These TS 10th Class Telugu Important Questions 10th Lesson గోలకొండ పట్టణము will help the students to improve their time and approach.
TS 10th Class Telugu 10th Lesson Important Questions గోలకొండ పట్టణము
PAPER – I : PART – A
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)
1. లఘు సమాధాన ప్రశ్నలు మార్కులు
అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఇబ్రహీం కుతుబ్షా గురించి రాయండి.
జవాబు:
ఇబ్రహీం కుతుబ్షా విద్యాప్రియుడు. ఇతనికి కులమత భేదాలు లేవు. ఇతని ఆస్థానంలో కవులు, పండితులను పోషించేవారు. ఇతని ఆస్థానంలో నిరంతరం విద్యాగోష్టి సాగేది. పండితులను ఘనంగా సన్మానించేవాడు. తెలుగు భాషపైన అభిమానం కలవాడు. జంతు రక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవాడు. ద్రాక్ష తోటల పెంపకాన్ని ప్రోత్సహించే వాడు. ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవాడు.
ప్రశ్న 2.
‘బాల్బోవా వృక్షాన్ని సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా ఆఫ్రికా నుండి తెప్పించాడు’. దీనిని బట్టి నీవేమి గ్రహించావు?
జవాబు:
గోలకొండ నవాబులకు ఇతర దేశాలతోనే కాక, ఇతర ఖండాలతో కూడా సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఇతర దేశాల వ్యాపారులు కూడా గోలకొండతో వ్యాపార సంబంధాలకు ప్రాధాన్యతను ఇచ్చేవారు.
గోలకొండ నవాబులు కళలకు, కళా ఖండాలకు ప్రాధాన్యతను ఇచ్చేవారు. అపురూప మైనది ఏదైనా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎంత ఖర్చయినా తెప్పించే వారు. దానిని జాగ్రత్తగా సంరక్షించేవారు అని గ్రహించాను.
ప్రశ్న 3.
గోలకొండ పట్టణములో వీధులు విశాలముగా ఎందుకు ఉండేవి ?
జవాబు:
గోలకొండ పట్టణములో జనసమ్మర్థం ఎక్కువ. పరిపాలకులు, అధికారులు, సామాన్య ప్రజలు తిరగడానికి వీధులు విశాలంగా ఉండేవి. గోలకొండ పట్టణంలో ఏనుగులు, ఒంటెలు, గుఱ్ఱాలు కూడా ఎక్కువగా ఉండేవి. అవి రాజవీధులలో ఎక్కువగా తిరిగేవి. ఇటువంటి పెద్ద పెద్ద జంతువులు, మానవులు తిరగాలంటే వీధులు చాలా విశాలంగా ఉండాలి కదా ! అందుకే గోలకొండ పట్టణంలోని వీధులు విశాలంగా ఉండేవి.
ప్రశ్న 4.
ఇబ్రహీం కుతుబ్షా సరదార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టవలసినదిగా ఎందుకు ఆజ్ఞాపించాడు ?
జవాబు:
సాధారణంగా ధనవంతుల ఇండ్లలోనే దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి. దొంగలు కూడా సామాన్యుల ఇళ్ళను దొంగతనానికి ఎంచుకోరు. ధనవంతులనే లక్ష్యంగా పెట్టుకొంటారు.
ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎక్కువ ధనాన్ని చెల్లించేది ధనవంతులే. వారిని కాపాడడం ప్రభుత్వం యొక్క కనీస ధర్మం. కోట బయట ఉంటే ధనవంతులను దొంగల బారి నుండి కాపాడడం కష్టం. కోట లోపలయితే సైన్యం ఉంటుంది. కనుక దొంగతనాలకు అవకాశం తక్కువ. అందుచేత ధనవంతులను, సరదార్లను కోటలోపల మేడలు కట్టుకోమని ఇబ్రహీం కుతుబ్షా ఆజ్ఞాపించాడు.
ప్రశ్న 5.
ఇబ్రహీం కుతుబ్షా పన్నెండు భిక్షా గృహాలను ఎందుకు నిర్మించాడు ?
జవాబు:
కనీసం తిండికి కూడా లేని పేదవారు భిక్షాటన చేస్తారు. వారు అనాథలు. వారిలో అవయవాలు సరిగ్గా లేనివారుంటారు. వృద్ధులు ఉంటారు. తల్లి దండ్రులెవరో తెలియని పిల్లలుంటారు. ఏ ఆధారం లేనివారుంటారు. వారికి ఆశ్రయం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అటువంటి యాచకులకు భోజనం, వసతి కల్పించడం ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత. అందుకే ఇబ్రహీం కుతుబ్షా 12 భిక్షా గృహాలను నిర్మించి యాచకులకు ఆశ్రయం కల్పించాడు.
ప్రశ్న 6.
గోల్కొండ పట్టణంలోకి కొత్తవారికి ప్రవేశం ఉండేదా ? కాదా ? ఎందుకు ?
జవాబు:
గోలకొండ పట్టణంలోకి క్రొత్తవారికి ప్రవేశం దుర్లభం. ‘దారోగా’ నుండి అనుమతి పత్రం ఉంటేనే రానిచ్చేవారు. లేదా రాజోద్యోగులు పరిచయం ఉన్న వారిని రానిచ్చేవారు. కొత్తగా వచ్చినవారిని రక్షక భటులు చాలా తనిఖీలు చేసేవారు. ఎందుకంటే వారి వద్ద ఉప్పు కాని, పొగాకు కాని ఉందేమో అని అధికారులు తనిఖీ చేసేవారు. ఉప్పు, పొగాకు వల్ల రెవెన్యూ వసూలు ఎక్కువగా ఉండేది. అందుకే ఎక్కువగా తనిఖీలు నిర్వహించేవారు.
కొత్తవారి వలన ఎక్కువగా వస్తాయి. రెవెన్యూ వచ్చే వస్తువులు అక్రమంగా తరలిపో తాయనే అనుమానం కూడా కారణం. అందుచేతనే కొత్త వారికి ప్రవేశం ఉండేది కాదు.
ప్రశ్న 7.
ఆదిరాజు వీరభద్రరావు రచనలను పేర్కొనండి. (Mar.’17)
జవాబు:
తెలంగాణ తెలుగుకవుల్లో ఆదిరాజు వీరభద్రరావు ప్రసిద్ధులు. వీరి రచనలు తెలంగాణ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. వీరి రచనల్లో ‘మన తెలంగాణ’ అనే వ్యాససంపుటి ప్రసిద్ధమైంది.
ఆదిరాజు వీరభద్రరావు గారి రచనలు : ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశంలో యాభై వ్యాసాలు రాశాడు.
2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు మార్కులు
ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఉమ్రావుల పటాటోపం వివరించండి.
జవాబు:
ఉమ్రావులు బజారులలో వెళ్ళేటపుడు చాలా పటాటోపంతో వెళ్ళేవారు. ఒక ఉమ్రావు బయలు దేరితే అతని ముందు ఒకటో, రెండో ఏనుగులు బయల్దేరేవి. వాటి మీద జెండాలతో భటులు కూర్చొనేవారు. తర్వాత గుఱ్ఱాలపై 50 లేక 60 మంది భటులు ఆయుధాలు ధరించి వెళ్ళేవారు.
వీరి వెనుక బాకాలు, సన్నాయిలతో కొందరు వెళ్ళేవారు. వీరి వెనుక ఉమ్రావు గుఱ్ఱంపై వచ్చేవాడు. అతనికి 40 మంది అంగరక్షకులుండేవారు. కొందరు విసనకర్రలతో విసిరేవారు. ఒకడు గొడుగు పట్టేవాడు.
మరొకడు హుక్కాతో వచ్చేవాడు. ఒకడు పూర్ణ కుంభాలతో వచ్చేవాడు. తర్వాత ఒక పల్లకిని నలుగురు మోసుకొని వచ్చేవారు. తర్వాత నలుగురు పల్లకితో వచ్చేవారు. తర్వాత ఒంటెలపై తప్పెటలు వాయిస్తూ వచ్చేవారు. నవాబుగారికి ఇష్టమయినపుడు పల్లకిలో వెళ్ళేవాడు.
ప్రశ్న 2.
గోలకొండ పట్టణంలోని కట్టడాల ద్వారా పరిపాలనకు ప్రయోజనాలేమిటి ?
జవాబు:
గోలకొండ పట్టణాన్ని ఒక పద్ధతి ప్రకారం నిర్మించారు. దీని నిర్మాణ పథక కర్త ఆజంఖాన్ అనే ఇంజనీరు. పట్టణ నిర్మాణం వలననే పరిపాలన పటిష్ఠంగా సాగుతుంది.
వీధులు విశాలంగా నిర్మించడం వలన ట్రాఫిక్ సమస్యలు చాలా తక్కువగా ఉండేవి. సర్దార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టుకోమని ఆజ్ఞాపించడం ద్వారా ధనవంతుల రక్షణను కట్టు దిట్ట౦ చేశారు.
ఉద్యోగులకు భవనాలు కట్టించడం ద్వారా, వారికి సౌఖ్యాలు కల్పించారు. దానివల్ల ఉద్యోగులు సమయానికి కార్యాలయాలకు రాగలరు. పని మీద పూర్తిగా దృష్టి పెడతారు.
భిక్షా గృహాల వలన యాచకులకు కూడా సౌఖ్యం కల్పించారు. దీని వలన నేరాల సంఖ్య తగ్గుతుంది. పాఠశాలలు నిర్మించారు. దాని వలన భావి తరాలకు విజ్ఞానం అందుతుంది. చదువు వలన మాత్రమే ఉత్తమ సమాజం రూపొందుతుంది. పాఠశాలల నిర్మాణం ద్వారా ఉత్తమ సమాజానికి విత్తనాలు చల్లారు.
విదేశీ రాయబారులకు ప్రత్యేక నివాసాలు కట్టడం ద్వారా విదేశాల దృష్టిలో పరువు ప్రతిష్ఠలు పెంచారు.
ప్రశ్న 3.
గోలకొండ పట్టణ వైభవాన్ని వివరించండి. (June ’16)
జవాబు:
పట్టణమనగా గోలకొండ పట్టణమనియే దక్షిణా పథమున ప్రసిద్ధి. గోలకొండ దుర్గమనగా ఒక్క కోట కాదు, మూడు కోటలు. గోలకొండ పట్టణ నిర్మాణ పథకమునకు కర్త ఆజంఖాన్ అను ఇంజనీరు అని తెలియుచున్నది. ఈతడే పట్టణము యొక్క రూపు రేఖలను దిద్దినవాడు.
గోలకొండ పట్టణములో ఏనుగులు, ఒంటెలు, గుఱ్ఱాలు అధిక సంఖ్యలో నుండి పట్టణములో సందడిగా సంచరించు చుండెను. గోలకొండ పట్టణం అలంకార భూయిష్టముగా ఉంటుంది. గోలకొండ పట్టణములో ఉద్యానవన నిర్మాణమునందు విలక్షణమయి, ఆకర్షణీయ మైనట్టివి మిద్దెల మీది తోటలు, భవనముల పైభాగము ఎంతో మనోహరంగా నిర్మించినారు. ఈ విధంగా ఆనాటి చరిత్ర, సంస్కృతి మనకు తెలుస్తోంది.
PAPER – II : PART – A
I. అవగాహన – ప్రతిస్పందన
అపరిచిత గద్యాలు
1. కింది పేరాను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఒకప్పుడు మానవజాతి ప్రగతికి సంకేతాలుగా భావింపబడిన సాంకేతిక అద్భుతాలు ఈవేళ పర్యా వరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి. మన పరిశ్రమలు, కర్మాగారాలు, వాహనాలు, రక రకాల విద్యుత్ పరికరాలు పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలుగా ఉంటున్నాయి. వాతా వరణంలో బొగ్గుపులుసు వాయువులు, గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువవుతున్నాయి. వీటి వలన తీవ్రమయిన పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి 15 మించి 35 శాతం జంతువులు నశించిపోయే ప్రమాదముందనిశాస్త్రవేత్తలు అభిప్రాయపడు
తున్నారు.
ప్రశ్నలు – సమాధానములు
ప్రశ్న 1.
వాతావరణ కాలుష్యానికి కారణమయిన వాయువేది ?
జవాబు:
బొగ్గుపులుసు వాయువు
ప్రశ్న 2.
జంతువులు ఎందుకు నశించిపోతాయి ?
జవాబు:
వాతావరణ కాలుష్యం వలన
ప్రశ్న 3.
మానవులు ఉపయోగించే వాహనాలలో కాలుష్యం కలిగించనిదేది ?
జవాబు:
సైకిలు
ప్రశ్న 4.
వాతావరణ కాలుష్య నివారణకు ఏం చేయాలి ?
జవాబు:
చెట్లను ఎక్కువగా పెంచాలి
ప్రశ్న 5.
పెద్ద ప్రమాదం ఏమిటి ?
జవాబు:
వాతావరణ కాలుష్యం
2. క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
సముద్రగర్భంలో ఆయుధ పాణులైన సైనికుల్లాంటి ప్రాణులున్నాయంటే నమ్మశక్యం కాదు. అయినా ఇది నిజం. సముద్రగర్భంలో ఒక ప్రత్యేకమైన నత్తజాతి ఉంది. ఈ నత్తల శరీరం మీద పాదాల అడుగున ఇనుప పొలుసులు ఉంటాయి. మామూలు నత్తల కున్న వీపుమీది పై తొడుగు వీటికి ఉండదు. పాదాల అడుగున ఉన్న ఈ ఇనుప పొలుసులే క్రమంగా నత్తల పై తొడుగుగా మారి ఉండవచ్చునని సముద్ర జల జీవశాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవి శత్రువులను ఆ ఇనుప తొడుగులతో ఎదుర్కొంటాయి.
ప్రశ్నలు
1. సముద్రగర్భంలో ఏది నమ్మశక్యంకాదు ?
జవాబు:
ఆయుధపాణులైన సైనికుల్లాంటి ప్రాణులున్నాయంటే నమ్మశక్యం కాదు.
2. వేటిమీద పొలుసులు ఉన్నాయి ?
జవాబు:
ఒక ప్రత్యేకమైన నత్తజాతి శరీరం మీద.
3. సైనిక నత్తలు శత్రువులను ఎలా ఎదుర్కొంటాయి ?
జవాబు:
ఇనుప తొడుగులతో శత్రువులను ఎదుర్కొంటాయి.
4. “పాదాల అడుగున” దీనిలో ఏ సంధి పదం కలదు ?
జవాబు:
లులనల సంధి.
5. చిత్ర విచిత్రమైన జలచరాలు ఎక్కడ ఉంటాయి ?
జవాబు:
సముద్రగర్భంలో.
3. క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు వ్రాయండి
“దేశ భాషలందు తెలుగు లెస్స” అని సాహితీ సమరాంగణ సార్వభౌములచే ప్రశంసింపబడిన భాష మన తెలుగుభాష, భాషాభ్యుదయమునకు సాహిత్య సంపద జీవగర్ర. ఆదికవి నన్నయభట్టారకుని నాటినుండి నేటి వరకు ఆంధ్ర భాషా సాహిత్యము అవిచ్ఛిన్నముగా, బహు-ముఖములుగా రాణించి మించినది. ముద్రణాది సౌకర్యములు ఏర్పడిన తరువాత మన తెలుగు భాషలో ప్రాచీన కావ్య పురాణాది వివిధ గ్రంథములు ప్రచురింపబడి సుప్రకాశితములయ్యెను.
ప్రశ్నలు – సమాధానములు
1. తెలుగు భాష ఏమని ప్రశంసింపబడినది ?
జవాబు:
తెలుగు భాష “దేశ భాషలందు తెలుగు లెస్స” అని ప్రశంసింపబడింది.
2. ముద్రణా సౌకర్యము ఏర్పడుట ద్వారా భాషకు కల్గిన ప్రయోజనమేమి ?
జవాబు:
తెలుగు భాషలో ప్రాచీన కావ్య పురాణాది గ్రంథములు ప్రచురింపబడ్డాయి.
3. ఆదికవి ఎవరు ?
జవాబు:
ఆదికవి నన్నయ భట్టారకుడు.
4. భాషాభ్యుదయమునకు ఏది జీవగర్ర ?
జవాబు:
భాషాభ్యుదయానికి సాహిత్య సంపద జీవగర్ర.
5. సాహిత్యరంగంలో, యుద్ధరంగంలో రెండింటి లోను చక్రవర్తి అని చెప్పిన పదం ఏది ?
జవాబు:
సాహితీ సమరాంగణ సార్వభౌముడు.
4. క్రింది పేరా చదివి ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
కుందుర్తి ఆంజనేయులు రచించిన వచన పద్య ఖండిక ‘నగరంలో వాన’ కవిత్వంలా మొదలై రాజకీయ శాసనంతో అంతం అవుతుంది. అందరూ వాస్తవికత నుంచి వ్యంగ్యాన్ని పుట్టిస్తే, ఇందులో కవి వ్యంగ్యం నుంచి వాస్తవికతను సృష్టిస్తాడు. ప్రబంధకవి అయ్యలరాజు రామభద్రుడు వర్షధార నుంచి కవితాధారను శ్లేషించాడు. అది కేవలం శబ్దగతమైన శ్లేష మాత్రమే. ఇందులో భావసంఘర్షణ నుంచి వెలువడిన వ్యంగ్యం గుబాళిస్తుంది.
కవి భావుకత వ్యంగ్య ధనువును ఎక్కు పెడితే, సంస్కారం వాస్తవికత భాగాన్ని గుండెలకు గురిపెట్టి కొడుతున్నది. ఆ దెబ్బ తప్పదు. అది ఎంత సున్నితంగా తాకుతుందో అంత గాఢంగా ముద్ర వేస్తుంది. వచన పద్యం ఎంత సహజమైన ఛందస్సో, ఈ ఖండికలోని రచన కూడా అంత సహజంగా రూపుదిద్దుకున్నది. కుందుర్తి వాన కురిసింది నగరంలోనే అయినా, ఆ వానలో తడి సింది మాత్రం సామాన్యుడి జీవనమే ! ఇందులో వాన కేవలం కేన్వాసు మాత్రమే. దాని ఆధారంగా చేసుకుని కవి చిత్రించిన వాస్తవిక దృశ్యాలు మనల్ని నిలబెట్టి ఆలోచింపజేస్తాయి.
ప్రశ్నలు – సమాధానములు
1. ‘నగరంలో వాన’ దేనితో అంతమవుతుంది ?
జవాబు:
రాజకీయ శాసనంతో అంతమవుతుంది.
2. కవి దేనినుంచి వాస్తవికతను సృష్టిస్తాడు ?
జవాబు:
కవి వ్యంగ్యం నుంచి వాస్తవికతను సృష్టిస్తాడు.
3. కుందుర్తి నగరంలో వాన కవితను ఏ శైలిలో రాశాడు ?
జవాబు:
కుందుర్తి ‘నగరంలో వాన’ కవితను ‘వచన పద్య ఛందస్సు’ లో వ్రాశారు.
4. నగరంలో వాన కవితలోని ప్రధానాంశం ఏమిటి ?
జవాబు:
సామాన్యుడి జీవనమే ప్రధానాంశం.
5. మనల్ని ఆలోచింపచేసేవి ఏవి ?
జవాబు:
కవి చిత్రించిన వాస్తవిక దృశ్యాలు మనల్ని నిలబెట్టి ఆలోచింపచేస్తాయి.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (5 మార్కులు)
సృజనాత్మక ప్రశ్నలు
ప్రశ్న 1.
మీ పల్లె గురించి వివరిస్తూ కవిత రాయండి.
జవాబు:
మా పల్లె
మా పల్లె అందిస్తోంది కలుషితం కాని ఆహారం. మా పల్లె అందిస్తోంది మంచి మనసుల సహవాసం. మా పల్లె కలిగిస్తోంది పక్షులు, జంతువులకు ఆవాసం. మా పల్లె అందిస్తోంది బడిలో చక్కటి చదువులు మా కోసం.
మా పల్లె నేర్పిస్తోంది ఎక్కడా తలవంచని శౌర్య పౌరుషాలు.
మా పల్లె పాడిపంటలకు ఆలవాలం.
చిరునవ్వుకు చిరునామా మా పల్లె రండి. రండి……
ప్రశ్న 2.
గోలకొండ పట్టణం గురించి మీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:
హైదరాబాదు,
X X X X X.
ప్రియనేస్తమా సుభాష్,
గోలకొండ పట్టణం చరిత్ర ప్రసిద్ధి గల పట్టణం. గోలకొండ మూడు కోటల నిలయం. గోలకొండ పట్టణ నిర్మాణ పథక కర్త ఆజంఖాన్ అనే ఇంజనీరు.
ఈ పట్టణంలో ఏనుగులు, గుఱ్ఱాలు, ఒంటెలు ఎక్కువగా ఉండేవి. జనం కూడా చాలా మంది ఉండేవారు. వీధులు చాలా విశాలంగా ఉండేవి.
గోలకొండ పట్టణాన్ని నలుగురు నవాబులు అద్భుతంగా అభివృద్ధి చేశారు. అనేక భవనాలు కట్టించారు. అందమైన ఉద్యానవనాలు కూడా ఏర్పరచారు. మిద్దెల మీది తోటలు గోలకొండ ప్రత్యేకత.
నీవు దర్శించిన వరంగల్లు పట్టణం ప్రత్యేకతలురాయి.
ఇట్లు,
నీ స్నేహితుడు,
X X X X.
చిరునామా :
వై. సుభాష్, నెం. 20,
10వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
మధిర, ఖమ్మం జిల్లా.
ప్రశ్న 3.
చక్కటి గోలకొండ నగరాన్ని నిర్మించి ఇచ్చిన ఆజంఖాన్ ను అభినందిస్తూ ఒక అభినందన పత్రం రాయండి.
జవాబు:
గోలకొండ నిర్మాత ఆజంఖాన్కు సమర్పించు
అభినందన పత్రం
అలనాటి మేటి ఇంజనీర్ ఆజంఖాన్ !
నీ మేధకు అపురూప సాక్ష్యం గోలకొండ పట్టణం. 500 సంవత్సరాలు దాటినా నీ కళాత్మక సృష్టి కొత్తకొత్తగానే కనిపిస్తోంది. ఆ భవన నిర్మాణాలు మీ ఆలోచనా పటిష్ఠతను చెబుతున్నాయి. ఆ వీధుల వైశాల్యం నీ హృదయ విశాలతను చాటు తున్నాయి. రమ్యమైన ఉద్యానవనాలు అందమైన మీ కళాత్మక దృష్టికి దర్పణం పడుతున్నాయి. నీ వంటి మహోన్నతుడిని అభినందించడం మా అదృష్టం. అందుకోండి మా అభినందన మందారమాల.
ఇట్ల
గోలకొండ పట్టణ అభివృద్ధి కమిటీ.
ప్రశ్న 4.
ఇటీవల నీవు సందర్శించిన చారిత్రక కట్టడాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.
జవాబు:
సిరిపూర్ కాగజ్నగర్,
తేది : ……………
ప్రియ మిత్రమా,
నేను ఇక్కడ క్షేమం. నువ్వూ అక్కడ క్షేమంగా ఉన్నావని తలుస్తాను. ముఖ్యంగా ఈ లేఖ రాయడంలో ఉద్ధేశ్యం ఏమిటంటే నేను ఇటీవల మన ప్రఖ్యాత చారిత్రక కట్టడం రామప్ప గుడిని సందర్శించాను. దాని విశేషాలను నీతో పంచుకుందామని అనుకొంటు న్నాను. రామప్ప దేవాలయాన్ని ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించారు. ఇది హైదరాబాదు 157 కి.మీ. దూరంలో వరంగల్ జిల్లా పాలంపేరు అనే ఊరి దగ్గర ఉంది. ఇక్కడ ప్రధాన దైవం రామలింగేశ్వరస్వామి.
ఈ ఆలయం దానిలోని దైవం పేరు మీదుగా కాక, దానిని చెక్కిన శిల్పి రామప్ప పేరు మీదుగా ప్రసిద్ధి చెందటం విశేషం. ఇక్కడ శిల్ప సంపద కాకతీయులు కళాభిరుచికి నిదర్శనం. ఎత్తైన పీఠం పై నల్లరాతితో చెక్కబడిన పెద్ద శివలింగం చక్కగా ఉంది. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ దిశ నుండి చూసినా నంది మనవైపే చూస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడ ఇటుకలు నీటిమీద తేలుతూ ఉంటాయి. ఇక్కడ కాకతీయుల శిల్ప చాతుర్యం నాకు చాలా ఆనందాన్ని కలుగజేసింది. మరో ఉత్తరంతో మరలా కలుస్తాను సెలవు.
ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
X X X X.
చిరునామా :
క్రొత్త నాగేశ్వర్,
ఇం. నెం. 3-256,
గాంధీ నగర్,
నల్లగొండ,
ప్రశ్న 5.
‘గోలకొండ పట్టణము’ లోని అందచందాలను ‘వచన కవిత’ రూపంలో రాయండి.
జవాబు:
గోలకొండ దక్షిణాపథమ్మున అలరె
జగతికి జాగృతిని కల్పించె
తెలంగాణమ్ములన మకుటాయమానమ్ముగ
నిలచె గగన తలంబుదాక !
శిల్పకళావైభవంబున కొదువలేదు
నిర్మాణ కౌశలమ్మునకు ఎదురు లేదు
ప్రకృతిరమణీయతకు తిరుగులేదు
చూచినంతనే చూడాలనిపించు
వ్యాపార సామ్రాజ్యమునకు నెలవుగా నిలిచె
రామదాసు కీర్తనలకు ఆలవాలమాయె
పాలకుల ఏలుబడిలో జీవకారుణ్యం అలరె
సకల వసతులకు మూలకేంద్రమాయె.
అదనపు వ్యాకరణాంశాలు
PAPER – I : PART – B
1. సొంతవాక్యాలు
1. పెంపుసొంపులు : నగరం పెంపుసొంపులకై ముఖ్యమంత్రిగారు బాగా కష్టపడుతున్నారు.
2. మిరుమిట్లు గొలుపు సర్కసువారు ఏర్పాటు చేసిన దీప కాంతులు కళ్ళకు మిరుమిట్లు గొలుపు తున్నాయి.
3. రాకపోకలు : దేశంలో రాకపోకలకై అనేక రహదారులు కలవు.
2. పర్యాయపదాలు
ఏనుగు = దంతి, హస్తి, ద్విరదము, గజము, అనే కపము
ఒంటె = లొట్టె, లొట్టిపిట్ట, ఉష్ట్రము, వాసంతము
గుఱ్ఱము = ఘోటకము, వీతి, తురగము, తురంగము
ద్రాక్ష = కృష్ణ, గోసన్తి, మధురస, స్వాద్వి
మేడ = ఉపకారిక, పురము, నగరు, సౌదము
వర్తకుడు = వైదేహకుడు, వణిజుడు, సార్ధవాహుడు, వైగముడు
హర్మ్యము = మేడ, ప్రాసాదము, సౌధము, భవనము
ధ్వజము = పతాకము, కేతనము, టెక్కెము, జెండా
జైలు = చెరసాల, కారాగృహము, ఖైదు
హాటకం = బంగారం, సువర్ణం, పసిడి, హేమం,
భార్య = పతి, ఇల్లాలు, ఆలి
పోరాటం = యుద్ధము, సంగ్రామము, సమరము
బాట = దారి, మార్గము
భర్త = ధవుడు, నాథుడు, పతి, మగడు
3. వ్యుత్పత్త్యర్థాలు
రాజధాని = రాజు నివసించే ప్రధాన పట్టణము (రాచవీడు)
భవనము = బాలురు దీనియందు పుట్టుదురు (ఇల్లు)
నందనము= సంతోషపెట్టునది (ఇంద్రుని ఉద్యాన వనము)
హర్మ్యము = మనస్సును హరించునది (ధనికుని గృహము)
4. నానార్థాలు
పట్టణము = రాజధాని, ఉత్తరీయము, వస్త్రము
సమ్మర్దము = గుంపు, రాపిడి, యుద్ధము, త్రొక్కుట
జలము = నీళ్ళు, జడము, కురువేర, ఎఱ్ఱ తామర
శిఖరము = అగ్రము, కొండ కొన, మండపము
గాలి = వాయువు, పిశాచము, దుర్భాష
ధర = నేల, మెదడు, వెల, రక్తనాళము
అంబరము = వస్త్రము, ఆకాశము
ఆశ = కోరిక, దిక్కు
పేరు = నామధేయం, కీర్తి, అధికం, హారము
క్షేత్రము = చోటు, పుణ్యస్థానం, శరీరము, భూమి
5. ప్రకృతి – వికృతులు
రూపము – రూపు
స్త్రీలు – ఇంతులు
మృత్యువు – మిత్తి
భీతి – బీతు
దేవాలయము – దేవళము
ముఖము – మొగము
రాజ్ఞి – రాణి
కర్పూరము – కప్పురము
పట్టణము – పట్నము, పట్టము
నాణకము – నాణెము
హృదయము – ఎద, ఎడ,ఎడద
యజ్ఞం – జన్నం
గుచ్ఛము – గుత్తి
భటుడు – బంటు
యోధులు – జోదులు
స్తంభము – కంబము
భీతి – భీతు
ప్రయాణం – పయనం
ఆజ్ఞ = ఆన
గృహము = గీము
రాట్టు = ఱేడు
భక్తి – బత్తి
కవిత – కైత
దిశ – దెస
కావ్యము – కబ్బము
దక్షిణము – దక్కిణము
భాష – బాస
పల్యంకిక – పల్లకి
విద్య – విద్దె
శిఖ – సిగ
ఉష్ట్రము – ఒంటె
PAPER – II : PART – B
1. సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమగునపుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును.
ఉదా : దేవాలయాలు = దేవ + ఆలయాలు
ఉపాహరము = ఉప + ఆహారము
క్రమాభివృద్ధి = క్రమ + అభివృద్ధి
సౌకర్యార్థము = సౌకర్య + అర్థము
విక్రయాదులు = విక్రయ + ఆదులు
రాజాదరణము = రాజ + ఆదరణము
సింగరాచార్య = సింగర + ఆచార్య
హటకాంబర = హటక + అంబర
తెలగనార్యుని = తెలగన + ఆర్యుని
రాజాజ్ఞ = రాజ + ఆజ్ఞ
పటాటోపము = పట + ఆటోపము
శస్త్రాదులు = శస్త్ర + ఆదులు
కార్యాలయము = కార్య + ఆలయము
2. గుణ సంధి
సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమముగా ఏ, ఓ, ఆర్లు ఏకాదేశమగును.
ఉదా :
రమ్యోద్యానములు = రమ్య + ఉద్యానములు
రాజోద్యోగులు = రాజ + ఉద్యోగులు
సంవరణోపాఖ్యానము = సంవరణ + ఉపాఖ్యానము
3. వృద్ధి సంధి
సూత్రం : అకారమునకు ఏ – ఐలు పరమగునపుడు
‘ఐ’ కారమును, ‘ఓ ఔలు పరమగునపుడు ‘ఔ’
కారమును ఏకాదేశమగును.
‘ఐ – ఔ’ లను వృద్ధులు అని అందురు.
ఉదా : ఏకైక = ఏక + ఏక
4. యణాదేశ సంధి
సూత్రం : ఇ – ఉ – ఋ లకు అసమానమయిన అచ్చులు పరమగునప్పుడు క్రమంగా య – వ – ర లు ఆదేశమగును.
ఉదా : అత్యంత = అతి + అంత
5. అనునాసిక సంధి
సూత్రం : క – చ – ట – త – ప లకు న – మ లు పరమైతే క్రమంగా జ్ఞ – ఞ ణ న – మలు ఆదేశమగును.
ఉదా : వాఙ్మయము = వాక్ + మయము
6. లులనల సంధి
సూత్రం : లు- ల – న లు పరంబగునపుడు ఒకానొకచో ముగామంబునకు లోపంబును దత్పూర్వ స్వరంబునకు దీర్ఘంబును విభాషనగు.
ఉదా : వజ్రాలు = వజ్రము + లు
2. సమాసాలు
సమాస పదము – విగ్రహవాక్యము – సమాసము పేరు
గోలకొండ పట్టణము – గోలకొండ అను పేరుగల పట్టణము – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
మజ్నూ బురుజు – మజ్నూ అను పేరు గల బురుజు – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
హైదరాబాద్ నగరము – హైదరాబాద్ అను పేరు గల నగరము – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
మచిలీపట్టణము – మచిలీ అను పేరుగల పట్టణము – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
బంజారా దర్వాజ – బంజారా అను పేరుగల దర్వాజ – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
మూడు కోటలు – మూడు సంఖ్య గల కోటలు – ద్విగు సమాసం
ఏడు మైళ్ళు రెండు – ఏడు సంఖ్యగల మైళ్ళు – ద్విగు సమాసం
రెండు వస్తువులు – రెండు సంఖ్యగల వస్తువులు – ద్విగు సమాసం
రెండు బారకాసులు – రెండైన బారకాసులు – ద్విగు సమాసం
నాలుగు కుర్చీలు – నాలుగైన కుర్చీలు – ద్విగు సమాసం
రెండు లక్షలు – రెండైన లక్షలు – ద్విగు సమాసం
పన్నెండు ద్వారములు – పన్నెండు సంఖ్య గల ద్వారములు – ద్విగు సమాసం
నలుమూలలు – నాలుగైన మూలలు – ద్విగు సమాసం
జనసమ్మర్దము – జనము చేత సమ్మర్థము – తృతీయా తత్పురుష సమాసం
వజ్రాల వ్యాపారము – వజ్రాలతో వ్యాపారము – తృతీయా తత్పురుష సమాసం
బంగారు నాణెము – బంగారంతో నాణెలు – తృతీయా తత్పురుష సమాసం
స్నాన మందిరము – స్నానము కొరకు మందిరము – చతుర్థీ తత్పురుష సమాసం
రాజభవనాలు – రాజుల కొఱకు భవనాలు – చతుర్థీ తత్పురుష సమాసం
భిక్షా గృహములు – భిక్ష కొఱకు గృహములు – చతుర్థీ తత్పురుష సమాసం
విహారభూమి – విహారము కొఱకు భూమి – చతుర్థీ తత్పురుష సమాసం
రూపురేఖలు – రూపును, రేఖయు – ద్వంద్వ సమాసం
క్రయ విక్రయాలు – క్రయమును, విక్రయమును – ద్వంద్వ సమాసం
అస్త్రశస్త్రములు – అస్త్రమును, శస్త్రమును – ద్వంద్వ సమాసం
సంపద్వైభవములు – సంపత్తును, వైభవమును – ద్వంద్వ సమాసం
కూరగాయలు – కూరయును, కాయయును – ద్వంద్వ సమాసం
రాకపోకలు – రాకయును, పోకయును – ద్వంద్వ సమాసం
అందచందములు – అందమును, చందమును – ద్వంద్వ సమాసం
ప్రజాసముదాయము – ప్రజల యొక్క సముదాయము – షష్ఠీ తత్పురుష సమాసం
పర్వత శిఖరము – పర్వతము యొక్క శిఖరము – షష్ఠీ తత్పురుష సమాసం
గోలకొండ ప్రాధాన్యము – గోలకొండ యొక్క ప్రాధాన్యము – షష్ఠీ తత్పురుష సమాసం
వెండిపూత – వెండితో పూత – షష్ఠీ తత్పురుష సమాసం
వణికుంగవులు – వర్తకులలో శ్రేష్ఠులు – షష్ఠీ తత్పురుష సమాసం
దుర్గతటాకము – దుర్గము నందలి తటాకము – సప్తమీ తత్పురుష సమాసం
విద్యాప్రియుడు – విద్యలయందు ప్రియుడు – సప్తమీ తత్పురుష సమాసం
ద్వార రక్షకులు – ద్వారమును రక్షించేవారు – ద్వితీయా తత్పురుష సమాసం
యుద్ధభీతి – యుద్ధము వలన భీతి – పంచమీ తత్పురుష సమాసం
సుందరాకారము – సుందరమైన ఆకారము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. వాక్య పరిజ్ఞానం
అ) క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యంగా మార్చండి.
1. నేను గుంటూరు వచ్చాను. శారదానికేతనంలో చేరాను.
జవాబు:
నేను గుంటూరు వచ్చి శారదానికేతనంలో చేరాను.
2. రవి బాగా చదివాడు. రవి పరీక్ష వ్రాశాడు.
జవాబు:
రవి బాగా చదివి పరీక్ష వ్రాసాడు.
3. గోపాల్ బాగా చదువుతాడు. గోపాల్ తొమ్మిదింటికే నిద్రపోతాడు.
జవాబు:
గోపాల్ బాగా చదివి తొమ్మిదింటికే నిద్రపోతాడు.
4. గీత బాగా నృత్యం నేర్చుకొంది. గీత బాగా నృత్యం చేసింది.
జవాబు:
గీత బాగా నృత్యం నేర్చుకొని, చేసింది.
5. మంచి రచనలను వ్రాయండి. మంచి మెప్పు పొందండి.
జవాబు:
మంచి రచనలను వ్రాసి మెప్పు పొందండి.
ఆ) క్రింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగాను, కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగాను రాయండి.
1. దున్నేవానికి భూమినిచ్చే హక్కు తయారయ్యింది. (కర్తరి వాక్యం)
జవాబు:
దున్నేవానికి భూమినిచ్చే హక్కు తయారు చేయబడింది. (కర్మణి వాక్యం)
2. బూర్గులవారు మంచినిర్ణయాలు తీసుకున్నారు. (కర్తరి వాక్యం).
జవాబు:
బూర్గుల వారిచే మంచి నిర్ణయాలు తీసుకొనబడ్డాయి. (కర్మణి వాక్యం)
3. వారి న్యాయవాద పటిమ ఇతరులను అబ్బురపరచింది. (కర్తరి వాక్యం)
జవాబు:
వారి న్యాయవాద పటిమ ఇతరులచే అబ్బురపరచబడింది. (కర్మణి వాక్యం)
4. రేఖామాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. (కర్తరి వాక్యం)
జవాబు:
రేఖామాత్రంగా నా భావాలను ఇక్కడ పొందుపరిచాను. (కర్మణి వాక్యం)
5. పర్షియన్ ట్యూటర్గా ఆయన కొంతకాలం పని చేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:
పర్షియన్ ట్యూటర్ ఆయనచే కొంతకాలం పని చేయబడింది. (కర్మణి వాక్యం)
ఇ) క్రింది ప్రత్యక్ష కథనాలను పరోక్ష కథనంలోకి మార్చి రాయండి.
ప్రశ్న 1.
‘నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను’ అని అమ్మతో అన్నాను.
జవాబు:
తాను నేటి సినిమాలను చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాడు.
ప్రశ్న 2.
నీకివ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అతడన్నాడు.
జవాబు:
అతనికివ్వాల్సింది ఏమీలేదని నాతో అన్నాడు.
ప్రశ్న 3.
సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు.
జవాబు:
‘సుందరకాండ చదువుము’ అని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు.
ప్రశ్న 4.
వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాశ్ ఊరికెళ్ళాడని.
జవాబు:
వాళ్ళమ్మ చెప్పింది “భానుప్రకాశ్ ఊరికి వెళ్ళాడు” అని.
ప్రశ్న 5.
ప్రజ్ఞ పద్యాలు బాగాపాడిందని అందరను కుంటున్నారు.
జవాబు:
“ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది” అని అందరను కుంటున్నారు.