TS Inter 2nd Year Economics Notes Chapter 6 Industrial Sector

Here students can locate TS Inter 2nd Year Economics Notes Chapter 6 Industrial Sector to prepare for their exam.

TS Inter 2nd Year Economics Notes Chapter 6 Industrial Sector

→ Role of industrial sector in Indian economy – Share of industries in the GDP – Increase in employment opportunities – Share of Industrial sector in national income – Growth of large scale industries – Growth in the production of durable consumer goods.

TS Inter 2nd Year Economics Notes Chapter 6 Industrial Sector

→ Industrial structure – Structure in terms of usage – Structure by type of ownership – Structure by size of capital – Structure by type of enterprises.

→ Causes of industrial backwardness in india – British rulelack of mineral resources – Lack qf capital – lack credit finance – Lack of transport facilities – Lack of industrial finance – Energy crisis increase in taxes – Limited market – Defective planning,

→ Industrial policy aims at systematic development of industries. The pattern of industrialisation to be achieved by the government indicated through the policy.

→ 1948 policy contents – Classification of industries – Small scale industries. – Labour man-agement relations – Foreign capital tarriff policy.

→ 1956 policy contents – Classification of industries – Small scale industries, Labour man- agement relation-Reduction of- regional imbalance Technical and managerial personnel.

→ 1997 policy contents – Objectives – Abolition of industrial licensing Policy regarding pub- lie sector, MRTP unit-Foreign investment’ and technology – Removal of mandatory con¬vertibility – Providing small scale industries.

→ The government of India bring back industrial policy into focus in the form of national manufacturing policy as Nov 4, 2011 objective zones.

→ Small scale industries problems and role.

→ Industrial finance sources – Internal self finance equity, Debenture, Public deposits, Loans from bank – Foreign capital – IDBI, IFCI, ICICI, IDFC, SIDBI.

TS Inter 2nd Year Economics Notes Chapter 6 Industrial Sector

TS Inter 2nd Year Economics Notes Chapter 6 పారిశ్రామిక రంగం

→ దేశంలో లభ్యమవుతున్న ముడి సరుకులను ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించి ఉత్పాదక, వినియోగ వస్తువులు తయారు చేయడాన్ని పారిశ్రామీకరణ అంటారు.

→ పారిశ్రామీకరణ వల్ల ఉద్యోగిత, ఆదాయాలు పెరగడమేకాక, వినియోగ వ్యయంతో పాటు జీవన ప్రమాణం పెరుగుతుంది.

→ పంచవర్ష ప్రణాళికల అమలు వల్ల భారత పారిశ్రామిక రంగంలో గణనీయమైన మార్పు వచ్చింది. స్థూల జాతీయోత్పత్తిలో వాటా పెరిగింది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. జాతీయాదాయంలో పారిశ్రామిక రంగం వాటా పెరిగింది. నూతన ఆర్థిక విధానం ద్వారా ప్రభుత్వరంగ స్థానాన్ని ప్రవైటు రంగం ఆక్రమించుకున్నది.

→ భారతదేశం పారిశ్రామికంగా వెనుకబడి ఉండటానికి గల కారణాలు సామర్థ్యతను పూర్తిగా వినియోగించుకోలేకపోవటం, ప్రభుత్వరంగం సంస్థల పనితీరు, అవస్థాపనా సౌకర్యాల కొరత, ప్రాంతీయ అసమానతల వృద్ధి, పారిశ్రామిక రుగ్మత.

→ 1948 సంవత్సరం పారిశ్రామిక విధాన తీర్మానం భారతదేశంలో మిశ్రమ ఆర్థికవ్యవస్థకు పునాది వేసింది.

→ 1956 సంవత్సరంలో ప్రారంభం కానున్న రెండవ పంచవర్ష ప్రణాళిక పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత యిస్తూ మౌళిక భారీ పరిశ్రమల స్థాపనకు పూనుకుంది.

→ 1991 పారిశ్రామిక తీర్మానం భారతీయ పరిశ్రమ సామర్ధ్యాన్ని పెంచి, ప్రపంచదేశాలతో పోటీపడేలా చేయాలని, అవసరమైన కంట్రోళ్ళు, నియంత్రణలన్నింటిని తొలగించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. * విదేశీ పెట్టుబడులను పెంచే లక్ష్యంతో దేశపు సాధారణ ఆర్ధిక సూత్రాలకు భిన్నంగా ఉండే ఆర్థిక సూత్రాలు కలిగిన ఒక భౌగోళిక ప్రాంతాన్ని SEZ అంటారు.

→ చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యత : ఉద్యోగ అవకాశాలు, ఉత్పత్తిలో ప్రగతి, తక్కువ మూలధనం, మూలధన సేకరణ, ప్రాంతీయ అభివృద్ధి, ఎగుమతులు.

→ చిన్న తరహా పరిశ్రమల సమస్యలు, పెట్టుబడికొరత, పురాతన యంత్రాలు, ముడి పదార్థాల కొరత, మార్కెటింగ్ సమస్యలు, అవస్థాపనా సౌకర్యాల కొరత, నిర్వాహణ సామర్ధ్యంలేకపోవడం.

TS Inter 2nd Year Economics Notes Chapter 6 Industrial Sector

→ పారిశ్రామిక సంస్థలు వాటి ఉత్పాదక కార్యకలాపాలకు వెచ్చించే విత్తం మొత్తాన్ని ” పారిశ్రామిక విత్తం” అంటారు.

→ వీటిని సమకూర్చడానికి IDBI, IFCI, ICICI, IFBI, IDFC, SIDBI, మొదలైన సంస్థలను ప్రారంభించటం జరిగింది.

TS Inter 2nd Year Sanskrit Study Material Poem 3 साधुवर्तनम्

Telangana TSBIE TS Inter 2nd Year Sanskrit Study Material 3rd Poem साधुवर्तनम् Textbook Questions and Answers.

TS Inter 2nd Year Sanskrit Study Material 3rd Poem साधुवर्तनम्

लघु समाधान प्रश्नाः (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

प्रश्न 1. के लोकहिते सदा सक्ताः भवन्ति ?
समादान:
ये अनपेक्षन्ते स्नेहं पात्रं दशान्तरं लोकहिते सदा सक्ताः भवन्ति ।

प्रश्न 2.
कानि करद्वयं वासयन्ति ?
समादान:
अंजलिस्थानि पुष्पाणि करद्वयं वासयन्ति ।

प्रश्न 3.
कस्य जीवितं निष्फलम् ?
समादान:
गुणधर्मविहीनस्य जीवितं निष्फलम् ।

एकपद समाधान प्रश्नाः (ఏక పద సమాధాన ప్రశ్నలు)

प्रश्न 1.
महात्मानः कां तृणाय मन्यन्ते ?
समादान:
महात्मानः लक्ष्मीं तृणाय मन्यन्ते ।

प्रश्न 2.
नदीशः परिपूर्णोपि किं अपेक्षते ?
समादान:
नदीशः परिपूर्णोपि चन्द्रोदयं अपेक्षते ।

TS Inter 2nd Year Sanskrit Study Material Poem 3 साधुवर्तनम्

प्रश्न 3.
कति दोषाः पुरुषेण हातव्याः ?
समादान:
षट् दोषाः पुरुषेण हातव्याः ।

कठिनशब्दार्थाः (కఠిన పదాలు – అర్ధాలు)

1. पादपाः = वृक्षाः, చెట్లు
2. स्नेहम् = तैलम्;, నూనె
3. सुमनाः = सज्जनः, पुष्पम्, సజ్జనులు, పూవు
4. नदीशः = समुद्रः, సముద్రుడు
5. व्यवसायिनः = उद्योगिनः, ప్రయత్నశీలురు
6. तुषः = धान्यत्वक् , బియ్యపుపొట్టు
7. कशाघातः = अश्वादेः ताडनी तया घातः, గుర్రాన్ని కొట్టే సాధనం
8. आरामः = उद्यानवनम्, = ఉద్యావనం
9. पथ्यम् = सत्यम्, నిజం
10. ज्ञातिः = बन्धुः, బంధువు

व्याकरणांशाः (వ్యాకరణాంశాలు)

सन्धयः (సంధులు)

1. सत् + जनाः = सज्जना – श्श्रुत्वसन्धिः
2. वृत्तिः + वामदक्षिणयोः = वृत्तिर्वामदक्षिणयोः – विसर्गसन्धिः
3. बृहस्पतिः + अपि = बृहस्पतिरपि – विसर्गसन्धिः
4. परिपूर्णः + अपि = परिपूर्णोऽपि – विसर्गसन्धिः
5. परैः + अङ्गलिनिर्दिष्टम् = परैरङ्गुलिनिर्दिष्टम् – विसर्गसन्धिः
6. वशीकृतिः + लोके = वशीकृतिर्लोके – विसर्गसन्धिः
7. यः + तम् = यस्तम् – विसर्गसन्धिः
8. कुर्यात् + येन = कुर्याद्येन – जश्त्वसन्धिः
9. पुण्याः + च = पुण्याश्च – श्रुत्वसन्धिः
10. सम्प्रीतिः + च = सम्प्रीतिश्च – श्रुत्वसन्धिः

समासाः (సమాసాలు)

1. पादेन पिबति इति – पादपः – उपपदतत्पुरुषः
2. सन्तश्च ते जनाश्च – सज्जनाः – विशेषणपूर्वपदकर्मधारयः
3. लोकस्य हितम् – लोकहितम् तस्मिन् – षष्ठीतत्पुरुषसमासः
4. अञ्चलौ तिष्ठन्ति इति – अञ्चलिस्थानि – उपपदतत्पुरुषः
5. शोभनं मनः येषां ते सुमनसः – तेषां सुमनसाम् – बहुव्रीहिसमासः
6. वामश्च दक्षिणश्च वामदक्षिणौ तयोः – वामदक्षिणयोः – द्वन्द्वसमासः
7. लघु चेतः येषां ते – लघुचेतसः – बहुव्रीहिः
8. उदारं चरितं येषां ते – उदारचरिताः तेषां – उदारचरितानाम् – बहुव्रीहिः

TS Inter 2nd Year Sanskrit Study Material Poem 3 साधुवर्तनम्

9. विद्यया सह वर्त्तते इति सविद्यः तेषां – सविद्यानां – बहुव्रीहिः
10. शोभनाः अश्वा: – सदश्वाः – प्रादितत्पुरुषः
11. कशायाः घातं – कशाघातं – षष्ठीतत्पुरुषसमासः
12. घनस्य गर्जितम् – घनगर्जितम् – षष्ठीतत्पुरुषसमासः
13. अङ्गुल्या निर्दिष्टम् – अङ्गुलिनिर्दिष्टम् – तृतीयातत्पुरुषसमासः
14. शान्ति एव शङ्खः — शान्तिशङ्खः – सम्भावनापूर्वपदकर्मधारयः
15. दुष्टः जनः – दुर्जनः – प्रादितत्पुरुषः
16. मालां करोति इति – मालाकारः – उपपदतत्पुरुषः
17. गुणश्च धर्मश्च गुणधर्मौ ताभ्यां विहीनः – गुणधर्मविहीनः – तृतीयातत्पुरुषः
18. फलस्य अभाव: – निष्फलम् – अव्ययीभावः

अर्थतात्पर्याणि (అర్ధ తాత్పర్యములు) (Meanings and Substances)

★ 1. छायां कुर्वन्ति चान्यस्य स्वयं तिष्ठन्ति चातपे ।
फलन्ति च परार्थाय पादपा इव सज्जनाः ||

ఛాయాం కుర్వంతి చాన్యస్య స్వయం తిష్ఠన్తి చాతపే |
ఫలంతి చ పరార్థాయ పాదపా ఇవ సజ్జనాః

पदच्छेदः – छायां, कुर्वन्ति, च, अन्यस्य, स्वयं तिष्ठन्ति, न आतपे, फलन्ति, च, परार्थाय पादपाः, इव, सज्जनाः ।

अन्वयक्रमः – पादपाः, सज्जनाः, इव, अन्यस्य, छायां कुर्वन्ति, च, स्वयं, आतपे तिष्टन्ति, च, परार्थाय फलन्ति ।

अर्थाः-
पादपाः = చెట్లు,
सज्जनाः = సత్పురుషుల,
इव = వలె,
अन्यस्य = ఇతరునికి,
छायां = నీడను,
कुर्वन्ति = ఇచ్చుచున్నవి,
च = మరియు,
स्वयं = స్వయంగా,
आतपे = ఎండలో,
तिष्टन्ति = నిలబడి ఉన్నాయి,
परार्थाय = = పరోపకారం కొరకు
फलन्ति = ఫలములను ఇచ్చుచున్నవి.

भावः-
చెట్లు సత్పురుషులవలె తాను స్వయంగా ఎండను అనుభవిస్తున్నవై తమను ఆశ్రయించినవారికి చల్లని నీడను అందించుచున్నవి. పరోపకారం చేయదలచి పండ్లను కూడా ఇస్తున్నాయి.

Trees stand in the Sun, but give shade to others. They bear fruits for the sake of others only. Similarly, the noble work hard to make others happy. All their deeds are meant for the welfare of others.

2. अपेक्षन्ते न च स्नेहं न पात्रं न दशान्तरम् ।
सदा लोकहिते सक्ता रत्नदीपा इवोत्तमाः ॥
అపేక్షంతే న చ స్నేహం న పాత్రం న దశాంతరం ।
సదా లోకహితే సక్తా రత్నదీపా ఇవోత్తమాః ॥

पदच्छेदः – अपेक्षन्ते, न, च, स्नेहं न, पात्रं, न, दशान्तरम् सदा, . लोकहिते, सक्ताः, रत्नदीपा, इव, उत्तमाः ।

अन्वयक्रमः – रत्नदीपाः, उत्तमाः, इव, स्नेहं न अपेक्षन्ते, न, पात्रं, दशान्तरं न अपेक्षंते सदा लोकहित सक्ताः ।

अर्थाः-
रत्नदीपाः = రత్నదీపములు,
उत्तमाः इव = ఉత్తముల వలె,
स्नेहं = తైలాన్ని,
न अपेक्षन्ते = కోరుకొనవు,
पात्रं = పాత్రను,
दशान्तरं = వత్తి భేరాన్ని,
न अपेक्षन्ते = కోరుకొనవు,
सदा = ఎల్లప్పుడు,
लोकहित = లోకహితమునందు,
सक्ता = ఆసక్తి కలిగి ఉంటాయి.

भावः- రత్నదీపాలు ఉత్తములవలె తైలాన్ని కోరవు. పాత్రను కోరవు. వత్తిని కోరవు. ఎల్లప్పుడు లోకహితాన్నే కోరుతూ ప్రకాశిస్తుంటాయి. రత్నదీపాలు స్వయం- ప్రకాశకత్వము గలవి.

The good do not seek friendship, wor-thiness or change of position. They are alway engaged in the wel-fare of the world just as a lamp of gems, which does not need oil, container or a wick.

TS Inter 2nd Year Sanskrit Study Material Poem 3 साधुवर्तनम्

3. लक्ष्मीं तृणाय मन्यन्ते तद्भरेण नमन्ति च ।
अहो किमपि चित्राणि चरित्राणि महात्मनाम् ||
లక్ష్మీం తృణాయ మన్యంతే తద్భరేణ నమంతి చ।
అహో కిమపి చిత్రాణి చరిత్రాణి మహాత్మనామ్ ||

पदच्छेदः – लक्ष्मी, तृणाय मन्यन्ते, तद्भरेण, नमन्ति च, अहो, किमपि, चित्राणि, चरित्राणि, महात्मनाम् ।

अन्वयक्रमः – महात्मनां चरित्राणि, किमपि चित्राणि अहो ! लक्ष्मी, तृणाय मन्यन्ते, तद्भरेण, नमन्ति च ।

अर्थाः-
महात्मनां = మహాత్ముల యొక్క,
चित्राणि = చరిత్రలు,
किमपि चित्राणि = చాలా చిత్రంగా ఉంటాయి,
लक्ष्मी = సంపదను,
तृणाय = గడ్డిపోచవలె,
मन्यन्ते = తలుస్తారు,
तत् + भरेणा = ఆ సంపదతో తులతూగుతున్న వారైనను,
अहो = ఆశ్చర్యము.

भावः- మహాత్ముల ప్రవర్తనలు చాలా చిత్రంగా ఉంటాయి. ఇది ఆశ్చర్యము వారు సంపదలతో కూడియున్న వారైననూ ఆ సంపదను గడ్డిపోచవలె భావిస్తారు.

They consider wealth as straw. However, they become humble, when they have it. Strange, indeed, are the ways of the noble.

4. अञ्जलिस्थानि पुष्पाणि वासयन्ति करद्वयम् ।
अहो सुमनसां वृत्तिर्वामदक्षिणयोः समा ॥
అంజలిస్థాని పుష్పాణి వాసయంతి కరద్వయమ్ |
అహో సుమనసాం వృత్తిర్వామదక్షిణయోః సమా ॥

पदच्छेदः – अंजलिस्थानि पुष्पाणि, वासयन्ति, करद्वयम्, अहो, सुमनसां, वृत्तिः, वामदक्षिणयोः समा ।

अन्वयक्रमः – अंजलिस्थानि पुष्पाणि, करद्वयं वासयन्ति, सुमनसाम्, वृत्तिः, वामदक्षिणयोः समा, अहो |

अर्थाः-
अंजलिस्थानि = దోసిలిలో ఉన్నట్టి,
पुष्पाणि = పూవులు,
करद्वयं = రెండు చేతులను,
वासयन्ति = పరిమళభరితం చేస్తాయి,
सुमनसाम् = మంచి మనసు కలవారియొక్క,
वृत्तिः = స్వభావము,
वामदक्षिणयोः = కుడి ఎడమలకు,
समा = సమానము,
अहो = ఆశ్చర్యము.

भावः- దోసిలిలోని పూల వల్ల కలిగే సువాసన రెండు చేతులకు సమానంగా అంటుకుంటుంది. ఆ పరిమళానికి కుడిచేయి, ఎడమచేయి అనే భేదం ఉండదు. అలాగే మంచి మనస్సు కలవారు కూడా అందరిని సమభావంతో ఆదరిస్తారు.

The flowers in the folded hands make fragrant both the hands. So, the behaviour of the flowers is the same towards right and left. (The noble do not discriminate be-tween the good and bad while doing a favour.)

★5. अयं निजः परो वेति गणना लघुचेतसाम् ।
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥
అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసామ్ |
ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకమ్ ॥

पदच्छेदः अयं, निजः, परः, वा, इति गणना लघुचेतसाम्, उदारचरितानाम्, वसुधा, एव कुटुम्बिनाम् ।

अन्वयक्रमः – लघुचेतसां, अयं निजः, वा, परः, इति, गणना, उदारचरितानां, तु, वसुधा, एव कुटुम्बकम् ।

अर्थाः-
लघुचेतसां = కొద్దిపాటి బుద్ధిగల అల్పులకు,
अयं = ఇతడు,
निजः = తనవాడు,
वा = లేక,
परः = ఇతరుడా,
इति = అను,
गणना = లెక్కింపు, (ఆలోచన ఉంటుంది),
उदारचरितानां तु = మంచి బుద్ధికలవారికి,
कुटुम्बकम् = తన కుటుంబము వలె ఉండును.

भावः-
అల్ప బుద్ధికలవానికి వీడు నా వాడు, వీడు ఇతరుడు అనే భావన ఉంటుంది. కాని ఉత్తములకు ఈ ప్రపంచమంతా తన కుటుంబంగా తోచును. అనగా సత్పురుషులకు తరతమ భేదం ఉండదు.

Whether this one is a friend or enemy is the consideration of the mean minded only. For the noble minded, the world is but one family.

6. अप्राप्तकालं वचनं बृहस्पतिरपि ब्रुवन् ।
लभते बह्ववज्ञानम् अपमानं च पुष्कलम् ||
అప్రాప్తకాలం వచనం బృహస్పతిరపి బ్రువన్ !
లభతే బహ్వవజ్ఞానం అపమానం చ పుష్కలమ్ ॥

पदच्छेदः – अप्राप्तकालं, वचनं, बृहस्पतिः, अपि, ब्रुवन्, लभते, लभते, बह्ववज्ञानं, अपमानं, च, पुष्कलम् ।

अन्वयक्रमः – अप्राप्तकालं, वचनं, बृवन्, बृहस्पतिः, अपि, बहु + अवज्ञानम्, च, पुष्कलं, अपमानं, लभते ।

अर्थाः
– अप्राप्तकालं = సమయం కాని సమయంలో,
वचनं = మాటలను,
बृवन् = మాట్లాడిన,
बृहस्पतिः + अपि = బృహస్పతి కూడా,
बहु + अवज्ञानम् = తిరస్కారమును,
च = మరియు,
पुष्कलं = అధికమైన,
अपमानं = అవమానాన్ని,
लभते = పొందుతాడు.

भावः-
సరియైన కాలంలో మాట్లాడిన బ్రహ్మ కూడా అంతటి తిరస్కారమును, మిక్కిలి అవమానము పొందుతాడు. అందువల్ల మానవులు తగని కాలంలో మాట్లాడటం వల్ల అనర్థాలు కలుగుతాయి.

Even it be Brihaspati, the one who speaks words not proper to the occasion, receives a lot of disrespect and insult.

7. अपि सम्पूर्णतायुक्तैः कर्तव्याः सुहृदो बुधैः ।
नदीशः परिपूर्णोऽपि चन्द्रोदयम् अपेक्षते ||
అపి సంపూర్ణతాయుక్తే కర్తవ్యాః సుహృదో బుధైః |
నదీశః పరిపూర్ణోSపి చంద్రోదయం అపేక్షతే ॥

पदच्छेदः – अपि, सम्पूर्णतायुक्तैः कर्तव्याः, सुहृदः, बुधैः, नदीशः, परिपूर्ण, अपि, चन्द्रोदयं, अपेक्षते ।

अन्वयक्रमः – संपूर्णतायुक्तै, बुधैः, अपि, सुहृदः, कर्तव्यः, नदीशः, परिपूर्णः अपि, चन्द्रोदयं, अपेक्षते ।

अर्थाः-
संपूर्णतायुक्तै = అన్నింటితో కూడియున్న వారైన
बुधैः अपि = పండితుల చేత కూడ
सुहृदः = మిత్రుడు
कर्तव्यः = కోరదగినవాడు,
नदीशः = సముద్రుడు,
परिपूर्णः अपि = నిండుగా ఉన్నప్పటికి,
चन्द्रोदयं = చంద్రోదయమును,
अपेक्षते = కోరుతున్నాడు.

भावः-
అన్నింటితో కూడిన వారైనను పండితులు మంచి స్నేహితుడిని పొందాలి. సముద్రుడు నీటితో పరిపూర్ణుడిగా ఉన్ననూ చంద్రోదయాన్ని కోరుతున్నాడు గదా !

Even though they are self – equipped, people should make friendship with the wise. Even though, the ocean is full, it awaits the appearance of the moon.

TS Inter 2nd Year Sanskrit Study Material Poem 3 साधुवर्तनम्

★8. कोऽतिभारः समर्थानां किं दूरं व्यवसायिनाम् ।
को विदेशः सविद्यानां कः परः प्रियवादिनाम् ॥
కోకతిభారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినామ్ ।
కో విదేశః సవిద్యానాం కః పరః ప్రియవాదినామ్ ॥

पदच्छेदः – कः, अतिभारः, समर्थानां किं, दूरं, व्यवसायिनाम्, कः, विदेशः, सविद्यानां, कः परः प्रियवादिनाम् ।

अन्वयक्रमः – समर्थानां, अतिभारः कः, व्यवसायिनां, दूरं, किं, सविद्यानां, विदेशः, कः, प्रियवादिनां परः, कः ।

अर्थाः-
समर्थानां = కార్యసాధకులకు,
अतिभारः = మిక్కిలి బరువైనది,
कः = ఏది ?
व्यवसायिनां = కష్టించి పనిచేసేవారిని,
दूरं = దూరమైనది,
किं = ఏమున్నది,
सविद्यानां = విద్యావంతులకు,
विदेशः = విదేశము (తెలియని ప్రదేశం),
कः = ఏది ?,
प्रियवादिनां = ఇష్టంగా మాట్లాడువారికి,
परः = ఇతరులు,
कः = ఎవడు ?

भावः-
ఏ పనినైనా చేయగల బలవంతులకు మోయలేని బరువేది ? నిత్యం కష్టపడి నడిచేవానికి దూరం ఎక్కడ ? విద్వాంసులకు తెలియని ప్రదేశం ఏది ? ఇతరులతో ప్రేమగా మాట్లాడేవారికి ఎవడు శత్రువు అవుతాడు ?

What is overload to the efficient ? What is distance to those those who work hard ? What is a foreign place to the educated ? Who is an enemy to the sweetly speaking ones ?

9. सङ्गतिः श्रेयसो मूलं सुजनेषु विशेषतः ।
तुषमात्रे पृथग्भिन्ने तण्डुलं न प्ररोहति ॥
`సంగతిః శ్రేయసో మూలం సుజనేషు విశేషతః |
తుషమాత్రే పృథగ్భిన్నే తండులం న ప్రరోహతి ॥

पदच्छेदः – सङ्गतिः, श्रेयसः, मूलं, सुजनेषु, विशेषतः, तुषमात्रे, पृथग्भिन्ने, तण्डुलं, न, प्ररोहति ।

अन्वयक्रमः – सुजनेषु, सङ्गतिः, विशेषतः, श्रेयसां मूलं तुषमात्रे, पृथग्भिन्ने, तण्डुलं, न प्ररोहति ।

अर्थाः-
सुजनेषु, = సజ్జనులయందు,
सङ्गतिः = మైత్రి,
विशेषतः = విశేషించి,
श्रेयसां = శ్రేయస్సునకు,
मूलं = మూలము,
तुषमात्रेपृथग्भिन्ने = పొట్టు లేక విడిగా ఉన్న,
तण्डुलं = బియ్యపుగింజ,
न प्ररोहति = మొలకెత్తదు.

भावः-
సజ్జనులతో సాంగత్యం శ్రేయస్సునకు మూలమని గ్రహించాలి. పొట్టులేని బియ్యపుగింజ మొలకెత్తుటకు తగినది కాదు. అందువలన సత్సాంగత్యం తప్పనిసరిగా కోరదగినది.

Association is the cause of prosperity, especially in case of the good ones. If the husk is removed, the grain will not sprout.

10. न सदश्वाः कशाघातं न सिंहो घनगर्जितम् ।
परैरङ्गुलिनिर्दिष्टं न सहन्ते मनस्विनः ॥
న సదశ్వాః కశాఘాతం న సింహో ఘనగర్జితమ్ ।
పరైరంగుళినిర్దిష్టం న సహంతే మనస్వినః ||

पदच्छेदः – न सदश्वाः, कशाघातं न सिंह, घनगर्जितम् परैः अंगुलिनिर्दिष्टं, न, सहन्ते, मनस्विनः । .

अन्वयक्रमः – सदश्वाः, न कशाघातं, सिंहः, न घनगर्जितम्, मनस्विनः, परैः, अंगुलिनिर्दिष्टं न, सहन्ते ।

अर्थाः-
सदश्वाः = మంచిగుర్రాలు,
कशाघातं = చెరకోలతో కొట్టడాన్ని,
न सहन्ते = సహించవు,
सिंहः = సింహము,
घनगर्जितम् మేఘగర్జనను,
न सहन्ते = సహించవు,
मनस्विनः = అభిమానవంతులు,
परैः = ఇతరుల చేత,
अंगुलिनिर्दिष्टं = వేలుతో చూపించడాన్ని,
न सहन्ते = సహించరు.

भावः-
మంచిగుర్రాలు చెరకోలతో కట్టడాన్ని సహించవు. సింహాలు మేఘగర్జనను సహించవు. అభిమానవంతులు ఇతరులతో వేలెత్తి చూపించడాన్ని సహింపరు.

A good horse does not tolerate whiplash, a lion will not endure the rumbling of the cloud. So also the noble do not tolerate fingers pointing at them.

11. क्षमा वशीकृतिर्लोके क्षमया किं न साध्यते ।
शान्तिशङ्खः करे यस्य किं करिष्यति दुर्जनः ॥
క్షమా వశీకృతిర్లోకే క్షమయా కిం న సాధ్యతే |
శాంతిశంఖః కరే యస్య కిం కరిష్యతి దుర్జనః |

पदच्छेदः – क्षमा, वशीकृतिः, लोके, क्षमया, किं, न, साध्यते, शान्तिशंखः, करे, यस्य किं करिष्यति, दुर्जनः ।

अन्वयक्रमः – लोके, क्षमा, वशीकृतिः, क्षमया किं न, साध्यते, यस्य, करे, शान्तिशंखः, दुर्जनः, किं करिष्यति ।

अर्थाः-
लोके = లోకమందు,
क्षमा = ఓర్పు,
वशीकृतिः = వశం చేసుకుంటుంది,
क्षमया = ఓర్పుతో,
किं न साध्यते = ఏమి సాధింపబడదు ?,
यस्य = ఎవరి యొక్క,
करे = చేతియందు,
शान्तिशंखः = శాంతి అనెడి శంఖం (ఉంటుందో – అతడిని),
दुर्जनः = దుర్జనుడు,
किं करिष्यति = ఏమి చేయగలడు ?

भावः-
ఓర్పు అన్నింటిని వశపరుస్తుంది. ఓర్పుతో సాధించలేనిది ఏదీ ఉండదు. ఎవని దగ్గర శాంతి అనే శంఖం ఉంటుందో అతడిని దుర్జనుడు ఏమి చేయగలడు ? అనగా ఏమీ చేయలేడని భావం.

Forbearance is the conqueror in this world. What is not attained by forbearance ? What can an evil man do the one who has the conch of peace in his hand ?

12. षड्दोषाः पुरुषेणेह हातव्या भूतिमिच्छता ।
निद्रा तन्द्रा भयं क्रोध आलस्यं दीर्घसूत्रता ॥
షడ్ దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా |
నిద్రా తంద్రా భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రతా ।

पदच्छेदः – षट् दोषाः, पुरुषेण, इह, हातव्याः, भूतिं, इच्छत, निद्रा, तन्द्रा, भयं क्रोधः, आलस्यं दीर्घसूत्रता ।

अन्वयक्रमः – भूतिं, इच्छता, पुरुषेण, इह, षट् दोषाः, हातव्याः, निद्रा, तन्द्रा, भयं क्रोधः, आलस्यं दीर्घसूत्रता ।

अर्थाः-
भूतिं = సంపదను,
इच्छता = కోరుతున్న,
पुरुषेण = మానవుని చేత,
इह = ఈ లోకంలో,
षट् दोषाः = ఆరు దోషాలను,
हातव्याः = విడువవలెను,
निद्रा = నిద్ర,
तन्द्रा = కునికిపాటు,
भयं = భయము,
क्रोधः = కోపము,
आलस्यं = సోమరితనము,
दीर्घसूत्रता = తీవ్రముగా ఆలోచించుట.

भावः-
అభివృద్ధిని, సంపదను కోరేవారు ఈ లోకంలో నిద్ర, కునికిపాటు, భయము, కోపము, సోమరితనం, దీర్ఘాలోచన అనే ఆరు దుర్గుణాలను విడిచిపెట్టాలి.

A person seeking prosperity should avoid these six blemishes : sleep, lethargy, fear, anger, idleness and pro-crastination.

13. पुष्पं पुष्पं विचिन्वीत मूलच्छेदं न कारयेत् ।
मालाकार इवारामे न यथाङ्गारकारकः ||
పుష్పం పుష్పం విచిన్వీత మూలచ్చేదం న కారయేత్ ।
మాలాకార ఇవారామే న యథాంగారకారకః ॥

पदच्छेदः – पुष्पं, पुष्पं, विचिन्चीत, मूलच्छेदं न कारयेत्, मालाकारः, इव, आरामे, न, यथा, अंगारकारकः ।

अन्वयक्रमः – आरामे, मालाकारः, इव, पुष्पं, पुष्पं विचिन्वीत, यथा, अंगारकारकः, मूलच्छेदं, न कारयेत् ।

अर्थाः-
आरामे = ఉద్యానవనంలో,
मालाकारः इव, = దండలను కట్టే వానివలె,
पुष्पं पुष्पं = పూవును, పూవును,
विचिन्वीत = కోయాలి,
यथा, = ఎట్లు,
अंगारकारकः = కాలుతున్న బొగ్గువలె,
मूलच्छेदं = మూలాన్ని నరకడాన్ని,
कारयेत् = చేయకూడదు.

भावः-
పూలతోటలో మాలాకారునివలె పువ్వును పువ్వును జాగ్రత్తగా కోయాలి. మండుతున్న బొగ్గువలె మూలభేదం చేయకూడదు.

Collect flowers one by one like the gar¬land-marker in the garden. Do not kill the tree like the fire – maker.

★14. चक्षुषा मनसा वाचा कर्मणा च चतुर्विधम् ।
प्रसादयति लोकं यस्तं लोकोऽनुप्रसीदति ॥
చక్షుషా మనసా వాచా కర్మణా చ చతుర్విధమ్ |
ప్రసాదయతి లోకం యస్తం లోకోకనుప్రసీదతి ||

पदच्छेदः – चक्षुषा, मनसा, वाचा, कर्मणा, च, चतुर्विधम्, प्रसादयति, लोके, यः, तं, लोकः, अनुप्रसीदति ।

अन्वयक्रमः – यः, लोकं, चक्षुषा, मनसा, वाचा, च, कर्मणा, चतुर्विधम्, प्रसादयति, तं, लोकः, अनुप्रसीदति ।

अर्थाः-
यः = ఎవడు,
लोकं = ఈ ప్రపంచమును,
चक्षुषा = కంటితో,
मनसा = మనసుతో,
वाचा = మాటతో,
च = మరియు,
कर्मणा = పనితో,
चतुर्विधम् = నాలుగు రకములుగా,
प्रसादयति = తృప్తిపరచునో,
तं = అతడిని,
लोकः = లోకమును,
अनुप्रसीदति = అనుసరిస్తూ సంతోషపెట్టును.

भावः-
ఎవడు తన కనుల చేత, మనసు చేత, మాట చేత, చేయు పనిచేత నాలుగు విధములుగా ఇతరులను సంతోషపెట్టునో అతడు అదే విధమైన సంతోషమును లోకము నుండి పొందుతాడు.

The world will be favourable to one, who pleases her with looks, mind, words and actions.

★15. यथा यथा हि पुरुषः कल्याणे कुरुते मनः ।
तथा तथास्य सर्वार्थाः सिद्ध्यन्ते नात्र संशयः ॥
యథా యథా హి పురుషః కళ్యాణే కురుతే మనః |
తథా తథాస్య సర్వార్థాః సిధ్యంతే నాత్ర సంశయః |

पदच्छेदः – यथा, यथा, हि, पुरुषः, कल्याणे, कुरुते, मनः, तथा, तथा, अस्य, सर्वार्थाः सिध्यन्ते, न, अत्र, संशयः ।

अन्वयक्रमः – यथा, यथा, पुरुषः, कल्याणे, मनः कुरुत, तथा तथा, अस्य, सर्वार्थाः, सिध्यन्ते, अत्र, संशयः, न हि ।

अर्थाः-
यथा, यथा = ఏఏ విధముగా అయితే,
पुरुषः = మానవుడు, ఇతరులకు మంచి చేయుటకు,
कल्याणे = మనసు,
कुरुत = చేయునో,
तथा तथा = అదే విధంగా,
अस्य = ఇతనికి,
सर्वार्थाः = అన్ని కోరికలు,
सिध्यन्ते = తీరును,
अत्र = ఈ విషయమును గురించి,
संशयः = సందేహము,
न = లేదు,
हि = కదా !

भावः-
మానవుడు ఏఏ విధంగా లోకమునకు మంచిపనులు చేయుటకు ప్రయత్నము చేయునో అదేవిధంగా అతనికి అన్ని కోరికలూ సిద్ధించును. ఈ విషయమున సందేహము లేదు.

Whenever man fixes his mind on doing good things, then all his desires will be fulfilled. There is no doubt in it.

TS Inter 2nd Year Sanskrit Study Material Poem 3 साधुवर्तनम्

16. दिवसेनैव तत्कुर्याद्येन रात्रौ सुखं वसेत् ।
अष्ट मासेन तत्कुर्याद्येन वर्षाः सुखं वसेत् ॥
దివసేనైవ తత్కుర్యాద్యేన రాత్రే సుఖం వసేత్ |
అష్ట మాసేన తత్కుర్యాద్యేన వర్షాః సుఖం వసేత్ ॥

पदच्छेदः – दिवसेन एव तत् कुर्यात्, येन, शत्रौ, सुखं वसेत्, अष्टमासेन, तत्, कुर्यात्, येन, रात्रौ सुखं वसेत् ।

अन्वयक्रमः – येन, रात्रौ सुखं वसेत्, तत्, दिवसेन, एव कुर्यात्, येन, वर्षाः, सुखं, वसेत्, तत्, अष्टमासेन, कुर्यात् ।

अर्थाः-
येन = ఎవనిచేత,
रात्रौ = రాత్రియందు,
सुखं = సుఖముగా,
वसेत्, = ఉండవలయునో,
तत् = దానిని,
दिवसेन + एव = పగటి పూటయందే,
कुर्यात्, = చేయవలయును,
येन= ఎవని చేత,
वर्षाः = వర్షాకాలంలో,
सुखं = సుఖముగా,
वसेत् = ఉండవలయునో,
तत् = దానిని,
अष्टमासेन = ఎనిమిది నెలలలోనే,
कुर्यात् = చేయవలయును.

भावः-
ఏ మానవుడు రాత్రి సమయంలో సుఖంగా ఉండాలనుకుంటాడో అతడు దానికి సంబంధించిన పనిని ఉదయమందే చేయాలి. వర్షాకాలంలో ఎవడు సుఖంగా ఉండాలని అనుకుంటాడో అట్టివాడు మిగిలిన ఎనిమిది నెలలలోనే దానికి సంబంధించిన ఏర్పాట్లను, పనులను చేసుకోవాలి.

One should finish his tasks during the day itself, so that he can sleep peacefully at night. One should finish his work in eight months so that he can rest during the rainy season.

★17. सुलभाः पुरुषा राजन्सततं प्रियवादिनः ।
अप्रियस्य तु पथ्यस्य वक्ता श्रोता च दुर्लभः ॥
సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః |
అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ॥

पदच्छेदः – सुलभाः, पुरुषाः, राजन् सततं प्रियवादिनः, अप्रियस्य, तु, पथ्यस्य, वक्ता, श्रोता, च, दुर्लभः ।

अन्वयक्रमः – राजन्, सततं प्रियवादिनः, पुरुषाः, सुलभाः, अप्रियस्य, च, पथ्यस्य, वक्ता, च, श्रोता, दुर्लभः ।

अर्थाः-
राजन् = ఓ రాజా !
सततं = ఎల్లప్పుడు
प्रियवादिनः = ఇష్టముగా మాట్లాడువారు,
सुलभाः = సులభంగా దొరుకుతారు,
तु = కాని,
अप्रियस्य = ఇష్టములేని వారికి,
च = మరియు,
पथ्यस्य = తప్పక అనుసరించదగిన దానిని గురించి,
श्रोता = వినేవాడు,
दुर्लभः = ఎక్కడా దొరకడు.

भावः-
ఓ రాజా ! మనకు మంచిని కలిగించకపోయినా దానిని గురించి ఇష్టము కలిగే విధంగా చెప్పేవారు లోకంలో ఎక్కడైనా చాలా మంది సులభంగా దొరుకుతారు. కానీ వినడానికి, ఇష్టం లేని వారికి తప్పనిసరిగా అనుసరించవలసిన మంచి మార్గాన్ని గురించి చెప్పేవారు, దానిని వినేవారు ఎక్కడా దొరకరు.

O king, it is easy to find people who speak sweetly always. But, it is hard to find one who gives the unpalatable advice, and the one who listens to him.

18. पूजनीया महाभागाः पुण्याश्च गृहदीप्तयः ।
स्त्रियः श्रियो गृहस्योक्तास्तस्माद्रक्ष्या विशेषतः ॥
పూజనీయా మహాభాగాః పుణ్యాశ్చ గృహదీప్తయః ॥
స్త్రియః శ్రియో గృహస్యోక్తాస్తస్మాదక్ష్యా విశేషతః ॥

पदच्छेदः – पूजनीया, महाभागाः, पुण्याः, च, गृहदीप्तयः, स्त्रियः, श्रियः, गृहस्य, उक्ताः, तस्मात्, रक्ष्या, विशेषतः ।

अन्वयक्रमः – गृहदीप्तयः, पुण्याः, महाभागाः, च, गृहस्य, श्रियः, उक्ताः, स्त्रियः, पूजनीया, तस्मात्त्, विशेषतः, रक्ष्या ।

अर्थाः-
गृहदीप्तयः = ఇంటికి దీపముల వంటి,
पुण्याः = పుణ్యప్రదులైన,
महाभागाः = మహానుభావులైన, చె
च = మరియు,
गृहस्य = ఇంటికి,
श्रियः = లక్ష్మి వంటివారని,
उक्ताः = పలుకబడిన,
स्त्रियः = స్త్రీలు,
पूजनीया = పూజింపదగినవారు,
तस्मात्त् = అందువలన,
विशेषतः = విశేషించి,
रक्ष्या = రక్షింపదగినవారు.

भावः-
స్త్రీలు ఎల్లవేళలా పూజింపదగినవారు. వారు ఇంటికి వెలుగులను అందించువారు పుణ్యవ్రతులు, గొప్పవారు. ఇంటికి లక్ష్మీ స్వరూపులు. అందువలన స్త్రీలను సర్వదా రక్షించాలి.

Women, who are honourable, noble, pious and the light of the home are the wealth of the home. Hence, they should be carefully protected.

19. सम्भोजनं सङ्कथनं सम्प्रीतिश्च परस्परम् ।
ज्ञातिभिः सह कार्याणि न विरोधः कथञ्चन ॥
సంభోజనం సంకథనం సంప్రీతిశ్చ పరస్పరమ్ |
జ్ఞాతిభిః సహ కార్యాణి న విరోధః కథంచన ॥

पदच्छेदः- सम्भोजनं सङ्कथनं, संप्रीतिः च परस्परम्, ज्ञातिभिः, सह, कार्याणि, न, विरोधः, कथञ्चन ।

अन्वयक्रमः – ज्ञातिभिः, सह, परस्परं, सम्भोजनं, सङ्कथनम्, संप्रीतिः, कार्याणि कथञ्चम, विरोधः, न ।

अर्थाः-
ज्ञातिभिः = దాయాదులతో,
सह = కూడి,
परस्परं = అన్యోన్యంగా,
सम्भोजनं = కలసి భోజనం చేయడం,
सङ्कथनम् = కలసి మాట్లాడుకోవడం,
संप्रीतिः = ప్రేమ పూర్వక వ్యవహారం,
कथञ्चम = చేయదగినది,
कथञ्चम = ఎన్నడును,
विरोधः = వైరము,
न = వద్దు.

भावः- దాయాదులతో అన్యోన్యంగా కలిసిభోజనం చేయడం, కలసి మాట్లాడుకోవడం, ప్రీతిని ప్రదర్శించడం చేయాలి. వారితో ఎన్నడునూ వైరం తగదు.

One should eat together, converse, and be affectionate with the relatives, and should not quarrel with them.

20. स जीवति गुणो यस्य धर्मो यस्य स जीवति ।
गुणधर्मविहीनो यः जीवितं तस्य निष्फलम् ॥
స జీవతి గుణో యస్య ధర్మో యస్య స జీవతి |
గుణధర్మవిహీనో యః జీవితం తస్య నిష్ఫలమ్ ॥

पदच्छेदः – सः, जीवति, गुणः, यस्य, धर्मः, यस्य सः, जीवति, गुणधर्मविहीनः यः जीवितं, तस्य, निष्फलम् ।

अन्वयक्रमः यस्य, गुणः, सः, जीवति, यस्य, धर्मः, सः, जीवति, यः, गुणधर्मविहीनः, तस्य जीवितं निष्फलम् ।

अर्थाः-
यस्य = ఎవనికి, गुणः = మంచి గుణం ఉంటుందో
सः = అట్టివాడు,
जीवति = జీవించునట్టివాడు,
यस्य = ఎవనికి,
धर्मः = ధర్మము ఉంటుందో,
सः = అట్టివాడు,
जीवति = జీవించి యుండును,
यः = ఎవడు,
गुणधर्मविहीनः = గుణము, ధర్మము లేని వాడై ఉంటాడో,
तस्य = అతని యొక్క,
जीवितं = జీవితము,
निष्फलम् = నిష్ఫలమైనది.

भावः-
లోకంలో ఎవడు ఉత్తమగుణాన్ని కల్గియుంటాడో, ధర్మమును కలిగి యుంటాడో అట్టివాడే నిజంగా జీవించువాడు గుణధర్మములు లేనివాని జీవితం నిష్ఫలము.

He lives who is meritorious and righteous. The life of one devoid of merits and righteousness is useless.

साधुवर्तनम् Summary in Sanskrit

पाट्यभाग परिचयः 

लोके पुरुषस्य जीवनं न केवलं तस्य तत्परिवारस्य च किन्तु सर्वस्यापि लोकस्य उपकारकं भवेदिति अस्माकं पूर्वपुरुषाणामाशयः । अत एव वैदिके लौकिकेऽपि संस्कृतसाहित्ये सत्पथप्रदर्शकानि सुभाषितानि बहुशः सङ्ग्रथितान्यासन् । कालान्तरक्षमा एतास्सूक्तयः अनपगतशैशवैः विद्यार्थिभिः हृदयस्थीकृताः स्युः । एतानि सुभाषितानि सर्वासु दशासु तान् सन्मार्गे नयेयुः । माधुकरीं वृत्तिमाश्रित्य महाभारतम् (विदुरनीतिः ), अर्थशास्त्रम्, पञ्चतन्त्रम्, हितोपदेशः इत्यादिभ्यः ग्रन्थेभ्य: समाहृत्य अस्मिन् पाठ्यभागे सङ्कलिता इमाः सदुक्तयः ।

सूचना – अत्र ★ नक्षत्राङ्कितानां श्लोकानां प्रतिपदार्थः भावः च लेखनीयः ।

TS Inter 2nd Year Sanskrit Study Material Poem 3 साधुवर्तनम्

साधुवर्तनम् Summary in Telugu

పాఠ్యభాగ పరిచయం

లోకంలో మానవజీవనం కేవలం అతనికి సంబంధించినదే కాదు, సకల లోకానికి ఉపకారం చేయడానికి ఉపకరిస్తుంది. ఇది మన ప్రాచీనులు అభిప్రాయము. నైతికంలో గాని, లౌకికంలో గాని మంచి మార్గాన్ని పొందింపజేయడానికి సుభాషితాలు ఉపయోగ పడుతున్నాయి. ఇలాంటి సుభాషితాలను విద్యార్థులందరు తప్పక చదవాలి. ఈ సుభాషితాలను సందర్భానుగుణంగా జనాల్లోకి తీసుకొని వెళ్ళాలి. మహాభారతంలో విదురనీతి, అర్థశాస్త్రం, పంచతంత్రం, హితోపదేశం మొదలైన గ్రంథాల నుండి ఈ శ్లోకాలను తీసికొని ఈ పాఠ్యభాగంలో ఇవ్వబడినాయి.

సూచన : ఇక్కడ * నక్షత్రం గల శ్లోకాలకు ప్రతిపదార్థము, భావము చదవాలి.

साधुवर्तनम् Summary in English

Introduction

Subhashitas teach morals and code of conduct to show the right path to the people. These subhashitas are collected from various works such as the Mahabharata, Arthasastra, Panchatantram, Hitopadesa etc.

 

TS Inter 2nd Year Economics Notes Chapter 5 Agricultural Sector

Here students can locate TS Inter 2nd Year Economics Notes Chapter 5 Agricultural Sector to prepare for their exam.

TS Inter 2nd Year Economics Notes Chapter 5 Agricultural Sector

→ Agricultural sector occupies an important role by providing basic necessary food and nonfood products and raw materials for industrial development.

TS Inter 2nd Year Economics Notes Chapter 5 Agricultural Sector

→ Importance of agricultural sector:

  1. share of National income
  2. share of employment
  3. providing raw materials to industries
  4. market for industrial products
  5. capital formation
  6. provision of food security and poverty reduction
  7. Importance in international trade
  8. Economic planning and economic development.

→ Cropping pattern is shifting from food crops to non-food crops.

→ Causes for low productivity

  1. General causes: a) Social environment, b) Population pressure c) Land degradation d) Inadequate infrastructure.
  2. Institutional causes: a) Land tenure system; b) Six of holdings, c)Lack of entrepreneurship, d) Lack of investment.
  3. Technical causes: a) Poor production techniques, b) Inadequate irrigation, c) Environmental factors.

→ The implementation of land reforms without a stong political will did not get desired benefits.

→ Green revolution has produced asignificant impact in Indian economy in the form of increase in food grains production, employment in causes of formers and labourers.

→ Agricultural credit is one of the important inputs in agriculture. Non-institutional sources contributed much higher percentage of rural credit in the initial period and now it has decreased.

→ Regulated markets are playing a vital role in elimination of unhealthy market practices. Similarly, with the of minimum support prices and maximum Prices.for agricultural products, both farmers and consumers are gaining.

→ Achieving the aim of food security to all is the key factor. Finally, a better implementation of all the reforms in the agricultural sector can benefit to the sections.

TS Inter 2nd Year Economics Notes Chapter 5 Agricultural Sector

TS Inter 2nd Year Economics Notes Chapter 5 వ్యవసాయ రంగం

→ పారిశ్రామికాభివృద్ధికి కావలసిన ముడిసరుకులు, ప్రాథమిక అత్యవసర ఆహార, ఆహారేతర ఉత్పత్తులను అందించడంలో వ్యవసాయరంగం ఒక ప్రధానమైన స్థానాన్ని కల్గిఉంది.

→ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ ప్రాధాన్యత – జాతీయాదాయాలలో వ్యవసాయరంగం వాటా, ఉద్యోగితలో వ్యవసాయరంగం వాటా – ముడి పదార్థాలు అందించుట – మూలధన సమీకరణ – ఆహార భద్రత – అంతర్జాతీయ వ్యాపారం.

→ పంటల తీరును నిర్ణయించే అంశాలు :

  1. సహజ అంశాలు
  2. సాంఘిక అంశాలు
  3. చారిత్రక అంశాలు
  4. ఆర్థిక అంశాలు
  5. ప్రభుత్వ చర్యలు.

→ వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉండటానికి కారణాలు :

  1. సాధారణ కారణాలు
  2. సంస్థాగత కారణాలు
  3. సాంకేతిక కారణాలు.

→ వ్యవసాయ నిర్మాణంలో మార్పులను తీసుకొని రావడాన్ని భూ సంస్కరణలు అంటారు. అయితే ఇవి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది.

→ నిశ్చితమైన నీటిపారుదల వసతి, రసాయనిక ఎరువుల వాడకంతో బాటు అధిక దిగుబడినిచ్చే వంగడాలతో సేద్యం చేసి ఎక్కువ దిగుబడులు సాధించడాన్ని హరిత విప్లవం అంటారు. దీనిని నార్మల్ ‘బోర్లాగ్ అభివృద్ధి చేశారు.

→ వ్యవసాయ పరపతి ఆధారాలు :

  1. సంస్థా పూర్వకం కాని ఆధారాలు
  2. సంస్థా పూర్వకమైన ఆధారాలు.

→ హేయమైన మార్కెట్ విధానాలను తొలగించేందుకు క్రమబద్ధమైన మార్కెట్లు ఒక కీలకమైన పాత్రను పోషిస్తాయి.

→ వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దుతు ధర, గరిష్ట ధరలను నిర్ణయించడం ద్వారా వ్యవసాయదారులు, వినియోగదారులు ప్రయోజనాల్ని పొందుతారు.

TS Inter 2nd Year Economics Notes Chapter 5 Agricultural Sector

→ అందరికీ ఆహార భద్రత కల్పించడమనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. అంతిమంగా అన్ని తరగతుల వారి సంక్షేమం కోసం ఉద్దేశించిన సంస్కరణలు పటిష్టంగా అమలుచేయడం ద్వారా ఆశించిన ఫలితాలు అందరికి దక్కే విధంగా ప్రభుత్వ పనితీరు ఉండాలి.

TS Inter 2nd Year Economics Notes Chapter 10 Telangana Economy

Here students can locate TS Inter 2nd Year Economics Notes Chapter 10 Telangana Economy to prepare for their exam.

TS Inter 2nd Year Economics Notes Chapter 10 Telangana Economy

→ The new Telangana state has been formed and there is an urgent need for reconstruction for which serious and concerted action is needed.

TS Inter 2nd Year Economics Notes Chapter 10 Telangana Economy

→ The sector-wise composition of the state economy is significantly changing over the last 10 years. During 2013 – 14 agriculture growth rate is 8.4 , the Industrial sector is 0.1 service sector is 5.9.

→ The sectors directly or indirectly require infrastructural facilities which can be divided into economic infrastructure and social infrastructure.

→ Economic Infrastructure includes energy, irrigation, transportation, roads,, postal and banking.

→ Social Infrastructure includes education, health, housing, sanitation family and labour welfare.

→ Communication system consists of various services like posts and telegraphs, telecommunications, broad costing, television and information technology.

→ Banking system regulates the money supply in circulations and influences the nature of production.

→ Tourism is an industry with a lot of opportunities that contribute significantly.

→ The state of Telangana suffers from massive polluted groundwater due to the agglomeration of pollution industries.

TS Inter 2nd Year Economics Notes Chapter 10 Telangana Economy

→ The co-existence of relatively developed and developing regions within the state leads to regional imbalances.

→ District-level data on different indicators have been collected for the 10 districts of Telangana to compare the disparities between rural and urban areas.

TS Inter 2nd Year Economics Notes Chapter 10 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

→ తెలంగాణ 29వ రాష్ట్రంగా జూన్ 2, 2014న ఏర్పాటైంది. స్వయం పాలన సాంస్కృతిక గుర్తింపు కోసం 6 దశాబ్దాల సుదీర్ఘ పోరాటానికి ముగింపు ఏర్పడినది.
తెలంగాణ నూతన రాష్ట్రం 1, 14, 840 చ.కి.మీ. వైశాల్యంలో 3.52 కోట్ల జనాభాతో 12వ పెద్ద రాష్ట్రంగా అవతరించింది.

→ దక్కన్ పీఠభూమిలోని సెమి అరిడ్ ప్రాంతంలో ఏర్పాటైంది. ప్రధానమైన కృష్ణా, గోదావరి జీవనదులు రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి.

→ రాష్ట్ర స్థూల ప్రాంతీయోత్పత్తి రేటు 2014-15 సం॥లో 5.3%గా అంచనా వేయబడింది. SGDP పెరుగుదల రాష్ట్ర తలసరి ఆదాయంలోని పెరుగుదలకు తోడ్పడింది.

→ రాష్ట్ర జనాభాలో అధిక శాతం 61.33% జనాభా గ్రామాలలో నివసిస్తున్నారు. మిగిలిన 38.67 పట్టణ జనాభా.

→ తెలంగాణ ప్రభుత్వం కె.జి. నుంచి పి.జి. వరకు ఉచిత విద్యను అందించడానికి పూనుకొన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత 66.3%, శిశుమరణాల సంఖ్య 1981. 83 నుంచి 2011లో 49కు తగ్గింది.

→ అందరికి వైద్యం లక్ష్యాన్ని చేరుకొనే దిశగా ప్రభుత్వం ICDP బాలిక సమృద్ధి యోజన, ఆరోగ్యశ్రీ; ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నది.

TS Inter 2nd Year Economics Notes Chapter 10 Telangana Economy

→ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం ప్రజల సంక్షేమం. ఇందుకుగాను ఎన్నో పథకాలను రూపొందించి అమలు చేసింది. అందులో కొన్ని ముఖ్యమైనవి. ఆసరా పెన్షన్, SC లకు భూమి కొనుగోలు, కళ్యాణలక్ష్మీ, తెలంగాణ తాగునీటి సరఫరా పథకాలు మొదలగునవి. ఇవే కాకుండా ‘బంగారు తెలంగాణ’ సాధన లక్ష్యంగా మరెన్నో పథకాలకు రూపకల్పన చేస్తున్నది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 5th Lesson ఎంట్రప్రిన్యూర్షిప్ Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 5th Lesson ఎంట్రప్రిన్యూర్షిప్

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎంట్రప్రిన్యూర్ను నిర్వచించి, వారి లక్షణాలను వివరించండి.
జవాబు.
ఎంట్రప్రిమ్యార్ అర్థం: ఎంట్రప్రిన్యూర్ అనే పదం ఫ్రెంచి మూలమైన “entrependre” అనే పదం నుండి ఆవిర్భవించింది. దాని అర్థం ఒక కొత్తపనిని చేపట్టడం. అనగా నష్టం భరించి ఒక కొత్త సంస్థను స్థాపించడమనే కార్యాన్ని చేపట్టేవాడే ఎంట్రప్రిన్యూర్.

ఎంట్రప్రిన్యూర్ నిర్వచనాలు:
1) రిచర్డ్ కాంటిల్లన్ ప్రకారం “నిశ్చితమైన ఖరీదుకు కొన్న ఒక వస్తువును అనిశ్చితమైన ధరకు అమ్మడం, ఈ విధంగా అమ్మడంలో గల లాభ నష్టాలకు సంబంధించిన సమంజసమైన నిర్ణయాలను తీసుకోవడమే కాకుండా వనరులను వినియోగంలోకి తెచ్చే వ్యక్తిని ఎంట్రప్రిన్యూర్ గా నిర్వచించవచ్చు.

2) జె.బి. సే ప్రకారం ఎంట్రప్రిన్యూర్ అనేవాడు ఒక ఆర్థిక ఏజెంట్. భూమి, శ్రమ, పెట్టుబడి అనే ఉత్పత్తి కారకాలను సంఘటీకృత పరిచి, వాటికి ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువు యొక్క విలువను నిర్ధారించి దానిలో వేతనాలు, అద్దె, వడ్డీ, లాభాలు అనే భాడీలను విడివిడిగా గుర్తించడమే గాకుండా, తన పెట్టుబడికి పునరుపయోగం కలిగే విధంగా నిర్వహించేవాడు”.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

ఎంట్రప్రిన్యూర్ లక్షణాలు:
1. నవకల్పన: నవకల్పన అనగా కొత్త పనులను చేయడం లేదా పాత పనులను కొత్త పద్ధతిలో చేయడం. ఎంట్రప్రిన్యూర్ ప్రస్తుతం లేని ఒక అంశాన్ని ఊహించి, దాన్ని విశ్లేషించి అమలుపరుస్తాడు. పాత భావాలకు స్వస్తి చెప్పడం, కొత్త పద్ధతులకు నాంది పలకడం అతని ముఖ్య లక్షణం.

2. రిస్కు భరించడం: కొత్త వ్యాపారాలేవైనా రిస్కు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ కొత్త వ్యాపారాలలో ఎంట్రప్రిన్యూర్లు విజయం పొందవచ్చు లేదా ఓటిమి చవిచూడవచ్చు. రెండింటికి సిద్ధం కావడమే రిస్కును భరించడం.

3. ఆత్మవిశ్వాసం: ఎంట్రప్రిన్యూర్లకు ఆత్మవిశ్వాసమే మొదటిమెట్టు. వారు తమశక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంచి పోటీని, అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కోవడమే కాకుండా, పరిస్థితులను తమకనుకూలంగా మార్చుకోగలమనే ధీమా కలిగి ఉంటారు.

4. కఠిన శ్రమ: ఎంట్రప్రిన్యూర్లు కఠిన శ్రమ చేస్తారు. ఇంతకంటే ఎక్కువ శ్రమ చేసేవారు ఉండరనడం అతిశయోక్తి కాదు. అవసరమైన పరిజ్ఞానం, చొరవ, చాకచక్యం కలిగి కఠిన శ్రమ చేయడం వల్ల, వీరి శ్రమకు అత్యధిక విలువ సమకూరుతుంది. లక్ష్యసాధన కోసం వారు ఎన్ని గంటలైనా వరుసగా శ్రమ చేస్తారు.

5. లక్ష్య స్థాపన: లక్ష్యాలను నిర్ణయించుకొని, వాటిని సాధించడానికి కృషి చేసయడంలోనే ఎంట్రప్రిన్యూర్ నిజమైన సంతృప్తిని పొందుతాడు. కానీ అన్ని లక్ష్యాలను అతడు పరిపూర్ణంగా సాధించలేకపోవచ్చు. అలాంటి సందర్భాలలో వారు తమ లక్ష్యాలను లేదా వాటి సాధనకు అవలంభించే పద్ధతులను పనర్నిర్మించుకొని తిరిగి కృషి చేయడం మొదలుపెడతారు. అంతేకాకుండా ఒక లక్ష్యాన్ని సాధించగలిగిన ఒక ఎంట్రప్రిన్యూర్ వెంటనే మరొక లక్ష్యాన్ని రూపొందించుకోవడం పరిపాటి.

6. జవాబుదారీతనం: ఎంట్రప్రిన్యూర్లు జయాపజయాలను సమానంగా స్వీకరిస్తారు. లక్ష్యాలను సాధించగలిగిన వారికి ప్రశంసలు, ఓడినవారికి నిందలు పరిపాటి. నిజమైన ఎంట్రప్రిన్యూర్ ఓటమిని విజయానికి మెట్టుగా భావించి కొనసాగించవలసి ఉంటుంది. వారు సంపాదించిన లాభాలే వారు సాధించిన విజయాన్ని సూచిస్తాయి.

7. నాయకత్వం:
1) మనిషి యొక్క ఆదర్శవంతమైన గుణానికి ప్రాతినిధ్యం వహించేదే నాయకత్వం ప్రకారం నాయకత్వం అంటే మేనేజర్ తన ఆధీనాధికారులను ఉత్ప్రేరణ చేసే సామర్థ్యం కలిగి ఉండటం.

2) ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించడానికి తమ శాయశక్తులను ఉపయోగించడానికి నాయకుడు తనను అనుసరించే వారికి నిర్దేశకతను, మార్గదర్శకాన్ని చూపిస్తూ, వారిని ప్రభావితం చేస్తాడు. సమిష్టికృషికి ఔత్సాహికుని నాయకత్వం ఒక శక్తిగా పనిచేస్తుంది. మానవ వనరులను సక్రమంగా వినియోగించడానికి నాయకత్వం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఔత్సాహికుడు విజయవంతమైన ఔత్సాహికుడిగా రాణించాలంటే, అతను తప్పకుండా మంచి నాయకత్వపు గుణాలను కలిగి ఉండాలి.

8. నిర్వహణ నైపుణ్యాలు: ఔత్సాహికునికి నిర్వహణ నైపుణ్యాల అవసరం చాలా ఉంది. నిర్వహణ నైపుణ్యంలో విత్త నిర్వహణ, కార్యాలయ నిర్వహణ, ఉత్పత్తి నిర్వహణ, మార్కెటింగ్ నిర్వహణ, ఫ్యాక్టరీ నిర్వహణ మొదలయిన వ్యాపకాలన్నీ ఇమిడి ఉంటాయి. ఇందుకుగాను ఔత్సాహికులు నిర్వహణ నైపుణ్యాల కింద వివిధ అంశాలను పెంపొందించుకోవాలి. స్పష్టమైన విధానాన్ని బాగా ఆలోచించి, నిర్ణయించి రూపొందించాలి, వివిధ విభాగాలలో పనిచేసే సిబ్బందియొక్క విధులు, బాధ్యతలు, అధికారాలు మరియు హక్కుల మధ్య సమతౌల్యతను సాధించాలి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

ప్రశ్న 2.
ఎంట్రప్రిన్యూర్ విధులను వివరించండి.
జవాబు.
1. నవకల్పన:

  1. ఎంట్రప్రిన్యూర్ అనే పదం ‘నవకల్పన’తో ముడిపడి ఉంటుంది. “నవకల్పన” అంటే కొత్తపనులను చేయడం, లేదా పాతపనులను ఒక కొత్త పద్ధతిలో చేయడం.
  2. ఇందులో కొత్త వస్తువుల ఉత్పత్తి, కొత్త మార్కెట్లు సృష్టి, కొత్త ఉత్పత్తి పద్ధతులను అమలులోకి తేవడం, ముడిసరుకుల సప్లైలో కొత్త మార్గాలను అన్వేషించడం, ఒక కొత్త వ్యవస్థ నిర్మాణాన్ని రూపొందించడం మొదలయినవి కలసి ఉంటాయి.

2. రిస్కు భరించడం:

  1. వినియోగదారుల అభిరుచులలో, ఉత్పత్తి పద్ధతులలో, ప్రభుత్వ విధానాలలో మార్పులు రావడం వల్ల, కొత్త వస్తువులు కనుగొనడం వల్ల చేస్తున్న వ్యాపారాలకు నష్టాలు ఏర్పడవచ్చు. ఈ నష్టాలను భరించడానికి ఎంట్రప్రిన్యూర్ సిద్ధంగా ఉండాలి.
  2. పై మార్పులవల్ల ప్రయోజనాలు కలిగితే వీటిని ఎంట్రప్రిన్యూర్ అనుభవిస్తాడు. కాబట్టి నష్టాన్ని కూడా అతనే భరించాలి.
  3. జె.బి.సే ప్రకారం రిస్ను భరించడమనేది ఎంట్రప్రిన్యూర్ ప్రత్యేక విధి.

3. వ్యవస్థీకరణ, నిర్వహణ:

  1. ఎంట్రప్రిన్యూర్ తాను అందించదలచిన వస్తుసేవల రకాలు, వాటి స్వభావాలు ముందుగా నిర్ణయించవలసి ఉంటుంది. భూమి, శ్రమ, పెట్టుబడి అనే ఈ ఉత్పత్తి కారకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంటాయి. ఎంట్రప్రిన్యూర్ వాటిని సేకరించి వస్తువు సేవల ఉత్పత్తికి వీలుగా వాటిని మలచుకొనవలసి ఉంటుంది.
  2. వ్యాపార సంస్థ పరిమాణంలో గానీ, స్థల నిర్ణయంలోగానీ, ఉత్పత్తి పద్ధతులలోగానీ అవసరమైన మార్పులు చేయడమేగాక, రోజువారీ నిర్వహణకు అవసరమైన ఉత్పత్తి ప్రణాళికలు, అమ్మకాల ‘నిర్వహణ, సిబ్బంది నిర్వహణకు సంబంధించిన విధులను కూడా అతడు చేపట్టవలసి ఉంటుంది.
  3. ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారం వ్యవస్థీకరణ, నిర్వహణ అనేవి ఎంట్రప్రిన్యూర్ ముఖ్య విధులు.

4. వ్యాపార ప్రణాళికలు:
1) ఔత్సాహికుడు ఒక క్రమబద్ధమైన పద్ధతిని రూపొందించి, వాస్తవ విషయాలను శాస్త్రీయంగా విశ్లేషించి, వాటి పరిణామాలను ఊహిస్తూ భవిష్యత్ను అంచనా వేయాలి.

2) వ్యాపార కార్యకలాపాలను ప్రణాళికీకరణ చేయడానికి, ముడిసరుకు అవసరాన్ని గుర్తించడం, సిబ్బంది అవసరాలను అంచనావేయడం, ఉత్పత్తి షెడ్యూళ్ళను నిర్ణయించడం, అమ్మకాలు, ఇన్వెంటరీ, వ్యాపార ప్రకటనలు, బడ్జెట్ల కేటాయింపు వినియోగదారుల అవసరాలు, పోటీదారులు బలాలు, బలహీనతలు మొదలయినవి అధ్యయనం చేయాలి.

3) క్రమబద్ధమైన వ్యాపార ప్రణాళికీకరణను రూపొందించాలంటే, ఔత్సాహికుడు తప్పకుండా వ్యాపార లక్ష్యాలను, విధానాలను, వ్యాపార సరళిని, కార్యక్రమాలను, బడ్జెట్లను దృష్టిలో ఉంచుకోవాలి.

4) సరైన ప్రణాళికను రూపొందించడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవడమే కాకుండా, క్రమరీతిలో వ్యాపార కార్యకలాపాలను చేపట్టవచ్చు. ముందుగా నిర్ణయించిన విధంగా వ్యాపారానికి మార్గదర్శకం ఏర్పడుతుంది. తద్వారా ఇతర నిర్వహణ విధులు సమర్థవంతంగా నిర్వర్తించబడతాయి. కాబట్టి ఔత్సాహికులు ఈ వ్యాపార ప్రణాళికీకరణ విధులకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వవలసి ఉంటుంది.

5. నిర్ణయాలు తీసుకోవడం:

  1. ఔత్సాహికుడు నిర్వర్తించాల్సిన మరొక ముఖ్యమైన విధి, నిర్ణయాలు తీసుకోవడం.
  2. సంస్థ కార్యకలాపాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వ్యాపార సంస్థను కొనసాగించడానికి లేదా నిర్వహించడానికి అనేక నిర్ణయాలు తీసుకోవాలి.
  3. ఏ వ్యాపారసంస్థ అయినా విజయవంతం కావాలంటే, పురోగతిని సాధించాలంటే ఔత్సాహికుని నిర్ణయాలు ఎక్కువగా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

ప్రశ్న 3.
వివిధ రకాల ఎంట్రప్రిన్యూర్ల గురించి వివరంగా తెలపండి.
జవాబు.
L డానఫ్ ప్రకారం ఎంట్రప్రిన్యూర్ల వర్గీకరణ: అమెరికాలోని వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక అధ్యయనంలో డాన్హాఫ్ ఎంట్రప్రిన్యుర్లు నాలుగు రకాలుగా విభజించినాడు.

  1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు
  2. అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు
  3. నిదానపు ఎంట్రపిన్యూర్లు
  4. స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు.

1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు: నవకల్పన కర్త ఘంపీటర్ దృష్టిలో ఎంట్రప్రిన్యూర్ అంటే కొత్తరకపు వస్తువులను ప్రవేశపెట్టడం, కొత్త ఉత్పత్తి పద్ధతులను అవలంభించడం, కొత్తమార్కెట్లను రూపొందించే వ్యక్తి. కొత్తగా ప్రయోగాలు చేసి, విజయవంతమైన వాటిని విస్తరింపజేసి, ఆకర్షణీయ అవకాశాలన్నింటిని అమలుపరచడం ఇతడికి నిత్యకృత్యం.

2. అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు: వీరు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపిస్తారు. వీరు కొత్త వస్తువుల రూపకల్పనలు చేయలేక, విజయవంతమైన ఇతరుల వస్తువులను అనుకరిస్తూ వాటిని పోలిన వస్తువులను ఉత్పత్తి చేస్తారు.

3. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు: వీరు రెండు రకాలకు చెందరు. వీరు బహు జాగ్రత్తగా ఉండే వ్యక్తులు, వేగవంతమైన మార్పులను వీరు అంగీకరించరు. వారి పూర్వికులు, సీనియర్లు అవలంభించిన మార్గాలను సులభంగా వాడతారు. కొత్త పద్ధతులు, కొత్తభావాలు, ఒకే మారు కాకుండా నిదానంగా అమలు పరుస్తారు. వీరు రిస్కు తీసుకోవడంలో వెనుకంజవేస్తారు.

4. స్థిరచిత్తపు ఎంట్రప్రిన్యూర్లు వీరు నిదానపు ఎంట్రప్రిన్యూర్లు కంటే మొండివారు. మార్పులను ఏమాత్రం అంగీకరించరు. ఈ కారణంగా ఆధునిక రంగంలో వీరు వెనుకబడి ఉంటారు. వ్యాపారాలను మూసివేయడానికైనా సిద్ధపడతారు.

II. ఇతర రకాల ఎంట్రప్రిన్యూర్లు:
1. వ్యక్తిగత ఎంట్రప్రిన్యూర్లు: వ్యక్తిగత ఎంట్రప్రిన్యూర్లు ఎక్కువగా చిన్న తరహా వ్యాపార సంస్థను నిర్వహిస్తూ ఉంటారు. ఒక వ్యాపారసంస్థను స్థాపించి, దానికవసరమైన మూలధనాన్ని సమకూర్చి దానికి సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించి, అందులో ఉన్న రిస్కును భరించేందుకు సిద్ధపడిన ఒక వ్యక్తిని వ్యక్తిగత ఎంట్రప్రిన్యూర్ అంటారు.

2. సంస్థాగత ఎంట్రప్రిన్యూర్లు: సంక్లిష్టమైన వ్యవస్థ కలిగిన భారీతరహా సంస్థలను, పరిశ్రమలను స్థాపించడానికి ఒక వ్యక్తి యొక్క శక్తి సరిపోనప్పుడు కొంతమంది వ్యక్తుల సమూహంగానీ, ఒక సంస్థగానీ ఈ పనిని చేపట్టవచ్చు. ఈ విధమైన సంస్థాగత ఎంట్రప్రిన్యూర్లకు సాంకేతిక పరిజ్ఞానం, మూలధనం సేకరించడం సులభం. అంతేగాక ఎంత ఎక్కువ రిస్కునైనా భరించి, మార్పులను అమలుపరచడం కూడా వీరికి సాధ్యం.

3. వారసత్వపు ఎంట్రప్రిన్యూర్లు: వారసత్వపు ఎంట్రప్రిన్యూర్లు భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తారు. వారి కుటుంబ వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించి నడిపిస్తుంటారు. వీరిని రెండవతరపు ఎంట్రప్రిన్యూర్లు అని కూడా అంటారు.

4. నిర్బంధపు ఎంట్రప్రిన్యూర్లు: కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎంట్రప్రిన్యూర్లుగా మారిన వారిని “నిర్బంధ ఎంట్రప్రిన్యూర్లు” అంటారు. సాధారణంగా సంపన్న కుటుంబాలకు చెందిన నిరుద్యోగ వ్యక్తులు, వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలపట్ల ఆకర్షితులైన వారు, నాన్-రెసిడెంట్ ఇండియన్స్ ఈ వర్గానికి చెందుతారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

5. వ్యాపార ఎంట్రప్రిన్యూర్లు: వారికున్న గత అనుభవంవల్ల గానీ, శిక్షణద్వారా గానీ ఒక కొత్త వస్తువునుగానీ, సేవనుగానీ, అందించాలనే ఉద్దేశం కలిగిన వ్యక్తిని వ్యాపార ఎంట్రప్రిన్యూర్ అంటారు. ఇతడు తనకు కలిగిన భావం ఆధారంగా ఒక చిన్న సంస్థనైనా ప్రారంభించి, తన భావానికి కార్యరూపం ఇచ్చేందుకు కృషి చేస్తాడు.

6. పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్లు: ఇతడు ఉత్పత్తిదారు పరిశోధన ద్వారాగానీ, ఇతర రకాలుగాగానీ వినియోగదారుల అవసరాలను, కోరికలను అంచనావేసి, తదనుగుణంగా వస్తువులను ఉత్పత్తి చేసేవాడిని పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్ అంటారు.

7. స్వచ్ఛమైన ఎంట్రప్రిన్యూర్లు: స్వచ్ఛమైన ఎంట్రప్రిన్యూర్ తన లక్ష్యసాధనకై, తన సామర్ధ్య నిరూపణకై కృషి చేస్తాడు. తనకంటూ ఒక గుర్తింపు, హోదా సంపాదించుకోవాలని ఆకాంక్షిస్తూ అందుకు తన శాయశక్తులా కృషిచేస్తాడు.

8. ప్రేరేపిత ఎంట్రప్రిన్యూర్లు: ప్రభుత్వంగానీ, ప్రభుత్వేతర సంస్థలుగానీ అందించే ఆర్థిక, ఆర్థికేతర సహాయాన్ని రాయితీలను, సబ్సిడీలను, శిక్షణలను, ఇతర ప్రయోజనాలను పొందడానికై ప్రేరేపించబడి ఎంట్రప్రిన్యూర్గా అవతరించే వ్యక్తిని ప్రేరేపిత ఎంట్రప్రిన్యూర్, అంటారు.

ప్రశ్న 4.
ఎంట్రప్రిన్యూర్, ఎంట్రప్రిన్యూర్షిప్ల మధ్య వ్యత్యాసాలు తెలుపండి.
జవాబు.
ఎంట్రప్రిన్యూర్

  1. ఎంట్రప్రిన్యూర్ ఒక వ్యక్తి.
  2. ఎంట్రప్రిన్యూర్ పరిపాలనాకర్త.
  3. ఎంట్రప్రిన్యూర్ రిస్క్ ను భరిస్తాడు.
  4. ఎంట్రప్రిన్యూర్ నవకల్పన కర్త.
  5. ఎంట్రప్రిన్యూర్ ఉత్పత్తికారకాల సమ్మేళన పరుస్తాడు.
  6. ఎంట్రప్రిన్యూర్ ప్రారంభకుడు, చొరవ తీసుకునే వ్యక్తి.
  7. ఎంట్రప్రిన్యూర్ నాయకుడు.

ఎంట్రప్రిన్యూర్ షిప్

  1. ఎంట్రప్రిన్యూర్షిప్ ఒక కార్యాచరణ ప్రణాళిక.
  2. ఎంట్రప్రిన్యూర్షిప్ అనేది ఒక పరిపాలనాంశం.
  3. ఎంట్రప్రిన్యూర్షిప్ రిష్తో కూడిన చర్య.
  4. ఎంట్రప్రిన్యూర్షిప్ నవకల్పన ప్రక్రియ.
  5. ఎంట్రప్రిన్యూర్షిప్ ఉత్పత్తికారకాల వినియోగ ప్రక్రియ.
  6. ఎంట్రప్రిన్యూర్షిప్ అనేది సంస్థను ప్రారంభం చేయడం, చొరవతీసుకునే చర్య.
  7. ఎంట్రప్రిన్యూర్షిప్ అనేది నాయకత్వమే.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
వ్యాపార ప్రణాళికీకరణ అంటే ఏమిటి ?
జవాబు.
1) ఔత్సాహికుడు ఒక క్రమబద్ధమైన పద్ధతిని రూపొందించి, వాస్తవ విషయాలను శాస్త్రీయంగా విశ్లేషించి, వాటి పరిణామాలను ఊహిస్తూ..భవిష్యత్ను అంచనా వేయాలి.

2) వ్యాపార కార్యకలాపాలను ప్రణాళికీకరణ చేయడానికి, ముడిసరుకు అవసరాన్ని గుర్తించడం, సిబ్బంది అవసరాలను అంచనావేయడం, ఉత్పత్తి షెడ్యూళ్ళను నిర్ణయించడం, అమ్మకాలు, ఇన్వెంటరీ, వ్యాపార ప్రకటనలు, బడ్జెట్ల కేటాయింపు వినియోగదారుల అవసరాలు, పోటీదారులు బలాలు, బలహీనతలు మొదలయినవి అధ్యయనం చేయాలి.

3) క్రమబద్ధమైన వ్యాపార ప్రణాళికీకరణను రూపొందించాలంటే, ఔత్సాహికుడు తప్పకుండా వ్యాపార లక్ష్యాలను, విధానాలను, వ్యాపార సరళిని, కార్యక్రమాలను, బడ్జెట్లను దృష్ఠిలో ఉంచుకోవాలి.

4) సరైన ప్రణాళికను రూపొందించడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవడమే కాకుండా, క్రమరీతిలో వ్యాపార కార్యకలాపాలను చేపట్టవచ్చు. ముందుగా నిర్ణయించిన విధంగా వ్యాపారానికి మార్గదర్శకం ఏర్పడుతుంది. తద్వారా ఇతర నిర్వహణ విధులు సమర్థవంతంగా నిర్వర్తించబడతాయి. కాబట్టి ఔత్సాహికులు ఈ వ్యాపార ప్రణాళికీకరణ విధులకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వవలసి ఉంటుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

ప్రశ్న 2.
ఎంట్రప్రిన్యూర్ రిస్కున్ను భరించే విధులు ఏమిటి ?
జవాబు.

  1. వినియోగదారుల అభిరుచులలో, ఉత్పత్తి పద్ధతులలో, ప్రభుత్వ విధానాలలో మార్పులు రావడం వల్ల, కొత్త వస్తువులు కనుగొనడం వల్ల చేస్తున్న వ్యాపారాలకు నష్టాలు ఏర్పడవచ్చు. ఈ నష్టాలను భరించడానికి ఎంట్రప్రిన్యూర్ సిద్ధంగా ఉండాలి.
  2. పై మార్పులవల్ల ప్రయోజనాలు కలిగితే వీటిని ఎంట్రప్రిన్యూర్ అనుభవిస్తాడు. కాబట్టి నష్టాన్ని కూడా అతనే
    భరించాలి.
  3. జె.బి.సే ప్రకారం రిస్ను భరించడమనేది ఎంట్రప్రిన్యూర్ ప్రత్యేక విధి.

ప్రశ్న 3.
నవకల్పన అనే విధితో ఏ విధంగా సృష్టించడం విభేదిస్తుందో తెలపండి.
జవాబు.

  1. నవకల్పన అంటే కొత్త పనులను చేయడం, లేదా పాత పనులను ఒక కొత్త పద్ధతిలో చేయడం ఇందులో కొత్త వస్తువులు ఉత్పత్తి, కొత్త మార్కెట్ల సృష్టి, కొత్త ఉత్పత్తి పద్దతులను అమలులోకి తేవడం మొదలైనవి ఇమిడి ఉంటాయి.
  2. సృష్టించడం అంటే కొత్త భావాలు, సిద్ధాంతాలను రూపొందించడం, కొత్త పద్ధతులు కనుగొనడం.
  3. సృష్టించడంలో కొత్త పద్ధతులను, సిద్ధాంతాలను కనుగొంటే నవకల్పనలో ఆ కనుగొన్న కొత్త సిద్ధాంతాలను, పద్ధతులను వాణిజ్యపరంగా వినియోగంలోకి తేవడం జరుగుతుంది.

ప్రశ్న 4.
డానఫ్ ఔత్సాహికులను ఏ విధంగా వర్గీకరించాడో తెలియజేయండి.
జవాబు.
అమెరికాలోని వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక అధ్యయనంలో డాన్హాఫ్ ఎంట్రప్రిన్యూర్లు నాలుగు రకాలుగా విభజించినాడు.

  1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు
  2. అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు
  3. నిదానపు ఎంట్రపిన్యూర్లు
  4. స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు.

ఎ. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు:

  1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్ అంటే కొత్తరకపు వస్తువులను ప్రవేశపెట్టడం. కొత్త ఉత్పత్తి పద్ధతులను అవలంబించడం, కొత్త మార్కెట్లను రూపొందించే వ్యక్తి.
  2. కొత్తగా ప్రయోగాలు చేసి, విజయవంతమైన వాటిని విస్తరింపజేసి, ఆకర్షణీయ అవకాశాలన్నింటినీ అమలుపరచడం ఇతడికి నిత్యకృత్యం.

బి. అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు:

  1. వీరు అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనిపిస్తారు. వీరు కొత్త వస్తువుల రూపకల్పనలు చేయలేక, విజయవంతమైన ఇతరుల వస్తువులను అనుకరిస్తూ వాటిని పోలిన వస్తువులనే ఉత్పత్తి చేస్తుంటారు.
  2. ఇతర దేశాలలో, ఇతర మార్కెట్లటో విజయవంతమైన వస్తువులు, అభివృద్ధి చెందని దేశాలలో పూర్తిగా వినియోగించే అవకాశం లేనపుడు అలాంటి వస్తువులలో స్వల్పమైన మార్పులను చేసి ఈ ఎంట్రప్రిన్యూర్లు తమ దేశాలలో తమ మార్కెట్లలో ప్రవేశపెడతారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

సి. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు:

  1. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు బహు జాగ్రత్తగా ఉండే వ్యక్తులు. వేగవంమైన మార్పులను వీరు అంగీకరించరు.
  2. వారి పూర్వీకులు, సీనియర్లు అవలంబించిన మార్గాలను సులభంగా వీడలేరు. కొత్త పద్ధతులు, కొత్త భావాలను ఒకేమారు కాకుండా నిదానంగా అమలుపరుస్తుంటారు. వీరు రిస్కు తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు.

డి. స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు:

  1. వీరు నిదానపు ఎంట్రప్రిన్యూర్ల కంటే మొండివారు. మార్పులను ఏమాత్రం అంగీకరించరు.
  2. ఈ కారణంగా ఆధునిక రంగంలో వీరు వెనుకబడి ఉంటారు. వ్యాపారాలను మూసివేయడానికైనా సిద్ధపడతారు. కానీ మార్పులకు అంగీకరించరు.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.

  1. ఎంట్రప్రిన్యూర్ అనే పదం ఫ్రెంచి మూలమైన “entrependre” అనే పదం నుండి ఆవిర్భవించింది. అంటే ఒక కొత్త పనిని చేపట్టడం అని అర్థం. అనగా నష్టం భరించి ఒక కొత్త సంస్థను స్థాపించడమనే కార్యాన్ని చేపట్టే వాడే ఎంట్రప్రిన్యూర్.
  2. జె.బి. సే ప్రకారం ఎంట్రప్రిన్యూర్ అనేవాడు ఒక ఆర్థిక ఏజెంట్. భూమి, శ్రమ, పెట్టుబడి అనే ఉత్పత్తి కారకాలను సంఘటీకృతపరిచి, వాటిని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువు యొక్క విలువను నిర్థారించి దానిలో వేతనాలు, అద్దె, వడ్డీ, లాభాలు అనే భాగాలను విడివిడిగా గుర్తించడమే గాకుండా, తన పెట్టుబడికి పునరుపయోగం కలిగే విధంగా నిర్వహించేవాడినే ఎంట్రప్రిన్యూర్ గా పేర్కొనవచ్చు.

ప్రశ్న 2.
సంస్థ నిర్వచనం.
జవాబు.

  1. నష్టభయంతో కూడిన, సంక్లిష్టమైన, కష్టతరమైన పనిని అనేక మంది చేపట్టే వ్యాపకాన్ని లేదా ప్రాజెక్టును, ఎంట్రప్రెస్’గా నిర్వచించవచ్చు.
  2. సాహసంతో కూడిన వ్యాపారాన్ని చేయడానికి సృష్టించబడిన వ్యవస్థనే ‘ఎంటర్ప్రైస్’ అంటారు. వ్యాపార వ్యవస్థలో ఇది ఒక ప్రత్యేకమైన వ్యాపకం లేదా ఆర్థిక సంబంధం కలిగిన వ్యవహారంగా పేర్కొంటారు.
  3. ఔత్సాహికుడు చేపట్టే వ్యాపారాన్నే ‘ఎంటర్ప్రైస్’ లేదా “వ్యాపార సంస్థగా” పేర్కొంటారు.

ప్రశ్న 3.
ఎంట్రప్రిన్యూర్షిప్.

  1. ఉత్పత్తికారకాలను అత్యల్పస్థాయిలో వినియోగించి, వాటివల్ల ప్రయోజనాలను అత్యధిక స్థాయిలో పొందగలడమనే శక్తి లేదా సామర్థ్యమే ఎంట్రప్రిన్యూర్షిప్ అని పేర్కొనవచ్చు.
  2. ఎ.హెచ్.కోల్ ప్రకారం “ఎంట్రప్రిన్యూర్షిప్. అంటే ఒక వ్యక్తిగానీ, వ్యక్తుల సముదాయం గానీ చేపట్టిన ఒక అర్థవంతమైన చర్య. ఆర్థిక వస్తుసేవల ఉత్పత్తి లేదా పంపిణీలను ప్రారంభించడం లేదా నిర్వహించడం ద్వారా లాభార్జన కోసం, ఉద్దేశించినదే “ఎంట్రప్రిన్యూర్”.
  3. దేశ ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడం, రిస్క్ ను భరించడం, ఏదో ఒక కొత్తదనాన్ని సృష్టించడం, వనరులను సమీకృతం చేసి వాటి మధ్య సమన్వయాన్ని సాధించడమనేది ఎంట్రప్రిన్యూర్షిప్ ముఖ్య విధులు.

ప్రశ్న 4.
సమతుల్య ప్రాంతీయాభివృద్ధి.
జవాబు.
అభివృద్ధి చెందని వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడాన్నే సమతుల్య ప్రాంతీయాభివృద్ధి అంటారు.
ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశ సమతుల్య ప్రాంతీయాభివృద్ధి ఎంతో అవసరం.

ప్రశ్న 5.
నాయకత్వం.
జవాబు.

  1. మనిషి యొక్క ఆదర్శవంతమైన గుణానికి ప్రాతినిధ్యం వహించేదే నాయకత్వం, ప్రకారం నాయకత్వం అంటే మేనేజర్ తన ఆధీనాధికారులను ఉత్ప్రేరణ చేసే సామర్థ్యం కలిగి ఉండటం.
  2. ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించడానికి తమ శాయశక్తులను ఉపయోగించడానికి నాయకుడు తనను అనుసరించే వారికి నిర్దేశకతను, మార్గదర్శకాన్ని చూపిస్తూ, వారిని ప్రభావితం చేస్తాడు. సమిష్టికృషికి ఔత్సాహికుని నాయకత్వం ఒక శక్తిగా పనిచేస్తుంది. మానవ వనరులను సక్రమంగా వినియోగించడానికి నాయకత్వం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

ప్రశ్న 6.
నవకల్పన.
జవాబు.

  1. “నవకల్పన” అంటే కొత్తపనులను చేయడం, లేదా పాతపనులను ఒక కొత్త పద్ధతిలో చేయడం.
  2. ఇందులో కొత్త వస్తువుల ఉత్పత్తి, కొత్త మార్కెట్లు సృష్టి, కొత్త ఉత్పత్తి పద్ధతులను అమలులోకి తేవడం, ముడిసరుకుల సప్లైలో కొత్త మార్గాలను అన్వేషించడం, ఒక కొత్త వ్యవస్థ నిర్మాణాన్ని రూపొందించడం మొదలయినవి కలసి ఉంటాయి.

ప్రశ్న 7.
అనుకరణ ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.

  1. వీరు అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనిపిస్తారు. వీరు కొత్త వస్తువుల రూపకల్పనలు చేయలేక, విజయవంతమైన ఇతరుల వస్తువులను అనుకరిస్తూ వాటిని పోలిన వస్తువులనే ఉత్పత్తి చేస్తుంటారు.
  2. ఇతర దేశాలలో, ఇతర మార్కెట్లటో విజయవంతమైన వస్తువులు, అభివృద్ధి చెందని దేశాలలో పూర్తిగా వినియోగించే అవకాశం లేనపుడు అలాంటి వస్తువులలో స్వల్పమైన మార్పులను చేసి ఈ ఎంట్రప్రిన్యూర్లు తమ దేశాలలో తమ మార్కెట్లలో ప్రవేశపెడతారు.

ప్రశ్న 8.
నిదానపు ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.

  1. నిదానపు ఎంట్రప్రిన్యూర్లు బహు జాగ్రత్తగా ఉండే వ్యక్తులు. వేగవంతమైన మార్పులను వీరు అంగీకరించరు.
  2. వారి పూర్వీకులు, సీనియర్లు అవలంబించిన మార్గాలను సులభంగా వీడలేరు. కొత్త పద్ధతులు, కొత్త భావాలను ‘ఒకేమారు కాకుండా నిదానంగా అమలుపరుస్తుంటారు. వీరు రిస్కు తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు.

ప్రశ్న 9.
స్థిరచిత్తపు ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.

  1. వీరు నిదానపు ఎంట్రప్రిన్యూర్ల కంటే మొండివారు. మార్పులను ఏమాత్రం అంగీకరించరు.
  2. ఈ కారణంగా ఆధునిక రంగంలో వీరు వెనుకబడి ఉంటారు. వ్యాపారాలను మూనివేయడానికైనా సిద్ధపడతారు. కానీ మార్పులకు అంగీకరించరు.

ప్రశ్న 10.
నిర్బంధ ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.

  1. కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎంట్రప్రిన్యూర్లుగా మారిన వారిని “నిర్బంధ ఎంట్రప్రిన్యూర్లు’ అంటారు.
  2. సాధారణంగా సంపన్న కుటుంబాలకు చెందిన నిరుద్యోగ వ్యక్తులు, వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలపట్ల ఆకర్షితులైన వారు, నాన్-రెసిడెంట్ ఇండియన్స్ ఈ వర్గానికి చెందుతారు.

ప్రశ్న 11.
పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.

  1. పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్లు ఉత్పత్తిదారులు.
  2. పరిశోధన ద్వారా గాని, ఇతర రకాలుగా వినియోగదారుల అవసరాలను, కోరికలను అంచనావేసి, తదనుగుణంగా వస్తువులను ఉత్పత్తి చేసేవారిని పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్లు అంటారు.

ప్రశ్న 12.
స్వచ్ఛంద ఎంట్రప్రిన్యూర్లు..
జవాబు.

  1. స్వచ్ఛంద ఎంట్రప్రిన్యూర్లు తమ నమ్మకాన్ని సామర్ధ్యాన్ని ఆధారంగా చేసుకొని వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.
  2. వీరు ప్రేరేపిత ఎంట్రప్రిన్యూర్లకు భిన్నమైన వారు. స్వచ్ఛంద ఎంట్రప్రిన్యూర్లు ఇతరులచే ప్రేరేపించబడరు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

ప్రశ్న 13.
స్వచ్ఛమైన ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.

  1. స్వచ్ఛమైన ఎంట్రప్రిన్యూర్లు తమ లక్ష్యసాధనకై, తమ సామర్ధ్య నిరూపణకై కృషి చేస్తారు.
  2. తమకంటూ ఒక గుర్తింపు, హోదా సంపాదించుకోవాలని ఆకాంక్షిస్తూ అందుకు తమ శాయశక్తులా కృషి చేస్తారు.

ప్రశ్న 14.
కార్పోరేట్ ఎంట్రప్రిన్యూర్లు.

  1. ఒక కంపెనీని ప్రారంభించే వ్యక్తిని కార్పొరేట్ ఎంట్రప్రిన్యూర్ అంటారు. ఇతడినే వ్యవస్థాపకుడు అని కూడా
    అంటారు.
  2. ఇతడు కంపెనీల చట్టం కింద ఒక కంపెనీని రూపొందించి, నమోదుచేయించి, దానికి న్యాయబద్ధమైన అస్తిత్వాన్ని కల్పించడం జరుగుతుంది.

ప్రశ్న 15.
ప్రేరేపిత ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.
ప్రభుత్వంగాని, ప్రభుత్వేతర సంస్థలు గానీ అందించే ఆర్థిక, ఆర్థికేతర సహాయాన్ని, రాయితీలు, సబ్సిడీలను, శిక్షణలను, ఇతర ప్రయోజనాలను పొందడానికై ప్రేరేపించబడి ఎంట్రప్రిన్యూర్గా అవతరించే వ్యక్తిని ప్రేరిపిత ఎంట్రప్రిన్యూర్ అంటారు.

ప్రశ్న 16.
వృత్తిరీత్యా ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.
వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడమే వృత్తిగా కలిగి ఉంటారు. ఒక వ్యాపారాన్ని ప్రారంభించి దాన్ని మరొకరికి అమ్మివేసి, మరొక వ్యాపారాన్ని ప్రారంభించే సన్నాహాలు మొదలుపెడతారు. స్వయంగా స్థాపించిన వ్యాపారాన్నైనా నిర్వహణ చేసే ఆసక్తి వీరికి ఉండదు.

ప్రశ్న 17.
పాత తరం ఎంట్రప్రిన్యూర్లు.
జవాబు.
వీరు తమకు రావలసిన ఆర్ధిక లాభాలను గురించి తప్ప, సంస్థ వృద్ధిని కూడా పట్టించుకోరు. సంస్థలో వృద్ధి లేకున్న తమకు గరిష్ఠ లాభాలుంటే చాలని కోరుకుంటారు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

ప్రశ్న 18.
చిన్న తరహా పరిశ్రమ ఔత్సాహికులు.
జవాబు.
పరిశ్రమ వర్గీకరణ ఆధారంగా ఔత్సాహికులను భారీ తరహా, మధ్యతరహా, చిన్నతరహా పారిశ్రామిక ఎంట్రప్రిన్యూర్లుగా విభజించారు. వారికున్న గత అనుభవం వల్లగాని, శిక్షణద్వారా గారి ఒక కొత్త వస్తువునుగాని సేవనుగానీ అందించాలనే ఉద్దేశం కలిగి చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే ఔత్సాహికులను చిన్న తరహా పరిశ్రమ ఔత్సాహికులు అంటారు.

TS Inter 2nd Year Commerce Notes Chapter 6 Setting up a Business

Here students can locate TS Inter 2nd Year Commerce Notes Chapter 6 Setting up a Business to prepare for their exam.

TS Inter 2nd Year Commerce Notes Chapter 6 Setting up a Business

→ The knowledge of rules and regulations of state and central governments will help the entrepreneurs to draw a plan to setting up an enterprise.

→ The various steps to be followed by entrepreneurs to set a business enterprise have been classified into two stages –

  1. Preliminary stages
  2. Implementation Stage

TS Inter 2nd Year Commerce Notes Chapter 6 Setting up a Business

→ Process of setting up of a business at a preliminary stage.

  • Step-1 Decision to be self-employed
  • Step-2 Study and Scanning Business Environment
  • Step-3 Selection of idea
  • Step-4 Deciding Organisational Structure
  • Step-5 Preparation of Project Report
  • Step-6 Project Appraisal stage
  • Step-7 Selection of Location and Site
  • Step-8 Provisional Registration
  • Step-9 Enquire for Machinery and Technology

→ Process of setting up of a business at the implementation stage.

  • Step-1 Statutory Licences/clearance
  • Step-2 Arrangement of Finance
  • Step -3 Application for Financial Assistance
  • Step-4 Building construction and civil works
  • Step-5 Placement of order for plant and machinery and other fixed assets and procurement
  • Step-6 Power and water connection
  • Step-7 Procurement of personnel and their training
  • Step-8 Raw material procurement
  • Step-9 Installation and commissioning of plant and machinery
  • Step-10 Marketing
  • Step-11 Permanent Registration
  • Step-12 Profit Generation and Repayment of loan

→ The government of Telangana State is providing different opportunities to entrepreneurs of various categories to set up their own enterprises.

→ A number of incentives and infrastructural facilities are afforded to the entrepreneurs of fulfilling their aspirations of becoming self-employed.

→ Telangana State Government gives special support to SC and ST entrepreneurs through TS-PRIDE.

→ Startup is a company that is in the first stage of its operations. The startup company are age, type, turnover, originality and innovation and scalable.

→ The registration process includes incorporation, registering and uploading documentation.

TS Inter 2nd Year Commerce Notes Chapter 6 Setting up a Business

TS Inter 2nd Year Commerce Notes Chapter 6 వ్యాపారాన్ని నెలకొల్పడం

→ ఔత్సాహికులు వ్యాపార సంస్థలను నెలకొల్పడానికి అనేక లాంఛనాలు, నియమాలు రూపొందించబడినవి.

→ సంస్థ నమోదుకు సంబంధించి పాటించాల్సిన నియమ నిబంధనలను. రెండు దశలలో వర్గీకరించవచ్చు. అవి: ఎ) ప్రాథమిక దశ, బి) అమలు పరిచే దశ..

→ ప్రాథమిక దశలో పాటించాల్సిన విధాన క్రమం:

  • 1వ దశ: స్వయం ఉపాధికై నిర్ణయం
  • 2వ దశ: వ్యాపార పరిసరాల అవగాహన
  • 3వ దశ: ఆలోచనల ఎంపిక
  • 4వ దశ: వ్యవస్థాపక నిర్మాణ నిర్ణయం
  • 5వ దశ: ప్రాజెక్టు రిపోర్టు తయారి
  • 6వ దశ: ప్రాజెక్టు తులనాత్మక పరిశీలన
  • 7వ దశ: ప్రదేశ నిర్ణయం
  • 8వ దశ: తాత్కాలిక నమోదు
  • 9వ దశ: యంత్ర పరికరాలు మరియు సాంకేతికతలపై విచారణ.

→ అమలు పరిచే దశలో ఉన్న విధివిధానాలు:

  1. శాసనాత్మక లైసెన్స్ పొందడం,
  2. విత్త ఏర్పాట్లు,
  3. విత్త సహాయానికి దరఖాస్తు పద్ధతి
  4. భవన నిర్మాణం, సివిల్ పనులు,
  5. ప్లాంట్లు, యంత్రాలు, ఇతర స్థిరాస్తులకోసం ఆర్డరు చేయటం, సేకరించడం,
  6. విద్యుచ్ఛక్తి, నీటి కనెక్షన్లు,
  7. సిబ్బందిని చేర్చుకోవడం మరియు శిక్షణ
  8. ముడిసరుకు సేకరణ
  9. యంత్రాలను స్థాపన ప్రారంభించడం
  10. మార్కెటింగ్,
  11. శాశ్వతమైన నమోదు
  12. లాభాలను ఆర్జించి అప్పును తిరిగి చెల్లించడం

→ తెలంగాణ రాష్ట్ర పభుత్వం వివిధ రకాల ఔత్సాహికులు తమ వ్యాపార యూనిట్లను నెలకొల్పుకోడానికి అనేక అవకాశాలు కల్పిస్తుంది.

TS Inter 2nd Year Commerce Notes Chapter 6 Setting up a Business

→ ఔత్సాహికులు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా అనేక మందికి ఉపాధి కల్పించడానికి, తమ ఆలోచనలకు కార్యరూపం కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను, మౌళిక వసతులను కల్పిస్తుంది.

→ వ్యాపార కార్యకలాపాలను ఆరంభించే క్రమాలలో మొదటిదశలో ఉన్న సంస్థను అంకుర సంస్థలు అంటారు.

TS Inter 2nd Year Economics Notes Chapter 3 National Income, Poverty and Unemployment

Here students can locate TS Inter 2nd Year Economics Notes Chapter 3 National Income, Poverty and Unemployment to prepare for their exam.

TS Inter 2nd Year Economics Notes Chapter 3 National Income, Poverty and Unemployment

→ Several estimates of national income were prepared by dada bhai naoroji (1868, william Digby (1899), Findlay shirras (1911, 1922 and 1931) shah and khambatta (1921), Dr. .R. . Rao (1925-29) and R.C. Desai (1931-40).

→ C.S.O. is estimating national income by adopting the product method in primary sectors and secondary sectors, the income method in the tertiary sector or the expenditure method in construction.

→ The growth of per capita income at constant prices is an indicator of the change, in the standard of living people.

→ Sectoral contribution to national income – contribution of the primary sector – contribution of the secondary sector-contribution of the tertiary sector.

TS Inter 2nd Year Economics Notes Chapter 3 National Income, Poverty and Unemployment

→ After the introduction of economic reforms the share of the private sector in the national income increased from 76.8 in 2000 – 01 to 78.8 in 2010.

→ Two basic causes of income inequalities: The existing system is based on the institution of private poverty, and low of inheritance.

→ Poverty is a situation where a part of the society is unable to satisfy even the basic minimum necessities such, as food, shelter, and clothing.

→ Causes of poverty: Concentration of economic power under exploitation of natural, resources, heavy population pressure, unemployment, poor education, inflation, low technology, capital deficiency, failure of plans, economic reforms, and social factors.

→ Types of unemployment: Structural disguised, seasonal, cyclical, technological, and fictoral unemployment.

→ Causes of unemployment: jobless growth, increase in labour force, inappropriate technology, inappropriate educational system, neo-liberal economic policy.

→ To overcome the problem of unemployment the gest took many measures to provide employment and alleviation underemployment and poverty. For instance, SFDA, MFAL, DPAP, IRDF, NREP, RLECP, and MGNRES. etc.

TS Inter 2nd Year Economics Notes Chapter 3 జాతీయాదాయం, పేదరికం, నిరుద్యోగిత

→ ఒక దేశంలో ఒక సంవత్సరకాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల నికర విలువను జాతీయాదాయం అంటారు. రెండు మార్లు లెక్కించకుండా నిర్ణీత కాల వ్యవధిలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల మొత్తం పరిమాణాన్ని జాతీయాదాయపు అంచనా మదింపు చేస్తుంది.

→ 1950–51, 2012-13 మధ్య కాలాలను పరిగణనలోకి తీసుకొన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ పని తీరును సమీక్షించినపుడు మొదటి, రెండవ ప్రణాళికలలో నిర్దేశించబడిన లక్ష్యాల దృష్ట్యా, వ్యవస్థ పని తీరు నిరాశాజనకంగా ఉందని చెప్పవచ్చు. తలసరి నికర జాతీయోత్పత్తిలో పెరుగుదల రేటు చాలా తక్కువగా
ఉంది.

TS Inter 2nd Year Economics Notes Chapter 3 National Income, Poverty and Unemployment

→ మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండు కలిసి జాతీయాదాయాన్ని ఉత్పత్తి చేస్తాయి. మన దేశంలో 1951కి పూర్వం జాతీయాదాయంలో ప్రభుత్వ రంగం వాటా చాలా తక్కువగా ఉంది. పంచవర్ష ప్రణాళికలు ప్రవేశ పెట్టినప్పటి నుంచి ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పెరగడం వల్ల జాతీయాదాయంలో ప్రభుత్వ రంగం వాటా క్రమంగా పెరిగింది.

→ మన దేశంలోని నికర దేశీయోత్పత్తి ప్రస్తుతం సేవల రంగం యొక్క వాటా మిగతా రంగాల వాటా కంటే ఎక్కువగా ఉంది. అనగా 2013-14లో సేవా రంగం వాటా 59.9% గా వ్యవసాయ రంగం వాటా 13.9 మరియు పారిశ్రామిక రంగం వాటా 26.2%గా ఉంది.

→ భారత దేశంలో ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మన దేశంలో వీటికి సంబంధించిన దత్తాంశాన్ని కూర్చడానికి అధికారిక సంస్థ లేదు.
కారణాలు –

  1. భూ యాజమాన్యంలోని అసమానతలు
  2. ప్రైవేటు కార్పోరేటు రంగంలో అస్తుల కేంద్రీకరణ
  3. వృత్తిపరమైన తేడాలు
  4. ద్రవ్యోల్బణం
  5. పరపతి సౌకర్యాలలో అసమానతి
  6. పట్టణాల వైపు ప్రైవేటు పెట్టుబడి
  7. ప్రభుత్వపాత్ర.

→ నివారణ చర్యలు :

  1. భూ సంస్కరణ అమలు
  2. ఏకస్వామ్య వ్యాపార కార్యక్రమాల నియంత్రణ
  3. ఉపాధి వేతన విధానాలు
  4. సాంఘిక భద్రతా చర్యలు
  5. కనీస అవసరాల పథకం
  6. గ్రామీణ పేదరిక నిర్మూలన పథకాలు
  7. పన్నుల వ్యవస్థ.

→ సమాజంలోని ఒక సమూహం తన కనీస జీవితావసరాలైన తిండి, బట్ట, గూడు తీర్చుకోలేని స్థితిని పేదరికం అంటారు. ఇవి రెండు రకాలు. 1. సాపేక్ష పేదరికం 2. నిరపేక్ష పేదరికం

TS Inter 2nd Year Economics Notes Chapter 3 National Income, Poverty and Unemployment

→ అమలులో ఉన్న వేతన రేటు వద్ద వ్యక్తికి పని చేయాలనే కోరిక ఉన్నప్పటికి అతనికి ఉద్యోగ అవకాశం లభ్యం కాకపోవడాన్నే నిరుద్యోగిత అంటారు. ఇదీ పలురకాలుగా ఉంటుంది.
కారణాలు :

  1. ఉపాధి రహిత వృద్ధి
  2. శ్రామిక శక్తితో పెరుగుదల
  3. ప్రతికూల సాంకేతికత
  4. ప్రతికూల విద్యావ్యవస్థ
  5. నవ్య ఆర్థిక సరళీకరణ విధానాలు మొదలగునవి.

→ ఈ పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తొలగించడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో ముఖ్యమైనవి SFDA, MFAL, DAAP, IRDP, NREP, RLEGP, MGNREGS మొదలగునవి.

TS Inter 2nd Year Political Science Notes Chapter 3 Union Government

Here students can locate TS Inter 2nd Year Political Science Notes Chapter 3 Union Government to prepare for their exam.

TS Inter 2nd Year Political Science Notes Chapter 3 Union Government

→ The President is the Constitutional Head of the State.

→ The Executive powers of the union are vested in the President.

→ The Vice President is elected by all the members of Parliament in accordance with the system of proportional representation by means of Single Transferable Vote.

→ The Vice President acts as the Ex – officio chairman of Rajya Sabha.

→ The President appoints the Leader of the majority, party in the Lok Sabha as Prime Minister.

→ The Prime Minister is the head of the Government. He is the key stone of the Cabinet arch.

TS Inter 2nd Year Political Science Notes Chapter 3 Union Government

→ The union council of ministers remain in office as long as they enjoy the support of the majority of the members of Lok Sabha.

→ The union council of ministers led by the Prime Minister is collectively responsible to the Parliament for all their acts of omissions and commissions.

→ Indian Parliament is Bicameral. It consists of two houses.They are 1. Lok Sabha, 2. Rajya Sabha.

→ Quorum is required to conduct the business of the house, which is 1/10 of the total number of members of the House.

→ The Supreme Court was inaugurated on January 28, 1950 at New Delhi.

→ At Present there are a chief Justice and 30 other Judges in the Supreme Court.

→ There are 24 High Courts in India.

TS Inter 2nd Year Political Science Notes Chapter 3 కేంద్ర ప్రభుత్వం

→ కేంద్ర ప్రభుత్వ అధికారం భారత భూభాగమంతటికి వర్తిస్తుంది.

→ కేంద్ర ప్రభుత్వం క్రింది మూడు భాగాలతో ఏర్పడుతుంది. అవి:-

  1. కేంద్ర కార్యనిర్వాహక శాఖ
  2. కేంద్ర శాసన నిర్మాణశాఖ
  3. కేంద్ర న్యాయశాఖ.

→ కేంద్ర కార్యనిర్వాహకశాఖ i) భారత రాష్ట్రపతి ii) భారత ఉపరాష్ట్రపతి iii) భారత ప్రధానమంత్రి iv) కేంద్ర మంత్రిమండలి అనే భాగాలను కలిగి ఉంటుంది.

→ కేంద్ర శాసన నిర్మాణశాఖ i) లోక్సభ ii) రాజ్యసభ, iii) భారత రాష్ట్రపతితో కూడి ఉంటుంది.

→ కేంద్ర న్యాయశాఖ అంటే సుప్రీంకోర్టు. ఇది ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను కలిగి ఉంటుంది.

→ భారత రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, రాజ్యాధినేత.

TS Inter 2nd Year Political Science Notes Chapter 3 Union Government

→ రాష్ట్రపతి దేశంలో మూడు రకాల అత్యవసర పరిస్థితులను ప్రకటించవచ్చు. (352, 356, 360 అధికరణల ద్వారా) ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షుడిగా (ఛైర్మన్) వ్యవహరించును.

→ ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమించును. లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడు ప్రధానిగా నియమించబడును.

→ ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత. కేంద్ర మంత్రిమండలికి కీలకమైన వ్యక్తి.

→ కేంద్ర మంత్రిమండలిలో మూడు రకాలైన మంత్రులు ఉంటారు. అంటే కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, డిప్యూటీ మంత్రులు.

→ కేబినెట్ అనే పదం రాజ్యాంగంలో 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది.

→ భారత పార్లమెంట్లో రెండు సభలు కలవు. అవి: 1) లోక్ సభ 2) రాజ్యసభ.

→ భారత సుప్రీంకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తిని, 30 మంది న్యాయమూర్తులను కలిగి ఉంది.

TS Inter 2nd Year Commerce Notes Chapter 5 Entrepreneurship

Here students can locate TS Inter 2nd Year Commerce Notes Chapter 5 Entrepreneurship to prepare for their exam.

TS Inter 2nd Year Commerce Notes Chapter 5 Entrepreneurship

→ Entrepreneur is an economic agent who unites all means of production to maximize his profits by innovations.

→ An entrepreneur should be one who bears, innovates or initiates and organizes the business.

TS Inter 2nd Year Commerce Notes Chapter 5 Entrepreneurship

→ Innovation, Risk Taking, Self-confidence, hard work, Goal setting, Accountability, Leadership, Managerial skills, etc., are the important characteristics of an Entrepreneur.

→ Modern writers have emphasised that an entrepreneur is supposed to perform functions, like Innovation, Risk Bearing, Organisation and Management, Business planning and decision-making.

→ Danhof has classified entrepreneurs into 4 types

  1. Innovating entrepreneurs
  2. Adoptive or imitative entrepreneurs
  3. Fabian Entrepreneurs and
  4. Drone entrepreneurs

→ The term entreprise means the actions as someone who shows some initiative by taking a risk by setting up, inverting in and running a business.

→ Entrepreneurship plays an important role in the development of a society. It is the barometer of overall economic, social and industrial growth of the country.

TS Inter 2nd Year Commerce Notes Chapter 5 ఎంట్రప్రిన్యూర్షిప్

→ ఎంట్రప్రిన్యూర్ అనే పదం ఫ్రెంచి మూలమైన “entrependre” అనే పదం నుండి ఆవిర్భవించింది. దీని అర్థం కొత్త పనిని చేపట్టడం.

→ నష్టం భరించిఒక కొత్త సంస్థను స్థాపించడమనే కార్యాన్ని చేపట్టేవాడే ఎంట్రప్రిన్యూర్/ఔత్సాహికుడు.

→ ఎంట్రప్రిన్యూర్ క నవకల్పన, రిస్కూ భరించడం, ఆత్మవిశ్వాసం, జవాబుదారీతనం, నాయకత్వం, నిర్వహణ నైపుణ్యం వంటి లక్షణాలు ఉంటాయి.

→ ఆధునిక కాలంలోని రచయితలు ఎంట్రప్రిన్యూర్లు నవకల్పన, రిస్కూభరించడం, వ్యవస్థీకరణ, నిర్వహణ, వ్యాపార ప్రణాళికీకరణ, మరియు నిర్ణయాలు తీసుకోవడం మొదలైన విధులు నిర్వర్తించ వాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

TS Inter 2nd Year Commerce Notes Chapter 5 Entrepreneurship

→ డన్ హోఫ్ ప్రకారు ఎంట్రప్రిన్యూర్లను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :

  1. నవకల్పన ఎంట్రప్రిన్యూర్లు
  2. అనుకరణ ఎట్రప్రిన్యూర్లు
  3. నిదానపు ఎట్తు ప్రిన్యూర్లు
  4. స్థిర చిత్తపు ఎంట్రప్రిన్యూర్లు.

→ ఏదేశపు ఆర్థికాభివృద్ధిలోనైనా ఎంట్రప్రిన్యూర్షిప్ యొక్క పాత్ర అత్యంత విశిష్టమైనది. ఎంట్రప్రిన్యూర్షిప్ పారిశ్రామికాభివృద్ధికి, మూలధన సేకరణలో, సమతౌల్య ప్రాంతీయాభివృద్ధిలో, ఉపాధి కల్పనలో, జీవన ప్రమాణ స్థాయి పెరగుదలలో ప్రముఖపాత్రను కలిగి ఉంది.

TS Inter 2nd Year Political Science Notes Chapter 2 Fundamental Rights and Directive Principles of State Policy

Here students can locate TS Inter 2nd Year Political Science Notes Chapter 2 Fundamental Rights and Directive Principles of State Policy to prepare for their exam.

TS Inter 2nd Year Political Science Notes Chapter 2 Fundamental Rights and Directive Principles of State Policy

→ Fundamental Rights are enriched in Part-Ill of the constitution covering articles from 12 to 35.

→ In 1978, the 44 constitutional amendments deleted the right to property from the list of Fundamental Rights.

→ Right to constitutional remedies is the very soul and heart of the constitution:

→ Through the 42nd Constitutional Amendment Act -10 fundamental duties were incorporated in Part- IV of the constitution.

TS Inter 2nd Year Political Science Notes Chapter 2 Fundamental Rights and Directive Principles of State Policy

→ Article 19 provides now to Indian citizens with six kinds of Freedom.

→ The directive principles of state policy are included in Part – IV of the constitution covering articles 36 to 51.

→ The directive principles are classified into three categories i.e., Socialist, Gandhian and Liberal principles.

→ The 42nd amendment gave precedence to directive principles than to fundamental rights.

→ Directive principles are considered as New Year greeting by Sri Naseeruddin.

TS Inter 2nd Year Political Science Notes Chapter 2 ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు

→ ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలోని 3వ భాగంలో 12వ అధికరణం నుండి 35వ అధికరణం వరకు ప్రస్తావించారు.

→ ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్యాన్ని అర్థవంతం చేస్తాయి.

→ రాజ్యాంగం రూపొందించినప్పుడు 7 ప్రాథమిక హక్కులుండేవి. ఇప్పుడు 6 ప్రాథమిక హక్కులు మాత్రమే కలవు.

→ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా రూపొందించారు. 300 (ఎ) అధికరణం ఆస్తి హక్కుకు సంబంధించినది.

→ ప్రాథమిక హక్కులలోని రాజ్యాంగ పరిహార హక్కు అత్యంత విలువైనది. ఈ హక్కు ద్వారా పౌరులు తమ హక్కులకు భంగం వాటిల్లితే న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందవచ్చు. ఉన్నత న్యాయస్థానాలు రిట్లను జారీచేసి పౌరుల హక్కులను కాపాడతాయి.

→ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగానికి 10 ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి.

TS Inter 2nd Year Political Science Notes Chapter 2 Fundamental Rights and Directive Principles of State Policy

→ ప్రాథమిక విధులను స్వరణ్ సింగ్ అధ్యక్షతన ఏర్పడిన ఒక సంఘం సూచించింది.

→ ప్రాథమిక విధులను న్యాయస్థానాల ద్వారా అమలు చేయడానికి వీలులేదు.

→ 19వ అధికరణం ప్రకారం పౌరులకు ఆరు రకాల స్వాతంత్ర్యాలు ఉంటాయి.

→ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిహార హక్కును “ప్రాథమిక హక్కులకు ఆత్మవంటి”దని వర్ణించాడు.

→ భారత రాజ్యాంగం 4వ భాగంలో ఆదేశక సూత్రాలను పేర్కొనడం జరిగింది.

→ భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగాను, వర్గరహిత రాజ్యంగాను ఏర్పరచడమే ఈ నియమాల లక్ష్యం.

→ ఆదేశక సూత్రాలు రాజ్యకలాపాల పరిధిని విస్తృతం చేశాయి.

→ ఈ సూత్రాలు శాసనపరమైనవి కావు. వీటిని అమలు జరపడంలో ఆయా ప్రభుత్వాలకు విచక్షణాధికారాలు ఉన్నాయి.

→ వీటిని సామ్యవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు, ఉదారవాద సూత్రాలుగా వర్గీకరించడం జరిగింది.

TS Inter 2nd Year Political Science Notes Chapter 2 Fundamental Rights and Directive Principles of State Policy

→ 42, 44వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ఆదేశక సూత్రాలకు ప్రాథమిక హక్కుల కంటే ఎక్కువ ప్రాధాన్యము ఉందని తెలిసింది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

Telangana TSBIE TS Inter 2nd Year Commerce Study Material 10th Lesson నిర్వహణ విధులు Textbook Questions and Answers.

TS Inter 2nd Year Commerce Study Material 10th Lesson నిర్వహణ విధులు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రణాళిక నిర్వచనంలోని ముఖ్యమైన అంశాలు ఏమిటో వివరించండి ?
జవాబు.
ప్రణాళిక నిర్వచనంలోని ముఖ్యమైన అంశాలు:
1) ఒక పనిని ఏవిధంగా, ఎలా చేయాలో ముందుగా నిర్ణయించడమే ప్రణాళిక. ప్రణాళిక అనేది నిర్వహణ విధులలో ప్రాథమికమైంది.

2) ఏదైనా ఒక పనిని చేపట్టబోయేటప్పుడు, ఒక నిర్వాహకుడు అలాంటి లక్ష్యం సాధించడానికి కార్యకలాపాలను సూత్రప్రాయంగా క్రమపరచాలి. అందువల్ల ప్రణాళిక, సృజనాత్మకతకు, కల్పనకు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నది అని చెప్పవచ్చు.

3) ప్రణాళిక వల్ల ప్రస్తుతమున్న స్థితి నుంచి చేరవలసిన స్థితికి వంతెనలాగా తోడ్పడుతుంది. నిర్వాహకులు అన్ని దశలలోనూ ప్రణాళిక కొనసాగించే ప్రక్రియ. ప్రణాళికలో వివిధ ప్రత్యామ్నాయ పరిస్థితులలో తీసుకొనవలసిన నిర్ణయాలు ఉంటాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

4) యాజమాన్యం చేపట్టే చర్యలకు, నిర్ణయాలకు ఏర్పరచిన లక్ష్యాలు దిశానిర్దేశం చేస్తాయి. ముందుగా నిర్ణయించిన లక్ష్యాలకు యదార్థమైన మార్గాన్ని చూపడానికి ప్రణాళిక ఏర్పాట్లను చేస్తుంది.

5) లక్ష్యాలను సాధించడానికి రూపకల్పన చేసేది, పనిని ఏ విధంగా, చేయాలనే సాధ్యాసాధ్యాలు నిర్ణయించేది, తీసుకొనే చర్యలకు కార్యరూపాన్ని చూపేది ప్రణాళిక.

6) భవిష్యత్లో ఏర్పడే ఘటనలకు, ప్రణాళికలు ముందు జాగ్రత్త ప్రయోజనాల్ని కల్పిస్తాయి.

7) ప్రణాళికలో అనేక దశలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

  • సంస్థలోని ప్రతి విభాగానికి లక్ష్యాలను ముందుగా నిర్ణయించుకోవాలి.
  • పథకాలను అమలుపరచడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
  • పని క్రమాన్ని, పని విధానం కొనసాగించడానికి తగిన ప్రమాణాలు ఏర్పరచుకోవాలి.
  • సంస్థ మొత్తానికి బడ్జెట్లను తయారు చేసుకొని, ఉత్పత్తి, అమ్మకాల, నగదుకు సంబంధించిన విభాగాల కోసం ప్రత్యేక బడ్జెట్లను రూపొందించవలసి ఉంటుంది.

ప్రశ్న 2.
మారుతున్న పర్యావరణంలో ప్రణాళికీకరణ పని చేస్తుందని నీవు భావిస్తున్నావా ? (or) ప్రణాళికీకరణ ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు.
ఒక పనిని ఏ విధంగా, ఎలా చేయాలో ముందుగా నిర్ణయించడమే ప్రణాళిక. భవిష్యత్లో ఏర్పడే ఘటనలకు, ప్రణాళికలు ముందు జాగ్రత్త ప్రయోజనాల్ని కల్పిస్తాయి.

మారుతున్న పర్యావరణంలో ప్రణాళికీకరణ ఎంతగానో ఉపయోగపడుతుంది.
వివిధ కారణాల దృష్ట్యా అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నది. ప్రణాళిక ప్రాముఖ్యతను కింది విధంగా చెప్పవచ్చు.

1. లక్ష్యాలపై దృష్టి: సంస్థలోగల వివిధ విభాగాల లక్ష్యాలను ప్రణాళిక ద్వారా రూపొందించవలసి ఉంటుంది. అంతేకాకుండా, లక్ష్యాలను సాధించడం కోసం ప్రణాళిక ఎంతైనా అవసరం. వేగంగా మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు అనేక విషయాలను పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుంది.

2. ఆదాపూర్వకంగా కార్యాచరణ వ్యాపారాన్ని నైపుణ్యవంతంగా నడిపించడానికి ప్రణాళిక విశేషంగా దృష్టి సారిస్తుంది. ఒక పనిని ఎలా చేయాలి ? ఎవరు చేయాలి ? ఏవిధంగా చేయాలి ? ఎప్పుడు చేయాలి అనే వాటిని ప్రణాళిక నిర్ణయిస్తుంది. ప్రణాళికీకరణ వల్ల సంస్థ లక్ష్యాలను సమిష్టి కృషితో సాధించుకుంటారు. వారి మధ్య సమన్వయ లోపం లేకుండా, పనులను విభజించకుండా సంయుక్త నిర్దేశకత్వం ఉంటుంది. సంస్థకు లభించే వనరులన్నీ సమర్ధవంతంగా ఉపయోగించడం
జరుగుతుంది.

3. అనిశ్చితిని, మార్పును తగ్గిస్తుంది: భవిష్యత్ అనిశ్చితం కాబట్టి వ్యాపార పర్యావరణం, ఆర్థిక విధానాలు, వనరుల సప్లయిలలో మార్పుల వల్ల వ్యాపారం అనిశ్చిత స్థితిలోకి నెట్టివేయబడుతుంది. వీటికి తోడుగా సాంకేతిక మార్పులు కూడా మార్కెట్లో చోటు చేసుకోవచ్చు. కాని ప్రణాళికీకరణ వల్ల సంస్థ అనిశ్చిత పరిస్థితులను భవిష్యత్ కాలంలో సమర్ధవంతంగా, విజయవంతంగా ఎదుర్కొనగలుగుతాయి. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా సంస్థ పురోగతిని సాధించడానికి వీలు కలుగుతుంది.

4. నియంత్రణ సులువుగా జరుగుతుంది: అర్ధవంతమైన ప్రణాళిక వల్ల సిబ్బందిపై సరైన రీతిలో నియంత్రణ చేయవచ్చు. వాస్తవ పనిని, అంచనా వేసిన ఫలితాలను బేరీజు వేసుకోవాలి. ఒకవేళ వాస్తవ ఫలితాలు అంచనా వేసిన ఫలితాలకంటే భిన్నంగా నమోదయితే భవిష్యత్ ప్రణాళికకు తగిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అందువల్ల సరియైన నియంత్రణ కోసం తగిన ప్రణాళిక అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రణాళిక లేనిదే నియంత్రణ లేదు.

ప్రశ్న 3.
ప్రణాళికలో ముందుచూపు ఇమిడి ఉంటే, అది ఎందుకు విజయాన్ని అందించదు ? (లేదా) ప్రణాళికీకరణ పరిమితులను వివరించండి.
జవాబు.
ప్రణాళికలో ముందు చూపు ఇమిడి ఉంటుంది కాని కొన్ని కారణాల వల్ల ప్రణాళికలు విజయాన్ని అందించలేవు. ప్రణాళికలో అనేక పరిమితులు ఉన్నాయి. వాటివల్ల ప్రణాళికలు విజయాన్ని అందించలేవు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

ప్రణాళిక – పరిమితులు:
1) అనిశ్చితమైన భవిష్యత్తు: భవిష్యత్తులో సంభవించగల అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. కాని భవిష్యత్లోని అవరోధ కారణాలను కచ్చితంగా ఊహించడం కష్టమవుతుంది. ప్రణాళిక అంచనా వేసిన ఫలితాలను అందించలేదు. ఈ పరిమితిని అధిగమించాలంటే సరియైన సమాచారాన్ని సేకరించి, దాని విశ్వసనీయతను నిర్ధారణ. చేయడంతోపాటు భవిష్యత్ అంచనాలకై సాంకేతిక పద్ధతులను వాడవలసి ఉంటుంది.

2) కఠినమైనది: ప్రణాళికలో పథకాలను, కార్యక్రమాలను, విధానాలను ముందుగా నిర్ణయిస్తారు. దీన్ని అందరూ అమలు చేయాలి. వ్యక్తిగత స్వేచ్ఛ, చొరవ అణచివేయబడతాయి. అంతేకాక ప్రణాళికలోని అంశాలు కఠినంగానూ, మార్చడానికి వీలు లేకుండా ఉంటాయి.

3) వ్యయమైంది: ప్రణాళికను రూపొందించడానికి ఎంతో సమయం, వ్యయం అవసరం, ప్రణాళికీకరణ వ్యయంతో కూడుకున్నది. అందువల్ల చిన్న సంస్థలు ప్రణాళిక తయారు చేయడానికి, అమలు చేయడం కోసం అయ్యే వ్యయాలను భరించలేవు.

4) నిధుల పెట్టుబడి: ఇదివరకే సంస్థలో ఆస్తుల స్థాపనకై అయిన వ్యయాలు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికైన వ్యయాలు భవిష్యత్ ప్రణాళికల తయారీకి అవరోధంగా మారతాయి. భవిష్యత్ ప్రణాళికలు తయారు చేయవలసి వస్తే, గతంలో పెట్టిన పెట్టుబడిని ఎలా రాబట్టుకోవాలి అనే దృక్పథం తప్ప ఇంకే విషయమూ యాజమాన్యం వారు ఆలోచించరు.

5) బహిర్గత అంశాలు: అంతర్గతంగా ఏర్పాటు చేసుకున్న ప్రణాళికలకు యాజమాన్యం వారి నియంత్రణలో లేని బహిర్గత అంశాలు తోడవుతాయి. వాటి కార్యకలాపాలు జాతీయ స్థాయిలోని కార్మిక విధానాలు, కార్మిక సంఘాల నుంచి వచ్చే ఒత్తిడులను బట్టి కొనసాగుతాయి. ప్రణాళికలోని పరిమితులు ప్రభుత్వం రూపొందించిన నియమాలను బట్టి, న్యాయపరమైన అంశాల కారణంగా వెల్లడి అవుతాయి.

ప్రశ్న 4.
ప్రణాళిక రకాలు ఏమిటో వివరిచండి ?
జవాబు.
నిర్వాహకులు రూపొందించే ప్రణాళికలు రెండు రకాలుగా వర్గీకరించారు.
1. వ్యూహాపరమైన ప్రణాళిక: వ్యాపార రంగంలో ఏర్పడే వాతావరణ మార్పులను బట్టి దీర్ఘకాలిక ఏకీకృత ప్రణాళికలను రూపొందించవలసి ఉంటుంది. ఈ ప్రణాళికలో దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి వ్యూహరచన చేయబడుతుంది. వ్యూహాపరమైన ప్రణాళికకు కాలపరిమితి ఉంటుంది. భవిష్యత్తులో రాగల సమస్యలను గుర్తించి ప్రణాళిక తయారుచేస్తారు.

2. కార్యరూప ప్రణాళిక: కార్యరూప ప్రణాళికలు వ్యూహాల అమలు కోసం స్వల్పకాలానికి తయారుచేస్తారు. సంస్థ కార్యకలాపాల మనుగడ కోసం స్వల్పకాల ప్రణాళికలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.

ప్రశ్న 5.
వ్యవస్థీకరణను నిర్వచించి, దానిలోని దశలను తెలియపరచండి.
జవాబు.
1) మానవ ప్రయత్నాలను సమన్వయపరచి, వనరులను ఏకం చేసి ప్రత్యేకంగా రూపొందించిన లక్ష్యాలను సాధించడానికి ఏర్పరచే ప్రక్రియే వ్యవస్థీకరణ

2) వ్యవస్థీకరణలో వ్యక్తులు చేపట్టవలసిన కార్యకలాపాలను నిర్ధారించడం జరుగుతుంది. ఈ కార్యకలాపాలను వివిధ వర్గాలుగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రతి వర్గానికి చెందిన ఆయా విభాగాలకు కేటాయింపు పనులను చేయడం జరుగుతుంది. ప్రతి విభాగంలోని వ్యక్తులకు విధులు, బాధ్యతలను నిర్వచించడం జరుగుతుంది.

3) ఆచార్య అర్విక్ ప్రకారం ఏ ఉద్దేశం కోసం కార్యకలాపాలను నిర్ధారించుకున్నామో వాటిని ‘వివిధ వర్గాలకు కేటాయించే క్రమమే వ్యవస్థీకరణ అని చెప్పబడింది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

వ్యవస్థీకరణలోని దశలు:
1) పనిని గుర్తించి విభజించడం: ఒక సంస్థ గతంలో నిర్ధారించిన విధంగా పనిని గుర్తించి విభజించడం వ్యవస్థీకరణలో మొదటి దశ. సంస్థలోని పనిని మొత్తం సిబ్బంది విభజించుకుని చేసిన పనిని తిరిగి చేయడాన్ని నివారించడం ఎంతైనా శ్రేయస్కరం.

2) విభాగీకరణ: ఒక పనిని నిర్వహించడానికి కార్యకలాపాల విభజన జరిగిన తరువాత, ఒకే స్వభావం గల పనిని ఏకీకృతం చేసి అప్పగించాలి. అలాంటి విభాగీకరణ ప్రత్యేకతకు దారితీస్తుంది. ఈ కార్యకలాపాల విభజననే విభాగీకరణ అంటారు. విజయవంతమయ్యే విభాగీకరణ కోసం వివిధ అంశాలను పరిగణలోనికి తీసుకోవలసి ఉంటుంది.

3) బాధ్యతలను అప్పగించడం: సంస్థలో ఉన్న స్థాయిలను బట్టి వివిధ విభాగాలకు కేటాయించవలసిన పనులను నిర్వచించడం ఎంతో అవసరం. ఏర్పడిన ప్రతి విభాగానికి ఒక అధిపతిని నియమించాలి. అటు తరువాత వారి సామర్ధ్యం, నేర్పరితనం ఆధారంగా పనులను కేటాయించాలి.

4) నివేదికలను సమర్ధించే సంబంధాలను ఏర్పాటు చేయడం: సంస్థలోని పనులను సిబ్బందికి కేటాయించడంతో పాటు ప్రతీ వ్యక్తి తాను చేపట్టవలసిన పనులు మరియు ఎవరికి జవాబుదారి అవుతాడో తెలుసుకొని ఉండాలి. ఈ విధమైన సత్సంబంధాలు ఉండడం వల్ల విభాగాలలోని వ్యక్తుల మధ్య సమన్వయం ఏర్పడుతుంది.

ప్రశ్న 6.
నియంత్రణను నిర్వచించి, దాని ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు.

  1. నియంత్రణ అంటే ఒక సంస్థ ఏర్పరచిన నియమ నిబంధనల మేరకు ప్రతి కార్యాచరణ తగిన విధంగా నడిచేటట్లు చేయడం.
  2. నిర్వహణ శాస్త్రం సూచించిన చివరి విధి నియంత్రణ. సంస్థలో ఏర్పరచిన ప్రమాణాలతో వాస్తవ కార్యాలను పోల్చాలి. ఏదైనా తేడా గమనించినట్లయితే తగిన నివారణాత్మక చర్యలను తీసుకుని సంస్థ ప్రమాణాలను పాటించే దిశగా ప్రయత్నించాలి.

నియంత్రణ – ప్రాముఖ్యత:
1) సంస్థ లక్ష్యాలను సాధించడం: సంస్థ నెరవేర్చుకునే లక్ష్యాలను, వాటి పురోగతిని నియంత్రణ విధానం కొంతమట్టుకు కొలిచే సాధనంగా పనిచేస్తుంది. అంతేకాక వ్యత్యాసాలేమైనా ఉంటే దిద్దుబాటుకై తేలికైన మార్గాన్ని చూపుతుంది. సంస్థను సరియైన మార్గంలో నడిపి లక్ష్యాలను చేరడానికి సహాయకారిగా ఉంటుంది.

2) ప్రమాణాల ఖచ్చితత్వాన్ని నిర్ణయించడం: మేలైన నియంత్రణ విధానం ద్వారా యాజమాన్యం ఖచ్చితమైన ప్రమాణాలను నెలకొల్పుతుంది. సమర్ధవంతమైన నియంత్రణ విధానం ద్వారా పరిణమిస్తున్న మార్పులను శ్రద్ధగా గమనిస్తూ, తదనుగుణంగా సంస్థ యొక్క ప్రమాణాలను పునఃపరిశీలన చేయవలసి ఉంటుంది.

3) సమర్ధవంతమైన వనరుల వినియోగం: మేలైన నియంత్రణ ఆచరణలో నిర్వాహకుడు వినియోగించే వనరుల దుబారా, పాడయ్యే విధానాన్ని నిరోధిస్తుంది. ప్రతి కార్యక్రమంను ముందుగా నిర్ణయించిన ప్రమాణాల ఆధారంగా చేపట్టవలసి ఉంటుంది. ఈ నియంత్రణ వల్ల వనరులను నైపుణ్యవంతంగా వినియోగించుకోవడం సాధ్యపడుతుంది.

4) సిబ్బంది ప్రేరణను మెరుగుపరచడం: ఒక మంచి నియంత్రణ విధానం ద్వారా సంస్థలోని సిబ్బంది చేయవలసిన పనిని ముందుగానే తెలుసుకుని, ప్రమాణాలను అనుసరించి ప్రశంసించబడే విధంగా నిర్వర్తించబడుతుంది.

5) క్రమశిక్షణను చేపట్టడం ఒక సంస్థలోని నియంత్రణా విధానాన్ని దానిలోగల క్రమశిక్షణ, క్రమమైన పని విధానాన్ని బట్టి సృష్టించవలసి ఉంటుంది. సిబ్బంది మోసపూరితమైన నడవడిని తగ్గించి వారు చేపట్టే కార్యకలాపాలను తగిన సమయాలలో తనిఖీ చేస్తుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

ప్రశ్న 7.
POSDCORB అంటే ఏమిటి ? దాని ఉపయోగాలు, పరిమితులను వివరించండి.
జవాబు.

  1. లూథర్ గల్లిక్, ప్రధాన అధికారి యొక్క కార్యకలాపాలను ఏడు రకాలైన కార్యాలుగా అభివర్ణించారు.
  2. గల్లిక్ తెలిపిన నిర్వహణ విధులను POSDCORB అని అంటారు.
  3. POSDCORB అనగా ప్రణాళిక (Planning), వ్యవస్థీకరణ (Organising), సిబ్బందీకరణ (Staffing), నిర్దేశం (Directing), సమన్వయాధికారం (Co-ordinating), నివేదిక (Reporting), బడ్జెటింగ్ (Budgeting).

I) POSDCORB ఉపయోగాలు:
1) ఒక సంస్థ దాని లక్ష్యాలను సాధించడానికి ప్రారంభదశగా ఈ నిర్వహణ విధులను అన్వయిస్తుంది.
2) ఒక సంస్థ రూపకల్పనలో గల కార్యకలాపాలను నెరవేర్చేదిశగా ఈ నిర్వహణ విధులు సహాయాన్ని’ అందిస్తాయి.

II) POSDCORB పరిమితులు:
1) మార్క్ మూర్ అనే నిష్ణాతుడు POSDCORB ను మానసదృష్టి కలదిగా భావించాడు. అతని దృష్టిలో ఒక సంస్థ తన వినియోగదారులకు అందించే సేవలు ఆ సంస్థలో గల వాతావరణాన్ని బట్టి ఉంటాయని అర్థం చేసుకోవాలి.

2) డా|| లూయిస్ మెరియమ్ చెప్పినట్లు POSDCORB పదంలో లోపించిన అంశం ఏమిటంటే వాటికి సంబంధించిన పరిజ్ఞానం. నిర్వాహకులు ఏదో ప్రణాళికను వేసి, వ్యవస్థీకరించి, ఆదేశాలు జారీ చేస్తారు కాని ఏ లక్ష్యాలపై దృష్టి పెడుతున్నారో తెలుసుకోవడం కష్టం.

ప్రశ్న 8.
వ్యవస్థీకరణ యొక్క ప్రాముఖ్యత ఏమిటో సవివరంగా వివరించండి.
జవాబు.
వ్యవస్థీకరణ: ఏ ఉద్దేశం కోసం కార్యకలాపాలను నిర్ధారించుకున్నామో వాటిని వివిధ వర్గాలకు కేటాయించే ప్రక్రియను వ్యవస్థీకరణ అంటారు.

వ్యవస్థీకరణ – ప్రాముఖ్యత:
ఏ సంస్థ అయినా విజయవంతంగా కొనసాగడానికి వ్యవస్థీకరణ విధిని ఖచ్చితంగా అమలు పరచవలసి ఉంటుంది. వ్యవస్థీకరణ వల్ల సంస్థ అనేక సమస్యలను అధిగమించి, నిలదొక్కుకుని, వృద్ధి పొందవచ్చు. వ్యవస్థీకరణ ప్రాముఖ్యత కింద వివరించబడినది.
1) ప్రత్యేకీకరణ ప్రయోజనాలు: శ్రామిక శక్తికి కేటాయించవలసిన పనులను బట్టి వ్యవస్థీకరణ క్రమమైనదిగా ఉంటుంది. వ్యక్తుల సామర్థ్యాన్ని ఆధారం చేసుకుని పనులను నిర్వర్తిస్తారు. కాబట్టి పని భారం తగ్గి ఉత్పాదకత పెరుగుతుంది. చేసే పనులు అనేక పర్యాయాలు చేయడం వల్ల అనుభవం పెరిగి ప్రత్యేకీకరణకు దారి తీస్తుంది.

2) స్పష్టమైన కార్యసంబంధాలు: సంస్థలో పనిచేసే సిబ్బంది మధ్య సంబంధాలను గుర్తించడం ద్వారా సమాచారాన్ని ఎవరు ఎవరికి నివేదించాలని స్పష్టమవుతుంది. దీనివల్ల సమాచారాన్ని, సూచనలను చేరవేయడంలో అస్పష్టతను తొలగించవచ్చు.

3) అభిషణీయమైన వనరుల వినియోగం: వ్యవస్థీకరణ వల్ల లభ్యమయ్యే ఆర్థిక, మౌలిక మరియు మానవ వనరుల వినియోగం సక్రమంగా జరుగుతుంది. దానితో వనరుల దుర్వినియోగం తగ్గించబడి గందరగోళాన్ని నిరోధిస్తుంది.

4) మార్పుల ఆమోదం: వ్యవస్థీకరణ ప్రక్రియ ఒక వ్యాపార సంస్థలో జరిగే మార్పులను ఆమోదిస్తుంది. దీనివల్ల వ్యవస్థ నిర్మాణాన్ని సముచిత రీతిలో సవరించడం జరుగుతుంది. తద్వారా వివిధ మార్పులు జరుగుతున్నప్పటికీ సంస్థ ఎదుగుదల, మనుగడకు అవసరమయిన స్థిరత్వాన్ని కల్పిస్తుంది.

5) సమర్ధవంతమైన పరిపాలన సంస్థలోని ఉద్యోగ బాధ్యతలను స్పష్టంగా నిర్వచించడానికి వ్యవస్థీకరణ సహాయపడుతుంది. ఈ విధానం గందరగోళాన్ని, నకలు చేయడాన్ని తొలగిస్తుంది. దానితో పరిపాలనలో సౌలభ్యమేర్పడి, నిర్వహణలో సామర్థ్యాన్ని సంపాదించడానికి వీలవుతుంది.

6) సిబ్బంది వృద్ధి: వ్యవస్థీకరణ నిర్వాహకుల మధ్య సృజనాత్మకతను పెంపొందిస్తుంది. సమర్థవంతమైన అధికారదత్తత వల్ల ప్రతీ నిర్వాహకుడి పని భారం తగ్గి, క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన పనులను కేటాయిస్తుంది ఈ విధమైన పనిభారం తగ్గింపు కేవలం పరిమితమైన సామర్థ్యం కోసమేకాక నిర్వాహకులు క్రొత్తపద్ధతులను వృద్ధిపరచి లక్ష్యాలను నిర్ధారించేందుకు ఉపయోగపడుతుంది.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రణాళికను రూపొందించేటప్పుడు సంస్థ నిర్వాహకులు పరిగణించవలసిన ముఖ్యమైన లక్షణాలు ఏమిటి ?
జవాబు.
ఒక పనిని ఏవిధంగా, ఎలా చేయాలో ముందుగా నిర్ణయించడమే ప్రణాళిక. భవిష్యత్లో ఏర్పడే ఘటనలకు, ప్రణాళికలు ముందు జాగ్రత్త ప్రయోజనాల్ని కల్పిస్తాయి. ప్రణాళికను రూపొందించేటప్పుడు సంస్థ నిర్వహకులు పరిగణించవల్సిన ముఖ్యమైన అంశాలు:

  1. సంస్థలోని ప్రతి విభాగానికి లక్ష్యాలను ముందుగా నిర్ణయించుకోవాలి.
  2. పథకాలను అమలు పరచడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
  3. పని క్రమాన్ని, పని విధానం కొనసాగించడానికి తగిన ప్రమాణాలు ఏర్పరచుకోవాలి.
  4. సంస్థ మొత్తానికి బడ్జెట్లను తయారుచేసుకొని, ఉత్పత్తి అమ్మకాల, నగదుకు సంబంధించిన విభాగాల కోసం ప్రత్యేక బడ్జెట్ రూపొందించుకోవాలి.

ప్రణాళిక లక్షణాలు:
1) ప్రణాళిక · ఒక వివేకవంతమైన ప్రక్రియ: ప్రతి నిర్వాహకుడు తన మనసులో ‘మునిగే ముందు చూడు’ అని తనను తానే ప్రశ్నించుకోవాలి. ఏ కార్యాన్నైనా ప్రారంభించకముందే ప్రణాళికకు సంబంధించిన పనులు చేయడానికి పూనుకోవాలి. నిర్వాహకుడు తగిన వాస్తవాలను సేకరించి సంస్థ లక్ష్యాలను సాధించే విధంగా వ్యవస్థీకరించవలసి ఉంటుంది. లక్ష్యాలను ఏర్పరచే దిశలో ప్రతి నిర్వాహకుడు వివేకవంతమైన ప్రక్రియ చేబడతాడు.

2) లక్ష్యం ఆధారంగా ప్రణాళిక: సంస్థ రూపొందించే ప్రణాళికలన్నీ లక్ష్యానికి వలయంగా ఏర్పడతాయి. ప్రతి ప్రణాళిక లక్ష్యాల సాధన దిశగా అనుకూలమైన మద్దతును ఇవ్వాలి. లక్ష్యం లేనిదే ప్రణాళికకు అర్థం లేదు. లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోకుండా తీసుకునే ప్రతి చర్య శూన్యమైన అభ్యాసం అవుతుంది.

3) నిర్వహణ ప్రక్రియలో ప్రణాళిక ఒక ప్రాథమిక విధి: ఒక సంస్థ యొక్క ప్రణాళిక కార్యం నిర్వహణ శాస్త్రాలు అన్నింటిలోకి ప్రాథమిక విధి. మిగిలిన నిర్వాహక విధులన్నీ కూడా ప్రణాళికను రూపొందించిన తరవాత అమలుపరుస్తారు. దీనితో ప్రణాళికలో సమూల మార్పులకు ఆస్కారం ఉంటుంది.

4) ప్రణాళిక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది: ప్రణాళికలో నైపుణ్యం అంతర్భాగం. తక్కువ వ్యయంతో స్వల్ప వనరులను ఉపయోగించి ప్రారంభించిన కార్యాన్ని అత్యంత లాభసాటిగా మార్చడానికి తోడ్పడే మెళకువనే ప్రణాలిక అనవచ్చు. దాని కోసం నిర్వాహకుడు ఒక పనిని నైపుణ్యవంతంగా నిర్విర్తించడానికి గల ప్రత్యామ్నాయాలను పరిశీలించి నిర్ధారణ చేయాలి.

ప్రశ్న 2.
ప్రణాళిక ప్రక్రియలో ఇమిడి ఉన్న నిర్వహణ చర్యలు ఏమిటో వివరించండి. (లేదా) ప్రణాళికా ప్రక్రియలో గల దశలను వివరించండి.
జవాబు.
ప్రణాళికా దశలు:
1. వ్యాపార అవకాశాల అవగాహన: వాస్తవానికి వ్యాపారంలో అనేక అవకాశాలు ఉంటాయి. యాజమాన్యం. అలాంటి అవకాశాలపట్ల అవగాహన కలిగిఉండాలి. ఒక వ్యాపార అవకాశంపట్ల నిర్వాహకులకు ఉన్న అవగాహన కారణంగా . ప్రణాళికా ప్రయోజనం ఉన్నట్లు తయారు చేయాలి. అదే భవిష్యత్తులో సమస్యలకు పరిష్కారం శోధన సమస్యలను అధిగమిస్తుంది.

2. లక్ష్యాల నిర్ధారణ: ఒక సంస్థ యొక్క లక్ష్యాలను నిర్ధారించడం ప్రణాళికలోని రెండవదశ. యాజమాన్యం సాధించవలసిన లక్ష్యాలను క్లుప్తంగా తెలియజేయాలి. లక్ష్యాల నిర్ధారణ వల్ల ఏ పనిపై ఎక్కువ శ్రద్ధను కనబరచాలో తెలుస్తుంది. సంస్థ తన లక్ష్యాలను సాధించడానికి తగిన వ్యూహరచనలను, పథకాలను, విధానాలను, నియమాలను “ఏర్పరచుకోవాలి.

3. ప్రణాళికా సిద్ధాంతం – నిర్ధారణ: వస్తువులకున్న మార్కెట్, పెట్టుబడి మార్కెట్, ప్రభుత్వ పథకాలు, సాంకేతిక మార్పులలాంటి వివిధ కారకాలు, శక్తులు సంస్థ లాభాలపై ప్రభావాన్ని చూపుతాయి. వ్యాపారంపై ప్రభావం చూపే ఎలాంటి కారకాలైనప్పటికీ యాజమాన్యం వాటిని ముందుగా అంచనావేసుకోవలసి వస్తుంది. ఇలాంటి నిర్ధారణకు రావాలంటే ముందు జాగ్రత్త ఎంతైనా అవసరం.

4. ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టడం: ఆశించిన ఫలితాలను పొందడానికి అనేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉంటాయి. ఆ విధంగా ప్రత్యామ్నాయ ఫలితాలను పొందడానికి గల ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించి సరైనది ఎన్నుకోవడం.

5. అవసరార్థం ప్రణాళికలు: ఆమోదయోగ్యమైన చర్యను ఎంపిక చేసి ప్రాథమిక ప్రణాళికను అనుబంధంగాను, తోడ్పాటుగాను ఉండటం కోసం ఈ ప్రణాళికలను ఏర్పాటుచేయవచ్చు. భవిష్యత్తులో సంస్థ లక్ష్యాలు సాధించడానికి సహాయపడతాయి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

ప్రశ్న 3.
సిబ్బందీకరణను నిర్వచించి, దానిలోని వివిధ దశలు వివరించండి.
జవాబు.
సిబ్బందీకరణ అంటే వ్యక్తులను వివిధ స్థాయిలలోని ఉద్యోగాలలో నియమించడం. శ్రామిక శక్తి, ప్రక్రియ ప్రణాళికా సిబ్బంది ఎంపికతో మొదలై నియామకం, శిక్షణ, వృద్ధి, పదోన్నతి, నష్టపరిహారం నిర్వహణ విశ్లేషణతో ముగుస్తుంది. సిబ్బందీకరణ దశలు:
1. సిబ్బంది అవసరాలను అంచనావేయడం: ఒక సంస్థ రూపకల్పన చేయబడినప్పుడు వివిధ స్థాయిలలో సిబ్బంది అవసరాలను అంచనావేయడం జరుగుతుంది. ప్రతి స్థాయిలో ఒక వ్యక్తికి గల అర్హత, నేర్పు, అనుభవాన్ని బట్టి నియామకం చేపట్టడం జరుగుతుంది. అందువల్ల సంస్థ పరిమాణం ఆధారంగా ఎంతమేరకు, ఏ రకమైన సిబ్బంది అవసరమో తెలుసుకోవచ్చు. కార్యభారం విశ్లేషణ చేయడంవల్ల సంస్థ సిబ్బంది సంఖ్యను అంచనావేసి సంస్థ లక్ష్యాలను సాధించడానికి తగిన చర్యలు తీసుకుంటూ నియామకాలు చేపట్టవచ్చు.

2. నియామకం: ఒక సంస్థకు కావలసిన భావి ఉద్యోగులను వెదికి, అభ్యర్థించే వ్యక్తులను తగిన ఉద్యోగాలలో నియమించి ప్రోత్సహించే ప్రక్రియనే నియామకం అంటారు. నియామకాలు చేపట్టడానికి ఫ్యాక్టరీ గేటు వద్దగాని, కార్యాలయపు నోటీసు బోర్డు వద్దగాని, పత్రికలలోగాని, ఎలక్ట్రానిక్ మీడియాలలోగాని ప్రకటనలు చేయవచ్చు. దీనివల్ల కాబోయే ఉద్యోగార్థులను నిర్ధారించుకోవడానికి తగిన అవకాశాలు ఏర్పడతాయి.

3. ఎంపిక: నియామక ప్రక్రియలో సరైన వ్యక్తిని తెలుసుకోవడమే ఎంపిక. ఎంపిక వల్ల రెండు ముఖ్యమైన ప్రయోజనాలుంటాయి. మొదటిది సంస్థకు కావలసిన వ్యక్తులలో అత్యంత ప్రావీణ్యమైన వ్యక్తులు లభించడం మరియు రెండవది, సంస్థకు వారిపట్ల ఉన్న స్థాయిని తెలిపే చర్యలను చేపట్టడం. సంస్థ ఏర్పాటు చేసిన నియామక ప్రక్రియలో లిఖిత పూర్వక పరీక్ష మరియు మౌఖిక పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి నియమనిబంధనలతో కూడిన నియామక పత్రాన్ని అందజేసి విధులలో చేరే తేదీని లేఖాపూర్వకంగా తెలియజేస్తారు.

4. స్థానీకరణ, పునఃశ్చరణ: ఒకే స్థానానికి నియమింపబడిన వ్యక్తి విధులకు హాజరయ్యే పత్రాన్ని సంస్థకు అందజేసిన తరువాత, అలాంటి వ్యక్తులకు కంపెనీకి సంబంధించిన అంశాలను వ్యక్తులను పరిచయం చేస్తారు. ఆ వ్యక్తిని తగిన విభాగానికి పంపి ఉద్యోగ బాధ్యతలను అప్పగిస్తారు. ఈ రకమైన ప్రక్రియల ద్వారా వ్యక్తులకు కంపెనీ పట్ల అవగాహన ఏర్పడుతుంది. స్థానీకరణ అంటే ఏ స్థాయికైతే ఒక వ్యక్తిని ఎంపిక చేస్తారో అదే స్థాయిలో అతనిని నియమించడం అన్నమాట.

5. శిక్షణ, వికాసం: ప్రతి ఉద్యోగికి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉండాలి. అలాంటి అవకాశాన్ని ఇవ్వడానికి శిక్షణ ద్వారా తగిన విధంగా నేర్చుకునే సదుపాయాన్ని సంస్థ కల్పించాలి. నిరంతరం విద్య నేర్చుకునే సదుపాయాలు అంతర్గతంగా శిక్షణ కేంద్రంలో ఉండే అవకాశం ఉంటుంది. లేనట్లయితే బహిరంగ ప్రాంతాలలో గల శిక్షణా కేంద్రాల ద్వారా విషయ సమాచారాన్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది. శిక్షణా కార్యక్రమాల వల్ల నైపుణ్యాలు పెంచుకోవచ్చు.

ప్రశ్న 4.
ఉద్యోగుల ఎంపికకు పాటించాల్సిన విధాన క్రమాన్ని తెలియపరచండి.
జవాబు.

  1. ఒక సంస్థలో మానవ వనరుల ఆవశ్యకాలను అర్ధం చేసుకోవడంతో సిబ్బందీకరణ ప్రక్రియ మొదలవుతుంది.
  2. మానవ వనరుల కోసం సంస్థ అంతర్గతంగా లేదా బహిర్గత ఆధారాల ద్వారా గుర్తించవచ్చు.
  3. నియామకాలు చేపట్టడానికి ఫ్యాక్టరీ గేటువద్ద గాని, కార్యాలయపు నోటీసు బోర్డు వద్దగానీ, పత్రికలలో గాని ప్రకటనలు చేయవచ్చు.
  4. నియామక ప్రక్రియలో సరైన వ్యక్తిని తెలుసుకోవడాన్ని “ఎంపిక” అంటారు.
  5. సంస్థ ఏర్పాటు చేసిన నియామక ప్రక్రియలో లిఖిత పూర్వక పరీక్ష మరియు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు.
  6. సంస్థ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి నియమనిబంధనలతో కూడి నియామక పత్రాన్ని అందజేసి, విధులలో చేరే తేదీని లేఖ పూర్వకంగా తెలియజేస్తారు.
  7. ఎంపిక అయిన వ్యక్తికి నైపుణ్యం ఉన్న వ్యక్తులతో శిక్షణ ఇస్తారు. ఈ విధంగా సిబ్బంది ఎంపికా విధానం కొనసాగును.

ప్రశ్న 5.
`నిర్దేశక సూత్రాలను వివరించండి.
జవాబు.
నిర్దేశ సూత్రాలు:
1. వ్యక్తుల అత్యున్నత కృషి: సంస్థ లక్ష్యాలను సాధించడానికి ప్రతివ్యక్తి తమవంతు కృషిని కనబరుస్తాడు. ఈ సూత్రం ద్వారా అనేక పద్ధతులను పాటించి వ్యక్తిగతంగా అత్యున్నత ప్రతిభను చూపడానికి కృషి చేయవలసి ఉంటుంది. సిబ్బందిలో గల నిగూఢమైన శక్తిని వెలికితీసి సంస్థ సామర్థ్యాన్ని పెంచడానికి వీలు ఉంటుంది.

2. లక్ష్యాల పొందిక: సాధారణంగా, సంస్థ లక్ష్యాలు, వ్యక్తిగత లక్ష్యాలు వేరుగా ఉండి వివాదాలకు కారణమౌతాయని ‘మనం గమనిస్తూ ఉంటాం. కాని మంచి నిర్దేశ సూత్రాల వల్ల లక్ష్యాల పొందిక ఏర్పడి వ్యక్తుల సహకారంతో పని నైపుణ్యం పెరుగును.

3. అనుగుణమైన నిర్దేశ సంకేతం: ఈ సూత్రం ప్రకారం సిబ్బందికి నిర్దేశించే సూచనలు వారి సామర్థ్యం, నడవడిలాంటి వాటిలో విచిత్రమైన మార్పులు చోటుచేసుకునే అంశాలు లెక్కలోనికి తీసుకుని వారికి ప్రోత్సాహాన్ని కలిపించాలి..

4. నిర్వాహక సమాచారం: సంస్థలోని అన్ని స్థాయిలలో సమర్థవంతమైన నిర్దేశ సూత్రాలను అమలుపరచడానికి సమాచారాన్ని అత్యంత శ్రద్ధతో అందించాలి. ఈ సూత్రం వల్ల క్షేత్రస్థాయి సిబ్బందిపట్ల పూర్తి అవగాహన ఏర్పడును.

5. లాంఛనప్రాయమైన వర్గాల వినియోగం: ప్రతి సంస్థలోను అధికార, అనధికార వర్గాలు ఉంటాయని నిర్వాహకులు తెలుసుకోవాలి. వీటిని అధికారులు గుర్తించి సమర్థవంతమైన నిర్దేశకత్వానికి ఈ వర్గాలను ఉపయోగించుకోవాలి.

6. ఆజ్ఞా ఏకత్వం: ఈ సూత్రం ప్రకారం సంస్థలోని సిబ్బంది ఓకే అధికారి నుంచి సూచనలు పొందవలసి ఉంటుంది. దీన్ని పాటించడం వల్ల సమర్థవంతమైన నిర్దేశంగా పరిగణించబడుతుంది.

7. నాయకత్వం నిర్వాహకులు, తమవద్ద గల క్షేత్రస్థాయి సిబ్బంది అసంతృప్తికి లోనుకాకుండా నాయకత్వ ప్రతిభ ప్రాభవాన్ని చూపుతూ సరిఅయిన మార్గంలో తీసుకెళ్ళాలి.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

ప్రశ్న 6.
ప్రణాళిక అంటే ముందు చూపు, నియంత్రణ అంటే వెనక్కి చూడటం వ్యాఖ్యానించండి.
జవాబు.
1) ఒక పనిని ఏ విధంగా, ఎలా చేయాలో ముందుగా నిర్ణయించడమే ప్రణాళిక. ప్రణాళిక అనేది నిర్వహణ విధులలో ప్రాథమికమైంది.

2) ఒక సంస్థ ఏర్పరిచిన నియమ నిబందనల మేరకు ప్రతి కార్యాచరణ తగిన విధంగా నడిచేటట్లు పరిశీలన చేయడం

3) ప్రణాళికలో చేయబోయే పనికి నియమ నిబంధనలు తయారుచేస్తే, నియంత్రణలో వాస్తవ కార్యాలు నిబంధనలు ప్రకారం జరిగినవో లేదో, ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటికి నివారణాత్మక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిని బట్టి ప్రణాళిక అంటే ముందు చూపు, నియంత్రణ అంటే వెనక్కి చూడటం అని తెలుస్తుంది.

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
ప్రణాళిక లక్షణాలు.
జవాబు.
ప్రణాళిక లక్షణాలు:

  1. ప్రణాళిక ఒక వివేకవంతమైన ప్రక్రియ.
  2. లక్ష్యం ఆధారంగా ప్రణాళిక తయారు చేస్తారు.
  3. నిర్వహణ ప్రక్రియలో ప్రణాళిక ఒక ప్రాథమిక విధి.
  4. ప్రణాళిక నైపుణ్యం పెంపొందిస్తుంది.

ప్రశ్న 2.
వ్యవస్థీకరణ ప్రక్రియ.
జవాబు.

  1. ఏ ఉద్దేశం కోసం కార్యకలాపాలను నిర్ధారించుకున్నామో వాటిని వివిధ వర్గాలకు కేటాయించే క్రమమే వ్యవస్థీకరణ అంటారు.
  2. వ్యవస్థీకరణ ప్రక్రియ దశలు: a) పనికి గుర్తించి విభజించడం b) విభాగీకరణ c) సంస్థలోని వివిధ స్థాయి వారి విధులు, బాధ్యతలు అప్పగించడం d) నివేదికలను సమర్పించే సంబంధాలను ఏర్పరచడం.

ప్రశ్న 3.
వ్యవస్థ స్వరూపం.
జవాబు.
వ్యవస్థ రూపం:

  1. పనిని గుర్తించడం.
  2. విభాగీకరణ.
  3. సంస్థలోని వివిధ స్థాయిల వారి విధులను, బాధ్యతను నిర్ధారించడం.
  4. నివేదికలను సమర్పించే సంబంధాన్ని ఏర్పరచడం.

ప్రశ్న 4.
సిబ్బందీకరణ.
జవాబు.

  1. వ్యక్తులను వివిధ స్థాయిలోని ఉద్యోగాలలో నియమించడాన్ని “సిబ్బందీకరణ” అంటారు.
  2. సిబ్బందీకరణతో సరియైన వ్యక్తులను సరియైన స్థానంలో నియమించడం జరుగుతుంది.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

ప్రశ్న 5.
సిబ్బంది ఆవశ్యకత.
జవాబు.

  1. ఏ సంస్థలోనైనా పనిచేసే సిబ్బంది ఎంతో అవసరం. సిబ్బందీకరణతో సరియైన వ్యక్తులను సరియైన స్థానంలో నియమించడం జరుగుతుంది. దీని ద్వారా ఉన్నత ప్రమాణాలు గల పనితనం సృష్టించబడుతుంది.
  2. అభిలషణీయమైన మానవ వనరుల, వినియోగానికి ఉపకరిస్తుంది. పరిమితికి మించిన సిబ్బందిని నివారించడం వల్ల హెచ్చు శ్రామిక వ్యయాన్ని తొలగించవచ్చు.

ప్రశ్న 6.
నిర్దేశం ప్రాముఖ్యత.
జవాబు.

  1. సంస్థ లక్ష్యాలను సాధించడానికి నిర్దేశ సూచనలు ఎంతో అవసరం.
  2. నిర్వాహకులు ఇచ్చే దిశగా నిర్దేశం ద్వారా సిబ్బంది ఎప్పుడు, ఏ విధంగా ఎలా అమలుపరచాలో తెలియజేస్తారు.
  3. నిర్దేశం ద్వారా సంస్థలో సంభవించే మార్పులకు సూచనలు ప్రవేశపెట్టవచ్చు. సిబ్బంది సహాయ సహకారాలతో బాధ్యతాయుతమైన నిర్దేశ ప్రాబల్యం వల్ల సంస్థలో స్థిరత్వం ఏర్పడుతుంది.

 

ప్రశ్న 7.
నియంత్రణ.
జవాబు.

  1. నియంత్రణ అంటే ఒక సంస్థ ఏర్పరచిన నియమనిబంధనల మేరకు ప్రతి కార్యాచరణ తగిన విధంగా నడిచేటట్లు పరిశీలించడం.
  2. నియంత్రణ, నిర్వహణ శాస్త్రం సూచించిన చివరి విధి.

ప్రశ్న 8.
ప్రణాళికకు, నియంత్రణకు మధ్యగల సంబంధం.
జవాబు.

  1. నిర్వహణ శాస్త్రంలో మొదటి విధి ప్రణాళిక మరియు చివరి విధి నియంత్రణ.
  2. ప్రణాళికలో ఏపనిని ఎలా చెయ్యాలో నియమనిబంధనలు రూపొందిస్తే, ఆ ‘నియమ నిబంధనలను పాటిస్తూ పని జరిగిందో లేదో పరిశీలించడం నియంణలోకి వస్తుంది.
  3. ప్రణాళిక అంటే ముందుచూపు, నియంత్రణ అంటే వెనక్కి చూడటం అని చెప్పవచ్చు.

TS Inter 2nd Year Commerce Study Material Chapter 10 నిర్వహణ విధులు

ప్రశ్న 9.
POSDCORB.
జవాబు.

  1. లూథర్ గల్లిక్ ప్రకారం నిర్వహణ విధులను POSDCORB అని అమర్చడం జరిగింది.
  2. POSDCORB అనగా ప్రణాళిక, వ్యవస్థీకరణ, నిర్దేశం, సిబ్బంది, సమన్వయం, రిపోర్టింగ్, బడ్జెట్లుగా చెప్పబడింది.