TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 1st Lesson విత్త మార్కెట్లు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 1st Lesson విత్త మార్కెట్లు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ద్రవ్య మార్కెట్ అంటే ఏమిటి ? దాని విధులను వివరించండి.
జవాబు.
స్వల్పకాలిక పరపతి సాధనాలతో వర్తకం జరిపే మార్కెట్ను ద్రవ్యమార్కెట్ అంటారు.
ద్రవ్యంతో దగ్గరి సంబంధం గల అనేక రకాల ద్రవ్యాలతో వ్యవహరించే వివిధ సంస్థల సముదాయాన్ని ద్రవ్య మార్కెట్ అంటారు.

నిర్వచనం: “ద్రవ్య మార్కెట్ ముఖ్యంగా స్వల్పకాలిక స్వభావం గల ద్రవ్యపరమైన ఆస్తులతో జరిపే వ్యవహారాలకు కేంద్రమై ఉంటుంది. ఇది రుణగ్రస్తులకు స్వల్పకాలిక ద్రవ్య అవసరాలను తీరుస్తూ, రుణాలను అందించే వారికి ద్రవ్యత్వాన్ని లేదా నగదును సమకూరుస్తుంది”. – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ద్రవ్య మార్కెట్కు వ్యవహారాలు జరపడానికి నిర్ణీత ప్రదేశమేమీ లేదు. అందులో పాల్గొనేవారు ఫోన్, ఇంటర్నెట్ ద్వారా వ్యవహారాలను జరుపుతారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ద్రవ్య మార్కెట్ విధులు:
(ఎ) ప్రధాన విధులు:

  1. స్వల్పకాలిక నిధుల సప్లయ్కు సమానమైన డిమాండ్ను కల్పిస్తూ రెండింటి మధ్య సమతౌల్య సాధనకు తగిన యంత్రాంగంగా వ్యవహరిస్తుంది.
  2. కేంద్ర బ్యాంకు తన జోక్యం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యత్వం మరియు సాధారణ స్థాయి వడ్డీ రేట్లను ప్రభావితం చేయడానికి ప్రవాస సమాచారాన్ని అందచేస్తుంది.
  3. స్వల్పకాలిక నిధులను సమకూర్చేవారు, వాటిని వినియోగించేవారు, తమ రుణాల, పెట్టుబడుల అవసరాలను ఒక సమర్థవంతమైన మార్కెట్లో స్పష్టమైన ధరతో తీర్చుకోవడానికి సరైన మార్గం చూపుతుంది.

(బి) ఇతర విధులు:
పై ప్రధాన విధులతో పాటు క్రింద చెప్పబడిన విధులను కూడా ద్రవ్య మార్కెట్ నిర్వర్తిస్తుంది.

  1. నిర్వహణా మూలధన అవసరాలను తీర్చడానికి, ఇది వ్యాపారానికి స్వల్పకాలిక రుణ సౌకర్యాన్ని కల్పిస్తుంది.
  2. పొదుపరులకు స్వల్పకాలిక పరపతి సాధనాలను జారీ చేయడం ద్వారా ప్రభుత్వానికి నిధులను సమకూరుస్తుంది.
  3. పరపతి సాధనాలతో వ్యవహరిస్తుంది.
  4. వర్తక వాణిజ్యాలు మేలైన మార్గంలో అభివృద్ధి చెందడానికి వీలుగా బిల్లులను జారీ చేస్తుంది.
  5. బిల్లులు/హుండీలను జారీ చేయడం ద్వారా వర్తక వాణిజ్యాలు మెరుగైన పద్ధతిలో అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది.
  6. ప్రజలు తమ పొదుపు మొత్తాలను పరపతి సాధనాలలో పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే వడ్డీ/డిస్కౌంట్ల వల్ల పొదుపు అలవాటు ప్రజలలో మరింత పెంపొందింప చేయడం సాధ్యపడుతుంది.
  7. “ఎలువైన, ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా పార్టీలు తమ సమయాన్ని, శ్రమను, నగదును ఆదా చేసుకోవడంలో సహాయపడుతుంది.

ప్రశ్న 2.
మూలధన మార్కెట్ విధులను వివరించండి.
జవాబు.
మూలధన మార్కెట్:

  1. సెక్యూరిటీలను అమ్మడం ద్వారా వ్యాపార సంస్థలకు దీర్ఘకాలిక నిధులను సమకూర్చే మార్కెట్ను మూలధన మార్కెట్ అంటారు.
  2. మూలధన మార్కెట్లో ప్రైవేట్ రంగ ఉత్పత్తి సంస్థలు, ప్రభుత్వం, ప్రత్యేక విత్త సంస్థలు, మదుపరులు పాల్గొంటారు.

మూలధన మార్కెట్ను ప్రాథమిక మార్కెట్ మరియు ద్వితీయ మార్కెట్ వర్గీకరించవచ్చు.

మూలధన మార్కెట్ విధులు:
1. వనరుల మళ్ళింపు: మూలధన మార్కెట్ వనరులను మిగులుగా ఉన్న ప్రదేశాల నుంచి నిధుల లోటు ఉన్న ఉత్పాదక రంగాలకు మళ్ళించి దేశ ఉత్పాదకతను, ఆర్థికాభివృద్ధిని పెంపొందిస్తుంది.

2. పొదుపును ప్రోత్సహించడం: ప్రజలు పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి, వడ్డీ, డివిడెండ్, బోనస్ రూపంలో రావడం వల్ల, ప్రజలలో పొదుపు అలవాటుకు ప్రోత్సాహం కలుగచేస్తుంది.

3. పెట్టుబడికి ప్రోత్సాహం: అధిక పెట్టుబడులను విత్త సంస్థల ద్వారా సేకరించడం వల్ల వడ్డీరేట్లు తగ్గి పెట్టుబడులు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.

4. ధరలలో స్థిరత్వం: సెక్యూరిటీల (వాటాల) ధరలు నిలకడగా ఉండేటట్లు గాను, ధరలలో హెచ్చు తగ్గులను కనీస స్థాయికి తగ్గించడం చేస్తుంది.

5. అనుత్పాదక కార్యకలాపాల తగ్గింపు: స్పెక్యులేషన్ను అనుత్పాదక కార్యకలాపాలను తగ్గించడానికి వీలు కల్పిస్తుంది.

6. ఆర్ధికాభివృద్ధిని పెంపొందించడం: మూలధన మార్కెట్ దేశ ఆర్థికాభివృద్ధిని పెంపొందింపచేస్తుంది. పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగ పరిశ్రమలను, వర్తకాన్ని విస్తరింపచేయడానికి మిగులు నిధులను తగిన విధంగా కేటాయించడం వల్ల దేశ ఆర్థిక పురోగతి ముందంజ వేస్తుంది.

ప్రశ్న 3.
ద్రవ్య మార్కెటు, మూలధన మార్కెట్కు మధ్యగల వ్యత్యాసాలను పేర్కొనండి.
జవాబు.
ద్రవ్య మార్కెట్: స్వల్పకాలిక పరపతి సాధనాలతో వర్తకం జరిపే మార్కెట్ను ద్రవ్య మార్కెట్ అంటారు. మూలధన మార్కెట్: సెక్యూరిటీల అమ్మడం ద్వారా వ్యాపార సంస్థలకు దీర్ఘకాలిక నిధులను సమకూర్చే మార్కెట్ను మూలధన మార్కెట్ అంటారు.

ద్రవ్య మార్కెట్, మూలధన మార్కెట్ల మధ్య వ్యత్యాసం:
TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు 1
TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు 2

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 4.
వివిధ ద్రవ్య మార్కెట్ పత్రాలను వివరించండి.
జవాబు.
1) ద్రవ్యమార్కెట్ పత్రాలు:
1) ట్రెజరీ బిల్లు:
a) ట్రెజరీ బిల్లు లేదా శూన్య కూపన్ బాండు కేంద్ర ప్రభుత్వం తరపున స్వల్పకాలిక నిధుల అవసరాలను తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ చేత డిస్కౌంట్ కోసం జారీ చేసిన ఒక ప్రామిసరీ నోటు.

b) ట్రెజరీ బిల్లులు వాటి ముఖ విలువ కంటే తక్కువ ధరకు జారీ చేయబడి ముఖ విలువతో తిరిగి చెల్లించబడుతాయి. కొనుగోలు ధరకు, గడువు తేదీన చెల్లించిన మొత్తానికి మధ్యగల వ్యత్యాసమే డిస్కౌంట్గా పిలుస్తారు.

c) ఇది సురక్షిత ద్రవ్య మార్కెట్ సాధనాలలో ఒకటి. కాని దీనిపై రాబడి అంత ఆకర్షణీయంగా ఉండదు. అయినప్పటికీ, ఇవి శూన్య నష్టభయమున్న, నిశ్చిత ఆదాయం కలిగిన సాధనాలు. ట్రెజరీ బిల్లు యొక్క కొనుగోలు ధర వేలం పద్ధతిలో నిర్ణయించబడుతుంది.

d) ప్రస్తుతం భారత ప్రభుత్వం 91 రోజుల, 182 రోజుల, 364 రోజుల మూడు రకాలైన ట్రెజరీ బిల్లులను వేలం ద్వారా జారీ చేస్తున్నదీ.

2) వాణిజ్య పత్రం:
a) వాణిజ్య పత్రం, ఆర్థిక పరిపుష్టి కలిగిన కంపెనీలచే జారీ చేయబడి, కొంత డిస్కౌంట్ తో బదలాయింపు చేయదగిన ఒక స్వల్పకాలిక హామీ లేని ప్రామిసరీ నోటు.

b) వాణిజ్య పత్రం ఒక రోజు నుంచి 270 రోజుల కాల పరిమితిని కలిగి ఉంటుంది.

c) వసూలు ఖాతాలు, ఇన్వెంటరీ నిర్వహణ కోసం అవసరమయ్యే నిధుల నిమిత్తం, స్వల్పకాలిక రుణాలను చెల్లించడానికి వాణిజ్య పత్రాలను జారీ చేస్తారు.

d) వాణిజ్య పత్రాల మీది రాబడి ట్రెజరీ బిల్లులపై వచ్చే రాబడి కంటే అధికంగా ఉంటుంది. కాని ఇవి తక్కువ హామీ కలిగినవి.

3) పిలుపు ద్రవ్యం:
a) పిలుపు ద్రవ్యం నగదు, రిజర్వు ఆవశ్యకత కోసం పిలుపు రేటు అనే వడ్డీతో సహా ఒక రోజు నుంచి 14 రోజుల నోటీసుపై గాని మరియు 14 రోజులు మించిన కాల వ్యవధితో తిరిగి చెల్లించబడే, స్వల్పకాలిక నిధుల కోసం బ్యాంకులు జరిపే పరస్పర వ్యవహారం.

b) రిజర్వు బ్యాంకు నగదు రిజర్వ్ నిష్పత్తి మొత్తంలో మార్పులు చేసినప్పుడు నిర్దేశించబడిన నిల్వల కంటే తక్కువ నగదు నిల్వలు కలిగిన బ్యాంకులు మిగులు నిధులు కలిగి ఉన్న బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుంటాయి. ఈ సేవలకు గాను, రుణదాత బ్యాంకుకు చెల్లించే వడ్డీని పిలుపు రేటు అని పిలుస్తారు.

c) పిలుపు రేటు రోజు రోజుకు, గంట గంటకు కూడా మారుతూ ఉంటుంది.

4) సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్:
a) సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, దాని గ్రహీత వడ్డీతో పాటుగా ముఖ విలువ మొత్తాన్ని పొందేందుకు అధికారాన్నిస్తూ వాణిజ్య బ్యాంకులచే జారీ చేయబడ్డ బదిలీ చేయదగిన స్వల్పకాలిక హామీ లేని ప్రామిసరీ నోటు.

b) సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ వ్యక్తులకు, కార్బొరేషన్లకు, కంపెనీలకు, ప్రవాస భారతీయులకు జారీ చేయబడుతుంది.

c) ఈ సర్టిఫికెట్లు 3 నెలల నుంచి 5 సంవత్సరాల కాల పరిమితితో అందుబాటులో ఉంటాయి.

d) సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు నష్టభయం ఎక్కువగా కలిగి ఉండడం చేత వీటి మీద రాబడి ట్రెజరీ బిల్లులపై రాబడి కంటే అధికంగా ఉంటుంది.

5) వాణిజ్య బిల్లులు:
a) వాణిజ్య బిల్లు కొనుగోలుదారుడు బాకీ ఉన్న అరువు అమ్మకాల మొత్తాన్ని ఒక భవిష్యత్తు తేదీ నాడు చెల్లించడం కోసం కొనుగోలుదారుని (బిల్లు స్వీకర్త) ఆమోదానికై అమ్మకందారుని (బిల్లుకర్త)చే రాయబడ్డ అన్యాక్రాంత యోగ్యతా పత్రం. (negotiable bill)

b) బిల్లు స్వీకర్త స్వీకృతిని తెలియజేయగానే వాణిజ్య బిల్లు ఒక చట్టబద్ధమైన పత్రంగా మారి బిల్లు కర్తకు నగదు అవసరమైనప్పుడు బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

c) బ్యాంకు బిల్లుపై సొమ్మును చెల్లించేటప్పుడు కొంత డిస్కౌంట్ మొత్తాన్ని మినహాయించుకుంటుంది. గడువు తేదీనాడు బిల్లు మొత్తాన్ని బ్యాంకు బిల్లు స్వీకర్త వద్ద వసూలు చేసుకుంటుంది.

ప్రశ్న 5.
ఉత్పన్నాలు అంటే ఏమిటి ? వివిధ ఉత్పన్నాల ఉత్పత్తులను వివరించండి.
జవాబు.
ఉత్పన్నాలు:
1) ఉత్పన్నాలు అనగా ఆర్థిక ఒప్పందాలు. వీటి విలువ వీటిని పోలిన ఇతర ఆస్తుల విలువపై ఆధారపడి ఉంటుంది.
2) ఉత్పన్నాలను సరిపోల్చడానికి ఉపయోగించే ఇతర ఆస్తులు స్టాక్స్, బాండ్లు, కరెన్సీలు, వస్తువులు మరియు మార్కెట్ సూచికలు.
ఉత్పన్నాల ఉత్పత్తులు:
ఉత్పన్న ఉత్పత్తులను 4 రకాలుగా వర్గీకరించవచ్చు.
ఎ) ఫార్వార్డ్స్
బి) ఫ్యూచర్స్,
సి) ఆప్షన్స్,
డి) స్వాప్స్
TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు 3

ఎ) ఫార్వార్డ్స్:

  1. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం
  2. ముందుగా అంగీకరించిన ధర వద్ద భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీలో సెక్యూరిటీల పరిష్కారం జరుగుతుంది.

బి) ఫ్యూచర్స్:

  1. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట ధర వద్ద ఒక ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి రెండు పార్టీల మధ్య చేసుకున్న ఒప్పందం.
  2. ఫ్యూచర్స్ కాంట్రాక్టులు ప్రత్యేకమైన ఫార్వర్డ్ కాంట్రాక్టులు. వీటిలో ప్రామాణికమైన మారకపు వర్తక ఒప్పందాలు ఇమిడి ఉంటాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

సి) ఆప్షన్స్:

  1. ఆప్షన్స్ రెండు రకాలు – కాల్స్ మరియు పుట్స్
  2. కాల్స్ కొనుగోలుదారునికి కొనుగోలు చేయడానికి హక్కును ఇస్తాయి. కాని ఇచ్చిన భవిష్యత్ తేదీన లేదా అంతకు ముందు నిర్ధారించిన ధర వద్ద నిర్దిష్ట ఆస్తి యొక్క నిర్దిష్ట పరిమాణాన్ని కొనుగోలు చేయవలసిన బాధ్యత మాత్రం ఏర్పడదు.
  3. పుట్స్ కొనుగోలుదారునికి ఆస్తి కొనుగోలు హక్కును ఇస్తాయి. కాని ఇచ్చిన తేదీలో లేదా నిర్ధారిత ధర వద్ద నిర్దిష్టమైన ఆస్తిని, నిర్దిష్ట పరిమాణాన్ని విక్రయించే బాధ్యత ఏర్పడదు.

డి) స్వాప్స్:

  1. ముందుగా నిర్ణయించిన సూత్రం ప్రకారం భవిష్యత్తులో నగదు ప్రవాహాన్ని మార్పిడి చేయడానికి రెండు పార్టీల మధ్య కుదిరిన ప్రైవేట్ ఒప్పందాలు స్వాప్లు.
  2. వాటిని ఫార్వర్డ్ కాంట్రాక్టులు ఫోర్ట్ఫోలియోగ పరిగణించవచ్చు.

ప్రశ్న 6.
వివిధ రుణ మార్కెట్ పత్రాల గురించి సవివరంగా తెలియచేయండి.
జవాబు.
రుణ మార్కెట్: రుణ పత్రాలతో వ్యాపారం జరిగే మార్కెట్ను రుణ మార్కెట్ అంటారు. రుణ పత్రాలలో తనఖా, ప్రామిసరీ నోట్స్, బాండ్లు మరియు డిపాజిట్ సర్టిఫికెట్లు ఉన్నాయి.
రుణ మార్కెట్ పత్రాలు: ఈ క్రింది రుణ పత్రాలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, మునిసిపల్ కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థలు మరియు వాణిజ్య సంస్థలు జారీ చేస్తాయి. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు మరియు పబ్లిక్ లిమిటెడ్ సంస్థలు రుణ మార్కెట్లో జారీ చేసే ముఖ్యమైన పత్రాలు.
1) డిబెంచర్లు:

  1. ఇవి ఒక రకమైన రుణ పత్రాలు. ఇవి నిర్దిష్ట కాలానికి నిర్ణీత వడ్డీ రేటును అందిస్తుంది.
  2. కంపెనీలు లేదా ప్రభుత్వాలు నిధులను సమకూర్చుకోవడానికి డిబెంచర్లను ఉపయోగిస్తాయి. డిబెంచర్లు కేవలం కంపెనీలు తీసుకున్న రుణాలు మాత్రమే. అవి సంస్థలో యాజమాన్యపు హక్కును కల్గించవు.

2) బాండ్లు:

  1. మూలధనాన్ని పెంచడానికి కార్పొరేషన్లు మరియు ప్రభుత్వాలు జారీ చేసే స్థిర ఆదాయ సెక్యూరిటీలు బాండ్లు.
  2. బాండ్ జారీ చేసేవారు బాండ్ హోల్డర్ నుంచి మూలధనాన్ని తీసుకుంటారు మరియు వారికి నిర్ణీత కాలానికి స్థిర వడ్డీ రేటుతో స్థిర చెల్లింపులు చేస్తారు.

3) ప్రభుత్వ సెక్యూరిటీలు:

  1. ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా G-Secs భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది.
  2. సెక్యూరిటీలు స్థిర వడ్డీ రేటును అందిస్తాయి. ఇక్కడ వడ్డీ వార్షిక కాలంలో రెండు సార్లు చెల్లించబడుతుంది.

3) ట్రెజరీ బిల్లులు:

  1. ట్రెజరీ బిల్లులు లేదా టి-బిల్లులు, వీటిని రిజర్వు బ్యాంకు జారీ చేస్తుంది.
  2. ఇవి 91 రోజులు, 182 రోజులు మరియు 364 రోజుల కాలానికి జారీ చేస్తారు.

4) సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు:

  1. ఒక నిర్దిష్ట కాలానికి బ్యాంకు వద్ద ఉన్న నిధుల డిపాజిటర్లకు సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు (CDలు) బ్యాంక్ జారీ చేస్తుంది.
  2. CDలు సాంప్రదాయ టర్మ్ డిపాజిట్ల మాదిరిగానే ఉంటాయి, వీటిని స్వల్పకాలిక ద్రవ్య మార్కెట్లో మార్చుకోవచ్చు మరియు వర్తకం చేయవచ్చు.

5) వాణిజ్య పత్రాలు:

  1. వాణిజ్య పత్రాలను CP అని కూడా పిలుస్తారు. ఇవి నిధుల సేకరణ కోసం కంపెనీలు జారీ చేసే స్వల్పకాలిక రుణ పత్రాలు.
  2. ఇది ప్రామిసరీ నోట్ రూపంలో జారీ చేయబడిన రిస్క్ ను కలిగి ఉన్న ద్రవ్య మార్కెట్ పత్రం. దీనిని 1990లో భారతదేశంలో మొదటిసారి ప్రవేశపెట్టడం జరిగింది.

ప్రశ్న 7.
ఈక్విటీ మార్కెట్ పత్రాలను వివరించండి.
జవాబు.
ఈక్విటీ మార్కెట్: లిస్టెడ్ కంపెనీల షేర్లలో వర్తకం చేయడానికి కొనుగోలుదారులు మరియు విక్రేతలు కలిసే మార్కెటు ఈక్విటీ మార్కెట్ అంటారు. దీనినే స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ అని కూడా పిలుస్తారు.

ఈక్విటీ మార్కెట్ పత్రాలు:
1) సాధారణ వాటాలు:
1) సాధారణ స్టాక్ వాటాలు యాజమాన్య మూలధనాన్ని సూచిస్తాయి మరియు సాధారణ వాటాలను కలిగి ఉన్న వారికి సంస్థ యొక్క లాభాల నుంచి డివిడెండ్ చెల్లించబడుతుంది.

2) సాధారణ వాటాదారులకు సంస్థ యొక్క ఆదాయం మరియు ఆస్తుల అవశేష విలువపై అధికారం ఉంటుంది. ఆధిక్యపు వాటాదారులు మరియు బాండ్ హెరాల్డర్కు చెల్లించిన తర్వాత మాత్రమే వారు సంస్థ యొక్క లాభాలలో వాటాను పొందటానికి అర్హులు.

2) ఆధిక్యపు వాటాలు:
1) ఆధిక్యపు వాటాలు మిశ్రమ జాతి భద్రత లక్షణాలను కలిగి ఉంటాయి. ఎందుకంటే అవి సాధారణ ఈక్విటీ వాటాలు మరియు డిబెంచర్ల యొక్క కొన్ని లక్షణాలను మిళితం చేస్తాయి.

2) అవి డివిడెండ్ల స్థిరమైన రేటును కలిగి ఉండటం, ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా కంపెనీ ఆదాయంపై మరియు ఆస్తులపై హక్కును కలిగి ఉంటారు. కంపెనీ యొక్క మిగిలిన ఆదాయంలో వీరికి ఏ హక్కులేదు మరియు వాటాదారులకు ఓటు హక్కును ఇవ్వనందున అవి డిబెంచర్ల వంటివి.

3) ప్రైవేట్ ఈక్విటీ:
1) ప్రైవేట్ ప్లేస్మెంట్ల ద్వారా చేసే ఈక్విటీ పెట్టుబడులను ప్రైవేట్ ఈక్విటీ అంటారు. ప్రైవేట్ ఈక్విటీని ప్రైవేట్ ఋణ బాధ్యతగల సంస్థలు మరియు భాగస్వామ్యాలు సేకరిస్తాయి.

2) సాధారణంగా, ప్రారంభ మరియు చిన్న/మధ్య తరహా కంపెనీలు, సంస్థాగత పెట్టుబడిదారులు మరియు సంపన్న వ్యక్తుల నుండి ఈ మార్గం ద్వారా మూలధనాన్ని సేకరిస్తాయి.

4) మ్యూచువల్ ఫండ్స్:
1) మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడిదారులకు లాభం సంపాదించడానికి అనేకమంది పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి కంపెనీ స్టాక్స్, బాండ్స్, ప్రభుత్వ పత్రాలు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టే సాధనం.

2) వచ్చిన లాభాన్ని పెట్టుబడిదారులకు డివిడెండ్లుగా చెల్లించవచ్చు లేదా మూలధన పెరుగుదల కోసం ఫండ్ ద్వారా తిరిగి పెట్టు బడి పెట్టవచ్చు.

5) ఉత్పన్నాలు:
1) ఇవి ఆర్థిక ఒప్పందాలు. వీటి విలువ వీటిని పోలిన ఇతర ఆస్తుల విలువపై ఆధారపడి ఉంటుంది.

2) సాధారణంగా సరిపోల్చడానికి ఇతర ఆస్తులు ఏవనగా స్టాక్స్, బాండ్లు, కరెన్సీలు, వస్తువులు మరియు మార్కెట్ సూచికలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆస్తుల విలువ మారుతూ ఉంటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 8.
మ్యూచువల్ ఫండ్ను నిర్వచించి, దాని ధ్యేయాలు ఏమిటో వివరించండి.
జవాబు.
1) మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడిదారులకు లాభం సంపాదించడానికి అనేక మంది పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి కంపెనీ స్టాక్స్, బాండ్స్, ప్రభుత్వ పత్రాలు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టే సాధనం.

2) వీటిలో వచ్చిన లాభాన్ని పెట్టుబడిదారులకు డివిడెండ్లుగా చెల్లించవచ్చు లేదా మూలధన పెరుగుదల కోసం ఫండ్ ద్వారా తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు.

మ్యూచువల్ ఫండ్ ధ్యేయాలు:
1) లక్ష్య ఆధారిత పెట్టుబడి: మ్యూచువల్ ఫండ్స్ యొక్క ప్రథమ పెట్టుబడి లక్ష్యం ఇది. ఇది వివిధ పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల మ్యూచువల్ ఫండ్లను అందిస్తుంది. ఫండ్ మేనేజర్ పెట్టుబడిదారునికి ఏర్పడే రిస్క్ మరియు రుణ బాధ్యతలు మొదలైన వాటిని చూసిన తరువాతనే పెట్టుబడిదారులకు అనువైన సెక్యూరిటీల మిశ్రమాన్ని ఎంపిక చేస్తారు.

2) పెట్టుబడి వృద్ధి: అనేక మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడి ఉద్దేశాలలో పెట్టుబడి వృద్ధి ఒకటి. అధిక రాబడి కోసం చూస్తున్న పెట్టుబడిదారులు కొంత అదనపు రిస్క్ తీసుకొని పెట్టుబడిని చేస్తారు. ఈ ఉద్దేశం ప్రకారం వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థలలో డబ్బును పెట్టుబడి పెడతాయి.

3) పన్ను ఆదా: మ్యూచువల్ ఫండ్ యొక్క ముఖ్యమైన పెట్టుబడి ఉద్దేశాలలో పన్ను ఆదా కూడా ఒకటి. ఎక్కువగా సంపన్న క్లయింట్లు, సంస్థాగత పెట్టుబడిదారులు మరియు కార్పొరేట్ పన్ను భారాన్ని తగ్గించే ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు వివిధ రకాల ఫండ్లు అందుబాటులో ఉండి పన్నులు తగ్గిస్తాయి.

ప్రశ్న 9.
వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ ఏమిటో సవివరంగా తెలియజేయండి.”
జవాబు.
మ్యూచువల్ ఫండ్ పథకాలను దాని నిర్మాణం మరియు పెట్టుబడి లక్ష్యం ఆధారంగా వర్గీకరించవచ్చు.
TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు 4
స్వరూపం ఆధారంగా:
ద్రవ్య మార్కెట్ ఫండ్
ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్
ఓపెన్ ఎండెడ్ ఫండ్స్:

  1. ఓపెన్ – ఎండెడ్ ఫండ్ అంటే నిరంతర ప్రాతిపదికన చందా చేయడానికి మరియు తిరిగి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అంటే ఏడాది పొడవునా లభ్యమౌతుంది.
  2. ఈ ఫండ్కు స్థిర మెచ్యూరిటీ వ్యవధి లేదు.
  3. పెట్టుబడిదారులు నికర ఆస్తి విలువ (NAV) సంబంధిత ధరలతో సౌకర్యవంతంగా యూనిట్లను కొనుగోలు చేయవచ్చు మరియు అమ్మవచ్చు. ఓపెన్ – ఎండ్ పథకాల యొక్క ముఖ్య లక్షణం ద్రవ్యత్వాన్ని కల్పించడం.

క్లోజ్ – ఎండెడ్ ఫండ్స్:
1) క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ నిర్ణీత మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా 3-15 సంవత్సరాల కాల వ్యవధిలో ఉంటాయి. ఈ నిధులు నిర్దిష్ట కాలంలో మాత్రమే చందా కోసం తెరవబడతాయి.

2) ప్రారంభ పబ్లిక్ ఇష్యూ సమయంలో పెట్టుబడిదారులు ఈ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు మరియు ఆ తరువాత వారు జాబితా చేయబడిన స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ఈ పథకం యొక్క యూనిట్లను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు.

3) పెట్టుబడిదారులకు నిష్క్రమణ మార్గాన్ని అందించడానికి, కొన్ని క్లోజ్-ఎండెడ్ ఫండ్ NAV సంబంధిత ధరలకు మ్యూచువల్ ఫండ్ పునర్ కొనుగోలు విధానం ద్వారా యూనిట్లను తిరిగి విక్రయించే అవకాశాన్ని ఇస్తాయి.

ఇంటర్వెల్ ఫండ్స్:

  1. ఇంటర్వెల్ ఫండ్స్ ఓపెన్ – ఎండెడ్ మరియు క్లోజ్-ఎండెడ్ స్కీమ్ల లక్షణాలను మిళితం చేస్తాయి.
  2. NAV సంబంధిత ధరల వద్ద ముందుగా నిర్ణయించిన వ్యవధిలో అవి అమ్మకం లేదా విముక్తి కోసం తెరవబడతాయి. పెట్టుబడి లక్ష్యం ఆధారంగా:

వృద్ధి ఫండ్స్:

  1. పెట్టుబడుల విలువ పెరుగుదలను మూలధనం విలువ పెరుగుదల ద్వారా ఉద్దేశించిన నిధులు ఈ రకానికి వస్తాయి.
  2. ఇలాంటి నిధులు వృద్ధి ఆధారిత సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెడతాయి. అంటే, దీర్ఘకాలంలో పెరుగుదల గల కంపెనీల వాటాలలో పెట్టుబడిని చేస్తారు.
  3. గ్రోత్ ఫండ్స్ను నెస్ట్ ఎగ్స్ లేదా లాంగ్ హాల్ ఇన్వెస్టిమెంట్స్ అని కూడా అంటారు.

ఆదాయ ఫండ్స్:

  1. పెట్టుబడిదారులకు క్రమమైన మరియు స్థిరమైన ఆదాయాన్ని అందించడం ఆదాయ ఫండ్స్ యొక్క ఉద్దేశం.
  2. ఇలాంటి పథకాలు సాధారణంగా బాండ్లు, కార్పొరేట్ డిబెంచర్లు మరియు ప్రభుత్వ సెక్యూరిటీల వంటి స్థిర ఆదాయ సెక్యూరిటీల ద్వారా లభ్యమౌతాయి.
  3. మూలధన స్థిరత్వం, సాధారణ ఆదాయానికి ఈ ఫండ్స్ అనువైనవి.

సమతుల్య ఫండ్స్:

  1. సమతుల్య ఫండ్స్ ఉద్దేశం వృద్ధి మరియు సాధారణ ఆదాయం రెండింటినీ అందించడం.
  2. ఇలాంటి పథకాలు క్రమానుగతంగా వారి సంపాదనలో కొంత భాగాన్ని పంపిణీ చేస్తాయి మరియు ఈక్విటీలు మరియు స్థిర ఆదాయ సెక్యూరిటీలలో వారి ప్రతిపాదన పత్రాలలో సూచించిన నిష్పత్తిలో పెట్టుబడి పెడతాయి. మెజారిటీ నిధులు ఈ కోవలోకి వస్తాయి.

ద్రవ్య మార్కెట్ ఫండ్స్:

  1. ద్రవ్య మార్కెట్ ఫండ్ల ఉద్దేశం తేలికైన ద్రవ్యత, మూలధన సంరక్షణ మరియు మితమైన ఆదాయాన్ని అందించడం.
  2. ఈ పథకాలు సాధారణంగా ట్రెజరీ బిల్లులు, డిపాజిట్ సర్టిఫికెట్లు, కమర్షియల్ పత్రాలు మరియు ఇంటర్ బ్యాంక్ కాల్ మనీ వంటి సురక్షితమైన స్వల్పకాలిక సాధనాలలో పెట్టుబడి పెడతాయి.
  3. మార్కెట్లో ఉన్న వడ్డీ రేట్లను బట్టి ఈ పథకాలపై రాబడి మారవచ్చు. ఈ నిధులు కార్పొరేట్ మరియు వ్యక్తిగత పెట్టుబడిదారులకు వారి మిగులు నిధులను స్వల్ప కాలానికి మళ్ళించటానికి అనువైనవి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

III. ఇతర రకాలు:
1) పన్ను పొదుపు ఫండ్స్ పెట్టుబడిదారులను ప్రోత్సహించటానికి నిర్దేశిత మార్గాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఈ పథకాలు భారతీయ ఆదాయపు పన్ను చట్టాల యొక్క నిర్దిష్ట నిబంధనల ప్రకారం పెట్టుబడిదారులకు పన్ను రాయితీలను అందిస్తాయి.

2) పరిశ్రమ నిర్దిష్ట ఫండ్స్:

  • పరిశ్రమ నిర్దిష్ట పథకాలు ప్రతిపాదనలో పేర్కొన్న పరిశ్రమలలో మాత్రమే పెట్టుబడి పెడతాయి.
  • ఈ నిధుల పెట్టుబడి ఇన్ఫోటెక్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) ఫార్మాస్యూటికల్స్ మొదలైన నిర్దిష్ట పరిశ్రమలకు పరిమితం.

ఇండెక్స్ ఫండ్స్: BSE లేదా NSEల నిర్దిష్ట సూచిక యొక్క పనితీరును ప్రతిబింబించడానికి ఇండెక్స్ ఫండ్స్ ప్రయత్నిస్తాయి.

ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్:

  1. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ పెట్టుబడిదారులకు క్లోజ్డ్ ఎండెడ్ మరియు ఓపెన్ – ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ యొక్క మిశ్రమ ప్రయోజనాలను అందిస్తాయి.
  2. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ సూచికలను అనుసరిస్తాయి మరియు సూచీతో ముడిపడి ఉన్న ధరల వద్ద ఒకే స్టాక్ స్టాక్ ఎక్స్ఛేంజిలలో వర్తకం చేయబడతాయి.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
దేశీయ బ్యాంకర్లకు, వడ్డీ వ్యాపారస్తులకు మధ్యగల తేడాలను రాయండి.
జవాబు.
దేశీయ బ్యాంకర్లు

  1. దేశీయ బ్యాంకర్లు వర్తక వాణిజ్య అవసరాలకు రుణాలిస్తారు.
  2. వీరు వసూలు చేసే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది.
  3. దేశీయ బ్యాంకర్లు ఇచ్చే రుణాలకు హామీ తప్పనిసరి.
  4. వీరు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందిస్తారు.

వడ్డీ వ్యాపారస్తులు

  1. వడ్డీ వ్యాపారస్తులు వినియోగ అవసరాలకు రుణాలిస్తారు.
  2. వడ్డీ వ్యాపారస్తులు వసూలు చేసే వడ్డీరేటు అధికంగా ఉంటుంది.
  3. వడ్డీ వ్యాపారస్తులు ఇచ్చే రుణాలకు హామీ అవసరం లేదు.
  4. వీరు ఎక్కువ స్వల్పకాలిక రుణాలకు ప్రాధాన్యత ఇస్తారు.

ప్రశ్న 2.
వ్యవస్థీకృత ద్రవ్య మార్కెట్ నిర్వహించే పాత్ర ఏమిటి ?
జవాబు.
సంఘటిత ద్రవ్య మార్కెట్లో పని చేస్తున్నా లేదా కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు R.B.I ద్వారాగాని, ఇతర నియంత్రణ సంస్థలైన ‘నాబార్డ్ (NABARD) ద్వారాగాని క్రమబద్దీకరించబడతాయి. అందువల్ల వాణిజ్య బ్యాంకులు, భారతీయ మరియు విదేశీ, పబ్లిక్ ప్రైవేట్ రంగానికి చెందినవి వ్యవస్థీకృత ద్రవ్యమార్కెట్లో కేంద్ర ప్రభుత్వం, వ్యాపార సంస్థలతోపాటు పాల్గొంటాయి.

వ్యవస్థీకృత ద్రవ్య మార్కెట్ పాత్ర:

  1. వాణిజ్య బ్యాంకులు నగదు రిజర్వు నిష్పత్తి కొనసాగించడంలో సహాయపడుతుంది.
  2. సంస్థలు నిర్వహణ మూలధన అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.
  3. నిధుల లోటును పూరించడానికి ప్రభుత్వానికి సహకరిస్తుంది.

ద్రవ్యమార్కెట్ పరపతి సాధనాలు ట్రెజరీ బిల్లులు, వాణిజ్య పత్రాలు, పిలుపు ద్రవ్యం, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, వాణిజ్య బిల్లులు మొదలైన సాధనాలతో వాణిజ్య బ్యాంకులు, సంస్థలు, ప్రభుత్వం నిధులను సమకూర్చుకుంటాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 3.
ప్రాథమిక మార్కెట్కు, ద్వితీయ మార్కెట్కు మధ్యగల తేడాలను రాయండి.
జవాబు.
ప్రాథమిక మార్కెట్

  1. కొత్తగా జారీచేయబడిన వాటాల కొనుగోళ్ళు జరుపుతుంది.
  2. పెట్టుబడిన అభివృద్ధి చేయడంలో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది.
  3. సెక్యూరిటీల కొనుగోలు వ్యవహారాలు మాత్రమే జరుగుతాయి.
  4. కంపెనీ నిర్వాహకులు సెక్యూరిటీ ధరలను నిర్ణయిస్తారు.
  5. సెక్యూరిటీ వ్యవహారాలు జరపడానికి నిర్ణీత ప్రదేశం లేదు.
  6. దీని ద్వారా కంపెనీ తన సెక్యూరిటీలను నేరుగా గాని, మధ్యవర్తుల ద్వారాగాని పెట్టుబడి దారులకు అమ్మగలదు.

ద్వితీయ మార్కెట్

  1. ఒకసారి కొనుగోలు చేయబడిన వాటాలను మరల మార్కెట్ చేయడం జరుపుతుంది.
  2. పెట్టుబడిని అభివృద్ధి చేయడంలో పరోక్షంగా సంబంధం కలిగి ఉంటుంది.
  3. సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలు రెండు జరుగుతాయి.
  4. సెక్యూరిటీల ధర వాటి యొక్క సప్లయ్, డిమాండ్లను బట్టి నిర్ణయించబడతాయి.
  5. నిర్ణీత ప్రదేశాలలో సెక్యూరిటీలకు సంబంధించిన వ్యవహారాలు జరుగుతాయి.
  6. సెక్యూరిటీదారులు తమ సెక్యూరిటీలను వినిమయం చేయడంలో తోడ్పడుతుంది.

ప్రశ్న 4.
ట్రెజరీ బిల్లు అంటే ఏమిటి ?
జవాబు.
1) ట్రెజరీ బిల్లు లేదా శూన్య కూపన్ బాండు కేంద్రప్రభుత్వం తరుపున స్వల్పకాలిక నిధుల అవసరాలను తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) చేత డిస్కౌంట్ కోసం జారీ చేసిన ఒక ప్రామిసరీ నోటు.

2) ట్రెజరీ బిల్లులు వాటి ముఖ విలువ కంటే తక్కువ ధరకు జారీచేయబడి ముఖ విలువతో తిరిగి చెల్లించబడతాయి. కొనుగోలు ధరకు, గడువు తేదీని చెల్లించిన మొత్తానికి మధ్యగల వ్యత్యాసమే డిస్కౌంట్గా పిలువబడు ఆర్జించిన వడ్డీ.

3) ఇది సురక్షిత ద్రవ్య మార్కెట్ సాధనాలలో ఒకటి. కాని దీనిపై రాబడి అంత ఆకర్షణీయంగా ఉండదు. అయినప్పటికీ,
ఇవి శూన్య నష్ట భయమున్న, నిశ్చిత ఆదాయం కలిగిన సాధనాలు. ట్రెజరీ బిల్లు యొక్క కొనుగోలు ధర వేలం పద్దతిలో నిర్ణయించబడుతుంది.

4) ప్రస్తుతం భారత ప్రభుత్వం 91 రోజుల, 182 రోజుల, 364 రోజుల మూడు రకాలైన ట్రెజరీ బిల్లులను వేలం ద్వారా జారీ చేస్తున్నది.

ప్రశ్న 5.
ఇ-ఐపిఒలు (e – IPO).
జవాబు.
1) కంపెనీ సెక్యూరిటీలను ఆన్లైన్ వర్తకం వ్యవస్థ గల స్టాక్ ఎక్స్ఛేంజ్తో ఒప్పందం చేసుకోవడం ద్వారా జారీ చేస్తుంది. దీనినే (e – IPO – Initial Public Offer) ‘ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్’ అంటారు.

2) దీనికోసం, దరఖాస్తులను అంగీకరించి ఆర్డర్లను కంపెనీకి ఇవ్వడానికి సెబి (SEBI) రిజిష్టర్ బ్రోకర్లను
నియమించవలసి ఉంటుంది.

3) వాటాలను జారీ చేస్తున్న కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్తో ఎలక్ట్రానిక్ కనెక్టివిటీ కోసం ఒక రిజిష్ట్రారును నియమించవలసి ఉంటుంది.

4) వాటాలను జారీ చేసే కంపెనీ తన సెక్యూరిటీలను “సెక్యూరిటీలను జాబితాలో చేర్చిన స్టాక్ ఎక్స్ఛేంజ్లో” కాకుండా ఏదైనా ఇతర స్టాక్ ఎక్స్ఛేంజ్లోని జాబితాలో చేర్చవలసి ఉంటుంది. సెక్యూరిటీల జారీ నిర్వహించే మధ్యవర్తులను ఒక లీడ్ మేనేజర్ సమన్వయించడం జరుగుతుంది.

ప్రశ్న 6.
ఏ విధంగా ఆర్థిక మార్కెట్లు వర్గీకరించారు ?
జవాబు.
ద్రవ్య పరమైన ఆస్తులను సృష్టించడానికి, వినిమయం చేయడానికి కావలసిన విత్త వ్యవహారాలు జరిపే మార్కెట్లను విత్త మార్కెట్లు అంటారు. వీటినే ఆర్థిక మార్కెట్లు అని కూడా పిలుస్తారు.
విత్త మార్కెట్లను విత్త యొక్క కాలపరిమితి ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:
1) ద్రవ్య మార్కెట్లు,
2) మూలధన మార్కెట్లు
TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు 5
A) స్వల్ప కాల పరపతి సాధనాలలో వర్తకం జరిపే మార్కెట్ను ద్రవ్య మార్కెట్ అంటారు. దీనిని మరల సంఘటిత మార్కెట్ మరియు అసంఘటిత మార్కెట్గా వర్గీకరించారు.

B) వ్యాపార దీర్ఘకాలిక అవసరాలను తీర్చడంకోసం వాటాల కొనుగోలు అమ్మకాలను సంబంధించిన వ్యవహారాలు జరిగే మార్కెట్లు మూలధన మార్కెట్ అంటారు. మూలధన మార్కెట్ను ప్రాథమిక మరియు ద్వితీయ మార్కెట్లుగా విభజించవచ్చు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 7.
సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు అంటే ఏమిటి ?
జవాబు.

  1. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ దాని గ్రహీత వడ్డీతో పాటుగా ముఖ విలువ మొత్తాన్ని పొందేందుకు అధికారాన్నిస్తూ వాణిజ్య బ్యాంకులచే జారీ చేయబడ్డ బదిలీ చేయదగిన స్వల్పకాలిక హామీ లేని ప్రామిసరీ నోటు.
  2. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ వ్యక్తులకు, కార్పొరేషన్లకు, కంపెనీలకు, ప్రవాస భారతీయులకు జారీ చేయబడుతుంది.
  3. ఈ సర్టిఫికేట్లు 3 నెలల నుంచి 5 సంవత్సరాల కాల పరిమితితో అందుబాటులో ఉంటాయి.
  4. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు నష్టభయం ఎక్కువగా కలిగి ఉండటం చేత వీటి మీద రాబడి ట్రెజరీ బిల్లులపై రాబడి కంటే అధికంగా ఉంటుంది.

ప్రశ్న 8.
వాణిజ్య పత్రం గురించి తెలపండి.
జవాబు.

  1. వాణిజ్య పత్రం ఆర్థిక పరిపుష్టి కలిగిన కంపెనీలచే జారీ చేయబడి, కొంత డిస్కౌంట్తో బదలాయింపు చేయదగిన ఒక స్వల్పకాలిక హామీ లేని ప్రామిసరీ నోటు.
  2. వాణిజ్య పత్రం ఒక రోజు నుంచి 270 రోజుల కాల పరిమితిని కలిగి ఉంటుంది.
  3. వసూలు ఖాతాలు, ఇన్వెంటరీ నిర్వహణ కోసం అవసరం అయ్యే నిధుల నిమిత్తం, స్వల్పకాలిక రుణాలను చెల్లించడానికి వాణిజ్య పత్రాలను జారీ చేస్తారు.
  4. వాణిజ్య పత్రాల మీద రాబడి ట్రెజరీ బిల్లులపై వచ్చే రాబడి కంటే అధికంగా ఉంటుంది. కాని ఇవి తక్కువ హామీ కలిగినవి.

ప్రశ్న 9.
పిలుపు ద్రవ్యం అంటే ఏమిటి ?
జవాబు.
1) పిలుపు ద్రవ్యం నగదు, రిజర్వు ఆవశ్యకత కోసం పిలుపు రేటు అనే వడ్డీతో సహా ఒక రోజు నుంచి 14 రోజుల నోటీసుపై గాని మరియు 14 రోజులు మించిన కాల వ్యవధితో తిరిగి చెల్లించబడే, స్వల్పకాలిక నిధుల కోసం బ్యాంకులు జరిపే పరస్పర వ్యవహారం.

2) రిజర్వ్ బ్యాంకు ఈ నగదు రిజర్వ్ నిష్పత్తి మొత్తంలో మార్పులు చేసినప్పుడు నిర్దేశించబడిన నిల్వల కంటే తక్కువ నగదు నిల్వలు కలిగిన బ్యాంకులు మిగులు నిధులు కలిగి ఉన్న బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుంటాయి. ఈ సేవలకు గాను, రుణదాత బ్యాంకుకు చెల్లించే వడ్డీని పిలుపు రేటు అని పిలుస్తారు.

3) పిలుపు రేటు రోజు రోజుకు, గంట గంటకు కూడా మారుతూ ఉంటుంది.

ప్రశ్న 10.
బాండ్ మార్కెట్ గురించి తెలియజేయండి.
జవాబు.
1) బాండ్ మార్కెట్ను తరచుగా డెట్ మార్కెట్, ‘స్థిర – ఆదాయ’ మార్కెట్ లేదా ‘క్రెడిట్-మార్కెట్’ అని పిలుస్తారు.

2) ప్రభుత్వ సంస్థలు లేదా బహిరంగంగా వర్తకం చేసే సంస్థల ద్వారా మార్కెట్లోకి తీసుకువచ్చే రుణ సెక్యూరిటీలను పెట్టుబడిదారులు కొనుగోలు చేసే మార్కెట్ స్థలంనే బాండ్ మార్కెట్ అంటారు.

3) ప్రభుత్వాలు సాధారణంగా అప్పులు చెల్లించడానికి లేదా మౌలిక సదుపాయాల మెరుగుదలకు నిధులు సమకూర్చడానికి బాండ్లను జారీ చేస్తాయి.

4) పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు వ్యాపార విస్తరణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు లేదా కొనసాగుతున్న కార్యకలాపాలను నిర్వహించడానికి బాండ్లను జారీ చేస్తాయి.

5) సాధారణ బాండ్ మార్కెట్ను కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ బాండ్లు, మునిసిపల్ బాండ్లు, తనఖా పౌండ్లు మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ బాండ్లుగా విభజించవచ్చు.

ప్రశ్న 11.
రుణ మార్కెట్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. రుణ మార్కెట్ అంటే రుణ పత్రాలతో వ్యాపారం జరిగే ఏదైనా మార్కెట్ స్థలము.
  2. రుణ పత్రాలలో తనఖా, ప్రామిసరీ నోట్స్, బాండ్లు మరియు డిపాజిట్ సర్టిఫికెట్లు ఉన్నాయి.
  3. ఇది వివిధ రకాల స్థిర ఆదాయ ఆర్థిక పత్రాలను జారీ చేస్తుంది మరియు ఆ తరువాత వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది.
  4. రుణ మార్కెట్ ప్రభుత్వ రంగ మరియు ప్రైవేట్ రంగ ప్రాజెక్టులకు ఎక్కువ నిధులను సమకూర్చే మార్గాలను అందిస్తుంది మరియు సంస్థాగత ఫైనాన్సింగ్పై ఒత్తిడిని తగ్గిస్తుంది.
  5. స్థిర రేట్ల రుణ పత్రాలతో అనుసంధానించబడినప్పుడు, మార్కెట్ను స్థిర ఆదాయ మార్కెట్ అని పిలుస్తారు.

ప్రశ్న 12.
ఈక్విటీ మార్కెట్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. ఈక్విటీ మార్కెట్ను “స్టాక్ మార్కెట్” లేదా “షేర్ మార్కెట్” అని కూడా పిలుస్తారు.
  2. ఇది కంపెనీ వాటాలతో వర్తకం చేయడానికి ఒక వేదిక. ఇది లిస్టెడ్ కంపెనీల షేర్లలో వర్తకం చేయడానికి కొనుగోలుదారులు మరియు విక్రేతలు కలిసే ప్రదేశం.
  3. లిస్టెడ్ కంపెనీలు తమ ఈక్విటీలో కొంత భాగాన్ని పబ్లిక్ పెట్టుబడిదారులకు అందిస్తాయి. వీటిని స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో చేర్చబడి ఉండాలి. ‘
  4. స్టాక్ ఎక్స్ఛేంజ్లు సాధారణ ఈక్విటీ షేర్లతో పాటు కార్పొరేట్ బాండ్లు మరియు కన్వర్టిబుల్ బాండ్లవంటి ఇతర సెక్యూరిటీలను జాబితాలో చేర్చుతాయి.
  5. స్టాక్ ఎక్స్ఛేంజ్ యొక్క ఉద్దేశం కొనుగోలుదారులు మరియు అమ్మకం దారుల మధ్య సెక్యూరిటీల మార్పిడిని సులభతరం చేయడం, తద్వారా మార్కెట్ స్థలం వలె పనిచేస్తుంది.
  6. రెండు ప్రధాన భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్లు BSE (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్) మరియు NSE (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్) లిస్టెడ్ సెక్యూరిటీలపై రియల్ టైమ్ ట్రేడింగ్ సమాచారాన్ని అందిస్తాయి, ధరల ఆవిష్కరణకు దోహదపడతాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 13.
ఫారెక్స్ మార్కెట్ అంటే ఏమిటి ?
జవాబు.
1) విదేశీ మారక మార్కెట్ లేదా ‘ఫారెక్స్ మార్కెట్’ అనేది అంతర్జాతీయ నెట్వర్క్ను ఏర్పరిచే వ్యవస్థ. ఇది కొనుగోలుదారులు, అమ్మకందారులకు వివిధ దేశాల కరెన్సీ వాణిజ్యం లేదా మార్పిడిని నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.

2) ఫారెక్స్ వ్యాపారి యొక్క లక్ష్యం ధరలలో ఈ హెచ్చుతగ్గుల నుండి లాభాలను ఆర్జించడం మరియు భవిష్యత్తులో విదేశీ మారక రేట్లు ఏ విధంగా కదలవచ్చో ఊహించడం.

3) ఫారెక్స్ మార్కెట్ బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, సెంట్రల్ బ్యాంకు, పెట్టుబడి నిర్వహణ సంస్థలు, హెడ్జ్ ఫండ్స్ మరియు రిటైల్ ఫారెక్స్ బ్రోకర్లు మరియు పెట్టుబడిదారులతో రూపొందించబడింది.

4) ఫారెక్స్ మార్కెట్ అనేది సంస్థల నెట్ వర్క్ రోజుకు 24 గంటలు, వారానికి ఐదు రోజులు వర్తకం చేయడానికి అనుమతిస్తుంది.

5) ఫారెక్స్ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక మార్కెట్. విదేశీ లావాదేవీలు సాధారణంగా జతగా కోట్ చేయబడతాయి. ఎందుకంటే ఒక కరెన్సీని కొనుగోలు చేసినప్పుడు మరొకటి అమ్ముతారు. మొదటి కరెన్సీ ‘బేస్ కరెన్సీ అని, రెండవ కరెన్సీని ‘కోట్ కరెన్సీ’ అంటారు.

ప్రశ్న 14.
క్లోజ్-ఎండెడ్ ఫండ్స్ అంటే ఏమిటి ?
జవాబు.
1) క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ నిర్ణీత మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా 3-15 సంవత్సరాల కాల వ్యవధిలో ఉంటాయి. ఈ నిధులు నిర్దిష్ట కాలంలో మాత్రమే చందా కోసం తెరవబడతాయి.

2) ప్రారంభ పబ్లిక్ ఇష్యూ సమయంలో పెట్టుబడిదారులు ఈ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు మరియు ఆ తరువాత వారు జాబితా చేయబడిన స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ఈ పథకం యొక్క యూనిట్లను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు.

3) పెట్టుబడిదారులకు నిష్క్రమణ మార్గాన్ని అందించడానికి, కొన్ని క్లోజ్-ఎండెడ్ ఫండ్ NAV సంబంధిత ధరలకు మ్యూచువల్ ఫండ్ పునర్ కొనుగోలు విధానం ద్వారా యూనిట్లను తిరిగి విక్రయించే అవకాశాన్ని ఇస్తాయి.

ప్రశ్న 15.
కన్వర్టబుల్ బాండ్ అంటే ఏమిటి ?
జవాబు.

  1. కన్వర్టిబుల్ బాండ్ అనేది ఒక సాధారణ కార్పొరేట్ బాండ్. ఇది సాధారణ స్టాక్ లోకి నిర్ణీత సంఖ్యలో వాటాలుగా మార్చగల అదనపు లక్షణాన్ని కలిగి ఉంటుంది.
  2. కన్వర్టిబుల్ బాండ్స్ రుణ పత్రాలు. ఎందుకంటే అవి వడ్డీని చెల్లిస్తాయి మరియు స్థిర విమోచన తేదీని కలిగి
    ఉంటాయి.
  3. మార్పిడి నిష్పత్తి జారీ చేసే సమయంలో నిర్ణయించబడుతుంది మరియు సాధారణంగా హెూల్డర్ ఎప్పుడైనా వాటిని వాటాలలోకి మార్చుకోవచ్చు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
విత్త మార్కెట్.
జవాబు.

  1. ద్రవ్యపరమైన ఆస్తులను సృష్టించడానికి, వినిమయం చేయడానికి కావలసిన విత్త వ్యవహారాలు జరిపే మార్కెట్లను విత్త మార్కెట్లు అంటారు.
  2. ఇవి వ్యాపార స్వల్పకాలిక, దీర్ఘకాలిక విత్త అవసరాలను తీర్చడం కోసం పరపతి సాధనాలను, సెక్యూరిటీలను జారీ చేయడంలో ప్రముఖపాత్ర నిర్వహిస్తున్నాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 2.
ద్రవ్య మార్కెట్.
జవాబు.

  1. స్వల్పకాలిక పరపతి సాధనాలతో వర్తకం జరిగే మార్కెట్ను ద్రవ్య మార్కెట్ అంటారు.
  2. ద్రవ్య మార్కెట్ అంటే అధిక ద్రవ్యత్వం కలిగిన, హామీ లేని, తక్కువ నష్టభయం కలిగిన స్వల్పకాలిక పరపతి సాధనాలతో పార్టీల మధ్య వర్తకం జరిగే పరపతి మార్కెట్.

ప్రశ్న 3.
మూలధన మార్కెట్.
జవాబు.

  1. సెక్యూరిటీలను అమ్మడం ద్వారా వ్యాపార సంస్థలకు దీర్ఘకాలిక నిధులను సమకూర్చే మార్కేట్ను మూలధన మార్కెట్ అంటారు.
  2. మూలధన మార్కెట్ (ప్రైవేట్ రంగ ఉత్పత్తి సంస్థలు, ప్రభుత్వం, ప్రత్యేక విత్త సంస్థలు, మదుపరులు పాల్గొంటారు.

ప్రశ్న 4.
సంఘటిత ద్రవ్య మార్కెట్.
జవాబు.
1) సంఘటిత ద్రవ్య మార్కెట్లో పనిచేస్తున్న లేదా కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా గాని, ఇతర నియంత్రణ సంస్థయైన నాబార్డ్ ద్వారా గాని క్రమబద్దీకరించబడతాయి.

2) వాణిజ్య బ్యాంకులు భారతీయ మరియు విదేశీ, పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగానికి చెందినవి సంఘటిత రంగంగా (లేదా వ్యవస్థీకృత రంగంగా) పరిగణించబడుతున్నాయి.. ఈ సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం, వ్యాపార సంస్థలు మరియు వ్యక్తులతో పాటుగా డిమాండు చేయడంలో పాల్గొంటాయి.

3) ద్రవ్య మార్కెట్ పరపతి సాధనాలైన ట్రెజరీ బిల్లులు, వాణిజ్య పత్రాలు, పిలుపు ద్రవ్యం, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, వాణిజ్య బిల్లులతో వ్యవహరిస్తాయి.

ప్రశ్న 5.
అసంఘటిత ద్రవ్య మార్కెట్.
జవాబు.

  1. ద్రవ్య మార్కెట్లోని ఈ విభాగంపై ఎలాంటి ప్రత్యేక అధికార యంత్రాంగం యొక్క క్రమబద్ధీకరణ లేదు
  2. దేశ గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించి అభివృద్ధి చెందినప్పటికీ అసంఘటిత ద్రవ్య మార్కెట్ ఇంకా కొనసాగుతున్నది. ఇందులో దేశీయ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు ఉన్నారు.
  3. దేశీయ బ్యాంకర్లు వర్తక వాణిజ్య అవసరాలకు రుణాలనిస్తే, వడ్డీ వ్యాపారస్తులు వినియోగ అవసరాలకు రుణాలనిస్తున్నారు.

ప్రశ్న 6.
ప్రాథమిక మార్కెట్.
జవాబు.
ప్రాథమిక మార్కెట్ను కొత్త సెక్యూరిటీల మార్కెట్ అని కూడా అంటారు. ఈ మార్కెట్లో సెక్యూరిటీలను జారీ చేసే కంపెనీ కొత్తదైనా, పాతదైనా కావచ్చు.

ప్రశ్న 7.
ద్వితీయ మార్కెట్.
జవాబు.
ద్వితీయ మార్కెట్ను స్టాక్ ఎక్స్ఛేంజ్ అనికూడా వ్యవహరిస్తారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ సెక్యూరిటీలు కొనుగోలు మరియు అమ్మకాలు రెండు జరుగుతాయి.

ప్రశ్న 8.
విత్త మార్కెట్ ధర.
జవాబు.

  1. విత్త సాధనాలు లేదా విత్త సెక్యూరిటీలను మార్కెట్లో వర్తనం చేయడానికి నిర్ణయించిన విలువను విత్త మార్కెట్ ధర అంటారు.
  2. విత్త మార్కెట్ ధర అంటే విత్త సాధనాలకు, మార్కెట్లో లభించిన విలువ.
  3. ప్రాథమిక మార్కెట్లో సెక్యూరిటీల ధరను కంపెనీ నిర్వాహకులు నిర్ణయిస్తారు మరియు ద్వితీయ మార్కెట్లో సెక్యూరిటీల ధర వాటి యొక్క సప్లయ్, డిమాండ్లను బట్టి నిర్ణయించబడుతుంది.

ప్రశ్న 9.
వ్యాపార విత్తం.
జవాబు.

  1. ఒక వ్యాపార సంస్థ తన కార్యకలాపాలు సాగించడానికి అవసరమైన ద్రవ్యసేకరణ, వినియోగం, నియంత్రణకు సంబంధించిన ప్రక్రియను వ్యాపార విత్తం అంటారు.
  2. ప్రతి వ్యాపార సంస్థకు వ్యాపారం ప్రారంభించడానికి, ‘ఆస్తుల కొనుగోలుకు, రోజువారి కార్యకలాపాలకు వ్యాపార – విత్తం ఎంతో ఆవశ్యకం.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 10.
ద్రవ్య మార్కెట్ పత్రాలు.
జవాబు.

  1. ట్రెజరీ బిల్లు
  2. వాణిజ్య పత్రం,
  3. పిలుపు ద్రవ్యం
  4. వాణిజ్య బిల్లులు,
  5. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్.

ప్రశ్న 11.
సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్.
జవాబు.

  1. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ దాని గ్రహీత వడ్డీతో పాటుగా ముఖ విలువ మొత్తాన్ని పొందేందుకు అధికారాన్నిస్తూ వాణిజ్య బ్యాంకులచే జారీ చేయబడ్డ బదిలీ చేయదగిన స్వల్పకాలిక హామీ లేని ప్రామిసరీ నోటు.
  2. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ వ్యక్తులకు, కార్పొరేషన్లకు, కంపెనీలకు, ప్రవాస భారతీయులకు జారీ చేయబడుతుంది.
  3. ఈ సర్టిఫికేట్లు 3 నెలల నుంచి 5 సంవత్సరాల కాల పరిమితితో అందుబాటులో ఉంటాయి.

ప్రశ్న 12.
వాణిజ్య బిల్లు.
జవాబు.
1) వాణిజ్య బిల్లు కొనుగోలు దారుడు బాకీ ఉన్న అరువు అమ్మకాల మొత్తాన్ని ఒక భవిష్యత్తు తేదీ నాడు చెల్లించడం కోసం కొనుగోలుదారుని (బిల్లు స్వీకర్త) ఆమోదానికై అమ్మకందారుని (బిల్లుకర్త) చే రాయబడ్డ అన్యాక్రాంత యోగ్యతా పత్రం.

2) బిల్లు స్వీకర్త స్వీకృతిని తెలియజేయగానే వాణిజ్య బిల్లు ఒక చట్టబద్దమైన పత్రంగా మారి బిల్లు కర్తకు నగదు అవసరమైనప్పుడు బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ప్రశ్న 13.
ట్రెజరీ బిల్లుపై డిస్కౌంట్.
జవాబు.

  1. కేంద్ర ప్రభుత్వం తరపున స్వల్పకాలిక నిధుల అవసరాల కోసం రిజర్వు బ్యాంకు చేత డిస్కౌంట్ కోసం జారీ చేసిన ప్రామిసరీ నోటును ట్రెజరీ బిల్లు అంటారు.
  2. ట్రెజరీ బిల్లులు వాటి ముఖ విలువ కంటే తక్కువ ధరకు జారీ చేయబడి ముఖ విలువతో తిరిగి చెల్లించబడతాయి. . కొనుగోలుధరకు, గడువు తేదీన చెల్లించే మొత్తానికి మధ్య గల వ్యత్యాసాన్ని “ట్రెజరీ బిల్లుపై డిస్కౌంట్” అంటారు.

ప్రశ్న 14.
పిలుపు రేటు.
జవాబు.
1) వాణిజ్య బ్యాంకులు నగదు రిజర్వు నిష్పత్తిగా పిలువబడే కొంత కనీస నగడు నిల్వలను రిజర్వు బ్యాంకు వద్ద పెంచాల్సి ఉంటుంది.

“రిజర్వు బ్యాంక్ నగదు రిజర్వు నిష్పత్తిలో మార్పులు చేసినప్పుడు నిర్దేశించబడిన నిల్వల కంటే తక్కువ నగదు నిల్వ కలిగిన బ్యాంకులు మిగులు నిధులు కలిగిన బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుంటాయి. ఈ సేవకు గాను రుణదాత బ్యాంకుకు చెల్లించే వడ్డీనే “పిలుపు రేటు” అని అంటారు.

ప్రశ్న 15. ఉత్పన్నాలు.
జవాబు.

  1. ఇవి ఆర్థిక ఒప్పందాలు. వీటి విలువ వీటిని పోలిన ఇతర ఆస్తుల విలువపై ఆధారపడి ఉంటుంది.
  2. సాధారణంగా సరిపోల్చడానికి ఇతర ఆస్తులు ఏవనగా స్టాక్స్, బాండ్లు, కరెన్సీలు, వస్తువులు మరియు మార్కెట్ సూచికలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆస్తుల విలువ మారుతూ ఉంటుంది.

ప్రశ్న 16.
ఫార్వార్డ్స్.
జవాబు.

  1. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం.
  2. ముందుగా అంగీకరించిన ధర వద్ద భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీలో సెక్యూరిటీల పరిష్కారం జరుగుతుంది.

ప్రశ్న 17.
ఫ్యూచర్స్.
జవాబు.

  1. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట ధర వద్ద ఒక ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి రెండు పార్టీల మధ్య చేసుకున్న ఒప్పందం.
  2. ఫ్యూచర్స్ కాంట్రాక్టులు ప్రత్యేకమైన ఫార్వర్డ్ కాంట్రాక్టులు. వీటిలో ప్రామాణికమైన మారకపు వర్తక ఒప్పందాలు ఇమిడి ఉంటాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 18.
ఆప్షన్స్ (Options).
జవాబు.

  1. ఆప్షన్స్ రెండు రకాలు – కాల్స్ మరియు పుట్స్.
  2. కాల్స్ కొనుగోలుదారునికి కొనుగోలు చేయడానికి హక్కును ఇస్తాయి. కాని ఇచ్చిన భవిష్యత్ తేదీన లేదా అంతకు ముందు నిర్ధారించిన ధర వద్ద నిర్దిష్ట ఆస్తి యొక్క నిర్దిష్ట పరిమాణాన్ని కొనుగోలు చేయవలసిన బాధ్యత మాత్రం ఏర్పడదు.
  3. పుట్స్ కొనుగోలుదారునికి ఆస్తి కొనుగోలు హక్కును ఇస్తాయి. కాని ఇచ్చిన తేదీలో లేదా నిర్ధారిత ధర వద్ద నిర్దిష్టమైన ఆస్తిని, నిర్దిష్ట పరిమాణాన్ని విక్రయించే బాధ్యత ఏర్పడదు.

ప్రశ్న 19.
స్వాప్స్ (Swaps).
జవాబు.

  1. ముందుగా నిర్ణయించిన సూత్రం ప్రకారం భవిష్యత్తులో నగదు ప్రవాహాన్ని మార్పిడి చేయడానికి రెండు పార్టీల మధ్య కుదిరిన ప్రైవేట్ ఒప్పందాలు స్వాప్లు.
  2. వాటిని ఫార్వర్డ్ కాంట్రాక్టుల ఫోర్ట్ఫోలియోగ పరిగణించవచ్చు.

ప్రశ్న 20.
నిర్మాణాత్మక ఉత్పత్తులు.
జవాబు.

  1. నిర్మాణాత్మక ఉత్పత్తి అనేది సాంప్రదాయ విత్త పత్రాలు మరియు ఉత్పన్నాల కలయికను ఉపయోగించి వ్యక్తీకరించిన పెట్టుబడి పరిష్కారం.
  2. ఈ కలయిక పెట్టుబడిదారులు రిస్క్ స్థాయిని వారికి ఆమోదయోగ్యమైన స్థాయికి సర్దుబాటు చేయడానికి అనుమతిస్తుంది. అదే సమయంలో అంతర్లీన కదలికల నుంచి ప్రయోజనం పొందుతుంది.
    (ఉదా: స్టాక్, మార్పిడి రేటు మొదలైనవి).
  3. ఈ ఉత్పత్తులు సాధారణంగా దీర్ఘకాలిక స్వభావం కలిగి ఉంటాయి. గరిష్ట రాబడిని పొందడానికి కనీసం 1 సంవత్సరం లాక్-ఇన్ కాలం మరియు 2-3 సంవత్సరాల పెట్టుబడి కాలం అవసరం.

ప్రశ్న 21.
మ్యూచువల్ ఫండ్.
జవాబు.

  1. మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడిదారులకు లాభం సంపాదించడానికి అనేకమంది పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి కంపెనీ స్టాక్స్, బాండ్స్, ప్రభుత్వ పత్రాలు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టే సాధనం.
  2. వచ్చిన లాభాన్ని పెట్టుబడిదారులకు డివిడెండ్లుగా చెల్లించవచ్చు లేదా మూలధన పెరుగుదల కోసం ఫండ్ ద్వారా తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రశ్న 22.
ఓపెన్ ఎండెడ్ ఫండ్.
జవాబు.

  1. ఓపెన్-ఎండెడ్ ఫండ్ అంటే నిరంతర ప్రాతిపదికన చందా చేయడానికి మరియు తిరిగి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అంటే ఏడాది పొడవునా లభ్యమౌతుంది.
  2. ఈ ఫండ్కు స్థిర మెచ్యూరిటీ వ్యవధి లేదు.
  3. పెట్టుబడిదారులు నికర ఆస్తి విలువ (NAV) సంబంధిత ధరలతో సౌకర్యవంతంగా యూనిట్లను కొనుగోలు చేయవచ్చు మరియు అమ్మవచ్చు. ఓపెన్-ఎండ్ పథకాల యొక్క ముఖ్య లక్షణం ప్రభుత్వాన్ని కల్పించడం.

ప్రశ్న 23.
గ్రోత్ ఫండ్.
జవాబు.

  1. పెట్టుబడుల విలువ పెరుగుదలను మూలధనం విలువ పెరుగుదల ద్వారా ఉద్దేశించిన నిధులు ఈ రకానికి వస్తాయి.
  2. ఇలాంటి నిధులు వృద్ధి ఆధారిత సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెడతాయి. అంటే, దీర్ఘకాలంలో పెరుగుదల గల కంపెనీల వాటాలలో పెట్టుబడిని చేస్తారు.
  3. గ్రోత్ ఫండ్స్న నెస్ట్ ఎగ్స్ లేదా లాంగ్ హాల్ ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా అంటారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 1 విత్త మార్కెట్లు

ప్రశ్న 24.
పరిశ్రమ నిర్దిష్ట ఫండ్.
జవాబు.

  1. పరిశ్రమ నిర్దిష్ట పథకాలు ప్రతిపాదనలో పేర్కొన్న పరిశ్రమలలో మాత్రమే పెట్టుబడి పెడతాయి.
  2. ఈ నిధుల పెట్టుబడి ఇన్ఫోటెక్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) ఫార్మాస్యూటికల్స్ మొదలైన నిర్దిష్ట పరిశ్రమలకు పరిమితం.

Leave a Comment