TS Inter 2nd Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు

Telangana TSBIE TS Inter 2nd Year Political Science Study Material 2nd Lesson ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Political Science Study Material 2nd Lesson ప్రాథమిక హక్కులు – ఆదేశక సూత్రాలు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులను వివరించండి.
జవాబు.
ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని 3వ భాగంలో చేర్చారు. ఇవి 12వ అధికరణ నుంచి 35వ అధికరణ వరకు పొందుపరచబడ్డాయి. స్వతంత్ర భారతదేశం కోసం జరిగిన స్వాతంత్రోద్యమమే వీటి ఆమోదం వెనకనున్న తాత్త్విక ప్రేరణ.

భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చడానికి వాటి గుర్తింపు పరిశీలన, సవరణల కొరకు రాజ్యాంగ సభలో జె.బి.కృపలాని అధ్యక్షతన ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ రూపొందించబడింది. అనిబిసెంట్ కామన్వెల్త్ ఇండియా బిల్లు 1925, నెహ్రూ నివేదిక 1928లు ఈ ప్రాథమిక హక్కులకు మార్గదర్శకాలు.

ప్రాథమిక హక్కుల వర్గీకరణ: వీటిని ఈ కింది విధంగా వర్గీకరించారు.

  1. సమానత్వపు హక్కు (అధికరణ 14 నుంచి అధికరణ 18 వరకు)
  2. స్వాతంత్య్రపు హక్కు (అధికరణ 19 నుంచి అధికరణ 22 వరకు)
  3. పీడనాన్ని నిరోధించే హక్కు (అధికరణ 23 మరియు అధికరణ 24)
  4. మతస్వాతంత్ర్యపు హక్కు (అధికరణ 25 నుంచి అధికరణ 28 వరకు)
  5. సాంస్కృతిక విద్యావిషయక హక్కు (అధికరణ 29 మరియు అధికరణ 30)
  6. రాజ్యాంగ పరిహార హక్కు (అధికరణ 32)

1. సమానత్వపు హక్కు (అధికరణ 14 నుంచి అధికరణ 18 వరకు) :
i) 14వ అధికరణ :
చట్టం ముందు వ్యక్తి సమానత్వాన్ని లేదా చట్టాల సమాన రక్షణను ప్రభుత్వం తిరస్కరించరాదని తెలుపుతుంది.

ii) 15వ అధికరణ :
మతం, జాతి, కులం, లింగం, జన్మస్థానం మీద గానీ, వీటిలో ఏ ఒక్కదాని కారణంగా గానీ ప్రభుత్వం ఏ పౌరుడి మీదా వివక్ష చూపరాదని తెలుపుతుంది.

  1. ఏ పౌరుడిపై కూడా పైవాటి లేదా ఏ ఇతర కారణాల వల్ల దుకాణాలు, హోటళ్లు, వినోద స్థలాలు ఉపయోగించుకోవడంలో ఏ విధమైన అనర్హత, నిషేధం, షరతులు విధించరాదు.
  2. పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ ప్రభుత్వ నిధులచే నిర్వహించబడుతున్న బావులు, చెరువులు, స్నానపుశాలలు, వినోద స్థలాలను పౌరులందరూ వినియోగించుకోవచ్చు.

iii) 16వ అధికరణ :
ప్రభుత్వం కింద ఉన్న ఏ కార్యాలయంలోనైనా ఉపాధి లేదా నియామకానికి సంబంధించిన విషయాలలో పౌరులందరికీ సమాన అవకాశాలుండాలని ఆఢలుపుతుంది.
సి) ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఏదైనా కార్యాలయం లేదా ఉద్యోగానికి సంబంధించి ఏ పౌరుడైనా మత, జాతి, కుల, లింగ, వంశ, జన్మస్థానం, నివాస స్థలాల కారణంగా గానీ వీటిలో ఏ ఒక్క కారణంగా గానీ అనర్హతకు లేదా వివక్షతకు గురికారాదు.

iv) 17వ అధికరణ :
అస్పృశ్యత నిషేధించబడింది. ఏ రూపంలోనైనా దీని వాడుక నిరోధించబడింది. బలవంతంగా అస్పృశ్యత కారణంగా తలెత్తిన ఏ అనర్హత అయినా చట్టపరంగా నేరం, శిక్షింపదగినది అని తెలుపుతుంది.

v) 18వ అధికరణ :
సైనిక సంబంధమైనవి లేదా విద్యా సంబంధమయినవి తప్ప ఏ ఇతర బిరుదును ప్రభుత్వం ప్రసాదించరాదని తెలుపుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

2. స్వాతంత్య్రపు హక్కు (అధికరణ 19 నుంచి అధికరణ 22 వరకు) :

i) 19వ అధికరణ : పౌరులందరూ ఈ కింది హక్కులను కలిగి ఉంటారని తెలుపుతుంది.

  1. భావ వ్యక్తీకరణ మరియు వాక్కు స్వేచ్ఛ.
  2. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సభలు, సమావేశాలు జరుపుకొనే స్వేచ్ఛ.
  3. సంఘాలు, సమూహాలు ఏర్పరచుకొనే స్వేచ్ఛ.
  4. భారత భూభాగమంతా సంచరించే స్వేచ్ఛ.
  5. భారత భూభాగంలోని ఏ ప్రాంతంలోనయినా నివసించే స్వేచ్ఛ.
  6. ఏదైనా వృత్తి, ఉపాధి, వ్యాపార, వాణిజ్యాలను నిర్వహించుకొనే స్వేచ్ఛ.

గమనిక : అధికరణ 19 (ఎఫ్), ఆస్తిని సంపాదించుకొనే స్వేచ్ఛ, 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది.

ii) 20వ అధికరణ :
(ఎ) అమలులో ఉన్న చట్టాన్ని అతిక్రమించడం నేరంగా పరిగణించబడుతున్న సమయంలో ఆ చర్యకు పాల్పడటం మినహా, ఏ ఇతర నేరానికీ ఏ పౌరుడూ నేరారోపణకు గురికారాదు. నేరం జరిగిన సమయంలో అమలులో ఉన్న చట్టం కింద విధించే దానికన్నా అధిక శిక్షకు గురికారాదు అని తెలుపుతుంది.

ఎ) ఏ వ్యక్తీ ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ నేరారోపణకు, శిక్షకు గురికారాదు.
బి) నేరారోపణ చేయబడిన ఏ పౌరుడినీ తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పుకోవడానికి ఒత్తిడి చేయరాదు.

iii) 21వ అధికరణ :
జీవించే హక్కు గురించి తెలుపుతుంది. చట్టం ద్వారా రూపొందించబడిన ప్రక్రియ ద్వారా మినహా, ఏ వ్యక్తి ప్రాణానికి లేదా వ్యక్తిగత స్వేచ్ఛకు హాని కలిగించరాదు. దీనినే ప్రాణరక్షణ హక్కు అని అంటారు.

iv) అధికరణ 21-ఎ కు లోబడి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ చట్టం ద్వారా నిర్ణయించిన పద్ధతిలో నిర్బంధ, ఉచిత విద్యను ప్రభుత్వాలన్నీ అందించాలి. (86వ సవరణ చట్టం 2002 ద్వారా చేర్చబడింది).

v) 22వ అధికరణ :
అరెస్టు చేసిన వ్యక్తిని కారణం తెలుపకుండా నిర్బంధించరాదు అని తెలుపుతుంది. అరెస్టు చేసి నిర్బంధించబడిన ప్రతీ వ్యక్తిని అరెస్టు చేసిన తరువాత ఇరవైనాలుగు గంటల లోపల దగ్గరలోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలి.

3. పీడనాన్ని నిరోధించే హక్కు (అధికరణ 23 మరియు అధికరణ 24) :

  1. 23వ అధికరణ అక్రమ మానవ వ్యాపారం, వెట్టిచాకిరి, మరే ఇతర రూపాలలో బలవంతంగా పని చేయించడం నిరోధించబడింది అని తెలుపుతుంది.
  2. 24వ అధికరణ 14 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలను కర్మాగారాలు, గనులు తదితర ప్రమాదకరమయిన వృతులలో పని చేయించరాదు.

4. మతస్వాతంత్య్రపు హక్కు (అధికరణ 25 నుంచి అధికరణ 28 వరకు) :

  1. 25వ అధికరణ ప్రజాసంక్షేమం, నైతిక విలువలు, ఆరోగ్యం ఇతర నిబంధనలకు లోబడి, ఏ వ్యక్తి అయినా తనకు ఇష్టమైన మతాన్ని స్వీకరించడం, ఆచరించడం, ప్రచారం చేయడం, వ్యాప్తి చేసుకోవడానికీ పౌరులందరికీ సమానమయిన హక్కు కల్పించబడింది.
  2. ప్రభుత్వాలు, మతానికి సంబంధించిన ఆర్థిక, రాజకీయ లేదా మరే ఇతర సంక్షేమ చర్యలను నియంత్రించే లేదా నిరోధించే చట్టాలను రూపొందించవచ్చు.
  3. 26వ అధికరణకు లోబడి ప్రజాసంక్షేమం, నైతిక విలువలు, ఆరోగ్యం వంటి విషయాలకు సంబంధించి మత సంబంధమయిన ఏ సంస్థ లేదా శాఖ అయినా ఈ క్రింది హక్కులను కలిగి ఉంటాయి.
    ఎ) మత సంబంధమయిన మరియు ధార్మిక సంస్థలను స్థాపించడం, నిర్వహించడం.
    బి) మత సంబంధమయిన వ్యవహారాలను స్వంతంగా నిర్వహించుకోవడం.
    సి) స్థిరాస్తి మరియు చరాస్తులను సమకూర్చుకోవడం.
    డి) చట్టానికి లోబడి అటువంటి ఆస్తులను నిర్వహించుకొనడం.
  4. 27వ అధికరణ మతం లేదా మత సంబంధమయిన సంస్థల అభివృద్ధి, నిర్వహణ ఖర్చుల కొరకు ఏ విధమయిన పన్నులు విధించరాదు.
  5. 28వ అధికరణ, పూర్తిగా గానీ, పాక్షికంగా గాని ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న ఏ విద్యాసంస్థలోనైనా మతపరమయిన బోధనలు, పద్ధతులను పాటించరాదు.

5. సాంస్కృతిక మరియు విద్యావిషయక హక్కు :

  1. 29వ అధికరణ, ప్రతీ పౌరుడికీ, తన స్వంత భాష, లిపి లేదా సంస్కృతులను కలిగి ఉండడానికి మరియు సంరక్షించుకొనే హక్కు ఉంది. ప్రభుత్వం లేదా ప్రభుత్వేతర నిధుల సహాయంతో నిర్వహించబడుతున్న ఏ విద్యా సంస్థలలోకి ఏ పౌరుడినీ మతం, జాతి, కుల, భాషల లేదా వీటిలో ఏ ఒక్కదాని కారణంగానైనా తన ప్రవేశాన్ని నిరాకరించరాదు.
  2. 30 అధికరణ, మత లేదా భాషాపరంగా అల్పసంఖ్యాకులు ఇష్టమయిన విద్యాసంస్థలను స్థాపించుకొని నిర్వహించుకొనే హక్కు కలిగి ఉన్నాయని తెలుపుతుంది.
    31వ అధికరణ ఆస్తి హక్కు 44వ సవరణ చట్టం ద్వారా 1978లో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించబడింది.

6. రాజ్యాంగ పరిహార హక్కు (అధికరణ 32) :
అధికరణ 32 ప్రకారం, ప్రతీ పౌరుడూ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల అమలుకు తగిన ప్రక్రియల ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రయించే హక్కు ప్రసాదించబడింది. రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ప్రాథమిక హక్కుల అమలు కొరకై సుప్రీంకోర్టు, హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో వారంలొ మరియు సర్షియర రిట్లతో తగిన రిట్ను జారీ చేసే అధికారం కలిగి ఉంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 2.
ఆదేశక సూత్రాలను వివరించండి.
జవాబు.
ఆదేశక సూత్రాలు ఐర్లాండు రాజ్యాంగం నుంచి గ్రహించబడ్డాయి. ఇవి భారత రాజ్యాంగంలో 4వ భాగంలో అధికరణ 36 నుంచి అధికరణ 51 వరకు పొందుపరచబడ్డాయి. ఆదేశక సూత్రాల అమలులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. ఆదేశక సూత్రాలు భారతదేశ పౌరులకు సామాజిక – ఆర్థిక న్యాయం అందించడంలో తోడ్పడతాయి. వీటి ముఖ్య ఉద్దేశం శ్రేయోరాజ్య స్థాపన.
ఆదేశక సూత్రాలను వివరించండి.

ఆదేశక సూత్రాలు మూడు రకాలుగా విభజించబడ్డాయి.

  1. సామ్యవాద సూత్రాలు
  2. గాంధేయవాద సూత్రాలు
  3. ఉదారవాద సూత్రాలు

1. సామ్యవాద సూత్రాలు :
ఇవి భారతదేశంలో సామాజిక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి ఆదేశక సూత్రాలలో చేర్చబడ్డాయి. 38వ అధికరణ, 39వ అధికరణ, 41వ అధికరణ, 42వ అధికరణ, 43వ అధికరణ, 46వ అధికరణ, 47వ అధికరణలు ఆదేశ సూత్రాల యొక్క సామ్యవాద భావాలను వివరిస్తాయి.

  1. 38వ అధికరణ, ప్రజలందరికీ న్యాయం (సామాజిక, ఆర్థిక, రాజకీయ) చేకూరే పద్ధతిలో ఒక సామాజిక క్రమాన్ని నెలకొల్పడం ద్వారా ప్రజాసంక్షేమాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని తెలుపుతుంది.
  2. 39వ అధికరణ, ప్రభుత్వం కింది వాటి కొరకు చర్యలు తీసుకోవాలని తెలుపుతుంది.
    i) ప్రజలందరికీ తగినంత జీవనభృతిని కల్పించుట.
    ii) ప్రజలందరి ఉపయోగం కొరకు దేశంలోని వనరుల సమాన పంపిణీ.
    iii) జాతీయ సంపదను వికేంద్రీకరించుట.
    iv) స్త్రీ, పురుషులకు సమాన వేతనాలు.
    v) కార్మికుల, పురుషుల, మహిళల సంపదను, శక్తిని సంరక్షించడం.
    vi) బాల్యం, యవ్వనాన్ని దోపిడీ నుంచి రక్షించడం.
  3. 41వ అధికరణ, నిరుద్యోగిత, వృద్ధాప్యం, అనారోగ్యం, అశక్తత వంటి పరిస్థితులలో సహాయం, పనిహక్కు విద్యాహక్కులను ప్రసాదించాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.
  4. 42వ అధికరణ, కార్మికులు పనిచేసేందుకు తగిన మానవీయ పరిస్థితులను కల్పించడం, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలను కల్పించడం.
  5. 43వ అధికరణ కార్మికులందరికీ కనీస జీవన వేతనం, మెరుగైన పని నిబంధనలు, సామాజిక, సాంస్కృతిక అవకాశాలను కల్పించాలని ప్రభుత్వాన్ని సూచిస్తుంది.
  6. 46వ అధికరణ, ప్రభుత్వం షెడ్యూల్డు తెగల, షెడ్యూల్డు కులాల, అల్ప సంఖ్యాకులకు విద్యా, ఆర్థిక సదుపాయాలను అందించాలని ప్రభుత్వానికి సూచిస్తుంది. సామాజిక అన్యాయం, అన్ని రకాల దోపిడీల నుంచి ప్రభుత్వం వారిని రక్షించాలి.
  7. 47వ అధికరణ, కనీస పోషకాహార స్థాయి, జీవన ప్రమాణాన్ని పెంచి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

2. గాంధేయవాద సూత్రాలు:
గాంధేయవాద సూత్రాలు భారతదేశంలో ఆదర్శ పరిపాలనను అందిస్తాయి. ఈ సూత్రాలు అధికరణ 40, అధికరణ 43, అధికరణ 46, అధికరణ 47, అధికరణ 48ఎ, అధికరణ 49 లలో ప్రతిఫలిస్తాయి.

  1. 40వ అధికరణ, ప్రభుత్వం, గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసి, అధికారాలను కల్పించి, వాటిని స్వపరిపాలనా సంస్థలుగా పనిచేసే అవకాశాన్ని కల్పించాలని సూచిస్తుంది.
  2. 43వ అధికరణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగతంగా గాని సామూహిక రంగంలో గాని కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది.
  3. 46వ అధికరణ, బలహీన వర్గాల వారికి ప్రత్యేక శ్రద్ధతో విద్య, ఆర్థిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది.
  4. 47వ అధికరణ, మద్యం, మత్తుపదార్థాలను నిషేధించడానికి కృషి చేయాలని ప్రభుత్వానికి సూచిస్తుంది.
  5. 48వ అధికరణ, నూతన, సాంకేతిక పద్ధతులలో పశుపోషణ, వ్యవసాయాలను నిర్వహించాలని ప్రభుత్వానికి ఇది సూచిస్తుంది. ఇది గోవులను, ఇతర పాడి పశువులను వధించడాన్ని నిషేధించవలసిందిగా ఆదేశిస్తుంది.
  6. అధికరణ 48ఎ, పర్యావరణ పరిరక్షణ, అడవులను, వన్యప్రాణుల్ని సంరక్షించాలని ప్రభుత్వానికి సూచిస్తుంది.
  7. 49వ అధికరణ కళాత్మక నైపుణ్యం, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన స్థలాలను, కట్టడాలను పరిరక్షించాలని సూచిస్తుంది.

3. ఉదారవాద సూత్రాలు :
ఈ సూత్రాలు స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు అంతర్జాతీయ శాంతి మొదలగు వాటి సాకారానికి సంబంధించినవి. అవి అధికరణ 44, అధికరణ 45, అధికరణ 50, అధికరణ 51 లలో పొందుపరచబడ్డాయి.

  1. 44వ అధికరణ, దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తుంది.
  2. 45వ అధికరణ, బాల్యంలో పిల్లల సంరక్షణ మరియు పిల్లలందరికీ ఆరు సంవత్సరాల వరకు పూర్వప్రాథమిక విద్యను ప్రభుత్వం అందించాలని సూచిస్తుంది.
  3. 50వ అధికరణ, కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.
  4. 51వ అధికరణ ప్రభుత్వాన్ని కింది వాటిని నిర్వహించాలని సూచిస్తుంది.
    i) అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించడం.
    ii) దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పడం.
    iii) అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను గౌరవించి ఆచరించడం.
    iv) అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడాన్ని ప్రోత్సహించడం.

అదనపు సూత్రాలు :
రాజ్యాంగ చట్టాలు – 42వ సవరణ 1976, 44వ సవరణ 1978, ఈ ఆదేశ సూత్రాలకు మరికొన్ని సూత్రాలను చేర్చాయి. 42వ సవరణ 1976 చట్టం అధికరణ 39ఎ, అధికరణ 43ఎ, అధికరణ 48ఎ లను చేర్చింది. 44వ సవరణ 1978 చట్టం అధికరణ 38 లో 2వ నిబంధనను చేర్చింది. అవి ఈ క్రింది విషయాలను కలిగి ఉన్నాయి.

  1. ఆదాయంలో అసమానతలను తగ్గించడం.
  2. సమన్యాయం మరియు పేదలకు ఉచిత్ర చట్టపరమయిన సహాయం (అధికరణ 39ఎ).
  3. పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం (అధికరణ 43ఎ).
  4. పర్యావరణం, అడవులు, జంతువుల సంరక్షణ (అధికరణ 48ఎ).

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 3.
ప్రాథమిక హక్కులకు, ఆదేశక సూత్రాలకు మధ్య భేదాలను తెలపండి.
జవాబు.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య భేదాలు :

ప్రాథమిక హక్కులు

ఆదేశక సూత్రాలు

1. ప్రాథమిక హక్కులు ప్రతికూల స్వభావాన్ని కలిగి ఉంటాయి. వ్యక్తికి హానికరమైన ప్రభుత్వ కార్యకలాపాలను నిరోధిస్తాయి. 1. ఇవి స్వభావరీత్యా అనుకూలమైనవి. ఇవి ప్రభుత్వపు సామాజిక, ఆర్థిక కార్యకలాపాలను విస్తరిస్తాయి.
2. ఇవి న్యాయస్థానం ద్వారా పొందగలిగినవి. న్యాయస్థానాలు 32వ అధికరణకు లోబడి, ప్రాథమిక హక్కుల సంరక్షణ కొరకు రిట్లను జారీ చేస్తాయి. 2. ఇవి న్యాయస్థానం ద్వారా పొందలేనివి. న్యాయ స్థానం వీటిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేవు.
3. 13వ అధికరణ ప్రకారం, ప్రాథమిక విధులను ఉల్లంఘించే చట్టాలు చెల్లవు. 3. ఆదేశక సూత్రాలను ఉల్లంఘించే చట్టాలు చెల్లుబాటు కావు అని న్యాయస్థానాలు నిర్దేశించలేవు.
4. ప్రాథమిక హక్కులు పౌరుల వ్యక్తిగత జీవితం, స్వేచ్ఛల సంరక్షణకు సంబంధించినవి. 4. ఆదేశక సూత్రాలు దేశం యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, సంక్షేమాల అభివృద్ధి కొరకు ఉద్దేశించబడినవి.
5. ప్రాథమిక హక్కులకు, ఆదేశక సూత్రాలకు మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలను అధిగమిస్తాయి. 5. ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులను ఆదేశక సూత్రాలు అధిగమించలేవు.
6. ఇవి రాజ్యాంగంలోని 3వ భాగంలో చేర్చబడ్డాయి. వీటిని అమలు చేయడానికి ప్రత్యేక చట్టాలను చేయాల్సిన అవసరం లేదు. 6. ఇవి భవిష్యత్ ప్రభుత్వాలకు మార్గ నిర్దేశకాలు మాత్రమే. కావున వీటిని అమలు చేయడానికి ప్రత్యేక చట్టం అవసరం.
7. ఇవి రాజ్యానికి మరియు భవిష్యత్ ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు. 7. ఇవి భవిష్యత్ ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు. ఇవి రాజ్యాంగకర్తల ఆదర్శాలు.
8. ప్రభుత్వం లేదా అధికారంలో ఎవరున్నా ప్రాథమిక హక్కులు అమలుపరచబడతాయి. 8. వీటిపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకతలు ఎదురుకావచ్చు. కాబట్టి ప్రభుత్వం తన వెసులుబాటు, వనరుల లభ్యతను బట్టి అమలుపరుస్తుంది.
9. ప్రాథమిక హక్కులు ప్రభుత్వం యొక్క రాజకీయ ప్రజాస్వామ్య స్వభావాన్ని సూచిస్తాయి. 9. ఆదేశక సూత్రాలు రాజ్య ఆదర్శాలను మరియు ప్రభుత్వపు లక్ష్యాలను, గమ్యాలను వివరిస్తాయి.
10. ప్రతీ పౌరునికీ, దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో స్వేచ్ఛగా పాల్గొనే అవకాశాన్ని ఇవి కలిగిస్తాయి. 10. సామాజిక అభివృద్ధి సంక్షేమం కొరకు, వెసులుబాటు మరియు వనరులను బట్టి ప్రభుత్వం నిర్వహించే చర్యలను ఇవి సూచిస్తాయి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
సమానత్వ హక్కు.
జవాబు.
రాజ్యాంగం 14వ అధికరణం భారతదేశంలో నివసించే వ్యక్తులందరికీ చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం ద్వారా సమానమైన రక్షణ, సదుపాయాలను కల్పించింది. చట్టం ముందు సమానత్వం అంటే వ్యక్తులందరికీ ఒకే విధమైన చట్టాలు, ఒకే రకమైన న్యాయస్థానాలు, ఒకే విధమైన కార్యపద్ధతులు అని అర్థం.

సంపద, హోదా లేదా పరిస్థితిని బట్టి వ్యక్తుల మధ్య విచక్షణ చూపించకూడదు. పౌరుల మధ్య మతం, కులం, లింగ, జన్మస్థల సంబంధమైన వివక్షతలను రాజ్యం పాటించరాదని 15వ అధికరణం స్పష్టం చేసింది.

16వ అధికరణం ప్రకారం రాజ్యానికి సంబంధించిన ఏ ఉద్యోగం లేదా నియామకానికైనా పౌరులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. 17వ అధికరణం అస్పృశ్యత లేదా అంటరానితనం పాటించడాన్ని నేరంగా పేర్కొంది. 18వ అధికరణం ప్రకారం పౌరులకు సైనిక లేదా విద్యా విషయక బిరుదులు ఇతర బిరుదులను రాజ్యం ప్రసాదించకూడదు. భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశీ రాజ్యాలు ప్రకటించే బిరుదులను పౌరులు స్వీకరించకూడదు.

ప్రశ్న 2.
స్వాతంత్య్ర హక్కు.
జవాబు. స్వాతంత్య్రపు హక్కు (19 – 22 అధికరణాలు) : ఈ హక్కు పౌరులకు 6 ప్రాథమిక స్వేచ్ఛలను కల్పిస్తున్నది. అవి :

  1. వాక్ స్వాతంత్ర్యం
  2. సభలు, సమావేశాలు జరుపుకునే స్వాతంత్ర్యం
  3. సంఘ నిర్మాణ స్వాతంత్ర్యం
  4. సంచార స్వాతంత్ర్యం
  5. నివాస స్వాతంత్ర్యం
  6. వృత్తి స్వాతంత్ర్యం.
    ఈ స్వేచ్ఛలు ఏవీ నిరపేక్షమైనవి కావు. వీటికి ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చు.

ఏ పౌరుడు నేరం చేయనిదే శిక్షింపబడరాదు. నిందితుడు తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని బలవంతం చేయరాదు. నేరం ఋజువు కానిదే ఎవరినీ 24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచరాదు. 24 గంటలలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 3.
మతస్వాతంత్ర్య హక్కు.
జవాబు.
మత స్వాతంత్ర్య హక్కు భారత రాజకీయ వ్యవస్థ లౌకిక స్వభావానికి ప్రతీక. 25వ అధికరణం ప్రకారం ప్రతి వ్యక్తికీ ప్రజాభద్రత, నైతికత, ఆరోగ్యాలకు లోబడి తన అంతరాత్మకు అనుగుణమైన మతాన్ని అవలంభించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది. మత ప్రభావానికి సంబంధించిన ఏ కార్యక్రమాలనైనా క్రమబద్ధం చేసే చట్టాన్ని రాజ్యం రూపొందించవచ్చు.

26వ అధికరణం ప్రకారం ఏ మతానికి చెందినవారైనా

  1. మతపరమైన ధార్మిక సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి
  2. స్వీయ మత వ్యవహారాలను నిర్వహించుకోవడానికి
  3. స్థిర, చరాస్తులపై యాజమాన్య హక్కు పొందటానికి, వాటిని కొనుగోలు చేయడానికి చట్ట ప్రకారం ఆస్తిపాస్తులను నిర్వహించుకోవచ్చు.

27వ అధికరణం మతం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తిపై, ఏ విధమైన పన్ను విధించడానికి, వసూలు చేయడానికి వీలులేదని పేర్కొంది. 28వ అధికరణం ప్రకారం రాజ్యం నుంచి సంపూర్ణంగానో, పాక్షికంగానో ఆర్థిక సహాయాన్ని పొందే విద్యా సంస్థలలో మతపరమైన బోధనలు నిషేధించడం జరిగింది.

ప్రశ్న 4.
గాంధేయవాద సూత్రాలు.
జవాబు.

  1. 40వ అధికరణం ప్రకారం రాజ్యం పంచాయితీరాజ్ సంస్థలను నిర్వహించి, అవి స్వయంపాలన సంస్థలుగా ఏర్పడటానికి తగిన అధికారాలు ఇవ్వాలి.
  2. 43వ అధికరణం ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తిగత లేదా సహకార ప్రాతిపదికపై కుటీర పరిశ్రమల స్థాపనకు రాజ్యం తోడ్పడాలి.
  3. 46వ అధికరణం ప్రకారం బలహీన వర్గాల ప్రజల విద్యా, సామాజిక ప్రగతికి రాజ్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
  4. 47వ అధికరణం ప్రకారం మత్తు పానీయాలు, మాదకద్రవ్యాల నిషేధానికి చర్యలు తీసుకోవాలి.
  5. 48వ అధికరణం ప్రకారం వ్యవసాయం, పశుపోషణలను ఆధునిక, శాస్త్రీయ పద్ధతులలో నిర్వహించడానికి గోవులు, దూడలు, ఇతర పాడి పశువులు, లాగుడుబండ్లకు కట్టే పశువుల వధను నిషేధించడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 5.
సామ్యవాద సూత్రాలు.
జవాబు.
సామ్యవాద సూత్రాలు :

  1. ప్రజలందరికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చుట.
  2. స్త్రీ, పురుష వివక్షత చూపక అందరికీ సమాన హక్కులు ఇచ్చుట. అస్పృశ్యతను నేరంగా పరిగణించటం.
  3. పౌరులందరికీ జీవనోపాధి కల్పించడం.
  4. దేశ సంపద సమిష్టి శ్రేయస్సు కోసం పంపిణీ చేయటం.
  5. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ.
  6. బాలబాలికలు, యువతీయువకులు దోపిడీకి గురికాకుండా ఉండేటట్లు చేయడం, పని హక్కు కల్పించే చర్యలు తీసుకోవడం.
  7. ప్రజలకు పోషకాహారాన్ని అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవడం.
  8. మాతాశిశు సంక్షేమం మొదలగునవి. ఈ అంశాల అమలుకు కొన్ని చర్యలు తీసుకొనబడ్డాయి.
    ఉదా : అంటరానితనం నిర్మూలించే చట్టం చేయడం, జాతీయ ప్రణాళికా సంఘం ద్వారా ప్రణాళికలు అమలు చేసి ఆర్థిక ప్రగతికి చర్యలు తీసుకోవడం, కార్మిక చట్టాలు చేయడం మొదలగునవి.

ప్రశ్న 6.
ఏవైనా నాలుగు ప్రాథమిక విధులు.
జవాబు.
నాలుగు ప్రాథమిక విధులు :

  1. భారత రాజ్యాంగం పట్ల, అది సూచించిన ఆదర్శాలు, సంస్థల పట్ల, జాతీయపతాకం, జాతీయగీతం పట్ల విధేయతను చూపటం.
  2. స్వాతంత్ర్యం కోసం జరిగిన జాతీయోద్యమ ఉదాత్త ఆశయాలను పోషించుకుంటూ అనుసరించటం.
  3. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యత, సమగ్రతలను సమర్థించి సంరక్షించుకోవటం.
  4. దేశాన్ని రక్షించుకోవడం, అవసరమయినపుడు జాతీయ సేవలో పాల్గొనడం.
  5. మత, భాషా, ప్రాంతీయ, వర్గ సంబంధమైన వైవిధ్యాలను అధిగమించి భారత ప్రజలందరిలో సమైక్యతను, ఉమ్మడి సౌభ్రాతృత్వ భావాలను పెంపొందించుకోవడం, మహిళల గౌరవానికి విరుద్ధమైన పద్ధతులను పరిత్యజించడం.

TS Board Inter Second Year Political Science Study Material Chapter 2 ప్రాథమిక హక్కులు - ఆదేశక సూత్రాలు

ప్రశ్న 7.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య ఏవైనా రెండు తేడాలు.
జవాబు.
ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య రెండు వ్యత్యాసాలు :

ప్రాథమిక హక్కులు ఆదేశక సూత్రాలు
1. ప్రాథమిక హక్కులు చట్టబద్ధమైనవి. 1. ఆదేశక సూత్రాలు సామాజికమైనవి.
2. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగం హామీ ఇస్తుంది. 2. ఆదేశక సూత్రాల అమలు కోసం రాజ్యాంగం ఎలాంటి హామీ ఇవ్వలేదు.
3. ప్రాథమిక హక్కులు సంరక్షక స్వభావాన్ని కలిగి ఉంటాయి. 3. ఆదేశక సూత్రాలు సంవర్థకమైనవి.

Leave a Comment