TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 3rd Lesson వలసకూలీ Textbook Questions and Answers.

TS 9th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వలసకూలీ

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 25)

ఊరిలో నీకిల్లు లేదు – ఊరి వెలుపల పొలము లేదు
కూలి నిర్ణయ మింతని లేదు – కూలి పని స్థిరమైనది కాదు
ఆలుపిల్లల నేలేదెట్లా – అనే చింత నిన్నిడదోయి వ్యవసాయకూలి.
బతుకు దెరువు లేక నీవు – భార్యపిల్లల నొదిలి పెట్టి
బస్తి చేరి రిక్షలాగి – బలముగ జ్వరమొచ్చి పంటే
కాస్త నీకు గంజినీళ్ళు – కాసి పోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి.
– సుద్దాల హనుమంతు

ప్రశ్న 1.
ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి ? రాసింది ఎవరు ?
జవాబు:
ఈ పంక్తులు వ్యవసాయ కూలీలను గూర్చి తెలుపుతున్నాయి. ఈ గేయాన్ని “సుద్దాల హనుమంతు” రాశాడు.

ప్రశ్న 2.
కూలిపని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థమేమిటి ?
జవాబు:
‘కూలిపని’ అంటే ఏ రోజుకు ఆ రోజు, ఎవరికైనా ఏదో పని చేసిపెట్టి, ఆ చేసిన పనికి కూలి తీసుకోవడం. ఈ పని ఉద్యోగంలా స్థిరమైనది కాదు. ప్రతిరోజూ కూలిపని ఎక్కడ దొరకుతుందో. అని వెతుక్కోవాలి. ఒక్కొక్క రోజు ఏ పనీ దొరకదు. వర్షం వచ్చిన రోజున ఎవరూ కూలిపని చెప్పరు. కూలిపని కోసం నిత్యం వేటాడాలి.

ఒకరోజు పని ఉంటుంది. మరొకరోజు ఏ పనీ ఉండదు. లేదా ఏ రిక్షాయో అద్దెకు తీసుకుని దాన్ని తొక్కుతూ జీవనం సాగించాలి. అందుకే కూలిపని స్థిరమైనది కాదు.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది ?
జవాబు:
కూలిపని దొరికితే, వచ్చిన కొద్ది డబ్బుతో ఏదోరకంగా సంసారం నడుపుకుంటారు. డబ్బు లేనప్పుడు అప్పులు చేస్తారు. ఋణాలు తీసుకుంటారు. ఏమీ దొరకకపోతే, కాసిని మంచినీళ్ళు తాగి, కడుపులో కాళ్ళు పెట్టుకొని ముడుచుకొని పడుకుంటారు. లేదా, ఏ రిక్షాయో తొక్కి దానితో వచ్చిన కొద్దిపాటి డబ్బుల్లో రిక్షా అద్దె కట్టి, మిగిలినది ఉంటే దానితో బతకాలి.

ప్రశ్న 4.
ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితులేవి ?
జవాబు:
తాము ఉంటున్న ఊళ్ళలో సరైన వ్యవసాయపనులు, తమ వృత్తిపనులు లేకపోవడం వల్ల, నగరాల్లో కూలి చేసుకొని బ్రతకవచ్చని గ్రామీణ జనం, తమ ఊర్లు వదలి నగరాలకు పోతారు.

వర్షాలు లేకపోతే వ్యవసాయపనులు గ్రామాల్లో దొరకవు. వ్యవసాయ ఆదాయం లేకపోతే, పెద్ద రైతులు చేతివృత్తులవారికి తగిన పనులు చూపించలేరు. అలాగే కొందరు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడానికి నగరాలకు వలసపోతారు. పిల్లల చదువుల కోసం కోందరు గ్రామాలు వదలి నగరాలకు వెడతారు. గ్రామాల్లో ఉపాధి సౌకర్యాలు బొత్తిగా లేకపోవడం వల్లనే ప్రజలు ఊళ్ళు వదలి పోతున్నారు.

ఆలోచించండి – చెప్పండి. (Textbook Page No. 27)

ప్రశ్న 1.
‘గొడ్ల డొక్కలు గుంజడం’ అంటే మీకు ఏమి అర్థమైంది ?
జవాబు:
గొడ్లు అంటే పశువులు. ‘డొక్కలు గుంజడం’ అంటే వాటి పొట్టలు తిండిలేక లోపలకు నొక్కుకుపోవడం. పశువులకు తిండిలేక వాటి శరీరాలు ఎండిపోయి, వాటి డొక్కలు లోపలకు దిగిపోయాయన్నమాట. ఆ పాలమూరు జిల్లాలో వర్షాలు లేనందున, ప్రజలకు తిండి, పశువులకు గ్రాసం లేకపోయిందని నాకు అర్థమయ్యింది.

ప్రశ్న 2.
కోస్తా ప్రాంతానికి ఎవరు, ఎందుకు వెళ్ళారు ?
జవాబు:
కోస్తా ప్రాంతానికి పాలమూరు జిల్లాలోని కూలీలతో పాటు, ఒక జాలరి వెళ్ళాడు. పాలమూరు ప్రాంతంలో వర్షాలు లేవు. కృష్ణాష్టమి వెళ్ళిపోయింది. పశువులకు ఆహారం లేదు. వాగుల్లో నీళ్ళులేక వానపాములు సైతం ఎండిపోయాయి. చెరువులు, కుంటలు బీటలు తీశాయి. వానపడుతుందన్న ఆశ లేకపోయింది. ఆ పరిస్థితుల్లో, కోస్తా దేశంలో కూలి ఎక్కువగా దొరుకుతుందని, కూలి పని చేసుకొనేవారు, కోస్తా ప్రాంతానికి వెళ్ళిపోయారు.

ప్రశ్న 3.
పల్లెబతుకుల కష్టానికి కారణం ఏమిటి ?
జవాబు:
పల్లెల్లో ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ‘ జీవిస్తారు. పశువుల పాడిపై ఆధారపడతారు. వర్షాలు పడకపోతే, వ్యవసాయం పనులుండవు.. పశువులకు మేత దొరకదు. కూలివారికి కూలిపనులు దొరకవు. మొత్తంపై వర్షాలు లేక, వ్యవసాయం పనులు లేకపోవడం, వ్యవసాయం వల్ల, పాడిపంటల వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉండడం, అనేవే పల్లె బ్రతుకుల కష్టాలకు కారణాలు.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

ఆలోచించండి – చెప్పండి’ (Textbook Page No. 28)

ప్రశ్న 1.
కృష్ణా ఆనకట్టను కట్టకపోవటానికి, పాలమూరు జనం కూలీలుగా మారడానికి గల సంబంధం ఏమై ఉంటుంది ?
జవాబు:
కృష్ణానదిపై ఎగువన ఆనకట్ట కడితే, ఆ నీళ్ళు మహబూబ్ నగర్ జిల్లా పంటపొలాలకు అందుతాయి. ఆ నీళ్ళు లభ్యమైతే, ఆ పాలమూరు జిల్లా ప్రజలు వర్షాధారంగా జీవించవలసిన పనిలేదు. హాయిగా కృష్ణాజలాలతో తమ పొలాల్లో పంటలు పండించు కోవచ్చు. ప్రస్తుతం ఆ ఆనకట్ట నిర్మించనందువల్ల, వర్షాలు లేకపోవడం వల్ల, పాలమూరు జనం కూలీలుగా మారిపోయి యుంటారు.

ప్రశ్న 2.
‘చీకు మబ్బుల ముసురులో కార్తీకపున్నం వెళ్ళి పోయిందని’ కవి ఎందుకు ఆవేదన చెందాడు ?
జవాబు:
సామాన్యంగా వర్షాలు శ్రావణ భాద్రపద మాసాల్లో ఎక్కువగా పడతాయి. కార్తీక పౌర్ణమి వచ్చే నాటికి వర్షాలు పూర్తిగా వెనుకపడతాయి. కార్తీక పౌర్ణమి వెళ్ళిపోయిందంటే, ఇంక ఆ సంవత్సరానికి వర్షాలు లేనట్లే లెక్క

ఇక చీకు మబ్బుల ముసురు సంగతి చూద్దాము. ఆ ప్రాంతంలో మబ్బులు ముసురుకున్నాయి. కాని అవి- చీకుమబ్బులు. అంటే చితికిపోయిన చిన్న చిన్న మబ్బులు అన్నమాట. దట్టమైన నల్లని మబ్బులు కావు. అందువల్ల చిన్న చిన్న జల్లులు తప్ప, పెద్ద వర్షం పడలేదన్నమాట.

అంతవరకూ పెద్ద వర్షం లేదు. కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఆ సంవత్సరం వర్షం పడదు. అందుకే సరియైన వర్షం రాలేదని కవి ఆవేదన పడ్డాడు.

ఇవి చేయండి

I అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
ఒక ప్రాంతంలోని జనం ఇతర ప్రాంతాలకు ఎందుకు వలసలు వెళతారు? దీనిని అరికట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది? చర్చించండి.
జవాబు:
ఒక ప్రాంతంలోని జనం, ఆ ప్రాంతంలో వారు జీవించడానికి అనువయిన పరిస్థితులు లేనపుడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వారి జీవనానికి అనువైన మరో ప్రాంతానికి వలసవెడుతూ ఉంటారు.

  1. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురియక, తినడానికి తిండి, త్రాగడానికి నీరు దొరకదు. త్రాగేనీరు సహితం వారు కొనవలసి వస్తుంది. ఆ పరిస్థితుల్లో జనం వలసలు పోతారు.
  2. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయపనులు లేక, జీవనాధారం లేక, మరో ఉద్యోగం సంపాదించే సావకాశం లేక, ఏదైనా పని చేసుకొని బ్రతుకవచ్చనే ఆశతో, నగరాలకు వలసపోతారు.
  3. తాము నివసించే ప్రాంతాలలో విద్యా వైద్య, ప్రయాణ సౌకర్యాలు లేక, ఆ సదుపాయాల కోసం జనం వలసలు పోతారు. ముఖ్యంగా జనం, జీవనభృతి కోసం, అది సంపాదించగల ప్రాంతాలకు వలసలు పోతుంటారు. వలసలు నిరోధించాలంటే, ప్రజలకు కావలసిన అన్ని సదుపాయాలు గ్రామ ప్రాంతాల్లోనే దొరికేలా ప్రభుత్వాలు చర్యలు తీసికోవాలి. కూలీలకు వ్యవసాయపనులు లేనపుడు, పనికి ఆహారపథకం వంటి పథకాల ద్వారా, ప్రజలకు పనులు చూపించాలి. గ్రామాల్లో సాగునీటి, త్రాగునీటి సదుపాయాలు కల్పించాలి.

ప్రశ్న 2.
పాఠం చదువండి. ‘అంత్యానుప్రాస’ పదాలు రాయండి.
జవాబు:

  1. ఎన్నడొస్తవు లేబరీ
    పాలమూరి జాలరీ !
  2. గొడ్ల డొక్కలు గుంజినా
    వానపాములు ఎండినా
  3. సరళా సాగరం నిండేది కాదని
    కోయిల సాగరం నిండేది కాదని
  4. గుడిసెకు విసిరి పోతివా
    నడుం చుట్టుక పోతివా
  5. మరిగి రాకనె పోతివా
    చారు మరిచే పోతివా
  6. కర్మ మెందుకు
    వేయ నందుకు
  7. మొక్కుతు పోతివా
    కోస్తదేశం పోతివా

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

ప్రశ్న 3.
కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణం శాతవాహనుల కాలం కంటే ముందునుంచే ఉన్నప్పటికీ కాకతీయుల కాలంలో ఉన్నతదశకు చేరుకుంది. ఆ తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానాధీశులు, తెలంగాణలో చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధిపరిచి, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. తర్వాత కాలంలో ఈ చెరువుల వ్యవస్థ సరైన నిర్మాణానికి నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది.

దీనివలన స్వయంపోషక గ్రామాలుగా ఉన్న తెలంగాణ గ్రామాలు కరవు పీడిత గ్రామాలుగా మారాయి. ఈ పరిణామం కూడా వలసలకు కారణమైంది. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పొట్టచేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలసపోయారు. తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధిస్తే, ప్రజలకు ఉపాధి దొరికి, వలసలు ఆగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడానికి ‘మిషన్ కాకతీయ’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.

ప్రశ్నలు :

అ) పై పేరా దేని గురించి చెప్తున్నది ?
జవాబు:
పై పేరా తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం గురించి చెప్తున్నది.

ఆ) ‘మిషన్ కాకతీయ’ అంటే ఏమిటి ?
జవాబు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి ‘మిషన్ కాకతీయ’ అని పేరు పెట్టింది.

ఇ) తెలంగాణ ప్రజలు ఎందుకు వలసలు వెళ్ళుతున్నారు?
జవాబు:
తెలంగాణలో చెరువుల వ్యవస్థ కాలక్రమంలో సరైన నిర్మాణానికి నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది. దానితో తెలంగాణ గ్రామాలు కరవుపీడిత గ్రామాలుగా మారడంతో, తెలంగాణ ప్రజలు వలసలు వెడుతున్నారు.

ఈ) వలసలు ఆగిపోవడానికి చేపట్టవలసిన చర్యలేవి?
జవాబు:
తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా, వ్యవసాయాభివృద్ధి సాధిస్తే ప్రజలకు ఉపాధి దొరికి, వలసలు ఆగిపోతాయి.

ఉ) చెరువుల అభివృద్ధి కోసం కృషిచేసిన వారెవరు?
జవాబు:
చెరువుల అభివృద్ధి కోసం కాకతీయులు, కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానాధీశులు కృషిచేశారు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ముకురాల రామారెడ్డి పాట విన్నారు కదా! దీని ఆధారంగా పాలమూరు కూలీ జీవితం ఎట్లా ఉండేదో ఊహించి రాయండి.
జవాబు:
పాలమూరులో కూలీలకు పని దొరికేదికాదు. కనీసం వారికి తిండి ఉండేది కాదు. త్రాగడానికి నీరు కూడా దొరికేది కాదు. ఆ ప్రాంతంలోని భూస్వాములకు వ్యవసాయం చేసేందుకు సాగునీటి సౌకర్యం లేదు. వర్షాలు లేవు. దానితో కూలీలు తిండిలేక, పస్తులు పడుకోవలసి వచ్చేది. వారి పిల్లలకు చదువు సంధ్యలు లేవు. వారికి జబ్బుచేస్తే మందులు వేసికోడానికి కూడా డబ్బులు వారి వద్ద ఉండేవి కావు. అందుకే వారు కూలీ దొరికే ప్రాంతాలకు వలసలు పోయేవారు.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

ఆ) ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. అలాంటి గ్రామాల నుండి ప్రజలు ఎందుకు వలసలు పోతున్నారు?
జవాబు:
గ్రామాల్లో పూర్వము పెద్ద పెద్ద భూస్వాములు ఉండేవారు. పెద్ద పెద్ద వ్యవసాయ చెరువులు, ఆ చెరువుల నుండి పొలాలకు సాగునీరు లభించేది. దానితో గ్రామాల్లో పని కావలననే రైతు కూలీలందరికీ పని దొరికేది. ఇప్పుడు పెద్ద భూస్వాములు లేరు. పిల్లలకు భూములు పంచడంతో అవి చిన్న చిన్న భూకమతాలుగా మారాయి. ఆ చిన్నరైతులు వ్యవసాయ కూలీలకు 365 రోజులూ ఉపాధిని చూపించలేరు.

చిన్న రైతులకే సంవత్సరం పొడుగునా పని ఉండదు. యంత్రాలు అమల్లోకి వచ్చాయి. దానితో కూలీల అవసరం తగ్గింది. గ్రామాల్లో కూలీల పిల్లలకు, విద్యా వైద్య ఉపాధి సౌకర్యాలు అంతగా లేవు.

గ్రామాల్లో ఉన్న యువకులు తమ జీవనభృతిని సంపాదించుకోగల పరిస్థితులు గ్రామాల్లో నేడు లేవు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమితో వారికి కావలసిన సదుపాయాలు లభించడంలేదు. వ్యవసాయదారులకు ప్రభుత్వ సహాయం ఉండడం లేదు.

అందువల్ల పిల్లలకు ఉద్యోగసంపాదనకు తగిన చదువులు చెప్పించడానికీ, తమ పిల్లలు మంచి ఉద్యోగాలు పొందడానికీ, తాము సుఖంగా జీవితాలు గడపడానికీ, ప్రజలు గ్రామాలు విడిచి, నగరాలకు వలసలు పోతున్నారు.

గ్రామాల్లో 24 గంటలూ విద్యుచ్ఛక్తి సౌకర్యం ఉండడం లేదు. గ్రామాల్లోని వృత్తి పనివారలకు నగరాల్లో చక్కని జీవనభృతి లభిస్తోంది. భవన నిర్మాణ కార్మికులకు నగరాల్లో 365 రోజులూ పని దొరుకుతోంది.

పై కారణాల వల్లనే నేడు గ్రామాల నుండి ప్రజలు నగరాలకు వలసలు పోతున్నారు.

ఇ) “ఎప్పుడొస్తవు లేబరీ, పాలమూరి జాలరీ” అని అనడంలో కవి ఉద్దేశాన్ని రాయండి.
జవాబు:
‘లేబరీ’ అంటే పనిచేసుకొని జీవించే కూలివాడు అని అర్థము. ఈ పాటలో కూలి, జాలరివాడు. అంటే చేపలు పట్టుకొని వాటిని అమ్ముకొని జీవించేవాడు. పాలమూరు ప్రాంతాల్లో వాగులు, వంకలూ ఎండిపోయాయి. దానితో ఈ జాలరికి చేపలు పట్టుకొనే పనిలేకుండా పోయింది.

కోస్తా ప్రాంతంలో సముద్రం ఉంటుంది. అక్కడి జాలర్లు పడవలపై సముద్రంలోకి నైలాన్ వలలతో చేపల వేటకు వెడతారు. అందుకే ఈ పాలమూరి జాలరి ఇక్కడ తనకు పనిలేక, కోస్తా బెస్తల పడవల్లో లేబరీగా మారాడు. అందుకే కవి జాలరిని, ఎప్పుడొస్తవు లేబరీ అని రాశాడు.

ఈ) గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి ఎప్పుడు దొరుకుతుంది ?
జవాబు:
గ్రామాల్లోని పంటచేలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తే గ్రామాల్లోని బీడు భూములన్నీ చక్కని పంటపొలాలుగా మారుతాయి. అప్పుడు గ్రామాల్లో ప్రజలందరికీ చేసుకోడానికి పని దొరుకుతుంది. గ్రామాల్లోని పూర్వం చెరువులన్నింటినీ పునరుద్ధరించాలి. పంటలు బాగా పండితే, ప్రజలు మంచి గృహాలు నిర్మించుకుంటారు. అప్పుడు వృత్తిపనివారలకు అందరికీ మంచి ఉపాధి దొరుకుతుంది. గ్రామాల్లో విద్యా వైద్య రవాణా సౌకర్యాలు కల్పిస్తే, గ్రామాల్లో ఉపాధి సౌకర్యాలు పెరుగుతాయి. అప్పుడు ఎక్కువమందికి ఉపాధి దొరుకుతుంది.

గ్రామాల్లో వ్యవసాయానికి తోడు అనుబంధ పరిశ్రమలు ప్రారంభించాలి. ముఖ్యంగా పాడి పరిశ్రమను గ్రామాల్లో ప్రోత్సహించాలి. కోళ్ళు, మేకలు, గొట్టెలు వంటివాటిని పెంచాలి. సేంద్రియ ఎరువులను తయారుచేసే యూనిట్లు ప్రారంభించాలి. గ్రామాలను స్వయంపోషకంగా తయారుచేయాలి. యువకులకు గ్రామాల్లో లఘు పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి చూపించాలి. గ్రామాల్లో ఉపాధి పుష్కలంగా లభించేటట్లు ప్రభుత్వం కృషిచేయాలి.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “వలసకూలీ” గురించి కవి ఆవేదనను మీ సొంతమాటల్లో రాయండి.
‘వలసకూలీ’ గేయ సారాంశాన్ని రాయండి.
(లేదా)
జవాబు:
ఓ పాలమూరి జాలరీ ! కూలి ఎక్కువ ఇస్తారని, కోస్తా దేశం వెళ్ళావా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?
గోకులాష్టమి వెళ్ళిపోయింది. పశువులు డొక్కలు ఎండిపోయాయి. వాగులలో, వంకలలో వానపాములు సైతం ఎండిపోయాయి. చెరువులు, కుంటలు బీటలు తీశాయి. అయినా చినుకుపడే ఆశలేదని కోస్తా దేశం వెళ్ళావా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?

వానపడదు. సరళా కోయిల సాగరాలు నిండనే నిండవు. చౌట మడుగులు ఎండిపోయాయి. పైరులు వరుగులయ్యాయి. పల్లెల్లో బతకడం ఎలాగా అనీ, కూలి బాగా ఇస్తారనీ, కోస్తాకు వలసపోయావా !
ఓ జాలరీ ! నావ, గాలం గుడిసెలో పడేసి నైలాను వల తీసుకొని, మన్నెంకొండ దేవుడు వేంకటేశ్వరుడికి మొక్కుతూ, కోస్తాకు వెళ్ళావా ! తిరిగి ఎప్పుడొస్తావు ?

మెరిగె, బొచ్చె చేపలకు అలవాటుపడి, చందమామల, పరకపిల్లల చారు మరిచిపోయావా ! కోస్తా బెస్తల పడవల్లో కూలీగా పనిచేసే కర్మ నీకు కృష్ణా ఎగువ ఆనకట్ట కట్టకపోడం వల్లనే కదా !

నీవు తిరిగి ఇంటికి వస్తానన్న గడువు దాటి వారాలయ్యింది. కార్తీక పౌర్ణమి వెళ్ళింది. ఇక్కడ నుండి వెళ్ళిన జనం అంతా చచ్చే కాలం వచ్చిందన్నట్లు, జలపిడుగు భద్రాచలం మెట్లు తాకిందట. ఎక్కడున్నావు ? ఎప్పుడొస్తావు ?

(లేదా)

ఆ) వలసకూలీల బతుకుల్లో వెలుగులు నింపడానికి ఎట్లాంటి చర్యలు అవసరమో వివరించండి.
జవాబు:
వలసకూలీలు సామాన్యంగా గ్రామీణప్రాంతాల నుండి నగరాలకు వస్తూ ఉంటారు.

  1. వలసకూలీలకు గ్రామాల్లో ఉన్న రేషనుకార్డులు, పింఛన్లు వంటి సదుపాయాలన్నీ, వలసకు వారు వచ్చిన నగర ప్రాంతాల్లో కూడా కల్పించాలి.
  2. వలసకూలీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారికి ఇళ్ళు కట్టించి ఉచితంగా ఇవ్వాలి.
  3. వలసకూలీలందరికీ నగరాల్లో పట్టణ ఉపాధి పథకాల ద్వారా పనులు చూపించాలి. రెవెన్యూ అధికారులు వలస కూలీలకు రేషన్కార్డులు ఇచ్చి, వారికి చౌకగా బియ్యం, పంచదార వంటి వస్తువులు ఇప్పించాలి.
  4. వలసకూలీల పిల్లలకు, విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి.
  5. నగరాల్లో వలసకూలీలు ప్రయాణం చేయడానికి సిటీబస్సుల్లో కన్సెషన్ టిక్కెట్లు ఇవ్వాలి.
  6. ప్రభుత్వం చేయించే పనులలో వలసకూలీలకు పనిలో ప్రాధాన్యం ఇవ్వాలి. వలసకూలీల కాలనీల్లో రోడ్లు, మంచినీటి కుళాయిలు వగైరా సదుపాయాలు కల్పించాలి.
  7. వలసకూలీలు తమ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడానికి కనీసం ఏడాదిలో రెండుసార్లు ప్రయాణ సదుపాయాలు ఏర్పాటుచేయాలి.
  8. వలసకూలీల కష్ట సుఖాలను మునిసిపల్ కౌన్సిలర్సు తెలిసికొని, ప్రభుత్వాధికారులకు తెలియజేయాలి. వలస కూలీలు నగరాల్లో స్వేచ్ఛగా జీవించేందుకు కావలసిన ఏర్పాట్లు ప్రభుత్వం కలుగజెయ్యాలి.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) శ్రమజీవులైన కూలీలు పనిదొరకక పొట్టచేత పట్టుకొని వలసపోతున్నారు. వారి జీవనాన్ని ఊహిస్తూ ఒక కవిత/గేయం రాయండి.
జవాబు:
కూలీ గొప్పగ ముట్టుతుందని
నగర మార్గమై సాధనమ్మని
గ్రామం విడిచి పట్నవాసము
దారి పడితివి అయ్యోపాపము !

ఉన్న ఊరిలో పనులు లేవయా
కన్న తల్లిని విడిచి నావయా.
అమ్మా నాన్నలు దూరమయ్యిరీ
బంధు లందరూ నిన్ను విడిచిరీ

తిండి కోసమీ తిప్పలు తప్పవు
నగరములో మరి పనులు దొరకెనా ?
కడుపు నిండుగా తిండి దొరకెనా ?
ఉండడానికి ఇల్లు దొరకెనా ?

రోడ్డు పక్కనే చోటు దొరకెనా
అమ్మా నాన్నలు గుర్తుకొచ్చిరా
భార్యా బిడ్డలు గుర్తుకొచ్చిరా
అయ్యో కంటను కన్నీరొచ్చెనా

ఎవరైనా నీ పనిని మెచ్చెనా
కడుపు కోసమా ఇంత పరీక్ష
అయ్యా ఎందుకు నీకీ శిక్ష
కండబలమూ ఉన్నవాడవు

మొండితనమూ పట్టినాడవు
కలుగును తప్పక నీకు విజయము
దైవము తోడగు నీకిది నిజము.

(లేదా)

ఆ) వలసలను నిరోధించడానికి ప్రజలకు గ్రామాల్లోనే ఉపాధి లభించేటట్లు ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలను గురించి పత్రికలకు లేఖ రాయండి.

నిజామాబాద్,
X X X X X.

ప్రధాన సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.
ఆర్యా,

నమస్కారాలు. నేను ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. మా పరిసర ప్రాంతాల పల్లెల నుండి ఎందరో. గ్రామీణ జనం, మా నగరాలకు వలస వస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వము కింది సాయం చేస్తే వలసలను అరికట్టవచ్చు.

  1. గ్రామాల్లో ప్రజలకు సాగునీరు, త్రాగునీరు, విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి.
  2. గ్రామాల నుండి రవాణా సదుపాయాలు కల్పించాలి.
  3. గ్రామాల్లో ప్రజలకు పనికి ఆహారపథకం ద్వారా 365 రోజులూ పనులు చూపించాలి. ప్రతి మండల కేంద్రాల్లో పిల్లల చదువులకు సక్సెస్ పాఠశాలలు ఏర్పాటుచేయాలి.

ప్రతి గ్రామానికి రోజూ 24 గంటలూ విద్యుచ్ఛక్తి సదుపాయం కల్పించాలి. ప్రతి మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేయాలి. ప్రతి గ్రామాలకూ ఆర్.టి.సి బస్సు సౌకర్యం ఉండాలి.

వ్యవసాయానికి కావలసిన ఆధునిక పనిముట్లను, చౌకగా ప్రజలకు అందించాలి. వ్యవసాయదారులకు బ్యాంకుల ద్వారా అప్పులు తక్కువ వడ్డీకి ఇప్పించాలి. ఈ విషయాలను మీ పత్రిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ముందుగానే మీకు నా కృతజ్ఞతలు. తప్పక ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి మీ పత్రిక ద్వారా తీసుకురండి.

ఇట్లు,
భవద్విశ్వసనీయుడు,
పి. రాజా,
తొమ్మిదవ తరగతి,
ప్రభుత్వ పాఠశాల,
నిజామాబాద్.

చిరునామా :

ప్రధాన సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

అ) పుస్తకాల నిండ మస్తుగ బొమ్మలు ఉన్నవి.
జవాబు:
మస్తుగ = అధికంగా
వాక్యప్రయోగం : ప్రభుత్వం దగ్గర మస్తుగ డబ్బు ఉంది.

ఆ) పరీక్ష రుసుం చెల్లించడానికి నేటితో గడువు ముగిసింది.
జవాబు:
గడువు = కాలవ్యవధి
వాక్యప్రయోగం : ఈ నెల పదవ తారీకు వరకూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనే గడువు ఉంది.

ఇ) పల్లెదారి పంట పైరులతో అందంగా ఉన్నది.
జవాబు:
పైరు = సస్యము
వాక్యప్రయోగం : ఈ సంవత్సరము మా చేలలో పైరులన్నీ పురుగుపట్టి పాడయ్యాయి.

2. కింది పదాలు/వాక్యాలు వివరించి రాయండి.

అ) గొడ్లడొక్కలు గుంజినా…
జవాబు:
వివరణ : ‘గొడ్లు’ అంటే పశువులు. ‘డొక్కలు’ అంటే వాటి పొట్టలు. గుంజడం అంటే ‘లాగడం’. పశువులకు కడుపునిండా తిండి లేకపోతే, వాటి డొక్కలు ఎండి లోపలకు దిగిపోతాయి. మొత్తంపై పశువుల శరీరాలు ఎండి లోపలకు దిగిపోడాన్ని ‘గొడ్లడొక్కలు గుంజడం’ అంటారు.

ఆ) చెర్లుకుంటలు పర్రెవడెనని………..
జవాబు:
వివరణ : చెర్లు అంటే చెరువులు. కుంటలు అంటే నీటి గుంటలు. వర్షాలు లేనందున చెరువులు, గుంటలు ఎండిపోయాయి. చెరువులు, గుంటలలోని నేల ‘పర్రెలు పడింది’ అంటే నెరలు తీసింది అనగా బీటలు పడిందని భావం.

ఇ) పైరులన్నీ వరుగులయ్యె….
జవాబు:
వివరణ : పైరులు పచ్చగా ఉంటాయి. ‘వరుగులు’ అంటే పచ్చి కూరగాయలు ఎండబెట్టిన ముక్కలు. పచ్చి కాయగూరలు ఎండబెడితే, బాగా ఎండి అవి వరుగులు అవుతాయి. పైరులు నీరులేక పచ్చదనం పోయి అవి వరుగులుగా మారిపోయాయని భావము.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

ఈ) జల పిడుగు…….
జవాబు:
వివరణ : పిడుగు ఆకాశం మీది నుండి వర్షం వచ్చేటప్పుడు నేలపై పడుతుంది. పిడుగు పడ్డట్లయితే ఆ పడ్డ వస్తువు లేక మనిషి మాడిపోతాడు. మరణిస్తాడు.

ఇది ‘జలపిడుగు’. పిడుగుపాటులా జలము పొంగి పొర్లిందన్న మాట. వరదలు వస్తే ఆ నీరు ప్రజలపై పిడుగులా వచ్చి పడుతుంది. కాబట్టి ‘జలపిడుగు’ అంటే పిడుగువలె వచ్చిపడిన ‘వరద ఉధృతి’ అని భావం. తుపాను వస్తే సముద్రం పొంగి పిడుగులా సముద్రం నీరు మీద పడుతుంది. కాబట్టి తుపాను, నదుల వరద వంటివి “జల పిడుగులు” అని భావం.

3. కింది వ్యాక్యాలలోని ప్రకృతి, వికృతులను గుర్తించండి.

అ) మానవుడు ఆశాజీవి. అతని ప్రయత్నాన్ని బట్టి ఆసలు నెరవేరుతాయి.
జవాబు:
ఆశ (ప్రకృతి) – ఆస (వికృతి)

ఆ) సింహాలు కొండ గుహల్లో ఉన్నాయి. జడివానకు కుహరాలలోని సింగాల గుండెలు పగిలాయి.
జవాబు:
సింహాలు (ప్రకృతి) – సింగాలు (వికృతి)

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
కింది పదాలను పరిశీలించండి. వాటిని విడదీసి సంధిని గుర్తించి, సూత్రం రాయండి.

అ) ఎట్లని
జవాబు:
ఎట్లని = ఎట్లు + అని = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.

ఆ) కాలమంటూ
జవాబు:
కాలమంటూ = కాలము + అంటూ = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.

ఇ) వరుగులయ్యే = వరుగులు + అయ్యే = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.

శబ్దాలంకారాలు :

అంత్యానుప్రాస

కింది వాక్యాలు పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.
……….. గొడ్లడొక్కలు గుంజినా
………. వానపాములు ఎండినా
………. గుడిసెకు విసిరి పోతివా
………. నడుం చుట్టుక పోతివా
…….. ఎన్నడొస్తవు లేబరీ ;
……… పాలమూరి జాలరీ!

గమనిక : పై పాదాలు చివర అక్షరాలు, పునరుక్తమైనాయని గమనించారు కదా ! అక్షరాలు పునరుక్తమవడాన్ని “అంత్యానుప్రాస” అంటారు.

అంత్యానుప్రాస లక్షణం : పదాల, పాదాల, వాక్యాల చరణాల చివరలో అక్షరాలు పునరుక్తమైతే అది అంత్యానుప్రాసాలంకారం.

ప్రశ్న 2.
అభ్యాసము : పాఠంలోని అంత్యానుప్రాసాలంకార పంక్తులను గుర్తించి రాయండి.
జవాబు:

  1. ఎన్నడొస్తవు లేబరీ
    పాలమూరి జాలరీ !
  2. గొడ్లడొక్కలు గుంజినా
    వానపాములు ఎండినా
  3. సరళాసాగరం నిండేది కాదని
    కోయిలసాగరం నిండేది కాదని
  4. గుడిసెకు విసరి పోతివా
    నడుం చుట్టుక పోతివా
  5. దిక్కు మొక్కుకు పోతివా
    కోస్తదేశం పోతివా
  6. మరిగి రాకనె పోతివా
    చారు మరిచే పోతివా
  7. …….. కర్మ మెందుకు
    ……… వేయ నందుకు

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

ఈ కింది వాక్యాలలో గీత గీసిన సమాస పదాలను పరిశీలించండి.
ఉదా : భద్రాచలం ఒక పుణ్యక్షేత్రం.
గమనిక : పై ‘భద్రాచలం’ అనే సమాస పదంలో భద్ర, అచలం అనే రెండు పదాలున్నాయి కదా! ‘అచలం’ అంటే కొండ అని అర్థం. ‘అచలం’ అనేది నామవాచకం.
‘భద్ర’ అనేది పేరు. అనగా “సంజ్ఞ”.
సంజ్ఞనే సంభావన అని అంటారు.
ఈ విధంగా పూర్వపదం (మొదటి పదం)లో సంభావన ఉన్నట్లయితే, ఆ సమాసపదాన్ని “సంభావన పూర్వపద కర్మధారయ సమాసము” అని అంటారు.

ప్రశ్న 3.
ఈ పాఠంలో ఉన్న సంభావన పూర్వపద కర్మధారయ సమాస పదాలను గుర్తించి, విశ్లేషించండి.
రూపక సమాసం
జవాబు:

  1. సరళా సాగరం – విశ్లేషణ : ‘సరళా’ అనే పేరు గల సాగరం.
  2. కోయిల సాగరం – విశ్లేషణ : ‘కోయిల’ అనే పేరు గల సాగరం
  3. కోస్త దేశం – విశ్లేషణ : ‘కోస్తా’ అనే పేరు గల దేశం
  4. మన్నెం కొండ – విశ్లేషణ : ‘మన్నెం’ అనే పేరు గల కొండ
  5. మెరిగె చాప – విశ్లేషణ : ‘మెరిగె’ అనే పేరు గల చేప
  6. బొచ్చె చాప – విశ్లేషణ : ‘బొచ్చె’ అనే పేరు గల చేప

కింద గీత గీసిన సమాస పదాన్ని పరిశీలించండి.

ధనాలన్నింటిలో శ్రేష్ఠమైనది విద్యాధనం.
పై గీత గీసిన పదములో విద్యకు ధనమునకు భేదం లేనట్లు చెప్పబడింది.
“విద్య అనెడు ధనం” అని ‘విద్యాధనం’ అనే సమాసానికి అర్థం.
‘విద్యాధనం’ అనే సమాసపదంలో, ‘ధనం’ అనేది ఉపమానం.
‘విద్యాధనం’ అనే సమాసపదంలో, ‘విద్య’ అనేది ‘ఉపమేయము’.

అభ్యాసము : కింద గీత గీసిన సమాసపదాలలోని ఉపమాన, ఉపమేయాలను గుర్తించండి.

1. “దయాభరణము”ను ధరించినవాడు భగవంతుడు.
వివరణ : “దయాభరణము” అనే సమాసపదంలో, ‘ఆభరణము’ అనే పదం ఉపమానము. ‘దయ’ అనేది ఉపమేయం.

2. పేదలపై కృపారసము కలిగియుండాలి.
వివరణ : ‘కృపారసము’ అనే సమాసపదంలో, “రసము” అనే పదం, ‘ఉపమానం’, ‘కృప’ అనేది ఉపమేయము.
గమనిక : ఈ విధంగా ఉపమానం యొక్క ధర్మాన్ని, ఉపమేయమందు ఆరోపించడాన్ని, ‘రూపక సమాసం’ అంటారు. లేదా “అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు.

ప్రశ్న 4.
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాలో గుర్తించండి.

సమాస పదం – విగ్రహవాక్యం – సమాస నామం

అ) పాలమూరు జిల్లా – ‘పాలమూరు’ అను పేరు గల జిల్లా – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) సరళాసాగరం – ‘సరళా’ అనే పేరు గల సాగరం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఇ) మన్నెంకొండ – ‘మన్నెం’ అనే పేరు గల కొండ – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) కీర్తికన్యక – కీర్తి అనే కన్య – రూపక సమాసం
ఉ) జ్ఞానజ్యోతి – జ్ఞానము అనే జ్యోతి – రూపక సమాసం

ప్రాజెక్టు పని

మీ గ్రామంలో లేదా వాడలో వలసకూలీల వద్దకు/ వాళ్ల బంధువుల వద్దకు వెళ్లి, వలస ఎందుకు వచ్చారో తెలుసుకుని, వాళ్ళ కష్టసుఖాల గురించి ఇంటర్వ్యూ చేసి నివేదిక రూపొందించండి.
జవాబు:
నేను మా గ్రామంలోని వలస కూలీల వద్దకు, వాళ్ళ బంధువుల వద్దకు వెళ్ళి వారు ఏ ప్రాంతం నుండి వచ్చారో, ఎప్పటి నుండి వచ్చారో, ఏ కారణాలతో వచ్చారో ప్రశ్నావళి ద్వారా వివరాలను తెలుసుకున్నాను. కరవుకాటకాల వల్ల, ఉపాధి అవకాశాలు లేనందువల్ల, కూలీ పనులు లేని కారణంగా వలస వచ్చినట్లుగా గ్రహించాను. వారు ప్రతి రోజు దుర్భర జీవితాన్ని గడుపుతున్నట్లుగా అర్థమయ్యింది. అందువల్ల ఇలాంటి వలసకూలీల సంక్షేమానికి ప్రభుత్వం చేయూతను అందివ్వాలి. సంపన్నులు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలి. వారిని మనలో ఒకరిగా గుర్తించాలి. వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఉన్నతంగా జీవించే అవకాశాలను కల్పించాలి.

(లేదా)

కార్మికుల, కూలీల బతుకు జీవనం గురించి వచ్చిన కథ/కవిత/గేయం/ పాటలను సేకరించి, నివేదిక రాయండి. చదివి వినిపించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

గేయ పంక్తులు – భావం

I

1వ గేయం

కూలి మస్తుగ దొరుకుతాదని!
కోస్తదేశం పోతివా!
ఎన్నడొస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ!

భావార్థం :

కూలిమస్తుగ దొరుకుతాదని = కూలి ఎక్కువగా దొరుకుతుందని (కూలి ఎక్కువగా వస్తుందని)
కోస్తదేశం పోతివా = కోస్తా ప్రాంతానికి వెళ్ళావా ?
(ఆంధ్రదేశంలో శ్రీకాకుళం జిల్లా నుండి, నెల్లూరు జిల్లా వరకూ సముద్రతీర ప్రాంతాన్ని కోస్తా దేశం అంటారు. ).
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?
(లేబరర్ = LABORER = కూలివాడు)
పాలమూరి జాలరీ = పాలమూరు జిల్లాలోని
బెస్తవాడా ! (మహబూబ్ నగర్
జిల్లాలో ఉండే బెస్తవాడా !)
(జాలరి = చేపలు పట్టేవాడు)

భావం:కూలి బాగా ముడుతుందని, కోస్తా దేశం వెళ్ళావా ? ఓ పాలమూరి జిల్లా జాలరీ ! ఎప్పుడు తిరిగి వస్తావు ?

2వ గేయం

గోకులాష్టమి దాటిపోయినా, గొడ్లడొక్కలు గుంజివా,
వాగులల్లో, వంకలల్లో వానపాములు ఎండినా,
చినుకురాలే ఆశలేదని, చెర్లుకుంటలు పర్రెవడెవని
కూలి మస్తుగ దొరుకుతాదని కోస్తదేశం పోతివా!

ఎన్నడొస్తవులేబరీ,
పాలమూరి. జాలరీ!

భావార్థం :

గోకులాష్టమి = కృష్ణాష్టమి (గోకులాష్టమి శ్రావణ బహుళ అష్టమినాడు వస్తుంది) (శ్రావణమాసం వెళ్ళిపోతున్నా వర్షాలు రాలేదన్నమాట)
దాటిపోయినా = వెళ్ళిపోయినా
గొడ్లడొక్కలు గుంజినా = పశువుల శరీరాలు, లోపలకు లాగుకుపోయినా; (తిండిలేక వాటి పొట్టలు ఎండి లోతుకు పోయినా)
వాగుల్లో, వంకలల్లో = సెలయేఱులలో, చిన్న ఏఱుల్లో ఉండే
వానపాములు ఎండినా = వానపాములు ఎండిపోయినా (చాలాకాలంగా ఆ వాగులలో, వంకలలో నీరు లేనందున, ఆ మట్టిలోని వానపాములు సైతం ఎండిపోయాయన్న మాట)
చినుకురాలే ఆశలేదని = వానచినుకు పడుతుందని ఆశ ఇంక లేదని ;
చెర్లుకుంటలు = చెరువులూ, గుంటలూ
పర్రెవడెనని = బీటలు తీశాయని ; (నెఱ్ఱలు పడ్డాయని)
కూలి మస్తుగ దొరుకుతాదని = కూలి ఎక్కువగా ఇస్తారని
కోస్తదేశం పోతివా ! = కోస్తాకు వెళ్ళావా !
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా! ఎప్పుడు తిరిగి వస్తావు ?
పాలమూరి జాలరీ = పాలమూరులో ఉండే ఓ బెస్తవాడా!

భావం: ఓ పాలమూరు జాలరీ ! కృష్ణాష్టమి వెళ్ళిపోయినా, పశువుల డొక్కలు ఎండిపోయినా, వాగులలో, వంకలలో, వానపాములు ఎండిపోయినా, ఇక్కడ వర్షపు చినుకు నేలపై రాలిపడే ఆశ కనబడటల్లేదని, చెరువులూ, గుంటలూ బీటలు తీశాయనీ, అక్కడ కూలీ బాగా దొరుకుతుందనీ, కోస్తా ప్రాంతానికి వెళ్ళిపోయావా ? ఓ కూలివాడా ! ఎప్పుడు తిరిగి వస్తావో చెప్పు.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

3వ గేయం

చాలు వానే పడదు సరళాసాగరం నిండేది కాదని,
చౌట మడుగులె యెండె, కోయిలసాగరం నిండేది కాదని,
పైరు లన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని,
కూలి మస్తుగ దొరుకుతాదని కోస్తదేశం పోతివా
ఎన్నడొస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ!

భావార్థం :

పాలమూరి జాలరీ = ఓ పాలమూరు జిల్లాలో ఉండే జాలరివాడా !
చాలు = ఇంక ఆశలు చాలు
వానే పడదు = ఈ సంవత్సరం ఇంక వాన పడదు
సరళాసాగరం = ‘సరళాసాగరం’ అనే నీటిమడుగు
నిండేది కాదని = ఈ సంవత్సరానికి ఇంక నిండదని;
చౌట మడుగులె = చౌడు నేలల్లో ఉన్న నీటిమడుగులే;
ఎండె = ఎండిపోయాయని;
‘కోయిల సాగరం’
నిండేది కాదని = ‘కోయిల సాగరం’ మడుగు ఇక ఈ సంవత్సరం నిండదని
పైరులన్నీ = పంటచేలన్నీ
పరుగులయ్యే
(వరుగులు + అయ్యే) = వరుగులవలె ఎండిపోతే,
పల్లెలో = గ్రామంలో
బతికేది ఎట్లని = జీవించడం ఎలా అని,
కూలి మస్తుగ దొరుకుతాదని = కూలి బాగా దొరుకుతుందని
కోస్తదేశం పోతివా = కోస్తాకు వెళ్ళావా (సముద్రతీర ప్రాంతం)
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం: ఓ పాలమూరి జాలరీ ! ఇంక వానపడదని, సరళా సాగరం ఇంక నిండదని, చౌడు నేలల్లో నీటిగుంటలు ఎండిపోయాయనీ, కోయిల సాగర్ ఇంక నిండదని, పైరులన్నీ వరుగుల్లా ఎండిపోయాయనీ, ఇంక పల్లెల్లో బ్రతకడం కష్టమనీ, కూలి ఎక్కువగా దొరకుతుందనీ, కోస్తా దేశానికి వెళ్ళిపోయావా ? ఓ కూలివాడా ! తిరిగి ఎప్పుడు వస్తావు ?

II

4వ గేయం

కొడిమెలూ, గాలాల గడెలూ గుడిసెకు విసిరిపోతివా!
నజాకతు నైలాను వలనే నడుం చుట్టుక పోతివా,
తిరిగి మన్నెంకొండ దేవుని దిక్కు మొక్కుతు పోతివా,
కూలి మస్తుగ దొరుకుతాదని కోస్తదేశం పోతివా
ఎన్నడొస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ !

భావార్థం:

పాలమూరి జాలరీ = ఓ పాలమూరు జిల్లా బెస్తవాడా!
కొడిమెల = నావలూ (చేపల బుట్టలు)
గాలాల గడెలు = చేపలను పట్టే గాలముల, కఱ్ఱులూ
(గడె = చేపలు పట్టేసాధనం).
గుడిసెకు విసిరిపోతివా = నీవు ఉండే తాటియాకుల ఇంటిలోకి విసరిపడేసి వెళ్ళిపోయావా ?
నజాకతు, నైలాను వలనే = సున్నితమైన నైలాను దారంతో అల్లిన వలను మాత్రం.
నడుం చుట్టుక పోతివా = నీ నడుముకు చుట్టుకొని వెళ్ళావా ? (కూడా తీసుకువెళ్ళావా అని భావం)
తిరిగి = వెళ్ళిపోతూ వెనుకకు తిరిగి
మన్నెంకొండ దేవుని = మన్నెంకొండలో వేలిసిన వేంకటేశ్వరుడి
దిక్కు మొక్కుతు పోతివా = ధిక్కు చూస్తూ దండం పెడుతూ వెళ్ళావా ?
కూలి మస్తుగ దొరుకుతాదని = కూలి ఎక్కువగా దొరుకుతుందని
కోస్తదేశం పోతివా = కోస్తా దేశానికి వెళ్ళావా ?
ఎన్నడొస్తవు లేబరీ = కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం : ఓ పాలమూరి జాలరీ ! పడవలు, గాలాల కఱ్ఱులు →గుడిసెలోకి విసరిపోయావా ? సున్నితమైన నైలాను వలను నీ నడుముకు చుట్టుకొని వెళ్ళిపోయావా ? వెళ్ళిపోతూ వెనక్కు తిరిగి మన్నెంకొండ వేంకటేశ్వరుడి వైపు చూసి నమస్కారం చేస్తూ వెళ్ళిపోయావా ? కూలి బాగా వస్తుందని, కోస్తా దేశానికి వెళ్ళిపోయావా ? కూలివాడా ! ఎప్పుడు తిరిగివస్తావు ?

5వ గేయం

మెరిగె చాపకు బొచ్చె చాపకు మరిగి రాకనె పోతివా,
చందమానుల, పరక పిల్లల చారు మరిచే పోతినా,
ఎన్నడోస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ !

భావార్థం:

మెరిగే చాపకు = మెరిగె అనే చేపలకూ
బొచ్చె చాపకు = ‘బొచ్చెలు’ అనే చేపలకూ (మెరిగెలు, బొచ్చెలు కోస్తాలో దొరికే చేపలు).
మరిగి = అలవాటుపడి (కోస్తా ప్రాంతంలో దొరికే మెరిగె, బొచ్చెలు అనే చేపలు తినడానికి అలవాటుపడి)
రాకనె పోతివా = తిరిగి పాలమూరు. రాకుండా పోయావా ?
చందమామల, పరక పిల్లల= చందమామలు, పరకలు అనే చేపపిల్లలతో పెట్టే;
చారు మరిచే పోతివా = చారు రుచి మరచిపోయావా!
పాలమూరి జాలరీ = ఓ పాలమూరి జాలరీ !
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం: ఓ పాలమూరి జాలరీ ! కోస్తా ప్రాంతంలో దొరికే మెరిగెలు, బొచ్చెలు అనే చేపలకు అలవాటుపడి, తిరిగి ఇక్కడకు రాకుండా పోయావా ? ఇక్కడ దొరికే చందమామల, పరక పిల్లల చారు రుచిని మరచిపోయావా ? ఓ కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

6వ గేయం

కోస్తబెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు ?
ఎగువ కృష్ణా ఆనకట్టను ఇంత వరకూ వేయవందుకు
ఏడ ఉంటివొ లేబరీ,
ఎన్నడొస్తవు జాలరీ !

భావార్థం:

కోస్తబెస్తల = కోస్తా తీరంలోని చేపలు పట్టే బెవాండ్ర
పడవలల్లో = పడవలలో
కూలివయ్యిన కర్మమెందుకు = కూలిగా పడి ఉండవలసిన కర్మము నీకు ఎందుకు ?
ఎగువ కృష్ణా ఆనకట్టను = కృష్ణా నదిపై ఎగువ భాగాన (పై భాగాన) ఆనకట్టను
ఇంతవరకూ వేయనందుకు = ఇంతవరకూ కట్టనందువల్లనే కదా !
ఏడ ఉంటివొ లేబరీ = ఓ కూలివాడా ! ఎక్కడ ఉన్నావు ?
ఎన్నడొస్తవు జాలరీ = ఓ జాలరీ ! ఎప్పుడు తిరిగి పాలమూరు వస్తావు ?

భావం : కృష్ణా నదిపై ఎగువన ఆనకట్ట కడితే, పాలమూరు జిల్లాకు నీరు వచ్చేది. అప్పుడు ఆ ప్రాంత ప్రజలు వలసలు వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదని గేయకర్త అభిప్రాయం.

7వ గేయం

ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటె,
చీకు మబ్బుల ముసురులో కార్తీకపున్నం వెళ్ళిపాయె,
ఇటే పోయిన జనం – అంతా అటే చచ్చే కాలమంటు,
జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెవంటా
ఎక్కడుంటివి లేబరీ,
ఎన్నడొస్తవు జాలరీ !

భావార్థం :

ఇంటికొస్తానన్న గడువుకు = నీవు ఇంటికి తిరిగి వస్తానన్న కాలవ్యవధికి;
ఇప్పటికి వారాలు దాటే = ఇప్పటికే వారాలు దాటిపోయాయి
చీకు మబ్బుల = చితికిపోయిన చిన్న చిన్న మబ్బుల
ముసురులో = ఎడతెగని చిరు వానలో
కార్తీకపున్నం = కార్తీక పౌర్ణమి
వెళ్ళి పాయె = వెళ్ళిపోయింది
ఇటే పోయిన జనం = ఇక్కడి నుండి కోస్తా వెళ్ళిన జనము
అంతా అటే చచ్చే కాలమంటు = అంతా అక్కడే చచ్చే కాలము వచ్చిందన్నట్లు;
జలపిడుగు పొర్లాడి = ‘నీటి ఉధృతి’ అనగా గోదావరి నది వరద పొంగి
భద్రాచలం మెట్లకు తాకెనంటా = భద్రాచలంలోని శ్రీరామ పాదాలను తాకిందట కదా !
ఎక్కడుంటివి లేబరీ = ఓ కూలివాడా! ఎక్కడ ఉన్నావు?
ఎన్నడొస్తవు జాలరీ = ఓ జాలరివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం : ఓ కూలివాడా ! నీవు ఇంటికి తిరిగివస్తానన్న కాలవ్యవధి, ఇప్పటికే వారాలు దాటిపోయింది. చిన్నమబ్బుల ముసురువానలో కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది. ఇక్కడి నుండి కోస్తా ప్రాంతానికి వెళ్ళిన జనం, అంతా అక్కడే చచ్చే కాలం వచ్చినట్లు, గోదావరి వరద భద్రాచలంలోని రామ పాదాలను తాకిందట. నీవు ఎక్కడ ఉన్నావు ? ఓ జాలరీ! ఎప్పుడు తిరిగి వస్తావు ?

పాఠం నేపథ్యం

తెలంగాణ రాష్ట్రంలో నీటివసతికి నోచుకోక, పంటలు పండక, నిరంతరం కరువురక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు, నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్నగర్ జిల్లా. బతుకుభారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతుకటానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి.

1977లో తూర్పు తీరప్రాంతానికి వలస వెళ్ళిన, కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుపానుకు గురై తిరిగిరాలేదని, వాళ్ళెక్కడున్నరో జాడతెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది.

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం గేయ ప్రక్రియకు సంబంధించినది. “లయాత్మకంగా ఉండి, ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం”. ఈ గేయం, పల్లవి, చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతమవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే ‘గేయం’.
ప్రస్తుత పాఠ్యభాగం, డా॥ ముకురాల రామారెడ్డిగారి ‘హృదయశైలి’ అనే గేయ సంకలనంలోనిది.

కవి పరిచయం

TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ 1
01.01.1929
24.02.2003

పాఠ్యభాగము : ‘వలసకూలీ !’

కవి : డా॥ ముకురాల రామారెడ్డి

దేని నుండి గ్రహింపబడింది : కవి రాసిన ‘హృదయశైలి’ గేయ సంకలనం నుండి గ్రహింపబడింది.

జననము : వీరు 01.01.1929న జన్మించారు.

జన్మస్థలము : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ‘ముకురాల’ గ్రామంలో వీరు జన్మించారు.

రచనలు :

  1. మేఘదూత (అనువాద కవిత్వం),
  2. దేవరకొండ దుర్గం,
  3. నవ్వేకత్తులు (దీర్ఘకవిత),
  4. హృదయశైలి (గేయ సంపుటి),
  5. రాక్షసజాతర (దీర్ఘకవిత),
  6. ఉపరిశోధన (పరిశోధనా పత్రాల సంకలనం),
  7. తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగునవి రచించారు.

పరిశోధనా గ్రంథం : “ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావపరిణామం” అనే అంశంపై పరిశోధనా గ్రంథం వెలువరించారు.

సన్మానాలు:

  1. వీరి ‘విడిజోడు’ కథకు, కృష్ణాపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇచ్చారు.
  2. ఆకాశవాణి ఢిల్లీ వారు 1967లో ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ కవిగా వీరిని గుర్తించి, సన్మానం చేశారు.

ప్రవేశిక

మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది. ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్ధకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన. ఆశ. కానీ ………….
కాలం కలిసి రాని అభాగ్యజీవులు, తమ జీవితాన్ని నెట్టుకురావడమే ఒక ‘కల’గా భావించవలసి వస్తే …………
అందంగా ఉండవలసిన ‘కల’ కూడా ‘పీడకల’గా పరిణమిస్తే ……………..

బతుకు బండి నడిపేటందుకు తన కలలన్నీ, కల్లలు కాగా పొట్టచేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి ….
మనసును పంచుకొనేటందుకు మనుషులు లేక,
బాధను పంచుకొనేటందుకు బంధువులు లేక,
సమాజం నుండి దూరమౌతున్న వ్యథార్థజీవితాలను గురించి,
ముకురాలవారు రాసిన గేయం చదువుదాం.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 2nd Lesson నేనెరిగిన బూర్గుల Textbook Questions and Answers.

TS 9th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నేనెరిగిన బూర్గుల

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 14)

సహనమ్ము, సత్యమ్ము, శాంతగంభీరమ్ము,
ఆత్మవిశ్వాసమ్ము, నహరహమ్ము
సాధన, దక్షత, సాధుభాషణమును,
సద్వివేచనమును, సద్గమనము,

దానమ్ము, ధైర్యమ్ము, త్యాగమ్ము, సునిశిత
బుద్ధి, మేల్గాంచుట, పుణ్యగుణము,
కరుణ, క్షమ, పరోపకారబుద్దియనెడి
యాలోచనారీతు లమరియుండు

‘మనుజులెప్పుడును మాన్యులు, మంగళస్వ
రూపులు, మహోన్నతులు, విరాడ్రూపశోభి
తులు, సుకీర్తికాంతవరపతులు, సుమతులు,
జగతిగతి విరచితులు, సజ్జనులువారు.

ప్రశ్న 1.
ఈ పద్యం దేన్ని గురించి చెబుతున్నది ?
జవాబు:
ఈ పద్యం మాన్యులూ, మంగళ స్వరూపులూ, మహోన్నతులూ, కీర్తిమంతులూ అయిన సజ్జనులను గురించి చెబుతున్నది.

ప్రశ్న 2.
ఈ పద్యం ద్వారా గుర్తించిన లక్షణాలేవి ?
జవాబు:
ఈ పద్యం ద్వారా గుర్తించిన లక్షణాలు ఇవి.

  1. సహనం,
  2. సత్యం,
  3. శాంతగంభీరం,
  4. ఆత్మవిశ్వాసం,
  5. రాత్రింబగళ్ళు సాధన,
  6. దక్షత,
  7. సాధుభాషణం,
  8. సద్వివేచనం,
  9. సద్గమనం,
  10. దాన ధైర్యాలు,
  11. త్యాగం,
  12. సునిశిత బుద్ధి,
  13. పుణ్యగుణం,
  14. కరుణ,
  15. క్షమ,
  16. పరోపకారబుద్ధి.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
మంచి లక్షణాలు కలిగిన వారినేమంటారు ?
జవాబు:
మంచి లక్షణాలు కలిగిన వారిని

  1. మాన్యులు,
  2. మంగళ స్వరూపులు,
  3. మహోన్నతులు,
  4. విరాడ్రూపశోభితులు,
  5. సుమతులు,
  6. సజ్జనులు అని అంటారు.

ప్రశ్న 4.
అలాంటివారి గురించి ఎందుకు తెలుసుకోవాలి ? వారితో ఎందుకు సాంగత్యం చేయాలి ?
జవాబు:
అలాంటి వారిని గూర్చి చదివితే, మంచి స్ఫూర్తి కలుగుతుంది. అలాంటి మహాత్ముల గుణాలను ఆదర్శంగా తీసుకొని తాము కూడా ఆ విధంగా సన్మార్గంలో నడవడానికి వీలుపడుతుంది. అటువంటి వారితో సాంగత్యం చేయడం వల్ల, వారి మహోన్నత వ్యక్తిత్వం గూర్చి చక్కగా తెలిసికోడానికి వీలవుతుంది.

అటువంటి వారిని గూర్చి తెలిసికొని, వారు నడచిన అడుగుజాడలలో తాము కూడా నడవడానికి వీలవుతుంది.

ఆలోచించండి – చెప్పండి’ (Textbook Page No. 17)

ప్రశ్న 1.
అంతరాత్మ బోధించడం అంటే ఏమిటి ? మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా ? ఎప్పుడు?
జవాబు:
అంతరాత్మ అంటే హృదయం. అంటే మనలో ఉన్న మనస్సు. మనం నోటితో పైకి ఏమి చెపుతున్నా, లోపల మనస్సు మరోరకంగా చెపుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి అందరికీ జరుగుతుంది.

ఒకసారి నేను మధ్యాహ్నం బడి మానివేసి సినీమాకు వెళ్ళాను. ఇంటికి వచ్చాక నాన్నగారు ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడిగారు. ఆటలు ఆడి వచ్చానని అబద్ధం చెప్పాను కాని నేను అబద్ధం చెపుతున్నాననీ, అది తప్పనీ, నా అంతరాత్మ నాకు బోధించింది.

ప్రశ్న 2.
ఇతరులకంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట, ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. ఈ వాక్యం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
ప్రతి వ్యక్తి తాను ఇతరుల కంటే గొప్పవాడినని, పదిమంది చేత అనిపించుకోవాలని గట్టిగా అనుకుంటాడు. అందుకోసం లేని గొప్పలు చెప్పుకోడానికి కూడా అతడు సిద్ధపడతాడని గ్రహించాను.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
సత్యదూరమైన విషయం అంటే ఏమిటి ? దీన్ని ఏ ఏ సందర్భాలలో వాడతారు ?
జవాబు:
సత్యదూరమైన విషయం అంటే, నిజం కాని విషయం. అంటే పూర్తిగా అబద్ధము అన్నమాట. ఇతరులు లేని మాటలను ఉన్నట్లు చెపుతున్నపుడు, వారు చెప్పినది. అబద్ధం అని చెప్పడానికి ‘సత్యదూరం’ అనే మాటను వాడతారు.

ఆలోచించండి – చెప్పండి’ (Textbook Page No. 19)

ప్రశ్న 1.
ఎవరైనా గుర్తింపు పొందడానికి శరీరాకృతి కారణం కాదని తెల్సుకొన్నారు కదా! దీన్ని మీరెలా సమర్థిస్తారు?
జవాబు:
“ఒక వ్యక్తి గుర్తించబడటానికి అతని శరీరం యొక్క ఆకారం కారణం కాదు” అని రచయిత చెప్పిన మాట సత్యం.

మన భారతదేశానికి రెండవ ప్రధానమంత్రి అయిన “లాల్ బహదూర్ శాస్త్రిగారు” పొట్టివాడు. ఆయన ఎంతోకాలం కేంద్రమంత్రిగా పనిచేశారు. రైల్వేమంత్రిగా ఆయన ఉన్నప్పుడు పెద్ద రైల్వే ప్రమాదం జరిగింది. వెంటనే ఆయన రిజైన్ చేశారు.

ఆయన ‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదం ఇచ్చి, రైతులనూ, సైనికులనూ ఉత్తేజపరచాడు. ఆయన మరణించే నాటికి ఆయనకు స్వంత ఇల్లు లేదు. అంతటి నిజాయితీ గల శాస్త్రిగారు పొట్టివాడైనా, ఆయన గట్టివాడనిపించుకున్నాడు కదా!

ప్రశ్న 2.
అనన్యమైన వాదనాపటిమ అంటే ఏమిటి ? ఇది ఎవరికి అవసరం ? ఎందుకు ?
జవాబు:
‘వాదనాపటిమ’ అంటే వాదించడంలో గల సమర్థత అని అర్థం. ‘అనన్యము’ అంటే అటువంటి వాదనాశక్తి, మరొక్కరికి ఎవ్వరికీ లేదని అర్థం. ‘అనన్యమైన వాదనాపటిమ’ అంటే, తాను చెప్పినదే సరయినదని, ఎదుటి వారివద్ద గట్టిగా వాదించి చెప్పగల సామర్థ్యం.

ఇటువంటి వాదనాపటిమ ముఖ్యంగా న్యాయ వాదులకు ఉండాలి. న్యాయవాదులు చేపట్టిన కేసులను నెగ్గించుకోవాలంటే, వాదనాపటిమ వారికి ముఖ్యం.

ప్రశ్న 3.
“కొరుకుడు పడకపోవడం” అంటే ఏమిటి ? దీన్ని ఏ ఏ సందర్భాలలో వాడతారు ?
జవాబు:
వస్తువు గట్టిగా ఉండి, పళ్ళతో కొరికి తినడానికి వీలులేక పోవడాన్ని “కొరుకుడు పడకపోవడం” అంటారు. ఈ పదాన్ని రెండు సందర్భాల్లో వాడతారు.

  1. వస్తువు బాగా గట్టిగా ఉండి, పళ్ళతో కొరికి తినడానికి వీలుకానప్పుడు వాడతారు.
  2. తెలిసికోవలసిన విషయం మన బుద్ధికి అంద నప్పుడు, అది ఎంత చెప్పినా అర్థం కానప్పుడు, ఎంత పరిశీలించినా ఆ విషయం స్పష్టం కానప్పుడు, విషయం “కొరుకుడు పడడం లేదు” అని అంటారు.

ఆలోచించండి – చప్పండి (Textbook Page No. 20)

ప్రశ్న 1.
గొప్పవారు తమ జీవితానుభవాలను గ్రంథస్థం ఎందుకు చేయాలి ?
జవాబు:
గొప్పవారి జీవిత చరిత్రలో ఎన్నో ఆదర్శ సంఘటనలు ఉంటాయి. అవి ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. వాటిని అందరూ తెలిసికోవాలి.

గొప్పవారు తమ జీవితానుభవాలను వారు పుస్తక రూపంగా రాసిపెడితే, ఆ పుస్తకాలు చదివి, ఇతరులు తమ జీవితాల్ని గొప్పవారు నడిచిన మంచి దారిలో నడుపుకోవచ్చును. కనుక గొప్పవారు తమ జీవితాను భవాల్ని పుస్తకంగా రాయాలి.

ప్రశ్న 2.
మీరు వెచ్చించే సమయం దేనికి ఎక్కువగా ఉంటోంది? మీకుపయోగపడేవాటికా ? లేక ఇతరపనులకా ?
జవాబు:
నేను ఎక్కువగా నా సమయాన్ని చదువుకోసం, ఆటపాటల కోసం వినియోగిస్తాను. నేను ఇతర పనులకు నా సమయాన్ని వినియోగించను.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
రామకృష్ణారావుగారిని పి.వి. గారు ప్రాతఃస్మరణీయులు అని పేర్కొన్నారు కదా! నేటి రాజకీయ నాయకులు కూడా రామకృష్ణారావుగారిలా గొప్పపేరు సంపాదించు కోవాలంటే ఎలా ఉండాలి ? ఏమేం చేయాలి ?
జవాబు:
నేటి రాజకీయ నాయకులు కూడా రామకృష్ణారావు గారివలె పేరు సంపాదించుకోవాలంటే ఈ క్రింది విధంగా పనులు చేయాలి.

  1. ప్రజల అభీష్టానికి పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చి మతాతీతంగా విశిష్ట వ్యక్తిత్వం కలిగి ఉండాలి.
  2. ప్రజలకు కష్టసుఖాలలో తాము పాలుపంచుకోవాలి.
  3. శాసనసభ చర్చలలో చక్కగా పాల్గొని, దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి చక్కని సూచనలు ఇవ్వాలి.
  4. సాహిత్యం బాగా చదివి మంచి పాండిత్యం సంపాదించాలి. మంచి వక్తగా పేరు పొందాలి.
  5. అవినీతికి దూరంగా ఉండాలి.
  6. ప్రజలకు సన్నిహితంగా, సోదర శాసనసభ్యులతో స్నేహంగా, ప్రజల తలలో నాలుకవలె మెలగాలి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కింది అంశం గురించి మాట్లాడండి.

ఇతరుల కంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. దీని గురించి మీ అభిప్రాయాలను తెలపండి.
జవాబు:
ఇతరుల కంటే తాను గొప్పవాడని అనిపించుకోవాలనే కోరిక, ఉత్సాహము సహజంగా అందరిలోనూ ఉంటుంది. బడిలో పిల్లలకు కూడా పక్కవాడి కంటే తాను ఎక్కువ మార్కులు తెచ్చుకొని, తాను గురువుల వద్ద మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. అలాగే ఆటలలో తానే బాగా ఆడి, పేరు తెచ్చుకోవాలని, అందరూ తన ప్రతిభను మెచ్చుకోవాలని పిల్లలు అనుకుంటారు.

కవులూ, పండితులూ, ఇతర కవి పండితుల కంటే తాము గొప్పవారమని అందరూ గుర్తించాలని వారు తమను గూర్చి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. సంఘంలో మనుషులు తాము పక్కవారి కంటే డబ్బు కలవారమని, గొప్పవారమని అనిపించుకోవాలని ఉబలాటపడుతూ ఉంటారు.

ప్రశ్న 2.
కింది విషయాలు పాఠంలో ఏయే పేరాలలో ఉన్నాయి ? వాటికి సంబంధించిన అంశాలను పట్టికలో రాయండి.
జవాబు:
TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 2

ప్రశ్న 3.
పాఠం మొత్తాన్ని చదువండి. పాఠంలో ఉన్న జాతీయాలను గుర్తించి రాయండి.
జవాబు:
పాఠంలో జాతీయాలు:

  1. శ్రీరామరక్ష
  2. గీటురాయి
  3. స్వస్తివాచకం
  4. కారాలు మిరియాలు నూరడం
  5. రూపుమాపడం
  6. ముప్పిరిగొను
  7. ఉక్కిరిబిక్కిరైపోవు
  8. వీసం ఎత్తు
  9. ఒడ్డూ పొడుగూ
  10. నిత్య నైమిత్తికం
  11. కంచుగోడలు
  12. కొరుకుడుపడని
  13. జోహారులర్పించు
  14. ప్రాతఃస్మరణీయులు
  15. మార్గదర్శకులు
  16. స్వస్తివాచకం
  17. ఆరునూరుగు
  18. చీల్చిచెండాడు
  19. అతిశయోక్తి
  20. ఒడుదుడుకులు.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 4.
కింది గద్యాన్ని చదువండి.

క్లిష్టపరిస్థితుల్లో రాజ్యాధికారం చేపట్టిన రుద్రమ నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనా, పరిపాలనా నిర్వహణలో మంచి సమర్థురాలుగా పేరొందింది. స్త్రీలు రాజ్యాధికారం చేపట్టడం అరుదైన ఆ కాలంలో రుద్రమాంబ తన తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయక వీరనారిగా చరిత్రలో నిలిచింది.

స్త్రీ అయినప్పటికి పురుషవేషం, పురుషనామం ధరించి సమకాలీన రాజులందరికంటే మిన్నగా రాజ్యాన్ని పరిపాలించి సాహసవంతమైన జీవితాన్ని గడిపింది. గ్రామాలను దానంచేసి ఆదాయంతో విద్యార్థులకు పాఠశాలలు, ఉచిత వసతిగృహాలు నెలకొల్పింది. ఆరోగ్యశాలలు, ప్రసూతి శాలలు ఏర్పాటు చేసింది.

ఒక విద్యాపీఠం స్థాపించి అందులో వేదాలను, సాహిత్యాన్ని, ఆగమవ్యాఖ్యానాలను బోధింపజేసేది. పాఠశాలల్లో ఉపాధ్యాయులను, గ్రామాల్లో కరణాలను నియమించి వారికి వస్తువాహనాలను, ధాన్యాన్ని సమకూర్చేది. మార్కోపోలో అనే విదేశీ యాత్రికుడు ఈమె పరిపాలనా దక్షత, సాహిత్యసేవ, శిల్పకళలు, మహదైశ్వర్యం గురించి ప్రశంసిస్తూ తన’ డైరీలో రాసుకున్నాడు. అదీ రుద్రమదేవి ఘనత.

కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) రుద్రమాంబపై ఆమె తండ్రి ఉంచిన నమ్మకమేమిటి ?
జవాబు:
రుద్రమాంబ స్త్రీ మూర్తి అయినా, ఆమె రాజ్యాధికారం చేపట్టి, చక్కగా పరిపాలించగలదని, రుద్రమాంబపై ఆమె తండ్రి నమ్మకం పెట్టుకున్నాడు.

ఆ) రుద్రమాంబ చేసిన సత్కార్యాలేవి ?
జవాబు:
రుద్రమాంబ గ్రామాలను దానంచేసి, ఆ ఆదాయంతో విద్యార్థులకు పాఠశాలలు, వసతిగృహాలు నెలకొల్పింది. ఆరోగ్యశాలలు, ప్రసూతిశాలలు ఏర్పాటు చేసింది. విద్యాపీఠం నెలకొల్పి, వేదాలను, సాహిత్యాన్ని, ఆగమాలను బోధింపజేసింది. కరణాలనూ, ఉపాధ్యాయులనూ నియమించింది.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ఇ) మార్కోపోలో ఏయే అంశాల్లో రుద్రమదేవిని పొగిడాడు ?
జవాబు:
మార్కోపోలో రుద్రమదేవి యొక్క

  1. పరిపాలనా దక్షత
  2. సాహిత్యసేవ
  3. శిల్పకళలు
  4. మహదైశ్వర్యం అనే విషయాలను గురించి పొగిడాడు.

ఈ) రుద్రమదేవి సమర్థత ఏమిటి ?
జవాబు:
రుద్రమదేవి క్లిష్టపరిస్థితిలో రాజ్యాధికారం చేపట్టి, నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనా, పరిపాలనా నిర్వహణలో మంచి సమర్థత కలిగి ఉండేది.

ఉ) ఈ గద్యం ద్వారా రుద్రమదేవి వ్యక్తిత్వాన్ని ఒక వాక్యంలో రాయండి.
జవాబు:
రుద్రమదేవి పాలనాదక్షత

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) బూర్గుల – పి.వి. గార్ల సంబంధం గురుశిష్య సంబంధం లాంటిది. దీన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
పి.వి. నరసింహారావుగారు, బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గర, అందరికంటే జూనియర్ న్యాయవాదిగా శిక్షణ పొందేవారు. తల్లి, చిన్న పిల్లవానిపై మమకారం ఎక్కువగా చూపించే విధంగానే, బూర్గుల వారు, పి.వి. గారిపై విశేష మమకారం చూపించేవారు. పి.వి. గారు చొరవగా బూర్గుల వారి ఆఫీసుకు వెళ్ళి, జూనియర్లకు లొంగని చిక్కుకేసులను చదివేవారు. అది చూసిన బూర్గులవారి సీనియర్ గుమస్తా, పి.వి. గారిపై కోపపడేవాడు.

అది చూసిన బూర్గులవారు, పి.వి. గార్కి కేసులు చదవడానికి అనుమతి ఇచ్చారు. అంతేగాక, పి.వి. గారితో కేసుల గురించి స్వయంగా తాను చర్చించేవారు. దానితో పి.వి. గారు తన శక్తిసామర్థ్యాలను గుర్తించి, ఆత్మవిశ్వాసాన్ని పొందారు.

ఈ విధంగా పి.వి. గారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన, బూర్గుల వారు, గురువులుగానూ, పి.వి. గారు శిష్యులుగానూ పేరు పడ్డారు. వారిద్దరి మధ్య గల సంబంధం గురుశిష్య సంబంధం వంటిది.

ఆ) ‘సరే – అవన్నీ ఆటల్లో ఉండేవేగా’ అని బూర్గులవారు అనేవారు కదా! ఏ సందర్భంలో ఎందుకనేవారో దానికిగల కారణాలను రాయండి.
జవాబు:
బూర్గుల రామకృష్ణారావుగారి సామాజిక యాత్ర, ఎప్పుడూ సాఫీగా సాగలేదు. ఆయన అనేక రకాల ఒడుదుడుకులను ఎదుర్కోవలసి వచ్చింది. అనేక సందర్భాల్లో ఆపదలు ఆయనను చుట్టుముట్టాయి. అయినా ఆయన చలించేవారు కాడు. మనః స్థైర్యాన్నీ, సమచిత్తతనూ విడిచిపెట్టేవారు కాడు.

ఆయన విజయానికి పొంగిపోలేదు. కష్టం వస్తే క్రుంగిపోలేదు. ఎవరైనా స్నేహితులు ఆయనకు ద్రోహం తలపెట్టినా, ఆయనకు వ్యతిరేకులు ఆయనను దూషించినా “సరే, అవన్నీ ఆటలో ఉండేవేగా” అని సరిపెట్టుకునేవారు.

ఇ) బూర్గుల వారిని ప్రాతఃస్మరణీయులని పి.వి. నరసింహారావుగారు పేర్కొనడాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
‘బూర్గుల రామకృష్ణారావుగారు ప్రాతఃస్మరణీయులు’ అని పి.వి. నరసింహారావుగారు రాశారు. ప్రాతఃస్మరణీయులంటే నిద్ర నుండి లేవగానే స్మరించుకోవలసిన దైవస్వరూపుడు అని అర్థము.

పి.వి. గారు బూర్గులవారి వద్ద జూనియర్ న్యాయవాదిగా ఉండేవారు. పి.వి. గారు, బూర్గులవారి ఆఫీసులోకి వెళ్ళి, జూనియర్లకు లొంగని చిక్కు కేసుల ఫైళ్ళను తీసి, చదువుతూ ఉండేవారు. పి.వి. చూపించే చొరవ, అక్కడ ఉన్న బూర్గుల వారి సీనియర్ గుమాస్తాకు కోపం తెప్పించింది.

ఒకసారి బూర్గులవారు దానిని గమనించి, పి.వి. గారు తన ఫైళ్ళు చూడడానికి అంగీకరించారు. అంతేగాక పి.వి. గారితో కేసుల గురించి స్వయంగా చర్చించేవారు. పి.వి. గారిలో శక్తి సామర్థ్యాలున్నాయని ఈ విధంగా పి.వి. గారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించారు. ఆ ఆత్మవిశ్వాసం, పి.వి. గారికి శ్రీరామరక్ష అయ్యింది. అందుకే పి.వి. గారు, బూర్గుల వారిని ప్రాతఃస్మరణీయులు అని రాశారు.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 2.
కింది ప్రశ్నలకు పడేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) బూర్గుల వ్యక్తిత్వంలోని మహోన్నత లక్షణాల గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
బూర్గుల వ్యక్తిత్వం – మహోన్నత లక్షణాలు: బూర్గులవారు ఎప్పుడూ అన్ని విషయాలూ, ఆఖరుకు తమలోని లోపాలను సహితం ఉన్నవి ఉన్నట్లు చెప్పేవారు. ఆయన పొట్టిగా ఉండేవారు. కాని ఆయనలో బహుముఖమైన ప్రతిభ ఉండేది. అవసరం అయినప్పుడు దానిని మహోన్నతరూపంలో వారు కనబరచేవారు. అవసరం లేనప్పుడు అది ఆయనలో ఇమిడి పోయేది.

న్యాయవాదిగా, బూర్గులవారు విశేషప్రతిభతో, ఎదుటి న్యాయవాదుల వాదనలకు ఎదురొడ్డి నిలిచేవారు. ఆయనలో సునిశిత మేధాసంపత్తి ఉండేది. బూర్గులవారు తమ జూనియర్ న్యాయవాదులను బాగా ప్రోత్సహించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవారు. బూర్గులవారు ప్రాతఃస్మరణీయులు.

బూర్గులవారు కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులు అయ్యారు. బూర్గులవారు, రాజనీతి విశారదులు. బూర్గులవారు ఏ నిర్ణయం తీసుకున్నా, అన్ని విధాలైన జాగ్రత్తలతోనూ, మంచి వ్యవహార దక్షతతోనూ తీసుకొనేవారు. బూర్గులవారు మతాతీత స్థితిని పాటించేవారు. వీరిది విశిష్టమైన వ్యక్తిత్వం. బూర్గులవారు మంచి పార్లమెంటేరియన్. ఈయన బహుభాషావేత్త. ఈయన మంచి ఉపకారశీలి. ఈయన సంతోషానికి పొంగలేదు. కష్టాలకు క్రుంగలేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే, బూర్గులవారు “పూర్ణపురుషులు”, బహుముఖ ప్రజ్ఞగలవారు. ప్రధానంగా వీరు సాహితీ జగత్తుకు చెందినవారు.

(లేదా)

ఆ) ఈ పాఠం ఆధారంగా “గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్పూర్తి గొప్పగా ఉంటుంది” అనే అంశం గురించి, సమర్థిస్తూ రాయండి.
జవాబు:
‘గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి కూడా గొప్పగానే ఉంటుంది’ అన్నమాట నిజం.
బూర్గుల రామకృష్ణారావుగారు మహోన్నత వ్యక్తి. వారిది విశిష్ట వ్యక్తిత్వం. విశాల వ్యక్తిత్వం. ఈయన పూర్ణపురుషుడు. బూర్గులవారి సాంగత్యం, శ్రీ పి.వి. నరసింహారావుగారికి మంచి స్ఫూర్తి నిచ్చింది. బూర్గులవారి వద్ద శ్రీ పి.వి. గారు జూనియర్ లాయర్గా పనిచేసేవారు.

బూర్గులవారు లాయర్ కేసు తీసుకొనేటప్పుడే, ఆ కేసు తాలూకు ఫైలుపై రేఖామాత్రంగా, నోటు వ్రాసి పెట్టుకొనేవారు, ఆ నోటు ఆధారంగానే వారు కోర్టులో ఎదుటి న్యాయవాదుల వాదనలను గట్టిగా అడ్డుకొనేవారు. బూర్గులవారి మేధాసంపత్తినీ, ఆ వాదనాపటిమనూ దగ్గరగా చూసిన పి.వి. గారికి మంచి స్ఫూర్తి కలిగింది.

పి.వి. గారు బూర్గులవారి వద్ద అందరికంటే జూనియర్ లాయరుగా ఉండేవారు. బూర్గులవారు, పి.వి. గారిని ఆదరంగా చూసేవారు. దానితో పి.వి. గారు చొరవగా బూర్గులవారి ఆఫీసులోకి వెళ్ళి, తనకు కావలసిన కేసులను, ముఖ్యంగా జూనియర్లకు కష్టమైన చిక్కు కేసుల ఫైళ్ళను ఏరుకొని చదివేవారు. పి.వి. గారి ఆ చొరవకు అక్కడి సీనియర్ గుమాస్తా కోపపడేవాడు.

కాని బూర్గులవారు పి.వి. గారు తన ఫైళ్ళు చూడ్డానికి అంగీకరించారు. అంతేకాక కేసుల గురించి పి.వి. గారితో బూర్గులవారు సమాన స్థాయిలో చర్చించేవారు. దానితో పి.వి. గారు తనలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, ఆత్మవిశ్వాసాన్ని పొందారు.

పి.వి. గారికి ఆ ఆత్మవిశ్వాసం, శాసనసభల్లోనూ, ఇతర స్థలాల్లోనూ శ్రీరామరక్షగా పనిచేసింది. ఈ విధంగా గొప్పవారైన బూర్గులవారి సాంగత్యం, పి.వి. గారికి మంచి స్ఫూర్తి నిచ్చింది.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) పాఠంలోని పదజాలం, విశిష్ట లక్షణాల ఆధారంగా ఒక కవిత రాయండి.
జవాబు:
“పూర్ణపురుషుడు బూర్గుల రామకృష్ణారావు”
“రామకృష్ణారావు మహాశయా! ఓ పూర్ణపురుషా!
నీవు నా పాలిటి ప్రాతఃస్మరణీయుడవు.
నీ పేరు వింటే, గత స్మృతులతో ఉక్కిరిబిక్కిరౌతాను.
నీ చదువూ, మంత్రి పదవులూ, గవర్నరు గిరీలూ
కమిటీ అధ్యక్షతలూ – నీ వ్యక్తిత్వ ప్రతిబింబాలు కానేకావు.

నీ గురించి నీవు వీసం ఎత్తు ఎక్కువ తక్కువలు చెప్పవు.
నీవు నిజంగా వామనుడైన విరాట్ స్వరూపుడివి,
నీ వ్యక్తిత్వపు మహోన్నత శిఖరం, అనన్య దర్శనీయం
న్యాయవాదిగా నీ ప్రజ్ఞాప్రాభవాలు, శక్తి సామర్థ్యాలూ

సునిశిత మేధా సంపత్తీ – జాజ్వల్యమాన ప్రతిభా
అనన్య వాదనాపటిమా – అద్భుతం, మహాద్భుతం.
నీవు నాలో నింపిన ఆత్మవిశ్వాసం, నా కదే శ్రీరామరక్ష.
నీ విశిష్ట వ్యక్తిత్వానికి ఇవే నా జోహార్లు

నీవు సామ్యవాదవ్యవస్థకు మార్గదర్శకుడవు.
రాజకీయాలలో నీ సమ్యక్ దృష్టి, ప్రశంసనీయం
మత దురభిమాని నిజాం, నీకు బద్ధ శత్రువు, కానీ
కుచ్చుటోపీల మౌల్వీలూ, గడ్డాల ముల్లాలూ నీ వాళ్ళే

మతాతీత స్థితి, నీ విశాల వ్యక్తిత్వం
నీవు బహు భాషావేత్తవు, ఉపకారశీలివి, ఉదారుడవు.
కించిత్తూ చలించవు కష్టసుఖాల రాకలకు
నీ గురించి చెప్పాలంటే అది నా వల్ల ఔతుందా ?
కానేకాదు. నీవు నిజంగా “పూర్ణపురుషుడవు”.

(లేదా)

ఆ) ఈ పాఠం ఓ అభినందన పత్రంగా ఉంది కదూ! దీన్ని ఆధారంగా మీకు నచ్చిన గొప్ప వ్యక్తిని గురించి అభినందన వ్యాసం రాయండి.
జవాబు:
సరస్వతీ మూర్తీ!

మాకు నచ్చిన గొప్ప వ్యక్తి “ఉత్తమోపాధ్యాయుడు” దువ్వూరి సోమయాజులు గార్కి విద్యార్థులు సమర్పించిన సన్మానపత్రం.

ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయునిగా మిమ్ము నిర్ణయించి గౌరవించిన సందర్భంగా మీ శిష్యులమైన మేము మీకూ, ప్రభుత్వానికీ, శతకోటి వందనాలు అర్పిస్తున్నాం. మీరు బహుభాషావేత్తలు. సంస్కృతాంధ్రభాషల్లో మీకు గల శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞాప్రాభవాలు ప్రశంసనీయాలు. మీ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, మాకు ఉపాధ్యాయుడిగా ఉండడం మాకు గర్వకారణం.

సౌజన్యమూర్తీ!
మీరు మా విద్యార్థులను మీ కన్నబిడ్డవలె ప్రేమగా చూస్తారు. మీరు మతాతీత స్థితిని పాటిస్తారు. మీకు కులమతాల పట్టింపులు లేవు. ధనిక బీద తారతమ్యం లేదు. మీ విశాల వ్యక్తిత్వం, విశిష్ట వ్యక్తిత్వం, సౌజన్యం మరెక్కడా కనబడదు. అందుకే మీరు ఉత్తమోపాధ్యాయులు అయ్యారని మా విశ్వాసం.

మార్గదర్శీ!
మీరు మాలో గల శక్తి సామర్థ్యాలను వెలికితీసి, మెరుగుపెట్టి, మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అందుకే మాకు ఎన్నో మంచి మార్కులు, బహుమతులు వస్తున్నాయి. మీ సునిశిత మేధాసంపత్తి, జాజ్వల్యమాన ప్రతిభ ఆధారంగా మమ్మల్ని ఉత్తమ విద్యార్థులుగా మీరు తీర్చిదిద్దుతున్నారు. మీరు మా కందించే ప్రోత్సాహమే, మాకు శ్రీరామరక్ష. మీరు మాకు ప్రాతఃస్మరణీయులు.

మీకు పరమేశ్వరుడు ఆయురారోగ్య భాగ్యాలను ఇచ్చి, మా వంటి ఎందరో విద్యార్థినీ, విద్యార్థులను సాహితీ సంపన్నులుగా తయారుచేసేందుకు మీకు తోడ్పడాలని, మేము దైవాన్ని కోరుతున్నాం.

ఇట్లు,
పదజాలం

X X X X X X
హైదరాబాద్.

III. భాషాంశాలు

పదజాలం

1. కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.

అ) చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు ముప్పిరిగొంటున్నాయి.
జవాబు:
ముప్పిరి = చుట్టుముట్టాయి (అతిశయించాయి.)

ఆ) వీసం ఎత్తు అహంకారం లేకుండా ముందుకెళ్ళాలి.
జవాబు:
వీసం ఎత్తు : 1/16 వ వంతు

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ఇ) దశరథుని కడగొట్టు బిడ్డడు శత్రుఘ్నుడు.
జవాబు:
కడగొట్టు = కట్టకడపటి ; చివరి

ఈ) భారతదేశ ప్రాభవాన్ని మనమంతా పెంచాలి.
జవాబు:
ప్రాభవాన్ని = శ్రేష్ఠత్వాన్ని

ఉ) మనదేశ ప్రజలకు వివేకానందుడు ప్రాతః స్మరణీయుడు.
జవాబు:
ప్రాతఃస్మరణీయుడు = నిద్ర నుండి లేవగానే స్మరించుకోవలసిన దైవస్వరూపులు.

ఊ) హితైషి చెప్పిన మాటలను పెడచెవిన పెట్టవద్దు.
జవాబు:
హితైషి = మేలును కోరేవాడు.

2) కింది జాతీయాలను మీ సొంతవాక్యాలలో ప్రయోగించండి.

అ) శ్రీరామరక్ష = పరిరక్షించగలిగినది, సర్వరక్షకం
జవాబు:
వాక్యప్రయోగం : నెహ్రూజీ మొదటి ప్రధానమంత్రి కావడం, మన భారతదేశానికి శ్రీరామరక్ష అయ్యింది.

ఆ) గీటురాయి = కొలబద్ద, ప్రమాణం
జవాబు:
వాక్యప్రయోగం : మంత్రిగారు మెచ్చుకోడం, నా తమ్ముని ప్రతిభకు గీటురాయి అని చెప్పాలి.

ఇ) రూపుమాపడం = శాశ్వతంగా తొలగించడం
జవాబు:
వాక్యప్రయోగం : వీరేశలింగంగారు నాటి సంఘంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషిచేశారు.

ఈ) కారాలు మిరియాలు నూరడం = మండిపడడం, మిక్కిలి కోపగించడం
జవాబు:
వాక్యప్రయోగం : నా తమ్ముడు తప్పుచేస్తే, మా నాన్నగారు కారాలు మిరియాలు నూరుతారు.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ఉ) స్వస్తివాచకం = ముగింపు, వదలివేయు
జవాబు:
వాక్యప్రయోగం : విద్యార్థులు చదువుకోసం పూర్తిగా ఆటలకు స్వస్తివాచకం చెప్పకూడదు.

3. కింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించండి.

అ) రైతులు ప్రతివర్షం పంటలను పండిస్తూ సాలుకొకసారి వచ్చిన ధనంతో సంవత్సరమంతా నడుపుతారు.
జవాబు:
పర్యాయపదాలు :

  1. వర్షం
  2. సాలు
  3. సంవత్సరం

ఆ) భూమిపై కాలుష్యం పెరుగుట వల్ల, ధరిత్రి మీద ఉండే జనం విలవిలలాడుతూ అవనిపై మేము జీవించలేమని అంటున్నారు.
జవాబు:
పర్యాయపదాలు :

  1. భూమి
  2. ధరిత్రి
  3. అవని.

ఇ) ఒక వ్యక్తి దక్షతతో పనిచేస్తే, ఆ సామర్థ్యం అందరికీ తెలుస్తుంది.
జవాబు:
పర్యాయపదాలు :

  1. దక్షత
  2. సామర్థ్యం

4. కింది ‘వికృతి’ పదాలకు పాఠంలో ఉన్న ‘ప్రకృతి’ పదాలను వెతికి రాయండి.

అ) దవ్వు
జవాబు:
దవ్వు (వికృతి)

  1. దూరము
  2. దవీయము (ప్రకృతి)

ఆ) గారవం
జవాబు:
గారవం (వికృతి) – గౌరవం (ప్రకృతి)

ఇ) పగ్గె / పగ్గియ
జవాబు:
పల్లె / పగ్గియ (వికృతి) – ప్రజ్ఞ (ప్రకృతి)

ఈ) దోసం
జవాబు:
దోసం (వికృతి) – దోషం (ప్రకృతి)

ఉ) రాతిరి
జవాబు:
రాతిరి (వికృతి) – రాత్రి (ప్రకృతి)

ఊ) బాస
జవాబు:
బాస (వికృతి) – భాష (ప్రకృతి)

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

5. ప్రతి వృత్తికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయని పాఠం ద్వారా తెలుసుకున్నారు కదా! మీకు తెలిసిన కొన్ని వృత్తులు, వాటికున్న ప్రత్యేక లక్షణాలకు సంబంధించిన పదాలను పట్టిక రూపంలో రాయండి.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 3
జవాబు:
TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 4

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలను విడదీసి సంధులను గుర్తించండి.

అ) హైదరాబాద్ లోని విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటి.
జవాబు:
విమానాశ్రయం : విమాన + ఆశ్రయం = సవర్ణదీర్ఘ సంధి

ఆ) చిన్నప్పటి విషయాలు జ్ఞాపకముండడం చాలా అరుదు.
జవాబు:
జ్ఞాపకముండడం : జ్ఞాపకము + ఉండడం ఉత్వసంధి

ఇ) ప్రతి జీవికి ఒక్కో శరీరాకృతి ఉంటుంది.
జవాబు:
శరీరాకృతి : శరీర + ఆకృతి = సవర్ణదీర్ఘ సంధి

ఈ) అబ్దుల్ కలాం మహోన్నత వ్యక్తిత్వం కలవాడు.
జవాబు:
మహోన్నత : మహా + ఉన్నత = గుణసంధి

ఉ) నా జీవితాన్నంతా దేశసేవకే వినియోగించాలనుకుంటున్నాను.
జవాబు:
జీవితాన్నంతా : జీవితాన్ని + అంతా

ఊ) మాధవి చెప్పినప్పటికీ రమ వినలేదు.
జవాబు:
చెప్పినప్పటికీ : చెప్పిన + అప్పటికీ = అత్వసంధి

ఋ) ఒక్కొక్కప్పుడు ముఖ్యమైన విషయాలు జ్ఞప్తికి రావు.
జవాబు:
ఒక్కొక్క : ఒక + ఒక = ఆమ్రేడిత సంధి

2. కింది సమాస పదాల్లోని తత్పురుష భేదాలను గుర్తించి, విగ్రహవాక్యాలు రాయండి. సమాస నిర్ణయం చేయండి.

ఉదా : – సత్యదూరము – సమాస పదం – షష్ఠీ తత్పురుష సమాసం

సమాసపదం – విగ్రహకవాక్యం – సమాసం పేరు

అ) అమెరికా రాయబారి – అమెరికా యొక్క రాయబారి – షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) వాదనాపటిమ – వాదనయందు పటిమ – సప్తమీ తత్పురుష సమాసం
ఇ) అసాధ్యం – సాధ్యము కానిది – నఞ తత్పురుష సమాసం
ఈ) నెలతాల్పు – నెలను ధరించినవాడు – ద్వితీయా తత్పురుష సమాసం
ఉ) గురుదక్షిణ – గురువు కొఱకు దక్షిణ – చతుర్థీ తత్పురుష సమాసం
ఊ) వయోవృద్ధుడు – వయస్సు చేత వృద్ధుడు – తృతీయా తత్పురుష సమాసం
ఋ) దొంగభయము – దొంగవలన భయము – పంచమీ తత్పురుష సమాసం
ౠ) రెండు రాష్ట్రాలు – రెండైన రాష్ట్రాలు – ద్విగు సమాసం
ఎ) శక్తిసామర్ధ్యాలు – శక్తియు, సామర్ధ్యమును – ద్వంద్వ సమాసం
ఏ) అమూల్యసమయం – అమూల్యమైన సమయం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఐ) పూర్ణపురుషులు – పూర్ణులైన పురుషులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఒ) ప్రాచీనకావ్యాలు – ప్రాచీనములైన కావ్యాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఓ) పెద్దకుటుంబం – పెద్దదైన కుటుంబం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

3. కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.

అ) పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు.
పర్షియన్ భాషను చదివాడు.
ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు.
జవాబు:
పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరి, పర్షియన్ భాషను చదివి, ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. (సంక్లిష్ట వాక్యం)

ఆ) బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కు నిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారుచేశాడు.
బూర్గుల సామ్యవాద వ్యవస్థకు పునాది వేశాడు.
బూర్గుల అజరామర కీర్తిని పొందాడు.
జవాబు:
బూర్గుల హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు పునాదివేసి, అజరామరకీర్తిని పొందాడు. (సంక్లిష్ట వాక్యం)

ప్రాజెక్టు పని

మహోన్నత వ్యక్తిత్వంతో, పరిపాలనాదక్షతతో సేవచేసిన వారి వివరాలు సేకరించండి. నివేదిక రూపొందించండి. తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 5

పదాలు – అర్థాలు

I

16వ పేజి

స్వర్గీయులు = స్వర్గాన్ని చేరిన వారు (మరణించిన వారు)
వర్ధంతి = “మరణించిన రోజు”, అనే అర్థంలో ఈ పదం వాడబడుతోంది.
మిత్రులు = స్నేహితులు
స్మృతులు = తలంపులు, జ్ఞాపకాలు
ముప్పిరిగొని = చుట్టుకొని, అతిశయించి
భావోద్రేకంతో
(భావ + ఉద్రేకంతో) = ఉద్రేకంతో కూడిన భావాలతో
ఉక్కిరి బిక్కిరైపోవు = ఊపిరి ఆడకపోవు; (విశ్రాంతి లేకపోవు)
రేఖామాత్రంగా = గీత వలె (కొద్దిగా)
పొందుపరుస్తాను = ఉంచుతాను (రాస్తాను)
పర్షియన్ భాష = పర్షియా భాష
ఐచ్ఛిక విషయం = స్వేచ్ఛా విషయం
పట్టభద్రులయ్యారు = డిగ్రీ పట్టా తీసికొన్నారు (బి.ఏ. పాసయ్యారు)
ట్యూటరు (Tutor) = ఉపన్యాసకునికి తోడుగా పనిచేసే గురువు (Private Teacher)
న్యాయవాద పట్టా = లా డిగ్రీ (Law Degree)
నమోదు అయ్యారు = రిజిష్టరు చేసుకున్నారు
కన్ను మూశారు = మరణించారు.
అవగతం కాదు ‘= అర్థం కాదు

17వ పేజి..

ఘనంగా = గొప్పగా
చిత్రించుకొనే = వర్ణించి చెప్పుకొనే
అంతరాత్మ (అంతః + ఆత్మ) = హృదయం
కృత్రిమ ఘనతను = తెచ్చిపెట్టుకొన్న గొప్పతనాన్ని
ప్రదర్శించి = చూపించి (కనబరచి)
ఉబలాటం = తీవ్రమైన కోరిక
పెనుగులాట = గ్రుద్దులాట
తత్ఫలితంగా = దానికి ఫలితంగా
కించపరుచుకొంటూ = తక్కువ చేసికొంటూ
అమూల్య సమయాన్ని = విలువకట్టలేని గొప్ప కాలాన్ని
వ్యర్థపరచుకుంటూ = వ్యర్థం చేసికొంటూ
అరుదుగా = అపురూపంగా (మిక్కిలి తక్కువగా)
మినహాయింపు = విడిచిపెట్టడం (Exemption)

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

వీసం ఎత్తు = వీసం ఎత్తు బరువు (రూపాయిలో 16వ వంతు బరువు)
మరుగుపరుస్తూ ఉండేది = కప్పిపెడుతూ ఉండేవి
సత్యదూరం = అసత్యం (సత్యం కానిది)
భావన = తలంపు
ఒడ్డూ, పొడుగూ = వెడల్పు, పొడుగు (ఒడ్డు = వెడల్పు)
వామనరూపాన్ని = వామనమూర్తివలె పొట్టి రూపాన్ని
స్నేహపూరితమైన = స్నేహంతో నిండిన
పరిహాసాలను = ఎగతాళులను (వేళాకోళాలను)
భావ నిర్లిప్తతతో = భావము యొక్క తగులపాటు లేకుండా (పట్టించుకోకుండా)
లోగడ = పూర్వం
అసాధారణ పొడగరితనం = సాధారణంగా ఉండని పొడుగుదనం
మరుగుపరచలేదు = కప్పిపెట్టలేదు
విమానాశ్రయం
(విమాన + ఆశ్రయం) = విమానాలు ఆగేచోటు
పుష్పమాలాలంకృతునిగా
(పుష్పమాలా + అలంకృతునిగా) = పూలదండతో అలంకరింపబడిన వానిగా
అతిథి = ముందు తెలియజేయకుండా భోజన సమయానికి వచ్చే వాడు
ఆతిథేయులు = అతిథికి సత్కారం చేసే వారు (గృహస్థులు)
ఇర్వురు = ఇద్దరూ
సరస్పర, సౌజన్య, సౌహార్దాలు = ఒకరికొకరియందు; మంచితనమూ, స్నేహమూ
ఫీటు (Feat) = సాహసకృత్యం
వినోదకర దృశ్యం = వేడుకను ఇచ్చే దృశ్యం
కళానైపుణ్యానికి = కళలో నేర్పరిదనానికి
గీటురాయి = ప్రమాణం
చేకూర్చింది = సిద్ధింపచేసింది

II

17వ పేజి

విరాట్రూపం = ఆదిపురుషుని బ్రహ్మాండ స్వరూపం; (పెద్ద ఆకారం)
శరీరాకృతి (శరీర + ఆకృతి) = శరీరం యొక్క ఆకారము
గహనమైనది
(గహనము + ఐనది) = ఎరుగరానిది
వ్యక్తిత్వం = వ్యక్తి స్వభావం
నిత్య నైమిత్తికంగా (Routine) = వాడుకగా (నియమిత చర్యగా)
వామనమూర్తి వలె = వామనుని వలె (వామనావతారంలో విష్ణువువలె పొట్టిగా)
ముల్లోకాలు
(మూడు + లోకాలు) = స్వర్గ, మర్త్య, పాతాళలోకాలు
ఆక్రమించి = ఆక్రమణం చేసి (వ్యాపించి)
ప్రదర్శించేవారు = వెల్లడించే వారు
ఇమిడిపోతూ = లీనమవుతూ (కలిసిపోతూ)
నిరాడంబరంగా = ఆడంబరం లేకుండా
తెరమరుగున = తెరచాటున (వెనుక)
బహుముఖ ప్రతిభాయుత మూర్తిమత్వం = అనేక విధాలైన తెలివి తేటలతో కూడిన రూపాన్ని కల్గి యుండడం
మహోన్నతరూపం
(మహా + ఉన్నతరూపం) = మిక్కిలి గొప్ప రూపం
వ్యక్తిత్వపు, మహోన్నత శిఖరాలు (వ్యక్తిత్వము + మహోన్నత శిఖరాలు) = స్వభావము యొక్క మిక్కిలి గొప్ప, విశిష్టతలు
అగాధపులోతులలోనే
(అగాధము + లోతులలోనే) = తెలియశక్యంకాని లోతులలో
పరిలక్షితమౌతుంది
(పరిలక్షితము + ఔతుంది) = బాగా సూచింపబడుతుంది. (వెల్లడి అవుతుంది)

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

18వ పేజి

న్యాయవాది (Advocate) = ప్లీడరు
ప్రాక్టీస్ (Practice) = అనుభవం
Roaring Practice = ఎక్కువ ప్రాక్టీసు
ప్రజాహిత జీవితం = ప్రజలకు మేలు కలిగించే జీవితం
ఫైలు పెరుగుట = హోదా పెరగడం (File)
ఉపకరిస్తే = సాయపడితే
తారుమారైంది = తిరగబడింది
క్లయింట్లు (Clients) = లాయర్లకు వ్యాజ్యాలు ఇచ్చేవారు
మిశ్రిత భావం = కలగాపులగమైన భావన
ప్రజ్ఞా ప్రాభవాలు = తెలివియు, గొప్పతనమును
సంపూర్ణ విశ్వాసానికి = పరిపూర్తి అయిన నమ్మకానికి
తోడు = సహాయం
రాజకీయ వ్యగ్రత = రాజకీయాలలోని తొందర తనం
ధ్యానము = మనస్సు యొక్క ఏకాగ్రత
క్షుణ్ణంగా చదివి = బాగా చదివి
చేపట్టేటప్పుడే = తీసుకొనేటప్పుడే (స్వీకరించేటప్పుడే)
ఫైలు (File) = దొంతి (కాగితాలు వరుసగా పెట్టుకొనే అట్ట)
అస్పష్టమైన = స్పష్టంకాని
నోట్సులు (Notes) = వివరణలు
రేఖామాత్రంగా = కొద్దిగా
జాజ్వల్యమానమైన = ప్రకాశించే
వాదనాఘాతములకు = వాదనలనే దెబ్బలకు
దుర్భేద్యమైన = భేదింప శక్యం కానిదైన
నిలపడం = నిలబెట్టడం
నిష్ణాతమైన = నేర్పు కలదైన
సునిశిత మేధాసంపత్తి = మిక్కిలి పదునైన బుద్ధిసంపద
ప్రదర్శిస్తున్నారు = చూపిస్తున్నారు
అనన్యమైన = ఇతరులకులేనట్టి
వాదనాపటిమ = వాదించడంలో సామర్థ్యం
ప్రోత్సాహం (ప్ర+ఉత్సాహం) = మిక్కిలి ఉత్సాహం
ప్రత్యేక తరహా = ప్రత్యేక విధం
జూనియర్ (Junior) = చిన్న
కడగొట్టు బిడ్డ = చివరి బిడ్డ
విశేష, మమకారం = అధికమైన, అభిమానం
చొరవతో = సాహసంతో
నిరాఘాటంగా = అడ్డులేకుండా
ఆఫీసును (Office) = కార్యాలయాన్ని
కాఫీ పానశాల(Coffee Hotel) = కాఫీ త్రాగేశాల
పరిగణించి = లెక్కించి (ఎన్నుకొని)
కొరుకుడుపడని = కొరకడానికి వీలుపడని (అర్థంకాని, కష్టమైన)
ఏరుకొని = ఏరి తీసుకొని (తీసుకొని)
కారాలు మిరియాలు నూరుతూ = కోపగిస్తూ
చేష్ట = నడవడి (కార్యం)
ఆమోదముద్ర = అంగీకారముద్ర
ప్రకరణం = ఒక విషయాన్ని బోధించే గ్రంథ భాగం
ముగియడం = ముగింపు
నిష్కాపట్యంతో = కపటం లేకుండా
సమానస్థాయి = సమానమైన స్థితి
చర్చా సంబంధం = చర్చకు సంబంధం
రూపొందించిన = ఏర్పరచిన
జోహారులు = నమస్కారాలు
అర్పిస్తూనే ఉంటాను = సమర్పిస్తూనే ఉంటాను
పూరించిన = నింపిన
ఆత్మవిశ్వాసమే = తన శక్తి యందు నమ్మకం కల్గియుండడమే
శాసనసభలు = చట్టసభలు
శ్రీరామరక్ష = సర్వరక్షకం
ప్రాతఃస్మరణీయులు = తెల్లవారు జాముననే తలంపవలసిన వారు (దేవుని వంటివారు)
విశిష్ట వ్యక్తిత్వము = మిక్కిలి శ్రేష్ఠమైన వ్యక్తిత్వం
అట్టిది = అటువంటిది
సమ్యక్ దృష్టికోణం = సరియైన చూపు
సంకుచితం = ముడుచుకున్నది
సైద్ధాంతిక అరలు = సిద్ధాంతానికి చెందిన భాగములు.
తావు = స్థానం
జాగీర్దార్ = నవాబుల వలన శౌర్యాదులకై మాన్యాలు పొందినవాడు
జాగీర్దారీ వ్యవస్థ = జాగీర్దారుల ఏర్పాటు
రూపుమాపడానికి = నశింపజేయడానికి (తీసివేయడానికి)
స్నేహకోటి = స్నేహితుల సమూహం
భూస్వాములు భూములు ఎక్కువగా గలవారు (భూకామందులు)
కౌలుదారీ చట్టాన్ని = భూమి యజమాని, సేద్యం చేసే రైతులకు ఇచ్చే హక్కుల చట్టాన్ని
సామ్యవాద వ్యవస్థ = ప్రజలందరికీ సమానమైన అధికారాలూ, భోగభాగ్యాలూ కలగాలని కోరే ఏర్పాటు
మార్గదర్శకులు = మార్గాన్ని చూపించేవారు
ఎంపిక చేసిన = ఎన్నుకొన్న
భూకామందులు = భూస్వాములు
రాజకీయసహచరులు = రాజకీయాల్లో వెంట తిరిగే స్నేహితులు

19వ పేజి

సంస్థానవిచ్ఛిత్తి = సంస్థానాల నాశనం
రాజకీయ ప్రాబల్యానికి = మంచి సమర్థత పొందడానికి
స్వస్తివాచకం పలుకు = ముగించు
మేలు చేకూర్చే = ఉపకారాన్ని చేసే
ఆత్మపరిత్యాగానికి = మనస్సును పూర్తిగా విడిచి వేయడానికి (మనఃపూర్వకం కాని దానికి)
సక్రియ రాజకీయాల నుండి = క్రియాశీలమైన రాజకీయాల నుండి
నిష్క్రమణకు = వెడలిపోడానికి (తప్పుకోడానికి)
అంకితం చేసుకొనే = సంపూర్తిగా సమర్పించుకొనే
రాజనీతి విశారదులు = రాజనీతి పండితులు
బహు అరుదు = మిక్కిలి తక్కువ
‘వ్యవహార దక్షత = వ్యవహార సామర్థ్యం
ఆరునూరైనా = ఏది ఏమయినా
సంక్షిప్త రాజకీయ చరిత్ర = కొద్దిగా చెప్పిన రాజకీయాల చరిత్ర

III

19వ పేజి

సౌజన్యానికి = మంచితనానికి
మారుపేరు = మరోపేరు
ముఖ్యాంశ (ముఖ్య + అంశం) = ముఖ్యవిషయం
గతతరంలోని = పూర్వపుతరంలోని (పూర్వకాలంలోని)
సుగుణాల = మంచిగుణాల
మూర్తిమత్వం = స్వరూపం (personality)
శరాఫత్ = సౌజన్యం (మంచితనం)
మత, దురభిమానం = మతమునందు, పిచ్చి ప్రేమ
పెంపొందిస్తూ = అభివృద్ధిపరుస్తూ
రాజ్యమేలుతున్న = రాజ్యాన్ని పాలిస్తున్న
నాటి నిజాంకు = ఆ రోజుల్లో పాలించే నిజాం రాజుకు
బద్ధవ్యతిరేకి = గట్టి విరోధి
పరమ మిత్రులు = మిక్కిలి స్నేహితులు

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ఆప్తులు = స్నేహితులు
అతినిరాడంబరంగా = మిక్కిలి ఆడంబరం లేకుండా
ఆడంబరం = డంబం
మతాతీతస్థితి (మత + అతీత స్థితి) = మతాన్ని అతిక్రమించిన పరిస్థితిని (మతంతో సంబంధం విడిచిపెట్టడం)
పాటించేవారు = ఆచరించేవారు
డ్రాయింగు రూం
(Drawing Room) = చావడి, (అతిథులు కూర్చుండే గది)
సంస్కృతీ ప్రదర్శనశాల = సంస్కృతిని తెలిపే ఇల్లు
మౌల్వీలు = ముసల్మాను పండితులు
ముల్లాలు = ముస్లిమ్ పండితులు
మహామహోపాధ్యాయులు = గొప్ప వేదశాస్త్ర పండితులు
ఆహ్వానించడానికి = పిలవడానికి
మూడు, విభిన్నతరాల, చివరి, వారధి = మూడు, వేరు వేరు తరాలకు చివరి వంతెన (మూడు తరాల వారినీ కలిపి ఉంచగలవాడు)
తీర్చిదిద్దారు = రూపుదిద్దారు
సునిశిత మేధ = చురుకైన తెలివి (గొప్పతెలివి)
శాసనసభా నాయకులు = చట్టసభలో నాయకులు
పరిమార్జిత భాష = శుద్ధిచేయబడిన భాష (సంస్కరింపబడిన భాష)
మేళవించి = కలిపి
ఉన్నత ప్రమాణాలను = గొప్ప ప్రమాణాలను
స్మరించుకుంటూ = తలచుకుంటూ
ప్రత్యర్థులను = ఎదుటి పక్షం వారిని (వ్యతిరేక పక్షం వారిని)
కన్నీరు బొట్టు = కన్నీటి చుక్క
రవ్వంత (రవ్వ + అంత) = కొద్దిమాత్రం
పార్లమెంటేరియన్ = ప్రజాప్రతినిధి
(Parliamentarian)
(MLA, MP)
అద్వితీయ కళాకౌశలం = సాటిలేని కళలో నేర్పు
బహుభాషావేత్త = అనేక భాషలు తెలిసినవాడు
అభిరుచులు = ఆసక్తులు
ప్రయివేటుగా (Private) = రహస్యంగా
ఆఫీసు ఫైళ్ళు = కార్యాలయపు దస్త్రాలు
సంస్కృత ప్రాచీన కావ్యాలు = సంస్కృత భాషలోని పూర్వపు కవులు వ్రాసిన ‘రఘువంశం’ వంటి గ్రంథాలు’
బహుముఖ ప్రతిభావంతులు = అనేక రంగాలలో తెలివి కలవారు
సాహితీ జగత్తు = సాహిత్యలోకం
సాహిత్య వ్యాసంగం = సాహిత్యంలో పరిశ్రమ

20వ పేజి

ముట్టని = అంటని
క్షేత్రం = రంగం
అతిశయోక్తి = ఎక్కువగా చెప్పడం
(అతిశయ + ఉక్తి)
సాహిత్యక్షేత్రం = సాహిత్యరంగం
దశాబ్దాలు = పదుల సంవత్సరాలు
స్మృతులను = జ్ఞాపకాలను
గ్రంథస్థం = గ్రంథంలో రాయడం
హితైషులు = మేలును కోరేవారు
ఔదార్యం = గొప్పతనం (దాతృత్వం)
దోష౦ = తప్పు
పరిణమించేది = మారేది
అసాధ్యం = సాధ్యం కానిది
చీదరింపు = ‘ఛీ’ యనడం (కాదు పొమ్మనడం)
పరిష్కరించి ఉండేవారు = చక్కపెట్టేవారు
మలచబడ్డారు = చెక్కబడ్డారు (తీర్చిదిద్దబడ్డారు)
ఉపకారశీలి = ఉపకారం చేసే స్వభావం కలవాడు
ఆత్మీయులైన = తనవారైన
పేరుబడ్డారు = పేరు కెక్కారు
సహచరులు = స్నేహితులు, అనుచరులు
ఓర్మి = సహనం
వేచిఉంటూ = ఎదురు చూస్తూ ఉంటూ
పరిపాటి = పద్ధతి (అలవాటు)
సామాజిక యాత్ర = సంఘానికి సంబంధించిన యాత్ర
సాఫీగా = తిన్నగా
ఒడుదుడుకులు = ఎత్తుపల్లాలు (కష్టస్థితులు)
విపత్కర పరిస్థితులు = ఆపద కలిగే పరిస్థితులు
సేనావాహిని = సేనానది
చలించేవారు = తొందరపడేవారు
మనః స్థైర్యాన్ని = మనస్సులో దృఢత్వాన్ని
సమచిత్తత = సమానమైన మనస్సు కల్గి యుండడం
క్రుంగిపోనూలేదు = అణగిపోలేదు (దిగాలు పడలేదు)
పూర్ణపురుషుల = సంపూర్ణమైన వ్యక్తులు (అన్ని శక్తులూ కలవారు)

పాఠం ఉద్దేశం

సమాజంలో కొద్దిమందే ప్రభావశక్తి సంపన్నులు ఉంటారు. వీరి సాంగత్యం పొందినా, వీరి గురించి తెలుసుకున్నా, స్ఫూర్తి కలుగుతుంది. మంచిమార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. ఇలా స్ఫూర్తిదాయకులైన వారిలో బూర్గుల రామకృష్ణారావు ఒకరు. ఈయన హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి, రాజనీతిజ్ఞుడిగా బహుభాషావేత్తగా పరిపాలనాదక్షుడిగా పేరెన్నికగన్నాడు. ఈయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా పి.వి. నరసింహారావు వ్యాసం రాశాడు, మహోన్నత వ్యక్తిత్వాల నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. గొప్పవారి జీవితాన్ని, వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన, స్ఫూర్తివంతమైన జీవన కోణాలను విశ్లేషిస్తూ, ప్రశంసిస్తూ రాసిన అభినందన వ్యాసం ఇది.
ఈ పాఠ్యభాగం ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక 1972 సం॥పు డిసంబర్ సంచిక నుండి తీసుకొనబడింది.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

రచయిత పరిచయం

వ్యాస రచయిత : పాములపర్తి వేంకట నరసింహారావు (పి.వి. నరసింహారావు)
పాఠ౦ : “నేనెరిగిన బూర్గుల”

రచయిత జన్మస్థలం : వరంగల్లు రూరల్ జిల్లా ‘నర్సంపేట’ మండలంలోని “లక్నేపల్లి” గ్రామంలో జన్మించారు.

దత్తపుత్రుడు : రచయిత, నరసింహారావుగారు, వరంగల్ దగ్గర ‘భీమదేవరపల్లి’ మండలంలోని ‘వంగర’ గ్రామంలోని రుక్మిణమ్మ, రంగారావులకు దత్తపుత్రుడు.
TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 1
రచయిత గురువులు : “స్వామి రామానంద తీర్థ వీరికి గురువు. బూర్గుల రామకృష్ణారావుగారు, ఈ రచయితకు గురుతుల్యులు.

రాజకీయ జీవితం : పి.వి. నరసింహారావుగారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థిగా హైద్రాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొని, విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గురి అయినారు. 1938 లో హైద్రాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు.

శాసన సభ్యత్వం : కరీంనగర్ జిల్లా “మంథని” నియోజక వర్గం నుండి వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్.ఎల్.ఏ.గా ఎన్నికయ్యారు.

మంత్రి పదవులు : అనేక శాఖలకు రాష్ట్రమంత్రిగా పనిచేసి, 1971 73 లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్రమంత్రిగా చాలాకాలం పనిచేసి, చివరకు 1991 96 కాలంలో భారత ప్రధానిగా పనిచేశారు.

రాజనీతిజ్ఞుడు : ఈయన అపరచాణక్యుడు. తన రాజకీయ చాతుర్యంతో, భారత రాజకీయాల్లో గొప్పగా రాణించిన రాజనీతిజ్ఞుడు.

సాహితీసేవ : ఈయన తెలుగుతో సహా 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన బహుభాషావేత్త. తెలుగులో ‘కాకతీయ’ పత్రికను నడిపించాడు. విశ్వనాథ సత్యనారాయణ గారి ‘వేయిపడగలు’ నవలను, ఈయన “సహస్రఫణ్” అనే పేరుతో హిందీలోకి అనువదించాడు. ఈ నవలకు కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఈయన “ఆత్మకథ” అని పేరు కెక్కిన “ఇన్ సైడర్” అనేక భాషల్లోకి అనువదించబడింది. “పన్లక్షతొకొనతో” అనే మరాఠి నవలను, ఈయన తెలుగులో “అబలా జీవితం” అనే పేర అనువదించారు.

వ్యక్తిత్వం : నిరాడంబరజీవితం, నిజాయితీ, దేశభక్తి కలిగినవారు. జీవిత పర్యంతం, నిండు కుండలా స్థితప్రజ్ఞునిగా వెలిగారు.

ప్రవేశిక

ప్రతి మానవునిలోనూ సాధారణంగా ఉన్నదానికంటే తనను గురించి ఘనంగా చిత్రించుకొనే స్వభావం ఉంటూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా ప్రవర్తించేవారు బహు అరుదుగా ఉంటారు. రకరకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నా విపత్కర పరిస్థితులు సేనావాహినిలా చుట్టుముట్టినా చలించకపోవడం, మనః స్థైర్యాన్ని, సమచిత్తాన్ని విడనాడక పోవడం గొప్పవారికే సాధ్యమౌతుంది.

జయాపజయాలను సమానంగా స్వీకరించడం, మిత్రులు సైతం ద్రోహం తలపెట్టినా ప్రత్యర్థులు దూషించినా “సరే ! ఇవన్నీ ఆటలో భాగమేగా !” అని స్థితప్రజ్ఞతను ప్రదర్శించడం అందరికీ సాధ్యమౌతుందా ? మరి ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఎవరు ? ఈ పాఠం ద్వారా తెలుసుకొండి.

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

These TS 10th Class Telugu Bits with Answers 10th Lesson గోలకొండ పట్టణము will help students to enhance their time management skills.

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

బహుళైచ్ఛిక ప్రశ్నలు (\(\frac{1}{2}\) మార్కులు)

PAPER – I: PART – B

1. సొంతవాక్యాలు (1 మార్కు)

1. రూపు రేఖలు : …………
జవాబు:
వంటపనితో మా అక్క రూపురేఖలు మారిపోయాయి.

2. జనసమ్మర్దము : …………
జవాబు:
పండుగల కాలంలో జనసమ్మర్దము విపరీతంగా ఉంటుంది.

3. సత్యహీనుడు : ………….
జవాబు:
లోకంలో సత్యహీనునికి గౌరవ మర్యాదలు దక్కవు.

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

4. మనసు కరుగు : ………..
జవాబు:
పేదలను చూస్తే నా హృదయం, మనసు కరుగుతుంది.

2. అర్ధాలు

ప్రశ్న 1.
గోలకొండ కైవారము చాలా పెద్దది. (గీత గీసిన పదమునకు అర్థం గుర్తించండి.)
A) చుట్టురా
B) దగ్గర
C) లోపల
D) వెలుపల
జవాబు:
A) చుట్టురా

ప్రశ్న 2.
గోలకొండ కోటలోని ఉద్యానవనాలు సొంపు కల్గి ఉంటాయి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) చుట్టూ
B) అందం
C) మేడ
D) గోడ
జవాబు:
B) అందం

ప్రశ్న 3.
బెంగళూరు నగరములో హర్మ్యములు చూడముచ్చటగా ఉంటాయి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) అల్పాహారం
B) చిన్నమేడ
C) ఎత్తైన మేడ
D) క్రీడా సరస్సులు
జవాబు:
C) ఎత్తైన మేడ

ప్రశ్న 4.
పాదుషాలు కేళాకూళులు నిర్మించారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) నేర్పు
B) కష్టం
C) అప్పు
D) క్రీడా సరస్సులు
జవాబు:
D) క్రీడా సరస్సులు

ప్రశ్న 5.
దర్వాజా తెరిచి ఉంది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) కోట
B) ద్వారము
C) కిటికి
D) ఇంటి ముందు
జవాబు:
B) ద్వారము

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 6.
“స్కంధం” అంటే అర్థం
A) విభాగం
B) తోట
C) చెట్టు బోదె
D) బురుజు
జవాబు:
C) చెట్టు బోదె

ప్రశ్న 7.
గోల్కొండలో కౌశల్యము గల శిల్పులు గలరు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) (June ’18)
A) నేర్పు
B) మార్పు
C) కూర్పు
D) చేర్పు
జవాబు:
A) నేర్పు

ప్రశ్న 8.
మిషన్ కాకతీయ పథకంలో తటాకములకు పూర్వవైభవం వచ్చింది. గీతగీసిన పదానికి అర్థం.
A) నది
B) సముద్రం
C) చెరువు
D) వాగు
జవాబు:
C) చెరువు

ప్రశ్న 9.
“మహమ్మారి” అంటే అర్థం
A) గొప్ప మర్రి
B) మరిడమ్మ
C) మశూచి,అమ్మతల్లి
D) తల్లి అమ్మ
జవాబు:
C) మశూచి,అమ్మతల్లి

ప్రశ్న 10.
“రాజసదనము” అంటే అర్థం
A) గుఱ్ఱాలు
B) రాజుగారి గుఱ్ఱము
C) రాజు తోట
D) రాజు మేడ
జవాబు:
D) రాజు మేడ

ప్రశ్న 11.
హిమగిరి సొగసులు మనసుకు ఆనందాన్నిస్తాయి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) నది
B) మంచు
C) జలం
D) పర్వతం
జవాబు:
D) పర్వతం

ప్రశ్న 12.
భారతదేశంలోని ప్రజలు లేమితో నలిగిపోతున్నారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) మోక్షగామి
B) పేదరికం
C) రాచరికము
D) బలిమి
జవాబు:
B) పేదరికం

ప్రశ్న 13.
రాజహర్మ్యము చాలా విశాలంగా ఉన్నది. (గీత గీసిన పదానికి అర్థము గుర్తించండి.)
A) వైపు
B) గుఱ్ఱము
C) రాజభవనం
D) మేడ
జవాబు:
C) రాజభవనం

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 14.
మహిళలు జాతరలో సూడిగములు కొన్నారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) గజ్జెలు
B) బొమ్మలు
C) గాజులు
D) బట్టలు
జవాబు:
C) గాజులు

3. పర్యాయపదాలు

ప్రశ్న 1.
ఏనుగు దంతములు విలువైనవి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) దన్తి, హస్తి
B) లొట్టె, ఉష్ణము
C) నీతి, రీతి
D) కృష్ణ, స్వాద్వి
జవాబు:
A) దన్తి, హస్తి

ప్రశ్న 2.
మేడలు గొప్పగా నిర్మించారు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) స్వాధ్వీ, కృష్ణ
B) లొట్టె, వాసంతము
C) పురము, సౌధము
D) గజం, ఏనుగు
జవాబు:
C) పురము, సౌధము

ప్రశ్న 3.
ఒంటెలు రాజస్థాన్లో ఎక్కువ ఉంటాయి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) లొట్టె, ఉష్ట్రము
B) నీతి, తురగము
C) గుంపు
D) నీళ్ళు, ఎఱ్ఱ తామర
జవాబు:
A) లొట్టె, ఉష్ట్రము

ప్రశ్న 4.
“కోట, ఖిల్లా” అనే పదాలకు పర్యాయపదం గుర్తించండి.
A) దుర్గము
B) పడి
C) కోశం
D) బురుజు
జవాబు:
A) దుర్గము

ప్రశ్న 5.
“మాతంగము, సామజము, హస్తి” అనే పదాలకు పర్యాయపదం గుర్తించండి.
A) ఒంటె
B) భల్లూకము
C) ఏనుగు
D) వేదం
జవాబు:
C) ఏనుగు

ప్రశ్న 6.
గోల్కొండలో మేడలు అందముగా నున్నవి. (గీతగీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) గోడ, కుడ్యము
B) గుడిసె, ఇల్లు
C) పురము, నగరు
D) వనము, అవని
జవాబు:
C) పురము, నగరు

ప్రశ్న 7.
“వాజి, ఘోటకము, హయము” పర్యాయపదాలుగా గలిగిన పదం
A) తరంగము
B) అశ్విని
C) అశ్వము
D) రథము
జవాబు:
C) అశ్వము

ప్రశ్న 8.
“హర్మ్యము” అనే పదానికి పర్యాయపదం కానిది.
A) చోటు
B) భవనము
C) ప్రాసాదము
D) సౌధము
జవాబు:
B) భవనము

ప్రశ్న 9.
“తొడవు, భూషణము, ఆభరణము”. అనే పదానికి పర్యాయపదం గల పదం.
A) మార్గము
B) నగ
C) నాగము
D) రాణులు
జవాబు:
B) నగ

ప్రశ్న 10.
“జింక” అనే పదానికి పర్యాయపదాలు కాని జత
A) ఏణము, కురంగము
B) కురంగము, హరిణము
C) ఇట్టి, మృగము
D) పుండరీకము, అశ్వము
జవాబు:
B) కురంగము, హరిణము

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 11.
గజకర్ణము అంటే విసనకర్ర అని అర్థం (దీనికి పర్యాయ పదాలు కానివి.)
A) వీవన, సురటి
B) ఏనుగు తొండం, గజము
C) రాజు, మదపుటేనుగు
D) తాళము, తాళవనం
జవాబు:
B) ఏనుగు తొండం, గజము

ప్రశ్న 12.
ఈ కిందివానిలో “జైలు” అనే పదానికి పర్యాయపదాలు కానివి.
A) చెరసాల, కటకటాలు
B) కారాగారము, కారాగృహము
C) బందీ, చోరులు
D) ఖైదు, బంధిఖానా
జవాబు:
B) కారాగారము, కారాగృహము

ప్రశ్న 13.
నేస్తము మంచి పుస్తకము వంటివాడు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) మిత్రుడు, చుట్టము
B) నఖుడు, చెలికాడు
C) ఆప్తుడు, బంధువు
D) ఏదీ కాదు
జవాబు:
B) నఖుడు, చెలికాడు

ప్రశ్న 14.
మిత్రుడు లేనివాడు అరణ్యంలోని గుడ్డి జంతువు లాంటివాడు. గీత గీసిన పదానికి సరియైన పర్యాయ పదాలు ఏవి ?
A) నేస్తము, చెలికాడు
B) మిత్రుము, కళత్రము
C) రవి, చంద్రుడు
D) మైత్రి, సుమిత్ర
జవాబు:
A) నేస్తము, చెలికాడు

ప్రశ్న 15.
గుడి, దేవాలయం అనే పర్యాయపదాల్ను మాట (June ’18)
A) వెన్నెల
B) కోవెల
C) సదనం
D) మహీరుహము
జవాబు:
B) కోవెల

ప్రశ్న 16.
……….వారు కొత్త గృహములోనికి ప్రవేశించారు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) ఇల్లు, మేడ
B) పాక, మందిరం
C) ఇల్లు, మందిరం
D) ఇల్లు, దేవాలయం
జవాబు:
A) ఇల్లు, మేడ

ప్రశ్న 17.
తరువు, మహీరుహం – అనే పర్యాయపదాలు గల మాట. (Mar. ’17)
A) చెట్టు
B) కొండ
C) చెరువు
D) చెలిమి
జవాబు:
A) చెట్టు

4. వ్యుత్పత్త్యర్థాలు

ప్రశ్న 1.
“రాజు నివసించు ప్రధాన పట్టణము”. (దీనికి సరిపడు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)
A) భవనము
B) అంతఃపురము
C) నందనం
D) రాజధాని
జవాబు:
D) రాజధాని

ప్రశ్న 2.
సంతోష పెట్టునది. (దీనికి సరిపడు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)
A) నందనం
B) భవనం
C) రాజధాని
D) తానము
జవాబు:
A) నందనం

ప్రశ్న 3.
మనస్సును హరించునది. (దీనికి సరిపడు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)
A) నందనం
B) భవనం
C) రాజధాని
D) హర్మ్యము
జవాబు:
D) హర్మ్యము

ప్రశ్న 4.
“భాషింపబడునది” దీనికి వ్యుత్పత్తి పదం
A) జలధి
B) సరస్వతి
C) భాష
D) తెలుగు
జవాబు:
C) భాష

ప్రశ్న 5.
“ఆజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు” – దీనికి వ్యుత్పత్తి పదం
A) గురువు
B) బ్రహ్మ
C) శివుడు
D) నారదుడు
జవాబు:
A) గురువు

ప్రశ్న 6.
మనస్సును హరించునది – అను వ్యుత్పత్తి గల పదము
A) కుసుమము
B) హర్మ్యము
C) జట
D) మహిళ
జవాబు:
B) హర్మ్యము

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 7.
ప్రజలను రంజింపచేయువాడు – వ్యుత్పత్తి గల పదము
A) రాజు
B) కళాకారుడు
C) హంతకుడు
D) రంజనం
జవాబు:
A) రాజు

ప్రశ్న 8.
దౌవారికుడు – అనే పదానికి సరియైన వ్యుత్పత్త్యర్థం
A) రెండుసార్లు వారించువాడు
B) సేవలు చేయువాడు
C) ద్వారమును కాపాడువాడు
D) మనుమని మనుమడు
జవాబు:
C) ద్వారమును కాపాడువాడు

ప్రశ్న 9.
వేదములను విభజించినవాడు (వ్యుత్పత్తి పదం)
A) వేదవ్యాసుడు
B) పారాశర్యుడు
C) వేదకర్త
D) వ్యాసుడు
జవాబు:
D) వ్యాసుడు

ప్రశ్న 10.
‘చర్యలను కనిపెట్టి చూచేవాడు’ అనే వ్యుత్పత్యర్థాన్ని కలిగి వున్న పదం ఏది ?
A) ఆచార్యుడు
B) అధ్యక్షుడు
C) కార్యదర్శి
D) క్రియాశీలి
జవాబు:
B) అధ్యక్షుడు

ప్రశ్న 11.
తిధి నియమాలు లేకుండా భోజన సమయానికి వచ్చేవాడు. (వ్యుత్పత్యర్థ పదం)
A) భోజనార్ధి
B) భిక్షార్ధి
C) అతిధి
D) భాగ్యతి
జవాబు:
C) అతిధి

5. నానార్థాలు

ప్రశ్న 1.
గోలకొండ పట్టణం ఎంతో అందమైనది. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) వస్త్రము, రాజధాని
B) గుంపు, రాపిడి
C) నీతి, తురగం
D) దన్తి, హస్తి
జవాబు:
A) వస్త్రము, రాజధాని

ప్రశ్న 2.
హైదరాబాద్ నగరంలో జన సమ్మర్థం ఎక్కువ. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) వగిజుడు, వర్తకుడు
B) రాపిడి, గుంపు
C) నగరు, పాదం
D) లొట్టె, ఉష్ట్రము
జవాబు:
B) రాపిడి, గుంపు

ప్రశ్న 3.
మనిషికి జీవనాధారము జలం. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) గుంపు, రీతి
B) రాజధాని, నగరం
C) నీళ్ళు, ఎఱ్ఱతామర
D) యుద్ధం, రణం
జవాబు:
C) నీళ్ళు, ఎఱ్ఱతామర

ప్రశ్న 4.
శిఖరము (అన్న పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) అగ్రము, మండపము
B) వాయువు, స్తంభము
C) హిమము, ఇగము
D) అండ, బంఢ
జవాబు:
A) అగ్రము, మండపము

ప్రశ్న 5.
గాలివానలో ప్రయాణం సాగదు. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) వాయువు, మండపం
B) వాయువు, పిశాచము
C) బద్దె, విద్దె
D) దక్షిణము, దక్కినము
జవాబు:
B) వాయువు, పిశాచము

ప్రశ్న 6.
వజ్రాలహారాన్ని మైసమ్మకు సమర్పించారు. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) రత్నము, ఆకాశము
B) కోరిక, దిక్కు
C) రత్నములలో ఒకటి, పిడుగు
D) కోరిక, రత్నము
జవాబు:
C) రత్నములలో ఒకటి, పిడుగు

ప్రశ్న 7.
అంబరం (అన్న పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) వస్త్రము, ఆకాశము
B) కోరిక, కీర్తి
C) అధికం, హారము
D) వాన, దేశం
జవాబు:
A) వస్త్రము, ఆకాశము

ప్రశ్న 8.
వాన, సంవత్సరం (అనే నానార్థాలనిచ్చే పదం)
A) నేల
B) వర్షం
C) శరీరం
D) దిక్కు
జవాబు:
B) వర్షం

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 9.
పుణ్యక్షేత్రం పదానికి నానార్థాలు
A) చోటు, పుణ్యస్థానం
B) కోరిక, నేల
C) ఆకాశము, కీర్తి
D) భూమి, దేశము
జవాబు:
A) చోటు, పుణ్యస్థానం

ప్రశ్న 10.
“ఉదాహరణము” – అనే పదానికి నానార్థాలు
A) దృష్టాంతము, ఉపమానము
B) నాటకభేదము, దొంగతనము
C) ప్రమాణము, ప్రణామము
D) వృథా, మికిలి
జవాబు:
A) దృష్టాంతము, ఉపమానము

ప్రశ్న 11.
‘శుక్రుడు, కావ్య రచయిత’ ఈ నానార్థాలు కలిగిన సరియైన పదం ఏది ?
A) గ్రంథకర్త
B) కావ్యకర్త
C) కవి
D) ఒక గ్రహణ
జవాబు:
A) గ్రంథకర్త

ప్రశ్న 12.
‘ప్రీతి’కి నానార్థాలు ఏవి ?
A) అభిమానం, దయ
B) ప్రతీత, పాత్ర
C) కీర్తి, క్రాంతి
D) ప్రఖ్యాతి, కాంతి
జవాబు:
D) ప్రఖ్యాతి, కాంతి

ప్రశ్న 13.
కవిత, విద్దె, కబ్బం, విద్య, కావ్యం, కైత – ఈ పదాల్లోని ప్రకృతి పదాలు (Mar. ’18)
A) కవిత, కావ్యం, కైత
B) విద్దె, కావ్యం, కవిత
C) కవిత, విద్య, కావ్యం
D) కబ్బం, కైత, విద్య
జవాబు:
C) కవిత, విద్య, కావ్యం

6. ప్రకృతి – వికృతులు

ప్రశ్న 1.
మా ప్రాంతము చాలా రద్దీగా ఉంటుంది. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) పొంత
B) దమ్మము
C) తానము
D) చోటు
జవాబు:
A) పొంత

ప్రశ్న 2.
స్నానముల గదులు చూడముచ్చటగానున్నవి. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) దమ్మము
B) తానము
C) పొంత
D) విద్య
జవాబు:
B) తానము

ప్రశ్న 3.
పూలరేఖలా? (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) లేఖ
B) లేక
C) రేక
D) రెమ్మ
జవాబు:
C) రేక

ప్రశ్న 4.
రాజు కొన్నది, రత్నము కాదా ? (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) రాయలు
B) రాడు
C) రోజు
D) తరాజు
జవాబు:
A) రాయలు

ప్రశ్న 5.
గీము, ఇంతి పదానికి వికృతి పదాలు గుర్తించండి.)
A) గీచు, స్త్రీ
B) గృహము, స్త్రీ’
C) గృహము, శ్రీ
D) గ్రహము, స్త్రీ
జవాబు:
B) గృహము, స్త్రీ’

ప్రశ్న 6.
మా వీథిలో దేవుని గుడి ఉంది (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) వీథులందు
B) వీదిలో
C) బాటలో
D) బజారులో
జవాబు:
B) వీదిలో

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 7.
“ఉష్ట్రము” ప్రకృతి అయితే వికృతి పదం
A) ఊపిరి
B) రాష్ట్రము
C) ఒంటె
D) ఒంటెలు
జవాబు:
C) ఒంటె

ప్రశ్న 8.
“అచ్చెరువు” అనే పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) ఆశ్చర్యము
B) అబ్బురము
C) అభ్రము
D) అక్కర
జవాబు:
A) ఆశ్చర్యము

ప్రశ్న 9.
“దేవాలయము” అనే పదానికి వికృతి పదం గుర్తించండి.
A) దేవరయిల్లు
B) దేవళము
C) దేశము
D) గుడి
జవాబు:
B) దేవళము

ప్రశ్న 10.
గురువు ఆజ్ఞ పాటిస్తే మేలు గీతగీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) ఆన
B) ఆగ్న
C) అనుమతి
D) ఆలోచన
జవాబు:
A) ఆన

ప్రశ్న 11.
ఆమెకు ప్రాణభీతి లేదు. గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) భయం
B) బయం
C) బీతు
D) ప్రీతి
జవాబు:
C) బీతు

ప్రశ్న 12.
మృగమును బంధించుము. గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) మృగము
B) మెకము
C) మృగ
D) మేక
జవాబు:
B) మెకము

ప్రశ్న 13.
తల్లి బిడ్డలను ప్రేమించడం సహజం. గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.
A) సైతం
B) అసహజం
C) సమాజం
D) సాజం
జవాబు:
D) సాజం

ప్రశ్న 14.
మిషన్ కాకతీయ పథకంలో తటాకములకు పూర్వ వైభవం వచ్చింది. గీతగీసిన పదానికి అర్థం. (June ’18)
A) నది
B) సముద్రం
C) చెరువు
D) వాగు
జవాబు:
B) సముద్రం

భాషాంశాలు (వ్యాకరణం)

PAPER – II : PART – B

1. సంధులు

ప్రశ్న 1.
రమ్యోద్యానములు (సంధి గుర్తించండి.)
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణ సంధి
C) యణాదేశ సంధి
D) త్రిక సంధి
జవాబు:
B) గుణ సంధి

ప్రశ్న 2.
అత్యంత ఏ సంధి ?
A) త్రిక సంధి
B) యణాదేశ సంధి
C) అకార సంధి
D) ఉకార సంధి
జవాబు:
B) యణాదేశ సంధి

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 3.
ఏకైక ఏ సంధి ?
A) అకార సంధి
B) త్రిక సంధి
C) లులనల సంధి
D) వృద్ధి సంధి
జవాబు:
D) వృద్ధి సంధి

ప్రశ్న 4.
“వాజఙ్మయము” విడదీయగా
A) వాక్ + మయము
B) వాగ్ + మయం
C) వాక్ + మయ
D) వాజ్మయ + ము
జవాబు:
A) వాక్ + మయము

ప్రశ్న 5.
‘శస్త్రాదులు’ ఏ సంధి ?
A) త్రిక సంధి
B) ఆమ్రేడిత సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) అకార సంధి
జవాబు:
C) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 6.
క్రమాభివృద్ధి – విడదీయండి.
A) క్రమ + అభివృద్ధి
B) క్రమాః + అభివృద్ధిః
C) క్రమాఅ + భివృద్ధి
D) క్రమాభి + వృద్ధి
జవాబు:
A) క్రమ + అభివృద్ధి

ప్రశ్న 7.
ద్రాక్షాసవము – విడదీయండి.
A) ద్రాక్ష + సవము
B) ద్రాక్ష + ఆసవము
C) ద్రాక్షా + స్తవము
D) ద్రాక్షాస + వము
జవాబు:
B) ద్రాక్ష + ఆసవము

ప్రశ్న 8.
ధనాగారము విడదీయండి.
A) ధనా + ఆగారము
B) ధనుస్సు + ఆగారము
C) ధన + ఆగారము
D) ధనః + ఆగారః
జవాబు:
C) ధన + ఆగారము

ప్రశ్న 9.
రమ్యోధ్యానములు – విడదీయండి.
A) రమ్యః + ధ్యానములు
B) రమ్య + ఉద్యానములు
C) రమ్యః + ఉధ్యానములు
D) రామ్య + ఉదధి + ధానములు
జవాబు:
B) రమ్య + ఉద్యానములు

ప్రశ్న 10.
రాజోద్యోగులు – విడదీయండి.
A) రాజ + సద్యోగులు
B) రాజ్యః + ఉద్యోగులు
C) రాజ + ఉద్యోగులు
D) రాజోద్యో + గులు
జవాబు:
C) రాజ + ఉద్యోగులు

ప్రశ్న 11.
క్రింది వానిలో సవర్ణదీర్ఘ సంధి కాని పదం ఏది ?
A) భిక్షాపాత్ర
B) ధనాపహరణం
C) సర్వాపదలు
D) శోకాగ్ని
జవాబు:
A) భిక్షాపాత్ర

ప్రశ్న 12.
అమ్మకు పిల్లలపై ప్రేమ అత్యంతము. (గీత గీసిన పదాన్ని విడదీయండి.)
A) అ + అంతము
B) అత్య + అంతము
C) అతి + అంతము
D) అత్యంత + అంతము
జవాబు:
C) అతి + అంతము

ప్రశ్న 13.
‘ఎల్లెడల’ పదాన్ని విడదీయండి.
A) ఎల్లె + డల
B) ఎల్లన్ + ఎడల
C) ఎల్ల + ఎడల
D) ఏ + వెడల
జవాబు:
C) ఎల్ల + ఎడల

ప్రశ్న 14.
క్రింది వానిలో ద్వంద్వ సమాసం కానిదేది ?
A) జవసత్త్వాలు
B) సమస్త కార్యాలు
C) పెట్టువోతలు
D) తాతాముత్తాతలు
జవాబు:
B) సమస్త కార్యాలు

2. సమాసాలు

ప్రశ్న 1.
గోలకొండ పట్టణము ఏ సమాసము ?
A) ద్విగువు
B) ద్వంద్వం
C) చతుర్థీ తత్పురుష
D) సంభావనా పూర్వపద కర్మధారయం
జవాబు:
B) ద్వంద్వం

ప్రశ్న 2.
పెంపుసొంపులు – ఏ సమాసము ?
A) ద్వంద్వ
B) విశేషణ పూర్వపద కర్మధారయం
C) ద్విగువు
D) బహువ్రీహి
జవాబు:
A) ద్వంద్వ

ప్రశ్న 3.
ఏడుమైళ్ళు ఏ సమాసము ?
A) బహువ్రీహి
B) ద్విగువు
C) ద్వంద్వం
D) చతుర్థీ తత్పురుష
జవాబు:
B) ద్విగువు

ప్రశ్న 4.
హైదరాబాద్ అను పేరు గల నగరము. (సమాసంగా మార్చండి.)
A) హైదరాబాదు నగరం
B) హైదరాబాద్ యొక్క నగరం
C) హైదర్ నగరం
D) హైదరాబాద్
జవాబు:
A) హైదరాబాదు నగరం

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 5.
‘యుద్ధభీతి’ అను మాటకు విగ్రహవాక్యం (June ’18)
A) యుద్ధము వలన భీతి
B) యుద్ధము అనెడి భీతి
C) యుద్ధమునకు భీతి
D) యుద్ధము వంటి భీతి
జవాబు:
A) యుద్ధము వలన భీతి

ప్రశ్న 6.
“చక్రపాణి” ఏ సమాసం ?
A) ద్వంద్వం
B) బహువ్రీహి
C) తృతీయా తత్పురుష
D) చతుర్థీ తత్పురుష
జవాబు:
B) బహువ్రీహి

ప్రశ్న 7.
అన్యపదార్థ ప్రాధాన్యం కల సమాసం
A) ద్వంద్వం
B) తృతీయా తత్పురుష
C) చతుర్థీ తత్పురుష
D) బహువ్రీహి
జవాబు:
D) బహువ్రీహి

ప్రశ్న 8.
ద్వంద్వ సమాసానికి ఉదాహరణ
A) పెంపుసొంపులు
B) రూపురేఖలు
C) స్నానమందిరములు
D) నలుమూలలు
జవాబు:
C) స్నానమందిరములు

ప్రశ్న 9.
షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణ
A) రాజభవనాలు
B) ప్రజా సముదాయము
C) వెండి పూత
D) పెంపుసొంపులు
జవాబు:
A) రాజభవనాలు

ప్రశ్న 10.
చతుర్థీ తత్పురుష సమాసానికి ఉదాహరణ
A) రెండు బారకాసులు
B) బంజారా దర్వాజ
C) విహార భూమి
D) రెండు లక్షలు
జవాబు:
C) విహార భూమి

ప్రశ్న 11.
ద్విగు సమాసానికి ఉదాహరణ (June ’18)
A) కూరగాయలు
B) నాలుగు రోడ్లు
C) అమ్మఒడి
D) మహావృక్షం
జవాబు:
B) నాలుగు రోడ్లు

ప్రశ్న 12.
“భోగము నందు లాలసత్వం గలవారు.” – విగ్రహ వాక్యానికి సరియైన సమాసము పేరు
A) సప్తమీ తత్పురుష సమాసము
B) బహువ్రీహి సమాసము
C) అవ్యయీభావ సమాసము
D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
జవాబు:
B) బహువ్రీహి సమాసము

ప్రశ్న 13.
నిర్మాణము కొఱకు పథకములు వేసిరి గీత గీసిన ప్రత్యయము ఏ విభక్తికి సంబంధించినది ?
A) తృతీయా విభక్తి
B) సప్తమీ విభక్తి
C) చతుర్ధి విభక్తి
D) షష్ఠీ విభక్తి
జవాబు:
C) చతుర్ధి విభక్తి

ప్రశ్న 14.
కింది వానిలో ద్విగు
A) ముజ్జగములు
B) వేయిస్తంభాలు
C) 300 సంవత్సరాలు
D) ముక్కంటి
జవాబు:
B) వేయిస్తంభాలు

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 15.
వివేకహీనుడు ప్రమాదం తెస్తాడు. విగ్రహవాక్యం ఏది ?
A) వివేకము యొక్క హీనుడు
B) వివేకమునందు హీనుడు
C) వివేకము హీనముగా కలవాడు
D) వివేకము చేత హీనుడు
జవాబు:
D) వివేకము చేత హీనుడు

ప్రశ్న 16.
‘యశస్సు అనెడి వసనము’ – సమాసపదంగా మారిస్తే,
A) యశఃవసనము
B) యశావసనము
C) యశోవసనము
D) యశస్వసనము
జవాబు:
C) యశోవసనము

ప్రశ్న 17.
అస్థిరమైన భావంతో పని చేయకూడదు – సమాస పదం ?
A) స్థిరభావం
B) అస్థిర భావం
C) అస్థిరము భావం
D) ఆస్థిర భావం
జవాబు:
B) అస్థిర భావం

ప్రశ్న 18.
పంచమీ తత్పురుష సమాసానికి ఉదాహరణ (Mar. ’18)
A) గురుదక్షిణ
B) సత్యనిష్ట
C) దొంగభయము
D) నెలతాల్పు
జవాబు:
C) దొంగభయము

3. ఛందస్సు

ప్రశ్న 1.
U I U – ఇది ఏ గణము ?
A) రగణం
B) భగణం
C) జగణం
D) తగణం
జవాబు:
A) రగణం

ప్రశ్న 2.
నగణం – దీనికి గణాలు గుర్తించండి.
A) U I I
B) U U U
C) I I I
D) I U U
జవాబు:
C) I I I

ప్రశ్న 3.
వృద్ధుడు – ఇది ఏ గణం ?
A) భగణం
B) నగణం
C) యగణం
D) సగణం
జవాబు:
A) భగణం

ప్రశ్న 4.
ఇంద్రగణాలు ఎన్ని ?
A) 3
B) 6
C) 4
D) 7
జవాబు:
B) 6

ప్రశ్న 5.
భ-ర-న-భ-భ-ర-వ గణాలు ఏ పద్యపాదానికి చెందినవి
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) శార్దూలం
D) మత్తేభం
జవాబు:
B) ఉత్పలమాల

ప్రశ్న 6.
సూర్యగణాలు ఎన్ని ?
A) 3
B) 4
C) 5
D) 2
జవాబు:
D) 2

ప్రశ్న 7.
‘సారము’ ఇది ఏ గణము ?
A) ‘స’ గణం
B) ‘భ’ గణం
C) ‘య’ గణం
D) ‘త’ గణం
జవాబు:
B) ‘భ’ గణం

4. అలంకారాలు

ప్రశ్న 1.
మావిడాకులు తెచ్చివ్వండి – అలంకారం గుర్తించండి.
A) శ్లేషాలంకారం
B) ఉపమా
C) రూపకం
D) ఉత్ప్రేక్ష
జవాబు:
A) శ్లేషాలంకారం

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 2.
రాజు కువలయానందకరుడు – అలంకారం గుర్తించండి.
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) రూపకం
D) శ్లేషాలంకారం
జవాబు:
D) శ్లేషాలంకారం

ప్రశ్న 3.
హిమాలయ పర్వతాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అలంకారం గుర్తించండి.
A) శ్లేషాలంకారం
B) ఉపమాలంకారం
C) ఉత్ప్రేక్ష
D) అతిశయోక్తి
జవాబు:
D) అతిశయోక్తి

ప్రశ్న 4.
జింకలు బిత్తరి చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున దూకుతున్నాయి – ఏ అలంకారం ?
A) స్వభావోక్తి
B) ఉపమా
C) రూపకం
D) ఉత్ప్రేక్ష
జవాబు:
A) స్వభావోక్తి

ప్రశ్న 5.
‘కమలాక్షునర్పించు కరములు కరములు’ ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి.
A) లాటానుప్రాస
B) ముక్తపదగ్రస్తము
C) యమకము
D) ఉపమాలంకారము
జవాబు:
A) లాటానుప్రాస

ప్రశ్న 6.
ముఖము చంద్రునివలె మనోహరముగా ఉన్నది ఇందులో సమాన ధర్మపదం ఏది ?
A) వలె
B) చంద్రుడు
C) మనోహరము
D) ముఖము
జవాబు:
C) మనోహరము

5. వాక్య పరిజ్ఞానం

ప్రశ్న 1.
వృద్ధుడు ఆశ్రమంబున నుండె దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) వృద్ధుడు ఆశ్రమంలో ఉన్నాడు
B) ఉండెను ఆశ్రమంబున వృద్ధుడు
C) వృద్ధునిచే ఆశ్రమంబున నుండె
D) ఆశ్రమంబుననుండె వృద్ధుడు
జవాబు:
A) వృద్ధుడు ఆశ్రమంలో ఉన్నాడు

ప్రశ్న 2.
విద్యార్థి వృద్ధునికి నమస్కరించె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) విద్యార్థి వినయంబున నమస్కరించే వృద్ధునికి
B) విద్యార్థి వృద్ధునికి నమస్కరించాడు
C) నమస్కరించె విద్యార్థి వృద్ధునికి
D) వృద్ధునిచే నమస్కరించబడియె విద్యార్థి
జవాబు:
B) విద్యార్థి వృద్ధునికి నమస్కరించాడు

ప్రశ్న 3.
విద్యార్థులు విద్యను ఆర్జించవలె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) విద్యార్థులను విద్యను నార్జించాలి
B) విద్యార్థులు విద్యను ఆర్జించాలి.
C) విద్యార్థులతో విద్య నార్జింపవలె
D) విద్యార్థుల వల్ల విద్య నార్జించాలి.
జవాబు:
B) విద్యార్థులు విద్యను ఆర్జించాలి.

ప్రశ్న 4.
‘నాకు చదువు రావాలి’ అని బాలుడు అన్నాడు. దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) బాలుని వల్ల చదువు రావాలని అన్నాడు.
B) చదువు రావాలని తాను బాలుడు చెప్పుకున్నాడు
C) బాలుడు చదువు రావాలని చెప్పాడు.
D) తనకు చదువు రావాలని బాలుడు అన్నాడు
జవాబు:
D) తనకు చదువు రావాలని బాలుడు అన్నాడు

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 5.
వృద్ధుడు ఆశ్రమమును కట్టించెను. దీనికి ఆధునిక వాక్యాన్ని గుర్తించండి.
A) ఆశ్రమమును వృద్ధునికే నిర్మించాడు.
B) వృద్ధుడు ఆశ్రమాన్ని కట్టించాడు
C) వృద్ధునిచే ఆశ్రమము కట్టించబడెను
D) వృద్ధుడు ఆశ్రమం కట్టించెను
జవాబు:
B) వృద్ధుడు ఆశ్రమాన్ని కట్టించాడు

ప్రశ్న 6.
అడ్డంకి గంగాధర కవిచే తపతీ సంవరణోపాఖ్యానం రచించబడింది. ఈ వాక్యం (June ’18)
A) ప్రత్యక్ష వాక్యం
B) పరోక్ష వాక్యం
C) కర్మణి వాక్యం
D) కర్తరి వాక్యం
జవాబు:
C) కర్మణి వాక్యం

ప్రశ్న 7.
లోభము మోహమును బుట్టించును – ఈ వాక్యానికి ఆధునిక వచనం గుర్తించండి.
A) లోభమునే మోహంబును బుట్టించును
B) లోభాద్మోహముత్పాద్యతి
C) లోభం మోహాన్ని పుట్టిస్తుంది.
D) లోభముతో మోహంబును బుట్టును
జవాబు:
D) లోభముతో మోహంబును బుట్టును

ప్రశ్న 8.
విద్యార్థి భక్తిగ నమస్కరించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) విద్యార్థికి భక్తిగ నమస్కరించాడు.
B) విద్యార్థితో భక్తిగ నమస్కరింపబడియె
C) విద్యార్థి వల్ల భక్తిగ నమస్కరింపబడెను
D) విద్యార్థి కొరకు భక్తిగ నమస్కరించాడు
జవాబు:
B) విద్యార్థితో భక్తిగ నమస్కరింపబడియె

ప్రశ్న 9.
వృద్ధుని చేత బాలుడు రక్షించబడెను – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.
A) విద్యార్థి బాలుడిని రక్షించాడు
B) విద్యార్థి వల్ల బాలుడిచే రక్షింపబడియె
C) విద్యార్థి వలన బాలునికి రక్షించబడెను
D) విద్యార్థికి బాలుడి యందు రక్షించాడు
జవాబు:
A) విద్యార్థి బాలుడిని రక్షించాడు

ప్రశ్న 10.
విద్యార్థి చక్కగా చదివాడు గుర్తించండి. – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) విద్యార్థి వలన చక్కగా చదివించబడియె
B) విద్యార్థికి చక్కగా చదివింపబడెను
C) విద్యార్థికి చక్కగా చదివించెను
D) విద్యార్థి చేత చక్కగా చదువబడెను
జవాబు:
D) విద్యార్థి చేత చక్కగా చదువబడెను

ప్రశ్న 11.
తల పాదాల మీద ఆనించబడింది – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.
A) తల పాదముల యందు ఆనింతును
B) పాదాల మీద తలను ఆనించాడు.
C) పాదాలకు తలను ఆనించాడు.
D) పాదాల యొక్క ఆనించాడు తలపై
జవాబు:
A) తల పాదముల యందు ఆనింతును

ప్రశ్న 12.
ఆయన ఓర్పు వహించాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) ఓర్పు ఆయనతో వహించును
B) ఓర్పు ఆయనకు వహించబడును
C) ఓర్పు ఆయనచేత వహించబడినది
D) ఓర్పు ఆయన వల్ల వహించాడు.
జవాబు:
C) ఓర్పు ఆయనచేత వహించబడినది

ప్రశ్న 13.
ముగ్గురు రచయిత్రులచే ‘పీఠిక’ వ్రాయబడింది.దీనికి కర్మణి వాక్యం గుర్తించండి. (A.P (SA – I)2016)
A) ముగ్గురు రచయిత్రులూ పీఠిక రాయలేదు.
B) పీఠిక ముగ్గురు రచయిత్రులచే రాయబడింది
C) పీఠికను ముగ్గురు రచయిత్రులు వ్రాశారు
D) పీఠిక ముగ్గురు రచయిత్రులు రాసేశారు
జవాబు:
C) పీఠికను ముగ్గురు రచయిత్రులు వ్రాశారు

ప్రశ్న 14.
‘నాకు గురుభక్తి ఎక్కువ’ అని రవి అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) వానికి గురుభక్తి ఎక్కువగా రవి చెప్పాడు.
B) తనకు గురుభక్తి ఎక్కువని రవి అన్నాడు
C) వానికి గురుభక్తి అధికంబని రవి చెప్పాడు
D) అతని యందు గురుభక్తి ఎక్కువని చెప్పాడు
జవాబు:
B) తనకు గురుభక్తి ఎక్కువని రవి అన్నాడు

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 15.
‘అందరూ చదవాలి’ అని ప్రభుత్వం చెప్పింది – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) అందరిచే చదువబడెనని ప్రభుత్వం చెప్పింది
B) అందరిని చదవాలని ప్రభుత్వం చెప్పింది
C) అందరు చదవాలని ప్రభుత్వం చెప్పింది
D) ప్రభుత్వం చెప్పడం వల్ల అందరు చదివారని చెప్పారు
జవాబు:
C) అందరు చదవాలని ప్రభుత్వం చెప్పింది

ప్రశ్న 16.
“నాకు ఆనందం కలిగింది అని బాలుడు అన్నాడు. – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) తనకు ఆనందం కలిగిందని బాలుడు అన్నాడు
B) తనకు ఆనందం కలగాలని బాలుడు చెప్పాడు
C) తనకు ఆనందం కలుగవచ్చు బాలుడు అన్నాడు.
D) బాలుడు తనకు ఆనందం కలుగవచ్చునని చెప్పాడు
జవాబు:
A) తనకు ఆనందం కలిగిందని బాలుడు అన్నాడు

ప్రశ్న 17.
“నాకు కన్నీళ్ళు వచ్చాయి” అని విద్యార్థి అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) వానికి కన్నీళ్ళు వచ్చాయని విద్యార్థి అన్నాడు.
B) తనకు కన్నీళ్ళు వచ్చాయని బాలుడు చెప్పుకున్నాడు
C) తనకు కన్నీళ్ళు వచ్చాయని విద్యార్థి అన్నాడు.
D) కన్నీళ్ళు నేను పెట్టుకున్నానని విద్యార్థి అన్నాడు
జవాబు:
C) తనకు కన్నీళ్ళు వచ్చాయని విద్యార్థి అన్నాడు.

ప్రశ్న 18.
నేను నీతో “నేను రాను” అని చెప్పాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) అతనితో తాను రానని చెప్పుకున్నాడు.
B) నేను నీతో రానని చెప్పాడు
C) తనతో నేను రానన్నాడు.
D) వానితో నేను రానన్నాడు.
జవాబు:
B) నేను నీతో రానని చెప్పాడు

ప్రశ్న 19.
అడవులను నరకవద్దు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) ధాత్వర్థక వాక్యం
B) నిశ్చయార్థక వాక్యం
C) నిషేధార్థక వాక్యం
D) హేత్వర్థక వాక్యం
జవాబు:
C) నిషేధార్థక వాక్యం

ప్రశ్న 20.
బాగా చదివి ఉండడం వల్ల మార్కులు వచ్చాయి. ఇది ఏ రకమైన వాక్యం ?
A) సందేహార్థక వాక్యం
B) హేత్వర్థక వాక్యం
C) అప్యర్థక వాక్యం
D) నిశ్చయార్థక వాక్యం
జవాబు:
B) హేత్వర్థక వాక్యం

ప్రశ్న 21.
నాయనా ! చిరకాలం వర్థిల్లు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) హేత్వర్థక వాక్యం
B) అప్యర్థక వాక్యం
C) నిశ్చయార్థక వాక్యం
D) ఆశీర్వచనార్థక వాక్యం
జవాబు:
D) ఆశీర్వచనార్థక వాక్యం

ప్రశ్న 22.
‘ఆయన డాక్టరా ? ప్రొఫెసరా ?’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.
A) సంక్లిష్ట వాక్యం
B) సామాన్య వాక్యం
C) సంయుక్త వాక్యం
D) అప్యర్థక వాక్యం
జవాబు:
C) సంయుక్త వాక్యం

ప్రశ్న 23.
‘నీరు లేక పంటలు పండలేదు’ – ఇది ఏరకమైన వాక్యం ?
A) సందేహార్థక వాక్యం
B) హేత్వర్థక వాక్యం
C) విధ్యర్థక వాక్యం
D) నిషేధార్థక వాక్యం
జవాబు:
B) హేత్వర్థక వాక్యం

ప్రశ్న 24.
రాజేష్ అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడగలడు (ఇది ఏరకమైన వాక్యమో గుర్తించండి.)
A) సంభావనార్థం
B) సామర్ధ్యార్థకం
C) చేదర్థకం
D) భావార్థకం
జవాబు:
B) సామర్ధ్యార్థకం

ప్రశ్న 25.
ఆ ఎత్తు మీద అతను కూర్చున్నాడా ! ఇది ఏరకమైన వాక్యం ?
A) ప్రశ్నార్థక
B) సామర్థ్యార్థకం
C) ఆశ్చర్యార్థకం
D) విధ్యర్థకం
జవాబు:
C) ఆశ్చర్యార్థకం

TS 10th Class Telugu Bits 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 26.
సన్యాసి చెప్పింది విని ఖిన్నుడనైతి. దీనికి ఆధునిక వాక్యం ఏది ?
A) ఖిన్నుడనైతిని చెప్పింది విని సన్యాసి
B) చెప్పింది విని సన్యాసి
C) సన్యాసి చెప్పింది విని ఖిన్నుడిని అయ్యాను
D) సన్యాసి చెప్పగా విన్నాను, ఖిన్నుడనయ్యాను
జవాబు:
C) సన్యాసి చెప్పింది విని ఖిన్నుడిని అయ్యాను

ప్రశ్న 27.
నదులలోని నీరు ప్రవహించును. ఇది ఏ రకమైన వాక్యం ?
A) నిషేధార్థక వాక్యం
B) తద్ధర్మార్థక వాక్యం
C) ప్రశ్నార్థక వాక్యం
D) విధ్యర్థక వాక్యం
జవాబు:
B) తద్ధర్మార్థక వాక్యం

ప్రశ్న 28.
తనకు చాలా ముఖ్యమైన పని యుందని రాము అన్నాడు దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి.
A) వానికి ముఖ్యమైన పని ఉందని రాము అన్నాడు.
B) ముఖ్యమైన పని నేను చేయాలి అని రాము అన్నాడు.
C) “నాకు చాలా ముఖ్యమైన పని ఉంది” అని రాము అన్నాడు.
D) “నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను” అని రాము అన్నాడు.
జవాబు:
B) ముఖ్యమైన పని నేను చేయాలి అని రాము అన్నాడు.

ప్రశ్న 29.
రామం తప్పక వెళ్తాడు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) హేత్వర్థక వాక్యం
B) నిశ్చయార్థక వాక్యం
C) తుమున్నర్థక వాక్యం
D) ప్రార్థనార్థక వాక్యం
జవాబు:
B) నిశ్చయార్థక వాక్యం

ప్రశ్న 30.
పిల్లలు పల్లెలకు వెళ్ళవచ్చు. – ఇది ఏ రకమైన వాక్యం ?
A) ప్రార్థనార్థక వాక్యం
B) అనుమత్యర్థక వాక్యం
C) అప్యర్థక వాక్యం
D) ప్రశ్నార్థక వాక్యం
జవాబు:
B) అనుమత్యర్థక వాక్యం

ప్రశ్న 31.
సన్యాసి పండుకున్నాడు. సన్యాసి నిద్రపోలేదు – దీనికి సంయుక్త వాక్యం ఏది ?
A) నిద్ర కోసం సన్యాసి పండుకున్నాడు.
B) సన్యాసి నిద్ర కోసం పండుకున్నాడు.
C) సన్యాసి పండుకున్నాడు గాని నిద్రపోలేదు
D) సన్యాసి పండుకున్నాడు నిద్రించాడు
జవాబు:
C) సన్యాసి పండుకున్నాడు గాని నిద్రపోలేదు

ప్రశ్న 32.
రైతులు పంటలు పండించారు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) పండించారు
B) రైతులచే పంటలు పండించబడినాయి
C) రైతులతో పంటలు పండించబడును
D) రైతులు పండించారు పంటలు
జవాబు:
B) రైతులచే పంటలు పండించబడినాయి

ప్రశ్న 33.
వారందరికి ఏమైంది ? ఇది ఏ రకమైన వాక్యం ?
A) ప్రశ్నార్థక వాక్యం
B) అప్యర్థక వాక్యం
C) తద్ధర్మార్థక వాక్యం
D) సందేహార్థక వాక్యం
జవాబు:
A) ప్రశ్నార్థక వాక్యం

ప్రశ్న 34.
‘కోటలో ఉత్తర భాగమునందు జింకల వనము ఒకటి యుండెను” ఈ వాక్యాన్ని వ్యవహార భాషలో రాస్తే (June ’18)
A) కోటయందు నుత్తర భాగమునందు జింకల వనము ఒకటి నుండెను.
B) కోటలో ఉత్తర భాగమునందు ఒక జింకల వనము యున్నది.
C) కోటలో ఉత్తర భాగాన జింకల వనం ఒకటి ఉండేది.
D) కోట ఉత్తర భాగంలో ఒక జింకల వనము ఉండె.
జవాబు:
C) కోటలో ఉత్తర భాగాన జింకల వనం ఒకటి ఉండేది.

TS 10th Class Telugu Bits 12th Lesson భూమిక

These TS 10th Class Telugu Bits with Answers 12th Lesson భూమిక will help students to enhance their time management skills.

TS 10th Class Telugu Bits 12th Lesson భూమిక

బహుళైచ్ఛిక ప్రశ్నలు (\(\frac{1}{2}\) మార్కులు)

PAPER – I: PART – B

1. సొంతవాక్యాలు (1 మార్కు)

1. అపూర్వం : ……………………..
…………………………..
జవాబు:
తెలంగాణలో బ్రతుకమ్మ ఉత్సవాలు అపూర్వంగా జరిగాయి.

2. సన్నివేశం : …………………..
………………………….
జవాబు:
నాటకాల్లోని సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి.

3. విశిష్ట స్థానం : ……………….
…………………………
జవాబు:
తెలంగాణ కవులలో దాశరథి గార్కి ఒక విశిష్ట స్థానం ఉంది.

TS 10th Class Telugu Bits 12th Lesson భూమిక

4. అనుమాన బీజాలు : ……….
………………………… (June ’18)
జవాబు:
చెడ్డవారు మంచివారి మనసునందు అనుమాన బీజాలు నాటే ప్రయత్నంచేస్తారు.

2. అర్థాలు

ప్రశ్న 1.
ధ్యాస పదానికి అర్థం
A) దృష్టి
B) సృష్టి
C) సమష్టి
D) వ్యష్టి
జవాబు:
A) దృష్టి

ప్రశ్న 2.
శృతి, శ్రావ్య ఇద్దరూ సఖ్యతతో మెలగుతారు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) విరోధంగా
B) స్నేహంగా
C) ఇష్టంగా
D) కష్టంగా
జవాబు:
B) స్నేహంగా

ప్రశ్న 3.
డా|| శ్రీనివాస్ గారి హస్తవాసి చాలా మంచిది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) దేవుని చలువ
B) మాటతీరు
C) చేతి చలువ
D) దయ
జవాబు:
C) చేతి చలువ

ప్రశ్న 4.
ప్రఖ్యాతి అనే పదానికి అర్థం గుర్తించండి.
A) దురవస్థ
B) సద్గతి
C) అప్రసిద్ధి
D) ప్రసిద్ధి
జవాబు:
D) ప్రసిద్ధి

ప్రశ్న 5.
“కోవ” అనే పదానికి అర్థం ?
A) జత
B) శక్తి
C) పోలిక
D) సంబంధం
జవాబు:
D) సంబంధం

TS 10th Class Telugu Bits 12th Lesson భూమిక

ప్రశ్న 6.
“పాతిపెట్టు” అనే అర్థం గల పదం?
A) నిక్షిప్తం
B) సాధనం
C) ఖననం
D) గుంట
జవాబు:
C) ఖననం

ప్రశ్న 7.
ఒక శాఖ మరొక శాఖలో విలీనమైంది – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) మాయమయింది
B) కలిసింది
C) జతకలియు
D) బాగుపడింది
జవాబు:
B) కలిసింది

ప్రశ్న 8.
“స్నేహము” అనే పదానికి సరియైన అర్థం
A) స్నేహితుడు
B) దోస్తు
C) సఖ్యత
D) పరిచయం
జవాబు:
C) సఖ్యత

ప్రశ్న 9.
పరిణామం – అంటే అర్థం
A) నియమం
B) పరిమాణం
C) పరిమితి
D) మార్పు
జవాబు:
D) మార్పు

3. పర్యాయపదాలు

ప్రశ్న 1.
స్నేహము ఎంతో విలువైనది. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) కథ, సేన
B) మైత్రి, నెయ్యం
C) గాథ, బలం
D) దళం, గూడు
జవాబు:
B) మైత్రి, నెయ్యం

ప్రశ్న 2.
తెలంగాణలో కథా రచయితలు ఎక్కువ. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) కత, గాథ
B) సేన, బలం
C) ప్రేమ, నెయ్యం
D) బాస, మాట
జవాబు:
A) కత, గాథ

ప్రశ్న 3.
యువ సైన్యం ఎలుగెత్తి నడవాలి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) కథానిక, గాథ
B) సున్నం, ఇటుక
C) సేన, బలం
D) ఒప్పు, గౌరి
జవాబు:
C) సేన, బలం

ప్రశ్న 4.
ముస్లిమ్ పదానికి పర్యాయపదాలు
A) ముస్లిమ్, అక్బరు
B) మహమ్మదీయుడు, తురుష్కుడు
C) యువజడు, యువకుడు
D) జాతి, తెగ
జవాబు:
B) మహమ్మదీయుడు, తురుష్కుడు

ప్రశ్న 5.
వంశం పదానికి పర్యాయపదాలు
A) కులము, కథ
B) కత, చెలిమి
C) కులము, జాతి
D) సంతతి, వసతి
జవాబు:
C) కులము, జాతి

ప్రశ్న 6.
పెళ్ళి పదానికి పర్యాయపదాలు
A) పరిణయం, వివాహం
B) ఉద్వాహం, ఆలోచన
C) కళ్యాణం, కమనీయం
D) మనువు, తనువు
జవాబు:
A) పరిణయం, వివాహం

ప్రశ్న 7.
సఖ్యత, దోస్తి, చెలిమి – అనే పర్యాయపదాలు గల పదం
A) స్నేహం
B) మిత్రుడు
C) జిగ్ని
D) నేస్తు
జవాబు:
A) స్నేహం

ప్రశ్న 8.
సైన్యము అనే పదానికి పర్యాయపదాలు కాని జంట
A) దండు, అనీకిని
B) రాణువ, వాహిని
C) బలగము, చమూ
D) రాజు, సేవకులు
జవాబు:
B) రాణువ, వాహిని

TS 10th Class Telugu Bits 12th Lesson భూమిక

ప్రశ్న 9.
పెండ్లి అనే పదానికి పర్యాయపదాలు కాని జంట
A) పరిణయము, వివాహము
B) ఉద్యాహము, కరగ్రహణం
C) మనువు, పాణిగ్రహం
D) వియ్యము, నెయ్యము
జవాబు:
D) వియ్యము, నెయ్యము

4. వ్యుత్పత్యర్థాలు

ప్రశ్న 1.
“లోకులను అంధులుగా చేయునది” (దీనికి సరిపోయే వ్యుత్పత్యర్థ పదం గుర్తించండి.)
A) మమకారం
B) గృహచారం
C) దురాచారం
D) అంధకారం
జవాబు:
D) అంధకారం

ప్రశ్న 2.
వార్తలను ప్రకటన చేయు కాగితం (దీనికి సరిపోయే వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)
A) సంతోషం
B) అంధకారం
C) వార్తాపత్రిక
D) స్వాతి
జవాబు:
C) వార్తాపత్రిక

ప్రశ్న 3.
హరింపబడునది – దీనికి వ్యుత్పత్తి పదం ఏది?
A) హృదయము
B) మనస్సు
C) కాళ్ళు
D) చేతులు
జవాబు:
A) హృదయము

ప్రశ్న 4.
వాతము (గాలి) ఆవరించిన స్థలము – అనే వ్యుత్పత్తి గల పదం
A) జలుబు
B) వాతావరణము
C) వాతరోగము
D) వాయి
జవాబు:
B) వాతావరణము

ప్రశ్న 5.
“అదృష్టము” నకు సరియైన వ్యుత్పత్తి అర్థము
A) దృష్టిలేనిది
B) దృష్టమునకు తోడైనది
C) చూడబడనిది
D) అదృష్టవంతుడు
జవాబు:
C) చూడబడనిది

ప్రశ్న 6.
“కేశి అను రాక్షసుని చంపిన వాడు” – దీనికి వ్యుత్పత్తి గల పదం ఏది ?
A) కేశవులు
B) కథ
C) ఆయుధము
D) యుగాంతము
జవాబు:
A) కేశవులు

ప్రశ్న 7.
“కొంచెము సత్యమును, కొంత కల్పన గల చరిత్ర” – దీనికి వ్యుత్పత్తి గల పదం ఏది?
A) ఆయుధము
B) కథ
C) కావ్యము
D) చరిత్ర
జవాబు:
B) కథ

ప్రశ్న 8.
“చూడబడనిది”. దీనికి వ్యుత్పత్తి గల పదం ఏది ?
A) తెలుగు
B) హృదయం
C) అదృష్టము
D) దురదృష్టము
జవాబు:
C) అదృష్టము

ప్రశ్న 9.
“యుద్ధము చేయుటకు తగిన సాధనము”. దీనికి వ్యుత్పత్తి గల పదం ఏది?
A) ఖడ్గము
B) కత్తి
C) గద
D) ఆయుధము
జవాబు:
D) ఆయుధము

TS 10th Class Telugu Bits 12th Lesson భూమిక

ప్రశ్న 10.
“యుగాంతం” – దీనికి వ్యుత్పత్తి పదం ఏది ?
A) యుగముల అంతము
B) వంగడం
C) రూపు
D) యుగము
జవాబు:
A) యుగముల అంతము

ప్రశ్న 11.
తెలుగు వ్యుత్పత్తి
A) అదృష్టము
B) తెనుగు
C) తమిళం
D) త్రిలింగముల మధ్య ఉపయోగించబడు భాష
జవాబు:
D) త్రిలింగముల మధ్య ఉపయోగించబడు భాష

ప్రశ్న 12.
వాతావరణము వ్యుత్పత్యర్థం ఏది ?
A) యుగముల అంతం
B) చూడబడునది
C) గాలితో కూడి ఉండునది
D) హరింపబడునది
జవాబు:
C) గాలితో కూడి ఉండునది

5. నానార్థాలు

ప్రశ్న 1.
తెలుగు భాష అమృతభాష (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) మాట, ప్రతిన
B) సంతోషం, గౌరి
C) కత, కథానిక
D) దళం, దండు
జవాబు:
C) కత, కథానిక

ప్రశ్న 2.
తెలంగాణ భాష సుధలు కురిపించును. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) బాస, మాట
B) సంతోషం, వృద్ధి
C) అమృతం, సున్నం
D) గౌరి, కత
జవాబు:
C) అమృతం, సున్నం

ప్రశ్న 3.
చెలిమి, చమురు, ప్రేమ – అనే నానార్థాలుగా గల పదం
A) స్నేహము
B) శత్రువు
C) నూనె
D) పగలు
జవాబు:
A) స్నేహము

ప్రశ్న 4.
రాజు అనే పదానికి నానార్థాలు
A) రాజు, తరాజు
B) ప్రభువు, జమిందారు
C) ప్రభువు, చంద్రుడు
D) చంద్రుడు, ఈశ్వరుడు
జవాబు:
C) ప్రభువు, చంద్రుడు

ప్రశ్న 5.
పత్రిక – అనే పదానికి నానార్థాలు
A) వార్తాపత్రిక, తాటియాకు, కాగితం
B) పెళ్ళిపుస్తకం, జాబు
C) పూజ సామగ్రి, వంట చెరకు
D) పుత్రిక, కూతురు
జవాబు:
A) వార్తాపత్రిక, తాటియాకు, కాగితం

ప్రశ్న 6.
తూర్పు, మొదటిది, పూర్వభాగం – అనే నానార్థాలు గల పదం
A) తూర్పు
B) పూర్వం
C) తొలి
D) మలి
జవాబు:
C) తొలి

ప్రశ్న 7.
వంశము కృష్ణుని వాద్యము, వంశము యదువంశము. పైన వంశము అను పదంలో వచ్చిన నానార్థాలు
A) వంగడము, కులము
B) పిల్లనగ్రోవి, కులము, వంగడం
C) సమూహము, కులము
D) వెన్నెముక, కులము
జవాబు:
B) పిల్లనగ్రోవి, కులము, వంగడం

TS 10th Class Telugu Bits 12th Lesson భూమిక

6. ప్రకృతి – వికృతులు

ప్రశ్న 1.
తెలంగాణ కథలు బాగా ఉంటాయి. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) కత
B) స్వామి
C) గౌరి
D) కృష్ణ
జవాబు:
A) కత

ప్రశ్న 2.
దొంగస్వాములను నమ్మరాదు. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) కత
B) సామి
C) మాట
D) వ్రతము
జవాబు:
B) సామి

ప్రశ్న 3.
శ్రీరామసుగ్రీవుల స్నేహం అపూర్వం – గీత గీసిన పధానికి వికృతి పదం ఏది?
A) కయ్యము
B) నెయ్యము
C) భవ్యము
D) తుల్యము
జవాబు:
B) నెయ్యము

ప్రశ్న 4.
దాశరథి ఒక గొప్ప కవి – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది ?
A) కయి
B) కావ్యము
C) రచయిత
D) కవిత్వము
జవాబు:
A) కయి

ప్రశ్న 5.
రాజులు మత్తులు, వారిని సేవించుట వృథా – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది ?
A) రాణులు
B) రాయలు
C) నెయ్యము
D) మహారాజులు
జవాబు:
B) రాయలు

ప్రశ్న 6.
పెద్దలు కథలు చెప్పేవారు – గీత గీసిన పదానికి వికృతి పదం ఏది ?
A) కతలు
B) కైతలు
C) రాజులు
D) తేడులు
జవాబు:
A) కతలు

ప్రశ్న 7.
“భాష, స్నేహం” అనే పదాలకు సరియైన వికృతి పదాలు
A) బాస, నెయ్యం
B) భాస, నేస్తం
C) బష, స్నేయం
D) బాష, స్నేహం
జవాబు:
A) బాస, నెయ్యం

ప్రశ్న 8.
“సందియము” నకు సరియైన ప్రకృతి పదం
A) సంది
B) సందేహము
C) సందోహం
D) సందేశం
జవాబు:
B) సందేహము

ప్రశ్న 9.
అపురూపముగా పాట పాడింది – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) అబ్బురము
B) అపూర్వము
C) ఆపూపము
D) పూర్వము
జవాబు:
B) అపూర్వము

ప్రశ్న 10.
సి.నా.రే. గొప్ప కవి. ఆయన కవితలు రాశాడు గీత గీసిన పదాలకు వికృతి పదాలు
A) కవురు, కతలు
B) కయి, కైత
C) కపి, కై
D) గవి, కథ
జవాబు:
B) కయి, కైత

ప్రశ్న 11.
“త్రిలింగము” ప్రకృతి కాగా వికృతి పదము
A) తైలింగ
B) తిరులింగ
C) తెలుగు
D) మూడు లింగములు
జవాబు:
C) తెలుగు

TS 10th Class Telugu Bits 12th Lesson భూమిక

ప్రశ్న 12.
“అంబ” ప్రకృతి పదమునకు వికృతి పదం
A) అంబిక
B) అమ్మ
C) అంబా
D) అంబరం
జవాబు:
B) అమ్మ

భాషాంశాలు (వ్యాకరణం)

PAPER – II : PART – B

1. సంధులు

ప్రశ్న 1.
విశ్వవిద్యాలయం (విడదీయండి.)
A) విశ్వ + విద్యాలయం
B) విశ్వవి + ద్యఆలయం
C) విశ్వవిద్య + ఆలయం
D) విశ్వద + విద్యాలయం
జవాబు:
C) విశ్వవిద్య + ఆలయం

ప్రశ్న 2.
మహోన్నతము – ఏ సంధి ?
A) సవర్ణదీర్ఘసంధి
B) గుణసంధి
C) యణాదేశసంధి
D) త్రికసంధి
జవాబు:
B) గుణసంధి

ప్రశ్న 3.
అంతర్యుద్ధం – విడదీయండి.
A) అంతః + యుద్ధం
B) అంతర్ + యుద్ధం
C) అంతర్ః + యుద్ధం
D) అంతర్య + యుద్ధం
జవాబు:
A) అంతః + యుద్ధం

ప్రశ్న 4.
ఉత్తరాంధ్ర – విడదీయండి.
A) ఉతరాం + ఆంధ్ర
B) ఉత్తర + ఆంధ్ర
C) ఉత్త + ఆంధ్ర
D) ఉత్తరః + ఆంధ్ర
జవాబు:
B) ఉత్తర + ఆంధ్ర

ప్రశ్న 5.
సార్థకత – విడదీయండి.
A) సః + అధికం
B) సా + ఆర్థకత
C) స + ఆర్థకత
D) స + అర్థకత
జవాబు:
D) స + అర్థకత

ప్రశ్న 6.
మహోన్నతము – విడదీయండి.
A) మహో + న్నతము
B) మహాన + తము
C) మహా + ఉన్నతము
D) మహోన్న + ఉన్నతము
జవాబు:
C) మహా + ఉన్నతము

ప్రశ్న 7.
“నట్టేట, కుట్టుసురు” లో వచ్చు సంధి
A) ఉత్వ సంధి
B) టకార సంధి
C) నడిసంధి
D) ద్విరుక్తటకారాదేశ సంధి
జవాబు:
D) ద్విరుక్తటకారాదేశ సంధి

ప్రశ్న 8.
“టుగాగమ సంధి”కి ఉదాహరణ
A) పల్లెటూరు
B) పటాటోపము
C) కప్పదాటు
D) పటాలు
జవాబు:
A) పల్లెటూరు

TS 10th Class Telugu Bits 12th Lesson భూమిక

ప్రశ్న 9.
“వృద్ధిసంధి”లో అకారమునకు పరముగా వచ్చు స్వరములు
A) ఇ, ఉ, ఋ లు
B) ఏ, ఐ, ఓ, ఔ లు
C) ఆ, ఈ, ఏ లు
D) అ, ఇ, ఉ, ఋ లు
జవాబు:
B) ఏ, ఐ, ఓ, ఔ లు

2. సమాసాలు

ప్రశ్న 1.
“తెలుగు సాహిత్యము” ఏ సమాసము ?
A) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
B) షష్ఠీ తత్పురుష సమాసము
C) తృతీయా తత్పురుష సమాసము
D) ద్విగు సమాసము
జవాబు:
A) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

ప్రశ్న 2.
“తెలంగాణ పలుకుబడులు” ఏ సమాసము ?
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) తృతీయా తత్పురుష సమాసము
C) బహువ్రీహి సమాసము
D) ద్విగు సమాసము
జవాబు:
A) షష్ఠీ తత్పురుష సమాసము

ప్రశ్న 3.
‘దృష్టం కానిది’ సమాసంగా కూర్చండి.
A) విశ్వాసం
B) సమాసం కానిది
C) అదృష్టం
D) సాహిత్యం
జవాబు:
C) అదృష్టం

ప్రశ్న 4.
“స్వేచ్ఛా అనెడి వాయువులు” ఏ సమాసము?
A) రూపక సమాసము
B) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
C) షష్ఠీ తత్పురుష సమాసము
D) నఞ తత్పురుష సమాసము
జవాబు:
A) రూపక సమాసము

ప్రశ్న 5.
“ఉస్మానియా యూనివర్శిటీ” ఏ సమాసము?
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) తృతీయా తత్పురుష సమాసము
C) నఞ తత్పురుష సమాసము
D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
జవాబు:
D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

ప్రశ్న 6.
అదానమును, ప్రదానమును – అను విగ్రహవాక్యానికి సమాసము పేరు
A) ద్విగు సమాసము
B) అవ్యయీభావ సమాసము
C) ద్వంద్వ సమాసము
D) ద్వితీయా తత్పురుష సమాసము
జవాబు:
C) ద్వంద్వ సమాసము

ప్రశ్న 7.
పదకొండు కథలు అను సమాసము యొక్క నామం
A) విశేషణ పూర్వపద కర్మధారయం
B) ద్విగు సమాసము
C) ద్వంద్వ సమాసము
D) బహువ్రీహి సమాసము
జవాబు:
B) ద్విగు సమాసము

ప్రశ్న 8.
ఇది ఒక గొప్పకథ – గీత గీసిన పదం ఏ సమాసం?
A) విశేషణ పూర్వపదకర్మధారయం
B) విశేషణ ఉత్తరపదకర్మధారయం
C) రూపక సమాసము
D) ఉపమానోత్తరపద కర్మధారయం
జవాబు:
A) విశేషణ పూర్వపదకర్మధారయం

ప్రశ్న 9.
“అదృష్టము” నకు విగ్రహవాక్యము → దృష్టము కానిది. మరి సమాసము పేరు
A) ప్రథమా తత్పురుష
B) ద్వితీయా తత్పురుష
C) నఞ తత్పురుష
D) రూపక సమాసము
జవాబు:
C) నఞ తత్పురుష

ప్రశ్న 10.
“ప్రజల జీవితాలు” – అనే సమాస పదానికి వచ్చు సమాసము పేరు
A) పంచమీ తత్పురుష
B) ద్వితీయా తత్పురుష
C) షష్ఠీ తత్పురుష
D) సప్తమీ తత్పురుష
జవాబు:
A) పంచమీ తత్పురుష

TS 10th Class Telugu Bits 12th Lesson భూమిక

ప్రశ్న 11.
కులమతాలు – దీనికి సరియైన విగ్రహవాక్యం
A) కులము మతములు రెండు
B) కులానికి మతానికి
C) కులము లేని మతము
D) కులమును, మతమును
జవాబు:
D) కులమును, మతమును

3. ఛందస్సు

ప్రశ్న 1.
11వ అక్షరం యతిగా గల పద్యపాదం
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభం
D) శార్దూలం
జవాబు:
B) చంపకమాల

ప్రశ్న 2.
గగ,భ,జ,స,న,ల గణాలు వచ్చే పద్యం
A) చంపకమాల
B) తేటగీతి
C) ఆటవెలది
D) కందం
జవాబు:
D) కందం

ప్రశ్న 3.
1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యపాదం
A) ఆటవెలది
B) తేటగీతి
C) కందం
D) చంపకమాల
జవాబు:
B) తేటగీతి

ప్రశ్న 4.
“నా నంద గీతంబు లగ్గించువారు, పూనిశం కర గీతములు పాడువారు” – ఇది ఏ పద్యపాదం ?
A) కందం
B) తేటగీతి
C) ద్విపద
D) ఆటవెలది
జవాబు:
C) ద్విపద

ప్రశ్న 5.
“ఆపరమపు రంధ్రుల యందే పుణ్యాంగనయు భిక్షయిడదయ్యె గటా” – ఇది ఏ పద్యపాదం ?
A) కందం
B) తేటగీతి
C) ఆటవెలది
D) సీస
జవాబు:
A) కందం

ప్రశ్న 6.
‘దమము శమము కూడని జపతపము లేల” ఇది ఏ పద్యపాదం ?
A) ఆటవెలది
B) తేటగీతి
C) కందం
D) ద్విపద
జవాబు:
B) తేటగీతి

ప్రశ్న 7.
నా రాజా – అనేవి ఏ గణము ?
A) భగణము
B) యగణము
C) తగణము
D) మగణము
జవాబు:
D) మగణము

4. అలంకారాలు

ప్రశ్న 1.
నానార్థాలను కలిగి ఉండే అలంకారం
A) శ్లేష
B) రూపకం
C) ఉపమ
D) ఉత్ప్రేక్ష
జవాబు:
A) శ్లేష

ప్రశ్న 2.
శ్లేషాలంకారానికి ఉదాహరణ
A) ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది
B) ఆమె ముఖం చంద్రబింబం
C) రాజు, చంద్రుడు ఒక్కడే
D) మావిడాకులు తెచ్చివ్వండి
జవాబు:
D) మావిడాకులు తెచ్చివ్వండి

ప్రశ్న 3.
అనాథనాధ నంద నందనం” ఇది ఏ అలంకారం ?
A) ఛేకానుప్రాసాలంకారం
B) లాటానుప్రాసాలంకారం
C) ఉపమాలంకారం
D) రూపకాలంకారం
జవాబు:
A) ఛేకానుప్రాసాలంకారం

TS 10th Class Telugu Bits 12th Lesson భూమిక

ప్రశ్న 4.
“నగారా మోగిందా, నయాగరా దుమికిందా” ఇందలి అలంకారం గుర్తించండి.
A) వృత్త్యనుప్రాస
B) లాటానుప్రాస
C) ఛేకానుప్రాస
D) అంత్యానుప్రాస
జవాబు:
D) అంత్యానుప్రాస

ప్రశ్న 5.
ఉపమేయాన్ని, ఉపమానంగా ఊహించి చెపితే అది ఏ అలంకారం ?
A) ఉపమాలంకారం
B) ఉత్ప్రేక్షాలంకారం
C) రూపకాలంకారం
D) అతిశయోక్తి
జవాబు:
B) ఉత్ప్రేక్షాలంకారం

ప్రశ్న 6.
ఉపమాన ఉపమేయములకు భేదం లేనట్లు చెపితే అది ఏ అలంకారం ?
A) ఉపమాలంకారం
B) ఉత్ప్రేక్షాలంకారం
C) లాటానుప్రాసాలంకారం
D) రూపకాలంకారం
జవాబు:
D) రూపకాలంకారం

ప్రశ్న 7.
“రాజు కువలయానందకరుడు” లో ఏ అలంకారం దాగి ఉన్నది ?
A) ఉపమ
B) ఉత్ప్రేక్ష
C) శ్లేష
D) అతిశయోక్తి
జవాబు:
C) శ్లేష

5. వాక్యపరిజ్ఞానం

ప్రశ్న 1.
ధర్మంబు నాచరించవలె. దీనికి ఆధునిక వాక్యం
A) ఆచరించును ధర్మంబు
B) ధర్మాన్ని ఆచరించాలి
C) ధర్మం చెల్లినా ఆచరించాలి
D) నాచరించాలి ధర్మంబును
జవాబు:
B) ధర్మాన్ని ఆచరించాలి

ప్రశ్న 2.
రవి నగరంబునకు చనియె. దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) రవి నగరంలో ఉన్నాడు.
B) రవి నగరంబున గనియె
C) రవి నగరానికి వెళ్ళాడు
D) రవి నగరంబులో చనియె
జవాబు:
C) రవి నగరానికి వెళ్ళాడు

ప్రశ్న 3.
ప్రజలు పక్షులను రక్షింపవలె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) ప్రజలు పక్షులను రక్షించాలి.
B) ప్రజలెల్లరును రక్షింపవలె పక్షి జాతిని
C) పక్షిజాతిని రక్షింపవలె ప్రజలు
D) రక్షించాలి పక్షులను ప్రజలెల్లరు
జవాబు:
A) ప్రజలు పక్షులను రక్షించాలి.

ప్రశ్న 4.
‘జీవనార్థము మిక్కిలి యూయాసంపాటు సయితము వ్యర్థము’ (ఆధునిక వచనాన్ని గుర్తించండి)
A) జీవించుటకు ఇంత కష్టము పడటం అవసరమా ?
B) జీవించడానికి మిక్కిలి ఆయాసపడటం దండగ
C) జీవించడానికి ఇన్ని కష్టాలు పడడం దండగకాదు
D) తినడం కోసమే బ్రతకడం వ్యర్థము
జవాబు:
B) జీవించడానికి మిక్కిలి ఆయాసపడటం దండగ

ప్రశ్న 5.
లక్షల పావురములు ఉన్నవి – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) లక్షల కొలదిగా యున్నవి పావురములు
B) పావురములు లక్షాధికంబుగ ఉన్నవి
C) పావురములున్నవి లక్షల కొలదిగ
D) లక్షల పావురాలు ఉన్నాయి
జవాబు:
D) లక్షల పావురాలు ఉన్నాయి

ప్రశ్న 6.
తల్లి ఆహారం అందించింది. దీనికి కర్మణి వాక్యం
A) తల్లి కొరకు ఆహారం అందెను
B) అందించెను ఆహారంబు తల్లి
C) తల్లికి ఆహారం అందించబడెను
D) తల్లిచేత ఆహారం అందించబడింది
జవాబు:
C) తల్లికి ఆహారం అందించబడెను

TS 10th Class Telugu Bits 12th Lesson భూమిక

ప్రశ్న 7.
చిత్రగ్రీవం అభ్యసనం చేసింది. దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) చిత్రగ్రీవం నందు అభ్యాసం చేయించెను
B) చేయించబడెను అభ్యాసంబు చిత్రగ్రీవము
C) చిత్రగ్రీవము చేత అభ్యాసం చేయబడింది
D) చిత్రగ్రీవం కొరకు అభ్యాసం చేయబడింది
జవాబు:
C) చిత్రగ్రీవము చేత అభ్యాసం చేయబడింది

ప్రశ్న 8.
తండ్రిపక్షి ఎగురుట నేర్పెను – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) తండ్రి పక్షికి ఎగురుటను నేర్పించెను
B) తండ్రి పక్షి కొరకు ఎగురుటను నేర్పించెను
C) తండ్రి పక్షిచే ఎగురుట నేర్పబడెను
D) తండ్రి పక్షి వల్ల ఎగురుటను నేర్పెను
జవాబు:
D) తండ్రి పక్షి వల్ల ఎగురుటను నేర్పెను

ప్రశ్న 9.
చిత్రగ్రీవం ఎగురుట తెలిసింది – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) చిత్రగ్రీవమునకు ఎగురుట తెలియను
B) చిత్రగ్రీవం వల్ల ఎగురుట తెలిసింది
C) చిత్రగ్రీవం ఎగరడం నేర్చుకొనును
D) చిత్రగ్రీవముచే ఎగురుట తెలియబడెను
జవాబు:
B) చిత్రగ్రీవం వల్ల ఎగురుట తెలిసింది

ప్రశ్న 10.
బాలురిచే సెలవు దీసికొనబడినది – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.
A) బాలురి వల్ల తీసుకొనబడింది సెలవు
B) సెలవుల కోసం బాలురు తీసుకున్నారు.
C) బాలురు సెలవు తీసికొన్నారు
D) తీసుకున్నారు సెలవు బాలురవల్ల
జవాబు:
C) బాలురు సెలవు తీసికొన్నారు

ప్రశ్న 11.
తనకు ఎగరడం తెలుసునని చిత్రగ్రీవం అన్నది. దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి.
A) ‘వాడికి ఎగరడం రావాలి’ అని చిత్రగ్రీవం అన్నది
B) ‘నేను పైకి ఎగురుతాను’ అని చిత్రగ్రీవం అన్నది
C) ‘నాకు ఎగరడం తెలుసు’ అని చిత్రగ్రీవం అన్నది
D) ‘తనకు ఎగరడం తెలియదు’ అని చిత్రగ్రీవం అన్నది
జవాబు:
C) ‘నాకు ఎగరడం తెలుసు’ అని చిత్రగ్రీవం అన్నది

ప్రశ్న 12.
తనకు ధైర్యమెక్కువని పక్షి పలికింది. దీనికి ప్రత్యక్ష కథనం గుర్తించండి.
A) ‘వానికి ఎక్కువ ధైర్యంబు’ అని పక్షి పలికింది
B) ‘అతనికి ధైర్యం చాలా ఎక్కువ’ అని పక్షి అనింది
C) ‘నాకు ధైర్యం ఎక్కువ’ అని పక్షి పలికింది
D) ‘వానికి ధైర్యం ఉండాలి’ అని పక్షి అన్నది
జవాబు:
D) ‘వానికి ధైర్యం ఉండాలి’ అని పక్షి అన్నది

ప్రశ్న 13.
వఱదైన చేను దున్నవద్దని కవి అన్నాడు – ప్రత్యక్ష కథనం గుర్తించండి.
A) “వఱదైన చేను దున్నకూడదు” అని కవి అన్నాడు.
B) “వఱదైన చేనును దున్ను” అని కవి అన్నాడు.
C) “వఱదైన చేను దున్నవద్దు” అని కవి అన్నాడు.
D) కవి అన్నాడు “వఱదైన చేన దున్నుము” అని.
జవాబు:
A) “వఱదైన చేను దున్నకూడదు” అని కవి అన్నాడు.

ప్రశ్న 14.
“వరికుప్ప చేలో నీరు పడ్డది, నీవు రావాలి”, అని రచయితతో కోటయ్య అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) వరికుప్ప చేలో నీరు పడిందని కోటయ్య అన్నాడు.
B) వరికుప్ప చేలో నీరు పడ్డదని, రచయితను రమ్మని కోటయ్య రచయితతో అన్నాడు.
C) వరికుప్ప చేలో నీరు పడిందని అన్నాడు.
D) చేలో వరికుప్పకు నీరు చేరిందని కోటయ్యతో రచయిత అన్నాడు.
జవాబు:
B) వరికుప్ప చేలో నీరు పడ్డదని, రచయితను రమ్మని కోటయ్య రచయితతో అన్నాడు.

ప్రశ్న 15.
పక్షి పైకి ఎగురగలదు. ఇది ఏ రకమైన వాక్యం ?
A) తద్ధర్మార్థక వాక్యం
B) హేత్వర్థక వాక్యం
C) తుమున్నర్థక వాక్యం
D) సామర్థ్యార్థక వాక్యం
జవాబు:
B) హేత్వర్థక వాక్యం

ప్రశ్న 16.
వర్షాలు పడితే పంటలు పండుతాయి – ఇది ఏ రకమైన వాక్యం ? (A.P Mar’16)
A) చేదర్థకం
B) విధ్యర్థకం
C) అధిక్షేపకం
D) క్త్వార్థకం
జవాబు:
C) అధిక్షేపకం

TS 10th Class Telugu Bits 12th Lesson భూమిక

ప్రశ్న 17.
బూర్గులవారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు ఇది ఏ రకమైన వాక్యం ? (A.P Mar’16)
A) అనుమత్యర్థకం
B) ప్రశ్నార్థకం
C) కర్మణి
D) కర్తరి వాక్యం
జవాబు:
A) అనుమత్యర్థకం

ప్రశ్న 18.
ఆహా ! ఎంత బాగుంది ? ఇది ఏ రకమైన వాక్యం ? (A.P Mar’16)
A) క్త్వార్థకం
B) ఆశ్చర్యార్థకం
C) ప్రేరణార్థకం
D) శత్రర్థకం
జవాబు:
A) క్త్వార్థకం

ప్రశ్న 19.
పాలు తెల్లగా ఉంటాయి. ఇది ఏ రకమైన వాక్యం ? (‘A.P Mar’ 15)
A) తద్ధర్మార్థక వాక్యం
B) హేత్వర్థక వాక్యం
C) భావార్థక వాక్యం
D) నిషేధార్థక వాక్యం
జవాబు:
A) తద్ధర్మార్థక వాక్యం

ప్రశ్న 20.
‘మీరు లోపలికి రావచ్చు’ – ఇది ఏ రకమైన సామాన్య వాక్యం ?
A) సందేహార్థక వాక్యం
B) విధ్యర్థకం
C) అనుమత్యర్థకం
D) ఆత్మార్థకం
జవాబు:
C) అనుమత్యర్థకం

ప్రశ్న 21.
కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి. ఇది వాక్యం ?
A) చేదర్థకం
B) శత్రర్థకం
C) క్వార్థం
D) అనుమత్యర్థకం
జవాబు:
A) చేదర్థకం

ప్రశ్న 22.
నేటి విద్యార్థులు చక్కటి పౌరులుగా ఎదగగలరు. ఇది ఏ వాక్యం ?
A) తుమున్నర్థకం
B) సామర్ధ్యార్థకం
C) చేదర్థకం
D) విధ్యర్థకం
జవాబు:
B) సామర్ధ్యార్థకం

ప్రశ్న 23.
“నెల్లూరి కేశవస్వామితో నా స్నేహం 1950ల నాటిది” అని అన్నాడు గూడూరు సీతారాం. ఈ వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మారిస్తే (March 2017 )
A) నెల్లూరి కేశవస్వామితో నా స్నేహం 1950ల నాటిదని అన్నాడు గూడూరు సీతారాం.
B) నెల్లూరి కేశవస్వామితో తన స్నేహం 1950ల నాటిదని అన్నాడు గూడూరు సీతారాం.
C) “నెల్లూరి కేశవస్వామితో తన స్నేహం 1950ల నాటిది” అని అన్నాడు గూడూరు సీతారాం.
D) నా స్నేహం నెల్లూరి కేశవస్వామితో 1950ల నాటిదని అన్నాడు గూడూరు సీతారాం.
జవాబు:
C) “నెల్లూరి కేశవస్వామితో తన స్నేహం 1950ల నాటిది” అని అన్నాడు గూడూరు సీతారాం.

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

These TS 10th Class Telugu Bits with Answers 11th Lesson భిక్ష will help students to enhance their time management skills.

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

బహుళైచ్ఛిక ప్రశ్నలు (\(\frac{1}{2}\) మార్కులు)

PAPER – I: PART – B

1. సొంతవాక్యాలు

1. సూడిగములు : ………………………..
………………………………..
జవాబు:
మహిళలు చేతులకు సూడిగములు వేసుకుంటారు.

2. కోపావేశం : ………………………..
………………………………..
జవాబు:
దుర్యోధనుడు కోపావేశంతో మాట్లాడాడు.

3. అపారము : ………………………..
………………………………..
జవాబు:
కాళిదాసుకు అపారమైన పాండిత్యం ఉంది.

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

4. కనుల పండుగ : ………………………..
………………………………..
జవాబు:
దసరా ఉత్సవాలు రాజధానిలో కనుల పండుగగా జరిగాయి.

5. కంకణంకట్టుకొను : ………………………..
………………………………..
జవాబు:
సమాజంలోని అసమానతలను రూపు
మాపడానికి ప్రభుత్వం కంకణం కట్టుకొనింది.

6. తలలో నాలుక : ………………………..
………………………………..
జవాబు:
శిష్యులు గురువులకు తలలో నాలుకగా ఉంటారు.

2. అర్ధాలు

ప్రశ్న 1.
వ్యాసుని కోరిక నెరవేరలేదు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) ఈప్సితం
B) తాపసుడు
C) తండ్రి
D) గురువు
జవాబు:
A) ఈప్సితం

ప్రశ్న 2.
భోజనముపై నెయ్యిని అభిఘరించినారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) కలుపు
B) చల్లు
C) కడుగు
D) పెరుగు
జవాబు:
B) చల్లు

ప్రశ్న 3.
తల్లిదండ్రులు మనల పేర్మితో చూస్తారు. గీతగీసిన పదానికి అర్ధం. (June ’18)
A) ద్వేషం
B) ప్రేమ
C) సుఖం
D) మర్యాద
జవాబు:
B) ప్రేమ

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

ప్రశ్న 4.
ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక అంగన తప్పక ఉంటుంది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) భుక్తిశాల
B) చూచు
C) స్త్రీ
D) పురుషుడు
జవాబు:
C) స్త్రీ

ప్రశ్న 5.
పిపాస తీరాలి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) క్రోథ
B) దప్పిక
C) ఓపిక
D) కాంక్ష
జవాబు:
B) దప్పిక

ప్రశ్న 6.
ఇతరుల క్షుత్తును తీర్చాలి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) మస్తకం
B) దాహం
C) ఆకలి
D) నాశిక
జవాబు:
C) ఆకలి

ప్రశ్న 7.
అసురులు అనగా (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) దేవతలు
B) పాములు
C) రాక్షసులు
D) గంధర్వులు
జవాబు:
C) రాక్షసులు

ప్రశ్న 8.
శ్రీనాథుడు ముక్కంటి భక్తుడు. ముక్కంటి అనగా (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) శివుడు
B) విష్ణువు
C) రాముడు
D) వినాయకుడు
జవాబు:
A) శివుడు

ప్రశ్న 9.
నీకింత ఆగ్రహము కూడదు. ‘ఆగ్రహము’నకు అర్థము
A) దయ
B) గ్రహము
C) శాంతము
D) కోపము
జవాబు:
D) కోపము

ప్రశ్న 10.
“ఏ మచ్చెకంటియు వంటకంబు పెట్టకున్నఁ గటకటంబడి” మచ్చెకంటి అనగా
A) చేపకన్నుల వంటి కన్నులు గలది
B) చేపల వంటి కన్నులు గలది
C) చేప మొప్పల వంటి కన్ను గలది
D) చేపతోక వంటి కన్నులు గలది
జవాబు:
B) చేపల వంటి కన్నులు గలది

ప్రశ్న 11.
అనవుడు నల్లనవ్వి కమలానన యిట్లను. ‘అనవుడు’కు అర్థం ?
A) అనిన పిమ్మట
B) వినిన పిమ్మట
C) కనిన పిమ్మట
D) పాడిన పిమ్మట
జవాబు:
A) అనిన పిమ్మట

ప్రశ్న 12.
ఒకసారి నేను నీఱె౦డలో చెప్పులు లేకుండానే నడవాల్సి వచ్చింది. ‘నీఱె౦డ’ అనగా ?
A) తీక్షణమయిన ఎండ
B) తక్కువ ఎండ
C) వర్షపు ఎండ
D) చలితో కూడిన ఎండ
జవాబు:
A) తీక్షణమయిన ఎండ

ప్రశ్న 13.
గోమయముతో చేసిన పిడకలను ఒకప్పుడు వంటకు వాడేవారు. గోమయము అనగా ?
A) గేదెపేడ
B) ఆవుపేడ
C) ఆవునేయి
D) ఆవుమూత్రం
జవాబు:
B) ఆవుపేడ

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

ప్రశ్న 14.
సీత, గీతలు జాతరలో సూడిగములు కొన్నారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) (Mar.’ 15)
A) బొమ్మలు
B) గజ్జెలు
C) బట్టలు
D) గాజులు
జవాబు:
D) గాజులు

ప్రశ్న 15.
సభలో రుద్రమదేవి హాటకపీఠము పై కూర్చొని యున్నది. గీత గీసిన పదానికి అర్థం ?
A) రజత పీఠం
B) స్వర్ణ పీఠం
C) కాంస్య పీఠం
D) వజ్ర పీఠం
జవాబు:
B) స్వర్ణ పీఠం

ప్రశ్న 16.
ఎదుటి వారిలోని తప్పులను ఎంచి పదే పదే కుందాడరాదు. గీత గీసిన పదానికి అర్థం ?
A) పొగడరాదు
B) మాట్లాడరాదు
C) నిందించరాదు
D) పలకరాదు
జవాబు:
C) నిందించరాదు

ప్రశ్న 17.
విద్యార్థులు సఖ్యతతో మెలగాలి. అర్థం
A) స్నేహం – చెలిమి
B) స్నేహం – కలిమి
C) బలిమి – స్నేహం
D) అందం – స్నేహం
జవాబు:
A) స్నేహం – చెలిమి

ప్రశ్న 18.
‘జిహ్వ’ అనే అర్థాన్ని సూచించే పదం.
A) నోరు
B) కళ్ళు
C) చెవి
D) నాలుక
జవాబు:
D) నాలుక

ప్రశ్న 19.
మానస సరోవరంలో మరాళాలు నివసిస్తాయి. పదానికి అర్థం
A) కొంగలు
B) హంసలు
C) చేపలు
D) కప్పలు
జవాబు:
B) హంసలు

ప్రశ్న 20.
చేతులు – ఈ పదానికి అర్థం కానిది.
A) కేలు
B) హస్తములు
C) కరములు
D) వేలు
జవాబు:
A) కేలు

3. పర్యాయపదాలు

ప్రశ్న 1.
కాశీలో గంగలో స్నానమాడి, జాహ్నవికి ఇచ్చే హారతిని చూసి తరించాలి. (గీత గీసిన పదాలకు సరిపడు పర్యాయపదాన్ని గుర్తించండి.)
A) కావేరి
B) కృష్ణ
C) గోదావరి
D) భాగీరథి
జవాబు:
D) భాగీరథి

ప్రశ్న 2.
స్త్రీలు నేటి సమాజంలో ఇబ్బందులు పడుతున్నారు. మహిళా లోకం మేలుకొనాలి. (గీత గీసిన వాటికి సరిపోవు పర్యాయ పదం గుర్తించండి).
A) అనిత
B) వనిత
C) కవిత
D) సుమతి
జవాబు:
B) వనిత

ప్రశ్న 3.
అంగనను గౌరవించాలి. (గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి.) (Mar. ’15)
A) స్త్రీ, వనిత
B) లలన, లాలిత్యం
C) దహనం, దాపు
D) శివం, సుత
జవాబు:
A) స్త్రీ, వనిత

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

ప్రశ్న 4.
ముఖం సుందరంగా ఉంది. (గీత గీసిన పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.)
A) ఊరిమి, ఓరిమి
B) నోరు, ఆస్యము
C) పదును, నుదురు
D) జిహ్వ, ఉదరం
జవాబు:
B) నోరు, ఆస్యము

ప్రశ్న 5.
అహిమకరుడు పశ్చిమదిశ అస్తమించె. (గీత గీసిన పదానికి పర్యాయపదం గుర్తించండి.)
A) బృహస్పతి
B) సూర్యుడు
C) చంద్రుడు
D) గురుడు
జవాబు:
B) సూర్యుడు

ప్రశ్న 6.
ఎండాకాలంలో ఛత్రము అవసరం. (గీత గీసిన పదానికి పర్యాయపదం గుర్తించండి.)
A) పతంగం
B) గొడుగు
C) అంబారి
D) వింజామరం
జవాబు:
B) గొడుగు

ప్రశ్న 7.
పారాశర్యుడు భారతం రచించాడు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) గణపతి, పురందరుడు
B) వ్యాసుడు, బాదరాయణుడు
C) పులోమావి, వీక్షకుడు
D) పరాశరుడు, వైశంపాయనుడు
జవాబు:
B) వ్యాసుడు, బాదరాయణుడు

ప్రశ్న 8.
నాకు ముగ్గురు శిష్యులు ఉన్నారు. (గీత గీసిన పదానికి సరైన పర్యాయపదాలు గుర్తించండి). (A.P June’15)
A) ఛాత్రులు, పిల్లలు
B) ఛాత్రులు, అంతేవాసులు
C) ఛాత్రులు గురువులు
D) ఛాత్రులు, పెద్దలు
జవాబు:
A) ఛాత్రులు, పిల్లలు

ప్రశ్న 9.
‘ఏ అంగనయూ, ఈ వనితతో సమానము కాదు. (గీత గీసిన పదాలకు పర్యాయపదమును గుర్తించండి.)
A) పావని
B) సీత
C) దమయంతి
D) స్త్రీ
జవాబు:
D) స్త్రీ

ప్రశ్న 10.
“నీ ముఖం ! నీకేం తెలుసు”. గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) తల, శిరస్సు
B) నోరు, ఆస్యము
C) వదనము, ఆననము
D) హస్తము, అంగము
జవాబు:
B) నోరు, ఆస్యము

ప్రశ్న 11.
ఇతరులను కుందాడుట శ్రేయస్కరం కాదు. గీత గీసిన పదానికి పర్యాయపదం గుర్తించండి.
A) నిందించుట
B) అవమానించుట
C) పలుకరించుట
D) గోలచేయుట
జవాబు:
A) నిందించుట

ప్రశ్న 12.
ఏనుగు తొండము చేయితో తాకితే మనమేదో సహాయం చేస్తున్నామని ఏనుగు ఆనందిస్తుంది. గీత గీసిన పదాలకు పర్యాయపదం గుర్తించండి.
A) కరము
B) హరి
C) హిరణ్యము
D) హస్తము
జవాబు:
D) హస్తము

ప్రశ్న 13.
విద్యార్థి నిరంతరం శ్రమిస్తేనే విజేత అవుతాడు. గీత గీసిన పదానికి పర్యాయపదం ?
A) ఎల్లప్పుడు
B) ఎప్పుడు
C) అప్పుడప్పుడు
D) రోజూ
జవాబు:
A) ఎల్లప్పుడు

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

ప్రశ్న 14.
‘వైరి, రిపువు’ – ఈ పర్యాయపదాలను సూచించు పదం.
A) మిత్రుడు
B) శత్రువు
C) బంధువు
D) సోదరుడు
జవాబు:
B) శత్రువు

ప్రశ్న 15.
యాది – ఈ పదానికి పర్యాయపదాలు
A) స్మరణం – జ్ఞాపకం
B) జ్ఞాపకం – మరుపు
C) జ్ఞాపకం – ప్రేమ
D) జ్ఞాపకం – స్నేహం
జవాబు:
A) స్మరణం – జ్ఞాపకం

4. వ్యుత్పత్త్యర్థాలు

ప్రశ్న 1.
మూడు కన్నులు కలవాడు మమ్ములను రక్షించుగాక ! (గీత గీసిన పదానికి సరిపోవు వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.)
A) శివుడు
B) శంకరుడు
C) శంభుడు
D) మహేశ్వరుడు
జవాబు:
A) శివుడు

ప్రశ్న 2.
వేదములను విభజించినవాడు. (గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థపదం గుర్తించండి.) (Mar.’ 15)
A) వేదవ్యాసుడు
B) పురంధ్రి
C) పార్వతి
D) భవాని
జవాబు:
A) వేదవ్యాసుడు

ప్రశ్న 3.
‘చేపలు వంటి కన్నులు కలది’ అనే వ్యుత్పత్తి గల్గిన పదం (June’ 18)
A) ముక్కంటి
B) మృగనేత్రి
C) మచ్చెకంటి
D) అభినయి
జవాబు:
C) మచ్చెకంటి

ప్రశ్న 4.
ప్రకాశించునది కనుకనే బంగారం అంటే అందరికీ ఇష్టం. (గీత గీసిన పదానికి సరిపోవు వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.)
A) స్వర్ణం
B) హిరణ్యం
C) కనకం
D) హాటకం
జవాబు:
D) హాటకం

ప్రశ్న 5.
సుఖమునిచ్చునది అనిన భయమును కలిగించే చీకటిలో ప్రయాణం చేయకూడదు. (గీత గీసిన పదానికి సరిపోవు వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.)
A) రాత్రి
B) తమస్సు
C) అంధకారము
D) నిశీధి
జవాబు:
A) రాత్రి

ప్రశ్న 6.
పూజ కొరకు జలము పవిత్రమైన నది నుండి తెచ్చుకోవాలి. (గీత గీసిన పదానికి సరిపోవు వ్యుత్పత్త్యర్థం గుర్తించండి.)
A) అర్ఘ్యము
B) పూజాజలము
C) అర్చన
D) ఆరాధన
జవాబు:
A) అర్ఘ్యము

ప్రశ్న 7.
‘పరాశర మహర్షి కుమారుడు’ వ్యుత్పత్త్యర్థానికి సరియైన పదం గుర్తించండి.
A) పరాశరి
B) పారాశరుడు
C) పారాశర్యుడు
D) వాసిష్ఠుడు
జవాబు:
C) పారాశర్యుడు

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

ప్రశ్న 8.
‘ముక్కంటి’ పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి.
A) మూడు కన్నులు
B) మూడు కన్నులు గలవాడు
C) రెండు నేత్రాలు కలవాడు
D) ఏకాక్షుడు
జవాబు:
B) మూడు కన్నులు గలవాడు

ప్రశ్న 9.
గృహమును ధరించునది (వ్యుత్పత్యర్థము గుర్తించండి.)
A) భార్య
B) సతీమణి
C) పురంధ్రి
D) నారీమణి
జవాబు:
C) పురంధ్రి

ప్రశ్న 10.
“తిథి నియమములు లేకుండా వచ్చేవాడు” అనే వ్యుత్పత్తి గల పదం ఏది ?
A) అభ్యాగతి
B) తిధి
C) అతిథి
D) సన్న్యాసి
జవాబు:
C) అతిథి

ప్రశ్న 11.
భవాని ఒక పెద్ద ముత్తైదువ రూపంలో వచ్చి వ్యాసుణ్ణి మందలించింది. (గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యర్ధాన్ని గుర్తించుము. (A.P Mar.’18)
A) ఇంద్రుని భార్య
B) భవుని భార్య
C) విష్ణువు భార్య
D) సూర్యుని భార్య
జవాబు:
B) భవుని భార్య

5. నానానార్థాలు

ప్రశ్న 1.
పుణ్య పురుషుడు నిర్యాణం చెందిన తర్వాత కైవల్యం ప్రాప్తిస్తుంది. (గీత గీసిన పదాలకు సరిపడు నానార్థ పదం గుర్తించండి.)
A) గురువు
B) లక్ష్మి
C) మోక్షము
D) చేయి
జవాబు:
C) మోక్షము

ప్రశ్న 2.
తొండముతో కిరణములను చేధించుకుంటూ ఏనుగు వెళుతుంది. (గీత గీసిన పదాలకు నానార్థ పదం గుర్తించండి.)
A) కరము
B) మరణము
C) కరణము
D) చరణము
జవాబు:
A) కరము

ప్రశ్న 3.
దేశభాషలందు తెలుగులెస్సయని రాయలు లెస్సగా పలికెను. (గీత గీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.)
A) ఉపాధ్యాయుడు, తండ్రి
B) మేలు, చక్కని
C) పట్టణం, వదులుట
D) కరము, చేయి
జవాబు:
B) మేలు, చక్కని

ప్రశ్న 4.
వేసవిలో సూర్య కిరణములు మంట పుట్టిస్తాయి. చెట్టు కొమ్మ కొనన కూర్చున్నా చల్లదనం ఉండదు. (గీత గీసిన పదాలకు సరిపడు నానార్థ పదం గుర్తించండి.)
A) శిఖ
B) వృక్షము
C) అగ్ని
D) తుద
జవాబు:
A) శిఖ

ప్రశ్న 5.
ఉపాధ్యాయుని, తండ్రిని ఎదిరిస్తే బృహస్పతికైనా కీడు తప్పదు. (గీత గీసిన పదాలకు సరిపడు నానార్థ పదం గుర్తించండి.
A) పెద్ద
B) గురువు
C) పిత
D) మాష్టారు
జవాబు:
B) గురువు

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

ప్రశ్న 6.
అర్జునుడు తన కన్ను లక్ష్యముపైనే పెట్టి బాణం విడిచేవాడు. అతను ఆవును రక్షించడం యజ్ఞముగా భావించేవాడు. (గీత గీసిన పదాలకు సరిపడు నానార్థ
పదం గుర్తించండి.)
A) గోవు
B) నరుడు
C) గురి
D) నేత్రం
జవాబు:
A) గోవు

ప్రశ్న 7.
‘మీ గృహములో ఎందరున్నారు’ ? గీత గీసిన పదానికి నానార్థాలు ఏవి ?
A) ఇల్లు, భవనము
B) ఇల్లు, భార్య
C) తండ్రి, చేయి
D) నెయ్యి, తొండము
జవాబు:
B) ఇల్లు, భార్య

ప్రశ్న 8.
కరణము, చేయి, తొండము అనే నానార్థం గల పదం ఏది ?
A) కరి
B) పాణి
C) కరము
D) హస్తము
జవాబు:
C) కరము

ప్రశ్న 9.
మెట్ట తామరలతో శ్రీదేవిని పూజిస్తే ఐశ్వర్యము పెరుగుతుంది. (గీత గీసిన పదాలకు సరిపడు నానార్థ పదం గుర్తించండి.)
A) పూజ
B) లక్ష్మి
C) అర్చన
D) ఈశ్వరుడు
జవాబు:
B) లక్ష్మి

ప్రశ్న 10.
ఒక తెగలోని పద్ధతి మరొకదానితో సామ్యము లేకపోయినా పురుషాంతరముల నుండి అవి కొనసాగుతాయి. (గీత గీసిన పదాలకు సరిపడు
నానార్థ పదం గుర్తించండి.)
A) తరీషము
B) తరి
C) తరము
D) తరణము
జవాబు:
C) తరము

ప్రశ్న 11.
దిక్కు – అనే పదానికి
A) దిశ – ఆధారం.
B) దిశ – చోటు
C) దిశ – ఎల్లలు
D) మొక్కు – దిక్కు
జవాబు:
D) మొక్కు – దిక్కు

6. ప్రకృతి – వికృతులు

ప్రశ్న 1.
లక్ష్మి – దీనికి వికృతి పదం ఏది ?
A) రూపం
B) దోషం
C) లచ్చి
D) సాచ్చి
జవాబు:
C) లచ్చి

ప్రశ్న 2.
శక్తి – దీనికి వికృతి పదం ఏది ?
A) విద్దె
B) వేషము
C) రతనము
D) సత్తి
జవాబు:
D) సత్తి

ప్రశ్న 3.
“బిచ్చము” – దీనికి ప్రకృతి పదం ఏది ?
A) భిక్షము
B) రతనము
C) చట్టు
D) రూపు
జవాబు:
A) భిక్షము

ప్రశ్న 4.
సుకము – దీనికి ప్రకృతి పదం ఏది ?
A) సుక్యము
B) సకము
C) సుఖము
D) సూన్యము
జవాబు:
C) సుఖము

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

ప్రశ్న 5.
రూపము – దీనికి వికృతి పదం ఏది ?
A) పాయసం
B) రూప
C) రూప్యము
D) రతనము
జవాబు:
B) రూప

ప్రశ్న 6.
శ్రీ – దీనికి వికృతి పదం ఏది ?
A) శ్రీజము
B) సిరిజము
C) సిరి
D) పున్నెము
జవాబు:
C) సిరి

ప్రశ్న 7.
మీ బంతిలో నేను కూర్చుంటాను (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.) (June ’15)
A) బాది
B) పంక్తి
C) పంతి
D) బంక్తి
జవాబు:
B) పంక్తి

ప్రశ్న 8.
వేసవిలో స్త్రీలు మల్లెలను సిగలలో పెట్టుకొంటారు. దీనికి వికృతి పదం ఏది ?
A) సెగ
B) జడ
C) కొప్పు
D) శిఖ
జవాబు:
D) శిఖ

ప్రశ్న 9.
అమెరికా యాత్ర ఆనందంగా గడిచింది. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
A) యతర
B) జాతర
C) జైత్ర
D) యతనము
జవాబు:
B) జాతర

ప్రశ్న 10.
ఎవరి పుణ్యము వారిని కాపాడుతుంది. గీత గీసిన పదానికి వికృతి ?
A) పుణయము
B) పుణ్ణియం
C) పున్నెము
D) పున్నియు
జవాబు:
C) పున్నెము

ప్రశ్న 11.
పూజకు పుష్పం చదువుకు పుస్తకం కావాలి. గీత గీసిన పదానికి వికృతి ?
A) పుష్పము
B) పూలు
C) సుమం
D) పూవు
జవాబు:
D) పూవు

భాషాంశాలు (వ్యాకరణం)

PAPER – II : PART – B

1. సంధులు

ప్రశ్న 1.
భిక్షాన్నం – విడదీయగా
A) భిక్ష + అన్నం
B) భిక్షా + ఆన్నము
C) భీక్ష + ఆన్నము
D) భిక్షా + అన్నము
జవాబు:
A) భిక్ష + అన్నం

ప్రశ్న 2.
“పాపాత్ములు” ఏ సంధి
A) గుణ సంధి
B) యణాదేశ సంధి
C) సవర్ణదీర్ఘ సంధి
D) అత్వ సంధి
జవాబు:
C) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 3.
ఏ, ఓ, అర్లను ఏమంటారు ?
A) గుణాలు
B) యణ్ణులు
C) త్రికాలు
D) సవర్ణములు
జవాబు:
A) గుణాలు

ప్రశ్న 4.
మా యిల్లు ఏ సంధి ?
A) త్రిక సంధి
B) గసడదవాదేశ సంధి
C) ఉత్వ సంధి
D) యడాగమ సంధి
జవాబు:
D) యడాగమ సంధి

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

ప్రశ్న 5.
ఇవ్వీటి – ఏ సంధి ?
A) త్రిక సంధి
B) యణాదేశ సంధి
C) ఉత్వ సంధి
D) ఇత్వ సంధి
జవాబు:
A) త్రిక సంధి

ప్రశ్న 6.
ఆ, ఈ, ఏలను ఏమంటారు ?
A) యణులు
B) త్రికములు
C) గుణాలు
D) సరళాలు
జవాబు:
B) త్రికములు

ప్రశ్న 7.
“మునీశ్వర” ఏ సంధి ?
A) గుణసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) యణాదేశ సంధి
D) త్రికసంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 8.
“పట్టపగలు” ఏ సంధి ?
A) ద్విరుక్తటకారాదేశ సంధి
B) యణాదేశ సంధి
C) త్రిక సంధి
D) ఉత్వ సంధి
జవాబు:
A) ద్విరుక్తటకారాదేశ సంధి

ప్రశ్న 9.
‘వాఙ్మయము’ ఏ సంధి ?
A) గసడదవాదేశ సంధి
B) ప్రాతాది సంధి
C) అనునాసిక సంది
D) గుణ సంధి
జవాబు:
C) అనునాసిక సంది

ప్రశ్న 10.
‘పుణ్యావాసము’ పదాన్ని విడదీయండి.
A) పుణ్య + వాసము
B) పున్నె + వాసము
C) పుణె + నివాసము
D) పుణ్య + ఆవాసము
జవాబు:
D) పుణ్య + ఆవాసము

ప్రశ్న 11.
ముత్తెదువ కు నమస్కరిస్తే పాపాలు పోతాయి. గీత గీసిన పదాన్ని విడదీయండి.
A) ముత్తు + ఐదువ
B) ముత్తి + ఐదువ
C) ముక్తి + ఐదువ
D) ముత్త + ఐదువ
జవాబు:
D) ముత్త + ఐదువ

ప్రశ్న 12.
అమ్మహాసాధ్వి సీత దుఃఖమే లంకను నశింపచేసింది. గీత గీసిన పదానికి సంధి పేరేమి ?
A) సవర్ణదీర్ఘ సంధి
B) గుణ సంధి
C) త్రిక సంధి
D) అత్వ సంధి
జవాబు:
C) త్రిక సంధి

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

ప్రశ్న 13.
గురు శిష్యులు మండుటెండలో భిక్షకోసం తిరిగారు. (గీత గీసిన పదానికి విడదీసిన రూపాన్ని గుర్తించండి.
A) మండుట + ఎండ
B) మండు + టెండ
C) మండు + ఎండ
D) మండుట + అండ
జవాబు:
C) మండు + ఎండ

2. సమాసాలు

ప్రశ్న 1.
“రత్న ఖచితం” ఏ సమాసం ? (A.P June’17)
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
B) షష్ఠీ తత్పురుష సమాసము
C) తృతీయా తత్పురుష సమాసము
D) ద్విగు సమాసము
జవాబు:
C) తృతీయా తత్పురుష సమాసము

ప్రశ్న 2.
షష్ఠీ తత్పురుష సమాసమునకు ఉదాహరణ
A) విశ్వనాథునిరూపం
B) కాశీపట్టణం
C) పాపాత్ముడు
D) లేతీగ
జవాబు:
A) విశ్వనాథునిరూపం

ప్రశ్న 3.
బహువ్రీహి సమాసమునకు ఉదాహరణ
A) కాశీనగరం
B) లేతీగ
C) శాకాహారులు
D) మధ్యాహ్నం
జవాబు:
C) శాకాహారులు

ప్రశ్న 4.
పుణ్యాంగన ఏ సమాసం ?
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
B) బహువ్రీహి సమాసం
C) చతుర్థీ తత్పురుష సమాసం
D) షష్ఠీ తత్పురుష సమాసం
జవాబు:
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ప్రశ్న 5.
బహుపద ద్వంద్వ సమాసానికి ఉదాహరణ
A) రామలక్ష్మణులు
B) తల్లిదండ్రులు
C) అక్కా చెల్లెళ్ళు
D) వేద పురాణశాస్త్రములు
జవాబు:
D) వేద పురాణశాస్త్రములు

ప్రశ్న 6.
కాళ్ళూ చేతులు కడుగుకొని భోజనశాలలోకి ప్రవేశించడం మంచిది. (గీత గీసిన పదానికి సమాస నామం ?)
A) షష్ఠీ తత్పురుష సమాసం
B) ద్వంద్వ సమాసం
C) ద్విగు సమాసం
D) చతుర్థీ తత్పురుష సమాసం
జవాబు:
D) చతుర్థీ తత్పురుష సమాసం

ప్రశ్న 7.
పుణ్యాంగనా వ్యాసునికి భిక్షం వేయలేదు. గీత గీసిన పదానికి విగ్రహవాక్యం
A) పుణ్యము కొరకు అంగన
B) పుణ్యమైన అంగన
C) పుణ్యమును, అంగనయును
D) పుణ్యము చేత అంగన
జవాబు:
B) పుణ్యమైన అంగన

ప్రశ్న 8.
కాశీలోని స్త్రీలు అతిథులకు అర్ఘ్య పాద్యాలు ఇచ్చి భోజనం పెట్టేవారు. గీత గీసిన పదానికి విగ్రహవాక్యం
A) అర్ఘ్యము అనెడి పాద్యం
B) అర్ఘ్యము మరియు పాద్యము
C) అర్ఘ్యము కొరకు పాద్యము
D) అర్హమైన పాద్యము
జవాబు:
B) అర్ఘ్యము మరియు పాద్యము

ప్రశ్న 9.
చిగురు బోడి ! నాతోపాటు నా శిష్యులు భోజనం చేయాలి. గీత గీసిన పదంలోని సమాసం ?
A) రూపక సమాసం
B) షష్ఠీతత్పురుష సమాసం
C) విశేషణ పూర్వపద కర్మధారయం
D) బహువ్రీహి సమాసం
జవాబు:
D) బహువ్రీహి సమాసం

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

ప్రశ్న 10.
పూర్వ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది ?
A) అవ్యయీభావం
B) కర్మధారయం
C) తత్పురుష
D) ద్విగువు
జవాబు:
A) అవ్యయీభావం

3. ఛందస్సు

ప్రశ్న 1.
“మునివర నీవు శిష్య గణముంగొని చయ్య నరమ్ము విశ్వనా” ఇది ఏ పద్యపాదం ?
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) మత్తేభం
D) శార్దూలం
జవాబు:
A) చంపకమాల

ప్రశ్న 2.
“వేదోక్త శివధర్మ విధి బసవనికి” ఇది ఏ పద్యపాదం ?
A) తేటగీతి
B) ఆటవెలది
C) ద్విపద
D) కందం
జవాబు:
C) ద్విపద

ప్రశ్న 3.
“య్యాదిమ శక్తి, సంయమివరా ! యిటు రమ్మనిపిల్చె హస్తసం” ఇది ఏ పద్యపాదం ?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) తేటగీతి
D) ఆటవెలది
జవాబు:
A) ఉత్పలమాల

ప్రశ్న 4.
“ఆకంఠంబుగ నిఫ్టు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా”. ‘ఇది ఏ పద్యపాదమో గుర్తించండి.
A) తేటగీతి
B) ఆటవెలది
C) శార్దూలం
D) మత్తేభం
జవాబు:
C) శార్దూలం

ప్రశ్న 5.
యటు విశేషించి శివుని యర్థాంగ లక్ష్మి. ఇది ఏ పద్య పాదము ?
A) తేటగీతి
B) ఆటవెలది
C) సీసం
D) ఉత్పలమాల
జవాబు:
A) తేటగీతి

ప్రశ్న 6.
శ్రీనాథుని ప్రతిభ ఏ పద్యాల్లో కనిపిస్తుంది ?
A) తేటగీతి
B) కందం
C) సీసం
D) ఆటవెలది
జవాబు:
C) సీసం

ప్రశ్న 7.
‘ముంగిట గోమయంబున గోముఖము దీర్చి కడలునాల్గుగ మ్రుగ్గుకఱవెట్టి’ ఇది ఏ పద్యపాదం ?
A) సీసం
B) కందం
C) చంపకమాల
D) ఉత్పలమాల
జవాబు:
A) సీసం

ప్రశ్న 8.
‘నఖిల విద్యాగురుండు భిక్షాటనంబు’ ఇది ఏ పద్యపాదం ?
A) ఆటవెలది
B) ద్విపద
C) మత్తేభం
D) తేటగీతి
జవాబు:
D) తేటగీతి

ప్రశ్న 9.
UIU – ఇది ఏ గణం ?
A) తగణం
B) రగణం
C) భగణం
D) సగణం
జవాబు:
B) రగణం

ప్రశ్న 10.
మత్తేభంలో యతిస్థానం ? (June’18)
A) 10వ అక్షరం
B) 11వ అక్షరం
C) 14వ అక్షరం
D) 13వ అక్షరం
జవాబు:
C) 14వ అక్షరం

4. అలంకారాలు

ప్రశ్న 1.
“శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు” – వీరులకు సాధ్యము కానిది లేదు కదా ! ఇది ఏ అలంకారం ?
A) స్వభావోక్త్యలంకారం
B) అర్థాంతరన్యాసాలంకారం
C) ఉపమాలంకారం
D) ఉత్ప్రేక్షాలంకారం
జవాబు:
B) అర్థాంతరన్యాసాలంకారం

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
విశేష విషయాన్ని సామాన్య విషయంతో గాని, సామాన్య విషయాన్ని విశేష విషయంతో గాని సమర్థించి చెపితే అది ఏ అలంకారం ?
A) రూపకాలంకారం
B) ఉత్ప్రేక్ష
C) స్వభావోక్త్యలంకారం
D) అర్థాంతరన్యాసాలంకారం
జవాబు:
D) అర్థాంతరన్యాసాలంకారం

ప్రశ్న 3.
ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పినచో అది అలంకారం ?
A) స్వభావోక్తి
B) రూపక
C) అతిశయోక్తి
D) అర్థాంతరన్యాస
జవాబు:
B) రూపక

ప్రశ్న 4.
అని పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింప దలంచు. ఇందలి అలంకారం ఏది ?
A) ఉత్ప్రేక్ష
B) వృత్త్యనుప్రాస
C) యమకం
D) లాటానుప్రాస
జవాబు:
B) వృత్త్యనుప్రాస

ప్రశ్న 5.
కమలాక్షు నర్చించు కరములు కరములు. ఇందులోని అలంకారాన్ని గుర్తించండి.
A) యమకం
B) అంత్యానుప్రాస
C) అనన్వయం
D) లాటానుప్రాస
జవాబు:
D) లాటానుప్రాస

ప్రశ్న 6.
‘కొన్ని మాటలు నీతోనాడ గలననిన నమ్మహా సాధ్వింగని, – ఇందలి అలంకారము.
A) వృత్త్యనుప్రాస
B) చేకానుప్రాస
C) లాటానుప్రాస
D) అంత్యానుప్రాస
జవాబు:
A) వృత్త్యనుప్రాస

ప్రశ్న 7.
నాటి యట్ల ముక్కంటిమాయ నే మచ్చెకంటియు వంటకంబు పెట్టకున్న గటకటంబడి – ఇందులోని అలంకారం
A) రూపకం
B) ఉత్ప్రేక్ష
C) స్వభావోక్తి
D) వృత్త్యనుప్రాస
జవాబు:
D) వృత్త్యనుప్రాస

ప్రశ్న 8.
‘ఇందు బింబాస్య యెదురుగా నేగుదెంచి’ ఇందలి అలంకారం
A) రూపకం
B) ఉపమాలంకారం
C) ఉత్ప్రేక్ష
D) స్వభావోక్తి
జవాబు:
B) ఉపమాలంకారం

ప్రశ్న 9.
‘చెడుగాక మోక్షలక్ష్మి’ ఇందలి అలంకారం
A) రూపకాలంకారం
B) వృత్త్యనుప్రాస
C) యమకం
D) ఉత్ప్రేక్ష
జవాబు:
A) రూపకాలంకారం

ప్రశ్న 10.
భగీరధుడు గంగను భూమిపైకి తెచ్చాడు. గొప్పవారు ఎంతటి కష్టమైన పనినైనా సాధిస్తారు గదా ! ఈ వాక్యంలోని అలంకారం గుర్తించండి ?
A) రూపకం
B) ఉత్ప్రేక్ష
C) అర్థాంతరన్యాసాలంకారం
D) యమకం
జవాబు:
C) అర్థాంతరన్యాసాలంకారం

ప్రశ్న 11.
‘ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడం’ అనేది ఏ అలంకారం ?
A) స్వభావోక్తి
B) ఉపమాలంకారం
C) ఉత్ప్రేక్ష
D) అతిశయోక్తి
జవాబు:
B) ఉపమాలంకారం

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

ప్రశ్న 12.
‘మా చెల్లెలు తాటి చెట్టు అంత పొడవు ఉంది’. ఈ వాక్యంలోని అలంకార మేది ?
A) స్వభావోక్తి
B) చేకానుప్రాస
C) లాటానుప్రాస
D) అతిశయోక్తి
జవాబు:
D) అతిశయోక్తి

ప్రశ్న 13.
‘మేడారం జాతరకు ఇసుకవేస్తే రాలనంత జనం వస్తారు’ – అనే వాక్యంలో అలంకారం ఏది ? (Mar.’ 17)
A) స్వభావోక్తి
B) శ్లేష
C) ఉపమాలంకారం
D) అతిశయోక్తి
జవాబు:
D) అతిశయోక్తి

ప్రశ్న 14.
అనేకార్థాలను కలిగి యుంటే అది (Mar.’ 17)
A) స్వభావోక్యలంకారం
B) అతిశయోక్తి అలంకారం
C) రూపకాలంకారం
D) శ్లేష అలంకారం
జవాబు:
D) శ్లేష అలంకారం

5. వాక్య పరిజ్ఞానం

ప్రశ్న 1.
వ్యాసుడు కాశీనగరంబునకు చనియె – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) వ్యాసుడు కాశీ నగరానికి వెళ్ళాడు
B) కాశీ నగరంబునకు వెళ్ళె వ్యాసుడు
C) చనెను వ్యాసుడు కాశీ నగరంబున
D) వ్యాసుడు కాశీపట్టణంబునకు వెళ్ళియుండెను
జవాబు:
A) వ్యాసుడు కాశీ నగరానికి వెళ్ళాడు

ప్రశ్న 2.
ఇవ్వీటి మీద నాగ్రహము దగునే ! – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) ఈ నగరమందు ఆగ్రహంబు తగునే
B) ఈ నగరంపైన కోపం తగునా
C) ఆగ్రహంబు తగునా ఈ నగరంబుపైన
D) నగరమందు ఈవ్వీటియందు దగునా !
జవాబు:
B) ఈ నగరంపైన కోపం తగునా

ప్రశ్న 3.
మా యింటికిం గుడువ రమ్ము! దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) మా ఇంట్లో తింటానికి రండి
B) మా ఇంటియందు తినుటకు విచ్చేయుము
C) మా ఇంటికి తినుట కొరకు విచ్చేయుము
D) మా ఇంట భుజించుటకు రమ్ము
జవాబు:
A) మా ఇంట్లో తింటానికి రండి

ప్రశ్న 4.
నాకు భిక్షను పెట్టు అని వ్యాసుడు అన్నాడు. – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) అతనికి భిక్ష పెట్టమని వ్యాసుడు చెప్పాడు
B) వ్యాసుడు భిక్ష పెట్టమని అన్నాడు.
C) తనకు భిక్షను పెట్టమని వ్యాసుడు అన్నాడు
D) తనకి భిక్షను పెట్టమని వ్యాసుడు చెప్పాడు.
జవాబు:
B) వ్యాసుడు భిక్ష పెట్టమని అన్నాడు.

ప్రశ్న 5.
తిరిగి రమ్మను నొక్క లేతీగ బోడి – దీనికి ఆధునిక వాక్యం గుర్తించండి.
A) లేతీగ బోడి తిరిగి నొక్క రమ్మన్నది
B) రమ్మన్నది తిరిగి లేతీగ బోడి నొకసారి
C) ఒక లతాంగి బోడి తిరిగి రమ్మంది
D) ఒక తిరిగి రమ్మను లేతీగ బోడి
జవాబు:
C) ఒక లతాంగి బోడి తిరిగి రమ్మంది

ప్రశ్న 6.
ఏ పాపాత్ముని ముఖంబు వీక్షించితినో – ఈ వాక్యానికి ఆధునిక వచనాన్ని గుర్తించండి. (A.P Mar.’17)
A) ఏ పాపాత్ముని చూసానో నేను !
B) ఏ పాపాత్ముని ముఖం చూసానో
C) ఏ పాపాత్ముని ముఖాన్ని చూడలేదు.
D) ఏ పాపాత్ముని చూడలేదు నేను
జవాబు:
B) ఏ పాపాత్ముని ముఖం చూసానో

ప్రశ్న 7.
శ్రీనాథుడు నైషథం రచించాడు. దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) శ్రీనాథునిచే నైషధం రచింపబడెను
B) శ్రీనాథుని వల్ల నైషధం రాశాడు.
C) శ్రీనాథుడు రచించాడు నైషధం
D) నైషధంబు రచింపబడియె శ్రీనాథుడు
జవాబు:
A) శ్రీనాథునిచే నైషధం రచింపబడెను

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

ప్రశ్న 8.
దేవి భిక్ష పెట్టింది – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) దేవియందు పెట్టబడినది భిక్ష
B) దేవిచే భిక్ష పెట్టబడింది.
C) దేవివల్ల భిక్ష పెట్టబడింది
D) దేవికి భిక్ష పెట్టబడింది
జవాబు:
B) దేవిచే భిక్ష పెట్టబడింది.

ప్రశ్న 9.
శ్రీనాథుడు కాశీఖండం రచించెను. వాక్యం గుర్తించండి. దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) కాశీఖండంబున శ్రీనాథుడు రచియించె
B) శ్రీనాథునిచే కాశీఖండం రచింపబడెను
C) కాశీఖండంలో శ్రీనాథుడు రచియించె
D) రచియింపబడియె శ్రీనాథుడు కాశీఖండంబు దీనికి కర్మణి వాక్యం
జవాబు:
B) శ్రీనాథునిచే కాశీఖండం రచింపబడెను

ప్రశ్న 10.
వ్యాసుడు కాశీని చూచాడు – దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) వ్యాసునికి కాశీ కనిపించింది
B) వ్యాసుని వల్ల కాశీ చూచాడు
C) వ్యాసునిచే కాశీ చూడబడెను
D) కాశీ వ్యాసుని వల్ల చూడబడింది
జవాబు:
C) వ్యాసునిచే కాశీ చూడబడెను

ప్రశ్న 11.
దేవి చేత గంధపుష్పాలు ఇవ్వబడెను.
A) దేవి వల్ల గంధపుష్పాలు అర్పించెను
B) దేవికి గంధపుష్పాలు అర్పించును
C) దేవి కొరకు గంధపుష్పాలు సమర్పించును
D) దేవి గంధపుష్పాలను ఇచ్చెను
జవాబు:
D) దేవి గంధపుష్పాలను ఇచ్చెను

ప్రశ్న 12.
తనకు కోపమెక్కువని వ్యాసుడు పలికాడు – దీనిని ప్రత్యక్ష కథనంలోకి మార్చండి.
A) అతనికి కోపం ఎక్కువ అని వ్యాసుడు పలికాడు
B) వానికి కోపం తక్కువ అని వ్యాసుడు అన్నాడు.
C) వానికి కోపం ఎక్కువ అని వ్యాసుడు అన్నాడు.
D) నాకు కోపం ఎక్కువ అని వ్యాసుడు అన్నాడు.
జవాబు:
D) నాకు కోపం ఎక్కువ అని వ్యాసుడు అన్నాడు.

ప్రశ్న 13.
“నాకు చదువును చెప్పు” అని శిష్యుడు అన్నాడు – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) వానికి చదువును చెప్పమని శిష్యుడు అన్నాడు
B) చెప్పమన్నది చదువని శిష్యుడు అన్నాడు.
C) తనకు చదువు తప్పక చెప్పాలని శిష్యుడు అన్నాడు
D) తనకు చదువును చెప్పమని శిష్యుడు అన్నాడు
జవాబు:
C) తనకు చదువు తప్పక చెప్పాలని శిష్యుడు అన్నాడు

ప్రశ్న 14.
‘నాకు భిక్ష సమర్పించు’ అని వ్యాసుడు అర్థించాడు. – దీనికి పరోక్ష కథన వాక్యం గుర్తించండి.
A) నేను భిక్షను అర్థించానని వ్యాసుడు చెప్పాడు
B) తనకు భిక్ష సమర్పించుమని వ్యాసుడు అర్థించాడు.
C) వానికి భిక్షను అర్పించాలని కోరాడు వ్యాసుడు
D) అతనికి భిక్ష సమర్పించాలని వ్యాసుడు కోరాడు
జవాబు:
B) తనకు భిక్ష సమర్పించుమని వ్యాసుడు అర్థించాడు.

ప్రశ్న 15.
“మీరందరూ తెలివైన విద్యార్థులే ! బాగా చదవండి”. అని అన్నారు డి.ఇ.ఓ గారు గుర్తించండి. – పరోక్ష కథనం గుర్తించండి.
A) మీరంతా బాగా చదివితే తెలివైనోళ్ళనని డి.ఇ.ఓ
B) తామంతా బాగా చదివినప్పుడు తెలివైనోళ్ళు అని డి.ఇ.ఓ గారన్నారు
C) తామందరమూ తెలివైన విద్యార్థులమేననీ, బాగా చదవాలనీ డి.ఇ.ఓ. గారన్నారు.
D) మీరందరూ తెలివైన విద్యార్థులేనని, బాగా చదవండని అన్నారు డి.ఇ.ఓ. గారు
జవాబు:
D) మీరందరూ తెలివైన విద్యార్థులేనని, బాగా చదవండని అన్నారు డి.ఇ.ఓ. గారు

ప్రశ్న 16.
దయచేసి పని వెంటనే పూర్తి చేయండి. (ఇది వాక్యం ?)
A) ప్రశ్నార్థకం
B) సంభావనార్థకం
C) విధ్యర్థకం
D) ప్రార్థనార్థకం
జవాబు:
B) సంభావనార్థకం

ప్రశ్న 17.
మీరు ఆఫీసుకు తప్పక రావాలి. (ఇది ఏ వాక్యం ?)
A) ప్రార్థనార్థకం
B) అజ్ఞార్థకం ( )
C) నిశ్చయార్థకం
D) విధ్యర్థకం
జవాబు:
D) విధ్యర్థకం

ప్రశ్న 18.
మీరు చూడని, వినని పుణ్యక్షేత్రం ఈ దేశంలో లేదు. (ఇది ఏ వాక్యం ?)
A) సంయుక్తవాక్యం
B) సంక్లిష్టవాక్యం
C) కర్తరి వాక్యం
D) సామాన్య వాక్యం
జవాబు:
B) సంక్లిష్టవాక్యం

ప్రశ్న 19.
వర్షాలు కురిసినా నీళ్ళు నిలవవు (ఇది ఏ వాక్యం ?)
A) చేదర్థకము
B) అనంతర్యార్థకము
C) క్త్వార్థకము
D) అప్యర్థకము
జవాబు:
D) అప్యర్థకము

TS 10th Class Telugu Bits 11th Lesson భిక్ష

ప్రశ్న 20.
శృతి కలెక్టరయ్యిందా ? (ఇది ఏ రకమైన వాక్యం ?)
A) ప్రశ్నార్థక వాక్యం
B) ఆశ్చర్యార్థకం
C) సందేహార్థకం
D) కర్తరి వాక్యం
జవాబు:
A) ప్రశ్నార్థక వాక్యం

ప్రశ్న 21.
సాయి, విజయ అక్కా చెల్లెండ్రు (ఇది ఏ రకమైన వాక్యం ?)
A) సంక్లిష్ట వాక్యం
B) సంయుక్త వాక్యం
C) కర్తరి వాక్యం
D) కర్మణి వాక్యం
జవాబు:
B) సంయుక్త వాక్యం

ప్రశ్న 22.
అమ్మ బుజ్జగించి, అన్నం పెట్టింది. (ఏ వాక్యమో గుర్తించండి.)
A) సంయుక్త వాక్యం
B) సంక్లిష్ట వాక్యం
C) ప్రశార్థక వాక్యం
D) విధ్యర్థక వాక్యం
జవాబు:
B) సంక్లిష్ట వాక్యం

ప్రశ్న 23.
కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి. ఇది ఏ రకమైన వాక్యం ?
A) చేదర్థకం
B) శత్రర్థకం
C) క్వార్ధం
D) అనుమత్యర్థకం
జవాబు:
A) చేదర్థకం

ప్రశ్న 24.
క్రింది వానిలో క్త్వార్ధ క్రియను గుర్తించండి.
A) వచ్చి
B) వస్తే
C) వస్తూ
D) వచ్చినా
జవాబు:
A) వచ్చి

ప్రశ్న 25.
నడిస్తే, చదివితే – ఇవి ఏ క్రియలు ?
A) తద్ధర్మార్థక క్రియలు
B) చేదర్థక క్రియలు
C) అప్యర్థక వాక్యాలు
D) క్త్వార్థక క్రియలు
జవాబు:
B) చేదర్థక క్రియలు

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

These TS 10th Class Telugu Bits with Answers 9th Lesson జీవనభాష్యం will help students to enhance their time management skills.

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

బహుళైచ్ఛిక ప్రశ్నలు (\(\frac{1}{2}\) మార్కులు)

PAPER – I: PART – B

1. సొంతవాక్యాలు (1 మార్కు)

1. మనసు కరగు : ……………….
……………………………
జవాబు:
మనసు కరగు : అందరి మనస్సులు కరిగేలా ఆమె ఏడ్చింది.

2. జడిపించు : …………………….
……………………………
జవాబు:
జడిపించు : బూచాడు వస్తున్నాడని మా అమ్మ నన్ను జడిపించేది.

3. ఊపిరాడని : ……………………
…………………………..
జవాబు:
ప్రధానమంత్రిని అనేక సమస్యలు ఊపిరాడ నివ్వటం లేదు.

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

4. అతలాకుతలం : ……………….
…………………………..
జవాబు:
పట్టణంలోని ప్రజలు ట్రాఫిక్ వల్ల అతలాకుతలం అవుతున్నారు.

2. అర్థాలు

ప్రశ్న 1.
మనిషిలాగా బ్రతకాలి. మృగములాగా బ్రతుకరాదు – గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. ( )
A) జంతువు
B) పశువు
C) సింహం
D) కోతి
జవాబు:
C) సింహం

ప్రశ్న 2.
నేస్తం పదానికి అర్థం గుర్తించండి.
A) మిగులుట
C) తరుగుట
B) కరుగుట
D) మిత్రుడు
జవాబు:
D) మిత్రుడు

ప్రశ్న 3.
మనిషీ, మృగమూ ఒకటనీ అనుకంటే వ్యర్థం గీసిన పదానికి అర్థం గుర్తించండి.
A) కథా
B) తథా
C) వృథా
D) బోధ
జవాబు:
C) వృథా

ప్రశ్న 4.
రాజకుమారులు అడవిలో వంకలు డొంకలు దాటి ముందుకు వెళ్ళారు – గీత గీసిన పదానికి అర్థాన్ని
A) కాలువలు
B) ఏఱులు
C) నదులు
D) చెరువులు
జవాబు:
B) ఏఱులు

ప్రశ్న 5.
డొంక కదలిన శబ్దం విని వీరుడు ధైర్యంగా నిలబడి చూశాడు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) చెట్టు
B) పొద
C) తీగ
D) ఆకు
జవాబు:
B) పొద

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 6.
గిరి చుట్టు ప్రదక్షిణ చేస్తే గిరిప్రదక్షిణ అంటారు గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. ( )
A) వాగు
B) శిఖరం
C) కొమ్ము
D) పర్వతం
జవాబు:
D) పర్వతం

ప్రశ్న 7.
“శిరస్సు” – అనే పదానికి అర్థం.
A) తల
B) సరస్సు
C) మనస్సు
D) శిఖరం
జవాబు:
A) తల

ప్రశ్న 8.
శ్రీనివాసుడు ఉద్ధండ పండితుడు. గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) గొప్ప
B) చిన్న
C) మధ్య
D) పనికిరాని
జవాబు:
A) గొప్ప

ప్రశ్న 9.
మా నాన్నగారు దుస్తురుమాలు లేనిది బయటకు వెళ్ళరు. (గీత గీసిన పదానికి అర్థం.)
A) శాలువ
B) భుజంపై కండువ
C) దస్తి
D) లాల్చి
జవాబు:
B) భుజంపై కండువ

ప్రశ్న 10.
“శక్ర ధనుస్సు” పదానికి అర్థం
A) శక్రుని ధనుస్సు
B) శని ధనుస్సు
C) ఇంద్రధనుస్సు
D) యమ ధనుస్సు
జవాబు:
C) ఇంద్రధనుస్సు

ప్రశ్న 11.
కురుక్షేత్రంలో చివరికి దుర్యోధనుడు ఏకాకిగా మిగిలాడు (గీత గీసిన పదానికి అర్థం.)
A) ఒక కాకి
B) ఒంటరి
C) తుంటరి
D) జంట
జవాబు:
B) ఒంటరి

3. పర్యాయపదాలు

ప్రశ్న 1.
మబ్బుకు పర్యాయపదాలు గుర్తించండి.
A) మేఘము, చీకటి
B) నేత్రము, చూపు
C) కుప్ప, కొండ
D) మైత్రి, స్నేహం
జవాబు:
A) మేఘము, చీకటి

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 2.
కన్నుకు పర్యాయపదాలు గుర్తించండి.
A) మైత్రి, స్నేహం
B) మాంసం, ప్రయోజనం
C) జాడ, నేత్రం
D) మనుజుడు, మానిసి
జవాబు:
C) జాడ, నేత్రం

ప్రశ్న 3.
మనస్సు మంచిగా ఉండాలె. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) హృదయం, అభిలాష
B) స్నేహం, నెయ్యం
C) కన్ను, నేత్రం
D) వారి, నీరు
జవాబు:
A) హృదయం, అభిలాష

ప్రశ్న 4.
పలము లేదని బాధపడరాదు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)
A) కుప్ప, కొండ
B) స్నేహం, నెయ్యం
C) మాంసం, ప్రయోజనం
D) స్నేహం, కోరిక
జవాబు:
C) మాంసం, ప్రయోజనం

ప్రశ్న 5.
మబ్బు అందం వర్ణనాతీతం- గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి. ( )
A) హృదయం, డెందం
B) తల, శీర్షం
C) మేఘము, అంబుదము
D) మస్తకము, ఘనము
జవాబు:
C) మేఘము, అంబుదము

ప్రశ్న 6.
గుండె అనే పదానికి అదే సమానార్థక పదాలు
A) హృదయం, డెందం
B) హృదయం, మూర్ధం
C) పందెం, డెందం
D) హృదయం, దయనీయం
జవాబు:
A) హృదయం, డెందం

ప్రశ్న 7.
శిరస్సు, తల – అనే పదాలకు సమానమైన పదం
A) డెందం
B) మస్తకం
C) పుస్తకం
D) వర్షం
జవాబు:
B) మస్తకం

ప్రశ్న 8.
“పయోధరము, జలదము, మేఘము” – అనే పర్యాయ పదాలు గల పదం
A) పయస్సు
B) సముద్రము
C) మబ్బు
D) జలములు
జవాబు:
C) మబ్బు

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 9.
“ఉదకము, సలిలము” – పర్యాయపదాలుగా ఉన్న పదము
A) జలధి
B) కంకు
C) నీరధి
D) అంబువు
జవాబు:
D) అంబువు

ప్రశ్న 10.
“డొంక” – పదానికి పర్యాయపదం కానిది
A) పొద
B) కొండ
C) ఈరము
D) నికుంజము
జవాబు:
A) పొద

ప్రశ్న 11.
వటువు బ్రహ్మాండాన్ని నిండినాడు.
(గీత గీసిన పదానికి అదే అర్థంవచ్చే పదాలు గుర్తించండి.)
A) విష్ణువు, బ్రహ్మ
B) పురోహితుడు, బ్రహ్మ
C) బ్రహ్మచారి, విష్ణువు
D) బ్రహ్మచారి, వర్ణి
జవాబు:
D) బ్రహ్మచారి, వర్ణి

ప్రశ్న 12.
జక్కన శిల్ప నిర్మాణ కౌశల్యం ఎన్నదగినది. గీత గీసిన పదానికి పర్యాయపదం గుర్తించండి.
A) నేర్పు, నైపుణ్యం
B) నేర్పు, నూర్పు
C) కోశలం, కౌశలం
D) అపకీర్తి, ఆచరణ
జవాబు:
A) నేర్పు, నైపుణ్యం

ప్రశ్న 13.
“మనసు, హృదయం” ఏ పదానికి చెందిన పర్యాయ పదాలో గుర్తించండి.
A) చిత్రము
B) పొత్తము
C) చిత్తము
D) విత్తము
జవాబు:
B) పొత్తము

4. వ్యుత్పత్త్యర్థాలు

ప్రశ్న 1.
హిమము గల కొండ (గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)
A) అరుణగిరి
B) భద్రగిరి
C) హిమగిరి
D) ధవళగిరి
జవాబు:
C) హిమగిరి

ప్రశ్న 2.
మనువు వలన పుట్టినవాడు. (వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)
A) మనుష్యుడు
B) గృహస్థుడు
C) గేస్తుడు
D) దుష్టుడు
జవాబు:
A) మనుష్యుడు

5. నానార్థాలు

ప్రశ్న 1.
మనస్సులో చెడ్డ ఆలోచనలు చేయరాదు. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
A) హృదయం, కోరిక
B) పాదము, చీకటి
C) జింక, యాచన
D) పాదము, అధమము
జవాబు:
A) హృదయం, కోరిక

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 2.
‘మృగము’ నానార్థాలు గుర్తించండి.
A) పాదము, పద్యపాదం
B) చీకటి, మేఘము
C) జింక, వేట
D) కోరిక, తలపు
జవాబు:
C) జింక, వేట

ప్రశ్న 3.
మబ్బు (నానార్థాలు గుర్తించండి.)
A) తలపు, కోరిక
B) మేఘము, అజ్ఞానం
C) పాదం, అధమం
D) జింక, పశువు
జవాబు:
B) మేఘము, అజ్ఞానం

ప్రశ్న 4.
శిరస్సు అన్న పదానికి నానార్థాలు
A) తల, కొండ కొన
B) వంకర, వాగు
C) చీకటి, మత్తు
D) పొద, దారి
జవాబు:
A) తల, కొండ కొన

ప్రశ్న 5.
గంగ వంకల నుండి పారుతుంది – గీత గీసిన పదానికి నానార్థాలు
A) గంగ, నది
B) వంకర, వాగు
D) మత్తు, అజ్ఞానం
C) జింక, వేట
D) మత్తు, జ్ఞానం
జవాబు:
B) వంకర, వాగు

ప్రశ్న 6.
జింక మృగం అందమైనది – గీత గీసిన పదానికి నానార్థాలు.
A) గంగా, యమునా
B) పొద, దారి
C) జింక, పశువు
D) పొద, పశువు
జవాబు:
C) జింక, పశువు

ప్రశ్న 7.
ఫలములు అనుభవించుటయే పరమావధిగా జీవి స్తారు – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) జింక, మృగం
B) వంకర, వాగు
C) జింక, చీకటి
D) పండు, ప్రయోజనం
జవాబు:
D) పండు, ప్రయోజనం

ప్రశ్న 8.
వంకలు – డొంకలు దాటి గోదావరి ప్రవహిస్తుంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) పొద, పల్లపు ప్రదేశం
B) మేఘము, చీకటి
C) పండు, ధనం
D) వంకర, దిక్కు
జవాబు:
A) పొద, పల్లపు ప్రదేశం

ప్రశ్న 9.
సాయంకాలపు వేళ మబ్బుగా ఉంది – గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.
A) మేఘము, దుబ్బు
B) మేఘము, చీకటి
C) మత్తు, వరుస
D) మేఘము, మొదలు
జవాబు:
A) మేఘము, దుబ్బు

ప్రశ్న 10.
“దిక్కు, వైపు, సాకు” – అనే నానార్థాలు గల పదం
A) దిశ
B) వంక
C) దారి
D) పెంచు
జవాబు:
A) దిశ

ప్రశ్న 11.
‘పేరు’ పదానికి నానార్థాలు గుర్తించండి.
A) నామధేయం, నామవాచకం
B) నామధేయం, కీర్తి
C) కీర్తి, కిరీటం
D) అపకీర్తి, ఆచరణ
జవాబు:
A) నామధేయం, నామవాచకం

ప్రశ్న 12.
“సంపద, సాలీడు” ఏ పదానికి సంబంధించిన నానార్థాలు
A) సిరి
B) ఐశ్వర్యం
C) శ్రీ
D) లక్ష్మీ
జవాబు:
C) శ్రీ

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 13.
‘కరము’ పదానికి నానార్థం
A) కట్టె, పుట్ట
B) చేయి, తొండము
C) చేయి, కాలు
D) గాడిద, ఏనుగు
జవాబు:
B) చేయి, తొండము

ప్రశ్న 14.
“భగీరథునిచే తీసుకురాబడినది” ఈ వాక్యానికి సరైన వ్యుత్పత్తి పదం
A) భగీరథుడు
B) బ్రహ్మకుమారి
C) భాగీరథీ
D) భరతుడు
జవాబు:
C) భాగీరథీ

ప్రశ్న 15.
‘జలధి’ అను పదానికి వ్యుత్పత్త్యర్థాన్ని గుర్తించండి.
A) జలమును కలిగించునది
B) జలములు దీనిచే ధరింపబడును
C) జలములను పారించేది
D) జగతిని నడిపించునది
జవాబు:
B) జలములు దీనిచే ధరింపబడును

6. ప్రకృతి – వికృతులు

ప్రశ్న 1.
నీరము (వికృతి పదాన్ని గుర్తించండి.)
A) మనిషి
B) ఇగము
C) సిరస్సు
D) నీరు
జవాబు:
D) నీరు

ప్రశ్న 2.
ఇగము (ప్రకృతి పదాన్ని గుర్తించండి.)
A) హిమము
B) కృష్ణుడు
C) రాముడు
D) మనిషి
జవాబు:
A) హిమము

ప్రశ్న 3.
సిరసుకు (ప్రకృతి పదాన్ని గుర్తించండి.)
A) మనిషి
B)శిరస్సు
C) నీరు
D) చెట్టు
జవాబు:
B)శిరస్సు

ప్రశ్న 4.
భారతీయులందరూ నా సోదరులని ప్రతిజ్ఞ చేయాలి – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) మెకము
B) మానిసి
C) త్యాగం
D) ప్రతిన
జవాబు:
D) ప్రతిన

ప్రశ్న 5.
భారతదేశం ఒక ద్వీపకల్పం – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) దిబ్బ, దీవి
B) మబ్బు
C) దివ్వె
D) దువ్వ
జవాబు:
A) దిబ్బ, దీవి

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 6.
“మెకము” అను పదానికి ప్రకృతి పదము
A) మేక
B) మృగము
C) ఏకము
D) ధనము
జవాబు:
B) మృగము

ప్రశ్న 7.
“మనుష్యుడు మనువు పదానికి వికృతి పదం సంతానమట” – గీత గీసిన
A) మనుజుడు
B) మానవుడు
D) మనుమ
C) జీవి
జవాబు:
A) మనుజుడు

ప్రశ్న 8.
“ఫలము” – అనే పదానికి వికృతి పదము
A) ప్రయోజనం
B) పండు
C) పలము
D) కాయ
జవాబు:
B) పండు

ప్రశ్న 9.
స్వాతంత్ర్యోద్యమంలో ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేశారు. గీత గీసిన పదానికి వికృతి పదం ?
A) చాగము
B) రాగము
C) భాగము
D) యాగము
జవాబు:
A) చాగము

ప్రశ్న 10.
పగటి నిదుర పనికిరాదు. (గీత గీసిన పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి.)
A) నిగుర
B) నీరు
C) నియమం
D) నిద్ర
జవాబు:
D) నిద్ర

ప్రశ్న 11.
మానవులంతా సహజంగా గొప్పవారే. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)
A) సమాజం
B) సాజం
C) సాహిత్యం
D) సౌఖ్యం
జవాబు:
B) సాజం

ప్రశ్న 12.
మెకం వేటగాడి వలలో చిక్కింది. (గీత గీసిన పదానికి ప్రకృతి పదం.)
A) మృగం
B) మేక
C) మొకం
D) జింక
జవాబు:
A) మృగం

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 13.
నాకు కైతల పోటీలో మొదటి బహుమతి వచ్చింది. గీత గీసిన పదం ………….
A) విభక్తి
B) దృతము
C) ప్రకృతి
D) వికృతి
జవాబు:
D) వికృతి

భాషాంశాలు (వ్యాకరణం)

PAPER – II : PART – B

1. సంధులు

ప్రశ్న 1.
నేను అన్నం తిన్నానని రాముడన్నాడు. ఈ వాక్యంలోని సంధులు (June ’18)
A) అకార సంధులు
B) త్రిక సంధులు
C) ఉత్త్వ సంధులు
D) ఆమ్రేడిత సంధులు
జవాబు:
C) ఉత్త్వ సంధులు

ప్రశ్న 2.
విలువేమి ఏ సంధి ?
A) త్రిక సంధి
B) యణాదేశ సంధి
C) అకార సంధి
D) గుణ సంధి
జవాబు:
C) అకార సంధి

ప్రశ్న 3.
నీరవుతుంది – విడదీయండి.
A) నీరు + అవుతుంది
B) నీర + అగుతుంది
C) నీరగా + అవుతుంది
D) నీరే + అవుతుంది
జవాబు:
A) నీరు + అవుతుంది

ప్రశ్న 4.
ఎత్తుల కెదిగిన – విడదీయండి.
A) ఎత్తులకు + ఎదిగిన
B) ఎత్తు + ఎదిగిన
C) ఎత్తులకున్ + యెదిగిన
D) ఎత్తు + లకున్ + యెదిగినన్
జవాబు:
A) ఎత్తులకు + ఎదిగిన

ప్రశ్న 5.
పేరవుతుంది – విడదీయండి.
A) పేరవు + తుంది
B) పేరు + అవుతుంది
C) పేరు అవు + తున్నది
D) పేరున్ + అవుతుంది
జవాబు:
B) పేరు + అవుతుంది

ప్రశ్న 6.
శ్రావణాభ్రము – విడదీయండి.
A) శ్రావణా + భ్రము
B) శ్రావణాభ + అము
C) శ్రావణ + అభ్రము
D) శ్రావణ + ఆభ్రము
జవాబు:
C) శ్రావణ + అభ్రము

ప్రశ్న 7.
నీరవుతుంది – ఏ సంధి?
A) అకారసంధి
B) ఇకారసంధి
C) ఉకారసంధి
D) గుణసంధి
జవాబు:
C) ఉకారసంధి

ప్రశ్న 8.
శ్రావణాభ్రము – ఏ సంధి
A) అకారసంధి
B) సవర్ణదీర్ఘ సంధి
C) గుణసంధి
D) యణాదేశ సంధి
జవాబు:
B) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 9.
పేరవుతుంది – ఏ సంధి
A) ఉత్వసంధి
B) అత్వసంధి
C) ఇత్వసంధి
D) త్రికసంధి
జవాబు:
A) ఉత్వసంధి

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 10.
ఉప + అర్జితము కలిపితే
A) ఉపోర్జితము
B) ఉపర్జితము
C) ఉపార్జితము
D) ఏదీకాదు
జవాబు:
C) ఉపార్జితము

ప్రశ్న 11.
కర్మధారయమందు తత్సమ శబ్దాలకు ‘ఆలు’ శబ్దము పరమైనపుడు పూర్వపదం చివర ఉన్న ఆకారానికి వచ్చేది
A) ఉకారం
B) అకారం
C) ఋకారం
D) రుగాగమం
జవాబు:
D) రుగాగమం

ప్రశ్న 12.
అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమయితే దీర్ఘాలు వస్తాయి.
A) అత్వ సంధి
B) గుణ సంధి
C) యణాదేశ సంధి
D) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
D) సవర్ణదీర్ఘ సంధి

ప్రశ్న 13.
స్వాతి చినుకులు ముత్యపుచిప్పలో ఎన్నిపడితే అన్ని ముత్యాలవుతాయి – సంధి విడదీయండి.
A) ముత్యపు + చిప్ప
B) ముత్యము + చిప్ప
C) ముత్యములు + చిప్ప
D) ఏదీకాదు
జవాబు:
A) ముత్యపు + చిప్ప

ప్రశ్న 14.
‘దారి + అవుతుంది’ అనే సంధి పదాల్లో గల పూర్వ పరస్వరాలు వరుసగా (Mar. ’17)
A) రి + అ
B) దా + అ
C) ఇ + అ
D) ఇ + ఇ
జవాబు:
C) ఇ + అ

2. సమాసాలు

ప్రశ్న 1.
‘వంకలు, డొంకలు’ ఏ సమాసం ?
A) ద్వంద్వం
B) బహువ్రీహి
C) చతుర్థీతత్పురుష
D) తృతీయాతత్పురుష
జవాబు:
A) ద్వంద్వం

ప్రశ్న 2.
జంకనివైన అడుగులు (ఏ సమాసం?)
A) షష్ఠీ తత్పురుష
B) ద్వంద్వం
C) బహువ్రీహి
D) విశేషణ పూర్వపద కర్మధారయ
జవాబు:
D) విశేషణ పూర్వపద కర్మధారయ

ప్రశ్న 3.
హిమగిరి శిరస్సు (ఏ సమాసం ?)
A) షష్ఠీ తత్పురుష
B) తృతీయాతత్పురుష
C) బహువ్రీహి
D) ద్విగువు
జవాబు:
A) షష్ఠీ తత్పురుష

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 4.
ద్వంద్వ సమాసానికి ఉదాహరణ
A) జంకని అడుగులు
B) ఎడారి దిబ్బలు
C) ఇసుక గుండెలు
D) మనిషి, మృగము
జవాబు:
D) మనిషి, మృగము

ప్రశ్న 5.
రూపక సమాసానికి ఉదాహరణ
A) ఇసుక గుండెలు
B) ఎడారి దిబ్బలు
C) హిమగిరి శిరసు
D) చెరగని త్యాగం
జవాబు:
A) ఇసుక గుండెలు

ప్రశ్న 6.
కాంతి వార్ధులు – ఏ సమాసం?
A) రూపక సమాసం
B) షష్ఠీ తత్పురుష
C) ద్వంద్వ సమాసం
D) ద్విగు సమాసం
జవాబు:
A) రూపక సమాసం

ప్రశ్న 7.
ఎడారి దిబ్బలు – ఏ సమాసం ?
A) షష్ఠీ తత్పురుష సమాసం
B) రూపక సమాసం
C) ద్వంద్వ సమాసం
D) ద్విగు సమాసం
జవాబు:
A) షష్ఠీ తత్పురుష సమాసం

ప్రశ్న 8.
ఇసుక గుండెలు ఏ సమాసం ?
A) రూపక సమాసం
B) షష్ఠీ తత్పురుష సమాసం
C) ద్విగు సమాసం
D) ద్వంద్వ సమాసం
జవాబు:
A) రూపక సమాసం

ప్రశ్న 9.
అచిరము ఏ సమాసం ?
A) షష్ఠీ తత్పురుష సమాసం
B) పంచమీ తత్పురుష
C) న తత్పురుష
D) చతుర్థీ తత్పురుష
జవాబు:
C) న తత్పురుష

ప్రశ్న 10.
‘వసుధ అనెడు చక్రం’ దీనిని సమాసంగా కూర్చి రాసినచో
A) చక్ర వసుధం
B) వసుధ నందలి చక్రం
C) వసుధాచక్రం
D) ధాత్రీసుదర్శనం
జవాబు:
C) వసుధాచక్రం

ప్రశ్న 11.
‘రాత్రి యొక్క అర్థము’ ఈ విగ్రహవాక్యాన్ని సమానంగా కూర్చి రాసినచో
A) అర్థరాత్రి
B) రాత్రంతా
C) రాత్రం
D) రాత్రీ పగలు
జవాబు:
A) అర్థరాత్రి

ప్రశ్న 12.
ఉపమాన, ఉపమేయాలకు భేదములేనట్లు చెప్పినది ఏ సమాసం ?
A) తత్పురుష సమాసం
B) ద్విగు సమాసం
C) ద్వంద్వ సమాసం
D) రూపక సమాసం
జవాబు:
D) రూపక సమాసం

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 13.
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంనకు ఉదాహరణ
A) సదావాసము
B) ధనహీనుడు
C) శోకాగ్ని
D) భిక్షాపాత్రము
జవాబు:
A) సదావాసము

3. ఛందస్సు

ప్రశ్న 1.
చంపకమాలలోని గణాలు ఏవి ?
A) మసజసతతగ
B) నజభజజజర
C) సభరనమయవ
D) భరనభభరవ
జవాబు:
B) నజభజజజర

ప్రశ్న 2.
ఉత్పలమాలలోని అక్షరాల సంఖ్య ఎంత ?
A) 21
B) 23
C) 20
D) 18
జవాబు:
C) 20

ప్రశ్న 3.
శ్రీరామ – ఇది ఏ గణం ?
A) జగణం
B) భగణం
C) నగణం
D) సగణం
జవాబు:
B) భగణం

ప్రశ్న 4.
IIU – ఇది ఏ గణం ?
A) యగణం
B) జగణం
C) సగణం
D) నగణం
జవాబు:
C) సగణం

ప్రశ్న 5.
స, భ, ర, న, మ, య, వ గణాలు ఏ వృత్తానికి చెందినవి ?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) మత్తేభము
D) శార్దూలము
జవాబు:
C) మత్తేభము

ప్రశ్న 6.
భ, ర, న, భ, భ, ర, వ గణాలు ఏ వృత్తానికి చెందినవి ?
A) శార్దూలము
B) ఉత్పలమాల
C) మత్తేభము
D) మత్తకోకిల
జవాబు:
B) ఉత్పలమాల

ప్రశ్న 7.
‘ఆగామి’ అనేది ఏ గణము ?
A) య గణము
B) త గణము
C) ర గణము
D) స గణము
జవాబు:
B) త గణము

ప్రశ్న 8.
‘క్రూరుడు’ అనెడి ఏ గణమో గుర్తించండి.
A) భ గణము
B) ర గణము
C) మ గణము
D) స గణము
జవాబు:
A) భ గణము

ప్రశ్న 9.
చంపకమాలలోని యతిస్థానము ఎంత ?
A) 12
B) 11
C) 14
D) 13
జవాబు:
B) 11

ప్రశ్న 10.
2 – 4 గణాల మొదటి అక్షరానికి యతిస్థానము గల పద్యపాదం ఏది ?
A) శార్దూలం
B) తేటగీతి
C) కందం
D) సీసం
జవాబు:
C) కందం

4. అలంకారాలు

ప్రశ్న 1.
లేమా ! దనుజుల గెలవలేమా ! – ఇది ఏ అలంకారం ?
A) అంత్యానుప్రాస
B) యమకం
C) వృత్త్యనుప్రాస
D) లాటానుప్రాస
జవాబు:
B) యమకం

ప్రశ్న 2.
కమలాక్షునర్చించు కరములు కరములు ఇది ఏ అలంకారం ?
A) ఛేకానుప్రాస
B) లాటానుప్రాస
C) అంత్యానుప్రాస
D) యమకం
జవాబు:
B) లాటానుప్రాస

ప్రశ్న 3.
అర్థభేదం లేకపోయినా తాత్పర్య భేదం ఉండే శబ్దా లంకారం ఏది ?
A) వృత్త్యనుప్రాస
B) ఛేకానుప్రాస
C) యమకం
D) లాటానుప్రాస
జవాబు:
C) యమకం

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 4.
మానవా ! నీ ప్రయత్నం మానవా ? ఇది ఏ అలంకారం ?
A) వృత్త్యానుప్రాస
B) ఛేకానుప్రాస
C) యమక
D) లాటానుప్రాస
జవాబు:
C) యమక

ప్రశ్న 5.
అర్థభేదంతో కూడిన పదం మరల మరల వచ్చినట్లు చెప్పితే అది ఏ అలంకారం ?
A) యమక
B) లాటానుప్రాస
C) ఛేకానుప్రాస
D) అంత్యానుప్రాస
జవాబు:
A) యమక

ప్రశ్న 6.
బింబ ప్రతిబింబ భావమును తెలుపు అలంకారం ఏది ?
A) దృష్టాంత
B) అతిశయోక్తి
C) అర్థాంతరన్యాస
D) ఉత్ప్రేక్ష
జవాబు:
A) దృష్టాంత

ప్రశ్న 7.
ఒక రూపాయి ఒక దమ్మిడీ లాగ ఖర్చు పెడతాం – ఇది ఏ అలంకారం ?
A) రూపకము
B) ఉపమా
C) అతిశయోక్తి
D) అర్థాంతరన్యాస
జవాబు:
B) ఉపమా

5. వాక్య పరిజ్ఞానం

ప్రశ్న 1.
కాళిదాసుచేత కావ్యము రచింపబడెను – దీనికి కర్తరి వాక్యం గుర్తించండి.
A) కాళిదాసు కావ్యం రచించాడు.
B) కాళిదాసు వల్ల కావ్యం రచింపబడెను
C) కాళిదాసు కొరకు కావ్యంబు రచించాడు
D) కాళిదాసు యందు కావ్యం రచించాడు.
జవాబు:
A) కాళిదాసు కావ్యం రచించాడు.

ప్రశ్న 2.
ఆంజనేయుడు ఆ రాక్షసుని చంపాడు. దీనికి కర్మణి వాక్యం గుర్తించండి.
A) ఆంజనేయుని వలన రాక్షసుడు చంపబడియుండె
B) ఆంజనేయుని చేత రాక్షసుడు చంపబడెను
C) చంపాడు ఆంజనేయుడు రాక్షసున్ని
D) రాక్షసునిచే చంపబడియె ఆంజనేయుడు
జవాబు:
B) ఆంజనేయుని చేత రాక్షసుడు చంపబడెను

ప్రశ్న 3.
‘బాలవ్యాకరణము’ చిన్నయసూరి చేత రచింపబడెను’ అనే కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చితే,
A) బాలవ్యాకరణము చిన్నయసూరి రాయలేదు.
B) చిన్నయసూరి బాలవ్యాకరణము రచించెను.
C) చిన్నయసూరి రచించాడు బాలవ్యాకరణమును.
D) బాలవ్యాకరణము చిన్నయసూరిచే రాయబడలేదు.
జవాబు:
B) చిన్నయసూరి బాలవ్యాకరణము రచించెను.

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 4.
‘అది నాచే రచింపబడినది’ – అనే కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చితే,
A) అది నేను రచింపబడినది
B) నేను దాన్ని రచించలేదు
C) దాన్ని నేను రచించాను
D) అది నాచే రచింపబడలేదు
జవాబు:
C) దాన్ని నేను రచించాను

ప్రశ్న 5.
‘కవులచే వ్యర్థపదాలు వాడబడినవి’ అనే కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యంగా మార్చితే
A) కవులు వ్యర్థపదాలను వాడారు.
B) కవులు వ్యర్థపదాలను వాడలేదు.
C) వ్యర్థపదాలను వాడారు కవులు.
D) వ్యర్థపదాలు కవులతో వాడబడ్డాయి.
జవాబు:
A) కవులు వ్యర్థపదాలను వాడారు.

ప్రశ్న 6.
మాకు హనుమంతుడంటే ఇష్టం అని రవి అన్నాడు – దీనికి పరోక్ష కథనం ఏమిటి ?
A) వానికి హనుమంతుడంటే ఇష్టంగా చెప్పమన్నాడు
B) హనుమంతునికి ఇష్టంగా చెప్పుకున్నాడు రవి
C) హనుమంతుని వల్ల ఇష్టంబుగా చెప్పుకున్నాడు
D) తనకు హనుమంతుడంటే ఇష్టమని రవి అన్నాడు.
జవాబు:
D) తనకు హనుమంతుడంటే ఇష్టమని రవి అన్నాడు.

ప్రశ్న 7.
“నేను కఠినుడనని అందరూ అంటారు. నిజానికి నేను చాలా శాంతస్వభావం కలవాడిని” అని తనను గురించి చెప్పుకున్నాడు’ అని ప్రత్యక్ష కథనంలో నున్న వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చితే.
A) నేను కఠినుడనని అందరూ అంటారని నిజానికి తాను చాలా శాంత స్వభావం కలవాడినని ఆయన గురించి తనకు చెప్పుకున్నాడు.
B) నేను కఠినుడను కానని అందరూ అంటారని నిజానికి తాను చాలా శాంతస్వభావం లేనివాడి నని తనను గురించి చెప్పుకున్నాడు.
C) తాను కఠినుడనను కానని అందరు అనరని నిజానికి నేను చాలా శాంత స్వభావం కలవాడిని కానని ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు.
D) తాను కఠినుడనని అందరూ అంటారని, నిజానికి తాను చాలా శాంత స్వభావం కలవాడినని ఆయన తనను గురించి తాను చెప్పుకున్నాడు.
జవాబు:
D) తాను కఠినుడనని అందరూ అంటారని, నిజానికి తాను చాలా శాంత స్వభావం కలవాడినని ఆయన తనను గురించి తాను చెప్పుకున్నాడు.

ప్రశ్న 8.
“మన చిత్ర కళాపిపాస గోడల మీద రంగుల క్యాలెండర్లు తీరుస్తున్నాయి” అని వారన్నారు. అనే ప్రత్యక్ష కథనంలో నున్న వాక్యాన్ని పరోక్ష కథనంలోనికి మార్చితే,
A) తమ చిత్ర కళాపిపాస గోడల మీద రంగుల క్యాలెండర్లు తీరుస్తున్నాయని వారన్నారు.
B) మా చిత్ర కళాపిపాస గోడల మీద రంగుల క్యాలెండర్లు తీరుస్తున్నాయని వారన్నారు.
C) మీ చిత్ర కళాపిపాస గోడల మీద రంగుల క్యాలెండర్లు తీరుస్తున్నాయని వారనలేదు.
D) తమ చిత్ర కళాపిపాస గోడల మీద రంగుల క్యాలెండర్లు తీరుస్తున్నాయని వీరన్నారు.
జవాబు:
A) తమ చిత్ర కళాపిపాస గోడల మీద రంగుల క్యాలెండర్లు తీరుస్తున్నాయని వారన్నారు.

ప్రశ్న 9.
“నాకు తిరుగు లేదు” అని హనుమంతుడు అన్నాడు – దీనికి పరోక్ష కథనం ఏది ?
A) వారికి తిరుగులేదని హనుమంతుడు చెప్పవలెను
B) తనకు తిరుగులేదని హనుమంతుడన్నాడు
C) అతనికి తిరుగులేదని హనుమంతుడన్నాడు
D) హనుమంతుడే తనకు తిరుగు ఉండాలని చెప్పుకున్నాడు.
జవాబు:
B) తనకు తిరుగులేదని హనుమంతుడన్నాడు

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 10.
“నేను రామభక్తుడిని” అని హనుమంతుడు చెప్పాడు. – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) తాను రామభక్తుడినని హనుమంతుడు చెప్పాడు.
B) ఆయన రామభక్తుడేనని చెప్పుకున్నాడు హనుమంతుడు.
C) వానికి రామునిపై రామభక్తి ఎక్కువని చెప్పు కున్నాడు.
D) రామునికి తనపై భక్తియని హనుమంతుడు చెప్పాడు.
జవాబు:
A) తాను రామభక్తుడినని హనుమంతుడు చెప్పాడు.

ప్రశ్న 11.
హనుమంతుడు బలవంతుడు, కీర్తివంతుడు – దీనికి సంయుక్త వాక్యం గుర్తించండి.
A) హనుమంతుడు బలవంతుడు కావాలి, కీర్తివంతుడు కావాలి
B) హనుమంతుడు బలవంతుడు మరియు కీర్తివంతుడు
C) హనుమంతుడు బలవంతుడైనందువల్ల కీర్తివంతుడు
D) హనుమంతుడు కీర్తివంతుడై, బలవంతుడై ఉండాలి
జవాబు:
B) హనుమంతుడు బలవంతుడు మరియు కీర్తివంతుడు

ప్రశ్న 12.
అతడు పాట పాడి బహుమతులందుకొనెను. ఇది ఏరకమైన వాక్యం ?
A) సంయుక్త వాక్యం
B) కర్మణి వాక్యం
C) శత్రర్థక వాక్యం
D) సంక్లిష్ట వాక్యం
జవాబు:
D) సంక్లిష్ట వాక్యం

ప్రశ్న 13.
నా సైకిల్ దొరికింది కాని దొంగ దొరకలేదు – ఇది ఏరకమైన వాక్యం ?
A) సంక్లిష్ట
B) సంయుక్త
C) కర్మణి
D) చేదర్థకం
జవాబు:
B) సంయుక్త

ప్రశ్న 14.
రాధ, లక్ష్మీ అక్కాచెల్లెళ్ళు – ఇది ఏరకమైన వాక్యం ?
A) కర్మణి
B) సంయుక్త
C) సంక్లిష్ట
D) శత్రర్థకం
జవాబు:
B) సంయుక్త

ప్రశ్న 15.
సుజాత నవ్వుతూ, మాట్లాడుతున్నది – ఇది ఏరకమైన వాక్యం ?
A) సంక్లిష్ట
B) సంయుక్త
C) కర్మణి
D) వ్యతిరేక
జవాబు:
A) సంక్లిష్ట

ప్రశ్న 16.
సమీర వీణ బాగా వాయించగలదు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) చేదర్థకం
B) సామర్థ్యార్థకం
C) హేత్వర్థకం
D) ఆత్మార్థకం
జవాబు:
B) సామర్థ్యార్థకం

ప్రశ్న 17.
రేపు నేను ఊరికి వెళ్ళవచ్చు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) హేత్వర్థకం
B) సామర్థ్యార్థకం
C) సంభావనార్థకం
D) ప్రేరణార్థకం
జవాబు:
C) సంభావనార్థకం

ప్రశ్న 18.
‘జ్మోతిర్మయి ఆలోచిస్తూ సైకిలు తొక్కుతుంది’ – గీత గీసిన పదం ఎటువంటి అసమాపక క్రియ ?
A) క్త్వార్థకం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) ఆనంతర్యార్థకం
జవాబు:
B) శత్రర్థకం

ప్రశ్న 19.
భూతకాలిక అసమాపక క్రియను ఇలా పిలుస్తారు.
A) చేదర్థకం
B) శత్రర్థకం
C) క్త్వార్థకం
D) అనంతర్యార్థకము
జవాబు:
C) క్త్వార్థకం

ప్రశ్న 20.
హనుమంతుడు ఎగురుతూ వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ క్రియా పదం ?
A) శత్రర్థకం
B) తద్ధర్మార్థకం
C) క్త్వార్థం
D) చేదర్థకం
జవాబు:
A) శత్రర్థకం

TS 10th Class Telugu Bits 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 21.
హనుమంతుడు అరిస్తే గుండెలు పగులుతాయి గీత గీసిన పదం ఏ క్రియా పదం ?
A) అప్యర్థకం
B) హేత్వర్థకం
C) ధాత్వర్థకం
D) చేదర్థకం
జవాబు:
D) చేదర్థకం

ప్రశ్న 22.
సూర్యుడు ఉదయించి వెళ్ళాడు – గీత గీసిన పదం ఏ క్రియా పదం ?
A) చేదర్థకం
B) అప్యర్థకం
C) ధాత్వర్థకం
D) క్త్వార్థం
జవాబు:
D) క్త్వార్థం

ప్రశ్న 23.
మీరు వెళ్ళాల్సిందే – ఇది ఏ రకమైన వాక్యం ?
A) విధ్యర్థక వాక్యం
B) నిషేదార్థక వాక్యం
C) అప్యర్థక వాక్యం
D) తద్ధర్మార్థక వాక్యం
జవాబు:
A) విధ్యర్థక వాక్యం

ప్రశ్న 24.
మీరు రావద్దు – ఇది ఏ రకమైన వాక్యం ?
A) ధాత్వర్థక వాక్యం
B) నిషేధార్థక వాక్యం
C) అప్యర్థక వాక్యం
D) హేత్వర్థక వాక్యం
జవాబు:
B) నిషేధార్థక వాక్యం

ప్రశ్న 25.
“నాకు ఏ వ్యసనాలు లేవు” అని రచయిత అన్నాడు. – దీనికి పరోక్ష కథనం గుర్తించండి.
A) వ్యసనాలు తనకు ఉండవని రచయిత అన్నాడు
B) రచయితకు వ్యసనాలు ఉండవని అన్నాడు
C) తనకు వ్యసనాలు లేవని రచయిత అన్నాడు.
D) వానికి వ్యసనాలు ఉండవని రచయిత అన్నాడు.
జవాబు:
C) తనకు వ్యసనాలు లేవని రచయిత అన్నాడు.

ప్రశ్న 26.
సైకిలు దొరికింది, దొంగ దొరకలేదు దీనికి సంయుక్త వాక్యం గుర్తించండి.
A) సైకిలు దొరక్కపోయినా దొంగ దొరికాడు
B) దొంగ, సైకిలు దొరికాయి
C) సైకిలు దొరికింది కాని దొంగ దొరకలేదు
D) దొంగతో పాటు సైకిలు దొరికింది
జవాబు:
C) సైకిలు దొరికింది కాని దొంగ దొరకలేదు

ప్రశ్న 27.
అగ్ని మండును ఇది ఏ రకమైన వాక్యం ?
A) విధ్యర్థక వాక్యం
B) తద్ధర్మార్థక వాక్యం
C) ప్రశ్నార్థక వాక్యం
D) హేత్వర్థక వాక్యం
జవాబు:
B) తద్ధర్మార్థక వాక్యం

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

These TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం will help the students to improve their time and approach.

TS 10th Class Telugu 9th Lesson Important Questions జీవనభాష్యం

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

1. లఘు సమాధాన ప్రశ్నలు మార్కులు

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
మన పేరు శాశ్వతంగా నిలవాలంటే ఏం చేయాలి ?
జవాబు:
మన పేరు శాశ్వతంగా నిలవాలంటే చెరగని త్యాగం చేయాలి. మనం చేసిన త్యాగకృత్యం, ఎప్పటికీ మరచి పోలేనిదిగా ఉండాలి. అంతటి త్యాగము చేసిన వారి పేరు, చరిత్రలో నిలిచిపోతుంది. ప్రస్తుతం ఏదో బిరుదులు ఇస్తున్నారని, ఆ బిరుదులు మనకు ఉన్నాయి కదా అని అనుకుంటే లాభం లేదనీ, ఆ బిరుదుల వల్ల, సన్మానాల వల్ల వచ్చే పేరు చిరకాలం నిలవదనీ కవి గుర్తుచేశారు. ప్రజలు ఎన్నటికీ మరచిపోలేని గొప్ప త్యాగం చేసిన త్యాగమూర్తుల పేరు చిరస్థాయిగా నిలిచి ‘ఉంటుందని కవి తెలిపాడు.

ప్రశ్న 2.
“ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యంలో మీరేం గ్రహించారు ?
జవాబు:
ఎడారిలో ఇసుకదిబ్బలు ఉంటాయి. అక్కడ నీళ్ళు దొరకవు. ఇసుక నేలల్లో పంటలు పండవు. అందువల్ల నీళ్ళు దొరకని ఎడారులలోని ఇసుక దిబ్బలను దున్నితే ఫలితము ఏముంటుంది ? అవి వ్యవసాయానికి పనికిరావు కదా ! అని నిరాశపడరాదని కవి చెప్పాడు.

సేద్యానికి పనికిరావు కదా అని బంజరు బీడులను దున్నకుండా విడిచిపెట్టవద్దనీ, వాటిని దున్ని విత్తులు చల్లితే చక్కని పైరు పంటలు పండుతాయనీ, నిరాశ పనికిరాదనీ, ఆశావహ దృక్పథంతో ముందుకు నడిస్తే, తప్పక ఫలితాలు వస్తాయనీ కవి ఈ వాక్యాల ద్వారా సందేశం అందించాడు.

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 3.
జయాపజయాలను నువ్వెలా స్వీకరిస్తావు ? సి.నా.రె. చెప్పారు?
జవాబు:
ఒక లక్ష్యాన్ని సాధించాలంటే మనం చక్కటి ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళిక లేని ప్రయాణం గమ్యం తెలీకుండా సాగుతుంది. గమ్యం చేరనీదు. అందుకనే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. ప్రణాళికలు సఫలమైనా ఒక్కొక్క సారి ఇతరుల, అధికారుల సహాయ నిరాకరణ వల్ల అపజయం కలగవచ్చు లేదా శక్తికి మించిన లక్ష్యాన్ని ఎంచుకున్న అపజయం ఎదురవవచ్చు. కానీ కుంగి పోను.

సాలీడు ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ గూడు కట్టినట్లు పోరాడతాను విజయం సాధిస్తాను. విజయానికి పొంగిపోను పరాజయానికి కుంగిపోను. విజయమైనా, అపజయమైనా తరువాత ప్రణాళికను సిద్ధపరుస్తూనే ఉంటాను. సి.నా.రె కూడా ‘జీవన భాష్యం’ లో ఇదే చెప్పారు. “పేరవుతుందని” చదువుకున్నాక ఏ విద్యార్థి అయిన తన పేరు తల్లిదండ్రుల పేరు తరాలపాటు నిలిచేలా ప్రయత్నం తప్పక చేస్తాడు.

ప్రశ్న 4.
జీవనభాష్యం పాఠం చదవడం వలన ప్రయోజనం ఏమిటి?
జవాబు:
జీవన భాష్యం పాఠం చదవడం వలన జీవించే విధానం తెలుస్తుంది. ధైర్యంగా పనిని ప్రారంభించడం తెలుస్తుంది. ఎవరో ఏదో ‘వంక’ పెడతారేమో అనే సంశయం పటాపంచలవుతుంది. ఎవరో భయపెడితే భయపడే పరిస్థితి ఉండదు. భయపడకుండా ప్రయత్నించి, సాధించినవే ఇపుడు మనం అనుభవించే సౌఖ్యాలని తెలుస్తుంది.

కష్టపడి పనిచేస్తే ఫలితం ఉండదని నిరాశ పడకూడదు. తప్పనిసరిగా ఫలితం ఉంటుందని తెలు స్తుంది. అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం అల వడుతుంది. ఆటంకాలకు భయపడకుండా ముందుకు సాగిపోయే గుణం అలవడుతుంది.

ఈ పాఠం చదవడం వలన దేన్నైనా సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. జంకు ఉండదు. సమాజం మహోన్నతంగా తీర్చదిద్దబడుతుంది. అదే ఈ పాఠం చదవడం వలన ప్రయోజనం.

ప్రశ్న 5.
‘ఎంతటి ఎత్తులకు ఎదిగినా ఉంటుంది పరీక్ష’ అనే కవి అనడంలో గల ఉద్దేశ్యం ఏమిటి ? (June ’17)
జవాబు:
ఎంత సామర్థ్యం మనకు ఉన్నా, అధికారం, సంపదలు ఉన్నా, మనం ఎన్నో విజయాలు సాధించినా, ఇంక మనకు ఏ కష్టాలూ, బాధలూ రావని ధీమాగా ఉండరాదని కవి సందేశం ఇచ్చాడు. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యలను తీసుకువస్తుందో, పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరని కవి సూచించాడు. విధి శక్తి ముందు ఎవరైనా తలవంచ వలసిందే అని కవి తెలియ జెప్పాడు.

కవి తాను చెప్పిన మాటకు దృష్టాంతంగా హిమాలయ పర్వతాన్ని గూర్చి గుర్తు చేశాడు. ఉన్నతమైన హిమాలయపర్వత శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి, నదిగా ప్రవహించవలసి వస్తోంది. అలాగే ఎంతటి మనిషి అయినా, విధి పరీక్షిస్తే అతని గర్వం కరిగి నీరు కావలసిందే అని కవి తెలిపాడు.

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు మార్కులు

ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘చెదరని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే ఏమిటి ? పేరు నిలపడానికి ఏమి మంచిపనులు చేయాలి?
జవాబు:
చెదరని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అంటే, త్యాగం చేసినవారి యొక్క మంచిపనులు చేసిన వారి యొక్క పేర్లు, చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయని అర్థము.

పేరు నిలవడానికి చేయవసిన పనులు :

  1. దానధర్మాలు విరివిగా చేయాలి.
  2. దేవాలయాలు, ధర్మసత్రాలు కట్టించాలి.
  3. పేదవారికి ఉచితంగా పెళ్ళిళ్ళు చేయించాలి.
  4. కావ్యాలను రచించాలి లేదా అంకితం తీసికోవాలి.
  5. బావులు, చెరువులు తవ్వించాలి.
  6. ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలి.
  7. విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
  8. చదువుకొనేవారికి ఉపకారవేతనాలు ఇవ్వాలి.
  9. వైద్యశాలలు కట్టించాలి.
  10. గ్రామాలకు రోడ్లు వగైరా వేయించాలి.

ప్రశ్న 2.
గజల్ ప్రక్రియను పరిచయం చేయండి. మీరు చదివిన గజల్ దేనిని గూర్చి చెప్పిందో తెలపండి.
జవాబు:
సరస భావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ అనేవి గజల్ ప్రక్రియకు జీవగుణాలు. మేము సి. నారాయణరెడ్డి గారు రాసిన ‘జీవనభాష్యం’ అనే గజల్న చదివాము.

గజల్లో పల్లవిని ‘మత్లా’ అని, చివరి చరణాన్ని ‘మక్తా’ అని పిలుస్తారు. కవి నామ ముద్రను ‘తఖల్లుస్’ అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.

మేము చదివిన జీవనభాష్యం గజల్, మనిషి దేనికోసమూ నిరుత్సాహం పడకూడదనీ, ఎంతటి గొప్ప విషయాన్ని అయినా, ఎంతటి ఘనకార్యాన్ని అయినా, ప్రయత్నం చేస్తే సాధింపవచ్చుననీ తెలుపుతుంది. దుఃఖాన్ని తట్టుకుంటూ, కష్టాలను ఎదుర్కొంటూ, తనంతట తాను ఎదుగుతూ, ఇతరుల కోసం శ్రమిస్తూ జీవించే మనిషి, సంఘంలో బాగా గౌరవం పొందు తాడని ఈ గజల్లో చెప్పబడింది.

ప్రశ్న 3.
‘జీవనభాష్యం’ పాఠం ఆధారంగా సి.నా.రె. గారి కవిత్వాన్ని విశ్లేషించండి.
జవాబు:
సి.నా.రె. గారు రచించిన ‘జీవన భాష్యం’ చాలా బాగుంది. నీరవుతుంది, దారవుతుంది, ఊరవుతుంది, పేరవుతుంది వంటి పదాలను పాదాల చివర రాసి అంత్యప్రాసను పాటించారు.

‘మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది’ వంటి వాక్యాలలో వాస్తవికతను చిత్రీకరించారు. చల్లటి గాలి తగిలితే ఎవరికైనా మనసుకు హాయిగా ఉంటుంది. అలాగే మబ్బుకు కూడా అన్ని చెప్పాడు. ‘జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది’ వంటి వాక్యాల ద్వారా, ఒక పనిని ప్రారంభించడానికి జంకకూడదని చెప్పారు. జంకకుండా పని మొదలు పెడితే తర్వాతి తరాలకు అదే ఆదర్శమౌతుందని చెప్పారు.

‘ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు’ అనే చరణంలో కష్టపడి పనిచేస్తే దేన్నైనా సాధించవచ్చని బోధించారు. అందరూ కలసిమెలసి ఉండాలని ఉద్బో ధించారు. ఎంత గొప్ప వారికైనా ఏవో కష్టాలు తప్పవని బోధించారు. కష్టాలను తట్టుకొంటేనే సుఖాలు కలుగు తాయని చెప్పారు.

జీవన భాష్యం పాఠం ద్వారా జీవితాన్ని గడప వలసిన విధానాన్ని వివరించారు. జీవితాన్ని కాచి వడబోసిన అనుభవాన్ని భావితరాలకు పాఠ్యాంశంగా రచించారు.

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 4.
మనిషి గొప్పస్థానానికి చేరుకోవడానికి ‘జీవన భాష్యం’ పాఠం ద్వారా కవి సి.నా.రె. సూచించిన (Mar. ’17)
జవాబు:
ప్రకృతికి భయపడిన ఆదిమానవుడు తనకు తాను నిలదొక్కుకున్నాడు. చాలా ప్రగతిని సాధించాడు. టెక్నాలజీ పెరిగింది. సౌకర్యాలు పెరిగాయి. కానీ, జీవన విధానంపై ఇంకా పూర్తి అవగాహనను మానవుడు పెంచుకోలేదు.

ఈరోజు చాలామంది ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందుతున్నారు. తమలో తాము కుమిలి పోతున్నారు. తమ బాధలను కనీసం స్నేహితులకు, తల్లిదండ్రులకు అయినా చెప్పు కోవాలి. అలా చెప్పు కొంటే బాధతో నిండిన మనసు కరిగి కన్నీటి రూపంలో బయటికి పోతుంది. మనసు తేలికవుతుంది.

ఏవో చిన్న చిన్న సమస్యలు చూసి భయపడ కూడదు. కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. జంతువులకు లేని ఆలోచన మనుషులకు ఉంది. ఆ ఆలోచనను సద్వినియోగం చేసుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి.

ఎంత గొప్పవారికైనా కష్టాలు తప్పవు. వాటిని పరీక్షలనుకోవాలి. గుణపాఠాలు నేర్చుకోవాలి. అభివృద్ధిని సాధించాలి. ఈ విధంగా జీవన విధానం ఉండాలి.

ప్రశ్న 5.
‘చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది’ అనే మాటద్వారా సి.నా.రె మనకిచ్చిన సందేశంలో ఉన్న అంతరార్థాన్ని సోదాహరణంగా వివరించండి. (June ’18)
జవాబు:
చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. అంటే త్యాగం చేసిన వారి యొక్క మంచిపనులు, చేసిన వారి యొక్క పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి. ప్రస్తుతం మనకు ఏదో బిరుదులు వస్తాయనీ అనుకుంటే లాభం లేదనీ, ఆ బిరుదుల వల్ల, సన్మానాల వల్ల వచ్చే పేరు చిరకాలం నిలువదనీ సినారె ఈ గజల్ ద్వారా తెలియపరిచారు.

త్యాగం చేసేవారిని, మంచి పనులు చేసేవారి పేర్లు మాత్రమే చరిత్రలో వెలుగుతాయని కవి ప్రబోధించాడు. మనం స్వార్థాన్ని విడిచి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. చేసే పనుల్లో చిత్తశుద్ధి, అంకితభావం ఉండాలి. తనకు మేలు కలిగే పనులను చేయడంకంటే తోటివారికి ఎక్కువ మేలు కలిగే పనులను చేయాలి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనాథలైన, అన్నార్హులైన, నిరాశ్రయులైన ప్రజలను ఆదుకోవాలి.

వికలాంగుల సంక్షేమంకోసం నిరంతరం కృషిచేయాలి. వారికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలి. గ్రామంలో పచ్చని చెట్లను నాటాలి. మూగజీవాల సంరక్షణకు చర్యలను చేపట్టాలి. ప్రమాదాల్లో గాయపడినవారిని ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యసహాయం అందే విధంగా కృషి చేయాలి. ఈ విధంగా మనమంతా ప్రజల హితం కోసం నిస్వార్థంగా సేవలను అందించాలి. ఇటువంటి పనుల వల్లనే మన పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

PAPER – II : PART – A

1. అవగాహన – ప్రతిస్పందన

అపరిచిత పద్యాలు (5 మార్కులు)

ప్రశ్న 1.
ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు
చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు

ప్రశ్నలు – సమాధానములు

1. తైల మెచ్చట నుండి తీయవచ్చును ?
జవాబు:
తైలమును ఇసుక నుండి తీయవచ్చును.

2. కుందేటి కొమ్ము ఎలా సాధించవచ్చు ?
జవాబు:
ఎక్కడెక్కడో తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు.

3. మూర్ఖుని మనసు రంజింప చేయగలమా ?
జవాబు:
మూర్ఖుని మనసు రంజింపజేయలేము.

4. ఈ పద్యానికి శీర్షిక సూచించండి.
జవాబు:
“మూర్ఖుని మనసు” అను శీర్షిక సరిపోవును.

5. ఇసుము అనగానేమి ?
జవాబు:
ఇసుము అనగా ఇసుక అని అర్థము.

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

2. క్రింది పద్యము చదివి, క్రింద తప్పొప్పులను గుర్తించండి.

కమలములు నీటబాసిన
కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రుల శత్రులగుట తథ్యము సుమతీ!

ప్రశ్నలు – సమాధానములు

1. కమలములకు, సూర్యునికి గల సంబంధంలేదు ( )
జవాబు:
తప్పు

2. ‘కమలిన భంగిన్’ అనగా వాడిపోని విధం. ( )
జవాబు:
తప్పు

3. తమ స్థానములు కోల్పోతే అనే అర్థం ఇచ్చే పదం తమతమ నెలవులు దప్పిన ( )
జవాబు:
ఒప్పు

4. నీట బాసినవి కమలములు. ( )
జవాబు:
ఒప్పు

5. ఇది వేమన శతకంలోని పద్యం. ( )
జవాబు:
తప్పు

3. ఈ క్రింది పద్యమును చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

ఎఱుక గల వారి చరితలు
గఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగిన దానిని
మఱువ కనుష్ఠించునది సమంజస బుద్ధిన్

ప్రశ్నలు – సమాధానములు

1. ఎవరి చరిత్ర తెలుసుకోవాలి ?
జవాబు:
జ్ఞానవంతుల చరిత్ర తెలుసుకోవాలి.

2. ధర్మాన్ని ఎక్కడ నుంచి తెలుసుకోవాలి ?
జవాబు:
ధర్మాన్ని సజ్జనుల సమావేశం నుంచి తెలుసుకోవాలి.

3. దేనిని అనుష్ఠించాలి ?
జవాబు:
ధర్మాన్ని అనుష్ఠించాలి.

4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “నీతి బోధ”.

5. గోష్ఠి అనగానేమి ?
జవాబు:
గోష్ఠి అనగా సమావేశమని అర్థము.

4. క్రింది పద్యమును చదివి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

ఎప్పుడు తప్పులు వెదకెడు
అప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
కప్ప వసించిన విధంబు గదరా సుమతీ !

ప్రశ్నలు – సమాధానములు

1. నిరంతరం తప్పులు వెతికే వాని సన్నిధి ఎటువంటిది ?
జవాబు:
పాము నీడలాంటిది.

2. ఎప్పుడూ తప్పులు వెతికే వాడు ఎలాంటివాడు ?
జవాబు:
పాము లాంటివాడు.

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

3. ఎవరిని సేవించకూడదు ?
జవాబు:
ఎప్పుడూ తప్పులు వెతికేవాడిని.

4. ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు:
ఈ పద్యం సుమతీ శతకంలోనిది.

5. “అప్పురుషుడు” అంటే అర్థం ఏమిటి ?
జవాబు:
ఎప్పుడూ తప్పులు వెతికే వ్యక్తి అని అర్థం.

5. క్రింది పద్యం చదివి, ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగతినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభి రామ వినురవేమ!

ప్రశ్నలు – సమాధానములు

1. అనగా అనగా అభివృద్ధి అయ్యేది ఏది ?
జవాబు:
అనగా అనగా అభివృద్ధి అయ్యేది రాగం

2. ఏది తినగా తినగా తియ్యగా ఉంటుంది ?
జవాబు:
వేము (వేపాకు) తినగా తినగా తియ్యగా ఉంటుంది.

3. పనులు సమకూరాలంటే ఏం చేయాలి ?
జవాబు:
పనులు సమకూరాలంటే సాధన చెయ్యాలి.

4. ఈ శతక పద్యాలు చెప్పిన కవి ఎవరు ?
జవాబు:
ఈ శతకపద్యాలు చెప్పిన కవి వేమన.

5. ఈ పద్యంలో ఒక సంధి పదాన్ని విడదీసి, సంధి పేరు వ్రాయండి.
జవాబు:
విశ్వద + అభిరామ = విశ్వదాభిరామ (సవర్ణదీర్ఘ సంధి).

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

సృజనాత్మక ప్రశ్నలు (5 మార్కులు)

ప్రశ్న 1.
జీవనభాష్యం పాఠం చదవడం వలన నీవు పొందిన అనుభూతిని వివరిస్తూ మీ మిత్రునికి లేఖ వ్రాయండి.
జవాబు:

సికింద్రాబాద్,
X X X X

ప్రియనేస్తం రహీమ్,

మాకు నిన్న జీవన భాష్యం పాఠం చెప్పారు. పాఠం చిన్నదే కానీ, చాలా బాగుంది. జీవన విధానం ఈ పాఠంలో చాలా బాగా చెప్పారు.

ప్రతి పనికీ ఏదో ఒక వంక పెట్టకూడదన్నారు. ఏవో సమస్యలుంటాయని ఎవరినీ భయపెట్ట కూడదని చెప్పారు.

మా స్నేహితులు నన్ను దేనికో దానికి భయ పెడుతుంటారు. ఈ పాఠం చదివాక భయపెట్టడం, భయపడడం మానేశారు.

ఇది వరకు ఏ పనిచేసినా ప్రయోజనం ఉంటుందా ? ఉండదా ? అని ఆలోచించేవాళ్ళం. ఇక అటువంటి ఆలోచన మానేశాం. కష్టపడి చదివితే మార్కులవే వస్తాయి. కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పక ఉంటుందనే నమ్మకం కలిగింది.

మొత్తం మీద ఈ పాఠం చదివాక మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఉంటాను మరి. నీకు 10వ తరగతిలో నచ్చిన పాఠం గురించి రాయి.

ఇట్లు,
నీ స్నేహితుడు,
XXXX.

చిరునామా :

ఆర్. రహీమ్, నెం. 6,
10వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మల్కాపురం,
రంగారెడ్డి జిల్లా.

ప్రశ్న 2.
మనిషి జీవించవలసిన విధానాన్ని వివరిస్తూ ఒక వ్యాసం రాయండి.
జవాబు:

జీవన విధానం

ప్రకృతికి భయపడిన ఆదిమానవుడు తనకు తాను నిలదొక్కుకున్నాడు. చాలా ప్రగతిని సాధించాడు. సాంకేతిక విజ్ఞానం పెరిగింది. సౌకర్యాలు పెరిగాయి. కానీ, జీవన విధానంపై ఇంకా పూర్తి అవగాహనను మానవుడు పెంచుకోలేదు.

ఈ రోజు చాలామంది ప్రతి చిన్న విషయానికీ ఆందోళన పడుతున్నారు. తమలో తాము కుమిలి పోతున్నారు. తమ బాధలను కనీసం స్నేహితులకు, తల్లిదండ్రులకు అయినా చెప్పుకోవాలి. అలా చెప్పుకొంటే బాధతో నిండిన మనసు కరిగి కన్నీటి రూపంలో బయటికి పోతుంది. మనసు తేలికవుతుంది.

ఏవో చిన్న చిన్న సమస్యలు చూసి భయపడ కూడదు. కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. జంతువులకు లేని ఆలోచనాశక్తి మనుషులకు ఉంది. ఆ ఆలోచనాశక్తిని సద్వినియోగం చేసుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి.

ఎంత గొప్పవారికైనా కష్టాలు తప్పవు. వాటి ద్వారా గుణపాఠాలు నేర్చుకోవాలి. అభివృద్ధిని సాధించాలి. ఈ విధంగా జీవన విధానం మెరుగుపరచుకోవాలి.

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

ప్రశ్న 3.
సమస్యలను చూసి భయపడేవారికి ధైర్యాన్ని కలిగించే సూక్తులను రాయండి.
జవాబు:
పరిష్కారం లేని సమస్య లేదు.. భయపడకునేస్తం. ఉంటుంది ఆదుకొనే హస్తం. సమస్యల వల్ల కష్టాలు రావు. కష్టాలే ఉంటాయనుకొంటే సమస్యలు పెరుగుతాయి.

ప్రతి సమస్యనూ కాలం పరిష్కరిస్తుంది. సమస్యలు ఏర్పడినపుడే బుర్ర చురుకుగా పని చేస్తుంది.
సమస్యలు లేని జీవితం పందిరి లేని పాదువంటిది. సమస్యలు మనుషులకు కాక మానులకొస్తాయా ? సాధన చేస్తే సాధ్యం కానిది లేదు.

ప్రయత్నిస్తే పరమాత్మైనా కనిపిస్తాడు. ధైర్యమే విజయం.

ప్రశ్న 4.
భయపడే వ్యక్తికి ధైర్యం కల్గించేలా సంభాషణ తయారు చేయండి.
జవాబు:
మురళి : నేను తప్పు చేశాన్రా, నాకు చాలా భయం వేస్తోంది.
సుధీర్ : ఏం చేశావు ? చెప్పు.

మురళి : ఎవ్వరూ ఏమీ చేయలేరురా. ఇదంతా నా కర్మ.
సుధీర్ : అంత తప్పేం చేశావురా !
మురళి : మా నాన్నగారి పరువు తీసేశాను రా ! నాకు బతికే అర్హత లేదు రా !
సుధీర్ : ఛీ ఛీ అవేం మాటలురా, ఏమయిందో చెప్పు.
మురళి : నా పరీక్ష ……….. పోతుందిరా. నేను పరీక్ష సరిగా రాయలేదు. మా నాన్నగారేమో 10 / 10 రావాలన్నారు.
సుధీర్ : పోతే పోతుంది. దానికే భయ పడిపోతావా ? అయినా ఫలితాలు రావాలి కదా !
మురళి : అపుడు తలెత్తుకోలేనురా !

సుధీర్ : ఏడిశావ్. పరీక్ష పాసవ్వడమే జీవితం కాదు. గొప్పవారు చాలా మంది చిన్నతనంలో సరిగ్గా చదవలేదు. గొప్పవాళ్ళు కాలేదా, మనకు తెలుగు వ్యాక రణం రాసిన పరవస్తు చిన్నయ సూరికి కూడా చిన్నతనంలో సరిగ్గా చదువు రాలేదు. భయ పడిపోయేడా !
మురళి : అయితే ……. పరీక్ష పోయినా ఫరవాలేదా ?
సుధీర్ : నేనిప్పుడే మీ నాన్నగారికి చెబుతా, మనం బాగా చదవాలని అంటారు కానీ, పరీక్ష పాసవ్వడమే జీవిత ధ్యేయమని ఎవ్వరూ చెప్పరు.
మురళి : అలాగే ఇక ఈ విషయం ఆలోచించను.
సుధీర్ : వెరీ గుడ్ – బై

ప్రశ్న 5.
జీవన భాష్యం గజల్లోని అంత్య పదాలతో సొంతంగా వచన కవిత రాయండి.
జవాబు:
నీరవుతుంది : సౌమ్యంగా మాట్లాడితే కోపం కరిగి నీరవుతుంది.
దారవుతుంది : ముందు నిలబడి నడిస్తే పది మందికి అది దారవుతుంది.
ఊరవుతుంది : చమటతో నేలను తడిపితే అది ఊరవుతుంది
ఏరవుతుంది. : మనిషిని మనిషితో కలిపితే అది ఏరవుతుంది
పేరవుతుంది : వాన ఆగక కురిస్తే చేనే ఏరవుతుంది.
పేరవుతుంది : లోకం నన్ను పొగిడినప్పుడే అది నా పేరవుతుంది.

ప్రశ్న 6.
ఆచార్య సి.నారాయణరెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుంచి ఏం తెలుసుకోవాలని అను కుంటున్నారో ప్రశ్నలు రాయండి.
జవాబు:

  1. మీ రచనల్లో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం ?
  2. విశ్వంభరలో దేని గురించి వివరించారు ?
  3. మీకు బాగా ఇష్టమైన సాహిత్య ప్రక్రియ ఏది ?
  4. మేమూ గజల్స్ రాయాలంటే ఏం చేయాలి ?
  5. తెలుగు భాషపైన పట్టు రావాలంటే మేం ఏమేం పుస్తకాలు చదవాలి ?
  6. ఆధునిక ఆంధ్ర కవిత్వము, సంప్రదాయాలు, ప్రయోగాల పేరిట మీరు ఇతరుల సాహిత్యాన్ని ఎందుకు పరిశోధనా అంశంగా తీసుకున్నారు ?

అదనపు వ్యాకరణాంశాలు

PAPER – I : PART – B

1. సొంతవాక్యాలు

1. గుండెలు పగులు : అగ్ని బాధితులు గుండెలు పగిలేలా ఏడ్చి, సొమ్మసిల్లి పడ్డారు.
2. ఎత్తుల కెదుగు : ఎంత ఎత్తులకెదికినా, బుద్ధిమంతుడు తన మూలాన్ని మరిచిపోడు.

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

2. పర్యాయపదాలు

మబ్బు – మేఘము, చీకటి, అజ్ఞానము
మనసు – మానసము, హృదయము, ఇష్టము,తలపు, అభిలాష
కన్ను – నేత్రము, చూపు, జాడ, బండిచక్రము
నేస్తం – మైత్రి, చెలిమి, స్నేహం
ఫలము – నాలుగు కర్షములయెత్తు, మాంసము, విఘడియ
మనుష్యుడు – మనుజుడు, మానసి

3. నానార్థాలు

మనస్సు = హృదయము, తలపు, కోరిక, అభిప్రాయము
మబ్బు = మేఘము, అజ్ఞానము, చీకటి
అడుగు = పాదము, పాతాళము, అధమము, పద్యపాదం
దిబ్బ = ఉన్నతభూమి, కుప్ప, మట్టిదిబ్బ, కొండ, ద్వీపము
ఫలము = పండు, ప్రతిఫలం, ప్రయోజనం, ధనము
మృగము = జింక, పశువు, యాచన, వేట, కస్తూరి
శిరస్సు = తల, కొండ కొన, ముఖ్యము, సేనాగ్రము
వంక = వంకర, దిక్కు, నదీ వక్రము, వాగు, వంపు
డొంక = పొద, పల్లపు ప్రదేశం, పశువుల ధారి

4. ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి

మనుష్యుడు – మనిషి
హిమము – ఇగము
నీరము – నీర
శిరస్సు – సిరస్సు
త్యాగము – చాగము
ద్వీపము – దిబ్బ
ప్రతిజ్ఞ – బిరుదు
మృగము మెకము

5. వ్యుత్పత్త్యర్థాలు

హిమగిరి = హిమము గల కొండ (మంచుకొండ)
మనుష్యుడు = మనువు వలన పుట్టినవాడు (నరుడు)

PAPER – II : PART – B

1. సంధులు

1. ఉకారసంధి

సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
ఉదా : నీరవుతుంది = నీరు + అవుతుంది

కన్నీరవుతుంది = కన్నీరు + అవుతుంది
దారవుతుంది = దారి + అవుతుంది
ఫలమేమి = ఫలము + ఏమి
పైరవుతుంది = పైరు + అవుతుంది
ఊరవుతుంది = ఊరు + అవుతుంది

2. ఇకార సంధి

సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగా వస్తుంది.
ఉదా : ఫలమేముందనకు = ఫలమేమి + ఉందనకు

3. అకార సంధి

సూత్రం : ఏమ్యాదులలోని, క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగా వస్తుంది.
ఉదా : ఫలమేముందనకు = ఫలమేమి + ఉందనకు

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

2. సమాసాలు

సమాస పదము – విగ్రహవాక్యము – సమాసము పేరు

వంకలు, డొంకలు – వంకలునూ, డొంకలునూ – ద్వంద్వ సమాసం
మనిషి మృగము – మనిషియూనూ, మృగమూను – ద్వంద్వ సమాసం
జంకని అడుగులు – జంకనివైన అడుగులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
చెరగని త్యాగం – చెరగనిదైన త్యాగం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఎడారి దిబ్బలు – ఎడారి యొక్క దిబ్బలు – షష్ఠీ తత్పురుష సమాసం
హిమగిరి శిరస్సు – హిమగిరి యొక్క శిరస్సు – షష్ఠీ తత్పురుష సమాసం
ఇసుకగుండెలు – ఇసుక అనెడి గుండెలు – రూపక సమాసం

3. ప్రత్యక్ష-పరోక్ష కథనం

1. ప్రత్యక్ష కథనం : “నేను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదు. స్వార్థానికి నేను ఏ పాపం చేయలేదు” అన్నాడు.
పరోక్ష కథనం : తాను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదనీ – స్వార్థానికి తాను ఏ పాపం చేయలేదనీ అన్నాడు.

2. ప్రత్యక్ష కథనం : “నాతో ఇన్ని బేరాలు లేవు” అని పరోక్ష కథనం
దుకాణాదారుడు అన్నాడు. :: తనతో అన్ని బేరాలు లేవని దుకాణాదారుడు అన్నాడు.

3. ప్రత్యక్ష కథనం : నేను నీతో “నేను రాను” అని చెప్పాను.
పరోక్ష కథనం : నేను నీతో రానని చెప్పాను.

4. ప్రత్యక్ష కథనం : “నీవు ఎక్కదలచిన ట్రైన్ ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు” అని చెప్పాడు ఆరుద్ర.
పరోక్ష కథనం : అతను ఎక్కదలచిన ట్రైన్ ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు అని ఆరుద్ర చెప్పాడు.

5. ప్రత్యక్ష కథనం : “అందరూ విద్య నేర్వండి” అని ప్రభుత్వం అంటున్నది.
పరోక్ష కథనం : అందరూ విద్య నేర్వండి అని ప్రభుత్వం అంటున్నది.

6. ప్రత్యక్ష కథనం : “నేను ఆవకాయలేనిదే ముద్ద ఎత్తను” అని చెప్పాడు.
పరోక్ష కథనం : అతను ఆవకాయ లేనిదే ముద్ద ఎత్తనని చెప్పాడు.

4. సంక్లిష్టవాక్యాలు

ప్రశ్న 1.
లక్ష్మీబాయి గుంటూరు వచ్చింది. లక్ష్మీబాయి శారదా నికేతనంలో చేరింది. (సామాన్య వాక్యం)
జవాబు:
లక్ష్మీబాయి గుంటూరు వచ్చి, శారదానికేతనంలో చేరింది. (సంక్లిష్ట వాక్యం)

ప్రశ్న 2.
అంబేద్కర్ మిళింద మహా విద్యాలయానికి స్థలం సంపాదించారు. అంబేద్కర్ భవన నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించారు. (సామాన్య వాక్యం)
జవాబు:
అంబేద్కర్ మిళింద మహా విద్యాలయానికి స్థలం సంపాదించి, భవన నిర్మాణాన్ని స్వయంగా పర్య వేక్షించారు. (సంక్లిష్ట వాక్యం)

ప్రశ్న 3.
రవి అన్నం తిన్నాడు. రవి బడికి వెళ్ళాడు. రవి చదువు కొన్నాడు. రవి తిరిగి వచ్చాడు. సామాన్య వాక్యం)
జవాబు:
రవి అన్నం తిని, బడికి వెళ్ళి, చదువుకొని, తిరిగి వచ్చాడు. (సంక్లిష్ట వాక్యం)

ప్రశ్న 4.
పశుబలంతో నాయకత్వాన్ని సాధించవచ్చు. పశు బలంతో నాయకత్వాన్ని నిలబెట్టుకోలేం. (సామాన్య వాక్యం)
జవాబు:
పశుబలంతో నాయకత్వం సాధించి నిలబెట్టుకోలేం. (సంక్లిష్ట వాక్యం)

ప్రశ్న 5.
రాముడు అడవికి వెళ్ళెను. తండ్రి మాట నెరవేర్చెను. (సామాన్య వాక్యం)
జవాబు:
రాముడు అడవికి వెళ్ళి తండ్రి మాట నెరవేర్చెను. (సంక్లిష్ట వాక్యం)

ప్రశ్న 6.
అతడు వేకువనే నిద్ర లేచెను. కాలకృత్యములు తీర్చుకొనెను. (సామాన్య వాక్యం)
జవాబు:
అతడు వేకువనే కాలకృత్యములు తీర్చు కొనెను. (సంక్లిష్ట వాక్యం)

5. ఆధునిక వాక్యాలు

1. నా జీవితములో అది ఒక సువర్ణావకాశము.
ఆధునిక భాష : నా జీవితంలో అదొక సువర్ణావకాశం.

2. కొందరు ఉపన్యాసముల మూలమున నా పని చేయుదురు.
ఆధునిక భాష : కొంతమంది (కొందరు) ఉపన్యాసాల మూలంగా ఆ పనిచేస్తారు.

3. మంటలు వేగముగా వ్యాపించుచున్నవి.
ఆధునిక భాష : మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి.

4. తత్పురుష సమాసమునకే వ్యధికరణమని పేరు కలదు.
ఆధునిక భాష : తత్పురుష సమాసానికే వ్యధికరణం అని పేరు. (లేదా) తత్పురుష సమాసాన్నే వ్యధికరణం అని అంటారు.

TS 10th Class Telugu Important Questions 9th Lesson జీవనభాష్యం

6. కర్తరి, కర్మణి వాక్యాలు

1. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆహ్వానించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
విశ్వామిత్రునిచే రామలక్ష్మణులు ఆహ్వానించబడ్డారు. (కర్మణి వాక్యం)

2. జనకుడు శివధనుస్సు తెప్పించాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
జనకునిచే శివధనుస్సు తెప్పించబడింది. (కర్మణి వాక్యం)

3. సుతీక్షమహర్షి తపశ్శక్తిని శ్రీరామునకు ధారాదత్తం చేసాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
సుతీక్ష తపశ్శక్తి శ్రీరామునకు ధారాదత్తం చేయబడింది. (కర్మణి వాక్యం)

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

Telangana SCERT 10th Class Telugu Guide Telangana 11th Lesson భిక్ష Textbook Questions and Answers.

TS 10th Class Telugu 11th Lesson Questions and Answers Telangana భిక్ష

చదువండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 109)

కం. తనకోపమె తన శత్రువు
తనశాంతమె తనకురక్ష దయ చుట్టంబౌఁ
దనసంతోషమె స్వర్గము
తనదుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ.

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
ఈ పద్యంలో శత్రువుగా దేనిని పేర్కొన్నాడు ? ఎందుకు ?
జవాబు:
ఈ పద్యంలో శత్రువుగా కోపాన్ని పేర్కొన్నాడు. కోపం అంతర్గతమైన శత్రువు. ఇది సకల అనర్థాలను కలిగిస్తుంది. బంధువులను, ఆప్తులను, మిత్రులను దూరం చేస్తుంది. రోగాలను కల్గిస్తుంది.

ప్రశ్న 2.
శాంతి రక్షగా ఉంటుందనడంలో కవి ఉద్దేశమేమిటి ?
జవాబు:
శాంతి మానవాళికి రక్షణకవచంలా ఉంటుంది. శాంతం ఉంటే మనకు శ్రీరామరక్ష. సమాజంలో గౌరవ మర్యాదలను వృద్ధి పొందింపజేస్తుంది. ఆప్తులను, బంధువులను దూరం చేయదు. పనులు త్వరగా అవుతాయి. ఇంట్లో సకల సుఖాలు కలుగుతాయి. యుద్ధోన్మాదాలు కలుగవు. అందువల్ల శాంతి అనేది కేవలం శరీరానికేకాదు. సకల సమాజానికి రక్షణగా ఉంటుంది. “తనశాంతమె తనకు రక్ష” అని సుమతీ శతకకర్త బద్దెన చెప్పాడు.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రశ్న 3.
సంతోషాన్ని స్వర్గంగా కవి ఎందుకు భావిస్తున్నాడు?
జవాబు:
మానవునికి సంతోషం స్వర్గంలాంటిది. సంతోషంగా ఉండడంవల్ల సమస్యలు తొలగిపోయి అంతటా ఆనందం వెల్లివిరుస్తుంది. తృప్తి కలుగుతుంది. ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. అరిషడ్వర్గాలకు లోనుకాడు. అందువల్లనే సంతోషాన్ని స్వర్గంగా కవి భావించాడు. “తన సంతోషమే తన స్వర్గము” అని కవులు చెప్పారు.

ప్రశ్న 4.
కోపంవల్ల కలిగే అనర్థాలను గురించిన సంఘటనలు మీకేమైనా తెలుసా ? చెప్పండి.
జవాబు:
కోపం వల్ల ఓర్పు పోతుంది. ఎదుటి వారిని అనకూడని మాటలు అంటాము. దాని మూలంగా పనులు చెడతాయి. అందరూ శత్రువులౌతారు. కోపం వల్ల జరిగే నష్టాన్ని చెప్పే కథ ఒకటి పంచతంత్రంలో ఉంది.

ఒక రైతు తాను అల్లారుముద్దుగా పెంచు కుంటున్న ముంగిసను తన బిడ్డకు కాపలాగా ఉంచి బయటకు వెళ్ళాడు. ఈ లోపు పాము ఇంట్లోకి రావడం చూసి బిడ్డను కాపాడడానికి ముంగిస ఆ పామును కరచి చంపింది. ఇంతలో రైతు ఇంటికి వచ్చాడు. ముంగిస యజమానిని చూసిన ఆనందంలో అతనికి ఎదురు వచ్చింది.

దాని నోటికి, ఒంటికి ఉన్న రక్తం మరకలు చూసి, బిడ్డను చంపిందనుకొని కోపంతో రైతు ముంగిసను కర్రతో కొట్టి చంపాడు. ముంగిసను చంపి, ఇంటిలోపలికి వెళ్ళిచూస్తే, బిడ్డ హాయిగా పడుకొని ఉన్నాడు. చచ్చిపడివున్న పాము కనబడింది. తన బిడ్డను రక్షించిన ముంగిసనే ఒళ్ళు తెలియని కోపంతో చంపానని రైతు వెక్కివెక్కి ఏడ్చాడు. కానీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 111)

ప్రశ్న 1.
ప్రాచీనకాలంలో భిక్షాటనాన్ని పవిత్రకార్యంగా ఎందుకు భావించేవారు ?
జవాబు:
సన్యాసులు, బ్రహ్మచారులు, మహర్షులు ‘భిక్షా’ వృత్తితో జీవించాలని, ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. వ్యాస మహర్షి వంటివారు పంచ భిక్ష స్వీకరించేవారు. అంటే కేవలం ఐదు గృహాలకు వెళ్ళి, ఐదుమంది నుండి మాత్రమే భిక్ష స్వీకరించేవారు. ఉపనయనం చేసినప్పుడు బ్రహ్మచారులు ముందుగా తల్లి నుండి, తరువాత తండ్రి నుండి భిక్షలు స్వీకరించాలి.

సన్యాసులు వంటి వారు జీవనం కోసం వస్తువులు, ధనం, వగైరా దాచరాదని, వారు భిక్ష ద్వారా లభించిన దానినే తిని జీవించాలనీ, శాస్త్రాలు చెపుతున్నాయి. అందుకే ప్రాచీన కాలంలో భిక్షాటనాన్ని పవిత్ర కార్యంగా భావించేవాడు

ప్రశ్న 2.
భిక్ష సమర్పించేటప్పుడు నాటికి నేటికి ఉన్న
జవాబు:
భిక్ష సమర్పించేటప్పుడు పూర్వం గృహిణులు, తమ ఇంటివాకిలిని ఆవు పేడతో శుద్ధిచేసి, అక్కడ ముగ్గు పెట్టి, అతిథికి అర్ఘ్యపాద్యాలిచ్చి, పుష్ప గంధాలతో పూజచేసి, అన్నం మీద నెయ్యి అభిఘూరం చేసి, పిండివంటలతో భక్తి విశ్యాసాలతో అతిథులకు పెట్టేవారు.

ఇప్పుడు భిక్ష పెట్టడం తక్కువ అయ్యింది. కేవలం కొద్దిమంది మాత్రం, ముష్టి పెడుతున్నారు. అది కూడా విసుగుకుంటూ, తప్పనిసరి పరిస్థితుల్లోనే బిచ్చగాండ్రకు ముష్టి వేస్తున్నారు. ముష్టి ఎత్తుకోడం, కొన్ని ప్రాంతాల్లో నేరంగా పరిగణింపబడుతోంది. నేడు దాన ధర్మాలు బాగా తగ్గిపోయాయి.

ఆలోచించండి – చెప్పండి (T.B. PNo. 113)

ప్రశ్న 1.
భిక్ష దొరకని వ్యాసుడు కోపగించాడు కదా ! దీనిపైన మీ అభిప్రాయమేమిటి ?
జవాబు:
వ్యాసుడు వేదవేదాంగవేత్త. అష్టాదశ పురాణాలు రచించినవాడు. భారతం రచించినవాడు. అటువంటి వాడు కేవలం రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీ నగరంపై కోపించి శపించడానికి సిద్ధమయ్యాడు. వ్యాసుడు కోపించడం, ధర్మం కాదు. లోకంలో ఎందరో మహర్షులు, తాపసులు నివ్వరి బియ్యం తిని జీవిస్తున్నారు.

కొందరు శాకాహారంతో, కంద భోజనంతో కడుపు నింపుకుంటున్నారు. కొందరు ఉంఛ వృత్తితో జీవిస్తున్నారు. కాబట్టి వ్యాసుని వంటి మహర్షి రెండు రోజులు పస్తు ఉండలేక, శివుని భార్యయైన కాశీ నగరాన్ని శపించబోవడం నేరం అని నా అభిప్రాయం.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
“ఆకలి మనిషిని విచక్షణ కోల్పోయేటట్లు చేస్తుంది” దీన్ని గురించి మాట్లాడండి.
జవాబు:
మనిషికైనా, జంతువుకైనా, ఏ ప్రాణికైనా ఆకలి వేసినపుడు తిండి కావాలి. అది శరీరానికి ప్రాథమిక అవసరం. తిండి లేకపోతే కడుపులో మంట వస్తుంది. తలపోటు, చిరాకు, కోపం వస్తాయి. ఆ పరిస్థితులలో మనిషి విచక్షణ కోల్పోతాడు. తను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు.

ప్రశ్న 3.
ఉన్న ఊరును కన్నతల్లితో సమానమని ఎందుకు (A.P Mar. ’16)
జవాబు:
కన్నతల్లి మనకు కావలసిన దానిని తాను గుర్తించి మన కడుపు నింపుతుంది. కన్నతల్లి తన బిడ్డలపై ఎప్పుడూ కోపగించుకోదు. పిల్లలను కన్నతల్లి బాగా ప్రేమగా చూసి, వారికి కావలసిన వాటిని ఇస్తుంది.

అలాగే మనం ఉన్న ఊరు కూడా, మనకు కావలసిన వాటిని సమకూరుస్తుంది. మనం ఉన్న ఊరిలో మనకు ప్రజలు అందరూ తెలిసిన వారు ఉంటారు. వారు తన తోడి వ్యక్తిని ప్రేమగా కన్నతల్లి వలె చూస్తారు. అందుకే జననీ, జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అన్నారు.

కన్నతల్లిని విడిచి వెళ్ళకూడదు. అలాగే మనం ఉన్న ఊరును విడిచి పొరుగూరు పోకూడదు. పొరుగూరిలో మనం ఎన్నటికీ ఉన్న ఊరులో వలె సుఖంగా ఉండలేము. కన్నతల్లి, ఉన్న ఊరు స్వర్గంతో
సమానం.

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 114)

ప్రశ్న 1.
భోజనానికి ఆహ్వానించిన గృహిణితో వ్యాసుడు పలికిన మాటలను బట్టి మీకేమి అర్థమయింది
జవాబు:
గృహిణి వ్యాసుడిని భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అప్పుడు వ్యాసుడు తానొక్కడినే భోజనానికి రానని, శిష్యులు పస్తులుండగా తానొక్కడినే తినడం మంచిది కాదని చెప్పాడు. దీనివల్ల వ్యాసునికి తన శిష్యులపట్ల ప్రేమానురాగాలు కలవని అందరూ ఆకలితో ఉంటే ఒక్కడినే తినడం మంచిదికాదని వ్యాసుని మాటల వల్ల అర్థమైంది.

ప్రశ్న 2.
ఈ పాఠం ఆధారంగా నాటి గురుశిష్య సంబంధాల గురించి వివరించండి.
జవాబు:
ఈ పాఠం ఆధారంగా అలనాటి గురుశిష్య సంబంధాలు జాతికి ఆదర్శంగా నిలుస్తాయి. శిష్యులు గురువుపై గౌరవాన్ని చూపేవారు. గురువు కూడా శిష్యులపై ప్రేమను, వాత్సల్యాన్ని చూపేవారు. శిష్యులు పస్తులుండగా గురువు ఆహారాన్ని స్వీకరించే వాడు కాదని తెలుస్తుంది.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
క్రింది పద్యం చదవండి. శ్రీ నాథుడు తన గురించి తాను ఏమని చెప్పుకొన్నాడో తెల్పండి.

సీ|| వచియింతు వేములవాడ భీమన భంగి
నుద్దండలీల నొక్కొక్కమాటు

భాషింతు నన్నయభట్టు మార్గంబున
నుభయవాక్రౌఢి నొక్కొక్క మాటు
వాక్రుత్తు తిక్కయజ్వ ప్రకారము రసా
భ్యుచిత బంధమున నొక్కొక్కమాటు
పరిఢవింతు ప్రబంధపరమేశ్వరుని ఠేవ
సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు

తే॥గీ॥ నైషధాది మహాప్రబంధములు పెక్కు
చెప్పినాడవు మాకు నాశ్రితుడ వనఘ
ఇపుడు చెప్పఁదొడంగిన యీ ప్రబంధ
మంకితముసేయు వీరభద్రయ్యపేర (కాశీ 1-18)
జవాబు:

ఈ పద్యం శ్రీనాథుడి కవిత్వ రచనా విధానాన్ని గూర్చి చెపుతోంది.

  1. శ్రీనాథుడు వేములవాడ భీమన అనే కవి వలె, ఒక్కొక్కసారి “ఉద్దండ లీల”గా కవిత్వం చెపుతాడు.
  2. ఒక్కొక్కసారి నన్నయభట్టు కవి వలె, “ఉభయ, వాక్రౌఢి” తో కవిత్వం రాస్తాడు. “
  3. ఒకసారి తిక్కన గారి వలె, ‘రసాభ్యుచిత బంధము’గా రాస్తాడు.
  4. ఒక్కొక్కసారి ప్రబంధ పరమేశ్వరుడైన ఎఱ్ఱన గారి వలె “సూక్తి వైచిత్రి”ని చూపిస్తాడు.
  5. నైషధము వంటి అనేక ప్రబంధాలు రాశాడు.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
‘అన్ని దానాల్లోకీ అన్నదానం మిన్న’ అనే అంశంపై తరగతిలో చర్చించండి.
జవాబు:
‘దానం’ అంటే ఇతరుడికి ఇవ్వడం. దానం చేస్తే పుణ్యం వస్తుందని చెపుతారు. ఈ జన్మలో దానం చేసుకుంటే తరువాతి జన్మలో భగవంతుడు మనకు తిరిగి ఇస్తాడని మన గ్రంథాలు చెపుతున్నాయి. దశదానాలు, షోడశ మహాదానాలు చేయాలని చెపుతారు. అయితే దానాలు అన్నింటిలోకి ‘అన్నదానం’ గొప్పది అని పెద్దలు చెపుతారు. ఈ మాట సత్యమైనది.

ఎదుటి వ్యక్తికి తృప్తి కలిగేటట్లు అన్నదానం చేయవచ్చు. అన్నదానం చేస్తే తిన్నవాడికి కడుపు నిండుతుంది. మరింతగా పెడతానన్నా అతడు తినలేడు. ఇతర దానాలు ఎన్ని చేసినా ఎంత విరివిగా చేసినా దానం పుచ్చుకున్న వాడికి తృప్తి కలుగదు. మరింతగా ఇస్తే బాగుండు ననిపిస్తుంది. అన్నదానం చేస్తే తిన్నవాడి ప్రాణం నిలుస్తుంది. కాబట్టి అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అన్నమాట నిజం

ప్రశ్న 3.
“ఆకంఠంబుగ ….. శిలోంఛప్రక్రముల్ తాపసుల్!” పదాన్ని పాదభంగం లేకుండా పూరించి, భావాన్ని వ్రాయండి. (Mar. ’16)
జవాబు:
ప్రతిపదార్థ తాత్పర్యాలలో 10వ పద్యాన్ని చూడుము.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు వ్రాయండి.

అ) పాఠం ఆధారంగా వ్యాసుడు ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాన్ని వ్రాయండి.
జవాబు:
“భిక్ష” పాఠం ఆధారంగా వ్యాసుడు ప్రవర్తించిన తీరును పరిశీలించగా ఎంతటి వారికయినా ఆకలిబాధ భరించరానిది అని అర్థమవుచున్నది. ఈ ఆకలి బాధచే వేదాలను నాలుగు విధాలుగా విభజించిన వేదవ్యాసుడు కోపానికి లోనయ్యాడు. కోపం వలన మంచి చెడుల విచక్షణను కోల్పోయి కాశీనగరాన్ని శపించబోయాడు. అంతేగాకుండా సకలశాస్త్రాలను చదివి, వాటి సారాన్ని తెలుసుకున్న వ్యాసుడు కేవలం 20 రోజులు భిక్ష దొరకని కారణంగా తీవ్రకోపానికి లోనై తన చేతిలోని భిక్షపాత్రను నేలకేసి విసిరిగొట్టెను.

“కనుక కోపం చాలా ప్రమాదకరమయినది. కోపం మానవునికి అంతర్గత శత్రువు. కోపం మన ప్రశాంతతను దెబ్బ తీస్తుంది. తోటివారిని ప్రశాంతంగా ఉండనివ్వదు. మనిషి ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని క్రమంగా క్షీణింపజేస్తుంది. ఆప్తులను, స్నేహితులను దూరం చేస్తుంది. గౌరవ, మర్యాదలు తగ్గిస్తుంది. కనుక మనిషి కోపాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే అందరికీ ఆదర్శంగా ఉండగలము” అనే విషయాన్ని గ్రహించాలి. మనిషికి కేవలం శాస్త్రజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదనీ, ఆత్మజ్ఞానం మరియు ఇంద్రియ నిగ్రహం ఉండాలని వ్యాసుని పాత్ర ద్వారా గ్రహించవచ్చు.

ఆ) నేఁడు నిన్నటికి మఱునాఁడు నిక్కువంబు” అను మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు ? వీటి అంతరార్థమేమిటో వివరించండి.
జవాబు:
పరిచయం : ఈ మాటలు శ్రీనాథ మహాకవి రచించిన కాశీఖండం నుండి గ్రహించిన “భిక్ష” పాఠంలోనిది.
భావము : ఈ రోజు నిన్నటికి మరునాడే కదా !

అంతరార్థం : అంటే ఈ రోజు నాకు భిక్ష లభించకపోతే నిన్నటిలాగే ఈ రోజు కూడా ఉపవాసం తప్పదని వ్యాసుని మాటల్లోని అంతరార్థము.

ఇ) ఆకలి వల్ల వ్యాసుడు కాశీ నగరాన్ని శపించాలను కున్నాడు కదా ! “ఆకలి మనిషి విచక్షణను నశింప జేస్తుంది” అనే దాని గురించి రాయండి.
జవాబు:
వేదవ్యాసుడు మహాపండితుడు. వేద విభజన చేసినవాడు. 18 పురాణాలు రచించినవాడు. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించాడు. అటువంటి మహర్షి కూడా ఆకలి వల్ల విచక్షణ కోల్పోయాడు. కాశీని శపించాలనుకొన్నాడు. ఎందుకంటే మనిషి దేనినైనా జయించగలడు. కానీ ఆకలిని జయించలేడు. ఆకలి ఎక్కువైతే కడుపులో మంట వస్తుంది. కళ్ళు తిరుగుతాయి.

తలపోటు, వికారం, చిరాకు, కోపం అన్నీ వస్తాయి. వాటివలన మనిషి విచక్షణను కోల్పోతాడు. విచక్షణ కోల్పోయిన మనిషి ఎంతకైనా తెగిస్తాడు. తనకు అన్నం పెట్టని లోకంపై కక్ష పెంచుకొంటాడు. రాక్షసుడుగా మారతాడు. అంటే మనిషిని రాక్షసుడిగా మార్చేది ఆకలి. అందుకే ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలి.

ప్రశ్న 2.
క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబులు వ్రాయండి.

అ) “భిక్ష” పాఠంలోని కథను సంక్షిప్తంగా వ్రాయండి. (A.P June’18)
(లేదా)
“భిక్ష” పాఠ్యభాగ కథను మీ మాటల్లో వివరించండి.
జవాబు:
వ్యాసమహర్షి శిష్యులతో కూడి నగరంలో నివ సిస్తున్నాడు. ఒకసారి వ్యాసుడు శిష్యులతో కలిసి భిక్షాటనకై బయలుదేరాడు. శివుని యోగమాయతో వ్యాసునికి గాని, అతని శిష్యులకు గాని భిక్ష లభించలేదు. ఏ ఇల్లాలు కూడా భిక్షను వేయలేదు. వాస్తవంగా కాశీ నగరంలోని ఇల్లాండ్రు అన్నపూర్ణా దేవికి చెలికత్తెలు. వారంతా అతిథులను గౌరవిస్తారు. కాని రెండు రోజుల పాటు భిక్ష దొరకలేదు.

వ్యాసుడు తీవ్రమైన కోపాన్ని పొందాడు. కాశీ నగరంలోని ప్రజలను శపించబోయాడు. ఆ సమయంలో అన్నపూర్ణాదేవి సాధారణ స్త్రీ వలె వ్యాసుని ముందుకు వచ్చింది. అతనితో మహర్షి ! నీవు కాశీపై కోపగించుట తగునా ? నీవు శాంత స్వభావం కల వాడివా ? పిడికెడు వరి గింజలతో కాలం వెళ్ళబుచ్చే శాకా హారంతో జీవించే తాపసుల కంటే నీవు గొప్ప వాడివా ? ‘ఉన్న ఊరు కన్నతల్లితో సమానం’ అనే ధర్మాన్ని మరిచిపోయావా ? ఆకలితో ఉన్న నిన్ను ఇంకా మాటలతో బాధపెట్టడం తగదు. నీవు వెంటనే భోజనానికి రమ్ము.

తరువాత నీకు కొన్ని మాటలు చెప్పాలి. అని పలికింది. వ్యాసుడు ఆ మాటలను విని ‘అమ్మా ! నా శిష్యులు, ఇతరులు మొత్తం పదివేల మంది ఉన్నారు. వారందరు తినకుండా నేను భోజనం చేయటం మంచిది కాదు’ అని పలికాడు. అది విని అన్నపూర్ణాదేవి “మహర్షీ! నీతోపాటు నీ శిష్యులు కలసి రావలసినది. విశ్వనాథుని అనుగ్రహంతో మీకందరికి రుచి కరములైన ఆహారాన్ని అందిస్తాను” అని పలికింది. వ్యాసుడు అంగీకరించిన శిష్యులతో కలిసి అన్నపూర్ణాదేవి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజన శాలలో భోజనం చేశాడు.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ఆ) కోపంవల్ల కలిగే దుష్పరిణామాలను గురించి రాయండి.
జవాబు:
మనం జయించవలసిన మనలోని శత్రువులు ఆరు. వీటిని అరిషడ్వర్గాలు అంటారు. అవి

  1. కామం,
  2. క్రోధం,
  3. లోభం,
  4. మోహం,
  5. మదం,
  6. మాత్సర్యం.

ఈ ఆరు అంతః శత్రువులను జయించిన వాడే మహనీయుడు అవుతాడు. వీటిలో ప్రధానమైన శత్రువు క్రోధం. అదే కోపం. ‘తన కోపమే తన శత్రువు – తన శాంతమే తనకు రక్ష’ అని శతకకర్త ఎప్పుడో చెప్పాడు. ‘కోపమునను ఘనత కొంచెమై పోవును’ అని కూడా మహాకవి చెప్పాడు.

కోపాన్ని జయించి సహనాన్ని శాంతాన్ని అలవరచుకోవడం చాలా కష్టం. ఎంతో సాధన చేస్తే తప్ప కోపాన్ని జయించలేం. భృగు మహర్షి, విశ్వామిత్రుడు, దుర్వాసుడు లాంటి గొప్ప మహర్షులు సహితం ఈ ప్రయత్నంలో విఫల మయ్యారు. కోపాన్ని జయించలేక తమను తాము తగ్గించుకొన్నారు. ఈ కోపం మనిషిని క్షణికావేశానికి లోను చేసి ఎన్నో అనర్థాలకు కారణమౌతుంది.

బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వేదవ్యాస మహర్షి ఆకలి బాధ తాళలేక కోపానికి వశుడై, పరమేశ్వరునికి ప్రీతి పాత్రమైన కాశీనగరాన్ని శపించడానికి సిద్ధపడ్డాడంటే – కోపం ఎంతటి వారినైనా విచక్షణను కోల్పోయేటట్లు చేస్తుందనేదానికి నిదర్శనం. సాధన చేస్తే సాధ్యం కానిది లేదు. ప్రతి ఒక్కరూ అంతః శత్రువైన కోపాన్ని జయించాలి. సహనాన్ని అలవర్చుకోవాలి. ఆనాడే సమాజంలో శాంతి పరిఢవిల్లుతుంది.

“కోపాన్ని జయించండి – ఉత్తమ వ్యక్తులుగా ఎదగండి”

ప్రశ్న 3.
క్రింది అంశాలను గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ వ్రాయండి.

అ) భిక్ష, రక్ష, పరీక్ష, సమీక్ష, వివక్ష… వంటి పదాలతో ఒక చక్కని భావాన్ని ప్రకటించే కవిత వ్రాయండి.
జవాబు:
సకల శుభదాయక కల్పవల్లీ
జనులందరికీ జ్ఞాన భిక్ష ప్రసాదించు
నీ కృపారస దృష్టే జనులందరికీ రక్ష
అదే మాకందరికి జీవన రక్ష.

జీవన పోరాట పరీక్షలెన్నో ఉన్నాయి
పరీక్షలన్నింటిలో నీ రక్షతో గెలవాలి మేము
నవ సమాజంలో ఎన్నో వివక్షలు
కక్షలేని రహదారులు లేవెక్కడ
నిరక్షరాస్యులైన నిర్భాగ్యులెందరో
వారందరినీ చూడుము నిష్పక్షపాతంగా

సమీక్షలు లేని ప్రభుత్వ పథకాలెన్నో
దూరమవుతున్నాయి నిర్భాగ్యులకు
నాగరిక సమాజంలో ఎన్నో వివక్షలు
కనిపించని మానవ నైతిక సంబంధాలు
తల్లీ ! ఇక రక్షించు ! నీవైనా !
మా కందరికీ పంచిపెట్టు జ్ఞానభిక్ష !

III. భాషాంశాలు

పదజాలం

1. క్రింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి.

అ) ద్వాఃకవాటంబు దెఱవదు వనిత యొకతె
జవాబు:
వనిత = మహిళ, స్త్రీ, పడతి, ఉవిద, నారి, పురంధ్రి, అంగన, మగువ

ఆ) ప్రక్షాళితంబైన పసిఁడి చట్టువము.
జవాబు:
పసిడి = బంగారం, కాంచనం, పుత్తడి, సువర్ణం, కనకము, హిరణ్యము

ఇ) పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపఁ
జవాబు:
పారాశర్యుండు = వ్యాసుడు, బాదరాయణుడు, కృష్ణ ద్వైపాయనుడు, సాత్యవ తేయుడు

ఈ) ఇవ్వీటిమీద నాగ్రహము తగునె ?
జవాబు:
ఆగ్రహము = కోపము, క్రోధము, అలుక, ఉద్రేకం, రోషము

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ఉ) అస్తమింపగ జేసినాడు అహిమకరుడు.
జవాబు:
అహిమకరుడు = సూర్యుడు, భానుడు, రవి, ప్రభాకరుడు, ఆదిత్యుడు, ఇనుడు

2. క్రింది పదాలను అర్థాలను రాయండి.

అ) ద్వాఃకవాటము
ఆ) వీక్షించు
ఇ) అంగన
ఈ) మచ్చెకంటి
ఉ) భుక్తిశాల

అ) ద్వాఃకవాటము
జవాబు:
ద్వారబంధము

ఆ) వీక్షించ
జవాబు:
చూచు

ఇ) అంగన
జవాబు:
స్త్రీ

ఈ) మచ్చెకంటి
జవాబు:
చేపకనులు గల స్త్రీ

ఉ) భుక్తిశాల
జవాబు:
భోజనశాల

3. క్రింది వాక్యాల్లో నానార్థాలు వచ్చే పదాలను గుర్తించండి.

అ) వీడు ఏ వీడువాడోగాని దుష్కార్యములను వీడుచున్నాడు.
జవాబు:
ఈ వాక్యంలో ‘వీడు’ అనే పదం మూడు అర్థాలలో వాడబడింది.
వీడు (నానార్థాలు) :

  1. ఈ మనుష్యుడు
  2. పట్టణము
  3. వదలుట

ఆ) రాజు ఆకాశంలోని రాజును చూసి సంతోషించాడు. (A.P Mar.16)
జవాబు:
ఈ వాక్యంలో ‘రాజు’ అనే పదం మూడు అర్థాల్లో వాడబడింది.
రాజు (నానార్థాలు) :

  1. క్షత్రియుడు
  2. చంద్రుడు

4. క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి.

అ) విద్య ()
క) విదియ
చ) విజ్జ
ట) విద్దె
త) విద్య
జవాబు:
ట) విద్దె

ఆ) భిక్ష ()
క) బత్తెము
చ) బచ్చ
ట) బిచ్చ
త) బిచ్చము
జవాబు:
త) బిచ్చము

ఇ) యాత్ర ( )
క) యతర
చ) జాతర
ట) జైత్ర
త) యతనము
జవాబు:
క) యతర

ఈ) మత్స్యము ( )
క) మచ్ఛీ
చ) మత్తియము
ట) మచ్చెము
త) మత్తము
జవాబు:
ట) మచ్చెము

ఉ) రత్నము ( )
క) రతనము
చ) రచ్చ
ట) రచ్చము
త) రత్తము
జవాబు:
క) రతనము

ఊ) పంక్తి ( )
క) పంతులు
చ) పత్తి
ట) బంతి
త) పంకు
జవాబు:
ట) బంతి

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

వ్యాకరణాంశాలు

1. కింద గీత గీసిన పదాల్లోని సంధులను గుర్తించి సంధి పేరు రాయండి.

అ) పుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁ గటా !
జవాబు:

  1. పుణ్య + అంగన = పుణ్యాంగన
    సవర్ణదీర్ఘ సంధి సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
  2. భిక్ష + ఇడదయ్యె = భిక్షయిడదయ్యె
    యడాగమసంధి సూత్రం : సంధిలేని చోట అచ్చుకంటె పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.
  3. ఇడదయ్యెన్ + కటా = ఇడదయ్యెఁ గటా! ద్రుతప్రకృతిక సంధి (సరళాదేశ సంధి)

సూత్రాలు :

  1. ద్రుత ప్రకృతికము మీది పరుషాలకు సరళాలు వస్తాయి.
  2. ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.

ఆ) కాశి; యివ్వీటి మీద నాగ్రహము దగునె.
జవాబు:

1) కాశి + ఇవ్వీటి = కాశి యివ్వీటి (యడాగమ సంధి)
ఈ + వీటి = ఇవ్వీటి (త్రికసంధి)

త్రికసంధి సూత్రాలు :

  1. ఆ,ఈ,ఏ లు త్రికములు.
  2. త్రికము మీదున్న అసంయుక్త హాల్లునకు ద్విత్వ బహుళంగా వస్తుంది.
  3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్ఛికంబగు దీర్ఘానికి హ్రస్వం.

2) గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమమీది పరుషములకు గ, స, డ, ద, వ లు బహుళముగానగు.

ఇ) ఓ మునీశ్వర ! వినవయ్య
జవాబు:

1) ముని + ఈశ్వర = మునీశ్వర (సవర్ణదీర్ఘ సంధి)

సవర్ణదీర్ఘసంధి సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
యడాగమసంధి సూత్రం:
సంధిలేని చోట అచ్చుకంటే పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది
వినవు + అయ్య = వినవయ్య (ఉత్వ సంధి)
ఉత్వసంధి సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది.

2. పాఠంలోని తేటగీతి పద్యాన్ని గుర్తించి లక్షణాలతో సమన్వయం చేయండి.

అ) మునీశ్వర! ……….. నా గ్రహముదగునె ?
జవాబు:
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 1

పై పద్యంలోని ప్రతి పాదంలో ఒక సూర్య గణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్య గణాలు వరసగా వచ్చాయి కాబట్టి ఇది తేటగీతి పద్యం.
ఇది ఉపజాతి
ప్రాసనియమం ఉండదు.
ఒకటవ గణం మొదటి అక్షరానికి నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది.

సీస పద్యం

క్రింది తరగతులలో తేటగీతి, ఆటవెలది పద్యాలు తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు ‘సీస పద్య’ లక్షణాలను పరిశీలిద్దాం.

క్రింది ఉదాహరణలను పరిశీలించండి.
ఉదా :
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 2

సీసపద్య లక్షణం:

ఇందులో నాలుగు పాదాలుంటాయి.
ప్రతిపాదంలో ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
పద్యపాదం రెండు సమభాగాలుగా ఉంటుంది. రెండు భాగాల్లోను మూడో గణంలోని మొదటి అక్షరం యతి లేదా ప్రాస యతి.
ప్రాసనియమం లేదు.
తేటగీతి లేదా ఆటవెలది దీనికి చివరగా ఉంటుంది.

పై పద్యపాదాల్లో –

  1. ఒక్కొక్కటి రెండు భాగాలుగా ఉన్నాయి.
  2. రెండు భాగాల్లో కలిపి ఎనిమిది గణాలున్నాయి. (ఆరు ఇంద్రగణాలు + రెండు సూర్యగణాలు)
  3. యతి, ప్రాస యతులు (కా – గ, ర – ర) (ప-పు, ప-ప) ఉన్నాయి.
  4. ప్రాసనియమం లేదు. వీటిని బట్టి ఇది సీసపద్యం అన్ని గుర్తించవచ్చు.

ప్రశ్న 1.
పాఠంలోని సీసపద్యానికి గణవిభజన చేసి లక్షణాలను అన్వయించండి.
జవాబు:
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 3
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 4
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 5
తేటగీతి :
TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష 6

లక్షణాలు :

  1. 4 పాదాలుంటాయి.
  2. ప్రతి పాదంలో 6 ఇంద్ర గణాలు + 2 సూర్య గణాలు ఉంటాయి.
  3. 3వ గణంలో 1 మొదటి అక్షరం యతి లేదా ప్రాస యతి.
  4. ప్రాస నియమం లేదు.
  5. తేటగీతి దీనికి చివరగా.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రాజెక్టు పని

శ్రీనాథుడు రచించిన ఏవైనా 5 పద్యాలు సేకరించండి. (లేదా) కాశీపట్టణ విశేషాలు తెలుసుకొని రాయండి. నివేదిక రాసి వినిపించండి.

1. సీ. ‘తల్లి మదేకపుత్రక పెద్ద కన్నులు
గానదిప్పుడు మూడుకాళ్ళ ముసలి
యిల్లాలు గడుసాధ్వి యేమియు నెఱుగదు.
పరమ పాతివ్రత్య భవ్య చరిత వెనుక ముందర లేరు నెనరైన చుట్టాలు
లేవడి యెంతేని జీవనంబు
గానక కన్న సంతానంబు శిశువులు
జీవన స్థితికేన తావలంబు

2. సీ. వేదండ సదన శుండాదండ గండూష
కాండ సిక్తాస్సరో మండలములు
గంధర్వ కన్యకా కనక సౌగంధిక
మాలికాలగ్న షాణ్మాతురములు
నందీశ్వరక్షిప్త నారంగ ఫలపాక
తారశ విద్యాద్ధరీ స్తనభరములు
గరుడ లీలావతీ కస్తూరికా పంక
పిహిత నిశ్శేషాంగ భృంగిరిటులు

3. సీ. శ్రీ భీమనాయక శివనామ ధేయంబు
చింతింపనేర్చిన జిహ్వ జిహ్వ
దక్షవాటీ పురాధ్యక్ష మోహనమూర్తి
చూడంగనేర్చిన చూపుచూపు
దక్షిణాంబుధి తటస్థాయి పావనకీర్తి
చేవింపనేర్చిన చెవులు చెవులు
తారకబ్రహ్మ విద్యాదాత యౌదల
విరులు పూన్పగనేర్చు కరము కరము

4. “ఓరి దురాత్మ ! నీ వార ముష్టింపచా
భాస, యోజనగంధి ప్రథమపుత్ర
దేవర న్యాయదుర్భావనా పరతంత్ర
బహుసంహిత వృధా పాదపఠన
భారత గ్రంథ గుంభన పండితం మన్య
నీవా మదీయ పత్నికి నశేష
కైవల్య కల్యాణఘంటాపథమునకు
గాశికాపురికి నిష్కారణంబ

5. సీ॥ సంస్తుతించిరి బహ్వృచ ప్రపంచంబుల
నొకకొందఱసిత కంఠోపకంఠు
నుచ్చైస్స్వనంబున నొక కొందఱునుతించి
రార్యాకళత్రు సధ్వర్యుశాఖ
శివునిఁ బ్రశంస చేసిరి యొకకొందఱు
సద్భక్తి మైసప్త సామములను
సర్వజ్ఞుఁ బొగడిరధర్వ వేదంబున
నొకకొందఱగిఁ బ్రసంగోచితముగఁ

తే.గీ. వీరభద్ర వికీర్ణ కర్పూర చూర్ణ
ధనకళితాకాశ చరవనితా ముఖములు
శాంభవీశంభు మధుకేళి సంభ్రమములు
పొడులి నాసించుగాకత నా హృదయవీధి
– హరవిలాసం – శ్రీనాథుడు.

తే.గీ. ధవళకర శేఖరునకు బ్రదక్షిణంబు
నర్థి దిరుగంగ నేర్చిన యడుగులడుగు
లంబికానాయక ధ్యానమార్గ జలధి
మధ్యమున దేలియాడెడి మనసు మనసు
– భీమఖండము – శ్రీనాథుడు.

తే.గీ. శాపమిచ్చెదనని యనాచార సరణి
నడుగుపెట్టినవాడ వహంకరించి
పొమ్ము ! నిర్భాగ్య మాయూరి పాలము వెడలి
యెచటికేన్ శిష్యులు నీవు నీక్షణంబు” (భీమేశ్వర పురాణము)

తే.గీ. గాశికాతీర్థ వాసులఁ గర్మపరులఁ
భూతి రుద్రాక్షధారులఁ బుణ్యనిధుల
నందఱినిఁ జూచి కరుణా సమగ్రబుద్ధి
నిట్టులని యానతిచ్చె విశ్వేశ్వరుండు ।

1. కాశీ పట్టణ విశిష్టత : మనదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో పరమపావనమైనది, దివ్యమైనది కాశీ క్షేత్రం. ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రంగాను, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందింది. పరమపావనమైన గంగానది ఇక్కడ ప్రవహిస్తుంది. కాశీలో మరణించినవారికి శివుని సాయుజ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇది ఎంతో అందమైన ప్రాంతం. నిరంతర వేదఘోష మార్మోగుతుంది. విద్యాలయాలకు నిలయంగా మారింది. అన్నార్తులకు కల్పవల్లిగా విరాజిల్లింది. భారతదేశంలో జన్మించిన ప్రతి హిందువు జీవితంలో ఒకసారైన కాశీని దర్శించాలని అనుకుంటాడు.

నివేదిక

శ్రీనాథుడు ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రలో కవిసార్వభౌమునిగా గుర్తింపు పొందాడు. కావ్య రచనలో రసపోషణకు ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చాడు. ఇతనిది వర్ణనాత్మకశైలి. కవిత్వం కొంత ప్రౌఢంగా ఉన్నప్పటికీ కూడా ఆపాతమధురంగా ఉంటుంది. ఇతడు సీసపద్య రచనలో తన విశేష ప్రతిభను ప్రదర్శించాడు. పాత్రానుగుణమైన శైలి, పదబంధము ఇతని ప్రత్యేకత. ఇతని పద్యాల్లో అంత్యానుప్రాస, ఉత్ప్రేక్ష, రూపకాలంకారాలు ఎక్కువగా కనిపిస్తాయి. తెలుగు సాహిత్యంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వారిలో శ్రీనాథుడ్నే ప్రథముడుగా చెప్పవచ్చు. ఇతని కవిత్వం ప్రబంధ యుగానికి పునాది వేసింది.

విశేషాంశాలు

1. మాధుకరము : మధుకర వృత్తి అంటే తుమ్మెదలు పూలలోపలి తేనెను గ్రహించినట్లు గృహస్థులు ఇండ్ల నుండి భిక్షను గ్రహించడం

మీకు తెలుసా ?

1. బ్రాహ్మీముహూర్తం : సూర్యోదయానికి 90 ని॥ల ముందుకాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. బ్రాహ్మీ అంటే సరస్వతి అని కూడా అర్థం. బుద్ధిని పెంపొందించే సమయం కాబట్టి దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఈ సమయం శ్రేష్ఠమైనది.

2. దేవకార్యము : భగవంతుడికి విశేషంగా చేసే పూజా కార్యక్రమం. రెండోది పితృదేవతా కార్యం. అంటే శ్రాద్ధము. శ్రాద్ధమునాడు భిక్ష సమర్పించరాదనే సంప్రదాయమున్నది.

3. కామధేనువు : (దేవతల ఆవు). కోరిన కోర్కెలను తీరుస్తుంది.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

4. కాశి : ప్రపంచంలో అతి పురాతన క్షేత్రం. 5 క్రోశములు కోసం వ్యాపించినది. వరుణ, అసినదుల సంగమ ప్రాంతం కనుక “వారణాసి” అయింది. విశ్వేశ్వరుని ఆలయం కలదు. పార్వతీమాతను అన్నపూర్ణగా కొలుస్తారు. దీనికి మహాశ్మశానమని కూడా పేరు. సప్త మోక్షధామాలలో ఇది ఒకటి.

5. అష్టాదశపురాణాలు : భాగవత, భవిష్య, మత్స్య, మార్కండేయ, బ్రహ్మ, బ్రహ్మండ, బ్రహ్మవైవర్త, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణాలు.

6. పారణ : ఉపవాసం ఉండి తర్వాత రోజు చేయు భోజనం (ఉపవాసానంతర భోజనం).

సూక్తి : మేధావి ఎన్నికష్టాలుపడ్డా, శుద్ధమైన నడవడిని, జీవనాన్ని వదలడు. దానివల్లనే అతడు ప్రతిష్టను, ఉత్తమ గతులనూ పొందుతాడు.
– మహాభారతం ఉద్యోగపర్వం

ప్రతిపదార్థ తాత్పర్యాలు

I

1. తే॥గీ॥ నెట్టుకొని కాయ బీటెండ పట్టపగలు
తాను శిష్యులు నిల్లిల్లు దప్పకుండఁ
గాశికా విప్రగృహ వాటికల నొనర్చు
నఖిల విద్యాగురుండు భిక్షాటనంబు.

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థము
అఖిల విద్యాగురుండు = సకల విద్యలకు గురువైన వ్యాసుడు
తాను = తానును
శిష్యులున్ = శిష్యులును
పగలు + పగలు = పట్ట పగటియందు
బీఱు + ఎండ = అధికమైన ఎండ
నెట్టుకొనికాయన్ = అతిశయించి కాయుచుండగా
కాశికా = కాశీనగరమందలి
విప్రగృహ = బ్రాహ్మణుల గృహాలకు సంబంధించిన
వాటికలన్ = వాడలయందు
భిక్షాటనంబు = భిక్షాటనను
ఇల్లిల్లు = ప్రతిఇంటిని
తప్పకుండగన్ = విడువకుండా
ఒనర్చున్ = చేసెను

తాత్పర్యము
విద్యాగురుడైన వ్యాసమహర్షి శిష్యులతో కూడి పట్టపగలు, అధికమైన ఎండలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీధిలో భిక్షకోసం ఇల్లిల్లూ తిరగసాగాడు.

2. తే॥గీ॥ వండుచున్నారమను నొక్క వనజనేత్ర
తిరిగి రమ్మను నొక్క లేఁదీఁగె బోఁడి
దేవకార్యంబు నేఁడనుఁ దెఱవ యోర్తు
ద్వాః కవాటంబుఁ దెఱవదు వనిత యొకతె

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

ఒక్కవనజనేత్ర = పద్మములవంటి కన్నులు గల ఒక
వండుచున్నారమనున్ = వంటచేయుచున్నవారమని
ఒక్కలేదీగబోడి = లతవంటి శరీరముగల ఒక స్త్రీ
తిరిగిరమ్మనున్ = తిరిగిరమ్మనును
తెఱవయోర్తు = ఒక ఇల్లాలు
నేడు = ఈరోజు
దేవకార్యంబు = దేవతాసమారాధన
అనున్ = అంటున్నది
వనితయొకతె = ఒక స్త్రీ
ద్వాఃకవాటంబున్ = వాకిటి తలుపును
తెఱవదు = తెరవనే తెరువదు

తాత్పర్యము
ఒక ఇల్లాలు ‘వండుతున్నాం’ అంటున్నది. మరొక స్త్రీ ‘మళ్ళీ రండి’ అంటున్నది. ఇంకొకావిడ ఈరోజు వ్రతం (దేవకార్యం) అని చెబుతుంది; వేరొకావిడైతే అసలు తలుపులే తెరవడం లేదు.

3. సీ॥
ముంగిట గోమయంబున గోముఖము దీర్చి
కడలు నాల్గుగ మ్రుగ్గుకఱ్ఱ వెట్టి,
యతిథి నచ్చో నిల్పి యర్ఘ్య పాద్యము లిచ్చి
పుష్పగంధంబులఁ బూజసేసి,
ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున
నన్నంబుమీఁద నెయ్యభిఘరించి,
ఫలపాయసాపూప బహుపదార్థములతో
భక్తివిశ్వాస తాత్పర్య గరిమఁ

తే॥గీ॥ బెట్టుదురు మాధుకరభిక్ష భిక్షుకులకుఁ
గంకణంబులతో సూడిగములు రాయఁ
గమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశి
నన్నపూర్ణ భవాని కట్టనుఁగుఁ జెలులు

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

ముంగిటన్ = ఇంటిముందు భాగమందు
గోమయంబునన్ = ఆవుపేడతో
గోముఖముదీర్చి = అలుకుపెట్టి (అలికి)
కడలు = అంచులు
నాల్గుగన్ = నాలుగవునట్లుగా
మ్రుగ్గుకఱ్ఱ = ముగ్గుతో నేలమీద రేఖలు
పెట్టి = పెట్టి
అతిథిన్ = అతిథిని
ఆ + చోటన్ = ఆ రంగవల్లుల మధ్యమునందు నిలుచుండ పెట్టి అర్ఘ్యపాద్యాదులను
నిల్చి = నిలుచుండపెట్టి
అర్ఘ్యపాద్యములు = అర్ఘ్యయపాద్యదులను
ఇచ్చి = ఇచ్చి
పుష్పగంధంబులన్ = పూవులతోను, చందనముతోను,
పూజచేసి = పూజించి, అర్చించి
ప్రక్షాళితంబు + ఐన = బాగుగా కడుగబడిన
పసిడి = బంగారుమయమైన
చట్టువమునన్ = గరిటెతో
అన్నంబుమీదన్ = అన్నము పైన
నెయ్యి = నేతిని
అభిఘరించి = అభిఘారముచేసి (కొద్దిగా చల్లి)
ఫల = పండ్లు
పాయస = పరమాన్నము
అపూప = పిండివంటకములు
బహు = అనేకములైన
పదార్దములతోన్ = వస్తువులతో
భక్తి = పూజ్యభావము యొక్క
విశ్వాస = నమ్మకము యొక్క
తాత్పర్య = తత్పరభావము యొక్క
గరిమన్ = పెంపుతో
కమ్రకరములన్ = ఇంపైన చేతులయందు
బ్రాహ్మణ + అంగనలు = బ్రాహ్మణ స్త్రీలు
కంకణంబులతోన్ = ముత్యాలు, పగడాలు మొదలైన వానిని గుచ్చి చేతికి కట్టుకొనేడి
సూడిగములు = గాజులు
రాయన్ = ఒరసికొనగా
కాశిన్ = కాశీయందు
అన్నపూర్ణ = అన్నపూర్ణ అను పేరుగల
భవాని = పార్వతి
కడు + అనుంగు = గారాబమైన
చెలులు = స్నేహితురాండ్రు
భిక్షకులన్ = = యాచకులకు
మధుకర = మధూకరమను
భిక్షన్ = భిక్షను
పెట్టుదురు = పెడతారు

తాత్పర్యము
కాశీనగరంలోని గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైన చెలులుగా పేరుగాంచినవారు. వారు భిక్షార్థమై వచ్చిన వాళ్ళను సాక్షాత్తు శివుడిగా భావించి, అపురూపంగా ఆదరిస్తారు. వాకిట్లో ఆవుపేడతో చక్కగా అలికి, నాలుగంచులూ కలిసేటట్లు ముగ్గుపెట్టి, దాని మధ్యలో వచ్చిన అతిథిని నిలబెట్టి, కాళ్ళకూ, చేతులకూ నీళ్ళిచ్చి, పూవులతో, గంధంతో వారిని అర్చించి, శుభ్రంగా కడిగిన బంగారుగరిటెతో అన్నం మీద నెయ్యి అభిఘరించి (వేసి), పండ్లు, పరమాన్నం, పిండివంటలు చేర్చి, భక్తి విశ్వాసాలు ఉట్టిపడుతుండగా భిక్ష సమర్పిస్తారు. (అతిథి దేవోభవ ! అనే భారతీయ సంప్రదాయాన్ని ఈ పద్యంలో వర్ణించాడు కవి).

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

విశేషాంశాలు

1. అతిథి : తిథి, వార, నక్షత్ర నియమం లేకుండా భోజనానికి వచ్చువాడు.
2. అర్ఘ్యం : (వ్యుత్పత్తి) పూజకు తగినది.

అష్టవిధ అర్ఘ్యములు :

  1. పెరుగు,
  2. తేనె,
  3. నెయ్యి,
  4. అక్షతలు,
  5. గరిక,
  6. నువ్వులు,
  7. దర్భ,
  8. పుష్పము

3. పాద్యము : వ్యుత్పత్తి, పాదములు కడుగుకొనుటకు ఉపయోగించు నీరు.
4. మాధుకర భిక్ష : (వ్యుత్పత్తి) = మధుకరం అంటే తుమ్మెద. తుమ్మెద వివిధ పుష్పాలపై వ్రాలి, తేనెను గ్రహించినట్లు, సన్యాసులు వివిధ గృహాలకు వెళ్ళి, ఆ ఇంటి గృహిణుల నుండి భిక్షాన్నములను స్వీకరిస్తారు. అందువల్ల సన్యాసులు స్వీకరించే భిక్షను ‘మాధుకర భిక్ష’ అంటారు.

4. కం॥ ఆ పరమపురంధ్రులయం
దే పుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁ గటా !
రేపాడి మేలుకని యే
నే పాపాత్ముని ముఖంబు నీక్షించితినో ?

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

ఆ పరమ పురంధ్రుల యందున్ = అట్టి పరమ పుణ్యస్త్రీలయందు
ఏ పుణ్యాంగనయున్ = ఏ పుణ్యురాలైన ఇల్లాలు
భిక్ష = భిక్షాన్నము
ఇడదెయ్యెన్ = పెట్టకుండెను
కటా = అయ్యో !
ఏను = నేను
రేపాడి = ప్రాతఃకాలమునందు
మేలుకని = నిద్రలేచి
ఏ పాపాత్ముని = ఏ పాపాత్మునియొక్క
ముఖంబున్ = ముఖాన్ని
ఈక్షించితినో = చూచియున్నానో

తాత్పర్యము
అటువంటి పుణ్యస్త్రీలున్న ఈ నేలలో ఒక్కరైనా భిక్ష సమర్పించడం లేదంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఈ రోజు ఉదయమే లేచి, ఏ పాపిష్టివాని ముఖం చూశానో ‘అనుకున్నాడు వ్యాసుడు.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

విశేషాంశాలు

1. పాపాత్ముని ముఖం చూడడం: దుర్మార్గుల ముఖం చూస్తే, చెడ్డ పరిణామాలు కలుగుతాయని నమ్మకం. అందుకే ఉదయం లేవగానే కాని, పాడ్యమి తిథినాడు చంద్రోదయాన్ని గమనించినప్పుడు కాని, ఇష్టమైన వాళ్ళ ముఖాలను చూస్తారు. అలాగే ఏదయినా పనిపై వెళ్ళేటప్పుడు, కులస్త్రీలు శకునంగా ఎదురువస్తే మంచిది అనే సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇటువంటి వాటిపై, నమ్మకం పోతూ ఉండడం గమనింపదగిన విషయం.

5. తే॥గీ॥ ఉపవసింతుముగాక నేఁడుడిగి మడిఁగి
యస్తమించుచు నున్నవాఁ డహిమభానుఁ
డెల్లి పారణకైన లేదెట్లు మనకు ?
మాధుకరభిక్ష బ్రాహ్మణమందిరముల

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

ఉడిగి = భిక్షకై తిరుగుట మాని
మడిగి = అణగి యుండి
నేడు = ఈరోజు
ఉపవసింతుముగాక = ఉపవాసం ఉందుముగాక !
అహిమభానుడు = వేడికిరణములు గల సూర్యుడు
అస్తమించుచున్నవాడు = అస్తమించుచున్నాడు
ఎల్లి = రేపు
మనకున్ = మనకు
బ్రాహ్మణమందిరములన్ = ఆ బ్రాహ్మణుల ఇళ్ళలో
మాధురభిక్ష = మధూకరరూపమైన భిక్ష
పారణకైనన్ = ఉపవాసాంత భోజనముకైనను
లేదెట్లు = లేకుండా ఎలా ఉంటుంది (తప్పక లభిస్తుంది) ?

తాత్పర్యము
సరే, ఇక భిక్షాటనం మాని ఈ రోజుకు ఉపవాసమే చేద్దాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రేపైనా మనకు ఈ బ్రాహ్మణ వాటికలో ఉపవాసాంత భోజనానికి సరిపడ భిక్ష దొరకక పోదు.

II

6. వ. అని యా రాత్రి గడపి మఱునాఁడు
మధ్యాహ్నకాలంబున
శిష్యులుం దాను వేఱువేఱు విప్రభవన వాటికల
భిక్షాటనం
బొనర్పంబోయి,తొలునాఁటియట్ల ముక్కంటిమాయ నే
మచ్చెకంటియు వంటకంబు పెట్టకున్నఁ గటకటంబడి
భిక్షాపాత్రంబు నట్టనడువీథిం బగులవైచి
– కోపావేశంబున

ప్రతిపదార్థం

అని = అట్లు చెప్పి
ఆ రాత్రి = ఆ రాత్రి
గడిపి = వెళ్ళబుచ్చి
మఱునాడు = మరుసటిరోజు
మధ్యాహ్నకాలంబున = మధ్యాహ్నసమయంలో
శిష్యులున్ = శిష్యులు
తాను = తానునూ (వేద వ్యాసుడునూ)
వేఱవేఱన్ = విడివిడిగా
వేదవ్యాసుడు = వేద వ్యాసమహర్షి
విప్రభవన = బ్రాహ్మణ భవనముల యొక్క
వాటికలన్ = వీధులయందు
భిక్షాటనంబు = భిక్ష కోసం సంచారం
ఒనర్పంబోయి (ఒనర్పన్ + పోయి) = చేయబోయి
తొలినాటియట్ల (తొలినాటి + అట్ల) = ముందురోజువలె
ముక్కంటి మాయన్ = శివునిమాయచేత
ఏ మచ్చెకంటియున్ = మీనాక్షియును
వంటకంబు = అన్నమును
పెట్టకున్న (పెట్టక + ఉన్నన్) = పెట్టకపోగా
కటకటంబడి = బాధపడి
భిక్షాపాత్రంబు = శివభిక్షాపాత్రను
నట్టనడివీధికి = వీధి నట్టనడుమ
పగులవైచి = పగులగొట్టి
కోపావేశంబునన్ = కోపావేశంతో

తాత్పర్యము
అని వ్యాసుడు శిష్యులతో ఆ రాత్రి మఠంలో గడిపి, మరునాడు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులు, తాను వేరువేరుగా విప్రవాటికల్లో భిక్షాటనం చేయసాగారు. కాని మొదటి రోజులాగానే విశ్వనాథుని మాయవల్ల ఏ ఇల్లాలు భిక్షపెట్టలేదు. దాంతో బాధపడి కోపంతో భిక్షాపాత్రను నట్టనడి వీథిలో ముక్కలు ముక్కల య్యేటట్లు విసిరి ఆవేశంతో.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

7. తే॥గీ॥ ధనము లేకుండెదరు మూఁడు తరములందు
మూఁడు తరములఁ జెడుఁగాక మోక్షలక్ష్మి
విద్యయును మూఁడు తరముల వెడలవలయుఁ
బంచజనులకుఁ గాశికాపట్టణమున

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

కాశీకాపట్టణమునన్ = కాశీపట్టణమందు
పంచజనులకున్ = నివసించే ప్రజలకు
మూడు తరములన్ = మూడు తరములందు
మోక్షలక్ష్మి = కైవల్యలక్ష్మి
చెడుగాక = చెడిపోవుగాక
మూడుతరములన్ = మూడు తరములందున్
విద్యయును = విద్యకూడా
వెడలవలయున్ = తొలగిపోవలయును
మూడుతరముల యందు = మూడుతరములయందు
ధనములేక = సంపదలేక
ఉండెదరు = ఉంటారు

తాత్పర్యము
‘ఈ కాశీ పట్టణంలో నివసించే మనుషులకు మూడు తరములదాక ధనం, విద్య, మోక్షం లేకుండు గాక’!

8. వ. అని పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపందలంచు |
నవసరంబున నొక్క విప్రభవనంబు వాఁకిటం బార్వతి
ప్రాకృత వేషంబున

ప్రతిపదార్థం

అని = ఈ విధముగా
పారాశర్యుండు = పరాశరుని కుమారుడైన వ్యాసుడు
క్షుత్ = ఆకలి
పిపాస = దప్పికతో
పరవశుండై = లొంగిపోయినవాడై
శపియింపన్ + తలంప = శపించడానికి ప్రయత్నించగా
అవసరంబున = ఆ సమయంబున
ఒక్క = ఒకానొక
విప్రభవనంబు = బ్రాహ్మణ ఇంటి యొక్క
వాకిటన్ = వాకిటయందు
పార్వతి = పార్వతీదేవి
ప్రాకృతవేషంబునన్ = సామాన్య స్త్రీ వేషముతో

తాత్పర్యము
అని ఆకలిదప్పులచే బాధపడుతున్న వ్యాసుడు శపించబోయిన సమయంలో ఒక బ్రాహ్మణ మందిరపు వాకిట పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో –

9. ఉ॥
వేదపురాణశాస్త్ర పదవీ నదవీయసియైన పెద్దము
త్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ య
య్యాదిమ శక్తి, సంయమివరా ! యిటు రమ్మని పిల్చె హస్తసం
జ్ఞాదరలీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం
“వేదపురాణశాస్త్ర పదవీ నదవీయసియైన”
వేద = వేదములకు
పురాణ = పురాణములకు
శాస్త్ర = శాస్త్రములకు, (ప్రతిపాద్యమైన)
పదవీ = జ్ఞానమునకు
నదవీయసియైన = మిక్కిలి దూరమునందు లేని
పెద్దముత్తైదువ = పెద్దకాలపునాటి పురంధ్రి

“కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ”
కాశికానగర = కాశీనగరమనెడి
హాటకపీఠ = స్వర్ణ పీఠము యొక్క
శిఖా = శిఖరమునందు
అధిరూఢ = అధిరోహించియున్న
అయ్యాదిమ శక్తి = ఆ ఆదిమశక్తి (ఆ + ఆదిమ శక్తి) (ఆ మొదటి శక్తి స్వరూపిణియైన)
హస్తసంజ్ఞాదరలీల హస్త సంజ్ఞ = చేతిసంజ్ఞయందు స్ఫురించుచున్న
ఆదర = ఆదరముతో కూడిన
లీలన్ = విలాసముతో
రత్నఖచితాభరణంబులు
రత్నఖచిత = రత్నకంకణరూపములైన
ఆభరణంబులు = నగలు
ఘల్లుఘల్లన్ = ఘల్లు ఘల్లుమనునట్లుగా
సంయమివరా = ఓ ముని శ్రేష్ఠుడా !
రమ్ము + అని = రమ్మని
ఇటు = ఇచ్చటకు
పిల్చెన్ = పిలిచింది

తాత్పర్యము
వేదపురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞాన స్వరూపిణి ఆ ముత్తైదువ. కాశీనగరం అనే స్వర్ణపీఠ శిఖరాన్ని అధిరోహించి ఉన్న ఆమె – చేతికి ధరించిన రత్నకంకణాలు ఘల్లు ఘల్లుమనేట్లు చెయ్యి ఊపుతూ ఓ సంయమివరా ! ఇటురా అని పిల్చింది. (ఒక్క రోజు ఆకలికే తట్టుకోలేని వాడికి నీకేం సంయమనం ఉందయ్యా ! అని వ్యంగ్యంగా అడగడానికే సంయమివరా! అని సంబోధించింది ఆ ముత్తైదువ.)

10. శా॥
ఆకంఠంబుగ నిష్ఠు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా
లేకున్నం గడు నంగలార్చెదవు మేలే ? లెస్స ! శాంతుండవే!
నీకంటెన్ మతిహీనులే కటకటా ! నీవార ముష్టింపచుల్
శాకాహారులుఁ గందభోజులు, శిలోంఛప్రక్రముల్ తాపసుల్ ! (A.P Mar. ’16)

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది. (T.S Mar. ’17)

ప్రతిపదార్థం

ఇప్డు = ఇప్పుడు
ఆ కంఠంబుగన్ = గొంతుదాకా
మాధుకర భిక్షాన్నంబు = మాధుకర రూపమైన భిక్షాన్నము
భక్షింపగాన్ = తినుటకు
లేకున్నన్ = లేకపోయినను
కడున్ = మిక్కిలియును
అంగలార్చెదవు = చిందులువేస్తూ అరుస్తున్నావు
మేలే = మంచిదా !
లెస్స = బాగు
శాంతుండవే = శాంతస్వభావము గలవాడవేనా!
కటకటా = అయ్యెయ్యో !
నీవారముష్టింపచుల్ = పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారును
శాకాహారులు = కాయకూరలు తినేవారును
కందభోజులు = దుంపలు మాత్రమే తినెడివారును
శిల = కోతకోసిన వరిమళ్ళలో జారిపడిన కంకులను ఏరుకొని బ్రతుకువారును
ఉచక్రముల్ = రోళ్ళవద్ద మిగిలిన బియ్యంతో జీవనం గడుపువారికంటే
తాపసుల్ = మునులు (తపస్సుచేసుకొనేవారు)
నీ కంటెన్ = నీ కన్నా
మతిహీనులే = తెలివితక్కువ వారా ?

తాత్పర్యము
ఇప్పుడు గొంతుదాకా తినడానికి భిక్ష దొరకలేదని ఇంతగా చిందులువేస్తున్నావు కదా ! ఇది నీకు మంచిదా ? బాగున్నది. నిజంగా నీవు శాంత స్వభావుడవా ? పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారు, శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకునేవాళ్ళు, కంకులు ఏరుకొని బ్రతికేవాళ్ళు, రోళ్ళవద్ద బియ్యం ఏరుకొని జీవనం సాగించే మునులు నీకంటే తెలివితక్కువ వాళ్ళ ?

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

11. తే॥గీ॥ ఓ మునీశ్వర! వినవయ్య యున్న యూరుఁ
గన్నతల్లియు నొక్క రూపన్న రీతి ?
యటు విశేషించి శివుని యర్ధాంగలక్ష్మి
కాశి; యివ్వీటిమీఁద నాగ్రహము దగునె ?

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం
ఓ మునీశ్వర(ముని + ఈశ్వరా) = ఓ మునీశ్వరుడా ! (ఓ వ్యాస మహర్షి)
ఉన్నయూరున్(ఉన్న + ఊరున్) = తానున్న ఊరును
కన్నతల్లియున్ = తన్నుకన్న తల్లియును
ఒక్కరూపన్న రీతిన్ = ఒకే మాదిరను రీతిని
వినవయ్య = నీవు వినియుండలేదా?
కాశి = కాశీపట్టణం
అటు విశేషించి = అంతకంటే విశేషించి
శివుని = పరమేశ్వరుని యొక్క
అర్ధాంగ లక్ష్మికాశి = అర్ధభాగమైన భార్య కాశి
ఇవ్వీటి మీదన్ (ఈ + వీటిమీదన్) = ఈ నగరము మీద
ఆగ్రహము = కోపము
తగునే (తగును + ఏ) = తగునా ?

తాత్పర్యము
‘ఉన్నఊరు కన్నతల్లితో సమానం’ అనే నీతి నీకు తెలియదా ? అంతకంటే విశేషించి శివుని అర్ధాంగ లక్ష్మియైన ఈ కాశీనగరి మీద నీవింత కోపం చూపించడం తగునా ? అని మందలించింది పెద్దముత్తైదువ రూపంలో ఉన్న పార్వతీదేవి.

12.వ. ఇట్టి కాశికానగరంబుమీద భిక్ష లేకుండుట కారణంబుగా
నీయంత వాడు కటకటంబడి శపియింపందలంచునే?
విశేషించి యాఁకొన్నవాఁడవు గావున నీ యవసరంబున
నిన్ను హెచ్చు గుందాడుట మము బోఁటి గృహిణులకు
మెచ్చుగాదు. మా యింటికిం గుడువ రమ్ము! కుడిచి
కూర్చున్న పిమ్మటం గొన్నిమాటలు నీతో నాడఁగలననిన
నమ్మహాసాధ్వింగని, పారాశర్యుండిట్టులనియె -.

ప్రతిపదార్థం

ఇట్టి = ఇటువంటి
కాశికానగరంబుమీది = కాశీనగరంమీద
భిక్షలేకుండుట = భిక్షలేకపోవుట
కారణంబుగా = కారణంగా
నీ + అంతవాడు = నీవంటివాడు
కటకటంబడి = కోపగించుకొని
శపియింపన్ = శపించడానికి
తలంచునే = తలంతువా ?
విశేషించి = ప్రత్యేకించి
ఆకొన్నవాడవున్ + కావున = ఆకలికొనియున్న వాడవు
నిన్నున్ = నిన్ను
హెచ్చున్ = అధికముగా
కుందాడుట = నిందించుట (నీతో తగువుపడుట)
మముబోటి = మావంటి
గృహిణులకున్ = ఇల్లాండ్రకు
మెచ్చుగాదు = మర్యాదకాదు
మా + ఇంటికిన్ = మా ఇంటికి
కుడువరమ్ము = భోజనంచేయడానికి రమ్ము
కుడిచికూర్చున్న = తిని కూర్చున్న
పిమ్మటన్ = తరువాత
కొన్నిమాటలు = కొన్ని పలుకులు (మాటలు)
నీతోన్ = నీతో
ఆడగలను = పలుకగలను
అనినన్ = అనగా
ఆ + మహాసాధ్విన్ = ఆ మహా పతివ్రతను
కని = చూచి
పారాశర్యుండు = వేదవ్యాసుడు (పరాశరుని కుమారుడు)
ఇట్లు = ఈ విధముగా
అనియె = పలికాడు

తాత్పర్యము
కేవలం భిక్షదొరకలేదని బాధపడి విశిష్టమైన కాశీనగరాన్ని నీలాంటి ఉత్తముడు శపించాలనుకుంటాడా ? చాలా ఆకలితో ఉన్నావు. కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా బాధపెట్టడం మావంటి గృహిణులకు మంచిది కాదు. మా ఇంటికి భోజనానికిరా ! తిని కూర్చున్న తర్వాత నీతో కొన్ని మాటలు మాట్లాడుతాను’ అన్న ఆ మహాసాధ్విని చూసి, వ్యాసుడిట్లా అన్నాడు.

III

13. తే॥గీ॥ అస్తమింపగఁ జేసినాఁ డహిమకరుఁడు
శిష్యులేఁగాక యయుతంబు చిగురుబోఁడి !
వ్రతము తప్పి భుజింపంగ వలను గాదు
నేఁడు నిన్నటి మఱునాఁడు నిక్కు వంబు

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

చిగురుబోఁడి = తల్లీ (ఓ పల్లవగాత్రీ) !
‘అహిమకరుడు = సూర్యుడు
అస్తమింపగన్ = అస్తమించడానికి
చేసినాడు = సమీపించినాడు
ఏగాక = నేనుగాకుండా
శిష్యులు = శిష్యులు
అయుతంబు = పదివేలమంది ఉన్నారు
వ్రతము తప్పి = నియమాన్ని తప్పి
భుజింపగన్ = తినడానికి
వలనుకాదు = యుక్తముకాదు (సరికాదు)
నేడున్ = నేడుకూడా
నిన్నటిమఱునాడు = నిన్నటి దినమునకు మరుసటి దినమే, పస్తుండటమే ?
నిక్కంబు = సత్యము (నిజం)

తాత్పర్యము
తల్లీ ! సూర్యుడస్తమిస్తున్నాడు. నేనే కాదు, నాతోపాటు శిష్యులూ ఉన్నారు. శిష్యులతో కలిసి భుజించాలనే నా వ్రతం విడిచిపెట్టి మీ ఇంట నేనొక్కడినే భుజించలేను. ఈ రోజు నిన్నటికి మరునాడేకదా ! (అంటే నిన్నటిలాగే ఈ రోజు కూడా ఉపవాసం తప్పదని అంతరార్థం).

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

14. చ॥
అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను, లెస్సగాక, యో
మునివర ! నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్ము విశ్వనా
థుని కృప పేర్మి నెందఱతిథుల్ చనుదెంచినఁ గామధేనువుం
బనిగొనునట్లు పెట్టుదు నపారములైన యభీప్సితాన్నముల్ (A.P June’15)

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

అనవుడున్ = వేదవ్యాసుడు ఈ విధంగా
అల్ల = కొంచెం
నవ్వి = నవ్వి
కమలాన = కమలమువంటి ముఖముగల ఆ ముత్తైదువ
ఇట్లనున్ = ఈ విధముగా పలికింది
లెస్సగాక = మేలగునుగాక !
ఓ మునివర = ఓ మునీశ్వరుడా !
నీవు = నీవు
శిష్యగణం ముంగొని = శిష్య సమూహముతో కలిసి
చయ్యన = వెంటనే (వేగముగా)
రమ్ము = రావలసినది
విశ్వనాథుని = విశ్వనాథుని యొక్క
కృప పేర్మిన్ = అతిశయమైన దయతో
ఎందఱు = ఎంతమంది
అతిథులు = అతిథులు
చనుదెంచినన్ కామధేనువుంబని = వచ్చినప్పటికీ
గొనునట్లు = కామధేనువును కల్గియున్నట్లు
అపారములైన (అభీప్సితాన్నముల్) = అంతులేని
అభీప్సిత = కోరినటువంటి
అన్నముల్ = భోజనములను
పెట్టుదున్ = పెడతాను

తాత్పర్యము
అని వేదవ్యాసుడు పల్కగా కొంచెం నవ్వి పద్మముఖియైన ఆ ఇల్లాలు సరేలే ! మునీంద్రా ! విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువు వలె కోరిన పదార్థాలన్నీ అనంతంగా నేను ఏర్పాటు చేయగలను. నీ శిష్యగణాన్ని తీసుకొని వెంటనే రా ! అన్నది.

15. వ॥ అనిన నట్లకాక మహాప్రసాదంబని వేదవ్యాసుండు
శిష్యులంగూర్చుకొని భాగీరథికిం జని యుపస్పర్శం
బాచరించి యేతెంచిన –

ప్రతిపదార్థం

అనినన్ = అని పలుకగా
అట్లాకాక = అట్లేయగునుగాక
మహాప్రసాదంబు = గొప్పదైన అనుగ్రహము
అని = అని
వేదవ్యాసుండు = వేదవ్యాసుడు
శిష్యులన్ = శిష్యులను
కూర్చుకొని = కలుపుకొని (తనవెంట పెట్టుకొని)
భాగీరథికిన్ = గంగానదికి
చని = వెళ్ళి
ఉపస్పర్శంబు = స్నానము, ఆచమనమును
ఆచరించి = చేసి
ఏతెంచినన్ = రాగా

తాత్పర్యం
అనగా, ‘సరే, మహాప్రసాదం’ అని, వేద వ్యాసుడు శిష్యులను తీసుకొని గంగానదికి వెళ్ళి, స్నాన, ఆచమనాదులు పూర్తి గావించుకొని రాగా.

16. తే॥గీ॥ గొడుగు పాగల గిలకలు గులకరింప
నిందుబింబాస్య యెదురుగా నేగుదెంచి
ఛాత్రసహితంబుగాఁ బరాశరతనూజు
బంతి సాగించె భుక్తి శాలాంతరమున

కవి పరిచయము
ఈ పద్యం కవిసార్వభౌముడు శ్రీనాథుడు రచించిన ‘భిక్ష’ అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినది.

ప్రతిపదార్థం

గొడుగు పాగల = గొడుగు, పావుకోళ్ళయొక్క
గిలకలు = గిలకలు
గులకరింపన్ = మ్రోగుతుండగా
ఇందుబింబాస్య = చంద్రబింబానమైన ఆ ఇల్లాలు
ఎదురుగాన్ = వ్యాసునకు ఎదురుగా
ఏగుదెంచి = వచ్చి (మునీశ్వరునకు ఎదురేగి)
ఛాత్రసహితంబుగాన్ = శిష్యసమేతముగా
పరాశరతనూజుబంతి = పరాశరనందనుడైన వ్యాసుడు కూర్చున్న పంక్తిని
భుక్తిశాల + అంతరమునన్ = భోజనశాల లోపల
సాగించెన్ = వడ్డన సాగించెను

తాత్పర్యము
గొడుగు, పావుకోళ్ళ (గొడుగు ఆకారంలోని బుడిపెలున్న పావుకోళ్ళు) గిలకలు మోగుతుండగా చంద్రముఖియైన ఆ ఇల్లాలు వారికి ఎదురెళ్ళి ఆహ్వానించింది. శిష్యులతో వ్యాసుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడామె పంక్తికి వడ్డన సాగించింది.

పాఠం నేపథ్యం / ఉద్దేశం

వేదవిభజన చేసి, పంచమవేదంగా మహాభారతాన్ని రచించి, అష్టాదశ (18) పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. పరమపవిత్రము, పరమేశ్వరునికి ప్రీతిపాత్రం అయిన కాశిలో వ్యాసుడు తన పదివేలమంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, ప్రాతర్మాధ్యాహ్నిక విధులను పూర్తిగావించి, శిష్యులతో కాశీ నగరంలో భిక్షాటనం చేసేవాడు. శిష్యులు, తాను వేర్వేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి, మిగిలినది భుజించేవారు. ఒకరోజు కాశీ విశ్వనాథునికి వ్యాసుడిని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠం.

ఆకలి ఎంతటి వారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇది మంచిది కాదని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠ్యాంశం కావ్యప్రక్రియకు చెందింది. కావ్యం e వర్ణనా ప్రధానమైనది. ఇది శ్రీనాథ కవిసార్వభౌముడు రచించిన ‘కాశీఖండము’ సప్తమాశ్వాసం లోనిది.

కవి పరిచయం

కవి : శ్రీనాథుడు
కాలం : 1380 – 1470
తల్లిదండ్రులు : భీమాంబ, మారయ
మూలగ్రంథం: కాశీఖండం – సప్తమాశ్వాసం

రచనలు :

  1. మరుత్తరాట్చరిత్ర
  2. శాలివాహన సప్తశతి
  3. పండితారాధ్య చరిత్ర
  4. శృంగారనైషధం
  5. భీమఖండం
  6. కాశీఖండం
  7. హర విలాసం,
  8. ధనంజయవిజయం
  9. క్రీడాభిరామం
  10. శివరాత్రిమాహాత్మ్యం
  11. పల్నాటి వీరచరిత్ర
  12. నందనందన చరిత్రలు

బిరుదు : కవిసార్వభౌముడు

విశేషాంశాలు : శ్రీనాథుడు రెడ్డి రాజుల ఆస్థానకవిగా ఉన్నాడు. పెదకోమటి వేమారెడ్డి కాలంలో విద్యాధికారిగా ఉన్నాడు. సుమారు ఇరవై సంవత్సరాలు రాజా శ్రయం పొందాడు. ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడడిండిమభట్టు యొక్క కంచుఢక్కను పగులగొట్టాడు. కనకా భిషేక గౌరవాన్ని పొందాడు.

శైలి – రచనా విధానం: ఉద్దండ లీల, ఉభయ వాక్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి శ్రీనాథుని కవితా లక్షణాలు. శ్రీనాథుని కవితావైశిష్ట్యానికి అతని సీసపద్య రచనా వైభవం ఒక నిదర్శనం. శ్రీనాథుడు శివ భక్తుడు. శివార్చన కళాశీలుడు. తెలుగు కవులలో విశిష్ట కవి శ్రీనాథుడు.

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రవేశిక

ఈనాడు ‘భిక్ష’ అనే మాట కేవలం ‘అడుక్కుతినడం’ అనే అల్పార్థానికి పరిమితమైంది కాని, ఒకప్పుడు ‘భిక్ష’ అనేది పరమపవిత్రమైన వ్రతం. శివుడు ఆదిభిక్షువుగా ప్రసిద్ధి. గురువులు శిష్యులకు ‘జ్ఞానభిక్ష’ పెట్టేవాళ్ళు. బుద్ధుడు భిక్షాధర్మంతోనే జీవనం సాగించేవాడు; బౌద్దులందరికీ అదే జీవనసూత్రంగా ఉండేది. గురుకులంలో చదువుకునే రాజకుమారులైనా భిక్షాటనంతో విద్యార్థిజీవనం గడిపేవారు.

భిక్షపెట్టేవాళ్ళు కూడా అది మహాపుణ్యకార్యంగా భావించి, తమ ఇంటికి వచ్చిన వారికి నమస్కరించి, పూజించి, భిక్ష సమర్పించేవాళ్ళు. భిక్షా ధర్మంతో చరించిన వేదవ్యాసమహర్షి కాశీనగరంలో పొందిన అనుభవమేమిటో ఈ పాఠం చదివి తెలుసుకోండి.

విద్యార్థులకు సూచనలు

  • పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
  • పాఠం చదువండి. అర్థంకాని పదాల కింద గీత గీయండి.
  • వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసు కోండి.

ముఖ్య పదాలు – అర్థాలు

అపూప = పిండివంటలు
అభిఘరించు = చల్లు
అర్ధాంగలక్ష్మి = శరీరంలో సగభాగమైన లక్ష్మి
ఆగ్రహం = కోపం
ఈప్సిత = కోరిక
బీటెండ = అధికమైన ఎండ
ద్వాఃకవాటము = ద్వారబంధము
భుక్తిశాల = భోజనశాల
మతిహీనులు = మతిలేనివారు
మచ్చెకంటి = చేపకనులుగల స్త్రీ
సాన్నిధ్యము = సమీపము
క్షుత్పిపాసులు = ఆకలి, దప్పిక బాధతో కూడినవారు
గోమయము = ఆవుపేడ
ప్రక్షాళితం = కడుగబడిన
పసిడి = బంగారం
ముక్కంటి = శివుడు
మోక్షలక్ష్మి = మోక్షము అనెడి లక్ష్మి
పారాశర్యుడు = వేదవ్యాసుడు
కటకటపడు = బాధపడు
సూడిగములు = గాజులు
బ్రాహ్మణాంగనలు = బ్రాహ్మణ స్త్రీలు
లెస్స = మేలు
కుందాడుట = బాధపెట్టునట్లు మాట్లాడు
భాగీరథి = గంగానది
బింబాస్య = చంద్రబింబము వంటి ముఖముకలది
ఆరగించుట = తినుట

TS 10th Class Telugu Guide 11th Lesson భిక్ష

ప్రక్రియ – కావ్యం (ప్రాచీన పద్యం)

ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ప్రబంధం ఒకటి. పురాణ, ఇతిహాసాలనుండి ఒక చిన్న కథను తీసుకొని, దానిని అనేకములైన వర్ణనలతోను, కల్పనల తోను, పెంచి పెద్దచేసి వర్ణించే గ్రంథాన్ని ‘ప్రబంధం’ అని అంటారు. ఇందులో వర్ణనలకు ప్రాధాన్యం ఉంటుంది. శృంగార రసానికి ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతర రసాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. మనుచరిత్ర, వసుచరిత్ర మొదలైనవాటిని ప్రబంధాలుగా పేర్కొనవచ్చు.

పాఠ్యభాగ సారాంశము

వేదవ్యాసుడు ఒకరోజు కాశీనగరంలో శిష్యులతో మధ్యాహ్న సమయంలో భిక్ష కోసం బ్రాహ్మణ వీధులలో ఇంటింటికీ తిరిగాడు. ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. కాశీ నగరంలోని బ్రాహ్మణ స్త్రీలు రోజూ అతిథులకు మధూకర భిక్ష పెడుతూ ఉంటారు. కాని ఆనాడు వ్యాసుడికి భిక్ష పెట్టలేదు.

ఆ రోజుకు ఉపవాసం ఉందామని, మరునాడు పారణకు భిక్ష దొరకకపోదని వ్యాసుడు నిశ్చయించాడు. మరుసటి రోజున వ్యాసుడు తిరిగి శిష్యులతో భిక్షాటనకు వెళ్ళాడు. ఈశ్వరుడి మాయవల్ల ఆ రోజు కూడా ఆయనకు ఎవ్వరూ భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో తన భిక్షాపాత్రను వీధి మధ్యలో పగులగొట్టి, కాశీ వాసులకు మూడు తరాల దాకా ధనం, మోక్షం, విద్య లేకుండా పోవాలి అని శపించ డానికి సిద్ధమయ్యాడు.

అప్పుడు పార్వతీదేవి ఒక బ్రాహ్మణ మధూభవనం వాకిట్లో సామాన్య స్త్రీ వలె కనబడి, వ్యాసుని రమ్మని పిలిచి ఇలా మందలించింది. “ఓ మహర్షీ ! నీవు గొంతు దాకా తినడానికి మధూకర భిక్ష దొరకలేదని గంతులు వేస్తున్నావు. నివ్వరి బియ్యం తినేవారు, శాకాహారులూ, కందభోజులూ, ఉంఛవృత్తితో జీవించేవారూ అయిన మునీశ్వరులు నీ కంటే తెలివితక్కువ వారు కాదు. ఉన్న ఊరు, కన్నతల్లితో సమానం అంటారు. అదీకాక ‘కాశీ’, ఈశ్వరుడి భార్య. భిక్ష దొరక లేదని నీవు కాశీ నగరాన్ని శపించడం తగదు.

నీవు ఆకలితో ఉన్నావు. మావంటి గృహిణులు నిన్ను ఇలా నిందించడం మంచిది కాదు. మా ఇంటికి భోజనానికి రా, భోజనం చేసిన తరువాత నీతో మాట్లాడవలసిన మాటలు ఉన్నాయి”.

పార్వతీదేవి మాటలు విని, వ్యాసుడు ఆమెతో “అమ్మా! సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు పదివేలమంది శిష్యులు ఉన్నారు. వారు తినకుండా నేను తిననని నాకు వ్రతం ఉంది. నిన్నటిలాగే ఈ రోజు కూడా పస్తు ఉంటాం” అన్నాడు.

అప్పుడు పార్వతీదేవి చిరునవ్వు నవ్వి “మునీశ్వరా ! నీవు శిష్యులను కూడా వెంటబెట్టుకొని తొందరగా రా. ఈశ్వరుడి దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా, అందరికీ కోరిన అన్నం పెడతాను” అంది.

వ్యాసుడు సరేనని గంగలో స్నానం చేసి, శిష్యులతో వచ్చాడు. పార్వతీదేవి వారికి స్వాగతం చెప్పి, వారందరికీ భోజనశాలలో బంతివేసి వడ్డించింది.

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

These TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము will help the students to improve their time and approach.

TS 10th Class Telugu 10th Lesson Important Questions గోలకొండ పట్టణము

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

1. లఘు సమాధాన ప్రశ్నలు మార్కులు

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఇబ్రహీం కుతుబ్షా గురించి రాయండి.
జవాబు:
ఇబ్రహీం కుతుబ్షా విద్యాప్రియుడు. ఇతనికి కులమత భేదాలు లేవు. ఇతని ఆస్థానంలో కవులు, పండితులను పోషించేవారు. ఇతని ఆస్థానంలో నిరంతరం విద్యాగోష్టి సాగేది. పండితులను ఘనంగా సన్మానించేవాడు. తెలుగు భాషపైన అభిమానం కలవాడు. జంతు రక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవాడు. ద్రాక్ష తోటల పెంపకాన్ని ప్రోత్సహించే వాడు. ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవాడు.

ప్రశ్న 2.
‘బాల్బోవా వృక్షాన్ని సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా ఆఫ్రికా నుండి తెప్పించాడు’. దీనిని బట్టి నీవేమి గ్రహించావు?
జవాబు:
గోలకొండ నవాబులకు ఇతర దేశాలతోనే కాక, ఇతర ఖండాలతో కూడా సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఇతర దేశాల వ్యాపారులు కూడా గోలకొండతో వ్యాపార సంబంధాలకు ప్రాధాన్యతను ఇచ్చేవారు.

గోలకొండ నవాబులు కళలకు, కళా ఖండాలకు ప్రాధాన్యతను ఇచ్చేవారు. అపురూప మైనది ఏదైనా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎంత ఖర్చయినా తెప్పించే వారు. దానిని జాగ్రత్తగా సంరక్షించేవారు అని గ్రహించాను.

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 3.
గోలకొండ పట్టణములో వీధులు విశాలముగా ఎందుకు ఉండేవి ?
జవాబు:
గోలకొండ పట్టణములో జనసమ్మర్థం ఎక్కువ. పరిపాలకులు, అధికారులు, సామాన్య ప్రజలు తిరగడానికి వీధులు విశాలంగా ఉండేవి. గోలకొండ పట్టణంలో ఏనుగులు, ఒంటెలు, గుఱ్ఱాలు కూడా ఎక్కువగా ఉండేవి. అవి రాజవీధులలో ఎక్కువగా తిరిగేవి. ఇటువంటి పెద్ద పెద్ద జంతువులు, మానవులు తిరగాలంటే వీధులు చాలా విశాలంగా ఉండాలి కదా ! అందుకే గోలకొండ పట్టణంలోని వీధులు విశాలంగా ఉండేవి.

ప్రశ్న 4.
ఇబ్రహీం కుతుబ్షా సరదార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టవలసినదిగా ఎందుకు ఆజ్ఞాపించాడు ?
జవాబు:
సాధారణంగా ధనవంతుల ఇండ్లలోనే దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి. దొంగలు కూడా సామాన్యుల ఇళ్ళను దొంగతనానికి ఎంచుకోరు. ధనవంతులనే లక్ష్యంగా పెట్టుకొంటారు.

ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎక్కువ ధనాన్ని చెల్లించేది ధనవంతులే. వారిని కాపాడడం ప్రభుత్వం యొక్క కనీస ధర్మం. కోట బయట ఉంటే ధనవంతులను దొంగల బారి నుండి కాపాడడం కష్టం. కోట లోపలయితే సైన్యం ఉంటుంది. కనుక దొంగతనాలకు అవకాశం తక్కువ. అందుచేత ధనవంతులను, సరదార్లను కోటలోపల మేడలు కట్టుకోమని ఇబ్రహీం కుతుబ్షా ఆజ్ఞాపించాడు.

ప్రశ్న 5.
ఇబ్రహీం కుతుబ్షా పన్నెండు భిక్షా గృహాలను ఎందుకు నిర్మించాడు ?
జవాబు:
కనీసం తిండికి కూడా లేని పేదవారు భిక్షాటన చేస్తారు. వారు అనాథలు. వారిలో అవయవాలు సరిగ్గా లేనివారుంటారు. వృద్ధులు ఉంటారు. తల్లి దండ్రులెవరో తెలియని పిల్లలుంటారు. ఏ ఆధారం లేనివారుంటారు. వారికి ఆశ్రయం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అటువంటి యాచకులకు భోజనం, వసతి కల్పించడం ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత. అందుకే ఇబ్రహీం కుతుబ్షా 12 భిక్షా గృహాలను నిర్మించి యాచకులకు ఆశ్రయం కల్పించాడు.

ప్రశ్న 6.
గోల్కొండ పట్టణంలోకి కొత్తవారికి ప్రవేశం ఉండేదా ? కాదా ? ఎందుకు ?
జవాబు:
గోలకొండ పట్టణంలోకి క్రొత్తవారికి ప్రవేశం దుర్లభం. ‘దారోగా’ నుండి అనుమతి పత్రం ఉంటేనే రానిచ్చేవారు. లేదా రాజోద్యోగులు పరిచయం ఉన్న వారిని రానిచ్చేవారు. కొత్తగా వచ్చినవారిని రక్షక భటులు చాలా తనిఖీలు చేసేవారు. ఎందుకంటే వారి వద్ద ఉప్పు కాని, పొగాకు కాని ఉందేమో అని అధికారులు తనిఖీ చేసేవారు. ఉప్పు, పొగాకు వల్ల రెవెన్యూ వసూలు ఎక్కువగా ఉండేది. అందుకే ఎక్కువగా తనిఖీలు నిర్వహించేవారు.

కొత్తవారి వలన ఎక్కువగా వస్తాయి. రెవెన్యూ వచ్చే వస్తువులు అక్రమంగా తరలిపో తాయనే అనుమానం కూడా కారణం. అందుచేతనే కొత్త వారికి ప్రవేశం ఉండేది కాదు.

ప్రశ్న 7.
ఆదిరాజు వీరభద్రరావు రచనలను పేర్కొనండి. (Mar.’17)
జవాబు:
తెలంగాణ తెలుగుకవుల్లో ఆదిరాజు వీరభద్రరావు ప్రసిద్ధులు. వీరి రచనలు తెలంగాణ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. వీరి రచనల్లో ‘మన తెలంగాణ’ అనే వ్యాససంపుటి ప్రసిద్ధమైంది.

ఆదిరాజు వీరభద్రరావు గారి రచనలు : ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశంలో యాభై వ్యాసాలు రాశాడు.

2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు మార్కులు

ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఉమ్రావుల పటాటోపం వివరించండి.
జవాబు:
ఉమ్రావులు బజారులలో వెళ్ళేటపుడు చాలా పటాటోపంతో వెళ్ళేవారు. ఒక ఉమ్రావు బయలు దేరితే అతని ముందు ఒకటో, రెండో ఏనుగులు బయల్దేరేవి. వాటి మీద జెండాలతో భటులు కూర్చొనేవారు. తర్వాత గుఱ్ఱాలపై 50 లేక 60 మంది భటులు ఆయుధాలు ధరించి వెళ్ళేవారు.

వీరి వెనుక బాకాలు, సన్నాయిలతో కొందరు వెళ్ళేవారు. వీరి వెనుక ఉమ్రావు గుఱ్ఱంపై వచ్చేవాడు. అతనికి 40 మంది అంగరక్షకులుండేవారు. కొందరు విసనకర్రలతో విసిరేవారు. ఒకడు గొడుగు పట్టేవాడు.

మరొకడు హుక్కాతో వచ్చేవాడు. ఒకడు పూర్ణ కుంభాలతో వచ్చేవాడు. తర్వాత ఒక పల్లకిని నలుగురు మోసుకొని వచ్చేవారు. తర్వాత నలుగురు పల్లకితో వచ్చేవారు. తర్వాత ఒంటెలపై తప్పెటలు వాయిస్తూ వచ్చేవారు. నవాబుగారికి ఇష్టమయినపుడు పల్లకిలో వెళ్ళేవాడు.

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 2.
గోలకొండ పట్టణంలోని కట్టడాల ద్వారా పరిపాలనకు ప్రయోజనాలేమిటి ?
జవాబు:
గోలకొండ పట్టణాన్ని ఒక పద్ధతి ప్రకారం నిర్మించారు. దీని నిర్మాణ పథక కర్త ఆజంఖాన్ అనే ఇంజనీరు. పట్టణ నిర్మాణం వలననే పరిపాలన పటిష్ఠంగా సాగుతుంది.

వీధులు విశాలంగా నిర్మించడం వలన ట్రాఫిక్ సమస్యలు చాలా తక్కువగా ఉండేవి. సర్దార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టుకోమని ఆజ్ఞాపించడం ద్వారా ధనవంతుల రక్షణను కట్టు దిట్ట౦ చేశారు.

ఉద్యోగులకు భవనాలు కట్టించడం ద్వారా, వారికి సౌఖ్యాలు కల్పించారు. దానివల్ల ఉద్యోగులు సమయానికి కార్యాలయాలకు రాగలరు. పని మీద పూర్తిగా దృష్టి పెడతారు.

భిక్షా గృహాల వలన యాచకులకు కూడా సౌఖ్యం కల్పించారు. దీని వలన నేరాల సంఖ్య తగ్గుతుంది. పాఠశాలలు నిర్మించారు. దాని వలన భావి తరాలకు విజ్ఞానం అందుతుంది. చదువు వలన మాత్రమే ఉత్తమ సమాజం రూపొందుతుంది. పాఠశాలల నిర్మాణం ద్వారా ఉత్తమ సమాజానికి విత్తనాలు చల్లారు.

విదేశీ రాయబారులకు ప్రత్యేక నివాసాలు కట్టడం ద్వారా విదేశాల దృష్టిలో పరువు ప్రతిష్ఠలు పెంచారు.

ప్రశ్న 3.
గోలకొండ పట్టణ వైభవాన్ని వివరించండి. (June ’16)
జవాబు:
పట్టణమనగా గోలకొండ పట్టణమనియే దక్షిణా పథమున ప్రసిద్ధి. గోలకొండ దుర్గమనగా ఒక్క కోట కాదు, మూడు కోటలు. గోలకొండ పట్టణ నిర్మాణ పథకమునకు కర్త ఆజంఖాన్ అను ఇంజనీరు అని తెలియుచున్నది. ఈతడే పట్టణము యొక్క రూపు రేఖలను దిద్దినవాడు.

గోలకొండ పట్టణములో ఏనుగులు, ఒంటెలు, గుఱ్ఱాలు అధిక సంఖ్యలో నుండి పట్టణములో సందడిగా సంచరించు చుండెను. గోలకొండ పట్టణం అలంకార భూయిష్టముగా ఉంటుంది. గోలకొండ పట్టణములో ఉద్యానవన నిర్మాణమునందు విలక్షణమయి, ఆకర్షణీయ మైనట్టివి మిద్దెల మీది తోటలు, భవనముల పైభాగము ఎంతో మనోహరంగా నిర్మించినారు. ఈ విధంగా ఆనాటి చరిత్ర, సంస్కృతి మనకు తెలుస్తోంది.

PAPER – II : PART – A

I. అవగాహన – ప్రతిస్పందన

అపరిచిత గద్యాలు

1. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ఒకప్పుడు మానవజాతి ప్రగతికి సంకేతాలుగా భావింపబడిన సాంకేతిక అద్భుతాలు ఈవేళ పర్యా వరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి. మన పరిశ్రమలు, కర్మాగారాలు, వాహనాలు, రక రకాల విద్యుత్ పరికరాలు పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలుగా ఉంటున్నాయి. వాతా వరణంలో బొగ్గుపులుసు వాయువులు, గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువవుతున్నాయి. వీటి వలన తీవ్రమయిన పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి 15 మించి 35 శాతం జంతువులు నశించిపోయే ప్రమాదముందనిశాస్త్రవేత్తలు అభిప్రాయపడు
తున్నారు.

ప్రశ్నలు – సమాధానములు

ప్రశ్న 1.
వాతావరణ కాలుష్యానికి కారణమయిన వాయువేది ?
జవాబు:
బొగ్గుపులుసు వాయువు

ప్రశ్న 2.
జంతువులు ఎందుకు నశించిపోతాయి ?
జవాబు:
వాతావరణ కాలుష్యం వలన

ప్రశ్న 3.
మానవులు ఉపయోగించే వాహనాలలో కాలుష్యం కలిగించనిదేది ?
జవాబు:
సైకిలు

ప్రశ్న 4.
వాతావరణ కాలుష్య నివారణకు ఏం చేయాలి ?
జవాబు:
చెట్లను ఎక్కువగా పెంచాలి

ప్రశ్న 5.
పెద్ద ప్రమాదం ఏమిటి ?
జవాబు:
వాతావరణ కాలుష్యం

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

2. క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

సముద్రగర్భంలో ఆయుధ పాణులైన సైనికుల్లాంటి ప్రాణులున్నాయంటే నమ్మశక్యం కాదు. అయినా ఇది నిజం. సముద్రగర్భంలో ఒక ప్రత్యేకమైన నత్తజాతి ఉంది. ఈ నత్తల శరీరం మీద పాదాల అడుగున ఇనుప పొలుసులు ఉంటాయి. మామూలు నత్తల కున్న వీపుమీది పై తొడుగు వీటికి ఉండదు. పాదాల అడుగున ఉన్న ఈ ఇనుప పొలుసులే క్రమంగా నత్తల పై తొడుగుగా మారి ఉండవచ్చునని సముద్ర జల జీవశాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవి శత్రువులను ఆ ఇనుప తొడుగులతో ఎదుర్కొంటాయి.

ప్రశ్నలు

1. సముద్రగర్భంలో ఏది నమ్మశక్యంకాదు ?
జవాబు:
ఆయుధపాణులైన సైనికుల్లాంటి ప్రాణులున్నాయంటే నమ్మశక్యం కాదు.

2. వేటిమీద పొలుసులు ఉన్నాయి ?
జవాబు:
ఒక ప్రత్యేకమైన నత్తజాతి శరీరం మీద.

3. సైనిక నత్తలు శత్రువులను ఎలా ఎదుర్కొంటాయి ?
జవాబు:
ఇనుప తొడుగులతో శత్రువులను ఎదుర్కొంటాయి.

4. “పాదాల అడుగున” దీనిలో ఏ సంధి పదం కలదు ?
జవాబు:
లులనల సంధి.

5. చిత్ర విచిత్రమైన జలచరాలు ఎక్కడ ఉంటాయి ?
జవాబు:
సముద్రగర్భంలో.

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

3. క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు వ్రాయండి

“దేశ భాషలందు తెలుగు లెస్స” అని సాహితీ సమరాంగణ సార్వభౌములచే ప్రశంసింపబడిన భాష మన తెలుగుభాష, భాషాభ్యుదయమునకు సాహిత్య సంపద జీవగర్ర. ఆదికవి నన్నయభట్టారకుని నాటినుండి నేటి వరకు ఆంధ్ర భాషా సాహిత్యము అవిచ్ఛిన్నముగా, బహు-ముఖములుగా రాణించి మించినది. ముద్రణాది సౌకర్యములు ఏర్పడిన తరువాత మన తెలుగు భాషలో ప్రాచీన కావ్య పురాణాది వివిధ గ్రంథములు ప్రచురింపబడి సుప్రకాశితములయ్యెను.

ప్రశ్నలు – సమాధానములు

1. తెలుగు భాష ఏమని ప్రశంసింపబడినది ?
జవాబు:
తెలుగు భాష “దేశ భాషలందు తెలుగు లెస్స” అని ప్రశంసింపబడింది.

2. ముద్రణా సౌకర్యము ఏర్పడుట ద్వారా భాషకు కల్గిన ప్రయోజనమేమి ?
జవాబు:
తెలుగు భాషలో ప్రాచీన కావ్య పురాణాది గ్రంథములు ప్రచురింపబడ్డాయి.

3. ఆదికవి ఎవరు ?
జవాబు:
ఆదికవి నన్నయ భట్టారకుడు.

4. భాషాభ్యుదయమునకు ఏది జీవగర్ర ?
జవాబు:
భాషాభ్యుదయానికి సాహిత్య సంపద జీవగర్ర.

5. సాహిత్యరంగంలో, యుద్ధరంగంలో రెండింటి లోను చక్రవర్తి అని చెప్పిన పదం ఏది ?
జవాబు:
సాహితీ సమరాంగణ సార్వభౌముడు.

4. క్రింది పేరా చదివి ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

కుందుర్తి ఆంజనేయులు రచించిన వచన పద్య ఖండిక ‘నగరంలో వాన’ కవిత్వంలా మొదలై రాజకీయ శాసనంతో అంతం అవుతుంది. అందరూ వాస్తవికత నుంచి వ్యంగ్యాన్ని పుట్టిస్తే, ఇందులో కవి వ్యంగ్యం నుంచి వాస్తవికతను సృష్టిస్తాడు. ప్రబంధకవి అయ్యలరాజు రామభద్రుడు వర్షధార నుంచి కవితాధారను శ్లేషించాడు. అది కేవలం శబ్దగతమైన శ్లేష మాత్రమే. ఇందులో భావసంఘర్షణ నుంచి వెలువడిన వ్యంగ్యం గుబాళిస్తుంది.

కవి భావుకత వ్యంగ్య ధనువును ఎక్కు పెడితే, సంస్కారం వాస్తవికత భాగాన్ని గుండెలకు గురిపెట్టి కొడుతున్నది. ఆ దెబ్బ తప్పదు. అది ఎంత సున్నితంగా తాకుతుందో అంత గాఢంగా ముద్ర వేస్తుంది. వచన పద్యం ఎంత సహజమైన ఛందస్సో, ఈ ఖండికలోని రచన కూడా అంత సహజంగా రూపుదిద్దుకున్నది. కుందుర్తి వాన కురిసింది నగరంలోనే అయినా, ఆ వానలో తడి సింది మాత్రం సామాన్యుడి జీవనమే ! ఇందులో వాన కేవలం కేన్వాసు మాత్రమే. దాని ఆధారంగా చేసుకుని కవి చిత్రించిన వాస్తవిక దృశ్యాలు మనల్ని నిలబెట్టి ఆలోచింపజేస్తాయి.

ప్రశ్నలు – సమాధానములు

1. ‘నగరంలో వాన’ దేనితో అంతమవుతుంది ?
జవాబు:
రాజకీయ శాసనంతో అంతమవుతుంది.

2. కవి దేనినుంచి వాస్తవికతను సృష్టిస్తాడు ?
జవాబు:
కవి వ్యంగ్యం నుంచి వాస్తవికతను సృష్టిస్తాడు.

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

3. కుందుర్తి నగరంలో వాన కవితను ఏ శైలిలో రాశాడు ?
జవాబు:
కుందుర్తి ‘నగరంలో వాన’ కవితను ‘వచన పద్య ఛందస్సు’ లో వ్రాశారు.

4. నగరంలో వాన కవితలోని ప్రధానాంశం ఏమిటి ?
జవాబు:
సామాన్యుడి జీవనమే ప్రధానాంశం.

5. మనల్ని ఆలోచింపచేసేవి ఏవి ?
జవాబు:
కవి చిత్రించిన వాస్తవిక దృశ్యాలు మనల్ని నిలబెట్టి ఆలోచింపచేస్తాయి.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (5 మార్కులు)

సృజనాత్మక ప్రశ్నలు

ప్రశ్న 1.
మీ పల్లె గురించి వివరిస్తూ కవిత రాయండి.
జవాబు:
మా పల్లె

మా పల్లె అందిస్తోంది కలుషితం కాని ఆహారం. మా పల్లె అందిస్తోంది మంచి మనసుల సహవాసం. మా పల్లె కలిగిస్తోంది పక్షులు, జంతువులకు ఆవాసం. మా పల్లె అందిస్తోంది బడిలో చక్కటి చదువులు మా కోసం.
మా పల్లె నేర్పిస్తోంది ఎక్కడా తలవంచని శౌర్య పౌరుషాలు.
మా పల్లె పాడిపంటలకు ఆలవాలం.
చిరునవ్వుకు చిరునామా మా పల్లె రండి. రండి……

ప్రశ్న 2.
గోలకొండ పట్టణం గురించి మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:

హైదరాబాదు,
X X X X X.

ప్రియనేస్తమా సుభాష్,

గోలకొండ పట్టణం చరిత్ర ప్రసిద్ధి గల పట్టణం. గోలకొండ మూడు కోటల నిలయం. గోలకొండ పట్టణ నిర్మాణ పథక కర్త ఆజంఖాన్ అనే ఇంజనీరు.

ఈ పట్టణంలో ఏనుగులు, గుఱ్ఱాలు, ఒంటెలు ఎక్కువగా ఉండేవి. జనం కూడా చాలా మంది ఉండేవారు. వీధులు చాలా విశాలంగా ఉండేవి.

గోలకొండ పట్టణాన్ని నలుగురు నవాబులు అద్భుతంగా అభివృద్ధి చేశారు. అనేక భవనాలు కట్టించారు. అందమైన ఉద్యానవనాలు కూడా ఏర్పరచారు. మిద్దెల మీది తోటలు గోలకొండ ప్రత్యేకత.

నీవు దర్శించిన వరంగల్లు పట్టణం ప్రత్యేకతలురాయి.

ఇట్లు,
నీ స్నేహితుడు,
X X X X.

చిరునామా :

వై. సుభాష్, నెం. 20,
10వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మధిర, ఖమ్మం జిల్లా.

ప్రశ్న 3.
చక్కటి గోలకొండ నగరాన్ని నిర్మించి ఇచ్చిన ఆజంఖాన్ ను అభినందిస్తూ ఒక అభినందన పత్రం రాయండి.
జవాబు:
గోలకొండ నిర్మాత ఆజంఖాన్కు సమర్పించు

అభినందన పత్రం

అలనాటి మేటి ఇంజనీర్ ఆజంఖాన్ !

నీ మేధకు అపురూప సాక్ష్యం గోలకొండ పట్టణం. 500 సంవత్సరాలు దాటినా నీ కళాత్మక సృష్టి కొత్తకొత్తగానే కనిపిస్తోంది. ఆ భవన నిర్మాణాలు మీ ఆలోచనా పటిష్ఠతను చెబుతున్నాయి. ఆ వీధుల వైశాల్యం నీ హృదయ విశాలతను చాటు తున్నాయి. రమ్యమైన ఉద్యానవనాలు అందమైన మీ కళాత్మక దృష్టికి దర్పణం పడుతున్నాయి. నీ వంటి మహోన్నతుడిని అభినందించడం మా అదృష్టం. అందుకోండి మా అభినందన మందారమాల.

ఇట్ల
గోలకొండ పట్టణ అభివృద్ధి కమిటీ.

ప్రశ్న 4.
ఇటీవల నీవు సందర్శించిన చారిత్రక కట్టడాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:

సిరిపూర్ కాగజ్నగర్,
తేది : ……………

ప్రియ మిత్రమా,

నేను ఇక్కడ క్షేమం. నువ్వూ అక్కడ క్షేమంగా ఉన్నావని తలుస్తాను. ముఖ్యంగా ఈ లేఖ రాయడంలో ఉద్ధేశ్యం ఏమిటంటే నేను ఇటీవల మన ప్రఖ్యాత చారిత్రక కట్టడం రామప్ప గుడిని సందర్శించాను. దాని విశేషాలను నీతో పంచుకుందామని అనుకొంటు న్నాను. రామప్ప దేవాలయాన్ని ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించారు. ఇది హైదరాబాదు 157 కి.మీ. దూరంలో వరంగల్ జిల్లా పాలంపేరు అనే ఊరి దగ్గర ఉంది. ఇక్కడ ప్రధాన దైవం రామలింగేశ్వరస్వామి.

ఈ ఆలయం దానిలోని దైవం పేరు మీదుగా కాక, దానిని చెక్కిన శిల్పి రామప్ప పేరు మీదుగా ప్రసిద్ధి చెందటం విశేషం. ఇక్కడ శిల్ప సంపద కాకతీయులు కళాభిరుచికి నిదర్శనం. ఎత్తైన పీఠం పై నల్లరాతితో చెక్కబడిన పెద్ద శివలింగం చక్కగా ఉంది. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ దిశ నుండి చూసినా నంది మనవైపే చూస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడ ఇటుకలు నీటిమీద తేలుతూ ఉంటాయి. ఇక్కడ కాకతీయుల శిల్ప చాతుర్యం నాకు చాలా ఆనందాన్ని కలుగజేసింది. మరో ఉత్తరంతో మరలా కలుస్తాను సెలవు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
X X X X.

చిరునామా :

క్రొత్త నాగేశ్వర్,
ఇం. నెం. 3-256,
గాంధీ నగర్,
నల్లగొండ,

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 5.
‘గోలకొండ పట్టణము’ లోని అందచందాలను ‘వచన కవిత’ రూపంలో రాయండి.
జవాబు:
గోలకొండ దక్షిణాపథమ్మున అలరె
జగతికి జాగృతిని కల్పించె
తెలంగాణమ్ములన మకుటాయమానమ్ముగ
నిలచె గగన తలంబుదాక !

శిల్పకళావైభవంబున కొదువలేదు
నిర్మాణ కౌశలమ్మునకు ఎదురు లేదు
ప్రకృతిరమణీయతకు తిరుగులేదు
చూచినంతనే చూడాలనిపించు

వ్యాపార సామ్రాజ్యమునకు నెలవుగా నిలిచె
రామదాసు కీర్తనలకు ఆలవాలమాయె
పాలకుల ఏలుబడిలో జీవకారుణ్యం అలరె

సకల వసతులకు మూలకేంద్రమాయె.

అదనపు వ్యాకరణాంశాలు

PAPER – I : PART – B

1. సొంతవాక్యాలు

1. పెంపుసొంపులు : నగరం పెంపుసొంపులకై ముఖ్యమంత్రిగారు బాగా కష్టపడుతున్నారు.

2. మిరుమిట్లు గొలుపు సర్కసువారు ఏర్పాటు చేసిన దీప కాంతులు కళ్ళకు మిరుమిట్లు గొలుపు తున్నాయి.

3. రాకపోకలు : దేశంలో రాకపోకలకై అనేక రహదారులు కలవు.

2. పర్యాయపదాలు

ఏనుగు = దంతి, హస్తి, ద్విరదము, గజము, అనే కపము
ఒంటె = లొట్టె, లొట్టిపిట్ట, ఉష్ట్రము, వాసంతము
గుఱ్ఱము = ఘోటకము, వీతి, తురగము, తురంగము
ద్రాక్ష = కృష్ణ, గోసన్తి, మధురస, స్వాద్వి
మేడ = ఉపకారిక, పురము, నగరు, సౌదము
వర్తకుడు = వైదేహకుడు, వణిజుడు, సార్ధవాహుడు, వైగముడు
హర్మ్యము = మేడ, ప్రాసాదము, సౌధము, భవనము
ధ్వజము = పతాకము, కేతనము, టెక్కెము, జెండా
జైలు = చెరసాల, కారాగృహము, ఖైదు
హాటకం = బంగారం, సువర్ణం, పసిడి, హేమం,
భార్య = పతి, ఇల్లాలు, ఆలి
పోరాటం = యుద్ధము, సంగ్రామము, సమరము
బాట = దారి, మార్గము
భర్త = ధవుడు, నాథుడు, పతి, మగడు

3. వ్యుత్పత్త్యర్థాలు

రాజధాని = రాజు నివసించే ప్రధాన పట్టణము (రాచవీడు)
భవనము = బాలురు దీనియందు పుట్టుదురు (ఇల్లు)
నందనము= సంతోషపెట్టునది (ఇంద్రుని ఉద్యాన వనము)
హర్మ్యము = మనస్సును హరించునది (ధనికుని గృహము)

4. నానార్థాలు

పట్టణము = రాజధాని, ఉత్తరీయము, వస్త్రము
సమ్మర్దము = గుంపు, రాపిడి, యుద్ధము, త్రొక్కుట
జలము = నీళ్ళు, జడము, కురువేర, ఎఱ్ఱ తామర
శిఖరము = అగ్రము, కొండ కొన, మండపము
గాలి = వాయువు, పిశాచము, దుర్భాష
ధర = నేల, మెదడు, వెల, రక్తనాళము
అంబరము = వస్త్రము, ఆకాశము
ఆశ = కోరిక, దిక్కు
పేరు = నామధేయం, కీర్తి, అధికం, హారము
క్షేత్రము = చోటు, పుణ్యస్థానం, శరీరము, భూమి

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

5. ప్రకృతి – వికృతులు

రూపము – రూపు
స్త్రీలు – ఇంతులు
మృత్యువు – మిత్తి
భీతి – బీతు
దేవాలయము – దేవళము
ముఖము – మొగము
రాజ్ఞి – రాణి
కర్పూరము – కప్పురము
పట్టణము – పట్నము, పట్టము
నాణకము – నాణెము
హృదయము – ఎద, ఎడ,ఎడద
యజ్ఞం – జన్నం
గుచ్ఛము – గుత్తి
భటుడు – బంటు
యోధులు – జోదులు
స్తంభము – కంబము
భీతి – భీతు
ప్రయాణం – పయనం
ఆజ్ఞ = ఆన
గృహము = గీము
రాట్టు = ఱేడు
భక్తి – బత్తి
కవిత – కైత
దిశ – దెస
కావ్యము – కబ్బము
దక్షిణము – దక్కిణము
భాష – బాస
పల్యంకిక – పల్లకి
విద్య – విద్దె
శిఖ – సిగ
ఉష్ట్రము – ఒంటె

PAPER – II : PART – B

1. సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి

సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమగునపుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.

ఉదా : దేవాలయాలు = దేవ + ఆలయాలు
ఉపాహరము = ఉప + ఆహారము
క్రమాభివృద్ధి = క్రమ + అభివృద్ధి
సౌకర్యార్థము = సౌకర్య + అర్థము
విక్రయాదులు = విక్రయ + ఆదులు
రాజాదరణము = రాజ + ఆదరణము
సింగరాచార్య = సింగర + ఆచార్య
హటకాంబర = హటక + అంబర
తెలగనార్యుని = తెలగన + ఆర్యుని
రాజాజ్ఞ = రాజ + ఆజ్ఞ
పటాటోపము = పట + ఆటోపము
శస్త్రాదులు = శస్త్ర + ఆదులు
కార్యాలయము = కార్య + ఆలయము

2. గుణ సంధి

సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమముగా ఏ, ఓ, ఆర్లు ఏకాదేశమగును.

ఉదా :
రమ్యోద్యానములు = రమ్య + ఉద్యానములు
రాజోద్యోగులు = రాజ + ఉద్యోగులు
సంవరణోపాఖ్యానము = సంవరణ + ఉపాఖ్యానము

3. వృద్ధి సంధి

సూత్రం : అకారమునకు ఏ – ఐలు పరమగునపుడు
‘ఐ’ కారమును, ‘ఓ ఔలు పరమగునపుడు ‘ఔ’
కారమును ఏకాదేశమగును.
‘ఐ – ఔ’ లను వృద్ధులు అని అందురు.
ఉదా : ఏకైక = ఏక + ఏక

4. యణాదేశ సంధి

సూత్రం : ఇ – ఉ – ఋ లకు అసమానమయిన అచ్చులు పరమగునప్పుడు క్రమంగా య – వ – ర లు ఆదేశమగును.
ఉదా : అత్యంత = అతి + అంత

5. అనునాసిక సంధి

సూత్రం : క – చ – ట – త – ప లకు న – మ లు పరమైతే క్రమంగా జ్ఞ – ఞ ణ న – మలు ఆదేశమగును.
ఉదా : వాఙ్మయము = వాక్ + మయము

6. లులనల సంధి

సూత్రం : లు- ల – న లు పరంబగునపుడు ఒకానొకచో ముగామంబునకు లోపంబును దత్పూర్వ స్వరంబునకు దీర్ఘంబును విభాషనగు.
ఉదా : వజ్రాలు = వజ్రము + లు

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

2. సమాసాలు

సమాస పదము – విగ్రహవాక్యము – సమాసము పేరు

గోలకొండ పట్టణము – గోలకొండ అను పేరుగల పట్టణము – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
మజ్నూ బురుజు – మజ్నూ అను పేరు గల బురుజు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
హైదరాబాద్ నగరము – హైదరాబాద్ అను పేరు గల నగరము – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
మచిలీపట్టణము – మచిలీ అను పేరుగల పట్టణము – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
బంజారా దర్వాజ – బంజారా అను పేరుగల దర్వాజ – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
మూడు కోటలు – మూడు సంఖ్య గల కోటలు – ద్విగు సమాసం
ఏడు మైళ్ళు రెండు – ఏడు సంఖ్యగల మైళ్ళు – ద్విగు సమాసం
రెండు వస్తువులు – రెండు సంఖ్యగల వస్తువులు – ద్విగు సమాసం
రెండు బారకాసులు – రెండైన బారకాసులు – ద్విగు సమాసం
నాలుగు కుర్చీలు – నాలుగైన కుర్చీలు – ద్విగు సమాసం
రెండు లక్షలు – రెండైన లక్షలు – ద్విగు సమాసం

పన్నెండు ద్వారములు – పన్నెండు సంఖ్య గల ద్వారములు – ద్విగు సమాసం
నలుమూలలు – నాలుగైన మూలలు – ద్విగు సమాసం
జనసమ్మర్దము – జనము చేత సమ్మర్థము – తృతీయా తత్పురుష సమాసం
వజ్రాల వ్యాపారము – వజ్రాలతో వ్యాపారము – తృతీయా తత్పురుష సమాసం
బంగారు నాణెము – బంగారంతో నాణెలు – తృతీయా తత్పురుష సమాసం
స్నాన మందిరము – స్నానము కొరకు మందిరము – చతుర్థీ తత్పురుష సమాసం
రాజభవనాలు – రాజుల కొఱకు భవనాలు – చతుర్థీ తత్పురుష సమాసం
భిక్షా గృహములు – భిక్ష కొఱకు గృహములు – చతుర్థీ తత్పురుష సమాసం
విహారభూమి – విహారము కొఱకు భూమి – చతుర్థీ తత్పురుష సమాసం
రూపురేఖలు – రూపును, రేఖయు – ద్వంద్వ సమాసం
క్రయ విక్రయాలు – క్రయమును, విక్రయమును – ద్వంద్వ సమాసం
అస్త్రశస్త్రములు – అస్త్రమును, శస్త్రమును – ద్వంద్వ సమాసం

సంపద్వైభవములు – సంపత్తును, వైభవమును – ద్వంద్వ సమాసం
కూరగాయలు – కూరయును, కాయయును – ద్వంద్వ సమాసం
రాకపోకలు – రాకయును, పోకయును – ద్వంద్వ సమాసం
అందచందములు – అందమును, చందమును – ద్వంద్వ సమాసం
ప్రజాసముదాయము – ప్రజల యొక్క సముదాయము – షష్ఠీ తత్పురుష సమాసం
పర్వత శిఖరము – పర్వతము యొక్క శిఖరము – షష్ఠీ తత్పురుష సమాసం
గోలకొండ ప్రాధాన్యము – గోలకొండ యొక్క ప్రాధాన్యము – షష్ఠీ తత్పురుష సమాసం
వెండిపూత – వెండితో పూత – షష్ఠీ తత్పురుష సమాసం
వణికుంగవులు – వర్తకులలో శ్రేష్ఠులు – షష్ఠీ తత్పురుష సమాసం
దుర్గతటాకము – దుర్గము నందలి తటాకము – సప్తమీ తత్పురుష సమాసం
విద్యాప్రియుడు – విద్యలయందు ప్రియుడు – సప్తమీ తత్పురుష సమాసం
ద్వార రక్షకులు – ద్వారమును రక్షించేవారు – ద్వితీయా తత్పురుష సమాసం
యుద్ధభీతి – యుద్ధము వలన భీతి – పంచమీ తత్పురుష సమాసం
సుందరాకారము – సుందరమైన ఆకారము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

3. వాక్య పరిజ్ఞానం

అ) క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా మార్చండి.

1. నేను గుంటూరు వచ్చాను. శారదానికేతనంలో చేరాను.
జవాబు:
నేను గుంటూరు వచ్చి శారదానికేతనంలో చేరాను.

2. రవి బాగా చదివాడు. రవి పరీక్ష వ్రాశాడు.
జవాబు:
రవి బాగా చదివి పరీక్ష వ్రాసాడు.

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

3. గోపాల్ బాగా చదువుతాడు. గోపాల్ తొమ్మిదింటికే నిద్రపోతాడు.
జవాబు:
గోపాల్ బాగా చదివి తొమ్మిదింటికే నిద్రపోతాడు.

4. గీత బాగా నృత్యం నేర్చుకొంది. గీత బాగా నృత్యం చేసింది.
జవాబు:
గీత బాగా నృత్యం నేర్చుకొని, చేసింది.

5. మంచి రచనలను వ్రాయండి. మంచి మెప్పు పొందండి.
జవాబు:
మంచి రచనలను వ్రాసి మెప్పు పొందండి.

ఆ) క్రింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగాను, కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగాను రాయండి.

1. దున్నేవానికి భూమినిచ్చే హక్కు తయారయ్యింది. (కర్తరి వాక్యం)
జవాబు:
దున్నేవానికి భూమినిచ్చే హక్కు తయారు చేయబడింది. (కర్మణి వాక్యం)

2. బూర్గులవారు మంచినిర్ణయాలు తీసుకున్నారు. (కర్తరి వాక్యం).
జవాబు:
బూర్గుల వారిచే మంచి నిర్ణయాలు తీసుకొనబడ్డాయి. (కర్మణి వాక్యం)

3. వారి న్యాయవాద పటిమ ఇతరులను అబ్బురపరచింది. (కర్తరి వాక్యం)
జవాబు:
వారి న్యాయవాద పటిమ ఇతరులచే అబ్బురపరచబడింది. (కర్మణి వాక్యం)

4. రేఖామాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. (కర్తరి వాక్యం)
జవాబు:
రేఖామాత్రంగా నా భావాలను ఇక్కడ పొందుపరిచాను. (కర్మణి వాక్యం)

5. పర్షియన్ ట్యూటర్గా ఆయన కొంతకాలం పని చేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
పర్షియన్ ట్యూటర్ ఆయనచే కొంతకాలం పని చేయబడింది. (కర్మణి వాక్యం)

ఇ) క్రింది ప్రత్యక్ష కథనాలను పరోక్ష కథనంలోకి మార్చి రాయండి.

ప్రశ్న 1.
‘నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను’ అని అమ్మతో అన్నాను.
జవాబు:
తాను నేటి సినిమాలను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాడు.

ప్రశ్న 2.
నీకివ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అతడన్నాడు.
జవాబు:
అతనికివ్వాల్సింది ఏమీలేదని నాతో అన్నాడు.

TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము

ప్రశ్న 3.
సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు.
జవాబు:
‘సుందరకాండ చదువుము’ అని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు.

ప్రశ్న 4.
వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాశ్ ఊరికెళ్ళాడని.
జవాబు:
వాళ్ళమ్మ చెప్పింది “భానుప్రకాశ్ ఊరికి వెళ్ళాడు” అని.

ప్రశ్న 5.
ప్రజ్ఞ పద్యాలు బాగాపాడిందని అందరను కుంటున్నారు.
జవాబు:
“ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది” అని అందరను కుంటున్నారు.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

These TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష will help the students to improve their time and approach.

TS 10th Class Telugu 11th Lesson Important Questions భిక్ష

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

1. లఘు సమాధాన ప్రశ్నలు (3 మార్కులు)

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘భిక్ష’ పాఠ్యభాగ రచయిత గురించి వివరించండి. (Mar. ’18)
(లేదా)
“భిక్ష” పాఠ్యభాగ కవి గురించి వ్రాయండి.
జవాబు:
‘భిక్ష’ పాఠ్యభాగ రచయిత మహాకవి శ్రీనాథుడు. తెలుగు సాహిత్యంలో కవిసార్వభౌముడిగా కీర్తి పొందాడు. తెలుగు సాహిత్యంలో శ్రీనాథ యుగం కూడా ఉంది. శ్రీనాథుడు 1380-1470 మధ్య జీవించాడు. అనగా 15వ శతాబ్ది కవి. రాజమహేంద్రవరంలో రెడ్డిరాజుల కొలువులో ఆస్థానకవి. మారయ, భీమాంబలు శ్రీనాథుని తల్లిదండ్రులు.

‘కవి సార్వభౌమ’ బిరుదాంకితుడు. పెదకోమటి వేమారెడ్డి కొలువులో విద్యాధికారి. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని గౌడడిండిమ భట్టును పాండిత్యంలో ఓడించాడు. అతని కంచుఢక్కను పగులకొట్టించాడు.

ప్రశ్న 2.
వ్యాసుని కోపకారణం తదనంతర పరిణామాలను (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
వ్యాసమహర్షి శిష్యపరివారంతో కలసి భిక్షకోసం కాశీలో తిరిగారు. పరమేశ్వరుని మాయతో రెండు రోజులపాటు ఆయనకు ఎవరూ భిక్ష పెట్టలేదు. దాంతో వ్యాసుడు తీవ్రంగా కోపగించాడు. భిక్షపాత్రను పగులకొట్టాడు. కాశీనగర ప్రజలకు మూడుతరములదాకా ధనం, విద్య, మోక్షం లేకుండుగాక ! అని శపించబోయాడు.

అంతలో పార్వతీదేవి పవిత్రమైన కాశీనగరాన్ని శపించడం తప్పని, ఉన్నఊరు కన్నతల్లితో సమానమని వ్యాసుడిని మందలించింది. వ్యాసుడిని భోజనానికి రమ్మని పిలిచింది. కాని వ్యాసుడు తన పదివేల మంది శిష్యులు తినకుండా తానుతిననని ప్రకటించాడు. అది విని పార్వతీదేవి అందరికి భోజనం పెడతానని చెప్పింది. వ్యాసుడు శిష్య సమేతంగా గంగలో స్నానంచేశాడు. పార్వతీదేవి ఇంటికి వచ్చాడు. పార్వతీదేవి వారందరికి భోజనం పెట్టింది.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 3.
వ్రతము తప్పి భుజింపంగ వలనుగాదు. ఈ మాటలను ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు ? (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
‘వ్రతము తప్పి భుజింపంగ వలనుగాదు’ అని వ్యాసుడు సామాన్యస్త్రీవలె కన్పించిన అన్నపూర్ణా దేవితో అన్నాడు. వ్యాసుడు ఒకసారి శిష్యులతో కలిసి కాశీకి వచ్చాడు. అక్కడ అతనికి, అతని శిష్యులకు శివునిమాయవల్ల భిక్ష దొరకలేదు. దాంతో కోపగించిన వ్యాసుడు కాశీనగరంలోని ప్రజలను, కాశీనగరాన్ని శపించబోయాడు.

అప్పుడు పార్వతీదేవి సామాన్యస్త్రీవలె కన్పించి వ్యాసుడిని మందలించింది. ఆహారానికి రమ్మని ఆహ్వానించింది. అది విని వ్యాసుడు తనవెంట పదివేల మంది శిష్యులు ఉన్నారు. వారికి ఆహారం లేకుండా నేను తినను. ఇది నా వ్రతము అని చెప్పాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి అందరికి అన్నం పెట్టింది.

ప్రశ్న 4.
కాశీ పట్టణంలో స్త్రీలు అతిథులను ఎలా ఆదరించేవారు ? (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
మనదేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీ. ఇక్కడ పరమశివుడు అన్నపూర్ణాదేవితో వెలసి యున్నాడు. ఇక్కడ నివసించే మానవులు పుణ్యాత్ములు. ముఖ్యంగా ఇక్కడి స్త్రీలు అన్నపూర్ణా దేవికి మిత్రురాండ్రు. వారు ప్రతిరోజు ఆవుపేడతో ఇంటిని చక్కగా అలుకుతారు. చక్కగా ముగ్గులు పెడతారు.

ఇంటికి వచ్చిన అతిథులను ముగ్గుల మధ్యలో నిలిపి భక్తి విశ్వాసాలు కనబరుస్తూ పండ్లతోను, పరమాన్నముతోను, పలురకాల పిండివంటలతోను గాజులు గలగల ధ్వనిచేస్తుండగా భిక్ష పెడతారు. అతిథి మర్యాదకు ప్రతిరూపంగా నిలుస్తారు.

ప్రశ్న 5.
కోపం తగదని అన్నపూర్ణాదేవి వ్యాసునికి ఏయే ఉదాహరణ పూర్వకంగా తెలిపింది. (APSCERT) మాదిరి ప్రశ్న
జవాబు:
వ్యాసుడు శిష్యపరివారంతో కలిసి ఒకసారి కాశీ నగరానికి వచ్చాడు. అతనికి మూడు రోజులపాటు భిక్ష దొరకలేదు. వ్యాసుడు కాశీనగరాన్ని శపించ బోయాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి సాధారణ స్త్రీవలె కన్పించి, వ్యాసుడిని మందలించింది.

“ఓ మహర్షీ ! నీవు ఇప్పుడు గొంతుదాకా తినడానికి భిక్షాన్నము దొరకలేదని చిందులు వేస్తున్నావు. ఇది మంచిపని కాదు. నీవు నిజంగా శాంత స్వభావం కలవాడవు కాదు. ఎందుకంటే, ఎంతో మంది మునులు పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళదీస్తున్నారు. మరికొందరు శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకుంటున్నారు. కొందరు వరిమళ్ళలో రాలిన ధాన్యం కంకులు ఏరుకొని దానితో బతుకుతున్నారు. మరికొందరు మునులు రోళ్ళ దగ్గర జారిపడిన బియ్యం ఏరుకొని బతుకుతున్నారు. వారంతా నీ కంటె తెలివి తక్కువ వారు కాదు కదా ! ఆలోచించు.

అదీగాక ఉన్నఊరు, కన్నతల్లి వంటిది. కాశీ నగరం శివునికి భార్య. “నీవంటివాడు అటువంటి కాశీ నగరాన్ని భిక్ష దొరకలేదని కోపించడం తగదు.” ఈ ఉదాహరణలతో అన్నపూర్ణాదేవి వ్యాసుడిని
మందలించింది.

ప్రశ్న 6.
“ఇవ్వీటిమీద నాగ్రహముదగునె?” అనే మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు ? (A.P Mar.17)
జవాబు:
పెద్ద ముత్తైదువ రూపంలో ఉన్న పార్వతి భిక్ష దొరకనందున కోపంతో కాశీ నగరాన్ని శపించబోయిన వ్యాసునితో అనిన మాటలు ఇవి. ఓ సంయమివరా! “ఉన్న ఊరు, కన్నతల్లితో సమానమైనది అనే నీతిని నీవు వినలేదా ? అంతకంటే, విశేషించి శివుని అర్థాంగ లక్ష్మి అయిన ఈ కాశీ నగరం మీద కోపించుట తగునా ?” అని పార్వతి వ్యాసుని మందలించినది.

ప్రశ్న 7.
అతిథులు అంటే ఎవరు ? అతిథి మర్యాద అంటే ఏమిటి?
జవాబు:
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు చూడకుండా ఇంటికి వచ్చేవారిని అతిథులు అంటారు. ఆ విధంగా వచ్చిన వారిని గౌరవించి, ఆదరించి కాళ్ళు కడుగుకోవడానికి నీళ్లు ఇచ్చి, కుశల ప్రశ్నలు అడుగుతూ మంచినీళ్లు ఇచ్చి మర్యాదలు చేయాలి. మనం భోజనం చేస్తున్న సమయంలో ఎవరైనా వస్తే తప్పకుండా వారికి కూడా భోజనం పెట్టాలి. వారిని తగిన రీతిగా ఆదరించి, గౌరవ మర్యాదలతో చూడాలి.

ప్రశ్న 8.
‘భిక్ష’ పాఠ్యభాగ నేపథ్యాన్ని రాయండి.
జవాబు:
వేదవిభజన చేసి, పంచమవేదంగా పేరున్న మహాభారతాన్ని రచించి, అష్టాదశ (18) పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. పరమ పవిత్రము, పరమేశ్వరునికి ప్రీతిపాత్రం అయిన కాశీలో వేదవ్యాసుడు తన పదివేలమంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, ప్రాతర్మాధ్యాహ్నిక విధులను పూర్తిగావించి శిష్యులతోకూడా కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు.

శిష్యులు, తానూ వేర్వేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి, మిగిలినది భుజించేవారు. ఒకరోజున కాశీ విశ్వనాథుడికి వ్యాసుణ్ణి పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠ్యాంశం.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 9.
శ్రీనాథుని రచనా శైలిని, సాహిత్య సేవను వివరించండి.
జవాబు:
శ్రీనాథుడు చిన్నతనం నుండే కావ్యరచన ప్రారంభించాడు. మరుత్తరాట్చరిత్ర, కాశీఖండం, శృంగారనైషధం మొదలైనవి రచించాడు.

చమత్కారానికీ, లోకానుశీలనకు, రసజ్ఞతకు, ఆయన జీవిత విధానానికీ అద్దంపట్టే చాటువులు చాలా ఉన్నాయి. ఆయన కవిత్వం ఉద్ధండలీల, ఉభయ వాక్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి వంటి లక్షణాలతో ఉంటుంది.
సీస పద్య రచనలో ఆయనకు ఆయనే సాటి. వృద్ధాప్యంలో కష్టాలనుభవించాడు.

ప్రశ్న 10.
తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష. – దీన్ని భిక్ష పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
మానవునికి అంతర్గత శత్రువు కోపం. ఇది సర్వఅనర్థాలకు మూలం. కోపం వల్ల విచక్షణాజ్ఞానం నశిస్తుంది. ఆలోచనాశక్తి తగ్గుతుంది. అసూయా ద్వేషాలు పెరుగుతాయి. కోపం చదువుకు దూరం చేస్తుంది. బంధువులు, క్రమంగా దూరం అవుతారు. కుటుంబంలో వైషమ్యాలు పెరుగుతాయి. కోపం వల్ల ఎన్నో రోగాలు కూడా వస్తాయి. జరుగవలసిన పనులు కూడా ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. ఇరుగుపొరుగు వారితో తగాదాలు వస్తాయి.

శాంతం మానవునికి రక్ష. అది మానవీయ విలువలను పెంచుతుంది. మనశ్శాంతి దొరుకుతుంది. శాంతియుత జీవనం ద్వారా మైత్రి పెరుగుతుంది. బాంధవ్యాలు వృద్ధిపొందుతాయి. సుఖమయజీవనం కలుగుతుంది. ప్రపంచ దేశాల మధ్య యుద్ధవాతావరణం నశిస్తుంది. అందువల్ల మానవులందరు శాంతిని పొందాలి. కోపాన్ని తొలగించుకోవాలి.

ప్రశ్న 11.
ఆకలిని తట్టుకోలేని వ్యాసునికి పార్వతి చేసిన హితబోధపై మీ అభిప్రాయాన్ని వివరించండి.
జవాబు:
మానవునికి అంతర్గత శత్రువు కోపం. ఈ కోపం అన్ని అనర్థాలకు మూలం. మహర్షి వ్యాసుడు కూడా ఈ కోపానికి బానిస అయ్యాడు. తన విచక్షణను కోల్పోయాడు. అట్టి వ్యాసుడికి పార్వతీదేవి హితోపదేశం చేసింది.

పార్వతీదేవి చేసిన హితబోధ వ్యాసునిలో గొప్ప పరివర్తనను తెచ్చింది. వాస్తవాన్ని గ్రహించాడు. కోపం వలన కలిగే అనర్థాలను వ్యాసుడు గ్రహించాడని తెలుస్తుంది.

కోపంలో ఉన్న వ్యక్తిని పెద్దమనసుగల మహ నీయులు శాంతపరచాలి. అప్పుడే ఆ వ్యక్తిలో వివేకం కలుగుతుంది. లోకం శాంతి మార్గంలో నడుస్తుంది.

ప్రశ్న 12.
‘రేపాడి మేలుకని ఏ నేపాపాత్ముని ముఖంబు నీక్షించితినో? అని వ్యాసుడు అనుకోవడంలో ? (June’18)
జవాబు:
వ్యాసుడు శిష్య పరివారంతో కలిసి కాశీనగరంలో బ్రాహ్మణ వీధుల్లో భిక్షాటనకు బయలుదేరాడు. వ్యాసునికి ఏ ఇల్లాలు భిక్ష వేయలేదు. వ్యాసుడు తనకు భిక్ష లభించక పోవడంతో నిరాశచెంది పలికిన పలుకులు ఇవి.

“రేపాడి మేలుకని యే నేపాపాత్ముని ముఖంబు నీక్షించితినో” అని వ్యాసుడు అనడంలో ఆంతర్యం – దుర్మార్గుల మొహం చూస్తే దుష్పరిణామాలు కలుగుతాయన్నది విశ్వాసం. అందుకే ఉదయం లేచినపుడు గానీ, పాడ్యమి చంద్రోదయాన్ని గమనించినప్పుడు గానీ ఇష్టమైన వాళ్ళముఖం చూడడం, పనిమీద వెళ్తున్నప్పుడు కులస్త్రీలు ఎదురు రావడం అనే సంప్రదాయాలు ఏర్పడ్డాయి.

2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (6 మార్కులు)

ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘భిక్ష’ పాఠ్యభాగం ఆధారంగా అన్నపూర్ణాదేవి, వ్యాస మహర్షి, కాశీనగరంలోని సామాన్య స్త్రీల స్వభావాన్ని వివరించండి. (APSCERT మాదిరి ప్రశ్నాపత్రం)
జవాబు:
‘భిక్ష’ అనే పాఠ్యభాగంలో ఎన్నో ముఖ్య పాత్రలు ఉన్నాయి. వాటిలో అన్నపూర్ణాదేవి, వ్యాసుడు, కాశీ నగరంలోని సామాన్య స్త్రీల పాత్రలు అద్భుతంగా ఉంటాయి.

1. అన్నపూర్ణాదేవి : అన్నపూర్ణాదేవి పరమేశ్వరుని అర్థాంగి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతుంది. కాశీలో ఆకలి బాధతో ఎవరూ ఉండరు. కేవలం భిక్ష దొరకనంత మాత్రాన ఇంత బాధపడిపోతావా ? ఇది మంచిదా? అని బిడ్డను తల్లి మందలించినట్లు వ్యాసుని మందలించింది. పిడికెడు బియ్యం వండుకొని తినే వారున్నారు. కేవలం కాయలు తినే వారున్నారు. ఇంకా రకరకాల వారున్నారు కదా ! వారంతా నీకంటే తెలివితక్కువ వారా ! అని ప్రశ్నించింది. ఒక బిడ్డకు తల్లి చెప్పే నీతులు, మందలింపులు, పోలికలు, ప్రశ్నలు సంధిస్తూ పార్వతీదేవి ఒక పెద్ద ముత్తైదువగా కనిపిస్తుంది. పరిపూర్ణ మాతృత్వం మూర్తీభవించినట్లుగా అన్నపూర్ణాదేవి స్వభావం కనిపిస్తుంది.

2. వ్యాస మహర్షి : ప్రాచీన సంస్కృత సాహిత్యంలో వ్యాస మహర్షికి సమున్నతమైన స్థానం ఉంది. ఒకే ఆకారంగా ఉన్న వేదవాఙ్మయాన్ని నాల్గు విధాలుగా విభజించాడు. లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆది గురువు అయ్యాడు. వేద విభజన చేశాడు. 18 పురాణాలు రచించాడు. 10 వేల మంది శిష్యులకు విద్య నేర్పేవాడు.

ఋషి ధర్మంగా భిక్షాటన చేసినవాడు. రెండు రోజులు భిక్ష దొరకలేదు. తన శిష్యుల ఆకలి చూడలేక కాశీని శపించబోయాడు. అంటే కాశీని కూడా శపించగల మహా తప స్సంపన్నుడు. అన్నపూర్ణాదేవి స్వయంగా పిలిచి భిక్షను పెట్టింది. అంటే అన్నపూర్ణా దేవిని కూడా ప్రత్యక్షం చేసుకోగల పుణ్యాత్ముడు. ఆ జగన్మాత చేతి వంటను రుచి చూసిన మహాభాగ్యశాలి. కాని తన కోపం కారణంగా ఆ వైభవాలను కోల్పోయాడు. అల్పసంతోషి, తక్షణ కోపం కలవాడు.

3. కాశీలోని సామాన్య స్త్రీలు : చక్కగా అలికి ముగ్గులు పెట్టి, ఇల్లు కళకళలాడుతూ ఉంచే స్వభావం కలవారు. అతిథులను సాక్షాత్తు దైవంగా భావించి పూజిస్తారు. బంగారు కంచంలో పిండి వంటలతో అన్నం పెడతారు. భిక్షుకులకు లేదు అనే మాట వారినోట రాదు. వారి హృదయాలలో నిరంతరం అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. కాశీలోని స్త్రీలు అన్నపూర్ణాదేవికి చెలికత్తెలు. అంతటి పుణ్యస్త్రీలు ఎక్కడా కనిపించరు. వారికి వారేసాటి.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమవడానికి గల కారణాలు వివరించండి. (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
వ్యాసమహర్షి తన పదివేల మంది శిష్యులతో కలిసి పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీనగరానికి వెళ్ళాడు. శివుని మాయవల్ల వ్యాసునికి రెండు రోజులపాటు భిక్ష దొరకలేదు. కొందరు మళ్ళీ రమ్మని చెప్పారు. మరికొంతమంది ‘అన్నం వండుతున్నానని’ చెప్పారు. ఒక స్త్రీ దేవకార్యం జరుగుతుందని చెప్పింది.

వ్యాసునికి, అతని శిష్యులకు ఆహారం దొరకలేదని దాంతో ఆకలి బాధతో అలమటి స్తున్నారు. వ్యాసునికి తీవ్రమైన కోపం వచ్చింది. కాశీనగరాన్ని, కాశీనగర ప్రజలను మూడుతరముల వరకు ధనము, మోక్షము, విద్య లేకుండునట్లుగా శపించదలచుకున్నాడు. ఆ సమయంలో అన్నపూర్ణాదేవి ఒక సామాన్య స్త్రీ వేషం ధరించింది. వ్యాసుని ఎదుట ప్రత్యక్షం అయింది. అతని శాపమివ్వదలచుచున్న వ్యాసుడిని అడ్డగించింది. నీతినిబోధించింది.

ప్రశ్న3.
‘కోపం అన్ని అనర్థాలకు కారణం’ అని ఎలా చెప్పగలవు ? (APSCERT మాదిరి ప్రశ్న)
(లేదా)
కోపం అన్ని విధాలుగా అనర్థదాయకమని భిక్ష పాఠ్యభాగం ఆధారంగా సమర్థించండి.
జవాబు:
మానవులకు జయింపరాని శత్రువు కోపం. నాకు కోపం వస్తే మనిషిని కాను అని కొందరు అంటారు. ఇది నిజమే. కోపం వస్తే తనను తాను మరచి మనిషి రాక్షసుడవుతాడు. ఆ కోపంతో తాను ఏమి చేస్తున్నాడో తెలిసికొనడు. కోపం వల్ల జీవితంలో ఎన్నో అనర్థాలు కలుగుతాయి. బంధువులు, మిత్రులు క్రమంగా దూరమవుతారు. కుటుంబంలో తగాదాలు ఏర్పడతాయి. మానవీయ సంబంధాలు దెబ్బ తింటాయి. విచక్షణను కోల్పోయి పశువుగా మారతారు.

వ్యాసుడు గొప్ప మహర్షి, వేదాలను విభజించాడు. మహాభారతాన్ని, పురాణాలను రచించాడు. అయినా కోపానికి దూరం కాలేకపోయాడు. అసహనంతో కాశీ నగరాన్ని శపించ బోయాడు. అట్లే దుర్యోధనుడికి పాండవుల మీద, భీమునిమీద కోపం ఎక్కువ. వాళ్ళతో వైరం పెంచుకున్నాడు. చివరకు సర్వనాశనమై పోయాడు. అందువల్ల కోపాన్ని విడిచిపెట్టాలి. సహనాన్ని అలవరచుకోవాలి.

ప్రశ్న4.
అన్నపూర్ణాదేవి పాత్ర స్వభావం వివరించండి. (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
అన్నపూర్ణాదేవి కాశీవిశ్వేశ్వరుని ఇల్లాలు. కాశీ నగరంలో అన్నపూర్ణాదేవి అందరికీ ఇష్టదైవం. ఒకసారి అన్నపూర్ణాదేవి, పరమేశ్వరులు కాశీ నగరానికి వచ్చిన వ్యాసుడిని పరీక్షించదలచు కున్నారు.

అన్నపూర్ణాదేవి కాశీ నగరంలో ఉన్న వారందరికి అన్నం పెడుతుంది. కాశీనగరంలోని స్త్రీలందరు అన్నపూర్ణాదేవికి స్నేహితురాండ్రు. ఈమె వేదపురాణ శాస్త్ర మార్గాన్ని చక్కగా పాటించే ముత్తయిదువు. ఆమె కాశీనగర బంగారు పీఠాన్ని అధిష్టించిన ఆదిశక్తి.

అన్నపూర్ణాదేవి వ్యాసుడు కాశీనగరాన్ని శపించ కుండా అడ్డుతగిలింది. ఈమె ఒక సామాన్య బ్రాహ్మణ స్త్రీవలె నిలబడి వ్యాసుడిని మందలించింది. అతనికి, అతని శిష్యులకు భోజనం పెట్టింది. అన్నపూర్ణాదేవి మాటల్లో నైపుణ్యం ఉంది. గొంతు దాకా తిండిలేదని గంతులు వేస్తున్నావు. మహర్షులు పిడికెడు నివ్వెరి ధాన్యంతో, కాయగూరలతో తృప్తి పడుతున్నారు గదా ! అని చక్కగా వ్యాసుడిని మందలించింది. ఉన్న ఊరు తల్లి వంటిదని, కాశీ నగరం శివునికి ఇల్లాలని గుర్తుచేసింది.

ప్రశ్న5.
ఎంతటి గొప్పవారినైనా ఆవేశం ఆలోచనలను నశింప జేస్తుందని ‘భిక్ష’ పాఠం ఆధారంగా వివరించండి. (APSCERT మాదిరి ప్రశ్నాపత్రం)
జవాబు:
కోపం వస్తే, ఆవేశం వస్తుంది. ఆవేశంలో ఏది మంచిదో, ఏది చెడ్డదో గ్రహించే వివేచనాశక్తి మనిషికి నశిస్తుంది. దానితో అతడు తప్పుడు పనులకు సిద్ధం అవుతాడు. ఆవేశంతో కట్టుకున్న భార్యను, కన్న పిల్లల్నీ కూడా చంపడానికి సిద్ధం అవుతాడు.

కోపం యొక్క ఆవేశంలో అష్టాదశ పురాణాలు రచించిన వ్యాసమహర్షి అంతటివాడు, కన్నతల్లి వంటి కాశీనగరాన్నే శపించబోయాడు. వ్యాసమహర్షి పదివేలమంది శిష్యులకు గురువు. నిత్యం కాశీనగరంలో శిష్యులతో భిక్షకు వెళ్ళి ఆ భిక్షాన్నం తిని జీవించేవాడు. వ్యాసుడిని పరీక్షించాలని శివుడు భావించాడు. అన్నపూర్ణాదేవితో చెప్పి ఎవరూ వ్యాసునికి భిక్ష పెట్టకుండా చేశాడు.

ఒకరోజు వ్యాసుడికి, శిష్యులకూ ఎవరూ భిక్ష పెట్టలేదు. ఆరోజు కాకపోయినా, మరునాడు తప్పక భిక్ష దొరుకుతుందని వారు అనుకున్నారు. మరునాడు కూడా వ్యాసునికి ఎవరూ భిక్ష పెట్టలేదు.
దానితో వ్యాసుడు కోపంవల్ల వచ్చిన ఆవేశంతో, ఉద్రేకంతో తాను నివసిస్తున్న కాశీనగరాన్నే శపించ బోయాడు. ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అంటారు. భిక్ష దొరకలేదనే ఆవేశంతో, వ్యాసుడు కాశీ నగరవాసులకు మూడు తరాల దాకా విద్య, ధనము, మోక్షము లేకుండా పోవుగాక అని శపించబోయాడు.

దీనిని బట్టి ఆవేశం, ఆలోచనలను నశింప జేస్తుంది అని మనకు తెలుస్తోంది.

ప్రశ్న6.
“ఆకలి దప్పికలు, కోపానికి కారణాలు” అని ఎట్లా సమర్థిస్తారు?
జవాబు:
ఆకలి, దాహం ఎక్కువయితే, తినడానికి తిండి, త్రాగడానికి నీరు దొరకకపోతే, కోపం వస్తుంది. ఆకలి దప్పికలు, కోపాన్ని తెప్పిస్తాయన్నమాట నిజం.

వ్యాసమహర్షి అష్టాదశ పురాణాలు రచించాడు. భారత భాగవతాలు రచించాడు. బ్రహ్మసూత్రాలు రచించాడు. అటువంటి విజ్ఞానధనుడు, రెండు రోజులు తనకు కాశీలో ఎవరూ భిక్ష వేయలేదన్న కారణంతో, భిక్షాపాత్రను పగులకొట్టి, కాశీవాసులకు మూడుతరాల వరకూ, ధనము, విద్య, మోక్షము లేకుండుగాక అని శపించడానికి సిద్ధమయ్యాడు. ఇందుకు ఆకలిదప్పికలే కారణం కదా !

శాంతమే భూషణమని తెలిసిన వ్యాసమహర్షి కోపానికి కారణం ఆకలిదప్పికలే కదా! కాబట్టి ఆకలి దప్పికలు కోపానికి కారణాలు అన్న మాట సత్యమైనది.

ప్రశ్న7.
కాశీ అన్నపూర్ణా దేవి వేదవ్యాసుణ్ణి పరీక్షించడానికి కారణాలు ఏమై ఉంటాయి ? దీని ద్వారా మీరు గ్రహించిన విషయాలేవి ?
జవాబు:
ఆకలిని తట్టుకోలేక వ్యాసమహర్షి కాశీ నగరాన్ని శపించబోయాడు. అప్పుడు పార్వతి మహర్షిని ఇలా మందలించింది. “గొంతుదాకా తినడానికి మాధు కరభిక్ష దొరకలేదని, శివునికి భార్యయైన పవిత్ర కాశీనగరాన్ని శపించాలనుకోడం బాగోలేదు. నీవు కాశీలో ఉన్నావు. ఉన్న ఊరు, కన్నతల్లితో సమానం అంటారు. అలాంటి కాశీని శపించడం ధర్మం కాదు.

అదిగాక ఎంతోమంది మహర్షులు శాకాహారంతో నెవ్వరి ధాన్యం దంచి తిని జీవిస్తున్నారు. కదా !” అని పార్వతి మందలించింది.

పార్వతీదేవి చేసిన మందలింపు యుక్తి యుక్తంగా ఉంది. నిజానికి వ్యాసుని వంటి మహర్షులు ఒకటి రెండు రోజులు తిండిలేదని పవిత్రమైన కాశీనగరాన్ని శపించడం తగదు. పార్వతీదేవి చెప్పిన మాటలు ధర్మబద్ధంగా, న్యాయంగా నాకు తోచాయి.

PAPER – II : PART – A

I. అవగాహన – ప్రతిస్పందన

అపరిచితపద్యాలు

1. ఈ క్రింది అపరిచిత పద్యమును చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి. (5 మార్కులు )

“కమలములు నీట బాసినఁ
గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ !”

ప్రశ్నలు – జవాబులు

1. కమలములు ఎక్కడుంటాయి ?
జవాబు:
కమలములు నీటిలో ఉంటాయి.

2. కమలాప్తుడనగా ఎవరు ?
జవాబు:
కమలాప్తుడు అంటే ‘సూర్యుడు’.

3. తమతమ నెలవులు తప్పితే ఎలాంటి పరిస్థితులెదురవుతాయి ?
జవాబు:
తమతమ నెలవులు తప్పితే, తమ మిత్రులే శత్రువులు అవుతారు.

4. ఈ పద్యము ఏ శతకములోనిది ?
జవాబు:
ఈ పద్యము సుమతీ శతకములోది.

5. “తథ్యము” అనగా ?
జవాబు:
తప్పదు అని అర్ధము.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

2. ఈ క్రింది అపరిచిత పద్యమును చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

“అంతరంగమందు నపరాధములు సేసి
మంచివానివలెను మనుజుఁడుండు
నితరులెరుగ కున్న నీశ్వరుఁడెఱుఁగడా ?
విశ్వదాభిరామ వినురవేమ !”

ప్రశ్నలు – జవాబులు

1. ఎవరు అపరాధములు చేస్తారు ?
జవాబు:
మనుజులు అపరాధములు చేస్తారు.

2. మంచివానిలాగ ప్రవర్తించేది ఎవరు ?
జవాబు:
మంచివానిలాగా ప్రవర్తించేది మనుజుడు.

3. మనిషి అపరాధములను ఎవరు ఎరిగి ఉంటారు ?
జవాబు:
మనిషి అపరాధములను, ఈశ్వరుడు ఎరిగి ఉంటాడు.

4. పై పద్యం ద్వారా అలవరచుకోవలసిన గుణాలేమిటి ?
జవాబు:
మనిషి తాను చేసిన తప్పులను తన మనస్సు ద్వారా తెలుసుకొని తన్ను సరిదిద్దుకోవాలి.

5. ఈ పద్యంలోని మకుటమేమి ?
జవాబు:
ఈ పద్యంలోని మకుటం విశ్వదాభిరామ వినురవేమ.

3. ఈ క్రింది అపరిచిత పద్యమును చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

“కలహపడు నింట నిలువదు.
కలుముల జవరాలు కానఁగలకాలంబే
కలహము లేక సమ్మతి
మెలగంగా నేర్చునేని మేలు కుమారీ !”

ప్రశ్నలు

1. కలహపడే ఇంట ఏమి నిలవదు ?
జవాబు:
కలహపడే ఇంట కలుముల జవరాలు (లక్ష్మి) నిలువదు.

2. కలుముల జవరాలు అనగా ఎవరు ?
జవాబు:
కలుముల జవరాలు అనగా లక్ష్మీదేవి.

3. ఈ పద్యం మనకు తెలియజేసే మేలు ఏమిటి ?
జవాబు:
కలకాలము ఎటువంటి కలహాలూ లేకుండా కలసి మెలసి ఉండడం నేర్చుకోవడం ‘మేలు’ అని ఈ పద్యం తెలుపుతుంది.

4. ఈ పద్యానికి శీర్షికను పెట్టండి.
జవాబు:
‘పోరు నష్టం – పొందు లాభం’ అని ఈ పద్యానికి శీర్షికగా ఉంచవచ్చు.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

5. ఈ పద్యం దేనిలోనిది ?
జవాబు:
ఈ పద్యం కుమారీ శతకంలోనిది.

4. ఈ క్రింది పద్యం చదివి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

“కనకపు సింహాసనమున
శునకము గూర్చండబెట్టి శుభలగ్నమునం
దొనరగ పట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ !”

ప్రశ్నలు – జవాబులు

1. శునకాన్ని దేనిపై కూర్చుండపెట్టారు ?
జవాబు:
బంగారు సింహాసనం మీద శునకాన్ని కూర్చుండ పెట్టారు.

2. సింహాసనంపై కూర్చున్నది ఎవరు ?
జవాబు:
సింహాసనంపై కూర్చున్నది శునకం.

3. శునకానికి పట్టము కట్టిన వేళ ఏది ?
జవాబు:
శునకానికి పట్టము కట్టిన వేళ శుభలగ్నము.

4. శునకానికి పట్టము కడితే ఏమి జరుగుతుంది ?
జవాబు:
శునకానికి పట్టము కడితే వెనుకటి గుణాన్ని మానదు.

5. ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు:
ఈ పద్యం సుమతీ శతకంలోనిది.

5. క్రింది పద్యాన్ని చదివి క్రింది ప్రశ్నలకు సరైన సమాధానాలు వ్రాయండి.

చేతులారంగ శివుని పూజింపడేని
నోరునవ్వగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యము లోనుగా దలపడేని
కలుగు నేటికి తల్లుల కడుపు చేటు

ప్రశ్నలు – జవాబులు

1. “కడుపుచేటు” అనే మాటకు అర్థమేమి ?
జవాబు:
‘కడుపుచేటు’ అనే మాటకు పుట్టుక దండగని అర్థం.

2. కవి శివపూజ ఎలా చేయమంటున్నాడు ?
జవాబు:
కవి శివపూజ చేతులతో తృప్తి కలిగేటట్లు చేయ మంటున్నాడు.

3. దయను, సత్యాన్ని ఎట్లా తలచాలి ?
జవాబు:
దయను, సత్యాన్ని మనసులో తలచాలి.

4. హరికీర్తిని ఎలా పలకాలి ?
జవాబు:
హరికీర్తిని నోరారా పలకాలి.

5. ఈ పద్యానికి శీర్షిక ఏమిటి ?
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘హరికీర్తన’.

6. కవిత చదివి తప్పొప్పులను గుర్తించండి.

ఓ పిడుగా !
నాకు తెలుసు,
నీశక్తి విద్యుచ్ఛక్తి కంటె గొప్పదని
కాని ఏం లాభం ?
నీ ఆవేశమే నిన్ను నేలకు చేరుస్తుంది
పాతాళానికి దిగజారుస్తుంది.
నీ కంటె
నా గదిలో జీరోబల్బు నయం
రాత్రంతా
చీకటితో పోరాడుతుంది.

ప్రశ్నలు – జవాబులు

1) విద్యుచ్ఛక్తిని మించిన శక్తి లేనిది పిడుగు. ( )
జవాబు:

2) ఆవేశం వల్ల పిడుగు నేలకు చేరుతుంది. ( )
జవాబు:

3) కవితననుసరించి పిడుగు చాలా గొప్పది. ( )
జవాబు:

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

4) చీకటితో పోరాడేది పిడుగు.
జవాబు:

5) పిడుగుకంటె జీరో బల్బే నయం.
జవాబు:

7. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.

ఉడుముండదె నూటేండ్లును
బడియుండదె పేర్మిఁబాము పదినూటేండ్లున్
మడువున కొక్కెర యుండదె
కడ నిల పురుషార్థపరుడు గావలె సుమతీ !

ప్రశ్నలు – జవాబులు

1. నూతేండ్లు జీవించే జంతువు ఏది ?
జవాబు:
నూటేండ్లు జీవించే జంతువు ‘ఉడుము’

2. పాము ఎన్నాళ్ళు జీవిస్తుంది ?
జవాబు:
పాము పదినూర్లు అనగా వేయి సంవత్సరాలు జీవిస్తుంది.

3. ‘కొక్కెర’ అంటే ఏమిటి?
జవాబు:
కొక్కెర అంటే కొంగ.

4. ‘వాడు కావాలి’ అనే అర్థం ఇచ్చే పాదం ఏది ?
జవాబు:
‘భూమండలంలో ధర్మార్థమోక్షాలను సాధించే 4వ పాదం.

5. కొక్కెర ఎక్కడ ఉంటుంది ?
జవాబు:
కొక్కెర మడుగులో ఉంటుంది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

సృజనాత్మక ప్రశ్నలు (5 మార్కులు)

ప్రశ్న 1.
శ్రీనాథుని కవితా ప్రశస్తిని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయుము.
జవాబు:

నిజామాబాద్,
12.01.2018.

ప్రియ మిత్రుడు అనంతు,

నీ మిత్రుడు వ్రాయునది. నేను బాగా చదువు తున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది. మన ప్రాచీన తెలుగు సాహిత్యంలో శ్రీనాథునికి సమున్నతమైన స్థానం ఉంది. ఈయన కవిసార్వ భౌముడిగా కీర్తి పొందాడు. వీరు ఎన్నో రచనలు చేశారు. శ్రీనాథుని వర్ణనాత్మక ప్రతిభ విశిష్టమైనది. శ్రీనాథుని సీస పద్యాలకు విశిష్టస్థానం ఉంది. అలంకార ప్రయోగం కూడా అద్భుతంగా ఉంటుంది. శ్రీనాథుని కవిత్వం, శైలి, భావి కవులకు మార్గదర్శకము అయ్యింది. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలరు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
XXXXXX.

చిరునామా :
ఎన్. అనంత్,
10వ తరగతి,
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ పాఠశాల,
శాంతి నగర్,
కరీంనగర్.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
కోపంవల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వ్యాసం రాయండి. (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
మానవులు వదిలించుకోవల్సిన దుర్గుణాలలో కోపం ప్రధానమైనది. కోపంవల్ల మోహం కలుగుతుంది. బుద్ధి నశిస్తుంది. మానవుని పతనాన్ని శాసిస్తుంది. కోపం వల్ల ఎన్నో అనర్థాలు కలవు. విచక్షణా శక్తిని కోల్పోతాడు. హింసాప్రవృత్తిని అలవరచుకుంటాడు. ఉన్మాదిగా మారతాడు.

బంధువులు, మిత్రులు దూరమౌతారు, ఆప్తులు ఆదరించరు. ఒంటరితనాన్ని అనుభవిస్తారు. కుటంబగౌరవం తగ్గుతుంది. తన కుటుంబంలో అంతర్గత కలహాలు పెరుగుతాయి. దుర్యోధనుడు, విశ్వామిత్రుడు, దుర్వాసుడి వంటివారు కోపానికి బానిసలుగా మారారు. ఎన్నో అనర్థాలను పొందారు.

మన శతకాలు కోపం మంచిదిగాదని, దాన్ని విడిచిపెట్టమని బోధిస్తున్నాయి. అందువల్ల మన మంతా కోపాన్ని విడనాడాలి. శాంతిని పొందాలి. జీవితాన్ని ఆదర్శంగా మలచుకోవాలి.

ప్రశ్న 3.
కోపంవల్ల గౌరవం తగ్గుతుందనే విషయాన్ని వివరిస్తూ ఒక కరపత్రం రాయండి. (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:

శాంతిని పొందు ! క్రోధం వదులుకో ! ఆదర్శంగా జీవించు !

మాన్యులారా ! వదాన్యులారా ! సోదర సోదరీ | మణులారా ! కోపం మనందరి శత్రువు. దానిని మనమంతా దూరం చేసుకోవాలి. కోపంవల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. అందరిని దూరం చేస్తుంది. సకలదుర్గుణాలకు మూలాధారం. దుర్యోధనుడు, విశ్వామిత్రుని వంటి పురాణపురుషులు కోపం వల్ల సర్వనాశనమైనారు.

అందువల్ల మనం కోపాన్ని దూరంగా ఉంచుదాం ! ప్రశాంతమైన జీవనాన్ని సాగిద్దాం ! ఆలోచించి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సహజీవన మాధుర్యాన్ని అనుభవిద్దాం. అందరికి ఆదర్శంగా జీవిద్దాం !

ఇట్లు,
ఆరోగ్య సంరక్షణ కమిటీ,
నల్గొండ.

ప్రశ్న 4.
కోపం అనర్థదాయకమని, శాంతిని పెంపొందించ మని తెలుపుతూ నినాదాలు రాయండి.
జవాబు:
కోపం వద్దు – శాంతి ముద్దు
మితిమీరిన కోపం – అనర్థాలకు మూలం
మానవుల అంతర్గత శత్రువు క్రోథం
కోపాన్ని తగ్గించు – ఆదర్శంగా జీవించు
శాంతియుత జీవనం – అదే అందరికి ఆదర్శం
కోపం త్యజించు – శాంతిని స్వాగతించు

ప్రశ్న 5.
ఆకలిగా ఉన్నవాళ్ళకు అన్నంపెట్టడం, అవసరానికి సహాయంచేయడం వంటివి మంచి లక్షణాలు. మీ తరగతిలో ఇలా మంచి లక్షణాలు గలవాళ్ళు ఎవరు ఉన్నారు ? వాళ్ళను అభినందించండి.
జవాబు:
మా తరగతిలో మేమందరం పేద విద్యార్థులకు సహాయం చేస్తాము. మా ఊరికి సమీపంలో ఒక విదేశీయుని కుటుంబం వచ్చి వీధి పిల్లలను చేరదీసి వారికి కావలసిన సకల సదుపాయాలు కల్పిస్తుంది. ఆ విదేశీయులు పెద్దల దగ్గర విరాళాలు వసూలు చేసి, వీధి పిల్లల కోసం ఒక గ్రామాన్ని స్థాపించారు. అందులో అందరూ అనాథపిల్లలే ఉంటారు.

ఆ అనాథ పిల్లలకు మా పాఠశాల పిల్లలందరం దుస్తులు, సబ్బులు, కొబ్బరినూనె, పుస్తకాలు, ధన సహాయం చేస్తుంటాము. అందుకు మాకెంతో తృప్తిగా ఉంటుంది. ఈ సంవత్సరం మా తరగతి విద్యార్థులందరం చందాలు వసూలు చేసి, ఆ అనాథ పిల్లలకు ఒక కంప్యూటర్ను బహూకరించాము. అందుకు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మా తరగతి విద్యార్థులనందరినీ అభినందించారు.

ప్రశ్న 6.
ప్రపంచశాంతి (విశ్వశాంతి) గూర్చి వ్యాసం వ్రాయండి.
జవాబు:
శాంతి అంటే శమము లేదా ఓర్పు అని అర్థం. బాధలు, దుఃఖాలు, ప్రకృతి వైపరీత్యాలు, మానవ కల్పితమగు ఉపద్రవాలు ప్రాణికోటికి కష్టనష్టాలు కలిగిస్తున్నాయి. లోకపు మనుగడకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. భూమండలంపై ఉన్న సమస్త ప్రాణులు ఎటువంటి ఉపద్రవాలు లేకుండా కూడు, గూడు, గుడ్డ గలిగి సుఖంగా జీవించడమే ప్రపంచ శాంతి.

సహజంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రపంచ మానవాళికి కష్టాలు కలుగుతాయి. భూకంపాలు, వరదలు, తుఫానులు, అతివృష్టి, అనావృష్టి వంటి వాటి వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడతారు. వాటి వల్ల జరిగే నష్టాన్ని తగ్గించడానికి శాస్త్రజ్ఞులు అంతా కృషి చేస్తున్నారు.

మానవ కల్పితాలైన ఉపద్రవాలు నేడు ప్రపంచ శాంతికి తీరని ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఒక దేశంవారు మరో దేశంపై సాగించే యుద్ధాలు ఇటువంటివే. యుద్ధం వల్ల ఓడిపోయిన వారికే కాక గెలిచిన వారికి కూడా ఎంతో నష్టం కలుగుతుంది. 20వ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల వల్ల ప్రజలలో భయాందోళనలు పెరిగి అశాంతి వాతావరణం నెలకొంది.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత నానాజాతి సమితి, రెండో ప్రపంచయుద్ధం తరువాత ఐక్యరాజ్యసమితి ఏర్పడ్డా అవి ప్రపంచ శాంతికి సరైన కృషిని కొనసాగించలేకపోయాయి. నేడు శ్రీలంక తమిళుల సమస్య, దక్షిణాఫ్రికా వర్ణ వివక్షత, పంజాబ్లోని టెర్రరిస్టుల చర్యలు మొదలైనవి మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయేమో అనే భయాందోళనలు కలిగిస్తున్నాయి.

నేడు ప్రపంచ శాంతి నెలకొల్పడానికై వివిధ దేశాలు గణనీయమైన కృషి చేస్తున్నాయి. అందులో భారతదేశం ఒకటి. ప్రపంచ దేశాల మధ్య స్నేహభావాన్ని పెంచి శాంతి చేకూర్చడానికి నెహ్రూగారి పంచశీల సిద్ధాంతాన్ని ఆచరించటం మంచిది.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 7.
యాచన వృత్తి మంచిది కాదు అని చెబుతూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

యాచన మానండి. మాన్పించండి.

నరులారా !

మానవులు కాయకష్టంచేసి జీవించాలి. ఆత్మాభి మానంతో జీవించాలి. ఇతరుల ముందు
చేయిచాచి యాచించకూడదు. కృషితో నాస్తి దుర్భిక్షం అని అంటారు. కష్టించి పనిచేసే వారిని సమాజం గౌరవిస్తుంది. సోమరిపోతుల్లా జీవించాలని కోరు కోకండి. ఆత్మవిశ్వాసంతో జీవించండి. అందరికి ఆదర్శంగా నిలుస్తారు. తోటివారికి సహాయపడండి. యాచన మానండి. కష్టంతో జీవించండి.

ఇట్లు,
యాచక వ్యతిరేక కమిటీ.

ప్రశ్న 8.
కోపం అనర్థదాయకమనే విషయాన్ని తెలుపుతూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
కోపంవీడు కోపం అనర్ధదాయకం సహనం పొందు మిత్రులారా ! మానవుల అంతర్గత శత్రువు కోపం. అరిషడ్వర్గాలలో కోపం ప్రధానమైనది. అన్ని అనర్ధాలకు కోపం మూలం. దీనివల్ల విచక్షణా జ్ఞానం నశిస్తుంది. ఆవేశం కలుగుతుంది. ఆలోచనా శక్తి కోల్పోతాడు. స్నేహం దెబ్బ తింటుంది.

“కోపం ఆత్మీయులను దూరం చేస్తుంది. బంధువులతో సంబంధాలను దూరం చేస్తుంది. మానవీయ సంబంధాలను, నైతిక విలువలను కోల్పోతాడు. సమాజంలో గౌరవం తగ్గుతుంది. సహజీవన మాధుర్యం క్రమంగా నశిస్తుంది. హింసాయుత ప్రవృత్తి అలవడుతుంది.

అందువల్ల మనంకూడా కోపాన్ని వదలిపెట్టాలి. శాంతిని పొందాలి. అందరితో నవ్వుతూ మాట్లాడాలి. కోపాన్ని వదలి నూరు సంవత్సరాలు సుఖంగా జీవించాలి. అదే మనకు ఆరోగ్య రక్ష.

ఇట్లు,
ఆరోగ్య సంరక్షణ కమిటీ,
X X X X X.

అదనపు వ్యాకరణాంశాలు

PAPER – I: PART – B

1. పర్యాయపదాలు

అర్ధాంగి = భార్య, ఇల్లాలు, పత్ని

ఆగ్రహం = కోపం, అలుక, క్రోధం

గృహము = ఇల్లు, గేహము, నికేతనం

శివుడు = శంకరుడు, రుద్రుడు, గౌరీపతి

పసిడి = బంగారం, కాంచనం, పుత్తడి

పారాశర్యుడు = వ్యాసుడు, బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడు

మోక్షం = కైవల్యం, ముక్తి

శిష్యులు = ఛాత్రులు, విద్యార్థులు, అంతేవాసులు

నిక్కము = నిజము, సత్యము, యదార్థం

భాగీరథి = గంగ, త్రిపథగ, జాహ్నవి

బ్రాహ్మణులు = విప్రులు, ద్విజులు, భూసురులు

భవాని = పార్వతి, గౌరి, ఉమ

వనిత = స్త్రీ, మహిళ, పడతి, అంగన

భానుడు = సూర్యుడు, రవి, దివాకరుడు

తనూజుడు = కుమారుడు, సుతుడు, ఆత్మజుడు

అంగన = వనిత, స్త్రీ, మహిళ

నెయ్యి = ఆజ్యము, ఘృతము, నేయి

ఇల్లు = గృహము, భువనం, భార్య, పేరు

గంధము = చందనం, మలయజం

పుష్పము = పువ్వు, కుసుమము, ప్రసూనము

ముఖము = వదనము, ఆననము, మొగము

గొడుగు = ఛత్రము, ఆతపత్రము, ఖర్పరము

మరికొన్ని పర్యాయపదాలు

క్రింది వాక్యములలో పర్యాయపదములు గుర్తించండి.

1. భిక్ష మునుల వృత్తి. ముష్టికి వచ్చిన వారికి తిరిపము పెట్టాలి కాని విసుక్కోకూడదు.
జవాబు
భిక్ష, ముష్టి, తిరిపము

2. శిష్యుడు గురువును గౌరవించాలి. గురువు అంతేవాసిని తీర్చి దిద్దాలి. ఆ ఛాత్రుడు ఎంత గొప్పవాడైతే అంత మంచిది.
జవాబు:
శిష్యుడు, అంతేవాసి, ఛాత్రుడు

3. చదువుపై శ్రద్ధ పెట్టాలి. విద్యను మించిన సంపద లేదు. పలుకును బట్టి గౌరవం పెరుగుతుంది.
జవాబు:
చదువు, విద్య, పలుకు

4. గురువును గౌరవించాలి. ఆచార్యుడు తన సమయాన్ని విద్యాదానానికి ఉపయోగించి మంచి దేశికుడుగా పేరు తెచ్చుకోవాలి.
జవాబు:
గురువు, ఆచార్యుడు, దేశికుడు

5. ఆవును బాధ పెట్టకూడదు. మొదవు ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం. అందుకే. గోవును పూజించాలి.
జవాబు:
ఆవు, మొదవు, గోవు

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

6. రాత్రి ప్రయాణం మంచిది కాదు. నిశీధిలో దీపం ఉండాలి. అలంకరిస్తే రజనిని మించినది లేదు.
జవాబు:
రాత్రి, నిశీధి, రజని

7. ముక్కంటి కంటి మంటకు మదనుడు నశించాడు. వరాలిచ్చే శివుడుకి కోపం వస్తే రుద్రుడు అవుతాడు.
జవాబు:
ముక్కంటి, శివుడు, రుద్రుడు

8. తొలిపలుకులు ఆగమములంటారు. వేదము శిరో ధార్యము.
జవాబు:
తొలిపలుకులు, ఆగమము, వేదము

9. వ్యాసుడు వేదాలు విభజించాడు. ఆ కృష్ణద్వైపా యనుడు 18 పురాణాలు రచించాడు. అందు పారాశర్యుడు తొలి గురువు.
జవాబు:
వ్యాసుడు, కృష్ణద్వైపాయనుడు, పారాశర్యుడు

10. ఎవరిపైనా నింద వేయకూడదు. దూషణములే శాపములై తగులును.
జవాబు:
నింద, దూషణము, శాపము

2. వ్యుత్పత్త్యర్థాలు

శివుడు = స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు. (శంకరుడు)

అతిథి = తిథి, వార, నక్షత్ర నియమం లేకుండా ఇంటికి భోజనానికి వచ్చువాడు.

గురువు = అధికారమనెడి అజ్ఞానమును తొలగించువాడు. (ఉపాధ్యాయుడు)

మోక్షము = జీవుడిని పాపము నుండి విడిపించునది (కైవల్యం)

పతివ్రత = పతిని సేవించుటయే వ్రతముగా కలది (సాధ్వి)

శిష్యులు = శిక్షింపతగిన వారు (ఛాత్రులు)

పారాశర్యుడు = పరాశరుని యొక్క కుమారుడు (వ్యాసుడు)

ఛాత్రుడు = గురువు యొక్క దోషాలను కప్పిపుచ్చు స్వభావం గలవాడు. (విద్యార్థి)

భాస్కరుడు = కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)

భవాని = భవుని యొక్క భార్య (పార్వతి)

విశ్వనాథుడు = ప్రపంచానికి నాథుడు (శివుడు)

పార్వతి = పర్వతరాజు యొక్క కుమార్తె (గౌరి)

వేదవ్యాసుడు = వేదములను విభజించువాడు (పారాశర్యుడు)

పురంధ్రి = గృహమును ధరించునది (ఇల్లాలు)

తాపసుడు = తపము చేయువాడు (ముని)

పంచజనుడు = ఐదుభూతములచే పుట్టబడేవాడు (మనిషి)

ముక్కంటి = మూడు కన్నులు కలవాడు (శివుడు)

వనజనేత్ర = పద్మముల వంటి కన్నులు కలది.

లేదీగబోడి = లేతతీగ వంటి శరీరము కలది

అహిమభానుడు = చల్లనివికాని కిరణములు గలవాడు. (సూర్యుడు)

వ్యాసుడు = వేదములను విభజించి ఇచ్చినవాడు (వ్యాసమహర్షి)

3. నానార్థాలు

కంకణము = తోరము, నీటిబిందువు, స్త్రీలు చేతికి ధరించేది
గురువు = ఉపాధ్యాయుడు, బృహస్పతి, తండ్రి, పురోహితుడు
మోక్షము = కైవల్యం, నిర్యాణం, విడుదల
ఫలము = పండు, ఫలితము, ప్రయోజనము
లక్ష్మి = సంపద, రమ, మెట్టతామర
కామము = కోరిక, మామిడి
ప్రసాదము = అనుగ్రహము, ప్రసన్నత, మంచి స్వభావం
కరము = చేయి, తొండము, కిరణము
గృహము = ఇల్లు, భార్య, రాశి
కాయ = చెట్టుకాయ, బిడ్డ
ఇల్లు = గృహము, కుటుంబము, స్థానము
ముఖము = మోము, ఉపాయము, ముఖ్యమైనది
బంతి = కందుకము, ఒక జాతి పువ్వుల చెట్టు, పంక్తి
రూపు = ఆకారము, దేహము, కన్నెమెడలో బంగారు నాణెము
గంధము = చందనము, గంధకము, సువాసన

4. ప్రకృతి – వికృతులు

ఆజ్ఞ – ఆన
దోషం – దోసం
స్వామి – సామి
భాగ్యము – బాగ్గెము
శక్తి – సత్తి
కార్యం – కర్జం
భిక్షము – బిచ్చము
పట్టణము – పత్తనము

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

వేషము – వేసము
రాత్రి – రాతిరి
స్వర్గము – సొన్నము
తపస్వి – తపసి
రూపము – రూపు
లక్ష్మి – లచ్చి
ఆహారము – ఓగిరమ
విద్య – విద్దె
శ్రీ – సిరి
ఈశ్వరుడు – ఈసుడు
పుణ్యం – పున్నెము
సుఖము – సుకము
రత్నము – రతనము
బ్రాహ్మణుడు – బాపడు
గంధము – గందము
పుష్పం – పూవు
శిష్యుడు – చట్టు
పాయసము – పాసెము

PAPER – II : PART – B

1. సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి

సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దాని దీర్ఘము ఏకాదేశమగును.

ఉదా: పుణ్యాంగన – పుణ్య + అంగన
బింబాస్య – బింబ + ఆస్య
అర్ధాంగ – అర్ధ + అంగ
శాకాహారులు – శాక + ఆహారులు
శిఖాధిరూఢ – శిఖ + అధిరూఢ
భిక్షాన్నం – భిక్ష + అన్నం
శాలాంతరం – శాల + అంతరం
మధ్యాహ్నం – మధ్య + అహ్నం
పాయసాపూపం – పాయస + అపూపం
బ్రాహ్మణాంగన – బ్రాహ్మణ + అంగన
కమలానన – కమల + ఆనన
పాపాత్ములు – పాప + ఆత్ములు
అభీప్సితాన్నములు – అభీప్సిత + అన్నములు
ఖచితాభరణంబు – ఖచిత + ఆభరణంబు
మునీశ్వర – ముని + ఈశ్వర

2. గుణ సంధి

సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమముగా ఏ, ఓ, ఆర్లు ఏకాదేశమగును.
ఉదా : శిలోంచ శిల + ఉంచ్ఛ

3. అత్వసంధి

సూత్రం : అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా : లేకైన – లేక + ఐన
ముత్తైదువ – ముత్త + ఐదువ

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

4. ఉత్వసంధి

సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు

ఉదా : లేదెట్లు – లేదు + ఎట్లు
బీఱెంద – బీఱు + ఎండ
ప్రక్షాలితంబైన – ప్రక్షాలితంబు + ఐన
అపారములైన – అపారములు + ఐన
రూపన్న – రూపు + అన్న
పారణకైన – పారణకు + ఐన
రమ్మని – రమ్ము + అని

5. యడాగమ సంధి

సూత్రం: సంధి లేనిచోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా : మా యిల్లు – మా + ఇల్లు

6. త్రికసంధి

సూత్రాలు :

  1. అ, ఈ, ఏ అను సర్వనామములు త్రికములనబడును.
  2. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
  3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్చి కంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగును.

ఉదా : ఇవ్వీటి – ఈ + వీటి
అచ్చోట – ఆ + చోట
అమ్మహాసాధ్వి – ఆ + మహాసాధ్వి
ఆయ్యాదిమశక్తి – ఆ + ఆదిమశక్తి – యడాగమ త్రికసంధులు

7. గసడదవాదేశ సంధి

సూత్రము : ప్రథమమీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.
ఉదా : లెస్సగాక – లెస్స + కాక
కఱ్ఱపెట్టి – కఱ్ఱ + పెట్టి
పూజచేసి – పూజ + చేసి

8. ద్రుత ప్రకృతిక సంధి

సూత్రము : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
ఉదా : కవాటంబుఁదెరువము – కవాటంబున్ + తెరువము
చనుదెంచినఁగామధేనువు – చనుదెంచినన్ + కామధేనువు

2. సమాసాలు

సమాస పదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
మతిహీనులు – మతిచేత హీనులు – తృతీయా తత్పురుష సమాసము
కోపావేశం – కోపము చేత ఆవేశం – తృతీయా తత్పురుష సమాసము
రత్నఖచిత – రత్నముచేత ఖచితం – తృతీయా తత్పురుష సమాసము
విప్రగృహం – విప్రుని యొక్క గృహం – షష్ఠీ తత్పురుష సమాసము
విద్యాగురుండు – విద్యలకు గురుండు – షష్ఠీ తత్పురుష సమాసము
బ్రాహ్మణాంగనలు – బ్రాహ్మణుల యొక్క అంగనలు – షష్ఠీ తత్పురుష సమాసము
పాపాత్ముని ముఖం – పాపాత్ముని యొక్క ముఖం – షష్ఠీ తత్పురుష సమాసము
‘బ్రాహ్మణ మందిరములు – బ్రాహ్మణుల యొక్క మందిరములు – షష్ఠీ తత్పురుష సమాసము
గోముఖము – గోవు యొక్క ముఖము – షష్ఠీ తత్పురుష సమాసము

ద్వాఃకవాటం – ద్వారము యొక్క కవాటం – షష్ఠీ తత్పురుష సమాసము
శిష్యగణం – శిష్యుల యొక్క గణం – షష్ఠీ తత్పురుష సమాసము
మాయిల్లు – మా యొక్క ఇల్లు – షష్ఠీ తత్పురుష సమాసము
విప్రవాటికలు – విప్రుల యొక్క వాటికలు – షష్ఠీ తత్పురుష సమాసము
విశ్వనాథుని రూపం – విశ్వనాథుని యొక్క రూపం – షష్ఠీ తత్పురుష సమాసము
విప్రభవనం – విప్రుని యొక్క భవనం – షష్ఠీ తత్పురుష సమాసము
ముక్కంటిమాయ – ముక్కంటి యొక్క మాయ – షష్ఠీ తత్పురుష సమాసము
భిక్షాటనం – భిక్ష కొఱకు అటనం – చతుర్థీ తత్పురుష సమాసము
భిక్షాపాత్ర – భిక్ష కొఱకు పాత్ర – చతుర్థీ తత్పురుష సమాసము
భుక్తిశాల – భుక్తి కొరకు శాల – చతుర్థీ తత్పురుష సమాసము
కాశినగరం – కాశిఅనే పేరుగల నగరం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
కాశీపట్టణం – కాశి అనే పేరుగల పట్టణం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
మోక్షలక్ష్మి – మోక్షము అనెడి లక్ష్మి – రూపక సమాసం
మూడుతరములు – మూడు సంఖ్య గల తరములు – ద్విగు సమాసం
మధ్యాహ్నం – అహ్నము మధ్య భాగము – ప్రథమా తత్పురుష సమాసం
ముక్కంటి – మూడు కన్నులు కలవాడు – బహువ్రీహి సమాసం

మచ్చెకంటి – చేప కన్నుల వంటి కన్నులు కలది – బహువ్రీహి సమాసం
బింబాస్య – చంద్రబింబము వంటి ముఖము కలది – బహువ్రీహి సమాసం
పాపాత్ముడు – పాపముతో కూడిన మనస్సు కలవాడు” – బహువ్రీహి సమాసం
శాకాహారులు – శాకమును ఆహారముగా కలవారు ” – బహువ్రీహి సమాసం
కమలాలన – కమలముల వంటి ఆననము కలది” – బహువ్రీహి సమాసం
బహు పదార్థములు – ఎక్కువైన పదార్థములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
లేతీగ – లేతదైన తీగ – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పుణ్యాంగన – పుణ్యమైన అంగన – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహాప్రసాదం – గొప్పదైన ప్రసాదం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రాకృత వేషం – ప్రాకృతమైన వేషం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అభీప్సితాన్నములు – అభీప్సితములైన అన్నములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
కొన్ని మాటలు – కొన్నైన మాటలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

పెద్ద ముత్తైదువ – పెద్దదైన ముత్తైదువ – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అర్ఘ్యపాద్యములు – అర్ఘ్యమును, పాద్యమును – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పుష్పగంధములు – పుష్పములును, గంధములును – ద్వంద్వ సమాసం
ఫలపాయసములు – ఫలమును, పాయసమును – ద్వంద్వ సమాసం
భక్తివిశ్వాసములు – భక్తియును, విశ్వాసమును – ద్వంద్వ సమాసం
క్షుత్పిపాసలు – క్షుత్తును, పిపాసయును – ద్వంద్వ సమాసం
వేదపురాణశాస్త్రములు – వేదములును, పురాణములును, శాస్త్రములును – బహుపద ద్వంద్వం

3. గణవిభజన

ప్రశ్న 1.
‘అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను లెస్సగా కయో – ఈ పద్యపాదానికి గురు లఘువులను గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్యపాదమో తెల్పండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 1
పై పద్యపాదంలో న, జ, భ, జ, జ, జ, అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది చంపకమాల పద్యపాదం.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
‘ఆ కంఠంబుగ నిఫ్టు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా’ – ఈ పద్య పాదానికి గురు లఘువులను గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్యపాదమో తెల్పండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 2
పై పద్యపాదంలో మ, స, జ, స, త, త, గ అనే గణాలు ఉన్నాయి కావున ఇది ‘మత్తేభ’ పద్యపాదము.

ప్రశ్న 3.
జ్ఞాదర లీలరత్న కటకా భరణంబులు ఘల్లు ఘల్లనన్ – ఈ పద్య పాదానికి గురు లఘువులను గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్యపాదమో తెల్పండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 3
ఈ పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ పద్యపాదం.

ప్రశ్న 4.
‘అనవుడు నల్ల నవ్వికమలానన యిట్లను లెస్సగాకయో, అన్న పద్యపాదానికి గురు లఘువులు గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్యపాదమో తెలపండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 4
పై పద్యపాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ గణాలు ఉన్నాయి కాబట్టి 11వ అక్షరం యతిమైత్రి. ఇది చంపకమాల పద్యపాదము.

ప్రశ్న 5.
‘ఓ మునీశ్వర వినవయ్య యున్నయూరు’ – పద్యపాదానికి గురు లఘువులు గుర్తించి, గణవిభజన చేసి ఏ పద్యపాదమో తెలపండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 5

  1. పై పాదంలో 1 సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది తేటగీతి పద్యపాదం.
  2. యతి నాల్గవ గణం మొదటి అక్షరంతో (ఓ – యు)

ప్రశ్న 6.
‘శాకాహారులు కందభోజులు శిలోంఛ ప్రక్రముల్ తాపసుల్’ అనే పద్యపాదానికి, గురు లఘువులు గుర్తించి, గణవిభజన చేసి, అది ఏ పద్యపాదమో తెలుపండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 6
పై పాదంలో ‘మ, స, జ, స, త, త, గ’ గణాలున్నాయి. కాబట్టి శార్దూల 13వ అక్షరం యతిమైత్రి (శా-ఛ) పద్యపాదము.

4. అలంకారాలు

ప్రశ్న 1.
ముంగిట గోమయంబున గోముఖము దీర్చి కడలు నాల్గుగ మ్రుగ్గు కఱ్ఱ వెట్టి,
జవాబు:
ఈ (సీస) పద్యంలో స్వభావోక్తి అలంకారం ఉంది.
లక్షణం : ఒక విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే అది స్వభావోక్తి అలంకారం.
సమన్వయం : పై పద్యం వాకిట్లో ముగ్గులు, ఆతిథ్యం మొదలగునవి ఉన్నవి ఉన్నట్లుగా చక్కని పదాలతో వర్ణించారు. కనుక, అది స్వభావోక్తి అలంకారం.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
మూడుతరముల చెడుగాక మోక్ష లక్ష్మి
జవాబు:
ఈ వాక్యంలో రూపకాలంకారం ఉంది.
లక్షణం : ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి, రెండింటికీ భేదం లేనట్లు చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు.
సమన్వయం : మోక్షమును లక్ష్మితో పోల్చారు. మోక్షమనెడు లక్ష్మి అని ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పారు. కనుక ఇది రూపకాలంకారం.

ప్రశ్న 3.
అని పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపందలంచు.
జవాబు:
ఈ వాక్యంలో వృత్త్యనుప్రాసాలంకారం ఉంది.
లక్షణం : ఒకే అక్షరం చాలాసార్లు వస్తే అది వృత్త్యనుప్రాసాలంకారం.
సమన్వయం : పై వాక్యంలో ‘ప’కారం చాలాసార్లు వచ్చింది. కనుక దానిలో వృత్త్యనుప్రాసాలంకారం ఉంది.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

These TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక will help the students to improve their time and approach.

TS 10th Class Telugu 12th Lesson Important Questions భూమిక

PAPER – 1 : PART- A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

1. లఘు సమాధాన ప్రశ్నలు (3 మార్కులు)

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘భూమిక లేక పీఠిక’ అనే సాహిత్య ప్రక్రియను గూర్చి వివరించండి.
జవాబు:
ఒక పుస్తకానికి ముందు రాసే ముందుమాటనే ‘పీఠిక’ లేక ‘భూమిక’ అని అంటారు. ఒక పుస్తకం ఆశయాన్నీ, దానిలోని సారాన్నీ, దాని తత్త్వాన్నీ, ఆ గ్రంథ రచయిత దృక్పథాన్నీ, ‘ముందుమాట’ తెలియజేస్తుంది.

ఒక గ్రంథము యొక్క నేపథ్యమును, లక్ష్యములను పరిచయము చేస్తూ స్వయంగా ఆ గ్రంథ రచయిత గానీ, మరొకరు గానీ, లేదా ఒక విమర్శకుడు గానీ రాసే విశ్లేషాత్మక పరిచయ వాక్యాలను, ‘పీఠిక’ లేక ‘భూమిక’ అని పిలుస్తారు. ఈ పీఠికనే, ముందుమాట, భూమిక, ప్రస్తావన, తొలిపలుకు, ఆముఖము, మున్నుడి అనే పేర్లతో కూడా పిలుస్తారు.
నేషనల్ బుక్ ట్రస్టు ప్రచురించిన నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథల సంపుటానికి, శ్రీ గూడూరి సీతారాం గారు పీఠిక రాశారు.

ప్రశ్న 2.
సంక్షుభిత వాతావరణంలో హిందూ, ముస్లింల సఖ్యత కోసం ఎందరో ప్రజాస్వామిక వాదులు నడుం బిగించారు అంటే మీకేమి అర్థమయింది ?
జవాబు:
ఆ రోజులలో హిందూ – ముస్లింల సఖ్యత లోపించింది. మానవ సంబంధాలు మరుగునపడ్డాయి. మమతలు మసకబారినాయి. మతాల ముసుగులో దారుణాలు ఎక్కువయ్యాయి. కులాతీత సమాజం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. మతాతీత స్నేహాలు మటుమా యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆత్మీయతలు అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే దానిని సంక్షుభిత వాతావరణం అన్నారు.

ఆ సంక్షుభిత వాతావరణాన్ని చక్కబరిచి, మళ్ళీ మమతలు, ఆత్మీయతలు, స్నేహాలు పెంపొంది కులాతీత మతాతీత సమాజం ఏర్పడటానికి చాలామంది ప్రజాస్వామికవాదులు పూనుకొన్నారని అర్థమయింది.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

ప్రశ్న 3.
నెల్లూరి కేశవస్వామి హృదయాన్ని ఆవిష్కరించండి.
జవాబు:
ఒక రచయిత యొక్క హృదయం అతని రచనలలో కన్పిస్తుంది. అలాగే నెల్లూరి కేశవస్వామి హృదయం ఆయన రచనలలో కన్పిస్తుంది. కేశవస్వామి హృదయం ఆయన రాసిన కథలలో కనిపిస్తుంది. స్వామి లోహియా సోషలిస్టు. సమాజంలో అన్ని కులాలవారు, అన్ని మతాల వారు స్నేహభావంతో ఉండాలని ఆయన ఆలోచన.

దానికి విఘాతం కలిగితే తట్టుకోలేడు. అందుకే హిందూ – ముస్లిం సఖ్యత లోపించినపుడు అశాంతిగా గడిపాడు. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపాడు. స్నేహం కోసం తపించాడు. ఆత్మీయత కోసం అర్రులు చాచాడు. కులాతీత, మతాతీత సమాజ నిర్మాణం కోసం చాలా ప్రయత్నం చేశాడు. ఆయన రచించిన చార్మినార్ కథలలో ఇవే కనిపిస్తాయి.

సామాజిక శాస్త్రవేత్తగా తన ప్రయత్నాలు తాను చేస్తూనే, ఉత్తమ సమాజ నిర్మాణానికి కథల ద్వారా పాఠకులలో చైతన్యం కల్గించాడు. సామాజిక మార్పులను తన కథలలో వ్యక్తపరిచాడు. సామాజిక చరిత్రను కథలలో రాశాడు.

ప్రశ్న 4.
కేశవస్వామి చాలా కథలు రచించాడు కదా! కథా రచన వలన ప్రయోజనం ఏమిటి?
జవాబు:
కేశవస్వామి తన కథల ద్వారా నాటి సమాజాన్ని గురించి తెలియజేశారు. ఆనాటి సమాజాన్ని చైతన్యపరిచారు. అలాగే కథల వలన సమాజాన్ని చైతన్యపరచవచ్చు. సమాజాన్ని సంస్కరించవచ్చును. సమాజంలోని అసమానతలను ప్రశ్నించవచ్చు. సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు సూచించవచ్చును.

కథలోని భాష, శైలి సామాన్య పాఠకులను కూడా ఆకట్టుకొనేలా ఉండాలి. పాఠకుల హృదయాలను కదిలించగలవు. ఉత్తమ సమాజ నిర్మాణానికి తమవంతు ప్రయత్నాన్ని తాము చేయాలనే సంకల్పం కలిగిస్తాయి. ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకొనే అవకాశం కల్పిస్తాయి. పాఠకుల మనోధైర్యాన్ని పెంచుతాయి. పాఠకులకు ఆనందాన్ని కల్గిస్తాయి. కత్తితో సాధ్యం కానిది, కలంతో సాధ్యమని కథలు నిరూపిస్తాయి. అందుకే ఉత్తమ కథా సాహిత్యం ఉత్తమ సమాజాన్ని రూపొందిస్తుందంటారు.

ప్రశ్న 5.
నెల్లూరి కేశవస్వామి కథల్లోని వస్తు వైవిధ్యాన్ని వివరించండి.
జవాబు:
కేశవస్వామి ‘చార్మినార్ కథలు’ సంపుటిలో 11 కథలున్నాయి. ఈ కథలన్నీ విశిష్టమైనవి, దేనికదే ప్రత్యేకమైనవి. ‘యుగాంతం’ కథ ఆనాటి సామాజిక, చారిత్రక పరిణామాల నేపథ్యంలో సాగింది. ‘మహీఅపా’ కథలో ముస్లిం నవాబులు ఒక ముజ్రాల రమణిని గౌరవించిన తీరు వారి హృదయం సంస్కారానికి అద్దం పడుతోంది. వంశాకురం వధ ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో, కొడుకు కావాలనే ఆశ ఆడపిల్లల జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తుందో చిత్రించింది. ‘కేవలం మనుషులం’ కథ మతాల సరిహద్దులను చెరిపివేసిన స్నేహం గురించి వివరిస్తుంది. భరోసా కథ నమ్మిన పేదలను నట్టేట ముంచిన వైనాన్ని తెలుపుతుంది.

ప్రశ్న 6.
‘భూమిక’ పాఠం రచయితను గురించి రాయండి. (June ’17)
జవాబు:
‘భూమిక’ పాఠ్యభాగ రచయిత గూడూరి సీతారాం. వీరు 18.07.1936న రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర గల హనుమాజీ పేటలో జన్మించారు. 1953 నుండి 1965 వరకు సుమారు 80 కథలు రాశారు. తెలంగాణ భాషను, యాసను ఒలికించడం ఈయన కలానికున్న ప్రత్యేకత. తెలంగాణ కథా సాహిత్యంలో పేదకులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షర బద్ధం చేసిన రచయిత. తెలంగాణా రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజారికం మొదలగునవి వీరి రచనలు. 25.09.2011 న వీరు మరణించారు.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

ప్రశ్న 7.
“ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్, జాకోబ్ వజ్రాల వంటివే స్వర్గీయ నెల్లూరి కేసవస్వామి చార్మినార్ కథను ” వివరించండి.
జవాబు:
నెల్లూరి కేశవస్వామి ‘చార్మినార్ కథలు’ ఆనాటి చారిత్రక, సామాజిక పరిణామాలను నమోదు చేశాయి. మొత్తం 11 కథలలో దేనికదే ప్రత్యేకమైనది. దేనికదే విశిష్టమైనది, వస్తు వైవిధ్యంతో ఆనాటి హైదరాబాద్ లోని సామాజిక సమస్యలను మానవీయ కోణంలో స్పృశించారు. మతాతీతమైన స్నేహం, తెలంగాణా సాయుధ పోరాటం, ముస్లిం జీవన విధానం, ముస్లిం నవాబు హృదయ సంస్కారం మొదలైన అంశాలు ఇతి వృత్తాలుగా కథలు సాగాయి. అందుకే కేశవస్వామి కథలు కోహినూర్ వజ్రం లాంటివని గూడూరి సీతారాం వ్యాఖ్యానించారు.

ప్రశ్న 8.
గూడూరి సీతారాం సాహిత్యసేవను వివరించండి.
జవాబు:
గూడూరి సీతారాం కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించారు. 80 కథలు రాస్తే వాటిలో కొన్ని మాత్రమే లభ్యమవుతున్నాయి. తెలంగాణ కథా సాహిత్యాన్ని పేదల జీవితంతో, అట్టడుగు వర్గాల వారి జీవిత విశేషాలతో నింపారు. తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచి. తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పని చేసారు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజీరికం లాంటి కథలు రాసారు. తెలంగాణ భాష, యాసను వాడిన గొప్ప కవి.

ప్రశ్న 9.
‘ఈ ఒక్క కథ రాసి మరేమి రాయక పోయినప్పటికీ నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒక్కడుగా కీర్తించబడేవాడు’ – ఆ ఒక్క కథ ఏది ? దానికున్న ప్రాధాన్యాన్ని తెలుపండి. (June ’18)
జవాబు:
యుగాంతం నిజంగానే ఒక గొప్పకథ. ఇండియా రెండు దేశాలుగా విడిపోయి పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు. సంక్షోభాలు, హత్యాకాండ గురించి భీష్మ సహాని “తమస్” నవలలో చిత్రించారు. అది దూరదర్శన్ టి.వి.

సీరియల్గా ప్రసారమైనపుడు పెద్ద ఎత్తున చర్చ సాగింది. అలాంటి పరిస్థితులే హైదరాబాద్ రాజ్యంలో 1946-1950ల మధ్య ఎలా కొనసాగాయో చాలా మందికి తెలియదు. హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డంతో మూలకు నెట్టివేయబడింది. ఒక సామాజిక వ్యవస్థ, రాజరిక వ్యవస్థ అంతమవుతూ ఒక నూతన దశలోకి సమాజం, మానవ సంబంధాలు మారుతున్న పరిణామాలను చిత్రించడం వల్ల కథకు యుగాంతం అనే పేరు సార్థకతను చేకూర్చింది.

అందుకే ఈ ఒక్క కథ రాసి మరేమి రాయక పోయినా నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ గొప్ప కథకుల్లో ఒకడుగా కీర్తించబడేవాడు.

2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (6 మార్కులు)

క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న1.
నెల్లూరి కేశవస్వామి కథలలోని ప్రత్యేకతలను వివరించండి. (Mar. ’16)
నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకరు. సమర్థించండి. (Mar. ’18)
జవాబు:
నెల్లూరి కేశవస్వామి, సుప్రసిద్ధ కథా రచయిత. ఈయన మొదటి కథల సంపుటి, ‘పసిడి బొమ్మ’. ఈయన రెండవ కథా సంపుటం చార్మినార్ కథలు. తాను అనుభవించిన జీవితం, స్నేహం, కులాతీత, మతాతీత వ్యవస్థలు, తెలిపే విధంగా ఓల్డ్ సిటీ. జీవితాన్ని, ‘చార్మినార్ కథలు’గా ఈయన రాశాడు.

ఒక సామాజిక శాస్త్రవేత్తగా, చైతన్యశీలిగా, తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఈ కథలను, ఈయన రాశాడు. ఈ చార్మినార్ కథలు, వాస్తవిక జీవితాల సామాజిక పరిణామాల చరిత్రతో నిండిన చారిత్రాత్మక కథలు. ఈ కథలో కేశవస్వామి హృదయం ఉంది.

ఈయన ‘రుహీ ఆపా’ అనే కథ, ముస్లిం నవాబులలోని హృదయ సంస్కారాన్ని తెలుపుతుంది. ఈయన కథలు, దేనికవే విశిష్టమైనవి. ప్రత్యేకమైనవి. ఈయన ‘యుగాంతం’ కథ, నిజంగానే ఒక యుగాంతాన్ని చిత్రించిన గొప్పకథ. ఈ కథలో హైదరాబాద్ రాజ్యంలో ప్రత్యేక పరిణామాలను ఒక చరిత్ర డాక్యుమెంటుగా ఈయన రాశాడు. ఈ కథ ఒక్కటే ఈయన రాసినా, భారతదేశం గర్వించదగ్గ కథకులలో ఒకడుగా ఈయన ఉండేవాడు.

ఈయన ‘వంశాకురం’ కథలో ముస్లిం పెళ్ళి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు. పేదల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో ‘భరోసా’ కథలో చెప్పాడు.
ఈయన కథలు, ‘కొహినూర్’, ‘జాకోబ్’ వజ్రాల వంటివి. ఈయన వాసిలో వస్తు నైపుణ్యంలో పేరుకెక్కిన కథలు రాశాడు.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

ప్రశ్న2.
గూడూరి సీతారాం వ్యాసం ఆధారంగా నెల్లూరి కేశవస్వామి కథలను గురించి రాయండి.
జవాబు:
నెల్లూరి కేశవస్వామి సుప్రసిద్ధ కథా రచయిత. ఆయన రాసిన కొన్ని కథలు నేడు దొరకట్లేదు. ఈయన తన కథలను కొన్ని సంపుటాలుగా వెలువరించాడు. ఈయన తొలికథల సంపుటి “పసిడి బొమ్మ”. ఇది 1969లో వెలువడింది. ఇది భాస్కరభట్ల కృష్ణారావుగారికి అంకితం ఇవ్వబడింది. ఈయన రెండవ కథా సంకలనం

“చార్మినార్” కథలు. ఇవి ఊహించి రాసిన కథలు కావు. ఇది సమాజంలోని మార్పులను కథలుగా రాసిన సామాజిక చరిత్ర రచన అని చెప్పాలి. చార్ మినార్ కథలు హైదరాబాదు సంస్కృతినీ, మానవ సంబంధాలనూ, అక్కడి ముస్లింల జీవితాలనూ అపూర్వంగా చిత్రించాయి. ఇవి మొత్తం 11 కథలు. హైదరాబాద్ నగరం కాస్మో పాలిటన్ నగరంగా ఎదిగింది. ఆ నేపథ్యాలనూ, ఆ జీవితాలనూ కేశవస్వామి చార్మినార్ కథల్లో చిత్రించాడు.

ఈయన “యుగాంతం” కథ సార్థకమైంది. దీనిలో హైదరాబాద్ రాజ్యంలో పరిణామాలను ఒక చారిత్రక డాక్యుమెంటుగా రాశాడు. ఈ ఒక్క కథే రాసినా, కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ గొప్ప కథకుల్లో ఒక్కడు అయ్యేవాడు.

చార్మినార్ కథల్లో కేశవస్వామి హృదయం ఉంది. ఇవి నిజాం రాజ్యయుగం అంతరించిన పరిణామాలకు చిత్రించిన కథలు, కేశవస్వామి రాసిన ‘రుహీ అపో’ కథ, గొప్ప మానవీయ సంబంధాలనూ, కులమతాలకు అతీతంగా స్పందించిన మనిషినీ చిత్రించిన కథ. ఈ కథలో ముస్లిం నవాబుల్లో ఉన్న హృదయ సంస్కారాన్ని రచయిత చక్కగా చూపించాడు.

ఈయన ‘వంశాంకురం’ కథలో ముస్లిం పెళ్ళి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు. నమ్మిన పేదల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో ‘భరోసా’ కథలో చెప్పాడు. కేశవస్వామి వాసిలో, వస్తు నైపుణ్యంలో వాసికెక్కిన కథలు రాశాడు. ఈయన హిందీ కథా రచయితలు ప్రేమ్చంద్, కిషన్ చందర్లతో పోల్చదగిన గొప్ప కథా రచయిత.

PAPER – II : PART – A

I. అవగాహన – ప్రతిస్పందన

అపరిచిత గద్యాలు

ప్రశ్న1.
క్రింది గద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన వాక్యాలలో తప్పొప్పులను గుర్తించండి. (5 మార్కులు)

“పూర్వం నుండి మనకు తులసి, రావి, వేప చెట్లను పూజించే సంప్రదాయం ఉంది. అనాది నుండి మనం తులసిని దేవతగా పూజిస్తూ వస్తున్నాం. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. పూర్వకాలంలో తట్టు, ఆటలమ్మ వంటి వ్యాధులు వచ్చినప్పుడు రోగి దగ్గర వేపాకులు ఉంచేవారు. వేపాకులను ఒంటికి రాసేవారు. స్నానం చేయించే ముందు వేపాకులు ముద్దగా నూరి, నూనె, పసుపు కలిపి ఒంటికి రాసేవారు. ఎందుకనగా తట్టు, ఆటలమ్మ వస్తే దేహంపై పొక్కులు వస్తాయి. కొన్ని పచ్చిగా దురద పెడతాయి. అలా దురద రాకుండా ఉండడానికి, గోకటం మానడానికి, ఈ వేపాకు, పసుపు దోహద పడతాయి. ఈ రకంగా వైద్యశాస్త్రానికి సంబంధించిన వేప, సంస్కృతీపరంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకొంది.

తప్పొప్పులు

1. తులసిని మనము నేడు దేవతగా పూజిస్తున్నాం.
జవాబు:
తప్పు

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

2. తులసిలో ఔషధ గుణాలున్నాయని శాస్త్రజ్ఞుల కథనం.
జవాబు:
ఒప్పు

3. వేపకు వైద్యశాస్త్రంలోనే ప్రాధాన్యత ఉంది.
జవాబు:
తప్పు

4. దురద రాకుండా, గోకకుండా పసుపు, వేపాకులు ఉపయోగపడతాయి.
జవాబు:
ఒప్పు

5. తట్టు, ఆటలమ్మ వ్యాధులకు, పూర్వం వైద్యం లేదు.
జవాబు:
తప్పు

ప్రశ్న2.
క్రింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారుచేయండి.

వీరభద్రారెడ్డికి అంకితముగా కాశీఖండము రచించిన శ్రీనాథుడు, పోతనకు సమకాలికుడు. శ్రీనాథుడు కాశీఖండము అనే పురాణాన్ని తెనిగించినను దానిని స్వతంత్రించి ప్రబంధముల వలె రచించినాడు. భీమఖండము గోదావరి తీర దేశ దివ్య వైభవ వర్ణనా గ్రంథమని చెప్పవచ్చును. కాశీఖండము ప్రౌఢాంధ్ర కవితా పరిజ్ఞానమునకు చదువదగిన గ్రంథము. ఈయన హరవిలాసం వ్రాసి అవచి తిప్పయ్య శెట్టికి అంకితమిచ్చాడు. కవి సార్వభౌముడిగా ప్రసిద్ధి చెందిన శ్రీనాథుడు 15వ శతాబ్దివాడు. ఈయనకు ప్రౌఢ కవితా పాకంపై ప్రీతి ఎక్కువ.
జవాబులు:

  1. శ్రీనాథుని గ్రంథములెవ్వి ?
  2. శ్రీనాథుని బిరుదమేమి ?
  3. శ్రీనాథుడు హరవిలాసమును ఎవరికి అంకితమిచ్చెను?
  4. శ్రీనాథునికి దేనిపై మక్కువ ఎక్కువ ?
  5. వీరభద్రారెడ్డికి అంకితమిచ్చిన గ్రంథమేది ?

ప్రశ్న3.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

స్త్రీ జనోద్ధరణము కూడా సంఘసేవయే. పురుషులు మాత్రమే చదివి లోకమున విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకొనుట చాలదు. స్త్రీలు సహితము పురుషులతో పాటుగా చదువుకొన్నప్పుడే సంఘము బాగుపడును. సంఘమనే బండికి పురుషులిద్దరు రెండు చక్రములు వంటివారు. అందులో ఏ చక్రము అవిటిగా నున్నను ఆ బండి నడువజాలదు. కావున రెండు చక్రములను సరిగా నడుచునట్లు చూచుకొన్నప్పుడే బండి చక్కగా సాగిపోవును.

ప్రశ్నలు – జవాబులు

1. సంఘ సేవ యనదగినదేది ?
జవాబు:
స్త్రీల జనోద్ధరణము సంఘసేవ అనదగినది.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

2. సంఘము ఎప్పుడు బాగుపడును ?
జవాబు:
స్త్రీలు కూడా పురుషులతో పాటుగా చదువుకొన్నప్పుడే సంఘం బాగుపడును.

3. సంఘమనే బండికి చక్రములవంటి వారెవరు ?
జవాబు:
సంఘమనే బండికి స్త్రీ పురుషులిద్దరూ రెండు చక్రముల వంటివారు.

4. బండి ఎప్పుడు చక్కగా సాగును ?
జవాబు:
రెండు చక్రములు సరిగా నడుచుచున్నట్లు చూచుకొన్నప్పుడే బండి చక్కగా సాగును.

5. ఎవరు విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకొనుట చాలదు ?
జవాబు:
పురుషులు మాత్రమే చదివి లోకమున విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకొనుట చాలును.

ప్రశ్న4.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

పొదుపు మానవ జీవితానికి అత్యవసరము. పొదుపు లేని మానవుడు దారం తెగిన గాలిపటం వంటివాడు. పొదుపు చేయకుండ అడ్డుపడే వాటిల్లో అతి ముఖ్యమైనవి కోరికలు. కోరికలు మానవుడిని మానసికంగా బలహీనుణ్ణి చేస్తాయి. పొదుపు అనేక విషయాలలో పాటించవచ్చు. ధనము, జలము, భాషణము మొదలగు వానిలో పొదుపు పాటించడం ద్వారా దేశాభివృద్ధిని సాధించగలము. పొదుపును నిర్లక్ష్యం చేస్తే అప్పులు చేయక తప్పదు. అప్పు చేయటం వలన మన వ్యక్తిత్వాన్నే కోల్పోతాము.

ప్రశ్నలు – సమాధానాలు

1. పొదుపు లేని మానవుడు ఎట్టివాడు ?
జవాబు:
పొదుపు లేని మానవుడు దారం తెగిన గాలిపటం వంటివాడు.

2. కోరికలు మానవుని ఏమి చేస్తాయి ?
జవాబు:
కోరికలు మానవుడిని మానసికంగా బలహీనుణ్ణి చేస్తాయి.

3. పొదుపు పాటించవలసిన ముఖ్య విషయాలేవి ?
జవాబు:
పొదుపు పాటించవలసిన ముఖ్య విషయాలు ధనం, జలం, భాషణం.

4. పొదుపును నిర్లక్ష్యం చేస్తే ఏమి జరుగుతుంది ?
జవాబు:
పొదుపును నిర్లక్ష్యం చేస్తే, అప్పులు చేయడం జరుగుతుంది.

5. అప్పు చేయటం వలన మనమేమి కోల్పోతాము ?
జవాబు:
అప్పు చేయడం వలన మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోతాము.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

సృజనాత్మక ప్రశ్నలు (5 మార్కులు)

ప్రశ్న 1.
ఉత్తమ సమాజం గురించి వివరించే కవిత రాయండి.
జవాబు:
ఆదర్శ సమాజం

కులాల కుళ్ళు లేదు.
మతాల మతలబులు లేవు.
ధనిక పేద తేడాలసలే లేవు.
మేడా మిద్దె గూడూ గుడిసె ఒక్కటే.
రాజకీయపు రంగురంగుల వలలు లేవు.
అరాచకపు ఆనవాళ్ళు అసలే లేవు.
ఆనందం, స్నేహం, సౌఖ్యం ఉన్నాయి.
అందరం ఒకే కుటుంబం అందరం బంధువులమే.
ఇదే మా ఆదర్శ సమాజం.

అదనపు వ్యాకరణాంశాలు

PAPER – 1: PART – B

1. సొంతవాక్యాలు

1. ఉన్నత శిఖరాలు : ప్రతి వ్యక్తి తన జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి అని ఆశించాలి.

2. సామాజిక పరిణామం : సంస్కర్తలు, తన శక్తి కొద్దీ మంచి సామాజిక పరిణామం తీసుకు రావడం కోసం కృషి చేయాలి.

3. నడుం బిగించు : హనుమంతుడు, కార్యసాధన కై నడుం బిగించాడు.

4. భారతీయ సంస్కృతి : వివేకానంద స్వామి దేశ విదేశాల్లో మన భారతీయ సంస్కృతి యొక్క గొప్ప తనాన్ని ప్రచారం చేశారు.

5. హృదయ విదారకం : వరద బాధితుల కష్టాలు వినడానికే హృదయ విదారకంగా ఉన్నాయి.

6. ఆదానప్రదానాలు
(ఇచ్చి పుచ్చుకోవడాలు) : అనుకున్న పని నెరవేరాలంటే, ఆదాన ప్రదానాలు రెండూ ఉండాలి.

7. అపూర్వంగా : షాజహాన్ తాజమహల్ను అపూర్వంగా నిర్మించాడు.

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

2. పర్యాయపదాలు

స్నేహము = ప్రేమ, ప్రియము, సాంగత్యము, మైత్రి, నెయ్యం
కథ = కత, కథానిక, ఆఖ్యాయిక, గాథ
సైన్యము = సేన, ధ్వజని, వాహిని, బలం, దండు, దళం
కవిత్వము = కవనము, కవిత, కయిత
ముస్లిమ్ = మహమ్మదీయుడు, తురుష్కుడు, పఠాణీ, యవనుడు
వంశము = కులము, అన్వయము, గోత్రము, జాతి, తెగ, సంతతి
పెళ్ళి = పరిణయము, వివాహము, ఉద్వా హము, కరగ్రహణము, కల్యాణము, మనువు

3. వ్యుత్పత్త్యర్థాలు

అంధకారము = లోకులను అంధులుగా చేయునట్టిది (చీకటి)
వార్తాపత్రిక = వార్తలను ప్రకటన చేయు కాగితం (వార్తాపత్రిక)

కేశవులు =
1) మంచి వెంట్రుకలు కలవాడు
2) కేశి అను రాక్షసుని చంపినవాడు

కథ = కొంచెము సత్యమును, కొంత కల్పన గల చరిత్ర – కత
అదృష్టము = చూడబడనిది – భాగ్యము
ఆయుధము = యుద్ధము చేయుటకు తగిన సాధనము – శస్త్రము
యుగాంతము = యుగముల అంతము మహా ప్రళయము
తెలుగు = త్రిలింగముల మధ్య ఉపయోగించబడు భాష – తెనుగు
వాతావరణము = గాలితో కూడి ఉండునది పర్యావరణము
హృదయము = హరింపబడునది గుండెకాయ

4. నానార్థాలు

భాష = బాస, మాట, వ్రతము, ప్రతిన
కథ = కత, పూర్వకథ, చెప్పుట, గౌరి
సుధ = అమృతము, సున్నము, ఇటుక
సొంపు = ఒప్పు, సంతోషం, సమృద్ధి
స్నేహము = చెలిమి, చమురు, ప్రేమ
రాజు = ప్రభువు, పాలకుడు, క్షత్రియుడు, యక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు
పత్రిక = కాగితము, పత్రము, జాబు, వార్తాపత్రిక
అచ్చు = ముద్ర, విధము, ప్రతిబింబము, నాణెము, పోతపోసిన అక్షరములు
పసిడి = బంగారము, ధనము
జీవితము = ప్రాణము, జీతము, జీవితకాలము, జీవనము
అపూర్వము = అపురూపము, తెలియనిది, క్రొత్తది, కారణములేనిది, పరబ్రహ్మము
వంశము = కులము, వెదురు, పిల్లనగ్రోవి, వెన్నెముక, సమూహము
యుగము = కాల పరిమాణ విశేషము, జత, కాళి, వయస్సు, రెండు బార
అదృష్టము = భాగ్యము, కర్మఫలము, చూడబడనిది, అనుభవింపబడనిది
చర్చ = విచారము, చింత, అధ్యయనము చేయుట, పార్వతి
సన్నివేశము = ఇంటివెనుక పెరడు, కలయిక, సమీపము, తావు
సంబంధము = చుట్టరికము, కూడిక
అక్క = పెద్దదైన తోబుట్టువు, పూజ్యస్త్రీ, వంటలక్క, తల్లి
భరణము = భరించుట, కూలి, జీతము

5. ప్రకృతి – వికృతులు

ప్రకృతి – వికృతి

స్నేహము -నెయ్యము
స్వామి – సామి
కవి – కయి
ఆర్య – అయ్య
రాజు – తేడు
పీఠము – పీట
కథ – కత
వృద్ధి – వడ్డీ
అత్యంత – అందంద
అంబ – అమ్మ
స్వీకారం – సేకరము
కథ – కత
జీవితము – జీతము
చిత్రము – చిత్తరువు
త్రిలింగము – తెలుగు
ప్రజ – పజ
అపూర్వము – అపురూపము
విధము – వితము
ఆశ్చర్యము – అచ్చెరువు
నిద్ర – నిదుర
హృదయము – ఎద
రాత్రి – రేయి
వంశము – వంగడము

PAPER – II : PART – B

1. సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి

సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును.

ఉదా :
రంగాచార్య – రంగ + ఆచార్య
విద్యాలయం – విద్య + ఆలయం
హిమాలయాలు – హిమ + ఆలయాలు
కోస్తాంధ్ర – కోస్త + ఆంధ్ర
వంశాకురం – వంశ + అంకురం
యుగాంతం – యుగ + అంతం
ఉత్తరాంధ్ర – ఉత్తర + ఆంధ్ర
సార్ధకత – స + అర్ధకత
అపార్ధాలు – అప + అర్ధాలు
కులాతీతము – కుల + అతీతము
మతాతీతము – మత + అతీతము
చారిత్రాత్మకం – చారిత్ర + ఆత్మకం

2. గుణ సంధి

సూత్రం: అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునప్పుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.

ఉదా :
జాతీయోద్యమం – జాతీయ + ఉద్యమం
మహోన్నతము – మహ + ఉన్నతము

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

2. సమాసాలు

సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు

తెలుగు సాహిత్యము – తెలుగు అను పేరుగల సాహిత్యం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

ఉస్మానియా యూనివర్శిటీ – ఉస్మానియా అను పేరుగల యూనివర్శిటీ – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

హైదరాబాద్ రాజ్యం – హైదరాబాద్ అను పేరుగల రాజ్యం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

సమాజ పరిశీలన – సమాజం యొక్క పరిశీలన – షష్ఠీ తత్పురుష సమాసము

తెలంగాణ పలుకుబడులు – తెలంగాణ యొక్క పలుకుబడులు – షష్ఠీ తత్పురుష సమాసము

హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర – హైదరాబాద్ రాష్ట్రం యొక్క చరిత్ర – షష్ఠీ తత్పురుష సమాసము

రైతాంగ పోరాటం – రైతాంగము యొక్క పోరాటం – షష్ఠీ తత్పురుష సమాసము

వంశాకురం – వంశమునకు అంకురం – షష్ఠీ తత్పురుష సమాసము

స్వేచ్ఛావాయువులు – స్వేచ్ఛ అనెడి వాయువులు – రూపక సమాసము

అదృష్టం – దృష్ఠం కానిది – నఞ తత్పురుష సమాసము

రాజకీయ పరిణామాలు – రాజకీయములందలి పరిణామాలు – సప్తమీ తత్పురుష సమాసము

శిల్ప నైపుణ్యము – శిల్పము నందు నైపుణ్యము – సప్తమీ తత్పురుష సమాసము

ప్రపంచ ప్రఖ్యాతి – ప్రపంచము నందు ప్రఖ్యాతి – సప్తమీ తత్పురుష సమాసము

3. వాక్య పరిజ్ఞానం

ఈ క్రింది వాక్యాలు ఏ రకానికి చెందినవో వ్రాయండి.

ప్రశ్న 1.
ఈనాటికీ విదేశీయులెవరైనా మన మహానగరాలకు వచ్చినట్లయితే వాళ్ళకు పావురాలు బృందాలు కనిపిస్తాయి.
జవాబు:
చేదర్థక వాక్యం

ప్రశ్న 2.
తెల్ల జెండాలు ఊపుతూ సంకేతాలు అందించే కుర్రాళ్ళు కనబడతారు.
జవాబు:
శత్రర్థక వాక్యం

ప్రశ్న 3.
రంగు రంగుల పావురాలతోనూ, నీలికళ్ళతో కువకువలాడే గువ్వలతోనూ నిండి ఉండడం కద్దు.
జవాబు:
సంయుక్త వాక్యం

ప్రశ్న 4.
అలా కలగలిసి, ఎగసి గంటల తరబడి ఎగిరాక తిరిగి అన్నీ విడివిడిగా తమ తమ యజమానుల ఇళ్ళకు చేరుకుంటాయి.
జవాబు:
సంక్లిష్ట వాక్యం

TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక

4. కర్తరి – కర్మణి వాక్యాలు

1. కర్తరి : అవి ఒక బృహత్తర సమూహంగా రూపొందుతాయి.
కర్మణి : ఒక బృహత్తర సమూహం వాటిచేత రూపొందించ బడుతుంది.

2. కర్తరి : మా పావురాన్ని హరివిల్లు మెడగాడు అని ముద్దుగా పిలుస్తూ ఉంటాను.
కర్మణి : మా పావురం హరివిల్లు మెడగాడని నా చేత ముద్దుగా పిలువబడుతూ ఉంటుంది.

3. కర్తరి : చిత్రగ్రీవం కథను నేను మొట్టమొదట్నుంచీ మొదలెడతాను.
కర్మణి : నా చేత చిత్రగ్రీవం కథ మొట్టమొదట్నుంచీ మొదలెట్టబడుతుంది.

4. కర్తరి : ఆ రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను.
కర్మణి : ఆ రోజు నా చేత ఎప్పటికీ మరచిపోబడదు.

5. కర్తరి : తల్లిపిట్టను మృదువుగా లేపి తీసి ఓ పక్కన ఉంచాను.
కర్మణి : తల్లిపిట్ట నా చేత మృదువుగా లేపబడి తీయబడి ఓ పక్కన ఉంచబడింది.

6. కర్తరి : వాటిని తగు మోతాదులోనే ఉంచాలి.
కర్మణి : అవి తగు మోతాదులోనే ఉంచబడాలి.

7. కర్తరి : ఆ ఆహారాన్ని పిల్లలకు అందిస్తాయి.
కర్మణి : ఆ ఆహారం పిల్లలకు అందించబడుతుంది.

8. కర్తరి : ఆ రోజుల్లోనే నేనో విషయం కనిపెట్టాను.
కర్మణి : ఓ విషయం ఆ రోజులలో నా చేత కనిపెట్ట

9. కర్తరి : ఆ రోజుల్లోనే దాని ఈకల రంగు మారడం గమనించాను.
కర్మణి : దాని ఈకల రంగు మారడం ఆ రోజులలోనే నా చేత గమనించబడింది.

10. కర్తరి : తండ్రిపక్షి జరగటం కొనసాగించింది.
కర్మణి : తండ్రిపక్షిచేత కూడా జరగటం కొనసాగించబడింది.