Here students can locate TS Inter 1st Year Commerce Notes Chapter 1 Introduction to Business to prepare for their exam.
TS Inter 1st Year Commerce Notes Chapter 1 Introduction to Business
→ Human activities are divided into economic and non-economic activities.
→ Economic activities related to the production and distribution of goods and services.
→ Non-economic activities are those which are undertaken without economic consideration.
→ The activities which involve the production of goods and services with the object of selling them for a profit is called business.
→ Professions are those occupations that involve rendering a personal service of a specialized and expert nature.
→ If a person undertake to work for another under a contract is called employment.
→ Objects of business can be classified as :
a) Economic objectives b) Social objectives c) Human objectives d) National objectives
→ Obligations to owners, employees, suppliers, consumers, government and to society are the social responsibilities of the business.
→ Profit is essential for the survival, growth, expansion and diversification of the business.
TS Inter 1st Year Commerce Notes Chapter 1 వ్యాపార భావన – పరిచయం
→ ప్రతి వ్యక్తి తన కోర్కెలను సంతృప్తిపరుచుకొనడానికి నిరంతరము శ్రమిస్తాడు. ఫలితముగా మానవ కార్యకలాపాలు ఏర్పడతాయి. వీటిని ఆర్థిక కార్యకలాపాలు అని, ఆర్థికేతర కార్యకలాపాలు అని విభజించవచ్చు.
→ ఆర్థిక కార్యకలాపాలు వృత్తి, ఉద్యోగము, వ్యాపారము. సమర్థవంతమైన వ్యక్తిగత సేవలను అందించే పనులను వృత్తులు అంటారు. ఒప్పందము ప్రకారము యజమాని చెప్పిన పనులను నిర్వహించడాన్ని ఉద్యోగము అంటారు. లాభాన్ని సంపాదించే ఉద్దేశముతో వస్తుసేవల ఉత్పత్తి, వినిమయము, పంపిణీలతో ఉండే వ్యాపకాన్ని వ్యాపారము అంటారు.
→ వ్యాపార లక్షణాలలో ప్రయోజనాల కల్పన, వస్తుసేవలతో సంబంధము, పునరావృతము కాకపోవడం, లాభార్జన, నష్టభయం, అనిశ్చిత పరిస్థితి, కళ అనేవి ఉంటాయి.
→ ప్రతి వ్యాపారానికి ఆర్థిక, సామాజిక, మానవ సంబంధిత, జాతీయ ఉంటాయి.
→ ఆర్థిక లక్ష్యాలలో లాభాల సంపాదన, ఖాతాదారుల సృష్టి, నవకల్పన ఉన్నాయి.
→ సామాజిక లక్ష్యాలలో సరైన వస్తువులను సరైన ధరలకు సప్లయి చేయడము, ఉద్యోగులకు చాలినంత ప్రతిఫలం అందజేయడము, సాంఘిక సంక్షేమము, ప్రభుత్వానికి సహకారము, సహజ వనరుల సక్రమ వినియోగము ఉన్నవి.
→ మానవ సంబంధిత లక్ష్యాలలో మానవ వనరుల అభివృద్ధి, ప్రజాస్వామ్య నిర్వహణ, శ్రామిక యజమానుల సహకారము ఉన్నాయి.
→ జాతీయ లక్ష్యాలలో వనరుల గరిష్ఠ వినియోగము, జాతీయ గౌరవం, చిన్నతరహా పరిశ్రమల వృద్ధి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అనేది ఉంటాయి.
→ వ్యాపారము సమాజములో అంతర్భాగము అయినందున లాభార్జనతో పాటు సామాజిక సంక్షేమాన్ని గురించి కూడా వ్యాపార సంస్థలు ఆలోచించాలి. దీనినే సామాజిక బాధ్యత అంటారు. యజమానులకు, ఉద్యోగులకు, సప్లయిదారులకు, ప్రభుత్వానికి, సమాజానికి సంబంధించి వ్యాపార సంస్థలకు వేర్వేరు బాధ్యతలు ఉంటాయి.