TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

These TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష will help the students to improve their time and approach.

TS 10th Class Telugu 11th Lesson Important Questions భిక్ష

PAPER – I : PART – A

I. వ్యక్తీకరణ – సృజనాత్మకత (స్వీయరచన)

1. లఘు సమాధాన ప్రశ్నలు (3 మార్కులు)

అ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘భిక్ష’ పాఠ్యభాగ రచయిత గురించి వివరించండి. (Mar. ’18)
(లేదా)
“భిక్ష” పాఠ్యభాగ కవి గురించి వ్రాయండి.
జవాబు:
‘భిక్ష’ పాఠ్యభాగ రచయిత మహాకవి శ్రీనాథుడు. తెలుగు సాహిత్యంలో కవిసార్వభౌముడిగా కీర్తి పొందాడు. తెలుగు సాహిత్యంలో శ్రీనాథ యుగం కూడా ఉంది. శ్రీనాథుడు 1380-1470 మధ్య జీవించాడు. అనగా 15వ శతాబ్ది కవి. రాజమహేంద్రవరంలో రెడ్డిరాజుల కొలువులో ఆస్థానకవి. మారయ, భీమాంబలు శ్రీనాథుని తల్లిదండ్రులు.

‘కవి సార్వభౌమ’ బిరుదాంకితుడు. పెదకోమటి వేమారెడ్డి కొలువులో విద్యాధికారి. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని గౌడడిండిమ భట్టును పాండిత్యంలో ఓడించాడు. అతని కంచుఢక్కను పగులకొట్టించాడు.

ప్రశ్న 2.
వ్యాసుని కోపకారణం తదనంతర పరిణామాలను (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
వ్యాసమహర్షి శిష్యపరివారంతో కలసి భిక్షకోసం కాశీలో తిరిగారు. పరమేశ్వరుని మాయతో రెండు రోజులపాటు ఆయనకు ఎవరూ భిక్ష పెట్టలేదు. దాంతో వ్యాసుడు తీవ్రంగా కోపగించాడు. భిక్షపాత్రను పగులకొట్టాడు. కాశీనగర ప్రజలకు మూడుతరములదాకా ధనం, విద్య, మోక్షం లేకుండుగాక ! అని శపించబోయాడు.

అంతలో పార్వతీదేవి పవిత్రమైన కాశీనగరాన్ని శపించడం తప్పని, ఉన్నఊరు కన్నతల్లితో సమానమని వ్యాసుడిని మందలించింది. వ్యాసుడిని భోజనానికి రమ్మని పిలిచింది. కాని వ్యాసుడు తన పదివేల మంది శిష్యులు తినకుండా తానుతిననని ప్రకటించాడు. అది విని పార్వతీదేవి అందరికి భోజనం పెడతానని చెప్పింది. వ్యాసుడు శిష్య సమేతంగా గంగలో స్నానంచేశాడు. పార్వతీదేవి ఇంటికి వచ్చాడు. పార్వతీదేవి వారందరికి భోజనం పెట్టింది.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 3.
వ్రతము తప్పి భుజింపంగ వలనుగాదు. ఈ మాటలను ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు ? (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
‘వ్రతము తప్పి భుజింపంగ వలనుగాదు’ అని వ్యాసుడు సామాన్యస్త్రీవలె కన్పించిన అన్నపూర్ణా దేవితో అన్నాడు. వ్యాసుడు ఒకసారి శిష్యులతో కలిసి కాశీకి వచ్చాడు. అక్కడ అతనికి, అతని శిష్యులకు శివునిమాయవల్ల భిక్ష దొరకలేదు. దాంతో కోపగించిన వ్యాసుడు కాశీనగరంలోని ప్రజలను, కాశీనగరాన్ని శపించబోయాడు.

అప్పుడు పార్వతీదేవి సామాన్యస్త్రీవలె కన్పించి వ్యాసుడిని మందలించింది. ఆహారానికి రమ్మని ఆహ్వానించింది. అది విని వ్యాసుడు తనవెంట పదివేల మంది శిష్యులు ఉన్నారు. వారికి ఆహారం లేకుండా నేను తినను. ఇది నా వ్రతము అని చెప్పాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి అందరికి అన్నం పెట్టింది.

ప్రశ్న 4.
కాశీ పట్టణంలో స్త్రీలు అతిథులను ఎలా ఆదరించేవారు ? (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
మనదేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీ. ఇక్కడ పరమశివుడు అన్నపూర్ణాదేవితో వెలసి యున్నాడు. ఇక్కడ నివసించే మానవులు పుణ్యాత్ములు. ముఖ్యంగా ఇక్కడి స్త్రీలు అన్నపూర్ణా దేవికి మిత్రురాండ్రు. వారు ప్రతిరోజు ఆవుపేడతో ఇంటిని చక్కగా అలుకుతారు. చక్కగా ముగ్గులు పెడతారు.

ఇంటికి వచ్చిన అతిథులను ముగ్గుల మధ్యలో నిలిపి భక్తి విశ్వాసాలు కనబరుస్తూ పండ్లతోను, పరమాన్నముతోను, పలురకాల పిండివంటలతోను గాజులు గలగల ధ్వనిచేస్తుండగా భిక్ష పెడతారు. అతిథి మర్యాదకు ప్రతిరూపంగా నిలుస్తారు.

ప్రశ్న 5.
కోపం తగదని అన్నపూర్ణాదేవి వ్యాసునికి ఏయే ఉదాహరణ పూర్వకంగా తెలిపింది. (APSCERT) మాదిరి ప్రశ్న
జవాబు:
వ్యాసుడు శిష్యపరివారంతో కలిసి ఒకసారి కాశీ నగరానికి వచ్చాడు. అతనికి మూడు రోజులపాటు భిక్ష దొరకలేదు. వ్యాసుడు కాశీనగరాన్ని శపించ బోయాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి సాధారణ స్త్రీవలె కన్పించి, వ్యాసుడిని మందలించింది.

“ఓ మహర్షీ ! నీవు ఇప్పుడు గొంతుదాకా తినడానికి భిక్షాన్నము దొరకలేదని చిందులు వేస్తున్నావు. ఇది మంచిపని కాదు. నీవు నిజంగా శాంత స్వభావం కలవాడవు కాదు. ఎందుకంటే, ఎంతో మంది మునులు పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళదీస్తున్నారు. మరికొందరు శాకాహారంతో, దుంపలతో సరిపెట్టుకుంటున్నారు. కొందరు వరిమళ్ళలో రాలిన ధాన్యం కంకులు ఏరుకొని దానితో బతుకుతున్నారు. మరికొందరు మునులు రోళ్ళ దగ్గర జారిపడిన బియ్యం ఏరుకొని బతుకుతున్నారు. వారంతా నీ కంటె తెలివి తక్కువ వారు కాదు కదా ! ఆలోచించు.

అదీగాక ఉన్నఊరు, కన్నతల్లి వంటిది. కాశీ నగరం శివునికి భార్య. “నీవంటివాడు అటువంటి కాశీ నగరాన్ని భిక్ష దొరకలేదని కోపించడం తగదు.” ఈ ఉదాహరణలతో అన్నపూర్ణాదేవి వ్యాసుడిని
మందలించింది.

ప్రశ్న 6.
“ఇవ్వీటిమీద నాగ్రహముదగునె?” అనే మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు ? (A.P Mar.17)
జవాబు:
పెద్ద ముత్తైదువ రూపంలో ఉన్న పార్వతి భిక్ష దొరకనందున కోపంతో కాశీ నగరాన్ని శపించబోయిన వ్యాసునితో అనిన మాటలు ఇవి. ఓ సంయమివరా! “ఉన్న ఊరు, కన్నతల్లితో సమానమైనది అనే నీతిని నీవు వినలేదా ? అంతకంటే, విశేషించి శివుని అర్థాంగ లక్ష్మి అయిన ఈ కాశీ నగరం మీద కోపించుట తగునా ?” అని పార్వతి వ్యాసుని మందలించినది.

ప్రశ్న 7.
అతిథులు అంటే ఎవరు ? అతిథి మర్యాద అంటే ఏమిటి?
జవాబు:
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు చూడకుండా ఇంటికి వచ్చేవారిని అతిథులు అంటారు. ఆ విధంగా వచ్చిన వారిని గౌరవించి, ఆదరించి కాళ్ళు కడుగుకోవడానికి నీళ్లు ఇచ్చి, కుశల ప్రశ్నలు అడుగుతూ మంచినీళ్లు ఇచ్చి మర్యాదలు చేయాలి. మనం భోజనం చేస్తున్న సమయంలో ఎవరైనా వస్తే తప్పకుండా వారికి కూడా భోజనం పెట్టాలి. వారిని తగిన రీతిగా ఆదరించి, గౌరవ మర్యాదలతో చూడాలి.

ప్రశ్న 8.
‘భిక్ష’ పాఠ్యభాగ నేపథ్యాన్ని రాయండి.
జవాబు:
వేదవిభజన చేసి, పంచమవేదంగా పేరున్న మహాభారతాన్ని రచించి, అష్టాదశ (18) పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. పరమ పవిత్రము, పరమేశ్వరునికి ప్రీతిపాత్రం అయిన కాశీలో వేదవ్యాసుడు తన పదివేలమంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, ప్రాతర్మాధ్యాహ్నిక విధులను పూర్తిగావించి శిష్యులతోకూడా కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు.

శిష్యులు, తానూ వేర్వేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి, మిగిలినది భుజించేవారు. ఒకరోజున కాశీ విశ్వనాథుడికి వ్యాసుణ్ణి పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠ్యాంశం.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 9.
శ్రీనాథుని రచనా శైలిని, సాహిత్య సేవను వివరించండి.
జవాబు:
శ్రీనాథుడు చిన్నతనం నుండే కావ్యరచన ప్రారంభించాడు. మరుత్తరాట్చరిత్ర, కాశీఖండం, శృంగారనైషధం మొదలైనవి రచించాడు.

చమత్కారానికీ, లోకానుశీలనకు, రసజ్ఞతకు, ఆయన జీవిత విధానానికీ అద్దంపట్టే చాటువులు చాలా ఉన్నాయి. ఆయన కవిత్వం ఉద్ధండలీల, ఉభయ వాక్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి వంటి లక్షణాలతో ఉంటుంది.
సీస పద్య రచనలో ఆయనకు ఆయనే సాటి. వృద్ధాప్యంలో కష్టాలనుభవించాడు.

ప్రశ్న 10.
తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష. – దీన్ని భిక్ష పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు:
మానవునికి అంతర్గత శత్రువు కోపం. ఇది సర్వఅనర్థాలకు మూలం. కోపం వల్ల విచక్షణాజ్ఞానం నశిస్తుంది. ఆలోచనాశక్తి తగ్గుతుంది. అసూయా ద్వేషాలు పెరుగుతాయి. కోపం చదువుకు దూరం చేస్తుంది. బంధువులు, క్రమంగా దూరం అవుతారు. కుటుంబంలో వైషమ్యాలు పెరుగుతాయి. కోపం వల్ల ఎన్నో రోగాలు కూడా వస్తాయి. జరుగవలసిన పనులు కూడా ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. ఇరుగుపొరుగు వారితో తగాదాలు వస్తాయి.

శాంతం మానవునికి రక్ష. అది మానవీయ విలువలను పెంచుతుంది. మనశ్శాంతి దొరుకుతుంది. శాంతియుత జీవనం ద్వారా మైత్రి పెరుగుతుంది. బాంధవ్యాలు వృద్ధిపొందుతాయి. సుఖమయజీవనం కలుగుతుంది. ప్రపంచ దేశాల మధ్య యుద్ధవాతావరణం నశిస్తుంది. అందువల్ల మానవులందరు శాంతిని పొందాలి. కోపాన్ని తొలగించుకోవాలి.

ప్రశ్న 11.
ఆకలిని తట్టుకోలేని వ్యాసునికి పార్వతి చేసిన హితబోధపై మీ అభిప్రాయాన్ని వివరించండి.
జవాబు:
మానవునికి అంతర్గత శత్రువు కోపం. ఈ కోపం అన్ని అనర్థాలకు మూలం. మహర్షి వ్యాసుడు కూడా ఈ కోపానికి బానిస అయ్యాడు. తన విచక్షణను కోల్పోయాడు. అట్టి వ్యాసుడికి పార్వతీదేవి హితోపదేశం చేసింది.

పార్వతీదేవి చేసిన హితబోధ వ్యాసునిలో గొప్ప పరివర్తనను తెచ్చింది. వాస్తవాన్ని గ్రహించాడు. కోపం వలన కలిగే అనర్థాలను వ్యాసుడు గ్రహించాడని తెలుస్తుంది.

కోపంలో ఉన్న వ్యక్తిని పెద్దమనసుగల మహ నీయులు శాంతపరచాలి. అప్పుడే ఆ వ్యక్తిలో వివేకం కలుగుతుంది. లోకం శాంతి మార్గంలో నడుస్తుంది.

ప్రశ్న 12.
‘రేపాడి మేలుకని ఏ నేపాపాత్ముని ముఖంబు నీక్షించితినో? అని వ్యాసుడు అనుకోవడంలో ? (June’18)
జవాబు:
వ్యాసుడు శిష్య పరివారంతో కలిసి కాశీనగరంలో బ్రాహ్మణ వీధుల్లో భిక్షాటనకు బయలుదేరాడు. వ్యాసునికి ఏ ఇల్లాలు భిక్ష వేయలేదు. వ్యాసుడు తనకు భిక్ష లభించక పోవడంతో నిరాశచెంది పలికిన పలుకులు ఇవి.

“రేపాడి మేలుకని యే నేపాపాత్ముని ముఖంబు నీక్షించితినో” అని వ్యాసుడు అనడంలో ఆంతర్యం – దుర్మార్గుల మొహం చూస్తే దుష్పరిణామాలు కలుగుతాయన్నది విశ్వాసం. అందుకే ఉదయం లేచినపుడు గానీ, పాడ్యమి చంద్రోదయాన్ని గమనించినప్పుడు గానీ ఇష్టమైన వాళ్ళముఖం చూడడం, పనిమీద వెళ్తున్నప్పుడు కులస్త్రీలు ఎదురు రావడం అనే సంప్రదాయాలు ఏర్పడ్డాయి.

2. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు (6 మార్కులు)

ఆ) కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
‘భిక్ష’ పాఠ్యభాగం ఆధారంగా అన్నపూర్ణాదేవి, వ్యాస మహర్షి, కాశీనగరంలోని సామాన్య స్త్రీల స్వభావాన్ని వివరించండి. (APSCERT మాదిరి ప్రశ్నాపత్రం)
జవాబు:
‘భిక్ష’ అనే పాఠ్యభాగంలో ఎన్నో ముఖ్య పాత్రలు ఉన్నాయి. వాటిలో అన్నపూర్ణాదేవి, వ్యాసుడు, కాశీ నగరంలోని సామాన్య స్త్రీల పాత్రలు అద్భుతంగా ఉంటాయి.

1. అన్నపూర్ణాదేవి : అన్నపూర్ణాదేవి పరమేశ్వరుని అర్థాంగి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతుంది. కాశీలో ఆకలి బాధతో ఎవరూ ఉండరు. కేవలం భిక్ష దొరకనంత మాత్రాన ఇంత బాధపడిపోతావా ? ఇది మంచిదా? అని బిడ్డను తల్లి మందలించినట్లు వ్యాసుని మందలించింది. పిడికెడు బియ్యం వండుకొని తినే వారున్నారు. కేవలం కాయలు తినే వారున్నారు. ఇంకా రకరకాల వారున్నారు కదా ! వారంతా నీకంటే తెలివితక్కువ వారా ! అని ప్రశ్నించింది. ఒక బిడ్డకు తల్లి చెప్పే నీతులు, మందలింపులు, పోలికలు, ప్రశ్నలు సంధిస్తూ పార్వతీదేవి ఒక పెద్ద ముత్తైదువగా కనిపిస్తుంది. పరిపూర్ణ మాతృత్వం మూర్తీభవించినట్లుగా అన్నపూర్ణాదేవి స్వభావం కనిపిస్తుంది.

2. వ్యాస మహర్షి : ప్రాచీన సంస్కృత సాహిత్యంలో వ్యాస మహర్షికి సమున్నతమైన స్థానం ఉంది. ఒకే ఆకారంగా ఉన్న వేదవాఙ్మయాన్ని నాల్గు విధాలుగా విభజించాడు. లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆది గురువు అయ్యాడు. వేద విభజన చేశాడు. 18 పురాణాలు రచించాడు. 10 వేల మంది శిష్యులకు విద్య నేర్పేవాడు.

ఋషి ధర్మంగా భిక్షాటన చేసినవాడు. రెండు రోజులు భిక్ష దొరకలేదు. తన శిష్యుల ఆకలి చూడలేక కాశీని శపించబోయాడు. అంటే కాశీని కూడా శపించగల మహా తప స్సంపన్నుడు. అన్నపూర్ణాదేవి స్వయంగా పిలిచి భిక్షను పెట్టింది. అంటే అన్నపూర్ణా దేవిని కూడా ప్రత్యక్షం చేసుకోగల పుణ్యాత్ముడు. ఆ జగన్మాత చేతి వంటను రుచి చూసిన మహాభాగ్యశాలి. కాని తన కోపం కారణంగా ఆ వైభవాలను కోల్పోయాడు. అల్పసంతోషి, తక్షణ కోపం కలవాడు.

3. కాశీలోని సామాన్య స్త్రీలు : చక్కగా అలికి ముగ్గులు పెట్టి, ఇల్లు కళకళలాడుతూ ఉంచే స్వభావం కలవారు. అతిథులను సాక్షాత్తు దైవంగా భావించి పూజిస్తారు. బంగారు కంచంలో పిండి వంటలతో అన్నం పెడతారు. భిక్షుకులకు లేదు అనే మాట వారినోట రాదు. వారి హృదయాలలో నిరంతరం అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. కాశీలోని స్త్రీలు అన్నపూర్ణాదేవికి చెలికత్తెలు. అంతటి పుణ్యస్త్రీలు ఎక్కడా కనిపించరు. వారికి వారేసాటి.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమవడానికి గల కారణాలు వివరించండి. (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
వ్యాసమహర్షి తన పదివేల మంది శిష్యులతో కలిసి పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీనగరానికి వెళ్ళాడు. శివుని మాయవల్ల వ్యాసునికి రెండు రోజులపాటు భిక్ష దొరకలేదు. కొందరు మళ్ళీ రమ్మని చెప్పారు. మరికొంతమంది ‘అన్నం వండుతున్నానని’ చెప్పారు. ఒక స్త్రీ దేవకార్యం జరుగుతుందని చెప్పింది.

వ్యాసునికి, అతని శిష్యులకు ఆహారం దొరకలేదని దాంతో ఆకలి బాధతో అలమటి స్తున్నారు. వ్యాసునికి తీవ్రమైన కోపం వచ్చింది. కాశీనగరాన్ని, కాశీనగర ప్రజలను మూడుతరముల వరకు ధనము, మోక్షము, విద్య లేకుండునట్లుగా శపించదలచుకున్నాడు. ఆ సమయంలో అన్నపూర్ణాదేవి ఒక సామాన్య స్త్రీ వేషం ధరించింది. వ్యాసుని ఎదుట ప్రత్యక్షం అయింది. అతని శాపమివ్వదలచుచున్న వ్యాసుడిని అడ్డగించింది. నీతినిబోధించింది.

ప్రశ్న3.
‘కోపం అన్ని అనర్థాలకు కారణం’ అని ఎలా చెప్పగలవు ? (APSCERT మాదిరి ప్రశ్న)
(లేదా)
కోపం అన్ని విధాలుగా అనర్థదాయకమని భిక్ష పాఠ్యభాగం ఆధారంగా సమర్థించండి.
జవాబు:
మానవులకు జయింపరాని శత్రువు కోపం. నాకు కోపం వస్తే మనిషిని కాను అని కొందరు అంటారు. ఇది నిజమే. కోపం వస్తే తనను తాను మరచి మనిషి రాక్షసుడవుతాడు. ఆ కోపంతో తాను ఏమి చేస్తున్నాడో తెలిసికొనడు. కోపం వల్ల జీవితంలో ఎన్నో అనర్థాలు కలుగుతాయి. బంధువులు, మిత్రులు క్రమంగా దూరమవుతారు. కుటుంబంలో తగాదాలు ఏర్పడతాయి. మానవీయ సంబంధాలు దెబ్బ తింటాయి. విచక్షణను కోల్పోయి పశువుగా మారతారు.

వ్యాసుడు గొప్ప మహర్షి, వేదాలను విభజించాడు. మహాభారతాన్ని, పురాణాలను రచించాడు. అయినా కోపానికి దూరం కాలేకపోయాడు. అసహనంతో కాశీ నగరాన్ని శపించ బోయాడు. అట్లే దుర్యోధనుడికి పాండవుల మీద, భీమునిమీద కోపం ఎక్కువ. వాళ్ళతో వైరం పెంచుకున్నాడు. చివరకు సర్వనాశనమై పోయాడు. అందువల్ల కోపాన్ని విడిచిపెట్టాలి. సహనాన్ని అలవరచుకోవాలి.

ప్రశ్న4.
అన్నపూర్ణాదేవి పాత్ర స్వభావం వివరించండి. (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
అన్నపూర్ణాదేవి కాశీవిశ్వేశ్వరుని ఇల్లాలు. కాశీ నగరంలో అన్నపూర్ణాదేవి అందరికీ ఇష్టదైవం. ఒకసారి అన్నపూర్ణాదేవి, పరమేశ్వరులు కాశీ నగరానికి వచ్చిన వ్యాసుడిని పరీక్షించదలచు కున్నారు.

అన్నపూర్ణాదేవి కాశీ నగరంలో ఉన్న వారందరికి అన్నం పెడుతుంది. కాశీనగరంలోని స్త్రీలందరు అన్నపూర్ణాదేవికి స్నేహితురాండ్రు. ఈమె వేదపురాణ శాస్త్ర మార్గాన్ని చక్కగా పాటించే ముత్తయిదువు. ఆమె కాశీనగర బంగారు పీఠాన్ని అధిష్టించిన ఆదిశక్తి.

అన్నపూర్ణాదేవి వ్యాసుడు కాశీనగరాన్ని శపించ కుండా అడ్డుతగిలింది. ఈమె ఒక సామాన్య బ్రాహ్మణ స్త్రీవలె నిలబడి వ్యాసుడిని మందలించింది. అతనికి, అతని శిష్యులకు భోజనం పెట్టింది. అన్నపూర్ణాదేవి మాటల్లో నైపుణ్యం ఉంది. గొంతు దాకా తిండిలేదని గంతులు వేస్తున్నావు. మహర్షులు పిడికెడు నివ్వెరి ధాన్యంతో, కాయగూరలతో తృప్తి పడుతున్నారు గదా ! అని చక్కగా వ్యాసుడిని మందలించింది. ఉన్న ఊరు తల్లి వంటిదని, కాశీ నగరం శివునికి ఇల్లాలని గుర్తుచేసింది.

ప్రశ్న5.
ఎంతటి గొప్పవారినైనా ఆవేశం ఆలోచనలను నశింప జేస్తుందని ‘భిక్ష’ పాఠం ఆధారంగా వివరించండి. (APSCERT మాదిరి ప్రశ్నాపత్రం)
జవాబు:
కోపం వస్తే, ఆవేశం వస్తుంది. ఆవేశంలో ఏది మంచిదో, ఏది చెడ్డదో గ్రహించే వివేచనాశక్తి మనిషికి నశిస్తుంది. దానితో అతడు తప్పుడు పనులకు సిద్ధం అవుతాడు. ఆవేశంతో కట్టుకున్న భార్యను, కన్న పిల్లల్నీ కూడా చంపడానికి సిద్ధం అవుతాడు.

కోపం యొక్క ఆవేశంలో అష్టాదశ పురాణాలు రచించిన వ్యాసమహర్షి అంతటివాడు, కన్నతల్లి వంటి కాశీనగరాన్నే శపించబోయాడు. వ్యాసమహర్షి పదివేలమంది శిష్యులకు గురువు. నిత్యం కాశీనగరంలో శిష్యులతో భిక్షకు వెళ్ళి ఆ భిక్షాన్నం తిని జీవించేవాడు. వ్యాసుడిని పరీక్షించాలని శివుడు భావించాడు. అన్నపూర్ణాదేవితో చెప్పి ఎవరూ వ్యాసునికి భిక్ష పెట్టకుండా చేశాడు.

ఒకరోజు వ్యాసుడికి, శిష్యులకూ ఎవరూ భిక్ష పెట్టలేదు. ఆరోజు కాకపోయినా, మరునాడు తప్పక భిక్ష దొరుకుతుందని వారు అనుకున్నారు. మరునాడు కూడా వ్యాసునికి ఎవరూ భిక్ష పెట్టలేదు.
దానితో వ్యాసుడు కోపంవల్ల వచ్చిన ఆవేశంతో, ఉద్రేకంతో తాను నివసిస్తున్న కాశీనగరాన్నే శపించ బోయాడు. ఉన్న ఊరు కన్నతల్లితో సమానం అంటారు. భిక్ష దొరకలేదనే ఆవేశంతో, వ్యాసుడు కాశీ నగరవాసులకు మూడు తరాల దాకా విద్య, ధనము, మోక్షము లేకుండా పోవుగాక అని శపించబోయాడు.

దీనిని బట్టి ఆవేశం, ఆలోచనలను నశింప జేస్తుంది అని మనకు తెలుస్తోంది.

ప్రశ్న6.
“ఆకలి దప్పికలు, కోపానికి కారణాలు” అని ఎట్లా సమర్థిస్తారు?
జవాబు:
ఆకలి, దాహం ఎక్కువయితే, తినడానికి తిండి, త్రాగడానికి నీరు దొరకకపోతే, కోపం వస్తుంది. ఆకలి దప్పికలు, కోపాన్ని తెప్పిస్తాయన్నమాట నిజం.

వ్యాసమహర్షి అష్టాదశ పురాణాలు రచించాడు. భారత భాగవతాలు రచించాడు. బ్రహ్మసూత్రాలు రచించాడు. అటువంటి విజ్ఞానధనుడు, రెండు రోజులు తనకు కాశీలో ఎవరూ భిక్ష వేయలేదన్న కారణంతో, భిక్షాపాత్రను పగులకొట్టి, కాశీవాసులకు మూడుతరాల వరకూ, ధనము, విద్య, మోక్షము లేకుండుగాక అని శపించడానికి సిద్ధమయ్యాడు. ఇందుకు ఆకలిదప్పికలే కారణం కదా !

శాంతమే భూషణమని తెలిసిన వ్యాసమహర్షి కోపానికి కారణం ఆకలిదప్పికలే కదా! కాబట్టి ఆకలి దప్పికలు కోపానికి కారణాలు అన్న మాట సత్యమైనది.

ప్రశ్న7.
కాశీ అన్నపూర్ణా దేవి వేదవ్యాసుణ్ణి పరీక్షించడానికి కారణాలు ఏమై ఉంటాయి ? దీని ద్వారా మీరు గ్రహించిన విషయాలేవి ?
జవాబు:
ఆకలిని తట్టుకోలేక వ్యాసమహర్షి కాశీ నగరాన్ని శపించబోయాడు. అప్పుడు పార్వతి మహర్షిని ఇలా మందలించింది. “గొంతుదాకా తినడానికి మాధు కరభిక్ష దొరకలేదని, శివునికి భార్యయైన పవిత్ర కాశీనగరాన్ని శపించాలనుకోడం బాగోలేదు. నీవు కాశీలో ఉన్నావు. ఉన్న ఊరు, కన్నతల్లితో సమానం అంటారు. అలాంటి కాశీని శపించడం ధర్మం కాదు.

అదిగాక ఎంతోమంది మహర్షులు శాకాహారంతో నెవ్వరి ధాన్యం దంచి తిని జీవిస్తున్నారు. కదా !” అని పార్వతి మందలించింది.

పార్వతీదేవి చేసిన మందలింపు యుక్తి యుక్తంగా ఉంది. నిజానికి వ్యాసుని వంటి మహర్షులు ఒకటి రెండు రోజులు తిండిలేదని పవిత్రమైన కాశీనగరాన్ని శపించడం తగదు. పార్వతీదేవి చెప్పిన మాటలు ధర్మబద్ధంగా, న్యాయంగా నాకు తోచాయి.

PAPER – II : PART – A

I. అవగాహన – ప్రతిస్పందన

అపరిచితపద్యాలు

1. ఈ క్రింది అపరిచిత పద్యమును చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి. (5 మార్కులు )

“కమలములు నీట బాసినఁ
గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ !”

ప్రశ్నలు – జవాబులు

1. కమలములు ఎక్కడుంటాయి ?
జవాబు:
కమలములు నీటిలో ఉంటాయి.

2. కమలాప్తుడనగా ఎవరు ?
జవాబు:
కమలాప్తుడు అంటే ‘సూర్యుడు’.

3. తమతమ నెలవులు తప్పితే ఎలాంటి పరిస్థితులెదురవుతాయి ?
జవాబు:
తమతమ నెలవులు తప్పితే, తమ మిత్రులే శత్రువులు అవుతారు.

4. ఈ పద్యము ఏ శతకములోనిది ?
జవాబు:
ఈ పద్యము సుమతీ శతకములోది.

5. “తథ్యము” అనగా ?
జవాబు:
తప్పదు అని అర్ధము.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

2. ఈ క్రింది అపరిచిత పద్యమును చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

“అంతరంగమందు నపరాధములు సేసి
మంచివానివలెను మనుజుఁడుండు
నితరులెరుగ కున్న నీశ్వరుఁడెఱుఁగడా ?
విశ్వదాభిరామ వినురవేమ !”

ప్రశ్నలు – జవాబులు

1. ఎవరు అపరాధములు చేస్తారు ?
జవాబు:
మనుజులు అపరాధములు చేస్తారు.

2. మంచివానిలాగ ప్రవర్తించేది ఎవరు ?
జవాబు:
మంచివానిలాగా ప్రవర్తించేది మనుజుడు.

3. మనిషి అపరాధములను ఎవరు ఎరిగి ఉంటారు ?
జవాబు:
మనిషి అపరాధములను, ఈశ్వరుడు ఎరిగి ఉంటాడు.

4. పై పద్యం ద్వారా అలవరచుకోవలసిన గుణాలేమిటి ?
జవాబు:
మనిషి తాను చేసిన తప్పులను తన మనస్సు ద్వారా తెలుసుకొని తన్ను సరిదిద్దుకోవాలి.

5. ఈ పద్యంలోని మకుటమేమి ?
జవాబు:
ఈ పద్యంలోని మకుటం విశ్వదాభిరామ వినురవేమ.

3. ఈ క్రింది అపరిచిత పద్యమును చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.

“కలహపడు నింట నిలువదు.
కలుముల జవరాలు కానఁగలకాలంబే
కలహము లేక సమ్మతి
మెలగంగా నేర్చునేని మేలు కుమారీ !”

ప్రశ్నలు

1. కలహపడే ఇంట ఏమి నిలవదు ?
జవాబు:
కలహపడే ఇంట కలుముల జవరాలు (లక్ష్మి) నిలువదు.

2. కలుముల జవరాలు అనగా ఎవరు ?
జవాబు:
కలుముల జవరాలు అనగా లక్ష్మీదేవి.

3. ఈ పద్యం మనకు తెలియజేసే మేలు ఏమిటి ?
జవాబు:
కలకాలము ఎటువంటి కలహాలూ లేకుండా కలసి మెలసి ఉండడం నేర్చుకోవడం ‘మేలు’ అని ఈ పద్యం తెలుపుతుంది.

4. ఈ పద్యానికి శీర్షికను పెట్టండి.
జవాబు:
‘పోరు నష్టం – పొందు లాభం’ అని ఈ పద్యానికి శీర్షికగా ఉంచవచ్చు.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

5. ఈ పద్యం దేనిలోనిది ?
జవాబు:
ఈ పద్యం కుమారీ శతకంలోనిది.

4. ఈ క్రింది పద్యం చదివి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

“కనకపు సింహాసనమున
శునకము గూర్చండబెట్టి శుభలగ్నమునం
దొనరగ పట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ !”

ప్రశ్నలు – జవాబులు

1. శునకాన్ని దేనిపై కూర్చుండపెట్టారు ?
జవాబు:
బంగారు సింహాసనం మీద శునకాన్ని కూర్చుండ పెట్టారు.

2. సింహాసనంపై కూర్చున్నది ఎవరు ?
జవాబు:
సింహాసనంపై కూర్చున్నది శునకం.

3. శునకానికి పట్టము కట్టిన వేళ ఏది ?
జవాబు:
శునకానికి పట్టము కట్టిన వేళ శుభలగ్నము.

4. శునకానికి పట్టము కడితే ఏమి జరుగుతుంది ?
జవాబు:
శునకానికి పట్టము కడితే వెనుకటి గుణాన్ని మానదు.

5. ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు:
ఈ పద్యం సుమతీ శతకంలోనిది.

5. క్రింది పద్యాన్ని చదివి క్రింది ప్రశ్నలకు సరైన సమాధానాలు వ్రాయండి.

చేతులారంగ శివుని పూజింపడేని
నోరునవ్వగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యము లోనుగా దలపడేని
కలుగు నేటికి తల్లుల కడుపు చేటు

ప్రశ్నలు – జవాబులు

1. “కడుపుచేటు” అనే మాటకు అర్థమేమి ?
జవాబు:
‘కడుపుచేటు’ అనే మాటకు పుట్టుక దండగని అర్థం.

2. కవి శివపూజ ఎలా చేయమంటున్నాడు ?
జవాబు:
కవి శివపూజ చేతులతో తృప్తి కలిగేటట్లు చేయ మంటున్నాడు.

3. దయను, సత్యాన్ని ఎట్లా తలచాలి ?
జవాబు:
దయను, సత్యాన్ని మనసులో తలచాలి.

4. హరికీర్తిని ఎలా పలకాలి ?
జవాబు:
హరికీర్తిని నోరారా పలకాలి.

5. ఈ పద్యానికి శీర్షిక ఏమిటి ?
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘హరికీర్తన’.

6. కవిత చదివి తప్పొప్పులను గుర్తించండి.

ఓ పిడుగా !
నాకు తెలుసు,
నీశక్తి విద్యుచ్ఛక్తి కంటె గొప్పదని
కాని ఏం లాభం ?
నీ ఆవేశమే నిన్ను నేలకు చేరుస్తుంది
పాతాళానికి దిగజారుస్తుంది.
నీ కంటె
నా గదిలో జీరోబల్బు నయం
రాత్రంతా
చీకటితో పోరాడుతుంది.

ప్రశ్నలు – జవాబులు

1) విద్యుచ్ఛక్తిని మించిన శక్తి లేనిది పిడుగు. ( )
జవాబు:

2) ఆవేశం వల్ల పిడుగు నేలకు చేరుతుంది. ( )
జవాబు:

3) కవితననుసరించి పిడుగు చాలా గొప్పది. ( )
జవాబు:

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

4) చీకటితో పోరాడేది పిడుగు.
జవాబు:

5) పిడుగుకంటె జీరో బల్బే నయం.
జవాబు:

7. క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.

ఉడుముండదె నూటేండ్లును
బడియుండదె పేర్మిఁబాము పదినూటేండ్లున్
మడువున కొక్కెర యుండదె
కడ నిల పురుషార్థపరుడు గావలె సుమతీ !

ప్రశ్నలు – జవాబులు

1. నూతేండ్లు జీవించే జంతువు ఏది ?
జవాబు:
నూటేండ్లు జీవించే జంతువు ‘ఉడుము’

2. పాము ఎన్నాళ్ళు జీవిస్తుంది ?
జవాబు:
పాము పదినూర్లు అనగా వేయి సంవత్సరాలు జీవిస్తుంది.

3. ‘కొక్కెర’ అంటే ఏమిటి?
జవాబు:
కొక్కెర అంటే కొంగ.

4. ‘వాడు కావాలి’ అనే అర్థం ఇచ్చే పాదం ఏది ?
జవాబు:
‘భూమండలంలో ధర్మార్థమోక్షాలను సాధించే 4వ పాదం.

5. కొక్కెర ఎక్కడ ఉంటుంది ?
జవాబు:
కొక్కెర మడుగులో ఉంటుంది.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

సృజనాత్మక ప్రశ్నలు (5 మార్కులు)

ప్రశ్న 1.
శ్రీనాథుని కవితా ప్రశస్తిని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయుము.
జవాబు:

నిజామాబాద్,
12.01.2018.

ప్రియ మిత్రుడు అనంతు,

నీ మిత్రుడు వ్రాయునది. నేను బాగా చదువు తున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా రాయునది. మన ప్రాచీన తెలుగు సాహిత్యంలో శ్రీనాథునికి సమున్నతమైన స్థానం ఉంది. ఈయన కవిసార్వ భౌముడిగా కీర్తి పొందాడు. వీరు ఎన్నో రచనలు చేశారు. శ్రీనాథుని వర్ణనాత్మక ప్రతిభ విశిష్టమైనది. శ్రీనాథుని సీస పద్యాలకు విశిష్టస్థానం ఉంది. అలంకార ప్రయోగం కూడా అద్భుతంగా ఉంటుంది. శ్రీనాథుని కవిత్వం, శైలి, భావి కవులకు మార్గదర్శకము అయ్యింది. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలరు.

ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
XXXXXX.

చిరునామా :
ఎన్. అనంత్,
10వ తరగతి,
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ పాఠశాల,
శాంతి నగర్,
కరీంనగర్.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
కోపంవల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వ్యాసం రాయండి. (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:
మానవులు వదిలించుకోవల్సిన దుర్గుణాలలో కోపం ప్రధానమైనది. కోపంవల్ల మోహం కలుగుతుంది. బుద్ధి నశిస్తుంది. మానవుని పతనాన్ని శాసిస్తుంది. కోపం వల్ల ఎన్నో అనర్థాలు కలవు. విచక్షణా శక్తిని కోల్పోతాడు. హింసాప్రవృత్తిని అలవరచుకుంటాడు. ఉన్మాదిగా మారతాడు.

బంధువులు, మిత్రులు దూరమౌతారు, ఆప్తులు ఆదరించరు. ఒంటరితనాన్ని అనుభవిస్తారు. కుటంబగౌరవం తగ్గుతుంది. తన కుటుంబంలో అంతర్గత కలహాలు పెరుగుతాయి. దుర్యోధనుడు, విశ్వామిత్రుడు, దుర్వాసుడి వంటివారు కోపానికి బానిసలుగా మారారు. ఎన్నో అనర్థాలను పొందారు.

మన శతకాలు కోపం మంచిదిగాదని, దాన్ని విడిచిపెట్టమని బోధిస్తున్నాయి. అందువల్ల మన మంతా కోపాన్ని విడనాడాలి. శాంతిని పొందాలి. జీవితాన్ని ఆదర్శంగా మలచుకోవాలి.

ప్రశ్న 3.
కోపంవల్ల గౌరవం తగ్గుతుందనే విషయాన్ని వివరిస్తూ ఒక కరపత్రం రాయండి. (APSCERT మాదిరి ప్రశ్న)
జవాబు:

శాంతిని పొందు ! క్రోధం వదులుకో ! ఆదర్శంగా జీవించు !

మాన్యులారా ! వదాన్యులారా ! సోదర సోదరీ | మణులారా ! కోపం మనందరి శత్రువు. దానిని మనమంతా దూరం చేసుకోవాలి. కోపంవల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి. అందరిని దూరం చేస్తుంది. సకలదుర్గుణాలకు మూలాధారం. దుర్యోధనుడు, విశ్వామిత్రుని వంటి పురాణపురుషులు కోపం వల్ల సర్వనాశనమైనారు.

అందువల్ల మనం కోపాన్ని దూరంగా ఉంచుదాం ! ప్రశాంతమైన జీవనాన్ని సాగిద్దాం ! ఆలోచించి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సహజీవన మాధుర్యాన్ని అనుభవిద్దాం. అందరికి ఆదర్శంగా జీవిద్దాం !

ఇట్లు,
ఆరోగ్య సంరక్షణ కమిటీ,
నల్గొండ.

ప్రశ్న 4.
కోపం అనర్థదాయకమని, శాంతిని పెంపొందించ మని తెలుపుతూ నినాదాలు రాయండి.
జవాబు:
కోపం వద్దు – శాంతి ముద్దు
మితిమీరిన కోపం – అనర్థాలకు మూలం
మానవుల అంతర్గత శత్రువు క్రోథం
కోపాన్ని తగ్గించు – ఆదర్శంగా జీవించు
శాంతియుత జీవనం – అదే అందరికి ఆదర్శం
కోపం త్యజించు – శాంతిని స్వాగతించు

ప్రశ్న 5.
ఆకలిగా ఉన్నవాళ్ళకు అన్నంపెట్టడం, అవసరానికి సహాయంచేయడం వంటివి మంచి లక్షణాలు. మీ తరగతిలో ఇలా మంచి లక్షణాలు గలవాళ్ళు ఎవరు ఉన్నారు ? వాళ్ళను అభినందించండి.
జవాబు:
మా తరగతిలో మేమందరం పేద విద్యార్థులకు సహాయం చేస్తాము. మా ఊరికి సమీపంలో ఒక విదేశీయుని కుటుంబం వచ్చి వీధి పిల్లలను చేరదీసి వారికి కావలసిన సకల సదుపాయాలు కల్పిస్తుంది. ఆ విదేశీయులు పెద్దల దగ్గర విరాళాలు వసూలు చేసి, వీధి పిల్లల కోసం ఒక గ్రామాన్ని స్థాపించారు. అందులో అందరూ అనాథపిల్లలే ఉంటారు.

ఆ అనాథ పిల్లలకు మా పాఠశాల పిల్లలందరం దుస్తులు, సబ్బులు, కొబ్బరినూనె, పుస్తకాలు, ధన సహాయం చేస్తుంటాము. అందుకు మాకెంతో తృప్తిగా ఉంటుంది. ఈ సంవత్సరం మా తరగతి విద్యార్థులందరం చందాలు వసూలు చేసి, ఆ అనాథ పిల్లలకు ఒక కంప్యూటర్ను బహూకరించాము. అందుకు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మా తరగతి విద్యార్థులనందరినీ అభినందించారు.

ప్రశ్న 6.
ప్రపంచశాంతి (విశ్వశాంతి) గూర్చి వ్యాసం వ్రాయండి.
జవాబు:
శాంతి అంటే శమము లేదా ఓర్పు అని అర్థం. బాధలు, దుఃఖాలు, ప్రకృతి వైపరీత్యాలు, మానవ కల్పితమగు ఉపద్రవాలు ప్రాణికోటికి కష్టనష్టాలు కలిగిస్తున్నాయి. లోకపు మనుగడకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. భూమండలంపై ఉన్న సమస్త ప్రాణులు ఎటువంటి ఉపద్రవాలు లేకుండా కూడు, గూడు, గుడ్డ గలిగి సుఖంగా జీవించడమే ప్రపంచ శాంతి.

సహజంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రపంచ మానవాళికి కష్టాలు కలుగుతాయి. భూకంపాలు, వరదలు, తుఫానులు, అతివృష్టి, అనావృష్టి వంటి వాటి వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడతారు. వాటి వల్ల జరిగే నష్టాన్ని తగ్గించడానికి శాస్త్రజ్ఞులు అంతా కృషి చేస్తున్నారు.

మానవ కల్పితాలైన ఉపద్రవాలు నేడు ప్రపంచ శాంతికి తీరని ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఒక దేశంవారు మరో దేశంపై సాగించే యుద్ధాలు ఇటువంటివే. యుద్ధం వల్ల ఓడిపోయిన వారికే కాక గెలిచిన వారికి కూడా ఎంతో నష్టం కలుగుతుంది. 20వ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల వల్ల ప్రజలలో భయాందోళనలు పెరిగి అశాంతి వాతావరణం నెలకొంది.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత నానాజాతి సమితి, రెండో ప్రపంచయుద్ధం తరువాత ఐక్యరాజ్యసమితి ఏర్పడ్డా అవి ప్రపంచ శాంతికి సరైన కృషిని కొనసాగించలేకపోయాయి. నేడు శ్రీలంక తమిళుల సమస్య, దక్షిణాఫ్రికా వర్ణ వివక్షత, పంజాబ్లోని టెర్రరిస్టుల చర్యలు మొదలైనవి మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయేమో అనే భయాందోళనలు కలిగిస్తున్నాయి.

నేడు ప్రపంచ శాంతి నెలకొల్పడానికై వివిధ దేశాలు గణనీయమైన కృషి చేస్తున్నాయి. అందులో భారతదేశం ఒకటి. ప్రపంచ దేశాల మధ్య స్నేహభావాన్ని పెంచి శాంతి చేకూర్చడానికి నెహ్రూగారి పంచశీల సిద్ధాంతాన్ని ఆచరించటం మంచిది.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 7.
యాచన వృత్తి మంచిది కాదు అని చెబుతూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:

యాచన మానండి. మాన్పించండి.

నరులారా !

మానవులు కాయకష్టంచేసి జీవించాలి. ఆత్మాభి మానంతో జీవించాలి. ఇతరుల ముందు
చేయిచాచి యాచించకూడదు. కృషితో నాస్తి దుర్భిక్షం అని అంటారు. కష్టించి పనిచేసే వారిని సమాజం గౌరవిస్తుంది. సోమరిపోతుల్లా జీవించాలని కోరు కోకండి. ఆత్మవిశ్వాసంతో జీవించండి. అందరికి ఆదర్శంగా నిలుస్తారు. తోటివారికి సహాయపడండి. యాచన మానండి. కష్టంతో జీవించండి.

ఇట్లు,
యాచక వ్యతిరేక కమిటీ.

ప్రశ్న 8.
కోపం అనర్థదాయకమనే విషయాన్ని తెలుపుతూ ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
కోపంవీడు కోపం అనర్ధదాయకం సహనం పొందు మిత్రులారా ! మానవుల అంతర్గత శత్రువు కోపం. అరిషడ్వర్గాలలో కోపం ప్రధానమైనది. అన్ని అనర్ధాలకు కోపం మూలం. దీనివల్ల విచక్షణా జ్ఞానం నశిస్తుంది. ఆవేశం కలుగుతుంది. ఆలోచనా శక్తి కోల్పోతాడు. స్నేహం దెబ్బ తింటుంది.

“కోపం ఆత్మీయులను దూరం చేస్తుంది. బంధువులతో సంబంధాలను దూరం చేస్తుంది. మానవీయ సంబంధాలను, నైతిక విలువలను కోల్పోతాడు. సమాజంలో గౌరవం తగ్గుతుంది. సహజీవన మాధుర్యం క్రమంగా నశిస్తుంది. హింసాయుత ప్రవృత్తి అలవడుతుంది.

అందువల్ల మనంకూడా కోపాన్ని వదలిపెట్టాలి. శాంతిని పొందాలి. అందరితో నవ్వుతూ మాట్లాడాలి. కోపాన్ని వదలి నూరు సంవత్సరాలు సుఖంగా జీవించాలి. అదే మనకు ఆరోగ్య రక్ష.

ఇట్లు,
ఆరోగ్య సంరక్షణ కమిటీ,
X X X X X.

అదనపు వ్యాకరణాంశాలు

PAPER – I: PART – B

1. పర్యాయపదాలు

అర్ధాంగి = భార్య, ఇల్లాలు, పత్ని

ఆగ్రహం = కోపం, అలుక, క్రోధం

గృహము = ఇల్లు, గేహము, నికేతనం

శివుడు = శంకరుడు, రుద్రుడు, గౌరీపతి

పసిడి = బంగారం, కాంచనం, పుత్తడి

పారాశర్యుడు = వ్యాసుడు, బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడు

మోక్షం = కైవల్యం, ముక్తి

శిష్యులు = ఛాత్రులు, విద్యార్థులు, అంతేవాసులు

నిక్కము = నిజము, సత్యము, యదార్థం

భాగీరథి = గంగ, త్రిపథగ, జాహ్నవి

బ్రాహ్మణులు = విప్రులు, ద్విజులు, భూసురులు

భవాని = పార్వతి, గౌరి, ఉమ

వనిత = స్త్రీ, మహిళ, పడతి, అంగన

భానుడు = సూర్యుడు, రవి, దివాకరుడు

తనూజుడు = కుమారుడు, సుతుడు, ఆత్మజుడు

అంగన = వనిత, స్త్రీ, మహిళ

నెయ్యి = ఆజ్యము, ఘృతము, నేయి

ఇల్లు = గృహము, భువనం, భార్య, పేరు

గంధము = చందనం, మలయజం

పుష్పము = పువ్వు, కుసుమము, ప్రసూనము

ముఖము = వదనము, ఆననము, మొగము

గొడుగు = ఛత్రము, ఆతపత్రము, ఖర్పరము

మరికొన్ని పర్యాయపదాలు

క్రింది వాక్యములలో పర్యాయపదములు గుర్తించండి.

1. భిక్ష మునుల వృత్తి. ముష్టికి వచ్చిన వారికి తిరిపము పెట్టాలి కాని విసుక్కోకూడదు.
జవాబు
భిక్ష, ముష్టి, తిరిపము

2. శిష్యుడు గురువును గౌరవించాలి. గురువు అంతేవాసిని తీర్చి దిద్దాలి. ఆ ఛాత్రుడు ఎంత గొప్పవాడైతే అంత మంచిది.
జవాబు:
శిష్యుడు, అంతేవాసి, ఛాత్రుడు

3. చదువుపై శ్రద్ధ పెట్టాలి. విద్యను మించిన సంపద లేదు. పలుకును బట్టి గౌరవం పెరుగుతుంది.
జవాబు:
చదువు, విద్య, పలుకు

4. గురువును గౌరవించాలి. ఆచార్యుడు తన సమయాన్ని విద్యాదానానికి ఉపయోగించి మంచి దేశికుడుగా పేరు తెచ్చుకోవాలి.
జవాబు:
గురువు, ఆచార్యుడు, దేశికుడు

5. ఆవును బాధ పెట్టకూడదు. మొదవు ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం. అందుకే. గోవును పూజించాలి.
జవాబు:
ఆవు, మొదవు, గోవు

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

6. రాత్రి ప్రయాణం మంచిది కాదు. నిశీధిలో దీపం ఉండాలి. అలంకరిస్తే రజనిని మించినది లేదు.
జవాబు:
రాత్రి, నిశీధి, రజని

7. ముక్కంటి కంటి మంటకు మదనుడు నశించాడు. వరాలిచ్చే శివుడుకి కోపం వస్తే రుద్రుడు అవుతాడు.
జవాబు:
ముక్కంటి, శివుడు, రుద్రుడు

8. తొలిపలుకులు ఆగమములంటారు. వేదము శిరో ధార్యము.
జవాబు:
తొలిపలుకులు, ఆగమము, వేదము

9. వ్యాసుడు వేదాలు విభజించాడు. ఆ కృష్ణద్వైపా యనుడు 18 పురాణాలు రచించాడు. అందు పారాశర్యుడు తొలి గురువు.
జవాబు:
వ్యాసుడు, కృష్ణద్వైపాయనుడు, పారాశర్యుడు

10. ఎవరిపైనా నింద వేయకూడదు. దూషణములే శాపములై తగులును.
జవాబు:
నింద, దూషణము, శాపము

2. వ్యుత్పత్త్యర్థాలు

శివుడు = స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు. (శంకరుడు)

అతిథి = తిథి, వార, నక్షత్ర నియమం లేకుండా ఇంటికి భోజనానికి వచ్చువాడు.

గురువు = అధికారమనెడి అజ్ఞానమును తొలగించువాడు. (ఉపాధ్యాయుడు)

మోక్షము = జీవుడిని పాపము నుండి విడిపించునది (కైవల్యం)

పతివ్రత = పతిని సేవించుటయే వ్రతముగా కలది (సాధ్వి)

శిష్యులు = శిక్షింపతగిన వారు (ఛాత్రులు)

పారాశర్యుడు = పరాశరుని యొక్క కుమారుడు (వ్యాసుడు)

ఛాత్రుడు = గురువు యొక్క దోషాలను కప్పిపుచ్చు స్వభావం గలవాడు. (విద్యార్థి)

భాస్కరుడు = కాంతిని కలుగజేయువాడు (సూర్యుడు)

భవాని = భవుని యొక్క భార్య (పార్వతి)

విశ్వనాథుడు = ప్రపంచానికి నాథుడు (శివుడు)

పార్వతి = పర్వతరాజు యొక్క కుమార్తె (గౌరి)

వేదవ్యాసుడు = వేదములను విభజించువాడు (పారాశర్యుడు)

పురంధ్రి = గృహమును ధరించునది (ఇల్లాలు)

తాపసుడు = తపము చేయువాడు (ముని)

పంచజనుడు = ఐదుభూతములచే పుట్టబడేవాడు (మనిషి)

ముక్కంటి = మూడు కన్నులు కలవాడు (శివుడు)

వనజనేత్ర = పద్మముల వంటి కన్నులు కలది.

లేదీగబోడి = లేతతీగ వంటి శరీరము కలది

అహిమభానుడు = చల్లనివికాని కిరణములు గలవాడు. (సూర్యుడు)

వ్యాసుడు = వేదములను విభజించి ఇచ్చినవాడు (వ్యాసమహర్షి)

3. నానార్థాలు

కంకణము = తోరము, నీటిబిందువు, స్త్రీలు చేతికి ధరించేది
గురువు = ఉపాధ్యాయుడు, బృహస్పతి, తండ్రి, పురోహితుడు
మోక్షము = కైవల్యం, నిర్యాణం, విడుదల
ఫలము = పండు, ఫలితము, ప్రయోజనము
లక్ష్మి = సంపద, రమ, మెట్టతామర
కామము = కోరిక, మామిడి
ప్రసాదము = అనుగ్రహము, ప్రసన్నత, మంచి స్వభావం
కరము = చేయి, తొండము, కిరణము
గృహము = ఇల్లు, భార్య, రాశి
కాయ = చెట్టుకాయ, బిడ్డ
ఇల్లు = గృహము, కుటుంబము, స్థానము
ముఖము = మోము, ఉపాయము, ముఖ్యమైనది
బంతి = కందుకము, ఒక జాతి పువ్వుల చెట్టు, పంక్తి
రూపు = ఆకారము, దేహము, కన్నెమెడలో బంగారు నాణెము
గంధము = చందనము, గంధకము, సువాసన

4. ప్రకృతి – వికృతులు

ఆజ్ఞ – ఆన
దోషం – దోసం
స్వామి – సామి
భాగ్యము – బాగ్గెము
శక్తి – సత్తి
కార్యం – కర్జం
భిక్షము – బిచ్చము
పట్టణము – పత్తనము

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

వేషము – వేసము
రాత్రి – రాతిరి
స్వర్గము – సొన్నము
తపస్వి – తపసి
రూపము – రూపు
లక్ష్మి – లచ్చి
ఆహారము – ఓగిరమ
విద్య – విద్దె
శ్రీ – సిరి
ఈశ్వరుడు – ఈసుడు
పుణ్యం – పున్నెము
సుఖము – సుకము
రత్నము – రతనము
బ్రాహ్మణుడు – బాపడు
గంధము – గందము
పుష్పం – పూవు
శిష్యుడు – చట్టు
పాయసము – పాసెము

PAPER – II : PART – B

1. సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి

సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దాని దీర్ఘము ఏకాదేశమగును.

ఉదా: పుణ్యాంగన – పుణ్య + అంగన
బింబాస్య – బింబ + ఆస్య
అర్ధాంగ – అర్ధ + అంగ
శాకాహారులు – శాక + ఆహారులు
శిఖాధిరూఢ – శిఖ + అధిరూఢ
భిక్షాన్నం – భిక్ష + అన్నం
శాలాంతరం – శాల + అంతరం
మధ్యాహ్నం – మధ్య + అహ్నం
పాయసాపూపం – పాయస + అపూపం
బ్రాహ్మణాంగన – బ్రాహ్మణ + అంగన
కమలానన – కమల + ఆనన
పాపాత్ములు – పాప + ఆత్ములు
అభీప్సితాన్నములు – అభీప్సిత + అన్నములు
ఖచితాభరణంబు – ఖచిత + ఆభరణంబు
మునీశ్వర – ముని + ఈశ్వర

2. గుణ సంధి

సూత్రం : అకారమునకు ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమముగా ఏ, ఓ, ఆర్లు ఏకాదేశమగును.
ఉదా : శిలోంచ శిల + ఉంచ్ఛ

3. అత్వసంధి

సూత్రం : అత్తునకు సంధి బహుళముగానగు.
ఉదా : లేకైన – లేక + ఐన
ముత్తైదువ – ముత్త + ఐదువ

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

4. ఉత్వసంధి

సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు

ఉదా : లేదెట్లు – లేదు + ఎట్లు
బీఱెంద – బీఱు + ఎండ
ప్రక్షాలితంబైన – ప్రక్షాలితంబు + ఐన
అపారములైన – అపారములు + ఐన
రూపన్న – రూపు + అన్న
పారణకైన – పారణకు + ఐన
రమ్మని – రమ్ము + అని

5. యడాగమ సంధి

సూత్రం: సంధి లేనిచోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా : మా యిల్లు – మా + ఇల్లు

6. త్రికసంధి

సూత్రాలు :

  1. అ, ఈ, ఏ అను సర్వనామములు త్రికములనబడును.
  2. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు.
  3. ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్చి కంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగును.

ఉదా : ఇవ్వీటి – ఈ + వీటి
అచ్చోట – ఆ + చోట
అమ్మహాసాధ్వి – ఆ + మహాసాధ్వి
ఆయ్యాదిమశక్తి – ఆ + ఆదిమశక్తి – యడాగమ త్రికసంధులు

7. గసడదవాదేశ సంధి

సూత్రము : ప్రథమమీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.
ఉదా : లెస్సగాక – లెస్స + కాక
కఱ్ఱపెట్టి – కఱ్ఱ + పెట్టి
పూజచేసి – పూజ + చేసి

8. ద్రుత ప్రకృతిక సంధి

సూత్రము : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
ఉదా : కవాటంబుఁదెరువము – కవాటంబున్ + తెరువము
చనుదెంచినఁగామధేనువు – చనుదెంచినన్ + కామధేనువు

2. సమాసాలు

సమాస పదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
మతిహీనులు – మతిచేత హీనులు – తృతీయా తత్పురుష సమాసము
కోపావేశం – కోపము చేత ఆవేశం – తృతీయా తత్పురుష సమాసము
రత్నఖచిత – రత్నముచేత ఖచితం – తృతీయా తత్పురుష సమాసము
విప్రగృహం – విప్రుని యొక్క గృహం – షష్ఠీ తత్పురుష సమాసము
విద్యాగురుండు – విద్యలకు గురుండు – షష్ఠీ తత్పురుష సమాసము
బ్రాహ్మణాంగనలు – బ్రాహ్మణుల యొక్క అంగనలు – షష్ఠీ తత్పురుష సమాసము
పాపాత్ముని ముఖం – పాపాత్ముని యొక్క ముఖం – షష్ఠీ తత్పురుష సమాసము
‘బ్రాహ్మణ మందిరములు – బ్రాహ్మణుల యొక్క మందిరములు – షష్ఠీ తత్పురుష సమాసము
గోముఖము – గోవు యొక్క ముఖము – షష్ఠీ తత్పురుష సమాసము

ద్వాఃకవాటం – ద్వారము యొక్క కవాటం – షష్ఠీ తత్పురుష సమాసము
శిష్యగణం – శిష్యుల యొక్క గణం – షష్ఠీ తత్పురుష సమాసము
మాయిల్లు – మా యొక్క ఇల్లు – షష్ఠీ తత్పురుష సమాసము
విప్రవాటికలు – విప్రుల యొక్క వాటికలు – షష్ఠీ తత్పురుష సమాసము
విశ్వనాథుని రూపం – విశ్వనాథుని యొక్క రూపం – షష్ఠీ తత్పురుష సమాసము
విప్రభవనం – విప్రుని యొక్క భవనం – షష్ఠీ తత్పురుష సమాసము
ముక్కంటిమాయ – ముక్కంటి యొక్క మాయ – షష్ఠీ తత్పురుష సమాసము
భిక్షాటనం – భిక్ష కొఱకు అటనం – చతుర్థీ తత్పురుష సమాసము
భిక్షాపాత్ర – భిక్ష కొఱకు పాత్ర – చతుర్థీ తత్పురుష సమాసము
భుక్తిశాల – భుక్తి కొరకు శాల – చతుర్థీ తత్పురుష సమాసము
కాశినగరం – కాశిఅనే పేరుగల నగరం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
కాశీపట్టణం – కాశి అనే పేరుగల పట్టణం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
మోక్షలక్ష్మి – మోక్షము అనెడి లక్ష్మి – రూపక సమాసం
మూడుతరములు – మూడు సంఖ్య గల తరములు – ద్విగు సమాసం
మధ్యాహ్నం – అహ్నము మధ్య భాగము – ప్రథమా తత్పురుష సమాసం
ముక్కంటి – మూడు కన్నులు కలవాడు – బహువ్రీహి సమాసం

మచ్చెకంటి – చేప కన్నుల వంటి కన్నులు కలది – బహువ్రీహి సమాసం
బింబాస్య – చంద్రబింబము వంటి ముఖము కలది – బహువ్రీహి సమాసం
పాపాత్ముడు – పాపముతో కూడిన మనస్సు కలవాడు” – బహువ్రీహి సమాసం
శాకాహారులు – శాకమును ఆహారముగా కలవారు ” – బహువ్రీహి సమాసం
కమలాలన – కమలముల వంటి ఆననము కలది” – బహువ్రీహి సమాసం
బహు పదార్థములు – ఎక్కువైన పదార్థములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
లేతీగ – లేతదైన తీగ – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పుణ్యాంగన – పుణ్యమైన అంగన – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
మహాప్రసాదం – గొప్పదైన ప్రసాదం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ప్రాకృత వేషం – ప్రాకృతమైన వేషం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అభీప్సితాన్నములు – అభీప్సితములైన అన్నములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
కొన్ని మాటలు – కొన్నైన మాటలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

పెద్ద ముత్తైదువ – పెద్దదైన ముత్తైదువ – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
అర్ఘ్యపాద్యములు – అర్ఘ్యమును, పాద్యమును – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
పుష్పగంధములు – పుష్పములును, గంధములును – ద్వంద్వ సమాసం
ఫలపాయసములు – ఫలమును, పాయసమును – ద్వంద్వ సమాసం
భక్తివిశ్వాసములు – భక్తియును, విశ్వాసమును – ద్వంద్వ సమాసం
క్షుత్పిపాసలు – క్షుత్తును, పిపాసయును – ద్వంద్వ సమాసం
వేదపురాణశాస్త్రములు – వేదములును, పురాణములును, శాస్త్రములును – బహుపద ద్వంద్వం

3. గణవిభజన

ప్రశ్న 1.
‘అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను లెస్సగా కయో – ఈ పద్యపాదానికి గురు లఘువులను గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్యపాదమో తెల్పండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 1
పై పద్యపాదంలో న, జ, భ, జ, జ, జ, అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది చంపకమాల పద్యపాదం.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
‘ఆ కంఠంబుగ నిఫ్టు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా’ – ఈ పద్య పాదానికి గురు లఘువులను గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్యపాదమో తెల్పండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 2
పై పద్యపాదంలో మ, స, జ, స, త, త, గ అనే గణాలు ఉన్నాయి కావున ఇది ‘మత్తేభ’ పద్యపాదము.

ప్రశ్న 3.
జ్ఞాదర లీలరత్న కటకా భరణంబులు ఘల్లు ఘల్లనన్ – ఈ పద్య పాదానికి గురు లఘువులను గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్యపాదమో తెల్పండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 3
ఈ పాదంలో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉన్నాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ పద్యపాదం.

ప్రశ్న 4.
‘అనవుడు నల్ల నవ్వికమలానన యిట్లను లెస్సగాకయో, అన్న పద్యపాదానికి గురు లఘువులు గుర్తించి, గణ విభజన చేసి, ఏ పద్యపాదమో తెలపండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 4
పై పద్యపాదంలో ‘న, జ, భ, జ, జ, జ, ర’ గణాలు ఉన్నాయి కాబట్టి 11వ అక్షరం యతిమైత్రి. ఇది చంపకమాల పద్యపాదము.

ప్రశ్న 5.
‘ఓ మునీశ్వర వినవయ్య యున్నయూరు’ – పద్యపాదానికి గురు లఘువులు గుర్తించి, గణవిభజన చేసి ఏ పద్యపాదమో తెలపండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 5

  1. పై పాదంలో 1 సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది తేటగీతి పద్యపాదం.
  2. యతి నాల్గవ గణం మొదటి అక్షరంతో (ఓ – యు)

ప్రశ్న 6.
‘శాకాహారులు కందభోజులు శిలోంఛ ప్రక్రముల్ తాపసుల్’ అనే పద్యపాదానికి, గురు లఘువులు గుర్తించి, గణవిభజన చేసి, అది ఏ పద్యపాదమో తెలుపండి.
జవాబు:
TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష 6
పై పాదంలో ‘మ, స, జ, స, త, త, గ’ గణాలున్నాయి. కాబట్టి శార్దూల 13వ అక్షరం యతిమైత్రి (శా-ఛ) పద్యపాదము.

4. అలంకారాలు

ప్రశ్న 1.
ముంగిట గోమయంబున గోముఖము దీర్చి కడలు నాల్గుగ మ్రుగ్గు కఱ్ఱ వెట్టి,
జవాబు:
ఈ (సీస) పద్యంలో స్వభావోక్తి అలంకారం ఉంది.
లక్షణం : ఒక విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే అది స్వభావోక్తి అలంకారం.
సమన్వయం : పై పద్యం వాకిట్లో ముగ్గులు, ఆతిథ్యం మొదలగునవి ఉన్నవి ఉన్నట్లుగా చక్కని పదాలతో వర్ణించారు. కనుక, అది స్వభావోక్తి అలంకారం.

TS 10th Class Telugu Important Questions 11th Lesson భిక్ష

ప్రశ్న 2.
మూడుతరముల చెడుగాక మోక్ష లక్ష్మి
జవాబు:
ఈ వాక్యంలో రూపకాలంకారం ఉంది.
లక్షణం : ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి, రెండింటికీ భేదం లేనట్లు చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు.
సమన్వయం : మోక్షమును లక్ష్మితో పోల్చారు. మోక్షమనెడు లక్ష్మి అని ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పారు. కనుక ఇది రూపకాలంకారం.

ప్రశ్న 3.
అని పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపందలంచు.
జవాబు:
ఈ వాక్యంలో వృత్త్యనుప్రాసాలంకారం ఉంది.
లక్షణం : ఒకే అక్షరం చాలాసార్లు వస్తే అది వృత్త్యనుప్రాసాలంకారం.
సమన్వయం : పై వాక్యంలో ‘ప’కారం చాలాసార్లు వచ్చింది. కనుక దానిలో వృత్త్యనుప్రాసాలంకారం ఉంది.

Leave a Comment