These TS 10th Class Telugu Important Questions 12th Lesson భూమిక will help the students to improve their time and approach.
TS 10th Class Telugu 12th Lesson Important Questions భూమిక
PAPER – 1 : PART- A
I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)
1. లఘు సమాధాన ప్రశ్నలు (3 మార్కులు)
అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘భూమిక లేక పీఠిక’ అనే సాహిత్య ప్రక్రియను గూర్చి వివరించండి.
జవాబు:
ఒక పుస్తకానికి ముందు రాసే ముందుమాటనే ‘పీఠిక’ లేక ‘భూమిక’ అని అంటారు. ఒక పుస్తకం ఆశయాన్నీ, దానిలోని సారాన్నీ, దాని తత్త్వాన్నీ, ఆ గ్రంథ రచయిత దృక్పథాన్నీ, ‘ముందుమాట’ తెలియజేస్తుంది.
ఒక గ్రంథము యొక్క నేపథ్యమును, లక్ష్యములను పరిచయము చేస్తూ స్వయంగా ఆ గ్రంథ రచయిత గానీ, మరొకరు గానీ, లేదా ఒక విమర్శకుడు గానీ రాసే విశ్లేషాత్మక పరిచయ వాక్యాలను, ‘పీఠిక’ లేక ‘భూమిక’ అని పిలుస్తారు. ఈ పీఠికనే, ముందుమాట, భూమిక, ప్రస్తావన, తొలిపలుకు, ఆముఖము, మున్నుడి అనే పేర్లతో కూడా పిలుస్తారు.
నేషనల్ బుక్ ట్రస్టు ప్రచురించిన నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథల సంపుటానికి, శ్రీ గూడూరి సీతారాం గారు పీఠిక రాశారు.
ప్రశ్న 2.
సంక్షుభిత వాతావరణంలో హిందూ, ముస్లింల సఖ్యత కోసం ఎందరో ప్రజాస్వామిక వాదులు నడుం బిగించారు అంటే మీకేమి అర్థమయింది ?
జవాబు:
ఆ రోజులలో హిందూ – ముస్లింల సఖ్యత లోపించింది. మానవ సంబంధాలు మరుగునపడ్డాయి. మమతలు మసకబారినాయి. మతాల ముసుగులో దారుణాలు ఎక్కువయ్యాయి. కులాతీత సమాజం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. మతాతీత స్నేహాలు మటుమా యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆత్మీయతలు అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే దానిని సంక్షుభిత వాతావరణం అన్నారు.
ఆ సంక్షుభిత వాతావరణాన్ని చక్కబరిచి, మళ్ళీ మమతలు, ఆత్మీయతలు, స్నేహాలు పెంపొంది కులాతీత మతాతీత సమాజం ఏర్పడటానికి చాలామంది ప్రజాస్వామికవాదులు పూనుకొన్నారని అర్థమయింది.
ప్రశ్న 3.
నెల్లూరి కేశవస్వామి హృదయాన్ని ఆవిష్కరించండి.
జవాబు:
ఒక రచయిత యొక్క హృదయం అతని రచనలలో కన్పిస్తుంది. అలాగే నెల్లూరి కేశవస్వామి హృదయం ఆయన రచనలలో కన్పిస్తుంది. కేశవస్వామి హృదయం ఆయన రాసిన కథలలో కనిపిస్తుంది. స్వామి లోహియా సోషలిస్టు. సమాజంలో అన్ని కులాలవారు, అన్ని మతాల వారు స్నేహభావంతో ఉండాలని ఆయన ఆలోచన.
దానికి విఘాతం కలిగితే తట్టుకోలేడు. అందుకే హిందూ – ముస్లిం సఖ్యత లోపించినపుడు అశాంతిగా గడిపాడు. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపాడు. స్నేహం కోసం తపించాడు. ఆత్మీయత కోసం అర్రులు చాచాడు. కులాతీత, మతాతీత సమాజ నిర్మాణం కోసం చాలా ప్రయత్నం చేశాడు. ఆయన రచించిన చార్మినార్ కథలలో ఇవే కనిపిస్తాయి.
సామాజిక శాస్త్రవేత్తగా తన ప్రయత్నాలు తాను చేస్తూనే, ఉత్తమ సమాజ నిర్మాణానికి కథల ద్వారా పాఠకులలో చైతన్యం కల్గించాడు. సామాజిక మార్పులను తన కథలలో వ్యక్తపరిచాడు. సామాజిక చరిత్రను కథలలో రాశాడు.
ప్రశ్న 4.
కేశవస్వామి చాలా కథలు రచించాడు కదా! కథా రచన వలన ప్రయోజనం ఏమిటి?
జవాబు:
కేశవస్వామి తన కథల ద్వారా నాటి సమాజాన్ని గురించి తెలియజేశారు. ఆనాటి సమాజాన్ని చైతన్యపరిచారు. అలాగే కథల వలన సమాజాన్ని చైతన్యపరచవచ్చు. సమాజాన్ని సంస్కరించవచ్చును. సమాజంలోని అసమానతలను ప్రశ్నించవచ్చు. సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు సూచించవచ్చును.
కథలోని భాష, శైలి సామాన్య పాఠకులను కూడా ఆకట్టుకొనేలా ఉండాలి. పాఠకుల హృదయాలను కదిలించగలవు. ఉత్తమ సమాజ నిర్మాణానికి తమవంతు ప్రయత్నాన్ని తాము చేయాలనే సంకల్పం కలిగిస్తాయి. ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకొనే అవకాశం కల్పిస్తాయి. పాఠకుల మనోధైర్యాన్ని పెంచుతాయి. పాఠకులకు ఆనందాన్ని కల్గిస్తాయి. కత్తితో సాధ్యం కానిది, కలంతో సాధ్యమని కథలు నిరూపిస్తాయి. అందుకే ఉత్తమ కథా సాహిత్యం ఉత్తమ సమాజాన్ని రూపొందిస్తుందంటారు.
ప్రశ్న 5.
నెల్లూరి కేశవస్వామి కథల్లోని వస్తు వైవిధ్యాన్ని వివరించండి.
జవాబు:
కేశవస్వామి ‘చార్మినార్ కథలు’ సంపుటిలో 11 కథలున్నాయి. ఈ కథలన్నీ విశిష్టమైనవి, దేనికదే ప్రత్యేకమైనవి. ‘యుగాంతం’ కథ ఆనాటి సామాజిక, చారిత్రక పరిణామాల నేపథ్యంలో సాగింది. ‘మహీఅపా’ కథలో ముస్లిం నవాబులు ఒక ముజ్రాల రమణిని గౌరవించిన తీరు వారి హృదయం సంస్కారానికి అద్దం పడుతోంది. వంశాకురం వధ ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో, కొడుకు కావాలనే ఆశ ఆడపిల్లల జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తుందో చిత్రించింది. ‘కేవలం మనుషులం’ కథ మతాల సరిహద్దులను చెరిపివేసిన స్నేహం గురించి వివరిస్తుంది. భరోసా కథ నమ్మిన పేదలను నట్టేట ముంచిన వైనాన్ని తెలుపుతుంది.
ప్రశ్న 6.
‘భూమిక’ పాఠం రచయితను గురించి రాయండి. (June ’17)
జవాబు:
‘భూమిక’ పాఠ్యభాగ రచయిత గూడూరి సీతారాం. వీరు 18.07.1936న రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర గల హనుమాజీ పేటలో జన్మించారు. 1953 నుండి 1965 వరకు సుమారు 80 కథలు రాశారు. తెలంగాణ భాషను, యాసను ఒలికించడం ఈయన కలానికున్న ప్రత్యేకత. తెలంగాణ కథా సాహిత్యంలో పేదకులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షర బద్ధం చేసిన రచయిత. తెలంగాణా రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజారికం మొదలగునవి వీరి రచనలు. 25.09.2011 న వీరు మరణించారు.
ప్రశ్న 7.
“ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్, జాకోబ్ వజ్రాల వంటివే స్వర్గీయ నెల్లూరి కేసవస్వామి చార్మినార్ కథను ” వివరించండి.
జవాబు:
నెల్లూరి కేశవస్వామి ‘చార్మినార్ కథలు’ ఆనాటి చారిత్రక, సామాజిక పరిణామాలను నమోదు చేశాయి. మొత్తం 11 కథలలో దేనికదే ప్రత్యేకమైనది. దేనికదే విశిష్టమైనది, వస్తు వైవిధ్యంతో ఆనాటి హైదరాబాద్ లోని సామాజిక సమస్యలను మానవీయ కోణంలో స్పృశించారు. మతాతీతమైన స్నేహం, తెలంగాణా సాయుధ పోరాటం, ముస్లిం జీవన విధానం, ముస్లిం నవాబు హృదయ సంస్కారం మొదలైన అంశాలు ఇతి వృత్తాలుగా కథలు సాగాయి. అందుకే కేశవస్వామి కథలు కోహినూర్ వజ్రం లాంటివని గూడూరి సీతారాం వ్యాఖ్యానించారు.
ప్రశ్న 8.
గూడూరి సీతారాం సాహిత్యసేవను వివరించండి.
జవాబు:
గూడూరి సీతారాం కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించారు. 80 కథలు రాస్తే వాటిలో కొన్ని మాత్రమే లభ్యమవుతున్నాయి. తెలంగాణ కథా సాహిత్యాన్ని పేదల జీవితంతో, అట్టడుగు వర్గాల వారి జీవిత విశేషాలతో నింపారు. తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచి. తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పని చేసారు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజీరికం లాంటి కథలు రాసారు. తెలంగాణ భాష, యాసను వాడిన గొప్ప కవి.
ప్రశ్న 9.
‘ఈ ఒక్క కథ రాసి మరేమి రాయక పోయినప్పటికీ నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒక్కడుగా కీర్తించబడేవాడు’ – ఆ ఒక్క కథ ఏది ? దానికున్న ప్రాధాన్యాన్ని తెలుపండి. (June ’18)
జవాబు:
యుగాంతం నిజంగానే ఒక గొప్పకథ. ఇండియా రెండు దేశాలుగా విడిపోయి పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు. సంక్షోభాలు, హత్యాకాండ గురించి భీష్మ సహాని “తమస్” నవలలో చిత్రించారు. అది దూరదర్శన్ టి.వి.
సీరియల్గా ప్రసారమైనపుడు పెద్ద ఎత్తున చర్చ సాగింది. అలాంటి పరిస్థితులే హైదరాబాద్ రాజ్యంలో 1946-1950ల మధ్య ఎలా కొనసాగాయో చాలా మందికి తెలియదు. హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డంతో మూలకు నెట్టివేయబడింది. ఒక సామాజిక వ్యవస్థ, రాజరిక వ్యవస్థ అంతమవుతూ ఒక నూతన దశలోకి సమాజం, మానవ సంబంధాలు మారుతున్న పరిణామాలను చిత్రించడం వల్ల కథకు యుగాంతం అనే పేరు సార్థకతను చేకూర్చింది.
అందుకే ఈ ఒక్క కథ రాసి మరేమి రాయక పోయినా నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ గొప్ప కథకుల్లో ఒకడుగా కీర్తించబడేవాడు.
2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (6 మార్కులు)
క్రింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
ప్రశ్న1.
నెల్లూరి కేశవస్వామి కథలలోని ప్రత్యేకతలను వివరించండి. (Mar. ’16)
నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకరు. సమర్థించండి. (Mar. ’18)
జవాబు:
నెల్లూరి కేశవస్వామి, సుప్రసిద్ధ కథా రచయిత. ఈయన మొదటి కథల సంపుటి, ‘పసిడి బొమ్మ’. ఈయన రెండవ కథా సంపుటం చార్మినార్ కథలు. తాను అనుభవించిన జీవితం, స్నేహం, కులాతీత, మతాతీత వ్యవస్థలు, తెలిపే విధంగా ఓల్డ్ సిటీ. జీవితాన్ని, ‘చార్మినార్ కథలు’గా ఈయన రాశాడు.
ఒక సామాజిక శాస్త్రవేత్తగా, చైతన్యశీలిగా, తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఈ కథలను, ఈయన రాశాడు. ఈ చార్మినార్ కథలు, వాస్తవిక జీవితాల సామాజిక పరిణామాల చరిత్రతో నిండిన చారిత్రాత్మక కథలు. ఈ కథలో కేశవస్వామి హృదయం ఉంది.
ఈయన ‘రుహీ ఆపా’ అనే కథ, ముస్లిం నవాబులలోని హృదయ సంస్కారాన్ని తెలుపుతుంది. ఈయన కథలు, దేనికవే విశిష్టమైనవి. ప్రత్యేకమైనవి. ఈయన ‘యుగాంతం’ కథ, నిజంగానే ఒక యుగాంతాన్ని చిత్రించిన గొప్పకథ. ఈ కథలో హైదరాబాద్ రాజ్యంలో ప్రత్యేక పరిణామాలను ఒక చరిత్ర డాక్యుమెంటుగా ఈయన రాశాడు. ఈ కథ ఒక్కటే ఈయన రాసినా, భారతదేశం గర్వించదగ్గ కథకులలో ఒకడుగా ఈయన ఉండేవాడు.
ఈయన ‘వంశాకురం’ కథలో ముస్లిం పెళ్ళి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు. పేదల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో ‘భరోసా’ కథలో చెప్పాడు.
ఈయన కథలు, ‘కొహినూర్’, ‘జాకోబ్’ వజ్రాల వంటివి. ఈయన వాసిలో వస్తు నైపుణ్యంలో పేరుకెక్కిన కథలు రాశాడు.
ప్రశ్న2.
గూడూరి సీతారాం వ్యాసం ఆధారంగా నెల్లూరి కేశవస్వామి కథలను గురించి రాయండి.
జవాబు:
నెల్లూరి కేశవస్వామి సుప్రసిద్ధ కథా రచయిత. ఆయన రాసిన కొన్ని కథలు నేడు దొరకట్లేదు. ఈయన తన కథలను కొన్ని సంపుటాలుగా వెలువరించాడు. ఈయన తొలికథల సంపుటి “పసిడి బొమ్మ”. ఇది 1969లో వెలువడింది. ఇది భాస్కరభట్ల కృష్ణారావుగారికి అంకితం ఇవ్వబడింది. ఈయన రెండవ కథా సంకలనం
“చార్మినార్” కథలు. ఇవి ఊహించి రాసిన కథలు కావు. ఇది సమాజంలోని మార్పులను కథలుగా రాసిన సామాజిక చరిత్ర రచన అని చెప్పాలి. చార్ మినార్ కథలు హైదరాబాదు సంస్కృతినీ, మానవ సంబంధాలనూ, అక్కడి ముస్లింల జీవితాలనూ అపూర్వంగా చిత్రించాయి. ఇవి మొత్తం 11 కథలు. హైదరాబాద్ నగరం కాస్మో పాలిటన్ నగరంగా ఎదిగింది. ఆ నేపథ్యాలనూ, ఆ జీవితాలనూ కేశవస్వామి చార్మినార్ కథల్లో చిత్రించాడు.
ఈయన “యుగాంతం” కథ సార్థకమైంది. దీనిలో హైదరాబాద్ రాజ్యంలో పరిణామాలను ఒక చారిత్రక డాక్యుమెంటుగా రాశాడు. ఈ ఒక్క కథే రాసినా, కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ గొప్ప కథకుల్లో ఒక్కడు అయ్యేవాడు.
చార్మినార్ కథల్లో కేశవస్వామి హృదయం ఉంది. ఇవి నిజాం రాజ్యయుగం అంతరించిన పరిణామాలకు చిత్రించిన కథలు, కేశవస్వామి రాసిన ‘రుహీ అపో’ కథ, గొప్ప మానవీయ సంబంధాలనూ, కులమతాలకు అతీతంగా స్పందించిన మనిషినీ చిత్రించిన కథ. ఈ కథలో ముస్లిం నవాబుల్లో ఉన్న హృదయ సంస్కారాన్ని రచయిత చక్కగా చూపించాడు.
ఈయన ‘వంశాంకురం’ కథలో ముస్లిం పెళ్ళి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు. నమ్మిన పేదల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో ‘భరోసా’ కథలో చెప్పాడు. కేశవస్వామి వాసిలో, వస్తు నైపుణ్యంలో వాసికెక్కిన కథలు రాశాడు. ఈయన హిందీ కథా రచయితలు ప్రేమ్చంద్, కిషన్ చందర్లతో పోల్చదగిన గొప్ప కథా రచయిత.
PAPER – II : PART – A
I. అవగాహన – ప్రతిస్పందన
అపరిచిత గద్యాలు
ప్రశ్న1.
క్రింది గద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన వాక్యాలలో తప్పొప్పులను గుర్తించండి. (5 మార్కులు)
“పూర్వం నుండి మనకు తులసి, రావి, వేప చెట్లను పూజించే సంప్రదాయం ఉంది. అనాది నుండి మనం తులసిని దేవతగా పూజిస్తూ వస్తున్నాం. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. పూర్వకాలంలో తట్టు, ఆటలమ్మ వంటి వ్యాధులు వచ్చినప్పుడు రోగి దగ్గర వేపాకులు ఉంచేవారు. వేపాకులను ఒంటికి రాసేవారు. స్నానం చేయించే ముందు వేపాకులు ముద్దగా నూరి, నూనె, పసుపు కలిపి ఒంటికి రాసేవారు. ఎందుకనగా తట్టు, ఆటలమ్మ వస్తే దేహంపై పొక్కులు వస్తాయి. కొన్ని పచ్చిగా దురద పెడతాయి. అలా దురద రాకుండా ఉండడానికి, గోకటం మానడానికి, ఈ వేపాకు, పసుపు దోహద పడతాయి. ఈ రకంగా వైద్యశాస్త్రానికి సంబంధించిన వేప, సంస్కృతీపరంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకొంది.
తప్పొప్పులు
1. తులసిని మనము నేడు దేవతగా పూజిస్తున్నాం.
జవాబు:
తప్పు
2. తులసిలో ఔషధ గుణాలున్నాయని శాస్త్రజ్ఞుల కథనం.
జవాబు:
ఒప్పు
3. వేపకు వైద్యశాస్త్రంలోనే ప్రాధాన్యత ఉంది.
జవాబు:
తప్పు
4. దురద రాకుండా, గోకకుండా పసుపు, వేపాకులు ఉపయోగపడతాయి.
జవాబు:
ఒప్పు
5. తట్టు, ఆటలమ్మ వ్యాధులకు, పూర్వం వైద్యం లేదు.
జవాబు:
తప్పు
ప్రశ్న2.
క్రింది గద్యాన్ని చదివి, అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారుచేయండి.
వీరభద్రారెడ్డికి అంకితముగా కాశీఖండము రచించిన శ్రీనాథుడు, పోతనకు సమకాలికుడు. శ్రీనాథుడు కాశీఖండము అనే పురాణాన్ని తెనిగించినను దానిని స్వతంత్రించి ప్రబంధముల వలె రచించినాడు. భీమఖండము గోదావరి తీర దేశ దివ్య వైభవ వర్ణనా గ్రంథమని చెప్పవచ్చును. కాశీఖండము ప్రౌఢాంధ్ర కవితా పరిజ్ఞానమునకు చదువదగిన గ్రంథము. ఈయన హరవిలాసం వ్రాసి అవచి తిప్పయ్య శెట్టికి అంకితమిచ్చాడు. కవి సార్వభౌముడిగా ప్రసిద్ధి చెందిన శ్రీనాథుడు 15వ శతాబ్దివాడు. ఈయనకు ప్రౌఢ కవితా పాకంపై ప్రీతి ఎక్కువ.
జవాబులు:
- శ్రీనాథుని గ్రంథములెవ్వి ?
- శ్రీనాథుని బిరుదమేమి ?
- శ్రీనాథుడు హరవిలాసమును ఎవరికి అంకితమిచ్చెను?
- శ్రీనాథునికి దేనిపై మక్కువ ఎక్కువ ?
- వీరభద్రారెడ్డికి అంకితమిచ్చిన గ్రంథమేది ?
ప్రశ్న3.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
స్త్రీ జనోద్ధరణము కూడా సంఘసేవయే. పురుషులు మాత్రమే చదివి లోకమున విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకొనుట చాలదు. స్త్రీలు సహితము పురుషులతో పాటుగా చదువుకొన్నప్పుడే సంఘము బాగుపడును. సంఘమనే బండికి పురుషులిద్దరు రెండు చక్రములు వంటివారు. అందులో ఏ చక్రము అవిటిగా నున్నను ఆ బండి నడువజాలదు. కావున రెండు చక్రములను సరిగా నడుచునట్లు చూచుకొన్నప్పుడే బండి చక్కగా సాగిపోవును.
ప్రశ్నలు – జవాబులు
1. సంఘ సేవ యనదగినదేది ?
జవాబు:
స్త్రీల జనోద్ధరణము సంఘసేవ అనదగినది.
2. సంఘము ఎప్పుడు బాగుపడును ?
జవాబు:
స్త్రీలు కూడా పురుషులతో పాటుగా చదువుకొన్నప్పుడే సంఘం బాగుపడును.
3. సంఘమనే బండికి చక్రములవంటి వారెవరు ?
జవాబు:
సంఘమనే బండికి స్త్రీ పురుషులిద్దరూ రెండు చక్రముల వంటివారు.
4. బండి ఎప్పుడు చక్కగా సాగును ?
జవాబు:
రెండు చక్రములు సరిగా నడుచుచున్నట్లు చూచుకొన్నప్పుడే బండి చక్కగా సాగును.
5. ఎవరు విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకొనుట చాలదు ?
జవాబు:
పురుషులు మాత్రమే చదివి లోకమున విజ్ఞులమని, ప్రయోజకులమని చెప్పుకొనుట చాలును.
ప్రశ్న4.
క్రింది గద్యాన్ని చదివి, క్రింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
పొదుపు మానవ జీవితానికి అత్యవసరము. పొదుపు లేని మానవుడు దారం తెగిన గాలిపటం వంటివాడు. పొదుపు చేయకుండ అడ్డుపడే వాటిల్లో అతి ముఖ్యమైనవి కోరికలు. కోరికలు మానవుడిని మానసికంగా బలహీనుణ్ణి చేస్తాయి. పొదుపు అనేక విషయాలలో పాటించవచ్చు. ధనము, జలము, భాషణము మొదలగు వానిలో పొదుపు పాటించడం ద్వారా దేశాభివృద్ధిని సాధించగలము. పొదుపును నిర్లక్ష్యం చేస్తే అప్పులు చేయక తప్పదు. అప్పు చేయటం వలన మన వ్యక్తిత్వాన్నే కోల్పోతాము.
ప్రశ్నలు – సమాధానాలు
1. పొదుపు లేని మానవుడు ఎట్టివాడు ?
జవాబు:
పొదుపు లేని మానవుడు దారం తెగిన గాలిపటం వంటివాడు.
2. కోరికలు మానవుని ఏమి చేస్తాయి ?
జవాబు:
కోరికలు మానవుడిని మానసికంగా బలహీనుణ్ణి చేస్తాయి.
3. పొదుపు పాటించవలసిన ముఖ్య విషయాలేవి ?
జవాబు:
పొదుపు పాటించవలసిన ముఖ్య విషయాలు ధనం, జలం, భాషణం.
4. పొదుపును నిర్లక్ష్యం చేస్తే ఏమి జరుగుతుంది ?
జవాబు:
పొదుపును నిర్లక్ష్యం చేస్తే, అప్పులు చేయడం జరుగుతుంది.
5. అప్పు చేయటం వలన మనమేమి కోల్పోతాము ?
జవాబు:
అప్పు చేయడం వలన మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోతాము.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
సృజనాత్మక ప్రశ్నలు (5 మార్కులు)
ప్రశ్న 1.
ఉత్తమ సమాజం గురించి వివరించే కవిత రాయండి.
జవాబు:
ఆదర్శ సమాజం
కులాల కుళ్ళు లేదు.
మతాల మతలబులు లేవు.
ధనిక పేద తేడాలసలే లేవు.
మేడా మిద్దె గూడూ గుడిసె ఒక్కటే.
రాజకీయపు రంగురంగుల వలలు లేవు.
అరాచకపు ఆనవాళ్ళు అసలే లేవు.
ఆనందం, స్నేహం, సౌఖ్యం ఉన్నాయి.
అందరం ఒకే కుటుంబం అందరం బంధువులమే.
ఇదే మా ఆదర్శ సమాజం.
అదనపు వ్యాకరణాంశాలు
PAPER – 1: PART – B
1. సొంతవాక్యాలు
1. ఉన్నత శిఖరాలు : ప్రతి వ్యక్తి తన జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి అని ఆశించాలి.
2. సామాజిక పరిణామం : సంస్కర్తలు, తన శక్తి కొద్దీ మంచి సామాజిక పరిణామం తీసుకు రావడం కోసం కృషి చేయాలి.
3. నడుం బిగించు : హనుమంతుడు, కార్యసాధన కై నడుం బిగించాడు.
4. భారతీయ సంస్కృతి : వివేకానంద స్వామి దేశ విదేశాల్లో మన భారతీయ సంస్కృతి యొక్క గొప్ప తనాన్ని ప్రచారం చేశారు.
5. హృదయ విదారకం : వరద బాధితుల కష్టాలు వినడానికే హృదయ విదారకంగా ఉన్నాయి.
6. ఆదానప్రదానాలు
(ఇచ్చి పుచ్చుకోవడాలు) : అనుకున్న పని నెరవేరాలంటే, ఆదాన ప్రదానాలు రెండూ ఉండాలి.
7. అపూర్వంగా : షాజహాన్ తాజమహల్ను అపూర్వంగా నిర్మించాడు.
2. పర్యాయపదాలు
స్నేహము = ప్రేమ, ప్రియము, సాంగత్యము, మైత్రి, నెయ్యం
కథ = కత, కథానిక, ఆఖ్యాయిక, గాథ
సైన్యము = సేన, ధ్వజని, వాహిని, బలం, దండు, దళం
కవిత్వము = కవనము, కవిత, కయిత
ముస్లిమ్ = మహమ్మదీయుడు, తురుష్కుడు, పఠాణీ, యవనుడు
వంశము = కులము, అన్వయము, గోత్రము, జాతి, తెగ, సంతతి
పెళ్ళి = పరిణయము, వివాహము, ఉద్వా హము, కరగ్రహణము, కల్యాణము, మనువు
3. వ్యుత్పత్త్యర్థాలు
అంధకారము = లోకులను అంధులుగా చేయునట్టిది (చీకటి)
వార్తాపత్రిక = వార్తలను ప్రకటన చేయు కాగితం (వార్తాపత్రిక)
కేశవులు =
1) మంచి వెంట్రుకలు కలవాడు
2) కేశి అను రాక్షసుని చంపినవాడు
కథ = కొంచెము సత్యమును, కొంత కల్పన గల చరిత్ర – కత
అదృష్టము = చూడబడనిది – భాగ్యము
ఆయుధము = యుద్ధము చేయుటకు తగిన సాధనము – శస్త్రము
యుగాంతము = యుగముల అంతము మహా ప్రళయము
తెలుగు = త్రిలింగముల మధ్య ఉపయోగించబడు భాష – తెనుగు
వాతావరణము = గాలితో కూడి ఉండునది పర్యావరణము
హృదయము = హరింపబడునది గుండెకాయ
4. నానార్థాలు
భాష = బాస, మాట, వ్రతము, ప్రతిన
కథ = కత, పూర్వకథ, చెప్పుట, గౌరి
సుధ = అమృతము, సున్నము, ఇటుక
సొంపు = ఒప్పు, సంతోషం, సమృద్ధి
స్నేహము = చెలిమి, చమురు, ప్రేమ
రాజు = ప్రభువు, పాలకుడు, క్షత్రియుడు, యక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు
పత్రిక = కాగితము, పత్రము, జాబు, వార్తాపత్రిక
అచ్చు = ముద్ర, విధము, ప్రతిబింబము, నాణెము, పోతపోసిన అక్షరములు
పసిడి = బంగారము, ధనము
జీవితము = ప్రాణము, జీతము, జీవితకాలము, జీవనము
అపూర్వము = అపురూపము, తెలియనిది, క్రొత్తది, కారణములేనిది, పరబ్రహ్మము
వంశము = కులము, వెదురు, పిల్లనగ్రోవి, వెన్నెముక, సమూహము
యుగము = కాల పరిమాణ విశేషము, జత, కాళి, వయస్సు, రెండు బార
అదృష్టము = భాగ్యము, కర్మఫలము, చూడబడనిది, అనుభవింపబడనిది
చర్చ = విచారము, చింత, అధ్యయనము చేయుట, పార్వతి
సన్నివేశము = ఇంటివెనుక పెరడు, కలయిక, సమీపము, తావు
సంబంధము = చుట్టరికము, కూడిక
అక్క = పెద్దదైన తోబుట్టువు, పూజ్యస్త్రీ, వంటలక్క, తల్లి
భరణము = భరించుట, కూలి, జీతము
5. ప్రకృతి – వికృతులు
ప్రకృతి – వికృతి
స్నేహము -నెయ్యము
స్వామి – సామి
కవి – కయి
ఆర్య – అయ్య
రాజు – తేడు
పీఠము – పీట
కథ – కత
వృద్ధి – వడ్డీ
అత్యంత – అందంద
అంబ – అమ్మ
స్వీకారం – సేకరము
కథ – కత
జీవితము – జీతము
చిత్రము – చిత్తరువు
త్రిలింగము – తెలుగు
ప్రజ – పజ
అపూర్వము – అపురూపము
విధము – వితము
ఆశ్చర్యము – అచ్చెరువు
నిద్ర – నిదుర
హృదయము – ఎద
రాత్రి – రేయి
వంశము – వంగడము
PAPER – II : PART – B
1. సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును.
ఉదా :
రంగాచార్య – రంగ + ఆచార్య
విద్యాలయం – విద్య + ఆలయం
హిమాలయాలు – హిమ + ఆలయాలు
కోస్తాంధ్ర – కోస్త + ఆంధ్ర
వంశాకురం – వంశ + అంకురం
యుగాంతం – యుగ + అంతం
ఉత్తరాంధ్ర – ఉత్తర + ఆంధ్ర
సార్ధకత – స + అర్ధకత
అపార్ధాలు – అప + అర్ధాలు
కులాతీతము – కుల + అతీతము
మతాతీతము – మత + అతీతము
చారిత్రాత్మకం – చారిత్ర + ఆత్మకం
2. గుణ సంధి
సూత్రం: అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమగునప్పుడు క్రమముగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమగును.
ఉదా :
జాతీయోద్యమం – జాతీయ + ఉద్యమం
మహోన్నతము – మహ + ఉన్నతము
2. సమాసాలు
సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
తెలుగు సాహిత్యము – తెలుగు అను పేరుగల సాహిత్యం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
ఉస్మానియా యూనివర్శిటీ – ఉస్మానియా అను పేరుగల యూనివర్శిటీ – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
హైదరాబాద్ రాజ్యం – హైదరాబాద్ అను పేరుగల రాజ్యం – సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
సమాజ పరిశీలన – సమాజం యొక్క పరిశీలన – షష్ఠీ తత్పురుష సమాసము
తెలంగాణ పలుకుబడులు – తెలంగాణ యొక్క పలుకుబడులు – షష్ఠీ తత్పురుష సమాసము
హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర – హైదరాబాద్ రాష్ట్రం యొక్క చరిత్ర – షష్ఠీ తత్పురుష సమాసము
రైతాంగ పోరాటం – రైతాంగము యొక్క పోరాటం – షష్ఠీ తత్పురుష సమాసము
వంశాకురం – వంశమునకు అంకురం – షష్ఠీ తత్పురుష సమాసము
స్వేచ్ఛావాయువులు – స్వేచ్ఛ అనెడి వాయువులు – రూపక సమాసము
అదృష్టం – దృష్ఠం కానిది – నఞ తత్పురుష సమాసము
రాజకీయ పరిణామాలు – రాజకీయములందలి పరిణామాలు – సప్తమీ తత్పురుష సమాసము
శిల్ప నైపుణ్యము – శిల్పము నందు నైపుణ్యము – సప్తమీ తత్పురుష సమాసము
ప్రపంచ ప్రఖ్యాతి – ప్రపంచము నందు ప్రఖ్యాతి – సప్తమీ తత్పురుష సమాసము
3. వాక్య పరిజ్ఞానం
ఈ క్రింది వాక్యాలు ఏ రకానికి చెందినవో వ్రాయండి.
ప్రశ్న 1.
ఈనాటికీ విదేశీయులెవరైనా మన మహానగరాలకు వచ్చినట్లయితే వాళ్ళకు పావురాలు బృందాలు కనిపిస్తాయి.
జవాబు:
చేదర్థక వాక్యం
ప్రశ్న 2.
తెల్ల జెండాలు ఊపుతూ సంకేతాలు అందించే కుర్రాళ్ళు కనబడతారు.
జవాబు:
శత్రర్థక వాక్యం
ప్రశ్న 3.
రంగు రంగుల పావురాలతోనూ, నీలికళ్ళతో కువకువలాడే గువ్వలతోనూ నిండి ఉండడం కద్దు.
జవాబు:
సంయుక్త వాక్యం
ప్రశ్న 4.
అలా కలగలిసి, ఎగసి గంటల తరబడి ఎగిరాక తిరిగి అన్నీ విడివిడిగా తమ తమ యజమానుల ఇళ్ళకు చేరుకుంటాయి.
జవాబు:
సంక్లిష్ట వాక్యం
4. కర్తరి – కర్మణి వాక్యాలు
1. కర్తరి : అవి ఒక బృహత్తర సమూహంగా రూపొందుతాయి.
కర్మణి : ఒక బృహత్తర సమూహం వాటిచేత రూపొందించ బడుతుంది.
2. కర్తరి : మా పావురాన్ని హరివిల్లు మెడగాడు అని ముద్దుగా పిలుస్తూ ఉంటాను.
కర్మణి : మా పావురం హరివిల్లు మెడగాడని నా చేత ముద్దుగా పిలువబడుతూ ఉంటుంది.
3. కర్తరి : చిత్రగ్రీవం కథను నేను మొట్టమొదట్నుంచీ మొదలెడతాను.
కర్మణి : నా చేత చిత్రగ్రీవం కథ మొట్టమొదట్నుంచీ మొదలెట్టబడుతుంది.
4. కర్తరి : ఆ రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను.
కర్మణి : ఆ రోజు నా చేత ఎప్పటికీ మరచిపోబడదు.
5. కర్తరి : తల్లిపిట్టను మృదువుగా లేపి తీసి ఓ పక్కన ఉంచాను.
కర్మణి : తల్లిపిట్ట నా చేత మృదువుగా లేపబడి తీయబడి ఓ పక్కన ఉంచబడింది.
6. కర్తరి : వాటిని తగు మోతాదులోనే ఉంచాలి.
కర్మణి : అవి తగు మోతాదులోనే ఉంచబడాలి.
7. కర్తరి : ఆ ఆహారాన్ని పిల్లలకు అందిస్తాయి.
కర్మణి : ఆ ఆహారం పిల్లలకు అందించబడుతుంది.
8. కర్తరి : ఆ రోజుల్లోనే నేనో విషయం కనిపెట్టాను.
కర్మణి : ఓ విషయం ఆ రోజులలో నా చేత కనిపెట్ట
9. కర్తరి : ఆ రోజుల్లోనే దాని ఈకల రంగు మారడం గమనించాను.
కర్మణి : దాని ఈకల రంగు మారడం ఆ రోజులలోనే నా చేత గమనించబడింది.
10. కర్తరి : తండ్రిపక్షి జరగటం కొనసాగించింది.
కర్మణి : తండ్రిపక్షిచేత కూడా జరగటం కొనసాగించబడింది.