TS Inter 2nd Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 3rd Lesson కేంద్ర ప్రభుత్వం Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 3rd Lesson కేంద్ర ప్రభుత్వం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత రాష్ట్రపతికి ఉన్న సాధారణ, అత్యవసర అధికారాలను గురించి వర్ణించండి.
జవాబు.
అధికారాలు, విధులు :
సాధారణ అధికారాలు: భారత రాష్ట్రపతికి ఉన్న సాధారణ అధికారాలను 6 రకాలుగా వర్గీకరించవచ్చు.

1. కార్యనిర్వాహణాధికారాలు :
అధికరణ 53 ప్రకారం కేంద్రం కార్యనిర్వహణాధికారాలు రాష్ట్రపతికి చెందుతాయి. ఈ అధికారాలన్నీ రాష్ట్రపతి నేరుగాగానీ, అతడి కింది అధికారుల ద్వారా గానీ నిర్వహిస్తాడు. దేశం కార్యనిర్వహణాధిపతిగా రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను, ప్రధానమంత్రిని, సుప్రీంకోర్ట్, హైకోర్టు న్యాయమూర్తులను వివిధ కమీషన్ల సభ్యులను, ఛైర్మన్లను నియమిస్తాడు.

2. శాసనాధికారాలు :
అధికరణ 79 ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖ, పార్లమెంట్ ఉభయసభలను మరియు రాష్ట్రపతిని కలిగి ఉంటుంది. భారత రాష్ట్రపతి కేంద్ర శాసననిర్మాణ శాఖలో ముఖ్య భాగం. రాష్ట్రపతికి పార్లమెంట్ ఉభయసభలను సమావేశపరచడం లేదా సభలను నిరవధికంగా వాయిదావేయడం, కేంద్ర మంత్రిమండలి సలహాపై అధికారం ఉంది.

ఏదైనా బిల్లు పట్ల ఉభయ సభల మధ్య వివాదం ఏర్పడినట్లయితే ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. లోక్సభ ప్రతీ సాధారణ ఎన్నికల తరవాత, ప్రతీ సంవత్సరం జరిగే పార్లమెంట్ ఉభయ సభల సమావేశంలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తాడు. రాష్ట్రపతి లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను, రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తాడు.

3. ఆర్థికాధికారాలు :
రాష్ట్రపతి ప్రతీ ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం తన సంవత్సర బడ్జెట్ను పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టేలా చూస్తాడు. రాష్ట్రపతి భారత సంఘటిత నిధిని నిర్వహిస్తాడు. రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా ద్రవ్యాన్ని ఖర్చుచేయడం, ప్రభుత్వం రెవెన్యూను పెంచటం వంటి ప్రతిపాదనలు పార్లమెంటులో ప్రవేశపెట్టరాదు.

ప్రతీ అయిదు సంవత్సరాలకు ఆర్థిక సంఘం అధ్యక్షుణ్ణి, ఇతర సభ్యులను నియమిస్తాడు. ఆర్థిక సంఘం మరియు భారత కంప్టోలర్ ఆడిటర్ జనరల్ తమ తమ నివేదికలు పార్లమెంట్లో ప్రవేశపెడతారు.

4. న్యాయాధికారాలు:
రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. రాష్ట్రపతికి కోర్టు విధించిన శిక్షను తగిన కారణమున్న పక్షంలో తాత్కాలికంగా నిలిపివేయడానికి, శిక్షలు అమలు కాకుండా వాయిదావేయడానికీ, ఒక రకమైన శిక్షను వేరొక రకం శిక్షగా మార్చడానికీ, శిక్షని పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష పెట్టడానికి అధికారం ఉంది. అధికరణ 143 ప్రకారం రాష్ట్రపతి జాతీయ ప్రాధాన్యత గల అంశాలపై న్యాయపరమైన సలహాలు తీసుకోగలడు.

5. సైనిక అధికారాలు :
రాష్ట్రపతి దేశానికి సర్వసైన్యాధ్యక్షుడు. ఇతడికి యుద్ధాన్ని ప్రకటించడం. సంధి ఒడంబడికలు చేయడం లాంటి అధికారాలు కలవు.

6. దౌత్య అధికారాలు :
రాష్ట్రపతి ఇతర దేశాలకు భారత దౌత్య రాయబారులను నియమిస్తాడు మరియు ఇతర దేశాలు భారతదేశానికై నియమించిన రాయబారుల అధికార పత్రాలను స్వీకరిస్తాడు. అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు, సంధి ఒడంబడికలు రాష్ట్రపతి పేరుమీదనే జరుగుతాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

అత్యవసర అధికారాలు :
భారత రాజ్యాంగం, భారతరాష్ట్రపతికి మూడు రకాలైన అత్యవసర పరిస్థితుల్ని ప్రకటించి, నిర్వహించే అధికారం ఇచ్చింది.

  1. జాతీయ అత్యవసర పరిస్థితి (అధికరణ 352)
  2. రాష్ట్రపతి పాలన (అధికరణ 356)
  3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (అధికరణ 360)

1. జాతీయ అత్యవసర పరిస్థితి :
రాష్ట్రపతి దేశానికి గానీ లేదా ఏదైనా భారత భూభాగానికి గానీ యుద్ధం లేదా బాహ్య దాడులు, సైనిక తిరుగుబాటు వల్ల ముప్పు పొంచి ఉందని భావించినట్లైతే, కేంద్ర మంత్రిమండలి లిఖిత సలహా మేరకు జాతీయ అత్యవసర పరిస్థితులను విధించవచ్చు.

ఇలాంటి ప్రకటన ఒక నెల వ్యవధి లోపల పార్లమెంటులో ఓటింగ్లో పాల్గొన్న మొత్తం సభ్యుల్లో 2/3 వంతుకు తగ్గకుండా ఆమోదించవలసి ఉంటుంది. అపుడు ఈ ప్రకటన 6 నెలల పాటు అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం ద్వారా దీన్ని మరో 6 నెలల పాటు పొడిగించవచ్చు.

2. రాష్ట్రపతి పాలన :
ఒక రాష్ట్రం గవర్నర్చే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగే పరిస్థితిలో లేదు. ఆ రాష్ట్రంలోని రాజ్యాంగపరమైన వ్యవస్థ విఫలమైంది అన్న నివేదికను అందుకున్న మీదట రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని, (రాష్ట్రపతి పాలన) ప్రకటించవచ్చు. ఈ ప్రకటన ఫలితంగా,

  1. రాష్ట్రపతీ ఆ రాష్ట్రప్రభుత్వం మొత్తం లేదా ఏవైనా విధులను తన అధికారంలోకి తీసుకోవచ్చు.
  2. రాష్ట్రశాసన నిర్మాణశాఖ అధికారాలు పార్లమెంటుచే నిర్వహించబడతాయి.

ఈ అత్యవసర ప్రకటన రెండు నెలలలోపు పార్లమెంటుచే ఆమోదించబడాలి. ఈ ప్రకటన 6 నెలల పాటు అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం మేరకు దీన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించవచ్చు.

3. ఆర్థిక అత్యవసర పరిస్థితి :
దేశం ఆర్థిక సుస్థిరతకు భంగం వాటిల్లిందని రాష్ట్రపతి భావించినపుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. ఈ అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్రప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని, ఇతర సదుపాయాలను తగ్గించగలిగే అధికారం కలిగి ఉంటుంది.

అన్ని ద్రవ్యబిల్లులు, ఇతర బిల్లులను రాష్ట్ర శాసన నిర్మాణశాఖ ద్వారా జారీ చేయబడిన తరువాత రాష్ట్రపతి అనుమతి కొరకు పంపించవలసి ఉంటుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించలేదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 2.
భారత ప్రధానమంత్రి అధికారాలను వర్ణించండి.
జవాబు.
ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం యొక్క నిజమైన కార్యనిర్వాహక అధిపతి. రాజ్యాంగ అధికరణ 74 ప్రకారం ప్రధానమంత్రి ఛైర్మన్ గా గల కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి తన విధులను నిర్వహించడంలో సలహాలను, సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రపతి లోక్సభలోని మెజారిటీ పార్టీ లేదా గ్రూపు నాయకుణ్ణి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. అందరు మంత్రులు ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు.

ప్రధానమంత్రి తన ఇష్టానుసారం బాధ్యతారహితంగా ప్రవర్తించే మంత్రుల్ని తొలగించడం లేదా మంత్రిత్వ శాఖల్ని పునఃపంపిణీ చేయడం, మార్చడం వంటి అధికారాలను కలిగి ఉంటాడు. భారత రాజ్యాంగం ప్రకారం మంత్రులు రాష్ట్రపతి విశ్వాసం కలిగి ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. కానీ నిజానికి వారు ప్రధానమంత్రి విశ్వాసం కలిగి ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారు.

ప్రధానమంత్రి అధికారాలు, విధులు :

1. ప్రధానమంత్రి – కేంద్ర కేబినెట్ నాయకుడు:
కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి ఆదేశాలకనుగుణంగా విధులను నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రిమండలిలోని ఏ వ్యక్తినైనా తొలగించే లేదా ఏ వ్యక్తినైనా నియమించే అధికారం ప్రధానమంత్రికి ఉంది. ఇతడు మంత్రిమండలిలో మంత్రుల మధ్య శాఖలను మార్చగలడు. కేబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.

2. ప్రధానమంత్రి – మెజార్టీ పార్టీ నాయకుడు:
ప్రధానమంత్రి ప్రజలసభ అయిన లోక్సభలోని మెజార్టీ పార్టీ నాయకుడు. ఇతడు తన పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను, పార్టీ మేనిఫెస్టోను నెరవేరుస్తాడు. ఇతను పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధి.

3. ప్రధానమంత్రి – పార్లమెంట్ నాయకుడు :
రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని రూపొందించిన దగ్గర నుంచి పార్లమెంట్ దేశప్రజల పరిపాలనలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పార్లమెంట్లోని ప్రజల సభ అయిన లోక్ సభ మెజార్టీ పార్టీ నాయకుడిగా, ప్రభుత్వం అధినేతగా ప్రధానమంత్రి పార్లమెంట్కు నాయకుడిగా పరిగణించబడతాడు. ఇతడు కేబినెట్ నిర్ణయాలను పార్లమెంట్కు తెలియపరుస్తాడు. కేంద్రప్రభుత్వ దేశ, విదేశీ విధానాలను పార్లమెంట్ సభ్యులకు వివరిస్తాడు.

4. ప్రధానమంత్రి – రాష్ట్రపతి, మంత్రిమండలి మధ్య వారధి:
ప్రధానమంత్రి రాష్ట్రపతి, కేంద్ర మంత్రిమండలికి మధ్య వారధిలా వ్యవహరిస్తాడు. మంత్రిమండలి నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేయడం ఇతడి విధి. కేంద్రప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన విషయాలన్నింటినీ రాష్ట్రపతికి తెలియజేస్తాడు.

5. ప్రధానమంత్రి – కేంద్రప్రభుత్వ నాయకుడు :
ప్రధానమంత్రి కేంద్రప్రభుత్వ అధినేత. ఇతడు దేశం మరియు దేశప్రజల ఉన్నతికి, అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వ పథకాలను, విధానాలను, కార్యక్రమాలను కేంద్ర మంత్రిమండలితో కలసి రూపొందించి అమలుపరుస్తాడు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రధానమంత్రి ఇష్టానుసారం పనిచేస్తుంది.

6. ప్రధానమంత్రి దేశానికి నాయకుడు :
ప్రధానమంత్రి దేశం నాయకుడిగా వ్యవహరిస్తాడు. పార్లమెంట్ నాయకుడిగా మరియు ప్రభుత్వ అధినేతగా పార్లమెంట్ లోపల, బయట ఇతడి వ్యాఖ్యలు ప్రకటనలు దేశానికి ముఖ్యమైనవిగా ఉంటాయి. ఇతర దేశాలను సందర్శించినప్పుడు ప్రధానమంత్రి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇతడి అభిప్రాయాలు మొత్తం దేశపు అభిప్రాయంగా పరిగణించబడతాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 3.
కేంద్ర మంత్రిమండలి నిర్మాణం, విధులను వివరించండి.
జవాబు.
అధికరణ 74(1) ప్రకారం ప్రధానమంత్రి ఛైర్మన్ గా గల కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి తన విధులను నిర్వహించడంలో సలహాలను, సహకారాన్ని అందిస్తుంది. మంత్రిమండలిలోని మంత్రులందరూ ప్రధానమంత్రి సలహాపైన రాష్ట్రపతి ద్వారా నియమించబడతారు.

1. నిర్మాణం :
కేంద్ర మంత్రిమండలిలో మూడు విధాలైన మంత్రులు ఉంటారు. అంటే కేబినెట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు, స్టేట్ మంత్రులు.
i) కేబినేట్ మంత్రులు :
మొదట రాజ్యాంగంలో కేబినెట్ అనే పదం లేదు. కేబినెట్ అనే పదం రాజ్యాంగంలో 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. సాధారణంగా ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్న మంత్రులు కేబినెట్ మంత్రులుగా పిలవబడతారు.

విధానాలు రూపొందించడంలో కేబినెట్ మంత్రులు ప్రధానమంత్రికి సహకరిస్తారు. కేబినేట్ ప్రభుత్వ విధాన రూపకల్పనలో ముఖ్యమైన భాగం ప్రధానమంత్రి స్వయంగా నియమించిన వారు క్యాబినేట్ మంత్రులుగా ఉంటారు.

ii) స్టేట్ మంత్రులు :
స్టేట్ మంత్రులు చిన్న మంత్రిత్వ శాఖలను స్వతంత్రంగా నిర్వహిస్తారు.

iii) డిప్యూటీ మంత్రులు :
డిప్యూటీ మంత్రులు ఎలాంటి స్వతంత్ర మంత్రిత్వ శాఖలను కలిగి ఉండరు. వీరు కేబినెట్ మంత్రులకు సహకరిస్తారు. కేబినెట్ మంత్రుల ఆధ్వర్యంలో ఆయా మంత్రిత్వ శాఖల రోజువారీ పనులను నిర్వహిస్తారు.

అధికారాలు, విధులు : మంత్రిమండలిలోని మంత్రులు కింది విధులను కలిగి ఉంటారు.

  1. కేంద్రప్రభుత్వం విధానాలను మంత్రిమండలి రూపొందిస్తుంది. ఎన్నో చర్చోపచర్చల తరవాత వీరు దేశం, దేశీయ విదేశీ విధానాలను అంతిమంగా నిర్ణయిస్తారు.
  2. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాల్లో రాష్ట్రపతికి సలహాలను అందిస్తుంది. రాష్ట్రపతి తన విధులను నిర్వహించడానికి మార్గనిర్దేశం చేస్తుంది.
  3. ఇది దేశ, ఆర్థిక రంగంపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది. పన్నులు, ఇతర ఖర్చులకు సంబంధించిన తీర్మానాలు నిజానికి కేబినెట్ ద్వారా రూపొందించబడి పార్లమెంట్ ద్వారా ఆమోదించబడతాయి.
  4. దేశ పరిపాలన మంత్రులు వివిధ ప్రభుత్వ విభాగాల రాజకీయ అధినేతలు ప్రభుత్వ యంత్రాంగం అంతా మంత్రుల నియంత్రణలో రోజువారీ పరిపాలన నిర్వహిస్తారు. దీన్ని బట్టి కేబినెట్ మొత్తం దేశాన్ని పరిపాలిస్తుంది అని చెప్పవచ్చు.
  5. చట్టాలను రూపొందించే ప్రక్రియలో కేబినెట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏదైనా మంత్రిత్వశాఖకు సంబంధించిన బిల్లు నిర్మాణం మంత్రిమండలి సమావేశంలో క్షుణ్ణంగా చర్చించిన తరవాతనే జరుగుతుంది. ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి, సంబంధించిన మంత్రులతో వివరించబడుతుంది.
  6. పార్లమెంట్లో ప్రవేశపెట్టబడ్డ బిల్లులు రాష్ట్రపతి సంతకం తరవాతే చట్టాలుగా మారతాయి. నిజానికి రాష్ట్రపతి కేబినెట్ చేయమన్న పని మాత్రమే చేస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

5. సమిష్టి బాధ్యత :
అధికరణ 75(3) ప్రకారం మంత్రిమండలి ప్రజల సభ అయిన లోక్సభకి సమిష్టి బాధ్యత వహిస్తుంది. ప్రతీ మంత్రి తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన నిర్ణయాలకు బాధ్యుడు అంతేకాకుండా అతడు తన తోటి మంత్రులు నిర్వహించే మంత్రిత్వశాఖలకు సంబంధించిన నిర్ణయాలకు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.

ఎందుకంటే అందరు మంత్రులు కేబినెట్ విధి విధానాలను అనుసరించి, క్యాబినెట్ మార్గనిర్దేశనంలో, నియంత్రణలో పనిచేస్తారు. దీన్ని బట్టి ఒక మంత్రి తన తప్పుడు నిర్ణయాలకు బాధ్యత వహిస్తాడు.

అలాగే తన తోటి మంత్రుల తప్పుడు నిర్ణయాలకు బాధ్యత వహిస్తాడు. ఒకవేళ ఏ మంత్రి అయినా వేరొక మంత్రి తప్పుడు నిర్ణయానికి, చర్యకు బాధ్యత వహించడానికి అంగీకరించనట్లయితే అతను మంత్రి పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది లేదా. అతడు ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతిచే తొలగించబడతాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
భారత పార్లమెంటు అధికారాలు ఏమిటి ? వివరించండి.
జవాబు.
రాజ్యాంగం 79వ అధికరణం ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖలో (ఎ) రాష్ట్రపతి, (బి) పార్లమెంటులోని ఉభయసభలు అంతర్భాగాలు. లోక్సభ అనేది పార్లమెంటులో దిగువసభకాగా, రాజ్యసభ ఎగువసభ. రాష్ట్రపతికి ఉభయసభల సమావేశాలను ప్రారంభించేందుకు వాయిదా వేసేందుకు అధికారం ఉంటుంది.

పార్లమెంట్ అధికారాలు, విధులు: భారత పార్లమెంట్ భారతదేశ పౌరుల ఆకాంక్షలను, ఆశయాలను ప్రతిబింబించే ప్రధాన శాసన నిర్మాణ అంగం. ఇది భారత ప్రభుత్వానికి కావలసిన చట్టాలను రూపొందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. భారత పార్లమెంట్ క్రింది అధికారాలను కలిగి ఉంది.

1. శాసన నిర్మాణాధికారం :
పార్లమెంట్ కేంద్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో గల అంశాలపై చట్టాలను రూపొందిస్తుంది. ఏ జాబితాలోని అంశాలపైన అయినా శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఒక బిల్లు కేవలం రెండు సభలు ఆమోదించిన తరవాత మాత్రమే చట్టంగా మారుతుంది. ఒక బిల్లుపై రెండు సభల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తినపుడు రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు.

అప్పుడు ఆ బిల్లు భవితవ్యం సంయుక్త సమావేశంలో మెజారిటీ ఓట్ల ద్వారా నిర్ణయించబడుతుంది. రాష్ట్రపతికి ఒక బిల్లుని పునఃపరిశీలన కోసం పార్లమెంట్కు తిరిగి పంపించగలిగే అధికారం ఉంది. ఎప్పుడైతే పార్లమెంట్ తిరిగి చర్చ జరిపి దాన్ని మళ్ళీ ఆమోదిస్తుందో అప్పడు రాష్ట్రపతి తప్పనిసరిగా సంతకం చేయవలసి ఉంటుంది.

2. కార్వనిర్వాహక అధికారం (కార్యనిర్వాహక శాఖని నియంత్రించే అధికారం) :
కేంద్ర మంత్రిమండలి తన నిర్ణయాలపట్ల తన విధానాలపట్ల నేరుగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. కొత్త తీర్మానాన్ని ఆమోదించడం లేదా ఏదైనా ద్రవ్యబిల్లును ఆమోదించడానికి లోక్సభ నిరాకరించనట్లయితే దాన్ని మంత్రిమండలిపై అవిశ్వాస తీర్మానంగా భావించబడుతుంది. మంత్రిమండలి రాజీనామా చేయవలసి ఉంటుంది.

3. ఆర్థికాధికారాలు :
పార్లమెంట్ దేశం యొక్క జమా ఖర్చులకు బాధ్యత వహిస్తుంది. పార్లమెంటు ఆమోదం లేనిదే పన్నులను విధించడంగానీ, పన్నులు వసూలు చేయడంగానీ, ఏదైనా వ్యయం చేయడంగానీ జరగదు.

4. రాజ్యాంగ సవరణాధికారం:
రాజ్యాంగ అధికరణ 368 నిబంధనల ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కు ఉంది. రాజ్యాంగంలో చాలా భాగం పార్లమెంట్ ప్రతీ సభలో సభ్యులలో 2/3వ వంతు మెజారిటీ ద్వారా సవరించబడింది. కొన్ని అధికరణాలలోని నిబంధనలను సవరించడానికి రెండు సభల్లో 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించబడ్డ తరవాత దేశంలోని రాష్ట్రశాసన సభలలో కనీసం సగం శాసనసభల ఆమోదం అవసరం.

5. ఎన్నికాధికారం :
భారతపార్లమెంట్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను ఎన్నుకొంటుంది. లోక్సభలోని సభ్యులు తమ నుండి ఇద్దరు సభ్యులను స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులు తమ డిప్యూటీ చైర్మన్ని ఎన్నుకుంటారు.

6. న్యాయసంబంధ అధికారాలు :
అవినీతి, అసమర్థత లాంటి అభియోగాల వంటి నిర్దిష్ట కారణాలున్నపుడు మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని, సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులను తొలగించడానికి భారత పార్లమెంట్కి అధికారం గలదు.

7. చర్చాపూర్వక విధులు :
భారత పౌరులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించే, యోచించే ముఖ్యమైన చర్చావేదిక పార్లమెంట్. సమకాలీన జాతీయ, అంతర్జాతీయ అంశాలు, దేశ పౌరులను ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించడానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరుపుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 5.
భారత సుప్రీంకోర్టు విధులను తెలియజేయండి.
జవాబు.
సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని ప్రాథమిక, అప్పీళ్ళ విచారణ, సలహారూపక అధికార పరిధులుగా విభజించవచ్చు.

i. ప్రాథమిక అధికార పరిధి :
ఈ అధికారం కింది సుప్రీంకోర్టు ఈ కింది వివాదాలను విచారించగలదు.

  1. భారత ప్రభుత్వానికి ఒకటి లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు మధ్య వివాదం.
  2. భారతప్రభుత్వం ఒకటి అంతకంటే ఎకుకవ రాష్ట్రాలు ఒక వైపు, ఒక రాష్ట్రం లేదా ఎక్కువచ రాష్ట్రాలు ఇంకోవైను ఉన్నప్పుడు వాటి మధ్య వివాదం.
  3. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు మధ్య వివాదాలు తలెత్తినప్పుడు విచారిస్తుంది.

ii. అప్పీళ్ళ విచారణా పరిధి :
ఈ అధికారం కింద సుప్రీంకోర్టు ఈ కింది వివాదాలపై అప్పీళ్ళను విచారిస్తుంది.

ఎ. రాజ్యాంగపరమైన వివాదాలు :
రాజ్యాంగంపై వ్యాఖ్యానాలకు సంబంధించిన వివాదాలపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.

బి. పౌర వివాదాలు :
పౌరవివాదాలపై కూడా హైకోర్టు తీర్పుకు వ్యవతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు చేయవచ్చు. ఈ అప్పీలు కోసం హైకోర్టు ఆ వివాదం రాజ్యాంగపరమైన, చట్టానికి సంబంధించిన ప్రశ్నలను కలిగి ఉందని అప్పీలు చేయవచ్చు.

సి. క్రిమినల్ వివాదాలు :
క్రిమినల్ వివాదాల్లో ఏ తీర్పుకు వ్యతిరేకంగానైనా సుప్రీంకోర్టులో అప్పీలు చేయవచ్చు. అంతిమ నిర్ణయం లేదా తుది తీర్పు హైకోర్టుచే ఇవ్వబడుతుంది. సాధారణంగా క్రిమినల్ వివాదాలలో అప్పీలు చేసుకోగలిగే అంతిమ స్థాయి కోర్టు హైకోర్టు. కానీ ఈ క్రిమినల్ అంశాలకు సంబంధించి హైకోర్టు నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీలును వినే ప్రత్యేక అధికారం పార్లమెటు సుప్రీంకోర్టుకు కల్పించింది.

iii. సలహా అధికార పరిధి :
సుప్రీంకోర్టు కొంత సలహా అధికార పరిధిని కూడా కలిగి ఉంది. ఒక అంశంలో చట్టం, వాస్తవానికి మధ్య ప్రశ్న తలెత్తి ఆ విషయంలో రాజ్యాంగపరమైన వ్యాఖ్యానం అవసరమని రాష్ట్రపతి భావించినట్లయితే సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరవచ్చు. సుప్రీంకోర్టు రాష్ట్రపతి ప్రశ్నకి సమాధానం ఇవ్వవచ్చు. కానీ ఇది ఏ పక్షాలపై నిర్బంధం విధించదు.

iv. ఇతర విధులు :
కోర్ట్ ఆఫ్ రికార్డ్ (Court of Record) :
సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్ కూడా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులు నమోదు చేయబడి, భద్రపరచబడతాయి. ఇవి ప్రామాణికమైనవిగా భావించబడి చట్టాలతో సమానంగా గౌరవించబడతాయి. ఈ రాకార్డులు సాక్ష్యాలుగా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.

సూచనలు ఆదేశాలు లేదా రిట్లు :
సుప్రీంకోర్టు పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను రక్షించేదిగా, హామీనిచ్చేదిగా విమర్శించడం ఖండించడం, కోర్టును, న్యాయమూర్తులను విమర్శించడం. కోర్టుకి వ్యతిరేకంగా అమర్యాదకరమైన అగౌరవమైన అభిప్రాయాలను వెలిబుచ్చడం, కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉండకపోవడం అనేవి కోర్టు ధిక్కార నేరంగా పరిగణించబడతాయి.

కోర్టు ధిక్కరణ :
ఏ వ్యక్తినైనా కోర్టు ధిక్కార నేరం కింద శిక్షించే అధికారం సుప్రీంకోర్టుకి ఉంది. కోర్టు తీర్పును విమర్శించడం, ఖండించడం, కోర్టును, న్యాయమూర్తులను విమర్శించడం, కోర్టుకి వ్యతిరేకంగా అమర్యాదకరమైన, అగౌరవకరమైన అభిప్రాయాలను వెలిబుచ్చడం, కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉండకపోవడం అనేవి కోర్టుధిక్కార నేరంగా పరిగణించబడతాయి.

ఆదేశాలను, తీర్పులను, పునఃపరిశీలించడం :
సుప్రీంకోర్టు తీను ఇంతకు ముందు జారీ చేసిన ఏ ఆదేశాన్నైనా పునఃపరిశీలించే అధికారం కలిగి ఉంది. ఎ. కొత్త పరిష్కార పద్ధతి లేదా సాక్ష్యాలు కనిపించినపుడు, బి. కోర్టు యొక్క రికార్డుల ప్రకారం తీర్పులో తప్పిదం కనిపించినప్పుడు సి. లేదా పునఃపరిశీలనకు తగిన కారణాలు కలిగి ఉన్నపుడు కోర్టు ఈ విధంగా ఆదేశాలను సమీక్షించగలదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

స్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
భారత రాష్ట్రపతి ప్రత్యేక (అత్యవసర) అధికారాలు ఏమిటి ?
జవాబు.
భారత రాజ్యాంగం, భారత రాష్ట్రపతికి మూడురకాలైన అత్యవసర పరిస్థితుల్ని ప్రకటించి, నిర్వహించే అధికారం ఇచ్చింది. అవి:

  1. జాతీయ అత్యవసర పరిస్థితి (అధికరణ 352)
  2. రాష్ట్రపతి పాలన (అధికరణ 356)
  3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (అధికరణ 360)

1. జాతీయ అత్యవసర పరిస్థితి :
రాష్ట్రపతి దేశానికి గానీ లేదా ఏదైనా భారత భూభాగానికి గానీ యుద్ధం లేదా బాహ్యదాడులు, సైనిక తిరుగుబాటు వల్ల ముప్పు పొంచి ఉందని భావించినట్లయితే, కేంద్ర మంత్రిమండలి లిఖిత సలహా మేరకు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు.

ఇలాంటి ప్రకటన ఒక నెల వ్యవధి లోపల పార్లమెంటులో ఓటింగులో పాల్గొన్న మొత్తం సభ్యుల్లో 2/3వ వంతుకు తగ్గకుండా ఆమోదించవలసి ఉంటుంది. అప్పుడు ఈ ప్రకటన 6 నెలల పాటు అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం ద్వారా దీనిని మరో 6 నెలల పాటు పొడిగించవచ్చు.

2. రాష్ట్రపతి పాలన :
ఒక రాష్ట్రం గవర్నర్చే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగే పరిస్థితిలో లేదు. ఆ రాష్ట్రంలోని రాజ్యాంగపరమైన వ్యవస్థ విఫలమైంది అన్న నివేదికను అందుకున్న మీదట రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని (రాష్ట్రపతి పాలన) ప్రకటించవచ్చు. ఈ ప్రకటన ఫలితంగా

  1. రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లేదా ఏదైనా విధులను తన అధికారంలోకి తీసుకోవచ్చు.
  2. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అధికారాలు పార్లమెంటుచే నిర్వహించబడతాయి.

ఈ అత్యవసర ప్రకటన రెండు నెలల లోపు పార్లమెంటుచే ఆమోదించబడాలి. ఈ ప్రకటన 6 నెలల పాటు అమలులో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం మేరకు దీన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించవచ్చు.

3. ఆర్థిక అత్యవసర పరిస్థితి :
దేశ ఆర్థిక సుస్థిరతకు భంగం వాటిల్లిందని రాష్ట్రపతి భావించినపుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. ఈ అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను, ఇతర సదుపాయాలను తగ్గించగలిగే అధికారం కలిగి ఉంటాడు.

అన్ని ద్రవ్య బిల్లులు, ఇతర బిల్లులను రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ద్వారా. జారీ చేయబడిన తరువాత రాష్ట్రపతి అనుమతి కొరకు పంపించవలసి ఉంటుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించలేదు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 2.
రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మాన ప్రక్రియను వివరించండి.
జవాబు.
రాష్ట్రపతి పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయవచ్చు లేదా రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే రాజ్యాంగంలోని 56, 61 అధికరణాల ప్రకారం పార్లమెంట్ మహాభియోగ తీర్మానం ద్వారా పదవి నుండి తొలగించవచ్చు. దానికి అనుసరించే పద్ధతి ఈ దిగువ వివరించిన విధంగా ఉంటుంది.

  1. పార్లమెంట్లో ఏదో ఒక సభలో 14 రోజుల వ్యవధితో ఒక నోటీసు జారీచేసి మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానం మీద ఆ సభలోని సభ్యుల 4వ వంతు సభ్యులు సంతకం చేయాలి.
  2. ఆ తీర్మానాన్ని చర్చించి ఆ సభ 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించాలి.
  3. అలా ఆమోదించిన తీర్మానాన్ని రెండవ సభ ఒక కమిటీని ఏర్పరచి, ఆరోపణలపై విచారణ జరుపుతుంది.
  4. ఆరోపణలు రుజువైతే ఆ సభలో మొత్తం సభ్యులలో 2/3వ వంతు సభ్యులు ఆమోదిస్తే రాష్ట్రపతి పదవీచ్యుతుడౌతాడు. ఇంతవరకు మహాభియోగ తీర్మానం ద్వారా ఏ రాష్ట్రపతి తొలగింపబడలేదు.

ప్రశ్న 3.
ఉపరాష్ట్రపతి ఎన్నిక, అధికారాలు – విధులను గురించి రాయండి.
జవాబు.
భారత ఉపరాష్ట్రపతి పదవి భారతదేశంలోని రెండవ అత్యున్నత పదవి. రాజ్యాంగ అధికరణ 60 నుంచి 71 ఉపరాష్ట్రపతి గురించి వివరిస్తాయి. ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ వరుసగా రెండవసారి ఎన్నికై కొనసాగుతున్నారు.

నిర్మాణం :
1. అర్హతలు:
భారత ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఒక వ్యక్తి ఈ కింది అర్హతలను కలిగి ఉండాలి.

  • భారత పౌరుడై ఉండాలి.
  • 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
  • రాజ్యసభ సభ్యుడుగా ఎన్నిక కావడానికి కావలిసిన అర్హత కలిగి ఉండాలి.

2. ఎన్నిక :
భారత ఉపరాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఒక ఓటు బదిలీ ద్వారా రహస్య ఓటింగ్ విధానంలో భారత పార్లమెంట్ ఉభయసభలకు ఎన్నుకోబడిన, నామినేట్ చేయబడిన సభ్యులు ఎన్నుకొంటారు.

3. పదవీకాలం :
భారత ఉపరాష్ట్రపతి పదవీకాలం కార్యాలయంలో విధులు చేపట్టిన సమయం నుంచి 5 సంవత్సరాలు. ఇతడు రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపించడం ద్వారా పదవికి రాజీనామా చేయవచ్చు.

4. వేతనం, ఇతర సదుపాయాలు:
భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ హోదాలో 71,25,000 నెలసరి వేతనం, ఇతర సదుపాయాలను అందుకొంటాడు.

5. తొలగింపు భారత ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం కేవలం రాజ్యసభలో మొత్తం సభ్యుల్లో 1/4వ వంతు సభ్యుల అనుమతితో ప్రవేశపెట్టాలి. 14 రోజుల ముందస్తు నోటీసు గడువు పూర్తి అయిన తరువాత రాజ్యసభ ఈ తీర్మానంపై చర్చలు జరుపుతుంది.

ఈ తీర్మానం సభలో ఓటింగ్ లో పాల్గొనే సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు ఆమోదించినట్లయితే ఇది లోక్సభకు పంపబడుతుంది. లోక్ సభలో కూడా ఈ తీర్మానం 2/3వ వంతు సభ్యులచే ఆమోదించవలసి ఉంటుంది.

అధికారాలు – విధులు : భారత ఉపరాష్ట్రపతి కేవలం 2 రకాల అధికారాలను, విధులను కలిగి ఉన్నాడు.

1. రాజ్యసభ ఛైర్మన్ :
భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరిస్తాడు. ఇతడు రాజ్యసభ సమావేశాల్లో – ప్రసంగిస్తాడు. సభ యొక్క వ్యవహారాలను నిర్వహిస్తాడు. ఏదైనా బిల్లు పట్ల ఓట్లు సమానంగా చీలినట్లయితే, నిర్ణాయకపు ఓటును వినియోగిస్తాడు.

2. తాత్కాలిక రాష్ట్రపతి :
రాష్ట్రపతిని తొలగించినా, రాజీనామా చేసినా లేదా మరణించినా గానీ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా 6 నెలలు మాత్రమే వ్యవహరించగలడు. ఈ సమయంలో ఇతడు భారత రాష్ట్రపతికి గల వేతనం ఇతర సదుపాయాలను అందుకుంటాడు. రాజ్యసభ ఛైర్మన్ హోదాలో ఎలాంటి వేతనాన్ని, ఇతర సదుపాయాలను అందుకోలేడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
సమిష్టి బాధ్యత అనగానేమి ? వివరించండి.
జవాబు.
సమిష్టి బాధ్యత :
పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలలో ప్రధానమైనదే సమిష్టి బాధ్యత. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ సూత్రాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యాంగం 75(3)వ అధికరణం మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుందని ప్రకటించింది. కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఒక జట్టుగా వ్యవహరిస్తుంది.

కార్యనిర్వాహకశాఖలోని మంత్రులు అధికారంలో ఉండగా తమ చర్యలకు, కార్యకలాపాలకు పార్లమెంటు (శాసన నిర్మాణశాఖ కు సమిష్టిగా బాధ్యత వహించడాన్నే సమిష్టి బాధ్యత అంటారు. ప్రతి మంత్రి తన మంత్రిత్వశాఖలో పరిణామాలకు బద్దుడై పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటాడు. అలాగే మంత్రిత్వశాఖలో తన నిర్ణయాలవల్ల కలిగే పరిణామాలకు బద్ధుడై ఉంటాడు.

ఇది ప్రతి మంత్రి నిర్వర్తించవలసిన వ్యక్తిగత బాధ్యత కూడా. ప్రభుత్వ విధానాలపట్ల, అనుకూలంగానో, ప్రతికూలంగానో ఎదురయ్యే పరిణామాల సందర్భంలో తన ప్రమేయంలేదనీ, తనకు తెలియదనీ చెప్పి తప్పుకోవడానికి, నిస్సహాయతను వెల్లడించడానికి ఏ మంత్రికీ వీలులేదు.

సమిష్టి బాధ్యత మంత్రులందరినీ ఒక జట్టుగా ఉంచి ఏక త్రాటిపై నడిపిస్తుంది. సమిష్టి బాధ్యతా సూత్రాన్ని ప్రధానమంత్రి ఆచరణలో ఉంచుతాడు. మంత్రివర్గ సమావేశాలలో ఆమోదించిన నిర్ణయాలను ప్రతి ఒక్క మంత్రి గౌరవించినట్లు, అమలుతో ఉంచేటట్లు ప్రధానమంత్రి చర్యలు తీసుకుంటాడు. మంత్రిమండలిలోని సభ్యుల మధ్య సహకారం, సమన్వయం సర్దుబాటుతనం పెంపొందించడానికి కృషి చేస్తాడు. మంత్రివర్గ సమావేశాలలో ఏ మంత్రి అయినా తన భావాలను స్వేచ్ఛగా వెల్లడించడానికి అనుమతిస్తాడు.

అయితే, ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత దానికి కట్టుబడి ప్రతి మంత్రి మనస్ఫూర్తిగా అనుసరించవలసి ఉంటుంది. లేకపోతే రాజీనామా సమర్పించవలసి ఉంటుంది. అది కూడా చేయనప్పుడు ఆయనను ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయవచ్చు. ఇక మంత్రివర్గ నిర్ణయాలను బట్టి కట్టుబడని మంత్రులను మినహాయించి మిగిలిన వారితో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే హక్కు ప్రధానమంత్రికి ఉంటుంది.

కార్యనిర్వాహకశాఖ సమిష్టి బాధ్యతను శాసన నిర్మాణశాఖ అనేక విధాలుగా ఆచరణలో ఉంచుతుంది. శాసన నిర్మాణశాఖ (పార్లమెంటు) కార్యనిర్వాహకశాఖ (మంత్రిమండలి)పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి, ఆమోదిస్తుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిన తక్షణమే కార్యనిర్వాహకశాఖ (మంత్రిమండలి) అధికారాన్ని కోల్పోతుంది.

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే సందర్భంలో పార్లమెంటు సభ్యులు కార్యనిర్వాహకశాఖపై మోపిన ఆరోపణలకు సంజాయిషీ కోరగా కార్యనిర్వాహకశాఖ అందుకు కొన్ని సందర్భాలలో అవిశ్వాస తీర్మానం బదులుగా కార్యనిర్వాహకశాఖే శాసన నిర్మాణశాఖ విశ్వాసాన్ని పొందే విధంగా తీర్మానాన్ని ప్రతిపాదించవలసి రావచ్చు.

ఉదాహరణకు 1979లో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చరణ్సింగ్ను ప్రధానిగా నియమిస్తూ లోక్సభ విశ్వాసాన్ని పొందవలసిందిగా ఆదేశించారు. కానీ లోక్సభ విశ్వాసాన్ని పొందకుండానే చరణ్ సింగ్ ప్రధాని పదవికి రాజీనామా సమర్పించారు.

ఇటీవల 1999 ఏప్రిల్ 14న వాజ్పేయి ఆధ్వర్యంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వానికి ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. మద్దతు ఉపసంహరించుకోగా, ప్రధాని వాజ్పేయి లోక్సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన తీర్మానాన్ని సభ తిరస్కరించగా 1999 ఏప్రిల్ 17న ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారు.

మొత్తం మీద సమిష్టి బాధ్యత అనేది మంత్రిమండలికి, లోక్సభకు సంబంధించిన అంశం. సమిష్టి బాధ్యత అనేది శాసన నిర్మాణశాఖ కార్యనిర్వాహకశాఖలు రెండూ విడివిడిగా పార్లమెంటు దిగువసభలో తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవడానికి, ప్రజలకు ఎలక్ట్రానిక్ ప్రచార సాధనాల ద్వారా తన అభిప్రాయాలను తెలియజేయడానికి వీలు కల్పిస్తుంది. మంత్రిమండలి సమైక్యంగా బాధ్యతాయుతంగా, సామరస్యం, సదవగాహనలతో వ్యవహరించడానికి సమిష్టి బాధ్యత దోహదపడుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 5.
లోక్సభ స్పీకర్ యొక్క విధులను వివరించండి.
జవాబు.
భారతదేశంలో స్పీకర్ కార్యాలయం ఏర్పాటు పద్దతిని బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ నుండి తీసుకోవడం జరిగింది. రాజ్యాంగ అధికరణ 93 ప్రకారం ప్రతీ సాధారణ ఎన్నికల తరువాత లోక్సభ సభ్యులు తమ నుండి స్పీకర్ను డిప్యూటీ స్పీకర్ను పూర్తి సమయం కోసం ఎన్నుకోవలసి ఉంటుంది.

1. అర్హత :
లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యే వ్యక్తి తప్పనిసరిగా లోక్సభ సభ్యుడై ఉండాలి.

2. ఎన్నిక :
లోక్ సభ సభ్యులు తమలోంచి ఒక సభ్యుణ్ణి స్పీకర్గా ఎన్నుకుంటారు. సాధారణంగా స్పీకర్ పదవికి అధికారంలో ఉన్న పార్టీ సభ్యులే ఎన్నికవడం ఆనవాయితీ.

3. పదవీకాలం :
లోకసభ స్పీకర్ పదవీకాలం సాధారణంగా 5 సంవత్సరాలు. స్పీకర్ సభ రద్దయిన తరువాత కూడా పదవిలో కొనసాగుతాడు. క్రొత్త స్పీకర్ ఎన్నికయ్యే వరకు అతను స్పీకర్ కార్యాలయాన్ని నిర్వహిస్తాడు.

4. వేతనం, ఇతర సదుపాయాలు :
స్పీకర్ ప్రతి నెల 1,25,000 వేతనంగా పొందుతాడు. ఉచిత నివాసగృహం. వైద్యసదుపాయం, కమ్యూనికేషన్ సదుపాయాలు కల్పించబడడం పొందుతారు.

5. తొలగింపు :
స్పీకర్ సభలో హాజరైన, ఓటింగ్ లో పాల్గొన్న సభ్యుల్లోని మెజారిటీ సభ్యులు తొలగింపు తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా తొలగించబడతాడు. దీనికి 14 రోజుల ముందస్తు నోటీసు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. స్పీకరును తొలగించే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు, స్పీకర్ సభకి అధ్యక్షత వహించలేడు. కానీ చర్చలో పాల్గొనగలడు. ఇంతవరకు భారతదేశంలో స్పీకర్ పదవిలో ఉన్న ఎవరినీ తొలగించడం జరగలేదు.

6. స్పీకర్ అధికారాలు, విధులు :
స్పీకర్ తన విధులను సక్రమంగా, హుందాగా సమర్థవంతంగా నిర్వహించడానికి కావలసిన అధికారాలను భారత రాజ్యాంగం స్పీకర్కు కల్పించింది. స్పీకర్ తన విస్తృతమైన అధికారాలను రాజ్యంగం ద్వారా, పార్లమెంటు విధి విధానాల నిర్వహణ చట్టం 1950 నుంచి పొందుతాడు. స్పీకర్ ఈ కింది విధులను నిర్వహిస్తాడు.

  1. స్పీకర్ లోక్సభ సమావేశాల్లో ప్రసంగిస్తాడు.
  2. సభ్యులను ప్రశ్నలు అడగడానికి అనుమతిస్తాడు. సభానియమాలకు అనుగుణంగా ప్రశ్నలు లేని పక్షంలో అనుమతి నిరాకరించడానికి కూడా స్పీకర్కు అధికారం ఉంది.
  3. వాయిదా తీర్మానాలు ఇతని ఆమోదంతోనే ప్రవేశపెట్టబడతాయి. ఇతడి తీర్మానంపై వ్యాఖ్యానించడానికి సమయం పరిమితిని నిర్ణయిస్తాడు.
  4. ఒక బిల్లుని సభలో ప్రవేశపెట్టడానికి ముందు గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించడానికి అనుమతించవచ్చు. దీనికి సభ అనుమతి అవసరం లేదు.
  5. అతడు సెలక్షన్ కమిటీ చైర్మన్ను నియమిస్తాడు. తను స్వంతంగా కొన్ని ముఖ్యమైన కమిటీలకు, బిజినెస్ అడ్వయిజరీ కమిటీ, జనరల్ పర్చేస్ కమిటీ వంటి వాటికి చైర్మన్ గా వ్యవహరిస్తాడు.
  6. ఒక తీర్మానం సభలో ప్రవేశయోగ్యమా కాదా అని నిర్ణయిస్తాడు.
  7. స్పీకర్ అనుమతి లేకుండా ఏ సభ్యుడూ సభనుద్దేశించి ప్రసంగించలేడు. ఏ సభ్యుడు అయినా చర్చకు సంబంధంలేని అంశాలను మాట్లాడడం ద్వారా సభా సమయాన్ని దుర్వినియోగం, నిరుపయోగం కాకుండా చూస్తాడు.
  8. సభను సక్రమంగా నిర్వహిస్తాడు. సభలో గందరగోళం చెలరేగి కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడినపుడు సభను వాయిదా వేసి, ముగిస్తాడు.
  9. ఒక సభ్యుడు స్పీకర్ అధ్యక్షతను అంగీకరించకపోతే, అసభ్యంగా ప్రవర్తిస్తే నిషేధ హెచ్చరిక చేస్తాడు. సభ నుంచి వెళ్ళిపొమ్మని ఆదేశించినప్పుడు ఆ ఆ దేశాన్ని ఆ సభ్యుడు ఖాతరు చేయకపోతే సంబంధిత సెక్యూరిటీ అధికారుల (మార్షల్స్) ద్వారా బయటికి పంపించగలడు.
  10. ఒక తీర్మానానికి అనుకూలంగా, ప్రతికూలంగా, సమానంగా ఓట్లు లభించినప్పుడు నిర్ణాయకపు ఓటును వినియోగిస్తాడు.
  11. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాలలో ప్రసంగిస్తాడు.
  12. ఒక బిల్లుని ద్రవ్య బిల్లా, కాదా అని నిర్ణయిస్తాడు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 6.
సుప్రీంకోర్టు యొక్క న్యాయసమీక్షాధికారం గురించి రాయండి.
జవాబు.
భారత రాజ్యాంగంలో ‘న్యాయసమీక్ష’ అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ, మన రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోని శాసన, కార్యనిర్వాహక సంస్థలు రూపొందించే, అమలుచేసే చట్టాలలోని రాజ్యాంగ ఔచిత్యాన్ని నిర్ణయించే అధికారాన్ని సుప్రీంకోర్టుకు సంక్రమింపచేశారు.

భారతదేశంలో రాజ్యాంగ అంశాలను వ్యాఖ్యానించడానికి, రాజ్యాంగ విలువలను కాపాడటానికి, కేంద్రం, రాష్ట్రాల మధ్య న్యాయవివాదాలు ఏర్పడితే న్యాయపరమైన తీర్పు ఇచ్చే పవిత్ర బాధ్యతను సుప్రీంకోర్టుకు ఇవ్వడం జరిగింది.

అందుకు అనుగుణంగా రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఎలాంటి శాసనాలను శాసన నిర్మాణశాఖ రూపొందించినా, కార్యనిర్వాహక వర్గం అమలు చేసినా అవి చెల్లవనీ, రాజ్యాంగ వ్యతిరేకమనీ సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది. సుప్రీంకోర్టు ఈ రకమైన న్యాయసమీక్ష అధికారాన్ని తొలిసారిగా 1950లోనే వినియోగించి ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం (Preventive Detention) లోని కొన్ని అంశాలు రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పుచెప్పింది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఎన్నికల గణం అంటే ఏమిటి ?
జవాబు.
భారత రాష్ట్రపతి ఎన్నిక : భారత రాష్ట్రపతి ఎన్నికల గణం ద్వారా ఎన్నికవుతాడు. ఆ ఎన్నికల గణంలో (i) పార్లమెంటు, (ii) రాష్ట్రాల విధాన సభలు, (iii) ఢిల్లీ, పాండిచ్చేరీ విధాన సభలలోని ‘ఎన్నికైన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. నైష్పత్తిక ప్రాతిపదికన, ఒక ఓటు బదిలీ సూత్రం అనుసరించి, ఎన్నిక జరుగుతుంది. నిర్ణీత కోటా ఓట్లు వచ్చిన అభ్యర్థి రాష్ట్రపతి పదవికి ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.

ప్రశ్న 2.
సాధారణ బిల్లుకు, ద్రవ్య బిల్లుకు మధ్యగల తేడాను వివరించండి.
జవాబు.
ఆర్థికేతర, ప్రభుత్వపు పరిపాలన అంశాలకు సంబంధించిన బిల్లులను సాధారణ బిల్లులంటారు. ద్రవ్యబిల్లులు ప్రభుత్వపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఉంటాయి. సాధారణ బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అసుమతి అవసరం లేదు. ద్రవ్య బిల్లులను పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 3.
కేంద్ర మంత్రిమండలి నిర్మాణం గురించి రాయండి.
జవాబు.
కేంద్ర మంత్రిమండలిలో మూడు రకాల సభ్యులు ఉంటారు. వారు :

  1. కేబినెట్ మంత్రులు
  2. స్టేట్ మంత్రులు
  3. డిప్యూటీ లేదా సహాయమంత్రులు.

1. కేబినెట్ మంత్రులు :
కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, హోం, మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేలు వంటి ముఖ్యశాఖలకు అధిపతులుగా కేబినెట్ హోదా గల మంత్రులు ఉంటారు. వారు తమ మంత్రిత్వశాఖల నిర్వహణలో, నిర్ణయాలు తీసుకోవడంలో స్వతంత్రులు. కేంద్ర మంత్రిమండలి, కేంద్ర కేబినెట్ సమావేశాలలో నిర్ణయాలు తీసుకోవడంలో వారికి నిర్ణయాత్మకమైన పాత్ర ఉంటుంది.

2. స్టేట్ మంత్రులు :
కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని శాఖలను ఈ రకమైన మంత్రులు స్వతంత్రంగా నిర్వహిస్తూ, విధి నిర్వహణలో ప్రధానమంత్రికి నేరుగా జవాబుదారీగా ఉంటారు. మంత్రిత్వశాఖలోని కొన్ని కీలకమైన విభాగాలకు వారు ఆధ్వర్యం వహిస్తారు. కేబినెట్ మంత్రుల అజమాయిషీ వారిపైన ఉండదు.

3. డిప్యూటీ లేదా సహాయమంత్రులు :
మంత్రిత్వశాఖలకు సంబంధించిన శాసన పరిపాలనా వ్యవహారాలలో కేబినెట్ మంత్రులకు సహాయపడటానికి నియమించబడే మంత్రులను డిప్యూటీ లేదా సహాయమంత్రులని అంటారు. వారిని ప్రధానమంత్రి ఎంపిక చేస్తాడు. బ్రిటన్లో ఈ రకమైన మంత్రులను జూనియర్ మంత్రులనీ, పార్లమెంటరీ కార్యదర్శులని పిలుస్తారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 4.
రాష్ట్రపతి యొక్క శాసనాధికారాలు.
జవాబు.
శాసనాధికారాలు :

  1. పార్లమెంటు సమావేశపరచడానికి, వాయిదా వేయడానికి, లోక్సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారాలున్నాయి.
  2. సాధారణ ఎన్నికల తరువాత ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తాడు.
  3. పార్లమెంట్కు సందేశాలు పంపవచ్చును.
  4. రాష్ట్రపతి సంతకం పొందిన తరువాతనే బిల్లులు చట్టాలవుతాయి. బిల్లులకు ఆమోదం తెలుపకుండా కొంతకాలం నిలపవచ్చు కానీ రెండు సభలు తిరిగి ఆ బిల్లలను ఆమోదించి పంపితే అధ్యక్షుడు తప్పనిసరిగా ఆమోదించాలి.
  5. పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లను జారీ చేస్తాడు.
  6. ఆర్థిక బిల్లులు ఆయన అనుమతి లేనిదే పార్లమెంటులో ప్రవేశపెట్టరాదు.
  7. ఆర్థిక సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వంటి సంస్థలు ఇచ్చిన నివేదికలను పార్లమెంట్కు పంపుతాడు.
  8. పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేస్తాడు.
  9. రాజ్యసభకు 12 మందిని లోక్సభకు ఇద్దరిని నియమిస్తాడు.

ప్రశ్న 5.
జాతీయ అత్యవసర పరిస్థితి.
జవాబు.
జాతీయ అత్యవసర పరిస్థితి (352వ అధికరణం) : విదేశీ దండయాత్రలు, యుద్ధం, సాయుధ తిరుగుబాటు వంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు రాష్ట్రపతి ఈ రకమైన అత్యవసర అధికారాన్ని వినియోగిస్తాడు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రిమండలి లిఖితపూర్వక సూచన మేరకు మాత్రమే రాష్ట్రపతి వ్యవహరించవలసి ఉంటుందని 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం స్పష్టం చేసింది.

జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనకు సంబంధించిన తీర్మానాన్ని నెల రోజుల్లోగా పార్లమెంటు ఉభయ సభల మొత్తం సభ్యత్వ సంఖ్యలో 2/3వ వంతు సభ్యుల మద్దతుతో ఆమోదించవలసి ఉంటుంది. పార్లమెంటు ఆమోదించిన రాష్ట్రపతి ప్రకటన ఆరు నెలల కాలంపాటు అమలులో ఉంటుంది. ఆ తరువాత రాష్ట్రపతి మరొక ప్రకటన ద్వారా అలాంటి అత్యవసర పరిస్థితిని పార్లమెంటు ఆమోదంతో మరో ఆరునెలల కాలంపాటు పొడిగించవచ్చు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 6.
ఒక రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (రాష్ట్రపతి పాలన).
జవాబు.
ఒక రాష్ట్రం గవర్నర్చే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగే పరిస్థితిలో లేదు. ఆ రాష్ట్రంలోని రాజ్యాంగపరమైన వ్యవస్థ విఫలమైంది అన్న నివేదికను అందుకున్న మీదట రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని (రాష్ట్రపతి పాలన) ప్రకటించవచ్చు. ఈ ప్రకటన ఫలితంగా:

  1. రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లేదా ఏవైనా విధులను తన అధికారంలోకి తీసుకోవచ్చు.
  2. రాష్ట్ర శాసన నిర్మాణశాఖ అధికారాలు పార్లమెంటుచే నిర్వహించబడతాయి.

ఈ అత్యవసర ప్రకటన రెండు నెలలలోపు పార్లమెంటుచే ఆమోదించబడాలి. ఈ ప్రకటన 6 నెలలపాటు అమలులో ఉంటుంది. పార్లమెంటు ఆమోదం మేరకు దీన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించవచ్చు.

ప్రశ్న 7.
లోక్సభ స్పీకర్ అధికారాలు తెలపండి.
జవాబు.
లోక్సభ స్పీకర్ అధికారాలు :

  1. స్పీకర్ లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.
  2. వివిధ బిల్లులపై అధికార, ప్రతిపక్షాల సభ్యులు ప్రసంగించేందుకు తగిన సమయాన్ని కేటాయించి, అవసరమయితే బిల్లులపై ఓటింగ్ నిర్వహించి, ఫలితాలు ప్రకటిస్తాడు.
  3. లోక్సభ ఆమోదించిన బిల్లులను రాజ్యసభకు పంపుతాడు.
  4. లోక్సభ తరపున ముఖ్య ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.
  5. సభ్యుల హక్కులను, సభా గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాడు.

ప్రశ్న 8.
రాజ్యసభ నిర్మాణం.
జవాబు.
రాజ్యసభ నిర్మాణం: రాజ్యసభలో గరిష్టంగా 250 మంది సభ్యులు ఉంటారు. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ వ్యవహరిస్తాడు. సభ్యులలో ఒకరు డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికవుతారు. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 233 మంది ఎన్నికైనవారు కాగా, 12 మంది నామినేటెడ్ సభ్యులు.

ఎన్నికైన వారిలో 229 మంది 28 రాష్ట్రాలకు, ముగ్గురు సభ్యులు జాతీయ రాజధాని ఢిల్లీకి, ఒకరు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి ప్రాతినిధ్యం వహిస్తారు. రాష్ట్రపతి 12 మంది సభ్యులను నామినేట్ చేస్తారు.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 3 కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 9.
లోక్సభ నిర్మాణం.
జవాబు. భారత పార్లమెంటులో లోక్సభను దిగువ సభ, ప్రజల సభ అనికూడా అంటారు. దీనిలో అత్యధికంగా 552 సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం ఈ సభలో 545 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 543 మంది ఎన్నుకోబడే సభ్యులు కాగా రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ ప్రతినిధులను లోక్సభకు నామినేట్ చేస్తారు. అయితే ఈ పద్ధతిని (నామినేట్ చేసే పద్ధతిని) 104వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించటం జరిగింది. స్పీకర్ అధ్యక్షతన లోక్సభ సమావేశాలు నిర్వహించబడతాయి.

Leave a Comment