TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

Telangana SCERT 9th Class Telugu Guide Telangana 2nd Lesson నేనెరిగిన బూర్గుల Textbook Questions and Answers.

TS 9th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నేనెరిగిన బూర్గుల

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 14)

సహనమ్ము, సత్యమ్ము, శాంతగంభీరమ్ము,
ఆత్మవిశ్వాసమ్ము, నహరహమ్ము
సాధన, దక్షత, సాధుభాషణమును,
సద్వివేచనమును, సద్గమనము,

దానమ్ము, ధైర్యమ్ము, త్యాగమ్ము, సునిశిత
బుద్ధి, మేల్గాంచుట, పుణ్యగుణము,
కరుణ, క్షమ, పరోపకారబుద్దియనెడి
యాలోచనారీతు లమరియుండు

‘మనుజులెప్పుడును మాన్యులు, మంగళస్వ
రూపులు, మహోన్నతులు, విరాడ్రూపశోభి
తులు, సుకీర్తికాంతవరపతులు, సుమతులు,
జగతిగతి విరచితులు, సజ్జనులువారు.

ప్రశ్న 1.
ఈ పద్యం దేన్ని గురించి చెబుతున్నది ?
జవాబు:
ఈ పద్యం మాన్యులూ, మంగళ స్వరూపులూ, మహోన్నతులూ, కీర్తిమంతులూ అయిన సజ్జనులను గురించి చెబుతున్నది.

ప్రశ్న 2.
ఈ పద్యం ద్వారా గుర్తించిన లక్షణాలేవి ?
జవాబు:
ఈ పద్యం ద్వారా గుర్తించిన లక్షణాలు ఇవి.

  1. సహనం,
  2. సత్యం,
  3. శాంతగంభీరం,
  4. ఆత్మవిశ్వాసం,
  5. రాత్రింబగళ్ళు సాధన,
  6. దక్షత,
  7. సాధుభాషణం,
  8. సద్వివేచనం,
  9. సద్గమనం,
  10. దాన ధైర్యాలు,
  11. త్యాగం,
  12. సునిశిత బుద్ధి,
  13. పుణ్యగుణం,
  14. కరుణ,
  15. క్షమ,
  16. పరోపకారబుద్ధి.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
మంచి లక్షణాలు కలిగిన వారినేమంటారు ?
జవాబు:
మంచి లక్షణాలు కలిగిన వారిని

  1. మాన్యులు,
  2. మంగళ స్వరూపులు,
  3. మహోన్నతులు,
  4. విరాడ్రూపశోభితులు,
  5. సుమతులు,
  6. సజ్జనులు అని అంటారు.

ప్రశ్న 4.
అలాంటివారి గురించి ఎందుకు తెలుసుకోవాలి ? వారితో ఎందుకు సాంగత్యం చేయాలి ?
జవాబు:
అలాంటి వారిని గూర్చి చదివితే, మంచి స్ఫూర్తి కలుగుతుంది. అలాంటి మహాత్ముల గుణాలను ఆదర్శంగా తీసుకొని తాము కూడా ఆ విధంగా సన్మార్గంలో నడవడానికి వీలుపడుతుంది. అటువంటి వారితో సాంగత్యం చేయడం వల్ల, వారి మహోన్నత వ్యక్తిత్వం గూర్చి చక్కగా తెలిసికోడానికి వీలవుతుంది.

అటువంటి వారిని గూర్చి తెలిసికొని, వారు నడచిన అడుగుజాడలలో తాము కూడా నడవడానికి వీలవుతుంది.

ఆలోచించండి – చెప్పండి’ (Textbook Page No. 17)

ప్రశ్న 1.
అంతరాత్మ బోధించడం అంటే ఏమిటి ? మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా ? ఎప్పుడు?
జవాబు:
అంతరాత్మ అంటే హృదయం. అంటే మనలో ఉన్న మనస్సు. మనం నోటితో పైకి ఏమి చెపుతున్నా, లోపల మనస్సు మరోరకంగా చెపుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి అందరికీ జరుగుతుంది.

ఒకసారి నేను మధ్యాహ్నం బడి మానివేసి సినీమాకు వెళ్ళాను. ఇంటికి వచ్చాక నాన్నగారు ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడిగారు. ఆటలు ఆడి వచ్చానని అబద్ధం చెప్పాను కాని నేను అబద్ధం చెపుతున్నాననీ, అది తప్పనీ, నా అంతరాత్మ నాకు బోధించింది.

ప్రశ్న 2.
ఇతరులకంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట, ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. ఈ వాక్యం ద్వారా మీరేమి గ్రహించారు?
జవాబు:
ప్రతి వ్యక్తి తాను ఇతరుల కంటే గొప్పవాడినని, పదిమంది చేత అనిపించుకోవాలని గట్టిగా అనుకుంటాడు. అందుకోసం లేని గొప్పలు చెప్పుకోడానికి కూడా అతడు సిద్ధపడతాడని గ్రహించాను.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
సత్యదూరమైన విషయం అంటే ఏమిటి ? దీన్ని ఏ ఏ సందర్భాలలో వాడతారు ?
జవాబు:
సత్యదూరమైన విషయం అంటే, నిజం కాని విషయం. అంటే పూర్తిగా అబద్ధము అన్నమాట. ఇతరులు లేని మాటలను ఉన్నట్లు చెపుతున్నపుడు, వారు చెప్పినది. అబద్ధం అని చెప్పడానికి ‘సత్యదూరం’ అనే మాటను వాడతారు.

ఆలోచించండి – చెప్పండి’ (Textbook Page No. 19)

ప్రశ్న 1.
ఎవరైనా గుర్తింపు పొందడానికి శరీరాకృతి కారణం కాదని తెల్సుకొన్నారు కదా! దీన్ని మీరెలా సమర్థిస్తారు?
జవాబు:
“ఒక వ్యక్తి గుర్తించబడటానికి అతని శరీరం యొక్క ఆకారం కారణం కాదు” అని రచయిత చెప్పిన మాట సత్యం.

మన భారతదేశానికి రెండవ ప్రధానమంత్రి అయిన “లాల్ బహదూర్ శాస్త్రిగారు” పొట్టివాడు. ఆయన ఎంతోకాలం కేంద్రమంత్రిగా పనిచేశారు. రైల్వేమంత్రిగా ఆయన ఉన్నప్పుడు పెద్ద రైల్వే ప్రమాదం జరిగింది. వెంటనే ఆయన రిజైన్ చేశారు.

ఆయన ‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదం ఇచ్చి, రైతులనూ, సైనికులనూ ఉత్తేజపరచాడు. ఆయన మరణించే నాటికి ఆయనకు స్వంత ఇల్లు లేదు. అంతటి నిజాయితీ గల శాస్త్రిగారు పొట్టివాడైనా, ఆయన గట్టివాడనిపించుకున్నాడు కదా!

ప్రశ్న 2.
అనన్యమైన వాదనాపటిమ అంటే ఏమిటి ? ఇది ఎవరికి అవసరం ? ఎందుకు ?
జవాబు:
‘వాదనాపటిమ’ అంటే వాదించడంలో గల సమర్థత అని అర్థం. ‘అనన్యము’ అంటే అటువంటి వాదనాశక్తి, మరొక్కరికి ఎవ్వరికీ లేదని అర్థం. ‘అనన్యమైన వాదనాపటిమ’ అంటే, తాను చెప్పినదే సరయినదని, ఎదుటి వారివద్ద గట్టిగా వాదించి చెప్పగల సామర్థ్యం.

ఇటువంటి వాదనాపటిమ ముఖ్యంగా న్యాయ వాదులకు ఉండాలి. న్యాయవాదులు చేపట్టిన కేసులను నెగ్గించుకోవాలంటే, వాదనాపటిమ వారికి ముఖ్యం.

ప్రశ్న 3.
“కొరుకుడు పడకపోవడం” అంటే ఏమిటి ? దీన్ని ఏ ఏ సందర్భాలలో వాడతారు ?
జవాబు:
వస్తువు గట్టిగా ఉండి, పళ్ళతో కొరికి తినడానికి వీలులేక పోవడాన్ని “కొరుకుడు పడకపోవడం” అంటారు. ఈ పదాన్ని రెండు సందర్భాల్లో వాడతారు.

  1. వస్తువు బాగా గట్టిగా ఉండి, పళ్ళతో కొరికి తినడానికి వీలుకానప్పుడు వాడతారు.
  2. తెలిసికోవలసిన విషయం మన బుద్ధికి అంద నప్పుడు, అది ఎంత చెప్పినా అర్థం కానప్పుడు, ఎంత పరిశీలించినా ఆ విషయం స్పష్టం కానప్పుడు, విషయం “కొరుకుడు పడడం లేదు” అని అంటారు.

ఆలోచించండి – చప్పండి (Textbook Page No. 20)

ప్రశ్న 1.
గొప్పవారు తమ జీవితానుభవాలను గ్రంథస్థం ఎందుకు చేయాలి ?
జవాబు:
గొప్పవారి జీవిత చరిత్రలో ఎన్నో ఆదర్శ సంఘటనలు ఉంటాయి. అవి ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. వాటిని అందరూ తెలిసికోవాలి.

గొప్పవారు తమ జీవితానుభవాలను వారు పుస్తక రూపంగా రాసిపెడితే, ఆ పుస్తకాలు చదివి, ఇతరులు తమ జీవితాల్ని గొప్పవారు నడిచిన మంచి దారిలో నడుపుకోవచ్చును. కనుక గొప్పవారు తమ జీవితాను భవాల్ని పుస్తకంగా రాయాలి.

ప్రశ్న 2.
మీరు వెచ్చించే సమయం దేనికి ఎక్కువగా ఉంటోంది? మీకుపయోగపడేవాటికా ? లేక ఇతరపనులకా ?
జవాబు:
నేను ఎక్కువగా నా సమయాన్ని చదువుకోసం, ఆటపాటల కోసం వినియోగిస్తాను. నేను ఇతర పనులకు నా సమయాన్ని వినియోగించను.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
రామకృష్ణారావుగారిని పి.వి. గారు ప్రాతఃస్మరణీయులు అని పేర్కొన్నారు కదా! నేటి రాజకీయ నాయకులు కూడా రామకృష్ణారావుగారిలా గొప్పపేరు సంపాదించు కోవాలంటే ఎలా ఉండాలి ? ఏమేం చేయాలి ?
జవాబు:
నేటి రాజకీయ నాయకులు కూడా రామకృష్ణారావు గారివలె పేరు సంపాదించుకోవాలంటే ఈ క్రింది విధంగా పనులు చేయాలి.

  1. ప్రజల అభీష్టానికి పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చి మతాతీతంగా విశిష్ట వ్యక్తిత్వం కలిగి ఉండాలి.
  2. ప్రజలకు కష్టసుఖాలలో తాము పాలుపంచుకోవాలి.
  3. శాసనసభ చర్చలలో చక్కగా పాల్గొని, దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి చక్కని సూచనలు ఇవ్వాలి.
  4. సాహిత్యం బాగా చదివి మంచి పాండిత్యం సంపాదించాలి. మంచి వక్తగా పేరు పొందాలి.
  5. అవినీతికి దూరంగా ఉండాలి.
  6. ప్రజలకు సన్నిహితంగా, సోదర శాసనసభ్యులతో స్నేహంగా, ప్రజల తలలో నాలుకవలె మెలగాలి.

ఇవి చేయండి

I. అవగాహన – ప్రతిస్పందన

ప్రశ్న 1.
కింది అంశం గురించి మాట్లాడండి.

ఇతరుల కంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. దీని గురించి మీ అభిప్రాయాలను తెలపండి.
జవాబు:
ఇతరుల కంటే తాను గొప్పవాడని అనిపించుకోవాలనే కోరిక, ఉత్సాహము సహజంగా అందరిలోనూ ఉంటుంది. బడిలో పిల్లలకు కూడా పక్కవాడి కంటే తాను ఎక్కువ మార్కులు తెచ్చుకొని, తాను గురువుల వద్ద మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. అలాగే ఆటలలో తానే బాగా ఆడి, పేరు తెచ్చుకోవాలని, అందరూ తన ప్రతిభను మెచ్చుకోవాలని పిల్లలు అనుకుంటారు.

కవులూ, పండితులూ, ఇతర కవి పండితుల కంటే తాము గొప్పవారమని అందరూ గుర్తించాలని వారు తమను గూర్చి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. సంఘంలో మనుషులు తాము పక్కవారి కంటే డబ్బు కలవారమని, గొప్పవారమని అనిపించుకోవాలని ఉబలాటపడుతూ ఉంటారు.

ప్రశ్న 2.
కింది విషయాలు పాఠంలో ఏయే పేరాలలో ఉన్నాయి ? వాటికి సంబంధించిన అంశాలను పట్టికలో రాయండి.
జవాబు:
TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 2

ప్రశ్న 3.
పాఠం మొత్తాన్ని చదువండి. పాఠంలో ఉన్న జాతీయాలను గుర్తించి రాయండి.
జవాబు:
పాఠంలో జాతీయాలు:

  1. శ్రీరామరక్ష
  2. గీటురాయి
  3. స్వస్తివాచకం
  4. కారాలు మిరియాలు నూరడం
  5. రూపుమాపడం
  6. ముప్పిరిగొను
  7. ఉక్కిరిబిక్కిరైపోవు
  8. వీసం ఎత్తు
  9. ఒడ్డూ పొడుగూ
  10. నిత్య నైమిత్తికం
  11. కంచుగోడలు
  12. కొరుకుడుపడని
  13. జోహారులర్పించు
  14. ప్రాతఃస్మరణీయులు
  15. మార్గదర్శకులు
  16. స్వస్తివాచకం
  17. ఆరునూరుగు
  18. చీల్చిచెండాడు
  19. అతిశయోక్తి
  20. ఒడుదుడుకులు.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 4.
కింది గద్యాన్ని చదువండి.

క్లిష్టపరిస్థితుల్లో రాజ్యాధికారం చేపట్టిన రుద్రమ నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనా, పరిపాలనా నిర్వహణలో మంచి సమర్థురాలుగా పేరొందింది. స్త్రీలు రాజ్యాధికారం చేపట్టడం అరుదైన ఆ కాలంలో రుద్రమాంబ తన తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయక వీరనారిగా చరిత్రలో నిలిచింది.

స్త్రీ అయినప్పటికి పురుషవేషం, పురుషనామం ధరించి సమకాలీన రాజులందరికంటే మిన్నగా రాజ్యాన్ని పరిపాలించి సాహసవంతమైన జీవితాన్ని గడిపింది. గ్రామాలను దానంచేసి ఆదాయంతో విద్యార్థులకు పాఠశాలలు, ఉచిత వసతిగృహాలు నెలకొల్పింది. ఆరోగ్యశాలలు, ప్రసూతి శాలలు ఏర్పాటు చేసింది.

ఒక విద్యాపీఠం స్థాపించి అందులో వేదాలను, సాహిత్యాన్ని, ఆగమవ్యాఖ్యానాలను బోధింపజేసేది. పాఠశాలల్లో ఉపాధ్యాయులను, గ్రామాల్లో కరణాలను నియమించి వారికి వస్తువాహనాలను, ధాన్యాన్ని సమకూర్చేది. మార్కోపోలో అనే విదేశీ యాత్రికుడు ఈమె పరిపాలనా దక్షత, సాహిత్యసేవ, శిల్పకళలు, మహదైశ్వర్యం గురించి ప్రశంసిస్తూ తన’ డైరీలో రాసుకున్నాడు. అదీ రుద్రమదేవి ఘనత.

కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.

అ) రుద్రమాంబపై ఆమె తండ్రి ఉంచిన నమ్మకమేమిటి ?
జవాబు:
రుద్రమాంబ స్త్రీ మూర్తి అయినా, ఆమె రాజ్యాధికారం చేపట్టి, చక్కగా పరిపాలించగలదని, రుద్రమాంబపై ఆమె తండ్రి నమ్మకం పెట్టుకున్నాడు.

ఆ) రుద్రమాంబ చేసిన సత్కార్యాలేవి ?
జవాబు:
రుద్రమాంబ గ్రామాలను దానంచేసి, ఆ ఆదాయంతో విద్యార్థులకు పాఠశాలలు, వసతిగృహాలు నెలకొల్పింది. ఆరోగ్యశాలలు, ప్రసూతిశాలలు ఏర్పాటు చేసింది. విద్యాపీఠం నెలకొల్పి, వేదాలను, సాహిత్యాన్ని, ఆగమాలను బోధింపజేసింది. కరణాలనూ, ఉపాధ్యాయులనూ నియమించింది.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ఇ) మార్కోపోలో ఏయే అంశాల్లో రుద్రమదేవిని పొగిడాడు ?
జవాబు:
మార్కోపోలో రుద్రమదేవి యొక్క

  1. పరిపాలనా దక్షత
  2. సాహిత్యసేవ
  3. శిల్పకళలు
  4. మహదైశ్వర్యం అనే విషయాలను గురించి పొగిడాడు.

ఈ) రుద్రమదేవి సమర్థత ఏమిటి ?
జవాబు:
రుద్రమదేవి క్లిష్టపరిస్థితిలో రాజ్యాధికారం చేపట్టి, నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనా, పరిపాలనా నిర్వహణలో మంచి సమర్థత కలిగి ఉండేది.

ఉ) ఈ గద్యం ద్వారా రుద్రమదేవి వ్యక్తిత్వాన్ని ఒక వాక్యంలో రాయండి.
జవాబు:
రుద్రమదేవి పాలనాదక్షత

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

ప్రశ్న 1.
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) బూర్గుల – పి.వి. గార్ల సంబంధం గురుశిష్య సంబంధం లాంటిది. దీన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
పి.వి. నరసింహారావుగారు, బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గర, అందరికంటే జూనియర్ న్యాయవాదిగా శిక్షణ పొందేవారు. తల్లి, చిన్న పిల్లవానిపై మమకారం ఎక్కువగా చూపించే విధంగానే, బూర్గుల వారు, పి.వి. గారిపై విశేష మమకారం చూపించేవారు. పి.వి. గారు చొరవగా బూర్గుల వారి ఆఫీసుకు వెళ్ళి, జూనియర్లకు లొంగని చిక్కుకేసులను చదివేవారు. అది చూసిన బూర్గులవారి సీనియర్ గుమస్తా, పి.వి. గారిపై కోపపడేవాడు.

అది చూసిన బూర్గులవారు, పి.వి. గార్కి కేసులు చదవడానికి అనుమతి ఇచ్చారు. అంతేగాక, పి.వి. గారితో కేసుల గురించి స్వయంగా తాను చర్చించేవారు. దానితో పి.వి. గారు తన శక్తిసామర్థ్యాలను గుర్తించి, ఆత్మవిశ్వాసాన్ని పొందారు.

ఈ విధంగా పి.వి. గారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన, బూర్గుల వారు, గురువులుగానూ, పి.వి. గారు శిష్యులుగానూ పేరు పడ్డారు. వారిద్దరి మధ్య గల సంబంధం గురుశిష్య సంబంధం వంటిది.

ఆ) ‘సరే – అవన్నీ ఆటల్లో ఉండేవేగా’ అని బూర్గులవారు అనేవారు కదా! ఏ సందర్భంలో ఎందుకనేవారో దానికిగల కారణాలను రాయండి.
జవాబు:
బూర్గుల రామకృష్ణారావుగారి సామాజిక యాత్ర, ఎప్పుడూ సాఫీగా సాగలేదు. ఆయన అనేక రకాల ఒడుదుడుకులను ఎదుర్కోవలసి వచ్చింది. అనేక సందర్భాల్లో ఆపదలు ఆయనను చుట్టుముట్టాయి. అయినా ఆయన చలించేవారు కాడు. మనః స్థైర్యాన్నీ, సమచిత్తతనూ విడిచిపెట్టేవారు కాడు.

ఆయన విజయానికి పొంగిపోలేదు. కష్టం వస్తే క్రుంగిపోలేదు. ఎవరైనా స్నేహితులు ఆయనకు ద్రోహం తలపెట్టినా, ఆయనకు వ్యతిరేకులు ఆయనను దూషించినా “సరే, అవన్నీ ఆటలో ఉండేవేగా” అని సరిపెట్టుకునేవారు.

ఇ) బూర్గుల వారిని ప్రాతఃస్మరణీయులని పి.వి. నరసింహారావుగారు పేర్కొనడాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
‘బూర్గుల రామకృష్ణారావుగారు ప్రాతఃస్మరణీయులు’ అని పి.వి. నరసింహారావుగారు రాశారు. ప్రాతఃస్మరణీయులంటే నిద్ర నుండి లేవగానే స్మరించుకోవలసిన దైవస్వరూపుడు అని అర్థము.

పి.వి. గారు బూర్గులవారి వద్ద జూనియర్ న్యాయవాదిగా ఉండేవారు. పి.వి. గారు, బూర్గులవారి ఆఫీసులోకి వెళ్ళి, జూనియర్లకు లొంగని చిక్కు కేసుల ఫైళ్ళను తీసి, చదువుతూ ఉండేవారు. పి.వి. చూపించే చొరవ, అక్కడ ఉన్న బూర్గుల వారి సీనియర్ గుమాస్తాకు కోపం తెప్పించింది.

ఒకసారి బూర్గులవారు దానిని గమనించి, పి.వి. గారు తన ఫైళ్ళు చూడడానికి అంగీకరించారు. అంతేగాక పి.వి. గారితో కేసుల గురించి స్వయంగా చర్చించేవారు. పి.వి. గారిలో శక్తి సామర్థ్యాలున్నాయని ఈ విధంగా పి.వి. గారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించారు. ఆ ఆత్మవిశ్వాసం, పి.వి. గారికి శ్రీరామరక్ష అయ్యింది. అందుకే పి.వి. గారు, బూర్గుల వారిని ప్రాతఃస్మరణీయులు అని రాశారు.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 2.
కింది ప్రశ్నలకు పడేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) బూర్గుల వ్యక్తిత్వంలోని మహోన్నత లక్షణాల గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు:
బూర్గుల వ్యక్తిత్వం – మహోన్నత లక్షణాలు: బూర్గులవారు ఎప్పుడూ అన్ని విషయాలూ, ఆఖరుకు తమలోని లోపాలను సహితం ఉన్నవి ఉన్నట్లు చెప్పేవారు. ఆయన పొట్టిగా ఉండేవారు. కాని ఆయనలో బహుముఖమైన ప్రతిభ ఉండేది. అవసరం అయినప్పుడు దానిని మహోన్నతరూపంలో వారు కనబరచేవారు. అవసరం లేనప్పుడు అది ఆయనలో ఇమిడి పోయేది.

న్యాయవాదిగా, బూర్గులవారు విశేషప్రతిభతో, ఎదుటి న్యాయవాదుల వాదనలకు ఎదురొడ్డి నిలిచేవారు. ఆయనలో సునిశిత మేధాసంపత్తి ఉండేది. బూర్గులవారు తమ జూనియర్ న్యాయవాదులను బాగా ప్రోత్సహించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవారు. బూర్గులవారు ప్రాతఃస్మరణీయులు.

బూర్గులవారు కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులు అయ్యారు. బూర్గులవారు, రాజనీతి విశారదులు. బూర్గులవారు ఏ నిర్ణయం తీసుకున్నా, అన్ని విధాలైన జాగ్రత్తలతోనూ, మంచి వ్యవహార దక్షతతోనూ తీసుకొనేవారు. బూర్గులవారు మతాతీత స్థితిని పాటించేవారు. వీరిది విశిష్టమైన వ్యక్తిత్వం. బూర్గులవారు మంచి పార్లమెంటేరియన్. ఈయన బహుభాషావేత్త. ఈయన మంచి ఉపకారశీలి. ఈయన సంతోషానికి పొంగలేదు. కష్టాలకు క్రుంగలేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే, బూర్గులవారు “పూర్ణపురుషులు”, బహుముఖ ప్రజ్ఞగలవారు. ప్రధానంగా వీరు సాహితీ జగత్తుకు చెందినవారు.

(లేదా)

ఆ) ఈ పాఠం ఆధారంగా “గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్పూర్తి గొప్పగా ఉంటుంది” అనే అంశం గురించి, సమర్థిస్తూ రాయండి.
జవాబు:
‘గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి కూడా గొప్పగానే ఉంటుంది’ అన్నమాట నిజం.
బూర్గుల రామకృష్ణారావుగారు మహోన్నత వ్యక్తి. వారిది విశిష్ట వ్యక్తిత్వం. విశాల వ్యక్తిత్వం. ఈయన పూర్ణపురుషుడు. బూర్గులవారి సాంగత్యం, శ్రీ పి.వి. నరసింహారావుగారికి మంచి స్ఫూర్తి నిచ్చింది. బూర్గులవారి వద్ద శ్రీ పి.వి. గారు జూనియర్ లాయర్గా పనిచేసేవారు.

బూర్గులవారు లాయర్ కేసు తీసుకొనేటప్పుడే, ఆ కేసు తాలూకు ఫైలుపై రేఖామాత్రంగా, నోటు వ్రాసి పెట్టుకొనేవారు, ఆ నోటు ఆధారంగానే వారు కోర్టులో ఎదుటి న్యాయవాదుల వాదనలను గట్టిగా అడ్డుకొనేవారు. బూర్గులవారి మేధాసంపత్తినీ, ఆ వాదనాపటిమనూ దగ్గరగా చూసిన పి.వి. గారికి మంచి స్ఫూర్తి కలిగింది.

పి.వి. గారు బూర్గులవారి వద్ద అందరికంటే జూనియర్ లాయరుగా ఉండేవారు. బూర్గులవారు, పి.వి. గారిని ఆదరంగా చూసేవారు. దానితో పి.వి. గారు చొరవగా బూర్గులవారి ఆఫీసులోకి వెళ్ళి, తనకు కావలసిన కేసులను, ముఖ్యంగా జూనియర్లకు కష్టమైన చిక్కు కేసుల ఫైళ్ళను ఏరుకొని చదివేవారు. పి.వి. గారి ఆ చొరవకు అక్కడి సీనియర్ గుమాస్తా కోపపడేవాడు.

కాని బూర్గులవారు పి.వి. గారు తన ఫైళ్ళు చూడ్డానికి అంగీకరించారు. అంతేకాక కేసుల గురించి పి.వి. గారితో బూర్గులవారు సమాన స్థాయిలో చర్చించేవారు. దానితో పి.వి. గారు తనలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, ఆత్మవిశ్వాసాన్ని పొందారు.

పి.వి. గారికి ఆ ఆత్మవిశ్వాసం, శాసనసభల్లోనూ, ఇతర స్థలాల్లోనూ శ్రీరామరక్షగా పనిచేసింది. ఈ విధంగా గొప్పవారైన బూర్గులవారి సాంగత్యం, పి.వి. గారికి మంచి స్ఫూర్తి నిచ్చింది.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ప్రశ్న 3.
సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) పాఠంలోని పదజాలం, విశిష్ట లక్షణాల ఆధారంగా ఒక కవిత రాయండి.
జవాబు:
“పూర్ణపురుషుడు బూర్గుల రామకృష్ణారావు”
“రామకృష్ణారావు మహాశయా! ఓ పూర్ణపురుషా!
నీవు నా పాలిటి ప్రాతఃస్మరణీయుడవు.
నీ పేరు వింటే, గత స్మృతులతో ఉక్కిరిబిక్కిరౌతాను.
నీ చదువూ, మంత్రి పదవులూ, గవర్నరు గిరీలూ
కమిటీ అధ్యక్షతలూ – నీ వ్యక్తిత్వ ప్రతిబింబాలు కానేకావు.

నీ గురించి నీవు వీసం ఎత్తు ఎక్కువ తక్కువలు చెప్పవు.
నీవు నిజంగా వామనుడైన విరాట్ స్వరూపుడివి,
నీ వ్యక్తిత్వపు మహోన్నత శిఖరం, అనన్య దర్శనీయం
న్యాయవాదిగా నీ ప్రజ్ఞాప్రాభవాలు, శక్తి సామర్థ్యాలూ

సునిశిత మేధా సంపత్తీ – జాజ్వల్యమాన ప్రతిభా
అనన్య వాదనాపటిమా – అద్భుతం, మహాద్భుతం.
నీవు నాలో నింపిన ఆత్మవిశ్వాసం, నా కదే శ్రీరామరక్ష.
నీ విశిష్ట వ్యక్తిత్వానికి ఇవే నా జోహార్లు

నీవు సామ్యవాదవ్యవస్థకు మార్గదర్శకుడవు.
రాజకీయాలలో నీ సమ్యక్ దృష్టి, ప్రశంసనీయం
మత దురభిమాని నిజాం, నీకు బద్ధ శత్రువు, కానీ
కుచ్చుటోపీల మౌల్వీలూ, గడ్డాల ముల్లాలూ నీ వాళ్ళే

మతాతీత స్థితి, నీ విశాల వ్యక్తిత్వం
నీవు బహు భాషావేత్తవు, ఉపకారశీలివి, ఉదారుడవు.
కించిత్తూ చలించవు కష్టసుఖాల రాకలకు
నీ గురించి చెప్పాలంటే అది నా వల్ల ఔతుందా ?
కానేకాదు. నీవు నిజంగా “పూర్ణపురుషుడవు”.

(లేదా)

ఆ) ఈ పాఠం ఓ అభినందన పత్రంగా ఉంది కదూ! దీన్ని ఆధారంగా మీకు నచ్చిన గొప్ప వ్యక్తిని గురించి అభినందన వ్యాసం రాయండి.
జవాబు:
సరస్వతీ మూర్తీ!

మాకు నచ్చిన గొప్ప వ్యక్తి “ఉత్తమోపాధ్యాయుడు” దువ్వూరి సోమయాజులు గార్కి విద్యార్థులు సమర్పించిన సన్మానపత్రం.

ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయునిగా మిమ్ము నిర్ణయించి గౌరవించిన సందర్భంగా మీ శిష్యులమైన మేము మీకూ, ప్రభుత్వానికీ, శతకోటి వందనాలు అర్పిస్తున్నాం. మీరు బహుభాషావేత్తలు. సంస్కృతాంధ్రభాషల్లో మీకు గల శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞాప్రాభవాలు ప్రశంసనీయాలు. మీ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, మాకు ఉపాధ్యాయుడిగా ఉండడం మాకు గర్వకారణం.

సౌజన్యమూర్తీ!
మీరు మా విద్యార్థులను మీ కన్నబిడ్డవలె ప్రేమగా చూస్తారు. మీరు మతాతీత స్థితిని పాటిస్తారు. మీకు కులమతాల పట్టింపులు లేవు. ధనిక బీద తారతమ్యం లేదు. మీ విశాల వ్యక్తిత్వం, విశిష్ట వ్యక్తిత్వం, సౌజన్యం మరెక్కడా కనబడదు. అందుకే మీరు ఉత్తమోపాధ్యాయులు అయ్యారని మా విశ్వాసం.

మార్గదర్శీ!
మీరు మాలో గల శక్తి సామర్థ్యాలను వెలికితీసి, మెరుగుపెట్టి, మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అందుకే మాకు ఎన్నో మంచి మార్కులు, బహుమతులు వస్తున్నాయి. మీ సునిశిత మేధాసంపత్తి, జాజ్వల్యమాన ప్రతిభ ఆధారంగా మమ్మల్ని ఉత్తమ విద్యార్థులుగా మీరు తీర్చిదిద్దుతున్నారు. మీరు మా కందించే ప్రోత్సాహమే, మాకు శ్రీరామరక్ష. మీరు మాకు ప్రాతఃస్మరణీయులు.

మీకు పరమేశ్వరుడు ఆయురారోగ్య భాగ్యాలను ఇచ్చి, మా వంటి ఎందరో విద్యార్థినీ, విద్యార్థులను సాహితీ సంపన్నులుగా తయారుచేసేందుకు మీకు తోడ్పడాలని, మేము దైవాన్ని కోరుతున్నాం.

ఇట్లు,
పదజాలం

X X X X X X
హైదరాబాద్.

III. భాషాంశాలు

పదజాలం

1. కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.

అ) చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు ముప్పిరిగొంటున్నాయి.
జవాబు:
ముప్పిరి = చుట్టుముట్టాయి (అతిశయించాయి.)

ఆ) వీసం ఎత్తు అహంకారం లేకుండా ముందుకెళ్ళాలి.
జవాబు:
వీసం ఎత్తు : 1/16 వ వంతు

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ఇ) దశరథుని కడగొట్టు బిడ్డడు శత్రుఘ్నుడు.
జవాబు:
కడగొట్టు = కట్టకడపటి ; చివరి

ఈ) భారతదేశ ప్రాభవాన్ని మనమంతా పెంచాలి.
జవాబు:
ప్రాభవాన్ని = శ్రేష్ఠత్వాన్ని

ఉ) మనదేశ ప్రజలకు వివేకానందుడు ప్రాతః స్మరణీయుడు.
జవాబు:
ప్రాతఃస్మరణీయుడు = నిద్ర నుండి లేవగానే స్మరించుకోవలసిన దైవస్వరూపులు.

ఊ) హితైషి చెప్పిన మాటలను పెడచెవిన పెట్టవద్దు.
జవాబు:
హితైషి = మేలును కోరేవాడు.

2) కింది జాతీయాలను మీ సొంతవాక్యాలలో ప్రయోగించండి.

అ) శ్రీరామరక్ష = పరిరక్షించగలిగినది, సర్వరక్షకం
జవాబు:
వాక్యప్రయోగం : నెహ్రూజీ మొదటి ప్రధానమంత్రి కావడం, మన భారతదేశానికి శ్రీరామరక్ష అయ్యింది.

ఆ) గీటురాయి = కొలబద్ద, ప్రమాణం
జవాబు:
వాక్యప్రయోగం : మంత్రిగారు మెచ్చుకోడం, నా తమ్ముని ప్రతిభకు గీటురాయి అని చెప్పాలి.

ఇ) రూపుమాపడం = శాశ్వతంగా తొలగించడం
జవాబు:
వాక్యప్రయోగం : వీరేశలింగంగారు నాటి సంఘంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషిచేశారు.

ఈ) కారాలు మిరియాలు నూరడం = మండిపడడం, మిక్కిలి కోపగించడం
జవాబు:
వాక్యప్రయోగం : నా తమ్ముడు తప్పుచేస్తే, మా నాన్నగారు కారాలు మిరియాలు నూరుతారు.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ఉ) స్వస్తివాచకం = ముగింపు, వదలివేయు
జవాబు:
వాక్యప్రయోగం : విద్యార్థులు చదువుకోసం పూర్తిగా ఆటలకు స్వస్తివాచకం చెప్పకూడదు.

3. కింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించండి.

అ) రైతులు ప్రతివర్షం పంటలను పండిస్తూ సాలుకొకసారి వచ్చిన ధనంతో సంవత్సరమంతా నడుపుతారు.
జవాబు:
పర్యాయపదాలు :

  1. వర్షం
  2. సాలు
  3. సంవత్సరం

ఆ) భూమిపై కాలుష్యం పెరుగుట వల్ల, ధరిత్రి మీద ఉండే జనం విలవిలలాడుతూ అవనిపై మేము జీవించలేమని అంటున్నారు.
జవాబు:
పర్యాయపదాలు :

  1. భూమి
  2. ధరిత్రి
  3. అవని.

ఇ) ఒక వ్యక్తి దక్షతతో పనిచేస్తే, ఆ సామర్థ్యం అందరికీ తెలుస్తుంది.
జవాబు:
పర్యాయపదాలు :

  1. దక్షత
  2. సామర్థ్యం

4. కింది ‘వికృతి’ పదాలకు పాఠంలో ఉన్న ‘ప్రకృతి’ పదాలను వెతికి రాయండి.

అ) దవ్వు
జవాబు:
దవ్వు (వికృతి)

  1. దూరము
  2. దవీయము (ప్రకృతి)

ఆ) గారవం
జవాబు:
గారవం (వికృతి) – గౌరవం (ప్రకృతి)

ఇ) పగ్గె / పగ్గియ
జవాబు:
పల్లె / పగ్గియ (వికృతి) – ప్రజ్ఞ (ప్రకృతి)

ఈ) దోసం
జవాబు:
దోసం (వికృతి) – దోషం (ప్రకృతి)

ఉ) రాతిరి
జవాబు:
రాతిరి (వికృతి) – రాత్రి (ప్రకృతి)

ఊ) బాస
జవాబు:
బాస (వికృతి) – భాష (ప్రకృతి)

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

5. ప్రతి వృత్తికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయని పాఠం ద్వారా తెలుసుకున్నారు కదా! మీకు తెలిసిన కొన్ని వృత్తులు, వాటికున్న ప్రత్యేక లక్షణాలకు సంబంధించిన పదాలను పట్టిక రూపంలో రాయండి.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 3
జవాబు:
TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 4

వ్యాకరణాంశాలు

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలను విడదీసి సంధులను గుర్తించండి.

అ) హైదరాబాద్ లోని విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటి.
జవాబు:
విమానాశ్రయం : విమాన + ఆశ్రయం = సవర్ణదీర్ఘ సంధి

ఆ) చిన్నప్పటి విషయాలు జ్ఞాపకముండడం చాలా అరుదు.
జవాబు:
జ్ఞాపకముండడం : జ్ఞాపకము + ఉండడం ఉత్వసంధి

ఇ) ప్రతి జీవికి ఒక్కో శరీరాకృతి ఉంటుంది.
జవాబు:
శరీరాకృతి : శరీర + ఆకృతి = సవర్ణదీర్ఘ సంధి

ఈ) అబ్దుల్ కలాం మహోన్నత వ్యక్తిత్వం కలవాడు.
జవాబు:
మహోన్నత : మహా + ఉన్నత = గుణసంధి

ఉ) నా జీవితాన్నంతా దేశసేవకే వినియోగించాలనుకుంటున్నాను.
జవాబు:
జీవితాన్నంతా : జీవితాన్ని + అంతా

ఊ) మాధవి చెప్పినప్పటికీ రమ వినలేదు.
జవాబు:
చెప్పినప్పటికీ : చెప్పిన + అప్పటికీ = అత్వసంధి

ఋ) ఒక్కొక్కప్పుడు ముఖ్యమైన విషయాలు జ్ఞప్తికి రావు.
జవాబు:
ఒక్కొక్క : ఒక + ఒక = ఆమ్రేడిత సంధి

2. కింది సమాస పదాల్లోని తత్పురుష భేదాలను గుర్తించి, విగ్రహవాక్యాలు రాయండి. సమాస నిర్ణయం చేయండి.

ఉదా : – సత్యదూరము – సమాస పదం – షష్ఠీ తత్పురుష సమాసం

సమాసపదం – విగ్రహకవాక్యం – సమాసం పేరు

అ) అమెరికా రాయబారి – అమెరికా యొక్క రాయబారి – షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) వాదనాపటిమ – వాదనయందు పటిమ – సప్తమీ తత్పురుష సమాసం
ఇ) అసాధ్యం – సాధ్యము కానిది – నఞ తత్పురుష సమాసం
ఈ) నెలతాల్పు – నెలను ధరించినవాడు – ద్వితీయా తత్పురుష సమాసం
ఉ) గురుదక్షిణ – గురువు కొఱకు దక్షిణ – చతుర్థీ తత్పురుష సమాసం
ఊ) వయోవృద్ధుడు – వయస్సు చేత వృద్ధుడు – తృతీయా తత్పురుష సమాసం
ఋ) దొంగభయము – దొంగవలన భయము – పంచమీ తత్పురుష సమాసం
ౠ) రెండు రాష్ట్రాలు – రెండైన రాష్ట్రాలు – ద్విగు సమాసం
ఎ) శక్తిసామర్ధ్యాలు – శక్తియు, సామర్ధ్యమును – ద్వంద్వ సమాసం
ఏ) అమూల్యసమయం – అమూల్యమైన సమయం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఐ) పూర్ణపురుషులు – పూర్ణులైన పురుషులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఒ) ప్రాచీనకావ్యాలు – ప్రాచీనములైన కావ్యాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఓ) పెద్దకుటుంబం – పెద్దదైన కుటుంబం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

3. కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.

అ) పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు.
పర్షియన్ భాషను చదివాడు.
ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు.
జవాబు:
పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరి, పర్షియన్ భాషను చదివి, ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. (సంక్లిష్ట వాక్యం)

ఆ) బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కు నిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారుచేశాడు.
బూర్గుల సామ్యవాద వ్యవస్థకు పునాది వేశాడు.
బూర్గుల అజరామర కీర్తిని పొందాడు.
జవాబు:
బూర్గుల హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు పునాదివేసి, అజరామరకీర్తిని పొందాడు. (సంక్లిష్ట వాక్యం)

ప్రాజెక్టు పని

మహోన్నత వ్యక్తిత్వంతో, పరిపాలనాదక్షతతో సేవచేసిన వారి వివరాలు సేకరించండి. నివేదిక రూపొందించండి. తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 5

పదాలు – అర్థాలు

I

16వ పేజి

స్వర్గీయులు = స్వర్గాన్ని చేరిన వారు (మరణించిన వారు)
వర్ధంతి = “మరణించిన రోజు”, అనే అర్థంలో ఈ పదం వాడబడుతోంది.
మిత్రులు = స్నేహితులు
స్మృతులు = తలంపులు, జ్ఞాపకాలు
ముప్పిరిగొని = చుట్టుకొని, అతిశయించి
భావోద్రేకంతో
(భావ + ఉద్రేకంతో) = ఉద్రేకంతో కూడిన భావాలతో
ఉక్కిరి బిక్కిరైపోవు = ఊపిరి ఆడకపోవు; (విశ్రాంతి లేకపోవు)
రేఖామాత్రంగా = గీత వలె (కొద్దిగా)
పొందుపరుస్తాను = ఉంచుతాను (రాస్తాను)
పర్షియన్ భాష = పర్షియా భాష
ఐచ్ఛిక విషయం = స్వేచ్ఛా విషయం
పట్టభద్రులయ్యారు = డిగ్రీ పట్టా తీసికొన్నారు (బి.ఏ. పాసయ్యారు)
ట్యూటరు (Tutor) = ఉపన్యాసకునికి తోడుగా పనిచేసే గురువు (Private Teacher)
న్యాయవాద పట్టా = లా డిగ్రీ (Law Degree)
నమోదు అయ్యారు = రిజిష్టరు చేసుకున్నారు
కన్ను మూశారు = మరణించారు.
అవగతం కాదు ‘= అర్థం కాదు

17వ పేజి..

ఘనంగా = గొప్పగా
చిత్రించుకొనే = వర్ణించి చెప్పుకొనే
అంతరాత్మ (అంతః + ఆత్మ) = హృదయం
కృత్రిమ ఘనతను = తెచ్చిపెట్టుకొన్న గొప్పతనాన్ని
ప్రదర్శించి = చూపించి (కనబరచి)
ఉబలాటం = తీవ్రమైన కోరిక
పెనుగులాట = గ్రుద్దులాట
తత్ఫలితంగా = దానికి ఫలితంగా
కించపరుచుకొంటూ = తక్కువ చేసికొంటూ
అమూల్య సమయాన్ని = విలువకట్టలేని గొప్ప కాలాన్ని
వ్యర్థపరచుకుంటూ = వ్యర్థం చేసికొంటూ
అరుదుగా = అపురూపంగా (మిక్కిలి తక్కువగా)
మినహాయింపు = విడిచిపెట్టడం (Exemption)

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

వీసం ఎత్తు = వీసం ఎత్తు బరువు (రూపాయిలో 16వ వంతు బరువు)
మరుగుపరుస్తూ ఉండేది = కప్పిపెడుతూ ఉండేవి
సత్యదూరం = అసత్యం (సత్యం కానిది)
భావన = తలంపు
ఒడ్డూ, పొడుగూ = వెడల్పు, పొడుగు (ఒడ్డు = వెడల్పు)
వామనరూపాన్ని = వామనమూర్తివలె పొట్టి రూపాన్ని
స్నేహపూరితమైన = స్నేహంతో నిండిన
పరిహాసాలను = ఎగతాళులను (వేళాకోళాలను)
భావ నిర్లిప్తతతో = భావము యొక్క తగులపాటు లేకుండా (పట్టించుకోకుండా)
లోగడ = పూర్వం
అసాధారణ పొడగరితనం = సాధారణంగా ఉండని పొడుగుదనం
మరుగుపరచలేదు = కప్పిపెట్టలేదు
విమానాశ్రయం
(విమాన + ఆశ్రయం) = విమానాలు ఆగేచోటు
పుష్పమాలాలంకృతునిగా
(పుష్పమాలా + అలంకృతునిగా) = పూలదండతో అలంకరింపబడిన వానిగా
అతిథి = ముందు తెలియజేయకుండా భోజన సమయానికి వచ్చే వాడు
ఆతిథేయులు = అతిథికి సత్కారం చేసే వారు (గృహస్థులు)
ఇర్వురు = ఇద్దరూ
సరస్పర, సౌజన్య, సౌహార్దాలు = ఒకరికొకరియందు; మంచితనమూ, స్నేహమూ
ఫీటు (Feat) = సాహసకృత్యం
వినోదకర దృశ్యం = వేడుకను ఇచ్చే దృశ్యం
కళానైపుణ్యానికి = కళలో నేర్పరిదనానికి
గీటురాయి = ప్రమాణం
చేకూర్చింది = సిద్ధింపచేసింది

II

17వ పేజి

విరాట్రూపం = ఆదిపురుషుని బ్రహ్మాండ స్వరూపం; (పెద్ద ఆకారం)
శరీరాకృతి (శరీర + ఆకృతి) = శరీరం యొక్క ఆకారము
గహనమైనది
(గహనము + ఐనది) = ఎరుగరానిది
వ్యక్తిత్వం = వ్యక్తి స్వభావం
నిత్య నైమిత్తికంగా (Routine) = వాడుకగా (నియమిత చర్యగా)
వామనమూర్తి వలె = వామనుని వలె (వామనావతారంలో విష్ణువువలె పొట్టిగా)
ముల్లోకాలు
(మూడు + లోకాలు) = స్వర్గ, మర్త్య, పాతాళలోకాలు
ఆక్రమించి = ఆక్రమణం చేసి (వ్యాపించి)
ప్రదర్శించేవారు = వెల్లడించే వారు
ఇమిడిపోతూ = లీనమవుతూ (కలిసిపోతూ)
నిరాడంబరంగా = ఆడంబరం లేకుండా
తెరమరుగున = తెరచాటున (వెనుక)
బహుముఖ ప్రతిభాయుత మూర్తిమత్వం = అనేక విధాలైన తెలివి తేటలతో కూడిన రూపాన్ని కల్గి యుండడం
మహోన్నతరూపం
(మహా + ఉన్నతరూపం) = మిక్కిలి గొప్ప రూపం
వ్యక్తిత్వపు, మహోన్నత శిఖరాలు (వ్యక్తిత్వము + మహోన్నత శిఖరాలు) = స్వభావము యొక్క మిక్కిలి గొప్ప, విశిష్టతలు
అగాధపులోతులలోనే
(అగాధము + లోతులలోనే) = తెలియశక్యంకాని లోతులలో
పరిలక్షితమౌతుంది
(పరిలక్షితము + ఔతుంది) = బాగా సూచింపబడుతుంది. (వెల్లడి అవుతుంది)

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

18వ పేజి

న్యాయవాది (Advocate) = ప్లీడరు
ప్రాక్టీస్ (Practice) = అనుభవం
Roaring Practice = ఎక్కువ ప్రాక్టీసు
ప్రజాహిత జీవితం = ప్రజలకు మేలు కలిగించే జీవితం
ఫైలు పెరుగుట = హోదా పెరగడం (File)
ఉపకరిస్తే = సాయపడితే
తారుమారైంది = తిరగబడింది
క్లయింట్లు (Clients) = లాయర్లకు వ్యాజ్యాలు ఇచ్చేవారు
మిశ్రిత భావం = కలగాపులగమైన భావన
ప్రజ్ఞా ప్రాభవాలు = తెలివియు, గొప్పతనమును
సంపూర్ణ విశ్వాసానికి = పరిపూర్తి అయిన నమ్మకానికి
తోడు = సహాయం
రాజకీయ వ్యగ్రత = రాజకీయాలలోని తొందర తనం
ధ్యానము = మనస్సు యొక్క ఏకాగ్రత
క్షుణ్ణంగా చదివి = బాగా చదివి
చేపట్టేటప్పుడే = తీసుకొనేటప్పుడే (స్వీకరించేటప్పుడే)
ఫైలు (File) = దొంతి (కాగితాలు వరుసగా పెట్టుకొనే అట్ట)
అస్పష్టమైన = స్పష్టంకాని
నోట్సులు (Notes) = వివరణలు
రేఖామాత్రంగా = కొద్దిగా
జాజ్వల్యమానమైన = ప్రకాశించే
వాదనాఘాతములకు = వాదనలనే దెబ్బలకు
దుర్భేద్యమైన = భేదింప శక్యం కానిదైన
నిలపడం = నిలబెట్టడం
నిష్ణాతమైన = నేర్పు కలదైన
సునిశిత మేధాసంపత్తి = మిక్కిలి పదునైన బుద్ధిసంపద
ప్రదర్శిస్తున్నారు = చూపిస్తున్నారు
అనన్యమైన = ఇతరులకులేనట్టి
వాదనాపటిమ = వాదించడంలో సామర్థ్యం
ప్రోత్సాహం (ప్ర+ఉత్సాహం) = మిక్కిలి ఉత్సాహం
ప్రత్యేక తరహా = ప్రత్యేక విధం
జూనియర్ (Junior) = చిన్న
కడగొట్టు బిడ్డ = చివరి బిడ్డ
విశేష, మమకారం = అధికమైన, అభిమానం
చొరవతో = సాహసంతో
నిరాఘాటంగా = అడ్డులేకుండా
ఆఫీసును (Office) = కార్యాలయాన్ని
కాఫీ పానశాల(Coffee Hotel) = కాఫీ త్రాగేశాల
పరిగణించి = లెక్కించి (ఎన్నుకొని)
కొరుకుడుపడని = కొరకడానికి వీలుపడని (అర్థంకాని, కష్టమైన)
ఏరుకొని = ఏరి తీసుకొని (తీసుకొని)
కారాలు మిరియాలు నూరుతూ = కోపగిస్తూ
చేష్ట = నడవడి (కార్యం)
ఆమోదముద్ర = అంగీకారముద్ర
ప్రకరణం = ఒక విషయాన్ని బోధించే గ్రంథ భాగం
ముగియడం = ముగింపు
నిష్కాపట్యంతో = కపటం లేకుండా
సమానస్థాయి = సమానమైన స్థితి
చర్చా సంబంధం = చర్చకు సంబంధం
రూపొందించిన = ఏర్పరచిన
జోహారులు = నమస్కారాలు
అర్పిస్తూనే ఉంటాను = సమర్పిస్తూనే ఉంటాను
పూరించిన = నింపిన
ఆత్మవిశ్వాసమే = తన శక్తి యందు నమ్మకం కల్గియుండడమే
శాసనసభలు = చట్టసభలు
శ్రీరామరక్ష = సర్వరక్షకం
ప్రాతఃస్మరణీయులు = తెల్లవారు జాముననే తలంపవలసిన వారు (దేవుని వంటివారు)
విశిష్ట వ్యక్తిత్వము = మిక్కిలి శ్రేష్ఠమైన వ్యక్తిత్వం
అట్టిది = అటువంటిది
సమ్యక్ దృష్టికోణం = సరియైన చూపు
సంకుచితం = ముడుచుకున్నది
సైద్ధాంతిక అరలు = సిద్ధాంతానికి చెందిన భాగములు.
తావు = స్థానం
జాగీర్దార్ = నవాబుల వలన శౌర్యాదులకై మాన్యాలు పొందినవాడు
జాగీర్దారీ వ్యవస్థ = జాగీర్దారుల ఏర్పాటు
రూపుమాపడానికి = నశింపజేయడానికి (తీసివేయడానికి)
స్నేహకోటి = స్నేహితుల సమూహం
భూస్వాములు భూములు ఎక్కువగా గలవారు (భూకామందులు)
కౌలుదారీ చట్టాన్ని = భూమి యజమాని, సేద్యం చేసే రైతులకు ఇచ్చే హక్కుల చట్టాన్ని
సామ్యవాద వ్యవస్థ = ప్రజలందరికీ సమానమైన అధికారాలూ, భోగభాగ్యాలూ కలగాలని కోరే ఏర్పాటు
మార్గదర్శకులు = మార్గాన్ని చూపించేవారు
ఎంపిక చేసిన = ఎన్నుకొన్న
భూకామందులు = భూస్వాములు
రాజకీయసహచరులు = రాజకీయాల్లో వెంట తిరిగే స్నేహితులు

19వ పేజి

సంస్థానవిచ్ఛిత్తి = సంస్థానాల నాశనం
రాజకీయ ప్రాబల్యానికి = మంచి సమర్థత పొందడానికి
స్వస్తివాచకం పలుకు = ముగించు
మేలు చేకూర్చే = ఉపకారాన్ని చేసే
ఆత్మపరిత్యాగానికి = మనస్సును పూర్తిగా విడిచి వేయడానికి (మనఃపూర్వకం కాని దానికి)
సక్రియ రాజకీయాల నుండి = క్రియాశీలమైన రాజకీయాల నుండి
నిష్క్రమణకు = వెడలిపోడానికి (తప్పుకోడానికి)
అంకితం చేసుకొనే = సంపూర్తిగా సమర్పించుకొనే
రాజనీతి విశారదులు = రాజనీతి పండితులు
బహు అరుదు = మిక్కిలి తక్కువ
‘వ్యవహార దక్షత = వ్యవహార సామర్థ్యం
ఆరునూరైనా = ఏది ఏమయినా
సంక్షిప్త రాజకీయ చరిత్ర = కొద్దిగా చెప్పిన రాజకీయాల చరిత్ర

III

19వ పేజి

సౌజన్యానికి = మంచితనానికి
మారుపేరు = మరోపేరు
ముఖ్యాంశ (ముఖ్య + అంశం) = ముఖ్యవిషయం
గతతరంలోని = పూర్వపుతరంలోని (పూర్వకాలంలోని)
సుగుణాల = మంచిగుణాల
మూర్తిమత్వం = స్వరూపం (personality)
శరాఫత్ = సౌజన్యం (మంచితనం)
మత, దురభిమానం = మతమునందు, పిచ్చి ప్రేమ
పెంపొందిస్తూ = అభివృద్ధిపరుస్తూ
రాజ్యమేలుతున్న = రాజ్యాన్ని పాలిస్తున్న
నాటి నిజాంకు = ఆ రోజుల్లో పాలించే నిజాం రాజుకు
బద్ధవ్యతిరేకి = గట్టి విరోధి
పరమ మిత్రులు = మిక్కిలి స్నేహితులు

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

ఆప్తులు = స్నేహితులు
అతినిరాడంబరంగా = మిక్కిలి ఆడంబరం లేకుండా
ఆడంబరం = డంబం
మతాతీతస్థితి (మత + అతీత స్థితి) = మతాన్ని అతిక్రమించిన పరిస్థితిని (మతంతో సంబంధం విడిచిపెట్టడం)
పాటించేవారు = ఆచరించేవారు
డ్రాయింగు రూం
(Drawing Room) = చావడి, (అతిథులు కూర్చుండే గది)
సంస్కృతీ ప్రదర్శనశాల = సంస్కృతిని తెలిపే ఇల్లు
మౌల్వీలు = ముసల్మాను పండితులు
ముల్లాలు = ముస్లిమ్ పండితులు
మహామహోపాధ్యాయులు = గొప్ప వేదశాస్త్ర పండితులు
ఆహ్వానించడానికి = పిలవడానికి
మూడు, విభిన్నతరాల, చివరి, వారధి = మూడు, వేరు వేరు తరాలకు చివరి వంతెన (మూడు తరాల వారినీ కలిపి ఉంచగలవాడు)
తీర్చిదిద్దారు = రూపుదిద్దారు
సునిశిత మేధ = చురుకైన తెలివి (గొప్పతెలివి)
శాసనసభా నాయకులు = చట్టసభలో నాయకులు
పరిమార్జిత భాష = శుద్ధిచేయబడిన భాష (సంస్కరింపబడిన భాష)
మేళవించి = కలిపి
ఉన్నత ప్రమాణాలను = గొప్ప ప్రమాణాలను
స్మరించుకుంటూ = తలచుకుంటూ
ప్రత్యర్థులను = ఎదుటి పక్షం వారిని (వ్యతిరేక పక్షం వారిని)
కన్నీరు బొట్టు = కన్నీటి చుక్క
రవ్వంత (రవ్వ + అంత) = కొద్దిమాత్రం
పార్లమెంటేరియన్ = ప్రజాప్రతినిధి
(Parliamentarian)
(MLA, MP)
అద్వితీయ కళాకౌశలం = సాటిలేని కళలో నేర్పు
బహుభాషావేత్త = అనేక భాషలు తెలిసినవాడు
అభిరుచులు = ఆసక్తులు
ప్రయివేటుగా (Private) = రహస్యంగా
ఆఫీసు ఫైళ్ళు = కార్యాలయపు దస్త్రాలు
సంస్కృత ప్రాచీన కావ్యాలు = సంస్కృత భాషలోని పూర్వపు కవులు వ్రాసిన ‘రఘువంశం’ వంటి గ్రంథాలు’
బహుముఖ ప్రతిభావంతులు = అనేక రంగాలలో తెలివి కలవారు
సాహితీ జగత్తు = సాహిత్యలోకం
సాహిత్య వ్యాసంగం = సాహిత్యంలో పరిశ్రమ

20వ పేజి

ముట్టని = అంటని
క్షేత్రం = రంగం
అతిశయోక్తి = ఎక్కువగా చెప్పడం
(అతిశయ + ఉక్తి)
సాహిత్యక్షేత్రం = సాహిత్యరంగం
దశాబ్దాలు = పదుల సంవత్సరాలు
స్మృతులను = జ్ఞాపకాలను
గ్రంథస్థం = గ్రంథంలో రాయడం
హితైషులు = మేలును కోరేవారు
ఔదార్యం = గొప్పతనం (దాతృత్వం)
దోష౦ = తప్పు
పరిణమించేది = మారేది
అసాధ్యం = సాధ్యం కానిది
చీదరింపు = ‘ఛీ’ యనడం (కాదు పొమ్మనడం)
పరిష్కరించి ఉండేవారు = చక్కపెట్టేవారు
మలచబడ్డారు = చెక్కబడ్డారు (తీర్చిదిద్దబడ్డారు)
ఉపకారశీలి = ఉపకారం చేసే స్వభావం కలవాడు
ఆత్మీయులైన = తనవారైన
పేరుబడ్డారు = పేరు కెక్కారు
సహచరులు = స్నేహితులు, అనుచరులు
ఓర్మి = సహనం
వేచిఉంటూ = ఎదురు చూస్తూ ఉంటూ
పరిపాటి = పద్ధతి (అలవాటు)
సామాజిక యాత్ర = సంఘానికి సంబంధించిన యాత్ర
సాఫీగా = తిన్నగా
ఒడుదుడుకులు = ఎత్తుపల్లాలు (కష్టస్థితులు)
విపత్కర పరిస్థితులు = ఆపద కలిగే పరిస్థితులు
సేనావాహిని = సేనానది
చలించేవారు = తొందరపడేవారు
మనః స్థైర్యాన్ని = మనస్సులో దృఢత్వాన్ని
సమచిత్తత = సమానమైన మనస్సు కల్గి యుండడం
క్రుంగిపోనూలేదు = అణగిపోలేదు (దిగాలు పడలేదు)
పూర్ణపురుషుల = సంపూర్ణమైన వ్యక్తులు (అన్ని శక్తులూ కలవారు)

పాఠం ఉద్దేశం

సమాజంలో కొద్దిమందే ప్రభావశక్తి సంపన్నులు ఉంటారు. వీరి సాంగత్యం పొందినా, వీరి గురించి తెలుసుకున్నా, స్ఫూర్తి కలుగుతుంది. మంచిమార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. ఇలా స్ఫూర్తిదాయకులైన వారిలో బూర్గుల రామకృష్ణారావు ఒకరు. ఈయన హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి, రాజనీతిజ్ఞుడిగా బహుభాషావేత్తగా పరిపాలనాదక్షుడిగా పేరెన్నికగన్నాడు. ఈయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా పి.వి. నరసింహారావు వ్యాసం రాశాడు, మహోన్నత వ్యక్తిత్వాల నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. గొప్పవారి జీవితాన్ని, వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన, స్ఫూర్తివంతమైన జీవన కోణాలను విశ్లేషిస్తూ, ప్రశంసిస్తూ రాసిన అభినందన వ్యాసం ఇది.
ఈ పాఠ్యభాగం ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక 1972 సం॥పు డిసంబర్ సంచిక నుండి తీసుకొనబడింది.

TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల

రచయిత పరిచయం

వ్యాస రచయిత : పాములపర్తి వేంకట నరసింహారావు (పి.వి. నరసింహారావు)
పాఠ౦ : “నేనెరిగిన బూర్గుల”

రచయిత జన్మస్థలం : వరంగల్లు రూరల్ జిల్లా ‘నర్సంపేట’ మండలంలోని “లక్నేపల్లి” గ్రామంలో జన్మించారు.

దత్తపుత్రుడు : రచయిత, నరసింహారావుగారు, వరంగల్ దగ్గర ‘భీమదేవరపల్లి’ మండలంలోని ‘వంగర’ గ్రామంలోని రుక్మిణమ్మ, రంగారావులకు దత్తపుత్రుడు.
TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల 1
రచయిత గురువులు : “స్వామి రామానంద తీర్థ వీరికి గురువు. బూర్గుల రామకృష్ణారావుగారు, ఈ రచయితకు గురుతుల్యులు.

రాజకీయ జీవితం : పి.వి. నరసింహారావుగారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థిగా హైద్రాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొని, విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గురి అయినారు. 1938 లో హైద్రాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు.

శాసన సభ్యత్వం : కరీంనగర్ జిల్లా “మంథని” నియోజక వర్గం నుండి వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్.ఎల్.ఏ.గా ఎన్నికయ్యారు.

మంత్రి పదవులు : అనేక శాఖలకు రాష్ట్రమంత్రిగా పనిచేసి, 1971 73 లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్రమంత్రిగా చాలాకాలం పనిచేసి, చివరకు 1991 96 కాలంలో భారత ప్రధానిగా పనిచేశారు.

రాజనీతిజ్ఞుడు : ఈయన అపరచాణక్యుడు. తన రాజకీయ చాతుర్యంతో, భారత రాజకీయాల్లో గొప్పగా రాణించిన రాజనీతిజ్ఞుడు.

సాహితీసేవ : ఈయన తెలుగుతో సహా 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన బహుభాషావేత్త. తెలుగులో ‘కాకతీయ’ పత్రికను నడిపించాడు. విశ్వనాథ సత్యనారాయణ గారి ‘వేయిపడగలు’ నవలను, ఈయన “సహస్రఫణ్” అనే పేరుతో హిందీలోకి అనువదించాడు. ఈ నవలకు కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఈయన “ఆత్మకథ” అని పేరు కెక్కిన “ఇన్ సైడర్” అనేక భాషల్లోకి అనువదించబడింది. “పన్లక్షతొకొనతో” అనే మరాఠి నవలను, ఈయన తెలుగులో “అబలా జీవితం” అనే పేర అనువదించారు.

వ్యక్తిత్వం : నిరాడంబరజీవితం, నిజాయితీ, దేశభక్తి కలిగినవారు. జీవిత పర్యంతం, నిండు కుండలా స్థితప్రజ్ఞునిగా వెలిగారు.

ప్రవేశిక

ప్రతి మానవునిలోనూ సాధారణంగా ఉన్నదానికంటే తనను గురించి ఘనంగా చిత్రించుకొనే స్వభావం ఉంటూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా ప్రవర్తించేవారు బహు అరుదుగా ఉంటారు. రకరకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నా విపత్కర పరిస్థితులు సేనావాహినిలా చుట్టుముట్టినా చలించకపోవడం, మనః స్థైర్యాన్ని, సమచిత్తాన్ని విడనాడక పోవడం గొప్పవారికే సాధ్యమౌతుంది.

జయాపజయాలను సమానంగా స్వీకరించడం, మిత్రులు సైతం ద్రోహం తలపెట్టినా ప్రత్యర్థులు దూషించినా “సరే ! ఇవన్నీ ఆటలో భాగమేగా !” అని స్థితప్రజ్ఞతను ప్రదర్శించడం అందరికీ సాధ్యమౌతుందా ? మరి ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఎవరు ? ఈ పాఠం ద్వారా తెలుసుకొండి.

Leave a Comment