపై అమ్మిన సరుకు అమ్మకాల పుస్తకాలలో నమోదు చేశారు కాని రమేష్ ఖాతాలో నమోదు చేయలేదు.ఉదాహరణకు : శ్రీను నుండి కొన్న ఫర్నీచర్ పుస్తకాలలో పూర్తిగా నమోదు చేయలేదు.
3. అంకణాపై ప్రభావంపాక్షిక ఆకృత తప్పుల వల్ల అంకణా సమానత్వానికి ప్రభావం భంగం కలుగుతుంది. కాబట్టి అంకణా సరితూగదు.సంపూర్ణ ఆకృత తప్పుల వల్ల అంకణా సమానత్వానికి భంగం వాటిల్లదు. అంకణా సరితూగుతుంది.


TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

Problems:

ప్రశ్న 1.
కింది దోషాలను సవరించండి.
a) ఆదిత్యకు అమ్మిన సరుకు ₹ 2,500 కొనుగోలు పుస్తకంలో రాసుకొన్నారు.
b) సందీప్కి చెల్లించిన జీతం ₹ 800 అతని వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేశారు.
c) శేఖర్ వద్ద అరువుకి కొన్న ఫర్నీచర్ ₹ 1,000 కొనుగోలు పుస్తకంలో రాశారు.
d) భవనాల విస్తృతి కోసం పెట్టిన ఖర్చు ₹ 5,000 తప్పుగా భవనాల మరమ్మత్తుల ఖాతాలో డెబిట్ చేశారు.
e) శైలేష్ వాపసు చేసిన సరుకు ₹ 1,200 కొనుగోలు వాపసుల పుస్తకంలో నమోదు చేసుకొన్నారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 1

ప్రశ్న 2.
కింది తప్పులను సవరించండి.
a) ఫర్నీచర్ కొనుగోలు ₹ 10,000 తప్పుగా కొనుగోలు ఖాతాకు డెబిట్ అయ్యింది.
b) రమణ వద్ద అరువుకి కొన్న యంత్రాలు ₹ 20,000 కొనుగోలు పుస్తకంలో రాయడమైంది.
c) యంత్రం మరమ్మత్తుల ఖర్చు ₹ 1,400 యంత్రాల ఖాతాకు డెబిట్ చేశారు.
d) పాత యంత్రం మరమ్మత్తులకైన ఖర్చు ₹ 2,000 మరమ్మత్తుల ఖాతాకు డెబిట్ చేశారు.
e) యంత్రం అమ్మకాలు ₹ 3,000 అమ్మకాల ఖాతాలో క్రెడిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 2

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 3.
కింది తప్పులను సవరించడానికి చిట్టా పద్దులు రాయండి.
a) యంత్రం కొనుగోలు ₹ 5,000 కొనుగోలు ఖాతాకు డెబిట్ చేయడమైంది.
b) రుచిరకి చెల్లించిన న్యాయాత్మక ఖర్చులు ₹ 700 ఆమె వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేయడమైంది.
c) ఎస్కార్ట్స్ కంపెనీ వద్ద కొనుగోలు చేసిన యంత్రం ₹ 10,000 ఎస్కార్ట్స్ కంపెనీ ఖాతాకు డెబిట్ చేశారు.
d) టైప్ రైటర్ కొనుగోలు ₹ 6,000 తప్పుగా కొనుగోలు పుస్తకంలో రాశారు.
e) యజమాని తనకోసం కొనుగోలు చేసిన మోటారు సైకిల్ ₹ 20,000 సాధారణ ఖర్చుల ఖాతాలో రాశారు.
f) గ్యాస్ ఇంజన్ కొనుగోలు ₹ 15,000 కొనుగోలు ఖాతాకు డెబిట్ చేశారు.
g) సరితకు చెల్లించిన నగదు ₹ 400 ఆమని ఖాతాకు డెబిట్ చేయడమైంది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 3

ప్రశ్న 4.
కింది తప్పులకు సవరణ పద్దులు రాయండి.
a) ఫర్నీచర్ తయారీదారుకి చెల్లించాల్సిన వేతనాలు ₹ 670 వేతనాల ఖాతాకు డెబిట్ చేశారు.
b) శ్రీనివాస్కు అరువుపై అమ్మిన సరుకు ₹ 150 శివరామ్ ఖాతాకు డెబిట్ చేశారు.
c) వర్షిణికి చెల్లించిన జీతం ₹ 1,000 అసలు పుస్తకాల్లో నమోదు కాలేదు.
d) హర్షిణి వద్ద అరువుకి కొన్న సరుకు 140 పుస్తకాల్లో ₹ 410 గా నమోదు అయ్యింది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 4

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 5.
కింది దోషాలకు సవరణ పద్దులు రాయండి.
a) వ్యాపారస్తుడి కొనుగోలు పుస్తకాన్ని ₹ 200 ఎక్కువగా కూడారు.
b) పాత ఫర్నీచర్ అమ్మకం ₹ 100 తప్పుగా అమ్మకాల ఖాతాకు క్రెడిట్ అయ్యింది.
c) చెల్లించిన వడ్డీ ₹ 100 కమీషన్ ఖాతాకు డెబిట్ చేశారు.
d) సోనీ నుంచి వచ్చిన నగదు ₹ 125 ఆమె ఖాతాలో తప్పుగా ₹ 152 క్రెడిట్ అయ్యింది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 5

ప్రశ్న 6.
కింది తప్పులను సవరించండి.
a) ఫర్నీచర్ కొనుగోలు ₹ 1,200 కొనుగోలు పుస్తకంలో రికార్డు అయ్యింది.
b) యంత్రం మరమ్మత్తులు ₹ 200 యంత్రం ఖాతాకు డెబిట్ చేశారు.
c) రమేష్కి అరువుపై అమ్మిన సరుకు ₹ 200 అమ్మకాల పుస్తకంలో సరిగానే నమోదు అయినప్పటికీ అతడి ఖాతా, డెబిట్ చేశారు.
d) కొనుగోలు పుస్తకాన్ని ₹ 200 ఎక్కువగా కూడారు.
e) మేనేజర్కి చెల్లించిన జీతం ₹ 2,000 అతడి వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 6

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 7.
కింది తప్పులను సవరించండి.
a) పాత యంత్రం అమ్మకం ₹ 500 అమ్మకాల పుస్తకంలో రాసుకొన్నారు.
b) రాకేష్ చెల్లించిన ₹ 300 రాజేష్ ఖాతాకు క్రెడిట్ చేశారు.
c) షా & కంపెనీ ₹ 250 వారి ఖాతాకు ₹ 520గా డెబిట్ అయ్యింది.
d) రామంజికి వాపసు చేసిన సరుకు ₹ 350 అసలు పుస్తకాల్లో రికార్డు కాలేదు.
e) రమణకి చెల్లించిన జీతం ₹ 1,500 అతడి ఖాతాకు డెబిట్ చేశారు.
f) గుప్త వద్ద కొన్న సరుకు ₹ 700 అమ్మకాల పుస్తకంలో రాసుకొన్నారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 7

ప్రశ్న 8.
కింది దోషాలను సవరించండి.
a) ఫర్నీచర్ మరమ్మత్తులకై చెల్లించిన ₹ 100 ఫర్నీచర్ ఖాతాకు డెబిట్ చేశారు.
b) అమ్మకాల పుస్తకాన్ని ₹ 500 తో ఎక్కువగా కూడారు.
c) ఖర్చులు ₹ 1500 ఆవర్జా ఖాతాలో ₹ 150 గా నమోదు అయ్యింది.
d) Mr. S కి అమ్మిన సరుకు ₹ 200 Mr. V ఖాతాకు డెబిట్ చేశారు.
e) పాత ఫర్నీచర్ అమ్మకం ₹ 500 అమ్మకాల ఖాతాకు క్రెడిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 8

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 9.
కింది తప్పులకు సవరణ పద్దులు రాయండి.
a) అమ్మకాల పుస్తకాన్ని ₹ 300 ఎక్కువగా కూడారు.
b) మాధవికి అమ్మకాలు ₹ 100 తప్పుగా శరత్ ఖాతాకు డెబిట్ చేశారు.
c) సాధారణ ఖర్చులు ₹ 200 ఆవర్జా ఖాతాలో 300గా నమోదు అయ్యింది.
d) శంకర్ నుంచి వచ్చిన నగదు ₹ 500 సంధ్య ఖాతాకు డెబిట్ చేశారు.
e) సరితకు చెల్లించిన న్యాయాత్మక ఖర్చులు ₹ 200 ఆమె వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేశారు.
f) రమేష్కి చెల్లించిన ₹ 200 అసలు పుస్తకాల్లో రికార్డు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 9

ప్రశ్న 10.
కింది తప్పులను సవరిస్తూ చిట్టాపద్దులు రాయండి.
a) కొనుగోలు పుస్తకాన్ని ₹ 200 తక్కువగా కూడారు.
b) వైష్ణవి వద్ద అరువుకి కొన్న సరుకు ₹ 1,000 తప్పుగా అమ్మకాల పుస్తకంలో రాశారు.
c) చెల్లించిన వేతనాలు ₹ 200 తప్పుగా జీతాల ఖాతాకు డెబిట్ చేశారు.
d) వచ్చిన వడ్డీ ₹ 100 తప్పుగా కమీషన్ ఖాతాకు క్రెడిట్ చేశారు.
e) మేనేజర్ కృష్ణకు చెల్లించిన జీతం ₹ 500 అతని ఖాతాకు డెబిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 10

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 11.
కింది తప్పులను సవరించండి.
a) కొనుగోలు పుస్తకాన్ని ₹ 2,000 తో తక్కువగా కూడారు.
b) చెల్లించిన అద్దె ₹ 350 ఆ ఖాతాకు 530గా డెబిట్ అయ్యింది.
c) రామా & కంపెనీ నుంచి వచ్చిన డిస్కౌంట్ ₹ 250 అసలు పుస్తకాల్లో రికార్డు కాలేదు.
d) చెల్లించిన వడ్డీ ₹ 89 తప్పుగా ₹ 98 గా క్రెడిట్ అయ్యింది.
e) అమ్మకాల పుస్తకాన్ని ₹ 1,700 తో ఎక్కువగా కూడారు.
f) కొనుగోలు వాపసుల పుస్తకం ₹ 275 తక్కువగా కూడారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 11

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 12.
కింది దోషాలను సవరించండి.
a) అమ్మకాల పుస్తకాన్ని ₹ 1,000 తక్కువగా కూడారు.
b) పాత ఫర్నీచర్ అమ్మకాలు ₹ 4,000 అమ్మకాల ఖాతాకు క్రెడిట్ చేశారు.
c) వడ్డీ నిమిత్తం చెల్లించిన ₹ 250 కమీషన్ ఖాతాకు డెబిట్ చేయడమైంది.
d) సందీప్కి చెల్లించిన ₹ 125 అతని ఖాతాలో ₹ 152 గా నమోదు అయ్యింది.
e) కొనుగోలు పుస్తకంలో ₹ 750 ఎక్కువగా కూడారు.
f) హెడ్ గుమాస్తా శేఖరుకి చెల్లించిన జీతం ₹ 4,500 అతని ఖాతాకు డెబిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 12

ప్రశ్న 13.
కింది తప్పులను సవరించండి.
a) ఫర్నీచర్ కొనుగోలు ₹ 3,500 కొనుగోలు పుస్తకంలో రాశారు.
b) వచ్చిన వాపసుల పుస్తకాన్ని ₹ 250 తో ఎక్కువగా కూడారు.
c) యంత్రం మరమ్మత్తుల ఖర్చులు ₹ 800 యంత్రాల ఖాతాకు డెబిట్ చేశారు.
d) శ్రీమన్నారాయణకి చేసిన అమ్మకాలు ₹ 750 అమ్మకాల పుస్తకంలో నమోదు అయినప్పటికీ అతడి ఖాతాలో క్రెడిట్ చేశారు.
e) రాధిక వద్ద చేసిన కొనుగోలు ₹ 760 ఆమె ఖాతాలో ₹ 670 గా క్రెడిట్ అయ్యింది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 13

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 14.
కింది దోషాలను సవరించండి.
a) యజమాని వైద్య ఖర్చులు ₹ 250 వివిధ ఖర్చుల ఖాతాకు డెబిట్ చేశారు.
b) సంధ్య & కంపెనీకి అమ్మిన సరుకు ₹ 2,900 కొనుగోలు పుస్తకంలో నమోదు చేశారు.
c) పాత యంత్రం ₹ 5,000 అమ్మకాల ఖాతాకు క్రెడిట్ చేశారు.
d) కొనుగోలు పుస్తకాన్న ₹ 2,000 తో ఎక్కువగా కూడారు.
e) కిట్టుకి చెల్లించిన జీతం ₹ 4,500 వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 14

ప్రశ్న 15.
కింద ఇచ్చిన తప్పులను సవరించండి.
a) గోపాల్ నుంచి వచ్చిన నగదు ₹ 1,500 చందు ఖాతాకు క్రెడిట్ చేశారు.
b) కొనుగోలు పుస్తకాన్ని ₹ 1,000 తక్కువగా కూడారు.
c) యంత్రం మరమ్మత్తులు ₹ 800 యంత్రాల ఖాతాకు డెబిట్ చేశారు.
d) చింటుకి అనుమతించిన డిస్కౌంట్ ₹ 200 నగదు పుస్తకంలో సరిగానే నమోదు అయినప్పటికీ వ్యక్తిగత ఖాతాలో అసలు నమోదు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 15

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

Textual Examples:

ప్రశ్న 1.
కింద ఇచ్చిన దోషాలను సవరించండి.
a) పవనికి చెల్లించిన జీతం ₹ 1,200 అతని వ్యక్తిగత ఖాతాకు డెబిట్ చేశారు.
b) ఇంటి యజమాని మురళికి చెల్లించిన అద్దె ₹ 5,000 అతని ఖాతాకు డెబిట్ చేశారు.
c) భవనాల మరమ్మతుల కోసం చెల్లించిన ₹ 2,000 భవనాల ఖాతాకు డెబిట్ చేశారు.
d) యజమాని తన సొంతానికి వాడుకొన్న ₹ 850 ను వర్తక ఖర్చులకు డెబిట్ చేశారు.
e) రమేష్ బ్రదర్స్ వాపసు చేసిన సరుకు ₹ 235 అసలు పుస్తకాల్లో నమోదు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 16

ప్రశ్న 2.
కింది తప్పులను సవరించండి.
a) ఆఫీసు ఫర్నిచర్ కొనుగోలు ₹ 7,200 తప్పుగా ఆఫీసు ఖర్చుల ఖాతాకి డెబిట్ చేశారు.
b) ప్రదీప్ అరువుపై అమ్మిన సరుకు ₹ 1,500 పొరపాటున కొనుగోలు ఖాతాలో రాసారు.
c) వెంకట్ నుంచి వచ్చిన చెక్కు ₹ 1,600 అనాదరణ చెందగా తప్పుగా అమ్మకాల వాపసుల పుస్తకంలో డెబిట్ చేశారు.
d) సుధకి అమ్మిన సరుకు ₹ 4,000 పుస్తకాల్లో రికార్డు కాలేదు.
e) సుధీర్ నుంచి వచ్చిన నగదు ₹ 2,000 తప్పుగా సందీప్ ఖాతాకు క్రెడిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 17

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 3.
లక్ష్మీనారాయణ్ & సన్స్ పుస్తకాల్లో కింది తప్పులు కనుగొన్నారు. వాటిని సవరించే చిట్టా పద్దులు రాయండి.
a) ఫర్నిచర్ కొనుగోలు ₹ 500 కొనుగోలు ఖాతాలో రాశారు.
b) మరమ్మతుల ఖర్చు ₹ 50 భవనాల ఖాతాకు డెబిట్ చేశారు.
c) చెల్లించిన అద్దె ₹ 1000 భూస్వామి ఖాతాకు డెబిట్ చేశారు.
d) షా & కో నుంచి వచ్చిన నగదు ₹ 100 షా & కంపెనీ నుంచి వచ్చినట్లుగా రాసుకొన్నారు.
e) యజమాని తన సొంతానికి తీసుకున్న నగదు ₹ 1150 ప్రయాణ ఖర్చుల ఖాతాకు డెబిట్ చేశారు.
f) టైప్ రైటర్ కొనుగోలు ₹ 1,500 ఆఫీసు ఖర్చుల ఖాతాలో రాసుకొన్నారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 18

ప్రశ్న 4.
అంకణా తయారుచేసేటప్పుడు కనుగొన్న తప్పులకు సవరణ పద్దులు రాయండి.
a) వచ్చిన కమీషన్ ₹ 200 తప్పుగా వడ్డీ ఖాతాకు క్రెడిట్ చేశారు.
b) కొనుగోలు వాపసుల పుస్తకాన్ని ₹ 500 తక్కువగా కూడారు.
c) ఫర్నిచర్ కొనుగోలు ₹ 600 కొనుగోలు ఖాతాకు డెబిట్ చేయడమైంది.
d) శ్రీ భీమ్రాజ్ నుంచి వచ్చిన నగదు ₹ 300 శ్రీరామ్ రాజ్ ఖాతాకు తప్పుగా క్రెడిట్ చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 19

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 5.
వరుణ్ బ్రదర్స్, వరంగల్ వారి ఖాతా పుస్తకాల నుంచి కింది దోషాలను కనుగొన్నారు. సవరణపద్దులు రాయండి.
a) ఫర్నిచర్ అమ్మకాలు ₹ 1,500 సరుకు అమ్మకాలుగా నమోదు అయ్యింది.
b) రామ్ వద్ద నుంచి వచ్చిన నగదు ₹ 3500 శ్యామ్ ఖాతాకు క్రెడిట్ చేయడమైంది.
c) మోహన్ వద్ద కొనుగోలు చేసిన సరుకు ₹ 1,000 అసలు పుస్తకాల్లో నమోదు కాలేదు.
d) ముఖేష్ వద్ద నుంచి వాపసు వచ్చిన సరుకు ₹ 120 అతని ఖాతాకు డెబిట్ చేశారు.
e) యజమాని ఇంటి అద్దె ₹ 600 అద్దె ఖాతాకు డెబిట్ చేయడమైంది.
f) రఫీకి చెల్లించిన ₹ 215 అతని ఖాతాలో ₹ 125 గా క్రెడిట్ చేయడమైంది.
g) అమ్మకాల పుస్తకంలో ₹ 400 తక్కువగా కూడారు.
h) వసూలు బిల్లుల పుస్తకంలో ₹ 1,500 పుస్తకాల్లో నమోదు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 20

ప్రశ్న 6.
కింద ఇచ్చిన తప్పులను అనామతు ఖాతా సహాయంతో సవరించండి.
a) మోహన్క అరువుకి అమ్మిన సరుకు ₹ 7,000 శ్రీను ఖాతాలో ₹ 5,000 గా నమోదు అయ్యింది.
b) శరత్ వద్ద అరువు కొనుగోళ్ళు ₹ 9,000 కిరణ్ ఖాతాలో ₹ 10,000 గా డెబిట్ చేశారు.
c) శైలజకు వాపసు చేసిన సరుకు ₹ 4,000 పావని ఖాతాలో ₹ 3,000 లుగా క్రెడిట్ చేశారు.
d) రత్నాజీ నుంచి వాపసు వచ్చిన సరుకు ₹ 1,000 సంధ్య ఖాతాలో ₹ 2,000 గా నమోదయ్యింది.
e) నగదు అమ్మకాలు ₹ 2,000 కమీషన్ ఖాతాలో ₹ 200 గా నమోదు అయ్యింది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 21

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 7.
కింది తప్పులను సవరించండి.
a) లలిత నుంచి వచ్చిన నగదు ₹ 200 ఆమె ఖాతాలో ₹ 180 గా నమోదు చేశారు.
b) అశోకికి అమ్మిన సరుకు ₹ 75 అసలు ఖాతా పుస్తకాల్లో నమోదు కాలేదు.
c) హరి ఖాతాలో క్రెడిట్ వైపు ఎక్కువగా కూడిన మొత్తం ₹ 200.
d) రమేష్ నుంచి వాపసు వచ్చిన సరుకు ₹ 650 అతని ఖాతాలో నమోదు కాలేదు.
e) అమ్మకాల పుస్తకాన్ని ₹ 500 తక్కువగా కూడారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 22

ప్రశ్న 8.
కింద ఇచ్చిన తప్పులను అనామతు ఖాతా సహాయంతో సవరించండి.
a) కొనుగోలు పుస్తకాన్ని ₹ 650 ఎక్కువగా కూడారు.
b) కొనుగోలు వాపసుల పుస్తకాన్ని ₹ 250 తక్కువగా కూడారు.
c) అమల నుంచి వచ్చిన నగదు ₹ 222 ఆమె ఖాతాలో ₹ 2,222 గా నమోదు అయ్యింది.
d) రాజేష్ అమ్మిన సరుకు ₹ 296 అతని ఖాతాలో ₹ 269 గా నమోదు అయ్యింది.
e) శరత్ నుంచి వచ్చిన నగదు ₹ 350 అతని ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 23

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 9.
మహేంద్ర ట్రేడర్స్ పుస్తకాల ద్వారా తయారుచేసిన అంకణా సరితూగలేదు. ఖాతాల్లో ₹ 1,310 తేడా కనపడగా దాన్ని అనామతు ఖాతాకి క్రెడిట్ వైపుకు మళ్ళించారు. కింది దోషాలను కనుగొన్నారు. వాటిని సవరించి, అనామతు ఖాతాను తయారుచేయండి.
a) వినయ్ వద్ద కొనుగోలు చేసిన సరుకు ₹ 800 కొనుగోలు పుస్తకంలో సరిగా నమోదు అయ్యింది కానీ అతని ఖాతాకు తప్పుగా డెబిట్ అయ్యింది.
b) అమ్మకాల పుస్తకాన్ని ₹ 600 ఎక్కువగా కూడారు.
c) ₹ 115 సాధారణ ఖర్చు కింద చెల్లించగా అది ₹ 150 గా నమోదు అయ్యింది.
d) అమర్కి అనుమతించిన డిస్కౌంట్ ₹ 225 నగదు పుస్తకంలో సరిగానే నమోదు అయ్యింది. కానీ అతని వ్యక్తిగత ఖాతాలో నమోదు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 24

ప్రశ్న 10.
ఒక సంస్థ అంకణాలోని వ్యత్యాసాలు ₹ 750 (డెబిట్ వైపు ఎక్కువగా ఉన్నది) అందుకు గాను ఆ మొత్తాన్ని అనామతు ఖాతాలో క్రెడిట్ వైపు ఉంచారు మరియు క్రింది తప్పులను గుర్తించారు. ఆ దోషాలను సవరించి అనామతు ఖాతా తయారుచేయండి.
a) రాజేష్ నుంచి వచ్చిన నగదు ₹ 250 అతని వ్యక్తిగత ఖాతాలో డెబిట్ చేశారు.
b) మహేష్కి అమ్మిన సరుకు ₹ 540 అమ్మకాల పుస్తకంలో ₹ 450గా నమోదు అయ్యింది.
c) వచ్చిన డిస్కౌంట్ ₹ 150 నగదు పుస్తకంలో రాసుకొన్నారు. కానీ డిస్కౌంట్ ఖాతాలో నమోదు కాలేదు.
d) కొనుగోలు వాపసులు ₹ 50 కొనుగోలు ఖాతాకు డెబిట్ చేశారు.
e) యంత్రాల మరమ్మతులు ₹ 370 మరమ్మతుల ఖాతాలో తప్పుగా ₹ 170 గా డెబిట్ అయ్యింది.
f) అమ్మకాల పుస్తకాన్ని ₹ 200 తక్కువగా కూడారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 25

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 11.
కింది దోషాలను సవరించండి.
a) ఆనంద్ నుంచి వచ్చిన నగదు ₹ 188 ని ₹ 180 గా నమోదు చేసుకొన్నారు.
b) వర్ధనికి అమ్మిన సరుకు ₹ 75 రికార్డు చేయడం మర్చిపోయారు.
c) దీక్షిత్ ఖాతాలో క్రెడిట్ వైపు ₹ 20 ఎక్కువగా కూడారు.
d) రాధిక నుంచి వాపసు వచ్చిన ₹ 35 ల సరుకు ఆమె ఖాతాలో నమోదు కాలేదు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 26

ప్రశ్న 12.
a) కొనుగోలు పుస్తకం ₹ 400 ఎక్కువగా కూడటమైనది.
b) కొనుగోలు వాపసుల పుస్తకం ₹ 260 తక్కువగా కూడటం జరిగింది.
c) సుందర్ నుండి వచ్చిన నగదు ₹ 660 అతని ఖాతాలో ₹ 1,660 గా నమోదు అయ్యింది.
d) పరమ్కి అమ్మిన సరుకు ₹ 550 అతని ఖాతాలో ₹ 450గా నమోదు అయ్యింది.
e) కిరణ్ నుంచి వచ్చిన నగదు ₹ 1050 అతని ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేశారు.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 27

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 13.
అకౌంటెంట్ అంకణాని సరిపోల్చలేకపోయాడు. అంకణాలో ఉన్న ₹ 5,180 తేడాను ముగింపు లెక్కలు తయారు చేయటం కొరకు (ప్రస్తుతానికి) అనామతు ఖాతాలో క్రెడిట్ వైపున వేయటం జరిగింది. ఈ క్రింది తప్పులను గుర్తించడం జరిగింది.
a) చెల్లించిన కమీషన్ ₹ 500. రెండు సార్లు అనగా చెల్లించిన డిస్కౌంటు ఖాతాకి మరియు కమీషన్ ఖాతాకి నమోదు చేయుటమైనది.
b) అమ్మకాల పుస్తకం ₹ 1,000 తక్కువ కూడటమైనది.
c) సుధకి అరువుపై అమ్మిన సరుకు ₹ 2,780 అమ్మకాల పుస్తకాలలో సరిగి నమోదు చేసినప్పటికీ, తన వ్యక్తిగత ఖాతాలో ₹ 3,860 గా తప్పుగా డెబిట్ చేయుటమైనది.
d) నటరాజ్ నుండి అరువు కొనుగోలు ₹ 1,500 కొనుగోలు పుస్తకాలలో సరిగా నమోదు చేసినప్పటికీ, అతని వ్యక్తిగత ఖాతాకి తప్పుగా డెబిట్ చేయటమైనది.
e) నగదు పుస్తకంలోని చెల్లింపు వైపున డిస్కౌంట్ వరసలో ₹ 2,400 కు బదులు, ₹ 2,800 గా తప్పుగా చూపటమైనది. అవసరమైన సవరణ పద్దులు రాసి, అనామతు ఖాతాను తయారు చేయండి.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 28

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 14.
శేషు & బ్రదర్స్, వరంగల్ వారి పుస్తకాలలో 2018 సం॥రానికి క్రింద తెలిపిన దోషాలు వారి ఖాతాలను ప్రభావితం చేస్తున్నాయి.
a) పాత ఫర్నీచర్ అమ్మకం ₹ 1,500 సరుకు అమ్మకాలుగా చూపడమైంది.
b) సాయిరాం నుండి వచ్చిన ₹ 5,000 రాంసాయి ఖాతాలో క్రెడిట్ చేయడమైంది.
c) పవన్ కుమార్ నుంచి కొన్న సరుకు ₹ 1,200 పుస్తకాలలో నమోదు కాలేదు.
d) యజమాని సొంత నివాసం అద్దె ₹ 7,500, అద్దె ఖాతాకి డెబిట్ చేయడమైంది.
e) మరమత్తులకు అయిన ఖర్చు ₹ 600 భవనాల ఖాతాకి డెబిట్ చేయటమైంది.
సాధన.
సవరణ పద్దులు:

TS Inter 1st Year Accountancy Study Material 8th Lesson తప్పుల సవరణ 29

TS Board Inter First Year Accountancy Study Material Chapter 8 తప్పుల సవరణ

ప్రశ్న 15.
కింది తప్పులను సవరించండి.
a) కొనుగోలు పుస్తకం ₹ 2,500 ఎక్కువగా కూడటం జరిగింది.
b) అమ్మకాల పుస్తకం ₹ 4,200 తక్కువగా కూడటం జరిగింది.
c) కొనుగోలు వాపసుల పుస్తకం ₹ 1,450 ఎక్కువగా చూపటం జరిగింది.
d) అమ్మకాల వాపసుల పుస్తకం ₹ 3,500 తక్కువగా చూపటం జరిగింది.
సాధన.
a) కొనుగోలు ఖాతాకి ₹ 2,500 క్రెడిట్ చేయాలి.
b) అమ్మకాల ఖాతాకి ₹ 4,200 క్రెడిట్ చేయాలి.
c) కొనుగోలు వాపసుల పుస్తకాన్ని ₹ 1,450 తో డెబిట్ చేయాలి.
d) అమ్మకాల వాపసుల పుస్తకాన్ని ₹ 3,500 తో డెబిట్ చేయాలి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 2nd Lesson స్టాక్ ఎక్స్ఛేంజ్ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 2nd Lesson స్టాక్ ఎక్స్ఛేంజ్

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటే ఏమిటి ? దాని విధులను వివరించండి.
జవాబు.
అర్ధం:

  1. కంపెనీల వాటాలను కొనడానికి, అమ్మడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థీకృత మార్కెట్ను స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటారు.
  2. ఇంతకు ముందే జారీ చేసిన సెక్యూరిటీలను అమ్మడం, కొనడం లాంటి కార్యకలాపాలు జరిపే వ్యవస్థీకృతమైన సెకండరీ మార్కెట్ను స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటారు.

నిర్వచనాలు:

  1. సెక్యూరిటీల (కాంట్రాక్టు) ఒప్పందాల (నియంత్రణ) చట్టం, 1956 ప్రకారం “సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలను క్రమబద్దీకరించి, నియంత్రించే ఉద్దేశంతో నమోదైన లేదా నమోదు కాని సంఘం, వ్యవస్థ లేదా వ్యక్తుల సముదాయమే స్టాక్ ఎక్స్ఛేంజ్’.
  2. పైలీ ప్రకారం, “పెట్టుబడి లేదా స్పెక్యులేషన్ నిమిత్తం జాబితాలో చేర్చిన సెక్యూరిటీల అమ్మకం, కొనుగోలు జరిగే మార్కెట్ ప్రదేశాన్ని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ నిర్వచించవచ్చు”.

స్టాక్ ఎక్స్ఛేంజ్ విధులు:
1) వర్తకానికి అవసరమైన మౌళిక వసతులు కల్పిస్తుంది: స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీల వర్తకం తక్షణమే అమలు జరుగుతుంది. సెక్యూరిటీల నిరంతర మార్కెటింగ్కు అవసరమైన సమాచారం పెట్టుబడిదారులకు అందిస్తూ వ్యాపారానికి, కంపెనీలకు అధిక మొత్తంలో మూలధనాన్ని పొందడానికి సహకరిస్తుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

2) ధరల సమాచారాన్ని అందిస్తుంది: సెక్యూరిటీల ధరల సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్వసనీయమైన మార్గాల ద్వారా, ప్రచురణకర్తల ద్వారా పెట్టుబడిదారులకు చేరవేస్తుంది. భావి పెట్టుబడిదారుడు తాను కొనుగోలు చేయబోయే సెక్యూరిటీల కొటేషన్ ధరను, అమ్మకందారుడు తన సెక్యూరిటీల విలువను తెలుసుకోవచ్చు.

3) పెట్టుబడిదారుల సంపదను పరిరక్షిస్తుంది: సెక్యూరిటీల వర్తకానికి సంబంధించిన నియమ నిబంధనలను సక్రమంగా అమలుపరుస్తూ, పెట్టుబడిదారుల ఆసక్తులను, సంపదను పరిరక్షిస్తుంది.

4) క్లియరింగ్ హౌస్గా వ్యవహరిస్తుంది: క్లియరింగ్ హౌస్ లేనప్పుడు వర్తకంలో క్రయవిక్రయాలు కుదరవు. స్టాక్ ఎక్స్ఛేంజ్ అమ్మకందారుడు, కొనుగోలుదారుని తరపున వ్యవహరిస్తూ, సెక్యూరిటీల వర్తకంలో సహాయపడుతుంది.

5) ద్రవ్యత్వాన్ని కలిగిస్తుంది: సెక్యూరిటీలను కలిగి ఉన్న వ్యక్తి సులభంగా వాటిని నగదులోకి మార్చుకోవడానికి, తనకు అవసరమయినప్పుడు కొనుగోలుదారునకు అమ్ముకోడానికి సులభమార్కెట్ అవకాశాలను కలుగచేస్తుంది. చేసుకోవడానికి, విస్తృతపరచడానికి

6) కొత్త మూలధనాన్ని పొందడంలో సహాయపడుతుంది: వ్యాపారాన్ని అభివృద్ధి అదనపు మూలధనం అవసరం ఏర్పడుతుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్లల వల్ల ప్రస్తుతం నడుస్తున్న కంపెనీలు తమ అదనపు మూలధన అవసరాలను హక్కు వాటాల జారీ ద్వారా సులభంగా పొందవచ్చు.

7) భారమితిగా వ్యవహరిస్తుంది: దేశంలోని వ్యాపార పరిస్థితులను మదింపు చేయడానికి స్టాక్ ఎక్స్ఛేంజ్లు భారమితిగా / కొలమానంగా వ్యవహరిస్తాయి.

8) కంపెనీ కీర్తి ప్రతిష్టలను పెంచుతాయి: కంపెనీ వాటాలను స్టాక్ ఎక్స్ఛేంజ్ల జాబితాలో చేర్చడం వల్ల కంపెనీ పరపతి పెంపొందించడంతోపాటు, దాని పేరు ప్రఖ్యాతులు కూడా మెరుగవుతాయి.

9) స్పెక్యులేషన్ భయాలు తగ్గుతాయి: వివిధ చట్టాల నియమ, నిబంధనలను పాటించడం వల్ల స్పెక్యులేషన్ భయాలు, ధరలో అవకతవకలను తగ్గించడం సాధ్యమవుతుంది.

10)స్పెక్యులేషన్కు దోహదపడుతుంది: స్టాక్ ఎక్స్ఛేంజ్లు స్పెక్యులేషన్కు కొంతమేరకు దోహదపడతాయి. సెక్యూరిటీల ధరలలో ఏర్పడే మార్పులవల్ల వ్యాపారస్తులు స్పెక్యులేషన్కు పాల్పడి, లాభాలను ఆర్జించవచ్చు.

ప్రశ్న 2.
స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రాముఖ్యతను సవివరంగా తెలపండి.
జవాబు.
వివిధ వర్గల వారికి స్టాక్ ఎక్స్ఛేంజ్ల ప్రాముఖ్యతను, అవసరాన్ని క్రింది విధంగా గుర్తించవచ్చు.
ఎ) పెట్టుబడిదారులకు
బి) కంపెనీలకు
సి) సమాజానికి.

ఎ) పెట్టుబడిదారులకు స్టాక్ ఎక్స్ఛేంజ్ల అవసరం:

  1. పెట్టుబడిదారులు తమ మిగులు నిధులను పేరు ప్రఖ్యాతులు గల కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుంది.
  2. నిరంతర మార్కెట్ సమాచారం లభ్యత వల్ల, సెక్యూరిటీలను సరైన రీతిలో సమీక్షించి, పెట్టుబడిదారులు నష్టభయాన్ని తగ్గించుకోవచ్చు.
  3. ఏ సమయంలో అయినా తమ వద్ద ఉన్న సెక్యూరిటీల విలువను తెలుసుకోవచ్చు.
  4. నిరంతరంగా సెక్యూరిటీలను మార్పు చేసుకునే వీలు ఉన్నందువల్ల సెక్యూరిటీలు ద్రవ్యత్వ గుణాన్ని కలిగి ఉంటాయి.
  5. నియమ నిబంధనలు కఠినంగా అమలుపరచడం వల్ల పెట్టుబడిదారుల ప్రయోజనాలు పరిరక్షింపబడతాయి.
  6. సెక్యూరిటీలను హామీలుగా ఉంచి రుణాలు పొందవచ్చు.
  7. కంపెనీ కార్యకలాపాలు, ఆర్థిక పటిష్ఠతను పెట్టుబడిదారులు తెలుసుకోవచ్చు.
  8. కంపెనీల సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాల వద్ద అని నిర్ణయించుకోడానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది.

కంపెనీలకు స్టాక్ ఎక్స్ఛేంజ్ల అవసరం:

  1. సెక్యూరిటీల జారీని దేశ వ్యాప్తంగా పెట్టుబడిదారులు దృష్టికి స్టాక్ ఎక్స్ఛేంజ్లు తీసుకువస్తాయి కాబట్టి కంపెనీలు భారీ మొత్తంలో మూలధనం సేకరించగలుగుతాయి.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చబడిన కంపెనీలు ఎక్కువ పేరు ప్రతిష్టలను పొందుతూ, ఆర్థిక పటిష్టతను చేకూర్చుకోగలుగుతాయి.
  3. స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేరిన కంపెనీలు తమ ఆర్థిక నివేదికలను సమర్పిస్తాయి కాబట్టి, పెట్టుబడిదారులు నమ్మకాన్ని పొందగలుగుతాయి మరియు కంపెనీ పటిష్టమైన స్థితిని వివరించగలుగుతాయి.
  4. కొత్త వాటాల జారీ కోసం ప్రాథమిక మార్కెట్కు అవసరమైన ప్రోత్సాహాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్లు కలిగిస్తాయి.
  5. స్టాక్ ఎక్స్ఛేంజ్ వల్ల సెక్యూరిటీలకు నిరంతర మార్కెటింగ్ సదుపాయం కలుగుతుంది కాబట్టి కొత్త కంపెనీలు తమకు కావలసిన మూలధనాన్ని సులభంగా సమీకరించుకోగలుగుతాయి.
  6. స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చిన కంపెనీల పట్ల భావి పెట్టుబడిదారుల మనస్సులలో సానుకూలమైన ఆలోచన కలుగుతుంది.
  7. కంపెనీని విస్తృతపరచడానికి, ఆధునీకరించడానికి కంపెనీలు అదనపు నిధులను హక్కు వాటాల జారీ ద్వారా పొవీందవచ్చు.
  8. స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చడం వల్ల కంపెనీల సెక్యూరిటీల మార్కెట్ పరిధి విస్తృతమౌతుంది.
  9. స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చిన కంపెనీల పరపతి సౌకర్యం మెరుగుపడుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

ప్రశ్న 3.
నెక్యూరిటీలను స్టాక్ ఎక్స్చేంజ్ల జాబితాలో చేర్చడానికి పాటించవలసిన విధానక్రమం ఏమిటో తెలపండి ?
జవాబు.
అధికారయుతంగా సెక్యూరిటీలను అమ్మడానికిగాని, కొనగానికి గాని స్టాక్ ఎక్స్ఛేంజ్లలో అవకాశం కల్పించడాన్ని సెక్యూరిటీలను జాబితాలో చేర్చడం అంటారు.
సెక్యూరిటీలను స్టాక్ ఎక్స్ఛేంజ్ల జాబితాలో చేర్చడానికి పాటించాల్సిన విధాన క్రమం:
1) స్టాక్ ఎక్స్ఛేంజ్లో సెక్యూరిటీలను జాబితాలో చేర్చాలంటే, దరఖాస్తు చేసుకునే కంపెనీలు కనీసం 3 కోట్ల జారీ మూలధనం కలిగి ఉండాలి. దీనిలో కౌ 1.80 కోట్లకు (60%) తగ్గకుండా ప్రజలకు ప్రతిపాదించాలి. ఈ నిబంధనలు పాటించిన కంపెనీలు మాత్రమే నిర్దిష్టమైన దరఖాస్తును పూరించి, క్రింద పేర్కొన్న పత్రాలను జతపరచి స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుంది.

  • సంస్థాపన పత్రం, నియమావళి, పరిచయ పత్రం, డైరెక్టర్ల నివేదికలు, ఆస్తి అప్పుల పట్టీ మరియు చందాపూచీదార్లు, బ్రోకర్లతో చేసుకున్న ఒప్పందాల నకలు కాపీలను సమర్పించాలి.
  • వాటాలు, డిబెంచర్ల సర్టిఫికెట్స్, కేటాయింపు లేఖలు, ఆమోదం లేదా పరిత్యజించే లేఖల నమూనాలను జతపరచాలి.
  • మూలధన నిర్మాణ వివరాలు సమర్పించాలి.
  • వాటాల పంపిణీని వివరించే నివేదికను రూపొందించాలి.
  • గత పది సంవత్సరాలుగా చెల్లించిన లేదా ప్రకటించిన డివిడెండు, బోనస్ వివరాలు అందించాలి.
  • వాటాలు, డిబెంచర్లతో వ్యవహరించడానికి అవసరమైన అనుమతులు పొందడానికి దరఖాస్తు చేసుకున్న వివరాలు అందించాలి.
  • కంపెనీ నమోదు కాలం నుంచి కంపెనీ కార్యకలాపాల సంక్షిప్త నివేదికను రూపొందించాలి.
  • సెక్యూరిటీలను జాబితాలోకి చేర్చే నిమిత్తం ఒప్పందం చేసుకోవడానికి గాను అవసరమైన ప్రారంభ మరియు వార్షిక లిస్టింగ్ ఫీజును చెల్లించాలి.

2) ఒక కొత్త కంపెనీ పైన పేర్కొన్న పత్రాలలో కొన్నింటిని సమర్పించే స్థితిలో ఉండకపోవచ్చు. ఇది సెక్యూరిటీలను జాబితాలో చేర్చడానికి గాను అభ్యంతరకరం కాకపోవచ్చు. ఆసక్తిగల కంపెనీలు తమ సెక్యూరిటీలను స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చడానికి గాను నిర్ణీత దరఖాస్తుతో పాటు పైన పేర్కొన్న పత్రాలను జతపరచి సమర్పించిన తరువాత, స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆ దరఖాస్తును నిశితంగా పరిశీలిస్తుంది.

3) దరఖాస్తును అన్ని కోణాలలో అధ్యయనం చేసిన తరువాత, స్టాక్ ఎక్స్ఛేంజ్ పొందుపరచిన వివరాలపట్ల సంతృప్తి చెందితే లిస్టింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకోమని కంపెనీకి సమాచారాన్ని ఇస్తుంది. ఈ ఒప్పంద పత్రంలో కంపెనీ బాధ్యతలు, పరిమితులు ఎలా ఉంటాయో, సెక్యూరిటీల లిస్టింగ్ జరిగాక ఎలా వ్యవహరించాల్సి ఉంటుందో స్పష్టం చేయబడుతుంది.

4) SEBI స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థగా 2003వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడి కేంద్రీయ లిస్టింగ్ అధికారాన్ని కలిగి ఉంది. భారతదేశంలోని అన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీలను జాబితాలో చేర్చడానికి, ఒకే రకమైన, ప్రామాణీకరించబడిన విధానాలను పాటించడానికి, దీని ఏర్పాటు జరిగింది.

5) కంపెనీలు తమ సెక్యూరిటీలను స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో నుంచి స్వచ్చందంగా లేదా నిర్బంధంగానైనా విరమింపచేసుకోవచ్చు. ఒకసారి విరమింపచేసుకున్న తరువాత, తిరిగి తమ వాటాలను స్టాక్ జాబితాలో చేర్చాలనే ఆసక్తిగల కంపెనీలు రెండు సంవత్సరాల వరకు నిరీక్షించాలి. ఈ రెండు సంవత్సరాలు గడిచిన తరువాత మళ్ళీ అవసరమైన అన్ని లాంఛనాలు పూర్తి చేసినప్పుడే కంపెనీ వాటాలను తిరిగి స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చడమవుతుంది.

ప్రశ్న 4.
సెబి అంటే ఏమిటి ? దాని విధులను, అధికారాలను వివరించండి.
జవాబు.
సెబి:

  1. సెబి (SEBI) అనగా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్లలో నెలకొన్న అవాంఛనీయ అలవాట్లను తొలగిస్తుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్, దానిలో పాల్గొనే స్టాక్ బ్రోకర్ల మరియు ఆపరేటర్ల పనులను నియంత్రిస్తుంది.
  3. SEBI ACT 1992ను భారత పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత SEBI అమలులోకి వచ్చింది. SEBIకు శాసనాత్మక అధికారాలను చట్టం కల్పించింది. భారతప్రభుత్వం 1995వ సంవత్సరంలో, SEBI Act 1992ను సవరిస్తూ అనేక అదనపు శాసనాత్మక అధికారాలను SEBIకి కల్పించింది.

సెబి విధులు:
సెబి 3 రకాల విధులను నిర్వర్తిస్తుంది. అవి:

  1. క్వాసీ లెజిస్లేటివ్
  2. క్వాసీ జ్యుడిషియల్
  3. క్వాసీ ఎక్సిక్యూటివ్.

లెజిస్లేటివ్ హోదాలో SEBI నిబంధనలను రూపొందిస్తుంది. ఎక్సిక్యూటివ్ విధులలో భాగంగా సెబి పరిశోధనలను చేపట్టి నిబంధనలను అమలుపరిచే చర్యలను తీసుకుంటుంది. జ్యుడిషియల్ హోదాలో సెబి అవసరమైన తీర్పులను ఇస్తూ ఉత్తర్వులను జారీ చేస్తుంది. SEBI నిర్వర్తించే ఈ మూడు రకాల విధులను కింద సంక్షిప్తపరచడమైంది.

  1. పెట్టుబడిదారులకు పరిజ్ఞానాన్ని కల్పించడం.
  2. సెక్యూరిటీలతో వ్యవహరించే మధ్యవర్తులకు అవసరమైన శిక్షణను ఇవ్వడం.
  3. స్టాక్ ఎక్స్ఛేంజ్ల పనిని నియంత్రించడం
  4. మధ్యవర్తులు అంటే స్టాక్ బ్రోకర్లు, మర్చంట్ బ్యాంకర్లు, చందా పూచీదారులు మొదలయిన వారి పనితీరును నియంత్రించడం, వారి వ్యవహారాలను నమోదు చేయడం.:
  5. మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇతర సామూహిక పెట్టుబడి పథకాల పనితీరును క్రమబద్దీకరించడం.
  6. అవసరమయిన ఆడిట్ కార్యక్రమాలను, తనిఖీలను నిర్వహించడం.
  7. అంతర్గతంగా జరిగే సెక్యూరిటీల వర్తకాన్ని అదుపు చేయడం.

సెబి అధికారాలు:
సెబి తన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించడానికి గాను కింది అధికారాలను కలిగి ఉంటుంది.

  1. స్టాక్ ఎక్స్ఛేంజ్ నియమాలను ఆమోదించడం మరియు సవరణలను చేయడం.
  2. ఆర్థిక మధ్యవర్తుల ఖాతాపుస్తకాలను తనిఖీ చేయడం.
  3. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజ్ల ఖాతా పుస్తకాలను తనిఖీ చేయడం, కాలానుగతంగా నివేదికలను సమర్పించమని పిలుపును ఇవ్వడం.
  4. కంపెనీలకు తమ సెక్యూరిటీలను ఒకటి లేదా అంతకుమించిన స్టాక్ ఎక్స్ఛేంజ్ల జాబితాలో తప్పనిసరిగా చేర్చుకోమని ఆదేశించడం.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

ప్రశ్న 5.
వివిధ రకాల స్టాక్ ఎక్స్ఛేంజ్ స్పెక్యులేటర్స్ గురించి వివరించండి.
జవాబు.
స్పెక్యులేటర్స్:

  1. సెక్యూరిటీల ధరలలో మార్పుల వల్ల లాభం పొందే నిమిత్తం స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యవహారాలను జరిపే చట్టబద్ధమైన వ్యాపారస్తులనే స్పెక్యులేటర్స్ అంటారు.
  2. స్పెక్యులేటర్లు ధరల మార్పుల తేడాను వసూలు చేసుకోవడంగాని, చెల్లించడంగాని చేస్తారు.
  3. స్పెక్యులేషన్ అంటే భవిష్యత్లో సెక్యూరిటీల ధరల మార్పుల వల్ల లాభం పొందే ఉద్దేశం గల వ్యవహారం.
  4. కాబట్టి స్పెక్యులేషన్ రిస్క్ తో కూడుకున్న వ్యవహారంగా పరిగణిస్తారు. ఆశించిన రీతిలో లాభాలు రాకుంటే స్పెక్యులేటర్స్ నష్టపోతారు.

స్పెక్యులేటర్ల రకాలు: స్పెక్యులేషన్ స్వభావాన్ని బట్టి, స్పెక్యులేటర్లకు బుల్స్ (Bulls), బేర్స్ (Bears), స్టాగ్ (Stag) మరియు లేవొక్ (Lame Duck)గా వర్గీకరించవచ్చు.
1) బుల్స్:

  1. ఈ మధ్యవర్తులు తమ వ్యవహారాలలో ఆశావాదిగా ఉంటారు. సెక్యూరిటీల ధరలు పెరుగుతాయనే ఆశతో వాటిని ప్రస్తుత ధరకు కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్న స్పెక్యులేటర్లను బుల్స్ అంటారు.
  2. వీరు భవిష్యత్ కాలంలో అంచనావేసిన అధిక ధరకు అమ్మగలుగుతారని సెక్యూరిటీలను కొనుగోలు చేస్తారు.
  3. సెక్యూరిటీల ధరలు పెరుగుతాయని ఆశించడం వల్ల, అతని ధోరణిని బుల్తో సరిపోలుస్తారు. సాంకేతిక పరిభాషలో బుల్ను మార్కెట్కు సుదీర్ఘంగా ఉంటాడని పేర్కొంటారు. ఈ బుల్స్ను ‘తేజీవాలాలు’గా కూడా వ్యవహరిస్తారు.

2) బేర్స్:

  1. ఈ మధ్యవర్తులు తమ వ్యవహారాలలో నిరాశావాదులుగా ఉంటారు. సెక్యూరిటీల ధరలు తగ్గుతాయనే భావనతో వాటిని ప్రస్తుత ధరకు అమ్మడానికి ఒప్పందం చేసుకున్న స్పెక్యులేటర్లను ‘బేర్స్’ అంటారు. వీరిని మండివాలాలు అని కూడా వ్యవహరిస్తారు.
  2. వీరు భవిష్యత్తులో సెక్యూరిటీలను ఇప్పటి ధరకంటే తక్కువ ధరతో కొనుగోలు చేసి అమ్మవచ్చనే ఆశతో ఈ వ్యవహారం జరుపుతారు.
  3. బేర్స్ ప్రతిపాదించిన అమ్మకం ధర, కొనుగోలు ధరల మధ్య వ్యత్యాసమే తాము ఆర్జించిన లాభంగా నిర్ధారితమౌతుంది.
  4. బేర్ తన బాధితున్ని భూమిపై తోసి గాయపరుస్తుంది. తన నిరాశావాదతత్వంతో స్పెక్యులేటర్ సెక్యూరిటీల ధరలు తగ్గుతాయని భావిస్తాడు. అందకే అతనికి బేర్ అనే పేరును సార్థకం చేసారు.

3) స్టాగ్:

  1. ఈ స్పెక్యులేటర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించే స్పెక్యులేటర్లు, ఒక కొత్త కంపెనీ వాటాలను జారీ చేసినప్పుడు ఈ స్పెక్యులేటర్లు అధిక మొత్తంలో దరఖాస్తు రుసుము చెల్లించి పెద్ద మొత్తాలలో వాటాల కోసం దరఖాస్తు చేస్తారు. వాటాల కేటాయింపు వీరికి జరిగినట్లయితే తాము పొందిన వాటాలను ప్రీమియానికి అమ్ముతారు.
  2. ఏ కంపెనీ వాటాలకయితే డిమాండు ఎక్కువగా ఉందో గమనించి, ఆ కంపెనీ వాటాలను ఎంచుకొని, ఆ వాటాలపై కేటాయింపు సొమ్ము చెల్లించమని పిలుపు ఇవ్వకముందే, వాటిని ప్రీమియంపై అమ్ముతారు.
  3. తాము వాటాల కోసం చెల్లించిన సొమ్ముకు, అమ్మకం ధరకు మధ్యగల వ్యత్యాసమ్మొత్తాన్ని లాభంగా పరిగణిస్తారు.

4) లేమ్క్:

  1. బేరం దొరకని బేర్ను లేమితో పోలుస్తారు. కొన్ని సందర్భాలలో అమ్ముతానన్న సెక్యూరిటీలు మార్కెట్లో లభ్యం కాకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో బేర్ ఇబ్బందులకు లోను కావలసి వస్తుంది. తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. అమ్ముతానన్న సెక్యూరిటీలను అమ్మలేడు.
  2. తన దగ్గరలేని సెక్యూరిటీల అమ్మకానికి కుదుర్చుకున్న ఒప్పందంలో బేరు ఈ పరిస్థితి ఎదురవుతుంది. అంటే తమ దగ్గరలేని సెక్యూరిటీలను అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకొని వాటిని నెరవేర్చడానికి తక్కువ ధరలకు సెక్యూరిటీలు లభించక అవస్థలు పడే బేర్లను ‘లేమడక్స్’ అంటారు.

ప్రశ్న 6.
BSE, NSEల లక్షణాలను వివరించండి.
జవాబు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ని 1877 సంవత్సరంలో స్థాపించారు. దీనినే “నేటివ్ స్టాక్ అండ్ షేర్ బ్రోకర్స్ అసోసియేషన్” గా పిలుస్తారు. ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం స్టాక్ ఎక్స్ఛేంజ్లో పనిచేసే బ్రోకర్లకు సహాయపడటం, వారి హోదాలను పరిరక్షించడం. స్టాక్ ఎక్స్ఛేంజ్లలో న్యాయమైన, సముచితమైన పనులను మాత్రమే చేపట్టి అవకతవకలను తగ్గించడంలో ఈ సంస్థ ముఖ్యపాత్రను పోషిస్తుంది.

BSE లక్షణాలు:

  1. ఈ ఎక్స్ఛేంజ్ ఆన్లైన్ ట్రేడింగ్ విధానాన్ని 1995 లో ప్రవేశపెట్టింది. ఇది సెక్యూరిటీల వర్తకాన్ని చురుకుగా చేపట్టడమే కాకుండా, స్టాక్ మార్కెట్ వ్యవహారాలను సంరక్షిస్తుంది.
  2. చిన్న తరహా, మధ్యతరహా సంస్థలు తమ ఈక్విటీలను వర్తకం చేసుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది.
  3. సెక్యూరిటీలతో వ్యవహరించేటప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడంలో ఉపయోగపడుతుంది.
  4. ఈక్విటీలు, రుణ పత్రాలు మరియు మ్యూచువల్ ఫండ్స్తో వర్తకం చేయడానికి సమర్థవంతమైన పారదర్శక మార్కెట్ను అందిస్తుంది.
  5. ప్రపంచ వ్యాప్తంగా ఖాతాదారులను కలిగి ఉంటుంది.
  6. రిస్క్ మేనేజ్మెంట్ క్లియరింగ్, సేవలు అందిస్తూ మూలధన మార్కెట్లో పాల్గొనేవారికి పరిజ్ఞానాన్ని అందిస్తుంది.

NSE నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ను నవంబర్, 1992 సంవత్సరంలో నమోదు చేయడమైంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ వర్తక విధానాన్ని కలిగి ఉండి సెక్యూరిటీల వర్తకానికి ఇది దోహదపడుతున్నది.

NSE లక్షణాలు:

  1. దేశవ్యాప్తంగా కంప్యూటీకరించిన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇది. భారతదేశంలోని NSE సభ్యులందరూ శాటిలైట్ మరియు కేబుల్ సిస్టమ్ ద్వారా కలపబడతారు.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీల వర్తకం జరిగేటప్పుడు ధరల నిర్ణయానికి సంబంధించి అరవడం గాని లేదా బెల్ మోగించవలసిన అవసరం గానీ ఈ NSE లో ఉండదు. NSE లో పొందుపరచిన అటోమేటెడ్ కొటేషన్ సిస్టమ్ (Automated Quotation System) ద్వారా సెక్యూరిటీలను అమ్మడం, కొనడం చేయబడతాయి.
  3. NSE రుణ మార్కెట్లోని ప్రభుత్వ సెక్యూరిటీలు, UTI యూనిట్లు మొదలయిన వాటిని టోకు అమ్మకాలుగాచేపడుతుంది.
  4. ధరలకు సంబంధించిన సమాచారంను ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (P.T.I) ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది.
  5. ఈ సంస్థ పరిష్కార విధానాన్ని మెరుగుపరచడమే కాకుండా సెక్యూరిటీల వర్తకంలోని నష్ట భయాన్ని తగ్గిస్తుంది.
  6. NSE సబ్సిడియరీ నేషనల్ సెక్యూరిటీస్ క్లియరింగ్ కార్పొరేషన్ను నెలకొల్పింది. దీని ద్వారా వర్తకాన్ని నిర్వర్తించడానికి అవసరమైన పరిష్కారాలను, గ్యారంటీని ఈ సంస్థ అందిస్తుంది.
  7. ఈ సంస్థ కార్పొరేట్ ఈక్విటీ, రుణ పత్రాలతో వ్యవహరిస్తూ, కొనుగోలుదారులకు, అమ్మకందారులకు బ్రోకర్లుకు అవసరమైన సహాయం అందిస్తుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

ప్రశ్న 7.
స్టాక్ బ్రోకర్ అంటే ఎవరు? అతను నిర్వహించే పాత్ర ఏమిటి ?
జవాబు.
స్టాక్ బ్రోకర్:

  1. సాధారణ ప్రజలకు మరియు జాబర్ల మధ్య విభిన్న సెక్యూరిటీలను కమీషన్ కోసం ఏర్పాట్లు చేసే స్పెక్యులేటర్లను స్టాక్ బ్రోకర్లు అంటారు.
  2. స్టాక్ బ్రోకర్ తన ఖాతాదారుల తరపున స్టాక్స్ మరియు ఇతర సెక్యూరిటీల కోసం కొనుగోలు మరియు అమ్మకం ఆర్డర్లను ప్రాసెస్ చేసే నిపుణుడు. స్టాక్ బ్రోకర్ను “రిజిస్టర్డ్ ప్రతినిది”, “పెట్టుబడి సలహాదారు” లేదా “బ్రోకర్” అని కూడా పిలుస్తారు.
  3. స్టాక్ బ్రోకర్లు సాధారణంగా బ్రోకరేజ్ సంస్థతో సంబంధం కలిగి ఉంటారు మరియు రిటైల్ లేదా సంస్థాగత కస్టమర్ల కోసం లావాదేవీలను నిర్వహిస్తారు. స్టాక్ బ్రోకర్లు తరచూ వారి సేవలకు కమీషన్లు తీసుకుంటారు.

స్టాక్ బ్రోకర్ల పాత్ర:
1) సెక్యూరిటీల కొనుగోలు:

  1. స్టాక్ బ్రోకర్ యొక్క ప్రాథమిక బాధ్యతలలో ఒకటి తన క్లయింట్ తరపున స్టాక్స్ కొనడం. క్లయింట్ కలిగి ఉన్న ఖాతా రకాన్ని బట్టి అతను కొనుగోలును వివిధ మార్గాల్లో చేపట్టవచ్చు.
  2. విచక్షణారహిత ఖాతాలో, స్టాక్ బ్రోకర్ కొన్ని ముందుగా నిర్ణయించిన మార్గదర్శకాల ఆధారంగా క్లయింట్ కోసం స్టాక్ కొనుగోలు చేస్తారు.

2) సెక్యూరిటీల అమ్మకం:

  1. క్లయింట్ తరపున స్టాక్ అమ్మడం స్టాక్ బ్రోకర్కు ఉన్న ఇతర బాధ్యత. స్టాక్ కొనుగోలు విషయంలో మాదిరిగానే, స్టాక్ బ్రోకర్ క్లయింట్ కోరుకున్న మరియు తెరిచిన ఖాతా ఆధారంగా క్లయింట్ యొక్క స్టాక్లను అమ్మవచ్చు.
  2. క్లయింట్కు అమలు మాత్రమే ఖాతా ఉంటే, స్టాక్ బ్రోకర్ క్లయింట్ స్టాక్ను అడిగినప్పుడు మాత్రమే అమ్మవచ్చు.
  3. క్లయింటు సలహా ఖాతా ఉంటే, స్టాక్ బ్రోకర్ క్లయింట్కు తన స్టాక్లను విక్రయించమని మాత్రమే సలహా ఇవ్వగలడు, క్లయింట్కు విచక్షణా ఖాతా ఉంటే, స్టాక్ బ్రోకర్కు ముందుగా నిర్ణయించిన మార్గదర్శకం ఆధారంగా స్టాక్లను విక్రయించడానికి కొంత అవకాశం ఉంది.

3) పరిశోధన మరియు సలహా:

  1. చాలా బ్రోకింగ్ హౌన్లు సంస్థలను మరియు స్టాక్లను స్కాన్ చేయడంతోపాటు, స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేసే స్థూల – ఆర్థిక దృష్టాంతాన్ని విశ్లేషించే అంతర్గత పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేస్తాయి. పరిశోధనా బృందం నుంచి ఇన్పుట్లతో, బ్రోకరేజ్ హౌస్ స్టాక్స్పై సిఫారసుల ఆధారంగా కొనుగోలు చేస్తుంది లేదా అమ్మవచ్చు.
  2. మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం గురించి తమ ఖాతాదారుల జ్ఞానాన్ని మెరుగుపరచడంలో సహాయపడటానికి ‘బ్రోకర్లు పెట్టుబడిదారులకు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.

4) వ్యక్తిగతీకరించిన సేవ: చాలా బ్రోకింగ్ హౌన్లు సలహాదారుగా వ్యవహరించే క్లయింట్తో సంభాషించడానికి సంబంధిత నిర్వాహకుడిని (రిలేషన్షిప్ మేనేజర్ను) నియమిస్తాయి. సంబంధిత నిర్వాహకులు తమ ఖాతాదారులకు ఎప్పుడు లావాదేవీలు చేయాలో సలహా ఇస్తారు మరియు మార్కెట్ లావాదేవీలలో ఏమి చూడాలి అనే దాని గురించి వారికి మార్గనిర్దేశం చేస్తారు.

5) మార్జిన్ పైనాన్సింగ్:

  1. స్టాక్ బ్రోకర్లు ఈ రోజుల్లో బాగా మూలధనీకరణను కలిగి ఉన్నారు.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్ బ్రోకర్లు తమ నికర విలువకు అనుగుణంగా ఎంతవరకు రుణాలు ఇస్తున్నారో పర్యవేక్షిస్తాయి. తత్ఫలితంగా, పరపతి స్థానాలను తీసుకోవాలనుకునే ఖాతాదారులకు అనేక పెద్ద బ్రోకింగ్ హౌస్లు ఫైనాన్సింగ్ సదుపాయాలను కల్పిస్తాయి. దీని అర్థం ట్రేడింగ్ కోసం రుణాలను సమకూర్చుకుంటాయి.
  3. మార్జిన్ మొత్తాన్ని చెల్లించిన తరువాత ఖాతాదారులకు మార్కెట్లో స్థానం పొందటానికి అనుమతి ఉంది. చాలా సందర్భాలలో, పెట్టుబడిదారులు 50% మార్జిన్తో వ్యాపారం చేయడానికి అనుమతించబడతారు.

6) ఇతర రకాల ఆస్తులలో పెట్టుబడులు: స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా, వస్తువులు, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్) మరియు మ్యూచువల్ ఫండ్ వంటి ఇతర రకాల ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి బ్రోకర్లు పెట్టుబడిదారులకు సహాయం చేస్తారు. కంపెనీల ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపిఓ)లో పెట్టుబడులు పెట్టడానికి కూడా వారు తమ ఖాతాదారులకు సహాయం అందిస్తారు.

7) మార్కెటింగ్: స్టాక్ బ్రోకర్ భావి క్లయింట్లను గుర్తించి కస్టమర్ల సమూహాన్ని నిర్మిస్తాడు. వార్తా పత్రికలు మరియు మ్యాగజైనులో వ్యాసాలు రాయడం, రేడియో మరియు టెలివిజన్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అతను మార్కెటింగ్ను చేపట్టవచ్చు.

ప్రశ్న 8.
విత్త మార్కెట్లో స్టాక్ బ్రోకర్ యొక్క ఆవశ్యకతను సవివరంగా తెలపండి.
జవాబు.
ఒక సామాన్యుడికి, ఎక్స్ఛేంజ్ నుంచి నేరుగా స్టాకులను కొనడం సాధ్యం కాదు. సెక్యూరిటీల అమ్మకాలను మరియు కొనుగోలును అమలు చేయడానికి వారికి మధ్యవర్తుల అవసరం ఏర్పడుతుంది. అలాంటి మధ్యవర్తులను ‘స్టాక్ బ్రోకర్లు’ .అంటారు. పెట్టుబడిదారుల తరపున, స్టాక్ మార్కెట్లలో స్టాకుల కొనుగోలు మరియు అమ్మకాన్ని సులభతరం చేయడానికి .స్టాక్ బ్రోకర్ స్టేషలు అవసరం.

స్టాక్ బ్రోకర్లు తమ కాతాదారులకు ఈ దిగువ సేవలను అందిస్తున్నారు:
1) సలహా సేవలను అందించడం: స్టాక్ మార్కెట్ బ్రోకర్లు స్టాక్ మార్కెట్ పనితీరు, మార్కెట్పై పోకడలు, మొదలైన అంశాలలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా, వారు సంబంధం ఉన్న బ్రోకరేజ్ సంస్థల యొక్క డేటాబేస్ మరియు పరిశోధన ఫలితాలతో వారికి మార్కెట్పై అవగాహన ఉంటుంది. అందువల్ల, వారు తమ ఖాతాదారులకు అద్భుతమైన పెట్టుబడి సలహాలను అందించగలరు.

2) పరిమిత బ్యాంకింగ్ సేవలను అందించడం: స్టాక్ మార్కెట్ బ్రోకర్లకు వడ్డీ-బేరింగ్ ఖాతాలు, ఎలక్ట్రానిక్, డిపాజిట్లు మరియు ఉపసంహరణలు వంటి పరిమిత బ్యాంకింగ్ సేవలను అందించడానికి అధికారం ఉంది. ఖాతాదారులకు నామమాత్రపు బ్రోకరేజ్ ఛార్జీని చెల్లించడం ద్వారా స్టాక్ బ్రోకర్ల నుంచి బ్యాంకింగ్ సంబంధిత సేవలను పొందవచ్చు.

3) ఇతర పెట్టుబడి సేవలకు మద్దతు ఇవ్వడం: స్టాక్స్ పాటు, చాలా మంది స్టాక్ బ్రోకర్లు మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ మరియు కమోడిటీ ట్రేడింగ్ వంటి ఇతర సెక్యూరిటీలకు సంబంధించిన పెట్టుబడి సలహాలను వారు తమ ఖాతాదారులకు అందిస్తారు.

4) ఈ-మెయిల్ మద్దతు సేవలను నిర్వహించడం: వ్యాపార సమయంలో కొన్ని గంటల్లో ఈ-మెయిల్కు ప్రత్యత్తురం ఇవ్వడం అనేది సహేతుకమైన చర్యగా పరిగణించబడుతుంది. ఇది వ్యాపార అవసరాన్ని బట్టి ఉంటుంది.

5) ఫోన్ / టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా కమ్యూనికేట్ చేయడం: బ్రోకర్ ఫోన్ మరియు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అద్భుతమైన కస్టమర్ సేవలను అందించగలదు. దీని వలన కస్టమర్ల సంతృప్తిని పొందడమే కాకుండా తమ వ్యాపార విస్తరణకు దోహదపడుతుంది.

6) ప్రత్యక్ష చాట్ మద్దతును అందించడం: ప్రత్యక్ష చాట్ వెళ్ళేంతవరకు, ప్రతిస్పందన తక్షణమే ఉండాలి. అయితే ఇది పని రోజులలో మరియు నిర్దిష్ట సమయం వరకు మాత్రమే సాధ్యమవుతుంది.

7) వెబ్ సైట్లో సందేశాన్ని పంపడం: ఇది క్లయింట్కు వేగంగా సహాయం అందించడంలో సహాయపడుతుంది. మరియు నిర్దిష్ట ప్రతినిధికి సందేశం త్వరితగతిన పంపబడుతుంది.

8) చర్చా వేదికల ద్వారా అవగాహన కల్పించడం: ఈ రకమైన సేవలు సరికొత్తవిగా మరియు జనాదరణ పొందినవిగా చెప్పవచ్చు. ఖాతాదారుడు ఏదైనా ప్రత్యేకమైన అంశం లేదా సమస్యకు సంబంధించి బ్రోకర్తో నేరుగా ప్రశ్నలు అడగవచ్చు. తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చును.

9) నాలెడ్జ్ – బేస్ మరియు వీడియో ట్యుటోరియల్స్ ఏర్పరచడం: నాలెడ్జ్ – బేస్లో పునరావృతమయ్యే సమస్యను శీఘ్రంగా ప్రదర్శించడంలో ఆన్లైన్ కమ్యూనిటీకి సమర్ధవంతమైన మార్గాలలో ఒకటి. వీడియో ట్యుటోరియల్స్ ద్వారా సమస్య – పరిష్కార సాధనాల గురించి ఖాతాదారునికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

ఈ కారణాల వల్ల జాయింట్ స్టాక్ కంపెనీల సెక్యూరిటీల వర్తకంలో స్టాక్ బ్రోకర్ సేవలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
NSE గురించి మీకేమి తెలుసు ?
జవాబు.
NSE నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ను నవంబర్, 1992 సంవత్సరంలో నమోదు చేయడమైంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ వర్తక విధానాన్ని కలిగి ఉండి సెక్యూరిటీల వర్తకానికి ఇది దోహదపడుతున్నది.

NSE లక్షణాలు:
1) దేశవ్యాప్తంగా కంప్యూటీకరించిన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇది. భారతదేశంలోని NSE సభ్యులందరూ శాటిలైట్ మరియు కేబుల్ సిస్టమ్ ద్వారా కలపబడతారు.

2) స్టాక్ ఎక్స్ఛేంజ్లలో సెక్యూరిటీల వర్తకం జరిగేటప్పుడు ధరల నిర్ణయానికి సంబంధించి అరవడం గాని లేదా బెల్ మోగించవలసిన అవసరం గానీ ఈ NSE లో ఉండదు. NSE లో పొందుపరచిన అటోమేటెడ్ కొటేషన్ సిస్టమ్ (Automated Quotation System) ద్వారా సెక్యూరిటీలను అమ్మడం, కొనడం చేయబడతాయి.

3) NSE రుణ మార్కెట్లోని ప్రభుత్వ సెక్యూరిటీలు, UTI యూనిట్లు మొదలయిన వాటిని టోకు అమ్మకాలుగా చేపడుతుంది.

4) ధరలకు సంబంధించిన సమాచారంను ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (P.T.I) ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది.

5) ఈ సంస్థ పరిష్కార విధానాన్ని మెరుగుపరచడమే కాకుండా సెక్యూరిటీల వర్తకంలోని నష్ట భయాన్ని తగ్గిస్తుంది.

6) NSE సబ్సిడియరీ నేషనల్ సెక్యూరిటీస్ క్లియరింగ్ కార్పొరేషను నెలకొల్పింది. దీనిద్వారా వర్తకాన్ని నిర్వర్తించడానికి అవసరమైన పరిష్కారాలను గ్యారంటీని ఈ సంస్థ అందిస్తుంది.

7) ఈ సంస్థ కార్పొరేట్ ఈక్విటీ, రుణ పత్రాలతో వ్యవహరిస్తూ, కొనుగోలుదారులకు, అమ్మకందారులకు బ్రోకర్లుకు అవసరమైన సహాయం అందిస్తుంది.

ప్రశ్న 2.
BSE అంటే ఏమిటి ?
జవాబు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ని 1877 సంవత్సరంలో స్థాపించారు. దీనినే “నేటివ్ స్టాక్ అండ్ బ్రోకర్స్ అసోషియేషన్” ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం స్టాక్ ఎక్స్ఛేంజ్లో పనిచేసే బ్రోకర్లకు సహాయపడటం, వారి హోదాలను పరిరక్షించడం. స్టాక్ ఎక్స్ఛేంజ్లలో న్యాయమైన, సముచితమైన పనులను మాత్రమే చేపట్టి అవకతవకలను తగ్గించడంలో ఈ సంస్థ ముఖ్యపాత్రను పోషిస్తుంది.

BSE లక్షణాలు:

  1. ఈ ఎక్స్ఛేంజ్ ఆన్లైన్ ట్రేడింగ్ విధానాన్ని 1995 లో ప్రవేశపెట్టింది. ఇది సెక్యూరిటీల వర్తకాన్ని చురుకుగా చేపట్టడమే కాకుండా, స్టాక్ మార్కెట్ వ్యవహారాలను సంరక్షిస్తుంది.
  2. చిన్న తరహా, మధ్యతరహా సంస్థలు తమ ఈక్విటీలను వర్తకం చేసుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది.
  3. సెక్యూరిటీలతో వ్యవహరించేటప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడంలో ఉపయోగపడుతుంది.
  4. ఈక్విటీలు, రుణ పత్రాలు మరియు మ్యూచువల్ ఫండ్స్తో వర్తకం చేయడానికి సమర్థవంతమైన పారదర్శక మార్కెట్ను అందిస్తుంది.
  5. ప్రపంచ వ్యాప్తంగా ఖాతాదారులను కలిగి ఉంటుంది.
  6. రిస్క్ మేనేజ్మెంట్ క్లియరింగ్ సేవలు అందిస్తూ మూలదన మార్కెట్లో పాల్గొనే వారికి పరిజ్ఞానాన్ని అందిస్తుంది.

ప్రశ్న 3.
బుల్స్, బేర్స్ గురించి మీకేమి తెలుసు ?
జవాబు.
బుల్స్:

  1. వీరిని తేజీవాలాలు (Tejiwalas) అని కూడా అంటారు. ఈ మధ్యవర్తులు తమ వ్యవహారాలలో ఆశావాదిగా ఉంటారు. సెక్యూరిటీల ధరలు పెరుగుతాయనే ఆశతో వాటిని ప్రస్తుత ధరకు కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్న స్పెక్యులేటర్లను బుల్స్ అంటారు.
  2. వీరు భవిష్యత్ కాలంలో అంచనావేసిన అధిక ధరకు అమ్మగలుగుతాయని సెక్యూరిటీలను కొనుగోలు చేస్తారు. ఇతడు వాస్తవంగా సెక్యూరిటీల డెలివరీని తీసుకోడు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

బేర్స్:
1) వీరినే మండివాలాలు (Mandiwala) అంటారు. ఈ మధ్యవర్తులు తమ వ్యవహారాలను నిరాశావాదులుగా . ఉంటారు. సెక్యూరిటీల ధరలు తగ్గుతాయనే భావనతో వాటిని ప్రస్తుత ధరకు అమ్మడానికి ఒప్పందం చేసుకున్న సెక్యులేటర్లను బేర్స్ అంటారు.

2) వీరు వాస్తవంగా సెక్యూరిటీలను కొనుగోలు చేయరు, అమ్మరు. కానీ వాటిని ఎక్కువ ధరకు అమ్మజూపుతారు. అంటే భవిష్యత్లో సెక్యూరిటీలను ఇప్పటి ధరకంటే తక్కువ ధరతో కొనుగోలుచేసి అమ్మవచ్చనే ఆశతో ఈ వ్యవహారం జరుపుతారు. బేర్స్ ప్రతిపాదించిన అమ్మకం ధర, కొనుగోలు ధరల మధ్య వ్యత్యాసమే తాము ఆర్జించిన లాభంగా పరిగణిస్తారు.

ప్రశ్న 4.
సెక్యూరిటీలను జాబితాలో చేర్చడానికి సంబంధించిన ఉద్దేశాలు ఏమిటి ?
జవాబు.
సెక్యూరిటీలను జాబితాలో చేర్చడానికి గల ఉద్దేశాలు:

  1. సెక్యూరిటీల వ్యవహారాలపై నియంత్రణ కలిగి ఉండటమే కాకుండా వాటిపై సరైన పర్యవేక్షణను కలిగి ఉండటం.
  2. ఆర్థిక శక్తులను వికేంద్రీకరించడం.
  3. వ్యవస్థాపకుల ఆసక్తులను పరిరక్షించడం.
  4. పెట్టుబడిదారుల, వాటాదారుల ప్రయోజనాలను కాపాడటం.

ప్రశ్న 5.
డీమ్యూచువలైజేషన్ (Demutualisation) అంటే ఏమిటి ?
జవాబు.
నవంబర్, 2002లో కనియా కమిటీ వారు, స్టాక్ ఎక్స్ఛేంజ్లను కార్పొరేట్ తరహాలో వ్యాపారం చేయడానికి కొన్ని సూచనలు చేశారు. దీని ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజ్లన్నీ కంపెనీలుగా మారడమే కాకుండా ఏకీయత కలిగిన సంస్థగా, మార్పు చెందడానికి వీలు లేనిదిగా మారాయి. కాబట్టి స్టాక్ ఎక్స్ఛేంజ్ల లక్షణం ‘లాభాపేక్ష లేకుండా’ (Not for Profit) నుంచి ‘లాభం కోసం’ (For Profit) గా రూపుదిద్దుకున్నాయి. మార్పు చెందడానికి వీలులేదు. (Demutualization) అనే కారణం వల్ల యాజమాన్యం – నిర్వహణల మధ్య వేర్పాటువాదం ఏర్పడింది. ఓవర్ ది కౌంటర్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (OTC EOI) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఏర్పాటు అయినప్పటి నుంచి స్వచ్ఛమైన ‘డిమ్యూచువలైజ్డ్’ నిర్మాణాన్ని పాటిస్తున్నారు.

డీమ్యూచువలైజేషన్ అనగా స్టాక్ ఎక్స్ఛేంజ్లు లాభార్జన ధ్యేయంతో పన్నులు చెల్లిస్తూ కొనసాగే సంస్థగా మారడం డీమ్యూచు వలైజేషన్ నిర్వహణను యాజమాన్యం నుంచి వేరు చేయటం జరిగింది. బ్రోకర్లు తమ అధికారాలను దుర్వినియోగపరచుట వల్ల దీని అవశ్యకత ఏర్పడింది.

ప్రశ్న 6.
భారతదేశంలో మొదటి పది స్టాక్ బ్రోకింగ్ సంస్థలు ఏమిటి ?
జవాబు.
భారతదేశంలో ఉన్నత స్థాయి స్టాక్ బ్రోకింగ్ సంస్థలు
TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్ 1
TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్ 2

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
స్టాక్ ఎక్స్ఛేంజ్.
జవాబు.

  1. ఇంతకు ముందే జారీ చేసిన కంపెనీ వాటాలను అమ్మడం, కొనడం లాంటి కార్యకలాపాలు జరిపే వ్యవస్థీకృతమైన సెకండరీ మార్కెట్ను స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటారు.
  2. సెక్యూరిటీల కాంట్రాక్ట్ ఒప్పందాల నియంత్రణ చట్టం 1956, ప్రకారం సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలను క్రమబద్దీకరించి, నియంత్రించే ఉద్దేశంతో నమోదైన లేదా నమోదు కాని సంఘం, వ్యవస్థ లేదా వ్యక్తుల సముదాయమే స్టాక్ ఎక్ఛేంజ్.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

ప్రశ్న 2.
సెక్యూరిటీలను జాబితాలో చేర్చడం.
జవాబు.

  1. స్టాక్ ఎక్స్ఛేంజ్ అధికారిక జాబితాలో వర్తకం చేయడానికి గాను కంపెనీ సెక్యూరిటీలను చేర్చడాన్ని సెక్యూరిటీలను జాబితాలో చేర్చడం అంటారు.
  2. సెక్యూరిటీలను జాబితాలో చేర్చడం కోసం కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్ అనుమతి తీసుకోవాలి. ఇందుకుగాను కంపెనీలు కొన్ని లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ప్రశ్న 3.
లేమెదక్.
జవాబు.
తమ దగ్గర లేని సెక్యూరిటీలను అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకొని వాటిని నెరవేర్చడానికి తక్కువ ధరలకు సెక్యూరిటీలు లభించక అవస్థలు పడే బేర్లనే “లేమ్క్”లు అంటారు.

ప్రశ్న 4.
స్టాగ్.
జవాబు.
కొత్త కంపెనీ వాటాలను జారీ చేసినపుడు అధిక మొత్తంలో దరఖాస్తు రుసుము చెల్లించి పెద్ద మొత్తాలలో వాటాల కోసం దరఖాస్తు చేసుకున్న స్పెక్యులేటర్లునే స్టాగ్ అంటారు.

ప్రశ్న 5.
జాబర్.
జవాబు.
సెక్యూరిటీలను కొనుగోలు మరియు అమ్మకం చేస్తూ వాటి ధరలలో వచ్చే మార్పుల ద్వారా ఆదాయం పొందే స్పెక్యులేటర్లను జాబర్స్ అంటారు. కొనుగోలు, అసౌకర్యపు ధరలు మధ్యగల వ్యత్యాసమే జాబర్ యొక్క లాభం / నష్టం అవుతుంది.

ప్రశ్న 6.
స్టాక్ బ్రోకర్.
జవాబు.

  1. సాధారణ ప్రజలకు జాబర్ల మధ్య విభిన్న సెక్యూరిటీలను కమీషన్ కోసం ఏర్పాట్లు చేసే స్పెక్యులేటర్లను స్టాక్ బ్రోకర్స్ అంటారు.
  2. స్టాక్ బ్రోకర్ తన ఖాతాదారుల తరపున స్టాక్స్ మరియు ఇతర సెక్యూరిటీల కోసం కొనుగోలు మరియు అమ్మకం ఆర్డర్లను ప్రాసెస్ చేసే నిపుణుడు. స్టాక్ బ్రోకర్ను ‘రిజిష్టర్డ్ ప్రతినిధి”/పెట్టుబడి సలహాదారు / బ్రోకర్ అని కూడా పిలుస్తారు.

ప్రశ్న 7.
సెబి (SEBI).
జవాబు.

  1. సెబి అనగా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్లలో నెలకొన్న అవాంఛనీయ అలవాట్లను తొలగించడానికి, స్టాక్ ఎక్స్ఛేంజ్, దానిలో పాల్గొనే స్టాక్ బ్రోకర్లను మరియు ఆపరేటర్ల పనులను నియంత్రించడానికి SEBI Act 1992 భారత పార్లమెంట్ ద్వారా సెబిని ఏర్పాటు చేశారు.

ప్రశ్న 8.
అనుమతించిన సెక్యూరిటీలు.
జవాబు.
ఇతర స్టాక్ ఎక్స్ఛేంజ్లలో చురుకుగా వ్యవహారాలను జరుపుకునే సెక్యూరిటీలను, తమ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ కాకపోయినా లావాదేవీలు జరపటానికి అనుమతిస్తారు. ఈ తరహా సెక్యూరిటీలనే అనుమతించిన సెక్యూరిటీలు అంటారు.

ప్రశ్న 9.
స్టాక్ ఎక్స్ఛేంజ్ స్పెక్యులేటర్స్.
జవాబు.

  1. సెక్యూరిటీల ధరలలో మార్పుల వల్ల లాభం పొందే నిమిత్తం స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యవహారాలను జరిపే చట్టబద్దమైన వ్యాపారస్తులనే స్పెక్యులేటర్స్ అంటారు.
  2. వీరు ధరల ‘మార్పుల తేడాను వసూలు చేసుకోవడం గాని, చెల్లించడం గాని చేస్తారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 2 స్టాక్ ఎక్స్ఛేంజ్

ప్రశ్న 10.
స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్లు.
జవాబు.

  1. స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యవహారాలు స్టాక్ ఎక్స్ఛేంజ్ సభ్యులు మాత్రమే చేపట్టాలి. ప్రతిస్టాక్ ఎక్స్ఛేంజ్ సభ్యులను చేర్చుకోవడానికి నియమ నిబంధనలు రూపొందించుకుంటుంది. ఆ నియమనిబంధనల ప్రకారం చేర్చుకున్న సభ్యులనే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్లు అంటారు.
  2. స్టాక్ ఎక్స్ఛేంజ్లో వ్యవహారాలు చేపట్టే ఆపరేటర్లను జాబర్లు మరియు బ్రోకర్లుగా వర్గీకరించవచ్చు.

TS Inter 2nd Year Economics Notes Chapter 9 Environmental Economics

Here students can locate TS Inter 2nd Year Economics Notes Chapter 9 Environmental Economics to prepare for their exam.

TS Inter 2nd Year Economics Notes Chapter 9 Environmental Economics

→ Environment is the surroundings encompassing the physical and organic factors.

TS Inter 2nd Year Economics Notes Chapter 9 Environmental Economics

→ A balance is to be stack between environment and economic development as otherwise environment gets degraded.

→ Ecosystems operate within the environment. Some ecosystems likes forests, gross buds, deserts etc.

→ Pollution has become a challenge in the process of industrialization and growing urbanization. Pollution is different types, they are pollution, water pollution, soil pollution, sound pollution etc.

→ Population, overproduction and pollution are recognized as the recent factors for environmental degradation.

→ Sustainable development means development without the destruction of the environment. If the objective is the protection of the environment increase in the standard of living of all sections of society.

TS Inter 2nd Year Economics Notes Chapter 9 పర్యావరణ అర్థశాస్త్రం

→ మన చుట్టూ ఆవరించి ఉన్న అన్ని అంశాలను పర్యావరణంగా చెప్పవచ్చు. దీనిలో సజీవ, నిర్జీవ అంశాలు ఉంటాయి.

→ పర్యావరణంలో రకాలు :

  1. భౌతిక పర్యావరణం
  2. జీవ పర్యావరణం
  3. సామాజిక పర్యావరణం.

→ ఒక భౌగోళిక ప్రాంతంలో సహజ భౌతిక పర్యావరణాల కలయిక, వాటి మధ్యగల పరస్పర సంబంధమే ఆవరణ వ్యవస్థ.

→ కాలుష్యం ప్రధానంగా వాయు కాలుష్యం, జల కాలుష్యం, ధ్వని కాలుష్యం మొదలైన రూపాల్లో ఉంటుంది.

→ పర్యావరణ విచ్ఛేదనకు కారణాలు : భూసార క్షీణత, కాలుష్యం చెత్తా చెదారాల సమూహం, వన నిర్మూలన, సహజ కారణాలు, పారిశ్రామికీకరణ, అధికోత్పత్తి.

→ సహజ వనరుల వర్గీకరణ :

  1. పునరుద్ధరించగల వనరులు
  2. పునరుద్ధరించలేని వనరులు.

TS Inter 2nd Year Economics Notes Chapter 9 Environmental Economics

→ పర్యావరణ విధ్వంసం లేకుండా జరిగే ఆర్థికాభివృద్ధిని సుస్థిర అభివృద్ధి అంటారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 1st Lesson విత్త మార్కెట్లు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 1st Lesson విత్త మార్కెట్లు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ద్రవ్య మార్కెట్ అంటే ఏమిటి ? దాని విధులను వివరించండి.
జవాబు.
స్వల్పకాలిక పరపతి సాధనాలతో వర్తకం జరిపే మార్కెట్ను ద్రవ్యమార్కెట్ అంటారు.
ద్రవ్యంతో దగ్గరి సంబంధం గల అనేక రకాల ద్రవ్యాలతో వ్యవహరించే వివిధ సంస్థల సముదాయాన్ని ద్రవ్య మార్కెట్ అంటారు.

నిర్వచనం: “ద్రవ్య మార్కెట్ ముఖ్యంగా స్వల్పకాలిక స్వభావం గల ద్రవ్యపరమైన ఆస్తులతో జరిపే వ్యవహారాలకు కేంద్రమై ఉంటుంది. ఇది రుణగ్రస్తులకు స్వల్పకాలిక ద్రవ్య అవసరాలను తీరుస్తూ, రుణాలను అందించే వారికి ద్రవ్యత్వాన్ని లేదా నగదును సమకూరుస్తుంది”. – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ద్రవ్య మార్కెట్కు వ్యవహారాలు జరపడానికి నిర్ణీత ప్రదేశమేమీ లేదు. అందులో పాల్గొనేవారు ఫోన్, ఇంటర్నెట్ ద్వారా వ్యవహారాలను జరుపుతారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ద్రవ్య మార్కెట్ విధులు:
(ఎ) ప్రధాన విధులు:

  1. స్వల్పకాలిక నిధుల సప్లయ్కు సమానమైన డిమాండ్ను కల్పిస్తూ రెండింటి మధ్య సమతౌల్య సాధనకు తగిన యంత్రాంగంగా వ్యవహరిస్తుంది.
  2. కేంద్ర బ్యాంకు తన జోక్యం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యత్వం మరియు సాధారణ స్థాయి వడ్డీ రేట్లను ప్రభావితం చేయడానికి ప్రవాస సమాచారాన్ని అందచేస్తుంది.
  3. స్వల్పకాలిక నిధులను సమకూర్చేవారు, వాటిని వినియోగించేవారు, తమ రుణాల, పెట్టుబడుల అవసరాలను ఒక సమర్థవంతమైన మార్కెట్లో స్పష్టమైన ధరతో తీర్చుకోవడానికి సరైన మార్గం చూపుతుంది.

(బి) ఇతర విధులు:
పై ప్రధాన విధులతో పాటు క్రింద చెప్పబడిన విధులను కూడా ద్రవ్య మార్కెట్ నిర్వర్తిస్తుంది.

  1. నిర్వహణా మూలధన అవసరాలను తీర్చడానికి, ఇది వ్యాపారానికి స్వల్పకాలిక రుణ సౌకర్యాన్ని కల్పిస్తుంది.
  2. పొదుపరులకు స్వల్పకాలిక పరపతి సాధనాలను జారీ చేయడం ద్వారా ప్రభుత్వానికి నిధులను సమకూరుస్తుంది.
  3. పరపతి సాధనాలతో వ్యవహరిస్తుంది.
  4. వర్తక వాణిజ్యాలు మేలైన మార్గంలో అభివృద్ధి చెందడానికి వీలుగా బిల్లులను జారీ చేస్తుంది.
  5. బిల్లులు/హుండీలను జారీ చేయడం ద్వారా వర్తక వాణిజ్యాలు మెరుగైన పద్ధతిలో అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది.
  6. ప్రజలు తమ పొదుపు మొత్తాలను పరపతి సాధనాలలో పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే వడ్డీ/డిస్కౌంట్ల వల్ల పొదుపు అలవాటు ప్రజలలో మరింత పెంపొందింప చేయడం సాధ్యపడుతుంది.
  7. “ఎలువైన, ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా పార్టీలు తమ సమయాన్ని, శ్రమను, నగదును ఆదా చేసుకోవడంలో సహాయపడుతుంది.

ప్రశ్న 2.
మూలధన మార్కెట్ విధులను వివరించండి.
జవాబు.
మూలధన మార్కెట్:

  1. సెక్యూరిటీలను అమ్మడం ద్వారా వ్యాపార సంస్థలకు దీర్ఘకాలిక నిధులను సమకూర్చే మార్కెట్ను మూలధన మార్కెట్ అంటారు.
  2. మూలధన మార్కెట్లో ప్రైవేట్ రంగ ఉత్పత్తి సంస్థలు, ప్రభుత్వం, ప్రత్యేక విత్త సంస్థలు, మదుపరులు పాల్గొంటారు.

మూలధన మార్కెట్ను ప్రాథమిక మార్కెట్ మరియు ద్వితీయ మార్కెట్ వర్గీకరించవచ్చు.

మూలధన మార్కెట్ విధులు:
1. వనరుల మళ్ళింపు: మూలధన మార్కెట్ వనరులను మిగులుగా ఉన్న ప్రదేశాల నుంచి నిధుల లోటు ఉన్న ఉత్పాదక రంగాలకు మళ్ళించి దేశ ఉత్పాదకతను, ఆర్థికాభివృద్ధిని పెంపొందిస్తుంది.

2. పొదుపును ప్రోత్సహించడం: ప్రజలు పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి, వడ్డీ, డివిడెండ్, బోనస్ రూపంలో రావడం వల్ల, ప్రజలలో పొదుపు అలవాటుకు ప్రోత్సాహం కలుగచేస్తుంది.

3. పెట్టుబడికి ప్రోత్సాహం: అధిక పెట్టుబడులను విత్త సంస్థల ద్వారా సేకరించడం వల్ల వడ్డీరేట్లు తగ్గి పెట్టుబడులు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.

4. ధరలలో స్థిరత్వం: సెక్యూరిటీల (వాటాల) ధరలు నిలకడగా ఉండేటట్లు గాను, ధరలలో హెచ్చు తగ్గులను కనీస స్థాయికి తగ్గించడం చేస్తుంది.

5. అనుత్పాదక కార్యకలాపాల తగ్గింపు: స్పెక్యులేషన్ను అనుత్పాదక కార్యకలాపాలను తగ్గించడానికి వీలు కల్పిస్తుంది.

6. ఆర్ధికాభివృద్ధిని పెంపొందించడం: మూలధన మార్కెట్ దేశ ఆర్థికాభివృద్ధిని పెంపొందింపచేస్తుంది. పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగ పరిశ్రమలను, వర్తకాన్ని విస్తరింపచేయడానికి మిగులు నిధులను తగిన విధంగా కేటాయించడం వల్ల దేశ ఆర్థిక పురోగతి ముందంజ వేస్తుంది.

ప్రశ్న 3.
ద్రవ్య మార్కెటు, మూలధన మార్కెట్కు మధ్యగల వ్యత్యాసాలను పేర్కొనండి.
జవాబు.
ద్రవ్య మార్కెట్: స్వల్పకాలిక పరపతి సాధనాలతో వర్తకం జరిపే మార్కెట్ను ద్రవ్య మార్కెట్ అంటారు. మూలధన మార్కెట్: సెక్యూరిటీల అమ్మడం ద్వారా వ్యాపార సంస్థలకు దీర్ఘకాలిక నిధులను సమకూర్చే మార్కెట్ను మూలధన మార్కెట్ అంటారు.

ద్రవ్య మార్కెట్, మూలధన మార్కెట్ల మధ్య వ్యత్యాసం:
TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు 1
TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు 2

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 4.
వివిధ ద్రవ్య మార్కెట్ పత్రాలను వివరించండి.
జవాబు.
1) ద్రవ్యమార్కెట్ పత్రాలు:
1) ట్రెజరీ బిల్లు:
a) ట్రెజరీ బిల్లు లేదా శూన్య కూపన్ బాండు కేంద్ర ప్రభుత్వం తరపున స్వల్పకాలిక నిధుల అవసరాలను తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ చేత డిస్కౌంట్ కోసం జారీ చేసిన ఒక ప్రామిసరీ నోటు.

b) ట్రెజరీ బిల్లులు వాటి ముఖ విలువ కంటే తక్కువ ధరకు జారీ చేయబడి ముఖ విలువతో తిరిగి చెల్లించబడుతాయి. కొనుగోలు ధరకు, గడువు తేదీన చెల్లించిన మొత్తానికి మధ్యగల వ్యత్యాసమే డిస్కౌంట్గా పిలుస్తారు.

c) ఇది సురక్షిత ద్రవ్య మార్కెట్ సాధనాలలో ఒకటి. కాని దీనిపై రాబడి అంత ఆకర్షణీయంగా ఉండదు. అయినప్పటికీ, ఇవి శూన్య నష్టభయమున్న, నిశ్చిత ఆదాయం కలిగిన సాధనాలు. ట్రెజరీ బిల్లు యొక్క కొనుగోలు ధర వేలం పద్ధతిలో నిర్ణయించబడుతుంది.

d) ప్రస్తుతం భారత ప్రభుత్వం 91 రోజుల, 182 రోజుల, 364 రోజుల మూడు రకాలైన ట్రెజరీ బిల్లులను వేలం ద్వారా జారీ చేస్తున్నదీ.

2) వాణిజ్య పత్రం:
a) వాణిజ్య పత్రం, ఆర్థిక పరిపుష్టి కలిగిన కంపెనీలచే జారీ చేయబడి, కొంత డిస్కౌంట్ తో బదలాయింపు చేయదగిన ఒక స్వల్పకాలిక హామీ లేని ప్రామిసరీ నోటు.

b) వాణిజ్య పత్రం ఒక రోజు నుంచి 270 రోజుల కాల పరిమితిని కలిగి ఉంటుంది.

c) వసూలు ఖాతాలు, ఇన్వెంటరీ నిర్వహణ కోసం అవసరమయ్యే నిధుల నిమిత్తం, స్వల్పకాలిక రుణాలను చెల్లించడానికి వాణిజ్య పత్రాలను జారీ చేస్తారు.

d) వాణిజ్య పత్రాల మీది రాబడి ట్రెజరీ బిల్లులపై వచ్చే రాబడి కంటే అధికంగా ఉంటుంది. కాని ఇవి తక్కువ హామీ కలిగినవి.

3) పిలుపు ద్రవ్యం:
a) పిలుపు ద్రవ్యం నగదు, రిజర్వు ఆవశ్యకత కోసం పిలుపు రేటు అనే వడ్డీతో సహా ఒక రోజు నుంచి 14 రోజుల నోటీసుపై గాని మరియు 14 రోజులు మించిన కాల వ్యవధితో తిరిగి చెల్లించబడే, స్వల్పకాలిక నిధుల కోసం బ్యాంకులు జరిపే పరస్పర వ్యవహారం.

b) రిజర్వు బ్యాంకు నగదు రిజర్వ్ నిష్పత్తి మొత్తంలో మార్పులు చేసినప్పుడు నిర్దేశించబడిన నిల్వల కంటే తక్కువ నగదు నిల్వలు కలిగిన బ్యాంకులు మిగులు నిధులు కలిగి ఉన్న బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుంటాయి. ఈ సేవలకు గాను, రుణదాత బ్యాంకుకు చెల్లించే వడ్డీని పిలుపు రేటు అని పిలుస్తారు.

c) పిలుపు రేటు రోజు రోజుకు, గంట గంటకు కూడా మారుతూ ఉంటుంది.

4) సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్:
a) సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, దాని గ్రహీత వడ్డీతో పాటుగా ముఖ విలువ మొత్తాన్ని పొందేందుకు అధికారాన్నిస్తూ వాణిజ్య బ్యాంకులచే జారీ చేయబడ్డ బదిలీ చేయదగిన స్వల్పకాలిక హామీ లేని ప్రామిసరీ నోటు.

b) సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ వ్యక్తులకు, కార్బొరేషన్లకు, కంపెనీలకు, ప్రవాస భారతీయులకు జారీ చేయబడుతుంది.

c) ఈ సర్టిఫికెట్లు 3 నెలల నుంచి 5 సంవత్సరాల కాల పరిమితితో అందుబాటులో ఉంటాయి.

d) సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు నష్టభయం ఎక్కువగా కలిగి ఉండడం చేత వీటి మీద రాబడి ట్రెజరీ బిల్లులపై రాబడి కంటే అధికంగా ఉంటుంది.

5) వాణిజ్య బిల్లులు:
a) వాణిజ్య బిల్లు కొనుగోలుదారుడు బాకీ ఉన్న అరువు అమ్మకాల మొత్తాన్ని ఒక భవిష్యత్తు తేదీ నాడు చెల్లించడం కోసం కొనుగోలుదారుని (బిల్లు స్వీకర్త) ఆమోదానికై అమ్మకందారుని (బిల్లుకర్త)చే రాయబడ్డ అన్యాక్రాంత యోగ్యతా పత్రం. (negotiable bill)

b) బిల్లు స్వీకర్త స్వీకృతిని తెలియజేయగానే వాణిజ్య బిల్లు ఒక చట్టబద్ధమైన పత్రంగా మారి బిల్లు కర్తకు నగదు అవసరమైనప్పుడు బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

c) బ్యాంకు బిల్లుపై సొమ్మును చెల్లించేటప్పుడు కొంత డిస్కౌంట్ మొత్తాన్ని మినహాయించుకుంటుంది. గడువు తేదీనాడు బిల్లు మొత్తాన్ని బ్యాంకు బిల్లు స్వీకర్త వద్ద వసూలు చేసుకుంటుంది.

ప్రశ్న 5.
ఉత్పన్నాలు అంటే ఏమిటి ? వివిధ ఉత్పన్నాల ఉత్పత్తులను వివరించండి.
జవాబు.
ఉత్పన్నాలు:
1) ఉత్పన్నాలు అనగా ఆర్థిక ఒప్పందాలు. వీటి విలువ వీటిని పోలిన ఇతర ఆస్తుల విలువపై ఆధారపడి ఉంటుంది.
2) ఉత్పన్నాలను సరిపోల్చడానికి ఉపయోగించే ఇతర ఆస్తులు స్టాక్స్, బాండ్లు, కరెన్సీలు, వస్తువులు మరియు మార్కెట్ సూచికలు.
ఉత్పన్నాల ఉత్పత్తులు:
ఉత్పన్న ఉత్పత్తులను 4 రకాలుగా వర్గీకరించవచ్చు.
ఎ) ఫార్వార్డ్స్
బి) ఫ్యూచర్స్,
సి) ఆప్షన్స్,
డి) స్వాప్స్
TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు 3

ఎ) ఫార్వార్డ్స్:

  1. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం
  2. ముందుగా అంగీకరించిన ధర వద్ద భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీలో సెక్యూరిటీల పరిష్కారం జరుగుతుంది.

బి) ఫ్యూచర్స్:

  1. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట ధర వద్ద ఒక ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి రెండు పార్టీల మధ్య చేసుకున్న ఒప్పందం.
  2. ఫ్యూచర్స్ కాంట్రాక్టులు ప్రత్యేకమైన ఫార్వర్డ్ కాంట్రాక్టులు. వీటిలో ప్రామాణికమైన మారకపు వర్తక ఒప్పందాలు ఇమిడి ఉంటాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

సి) ఆప్షన్స్:

  1. ఆప్షన్స్ రెండు రకాలు – కాల్స్ మరియు పుట్స్
  2. కాల్స్ కొనుగోలుదారునికి కొనుగోలు చేయడానికి హక్కును ఇస్తాయి. కాని ఇచ్చిన భవిష్యత్ తేదీన లేదా అంతకు ముందు నిర్ధారించిన ధర వద్ద నిర్దిష్ట ఆస్తి యొక్క నిర్దిష్ట పరిమాణాన్ని కొనుగోలు చేయవలసిన బాధ్యత మాత్రం ఏర్పడదు.
  3. పుట్స్ కొనుగోలుదారునికి ఆస్తి కొనుగోలు హక్కును ఇస్తాయి. కాని ఇచ్చిన తేదీలో లేదా నిర్ధారిత ధర వద్ద నిర్దిష్టమైన ఆస్తిని, నిర్దిష్ట పరిమాణాన్ని విక్రయించే బాధ్యత ఏర్పడదు.

డి) స్వాప్స్:

  1. ముందుగా నిర్ణయించిన సూత్రం ప్రకారం భవిష్యత్తులో నగదు ప్రవాహాన్ని మార్పిడి చేయడానికి రెండు పార్టీల మధ్య కుదిరిన ప్రైవేట్ ఒప్పందాలు స్వాప్లు.
  2. వాటిని ఫార్వర్డ్ కాంట్రాక్టులు ఫోర్ట్ఫోలియోగ పరిగణించవచ్చు.

ప్రశ్న 6.
వివిధ రుణ మార్కెట్ పత్రాల గురించి సవివరంగా తెలియచేయండి.
జవాబు.
రుణ మార్కెట్: రుణ పత్రాలతో వ్యాపారం జరిగే మార్కెట్ను రుణ మార్కెట్ అంటారు. రుణ పత్రాలలో తనఖా, ప్రామిసరీ నోట్స్, బాండ్లు మరియు డిపాజిట్ సర్టిఫికెట్లు ఉన్నాయి.
రుణ మార్కెట్ పత్రాలు: ఈ క్రింది రుణ పత్రాలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, మునిసిపల్ కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థలు మరియు వాణిజ్య సంస్థలు జారీ చేస్తాయి. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు మరియు పబ్లిక్ లిమిటెడ్ సంస్థలు రుణ మార్కెట్లో జారీ చేసే ముఖ్యమైన పత్రాలు.
1) డిబెంచర్లు:

  1. ఇవి ఒక రకమైన రుణ పత్రాలు. ఇవి నిర్దిష్ట కాలానికి నిర్ణీత వడ్డీ రేటును అందిస్తుంది.
  2. కంపెనీలు లేదా ప్రభుత్వాలు నిధులను సమకూర్చుకోవడానికి డిబెంచర్లను ఉపయోగిస్తాయి. డిబెంచర్లు కేవలం కంపెనీలు తీసుకున్న రుణాలు మాత్రమే. అవి సంస్థలో యాజమాన్యపు హక్కును కల్గించవు.

2) బాండ్లు:

  1. మూలధనాన్ని పెంచడానికి కార్పొరేషన్లు మరియు ప్రభుత్వాలు జారీ చేసే స్థిర ఆదాయ సెక్యూరిటీలు బాండ్లు.
  2. బాండ్ జారీ చేసేవారు బాండ్ హోల్డర్ నుంచి మూలధనాన్ని తీసుకుంటారు మరియు వారికి నిర్ణీత కాలానికి స్థిర వడ్డీ రేటుతో స్థిర చెల్లింపులు చేస్తారు.

3) ప్రభుత్వ సెక్యూరిటీలు:

  1. ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా G-Secs భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది.
  2. సెక్యూరిటీలు స్థిర వడ్డీ రేటును అందిస్తాయి. ఇక్కడ వడ్డీ వార్షిక కాలంలో రెండు సార్లు చెల్లించబడుతుంది.

3) ట్రెజరీ బిల్లులు:

  1. ట్రెజరీ బిల్లులు లేదా టి-బిల్లులు, వీటిని రిజర్వు బ్యాంకు జారీ చేస్తుంది.
  2. ఇవి 91 రోజులు, 182 రోజులు మరియు 364 రోజుల కాలానికి జారీ చేస్తారు.

4) సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు:

  1. ఒక నిర్దిష్ట కాలానికి బ్యాంకు వద్ద ఉన్న నిధుల డిపాజిటర్లకు సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు (CDలు) బ్యాంక్ జారీ చేస్తుంది.
  2. CDలు సాంప్రదాయ టర్మ్ డిపాజిట్ల మాదిరిగానే ఉంటాయి, వీటిని స్వల్పకాలిక ద్రవ్య మార్కెట్లో మార్చుకోవచ్చు మరియు వర్తకం చేయవచ్చు.

5) వాణిజ్య పత్రాలు:

  1. వాణిజ్య పత్రాలను CP అని కూడా పిలుస్తారు. ఇవి నిధుల సేకరణ కోసం కంపెనీలు జారీ చేసే స్వల్పకాలిక రుణ పత్రాలు.
  2. ఇది ప్రామిసరీ నోట్ రూపంలో జారీ చేయబడిన రిస్క్ ను కలిగి ఉన్న ద్రవ్య మార్కెట్ పత్రం. దీనిని 1990లో భారతదేశంలో మొదటిసారి ప్రవేశపెట్టడం జరిగింది.

ప్రశ్న 7.
ఈక్విటీ మార్కెట్ పత్రాలను వివరించండి.
జవాబు.
ఈక్విటీ మార్కెట్: లిస్టెడ్ కంపెనీల షేర్లలో వర్తకం చేయడానికి కొనుగోలుదారులు మరియు విక్రేతలు కలిసే మార్కెటు ఈక్విటీ మార్కెట్ అంటారు. దీనినే స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ అని కూడా పిలుస్తారు.

ఈక్విటీ మార్కెట్ పత్రాలు:
1) సాధారణ వాటాలు:
1) సాధారణ స్టాక్ వాటాలు యాజమాన్య మూలధనాన్ని సూచిస్తాయి మరియు సాధారణ వాటాలను కలిగి ఉన్న వారికి సంస్థ యొక్క లాభాల నుంచి డివిడెండ్ చెల్లించబడుతుంది.

2) సాధారణ వాటాదారులకు సంస్థ యొక్క ఆదాయం మరియు ఆస్తుల అవశేష విలువపై అధికారం ఉంటుంది. ఆధిక్యపు వాటాదారులు మరియు బాండ్ హెరాల్డర్కు చెల్లించిన తర్వాత మాత్రమే వారు సంస్థ యొక్క లాభాలలో వాటాను పొందటానికి అర్హులు.

2) ఆధిక్యపు వాటాలు:
1) ఆధిక్యపు వాటాలు మిశ్రమ జాతి భద్రత లక్షణాలను కలిగి ఉంటాయి. ఎందుకంటే అవి సాధారణ ఈక్విటీ వాటాలు మరియు డిబెంచర్ల యొక్క కొన్ని లక్షణాలను మిళితం చేస్తాయి.

2) అవి డివిడెండ్ల స్థిరమైన రేటును కలిగి ఉండటం, ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా కంపెనీ ఆదాయంపై మరియు ఆస్తులపై హక్కును కలిగి ఉంటారు. కంపెనీ యొక్క మిగిలిన ఆదాయంలో వీరికి ఏ హక్కులేదు మరియు వాటాదారులకు ఓటు హక్కును ఇవ్వనందున అవి డిబెంచర్ల వంటివి.

3) ప్రైవేట్ ఈక్విటీ:
1) ప్రైవేట్ ప్లేస్మెంట్ల ద్వారా చేసే ఈక్విటీ పెట్టుబడులను ప్రైవేట్ ఈక్విటీ అంటారు. ప్రైవేట్ ఈక్విటీని ప్రైవేట్ ఋణ బాధ్యతగల సంస్థలు మరియు భాగస్వామ్యాలు సేకరిస్తాయి.

2) సాధారణంగా, ప్రారంభ మరియు చిన్న/మధ్య తరహా కంపెనీలు, సంస్థాగత పెట్టుబడిదారులు మరియు సంపన్న వ్యక్తుల నుండి ఈ మార్గం ద్వారా మూలధనాన్ని సేకరిస్తాయి.

4) మ్యూచువల్ ఫండ్స్:
1) మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడిదారులకు లాభం సంపాదించడానికి అనేకమంది పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి కంపెనీ స్టాక్స్, బాండ్స్, ప్రభుత్వ పత్రాలు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టే సాధనం.

2) వచ్చిన లాభాన్ని పెట్టుబడిదారులకు డివిడెండ్లుగా చెల్లించవచ్చు లేదా మూలధన పెరుగుదల కోసం ఫండ్ ద్వారా తిరిగి పెట్టు బడి పెట్టవచ్చు.

5) ఉత్పన్నాలు:
1) ఇవి ఆర్థిక ఒప్పందాలు. వీటి విలువ వీటిని పోలిన ఇతర ఆస్తుల విలువపై ఆధారపడి ఉంటుంది.

2) సాధారణంగా సరిపోల్చడానికి ఇతర ఆస్తులు ఏవనగా స్టాక్స్, బాండ్లు, కరెన్సీలు, వస్తువులు మరియు మార్కెట్ సూచికలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆస్తుల విలువ మారుతూ ఉంటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 8.
మ్యూచువల్ ఫండ్ను నిర్వచించి, దాని ధ్యేయాలు ఏమిటో వివరించండి.
జవాబు.
1) మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడిదారులకు లాభం సంపాదించడానికి అనేక మంది పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి కంపెనీ స్టాక్స్, బాండ్స్, ప్రభుత్వ పత్రాలు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టే సాధనం.

2) వీటిలో వచ్చిన లాభాన్ని పెట్టుబడిదారులకు డివిడెండ్లుగా చెల్లించవచ్చు లేదా మూలధన పెరుగుదల కోసం ఫండ్ ద్వారా తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు.

మ్యూచువల్ ఫండ్ ధ్యేయాలు:
1) లక్ష్య ఆధారిత పెట్టుబడి: మ్యూచువల్ ఫండ్స్ యొక్క ప్రథమ పెట్టుబడి లక్ష్యం ఇది. ఇది వివిధ పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల మ్యూచువల్ ఫండ్లను అందిస్తుంది. ఫండ్ మేనేజర్ పెట్టుబడిదారునికి ఏర్పడే రిస్క్ మరియు రుణ బాధ్యతలు మొదలైన వాటిని చూసిన తరువాతనే పెట్టుబడిదారులకు అనువైన సెక్యూరిటీల మిశ్రమాన్ని ఎంపిక చేస్తారు.

2) పెట్టుబడి వృద్ధి: అనేక మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడి ఉద్దేశాలలో పెట్టుబడి వృద్ధి ఒకటి. అధిక రాబడి కోసం చూస్తున్న పెట్టుబడిదారులు కొంత అదనపు రిస్క్ తీసుకొని పెట్టుబడిని చేస్తారు. ఈ ఉద్దేశం ప్రకారం వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థలలో డబ్బును పెట్టుబడి పెడతాయి.

3) పన్ను ఆదా: మ్యూచువల్ ఫండ్ యొక్క ముఖ్యమైన పెట్టుబడి ఉద్దేశాలలో పన్ను ఆదా కూడా ఒకటి. ఎక్కువగా సంపన్న క్లయింట్లు, సంస్థాగత పెట్టుబడిదారులు మరియు కార్పొరేట్ పన్ను భారాన్ని తగ్గించే ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు వివిధ రకాల ఫండ్లు అందుబాటులో ఉండి పన్నులు తగ్గిస్తాయి.

ప్రశ్న 9.
వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ ఏమిటో సవివరంగా తెలియజేయండి.”
జవాబు.
మ్యూచువల్ ఫండ్ పథకాలను దాని నిర్మాణం మరియు పెట్టుబడి లక్ష్యం ఆధారంగా వర్గీకరించవచ్చు.
TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు 4
స్వరూపం ఆధారంగా:
ద్రవ్య మార్కెట్ ఫండ్
ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్
ఓపెన్ ఎండెడ్ ఫండ్స్:

  1. ఓపెన్ – ఎండెడ్ ఫండ్ అంటే నిరంతర ప్రాతిపదికన చందా చేయడానికి మరియు తిరిగి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అంటే ఏడాది పొడవునా లభ్యమౌతుంది.
  2. ఈ ఫండ్కు స్థిర మెచ్యూరిటీ వ్యవధి లేదు.
  3. పెట్టుబడిదారులు నికర ఆస్తి విలువ (NAV) సంబంధిత ధరలతో సౌకర్యవంతంగా యూనిట్లను కొనుగోలు చేయవచ్చు మరియు అమ్మవచ్చు. ఓపెన్ – ఎండ్ పథకాల యొక్క ముఖ్య లక్షణం ద్రవ్యత్వాన్ని కల్పించడం.

క్లోజ్ – ఎండెడ్ ఫండ్స్:
1) క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ నిర్ణీత మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా 3-15 సంవత్సరాల కాల వ్యవధిలో ఉంటాయి. ఈ నిధులు నిర్దిష్ట కాలంలో మాత్రమే చందా కోసం తెరవబడతాయి.

2) ప్రారంభ పబ్లిక్ ఇష్యూ సమయంలో పెట్టుబడిదారులు ఈ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు మరియు ఆ తరువాత వారు జాబితా చేయబడిన స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ఈ పథకం యొక్క యూనిట్లను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు.

3) పెట్టుబడిదారులకు నిష్క్రమణ మార్గాన్ని అందించడానికి, కొన్ని క్లోజ్-ఎండెడ్ ఫండ్ NAV సంబంధిత ధరలకు మ్యూచువల్ ఫండ్ పునర్ కొనుగోలు విధానం ద్వారా యూనిట్లను తిరిగి విక్రయించే అవకాశాన్ని ఇస్తాయి.

ఇంటర్వెల్ ఫండ్స్:

  1. ఇంటర్వెల్ ఫండ్స్ ఓపెన్ – ఎండెడ్ మరియు క్లోజ్-ఎండెడ్ స్కీమ్ల లక్షణాలను మిళితం చేస్తాయి.
  2. NAV సంబంధిత ధరల వద్ద ముందుగా నిర్ణయించిన వ్యవధిలో అవి అమ్మకం లేదా విముక్తి కోసం తెరవబడతాయి. పెట్టుబడి లక్ష్యం ఆధారంగా:

వృద్ధి ఫండ్స్:

  1. పెట్టుబడుల విలువ పెరుగుదలను మూలధనం విలువ పెరుగుదల ద్వారా ఉద్దేశించిన నిధులు ఈ రకానికి వస్తాయి.
  2. ఇలాంటి నిధులు వృద్ధి ఆధారిత సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెడతాయి. అంటే, దీర్ఘకాలంలో పెరుగుదల గల కంపెనీల వాటాలలో పెట్టుబడిని చేస్తారు.
  3. గ్రోత్ ఫండ్స్ను నెస్ట్ ఎగ్స్ లేదా లాంగ్ హాల్ ఇన్వెస్టిమెంట్స్ అని కూడా అంటారు.

ఆదాయ ఫండ్స్:

  1. పెట్టుబడిదారులకు క్రమమైన మరియు స్థిరమైన ఆదాయాన్ని అందించడం ఆదాయ ఫండ్స్ యొక్క ఉద్దేశం.
  2. ఇలాంటి పథకాలు సాధారణంగా బాండ్లు, కార్పొరేట్ డిబెంచర్లు మరియు ప్రభుత్వ సెక్యూరిటీల వంటి స్థిర ఆదాయ సెక్యూరిటీల ద్వారా లభ్యమౌతాయి.
  3. మూలధన స్థిరత్వం, సాధారణ ఆదాయానికి ఈ ఫండ్స్ అనువైనవి.

సమతుల్య ఫండ్స్:

  1. సమతుల్య ఫండ్స్ ఉద్దేశం వృద్ధి మరియు సాధారణ ఆదాయం రెండింటినీ అందించడం.
  2. ఇలాంటి పథకాలు క్రమానుగతంగా వారి సంపాదనలో కొంత భాగాన్ని పంపిణీ చేస్తాయి మరియు ఈక్విటీలు మరియు స్థిర ఆదాయ సెక్యూరిటీలలో వారి ప్రతిపాదన పత్రాలలో సూచించిన నిష్పత్తిలో పెట్టుబడి పెడతాయి. మెజారిటీ నిధులు ఈ కోవలోకి వస్తాయి.

ద్రవ్య మార్కెట్ ఫండ్స్:

  1. ద్రవ్య మార్కెట్ ఫండ్ల ఉద్దేశం తేలికైన ద్రవ్యత, మూలధన సంరక్షణ మరియు మితమైన ఆదాయాన్ని అందించడం.
  2. ఈ పథకాలు సాధారణంగా ట్రెజరీ బిల్లులు, డిపాజిట్ సర్టిఫికెట్లు, కమర్షియల్ పత్రాలు మరియు ఇంటర్ బ్యాంక్ కాల్ మనీ వంటి సురక్షితమైన స్వల్పకాలిక సాధనాలలో పెట్టుబడి పెడతాయి.
  3. మార్కెట్లో ఉన్న వడ్డీ రేట్లను బట్టి ఈ పథకాలపై రాబడి మారవచ్చు. ఈ నిధులు కార్పొరేట్ మరియు వ్యక్తిగత పెట్టుబడిదారులకు వారి మిగులు నిధులను స్వల్ప కాలానికి మళ్ళించటానికి అనువైనవి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

III. ఇతర రకాలు:
1) పన్ను పొదుపు ఫండ్స్ పెట్టుబడిదారులను ప్రోత్సహించటానికి నిర్దేశిత మార్గాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఈ పథకాలు భారతీయ ఆదాయపు పన్ను చట్టాల యొక్క నిర్దిష్ట నిబంధనల ప్రకారం పెట్టుబడిదారులకు పన్ను రాయితీలను అందిస్తాయి.

2) పరిశ్రమ నిర్దిష్ట ఫండ్స్:

  • పరిశ్రమ నిర్దిష్ట పథకాలు ప్రతిపాదనలో పేర్కొన్న పరిశ్రమలలో మాత్రమే పెట్టుబడి పెడతాయి.
  • ఈ నిధుల పెట్టుబడి ఇన్ఫోటెక్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) ఫార్మాస్యూటికల్స్ మొదలైన నిర్దిష్ట పరిశ్రమలకు పరిమితం.

ఇండెక్స్ ఫండ్స్: BSE లేదా NSEల నిర్దిష్ట సూచిక యొక్క పనితీరును ప్రతిబింబించడానికి ఇండెక్స్ ఫండ్స్ ప్రయత్నిస్తాయి.

ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్:

  1. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ పెట్టుబడిదారులకు క్లోజ్డ్ ఎండెడ్ మరియు ఓపెన్ – ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ యొక్క మిశ్రమ ప్రయోజనాలను అందిస్తాయి.
  2. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ సూచికలను అనుసరిస్తాయి మరియు సూచీతో ముడిపడి ఉన్న ధరల వద్ద ఒకే స్టాక్ స్టాక్ ఎక్స్ఛేంజిలలో వర్తకం చేయబడతాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దేశీయ బ్యాంకర్లకు, వడ్డీ వ్యాపారస్తులకు మధ్యగల తేడాలను రాయండి.
జవాబు.
దేశీయ బ్యాంకర్లు

  1. దేశీయ బ్యాంకర్లు వర్తక వాణిజ్య అవసరాలకు రుణాలిస్తారు.
  2. వీరు వసూలు చేసే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది.
  3. దేశీయ బ్యాంకర్లు ఇచ్చే రుణాలకు హామీ తప్పనిసరి.
  4. వీరు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందిస్తారు.

వడ్డీ వ్యాపారస్తులు

  1. వడ్డీ వ్యాపారస్తులు వినియోగ అవసరాలకు రుణాలిస్తారు.
  2. వడ్డీ వ్యాపారస్తులు వసూలు చేసే వడ్డీరేటు అధికంగా ఉంటుంది.
  3. వడ్డీ వ్యాపారస్తులు ఇచ్చే రుణాలకు హామీ అవసరం లేదు.
  4. వీరు ఎక్కువ స్వల్పకాలిక రుణాలకు ప్రాధాన్యత ఇస్తారు.

ప్రశ్న 2.
వ్యవస్థీకృత ద్రవ్య మార్కెట్ నిర్వహించే పాత్ర ఏమిటి ?
జవాబు.
సంఘటిత ద్రవ్య మార్కెట్లో పని చేస్తున్నా లేదా కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు R.B.I ద్వారాగాని, ఇతర నియంత్రణ సంస్థలైన ‘నాబార్డ్ (NABARD) ద్వారాగాని క్రమబద్దీకరించబడతాయి. అందువల్ల వాణిజ్య బ్యాంకులు, భారతీయ మరియు విదేశీ, పబ్లిక్ ప్రైవేట్ రంగానికి చెందినవి వ్యవస్థీకృత ద్రవ్యమార్కెట్లో కేంద్ర ప్రభుత్వం, వ్యాపార సంస్థలతోపాటు పాల్గొంటాయి.

వ్యవస్థీకృత ద్రవ్య మార్కెట్ పాత్ర:

  1. వాణిజ్య బ్యాంకులు నగదు రిజర్వు నిష్పత్తి కొనసాగించడంలో సహాయపడుతుంది.
  2. సంస్థలు నిర్వహణ మూలధన అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.
  3. నిధుల లోటును పూరించడానికి ప్రభుత్వానికి సహకరిస్తుంది.

ద్రవ్యమార్కెట్ పరపతి సాధనాలు ట్రెజరీ బిల్లులు, వాణిజ్య పత్రాలు, పిలుపు ద్రవ్యం, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, వాణిజ్య బిల్లులు మొదలైన సాధనాలతో వాణిజ్య బ్యాంకులు, సంస్థలు, ప్రభుత్వం నిధులను సమకూర్చుకుంటాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 3.
ప్రాథమిక మార్కెట్కు, ద్వితీయ మార్కెట్కు మధ్యగల తేడాలను రాయండి.
జవాబు.
ప్రాథమిక మార్కెట్

  1. కొత్తగా జారీచేయబడిన వాటాల కొనుగోళ్ళు జరుపుతుంది.
  2. పెట్టుబడిన అభివృద్ధి చేయడంలో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది.
  3. సెక్యూరిటీల కొనుగోలు వ్యవహారాలు మాత్రమే జరుగుతాయి.
  4. కంపెనీ నిర్వాహకులు సెక్యూరిటీ ధరలను నిర్ణయిస్తారు.
  5. సెక్యూరిటీ వ్యవహారాలు జరపడానికి నిర్ణీత ప్రదేశం లేదు.
  6. దీని ద్వారా కంపెనీ తన సెక్యూరిటీలను నేరుగా గాని, మధ్యవర్తుల ద్వారాగాని పెట్టుబడి దారులకు అమ్మగలదు.

ద్వితీయ మార్కెట్

  1. ఒకసారి కొనుగోలు చేయబడిన వాటాలను మరల మార్కెట్ చేయడం జరుపుతుంది.
  2. పెట్టుబడిని అభివృద్ధి చేయడంలో పరోక్షంగా సంబంధం కలిగి ఉంటుంది.
  3. సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలు రెండు జరుగుతాయి.
  4. సెక్యూరిటీల ధర వాటి యొక్క సప్లయ్, డిమాండ్లను బట్టి నిర్ణయించబడతాయి.
  5. నిర్ణీత ప్రదేశాలలో సెక్యూరిటీలకు సంబంధించిన వ్యవహారాలు జరుగుతాయి.
  6. సెక్యూరిటీదారులు తమ సెక్యూరిటీలను వినిమయం చేయడంలో తోడ్పడుతుంది.

ప్రశ్న 4.
ట్రెజరీ బిల్లు అంటే ఏమిటి ?
జవాబు.
1) ట్రెజరీ బిల్లు లేదా శూన్య కూపన్ బాండు కేంద్రప్రభుత్వం తరుపున స్వల్పకాలిక నిధుల అవసరాలను తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) చేత డిస్కౌంట్ కోసం జారీ చేసిన ఒక ప్రామిసరీ నోటు.

2) ట్రెజరీ బిల్లులు వాటి ముఖ విలువ కంటే తక్కువ ధరకు జారీచేయబడి ముఖ విలువతో తిరిగి చెల్లించబడతాయి. కొనుగోలు ధరకు, గడువు తేదీని చెల్లించిన మొత్తానికి మధ్యగల వ్యత్యాసమే డిస్కౌంట్గా పిలువబడు ఆర్జించిన వడ్డీ.

3) ఇది సురక్షిత ద్రవ్య మార్కెట్ సాధనాలలో ఒకటి. కాని దీనిపై రాబడి అంత ఆకర్షణీయంగా ఉండదు. అయినప్పటికీ,
ఇవి శూన్య నష్ట భయమున్న, నిశ్చిత ఆదాయం కలిగిన సాధనాలు. ట్రెజరీ బిల్లు యొక్క కొనుగోలు ధర వేలం పద్దతిలో నిర్ణయించబడుతుంది.

4) ప్రస్తుతం భారత ప్రభుత్వం 91 రోజుల, 182 రోజుల, 364 రోజుల మూడు రకాలైన ట్రెజరీ బిల్లులను వేలం ద్వారా జారీ చేస్తున్నది.

ప్రశ్న 5.
ఇ-ఐపిఒలు (e – IPO).
జవాబు.
1) కంపెనీ సెక్యూరిటీలను ఆన్లైన్ వర్తకం వ్యవస్థ గల స్టాక్ ఎక్స్ఛేంజ్తో ఒప్పందం చేసుకోవడం ద్వారా జారీ చేస్తుంది. దీనినే (e – IPO – Initial Public Offer) ‘ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్’ అంటారు.

2) దీనికోసం, దరఖాస్తులను అంగీకరించి ఆర్డర్లను కంపెనీకి ఇవ్వడానికి సెబి (SEBI) రిజిష్టర్ బ్రోకర్లను
నియమించవలసి ఉంటుంది.

3) వాటాలను జారీ చేస్తున్న కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్తో ఎలక్ట్రానిక్ కనెక్టివిటీ కోసం ఒక రిజిష్ట్రారును నియమించవలసి ఉంటుంది.

4) వాటాలను జారీ చేసే కంపెనీ తన సెక్యూరిటీలను “సెక్యూరిటీలను జాబితాలో చేర్చిన స్టాక్ ఎక్స్ఛేంజ్లో” కాకుండా ఏదైనా ఇతర స్టాక్ ఎక్స్ఛేంజ్లోని జాబితాలో చేర్చవలసి ఉంటుంది. సెక్యూరిటీల జారీ నిర్వహించే మధ్యవర్తులను ఒక లీడ్ మేనేజర్ సమన్వయించడం జరుగుతుంది.

ప్రశ్న 6.
ఏ విధంగా ఆర్థిక మార్కెట్లు వర్గీకరించారు ?
జవాబు.
ద్రవ్య పరమైన ఆస్తులను సృష్టించడానికి, వినిమయం చేయడానికి కావలసిన విత్త వ్యవహారాలు జరిపే మార్కెట్లను విత్త మార్కెట్లు అంటారు. వీటినే ఆర్థిక మార్కెట్లు అని కూడా పిలుస్తారు.
విత్త మార్కెట్లను విత్త యొక్క కాలపరిమితి ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:
1) ద్రవ్య మార్కెట్లు,
2) మూలధన మార్కెట్లు
TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు 5
A) స్వల్ప కాల పరపతి సాధనాలలో వర్తకం జరిపే మార్కెట్ను ద్రవ్య మార్కెట్ అంటారు. దీనిని మరల సంఘటిత మార్కెట్ మరియు అసంఘటిత మార్కెట్గా వర్గీకరించారు.

B) వ్యాపార దీర్ఘకాలిక అవసరాలను తీర్చడంకోసం వాటాల కొనుగోలు అమ్మకాలను సంబంధించిన వ్యవహారాలు జరిగే మార్కెట్లు మూలధన మార్కెట్ అంటారు. మూలధన మార్కెట్ను ప్రాథమిక మరియు ద్వితీయ మార్కెట్లుగా విభజించవచ్చు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 7.
సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు అంటే ఏమిటి ?
జవాబు.

  1. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ దాని గ్రహీత వడ్డీతో పాటుగా ముఖ విలువ మొత్తాన్ని పొందేందుకు అధికారాన్నిస్తూ వాణిజ్య బ్యాంకులచే జారీ చేయబడ్డ బదిలీ చేయదగిన స్వల్పకాలిక హామీ లేని ప్రామిసరీ నోటు.
  2. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ వ్యక్తులకు, కార్పొరేషన్లకు, కంపెనీలకు, ప్రవాస భారతీయులకు జారీ చేయబడుతుంది.
  3. ఈ సర్టిఫికేట్లు 3 నెలల నుంచి 5 సంవత్సరాల కాల పరిమితితో అందుబాటులో ఉంటాయి.
  4. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు నష్టభయం ఎక్కువగా కలిగి ఉండటం చేత వీటి మీద రాబడి ట్రెజరీ బిల్లులపై రాబడి కంటే అధికంగా ఉంటుంది.

ప్రశ్న 8.
వాణిజ్య పత్రం గురించి తెలపండి.
జవాబు.

  1. వాణిజ్య పత్రం ఆర్థిక పరిపుష్టి కలిగిన కంపెనీలచే జారీ చేయబడి, కొంత డిస్కౌంట్తో బదలాయింపు చేయదగిన ఒక స్వల్పకాలిక హామీ లేని ప్రామిసరీ నోటు.
  2. వాణిజ్య పత్రం ఒక రోజు నుంచి 270 రోజుల కాల పరిమితిని కలిగి ఉంటుంది.
  3. వసూలు ఖాతాలు, ఇన్వెంటరీ నిర్వహణ కోసం అవసరం అయ్యే నిధుల నిమిత్తం, స్వల్పకాలిక రుణాలను చెల్లించడానికి వాణిజ్య పత్రాలను జారీ చేస్తారు.
  4. వాణిజ్య పత్రాల మీద రాబడి ట్రెజరీ బిల్లులపై వచ్చే రాబడి కంటే అధికంగా ఉంటుంది. కాని ఇవి తక్కువ హామీ కలిగినవి.

ప్రశ్న 9.
పిలుపు ద్రవ్యం అంటే ఏమిటి ?
జవాబు.
1) పిలుపు ద్రవ్యం నగదు, రిజర్వు ఆవశ్యకత కోసం పిలుపు రేటు అనే వడ్డీతో సహా ఒక రోజు నుంచి 14 రోజుల నోటీసుపై గాని మరియు 14 రోజులు మించిన కాల వ్యవధితో తిరిగి చెల్లించబడే, స్వల్పకాలిక నిధుల కోసం బ్యాంకులు జరిపే పరస్పర వ్యవహారం.

2) రిజర్వ్ బ్యాంకు ఈ నగదు రిజర్వ్ నిష్పత్తి మొత్తంలో మార్పులు చేసినప్పుడు నిర్దేశించబడిన నిల్వల కంటే తక్కువ నగదు నిల్వలు కలిగిన బ్యాంకులు మిగులు నిధులు కలిగి ఉన్న బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుంటాయి. ఈ సేవలకు గాను, రుణదాత బ్యాంకుకు చెల్లించే వడ్డీని పిలుపు రేటు అని పిలుస్తారు.

3) పిలుపు రేటు రోజు రోజుకు, గంట గంటకు కూడా మారుతూ ఉంటుంది.

ప్రశ్న 10.
బాండ్ మార్కెట్ గురించి తెలియజేయండి.
జవాబు.
1) బాండ్ మార్కెట్ను తరచుగా డెట్ మార్కెట్, ‘స్థిర – ఆదాయ’ మార్కెట్ లేదా ‘క్రెడిట్-మార్కెట్’ అని పిలుస్తారు.

2) ప్రభుత్వ సంస్థలు లేదా బహిరంగంగా వర్తకం చేసే సంస్థల ద్వారా మార్కెట్లోకి తీసుకువచ్చే రుణ సెక్యూరిటీలను పెట్టుబడిదారులు కొనుగోలు చేసే మార్కెట్ స్థలంనే బాండ్ మార్కెట్ అంటారు.

3) ప్రభుత్వాలు సాధారణంగా అప్పులు చెల్లించడానికి లేదా మౌలిక సదుపాయాల మెరుగుదలకు నిధులు సమకూర్చడానికి బాండ్లను జారీ చేస్తాయి.

4) పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు వ్యాపార విస్తరణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు లేదా కొనసాగుతున్న కార్యకలాపాలను నిర్వహించడానికి బాండ్లను జారీ చేస్తాయి.

5) సాధారణ బాండ్ మార్కెట్ను కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ బాండ్లు, మునిసిపల్ బాండ్లు, తనఖా పౌండ్లు మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ బాండ్లుగా విభజించవచ్చు.

ప్రశ్న 11.
రుణ మార్కెట్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. రుణ మార్కెట్ అంటే రుణ పత్రాలతో వ్యాపారం జరిగే ఏదైనా మార్కెట్ స్థలము.
  2. రుణ పత్రాలలో తనఖా, ప్రామిసరీ నోట్స్, బాండ్లు మరియు డిపాజిట్ సర్టిఫికెట్లు ఉన్నాయి.
  3. ఇది వివిధ రకాల స్థిర ఆదాయ ఆర్థిక పత్రాలను జారీ చేస్తుంది మరియు ఆ తరువాత వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది.
  4. రుణ మార్కెట్ ప్రభుత్వ రంగ మరియు ప్రైవేట్ రంగ ప్రాజెక్టులకు ఎక్కువ నిధులను సమకూర్చే మార్గాలను అందిస్తుంది మరియు సంస్థాగత ఫైనాన్సింగ్పై ఒత్తిడిని తగ్గిస్తుంది.
  5. స్థిర రేట్ల రుణ పత్రాలతో అనుసంధానించబడినప్పుడు, మార్కెట్ను స్థిర ఆదాయ మార్కెట్ అని పిలుస్తారు.

ప్రశ్న 12.
ఈక్విటీ మార్కెట్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఈక్విటీ మార్కెట్ను “స్టాక్ మార్కెట్” లేదా “షేర్ మార్కెట్” అని కూడా పిలుస్తారు.
  2. ఇది కంపెనీ వాటాలతో వర్తకం చేయడానికి ఒక వేదిక. ఇది లిస్టెడ్ కంపెనీల షేర్లలో వర్తకం చేయడానికి కొనుగోలుదారులు మరియు విక్రేతలు కలిసే ప్రదేశం.
  3. లిస్టెడ్ కంపెనీలు తమ ఈక్విటీలో కొంత భాగాన్ని పబ్లిక్ పెట్టుబడిదారులకు అందిస్తాయి. వీటిని స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చబడి ఉండాలి. ‘
  4. స్టాక్ ఎక్స్ఛేంజ్లు సాధారణ ఈక్విటీ షేర్లతో పాటు కార్పొరేట్ బాండ్లు మరియు కన్వర్టిబుల్ బాండ్లవంటి ఇతర సెక్యూరిటీలను జాబితాలో చేర్చుతాయి.
  5. స్టాక్ ఎక్స్ఛేంజ్ యొక్క ఉద్దేశం కొనుగోలుదారులు మరియు అమ్మకం దారుల మధ్య సెక్యూరిటీల మార్పిడిని సులభతరం చేయడం, తద్వారా మార్కెట్ స్థలం వలె పనిచేస్తుంది.
  6. రెండు ప్రధాన భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్లు BSE (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్) మరియు NSE (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్) లిస్టెడ్ సెక్యూరిటీలపై రియల్ టైమ్ ట్రేడింగ్ సమాచారాన్ని అందిస్తాయి, ధరల ఆవిష్కరణకు దోహదపడతాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 13.
ఫారెక్స్ మార్కెట్ అంటే ఏమిటి ?
జవాబు.
1) విదేశీ మారక మార్కెట్ లేదా ‘ఫారెక్స్ మార్కెట్’ అనేది అంతర్జాతీయ నెట్వర్క్ను ఏర్పరిచే వ్యవస్థ. ఇది కొనుగోలుదారులు, అమ్మకందారులకు వివిధ దేశాల కరెన్సీ వాణిజ్యం లేదా మార్పిడిని నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.

2) ఫారెక్స్ వ్యాపారి యొక్క లక్ష్యం ధరలలో ఈ హెచ్చుతగ్గుల నుండి లాభాలను ఆర్జించడం మరియు భవిష్యత్తులో విదేశీ మారక రేట్లు ఏ విధంగా కదలవచ్చో ఊహించడం.

3) ఫారెక్స్ మార్కెట్ బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, సెంట్రల్ బ్యాంకు, పెట్టుబడి నిర్వహణ సంస్థలు, హెడ్జ్ ఫండ్స్ మరియు రిటైల్ ఫారెక్స్ బ్రోకర్లు మరియు పెట్టుబడిదారులతో రూపొందించబడింది.

4) ఫారెక్స్ మార్కెట్ అనేది సంస్థల నెట్ వర్క్ రోజుకు 24 గంటలు, వారానికి ఐదు రోజులు వర్తకం చేయడానికి అనుమతిస్తుంది.

5) ఫారెక్స్ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక మార్కెట్. విదేశీ లావాదేవీలు సాధారణంగా జతగా కోట్ చేయబడతాయి. ఎందుకంటే ఒక కరెన్సీని కొనుగోలు చేసినప్పుడు మరొకటి అమ్ముతారు. మొదటి కరెన్సీ ‘బేస్ కరెన్సీ అని, రెండవ కరెన్సీని ‘కోట్ కరెన్సీ’ అంటారు.

ప్రశ్న 14.
క్లోజ్-ఎండెడ్ ఫండ్స్ అంటే ఏమిటి ?
జవాబు.
1) క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ నిర్ణీత మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా 3-15 సంవత్సరాల కాల వ్యవధిలో ఉంటాయి. ఈ నిధులు నిర్దిష్ట కాలంలో మాత్రమే చందా కోసం తెరవబడతాయి.

2) ప్రారంభ పబ్లిక్ ఇష్యూ సమయంలో పెట్టుబడిదారులు ఈ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు మరియు ఆ తరువాత వారు జాబితా చేయబడిన స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ఈ పథకం యొక్క యూనిట్లను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు.

3) పెట్టుబడిదారులకు నిష్క్రమణ మార్గాన్ని అందించడానికి, కొన్ని క్లోజ్-ఎండెడ్ ఫండ్ NAV సంబంధిత ధరలకు మ్యూచువల్ ఫండ్ పునర్ కొనుగోలు విధానం ద్వారా యూనిట్లను తిరిగి విక్రయించే అవకాశాన్ని ఇస్తాయి.

ప్రశ్న 15.
కన్వర్టబుల్ బాండ్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. కన్వర్టిబుల్ బాండ్ అనేది ఒక సాధారణ కార్పొరేట్ బాండ్. ఇది సాధారణ స్టాక్ లోకి నిర్ణీత సంఖ్యలో వాటాలుగా మార్చగల అదనపు లక్షణాన్ని కలిగి ఉంటుంది.
  2. కన్వర్టిబుల్ బాండ్స్ రుణ పత్రాలు. ఎందుకంటే అవి వడ్డీని చెల్లిస్తాయి మరియు స్థిర విమోచన తేదీని కలిగి
    ఉంటాయి.
  3. మార్పిడి నిష్పత్తి జారీ చేసే సమయంలో నిర్ణయించబడుతుంది మరియు సాధారణంగా హెూల్డర్ ఎప్పుడైనా వాటిని వాటాలలోకి మార్చుకోవచ్చు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విత్త మార్కెట్.
జవాబు.

  1. ద్రవ్యపరమైన ఆస్తులను సృష్టించడానికి, వినిమయం చేయడానికి కావలసిన విత్త వ్యవహారాలు జరిపే మార్కెట్లను విత్త మార్కెట్లు అంటారు.
  2. ఇవి వ్యాపార స్వల్పకాలిక, దీర్ఘకాలిక విత్త అవసరాలను తీర్చడం కోసం పరపతి సాధనాలను, సెక్యూరిటీలను జారీ చేయడంలో ప్రముఖపాత్ర నిర్వహిస్తున్నాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 2.
ద్రవ్య మార్కెట్.
జవాబు.

  1. స్వల్పకాలిక పరపతి సాధనాలతో వర్తకం జరిగే మార్కెట్ను ద్రవ్య మార్కెట్ అంటారు.
  2. ద్రవ్య మార్కెట్ అంటే అధిక ద్రవ్యత్వం కలిగిన, హామీ లేని, తక్కువ నష్టభయం కలిగిన స్వల్పకాలిక పరపతి సాధనాలతో పార్టీల మధ్య వర్తకం జరిగే పరపతి మార్కెట్.

ప్రశ్న 3.
మూలధన మార్కెట్.
జవాబు.

  1. సెక్యూరిటీలను అమ్మడం ద్వారా వ్యాపార సంస్థలకు దీర్ఘకాలిక నిధులను సమకూర్చే మార్కేట్ను మూలధన మార్కెట్ అంటారు.
  2. మూలధన మార్కెట్ (ప్రైవేట్ రంగ ఉత్పత్తి సంస్థలు, ప్రభుత్వం, ప్రత్యేక విత్త సంస్థలు, మదుపరులు పాల్గొంటారు.

ప్రశ్న 4.
సంఘటిత ద్రవ్య మార్కెట్.
జవాబు.
1) సంఘటిత ద్రవ్య మార్కెట్లో పనిచేస్తున్న లేదా కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా గాని, ఇతర నియంత్రణ సంస్థయైన నాబార్డ్ ద్వారా గాని క్రమబద్దీకరించబడతాయి.

2) వాణిజ్య బ్యాంకులు భారతీయ మరియు విదేశీ, పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగానికి చెందినవి సంఘటిత రంగంగా (లేదా వ్యవస్థీకృత రంగంగా) పరిగణించబడుతున్నాయి.. ఈ సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం, వ్యాపార సంస్థలు మరియు వ్యక్తులతో పాటుగా డిమాండు చేయడంలో పాల్గొంటాయి.

3) ద్రవ్య మార్కెట్ పరపతి సాధనాలైన ట్రెజరీ బిల్లులు, వాణిజ్య పత్రాలు, పిలుపు ద్రవ్యం, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, వాణిజ్య బిల్లులతో వ్యవహరిస్తాయి.

ప్రశ్న 5.
అసంఘటిత ద్రవ్య మార్కెట్.
జవాబు.

  1. ద్రవ్య మార్కెట్లోని ఈ విభాగంపై ఎలాంటి ప్రత్యేక అధికార యంత్రాంగం యొక్క క్రమబద్ధీకరణ లేదు
  2. దేశ గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించి అభివృద్ధి చెందినప్పటికీ అసంఘటిత ద్రవ్య మార్కెట్ ఇంకా కొనసాగుతున్నది. ఇందులో దేశీయ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు ఉన్నారు.
  3. దేశీయ బ్యాంకర్లు వర్తక వాణిజ్య అవసరాలకు రుణాలనిస్తే, వడ్డీ వ్యాపారస్తులు వినియోగ అవసరాలకు రుణాలనిస్తున్నారు.

ప్రశ్న 6.
ప్రాథమిక మార్కెట్.
జవాబు.
ప్రాథమిక మార్కెట్ను కొత్త సెక్యూరిటీల మార్కెట్ అని కూడా అంటారు. ఈ మార్కెట్లో సెక్యూరిటీలను జారీ చేసే కంపెనీ కొత్తదైనా, పాతదైనా కావచ్చు.

ప్రశ్న 7.
ద్వితీయ మార్కెట్.
జవాబు.
ద్వితీయ మార్కెట్ను స్టాక్ ఎక్స్ఛేంజ్ అనికూడా వ్యవహరిస్తారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ సెక్యూరిటీలు కొనుగోలు మరియు అమ్మకాలు రెండు జరుగుతాయి.

ప్రశ్న 8.
విత్త మార్కెట్ ధర.
జవాబు.

  1. విత్త సాధనాలు లేదా విత్త సెక్యూరిటీలను మార్కెట్లో వర్తనం చేయడానికి నిర్ణయించిన విలువను విత్త మార్కెట్ ధర అంటారు.
  2. విత్త మార్కెట్ ధర అంటే విత్త సాధనాలకు, మార్కెట్లో లభించిన విలువ.
  3. ప్రాథమిక మార్కెట్లో సెక్యూరిటీల ధరను కంపెనీ నిర్వాహకులు నిర్ణయిస్తారు మరియు ద్వితీయ మార్కెట్లో సెక్యూరిటీల ధర వాటి యొక్క సప్లయ్, డిమాండ్లను బట్టి నిర్ణయించబడుతుంది.

ప్రశ్న 9.
వ్యాపార విత్తం.
జవాబు.

  1. ఒక వ్యాపార సంస్థ తన కార్యకలాపాలు సాగించడానికి అవసరమైన ద్రవ్యసేకరణ, వినియోగం, నియంత్రణకు సంబంధించిన ప్రక్రియను వ్యాపార విత్తం అంటారు.
  2. ప్రతి వ్యాపార సంస్థకు వ్యాపారం ప్రారంభించడానికి, ‘ఆస్తుల కొనుగోలుకు, రోజువారి కార్యకలాపాలకు వ్యాపార – విత్తం ఎంతో ఆవశ్యకం.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 10.
ద్రవ్య మార్కెట్ పత్రాలు.
జవాబు.

  1. ట్రెజరీ బిల్లు
  2. వాణిజ్య పత్రం,
  3. పిలుపు ద్రవ్యం
  4. వాణిజ్య బిల్లులు,
  5. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్.

ప్రశ్న 11.
సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్.
జవాబు.

  1. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ దాని గ్రహీత వడ్డీతో పాటుగా ముఖ విలువ మొత్తాన్ని పొందేందుకు అధికారాన్నిస్తూ వాణిజ్య బ్యాంకులచే జారీ చేయబడ్డ బదిలీ చేయదగిన స్వల్పకాలిక హామీ లేని ప్రామిసరీ నోటు.
  2. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ వ్యక్తులకు, కార్పొరేషన్లకు, కంపెనీలకు, ప్రవాస భారతీయులకు జారీ చేయబడుతుంది.
  3. ఈ సర్టిఫికేట్లు 3 నెలల నుంచి 5 సంవత్సరాల కాల పరిమితితో అందుబాటులో ఉంటాయి.

ప్రశ్న 12.
వాణిజ్య బిల్లు.
జవాబు.
1) వాణిజ్య బిల్లు కొనుగోలు దారుడు బాకీ ఉన్న అరువు అమ్మకాల మొత్తాన్ని ఒక భవిష్యత్తు తేదీ నాడు చెల్లించడం కోసం కొనుగోలుదారుని (బిల్లు స్వీకర్త) ఆమోదానికై అమ్మకందారుని (బిల్లుకర్త) చే రాయబడ్డ అన్యాక్రాంత యోగ్యతా పత్రం.

2) బిల్లు స్వీకర్త స్వీకృతిని తెలియజేయగానే వాణిజ్య బిల్లు ఒక చట్టబద్దమైన పత్రంగా మారి బిల్లు కర్తకు నగదు అవసరమైనప్పుడు బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ప్రశ్న 13.
ట్రెజరీ బిల్లుపై డిస్కౌంట్.
జవాబు.

  1. కేంద్ర ప్రభుత్వం తరపున స్వల్పకాలిక నిధుల అవసరాల కోసం రిజర్వు బ్యాంకు చేత డిస్కౌంట్ కోసం జారీ చేసిన ప్రామిసరీ నోటును ట్రెజరీ బిల్లు అంటారు.
  2. ట్రెజరీ బిల్లులు వాటి ముఖ విలువ కంటే తక్కువ ధరకు జారీ చేయబడి ముఖ విలువతో తిరిగి చెల్లించబడతాయి. . కొనుగోలుధరకు, గడువు తేదీన చెల్లించే మొత్తానికి మధ్య గల వ్యత్యాసాన్ని “ట్రెజరీ బిల్లుపై డిస్కౌంట్” అంటారు.

ప్రశ్న 14.
పిలుపు రేటు.
జవాబు.
1) వాణిజ్య బ్యాంకులు నగదు రిజర్వు నిష్పత్తిగా పిలువబడే కొంత కనీస నగడు నిల్వలను రిజర్వు బ్యాంకు వద్ద పెంచాల్సి ఉంటుంది.

“రిజర్వు బ్యాంక్ నగదు రిజర్వు నిష్పత్తిలో మార్పులు చేసినప్పుడు నిర్దేశించబడిన నిల్వల కంటే తక్కువ నగదు నిల్వ కలిగిన బ్యాంకులు మిగులు నిధులు కలిగిన బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుంటాయి. ఈ సేవకు గాను రుణదాత బ్యాంకుకు చెల్లించే వడ్డీనే “పిలుపు రేటు” అని అంటారు.

ప్రశ్న 15. ఉత్పన్నాలు.
జవాబు.

  1. ఇవి ఆర్థిక ఒప్పందాలు. వీటి విలువ వీటిని పోలిన ఇతర ఆస్తుల విలువపై ఆధారపడి ఉంటుంది.
  2. సాధారణంగా సరిపోల్చడానికి ఇతర ఆస్తులు ఏవనగా స్టాక్స్, బాండ్లు, కరెన్సీలు, వస్తువులు మరియు మార్కెట్ సూచికలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆస్తుల విలువ మారుతూ ఉంటుంది.

ప్రశ్న 16.
ఫార్వార్డ్స్.
జవాబు.

  1. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం.
  2. ముందుగా అంగీకరించిన ధర వద్ద భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీలో సెక్యూరిటీల పరిష్కారం జరుగుతుంది.

ప్రశ్న 17.
ఫ్యూచర్స్.
జవాబు.

  1. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట ధర వద్ద ఒక ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి రెండు పార్టీల మధ్య చేసుకున్న ఒప్పందం.
  2. ఫ్యూచర్స్ కాంట్రాక్టులు ప్రత్యేకమైన ఫార్వర్డ్ కాంట్రాక్టులు. వీటిలో ప్రామాణికమైన మారకపు వర్తక ఒప్పందాలు ఇమిడి ఉంటాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 18.
ఆప్షన్స్ (Options).
జవాబు.

  1. ఆప్షన్స్ రెండు రకాలు – కాల్స్ మరియు పుట్స్.
  2. కాల్స్ కొనుగోలుదారునికి కొనుగోలు చేయడానికి హక్కును ఇస్తాయి. కాని ఇచ్చిన భవిష్యత్ తేదీన లేదా అంతకు ముందు నిర్ధారించిన ధర వద్ద నిర్దిష్ట ఆస్తి యొక్క నిర్దిష్ట పరిమాణాన్ని కొనుగోలు చేయవలసిన బాధ్యత మాత్రం ఏర్పడదు.
  3. పుట్స్ కొనుగోలుదారునికి ఆస్తి కొనుగోలు హక్కును ఇస్తాయి. కాని ఇచ్చిన తేదీలో లేదా నిర్ధారిత ధర వద్ద నిర్దిష్టమైన ఆస్తిని, నిర్దిష్ట పరిమాణాన్ని విక్రయించే బాధ్యత ఏర్పడదు.

ప్రశ్న 19.
స్వాప్స్ (Swaps).
జవాబు.

  1. ముందుగా నిర్ణయించిన సూత్రం ప్రకారం భవిష్యత్తులో నగదు ప్రవాహాన్ని మార్పిడి చేయడానికి రెండు పార్టీల మధ్య కుదిరిన ప్రైవేట్ ఒప్పందాలు స్వాప్లు.
  2. వాటిని ఫార్వర్డ్ కాంట్రాక్టుల ఫోర్ట్ఫోలియోగ పరిగణించవచ్చు.

ప్రశ్న 20.
నిర్మాణాత్మక ఉత్పత్తులు.
జవాబు.

  1. నిర్మాణాత్మక ఉత్పత్తి అనేది సాంప్రదాయ విత్త పత్రాలు మరియు ఉత్పన్నాల కలయికను ఉపయోగించి వ్యక్తీకరించిన పెట్టుబడి పరిష్కారం.
  2. ఈ కలయిక పెట్టుబడిదారులు రిస్క్ స్థాయిని వారికి ఆమోదయోగ్యమైన స్థాయికి సర్దుబాటు చేయడానికి అనుమతిస్తుంది. అదే సమయంలో అంతర్లీన కదలికల నుంచి ప్రయోజనం పొందుతుంది.
    (ఉదా: స్టాక్, మార్పిడి రేటు మొదలైనవి).
  3. ఈ ఉత్పత్తులు సాధారణంగా దీర్ఘకాలిక స్వభావం కలిగి ఉంటాయి. గరిష్ట రాబడిని పొందడానికి కనీసం 1 సంవత్సరం లాక్-ఇన్ కాలం మరియు 2-3 సంవత్సరాల పెట్టుబడి కాలం అవసరం.

ప్రశ్న 21.
మ్యూచువల్ ఫండ్.
జవాబు.

  1. మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడిదారులకు లాభం సంపాదించడానికి అనేకమంది పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి కంపెనీ స్టాక్స్, బాండ్స్, ప్రభుత్వ పత్రాలు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టే సాధనం.
  2. వచ్చిన లాభాన్ని పెట్టుబడిదారులకు డివిడెండ్లుగా చెల్లించవచ్చు లేదా మూలధన పెరుగుదల కోసం ఫండ్ ద్వారా తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రశ్న 22.
ఓపెన్ ఎండెడ్ ఫండ్.
జవాబు.

  1. ఓపెన్-ఎండెడ్ ఫండ్ అంటే నిరంతర ప్రాతిపదికన చందా చేయడానికి మరియు తిరిగి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అంటే ఏడాది పొడవునా లభ్యమౌతుంది.
  2. ఈ ఫండ్కు స్థిర మెచ్యూరిటీ వ్యవధి లేదు.
  3. పెట్టుబడిదారులు నికర ఆస్తి విలువ (NAV) సంబంధిత ధరలతో సౌకర్యవంతంగా యూనిట్లను కొనుగోలు చేయవచ్చు మరియు అమ్మవచ్చు. ఓపెన్-ఎండ్ పథకాల యొక్క ముఖ్య లక్షణం ప్రభుత్వాన్ని కల్పించడం.

ప్రశ్న 23.
గ్రోత్ ఫండ్.
జవాబు.

  1. పెట్టుబడుల విలువ పెరుగుదలను మూలధనం విలువ పెరుగుదల ద్వారా ఉద్దేశించిన నిధులు ఈ రకానికి వస్తాయి.
  2. ఇలాంటి నిధులు వృద్ధి ఆధారిత సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెడతాయి. అంటే, దీర్ఘకాలంలో పెరుగుదల గల కంపెనీల వాటాలలో పెట్టుబడిని చేస్తారు.
  3. గ్రోత్ ఫండ్స్న నెస్ట్ ఎగ్స్ లేదా లాంగ్ హాల్ ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా అంటారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 24.
పరిశ్రమ నిర్దిష్ట ఫండ్.
జవాబు.

  1. పరిశ్రమ నిర్దిష్ట పథకాలు ప్రతిపాదనలో పేర్కొన్న పరిశ్రమలలో మాత్రమే పెట్టుబడి పెడతాయి.
  2. ఈ నిధుల పెట్టుబడి ఇన్ఫోటెక్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) ఫార్మాస్యూటికల్స్ మొదలైన నిర్దిష్ట పరిశ్రమలకు పరిమితం.

TS Inter 2nd Year Economics Notes Chapter 8 Foreign Sector

Here students can locate TS Inter 2nd Year Economics Notes Chapter 8 Foreign Sector to prepare for their exam.

TS Inter 2nd Year Economics Notes Chapter 8 Foreign Sector

→ Liberalisation: It refers to the relaxation of previous government restrictions usually in areas of social and economic policies. Thus, when the government liberalized trade it means it has removed the tariff, subsidies and other under employment restrictions on the flow of goods and services between the countries.

TS Inter 2nd Year Economics Notes Chapter 8 Foreign Sector

→ Globalisation: It is the process of integrating various economies of the world without creating any hindrances in the free flow of goods and services or human capital.

→ Privatisation: It is the general process of involving the private sector in the ownership or operation of a state-owned enterprise.

→ The govt, of India implemented economic reforms since 1991 to stabilize the economy from the severe economic crisis 1990. Foreign investment restrictions were relaxed. F.D.I allowed upto .74 state even -100 in some cases in Indian enterprises.

→ The reduction in trade and non-trade barriers due to the liberalization policy improved international trade of our country.

→ The balance of payments accounts statement of a nation denotes the true position of a country. It also indicates the visible and invisible trade balance of a country. India experienced a negative balance in its balanced of trade.

→ Role of international trade – comparative cost advantage market expansion – Agricultural development, competition, trach policy, foreign capital.

→ The GATT came into force on January 1, 1948. This paved way for the setting up of .T.O.

→ The T.O. came into force on 1, 1995 and India became a founder member of the T.O. by signing the .T.O. agreement on December 30, 1994.

TS Inter 2nd Year Economics Notes Chapter 8 Foreign Sector

TS Inter 2nd Year Economics Notes Chapter 8 విదేశీ రంగం

→ 1990 దశకంలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడటానికి భారతదేశం 1991లో ఆర్థిక స్థిరీకరణ సాధన కోసం ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది.

→ అంతర్జాతీయ వ్యాపారంలో గతంలో అమలులో ఉన్న ప్రభుత్వ నియంత్రణలను తొలగించడాన్ని సరళీకరణ అంటారు.

→ ప్రభుత్వ రంగంలోని ఉత్పాదక కార్యకలాపాలను ప్రైవేటు రంగానికి బదిలీ చేసే ప్రక్రియనే ప్రైవేటీకరణ అంటారు.

→ ప్రపంచీకరణ అంటే వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనుసంధానం చేయడం.

→ విదేశీ సంస్థలో యాజమాన్యపు భాగస్వామ్యం కోసం లేదా యాజమాన్య నియంత్రణ ఉద్దేశంలో దీర్ఘకాలిక రూపంలో అంతర్జాతీయ మూలధన బదలాయింపునే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటారు.

→ అంతర్జాతీయ చెల్లింపులు, రాబడుల వివరాల పట్టికయే, విదేశీ వర్తక చెల్లింపుల శేషం. ఇది జంట పద్దు అకౌంటింగ్ రూపంలో ఉంటుంది. దీనిలో రెండు ఖాతాలు ఉంటాయి.
ఎ) కరెంటు ఖాతా బి) మూలధన ఖాతా.

→ 1948లో సుంకాల, వర్తకంపై సాధారణ ఒప్పందం (GATT) అమలులోకి వచ్చింది.

→ 1994 సం||లో (GATT) W. T. O లో విలీనం కావడం వల్ల 1995 సం॥లో ప్రపంచ వర్తక సంస్థ ఆవర్భవించింది.

TS Inter 2nd Year Economics Notes Chapter 8 Foreign Sector

→ ప్రపంచ వర్తక సంస్థ ఒప్పందాలు – వ్యవసాయంపై ఒప్పందం – జౌళి వస్త్ర వ్యాపార ఒప్పందం – వర్తక సంబంధిత పెట్టుబడిపై ఒప్పందం – TRIPS, TRMS etc.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 3rd Lesson కేంద్ర ప్రభుత్వం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 3rd Lesson కేంద్ర ప్రభుత్వం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత రాష్ట్రపతికి ఉన్న సాధారణ, అత్యవసర అధికారాలను గురించి వర్ణించండి.
జవాబు.
అధికారాలు, విధులు :
సాధారణ అధికారాలు: భారత రాష్ట్రపతికి ఉన్న సాధారణ అధికారాలను 6 రకాలుగా వర్గీకరించవచ్చు.

1. కార్యనిర్వాహణాధికారాలు :
అధికరణ 53 ప్రకారం కేంద్రం కార్యనిర్వహణాధికారాలు రాష్ట్రపతికి చెందుతాయి. ఈ అధికారాలన్నీ రాష్ట్రపతి నేరుగాగానీ, అతడి కింది అధికారుల ద్వారా గానీ నిర్వహిస్తాడు. దేశం కార్యనిర్వహణాధిపతిగా రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను, ప్రధానమంత్రిని, సుప్రీంకోర్ట్, హైకోర్టు న్యాయమూర్తులను వివిధ కమీషన్ల సభ్యులను, ఛైర్మన్లను నియమిస్తాడు.

2. శాసనాధికారాలు :
అధికరణ 79 ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖ, పార్లమెంట్ ఉభయసభలను మరియు రాష్ట్రపతిని కలిగి ఉంటుంది. భారత రాష్ట్రపతి కేంద్ర శాసననిర్మాణ శాఖలో ముఖ్య భాగం. రాష్ట్రపతికి పార్లమెంట్ ఉభయసభలను సమావేశపరచడం లేదా సభలను నిరవధికంగా వాయిదావేయడం, కేంద్ర మంత్రిమండలి సలహాపై అధికారం ఉంది.

ఏదైనా బిల్లు పట్ల ఉభయ సభల మధ్య వివాదం ఏర్పడినట్లయితే ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. లోక్సభ ప్రతీ సాధారణ ఎన్నికల తరవాత, ప్రతీ సంవత్సరం జరిగే పార్లమెంట్ ఉభయ సభల సమావేశంలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తాడు. రాష్ట్రపతి లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను, రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తాడు.

3. ఆర్థికాధికారాలు :
రాష్ట్రపతి ప్రతీ ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం తన సంవత్సర బడ్జెట్ను పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టేలా చూస్తాడు. రాష్ట్రపతి భారత సంఘటిత నిధిని నిర్వహిస్తాడు. రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా ద్రవ్యాన్ని ఖర్చుచేయడం, ప్రభుత్వం రెవెన్యూను పెంచటం వంటి ప్రతిపాదనలు పార్లమెంటులో ప్రవేశపెట్టరాదు.

ప్రతీ అయిదు సంవత్సరాలకు ఆర్థిక సంఘం అధ్యక్షుణ్ణి, ఇతర సభ్యులను నియమిస్తాడు. ఆర్థిక సంఘం మరియు భారత కంప్టోలర్ ఆడిటర్ జనరల్ తమ తమ నివేదికలు పార్లమెంట్లో ప్రవేశపెడతారు.

4. న్యాయాధికారాలు:
రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. రాష్ట్రపతికి కోర్టు విధించిన శిక్షను తగిన కారణమున్న పక్షంలో తాత్కాలికంగా నిలిపివేయడానికి, శిక్షలు అమలు కాకుండా వాయిదావేయడానికీ, ఒక రకమైన శిక్షను వేరొక రకం శిక్షగా మార్చడానికీ, శిక్షని పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష పెట్టడానికి అధికారం ఉంది. అధికరణ 143 ప్రకారం రాష్ట్రపతి జాతీయ ప్రాధాన్యత గల అంశాలపై న్యాయపరమైన సలహాలు తీసుకోగలడు.

5. సైనిక అధికారాలు :
రాష్ట్రపతి దేశానికి సర్వసైన్యాధ్యక్షుడు. ఇతడికి యుద్ధాన్ని ప్రకటించడం. సంధి ఒడంబడికలు చేయడం లాంటి అధికారాలు కలవు.

6. దౌత్య అధికారాలు :
రాష్ట్రపతి ఇతర దేశాలకు భారత దౌత్య రాయబారులను నియమిస్తాడు మరియు ఇతర దేశాలు భారతదేశానికై నియమించిన రాయబారుల అధికార పత్రాలను స్వీకరిస్తాడు. అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు, సంధి ఒడంబడికలు రాష్ట్రపతి పేరుమీదనే జరుగుతాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

అత్యవసర అధికారాలు :
భారత రాజ్యాంగం, భారతరాష్ట్రపతికి మూడు రకాలైన అత్యవసర పరిస్థితుల్ని ప్రకటించి, నిర్వహించే అధికారం ఇచ్చింది.

  1. జాతీయ అత్యవసర పరిస్థితి (అధికరణ 352)
  2. రాష్ట్రపతి పాలన (అధికరణ 356)
  3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (అధికరణ 360)

1. జాతీయ అత్యవసర పరిస్థితి :
రాష్ట్రపతి దేశానికి గానీ లేదా ఏదైనా భారత భూభాగానికి గానీ యుద్ధం లేదా బాహ్య దాడులు, సైనిక తిరుగుబాటు వల్ల ముప్పు పొంచి ఉందని భావించినట్లైతే, కేంద్ర మంత్రిమండలి లిఖిత సలహా మేరకు జాతీయ అత్యవసర పరిస్థితులను విధించవచ్చు.

ఇలాంటి ప్రకటన ఒక నెల వ్యవధి లోపల పార్లమెంటులో ఓటింగ్లో పాల్గొన్న మొత్తం సభ్యుల్లో 2/3 వంతుకు తగ్గకుండా ఆమోదించవలసి ఉంటుంది. అపుడు ఈ ప్రకటన 6 నెలల పాటు అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం ద్వారా దీన్ని మరో 6 నెలల పాటు పొడిగించవచ్చు.

2. రాష్ట్రపతి పాలన :
ఒక రాష్ట్రం గవర్నర్చే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగే పరిస్థితిలో లేదు. ఆ రాష్ట్రంలోని రాజ్యాంగపరమైన వ్యవస్థ విఫలమైంది అన్న నివేదికను అందుకున్న మీదట రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని, (రాష్ట్రపతి పాలన) ప్రకటించవచ్చు. ఈ ప్రకటన ఫలితంగా,

  1. రాష్ట్రపతీ ఆ రాష్ట్రప్రభుత్వం మొత్తం లేదా ఏవైనా విధులను తన అధికారంలోకి తీసుకోవచ్చు.
  2. రాష్ట్రశాసన నిర్మాణశాఖ అధికారాలు పార్లమెంటుచే నిర్వహించబడతాయి.

ఈ అత్యవసర ప్రకటన రెండు నెలలలోపు పార్లమెంటుచే ఆమోదించబడాలి. ఈ ప్రకటన 6 నెలల పాటు అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం మేరకు దీన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించవచ్చు.

3. ఆర్థిక అత్యవసర పరిస్థితి :
దేశం ఆర్థిక సుస్థిరతకు భంగం వాటిల్లిందని రాష్ట్రపతి భావించినపుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. ఈ అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్రప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని, ఇతర సదుపాయాలను తగ్గించగలిగే అధికారం కలిగి ఉంటుంది.

అన్ని ద్రవ్యబిల్లులు, ఇతర బిల్లులను రాష్ట్ర శాసన నిర్మాణశాఖ ద్వారా జారీ చేయబడిన తరువాత రాష్ట్రపతి అనుమతి కొరకు పంపించవలసి ఉంటుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించలేదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 2.
భారత ప్రధానమంత్రి అధికారాలను వర్ణించండి.
జవాబు.
ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం యొక్క నిజమైన కార్యనిర్వాహక అధిపతి. రాజ్యాంగ అధికరణ 74 ప్రకారం ప్రధానమంత్రి ఛైర్మన్ గా గల కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి తన విధులను నిర్వహించడంలో సలహాలను, సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రపతి లోక్సభలోని మెజారిటీ పార్టీ లేదా గ్రూపు నాయకుణ్ణి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. అందరు మంత్రులు ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు.

ప్రధానమంత్రి తన ఇష్టానుసారం బాధ్యతారహితంగా ప్రవర్తించే మంత్రుల్ని తొలగించడం లేదా మంత్రిత్వ శాఖల్ని పునఃపంపిణీ చేయడం, మార్చడం వంటి అధికారాలను కలిగి ఉంటాడు. భారత రాజ్యాంగం ప్రకారం మంత్రులు రాష్ట్రపతి విశ్వాసం కలిగి ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. కానీ నిజానికి వారు ప్రధానమంత్రి విశ్వాసం కలిగి ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు.

ప్రధానమంత్రి అధికారాలు, విధులు :

1. ప్రధానమంత్రి – కేంద్ర కేబినెట్ నాయకుడు:
కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి ఆదేశాలకనుగుణంగా విధులను నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రిమండలిలోని ఏ వ్యక్తినైనా తొలగించే లేదా ఏ వ్యక్తినైనా నియమించే అధికారం ప్రధానమంత్రికి ఉంది. ఇతడు మంత్రిమండలిలో మంత్రుల మధ్య శాఖలను మార్చగలడు. కేబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.

2. ప్రధానమంత్రి – మెజార్టీ పార్టీ నాయకుడు:
ప్రధానమంత్రి ప్రజలసభ అయిన లోక్సభలోని మెజార్టీ పార్టీ నాయకుడు. ఇతడు తన పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను, పార్టీ మేనిఫెస్టోను నెరవేరుస్తాడు. ఇతను పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధి.

3. ప్రధానమంత్రి – పార్లమెంట్ నాయకుడు :
రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని రూపొందించిన దగ్గర నుంచి పార్లమెంట్ దేశప్రజల పరిపాలనలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పార్లమెంట్లోని ప్రజల సభ అయిన లోక్ సభ మెజార్టీ పార్టీ నాయకుడిగా, ప్రభుత్వం అధినేతగా ప్రధానమంత్రి పార్లమెంట్కు నాయకుడిగా పరిగణించబడతాడు. ఇతడు కేబినెట్ నిర్ణయాలను పార్లమెంట్కు తెలియపరుస్తాడు. కేంద్రప్రభుత్వ దేశ, విదేశీ విధానాలను పార్లమెంట్ సభ్యులకు వివరిస్తాడు.

4. ప్రధానమంత్రి – రాష్ట్రపతి, మంత్రిమండలి మధ్య వారధి:
ప్రధానమంత్రి రాష్ట్రపతి, కేంద్ర మంత్రిమండలికి మధ్య వారధిలా వ్యవహరిస్తాడు. మంత్రిమండలి నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేయడం ఇతడి విధి. కేంద్రప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన విషయాలన్నింటినీ రాష్ట్రపతికి తెలియజేస్తాడు.

5. ప్రధానమంత్రి – కేంద్రప్రభుత్వ నాయకుడు :
ప్రధానమంత్రి కేంద్రప్రభుత్వ అధినేత. ఇతడు దేశం మరియు దేశప్రజల ఉన్నతికి, అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వ పథకాలను, విధానాలను, కార్యక్రమాలను కేంద్ర మంత్రిమండలితో కలసి రూపొందించి అమలుపరుస్తాడు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రధానమంత్రి ఇష్టానుసారం పనిచేస్తుంది.

6. ప్రధానమంత్రి దేశానికి నాయకుడు :
ప్రధానమంత్రి దేశం నాయకుడిగా వ్యవహరిస్తాడు. పార్లమెంట్ నాయకుడిగా మరియు ప్రభుత్వ అధినేతగా పార్లమెంట్ లోపల, బయట ఇతడి వ్యాఖ్యలు ప్రకటనలు దేశానికి ముఖ్యమైనవిగా ఉంటాయి. ఇతర దేశాలను సందర్శించినప్పుడు ప్రధానమంత్రి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇతడి అభిప్రాయాలు మొత్తం దేశపు అభిప్రాయంగా పరిగణించబడతాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 3.
కేంద్ర మంత్రిమండలి నిర్మాణం, విధులను వివరించండి.
జవాబు.
అధికరణ 74(1) ప్రకారం ప్రధానమంత్రి ఛైర్మన్ గా గల కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి తన విధులను నిర్వహించడంలో సలహాలను, సహకారాన్ని అందిస్తుంది. మంత్రిమండలిలోని మంత్రులందరూ ప్రధానమంత్రి సలహాపైన రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు.

1. నిర్మాణం :
కేంద్ర మంత్రిమండలిలో మూడు విధాలైన మంత్రులు ఉంటారు. అంటే కేబినెట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు, స్టేట్ మంత్రులు.
i) కేబినేట్ మంత్రులు :
మొదట రాజ్యాంగంలో కేబినెట్ అనే పదం లేదు. కేబినెట్ అనే పదం రాజ్యాంగంలో 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. సాధారణంగా ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్న మంత్రులు కేబినెట్ మంత్రులుగా పిలవబడతారు.

విధానాలు రూపొందించడంలో కేబినెట్ మంత్రులు ప్రధానమంత్రికి సహకరిస్తారు. కేబినేట్ ప్రభుత్వ విధాన రూపకల్పనలో ముఖ్యమైన భాగం ప్రధానమంత్రి స్వయంగా నియమించిన వారు క్యాబినేట్ మంత్రులుగా ఉంటారు.

ii) స్టేట్ మంత్రులు :
స్టేట్ మంత్రులు చిన్న మంత్రిత్వ శాఖలను స్వతంత్రంగా నిర్వహిస్తారు.

iii) డిప్యూటీ మంత్రులు :
డిప్యూటీ మంత్రులు ఎలాంటి స్వతంత్ర మంత్రిత్వ శాఖలను కలిగి ఉండరు. వీరు కేబినెట్ మంత్రులకు సహకరిస్తారు. కేబినెట్ మంత్రుల ఆధ్వర్యంలో ఆయా మంత్రిత్వ శాఖల రోజువారీ పనులను నిర్వహిస్తారు.

అధికారాలు, విధులు : మంత్రిమండలిలోని మంత్రులు కింది విధులను కలిగి ఉంటారు.

  1. కేంద్రప్రభుత్వం విధానాలను మంత్రిమండలి రూపొందిస్తుంది. ఎన్నో చర్చోపచర్చల తరవాత వీరు దేశం, దేశీయ విదేశీ విధానాలను అంతిమంగా నిర్ణయిస్తారు.
  2. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాల్లో రాష్ట్రపతికి సలహాలను అందిస్తుంది. రాష్ట్రపతి తన విధులను నిర్వహించడానికి మార్గనిర్దేశం చేస్తుంది.
  3. ఇది దేశ, ఆర్థిక రంగంపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది. పన్నులు, ఇతర ఖర్చులకు సంబంధించిన తీర్మానాలు నిజానికి కేబినెట్ ద్వారా రూపొందించబడి పార్లమెంట్ ద్వారా ఆమోదించబడతాయి.
  4. దేశ పరిపాలన మంత్రులు వివిధ ప్రభుత్వ విభాగాల రాజకీయ అధినేతలు ప్రభుత్వ యంత్రాంగం అంతా మంత్రుల నియంత్రణలో రోజువారీ పరిపాలన నిర్వహిస్తారు. దీన్ని బట్టి కేబినెట్ మొత్తం దేశాన్ని పరిపాలిస్తుంది అని చెప్పవచ్చు.
  5. చట్టాలను రూపొందించే ప్రక్రియలో కేబినెట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏదైనా మంత్రిత్వశాఖకు సంబంధించిన బిల్లు నిర్మాణం మంత్రిమండలి సమావేశంలో క్షుణ్ణంగా చర్చించిన తరవాతనే జరుగుతుంది. ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి, సంబంధించిన మంత్రులతో వివరించబడుతుంది.
  6. పార్లమెంట్లో ప్రవేశపెట్టబడ్డ బిల్లులు రాష్ట్రపతి సంతకం తరవాతే చట్టాలుగా మారతాయి. నిజానికి రాష్ట్రపతి కేబినెట్ చేయమన్న పని మాత్రమే చేస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

5. సమిష్టి బాధ్యత :
అధికరణ 75(3) ప్రకారం మంత్రిమండలి ప్రజల సభ అయిన లోక్సభకి సమిష్టి బాధ్యత వహిస్తుంది. ప్రతీ మంత్రి తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నిర్ణయాలకు బాధ్యుడు అంతేకాకుండా అతడు తన తోటి మంత్రులు నిర్వహించే మంత్రిత్వశాఖలకు సంబంధించిన నిర్ణయాలకు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.

ఎందుకంటే అందరు మంత్రులు కేబినెట్ విధి విధానాలను అనుసరించి, క్యాబినెట్ మార్గనిర్దేశనంలో, నియంత్రణలో పనిచేస్తారు. దీన్ని బట్టి ఒక మంత్రి తన తప్పుడు నిర్ణయాలకు బాధ్యత వహిస్తాడు.

అలాగే తన తోటి మంత్రుల తప్పుడు నిర్ణయాలకు బాధ్యత వహిస్తాడు. ఒకవేళ ఏ మంత్రి అయినా వేరొక మంత్రి తప్పుడు నిర్ణయానికి, చర్యకు బాధ్యత వహించడానికి అంగీకరించనట్లయితే అతను మంత్రి పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది లేదా. అతడు ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతిచే తొలగించబడతాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
భారత పార్లమెంటు అధికారాలు ఏమిటి ? వివరించండి.
జవాబు.
రాజ్యాంగం 79వ అధికరణం ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖలో (ఎ) రాష్ట్రపతి, (బి) పార్లమెంటులోని ఉభయసభలు అంతర్భాగాలు. లోక్సభ అనేది పార్లమెంటులో దిగువసభకాగా, రాజ్యసభ ఎగువసభ. రాష్ట్రపతికి ఉభయసభల సమావేశాలను ప్రారంభించేందుకు వాయిదా వేసేందుకు అధికారం ఉంటుంది.

పార్లమెంట్ అధికారాలు, విధులు: భారత పార్లమెంట్ భారతదేశ పౌరుల ఆకాంక్షలను, ఆశయాలను ప్రతిబింబించే ప్రధాన శాసన నిర్మాణ అంగం. ఇది భారత ప్రభుత్వానికి కావలసిన చట్టాలను రూపొందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. భారత పార్లమెంట్ క్రింది అధికారాలను కలిగి ఉంది.

1. శాసన నిర్మాణాధికారం :
పార్లమెంట్ కేంద్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో గల అంశాలపై చట్టాలను రూపొందిస్తుంది. ఏ జాబితాలోని అంశాలపైన అయినా శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఒక బిల్లు కేవలం రెండు సభలు ఆమోదించిన తరవాత మాత్రమే చట్టంగా మారుతుంది. ఒక బిల్లుపై రెండు సభల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తినపుడు రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు.

అప్పుడు ఆ బిల్లు భవితవ్యం సంయుక్త సమావేశంలో మెజారిటీ ఓట్ల ద్వారా నిర్ణయించబడుతుంది. రాష్ట్రపతికి ఒక బిల్లుని పునఃపరిశీలన కోసం పార్లమెంట్కు తిరిగి పంపించగలిగే అధికారం ఉంది. ఎప్పుడైతే పార్లమెంట్ తిరిగి చర్చ జరిపి దాన్ని మళ్ళీ ఆమోదిస్తుందో అప్పడు రాష్ట్రపతి తప్పనిసరిగా సంతకం చేయవలసి ఉంటుంది.

2. కార్వనిర్వాహక అధికారం (కార్యనిర్వాహక శాఖని నియంత్రించే అధికారం) :
కేంద్ర మంత్రిమండలి తన నిర్ణయాలపట్ల తన విధానాలపట్ల నేరుగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. కొత్త తీర్మానాన్ని ఆమోదించడం లేదా ఏదైనా ద్రవ్యబిల్లును ఆమోదించడానికి లోక్సభ నిరాకరించనట్లయితే దాన్ని మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానంగా భావించబడుతుంది. మంత్రిమండలి రాజీనామా చేయవలసి ఉంటుంది.

3. ఆర్థికాధికారాలు :
పార్లమెంట్ దేశం యొక్క జమా ఖర్చులకు బాధ్యత వహిస్తుంది. పార్లమెంటు ఆమోదం లేనిదే పన్నులను విధించడంగానీ, పన్నులు వసూలు చేయడంగానీ, ఏదైనా వ్యయం చేయడంగానీ జరగదు.

4. రాజ్యాంగ సవరణాధికారం:
రాజ్యాంగ అధికరణ 368 నిబంధనల ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కు ఉంది. రాజ్యాంగంలో చాలా భాగం పార్లమెంట్ ప్రతీ సభలో సభ్యులలో 2/3వ వంతు మెజారిటీ ద్వారా సవరించబడింది. కొన్ని అధికరణాలలోని నిబంధనలను సవరించడానికి రెండు సభల్లో 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించబడ్డ తరవాత దేశంలోని రాష్ట్రశాసన సభలలో కనీసం సగం శాసనసభల ఆమోదం అవసరం.

5. ఎన్నికాధికారం :
భారతపార్లమెంట్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను ఎన్నుకొంటుంది. లోక్సభలోని సభ్యులు తమ నుండి ఇద్దరు సభ్యులను స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులు తమ డిప్యూటీ చైర్మన్ని ఎన్నుకుంటారు.

6. న్యాయసంబంధ అధికారాలు :
అవినీతి, అసమర్థత లాంటి అభియోగాల వంటి నిర్దిష్ట కారణాలున్నపుడు మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని, సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులను తొలగించడానికి భారత పార్లమెంట్కి అధికారం గలదు.

7. చర్చాపూర్వక విధులు :
భారత పౌరులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించే, యోచించే ముఖ్యమైన చర్చావేదిక పార్లమెంట్. సమకాలీన జాతీయ, అంతర్జాతీయ అంశాలు, దేశ పౌరులను ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించడానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరుపుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 5.
భారత సుప్రీంకోర్టు విధులను తెలియజేయండి.
జవాబు.
సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని ప్రాథమిక, అప్పీళ్ళ విచారణ, సలహారూపక అధికార పరిధులుగా విభజించవచ్చు.

i. ప్రాథమిక అధికార పరిధి :
ఈ అధికారం కింది సుప్రీంకోర్టు ఈ కింది వివాదాలను విచారించగలదు.

  1. భారత ప్రభుత్వానికి ఒకటి లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు మధ్య వివాదం.
  2. భారతప్రభుత్వం ఒకటి అంతకంటే ఎకుకవ రాష్ట్రాలు ఒక వైపు, ఒక రాష్ట్రం లేదా ఎక్కువచ రాష్ట్రాలు ఇంకోవైను ఉన్నప్పుడు వాటి మధ్య వివాదం.
  3. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు మధ్య వివాదాలు తలెత్తినప్పుడు విచారిస్తుంది.

ii. అప్పీళ్ళ విచారణా పరిధి :
ఈ అధికారం కింద సుప్రీంకోర్టు ఈ కింది వివాదాలపై అప్పీళ్ళను విచారిస్తుంది.

ఎ. రాజ్యాంగపరమైన వివాదాలు :
రాజ్యాంగంపై వ్యాఖ్యానాలకు సంబంధించిన వివాదాలపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.

బి. పౌర వివాదాలు :
పౌరవివాదాలపై కూడా హైకోర్టు తీర్పుకు వ్యవతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు చేయవచ్చు. ఈ అప్పీలు కోసం హైకోర్టు ఆ వివాదం రాజ్యాంగపరమైన, చట్టానికి సంబంధించిన ప్రశ్నలను కలిగి ఉందని అప్పీలు చేయవచ్చు.

సి. క్రిమినల్ వివాదాలు :
క్రిమినల్ వివాదాల్లో ఏ తీర్పుకు వ్యతిరేకంగానైనా సుప్రీంకోర్టులో అప్పీలు చేయవచ్చు. అంతిమ నిర్ణయం లేదా తుది తీర్పు హైకోర్టుచే ఇవ్వబడుతుంది. సాధారణంగా క్రిమినల్ వివాదాలలో అప్పీలు చేసుకోగలిగే అంతిమ స్థాయి కోర్టు హైకోర్టు. కానీ ఈ క్రిమినల్ అంశాలకు సంబంధించి హైకోర్టు నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీలును వినే ప్రత్యేక అధికారం పార్లమెటు సుప్రీంకోర్టుకు కల్పించింది.

iii. సలహా అధికార పరిధి :
సుప్రీంకోర్టు కొంత సలహా అధికార పరిధిని కూడా కలిగి ఉంది. ఒక అంశంలో చట్టం, వాస్తవానికి మధ్య ప్రశ్న తలెత్తి ఆ విషయంలో రాజ్యాంగపరమైన వ్యాఖ్యానం అవసరమని రాష్ట్రపతి భావించినట్లయితే సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరవచ్చు. సుప్రీంకోర్టు రాష్ట్రపతి ప్రశ్నకి సమాధానం ఇవ్వవచ్చు. కానీ ఇది ఏ పక్షాలపై నిర్బంధం విధించదు.

iv. ఇతర విధులు :
కోర్ట్ ఆఫ్ రికార్డ్ (Court of Record) :
సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్ కూడా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులు నమోదు చేయబడి, భద్రపరచబడతాయి. ఇవి ప్రామాణికమైనవిగా భావించబడి చట్టాలతో సమానంగా గౌరవించబడతాయి. ఈ రాకార్డులు సాక్ష్యాలుగా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.

సూచనలు ఆదేశాలు లేదా రిట్లు :
సుప్రీంకోర్టు పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను రక్షించేదిగా, హామీనిచ్చేదిగా విమర్శించడం ఖండించడం, కోర్టును, న్యాయమూర్తులను విమర్శించడం. కోర్టుకి వ్యతిరేకంగా అమర్యాదకరమైన అగౌరవమైన అభిప్రాయాలను వెలిబుచ్చడం, కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉండకపోవడం అనేవి కోర్టు ధిక్కార నేరంగా పరిగణించబడతాయి.

కోర్టు ధిక్కరణ :
ఏ వ్యక్తినైనా కోర్టు ధిక్కార నేరం కింద శిక్షించే అధికారం సుప్రీంకోర్టుకి ఉంది. కోర్టు తీర్పును విమర్శించడం, ఖండించడం, కోర్టును, న్యాయమూర్తులను విమర్శించడం, కోర్టుకి వ్యతిరేకంగా అమర్యాదకరమైన, అగౌరవకరమైన అభిప్రాయాలను వెలిబుచ్చడం, కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉండకపోవడం అనేవి కోర్టుధిక్కార నేరంగా పరిగణించబడతాయి.

ఆదేశాలను, తీర్పులను, పునఃపరిశీలించడం :
సుప్రీంకోర్టు తీను ఇంతకు ముందు జారీ చేసిన ఏ ఆదేశాన్నైనా పునఃపరిశీలించే అధికారం కలిగి ఉంది. ఎ. కొత్త పరిష్కార పద్ధతి లేదా సాక్ష్యాలు కనిపించినపుడు, బి. కోర్టు యొక్క రికార్డుల ప్రకారం తీర్పులో తప్పిదం కనిపించినప్పుడు సి. లేదా పునఃపరిశీలనకు తగిన కారణాలు కలిగి ఉన్నపుడు కోర్టు ఈ విధంగా ఆదేశాలను సమీక్షించగలదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత రాష్ట్రపతి ప్రత్యేక (అత్యవసర) అధికారాలు ఏమిటి ?
జవాబు.
భారత రాజ్యాంగం, భారత రాష్ట్రపతికి మూడురకాలైన అత్యవసర పరిస్థితుల్ని ప్రకటించి, నిర్వహించే అధికారం ఇచ్చింది. అవి:

  1. జాతీయ అత్యవసర పరిస్థితి (అధికరణ 352)
  2. రాష్ట్రపతి పాలన (అధికరణ 356)
  3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (అధికరణ 360)

1. జాతీయ అత్యవసర పరిస్థితి :
రాష్ట్రపతి దేశానికి గానీ లేదా ఏదైనా భారత భూభాగానికి గానీ యుద్ధం లేదా బాహ్యదాడులు, సైనిక తిరుగుబాటు వల్ల ముప్పు పొంచి ఉందని భావించినట్లయితే, కేంద్ర మంత్రిమండలి లిఖిత సలహా మేరకు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు.

ఇలాంటి ప్రకటన ఒక నెల వ్యవధి లోపల పార్లమెంటులో ఓటింగులో పాల్గొన్న మొత్తం సభ్యుల్లో 2/3వ వంతుకు తగ్గకుండా ఆమోదించవలసి ఉంటుంది. అప్పుడు ఈ ప్రకటన 6 నెలల పాటు అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం ద్వారా దీనిని మరో 6 నెలల పాటు పొడిగించవచ్చు.

2. రాష్ట్రపతి పాలన :
ఒక రాష్ట్రం గవర్నర్చే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగే పరిస్థితిలో లేదు. ఆ రాష్ట్రంలోని రాజ్యాంగపరమైన వ్యవస్థ విఫలమైంది అన్న నివేదికను అందుకున్న మీదట రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని (రాష్ట్రపతి పాలన) ప్రకటించవచ్చు. ఈ ప్రకటన ఫలితంగా

  1. రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లేదా ఏదైనా విధులను తన అధికారంలోకి తీసుకోవచ్చు.
  2. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అధికారాలు పార్లమెంటుచే నిర్వహించబడతాయి.

ఈ అత్యవసర ప్రకటన రెండు నెలల లోపు పార్లమెంటుచే ఆమోదించబడాలి. ఈ ప్రకటన 6 నెలల పాటు అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం మేరకు దీన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించవచ్చు.

3. ఆర్థిక అత్యవసర పరిస్థితి :
దేశ ఆర్థిక సుస్థిరతకు భంగం వాటిల్లిందని రాష్ట్రపతి భావించినపుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. ఈ అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను, ఇతర సదుపాయాలను తగ్గించగలిగే అధికారం కలిగి ఉంటాడు.

అన్ని ద్రవ్య బిల్లులు, ఇతర బిల్లులను రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ద్వారా. జారీ చేయబడిన తరువాత రాష్ట్రపతి అనుమతి కొరకు పంపించవలసి ఉంటుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించలేదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 2.
రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మాన ప్రక్రియను వివరించండి.
జవాబు.
రాష్ట్రపతి పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయవచ్చు లేదా రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే రాజ్యాంగంలోని 56, 61 అధికరణాల ప్రకారం పార్లమెంట్ మహాభియోగ తీర్మానం ద్వారా పదవి నుండి తొలగించవచ్చు. దానికి అనుసరించే పద్ధతి ఈ దిగువ వివరించిన విధంగా ఉంటుంది.

  1. పార్లమెంట్లో ఏదో ఒక సభలో 14 రోజుల వ్యవధితో ఒక నోటీసు జారీచేసి మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానం మీద ఆ సభలోని సభ్యుల 4వ వంతు సభ్యులు సంతకం చేయాలి.
  2. ఆ తీర్మానాన్ని చర్చించి ఆ సభ 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించాలి.
  3. అలా ఆమోదించిన తీర్మానాన్ని రెండవ సభ ఒక కమిటీని ఏర్పరచి, ఆరోపణలపై విచారణ జరుపుతుంది.
  4. ఆరోపణలు రుజువైతే ఆ సభలో మొత్తం సభ్యులలో 2/3వ వంతు సభ్యులు ఆమోదిస్తే రాష్ట్రపతి పదవీచ్యుతుడౌతాడు. ఇంతవరకు మహాభియోగ తీర్మానం ద్వారా ఏ రాష్ట్రపతి తొలగింపబడలేదు.

ప్రశ్న 3.
ఉపరాష్ట్రపతి ఎన్నిక, అధికారాలు – విధులను గురించి రాయండి.
జవాబు.
భారత ఉపరాష్ట్రపతి పదవి భారతదేశంలోని రెండవ అత్యున్నత పదవి. రాజ్యాంగ అధికరణ 60 నుంచి 71 ఉపరాష్ట్రపతి గురించి వివరిస్తాయి. ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ వరుసగా రెండవసారి ఎన్నికై కొనసాగుతున్నారు.

నిర్మాణం :
1. అర్హతలు:
భారత ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఒక వ్యక్తి ఈ కింది అర్హతలను కలిగి ఉండాలి.

  • భారత పౌరుడై ఉండాలి.
  • 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
  • రాజ్యసభ సభ్యుడుగా ఎన్నిక కావడానికి కావలిసిన అర్హత కలిగి ఉండాలి.

2. ఎన్నిక :
భారత ఉపరాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఒక ఓటు బదిలీ ద్వారా రహస్య ఓటింగ్ విధానంలో భారత పార్లమెంట్ ఉభయసభలకు ఎన్నుకోబడిన, నామినేట్ చేయబడిన సభ్యులు ఎన్నుకొంటారు.

3. పదవీకాలం :
భారత ఉపరాష్ట్రపతి పదవీకాలం కార్యాలయంలో విధులు చేపట్టిన సమయం నుంచి 5 సంవత్సరాలు. ఇతడు రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపించడం ద్వారా పదవికి రాజీనామా చేయవచ్చు.

4. వేతనం, ఇతర సదుపాయాలు:
భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ హోదాలో 71,25,000 నెలసరి వేతనం, ఇతర సదుపాయాలను అందుకొంటాడు.

5. తొలగింపు భారత ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం కేవలం రాజ్యసభలో మొత్తం సభ్యుల్లో 1/4వ వంతు సభ్యుల అనుమతితో ప్రవేశపెట్టాలి. 14 రోజుల ముందస్తు నోటీసు గడువు పూర్తి అయిన తరువాత రాజ్యసభ ఈ తీర్మానంపై చర్చలు జరుపుతుంది.

ఈ తీర్మానం సభలో ఓటింగ్ లో పాల్గొనే సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు ఆమోదించినట్లయితే ఇది లోక్సభకు పంపబడుతుంది. లోక్ సభలో కూడా ఈ తీర్మానం 2/3వ వంతు సభ్యులచే ఆమోదించవలసి ఉంటుంది.

అధికారాలు – విధులు : భారత ఉపరాష్ట్రపతి కేవలం 2 రకాల అధికారాలను, విధులను కలిగి ఉన్నాడు.

1. రాజ్యసభ ఛైర్మన్ :
భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరిస్తాడు. ఇతడు రాజ్యసభ సమావేశాల్లో – ప్రసంగిస్తాడు. సభ యొక్క వ్యవహారాలను నిర్వహిస్తాడు. ఏదైనా బిల్లు పట్ల ఓట్లు సమానంగా చీలినట్లయితే, నిర్ణాయకపు ఓటును వినియోగిస్తాడు.

2. తాత్కాలిక రాష్ట్రపతి :
రాష్ట్రపతిని తొలగించినా, రాజీనామా చేసినా లేదా మరణించినా గానీ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా 6 నెలలు మాత్రమే వ్యవహరించగలడు. ఈ సమయంలో ఇతడు భారత రాష్ట్రపతికి గల వేతనం ఇతర సదుపాయాలను అందుకుంటాడు. రాజ్యసభ ఛైర్మన్ హోదాలో ఎలాంటి వేతనాన్ని, ఇతర సదుపాయాలను అందుకోలేడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
సమిష్టి బాధ్యత అనగానేమి ? వివరించండి.
జవాబు.
సమిష్టి బాధ్యత :
పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలలో ప్రధానమైనదే సమిష్టి బాధ్యత. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ సూత్రాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యాంగం 75(3)వ అధికరణం మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుందని ప్రకటించింది. కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఒక జట్టుగా వ్యవహరిస్తుంది.

కార్యనిర్వాహకశాఖలోని మంత్రులు అధికారంలో ఉండగా తమ చర్యలకు, కార్యకలాపాలకు పార్లమెంటు (శాసన నిర్మాణశాఖ కు సమిష్టిగా బాధ్యత వహించడాన్నే సమిష్టి బాధ్యత అంటారు. ప్రతి మంత్రి తన మంత్రిత్వశాఖలో పరిణామాలకు బద్దుడై పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటాడు. అలాగే మంత్రిత్వశాఖలో తన నిర్ణయాలవల్ల కలిగే పరిణామాలకు బద్ధుడై ఉంటాడు.

ఇది ప్రతి మంత్రి నిర్వర్తించవలసిన వ్యక్తిగత బాధ్యత కూడా. ప్రభుత్వ విధానాలపట్ల, అనుకూలంగానో, ప్రతికూలంగానో ఎదురయ్యే పరిణామాల సందర్భంలో తన ప్రమేయంలేదనీ, తనకు తెలియదనీ చెప్పి తప్పుకోవడానికి, నిస్సహాయతను వెల్లడించడానికి ఏ మంత్రికీ వీలులేదు.

సమిష్టి బాధ్యత మంత్రులందరినీ ఒక జట్టుగా ఉంచి ఏక త్రాటిపై నడిపిస్తుంది. సమిష్టి బాధ్యతా సూత్రాన్ని ప్రధానమంత్రి ఆచరణలో ఉంచుతాడు. మంత్రివర్గ సమావేశాలలో ఆమోదించిన నిర్ణయాలను ప్రతి ఒక్క మంత్రి గౌరవించినట్లు, అమలుతో ఉంచేటట్లు ప్రధానమంత్రి చర్యలు తీసుకుంటాడు. మంత్రిమండలిలోని సభ్యుల మధ్య సహకారం, సమన్వయం సర్దుబాటుతనం పెంపొందించడానికి కృషి చేస్తాడు. మంత్రివర్గ సమావేశాలలో ఏ మంత్రి అయినా తన భావాలను స్వేచ్ఛగా వెల్లడించడానికి అనుమతిస్తాడు.

అయితే, ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత దానికి కట్టుబడి ప్రతి మంత్రి మనస్ఫూర్తిగా అనుసరించవలసి ఉంటుంది. లేకపోతే రాజీనామా సమర్పించవలసి ఉంటుంది. అది కూడా చేయనప్పుడు ఆయనను ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయవచ్చు. ఇక మంత్రివర్గ నిర్ణయాలను బట్టి కట్టుబడని మంత్రులను మినహాయించి మిగిలిన వారితో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే హక్కు ప్రధానమంత్రికి ఉంటుంది.

కార్యనిర్వాహకశాఖ సమిష్టి బాధ్యతను శాసన నిర్మాణశాఖ అనేక విధాలుగా ఆచరణలో ఉంచుతుంది. శాసన నిర్మాణశాఖ (పార్లమెంటు) కార్యనిర్వాహకశాఖ (మంత్రిమండలి)పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి, ఆమోదిస్తుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిన తక్షణమే కార్యనిర్వాహకశాఖ (మంత్రిమండలి) అధికారాన్ని కోల్పోతుంది.

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే సందర్భంలో పార్లమెంటు సభ్యులు కార్యనిర్వాహకశాఖపై మోపిన ఆరోపణలకు సంజాయిషీ కోరగా కార్యనిర్వాహకశాఖ అందుకు కొన్ని సందర్భాలలో అవిశ్వాస తీర్మానం బదులుగా కార్యనిర్వాహకశాఖే శాసన నిర్మాణశాఖ విశ్వాసాన్ని పొందే విధంగా తీర్మానాన్ని ప్రతిపాదించవలసి రావచ్చు.

ఉదాహరణకు 1979లో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చరణ్సింగ్ను ప్రధానిగా నియమిస్తూ లోక్సభ విశ్వాసాన్ని పొందవలసిందిగా ఆదేశించారు. కానీ లోక్సభ విశ్వాసాన్ని పొందకుండానే చరణ్ సింగ్ ప్రధాని పదవికి రాజీనామా సమర్పించారు.

ఇటీవల 1999 ఏప్రిల్ 14న వాజ్పేయి ఆధ్వర్యంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వానికి ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. మద్దతు ఉపసంహరించుకోగా, ప్రధాని వాజ్పేయి లోక్సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన తీర్మానాన్ని సభ తిరస్కరించగా 1999 ఏప్రిల్ 17న ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారు.

మొత్తం మీద సమిష్టి బాధ్యత అనేది మంత్రిమండలికి, లోక్సభకు సంబంధించిన అంశం. సమిష్టి బాధ్యత అనేది శాసన నిర్మాణశాఖ కార్యనిర్వాహకశాఖలు రెండూ విడివిడిగా పార్లమెంటు దిగువసభలో తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవడానికి, ప్రజలకు ఎలక్ట్రానిక్ ప్రచార సాధనాల ద్వారా తన అభిప్రాయాలను తెలియజేయడానికి వీలు కల్పిస్తుంది. మంత్రిమండలి సమైక్యంగా బాధ్యతాయుతంగా, సామరస్యం, సదవగాహనలతో వ్యవహరించడానికి సమిష్టి బాధ్యత దోహదపడుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 5.
లోక్సభ స్పీకర్ యొక్క విధులను వివరించండి.
జవాబు.
భారతదేశంలో స్పీకర్ కార్యాలయం ఏర్పాటు పద్దతిని బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ నుండి తీసుకోవడం జరిగింది. రాజ్యాంగ అధికరణ 93 ప్రకారం ప్రతీ సాధారణ ఎన్నికల తరువాత లోక్సభ సభ్యులు తమ నుండి స్పీకర్ను డిప్యూటీ స్పీకర్ను పూర్తి సమయం కోసం ఎన్నుకోవలసి ఉంటుంది.

1. అర్హత :
లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యే వ్యక్తి తప్పనిసరిగా లోక్సభ సభ్యుడై ఉండాలి.

2. ఎన్నిక :
లోక్ సభ సభ్యులు తమలోంచి ఒక సభ్యుణ్ణి స్పీకర్గా ఎన్నుకుంటారు. సాధారణంగా స్పీకర్ పదవికి అధికారంలో ఉన్న పార్టీ సభ్యులే ఎన్నికవడం ఆనవాయితీ.

3. పదవీకాలం :
లోకసభ స్పీకర్ పదవీకాలం సాధారణంగా 5 సంవత్సరాలు. స్పీకర్ సభ రద్దయిన తరువాత కూడా పదవిలో కొనసాగుతాడు. క్రొత్త స్పీకర్ ఎన్నికయ్యే వరకు అతను స్పీకర్ కార్యాలయాన్ని నిర్వహిస్తాడు.

4. వేతనం, ఇతర సదుపాయాలు :
స్పీకర్ ప్రతి నెల 1,25,000 వేతనంగా పొందుతాడు. ఉచిత నివాసగృహం. వైద్యసదుపాయం, కమ్యూనికేషన్ సదుపాయాలు కల్పించబడడం పొందుతారు.

5. తొలగింపు :
స్పీకర్ సభలో హాజరైన, ఓటింగ్ లో పాల్గొన్న సభ్యుల్లోని మెజారిటీ సభ్యులు తొలగింపు తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా తొలగించబడతాడు. దీనికి 14 రోజుల ముందస్తు నోటీసు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. స్పీకరును తొలగించే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు, స్పీకర్ సభకి అధ్యక్షత వహించలేడు. కానీ చర్చలో పాల్గొనగలడు. ఇంతవరకు భారతదేశంలో స్పీకర్ పదవిలో ఉన్న ఎవరినీ తొలగించడం జరగలేదు.

6. స్పీకర్ అధికారాలు, విధులు :
స్పీకర్ తన విధులను సక్రమంగా, హుందాగా సమర్థవంతంగా నిర్వహించడానికి కావలసిన అధికారాలను భారత రాజ్యాంగం స్పీకర్కు కల్పించింది. స్పీకర్ తన విస్తృతమైన అధికారాలను రాజ్యంగం ద్వారా, పార్లమెంటు విధి విధానాల నిర్వహణ చట్టం 1950 నుంచి పొందుతాడు. స్పీకర్ ఈ కింది విధులను నిర్వహిస్తాడు.

  1. స్పీకర్ లోక్సభ సమావేశాల్లో ప్రసంగిస్తాడు.
  2. సభ్యులను ప్రశ్నలు అడగడానికి అనుమతిస్తాడు. సభానియమాలకు అనుగుణంగా ప్రశ్నలు లేని పక్షంలో అనుమతి నిరాకరించడానికి కూడా స్పీకర్కు అధికారం ఉంది.
  3. వాయిదా తీర్మానాలు ఇతని ఆమోదంతోనే ప్రవేశపెట్టబడతాయి. ఇతడి తీర్మానంపై వ్యాఖ్యానించడానికి సమయం పరిమితిని నిర్ణయిస్తాడు.
  4. ఒక బిల్లుని సభలో ప్రవేశపెట్టడానికి ముందు గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించడానికి అనుమతించవచ్చు. దీనికి సభ అనుమతి అవసరం లేదు.
  5. అతడు సెలక్షన్ కమిటీ చైర్మన్ను నియమిస్తాడు. తను స్వంతంగా కొన్ని ముఖ్యమైన కమిటీలకు, బిజినెస్ అడ్వయిజరీ కమిటీ, జనరల్ పర్చేస్ కమిటీ వంటి వాటికి చైర్మన్ గా వ్యవహరిస్తాడు.
  6. ఒక తీర్మానం సభలో ప్రవేశయోగ్యమా కాదా అని నిర్ణయిస్తాడు.
  7. స్పీకర్ అనుమతి లేకుండా ఏ సభ్యుడూ సభనుద్దేశించి ప్రసంగించలేడు. ఏ సభ్యుడు అయినా చర్చకు సంబంధంలేని అంశాలను మాట్లాడడం ద్వారా సభా సమయాన్ని దుర్వినియోగం, నిరుపయోగం కాకుండా చూస్తాడు.
  8. సభను సక్రమంగా నిర్వహిస్తాడు. సభలో గందరగోళం చెలరేగి కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడినపుడు సభను వాయిదా వేసి, ముగిస్తాడు.
  9. ఒక సభ్యుడు స్పీకర్ అధ్యక్షతను అంగీకరించకపోతే, అసభ్యంగా ప్రవర్తిస్తే నిషేధ హెచ్చరిక చేస్తాడు. సభ నుంచి వెళ్ళిపొమ్మని ఆదేశించినప్పుడు ఆ ఆ దేశాన్ని ఆ సభ్యుడు ఖాతరు చేయకపోతే సంబంధిత సెక్యూరిటీ అధికారుల (మార్షల్స్) ద్వారా బయటికి పంపించగలడు.
  10. ఒక తీర్మానానికి అనుకూలంగా, ప్రతికూలంగా, సమానంగా ఓట్లు లభించినప్పుడు నిర్ణాయకపు ఓటును వినియోగిస్తాడు.
  11. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాలలో ప్రసంగిస్తాడు.
  12. ఒక బిల్లుని ద్రవ్య బిల్లా, కాదా అని నిర్ణయిస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 6.
సుప్రీంకోర్టు యొక్క న్యాయసమీక్షాధికారం గురించి రాయండి.
జవాబు.
భారత రాజ్యాంగంలో ‘న్యాయసమీక్ష’ అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ, మన రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోని శాసన, కార్యనిర్వాహక సంస్థలు రూపొందించే, అమలుచేసే చట్టాలలోని రాజ్యాంగ ఔచిత్యాన్ని నిర్ణయించే అధికారాన్ని సుప్రీంకోర్టుకు సంక్రమింపచేశారు.

భారతదేశంలో రాజ్యాంగ అంశాలను వ్యాఖ్యానించడానికి, రాజ్యాంగ విలువలను కాపాడటానికి, కేంద్రం, రాష్ట్రాల మధ్య న్యాయవివాదాలు ఏర్పడితే న్యాయపరమైన తీర్పు ఇచ్చే పవిత్ర బాధ్యతను సుప్రీంకోర్టుకు ఇవ్వడం జరిగింది.

అందుకు అనుగుణంగా రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఎలాంటి శాసనాలను శాసన నిర్మాణశాఖ రూపొందించినా, కార్యనిర్వాహక వర్గం అమలు చేసినా అవి చెల్లవనీ, రాజ్యాంగ వ్యతిరేకమనీ సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది. సుప్రీంకోర్టు ఈ రకమైన న్యాయసమీక్ష అధికారాన్ని తొలిసారిగా 1950లోనే వినియోగించి ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం (Preventive Detention) లోని కొన్ని అంశాలు రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పుచెప్పింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఎన్నికల గణం అంటే ఏమిటి ?
జవాబు.
భారత రాష్ట్రపతి ఎన్నిక : భారత రాష్ట్రపతి ఎన్నికల గణం ద్వారా ఎన్నికవుతాడు. ఆ ఎన్నికల గణంలో (i) పార్లమెంటు, (ii) రాష్ట్రాల విధాన సభలు, (iii) ఢిల్లీ, పాండిచ్చేరీ విధాన సభలలోని ‘ఎన్నికైన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. నైష్పత్తిక ప్రాతిపదికన, ఒక ఓటు బదిలీ సూత్రం అనుసరించి, ఎన్నిక జరుగుతుంది. నిర్ణీత కోటా ఓట్లు వచ్చిన అభ్యర్థి రాష్ట్రపతి పదవికి ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.

ప్రశ్న 2.
సాధారణ బిల్లుకు, ద్రవ్య బిల్లుకు మధ్యగల తేడాను వివరించండి.
జవాబు.
ఆర్థికేతర, ప్రభుత్వపు పరిపాలన అంశాలకు సంబంధించిన బిల్లులను సాధారణ బిల్లులంటారు. ద్రవ్యబిల్లులు ప్రభుత్వపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఉంటాయి. సాధారణ బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అసుమతి అవసరం లేదు. ద్రవ్య బిల్లులను పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 3.
కేంద్ర మంత్రిమండలి నిర్మాణం గురించి రాయండి.
జవాబు.
కేంద్ర మంత్రిమండలిలో మూడు రకాల సభ్యులు ఉంటారు. వారు :

  1. కేబినెట్ మంత్రులు
  2. స్టేట్ మంత్రులు
  3. డిప్యూటీ లేదా సహాయమంత్రులు.

1. కేబినెట్ మంత్రులు :
కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, హోం, మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేలు వంటి ముఖ్యశాఖలకు అధిపతులుగా కేబినెట్ హోదా గల మంత్రులు ఉంటారు. వారు తమ మంత్రిత్వశాఖల నిర్వహణలో, నిర్ణయాలు తీసుకోవడంలో స్వతంత్రులు. కేంద్ర మంత్రిమండలి, కేంద్ర కేబినెట్ సమావేశాలలో నిర్ణయాలు తీసుకోవడంలో వారికి నిర్ణయాత్మకమైన పాత్ర ఉంటుంది.

2. స్టేట్ మంత్రులు :
కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని శాఖలను ఈ రకమైన మంత్రులు స్వతంత్రంగా నిర్వహిస్తూ, విధి నిర్వహణలో ప్రధానమంత్రికి నేరుగా జవాబుదారీగా ఉంటారు. మంత్రిత్వశాఖలోని కొన్ని కీలకమైన విభాగాలకు వారు ఆధ్వర్యం వహిస్తారు. కేబినెట్ మంత్రుల అజమాయిషీ వారిపైన ఉండదు.

3. డిప్యూటీ లేదా సహాయమంత్రులు :
మంత్రిత్వశాఖలకు సంబంధించిన శాసన పరిపాలనా వ్యవహారాలలో కేబినెట్ మంత్రులకు సహాయపడటానికి నియమించబడే మంత్రులను డిప్యూటీ లేదా సహాయమంత్రులని అంటారు. వారిని ప్రధానమంత్రి ఎంపిక చేస్తాడు. బ్రిటన్లో ఈ రకమైన మంత్రులను జూనియర్ మంత్రులనీ, పార్లమెంటరీ కార్యదర్శులని పిలుస్తారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
రాష్ట్రపతి యొక్క శాసనాధికారాలు.
జవాబు.
శాసనాధికారాలు :

  1. పార్లమెంటు సమావేశపరచడానికి, వాయిదా వేయడానికి, లోక్సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారాలున్నాయి.
  2. సాధారణ ఎన్నికల తరువాత ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తాడు.
  3. పార్లమెంట్కు సందేశాలు పంపవచ్చును.
  4. రాష్ట్రపతి సంతకం పొందిన తరువాతనే బిల్లులు చట్టాలవుతాయి. బిల్లులకు ఆమోదం తెలుపకుండా కొంతకాలం నిలపవచ్చు కానీ రెండు సభలు తిరిగి ఆ బిల్లలను ఆమోదించి పంపితే అధ్యక్షుడు తప్పనిసరిగా ఆమోదించాలి.
  5. పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు.
  6. ఆర్థిక బిల్లులు ఆయన అనుమతి లేనిదే పార్లమెంటులో ప్రవేశపెట్టరాదు.
  7. ఆర్థిక సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వంటి సంస్థలు ఇచ్చిన నివేదికలను పార్లమెంట్కు పంపుతాడు.
  8. పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేస్తాడు.
  9. రాజ్యసభకు 12 మందిని లోక్సభకు ఇద్దరిని నియమిస్తాడు.

ప్రశ్న 5.
జాతీయ అత్యవసర పరిస్థితి.
జవాబు.
జాతీయ అత్యవసర పరిస్థితి (352వ అధికరణం) : విదేశీ దండయాత్రలు, యుద్ధం, సాయుధ తిరుగుబాటు వంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు రాష్ట్రపతి ఈ రకమైన అత్యవసర అధికారాన్ని వినియోగిస్తాడు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రిమండలి లిఖితపూర్వక సూచన మేరకు మాత్రమే రాష్ట్రపతి వ్యవహరించవలసి ఉంటుందని 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం స్పష్టం చేసింది.

జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనకు సంబంధించిన తీర్మానాన్ని నెల రోజుల్లోగా పార్లమెంటు ఉభయ సభల మొత్తం సభ్యత్వ సంఖ్యలో 2/3వ వంతు సభ్యుల మద్దతుతో ఆమోదించవలసి ఉంటుంది. పార్లమెంటు ఆమోదించిన రాష్ట్రపతి ప్రకటన ఆరు నెలల కాలంపాటు అమలులో ఉంటుంది. ఆ తరువాత రాష్ట్రపతి మరొక ప్రకటన ద్వారా అలాంటి అత్యవసర పరిస్థితిని పార్లమెంటు ఆమోదంతో మరో ఆరునెలల కాలంపాటు పొడిగించవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 6.
ఒక రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (రాష్ట్రపతి పాలన).
జవాబు.
ఒక రాష్ట్రం గవర్నర్చే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగే పరిస్థితిలో లేదు. ఆ రాష్ట్రంలోని రాజ్యాంగపరమైన వ్యవస్థ విఫలమైంది అన్న నివేదికను అందుకున్న మీదట రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని (రాష్ట్రపతి పాలన) ప్రకటించవచ్చు. ఈ ప్రకటన ఫలితంగా:

  1. రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లేదా ఏవైనా విధులను తన అధికారంలోకి తీసుకోవచ్చు.
  2. రాష్ట్ర శాసన నిర్మాణశాఖ అధికారాలు పార్లమెంటుచే నిర్వహించబడతాయి.

ఈ అత్యవసర ప్రకటన రెండు నెలలలోపు పార్లమెంటుచే ఆమోదించబడాలి. ఈ ప్రకటన 6 నెలలపాటు అమలులో ఉంటుంది. పార్లమెంటు ఆమోదం మేరకు దీన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించవచ్చు.

ప్రశ్న 7.
లోక్సభ స్పీకర్ అధికారాలు తెలపండి.
జవాబు.
లోక్సభ స్పీకర్ అధికారాలు :

  1. స్పీకర్ లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.
  2. వివిధ బిల్లులపై అధికార, ప్రతిపక్షాల సభ్యులు ప్రసంగించేందుకు తగిన సమయాన్ని కేటాయించి, అవసరమయితే బిల్లులపై ఓటింగ్ నిర్వహించి, ఫలితాలు ప్రకటిస్తాడు.
  3. లోక్సభ ఆమోదించిన బిల్లులను రాజ్యసభకు పంపుతాడు.
  4. లోక్సభ తరపున ముఖ్య ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.
  5. సభ్యుల హక్కులను, సభా గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాడు.

ప్రశ్న 8.
రాజ్యసభ నిర్మాణం.
జవాబు.
రాజ్యసభ నిర్మాణం: రాజ్యసభలో గరిష్టంగా 250 మంది సభ్యులు ఉంటారు. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ వ్యవహరిస్తాడు. సభ్యులలో ఒకరు డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికవుతారు. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 233 మంది ఎన్నికైనవారు కాగా, 12 మంది నామినేటెడ్ సభ్యులు.

ఎన్నికైన వారిలో 229 మంది 28 రాష్ట్రాలకు, ముగ్గురు సభ్యులు జాతీయ రాజధాని ఢిల్లీకి, ఒకరు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి ప్రాతినిధ్యం వహిస్తారు. రాష్ట్రపతి 12 మంది సభ్యులను నామినేట్ చేస్తారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 9.
లోక్సభ నిర్మాణం.
జవాబు. భారత పార్లమెంటులో లోక్సభను దిగువ సభ, ప్రజల సభ అనికూడా అంటారు. దీనిలో అత్యధికంగా 552 సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం ఈ సభలో 545 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 543 మంది ఎన్నుకోబడే సభ్యులు కాగా రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ ప్రతినిధులను లోక్సభకు నామినేట్ చేస్తారు. అయితే ఈ పద్ధతిని (నామినేట్ చేసే పద్ధతిని) 104వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించటం జరిగింది. స్పీకర్ అధ్యక్షతన లోక్సభ సమావేశాలు నిర్వహించబడతాయి.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 2nd Lesson ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 2nd Lesson ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులను వివరించండి.
జవాబు.
ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని 3వ భాగంలో చేర్చారు. ఇవి 12వ అధికరణ నుంచి 35వ అధికరణ వరకు పొందుపరచబడ్డాయి. స్వతంత్ర భారతదేశం కోసం జరిగిన స్వాతంత్రోద్యమమే వీటి ఆమోదం వెనకనున్న తాత్త్విక ప్రేరణ.

భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చడానికి వాటి గుర్తింపు పరిశీలన, సవరణల కొరకు రాజ్యాంగ సభలో జె.బి.కృపలాని అధ్యక్షతన ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ రూపొందించబడింది. అనిబిసెంట్ కామన్వెల్త్ ఇండియా బిల్లు 1925, నెహ్రూ నివేదిక 1928లు ఈ ప్రాథమిక హక్కులకు మార్గదర్శకాలు.

ప్రాథమిక హక్కుల వర్గీకరణ: వీటిని ఈ కింది విధంగా వర్గీకరించారు.

  1. సమానత్వపు హక్కు (అధికరణ 14 నుంచి అధికరణ 18 వరకు)
  2. స్వాతంత్య్రపు హక్కు (అధికరణ 19 నుంచి అధికరణ 22 వరకు)
  3. పీడనాన్ని నిరోధించే హక్కు (అధికరణ 23 మరియు అధికరణ 24)
  4. మతస్వాతంత్ర్యపు హక్కు (అధికరణ 25 నుంచి అధికరణ 28 వరకు)
  5. సాంస్కృతిక విద్యావిషయక హక్కు (అధికరణ 29 మరియు అధికరణ 30)
  6. రాజ్యాంగ పరిహార హక్కు (అధికరణ 32)

1. సమానత్వపు హక్కు (అధికరణ 14 నుంచి అధికరణ 18 వరకు) :
i) 14వ అధికరణ :
చట్టం ముందు వ్యక్తి సమానత్వాన్ని లేదా చట్టాల సమాన రక్షణను ప్రభుత్వం తిరస్కరించరాదని తెలుపుతుంది.

ii) 15వ అధికరణ :
మతం, జాతి, కులం, లింగం, జన్మస్థానం మీద గానీ, వీటిలో ఏ ఒక్కదాని కారణంగా గానీ ప్రభుత్వం ఏ పౌరుడి మీదా వివక్ష చూపరాదని తెలుపుతుంది.

  1. ఏ పౌరుడిపై కూడా పైవాటి లేదా ఏ ఇతర కారణాల వల్ల దుకాణాలు, హోటళ్లు, వినోద స్థలాలు ఉపయోగించుకోవడంలో ఏ విధమైన అనర్హత, నిషేధం, షరతులు విధించరాదు.
  2. పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ ప్రభుత్వ నిధులచే నిర్వహించబడుతున్న బావులు, చెరువులు, స్నానపుశాలలు, వినోద స్థలాలను పౌరులందరూ వినియోగించుకోవచ్చు.

iii) 16వ అధికరణ :
ప్రభుత్వం కింద ఉన్న ఏ కార్యాలయంలోనైనా ఉపాధి లేదా నియామకానికి సంబంధించిన విషయాలలో పౌరులందరికీ సమాన అవకాశాలుండాలని ఆఢలుపుతుంది.
సి) ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఏదైనా కార్యాలయం లేదా ఉద్యోగానికి సంబంధించి ఏ పౌరుడైనా మత, జాతి, కుల, లింగ, వంశ, జన్మస్థానం, నివాస స్థలాల కారణంగా గానీ వీటిలో ఏ ఒక్క కారణంగా గానీ అనర్హతకు లేదా వివక్షతకు గురికారాదు.

iv) 17వ అధికరణ :
అస్పృశ్యత నిషేధించబడింది. ఏ రూపంలోనైనా దీని వాడుక నిరోధించబడింది. బలవంతంగా అస్పృశ్యత కారణంగా తలెత్తిన ఏ అనర్హత అయినా చట్టపరంగా నేరం, శిక్షింపదగినది అని తెలుపుతుంది.

v) 18వ అధికరణ :
సైనిక సంబంధమైనవి లేదా విద్యా సంబంధమయినవి తప్ప ఏ ఇతర బిరుదును ప్రభుత్వం ప్రసాదించరాదని తెలుపుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

2. స్వాతంత్య్రపు హక్కు (అధికరణ 19 నుంచి అధికరణ 22 వరకు) :

i) 19వ అధికరణ : పౌరులందరూ ఈ కింది హక్కులను కలిగి ఉంటారని తెలుపుతుంది.

  1. భావ వ్యక్తీకరణ మరియు వాక్కు స్వేచ్ఛ.
  2. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సభలు, సమావేశాలు జరుపుకొనే స్వేచ్ఛ.
  3. సంఘాలు, సమూహాలు ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
  4. భారత భూభాగమంతా సంచరించే స్వేచ్ఛ.
  5. భారత భూభాగంలోని ఏ ప్రాంతంలోనయినా నివసించే స్వేచ్ఛ.
  6. ఏదైనా వృత్తి, ఉపాధి, వ్యాపార, వాణిజ్యాలను నిర్వహించుకొనే స్వేచ్ఛ.

గమనిక : అధికరణ 19 (ఎఫ్), ఆస్తిని సంపాదించుకొనే స్వేచ్ఛ, 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది.

ii) 20వ అధికరణ :
(ఎ) అమలులో ఉన్న చట్టాన్ని అతిక్రమించడం నేరంగా పరిగణించబడుతున్న సమయంలో ఆ చర్యకు పాల్పడటం మినహా, ఏ ఇతర నేరానికీ ఏ పౌరుడూ నేరారోపణకు గురికారాదు. నేరం జరిగిన సమయంలో అమలులో ఉన్న చట్టం కింద విధించే దానికన్నా అధిక శిక్షకు గురికారాదు అని తెలుపుతుంది.

ఎ) ఏ వ్యక్తీ ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ నేరారోపణకు, శిక్షకు గురికారాదు.
బి) నేరారోపణ చేయబడిన ఏ పౌరుడినీ తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పుకోవడానికి ఒత్తిడి చేయరాదు.

iii) 21వ అధికరణ :
జీవించే హక్కు గురించి తెలుపుతుంది. చట్టం ద్వారా రూపొందించబడిన ప్రక్రియ ద్వారా మినహా, ఏ వ్యక్తి ప్రాణానికి లేదా వ్యక్తిగత స్వేచ్ఛకు హాని కలిగించరాదు. దీనినే ప్రాణరక్షణ హక్కు అని అంటారు.

iv) అధికరణ 21-ఎ కు లోబడి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ చట్టం ద్వారా నిర్ణయించిన పద్ధతిలో నిర్బంధ, ఉచిత విద్యను ప్రభుత్వాలన్నీ అందించాలి. (86వ సవరణ చట్టం 2002 ద్వారా చేర్చబడింది).

v) 22వ అధికరణ :
అరెస్టు చేసిన వ్యక్తిని కారణం తెలుపకుండా నిర్బంధించరాదు అని తెలుపుతుంది. అరెస్టు చేసి నిర్బంధించబడిన ప్రతీ వ్యక్తిని అరెస్టు చేసిన తరువాత ఇరవైనాలుగు గంటల లోపల దగ్గరలోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలి.

3. పీడనాన్ని నిరోధించే హక్కు (అధికరణ 23 మరియు అధికరణ 24) :

  1. 23వ అధికరణ అక్రమ మానవ వ్యాపారం, వెట్టిచాకిరి, మరే ఇతర రూపాలలో బలవంతంగా పని చేయించడం నిరోధించబడింది అని తెలుపుతుంది.
  2. 24వ అధికరణ 14 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలను కర్మాగారాలు, గనులు తదితర ప్రమాదకరమయిన వృతులలో పని చేయించరాదు.

4. మతస్వాతంత్య్రపు హక్కు (అధికరణ 25 నుంచి అధికరణ 28 వరకు) :

  1. 25వ అధికరణ ప్రజాసంక్షేమం, నైతిక విలువలు, ఆరోగ్యం ఇతర నిబంధనలకు లోబడి, ఏ వ్యక్తి అయినా తనకు ఇష్టమైన మతాన్ని స్వీకరించడం, ఆచరించడం, ప్రచారం చేయడం, వ్యాప్తి చేసుకోవడానికీ పౌరులందరికీ సమానమయిన హక్కు కల్పించబడింది.
  2. ప్రభుత్వాలు, మతానికి సంబంధించిన ఆర్థిక, రాజకీయ లేదా మరే ఇతర సంక్షేమ చర్యలను నియంత్రించే లేదా నిరోధించే చట్టాలను రూపొందించవచ్చు.
  3. 26వ అధికరణకు లోబడి ప్రజాసంక్షేమం, నైతిక విలువలు, ఆరోగ్యం వంటి విషయాలకు సంబంధించి మత సంబంధమయిన ఏ సంస్థ లేదా శాఖ అయినా ఈ క్రింది హక్కులను కలిగి ఉంటాయి.
    ఎ) మత సంబంధమయిన మరియు ధార్మిక సంస్థలను స్థాపించడం, నిర్వహించడం.
    బి) మత సంబంధమయిన వ్యవహారాలను స్వంతంగా నిర్వహించుకోవడం.
    సి) స్థిరాస్తి మరియు చరాస్తులను సమకూర్చుకోవడం.
    డి) చట్టానికి లోబడి అటువంటి ఆస్తులను నిర్వహించుకొనడం.
  4. 27వ అధికరణ మతం లేదా మత సంబంధమయిన సంస్థల అభివృద్ధి, నిర్వహణ ఖర్చుల కొరకు ఏ విధమయిన పన్నులు విధించరాదు.
  5. 28వ అధికరణ, పూర్తిగా గానీ, పాక్షికంగా గాని ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న ఏ విద్యాసంస్థలోనైనా మతపరమయిన బోధనలు, పద్ధతులను పాటించరాదు.

5. సాంస్కృతిక మరియు విద్యావిషయక హక్కు :

  1. 29వ అధికరణ, ప్రతీ పౌరుడికీ, తన స్వంత భాష, లిపి లేదా సంస్కృతులను కలిగి ఉండడానికి మరియు సంరక్షించుకొనే హక్కు ఉంది. ప్రభుత్వం లేదా ప్రభుత్వేతర నిధుల సహాయంతో నిర్వహించబడుతున్న ఏ విద్యా సంస్థలలోకి ఏ పౌరుడినీ మతం, జాతి, కుల, భాషల లేదా వీటిలో ఏ ఒక్కదాని కారణంగానైనా తన ప్రవేశాన్ని నిరాకరించరాదు.
  2. 30 అధికరణ, మత లేదా భాషాపరంగా అల్పసంఖ్యాకులు ఇష్టమయిన విద్యాసంస్థలను స్థాపించుకొని నిర్వహించుకొనే హక్కు కలిగి ఉన్నాయని తెలుపుతుంది.
    31వ అధికరణ ఆస్తి హక్కు 44వ సవరణ చట్టం ద్వారా 1978లో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించబడింది.

6. రాజ్యాంగ పరిహార హక్కు (అధికరణ 32) :
అధికరణ 32 ప్రకారం, ప్రతీ పౌరుడూ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల అమలుకు తగిన ప్రక్రియల ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రయించే హక్కు ప్రసాదించబడింది. రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ప్రాథమిక హక్కుల అమలు కొరకై సుప్రీంకోర్టు, హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో వారంలొ మరియు సర్షియర రిట్లతో తగిన రిట్ను జారీ చేసే అధికారం కలిగి ఉంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 2.
ఆదేశక సూత్రాలను వివరించండి.
జవాబు.
ఆదేశక సూత్రాలు ఐర్లాండు రాజ్యాంగం నుంచి గ్రహించబడ్డాయి. ఇవి భారత రాజ్యాంగంలో 4వ భాగంలో అధికరణ 36 నుంచి అధికరణ 51 వరకు పొందుపరచబడ్డాయి. ఆదేశక సూత్రాల అమలులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. ఆదేశక సూత్రాలు భారతదేశ పౌరులకు సామాజిక – ఆర్థిక న్యాయం అందించడంలో తోడ్పడతాయి. వీటి ముఖ్య ఉద్దేశం శ్రేయోరాజ్య స్థాపన.
ఆదేశక సూత్రాలను వివరించండి.

ఆదేశక సూత్రాలు మూడు రకాలుగా విభజించబడ్డాయి.

  1. సామ్యవాద సూత్రాలు
  2. గాంధేయవాద సూత్రాలు
  3. ఉదారవాద సూత్రాలు

1. సామ్యవాద సూత్రాలు :
ఇవి భారతదేశంలో సామాజిక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి ఆదేశక సూత్రాలలో చేర్చబడ్డాయి. 38వ అధికరణ, 39వ అధికరణ, 41వ అధికరణ, 42వ అధికరణ, 43వ అధికరణ, 46వ అధికరణ, 47వ అధికరణలు ఆదేశ సూత్రాల యొక్క సామ్యవాద భావాలను వివరిస్తాయి.

  1. 38వ అధికరణ, ప్రజలందరికీ న్యాయం (సామాజిక, ఆర్థిక, రాజకీయ) చేకూరే పద్ధతిలో ఒక సామాజిక క్రమాన్ని నెలకొల్పడం ద్వారా ప్రజాసంక్షేమాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని తెలుపుతుంది.
  2. 39వ అధికరణ, ప్రభుత్వం కింది వాటి కొరకు చర్యలు తీసుకోవాలని తెలుపుతుంది.
    i) ప్రజలందరికీ తగినంత జీవనభృతిని కల్పించుట.
    ii) ప్రజలందరి ఉపయోగం కొరకు దేశంలోని వనరుల సమాన పంపిణీ.
    iii) జాతీయ సంపదను వికేంద్రీకరించుట.
    iv) స్త్రీ, పురుషులకు సమాన వేతనాలు.
    v) కార్మికుల, పురుషుల, మహిళల సంపదను, శక్తిని సంరక్షించడం.
    vi) బాల్యం, యవ్వనాన్ని దోపిడీ నుంచి రక్షించడం.
  3. 41వ అధికరణ, నిరుద్యోగిత, వృద్ధాప్యం, అనారోగ్యం, అశక్తత వంటి పరిస్థితులలో సహాయం, పనిహక్కు విద్యాహక్కులను ప్రసాదించాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.
  4. 42వ అధికరణ, కార్మికులు పనిచేసేందుకు తగిన మానవీయ పరిస్థితులను కల్పించడం, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలను కల్పించడం.
  5. 43వ అధికరణ కార్మికులందరికీ కనీస జీవన వేతనం, మెరుగైన పని నిబంధనలు, సామాజిక, సాంస్కృతిక అవకాశాలను కల్పించాలని ప్రభుత్వాన్ని సూచిస్తుంది.
  6. 46వ అధికరణ, ప్రభుత్వం షెడ్యూల్డు తెగల, షెడ్యూల్డు కులాల, అల్ప సంఖ్యాకులకు విద్యా, ఆర్థిక సదుపాయాలను అందించాలని ప్రభుత్వానికి సూచిస్తుంది. సామాజిక అన్యాయం, అన్ని రకాల దోపిడీల నుంచి ప్రభుత్వం వారిని రక్షించాలి.
  7. 47వ అధికరణ, కనీస పోషకాహార స్థాయి, జీవన ప్రమాణాన్ని పెంచి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

2. గాంధేయవాద సూత్రాలు:
గాంధేయవాద సూత్రాలు భారతదేశంలో ఆదర్శ పరిపాలనను అందిస్తాయి. ఈ సూత్రాలు అధికరణ 40, అధికరణ 43, అధికరణ 46, అధికరణ 47, అధికరణ 48ఎ, అధికరణ 49 లలో ప్రతిఫలిస్తాయి.

  1. 40వ అధికరణ, ప్రభుత్వం, గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసి, అధికారాలను కల్పించి, వాటిని స్వపరిపాలనా సంస్థలుగా పనిచేసే అవకాశాన్ని కల్పించాలని సూచిస్తుంది.
  2. 43వ అధికరణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగతంగా గాని సామూహిక రంగంలో గాని కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది.
  3. 46వ అధికరణ, బలహీన వర్గాల వారికి ప్రత్యేక శ్రద్ధతో విద్య, ఆర్థిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది.
  4. 47వ అధికరణ, మద్యం, మత్తుపదార్థాలను నిషేధించడానికి కృషి చేయాలని ప్రభుత్వానికి సూచిస్తుంది.
  5. 48వ అధికరణ, నూతన, సాంకేతిక పద్ధతులలో పశుపోషణ, వ్యవసాయాలను నిర్వహించాలని ప్రభుత్వానికి ఇది సూచిస్తుంది. ఇది గోవులను, ఇతర పాడి పశువులను వధించడాన్ని నిషేధించవలసిందిగా ఆదేశిస్తుంది.
  6. అధికరణ 48ఎ, పర్యావరణ పరిరక్షణ, అడవులను, వన్యప్రాణుల్ని సంరక్షించాలని ప్రభుత్వానికి సూచిస్తుంది.
  7. 49వ అధికరణ కళాత్మక నైపుణ్యం, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన స్థలాలను, కట్టడాలను పరిరక్షించాలని సూచిస్తుంది.

3. ఉదారవాద సూత్రాలు :
ఈ సూత్రాలు స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు అంతర్జాతీయ శాంతి మొదలగు వాటి సాకారానికి సంబంధించినవి. అవి అధికరణ 44, అధికరణ 45, అధికరణ 50, అధికరణ 51 లలో పొందుపరచబడ్డాయి.

  1. 44వ అధికరణ, దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తుంది.
  2. 45వ అధికరణ, బాల్యంలో పిల్లల సంరక్షణ మరియు పిల్లలందరికీ ఆరు సంవత్సరాల వరకు పూర్వప్రాథమిక విద్యను ప్రభుత్వం అందించాలని సూచిస్తుంది.
  3. 50వ అధికరణ, కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.
  4. 51వ అధికరణ ప్రభుత్వాన్ని కింది వాటిని నిర్వహించాలని సూచిస్తుంది.
    i) అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించడం.
    ii) దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పడం.
    iii) అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను గౌరవించి ఆచరించడం.
    iv) అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడాన్ని ప్రోత్సహించడం.

అదనపు సూత్రాలు :
రాజ్యాంగ చట్టాలు – 42వ సవరణ 1976, 44వ సవరణ 1978, ఈ ఆదేశ సూత్రాలకు మరికొన్ని సూత్రాలను చేర్చాయి. 42వ సవరణ 1976 చట్టం అధికరణ 39ఎ, అధికరణ 43ఎ, అధికరణ 48ఎ లను చేర్చింది. 44వ సవరణ 1978 చట్టం అధికరణ 38 లో 2వ నిబంధనను చేర్చింది. అవి ఈ క్రింది విషయాలను కలిగి ఉన్నాయి.

  1. ఆదాయంలో అసమానతలను తగ్గించడం.
  2. సమన్యాయం మరియు పేదలకు ఉచిత్ర చట్టపరమయిన సహాయం (అధికరణ 39ఎ).
  3. పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం (అధికరణ 43ఎ).
  4. పర్యావరణం, అడవులు, జంతువుల సంరక్షణ (అధికరణ 48ఎ).

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 3.
ప్రాథమిక హక్కులకు, ఆదేశక సూత్రాలకు మధ్య భేదాలను తెలపండి.
జవాబు.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య భేదాలు :

ప్రాథమిక హక్కులు

ఆదేశక సూత్రాలు

1. ప్రాథమిక హక్కులు ప్రతికూల స్వభావాన్ని కలిగి ఉంటాయి. వ్యక్తికి హానికరమైన ప్రభుత్వ కార్యకలాపాలను నిరోధిస్తాయి.1. ఇవి స్వభావరీత్యా అనుకూలమైనవి. ఇవి ప్రభుత్వపు సామాజిక, ఆర్థిక కార్యకలాపాలను విస్తరిస్తాయి.
2. ఇవి న్యాయస్థానం ద్వారా పొందగలిగినవి. న్యాయస్థానాలు 32వ అధికరణకు లోబడి, ప్రాథమిక హక్కుల సంరక్షణ కొరకు రిట్లను జారీ చేస్తాయి.2. ఇవి న్యాయస్థానం ద్వారా పొందలేనివి. న్యాయ స్థానం వీటిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేవు.
3. 13వ అధికరణ ప్రకారం, ప్రాథమిక విధులను ఉల్లంఘించే చట్టాలు చెల్లవు.3. ఆదేశక సూత్రాలను ఉల్లంఘించే చట్టాలు చెల్లుబాటు కావు అని న్యాయస్థానాలు నిర్దేశించలేవు.
4. ప్రాథమిక హక్కులు పౌరుల వ్యక్తిగత జీవితం, స్వేచ్ఛల సంరక్షణకు సంబంధించినవి.4. ఆదేశక సూత్రాలు దేశం యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, సంక్షేమాల అభివృద్ధి కొరకు ఉద్దేశించబడినవి.
5. ప్రాథమిక హక్కులకు, ఆదేశక సూత్రాలకు మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలను అధిగమిస్తాయి.5. ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులను ఆదేశక సూత్రాలు అధిగమించలేవు.
6. ఇవి రాజ్యాంగంలోని 3వ భాగంలో చేర్చబడ్డాయి. వీటిని అమలు చేయడానికి ప్రత్యేక చట్టాలను చేయాల్సిన అవసరం లేదు.6. ఇవి భవిష్యత్ ప్రభుత్వాలకు మార్గ నిర్దేశకాలు మాత్రమే. కావున వీటిని అమలు చేయడానికి ప్రత్యేక చట్టం అవసరం.
7. ఇవి రాజ్యానికి మరియు భవిష్యత్ ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు.7. ఇవి భవిష్యత్ ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు. ఇవి రాజ్యాంగకర్తల ఆదర్శాలు.
8. ప్రభుత్వం లేదా అధికారంలో ఎవరున్నా ప్రాథమిక హక్కులు అమలుపరచబడతాయి.8. వీటిపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకతలు ఎదురుకావచ్చు. కాబట్టి ప్రభుత్వం తన వెసులుబాటు, వనరుల లభ్యతను బట్టి అమలుపరుస్తుంది.
9. ప్రాథమిక హక్కులు ప్రభుత్వం యొక్క రాజకీయ ప్రజాస్వామ్య స్వభావాన్ని సూచిస్తాయి.9. ఆదేశక సూత్రాలు రాజ్య ఆదర్శాలను మరియు ప్రభుత్వపు లక్ష్యాలను, గమ్యాలను వివరిస్తాయి.
10. ప్రతీ పౌరునికీ, దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో స్వేచ్ఛగా పాల్గొనే అవకాశాన్ని ఇవి కలిగిస్తాయి.10. సామాజిక అభివృద్ధి సంక్షేమం కొరకు, వెసులుబాటు మరియు వనరులను బట్టి ప్రభుత్వం నిర్వహించే చర్యలను ఇవి సూచిస్తాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
సమానత్వ హక్కు.
జవాబు.
రాజ్యాంగం 14వ అధికరణం భారతదేశంలో నివసించే వ్యక్తులందరికీ చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమానమైన రక్షణ, సదుపాయాలను కల్పించింది. చట్టం ముందు సమానత్వం అంటే వ్యక్తులందరికీ ఒకే విధమైన చట్టాలు, ఒకే రకమైన న్యాయస్థానాలు, ఒకే విధమైన కార్యపద్ధతులు అని అర్థం.

సంపద, హోదా లేదా పరిస్థితిని బట్టి వ్యక్తుల మధ్య విచక్షణ చూపించకూడదు. పౌరుల మధ్య మతం, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షతలను రాజ్యం పాటించరాదని 15వ అధికరణం స్పష్టం చేసింది.

16వ అధికరణం ప్రకారం రాజ్యానికి సంబంధించిన ఏ ఉద్యోగం లేదా నియామకానికైనా పౌరులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. 17వ అధికరణం అస్పృశ్యత లేదా అంటరానితనం పాటించడాన్ని నేరంగా పేర్కొంది. 18వ అధికరణం ప్రకారం పౌరులకు సైనిక లేదా విద్యా విషయక బిరుదులు ఇతర బిరుదులను రాజ్యం ప్రసాదించకూడదు. భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశీ రాజ్యాలు ప్రకటించే బిరుదులను పౌరులు స్వీకరించకూడదు.

ప్రశ్న 2.
స్వాతంత్య్ర హక్కు.
జవాబు. స్వాతంత్య్రపు హక్కు (19 – 22 అధికరణాలు) : ఈ హక్కు పౌరులకు 6 ప్రాథమిక స్వేచ్ఛలను కల్పిస్తున్నది. అవి :

  1. వాక్ స్వాతంత్ర్యం
  2. సభలు, సమావేశాలు జరుపుకునే స్వాతంత్ర్యం
  3. సంఘ నిర్మాణ స్వాతంత్ర్యం
  4. సంచార స్వాతంత్ర్యం
  5. నివాస స్వాతంత్ర్యం
  6. వృత్తి స్వాతంత్ర్యం.
    ఈ స్వేచ్ఛలు ఏవీ నిరపేక్షమైనవి కావు. వీటికి ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చు.

ఏ పౌరుడు నేరం చేయనిదే శిక్షింపబడరాదు. నిందితుడు తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని బలవంతం చేయరాదు. నేరం ఋజువు కానిదే ఎవరినీ 24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచరాదు. 24 గంటలలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 3.
మతస్వాతంత్ర్య హక్కు.
జవాబు.
మత స్వాతంత్ర్య హక్కు భారత రాజకీయ వ్యవస్థ లౌకిక స్వభావానికి ప్రతీక. 25వ అధికరణం ప్రకారం ప్రతి వ్యక్తికీ ప్రజాభద్రత, నైతికత, ఆరోగ్యాలకు లోబడి తన అంతరాత్మకు అనుగుణమైన మతాన్ని అవలంభించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది. మత ప్రభావానికి సంబంధించిన ఏ కార్యక్రమాలనైనా క్రమబద్ధం చేసే చట్టాన్ని రాజ్యం రూపొందించవచ్చు.

26వ అధికరణం ప్రకారం ఏ మతానికి చెందినవారైనా

  1. మతపరమైన ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి
  2. స్వీయ మత వ్యవహారాలను నిర్వహించుకోవడానికి
  3. స్థిర, చరాస్తులపై యాజమాన్య హక్కు పొందటానికి, వాటిని కొనుగోలు చేయడానికి చట్ట ప్రకారం ఆస్తిపాస్తులను నిర్వహించుకోవచ్చు.

27వ అధికరణం మతం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తిపై, ఏ విధమైన పన్ను విధించడానికి, వసూలు చేయడానికి వీలులేదని పేర్కొంది. 28వ అధికరణం ప్రకారం రాజ్యం నుంచి సంపూర్ణంగానో, పాక్షికంగానో ఆర్థిక సహాయాన్ని పొందే విద్యా సంస్థలలో మతపరమైన బోధనలు నిషేధించడం జరిగింది.

ప్రశ్న 4.
గాంధేయవాద సూత్రాలు.
జవాబు.

  1. 40వ అధికరణం ప్రకారం రాజ్యం పంచాయితీరాజ్ సంస్థలను నిర్వహించి, అవి స్వయంపాలన సంస్థలుగా ఏర్పడటానికి తగిన అధికారాలు ఇవ్వాలి.
  2. 43వ అధికరణం ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తిగత లేదా సహకార ప్రాతిపదికపై కుటీర పరిశ్రమల స్థాపనకు రాజ్యం తోడ్పడాలి.
  3. 46వ అధికరణం ప్రకారం బలహీన వర్గాల ప్రజల విద్యా, సామాజిక ప్రగతికి రాజ్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
  4. 47వ అధికరణం ప్రకారం మత్తు పానీయాలు, మాదకద్రవ్యాల నిషేధానికి చర్యలు తీసుకోవాలి.
  5. 48వ అధికరణం ప్రకారం వ్యవసాయం, పశుపోషణలను ఆధునిక, శాస్త్రీయ పద్ధతులలో నిర్వహించడానికి గోవులు, దూడలు, ఇతర పాడి పశువులు, లాగుడుబండ్లకు కట్టే పశువుల వధను నిషేధించడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 5.
సామ్యవాద సూత్రాలు.
జవాబు.
సామ్యవాద సూత్రాలు :

  1. ప్రజలందరికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చుట.
  2. స్త్రీ, పురుష వివక్షత చూపక అందరికీ సమాన హక్కులు ఇచ్చుట. అస్పృశ్యతను నేరంగా పరిగణించటం.
  3. పౌరులందరికీ జీవనోపాధి కల్పించడం.
  4. దేశ సంపద సమిష్టి శ్రేయస్సు కోసం పంపిణీ చేయటం.
  5. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ.
  6. బాలబాలికలు, యువతీయువకులు దోపిడీకి గురికాకుండా ఉండేటట్లు చేయడం, పని హక్కు కల్పించే చర్యలు తీసుకోవడం.
  7. ప్రజలకు పోషకాహారాన్ని అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవడం.
  8. మాతాశిశు సంక్షేమం మొదలగునవి. ఈ అంశాల అమలుకు కొన్ని చర్యలు తీసుకొనబడ్డాయి.
    ఉదా : అంటరానితనం నిర్మూలించే చట్టం చేయడం, జాతీయ ప్రణాళికా సంఘం ద్వారా ప్రణాళికలు అమలు చేసి ఆర్థిక ప్రగతికి చర్యలు తీసుకోవడం, కార్మిక చట్టాలు చేయడం మొదలగునవి.

ప్రశ్న 6.
ఏవైనా నాలుగు ప్రాథమిక విధులు.
జవాబు.
నాలుగు ప్రాథమిక విధులు :

  1. భారత రాజ్యాంగం పట్ల, అది సూచించిన ఆదర్శాలు, సంస్థల పట్ల, జాతీయపతాకం, జాతీయగీతం పట్ల విధేయతను చూపటం.
  2. స్వాతంత్ర్యం కోసం జరిగిన జాతీయోద్యమ ఉదాత్త ఆశయాలను పోషించుకుంటూ అనుసరించటం.
  3. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యత, సమగ్రతలను సమర్థించి సంరక్షించుకోవటం.
  4. దేశాన్ని రక్షించుకోవడం, అవసరమయినపుడు జాతీయ సేవలో పాల్గొనడం.
  5. మత, భాషా, ప్రాంతీయ, వర్గ సంబంధమైన వైవిధ్యాలను అధిగమించి భారత ప్రజలందరిలో సమైక్యతను, ఉమ్మడి సౌభ్రాతృత్వ భావాలను పెంపొందించుకోవడం, మహిళల గౌరవానికి విరుద్ధమైన పద్ధతులను పరిత్యజించడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 7.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య ఏవైనా రెండు తేడాలు.
జవాబు.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య రెండు వ్యత్యాసాలు :

ప్రాథమిక హక్కులుఆదేశక సూత్రాలు
1. ప్రాథమిక హక్కులు చట్టబద్ధమైనవి.1. ఆదేశక సూత్రాలు సామాజికమైనవి.
2. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగం హామీ ఇస్తుంది.2. ఆదేశక సూత్రాల అమలు కోసం రాజ్యాంగం ఎలాంటి హామీ ఇవ్వలేదు.
3. ప్రాథమిక హక్కులు సంరక్షక స్వభావాన్ని కలిగి ఉంటాయి.3. ఆదేశక సూత్రాలు సంవర్థకమైనవి.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 1st Lesson నా ప్రథమ విదేశయాత్ర Textbook Questions and Answers.

TS Inter 2nd Year Telugu Non-Detailed 1st Lesson నా ప్రథమ విదేశయాత్ర

అభ్యాసం

I. ప్రశ్నలకు జవాబులు

ప్రశ్న 1.
ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలుపండి. (V.Imp) (M.P)
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య 18 అక్టోబరు 1907 నాడు మంథెనలో జన్మించాడు. ఆయన తండ్రి ఆదిలాబాద్ జిల్లా తాండూర్లో సింగల్ టీచర్గా పనిచేసేవారు. ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారం ప్రారంభించి నష్టపోయారు. దాని కారణంగా ఆస్తి కన్నా అప్పు పెరిగింది. అప్పులవాళ్ళు వచ్చి వారి తండ్రివి తిట్టేవారు. ఆ మాటల బాధకు ఇంటి బయటకు వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ, చేతులు జోడించి దేవునితో నన్ను కనికరించి చదువు చెప్పించు.

విదేశాలకు వెళ్లి చదువుకునేల ఆశీర్వదించమని, తండ్రి చేసిన అప్పులు తీర్పించి, ఇల్లును అమ్మకుండా, దాని ముందర గుఱ్ఱపు బగ్గీలను, మోటార్లను పెట్టించేలా, తండ్రికి, తల్లికి ఇప్పటికన్న ఎక్కువ పేరు మర్యాదలు తెప్పించమని మొక్కారు. అంటే చిన్నప్పుడే విదేశాల్లో చదువుకోవాలనే సంకల్పం ఉండేదని తెలుస్తుంది.

డబ్బులేనివారు చదువుకోలేరు, వివాహం అయిన వారు చదువుకోలేరు అనే మాటలను తప్పు అని నిరూపించాలని, ఈశ్వరుణ్ణి నమ్మినవాడు తప్పక అనుకున్నది సాధిస్తాడని కూడా రుజువు చేయాలని సంకల్పించు కున్నాడు. హైదరాబాద్ లో బి.ఏ. పాస్ అయ్యాడు. తరువాత L.L.B.

చదువుకొని BAR చేయడానికి ఇంగ్లాండు వెళ్ళాలని సంకల్పం చేసుకున్నాడు. ఇంగ్లండు వెళ్ళడానికి ధనవంతులయిన రెడ్డి స్నేహితులు సహాయం చేస్తారనే నమ్మకం ఉండేది. సర్కారీ ఉద్యోగం చేయటానికి ఇష్టం లేదు. అనేక చిన్న, పెద్ద పనులు చేస్తూ చదువుకున్నాక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. తరువాత ఇంకా గట్టిగ ఇంగ్లండు వెళ్లి పరిశోధన చేయాలని సంకల్పించుకున్నాడు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 2.
ముద్దు రామకృష్ణయ్య గారి ప్రథమ విదేశయాత్ర సన్నాహాలు వివరించండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య మొదటి ప్రయత్నం విఫలం అయ్యాక 1944 లో తన తోటి ఉపాధ్యాయుడు దిగంబరరావు తో మాట్లాడుతూ డబ్బు లేని కారణంగా ఇంగ్లాండు వెళ్లలేదని చెప్పాడు. ఆయన డిప్యూటి కలెక్టర్, పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ మిత్రులే కదా వారు సహకరించరా అని సలహా ఇచ్చాడు. మళ్ళీ విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు ప్రారంభించి థామస్ కుక్ వారికి ఇంగ్లాండ్ వెళ్ళడానికి పడవ ఉందా అని లేఖ రాశాడు. సెప్టెంబర్లో పడవ బయలుదేరుతుందని, బ్రిటీష్ రెసిడెన్సి నుండి పాస్పోర్ట్ తీసుకొమ్మని, సీటు రిజర్వు చేసినట్టు వారు జవాబు పంపారు.

దానికి సంతోషించి హైదరాబాద్ ప్రభుత్వ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్కు ఇంగ్లాండ్లో ఎం. ఇడి లేదా పి. హెచ్లలో సీట్ ఇప్పించమని, అక్కడ చదువుకోవడానికి ఇక్కడ సెలవు ఇప్పించమని, 6000 అప్పు ఇప్పించమని లేఖ రాశాడు. అతడు యుద్ధ సమయం ముగిసేవరకు పడవలు వెళ్ళవు, అక్కడ సీట్ రావడం కష్టం, అక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు.

ఈ మూడు విషయాలు పూర్తి కాకుంటే డబ్బుతో అవసరమే లేదు అని ప్రత్యుత్తరం పంపాడు. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కాదన్నాడు. కో ఆపరేటివ్ బ్యాంకు సెక్రెటరి లోనే లేదన్నాడు. ఇలా అందరూ నిరుత్సాహపరిచారు. అన్నలా భావించే అబ్దుల్ హమీద్ కూడా మొదట పిచ్చి ప్రయత్నం, యుద్ధకాలంలో ఒక నెలలో పాస్పోర్ట్ రావడం అసంభవం అని చెప్పాడు. మీ ఆశీర్వాదం ఉంటే అన్ని అవుతాయని రామకృష్ణయ్య అంటే ఆశీర్వదించి పంపాడు.

లాతూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మీరు ప్రయత్నం చేయండి నా వంతు సహాయం చేస్తానన్నాడు. ఆ కాలంలో పాస్పోర్ట్ పొందడానికి చాలా తతంగం ఉండేది. పాస్పోర్ట్ కోసం జిల్లా అధికారికి దరఖాస్తు చేస్తే ఆయన హోం శాఖకు పంపితే వారు లోకల్ పోలీసు వారికి పరిశీలన కోసం పంపేవారు. ఇవన్నీ కావడానికి కనీసం ఆరు నెలల కాలం పట్టేది. ఆ తరువాత వారు దానిని బ్రిటీష్ రెసిడెన్సీకి పంపితే వారు పాస్పోర్ట్ మంజూరు చేసేవారు. ఇదంతా జరగడానికి తనకున్న సమయం సరిపోదని తెలిసి కూడా ముద్దు రామకృష్ణయ్య ప్రయత్నాలు ప్రారంభించాడు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 3.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్ర కోసం విద్యాశాఖ అనుమతి గురించి రాయండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య విదేశాలకు వెళ్ళాలనుకున్న రోజుల్లో సగం జీతంతో ఇంగ్లాండ్ వెళ్లి చదువుకుంటే వచ్చాక పది సంవత్సరాలు ఉద్యోగం చేస్తానని, అలా చేయకుంటే తీసుకున్న జీతం వాపసు ఇస్తానని బాండ్ రాసి ఇవ్వాలి. అలా ఇవ్వకుంటే మేము ఇస్తామని వంద కంటే ఎక్కువ జీతం ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు జమానత్ (పూచీ కత్తు) ఇవ్వాలని నిబంధనలు ఉండేవి. అప్పుడు వందపైన జీతం ఉన్న వారు నలుగురు మాత్రమె ఉండేవారు. అందులో ఒకరు జామీను సులభంగానే ఇచ్చారు.

ఇంకో జామీను కోసం చాల ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఐదు రూపాయల బియ్యం ఇప్పించి ఇంకో జామీను తీసుకున్నాడు. రెండు జామీనులు, సెలవు పత్రం, ఎకరారు నామాలతో ప్రధానోపాధ్యాయునికి దరఖాస్తు చేశాడు. ఆయన డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్కు పంపాడు. వారికి ఒక ప్రైవేటు లేఖ రాసి పని త్వరగా అయ్యేలా చూడాలని అభ్యర్థించాడు. వారు అలానే త్వరగా దానిని డి పి ఐ కి పంపారు కాని వారు ఆరు నెలల ముందు అనుమతి కోరలేదు కాబట్టి సెలవు దొరకదని చెప్పారు.

అక్కడి వారిని ఎంత బతిమిలాడినా పని కాలేదు చివరికి సీనియర్ డిప్యుటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ డి.పి.ఐ. హక్కాని ని కలిశారు. ఆయన రామకృష్ణయ్యను చూడగానే మీ హిందువులు నీకు సహకరించడం లేదా అని అడిగారు. ముస్లిం కమ్మంటే కాకపోతివి ఇప్పుడు ఇబ్బందులు పడవడితివి అని అన్నాడు. ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుని దగ్గర భోజనం పెట్టించాడు.

ఆయనకు రామకృష్ణయ్య విషయాన్ని వివరించి సహకరించాలని వేడుకున్నాడు. ప్రభుత్వం సెలవు ఇవ్వకున్నా సొంత ఖర్చులతో ఇంగ్లాండ్ వెళ్తానని రాసివ్వు అంటే అలా రాసిచ్చాడు. ఇతను ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే ఇంకెప్పుడూ వెళ్ళలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్ పాడవుతుంది కావున వెంటనే అనుమతించి రిలీవ్ చేయాలని ప్రధానోపాధ్యాయునికి రాశారు. అలా విద్యాశాఖ అనుమతి లభించింది.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 4.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్రకు పాస్పోర్టు ఎలా లభించింది ? (V.Imp) (M.P)
జవాబు:
పాస్పోర్ట్ దరఖాస్తుకు పెట్టడానికి ఫోటోలు కావాలి. ఫోటోలు దిగడానికి మంచి డ్రెస్ కూడా లేదు. లాతూర్ పోలీస్ మంచి కాలర్ ఉన్న డ్రెస్తో ఫోటోలు దిగాడు. పాస్పోర్ట్ దరఖాస్తుకు పది రూపాయాల ఫీజు చెల్లించాలి. ఆ డలను స్కూల్ ఫీ నుండి వాడుకొని జీతం వచ్చాక స్కూల్ వారికి ఇచ్చాడు.

ఆ దరఖాస్తును డిప్యూటి కలెక్టర్ ద్వారా ఉస్మానాబాద్ కలెక్టర్కు పంపాడు. తన పరిస్థితి వివరిస్తూ ఒక ప్రయివేటు లెటర్ రాసి ఒక విద్యార్థి ఇచ్చిన కవర్లో పెట్టి పోస్ట్ చేశారు. ఆ కవర్లో అనుకోకుండా ఒక రూపాయి ఉండిపోయింది. అది తెలిసి కలెక్టర్ శిక్షిస్తాడేమో అని రామకృష్ణయ్య భయపడ్డాడు. సిగ్గుతో ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

హమీద్ పాస్పోర్ట్ రావడం అంతసులభం కాదని చెప్పేవారు. స్కూల్లో సెలవు తీసుకొని పాస్పోర్ట్ పని మీద హైదరాబాదు వెళ్ళాడు. అక్కడ మున్సిపల్ సత్రంలో సామాను పెట్టి కార్యాలయాలన్నీ తిరిగేవాడు. మొదట బ్రిటీష్ రెసిడెన్సికి వెళ్ళాడు. అక్కడికి ఫైల్ రాలేదని తెలిసి పొలిటికల్ డిపార్ట్మెంటుకు వెళ్ళాడు. అక్కడ కూడా లేదని తెలిసి అక్కడి నుండి చీఫ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్ళాడు.

అక్కడ మీ దరఖాస్తు లేదని చెప్పారు కాని వెతకమని అడిగితే అక్కడే ఉంది. అయ్యా దానిని త్వరగా పూర్తి చేయండి చాల త్వరగా నేను వెళ్ళాల్సి ఉంది అని అడిగితే చాలా పెద్ద పని ఉంది కనీసం సంవత్సరం అయినా పడుతుంది అని చెప్పారు. వారిని బతిమిలాడితే శివలాల్ అనే వారు సి.ఐ.డి. సెక్షన్లో పని చేస్తున్నారు. వారిని కలిస్తే పని త్వరగా కావచ్చు అని సలహా ఇచ్చారు. దేవునికి నమస్కరించి శివకుమార్ లాలు దగ్గరికి వెళ్ళాడు. వారితో కలిసి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ దగ్గరికి వెళ్లి రామకృష్ణయ్య పరిస్థితిని వివరించి పోలీసు రిపోర్ట్ త్వరగా హోం డిపార్ట్మెంట్కు పంపాలని అభ్యర్థించాడు.

దానికి అంగీకరించి తన క్లార్క్తో బ్రిటీష్ రెసిడెంట్ కార్యాలయానికి సిఫారసు లేఖను పంపాడు. అక్కడికి వెళ్లి అడిగితే ఇంగ్లాండులో ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్లు కాగితం చూపమన్నారు. దానితో అతనిపై బాంబు పడ్డట్లయింది. మీర్ రజా అలీ సహకారంతో రిప్లయ్ పెయిడ్ ఎక్స్ప్రెస్ టెలిగ్రాం పంపాడు. 48 గంటలు వేచి చూసి తన మిత్రునికి అప్పగించి లాతూరు చేరుకున్నాడు. 72 గంటల తరువాత రిప్లయ్ వచ్చిందని దానిని పాస్పోర్ట్ ఆఫీసులో చూపిస్తే పాస్పోర్ట్ ఇవ్వలేమన్నారని ఉత్తరం వచ్చింది.

చివరి ప్రయత్నంగా హైదరాబాదు వెళ్లి షరతులతో అడ్మిషన్ ఉన్నట్లు వచ్చిన టెలిగ్రాంను, థామస్ కుక్ కంపెనీ వారి లేఖను చూపించి పాస్పోర్ట్ ఇవ్వాలని అభ్యర్థించాడు. రెండు సంవత్సరాలు ఇంగ్లాండులో ఉండడానికి సరిపడా పదివేల రూపాయలను లేదా బ్యాంకు బాలన్స్ను చూపించాలని వారు షరతు విధించారు. మీర్ రజా సహకారంతో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారి సర్టిఫికేట్ చూపించి పాస్పోర్ట్ పొందాడు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 5.
ముద్దు రామకృష్ణయ్యకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం డబ్బు సమస్య ఎలా తీరింది ?
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య పట్టువదలని విక్రమార్కునిగా ప్రయత్నం చేసి శాఖాపరమైన అనుమతి, యూనివర్సిటిలో అడ్మిషన్, పాస్పోర్ట్ పొందాడు. కాని డబ్బు సమస్య మాత్రం తీరలేదు. తన ఇన్సురెన్స్ పాలసీలు తాకట్టు పెట్టుకొని ఎవరైనా తక్కువ వడ్డీకి అప్పు ఇస్తారేమో అని ప్రయత్నం చేశాడు కాని ఫలించలేదు.

తాలూక్ దార్ హమీద్ ఒక మార్వాడి సేట్ అయిన విష్ణుదాసన్ను పిలిచి తక్కువ వడ్డీతో పదివేల అప్పు ఇప్పించమన్నాడు. అంత కాకుంటే ఐదువేలు అదీ కాకుంటే పన్నెండు వందలు పడవ కిరాయి ఇప్పించమన్నాడు. కాని ఆయన ఐదు వందలు మాత్రమె జమ అయినాయని అంతకంటే కావని చెప్పాడు.

ఆ ఐదు వందలతో నేనేం చేసుకోవాలి అని డబ్బు వాపసు చేస్తే అతను తీసుకోలేదు. రామకృష్ణయ్య లాతూర్ వెళ్లి విష్ణుదాస్ అకౌంట్ లో డబ్బు వేశాడు. దానికి హమీద్ సంతోషించాడు. కాని నా సొమ్ము కాని దాన్ని నా అకౌంటులో ఎందుకు వేశారని విష్ణుదాస్ చిరాకుపడ్డాడు.

నాకు పాస్పోర్ట్ దొరికింది పడవ ఎప్పుడు బయలు దేరుతుంది అని థామస్ కుక్ కంపెనీకి టెలిగ్రాం ఇస్తే సెప్టెంబర్ 22న అని జవాబు వచ్చింది. కాని డబ్బు సమస్య తీరలేదు. ఈ విషయాన్ని హామీద్కు చెప్తే అతను సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లను వెంట తీసుకొని వెళ్లి విష్ణుదాస్ గోదాములను తనిఖీ చేయించాడు. దానిలో బ్లాక్ మార్క్ ధాన్యం, చెక్కర సంచులను గుర్తించి పంచనామా చేయమన్నారు.

దానితో విష్ణుదాస్ భయపడి చందా రూపంలో వచ్చిన ఐదువందలకు తాను ఒక వెయ్యి రూపాయలు కలిపి పదిహేను వందలకు హుండీ రాసిచ్చాడు. అలా మొదటి స్టేజి డబ్బు సమస్య తీరింది. రామకృష్ణయ్య ఇంగ్లాండ్ వెళ్ళడానికి 18 రోజుల పని దినాలు ఉన్నాయి.

రోజుకు నాలుగు రూపాయల చొప్పున 72 రూపాయలు వస్తాయి. వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో మంథెనకు వెళ్ళాలి అని ఆలోచించాడు. వెంకట రామారావు దగ్గర తాకట్టు పెట్టి 72 రూపాయలు తీసుకొని లాతూరు నుండి మంథెనకు, మంథెన నుండి బొంబాయికి వెళ్ళాడు. అలా సోదరునిలాగా భావించే హామీద్ సహకారంతో ముద్దు రామకృష్ణయ్య డబ్బు సమస్య తీరింది.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 6.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా ప్రారంభమైంది ? (V.Imp) (M.P)
జవాబు:
గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్ దిగి అక్కడనుండి ఎడింబరో యూనివర్సిటీ ఉన్న నగరానికి రైలులో వెళ్ళారు. ఆంగ్ల ఉపాధ్యాయునిగా పదకొండు సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఆంగ్లం మాతృభాషగా ఉన్నవారితో మాట్లాడిన అనుభవం లేదు. రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లి టెలిగ్రాఫ్ను చూపించాడు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో మాట్లాడుతా అన్నాడు. ఉండడానికి ఒక హోటల్లో రూమ్ బుక్ చేశాడు.

కొన్ని రోజులకు ఆలస్యంగా వచ్చిన కారణంగా అడ్మిషన్ దొరకదు అని చెప్పారు. అక్కడి నుండి లీడ్స్ యూనివర్సిటీలో ప్రయత్నం చేయడానికి లీడ్స్ వెళ్ళాడు. 1939లో చేసిన దరఖాస్తు చేస్తే మీరు రమ్మన్నారు. యుద్ధం కారణంగా ఆలస్యంగా వచ్చాను అని చెప్పాడు. దానికి ఇండియా హౌస్ నుండి దరఖాస్తు చేసుకొమ్మని సలహా ఇచ్చారు. మాది హైదరాబాదు రాజ్యం ఇండియా హౌసుకు సంబంధం ఉండదు అని చెప్తే అడ్మిషన్ అయిన తరువాత వారికి చెప్పొచ్చు అని ఎం.ఇడిలో చేర్చుకున్నారు.

ప్రొఫెసర్ ఫ్రాంక్ ఫీ కట్టడానికి రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళమన్నారు. వారు ఇరవై పౌండ్ల ఫీ కట్టమంటే అంతడబ్బు లేదని చెప్పకుండా పది పౌన్లు ఇప్పుడు కట్టి తరువాత పది పౌన్లు చెల్లిస్తానన్నాడు. దానికి వారు అంగీకరించలేదు. వారం రోజులు గడువు ఇచ్చారు. పడవలో పరిచయమైన సురేశ్ చందర్కు లేఖ రాశారు.

చివరి తేది ఉదయం పది పౌన్ల పోస్టల్ ఆర్డర్ను సురేశ్ చందర్ పంపాడు. పోస్ట్ ఆఫీసుకు వెళ్లి పది పౌన్లు తీసుకొని మొత్తం ఇరవై పౌన్లు యూనివర్సిటీ అకౌంట్ సెక్షన్లో ఇచ్చి రసీదు తీసుకున్నాడు. అలా ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం. ఇడి. లో అడ్మిషన్ దొరకడంతో ఇంగ్లాండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ప్రారంభమైనది.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 7.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా సాగింది ?
జవాబు:
ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం.ఇడి.లో ప్రవేశం లభించింది. ప్రొఫెసర్ ఫ్రాంక్ స్మిత్ గైడ్గా ఉన్నారు. ఆయన మాథ్స్, సైకాలజీ, చరిత్రలలో ఏం తీసుకుంటావని అడిగారు. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ నిజాం స్టేట్ అనే అంశంపై అరవై వేల శబ్దాలతో చరిత్రను రెండు సంవత్సరాలలో రాయాలని నిర్ణయించారు.

ప్రొఫెసర్ ఫ్రాంక్ చాలా ప్రేమగా సలహాలు ఇచ్చేవారు. రాసిన వాటిని ఓపికగా సరిదిద్దే వారు. ముఖ్యంగా ది అనే ఆర్టికల్ వాడటం విషయంలో భారతీయులు పొరపాట్లు చేస్తారని అనేవారు. ఒక గది అద్దెకు తీసుకొని ఉండేవారు. వారికి లభించిన మాంసాహార పదార్థాలు, పంది కొవ్వు ఇంటి ఓనర్కు ఇచ్చి శాఖాహార పదార్థాలు తీసుకునే వారు. పని చేయడానికి ఎంప్లాయ్మెంటు ఎక్స్ఛేంజ్లో పేరు నమోదు చేసుకున్నారు.

రైల్వే పోర్టులో హమాలిగా పని చేసేవారు. దానిలోనుంచి కొంత మొత్తాన్ని ఇంటికి పంపేవారు. డీన్ అనుమతితో లండన్లో కలోనియల్ సెంటర్లో చేరాడు. కలోనియల్ సెంటర్లోనే నైట్ పోర్టర్గా రాత్రి పది నుండి ఉదయం నాలుగు వరకు పని చేసేవాడు. సాయంత్రం ఆరు నుండి పది వరకు హోటల్ వెయిటర్గా పని చేసేవాడు. ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు వరకు లైబ్రరీలో ఐదు నుండి పది వరకు కలోనియల్ సెంటర్లో చదువుకునేవారు. ఉదయం నాలుగు నుండి ఎనిమిది వరకు పడుకునేవారు.

హోటల్లో పని చేసేటప్పుడు హైదరాబాద్ ప్రభుత్వపు అధికారి కలిశారు. వారు ప్రధాని నవాబు చత్తారికి చెప్పి వెయ్యి రూపాయలు పౌండ్లు థామస్ కుక్ ద్వారా పంపించారు. తరువాత బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం లభించింది. ఆ తరువాత వారికి ఆర్ధిక ఇబ్బందులు రాలేదు. బిబిసిలో ఉద్యోగం వచ్చాక ప్రొఫెసర్ ఫ్రాంక్ను కలిసి వారానికి ఒక రోజు వచ్చి పది గంటల క్లాస్ వినడానికి అనుమతి పొందాడు.

మిగతా పనులన్నీ మానేసి బిబిసిలో మాత్రమే పని చేస్తూ శ్రద్ధగా చదువును కొనసాగించాడు. వందల పుస్తకాలు, డాక్యుమెంట్లు చదివి నోట్స్ రాసి ప్రొఫెసర్కు చూపిస్తే ఆయన ప్రేమతో సలహాలు ఇచ్చేవారు. అలా రెండు సంవత్సరాలలో నిజాం రాజ్యంలో విద్య చరిత్ర పేరుతో దక్షిణ భారతదేశ విద్య చరిత్రను రాసి ఎం. ఇడి పూర్తి చేసుకున్నారు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 8.
ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణ అనుభవాలు వివరించండి. * (V.Imp) (M.P)
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య ఎన్నో ప్రయత్నాల తరువాత విద్యా శాఖ అనుమతి, యూనివర్సిటిలో షరతులతో కూడిన అడ్మిషన్, పాస్పోర్ట్, కావలిసిన డబ్బు సమకూరింది. మొత్తానికి బొంబాయి చేరుకొని థామస్ కుక్ పడవలో ప్రవేశించాడు. ఎక్కిన తరువాత కొన్ని రోజులు పడవ బొంబాయి పోర్ట్లోనే ఉంది కాని ప్రయాణికులను బయటికి వెళ్ళనివ్వలేదు. ఆ పడవ మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు.

రామకృష్ణయ్య ఉన్న క్యాబిన్లో ఆరు బెర్తులు ఉండేవి. గాలి రావడానికి కిటికీ బదులు పోర్ట్ హోల్స్ ఉన్నాయి. ఫ్యాన్లు, హాస్పిటల్, టెలిగ్రాఫ్ ఆఫీసు, దుకాణము, పిల్లలకు కిండర్ గార్టెన్ సెక్షన్, అవుట్ డోర్ ఆటలు, గ్రంథాలయం, మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. బ్రిటీషు రేవులో దిగగానే తగినంత డబ్బు లేని వారిని డిపార్ట్ చేస్తారని సహచరుడు చెప్పాడు. పడవలో ఉన్న హైదరాబాద్ నుండి వస్తున్న సురేశ్ చంద్ర ఆస్థాన పరిచయం అయ్యాడు. అతను చాల మంచివాడు.

రామకృష్ణయ్య ఇరవై రెండు పౌన్లతో ఇంగ్లాండ్ బయలుదేరాడు. పడవ బయలుదేరిన తరువాత మొదటిసారి ఏడెన్లో ఆగింది. అక్కడ చారిత్రక స్థలాలు అన్ని చూసి, గుజరాతి వాళ్ళ ఇంట్లో మంచి శాఖాహార భోజనం చేశారు. సయీద్ రేవులో కొద్ది రోజులున్నారు. అక్కడ మ్యూజియం చూశారు. జిబ్రాల్టర్ రేవు దాటిన తరువాత బ్రిటన్ భూమి కనిపిస్తుండగా దేవునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారం చేశాడు. కాని డబ్బు లేకపోతే డిపార్ట్ చేస్తారేమో అనే భయం మాత్రం ఉండేది.

ఈ విషయాన్ని సురేశబాబుకు చెప్పి అతని దగ్గరున్న నూటయాభై పౌన్ల డ్రాఫ్ట్ చూపించేలా ఒప్పందం చేసుకున్నాడు. కాని విద్యార్జనకు వచ్చానని చెప్పేసరికి డ్రాఫ్ట్ చూపించాల్సిన అవసరం రాకుండానే ఓడరేవులో పర్మిటెడ్ అని స్టాంప్ పడింది. తోటి భారతీయ ప్రయాణికుల సహకారంతో సామాను దించుకున్నాడు. మొత్తానికి బ్రిటన్లోని స్కాట్లాండ్లో దిగినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

II. సందర్భసహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
ఆస్తి కన్నా అప్పు మించింది. (Imp)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించాడు. వారి తండ్రి ప్రభుత్వ ఉద్యోగం వదిలి వ్యాపారం, వ్యవసాయం మొదలుపెట్టారు. చింతకాని చెరువు గుత్తా తీసుకున్నప్పుడు వారికి పెద్ద నష్టం వచ్చింది. దానితో వారికి ఆస్తి కన్నా అప్పు పెరిగిందని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
సంపాదించిన ఆస్తికన్నా చేసిన అప్పు పెరిగిందని అర్థం.

వ్యాఖ్య :
సింగల్ టీచర్గా పనిచేసిన వారు వారికి అనుభవం లేని రంగంలో పెట్టుబడి పెట్టి అప్పుల పాలైనారని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 2.
వివాహం విద్యానాశాయ * (V.Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశ యాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య గారి తండ్రి రాజన్న వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అప్పులపాలయ్యారు. ఆ అప్పుల వారు ఇంటికి వచ్చి తిట్టి వెళ్ళేవారు. అది చూసిన రామకృష్ణయ్య ఏడుస్తూ తనకు విదేశాలలో చదువు చెప్పించి, తండ్రి చేసిన అప్పులు ఇల్లు అమ్మకుండా తీర్చి, తల్లిదండ్రులకు మరింత మంచి పేరు తెచ్చే విధంగా ఆశీర్వదించమని దేవునికి మొర పెట్టుకునేవాడు. డబ్బులేని వాడు చదువుకోలేడు అని, వివాహం అయినవాడు చదువుకు పనికిరాడని అందరూ భావిస్తారు. అలాంటి భావన తప్పు అని నిరూపించాలని రామకృష్ణయ్య నిశ్చయించుకున్న సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
వివాహం జరిగితే విద్య నేర్వడం కష్టం అని అర్థం.

వ్యాఖ్య :
గట్టి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. పాతకాలం నుండి వస్తున్న నమ్మకాలను కూడా మార్చే శక్తి మానవ సంకల్పానికి ఉందని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 3.
ప్రథమ ప్రయత్నం విఫలమయింది (Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా- ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్యకు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కోరిక ఉండేది. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కోహిర్లో పని చేస్తున్నప్పుడు విదేశీ విద్య స్కాలర్షిప్ కోసం హైదరాబాద్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. మూడవ శ్రేణిలో బి.ఏ. పాస్ అయిన వారికి స్కాలర్షిప్ రాదని చెప్పారు. అప్పు అడిగితే దానికి అంగీకరించలేదు.

సొంతఖర్చులతో విదేశాలకు వెళ్ళే అవకాశం కల్పించాలని దరఖాస్తు చేస్తే కారణం చెప్పకుండా ఫైల్ మూసేశారు. ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయింది అలా రామకృష్ణయ్య గారి ప్రథమ ప్రయత్నం విఫలమైనదని తెలిపిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
మొదటి ప్రయత్నం విజయవంతం కాలేదు అని అర్థం.

వ్యాఖ్య :
దేవునిపై భారం వేసి చిన్నప్పటి నుండి చదువుకున్నాడు రామకృష్ణయ్య. విదేశాలలో చదువుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. దానిలో మొదటి ప్రయత్నం ఫలించలేదని భావం.

ప్రశ్న 4.
వారు నాకు జమానతు ఇవ్వటానికి సిద్ధపడలేదు
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాల్లో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి. దానికి 100 రూపాయల వేతనం కంటే ఎక్కువున్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారు ఎవరూ జామీను ఇవ్వడానికి సిద్ధంగా లేరని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
వాళ్ళెవరు జామానతు అంటే పూచీకత్తు ఇవ్వడానికి అంగీకరించలేదు అని అర్థం.

వ్యాఖ్య :
100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారెవరూ పూచీకత్తు ఇవ్వడానికి సిద్ధంగా లేరని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 5.
ఐదు రూపాయల బియ్యం ఇప్పించితే నేను సంతకం పెట్టుతాను
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాలులో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి.

దానికి 100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారిలో బషీరుద్ధిన్ అనే వారు సంతకం చేశారు. ఇంకొకరి సంతకం కోసం ప్రయత్నం చేస్తుంటే ఒక ముసలి ముస్లిం టీచర్ రేషన్ అందక బాధపడుతూ రామకృష్ణయ్యను ఐదు రూపాల బియ్యం ఇప్పిస్తే జామీను మీద సంతకం చేస్తానని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం ఇది.

అర్థం :
ఐదు రూపాయల విలువైన బియ్యం ఇప్పిస్తే జామీనుపై సంతకం చేస్తానని అర్థం.

వ్యాఖ్య :
వందకు పైన వేతనం వస్తున్నప్పటికీ రేషన్ కారణంగా తమ పిల్లలకు సరైన తిండి పెట్టలేని స్థితి ప్రపంచ యుద్ధ సమయంలో ఉండేది. రామకృష్ణయ్యకు ఉన్న అవసరాన్ని ఆసరాగా తీసుకొని ముసలి ముస్లిం ఉపాధ్యాయుడు ఐదు రూపాయల బియ్యం అడిగాడని భావం.

ప్రశ్న 6.
ఇప్పుడు వెళ్ళకపోతే అతడి భవిష్యత్తు చెడుతుంది.
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య విదేశీ పర్యటనకోసం విద్యా శాఖ అనుమతి కొరకు ప్రయత్నం చేస్తున్నపుడు జుల్ఫికర్ అలీ హక్కాని ఉన్నతాధికారిగా ఉన్నారు. అప్పటికే సెలవు ఇవ్వడానికి వీలు లేదని ఆఫీస్ నోట్ వచ్చిందని సెలవు ఇవ్వడం వీలుపడదని ఆయన అన్నారు. జీతం లేకుండా సెలవు మంజూరు చేసినా సరే అని రాసివ్వుమన్నారు. అలా రాసిచ్చిన తరువాత రామకృష్ణయ్య ఇప్పుడు పోకపోతే మరెప్పుడు పోలేడు, ఇప్పుడు వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడుతుందని ఉద్యోగం నుండి వెంటనే రిలీవ్ చేయమని అనుమతించిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే రామకృష్ణయ్య భవిష్యత్తు చెడుతుందని అర్థం.

వ్యాఖ్య :
రామకృష్ణయ్యకు సహకరించే పరిస్థితులు ఇప్పుడున్నవి. కావున ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు పోలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడిపోతుందని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 7.
సిగ్గుతో నా బాధను ఎవరికీ చెప్పుకోలేదు. (V.Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య పాస్పోర్ట్ కోసం అప్లై చేశారు. దానిని ఉస్మానాబాద్ కలెక్టర్కు ఒక తాలూక్ దార్ సిఫారసుతో పంపారు. దానిని త్వరగా పరిశీలించి అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు ఒక ప్రైవేటు ఉత్తరం రాసి ఒక కవర్లో పెట్టి పంపారు. ఆ కవర్లో హాస్టల్ బాలుడు ఒక రూపాయి పెట్టుకొని మరిచిపోయి ఆ కవర్ను రామకృష్ణయ్యకు ఇచ్చాడు. ఒక రూపాయి లంచం పంపినట్టు భావించి కలెక్టర్ ఏమైనా శిక్ష వేస్తాడేమో అని భయపడి, ఆ భయపడుతున్న విషయం కూడా ఎవరికైనా చెపితే పరువు పోతుందేమో అని ఎవరికీ తెలుపలేదని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
బాధ చెబితే పరువు పోతుందేమో అని ఎవరికీ చెప్పలేదని అర్థం.

వ్యాఖ్య :
తెలియక చేసినా పెద్ద పొరపాటు జరిగింది. ఆ పొరపాటుకు శిక్ష పడుతుందేమో అనే భయం, బాధ ఉన్నాయి. కాని ఆ బాధను ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందేమో అనే మరో అనుమానం కూడా ఉందని భావం.

ప్రశ్న 8.
ఈ మాటతో నా పైన బాంబు పడినంత బాధ అయినది.
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ఎన్నో ప్రయత్నాల తరువాత పాస్పోర్ట్ మంజూరు చేయమని నిజాం ప్రభుత్వము సిఫారసు లేఖ ఇచ్చింది. ఆ లేఖ తీసుకొని బ్రిటీషు రెసిడెంట్ ఆఫీసుకు వెళ్తే అక్కడున్న అసిస్టెంట్ సెక్రెటరీ ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు కాగితం చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పాడు. ఆ మాటతో తనపై బాంబు పడ్డంత పని అయిందని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ఆ మాట బాంబు దెబ్బతో సమానం అని అర్థం.

వ్యాఖ్య :
ఎంతో కష్టపడ్డ తరువాత వచ్చిన అవకాశం చివరి క్షణంలో చేజారి పోతుందని తెలిసి అది బాంబు పడ్డట్టు అనిపించిందని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 9.
అప్పుడే కోర్టు నుండి సర్టిఫికెట్టు దొరికినది
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ఎన్నో ప్రయత్నాల తరువాత పాస్పోర్ట్ మంజూరు చేయమని నిజాం ప్రభుత్వము సిఫారసు లేఖ ఇచ్చింది. ఆ లేఖ తీసుకొని బ్రిటీషు రెసిడెంట్ ఆఫీసుకు వెళ్తే అక్కడున్న అసిస్టెంట్ సెక్రెటరీ ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు కాగితం చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పాడు.

కొన్ని షరతులతో సీటు ఇస్తామని వచ్చిన టెలిగ్రాఫు చూపించి పాస్పోర్ట్ ఇమ్మన్నాడు. పదివేల రూపాయలు చూపించాలి, లేదా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సర్టిఫికేట్ తెమ్మన్నారు. దానిని మీర్ రజాకు చెప్తే వకీల్ నవరతన్ సహకారంతో సర్టిఫికెట్ ఇప్పించారని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం. –

అర్థం :
ఆ సందర్భంలో కోర్టు నుండి సర్టిఫికెట్ దొరికినదని అర్థం.

వ్యాఖ్య :
ఇంగ్లాండులో రెండు సంవత్సరాలు ఉండడానికి సరిపడా డబ్బు ఉందని సర్టిఫికేట్ దొరికిందని భావం.

ప్రశ్న 10.
పాలముంచినా నీట ముంచినా నీదే భారం
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
అనేక కష్టాల తరువాత విద్యా శాఖనుండి అనుమతి, యూనివర్సిటీలో షరతులతో కూడిన అడ్మిషన్, పాస్పోర్ట్ రావడం ఇలా అనేక పనులు అయినాయి. ఓడ బయలుదేరడానికి వారం రోజుల సమయం మాత్రమే ఉందని థామస్ కుక్ కంపనీ లేఖ పంపింది. కాని అన్నింటికి మించిన డబ్బు సమస్య తీరడం ఎలా అని భగవంతున్ని ప్రార్థించిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
పాలల్లో ముంచినా నీళ్ళల్లో ముంచినా దేవునిదే భారం అని అర్థం.

వ్యాఖ్య :
పాలల్లో ముంచినా అంటే కష్టాలు తీర్చినా, నీళ్ళల్లో ముంచినా అంటే కష్టాల్లోనే ఉంచిన దేవునిదే బాధ్యత అని భావం. అంతా దైవాదీనం అని అంతరార్థం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 11.
వారి పాదాలపైన నెత్తిపెట్టి వారికి మొక్కితిని
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
రామకృష్ణయ్య తాత సనాతన సంప్రదాయవాది. సముద్ర ప్రయాణం చేస్తే భ్రష్టుడవుతాడని ఆయన “నమ్మకం. తనను చంపి విదేశాలకు వెళ్ళమని అన్నాడు. దానికి మన సంప్రదాయాలు పాటిస్తూ మీరు గీచిన గీత దాటకుండా ఉంటాను. దానికి నువ్వు అనుమతి ఇస్తేనే వెళ్త లేదంటే ఇక్కడే చస్తా అని రామకృష్ణయ్య అన్నాడు. అప్పుడు నా నోరు మూయించావురా అని అనుమతించారు. దానికి కృతజ్ఞతా పూర్వకంగా వారికి పాద నమస్కారం చేశానని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ఆయన పాదాలపై తలపెట్టి మొక్కాడు అని అర్థం.

వ్యాఖ్య :
పాద నమస్కారం అత్యంత గౌరవ సూచకం అని భావం.

ప్రశ్న 12.
వారి ఉచ్ఛారణ, నిత్య వ్యవహారిక శబ్దాలు తెలియవు చేసిన విద్యావేత్త
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్లో దిగారు. ఎడింబరో యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం వెళ్ళాడు. పదకొండు సంవత్సరాల ఆంగ్ల ఉపాధ్యాయ అనుభవం ఉన్నప్పటికీ అక్కడి వారితో ఎప్పుడూ మాట్లాడని కారణంగా వారి భాష, యాస రామకృష్ణయ్యకు కొత్తగా అనిపించిందని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ఆంగ్లేయుల ఉచ్ఛారణ వారి వాడుక పదాలు తెలియవు అని అర్థం.

వ్యాఖ్య :
ప్రతీ భాషకు స్వంత యాస ఉంటుంది అలానే పలుకుబళ్ళు ఉంటాయి. వాటిని మాతృభాష అయిన వారి లాగా మాట్లాడటం కష్టం అని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 13.
నా జాతికి నావలన పాడుమాట రానివ్వను (V.Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
యుద్ధ కాలంలో తిండికి బట్టలకు రేషన్ ఉండేది. ఆ సమయంలో ఇంగ్లాండుకు కొత్తగా వెళ్ళాడు కాబట్టి రామకృష్ణయ్యకు బట్టలు కూపన్లు ఎక్కువ అందినాయి. కాని కొనుక్కోవడానికి డబ్బు లేదు. ఆ సమయంలో ఒక మిత్రుడు ఆ కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పాడు. అలా చేయడం వల్ల భారతీయులు కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతారనే చెడ్డపేరు వస్తుందని, అలా దేశానికి చెడ్డపేరు తెచ్చే ఏ పని తాను చేయనని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
నా భారత జాతికి నా ప్రవర్తన వల్ల చెడ్డపేరు రానివ్వను అని అర్థం

వ్యాఖ్య :
బట్టలకోసం దొరికిన కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మడం తప్పు అని అలా అమ్మితే దేశ వాసులందరికి చెడ్డ పేరు వస్తుందని, అలాంటి పని తాను చేయడని భావం.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ప్రశ్న 14.
తన సజెషన్స్ ప్రేమతో ఇచ్చేవారు
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.

సందర్భం :
చదువుకోసం ఇంగ్లాండు వచ్చి లీడ్స్ యూనివర్సిటీలో ఎం.ఎడ్. లో చేరాడు. చదువుతో పాటు వివిధ పార్ట్ టైం ఉద్యోగాలు చేశారు. చివరికి లండన్ బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తూ లీడ్స్కు రోజు వెళ్ళడం సాధ్యం కాదని, వారంలో ఒకరోజు వచ్చి పది గంటలు వింటానని, తన కోసం కొంత శ్రమ తీసుకోవాలని వారి ప్రొఫెసర్ను కోరాడు. దానికి ప్రొఫెసర్ ఫ్రాంక్ అంగీకరించాడని, ప్రేమతో సలహాలు ఇచ్చేవాడని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.

అర్థం :
ప్రొఫెసర్ ప్రేమగా సలహాలు ఇచ్చారని అర్థం.

వ్యాఖ్య :
కష్టపడి చదివే వారికి అందరూ సహకరిస్తారని, అలానే తన ప్రొఫెసర్ కూడా ప్రేమగా సలహాలు ఇచ్చారని భావం.

నా ప్రథమ విదేశయాత్ర Summary in Telugu

రచయిత పరిచయం

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర 1
ఉపవాచకం పేరు : నా ప్రథమ విదేశయాత్ర

దేనినుండి ఇది గ్రహింపబడింది. : ఈ ఉపవాచకం, శ్రీ ముద్దు రామకృష్ణయ్య ‘నా ప్రథమ విదేశ రచన నుండి గ్రహింపబడింది.

ఉపవాచకం ప్రక్రియ : యాత్రా చరిత్ర

రచయిత : ముద్దు రామకృష్ణయ్య

కాలం : జననం : అక్టోబర్ 18, 1907 – మరణం : అక్టోబరు 21, 1985

తల్లిదండ్రులు : అమ్మాయి, రాజన్న

స్వస్థలం : కరీంనగర్ జిల్లా మంథని

విద్య :

  • 1932లో బి.ఏ. పట్టా పొందాడు.
  • 1944-46 మధ్య ఇంగ్లండు వెళ్ళి లీడ్స్ విశ్వవిద్యాలయంలో విద్యలో మాస్టర్స్ డిగ్రీ (ఎం.ఇడి.) పూర్తి చేసి వచ్చాడు.

ఉద్యోగాలు :

  • 1933 జులై 31న అప్పటి హైదరాబాదు రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని చించోలిలో మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ఆరంభించాడు.
  • 1936లో పదోన్నతిపై కోహీరుకు వెళ్ళిన నాటి నుంచి విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
  • లండన్లో చదువుకుంటున్న సమయంలోనే బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం చేశారు.
  • 1948లో గుల్బర్గా కళాశాలలో తన ఉద్యోగ ప్రస్థానం కొనసాగించాడు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

విదేశీ పర్యటనలు :

  • 1951-52 మధ్యకాలంలో మలేషియా, ఫిలిప్పైన్స్, అమెరికా ఖండంలో 24 రాష్ట్రాలు, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్, మొరాకో వంటి దేశాలలో పర్యటించి అక్కడి విద్యావిధానం గురించి అక్కడి విద్యావేత్తలను అడిగి తెలుసుకున్నాడు.
  • 1954-55 సం॥లో ఆస్ట్రేలియా ఖండంలో పర్యటించి అక్కడి విద్యావిధానాన్ని అధ్యయనం చేశాడు. 1958లో ఒక యాత్రికుడిగా రష్యా, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలను సందర్శించి అనేక సంస్థలను పరిశీలించి వచ్చాడు.

సంస్కరణలు : వివిధ దేశాల విద్యావిధానాలను అధ్యయనం చేసిన రామకృష్ణయ్య వాటి స్ఫూర్తితో మన దేశ విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు.

  • కరీంనగర్, నిజామాబాదు, హైదరాబాదు మొదలైన జిల్లాల్లో ప్రభుత్వ విద్యాశాఖాధికారిగా పనిచేశారు.
  • పాఠశాల విద్య నిర్వహణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. ఆ విధానాలు కొన్ని నేటికీ అమలులో ఉన్నాయి.
  • నిరక్షరాస్యతా నిర్మూలన కొరకు “ఈచ్ వన్ టీచ్ వన్” ఉద్యమాన్ని జీవిత పర్యంతం కొనసాగించారు.
  • విధి నిర్వహణలోని ప్రతి అంశాన్నీ, అక్షర రూపంలో భద్రపరచి సంస్కరణలకు బీజం వేశాడు.
  • రామకృష్ణయ్య నిరంతరం తన దినచర్యను రాసుకుంటూ ఆరువేల పుటలకు పైగా అమూల్యమైన అంశాలను లోకానికి అందించారు.

TS Inter 2nd Year Telugu Non-Detailed Chapter 1 నా ప్రథమ విదేశయాత్ర

ఉద్దేశం : ముద్దు రామకృష్ణయ్య విదేశాలలో విద్యాభ్యాసం కోసం చేసిన ప్రయత్నాలు, ఎన్ని కష్టాలు ఎదురైనా, పస్తులుండవలసి వచ్చినా తన పట్టుదల వీడక ఆయన సాగించిన కృషి నేటి విద్యార్థులకు స్ఫూర్తి మంత్రం ఁ లాంటి వారి చరిత్ర ద్వారా స్ఫూర్తి పొందుతారని ఉద్దేశంతో ఈ యాత్రా చరిత్రను అందిం. ‘రు.

  • ఈ యాత్రా చరిత్రలో ఆంగ్లం, ఉర్దూ పదాలు ఎక్కువగా వాడారు. నిజాం పాలనా కాలంలోని వ్యవస్థలు, ఆధికారుల పేర్లు కూడా ఇందులో తెలుసుకోవచ్చు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని ఈ ఉపవాచకం నిరూపిస్తుంది.

TS Inter 2nd Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 9th Lesson తెలంగాణ రాష్ట్ర అవతరణ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 9th Lesson తెలంగాణ రాష్ట్ర అవతరణ

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావటానికి గల కారణాలు ఏవి ?
జవాబు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దారితీసిన కారణాలు :
1. స్థానికత (Domiclle) నియమాలను మార్చివేయటం ప్రధాన ఉల్లంఘన. తెలంగాణ ప్రాంతంలో స్థానికత రావాలంటే 12 సంవత్సరాల నిరంతరాయ నివాసం ఉండాలనే నియమం ఉంది. పెద్ద మనుషుల ఒప్పందం దానిని ఒప్పుకొన్నది. అమలు విషయానికి వచ్చేసరికి దానిని 4 సంవత్సరాలకు కుదించారు. ఈ ఉల్లంఘనవల్ల 50 వేలమంది ఆంధ్ర ప్రాంతీయులు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లోకి చేరిపోయారు. తెలంగాణ వారికి ఒక్క దెబ్బతో విద్య, ఉద్యోగాలలో అవకాశాలు పోయాయి.

2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం మానవ అభివృద్ధిలో ఎంతో వెనుకబడింది. తెలంగాణలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న జనాభా 40.78 శాతం. 1987-88 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తెలంగాణలో కంటె ఆంధ్ర ప్రాంతంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాభా శాతం చాలా తక్కువ.

అందువల్ల తెలంగాణాలో ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే పేదరికం పెరిగిపోయింది. తెలంగాణ ప్రాంతం ఆంధ్రతో పోలిస్తే నాటికి అధిక ఆదాయం కలిగిన ప్రాంతం. ఆ అధిక ఆదాయాన్ని తెలంగాణ మిగులు అంటారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూలో 40 శాతానికి పైగా సమకూరుస్తుంది.

3. జై ఆంధ్ర ఉద్యమం తరువాత 1972 తరువాత ముల్కీ నిబంధనలను, తెలంగాణ ప్రాంతీయ కమిటీకి సంబంధించిన నిబంధనలను సవరించారు. తెలంగాణ ప్రాంతానికి వనరుల పంపిణీలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే సంస్థాగత నిర్మాణమే లేకుండా చేశారు.

4. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1990 దశకం వరకు తెలంగాణ ప్రజలకు విద్యా సౌకర్యాల దుర్భరంగా ఉండేవి. తెలంగాణలో నిరక్షరాస్యత ఎక్కువ. ఇక్కడ అక్షరాస్యత శాతం చాలా కనిష్టంగా 37 శాతం మాత్రమే ఉండేది. వృత్తి విద్యా కళాశాలపైన ఇంజనీరింగ్, మెడికల్ తదితర విభాగాల కళాశాలలు కొన్నింటిని మాత్రమే స్థాపించారు. తెలంగాణ ప్రాంతంలో విశ్వవిద్యాలయాల సంఖ్య కూడా అతి తక్కువగా ఉండేది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

5. నదీజలాల వినియోగం విషయంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. కృష్ణానదిపై నిర్మించిన నాగర్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఆంధ్ర ప్రాంతానికి మేలు చేకూర్చేందుకు మాత్రమే నిర్మించారు. నాగార్జున సాగర్ నిర్మాణం వల్ల నల్లగొండ జిల్లాలో ఎంతో వ్యవసాయ భూమి ముంపుకు గురి కాగా, ఆ జిల్లాకు సాగర్ ద్వారా అందవలసిన న్యాయబద్ధ వాటా దక్కలేదు.

6. గోదావరి పైన ప్రారంభించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తెలంగాణకు మేలు చేస్తుంది. కానీ దీని పనులు నత్త నడక కాలంలో నడిపించారు. 20 లక్షల ఎకరాలకు నీరు అందించవలసిన ప్రాజెక్టు ఆయకట్టును 50 సంవత్సరాల రెండున్నర లక్షల ఎకరాలకు మాత్రమే అందేట్టు చేశారు. 1966 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలని ఆశించినా అది జరగలేదు.

7. తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులలో నీటి కేటాయింపు హామీ ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనులు సైతం సంతృప్తికరంగా ప్రగతి సాధించలేదు.

8. తెలంగాణలో నిజాం ప్రభుత్వ పాలనలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టును సరైన నిర్వహణ లేకుండా చేశారు. దాని పూడికమేట వేసి, ప్రాజెక్టు కింద ఆయకట్టు తగ్గిపోసాగింది.

9. మెదక్, నిజామాబాద్ జిల్లాలలోకి పొలాలకు నీరు అందించవలసిన మంజీరా నీళ్ళను, తాగునీటి అవసరాలకోసం హైదరాబాద్కు తరలించారు.

10. రాజోలి బండ డైవర్షన్ కెనాల్ ద్వారా నీరు, తెలంగాణలోని మహబూబ్నగర్లో 50 నుంచి 60 వేల ఎకరాలకు అందవలసి ఉండగా, ఆ జలాలను దౌర్జన్యంగా రాయలసీమకు తరలించారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 2.
భారత యూనియన్లో తెలంగాణ ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడిన తీరును చర్చించండి.
జవాబు.
దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది 60 సంవత్సరాలుగా వివిధ రూపాలలో నడిచిన ప్రజాపోరాటాల అంతిమ విజయం. 1948 నుంచి 1956 వరకు తెలంగాణకు ప్రత్యేక ఉనికి, గుర్తింపు ఉన్నాయి. తెలంగాణకు ప్రత్యేక చారిత్రక, భౌగోళిక సంస్కృతిక గుర్తింపు, ప్రాతిపదిక ఉన్నాయి.

హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం, ఇష్టంలేని, అసమానమైన ఇరుపక్షాలను బలవంతంగా ఒక్కటి చేయడం అనవచ్చు. అందువల్ల అవి విడిపోవడం అనే అనివార్యత, ఆ బలవంతపు కలయికలోనే ఉంది.

తెలంగాణ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అవకాశాలకు నోచుకోక, సహజవనరుల విషయంలో తీవ్రదోపిడీకి, ఇతర ప్రాంతాల అభివృద్ధికి తన వనరులను వదులుకోవాల్సిన పరిస్థితులకు గురి అయింది. పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో తెలంగాణ ప్రాంతానికి కొన్ని సంరక్షణలు కల్పించినప్పటికీ, వివిధ ప్రభుత్వాల కుయుక్తుల వలన పాలనలో అవి అసంపూర్ణంగా, నిరర్థకంగా మారడం కనిపిస్తుంది.

ఆంధ్ర పాలకుల కుయుక్త నైపుణ్యాల ముందు తెలంగాణ రాజకీయ శిష్టవర్గం సరితూగలేకపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలు, నదీజలాల్లో భాగస్వామ్యం, తెలంగాణ ప్రాంత మిగులు నిధుల అక్రమ తరలింపు, ముల్కీ నిబంధనల ఉల్లంఘనలు తదితర విషయాల్లో తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగింది. ఈ పరిణామాలన్నీ తెలంగాణ యువతను నిరాశ నిస్పృహలకు గురిచేశాయి.

దీనితో 1969లో ప్రత్యేక తెలంగాణ ఆందోళన ప్రారంభమైంది. ఆ తరువాత కాలంలో, ఈ ప్రత్యేక రాష్ట్రవాదం తీవ్రతరమై, రాజీలేని పోరాటంగా మారి 2001-2014 మధ్యకాలంలో ఒక శక్తివంతమైన ఉద్యమంగా మారింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

భిన్న రాజకీయ భావజాలం గల శక్తులు జాయింట్ యాక్షన్ కమిటీగా రూపొందడం ఈ పోరాటంలో ఒక ప్రత్యేక అంశం. ఇది ఒక విధంగా ప్రజా రాజకీయాలలో (Mass Politics) కొత్త నేర్పు. ఈ JAC లలో రాజకీయ JAC కులసంఘాల JAC, విద్యార్థి JAC, ఉద్యోగుల JAC మొదలైనవి ప్రధానమైనవి. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వివిధ రాజకీయ బృందాలచే కాక వివిధ వృత్తుల సామాజిక శ్రేణులనూ, వివిధ కులసంఘాలనూ పోరాటంలోకి తీసుకువచ్చింది.

ఆ విధంగా ప్రత్యేక రాష్ట్ర మహాయత్వానికి విశాలమైన ప్రజామద్ధతులను కూడగట్టింది. తెలంగాణ రాష్ట్రసమితి పుట్టుక ఒక చారిత్రక సంఘటన, ప్రజా ఉద్యమాన్ని పార్లమెంటరీ రాజకీయాలలోకి ఒదిగించి, సమత్వం, న్యాయం, ఆత్మగౌరవం అన్న ప్రాతిపదికలతో దాన్ని చట్టసభల చర్చలలోకి తీసుకుపోయింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు పార్టీ పుట్టుక ఎంతో పనికి వచ్చింది.

ఈ విధంగా దోపిడి, అణచివేత, ఆధిపత్యాల నుండి విముక్తి కోసం సాగించిన తెలంగాణ ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కల సాకారమయ్యింది. లోక్సభ, రాజ్యసభలలో రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం పొంది మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదం పొందింది. దానితో 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ, భారత యూనియన్లో 29వ రాష్ట్రంగా అవతరించింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ప్రధానాంశాలు ఈ విధంగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం : తెలంగాణ 10 జిల్లాలు గల 29వ రాష్ట్రం (ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు) తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం : 13 జిల్లాలు గల రాష్ట్రం.

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని : 2014 నుంచి 10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ నగరమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.

ఉమ్మడి గవర్నర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటాడు. (ప్రస్తుతం వేరు, వేరు గవర్నర్లు ఉన్నారు.)

రాజ్యసభ సభ్యులు : తెలంగాణకు 7 మంది, ఆంధ్రప్రదేశ్కు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.

లోకసభ సభ్యులు : తెలంగాణ రాష్ట్రానికి 17 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 మంది సభ్యులు ఉంటారు.

శాసనసభ సభ్యులు : తెలంగాణకు 119 మంది శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్కు 175 మంది సభ్యులు ఉంటారు.
శాసనమండలి : తెలంగాణ శాసనమండలి సభ్యులు 40, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు 50.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 3.
తెలంగాణ ఉద్యమంలో సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)ల పాత్రను వివరించండి.
జవాబు.
1. రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (Political JAC) :
రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (Political JAC) ని డిసెంబర్ 24, 2009న ఏర్పరచారు. దీనిలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS). భారతీయ జనతాపార్టీ (BJP), భారత కమ్యూనిస్టు పార్టీ (CPI), భారత జాతీయ కాంగ్రెస్ (INC), తెలుగుదేశం పార్టీ (TDP), సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమొక్రసీ తదితర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తదితరులు అంతర్భాగమై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహించాయి.

2. కులసంఘాలు జెఎసి :
సమాజంలోని కొన్ని కులాలు సంఘాలు ఏర్పరచుకోవడం, ఈ సంఘాలన్నీ సంయుక్త కార్యాచరణ కమిటీగా ఏర్పడటం తెలంగాణ ఉద్యమంలో ఒక వినూత్న ధోరణిగా పేర్కొనవచ్చు.

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొనడానికి సమాజంలో శతాబ్దాల తరబడి అణచివేతకు గురైన కుల సమూహాలు, వివిధ కుల వృత్తుల సమూహాలు, దళిత బహుజనులు, ఇతర వెనుకబడిన కులాలు, అల్ప సంఖ్యాక వర్గాలు ఒకే వేదిక పైకి వచ్చి, సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC) గా ఏర్పడ్డాయి. ఈ విధంగా కులసంఘాలు సంఘటితమై పోరాటం చేయడాన్ని కులంపైన ఉండే ఆదిమ విశ్వాసంగా అర్థం చేసుకోరాదు.

3. విద్యార్థుల జెఎసి :
తెలంగాణ ఉద్యమం ప్రారంభించి, తీవ్రతరం చేసి వివిధ కళాశాలల విద్యార్థులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు. వివిధ సిద్ధాంత భావజాలాలను నమ్మే విద్యార్థులు తమ మధ్యగల సైద్ధాంతిక విభేదాలను పక్కనబెట్టి తెలంగాణ ఉద్యమం నిర్వహించడానికి ఒక్కటై, పోరాడటానికి ఒక సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)ని ఏర్పరచారు.

ఈ తరహా జెఎసిలు అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలల స్థాయిలో ఏర్పడ్డాయి. వీటిలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు జెఎసి (OUJAC), కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల జెఎసి (KUJAC), ఉద్యమాన్ని క్రియాశీలంగా నడపడంలో కీలకపాత్ర పోషించాయి.

4. ఉద్యోగుల జెఎసి :
ఉద్యోగులు, కార్మికులు, శ్రామికులు, ఉపాధ్యాయులు తదితరవర్గాలు ఉద్యోగల సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC) పేరుతో ఒక వేదికను ఏర్పరచుకొని అనేక నిరసన కార్యక్రమాలు, ఉద్యమాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని చురుకుగా నిర్వహించాయి.

వివిధ స్థాయిలకు చెందిన లక్షలాది మంది ఉద్యోగులు సహాయ నిరాకరణ, పెన్ డౌన్ (Pen Down), ఢిల్లీ ఛలో, మధ్యాహ్న భోజన విరామ నిరసన కార్యక్రమాలతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మితిమీరిన ఆలస్యానికి నిరసనగా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపట్ల ఉదాసీనతకు వ్యతిరేకంగా ఉద్యోగల జెఎసి రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్నది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
పెద్దమనుషుల ఒప్పందంలోని నిబంధనలు తెలపండి.
జవాబు.
పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలో రీజినల్ కౌన్సిల్ ఏర్పాటు అవుతుంది. ఒప్పందం ప్రకారం తెలంగాణలోని అభివృద్ధి, ప్రణాళికారచన, స్థానికపాలన, ప్రజారోగ్యం, ప్రాథమిక, మాధ్యమిక విద్య, తెలంగాణ ప్రాంత విద్యాలయాల్లో అడ్మిషన్లు, తెలంగాణా ప్రాంత వ్యవసాయ భూముల అమ్మకాలు, లఘు, కుటీర పరిశ్రమలను వీటిని రీజనల్ కౌన్సిల్ నిర్వహిస్తుంది.

ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణలో 12 సంవత్సరాల శాశ్వత నివాసం ఉంటేనే వారికి తెలంగాణా ప్రాంతపు విద్యాలయాల్లో, ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.

ఇది ఒక ప్రధానమైన తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను రక్షించే చర్య, వీటితోపాటు మరో ప్రధాన రాజకీయ నిర్ణయం ఒప్పందంలో ఉన్నది. దాని ప్రకారం ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి చెందినవాడైతే ఉపముఖ్యమంత్రి మరో ప్రాంతానికి చెందినవారై ఉండాలి.

అలాగే మంత్రివర్గంలో ఆంధ్ర-తెలంగాణ మంత్రుల నిష్పత్తి 60:40 ఉండాలని ప్రతిపాదించబడింది. అంతేకాకుండా 2 నుంచి 5 వరకు ఉండే ముఖ్యమైన మంత్రిత్వశాఖలు అంటే హోమ్, ఆర్థిక ప్రణాళిక, అభివృద్ధి, వాణిజ్యం, పరిశ్రమలు వంటి శాఖలు తెలంగాణ వారికి ఇవ్వాలి అని ఒప్పందం జరిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 2.
1969 నాటి తెలంగాణ ఆందోళన గురించి వివరించండి.
జవాబు.
రకరకాల రూపాలలో పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనకు గురి కాగా తెలంగాణాలో అసంతృప్తి రాజుకోసాగింది. ముఖ్యంగా స్థానికతకు సంబంధించిన ముల్కీ నియమాలు ఉల్లంఘించడంతో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో జరిగిన అన్యాయానికి ఒక్కసారిగా వ్యక్తమయిన వ్యతిరేకతే 1909లో జరిగిన ‘జై తెలంగాణ ఉద్యమం’.

ఆనాటికి తెలంగాణ వారికి హక్కుగా లభించవలసిన 25,000 ఉద్యోగాలు తెలంగాణాలోకి వలసవచ్చిన ఆంధ్రావారికి వెళ్ళసాగాయి. ముల్కీ నిబంధనలను పూర్తి సరళంగా మార్చివేసి, 4 సంవత్సరాలు తెలంగాణలో ఉంటే చాలు ఎవరైనా తెలంగాణ వారే అనే వెసులుబాటు ఇవ్వడం వల్ల ఈ దుర్మార్గం జరిగిపోయింది.

ముల్కీ నియమాల ఉల్లంఘనవల్ల కాలేజీల్లో అడ్మిషన్లు కోల్పోవడం తెలంగాణ వారికి సర్వసాధారణమైపోయింది. ఖమ్మంలో ఇటువంటి సంఘటనకు వ్యతిరేకంగా మొదట నిప్పురవ్వ పుట్టింది. మెడికల్ కాలేజీలో అడ్మిషన్ విషయంలో ముల్కీ ఉల్లంఘన జరిగిందనే నిరసన, నిరాహార దీక్షగా పరిణమించింది.

1969లో అది వెనువెంటనే ఉప్మానియా విశ్వవిద్యాలయానికి పాకింది. తరువాత తెలంగాణ అంతటా విస్తరించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతిపక్ష, శాసన సభ్యులూ విద్యార్థులకు మద్ధతుగా “ప్రత్యక్ష చర్యకు” పూరుకుంటామని హెచ్చరించారు.

యువకులు, మేధావులు, టీచర్లు మహిళలూ ఇలా వివిధ జనాల మద్ధతు ఉద్యమానికి తోడయింది. అధికార సభ్యుడయిన కొండాలక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి మద్దతు తెలిపాడు. మదన్మోహన్, మల్లికార్జున్, పులి వీరన్న వంటి విద్యార్థి నాయకులు చురుకుగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు తెలంగాణ పరిరక్షణలు ఉల్లంఘనలను ప్రశ్నించి, పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలను హామీ మేరకు అమలుచేయాలని డిమాండ్ చేశారు.

ఈ పోరాటంలో 370 మంది విద్యార్థులు పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. 70,000 మంది అరెస్టు అయ్యారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆధ్యర్యంలోని ప్రభుత్వ అణచివేత చర్యల ద్వారా ఉద్యమాన్ని నీరుకార్చింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని అంశాలను తెలపండి.
జవాబు.
భారత రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సంపూర్ణ అధికారం పార్లమెంట్కు ఉంది. తెలంగాణ విషయంలో కేంద్రం ఈ ఆర్టికల్ కింద రాష్ట్ర పునర్విభజన ప్రక్రియ ఆరంభించింది. భారత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పునర్విభజన బిల్లును పరిశీలించి ఒక లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ బిల్లును తిరస్కరించింది. అంతిమంగా రాష్ట్రపతి బిల్లును పార్లమెంటుకు పంపారు.

లోక్సభ, రాజ్యసభలలో బిల్లు ఆమోదం పొంది మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదం పొందింది. భారత ప్రభుత్వం 2 జూన్ 2014న చట్టం అమలులోకి వస్తుందని ప్రకటించింది. దానితో 2 జూన్ 2014న తెలంగాణ, భారత యూనియన్లో 29న రాష్ట్రంగా అవతరించింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ప్రధానాంశాలు ఈ విధంగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం : తెలంగాణ 10 జిల్లాలు గల 29వ రాష్ట్రం (ప్రస్తుత దేశంలో 28 రాష్ట్రాలు, తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం : 13 జిల్లాలు గల రాష్ట్రం.

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని : 2014 నుంచి 10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ నగరమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.

ఉమ్మడి గవర్నర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటాడు. (ప్రస్తుతం వేరు, వేరు గవర్నర్లు ఉన్నారు.)

రాజ్యసభ సభ్యులు : తెలంగాణకు 7 మంది, ఆంధ్రప్రదేశ్కు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.

లోకసభ సభ్యులు : తెలంగాణ రాష్ట్రానికి 17 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 మంది సభ్యులు ఉంటారు.

శాసనసభ సభ్యులు : తెలంగాణకు 119 మంది శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్కు 175 మంది సభ్యులు ఉంటారు.

శాసనమండలి : తెలంగాణా శాసనమండలి సభ్యులు 40, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు 50.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 4.
జూన్ 2, 2014కు గల ప్రాధాన్యతను వివరించండి.
జవాబు.
భారత రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సంపూర్ణ అధికారం పార్లమెంట్కు ఉంది. తెలంగాణ విషయంలో కేంద్రం ఈ ఆర్టికల్ కింద రాష్ట్ర పనర్విభజన ప్రక్రియ ఆరంభించింది. భారత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పునర్విభజన బిల్లును పరిశీలించి ఒక లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ బిల్లును తిరస్కరించింది. అంతిమంగా రాష్ట్రపతి బిల్లును పార్లమెంటుకు పంపారు.

లోక్సభ, రాజ్యసభలలో బిల్లు ఆమోదం పొంది మార్చి 1, 2014న రాష్ట్రపతి ఆమోదం పొందింది. భారత ప్రభుత్వం 2 జూన్ 2014న చట్టం అమలులోకి వస్తుందని ప్రకటించింది. దానితో 2 జూన్ 2014న తెలంగాణ భారత యూనియన్లో 29 రాష్ట్రంగా అవతరించింది.

ఈ చట్టం రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఉండాలని, నదీజదాల పంపకపు ట్రిబ్యునల్ ఉండాలని తెలిపింది.

దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం రూపొందించింది. జూన్ 2, 2014 చరిత్రలోనూ, తెలంగాణ ప్రజల జ్ఞాపకాలలోనూ నిలిచిపోయింది. ఈ మహా ప్రయత్నానికి కీ.శే. ప్రొఫెసర్ జయశంకర్ వంటి మేథావులు, ఎంతో ఊతం అందించారు. 2014 నాటి యు.పి.ఎ. ఛైర్పర్సన్ శ్రీమతి ఇందిరాగాంధీ, బిజెపి నాయకులు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన మద్ధతు చాలా విలువైనది. వందలాది అమరుల త్యాగాల ద్వారా సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారాలని ఆశిద్దాం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 5.
తెలంగాణ ప్రాంతీయ సమన్వయ సంఘాల గురించి రాయండి.
జవాబు.
ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతీయ సమన్వయ సంఘం ఏర్పాటు ప్రధానమైంది. ప్రాంతీయ కమిటీ సలహాలను ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ అంగీకరించవలసి ఉండేది. తెలంగాణ ప్రాంతీయ సమన్వయ సంఘానికి ఈ కింది అంశాలపై అధికారం ఉంది.

  1. రాష్ట్ర శాసనసభ ఏర్పాటు చేసే అభివృద్ధి, ఆర్థిక ప్రణాళిక మొదలైన అంశాలు.
  2. స్థానిక స్వపరిపాలన ప్రభుత్వ అంశాలు నగరపాలక సంస్థల రాజ్యాంగ అధికారాలు, ట్రస్టుల అభివృద్ధి, జిల్లా బోర్డులు, జిల్లా అధికార సంస్థల అంశాలు.
  3. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, స్థానిక వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.
  4. ప్రాథమిక, సెకండరీ విద్య.
  5. తెలంగాణ ప్రాంతంలోని విద్యా సంస్థలలో ప్రవేశాల క్రమబద్ధీకరణ.
  6. మద్యపాన నిషేధం.
  7. వ్యవసాయ భూముల అమ్మకాలు
  8. హెచ్. కుటీర, చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయం సహకార సంస్థలు మార్కెట్లు సంతలు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
హైదరాబాదు రాష్ట్రం.
జవాబు.
భారత యూనియన్ జరిపిన పోలీస్ చర్య పర్యవసానంగా స్వపరిపాలన కలిగిన హైదరాబాద్ రాజ్యం 1948లో హైదరాబాద్ రాష్ట్రంగా భారత యూనియన్లో విలీనమైంది. తరనంతరం జనరల్ చౌదరి రాష్ట్రపాలన పగ్గాలు చేపట్టారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటం వల్ల హైదరాబాద్ రాష్ట్ర పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండేవి.

ఆ తరుణంలో భారత ప్రభుత్వం ఐ.సి.యస్. అధికారి యం.కె. వెల్లోడిని పాలనా వ్యవహారాలు చూసేందుకు నియమించింది. తదనంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రశ్న 2.
ముల్కీ నిబంధనలు.
జవాబు.
ఉర్దూ భాషలో ముల్కీ అంటే ఒక జాతి, రాజ్యం. ఆ జాతికి చెందిన ప్రజలందరిని ముల్కీలంటారు. హైదరాబాద్ రాష్ట్రంలో, 15 సంవత్సరాలు శాశ్వత ప్రాతిపదికగా నివసించిన పౌరులను ముల్కీలంటారు. ఆ మేరకు మెజిస్ట్రేట్ సమక్షంలో ఒక లిఖిత పూర్వకమైన అఫిడవిట్ మీద సంతకం చేసి తన పుట్టిన ప్రదేశానికి తిరిగి వెళ్ళనని ప్రకటించిన వారు ముల్కీలుగా పరిగణించబడతారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 3.
విశాలాంధ్ర.
జవాబు.
మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఆ రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు వారితో కలిసి ఒక విశాల తెలుగు రాష్ట్రం ఏర్పాటు జరగాలన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆ ఆలోచనలను వారు విశాలాంధ్ర నినాదంగా మార్చారు.

ఈ ఆలోచనను జాతీయ స్థాయిలోని కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకత్వానికి సూచనప్రాయంగా తెలియజేసింది. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే తెలుగు రాష్ట్రం ఉంటే మంచిది అన్న వాదనను ‘విశాలాంధ్ర’ అనే పేరిట ప్రచారంలోకి తీసుకొచ్చింది.

ప్రశ్న 4.
1969 తెలంగాణ ఆందోళన.
జవాబు.
రకరకాల రూపాలలో పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనకు గురికాగా తెంగాణలో అసంతృప్తి రాజుకోసాగింది. ముఖ్యంగా స్థానికతకు సంబంధించిన ముల్కీ నియమాలు ఉల్లంఘించడంతో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో జరిగిన అన్యాయానికి ఒక్కసారిగా వ్యక్తమయిన వ్యతిరేకతే 1969లో జరిగిన ‘జైతెలంగాణ ఉద్యమం’. ఆనాటికి తెలంగాణ వారికి హక్కుగా లభించవలసిన 25,000 ఉద్యోగాలు తెలంగాణ లోకి వలసవచ్చిన ఆంధ్రావారికి వెళ్ళసాగాయి.

ముల్కీ నిబంధనలను పూర్తి సరళంగా మార్చివేసి, 4 సంవత్సరాలు తెలంగాణలో ఉంటే చాలు ఎవరైనా తెలంగాణ వారే అనే వెసులుబాటు ఇవ్వడం వల్ల ఈ దుర్మార్గం జరిగిపోయిది. 1969లో జరిగిన ‘ఉద్యమంలో 370 మంది విద్యార్థులు పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. 70,000 మంది అరెస్టు అయ్యారు. కాసు బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యలోని ప్రభుత్వం అణచివేత చర్యల ద్వారా ఉద్యమాన్ని నీరు కార్చింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 5.
శ్రీకృష్ణకమిటీ రిపోర్టు 2010.
జవాబు.
శ్రీకృష్ణకమిటీ రిపోర్టులోని ప్రధానాంశాలు :

  1. రాష్ట్రాన్ని విభజించకుండా ఉంచుతూ, తెలంగాణ ప్రాంత సామాజికార్థికాభివృద్ధి కోసం రాజ్యాంగబద్ధమైన తెలంగాణ రీజన్ కౌన్సిలును ఏర్పాటు చేయటం.
  2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచటం.
  3. ఆంధ్రప్రదేశ్ తెలంగాణా, రాయలసీమ, కోస్తాంధ్రాలు కలిసిన రెండు రాష్ట్రాలుగా విభజించటం, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం.

ప్రశ్న 6.
తెలంగాణ సంరక్షణల ఉల్లంఘనలు.
జవాబు.
ఎన్నో మంచి ఒప్పందాలు, ఎంతో విశ్వాసంతో మొదలైనా చిత్తశుద్ధి లేకపోతే, అమలులోకి రావు అనేది చారిత్రక సత్యం. పెద్ద మనుషుల ఒప్పందంలో పొందుపరచిన తెలంగాణ ప్రాంత సంరక్షణల ఉల్లంగన ఈ సత్యాన్నే లోకానికి తెలిపింది. మరోసారి వీటితో పలు ఉల్లంఘనలు కింది విధంగా జరిగాయి.

స్థానికత (Domicile) నియమాలను మార్చివేయటం ప్రధాన ఉల్లంఘన. తెలంగాణ ప్రాంతంలో స్థానికత రావాలంటే 12 సంవత్సరాల నిరంతరాయ నివాసం ఉండాలనే నియమం ఉండి. పెద్ద పమనుషుల ఒప్పందం దానిని ఒప్పుకొన్నది.

అమలు విషయానికి వచ్చేసరికి దానిని 4 సంవత్సరాలకు కుదించారు. ఈ ఉల్లంఘన వల్ల 50 వేలమంది ఆంధ్ర ప్రాంతీయులు తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లోకి చేరిపోయారు. తెలంగాణ వారికి ఒక్క దెబ్బతో విద్య, ఉద్యోగాలలో అవకాశాలు పోయాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 7.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.
జవాబు.
ఆంధ్రప్రదేశ్ పనర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ చట్టం 2014 నుండి 10 సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ నగరమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని స్పష్టంగా పేర్కొంది.

ప్రశ్న 8.
సకల జనుల సమ్మె.
జవాబు.
తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థులు ఒక మహా సమ్మె తలపెట్టారు. 13 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్ 2011 వరకు నలభై రోజులు తెలంగాణలో సాధారణ జనజీవితం స్తంభించింది. అన్ని వృత్తులవారు ఈ సమ్మెలో పాల్గొన్నారు. రోడ్లపైనే వంటావార్పులు, రైల్ రోకో, రోడ్డు దిగ్బంధాలు ఈ సమ్మె కాలంలో నిత్యకృత్యమైనాయి. ఇది చారిత్రాత్మకమైన ఉద్యమంగా
నిలిచింది.

ప్రశ్న 9.
మిలియన్ మార్ట్.
జవాబు.
17 ఫిబ్రవరి 2011లో మొదలుపెట్టి తెలంగాణ ప్రాంత ఉద్యోగులు 16 రోజులు సహాయనిరాకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు దీనిలో పాల్గొన్నారు.
దీని తరువాత తెలంగాణ జె.ఏ.సి. పదిలక్షల మంది (మిలియన్) జనాలను హైదరాబాద్కు ర్యాలీగా తరలి రమ్మని పిలుపునిచ్చారు.

అదే సంవత్సరం ఈజిప్ట్ లక్షలాది మంది ప్రజలు కైరోను దిగ్బంధించి అధికార మార్పు కోసం చేసిన పోరాటం స్ఫూర్తిగా దానికి మిలియన్ మార్చ్ అని పేరు పెట్టారు. మార్చ్ 10, 2011న హైదరాబాద్లో మిలియన్ మార్చ్ జరిగింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 9 తెలంగాణ రాష్ట్ర అవతరణ

ప్రశ్న 10.
రాజకీయ జెఎసి.
జవాబు.
రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (Political JAC) : రాజకీయ సంయు కార్యాచరణ కమిటీ (Political JAC) ని డిసెంబర్ 24, 2009 న ఏర్పరచారు. దీనిలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), భారతీయ జనతాపార్టీ (BJP), భారత కమ్యూనిస్టు పార్టీ (CPI), భారత జాతీయ కాంగ్రెస్ (INC), తెలుగుదేశం పార్టీ (TDP), సిసిఐ (ఎం.ఎల్), న్యూడెమొక్రసీ తదితర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తదితరులు అంతర్భాగమై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహించాయి.

ప్రశ్న 11.
విద్యార్థుల జెఎసి.
జవాబు.
తెలంగాణ ఉద్యమం ప్రారంభించి, తీవ్రతరం చేసి వివిద కళాశాలలు విద్యార్థులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు. వివిధ సిద్ధాంత భావజాలాలలను నమ్మే విద్యార్థులు తమ మధ్యగల సైద్ధాంతిక విభేదాలను పక్కన బెట్టి తెలంగాణ ఉద్యమం నిర్వహించడానికి ఒక్కటై, పోరాడడానికి ఒక సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)ని ఏర్పరచారు.

ఈ తరహా జెఎసిలు అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు స్థాయిల్లో ఏర్పడ్డాయి. వీటిలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు జెఎసి (OUJAC), కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు జెఎసి (KUJAC), ఉద్యమాన్ని క్రియాశీలంగా నడపడంలో కీలకపాత్ర పోషించాయి.