Telangana TSBIE TS Inter 2nd Year Telugu Study Material 1st Lesson నా ప్రథమ విదేశయాత్ర Textbook Questions and Answers.
TS Inter 2nd Year Telugu Non-Detailed 1st Lesson నా ప్రథమ విదేశయాత్ర
అభ్యాసం
I. ప్రశ్నలకు జవాబులు
ప్రశ్న 1.
ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలుపండి. (V.Imp) (M.P)
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య 18 అక్టోబరు 1907 నాడు మంథెనలో జన్మించాడు. ఆయన తండ్రి ఆదిలాబాద్ జిల్లా తాండూర్లో సింగల్ టీచర్గా పనిచేసేవారు. ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారం ప్రారంభించి నష్టపోయారు. దాని కారణంగా ఆస్తి కన్నా అప్పు పెరిగింది. అప్పులవాళ్ళు వచ్చి వారి తండ్రివి తిట్టేవారు. ఆ మాటల బాధకు ఇంటి బయటకు వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ, చేతులు జోడించి దేవునితో నన్ను కనికరించి చదువు చెప్పించు.
విదేశాలకు వెళ్లి చదువుకునేల ఆశీర్వదించమని, తండ్రి చేసిన అప్పులు తీర్పించి, ఇల్లును అమ్మకుండా, దాని ముందర గుఱ్ఱపు బగ్గీలను, మోటార్లను పెట్టించేలా, తండ్రికి, తల్లికి ఇప్పటికన్న ఎక్కువ పేరు మర్యాదలు తెప్పించమని మొక్కారు. అంటే చిన్నప్పుడే విదేశాల్లో చదువుకోవాలనే సంకల్పం ఉండేదని తెలుస్తుంది.
డబ్బులేనివారు చదువుకోలేరు, వివాహం అయిన వారు చదువుకోలేరు అనే మాటలను తప్పు అని నిరూపించాలని, ఈశ్వరుణ్ణి నమ్మినవాడు తప్పక అనుకున్నది సాధిస్తాడని కూడా రుజువు చేయాలని సంకల్పించు కున్నాడు. హైదరాబాద్ లో బి.ఏ. పాస్ అయ్యాడు. తరువాత L.L.B.
చదువుకొని BAR చేయడానికి ఇంగ్లాండు వెళ్ళాలని సంకల్పం చేసుకున్నాడు. ఇంగ్లండు వెళ్ళడానికి ధనవంతులయిన రెడ్డి స్నేహితులు సహాయం చేస్తారనే నమ్మకం ఉండేది. సర్కారీ ఉద్యోగం చేయటానికి ఇష్టం లేదు. అనేక చిన్న, పెద్ద పనులు చేస్తూ చదువుకున్నాక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. తరువాత ఇంకా గట్టిగ ఇంగ్లండు వెళ్లి పరిశోధన చేయాలని సంకల్పించుకున్నాడు.
ప్రశ్న 2.
ముద్దు రామకృష్ణయ్య గారి ప్రథమ విదేశయాత్ర సన్నాహాలు వివరించండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య మొదటి ప్రయత్నం విఫలం అయ్యాక 1944 లో తన తోటి ఉపాధ్యాయుడు దిగంబరరావు తో మాట్లాడుతూ డబ్బు లేని కారణంగా ఇంగ్లాండు వెళ్లలేదని చెప్పాడు. ఆయన డిప్యూటి కలెక్టర్, పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీ మిత్రులే కదా వారు సహకరించరా అని సలహా ఇచ్చాడు. మళ్ళీ విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు ప్రారంభించి థామస్ కుక్ వారికి ఇంగ్లాండ్ వెళ్ళడానికి పడవ ఉందా అని లేఖ రాశాడు. సెప్టెంబర్లో పడవ బయలుదేరుతుందని, బ్రిటీష్ రెసిడెన్సి నుండి పాస్పోర్ట్ తీసుకొమ్మని, సీటు రిజర్వు చేసినట్టు వారు జవాబు పంపారు.
దానికి సంతోషించి హైదరాబాద్ ప్రభుత్వ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్కు ఇంగ్లాండ్లో ఎం. ఇడి లేదా పి. హెచ్లలో సీట్ ఇప్పించమని, అక్కడ చదువుకోవడానికి ఇక్కడ సెలవు ఇప్పించమని, 6000 అప్పు ఇప్పించమని లేఖ రాశాడు. అతడు యుద్ధ సమయం ముగిసేవరకు పడవలు వెళ్ళవు, అక్కడ సీట్ రావడం కష్టం, అక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు.
ఈ మూడు విషయాలు పూర్తి కాకుంటే డబ్బుతో అవసరమే లేదు అని ప్రత్యుత్తరం పంపాడు. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కాదన్నాడు. కో ఆపరేటివ్ బ్యాంకు సెక్రెటరి లోనే లేదన్నాడు. ఇలా అందరూ నిరుత్సాహపరిచారు. అన్నలా భావించే అబ్దుల్ హమీద్ కూడా మొదట పిచ్చి ప్రయత్నం, యుద్ధకాలంలో ఒక నెలలో పాస్పోర్ట్ రావడం అసంభవం అని చెప్పాడు. మీ ఆశీర్వాదం ఉంటే అన్ని అవుతాయని రామకృష్ణయ్య అంటే ఆశీర్వదించి పంపాడు.
లాతూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మీరు ప్రయత్నం చేయండి నా వంతు సహాయం చేస్తానన్నాడు. ఆ కాలంలో పాస్పోర్ట్ పొందడానికి చాలా తతంగం ఉండేది. పాస్పోర్ట్ కోసం జిల్లా అధికారికి దరఖాస్తు చేస్తే ఆయన హోం శాఖకు పంపితే వారు లోకల్ పోలీసు వారికి పరిశీలన కోసం పంపేవారు. ఇవన్నీ కావడానికి కనీసం ఆరు నెలల కాలం పట్టేది. ఆ తరువాత వారు దానిని బ్రిటీష్ రెసిడెన్సీకి పంపితే వారు పాస్పోర్ట్ మంజూరు చేసేవారు. ఇదంతా జరగడానికి తనకున్న సమయం సరిపోదని తెలిసి కూడా ముద్దు రామకృష్ణయ్య ప్రయత్నాలు ప్రారంభించాడు.
ప్రశ్న 3.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్ర కోసం విద్యాశాఖ అనుమతి గురించి రాయండి.
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య విదేశాలకు వెళ్ళాలనుకున్న రోజుల్లో సగం జీతంతో ఇంగ్లాండ్ వెళ్లి చదువుకుంటే వచ్చాక పది సంవత్సరాలు ఉద్యోగం చేస్తానని, అలా చేయకుంటే తీసుకున్న జీతం వాపసు ఇస్తానని బాండ్ రాసి ఇవ్వాలి. అలా ఇవ్వకుంటే మేము ఇస్తామని వంద కంటే ఎక్కువ జీతం ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు జమానత్ (పూచీ కత్తు) ఇవ్వాలని నిబంధనలు ఉండేవి. అప్పుడు వందపైన జీతం ఉన్న వారు నలుగురు మాత్రమె ఉండేవారు. అందులో ఒకరు జామీను సులభంగానే ఇచ్చారు.
ఇంకో జామీను కోసం చాల ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఐదు రూపాయల బియ్యం ఇప్పించి ఇంకో జామీను తీసుకున్నాడు. రెండు జామీనులు, సెలవు పత్రం, ఎకరారు నామాలతో ప్రధానోపాధ్యాయునికి దరఖాస్తు చేశాడు. ఆయన డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్కు పంపాడు. వారికి ఒక ప్రైవేటు లేఖ రాసి పని త్వరగా అయ్యేలా చూడాలని అభ్యర్థించాడు. వారు అలానే త్వరగా దానిని డి పి ఐ కి పంపారు కాని వారు ఆరు నెలల ముందు అనుమతి కోరలేదు కాబట్టి సెలవు దొరకదని చెప్పారు.
అక్కడి వారిని ఎంత బతిమిలాడినా పని కాలేదు చివరికి సీనియర్ డిప్యుటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ డి.పి.ఐ. హక్కాని ని కలిశారు. ఆయన రామకృష్ణయ్యను చూడగానే మీ హిందువులు నీకు సహకరించడం లేదా అని అడిగారు. ముస్లిం కమ్మంటే కాకపోతివి ఇప్పుడు ఇబ్బందులు పడవడితివి అని అన్నాడు. ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుని దగ్గర భోజనం పెట్టించాడు.
ఆయనకు రామకృష్ణయ్య విషయాన్ని వివరించి సహకరించాలని వేడుకున్నాడు. ప్రభుత్వం సెలవు ఇవ్వకున్నా సొంత ఖర్చులతో ఇంగ్లాండ్ వెళ్తానని రాసివ్వు అంటే అలా రాసిచ్చాడు. ఇతను ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే ఇంకెప్పుడూ వెళ్ళలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్ పాడవుతుంది కావున వెంటనే అనుమతించి రిలీవ్ చేయాలని ప్రధానోపాధ్యాయునికి రాశారు. అలా విద్యాశాఖ అనుమతి లభించింది.
ప్రశ్న 4.
ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్రకు పాస్పోర్టు ఎలా లభించింది ? (V.Imp) (M.P)
జవాబు:
పాస్పోర్ట్ దరఖాస్తుకు పెట్టడానికి ఫోటోలు కావాలి. ఫోటోలు దిగడానికి మంచి డ్రెస్ కూడా లేదు. లాతూర్ పోలీస్ మంచి కాలర్ ఉన్న డ్రెస్తో ఫోటోలు దిగాడు. పాస్పోర్ట్ దరఖాస్తుకు పది రూపాయాల ఫీజు చెల్లించాలి. ఆ డలను స్కూల్ ఫీ నుండి వాడుకొని జీతం వచ్చాక స్కూల్ వారికి ఇచ్చాడు.
ఆ దరఖాస్తును డిప్యూటి కలెక్టర్ ద్వారా ఉస్మానాబాద్ కలెక్టర్కు పంపాడు. తన పరిస్థితి వివరిస్తూ ఒక ప్రయివేటు లెటర్ రాసి ఒక విద్యార్థి ఇచ్చిన కవర్లో పెట్టి పోస్ట్ చేశారు. ఆ కవర్లో అనుకోకుండా ఒక రూపాయి ఉండిపోయింది. అది తెలిసి కలెక్టర్ శిక్షిస్తాడేమో అని రామకృష్ణయ్య భయపడ్డాడు. సిగ్గుతో ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
హమీద్ పాస్పోర్ట్ రావడం అంతసులభం కాదని చెప్పేవారు. స్కూల్లో సెలవు తీసుకొని పాస్పోర్ట్ పని మీద హైదరాబాదు వెళ్ళాడు. అక్కడ మున్సిపల్ సత్రంలో సామాను పెట్టి కార్యాలయాలన్నీ తిరిగేవాడు. మొదట బ్రిటీష్ రెసిడెన్సికి వెళ్ళాడు. అక్కడికి ఫైల్ రాలేదని తెలిసి పొలిటికల్ డిపార్ట్మెంటుకు వెళ్ళాడు. అక్కడ కూడా లేదని తెలిసి అక్కడి నుండి చీఫ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్ళాడు.
అక్కడ మీ దరఖాస్తు లేదని చెప్పారు కాని వెతకమని అడిగితే అక్కడే ఉంది. అయ్యా దానిని త్వరగా పూర్తి చేయండి చాల త్వరగా నేను వెళ్ళాల్సి ఉంది అని అడిగితే చాలా పెద్ద పని ఉంది కనీసం సంవత్సరం అయినా పడుతుంది అని చెప్పారు. వారిని బతిమిలాడితే శివలాల్ అనే వారు సి.ఐ.డి. సెక్షన్లో పని చేస్తున్నారు. వారిని కలిస్తే పని త్వరగా కావచ్చు అని సలహా ఇచ్చారు. దేవునికి నమస్కరించి శివకుమార్ లాలు దగ్గరికి వెళ్ళాడు. వారితో కలిసి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ దగ్గరికి వెళ్లి రామకృష్ణయ్య పరిస్థితిని వివరించి పోలీసు రిపోర్ట్ త్వరగా హోం డిపార్ట్మెంట్కు పంపాలని అభ్యర్థించాడు.
దానికి అంగీకరించి తన క్లార్క్తో బ్రిటీష్ రెసిడెంట్ కార్యాలయానికి సిఫారసు లేఖను పంపాడు. అక్కడికి వెళ్లి అడిగితే ఇంగ్లాండులో ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్లు కాగితం చూపమన్నారు. దానితో అతనిపై బాంబు పడ్డట్లయింది. మీర్ రజా అలీ సహకారంతో రిప్లయ్ పెయిడ్ ఎక్స్ప్రెస్ టెలిగ్రాం పంపాడు. 48 గంటలు వేచి చూసి తన మిత్రునికి అప్పగించి లాతూరు చేరుకున్నాడు. 72 గంటల తరువాత రిప్లయ్ వచ్చిందని దానిని పాస్పోర్ట్ ఆఫీసులో చూపిస్తే పాస్పోర్ట్ ఇవ్వలేమన్నారని ఉత్తరం వచ్చింది.
చివరి ప్రయత్నంగా హైదరాబాదు వెళ్లి షరతులతో అడ్మిషన్ ఉన్నట్లు వచ్చిన టెలిగ్రాంను, థామస్ కుక్ కంపెనీ వారి లేఖను చూపించి పాస్పోర్ట్ ఇవ్వాలని అభ్యర్థించాడు. రెండు సంవత్సరాలు ఇంగ్లాండులో ఉండడానికి సరిపడా పదివేల రూపాయలను లేదా బ్యాంకు బాలన్స్ను చూపించాలని వారు షరతు విధించారు. మీర్ రజా సహకారంతో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారి సర్టిఫికేట్ చూపించి పాస్పోర్ట్ పొందాడు.
ప్రశ్న 5.
ముద్దు రామకృష్ణయ్యకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం డబ్బు సమస్య ఎలా తీరింది ?
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య పట్టువదలని విక్రమార్కునిగా ప్రయత్నం చేసి శాఖాపరమైన అనుమతి, యూనివర్సిటిలో అడ్మిషన్, పాస్పోర్ట్ పొందాడు. కాని డబ్బు సమస్య మాత్రం తీరలేదు. తన ఇన్సురెన్స్ పాలసీలు తాకట్టు పెట్టుకొని ఎవరైనా తక్కువ వడ్డీకి అప్పు ఇస్తారేమో అని ప్రయత్నం చేశాడు కాని ఫలించలేదు.
తాలూక్ దార్ హమీద్ ఒక మార్వాడి సేట్ అయిన విష్ణుదాసన్ను పిలిచి తక్కువ వడ్డీతో పదివేల అప్పు ఇప్పించమన్నాడు. అంత కాకుంటే ఐదువేలు అదీ కాకుంటే పన్నెండు వందలు పడవ కిరాయి ఇప్పించమన్నాడు. కాని ఆయన ఐదు వందలు మాత్రమె జమ అయినాయని అంతకంటే కావని చెప్పాడు.
ఆ ఐదు వందలతో నేనేం చేసుకోవాలి అని డబ్బు వాపసు చేస్తే అతను తీసుకోలేదు. రామకృష్ణయ్య లాతూర్ వెళ్లి విష్ణుదాస్ అకౌంట్ లో డబ్బు వేశాడు. దానికి హమీద్ సంతోషించాడు. కాని నా సొమ్ము కాని దాన్ని నా అకౌంటులో ఎందుకు వేశారని విష్ణుదాస్ చిరాకుపడ్డాడు.
నాకు పాస్పోర్ట్ దొరికింది పడవ ఎప్పుడు బయలు దేరుతుంది అని థామస్ కుక్ కంపెనీకి టెలిగ్రాం ఇస్తే సెప్టెంబర్ 22న అని జవాబు వచ్చింది. కాని డబ్బు సమస్య తీరలేదు. ఈ విషయాన్ని హామీద్కు చెప్తే అతను సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లను వెంట తీసుకొని వెళ్లి విష్ణుదాస్ గోదాములను తనిఖీ చేయించాడు. దానిలో బ్లాక్ మార్క్ ధాన్యం, చెక్కర సంచులను గుర్తించి పంచనామా చేయమన్నారు.
దానితో విష్ణుదాస్ భయపడి చందా రూపంలో వచ్చిన ఐదువందలకు తాను ఒక వెయ్యి రూపాయలు కలిపి పదిహేను వందలకు హుండీ రాసిచ్చాడు. అలా మొదటి స్టేజి డబ్బు సమస్య తీరింది. రామకృష్ణయ్య ఇంగ్లాండ్ వెళ్ళడానికి 18 రోజుల పని దినాలు ఉన్నాయి.
రోజుకు నాలుగు రూపాయల చొప్పున 72 రూపాయలు వస్తాయి. వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో మంథెనకు వెళ్ళాలి అని ఆలోచించాడు. వెంకట రామారావు దగ్గర తాకట్టు పెట్టి 72 రూపాయలు తీసుకొని లాతూరు నుండి మంథెనకు, మంథెన నుండి బొంబాయికి వెళ్ళాడు. అలా సోదరునిలాగా భావించే హామీద్ సహకారంతో ముద్దు రామకృష్ణయ్య డబ్బు సమస్య తీరింది.
ప్రశ్న 6.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా ప్రారంభమైంది ? (V.Imp) (M.P)
జవాబు:
గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్ దిగి అక్కడనుండి ఎడింబరో యూనివర్సిటీ ఉన్న నగరానికి రైలులో వెళ్ళారు. ఆంగ్ల ఉపాధ్యాయునిగా పదకొండు సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఆంగ్లం మాతృభాషగా ఉన్నవారితో మాట్లాడిన అనుభవం లేదు. రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లి టెలిగ్రాఫ్ను చూపించాడు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్తో మాట్లాడుతా అన్నాడు. ఉండడానికి ఒక హోటల్లో రూమ్ బుక్ చేశాడు.
కొన్ని రోజులకు ఆలస్యంగా వచ్చిన కారణంగా అడ్మిషన్ దొరకదు అని చెప్పారు. అక్కడి నుండి లీడ్స్ యూనివర్సిటీలో ప్రయత్నం చేయడానికి లీడ్స్ వెళ్ళాడు. 1939లో చేసిన దరఖాస్తు చేస్తే మీరు రమ్మన్నారు. యుద్ధం కారణంగా ఆలస్యంగా వచ్చాను అని చెప్పాడు. దానికి ఇండియా హౌస్ నుండి దరఖాస్తు చేసుకొమ్మని సలహా ఇచ్చారు. మాది హైదరాబాదు రాజ్యం ఇండియా హౌసుకు సంబంధం ఉండదు అని చెప్తే అడ్మిషన్ అయిన తరువాత వారికి చెప్పొచ్చు అని ఎం.ఇడిలో చేర్చుకున్నారు.
ప్రొఫెసర్ ఫ్రాంక్ ఫీ కట్టడానికి రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్ళమన్నారు. వారు ఇరవై పౌండ్ల ఫీ కట్టమంటే అంతడబ్బు లేదని చెప్పకుండా పది పౌన్లు ఇప్పుడు కట్టి తరువాత పది పౌన్లు చెల్లిస్తానన్నాడు. దానికి వారు అంగీకరించలేదు. వారం రోజులు గడువు ఇచ్చారు. పడవలో పరిచయమైన సురేశ్ చందర్కు లేఖ రాశారు.
చివరి తేది ఉదయం పది పౌన్ల పోస్టల్ ఆర్డర్ను సురేశ్ చందర్ పంపాడు. పోస్ట్ ఆఫీసుకు వెళ్లి పది పౌన్లు తీసుకొని మొత్తం ఇరవై పౌన్లు యూనివర్సిటీ అకౌంట్ సెక్షన్లో ఇచ్చి రసీదు తీసుకున్నాడు. అలా ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం. ఇడి. లో అడ్మిషన్ దొరకడంతో ఇంగ్లాండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ప్రారంభమైనది.
ప్రశ్న 7.
ఇంగ్లండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా సాగింది ?
జవాబు:
ఇంగ్లాండ్ లీడ్స్ యూనివర్సిటీలో ఎం.ఇడి.లో ప్రవేశం లభించింది. ప్రొఫెసర్ ఫ్రాంక్ స్మిత్ గైడ్గా ఉన్నారు. ఆయన మాథ్స్, సైకాలజీ, చరిత్రలలో ఏం తీసుకుంటావని అడిగారు. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ నిజాం స్టేట్ అనే అంశంపై అరవై వేల శబ్దాలతో చరిత్రను రెండు సంవత్సరాలలో రాయాలని నిర్ణయించారు.
ప్రొఫెసర్ ఫ్రాంక్ చాలా ప్రేమగా సలహాలు ఇచ్చేవారు. రాసిన వాటిని ఓపికగా సరిదిద్దే వారు. ముఖ్యంగా ది అనే ఆర్టికల్ వాడటం విషయంలో భారతీయులు పొరపాట్లు చేస్తారని అనేవారు. ఒక గది అద్దెకు తీసుకొని ఉండేవారు. వారికి లభించిన మాంసాహార పదార్థాలు, పంది కొవ్వు ఇంటి ఓనర్కు ఇచ్చి శాఖాహార పదార్థాలు తీసుకునే వారు. పని చేయడానికి ఎంప్లాయ్మెంటు ఎక్స్ఛేంజ్లో పేరు నమోదు చేసుకున్నారు.
రైల్వే పోర్టులో హమాలిగా పని చేసేవారు. దానిలోనుంచి కొంత మొత్తాన్ని ఇంటికి పంపేవారు. డీన్ అనుమతితో లండన్లో కలోనియల్ సెంటర్లో చేరాడు. కలోనియల్ సెంటర్లోనే నైట్ పోర్టర్గా రాత్రి పది నుండి ఉదయం నాలుగు వరకు పని చేసేవాడు. సాయంత్రం ఆరు నుండి పది వరకు హోటల్ వెయిటర్గా పని చేసేవాడు. ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు వరకు లైబ్రరీలో ఐదు నుండి పది వరకు కలోనియల్ సెంటర్లో చదువుకునేవారు. ఉదయం నాలుగు నుండి ఎనిమిది వరకు పడుకునేవారు.
హోటల్లో పని చేసేటప్పుడు హైదరాబాద్ ప్రభుత్వపు అధికారి కలిశారు. వారు ప్రధాని నవాబు చత్తారికి చెప్పి వెయ్యి రూపాయలు పౌండ్లు థామస్ కుక్ ద్వారా పంపించారు. తరువాత బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం లభించింది. ఆ తరువాత వారికి ఆర్ధిక ఇబ్బందులు రాలేదు. బిబిసిలో ఉద్యోగం వచ్చాక ప్రొఫెసర్ ఫ్రాంక్ను కలిసి వారానికి ఒక రోజు వచ్చి పది గంటల క్లాస్ వినడానికి అనుమతి పొందాడు.
మిగతా పనులన్నీ మానేసి బిబిసిలో మాత్రమే పని చేస్తూ శ్రద్ధగా చదువును కొనసాగించాడు. వందల పుస్తకాలు, డాక్యుమెంట్లు చదివి నోట్స్ రాసి ప్రొఫెసర్కు చూపిస్తే ఆయన ప్రేమతో సలహాలు ఇచ్చేవారు. అలా రెండు సంవత్సరాలలో నిజాం రాజ్యంలో విద్య చరిత్ర పేరుతో దక్షిణ భారతదేశ విద్య చరిత్రను రాసి ఎం. ఇడి పూర్తి చేసుకున్నారు.
ప్రశ్న 8.
ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణ అనుభవాలు వివరించండి. * (V.Imp) (M.P)
జవాబు:
ముద్దు రామకృష్ణయ్య ఎన్నో ప్రయత్నాల తరువాత విద్యా శాఖ అనుమతి, యూనివర్సిటిలో షరతులతో కూడిన అడ్మిషన్, పాస్పోర్ట్, కావలిసిన డబ్బు సమకూరింది. మొత్తానికి బొంబాయి చేరుకొని థామస్ కుక్ పడవలో ప్రవేశించాడు. ఎక్కిన తరువాత కొన్ని రోజులు పడవ బొంబాయి పోర్ట్లోనే ఉంది కాని ప్రయాణికులను బయటికి వెళ్ళనివ్వలేదు. ఆ పడవ మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు.
రామకృష్ణయ్య ఉన్న క్యాబిన్లో ఆరు బెర్తులు ఉండేవి. గాలి రావడానికి కిటికీ బదులు పోర్ట్ హోల్స్ ఉన్నాయి. ఫ్యాన్లు, హాస్పిటల్, టెలిగ్రాఫ్ ఆఫీసు, దుకాణము, పిల్లలకు కిండర్ గార్టెన్ సెక్షన్, అవుట్ డోర్ ఆటలు, గ్రంథాలయం, మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. బ్రిటీషు రేవులో దిగగానే తగినంత డబ్బు లేని వారిని డిపార్ట్ చేస్తారని సహచరుడు చెప్పాడు. పడవలో ఉన్న హైదరాబాద్ నుండి వస్తున్న సురేశ్ చంద్ర ఆస్థాన పరిచయం అయ్యాడు. అతను చాల మంచివాడు.
రామకృష్ణయ్య ఇరవై రెండు పౌన్లతో ఇంగ్లాండ్ బయలుదేరాడు. పడవ బయలుదేరిన తరువాత మొదటిసారి ఏడెన్లో ఆగింది. అక్కడ చారిత్రక స్థలాలు అన్ని చూసి, గుజరాతి వాళ్ళ ఇంట్లో మంచి శాఖాహార భోజనం చేశారు. సయీద్ రేవులో కొద్ది రోజులున్నారు. అక్కడ మ్యూజియం చూశారు. జిబ్రాల్టర్ రేవు దాటిన తరువాత బ్రిటన్ భూమి కనిపిస్తుండగా దేవునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారం చేశాడు. కాని డబ్బు లేకపోతే డిపార్ట్ చేస్తారేమో అనే భయం మాత్రం ఉండేది.
ఈ విషయాన్ని సురేశబాబుకు చెప్పి అతని దగ్గరున్న నూటయాభై పౌన్ల డ్రాఫ్ట్ చూపించేలా ఒప్పందం చేసుకున్నాడు. కాని విద్యార్జనకు వచ్చానని చెప్పేసరికి డ్రాఫ్ట్ చూపించాల్సిన అవసరం రాకుండానే ఓడరేవులో పర్మిటెడ్ అని స్టాంప్ పడింది. తోటి భారతీయ ప్రయాణికుల సహకారంతో సామాను దించుకున్నాడు. మొత్తానికి బ్రిటన్లోని స్కాట్లాండ్లో దిగినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.
II. సందర్భసహిత వ్యాఖ్యలు
ప్రశ్న 1.
ఆస్తి కన్నా అప్పు మించింది. (Imp)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించాడు. వారి తండ్రి ప్రభుత్వ ఉద్యోగం వదిలి వ్యాపారం, వ్యవసాయం మొదలుపెట్టారు. చింతకాని చెరువు గుత్తా తీసుకున్నప్పుడు వారికి పెద్ద నష్టం వచ్చింది. దానితో వారికి ఆస్తి కన్నా అప్పు పెరిగిందని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం :
సంపాదించిన ఆస్తికన్నా చేసిన అప్పు పెరిగిందని అర్థం.
వ్యాఖ్య :
సింగల్ టీచర్గా పనిచేసిన వారు వారికి అనుభవం లేని రంగంలో పెట్టుబడి పెట్టి అప్పుల పాలైనారని భావం.
ప్రశ్న 2.
వివాహం విద్యానాశాయ * (V.Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశ యాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య గారి తండ్రి రాజన్న వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అప్పులపాలయ్యారు. ఆ అప్పుల వారు ఇంటికి వచ్చి తిట్టి వెళ్ళేవారు. అది చూసిన రామకృష్ణయ్య ఏడుస్తూ తనకు విదేశాలలో చదువు చెప్పించి, తండ్రి చేసిన అప్పులు ఇల్లు అమ్మకుండా తీర్చి, తల్లిదండ్రులకు మరింత మంచి పేరు తెచ్చే విధంగా ఆశీర్వదించమని దేవునికి మొర పెట్టుకునేవాడు. డబ్బులేని వాడు చదువుకోలేడు అని, వివాహం అయినవాడు చదువుకు పనికిరాడని అందరూ భావిస్తారు. అలాంటి భావన తప్పు అని నిరూపించాలని రామకృష్ణయ్య నిశ్చయించుకున్న సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం :
వివాహం జరిగితే విద్య నేర్వడం కష్టం అని అర్థం.
వ్యాఖ్య :
గట్టి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. పాతకాలం నుండి వస్తున్న నమ్మకాలను కూడా మార్చే శక్తి మానవ సంకల్పానికి ఉందని భావం.
ప్రశ్న 3.
ప్రథమ ప్రయత్నం విఫలమయింది (Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా- ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం :
ముద్దు రామకృష్ణయ్యకు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కోరిక ఉండేది. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కోహిర్లో పని చేస్తున్నప్పుడు విదేశీ విద్య స్కాలర్షిప్ కోసం హైదరాబాద్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. మూడవ శ్రేణిలో బి.ఏ. పాస్ అయిన వారికి స్కాలర్షిప్ రాదని చెప్పారు. అప్పు అడిగితే దానికి అంగీకరించలేదు.
సొంతఖర్చులతో విదేశాలకు వెళ్ళే అవకాశం కల్పించాలని దరఖాస్తు చేస్తే కారణం చెప్పకుండా ఫైల్ మూసేశారు. ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయింది అలా రామకృష్ణయ్య గారి ప్రథమ ప్రయత్నం విఫలమైనదని తెలిపిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం :
మొదటి ప్రయత్నం విజయవంతం కాలేదు అని అర్థం.
వ్యాఖ్య :
దేవునిపై భారం వేసి చిన్నప్పటి నుండి చదువుకున్నాడు రామకృష్ణయ్య. విదేశాలలో చదువుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. దానిలో మొదటి ప్రయత్నం ఫలించలేదని భావం.
ప్రశ్న 4.
వారు నాకు జమానతు ఇవ్వటానికి సిద్ధపడలేదు
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాల్లో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి. దానికి 100 రూపాయల వేతనం కంటే ఎక్కువున్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారు ఎవరూ జామీను ఇవ్వడానికి సిద్ధంగా లేరని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం :
వాళ్ళెవరు జామానతు అంటే పూచీకత్తు ఇవ్వడానికి అంగీకరించలేదు అని అర్థం.
వ్యాఖ్య :
100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారెవరూ పూచీకత్తు ఇవ్వడానికి సిద్ధంగా లేరని భావం.
ప్రశ్న 5.
ఐదు రూపాయల బియ్యం ఇప్పించితే నేను సంతకం పెట్టుతాను
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాలులో భాగంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవలసి వచ్చింది. సగం వేతనం తీసుకుంటూ విదేశాలలో చదువుకొని వచ్చిన తరువాత పది సంవత్సరాలు ప్రభుత్వంలోనే ఉద్యోగం చేయాలి. అలా చేయకుంటే తీసుకున్న వేతనం వాపసు ఇవ్వాలి.
దానికి 100 రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్న వారు పూచికత్తు ఇవ్వాలి. అలాంటి వారు కేవలం నలుగురే ఉన్నారు. వారిలో బషీరుద్ధిన్ అనే వారు సంతకం చేశారు. ఇంకొకరి సంతకం కోసం ప్రయత్నం చేస్తుంటే ఒక ముసలి ముస్లిం టీచర్ రేషన్ అందక బాధపడుతూ రామకృష్ణయ్యను ఐదు రూపాల బియ్యం ఇప్పిస్తే జామీను మీద సంతకం చేస్తానని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం ఇది.
అర్థం :
ఐదు రూపాయల విలువైన బియ్యం ఇప్పిస్తే జామీనుపై సంతకం చేస్తానని అర్థం.
వ్యాఖ్య :
వందకు పైన వేతనం వస్తున్నప్పటికీ రేషన్ కారణంగా తమ పిల్లలకు సరైన తిండి పెట్టలేని స్థితి ప్రపంచ యుద్ధ సమయంలో ఉండేది. రామకృష్ణయ్యకు ఉన్న అవసరాన్ని ఆసరాగా తీసుకొని ముసలి ముస్లిం ఉపాధ్యాయుడు ఐదు రూపాయల బియ్యం అడిగాడని భావం.
ప్రశ్న 6.
ఇప్పుడు వెళ్ళకపోతే అతడి భవిష్యత్తు చెడుతుంది.
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య విదేశీ పర్యటనకోసం విద్యా శాఖ అనుమతి కొరకు ప్రయత్నం చేస్తున్నపుడు జుల్ఫికర్ అలీ హక్కాని ఉన్నతాధికారిగా ఉన్నారు. అప్పటికే సెలవు ఇవ్వడానికి వీలు లేదని ఆఫీస్ నోట్ వచ్చిందని సెలవు ఇవ్వడం వీలుపడదని ఆయన అన్నారు. జీతం లేకుండా సెలవు మంజూరు చేసినా సరే అని రాసివ్వుమన్నారు. అలా రాసిచ్చిన తరువాత రామకృష్ణయ్య ఇప్పుడు పోకపోతే మరెప్పుడు పోలేడు, ఇప్పుడు వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడుతుందని ఉద్యోగం నుండి వెంటనే రిలీవ్ చేయమని అనుమతించిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం :
ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళకపోతే రామకృష్ణయ్య భవిష్యత్తు చెడుతుందని అర్థం.
వ్యాఖ్య :
రామకృష్ణయ్యకు సహకరించే పరిస్థితులు ఇప్పుడున్నవి. కావున ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు పోలేడు. అలా వెళ్ళకపోతే అతని భవిష్యత్తు చెడిపోతుందని భావం.
ప్రశ్న 7.
సిగ్గుతో నా బాధను ఎవరికీ చెప్పుకోలేదు. (V.Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య పాస్పోర్ట్ కోసం అప్లై చేశారు. దానిని ఉస్మానాబాద్ కలెక్టర్కు ఒక తాలూక్ దార్ సిఫారసుతో పంపారు. దానిని త్వరగా పరిశీలించి అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు ఒక ప్రైవేటు ఉత్తరం రాసి ఒక కవర్లో పెట్టి పంపారు. ఆ కవర్లో హాస్టల్ బాలుడు ఒక రూపాయి పెట్టుకొని మరిచిపోయి ఆ కవర్ను రామకృష్ణయ్యకు ఇచ్చాడు. ఒక రూపాయి లంచం పంపినట్టు భావించి కలెక్టర్ ఏమైనా శిక్ష వేస్తాడేమో అని భయపడి, ఆ భయపడుతున్న విషయం కూడా ఎవరికైనా చెపితే పరువు పోతుందేమో అని ఎవరికీ తెలుపలేదని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం :
బాధ చెబితే పరువు పోతుందేమో అని ఎవరికీ చెప్పలేదని అర్థం.
వ్యాఖ్య :
తెలియక చేసినా పెద్ద పొరపాటు జరిగింది. ఆ పొరపాటుకు శిక్ష పడుతుందేమో అనే భయం, బాధ ఉన్నాయి. కాని ఆ బాధను ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందేమో అనే మరో అనుమానం కూడా ఉందని భావం.
ప్రశ్న 8.
ఈ మాటతో నా పైన బాంబు పడినంత బాధ అయినది.
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం :
ఎన్నో ప్రయత్నాల తరువాత పాస్పోర్ట్ మంజూరు చేయమని నిజాం ప్రభుత్వము సిఫారసు లేఖ ఇచ్చింది. ఆ లేఖ తీసుకొని బ్రిటీషు రెసిడెంట్ ఆఫీసుకు వెళ్తే అక్కడున్న అసిస్టెంట్ సెక్రెటరీ ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు కాగితం చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పాడు. ఆ మాటతో తనపై బాంబు పడ్డంత పని అయిందని రామకృష్ణయ్య చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం :
ఆ మాట బాంబు దెబ్బతో సమానం అని అర్థం.
వ్యాఖ్య :
ఎంతో కష్టపడ్డ తరువాత వచ్చిన అవకాశం చివరి క్షణంలో చేజారి పోతుందని తెలిసి అది బాంబు పడ్డట్టు అనిపించిందని భావం.
ప్రశ్న 9.
అప్పుడే కోర్టు నుండి సర్టిఫికెట్టు దొరికినది
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం :
ఎన్నో ప్రయత్నాల తరువాత పాస్పోర్ట్ మంజూరు చేయమని నిజాం ప్రభుత్వము సిఫారసు లేఖ ఇచ్చింది. ఆ లేఖ తీసుకొని బ్రిటీషు రెసిడెంట్ ఆఫీసుకు వెళ్తే అక్కడున్న అసిస్టెంట్ సెక్రెటరీ ఏదైనా యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు కాగితం చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పాడు.
కొన్ని షరతులతో సీటు ఇస్తామని వచ్చిన టెలిగ్రాఫు చూపించి పాస్పోర్ట్ ఇమ్మన్నాడు. పదివేల రూపాయలు చూపించాలి, లేదా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సర్టిఫికేట్ తెమ్మన్నారు. దానిని మీర్ రజాకు చెప్తే వకీల్ నవరతన్ సహకారంతో సర్టిఫికెట్ ఇప్పించారని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం. –
అర్థం :
ఆ సందర్భంలో కోర్టు నుండి సర్టిఫికెట్ దొరికినదని అర్థం.
వ్యాఖ్య :
ఇంగ్లాండులో రెండు సంవత్సరాలు ఉండడానికి సరిపడా డబ్బు ఉందని సర్టిఫికేట్ దొరికిందని భావం.
ప్రశ్న 10.
పాలముంచినా నీట ముంచినా నీదే భారం
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం :
అనేక కష్టాల తరువాత విద్యా శాఖనుండి అనుమతి, యూనివర్సిటీలో షరతులతో కూడిన అడ్మిషన్, పాస్పోర్ట్ రావడం ఇలా అనేక పనులు అయినాయి. ఓడ బయలుదేరడానికి వారం రోజుల సమయం మాత్రమే ఉందని థామస్ కుక్ కంపనీ లేఖ పంపింది. కాని అన్నింటికి మించిన డబ్బు సమస్య తీరడం ఎలా అని భగవంతున్ని ప్రార్థించిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం :
పాలల్లో ముంచినా నీళ్ళల్లో ముంచినా దేవునిదే భారం అని అర్థం.
వ్యాఖ్య :
పాలల్లో ముంచినా అంటే కష్టాలు తీర్చినా, నీళ్ళల్లో ముంచినా అంటే కష్టాల్లోనే ఉంచిన దేవునిదే బాధ్యత అని భావం. అంతా దైవాదీనం అని అంతరార్థం.
ప్రశ్న 11.
వారి పాదాలపైన నెత్తిపెట్టి వారికి మొక్కితిని
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం :
రామకృష్ణయ్య తాత సనాతన సంప్రదాయవాది. సముద్ర ప్రయాణం చేస్తే భ్రష్టుడవుతాడని ఆయన “నమ్మకం. తనను చంపి విదేశాలకు వెళ్ళమని అన్నాడు. దానికి మన సంప్రదాయాలు పాటిస్తూ మీరు గీచిన గీత దాటకుండా ఉంటాను. దానికి నువ్వు అనుమతి ఇస్తేనే వెళ్త లేదంటే ఇక్కడే చస్తా అని రామకృష్ణయ్య అన్నాడు. అప్పుడు నా నోరు మూయించావురా అని అనుమతించారు. దానికి కృతజ్ఞతా పూర్వకంగా వారికి పాద నమస్కారం చేశానని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం :
ఆయన పాదాలపై తలపెట్టి మొక్కాడు అని అర్థం.
వ్యాఖ్య :
పాద నమస్కారం అత్యంత గౌరవ సూచకం అని భావం.
ప్రశ్న 12.
వారి ఉచ్ఛారణ, నిత్య వ్యవహారిక శబ్దాలు తెలియవు చేసిన విద్యావేత్త
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం :
ముద్దు రామకృష్ణయ్య గ్రేట్ బ్రిటన్ స్కాట్లాండ్లో దిగారు. ఎడింబరో యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం వెళ్ళాడు. పదకొండు సంవత్సరాల ఆంగ్ల ఉపాధ్యాయ అనుభవం ఉన్నప్పటికీ అక్కడి వారితో ఎప్పుడూ మాట్లాడని కారణంగా వారి భాష, యాస రామకృష్ణయ్యకు కొత్తగా అనిపించిందని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం :
ఆంగ్లేయుల ఉచ్ఛారణ వారి వాడుక పదాలు తెలియవు అని అర్థం.
వ్యాఖ్య :
ప్రతీ భాషకు స్వంత యాస ఉంటుంది అలానే పలుకుబళ్ళు ఉంటాయి. వాటిని మాతృభాష అయిన వారి లాగా మాట్లాడటం కష్టం అని భావం.
ప్రశ్న 13.
నా జాతికి నావలన పాడుమాట రానివ్వను (V.Imp) (M.P)
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం :
యుద్ధ కాలంలో తిండికి బట్టలకు రేషన్ ఉండేది. ఆ సమయంలో ఇంగ్లాండుకు కొత్తగా వెళ్ళాడు కాబట్టి రామకృష్ణయ్యకు బట్టలు కూపన్లు ఎక్కువ అందినాయి. కాని కొనుక్కోవడానికి డబ్బు లేదు. ఆ సమయంలో ఒక మిత్రుడు ఆ కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పాడు. అలా చేయడం వల్ల భారతీయులు కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతారనే చెడ్డపేరు వస్తుందని, అలా దేశానికి చెడ్డపేరు తెచ్చే ఏ పని తాను చేయనని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం :
నా భారత జాతికి నా ప్రవర్తన వల్ల చెడ్డపేరు రానివ్వను అని అర్థం
వ్యాఖ్య :
బట్టలకోసం దొరికిన కూపన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మడం తప్పు అని అలా అమ్మితే దేశ వాసులందరికి చెడ్డ పేరు వస్తుందని, అలాంటి పని తాను చేయడని భావం.
ప్రశ్న 14.
తన సజెషన్స్ ప్రేమతో ఇచ్చేవారు
జవాబు:
రచయిత పరిచయం :
పేదరికంలో పుట్టి, ఎన్నో కష్టాలు అనుభవించి, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య. కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించిన ఆయన రాసిన నా ప్రథమ విదేశయాత్ర అనే గ్రంథం నుండి ఇచ్చిన ఉపవాచకంలోనిది ఈ వాక్యం.
సందర్భం :
చదువుకోసం ఇంగ్లాండు వచ్చి లీడ్స్ యూనివర్సిటీలో ఎం.ఎడ్. లో చేరాడు. చదువుతో పాటు వివిధ పార్ట్ టైం ఉద్యోగాలు చేశారు. చివరికి లండన్ బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తూ లీడ్స్కు రోజు వెళ్ళడం సాధ్యం కాదని, వారంలో ఒకరోజు వచ్చి పది గంటలు వింటానని, తన కోసం కొంత శ్రమ తీసుకోవాలని వారి ప్రొఫెసర్ను కోరాడు. దానికి ప్రొఫెసర్ ఫ్రాంక్ అంగీకరించాడని, ప్రేమతో సలహాలు ఇచ్చేవాడని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం :
ప్రొఫెసర్ ప్రేమగా సలహాలు ఇచ్చారని అర్థం.
వ్యాఖ్య :
కష్టపడి చదివే వారికి అందరూ సహకరిస్తారని, అలానే తన ప్రొఫెసర్ కూడా ప్రేమగా సలహాలు ఇచ్చారని భావం.
నా ప్రథమ విదేశయాత్ర Summary in Telugu
రచయిత పరిచయం
ఉపవాచకం పేరు : నా ప్రథమ విదేశయాత్ర
దేనినుండి ఇది గ్రహింపబడింది. : ఈ ఉపవాచకం, శ్రీ ముద్దు రామకృష్ణయ్య ‘నా ప్రథమ విదేశ రచన నుండి గ్రహింపబడింది.
ఉపవాచకం ప్రక్రియ : యాత్రా చరిత్ర
రచయిత : ముద్దు రామకృష్ణయ్య
కాలం : జననం : అక్టోబర్ 18, 1907 – మరణం : అక్టోబరు 21, 1985
తల్లిదండ్రులు : అమ్మాయి, రాజన్న
స్వస్థలం : కరీంనగర్ జిల్లా మంథని
విద్య :
- 1932లో బి.ఏ. పట్టా పొందాడు.
- 1944-46 మధ్య ఇంగ్లండు వెళ్ళి లీడ్స్ విశ్వవిద్యాలయంలో విద్యలో మాస్టర్స్ డిగ్రీ (ఎం.ఇడి.) పూర్తి చేసి వచ్చాడు.
ఉద్యోగాలు :
- 1933 జులై 31న అప్పటి హైదరాబాదు రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని చించోలిలో మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ఆరంభించాడు.
- 1936లో పదోన్నతిపై కోహీరుకు వెళ్ళిన నాటి నుంచి విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
- లండన్లో చదువుకుంటున్న సమయంలోనే బిబిసిలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం చేశారు.
- 1948లో గుల్బర్గా కళాశాలలో తన ఉద్యోగ ప్రస్థానం కొనసాగించాడు.
విదేశీ పర్యటనలు :
- 1951-52 మధ్యకాలంలో మలేషియా, ఫిలిప్పైన్స్, అమెరికా ఖండంలో 24 రాష్ట్రాలు, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్, మొరాకో వంటి దేశాలలో పర్యటించి అక్కడి విద్యావిధానం గురించి అక్కడి విద్యావేత్తలను అడిగి తెలుసుకున్నాడు.
- 1954-55 సం॥లో ఆస్ట్రేలియా ఖండంలో పర్యటించి అక్కడి విద్యావిధానాన్ని అధ్యయనం చేశాడు. 1958లో ఒక యాత్రికుడిగా రష్యా, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలను సందర్శించి అనేక సంస్థలను పరిశీలించి వచ్చాడు.
సంస్కరణలు : వివిధ దేశాల విద్యావిధానాలను అధ్యయనం చేసిన రామకృష్ణయ్య వాటి స్ఫూర్తితో మన దేశ విద్యారంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు.
- కరీంనగర్, నిజామాబాదు, హైదరాబాదు మొదలైన జిల్లాల్లో ప్రభుత్వ విద్యాశాఖాధికారిగా పనిచేశారు.
- పాఠశాల విద్య నిర్వహణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. ఆ విధానాలు కొన్ని నేటికీ అమలులో ఉన్నాయి.
- నిరక్షరాస్యతా నిర్మూలన కొరకు “ఈచ్ వన్ టీచ్ వన్” ఉద్యమాన్ని జీవిత పర్యంతం కొనసాగించారు.
- విధి నిర్వహణలోని ప్రతి అంశాన్నీ, అక్షర రూపంలో భద్రపరచి సంస్కరణలకు బీజం వేశాడు.
- రామకృష్ణయ్య నిరంతరం తన దినచర్యను రాసుకుంటూ ఆరువేల పుటలకు పైగా అమూల్యమైన అంశాలను లోకానికి అందించారు.
ఉద్దేశం : ముద్దు రామకృష్ణయ్య విదేశాలలో విద్యాభ్యాసం కోసం చేసిన ప్రయత్నాలు, ఎన్ని కష్టాలు ఎదురైనా, పస్తులుండవలసి వచ్చినా తన పట్టుదల వీడక ఆయన సాగించిన కృషి నేటి విద్యార్థులకు స్ఫూర్తి మంత్రం ఁ లాంటి వారి చరిత్ర ద్వారా స్ఫూర్తి పొందుతారని ఉద్దేశంతో ఈ యాత్రా చరిత్రను అందిం. ‘రు.
- ఈ యాత్రా చరిత్రలో ఆంగ్లం, ఉర్దూ పదాలు ఎక్కువగా వాడారు. నిజాం పాలనా కాలంలోని వ్యవస్థలు, ఆధికారుల పేర్లు కూడా ఇందులో తెలుసుకోవచ్చు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని ఈ ఉపవాచకం నిరూపిస్తుంది.