TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 5th Lesson శతక సుధ Textbook Questions and Answers.

శతక సుధ TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana

చదువండి – ఆలోచించి చెప్పండి.

యాదగిరీశుని వేడుకొంటూ తిరువాయిపాటి వేంకట కవి రచించిన కింది పద్యాన్ని చదువండి.

వాదము చేయఁగా నరులు వాక్య పరుండని యెగ్గు చేతురున్
మోదముతో భుజించునెడ ముందుగఁ బిల్తురు తిండిపోతుగా,
ఏదియుఁ బల్కకున్నయెడ నీతఁడు మూగని యెంచుచుంద్రుగా,
నీ దయగల్గఁగా సుఖము నేర్పును యాదగిరీంద్ర మ్రొక్కెదన్.

ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఈ పద్యం ఏ శతకం లోనిది ? కవి ఎవరు ?
జవాబు.
ఈ పద్యం శ్రీయాదగిరీంద్ర శతకం లోనిది. కవి తిరువాయిపాటి వేంకటకవి.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

ప్రశ్న 2.
ఈ పద్యాన్ని చదివినప్పుడు మీరేం గ్రహించారు ?
జవాబు.
ప్రజలు ప్రతి విషయానికీ ఎదుటి వారిని విమర్శిస్తూనే ఉంటారు. జనుల మెప్పుపొందడం తేలికకాదు అని ఈ పద్యాన్ని చదివి గ్రహించాను.

ప్రశ్న 3.
కవులు శతక పద్యాలు ఎందుకు రాస్తారు ?
జవాబు.

ప్రశ్న 4.
ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సమాజంలోని మంచి చెడ్డలు తెలియజెప్పడానికి, ప్రజలకు మంచి నడవడి అలవర్చడానికి కవులు శతక పద్యాలు రాస్తారు.
ఈ పద్యంలోని మకుటం ఏమిటి ?
జవాబు.
“యాదగిరీంద్ర” అనేది ఈ పద్యంలోని మకుటం

ప్రశ్న 5.
మీకు తెలిసిన కొన్ని శతకాల మకుటాలను చెప్పండి.
జవాబు.
యాదగిరీంద్ర !
విశ్వదాభిరామ వినురవేమ |
సుమతీ !
దాశరథీ కరుణాపయోనిధీ,
శ్రీ కాళహస్తీశ్వరా !
కుమారా !
కుమారీ !
నరసింహ ! దురిత దూర మొదలైనవి.

ఆలోచించండి- చెప్పండి (TextBook Page No. 47)

ప్రశ్న 1.
కవి ఉద్దేశంలో నిజమైన సుఖం అంటే ఏమిటి ? ‘వివేకధనం’గా కవి వేటిని పేర్కొన్నాడు ?
జవాబు.
పేదలకు సమృద్ధిగా అన్నము, వస్త్రాలు దానం చేయాలి. నీచమైన సుఖాల కోసం అబద్ధాలు మాట్లాడకూడదు. ఇతరులతో తగవులు పెట్టుకోకూడదు. హద్దు మీరి ప్రవర్తించరాదు. అందరితో స్నేహంగా ఉండాలి. ఇవే తెలుసుకోవలసిన విషయాలు. ఇవన్నీ తెలుసుకోవడమే వివేకధనం అని కవి పేర్కొన్నాడు.

ఆలోచించండి- చెప్పండి (TextBook Page No. 48)

ప్రశ్న 1.
ఎట్లాంటి చదువు వ్యర్థమని మీరనుకొంటున్నారు. ఎందుకు ?
జవాబు.

ప్రశ్న 2.
మంచికూర ఎంత కమ్మగా నలభీమ పాకంగా చేసినా అందులో చాలినంత ఉప్పు వేయకపోతే రుచిగా ఉండదు. అలాగే ఎంత గొప్ప చదువులు చదివినా ఆ చదువులోని సారం గ్రహించలేకపోతే అటువంటి చదువు వ్యర్థం అని అనుకుంటున్నాను. సత్సంపదలు అంటే ఏవి ?
జవాబు.
మంచివారితో స్నేహం, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం, మోక్షాన్ని పొందడం – ఇవీ సత్సంపదలు.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

ప్రశ్న 3.
డబ్బు కూడబెట్టి దానధర్మం చేయనివాడిని తేనెటీగతో ఎందుకు పోల్చారు ?
జవాబు. తేనెటీగ పువ్వు పువ్వుకూ తిరిగి తేనెను తెచ్చి పట్టులో దాచి పెడుతుంది. అది తాగదు. చివరికి బాటసారులు ఆ తేనెను పిండుకుంటారు. అలాగే పిసినారి దానధర్మాలు చేయకుండా డబ్బు దాచిపెట్టి తాను అనుభవించకుండా కష్టపడతాడు. చివరికి ఆ దాచిన డబ్బు రాజులపాలో దొంగలపాలో అవుతుంది. అందుచేత దానధర్మం చేయనివాడిని తేనెటీగతో పోల్చారు.

ఆలోచించండి- చెప్పండి (TextBook Page No. 49)

ప్రశ్న 1.
మంచిమార్గంలో నడిచే ఆలోచనలు కలుగకపోవటానికి కారణాలేవి ?
జవాబు.
మానవుడు అంతంలేని కోరికలతో ఇష్టాలను పెంచుకుంటూ కొత్త కొత్త వాటికోసం ఆశపడుతూనే ఉంటాడు. అవి తీర్చుకోడానికి మంచి చెడు తెలుసుకోలేని అమాయకుడై ఉక్కిరిబిక్కిరైపోతూ చెడుదారులలో తిరుగుతుంటాడు. అందుకనే మంచి మార్గంలో నడిచే ఆలోచన చెయ్యడానికి కూడా అతడికి తీరిక దొరకదు.

ప్రశ్న 2.
“చెప్పుట చేయుటేకమై” నడవటమంటే ఏమిటి ?
జవాబు.
మనం ఏమి ఆలోచిస్తున్నామో అదే ఇతరులకు చెప్పాలి. ఇతరులకు మనమేమి చెప్పామో అదే ఆచరించాలి. ఆలోచనచేసే మనస్సు, చెప్పే మాట, చేసే పని ఈ మూడూ ఒకటిగా ఉండాలి. దీనినే త్రికరణ శుద్ధిగా ఉండటం అంటారు. చెప్పుట చేయుట ఏకమై నడవడమంటే ఇదే.

ప్రశ్న 3.
కవి చెప్పిన పుణ్యపు పనులేవి ?
జవాబు.
ఆకలితో, దప్పికతో బాధపడేవారికి కొంచెం అన్నము గాని, కూరగాని, నీరుగాని ఇచ్చి వారి బాధను తీర్చాలి. అలాచేస్తే ఎన్నో పుణ్యాలు చేసినంత ఫలితం లభిస్తుంది. ఇతరులకు మేలు కలిగే పని చేసినందుకు, ప్రియమైన పనిచేసినందుకు దేవుడు మెచ్చుకుంటాడు.

ఇవి చేయండి

విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. పాఠంలోని పద్యాలను రాగ, భావయుక్తంగా చదవండి.

జవాబు.
విద్యార్థి కృత్యం.

2. శతక పద్యాలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతాయి చర్చించండి.

జవాబు.
శతక పద్యాలలో కవులు వారి సమకాలికమైన సమాజంలోని ఆచారాలు, అలవాట్లు, నీతి నియమాలు, కట్టుబాట్లు మొదలైన వాటిని వివరిస్తారు. ఏది మంచి, ఏది చెడు అని తెలియజెప్పడానికి ప్రయత్నిస్తారు. అందుచేత శతక పద్యాలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతాయి అని చెప్పవచ్చు.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. పాఠంలోని పద్యాల ఆధారంగా కింద తెలిపిన పదాలతో వేటిని పోల్చినారో రాయండి.

అ) ఉప్పు : _________________
జవాబు. రసజ్ఞతను

ఆ) వేదాలు : _________________
జవాబు. వివేకధనాన్ని

ఇ) సుడిగుండాలు : _________________
జవాబు. కోరికలను

2. కరీంనగర్ జిల్లా వేములవాడ కవి మామిడిపల్లి సాంబశివశర్మ రాసిన కింది పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించండి.

పరువు లేకున్న జగతి సంబరము లేదు
సంబరము లేక అన్నమే సైపబోదు
అన్నమే లేక యున్న సోయగము సున్న
సోయగము లేక యున్న మెచ్చుదురె జనులు.

అ. అందంగా ఉండాలంటే ఇది అవసరం
ఎ) నగలు
బి) రంగు
సి) అన్నం
డి) వస్త్రాలు
జవాబు.
సి) అన్నం

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

ఆ. పరువు అంటే అర్థం
ఎ) ధనం
బి) గౌరవం
సి) పండుగ
డి) ప్రాణం
జవాబు.
బి) గౌరవం

ఇ. సంతోషంగా లేకపోవడం వల్ల సహించనిది ఏది ?
ఎ) అన్నం
బి) చదువు
సి) ప్రార్థన
డి) భక్తి
జవాబు.
ఎ) అన్నం

ఈ. జనులు మెచ్చుకొనటానికి ఒక కారణం
ఎ) దుర్మార్గం
బి) కోపం
సి) ద్వేషం
డి) సోయగం
జవాబు.
డి) సోయగం

ఉ. ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండవలసినది
ఎ) పరువు
బి) సంబరం
సి) అన్నం
డి) పైవన్నీ
జవాబు.
ఎ) పరువు

III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. “తుచ్ఛ సౌఖ్య సంపాదనకై యబద్ధములఁ బల్కకు, వాదము లాడబోకు” అని భాస్కరకవి ఎందుకు చెప్పి ఉంటాడు?
జవాబు.
ఎవరైనా మంచి ప్రవర్తన గలవారినే ఇష్టపడతారు. అబద్ధాలాడేవారిని, అన్యాయంగా ఒకరి సొమ్ము కాజేసే వారిని సమాజం హర్షించదు. అందరితో తగవులు పెట్టుకొని అబద్ధాలాడి అన్యాయాలు చేసి నీచమైన సుఖాలు పొందవలసిన పనిలేదు. అందువల్ల మంచి మార్గంలో నడిచి పది మందితో మంచి అనిపించుకోవాలని భాస్కర కవి చెప్పాడు.

ఆ. వివేకవంతునికి ఉండవలసిన లక్షణాలేవి ?
జవాబు.
వివేకి అయినవాడు తనకు ఉన్న దానిలో నుండి కొంతైనా అనాథలకు, పేదలకు సాయం చేయాలి. నీచమైన సుఖాల కోసం అబద్ధాలాడకూడదు. అనవసరంగా ఎవరితోనూ వాదనకు దిగకూడదు. అమర్యాదగా ప్రవర్తించ కూడదు. అందరితోనూ స్నేహంగా మెలగాలి. పైన చెప్పిన లక్షణాలన్నింటిని వేదాలుగా భావించాలి. ఇవే వివేకులకు ఉండవలసిన లక్షణాలు.

ఇ. పెంపునదల్లివై …. అనే పద్యంలోని అంతరార్థాన్ని మీరేమని గ్రహించారు ?
జవాబు.
భగవంతుడు సర్వ సమర్థుడు. ఆయన శరణు జొచ్చిన వారి పోషణ, రక్షణ మొదలైన అన్ని బాధ్యతలు ఆయనే చూసుకుంటాడు. మానసిక శారీరకమైన అన్ని జబ్బులను దూరంచేసి తన భక్తులను ఆరోగ్యంగా ఉంచుతాడు. పాపాలంటనీకుండా మంచిదారిలో నడిపిస్తాడు. శాశ్వతమైన మోక్ష పదాన్ని అనుగ్రహిస్తాడు. అని “పెంపున తల్లివై’ అనే పద్యం ద్వారా తెలుస్తుంది.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

ఈ. “కోరికలకు బానిసై ఉక్కిరి బిక్కిరి కావడం కంటె విశిష్టమార్గాన్ని వెతుక్కోవటం మంచిది” దీనిపై మీ అభిప్రాయాన్ని రాయండి.
జవాబు.
కోరికలు మనిషి మనుగడకు ఆటంకాలు. కోరికలు ఒకసారి మొదలైతే ఒకటి తీర్చుకుంటే మరొకటి పుట్టుకొస్తూనే ఉంటుంది. మనిషి ఆ కోరికల సాగరంలో కొట్టుకుపోతూ ఉక్కిరిబిక్కిరై పోతాడు. వాటిని సాధించుకోడానికి అక్రమ మార్గాలు వెతుక్కుంటాడు. అనేక కష్టనష్టాలకు గురి అవుతాడు. అందుకే విశిష్ట మార్గాన్ని వెతుక్కోవటం మంచిది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ. శతక కవులు ఈ విధమైన పద్యాలను ఎందుకు రాసి ఉంటారో కారణాలు రాయండి.
జవాబు.
1. పరిచయం : వేమన, బద్దెన, పోతన, భాస్కర కవి, మారద వెంకయ్య, భక్త రామదాసు, శేషప్పకవి … ఇలా ఎందరో శతక కవులు మన సాహిత్యంలో కనబడతారు.

2. నిశిత పరిశీలన : శతక కవులు తమ కాలంలో తమ చుట్టూ ఉండే పరిసరాలు, సమాజం, మనుషులు, వారి ప్రవర్తన, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు, ధనవంతుల అత్యాచారాలు, పేదవారి అగచాట్లు మొదలైన విషయాలను జాగ్రత్తగా పరిశీలించేవారు. వాటిని గమనిస్తూ వారి మనసుల్లో కలిగే భావాలను పద్యరూపంలో పెట్టి శతకాలుగా రాసి ఉంటారు.

3. సమాజాన్ని సంస్కరించాలనే తహతహ : కొన్ని భక్తి శతకాలు, కొన్ని నీతి శతకాలు మనకు లభిస్తున్నాయి. ఏ శతకమైనా పైన చెప్పిన అంశాలను ప్రజలకు వివరించడం, వాటిలోని మంచిచెడులను గుర్తింపజేయడం, మంచిమార్గంలో నడిచేందుకు స్ఫూర్తినివ్వడం, లక్ష్యంగా పెట్టుకొని శతక కవులు ఈవిధమైన పద్యాలు రాసి ఉండవచ్చు. ప్రజలు మూఢనమ్మకాల్లో కొట్టుకొని పోకుండా ఉండడానికి, సమాజం చెడుమార్గంలో వెళుతూ ఉంటే సరైన మార్గంలో పెట్టడానికి శతకాలు రాసి ఉంటారు.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) పాఠశాలలో పిల్లలకు నిర్వహించే పద్యాల పోటీలో పిల్లలందరు పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటనను రాయండి. (ప్రకటనలో పోటీ నిర్వహణ తేదీ, స్థలం, సమయం మొదలైన వివరాలుండాలి)

ప్రకటన
పద్య పఠనం పోటీలు

ఎస్.ఆర్.ఎమ్. ప్రాథమికోన్నత పాఠశాల వారి ఆధ్వర్యంలో 6, 7, 8 తరగతుల విద్యార్థులకు అంతర పాఠశాలలతో పద్య పఠనం పోటీలు నిర్వహించబడతాయి. పోటీ ఆగష్టు 13వ తేదీన జరుగుతుంది. పోటీలో గెలిచినవారికి ఆగష్టు 15న జరిగే జెండా వందనం ఉత్సవంలో బహుమతులు అందించబడతాయి.

నిబంధనలు :
పద్యాలు రాగయుక్తంగా పాడాలి.
తప్పులు లేకుండా పాడాలి.
స్పష్టమైన ఉచ్చారణతో పాడాలి.
నిర్ణయం న్యాయ నిర్ణేతలదే.

ఆసక్తిగల విద్యార్థులు ఆగష్టు 5వ తేదీ నాటికి తమ పేర్లు నమోదు చేయించుకోగలరు.

వేదిక :
ఎస్.ఆర్.ఎమ్. ప్రాథమికోన్నత పాఠశాల, వరంగల్.
నిర్వహణ తేదీ : XX,XX.XXXX
సమయం ఉదయం 10 గంటల నుంచి

ఇట్లు
కార్యదర్శి,
ఎస్. ఆర్. ఎమ్. పాఠశాల
వరంగల్.

V. పదజాల వినియోగం:

1. కింది వాక్యాలలోని సమానార్ధక పదాలను గుర్తించి, గీత గీయండి.

అ) ఇతరుల దోషాలు ఎంచేవాళ్ళు తమ   తాము తెలుసుకోరు.
జవాబు.
దోషాలు = తప్పులు

ఆ) తేనెతెట్టు నుండి తేనెను సేకరిస్తారు. ఆ మధువు తీయగా ఉంటుంది.
జవాబు.
తేనె = మధువు

2. కింది వాక్యాలలోని గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

ఉదా : సహృదయత గల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది.
జవాబు.
సహృదయత = మంచి మనసు

అ) పూలతో పాటు దండలోని దారం కూడా పరిమళాన్నిస్తుంది.
జవాబు.
పరిమళం = సువాసన

ఆ) సజ్జనుల మైత్రి ఎప్పటికీ సంతోషాన్నిస్తుంది.
జవాబు.
మైత్రి = స్నేహం

3. కింద ఇవ్వబడిన పదాలలో ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 1
జవాబు.

ప్రకృతివికృతి
గుణంగొనం
దోషందోసం
సుఖంసుకం
పుణ్యెంపున్నెం
అగ్నిఅగ్గి
వైద్యుడువెజ్జు
ధర్మందమ్మం

 

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

అ) దశేంద్రియ = _________ + _________ + _________
జవాబు.
దశ + ఇంద్రియ – గుణసంధి

ఆ) లక్షాధికారి = _________ + _________ + _________
జవాబు.
= లక్ష + అధికారి – సవర్ణదీర్ఘ సంధి

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

ఇ) పట్టెడన్నము = _________ + _________ + _________
జవాబు.
= పట్టెడు + అన్నము – ఉత్వ సంధి

ఈ) రాతికంటు = _________ + _________ + _________
జవాబు.
= రాతికి + అంటు – ఇత్వ సంధి

ఉ) చాలకున్న = _________ + _________ + _________
జవాబు.
చాలక + ఉన్న – అత్వసంధి

2. కింది విగ్రహవాక్యాలకు సమాసపదాలు రాసి, సమాసం పేరు రాయండి.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 2
జవాబు.
సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు
అ) ఆకలిదప్పులు – ఆకలియు, దప్పియు – ద్వంద్వ సమాసం
ఆ) అన్నవస్త్రాలు – అన్నము, వస్త్రము – ద్వంద్వ సమాసం
ఇ) దశేంద్రియాలు – దశ సంఖ్య గల ఇంద్రియములు – ద్విగు సమాసం
ఈ) నాలుగు వేదాలు – నాలుగైన వేదాలు – ద్విగు సమాసం

ఛందస్సు – లఘువు, గురువు

కింది వానిని చదివి తెలుసుకోండి.

పద్యాలలో, గేయాలలో ఉండే మాత్రలు, గురు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేది ఛందస్సు.

అ) “లఘువు” – ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. దీనిని ‘ల’ అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు “” (నిలువుగీత). లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 3

ఆ) “గురువు” – రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేది. దీనిని ‘గ’ అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు “U”. గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 4

3. కింది పదాలకు గురులఘువులు గుర్తించండి.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 5
జవాబు.
TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 6

గణాలు

గణం అంటే మాత్రల అక్షరాల సముదాయం. అంటే గురు లఘువుల సమూహం. ఈ గణాలలో ఏక అక్షర (ఒకే అక్షరం) గణాలు, రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు ఉంటాయి.

1. ఏక (ఒకే) అక్షర గణాలు. ఆ ఒకే అక్షరం లఘువు అయితే ” అనీ, గురువు అయితే ‘U’ అనీ గుర్తు ఉంటుంది.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 7

2. రెండు అక్షరాల గణాలు.
TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 8

3. మూడు అక్షరాల గణాలు.
TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 9

కింది పద్య పాదాలకు గురులఘువులను గుర్తించి గణ విభజన చేసిన తీరు చూడండి.
TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 10

4. కింద పద్య పాదాలకు గురులఘువులను గుర్తించి గణ విభజన చేయండి.

అ) బీదల కన్న వస్త్రములు పేర్మినొసంగుము తుచ్ఛ సౌఖ్యసం
జవాబు.
TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 11
సూచన : ఇందులో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉన్నాయి. అందువల్ల ఇది ఉత్పలమాల పద్యపాదము –

ఆ) పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా
జవాబు.
TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 12
సూచన : ఇందులో న, జ, భ, జ, జ, జ, ర ‘అనే గణాలు ఉన్నాయి. అందువల్ల ఇది చంపకమాల పద్య పాదం. ‘పొ’ కి, ‘పు’ కి యతి స్థానం.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

కింది తరగతుల్లో ఇచ్చిన శతక పద్యాల ఆధారంగా ఆ శతకాల పేర్లు, వాటిని రాసిన కవుల పేర్లు సేకరించి, పట్టిక తయారుచేసి, నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 13
జవాబు.

శతకం పేరుకవి పేరు
1. వేమన శతకంవేమన
2. సుమతీ శతకంబద్దెన
3. శ్రీకాళహస్తీశ్వర శతకంధూర్జటి
4. వృషాధిప శతకముపాల్కురికి సోమన
5. దాశరథీ శతకంకంచర్ల గోపన్న
6. సుభాషిత త్రిశతిఏనుగు లక్ష్మణకవి
7. భాస్కర శతకంమారద వెంకయ్య
8. నారాయణ శతకంపోతన
9. కుమార శతకముపక్కి అప్పల నర్సయ్య
10. చిత్తశతకంశ్రీపతి భాస్కరకవి
11. కాళికాంబ శతకంశ్రీ పోతులూరి వీరబ్రహ్మం
12. తెలుగుబాలజంధ్యాల పాపయ్యశాస్త్రి

 

ఇ) ముగింపు :
జంధ్యాల పాపయ్యశాస్త్రి
ఈ విధంగా వివిధ పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా నేను వివిధ శతక కర్తలు, వారి పద్యాల గొప్పదనం తెలుసుకొన్నాను. అంత పురాతన కాలంలో, సాంఘిక రుగ్మతలు రూపు మాపటానికి కలాన్ని ఎన్నుకొని కృషి చేసిన ఆ మహనీయులు ఎంతో అభినందనీయులు.
TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 14

TS 8th Class Telugu 5th Lesson Important Questions శతక సుధ

ప్రశ్న 1.
అంతరార్థం తెలుసుకోని చదువు వృథా అనడానికి భాస్కర శతక కర్త ఏ ఉదాహరణ చెప్పారు ?
జవాబు.
భాస్కరా! ఎంత చదువు చదివినా, అందులోని అంతరార్థాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. అటువంటి చదువును ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు. ఎంత బాగా వంటచేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా! అని భాస్కర శతక కర్త అన్నాడు.

ప్రశ్న 2.
“ఇతరులు గౌరవించనంత మాత్రాన తాను చేస్తున్న మంచి పనిని, వృత్తిని తక్కువగా అనుకోనక్కర్లేదు”. ఉదాహరణలతో రామసింహకవి ఎట్లా సమర్థించాడు ?
జవాబు.
మొగిలిపువ్వు మూలాలు బురదలో ఉన్నంత మాత్రాన దాని ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు. పశువుల దోషాలేవీ పాలకు అంటుకోవు. ఇచ్చే మందులకు వైద్యుని కులంతో సంబంధమేమి ఉండదు. కప్పల దోషాలవల్ల ముత్యాల వన్నె కొంచెం కూడా తగ్గదు. ఎద్దు స్వరూపం ఎట్లున్నా వ్యవసాయానికి ఇబ్బంది రాదు. మనిషిని వెలివేసినా, అతని విద్యకు లోటేమిరాదు. అపవిత్రత వలన కలిగే దోషాలతో అగ్నిదేవునికి సంబంధం లేదు. చందనం మలినమైనంత మాత్రాన సువాసనలు ఎక్కడికీపోవు. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెం కూడా తగ్గదు. ఇతరులు గౌరవించనంత మాత్రాన అతని వృత్తి ఘనతకు ఏ భంగమూ కలుగదు అని పండిత రామసింహకవి చెప్పాడు.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

ప్రశ్న 3.
శతక పద్యాలలోని విలువలు విద్యార్థులను తీర్చి దిద్దుతాయి” ఎట్లాగో వివరించండి.
(లేదా)
శతక పద్యాలలో ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నారు కదా! వాటిని విద్యార్థులు తెలుసుకోవటం వల్ల భవిష్యత్తులో సమాజం చాలా బాగుంటుంది. ఎట్లాగో వివరించండి.
(లేదా)
“శతక సుధ” పాఠం ద్వారా మీరు తెలుసుకున్న మంచి విషయాలు ఏమిటి?
(లేదా)
సమాజం యొక్క మేలుకోసం శతక పద్యాలు ఏ విధంగా తోడ్పడుతాయి?
జవాబు.
సమాజహితాన్ని కోరి శతక కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెల్పుతూ, మానవుడిలో నైతిక, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు. సమాజంలోని ఆచారాలు, నీతిని వివరించుటే లక్ష్యంగా నీతి, భక్తి శతకాలను రచించారు. సమాజహితమే వీరి లక్ష్యం. సత్యం, దయ, శాంతం, భక్తి, ధ్యానం, మంచి మనసు, ధర్మం, ధైర్యం లాంటి గుణాలు నాకు ఇచ్చి నీ భక్తుడుగా ఉండే సుఖం ఇవ్వమని భక్తుల లక్షణాలు తెలిపారు.

పేదవారికి దానం, నీచ సుఖాలకి అబద్ధాలాడకుండుట, వాదనకు దిగకుండుట, హద్దు మీరి ప్రవర్తించకుండా సఖ్యంగా ఉండటం వివేకుల ధనం అని తెల్పారు. శాశ్వత సంపదలు ఇచ్చేది భగవంతుడు. దానం చేయకుండా దాస్తే పోయేముందు తీసుకెళ్ళడు. చివరికి బాటసారుల పాలౌతుంది. ఇతరులు గౌరవించనంతమాత్రాన వృత్తి ఘనతకు భంగం కలుగదు. భగవంతుని భక్తులను సేవించుట భగవంతుని సేవయే అని, మంచిదారిలో నడిచే ఆలోచన కల్గించేది భగవంతుడే అని తెలియచేశారు.

శతక పద్యాలలో ఇటువంటి ఎన్నో మంచి విషయాలు విద్యార్థులు తెలుసుకోవటం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో మంచివారుగా ఉండటమే కాకుండా సమాజాభివృద్ధికి తోడ్పడగలరు. ఇట్లాంటి మంచి నీతులు తెల్పే శతక పద్యాలు విద్యార్థులు చదవటం ఎంతో అవసరం. ఈ నీతులు విద్యార్థులను మంచివారుగా తీర్చి దిద్దుతాయనుటలో అతిశయోక్తి లేదు.

ప్రశ్న 4.
“చెడ్డ వారితో ఉన్నంత మాత్రాన వారి దోషాలు మంచివారికి అంటుకోవు” శతక సుధ పాఠం ఆధారంగా వివరించండి.
జవాబు.

  1. మొగలి పువ్వు మూలాలు బురదలో ఉన్నా పువ్వు ప్రాధాన్యత తగ్గదు.
  2. పశువుల దోషాలు పాలకు అంటుకోవు.
  3. వైద్యుడిచ్చే మందులకు అతని కులంతో సంబంధమేమీ ఉండదు.
  4. కప్పల దోషాల వల్ల ముత్యాల వన్నె తగ్గదు.
  5. ఎద్దుల స్వరూపం ఎట్లా ఉన్నా వ్యవసాయానికి ఇబ్బంది రాదు.
  6. మనిషిని వెలివేసినా అతని విద్యకు లోటురాదు.
  7. అపవిత్ర దోషాలు అగ్నికి అంటవు.
  8. చందనం మలినమైనంత మాత్రాన దాని సువాసనలు ఎక్కడికీపోవు.
  9. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెంకూడా తగ్గదు.
  10. ఇతరులు గౌరవించనంత మాత్రాన వృత్తి ఘనతకు ఏ భంగం కలుగదు.

దీనిని బట్టి చెడ్డవారితో ఉన్నంతమాత్రాన వారి దోషాలు మంచివారికి అంటుకోవని చెప్పవచ్చు.

ప్రశ్న 5.
శతక సుధ పాఠంలో నీవు చదివిన పద్యాల్లో నీకు బాగా నచ్చిన వాక్యం గురించి మీ చెల్లికి లేఖ రాయండి.

ది. XX.XX.XXXX,
ఖమ్మం.

ప్రియమైన చెల్లి దేవికకు!

నీవు బాగా చదువుకుంటున్నావని తలుస్తాను. నేనిక్కడ హాస్టల్లో బాగానే చదువుకుంటున్నాను. ఈమధ్యే మా తెలుగు మాస్టారు ‘శతక సుధ’ పాఠం చెప్పారు. అందులో ఎన్నో చక్కని విషయాలు చెప్పారు. అందులోని ప్రతి పద్యమూ మన జీవితాలకు ఉపయోగపడేదే.

అందులో పండిత రామసింహకవి రాసిన విశ్వకర్మ శతకం నుండి ‘మొదట కర్దమముంటే మొగలి పుష్పముకేమి’ అనే పద్యం నాకు బాగా నచ్చింది.

బురద ఉన్నా మొగలిపువ్వు వాసన తగ్గదు. అపవిత్ర దోషాలతో అగ్నిదేవునికి వచ్చిన చిక్కులేదు. ఇలా ఎన్నో ఉదాహరణలతో మనం చేసే మంచి పనిని ఒకరు గుర్తించకపోయినా నష్టం లేదు అని చెప్పారు. ఒకరి మెప్పుకోసం కాక మన పనిని మనం ఇష్టంతో చేయాలని దీనర్థం.

నీవు కూడా నీ పుస్తకంలోని శతక పద్యాలు చదువు. నీకిష్టమైన పద్యం గూర్చి రాయి. అమ్మనీ, నాన్ననీ అడిగానని చెప్పు.

నీ అక్క
కె. రాజ్యలక్ష్మి

చిరునామా :
కొప్పురావూరి దేవిక
C/o. రమేష్
పుణ్యపురం
వైరా మండలం
ఖమ్మం జిల్లా

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

పర్యాయపదాలు:

  • కృప = దయ, కరుణ
  • చిత్తము = మతి, మనస్సు
  • కరము = మిక్కిలి, అధికము
  • మా = రమ, లక్ష్మీదేవి
  • తుచ్ఛము = నీచము, అల్పము
  • ఉప్పు = లవణం, రుచి
  • మెయి = మేను, శరీరం
  • విత్తము = ధనము, డబ్బు
  • పుష్పము = పూవు, కుసుమము
  • పరిమళము = సుగంధము, సువాసన
  • కలుషము = దోషము, పాపము

నానార్థాలు:

  • కరము = మిక్కిలి, చేయి, ఏనుగుతొండం, పన్ను
  • మర్యాద = గౌరవము, హద్దు
  • పెంపు =అభివృద్ధి, పెద్దచేయుట
  • కృషి = వ్యవసాయము, కష్టము

ప్రకృతులు – వికృతులు:

  • మర్యాద – మరియాద
  • శుద్ధి – సుద్ది
  • స్థిరము – తిరము
  • భృంగారము – బంగారము
  • కులము – కొలము
  • విద్య – విద్దె

వ్యుత్పత్త్యర్థాలు:

  • ఆంజనేయుడు = అంజనీదేవి కుమారుడు (హనుమంతుడు)
  • దాశరథి = దశరథుని యొక్క కుమారుడు (శ్రీరాముడు)
  • పయోనిధి = నీటికి నిలయమైనది (సముద్రము)
  • భాస్కరుడు = వెలుగునిచ్చు కిరణములు కలవాడు (సూర్యుడు)

సంధులు:

  • సతతాచారము = సతత + ఆచారము
  • లక్షాధికారి = లక్ష + అధికారి
  • సాధు జనానురంజన = సాధుజన + అనురంజన = సవర్ణదీర్ఘసంధి
    సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.
  • ప్రేమటంచు = ప్రేమము + అటంచు = ఉత్వ సంధి
  • వెజ్జువై = వెజ్జువు + ఐ = ఉత్వ సంధి
  • సంపదలీయ = సంపదలు + ఈయ = ఉత్వ సంధి
  • తేడెవ్వడు = తేడు + ఎవ్వడు = ఉత్వ సంధి
  • విత్తమార్జన = విత్తము + ఆర్జన = ఉత్వ సంధి
  • లవణమన్నము = లవణము + అన్నము
  • మరుగైన = మరుగు + అయిన = ఉత్వ సంధి
  • కర్దమముంటే = కర్దమము + ఉంటే = ఉత్వ సంధి
  • ఎట్లున్న = ఎట్లు + ఉన్న = ఉత్వ సంధి
    సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
  • కాకుండ = కాక + ఉండ = అత్వ సంధి
  • నేర్చునటయ్యా = నేర్చునట + అయ్యా = అత్వ సంధి
  • ఒందకుండ = ఒందక + ఉండ = అత్వ సంధి
    సూత్రం : అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
  • తల్లివై = తల్లివి + ఐ = ఇత్వ సంధి
  • జుంటీగ = జుంటి + ఈగ = ఇత్వ సంధి
  • రాతికంటు = రాతికి + అంటు = ఇత్వ సంధి
  • ఇట్టివౌ = ఇట్టివి + ఔ = ఇత్వ సంధి
    సూత్రం : ఏమి మొదలైన పదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది.

పద్యాలు – ప్రతిపదార్థాలు – తాత్పర్యాలు

1. మ॥ సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్
నతి శాంతత్వము చిత్తశుద్ధి కరమున్నధ్యాత్మయున్ ధ్యానమున్
ధృతియున్ ధర్మము సర్వజీవ హితముం దూరంబు గాకుండ స
మ్మతికిం జేరువ మీ నివాస సుఖమున్ మానాథ నారాయణా !

ప్రతిపదార్థం:

మానాథా = లక్ష్మీదేవికి భర్త అయిన వాడా
నారాయణా = ఓ విష్ణుమూర్తీ!
సతత = ఎల్లప్పుడు
ఆచారము = పెద్దలు చెప్పినట్లు నడుచుకోవడం
సూనృతంబు = మంచి మాట
కృపయున్ = దయ
సత్యంబునున్ = నిజము మాట్లాడుట
శీలమున్ = మంచి స్వభావము
నతి = వినయంగా ఉండటము
శాంతత్వము = ఓర్పుతో ఉండటము
చిత్తశుద్ధి కరమున్ = మనస్సు నిర్మలంగా ఉండటము
అధి+ఆత్మయున్ ధ్యానమున్
ధ్యానమున్ = స్మరణ
ధృతియున్ = ఇంద్రియ నిగ్రహము
ధర్మము = ధర్మ ప్రవర్తనము
మిక్కిలిగా దేవుని మీద భక్తి
సర్వజీవ = ప్రాణులన్నింటికి
హితమున్ దూరంబు = మేలు కోరుట
గాకుండా = ఇవేవి వదిలి పెట్టకుండా
మీ చేరువన్ = మీ సమీపంలో
సమ్మతికిన్ = మీకిష్టమగునట్లుగా
నివాస = నివసించుట అనే
సుఖమున్ = సౌఖ్యమును (ప్రసాదించుము)

తాత్పర్యం :
లక్ష్మీదేవి భర్త అయిన ఓ నారాయణుడా! ప్రియవచనం, దయ, సత్యం, మంచి స్వభావం, మిక్కిలి శాంతం, నిర్మలమైన మనస్సు, భగవద్భక్తి, ధ్యానం, ధైర్యం, ధర్మాలను సదా ఆచరిస్తూ, సర్వప్రాణుల మేలు కోరేవాడిగా, మీ సన్నిధిలో మీ కిష్టమైన వాడిగా ఉండే సుఖాన్ని దయచేయి (ఇవ్వుమని అర్థం)

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

2. ఉ॥ బీదల కన్నవస్త్రములు పేర్మి నొసంగుము, తుచ్ఛ సౌఖ్యసం
పాదనకై యబద్ధములఁ బల్కకు, వాదము లాడబోకు, మ
ర్యాద నతిక్రమింపకు, పరస్పరమైత్రి మెలంగు, మిట్టి వౌ
వేదములంచెరుంగుము, వివేకధనంబిది నమ్ము, చిత్తమా!

ప్రతిపదార్థం:

చిత్తము + ఆ = ఓ మనసా !
బీదలకున్ = పేదవారికి
అన్న వస్త్రములు = కూడును, గుడ్డయు (గ్రాసవాసములు)
పేర్మిన్ = ప్రేమతో, అధికముగా
ఒసంగుము = ఇమ్ము, దానము చేయుము
తుచ్ఛ = నీచమైన, అల్పమైన
సౌఖ్య = సుఖముల యొక్క
సంపాదనకున్ + ఐ = గడనకై, ఆర్జనమునకై
అబద్ధములన్ = అసత్యములను, కల్లలను
పల్కకు = మాటలాడకుము, చెప్పకుము
వాదములు = వాగ్వాదములు, తగవులు
ఆడ = చేయుటకు, నడపుటకు
పోకు = వెళ్ళకుము
మర్యాదన్ = నీతి పద్ధతిని, హద్దును
అతిక్రమింపకు = మీఱకుము
పరస్పర = అన్యోన్యమైన
మైత్రిన్ = స్నేహముతో
మెలంగుము = నడచుకొనుము
వేదములు = ఆగమములు
ఇట్టి+అవి+ఔన్ = ఇటువంటివే యగును
అంచున్ = అని
ఎరుంగుము = తెలిసికొనుము
ఇది = ఇద్ది (ఈ పద్ధతి, ఈ గుణము)
వివేక = మంచి చెడులను తెలిసికొను తెలివి కలవారి యొక్క
ధనంబు = సంపద
నమ్ము = విశ్వసింపుము

తాత్పర్యం :
ఓ చిత్తమా! పేదవారికి అన్నదానం, వస్త్రదానం అధికంగా చేయి. నీచమైన సుఖాలకోసం అబద్ధాలాడకు. అనవసరంగా ఎవరితోను వాదనకు దిగకు. హద్దుమీరి ప్రవర్తించకు. అందరితో సఖ్యంగా ఉండు. ఈ సూత్రాలనే వేదాలుగా భావించు. వివేకులకు ఈ లక్షణాలే సంపదగా భాసిల్లుతాయి.

3. చ|| చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా!

ప్రతిపదార్థం:

భాస్కరా ! = ఓ సూర్యదేవా !
చదువు + అది = విద్య అనునది
ఎంత = ఏ కొలది
కల్గినన్ = ఉన్నప్పటికిని
ఇంచుక = కొంచెము
రసజ్ఞత = రసికత
చాలక + ఉన్నన్ = సరిపడక పోయినచో
ఆ చదువు = ఆ గొప్ప చదువు
నిరర్థకంబు = ప్రయోజనం లేనిది (అవుతుంది)
గుణసంయుతులు = సుగుణములతో కూడినవారు (సుగుణవంతులు)
ఎవ్వరున్ = ఎవరైనను
ఎచ్చటన్ = ఎక్కడ కూడా
మెచ్చరు = మెచ్చుకోరు
పదనుగన్ = అన్నీ కుదిరేటట్లు చక్కగా
మంచి కూరన్ = మంచికూరను, ఇష్టమైన కూరను
నలపాకము = నలమహారాజు వంటవలె
చేసినన్ + ఐనన్ = వండినప్పటికిని
అందున్ = ఆ కూరలో
ఇంపు + ఒదవెడు = ఇష్టమును కలిగించే (రుచిని కలిగించే)
ఉప్పులేక = ఉప్పు లేకపోయినచో
రుచి = రుచి
పుట్టగన్ + నేర్చున్ ఆట + అయ్య = కలుగుతుందా ? (కలుగదని భావం)

తాత్పర్యం :
భాస్కరా! ఎంత చదువు చదివినా, అందులోని అంతరార్థాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. అటువంటి చదువును ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు. ఎంత బాగా వంటచేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా!

4. ఉ॥ పెంపునదల్లివై, కలుషబృంద సమాగమ మొందకుండ ర
క్షింపను దండ్రివై, మెయి వసించు దశేంద్రియ రోగముల్ నిపా
రింపను వెజ్జువై, కృపగుఱించి పరంబు దిరంబుగాగ స
త్సంపద లీయ నీవెగతి దాశరథీ! కరుణా పయోనిధీ!

ప్రతిపదార్థం:

దాశరథీ! = దశరథుని కుమారుడవైన శ్రీరామా!
కరుణా = దయకు
పయోనిధీ = సముద్రం వంటి వాడా
పెంపునన్ = పిల్లలను పెంచడంలో
తల్లివి + ఐ = తల్లి వంటి దానివై
కలుషబృంద = పాపాల సమూహంతో
సమాగమము = కలయిక
ఒందకుండా = కలుగకుండా
రక్షింపను = కాపాడే విషయంలో
తండ్రివి + ఐ = తండ్రి వంటి వాడవై
మెయి = శరీరంలో
వసించు = ఉన్న
దశ + ఇంద్రియ = పది ఇంద్రియములకు సంబంధించిన
రోగముల్ = జబ్బులను
నివారింపను = తొలగించుటకు
వెజ్జువు + ఐ = వైద్యుని వంటి వాడివై
కృప గురించి = దయతో
పరంబు = మోక్షము
తిరంబు + కాగ = శాశ్వతమగునట్లుగా
సత్ సంపదలు = సత్యమైన మోక్ష సంపదలు
ఈయన్ = ఇచ్చుట
నీవు + ఎ = నీవు మాత్రమే
గతి = ఆధారము

తాత్పర్యం :
దయా సముద్రుడవైన రామా! పెంపకంలో తల్లివి. చెడుదారిన నడువకుండా కాపాడే తండ్రివి. ఇంద్రియ (జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ) రోగాలను తొలగించే వైద్యుడివి. మోక్షం స్థిరమయ్యేటట్లుగా దయతో మేలైన సంపదలు ఇవ్వడానికి నీవే దిక్కు.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

5. సీ॥ తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగఁబోడు
విత్తమార్జన చేసి విఱ్ఱవీగుటె కాని,
కూడఁ బెట్టిన సొమ్ముఁ గుడువఁ బోడు
పొందుగా మఱుగైన భూమిలోపల పెట్టి
దానధర్మము లేక దాచి దాచి

తే॥ తుదకు దొంగల కిత్తురో ? దొరలకవునొ ?
తేనె జుంటీగలియ్యవా తెరువరులకు
భూషణ వికాస ! శ్రీ ధర్మపుర నివాస
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ప్రతిపదార్థం:

భూషణ వికాస! = ఆభరణములతో ప్రకాశించువాడా!
శ్రీ ధర్మ పుర నివాసా = ధర్మపురంలో నివసించే స్వామీ
దుష్ట సంహార! = దుర్మార్గులను సంహరించేవాడా
దురితదూర! = పాపములను పోగొట్టే వాడా
నరసింహ = నరసింహ స్వామీ
ఎవ్వడు = ఎవరూ కూడా
తల్లి గర్భము నుండి = తల్లి కడుపు నుండి పుట్టేటప్పుడు
ధనము తేడు = డబ్బు తీసుకురాడు
వెళ్ళి పోయెడినాడు. = మరణించే సమయంలో
వెంటరాదు = తనతో పాటు రాదు
లక్ష అధికారి + ఐన = లక్షలకు అధిపతి అయినప్పటికీ
లవణము + అన్నము + ఎ = ఉప్పు అన్నము తప్ప
మెరుగు = మెరిసిపోయె
బంగారము = బంగారాన్ని
మ్రింగన్ + పోడు = తినలేడు
విత్తము = డబ్బు
ఆర్జన చేసి = సంపాదించి
విర్రవీగుట + ఎ + కాని = అహంకరించడమే తప్ప
కూడన్ + పెట్టిన = పోగు చేసిన
సొమ్మున్ = సంపదను
కుడువన్ + పోడు = అనుభవించబోడు
పొందుగా = చక్కగా
మరుగు + ఐన = రహస్యంగా ఉన్న
భూమిలోపల = భూమిలో
పెట్టి = పాతిపెట్టి
దాన ధర్మము లేక = దానము ధర్మము లేకుండా
దాచి దాచి = ఎంతో కాలం దాచిపెట్టి
తుదకు = చివరికి
దొంగలకు + ఇత్తురో? = దొంగల పాలు చేస్తారో ?
దొరలకు + అవునో? = రాజుల పాలవుతుందో ?
తేనెజుంటి + ఈగలు = తేనెటీగలు
తెరువరులకు = బాటసారులకు
తేనె = తేనెను
ఇయ్యవు + ఆ = ఇవ్వడం లేదా

తాత్పర్యం :
శ్రీ ధర్మపురి నివాసుడా! ఆభరణాలచేత ప్రకాశించేవాడా! పాపాలను దూరం చేసేవాడా! దుర్మార్గులను పారదోలేవాడా! ఓ నరసింహా! తల్లి కడుపులో నుంచి పుట్టినప్పుడు ఎవ్వడూ ధనాన్ని వెంట తీసుకొనిరాడు. పోయేటప్పుడు వెంటతీసుకొని వెళ్ళలేడు. లక్షాధికారైనా ఉప్పుతో కూడిన ఆహారాన్నే కాని బంగారాన్ని తినలేడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోడమే కానీ, తాను కూడబెట్టిన సొమ్మును తినడు. అలాంటిదాన్ని దానం, ధర్మం చేయకుండా భూమిలో పాతిపెడుతూ ఉంటాడు. తేనెటీగలు తేనెను బాటసారులకు సమర్పించుకొన్నట్టు ఆ సొమ్మును అనుభవించకుండానే చివరకు దొంగలపాలో, రాజులపాలో చేస్తాడు.

6. సీ॥ మొదట కర్దమముంటె మొగిలిపుష్పముకేమి ?
పశువుల దోషముల్ పాలకేమి ?
అరయ వైద్యుని కులం బౌషధంబునకేమి ?
కప్పదోషము మౌక్తికములకేమి ?
వృషభంబు లెట్లున్న కృషికర్మమునకేమి ?
వెలియైన వాని సద్విద్యకేమి ?
అపవిత్ర దోషంబు లగ్నిహెూత్రునకేమి ?
గుణదోషములవల్ల కులముకేమి ?
మలినమై చందనము పరిమళము జెడున
రాతికంటు గుడము మధురంబు జెడున
వినయములు జెడ మావృత్తి ఘనత జెడున
విశ్వ పాలన ధర్మ ! శ్రీ విశ్వ కర్మ!

ప్రతిపదార్థం:

విశ్వపాలన ధర్మ! = ప్రపంచాన్ని రక్షించుటయే ధర్మముగా కలవాడా!
శ్రీవిశ్వకర్మ! = ప్రపంచాన్ని సృష్టించిన వాడా!
మొదట = వేళ్ళ దగ్గర
కర్దమము + ఉంటే = బురద ఉంటే
మొగిలిపుష్పముకు + ఏమి = మొగలిపువ్వు తప్పేమిటి
పశువుల దోషముల్ = జంతువులు తప్పులు
పాలకు + ఏమి = పాలకెందుకుంటాయి
అరయ = ఆలోచించినట్లయితే
వైద్యుని కులంబు = వైద్యుని యొక్క కులముతో
ఔషధంబునకు = మందుకు
ఏమి = పనేముంది
కప్పదోషము = కప్పల వలన దోషం జరిగితే
మౌక్తికములకు + ఏమి = ముత్యాల గొప్పదనం తగ్గుతుందా ?
కృషి కర్మమునకు = వ్యవసాయమునకు
వృషభంబులు = ఎద్దులు
ఎట్లు + ఉన్నన్ +ఏమి = ఎలా ఉంటే ఏమిటి ?
వెలి + ఐన = సమాజమునకుదూరమైనప్పటికీ
వాని = అతడి
సత్ + విద్యకు +ఏమి= విద్యాభ్యాసానికి అడ్డేమిటి
అగ్నిహోత్రునకు = అగ్నిదేవునకు
అపవిత్రదోషంబులు + ఏమి = పాపమెందుకు అంటుతుంది
కులముకు = వంశానికి
గుణ దోషముల వల్ల ఏమి = పాపపుణ్యాలతో సంబంధం ఏముంది ?
మలినమై చందనము = మురికి పట్టినంత మాత్రాన
పరిమళము = గంధము యొక్క సువాసన
చెడును + అ = చెడిపోతుందా ?
రాతికి + అంటు = గుండ్రాయికి అంటుకున్న
గుడము = బెల్లము యొక్క
మధురంబు = తియ్యదనము
చెడును + అ = తగ్గిపోతుందా ?
వినయములు చెడన్ = గౌరవము లోపించినంత మాత్రాన
మా వృత్తి = మా పని యొక్క
ఘనత = గొప్పదనము
చెడును + అ = పాడైపోతుందా ?

తాత్పర్యం :
శ్రీ విశ్వకర్మా! విశ్వాన్ని ధర్మబద్ధంగా పరిపాలించేవాడా! మొగిలిపువ్వు మూలాలు బురదలో ఉన్నంత మాత్రాన దాని ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు. పశువుల దోషాలేవి పాలకు అంటుకోవు. ఇచ్చే మందులకు వైద్యుని కులంతో సంబంధమేమి ఉండదు. కప్పల దోషాలవల్ల ముత్యాల వన్నె కొంచెం కూడా తగ్గదు. ఎద్దుల స్వరూపం ఎట్లున్నా వ్యవసాయానికి ఇబ్బందిరాదు. మనిషిని వెలివేసినా, అతని విద్యకు లోటేమిరాదు. అపవిత్రత వలన కలిగే దోషాలతో అగ్నిదేవునికి సంబంధం లేదు. చందనం మలినమైనంత మాత్రాన సువాసనలు ఎక్కడికిపోవు. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెం కూడా తగ్గదు. ఇతరులు గౌరవించనంత మాత్రాన అతని వృత్తి ఘనతకు ఏ భంగమూ కలుగదు.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

7. ఉ॥ లెక్కకురాని కోరికల రీతులలో బడి మానవుండిటుల్
ముక్కువలన్ సృజించుచు సమాయకుడై సుడులన్ పదేపదే
యుక్కిరి బిక్కిరై తిరుగుచుండునుగాని, విశిష్ట మార్గముల్
ద్రొక్కు తలంపులేశము కుదుర్కొననీయడె? వేంకటేశ్వరా!

ప్రతిపదార్థం:

వేంకట + ఈశ్వరా! = పాపాలను పోగొట్టే దైవమా!
మానవుండు = మానవుడు
లెక్కకు రాని = అనంతమైన
కోరికల రీతులలో = కోరికల సమూహంలో
పడి = చిక్కుకు పోయి
ఇటుల్ = ఈ విధముగా
మక్కువలన్ = కోరికలను
సృజించుచూ = ఇంకా ఇంకా పెంచుకుంటూ
అమాయకుడై = తెలివిలేనివాడై
పదే పదే = మాటి మాటికి
సుడులన్ = కోరికల సుడిగుండాలలో
ఉక్కిరి బిక్కిరి + ఐ= ఊపిరాడకుండా
తిరుగుచు + ఉండును + కాని = తిరుగుతుంటాడే తప్ప
విశిష్ట మార్గముల్ = మంచి దారులలో
త్రొక్కు = నడిచే
తలంపు = ఆలోచన
లేశ్యము = కొంచెమైన
కుదుర్కొననీయడు + ఎ ? = స్థిరపడనివ్వడు కదా ?

తాత్పర్యం : ఓ వేంకటేశ్వరా! మనిషి అధికమైన కోరికలకు బానిసై అమాయకత్వంతో వివిధ అనుబంధాలను సృష్టించుకుంటూ సుడిగుండాలలో పడి, ఉక్కిరిబిక్కిరై తిరుగుతుంటాడే గాని మంచి దారిలో నడిచే ఆలోచన కలిగేటట్లుగా చేయడం లేదు కదా!

8. ఉ|| ఆకలిదప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో
శాకమొ, నీరమో యిడి, ప్రశాంతుల జేసిన సర్వపుణ్యముల్
చేకురు, నీవుమెచ్చెదవు, శ్రేయము, ప్రేయమటంచు నెంతయున్
బాకవరాంజనేయ! ఖలభంజన! సాధుజనానురంజనా!

ప్రతిపదార్థం:

ఖల భంజన! = దుష్టులను శిక్షించే వాడా
సాధుజన = మంచివారిని
అనురంజన! = సంతోషపెట్టేవాడా
బావ+ ఆంజనేయ! = బాకవరంలో వెలసిన ఆంజనేయ స్వామీ!
ఆకలిదప్పులన్ = ఆకలితోనూ, దాహంతోనూ
వనటన్ = బాధను
అందినవారికి = పొందినవారికి
పట్టెడు అన్నము + ఓ = గుప్పెడు ఆహారమో
శాకము + ఓ = కూర
నీరము + ఓ = మంచినీరో
ఇడి = ఇచ్చి
ప్రశాంతుల = శాంతి పొందిన వారిగా
చేసినన్ = చేసినట్లయితే
సర్వపుణ్యముల్ = అన్ని పుణ్యములు
చేకురు = కలుగును
ఎంతయున్ = మిక్కిలి
శ్రేయము = మేలు కలిగించేది.
ప్రేమయు = ఇష్టాన్ని కలిగించేది
అటంచు = అంటూ
నీవు = దేవుడవైన నీవు
మెచ్చెదవు = మెచ్చుకుంటావు

తాత్పర్యం : పాపులను నశింపజేసేవాడ! సాధుజనులను ఆనందింపజేసేవాడ! బాకవరంలో వెలసిన ఓ ఆంజనేయా! ఆకలిదప్పులతో అలమటించే వారికి పట్టెడన్నంగాని, శాకంగాని, నీళ్ళుగాని ఇచ్చి వారిని శాంతపరిస్తే సమస్త పుణ్యాలు లభిస్తాయి. ఆ విధంగా భక్తులు చేస్తే, అది వారికి మేలయినదని, ప్రియమైనదని నీవు మెచ్చుకుంటావు.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

పాఠ్యభాగ ఉద్దేశం

ప్రశ్న.
శతకసుధ పాఠ్యభాగం ఉద్దేశం తెల్పండి.

శతక పద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తయారుజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం

పాఠ్యభాగ వివరాలు

ప్రశ్న.
శతక ప్రక్రియను గురించి వివరించండి.
జవాబు.
ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే నూరు పద్యాలు కలది. కాని నూటెనిమిది పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది. పద్యం చివరి పదంగాని, పాదంగాని లేక రెండు పాదాలుగాని అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు. మకుటమంటే కిరీటం అని కూడా అర్థం. శతకంలోని ప్రతి పద్యం దేనికదే స్వతంత్రభావాన్ని కల్గివుంటుంది.
ఈ పాఠంలోని పద్యాలను నారాయణ, చిత్త, భాస్కర, దాశరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వేంకటేశ్వర, శ్రీ బాకవరాంజనేయ శతకాల నుండి తీసుకున్నారు.

కవి పరిచయం

ప్రశ్న 1.
నారాయణ శతక కర్తను గురించి తెల్పండి.
జవాబు.
నారాయణ శతకం : ‘నారాయణా!’ అన్న మకుటంతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నవి. దీనిని పోతన రాశాడు. ఇతడు వరంగల్లు జిల్లా బమ్మెర వాసి. ఆంధ్ర మహాభాగవతం, భోగినీదండకం, వీరభద్ర విజయం రాశాడు.

ప్రశ్న 2.
చిత్త శతకం రచించిన కవిని గురించి రాయండి.
జవాబు.
చిత్త శతకం : శ్రీపతి భాస్కర కవి ‘చిత్తమా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకుల అభిప్రాయం.

ప్రశ్న 3.
భాస్కర శతకం రాసిన కవిని పరిచయం చేయండి.
జవాబు.
భాస్కర శతకం : మారద వెంకయ్య ‘భాస్కరా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోను మొదటి, రెండు పాదాలలో ఒక నీతిని చెప్పి, తరువాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత.

ప్రశ్న 4.
దాశరథీ శతక కర్తను పరిచయం చేయండి.
జవాబు.
దాశరథీ శతకం : కంచర్ల గోపన్న (భక్త రామదాసు) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడు. ‘దాశరథీ కరుణాపయోనిధీ!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. భద్రాచల రామునిపై అనేక కీర్తనలు రాశాడు.

ప్రశ్న 5.
నరసింహ శతకం రచించిన కవిని గురించి వివరించండి.
జవాబు.
నరసింహ శతకం : ఈ శతక కర్త కాకుత్థ్సం శేషప్పకవి. కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందినవాడు. “దుష్టసంహార నరసింహ దురితదూర!” అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి. తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహ స్వామికి అంకితం చేశాడు. ఈయన నరహరి, నృకేసరీ శతకాలు, ధర్మపురీరామాయణం మొదలగు
రచనలు చేశాడు.

ప్రశ్న 6.
పండిత రామ సింహ కవిని పరిచయం చేయండి.
జవాబు.
విశ్వకర్మ శతకం : ‘విశ్వపాలన ధర్మ! శ్రీ విశ్వకర్మ!’ అనే మకుటంతో పండిత రామసింహకవి ‘విశ్వకర్మ’ శతకాన్ని రాశాడు. ఈయన కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలంలోని పూర్వపు రాఘవపట్నం వాసి. ఈయన ఆశుకవి. దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు మొదలగునవి ఇతని రచనలు.

ప్రశ్న 7.
శ్రీవేంకటేశ్వర శతక కర్తను గురించి రాయండి.
జవాబు.
శ్రీవేంకటేశ్వర శతకం : నల్లగొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో జన్మించిన ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు ‘వేంకటేశ్వరా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన గోదాదేవి, యాదగిరి లక్ష్మీనరసింహ శతకం, గోదావరి, సత్యవతీ సాంత్వనం, మారుతి మొదలగు రచనలు చేశాడు. ఈయన ‘విద్వత్ కవి’గా ప్రసిద్ధి పొందాడు.

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ

ప్రశ్న 8.
శ్రీ బాకవరాంజనేయ శతకం రచించిన కవిని గురించి తెల్పండి.
జవాబు.
శ్రీ బాకవరాంజనేయ శతకం : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నివాసియైన వేంకటరావు పంతులు, తాండూర్ దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామిపై “బాకవరాంజనేయ! ఖలభంజన! సాధుజనానురంజనా! అనే మకుటంతో పద్యాలను రాశాడు. యక్షగానాలు, కీర్తనలు, గేయాలు రాశాడు.

ప్రవేశిక

ప్రశ్న
శతక ప్రక్రియ గురించి వివరించండి.
జవాబు.
విశిష్టమైన సాహిత్య ప్రక్రియల్లో శతకం ఒకటి. మేలిముత్యాల్లాంటి శతక పద్యాలనుండి కొన్నింటిని ఈ పాఠం ద్వారా చదువుకుందాం. నైతిక విలువలను పెంపొందించుకుందాం.

కఠిన పదాలకు అర్ధాలు

  • సూనృతం = మంచిమాట
  • శీలము = స్వభావం
  • నతి = వినయం
  • ధృతి = ధైర్యం
  • తుచ్ఛం = నీచము
  • మెయి = శరీరం
  • తిరము = శాశ్వత
  • గతి = దిక్కు ఆధారం
  • లవణము = ఉపు
  • వితం = ధనం
  • కుడువన్ = తినుటకు, అనుభవించుటకు
  • మరుగు = రహస్యము
  • తెరువరి = బాటసారి
  • రీతి = విధం
  • మక్కువ = ఇష్టం, కోరిక
  • దురిత = పాపం
  • విర్రవీగు = అహంకారంతో ఉండు
  • గుడము = బెల్లం
  • మౌక్తికం = ముత్యం
  • కృషి = వ్యవసాయం, ప్రయత్న
  • వెలివేయు = సమాజానికి దూరంగా ఉండు
  • లేశ్యము = కొంచెమ
  • వనట = బాధ
  • చేకురు = చేకూరును, కల్గును
  • ప్రియము = ఇష్టాన్ని కల్గించేది

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu 5th Lesson Questions and Answers Telangana శతక సుధ 15

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 11th Lesson కాపుబిడ్డ Textbook Questions and Answers.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

చదువండి ఆలోచించి చెప్పండి

ఈ విశ్వంలో, ఈ భూమండలంలో, ఈ జీవనచక్రంలో మనకెంత ప్రాధాన్యముందో …. ఓ చీమకు, ఓ దోమకు, ఓ ఈగకు, ఓ బూగకు, ఓ తేనెటీగకు, ఓ గద్దకు చివరకు ఓ నత్తకూ, ఓ పీతకూ కూడ కాస్త అటు ఇటుగా అంతే ప్రాధాన్యం ఉందని తేలిపోయింది. సమస్యేమిటంటే ఉన్నత జీవులం కావటంతో మనకు తెలివి ఎక్కువనుకుంటాం. కాని ఆ తెలివిని మనం వినాశానికి ఉపయోగిస్తున్నామనుకోం. నాటి వేటకాలం నుంచీ నేటి పారిశ్రామిక యుగం వరకూ మనం ఇతర జీవులనూ, ఈ ప్రకృతిలోని జీవవైవిధ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఫలితం – ఇప్పుడు ఈ భూమ్మీద మన అస్తిత్వమే అయోమయంలో పడింది.

ప్రశ్న 1.
పై పేరా దేన్ని గురించి తెలుపుతున్నది?
జవాబు.
పై పేరా జీవరాశి యొక్క మానవుల యొక్క అస్తిత్వాన్ని గురించి తెలుపుతున్నది.

ప్రశ్న 2.
తెలివిమీరిన మానవులు ఏం చేస్తున్నారు?
జవాబు.
తెలివిమీరిన మానవులు విశ్వం వినాశనానికి తమ తెలివిని ఉపయోగిస్తున్నారు.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ప్రశ్న 3.
వీటి ఫలితాలు ఎలా ఉన్నాయి?
జవాబు.
వీటి ఫలితాలు అంటే మానవుల తెలివితేటలకు సంబంధించిన విషయాలు, వాటి ఫలితాలని అర్థం. ఆ తెలివి తేటలు లోకవినాశనానికి ఉపయోగ పడుతున్నట్లున్నాయి.

ప్రశ్న 4.
జీవవైవిధ్యాన్ని కాపాడటానికి మనం ఏం చేయాలి?
జవాబు.
జీవవైవిధ్యాన్ని కాపాడటానికి మనం ముందుగా జీవహింసను మానుకోవాలి. జీవన చక్రంలో మనకు ఎంత ప్రాముఖ్యం ఉందో వాటికీ అంతప్రాముఖ్యం ఉందని గుర్తించి మనలానే వాటిని కూడా బ్రతుకనీయాలి.

ఆలోచించండి – చెప్పండి.

ప్రశ్న 1.
ఓసెఫన్ను ఎద్దుపిచ్చోడు’ అనడం గురించి మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు.
ఓసెఫ్ నిజంగా ఎద్దు పిచ్చోడే. ఎద్దు సంగతి వచ్చేసరికి ఓసెఫ్ అన్నీ మరచిపోతాడు. ఓసెఫ్క తన ఎద్దు కన్నన్ తోడిదే లోకం. కనుక ఓసెఫ్ ఎద్దు పిచ్చోడే.

ప్రశ్న 2.
విచక్షణ అంటే నీకేమర్థమయింది ? కన్ననికి విచక్షణ ఉందని మీరెట్లా చెప్పగలరు?
జవాబు.
ఇది చేయదగిన పని ఇది చేయకూడని పని అని నిర్ణయించటమే విచక్షణ. కన్నన్కు ఆ విచక్షణ ఉన్నదనే చెప్పాలి. ఎందుకంటే ఓసెఫ్ ఏం చెబితే అది కన్నన్ చేసుకుపోతుంది. ఒక మడిలో నుండి మరొక మడిలోకి వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా దానికేమీ చెప్పనక్కర లేదు. గట్ల మీద కాలువేస్తే గట్లు తెగిపోతాయనే విచక్షణ దానికుండేది. దున్నటం పూర్తి అయ్యాక మేతకు వదిలి “కడుపు నింపుకో, అరటి చెట్లను ముట్టుకోకు” అని ఓసెఫ్ అనేవాడు. కన్నన్ ఎప్పుడూ అరటి చెట్లను గాని, కొబ్బరి మొలకలను గాని ముట్టుకునేది కాదు. అవి పాడైపోతాయనే విచక్షణ దానికి ఉండేది.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ప్రశ్న 3.
సాటి మనుషులతో మన ప్రేమాభిమానాల్ని ఎట్లా వ్యక్తపరచవచ్చు?
జవాబు.
సాటి మనుషులపై ప్రేమాభిమానాల్ని మనసుకు హత్తుకొనే చక్కని మాటలతో వ్యక్తం చేయాలి. మంచిమాట మనసును ఆనందింప చేస్తుంది. మన వద్దకు వచ్చిన వారికి పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించనక్కరలేదు. వారి మనసుకు బాధ కలుగకుండా ఉపశమనం కలిగించే రెండు మాటలు మాట్లాడి ఆప్యాయంగా ఆదరిస్తే చాలు ప్రేమాభిమానాలను వ్యక్తంచేసినట్లు అవుతుంది.

ప్రశ్న 4.
సంగీతానికున్న శక్తి ఎట్లాంటిది ?
జవాబు.
సంగీతం శిశువులను, పశువులను, చివరికి రాళ్ళను కూడా కరిగించగలిగిన శక్తిగలది. కన్నన్కి ఓసెఫ్ సంగీతం (పాట) అంటే ఇష్టం. పచన్ సంగీతం విన్న కన్నన్ సంగీతాన్ని అవమానించాడని కుడికాలు మీద తన్నింది. కాబట్టి సంగీతం చాలా గొప్ప శక్తిగలదని పశువులు కూడా ఆస్వాదిస్తాయని తెలుస్తుంది.

ప్రశ్న 5.
“ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాల సాన్నిహిత్యమే”- దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు.
ప్రేమకు ఎపుడూ మాటలు ప్రదర్శనలు అవసరం లేదు. ప్రేమంటే రెండు మనసులు కలిసి అనుభవించే సుఖదుఃఖాల సాన్నిహిత్యం. దీనిలో సాన్నిహిత్యం ముఖ్యం. ఓసెఫ్ కన్నా కన్నన్కు దగ్గరయిన వారెవ్వరూ లేరు. అందువల్ల ఆ రెండు హృదయాలు మరింత దుఃఖాన్ని అనుభవించాయి. కనుక ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాల సాన్నిహిత్యం.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ప్రశ్న 6.
ఓసెఫ్ ఎద్దును అమ్మినప్పుడు మీకేమనిపించింది ? ఎందుకు?
జవాబు.
ఓసెఫ్ ఎద్దును అమ్మినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఓసెఫ్కు కన్నన్ తోడిదే లోకం. దానిని తన సంతానంగా భావించాడు. కూతురి పెళ్ళి ఆగిపోతుందన్న భయంతో అప్పటికే తన బంగారు బాతులాంటి పొలాన్ని తాకట్టు పెట్టాడు. ఇక మిగిలింది ఎద్దు. దాన్ని కూడా అమ్మాల్సి వచ్చింది. అందుకని ఓసెఫ్ పట్ల జాలి కలిగింది.

ప్రశ్న 7.
ధరల ప్రభావం మనిషి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?
జవాబు.
ధరల ప్రభావం మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసేస్తుంది. మనుషుల అంచనాలను తారుమారు చేస్తుంది. అధిక ధరలు ఓసెఫ్ వంటి సామాన్యుల జీవితాలను శాసిస్తాయి. మధ్య తరగతి వారిని రోడ్డున పడవేస్తుంది. ధరల పెరుగుదల మనశ్శాంతిని దూరం చేస్తుంది.

ప్రశ్న 8.
‘భూతదయ’ – అంటే ఏమిటో వివరించండి.
జవాబు.
భూతదయ అంటే భూతములపట్ల దయ అని అర్థం. భూతములు అంటే జీవరాశి అనిఅర్థం. ఆ జీవులపై మనం చూపించే కరుణే భూతదయ. సృష్టిలో మానవునకు బ్రతికే హక్కు ఎంత ఉన్నదో మిగిలిన జీవరాశికీ అంతే ఉంది. వాటిపట్ల దయ, జాలి, కరుణలు చూపించాలి, అలా చూపించటాన్నే భూతదయ అంటాము.

ప్రశ్న 9.
ఈ “బిడ్డా, నన్ను గుర్తు పట్టావా ? నిన్నీ స్థితిలో చూడవలసి వచ్చిందా ?” దీని మీకేమి ద్వారా. అర్థమయ్యింది ?
జవాబు.
విధిలేని పరిస్థితిలో ఓసెఫ్ కన్నన్ను అమ్మేశాడు. ఇపుడు దానిని కబేళాకు తరలించారు. అక్కడ ఓసెఫ్ కన్నన్ను చూసి చలించి పోయాడు. బక్కచిక్కి ఎముకల గూడులా ఉన్న తన బిడ్డవంటి ఎద్దు కన్నన్ను చూసి ‘ఇలా నిన్ను చూడవలసి వచ్చిందా’ అని బాధపడ్డాడు. కన్నన్ కూడా ఓసెఫన్ను చూసి కన్నీరు కార్చి దగ్గరకు వచ్చి ఆప్యాయంగా నాకటం ప్రారంభించింది. దీనిద్వారా ఓసెఫ్, కన్నన్ల అనురాగ ఆప్యాయతలు తెలిశాయి. మనుషుల్లానే జంతువులకూ ప్రేమ ఉందని తెలిసింది.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ప్రశ్న 10.
కన్నన్ తన యజమానిపై అభిమానాన్ని, ప్రేమని ప్రదర్శించిందని ఎట్లా చెప్పగలవు ?
జవాబు.
మూగజీవాలకు భాషతో, మాటతో భావాలను వ్యక్తం చేయటం రాకపోయినా చేష్టలతో వ్యక్తం చేయగలవు. కన్నన్ తన యజమానిని చూడగానే, అతని చేయి తాకగానే ఆ స్పర్శకు తన తోక ఎత్తింది. అది తన నోటితో కాదు హృదయంతో ఏడ్చింది. కన్నన్ తన పాత దొడ్లో ప్రవేశించి సంతోషంతో నేలమీద ఒరిగింది.

ప్రశ్న 11.
“నాన్నా! నువ్వు నాకింత పని చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు” – అనే కత్రి మాటలను ఎట్లా అర్థం చేసుకుంటావు?
జవాబు.
కత్రి తనకు కొత్త బట్టలు తెచ్చిపెట్టి నాన్న కొత్తకాపురానికి పంపిస్తాడన్న ఆలోచనలో ఉంది. కొత్త బట్టలకు బదులు కన్నన్ ను వెంటబెట్టుకురావటంతో కత్రి తాను కొత్త కాపురానికి వెళ్తున్నానన్న ఆశలు అడియాసలయ్యాయి అని అర్థం చేసుకున్నాను.

ప్రశ్న 12.
ఈ “నాకు నువ్వెంతో కన్నన్ అంతే – దీని ద్వారా నీకేమర్థమయ్యింది
జవాబు.
“నాకు నువ్వెంతో కన్నన్ అంతే” అన్న మాటల వలన కన్నన్ పై ఓసెఫ్కు ఉన్న ప్రేమ అర్థమయింది. తన కన్న కూతురు కత్రిని ఎంత ప్రేమగా ఓసెఫ్ పెంచుకున్నాడో అంతే ప్రేమతో కన్నన్ను కూడా చూసుకున్నాడని అర్థమయింది. కన్నన్ ఓసెఫ్కు మరో బిడ్డ అని అర్థమయింది.

ఇవి చేయండి.

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. కింది అంశాల గురించి తెలుపండి.

అ. ఈ కథను సొంతమాటల్లో చెప్పండి.
జవాబు.
మానవత్వం గురించి, మూగ జీవుల పట్ల మానవులు చూపాల్సిన ప్రేమ గురించి చెప్పిన మంచి కథ ఇది. ఓసెఫ్ ఒక మనసున్న రైతు. అతని వద్ద కన్నన్ అనే ఎద్దు ఉండేది. ఆ ఎద్దే అతని లోకం. అది ఉంటే అతడు ఈలోకాన్ని మరచేవాడు. అందుకే అతనిని ఎద్దు పిచ్చోడు అని మిగిలిన రైతులు అనేవారు. కన్నన్ను ఎప్పుడూ ఓసెఫ్ చెర్నాకోలతో కొట్టలేదు. అదే తన యజమాని మనసు తెలుసుకుని ప్రవర్తించేది. పని అయిపోయాక హాయిగా కడుపునింపుకోమని వదిలేవాడు. అది గడ్డి తిన్నదే గాని ఏనాడు అరటి మొక్కలను కొబ్బరి మొక్కలను తాకనైనా తాకలేదు. ఓసెఫ్ పాట మాట అంటే కన్నన్కు ఇష్టం. ఇరవైఏళ్ళపాటు కన్నన్ ఓసెఫ్క మొక్కవోని సేవచేసింది.

ఓసెఫ్కు ఒక కూతురుంది. ఆమెపేరు కత్రి. ఆమెకు పెళ్ళిచేయాలనుకున్నాడు. కట్నంకోసం పొలాన్ని అమ్మాడు. అయినా చాలలేదు. కన్నన్ను కూడా అమ్మేయక తప్పిందికాదు. ఒక రోజు కూతురు కత్రికి బట్టలు తేవటానికి వెళ్ళిన ఓసెఫ్కు తన కన్నన్ను మాంసం దుకాణానికి తరలిస్తుండడం కన్పించింది. తట్టుకోలేక పోయాడు. కన్నన్.. అని పెద్దకేకవేసి బట్టలకని తెచ్చిన డబ్బులతో కన్నన్ను కొని ఇంటికి తీసుకువచ్చాడు. నాన్న బట్టలు తెస్తున్నాడని ఎదురువెళ్ళిన కత్రికి కన్నన్ కన్పించింది. విషయం అర్థమయింది. నాన్నా నువ్వు నాకు ఇలా అన్యాయం చేస్తావని ఎప్పుడూ అనుకోలేదని ఏడ్చింది. అప్పుడు ఓసెఫ్ “ఓ బిడ్డా నువ్వు నాకు ఎంతో కన్నన్ కూడా అంతే అన్నాడు.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ఆ. ‘మాట్లాడే నాగలి’ అనే పేరు ఈ కథకు సరైందేనా? ఎందుకు?
జవాబు.
దేశాభివృద్ధిలో రైతులదే కీలకపాత్ర. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఆయుధం నాగలి. రైతు యొక్క జీవితాన్ని విశ్లేషించిన కథ ‘మాట్లాడే నాగలి’. రైతు అతనికి ప్రాణప్రదమైన ఎద్దుల అనుబంధం ఈ కథలో వివరించబడింది. కనుక ఈ కథకు మాట్లాడే నాగలి అనుపేరు సరైందేనని భావించాలి. ఇక్కడ నాగలి అంటే ఎద్దు. మాట్లాడడమంటే ప్రేమను చూపడం.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. కింది వాక్యాలు పాఠంలోని ఏ పేరాలో ఉన్నాయో గుర్తించండి. ఆ వాక్యాల కింద గీత గీయండి.

అ. ఒకసారి దాని చెవుల్లో జీవితం ప్రతిధ్వనించింది.
జవాబు.
ఈ వాక్యం పాఠంలోని 125వ పేజీలో మొదటి పేరాలో ఉంది. మొద్దుబారి పోయింది. కన్నన్ అప్పుడు ఆ బ్రహ్మాండమైన భవనం ముందర తలదించుకొని ఉంది. మళ్ళీ ఒకసారి దాని చెవుల్లో జీవితం ప్రతిధ్వనించింది. తలపైకెత్తి చుట్టూ చూసింది.

అ. అది తన నోటితో కాదు; హృదయంతో ఏడ్చింది.
జవాబు.
ఈ వాక్యం పాఠంలోని 125వ పేజీలో రెండవ పేరాలో ఉంది. బిడ్డా, నన్ను గుర్తుపట్టావా ? నిన్నీ స్థితిలో చూడవలసి వచ్చిందా? ప్రేమ స్పందిస్తున్న గుండెలకు అతను ఆ పశువును హత్తుకున్నాడు. దాని తలమీద నిమిరాడు. ఆ చేతుల స్పర్శ గుర్తించగానే అది తోకెత్తింది. అది తన నోటితో కాదు, హృదయంతో ఏడ్చింది. కన్నన్ మీద కూడా ముద్ర ఉందేమోనని చూశాడు ఓసెఫ్. ఔను, వెనకకాళ్ళ మీద ముద్ర స్పష్టంగా ఉంది. దాన్ని చెరిపెయ్యడానికి ప్రయత్నించాడు. కాని మునిసిపాలిటీ వేసిన ఆ నల్లముద్రను చెరపడం అంత సులభం కాదు.

2. కింది పేరా చదవండి. ఖాళీలు పూరించండి.

ఒక పండుగరోజు ఆశ్రమంలో సేవచేస్తున్న ఒక ముసలమ్మ హాలుకు ఎదురుగా ఉన్న గడపలకింద ఉన్న నేలమీద ముగ్గులు వేస్తుంది. అది రమణమహర్షి కంట పడింది. పాటీ! అని భగవాన్ పిలువగా ఎంతో సంతోషంగా భగవాన్ దగ్గరకు వచ్చిందామె. ఇదిగో అవ్వా! కష్టపడి ముగ్గులు పెడుతున్నావు గాని అది బియ్యపుపిండేనా ? అన్నారు భగవాన్. కాదు! రాతి ముగ్గే అంది ఆ అవ్వ. అయ్యో! చీమలకైనా ఉపయోగం ఉండదే. ముగ్గులు పెట్టడం అంటే చీమలకు ఆహారం వేయడమన్నమాట. ఆ ధర్మం విడిచిపెట్టి అచ్చంగా రాతిముగ్గే పెడితే చీమలు ఆ పక్కకే రావు. ఒకవేళ వచ్చినా ఆ ఘాటుకు చచ్చిపోతాయి కూడ. ఎందుకది ? కొంచెమైనా బియ్యపు పిండి చేర్చుకోండి అ సెలవిచ్చినారు భగవాన్. ఆ మాటలు విన్నవారొకరందుకొని “ధనుర్మాసంలో ముగ్గులు అధికంగా పెట్టడం చీమలకు ఆహారం వెయ్యడం కోసమేనా!” అన్నారు. ఆ! కాకపోతే మరేమి ? కొత్త ధాన్యం వచ్చిన సంబరంతో రంగవల్లులు తీర్చి చీమలకు ఆహారం వేస్తారన్నమాట. ‘పెద్దలు నిర్ణయించిన ఆచారాలన్నీ జీవకారుణ్యంతో కూడినవే! ఇప్పుడవి పాటించేదెవరు? అలంకారానికి ఏదో చేస్తారంతే’ అన్నారు భగవాన్.

అ. జీవకారుణ్యం అంటే …………….
జవాబు.
తోటి జీవుల పట్ల కారుణ్యంతో వ్యవహరించటం.

ఆ. ముగ్గులు పెట్టడంలో అంతరార్థం …………….
జవాబు.
చీమలకు ఆహారం వెయ్యటం

ఇ. పూర్వాచారాలను పాటించాలె ఎందుకంటే …………….
జవాబు.
ఆ ఆచారాలన్నీ జీవకారుణ్యంతో కలిసి ఉన్నవి.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ఈ. పై పేరాకు శీర్షిక ………………
జవాబు.
జీవకారుణ్యం

ఉ. పై పేరాలోని ఐదు ముఖ్యమైన పదాలు ……………
జవాబు.
పండుగరోజు, ఆశ్రమం, బియ్యపుపిండి, ఘాటు, ధనుర్మాసం, రంగవల్లులు, జీవకారుణ్యం.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. ఓసెఫ్ స్థానంలో మీరుంటే ఏం చేస్తారు?
జవాబు.
ఓసెఫ్ స్థానంలో నేనుంటే కన్నన్ను ఓసెఫ్ లాగానే కన్న బిడ్డలా చూసుకుంటాను. దానితోడిదే లోకంలా భావిస్తాను. నా మనుగడకు కారణమైన కన్నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాను. అవసరం తీరిందిగదా, అది ఇంక ఎంతో కాలం పనిచేయలేదు కదా అని దానిని కటిక వానికి అమ్మను. పెంపుడు జంతువులపై ప్రేమను అందరికీ వివరిస్తాను.

ఆ. ‘పశువులపట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే ఓసెఫ్కు చిర్రెత్తేది’ ఎందుకని?
జవాబు.
ఎవరైనా మాటల్లో చెప్పేవిషయాలు చేతల్లో చేసి చూపించాలనేది ఓసెఫ్ తత్వం. ఆయన పశువులను ప్రేమగా చూడడం కర్తవ్యంగా భావించేవాడు. అందుకే ఓసెఫ్ తనకుమార్తె అత్తారింటికి వెళ్ళటానికి బట్టలు కొనడం కన్నా, తనకు చాలా కాలం జీవనాధారంగా నిలచిన మూగజీవి కన్నన్ మాంసశాలకు వెళ్ళకుండా ఉండడానికి పైసలు ఖర్చు చేయడం సరైందని భావించాడు. పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు చేసే కన్నా వాటిని రక్షిస్తే బాగుంటుందన్నాడు.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ఇ. క్రయపత్రం అంటే ఏమిటి ? ఏ సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తారు?
జవాబు.
క్రయపత్రం అంటే బేరసారాలు జరిగేటప్పుడు కొనుగోలు దారుడు, అమ్మకం దారుడు నమ్మకం కోసం ఒకరికొకరు రాసుకునే పత్రం. వ్యాపార లావాదేవీలు ముగిసేవరకే దీని విలువ ఉంటుంది. పొలాలు, స్థలాలు, ఇండ్లు, గొడ్లు మొదలగు వాటికి క్రయవిక్రయాలు జరిపేటప్పుడు వీటిని రాసుకుంటారు. ఒక కంపెనీ తయారు చేసిన వస్తువులను ఇతరులకు విక్రయించేటప్పుడు కూడా ఈ క్రయపత్రాలు వ్రాసుకుంటారు. దీనిని ఇంగ్లీషులో ‘అగ్రిమెంట్’ అని వ్యవహరిస్తారు. ఒకనాడు నోటి మాటలతోనే క్రయవిక్రయాలు జరిగేవి. ఇపుడు క్రయపత్రం రాసుకోవటం తప్పనిసరి అయింది.

ఈ. కన్నన్తో తిరిగివచ్చిన తండ్రిని చూసి కత్రి “నాన్నా!” అంది. అట్లా అనడంలో ఆమె ఉద్దేశం ఏమై ఉంటుంది?
జవాబు.
కన్నన్తో తిరిగివచ్చిన తండ్రిని చూసి కత్రి ‘నాన్నా’ అంది. ఇలా అనటానికి కారణం లేకపోలేదు. తండ్రి తనకు
వివాహంచేసి అత్తగారింటికి పంపించటానికి బట్టలు తెస్తానని పెళ్ళిబట్టలు మానేసి కన్నన్ను వెంటబెట్టుకొచ్చాడు. మరి తను అత్తారింటికి వెళ్ళేదెట్లా. ఆ ఆశ నెరవేరేదెట్లా అని ఆలోచించిన కత్రి తన మనసులో కలిగిన ఆలోచనను ఆవేదనను ‘నాన్నా’ అన్న ఒక్క మాటలో వ్యక్తం చేయగలిగింది. ఇంత పనిచేస్తావని ఎప్పుడూ అనుకోలేదని మూగగా రోదించింది.

ఉ. మాట్లాడే నాగలి ఏ సాహిత్య ప్రక్రియకు చెందిన పాఠం ? రచయిత ఎవరు ? విశేషాలను తెలుపండి?
జవాబు.
మాట్లాడే నాగలి అను పాఠం అనువాద ప్రక్రియకు సంబంధించిన పాఠం. దీనిని మలయాళంలో పొన్కున్నం వర్కెయ్, వ్రాయగా దానిని ఎన్. వేణుగోపాలరావు తెలుగులోకి అనువదించాడు. ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోనికి మార్చి రాసినట్లైతే దానిని అనువాదం అంటాం. ఆంగ్లంలో అనువాదాన్ని ‘Translation’ అంటారు. సాహిత్య అకాడమీవారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు’ అనే గ్రంథంలో ప్రచురించిన మలయాళకథ ఇది. ప్రకృతి, మూగజీవుల పట్ల ప్రేమ ఆవశ్యకతను వివరించిన కథ ఇది. జీవకారుణ్యానికి ఈ కథ ఒక మచ్చుతునక.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ఊ. కన్నను, దాని స్వభావాన్ని వివరించండి. (లేదా) మాట్లాడే నాగలి పాఠం ఆధారంగా కన్నన్ ఎద్దు స్వభావాన్ని వివరించండి.
జవాబు.
కన్నన్ ఓసెఫ్కు జీవనాధారమైన ఎద్దు. ఓసెఫ్క కన్నన్ తోడిదే జీవితం. అది బూడిదరంగులో బలంగా పొట్టిగా లావాటి వంపులు తిరిగిన కొమ్ములతో బ్రహ్మాండమైన ఆకారం గలిగిన వృషభరాజం. సుడి తిరిగిన బిగువైన చర్మం, బయటకు ఉబికిన కళ్ళుండేవి. అసలు కన్నన్ నడకలోనే ఒక ప్రత్యేకత కన్పించేది. కన్నన్ విచక్షణాజ్ఞానం కలిగిన ఎద్దు. దానిని తిట్టవలసిన కొట్టవలసిన అవసరం ఓసెఫ్కు ఏనాడు రాలేదట. దీనిని బట్టి కన్నన్ ఎంతటి పెంపుడు జంతువో అర్థమౌతుంది. ఓసెఫ్ మాటలను ముందుగానే అర్థంచేసుకొని కూతురితో సమానమనిపించుకుంది.

ఎ. ఓసెఫ్ కన్నన్ను ఎలా శాంతింపజేసేవాడు?
జవాబు.
ఓసెఫ్ మాట్లాడిన ప్రతిమాట కన్నన్ అర్థం చేసుకునేది. ఎంతటి గుంపులో ఉన్నా కన్నన్ ఓసెఫ్ గొంతును గుర్తుపట్టేది. నాగలిని ఓసెఫ్ పడితేనే ఇష్టపడేది. ఇంకెవరు పట్టినా తన కొంటెతనం చూపించేది. కన్నన్ హెచ్చరికతో దానిని శాంతింపజేసేవాడు. పొలాల్లో పనిచేసే రైతులు చక్కగా పాటలు పాడుకుంటారు. వాటికి వ్యాకరణంతోగాని, శాస్త్రీయ రాగాలతోగాని పనిఉండదు. ఓసెఫ్ గొంతెత్తి చక్కని పాటలు పాడేవాడు. ఆ ఆలాపన కన్నన్కు మహాఇష్టం. ఒకసారి మడి దున్నుతున్నపుడు ఓసెఫ్కు బదులు ఓసెఫ్ మిత్రుడు పచన్ పాట అందుకున్నాడు. ఆ పాటను విన్న కన్నన్ సంగీతాన్ని పచన్ అవమానిస్తున్నాడని కుడి కాలు మీద ఒక్కటి తన్నింది. ఓసెఫ్ మాటలతో మరలా శాంతించింది. ఇలా కన్నన్ విషయంలో ఎవరైనా ఓసెఫ్ తరువాతే, ఓసెఫ్కు కన్నన్ తరువాతే ఎవ్వరైనా!

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. ఓసెఫ్ కన్నన్ను ఏ విధంగా ప్రేమించేవాడో తెలుపండి. (లేదా) ‘మాట్లాడే నాగలి’ పాఠం ఆధారంగా ఓసెఫ్, కన్నన్ ల మధ్య అనుబంధం గురించి రాయండి.
జవాబు.
ఓసెఫ్ ఒక రైతు. అతడు తన ఎద్దు కన్నన్ సంగతి వచ్చేసరికి అన్నీ మరచిపోతాడు. ఓసెఫ్కు కన్నన్ తోడిదేలోకం. బూడిదరంగులో పొట్టిగా లావాటి ఒంపు తిరిగిన కొమ్ములతో, సుడిదిగిన బిగువైన చర్మంతో బయటకు ఉబికిన కళ్ళతో ఠీవిగా నడుస్తుంది. ఓసెఫ్ ప్రతి అడుగు ప్రతి మాట దానికి ఎరుకే! అందుకే కన్నన్ పై ఓసెఫ్ ఏనాడూ చెర్నాకోల వాడలేదు. కన్నన్ను ఓసెఫ్ ఎప్పుడూ కట్టేయ లేదు. దున్నటం పూర్తవగానే దానిని మేతకు వదిలేవాడు.

కన్నన్ వంటికి అంటిన బురదను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవాడు. కన్నన్కు ఓసెఫ్ చేసేపనులలో నచ్చనిది ఇది ఒక్కటే. ఓసెఫ్ కన్నన్కు తన హృదయంలోని ప్రేమానురాగాలను పంచి పెట్టేవాడు. పశువులను రక్షించాలన్న ఉపన్యాస మంటే ఓసెఫ్కు కోపం వచ్చేది. ఓసెఫ్ దొడ్లో పశువులు ఆకలితో మాడితే ఆ ఇంటికి అరిష్టం వస్తుందనేవాడు. పనిఅవగానే ఇంటికి తీసుకొనిపోయి కన్నన్కు చేతినిండా గడ్డిపరకలను, అరటి తొక్కలను చిన్న కానుకగా ఇచ్చేవాడు.

ఓసెఫ్ ప్రేమగా కన్నన్ను దువ్వుతుంటే కన్నన్ అతనిని నాకుతుంటుంది. ప్రేమకు మాటలూ ప్రదర్శనలు అవసరంలేదు. ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాలు. కుమార్తె “నాన్నా నువ్వు నాకింత పని చేస్తావని ఎపుడూ అనుకోలేదు” అని అన్నపుడు ఓసెఫ్ బిడ్డా “నాకు నువ్వెంతో కన్నన్ అంతే” అన్న మాటల్లో కన్నన్పట్ల ఓసెఫ్ ప్రేమ మనకు అర్థమౌతుంది.

ఆ. మూగజీవాలమీద ఎందుకు ప్రేమ చూపించాలి ? (లేదా) పశువుల్ని రక్షించుకోవాల్సిన అవసరం గురించి రాయండి.
జవాబు.
ఈ సృష్టిలో మనిషికి బ్రతికే హక్కు ఎంత ఉందో మిగిలిన జీవరాశికి బ్రతికే హక్కు అంతే ఉంది. కాబట్టి మనం మూగ జీవాల మీద ప్రేమచూపించాలి. జీవరాశిలో మానవుడు విలక్షణమైనవాడు. మిగిలిన జీవరాశుల కంటే మానవుడు ఆలోచనా జ్ఞానం విచక్షణా జ్ఞానం కలిగినవాడు. మానవుడు జీవరాశి అంతటికి ఉన్నతుడు అవటంచేత ఇతర జీవరాశుల నియంత్రణకు పాల్పడుతున్నాడు. అది సరైన పద్ధతి కానేకాదు.

ప్రతి జీవిపై ప్రేమాభిమానాలను చూపించాలి. మనిషి తాను సుఖంగా బతకాలనుకొని ఇతర జీవరాశిని నాశనం చేస్తే ప్రకృతిలో అసమతౌల్యత తలెత్తే ప్రమాదం ఉంది. ఆ అసమతౌల్యతను అధిగమించటానికైనా మనం మూగ జీవాల మీద ప్రేమను చూపించాలి. మూగజీవులకు మాటలేదు. తమ బాధలను చెప్పుకోలేవు. అందుకే వాటిని ప్రేమగా లాలించాలి. అవి చేతలతో వ్యక్తం చేసే బాధలను అర్థం చేసుకోవాలంటే ప్రేమ చూపించడమే మార్గం.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ఇ. ఎద్దు (కన్నన్)ను అమ్మవలసిన పరిస్థితిలో ఓసెఫ్ పడిన బాధను వివరించండి. (లేదా) ఓసెఫ్కి ఎద్దులంటే చాలా ప్రేమ. వాటిని అమ్మేశాడు కదా ! పేదరైతులు తమకు విలువైన వాటిని ఎందుకమ్ముకుంటున్నారో వివరించండి.
జవాబు.
కన్నన్ ఓసెఫ్ దగ్గర పన్నెండు సంవత్సరాలు విశ్రాంతి లేకుండా పనిచేసింది. కాలానుగుణంగా వచ్చిన పరిస్థితుల ప్రభావం వలన ఓసెఫ్కు కన్నన్ ను అమ్మేయవలసిన పరిస్థితి వచ్చింది. అప్పటికే తాను బంగారు బాతులాంటి పొలాన్ని తాకట్టు పెట్టాడు. అది కూడా ఇష్టపూర్వకంగా కాదు. అంతకంటే గత్యంతరం లేదు. ఓసెఫ్కు పెళ్ళీడుకు వచ్చిన ముద్దుల కూతురుంది.

ఆమె పెళ్లికి కట్నకానుకలు సమర్పించటానికి పొలాన్ని, తనకు ఇష్టమైన కన్నన్నీ అమ్మేయవలసివచ్చింది. పెళ్లికొడుకు కుటుంబం పైసాకు రికాణా లేనిదైనా 3 వేలు కట్నంగా అడగటంతో అమ్మేయక తప్పిందికాదు. కన్నన్ ను అమ్మినపుడు ఓసెఫ్ అక్కడ లేడు. ప్రేమకు ఎప్పుడూ మాటలు, ప్రదర్శనలు ఉండవు. ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాల సాన్నిహిత్యమే. ఓసెఫ్ బాధ ఎవరూ తీర్చలేనిది. ఓసెఫ్ మనసు మనసులో లేదు. కన్నన్ పట్ల ఓసెఫున్న ప్రేమ కథ చివరిలో కూతురుతో “బిడ్డా నాకు నువ్వెంతో కన్నన్ కూడా అంతే” అన్నమాటల్లో అర్థమౌతుంది.

IV సృజనాత్మకత/ప్రశంస

1. “మూగజీవులకు నోరొస్తే …..” ఊహాత్మకంగా ఒక కథ రాయండి.
జవాబు.
ఒక అడవిలోని మునీశ్వరుడు ఘోరతపస్సు చేసి ఎన్నో మహిమలు పొందాడు. ఆయన తన తపశ్శక్తిని పరీక్షింపదలచి తన ఆశ్రమంలోని జింకకు మాట్లాడే వరాన్నిచ్చాడు. దాంతో ఆ జింకకు గర్వమొచ్చి ఆశ్రమంలో తనకు అడ్డువచ్చే ప్రతి జంతువునూ నోటికొచ్చినట్లు తిట్టసాగింది. ఆశ్రమంలోని విద్యార్థులను కూడా అకారణంగా దూషించేది. ఒకరోజు తనకు మేత వేయడం ఆలస్యమైందని మహర్షిని కూడా తిట్టింది. దాంతో మహర్షికి కోపం వచ్చి మరలా దానికి మాట రాకుండా చేశాడు.
కాబట్టి ఎవరి స్థాయిని వారు మరువకూడదు.

2. “మూగజీవులను ప్రేమించాలి’ అన్న అంశాన్ని ప్రజలకు తెలియచెపుతూ ఒక కరపత్రం రాయండి.

మూగజీవులను ప్రేమించాలి

ప్రజలారా!
సృష్టిలోని ప్రతి ప్రాణిలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత లుంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువుల విషయంలో మనం ప్రేమానురాగాలను చూపించాలి. మనింట్లో ఒక ఆవో గేదో ఉందనుకుందాం. అది మనతో 10, 15 ఏండ్ల పాటు కలిసి మెలసి ఉంటుంది. మనకు ఒకరకంగా జీవనోపాధినిస్తుంది. తరువాత అది పాలివ్వటం లేదని కటికవానికి అప్పగించకూడదు. నాలుగు గడ్డిపరకలు వేస్తే దాని జీవనం అది గడుపుతుంది. అంతకన్నా మూగజీవాలు మనల్ని ఏమీ కోరవు. వాటి మూగ వేదనను రోదనను భరించవలసిన పని మనకేమిటంటే ఇక మానవత్వం ఎక్కడున్నది.

ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూడండి. అవి మనకు ఏ హాని చేయవు. వాటిని ప్రేమిస్తూ నాలుగు గింజలను వాటికోసం ఉంచండి. మనకు పోయేదేంలేదు. దారి వెంట తనదారిన తాను పోతున్నా తొండల మీద పక్షుల మీద రాళ్ళను విసరటం మానుకోవాలి. అవి గాయపడితే మనకేం లాభం. కాబట్టి మూగజీవాలను ప్రేమతో ప్రేమించండి. ప్రేమిస్తారు కదూ!

ఇట్ల
జీవావరణ పరిరక్షణ కమిటీ,
వరంగల్.

V. పదజాల వినియోగం:

1. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

ఉదా : వృషభం పరమేశ్వరుడి వాహనం.

(అ) పిల్ల మనసులో ఏముంటుందో తల్లి పసికడుతుంది
జవాబు. వృషభం = ఎద్దు.

(ఆ) కన్నన్ ఠీవిగా నడుస్తూ వుంటే అందరూ మురిసిపోయేవారు.
జవాబు. పసికట్టు = కనిపెట్టు

(ఇ) మనిషిని అసహనం ఇబ్బందులకు గురిచేస్తుంది.
జవాబు. ఠీవిగా = దర్జాగా

(ఈ) పశువులు మేతకు మాడితే ఇంటికి అరిష్టం దాపురిస్తదని రైతుల నమ్మకం.
జవాబు.
అరిష్టం = కీడు

కింది వాక్యాలను చదివి సమానార్థం వచ్చే పదాలను గుర్తించి, వాటి కింద గీత గీయండి.

(అ) రైతు హృదయం దహించింది. కన్నన్ తన ఎదలో బాధను దాచుకున్నాడు. వీరి ఎడదను ఓదార్చేదెవరు?
జవాబు.
హృదయము, ఎద, ఎడద

(ఆ) పక్షులు ఆకలిని తీర్చుకోవటానికి సంచరిస్తాయి. కొంగలు క్షుద్బాధ కోసం చెరువును ఆశ్రయిస్తాయి. ఇక ప్రజలు బుభుక్షను తీర్చుకోవడానికి పనిచేస్తారు.
జవాబు.
ఆకలి, క్షుద్బాధ, బుభుక్ష

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

(ఇ) పంటలు చేతికొచ్చినందుకు రైతులు సంబరపడ్డారు. వారి పిల్లలు సంతోషంతో గంతులు వేశారు. వారి కుటుంబమంతా ఆనందంగా గడిపింది.
జవాబు.
సంబరం, సంతోషం, ఆనందం

3. కింది గీత గీసిన పదాలకు గల వేర్వేరు అర్థాలు (నానార్థాలు) రాయండి.

(అ) తూర్పు దిక్కు వెళ్తున్న భక్తులు మాకు దేవుడే దిక్కు అంటూ వేడుకొంటున్నారు.
జవాబు.
దిక్కు = దిశ, శరణము, వైపు

(ఆ) రాజేశ్ ఉత్తరం వైపున ఉన్న పోస్టాఫీసుకు వెళ్ళి ఉత్తరం తెచ్చాడు. ఎందుకు తెచ్చావని తండ్రి అడిగితే ఉత్తరమివ్వ లేదు.
జవాబు.
ఉత్తరము = దిక్కు, లేఖ, జవాబు.

4. కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.

ప్రకృతి(ఏ)వికృతి
1. మేఘం(ఊ)(అ) అచ్చెరువు
2. హృదయం(ఎ)(ఆ) ప్రేముడి
3. పశువు(అ)(ఇ) రాతిరి
4. ఆశ్చర్య(ఐ)(ఈ) మొగము
5. తోష(ఒ)(ఉ) అబ్బురం
6. దీపం(ఆ)(ఊ) ఎద
7. ప్రేమ(ఓ)(ఎ) పసరం
8. సహాయం(ఈ)(ఏ) మొగులు
9. ముఖము(ఉ)(ఐ) సంతసం
10. అద్భుతం(ఇ)(ఒ) దివ్వె
11. రాత్రి(ఏ)(ఓ) సాయం

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది సంధులను విడదీసి, సంధి పేర్లను రాయండి.

దూపమువిసంధిసవర్ణదీర్ఘసంధి
1. ప్రేమూనురాగాలుప్రేమ + అనురాగాలుగుణసంధి
2. ఆనందోత్సాహాలుఆనంద + ఉత్సాహాలుఅత్వసంధి
3. ఇంకెవరుఇంక + ఎవరుఅత్వసంధి
4. ఎక్కడయనాఎక్కడ + ఐనాఇత్వసంధి
5. ఏమున్నదఏమి + ఉన్నదిఉత్వసంధి
6. చేతులెట్లాచేతులు + ఎట్లాఇత్వసంధి
7. పైకెత్తిపైకి + ఎత్తిఉత్వసంధి
8. మరెక్కడమరి + ఎక్కడఉత్వసంధి
9. సారమంతాసారము + అంతఉత్వసంధి
10. ఆలస్యమయ్యంందిఆలస్యమ + అయిందిగుణసంధి
11. దుర్ళరమైనాదర్భరయు + ఐనసవర్ణదీర్ఘసంధి
12. రామేశ్వరంరామ + ఈశ్వరంగుణసంధి


2. కింది సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి.

సమాసపదంవిగ్రహవాక్యంసమాసంపేరు
(అ) కీళ్ళ నొప్పులుక్ళీళ్ళ యొక్క నొప్పులుషష్ఠీతత్పురుష సమాసము
(ఆ) తల్లీ కూతుళ్ళూతల్లియును కూతురునుద్వంద్ససమాసము
(ఇ) దయా హృదయందయతో కూడిన హృదయంతృతీయ తత్పురుష సమాసము
(ఈ) భూమి శిస్తుభూమి యొక్క శిస్తుషష్ఠీ తత్పురుష సమాసము
(ఉ) రాతింబవళ్ళ్రాత్రియును పగలునుద్వంద్వ సమాసము
(ఊ) పది సంవత్సరాలుపది సంఖ్యగల సంవత్సరాలుద్విగు సమాసము
(ఎ) నలుదిక్కులునాలుగు సంఖ్యగల దిక్కులుద్విగు సమాసము

భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

ప్రశ్న 1.
నిత్యజీవితంలో జంతువులు, పక్షులపైన ప్రేమ చూపించే సంఘటనలు మీరు చూసినవి లేదా విన్నవాటి గురించి నివేదిక రాయండి.
జవాబు.
నిత్య జీవితంలో జంతువులు పక్షులపైన (పేమ చూపించే సంఘటనలు కోకొల్లలు. వాటిలో నాకు తెలిసిన కథ వివరిస్తాను. బౌద్ధమతం బుద్ధునిచే ప్రారంభించబడింది. అది ‘అహింసో పరమోధర్మః’ అని ర్రబోధించింది. బుద్ధుడు చిన్నతనంలో ఒకానాక రోజున ఉద్యానవనంలో విహరిస్తుండగా హంసలు ఆ వనంలో హాయిగా అటుఇటు తిరుగుతున్నాయి. బుద్ధుని అన్న కుమారుడు ఆ హంసలలో ఒకదానిని బాణంతో కొట్టాడు.

ఆ హంస బుద్ధుని వద్దకు వచ్చి పడిపోయింది. అపుడు బుద్ధుడు ఆ హంస శరీరంలో గుచ్చుకున్న బాణాన్ని తీసి తన వస్తాన్ని చించి కట్టుకట్టి సంరక్షించాడు. ఆ హంసను నేను వేటాడాను; అది నాది నాకిమ్మని పట్టుపట్టాడు అన్న కుమారుడు. బుద్ధుడు అందుకు ఒప్పుకోలేదు. వారి తగవు రాజు వద్దకు చేరింది. రాజు వారిద్దరి వాదనలు విని హంసను [పేమతో రక్షించిన వాడు బుద్ధుడు కావున అది బుద్ధునిదేనని తీర్పు ఇచ్చాడు. (పేమించిన వానిదే ప్రాణి కాని హింసించిన వానిది కాదని ఈ కథలోని నీతి.

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

ప్రశ్న 2.
వివిధ జంతువులు / పక్షులు పెంపకం దారుల వద్దకు వెళ్ళి, ఆయా జంతువుల / పక్షుల పెంపకంలో ఎలాంటి శ్రద్ధ కనబరుస్తున్నారో తెలుసుకొని నివేదిక రాయండి.
జవాబు.
సంప్రదించిన వ్యక్తులు

  1. డేవిడ్ – కెన్నెల్ నిర్వాహకులు
  2. న్నూభాయ్ – పావురాల ప్రేమికుడు
  3. కిరణ్ – కుక్కపిల్ల (జూలీ) ని పెంచుకుంటున్న స్నేహితుడు
  4. రంగమ్మత్త – పిల్లికూనను పెంచుకుంటున్న పక్కింటి అత్తమ్మ 5. రామయ్య – ఆవును సాదుకుంటున్న పశుప్రేమికుడు
  5. సలీం అలీ – పక్షుల సంరక్షకుడు
  6. శ్రావణి – లవ్బర్డ్స్ని పెంచుతున్న ఒక అమ్మాయి.
  7. సురేందర్ – ఆక్వేరియంలో చేపపిల్లలను పెంచుతున్న మిత్రుడు

ఈవిధంగా మన చుట్టూ సమాజంలో ఉన్న రకరకాల జంతుప్రేమికులను, పక్షుల ప్రేమికులను, చేపల ప్రేమికులను సంప్రదించిన తర్వాత అనేక విషయాలు తెలిశాయి. వివిధ రకాల పశుపక్ష్యాదుల పెంపకం మనలో జీవకారుణ్యాన్ని పెంపొందించడమే గాక, బాధ్యతను, సహానుభూతినీ, క్రమశిక్షణనూ నేర్పిస్తాయనీ తెలుసుకున్నాను. వాళ్ళ అనుభవాలూ అనుభూతులూ ఒక కొత్త ప్రపంచంలో విహరింపజేశాయి.

నివేదిక :

మనుషులకు దగ్గరై, వాళ్ళతో చక్కని అనుబంధాన్ని పెంచుకొని, విశ్వాసాన్ని, ప్రేమను ప్రకటిస్తూ మనసులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పెంచే జంతువులూ, పక్షులూ మనచుట్టూ ఉన్నాయని, వాటి రక్షణ, పోషణ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలుసుకున్నాను. ముఖ్యంగా మూగజీవుల మనోవేదనను, స్పందనను బాగా అర్థం చేసుకోవడానికి ఈ పెంపకం ఉపకరిస్తుందనీ గ్రహించాను.

మనకు ఇష్టమైన పక్షినో, జంతువునో పెంచుకోవాలనుకున్నప్పుడు వాటిని చిన్న వయస్సులో ఉండగానే తెచ్చుకోవాలి. అట్లా తెచ్చుకోవడానికి ముందే వాటికి సంబంధించిన ఆహారపు అలవాట్లు, రక్షణ, భద్రత, పోషణకు సంబంధించిన అన్ని విషయాలూ కూలంకషంగా తెలుసుకోవాలి.

కొన్ని కొన్ని పక్షులకు / జంతువులకు ప్రత్యేకమైన ఆహారం, ఇష్టమైన ఆహారం ఉంటుంది. ఉదాహరణకు పావురాలకు జొన్నలంటే ఇష్టం. అదే లవ్బర్స్కైతే కొర్రలు ఇష్టమైన ఆహారం. పిల్లులూ కుక్కలు కూడా పాలన్నా, మాంసాహారమన్నా ఇష్టపడతాయి. కుక్కలకు రొట్టెలు ఇష్టం. పిల్లులకు పెరుగన్నం ప్రీతిపాత్రం. చేపలకు నిర్దేశించిన ఆహారం ఎక్కువైతే విషతుల్యమౌతుంది.

అవి నివసించే పరిసరాలు శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండాలి. పిల్లులు, కుక్కలకు మల విసర్జన కోసం బయటికి తీసుకెళ్ళే అలవాటు చేయాలి. పావురాలు, లబ్బర్డ్స్ తమ గూళ్ళను, పంజరాన్నీ బాగా మలిన పరుస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పిల్లులకు, కుక్కలకు తరచూ స్నానం చేయిస్తుండాలి. ఆవులు కూడా స్నానానికి ఇష్టపడతాయి. ఎద్దులు అంతగా ఇష్టపడవు. చేపల అక్వేరియంలు తొందరగా మురికి అయిపోతుంటాయి. వాటిని 10-15 రోజులకొకసారి శుభ్రం చేయాలి.

పశువులు, పక్షులు సరిగ్గా నిద్రపోకున్నా, వాటి అరుపుల్లో తేడా వచ్చినా, నీరసంగా కనిపించినా వెంటనే వాటికి సంబంధించిన వైద్యులకో, అనుభవజ్ఞులకో చూపించి తగిన వైద్య సహాయం అందించాలి. అవి మూగజీవులు భాషను అవి అర్థం చేసుకుంటాయి. కాని వాటి భాషనే మనం అర్థం చేసుకోలేం. తగినంత శ్రద్ధ, పరిశీలన ఉంటే కనీసం వాటి మనోభావాలను అర్థం చేసుకొని, తగిన విధంగా స్పందించగలుగుతాం.

జీవులన్నీ స్వేచ్ఛను కోరుకుంటాయి. అందుకే వాటిని ఎప్పుడూ బంధించి ఉంచకూడదు. నగరాల్లో వాటిని స్వేచ్ఛగా వదిలేసే అవకాశం లేకుంటే కనీసం రోజుకొక్కసారైనా బయటి ప్రపంచంలో తిప్పడం మంచిది. లవ్బర్డ్స్ పెద్దవయ్యాక వాటిని పంజరంలో నుండి స్వేచ్ఛగా వదిలేయాలి. ఈవిధంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకొని వాటిని పోషించడమేగాక, వీలైనంత సమయం వాటితో గడిపితే వాటికీ, మనకూ ఆనందంగా ఉంటుంది. మూగజీవులను స్వచ్ఛంగా ప్రేమించేవాళ్ళు సాటి మనుషులతో సఖ్యంగా నివసించగల్గుతారు.

TS 8th Class Telugu 12th Lesson Important Questions మాట్లాడే నాగలి

పర్యాయపదాలు:

  • రైతు = కృషీవలుడు, కర్షకుడు
  • లోకము = ప్రపంచము, జగత్తు
  • రాజు = చక్రవర్తి, భూపాలకుడు
  • కళ్ళు = నయనము, నేత్రములు
  • స్నేహితుడు = మిత్రుడు, నేస్తము
  • చెట్టు = తరువు, వృక్షము
  • భూమి = ఇల, ధరణి
  • పండుగ = ఉత్సవము, సంబరము

నానార్థాలు:

  • రాజు = చంద్డు, భూపాలుడు
  • ఊరు = గ్రామము, గ్రవించు
  • స్నేహితుడు = చెలికాడు, సూర్యుడు
  • అర్థము = శబ్దార్థము, ఏయోజనము

ప్రకృతిలు – వికృతిలు:

  • భాష – బాస
  • మనిషి – మనిసి
  • ప్రాణము – పానము
  • కష్టము – కస్తి
  • ఆశ – ఆస

సంధులు:

బహ్మాండమైన – బబ్మాండము + ఐన = ఉత్వసంధి
చిత్రమైన – చిత్రము + ఐన = ఉత్వసంధి
గొంతెత్తి – గొంతు + ఎత్తి = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడ సంధి అవుతుంది.

పత్యక్షము = పత్రి + అక్షము = యణాదేశసంధి
సూ(త్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనప్పుడు య, వ, ర లు ఆదేశమవుతాయి.

చెప్పినదంతా = చెప్పినది + అంత = ఇత్వసంధి
సూత్రం : క్రియా పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికము అవుతుంది.

(పేమానురాగాలు = ప్రేమ + అనురాగాలు = సవర్ణదీర్ఘసంధి
సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమవుతుంది.

ఆనందోత్సాహాలు = ఆనంద + ఉత్సహాలు = గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋలు పరమైతే (క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశమవుతాయి.

సమాసాలు:

అరటి చెట్టు – అరటి అనుపేరుగల చెట్టు = సంభావనా పూర్వపద కర్మధారయము
[పేమానురాగాలు – చేమయును, అనురాగమును = ద్వంద్వ సమాసము
మంచి భూమి – మంచిదైన భూమి = విశేషణపూర్వపద కర్మధారయము
మధ్యాహ్నము – అహ్నం యొక్క మధ్య భాగము = (ప్రమా తత్పురుష సమాసము

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి

చదవండి ఆలోచించండి – చెప్పండి.

ఈ విశ్వంలో, ఈ భూమండలంలో, ఈ జీవనచక్రంలో మనకంత ప్రాధాన్యముందో ….. ఓ చీమకు, ఓ దోమకు, ఓ ఈగకు, ఓ బూగకు, ఓ తేనెటీగకు, ఓ గద్దకు చివరకు ఓ నత్తకూ, ఓ ఏీతకూ కూడ 5ాస్త అటు ఇటుగా అంతే ప్రాధాన్యం ఉందని తేలిపోయింది. సమస్యేమిటంటే ఉన్నత జీవులం కావటంతో మనకు తెలివి ఎక్కువనుకుంటాం. కాని ఆ తెలివిని మనం వినాశానికి ఉపయోగిస్తున్నామనుకోం. నాటి వేటకాలం నుంచీ నేటి పారిశ్రామిక యుగం వరకూ మనం ఇతర జీవులనూ, ఈ ప్రకృతిలోని జీవవైవిధ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఫలితం – ఇప్పుడు ఈ భూమ్మీద మన ఆస్తిత్వమే ఆయోమయంలో పడింది.

పాఠ్యభాగ ఉద్దేశం:

ప్రాణులకు – ముఖ్యంగా పెంపుడు జంతువులకూ సంవేదనలుంటాయనీ, మనం చూపే (పేమ, ఆప్యాయతలకు అవి స్పందిస్తాయనీ చెహ్తూ, తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపచేయటం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు: 

ప్రశ్న 1.
అనువాద ప్రక్రియ గురించి రాయండి.
జవాబు.
ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్లైతే దాన్ని అనువాదం (Translation) అంటారు. తెలుగు సాహిత్యంలో దీనిని ‘అనువాద ప్రక్రియ’గా పేర్కొనటం జరుగుతున్నది. సాహిత్య అకాడమీ వారు ముద్రించిన “భారతీయ సాహిత్యం – సమకాలీన కథానికలు” అనే (్రంథంలోని మలయాళ భాషలోని అనువాదకథ ప్రస్తుత పాఠ్యాంశం. మలయాళ భాషలో పొన్కనన్నం వర్కెయ్ రాసిన కథను తెలుగులోకి ఎన్. వేణుగోపాలరావు అనువాదం చేశాడు.

రచయిత పరిచయం:

రచయిత పేరు : పొన్కున్నం వర్కెయ్
పాఠ్యభాగం పేరు : మాట్లాడే నాగలి
కాలం : 1910 – 2004
రచనలు : 24 కథానికా సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు ఒక వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి.

ప్రవేశిక:

ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిలో [పేమ, ఆప్యాయతలు ఉంటాయి. మానవ సమాజంలో తన కుటుంబంతో ఎంతో మమైకమై సహజీవనం చేస్తున్న మూగజీవులను అనుకోని పరిస్థితులలో దూరం చేసుకొని, తిరిగి ఎప్పుడో కలుసుకున్నప్పుడు మనస్సు ఎంతగా స్పందిస్తుందో ‘ఓసెఫ్ – కన్నన్” ద్వారా తెలుస్తుంది. ఇంతకూ ఓసెఫ్ ఎవరు ? కన్నన్ను ఏ విధంగా చూసుకునేవాడు అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం.

కఠిన పదాలకు అర్థాలు:

  • దివి = ఆకాశము
  • ముచ్చటపటడు = ఇష్టపడు
  • ఘోరము = సహించలేనిది
  • బృందము = సమాయాయు
  • మాధుర్యము = తీయనైన
  • స్వరాలు = చప్పుళ్ళు
  • తాకట్టు = కుదవపెట్టు
  • నిష్ఫలం = ఫలము లేనిది
  • దినము = రోజు
  • విపరీతంగా = ఎక్కువగా
  • స్సౌఖ్యము = సుఖము
  • చరమదశ = చివరిదశ
  • సంబరము = పండుగ
  • కార్యము = పని
  • ధరణి = భూమి
  • వృషభం = ఎద్దు
  • ఠీవి = హుందా, వైభవం
  • పాన్ = కిళ్ళీ
  • పోగు = కుప్పవేయు
  • అరిష్ఠం = కీడు
  • పురి = పింఛం
  • పరిరక్షించు = కాపాడు
  • డగ్గుత్తిక = బాధతో పూడుకుపోయిన గొంతుతో

నేనివి చేయగలనా?

TS 8th Class Telugu 12th Lesson Questions and Answers Telangana మాట్లాడే నాగలి 1

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 6th Lesson తెలుగు జానపద గేయాలు Textbook Questions and Answers.

తెలుగు జానపద గేయాలు TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana

చదువండి ఆలోచించి చెప్పండి.

చిక్కుడు పూసే చిక్కుడు కాసే తీగో నాగో ఉయ్యాలో
చిక్కుడు తెంపా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
చిక్కుడు తెంపా సీరాములు లేరా తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా సీతమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో
బీరలు పూసే బారలు కాసే తీగో నాగో ఉయ్యాలో
బీరలు తెంపా శివయ్య లేడా తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
కొంగూలు పట్టా పార్తమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో

ప్రశ్నలు

ప్రశ్న 1.
ఈ గేయం దేన్ని గురించి చెప్తుంది ?
జవాబు.
ఈ గేయం తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలను గురించి చెప్తుంది.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

ప్రశ్న 2.
ఈ గేయాన్ని ఏమంటారో తెలుసా ?
జవాబు.
తెలుసు. ఈ గేయాన్ని జానపదగేయం అంటారు.

ప్రశ్న 3.
ఇట్లాంటి మరికొన్ని గేయాలు పాడండి.
జవాబు.
గోగులు పూచే గోగులు కాసే తీగో నాగో ఉయ్యాలో
నారలు తియ్యా ఎవ్వరు లేరూ తీగో నాగో ఉయ్యాలో
నారలు తీయా వీరులు లేరా తీగో నాగో ఉయ్యాలో
వాగులు పొంగే వంకలు పొంగే తీగో నాగో ఉయ్యాలో
దారులు చెయ్యా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
దారులు ఇయ్యా ఏరులు లేవా తీగో నాగో ఉయ్యాలో

ప్రశ్న 4.
ఇట్లాంటి గేయాల గొప్పతనం ఏమిటి ?
జవాబు.
ఇట్లాంటి గేయాలు తెలుగువారి ఆచార సంప్రదాయాలనూ, చరిత్రను, గొప్పదనాన్ని తెలియజేస్తాయి.

ఆలోచించండి – చెప్పండి (Text Book Page No.59)

ప్రశ్న 1.
ఈ తెలుగు జానపద గేయ చరిత్ర ప్రాచీనమైనదని ఎట్లా చెప్పగలం ?
జవాబు.
మానవ సమాజం తాము పడే శ్రమను మరచిపోవడానికి సృష్టించుకొన్న కళే గేయం. ఈ గేయ సాహిత్యం భాష పుట్టినప్పటి నుంచే ఉండే అవకాశం ఉంది. రాసే పనిలేకుండా నోటి ద్వారానే ఒకతరం నుంచి మరొక తరానికి జానపదులు పాడుకుంటున్న ఈ గేయాల చరిత్ర ఎంతో ప్రాచీనమైనది. భాష పుట్టిన చాలా ఏళ్ళకు కానీ దాన్ని రాయడానికి అవసరమైన లిపి పుట్టదు. అందువల్ల లిపి అవసరం లేకుండా ఆనోటా ఆనోటా ప్రచారం అవుతున్న జానపద గేయచరిత్ర ప్రాచీనమైనదని చెప్పవచ్చు.

ప్రశ్న 2.
పౌరాణిక గాథలపై గ్రామీణులకు ఉండే భక్తి భావం ఎట్లాంటిది ?
జవాబు.
పౌరాణిక గాథలపై గ్రామీణులకు ఉండే భక్తి మెచ్చుకోదగినది. జానపద గేయాలలో దాదాపు ప్రసిద్ధ పౌరాణిక గాథలు అన్నీ ఉండటం వారి భక్తికి నిదర్శనం. రామాయణం, భారతం, భాగవతం మొదలైన పురాణాలలోని అమూల్యమైన ఉపదేశాలను జానపదులు గేయాలలో తమకు నచ్చిన విధంగా మలచుకున్నారు.

ప్రశ్న 3.
“ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైనా చేవగలదే” – దీనిని ఏ సందర్భంలో వాడారు. దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారు?
జవాబు.
తెలుగు వారు నివసించే ప్రాంతం వీరులకు నిలయమనే విషయాన్ని చెబుతున్న సందర్భంలో దీనిని వాడారు. తెలుగు భూమి మీద పుట్టిన చిగురు కొమ్మ కూడా బలంగా ఉంటుంది అని దీని అర్థం. అంటే పని పిల్లలకు కూడా పౌరుషం ఉంటుంది అని భావం. దేశక్షేమం కోసం, తమ జాతి రక్షణ కోసం పసిపిల్లలు కూడా పోరాటానికి వెనకాడరని తాత్పర్యం.

ఆలోచించండి – చెప్పండి (Text Book Page No.61)

ప్రశ్న 1.
వీరగీతాల ధ్యేయం వేరు. ఇతర జానపదగేయాల ధ్యేయం వేరు. దీనిని వివరించండి.
జవాబు.
వీరగీతాలు వీరత్వాన్ని, దేశభక్తిని చాటుతాయి. వీటిలో వీర రసం ప్రధానంగా ఉంటుంది. కనుకనే వీటిని వీరగీతాలు అని అంటారు. వీటినే చారిత్రక గేయాలు అని పిలుస్తారు. ఈ వీరగీతాలకు సంబంధించిన సన్నివేశాలను కనులారా చూసినప్పుడు, చెవులారా విన్నప్పుడు జానపదుడు ఉద్వేగంతో గానం చేసి వినిపిస్తాడు. ఇలా వీరగేయాలు జానపదగేయాలు అవుతాయి. జానపదగేయాల్లో స్త్రీల పాటలు, శ్రామిక గేయాలు కూడా భాగాలే. వీరగేయాల్లో కేవలం వీరరసమే ప్రధానం.

ప్రశ్న 2.
భక్తిగీతాలు కొందరికి జీవనోపాది. ఎట్లాగో చెప్పండి.
జవాబు.
తెలుగునాట భక్తిపాటలలో భద్రాచల రామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు ఎంతో ప్రసిద్ధమైనవి. ఇటువంటి భక్తిగీతాలు పాడుకుంటూ జంగంవారు, హరిదాసులు తమ జీవనాన్ని సాగించుకుంటున్నారు.

ఆలోచించండి – చెప్పండి (Text Book Page No.62)

ప్రశ్న 1.
ఈ ‘నిష్కపటము, నిర్మలమైన హృదయం కలిగి ఉండడం అంటే ఏమిటి ?
జవాబు.
నిష్కపటం అంటే మోసం చేయాలనే ఆలోచనలు లేకపోవటం. నిర్మలం అంటే చెడు ఆలోచనలు లేకపోవడం. నిష్కపటము, నిర్మలము అయిన హృదయం కలిగి ఉండడం అంటే మోసం చేయాలనే ఆలోచనగానీ, చెడ్డ ఆలోచనలుగానీ లేని ‘స్వచ్ఛమైన మనసు’ కలిగి ఉండడం అని అర్థం.

ప్రశ్న 2.
ఆ జానపదగేయాలు ప్రచారానికి అత్యుత్తమ సాధనం. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు.
జానపదగేయాలు వేల సంవత్సరాల నుంచీ ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని కలిగిస్తూ ఆనోటా ఆనోటా ప్రచారం అవుతూ ఉంటాయి. పని పాటలు చేసుకొని జీవించే చదువుకోని వారిని ఈ జానపదగేయాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. అందువల్ల ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య జాగ్రత్తలు మొదలైన ప్రజాసంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ఈ జానపద గేయాలు ఎంతో ఉపకరిస్తాయి.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

ప్రశ్న 3.
జానపద గేయ సంపదను రక్షించుకోవడానికి ఏం చేయాలి ?
జవాబు.
జానపదగేయం సంపదపై విస్తృతంగా వివిధ కోణాలలో పరిశోధనలు జరగాలి. అమూల్యమైన గేయాలను యుద్ధ ప్రాతిపదికన సేకరించాలి. జానపదగేయాల గొప్పదనాన్ని ప్రచారం చేయాలి. సేకరించిన వాటిని తగిన రీతిలో భద్రపరచాలి. వాటికోసం ప్రత్యేక అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలి. గేయ సాహిత్యాన్ని, వాటికి సంబంధించిన విశేషాలను అందరికీ అందుబాటులోకి తేవాలి.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. “జానపదగేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమదర్పణం” – చర్చించండి.

జవాబు.
పండితులైన కవులు దీక్ష పూని చేసే కావ్యం, శతకం, ప్రబంధం వంటి రచనలు శిష్టరచనలు. గ్రామీణ ప్రాంత ప్రజలు రోజంతా పనులు చేసుకుంటూ ఆ పని వల్ల కలిగే శ్రమను మరచిపోవడానికి అప్పటికప్పుడు తామే రచించుకొని లయబద్ధంగా పాడుకొనే పాటలే జానపదగేయాలు. శిష్ట రచనల్లాగే ఈ గేయాలన్నీ దాదాపుగా రామాయణం, భారతం, భాగవతం మొదలైన గ్రంథాలలోని ప్రసిద్ధ కథలకు సంబంధించినవే. శిష్ట సాహిత్యాన్ని చదువుకున్న వారు మాత్రమే చదువుకో గులుగుతారు. కానీ జానపదుల గేయాలు లయాత్మకంగా ఉండి పండితులనూ, పామరులనూ అలరిస్తాయి. ఈ గేయాలలో తెలుగు వారి దైనందిన జీవితం కనిపిస్తుంది. తెలుగువారి ఆచారాలు, సంప్రదాయలతో ఈ గేయాలు నిండి ఉంటాయి. అందువల్ల తెలుగువారి నాలుకలపై నిత్యం నర్తించే జానపదగేయాలు తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణాలు అని చెప్పవచ్చు.

2. మీకు తెలిసిన జానపద గేయాలు పాడండి. వాటి గురించి మాట్లాడండి.

జవాబు.
“చీరలొచ్చినాయి మామ కట్టమిందికి!
మంచి చీరలొచ్చినాయి మామ కట్టమిందికి!”
“ఊరుకోండు! ఊరుకోండు!
నీకు కట్టను చాతగాదు ఊరుకోండు!”
“రవికలొచ్చినాయి మామ కట్టమిందికి! మంచి రవికలొచ్చినాయి మామ కట్టమిందికి!”
“ఊరుకోండు! ఊరుకోండు!
నీకు తొడగను చాతకాదు ఊరుకోండు!”
“పూవులొచ్చినాయి మామ కట్టమిందికి!
మల్లెపూవు లొచ్చినాయి మామ కట్టమిందికి!”
“ఊరుకోండు! ఊరుకోండు!
నీకు ముడవను చాతకాదు ఊరుకోండు!”

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1 కింద ఇచ్చిన అంశాల పేరా సంఖ్య. ఆ అంశాలకు సంబంధించిన కీలక విషయాలను పట్టికలో రాయండి.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు 1
జవాబు.

అంశంపేరా సంఖ్యకీలక (ముఖ్యమైన) విషయాల
పౌరాణిక గేయాలు58వ పుటలో 4వ పేరాజానపద గేయాలలో ప్రసిద్ధ పౌరాణిక గాథలు
చారిత్రక గేయాలు59వ పుటలో 2వ పేరావీర గీతాల స్వరూప స్వభావాలు
శ్రామిక గేయాలు61వ పుటలో 1వ పేరాజానపదగేయాల పుట్టుక నేపథ్యం
పిల్లల పాటలు61వ పుటలో 2వ పేరాపిల్లల పాటల్లోని స్వచ్ఛత, మార్దవ గుణాలు


2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు వారి సాహిత్యమే. బడిలో చదివే చదువు కొంతే. సమాజం నుంచి నేర్చుకొనే చదువు కొండంత. పసి పిల్లలు ఆటలాడకుంటే వాళ్ళ మనస్సు చెడుతుంది. దేహ ఆరోగ్యం చెడుతుంది. శారీరక శిక్షణ అన్నది జానపదులు తమకుతామే సహజంగా నేర్చుకున్నదేగాని ఒకరు నేర్పింది కాదు. పసిపిల్లలకు పెద్దలు చెప్పే కథలవల్ల వినోదమే కాక విజ్ఞానం కూడా లభిస్తుంది. అనేక విషయాలను వారు ఆలోచించేటట్లు చేస్తాయి. ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి. పొడుపుకథలు జానపదుల బుద్ధికి పదునుపెట్టే సమస్యలు. ముక్తపదగ్రస్త్రాలు పదజ్ఞానానికి సాటి అయింది మరొకటిలేదు. ఇవి జానపదులకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి, వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతాయి. సంస్కృతికి సంబంధించిన విషయాలు కాలగర్భంలో కలిసిపోకుండా ఈ జానపద సాహిత్యం కాపాడుతుంది.

అ) జానపదులు సహజంగా నేర్చుకున్నది ఏమిటి ?
జవాబు.
జానపదులు సహజంగా నేర్చుకున్నది శారీరక శిక్షణ.

ఆ) పెద్దలు చెప్పే కథల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనం ఏమిటి ?
జవాబు.
పెద్దలు చెప్పే కథల వల్ల పిల్లలకు వినోదమే కాక విజ్ఞానం కూడా లభిస్తుంది.

ఇ) పిల్లలు ఎక్కువ చదువు నేర్చుకొనేది ఎక్కడ ?
జవాబు.
పిల్లలు ఎక్కువ చదువు నేర్చుకొనేది సమాజం నుంచే.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

ఈ) జానపద సాహిత్యం దేనికి హేతువు ?
జవాబు.
జానపద సాహిత్యం జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు.

ఉ) పొడుపు కథలు, ముక్తపదగ్రస్త్రాలు – వీటి ప్రత్యేకత ఏమిటి ?
జవాబు.
పొడుపు కథలు జానపదుల బుద్ధికి పదునుపెట్టే సమస్యలు. ముక్తపదగ్రస్త్రాల్లా పదజ్ఞానానికి సాటి అయింది మరొకటి లేదు.

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) జానపదగేయాలను ఎందుకు భద్రపరచాలి ?
జవాబు.
ప్రజల నోటి నుండి అప్రయత్నంగా వెలువడిన జానపద గేయాలలో చక్కటి శిల్పం కానవస్తుంది. ఈ గేయ సంపదను భద్రపరచి విశ్లేషించి, పరిశీలించడం ఎంతైనా అవసరం. తెలుగు భాషా సంస్కృతుల చరిత్ర ఎంత ప్రాచీనమైనదో తెలుగు జానపద గేయ చరిత్ర కూడా అంత ప్రాచీనమైనది. జానపదగేయాలకు సాహితీపరమైన విలువ మాత్రమే కాకుండా సాంఘిక, సాంస్కృతిక, భాషా విషయక ప్రాధాన్యత కూడా ఉన్నది. నిఘంటువుల్లో లేని ఎన్నో అందమైన నుడికారాలు, పదాలు, ప్రయోగాలు వాటిలో కనుపిస్తాయి. అంతేకాక వాటిలో రమణీయమైన స్థానిక గాథలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల జానపద గేయాలను భద్రపరచాలి.

ఆ) జానపదగేయాల్లో రామాయణ సంబంధమైన గేయాలు ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి ?
జవాబు.
భారతీయ సంస్కృతికి తలమానికమైన రామాయణ మహాకావ్యం ముఖ్యమైనది. ప్రాచీనమైనది. తెలుగువారి జానపద గేయాలలో కథా వస్తువులలో దాదాపు ప్రసిద్ధ పౌరాణిక గాథలే ఎక్కువ. పురాణాలలోని అమూల్యమైన ఉపదేశాలను చదువుకుని అర్థం చేసుకోలేని గ్రామీణులు వాటిని జానపద గేయాలుగా మలుచుకొని నేర్చుకుంటారు. విద్యావంతుల రచనలలో లాగానే జానపదుల గేయాలలో కూడా రామాయణ సంబంధ గేయాలే ఎక్కువగా ఉన్నాయి.

అంతేకాక ఈ రామాయణ సంబంధ కథలను జానపదులు తమ తమ అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం కూడా గమనించవచ్చు. అన్నదమ్ముల అనుబంధం, పిల్లలకు తల్లిదండ్రుల మాటపై గౌరవం, భార్యాభర్తల అనురాగం, రాజు ప్రజల అనుబంధం మొదలైన ఎన్నో కుటుంబ అనుబంధాలు, రాజ్యపాలన అనుభవాలు కలిగిన కథలు ఉండటం వల్ల జానపదగేయాల్లో రామాయణ సంబంధ గేయాలు ఎక్కువ ఉన్నాయి.

ఇ) “గృహజీవనంలో స్త్రీకి పురుషుని కంటె ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది” – దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు.
గృహజీవనంలో స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. భారతీయ కుటుంబ జీవనంలో ఇంటి యజమాని అయిన పురుషుడు కుటుంబ పోషణకోసం పొలంలోనో, పరిశ్రమలోనో, కొలువులోనో శ్రమచేసి సంపాదిస్తాడు. ఇల్లాలైన స్త్రీ భర్త శ్రమ చేసి తెచ్చిన సంపదను జాగ్రత్త చేస్తుంది. అర్థశాస్త్రవేత్తలా వాటిని అవసరాలకు వినియోగిస్తుంది. ఉత్తమ గృహిణిగా భర్త బాగోగులను చూసుకుంటుంది.

బిడ్డలను కనిపెంచి పోషించి ప్రయోజకులను చేస్తుంది. పెద్దలను సాకుతుంది. ఇంటిల్లిపాది ఆరోగ్యాలనూ కాపాడుతుంది. అయిన వాళ్ళను ఆదరిస్తుంది. అతిథులను గౌరవిస్తుంది. అవసరమైతే భర్తకు చేదోడుగా ఉంటూ తాను కూడా శ్రమపడి సంపాదిస్తుంది. తప్పని పరిస్థితులలో కుటుంబ భారాన్ని తానొక్కతే మోయడానికి సిద్ధమవుతుంది. అందువల్ల కుటుంబంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషించే స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది.

ఈ) శ్రామిక గేయాల ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు.
కవిత్వం కేవలం ఉల్లాసం కలిగించేందుకే కాక కష్టనివారణ కోసం కూడా ఉదయిస్తుంది. స్త్రీ పురుషులు కాయకష్టం చేస్తున్నప్పుడు శ్రమ కనబడకుండా ఉండేందుకు అలసట చెందకుండా ఉండేందుకు అప్రయత్నంగా వారి నోటి నుండి కూనిరాగాలు, మాటలు వెలువడతాయి. సామూహిక కర్తృత్వంలో ఇటువంటి రాగాలు మాటలు జానపద గేయాలుగా పరిణమించి క్రమంగా వ్యాప్తి చెందుతాయి.

పిండి విసరడం, ఇల్లు అలకడం, ధాన్యం దంచడం, నాగలి దున్నడం మొదలైన పనులు ఈ పాటలు పాడుతూ చేయడం వల్ల హృదయంలోనూ, మనస్సులోనూ ఉండే బాధ తొలగిపోవడమే కాక, శారీరక శ్రమ కూడా తెలియదు. శ్రామిక గీతాలకు వస్తువేదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు శ్రామికులు పాడుకుంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీరభాగాల కదలికలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఈ గీతాలకు తాళలయలు సమకూరుతాయి.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “స్త్రీల పాటల్లో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా కనిపిస్తుంది.” – ఎట్లాగో వివరించండి.
జవాబు.
1. పరిచయం : ఆచార్య బిరుదురాజు రామరాజు రచించిన తెలుగు జానపదగేయాలు అనే పాఠ్యభాగంలో అతి ప్రాచీనమైన ఎంతో ప్రసిద్ధమైన తెలుగువారి జానపదగేయాల గురించి అపూర్వంగా వివరించారు. జానపద గేయాలలోని రకాలు వివరిస్తూ స్త్రీల పాటల ప్రత్యేకతలను వర్ణించారు.

2. స్త్రీల పాటలు : గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి సంసార విషయాలకు సంబంధించిన కవితకు స్త్రీలే ఆలంబనం. వీటిని స్త్రీ పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికతపాలు ఎక్కువ. శిశుజననం పురస్కరించుకొని అనేక పాటలు పాడతారు. లాలి పాటలు, జోల పాటలు పాడి నిద్రపుచ్చుతారు. తల్లి తన కుమారుణ్ణి రాముడిగానో, కృష్ణుడుగానో, తన కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో, గౌరిగానో తలచుకొని ఈ పాటలు పాడుతూ ఆనంద తన్మయత్వం చెందుతుంది.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

3. సాంఘిక, సాంస్కృతిక జీవనం : స్త్రీలకు జరిపే ఆయా వేడుకలలో పాడే స్త్రీల పాటలు అన్నింటిలో తెలుగు వారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది. వీటిని పెళ్ళిపాటలు, ఇతర వేడుకల పాటలు అని రెండు అంశాలుగా తెలుసుకోవచ్చు.

4. పెళ్ళి పాటలు : స్త్రీ జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం పెండ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు, లాంచనాలు, పరిహాసాలు వర్ణిస్తూ, పెక్కు జానపదగేయాలు ఉద్భవించాయి. ఇవి పెండ్లిపాటలు. ఇవి కట్నములతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి. కట్నముల పాటలు, తలుపు దగ్గరపాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, ముఖము కడుగు పాటలు, కట్నాల పాటలు, అవిరేణి పాటలు, ఉయ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు వంటివన్నీ పెండ్లి పాటలే.

5. ఇతర వేడుకల పాటలు : సీతసమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీత వామనగుంటలు, సుభద్రసారె, రుక్మిణీదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైన ఆయా సందర్భాలలో పాడే పాటలు అతి రమణీయమైనవి.

ముగింపు : ఈ విధంగా స్త్రీ జీవిత కాలంలో జరిపే వివిధ వేడుకలలో పాడే సందర్భోచితమైన ఆయా పాటలలో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం అద్దంలా కనిపిస్తుంది.

ఆ) “జానపద గేయాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి” దీన్ని వివరిస్తూ రాయండి.

(లేదా)

జానపద గేయాల గొప్పతనం వివరించండి.
జవాబు.
1. పరిచయం : ఆచార్య బిరుదురాజు రామరాజు ‘తెలుగు జానపద గేయాలు’ అనే పాఠ్యభాగంలో జానపదగేయాలలో ప్రతిబింబించే మన సంస్కృతీ సంప్రదాయాలను అపూర్వంగా వివరించారు. మతపరమైన ఉద్యమాలు, వీరకృత్యాలు, మహాపురుషుల గాథలు, ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, వినోద సాధనాలు మొదలైన అంశాలతో తెలుగు ప్రజల జీవితమంతా జానపదగేయాలలో ప్రతిధ్వనిస్తుంది. ఈ గేయాలను పౌరాణిక, చారిత్రక, పారమార్థిక గేయాలు, స్త్రీలపాటలు, శ్రామిక గేయాలు, పిల్లలపాటలు, కరుణరసగేయాలు అనే విభాగాలలో రచయిత వివరించారు. పౌరాణిక

2. గేయాలు : ప్రసిద్ధ రామాయణం, భారతం, భాగవతం మొదలైన పురాణాలలోని గాథలన్నీ జానపద గేయాలలో ఉన్నాయి.
ఉదా : శాంతాకల్యాణం, పుత్రకామేష్టి, శ్రీరాముల ఉగ్గుపాట మొదలైనవి.

3. చారిత్రక గేయాలు : వీరరసం ప్రధానంగా ఉండటం వల్ల వీటిని వీరగీతాలు అని కూడా అంటారు. ఇవి వీరత్వాన్ని, దేశభక్తిని బోధిస్తాయి. ఉదాహరణకు మియాసాబ్కథ, సోమనాద్రికథ, రామేశ్వరరావుకథ మొదలైనవి.
పారమార్థిక గేయాలు : పారమార్థిక గేయాలకు భక్తిగీతాలని పేరు. జంగంవారు, హరిదాసులు ఈ భక్తిగీతాలు పాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదాహరణకు భద్రాచల రామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు మొదలైనవి.

4. స్త్రీల పాటలు : గృహ జీవనంలో స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. స్త్రీల పాటలలో లాలిపాటలు, జోలపాటలు, పెళ్ళిపాటలు, వివిధ ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, లాంఛనాలు, పరిహాసాలు తెలిపే మొదలైనవి ఉంటాయి. ఉదాహరణకు కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు మొదలైనవి.

5. శ్రామిక గేయాలు : పిండి విసరడం, ఇల్లు అలకడం, ధాన్యం దంచడం మొదలైన పనులకు, ఆయా వృత్తులకు సంబంధించి శ్రామికులు గేయాలు పాడుకుంటారు.

6. పిల్లల పాటలు : వీటిలో పిల్లల కోసం పెద్దలు రచించినవి కొన్ని కాగా పిల్లలు తమకు తామే సమకూర్చుకున్నవి మరి కొన్ని. ఉదాహరణకు చెమ్మచెక్క, కోతికొమ్మచ్చి మొదలైన ఆటలలో పాడే పాటలు.

7. కరుణరస గేయాలు : ఎరుకల నాంచారమ్మకథ, రాములమ్మపాట, సరోజనమ్మపాట మొదలైనవి.

ముగింపు : ఈ విధంగా జానపదగేయాలలో గ్రామీణుల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయలు, వారి మనోభావాలు మృదుహృదయం ప్రతిబింబిస్తుంది.

IV సృజనాత్మకత/ప్రశంస

1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.

అ) వారం రోజుల పాటు వివిధ జానపద కళారూపాల ప్రదర్శన జరుగుతుంది. ఏ కళారూపం ఏ రోజు, ఏ సమయంలో ప్రదర్శించబడుతుందో, ఎక్కడ ప్రదర్శించబడుతుందో మొదలైన వివరాలతో ఒక ఆహ్వాన పత్రికను తయారుచేయండి.

ఆహ్వానం

శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వయుజ మాస శుద్ధ పక్షంలో శరన్నవరాత్రులు, బతుకమ్మ పండగ సందర్భంగా హైదరాబాదు నగరంలో ఏర్పాటు చేసిన కళాప్రదర్శన వారోత్సవాలకు అందరికీ ఇదే సాదర ఆహ్వానం. ది. 10-10-2019 నుంచి 16-10-2019 వరకూ వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో దిగువ తెలిపిన కళారూపాలు వివిధ వేదికలపై ప్రదర్శించబడతాయి.

తేదీ సమయంప్రదర్శించబడే కళారూపంవేదిక
1. 10-10-2019 సాయంత్రం గం. 6.00 ని||లుగుసాడి నృత్యంతెలుగు లలితకళాతోరణం, పబ్లిక్ గార్డెన్స్
2. 11-10-2019 సాయంత్రం గం. 6.00 ని||లుకొండరెడ్ల మామిడి నృత్యంతెలుగు లలితకళాతోరణం,పబ్లిక్ గార్డెన్స్
3. 12-10-2019 ఉదయం గం. 10.00 ని॥లుబతుకమ్మ ఆటలు పాటలురవీంద్ర భారతి
4. 13-10-2019 ఉదయం గం. 10.00 ని॥లుతోలుబొమ్మలాటత్యాగరాయ గాన సభ
5. 14-10-2019 ఉదయం గం. 10.00 ని॥లువీధి భాగవతాలుఎ.వి. కళాశాల ప్రాంగణం
6. 15-10-2019 సాయంత్రం గం. 6.00 ని॥లుయక్షగానాలునెక్లెస్ రోడ్డు
7. 16-10-2019 సాయంత్రం గం. 6.00 ని॥లుకాటి పాపలుహరికళాభవనం, సికిందరాబాదు

 

కనుక ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాం.

స్థలం : హైదరాబాదు,
తేదీ : 5-10-2019.

ఇట్లు
ఆహ్వాన కమిటి,
భాగ్యనగర్ దసరా ఉత్సవ సంఘం.

V. పదజాల వినియోగం

కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరో రెండు పదాలను రాయండి.

ఉదా : కవితా సౌరంభం వెదజల్లుతుంది.
సౌరభం = సువాసన, పరిమళం.

అ) గృహజీవనానికి స్త్రీలే ఆలంబనం.
జవాబు.
ఆలంబనం = ఆధారం, ఆశ్రయం

ఆ) భక్తి మార్గం-మోక్ష సాధనం.
జవాబు.
మోక్షం = కైవల్యం, ముక్తి

ఇ) కాయ కష్టం చేసేవారు కొందరు. తినేది అందరూ.
జవాబు.
కష్టం = ఇక్కట్లు, శ్రమ

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

2. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

అ) పురోగతి
జవాబు.
ప్రజలంతా శక్తి వంచన లేకుండా కృషిచేసినప్పుడే జాతి పురోగతి సాధ్యం అవుతుంది. ఆ) రూపురేఖలు

ఆ) రూపురేఖలు :
జవాబు.
మనిషికి రూపురేఖలు కంటే మంచి గుణమే ముఖ్యం.

ఇ) కూనిరాగాలు
జవాబు.
కూనిరాగాలు తీస్తూ గొప్ప గాయకులమని ఊహించుకోకూడదు.

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.

అ) మామయ్య ఇంటికి వచ్చాడు. మామయ్య కాఫీ తాగాడు.
జవాబు.
మావయ్య ఇంటికి వచ్చి కాఫీ తాగాడు.

ఆ) కొమ్మ విరిగిపోయింది. కొమ్మ కింద పడింది.
జవాబు.
కొమ్మ విరిగిపోయి కింద పడింది.

ఇ) శత్రువులు భయపడ్డారు. శత్రువులు పారిపోయారు.
జవాబు.
శత్రువులు భయపడి పారిపోయారు.

2. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) శివ అన్నం తిన్నాడు. రాజు పండ్లు తిన్నాడు.
జవాబు.
శివ అన్నము, రాజు పండ్లు తిన్నారు.

ఆ) ఆమె పూలు తెచ్చింది. ఆమె కొబ్బరికాయ తెచ్చింది.
జవాబు.
ఆమె పూలు, కొబ్బరికాయ తెచ్చింది.

ఇ) నల్లని మబ్బులు కమ్ముకొన్నాయి. వర్షం పడలేదు.
జవాబు.
నల్లని మబ్బులు కమ్ముకొన్నాయి కానీ వర్షం పడలేదు.

తత్పురుష సమాసం:

కింది వాక్యం చదువండి.

‘రాజభటుడు వచ్చాడు’.

పై వాక్యంలో వచ్చిన వాడు రాజా ? భటుడా ? అని చూస్తే భటుడే వచ్చాడని అర్థం వస్తుంది. అయితే ఆ భటుడు రాజుకు చెందిన వాడని చెప్పడానికి ‘రాజు యొక్క భటుడు’ అంటాం. ఇట్లా చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటాం. విగ్రహవాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ షష్ఠీ విభక్తి ప్రత్యయమైన “యొక్క” వాడినాం.

తిండి గింజలు తిండి ‘కొరకు’ గింజలు
పాపభీతి – పాపం ‘వల్ల’ భీతి

పై రెండు వాక్యాలను కూడా గమనిస్తే రెండు పదాల మధ్య విభక్తి ప్రత్యయాలు వాడినాం. పై విగ్రహ వాక్యాలు చూస్తే ఉత్తర పదాలైన భటుడు, గింజలు, భీతికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇట్లా ఉత్తరపద ప్రాధాన్యతను తెలిపేది తత్పురుష సమాసం.

పూర్వ పదాలుఉత్తర పదాలు
రాజుభటుడు
తిండిగింజలు
పాపభీతి

‘సమాసంలో ఉండే రెండు పదాలలో మొదటి పదం పూర్వపదం, రెండవ పదం ఉత్తరపదం.
పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

కింది పట్టికను చూడండి. చదువండి.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు 2
కింది వానిని చదువండి.
అసత్యం – సత్యం కానిది.
అధర్మం – ధర్మం కానిది
అన్యాయం – న్యాయం కానిది
ఇట్లా వ్యతిరేకార్థం తెలిపితే అది నఞ తత్పురుషం (నఇ’ అంటే వ్యతిరేకార్థం).

3. కింది పదాలు చదువండి. వాటి విగ్రహ వాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో రాయండి.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు 3
జవాబు.

సమాసపదంవిగ్రహవాక్యం

సమాసం పేరు

అ) గదాధరుడుగదను ధరించినవాడుద్వితీయా తత్పురుష
ఆ) అగ్నిభయంఅగ్ని వలన భయముపంచమీ తత్పురుష
ఇ) గుణహీనుడుగుణము చేత హీనుడుతృతీయా తత్పురుష
ఈ) ధనాశధనము నందు ఆశసప్తమీ తత్పురుష
ఉ) దైవభక్తిదైవము నందు భక్తిసప్తమీ తత్పురుష
ఊ) అజ్ఞానంజ్ఞానం కానిదినఞ తత్పురుష


భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని

పెండ్లిళ్ళలో లేదా శ్రామికులకు సంబంధించిన జానపద గేయాలను సేకరించి నివేదిక రాయండి.

జవాబు.
అ) ప్రాథమిక సమాచారం
1) ప్రాజెక్టు పని పేరు : పెండ్లిళ్ళు మరియు శ్రామికులకు సంబంధించిన జానపద గేయాలు
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఇంటిలో పెద్దవాళ్ళ ద్వారా / గ్రంథాలయ పుస్తకాల ద్వారా

ఆ) నివేదిక :

1. పెండ్లిళ్ళలో పాడే పాటలు

1) నూతన వధువు గృహ ప్రవేశము :

పల్లవి :
మహాలక్ష్మి రావమ్మా శ్రీలక్ష్మి రావమ్మ
మా ఇంట కొలువుండ రావమ్మ
మంగళ హారతులు గొనుమమ్మ

చరణాలు :
1. అష్టలక్ష్మీ నీకు స్వాగతము పలికేము
ఇష్టముగ మా ఇంటి సౌభాగ్యములు కలుగ
గృహలక్ష్మివై నీవు రావమ్మా … || మంగళ ||

2. పదము పెట్టిన చోట సిరిసంపదలు గలుగ
కరము తాకిన వెనుక ధనధాన్య రాశులుగ
గృహలక్ష్మివై నీవు రావమ్మా … || మంగళ ||

3. పతి భక్తితో నీవు పతివ్రతగా వర్ధిల్లు
పదికాలములు పిల్లపాపలతో రాజిల్లు
గృహలక్ష్మివై నీవు రావమ్మా … || మంగళ ||

4. సకల సుఖశాంతులతో సంసారమును నడుప
తులసిదాసుడు నీకు శుభ మంగళము పలుక
గృహలక్ష్మివై నీవు రావమ్మా … || మంగళ ||

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

2) అప్పగింతల పాట :

పల్లవి :
కోటి శుభములు కలుగు నీకు పోయిరావమ్మ
ముక్కోటి వేల్పుల దీవెలనతో వెలయు మాయమ్మ || కోటి ||

చరణాలు :
1. కీర్తికాంతుల భాగ్యరాశుల శోభ నీదమ్మా
పుట్టినింటికి, మెట్టినింటికి పేరు తేవమ్మా

2. అత్తమామలె తల్లిదండ్రులు ఈ క్షణము నుండి
ఉత్తమ ఇల్లాలిగా నువు మసలుకోవమ్మా

3. మగని మనసెరిగి నీవు నడుచుకోవమ్మా
ప్రేమ మీరగ భర్త సేవలు చేసుకోవమ్మా

4.మరిది బావల ఆడపడచుల కలిసిమెసలమ్మా
బంధుమిత్రులు సేవకులను ఆదరించమ్మా.

5.అల్లుడా మా ముద్దు పట్టిని ఒప్పగించేము .
మనసుదీరగ మురిపెమారగ ఏలుకోవయ్యా

6. కల్ల కపటము లేని పిల్లను మీకు ఇచ్చేము
కంటి పాపగ వెంట నుండి చూసుకో వదినా || కోటి ||

3) బెస్తవాళ్ళ పాట :

ఏలియాల – ఏలియాల – ఏలియాల
ఐలేసా జోరిసెయ్యి – ఐలేసా బారుసెయ్యి
గంగమ్మ తల్లికి చెంగల్వ పూదండ
కాళిందికి తెల్ల కల్వదండ
జోర్సెయ్యి బార్సెయ్యి …………. జోర్సెయ్యి బార్సెయ్యి ॥ఏలియాల॥
గోదారి తల్లికి ………….. గొజ్జంగి పూదండ
సరస్వతికి …………….. సన్నజాజి దండ
కృష్ణవేణమ్మకు …………. గౌదంగి పూదండ
కావేరికి చంద్రకాంత దండా
ఐలేసా జోరుసెయ్యి – ఐలేసా బారుసెయ్యి ॥ఏలియాల॥

ఇ) ముగింపు : ఈ విధంగా పెండ్లిళ్ళ పాటలలో వరుడికి నలుగు పెట్టేప్పుడు పాట, వధువుకు నలుగు పెట్టేటపుడు పాట, అప్పగింతల పాట, నిశ్చయ తాంబూలం పాట, నూతన వధువు గృహప్రవేశం పాట.. ఇలా ఎన్నో పాటలు ఆయా సందర్భాలను బట్టి ఉన్నాయి. కానీ ప్రస్తుత కాలంలో వీటిని పాడేవాళ్ళు బహు అరుదు. అదే విధంగా కర్షకులు పొలం పని చేసేప్పుడు, శ్రామికులు ఆయా పనులు చేస్తున్నప్పుడు, తమ శ్రమను మరచి పోవడానికి అనేక జానపద గీతాలను పాడుతుంటారు. జానపదం అంటే జనం నోటితో పాడుకుంటూ, ఒక తరం నుండి మరొక తరానికి అందించే పాటలు. వీటికి లిఖిత రూపం ఉండదు. ఇలా సంస్కృతి వారసత్వంగా వస్తున్న ఈ పాటలను పరిరక్షించుకోవలిసిన అవసరం ఎంతైనా ఉన్నది.

TS 8th Class Telugu 6th Lesson Important Questions తెలుగు జానపద గేయాలు

ప్రశ్న 1.
పిల్లల పాటల గురించి రాయండి.
(లేదా)
పిల్లల పాటలు ప్రాధాన్యతను తెలపండి.
జవాబు.
జానపదగేయాలలో పిల్లల పాటల దొక ప్రత్యేకశాఖ. పసిపిల్లల లేత హృదయం లాగానే వారి పాటలు కూడా నిష్కపటంగానూ, నిర్మలంగానూ, స్వచ్ఛంగానూ, మార్దవంగానూ ఉంటాయి. ఈ గేయాలు అ) పిల్లల కోసం పెద్దలు రచించినవి ఆ) పిల్లలు రాసినవి అని రెండు విధాలు.

అ) పిల్లల కోసం పెద్దలు రచించినవి : వీటిలో లాలిపాటలు, జోలపాటలు ముఖ్యమైనవి. పిల్లలను లాలించేందుకు జోలపాడి నిద్రపుచ్చేందుకు ఇవి రచించబడ్డాయి. ఈ పాటలలోని భావాలు పిల్లలకు అర్థం కాకపోయినా వాటిలోని సంగీతం, లయ పిల్లలను లాలించి నిద్రపుచ్చుతాయి.

ఆ) పిల్లలు రాసినవి : పిల్లలు పాడే పాటలలో కొన్ని తమ సొంత రచనలు, మరొకొన్ని పెద్దల రచనలకు తమ కవిత్వం కలిపి కూర్చినవి ఉంటాయి. అనుకరణలో పిల్లలు పెద్దల రచనలలోని ధ్వనులను, మాటలను అర్థంతో పనిలేకుండా గ్రహిస్తారు. వాటిని అర్థంలేని పాటలు అని కూడా అంటారు. బాలబాలికలు ఆడే చెమ్మచెక్క, బిత్తి, కోతికొమ్మచ్చి, గుడుగుడుగుంచం, బుజబుజరేకులు, గొబ్బిళ్ళు, చిట్టిచిట్టి చిర్ర మొదలైన ఆటలలో పాడే పాటలు ఇందుకు ఉదాహరణలు.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

ప్రశ్న 2.
జానపదగేయాలలో పారమార్థిక గేయాల ప్రత్యేకత ఏమిటి ?
జవాబు.
భక్తి, కర్మ, జ్ఞానం – అనే మూడు మోక్ష సాధనాలలో భక్తిమార్గం సులభమైనదని భారతీయులు నమ్ముతారు. ఈ భక్తిని ప్రబోధించే గేయాలే భక్తిగేయాలు. వీటినే పారమార్థిక గేయాలు అంటారు. తెలుగు ప్రాంతాలలో శైవభక్తిగీతాలు, వైష్ణవ భక్తిగీతాలు. వీటినే పారమార్థిక గేయాలు అంటారు. తెలుగు ప్రాంతాలలో శైవభక్తిగీతాలు, వైష్ణవ భక్తిగీతాలు వేల సంఖ్యలో ప్రచారం పొందాయి. భక్తిగీతాలు ప్రాచీనకాలం నుంచే ఉన్నట్లు తెలుస్తున్నది.

జంగంవారు, హరిదాసులు ఈ భక్తిగీతాలు పాడుకుంటూ తమ జీవనాన్ని సాగించుకుంటున్నారు. అంటే భక్తిగీతాలు వీరికి జీవనోపాధిని కల్పిస్తున్నాయన్నమాట. ఈ గీతాలలో భద్రాచలరామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు మొదలైనవి తెలుగుసీమ అంతటా వినవస్తాయి. పదములు, దారువులు, మేలుకొలుపులు, భూపాళములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతులు, స్తోత్రములు, తారావళులు నామావళులు కూడా కీర్తనల కిందకే వస్తాయి.

ప్రశ్న 3.
స్త్రీల పాటలలో కనిపించే తెలుగువారి వేడుకలను తెలపండి.
(లేదా)
స్త్రీల పాటల్లో సంపూర్ణ జీవనం కనిపిస్తుంది. ఎలాగో వివరించండి.
జవాబు.
గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది. అందువల్ల సంసార సంబంధించిన కవితకు ఆలంబనం స్త్రీలే. కనుక వీటిని స్త్రీల పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికత పాలు ఎక్కువ. శిశువు పుట్టినప్పటి నుంచి వివాహం వరకూ జరిపే ప్రతి వేడుకకు సంబంధించిన పాటలు గమనించవచ్చు. పిల్లల్ని ఉయ్యాలలో ఉంచి పాడే లాలిపాటలు, జోలపాటలు ఎంతో ప్రసిద్ధమైనవి.

కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు, తలుపుదగ్గర పాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, ముఖము కడుగుపాటలు, అవిరేణి పాటలు, ఉయ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు మొదలైన పాటల ద్వారా కట్నాలు, నలుగులు, అలుకలు, బంతులు, అప్పగింతలు మొదలైన తెలుగువారి వేడుకలు తెలుస్తాయి. అంతేకాక సీతసమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీత వామనగుంటలు, సుభద్రసారె, రుక్మిణీదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైనవి కూడా తరతరాల తెలుగు వారి వేడుకలను తెలిపేవే.

ప్రశ్న 4.
పనికి, పాటకి దగ్గర సంబంధం ఉంది అని శ్రామిక గేయాల ఆధారంగా తెల్పండి.
జవాబు.
పాటలు పాడుతూ పనిచేయటంవల్ల తాము చేసే కాయకష్టాన్ని మరిచి, హృదయంలోను మనసులోను ఉండే బాధ తొలగిపోవటమేకాక, శారీరక శ్రమ కూడా తెలియదు. శ్రామిక గీతాలకు వస్తువు ఏదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు, శ్రామికులు పాడుకుంటూ ఉంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీర భాగాల కదలికలో, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో శ్రామికగేయాలకు, గీతాలకు తాళలయలు సమకూరి ఉంటాయి.ఉదా :- తిరుగలి పాటలు, దంపుడు పాటలు, పల్లకీ పాటలు, దుక్కి పాటలు, పడవలాగేటప్పుడు పాడే పాటలు (హైలెస్సో పాటలు) మొ||వి. దీనినిబట్టి చేసే పనికి, పాడే పాటకి దగ్గర సంబంధం ఉందని చెప్పవచ్చు.

ప్రశ్న 5.
జానపదాలను ఏయే సందర్భాలలో పాడటాన్ని నీవు గమనిస్తున్నావు ?
జవాబు.
1) పౌరాణిక గేయాలను పురాణేతిహాసాలపైన మక్కువగల గ్రామీణులు రామాయణం, భారతం, భాగవతాది పురాణాలలో కథలకు సంబంధించిన పాటలు మనోల్లాసానికి పాడుతారు.
ఉదా :- ఊర్మిళాదేవి నిద్ర, శ్రీరామ పట్టాభిషేకం.

2) చారిత్రక గేయాలను దేశభక్తిని కల్గించి వినోదాన్ని, ఉల్లాసాన్ని కల్గించి వీరరసంలో పాడుతారు.
ఉదా :- కాటమరాజు కథ, బొబ్బిలికథ, అల్లూరి సీతారామరాజు కథ.

3) పారమార్థిక గేయాలను భక్తి జ్ఞాన కర్మ మార్గాలలో భక్తి మార్గం ద్వారా మోక్షప్రాప్తి కోసం ఈ గేయాలు పాడుతారు.
ఉదా :- భద్రాచల రామదాసు కీర్తనలు, లాలిపాటలు, తత్త్వాలు, బతుకమ్మ పాటలు మొ||వి.

4) స్త్రీల పాటలను ఇంట్లో జరిగే విభిన్న వేడుకలలో సందర్భాన్ననుసరించి పాడుతారు.
ఉదా :- వియ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు మొ||వి.

5) శ్రామిక గేయాలను కాయకష్టం చేసుకొనేవారు తమ కష్టం మరిచి పనిచేసుకోవడానికి పాడేవారు.
ఉదా :- తిరుగలి పాటలు, ఊడ్పు పాటలు, దంపుడు పాటలు.

6) పిల్లల పాటలను నిష్కపటంగా, నిర్మలముగా, మార్దవంగా ఉండే ఈ పాటలు పిల్లలకు పాడి, ఆటలు ఆడించేవారు.
ఉదా :- గుడిగుడిగుంచెం, గొబ్బిళ్ళు, కోతికొమ్మచ్చి మొ॥ వి.

7) కరుణరస గేయాలను విషాద సమయాలలో పాడి వినిపించేవారు. సందర్భాన్ని బట్టి పాడేవారు.
ఉదా :- ఎరుకల నాంచారి కథ, రాములమ్మ పాట.

ఈ విధంగా విభిన్న సందర్భాలలో సందర్భానికి తగిన జానపదగేయాలను పాడి వినోదం పొంది గ్రామీణులు ఆనందించేవారు.

పర్యాయపదాలు:

  • హృదయం గేయం = ఎద, మది, మనస్సు, గుండె
  • గేయం = గీతం, పాట, కీర్తన, సంకీర్తన
  • ప్రజలు = జనం, పౌరులు, పాలితులు, మనుషులు
  • భాష = మాట, వాక్కు
  • సాహిత్య = వాఙ్మయం, సారస్వతం
  • తొలి = ముందు, తొల్లి, పూర్వం
  • పెక్కు = చాలా, అనేక
  • పండితులు = విద్వాంసులు, విద్యావంతులు, చదువుకున్నవారు, శిష్టులు

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

నానార్థాలు:

  • అర్ధం = శబ్దార్థం, కారణం, ధనం, న్యాయం, ప్రయోజనం, వస్తువు
  • కాలం = నల్లని, సమయం, మరణం, ఇనుము
  • పదం = మాట, పాట
  • కవి = కవిత్వం చెప్పేవాడు, హంస, శుక్రాచార్యుడు, పండితుడు
  • వృత్తి = పని, జీవనోపాయము, స్థితి, పద్ధతి
  • అమూల్యం = వెలలేనిది, మిక్కిలి వెలగలది
  • వృత్తాంతం = సంగతి, కథ, విధం, అవసరం, ఉదాహరణం

వ్యుత్పత్త్యర్థాలు:

  • అదృష్టం = దైవకృతమగుట వలన కనబడనిది (భాగ్యము)
  • సాహిత్యం = హితంతో కూడినది, హితాన్ని చేకూర్చేది (సారస్వతం)
  • కృష్ణుడు = కృష్ణ (నలుపు) వర్ణము కలవాడు (విష్ణువు)
  • గ్రామము = ప్రాణుల చేత అనుభవించబడునది (ఊరు)
  • పండితుడు = శాస్త్రమందు మంచి బుద్ధి గలవాడు (విద్వాంసుడు)

ప్రకృతి – వికృతులు:

  • ప్రకృతి – వికృతి
  • అగ్ని – అగ్గి
  • శక్తి – సత్తి, సత్తు
  • కవిత – కయిత, కైత
  • కథ – కత, కద
  • స్నానం – తానం
  • ముఖం – మొకం, మొగం

సంధులు:

  • ప్రాంతమంతటా = ప్రాంతము + అంతటా = ఉత్వసంధి
  • దేశమంతటా = దేశము + అంతటా = ఉత్వసంధి
  • ఆవిష్కృతమవుతుంది = ఆవిష్కృతము + అవుతుంది = ఉత్వసంధి
  • సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
  • ఎంతైనా ఎంత + ఐనా = అత్వ సంధి
  • ప్రాచీనమైనట్టిది = ప్రాచీనమైన + అట్టిది = అత్వసంధి
  • సూత్రం: అత్తునకు సంధి బహుళంగా వస్తుంది.
  • ప్రేమాభిమానాలు = ప్రేమ + అభిమానాలు = సవర్ణదీర్ఘ సంధి
  • నామృతం = నా + అమృతం = సవర్ణదీర్ఘ సంధి
  • రామాయణాదులు = రామాయణ + ఆదులు = సవర్ణదీర్ఘసంధి
  • భాగవతాది = భాగవత + ఆది = సవర్ణదీర్ఘ సంధి
  • అభీష్టానుగుణం = అభీష్ట + అనుగుణం = వైష్ణవ + ఆది = సవర్ణదీర్ఘ సంధి
  • వైష్ణవాది = వైష్ణవ + ఆది = సవర్ణదీర్ఘ సంధి
  • సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.
  • పురాణేతిహాసాలు = పురాణ + ఇతిహాసాలు = గుణసంధి = గుణసంధి
  • విమోచనోద్యమం = విమోచన + ఉద్యమం
  • సూత్రం : అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశమవుతాయి.
  • అత్యుత్తమ = అతి + ఉత్తమ = యణాదేశ సంధి
  • అత్యంత = అతి + అంత = యణాదేశసంధి
  • సూత్రం : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా య, వ, ర లు ఆదేశమవుతాయి.

సమాసములు:

సమాసపదంవిగ్రహవాక్యంసమాసం పేరు
1. ఇతర భాషలుఇతరమైన భాషలువిశేషణ పూర్వపద కర్మధారయం
2. మృదుహృదయంమృదువైన హృదయంవిశేషణ పూర్వపద కర్మధారయం
3. లేత హృదయంలేతదైన హృదయంవిశేషణ పూర్వపద కర్మధారయం
4. భాషా సంస్కృతులుభాషయునూ సంస్కృతియునూద్వంద్వ సమాసం
5. ఉచ్ఛ్వాస నిశ్వాసలుఉచ్ఛ్వాసయునూ నిశ్వాసయునూద్వంద్వ సమాసం
6. తాళలయలుతాళమునూ లయయునూద్వంద్వ సమాసం
7. దైవ సమానుడుదైవముతో సమానుడుతృతీయా తత్పురుష సమాసం
8. వీరపూజవీరుల యొక్క పూజషష్ఠీ తత్పురుష
9. జానపద గేయాలుజానపదుల యొక్క గేయాలుషష్ఠీ తత్పురుష
10. శిష్ట సాహిత్యంశిష్టుల యొక్క సాహిత్యంషష్ఠీ తత్పురుష
11. సీతా కళ్యాణంసీత యొక్క కళ్యాణముషష్ఠీ తత్పురుష
12. కాటమరాజు కథకాటమరాజు యొక్క కథషష్ఠీ తత్పురుష
13. మోక్ష సాధనాలుమోక్షము యొక్క సాధనాలుషష్ఠీ తత్పురుష
14. అగ్ని ప్రవేశంఅగ్ని యందు ప్రవేశంసప్తమీ తత్పురుష సమాసం
15. వేదాంత సత్యాలువేదాంతము నందలి సత్యాలుసప్తమీ తత్పురుష సమాసం


పాఠ్యభాగ ఉద్దేశం

తెలుగువారి ఆచార సంప్రదాయాలను, తాత్త్వికతను, చరిత్రను తెలిపే తెలుగు జానపద గేయాల గొప్పతనం, వాటి వైవిధ్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదురాజు రామరాజు రాసిన వ్యాసం.

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు

కవి పరిచయం

ప్రశ్న.
బిరుదురాజు రామరాజుగారి పరిచయం రాయండి.
(లేదా)
బిరుదురాజు రామరాజుగారి జీవిత విశేషాలు తెల్పండి.
జవాబు.
తెలుగు జానపద సాహిత్యమనగానే మనకు గుర్తుకువచ్చేవాడు ఆచార్య బిరుదురాజు రామరాజు. పూర్వపు వరంగల్ జిల్లా దేవునూరు గ్రామంలో ఈయన జన్మించాడు. కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడుగా ప్రసిద్ధుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడుగా, డీన్ గా పనిచేశాడు. “తెలుగు జానపద గేయ సాహిత్యం” ఈయన పరిశోధన గ్రంథం. చరిత్రకెక్కన చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగునపడిన మాణిక్యాలు, ఉర్దూ – తెలుగు నిఘంటువు, 08-02-2010 తెలుగు జానపదరామాయణం, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన ఇతర రచనలు.
గమనిక : పరీక్షలో గీత గీసిన వాక్యాలు రాస్తే జవాబు సరిపోతుంది.

ప్రవేశిక

జానపద సాహిత్యమనగానే గుర్తుకు వచ్చేది గేయమే. పదాలని, పాటలని జానపదులు పిలుచుకునే లయాత్మక రచనలు జానపదగేయాలు. ఈ గేయాలలో ఆయా ప్రాంత ప్రజల భావోద్వేగం, దైనందిన జీవితం, చరిత్ర, సంస్కృతి, భాష మొదలైనవి కనిపిస్తాయి. సామూహిక ప్రచారం, సరళభావం, జనప్రియత్వం వీటి లక్షణాలు. సాంస్కృతిక వారసత్వంగా వచ్చే ఈ జానపదగేయాల్లోని ఔన్నత్యాన్ని తెలుసుకుందాం.

కఠిన పదాలకు అర్ధాలు

  • దర్పణం = అద్దం
  • ఇతివృత్తం = తీసుకున్న విషయము (content), కథా సారాంశం, కథా వస్తువు.
  • గాథ = కథ, చరిత్ర లేదా విషయం
  • చేవ = బలం
  • దళం = సమూహం
  • ప్రజాబాహుళ్యం = ఎక్కువ మంది ప్రజలలో
  • శాఖ = విభాగం, కొమ్మ
  • మార్దవం = మృదుత్వం
  • విశ్వాసం = నమ్మకం, కృతజ్ఞతాభావం
  • ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు = గాలి పీల్చి వదలటం
  • నిష్కపటము = కపటం లేని (మోసం లేని)
  • జీవనోపాధి = జీవితానికి ఆధారం, బ్రతుకుతెరువు, మనుగడ, జరుగుబాటు, పొట్టకూడు.

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu 6th Lesson Questions and Answers Telangana తెలుగు జానపద గేయాలు 4

TS 8th Class Study Material Telangana Pdf Textbook Solutions

TS 8th Class Study Material Pdf Telangana | TS 8th Class Textbook Solutions Guide

TS Board Solutions

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download అపరిచిత పద్యాలు Questions and Answers.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

పద్యాలు – ప్రశ్నలు

I. క్రింద ఇచ్చిన పద్యాలను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయబోకుము కార్యా
లోచనము లొంటి జేయకు
మాచారము విడువబోకుమయ్య కుమారా !

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఎవరిని ఎదిరింపరాదు?
జవాబు.
గురువులను ఎదిరింపరాదు.

ప్రశ్న 2.
ఎవరిని నింద చేయకూడదు?
జవాబు.
రక్షించిన వారిని నిందించరాదు.

ప్రశ్న 3.
వేటిని ఒంటరిగా చేయకూడదు ?
జవాబు.
పనులను గూర్చి ఆలోచన ఒంటరిగా చేయరాదు.

ప్రశ్న 4.
విడిచి పెట్టకూడనిది ఏది ?
జవాబు.
ఆచారాన్ని విడిచిపెట్టకూడదు.

ప్రశ్న5.
ఈ పద్యానికి మకుటం ఏది ?
జవాబు.
కుమారా!

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

2. కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి మగుడ మీదికి న్నెగయుజుమీ
మందుడు మృత్పిండము వలె
క్రిందంబడి యడగి యుండుఁ కృపణత్వమునన్.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
సుజనుడెట్లా ఉంటాడు ?
జవాబు.
సుజనుడు బంతిలా క్రిందపడ్డా మరల పైకి లేస్తాడు.

ప్రశ్న 2.
మందుడెలా ఉంటాడు ?
జవాబు.
మందుడు మట్టి ముద్దలా క్రిందపడితే, అణగి పోయి, ఇంకలేవడు.

ప్రశ్న 3.
సుజనుని కవి దేనితో పోల్చాడు ?
జవాబు.
బంతితో పోల్చాడు.

ప్రశ్న 4.
ఈ పద్యంలో అలంకారమేది ?
జవాబు.
ఉపమాలంకారం.

ప్రశ్న 5.
కందుకము అర్థమేమి ?
జవాబు.
బంతి

3. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు
సుకవి చేతి కలము సుధలు గురియు
ఆతడేల గలుగు యావత్ప్రపంచంబు
నీతడేల గలుగు ఇహము పరము.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
రక్తాన్ని కురిపించునదేది?
జవాబు.
రాజు చేతిలోని కత్తి రక్తాన్ని కురిపిస్తుంది.

ప్రశ్న 2.
అమృతాన్ని కురిపించునదేది?
జవాబు.
కవి చేతిలోని కలము అమృతాన్ని కురిపిస్తుంది.

ప్రశ్న 3.
యావత్ప్రపంచాన్ని పాలించగలిగేదెవరు?
జవాబు.
రాజు యావత్ప్రపంచాన్ని పాలించగలుగుతాడు.

ప్రశ్న 4.
ఇహమును, పరమును పాలించగలవాడెవరు?
జవాబు.
కవి ఇహమును, పరమును పాలించగలడు.

ప్రశ్న 5.
సుకవి ఏ సమాసము?

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

4. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టదా! గిట్టదా!
విశ్వదాభిరామ! వినురవేమ!

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఎవరి మీద దయ కలిగి ఉండాలి ?
జవాబు.
తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి.

ప్రశ్న 2.
చెదలు ఎక్కడ పుట్టి గిట్టుతుంది ?
జవాబు.
చెదలు పుట్టలో పుట్టి గిట్టుతుంది.

ప్రశ్న 3.
దయలేని కుమారుడిని కవి దేనితో పోల్చాడు.
జవాబు.
దయలేని కుమారుడిని కవి చెదతో పోల్చాడు.

ప్రశ్న 4.
ఈ పద్యంలో అలంకారమేది ?
జవాబు.
ఈ పద్యాన్ని వేమన కవి రచించాడు.

ప్రశ్న 5.
గిట్టుట – అర్థమేమి ?
జవాబు.
చనిపోవుట.

5. అనువుగాని చోట అధికులమనరాదు,
కొంచెముండుటెల్ల కొదువకాదు,
కొండ అద్దమందు కొంచమై యుండదా !
విశ్వదాభిరామ వినురవేమ ! ప్రశ్నలు :

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఎక్కడ గొప్పవారమని అనుకోరాదు ?
జవాబు.
అనుకూలంగా లేని ప్రదేశంలో గొప్పవారమని అనుకోరాదు.

ప్రశ్న 2.
ఏది తక్కువ కాదు ?
జవాబు.
తగ్గి ఉండటం తక్కువ కాదు.

ప్రశ్న 3.
కొండ అద్దంలో ఎలా కనిపిస్తుంది ?
జవాబు.
కొండ అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది.

ప్రశ్న 4.
ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు.
ఈ పద్యం వేమన శతకంలోనిది.

ప్రశ్న 5.
అత్వసంధికి ఒక ఉదాహరణ రాయండి.
జవాబు.
ఉండుట + ఎల్ల = ఉండుటెల్ల.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

6. తివిరి యిసుమున దైలంబు తీయవచ్చు
తవిరి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనము రంజింపరాదు.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ప్రయత్నించి ఇసుక నుండి దేనిని తీయవచ్చును?
జవాబు.
ప్రయత్నించి ఇసుక నుండి నూనెను తీయవచ్చును.

ప్రశ్న 2.
ప్రయత్నిస్తే దేని నుండి నీరు త్రాగవచ్చును ?
జవాబు.
ప్రయత్నిస్తే ఎండమావి నుండి నీటిని త్రాగవచ్చును.

ప్రశ్న 3.
ఎక్కడైనా తిరిగి సాధించగలిగేదేమిటి ?
జవాబు.
కుందేటి కొమ్మును కూడా ఎక్కడైనా తిరిగి సాధించవచ్చును.

ప్రశ్న 4.
ఎంత ప్రయత్నించినా దేనిని చేయలేము ?
జవాబు.
ఎంత ప్రయత్నించినా మూర్ఖుని మనస్సును ఆనందింపజేయుటకు సాధ్యం కాదు.

ప్రశ్న 5.
మృగతృష్ణ అంటే ఏమిటి ?
జవాబు.
ఎండమావి.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

7. ఎఱుక గల వారి చరితలు
గఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుగుచు నెఱిగిన దానిని
మఱువ కనుష్టించినది సమంజస బుద్ధిన్.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఎవరి చరిత్ర తెలుసుకోవాలి ?
జవాబు.
సజ్జనుల చరిత్ర తెలుసుకోవాలి.

ప్రశ్న 2.
ధర్మాన్ని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి ?
జవాబు.
ధర్మాన్ని సజ్జనుల నుండి తెలుసుకోవాలి.

ప్రశ్న 3.
దేనిని అనుష్టించాలి ?
జవాబు.
ధర్మాన్ని అనుష్టించాలి.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి “ధర్మాచరణ” అను శీర్షిక తగినది.

ప్రశ్న 5.
సమంజస బుద్ధి-విగ్రహ వాక్యం రాయండి.
జవాబు.
సమంజసమైన బుద్ధి.

8. క్రింది పద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారుచేయండి.
మరువవలెగీడు నెన్నడు
మరువంగారాదు మేలు, మర్యాదలలో
దిరుగవలె సర్వజనముల
దరి ప్రేమన్ మెలగవలయు దరుణి కుమారీ !

ప్రశ్నలు :

1. దేనిని మరచిపోవలెను ?
2. దేనిని మరువకూడదు ?
3. అందరియెడల ఎట్లా మెలగాలి ?
4. ఈ పద్యం ఏ శతకంలోనిది ?
5. హద్దు అనే అర్థం వచ్చే పదం ఏది ?

9. అల్పుడెపుడు పల్కునాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ఆడంబరంగా మాట్లాడేదెవరు ?
జవాబు.
ఆడంబరంగా మాట్లాడేది దుర్జనుడు.

ప్రశ్న 2.
సజ్జనుండెలా మాట్లాడుతాడు?
జవాబు.
సజ్జనుడు చక్కగా మాట్లాడుతాడు.

ప్రశ్న 3.
ఈ పద్యంలో కవి ఎవరిని ఎవరితో పోల్చాడు.
జవాబు.
ఈ పద్యంలో కవి అల్పుని కంచుతోను, సజ్జనుని బంగారంతోను పోల్చాడు.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

ప్రశ్న 4.
ఈ పద్యానికి తగిన శీర్షికను రాయండి.
జవాబు.
“అల్పుడు- సజ్జనుల మాట తీరు” అనేది ఈ పద్యానికి తగిన శీర్షిక.

ప్రశ్న 5.
అల్పుడు దేని వంటి వాడు?
జవాబు.
కంచు వంటివాడు.

10. అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు :

ప్రశ్న 1.
అంటూ ఉంటే అతిశయిల్లేది ఏది?
జవాబు.
అంటూ ఉంటే అతిశయిల్లేది రాగం.

ప్రశ్న 2.
తింటూ ఉంటే తీయనయ్యేది ఏది ?
జవాబు.
తింటూ ఉంటే తీయనయ్యేది వేప.

ప్రశ్న 3.
సాధనముతో సమకూరేవి ఏవి ?
జవాబు.
సాధనముతో పనులు సమకూరుతాయి.

ప్రశ్న 4.
ఈ పద్యానికి మకుటం ఏది ?
జవాబు.
ఈ పద్యానికి ‘విశ్వదాభిరామ వినురవేమ’ అనేది మకుటం.

ప్రశ్న 5.
ధర – దీనికి నానార్థాలు రాయండి.
జవాబు.
భూమి, వెల

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

11. క్రింది పద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారుచేయండి.
అఘము వలన మరల్చు హితార్థ కలితు
జేయు, గోప్యంబుదాచు, బోషించు గుణము
విడువడా పన్ను లేవడి వేళ నిచ్చు
మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు !

ప్రశ్నలు :

1. పాపపు పనుల నుండి మరల్చేదెవరు?
2. రహస్యాన్ని దాచిపెట్టేదెవరు?
3. మన దగ్గర డబ్బులేనప్పుడు డబ్బు ఇచ్చేదెవరు?
4. ఈ పద్యానికి తగిన శీర్షిక ఏది?
5. గోప్యము అర్థమేమి?

12. తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తల తోకయనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !
ప్రశ్నలు :

ప్రశ్న 1.
పాముకు విషం ఎక్కడ ఉంటుంది ?
జవాబు.
పాముకు విషం తల (నోటి)లో ఉంటుంది.

ప్రశ్న 2.
తోకలో విషం గలది ఏది ?
జవాబు.
తోకలో విషం గలది తేలు.

ప్రశ్న 3.
దుర్జనుడికి విషం ఎక్కడ ఉంటుంది ?
జవాబు.
దుర్జనుడికి ఒళ్ళంతా విషమే.

ప్రశ్న 4.
ఈ పద్యం ద్వారా నీవు గమనించిందేమిటి ?
జవాబు.
పాము, తేలు కంటే కూడా దుర్జనుడు ప్రమాదకారి అని గమనించాను.

ప్రశ్న 5.
తేలు అనే అర్థాన్నిచ్చే పదమేది ?
జవాబు.
వృశ్చికము.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

13. ఎప్పుడు తప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్
సప్పంబు పడగ నీడను
కప్ప వసించిన విధంబు గదరా సుమతీ!

ప్రశ్నలు :

ప్రశ్న 1.
నిరంతరం తప్పులు వెతికే వాని సన్నిధి ఎటువంటిది ?
జవాబు.
నిరంతరం తప్పులు వెతికేవాని సన్నిధి పాము పడగనీడ వంటిది.

ప్రశ్న 2.
ఎప్పుడూ తప్పులు వెతికేవాడు ఎలాంటివాడు?
జవాబు.
ఎప్పుడూ తప్పులు వెతికేవాడు పాము లాంటివాడు, ప్రమాదకరమైనవాడు.

ప్రశ్న 3.
ఎవరిని సేవించకూడదు?
జవాబు.
ఎప్పుడూ తప్పులు వెతికేవాడిని సేవించకూడదు.

ప్రశ్న 4.
ఈ పద్యం ఏ శతకం లోనిది?
జవాబు.
ఈ పద్యం సుమతీ శతకం లోనిది.

ప్రశ్న 5.
“అప్పురుషుడు” అంటే అర్థం ఏమిటి?
జవాబు.
అప్పురుషుడు అంటే ఎప్పుడూ తప్పులు వెతికే వాడు, ప్రమాదకరమైనవాడు.

14. క్రింది పద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారుచేయండి.

వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కని కల్ల నిజము దెలిసిన
మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ !

ప్రశ్నలు :

1. ఎవరేమి చెప్పినా ఏం చేయాలి ?
2. విన్న తరువాత ఏం చేయాలి ?
3. ఎవరు నీతిపరుడు ?
4. ఈ పద్యానికి తగిన శీర్షిక ఏది ?
5. మంచి బుద్ధి కలవాడు అని అర్థం ఇచ్చే పదం ఏది ?

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

15. పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని గనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ !

ప్రశ్నలు :

ప్రశ్న 1.
తండ్రికి పుత్రోత్సాహం ఎప్పుడు కలుగదు?
జవాబు.
తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు పుత్రోత్సాహం కలుగదు.

ప్రశ్న 2.
తండ్రికి పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుంది?
జవాబు.
పుత్రుడు అందరిచే పొగడబడినపుడు తండ్రి నిజమైన పుత్రోత్సాహాన్ని పొందుతాడు.

ప్రశ్న 3.
ఈ పద్యానికి తగిన శీర్షిక ఏది ?
జవాబు.
“నిజమైన పుత్రోత్సాహం” అనేది ఈ పద్యానికి తగిన శీర్షిక.

ప్రశ్న 4.
ఈ పద్యం ఏ శతకంలోనిది ?
జవాబు.
ఈ పద్యం “సుమతీ శతకం” లోనిది.

ప్రశ్న 5.
పుత్రోత్సాహము – ఏ సంధి ?
జవాబు.
గుణసంధి.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

16. మేడిపండు చూడ మేలిమైయుండును
పొట్టవిప్పి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింక మీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు :

ప్రశ్న 1.
పిరికివాడు దేనితో పోల్చబడినాడు?
జవాబు.
పిరికివాడు మేడిపండుతో పోల్చబడినాడు.

ప్రశ్న 2.
మేడిపండు పైకి ఏ విధంగా ఉంటుంది?
జవాబు.
మేడిపండు పైకి మంచి బంగారంలాగా ఉంటుంది.

ప్రశ్న 3.
మేడిపండు లోపల ఎలా ఉంటుంది?
జవాబు.
మేడిపండు లోపల పురుగులతో నిండి ఉంటుంది.

ప్రశ్న 4.
ఈ పద్యం వల్ల తెలిసిందేమిటి?
జవాబు.
ఈ పద్యం వల్ల పిరికివాడు పైకి మాత్రం మేడిపండు లాగా డాంబికంగా కనిపిస్తాడని భావం.

ప్రశ్న 5.
మేలిమై – ఎలా విడదీయాలి ?
జవాబు.
మేలిమి + ఐ.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

17. మొదల జూచిన కడుగొప్ప. పిదప గురుచ
నాది కొంచెము తర్వాత నధికమగుచు
తనరు దిన పూర్వ పరభాగ జనితమైన
ఛాయ పోలిక, కుజన సజ్జనుల మైత్రి.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
కుజనుల మైత్రి ఎటువంటిది ?
జవాబు.
కుజనుల మైత్రి మొదట ఎక్కువగా ఉండి తరువాత తగ్గిపోతుంది.

ప్రశ్న 2.
సజ్జనుల మైత్రి ఎటువంటిది ?
జవాబు.
సజ్జనుల మైత్రి మొదట తక్కువగా ఉండి తరువాత ఎక్కువవుతుంది.

ప్రశ్న 3.
కుజన, సజ్జనుల మైత్రిని కవి దేనితో పోల్చి చెప్పాడు ?
జవాబు.
కుజన మైత్రిని ఉదయకాలపు నీడతోను, సజ్జనుల మైత్రిని సాయంత్రపు నీడతోను కవి పోల్చి చెప్పాడు.

ప్రశ్న 4.
ఈ పద్యం వల్ల మనకు ఏం తెలుస్తోంది?
జవాబు.
ఈ పద్యం వలన సజ్జనులతో మైత్రి శాశ్వతంగా ఉంటుందని తెలుస్తోంది.

ప్రశ్న 5.
కుజన సజ్జనులు – ఏ సమాసం?
జవాబు.
ద్వంద్వ సమాసం.

18. నడివడి యను మున్నీటం
గడవం బెట్టంగ నోడకరణిం దగి తా
నొడ గూడు ననిన సత్యము
గడచిన గుణమింక నొందుగలదే యరయన్.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
ప్రవర్తనను కవి దేనితో పోల్చారు?
జవాబు.
ప్రవర్తనను కవి సముద్రంతో పోల్చారు.

ప్రశ్న 2.
“సత్యగుణం” దేనిలాగా ఉపయోగపడుతుంది?
జవాబు.
సత్యగుణం సముద్రాన్ని దాటించే నావలాగా ఉపయోగపడుతుంది.

ప్రశ్న 3.
ఈ పద్యంలో గల శబ్దాలంకారమేమి?
జవాబు.
వృత్త్యనుప్రాసాలంకారం కలదు.

ప్రశ్న 4.
ఈ పద్య భావానికి తగిన శీర్షికను రాయండి. ?
జవాబు.
“సత్యగుణ ప్రాధాన్యత” అనేది ఈ పద్యానికి తగిన శీర్షిక.

ప్రశ్న 5.
గుణము + ఇంక – ఏ సంధి ?
జవాబు.
ఉత్వసంధి.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

19. క్రింది పద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారుచేయండి.
ఆత్మశుద్ధి లేని ఆచారమది యేల?
భాండ శుద్ధిలేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా?
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు :

1. పాకమునకు దేని శుద్ధి అవసరం?
2. చిత్తశుద్ధి లేకుండా దేనిని చేయకూడదు?
3. పద్యం మనిషికి ఏమి ఉండాలని చెబుతుంది?
4. ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు?
5. ఆచారానికి ఏమి కలిగి ఉండాలి?

20. పూజకన్న నెంచబుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు :

ప్రశ్న 1.
పూజకన్నా ఏది మిన్న ?
జవాబు.
పూజలు చేయటం కన్నా మంచిబుద్ధి కలిగి యుండటం మేలు.

ప్రశ్న 2.
మాటకంటే గొప్పదేది ?
జవాబు.
మాటలు చెప్పటంకన్నా దృఢమైన మనస్సు గలిగియుండటం మంచిది.

ప్రశ్న 3.
కులంకన్నా ప్రధానమైనదేది ?
జవాబు.
కులంకన్నా గుణం చాలా గొప్పది.

ప్రశ్న 4.
ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు.
ఈ పద్యానికి శీర్షిక “దేనికంటే ఏది ప్రధానం”.

ప్రశ్న 5.
మిగుల అంటే అర్థమేమి ?
జవాబు.
ఎక్కువగా.

21. ఆకొన్న కూడె యమృతము
తా గొంకక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోకోర్చువాడె మనుజుడు
తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ !

ప్రశ్నలు :

ప్రశ్న 1.
అమృతం వంటిదేది ?
జవాబు.
ఆకలితో ఉన్నప్పుడు తిన్న అన్నం అమృతం వంటిది.

ప్రశ్న 2.
ఎవరిని ‘దాత’ అంటారు ?
జవాబు.
సందేహించకుండా అడిగిన వెంటనే ఇచ్చువాడు దాత.

ప్రశ్న 3.
ఎవడు మనుష్యుడనిపించుకుంటాడు ?
జవాబు.
కష్టములను సహించగలవాడు మనుష్యుడనిపించు కుంటాడు.

ప్రశ్న 4.
వంశానికి అలంకారం వంటివాడెవడు ?
జవాబు.
సాహసం కలవాడు వంశానికి అలంకారం వంటివాడు.

ప్రశ్న 5.
కొంకక – అర్థమేమి ?
జవాబు.
సంకోచించకుండా.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

22. మిరెము చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనఁజురుకు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు :

ప్రశ్న 1.
మిరియపుగింజ ఎలా ఉంటుంది ?
జవాబు.
మిరియపుగింజ నల్లగా ఉంటుంది.

ప్రశ్న 2.
గింజ కొరికితే ఎట్లా ఉంటుంది ?
జవాబు.
మిరియపుగింజ కొరికితే నోరు చుర్రుమంటుంది.

ప్రశ్న 3.
మిరియపుగింజలాంటి వారు ఎవరు?
జవాబు.
మిరియపుగింజ లాంటివారు సజ్జనులు.

ప్రశ్న 4.
ఈ పద్యంలోని అలంకారం ఏది ?
జవాబు.
ఈ పద్యంలో ఉపమాలంకారం కలదు.

ప్రశ్న 5.
సజ్జనులు – ఈ పదాన్ని విడదీయండి.
జవాబు.
సత్ + జనులు.

23. క్రింది పద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారుచేయండి.
ధనము కూడబెట్టి ధర్మంబు సేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ గూర్చి తెరువరి కీయదా
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్నలు :

1. తేనెటీగ ఎవరికి యిస్తున్నది?
2. తాను తినక, కూడబెట్టు వారినేమందురు ?
3. పై పద్యమునందలి భావమేమి ?
4. కూడబెట్టిన ధనము ఎట్లు సద్వినియోగమగును?
5. ధర్మంబు + చేయక – ఏ సంధి ?

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

24. భూమి నాదియనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁజూచి ధనము నవ్వు
కదన భీతుఁజూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ !

ప్రశ్న 1.
భూమి ఎవరిని చూచి నవ్వుతుంది ?
జవాబు.
భూమి నాది అని అన్నవాడిని చూచి ఫక్కున నవ్వుతుంది.

ప్రశ్న 2.
ధనం ఎవరిని చూచి నవ్వుతుంది ?
జవాబు.
దానగుణం లేనివాడైన లోభిని చూచి ధనం నవ్వుతుంది.

ప్రశ్న 3.
యుద్ధంలో భయపడిన వాడిని చూచి ఎవరు నవ్వుతారు ?
జవాబు.
యుద్ధంలో భయపడిన వాడిని చూచి యముడు నవ్వుతాడు.

ప్రశ్న 4.
ఈ పద్యం తెలిపే నీతి ఏమిటి ?
జవాబు.
దురాశ, పిసినారితనం, పిరికితనం పనికిరావనే నీతి ఈ పద్యం బోధిస్తుంది.

ప్రశ్న 5.
దానము చేత హీనుడు – ఏ సమాసం ?
జవాబు.
తృతీయా తత్పురుష సమాసము.

TS 8th Class Telugu అపరిచిత పద్యాలు

25. విద్యచే భూషితుండయి వెలయుచున్న
దొడరి వర్ణింపనగు జుమీ దుర్జనుండు
చారుమాణిక్య భూషిత శస్తమస్త
కంబయిన పన్నగము భయంకరముగాదె.

ప్రశ్నలు :

ప్రశ్న 1.
విద్య ఉన్నప్పటికి విడువదగినవాడెవడు ?
జవాబు.
విద్య ఉన్నప్పటికీ విడువదగినవాడు దుర్జనుడు.

ప్రశ్న 2.
మణి ఉన్నప్పటికి భయం కలిగించేదేది ?
జవాబు.
మణి ఉన్నప్పటికి భయం కలిగించేది పాము.

ప్రశ్న 3.
ఈ పద్యంలో కవి ఎవరిని ఎవరితో పోత్చాడు ?
జవాబు.
ఈ పద్యంలో కవి చదువుకున్న దుర్జనుణ్ణి మణిని కలిగియున్న పాముతో పోల్చాడు.

ప్రశ్న 4.
ఈ పద్యంలో గల అర్థాలంకారమేది ?
జవాబు.
ఈ పద్యంలో అర్థాంతరన్యాసాలంకారం కలదు.

ప్రశ్న 5.
మాణిక్య – ఈ పదానికి వాడిన విశేషణమేది ?
జవాబు.
చారు.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

Telangana SCERT TS 8th Class Telugu Guide Pdf Download 4th Lesson అసామాన్యులు Textbook Questions and Answers.

అసామాన్యులు TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana

బొమ్మను చూడండి. ఆలోచించి చెప్పండి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 1
ప్రశ్న1.
బొమ్మను చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు ?
జవాబు.
వీధుల్లో పోగయిన చెత్తను, వ్యర్థాలను తీసి శుభ్రం చేస్తున్నారు.

ప్రశ్న2.
అట్లా చెత్తను ఎత్తిపోసే వారు లేకుంటే ఏమవుతుంది ?
జవాబు.
అట్లా చెత్తను ఎత్తిపోసేవారు లేకుంటే వీధులన్నీ మురికి కూపాలుగా మారతాయి. దోమలు, ఈగలు చేరి మలేరియా వంటి అంటురోగాలు వ్యాపిస్తాయి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

ప్రశ్న3.
ఇట్లా మనకు సేవలు చేసేవారు ఇంకా ఎవరెవరున్నారు ? వారి గొప్పదనమేమిటి ?
జవాబు.
ఇట్లా మనకు సేవ చేసే వారిలో వీధులను ఊడ్చేవారు, మురికి కాల్వలను బాగుచేసేవారు, హాస్పిటల్స్లో రోగులను శుభ్రం చేసేవారు ఉన్నారు. వీరే లేకపోతే మానవ మనుగడకే చేటు వస్తుంది. అంటురోగాలు విజృంభిస్తాయి.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.33)

ప్రశ్న 1.
ఈ నిజ జీవితంలో మీకు ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఉన్నాయా ? వాటి గురించి చర్చించండి.
జవాబు.
నిజ జీవితంలో ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఆకాశం మేఘావృతమై జడివాన కురుస్తుంది. అంతలోనే వర్షం ఆగగానే ఆకాశంలో వెలసిన ఇంద్రధనుస్సును చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. అది ప్రకృతి అందించిన అందాల హరివిల్లు. దాన్ని చూసి ఆశ్చర్యానందాలను పొందని వారెవరుంటారు ? ఎంత జడివాన కురిసినా, సాలెగూడు తడవదు. సాలెపురుగు ఇంజనీరింగ్ నైపుణ్యం ఆశ్చర్యమేస్తుంది.

ప్రశ్న 2.
ప్రతి వృత్తి పవిత్రమైందే, అని అనడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది ?
జవాబు.
ప్రతి వృత్తి పవిత్రమైందే. విమానం నడిపేవాని వృత్తి ఎంత గొప్పదో, ఆటో నడిపేవాని వృత్తీ అంత గొప్పదే. ఏ వృత్తీ తక్కువకాదు. ఒక వృత్తి లేనిదే మరొకటి లేదు. ప్రతి వృత్తిలోను ఎంతో కష్టం, నైపుణ్యం, త్యాగం కలగలసి ఉంటాయి. ఒకరికొకరు చేదోడుగా ఉంటే తప్ప సమాజం సజావుగా సాగదు.

ప్రశ్న 3.
చక్రం సమాజగతిని మార్చినది అని ఎట్లా చెప్పగలవు ?
జవాబు.
చక్రాన్ని కనుగొనడానికి ముందు ఒక చోట నుండి మరొకచోటకు వెళ్ళడానికి నడక తప్ప వేరే మార్గంలేదు. చక్రం ఆవిష్కరణతో మానవ జీవనంలో పరుగు మొదలయింది. ప్రయాణం మొదలయింది. చరిత్ర గతి మారింది.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.35)

ప్రశ్న 1.
బంగారానికే సౌందర్యం తెచ్చే స్వర్ణకారుల జీవితాలు ఎందుకు కళ తప్పుతున్నాయో చర్చించండి.
జవాబు.
బంగారం అంత సులభంగా కరగదు. మూసలో పెట్టి బొగ్గుల కొలిమిలో ఉంచి కరిగిస్తారు. దానికోసం బాగా ఊదాల్సివస్తుంది. అద్భుతమైన బంగారు నగలు చేసే వృత్తి కళాకారుల జీవితాలు యాంత్రిక విధానం రావటంతో కళతప్పాయి. బంగారాన్ని కరిగించటానికి ఊది ఊది రోగాల బారిన పడుతున్నారు. వారి శ్రమకు తగ్గ ఫలితం దొరకడంలేదు.

ప్రశ్న 2.
“కమ్మరి పని ఒక ఇంజనీరు ప్రక్రియ” అని ఎట్లా చెప్పగలవు ?
జవాబు.
ఇంజనీరింగ్ ప్రక్రియ అంటే సాంకేతిక ప్రక్రియ. ఇనుముతో నిత్యం సహవాసం చేసేవారు కమ్మరులు. ఎంతో నైపుణ్యంతో గొడ్డలి, పార, కొడవలి, బండి చక్రాలను తయారు చేస్తారు. సరైన కొలతలు తెలియందే అవి తయారుకావు. అందుకే పైకి తేలికగా కనపడే కమ్మరి పనిలో ఇంజనీరు ప్రక్రియ దాగి ఉంది.

ప్రశ్న 3.
వస్తుసామగ్రి, ఇంటిసామగ్రి తయారుచేయడంలో వడ్రంగి శ్రమ విలువను గురించి మాట్లాడండి.
(లేదా)
వడ్రంగుల పనితనం గురించి రాయండి.
జవాబు.
వడ్రంగి శ్రమకు మారుపేరు. కలపను ఎంపిక చేసుకునే దగ్గర నుండి దానిని వివిధ ఆకారాలలోకి మార్చటం కోసం ఎంతగా శ్రమిస్తాడో చెప్పలేము. వ్యవసాయపు పనిముట్లు, ఇండ్లకు వాడే కలప దూలాలు, వాసాలు, కిటికీలు, తలుపులు, కుర్చీలు, బల్లలు వీటి తయారీలో ఆయన శ్రమ విలువ దాగి ఉంటుంది. ఏమాత్రం కొలతలు తప్పినా, తయారు చేసిన వస్తువులు సరిగా కుదరవు.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

ప్రశ్న 4.
ఈ వ్యర్థ పదార్థాల నుండి పాదాలకు రక్షణ ఇచ్చే చెప్పులు సృష్టించిన వారి తెలివి ఎంత గొప్పదో చెప్పండి.
జవాబు.
మనం అడుగు బయట పెట్టాలంటే చెప్పుల్లో కాళ్ళు పెట్టాల్సిందే; ఒక చనిపోయిన జంతువు యొక్క చర్మమనే వ్యర్థ పదార్థం నుండి అందరికి అవసరమైన వస్తు సృష్టి చేయటం వారి తెలివికి నిదర్శనం.

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.37)

ప్రశ్న 1.
ఈ మానవుని సౌందర్యం వెనుక క్షురకుని పాత్ర ఉన్నది. దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జవాబు.
క్షురకుడంటే తల వెంట్రుకలను కత్తిరించే వాడని అర్థం. ఆ వెంట్రుకలను కత్తిరించడంలో ఒక పద్ధతి ఉంది, ఒక అమరిక ఉంది. వారు సరిగా వెంట్రుకలను కత్తిరించకపోతే వికారంగా తయారవుతాము.

ప్రశ్న 2.
ఈ అగ్గిపెట్టెలో పట్టేటంత చీరను నేసిన నేతపనివారి పనితనాన్ని ప్రశంసిస్తూ మాట్లాడండి.
జవాబు.
శరీరాన్ని కప్పుకోవటానికి బట్టలు కావాలి. వాటిని తయారుచేసేవారు నేతపనివారు. బట్టలు నేసే మగ్గంలో గొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అగ్గిపెట్టె చిన్నది. చీర పెద్దది. అంత పెద్ద చీరను చిన్న అగ్గిపెట్టెలో పట్టేలా, చీరను నేయడం అంటే మాటలు కాదు. ఎంతో పనితనం, నైపుణ్యం ఉండాలి.

ప్రశ్న 3.
దేశానికి అన్నంపెట్టే రైతు జీవనం దుర్బరంగా ఎందుకు మారిందో చర్చించండి.
జవాబు.
దేశానికి వెన్నెముక రైతు. రైతులు కష్టపడి పనిచేసి పంట పండిస్తే సరైన గిట్టుబాటు ధర లభించటం లేదు. దళారి వ్యవస్థ ప్రజలకు, రైతుకు మధ్య ఉండి ఇద్దరినీ దోపిడీకి గురిచేస్తోంది. అందుకే రైతు జీవనం దుర్భరంగా మారింది. దీనికి తోడు అతివృష్టి, అనావృష్టి, నాణ్యమైన విత్తనాల కొరత, చీడ పీడలు….. ఇలా పెట్టిన పెట్టుబడి రాక, వ్యవసాయం గిట్టుబాటు కాక, రైతు జీవనం దుర్భరంగా మారింది.

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. “ఒక్కొక్క వృత్తి దేనికదే గొప్పది” దీనిని సమర్థిస్తూ మాట్లాడండి.

జవాబు.
వృత్తి అంటే చేతివృత్తులని అర్థం. భారతదేశంలో చేతివృత్తులపై ఆధారపడి జీవించేవారు ఎక్కువ. చేతి వృత్తులవారిలో కుమ్మరి, కంసాలి, కమ్మరి, వడ్రంగి, చర్మకారులు, మంగళ్ళు, నేతవారు, చాకలివారు, వ్యవసాయదారులు ఉన్నారు. వారిలో ఎవరి వృత్తి వారికి గొప్ప.

కుమ్మరి కుండలు చేసే చాకచక్యం కంసాలికి ఉండదు. అలాగే కంసాలి చేసే నగల సున్నితమైన పనితనం కుమ్మరికి ఉండదు. అలాగే మిగిలిన వృత్తుల వారికి కూడా! ఏ వృత్తి గొప్పదనం దానిదే. కుమ్మరి చక్రం తిప్పందే కుండ తయారవదు. ఆ చక్రం కావాలంటే వడ్రంగి, కమ్మరి చెక్కపని, ఇనుము పని చేయాలి. ఇలా ఒక వృత్తి మరొక వృత్తి మీద ఆధారపడి ఉంది. అందుకే దేనికది గొప్పది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది పేరాను చదవండి. దాని ఆధారంగా కింద ఇచ్చిన పట్టికలో వివరాలు రాయండి.

లక్కతో తయారయ్యే గాజులకు హైదరాబాదు ప్రసిద్ధి. వాటికి అద్దంముక్కలు, పూసలు, విలువైన రంగురాళ్ళతో అలంకరిస్తారు. హైదరాబాద్ను సందర్శించేవారు వీటిని తప్పక కొనుక్కుంటారు. కళాత్మక కుట్టుపనులలో, వివిధ ఆకారాలలో ఉన్న చిన్నచిన్న అద్దంముక్కలు, పూసలు అందంగా తీర్చిదిద్దుతారు. దుప్పట్లు, దిండ్లు, కుషన్కవర్లు, లంగాలు, జాకెట్లు వంటి దుస్తులకు అత్యంత గిరాకీ ఉన్నది. నిర్మల్ వర్ణచిత్రాలు ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నవి. గృహోపకరణాలైన కొయ్యసామగ్రి, తేలికపాటి చెక్కల బొమ్మలు ఎంతో సృజనాత్మకంగా తయారు చేయబడతాయి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

వెండి నగిషీ కళను ‘ఫెలిగ్రీ’ అంటారు. కరీంనగర్ ఈ కళకు పెట్టింది పేరు. ఇక్కడ సన్నని వెండి దారాలతో, ఆకర్షణీయమైన వస్తువులు తయారుచేస్తారు. గంధపుగిన్నెలు, పళ్లాలు, పెట్టెలు, గొలుసులు, పక్షుల, జంతువుల బొమ్మలు వంటివి కళాకారులు కళాత్మకంగా తయారుచేస్తారు. వరంగల్లు జిల్లాలోని ‘పెంబర్తి’ గ్రామం లోహపు పనివారలకు ప్రసిద్ధి. అపురూపమైన జ్ఞాపికలు, గోడకు తగిలించే చిత్రాలు, పూలకుండీలు, విగ్రహాలు, స్టేషనరీ సామానులు, లోహపు రేకులతో వివిధ అంశాల తయారీ, ఇంకా అనేక రకాల అలంకరణ వస్తువులు వీరి చేతిలో తయారవుతాయి.
TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 2

జవాబు.

హస్తకళల పేర్లుదొరికే ప్రాంతంవాటి ప్రత్యేకతలు
1. లక్క గాజులుహైదరాబాదుఅద్దం ముక్కలు, పూసలు, విలువైన రంగు రాళ్ళతో చేతులకు అందాన్నిస్తాయి.
2. చెక్క బొమ్మలు, వర్ణ చిత్రాలునిర్మల్చెట్ల కొమ్మలతో అద్భుతమైన కళారూపాలను, బొమ్మలను తయారు చేస్తారు.
3. ఇత్తడి సామగ్రివరంగల్లు జిల్లా పెంబర్తిఇత్తడి ఖనిజంతో వివిధరకాలైన సామానులు, కళారూపాలను తయారుచేయు వృత్తి కళాకారులున్నారు.
4. వెండి నగిషీకళ (ఫెలిగ్రీ)కరీంనగర్సన్నని వెండిదారాలతో ఆకర్షణీయమైన వస్తువులను తయారుచేస్తారు.

 

2. ఆయా వృత్తిపనులవారు తయారుచేసేవి, వాడే వస్తువుల పేర్లను పాఠం ఆధారంగా వివరాలను పట్టికలో రాయండి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 3

జవాబు.

వృత్తులువాటికి సంబంధించిన పేరా సంఖ్యపేరాలో ఇచ్చినవారు వాడే వస్తువులు
1. కుమ్మరి33వ పేజీలో 1, 2 పేరాలులేదా తయారుచేసే వస్తువుల పేర్లు కుండలు, కూజాలు, అటికెలు, గురుగులు, మట్టి బొమ్మలు (చక్రం, సారెలు వాడతారు.)
2. కంసాలి33వ పేజీలో 3, 4 పేరాలుహారాలు, గాజులు, చెవి కమ్మలు, ముక్కుబిళ్ళ, వడ్డాణం, కడియాలు, ఉంగరాలు, గజ్జెలు, గొలుసులు మొదలగునవి. వీటిని తయారు చేయటానికి కొలిమి, చిన్నపాటి సుత్తులను వాడతారు.
3. కమ్మరి3వ పేజీ 2వ పేరానాగటికర్రు, పార, గొడ్డలి, కొడవలి, సుత్తి, ఇరుసులు, బండిచక్రము మొదలగునవి. వీటిని తయారుచేయటానికి సుత్తి, కొలిమి, దాయి మొదలగువాటిని వాడతారు.
4. వడ్రంగి34వ పేజీ 3వ పేరానాగలి, గుంటుక, గొర్రు, దూలాలు, వాసాలు కిటికీలు, గుమ్మాలు, కుర్చీలు, బెంచీలు మొదలగునవి. వీటిని తయారు చేయటానికి ఉలి, బాడిశ మొదలగు వాటిని వాడతారు.
5. తోలు పనివాళ్ళు35వ పేజీ 1, 2, 3 పేరాలుచెప్పులు, డప్పులు, మోట బావిలో నీళ్ళు తోడే బొక్కెనలకు తొండాలను చర్మంతో తయారు చేస్తారు.
6. నేత పనివాళ్ళు36వ పేజీ 2, 3 పేరాలుబట్టలు, కలంకారీ దుస్తులు, పట్టు వస్త్రాలు కంబళ్ళు మొదలగునవి తయారు చేస్తారు.

 

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ‘ఆదివాసులు మనందరికీ మార్గదర్శకులు’ – అని ఎట్లా చెప్పగలరు ? రాయండి.
జవాబు.
ఆదివాసులు అడవులే అమ్మ ఒడిగా జీవించేవారు. ప్రకృతిలో రేయింబవళ్ళు కలసిపోయి ఉండేవారు. ప్రకృతి పరిశీలకులు వారు. ఏమి తినాలో ఏమి తినకూడదో పరిశీలించి ఆ జ్ఞానాన్ని మనకు అందించారు. ఈ పరిశీలన కోసం ఎందరో తమ ప్రాణాలను వదిలి ఉంటారు. వారికున్న విజ్ఞానం చాలా గొప్పది. వాళ్ళు నిజంగా వృక్ష శాస్త్రజ్ఞులే! వన మూలికా వైద్యాన్ని వారి నుండే సభ్య ప్రపంచం తెలుసుకుంది. ప్రజలు రోగాల బారిన పడినప్పుడు చెట్ల ఆకుల రసాలతో ఆరోగ్యవంతులను చేయటం వారికి తెలిసినంతగా మనకు తెలీదు. యుద్ధాల్లో గాయపడిన వారికి స్వస్థతచేకూర్చగల శక్తి వారి నాటు వైద్యానికి ఉందంటే ఆశ్చర్యపడనవసరం లేదు. కావున వారు సభ్య సమాజానికి మార్గదర్శకులని చెప్పాలి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

ఆ) కుమ్మరి గొప్పతనం గురించి మీరు ఏమనుకుంటున్నారో రాయండి.
(లేదా)
నీకు తెలిసిన ఒక వృత్తి గొప్పతనాన్ని తెల్పండి
జవాబు.
కుమ్మరి వేసవి కాలపు చంద్రుడు. చల్లని నీటిని అందించే మట్టి కుండల తయారీలో నేర్పరి. చక్రం త్రిప్పుతూ తయారు చేసిన బంకమట్టిని దానిపై ఉంచి చేతి వేళ్ళతో సున్నితంగా నొక్కుతూ ఆశ్చర్యపడే విధంగా వివిధ రూపాలలో మట్టి వస్తువులను తయారు చేయగల నేర్పరి. ఆయన చేతుల్లో ఇంద్రజాల విద్య ఉందా అనిపిస్తుంది. మనం ఉపయోగించుకునే మట్టి పాత్రల వెనుక నైపుణ్యం కుమ్మరిదే. వేసవిలో పేదవాడి ఫ్రిజ్ నీటి కుండల నుండి అందమైన మట్టి బొమ్మలు తయారు చేయగల నేర్పరి అతడు. ఆయనకు ఆధారభూతమైన వస్తువు ‘సారె’ ఒక్కటే. కుమ్మరి చేసే కుండలు, మట్టిపాత్రలు, దీపపు ప్రమిదలు లేనిదే ఇప్పటికీ మనకు రోజు గడవదంటే, కుమ్మరి గొప్పదనం అర్థమవుతుంది.

ఇ) “రైతులు మన అన్నదాతలు” – సమర్థిస్తూ రాయండి.
(లేదా)
“రైతుకు చేతులెత్తి నమస్కరిస్తాను” అని కవి అనడంలోని ఉద్దేశం ఏమిటి ?
జవాబు.
రైతులు మన అన్నదాతలు. రైతే దేశానికి వెన్నెముక. అతడు పంట పండించకపోతే మనకు ఆహారం ఉండదు. కష్టపడి ఆరుగాలం పంటను సంరక్షించుకుంటూ దాన్నే తన జీవిత సర్వస్వంగా భావించేవాడు రైతు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి, సమస్యలతో నలిగి సడలని ధైర్య సాహసములతో పంటలు పండించి అన్నదాత అనిపించుకున్నాడు. ఆయన కష్టం మనకు భుక్తినిస్తుంది. ఒక్కపూట ఆహారం లేకపోతే అల్లాడిపోతాం. పిడికెడు మెతుకుల కోసం పడరాని పాట్లు పడతాం. కోటి విద్యలు కూటికొరకే కదా! మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు ఊరికే రావు కదా! రైతు కష్టించి పని చేస్తేనే మన కడుపులు నిండుతాయి. అందుకే రైతు మన అన్నదాత. అతనికి చేతులెత్తి నమస్కరిస్తానని కవి అన్నాడు.

ఈ) “దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో, సమాజానికి అన్ని వృత్తులవాళ్ళూ అంతే అవసరం” – దీన్ని సమర్థిస్తూ, మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు.
దేహానికి అవయవాలు ఎంత ముఖ్యమో, సమాజానికి అన్ని వృత్తుల వాళ్ళూ అంతే అవసరం. ఇది నిజం. ఏ అవయవం లేకపోయినా దేహానికి పరిపూర్ణత ఉండదు. అలాగే ఏ వృత్తిదారుడు లేకపోయినా అది సమాజం అనిపించుకోదు. ఒక వృత్తిని ఆధారం చేసుకొని మరొక వృత్తి నిలబడుతుంది. ప్రతి వృత్తిలోను శ్రమ, నైపుణ్యాలుంటాయి. ప్రతివృత్తి పవిత్రమైందే. ఏ వృత్తినీ చిన్నచూపు చూడకూడదు. ఒక శుభకార్యం జరగాలంటే ఎంతో మంది వృత్తిదారుల ప్రమేయం దానిపై ఉంటుంది. మంగళవాద్యాలు, కుండలు, ప్రమిదలు, ఆభరణాలు, వస్త్రాలు కావాలి. వాటిని తయారు చేసే అన్ని వృత్తులవారి సహకారం కావాలి కదా! ఇలా ఒకరికొకరై ఒకరితో ఒకరు సహకరించుకొంటేనే సమాజం నిలబడుతుంది. మన శరీరంలో కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు చేతులు వీటిలో ఏది గొప్ప అంటే ఏం చెబుతాం. దేనికదే గొప్ప. అన్ని అవయవాలు కలసి ఉండి పనిచేస్తేనే దేహం, అన్ని వృత్తులవారు కలసి ఉంటేనే సమాజం.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) “శ్రమ పునాదిపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుంది” అని ఎట్లా చెప్పగలరు ? కారణాలు వివరిస్తూ రాయండి. (లేదా) కార్మిక లోకానికి ఈ దేశం ఎంతో ఋణపడి ఉన్నది. సమర్థిస్తూ క్లుప్తంగా రాయండి.
జవాబు.
శ్రమ పునాదిపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుంది. ఇది వాస్తవం. ‘శ్రమయేవ జయతే’. ‘కృషి ఉంటే మనుషులు ఋషిలవుతారు’ అన్న నానుడులు ఉండనే ఉన్నాయి. శ్రమించటానికి ఎవరూ సిగ్గుపడనవసరం లేదు. సోమరితనం దరిద్రాన్ని తెచ్చిపెడ్తుంది. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని శ్రీశ్రీ గారి భావన. శ్రమను గౌరవించటం నేర్చుకోవాలి. శ్రమ సంస్కృతిలో జీవించటం నేర్చుకోవాలి.

సమాజం అభివృద్ధి చెందాలంటే సమాజంలో ఉన్న వారందరి కృషి అవసరం. రెండవ ప్రపంచయుద్ధంలో జపాన్ పూర్తిగా సర్వస్వాన్ని కోల్పోయింది. దేశ ప్రజలందరు ఆ దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములై శ్రమించి ప్రపంచంలో అత్యున్నత దేశంగా తీర్చిదిద్దారు. కాబట్టి శ్రమ పునాదులపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుందన్నది యథార్థం. దానికి సమాజంలోని ప్రజలందరూ కులమత వృత్తి భేదం లేకుండా ఒకరికొకరు కలసిమెలసి సహజీవనం చేస్తూ శ్రమించాల్సి ఉంటుంది.

అప్పుడే నిజమైన సమాజపు భవనం నిర్మించబడుతుంది. రైతు నాకెందుకులే అని వ్యవసాయం మానేస్తే, ఒక్కపూట కూడా మనకు తిండి గడవదు. ఇలాగే ఇతర వృత్తుల వాళ్ళు శ్రమ చేయనిదే మనకు రోజు గడవదు. అసలు మన శరీరమే శ్రమను కోరుతుంది. కేవలం తిండితిని కూర్చుంటే, ఆ తిండి అరగక, అనారోగ్యం పాలవుతాము. అందుకే శ్రమలోనే అభివృద్ధి ఉంది.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. మీ గ్రామంలోని వృత్తిపనుల వారిని గురించిన ఒకరి వివరాలను సేకరించడానికి ప్రశ్నావళిని తయారు చేయండి.

ఉదా ॥ 1. నమస్కారం! మీ పేరేమిటి ?
జవాబు.
ఉదా : 1. నమస్కారం! మీ పేరేమిటి ?
2. మీరు ఏం చేస్తుంటారు ?
3. మీది కులవృత్తా ? కాదా ?
4. దీనిని ఎవరి దగ్గర నేర్చుకున్నారు ?
5. ఇది మీకు తృప్తినిస్తుందా ?
6. ఈ వృత్తి మీకు భుక్తినిస్తుందా ?
7. మీ వృత్తిలోని ప్రత్యేకత ఏమిటి ?
8. మీ వృత్తిలో మీరు ఏం సాధించారు ?
9. సమాజంలో మీ వృత్తికి మంచి ఆదరణ ఉందా ?
10. ప్రజల అభిమానాన్ని పొందాలంటే మీ వృత్తి పట్ల మీరు ఎలాంటి శ్రద్ధను చూపుతారు ?
11. మీ వృత్తిదారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?

V పదజాల వినియోగం

1. కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి.

అ) చేదోడు వాదోడు : పిల్లలు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలి.
ఆ) చాకచక్యం : చాకచక్యంగా వ్యవహరించటం తెలివిగల వారి లక్షణం.

2. కింది పట్టికలోని ప్రకృతి వికృతులను గుర్తించి వేరుచేసి రాయండి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 4

జవాబు.
ప్రకృతి – వికృతి
ఉదా : విద్య – విద్దె
అ) గౌరవం – గారవం
ఆ) ఆహారం – ఓగిర
ఇ) భక్తి – బత్తి
ఈ) రాత్రి – రాతిరి

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

3. కింది వాటికి పర్యాయపదాలు రాయండి.

అ) చెట్టు : ___________, ___________, ___________
జవాబు.
వృక్షము, తరువు, భూరుహము

ఆ) పాదము : ___________, ___________, ___________
జవాబు.
పద్యపాదము, కాలిఅడుగు, చరణము

ఇ) శరీరం : ___________, ___________, ___________
జవాబు.
దేహం, తనువు, కాయం

VI. భాషను గురించి తెలుసుకుందాం.

1. కింది పట్టికలోని వాక్యాలలో క్రియాభేదాలను గుర్తించి రాయండి.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 5

జవాబు.

వాక్యంఅసమాపక క్రియసమాపక క్రియ
ఉదా : సీత బజారుకు వెళ్ళి, బొమ్మ కొన్నది.వెళ్ళికొన్నది
1. రాజు పద్యం చదివి, భావం చెప్పాడు.చదివిచెప్పాడు.
2. వాణి బొమ్మ గీసి, రంగులు వేసింది.గీసివేసింది
3. కావ్య మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది.ఎక్కివెళ్ళింది
4. రంగయ్య వచ్చి, వెళ్ళాడు.వచ్చివెళ్ళాడు.
5. వాళ్ళు అన్నం తిని నీళ్ళు తాగారు.తినితాగారు

 

సంక్లిష్ట వాక్యం :

కింది వాక్యాలు చదవండి. కలిపి రాసిన విధానం చూడండి.

ఉదా : గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.
గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది.

2. కింది వాక్యాలను కలిపి రాయండి.

అ) విమల వంటచేస్తుంది. విమల పాటలు వింటుంది.
జవాబు.
విమల వంట చేస్తూ పాటలు వింటుంది.

ఆ) అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జవాబు.
అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది.

ఇ) రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడి పండ్లు తెచ్చాడు.
జవాబు.
రవి ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చాడు.
పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారింది. కర్త పునరుక్తం కాలేదు.
ఇట్లా రెండు లేక మూడు వాక్యాలు కలిపి రాసేటప్పుడు చివరి వాక్యంలోని సమాపక క్రియ అలాగే ఉంటుంది.
ముందు వాక్యాల్లోని సమాపక క్రియలు, అసమాపక క్రియలుగా మారుతాయి. కర్త పునరుక్తం కాదు. దీనినే, ‘సంక్లిష్ట వాక్యం’ అంటారు.

3. కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా రాయండి.

అ) రజిత అన్నం తిన్నది. రజిత బడికి వెళ్ళింది.
జవాబు.
రజిత అన్నం తిని బడికి వెళ్ళింది.

ఆ) వాళ్ళు రైలు దిగారు. వాళ్ళు ఆటో ఎక్కారు.
జవాబు.
వాళ్ళు రైలు దిగి ఆటో ఎక్కారు.

ఇ) రామయ్య వ్యవసాయదారుడా ? రామయ్య ఉద్యోగస్తుడా?
జవాబు.
రామయ్య వ్యవసాయదారుడా ? ఉద్యోగస్తుడా? రెండు నామవాచకాలలో ఒకటి లోపించడం.

ఈ) రాజన్న లడ్డూలు తెచ్చాడు. రాజన్న అందరికీ పంచాడు.
జవాబు.
జవాబు. రాజన్న లడ్డూలు తెచ్చి అందరికీ పంచాడు.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

సంయుక్త వాక్యం :

4. కింది వాక్యాలు చదవండి. కలిపి రాయండి.

ఉదా : రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు.

అ) వర్షాలు కురిసాయి. పంటలు బాగా పండాయి.
జవాబు.
వర్షాలు కురిసాయి కాబట్టి పంటలు బాగా పండాయి.

ఆ) అతనికి కనిపించదు. అతడు చదువలేడు.
జవాబు.
అతనికి కనిపించదు కాబట్టి చదువలేడు.

పై వాక్యాలను కలిపి రాసినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
పై వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పురాలేదు. వాక్యాలమధ్య కొన్ని అనుసంధాన పదాలు వచ్చాయి. ఇట్లా రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే అవి ‘సంయుక్త వాక్యాలు’ అవుతాయి. అనుసంధాన పదాలు అంటే కావున, కానీ, మరియు, అందువల్ల మొదలైనవి.

సంయుక్తవాక్యంగా మారేటప్పుడు వాక్యాల్లో వచ్చే మరికొన్ని మార్పులు ఎట్లా ఉంటాయో గమనించండి.

అ) వనజ చురుకైనది. వనజ అందమైనది.
వనజ చురుకైనది. అందమైనది. రెండు నామ పదాల్లో ఒకటి లోపించడం.

ఆ) దివ్య అక్క, శైలజ చెల్లెలు.
దివ్య, శైలజ అక్కాచెల్లెళ్ళు – రెండు నామ పదాలు ఒకేచోట చేరి చివర బహువచనం చేరడం.

ఇ) రామయ్య వ్యవసాయదారుడా ? రామయ్య ఉద్యోగస్తుడా ?
రామయ్య వ్యవసాయదారుడా ? ఉద్యోగస్తుడా ? రెండు నామవాచకాలలో ఒకటి లోపించడం.

ఈ) ఆయన డాక్టరా ? ఆయన ప్రొఫెసరా ?
ఆయన డాక్టరా, ప్రొఫెసరా ? – రెండు సర్వనామాలలో ఒకటి లోపించటం.

5. కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.

అ) వారు గొప్పవారు. వారు తెలివైనవారు.
జవాబు.
వారు గొప్పవారు, తెలివైనవారు.

ఆ) సుధ మాట్లాడదు. సుధ చేసి చూపిస్తుంది.
జవాబు.
సుధ మాట్లాడదు, చేసి చూపిస్తుంది.

ఇ) మేము రాము. మేము తేలేము.
జవాబు.
మేము రాము, తేలేము.

భాషా కార్యకలాష్ట్రాలు / ప్రాజెక్టు పని

వివిధ వృత్తి పనులవారు పాడుకొనే పాటలను సేకరించండి. ఒక పాటపై మీ అభిప్రాయం ఆధారంగా నివేదిక రాయండి. ప్రదర్శించండి.

జవాబు.

అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు : వివిధ వృత్తుల వారు పాడుకొనే పాటలు
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఆయా వృత్తి పనుల వారిని కలిసి సేకరించడం

ఆ) నివేదిక :

1. రైతు కూలీల పాట

వానమ్మ వానమ్మ వానమ్మా
ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మా ॥వానమ్మ॥ 2

తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి
తినటానికి తిండిలేక … ఉండడానికి గుడిసె లేక
తాగేందుకు నీరు లేక … కాపాడే నాథుడు లేక ॥వానమ్మ॥ 2

చెర్లర్లో నీళ్ళూలేవూ … సెలకల్లో నీళ్ళూలేవూ
వాగుల్లో నీళ్ళూలేవూ … వంపుల్లో నీళ్ళూలేవూ
నిన్నే నమ్మిన రైతూ … కళ్ళల్లో నీళ్ళూలేవూ ॥వానమ్మ॥ 2

ఎదిగేటి మిరపసేనూ … ఎండల్లో ఎండిపోయే
సక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడ్వబట్టె…
పాలోసుకున్న కంకి … పాలన్నీ ఉడిగిపాయె
నీళ్ళోసుకున్నా నేను … నీళ్ళడలేకపాయే ॥వానమ్మ॥ 2

నల్లానీ గౌడీ బర్రె … తెల్లాని ఎల్లన్నావు
సైదన్నా మేకపోతూ … సక్కని లేగదూడా
కరువంటూ పీనుగెల్లా … కటికోని కమ్ముకునిరి ॥వానమ్మ॥ 2

కొంగునా నీళ్ళూ దెచ్చే … నింగిలో మబ్బులేవీ
చెంగూ చెంగూనా ఎగిరే … చెరువుల్లో చేపాలేవీ
తెల్లనీ కొంగ బావా … కళ్ళల్లో ఊసూలేవీ ॥వానమ్మ॥ 2

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

2. కుమ్మరిపాట
అన్నల్లారా రారండోయ్ … తమ్ముల్లారా చూడండోయ్
కుండలు చేసే కుమ్మరి నేను
కూజాలు చేసే కుమ్మరి నేను
గిర గిర సారెను తిప్పేస్తా
గురుగులు ముంతలు చేసేస్తా
బంకమట్టికే ఆకృతినిస్తూ
మట్టి ముంతలకు సొగసులద్దుతూ
ఇళ్ళలో వాడే మట్టి పాత్రలను
చల్లని నీటి మట్టి కూజాలను
తయారుచేసే కుమ్మరి నేనూ
పెళ్ళిళ్ళకు వాడే కూరాళ్ళను
దీపవళి నాటి దీపపు ప్రమిదలను
చక చక తయారుచేస్తాను
చిటికెలో మీకు ఇస్తాను ॥అన్నల్లారా రారండోయ్॥

ఇ) ముగింపు :
ఇలా వివిధ వృత్తి పని వాళ్ళు తాము పనిచేస్తున్నప్పుడు కలిగే అలసటను పోగొట్టుకోవడానికి, మానసిక ఉ ల్లాసానికి ఇలాంటి పాటలు పాడుకుంటూ పని చేస్తారు. పల్లెటూళ్ళు మన సంస్కృతీ సంప్రదాయాలకు, ప్రాచీన కళలకు పట్టుగొమ్మలు. ఈ కళలను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

(లేదా)

మీకు తెలిసిన వృత్తిపనివారిని కలవండి. వారు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల గురించి నివేదిక రాయండి.
జవాబు.
అ) ప్రాథమిక సమాచారం :
1) ప్రాజెక్టు పని పేరు : వివిధ వృత్తిపని వారి సమస్యలు
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఆయా వృత్తిపని వారిని కలువడం ద్వారా

ఆ) నివేదిక :
విషయ వివరణ :

మన దేశంలో ఎన్నో రకాల వృత్తుల వాళ్లు ఉన్నారు. యాంత్రీకరణ జరిగిన తర్వాత వారి చేతి వృత్తులకు గిరాకీ తగ్గి చాలామంది వారి కుల వృత్తులు వదిలివేసి వేరే పనులు చేస్తున్నారు. వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న వారి బతుకులు దుర్భరంగా ఉన్నాయి. మా ప్రాంతంలో గల చేనేత, కుమ్మరి, మేదర వృత్తి పనుల వారిని కలిసి వారి సాదక బాధకాల గూర్చి నివేదిక తయారుచేశాను.

1. చేనేత వృత్తి
పూర్వకాలం చేనేత వృత్తికి ఎంతో ఆదరణ ఉండేది. మగ్గంపై చేతితో నేసిన చీరలు, ధోవతులకు చాలా గిరాకీ ఉండేది. కానీ మరమగ్గాలు వచ్చిన తర్వాత చేనేత బట్టలకు ఆదరణ తగ్గిపోయింది. కారణం, మరమగ్గం మీద నేసిన దుస్తుల కంటే వీటి నాణ్యత, మన్నిక తక్కువ, ధర ఎక్కువ. ఒక చేనేత కార్మికుడు గుంట మగ్గంపై 10 గం||లు కూర్చుండి నేస్తే అతడి రోజువారీ కూలీ రూ. 150/- లు మాత్రమే ! కేవలం 10 గజాల గుడ్డను మాత్రమే నేయగలడు. 150 రూ॥లు ఈ కాలంలో అతని జీవితావసరాలను ఎంతమాత్రం తీర్చలేవు.
TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 6
ఇక మరమగ్గాల కార్మికుల జీవితాలేమైన సవ్యంగా ఉన్నాయా అంటే అదీ లేదు. ఒక మరమగ్గం కార్మికుడు రోజుకు 12 గం||లు పనిచేయాలి. ఒక వారం Day shift లో పనిచేస్తే, మరో వారం Night shift లో పనిచేయాలి. ఏక కాలంలో 8 మరమగ్గాలను చూసుకోవాలి. 10 పీకుల గుడ్డకు 30 పైసలు, అంటే సుమారు 1 మీటర్ గుడ్డకు 1 రూపాయి గిట్టుబాటవుతుంది. ఒక్కో మగ్గంపై 40 మీటర్ల గుడ్డ నేయగలడు. అంటే 8 మరమగ్గాలపై 12 గం||లలో 320 మీటర్ల గుడ్డ మాత్రమే నేయగలడు. సగటున వారానికి 6 రోజులు పనిచేస్తే, 320 × 6 = 1920 రూ॥ నెలకు 1920 × 4 = 7680 రూ॥ సంపాదించగలడు. కానీ, శబ్ద కాలుష్యం, నిద్రలేమి, 12 గంటలు నిలబడే పనిచేయడం లాంటి సమస్యల వల్ల నెలకు 6000/- కంటే ఎక్కువగా సంపాదించలేక పోతున్నారు. అది ఇల్లు కిరాయి, పిల్లల చదువు, జీవించడానికి సరిపోక ఎంతోమంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.

2. కుమ్మరి వృత్తి
పూర్వకాలం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లిన వీరి వృత్తి యాంత్రీకరణ తర్వాత, అల్యూమినియం, స్టీలు పాత్రలు, వంట ఇళ్ళను ఆక్రమించిన తర్వాత, వెల వెల బోయింది. చేతినిండా పనిలేక పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లుతున్నారు.
TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 7
ఎవరో యోగా సాధకులు, కుండలో నీరు, మట్టి పాత్రల్లో వంటకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప, ఎవరూ వీటిని వాడడం లేదు. పెళ్లికి వాడే కూరాటి కుండలు, దీపావళి నాడు వాడే ప్రమిదలు తప్ప, ఇతర మృణ్మయ పాత్రల వాడకం శూన్యం.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

3. మేదర వృత్తి
వీరు వెదురు బొంగును బద్దలుగా చీల్చి, ఆ బద్దలతో గాదెలు, తట్టలు, చేటలు, తడికెలు లాంటివి తయారుచేస్తారు. పూర్వం ప్రతి గ్రామంలో ఈ మేదరవాళ్లు ఉండేవారు. ఒక ఇంటిని రెండు భాగాలుగా వేరు చేయుటకు తడికెలు వాడేవారు. దానికి బదులు ఇప్పుడు కార్డుబోర్డును వాడుతున్నారు.
TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 8
పెళ్ళిళ్ళలో తడికెల పందిరి వేసేవారు, దాని స్థానంలో ఇప్పుడు టెంట్లు వచ్చాయి. ప్లాస్టిక్ చేటలు, తట్టలు, బుట్టలు వచ్చి వెదురుతో చేసిన చేటలు, తట్టలు, బుట్టల స్థానాన్ని ఆక్రమించాయి. చేయడానికి పనిలేక వీరు పట్టణాలకు వలస వెళుతున్నారు.

ఇ) ముగింపు :
ఈ విధంగా యాంత్రీకరణ, వివిధ చేతి వృత్తుల వారికి పనిలేకుండా చేసింది. వీరి సాదక బాధకాలు, ప్రభుత్వం తెలుసుకొని చేయూత నివ్వాలి. చేతివృత్తుల వారి ఉత్పత్తులకు మార్కెట్లో స్థానం కల్పించి, తగిన ధర ఇప్పించాలి. వీరు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నెలకొల్పుకోవడానికి, తక్కువ వడ్డీకే బ్యాంకులు అప్పులు ఇవ్వాలి.

TS 8th Class Telugu 4th Lesson Important Questions అసామాన్యులు

ప్రశ్న 1.
నేతపనివారల కళా నైపుణ్యాన్ని వివరించండి.
జవాబు.
బట్టలను తయారు చేసేవారు నేతపనివారు. మన శరీరాన్ని కప్పుకోవటానికి బట్టలు కావాలి. మగ్గం ద్వారా బట్టలను తయారుచేసి అందించే నేతపనివారి నైపుణ్యం చాలా గొప్పది. బట్టలు నేయడానికి వాడే మగ్గం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడినది. నేతపనివారు అగ్గిపెట్టెలో పట్టేంత చీరలను తయారు చేస్తారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఒక సుదీర్ఘ ప్రక్రియ. దూది నుండి సన్నని దారాన్ని తీయటం, దాన్ని పడుగు పేకలలో అమర్చటం, మగ్గంపై వస్త్రాలను తయారుచేయటం నేత పనివారలు ఎంతో నైపుణ్యంతో చేస్తారు. గొర్రెల బొచ్చును కత్తిరించి ఉన్నిదారం వడికి కంబళ్ళను చేస్తారు. పట్టువస్త్రాల తయారీ వీరి నైపుణ్యానికి ఒక మచ్చుతునక.

ప్రశ్న 2.
క్షురకుల సేవలు మరువలేనివి. సమర్థించండి.
(లేదా)
సమాజంలో వృత్తి చాలా గొప్పది. మీకు తెలిసిన ఒక వృత్తిని గురించి ఐదు వాక్యాలు రాయండి.
జవాబు.
క్షురకుల సేవలు మరువరానివి. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించటంలో వీరి పాత్ర అనిర్వచనీయమైనది. కత్తి, కత్తెరలతో వారు చూపే పనితనం ఎంతో నైపుణ్యంతో కూడినది. వీరికి తెలిసిన మరొక విద్య దేశీయమైన వైద్యం. చెట్ల వేళ్ళతో, ఆకులతో, చేపలతో చేసే మందుల పట్ల వీరికి మంచి అవగాహన ఉంది. తైలంతో శరీర మర్దన వీరి నైపుణ్యానికి నిదర్శనం. స్త్రీలకు క్షురకస్త్రీలే పూర్వం ప్రసవం చేసేవారట. వీరి సేవలన్నీ ఆరోగ్యకరమైనవి. సమాజానికి వీరి సేవలు అత్యవసరం.

ప్రశ్న 3.
“అన్నమయములైనవన్నీ జీవమ్ములు” అని కవి అనడంలోని ఉద్దేశమేమి?
జవాబు.
సకల ప్రాణులు అన్నం తినే జీవిస్తాయి. ఆ అన్నమే లేకపోతే ప్రాణికోటి లేదు. ఇంత ప్రాధాన్యం ఉన్న ఆహార నియమాల గురించి ఆదివాసులకు మొదటనే తెలుసు. అన్నం అందరికీ అవసరం అని కవి చెప్పాడని భావం.

ప్రశ్న 4.
గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి ?
జవాబు.
గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండాలంటే గ్రామంలోని ప్రజలందరి సమిష్టి కృషి ఎంతో అవసరం. ఒకప్పుడు
గ్రామాలు స్వయం సమృద్ధిగా వెలిగాయి. ప్రజా జీవనానికి అవసరమైన వస్తువులను అన్ని వృత్తులవారు కలసి మెలసి తయారు చేసుకునేవారు. ఒకరి అవసరాలకు మరొకరు చేదోడు వాదోడుగా నిలిచేవారు. కులాల కుమ్ములాటలు ఉండేవి కావు. అందరూ అక్కా, బావా, మావా, అత్తా… అని నోరారా పిలుచుకుంటూ ఆత్మీయతతో జీవించేవారు.

మానవత్వాన్ని చాటిన మధుర జీవనం వారిది. కలసి ఉండటం, ఒకరిపై ఒకరు ఆధారపడటం, ఒకరికొకరు సహకరించుకోవటం మన సంస్కృతిలో గొప్పతనం. వీటిని అలవరచుకొని పాటిస్తే గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉంటాయనటంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. సమాజంలోని వారు ఒకరినొకరు సహకరించుకోకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటే గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించలేవు.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

ప్రశ్న 5.
అసామాన్యులు వ్యాసం రాయటంలో ఉద్దేశమేమిటి ? చర్చించండి.
జవాబు.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, జీవన విధానం వృత్తి జీవనంపై ఆధారపడి ఉంది. మన సమాజంలోని రహస్యమిదే. పనిని విభాగించటం. మన సమాజం నేర్చుకున్న ఈ చేతివృత్తులు అందరికి సామాజిక స్థాయిని అందిస్తున్నాయి. ఉదాహరణకు ఒక వివాహం జరగాలనుకోండి దానికి కావలసిన వస్తు సామగ్రి ఒక్కరే తయారు చేయటం అసాధ్యం. ధాన్యం ఒకరు, పప్పు ఉప్పులు ఒకరు, కుండలు ఒకరు, తాళిబొట్టు ఒకరు, వస్త్రాలు ఒకరు, పాలు మిగిలిన ఆహార పదార్థాలు ఇంకొకరు. ఇలా సమాజంలోని వారు ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువును లేక పదార్థాన్ని తయారుచేసి సిద్ధంగా ఉంచితేనే కదా, వివాహం జరిగేది.

భారతదేశంలోని ప్రజల మధ్య ఉండే సహకారం సమన్వయాలకు ఒక నిదర్శనం వృత్తులు అని చెప్పేందుకు ఈ వ్యాసాన్ని రచించారు. బ్రాహ్మణుడు లేకపోయినా. కుమ్మరి లేకపోయినా పెళ్ళితంతు జరగటం కష్టమే! సమసమాజ నిర్మాణం ధ్యేయంగా కులవృత్తులు ఏర్పడ్డాయి. కాని ఇప్పుడు నిరాదరణకు గురై వ్యక్తులకు జీవన భృతిని కల్పించలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం సాంకేతిక పరిజ్ఞానం.

ప్రశ్న 6.
రజకుల కాయకష్టం మనకు ఆరోగ్యాన్నందిస్తుంది. సమర్థించండి.
జవాబు.
భారతీయ సమాజంలో చేతివృత్తులకు ఒక విశిష్టత ఉంది. “కులవృత్తికి సాటిరాదు గువ్వల చెన్నా” అన్నమాటలు మన సమాజానికి ప్రతినిధిగా వచ్చినవే! రజకుల కాయకష్టం నిజంగా మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. బట్టల మురికిని శుభ్రం చేయటం ద్వారా మనకు వారు ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. బట్టలను శుభ్రంగా ఉతికి ఆరేయటంతో వాటికి అంటుకున్న మురికితోపాటు చాలా క్రిములు నశిస్తాయి. అలా ఉతికిన బట్టలకు గంజిపెట్టి చలువ చేసి, ఇస్త్రీ చేయటంతో శుభ్రమైన బట్టలుగా అవి తయారవుతాయి.

ఇస్త్రీతో మిగిలిన క్రిములు కూడా నశిస్తాయి. శుభాశుభ కార్యాలు వీరి ప్రమేయం లేకుండా జరుగవు. ఇంట్లో జరిగే కార్యక్రమాలన్నింటిలో చేతివృత్తుల వారి ప్రమేయమే ఎక్కువ. అందునా రజకుల ప్రమేయం మరీ ఎక్కువ. శుభకార్యక్రమాల శుభవార్తలను బంధువులకు తెలియజేయటం దగ్గర నుండి ఆ సమయంలో ఇళ్ళను, గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించే బాధ్యతను వీరు చక్కగా నిర్వహిస్తారు. ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమాలే! కనుక రజకుల కాయకష్టం మనకు ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తుందనటంలో అతిశయోక్తి లేదు.

పర్యాయపదాలు

  • ఆకాశము = నింగి, గగనము
  • సొమ్ములు = డబ్బు, సంపద
  • హలము = నాగలి, సీరమ
  • కర్షకుడు = రైతు, హాలికుడు
  • పశువులు = జంతువులు, పసరములు
  • విప్లవం = ఉద్యమము, మేలుకొలువు

నానార్థాలు

  • కాలము = సమయము, మరణము
  • చేవ = సారము, ధైర్యము
  • పాడి = ధర్మము, న్యాయము, క్షీర సంపద (పెరుగు, పాలు, నెయ్యి మొదలైనవి)
  • శక్తి = బలము, పార్వతి
  • అర్థము = శబ్దార్థము, ప్రయోజనం

ప్రకృతి – వికృతులు

  • ప్రకృతి – వికృతి
  • ఆశ్చర్యము – అచ్చెరువు
  • శక్తి – సత్తి
  • ఆకాశము – ఆకసము
  • త్యాగము – చాగము
  • అటవి – అడవి
  • విజ్ఞానము – విన్నాణము
  • కష్టము – కస్తి
  • ధర్మము – దమ్మము
  • స్త్రీ – ఇంతి

వ్యుత్పత్త్యర్థాలు

  • గురువ = అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు (ఉపాధ్యాయుడు)
  • హాలికుడు = హలముతో నేలను దున్నువాడు (రైతు)
  • పక్షి = పక్షములు కలది
  • పౌరుడు = పురంలో నివసించువాడు

సంధులు

  • దేశాభివృద్ధి = దేశ + అభివృద్ధి – సవర్ణదీర్ఘసంధి
  • సూత్రము : అ, ఇ, ఉ, ఋలకు సవర్ణాలైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
  • సున్నితమైన = సున్నితము + ఐన – ఉత్వసంధి
  • అద్భుతమైన = అద్భుతము + ఐన – ఉత్వసంధి
  • సూత్రము : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి అవుతుంది.
  • ప్రత్యక్షము = ప్రతి + అక్షము – యణాదేశసంధి
  • అత్యంతము = అతి + అంతము – యణాదేశసంధి
  • సూత్రము : ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనపుడు క్రమంగా యవరలు వచ్చును.

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు

సమాసములు

  • వ్యర్థ పదార్థం = వ్యర్థమైన పదార్థం – విశేషణ పూర్వపద కర్మధారయము
  • మహా పురుషుడు = గొప్పవాడైన పురుషుడు – విశేషణ పూర్వపద కర్మధారయము
  • మధుర జీవనము = మధురమైన జీవనము – విశేషణ పూర్వపద కర్మధారయము
  • తోడు నీడ = తోడుయును నీడయును – ద్వంద్వ సమాసం
  • రేయింబవలు = రేయియును పవలును – ద్వంద్వ సమాసం
  • బండి చక్రము = బండి యొక్క చక్రము – షష్ఠీ తత్పురుష సమాసం
  • జంతువుల మనసు = జంతువుల యొక్క మనసు – షష్ఠీ తత్పురుష సమాసం
  • కళా దృష్టి = కళ యొక్క దృష్టి – షష్ఠీ తత్పురుష సమాసం
  • మూడు తరాలు = మూడు అను సంఖ్యగల తరాలు – ద్విగు సమాసం
  • నవగ్రహాలు = తొమ్మిది అను సంఖ్యగల గ్రహాలు – ద్విగు సమాసం
  • మృదుమధురము = మృదువైనది మధురమైనది – విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం
  • శీతోష్ణము = శీతలమైనది ఉష్ణమైనది – విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం

పాఠం ఉద్దేశం

అన్ని వృత్తుల సమిష్టి సహకారంతో సమాజం కొనసాగుతుంది. వృత్తులు సమాజ సేవలో తమవంతు పాత్రను పోషిస్తాయి. దేశాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచినవి వృత్తులే! అయినా వాటికి ఆదరణ కరువైంది. వివిధ వృత్తుల వారిపట్ల గౌరవాన్ని, శ్రమ విలువలను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ప్రశ్న.
‘వ్యాస ప్రక్రియను పరిచయం చేయండి.
జవాబు.
ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. వృత్తులు వ్యక్తి గౌరవానికి, సమాజాభివృద్ధికి ఎట్లా తోడ్పడుతాయో వివరిస్తూ, శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసమిది.

ప్రవేశిక

శ్రమ జీవన సౌందర్యాన్ని వర్ణించడం ఎవరితరం ? ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంది. అయినా అన్ని వృత్తుల సమిష్టి జీవనమే సమాజం. ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిబద్ధతతో నిర్వహిస్తే సమాజం సుసంపన్నం అవుతుంది. ప్రతి వృత్తి గౌరవప్రదమైనదే! అన్ని వృత్తుల మేలు కలయికతోనే వసుధైక కుటుంబ భావన పెరుగుతుంది. కొన్ని వృత్తుల విశేషాలను తెలుసుకుందాం!

కఠిన పదాలకు అర్ధాలు

  • దృష్టి = చూపు
  • ప్రతిభ = నేరు
  • పరిశీలన = నిశితమైన గమనింపు
  • మార్గం = దారి / త్రోవ
  • అద్భుతం = గొప్పది.
  • ఆపాదమస్తకం = కాలిగోటి నుండి తల వరకు
  • సొమ్ములు = ధనము / పశువులు
  • ఆకృతి = రూపం
  • ఔదార్యము = ఉదారగుణం
  • క్షుధ = ఆకలి
  • ఇక్కట్లు = కష్టాలు
  • కృషీవలుడు = రైతు
  • చిచ్చు = అగ్ని
  • హలము = నాగలి
  • గొంగడి = కంబళి, రగ్గు
  • ఆవిష్కరణ = కనిపెట్టుట
  • తోవ = మార్గము
  • అమాంతం = ఒక్కసారిగా
  • గురుగుల = ఆడపిల్లలు చిన్న వయస్సులో ఆడుకొనే బొమ్మలు (వంటసామగ్రితో ఉన్నవి)
  • గిరాకీ = ఎక్కువగా కావలసినవి, ప్రియమైనవి, బాగా కావలసినవి (డిమాండ్)
  • సెగ = వేడి బాగా తగులుట, దగ్గరగా వేడి ఉండుట
  • తొలి = మొదటి, రంధ్రం
  • వెల = రేటు
  • వక్కాణించు = గట్టిగా చెప్పు
  • కాటికి = కాడు + కి = శ్మశానానికి
  • బొక్కెన = బక్కెట్టు
  • బాయి = బావి
  • క్షురము = కత్తి
  • క్షురకుడు = మంగలి
  • శరీరమర్దనం = మసాజ్ లేదా మాలిష్

నేనివి చేయగలనా ?

TS 8th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అసామాన్యులు 9

TS 8th Class English Guide Study Material Telangana State Pdf

Telangana SCERT Class 8 English Solutions – TS 8th Class English Guide Study Material Telangana

Telangana SCERT 8th Class English Solutions Unit 1 Family

8th Class English Guide Pdf Telangana Unit 2 Social Issues

Telangana 8th Class English Workbook Answers Unit 3 Humanity

Telangana SCERT Class 8 English Solutions Unit 4 Science and Technology

TS 8th Class English Study Material Unit 5 Education and Career

8th Class English Guide Pdf TS Unit 6 Art and Culture

8th Class English Guide Telangana State Unit 7 Women Empowerment

8th Class English Textbook Pdf with Answers Telangana Unit 8 Gratitude

TS 8th Class English Guide Study Material Telangana State Pdf

TS 8th Class Study Material