TS Inter 1st Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

Telangana TSBIE TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము Textbook Questions and Answers.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
నగదు పుస్తకం ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు.
వ్యాపార సంస్థలలో సాధారణంగా నగదుకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని నమోదు చేయడానికి వ్యాపార సంస్థ పరిమాణం మరియు స్వభావంతో సంబంధం లేకుండా అన్ని రకాల వ్యాపార సంస్థలకు నగదు పుస్తకం అతి ముఖ్యమైన సహాయక చిట్టా.

నగదు పుస్తకం ఒక నిర్ణీత కాలానికి సంబంధించిన వ్యాపార సంస్థ యొక్క నగదు నిల్వకు సంబంధించిన సమాచారం అందిస్తుంది. కాబట్టి నిర్వాహకులకు నగదు నియంత్రణకు సంబంధించిన పటిష్టమైన విధానాలను రూపొందించవచ్చు. ప్రత్యేకించి ఈ క్రింది ప్రయోజనాల దృష్ట్యా ఈ పుస్తకం అతి ముఖ్యమైనది.

  1. రోజువారీగా వ్యాపార సంస్థ వసూళ్ళను, చెల్లింపులను నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది.
  2. ఒక నిర్ణీత కాలానికి వ్యాపార సంస్థ యొక్క నగదు, బాంకు నిల్వలను నగదు పుస్తకం చూపుతుంది.
  3. నగదు పుస్తకం నిల్వ, వ్యాపార సంస్థలో ఉన్న నగదు నిల్వతో సరి చూసుకోవచ్చు. చేతిలో ఉన్న నగదుకు నగదు పుస్తకం నిల్వకు వ్యత్యాసం ఉన్నట్లయితే నమోదులో జరిగిన దోషాలను లేదా క్యాషియర్ చేసిన మోసాలను కనిపెట్టవచ్చు.
  4. నగదు పుస్తకం, పాసు పుస్తకం చూపే నిల్వలను సమన్వయం చేయడానికి ఉపయోగపడుతుంది.
  5. నగదు పుస్తకం, నగదు ఖాతా లాగే వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రత్యేకించి నగదు ఖాతాను తయారు చేయవలసిన అవసరం లేదు. దీనివల్ల సమయం మరియు శ్రమ ఆదా అవుతుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

ప్రశ్న 2.
వివిధ రకాల నగదు పుస్తకాల గురించి సంక్షిప్త వివరణ ఇవ్వండి.
జవాబు.
వ్యాపార సంస్థ యొక్క అవసరము, పరిమాణము, నిర్వహించే వ్యాపార స్వభావాలను బట్టి, నగదు పుస్తకము స్వరూపము ఉంటుంది. సాధారణముగా వ్యాపార సంస్థలు దిగువ పేర్కొన్న నగదు పుస్తకాలను ఉపయోగిస్తాయి.

  1. సాధారణ నగదు పుస్తకము,
  2. రెండు వరుస నగదు పుస్తకము :
    i) నగదు, డిస్కౌంట్ వరుసలు గల నగదు చిట్టా
    ii) బాంకు, డిస్కౌంట్ వరుసలు గల నగదు చిట్టా.
  3. మూడు వరుస గల నగదు చిట్టా (నగదు, బాంకు, డిస్కౌంటు వరుసలు),
  4. చిల్లర నగదు చిట్టా.

1. సాధారణ నగదు పుస్తకము :
కొత్తగా ప్రారంభించబడిన వ్యాపార సంస్థలకు వర్తక కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, సాధారణ నగదు పుస్తకమును తయారుచేస్తాయి. కేవలం నగదు వ్యవహారాలనే నమోదు చేస్తారు. దీనిలో వ్యవహారాలను అవి జరిగిన కాలక్రమములో నమోదు చేస్తారు.

నగదు వసూళ్ళను డెబిట్ వైపు, నగదు చెల్లింపులను క్రెడిట్ వైపు రాయాలి. ఇతర ఖాతాలలో మాదిరి ఈ పుస్తకమును కూడా నిల్వ తేల్చాలి. ఈ పుస్తకమును ప్రతిరోజు నిల్వ తేలుస్తారు.

2. రెండు వరుసలు గల నగదు పుస్తకము :

i) నగదు, డిస్కౌంట్ వరుసలు గల నగదు పుస్తకము :
ఈ నగదు పుస్తకములో నగదు వసూళ్ళు, చెల్లింపులతో పాటు, డిస్కౌంట్ను కూడా నమోదు చేస్తారు. అందువలన దీనిని రెండు వరుసలు గల నగదు పుస్తకం అంటారు. ఒక ఋణదాత తన ఋణగ్రస్తునకు సకాలములో డబ్బు చెల్లించేందుకు ఇచ్చే ప్రేరకాన్ని నగదు డిస్కౌంట్ అంటారు.

వ్యాపారస్తుడు తన ఋణదాత నుంచి కొంత రిబేటును నగదు రూపములో పొందినపుడు వచ్చిన డిస్కౌంట్ గాను, అదే విధముగా ఖాతాదారుకు కొంత రిబేటును నగదు రూపములో ఇచ్చినపుడు ఇచ్చిన డిస్కౌంట్గా పరిగణిస్తారు. నగదు వరుసతోపాటు, డిస్కౌంట్ వరుసను కూడా నగదు పుస్తకములో డెబిట్ మరియు క్రెడిట్ వైపు చూపుతారు.

ii) బాంకు, డిస్కౌంట్ వరుసలు గల నగదు పుస్తకము :
ఆధునిక వ్యాపార సంస్థలు తమ వ్యాపార కర్యాకలాపాలను బాంకుల ద్వారా జరుపుతాయి. నగదు వసూళ్ళు, చెల్లింపులు చెక్కుల ద్వారా జరుగుతాయి. చెక్కును బాంకులో డిపాజిట్ చేసినపుడు నగదు పుస్తకము డెబిట్ వైపు, చెక్కుల ద్వారా చెల్లించినపుడు క్రెడిట్ వైపు చూపుతారు. అదే విధముగా వచ్చిన డిస్కౌంట్ క్రెడిట్ వైపు, ఇచ్చిన డిస్కౌంట్ డెబిట్ వైపు చూపుతారు.

3. మూడు వరుసలు గల నగదు పుస్తకము :
పెద్ద పెద్ద వ్యాపార సంస్థలన్నీ తమ వ్యవహారాలను బాంకుల ద్వారా జరుపుతాయి. కాబట్టి నగదు, బాంకు, డిస్కౌంట్ వరుసలు గల నగదు పుస్తకాన్ని తయారు చేస్తాయి. అందువలన దీనిని మూడు వరుసలు గల నగదు పుస్తకము అంటారు.

4. చిల్లర నగదు పుస్తకము :
ఈ నగదు పుస్తకములో చిల్లర ఖర్చులను నమోదు చేస్తారు. దీనిని చిన్న షరాబు నిర్వహిస్తాడు. చిన్న షరాబు చేసిన చెల్లింపులకు ఓచర్ను పొందుతాము. ఈ ఓచర్లకు క్రమ సంఖ్యలు వేయడం వలన భవిష్యత్తులో రిఫరెన్సుకు పనికి వస్తుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

ప్రశ్న 3.
మూడు వరుసల నగదు చిట్టా ప్రాముఖ్యత తెలియచేసి, ఆ చిట్టా నమూనా చూపండి.
జవాబు.
పెద్ద పెద్ద వ్యాపార సంస్థలన్నీ తమ వ్యవహారాలను బాంకుల ద్వారా జరుపుతాయి. కాబట్టి నగదు, బాంకు, డిస్కౌంట్ వరుసలు గల నగదు చిట్టా తయారు చేస్తాయి. అందువలన దీనిని మూడు వరుసలు గల నగదు చిట్టా అంటారు.

వ్యాపార వ్యవహారాలు పెద్ద మొత్తాలలో చేసే వ్యాపార సంస్థలు బాంకులలో ఖాతాలను తెరిచి తమ కార్యకలాపాలను బాంకు ద్వారా జరుపుతాయి. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు మూడు వరుసల నగదు చిట్టా ద్వారా దిగువ ప్రయోజనాలు కలుగుతాయి.

  1. మూడు వరుసలు గల నగదు చిట్టా నగదు వసూళ్ళు, నగదు చెక్కుల ద్వారా వసూళ్ళను నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది.
  2. అదే విధముగా నగదు చెల్లింపులు, చెక్కుల ద్వారా చెల్లింపులను నమోదు చేయవచ్చు.
  3. వివిధ స్వభావము గల నగదు, బాంకు వ్యవహారాలను పెద్ద సంఖ్యలో నమోదు చేయవచ్చు.
  4. బాంకులో నగదును డిపాజిట్ చేయడం ద్వారా వడ్డీని ఆర్జించవచ్చు. ఎదురు పద్దులను నమోదు చేయవచ్చు.

మూడు వరుసలు గల నగదు చిట్టా నమూనా :

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 1

మూడు వరుసలు గల నగదు చిట్టాను తయారుచేసేటపుడు దిగువ అంశాలు గమనించవలెను.

  1. ప్రారంభపు నిల్వ డెబిట్ వైపు వివరాల వరుసలో To తెచ్చిన నిల్వ అని వ్రాసి నగదు మొత్తాన్ని నగదు వరుసలో, బాంకు మొత్తాన్ని బాంకు వరుసలో రాయాలి. ఒకవేళ బాంకు ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తే, క్రెడిట్వైపు వివరాలలో By తెచ్చిన నిల్వ అని వ్రాసి, మొత్తాన్ని బాంకు వరుసలో చూపవలెను.
  2. నగదు వసూళ్ళను డెబిట్ వైపు నగదు వరుసలో, నగదు చెల్లింపులను క్రెడిట్ వైపు నగదు వరుసలో వ్రాయవలెను.
  3. చెక్కు ద్వారా వసూళ్ళను డెబిట్వైపు నగదు వరుసలో వ్రాయవలెను. ఒకవేళ చెక్కును వసూలు అయిన తేదీన బాంకులో వేస్తే నేరుగా డెబిట్ వైపు బాంకు వరసలో వ్రాయాలి. ఎదురుపద్దును వ్రాయకూడదు.
  4. చెక్కుల ద్వారా చెల్లింపులను క్రెడిట్ వైపు బాంకు వరుసలో నమోదు చేయాలి.
  5. ఆఫీసు ఉపయోగానికి బాంకు నుంచి నగదును తీసినపుడు, డెబిట్వైపు నగదు వరుసలోను, క్రెడిట్ వైపు బాంకు వరుసలోను నమోదు చేయాలి. ఇది ఎదురుపద్దు అవుతుంది.
  6. చెక్కు వసూలైనపుడు వాటిని నగదుగా భావించి, డెబిట్ వైపు నగదు వరుసలో వ్రాయవలెను. ఈ చెక్కులను తరువాత వసూలుకై బాంకులో వేసినపుడు, నగదును బాంకులో డిపాజిట్ చేసినట్లుగానే డెబిట్వైపు బాంకు వరుసలోనూ, క్రెడిట్వైపు నగదు వరుసలోను చూపవలెను. ఇది ఎదురు పద్దు అవుతుంది.
  7. నగదు లేదా బాంకు వ్యవహారాలలో డిస్కౌంట్ ఉన్నప్పుడు ఇచ్చిన డిస్కౌంట్ను డెబిట్వైపు డిస్కౌంట్ వరుసలోను, వచ్చిన డిస్కౌంట్ను క్రెడిట్వైపు డిస్కౌంట్ వరుసలోను చూపవలెను.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

లఘు సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
నగదు పుస్తకం ప్రయోజనాలు వ్రాయండి.
జవాబు.
నగదు పుస్తకము వలన ఈ క్రింది ప్రయోజనాలు కలుగుతాయి.

  1. వ్యాపార సంస్థకు వచ్చిన నగదు (వసూళ్ళు), వ్యాపార సంస్థ చెల్లించిన నగదుకు (చెల్లింపులు) సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది.
  2. ఏ సమయములోనైనా వ్యాపార సంస్థ యొక్క నగదు, బాంకు నిల్వలను తెలుసుకోవచ్చును.
  3. నగదు పుస్తకము నిల్వ వ్యాపార సంస్థల్లో ఉన్న నిల్వతో సరిచూసుకోవచ్చు. నగదు పుస్తకము నిల్వ, చేతిలో ఉన్న నగదు నిల్వతో సరిపోయినట్లయితే, తప్పులు, మోసాలు జరగలేదని భావించవచ్చు.
  4. నగదు పుస్తకము చిట్టా మరియు ఆవర్జాగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నగదు ఖాతాను తయారు చేయనవసరము లేదు.

ప్రశ్న 2.
నగదు పుస్తకం లక్షణాలను తెలపండి.
జవాబు.
నగదు పుస్తకపు లక్షణాలను దిగువ విధముగా వివరించవచ్చును.

  1. నగదు పుస్తకము ఒక సహాయక చిట్టా (రోజువారీ పుస్తకము).
  2. ఇది నగదు వ్యవహారాలను మాత్రమే రికార్డు చేస్తుంది.
  3. నగదు పుస్తకము నగదు ఖాతాగా కూడా వ్యవహరిస్తుంది.
  4. నగదు పుస్తకములో డెబిట్వైపు, క్రెడిట్వైపు ఉంటాయి. నగదు వసూళ్ళు డెబిటైవైపు, నగదు చెల్లింపులు క్రెడిట్ వైపు నమోదు చేస్తారు.
  5. నగదు పుస్తకము డెబిట్ నిల్వను మాత్రమే చూపుతుంది.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

ప్రశ్న 3.
వర్తకం డిస్కౌంటు మరియు నగదు డిస్కౌంటు మధ్యగల తేడాలను తెలుపండి.
జవాబు.
వర్తకం డిస్కౌంటు మరియు నగదు డిస్కౌంటుకు మధ్యగల వ్యత్యాసాలు.

వర్తకపు డిస్కౌంట్ నగదు డిస్కౌంట్
1. సరుకులు అమ్మే సమయంలో అమ్మకందారుడు కొనుగోలు దారునికి ఈ డిస్కౌంట్ను ఇవ్వడం జరుగుతుంది. 1. బాకీ పరిష్కార సమయంలో రుణదాత రుణగ్రస్తునికి ఈ డిస్కౌంట్ను ఇవ్వడం జరుగుతుంది.
2. దీనిని బిల్లులో లేదా ఇన్వాయిస్లో స్థూల మొత్తం నుంచి తగ్గించి చూపుతారు. 2. దీనిని బిల్లులో లేదా ఇన్వాయిస్లో చూపరు.
3. అమ్మకాల పరిమాణాన్ని పెంచుకొనుటకు ఈ డిస్కౌంటును ఇస్తారు. 3. నిర్ణీత గడువు తేదీన లేదా గడువు తేది కంటే ముందుగా బాకీ పరిష్కారం అయ్యేందుకు ఈ డిస్కౌంటును ఇస్తారు.
4. వస్తువు యొక్క ముద్రిత ధరపైన ఈ డిస్కౌంటును ఇస్తారు. 4. రుణగ్రస్తుని యొక్క బాకీ మొత్తంపైన ఈ డిస్కౌంటును ఇస్తారు.
5. దీనిని వస్తువు యొక్క ముద్రిత ధర నుంచి తగ్గిస్తారు. కాని ప్రత్యేకంగా నగదు పుస్తకంలో చూపించరు. 5. దీనిని ప్రత్యేకంగా ఖాతా పుస్తకాలలో చూపుతారు.

ప్రశ్న 4.
చిల్లర నగదు పుస్తకం యొక్క నమూనాను గీయండి.
జవాబు.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 2

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు:

ప్రశ్న 1.
నగదు డిస్కౌంట్.
జవాబు.

  1. ఋణదాత, ఋణగ్రస్తునకు తాను చెల్లించవలసిన మొత్తాన్ని గడువు తేదీన గాని, గడువు తేదీ కంటే ముందుగా చెల్లించినట్లయితే ఇచ్చే మినహాయింపు లేదా రిబేటును నగదు డిస్కౌంట్ అంటారు.
  2. దీనిని ఋణగ్రస్తుడు స్వీకరించిన నగదు డిస్కౌంట్గా భావిస్తాడు. అదే విధముగా నగదు వసూలైనపుడు డిస్కౌంట్ లేదా రిబేటు ఇవ్వడము జరుగుతుంది. నగదు పుస్తకములో ఈ డిస్కౌంట్లకు వరుసలు రెండు వైపులా ఉంటాయి.

ప్రశ్న 2.
ఇచ్చిన డిస్కౌంట్.
జవాబు.

  1. వ్యాపారస్తుడు తన ఖాతాదారుల నుంచి గడువు తేదీ కంటే ముందు (సకాలములో) నగదు వసూలైనపుడు వారిని ప్రోత్సహిస్తూ ఇచ్చే మినహాయింపు మొత్తాన్ని ఇచ్చిన డిస్కౌంట్ అంటారు.
  2. దీనిని నగదు పుస్తకములో డెబిట్ వైపు డిస్కౌంట్ వరుసలో వ్రాయాలి.

ప్రశ్న 3.
వచ్చిన డిస్కౌంట్.
జవాబు.

  1. వ్యాపారస్తుడు తన ఋణదాతలకు గడువు తేదీ కంటే ముందు మొత్తాన్ని చెల్లించినపుడు పొందే డిస్కౌంట్ను వచ్చిన డిస్కౌంట్ అంటారు.
  2. దీనిని నగదు పుస్తకములో క్రెడిట్ వైపు డిస్కౌంట్ వరుసలో వ్రాయాలి.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

ప్రశ్న 4.
ఎదురుపద్దు.
జవాబు.
ఒక వ్యవహారం మూడు వరసల నగదు పుస్తకంలో రెండు వైపుల నమోదు అయినప్పుడు ‘ఎదురుపద్దు’ అంటారు. ఎదురుపద్దును ఆవర్జాపుట సంఖ్య వరసలో ‘ఎ’ అనే అక్షరంతో సూచిస్తారు. సాధారణంగా దీనిని ఎరుపు రంగు సిరాతో సూచిస్తారు.

ఈ క్రింది సందర్భాలలో ఎదురుపద్దు వస్తుంది.

  1. బాంకులో నగదును జమ చేసినప్పుడు
  2. బాంకు నుంచి నగదును వ్యాపార అవసరాల కోసం తీసినప్పుడు
  3. వచ్చిన చెక్కు అదేరోజు కాకుండా వేరొక రోజు బాంక్ లో జమ చేసినప్పుడు.

ప్రశ్న 5.
బయానా భర్తీ పద్ధతి.
జవాబు.
ఈ పద్ధతిలో నిర్ణీత కాలానికి అనగా వారానికి, నెలకి అయ్యే చిల్లర ఖర్చులకు అయ్యే మొత్తాన్ని ముందుగా అంచనా వేసి, ఆ మొత్తాన్ని చిన్న షరాబుకు చెక్కు ద్వారా ఇస్తారు. చిన్న షరాబు తాను చెల్లించిన ఖర్చులకు తగిన ఓచర్లు తయారు చేసి వారాంతము లేదా నెలాఖరున పెద్ద షరాబుకు సమర్పిస్తాడు.

పెద్ద షరాబు ఓచర్లు, చిల్లర నగదు పుస్తకాన్ని తనిఖీ చేసి ఖర్చు పెట్టిన మొత్తానికి చెక్కును జారీ చేస్తాడు. ఖర్చు పెట్టిన మొత్తానికి పెద్ద షరాబు, చిన్న షరాబుకు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి దీనిని బయానా భర్తీ పద్ధతి అంటారు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

అదనపు ప్రశ్నలు:

ప్రశ్న 6.
చిల్లర నగదు చిట్టా.
జవాబు.
పెద్ద వ్యాపార సంస్థలు తమ నగదు వ్యవహారములన్నీ బాంకు ద్వారా జరుపుతూ ఉంటాయి. అనగా సంస్థకు వచ్చిన నగదును బాంకులో వేయడం, చెల్లింపులకు చెక్కులు జారీ చేయడం. అయితే ఈ వ్యాపార సంస్థలకు నగదు వ్యవహారములతోపాటు చిల్లర ఖర్చులు కూడా ఉంటాయి.

వీటి మొత్తము అతిస్వల్పముగా ఉండి చెక్కుల ద్వారా చెల్లించడం కుదరదు. అందువలన వ్యాపార సంస్థలు తమ వద్ద కొంత చిల్లర నగదును ఉంచుకొని, ఆ నిల్వనుండి చిల్లర ఖర్చులను చెల్లిస్తారు. వీటిని నమోదు చేయడానికి ఉంచిన పుస్తకమును ‘చిల్లర నగదు చిట్టా’ అంటారు.

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

అభ్యాసాలు:

ప్రశ్న 1.
క్రింది వివరాల నుంచి ‘మెసర్స్ మనస్వీ ట్రేడర్స్’ వారి యొక్క ఒంటి వరుస నగదు పుస్తకాన్ని తయారుచేయండి.
2019 జనవరి
జనవరి 1st వ్యాపారాన్ని నగదుతో వ్యాపారం ప్రారంభించడం జరిగింది – ₹ 20,000
జనవరి 3rd నగదు అమ్మకాలు – ₹ 5,000
జనవరి 6th బాంకులో చెల్లించిన నగదు – ₹ 2,000
జనవరి 10th యంత్రం కొనుగోలు – ₹ 1,800
జనవరి 17th ప్రకటన ఖర్చులు చెల్లింపు – ₹ 600
జనవరి 14th సొంతవాడకాలు – ₹ 300
జనవరి 19th నగదు కొనుగోళ్ళు – ₹ 5,000
జనవరి 21st నరేష్కు అరువుపై సరుకు అమ్మకాలు – ₹ 3,000
జనవరి 23rd వచ్చిన కమీషన్ – ₹ 800
జనవరి 25th శ్యాంకు చెల్లించిన నగదు – ₹ 3,500
జనవరి 28th వచ్చిన అద్దె – ₹ 1,200
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 3

ప్రశ్న 2.
క్రింది వివరాల నుంచి ప్రవీణ్ ట్రేడర్స్ వారి ఒంటి వరుస నగదు పుస్తకాన్ని తయారుచేయండి.
2019 ఏప్రిల్
ఏప్రిల్ 1st నగదు నిల్వ – ₹ 12,000
ఏప్రిల్ 2nd నగదుకు సరుకు కొనుగోళ్ళు – ₹ 3,000
ఏప్రిల్ 4th ఫర్నీచర్ కొనుగోలు – ₹ 10,000
ఏప్రిల్ 8th అజయ్ నుంచి వచ్చిన నగదు – ₹ 5,500
ఏప్రిల్ 12th టెలిఫోన్ బిల్లు చెల్లింపు – ₹ 600
ఏప్రిల్ 14th నిఖిల్కు సరుకు అమ్మకాలు – ₹ 2,500
ఏప్రిల్ 16th చెల్లించిన వడ్డీ – ₹ 300
ఏప్రిల్ 18th స్టేషనరీ కొనుగోలు – ₹ 1,200
ఏప్రిల్ 21st నగదు అమ్మకాలు – ₹ 4,000
ఏప్రిల్ 25th చెల్లించిన పోస్టేజి – ₹ 400
ఏప్రిల్ 28th తరుణ్ కు నగదు చెల్లింపు – ₹ 3,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 4

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

ప్రశ్న 3.
31.03.2019 తేదీ నాటి సాధారణ నగదు పుస్తకాన్ని తయారుచేయండి.
2019 మార్చి
మార్చి 1 వ్యాపారంలోకి తెచ్చిన నగదు – ₹ 14,000
మార్చి 3 నగదు అమ్మకాలు – ₹ 2,000
మార్చి 11 బాంకులో చెల్లించిన నగదు – ₹ 5,000
మార్చి 8 వరుణ్ నుంచి నగదుకు కొన్న సరుకు – ₹ 1,500
మార్చి 12 చెల్లించిన జిరాక్స్ ఛార్జీలు – ₹ 500
మార్చి 15 జీతాలు చెల్లింపు – ₹ 1,400
మార్చి 17 వచ్చిన వడ్డీ – ₹ 200
మార్చి 21 చెల్లించిన ఆఫీస్ ఖర్చులు – ₹ 400
మార్చి 25 చెల్లించిన ప్రయాణ ఖర్చులు – ₹ 800
మార్చి 27 ఫర్నీచర్ అమ్మకం – ₹ 8,500
మార్చి 28 సొంతవాడకాలు – ₹ 700
మార్చి 30 రఘు నుంచి అరువుపై సరుకు కొనుగోలు – ₹ 4,000
మార్చి 31 కొనుగోలు – ₹ 3,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 5

ప్రశ్న 4.
క్రింది వివరాల నుంచి రెండు వరుసల నగదు చిట్టా తయారుచేయండి.
2018 ఆగష్టు
ఆగష్టు 1 నగదు నిల్వ – ₹ 11,000
ఆగష్టు 2 కొనుగోళ్ళు – ₹ 1,500
ఆగష్టు 4 ప్రభాకర్ నుంచి వచ్చిన నగదు – ₹ 1,250
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 50
ఆగష్టు 17 నగదు అమ్మకాలు – ₹ 2,000
ఆగష్టు 10 చెల్లించిన వివిధ ఖర్చులు – ₹ 800
ఆగష్టు 12 వంశీకి చెల్లించిన నగదు – ₹ 1,400
వచ్చిన డిస్కౌంట్ – ₹ 100
ఆగష్టు 14 పాత ఫర్నీచర్ అమ్మకం – ₹ 5,000
ఆగష్టు 16 అనిల్ నుంచి వచ్చిన నగదు – ₹ 425
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 75
ఆగష్టు 21 చెల్లించిన కమీషన్ – ₹ 300
ఆగష్టు 23 చెల్లించిన ప్రయాణ ఖర్చులు – ₹ 250
ఆగష్టు 25 వచ్చిన వడ్డీ – ₹ 125
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 6

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

ప్రశ్న 5.
31.03.2018 వ తేదీన రెండు వరసల నగదు పుస్తకాన్ని తయారుచేయండి.
2018 మార్చి
మార్చి 1 చేతిలో నగదు – ₹ 7,500
మార్చి 3 సొంతవాడకాలు – ₹ 1,250
మార్చి 6 నగదు అమ్మకాలు – ₹ 6,000
మార్చి 7 స్వాతికి చెల్లించిన నగదు – ₹ 1,850
వచ్చిన డిస్కౌంట్ – ₹ 150
మార్చి 9 రాముకు అరువుపై సరుకు అమ్మకాలు – ₹ 3,000
మార్చి 10 బాంకు నుంచి తీసిన నగదు – ₹ 1,400
మార్చి 12 చెల్లించిన పోస్టేజీ – ₹ 200
మార్చి 14 అనిత నుంచి వచ్చిన నగదు – ₹ 600
ఇచ్చిన డిస్కౌంటు – ₹ 100
మార్చి 16 వచ్చిన కమీషన్ – ₹ 450
మార్చి 18 నీరజకు చెల్లించిన నగదు – ₹ 2,850
వచ్చిన డిస్కౌంట్ – ₹ 150
మార్చి 20 చెల్లించిన వడ్డీ – ₹ 1,200
మార్చి 21 చెల్లించిన జీతాలు – ₹ 600
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 7

ప్రశ్న 6.
క్రింది వివరాల నుంచి రెండు వరుసల నగదు చిట్టా తయారుచేయండి.
2018 ఏప్రిల్
ఏప్రిల్ 1 ప్రారంభనిల్వ – ₹ 9,500
ఏప్రిల్ 4 నగదు అమ్మకాలు – ₹ 2,000
ఏప్రిల్ 6 ముద్రణ & స్టేషనరీ – ₹ 250
ఏప్రిల్ 10 సునీత నుంచి వచ్చిన నగదు – ₹ 8,800
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 200
ఏప్రిల్ 13 బాంకులో జమచేసిన నగదు – ₹ 5000
ఏప్రిల్ 14 ఇంటి యజమానికి చెల్లించిన అద్దె – ₹ 800
ఏప్రిల్ 19 అంజలి నుంచి ఫర్నీచర్ కొనుగోలు – ₹ 6,000
ఏప్రిల్ 23 సొంతవాడకాల కోసం తీసిన నగదు – ₹ 2,500
ఏప్రిల్ 26 అంజలికి చెల్లించాల్సిన మొత్తం – ₹ 6,000
తుది పరిష్కారం కింద చెల్లించిన నగదు – ₹ 5,900
ఏప్రిల్ 28 చెల్లించిన రిపేర్లు – ₹ 200
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 8

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

ప్రశ్న 7.
క్రింద ఇచ్చిన వ్యవహారాల నుంచి బాంకు, డిస్కౌంట్ వరుసల నగదు పుస్తకాన్ని తయారుచేయండి. వసూళ్ళు, చెల్లింపులన్ని బాంకు ద్వారానే జరిగినట్లు భావించండి.
2018 నవంబర్
నవంబర్ 1 ప్రారంభ నిల్వ – ₹ 6,000
నవంబర్ 3 మహేష్ నుంచి వచ్చిన చెక్కు – ₹ 1,950
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 50
నవంబర్ 6 కొనుగోలు – ₹ 2,500
నవంబర్ 8 యంత్రం కొనుగోలు, చెక్కు ద్వారా చెల్లింపు – ₹ 3,000
నవంబర్ 11 సుమంత్కి చెల్లించాల్సింది – ₹ 500
తుది పరిష్కారం కింద చెక్కుద్వారా చెల్లించింది. – ₹ 450
నవంబర్ 13 రెడ్డికి సరుకు అమ్మకాలు, చెక్కుద్వారా వసూలు – ₹ 4,000
నవంబర్ 15 చెక్కు ద్వారా జీతాల చెల్లింపు – ₹ 2,000
నవంబర్ 17 సొంతవాడకాల కోసం బాంకు నుంచి తీసిన నగదు – ₹ 1,500
నవంబర్ 20 పోస్టల్ చార్జీలు – ₹ 800
నవంబర్ 24 చెల్లించిన వేతనాలు – ₹ 150
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 9

ప్రశ్న 8.
మూడు వరుసల నగదు చిట్టా తయారు చేయండి.
2018 డిసెంబర్
డిసెంబర్ 1 చేతిలో నగదు – ₹ 10,000
బాంకులో నగదు – ₹ 8,000
డిసెంబర్ 3 అమ్మకాలు – ₹ 4,000
డిసెంబర్ 6 సునీత నుంచి వచ్చిన నగదు – ₹ 6,800
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 200
వచ్చిన కమీషన్ – ₹ 800
డిసెంబర్ 10 బాంకులో జమచేసిన నగదు – ₹ 2,000
డిసెంబర్ 14 మూర్తికి జారీచేసిన చెక్కు – ₹ 9,600
వచ్చిన డిస్కౌంట్ – ₹ 400
డిసెంబర్ 17 ఆఫీసు అవసరాలకు బాంకు నుంచి తీసిన నగదు – ₹ 1,800
డిసెంబర్ 20 రోహిత్ నుంచి సరుకు కొనుగోలు – ₹ 3,500
డిసెంబర్ 24 శ్యామ్ నుంచి వచ్చిన చెక్కు (బాంకులో జమచేయడమైంది) – ₹ 3,800
డిసెంబర్ 31 జీతాల చెల్లింపు – ₹ 1,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 10

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

ప్రశ్న 9.
క్రింది ఇచ్చిన వ్యవహారాల నుంచి మూడు వరుసల నగదు చిట్టా తయారుచేయండి.
2018 అక్టోబర్
అక్టోబర్ 1 నగదు నిల్వ – ₹ 14,000
బాంకు నిల్వ – ₹ 12,000
3కొనుగోళ్ళు – ₹ 2,500
అక్టోబర్ 4 బాంకులో చెల్లించిన నగదు – ₹ 4,000
అక్టోబర్ 6 ముద్రణ ఖర్చులు – ₹ 600
అక్టోబర్ 10 అంజలి నుంచి వచ్చిన నగదు – ₹ 3,900
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 100
అక్టోబర్ 13 నగదు అమ్మకాలు – ₹ 4,800
అక్టోబర్ 16 సొంతవాడకాల కోసం బాంకు నుంచి తీసిన నగదు – ₹ 1,000
అక్టోబర్ 19 జ్యోత్స్న నుంచి వచ్చిన చెక్కు – ₹ 5,200
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 300
అక్టోబర్ 20 క్రిష్ణకు చెల్లించిన నగదు – ₹ 1,300
వచ్చిన డిస్కౌంట్ – ₹ 200
అక్టోబర్ 23 జ్యోత్స్న చెక్కును బాంకుకు పంపడమైనది.
అక్టోబర్ 31 చెక్కు ద్వారా జీతాలు చెల్లింపు – ₹ 1,800
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 11

ప్రశ్న 10.
క్రింది ఇచ్చిన వ్యవహారాలను నగదు, బాంకు మరియు డిస్కౌంట్ వరుసల నగదు పుస్తకంలో నమోదు చేయండి.
2018 నవంబర్
నవంబర్ 1 చేతిలో నగదు – ₹ 5,900
బాంకు ఓవర్ డ్రాఫ్ట్ – ₹ 10,800
నవంబర్ 3 స్టేషనరికి చెల్లింపు – ₹ 400
నవంబర్ 5 బాంకులో జమచేసిన నగదు – ₹ 4,500
నవంబర్ 8 స్వప్న నుంచి వచ్చిన నగదు – ₹ 7,900
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 100
నవంబర్ 11 నగదుకు సరుకు అమ్మకాలు – ₹ 1,000
నవంబర్ 13 స్రవంతి నుంచి వచ్చిన చెక్కు – ₹ 1,100
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 75
(చెక్కు బాంకుకి పంపడమైనది)
నవంబర్ 16 బాంకు నుంచి తీసిన నగదు – ₹ 2,000
నవంబర్ 19 చెల్లించిన అద్దె – ₹ 250
నవంబర్ 21 నిఖిల్కు జారీ చేసిన చెక్కు – ₹ 2,800
వచ్చిన డిస్కౌంట్ – ₹ 200
నవంబర్ 23 ఫర్నీచర్ కొనుగోలు – ₹ 4,000
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 12

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

ప్రశ్న 11.
క్రింద ఇచ్చిన రవి ట్రేడర్స్ యొక్క వివరాల నుంచి మూడు వరుసల నగదు చిట్టా తయారు చేయండి.
2018 సెప్టెంబర్
సెప్టెంబర్ 1 నగదు నిల్వ – ₹ 15000
బాంకు నిల్వ (క్రెడిట్) – ₹ 25000
సెప్టెంబర్ 4 బాస్కర్ నుంచి రావాల్సిన మొత్తం – ₹ 4,000
తుది పరిష్కారం కింద వసూలైన నగదు – ₹ 3,900
సెప్టెంబర్ 6 ప్రకాష్ నగదుకు అమ్మిన సరుకుv2,800
సెప్టెంబర్ 7 చెల్లించిన వడ్డీ – ₹ 500
సెప్టెంబర్ 10 కార్తీక్ ట్రేడర్స్ నుంచి వచ్చిన నగదు – ₹ 1,800
చెక్కు(చెక్కు బాంకుకి పంపడమైనది) – ₹ 4,800
సెప్టెంబర్ 14 బాంకులో జమచేసిన నగదు – ₹ 4,000
సెప్టెంబర్ 16 చైతన్య నుంచి కొనుగోలు, పేటియం ద్వారా చెల్లింపు – ₹ 2,500
సెప్టెంబర్ 24 మనోహర్ జారీ చేసిన చెక్కు – ₹ 2,800
వచ్చిన డిస్కౌంట్ – ₹ 200
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 13

ప్రశ్న 12.
క్రింది వ్యవహారాల నుంచి మూడు వరుసల నగదు చిట్టా తయారుచేయండి.
2019 మార్చి
మార్చి 1 చేతిలో నగదు – ₹ 4,900
బాంకులో నగదు – ₹ 5,000
మార్చి 3 బాంకులో డిపాజిట్ చేసిన నగదు – ₹ 3,000
మార్చి 6 అమ్మకాలు – ₹ 9,800
మార్చి 10 రెడ్డి నుంచి వచ్చిన చెక్కు – ₹ 2,500
మార్చి 14 వచ్చిన కమీషన్ – ₹ 500
మార్చి 16 వంశీకి చెల్లించిన నగదు – ₹ 1,600
వచ్చిన డిస్కౌంట్ – ₹ 400
మార్చి 18 రెడ్డి చెక్కును బాంకుకు పంపడమైనది
మార్చి 20 చెల్లించిన రవాణా – ₹ 600
మార్చి 22 శ్రీకాంత్ నుంచి వచ్చిన నగదు – ₹ 4,700
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 300
మార్చి 24 ఆఫీసు అవసరాలకు బాంకు తీసిన నగదు – ₹ 2,000
మార్చి 27 శ్యామ్క చెల్లించిన నగదు – ₹ 2,000
వచ్చిన డిస్కౌంట్ – ₹ 100
మార్చి 31 డెబిట్ కార్డు ద్వారా స్టేషనరీ కొనుగోలు – ₹ 1,200
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 14

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

ప్రశ్న 13.
క్రింది వ్యవహారాల నుంచి మూడు వరసల నగదు చిట్టా తయారు చేయండి.
2019 ఫిబ్రవరి
ఫిబ్రవరి 1 నగదు – ₹ 9,350
బాంకు – ₹ 10,000
ఫిబ్రవరి 4 నగదు అమ్మకాలు – ₹ 2,800
ఫిబ్రవరి 7 ఫర్నీచర్ అమ్మకాలు ‘గూగుల్ పే’ ద్వారా వసూలు – ₹ 6,000
ఫిబ్రవరి 10 బాంకులో జమ చేసిన నగదు – ₹ 4,200
ఫిబ్రవరి 14 సొంత అవసరాలకు బాంకు నుంచి తీసినది – ₹ 600
ఫిబ్రవరి 17 నవీన్ నుంచి వచ్చిన చెక్కు – ₹ 5,800
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 200
ఫిబ్రవరి 21 చెల్లించిన ఆడిట్ ఛార్జీలు – ₹ 150
ఫిబ్రవరి 23 నవీన్ చెక్కును బాంకుకి పంపడమైనది
ఫిబ్రవరి 25 మానస నుంచి వచ్చిన నగదు – ₹ 3,700
ఫిబ్రవరి 27 మౌనికకు చెల్లించాల్సిన మొత్తం – ₹ 2,000
తుది పరిష్కారం కింద చెక్కు ద్వారా చెల్లించినది – ₹ 1,900
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 15

ప్రశ్న 14.
క్రింది ఇచ్చిన వ్యవహారాలను నగదు, బాంకు, డిస్కౌంట్ వరుసల నగదు పుస్తకంలో నమోదు చేయండి.
2019 ఏప్రిల్
ఏప్రిల్ 1 నగదు నిల్వ – ₹ 8,000
బాంకు నిల్వ – ₹ 14,000
3 రాహులు జారీ చేసిన – ₹ 1,450
వచ్చిన డిస్కౌంట్ – ₹ 50
6 ‘నెట్ బాంకింగ్’ ద్వారా అమ్మకాలు – ₹ 2,800
9 బాంకు నుంచి తీసిన నగదు – ₹ 2,900
11 రాజు నుంచి రావాల్సిన మొత్తం – ₹ 1,500
తుది పరిష్కారం కింద వసూలైన చెక్కు – ₹ 1,450
(చెక్కును బాంకుకి పంపడమైనది)
ఏప్రిల్ 16 ‘డెబిట్ కార్డు’ ద్వారా కొనుగోలు – ₹ 2,400
19 బాంకులో చెల్లించిన నగదు – ₹ 800
24 యంత్రాలు కొనుగోలు – ₹ 4,000
26 శేఖర్ నుంచి వచ్చిన నగదు – ₹ 350
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 50
28 చెల్లించిన జీతాలు – ₹ 650
30 సొంతవాడకాల కోసం బాంకు నుంచి తీసిన నగదు – ₹ 2,300
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 16

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

ప్రశ్న 15.
క్రింది వ్యవహారాల నుంచి మూడు వరుసల నగదు చిట్టా తయారుచేయండి.
2018 జూన్
జూన్ 1 చేతిలో నగదు – ₹ 12,500
బాంకులో నగదు – ₹ 14,800
జూన్ 3 నగదు అమ్మకాలు – ₹ 3,000
జూన్ 7 అశోక్ నుంచి సరుకు కొనుగోలు, చెక్కు ద్వారా చెల్లింపు – ₹ 5,000
జూన్ 10 బాంకులో చెల్లించిన నగదు – ₹ 1,800
జూన్ 12 లక్ష్మీకి చెల్లించిన నగదు – ₹ 1,850
వచ్చిన డిస్కౌంట్ – ₹ 240
జూన్ 16 ఆఫీస్ అవసరాల కోసం బాంకు నుంచి తీసిన నగదు – ₹ 2,000
జూన్ 19 యంత్రం అమ్మకాలు “పేటియం’ ద్వారా వసూలు – ₹ 2,400
జూన్ 25 ప్రకటన ఖర్చులు – ₹ 150
జూన్ 28 విష్ణు నుంచి వచ్చిన చెక్కు – ₹ 1,980
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 120
(విష్ణు చెక్కును బాంకులో డిపాజిట్ చేయడమైనది)
జూన్ 30 చెక్కు ద్వారా జీతాలు చెల్లింపు – ₹ 3,280
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 17

ప్రశ్న 16.
క్రింది వివరాల నుంచి మూడు వరుసల నగదు చిట్టా తయారు చేయండి.
2018 జూలై
జూలై 1 చేతిలో నగదు – ₹ 6,000
బాంకులో నగదు – ₹ 10,000
జూలై 5 నగదు అమ్మకాలు – ₹ 1,900
జూలై 7 డీ-మార్ట్లు జారీ చేసిన చెక్కు – ₹ 1,800
వచ్చిన డిస్కౌంట్ – ₹ 200
జూలై 8 సాయి ట్రేడర్స్ నుంచి వచ్చిన నగదు – ₹ 1,850
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 150
జూలై 14 ఆఫీస్ అవసరాల కోసం బాంకు నుంచి తీసిన నగదు – ₹ 550
జూలై 22 నగదు కొనుగోళ్ళు – ₹ 600
జూలై 29 బాంకులో జమ చేసిన నగదు – ₹ 800
జూలై 30 చెక్కు ద్వారా జీతాల చెల్లింపు – ₹ 2,400
జూలై 31 పాసు పుస్తకం ప్రకారం బాంకు ఛార్జీలు – ₹ 50
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 18

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

ప్రశ్న 17.
మూడు వరుసల నగదు చిట్టా తయారు చేయండి.
2018 ఫిబ్రవరి
ఫిబ్రవరి 1 నగదు నిల్వ – ₹ 12,000
బాంకు నిల్వ – ₹ 8,000
ఫిబ్రవరి 3 రమకు జారీ చేసిన చెక్కు – ₹ 3,950
డిస్కౌంట్ – ₹ 50
ఫిబ్రవరి 6 నగదు అమ్మకాలు – ₹ 4,500
ఫిబ్రవరి 10 బాంకులో జమ చేసిన నగదు – ₹ 2,500
ఫిబ్రవరి 18 మోహన్ నుంచి వచ్చిన నగదు – ₹ 2,800
చెక్కు – ₹ 5,800
(చెక్కును బాంకులో జమ చేయడమైనది)
డిస్కౌంట్ – ₹ 400
ఫిబ్రవరి 20 కొనుగోళ్ళు – ₹ 3,400
ఫిబ్రవరి 23 మోహన్ నుండి వచ్చిన చెక్కు అనాదరణ పొందింది.
ఫిబ్రవరి 4 చెక్కు ద్వారా అద్దె చెల్లింపు – ₹ 1,000
ఫిబ్రవరి 28 ఆఫీసు అవసరాల కోసం బాంకు నుంచి తీసిన నగదు – ₹ 1,600
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 19

ప్రశ్న 18.
క్రింది ఇచ్చిన వ్యవహారాల నుంచి మూడు వరుసల నగదు చిట్టా తయారు చేయండి.
2019 ఏప్రిల్
ఏప్రిల్ 1 చేతిలో నగదు – ₹ 5,600
బాంకులో నగదు (Dr) – ₹ 10,500
4 బాంకులో డిపాజిట్ చేసిన నగదు – ₹ 1,500
6 నగదు అమ్మకాలు – ₹ 2,100
10 ‘పేటియం’ ద్వారా కమీషన్ చెల్లింపు – ₹ 1,200
13 రాజేష్ నుంచి వచ్చిన నగదు – ₹ 4,600
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 400
ఏప్రిల్ 15 శేఖర్కు జారీ చేసిన చెక్కు – ₹ 2,500
వచ్చిన డిస్కౌంట్ – ₹ 200
18 కొనుగోలు – ₹ 2,600
23 ఆఫీసు అవసరాలకు బాంకు నుంచి తీసిన నగదు – ₹ 600
25 ఫర్నీచర్ అమ్మకాలు – ₹ 3,200
30 వైభవ్ నుంచి వచ్చిన చెక్కు – ₹ 7,500
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 100
(చెక్కు బాంకులో డిపాజిట్ చేయడమైనది)
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 20

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

ప్రశ్న 19.
2018 నవంబర్
నవంబర్ 1 చేతిలో నగదు – ₹ 10,000
బాంకులో నగదు (Dr) – ₹ 5,000
నవంబర్ 5 అమ్మకాలు – ₹ 2,500
నవంబర్ 8 కొనుగోళ్ళు – ₹ 1,800
నవంబర్ 11 వినీత్ నుంచి వచ్చిన నగదు – ₹ 4,800
ఇచ్చిన డిస్కౌంట్ – ₹ 200
నవంబర్ 16 నగదుకు ఫర్నీచర్ కొనుగోలు – ₹ 3,500
నవంబర్ 19 బాంకులో డిపాజిట్ చేసిన నగదు – ₹ 6,000
నవంబర్ 22 చెల్లించిన రవాణా ఖర్చులు – ₹ 400
తుది పరిష్కారం క్రింద చెల్లించిన చెక్కు – ₹ 3,800
నవంబర్ 23 సుధీర్కు చెల్లించవలసిన మొత్తం – ₹ 4,000
నవంబర్ 25 ఆఫీసు అవసరాల కోసం బాంకు నుంచి తీసిన నగదు – ₹ 2,800
నవంబర్ 27 వేతనాల – ₹ 600

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 21

ప్రశ్న 20.
క్రింది వివరాల నుంచి విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టా తయారుచేయండి.
2019 జనవరి
జనవరి 1 హెడ్ క్యాషియర్ నుంచి తీసుకున్న బయానా (చెక్కు) – ₹ 350
జనవరి 3 పోస్టల్ ఛార్జీలు – ₹ 25
జనవరి 6 ‘టీ’ ఖర్చులు – ₹ 30
జనవరి 7 స్పీడ్ పోస్ట్క చెల్లించింది – ₹ 25
జనవరి 9 వేతనాల చెల్లింపు – ₹ 55
జనవరి 11 అల్పాహారము – ₹ 15
జనవరి 15 స్టేషనరీకి చెల్లించింది – ₹ 28
జనవరి 20 దింపుడు ఛార్జీలు – ₹ 23
జనవరి 21 రవాణాకి చెల్లించింది – ₹ 32
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 22

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

ప్రశ్న 21.
విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టాను తయారుచేయండి.
2018 ఫిబ్రవరి
ఫిబ్రవరి 1 హెడ్ క్యాషియర్ నుంచి వచ్చిన బయానా – ₹ 400
ఫిబ్రవరి 4 రైలు ఛార్జీలకు చెల్లించింది – ₹ 39
ఫిబ్రవరి 5 మరమ్మతులకు చెల్లించింది – ₹ 45
ఫిబ్రవరి 6 కాగితాలు, ఎన్వెలాప్లకు చెల్లించింది – ₹ 26
ఫిబ్రవరి 9 స్టేషనరీ చెల్లించింది – ₹ 18
ఫిబ్రవరి 10 ప్రవీణ్ చెల్లింపు – ₹ 50
ఫిబ్రవరి 14 టీ ఖర్చులు – ₹ 40
ఫిబ్రవరి 16 ఆఫీసు ఖర్చులు చెల్లించింది – ₹ 35
ఫిబ్రవరి 19 ప్రయాణ ఖర్చులకు చెల్లించింది – ₹ 60
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 23

TS Board Inter First Year Accountancy Study Material Chapter 5 నగదు పుస్తకము

ప్రశ్న 22.
క్రింది వివరాల నుంచి విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టా తయారుచేయండి.
2018 మార్చి
మార్చి 1 పెద్ద షరాబు నుంచి వచ్చిన నగదు – ₹ 300
మార్చి 2 అల్పాహార ఖర్చులు – ₹ 32
మార్చి 5 ఆటో ఛార్జీలు – ₹ 16
మార్చి 7 టెలిగ్రాం ఛార్జీలు – ₹ 18
మార్చి 10 STD ఛార్జీలు – ₹ 21
మార్చి 18 ప్రకటనలకు చెల్లింపు – ₹ 20
మార్చి 22 రవాణాకు చెల్లింపు – ₹ 28
మార్చి 24 ఆఫీసు క్లీనర్కు వేతనాలు చెల్లింపు – ₹ 14
మార్చి 26 ఇతరాలకు చెల్లించింది – ₹ 25
మార్చి 28 వినోదాల కోసం చెల్లించింది – ₹ 30
సాధన.

TS Inter 1st Year Accountancy Study Material 5th Lesson నగదు పుస్తకము 24

Leave a Comment